Monday, 30 December 2019

Telugu Murli 31/12/2019

31-12-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - మీకు ఏ జ్ఞానమైతే లభిస్తూ ఉందో, దాని పై విచార సాగర మథనము చేయండి, జ్ఞాన మథనము ద్వారానే అమృతము వెలువడ్తుంది''

ప్రశ్న :- 21 జన్మలకు మాలామాల్‌గా(మిక్కిలి ధనవంతులు) అయ్యే సాధనమేది?
జవాబు :- జ్ఞాన రత్నాలు. ఎంతెంత మీరు ఈ పురుషోత్తమ సంగమ యుగములో ఈ జ్ఞాన రత్నాలను ధారణ చేస్తారో అంతంత మిక్కిలి ధనవంతులుగా అవుతారు. ఇప్పటి జ్ఞాన రత్నాలే అక్కడ వజ్ర వైడూర్యాలుగా అవుతాయి. ఎప్పుడైతే ఆత్మ జ్ఞాన రత్నాలను ధారణ చేస్తుందో, నోటి ద్వారా జ్ఞాన రత్నాలు వెలువరిస్తుందో, రత్నాలనే వింటూ మళ్లీ వినిపిస్తుందో అప్పుడు వారి హర్షితముఖము ద్వారా తండ్రి పేరు ప్రఖ్యాతమవుతుంది. ఆసురీ గుణాలు తొలగిపోయినప్పుడు మిక్కిలి ధనవంతులుగా అవుతారు.

ఓంశాంతి. తండ్రి పిల్లలకు జ్ఞానము, భక్తిని గురించి అర్థం చేయిస్తారు. సత్యయుగంలో భక్తి ఉండదని పిల్లలకు తెలుసు. జ్ఞానము కూడా సత్యయుగములో లభించదు. కృష్ణుడు భక్తి చేయడు, జ్ఞాన మురళి కూడా మ్రోగించడు. మురళి అనగా జ్ఞానాన్ని ఇవ్వడము. మురళిలో ఇంద్రజాలముంది,........ (మురళీ మే హై జాదూ..........) అని గాయనముంది కదా. కనుక ఏదో ఇంద్రజాలముంటుంది కదా. కేవలం మురళి మ్రోగించడము సాధారణమైన విషయము. ఫకీర్లు కూడా మురళి మ్రోగిస్తారు. ఇందులో జ్ఞాన ఇంద్రజాలముంది. అజ్ఞానాన్ని ఇంద్రజాలమని అనరు. కృష్ణుడు మురళి మ్రోగించేవాడని వారిని చాలా మహిమను చేస్తారు. తండ్రి చెప్తారు - కృష్ణుడు దేవత. మనుష్యుల నుండి దేవతలుగా, దేవతల నుండి మనుష్యులుగా,....... ఇది జరుగుతూనే ఉంటుంది. దైవీసృష్టి కూడా ఉంటుంది, మనుష్య సృష్టి కూడా ఉంటుంది. ఈ జ్ఞానము ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. సత్యయుగము ఉన్నప్పుడు జ్ఞాన వారసత్వముంటుంది. సత్యయుగములో భక్తి ఉండదు. దేవతలు ఎప్పుడైతే మనుష్యులుగా అవుతారో అప్పుడు భక్తి ప్రారంభమవుతుంది. మనుష్యులను వికారులని, దేవతలను నిర్వికారులని అంటారు. దేవతల సృష్టిని పవిత్ర ప్రపంచమని అంటారు. ఇప్పుడు మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. దేవతలలో ఈ జ్ఞానముండదు. దేవతలు సద్గతిలో ఉంటారు, దుర్గతిలో ఉన్నవారికి జ్ఞానము అవసరము. ఈ జ్ఞానము ద్వారానే దైవీగుణాలు వస్తాయి. జ్ఞానధారణ ఉన్నవారి నడవడికలో దైవత్వముంటుంది. ధారణ తక్కువ ఉన్నవారి నడవడికలో మిక్స్‌ ఉంటుంది. ఆసురీ చలనము ఉన్నవారిని నా పిల్లలని చెప్పలేము. ధారణ లేకుంటే నా పిల్లలని ఎలా చెప్పుకోగలరు! పిల్లలు తండ్రిని తెలుసుకుంటే తండ్రి కూడా పిల్లలను ఎలా తెలుసుకోగలరు? ఎంత పచ్చి పచ్చిగా తండ్రిని నిందిస్తూ వచ్చారు. భగవంతుని నిందించడము ఎంత చెడ్డది! వారు బ్రాహ్మణులుగా అయినప్పుడు నిందించడము ఆగిపోతుంది. కనుక ఈ జ్ఞానాన్ని విచార సాగర మథనము చేయవలసి ఉంటుంది. విద్యార్థి విచార సాగర మథనము చేసి జ్ఞానాన్ని ఉన్నతి చేసుకుంటాడు. మీకు ఈ జ్ఞానము లభిస్తుంది. దీని పై మీరు విచార సాగర మథనము చేయడం ద్వారా అమృతము వెలువడ్తుంది. విచార సాగర మథనం జరగకుంటే ఇంకే మథనము జరుగుతుంది? ఆసురీ విచార మథనము. దీని ద్వారా మలినాలే వస్తాయి. ఇప్పుడు మీరు ఈశ్వరీయ విద్యార్థులు. మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే చదువును తండ్రి చదివిస్తున్నారని మీకు తెలుసు. దేవతలు చదివించరు. దేవతలనెప్పుడూ జ్ఞానసాగరులని అనరు. తండ్రియే జ్ఞాన సాగరులు. కనుక స్వయాన్ని - నాలో అన్ని దైవీ గుణాలు ఉన్నాయా? అని ప్రశ్నించుకోవాలి. ఒకవేళ ఆసురీ గుణాలుంటే వాటిని తొలగించుకోవాలి. అప్పుడే దేవతలుగా అవుతారు.

ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగములో ఉన్నారు. పురుషోత్తములుగా అవుతున్నారు కనుక వాతావరణము కూడా చాలా బాగుండాలి. ఛీ-ఛీ మాటలు నోటి నుండి వెలువడరాదు. లేకుంటే తక్కువ కులము వారని అంటారు. వాతావరణము ద్వారా తక్షణమే తెలిసిపోతుంది. నోటి ద్వారా దు:ఖమిచ్చు మాటలే వెలువడుతాయి. పిల్లలైన మీరు తండ్రి పేరును ప్రఖ్యాతము చేయాలి. ముఖము సదా చాలా హర్షితంగా ఉండాలి. నోటి ద్వారా సదా ఈ రత్నాలే వెలువడాలి. ఈ లక్ష్మీనారాయణులు చాలా హర్షితముఖులుగా ఉన్నారు! వీరి ఆత్మలు జ్ఞాన రత్నాలను ధారణ చేశాయి. నోటి ద్వారా ఈ జ్ఞాన రత్నాలే వెలువడుతూ ఉండేవి, ఈ రత్నాలనే వింటూ, వినిపిస్తూ ఉండేవారు. చాలా ఖుషీగా ఉండాలి. ఇప్పుడు మీరు ఏ జ్ఞాన రత్నాలను తీసుకుంటున్నారో అవి తర్వాత సత్యమైన వజ్ర వైడూర్యాలుగా అవుతాయి. నవరత్నాల మాల ఏ వజ్ర వైడూర్యాలది కాదు, ఇది చైతన్య రత్నాల మాల. మనుష్యులు వాటిని ఆ రత్నాలుగా భావించి ఉంగరాలు మొదలైనవాటిగా ధరిస్తారు. జ్ఞాన రత్నాల మాల ఈ పురుషోత్తమ సంగమ యుగములోనే తయారవుతుంది. ఈ రత్నాలే 21 జన్మలకు మిక్కిలి సంపన్నులుగా చేస్తాయి. వీటిని ఎవ్వరూ దోచుకోలేరు. ఇక్కడ ధరిస్తే తక్షణము ఎవరైనా దోచుకుంటారు, కనుక స్వయాన్ని చాలా చాలా వివేకవంతంగా చేసుకోవాలి. ఆసురీ గుణాలను తొలగించుకోవాలి. ఆసురీ గుణాలు గలవారి ముఖమే అలా తయారవుతుంది. క్రోధములో అయితే ఎర్రగా రాగి వలె అయిపోతుంది. కామ వికారము కలిగిన వారి ముఖము పూర్తి నల్లగా అయిపోతుంది. కృష్ణుని కూడా నల్లగా చూపిస్తారు కదా. వికారాల కారణంగానే సుందరమైనవారు నల్లగా అయ్యారు. పిల్లలైన మీరు ప్రతి విషయము పై విచార సాగర మథనము చేయాలి. ఈ చదువు ద్వారా చాలా ధనము పొందవచ్చు. పిల్లలైన మీరు విని ఉంటారు - విక్టోరియా మహారాణి మంత్రి మొదట చాలా పేదవానిగా ఉండేవాడు. దీపము వెలిగించుకుని చదివేవాడు. కాని ఆ చదువు రత్నాల సమానము కాదు. జ్ఞానాన్ని చదివి గొప్ప హోదాను సంపాదించుకుంటారు. కనుక విద్య ఉపయోగపడింది, కాని ధనము కాదు. చదువే ధనము. అది హద్దులోనిది, ఇది బేహద్‌ ధనము. తండ్రి మనలను చదివించి విశ్వాధికారులుగా చేస్తారని ఇప్పుడు మీకు తెలుసు. అక్కడ ధన సంపాదన కొరకు చదవరు. అక్కడ ఇప్పటి పురుషార్థము ద్వారా అపారమైన ధనము లభిస్తుంది. ధనము అవినాశిగా అయిపోతుంది. దేవతల వద్ద చాలా ధనముండేది. వారు వామమార్గములో రావణరాజ్యములోకి వచ్చినప్పుడు కూడా చాలా ధనముండేది, ఎన్ని మందిరాలు కట్టించారు. తర్వాత ముసల్మానులు దోచుకున్నారు. ఎంతో ధనవంతులుగా ఉండేవారు. ఈ రోజులలోని చదువు ద్వారా ఇంత ధనవంతలుగా అవ్వలేరు. ఈ చదువు ద్వారా మనుష్యులు ఏమవుతున్నారో చూడండి. పేదవారి నుండి ధనవంతులుగా అవుతున్నారు. ఇప్పుడు భారతదేశము ఎంత పేదగా ఉందో చూడండి. ధనవంతులకు సమయమే ఉండదు. వారికి తమ ధనము, హోదాల అహంకారము చాలా ఉంటుంది. ఇందులో అహంకారము మొదలైనవన్నీ సమాప్తమైపోవాలి. మనము ఆత్మలము, ఆత్మల వద్ద ధన-సంపదలు, వజ్ర వైడూర్యాలు మొదలైనవేవీ ఉండవు.

తండ్రి చెప్తారు - మధురమైన పిల్లలారా, దేహ సహితంగా దేహ సంబంధాలన్నీ వదిలేయండి. ఆత్మ శరీరాన్ని వదిలేస్తే ఆ శ్రీమంత స్థితి అంతా సమాప్తమైపోతుంది. మళ్లీ కొత్తగా చదవాలి, ధనాన్ని సంపాదించినప్పుడే ధనవంతులుగా అవుతారు లేక దాన-పుణ్యాలు బాగా చేసి ఉంటే శ్రీమంతుల ఇంటిలో జన్మిస్తారు. ఇది జరిగిపోయిన కర్మల ఫలమని అంటారు. జ్ఞానదానము చేసినప్పుడు, కాలేజీలు, ధర్మశాలలు మొదలైనవి కట్టిస్తే అందుకు ఫలము లభిస్తుంది కాని అది అల్పకాల ఫలము. ఈ దాన-పుణ్యాలు మొదలైనవన్నీ ఇక్కడే చేస్తారు. సత్యయుగములో చేయరు. సత్యయుగములో మంచి కర్మలే ఉంటాయి ఎందుకంటే ఇప్పటి వారసత్వము లభించి ఉంటుంది. అక్కడ ఏ కర్మా వికర్మగా అవ్వదు. ఎందుకంటే రావణుడే ఉండడు. వికారాలకు వశమగుట వలన వికారీ కర్మలుగా అవుతాయి. వికారాల వలన వికర్మలు తయారవుతాయి. స్వర్గములో వికర్మలేవి జరగవు. పూర్తి ఆధారమంతా కర్మల పై ఆధారపడి ఉంది. ఈ మాయా రావణుడు అవగుణాలు గలవారిగా చేస్తాడు. తండ్రి వచ్చి సర్వగుణ సంపన్నులుగా చేస్తారు. రామ వంశీయుల, రావణ వంశీయుల యుద్ధము జరుగుతుంది. మీరు రాముని సంతానము, ఎంతో మంచి-మంచి పిల్లలు మాయ చేతిలో ఓడిపోతారు. బాబా వారి పేర్లు చెప్పరు, అయినా ఆశను ఉంచుకుంటారు. అధమాతి అధములను(అత్యంత కనిష్ఠమైనవారిని) కూడా ఉద్ధరించవలసి ఉంటుంది. తండ్రి పూర్తి విశ్వాన్నంతా ఉద్ధరించవలసి ఉంటుంది. రావణ రాజ్యములో అందరూ అధోగతిని పొంది ఉన్నారు. రక్షణ చేసుకునేందుకు, రక్షణ చేసేందుకు తండ్రి ప్రతి రోజూ యుక్తులు తెలియజేస్తూ ఉంటారు. అయినా క్రిందపడుతూ అధమాతి అధములుగా అవుతారు మళ్లీ వారు ఇంత ఉన్నతిని పొందలేరు. ఆ అధమత్వము ఆంతరికములో తింటూ ఉంటుంది. అంతిమ సమయంలో ఎవరి స్మృతిలో శరీరాన్ని వదుల్తారో తదనుసారంగా గతి,........ అని చెప్తారు కదా. వారి బుద్ధిలో ఆ అధమత్వమే గుర్తు వస్తూ ఉంటుంది.

తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - కల్ప-కల్పము సృష్టి చక్రము ఎలా తిరుగుతుందో మీరు మాత్రమే వింటారు, జంతువులు తెలుసుకోలేవు కదా. మీరే వింటారు, అర్థము చేసుకుంటారు. మనుష్యులు మనుష్యులే. ఈ లక్ష్మీనారాయణలకు కూడా ముక్కు, చెవులు మొదలైనవన్నీ ఉన్నాయి, వారు కూడా మనుష్యులే కదా. కాని దైవీగుణాలు ఉన్న కారణంగా వారిని దేవతలని అంటారు. వారలాంటి దేవతలుగా ఎలా అవుతారు? మళ్లీ ఎలా పడిపోతారు, ఈ చక్రము గురించి మీకు మాత్రమే తెలుసు. ఎవరు విచార సాగర మథనము చేస్తూ ఉంటారో వారికే ధారణ జరుగుతుంది. విచార సాగర మథనము చేయనివారిని మూర్ఖులని అంటారు. మురళి నడిపించేవారికి ఈ టాపిక్‌ పై ఇలా - ఇలా అర్థం చేయించాలని విచార సాగర మథనము జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అర్థము చేసుకోకపోయినా ముందు - ముందు తప్పకుండా అర్థము చేసుకుంటారు అని నమ్మకము ఉంచబడ్తుంది. నమ్మకము ఉంచడము అనగా సర్వీసు చేసేందుకు ఆసక్తి ఉన్నట్లు, వారు అలసిపోరు. ఎవరైనా ఉన్నతి పొంది మళ్లీ అధములై వచ్చినట్లైతే స్నేహముతో కూర్చోబెడ్తారు కదా లేక వెళ్ళిపోండి అని అంటారా? ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు, ఎందుకు రాలేదు అని స్థితి-గతులను అడగవలసి ఉంటుంది. మాయ చేతిలో ఓడిపోయానని చెప్తారు కదా. జ్ఞానము చాలా బాగుందని అర్థము కూడా చేసుకుంటారు. స్మృతి అయితే ఉంటుంది కదా. భక్తిలో గెలుపు - ఓటములు పొందే మాటే లేదు. ఇది జ్ఞానము, దీనిని ధారణ చేయాలి. మీరు ఎప్పటి వరకు బ్రాహ్మణులుగా అవ్వరో, అప్పటి వరకు దేవతలుగా అవ్వలేరు. క్రైస్తవులు, బౌద్ధులు, పార్సీలు మొదలైన వారిలో బ్రాహ్మణులు ఉండరు. బ్రాహ్మణుల సంతానము బ్రాహ్మణులుగా అవుతారు. ఈ విషయాలు ఇప్పుడు మీరు అర్థము చేసుకున్నారు. అల్ఫ్‌(తండ్రి)ను స్మృతి చేయాలని మీకు తెలుసు. అల్ఫ్‌ను స్మృతి చేయడం వలన 'బే '(ఆస్తి) లభిస్తుంది. మిమ్ములను కలుసుకునేందుకు ఎవరు వచ్చినా, వారికి అల్ఫ్‌ అల్లాను స్మృతి చేయండి అని చెప్పండి. అల్ఫ్‌నే శ్రేష్ఠమైనవారని చెప్తారు. వేలితో పరమాత్ముని వైపు చూపిస్తారు. నేరుగా వారు అల్ఫ్‌(పరమాత్మ) అని, అల్ఫ్‌ ఒక్కరే అని కూడా చెప్తారు(అల్ఫ్‌ కో ఏక్‌ భీ కహా జాతా హై). భగవంతుడు ఒక్కరే, మిగిలినవారంతా వారి పిల్లలు. తండ్రిని అల్ఫ్‌ అని అంటారు. తండ్రి జ్ఞానాన్ని కూడా ఇస్తారు. తన పిల్లలుగా కూడా చేసుకుంటారు. కనుక పిల్లలైన మీరు ఎంత ఖుషీగా ఉండాలి! బాబా మనకు ఎంత సేవ చేస్తారు, విశ్వాధికారులుగా చేెస్తారు. కాని వారు స్వయం ఆ పవిత్ర ప్రపంచములోకి రానే రారు. పావన ప్రపంచములో వారిని ఎవ్వరూ పిలవనే పిలవరు. పతిత ప్రపంచములోనే పిలుస్తారు. పావన ప్రపంచములో వచ్చి ఏం చేస్తారు! వారి పేరే పతిత పావనులు. పాత ప్రపంచాన్ని పావన ప్రపంచంగా చేయడమే వారి కర్తవ్యము. తండ్రి పేరే శివుడు. పిల్లలను సాలిగ్రామాలని అంటారు. ఇరువురికీ పూజ జరుగుతుంది. కాని పూజ చేసేవారికి ఏమీ తెలియదు. పూజించేందుకు ఒక ఆచార సంప్రదాయంగా చేశారు. దేవీలకు కూడా ఫస్ట్‌క్లాస్‌ వజ్రాలు, ముత్యాలు మొదలైనవాటితో భవనాలు తయారుచేస్తారు, పూజిస్తారు. అక్కడ మట్టి లింగాలను తయారు చేస్తారు, పగులగొట్తారు. లింగాలను తయారు చేయడంలో శ్రమ ఉండదు. దేవీలను తయారు చేయడంలో శ్రమ ఉంటుంది. వారి పూజలో శ్రమ ఉండదు. ఉచితంగా లభిస్తాయి. రాళ్ళు, నీటి రాపిడికి గోళాకారంగా తయారవుతాయి. పూర్తి అండాకారంగా చేస్తారు. ఆత్మ అండాకారములో ఉంటుంది, బ్రహ్మతత్వములో ఉంటుంది అని అంటారు. కను దానిని బ్రహ్మాండము అని అంటారు. మీరు బ్రహ్మాండానికి, విశ్వానికి అధికారులుగా అవుతారు.

