Saturday, 29 February 2020

Telugu Murli 01/03/2020

01-03-2020 ప్రాత:మురళిఓంశాంతి'బాప్దాదా' 02-12-85

బంధనాలనుండి ముక్తులుగా అయ్యేందుకు యుక్తి - ఆత్మిక శక్తి
ఈరోజు బాప్దాదా తమ ఆత్మిక పిల్లల ఆత్మికతా శక్తిని చూస్తున్నారు. పిల్లల సంబంధము ఉన్న కారణంగా ఆత్మిక పిల్లలు ప్రతి ఒక్కరూ ఆత్మిక తండ్రినుండి ఆత్మిక శక్తికి చెందిన సంపూర్ణ అధికారమును ప్రాప్తి అయితే చేసుకున్నారు. కానీ ప్రాప్తి స్వరూపులుగా ఎంతవరకు అయ్యారు, అన్నదానిని చూస్తుండినారు.పిల్లలందరూ ప్రతిరోజు స్వయమును ఆత్మిక పిల్లలు అని అనుకుంటూ, ప్రియస్మృతులకు రిటర్న్ను ఆత్మిక తండ్రికి నోటితో లేక మనసుతో ప్రియస్మృతుల రూపంలో లేక నమస్తే రూపంలో ఇస్తారు. రిటర్న్ఇస్తారు కదా! ఇందులోని రహస్యమేమంటే ప్రతిరోజు ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలు అని అంటూ ఆత్మిక శక్తియొక్క వాస్తవిక స్వరూపపు స్మృతిని తెప్పిస్తారు, ఎందుకంటే ఈ బ్రాహ్మణ జీవిత విశేషతయే ఆత్మికత. ఈ ఆత్మికతా శక్తిద్వారా స్వయమును మరియు సర్వులను పరివర్తన చేస్తారు.ముఖ్యమైన ఫౌండేషనే ఈ ఆత్మిక శక్తి. ఈ శక్తిద్వారానే అనేకరకాలైన దైహిక బంధనాలనుండి ముక్తి లభిస్తుంది. ఇప్పటివరకుకూడా అనేక సూక్ష్మ బంధనాలు ఏవైతే ఉన్నాయో, వాటిని స్వయముకూడా అనుభవము చేస్తారు.ఆ బంధనమునుండి ముక్తి కావాలని కోరుకుంటున్నారు అన్నదానిని బాప్దాదా చూస్తుండినారు. కానీ వారు ముక్తిని పొందే యుక్తిని ప్రాక్టికల్లోకి తీసుకురాలేకపోతారు. కారణమేంటి? ఆత్మిక శక్తిని ప్రతి కర్మలో ఉపయోగించటము రాదు. ఒకే సమయములో సంకల్పము, మాట మరియు కర్మ, మూడింటినీ తోడుతోడుగా శక్తిశాలిగా తయారుచేసుకోవలసివస్తుంది. కానీ ఎందులో లూజ్అయిపోతుంది? ఒకవైపు సంకల్పాలను శక్తిశాలిగా తయారుచేసుకుంటారు, కానీ వాణిలో ఎంతో కొంత లూజ్అయిపోతుంది. ఒక్కోసారి వాణిని శక్తిశాలిగా తయారుచేసుకుంటారు, కానీ కర్మలలో లూజ్అయిపోతుంది. కానీ ఈ మూడింటినీఒకే సమయములో ఆత్మికంగా శక్తిశాలిగాతయారుచేసుకున్నట్లయితే, ఇదే ముక్తిని పొందేందుకు యుక్తి. సృష్టి రచనలో ఏవిధంగా స్థాపన, పాలన మరియు వినాశనము అన్న ఈ మూడుకార్యాలు తప్పనిసరో అలాగే సర్వ బంధనాలనుండి ముక్తి అయ్యేందుకు యుక్తి - మనసా, వాచ, కర్మణ, ఈ మూడింటిలో ఆత్మిక శక్తి తోడుతోడుగా ఉండటము తప్పనిసరి. ఒకసారి మనసును సంభాళించుకున్నట్లయితే వాచలో లోపము వచ్చేస్తుంది. మళ్ళీ, ఇలా అయితే ఆలోచించలేదు, ఇలా ఎందుకైందో తెలియదు అని అంటారు. మూడు వైపులా పూర్తి అటెన్షన్కావాలి. ఎందుకని? ఈ మూడు సాధనాలు సంపన్న స్థితిని మరియు బాబాను ప్రత్యక్షము చేసేటటువంటివి. ముక్తిని పొందేందుకు మూడింటిలో ఆత్మికతా అనుభవము ఉండాలి. ఎవరైతే మూడింటిలో యుక్తీయుక్తులో వారే జీవన్ముక్తులు. కనుక బాప్దాదా సూక్ష్మ బంధనాలను చూస్తున్నారు. సూక్ష్మ బంధనాలలో కూడా విశేషంగా ఈ మూడింటికి కనెక్షన్ఉంది. బంధనమునకు గుర్తు -

బంధనము కలవారు సదా పరవశమై ఉంటారు. బంధనము కలవారు స్వయమును ఆంతరిక సంతోషములో లేదా సుఖములో సదా అనుభవము చెయ్యరు. ఎలాగైతే లౌకిక ప్రపంచంలోని అల్పకాలికమైన సాధనాలు అల్పకాలికమైన సంతోషము లేక సుఖపు అనుభూతిని కలిగిస్తాయి కానీ ఆంతరికమైన లేక అవినాశీ అనుభూతి ఉండదు,అలా సూక్ష్మ బంధనములో బంధింపబడి ఉన్న ఆత్మ ఈ బ్రాహ్మణ జీవితంలో కూడా కొద్ది సమయము కొరకు సేవా సాధనాలు, సంగఠన శక్తి అనే సాధనము, ఏదో ఒక ప్రాప్తియొక్క సాధనము, శ్రేష్ఠ సాంగత్యం యొక్క సాధనం ఈ సాధనాల ఆధారంతో నడుస్తారు, ఎప్పటివరకు సాధనాలు ఉంటాయో అంతవరకు సంతోషపు లేక సుఖపు అనుభూతిని చేస్తారు. కానీ సాధనాలు సమాప్తమైనట్లయితే సంతోషము కూడా సమాప్తమైపోతుంది. సదా ఏకరసంగా ఉండరు. ఒక్కోసారి సంతోషంలో ఎలా నాట్యం చేస్తుంటారంటే, వీరిలాగా ఇంకెవ్వరూ ఉండనే ఉండరు అన్నట్లు ఆ సమయంలో అనిపిస్తుంది. కానీ ఆగిపోయారంటే, ఆ సమయంలో చిన్న రాయినికూడా పర్వతంలా అనుభవం చేస్తారు ఎందుకంటే ఒరిజినల్శక్తి లేని కారణంగా సాధనాల ఆధారంతో సంతోషంలో నాట్యం చేస్తారు. సాధనాలు లేకపోతే ఇంకెక్కడ నాట్యం చేస్తారు? కనుక ఆంతరిక ఆత్మిక శక్తి మూడు రూపాలలో సదా తోడుతోడుగా ఉండటము అవసరము. ముఖ్యమైన బంధనము - మనసా సంకల్పాలలో కంట్రోలింగ్పవర్ఉండదు. తాము చేసుకునే సంకల్పాలకు వశమైపోయిన కారణంగా పర వశాన్ని అనుభవము చేస్తారు. ఎవరైతే స్వయం యొక్క సంకల్పాల బంధనాలలో ఉంటారో వారు చాలా సమయము ఇందులో బిజీగా ఉంటారు. గాలిమేడలు కట్టేస్తుంటారని మీరు కూడా అంటారు కదా. గాలి కోటలుకట్తుంటారు, మళ్ళీ పడగొడ్తుంటారు. చాలా పొడవైన గోడను నిలబెట్తారు. కనుకనే గాలి కోట అంటారు.ఎలాగైతే భక్తిలోకూడా పూజ చేసి, అలంకారము చేసి, మళ్ళీ ముంచేస్తారు కదా, అలాగే సంకల్పాల బంధనములో బంధింపబడి ఉన్న ఆత్మలు చాలా తయారు చేసుకుంటారు, చాలా పోగొట్టుకుంటారు.స్వయానికి స్వయమే వ్యర్థ కార్యమువలన అలసిపోతారు కూడా, నిరాశ పడిపోతారు. ఒక్కోసారి అభిమానంలోకి వచ్చి వారు చేసిన పొరపాటును ఇతరులపై వేస్తూ ఉంటారు. అయినాకూడా సమయము గడిచేకొద్దీ నేను కరెక్ట్గా చెయ్యలేదు అని లోపల భావిస్తారు, కానీ అభిమానములో పరవశమైయున్న కారణంగా, తమను తాము రక్షించుకొనేందుకు ఇతరుల దోషాన్ని గురించే ఆలోచిస్తూ ఉంటారు. అన్నింటికన్నా పెద్ద బంధనము ఈ మనసా బంధనము, దీనివల్ల బుద్ధికి తాళం పడిపోతుంది, కనుక అర్థం చేయించేందుకు ఎంతగా ప్రయత్నించినాగానీ వారికి అర్థం కాదు. మనసా బంధనానికి విశేషంగా ఉన్న లక్షణము -రియలైజేషన్ చెందే శక్తి సమాప్తమైపోతుంది కనుక ఈ సూక్ష్మ బంధనాన్ని సమాప్తము చేస్తే తప్ప ఎప్పుడూకూడా ఆంతరిక సంతోషము, సదాకాలపు అతీంద్రియ సుఖం అనుభవాన్ని చెయ్యలేరు.

సంగమయుగపు విశేషతయే - అతీంద్రియ సుఖములో ఊయలలూగటము, సదా సంతోషములో నాట్యం చెయ్యటము. కనుక సంగమయుగములోనివారుగా అయ్యి ఒకవేళ ఈ విశేషతను అనుభవము చెయ్యనట్లయితే ఇక ఏమంటారు? కనుక ఏవిధమైనటువంటి సంకల్పాల బంధనములోనైతే లేను కదా అని స్వయాన్ని చెక్చేసుకోండి. అది వ్యర్థ సంకల్పాల బంధనమైనా, ఈర్ష్య-ద్వేషములతో కూడిన సంకల్పాలైనా, నిర్లక్ష్యముతో కూడిన సంకల్పాలైనా, సోమరితనమునకు చెందిన సంకల్పాలైనా, ఏవిధమైనటువంటి సంకల్పాలైనా అవి మనసా బంధనమునకు గుర్తు. కనుక ఈరోజు బాప్దాదా బంధనాలను చూస్తుండినారు. ముక్త ఆత్మలుగా ఎంతమంది ఉన్నారు?

బలమైన పెద్ద పెద్ద త్రాళ్ళు అయితే తెగిపోయాయి. ఇప్పుడు ఇవి సూక్ష్మమైన దారాలు. సన్నగా ఉన్నాకానీ బంధనంలో బంధించటంలో చాలా తెలివైనవి. మేము బంధనాలలో బంధింపబడి ఉన్నాము అన్నది కూడా తెలియనే తెలియదు ఎందుకంటే ఈ బంధనము అల్పకాలికమైన నషాను కూడా ఎక్కిస్తుంది. ఎలాగైతే వినాశీ నషాలో ఉన్నవారు ఎప్పుడూకూడా స్వయాన్ని కింద ఉన్నట్లుగా అనుకోరు. కాలువలో ఉన్నాకానీ మహల్లో ఉన్నట్లుగా అనుకుంటారు. ఖాళీ చేతులతో ఉన్నాకానీ తమను తాము మహారాజుగా అనుభవం చేసుకుంటారు. అలాగే ఈ నషా కలిగినవారు కూడా ఎప్పుడూ తమను తాము తప్పుగా భావించరు. ఎప్పుడూ తమను తాము రైట్అని నిరూపించుకుంటూ ఉంటారు లేదా నిర్లక్ష్యాన్ని చూపిస్తారు. ఇదైతే జరుగుతూనే ఉంటుంది, ఇలాగే నడుస్తూ ఉంటుంది అని అంటారు, కాబట్టి ఈరోజు కేవలము మనసా బంధనము గురించి తెలిపాము. తరువాత వాచ మరియు కర్మల గురించికూడా వినిపిస్తాము. అర్థమైందా!

ఆత్మికశక్తి ద్వారా ముక్తిని పొందుతూ వెళ్ళండి. సంగమయుగములో జీవన్ముక్తియొక్క అనుభవమును చెయ్యటమే భవిష్య జీవన్ముక్త ప్రాలబ్ధాన్ని పొందటము. గోల్డన్జూబిలీలోనైతే జీవన్ముక్తులుగా అవ్వాలి కదా, అంతేగానీ కేవలము గోల్డన్జూబిలీని జరుపుకోవటము కాదు. తయారవ్వటమే జరుపుకోవటము. ప్రపంచములోనివారు కేవలము జరుపుకుంటారు, ఇక్కడ తయారుచేస్తారు. ఇప్పుడు త్వరత్వరగా తయారైనట్లయితే అప్పుడు అందరూ మీ ముక్తిద్వారా ముక్తులుగా అయిపోతారు. సైన్స్వారు కూడా తాము చేసిన సాధనాల బంధనములో బంధింపబడ్డారు. నేతలనుకూడా చూడండి, రక్షించుకోవాలనుకుంటారు కానీ ఎంతగా బంధింపబడి ఉన్నారు! ఆలోచించినా గానీ చెయ్యలేకపోయినట్లయితే బంధనము ఉన్నట్లు కదా. ఆత్మలందరినీ భిన్న-భిన్న బంధనాలనుండి ముక్తులుగా చేయించేవారు స్వయం ముక్తులుగా అయ్యి అందరినీ ముక్తులుగా తయారుచెయ్యండి. అందరూ ముక్తి కావాలి, ముక్తి కావాలి అని ఆర్తనాదాలు చేస్తున్నారు. కొందరు పేదరికంనుండి ముక్తిని కోరుకుంటారు. కొందరు గృహస్థమునుండి ముక్తిని కోరుకుంటారు. కానీ అందరినుండి ముక్తి అన్న ఒకే మాట వస్తుంది. మరి ఇప్పుడు ముక్తి దాతగా అయ్యి ముక్తి యొక్క మార్గాన్ని చూపించండి లేక ముక్తి వారసత్వాన్ని ఇవ్వండి. వారి మాటలైతే చేరుకుంటున్నాయి కదా, లేక ఇది బాబా పని, మా పని కాదు అనైతే అనుకోవటం లేదు కదా. ప్రాలబ్ధాన్ని మీరే కదా పొందాలి, బాబాకు పొందే అవసరం లేదు. ప్రజలు లేక భక్తులుకూడా మీకే కావాలి. బాబాకు అవసరం లేదు. ఎవరైతే మీ భక్తులుగా ఉంటారో వారు బాబావారిగా స్వతహాగనే అయిపోతారు ఎందుకంటే ద్వాపరములో మీరే ముందుగా భక్తులుగా అవుతారు. మొదట బాబా పూజను ప్రారంభిస్తారు, కనుక మిమ్మల్ని అందరూ ఇప్పుడు ఫాలో చేస్తారు కనుక ఇప్పుడేం చెయ్యాలి? వారి పిలుపును వినండి. ముక్తి దాతలుగా అవ్వండి. అచ్ఛా!

సదా ఆత్మిక శక్తికి చెందిన యుక్తినుండి ముక్తిని ప్రాప్తి చేసుకునేవారు, సదా స్వయమును సూక్ష్మ బంధనాలనుండి ముక్తి చేసుకుని ముక్తి దాతలుగా అయ్యేవారు, సదా స్వయమును ఆంతరిక సంతోషపు, అతీంద్రియ సుఖపు అనుభూతిలో మున్ముందుకు తీసుకెళ్లేవారు, సదా సర్వుల ప్రతి ముక్త ఆత్మగా చెయ్యాలన్న శుభ భావనను కలవారు అయిన ఇటువంటి ఆత్మిక శక్తిశాలీ పిల్లలకు బాప్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో -వినేదానితోపాటు స్వరూపులుగా అయ్యేందులోకూడా శక్తిశాలీ ఆత్మలు కదా. ఎల్లప్పుడు మీ సంకల్పాలలో ప్రతిరోజూ ఏదో ఒక స్వయము కొరకు మరియు ఇతరుల కొరకు ఉల్లాస-ఉత్సాహాలతో కూడిన సంకల్పాలను చెయ్యండి. ఎలాగైతే నేటి సమయంలో వార్తాపత్రికలలో లేక చాలా స్థానాలలో ''నేటి సంకల్పము'' అని విశేషంగా వ్రాస్తారు కదా. అలాగే ప్రతిరోజూ మనసులో ఏదో ఒక ఉల్లాస-ఉత్సాహాలకు చెందిన సంకల్పాలను ఇమర్జ్రూపంలోకి తీసుకురండి. మరియు ఆ సంకల్పాలద్వారా స్వయాన్నికూడా స్వరూపులుగా తయారుచేసుకోండి మరియు ఇతరుల సేవలో కూడా ఆ సంకల్పాలను పెట్టండి, అప్పుడు ఏమవుతుంది? ఎల్లప్పుడు నూతన ఉల్లాస-ఉత్సాహాలు ఉంటాయి. ఈరోజు ఇది చెయ్యాలి, ఈరోజు ఇది చెయ్యాలి అని అనుకుంటారు. ఏదైనా విశేష ప్రోగ్రాం ఉన్నప్పుడు ఉల్లాస-ఉత్సాహాలు ఎందుకని ఉంటాయి? ఇది చేస్తాము, మళ్ళీ ఇది చేస్తాము అని ప్లాన్ను తయారుచేస్తారు కదా. దీనివలన విశేష ఉల్లాస-ఉత్సాహాలు వస్తాయి. అలాగే ప్రతిరోజూ అమృతవేళ విశేషంగా ఉల్లాస-ఉత్సాహాలతో కూడిన సంకల్పాలను చెయ్యండి. మళ్ళీ చెక్కూడా చేసుకున్నట్లయితే మీది కూడా సదాకాలమునకు ఉత్సాహము కల జీవితమౌతుంది మరియు ఉత్సాహాన్ని కలిగించేవారుగా కూడా అవుతారు. అర్థమైందా - ఏవిధంగానైతే మనోరంజన ప్రోగ్రాం ఉంటుందో అలా ఇది ప్రతిరోజూ మనసుయొక్క మనోరంజన ప్రోగ్రాంగా ఉండాలి. అచ్ఛా!

2. సదా శక్తిశాలీ స్మృతిలో ఉంటూ ఉన్నతి చెందే ఆత్మలే కదా? శక్తిశాలీ స్మృతి లేకుండా ఎటువంటి అనుభవాన్నీ చెయ్యలేరు. కనుక సదా శక్తిశాలురుగా అయ్యి ఉన్నతి చెందుతూ వెళ్ళండి. సదా తమ శక్తి అనుసారంగా ఈశ్వరీయ సేవలో మునిగిపోండి మరియు సేవ ఫలాన్ని పొందండి. ఎంత శక్తి ఉంటుందో,అంతగా దానిని సేవలో పెట్తూ వెళ్ళండి.అది తనువుద్వారానైనా, మనసుద్వారానైనా, ధనముద్వారానైనాగానీ సేవలో పెట్టండి. ఒకటికి పదమాగుణాలుగా లభించేదే ఉంది. మీకొరకు జమ చేసుకుంటారు. అనేక జన్మలకు జమ చేసుకోవాలి. ఒక్క జన్మలో జమ చేసుకోవటం వలన 21 జన్మలు కష్టపడటం నుండి ముక్తులైపోతారు. ఈ రహస్యం గురించి తెలుసు కదా! కనుక సదా మీ భవిష్యత్తును శ్రేష్ఠంగా తయారుచేసుకుంటూ వెళ్ళండి. చాలా సంతోషంగా స్వయమును సేవలో ముందుకు తీసుకువెళుతూ ఉండండి. సదా స్మృతిద్వారా ఏకరస స్థితితో ఉన్నతి చెందండి.

3. స్మృతి యొక్క సంతోషంద్వారా అనేక ఆత్మలకు సంతోషాన్ని ఇచ్చే సేవాధారులే కదా! సత్యమైన సేవాధారి అనగా సదా స్వయముకూడా లగనములో మగనమై ఉండాలి మరియు ఇతరులనుకూడా లగనములో మగనమై ఉండేటట్లు చేసేవారు. ప్రతి స్థానములోని సేవ ఎవరిది వారిది ఉంటుంది. అయినాకూడా ఒకవేళ స్వయం లక్ష్యాన్ని ఉంచుకుని ఉన్నతిని పొందినట్లయితే ఇలా ఉన్నతి చెందటమనేది అన్నింటికన్నా సంతోషకరమైన విషయము. వాస్తవానికి ఈ లౌకిక చదువు మొదలైనవన్నీ వినాశీ అయినవి, అవినాశీ ప్రాప్తికి సాధనము కేవలము ఈ జ్ఞానమే. ఇలా అనుభవము చేస్తారు కదా. చూడండి. సేవాధారులైన మీకు డ్రామాలో ఎంతటి గోల్డన్ఛాన్స్లభించిందో! ఈ గోల్డన్ఛాన్స్ను ఎంత ఎక్కువగా ముందుకు తీసుకుపోతే అంతగా మీ చేతుల్లో ఉంటుంది. ఇటువంటి గోల్డన్ఛాన్స్అందరికీ లభించదు. కోట్లలో కొద్దిమందికే లభిస్తుంది. మీకైతే లభించేసింది. ప్రపంచములో ఎవరివద్దా లేనటువంటిది మావద్ద ఉంది అన్న ఇంత సంతోషము ఉంటుందా? ఇటువంటి సంతోషములో సదా స్వయముకూడా ఉండండి మరియు ఇతరులనుకూడా తీసుకురండి. స్వయము ఎంత ఉన్నతి చెందుతారో అంతగా ఇతరుల ఉన్నతి చేస్తారు. సదా ఉన్నతి చెందేవారు, ఇటూ-అటూ చూస్తూ ఆగిపోయేవారు కాదు. ఎల్లప్పుడు బాబా మరియు సేవ ఎదురుగా ఉండాలి, ఇంతే. ఇకఎప్పుడూ ఉన్నతిని పొందుతూ ఉంటారు. సదా స్వయమును బాబాయొక్క అల్లారుముద్దు బిడ్డను అని ఇలా భావించుకుంటూ ఉండండి.

