Sunday, 29 September 2019

Telugu Murli 30/09/2019

30-09-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - సదా శ్రీమతం పై నడవాలి - ఇదే శ్రేష్ఠమైన పురుషార్థం, శ్రీమతం పై నడవడం ద్వారా ఆత్మ దీపం వెలుగుతుంది ''

ప్రశ్న :- పూర్తి పురుషార్థం ఎవరు చేయగలరు? ఉన్నతమైన పురుషార్థం ఏది ?
జవాబు :- ఎవరి పూర్తి అటెన్షన్‌ లేక బుద్ధి యోగము ఒక్కరితోనే ఉంటుందో, వారు పూర్తి పురుషార్థం చేయగలరు. అన్నిటికంటే ఉన్నతమైన పురుషార్థము తండ్రి పై పూర్తి పూర్తి బలి అవ్వడం. బలి అయ్యే పిల్లలు తండ్రికి చాలా ప్రియమనిపిస్తారు.

ప్రశ్న :- సత్య-సత్యమైన దీపావళి జరుపుకునేందుకు అనంతమైన తండ్రి ఎటువంటి సలహానిస్తారు?
జవాబు :- పిల్లలూ, అనంతమైన పవిత్రతను ధారణ చెయ్యండి. ఎప్పుడైతే ఇక్కడ అనంతమైన పవిత్రంగా అవుతారో, ఇటువంటి పురుషార్థం చేస్తారో అప్పుడు లక్ష్మీ-నారాయణుల రాజ్యంలోకి వెళ్ళగలరు అనగా సత్య-సత్యమైన దీపావళి లేక కారొనేషన్‌ డే (రాజ్యపట్టాభిషేకం) జరుపుకోగలరు.