కనుక మొట్టమొదట తండ్రి గురించి అర్థం చేయించాలి. శివుడిని బాబా అని అందరూ స్మృతి చేస్తారు. బ్రహ్మను కూడా బాబా అని అంటారు. ప్రజాపిత కనుక పూర్తి ప్రజలందరికి పిత అయ్యాడు కదా. గ్రేట్‌ గ్రేట్‌ గ్రాండ్‌ఫాదర్‌ అయ్యాడు. ఈ పూర్తి జ్ఞానము ఇప్పుడు మీలో ఉంది. ప్రజాపిత బ్రహ్మ అని చాలామంది చెప్తారు. కాని యథార్థ రీతిలో ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మ ఎవరి సంతానము? పరమపిత పరమాత్ముని సంతానమని మీరు చెప్తారు. శివబాబా వీరిని దత్తు తీసుకున్నారు. కనుక ఇతడు శరీరధారి కదా. ఈశ్వరునికి అందరూ సంతానమే. ఎప్పుడైతే శరీరము లభిస్తుందో అప్పుడు ప్రజాపిత బ్రహ్మకు దత్తు పిల్లలని చెప్తారు. అది దత్తత కాదు, ఆత్మలను పరమపిత పరమాత్మ దత్తత తీసుకున్నారా? లేదు. పిల్లలైన మిమ్ములను దత్తత తీసుకున్నారు. ఇప్పుడు మీరు బ్రహ్మకుమార - కుమారీలు. శివబాబా దత్తత తీసుకోరు. ఆత్మలందరూ అనాది, అవినాశి. ఆత్మలందరికీ తమ - తమ శరీరము, తమ-తమ పాత్ర లభించి ఉంది. దానిని అభినయించే తీరాలి. ఈ పాత్రనే అనాది, అవినాశి పరంపరగా వస్తోంది. దాని ఆది-అంత్యములను తెలపలేము. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మీ ధనికత్వము, స్థానాల(హోదా, పొజిషన్‌) అహంకారాన్ని సమాప్తము చేసుకోవాలి. అవినాశి జ్ఞాన ధనము ద్వారా స్వయాన్ని ఐశ్వర్యవంతులుగా చేసుకోవాలి. సేవలో ఎప్పుడూ అలసిపోరాదు.
2. వాతావరణాన్ని బాగా ఉంచుకునేందుకు నోటి ద్వారా సదా రత్నాలే వెలువడాలి. దు:ఖమునిచ్చే మాటలు వెలువడకుండా గమనముంచాలి. హర్షితముఖులుగా ఉండాలి.

వరదానము :- '' సదా శ్రేష్ఠ సమయానుసారము శ్రేష్ఠ కర్మలు చేస్తూ 'వాహ్‌ వాహ్‌' అనే పాట పాడుకునే భాగ్యశాలి ఆత్మా భవ ''
ఈ శ్రేష్ఠమైన సమయంలో సదా శ్రేష్ఠ కర్మలు చేస్తూ ''వాహ్‌ వాహ్‌'' అనే పాట మనసులో పాడుకుంటూ ఉండండి. ''వాహ్‌ నా శ్రేష్ఠ కర్మ'' లేక ''వాహ్‌ శ్రేష్ఠ కర్మలు నేర్పించే బాబా'' కనుక సదా ''వాహ్‌ వాహ్‌'' అనే పాట పాడుతూ ఉండండి. ఎప్పుడూ పొరపాటున కూడా దు:ఖము కలిగించే దృశ్యాలను చూస్తున్నా మీ నోటి నుండి హాయ్‌(అయ్యో) అనే శబ్ధము వెలువడరాదు. ''వాహ్‌ డ్రామా వాహ్‌, వాహ్‌ బాబా వాహ్‌''. ఏదైతే స్వప్నములో కూడా లేదో, ఆ భాగ్యము ఇంట్లో కూర్చుని ఉండగానే లభించింది. ఈ భాగ్య నశాలో ఉండండి.

స్లోగన్‌:- ''మనసు-బుద్ధిని శక్తిశాలిగా చేసుకుంటే ఎటువంటి అలజడిలోనైనాఅచలంగా, స్థిరంగా ఉంటారు''

Sunday, 29 December 2019

Telugu Murli 30/12/2019

30-12-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - పూర్తి ఆధారమంతా స్మృతి పైనే ఉంది, స్మృతి ద్వారానే మీరు మధురంగా అవుతారు, ఈ స్మృతిలోనే మాయతో యుద్ధము నడుస్తుంది ''

ప్రశ్న :- ఈ డ్రామాలో పిల్లలైన మీకు మాత్రమే తెలిసిన ఏ రహస్యము ఎక్కువగా విచార సాగర మథనము చేసేందుకు యోగ్యమైనది?
జవాబు :- ఈ డ్రామాలో ఒక్క పాత్ర రెండు సార్లు అభినయించబడదని మీకు తెలుసు. పూర్తి ప్రపంచంలో ఏ పాత్ర జరిగినా, అది ఒకదానికన్నా మరొకటి నూతనంగా ఉంటుంది. సత్యయుగము నుండి ఇప్పటివరకు రోజులు ఎలా పరివర్తిన అవుతాయో మీరు ఆలోచిస్తారు. కర్తవ్యాలన్నీ పరివర్తనైపోతాయి. ఆత్మలో 5 వేల సంవత్సరాల కర్మల రికార్డు(పాత్ర) నిండి ఉంది. ఇది ఎప్పుడూ పరివర్తనవ్వదు. ఈ చిన్న విషయము పిల్లలైన మీ బుద్ధికి తప్ప మరెవ్వరి బుద్ధికీ తోచదు.

ఓంశాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా, మీరు మీ భవిష్య పురుషోత్తమ ముఖమును, పురుషోత్తమ శరీరాన్ని చూస్తున్నారా? ఇది పురుషోత్తమ సంగమ యుగము కదా. మళ్లీ నూతన ప్రపంచమైన సత్యయుగములో వీరి వంశావళిలో వస్తామని మీరు ఫీల్‌ చేస్తారు. దానిని సుఖధామమని అంటారు. అక్కడి కొరకే మీరు ఇప్పుడు పురుషోత్తములుగా అవుతున్నారు. కూర్చుంటూనే ఇటువంటి ఆలోచనలు రావాలి. విద్యార్థి చదువుతున్నప్పుడు రేపు మేము ఇలా అవుతామని వారి బుద్ధిలో తప్పకుండా ఉంటుంది. అలాగే మీరు కూడా ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు మేము విష్ణు రాజ్యములోకి వస్తామని మీకు తెలుసు. ఇప్పుడు మీ బుద్ధి అలౌకికంగా ఉంది. వేరేవ్వరి బుద్ధిలోనూ ఈ విషయాలు రమిస్తూ ఉండవు. ఇది సాధారణ సత్సంగము కాదు. మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. అయినా సత్యమైన తండ్రి అయిన శివబాబా సాంగత్యములో కూర్చుని ఉన్నామని భావిస్తారు. శివబాబాయే రచయిత. వారికే ఈ రచన ఆదిమధ్యాంతాలు తెలుసు. వారే ఈ జ్ఞానమును ఇస్తారు. నిన్నటి విషయాన్ని వినిపించినట్లు తెలుపుతారు. మేము ఈ శరీరాన్ని పరివర్తన చేసుకుని దైవీ శరీరాన్ని పొందేందుకు ఇక్కడకు వచ్చామని ఇక్కడ కూర్చున్నప్పుడు స్మృతి ఉంటుంది కదా. ఇది మా తమోప్రధానమైన పాత శరీరము, దీనిని పరివర్తన చేసుకొని ఇలాంటి శరీరాన్ని తీసుకోవాలని ఆత్మ చెప్తుంది. ఎంత సహజమైన లక్ష్యము! చదివించే టీచరు చదివే విద్యార్థుల కంటే తప్పకుండా చురుకైనవారుగా ఉంటారు కదా. చదివిస్తారు, మంచి కర్మలు కూడా నేర్పిస్తారు. మమ్ములను సర్వ శ్రేష్ఠులైన భగవంతుడు చదివిస్తున్నారు. కనుక తప్పకుండా దేవీ దేవతలుగా చేస్తారని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఈ చదువు ఉండేదే నూతన ప్రపంచము కొరకు. వేరెవ్వరికీ నూతన ప్రపంచము గురించి కొద్దిగా కూడా తెలియదు. ఈ లక్ష్మీనారాయణులే నూతన విశ్వానికి అధికారులుగా ఉండేవారు. దేవీదేవతలు కూడా నెంబరువారుగా ఉంటారు కదా. అందరూ ఒకే విధంగా ఉండలేరు ఎందుకంటే అది రాజధాని కదా. ఇలాంటి ఆలోచనలు మీ బుద్ధిలో నడుస్తూ ఉండాలి. ఆత్మలమైన మనము ఇప్పుడు పతితుల నుండి పావనంగా అయ్యేందుకు పావనమైన తండ్రిని స్మృతి చేస్తాము. ఆత్మ తన మధురమైన తండ్రిని స్మృతి చేస్తుంది. మీరు నన్ను స్మృతి చేసినట్ల్లైతే పావనంగా, సతోప్రధానంగా అవుతారని బాబా స్వయంగా చెప్తారు. ఆధారమంతా స్మృతియాత్ర పైనే ఉంది. పిల్లలూ! నన్ను ఎంతసేపు స్మృతి చేస్తారు అని తండ్రి తప్పకుండా అడుగుతారు. స్మృతి యాత్రలోనే మాయతో యుద్ధము జరుగుతుంది. మీకు యుద్ధము కూడా తెలుసు. ఇది యాత్ర కాదు, యుద్ధము వంటిది. ఇందులో చాలా అప్రమత్తంగా ఉండాలి. జ్ఞానములో మాయ తుఫానులు మొదలైనవి రావు అని తండ్రి చెప్తున్నారు. ''బాబా, మేము మిమ్ములను స్మృతి చేస్తాము కాని మాయ తుఫాను మమ్ములను క్రింద పడేస్తుంది'' అని పిల్లలు చెప్తారు. దేహాభిమానము నంబర్‌వన్‌ తుఫాను. తర్వాత కామము, క్రొధము, లోభము, మోహముల తుఫాను. బాబా మేము స్మృతిలో ఉండేందుకు చాలా ప్రయత్నం చేస్తాము, ఏ విఘ్నము రాకూడదని అనుకుంటాము, కాని తుఫాను వచ్చేస్తుంది అని పిల్లలు చెప్తారు. నేడు క్రోధము, మరొకసారి లోభముల తుఫాను వచ్చిందని చెప్తారు. బాబా ఈ రోజు మా స్థితి చాలా బాగుంది, పూర్తి రోజంతా ఏ తుఫానూ రాలేదు,.......... చాలా సంతోషంగా ఉన్నాను. తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేశాను. స్నేహముతో ఆనందబాష్పాలు కూడా వచ్చాయి. తండ్రి స్మృతి ద్వారానే చాలా మధురంగా అవుతారు.

మనము మాయ చేతిలో ఓడిపోతూ ఓడిపోతూ ఎక్కడి వరకు వచ్చి చేరామని కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఇది ఎవ్వరికీ తెలియదు. మనుష్యులైతే లక్షల సంవత్సరాలని చెప్తారు లేక పరంపర అని చెప్తారు. మేము తిరిగి ఇప్పుడు మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నామని మీరు చెప్తారు. ఈ జ్ఞానాన్ని తండ్రే వచ్చి ఇస్తారు. విచిత్రమైన తండ్రియే విచిత్రమైన జ్ఞానాన్ని ఇస్తారు. విచిత్రము అని నిరాకారునికే చెప్పబడుతుంది. నిరాకారులు ఈ జ్ఞానాన్ని ఎలా ఇస్తారు? నేను ఎలా ఈ శరీరములో వస్తానో స్వయంగా అర్థం చేయిస్తాను. అయినా ఈ ఒక్క తనువులోనే వస్తారా! అని మనుష్యులు తికమకపడ్తారు. కాని డ్రామాలో ఈ తనువే నిమిత్తంగా అవుతుంది. కొద్దిగా కూడా మార్పు జరగదు. ఈ మాటలను మీరే అర్థము చేసుకుని ఇతరులకు అర్థం చేయిస్తారు. ఆత్మనే చదువుతుంది, ఆత్మనే నేర్చుకుంటుంది, నేర్పిస్తుంది. ఆత్మ చాలా విలువైనది. ఆత్మ అవినాశి, కేవలం శరీరము సమాప్తమైపోతుంది. ఆత్మలమైన మనము మన పరమపిత పరమాత్ముని ద్వారా రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాలను, 84 జన్మల జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. జ్ఞానము ఎవరు తీసుకుంటారు? ఆత్మలమైన మనము. ఆత్మలైన మీరే జ్ఞానసాగరులైన తండ్రి ద్వారా మూలవతనానికి, సూక్ష్మవతనానికి వెళ్ళాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలని మనుష్యులకు తెలియదు. మనుష్యులు స్వయాన్ని శరీరమని భావించి ఉల్టాగా వ్రేలాడుతున్నారు. ఆత్మ సచ్చిదానంద స్వరూపమని గాయనముంది. పరమాత్మకు అందరికంటే ఎక్కువ మహిమ ఉంది. ఒక్క తండ్రికే ఎంత మహిమ ఉంది! వారే దు:ఖహర్త - సుఖకర్త. దోమలు మొదలైన వాటిని దు:ఖహర్త - సుఖకర్త జ్ఞానసాగరులు అని మహిమ చేయరు. ఇది తండ్రి మహిమ. పిల్లలైన మీరు కూడా మాస్టర్‌ దు:ఖహర్త - సుఖకర్తలు. పిల్లలైన మీకు కూడా ఈ జ్ఞానము ఉండేది కాదు. పసివారి(బేబి) బుద్ధి వలె ఉండేది. పసిపిల్లలలో జ్ఞానము ఉండదు, ఎలాంటి అవగుణాలు కూడా ఉండవు, కనుకనే వారిని మహాత్ములని అంటారు. ఎందుకంటే వారు పవిత్రులు. ఎంత పసిపిల్లలుగా ఉంటారో అంత నంబరువన్‌ పుష్పాలు. పూర్తి కర్మాతీత స్థితి లాంటిది. వారికి కర్మ-అకర్మ- వికర్మల గురించి ఏమీ తెలియదు కనుక వారు పుష్పాలు. ఎలాగైతే తండ్రి అందరినీ ఆకర్షిస్తారో అలాగే వారు కూడా అందరినీ ఆకర్షిస్తారు. తండ్రి వచ్చిందే అందరినీ ఆకర్షించి సుగంధభరిత పుష్పాలుగా చేసేందుకు కాని కొందరు ముళ్ళుగానే మిగిలిపోతారు. పంచ వికారాలకు వశీభూతులయ్యే వారిని ముళ్ళు అని అంటారు. మొదటి నంబరు ముల్లు దేహాభిమానము. దీని ద్వారా ఇతర ముళ్ళు జన్మిస్తాయి. ముళ్ళ అడవి చాలా దు:ఖాన్నిస్తుంది. రకరకాలైన ముళ్లు అడవిలో ఉంటాయి కదా. కనుక దీనిని దు:ఖధామమని అంటారు. కొత్త ప్రపంచములో ముళ్ళు ఉండవు. అందువలన దానిని సుఖధామమని అంటారు. శివబాబా పుష్పాల తోటను తయారు చేస్తారు, రావణుడు ముళ్ళ అడవిని తయారు చేస్తాడు. కనుక రావణుని ముళ్ళ పొదలతో కాలుస్తారు, తండ్రి పై పుష్పాలను సమర్పిస్తారు. ఈ విషయాలు తండ్రికి తెలుసు, పిల్లలకు తెలుసు. ఇతరులెవ్వరికీ తెలియదు.

డ్రామాలో ఒకే పాత్ర రెండుసార్లు అభినయింపబడదని పిల్లలైన మీకు తెలుసు. పూర్తి విశ్వములో ఏ పాత్ర అభినయించబడ్తుందో అది ఒకదానికన్నా మరొకటి నూతనంగా ఉంటుందని మీ బుద్ధిలో ఉంది. సత్యయుగము నుండి ఇప్పటి వరకు ఎలా రోజులు పరివర్తన అవుతాయో మీరు ఆలోచించండి. పూర్తి పాత్రనే పరివర్తనైపోతుంది. 5 వేల సంవత్సరాల కర్మల రికార్డు ఆత్మలో నిండి ఉంది. అది ఎప్పుడూ పరివర్తనవ్వదు. ప్రతి ఆత్మలో తమ-తమ పాత్ర నిండి ఉంటుంది. ఈ చిన్న విషయము కూడా ఎవరి బుద్ధికీ తోచదు. ఈ డ్రామా యొక్క భూత, భవిష్య, వర్తమానాల గురించి మీకు తెలుసు. ఇది పాఠశాల కదా. పవిత్రంగా అయి తండ్రిని స్మృతి చేసే చదువును తండ్రి చదివిస్తున్నారు. తండ్రి వచ్చి ఇలా పతితులను పావనంగా చేసే చదువును చదివిస్తారని, ఈ చదువు ద్వారానే మనము విశ్వాధిపతులుగా అవుతామని ఎప్పుడైనా అనుకున్నారా? భక్తిమార్గములోని పుస్తకాలే వేరు. దానిని చదువు అని ఎప్పుడూ అనరు. జ్ఞానము లేకుండా సద్గతి ఎలా సాధ్యమవుతుంది? తండ్రి జ్ఞానము లేకుండా ఎలా వచ్చి సద్గతినివ్వగలరు? సద్గతిలో మీరు ఉన్నప్పుడు భక్తి చేస్తారా? లేదు, అక్కడ అపారమైన సుఖము ఉంటుంది, మరి భక్తి దేనికొరకు చేయాలి? ఈ జ్ఞానము ఇప్పుడే మీకు లభిస్తుంది. పూర్తి జ్ఞానమంతా ఆత్మలో ఉంటుంది. ఆత్మకు ఏ ధర్మమూ ఉండదు. ఆత్మ ఎప్పుడు శరీరాన్ని ధారణ చేస్తుందో అప్పుడే ఫలానా వారు ఫలానా ధర్మము వారు అని అంటారు. ఆత్మ ధర్మమేమిటి? ఆత్మ బిందువు వలె ఉంటుంది. అది శాంతి స్వరూపము, శాంతిధామములో ఉంటుంది.