ఉద్యోగం చేసే కుమారీలతో

1. అందరి లక్ష్యమైతే శ్రేష్ఠంగా ఉంది కదా. రెండు వైపులా ఉంటాము అనైతే అనుకోవటం లేదు కదా, ఎందుకంటే ఏదైనా బంధనము ఉన్నప్పుడు రెండు వైపులా నడవటమనేది వేరే సంగతి కానీ నిర్బంధన ఆత్మలు రెండు వైపులా ఉండటము అనగా వ్రేలాడడం. ఎవరికైనా పరిస్థితులు అలా ఉన్నాయంటే బాప్దాదాకూడా అనుమతినిస్తారు, కానీ మనసు బంధనము ఉన్నట్లయితే మళ్ళీ అది వ్రేలాడడం అవుతుంది. ఒక కాలు ఇటు, ఇంకొక కాలు అటు ఉన్నట్లయితే ఏమవుతుంది? ఒకవేళ ఒక నావలో ఒక కాలు, ఇంకో నావలో ఇంకో కాలు ఉంచినట్లయితే వారి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇబ్బంది పడిపోతారు కదా కనుక రెండు కాళ్ళు ఒకే నావలో ఉండాలి. ఎల్లప్పుడు తమ ధైర్యాన్ని ఉంచండి. ధైర్యంగా ఉన్నట్లయితే సహజంగానే దాటేస్తారు. నేను ఒంటరిని కాను, నాతో బాబా ఉన్నారు అని ఎల్లప్పుడు గుర్తుంచుకున్నట్లయితే ఏ కార్యాన్ని చెయ్యాలనుకున్నా చెయ్యగలరు.

2. కుమారీలకు సంగమయుగములో విశేష పాత్ర ఉంది, అటువంటి విశేష పాత్రధారులుగా స్వయమును తయారుచేసుకున్నారా? లేక ఇప్పటివరకు సాధారణంగా ఉన్నారా? మీ విశేషత ఏంటి? సేవాధారిగా అవ్వటమే విశేషత. సేవాధారులుగా ఎవరైతే ఉంటారో వారు విశేషమైనవారు. సేవాధారులు కానట్లయితే సాధారణులైనట్లు. ఏ లక్ష్యాన్ని పెట్టుకున్నారు? సంగమయుగములోనే ఈ అవకాశము లభిస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఈ అవకాశాన్ని తీసుకోనట్లయితే మొత్తము కల్పములో ఇది లభించదు. సంగమయుగమునకే విశేష వరదానము ఉంది. లౌకిక చదువును చదువుకుంటూకూడా లగనము ఈ చదువుపై ఉన్నట్లయితే ఆ చదువు విఘ్నరూపముగా అవ్వదు. కనుక అందరూ తమ భాగ్యాన్ని తయారుచేసుకుంటూ ఉన్నతి చెందండి. మీ భాగ్యపు నషా ఎంతగా ఉంటుందో, అంతగా సహజంగా మయాజీతులుగా అయిపోతారు. ఇది ఆత్మిక నషా. సదా మీ భాగ్యమునకు చెందిన పాటలను పాడుకుంటూ ఉన్నట్లయితే అలా పాడుతూ-పాడుతూ మీ రాజ్యమునకు చేరుకుంటారు.

వరదానము:- స్వయం యొక్క సర్వ బలహీనతలను దానం యొక్క విధి ద్వారా సమాప్తంచేసే దాత, విధాతా భవ
ఏదైనా వస్తువు యొక్క లోటు ఉన్నప్పుడు దానం చేయండి అని భక్తిలో నియమం ఉంటుంది. దానం చేయడం ద్వారా ఇవ్వడము, తీసుకోవడంగా మారిపోతుంది. కావున ఏ బలహీనతనైనా సమాప్తం చేసేందుకు దాతలుగా మరియు విధాతలుగా అవ్వండి. మీరు ఇతరులకు బాబా ఖజానాను ఇచ్చేందుకు నిమిత్త ఆధారంగా అయినట్లయితే స్వతహాగానే బలహీనతల నుండి దూరమైపోతారు. మీ దాత, వరదాతా స్వరూపం యొక్క శక్తిశాలీ సంస్కారమును ఎమర్జ్చేసుకున్నట్లయితే బలహీన సంస్కారాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి.

స్లోగన్:- తమ శ్రేష్ఠ భాగ్యపు గుణగానము చేయండి, బలహీనతలను కాదు.

Friday, 28 February 2020

Telugu Murli 29/02/2020

29-02-2020 ప్రాత:మురళిఓంశాంతి"బాప్దాదా" మధువనం

'' మధురమైన పిల్లలారా - శత్రువైన మాయ మీ ముందే ఉంది కనుక మిమ్ములను మీరు చాలా చాలా సంభాళన చేసుకోవాలి. ఒకవేళ నడుస్తూ నడుస్తూ మాయలో చిక్కుకున్నారంటే మీ భాగ్యరేఖకు మీరే అడ్డుగీత గీసుకుంటారు. ''

ప్రశ్న:- రాజయోగి పిల్లలైన మీ ముఖ్యమైన కర్తవ్యము ఏది ?
జవాబు:- చదవడం మరియు చదివించడమే మీ ముఖ్యమైన కర్తవ్యము. మీరు ఈశ్వరీయ మతమును అనుసరిస్తున్నారు. మీరు అడవులలోకి వెళ్లవలసిన అవసరము లేదు. గృహస్థములో ఉంటూ శాంతిగా కూర్చొని తండ్రిని స్మృతి చేయాలి. అల్ఫ్(తండ్రి) మరియు బే(వారసత్వము) ఈ రెండు శబ్ధాలలోనే మీ చదువంతా వచ్చేస్తుంది.

ఓంశాంతి. తండ్రి కూడా పిల్లలారా! శుభోదయము(గుడ్మార్నింగ్) అని బ్రహ్మ ద్వారా చెప్పగలరు. కాని మళ్లీ పిల్లలు కూడా బదులు చెప్పవలసి ఉంటుంది. ఇది తండ్రి మరియు పిల్లల సంబంధము. కొత్తవారు వస్తే వారు పక్కా అయ్యేవరకు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. ఇది చదువు, భగవానువాచ అని కూడా వ్రాయబడి ఉంది. భగవంతుడు నిరాకారుడు. ఇతరులకు ఈ విషయం అర్థము చేయించేందుకు దీనిని బాబా బాగా పక్కా చేయిస్తారు. ఎందుకంటే ఆ వైపు మాయ తీక్షణంగా ఉంది. ఇక్కడ ఆ విషయము లేదు. తండ్రి అర్థం చేయిస్తారు - ఎవరైతే కల్పక్రితము వారసత్వము తీసుకున్నారో వారు తమంతకు తామే వచ్చేస్తారు. ఫలానావారు వెళ్లిపోకుండా వారిని పట్టుకోవాలని కాదు. వెళ్లిపోతే వెళ్లిపోనీ. ఇక్కడ జీవించి ఉంటూ మరణించాలి. తండ్రి దత్తత తీసుకుంటారు. ఏదైనా వారసత్వము ఇచ్చేందుకే దత్తత తీసుకోవడం జరుగుతుంది. పిల్లలు తల్లిదండ్రుల వద్దకు వారసత్వాన్ని తీసుకోవాలనే ఆశతోనే వస్తారు. ధనవంతుల పిల్లలు ఎప్పుడైనా పేదవారి వద్దకు దత్తతకొస్తారా! అంత ధన-సంపదలను మొదలైనవాటిని వదిలి ఎలా వెళ్తారు? ధనవంతులు దత్తత తీసుకుంటారు. తండ్రి మనకు స్వర్గ సామ్రాజ్యాన్నిస్తారని ఇప్పుడు మీకు తెలుసు. మరి తండ్రివారిగా ఎందుకు అవ్వరు? ప్రతి విషయములో ఆశ అయితే ఉంటుంది. ఎంత ఎక్కువగా చదువుతారో అంత గొప్ప ఆశ ఉంటుంది. తండ్రి మనకు అనంతమైన వారసత్వము ఇచ్చేందుకే దత్తత తీసుకున్నారని మీకు తెలుసు. మీ అందరినీ నేను మళ్లీ 5 వేల సంవత్సరాల క్రితము వలె దత్తత తీసుకుంటానని బాబా కూడా చెప్తారు. బాబా, మేము మీ వారము, 5 వేల సంవత్సరాల క్రితము కూడా మీ వారిగా అయ్యాము అని మీరు కూడా చెప్తారు. ప్రాక్టికల్గా ఎంతమంది బ్రహ్మకుమార-బ్రహ్మకుమారీలు ఉన్నారు! ప్రజాపిత కూడా ప్రసిద్ధమైనవారు. ఎంతవరకు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవ్వరో అంతవరకు దేవతలుగా అవ్వలేరు. పిల్లలైన మీ బుద్ధిలో ఇప్పుడు ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది - మేము శూద్రులుగా ఉండేవారము, ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము మళ్లీ దేవతలుగా అవ్వాలి. సత్యయుగములో మనము రాజ్యము చేస్తాము. కనుక ఈ పాత ప్రపంచము తప్పకుండా వినాశనమవ్వాలి. పూర్తి నిశ్చయము లేకుంటే వెళ్లిపోతారు. కచ్ఛాగా ఉండి పడిపోయే పిల్లలు చాలామంది ఉన్నారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. మాయ శత్రువు మీ ఎదుటే నిలిచి ఉంది. కనుక అది తనవైపు ఆకర్షిస్తుంది. మాయలో చిక్కుకోకండి. లేకుంటే మీ భాగ్యరేఖకు అడ్డుగీత గీసుకున్నవారవుతారు అని తండ్రి ఘడియ-ఘడియ పక్కా చేయిస్తారు. ఇంతకుముందు నన్ను ఎప్పుడు కలిశారు? అని తండ్రి మాత్రమే అడగగలరు. ఇతరులెవ్వరికీ అడిగే ఆలోచనే ఉండదు. గీత వినిపించేందుకు నేను కూడా మళ్లీ వచ్చి రావణుని జైలు నుండి విడిపించవలసి వచ్చింది అని తండ్రి అంటారు. అనంతమైన తండ్రి అనంతమైన విషయాలు అర్థం చేయిస్తారు. ఇప్పుడిది రావణ రాజ్యము, పతిత రాజ్యము. ఇది అర్ధకల్పము నుండి ప్రారంభమయింది. రావణునికి 10 తలలు చూపిస్తారు. విష్ణువుకు 4 భుజాలు చూపిస్తారు. అలాంటి మనుష్యులెవ్వరూ ఉండరు. ఇది ప్రవృత్త్తి మార్గానికి గుర్తుగా చూపించబడింది. ఇది ముఖ్య లక్ష్యము. విష్ణువు ద్వారా పాలన. విష్ణుపురమును కృష్ణపురము అని కూడా అంటారు. కృష్ణునికి రెండు చేతులే చూపిస్తారు కదా. మనుష్యులు ఏమీ అర్థము చేసుకోరు. తండ్రి ప్రతి విషయాన్ని అర్థము చేయిస్తారు. అదంతా భక్తిమార్గము. ఇప్పుడు మీకు జ్ఞానముంది. నరుని నుండి నారాయణునిగా అవ్వడమే మీ ముఖ్య లక్ష్యము. జీవన్ముక్తిని ప్రాప్తి చేసుకునేందుకే ఈ గీతా పాఠశాల ఉంది. ఇందులో బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము. శివుని రుద్రుడని కూడా అంటారు. జ్ఞాన-యజ్ఞము కృష్ణునిదా లేక శివునిదా? అని ఇప్పుడు తండ్రి అడుగుతున్నారు. శివుని పరమాత్మ అని అంటారు. శంకరుని దేవత అని అంటారు. వారు శివ-శంకరులను ఒకటిగా చేసేశారు. నేను ఇతనిలో ప్రవేశించానని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. పిల్లలైన మీరు బాప్దాదా అని అంటారు. వారు శివ-శంకరులని అంటారు. జ్ఞానసాగరులు ఒక్కరు మాత్రమే.

ఈ జ్ఞానము ద్వారా బ్రహ్మనే విష్ణువుగా అవుతారని ఇప్పుడు మీకు తెలుసు. చిత్రము కూడా సరిగ్గా(ఖచ్ఛితంగా) తయారు చేశారు. విష్ణువు నాభి నుండి బ్రహ్మ వెలువడ్డారు. దీని అర్థము కూడా ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మ చేతికి శాస్త్రాలు ఇచ్చారు. ఇప్పుడు శాస్త్రాల సారాన్ని తండ్రి తెలియజేస్తున్నారా లేక బ్రహ్మనా? ఇతను కూడా మాస్టర్ జ్ఞానసాగరునిగా అవుతారు. పోతే అనేక చిత్రాలు తయారుచేశారు. అవేవీ యథార్థమైనవి కావు. అవన్నీ భక్తిమార్గానికి చెందినవి. 8-10 భుజాలు కల్గిన మనుష్యులెవ్వరూ ఉండరు. ఈ చిత్రములో కేవలం ప్రవృత్తిమార్గాన్ని చూపించారు. రావణుడంటే అర్థము కూడా తెలిపించారు. అర్ధకల్పము రావణరాజ్యము రాత్రి, అర్ధకల్పము రామరాజ్యము పగలు. తండ్రి ప్రతి విషయాన్ని అర్థము చేయిస్తారు. మీరందరూ ఒకే తండ్రి సంతానము. తండ్రి బ్రహ్మ ద్వారా విష్ణుపురాన్ని స్థాపన చేస్తారు. అంతేకాక మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు. సంగమ యుగములోనే రాజయోగాన్ని నేర్పిస్తారు. ద్వాపర యుగములో గీతను వినిపించారని చెప్పడం తప్పు. తండ్రి సత్యమునే తెలిపిస్తారు. చాలామందికి బ్రహ్మ సాక్షాత్కారము, విష్ణువు సాక్షాత్కారము జరుగుతుంది. శ్వేత వస్త్రధారి అయిన బ్రహ్మనే చూస్తారు. శివబాబా బిందువు. బిందువును సాక్షాత్కారములో చూసినా ఏమీ అర్థము చేసుకోలేరు. మేము ఆత్మలము అని మీరు చెప్తారు. ఇప్పుడు ఆత్మను ఎవరు చూశారు? ఎవ్వరూ చూడలేదు. అది ఒక బిందువు. అర్థము చేసుకోగలరు కదా. ఎవరు ఏ భావనతో ఎవరిని పూజిస్తారో వారికి అదే సాక్షాత్కారము అవుతుంది. ఒకవేళ వేరే రూపాన్ని చూసినట్లయితే తికమకపడ్తారు. హనుమంతుని పూజ చేస్తే వారికి అతనే సాక్షాత్కారమవుతాడు. గణేశుని పూజారులకు గణేశుడే కనిపిస్తాడు. తండ్రి అడుగుతున్నారు - నేను మిమ్ములను ఎంత ధనవంతులుగా చేశాను! వజ్రవైఢూర్యాల భవనాలుండేవి, మీ వద్ద లెక్కలేనంత ధనముండేది. మీరు ఇప్పుడు అదంతా ఎక్కడ పోగొట్టుకున్నారు? ఇప్పుడు మీరు నిరుపేదలుగా అయిపోయారు. భిక్ష వేడుకుంటున్నారు, అడుక్కుంటున్నారని తండ్రి అనవచ్చు కదా. ఇప్పుడు తండ్రి వచ్చారని, మనము మళ్లీ విశ్వానికి అధికారులుగా అవుతామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇది అనాదిగా తయారైన డ్రామా. ప్రతి ఒక్కరూ డ్రామాలో తమ తమ పాత్రను అభినయిస్తున్నారు. ఎవరైనా ఒక శరీరాన్ని వదిలి వెళ్లి మరొక శరీరాన్ని తీసుకుంటారు. ఇందులో ఏడ్చే విషయము ఏముంది? సత్యయుగములో ఎప్పుడూ ఏడ్వరు. ఇప్పుడు మీరు మోహజీతులుగా అవుతున్నారు. ఈ లక్ష్మినారాయణులు మొదలైనవారు మోహజీత్ రాజులు. అక్కడ మోహము ఉండదు. బాబా అనేకమైన విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. తండ్రి నిరాకారులు. మనుష్యులు వారిని నామ-రూపాలకు భిన్నమైనవారని అంటారు. కానీ నామ-రూపాలు లేకుండా ఏ వస్తువూ ఉండదు. ఓ భగవంతుడా! ఓ గాడ్ఫాదర్! అని అంటారు కదా. మరి నామ-రూపాలు ఉన్నాయి కదా. లింగమును శివపరమాత్మ, శివబాబా అని కూడా అంటారు. తండ్రి తప్పకుండా ఉన్నారు కదా, తండ్రికి తప్పకుండా పిల్లలు కూడా ఉంటారు. నిరాకారుని, నిరాకార ఆత్మయే బాబా అని అంటుంది. మందిరాలకు వెళ్తే వారిని శివబాబా అని పిలుస్తారు. మళ్లీ ఇంటికి వచ్చి తండ్రిని కూడా బాబా అని పిలుస్తారు. మనము వారిని శివబాబా అని ఎందుకు అంటున్నామో అర్థము తెలియదు. తండ్రి అతిగొప్ప చదువును రెండే శబ్ధాలలో నేర్పిస్తున్నారు - ''అల్ఫ్(తండ్రి) మరియు బే(వారసత్వము).'' అల్ఫ్ను స్మృతి చేస్తే బే(సామ్రాజ్యము) మీది అవుతుంది. ఇది చాలా పెద్ద పరీక్ష. మనుష్యులు పెద్ద పరీక్షను పాస్ అయితే ముందు చదివిన చదువు ఏదీ జ్ఞాపకముండదు. చదువుతూ చదువుతూ చివరికి సారము బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఇది కూడా అలాగే. మీరు చదువుతూ వచ్చారు. చివర్లో మళ్లీ తండ్రి 'మన్మనాభవ' అని చెప్తారు. అలా చేస్తే దేహాభిమానము సమాప్తమైపోతుంది. ఈ మన్మనాభవకు అలవాటు పడ్తే చివర్లో కూడా తండ్రి మరియు ఆస్తి జ్ఞాపకము వస్తాయి. ఇదే ముఖ్యమైనది. ఎంత సహజమైనది. ఆ చదువులో కూడా ఇప్పుడు ఏమేమి చదువుతారో తెలియదు. రాజు ఎలాంటివారో అలా వారు తమ పద్ధతిని నడుపుతారు. మొదట మణుము, శేరు, పావుల లెక్క ఉండేది. ఇప్పుడు కిలో మొదలైనవి ఏమేమో వెలువడ్డాయి. ఎన్ని వేరు వేరు ప్రాంతాలైపోయాయి. ఢిల్లీలో ఏ వస్తువు శేరు, ఒక రూపాయి ఉంటుందో అది ముంబాయిలో 2 రూపాయలకు లభిస్తుంది. ఎందుకంటే ప్రాంతాలు వేరు వేరుగా ఉన్నాయి. మేము మా ప్రాంతాన్ని ఆకలితో చంపము అని ప్రతి ఒక్కరు భావిస్తారు. ఎన్ని జగడాలు మొదలైనవి జరుగుతాయి. ఎంత అల్లరి, ఎన్ని గలాటాలున్నాయి!