ఓంశాంతి. పిల్లలు ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? నడుస్తూ తిరుగుతూ లేదా ఇక్కడ కూర్చొని-కూర్చొని జన్మ-జన్మాంతరాలుగా తల పై ఏదైతే పాపం ఉందో ఆ పాపాన్ని స్మృతి యాత్రతో వినాశనం చేసుకుంటున్నారు. మనము ఎంతగా తండ్రిని స్మృతి చేస్తామో అంతగా పాపాలు నశించిపోతాయి అని ఆత్మకు తెలుసు. తండ్రి అయితే మంచి రీతిగా అర్థం చేయించారు - భలే, ఇక్కడ కూర్చొని ఉన్నా ఎవరైతే శ్రీమతం పై నడుస్తారో వారికైతే తండ్రి సలహా మంచిగానే అనిపిస్తుంది. అనంతమైన పవిత్రంగా అవ్వాలి అని అనంతమైన తండ్రి సలహా లభిస్తోంది, ఇక్కడకు మీరు అనంతమైన పవిత్రంగా అయ్యేందుకు వచ్చారు, కనుక స్మృతి యాత్ర్రతోనే పవిత్రంగా అవుతారు. కొందరైతే బొత్తిగా స్మృతి చేయలేరు, మరికొందరు తమ స్మృతి యాత్రతోనే తమ పాపాలు కట్‌ అవుతున్నాయి అనగా తమ కళ్యాణము చేసుకుంటున్నట్లుగా భావిస్తారు. బయటి వారికి ఈ విషయాలు తెలియవు. మీకు మాత్రమే తండ్రి దొరికారు, మీరు తండ్రి వద్దే ఉంటారు. ఇప్పుడు మేము ఈశ్వరీయ సంతానంగా అయ్యామని, ముందు ఆసురీ సంతానంగా ఉండేవారమని తెలిసింది. ఇప్పుడు మన సాంగత్యము ఈశ్వరీయ సంతానంతో ఉంది. మంచి సాంగత్యం తేలుస్తుంది చెడు సాంగత్యం ముంచుతుంది అని గాయనం కూడా ఉంది కదా! మనము ఈశ్వరీయ సంతానం కనుక మనము ఈశ్వరుని మతం పైనే నడవాలి, మన్మతము పై కాదు అని పిల్లలు ఘడియ-ఘడియకు మర్చిపోతారు. మన్మతమని మనుష్య మతాన్నంటారు. మనుష్య మతము ఆసురీ మతంగానే ఉంటుంది. ఏ పిల్లలైతే తమ కళ్యాణం కావాలనుకుంటారో వారు సతోప్రధానంగా అయ్యేందుకు తండ్రిని చాలా బాగా స్మృతి చేస్తూ ఉంటారు. సతోప్రధానానికి మహిమ కూడా ఉంది. మనము సుఖధామానికి నంబరువారీ అధిపతులుగా అవుతామని తెలుసు. ఎంతెంత శ్రీమతము పై నడుస్తామో, అంత ఉన్నత పదవి పొందుతాము, ఎంతగా తమ మతము పై నడుస్తామో అంత పదభ్రష్టులైపోతాము. తమ కళ్యాణము చేసుకునేందుకు తండ్రి డైరెక్షన్‌ అయితే లభిస్తూనే ఉంటుంది. ఎవరు ఎంతగా స్మృతి చేస్తే వారి పాపాలు కూడా అంతగా నశిస్తాయి, ఇది కూడా పురుషార్థమే అని తండ్రి అర్థం చేయించారు. స్మృతి యాత్ర చేయకుండా పవిత్రంగా అవ్వలేరు. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ ఇదే చింత ఉండాలి. పిల్లలైన మీకు ఎన్ని సంవత్సరాల నుండి శిక్షణ లభించింది! అయినా మేము చాలా దూరంగానే ఉన్నామని భావిస్తారు. ఇంతగా తండ్రిని స్మృతి చేయలేరు. సతోప్రధానంగా అయ్యేందుకు చాలా టైమ్‌ పడ్తుంది. మధ్యలో శరీరం వదిలేస్తే కల్ప-కల్పాంతరాలకు పదవి తక్కువైపోతుంది. ఈశ్వరునికి చెందినవారుగా అయ్యారంటే వారి నుండి పూర్తి వారసత్వం తీసుకునే పురుషార్థం చెయ్యాలి. బుద్ధి ఒక్కవైపే ఉండాలి. మీకు శ్రీమతం లభిస్తోంది. వారు ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు. వారి మతం అనుసారంగా నడవకపోతే చాలా మోసపోతారు. నడుస్తారా నడవరా, అదైతే మీకే తెలియాలి, శివబాబాబాకు తెలియాలి. మీచే పురుషార్థం చేయించేవారు ఆ శివబాబా. దేహధారులందరు పురుషార్థం చేస్తారు. ఇతడు కూడా దేహధారియే, ఇతనిచే పురుషార్థం చేయిస్తారు. పురుషార్థం చేయాల్సింది పిల్లలే. అసలైన విషయం పతితులను పావనంగా చెయ్యడం. ప్రపంచంలో పావనంగా చాలామంది ఉంటారు. సన్యాసులు కూడా పవిత్రంగా ఉంటారు. సన్యాసులైతే ఒక్క జన్మకు పావనంగా అవుతారు. ఈ జన్మలో పావనంగా ఉండే బాలబ్రహ్మచారులు కూడా చాలామంది ఉన్నారు. వారెవ్వరు ప్రపంచానికి పవిత్రతా సహాయాన్ని ఇవ్వలేరు, శ్రీమతం పై పావనంగా అయ్యి ప్రపంచాన్ని పావనంగా చేసినప్పుడే సహాయం జరుగుతుంది.
ఇప్పుడు మీకు శ్రీమతం లభిస్తోంది. జన్మ-జన్మాంతరాలుగా మీరు ఆసురీ మతాన్ని అనుసరించారు. ఇప్పుడు సుఖధామం స్థాపన అవుతోందని మీకు తెలుసు. మనము శ్రీమతం పై ఎంతగా పురుషార్థము చేస్తామో అంత ఉన్నత పదవి పొందుతాము. ఇది బ్రహ్మ మతం కాదు, ఇతడు పురుషార్థి. ఇతడి పురుషార్థం తప్పకుండా ఇంత ఉన్నతంగా ఉంది కనుకనే లక్ష్మీ-నారాయణగా అవుతారు. అయితే పిల్లలు ఇది ఫాలో చెయ్యాలి. శ్రీమతం పై నడవాల్సి ఉంటుంది, మన్మతం పై కాదు. తమ ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలి. ఇప్పుడు దీపావళి వస్తోంది, సత్యయుగంలో దీపావళి ఉండదు. కేవలం కారొనేషన్‌(పట్టాభిషేకం) జరుగుతుంది. పోతే ఆత్మలైతే సతోప్రధానంగానే ఉంటాయి. ఇక్కడ దీపమాల ఏదైతే జరుపుతారో ఇది అసత్యమైనది. బయట దీపాలు వెలిగిస్తారు, అక్కడైతే ఇంటింటా దీపం వెలిగి ఉంటుంది అనగా అందరి ఆత్మ దీపము సతోప్రధానంగా ఉంటుంది. 21 జన్మలకు జ్ఞానమనే నెయ్యి పడ్తుంది. మెల్ల-మెల్లగా తగ్గిపోతూ-తగ్గిపోతూ మొత్తం ప్రపంచ జ్యోతి కొడిగట్టిపోయింది. అందునా విశేషించి భారతవాసులది, సామాన్య ప్రపంచంది. ఇప్పుడు అందరు పాపాత్మలుగా ఉన్నారు, ఇది అందరి అంతిమ(ప్రళయ) సమయం, అందరూ లెక్కాచారం సమాప్తం(చుక్త్‌) చేసుకోవాలి. ఇప్పుడు పిల్లలైన మీరు ఉన్నతాతి ఉన్నతమైన పదవి పొందే పురుషార్థం చెయ్యాలి, శ్రీమతం పై నడిస్తేనే పొందుతారు. రావణ రాజ్యంలో అయితే శివబాబా ఆజ్ఞను చాలా ఉల్లఘించారు. ఇప్పుడు కూడా వారి ఆజ్ఞ పై నడవకపోతే చాలా మోసపోతారు. వచ్చి మమ్ములను పావనంగా చేయండి అని వారినే పిలిచారు. కనుక ఇప్పుడు తమ కళ్యాణం చేసుకునేందుకు శివబాబా శ్రీమతం పై నడవాల్సి ఉంటుంది, లేకుంటే చాలా అకళ్యాణం అవుతుంది. శివబాబా స్మృతి లేకుండా మనము సంపూర్ణ పావనంగా అవ్వలేమని కూడా మధురమైన పిల్లలకకు తెలుసు. ఇన్ని సంవత్సరాలు గడిచినా మీకు ఎందుకు జ్ఞాన ధారణ అవ్వడం లేదు, బంగారు పాత్రలోనే ధారణ అవుతుంది. కొత్త-కొత్త పిల్లలు ఎంత సర్వీసబుల్‌గా (సేవారతులుగా) అవుతారు! ఎంత వ్యత్యాసం (తేడా) ఉందో చూడండి. క్రొత్త పిల్లలు ఎంతగా స్మృతి యాత్రలో ఉంటారో అంతగా పాత-పాత పిల్లలు ఉండరు. చాలామంది మంచి శివబాబా గారాబు పిల్లలు వస్తారు, వారు ఎంత సర్వీస్‌ చేస్తారు! ఎలాగైతే శివబాబా చివరి ఆత్మను త్యాగం చేసేశారు. త్యాగం చేయడంతో మళ్లీ సర్వీస్‌ కూడా ఎంత చేస్తారు! తండ్రికి సహాయం చేస్తూనే స్మృతి యాత్రలో ఉండడంతో ఎంత ప్రియంగా మధురంగా అనిపిస్తారు! తండ్రి చెప్తారు, నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారు. వచ్చి నన్ను పావనంగా చేయండి అని