పిల్లలందరికీ తండ్రి పైన హక్కు ఉందని తండ్రి చెప్తున్నారు. చాలామంది పిల్లలు వేరే వేరే ధర్మాలలోకి మారిపోయారు. వారు మళ్లీ తమ వాస్తవిక ధర్మములోకి వచ్చేస్తారు. ఎవరెవరు దేవీదేవతా ధర్మాన్ని వదిలి ఇతర ధర్మాలలోకి వెళ్ళారో, ఆ ఆకులన్నీ మళ్లీ తమ తమ స్థానాలకు వచ్చేస్తాయి. మొట్టమొదట మీరు తండ్రి పరిచయమునివ్వాలి. ఈ విషయాలలోనే అందరూ తికమకపడి ఉన్నారు. ఇప్పుడు మనలను చదివిస్తున్నవారు అనంతమైన తండ్రి అని పిల్లలకు తెలుసు. కృష్ణుడు దేహధారి, బ్రహ్మాబాబాను కూడా దాదా అని అంటారు. మీరంతా పరస్పరము సోదరులు కదా. మిగిలింది పదవుల విషయము. సోదరుల శరీరము ఒక రకంగా, సోదరి శరీరము మరొక రకంగా ఉంటుంది. ఆత్మ మాత్రము ఒక చిన్న నక్షత్రము. పూర్తి జ్ఞానమంతా ఈ చిన్న నక్షత్రములోనే ఉంది. ఈ నక్షత్రము శరీరము లేకుండా మాట్లాడలేదు. ఈ నక్షత్రము పాత్ర చేసేందుకు ఇన్ని అవయవాలు లభించాయి. మీ నక్షత్రాల ప్రపంచమే వేరు. ఆత్మ ఇక్కడకు వచ్చి శరీరాన్ని ధరిస్తుంది. శరీరములు చిన్నవిగా, పెద్దవిగా ఉంటాయి. ఆత్మయే తన తండ్రిని స్మృతి చేస్తుంది. అది కూడా ఎప్పటి వరకు శరీరములో ఉంటుందో అప్పటివరకే చేయగలదు. ఇంటిలో ఆత్మ తండ్రిని స్మృతి చేస్తుందా? లేదు. అక్కడ ఉన్నప్పుడు మనము ఎక్కడ ఉన్నామో కూడా తెలియదు. ఆత్మ మరియు పరమాత్మ ఇరువురూ ఎప్పుడు శరీరములో ఉంటారో అప్పుడే ఆత్మ-పరమాత్మల మేళా అని చెప్పబడ్తుంది. గాయనము కూడా ఉంది - ''ఆత్మ మరియు పరమాత్మ చాలా కాలము దూరంగా ఉన్నారు,..........'' ఎంత కాలము దూరంగా ఉన్నారు? ఎంత సమయము దూరంగా ఉన్నారు? జ్ఞాపకము వస్తోందా? ఒక్కొక్క క్షణము గడుస్తూ 5 వేల సంవత్సరాలు గడిచిపోయాయి. తిరిగి ఒకటవ నెంబరు నుండి ప్రారంభము చేయాలి, ఖచ్ఛితమైన లెక్క ఉంది. ఇప్పుడు మిమ్ములను ఇతడు ఎప్పుడు జన్మ తీసుకున్నారు? అని ప్రశ్నిస్తే ఖచ్ఛితంగా చెప్పగలరు. శ్రీ కృష్ణుడే మొదటి నంబరులో జన్మ తీసుకుంటాడు. శివునికి సంబంధించిన తిథి, తారీఖులు(నిమిషములు, క్షణాలు) తెలుసుకోలేరు. కృష్ణుని తిథి, తారీఖులు, నిమిషాలు, క్షణాలు తీయవచ్చు. మనుష్యుల గడియారాలలో తేడా రావచ్చు. శివబాబా అవతరణలో కొద్దిగా కూడా వ్యత్యాసము రాదు. ఎప్పుడు వచ్చారో కూడా తెలియదు. సాక్షాత్కారమైనప్పుడు వచ్చారని కూడా కాదు. అందాజుగా చెప్పవచ్చు. నిమిషాల - సెకండ్ల లెక్క చెప్పలేము. వారిది అలౌకిక అవతరణ. వారు బేహద్‌ రాత్రి సమయములోనే వస్తారు. ఇతరుల అవతరణ మొదలైన వాటిని గురించి తెలుస్తుంది. ఆత్మ శరీరములో ప్రవేశిస్తుంది. చిన్న శరీరాన్ని ధరిస్తుంది. తర్వాత శరీరము నిదానంగా పెద్దదవుతూ పోతుంది. శరీరముతో పాటు ఆత్మ వెలుపలికి వస్తుంది. ఈ విషయాలన్నీ విచార సాగర మథనము చేసి తర్వాత ఇతరులకు అర్థం చేయించాలి. ఎంతమంది మనుష్యులున్నారు, ఒకరిదున్నట్లు మరొకరిది ఉండదు. ఎంత పెద్ద నాటక రంగము! పెద్ద హాలులో అనంతమైన నాటము నడుస్తూ ఉన్నట్లుంది.

పిల్లలైన మీరు నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు ఇక్కడకు వస్తారు. తండ్రి స్థాపించే నూతన సృష్టిలో శ్రేష్ఠ పదవిని తీసుకునేందుకు వస్తున్నారు. మిగిలిన ఈ పాత ప్రపంచము వినాశమవుతుంది. బాబా ద్వారా నూతన ప్రపంచ స్థాపన జరుగుతోంది. తర్వాత బాబా పాలన కూడా చేయాలి. తప్పకుండా ఈ శరీరాన్ని వదిలి సత్యయుగములో నూతన శరీరాన్ని తీసుకున్నప్పుడే పాలన చేస్తారు. దానికి ముందే ఈ పాత ప్రపంచము వినాశనము కూడా జరగాలి. విశ్వానికి నిప్పు అంటుకుంటుంది. చివరికి భారతదేశము మాత్రమే మిగిలి, మిగిలినవన్నీ సమాప్తమైపోతాయి. భారతదేశములో కూడా కొద్దిగా మాత్రమే మిగులుతుంది. వినాశనము తర్వాత శిక్షలు తినరాదని మీరు కష్టపడ్తున్నారు. వికర్మలు వినాశనమవ్వకుంటే శిక్షలు కూడా అనుభవిస్తారు, పదవి కూడా లభించదు. మీరు ఎవరి వద్దకు వెళ్తున్నారు? అని ఎవరైనా ప్రశ్నిస్తే, బ్రహ్మ తనువులో వచ్చి ఉన్న శివబాబా వద్దకు వెళ్తున్నామని చెప్పండి. ఈ బ్రహ్మ శివుడు కాదు, తండ్రిని ఎంత బాగా తెలుసుకుంటారో అంతగా తండ్రి పై ప్రేమ కూడా ఉంటుంది. బాబా చెప్తున్నారు - పిల్లలారా, మీరు ఎవ్వరినీ ప్రేమించకండి, ఇతర సాంగత్యాల పై ప్రేమ వదిలి ఒక్కరితోనే జోడించండి. ప్రేయసి - ప్రియులుంటారు కదా. ఇది కూడా అలాగే. 108 మంది సత్యమైన ప్రేయసులుగా తయారవుతారు, వారిలో కూడా 8 మంది సత్య-సత్యంగా అవుతారు. 8 మణుల మాల కూడా ఉంటుంది కదా. 9 రత్నాల గాయనము జరుగుతుంది. 8 మణులు, 9వ వారు బాబా. అష్టదేవతలు ముఖ్యమైనవారు, త్రేతా యుగము చివరివరకు 16,108 రాజకుమారి-రాజకుమారుల పరివారము తయారవుతుంది. బాబా అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నారు. మేము సృష్టికి యజమానులుగా అవుతున్నామని మీకు నషా ఉంది. బాబాతో ఇలాంటి వ్యాపారము చేయాలి. ఎవరో అరుదుగా ఈ వ్యాపారము చేస్తారు. ఇటువంటి వ్యాపారస్థులు ఎక్కడున్నారు! అలాగని అందరూ వ్యాపారులు కారు. మేము బాబా వద్దకు వెళ్తున్నామని ఉమంగ- ఉత్సాహం ఉండాలి. బాబా పైన ఉన్నవారు. కాని ఈ విషయం ప్రపంచము వారికి తెలియదు. వారు చివర్లో వస్తారని చెప్తారు. ఇప్పుడిదే కలియుగ అంతిమ సమయము. అదే గీత, మహాభారతము యొక్క సమయము. అదే యాదవులు మిస్సైల్స్‌ (ముసలము)ను తయారు చేస్తున్నారు. అదే కౌరవ రాజ్యము అదే పాండవులైన మీరు ఉన్నారు.

పిల్లలైన మీరు ఇప్పుడు ఇంట్లో కూర్చునే మీ సంపాదన చేసుకుంటున్నారు. భగవంతుడు ఇంట్లోనే లభించారు. కనుక మీ సంపాదన చేసుకోండి అని బాబా చెప్తారు. ఈ వజ్ర తుల్యమైన జన్మ అత్యంత అమూల్యమైనదని గాయనము చేయబడింది. ఇప్పుడు గవ్వల కొరకు ఇలాంటి జీవితాన్ని కోల్పోరాదు. ఇప్పుడు మీరు ఈ పూర్తి ప్రపంచాన్ని రామరాజ్యంగా చేస్తున్నారు. మీకు శివుని నుండి శక్తి లభిస్తున్నది. వర్తమాన సమయంలో చాలామందికి అకాల మృత్యువు కూడా సంభవిస్తుంది. బాబా బుద్ధికి వేసిన తాళాన్ని తెరుస్తారు. మాయ బుద్ధికి తాళాన్ని వేస్తుంది. ఇప్పుడు మాతలైన మీకే జ్ఞాన కలశము లభించింది. అబలలకు శక్తినిచ్చేవారు ఆ బాబా. ఇదే జ్ఞానామృతము. శాస్త్రాల జ్ఞానాన్ని అమృతమని అనరు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఒక్క బాబా ఆకర్షణలో ఉంటూ సుగంధభరిత పుష్పాలుగా అవ్వాలి. మీ మధురమైన తండ్రిని స్మృతి చేసి దేహాభిమానమనే ముల్లును భస్మము చేయాలి.
2. ఈ వజ్ర తుల్యమైన జన్మలో అవినాశి సంపాదన జమ చేసుకోవాలి. గవ్వల వెనుక ఈ సంపాదనను కోల్పోరాదు. ఒక్క బాబా పై సత్యమైన ప్రీతినుంచి ఒక్కరి సాంగత్యములోనే ఉండాలి.

వరదానము :- '' పాత స్వభావ - సంస్కారాల బరువును సమాప్తము చేసి డబల్‌లైట్‌గా ఉండే ఫరిస్తా భవ ''
తండ్రికి చెందినవారిగా అయ్యారు కనుక మొత్తం బరువంతా తండ్రికి ఇచ్చేయండి. పాత స్వభావ - సంస్కారాల బరువు కొద్దిగా మిగిలి ఉన్నా అది పై నుండి క్రిందకు తీసుకొస్తుంది. ఎగిరేకళను అనుభవం చేయనివ్వదు. అందువలన బాప్‌దాదా మీ బరువంతా నాకిచ్చేయండని అంటారు. అది రావణుని ఆస్తి మీ వద్ద ఉంచుకుంటే దు:ఖమే పొందుకుంటారు. ఫరిస్తా అనగా కొంచెం కూడా రావణుని ఆస్తి ఉండరాదు. పాత ఖాతాలన్నీ భస్మము చేయండి. అప్పుడు డబల్‌లైట్‌ ఫరిస్తాలని అంటారు.

స్లోగన్‌ :- '' నిర్భయంగా, హర్షితముఖులుగా ఉండి బేహద్‌ ఆటను చూస్తే ఆందోళన చెందరు ''

Saturday, 28 December 2019

Telugu Murli 29/12/2019

29-12-2019 ని అవ్యక్తబాప్‌దాదా కు ఓంశాంతి రివైజ్‌: 27-03-1985 మధువనము

'' కర్మాతీత స్థితి ''
ఈ రోజు బాప్‌దాదా నలవైపులా ఉన్న పిల్లలను విశేషంగా చూసేందుకు తిరగడానికి వెళ్లారు. ఎలాగైతే భక్తిమార్గంలో మీరందరూ ఎన్నిసార్లు పరిక్రమణ చేశారో, అలా బాప్‌దాదా కూడా ఈ రోజు నలువైపులా ఉన్న సత్యమైన బ్రాహ్మణులుండే స్థానాలను పరిక్రమణ చేశారు. పిల్లలందరి స్థానాలను, స్థితులను కూడా చూశారు. భిన్న-భిన్న స్థానాలు విధి పూర్వకంగా అలంకరించబడి ఉన్నాయి. కొన్ని స్థానాలు స్థూల సాధనాలతో ఆకర్షించేవిగా ఉన్నాయి, మరికొన్ని తపస్సు వైబ్రేషన్లతో ఆకర్షించేవిగా ఉన్నాయి, మరికొన్ని త్యాగము మరియు శ్రేష్ఠ భాగ్యము అనగా సాధారణత మరియు శ్రేష్ఠతల వాయుమండలముతో ఆకర్షించేవిగా ఉన్నాయి. కొన్ని కొన్ని సాధారణ స్వరూపములో కూడా కనిపించాయి. భిన్న భిన్న రూపాలలో ఉన్న ఈశ్వరీయ స్మృతి గల అన్ని స్థానాలను చూశారు. అలాగే ఏ స్థితిని చూశారు? ఇందులో కూడా భిన్న భిన్న రకాల స్థితులు గల బ్రాహ్మణ పిల్లలను చూశారు. సమయానుసారంగా పిల్లలు ఎంతవరకు తయారయ్యారో చూచేందుకు బ్రహ్మబాబా వెళ్లారు. పిల్లలందరూ అన్ని బంధనాల నుండి బంధనముక్తులుగా, యోగయుక్తులుగా, జీవన్ముక్తులుగా, ఎవర్‌రెడీగా ఉన్నారు, కేవలం సమయం కొరకు ఎదురు చూస్తున్నారని బ్రహ్మబాబా చెప్పారు. అలా తయారుగా ఉన్నారా? ఏర్పాట్లు అయిపోయి కేవలం సమయం కోసం ఎదురు చూస్తున్నారా? ఈ విధంగా బాప్‌దాదాల ఆత్మిక సంభాషణ జరిగింది. బంధనముక్తులుగా ఎంతవరకు అయ్యారో, యోగయుక్తులుగా ఎంతవరకు అయ్యారో శివబాబా పరిక్రమణ చేసి చూశారు. ఎందుకంటే బంధనముక్త ఆత్మలే జీవన్ముక్తిని అనుభవం చేయగలుగుతాయి. ఏ విధమైన హద్దులోని ఆధారము లేదు అనగా బంధనాల నుండి అతీతంగా ఉన్నారు. ఎలాంటి చిన్న, పెద్ద, స్థూలమైన, సూక్ష్మమైన మనసు ద్వారా లేక కర్మణా ద్వారా హద్దులోని ఆధారమేదైనా ఉన్నట్లయితే బంధనాల నుండి అతీతంగా అవ్వలేరు. కావున ఇది చూపించేందుకే ఈ రోజు బ్రహ్మబాబాను విశేషంగా సైయిర్ (విహరింప) చేయించారు. వారు ఏం చూశారు? మెజారిటి పెద్ద పెద్ద బంధనాల నుండి ముక్తులుగా ఉన్నారు. స్పష్టంగా కనిపించే బంధనాలు లేక తాళ్లు ఏవైతే ఉన్నాయో, వాటి నుండైతే దూరమయ్యారు. కాని కొన్ని కొన్ని ఇటువంటి అతి సూక్ష్మమైన బంధనాలు లేక తాళ్లు మిగిలి ఉన్నాయో వాటిని సూక్ష్మ బుద్ధి లేకుండా చూడలేరు లేక తెలుసుకోజాలరు కూడా. ఎలాగైతే ఈ రోజుల్లో విజ్ఞానం వారు సూక్ష్మమైన వస్తువులను శక్తిశాలి లెన్స్‌(అద్దాలు) ద్వారా చూడగలరో వాటిని సాధారణ రీతిగా చూడలేరో అలా సూక్ష్మమైన పరిశీలనా శక్తి ద్వారా ఆ సూక్ష్మ బంధనాలను చూడగలరు లేక సూక్ష్మ బుద్ధి ద్వారా తెలుసుకోగలరు. కేవలం బాహ్య రూపములో (పై పైన) చూసినట్లయితే సరిగ్గా గమనించని కారణంగా స్వయాన్ని బంధనముక్తులుగానే భావిస్తూ ఉంటారు. బ్రహ్మబాబా ఇటువంటి సూక్ష్మమైన ఆధారాలను కూడా పరిశీలించారు. అన్నిటికంటే ఎక్కువగా రెండు రకాల ఆధారాలను గమనించారు.