భారతదేశము ఎంతో సంపన్నంగా ఉండేది. మళ్లీ 84 జన్మల చక్రములో తిరుగుతూ దివాలా తీసింది. వజ్రములాంటి అమూల్యమైన జన్మను గవ్వల కొరకు పోగొట్టుకున్నావు......... అని చెప్తారు. మీరు గవ్వల కొరకు ఎందుకు ప్రాకులాడ్తారు? అని తండ్రి అంటారు. ఇప్పుడు తండ్రి నుండి వారసత్వము తీసుకోండి, పావనంగా అవ్వండి. ఓ పతితపావనా! రండి, పావనము చేయండి అని కూడా పిలుస్తారు. కనుక మొదట పావనంగా ఉండేవారము, ఇప్పుడు పావనంగా లేము అని దీని నుండి ఋజువవుతుంది. ఇప్పుడుండేది కలియుగము. నేను పావన ప్రపంచాన్ని తయారుచేస్తాను కనుక పతిత ప్రపంచము తప్పకుండా వినాశనమవుతుంది అని తండ్రి చెప్తారు. అందుకే ఈ మహాభారత యుద్ధము. అది ఈ రుద్ర జ్ఞాన యజ్ఞము ద్వారా ప్రజ్వలితమయ్యింది. ఈ వినాశనము కావడము కూడా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. ప్రారంభములో బాబాకు సాక్షాత్కారమయ్యింది. ఇంత గొప్ప రాజ్యము లభిస్తుంది అన్నప్పుడు చాలా సంతోషము కలిగింది తర్వాత వినాశనాన్ని కూడా సాక్షాత్కారము చేయించారు. మన్మనాభవ, మధ్యాజీభవ ఇవి గీతలోని పదాలు. గీతలో కొన్ని-కొన్ని పదాలు సరిగ్గా ఉన్నాయి. మీకు ఈ జ్ఞానాన్ని అర్థం చేయిస్తాను, ఇది మళ్లీ ప్రాయ: లోపమైపోతుంది అని తండ్రి కూడా చెప్తున్నారు. లక్ష్మినారాయణుల రాజ్యమున్నప్పుడు వేరే ఏ ఇతర ధర్మముండేది కాదని ఎవ్వరికీ తెలియదు. ఆ సమయంలో జన సంఖ్య ఎంత తక్కువగా ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది! కనుక ఈ పరివర్తన జరగాలి. తప్పకుండా వినాశనము కూడా అవ్వాలి. మహాభారత యుద్ధము కూడా ఉంది. భగవంతుడు కూడా తప్పకుండా ఉంటారు. శివజయంతిని ఆచరిస్తారు. అయితే శివబాబా వచ్చి ఏం చేశారో కూడా తెలియదు. గీత ద్వారా కృష్ణుని ఆత్మకు రాజ్యము లభించిందని ఇప్పుడు బాబా అర్థం చేయించారు. గీతను 'మాత-పిత' అని అంటారు. దాని ద్వారా మీరు మళ్లీ దేవతలుగా అవుతారు. అందుకే కృష్ణుడు గీతను వినిపించలేదని చిత్రములో కూడా చూపించారు. కృష్ణుడు గీతా జ్ఞానము ద్వారా రాజయోగాన్ని నేర్చుకొని ఇలా అయ్యాడు. రేపు మళ్లీ కృష్ణుడు ఉంటాడు. వారు శివబాబాకు బదులుగా కృష్ణుని పేరు వేసేశారు. కనుక తండ్రి చెప్తున్నారు - ఇది మీలో పక్కా నిశ్చయం చేసుకోండి. ఉల్టా-సుల్టా మాటలు చెప్పి ఎవ్వరూ మిమ్ములను క్రింద పడేయరాదు. వికారాలు లేకుండా సృష్టి ఎలా నడుస్తుంది? ఇది ఎలా జరుగుతుంది? అని చాలామంది ప్రశ్నిస్తారు. అరే! అది నిర్వికారి ప్రపంచము. సంపూర్ణ నిర్వికారులని మీరే స్వయంగా చెప్తారు కదా. మళ్లీ వికారాల మాట ఎలా ఉండగలదు? అనంతమైన తండ్రి నుండి అనంతమైన సామ్రాజ్యము లభిస్తుందని మీకిప్పుడు తెలుసు. మరి అలాంటి తండ్రిని ఎందుకు స్మృతి చేయరు? ఇది పతిత ప్రపంచము. కుంభమేళాకు ఎన్ని లక్షలమంది వెళ్తారు. అక్కడ ఒక నది గుప్తముగా ఉందని చెప్తారు. నది గుప్తంగా ఉండగలదా? ఇక్కడ కూడా గోముఖాన్ని తయారుచేశారు. అందులో గంగ వస్తుందని చెప్తారు. అరే! గంగ తన మార్గములో ప్రవహిస్తూ సముద్రంలోకి వెళ్తుందా లేక ఈ పర్వతము పైకి వస్తుందా? భక్తిమార్గములో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలాయి. జ్ఞానము, భక్తి తర్వాత వైరాగ్యము. ఒకటి హద్దులోని వైరాగ్యము, రెండవది అనంతమైన వైరాగ్యము. సన్యాసులు వారి ఇండ్లను వదిలి అడవులలో ఉంటారు. ఇక్కడ ఆ మాటే లేదు. మీరు బుద్ధి ద్వారా పూర్తి పాత ప్రపంచాన్ని సన్యసిస్తారు. రాజయోగి పిల్లలైన మీ ముఖ్య కర్తవ్యము చదవడము, చదివించడము. ఇప్పుడు రాజయోగము అడవులలో నేర్పించబడదు. ఇది పాఠశాల, దాని శాఖలు వెలువడుతూ ఉంటాయి. మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. శివబాబా ద్వారా చదువుకున్న బ్రాహ్మణ-బ్రాహ్మణీలు ఇతరులకు నేర్పిస్తారు. అందరికి ఒక్క శివబాబాయే కూర్చొని నేర్పించరు. ఇది పాండవ ప్రభుత్వము. మీరు ఈశ్వరీయ మతాన్ని అనుసరిస్తున్నారు. ఇక్కడ మీరు ఎంత శాంతిగా కూర్చుని ఉన్నారు! వెలుపల అనేక గలాటాలున్నాయి. తండ్రి చెప్తున్నారు - 5 వికారాలను దానము చేస్తే గ్రహణము వదిలిపోతుంది. నా వారిగా అయితే నేను మీ కోరికలన్నీ పూర్తి చేస్తాను. ఇప్పుడు మనము సుఖధామానికి వెళ్తున్నాము. దు:ఖధామానికి నిప్పు అంటుకుంటుందని పిల్లలైన మీకు తెలుసు. పిల్లలకు వినాశనము కూడా సాక్షాత్కారమయ్యింది. ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉంది కనుక స్మృతియాత్రలో తత్పరులైతే వికర్మలు వినాశనమవుతాయి. అంతేకాక ఉన్నత పదవిని పొందుతారు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. బాబా వారసత్వము పై పూర్తి అధికారాన్ని పొందేందుకు మరజీవులుగా అవ్వాలి. 'దత్తు' పుత్రులుగా అవ్వాలి. ఎప్పుడూ మీ శ్రేష్ఠ భాగ్యానికి అడ్డుగీత గీసుకోరాదు.
2. ఏ ఉల్టా-సుల్టా(తప్పుడు) మాటలు విని సంశయములోకి రాకూడదు. నిశ్చయము కొద్దిగా కూడా కదలరాదు. ఈ దు:ఖధామానికి నిప్పు అంటుకోనున్నది. కనుక దీని నుండి మీ బుద్ధియోగాన్ని తొలగించాలి.

వరదానము:- '' సమస్యలను సమాధాన రూపములోకి పరివర్తన చేసే విశ్వ కళ్యాణి భవ ''
' నేను విశ్వ కళ్యాణిని ' అనే శ్రేష్ఠ భావన, శ్రేష్ఠ కామనల సంస్కారాన్ని ఉత్పన్నము (ఎమర్జ్) చేయండి. ఈ శ్రేష్ఠ సంస్కారము ముందు హద్దు సంస్కారాలు స్వతహాగా సమాప్తమైపోతాయి. సమస్యలు సమాధాన రూపంలోకి పరివర్తనైపోతాయి. ఇప్పుడు యుద్ధము చేస్తూ సమయాన్ని పోగొట్టుకోకండి. విజయీతనపు సంస్కారాన్ని ఎమర్జ్ చేయండి. ఇప్పుడు సర్వస్వము సేవలో ఉపయోగిస్తే శ్రమ నుండి విడుదల అవుతారు. సమస్యలలోకి వెళ్లేందుకు బదులు దానమివ్వండి, వరదానమివ్వండి. అలా చేస్తే స్వయానికి పట్టిన గ్రహణం స్వతహాగా సమాప్తమైపోతుంది.

స్లోగన్:- '' ఇతరుల లోపాలను, బలహీనతలను వర్ణించేందుకు బదులు గుణ స్వరూపులుగా అవ్వండి, గుణాలనే వర్ణించండి. ''

Thursday, 27 February 2020

Telugu Murli 28/02/2020

28-02-2020 ప్రాత:మురళిఓంశాంతి"బాప్దాదా" మధువనం

'' మధురమైన పిల్లలారా - తండ్రి మీ అతిథిగా వచ్చారు, కనుక మీరు వారిని ఆదరించాలి. ఎంత ప్రేమగా పిలిచారో, అంత ఆదరము కూడా చూపాలి, నిరాదరించరాదు. ''

ప్రశ్న:- పిల్లలైన మీకు సదా ఏ నషా ఎక్కి ఉండాలి? ఒకవేళ నషా ఎక్కకుంటే వారిని ఏమంటారు?
జవాబు:- అత్యంత ఉన్నతమైన ఆసామి(గొప్ప వ్యక్తి) ఈ పతిత ప్రపంచములో మన అతిథిగా వచ్చారు. సదా ఈ నషా ఎక్కి ఉండాలి. అయితే నంబరువారుగా ఈ నషా ఎక్కుతుంది. కొందరు తండ్రి వారిగా అయ్యి కూడా సంశయబుద్ధితో వారి చేతిని వదిలి వెళ్లిపోతే అప్పుడు వీరి భాగ్యము ఇంతేనని అంటారు.

ఓంశాంతి. ఓంశాంతి అని రెండు సార్లు అనవలసి ఉంటుంది. ఒకరు బాబా, మరొకరు దాదా అని పిల్లలకు తెలుసు. ఇరువురూ కలిసి ఉన్నారు కదా. భగవంతుని ఎంతో గొప్పగా మహిమ చేస్తారు కాని గాడ్ఫాదర్ అను పదము చాలా సాధారణమైనది. కేవలం ఫాదర్ అని అనరు. గాడ్ఫాదర్ అని అంటారు. వారు అత్యంత ఉన్నతులు. వారి మహిమ కూడా చాలా ఉన్నతమైనది. వారిని పతిత ప్రపంచములోనే పిలుస్తారు. '' నన్ను పతిత ప్రపంచములోనే పిలుస్తారు '' అయితే పతిత పావనుడు ఎలా ఉంటారో, ఎప్పుడు వస్తారో ఎవ్వరికీ తెలియదని స్వయంగా వారే వచ్చి తెలియజేస్తున్నారు. అర్ధకల్పము సత్య-త్రేతా యుగాలలో ఎవరి రాజ్యముండేదో, అది వారికి ఎలా వచ్చిందో ఎవ్వరికీ తెలియదు. పతితపావనులైన తండ్రి తప్పకుండా వస్తారు. కొంతమంది వారిని పతితపావనులని, కొంతమంది ముక్తిదాత అని అంటారు. స్వర్గానికి తీసుకెళ్లండని పిలుస్తారు. వారు అందరికంటే శ్రేష్ఠమైనవారు కదా. భారతీయులైన మమ్ములను శ్రేష్ఠంగా తయారు చేయండని పతిత ప్రపంచములో వారిని పిలుస్తారు. వారి హోదా ఎంతో గొప్పది. వారికి అత్యంత పెద్ద అధికారముంది. రావణ రాజ్యమున్నప్పుడు వారిని పిలుస్తారు. లేకుంటే ఈ రావణరాజ్యము నుండి విడిపించేదెవరు? ఈ విషయాలన్నీ వింటుంటే పిల్లలైన మీకు నషా కూడా ఎంత ఎక్కి ఉండాలి! కాని అంత నషా ఎక్కడం లేదు. మద్యపాన మత్తు అందరికీ ఎక్కుతుంది. కాని ఈ మత్తు అందరికీ ఎక్కదు. ఇందులో ధారణ చేయవలసిన విషయాలు, భాగ్యానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. తండ్రి చాలా పెద్ద ఆసామి. మీలో కూడా ఏ కొందరికో పూర్తి నిశ్చయముంటుంది. ఒకవేళ అందరికీ నిశ్చయముంటే సంశయము కలిగి ఎందుకు పారిపోతారు? తండ్రిని ఎందుకు మర్చిపోతారు? లౌకికంలో తండ్రికి పిల్లలుగా అయ్యాక ఆ తండ్రి పై పిల్లలకు సంశయబుద్ధి కలగదు. కాని ఈ తండ్రి చాలా అద్భుతమైనవారు. ఆశ్చర్యపడునట్లు తండ్రిని తెలుసుకుంటారు, బాబా అని పిలుస్తారు, జ్ఞానము వింటారు, వినిపిస్తారు, వెళ్లిపోతారు........ అహో మాయ! మాయ సంశయబుద్ధి గలవారిగా చేస్తుందని గాయనము కూడా ఉంది. తండ్రి తెలిపిస్తున్నారు - ఈ భక్తిమార్గములోని శాస్త్రాలలో ఎలాంటి సారము లేదు. తండ్రి చెప్తున్నారు - నా గురించి ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీలో కూడా కష్టంగా కొందరు మాత్రమే నిలబడగలరు. ఆ స్మృతి స్థిరంగా నిలవడం లేదని మీరు కూడా అనుభవము చేస్తారు. ఆత్మలైన మనము బిందువులము, బాబా కూడా బిందువే. వారు మన అందరి తండ్రి, వారికి తమ శరీరమే లేదు. వారు చెప్తున్నారు - నేను ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకుంటాను, నా పేరు శివుడు. ఆత్మనైన నా పేరు ఎప్పుడూ మారదు. మీ శరీరాల పేర్లు మారుతూ ఉంటాయి. శరీరానికే పేరు పెట్టబడ్తుంది. వివాహము అయితే పేరు కూడా మారిపోతుంది. తర్వాత ఆ పేరును పక్కా చేసుకుంటారు కనుక ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - మేము ఆత్మలము అని పక్కా చేసుకోండి. ఎప్పుడెప్పుడు అత్యాచారాలు, గ్లాని పెరుగుతుందో అప్పుడు నేను వస్తానని తండ్రియే స్వయంగా తమ పరిచయాన్ని ఇచ్చారు. ఏ కొన్ని పదాలనో పట్టుకోరాదు. తండ్రి స్వయంగా చెప్తున్నారు - రాళ్లు, రప్పలలో ఉన్నానని చెప్పి ఎంతో గ్లాని చేస్తారు. ఎంతగానో దూషిస్తారు. అయితే ఇది కూడా కొత్త విషయమేమీ కాదు. మీరు కల్ప-కల్పము ఇలా పతితులుగా అయి నన్ను గ్లాని చేస్తారు. అలా చేసినప్పుడే నేను వస్తాను. ఇది నా కల్ప-కల్పాల పాత్ర. ఇందులో మార్పులు ఉండవు. డ్రామాలో నిర్ణయించబడింది కదా. కేవలం భారతదేశములో మాత్రమే వస్తారా? కేవలం భారతదేశము మాత్రమే స్వర్గమవుతుందా? అని మిమ్ములను కొందరు అడుగుతారు. అవును, ఇది అనాది, అవినాశి పాత్ర కదా అని చెప్పండి. తండ్రి ఎంత ఉన్నతాతి ఉన్నతమైనవారు! పతితులను పావనంగా చేసే తండ్రి చెప్తున్నారు - నన్ను ఈ పతిత ప్రపంచములోనే పిలుస్తారు. నేను సదా పవిత్రుడను. నన్ను పవిత్ర ప్రపంచములో పిలవాలి కదా! కాని పిలువరు. పావన ప్రపంచములో పిలిచే అవసరమే ఉండదు. పతిత ప్రపంచములోనే మీరు వచ్చి పావనంగా చేయమని నన్ను పిలుస్తారు. నేను ఎంత గొప్ప అతిథిని. అర్ధకల్పము నుండి నన్ను స్మృతి చేస్తూ వచ్చారు. ఇక్కడ ఎవరైనా గొప్ప వ్యక్తిని పిలిస్తే ఎక్కువలో ఎక్కువ 1-2 సంవత్సరాలు పిలుస్తారు. ఫలానా వ్యక్తి ఈ సంవత్సరము రాకుంటే మరో సంవత్సరములో వస్తాడు కాని వీరిని అర్ధకల్పము నుండి స్మృతి చేస్తూ వచ్చారు. వీరు వచ్చే పాత్ర ముందే నిర్ణయించబడింది. ఇది ఎవ్వరికీ తెలియదు. వీరు చాలా ఉన్నతోన్నతమైన తండ్రి. మనుష్యులు తండ్రిని ఒకవైపు ప్రేమతో పిలుస్తారు, మరోవైపు మహిమలో మచ్చ కూడా వేస్తారు అనగా తప్పుగా మహిమ చేస్తారు. వాస్తవానికి వీరు చాలా గొప్ప మహిమాన్వితులైన అతిథి(గెస్ట్ ఆఫ్ ఆనర్). వీరి మహిమకు మచ్చను వేశారు. అటువంటి మహిమ గలవారు రాళ్లు, రప్పలు అన్నిటిలో ఉన్నారని అనేస్తారు. ఎంత సర్వ శ్రేష్ఠ అథారిటి, ప్రేమగా పిలుస్తారు కూడా. కాని పూర్తి బుద్ధిహీనులుగా ఉన్నారు. నేను మీ తండ్రిని అని నేనే వచ్చి నా పరిచయమునిస్తాను. నన్ను గాడ్ఫాదర్ అని అంటారు. అందరూ ఎప్పుడైతే రావణుని జైలులో ఉంటారో అప్పుడే తండ్రి రావలసి వస్తుంది. ఎందుకంటే భక్తులు లేక వధువులందరూ - సీతలు, తండ్రి వరుడు - రాముడు. ఇది ఒక్క సీత విషయము కాదు. సీతలందరిని రావణుని జైలు నుండి విడిపిస్తాడు. ఇది అనంతమైన విషయము. ఇది పాత పతిత ప్రపంచము. ఇది పాతదిగా అయినందున మళ్లీ కొత్తదిగా, ఖచ్ఛితంగా అవుతుంది. ఈ శరీరము మొదలైనవైతే కొన్ని త్వరగా పాతవైపోతాయి. మరికొన్ని ఎక్కువ సమయము నడుస్తాయి. ఇది డ్రామాలో ఖచ్ఛితంగా నిర్ణయించబడి ఉంది. 5 వేల సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత మళ్లీ నేను రావలసి వస్తుంది. నేను వచ్చి నా పరిచయమునిచ్చి సృష్టిచక్ర రహస్యాన్ని అర్థం చేయిస్తాను. ఎవ్వరికీ నా పరిచయము గానీ, బ్రహ్మ-విష్ణు-శంకరుల పరిచయము గానీ లక్ష్మీనారాయణుల, సీతా-రాముల పరిచయము గానీ లేదు. డ్రామాలో ఉన్నతాతి ఉన్నతమైన పాత్రధారులు వీరే. ఇదంతా మనుష్యుల విషయమే. 8-10 భుజాలు గల మనుష్యులు ఎవ్వరూ లేరు. విష్ణువుకు 4 భుజాలు ఎందుకు చూపిస్తారు? రావణుని 10 తలలు అంటే ఏమిటి? ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. తండ్రియే వచ్చి - నేను పూర్తి ప్రపంచ ఆదిమధ్యాంతాల జ్ఞానము తెలియజేస్తారు. నేను అత్యంత గొప్ప అతిథిని, కానీ గుప్తంగా ఉన్నానని తండ్రి చెప్తున్నారు. ఇది కూడా కేవలం మీకు మాత్రమే తెలుసు. అయితే తెలుసుకున్నా మళ్లీ మర్చిపోతారు. వారిని ఎంత గౌరవించాలి, వారిని స్మృతి చేయాలి. ఆత్మ కూడా నిరాకారమే, పరమాత్మ కూడా నిరాకారులే. ఇందులో ఫోటో అవసరము కూడా లేదు. మీరు స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకొని తండ్రిని స్మృతి చేయాలి. దేహాభిమానాన్ని వదిలేయాలి. మీరు సదా అవినాశి వస్తువును చూస్తూ ఉండాలి. మీరు వినాశి దేహాన్ని ఎందుకు చూస్తారు! దేహీ-అభిమానులుగా అవ్వండి, ఇందులోనే శ్రమ ఉంది. ఎంత స్మృతిలో ఉంటారో అంత కర్మాతీత స్థితిని పొంది ఉన్నతపదవిని పొందుతారు. తండ్రి చాలా సహజమైన యోగాన్ని అనగా స్మృతిని నేర్పిస్తారు. అనేక రకాల యోగాలున్నాయి. స్మృతి అను అక్షరమే యథార్థమైనది. పరమాత్ముడైన తండ్రిని స్మృతి చేయడంలోనే శ్రమ ఉంది. మేము ఇంత సమయము స్మృతిలో ఉండినామని ఎవరో అరుదుగా సత్యాన్ని తెలియజేస్తారు. స్మృతి చేయనందున తెలిపేందుకు సిగ్గుపడ్తారు. రోజంతటిలో ఒక గంట స్మృతిలో ఉన్నామని వ్రాస్తారు. సిగ్గుపడాలి కదా. రాత్రింబవళ్లు స్మృతి చేయవలసిన తండ్రిని కేవలం ఒక గంట స్మృతి చేశాను అని అనడం ఏం బాగుంటుంది! ఇందులో చాలా గుప్తమైన శ్రమ ఉంది. బాబాను పిలుస్తారు. వారు దూరము నుండి వచ్చే అతిథి కదా. తండ్రి చెప్తున్నారు - నేను నూతన ప్రపంచములో అతిథిగా అవ్వను. పాత ప్రపంచములోనే వస్తాను. నేను వచ్చి నూతన ప్రపంచ స్థాపన చేస్తాను. ఇది పాత ప్రపంచము. ఈ విషయాలు ఎవ్వరికీ యథార్థంగా తెలియదు. నూతన ప్రపంచ ఆయువు ఎంతో కూడా తెలియదు. తండ్రి చెప్తున్నారు - నేనే వచ్చి ఈ జ్ఞానమునిస్తాను. తర్వాత డ్రామానుసారము ఈ జ్ఞానము మళ్లీ అదృశ్యమైపోతుంది. కల్పము తర్వాత ఈ పాత్ర మళ్లీ పునరావృతమవుతుంది(రిపీట్ అవుతుంది). మళ్లీ నన్ను పిలుస్తారు, ప్రతి సంవత్సరము శివజయంతిని జరుపుకుంటారు. ఎవరైతే ఇక్కడ ఉండి వెళ్లిపోతారో, వారి జయంతిని ప్రతి సంవత్సరము జరుపుకుంటూ ఉంటారు. అలాగే శివబాబా జయంతిని కూడా 12 మాసాల తర్వాత జరుపుకుంటారు. అయితే ఈ పండుగను ఎప్పటి నుండి జరుపుకుంటూ వచ్చారో ఎవ్వరికీ తెలియదు. లక్షల సంవత్సరాలని ఊరకే అంటారు. కలియుగము ఆయువును లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. తండ్రి చెప్తున్నారు - ఇది కేవలం 5 వేల సంవత్సరాల విషయమే. ఈ దేవతల రాజ్యము భారతదేశములో ఉండేది కదా. కనుక బాబా చెప్తారు - నేను భారతదేశానికి చాలా గొప్ప అతిథిని. నన్ను అర్ధకల్పము నుండి చాలా ఆహ్వానిస్తూ వచ్చారు. దు:ఖితులుగా అయినప్పుడు ఓ పతితపావనా! రండి అని నన్ను పిలుస్తారు. నేను వచ్చింది కూడా పతిత ప్రపంచములోనే. నాకు రథము కావాలి కదా. ఆత్మ అకాలమూర్తి, ఇది(భృకుటి) దాని సింహాసనము. తండ్రి కూడా అకాలమూర్తులే. వారు వచ్చి ఈ సింహాసనము పై(బ్రహ్మ భృకుటిలో) విరాజమానమవుతారు. ఇవి చాలా రమణీయమైన విషయాలు. ఇతరులెవరైనా వింటే ఆశ్చర్యచకితులవుతారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - పిల్లలూ! నా మతమును అనుసరించండి. శివబాబా మతమునిస్తున్నారని, శివబాబా మురళి నడిపిస్తున్నారని భావించండి. నేను కూడా వారి మురళి విని ఇతరులకు వినిపిస్తానని ఈ బ్రహ్మ చెప్తున్నారు. వినిపించేవారైతే వారే కదా. ఇతను నంబరువన్ పూజ్యుని నుండి మళ్లీ నంబరువన్ పూజారిగా అయ్యారు. ఇప్పుడితను ఒక పురుషార్థి. పిల్లలు ఎల్లప్పుడూ మాకు శివబాబా శ్రీమతము లభించిందని భావించాలి. ఒకవేళ ఏవైనా ఉల్టా విషయాలు వినిపించినా, వారు(శివబాబా) సుల్టా అనగా చక్కదిద్దుతారు. ఈ నిశ్చయము స్థిరంగా ఉంటే శివబాబా బాధ్యునిగా ఉంటారు. ఇది డ్రామాలో ఫిక్స్ అయ్యి ఉంది. విఘ్నాలు తప్పకుండా రావాల్సిందే. చాలా కఠినమైన విఘ్నాలు వస్తాయి. మీ పిల్లల నుండి కూడా విఘ్నాలు వస్తాయి. కనుక సదా శివబాబా అర్థం చేయిస్తున్నారని భావించండి. అప్పుడు స్మృతి ఉంటుంది. చాలామంది పిల్లలు ఈ బ్రహ్మబాబా తన మతమునిస్తున్నారని భావిస్తారు, కానీ అలా కాదు. శివబాబాయే బాధ్యుడు కానీ దేహాభిమానముంటే క్షణ-క్షణము ఈ బ్రహ్మనే చూస్తూ ఉంటారు. శివబాబా ఎంత గొప్ప అతిథి! అయినా రైల్వే అధికారులు మొదలైనవారు వారిని గుర్తించగలరా? నిరాకారుని ఎలా గుర్తించాలి లేక అర్థం చేసుకోవాలి! వారికెప్పుడూ అనారోగ్యము కలుగదు. కనుక అనారోగ్యము మొదలైన వాటికి కారణం బ్రహ్మ ఆత్మ తెలుపుతుంది. ఇతనిలో ఎవరున్నారో వారికేం తెలుసు? పిల్లలైన మీకు కూడా నంబరువారుగా తెలుసు. వారు సర్వాత్మల తండ్రి. ఇతను ప్రజాపిత అనగా మనుష్యుల తండ్రి. కనుక వీరిరువురు(బాప్దాదా) ఎంతో గొప్ప అతిథులు.