పిలిచారు, ఇప్పుడు తండ్రి చెప్తారు నన్ను స్మృతి చేస్తూ ఉండండి. దేహ సంబంధాలన్నీ త్యాగం చెయ్యాల్సి వస్తుంది. ఒక్క తండ్రి స్మ్పృతి తప్ప బంధు-మిత్రులు మొదలైనవారెవ్వరూ గుర్తుండరాదు, అప్పుడే ఉన్నత పదవి పొందగలరు. స్మృతి చేయకుంటే ఉన్నత పదవిని పొందలేరు. ఇది బాప్‌దాదా కూడా అర్థం చేసుకోగలరు. పిల్లలైన మీకు కూడా తెలుసు. కొత్త-కొత్తవారు వస్తారు, రోజు - రోజుకూ సంస్కరింపబడ్తున్నామని అర్థం చేసుకుంటారు. శ్రీమతం పై నడిస్తేనే బాగుపడ్తారు. క్రోధం పై కూడా పురుషార్థం చేస్తూ చేస్తూ గెలుపు పొందుతారు. అయితే తండ్రి కూడా అర్థం చేయిస్తారు - చెడును తీసేస్తూ ఉండండి. క్రోధం కూడా చాలా చెడ్డది. తమను లోలోపల కాల్చేస్తుంది, ఇతరులను కూడా కాలుస్తుంది. దానిని కూడా తీసేయాలి. పిల్లలు తండ్రి శ్రీమతం పై నడవకపోతే పదవి తక్కువైపోతుంది. జన్మ-జన్మాంతరాలు, కల్ప-కల్పాంతరాలకు నష్టం కలుగుతుంది.
అది దేహ సంబంధమైన చదువు, ఇది ఆత్మిక చదువు దీనిని ఆత్మిక తండ్రి చదివిస్తారని పిల్లలైన మీకు తెలుసు. అన్ని విధాల సంభాళన కూడా జరుగుతూ ఉంటుంది. ఏ వికారి ఇక్కడ లోపలికి (మధుబన్‌లోకి) రాలేరు. జబ్బు మొదలైనవి వచ్చినప్పుడు వికారి బంధుమిత్రులు వచ్చినా, అది మంచిది కాదు. మనం ఇష్టపడరాదు. లేకుంటే అంతకాలంలో ఆ బంధు-మిత్రులే గుర్తుకొస్తారు. వారు ఉన్నత పదవిని పొందలేరు. తండ్రి అయితే ఎవ్వరూ గుర్తు రాకుండా పురుషార్థం చేయిస్తారు, మేము జబ్బు పడ్డాము కాబట్టి బంధు-మిత్రులు మొదలైనవారు చూసేందుకు వస్తారని కాదు, వారిని పిలవడం నియమం కాదు. నియమానుసారంగా నడిస్తేనే సద్గతి కలుగుతుంది. లేకుంటే ఊరకే స్వయానికి నష్టం కలగజేసుకుంటారు, కాని ఇది తమోప్రధాన బుద్ధి అర్థం చేసుకోదు. ఈశ్వరుడు సలహా ఇచ్చినా బాగుపడరు. చాలా అప్రమత్తంగా నడవాల్సి ఉంటుంది. ఇది పవిత్రాతి పవిత్రమైన (అతి పవిత్రమైన) స్థానము, ఇక్కడ పతితులు నిలవలేరు. బంధు-మిత్రులు మొదలైనవారు గుర్తొచ్చారంటే మరణించే సమయంలో తప్పకుండా వారు గుర్తొస్తారు. దేహ-అభిమానంలోకి రావడంతో తమను తామే నష్టపరుచుకుంటారు. శిక్షలకు నిమిత్తమవుతారు. శ్రీమతం పై నడవకపోతే చాలా దుర్గతి కలుగుతుంది. సేవకు తగినవారిగా అవ్వలేరు. ఎంత తల బాదుకున్నా సేవకు యోగ్యులుగా అవ్వలేరు. ఆజ్ఞను ఉల్లంఘిస్తే రాతి బుద్ధిగలవారుగా అయిపోతారు. పైకి ఎక్కేందుకు బదులు క్రింద పడిపోతారు. పిల్లలు ఆజ్ఞాకారులుగా అవ్వాలి అని తండ్రి చెప్తారు లేకపోతే పదభ్రష్టులైపోతారు. లౌకిక తండ్రికి కూడా నలుగురు - ఐదుగురు పిల్లలుంటారు, కాని వారిలో ఆజ్ఞాకారులైన పిల్లలే ప్రియమనిపిస్తారు. ఎవరైతే ఆజ్ఞాకారులు కాదో వారైతే దు:ఖమునే ఇస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఇద్దరు తండ్రులూ చాలా గొప్పవారు లభించారు. వారి ఆజ్ఞను తిరస్కరించరాదు. తిరస్కరిస్తే జన్మ-జన్మాంతరాలకు, కల్ప- కల్పాంతరాలకు చాలా తక్కువ పదవి పొందుతారు. పురుషార్థం ఎలా చెయ్యాలంటే అంతములో ఒక్క శివబాబాయే గుర్తు రావాలి. తండ్రి చెప్తారు - ప్రతి ఒక్కరు ఏం పురుషార్థం చేస్తారో నేను తెలుకోగలను. కొందరు చాలా కొద్దిగా స్మృతి చేస్తారు, మిగిలినవారు తమ బంధు-మిత్రులనే గుర్తు చేసుకుంటూ ఉంటారు. వారు అంత సంతోషంగా ఉండలేరు, ఉన్నత పదవి పొందలేరు.
మీకైతే రోజూ సద్గురువారమే. బృహస్పతివారం నాడు కాలేజిలో చేరతారు. అది శరీర సంబంధమైన విద్య, ఇదైతే ఆత్మిక విద్య. శివబాబా మన తండ్రి, టీచర్‌, సద్గురువు అని మీకు తెలుసు. కనుక వారి డైరెక్షన్‌ అనుసారం నడవాలి అప్పుడే ఉన్నత పదవి పొందగలరు. ఎవరైతే పురుషార్థులుగా ఉన్నారో వారికి లోలోపల చాలా సంతోషం ఉంటుంది, అడగనే వద్దు, సంతోషం ఉంటే ఇతరులను కూడా సంతోషపర్చే పురుషార్థం చేస్తారు. అమ్మాయిలు రాత్రి-పగలు ఎంత శ్రమ చేస్తూ ఉంటారో చూడండి, ఎందుకంటే ఇది వండర్‌ఫుల్‌(అద్భుతమైన) జ్ఞానం కదా! చాలామంది పిల్లలు తెలివి తక్కువతనంతో ఎంత నష్టపోతారు! బాప్‌దాదాకు జాలేస్తుంది. దేహాభిమానంలోకి వచ్చి లోపల చాలా మండిపోతూ ఉంటారు. క్రోధం వచ్చినప్పుడు మనుష్యులు తామ్రం(రాగి) వలె ఎఱ్ఱగా అయిపోతారు. క్రోధం మనుష్యలను కాల్చేస్తుంది, కామం నల్లగా తయారు చేస్తుంది. లోభము, మోహములో అంతగా కాలరు. క్రోధంలో కాలిపోతారు. క్రోధ భూతము చాలామందిలో ఉంది. ఎంత పోట్లాడ్తారు! పోట్లాడడంతో తమకే నష్టం కలగజేసుకుంటారు. నిరాకారుని, సాకారుని ఇరువురి ఆజ్ఞను తిరస్కరిస్తారు. తండ్రి ఇటువంటి వారిని కుపుత్రులని భావిస్తారు. శ్రమ చేస్తే ఉన్నత పదవి పొందుతారు. అయితే తమ కళ్యాణం కొరకు సంబంధాలన్నీ మర్చిపోవాలి. ఒక్క తండ్రిని తప్ప ఎవ్వరినీ గుర్తు చేయరాదు. ఇంట్లో ఉంటూ సంబంధీకులను చూస్తున్నా శివబాబాను స్మృతి చేయాలి. మీరు సంగమ యుగంలో ఉన్నారు, ఇప్పుడు మీ కొత్త ఇంటిని, శాంతిధామాన్ని గుర్తు చేసుకోండి.
ఇది అనంతమైన చదువు కదా! ఇందులో పిల్లలకే లాభం ఉంది అని తండ్రి శిక్షణనిస్తున్నారు. చాలామంది పిల్లలు తమ పద్ధతి లేని నడవడికతో ఊరకే తమకు నష్టం కలగజేసుకుంటారు. విశ్వమహారాజు పదవి పొందేందుకు పురుషార్థం చేస్తారు కానీ మాయా మార్జాలం(పిల్లి) చెవి కొరికేస్తుంది. జన్మించారు, మేము ఈ పదవి పొందుతామని భావిస్తారు, కాని మాయ పిల్లి పొందనీయడం లేదని అంటారు, కనుక పదవి భ్రష్టమైపోతుంది. మాయ చాలా బలంగా దాడి చేస్తుంది. మీరు ఇక్కడకు రాజ్యం పొందేందుకు వచ్చారు, కాని మాయ కలవరపరుస్తుంది. పాపం...! ఉన్నత పదవి పొందితే బాగుంటుంది కదా! అని తండ్రికి జాలి కలుగుతుంది. నన్ను నిందింపజేసేవారిగా అవ్వకండి. సద్గురు నిందకులు సత్యయుగంలో స్థానం పొందరు, ఎవరి నింద? శివాబాబాది. తండ్రిని నిందపరిచే ఇటువంటి నడత నడవరాదు, ఇందులో అహంకారం మాట లేదు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తమ కళ్యాణము కొరకు దేహ సంబంధాలన్నీ మర్చిపోవాలి, వాటి పై ప్రీతి ఉంచుకోరాదు. ఈశ్వరుని మతం పైనే నడవాలి, తమ మతము పై కాదు. చెడు సాంగత్యం నుండి రక్షించుకోవాలి, ఈశ్వరీయ సాంగత్యంలో ఉండాలి.
2. క్రోధము చాలా చెడ్డది, స్వయాన్ని కాలుస్తుంది, క్రోధానికి వశమై ఆజ్ఞను ఉల్లంఘించరాదు. సంతోషంగా ఉండాలి, అంతేకాక అందరిని సంతోషపరిచే పురుషార్థం చేయాలి.