ఒకటేమో అతి సూక్ష్మ స్వరూపంలో ఏదో ఒక సేవా సహచరుల సూక్ష్మ ఆధారాన్ని చూశారు. అందులో కూడా అనేక రకాలను చూశారు. సేవా సహయోగమున్న కారణంగా, సేవను వృద్ధి చేసేందుకు నిమిత్తంగా అయిన కారణంగా లేక విశేషంగా ఏదైనా విశేషత లేక విశేష గుణము ఉన్న కారణంగా, విశేషంగా ఏవైనా సంస్కారాలు కలిసిన కారణంగా లేక సమయ ప్రతి సమయము ఏదైనా అదనపు సహాయము ఇచ్చిన కారణంగా, ఇటువంటి కారణాలతో సేవా సహచరుల రూపంలో ఉన్నారు. సహయోగముంది కాని వారి వైపు విశేషమైన ఝుకావ్‌(తల వంచిన) కారణంగా సూక్ష్మ ఆకర్షణ రూపము తయారవుతూ ఉంటుంది. దీని పరిణామము ఎలా ఉంటుంది? ఇది బాబా ఇచ్చిందని మర్చిపోతారు. వీరు చాలా మంచి సహయోగులని, మంచి విశేషతా స్వరూపులని, గుణవంతులని భావిస్తారు. కాని సమయానుసారంగా తండ్రి అలా మంచిగా తయారు చేశారని మర్చిపోతారు. సంకల్ప మాత్రములో కూడా ఏ ఆత్మ వైపుకైనా బుద్ధి ఆకర్షింపబడినట్లయితే ఆ ఆకర్షణ ఆధారంగా అయిపోతుంది. సాకార రూపంలో సహయోగిగా అయినందున సమయానికి తండ్రికి బదులు వారే ముందు గుర్తుకొస్తారు. మూడు నాలుగు నిముషాలు కూడా ఒకవేళ స్థూల ఆధారము స్మృతిలోకి వస్తే ఆ సమయంలో తండ్రి ఆధారము గుర్తుకొస్తుందా? రెండవ విషయమేమంటే ఒకవేళ మూడు నాలుగు నిముషాలకైనా స్మృతియాత్ర లింకు తెగిపోయిన తర్వాత దానిని కలపడంలో కష్టపడవలసి వస్తుంది. ఎందుకంటే నిరంతరంలో అంతరం(తేడా) వచ్చేసింది కదా! హృదయంలో హృదయాభిరామునికి బదులు ఇంకెటు వైపుకైనా, ఏ కారణంగానైనా హృదయం తల వంచుతుంది. వీరితో మాట్లాడడం మంచిగా అనిపిస్తుంది, వీరితో కూర్చోవడం మంచిగా అనిపిస్తుంది. ''వీరితోనే'' అన్న మాట వస్తే ఏదో దోషమున్నట్లే. 'వీరితోనే' అన్న ఆలోచన రావడం అనగా హీనత రావడమే. అందరూ మంచిగా అనిపిస్తున్నారు కాని వీరు కాస్త ఎక్కువగా మంచిగా అనిపిస్తున్నారు అన్నది తప్పు. అందరితో ఆత్మిక స్నేహాన్ని ఉంచడం, మాట్లాడడం లేక సేవా సహయోగాన్ని తీసుకోవడం లేక ఇవ్వడం వేరే విషయము. విశేషతలను చూడండి, గుణాలను చూడండి కాని వీరి గుణమే చాలా బాగుంది అన్నది మధ్యలో తీసుకు రాకండి. 'వీరే' అన్న పదం గందరగోళం చేస్తుంది. దీనినే మోహమని అంటారు. బాహ్య రూపము సేవా రూపంగా, జ్ఞాన రూపంగా, యోగ రూపంగా ఉన్నా వీరితోనే యోగం చేయాలి, వీరి యోగమే బాగుంది,........ 'వీరే' అన్న ఈ పదము రాకూడదు. వీరే సేవలో సహయోగులుగా అవ్వగలరు, వీరే తోడుగా ఉండాలి అనేది ఉండరాదు. ఈ ఆకర్షణకు గుర్తు ఏమిటో అర్థం చేసుకున్నారా? 'వీరే' అన్న పదాన్ని తీసేయండి. అందరూ బాగున్నారంటూ విశేషతలను చూడండి. సహయోగులుగా అవ్వండి, చేసుకోండి కూడా. మొదట ఆరంభంలో కొద్దిగానే ఉంటుంది కాని తర్వాత పెరుగుతూ పెరుగుతూ భయంకర రూపమైపోతుంది. ఆ తర్వాత వారి నుండి స్వయం తప్పుకోవాలనుకున్నా బయట పడలేరు ఎందుకంటే దారం గట్టిపడిపోతుంది. మొదట చాలా సూక్ష్మంగా ఉంటుంది, ఆ తర్వాత పక్కా అయిపోతుంది. అప్పుడు తెంపడం కష్టమైపోతుంది. ఒక్క తండ్రియే ఆధారము, మనుష్య ఆత్మలు ఎవ్వరూ ఆధారము కాదు. తండ్రి ఎవరినైనా సహయోగిగా నిమిత్తంగా తయారు చేస్తారు కాని తయారు చేసేవారిని మర్చిపోకండి. తండ్రి అలా తయారుచేశారు. మధ్యలో తండ్రి రావడంతో ఎక్కడైతే తండ్రి ఉంటారో అక్కడ పాపముండదు. తండ్రి మధ్య నుండి తొలగిపోతే పాపం ఏర్పడ్తుంది. కావున ఒక విషయము ఈ ఆధారానిది.

రెండవ విషయము - ఏదో ఒక సాకార సాధనాలను ఆధారంగా చేసుకున్నారు. సాధనాలు హెచ్చు-తగ్గులైతే సేవ కూడా హెచ్చు-తగ్గులవుతుంది. సాధనాలను కార్యంలో వినియోగించడం వేరే విషయము. కాని ఆ సాధనాలకు వశమై సేవ చేయడం అనగా సాధనాలను ఆధారంగా చేసుకోవడమే. సాధనాలు సేవ వృద్ధి కొరకే ఉన్నాయి. కావున ఆ సాధనాలను అదే విధంగా కార్యములోకి తీసుకురండి. సాధనాలను ఆధారంగా చేసుకోకండి. ఆధారము ఒక్క బాబాయే. సాధనాలు నశ్వరమైనవి. వినాశి సాధనాలను ఆధారంగా చేసుకోవడం అనగా ఎలాగైతే సాధనాలు నశ్వరమైనవో, అలా స్థితి కూడా కాసేపు చాలా బాగుంటుంది, మరి కాసేపు మధ్యస్థంగా, మరి కాసేపు కిందకు వెళ్లిపోతుంది. అవినాశి ఏకరస స్థితి ఉండదు. కావున ఇంకొక విషయము, వినాశి సాధనాలను ఆధారంగా భావించకండి. అవి కేవలం నిమిత్త మాత్రంగానే ఉన్నాయి. సేవ కొరకు ఉన్నాయి. సేవ కొరకు కార్యంలో ఉపయోగించి మళ్లీ అతీతంగా అవ్వాలి. సాధనాల ఆకర్షణలో మనసు ఆకర్షింపబడరాదు. కావున ఈ రెండు రకాల ఆధారాలు సూక్ష్మ రూపములో ఆధారంగా అవ్వడం గమనించారు. కర్మాతీత స్థితి రావాలనుకుంటే ప్రతి వ్యక్తి, ప్రతి వస్తువు, కర్మ బంధనం నుండి అతీతంగా అవ్వడం, భిన్నంగా అగుటనే కర్మాతీత స్థితి అని అంటారు. కర్మాతీతము అనగా కర్మ నుండి అతీతంగా అయిపోవడం కాదు, కర్మ బంధనాల నుండి అతీతంగా అవ్వడం. అతీతంగా అయి కర్మ చేయడం అనగా కర్మ నుండి అతీతంగా అవ్వడం. కర్మాతీత స్థితి అనగా బంధనముక్తమైన, యోగయుక్తమైన జీవన్ముక్త అవస్థ.

మరొక విశేషమైన విషయమేమి చూశారంటే సమయానుసారంగా చాలామంది పిల్లలు పరిశీలనా శక్తిలో బలహీనమైపోతున్నారు. పరిశీలించలేకపోతున్నారు కనుక మోసపోతున్నారు. పరిశీలించే శక్తి బలహీనమయ్యేందుకు కారణము బుద్ధి యొక్క లగ్నము ఏకాగ్రంగా లేకపోవడం. ఎక్కడైతే ఏకాగ్రత ఉంటుందో అక్కడ పరిశీలనా శక్తి స్వతహాగా పెరుగుతుంది. ఏకాగ్రత అనగా ఒక్క తండ్రి జతలో సదా లగ్నములో మగ్నమై ఉండడం. ఏకాగ్రతకు గుర్తు సదా ఎగిరేకళను అనుభవం చేసే ఏకరస స్థితి ఉంటుంది. ఏకరసము అనగా అదే వేగముతో ఏకరసంగా ఉండడమని కాదు. ఏకరసము అనగా సదా ఎగిరేకళ అనుభవమవుతూ ఉండాలి. ఇందులో ఏకరసంగా ఉండాలి. నిన్న ఏదైతే ఉందో(ఏ స్థితి ఉందో) ఆ శాతములో ఈ రోజు వృద్ధి జరిగిందని అనుభూతి కలగాలి. దీనినే ఎగిరేకళ అని అంటారు. కనుక స్వ ఉన్నతి కొరకు, సేవా ఉన్నతి కొరకు పరిశీలనా శక్తి ఎంతో అవసరము. పరిశీలనా శక్తి బలహీనంగా ఉన్నందున తమ బలహీనతను బలహీనతగా భావించరు. ఇంకా తమ బలహీనతను దాచుకునేందుకు, నిరూపించేందుకు ప్రయత్నిస్తారు లేక మొండితనము చూపిస్తారు. ఈ రెండు విషయాలు బలహీనతను దాచుకునేందుకు విశేష సాధనాలు. లోపల అప్పుడప్పుడు అనుభవం కూడా అవుతుంది కాని పూర్తిగా పరిశీలించే శక్తి లేనందున తమను తాము సదా రైట్‌గా, చురుకైనవారిగా నిరూపిస్తారు. అర్థమయిందా! కర్మాతీతముగా అయితే అవ్వాలి కదా. నెంబరునైతే తీసుకోవాలి కదా! కనుక పరిశీలించుకోండి. మంచిరీతిగా యోగయుక్తముగా అయ్యి పరిశీలనాశక్తి ధారణ చేయండి. ఏకాగ్రబుద్ధి గలవారిగా అయి పరిశీలించండి. అప్పుడు సూక్ష్మ లోపాలేవైతే ఉన్నాయో అవి స్పష్ట రూపంలో కనిపిస్తాయి. నేను రైట్‌, చాలా బాగా నడుచుకుంటున్నాను అని భావించే విధంగా ఉండరాదు. నేను కర్మాతీతంగా అవుతానని భావిస్తూ సమయము వచ్చినప్పుడు ఈ సూక్ష్మ బంధనాలు ఎగరనీయకుండా తమ వైపుకు లాక్కున్నట్లయితే మరి ఆ సమయంలో ఏం చేస్తారు! బంధింపబడిన వ్యక్తి ఎగరాలనుకుంటే ఎగురుతాడా లేక క్రిందికి వచ్చేస్తాడా? కావున ఈ సూక్ష్మ బంధనాలు సమయము వచ్చినప్పుడు నెంబరు తీసుకోవడంలో లేక తోడుగా వెళ్లడంలో లేక ఎవర్‌రెడీగా అవ్వడంలో బంధనాలుగా అవ్వరాదు. కనుక బ్రహ్మబాబా పరిశీలిస్తున్నారు. వేటినైతే ఆధారంగా భావిస్తున్నారో అవి ఆధారాలు కావు. సూక్ష్మమైన రాయల్‌ దారాలు. బంగారు లేడి ఉదాహరణ ఉంది కదా! సీతను ఎక్కడికి తీసుకెళ్లింది? కావున ఈ బంధనాలు బంగారు లేడి వంటివి. వీటిని బంగారముగా భావించడం అనగా మీ శ్రేష్ఠ భాగ్యాన్ని పోగొట్టుకోవడం. బంగారము కాదు, పోగొట్టుకోవడం. రాముడిని పోగొట్టుకుంది, అశోకవాటికను పోగొట్టుకుంది.

బ్రహ్మబాబాకు పిల్లల పై విశేషమైన ప్రేమ ఉంది. కావున బ్రహ్మబాబా సదా పిల్లలను తన సమానంగా, ఎవర్‌రెడీగా, బంధనముక్తులుగా చూడాలనుకుంటారు. బంధనముక్తులుగా ఉన్న దృశ్యమునే చూశారు కదా! ఎంత సమయంలో ఎవర్‌రెడీగా అయ్యారు? ఎవరి బంధనంలోనైనా చిక్కుకున్నారా! ఫలానావారు ఎక్కడ ఉన్నారని ఎవరైనా గుర్తుకు వచ్చారా? ఫలానా వారు సేవలో సహచరులని గుర్తుకొచ్చారా? కావున ఎవర్‌రెడీ పాత్రను, కర్మాతీత స్థితిలోని పాత్రను చూశారు కదా! ఎంతగా పిల్లల పై అతి ప్రేమ ఉండేదో, అంతే ప్రియంగా మరియు అతీతంగా ఉండడం చూశారు కదా! పిలుపు వచ్చింది, వెళ్లిపోయారు. లేకపోతే బ్రహ్మకు అన్నిటికంటే పిల్లల పైనే ఎక్కువ ప్రేమ ఉంది కదా! ఎంతగా ప్రేమ ఉందో అంత అతీతంగా అవ్వడం చూశారు కదా. ఏదైనా వస్తువు లేక వంటకం పూర్తిగా తయారైపోయినప్పుడు అంచులను వదిలేస్తుంది కదా! కావున సంపూర్ణంగా అవ్వడం అనగా తీరాలను వదలడం. అలా వదులుతూ అతీతంగా అయిపోయారు. ఒక్క అవినాశి ఆధారమే ఆధారము. వ్యక్తులను, వైభవాలను, వస్తువులను ఆధారంగా చేసుకోకండి. దీనినే కర్మాతీతమని అంటారు. ఎప్పుడూ దేనినీ దాచవద్దు. దాచడం వలన ఇంకా వృద్ధి అవుతూ ఉంటుంది. విషయం పెద్దగా ఉండదు. కాని ఎంతగా దాస్తూ ఉంటారో, అంతగా ఆ విషయం పెద్దగా అవుతుంది. ఎంతగా తమను తాము రైట్‌గా నిరూపించుకునే ప్రయత్నం చేస్తారో, ఎంతగా మొండితనం చేస్తారో అంతగా విషయాన్ని పెంచుతారు. కావున విషయాన్ని పెంచకుండా దానిని చిన్న రూపములోనే సమాప్తం చేయండి. తద్వారా అది సహజమైపోతుంది అంతేకాక సంతోషముంటుంది. ఈ విషయం జరిగింది అన్న దానిని కూడా దాటి వేయండి. దీనితో కూడా విజయులుగా అయితే ఆ సంతోషము ఉంటుంది. అర్థమయిందా! విదేశీయులు కర్మాతీత స్థితిని పొందాలి అనే ఉత్సాహము కలిగినవారు కదా. కావున డబల్‌ విదేశీ పిల్లలకు బ్రహ్మబాబా విశేషమైన సూక్ష్మ పాలనను ఇస్తున్నారు. ఇది ప్రేమతో కూడుకున్న పాలన. శిక్షణ, హెచ్చరిక కాదు. అర్థమయిందా! ఎందుకంటే బ్రహ్మబాబా మీకు విశేషమైన ఆహ్వానముతో జన్మనిచ్చారు. బ్రహ్మ సంకల్పముతో మీరు జన్మించారు. బ్రహ్మ సంకల్పముతో సృష్టి రచించారని అంటారు కదా! బ్రహ్మ సంకల్పముతోనే ఈ బ్రాహ్మణుల సృష్టి ఇంతగా రచింపబడ్డది కదా. కావున బ్రహ్మ సంకల్పముతో, ఆహ్వానముతో రచింపబడిన విశేషమైన ఆత్మలు మీరు. మీరు ప్రియమైనవారిగా అయిపోయారు కదా. మీరు వేగంగా పురుషార్థం చేసి ఫస్ట్‌ డివిజన్‌లోకి వచ్చే ఉత్సాహము గలవారని బ్రహ్మబాబా భావిస్తున్నారు. విదేశీ పిల్లలను విశేషతలతో విశేషంగా అలంకరించే విషయాన్ని గురించిన మాటలు నడుస్తున్నాయి. ప్రశ్నలు కూడా వేస్తారు. అలాగే త్వరగా అర్థం చేసుకుంటారు కూడా. విశేషంగా వివేకవంతులు కావున బాబా తమ సమానంగా అన్ని బంధనాల నుండి అతీతంగా మరియు ప్రియంగా అయ్యేందుకు ప్రేరణనిస్తున్నారు. బాబా పిల్లలందరికి చెప్తున్నారు. బాబా ముందు సదా బ్రాహ్మణ పిల్లలందరు దేశం వారైనా లేక విదేశం వారైనా అందరూ ఉన్నారు. మంచిది. ఈ రోజు ఆత్మిక సంభాషణను జరుపుతున్నారు. గత సంవత్సరము కంటే ఈ సంవత్సరము రిజల్టు చాలా బాగుందని వినిపించాను కదా. దీని ద్వారా వృద్ధిని పొందుతున్నారని అర్థమవుతుంది. మీరు ఎగిరేకళలోకి వెళ్లే ఆత్మలు. ఎవరినైతే యోగ్యులుగా గమనించడం జరుగుతుందో వారిని సంపూర్ణ యోగులుగా అయ్యేందుకు సూచన ఇవ్వబడ్తుంది. మంచిది.

సదా కర్మబంధన ముక్తులకు, యోగయుక్త ఆత్మలకు, సదా ఒక్క బాబానే ఆధారంగా చేసుకునే పిల్లలకు, సదా సూక్ష్మ బలహీనతల నుండి అతీతంగా అయ్యే పిల్లలకు, సదా ఏకాగత్ర ద్వారా పరిశీలించగలిగే శక్తిశాలి పిల్లలకు, సదా వ్యక్తి లేక వస్తువుల వినాశి ఆధారము నుండి అతీతంగా అయ్యే పిల్లలకు - ఇటువంటి బాబా సమానమైన, జీవన్ముక్తులైన కర్మాతీత స్థితిలో స్థితులై ఉండే విశేష పిల్లలకు బాప్‌దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే.