తండ్రి చెప్తున్నారు - ఏమేమి జరుగుతుందో అదంతా డ్రామాలో నిర్ణయించబడింది. నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను. డ్రామాలో రచింపబడకుంటే ఏమీ చేయలేను. మాయ కూడా చాలా శక్తివంతమైనది. డ్రామాలో రాముడు-రావణుడు ఇరువురి పాత్రలు ఉన్నాయి. డ్రామాలో రావణుడు చైతన్యంగా ఉంటే నేను కూడా డ్రామానుసారమే వస్తానని చెప్పేవాడు. ఇది సుఖ-దు:ఖముల ఆట. సుఖము కొత్త ప్రపంచములో, దు:ఖము పాత ప్రపంచములో ఉంటుంది. కొత్త ప్రపంచములో మనుష్యులు కొద్దిమంది మాత్రమే ఉంటారు. పాత ప్రపంచములో ఎంతమంది మనుష్యులున్నారు! వచ్చి పావన ప్రపంచాన్ని తయారు చేయమని పతితపావనులైన తండ్రినే పిలుస్తారు, ఎందుకంటే పావన ప్రపంచంలో చాలా సుఖముండేది. అందుకే కల్ప-కల్పమూ పిలుస్తారు. తండ్రి అందరికీ సుఖమునిచ్చి వెళ్తారు. ఇప్పుడు వారి పాత్ర పునరావృతమవుతుంది. ప్రపంచము ఎప్పుడూ పూర్తిగా సమాప్తమవ్వదు. సమాప్తమవ్వడం అసంభవం. సముద్రము కూడా ప్రపంచములో ఉంది కదా. ఇది 3వ అంతస్తు కదా. జలమయమవుతుంది, అంతా నీటిమయమవుతుంది అని అంటారు. అలా అయినా పృథ్వి అనే అంతస్తు ఉంది కదా. ఇక్కడ నీరు కూడా ఉంది కదా. ఈ పృథ్వి అనే అంతస్తు ఎప్పటికీ వినాశనమవ్వదు. ఈ అంతస్తులో నీరు కూడా ఉంది. రెండవ అంతస్తు అయిన సూక్ష్మవతనములో, మొదటి అంతస్తు అయిన మూలవతనములో నీరు ఉండదు. ఇవి అనంతమైన సృష్టిలోని మూడు అంతస్తులు. ఈ విషయాలు పిల్లలైన మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. ఇది సంతోషకరమైన విషయము. అందరికీ సంతోషంగా వినిపించండి. ఎవరు పూర్తిగా పాస్ అవుతారో వారు అనుభవించే సుఖమునే అతీంద్రియ సుఖమని మహిమ చేయబడింది. ఎవరైతే రాత్రింబవళ్లు సేవలో తత్పరులై ఉంటారో, సర్వీసే చేస్తూ ఉంటారో వారికి చాలా సంతోషముంటుంది. మనుష్యులు రాత్రి కూడా మేలుకొని ఉండే రోజులు వస్తాయి కాని ఆత్మ అలసిపోతుంది కనుక నిద్రించవలసి వస్తుంది. ఆత్మ నిద్రించినందున శరీరము కూడా నిద్రిస్తుంది. ఆత్మ నిద్రించకపోతే శరీరము కూడా నిద్రించదు. అలసిపోయేది ఆత్మయే. ఈ రోజు నేను అలసిపోయానని ఎవరు చెప్తారు? ఆత్మ చెప్తుంది. పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా ఉండాలి. ఇందులోనే శ్రమ ఉంది. తండ్రిని స్మృతి చేయకుంటే, ఆత్మాభిమానులుగా అవ్వకుంటే దేహ సంబంధీకులు మొదలైనవారు గుర్తుకొస్తారు. తండ్రి చెప్తున్నారు - మీరు అశరీరులుగా వచ్చారు, మళ్లీ అశరీరులుగానే వెళ్లాలి. ఈ దేహ సంబంధాలు మొదలైనవన్నీ మర్చిపోండి. ఈ శరీరములో ఉంటూ నన్ను స్మృతి చేస్తే సతోప్రధానంగా అవుతారు. తండ్రి ఎంత గొప్ప అథారిటి అయ్యారో పిల్లలకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తున్నారు - నేను పేదల పెన్నిధిని. అందరూ సాధారణమైనవారు. పతితపావనులైన తండ్రి వచ్చారని తెలుసుకుంటే ఎంత పెద్ద గుంపు తయారవుతుందో చెప్పలేము. గొప్ప-గొప్ప వ్యక్తులు వచ్చినప్పుడు ఎంత గుంపు తయారవుతుంది. అయితే గుప్తంగా ఉండడమే డ్రామాలో వీరి పాత్ర. పోను పోను నెమ్మది నెమ్మదిగా ప్రభావము వెలువడ్తుంది. తర్వాత మళ్లీ వినాశనమైపోతుంది. అందరూ తండ్రిని కలుసుకోలేరు. స్మృతి చేస్తారు. కనుక వారికి తండ్రి పరిచయము మాత్రము లభిస్తుంది. కాని వారు ఇక్కడకు వచ్చి చేరుకోలేరు. బంధనములో ఉన్న పిల్లలు కలుసుకోలేరు. ఎన్నో అత్యాచారాలు సహిస్తారు. వికారాలను వదలలేరు. ఈ సృష్టి ఎలా నడుస్తుంది? అని అడుగుతారు. అరే! ఈ సృష్టి భారము తండ్రి పై ఉందా లేక మీ పై ఉందా? తండ్రిని తెలుసుకుంటే తర్వాత ఇటువంటి ప్రశ్నలు అడగరు. మొదట తండ్రిని తెలుసుకోండి. తర్వాత అన్ని విషయాలు తెలుసుకుంటారు అని చెప్పండి. అర్థం చేయించేందుకు కూడా యుక్తి అవసరము. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. సదా సర్వోన్నత అథారిటి అయిన తండ్రి స్మృతిలో ఉండాలి. వినాశి దేహాన్ని చూడక ఆత్మాభిమానులుగా అయ్యే శ్రమ చేయాలి. సత్యమైన స్మృతి చార్టునుంచాలి.
2. రాత్రింబవళ్లు సేవలో తత్పరులై అపారమైన సంతోషంలో ఉండాలి. మూడు లోకాల రహస్యాన్ని అందరికీ సంతోషంగా తెలియజేయాలి. శివబాబా ఇచ్చు శ్రీమతములో దృఢమైన నిశ్చయముంచుకొని నడవాలి. ఏ విఘ్నాలు వచ్చినా భయపడరాదు. బాధ్యత శివబాబాది. అందువలన సంశయము రాకూడదు.

వరదానము:- '' సమయము మరియు సంకల్పాలను సేవలో అర్పించే మాస్టర్ విధాత, వరదాత భవ ''
ఇప్పుడు స్వంత చిన్న చిన్న విషయాల వెనుక, శరీరము వెనుక, మనసు వెనుక, సాధనాల వెనుక, సంబంధాలను నిభాయించడంలో సమయాన్ని మరియు సంకల్పాలను ఉపయోగించేందుకు బదులు వాటిని సేవలో అర్పించండి. ఈ సమర్పణ సమారోహాన్ని జరుపుకోండి. శ్వాస శ్వాసలో సేవ చేయాలనే లగ్నముండాలి. సేవలో నిమగ్నమై ఉండండి. దాని వలన సేవ పై లగ్నమున్నందున స్వ ఉన్నతి అనే గిఫ్ట్ స్వతహాగా ప్రాప్తిస్తుంది. విశ్వ కళ్యాణంలో స్వ కళ్యాణము ఇమిడి ఉంది. అందువలన నిరంతర మహాదాని, మాస్టర్ విధాత, వరదాతలుగా అవ్వండి.

స్లోగన్:- '' మీ కోరికలను తగ్గించుకుంటే సమస్యలు తగ్గిపోతాయి ''

Telugu Murli 27/02/2020

27-02-2020 ప్రాత:మురళిఓంశాంతి"బాప్దాదా" మధువనం

'' మధురమైన పిల్లలారా - తండ్రి మీకు దైవీ ధర్మాన్ని, శ్రేష్ఠ కర్మలు నేర్పిస్తున్నారు. కనుక మీ ద్వారా ఏ ఆసురీ కర్మలు జరగరాదు. బుద్ధి చాలా శుద్ధంగా ఉండాలి.''

ప్రశ్న:- దేహాభిమానములోకి వచ్చుట వలన జరిగే మొట్టమొదటి పాపము ఏది ?
జవాబు:- దేహాభిమానముంటే తండ్రి స్మృతికి బదులు దేహధారుల స్మృతి వస్తుంది. దృష్టి చెడిపోతుంది. చెడు ఆలోచనలు(సంకల్పాలు) వస్తాయి. ఇది చాలా పెద్ద పాపము. మాయ దాడి చేస్తోందని అర్థం చేసుకోవాలి. వెంటనే జాగరూకులుగా అవ్వాలి.

ఓంశాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఆత్మిక తండ్రి ఎక్కడ నుండి వచ్చారు? ఆత్మల ప్రపంచము నుండి. దానిని నిర్వాణధామము లేక శాంతిధామమని కూడా అంటారు. ఇది గీతలోని విషయము. ఈ జ్ఞానము ఎక్కడ నుండి వచ్చింది? అని మిమ్ములను అడుగుతారు. ఇది అదే గీతా జ్ఞానమని, ఇప్పుడు గీతా పాత్ర నడుస్తూ ఉందని, తండ్రి చదివిస్తున్నారని చెప్పండి. భగవానువాచ కదా. భగవంతుడైతే ఒక్కరే. వారు శాంతిసాగరులు, శాంతిధామ నివాసులు. మనము కూడా అక్కడే ఉండేవారము. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇది పతిత ప్రపంచము, పాపాత్మల తమోప్రధాన ప్రపంచము. ఆత్మలమైన మనమంతా ఈ సమయములో తమోప్రధానంగా ఉన్నామని కూడా మీకు తెలుసు. 84 జన్మల చక్రములో తిరిగి సతోప్రధానము నుండి ఇప్పుడు తమోప్రధానములోకి వచ్చాము. ఇది పాత ప్రపంచము లేక కలియుగ ప్రపంచము కదా. ఈ పేర్లన్నీ ఈ సమయములోనివే. పాత ప్రపంచము తర్వాత మళ్లీ కొత్త ప్రపంచము వస్తుంది. ప్రపంచము ఎప్పుడు పరివర్తన కావలసి ఉండినదో అప్పుడు మహాభారత యుద్ధము జరిగిందని, అప్పుడే తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పించారని కూడా భారతవాసులకు తెలుసు. కేవలం తప్పు ఎక్కడ జరిగింది? ఒకటేమో - కల్పము ఆయువును మర్చిపోయారు, రెండవది - గీతా భగవంతుని కూడా మర్చిపోయారు. కృష్ణుని గాడ్ఫాదర్ అని అనలేము. ఆత్మ గాడ్ఫాదర్ అని అంటుంది. అందువలన వారు నిరాకారులు. నిరాకార తండ్రి ఆత్మలకు చెప్తున్నారు - నన్ను స్మృతి చేయండి, నేనే పతిత పావనుడను. నన్ను మీరు ఓ పతితపావనా! అని కూడా పిలుస్తారు. కృష్ణుడు దేహధారి కదా. నాకైతే ఏ దేహమూ లేదు. నేను నిరాకారుడను. మనుష్యుల తండ్రిని కాదు, ఆత్మల తండ్రిని. ఇది పక్కా చేసుకోవాలి. క్షణ-క్షణము ఆత్మలైన మనము ఈ తండ్రి(బ్రహ్మ) ద్వారా వారసత్వము తీసుకుంటాము. ఇప్పుడు 84 జన్మలు పూర్తి అయినవి. ఇప్పుడు తండ్రి వచ్చారు కనుక బాబా, బాబా అని అంటూనే ఉండాలి. బాబాను చాలా స్మృతి చేయాలి. కల్పమంతా దేహధారి తండ్రిని స్మృతి చేశారు. ఇప్పుడు ఆత్మల తండ్రి వచ్చారు. మానవ సృష్టి నుండి సర్వ ఆత్మలను వాపసు తీసుకెళ్తారు. ఎందుకంటే రావణరాజ్యములో మనుష్యులందరూ దుర్గతిలో ఉన్నారు. కనుక ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి. ఇది రావణరాజ్యమని కూడా మనుష్యులెవ్వరికీ తెలియదు. రావణుని అర్థమే తెలియదు. కేవలం దశరా పండుగను ఆచరించే ఒక ఆచారము మాత్రము ఏర్పడింది. మీలో కూడా ఎవ్వరికీ అర్థము తెలిసేది కాదు. ఇప్పుడు ఇతరులకు అర్థం చేయించేందుకు మీకు జ్ఞానము లభించింది. ఒకవేళ ఇతరులకు అర్థం చేయించలేకుంటే స్వయం అర్థము చేసుకోలేదని భావించాలి. తండ్రిలో సృష్టి చక్ర జ్ఞానముంది. మనము వారి పిల్లలము కనుక మనలో కూడా ఈ జ్ఞానముండాలి.

ఇది మీ గీతా పాఠశాల. దీని లక్ష్యమేది? ఈ లక్ష్మినారాయణులుగా అవ్వడం. ఇది రాజయోగము కదా. ఇది నరుని నుండి నారాయణునిగా, నారి నుండి శ్రీలక్ష్మిగా అయ్యే జ్ఞానము. వారు కూర్చుని కథలు వినిపిస్తారు. ఇక్కడైతే మనము చదువుకుంటాము. మనకు తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. కల్పములోని సంగమ యుగములో నేర్పిస్తారు. తండ్రి చెప్తారు - నేను పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి కొత్త ప్రపంచాన్ని తయారు చేసేందుకు వచ్చాను. క్రొత్త ప్రపంచములో వీరి రాజ్యముండేది. పాత ప్రపంచములో ఆ రాజ్యము లేదు. మళ్లీ తప్పకుండా వస్తుంది. చక్రమునైతే తెలుసుకున్నారు. ముఖ్యమైన ధర్మాలు నాలుగు. ఇప్పుడు దైవీ ధర్మము లేనే లేదు. దైవీ ధర్మము భ్రష్ఠమైపోయింది. దైవీ కర్మలు కూడా భ్రష్ఠమైపోయాయి. ఇప్పుడు మళ్లీ మీకు శ్రేష్ఠమైన దైవీ ధర్మము, శ్రేష్ఠ కర్మలు బాబా నేర్పిస్తున్నారు. కనుక మా ద్వారా ఏ ఆసురీ కర్మలు జరగడం లేదు కదా? మాయ కారణంగా చెడు సంకల్పాలేవీ రావడం లేదు కదా? చెడు దృష్టి లేదు కదా? అని స్వయం పై గమనముంచుకోవాలి. ఎవరికైనా చెడు దృష్టి ఉండడం లేక చెడు ఆలోచనలు రావడం గమనిస్తే వారిని వెంటనే హెచ్చరించాలి. వారితో మీరు కలిసిపోరాదు. మీలో మాయ ప్రవేశించిన కారణంగా ఇలాంటి చెడు ఆలోచనలు వస్తున్నాయని వారిని హెచ్చరించాలి. యోగములో కూర్చున్నప్పుడు తండ్రి స్మృతికి బదులు ఎవరి దేహము వైపైనా ఆలోచనలు వెళ్తే మాయతో యుద్ధము జరుగుతోందని, నేను పాపము చేస్తున్నానని అర్థం చేసుకోవాలి. దీని కొరకు చాలా శుద్ధమైన, పవిత్రమైన బుద్ధి అవసరము. ఎగతాళి(వేళాకోళము) వలన కూడా చాలా నష్టము సంభవిస్తుంది కనుక మీ నోటి ద్వారా సదా శుద్ధ మాటలే వెలువడాలి. చెడు మాటలు వెలువడరాదు. వేళాకోళము మొదలైనవి కూడా చేయరాదు. తమాషాకు అన్నాను......... అని కూడా అనరాదు. అది కూడా నష్టకారకంగా అయిపోతుంది. వికారీ వాసనలు ఉండు విధంగా తమాషాలు కూడా చేసుకోరాదు. చాలా హెచ్చరికగా ఉండాలి. దిగంబరుల ఆలోచనలు వికారాల వైపుకు వెళ్లవని మీరు భావిస్తారు. వారు వేరుగానే ఉంటారు. కాని యోగము ద్వారా తప్ప కర్మేంద్రియాల చంచలత ఎప్పుడూ తొలగదు. కామ శత్రువు ఎటువంటిదంటే, యోగము సరిగ్గా లేకుంటే ఎవరినైనా చూసినప్పుడు చంచలత తప్పకుండా వస్తుంది. మిమ్ములను మీరు పరీక్ష చేసుకోవలసి ఉంటుంది. సదా తండ్రి స్మృతిలోనే ఉంటే ఇలాంటి జబ్బులేవీ ఉండవు. యోగములో ఉండడం వలన ఈ జబ్బులు రావు. సత్యయుగములో ఎలాంటి మురికి ఉండదు. చంచలమయ్యేందుకు అక్కడ రావణుని చంచలతయే ఉండదు, అక్కడ యోగి జీవితముంటుంది. ఇక్కడ కూడా స్థితి చాలా పక్కాగా ఉండాలి. యోగబలము ద్వారా ఈ జబ్బులన్నీ సమాప్తమైపోతాయి. కాని ఇందులో చాలా శ్రమ ఉంది. రాజ్యము తీసుకోవడం పిన్నమ్మ ఇల్లేమీ కాదు(సులభము కాదు). పురుషార్థమైతే చేయాలి కదా. భాగ్యములో ఏముంటే అది లభిస్తుందని భావించరాదు. ధారణే చెయ్యకుంటే పనికిరాని పదవికి అనగా చాలా చిన్నపదవికి యోగ్యులుగా అవుతారు. పాఠ్యాంశాలు చాలా ఉంటాయి కదా. కొందరు డ్రాయింగులో, కొందరు ఆటలలో మంచి మార్కులు తీసుకుంటారు. అవి సాధారణ పాఠ్యాంశాలు. అలాగే ఇక్కడ కూడా అటువంటి పాఠ్యాంశాలు ఉన్నాయి. ఏదో ఒక పదవి లభిస్తుంది కాని సామ్రాజ్యము లభించదు. సర్వీసు చేస్తే సామ్రాజ్యము లభిస్తుంది. దాని కొరకు చాలా శ్రమ చేయాలి. ఎలాగైతే అందరికీ ఆహారము జీర్ణము ఎలా అవ్వదో అలా చాలామంది బుద్ధిలో కూర్చోదు. వారికి ఉన్నత పదవి పొందే ధైర్యముండదు. దీనిని కూడా అనారోగ్యమని అంటారు కదా. మీరు ఏ విషయము చూస్తున్నా చూడనట్లు ఉండండి. ఆత్మిక తండ్రి స్మృతిలో ఉండి ఇతరులకు దారి చూపించాలి. అంధులకు ఊతకర్రగా అవ్వాలి. మీరు దారి తెలుసుకున్నారు. మహారథులుగా ఎవరుంటారో వారి బుద్ధిలో రచయిత - రచనల జ్ఞానము, ముక్తి - జీవన్ముక్తుల జ్ఞానము తిరుగుతూ ఉంటుంది. మహారథి పిల్లల స్థితిలో కూడా రాత్రికి, పగలుకు ఉన్నంత వ్యత్యాసముంటుంది. కొన్ని చోట్ల కొంతమంది చాలా ధనవంతులుగా అవుతారు, కొంతమంది చాలా పేదవారుగా అవుతారు. రాజ్య పదవిలో వ్యత్యాసముంటుంది కదా. కాని అక్కడ రావణుడు లేనందున దు:ఖముండదు. కాని సంపదలో అయితే వ్యత్యాసముంటుంది. సంపద వలన సుఖము లభిస్తుంది.