వరదానము :- '' హృదయానుభూతి ద్వారా హృదయాభిరాముని ఆశీర్వాదాలు ప్రాప్తి చేసుకునే స్వ పరివర్తక భవ! ''
స్వయాన్ని పరివర్తన చేసుకునేందుకు సత్యమైన హృదయంతో రెండు విషయాల అనుభూతి అవసరం - 1. తమ బలహీనతల అనుభూతి 2. ఏ పరిస్థితి లేక వ్యక్తి నిమిత్తంగా అవుతారో వారి ఇచ్ఛ మరియు వారి మనోభావనల అనుభూతి. పరిస్థితుల పేపర్‌కు కారణాన్ని తెలుసుకొని స్వయం పాస్‌ అవుతాననే శ్రేష్ఠ స్వరూప అనుభూతి ఉండాలి. నా స్వస్థితి శ్రేష్ఠంగా ఉంది, పరిస్థితి ఒక పేపరు - ఈ అనుభూతి సహజంగా పరివర్తన చేయిస్తుంది, సత్యమైన హృదయంతో అనుభూతి చేసినట్లయితే హృదయాభిరాముని ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి.

స్లోగన్‌ :- ''ఎవరైతే ఎవర్‌రెడీ అయి ్య ప్రతి కార్యంలో హజూర్‌ హాజిర్‌ (చిత్తం ప్రభూ) అని అంటారో, వారే వారసులు.''