నిర్మలశాంత దాదీతో - సదా తండ్రి జతలో ఉండేవారిగానే ఉన్నారు. ఎవరైతే ఆది నుండి తండ్రి జత జతలో నడుస్తున్నారో వారికి సదా తండ్రి తోడుగా ఉన్న అనుభవం ఎప్పుడూ తక్కువ అవ్వజాలదు. చిన్ననాటి వాగ్ధానము ఉంది. కనుక సదా తోడుగా ఉన్నారు మరియు సదా తోడుగా వెళ్తారు. కనుక సదా తోడు యొక్క వాగ్ధానమనండి లేక వరదానమనండి, అది లభించే ఉంది. అయినా ఎలాగైతే తండ్రి ప్రీతి యొక్క రీతిని నిభాయించేందుకు అవ్యక్తము నుండి వ్యక్త రూపములోకి వస్తారో, అలా పిల్లలు కూడా ప్రీతి యొక్క రీతిని నిభాయించేందుకు చేరుకుంటారు. మీరు అలాగే ఉన్నారు కదా. సంకల్పములో ఏమిటి, స్వప్నంలో కూడా దేనినైతే సబ్‌కాన్షియస్‌ అని అంటారో........... ఆ స్థితిలో కూడా తండ్రి తోడు ఎప్పుడూ వదిలిపెట్టజాలరు. ఇంత పక్కా సంబంధము జోడింపబడి ఉంది. ఎన్ని జన్మల సంబంధము! పూర్తి కల్పానిది. ఈ జన్మలోని లెక్క అనుసరంగా సూచనలు పూర్తి కల్పమంతా ఉంటాయి. ఈ అంతిమ జన్మలో కొంతమంది పిల్లలు సేవ కొరకు ఎక్కడెక్కడో చెల్లాచెదురైపోయారు. ఎలాగైతే వీరు విదేశాలకు చేరుకున్నారో మీరు సింధ్‌ దేశాంలోకి వచ్చేశారు. కొందరు ఎక్కడికో చేరుకున్నారు, కొందరు మరెక్కడికో చేరుకున్నారు. ఒకవేళ వీరు విదేశాలకు చేరుకోకపోతే ఇన్ని సెంటర్లు ఎలా తెరుస్తారు! మంచిది. సదా తోడుగా ఉండే తోడు యొక్క వాగ్ధానాన్ని నిభాయించే పరదాదీ మీరు. బాప్‌దాదా, సేవ పట్ల పిల్లల ఉల్లాస-ఉత్సాహాలను చూసి సంతోషిస్తారు. వరదాని ఆత్మలుగా అయ్యారు. ఇప్పటి నుండే రద్దీగా అవ్వడం ప్రారంభమైపోయింది చూడండి. ఇంకా వృద్ధి అయినప్పుడు ఎంత రద్దీ అవుతుంది. ఆ వరదానీ రూపమనే విశేషత పునాదిగా పడుతోంది. ఎప్పుడైతే రద్దీగా అయిపోతుందో అప్పుడేం చేస్తారు? వరదానమిస్తారు, దృష్టినిస్తారు. ఇక్కడ నుండే చైతన్య మూర్తులు ప్రసిద్ధమవుతారు. ఎలాగైతే ప్రారంభంలో మిమ్ములను అందరూ దేవీలు, దేవీలు అని అనేవారో అలా చివర్లో కూడా గుర్తించి దేవీలు, దేవీలని అంటారు. జై దైవీ, జై దేవీ అనే నినాదాలు ఇక్కడ నుండే ప్రారంభమవుతాయి. మంచిది.

వరదానము :- '' ఈశ్వరీయ విధానమును అర్థం చేసుకొని విధి ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకునే ఫస్ట్‌ డివిజన్‌కు అధికారి భవ ''
ఒక్క అడుగు దైర్యము చేస్తే పదమా అడుగుల సహాయము లభిస్తుంది. డ్రామాలో ఈ విధానము ఒక విధిగా నిశ్చితమై ఉంది. ఒకవేళ ఈ విధి, విధానములో లేకపోతే అందరు విశ్వానికి మొదటి రాజుగా అయిపోతారు. నెంబరువారిగా అయ్యే విధానము ఈ విధి కారణంగానే తయారై ఉంది. కావున ఎంత కావాలనుకుంటే అంత ధైర్యము చేయండి, సహాయము తీసుకోండి. సరెండరు వారైనా లేక ప్రవృత్తి వారైనా సమానమైన అధికారముంది. కాని విధి ద్వారా సిద్ధి లభిస్తుంది. ఈ ఈశ్వరీయ విధానాన్ని అర్థం చేసుకొని నిర్లక్ష్యపు లీలను సమాప్తం చేస్తే ఫస్ట్‌ డివిజన్‌కు అధికారము లభిస్తుంది.

స్లోగన్‌ :- '' సంకల్ప ఖజానాల పట్ల పొదుపు (ఎకానమి) అవతారంగా అవ్వండి ''

Friday, 27 December 2019

Telugu Murli 28/12/2019

28-12-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - తండ్రి చదివించే ఈ చదువులో అపారమైన సంపాదన ఉంది. అందువలన బాగా చదువుకుంటూ ఉండండి, లింక్‌ (సంబంధము) ఎప్పుడూ తెగిపోరాదు ''

ప్రశ్న :- వినాశ కాలములో విపరీత బుద్ధి ఉన్నవారికి మీరు మాట్లాడే ఏ మాటలకు నవ్వు వస్తుంది?
జవాబు :- ఇప్పుడు వినాశ కాలము సమీపంగా ఉందని చెప్పినప్పుడు వారికి నవ్వు వస్తుంది. తండ్రి ఇక్కడే కూర్చుండిపోరని మీకు తెలుసు. పావనంగా చేయడమే తండ్రి కర్తవ్యము. పావనమైనప్పుడు ఈ పాత ప్రపంచము వినాశమవుతుంది, క్రొత్తది వస్తుంది. ఈ యుద్ధము వినాశనము కొరకే. మీరు దేవతలుగా అయినప్పుడు ఈ కలియుగ ఛీ-ఛీ సృష్టిలోకి రాజాలరు(రారు).

ఓంశాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మేము చాలా తెలివిహీనులుగా ఉండేవారమని పిల్లలు అర్థం చేసుకున్నారు. మాయా రావణుడు తెలివిహీనులుగా చేశాడు. నూతన సృష్టి స్థాపన జరగాల్సినప్పుడు తండ్రి తప్పకుండా రావాల్సిందే అని కూడా పిల్లలు అర్థం చేసుకున్నారు. త్రిమూర్తి చిత్రము కూడా ఉంది - బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణువు ద్వారా పాలన, శంకరుని ద్వారా వినాశనము. ఎందుకంటే చేసి చేయించేవారు ఆ తండ్రే కదా. చేసేవారు, చేయించేవారు ఒక్కరే. మొదట ఎవరి పేరు వస్తుంది? ఎవరు చేస్తారో వారి పేరు మొదట వస్తుంది, ఎవరి ద్వారా చేయిస్తారో వారి పేరు తర్వాత వస్తుంది. చేసి చేయించేవారని అంటారు కదా. బ్రహ్మ ద్వారా నూతన ప్రపంచాన్ని స్థాపన చేయిస్తారు. మన నూతన ప్రపంచాన్ని మనమే స్థాపన చేసుకుంటున్నాము, దాని పేరే దేవీ దేవతల ప్రపంచము. సత్యయుగములో మాత్రమే దేవీ దేవతలుంటారు. దేవీ దేవతలని ఇతరులను అనరు. అక్కడ మనుష్యులు ఉండరు. అక్కడ ఒకే ఒక దేవీ దేవతా ధర్మముంటుంది, ఇతర ధర్మాలేవీ ఉండవు. మనమే దేవతలుగా ఉండేవారమని ఇప్పుడు పిల్లలైన మీకు స్మృతి కలిగింది. అందుకు గుర్తులు కూడా ఉన్నాయి. ఇస్లామ్‌, బౌద్ధ, క్రైస్తవ మతాల వారందరికీ వారి వారి గుర్తులున్నాయి. మన రాజ్యము ఉన్నప్పుడు ఇతర ధర్మాలేవీ లేవు. ఇప్పుడు దేవీదేవతా ధర్మము తప్ప మిగిలిన ధర్మాలన్నీ ఉన్నాయి. గీతలో మంచి మంచి పదాలున్నాయి, కానీ వాటిని ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. తండ్రి చెప్తున్నారు - వినాశ కాలములో విపరీత బుద్ధి, వినాశ కాలములో ప్రీతి బుద్ధి, వినాశనమేమో ఇప్పుడే జరుగుతుంది. తండ్రి వచ్చేదే సంగమ యుగములో, అప్పుడే పరివర్తన జరుగుతుంది. తండ్రి పిల్లలైన మీకు అందుకు బదులుగా అన్నీ కొత్తవే ఇస్తారు. వారు కంసాలియే కాక చాకలి మరియు గొప్ప వ్యాపారి కూడా. తండ్రితో చాలా తక్కువమంది వ్యాపారము చేస్తారు. ఈ వ్యాపారములో అపారమైన లాభముంది. చదువులో చాలా లాభముంటుంది. చదువే సంపాదనకు మూలము అనే మహిమ ఉంది. ఆ సంపాదన కూడా జన్మ- జన్మలకు. అటువంటి చదువును బాగా చదువుకోవాలి కదా, చాలా సహజంగా చదివిస్తున్నారు. కేవలం ఒక వారము అర్థము చేసుకున్న తర్వాత ఎక్కడికైనా వెళ్లండి, మీ వద్దకు మురళి వస్తూనే ఉంటుంది, అప్పుడు లింకు ఎప్పుడూ తెగిపోకుండా ఉంటుంది. ఇది పరమాత్మతో ఆత్మల లింకు. గీతలో కూడా వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి, వినాశకాలే ప్రీతి బుద్ధి విజయంతి అనే మహావాక్యము ఉంది. ఇప్పుడు మనుష్యులు ఒకరినొకరు చంపుకుంటున్నారని మీకు తెలుసు. వారిలో ఉన్న క్రోధము లేక వికారాలు మరెవ్వరిలోనూ లేవు. ద్రౌపది ధీనంగా పిలిచింది,................ (ద్రౌపది నే పుకారా,.......) అనే గాయనము కూడా ఉంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరందరూ ద్రౌపదులే. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలారా, ఇప్పుడు వికారాలలోకి వెళ్లకండి. నేను మిమ్ములను స్వర్గములోకి తీసుకెళ్తాను, మీరు కేవలం నన్ను స్మృతి చేయండి. ఇప్పుడు వినాశ కాలము కదా - ఎవ్వరి మాటా కూడా వినరు, కొట్లాడుతూనే ఉంటారు. శాంతిగా ఉండమని అనేమంది చెప్తున్నా శాంతిగా ఉండరు, పిల్లలను మొదలైన వారినందరినీ వదిలి, యుద్ధానికి వెళ్తారు. ఎంతోమంది మనుష్యులు చనిపోతున్నారు. మనిషికి ఏ మాత్రము విలువ లేదు. విలువ, మహిమ కేవలం ఒక్క దేవీ దేవతలకు మాత్రమే ఉంది. ఇప్పుడు మీరే దేవతలుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. వాస్తవానికి మీకు దేవతల కంటే ఎక్కువ మహిమ ఉంది. మిమ్ములను ఇప్పుడు తండ్రి చదివిస్తున్నారు. ఇది ఎంత గొప్ప చదువు! చదివేవారు అనేక జన్మల అంత్యములో చాలా తమోప్రధానంగా ఉన్నారు. నేను సదా సతోప్రధానముగానే ఉంటాను.

తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, నేను మీకు అతివిధేయత గల సేవకునిగా వచ్చాను. మనము ఎంత ఛీ - ఛీగా అయ్యామో ఆలోచించండి. ఆ తండ్రి మనలను వాహ్‌ వాహ్‌గా(భేషుగ్గా) తయారు చేస్తున్నారు. భగవంతుడు కూర్చొని మానవులను చదివించి చాలా ఉన్నతంగా చేస్తున్నారు. తండ్రే స్వయంగా చెప్తున్నారు - నేను అనేక జన్మల అంత్యములో మిమ్ములందరినీ తమోప్రధానము నుండి సతోప్రధానంగా చేసేందుకు వచ్చాను. ఇప్పుడు మిమ్ములను చదివిస్తున్నాను. తండ్రి చెప్తున్నారు - నేను మిమ్ములను స్వర్గవాసులుగా చేశాను కాని మీరు నరకవాసులుగా ఎలా అయ్యారు? ఎవరు చేశారు? వినాశ కాలంలో విపరీత బుద్ధి వినశ్యంతి, ప్రీతిబుద్ధి విజయంతి అనే మహిమ కూడా ఉంది. ఎంతెంత ప్రీతి బుద్ధి కలిగి స్మృతి చేస్తారో, అంత మీకే లాభము. ఇది యుద్ధ మైదానము కదా. గీతలో ఏ యుద్ధము గురించి తెలిపించారో ఎవ్వరికీ తెలియదు. వారేమో కౌరవుల-పాండవుల యుద్ధంగా చూపించారు. కౌరవ సంప్రదాయము, పాండవ సంప్రదాయము రెండూ ఉన్నాయి. కాని యుద్ధము లేనే లేదు. పాండవులనగా తండ్రిని తెలుసుకున్నవారు, బాబాతో ప్రీతిబుద్ధి గలవారు. తండ్రితో విపరీతబుద్ధిగల వారిని కౌరవులని అంటారు. ఇవి బాగా అర్థము చేసుకోవలసిన మంచి-మంచి విషయాలు.

ఇప్పుడు సంగమ యుగము. నూతన ప్రపంచ స్థాపన జరుగుతూ ఉందని పిల్లలైన మీకు తెలుసు. బుద్ధి ద్వారా పని తీసుకోవాలి. ప్రపంచము ఎంతో విశాలమైనది. సత్యయుగములో చాలా కొద్దిమందే ఉంటారు. వృక్షము చిన్నదిగా ఉంటుంది కదా! ఆ వృక్షము తర్వాత వృద్ధి చెందుతుంది. ఈ మానవ సృష్టి రూపీ తలక్రిందుల వృక్షము ఎలా ఉందో ఎవ్వరూ అర్థము చేసుకోరు. దీనిని కల్పవృక్షమని అంటారు. జ్ఞానము కూడా కావాలి కదా! ఇతర వృక్షాల జ్ఞానము చాలా చాలా సులభము. వాటిని గురించి వెంటనే చెప్తారు. అదే విధంగా ఈ వృక్ష జ్ఞానము కూడా చాలా సహజము, అయితే ఇది మానవ వృక్షము. మనుష్యులకు తమ వృక్షము గురించి తెలియనే తెలియదు. భగవంతుడు సృష్టికర్త అని కూడా అంటారు. కనుక ఆయన చైతన్యము కదా. తండ్రి సత్యము, చైతన్యము, జ్ఞానసాగరులు. వారిలో ఏ జ్ఞానము ఉందో ఎవ్వరికీ తెలియదు. తండ్రి బీజరూపులు, చైతన్యమైనవారు. వారి ద్వారానే మొత్తం సృష్టి అంతా జరుగుతుంది. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - మానవులకు తమ వృక్షము గురించి తెలియదు, ఇతర వృక్షాల గురించి అయితే బాగా తెలుసు. వృక్షము యొక్క బీజము చైతన్యమైతే తెలిపేది కదా. కాని అది జడ బీజము. ఇప్పుడు పిల్లలైన మీకు మాత్రమే రచయిత - రచనల రహస్యము తెలుసు. వీరు సత్యము, చైతన్యము, జ్ఞానసాగరులు. చైతన్యములో అయితే మాట్లాడగలరు కదా! మానవ శరీరము అన్నింటికంటే అమూల్యమని గాయనము చేయబడింది. దాని విలువ కట్టలేరు - తండ్రి వచ్చి ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు.

మీరు రూపబసంత్‌లు(జ్ఞానులు, యోగులు). తండ్రి జ్ఞానసాగరులు. వారి ద్వారా మీకు జ్ఞాన రత్నాలు లభిస్తాయి. ఇవి జ్ఞానరత్నాలు. ఈ రత్నాల ద్వారా, ఆ రత్నాలు కూడా మీకు లెక్కలేనన్ని లభిస్తాయి. లక్ష్మీనారాయణుల వద్ద ఎన్ని రత్నాలున్నాయో చూడండి. వజ్ర వైడూర్యాల భవనాలలో నివసిస్తారు. దాని పేరే స్వర్గము. దానికి మీరు యజమానులుగా అవుతారు. ఎవరైనా పేదలకు పెద్ద లాటరీ లభిస్తే, పిచ్చివారైపోతారు కదా. తండ్రి కూడా చెప్తున్నారు - మీకు విశ్వచక్రవర్తి పదవి లభిస్తూ ఉంటే మాయ ఎంతో ఆటంకపరుస్తుంది. మీకు పోను పోను తెలుస్తుంది - మాయ ఎంతో మంచి-మంచి పిల్లలను కూడా మింగేస్తుంది. ఒక్కసారిగా తినేస్తుంది. మీరు సర్పము కప్పనెలా పట్టుకుంటుందో చూశారా? ఏనుగును మొసలి పట్టుకున్నట్లు పట్టుకుంటుంది. సర్పము కప్పనంతా ఒక్కసారిగా మింగేస్తుంది. మాయ కూడా అంతే. బ్రతికి ఉండగానే పిల్లలను పట్టుకొని ఒక్కసారిగా అంతమొందిస్తుంది. వారు మళ్లీ తండ్రి పేరు ఎత్తకుండా మింగేస్తుంది. మీలో యోగబల శక్తి చాలా తక్కువగా ఉంది. ఆధారమంతా యోగబలము పైనే ఉంది. సర్పము కప్పను మింగినట్లు పిల్లలైన మీరు మొత్తం చక్రవర్తి పదవిని మింగేస్తారు. విశ్వచక్రవర్తి పదవినంతా మీరు ఒక్క సకెండులో తీసేసుకుంటారు. తండ్రి ఎంతో సహజమైన యుక్తిని తెలియజేస్తున్నారు. ఏ ఆయుధమూ అవసరము లేదు. ఆ తండ్రి జ్ఞాన-యోగాలనే అస్త్రశస్త్ర్రాలను ఇస్తారు, కాని వారు స్థూల ఆయుధాలు మొదలైనవి ఇచ్చేశారు.

పిల్లలైన మీరిప్పుడు చెప్తున్నారు - ఎలా ఉండేవారము ఎలా అయ్యి ఉండినాము! ఎలా చెప్పాలనుకుంటే అలా చెప్పండి - మనము ఈ విధంగా(లక్ష్మీనారాయణులు) ఉండేవారము. భలే మనుష్యులుగానే ఉన్నాము కానీ మంచి గుణాలు, చెడు గుణాలు ఉంటాయి కదా. దేవతలలో దైవీ గుణాలుంటాయి. అందువలన వారిని మీరు సర్వ గుణసంపన్నులు,......... అని మహిమ చేస్తూ ఉంటారు. మేము నిర్గుణులము మాలో ఏ గుణాలూ లేవు అని పాడ్తారు. ఈ సమయంలో ప్రపంచమంతా నిర్గుణముగా ఉంది అనగా ఒక్క దైవీ గుణము కూడా లేదు. గుణాలను నేర్పించే తండ్రి గురించే తెలియదు. అందుకే వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు. ఇప్పుడు సంగమ యుగములో వినాశనము జరిగి తీరాలి. పాత ప్రపంచము వినాశనమై నూతన ప్రపంచము స్థాపన అవుతుంది. దీనినే వినాశ కాలమని అంటారు. ఇది అంతిమ వినాశనము తర్వాత అర్ధకల్పము ఎలాంటి యుద్ధాలు మొదలైనవేవీ ఉండనే ఉండవు. మానవులకు దీనిని గురించి ఏ మాత్రమూ తెలియదు. వినాశ కాలములో విపరీత బుద్ధి గలవారిగా ఉన్నారు. కనుక పాత ప్రపంచము తప్పకుండా వినాశనమవుతుంది కదా! ఈ పాత ప్రపంచములో ఎన్ని ఆపదలు జరుగుతున్నాయి. మరణిస్తూనే ఉంటారు. తండ్రి ఈ సమయంలో ఉన్న స్థితిని తెలిపిస్త్తున్నారు. చాలా వ్యత్యాసముంది కదా. ఈ రోజు భారతదేశము ఏ స్థితిలో ఉంది, రేపు ఎలా అవుతుంది? ఈ రోజు ఇక్కడ ఇలా ఉన్నారు, రేపు ఎక్కడ ఉంటారు? మొదట నూతన ప్రపంచము ఎంత చిన్నదిగా ఉండేదో మీకు తెలుసు. అక్కడ మాహళ్లలో ఎన్ని వజ్ర వైడూర్యాలు మొదలైనవి ఉంటాయి! భక్తిమార్గములో కూడా మీ మందిరాలు తక్కువ విలువైనవిగా ఉండవు. ఒక్క సోమనాథ మందిరమే కాదు. ఇతరులు కూడా నిర్మిస్తారు. ఒక్క సోమనాథ మందిరము నుండే ఎంతో దోచుకున్నారు! (సోమనాథ మందిరములోని వజ్ర వైడూర్యాలను, సంపదను మోహమ్మద్‌ గజనీ 17 సార్లు, 17 వేల ఒంటెల పై ఉంచుకొని దోచుకుపోయాడు) తమ జ్ఞాపక చిహ్నాలను మళ్లీ కూర్చుని తయారుచేశారు. కనుక గోడలలో రాళ్లు మొదలైనవి అమరుస్తారు. ఈ రాళ్లకేం విలువ ఉంటుంది. చిన్న వజ్రానికి కూడా ఎంత విలువ ఉంది! బాబా రత్నాల వ్యాపారి కదా. గురిగింజంత రత్నము కూడా 90 రూపాయలు. ఇప్పుడదే రత్నము ధర వేల రూపాయలుంటుంది. అది కూడా దొరకదు, విలువ చాలా పెరిగిపోయింది. ఇప్పుడు విదేశాలలో చాలా ధన-సంపదలున్నాయి. అలా ఉన్నా సత్యయుగముతో పోలిస్తే అది లెక్కలోకి రాదు.