ఎంతగా యోగములో ఉంటారో, అంత ఆరోగ్యము చాలా బాగుంటుంది. కష్టపడాలి. చాలామంది నడవడికలు అజ్ఞాని మనుష్యుల వలె ఉంటాయి. అటువంటివారు ఎవ్వరికీ కళ్యాణము చెయ్యలేరు. పరీక్షలు జరిగినప్పుడు ఎవరు ఎన్ని మార్కులతో పాస్ అవుతారో తెలుస్తుంది. ఆ సమయంలో అయ్యో! అయ్యో! అని బాధపడవలసి వస్తుంది. బాప్(తండ్రి), దాదా(అన్న) ఇరువురు ఎంతగానో అర్థం చేయిస్తూ ఉంటారు. కళ్యాణము చేసేందుకే తండ్రి వచ్చారు. స్వయానికి కూడా కళ్యాణము చేసుకోవాలి, ఇతరుల కళ్యాణము కూడా చేయాలి. మీరు వచ్చి పతితులైన మాకు పావనులయ్యే మార్గాన్ని తెలపండి అని తండ్రిని పిలిచారు. కనుక తండ్రి శ్రీమతమును ఇస్తున్నారు - మీరు స్వయాన్ని ఆత్మగా భావించి దేహాభిమానము వదిలి నన్ను స్మృతి చేయండి. ఇది ఎంత సహజమైన ఔషధము. మేము కేవలం ఒక్క భగవంతుడైన తండ్రిని మాత్రమే అంగీకరిస్తాము అని ఇతరులకు చెప్పండి. వారు చెప్తున్నారు - పతితులైన మమ్ములను మీరు వచ్చి పావనంగా చేయమని నన్ను పిలిచినందున నేను రావలసి వస్తుంది. బ్రహ్మ నుండి మీకు ఏమీ లభించదు. అతను అన్న మాత్రమే, తండ్రి కాదు. తండ్రి నుండి అయితే వారసత్వము లభిస్తుంది. బ్రహ్మ నుండి వారసత్వము లభించదు. నిరాకార తండ్రి ఇతని ద్వారా ఆత్మలైన మనలను దత్తు తీసుకొని చదివిస్తారు. ఇతనిని కూడా చదివిస్తారు. బ్రహ్మ నుండి లభించేది ఏమీ లేదు. వారసత్వము ఇతని ద్వారా తండ్రి నుండే లభిస్తుంది. ఇచ్చేవారు వారొక్కరే. మహిమ వారికే ఉంది. సర్వుల సద్గతిదాత వారే. ఈ బ్రహ్మ పూజ్యుని నుండి మళ్లీ పూజారిగా అవుతాడు. సత్యయుగములో ఉండేవాడు, తర్వాత మళ్లీ 84 జన్మలను అనుభవించి ఇప్పుడు పతితమయ్యాడు. మళ్లీ పూజ్యునిగా, పావనంగా అవుతున్నాడు. మనము తండ్రి ద్వారా వింటాము. మనుష్యుల ద్వారా వినడం లేదు. మనుష్యులది భక్తిమార్గము. ఇది ఆత్మిక జ్ఞానమార్గము. జ్ఞానము కేవలం ఒక్క జ్ఞానసాగరుని వద్ద మాత్రమే ఉంది. మిగిలిన ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గములోనివి. శాస్త్రాలు మొదలైనవి చదవడము - ఇవన్నీ భక్తి మార్గములోని సాంప్రదాయాలు. జ్ఞానసాగరులు ఒక్క తండ్రి మాత్రమే. జ్ఞాన నదులైన మనము జ్ఞానసాగరము నుండి వెలువడిన వారము. అక్కడ ఉండేది నీటి సాగరము, నీటి నదులు. పిల్లలకు ఈ విషయాలన్నీ గుర్తుండాలి. అంతర్ముఖులుగా అయి బుద్ధిని నడిపించాలి. స్వయాన్ని సరిజేసుకునేందుకు అంతర్ముఖులై స్వయాన్ని చెక్ చేసుకోండి. ఒకవేళ నోటి నుండి ఏవైనా చెడు మాటలు వెలువడినా లేక చెడు దృష్టి కలిగినా వెంటనే మా నోటి నుండి చెడు మాటలు ఎందుకు వచ్చాయి? మాకు చెడు దృష్టి ఎందుకు కలిగింది? అని స్వయానికి చీవాట్లు పెట్టుకోవాలి. తమకు తామే చెంపదెబ్బలు కూడా వేసుకోవాలి, క్షణ-క్షణము హెచ్చరించుకోవాలి. అప్పుడే ఉన్నతపదవి పొందగలరు. నోటి ద్వారా కటు వచనాలు వెలువడరాదు. తండ్రి అయితే అన్ని రకాలైన శిక్షణలను ఇవ్వవలసి ఉంటుంది. ఎవరినైనా పిచ్చివాడు అనడం కూడా చెడు వచనమే.

మనుష్యులు ఎవరి గురించి అయినా ఏది తోస్తే అది అంటూ ఉంటారు. ఎవరిని మహిమ చేస్తున్నామో కకూడా తెలియదు. పతితపావనుడైన ఒక్క తండ్రిని మాత్రమే మహిమ చేయాలి. వారు తప్ప వేరెవ్వరూ లేరు. బ్రహ్మ-విష్ణు-శంకరులను కూడా పతితపావనులని అనరు. వారు ఎవ్వరినీ పావనంగా చెయ్యరు. పతితుల నుండి పావనంగా చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. పావన సృష్టి అంటేనే నూతన ప్రపంచము. అది ఇప్పుడు లేనే లేదు. పవిత్రత స్వర్గములో మాత్రమే ఉంటుంది. పవిత్రతా సాగరులు కూడా ఉన్నారు. ఇదంతా రావణ రాజ్యమే. పిల్లలు ఇప్పుడు ఆత్మాభిమానులుగా అయ్యేందుకు చాలా శ్రమ చేయాలి. నోటి ద్వారా ఎలాంటి రాళ్లు లేక చెడు వచనాలు వెలువడరాదు. చాలా ప్రీతిగా నడుచుకోవాలి. చెడు దృష్టి కూడా చాలా నష్టపరుస్తుంది. చాలా శ్రమ అవసరము. ఆత్మాభిమానము అవినాశి అభిమానము. దేహమైతే వినాశి. ఆత్మను గురించి ఎవ్వరికీ తెలియదు. ఆత్మకు కూడా ఎవరో తండ్రి తప్పకుండా ఉంటారు కదా. అందరూ సోదరులే(భాయి-భాయి) అని కూడా అంటారు. మరి అందరిలో పరమాత్ముడైన తండ్రి ఎలా విరాజమానమై ఉంటారు? అందరూ తండ్రులు ఎలా అవ్వగలరు? ఇంత మాత్రము తెలివి కూడా లేదు! సర్వుల తండ్రి ఒక్కరే. వారి నుండే వారసత్వము లభిస్తుంది. వారి పేరు శివుడు. శివరాత్రి కూడా జరుపుకుంటారు, రుద్ర రాత్రి లేక కృష్ణ రాత్రి అని అనరు. మనుష్యులు కొంచెము కూడా అర్థము చేసుకోరు. ఇవన్నీ వారి రూపాలే, వారి లీలే, అంతా వారిదే అని అంటారు.

అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వము లభిస్తుంది కనుక ఆ తండ్రి శ్రీమతమును అనుసరించాలని ఇప్పుడు మీకు తెలుసు. నన్ను స్మృతి చేయండని తండ్రి చెప్తారు. కూలీలకు(లేబర్) కూడా శిక్షణ ఇవ్వాలి. అప్పుడు వారికి కూడా కొంత కళ్యాణము జరుగుతుంది. కాని స్వయం మీరే స్మృతి చేయలేకుంటే ఇతరులకు స్మృతి ఎలా ఇప్పించగలరు? రావణుడు పూర్తి పతితులుగా తయారు చేస్తాడు మళ్లీ తండ్రి వచ్చి స్వర్గంగా చేస్తారు. ఆశ్చర్యము కదా. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు. ఈ లక్ష్మినారాయణులు ఎంత శ్రేష్ఠమైన దేవతల నుండి మళ్లీ ఎంత పతితులుగా అవుతారు! అందుకే బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి అని మహిమ చేయబడింది. శివాలయాలలో మీరు చాలా సర్వీసు చేయవచ్చు. తండ్రి చెప్తున్నారు - గడప, గడప వెతకడం వదిలేసి మీరు తండ్రిని స్మృతి చేయండి అని అందరికీ చెప్పండి. ఈ జ్ఞానమే శాంతి కలిగించేది. తండ్రిని స్మృతి చేయడం వలన మీరు సతోప్రధానులుగా అవుతారు. ఈ మంత్రమునే అందరికీ ఇస్తూ ఉండండి. పక్కా అయినంత వరకు ఎవరి వద్దా ధనము తీసుకోకండి. అందరికీ ఇలా చెప్పండి - మీరు పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయండి, అప్పుడు మీ చేతితో భోంచేస్తాము, మీ వద్ద ఏమైనా తీసుకుంటాము. భారతదేశములో మందిరాలైతే అనేకం ఉన్నాయి(అందులో సేవ చేయండి). విదేశీయులు మొదలైనవారు ఎవరు వచ్చినా తండ్రిని స్మృతి చేయండి అను సందేశాన్ని ఇవ్వవచ్చు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఎప్పుడు కూడా వికారాల వాసన ఉండే వేళాకోళము చేయరాదు. నోటి నుండి కటువచనాలు వెలువడకుండా స్వయం పై చాలా గమనము ఉంచుకోవాలి.
2. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు చాలా చాలా అభ్యాసము చేయాలి. అందరితో ప్రేమగా వ్యవహరించాలి. చెడు దృష్టి ఉంచుకోరాదు. చెడు దృష్టి కలిగినట్లయితే మీకు మీరే శిక్ష విధించుకోవాలి.

వరదానము:- '' గౌరవం అడుక్కునే బదులు గౌరవం ఇచ్చే సదా నిష్కామ యోగీ భవ ''
మీకు ఎవరైనా గౌరవమిచ్చినా, ఇవ్వకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా మీరు వారిని మధురమైన సోదరునిగా, మధురమైన సోదరిగా అంగీకరించి సదా స్వమానంలో ఉండి, స్నేహయుక్త దృష్టితో, స్నేహ వృత్తితో ఆత్మిక గౌరవమిస్తూ ఉండండి. వీరు నన్ను గౌరవిస్తే నేను గౌరవిస్తానని అనుకోవడం కూడా రాయల్ భికారితనము. ఇది వదిలి మీరు నిష్కామ యోగులుగా అవ్వండి. ఆత్మిక స్నేహమనే వర్షము ద్వారా శత్రువును కూడా మిత్రునిగా చేసుకోండి. మీ ముందు ఎవరైనా రాళ్లు వేసినా మీరు వారికి రత్నాలనివ్వండి. ఎందుకంటే మీరు రత్నాగరుడైన తండ్రి పిల్లలు.

స్లోగన్:- '' విశ్వ నవ నిర్మాణము చేసేందుకు రెండు మాటలు గుర్తుంచుకోండి - నిమిత్తం మరియు నిర్మానం (నిరహంకారత) ''

Sunday, 23 February 2020

Telugu Murli 24/02/2020

24-02-2020 ప్రాత:మురళిఓంశాంతి"బాప్దాదా" మధువనం

'' మధురమైన పిల్లలారా - మీరు చాలా పెద్ద వజ్రాల వ్యాపారులు, మీరు అవినాశి జ్ఞాన రత్నాలనే సంపదనిచ్చి అందరినీ శ్రీమంతులుగా చేయాలి ''

ప్రశ్న:- మీ జీవితాన్ని వజ్ర సమానంగా చేసుకునేందుకు ఏ విషయము గురించి చాలా చాలా జాగ్రత్త వహించాలి ?
జవాబు:- సాంగత్య విషయములో పిల్లలు చాలా హెచ్చరికగా ఉండాలి. ఎవరైతే బాగా వర్షిస్తారో, పిల్లలు వారి సాంగత్యములోనే ఉండాలి. ఎవరు వర్షించరో, వారి సాంగత్యములో ఉండడం వలన లాభమేముంది! సాంగత్య దోషము చాలా ఉంటుంది. కొందరి సాంగత్యము ద్వారా వజ్ర సమానంగా అవుతారు, కొందరి సాంగత్యము ద్వారా రాయి సమానంగా అవుతారు. ఎవరు జ్ఞానవంతులై ఉంటారో వారు ఇతరులను తప్పకుండా తమ సమానంగా చేస్తారు. చెడు సాంగత్యము నుండి తమను తాము సంభాళన చేసుకుంటారు.

ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఈ సమస్త సృష్టి మరియు మొత్తం డ్రామాల జ్ఞానము చాలా బాగా బుద్ధిలో గుర్తుంది. వ్యత్యాసము కూడా బుద్ధిలో ఉంది. సత్యయుగములో అందరూ శ్రేష్ఠాచారులుగా, నిర్వికారులుగా, పావనంగా, సంపన్నంగా ఉండేవారని బుద్ధిలో పక్కాగా ఉండాలి. ఇప్పుడు ప్రపంచము భ్రష్ఠాచారిగా, వికారిగా, పతితంగా, భికారిగా ఉంది. ఇప్పుడు పిల్లలైన మీరు సంగమ యుగములో ఉన్నారు. మీరు ఆ తీరానికి వెళ్తున్నారు. నది, సాగరాల మిలనము ఎక్కడ జరుగుతుందో దానిని 'సంగమము' అని అంటారు. ఒకవైపు మంచినీరు, మరొక వైపు ఉప్పునీరు ఉంటాయి. ఇప్పుడిది కూడా సంగమమే. సత్యయుగములో లక్ష్ష్మినారాయణుల రాజ్యముండేది తర్వాత చక్రము ఎలా తిరిగిందో మీకు తెలుసు. ఇది సంగమ సమయము. కలియుగాంతములో అందరూ దు:ఖితులుగా ఉన్నారు. దీనిని అడవి అని అంటారు. సత్యయుగాన్ని పుష్పాల తోట అని అంటారు. ఇప్పుడు మీరు ముళ్ల నుండి పుష్పాలుగా అవుతున్నారు. ఈ స్మృతి పిల్లలైన మీకు ఉండాలి. మేము అనంతమైన తండ్రి నుండి వారసత్వము తీసుకుంటున్నామనే స్మృతి బుద్ధిలో ఉంచుకోవాలి. 84 జన్మల కథ చాలా సాధారణమైనది. సులభంగా అర్థము చేసుకోవచ్చు. ఇప్పుడు 84 జన్మలు పూర్తి అయ్యాయని మీరు అర్థము చేసుకున్నారు. మనము ఇప్పుడు సత్యయుగమనే తోటలోకి వెళ్తున్నామని మీ బుద్ధిలో తాజాగా ఉంది. ఇప్పుడు మన జన్మ మృత్యులోకములో జరగదు, అమరలోకములో జన్మ తీసుకుంటాము. శివబాబాను అమరనాథుడని కూడా అంటారు. వారు మనకు అమరకథను వినిపిస్తున్నారు. అక్కడ మనము శరీరములో ఉంటున్నా అమరులుగా ఉంటాము. సమయం వచ్చినప్పుడు సంతోషంగా శరీరాలను వదిలేస్తాము. దానిని మృత్యులోకమని అనరు. మీరు ఈ విషయాలు ఎవరికైనా అర్థం చేయిస్తే వీరిలో పూర్తి జ్ఞానముందని భావిస్తారు. సృష్టికి ఆదిమధ్యాంతాలు ఉన్నాయి కదా. చిన్న బిడ్డ కూడా యువకునిగా, వృద్ధునిగా అవుతాడు తర్వాత అంతిమ సమయము వచ్చేస్తుంది. మళ్లీ చిన్నబిడ్డగా అవుతాడు. సృష్టి కూడా మొదట కొత్తదిగా ఉంటుంది, తర్వాత 1/4 భాగము పాతదిగా, తర్వాత 1/2 భాగము పాతదిగా తర్వాత పూర్తి పాతదిగా అయిపోతుంది. మళ్లీ కొత్తదిగా అవుతుంది. ఈ విషయాలన్నీ వేరెవ్వరూ ఇతరులకు అర్థం చేయించలేరు. ఇలాంటి చర్చ ఎవ్వరూ చెయ్యలేరు. బ్రాహ్మణులైన మీకు తప్ప వేరెవ్వరికీ ఆత్మిక జ్ఞానము లభించదు. బ్రాహ్మణ వర్ణము(కులము)లో వచ్చినప్పుడే వినగలరు. ఈ విషయాలు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే తెలుసు. బ్రాహ్మణులలో కూడా నంబరువారుగా ఉన్నారు. కొందరు యథార్థ రీతిగా అర్థం చేయించగలరు, కొందరు అర్థం చేయించలేరు. కనుక వారికి ఏమీ లభించదు. వజ్రాల వ్యాపారులలో కూడా కొందరి వద్ద కోట్ల రూపాయలు విలువ చేసే రత్నాలుంటాయి. కొందరి వద్ద పది వేల రూపాయలు విలువ చేసే రత్నాలు కూడా ఉండవు. మీలో కూడా అలాగే ఉన్నారు. ఉదాహరణకు ఈ జనక్(జానకి దాది) మంచి వజ్రాల వ్యాపారి. ఈమె వద్ద అమూల్యమైన రత్నాల రాశి ఉంది. ఎవరికైనా ఇచ్చి వారిని మంచి ధనవంతులుగా చేయగలదు. కొందరు చిన్న వజ్రాల వ్యాపారులుగా ఉంటారు. వారు ఎక్కువగా ఇవ్వలేరు. కనుక వారి పదవి కూడా తగ్గిపోతుంది. మీరందరూ వజ్రాల వ్యాపారులు. ఇది అవినాశి జ్ఞాన రత్నాల మణుల రాశి. ఎవరి వద్ద మంచి రత్నాలుంటాయో, వారు శ్రీమంతులుగా అవుతారు, ఇతరులను కూడా అలా చేస్తారు. అందరూ మంచి వజ్రాల వ్యాపారులుగా అవుతారని కాదు. మంచి-మంచి రత్నాలను ఇవ్వగలిగినవారిని పెద్ద పెద్ద సేవాకేంద్రాలకు పంపిస్తారు. గొప్ప వ్యక్తులకు మంచి-మంచి రత్నాల రాశి ఇవ్వబడ్తుంది. పెద్ద పెద్ద దుకాణాలలో మంచి వజ్రాల నిపుణులు ఉంటారు. బాబాను కూడా సౌదాగర్(వ్యాపారి), రత్నాగర్(రత్నాల వ్యాపారి) అని అంటారు. వారు రత్నాల వ్యాపారము చేస్తారు, బాబా ఇంద్రజాలికుడు కూడా అయ్యారు. ఎందుకంటే వారి వద్దనే దివ్యదృష్టి అను తాళంచెవి ఉంది. ఎవరైనా నవవిధ(తీవ్రమైన) భక్తి చేస్తే వారికి సాక్షాత్కారాలు అవుతాయి. ఇక్కడ అలాంటి విషయాలేవీ లేవు. ఇక్కడ అనాయాసంగా ఇంట్లో కూర్చొని ఉన్నా చాలామందికి సాక్షాత్కారాలవుతాయి. రోజురోజుకు సహజమవుతూ ఉంటుంది. కొంతమందికి బ్రహ్మ సాక్షాత్కారము, కృష్ణుని సాక్షాత్కారాలు కూడా అవుతాయి. ''బ్రహ్మ వద్దకు వెళ్లండి, వెళ్లి వారి వద్ద రాకుమారులుగా అయ్యే చదువును చదువుకోండి'' అని వారికి సాక్షాత్కారములో చెప్తారు. ఈ పవిత్రమైన రాకుమార-రాకుమారీలు ఉంటారు కదా. రాకుమారుని పవిత్రమైన వారు అని కూడా అనవచ్చు. పవిత్రత ద్వారా జన్మ జరుగుతుంది కదా. పతితులను భ్రష్ఠాచారులని అంటారు. పతితుల నుండి పావనులుగా అవ్వాలి. ఇది బుద్ధిలో ఉండాలి. దీనిని ఇతరులకు కూడా అర్థం చేయించగలగాలి. వీరు చాలా వివేకవంతులని మనుష్యులు భావిస్తారు. మా వద్ద ఏ శాస్త్రాలు మొదలైన వాటి జ్ఞానము లేదు, ఇది ఆత్మిక జ్ఞానము, దీనిని ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారని వారికి చెప్పండి. వీరు త్రిమూర్తులు అంటే బ్రహ్మ-విష్ణు-శంకరులు. వీరు కూడా వారి రచనయే. రచయిత ఒక్క తండ్రి మాత్రమే. వారు హద్దులోని రచయితలు(తండ్రులు). కాని వీరు అనంతమైన తండ్రి, అనంతమైన రచయిత. బాబా కూర్చుని చదివిస్తారు. శ్రమపడవలసి ఉంటుంది. బాబా సుగంధ పుష్పాలుగా తయారుచేస్తారు. మీరు ఈశ్వరీయ కులానికి చెందినవారు. బాబా మిమ్ములను పవిత్రంగా చేస్తారు. మళ్లీ ఒకవేళ అపవిత్రంగా అయితే కులకళంకితులుగా అవుతారు. బాబాకు తెలుస్తుంది కదా. తర్వాత ధర్మరాజు ద్వారా చాలా శిక్షలనిప్పిస్తారు. వారు తండ్రితో పాటు ధర్మరాజు కూడా. ధర్మరాజు కర్తవ్యము కూడా ఇప్పుడు పూర్తి అవుతుంది. సత్యయుగములో ఉండనే ఉండదు. మళ్లీ ద్వాపరము నుండి ప్రారంభమవుతుంది. బాబా కూర్చొని కర్మ-అకర్మ-వికర్మల గతిని అర్థం చేయిస్తున్నారు. వీరు వెనుకటి జన్మలో అటువంటి కర్మ చేసిన కారణంగా ఇప్పుడు దానిని అనుభవిస్తున్నారు అని అంటారు కదా. సత్యయుగములో అలా అనరు. చెడు కర్మల నామ-రూపాలు కూడా అక్కడ ఉండవు. ఇక్కడ మంచి-చెడు రెండూ ఉన్నాయి, సుఖ-దు:ఖాలు రెండూ ఉన్నాయి కాని సుఖము చాలా తక్కువగా ఉంది. అక్కడ దు:ఖానికి నామ-రూపాలే ఉండవు. సత్యయుగములో దు:ఖము ఎక్కడ నుండి వస్తుంది! మీరు బాబా నుండి నూతన ప్రపంచ వారసత్వాన్ని తీసుకుంటారు. బాబా దు:ఖహర్త-సుఖకర్త. దు:ఖము ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో కూడా మీకు తెలుసు. శాస్త్రాలలో కల్పము ఆయువును చాలా ఎక్కువగా వ్రాసేశారు. అర్ధకల్పము మన దు:ఖము హరించబడ్తుంది. మనము సుఖాన్ని పొందుతాము అని ఇప్పుడు మీకు తెలుసు. ఈ సృష్టిచక్రము ఎలా తిరుగుతుందో అర్థం చేయించడం చాలా సహజము. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో తప్ప వేరెవ్వరి బుద్ధిలోనూ ఉండవు. లక్షల సంవత్సరాలని చెప్పడం వలన అన్ని విషయాలు బుద్ధి నుండి తొలగిపోతాయి.