Saturday, 28 September 2019

Telugu Murli 29/09/2019

29-09-2019 ని అవ్యక్తబాప్‌దాదా కు ఓంశాంతి రివైజ్‌: 16-02-1985 మధువనము

'' ప్రతి శ్వాసలో సంతోషపు వాయిద్యాలు మ్రోగడమే ఈ శ్రేష్ఠ జన్మ కానుక ''
ఈ రోజు భోళానాథ్‌, భోలాభండారి అయిన తండ్రి తమ అతి స్నేహితులు, సదా సహయోగులు, సర్వ ఖజానాలకు యజమానులైన పిల్లలతో మిలనము చేసుకునేందుకు వచ్చారు. పిల్లలు ఇప్పుడు కూడా యజమానులే, భవిష్యత్తులో కూడా యజమానులే. ఇప్పుడు విశ్వరచయితకు బాలకుల నుండి యజమానులుగా ఉన్నారు, భవిష్యత్తులో విశ్వానికి యజమానులుగా ఉంటారు. బాప్‌దాదా ఇటువంటి తమ యజమాని పిల్లలను చూసి హర్షిస్తారు. ఈ బాలకుల నుండి యజమానులుగా అవ్వడం, ఇది అలౌకిక నషా, అలౌకిక సంతోషము. మీరు సదా ఇటువంటి అదృష్టవంతలైన, సదా సంపన్నమైన శ్రేష్ఠ ఆత్మలు కదా! ఈ రోజు పిల్లలందరు తండ్రి అవతరణ జయంతిని జరపడానికి ఉల్లాస-ఉత్సాహాలతో హర్షిస్తున్నారు. తండ్రి జయంతియే పిల్లల జయంతి అని బాప్‌దాదా అంటారు. కావున ఇది అద్భుతమైన జయంతి. నిజానికి తండ్రి మరియు పిల్లల జయంతి ఒకేసారి జరగదు. అలా జరుగుతుందా? అదే రోజు తండ్రి జన్మదినం మరియు పిల్లల జన్మదినం అవ్వడం ఎప్పుడైనా విన్నారా? ఇదే ఆలౌకిక జయంతి. ఏ ఘడియ అయితే తండ్రి, పుత్రుడైన బ్రహ్మలో అవతరించారో అదే రోజున, అదే ఘడియలో బ్రహ్మ అలౌకిక జన్మ కూడా జరిగింది. ఇరువురి జన్మలు ఒకేసారి జరిగాయి కదా! అలాగే బ్రహ్మతో పాటు అనన్య బ్రాహ్మణుల జన్మ కూడా జరిగింది. కావున దివ్య జన్మ జరిగిన తిధి, వేళ, రేఖ బ్రహ్మ మరియు శివబాబాల అవతరణ ఒకటే అయిన కారణంగా శివబాబా మరియు పుత్రుడైన బ్రహ్మ పరమాత్మ మరియు మహాన్‌ ఆత్మ అయ్యి ఉండి కూడా తండ్రి సమానంగా (శివబాబా సమానంగా) అయ్యారు. సమానత ఉన్న కారణంగా కంబైండ్‌ రూపముగా అయిపోయారు. బాప్‌దాదా, బాప్‌దాదా అని సదా కలిపే పిలుస్తారు కదా! వేరుగా పిలవరు. అలాగే అనన్యులైన బ్రాహ్మణులు బాప్‌దాదాతో పాటు బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారీల రూపంలో అవతరించారు.
కావున బ్రహ్మ మరియు కుమారులు, కుమారీలు ఇది కూడా తండ్రి మరియు పిల్లల కంబైండ్‌ రూపానికి చిహ్నమైన పేరే. కావున బాప్‌దాదా పిల్లలు బ్రాహ్మణ జీవితము యొక్క అవతరణ జయంతిని జరిపేందుకు వచ్చారు. మీరందరూ కూడా అవతారులే కదా! అవతారము అనగా శ్రేష్ఠ స్మృతి. ''నేను దివ్య జీవితము గల బ్రాహ్మణ ఆత్మను.'' కనుక క్రొత్త జన్మ జరిగింది కదా! ఉన్నతమైన స్మృతి ద్వారా ఈ సాకార శరీరములోకి అవతరించి విశ్వకళ్యాణ కార్యములో నిమిత్తంగా అయ్యారు. కనుక మీరు అవతారమే కదా! ఎలాగైతే తండ్రి అవతరించారో అలాగే మీరందరూ విశ్వపరివర్తన కొరకు అవతరించారు. పరివర్తన చెందడమే అవతరించడము. కావున ఇది అవతారమూర్తుల సభ. తండ్రితో పాటు బ్రాహ్మణ పిల్లలైన మీ అలౌకిక జన్మదినము కూడా. కావున పిల్లలు తండ్రి జయంతిని జరుపుతారా లేక తండ్రి పిల్లల జయంతిని జరుపుతారా లేక అందరూ కలిసి పరస్పరం ఒకరి జన్మదినాన్ని మరొకరు జరుపుకుంటారా! దీనినైతే భక్తులు కేవలం స్మృతి చిహ్నంగా జరుపుకుంటూ ఉంటారు. కానీ మీరు సన్ముఖంగా తండ్రితో కలిసి జరుపుకుంటారు. ఇటువంటి శ్రేష్ఠ భాగ్యము కల్ప-కల్పపు భాగ్యరేఖ అవినాశిగా గీయబడింది. మాకు భగవంతుడు తోడుగా ఉండే భాగ్యము లభించింది అన్న విషయము సదా మా స్మృతిలో ఉండాలి. మాకు డైరెక్ట్‌ భాగ్యవిధాతతో పాటు భాగ్యమును ప్రాప్తించుకునే పాత్ర ఉంది. మీరు ఇటువంటి డబల్‌ హీరోలు, హీరో పాత్రధారులే కదా! వజ్రతుల్యమైన జీవితము గలవారు కూడా. కావున డబల్‌ హీరోలుగా అయిపోయారు కదా! మొత్తం విశ్వమంతటి దృష్టి హీరో పాత్రధారి ఆత్మలైన మీ పై ఉంది. భాగ్యశాలీ ఆత్మలైన మీ ఈ అంతిమ జన్మలో కూడా లేక కల్పము యొక్క అంతిమ కాలంలో కూడా ఎన్నో స్మృతులు, స్మృతిచిహ్నాల రూపంలో తయారుచేయబడి ఉన్నాయి. తండ్రి మరియు బ్రాహ్మణుల మాటలు స్మృతిచిహ్న రూపంలో శాస్త్రాలుగా తయారయ్యాయి. వాటిలోని రెండు మాటలు వినడం ద్వారా శాంతి-సుఖాల అనుభవము చేస్తూ ఉంటారు.
భాగ్యశాలీ ఆత్మలైన మీ శ్రేష్ఠ కర్మలు చరిత్ర రూపంలో ఇప్పటివరకు కూడా గానం చేయబడుతున్నారు. భాగ్యశాలి ఆత్మలైన మీ శ్రేష్ఠ భావన, శ్రేష్ఠ కామనల శ్రేష్ఠ సంకల్పాలు దీవెనల రూపంలో గానం చేయడ్తున్నాయి. ఏ దేవత ముందుకైనా దీవెనలు అడిగేందుకే వెళ్తారు. భాగ్యశాలి ఆత్మలైన మీ శ్రేష్ఠ స్మృతి, స్మరణ రూపంలో ఇప్పటికి కూడా స్మృతి చిహ్నంగా కొనసాగుతోంది. కావున మీరు ఇటువంటి భాగ్యశాలురుగా ఎలా అయ్యారు? ఎందుకంటే మీరు భాగ్యవిధాత జతలో భాగ్యవంతులుగా అయ్యారు. కావున మీది ఎంత భాగ్యవంతమైన దివ్య జన్మయో అర్థం చేసుకున్నారా? భాగ్యవంతులైన పిల్లలకు ఇటువంటి దివ్యజన్మ శుభాకాంక్షలను భగవంతుడైన బాప్‌దాదా తెలియజేస్తున్నారు. శుభాకాంక్షలే శుభాకాంక్షలు. ఇవి ఒక్కరి కోసం అభినందనలు కావు. ఈ భాగ్యవంతమైన జన్మ ప్రతి క్షణము, అన్నివేళలా అభినందనలతో నిండి ఉంది. ఈ శ్రేష్ఠ జన్మ గురించి తెలుసు కదా! ప్రతి శ్వాసలో సంతోష వాయిద్యాలు మ్రోగుతున్నాయి. శ్వాస నడవడం కాదు, సంతోషము యొక్క వాయిద్యాలు మ్రోగుతున్నాయి. ఆ వాయిద్యాలు వినిపిస్తున్నాయి కదా! సహజ సిద్ధమైన వాయిద్యాలు ఎంత శ్రేష్ఠమైనవి! ఈ దివ్య జన్మలోని ఈ సంతోష వాయిద్యాలు అనగా శ్వాస, దివ్య జన్మ యొక్క శ్రేష్ఠ కానుక. బ్రాహ్మణ జన్మ లభించడంతోనే ఈ సంతోష వాయిద్యాలు కానుకగా లభించాయి కదా! వాయిద్యాలు వాయించేటప్పుడు కూడా రెండు వేళ్ళూ పైకి కిందకి కదుపుతారు కదా! అలాగే శ్వాస నడవడం అనగా వాయిద్యాలు మ్రోగడం. శ్వాస ఎప్పుడూ ఆగిపోజాలదు. అలాగే వాయిద్యాలు కూడా ఎప్పుడూ ఆగిపోజాలవు. సంతోషముతో కూడుకున్న అందరి వాయిద్యాలు బాగా నడుస్తున్నాయి కదా! డబల్‌ విదేశీయులు ఏమని భావిస్తున్నారు? భోలాభండారి నుండి అన్ని ఖజానాలు తీసుకుని మీ భండారాన్ని నిండుగా చేసుకున్నారు కదా! వీటి ద్వారా 21 జన్మలు మీ భండారాలు నిండుగా ఉంటాయి. నింపుకునే శ్రమ చేయనవసరం లేదు. ఎంతో సుఖంగా ప్రాలబ్ధము ప్రాప్తిస్తుంది. ఇప్పటి ఈ పురుషార్థము 21 జన్మల కొరకు ప్రాలబ్ధము. 21 జన్మలు సదా సంపన్న రూపంలో ఉంటారు. మరి పురుషార్థమేం చేశారు? శ్రమ అనిపిస్తోందా? పురుషార్థం అనగా కేవలం కేవలం స్వయాన్ని ఈ రథములో విరాజమానమై ఉన్న పురుషుడను అనగా ఆత్మగా భావించండి. దీనినే పురుషార్థమని అంటారు. ఈ పురుషార్థము చేశారు కదా! ఈ పురుషార్థ ఫల స్వరూపంగా 21 జన్మలు సదా సుఖంగా మరియు ఆనందంగా ఉంటారు. ఇప్పుడిది కూడా సంగమయుగము ఆనందాల యుగము. ఇది తికమకపడే యుగము కాదు, ఆనందాల యుగము. ఒకవేళ ఏదైనా విషయంలో తికమకపడినట్లయితే సంగమయుగము నుండి పాదాలను కాస్త కలియుగము వైపుకు తీసుకెళ్తారు. అందువలన చిక్కులలో పడ్తారు. సంకల్పము మరియు బుద్ధి రూపి పాదము సంగమయుగంలో ఉన్నట్లయితే సదా ఆనందాలలో ఉంటారు. సంగమయుగమనగా ఇరువురి మిలనము జరుపుకునే యుగము. కావున ఇది తండ్రి మరియు పిల్లలు మిలనము జరుపుకునే సంగమయుగము. ఎక్కడైతే మిలనము జరుగుతుందో అక్కడ ఆనందం ఉంటుంది. కావున ఇది వేడుకలు జరుపునే జన్మ కదా! కావున తికమకల నామ-రూపాలు కూడా ఉండరాదు. ఈ వేడుకల సమయంలో ఆత్మికమైన వేడుకలు బాగా జరుపుకోండి. డబల్‌ విదేశీయులైతే డబల్‌ ఆనందములో ఉండేవారు కదా! ఇటువంటి ఆనందాల జన్మకు అభినందనలు తికమకపడేందుకు విశ్వంలో అనేక ఆత్మలు ఉన్నారు. మీరు అందుకు లేరు. అటువంటివారు ముందే ఎంతోమంది ఉన్నారు. వేడుకలు జరుపుకునే మీరు కొద్దిమందే ఉన్నారు. మీ ఈ శ్రేష్ఠ జయంతిని అర్థం చేసుకున్నారా? అలాగే ఈనాటి జ్యోతిష్య విద్య గలవారు దినము, తిథి, మరియు వేళ ఆధారం పై భాగ్యము గురించి తెలియజేస్తారు. మీ అందరి వేళ ఏది? తిథి ఏది? తండ్రితో పాటు బ్రాహ్మణుల జన్మ కూడా జరిగింది కదా! కావున భగవంతుని తిధి ఏదైతే ఉందో అదే మీ తిథి.