తండ్రి చెప్తున్నారు - వినాశకాలే విపరీత బుద్ధి గలవారిగా ఉన్నారు - వినాశనము సమీపంగా ఉందంటే వారు నవ్వుతారు. తండ్రి అంటున్నారు - నేను ఎంత కాలము ఇక్కడ ఉండాలి. నాకేమైనా ఇక్కడ మజా ఉందా? నేను సుఖమూ అనుభవించను, దు:ఖమూ అనుభవించను. పావనంగా చేయడమే నా కర్తవ్యము. మీరు ఇలా ఉండేవారు(లక్ష్మీనారాయణులు), ఇప్పుడిలా అయిపోయారు. నేను మళ్లీ మిమ్ములను ఇంత ఉన్నతంగా చేస్తాను. మనము మళ్లీ అలా తయారయ్యే వారమని మీకు తెలుసు. మనము దైవీ కుటుంబానికి చెందినవారమని, రాజ్యపదవి ఉండేదని, దానిని ఇలా పోగొట్టుకున్నామని ఇప్పుడు మీకు తెలిసింది. ఆ తర్వాత ఇతరులు వస్తూ వచ్చారు. ఇప్పుడీ చక్రము పూర్తి అవుతుంది. లక్షల సంవత్సరాల మాటే లేదని ఇప్పుడు మీకు తెలుసు. వినాశనము కొరకే ఈ యుద్ధము. అక్కడ చాలా సుఖంగా మరణిస్తారు. ఏ కష్టమూ ఉండదు. ఆసుపత్రులు మొదలైనవేవీ ఉండవు కూర్చుని సేవ చేసేదెవరు? ఏడ్చేదెవరు? అక్కడ ఈ పద్ధతులే ఉండవు. వారి మృత్యువు చాలా సహజంగా ఉంటుంది. ఇక్కడ దు:ఖపడి మరణిస్తారు. ఎందుకంటే మీరు చాలా సుఖపడ్డారు. కావున దు:ఖము కూడా మీరు చూడాలి. రక్తపు నదులు ఇక్కడే ప్రవహిస్తాయి. తర్వాత ఈ యుద్ధము శాంతిస్తుందని వారు భావిస్తారు. కాని శాంతి ఏర్పడదు. ఎలుకకు ప్రాణ సంకటము, పిల్లికి చెలగాటము,..........(మిరూఆ మౌత్‌ మలూకా షికార్‌,......) మీరు దేవతలుగా అవుతారు. తర్వాత ఈ ఛీ-ఛీ సృష్టిలోకి మీరు రారు. గీతలో కూడా భగవానువాచ ఉంది - వినాశనముతో పాటు స్థాపన కూడా చూడు. అర్జునునికి సాక్షాత్కారమయింది కదా. ఫలానావారు ఫలానాగా అవుతారని అంత్యములో సాక్షాత్కారాలవుతాయి. అప్పుడు రోధిస్తారు, చాలా పశ్చాత్తాపపడ్తారు, శిక్షలను అనుభవిస్తారు. తల వ్రాతను అనుభవిస్తారు. కాని ఏం చేయగలరు? ఇది 21 జన్మల లాటరీ స్మృతి అయితే వస్తుంది కదా. సాక్షాత్కారాలు లేకుండా, ఎవ్వరికీ శిక్షలు పడవు. ట్రిబ్యునల్‌(న్యాయసభ) కూర్చుంటుంది కదా. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. స్వయంలో జ్ఞాన రత్నాలను ధారణ చేసి రూపబసంత్‌లుగా(జ్ఞానులు, యోగులుగా) అవ్వాలి. జ్ఞాన రత్నాల ద్వారా విశ్వచక్రవర్తి పదవి అనే లాటరీని తీసుకోవాలి.
2. ఈ వినాశకాలంలో తండ్రి పై ప్రీతి కలిగి, ఒక్కరి స్మృతిలోనే ఉండాలి. అంతిమ సమయంలో పశ్చాత్తాపపడే లేక తలవ్రాతను అనుభవించే కర్మలేవీ చేయరాదు.

వరదానము :- '' నిర్లక్ష్యము లేక అటెన్షన్‌లో ఉన్నాననే అభిమానం వదిలి తండ్రి సహాయానికి పాత్రులుగా అయ్యే సహజ పురుషార్థీ భవ ''
చాలామంది పిల్లలు ధైర్యంగా ఉండేందుకు బదులు నిర్లక్ష్యం కారణంగా మేము సదా పాత్రులుగానే ఉన్నామని అభిమానంలోకి వచ్చేస్తారు. తండ్రి మాకు సహాయం చేయకుంటే ఇంకెవరికి చేస్తారు! అనే అభిమానం కారణంగా ధైర్యము చేసే విధిని మర్చిపోతారు. చాలామందిలో స్వయం పై అటెన్షన్‌ ఇచ్చే అభిమానం కూడా ఉంటుంది. ఈ అభిమానం సహాయము నుండి వంచితులుగా చేస్తుంది. మేము చాలా యోగం చేశాము, జ్ఞాని, యోగి ఆత్మలుగా అయిపోయాము, సేవకు రాజధానిగా అయిపోయాము.............. ఈ విధమైన అభిమానాన్ని వదిలి ధైర్యము ఆధారంతో సహాయానికి పాత్రులుగా అయితే సహజ పురుషార్థులుగా అవుతారు.

స్లోగన్‌ :- '' నెగటివ్‌, వేస్ట్‌ సంకల్పాలు ఏవైతే నడుస్తున్నాయో, వాటిని పరివర్తన చేసి విశ్వకళ్యాణ కార్యంలో ఉపయోగించండి. ''

Telugu Murli 27/12/2019

27-12-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - మీరిప్పుడు పురుషోత్తమ సంగమ యుగములో ఉన్నారు, మీరు ఇచ్చట ఉంటూ నూతన ప్రపంచాన్ని స్మృతి చేయాలి. అంతేకాక ఆత్మను పావనంగా చేసుకోవాలి ''

ప్రశ్న :- తండ్రి ఏ జ్ఞానము తెలిపినందున మీ బుద్ధికి వేయబడిన తాళము తెరవబడింది ?
జవాబు :- తండ్రి ఈ అనంతమైన అనాది డ్రామాను గురించిన జ్ఞానమిచ్చారు. దీని వలన బుద్ధికి వేయబడిన గాడ్రెజ్‌ తాళము తెరవబడింది. రాతి బుద్ధి నుండి బంగారు బుద్ధి గలవారిగా అయ్యారు. ఈ డ్రామాలో ప్రతి ఒక్కరిది వేర్వేరు పాత్ర, అనాది పాత్ర, కల్పక్రితము ఎవరు ఎంత చదివారో, వారు ఇప్పుడు కూడా అంతే చదువుతారు. పురుషార్థము చేసి తమ వారసత్వాన్ని తీసుకుంటారని తండ్రి అర్థం చేయిస్తారు.

ఓంశాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని నేర్పిస్తున్నారు. తండ్రి అయినప్పటి నుండి, అప్పటి నుండే టీచరు కూడా అయ్యారు. అప్పటి నుండే సద్గురువు రూపములో శిక్షణ కూడా ఇస్తున్నారు. వారు తండ్రి, టీచరు, సద్గురువు అయినందున వారు చిన్న బాలుడు కాదు కదా అని పిల్లలు అర్థము చేసుకున్నారు. వారు అత్యున్నతమైనవారు, అత్యంత గొప్పవారు. వీరంతా నా పిల్లలే అని తండ్రికి తెలుసు. మీరు వచ్చి మమ్ములను పవిత్ర ప్రపంచానికి తీసుకెళ్ళమని డ్రామా ప్లాను అనుసారము పిలిచారు కూడా. కానీ అర్థము తెలియదు. సత్యయుగాన్ని పావన ప్రపంచమని, పతిత ప్రపంచాన్ని కలియుగమని అంటారని మీకిప్పుడు తెలుసు. బాబా మీరు వచ్చి మమ్ములను రావణుని జైలు నుండి, దుఃఖాల నుండి విడిపించి మా శాంతిధామానికి, సుఖధామానికి తీసుకెళ్ళమని కూడా అంటారు. రెండు పేర్లు కూడా చాలా బాగున్నాయి. ముక్తి-జీవన్ముక్తి లేక శాంతిధామము - సుఖధామము. శాంతిధామము ఎక్కడ ఉందో, సుఖధామము ఎక్కడ ఉందో పిల్లలైన మీ బుద్ధిలో తప్ప మరెవ్వరి బుద్ధిలోనూ లేదు. పూర్తి తెలివిహీనులుగా ఉన్నారు. తెలివిగలవారిగా అవ్వడమే మీ లక్ష్యము. తెలివిహీనులైన వారికి, ఇటువంటి తెలివిగలవారిగా అవ్వాలని లక్ష్యముంటుంది. మనుష్యుల నుండి దేవతలుగా అవ్వడమే లక్ష్యమని అందరికీ నేర్పించాలి. ఇది మానవ సృష్టి, ఆది దేవతల సృష్టి. సత్యయుగములో దేవతల సృష్టి ఉంటుంది. కనుక మానవ సృష్టి తప్పకుండా కలియుగములో ఉంటుంది. ఇప్పుడు మానవుల నుండి దేవతలుగా అవ్వాలంటే తప్పకుండా ఈ పురుషోత్తమ సంగమ యుగమే సరియైన సమయము. వారు దేవతలు, వీరు మానవులు. దేవతలు తెలివిగలవారు. ఆ తండ్రే ఇటువంటి వివేకవంతులుగా చేశారు. విశ్వానికి యజమానులైన తండ్రి, యజమానులుగా అవ్వరు కాని వారిని అలాగే మహిమ చేస్తారు కదా. బేహద్‌ తండ్రి బేహద్‌ సుఖమునిచ్చేవారు. అనంతమైన సుఖము నూతన ప్రపంచములోనే ఉంటుంది. అనంతమైన దుఃఖము పాత ప్రపంచములో ఉంటుంది. దేవతల చిత్రాలు కూడా మీ ముందు ఉన్నాయి. వారి మహిమ కూడా ఉంది. ఈ రోజుల్లో అయితే పంచ భూతాలను కూడా పూజిస్తూ ఉన్నారు.
మీరు పురుషోత్తమ సంగమ యుగములో ఉన్నారని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఒక కాలు స్వర్గములో, ఒక కాలు నరకములో ఉందని మీలో కూడా పురుషార్థానుసారము తెలుసు. ఉండేది ఇక్కడైనా బుద్ధి నూతన ప్రపంచములో ఉంటుంది. ఆ నూతన ప్రపంచములోకి తీసుకెళ్లేవారిని స్మృతి చేయాలి. ఆ తండ్రి స్మృతి ద్వారానే మీరు పవిత్రుంగా అవుతారు. ఇదంతా శివబాబా కూర్చుని అర్థం చేయిస్తారు. శివజయంతినైతే తప్పకుండా జరుపుకుంటారు. కానీ శివబాబా ఎప్పుడు వచ్చారో, వచ్చి ఏం చేశారో ఎవ్వరికీ కొంచెం కూడా తెలియదు. శివరాత్రి జరుపుకుంటారు. కృష్ణ జయంతిని జరుపుకుంటారు, ఏ పదమును కృష్ణునికి వాడ్తారో ఆ పదమును శివబాబాకు వాడరు. అందుకే శివరాత్రి అని అంటారు. అర్థము తెలియకుండా అంటున్నారు. పిల్లలైన మీకేమో అర్థము చేయించబడ్తుంది. కలియుగాంతములో అపారమైన దుఃఖము, సత్యయుగములో అపారమైన సుఖము ఉంటుంది. పిల్లలైన మీకిప్పుడు ఈ జ్ఞానము లభించింది. మీరు ఆదిమధ్యాంతాలు తెలుసుకున్నారు. కల్పక్రితము చదువుకున్నవారే, ఇప్పుడు కూడా చదువుకుంటారు. అప్పుడు ఎవరు ఎంత పురుషార్థము చేశారో, ఇప్పుడు కూడా వారే చేసి, మళ్లీ అదే పదవిని పొందుతారు. మీ బుద్ధిలో పూర్తి చక్రమంతా ఉంది. అత్యున్నతమైన పదవి పొందేది మీరే, మళ్లీ అలాగే క్రిందికి కూడా దిగుతారు. మనుష్యులు ఎవరైతే ఉన్నారో ఇది వారందరి మాల కదా. అందరూ నంబరువారుగా వస్తారని తండ్రి అర్థం చేయించారు. ప్రతి పాత్రధారికి తన పాత్ర లభించింది. ఎవరెప్పుడు ఏ పాత్ర చేయాలో ఆ పాత్రను వారు అభినయించే తీరాలి. ఇది అనాదిగా తయారైన డ్రామా. దీనిని గురించి తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఆ తండ్రి మీకేది అర్థం చేయిస్తున్నారో దానిని మీరు మీ సోదరులకు అర్థం చేయించాలి. ప్రతి 5 వేల సంవత్సరాలకు ఒకసారి తండ్రి వచ్చి మనకు అర్థం చేయిస్తారని మీ బుద్ధిలో ఉంది. మనము మళ్లీ మన సోదరులకు అర్థం చేయిస్తాము. సోదరత్వము ఆత్మల సంబంధములో ఉంటుంది. ఇప్పుడు మీరు స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించండి. పావనంగా అయ్యేందుకు తన తండ్రిని స్మృతి చేయాల్సింది ఆత్మనే. ఆత్మ పవిత్రంగా అయితే శరీరము కూడా పవిత్రమైనది లభిస్తుంది. ఆత్మ అపవిత్రమైతే నగ(శరీరము) కూడా అపవిత్రమే. నంబరువారుగా అయితే ఉండనే ఉంటారు. ఒకరి లక్షణాలు, గుణాలు(రూపురేఖలు) ఒకరితో ఒకరివి కలువవు. అందరూ నంబరువారిగా తమ తమ పాత్రలను అభినయిస్తారు, తేడా ఉండదు. నాటకములో (సినిమాలో) నిన్న చూచిన దృశ్యాలే మళ్లీ ఈ రోజు కూడా చూస్తారు. అవే రిపీట్‌ అవుతాయి కదా. ఇది కూడా నిన్న, రేపుల అనంతమైన డ్రామా. నిన్న మీకు అర్థం చేయించారు. మీరు రాజ్యపదవి తీసుకొని మళ్లీ పోగొట్టుకున్నారు. ఈ రోజు రాజ్య పదవి పొందేందుకు మళ్లీ అర్థం చేసుకుంటున్నారు. ఈ రోజు భారతదేశము పాతదైపోయిన నరకము. రేపు నూతన స్వర్గంగా అవుతుంది. ఇప్పుడు మనము నూతన ప్రపంచములోకి వెళ్తున్నామని శ్రీమతముననుసరించి శ్రేష్ఠంగా అవుతున్నామని మీ బుద్ధిలో ఉంది. శ్రేష్ఠమైనవారు తప్పకుండా శ్రేష్ఠమైన సృష్టిలోనే ఉంటారు. ఈ లక్ష్మీ నారాయణులు శ్రేష్ఠమైనవారు. కనుక వారు శ్రేష్ఠమైన స్వర్గములో ఉంటారు. భ్రష్టులైనవారు నరకములో ఉంటారు. ఈ రహస్యాన్ని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. ఈ బేహద్‌ డ్రామాను బాగా అర్థం చేసుకున్నప్పుడు బుద్ధిలో కూర్చుంటుంది. శివరాత్రిని కూడా జరుపుకుంటారు. కానీ దానిని గురించి ఏమీ తెలియదు. ఇప్పుడు మిమ్ములను రిఫ్రెష్‌(తాజాగా) చేయాల్సి ఉంటుంది. మీరు ఇతరులను కూడా రిఫ్రెష్‌ చేస్తారు. ఇప్పుడు మీకు జ్ఞానము లభిస్తూ ఉంది. తర్వాత సద్గతి పొందుతారు. నేను స్వర్గములోకి రాను. పతిత ప్రపంచాన్ని పరివర్తన చేసి, పావన ప్రపంచంగా తయారు చేయడమే నా పాత్ర. అక్కడ మీ వద్ద అనంతమైన ఖజానా ఉంటుంది. ఇక్కడేమో నిరుపేదలుగా ఉన్నారు. అందుకే మీరు బేహద్‌ స్వర్గ వారసత్వాన్ని ఇవ్వమని తండ్రిని పిలుస్తారు. కల్ప-కల్పము బేహద్‌ వారసత్వము లభిస్తుంది. మళ్లీ నిరుపేదలుగా కూడా అవుతారు. చిత్రాలను చూపి అర్థం చేయిస్తే బాగా అర్థము చేసుకుంటారు. మొదటి నెంబరులోని లక్ష్మీనారాయణులు మళ్లీ 84 జన్మలు తీసుకొని మనుష్యులైపోయారు. ఈ జ్ఞానము పిల్లలైన మీకు ఇప్పుడే లభించింది. 5 వేల సంవత్సరాల క్రితము ఆది సనాతన దేవీ దేవతా ధర్మముండేది. దానిని వైకుంఠము, స్వర్గము(పారడైస్‌) దేవీ దేవతల ప్రపంచమని కూడా అంటారు. ఇప్పుడైతే అలా అనరు. ఇప్పుడిది ఆసురీ ప్రపంచము. ఇప్పుడు ఆసురీ ప్రపంచ అంత్యము, దేవతా ప్రపంచము ఆదిల సంగమ సమయము. ఈ విషయాలను మీరిప్పుడు అర్థము చేసుకున్నారు. ఇతరుల నోట ఈ మాటలు వినలేరు. ఆ తండ్రే వచ్చి ఇతని నోరు తీసుకుంటారు. ఎవరి నోరు తీసుకుంటారో అర్థం చేసుకోరు. తండ్రి దేని పై సవారీ అవుతారు? ఉదాహరణానికి ఆత్మలైన మీరు మీ శరీరాల పై సవారి అయ్యి ఉన్నారు కదా. శివబాబాకు తన స్వంత శరీరమైతే లేనే లేదు. అందువలన వారికి నోరు తప్పకుండా అవసరము. లేకుంటే రాజయోగమెలా నేర్పించాలి? ప్రేరణ ద్వారా అయితే నేర్చుకోలేరు. కనుక ఈ విషయాలన్నీ హృదయములో గుర్తుంచుకోండి. పరమాత్మ బుద్ధిలో కూడా జ్ఞానమంతా ఉంది కదా. మీ బుద్ధిలో కూడా ఈ జ్ఞానము కూర్చోవాలి. ఈ జ్ఞానము బుద్ధి ద్వారా ధారణ చేయాలి. మీ బుద్ధి బాగుంది కదా అని అంటారు కూడా? బుద్ధి ఆత్మలో ఉంటుంది. ఆత్మనే బుద్ధి ద్వారా అర్థము చేసుకుంటూ ఉంది. మిమ్ములను రాతి బుద్ధి గలవారిగా చేసిందెవరు? రావణుడు మన బుద్ధినెలా చేశాడో మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. నిన్న మీకు డ్రామాను గురించి తెలియదు. బుద్ధికి గాడ్రెజ్‌ తాళము వేయబడి ఉండేది. ఇందులో గాడ్‌ అనే పదము వస్తుంది కదా. తండ్రి ఇచ్చిన బుద్ధి పరివర్తనై రాతి బుద్ధిగా అయిపోతుంది. మళ్లీ తండ్రి వచ్చి తాళము తెరుస్తారు. సత్యయుగములో ఉండేదే పారసబుద్ధి గలవారు. తండ్రి వచ్చి అందరి కళ్యాణము చేస్తారు. అందరి బుద్ధి నంబరువారిగా తెరవబడ్తుంది. మళ్లీ ఒకరి వెనుక ఒకరు వస్తూ ఉంటారు. పైన అలాగే ఎవ్వరూ ఉండజాలరు. అక్కడ పతితులుండజాలరు. తండ్రి పావనంగా చేసి పావన ప్రపంచానికి తీసుకెళ్తారు. అక్కడ అంతా పావనాత్మలే ఉంటాయి. అది నిరాకార సృష్టి.
పిల్లలైన మీకిప్పుడు అంతా తెలిసిపోయింది. మీ ఇల్లు కూడా చాలా సమీపంగా కనిపిస్తూ ఉంది. మీకు మీ ఇంటి పై చాలా ప్రేమ ఉంది. మీకున్నంత ప్రేమ మరెవ్వరికీ లేదు. మీలో కూడా నెంబరువారిగా ఉన్నారు. ఎవరికైతే తండ్రి పై ప్రేమ ఉందో వారికి ఇంటి పై కూడా ప్రేమ ఉంటుంది. మురిపాల పిల్లలుంటారు కదా. ఇక్కడ మంచి పురుషార్థము చేసి ఎవరు అపురూప పిల్లలుగా అవుతారో వారు మాత్రమే ఉన్నత పదవి పొందుతారని మీకు తెలుసు. చిన్న లేక పెద్ద శరీరాల పై పదవి ఆధారపడదు. జ్ఞాన-యోగాలలో ఎవరైతే మస్త్‌గా(ఆనందములో మునిగి) ఉంటారో, వారే పెద్దవారు. చాలామంది చిన్న చిన్న పిల్లలు కూడా జ్ఞాన-యోగాలలో తీవ్రంగా ఉంటారు. వారు పెద్దవారిని కూడా చదివిస్తారు లేకుంటే నియమమేమంటే పెద్దవారు చిన్నవారిని చదివిస్తారు. ఈ రోజుల్లో అయితే చాలా పొట్టిగా నుండి సర్కస్‌లో ప్రేక్షకులకు ఆహ్లాదము చేకూర్చేవారుగా (మిడ్‌గేడ్‌, మరుగుజ్జులు) ఉన్నారు. వాస్తవానికి ఆత్మలన్నీ మిడ్‌గేడ్‌లే. ఆత్మ బిందువు దానినేం తూకం వేస్తారు? అది ఒక నక్షత్రము. మానవులు నక్షత్రం అనే పదము వింటూనే పైకి చూస్తారు. మీరు నక్షత్రం పేరు వినగానే స్వయాన్ని చూచుకుంటారు. మీరు భూమి పైనున్న నక్షత్రాలు. అవి ఆకాశమందున్న జడ నక్షత్రాలు. మీరు చైతన్య నక్షత్రాలు. వారి భ్రమణములో మార్పు ఉండదు. మీరు 84 జన్మలు తీసుకుంటారు. చాలా పెద్ద పాత్రను అభినయిస్తారు. పాత్ర చేస్తూ చేస్తూ ప్రకాశము తగ్గిపోతుంది. బ్యాటరి డిస్‌ఛార్జ్‌ అయిపోతుంది. మళ్లీ తండ్రి వచ్చి అనేక విధాలుగా అర్థం చేయిస్తారు. ఎందుకంటే మీ ఆత్మ ఆరిపోయింది. నింపబడిన శక్తి సమాప్తమైపోయింది. ఇప్పుడు మళ్లీ తండ్రి ద్వారా శక్తి నింపుకుంటారు. మీరు మీ బ్యాటరీని ఛార్జ్‌ చేసుకుంటున్నారు. ఛార్జ్‌ అవ్వకుండా మాయ అనేక విఘ్నాలు కలుగజేస్తుంది. మీరు చైతన్యమైన బ్యాటరీలు తండ్రితో యోగము చేసినందున మనము సతోప్రధానంగా అవుతామని మీకు తెలుసు. ఇప్పుడు తమోప్రధానంగా అయ్యారు. ఆ హద్దులోని చదువుకు, ఈ బేహద్‌ చదువుకు చాలా తేడా ఉంది. నంబరువారుగా ఆత్మలన్నీ ఎలా పైకి పోతాయో, మళ్లీ సమయానుసారము పాత్రను అభినయించేందుకు అలాగే రావాలి. అందరికీ తమ-తమ అవినాశి పాత్రలు లభించే ఉన్నాయి. ఈ 84 జన్మల పాత్ర మీరు అనేకసార్లు అభినయించి ఉంటారు. మీ బ్యాటరీని ఎన్నిసార్లు ఛార్జ్‌, ఎన్నిసార్లు డిస్‌ఛార్జ్‌ అయ్యింది! మీ బ్యాటరి డిస్‌ఛార్జ్‌ అయ్యిందని తెలుసుకున్న తర్వాత మళ్లీ ఛార్జ్‌ చేసుకునేందుకు ఆలస్యమెందుకు చేయాలి? కాని మాయ బ్యాటరీని ఛార్జ్‌ చేసుకోనివ్వదు. బ్యాటరీని ఛార్జ్‌ చేసుకోవాలను విషయాన్ని మాయ మరపింపజేస్తుంది. మాటిమాటికి బ్యాటరి డిస్‌ఛార్జ్‌ చేయిస్తుంది. తండ్రిని స్మృతి చేసేందుకు ప్రయత్నిస్తారు కాని స్మృతి చేయలేరు. ఎవరైతే బ్యాటరీని ఛార్జ్‌ చేసుకొని సతోప్రధానము వరకు దగ్గరగా వస్తున్నారో వారిని కూడా మాయ అప్పుడప్డుడు మరపింపజేసి బ్యాటరీని డిస్‌ఛార్జ్‌ చేయిస్తుంది. ఇది చివరి వరకు జరుగుతూనే ఉంటుంది. యుద్ధము సమాప్తమైనప్పుడు అన్నీ సమాప్తమైపోతాయి. ఎవరెవరి బ్యాటరి ఎంతెంత ఛార్జ్‌ అయిందో దాని అనుసారము పదవి పొందుతారు. ఆత్మలందరు తండ్రి పిల్లలే. ఆ తండ్రియే వచ్చి అందరి బ్యాటరీలు ఛార్జ్‌ చేయిస్తారు. ఈ ఆట ఎంత అద్భుతంగా తయారయింది! తండ్రితో యోగము జోడించకుండా మాటి మాటికి దూరంగా వెళ్తారు. కనుక ఎంత నష్టము జరుగుతుంది! తెగిపోకుండా ఉండేందుకు పురుషార్థము చేయించబడ్తుంది. పురుషార్థము చేస్తూ చేస్తూ సమాప్తమైనప్పుడు మళ్లీ నంబరువారు పురుషార్థానుసారము కల్ప-కల్పము జరిగినట్లే మీ పాత్ర పూర్తి అవుతుంది. ఆత్మల మాల తయారవుతూ ఉంటుంది.
రుద్రాక్ష మాల, విష్ణు మాల కూడా ఉన్నాయని పిల్లలైన మీకు తెలుసు. మొదటి నంబరులో అయితే వారి మాల పెడ్తారు కదా. తండ్రి దైవీ ప్రపంచాన్ని రచిస్తారు కదా. రుద్రమాల ఉన్నట్లే. రుండమాల కూడా ఉంది. బ్రాహ్మణుల మాల ఎప్పుడూ తయారవ్వజాలదు. మార్పు చెందుతూనే ఉంటుంది. రుద్రమాల తయారైనప్పుడు ఫైనల్‌ అవుతుంది. బ్రాహ్మణుల మాల కూడా ఉంది. కాని ఇప్పుడు తయారవ్వజాలదు. వాస్తవానికి అందరూ ప్రజాపిత బ్రహ్మ సంతానమే. శివబాబా సంతానం మాల కూడా ఉంది. విష్ణుమాల అని కూడా అంటారు. మీరు బ్రాహ్మణులుగా అయితే, బ్రహ్మకు, శివునికి కూడా మాలగా అవుతారు. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో నంబరువారుగా ఉంది. వినేదేమో అందరూ వింటారు. కాని కొంతమందికి ఆ సమయములోనే చెవుల నుండి బయటకు పోతుంది. విననే వినరు. కొంతమంది అయితే చదవనే చదవరు. భగవంతుడు చదివించేందుకు వచ్చారని వారికి తెలియనే తెలియదు. కనుక చదవనే చదవరు. ఈ చదువును ఎంతో ఖుషీగా చదువుకోవాలి. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. స్మృతి యాత్ర ద్వారా ఆత్మ రూపి బ్యాటరీని ఛార్జ్‌ చేసుకొని సతోప్రధానం వరకు చేరుకోవాలి. బ్యాటరీ డిస్‌ఛార్జ్‌ అయ్యే విధంగా ఏ పొరపాటు(నిర్లక్ష్యము) చేయరాదు.
2. ప్రియమైన ముద్దు బిడ్డలుగా అయ్యేందుకు తండ్రితో పాటు ఇంటి పై కూడా ప్రేమ కలిగి ఉండాలి. జ్ఞాన-యోగాలలో మస్త్‌(ఆనందం)గా అవ్వాలి. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో, దానిని మన సోదరులకు కూడా అర్థం చేయించాలి.

వరదానము :- '' సేవలో ఉంటూ సంపూర్ణతకు సమీపంగా అనుభవం చేసే బ్రహ్మబాబా సమానం ఉదాహరణంగా అవ్వండి (ఎగ్జాంపుల్‌ భవ) '' '' సేవలో ఉంటూ సంపూర్ణతకు సమీపంగా అనుభవం చేసే బ్రహ్మబాబా సమానం ఉదాహరణంగా అవ్వండి (ఎగ్జాంపుల్‌ భవ) '' '' సేవలో ఉంటూ సంపూర్ణతకు సమీపంగా అనుభవం చేసే బ్రహ్మబాబా సమానం ఉదాహరణంగా అవ్వండి (ఎగ్జాంపుల్‌ భవ) ''
ఎలాగైతే బ్రహ్మబాబా సేవలో ఉంటూ, సమాచారము వింటూ, ఏకాంతవాసులుగా అయ్యేవారో, ఒక గంట సమాచారాన్ని 5 నిముషాలలో సారాన్ని విని పిల్లలను సంతోషపరచి తమ అంతర్ముఖ ఏకాంతవాసి స్థితిని అనుభవం చేయించేవారో, అలా తండ్రిని అనుసరించండి. బ్రహ్మబాబా 'నేను చాలా బిజీగా ఉన్నాను' అని ఎప్పుడూ అనలేదు. కాని తండ్రి ముందు ఉదాహరణగా అయ్యాడు. సమయ ప్రమాణంగా ఇప్పుడీ అభ్యాసము అవసరము. హృదయపూర్వక లగ్నముంటే సమయం దానంతకు అదే వస్తుంది, అంతేకాక అనేకమందికి ఉదాహరణంగా అవుతారు.

స్లోగన్‌ :- '' ప్రతి కర్మలో - కర్మ మరియు యోగం అనుభవమవ్వడమే కర్మ యోగము ''

Wednesday, 25 December 2019

Telugu Murli 26/12/2019

26-12-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - తండ్రికి సహయోగులుగా అయి ఈ ఇనుప యుగమనే పర్వతాన్ని బంగారు యుగముదిగా తయారు చేయాలి, పురుషార్థము చేసి కొత్త ప్రపంచము కొరకు ఫస్ట్‌క్లాస్‌ సీటును రిజర్వ్‌ చేయించుకోవాలి ''

ప్రశ్న :- తండ్రి కర్తవ్యము ఏమిటి ? ఏ కర్తవ్యాన్ని పూర్తి చేసేందుకు సంగమ యుగములో తండ్రి రావలసి ఉంటుంది ?
జవాబు :- అనారోగ్యంగా, దుఃఖీలుగా ఉన్న పిల్లలను సుఖవంతులుగా చెయ్యడం, మాయా బంధనము నుండి వెలికి తీసి అపారమైన సుఖమునివ్వడం - ఇది తండ్రి కర్తవ్యము. ఈ కర్తవ్యాన్ని తండ్రి సంగమ యుగములోనే పూర్తి చేస్తారు. బాబా చెప్తారు - నేను మీ అందరి దుఃఖాన్ని సమాప్తము చేసేందుకు, అందరి పై కృప చూపేందుకు వచ్చాను. ఇప్పుడు పురుషార్థము చేసి 21 జన్మల కొరకు మీ శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకోండి.