ఇది 5 వేల సంవత్సరాల చక్రమని ఇప్పుడు మీకు తెలుసు. ఈ సూర్యవంశీ - చంద్ర వంశీయుల రాజ్యము ఉండేదనే విషయము నిన్నటిది. బ్రాహ్మణుల పగలు అని అంటారు కాని శివబాబా పగలు అని అనరు. బ్రాహ్మణుల పగలు, బ్రాహ్మణుల రాత్రి. బ్రాహ్మణులు తర్వాత భక్తిమార్గములోకి వస్తారు. ఇది సంగమ సమయము. పగలూ కాదు, రాత్రీ కాదు. బ్రాహ్మణులమైన మనము దేవతలుగా అవుతాము, మళ్లీ త్రేతాయుగంలో క్షత్రియులుగా అవుతామని మీకు తెలుసు. ఇది బుద్ధిలో బాగా గుర్తుంచుకోండి. ఈ విషయాలు ఇతరులెవ్వరికీ తెలియదు. శాస్త్రాలలో ఇంత ఆయువని వ్రాశారు, మీరు ఈ లెక్క ఎక్కడి నుండి తెచ్చారు? అని వారు అడుగుతారు. ఇది తయారైన అనాది డ్రామా అని ఎవ్వరికీ తెలియదు. అర్ధకల్పము సత్య, త్రేతా యుగాలు, మళ్లీ అర్ధము నుండి భక్తి ప్రారంభమౌతుందని మీ బుద్ధిలో ఉంది. అది త్రేతా, ద్వాపర యుగాల సంగమమవుతుంది. ద్వాపరంలో కూడా ఈ శాస్త్రాలు మొదలైనవి నెమ్మది నెమ్మదిగా తయారవుతాయి. వృక్షము ఎలాగైతే పెద్దదిగా, పొడవుగా ఉంటుందో అలా భక్తిమార్గ సామాగ్రి చాలా ఎక్కువగా ఉంటుంది. దీని బీజము బాబాయే. ఇది తలక్రిందులుగా ఉన్న వృక్షము. మొట్టమొదట ఆది సనాతన దేవీదేవతా ధర్మము ఉంటుంది. బాబా అర్థం చేయించే ఈ విషయాలు పూర్తి నూతనమైనవి. ఈ దేవీదేవతా ధర్మ స్థాపకుని గురించి ఎవ్వరికీ తెలియదు. కృష్ణుడు చిన్న బాలుడు. జ్ఞానము వినిపించేవారు తండ్రి. తండ్రి పేరుకు బదులు కొడుకు పేరు వేసేశారు. కృష్ణుని చరిత్రను చూపించారు. లీలలు కృష్ణునివి కాదు అని బాబా చెప్తారు. ఓ ప్రభూ, నీ లీలలు అపారమని గానము చేస్తారు. లీలలు ఒక్కరివే ఉంటాయి. శివబాబా మహిమ చాలా భిన్నమైనది. వారు సదా పావనులు. కాని వారు పావన శరీరములో రాలేరు. పతిత ప్రపంచాన్ని పావనంగా చేయండి అని వారినే పిలుస్తారు. కనుక నేను కూడా పతిత ప్రపంచములోనే రావలసి ఉంటుందని, ఇతని అనేక జన్మల అంతిమములో వచ్చి ప్రవేశిస్తానని తండ్రి చెప్తున్నారు. కనుక ముఖ్యమైన విషయము - బాబాను స్మృతి చేయడం మిగిలినదంతా ప్రాముఖ్యత లేని విస్తారమని తండ్రి చెప్తారు. అందరూ ధారణ చేయలేరు. ఎవరు ధారణ చేయగలరో వారికి అర్థము చేయిస్తాను. పోతే ముఖ్యమైనది 'మన్మనాభవ' అని చెప్తాను. బుద్ధి నంబరువారుగా ఉంటుంది కదా. కొన్ని మేఘాలు బాగా వర్షిస్తాయి, కొన్ని కొద్దిగా వర్షించి వెళ్లిపోతాయి. మీరు కూడా మేఘాల వంటి వారే కదా. కొందరు అసలు వర్షించనే వర్షించరు. జ్ఞానాన్ని నింపుకునే శక్తి ఉండదు. మమ్మా, బాబా మంచి మేఘాలు కదా. ఎవరు బాగా వర్షిస్తారో పిల్లలు వారి సాంగత్యంలో ఉండాలి. ఎవరు వర్షించరో వారి సాంగత్యంలో ఉండడం వలన ఏం జరుగుతుంది? సాంగత్య దోషము కూడా చాలా ఉంటుంది. కొందరి సాంగత్యము ద్వారా వజ్ర సమానంగా అవుతారు. కొందరి సాంగత్యము ద్వారా రాయి సమానంగా అవుతారు. మంచి వారి వెనుక వెనుకనే ఉండాలి. ఎవరు జ్ఞానవంతులై ఉంటారో వారు తమ సమానం పుష్పాలుగా చేస్తారు. సత్యమైన తండ్రి ద్వారా ఎవరైతే జ్ఞానవంతులుగా, యోగులుగా అయ్యారో వారి సాంగత్యంలో ఉండాలి. అలాగని మేము ఫలానా వారి తోక పట్టుకొని తీరానికి చేరుకుంటామని భావించకండి. ఇలా చాలామంది అంటారు. కాని ఇక్కడ అలాంటి మాటేమీ లేదు. విద్యార్థి ఎవరి తోకనైనా పట్టుకోవడం వలన పాస్ అవుతాడా! చదవవలసి ఉంటుంది కదా. తండ్రి కూడా వచ్చి జ్ఞానాన్నిస్తారు. ఈ సమయంలో జ్ఞానమునివ్వాలని వారికి తెలుసు. భక్తిమార్గములో నేను వెళ్లి జ్ఞానాన్ని ఇవ్వాలి అని వారి బుద్ధిలో ఉండదు. ఇదంతా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. బాబా ఏమీ చేయరు. డ్రామాలో దివ్యదృష్టి లభించే పాత్ర ఉంటే సాక్షాత్కారమవుతుంది. అలాగని నేను కూర్చొని సాక్షాత్కారము చేయిస్తానని అనుకోకండి. ఇది డ్రామాలో నిర్ణయించబడి ఉంది. ఎవరన్నా దేవీ సాక్షాత్కారము అవ్వాలనుకుంటే ఆ దేవి వచ్చి చేయించదు కదా. ఓ భగవంతుడా! మాకు సాక్షాత్కారము చేయించండి అని అడుగుతారు. డ్రామాలో నిర్ణయించబడి ఉంటే తప్పకుండా జరుగుతుంది, నేను కూడా డ్రామాలో బంధితుడనై ఉన్నానని బాబా చెప్తారు.

బాబా చెప్తున్నారు - నేను ఈ సృష్టిలోకి వచ్చి ఉన్నాను, ఇతని నోటి ద్వారా నేను మాట్లాడ్తున్నాను, ఇతని కళ్ల ద్వారా మిమ్ములను చూస్తున్నాను. ఒకవేళ ఈ శరీరము లేకుంటే ఎలా చూడగలను? పతిత ప్రపంచములోనే నేను రావలసి ఉంటుంది. స్వర్గములో నన్ను పిలువనే పిలువరు. నన్ను సంగమ యుగములోనే పిలుస్తారు. ఎప్పుడైతే సంగమ యుగములో వచ్చి శరీరాన్ని తీసుకుంటానో అప్పుడే చూస్తాను. నిరాకార రూపంలో ఏమీ చూడలేను. అవయవాలు లేకుండా ఆత్మ ఏమీ చేయలేదు. శరీరము లేకుండా నేను ఎలా చూడగలను, శబ్ధము ఎలా చెయ్యగలను? అని తండ్రి అంటారు. ఈశ్వరుడు అన్నీ చూస్తారు, అన్నీ చేస్తారని వారు అంటారు. ఇది గుడ్డి నమ్మకము. మరి ఎలా చూడగలరు? ఎప్పుడైతే అవయవాలు లభిస్తాయో అప్పుడే చూడగలరు కదా. మంచి పనులు గాని, చెడు పనులు గాని అందరూ డ్రామానుసారము చేస్తారని, అంతా నిర్ణయించబడి ఉందని బాబా చెప్తారు. నేను ఇన్ని కోట్లమంది మనుష్యుల లెక్కాచారాలను చూస్తానా? నాకు శరీరమున్నప్పుడే ఏదైనా చేయగలను. చేసి చేయించేవారని కూడా అప్పుడే అంటారు. లేకుంటే అలా అనలేరు. నేను ఎప్పుడు వీరిలో వస్తానో అప్పుడే పావనంగా చేస్తాను. ఆత్మ పైన ఉన్నప్పుడు ఏమి చేస్తుంది? శరీరము ద్వారానే పాత్రను అభినయము చేస్తుంది కదా. నేను కూడా ఇక్కడకు వచ్చి పాత్రను అభినయిస్తాను. సత్యయుగములో నా పాత్ర లేదు. పాత్ర లేకుండా ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. శరీరము లేకుండా ఆత్మ ఏమీ చెయ్యలేదు. ఆత్మను పిలవడం జరుగుతుంది. అది కూడా శరీరములోకి వచ్చే మాట్లాడ్తుంది కదా. అవయవాలు లేకుండా ఏమీ చెయ్యలేదు. ఇది విస్తృతమైన వివరణ. బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యడమే ముఖ్యమైన విషయము. అనంతమైన తండ్రి ఇంత శ్రేష్ఠమైనవారు, వారి నుండి ఆస్తి ఎప్పుడు లభిస్తుందో ఎవ్వరికీ తెలియదు. దు:ఖాన్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి(దు:ఖహర్త-సుఖకర్త) అని పిలుస్తారు. కాని అది ఎప్పుడో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు కొత్త విషయాలు వింటున్నారు. మేము అమరులుగా అవుతున్నాము, అమరలోకానికి వెళ్తున్నామని మీకిప్పుడు తెలుసు. మీరు అమరలోకానికి ఎన్నిసార్లు వెళ్లారు - అనేకసార్లు. దీనికి ఎప్పుడూ అంతము ఉండదు. మోక్షము లభించదా? అని చాలామంది అడుగుతారు. లభించదు అని వారికి చెప్పండి. ఇది అనాది అవినాశి డ్రామా. ఇది ఎప్పుడూ వినాశనమవ్వదు. ఈ అనాది చక్రము సదా తిరుగుతూనే ఉంటుంది. ఈ సమమంలో వీరు సత్యమైన సాహెబ్(ప్రభువు)ను తెలుసుకున్నారు. మీరు సన్యాసులు కదా. ఆ ఫకీరులు(బైరాగులు) కాదు. సన్యాసులను కూడా ఫకీరులని అంటారు. మీరు రాజఋషులు, ఋషులను సన్యాసులని అంటారు. ఇప్పుడు మళ్లీ మీరు ధనవంతులుగా అవుతారు. భారతదేశము ఎంత సంపన్నభరితంగా ఉండేది. ఇప్పుడు ఎలా పేదదిగా అయిపోయింది! అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన వారసత్వమునిస్తారు. బాబా మీరు ఏం ఇస్తారో, అది ఎవరూ ఇవ్వలేరు, మీరు మమ్ములను విశ్వాధికారులుగా చేస్తారు, దానిని ఎవరూ దోచుకోలేరు అని పాట కూడా ఉంది. ఇలాంటి పాటలను తయారు చేసేవారు అర్థమును గురించి ఆలోచించరు. అక్కడ విభజనలు మొదలైనవి ఏవీ ఉండవని మీకు తెలుసు. ఇక్కడ ఎన్ని విభజనలున్నాయి. అక్కడ భూమి, ఆకాశము అన్నీ మీవిగా ఉంటాయి. కనుక పిల్లలకు అంత ఖుషీ ఉండాలి కదా. శివబాబా అర్థం చేయిస్తున్నారని సదా గుర్తుంచుకోండి ఎందుకంటే వారు ఎప్పుడూ శెలవు తీసుకోరు. ఎప్పుడూ అనారోగ్యము పాలు అవ్వరు. శివబాబా స్మృతియే ఉండాలి. వారిని నిరహంకారులని అంటారు. నేను ఇది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అని అహంకారము రాకూడదు. సర్వీసు చేయడం మీ కర్తవ్యము, ఇందులో అహంకారము రాకూడదు. అహంకారము వస్తే క్రింద పడిపోతారు. సర్వీసు చేస్తూ ఉండండి. ఇది ఆత్మిక సేవ. మిగిలినదంతా దైహికమైనవి. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి చదివించిన దానికి ప్రతిఫలంగా సుగంధ పుష్పాలుగా అయి చూపించాలి, శ్రమ పడాలి. ఎప్పుడూ ఈశ్వరీయ కులము పేరును పాడు చేయరాదు. ఎవరైతే జ్ఞానవంతులుగా, యోగులుగా ఉంటారో వారి సాంగతములోనే ఉండాలి.
2. నేను (మై పన్/అహంకారము) త్యాగము చేసి నిరహంకారులుగా అయి ఆత్మిక సేవ చేయాలి. ఇది మా కర్తవ్యమని భావించాలి. అహంకారములోకి రాకూడదు.

వరదానము:- '' మీ ఫరిస్తా రూపము ద్వారా అందరికి వారసత్వ అధికారమునిప్పించే ఆకర్షణ మూర్త్ భవ ''
ఎటువంటి ఫరిస్తా స్వరూప చమ్కీలీ డ్రస్సును ధరించాలంటే దూర దూరాలలో ఉన్న ఆత్మలను మీ వైపు ఆకర్షించాలి. అంతేకాక అందరినీ భికారితనము నుండి విడిపించి వారసత్వానికి అధికారులుగా చేయాలి. అందుకు జ్ఞానమూర్తులు, స్మృతిమూర్తులు మరియు సర్వ దివ్యగుణ మూర్తులుగా అయి ఎగిరేకళలో స్థితమై ఉండే అభ్యాసాన్ని పెంచుతూ ఉండండి. మీ ఎగిరేకళయే అందరికి నడస్తూ తిరుగుతూ ఉన్న ఫరిస్తాల నుండి దేవతా స్వరూపాన్ని సాక్షాత్కారము చేయిస్తుంది. ఇదే వరదాత స్థితి.

స్లోగన్:- '' ఇతరుల మనోభావాలను తెలుసుకునేందుకు సదా మన్మనాభవ స్థితిలో స్థితమై ఉండండి.''

Saturday, 22 February 2020

Telugu Murli 23/02/2020

23-02-2020 ప్రాత:మురళిఓంశాంతి'బాప్దాదా' 27-11-1985

'' పాత ప్రపంచాన్ని మరియు పాత సంస్కారాలను మరపింపజేసేందుకు ఉపాయము ''
బాప్దాదా నిశ్చయబుద్ధి గల పిల్లలందరి నిశ్చయముతో కూడిన ప్రత్యక్ష జీవన స్వరూపాన్ని చూస్తున్నారు. నిశ్చయబుద్ధి గలవారి విశేషతలను అందరూ విన్నారు. అటువంటి విశేషతలతో సంపన్నమైన నిశ్చయం గల విజయీ రత్నాలు ఈ బ్రాహ్మణ జీవితంలో లేక పురుషోత్తమ సంగమయుగ జీవితంలో సదా నిశ్చయమనుసారంగా ఆ నషాలో ఉంటారు. ఆత్మిక నషా నిశ్చయానికి దర్పణం వంటిది. నిశ్చయం కేవలం బుద్ధిలో స్మృతి వరకే కాదు, ప్రతి అడుగులో, ఆత్మిక నషా రూపంలో, కర్మ ద్వారా ప్రత్యక్ష రూపంలో స్వయానికి కూడా అనుభవమవుతుంది, అలాగే ఇతరులకు కూడా అనుభవమవుతుంది. ఎందుకంటే ఇది జ్ఞానము మరియు యోగాలతో నిండిన జీవితము. ఇది కేవలం వినడం, వినిపించడం వరకు కాదు, జీవితాన్ని ఆ విధంగా తయారు చేసుకునేది. జీవితంలో స్మృతి అనగా సంకల్పాలు, మాటలు, కర్మలు, సంబంధాలు అన్నీ వచ్చేస్తాయి. నిశ్చయబుద్ధి అనగా నషాతో కూడుకున్న జీవితము. అటువంటి ఆత్మిక నషా గల ఆత్మల ప్రతి సంకల్పము, సదా నషాతో సంపన్నంగా ఉంటుంది. సంకల్పాలు, మాటలు, కర్మలు ఈ మూడింటి ద్వారా నిశ్చయము యొక్క నషా అనుభవమవుతుంది. నషా ఎలా ఉంటుందో అలా సంతోషము యొక్క మెరుపు ముఖము ద్వారా, నడవడిక ద్వారా ప్రత్యక్షమవుతుంది. నిశ్చయానికి గుర్తు నషా, నషాకు గుర్తు సంతోషము. నషా ఎన్ని రకాలుగా ఉంటుంది? దీని విస్తారము చాలా పెద్దది. కాని సార రూపంలో ఒకటేమో అశరీరి ఆత్మిక స్వరూప నషా. దీని విస్తారము గురించి తెలుసా? అందరూ ఆత్మలే కాని, ఎప్పుడైతే 'నేను ఎటువంటి ఆత్మను' అన్నది స్మృతిలో ఉంచుకుంటారో అప్పుడు ఆ ఆత్మిక నషా అనుభవమవుతుంది. దీని విస్తారాన్ని మరింతగా పరస్పరం చర్చించి వెలికి తీయండి లేక స్వయమే మననం చేయండి.

ఇంకొక నషా యొక్క విశేష రూపము - సంగమ యుగములోని అలౌకిక జీవితము. ఈ జీవితములో కూడా ఎటువంటి జీవితముంది. దీని విస్తారాన్ని గురించి కూడా ఆలోచించండి. కావున ఒకటేమో ఆత్మిక స్వరూపముతో నిండిన నషా. రెండవది అలౌకిక జీవితము యొక్క నషా. మూడవది ఫరిస్తా తనపు నషా. ఫరిస్తా అని ఎవరిని అంటారో దాని విస్తారాన్ని కూడా ఆలోచించండి. నాల్గవది భవిష్యత్తును గురించిన నషా. ఈ నాలుగు రకాల అలౌకిక నషాలలో ఏ ఒక్క నషా జీవితంలో ఉన్నా స్వతహాగానే సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు. నిశ్చయం కూడా ఉంది కాని సంతోషము లేదు. అందుకు కారణమేమి? నషా లేదు. నషా సహజంగానే పాత ప్రపంచాన్ని, పాత సంస్కారాలను మరపింపజేస్తుంది. ఈ పురుషార్థి జీవితంలో విశేషంగా ఈ రెండు విషయాలే విఘ్నరూపంగా అవుతాయి. పాత ప్రపంచమైనా కావచ్చు లేక పాత సంస్కారాలైనా కావచ్చు. ప్రపంచమన్నప్పుడు అందులో దేహ సంబంధాలు, దేహ పదార్థాలు రెండూ వచ్చేస్తాయి. వాటితో పాటు ప్రపంచం కంటే పాత సంస్కారాలు ఎక్కువగా విఘ్నరూపాలుగా అవుతాయి. ప్రపంచాన్ని మర్చిపోతారు కాని సంస్కారాలను మర్చిపోరు. కనుక సంస్కారాలను పరివర్తన చేసుకునేందుకు సాధనం ఈ నాలుగు నషాలలో ఏదో ఒక నషా సాకార స్వరూపంలో ఉండాలి. కేవలం సంకల్ప స్వరూపంలో కాదు, సాకార స్వరూపంలో ఉండడం ద్వారా ఎప్పుడూ విఘ్న రూపంగా అవ్వరు. ఇప్పటి వరకు సంస్కారాలు పరివర్తన అవ్వనందుకు కారణం ఇదే. ఈ నషాలను సంకల్ప రూపంలో అనగా జ్ఞానం రూపంలో బుద్ధి వరకు ధారణ చేశారు. కావున ఎప్పుడైనా కొంతమంది పాత సంస్కారము ప్రత్యక్షమవుతుంది, అప్పుడు 'నాకు అన్నీ అర్థం అవుతాయి' అన్న భాషను వాడ్తారు. మారాలి అని కూడా భావిస్తారు. కాని అది కేవలం అర్థం చేసుకునేంత వరకు కాదు, కర్మ అనగా జీవితం వరకు ఉండాలి. జీవితం ద్వారా పరివర్తన అనుభవంలోకి రావాలి. దీనినే సాకార స్వరూపంలోకి రావడం అని అంటారు. ఇప్పుడు బుద్ధి వరకు పాయింట్ల రూపం వరకు ఆలోచించడం మరియు వర్ణన చేయడం వరకు ఉంది కాని ప్రతి కర్మలో, సంపర్కంలో పరివర్తన కనిపించాలి. దీనినే సాకార రూపంలో అలౌకిక నషా అని అంటారు. ఇప్పుడిక ప్రతి నషాను మీ జీవితంలోకి తీసుకు రండి. ఎవరైనా మీ మస్తకం వైపు చూసినట్లయితే మస్తకం ద్వారా ఆత్మిక నషా యొక్క వృత్తి అనుభవమవ్వాలి. ఎవరైనా వర్ణన చేసినా, చేయకున్నా వృత్తి, వాయుమండలాన్ని వైబ్రేషన్లను వ్యాపింపజేస్తుంది. మీ వృత్తి ఇతరులకు కూడా సంతోషంతో కూడిన వాయుమండలంలో, సంతోషపు వైబ్రేషన్లను అనుభవం చేయించాలి. దీనినే నషాలో స్థితులవ్వడమని అంటారు. అలాగే దృష్టి ద్వారా, ముఖము నుండి మందహాసము ద్వారా, నోటి మాటల ద్వారా ఆత్మిక నషా యొక్క సాకార రూపము అనుభవమవ్వాలి. అప్పుడే నషాలో ఉండే నిశ్చయ బుద్ధి గల విజయీ రత్నాలని పిలవబడ్తారు. ఇందులో గుప్తంగా ఉండరాదు. కొంతమంది మేము గుప్తంగా ఉన్నామని అంటూ చతురత కూడా చూపిస్తారు. సూర్యుని ఎప్పుడూ ఎవ్వరూ దాచలేరు అన్న నానుడి ఉంది కదా! ఎంత దట్టమైన మేఘాలు అడ్డు వచ్చినా సూర్యుడు ఎప్పుడూ తన ప్రకాశాన్ని వదలజాలడు. సూర్యుడు తప్పుకుంటాడా లేక మేఘాలు తప్పుకుంటాయా? మేఘాలు వస్తాయి, తొలగిపోతాయి. కాని సూర్యుడు తన ప్రకాశ స్వరూపంలో స్థిరమై ఉంటాడు. కావున ఆత్మిక నషా గలవారు కూడా ఆత్మిక ప్రకాశము నుండి దాగి ఉండజాలరు. వారి ఆత్మిక నషా యొక్క ప్రకాశము ప్రత్యక్ష రూపంలో తప్పకుండా అనుభవమవుతుంది. వారి వైబ్రేషన్లు స్వతహాగానే ఇతరులను ఆకర్షిస్తాయి. ఆత్మిక నషాలో ఉండేవారి వైబ్రేషన్లు స్వయం పట్ల లేక ఇతరుల పట్ల ఛత్రఛాయగా పని చేస్తాయి. కావున ఇప్పడు ఏం చేయాలి? సాకారంలోకి రండి. జ్ఞానం లెక్కలో నాలెడ్జ్ఫుల్గా అయ్యారు. కాని జ్ఞానాన్ని సాకార జీవితంలోకి తీసుకురావడం ద్వారా నాలెడ్జ్ఫుల్గా అవ్వడంతో పాటు సఫలతా సంపన్నులు(సక్సెస్ఫుల్)గా, ఆనంద స్వరూపులుగా(బ్లిస్ఫుల్) అనుభవం చేస్తారు. మంచిది. సక్సెస్ఫుల్ మరియు బ్లిస్ఫుల్ అంటే ఏమిటో ఇంకోసారి వినిపిస్తాము.