భగవంతుని అవతారం అనగా దివ్యజన్మ జరిగిన వేళ ఏదైతే ఉందో, అదే మీ వేళ కూడా అయ్యింది. ఇది ఎంతటి ఉన్నతమైన వేళ. ఎంత ఉన్నతమైన రేఖ. దీనినే దశ అని అంటారు. తండ్రితో పాటు మా జన్మ జరిగిందని హృదయంలో ఉల్లాస-ఉత్సాహాలు ఉండాలి. బ్రహ్మ, బ్రాహ్మణులు లేకుండా ఏమీ చేయజాలరు. శివబాబా బ్రహ్మ లేకుండా ఏమీ చేయజాలరు. కావున జత జతలో జరిగింది కదా. కావున జన్మతిథి, జన్మవేళల మహత్వమును సదా గుర్తుంచుకోండి. ఏ తిథిన భగవంతుడు అవతరించారో అదే తిథినాడు ఆత్మలైన మనము అవతరించాము. పేరు, రాశి కూడా చూడండి. బ్రహ్మ బ్రాహ్మణులు, బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారీలు. నామరాశి కూడా శ్రేష్ఠమైనది. అటువంటి శ్రేష్ఠజన్మ లేక జీవితము కలిగిన పిల్లలను చూసి తండ్రి సదా హర్షిస్తారు. పిల్లలు, ''ఓ¬ బాబా, ఓ¬'' అని అంటారు. తండ్రి, ''ఓ¬! ఓ¬ పిల్లలూ'' అని అంటారు. ఇటువంటి పిల్లలు కూడా ఎవ్వరికీ లభించరు.
ఈనాటి దివ్యజన్మ యొక్క విశేష కానుకను బాప్‌దాదా స్నేహితులైన పిల్లలందరికీ రెండు స్వర్ణిమ పదాలుగా ఇస్తున్నారు. ఒకటి - సదా స్వయాన్ని తండ్రి కంటిపాపలు(నూరేరతన్‌) అని భావించండి. నూరేరతన్‌ అనగా సదా నయనాలలో ఇమిడి ఉన్నవారు. నయనాలలో ఇమిడి ఉన్న స్వరూపము బిందువు. నయనాలలో బిందువు చేసే అద్భుతముంది. కావున నూరేరతన్‌ అనగా బిందువైన తండ్రితో ఇమిడి ఉన్నాను, స్నేహములో ఇమిడి ఉన్నాను. కనుక నేను కంటిపాపను అన్న స్వర్ణిమ పదమును గుర్తుంచుకోండి. రెండవది, సదా తండ్రి తోడు, తండ్రి చేయి నా పై ఉంది. బాబా తోడు కూడా ఉంది. వారి చేయి కూడా నా పైన ఉంది. సదా ఆశీర్వాదాల చేయి ఉంది. అంతేకాక సదా సహయోగము తోడుగా ఉంది. కావున సదా తండ్రి తోడు మరియు చేయి నా పై ఉండనే ఉన్నాయి. తోడునివ్వడం చేయినుంచడం కాదు. వారు తోడుగా ఉండనే ఉన్నారు. ఈ రెండవ స్వర్ణిమ వాక్కు - ''సదా తోడుగా ఉన్నారు మరియు సదా వారి చేయి నా పై ఉంది.'' అన్నది ఈనాటి ఈ దివ్యజన్మ కానుక. మంచిది.
ఇటువంటి నలువైపులా ఉన్న సదా శ్రేష్ఠ భాగ్యశాలి పిల్లలకు, సదా ప్రతి శ్వాసను సంతోషమునిచ్చే వాయిద్యముగా అనుభవం చేసే పిల్లలకు, డబల్‌ హీరో పిల్లలకు, సదా భగవంతుడు మరియు భాగ్యము యొక్క స్మృతి స్వరూపులైన పిల్లలకు భోలానాధుడు, అమరనాధుడు, వరదాత అయిన తండ్రి చాలా చాలా దివ్యజన్మ శుభాకాంక్షలతో పాటు ప్రియస్మృతులు మరియు నమస్తే!
దాదీలతో :- బేహద్‌ తండ్రి బాహువులు చాలా విశాలమైనవి. ఆ స్నేహ బాహువులలో, ఒడిలో అందరు ఇమిడి ఉన్నారు. సదా పిల్లలందరు తండ్రి భుజాలలో, భుజాల మాలలు లోపల ఉన్నప్పుడే మాయాజీతులుగా ఉంటారు. మీరు బ్రహ్మతో పాటు జన్మ తీసుకునే శ్రేష్ఠ ఆత్మలు కదా! తిథిలో కొద్దిగా కూడా తేడా లేదు. అందుకే బ్రహ్మకు అనేక ముఖాలు చూపించారు. బ్రహ్మకే 5 ముఖాలు లేక 3 ముఖాలు చూపిస్తారు. ఎందుకంటే బ్రహ్మతో పాటు బ్రాహ్మణులు కూడా ఉన్నారు. అయితే మీరు మూడు ముఖాల రూపంలో ఉన్నారా లేక ఐదు ముఖాల రూపంలో ఉన్నారా? ముఖాలు కూడా సహయోగులుగా ఉంటాయి కదా! తండ్రికి కూడా నషా ఉంది, అది ఏ నషా? మొత్తం విశ్వంలో ఏ తండ్రి అయినా ఇటువంటి పిల్లలను వెతికినా దొరుకుతారా? దొరకరు. ఇటువంటి పిల్లలు లభించరని తండ్రి అంటారు. ఇటువంటి తండ్రి లభించరని పిల్లలంటారు. బాగుంది. పిల్లలే ఇంటికి శోభ. కేవలం తండ్రి ఒంటరిగా ఉంటే ఇంటికి శోభ ఉండదు. కావున పిల్లలు ఈ విశ్వమనే ఇంటికి శోభ. ఇంతమంది బ్రాహ్మణులందరి శోభను తీసుకొచ్చేందుకు నిమిత్తంగా ఎవరయ్యారు? పిల్లలే అయ్యారు కదా! తండ్రి కూడా పిల్లల శోభను చూసి సంతోషిస్తారు. తండ్రి మీ అందరికన్నా ఎక్కువగా మాలను స్మరించవలసి వస్తుంది. మీరైతే ఒకే తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది, తండ్రి ఎన్ని మాలలను స్మరించవలసి ఉంటుంది. భక్తిమార్గములో ఎన్ని మాలలైతే వేశారో అన్ని మాలలను తండ్రి ఇప్పుడు స్మరించవలసి వస్తుంది. ఒక్క రోజు కూడా పిల్లల మాలలో ఒక్కరినైనా తండ్రి స్మరింపకుండా ఉండడం జరగజాలదు. కావున తండ్రి కూడా నౌధా భక్తి చేసినట్లే కదా! ఒక్కొక్కరి విశేషతల గుణాల మాలను తండ్రి స్మరిస్తారు. ఎన్నిసార్లు స్మరిస్తారో అంతగా ఆ గుణాలు మరియు విశేషతలు ఇంకా తాజాగా అవుతూ ఉంటాయి. మాలను తండ్రి స్మరిస్తారు కానీ మాల ఫలాన్ని వారు పిల్లలకిస్తారు, స్వయం తీసుకోరు. మంచిది. బాప్‌దాదా అయితే సదా పిల్లల జతలోనే ఉంటారు. ఒక్క క్షణం కూడా పిల్లల నుండి వేరుగా ఉండలేరు. వేరుగా ఉండాలనుకున్నా ఉండలేరు. ఎందుకు? ఎంతెంతగా పిల్లలు స్మృతి చేస్తారో అంతగా దానికి బదులు అయితే ఇస్తారు కదా! స్మృతికి ప్రతిఫలం అయితే ఇవ్వవలసి ఉంటుంది కదా! కావున ఒక్క సెకండు కూడా పిల్లలు లేకుండా ఉండలేరు. సదా తోడుగా ఉండే ఇటువంటి అద్భుతాన్ని ఎప్పుడూ చూసి ఉండరు తండ్రి పిల్లలతో అసలు వేరు కాకుండా ఉండే తండ్రి, పిల్లల జోడీని ఎప్పుడూ చూసి ఉండరు. చాలా మంచి పూదోట తయారయింది. మీ అందరికీ కూడా ఈ పూదోట ఎంతో నచ్చుతుంది కదా! ఒక్కొక్కరి సుగంధము అతీతమైనది మరియు ప్రియమైనది. కావున అల్లా పూదోట మహిమ చేయబడింది.
మీరంతా ఆదిరత్నాలు, ఒక్కొక్క రత్నానికి ఎంత విలువ ఉంది! ప్రతి సమయంలో, ప్రతి కార్యంలో, ప్రతి రత్నము అవసరం ఉంది. కావున మీరంతా శ్రేష్ఠ రత్నాలు. ఇప్పటి వరకు కూడా రత్నాల రూపంలో మీకు పూజ జరుగుతోంది. ఇప్పుడు అనేక ఆత్మలకు విఘ్నవినాశకులుగా అయ్యి సేవ చేస్తున్నారు. అందుకే స్మృతిచిహ్న రూపంలో ఒక్కొక్క రత్నానికి విలువ ఉంటుంది. కొన్ని విఘ్నాలను నాశనం చేసే రత్నాలుగా ఉంటే, మరికొన్ని మరో రకంగా ఉంటాయి. కావున ఇప్పుడు చివరి వరకు కూడా స్థూలమైన స్మృతి చిహ్న రూపము సేవ చేస్తూ ఉంది. ఇటువంటి సేవాధారులుగా అయ్యారు. అర్థమయిందా!
సమ్ళేనంలో వచ్చిన విదేశీ ప్రతినిధులతో అవ్యక్త బాప్‌దాదా కలయిక
అందరూ ఎక్కడకు చేరుకున్నారు? తండ్రి ఇంటికి వచ్చారు. ఇలా అనుభవం చేస్తున్నారా? తండ్రి ఇంటికి అతిథులు వస్తారా లేక పిల్లలు వస్తారా? పిల్లలు అధికారులా లేక అతిథులా? తండ్రి ఇంటికి వచ్చారు. తండ్రి ఇంట్లోకి సదా అధికారి పిల్లలే వస్తారు. ఇప్పటి నుండి తమను అతిథులుగా కాక తండ్రికి పిల్లలుగా మహాన్‌ ఆత్మలుగా భావిస్తూ ముందుకు వెళ్తూ ఉండండి. భాగ్యవంతులుగా ఉన్నారు, అందుకే ఈ స్థానములోకి చేరుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడకు చేరుకోవడమే ఒక భాగ్యము, కానీ ఇక ముందు ఏం చేయాలి? ఇప్పుడు సదా తోడుగా ఉండడం. స్మృతిలో ఉండడమే తోడుగా ఉండడం. ఒంటరిగా వెళ్లకండి. ఎక్కడికి వెళ్లినా, ఏ కర్మ చేసినా కంబైండుగా ఉండి కంబైండు రూపంలో చేయడం వలన సదా సహజంగా మరియు సఫలతను అనుభవం చేస్తారు. సదా తోడుగా ఉంటామనే సంకల్పం తప్పకుండా చేసి వెళ్లండి. పురుషార్థం చేస్తాము, చూస్తాము అని కాదు, చేయాల్సిందే. ఎందుకంటే దృఢత సఫలతకు తాళంచెవి. కనుక ఈ తాళంచెవిని సదా మీ జతలో ఉంచుకోండి. ఇది ఎటువంటి తాళంచెవి అంటే సంకల్పం చేస్తే ఏ ఖజానా కావాలనుకుంటే ఆ ఖజానా లభిస్తుంది. ఈ తాళంచెవిని సదా తోడుగా ఉంచుకోవడమంటే సదా సఫలతను పొందడం. ఇప్పుడు మీరు అతిథులు కారు, అధికారీ ఆత్మలు. బాప్‌దాదా కూడా ఇటువంటి అధికారి పిల్లలను చూసి హర్షితమవుతారు. ఏ అనుభవం చేశారో ఆ అనుభవాల ఖజానాను సదా పంచుతూ ఉండండి. ఎంతగా పంచుతారో అంతగా పెరుగుతూ ఉంటుంది. కావున మహాదానులుగా అవ్వండి. కేవలం మీ వద్దనే ఉంచుకోకండి.
వీడ్కోలు సమయంలో(3-30గం||లకు) :- పిల్లలందరికి అభినందనలతో పాటు గుడ్‌మార్నింగ్‌. ఎలాగైతే ఈనాటి రాత్రిని శుభమిలనం చేస్తూ ఆనందంలో గడిపారో అలా సదా రాత్రింబవళ్లు తండ్రి మిలనం చేస్తూ ఆనందంలో గడుపుతూ ఉండండి. సంగమయుగమంతా తండ్రి నుండి అభినందనలు తీసుకుంటూ వృద్ధిని పొందుతూ ముందుకు వెళ్తూ అందరినీ ముందుకు తీసుకెళ్తూ ఉండండి. సదా మహాదానులుగా, వరదానులుగా అయి అనేక ఆత్మలకు దానమూ ఇవ్వండి, వరదానమూ ఇవ్వండి. మంచిది. ఇటువంటి సదా విశ్వకళ్యాణకారులకు, సదా దయాహృదయులకు సదా సర్వుల పట్ల శుభభావనను ఉంచే పిల్లలకు ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌.