పాట :- భోలానాథునికి సాటి అయినవారు,......................( భోలానాథ్‌ సే నిరాలా,...............)
ఓంశాంతి. భోలానాథుడైన శివభగవానువాచ - బ్రహ్మ ముఖ కమలము ద్వారా తండ్రి చెప్తున్నారు - ఇది వెరైటీ భిన్న-భిన్న ధర్మాల మనుష్య సృష్టిరూపి వృక్షము కదా. ఈ కల్పవృక్షము లేక సృష్టి ఆదిమధ్యాంత రహస్యాలను పిల్లలకు అర్థము చేయిస్తున్నాను. పాటలో కూడా వీరి మహిమ ఉంది. శివబాబా జన్మ ఇక్కడే జరిగింది. నేను భారతదేశములోనే వచ్చానని తండ్రి చెప్తున్నారు. శివబాబా ఎప్పుడు ఆగమించారో(వచ్చారో) మనుష్యులకు తెలియదు. ఎందుకంటే గీతలో కృష్ణుని పేరు వేసేశారు. ద్వాపరయుగము మాటే లేదు. తండ్రి చెప్తారు - పిల్లలూ, 5 వేల సంవత్సరాల క్రితము కూడా నేను వచ్చి ఈ జ్ఞానాన్నిచ్చాను. ఈ వృక్షము ద్వారా అందరికీ తెలిసిపోతుంది. వృక్షాన్ని బాగా చూడండి. సత్యయుగములో పూర్తి దేవీ దేవతల రాజ్యముండేది, త్రేతా యుగములో సీతా-రాముల రాజ్యముండేది. బాబా ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. బాబా, మేము మాయ బంధనాలలో ఎప్పుడు చిక్కుకున్నాము? అని పిల్లలు అడుగుతారు. ద్వాపర యుగము నుండి అని బాబా చెప్తారు. నంబరువారుగా మళ్లీ ఇతర ధర్మాలు వస్తాయి. కనుక ఈ ప్రపంచములోకి మళ్లీ మనము ఎప్పుడు వస్తామో లెక్క వేసి తెలుసుకోగలరు. నేను 5 వేల సంవత్సరాల తర్వాత సంగమ యుగములో నా కర్తవ్యాన్ని నిర్వహించేందుకు వచ్చానని శివబాబా చెప్తున్నారు. మనుష్య మాత్రులందరూ ముఖ్యంగా భారతవాసులు దుఃఖితులుగా ఉన్నారు. డ్రామానుసారము భారతాదేశాన్నే నేను సుఖప్రదంగా చేస్తాను. పిల్లలు అనారోగ్యము పాలైనప్పుడు వారికి వైద్యము చేయించడం తండ్రి కర్తవ్యము. ఇది అతిపెద్ద అనారోగ్యము(జబ్బు). అన్ని రోగాలకు మూలము ఈ 5 వికారాలు. ఇవి ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయని పిల్లలు అడుగుతారు. ద్వాపర యుగము నుండి. రావణుని విషయము అర్థం చేయించాలి. రావణుని ఎవ్వరూ చూడలేరు. బుద్ధి ద్వారా అర్థము చేసుకోవచ్చు. తండ్రిని కూడా బుద్ధి ద్వారానే తెలుసుకుంటారు. ఆత్మ మనసు-బుద్ధి సహితంగా ఉంది. మా తండ్రి పరమాత్మ అని ఆత్మకు తెలుసు. సుఖ-దుఃఖాలు, లేప చేపములలోకి(కర్మఫలము) ఆత్మ వస్తుంది. శరీరము ఉన్నప్పుడు ఆత్మకు దుఃఖము కలుగుతుంది. పరమాత్మ అయిన నన్ను దుఃఖింప చేయకండి అని ఎప్పుడూ చెప్పరు. తండ్రి చెప్తున్నారు - నా పాత్ర కూడా ఉంది, కల్ప-కల్పము సంగమ యుగములో వచ్చి నేను పాత్ర చేస్తాను. ఏ పిల్లలనైతే నేను సుఖములోకి పంపించానో వారు దుఃఖములో ఉన్నారు కనుక డ్రామానుసారము నేను మళ్లీ రావలసి ఉంటుంది. అంతేకాని కచ్ఛ, మత్సావతారాల(తాబేలు, చేప) మాట లేదు. పరశురాముడు గొడ్డలితో క్షత్రియులను సంహరించాడని చెప్తారు. ఇవన్నీ కాల్పనిక కథలు. ఇప్పుడు నన్ను స్మృతి చేయండి అని తండ్రి అర్థం చేయిస్తున్నారు.
వీరు జగదంబ-జగత్పితలు. తల్లి-తండ్రుల దేశము అని చెప్తారు కదా. మీరే మాతా - పితలు........... మీ కృప ద్వారా అపారమైన సుఖము లభిస్తుంది అని భారతవాసులు స్మృతి కూడా చేస్తారు. ఎవరు ఎంత పురుషార్థము చేస్తారో అంత పొందుతారు. సినిమా చూసేందుకు వెళ్ళినప్పుడు ఫస్ట్‌క్లాస్‌ రిజర్వేషను చేయిస్తారు కదా. తండ్రి కూడా చెప్తున్నారు - సూర్యవంశము కావాలన్నా, చంద్రవంశము కావాలన్నా సీటు రిజర్వ్‌ చేసుకోండి. ఎవరు ఎంత పురుషార్థము చేస్తారో అంత పదవిని పొందగలరు. ఇప్పుడు అన్ని దుఃఖాలను సమాప్తము చేసేందుకు తండ్రి వచ్చారు. రావణుడు అందరికి చాలా దుఃఖమునిచ్చాడు. ఏ మనిషీ మరొక మనిషికి గతి - సద్గతులను ఇవ్వలేడు. ఇది కలియుగ అంతిమ సమయము. గురువులు శరీరము వదిలినట్లయితే మళ్లీ ఇక్కడే పునర్జన్మ తీసుకుంటారు. మరి వారు ఇతరులకు సద్గతిని ఏమివ్వగలరు! ఇంతమంది అనేక గురువులు కలిసి పతిత సృష్టిని పావనంగా చేయగలరా? గోవర్ధన పర్వతము అని చెప్తారు కదా! ఈ మాతలు ఈ ఇనుప యుగమనే పర్వతాన్ని బంగారు యుగంగా తయారు చేస్తారు. గోవర్ధన పర్వతానికి పూజ కూడా చేస్తారు, అది తత్వపూజ. సన్యాసులు కూడా బ్రహ్మమును అనగా తత్వాన్ని స్మృతి చేస్తారు. అదే పరమాత్మ అని, బ్రహ్మతత్వము భగవంతుడని భావిస్తారు. ఇది భ్రమ అని తండ్రి అంటారు. బ్రహ్మాండములో ఆత్మలు అండాల వలె ఉంటాయి, నిరాకారి వృక్షమును కూడా చూపడం జరిగింది. ప్రతి ఒక్కరికి తమ-తమ విభాగాలు(సెక్షన్లు) ఉంటాయి. భారతదేశపు సూర్యవంశీ, చంద్రవంశీ పరివారాలు ఈ వృక్షానికి పునాది. తర్వాత వృద్ధి చెందుతుంది. నాలుగు ధర్మాలు ముఖ్యమైనవి. కనుక ఏ ఏ ధర్మాలు ఎప్పుడు వచ్చాయి అని లెక్క తీయాలి. ఉదాహరణానికి గురునానక్‌ 5 వందల సంవత్సరాల క్రితము వచ్చారు. సిక్కు ధర్మమువారు 84 జన్మల పాత్రను అభినయించరు. తండ్రి చెప్తారు - 84 జన్మలు కేవలం ఆల్‌రౌండర్‌ బ్రాహ్మణులైన మీరు మాత్రమే తీసుకుంటారు. మీదే ఆల్‌రౌండ్‌ పాత్ర. బ్రాహ్మణులుగా, దేవతలుగా, క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా మీరే అవుతారు అని తండ్రి అర్థం చేయించారు. ఎవరైతే మొట్టమొదట దేవీ దేవతలుగా అవుతారో వారే పూర్తి చక్రములో తిరుగుతారు.
తండ్రి చెప్తున్నారు - మీరు వేదశాస్త్రాలను చాలా విన్నారు. ఇప్పుడిది విని శాస్త్రాలు రైటా లేక గురువులు రైటా లేక తండ్రి తెలియజేస్తున్నది రైటా? అని మీరు నిర్ణయము తీసుకోండి. తండ్రిని సత్యము(ట్రూత్‌) అని అంటారు. నేను సత్యాన్నే తెలియజేస్తాను, దాని ద్వారా సత్యయుగము తయారవుతుంది. ద్వాపర యుగము నుండి మీరు అసత్యాన్ని వింటూ వచ్చారు కనుక దాని వలన నరకంగా తయారయింది.
తండ్రి చెప్తున్నారు - నేను మీ సేవకుడను, భక్తిమార్గములో ''నేను సేవకుడను, నేను సేవకుడను,''............. అని మీరు పాటలు పాడ్తూ వచ్చారు. ఇప్పుడు నేను మీ సేవ కొరకు వచ్చాను. తండ్రిని నిరాకారి, నిరహంకారి అని మహిమ చేస్తారు. కనుక మిమ్ములను సదా సుఖవంతంగా తయారు చేయడం నా కర్తవ్యమని తండ్రి చెప్తున్నారు. అగమ్‌ నిగమ్‌కా భేద్‌ ఖోలే (డ్రామాలోని అన్ని రహస్యాలను తెలియచేయువారు)....................... అని పాట కూడా ఉంది. కానీ ఢమరుకము మొదలైనవి మ్రోగించే విషయమేదీ లేదు. వీరు ఆదిమధ్యాంతాల సమాచారమంతా వినిపిస్తారు. బాబా చెప్తున్నారు - పిల్లలైన మీరందరూ పాత్రధారులు, నేను ఈ సమయములో చేసి చేయించేవాడిని. నేను ఇతని(బ్రహ్మ) ద్వారా స్థాపన చేయిస్తాను. అంతేకాని గీతలో ఏది వ్రాసి ఉందో అది లేనే లేదు. ఇప్పుడిది ప్రాక్టికల్‌ విషయము కదా. పిల్లలకు ఈ సహజ జ్ఞానాన్ని, సహజ యోగాన్ని నేర్పిస్తాను, యోగాన్ని జోడింపజేస్తాను. యోగాన్ని జోడింపజేసేవారు, జోలెను నింపేవారు, దుఃఖాన్ని దూరము చేసేవారు,......... అని అంటారు కదా. గీతకు పూర్తి అర్థాన్ని కూడా తెలియజేస్తారు. యోగాన్ని నేర్పిస్తాను, నేర్పింపజేస్తాను కూడా. పిల్లలు యోగాన్ని నేర్చుకుని మళ్లీ ఇతరులకు నేర్పిస్తారు కదా. యోగము ద్వారా మా జ్యోతిని వెలిగించేవారు................. అని అంటారు కదా. ఇలాంటి పాటలను కూడా ఇంట్లో కూర్చుని విన్నప్పటకీ పూర్తి జ్ఞానమంతా బుద్ధిలో తిరుగుతుంది. తండ్రి స్మృతి ద్వారా వారసత్వాల నషా కూడా పెరుగుతుంది. కేవలం పరమాత్మ, భగవంతుడు అని అనడం వలన నోరు మధురంగా అవ్వదు. బాబా అంటేనే వారసత్వము.
ఇప్పుడు పిల్లలైన మీరు బాబా ద్వారా ఆదిమధ్యాంతాల జ్ఞానము విని మళ్లీ ఇతరులకు వినిపిస్తారు. దీనినే 'శంఖ ధ్వని' అని అంటారు. ఏ పుస్తకాలు మొదలైనవి మీ చేతిలో లేవు. పిల్లలు కేవలం ధారణ చేయవలసి వస్తుంది. మీరు సత్యమైన ఆత్మిక బ్రాహ్మణులు, ఆత్మిక తండ్రి సంతానము. సత్యమైన గీత ద్వారా భారతదేశము స్వర్గంగా అవుతుంది. వారు కేవలం కూర్చుని కథలను తయారు చేశారు. మీరంతా పార్వతులు, మీకు ఈ అమరకథను వినిపిస్తున్నాను. మీరంతా ద్రౌపదులు, అక్కడ ఎవ్వరినీ వివస్త్రలుగా చెయ్యరు. అప్పుడు సంతానోత్పత్తి ఎలా జరుగుతుంది అని అడుగుతారు. అరే! వారంతా నిర్వికారులు, కనుక వికారాల మాట ఎలా ఉంటుంది! యోగబలము ద్వారా సంతానోత్పత్తి ఎలా జరుగగలదో మీరు అర్థము చేసుకోలేరు. మీరు వాదిస్తారు. కానీ ఇవి శాస్త్రాలలోని మాటలు కదా. అది సంపూర్ణ నిర్వికారి ప్రపంచము. ఇది వికారి ప్రపంచము, డ్రామానుసారంగా మాయ మళ్లీ మిమ్ములను దుఃఖితులుగా చేస్తుందని నాకు తెలుసు. నేను కల్ప-కల్పము నా కర్తవ్యము నిభాయించేందుకు వస్తాను. కల్పక్రితపు అపురూపమైన పిల్లలే వచ్చి తమ ఆస్తిని తీసుకుంటారని తెలుసు. లక్షణాలు కూడా కనబడ్తున్నాయి. ఇది అదే మహాభారత యుద్ధము. మీరు మళ్లీ దేవీ దేవతలుగా, స్వర్గానికి అధికారులుగా అయ్యే పురుషార్థము చేయాలి. ఇందులో స్థూల యుద్ధము మాటే లేదు. అసురుల, దేవతల యుద్ధము జరగలేదు. అక్కడ యుద్ధము చేసేందుకు మాయనే లేదు. అర్ధకల్పము యుద్ధాలుండవు, జబ్బులుండవు, దుఃఖము-అశాంతులు కూడా ఉండవు. అరే! అక్కడ సదా సుఖము, సదా వసంత ఋతువు ఉంటుంది. ఆసుపత్రులుండవు కాని స్కూలులో చదవవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు ఇక్కడ నుండి వారసత్వాన్ని తీసుకెళ్తారు. మనిషి చదువు ద్వారా తన కాళ్ల పై తాను నిలబడ్తాడు. దీని గురించి ఒక కథ కూడా ఉంది - నీవు ఎవరి సంపాదన తింటున్నావు? అని ప్రశ్నించినప్పుడు నేను నా భాగ్యాన్ని తింటున్నాను అని చెప్పారు. అది హద్దులోని భాగ్యము. ఇప్పుడు మీరు మీ బేహద్‌ భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు. మీరు ఎలాంటి భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారంటే 21 జన్మలు మీరు మీ రాజ్యభాగ్యాన్ని అనుభవిస్తారు. ఇది బేహద్‌ సుఖమునిచ్చే వారసత్వము. భారతదేశము ఎంత సుఖప్రదంగా ఉండేది, ఇప్పుడు ఏ స్థితిలో ఉంది! పిల్లలైన మీరు ఈ వ్యత్యాసాన్ని బాగా తెలుసుకున్నారు. ఎవరు కల్పక్రితము రాజ్యభాగ్యాన్ని తీసుకున్నారో, వారే ఇప్పుడు తీసుకుంటారు. డ్రామాలో ఏముంటే అది లభిస్తుందని అనుకోకండి, అలా అనుకుంటే ఆకలితో మరణిస్తారు. ఈ డ్రామా రహస్యాన్ని పూర్తిగా అర్థము చేసుకోవాలి. శాస్త్రాలలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆయువును వ్రాసేశారు. అనేక మత-మతాంతరాలున్నాయి. మేము సదా సుఖంగా ఉండనే ఉన్నామని కొంతమంది చెప్తారు. అరే! మీకెప్పుడూ జబ్బులు రావా? రోగాలు మొదలైనవి శరీరానికి వస్తాయి, ఆత్మ నిర్లేపి అని వారంటారు. అరే! దెబ్బ తగిలినప్పుడు దుఃఖము ఆత్మకే కలుగుతుంది కదా - ఇవి బాగా అర్థము చేసుకోవలసిన విషయాలు. ఇది పాఠశాల, చదివించే టీచరు ఒక్కరే. జ్ఞానము ఒక్కటే. నరుని నుండి నారాయణునిగా అయ్యే లక్ష్యము కూడా ఒక్కటే. ఎవరు ఫెయిల్‌ అవుతారో వారు చంద్ర వంశములోకి వెళ్ళిపోతారు. దేవతలు ఉన్నప్పుడు క్షత్రియులుండరు, క్షత్రియులున్నప్పుడు వైశ్యులుండరు, వైశ్యులున్నప్పుడు శూద్రులుండరు. ఇవన్నీ అర్థము చేసుకోవలసిన విషయాలు. మాతలకు కూడా ఇది చాలా సులభము. ఒకే పరీక్ష ఉంటుంది. ఆలస్యంగా వచ్చేవారు ఎలా చదువుతారని అనుకోకండి. కాని ఇప్పుడు కొత్తవారు తీక్షణంగా ముందుకు పోతున్నారు. ప్రాక్టికల్‌గా జరుగుతూ ఉంది. మాయా రావణునికి ఏ రూపమూ లేదు. వీరిలో కామ భూతము ఉందని అంటారు కాని రావణునికి ఏ చిత్రమూ లేదు, శరీరమూ లేదు.
అన్ని విషయాల స్యాక్రిన్‌(సారము) మన్మనాభవ. నన్ను స్మృతి చేసినట్లయితే ఈ యోగ అగ్నిలో వికర్మలు వినాశనమవుతాయని తండ్రి చెప్తారు. తండ్రి మార్గదర్శకునిగా అయి వస్తాడు. బాబా చెప్తున్నారు - పిల్లలారా! నేను సన్ముఖములో పిల్లలైన మిమ్ములను చదివిస్తున్నాను. కల్ప-కల్పము నా కర్తవ్యాన్ని పాలన చేస్తాను. పారలౌకిక తండ్రి చెప్తున్నారు - నేను పిల్లలైన మీ సహయోగముతో నా బాధ్యతను నిర్వహించేందు వచ్చాను. సహయోగమిచ్చినట్లయితే మీరు పదవి కూడా పొందుతారు. నేను ఎంత శ్రేష్ఠమైన తండ్రిని, ఎంత పెద్ద యజ్ఞాన్ని రచించాను. బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణ - బ్రాహ్మణీలైన మీరంతా సోదరీ-సోదరులు. ఎప్పుడైతే సోదరి-సోదరులుగా అయ్యారో అప్పుడు స్త్రీ - పురుషులనే దృష్టి పరివర్తన అవుతుంది. తండ్రి చెప్తున్నారు - ఈ బ్రాహ్మణ కులాన్ని కళంకితము చేయండి, పవిత్రంగా ఉండేందుకు యుక్తులున్నాయి. ఇరువురూ జతలో ఉంటూ ఇలా ఉండడం ఎలా సాధ్యమవుతుంది? ఇలా జరిగేందుకు వీలు లేదు అని మనుష్యులు అంటారు. బాబా చెప్తారు - మధ్యలో జ్ఞాన ఖడ్గముంటే ఎప్పుడూ అగ్ని అంటుకోదు, కాని ఇరువురూ మన్మనాభవ స్థితిలో ఉంటూ, శివబాబాను స్మృతి చేస్తూ ఉండాలి. స్వయాన్ని బ్రాహ్మణులుగా భావించాలి. మనుష్యులు ఈ మాటలను అర్థము చేసుకోలేని కారణంగా హంగామా చేస్తారు. వీరు నిందలు కూడా వినవలసి ఉంటుంది. కృష్ణుని ఎవ్వరూ నిందించరు. కృష్ణుడు అలా వచ్చినట్లయితే విదేశాల నుండి కూడా ఒక్కసారిగా విమానాలలో వచ్చేస్తారు. పెద్ద గుంపు తయారవుతుంది. ఇంకా భారతదేశములో ఏమేం జరుగుతుందో చెప్పలేము.
మంచిది, ఈ రోజు భోగ్‌(నైవేద్యము) ఉంది - ఇది తండ్రి ఇల్లు, అది అత్తగారిల్లు. సంగమ యుగములో మిలనము జరుగుతుంది. కొందరు దీనిని ఇంద్రజాలమని అనుకుంటారు. సాక్షాత్కారమంటే ఏమిటో భక్తిమార్గములో సాక్షాత్కారాలు ఎలా జరుగుతాయో బాబా అర్థం చేయించారు. ఇందులో సంశయబుద్ధి గలవారిగా అవ్వరాదు. ఇది సాంప్రదాయము, ఆచారము. శివబాబా భండారము కనుక వారిని స్మృతి చేసి భోగ్‌ స్వీకారము చేయించాలి. యోగములో ఉండడం మంచిదే. బాబా స్మృతి ఉంటుంది. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. స్వయాన్ని బ్రహ్మ ముఖ వంశావళి అని భావించి పక్కా పవిత్ర బ్రాహ్మణులుగా అవ్వాలి. ఎప్పుడూ మీ బ్రాహ్మణ కులాన్ని కళంకితము చేయరాదు.
2. తండ్రి సమానంగా నిరాకారి నిరహంకారులుగా అయి మీ బాధ్యతను పూర్తి చేయాలి. ఆత్మిక సేవలో తత్పరులుగా ఉండాలి.

వరదానము :- '' సేవల ప్రవృత్తిలో ఉంటూ మధ్య మధ్యలో ఏకాంతవాసులుగా అయ్యే అంతర్ముఖీ భవ ''
సైలెన్స్‌ శక్తిని ప్రయోగించేందుకు అంతర్ముఖులుగా, ఏకాంతవాసులుగా అయ్యే ఆవశ్యకత ఉంది. చాలా మంది పిల్లలు అంతర్ముఖ స్థితిని అనుభవం చేసేందుకు, ఏకాంతవాసులుగా అయ్యేందుకు సమయమే లభించదని అంటారు. ఎందుకంటే సేవా ప్రవృత్తి, వాచా ప్రవృత్తి చాలా పెరిగింది. కాని దీని కొరకు ఒకేసారి అర్ధగంట, ఒక గంట తీసుకునేందుకు బదులు మధ్య మధ్యలో కొంత సమయం కేటాయించినా(తీసుకున్నా) శక్తిశాలి స్థితి తయారవుతుంది.

స్లోగన్‌ :- ''బ్రాహ్మణ జీవితంలో యుద్ధం చేసేందుకు బదులు ఆనందంగా గడిపితే, కష్టం కూడా సహజమైపోతుంది ''