ఈ రోజు ఆత్మిక నషా అనే విషయాన్ని వినిపిస్తున్నారు. అందరికీ నషా అనుభవమవ్వాలి. ఈ నాలుగు నషాలలో ఒక నషాను భిన్న-భిన్న రూపాలలో ఉపయోగించండి. ఎంతగా ఈ నషాను జీవితంలో అనుభవం చేసుకుంటారో అంతగా సదా అన్ని చింతల నుండి అతీతంగా నిశ్చింత మహారాజులుగా అవుతారు. అందరూ మిమ్ములను నిశ్చింత మహారాజు రూపంలో చూస్తారు. కావున ఇప్పుడు విస్తారంలోకి తేవాలి లేక అభ్యాసంలోకి తీసుకు రావాలి. ఎక్కడ సంతోషముంటుందో అక్కడ మాయ యొక్క ఏ యుక్తులు నడవజాలవు. నిశ్చింత మహారాజుల రాజ్యంలోకి మాయ రాజాలదు. అది వస్తుంది, మీరు తరిమేస్తారు, మళ్లీ వస్తుంది, మళ్లీ తరిమేస్తారు. ఒకసారి దైహిక రూపంలో వస్తుంది. దీనినే మాయ ఒకసారి ఏనుగు రూపంలో వస్తే, మరొకసారి పిల్లిగా అయి వస్తుంది. మరొకసారి ఎలుకలా అయి వస్తుందని అంటారు. ఒకసారి ఎలుకను తీస్తే, ఇంకొకసారి పిల్లిని తీయవలసి వస్తుంది. ఇలా తరిమేయడంలోనే సమయము గడిచిపోతూ ఉంటుంది. కావున సదా ఆత్మిక నషాలో ఉండండి. మొదట స్వయాన్ని ప్రత్యక్షం చేసుకోండి. అప్పుడే తండ్రిని ప్రత్యక్షం చేయగలరు. ఎందుకంటే మీ ద్వారానే తండ్రి ప్రత్యక్షమవ్వాలి. మంచిది.

సదా స్వయం ద్వారా సర్వశక్తివంతుని ప్రత్యక్షం చేసేవారికి, సదా తమ సాకార జీవితమనే దర్పణం ద్వారా ఆత్మిక నషా యొక్క విశేషతను ప్రత్యక్షం చేసేవారికి, సదా నిశ్చింత మహారాజుగా అయి మాయకు వీడ్కోలు చెప్పేవారికి, సదా జ్ఞానాన్ని స్వరూపంలోకి తీసుకొచ్చేవారికి, ఇటువంటి నషాలో ఉండే నిశ్చయ బుద్ధిగలవారికి, సదా సంతోషంలో ఎగిరేవారికి, ఇటువంటి శ్రేష్ఠ ఆత్మలకు, విశేష ఆత్మలకు బాప్దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.

సేవాధారి(టీచర్) అక్కయ్యలతో :- సేవాధారులు అనగా తమ శక్తుల ద్వారా ఇతరులను కూడా శక్తిశాలిగా చేసేవారు. ఇదే సేవాధారుల వాస్తవిక విశేషత. బలహీనులలో బలము(శక్తి) నింపేందుకు నిమిత్తంగా అవ్వడమే సత్యమైన సేవ. ఇటువంటి సేవ చేసే పాత్ర లభించడం కూడా హీరో పాత్రయే! కావున హీరో పాత్రధారులు ఎంత నషాలో ఉంటున్నారు? సేవ చేసే పాత్ర ద్వారా ఎంతగా మీ నెంబరును ముందుకు తీసుకెళ్లాలనుకుంటే అంతగా తీసుకెళ్లగలరు. ఎందుకంటే సేవ ముందుకు వెళ్లే సాధనము. సేవలో బిజీగా ఉండడం వలన స్వతహాగానే అన్ని విషయాల నుండి దూరమవుతారు. ప్రతి సేవాస్థానము ఒక స్టేజ్, ఆ స్టేజ్ పైన ప్రతి ఆత్మ తమ పాత్రను అభినయిస్తోంది. సాధనాలైతే ఎన్నో ఉన్నాయి కాని సాధనాలలో శక్తి ఉండాలి. ఒకవేళ శక్తి లేకుండా సాధనాలను వినియోగించినట్లయితే సేవలో రిజల్టు ఏదైతే వెలువడాలో అది వెలువడదు. పూర్వం వీరులు సదా తమ శస్త్రాలను దేవతల ముందు అర్పణ చేసి అందులో శక్తిని నింపుకొని ఆ తర్వాత ఉపయోగించేవారు. కావున మీరందరు కూడా ఏ సాధనమునైనా ఉపయోగించే ముందు అదే విధి పూర్వకంగా కార్యంలో ఉపయోగిస్తున్నారా? ఇప్పుడు మీరు ఏ సాధనాలనైతే కార్యంలో ఉపయోగిస్తారో వాటి ద్వారా కొంత సమయం వరకు జనులు ఆకర్షితులవుతారు. కాని సదాకాలికంగా ప్రభావితులవ్వరు. ఎందుకంటే ఇంతమంది శక్తిశాలి ఆత్మలెవరైతే శక్తి ద్వారా పరివర్తన చేసి చూపించారో వారు నెంబరువారిగా ఉన్నారు. సేవనైతే అందరూ చేస్తున్నారు. అందరి పేర్లు టీచర్లే. సేవాధారులైనా లేక టీచర్లు అయినా సేవలో తేడా ఏముంది? ప్రోగ్రామ్ను కూడా ఒక్కటే తయారు చేస్తారు. ప్లాను కూడా ఒకేలా చేస్తారు. ఆచార వ్యవహారాలు కూడా ఒకే విధంగా ఉంటాయి. అయినా సఫలతలో తేడా వచ్చేస్తుంది. అందుకు కారణమేది? శక్తి లోపము. కావున సాధనాలలో శక్తిని నింపండి. ఎలాగైతే ఖడ్గంలో ఒకవేళ పదును లేకపోతే ఖడ్గము ఖడ్గములా పనిచేయదో అలా సాధనాలు ఖడ్గము వంటివి. వాటిలో శక్తి రూపీ పదును కావాలి. దానిని ఎంతగా మీలో నింపుకుంటూ ఉంటారో అంతగా సేవలో స్వతహాగానే సఫలత లభిస్తుంది. కావున శక్తిశాలి సేవాధారులుగా అవ్వండి. సదా విధి ద్వారా వృద్ధిని ప్రాప్తించుకోవడం ఇది కూడా పెద్ద విషయమేమీ కాదు. కానీ శక్తిశాలి ఆత్మలు వృద్ధిని పొందాలి. దీని కోసం విశేష అటెన్షన్ ఉంచండి. క్వాలిటీని తయారు చేయండి. క్వాంటిటీ అయితే ఇంకా ఎక్కువగా వస్తుంది. క్వాలిటీ పైన ధ్యానముంచండి. క్వాలిటీ ద్వారానే నెంబరు లభిస్తుంది, కాని క్వాంటిటీ ద్వారా కాదు. క్వాలిటీ గలవారు ఒక్కరైనా100 మంది క్వాంటిటీతో సమానము.

కుమారులతో :- కుమారులు ఏ అద్భుతం చేస్తున్నారు? విధ్వంసం చేసేవారైతే కాదు కదా! అద్భుతం చేసేందుకు శక్తిశాలిగా అవ్వండి, శక్తిశాలిగా తయారు చెయ్యండి. శక్తిశాలిగా అయ్యేందుకు సదా మీ 'మాస్టర్ సర్వశక్తివాన్' టైటిల్ను స్మృతిలో ఉంచుకోండి. ఎక్కడైతే శక్తి ఉంటుందో అక్కడ మాయ నుండి ముక్తి కలుగుతుంది. ఎంతగా స్వయం పైన అటెన్షన్ ఉంటుందో అంతగా సేవ పై కూడా అటెన్షన్ ఉంటుంది. ఒకవేళ స్వయం పట్ల అటెన్షన్ లేకుంటే సేవలో శక్తి నిండదు. కావున సదా స్వయాన్ని సఫలతా స్వరూపులుగా చేసుకునేందుకు శక్తిశాలి అభ్యాసముతో సాధనాలను తయారు చేయాలి. సదా అభివృద్ధి జరుగుతూ ఉండే ఏదైనా ప్రోగ్రామ్ను విశేషంగా తయారుచేయండి. మొదట స్వ ఉన్నతికి కార్యక్రమాన్ని తయారు చేయండి. ఆ తర్వాత సేవ సహజంగా జరుగుతుంది, అంతేకాక సఫలత కూడా లభిస్తుంది. కుమార్ జీవితము భాగ్యవంతమైన జీవితము. ఎందుకంటే మీరు అనేక బంధనాల నుండి రక్షింపబడ్డారు. లేకపోతే గృహస్థ జీవితంలో ఎన్ని బంధనాలున్నాయి! కావున ఇటువంటి భాగ్యవంతులుగా అయ్యే ఆత్మలు ఎప్పుడూ తమ భాగ్యాన్ని మర్చిపోవడం లేదు కదా! సదా స్వయాన్ని శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మలుగా భావిస్తూ ఇతరుల భాగ్యరేఖను కూడా మీరు దిద్దాలి. ఎవరైతే నిర్బంధనులుగా ఉంటారో వారు స్వతహాగానే ఎగిరేకళ ద్వారా ముందుకు వెళ్తూ ఉంటారు. అందుకే కుమార్ మరియు కుమారీ జీవితము బాప్దాదాకు ప్రియంగా అనిపిస్తుంది. గృహస్థ జీవితము బంధనయుక్తమైనది, కుమార జీవితము బంధనముక్తమైనది. కావున నిర్బంధన ఆత్మలుగా అయి ఇతరులను కూడా నిర్బంధనులుగా తయారుచేయండి. కుమార్ అనగా సదా సేవ మరియు స్మృతుల బ్యాలెన్సును ఉంచేవారు. బ్యాలెన్సు ఉన్నట్లయితే సదా ఎగిరేకళలో ఉంటారు. ఎవరికైతే బ్యాలెన్సు ఉండడం తెలుసో వారు ఎప్పుడూ ఏ పరిస్థితిలోను క్రిందకి, పైకి అవ్వజాలరు.

అధర్ కుమారులతో :- అందరూ తమ జీవితం యొక్క ప్రత్యక్ష ప్రమాణం ద్వారా సేవ చేసేవారే కదా! అన్నిటి కంటే చాలా పెద్ద ప్రత్యక్ష ప్రమాణం మీ అందరి జీవితంలోని పరివర్తన. వినేవారిని, వినిపించేవారినైతే ఎందరినో చూశారు. ఇప్పుడు అందరూ చూడాలనుకుంటున్నారు, వినాలనుకోవడం లేదు. కావున సదా ఎప్పుడు ఏ కర్మ చేసినా '' ఏ కర్మను మేము చేస్తున్నామో అందులో ఎటువంటి పరివర్తన ఉండాలంటే దాన్ని చూసి ఇతరులు పరివర్తన చెందాలి '' అనే లక్ష్యముంచుకోండి. దీని ద్వారా స్వయమూ సంతుష్టంగా(తృప్తిగా) మరియు సంతోషంగా ఉంటారు, అలాగే ఇతరుల కళ్యాణము కూడా చేస్తారు. కావున ప్రతి కర్మను సేవార్థము చెయ్యండి. నా ప్రతి కర్మ సేవార్థమే అన్న స్మృతి ఉన్నట్లయితే స్వతహాగానే శ్రేష్ఠ కర్మలే చేస్తారు. స్వ పరివర్తన ద్వారా ఇతరులను పరివర్తన చేయాలని గుర్తుంచుకోండి. ఈ సేవ సహజమే కాక శ్రేష్ఠమైనది కూడా. ఇది నోటి ద్వారా ప్రసంగించడమే కాక జీవితం ద్వారా కూడా ప్రసంగించడమవుతుంది. ఇటువంటి వారినే సేవాధారులని అంటారు. సదా తమ దృష్టి ద్వారా ఇతరుల దృష్టిని మార్చే సేవాధారులు. దృష్టి ఎంత శక్తిశాలిగా ఉంటుందో అంతగా అనేమందిని పరివర్తన చేయగలరు. సదా దృష్టి మరియు శ్రేష్ఠ కర్మల ద్వారా ఇతరుల సేవ చేసేందుకు నిమిత్తులుగా అవ్వండి.

2. ఎలా ఉండేవారు ఎలా అయిపోయారు! ఇది సదా స్మృతిలో ఉంచుకుంటున్నారా! ఈ స్మృతిలో ఉండడం ద్వారా ఎప్పుడూ పాత సంస్కారాలు ఉత్పన్నమవ్వవు. దీనికి తోడు భవిష్యత్తులో ఎలా అవ్వనున్నారో కూడా గుర్తుంచుకుంటే వర్తమానము మరియు భవిష్యత్తు శ్రేష్ఠంగా ఉన్న కారణంగా సంతోషము ఉంటుంది, సంతోషంగా ఉండడం ద్వారా సదా ముందుకు వెళ్తూ ఉంటారు. వర్తమాన మరియు భవిష్య ప్రపంచం శ్రేష్ఠంగా ఉంటే ఆ శ్రేష్ఠత ముందు దు:ఖమయమైన ప్రపంచమేదైతే ఉందో అది గుర్తుకు రాదు. సదా మీ ఈ అనంతమైన పరివారాన్ని చూస్తూ సంతోషిస్తూ ఉండండి. ఇటువంటి భాగ్యవంతమైన పరివారము లభిస్తుందని ఎప్పుడైనా స్వప్నంలోనైనా అనుకున్నారా? కాని సాకారంలో అన్నీ చూస్తున్నారు, అనుభవం చేస్తున్నారు. ఇటువంటి పరివారము, ఐకమత్యంతో ఉన్న పరివారము, ఎంతో పెద్ద పరివారము ఇది మొత్తం కల్పంలో ఇప్పుడే ఉంటుంది. సత్యయుగంలో కూడా చిన్న పరివారమే ఉంటుంది. కావున బాప్దాదాను, పరివారమును చూసి సంతోషము కలుగుతుంది కదా! ఈ పరివారము ప్రియంగా అనిపిస్తుంది కదా? ఎందుకంటే ఇక్కడ స్వార్థ భావము లేదు. ఎవరైతే ఇటువంటి పరివారానికి చెందినవారిగా అవుతారో వారు భవిష్యత్తులో కూడా పరస్పరం సమీపంలోకి వస్తారు. సదా ఈ ఈశ్వరీయ పరివారము యొక్క విశేషతలను చూస్తూ ముందుకు వెళుతూ ఉండండి.

కుమారీలతో :- కుమారీలందరు స్వయాన్ని విశ్వకళ్యాణకారులుగా భావిస్తూ ముందుకు వెళ్తున్నారా? ఈ స్మృతి సదా సమర్థంగా తయారు చేస్తుంది. కుమారీ జీవితము సమర్థ జీవితము. కుమారీలు స్వయం సమర్థులుగా అయ్యి ఇతరులను కూడా సమర్థంగా చేసేవారు. వ్యర్థానికి సదాకాలికంగా వీడ్కోలు ఇచ్చేవారు. కుమారీ జీవితము యొక్క భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకొని ముందుకు వెళ్తూ ఉండండి. సంగమ యుగములో కుమారీలుగా అయ్యారు, ఇది కూడా ఎంతో పెద్ద భాగ్యము. కుమారీలు తమ జీవితం ద్వారా ఇతరుల జీవితాలను తయారు చేయువారు అంతేకాక బాబా తోడుగా ఉండేవారు. సదా స్వయాన్ని శక్తిశాలిగా అనుభవం చేసుకుని ఇతరులను కూడా శక్తిశాలిగా తయారు చేసేవారు. సదా శ్రేష్ఠమైన ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ ఉండరాదు. ఇటువంటి నషాలో ప్రతి అడుగు ముందుకు వేసేవారు. కావున మీరు ఇటువంటి కూమారీలే కదా!

ప్రశ్న :- ఏ విశేషత లేక గుణము ద్వారా అందరికి ప్రియంగా అవ్వగలరు?

జవాబు :- అతీతంగా మరియు ప్రియంగా ఉండే గుణము లేక నిస్సంకల్పంగా ఉండే విశేషత ఏదైతే ఉందో ఆ విశేషత ద్వారా అందరికి ప్రియంగా అవ్వగలరు. ప్రేమ భావము ద్వారా అందరి మనసులోని ప్రేమ స్వతహాగా ప్రాప్తిస్తుంది. ఈ విశేషత ద్వారా సఫలను పొందగలరు.

వరదానము:- '' సర్వ సమస్యలకు వీడ్కోలునిచ్చే సమారోహాన్ని జరుపుకునే సమాధాన స్వరూప భవ ''
ఎప్పుడైతే మీరు మీ సంపూర్ణ స్థితిలో స్థితులవుతారో అప్పుడే సమాధాన స్వరూప ఆత్మల మాల తయారవుతుంది. సంపూర్ణ స్థితిలో సమస్యలు బాల్యతనపు ఆటగా అనుభవమవుతాయి, అనగా సమాప్తమైపోతాయి. ఎలాగైతే బ్రహ్మబాబా ముందు ఎవరైనా పుత్రుడు సమస్యను తీసుకు వచ్చినప్పుడు, సమస్య గురించిన విషయాలు చెప్పేందుకు ధైర్యము కూడా ఉండేది కాదో, ఆ విషయాలనే మర్చిపోయేవారో అలా పిల్లలైన మీరు సమాధాన స్వరూపులుగా అయినట్లయితే అర్ధకల్పము వరకు సమస్యల వీడ్కోలు సమారోహం జరుగుతుంది. విశ్వంలోని సమస్యలకు సమాధానమే పరివర్తన.

స్లోగన్:- ''ఎవరైతే సదా జ్ఞానాన్ని స్మరిస్తూ ఉంటారో, వారు మాయ ఆకర్షణల నుండి రక్షింపబడ్తారు.''

Friday, 21 February 2020

Telugu Murli 22/02/2020

22-02-2020 ప్రాత:మురళిఓంశాంతి"బాప్దాదా" మధువనం

'' మధురమైన పిల్లలారా - మిమ్ములను భగవంతుడు చదివిస్తున్నారు, మీ వద్ద జ్ఞాన రత్నాలున్నాయి. మీరు ఈ జ్ఞాన రత్నాల వ్యాపారమే చేయాలి. ఇక్కడ మీరు జ్ఞానము నేర్చుకుంటారు, భక్తి కాదు. ''

ప్రశ్న:- డ్రామాలో నిశ్చయింపబడిన ఏ అద్భుతాన్ని చూసి అది భగవంతుని లీల అని భావించి వారిని పొగుడ్తారు?
జవాబు:- ఎవరు ఎవరిలో భావనను ఉంచుతారో వారికి వారి సాక్షాత్కారము అవుతుంది. కనుక భగవంతుడే నాకు సాక్షాత్కారము చేయించారని భావిస్తారు. కాని ఇదంతా డ్రామానుసారము జరుగుతుంది. ఒకవైపు భగవంతుని మహిమ చేస్తారు, మరోవైపు వారిని సర్వవ్యాపి అని గ్లాని కూడా చేస్తారు.