వరదానము :- ''అనుభూతి శక్తి ద్వారా స్వ పరివర్తన చేసుకునే తీవ్ర పురుషార్థీ భవ''
ఏ పరివర్తనకైనా సహజమైన ఆధారమ అనుభూతి శక్తి. ఎప్పటివరకైతే అనుభూతి శక్తి రాదో, అప్పటివరకు బ్రాహ్మణ జీవితములో విశేషతలు అనే పునాది దృఢంగా ఉండదు. ఉల్లాస-ఉత్సాహాల నడవడిక ఉండదు. ఎప్పుడైతే అనుభూతి శక్తి ప్రతి విషయాన్ని అనుభవీలుగా చేస్తుందో అప్పుడు తీవ్ర పురుషార్థులుగా అయిపోతారు. అనుభూతి శక్తి సదా కాలికంగా సహజంగా పరివర్తన చేయిస్తుంది.

స్లోగన్‌ :- '' స్నేహ స్వరూపాన్ని సాకారంలో ప్రత్యక్షం(ఎమర్జ్‌) చేసి బ్రహ్మబాబా సమానంగా అవ్వండి.''

Friday, 27 September 2019

Telugu Murli 28/09/2019

28-09-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - తండ్రి శ్రీమతమును అనుసరిస్తూ స్వయాన్ని అలంకరించుకోండి. పరచింతన చేస్తూ మీ అలంకారాన్ని పాడు చేసుకోకండి, సమయాన్ని వృథా చేయకండి. ''

ప్రశ్న :- పిల్లలైన మీరు తండ్రి కంటే చురుకైన ఇంద్రజాలికులు - ఎలా ?
జవాబు :- ఇక్కడ మీరు కూర్చుంటూ కూర్చుంటూనే లక్ష్మినారాయణుల వలె అలంకరించుకుంటున్నారు. ఇక్కడ కూర్చునే తమను తాము పరివర్తన చేసుకుంటున్నారు. ఇది కూడా ఇంద్రజాలమే. కేవలం తండ్రిని స్మృతి చేయడం వలన మీ శృంగారము జరిగిపోతుంది. కాళ్లు, చేతులు కదిలించే పని కూడా లేదు. కేవలం ఆలోచన చేసే విషయము. యోగము ద్వారా మీరు శుభ్రంగా, స్వచ్ఛంగా, శోభాయమానంగా అవుతారు. మీ ఆత్మ మరియు శరీరము రెండూ కంచనంగా(బంగారముగా) అవుతాయి. ఇది కూడా అద్భుతమే కదా.