ఓంశాంతి. భగవవానువాచ - మనుష్యులను గానీ, దేవతలను గానీ భగవంతుడని అనరని పిల్లలైన మీకు అర్థం చేయించబడింది. బ్రహ్మ దేవతాయ నమ:, శంకర దేవతాయ నమ: అని అంటూ శివ పరమాత్మాయ నమ: అని అంటారు. శివునికి తమ స్వంత శరీరము లేదని మీకు తెలుసు. శివబాబా మరియు సాలిగ్రామాలు మూలవతనంలో ఉంటాయి. పిల్లలైన మనలను తండ్రి చదివిస్తున్నారని మీకు తెలుసు. ఇతర సత్సంగాలేవీ వాస్తవానికి సత్యముతో సాంగత్యము లేనివని కూడా పిల్లలైన మీకు తెలుసు. అవన్నీ మాయా సాంగత్యాలని తండ్రి చెప్తున్నారు. మనలను చదివించేది భగవంతుడని వారెవ్వరూ భావించరు. గీత కూడా కృష్ణ భగవానువాచ అని భావించి వింటారు. రోజురోజుకు గీతా అభ్యాసము తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే వారికి తమ స్వంత ధర్మము కూడా తెలియదు. అందరికీ కృష్ణుడంటే చాలా ప్రీతి. కృష్ణుడినే అందరూ ఊయలలో ఊపుతారు. అయితే ఇప్పుడు మనము ఊయలలో ఎవరిని ఊపాలో మీకు తెలుసు. తండ్రిని ఊపరు కాని పిల్లలను ఊయలలో ఊపుతారు. మీరు శివబాబాను ఊపుతారా? వారు బాలునిగా అవ్వరు, పునర్జన్మ తీసుకోరు. వారొక బిందువు. కనుక వారినెలా ఊపుతారు? చాలామందికి కృష్ణుని సాక్షాత్కారము అవుతుంది. మొత్తం విశ్వమంతా కృష్ణుని నోటిలో ఉంది ఎందుకంటే అతను విశ్వానికి అధికారిగా అవుతారు. అందువలన కృష్ణుని నోటిలో విశ్వమనే వెన్న ఉంది. వారు యుద్ధము చేసేది కూడా సృష్టి రూపి వెన్న కొరకే. గెలుపొందాలని వారు భావిస్తారు. కృష్ణుని నోటిలో వెన్న ముద్దను చూపిస్తారు. ఇది కూడా అనేక విధాలుగా సాక్షాత్కారము అవుతూ ఉంటుంది. అయితే దీని అర్థము ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ మీకు సాక్షాత్కారమంటే ఏమిటో అర్థం చేయించబడ్తుంది. భగవంతుడే మాకు సాక్షాత్కారము చేయించారని మనుష్యులు భావిస్తారు. ఎవరిని స్మృతి చేస్తారో కూడా తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఉదాహరణానికి ఎవరైనా కృష్ణుని గురించి తీవ్రమైన భక్తి చేస్తే అల్పకాలము కొరకు వారి మనోకామన పూర్తి అవుతుంది అనగా కృష్ణుని సాక్షాత్కారమవుతుంది. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. అంతేకాని ఈ సాక్షాత్కారాలు భగవంతుడు చేయించినవి కావు. ఎవరు ఏ భావముతో ఎవరిని పూజిస్తారో వారికి ఆ సాక్షాత్కారము అవుతుంది. ఇది డ్రామాలో నిశ్చయింపబడింది. అయితే ఇది భగవంతుడు చేయించిన సాక్షాత్కారమని వారిని మహిమ చేస్తారు. ఒకవైపు ఇంత మహిమ కూడా చేస్తారు, మరోవైపు రాయి, రప్పలలో భగవంతుడున్నాడని కూడా అంటారు. ఇది చాలా మూఢ నమ్మకముతో చేయు భక్తి. కృష్ణుని సాక్షాత్కారమయింది కనుక తప్పకుండా కృష్ణపురానికి వెళ్లిపోతామని భావిస్తారు. కాని ఇక్కడ కృష్ణపురము ఎక్కడ ఉంది? ఈ రహస్యాలన్నీ ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయిస్తారు. కృష్ణపురము స్థాపన అవుతూ ఉంది. ఇది కంసపురము. కంసుడు, అకాసురుడు, బకాసురుడు, కుంభకర్ణుడు, రావణుడు ఇవన్నీ అసురుల పేర్లు. శాస్త్రాలలో ఏదేదో వ్రాసేశారు.

గురువులు రెండు రకాలని కూడా తెలిపించాలి. ఒకటేమో భక్తిమార్గములోని గురువులు. వీరు భక్తి చేయడం మాత్రమే నేర్పిస్తారు. ఈ తండ్రి జ్ఞానసాగరులు. వీరిని సద్గురువని అంటారు. వీరు ఎప్పుడూ భక్తి నేర్పించరు. జ్ఞానము మాత్రమే నేర్పిస్తారు. మనుష్యులు భక్తి చేస్తూ ఎంతో సంతోషిస్తారు. తాళాలు, ఢక్కీ మ్రోగించి భజనలు చేస్తారు. బనారస్లో దేవతలందరికీ మందిరాలు కట్టించారు. ఇవన్నీ భక్తిమార్గపు దుకాణాలు. భక్తికి సంబంధించిన వ్యాపారాలు. పిల్లలైన మీది జ్ఞానరత్నాల వ్యాపారము. దీనిని కూడా వ్యాపారమని అంటారు. తండ్రి కూడా రత్నాల వ్యాపారులే. ఇవి ఎటువంటి రత్నాలో మీకు తెలుసు. ఈ విషయాలను కల్పక్రితము ఎవరు అర్థము చేసుకున్నారో ఇప్పుడు కూడా వారే అర్థము చేసుకుంటారు. ఇతరులు అర్థము చేసుకోలేరు. ఎవరైతే చాలా గొప్పవారిగా ఉన్నారో, వారు చివరిలో వచ్చి అర్థము చేసుకుంటారు. కొంతమంది ఇతర మతాలలోకి పరివర్తన కూడా అయ్యారు కదా. జనక మహారాజు కథ కూడా వినిపిస్తారు. జనకుడు మళ్లీ అనుజనకుడుగా అవుతాడు. ఉదాహరణానికి ఎవరి పేరైనా కృష్ణుడైతే నీవు దైవీ కృష్ణునిగా అవుతావని అంటారు. సర్వ గుణ సంపన్నమైన ఆ కృష్ణుడు ఎక్కడ, ఈ కృష్ణుడు ఎక్కడ! ఎవరి పేరైనా లక్ష్మి అయితే, ఆమె ఈ లక్ష్మీనారాయణుల ఎదుటకు వెళ్లి వారిని మహిమ చేస్తుంది. ఆ లక్ష్మికి, నాకు ఇంత వ్యత్యాసము ఎందుకుందో ఆమెకు అర్థము కాదు. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతూ ఉందో ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానము లభించింది. మీరు మాత్రమే 84 జన్మలు తీసుకుంటారు. ఈ చక్రము అనేకసార్లు తిరుగుతూ వచ్చింది. ఎప్పుడూ ఆగిపోదు, తిరుగుతూనే ఉంటుంది. మీరు ఈ నాటకములోని పాత్రధారులు. మనము ఈ నాటకములో పాత్రను అభినయించేందుకు వచ్చామని మాత్రం మనుష్యులకు తెలుసు. అయితే ఈ డ్రామా అదిమధ్యాంతాల గురించి ఎవ్వరికీ తెలియదు.

ఆత్మల నివాస స్థానము అత్యంత పై భాగంలో ఉందని పిల్లలైన మీకు తెలుసు. అక్కడ సూర్య, చంద్రుల ప్రకాశము కూడా ఉండదు. ఈ విషయాలన్నీ అర్థము చేసుకునే పిల్లలు చాలా వరకు సాధారణంగా పేదవారుగానే ఉంటారు. ఎందుకంటే భారతదేశమే అన్నిటికంటే ధనవంతముగా ఉండేది, ఇప్పుడు భారతదేశమే అన్నిటికంటే నిరుపేద దేశంగా అయింది. డ్రామా అంతా భారతదేశము పైనే ఆధారపడి ఉంది. భారతదేశము వంటి పవిత్రమైన ఖండము మరొకటేదీ ఉండదు. పావన ప్రపంచంలో పావన ఖండము మాత్రమే ఉంటుంది. ఇక ఏ ఇతర ఖండమూ అక్కడ ఉండదు. ఈ ప్రపంచమంతా ఒక అనంతమైన ద్వీపమని బాబా అర్థం చేయించారు. లంక(సిలోన్) ఎలాగైతే ఒక ద్వీపమో అలా ఈ ప్రపంచమంతా ఒక ద్వీపమే. రావణుడు లంకలో ఉండేవాడని అంటారు. ఇప్పుడు రావణరాజ్యము ఈ పూర్తి బేహద్ లంక పై ఉందని మీకు తెలుసు. ఈ సృష్టి అంతా సముద్రము పై ఉంది. ఇదంతా ఒక ద్వీపమే. దీని పై రావణ రాజ్యముంది. ఈ సీతలందరూ రావణుని జైలులో ఉన్నారు. అయితే వారు హద్దులోని కథలు తయారు చేసేశారు. వాస్తవానికి ఇవన్నీ అనంతమైన విషయాలు. ఇది అనంతమైన నాటకము. అందులోనే చిన్న-చిన్న నాటకాలు కూర్చుని తయారు చేశారు. ఈ సినిమాలు మొదలైనవి కూడా ఇప్పుడు తయారైనవి. వీటి ద్వారా అర్థము చేయించేందుకు తండ్రికి కూడా సులభంగా ఉంటుంది. ఈ అనంతమైన నాటకమంతా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మూలవతనము, సూక్ష్మవతనాల గురించి ఇతరులెవ్వరి బుద్ధిలోనూ లేదు. ఆత్మలైన మనమంతా మూలవతన వాసులమని మీకు తెలుసు. దేవతలు సూక్ష్మవతన వాసులు, వారిని ఫరిస్తాలని కూడా అంటారు. అక్కడ రక్తమాంసాల అస్తిపంజరముండదు. సూక్ష్మవతనములో పాత్ర కూడా కొద్ది సమయము మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మీరు సూక్ష్మవతనములోకి వస్తూ, పోతూ ఉంటారు. తర్వాత ఎప్పుడూ వెళ్లరు. ఆత్మలైన మీరు మూలవతనము నుండి వచ్చునప్పుడు వయా సూక్ష్మవతనము ద్వారా రారు, నేరుగా వచ్చేస్తారు. ఇప్పుడు వెళ్లేటప్పుడు సూక్ష్మవతనము ద్వారానే వెళ్తారు. ఇప్పుడు మాత్రమే సూక్ష్మవతన పాత్ర ఉంటుంది. ఈ రహస్యాలన్నీ పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆత్మలైన మనకు అర్థము చేయిస్తున్నానని తండ్రికి తెలుసు. సాధు-సత్పురుషులు ఎవ్వరికీ ఈ విషయాలు తెలియవు. వారెప్పుడూ ఇటువంటి విషయాలు మాట్లాడలేరు. అనంతమైన తండ్రియే పిల్లలతో ఈ విషయాలు మాట్లాడ్తారు. అవయవాలు లేకుంటే మాట్లాడలేరు కదా. నేను ఈ శరీరము ఆధారంగా తీసుకొని పిల్లలైన మిమ్ములను చదివిస్తానని తండ్రి చెప్తున్నారు. పిల్లలైన మీ దృష్టి కూడా తండ్రి వైపుకు వెళ్తుంది. ఇవన్నీ కొత్త విషయాలు. నిరాకార తండ్రి మాత్రమే ఈ విషయాలు తెలుపుతారు. వారి పేరు శివబాబా. ఆత్మలైన మీ పేరు ఆత్మలే. మీ శరీరము పేర్లు మారిపోతూ ఉంటాయి. పరమాత్మ నామ-రూపాలకు భిన్నమని అంటారు. కాని వారి పేరు శివుడని అంటారు కదా. శివుని పూజ కూడా చేస్తారు. ఒకటి అర్థము చేసుకుంటారు, మరొకటి చేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి నామ-రూప-దేశ-కాలాదులన్నీ తెలుసుకున్నారు. ఏ వస్తువు కూడా నామ-రూపాలు లేకుండా ఉండదని మీకు తెలుసు. ఇది కూడా చాలా సూక్ష్మముగా అర్థము చేసుకునే విషయము. తండ్రి అర్థం చేయిస్తున్నారు - సెకండులో జీవన్ముక్తి అనే గాయనం కూడా ఉంది. అనగా మనుష్యులు నరుని నుండి నారాయణునిగా అవ్వగలరు. మన తండ్రి హెవన్లీ గాడ్ఫాదర్. మనము వారి పిల్లలుగా అయ్యాము కనుక మనము స్వర్గానికి అధికారులము. అయితే ఈ విషయము కూడా అర్థము చేసుకోరు. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ! నరుని నుండి నారాయణునిగా అవ్వడమే మీ లక్ష్యము. ఇది రాజయోగము కదా. చాలామందికి చతుర్భుజుని సాక్షాత్కారమవుతుంది. అందువలన మనము విష్ణుపురానికి అధికారులుగా అయ్యేవారమని ఋజువవుతుంది. స్వర్గములో కూడా లక్ష్మీనారాయణుల సింహాసనము వెనుక విష్ణువు చిత్రము ఉంటుందని మీకు తెలుసు అనగా విష్ణుపురములో లక్ష్మినారాయణుల రాజ్యము ఉందని అర్థమవుతుంది. ఈ లక్ష్మీనారాయణులు విష్ణుపురమునకు యజమానులు. అది కృష్ణపురము, ఇది కంసపురము. డ్రామానుసారము ఈ పేర్లు పెట్టబడినవి. తండ్రి అర్థం చేయిస్తున్నారు - నా రూపము చాలా సూక్ష్మమైనది. ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఆత్మ ఒక నక్షత్రమని అంటారు కాని మళ్లీ లింగ రూపాన్ని తయారుచేస్తారు. లేకుంటే ఎలా పూజిస్తారు? రుద్ర యజ్ఞమును రచిస్తే బొటనవ్రేలు వంటి సాలిగ్రామాలను తయారు చేస్తారు. మరోవైపు ఆత్మలు నక్షత్రాల వలె ఉంటాయని అంటారు. ఆత్మను చూచేందుకు చాలా ప్రయత్నిస్తారు. కాని ఎవ్వరూ చూడలేరు. రామకృష్ణుడు, వివేకానందుల ఉదాహరణ కూడా చూపిస్తారు కదా. రామకృష్ణుని నుండి ఆత్మ వెలువడి తనలో ప్రవేశించినట్లు వివేకానందుడు చూస్తాడు. అయితే అతనికి ఎవరి సాక్షాత్కారము జరిగి ఉంటుంది? ఆత్మ-పరమాత్మల రూపమేమో ఒక్కటే. బిందువును చూస్తే ఏమీ అర్థము కాదు. ఆత్మను సాక్షాత్కారములో చూడాలని ఎవ్వరూ కోరుకోరు. అందరూ పరమాత్మ సాక్షాత్కారమవ్వాలని కోరుకుంటారు. గురువు ద్వారా పరమాత్ముని సాక్షాత్కారమవ్వాలని వివేకానందుడు కూర్చున్నప్పుడు ఒక జ్యోతి కనిపించింది. అది నాలోకి వచ్చి ప్రవేశించిందని అనేశాడు. దీనికే అతను చాలా సంతోషించాడు. ఇదే పరమాత్ముని రూపమని భావించాడు. గురువు ద్వారా భగవంతుని సాక్షాత్కారమవ్వాలనే భావము ఉంటుంది. అయితే ఏమీ అర్థము కాదు. భక్తిమార్గములో ఎవరు అర్థము చేయిస్తారు? ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - ఏ ఏ రూపములో ఎటువంటి భావన ఉంచుకుంటారో, ఏ రూపమును చూస్తారో వారికి అది సాక్షాత్కామైపోతుంది. ఉదాహరణానికి గణేశుని చాలా ఎక్కువగా పూజిస్తే వారికి చైతన్య రూపములో గణేశుడు సాక్షాత్కారమవుతాడు. అలా కాకుంటే వారికి నిశ్చయమెలా కలగాలి? తేజోమయ రూపాన్ని చూసి మేము భగవంతుని సాక్షాత్కారము చేసుకున్నామని భావిస్తారు. అందులోనే సంతోషపడ్తూ ఉంటారు. ఇదంతా భక్తిమార్గము. క్రిందికి దిగే కళ. మొదటి జన్మ బాగుంటుంది తర్వాత తగ్గుతూ-తగ్గుతూ అంత్యము వచ్చేస్తుంది. ఈ విషయాలన్నీ పిల్లలు మాత్రమే అర్థము చేసుకుంటారు. కల్పక్రితము ఈ జ్ఞానము ఎవరికి అర్థం చేయించానో వారికే ఇప్పుడు అర్థం చేయిస్తున్నాను. కల్పక్రితము వచ్చినవారే వస్తారు. మిగిలిన వారి ధర్మాలే వేరుగా ఉంటాయి. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఒక్కొక్క చిత్రములో భగవానువాచ అని వ్రాసేయండి. చాలా యుక్తిగా అర్థం చేయించాలి. భగవానువాచ కదా - యాదవులు, కౌరవులు, పాండవులు ఏం చేశారో ఈ చిత్రాలలో చూపించారు. మీ తండ్రి ఎవరో మీకు తెలుసా? అని అడగండి. తెలియకుంటే తండ్రి పై ప్రీతి లేదని అర్థము అనగా విపరీత బుద్ధి గలవారు అయ్యారు కదా. తండ్రి పై ప్రీతి లేకుంటే వినాశనమైపోతారు. ప్రీతి బుద్ధి గలవారు విజయులుగా అవుతారు. సత్యమేవ జయతే - దీని అర్థము కూడా బాగుంది. తండ్రి స్మృతి లేకుంటే విజయము పొందలేరు.

గీతను శివభగవానుడు వినిపించారని ఇప్పుడు మీరు నిరూపించి చెప్పగలరు. వారే బ్రహ్మ ద్వారా రాజయోగమును నేర్పించారు. కాని కృష్ణభగవానుని గీతగా భావించి ప్రమాణము చేస్తారు. సమక్షములో ఉన్నారని భావించవలసింది కృష్ణుడినా లేక భగవంతుడినా? అని అడగాలి. ఈశ్వరుని సమక్షములో ఉన్నారని భావించి సత్యము చెప్పమని అంటారు. ఇది ఒక సంప్రదాయంగా అయిపోయింది. కనుక ప్రమాణము కూడా అసత్యమైపోతుంది. సేవ చేసే పిల్లలకు గుప్త నషా ఉండాలి. నషాతో అర్థం చేయిస్తే సఫలత ఉంటుంది. మీ చదువు కూడా గుప్తమే. చదివించేవారు కూడా గుప్తమే. మనము నూతన ప్రపంచములో ఇలా(లక్ష్మినారాయణులుగా) అవుతామని మీకు తెలుసు. మహాభారత యుద్ధము తర్వాత నూతన ప్రపంచము స్థాపనవుతుంది. పిల్లలకిప్పుడు జ్ఞానము లభించింది. అది కూడా నంబరువారుగా ధారణ చేస్తారు. యోగములో కూడా నంబరువారుగా ఉంటారు. మేము ఎంత సమయము స్మృతిలో ఉంటున్నాము? అని కూడా చెక్ చేసుకోవాలి. తండ్రి చెప్తున్నారు - ఇప్పుడు మీరు చేసే ఈ పురుషార్థము భవిష్య 21 జన్మలకు ప్రాలబ్ధమునిస్తుంది. ఇప్పుడు ఫెయిల్ అయితే కల్ప-కల్పాంతరాలు కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు. ఉన్నతపదవి పొందలేరు. ఉన్నతపదవి పొందేందుకు పురుషార్థము చేయాలి. వికారాలకు వశమైనవారు కూడా కొన్ని సేవాకేంద్రాలకు వస్తూ ఉంటారు. ఈశ్వరుడు అన్నీ చూస్తూ ఉంటారు, వారికి అన్నీ తెలుసని భావిస్తారు. ఇవన్నీ చూచేందుకు తండ్రికి ఏం అవసరము? మీరు అసత్యము చెప్పి వికర్మలు చేస్తూ ఉంటే మీ అంతకు మీరే నష్టపోతారు. ముఖము నల్లగా చేసుకుంటే(అపవిత్రమౌతే) ఉన్నతపదవి పొందలేమని మీకు కూడా తెలుసు. కనుక తండ్రికి తెలిసినా ఫలితమొక్కటే కదా. తెలుసుకునే అవసరం వారికేముంది? ఇటువంటి కర్మలు చేస్తే దుర్గతి పాలవుతామని మీ మనసు తింటూ ఉండాలి. బాబా ఎందుకు అర్థం చేయించాలి? అయితే డ్రామాలో ఉంటే బాబా ఇది కూడా తెలుపుతారు. బాబా నుండి దాచిపెట్టడమంటే మీ అంతకు మీరే సర్వ నాశనము చేసుకోవడం. పావనంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయాలి. బాగా చదువుకొని ఉన్నతపదవి పొందాలనే తపన మీకుండాలి. ఎవరు మరణించినా, ఎవరు జీవించినా దాని చింత మీకెందుకు? తండ్రి నుండి వారసత్వము ఎలా తీసుకోవాలనే చింత మీకుండాలి. ఎవరికైనా క్లుప్తంగా అర్థం చేయించాలి. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. గుప్త నషాలో ఉండి సేవ చేయాలి. మనసు తినే పని ఏదీ చేయరాదు. ఎంత సమయము స్మృతిలో ఉంటున్నామని స్వయాన్ని చెక్ చేసుకోవాలి.
2. బాగా చదువుకొని ఉన్నత పదవి పొందాలనే చింత మీలో సదా ఉండాలి. వికర్మలు చేసి అసత్యము చెప్పి మిమ్ములను మీరు నష్టపరచుకోరాదు.

వరదానము:- '' విశేషతల దానం ద్వారా మహాన్గా తయారయ్యే మహాదాని భవ
జ్ఞాన దానాన్ని అయితే అందరూ చేస్తారు కాని విశేష ఆత్మలైన మీరు మీ విశేషతలను దానం చేయాలి. మీ ముందుకు ఎవరు వచ్చినా వారికి మీ నుండి తండ్రి స్నేహము అనుభవమవ్వాలి. మీ ముఖము ద్వారా తండ్రి చిత్రము, మీ నడవడిక ద్వారా తండ్రి చరిత్ర కనిపించాలి. మీ విశేషతలను చూసి వారు విశేష ఆత్మలుగా అయ్యేందుకు ప్రేరణను ప్రాప్తి చేసుకోవాలి. ఇటువంటి మహాదానులుగా అయితే ఆది నుండి అంత్యము వరకు పూజ్యులలోనూ, పూజారులలోనూ మహాన్గా (గొప్పవారిగా) ఉంటారు.

స్లోగన్:- '' సదా ఆత్మ - అభిమానులుగా ఉండేవారే అందరికంటే గొప్ప జ్ఞానులు ''