ఓంశాంతి. ఆత్మిక ఇంద్రజాలికుడు కూర్చుని తండ్రి కంటే చురుకైన ఇంద్రజాలికులైన తన ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మీరిక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ కూర్చుని ఉన్నా ఎలాంటి కదలికా లేదు. తండ్రి లేక ప్రియుడు తన ప్రేయసులకు యుక్తి తెలుపుతున్నారు. ప్రియుడు చెప్తున్నారు - ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నారు? స్వయాన్ని మీరు ఈ లక్ష్మినారాయణుల వలె అలంకరించుకుంటున్నారు. మిమ్ములను చూసి అలా ఎవరైనా భావిస్తారా? మీరందరూ ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఎవరికైనా అర్థమవుతుందా? మీరిక్కడ నంబరువారు పురుషార్థానుసారముగానే ఉన్నారు కదా. ఈ విధంగా అలంకారమూర్తులుగా అవ్వాలని తండ్రి చెప్తారు. భవిష్య అమరపురికి వెళ్లడమే మీ లక్ష్యము. మీరిక్కడ ఏం చేస్తున్నారు? స్వర్గ శృంగారము కొరకు పురుషార్థము చేస్తున్నారు. దీనిని ఏమంటారు? ఇక్కడ కూర్చుని స్వయాన్ని పరివర్తన చేసుకుంటున్నారు. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ స్మృతి చేసేందుకు 'మన్మనాభవ' అనే తాళంచెవిని తండ్రి ఇచ్చేశారు. ఇది తప్ప వ్యర్థ విషయాలను వింటూ, వినిపిస్తూ సమయాన్ని వృథా చేయకండి. మీరు స్వయాన్ని అలంకరించుకోవడంలోనే లగ్నమై ఉండండి. ఇతరులు చేస్తున్నారా లేదా? అని చూడకండి. అందులో మీకేం వస్తుంది? మీరు మీ పురుషార్థంలో ఉండండి. ఇవన్నీ ఎంతగా అర్థము చేసుకునే విషయాలు! ఎవరైనా కొత్తవారు వింటే తప్పకుండా ఆశ్చర్యపోతారు. మీలో కూడా కొందరైతే అలంకరించుకుంటున్నారు, కొందరైతే ఇంకా పాడు చేసుకుంటున్నారు. పరచింతన మొదలైన వాటిలో సమయాన్ని వృథా చేస్తూ ఉంటారు. మీరు కేవలం ''నేను ఏమి చేస్తున్నానని స్వయాన్ని పరిశీలించుకోండి'' అని తండ్రి పిల్లలకు తెలుపుతున్నారు. చాలా చిన్న ఉపాయము తెలిపించారు, ''మన్మనాభవ'' అనే పదమొక్కటే చాలు. మీరిక్కడ కూర్చున్నా మీ బుద్ధికి సృష్టిచక్రము ఎలా తిరుగుతూ ఉందో తెలుసు. మనమిప్పుడు మళ్లీ విశ్వమంతటినీ అలంకరిస్తున్నాము. మీరు ఎంతో పదమాపదమ్‌ భాగ్యశాలురు. మీరిక్కడ కూర్చుని ఉండే ఎంత గొప్ప కార్యము చేస్తున్నారు. కాళ్లు, చేతులు కదిలించే పని కూడా లేదు. కేవలం ఆలోచించవలసిన విషయము. మేము ఇక్కడ కూర్చుని విశ్వాన్ని అత్యుత్తమంగా అలంకరిస్తున్నామని అంటారు. 'మన్మనాభవ' మంత్రము ఎంత గొప్పది! ఈ యోగము ద్వారానే మీరు చేసిన పాపాలు భస్మమౌతూపోతాయి. మీరు స్వచ్ఛంగా అవుతూ అవుతూ మళ్లీ ఎంతో శోభాయమానమవుతారు. ఇప్పుడు ఆత్మ పతితమైనందున శారీరిక స్థితి కూడా ఎలా అయిపోయిందో చూడండి, ఇప్పుడు మీ ఆత్మ, శరీరము కంచనంగా అవుతాయి. ఇది అద్భుతం కదా. కావున స్వయాన్ని ఇలా అలంకరించుకోవాలి. దైవీగుణాలను కూడా ధారణ చేయాలి. తండ్రి అందరికి ఒకే మార్గమును తెలుపుతారు - తండ్రి మరియు ఆస్తి(అల్ఫ్‌, బే). కేవలం తండ్రిని స్మృతి చేసే విషయము ఒక్కటే. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే మీ అలంకారము పూర్తిగా మారిపోతుంది.
తండ్రి కంటే మీరు గొప్ప ఇంద్రజాలికులు. మీరు అలంకారమూర్తులుగా అయ్యేందుకు తండ్రి యుక్తులు తెలుపుతారు. ఇలా ఇలా చేయడం వలన అలంకారం జరుగుతుంది. స్వయాన్ని అలంకరించుకోకుంటే మిమ్ములను మీరు అనవసరంగా నష్టపరచుకుంటారు. భక్తిమార్గములో మనము ఏమేం చేసేవారమో మీరు అర్థం చేసుకున్నారు. అలంకారమునంతా పాడు చేసుకొని ఎలా అయిపోయారు! ఇప్పుడు ఒకే పదముతో తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీ అలంకారము జరుగుతుంది. పిల్లలకు ఎంత బాగా అర్థం చేయించి తాజాగా చేస్తారు. ఇక్కడ కూర్చుని మీరు ఏం చేస్తారు? స్మృతియాత్రలో కూర్చుని ఉన్నారు. ఒకవేళ ఎవరి ఆలోచనలైనా మరెటు వైపైనా ఉంటే సింగారము జరగదు. మీరు అలంకరింపబడి ఉంటే ఇతరులకు కూడా మార్గమును తెలపాలి. ఇలా అలంకరించేందుకే తండ్రి వస్తారు. శివబాబా, మీరు ఎంత అద్భుతం చేస్తారు, మీరు మమ్ములను ఎంత బాగా అలంకరిస్తారు! లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ స్వయాన్ని అలంకరించుకోవాలి. కొందరైతే స్వయాన్ని అలంకరించుకొని ఇతరులను కూడా అలంకరిస్తారు. కొందరైతే స్వయాన్ని అలంకరించుకోరు, ఇతరుల అలంకారాన్ని కూడా పాడు చేస్తూ ఉంటారు. వ్యర్థమైన మాటలు వినిపించి వారి స్థితిని కూడా క్రిందికి తెస్తారు. స్వయం అలంకారము నుండి దూరమౌతారు, ఇతరుల అలంకారమును కూడా నిలిపేస్త్తారు. తండ్రి ఎటువంటి యుక్తులను తెలుపుతారో బాగా ఆలోచించండి. భక్తిమార్గములోని శాస్త్రాలను చదవడం వలన ఈ ఉపాయాలు రావు. శాస్త్రాలైతే భక్తిమార్గములోనివి. శాస్త్రాలను మీరెందుకు నమ్మరని మిమ్ములను అడుగుతారు. మేము అన్నీ ఒప్పుకుంటామని అర్ధకల్పము భక్తి చేశామని చెప్పండి. శాస్త్రాలను చదివాము, ఎందుకు నమ్మము? రాత్రి పగలు ఉన్నప్పుడు తప్పకుండా రెండిటినీ ఒప్పుకుంటారు కదా. ఇది బేహద్‌ పగలు మరియు రాత్రి.
తండ్రి చెప్తున్నారు - మధురమైన పిల్లలారా, మీరు స్వయాన్ని అలంకరించుకోండి, సమయాన్ని వృథా చేయకండి. సమయము చాలా తక్కువగా ఉంది. మీ బుద్ధి చాలా విశాలంగా ఉండాలి. పరస్పరము చాలా ప్రేమతో ఉండాలి. సమయాన్ని వృథా చేయరాదు. ఎందుకంటే మీ సమయము చాలా విలువైనది. మీరు గవ్వల నుండి వజ్రాలుగా అవుతారు. ఊరకే ఇదంతా వినడం లేదు. ఇదేమైనా కథనా! తండ్రి ఒక్క పదమునే వినిపిస్తారు. గ్పొప-గొప్ప వ్యక్తులు ఎక్కువగా మాట్లాడరు. తండ్రి అయితే ఒక్క క్షణములో జీవన్ముక్తికి వెళ్లే మార్గమును తెలుపుతారు. వీరు(లక్ష్మినారాయణులు) ఉన్నతమైన సింగారము గలవారు. కనుక వారి చిత్రాలే ఉన్నాయి. వారిని చాలా పూజిస్తారు. ఎంత గొప్ప వ్యక్తులుగా ఉంటారో అంత పెద్ద మందిరాలను నిర్మిస్తారు. చాలా బాగా అలంకరిస్తారు. ఇంతకుముందు దేవతల చిత్రాలకు వజ్రాల హారాలను ధరింపజేసేవారు. బాబాకైతే అనుభవముంది కదా. బాబాయే స్వయంగా వజ్రాల హారము లక్ష్మినారాయణుల కొరకు తయారు చేయించారు. వాస్తవానికి అక్కడ వారు ధరించే హారాలను ఇక్కడ ఎవ్వరూ తయారు చేయలేరు. మీరిప్పుడు నంబరువారు పురుషార్థానుసారంగా తయారు చేస్తున్నారు. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలారా, మీరు మీ సమయాన్ని వృథా చేయకండి. ఇతరుల సమయాన్ని కూడా వృథా చేయకండి. తండ్రి చాలా సహజమైన యుక్తిని తెలుపుతారు. నన్ను స్మృతి చేస్తే పాపాలన్నీ నశిస్తాయి. స్మృతి చేయకుండా ఇంత బాగా అలంకరించుకోలేరు. మీరు ఇలా అయ్యేవారు కదా. దైవీ స్వభావాన్ని ధారణ చేయాలి. ఇందులో చెప్పే అవసరము కూడా లేదు. కాని రాతిబుద్ధిగా ఉన్నందువలన అన్ని విషయాలు అర్థం చేయించవలసి ఉంటుంది. ఒక్క క్షణములో అర్థము చేసుకునే విషయము. తండ్రి చెప్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా! మీరు మీ తండ్రిని మర్చిపోయినందున మీ అలంకారాన్ని పాడు చేసుకున్నారు. నడుస్తూ, తిరుగుతూ అలంకరించుకుంటూ ఉండమని తండ్రి చెప్తారు. కాని మాయ కూడా తక్కువైనది కాదు. బాబా, మీ మాయ చాలా విసిగిస్తోందని కొందరు వ్రాస్తారు. అరే! నా మాయ ఎక్కడుంది, ఇది ఆట కదా. నేను మిమ్ములను మాయ నుండి విడిపించేందుకు వచ్చాను. నా మాయ ఎక్కడుంది? ఇప్పుడు పూర్తిగా దీని రాజ్యముగానే ఉంది. ఎలాగైతే ఈ రాత్రికి, పగలుకు కొద్ది సమయము కూడా తేడా రాజాలదో, అలా ఇది బేహద్‌ రాత్రి-పగలు. ఇందులో కూడా ఒక్క సెకండు కూడా మార్పు రాజాలదు. పిల్లలైన మీరిప్పుడు నంబరువారు పురుషార్థానుసారంగా ఇలా అలంకరించుకుంటున్నారు. చక్రవర్తి రాజులుగా అవ్వాలంటే చక్రమును తిప్పుతూ ఉండండి. భలే గృహస్థ వ్యవహారంలో ఉండండి, ఇందులో బుద్ధితో పని చేయాల్సి ఉంటుంది. ఆత్మలోనే మనసు, బుద్ధి ఉన్నాయి. మీకిక్కడ బయటి చిక్కులు, వ్యాపారాదులు ఏవీ లేవు. స్వయాన్ని అలంకరించుకునేందుకు, తాజాగా అయ్యేందుకే మీరు ఇక్కడకు వస్తారు. తండ్ర్రి అందరినీ ఒకే విధంగా చదివిస్తారు. ఇక్కడ తండ్రి ఎదురుగా కూర్చుని కొత్త కొత్త పాయింట్లు వినేందుకు తండ్రి వద్దకు వస్తారు. మళ్లీ ఇంటికి వెళ్తే విన్నవన్నీ వెలుపలికి వెళ్లిపోతాయి. ఇక్కడి నుండి బయటకు వెళ్లగానే జోలె కత్తెరించబడ్తుంది. అంటే విన్నవన్నీ బుద్ధి నుండి ఖాళీ అయిపోతాయి. విన్న దానిని గురించి మనన చింతన చెయ్యరు. ఇక్కడ మీ కొరకు ఏకాంత స్థానాలు చాలా ఉన్నాయి. బయట అయితే నల్లులు తిరుగుతూ ఉంటాయి. ఒకరిని ఒకరు చంపుకుంటూ, రక్తము పీల్చి తాగుతూ ఉంటారు.
కావున తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - మీ ఈ సమయము చాలా విలువైనది, దీనిని వృథా చేయకండి. స్వయాన్ని అలంకరించుకునేందుకు చాలా యుక్తులు లభించాయి. నేను అందరినీ ఉద్ధరించేందుకు వస్తాను. మీకు విశ్వచక్రవర్తి పదవినిచ్చేందుకు వచ్చాను. కావున ఇప్పుడు నన్ను స్మృతి చేయండి. సమయాన్ని వృథా చేయకండి. పని పాటలు చేస్తున్నా తండ్ర్రిని స్మృతి చేస్తూ ఉండండి. పరమపిత పరమాత్ముడైన ఒక్క ప్రియునికి ఇంతమంది ఆత్మలు ప్రేయసులుగా ఉన్నారు. దైహిక కథలు మొదలైనవైతే మీరు చాలా వింటూ వచ్చారు. అవన్నీ మర్చిపోండి అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. మేము మీ వారిగానే ఉంటామని భక్తిమార్గములో నన్ను స్మృతి చేశారు, ప్రతిజ్ఞ కూడా చేశారు. అనేకమంది ప్రేయసులకు ప్రియుడు ఒక్కరే. భక్తిమార్గములో బ్రహ్మలో లీనమైపోతామని చెప్తారు. ఇవన్నీ వ్యర్థ మాటలు. ఒక్క మనిషి కూడా మోక్షమును పొందలేరు. ఇది అనాది డ్రామా. ఎంతోమంది పాత్రధారులున్నారు. ఇందులో ఏ మాత్రము తేడా ఏర్పడజాలదు. కేవలం ఒక్క అల్ఫ్‌ను (తండ్రిని) స్మృతి చేస్తే మీకు అలంకారము జరుగుతుందని తండ్రి చెప్తారు. మీరిప్పుడు ఈ విధంగా (లక్ష్మినారాయణులుగా) అవుతున్నారు. అనేకసార్లు మనము ఈ విధంగా అలంకరించుకున్నామని మీకు స్మృతిలోకి వస్తుంది. బాబా కల్ప-కల్పము మీరు వస్తారు, మేము మీరు చెప్పిందే వింటాము. ఇవి ఎంత గుహ్యమైన విషయాలు! బాబా ఎంతో మంచి యుక్తిని తెలిపించారు. ఇలాంటి తండ్రికి బలిహారి అవుతాను. ప్రేయసీ ప్రియులు కూడా అందరూ ఒకే విధంగా ఉండరు. వీరు ఆత్మలందరికీ ఒకే ప్రియుడు. దైహిక విషయమేదీ లేదు. కానీ మీకు సంగమ యుగములోనే తండ్రి ద్వారా ఈ యుక్తి లభిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్లినా తినండి, తాగండి, తిరగండి, ఉద్యోగము చెయ్యండి, స్వయాన్ని అలంకరించుకుంటూ ఉండండి. ఆత్మలందరూ ఒకే ప్రియునికి ప్రేయసులు. వారినే స్మృతి చేస్తూ ఉంటే చాలు. మేము 24 గంటలు స్మృతి చేస్తూ ఉంటామని కొందరు పిల్లలంటారు. కాని సదా ఎవ్వరూ స్మృతి చేయలేరు. ఎక్కువలో ఎక్కువ రెండు-రెండున్నర గంటల వరకు స్మృతి చేెస్తారు. ఒకవేళ ఎక్కువ వ్రాస్తే బాబా నమ్మరు. ఇతరులకు స్మృతినిప్పించకపోతే మీరు స్మృతి చేస్తున్నారని ఎలా భావించాలి? ఇదేమైనా కష్టమైన విషయమా? ఇందులో ఏమైనా ఖర్చు ఉందా? ఏమీ లేదు. బాబాను స్మృతి చేస్తూ ఉంటే చాలు. మీ పాపాలు సమాప్తమైపోతాయి. దైవీగుణాలు కూడా ధారణ చేయాలి. పతితులైన వారెవ్వరూ శాంతిధామానికి, సుఖధామానికి వెళ్లలేరు. స్వయాన్ని ఆత్మ- ఆత్మ సోదరులుగా (భాయీ-భాయీగా) భావించమని పిల్లలకు తండ్రి చెప్తారు. 84 జన్మల పాత్ర ఇప్పుడు పూర్తి అవుతుంది. ఈ పాత శరీరాన్ని ఇప్పుడు వదిలి పెట్టాలి. డ్రామా ఎలా తయారయ్యిందో చూడండి. నంబరువారు పురుషార్థానుసారంగా మీకు తెలుసు. ప్రపంచములో ఎవ్వరూ ఏమీ అర్థం చేసుకోరు. మనము తండ్రి మతమును అనుసరిస్తున్నామా? అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. శ్రీమతానుసారము నడుచుకుంటే అలంకారము కూడా చాలా బాగుంటుంది. ఒకరికొకరు ఉల్టా విషయాలు వినిపించి లేక విని తమ అలంకారాన్ని పాడు చేసుకుంటారు, ఇతరుల అలంకారాన్ని కూడా పాడు చేస్తారు. మనము ఇలాంటి అలంకారమూర్తులుగా ఎలా అవ్వాలనే తపన పిల్లలకు ఉండాలి. మిగిలినవన్నీ సరిగ్గా ఉన్నాయి. కేవలం కడుపు కొరకు రొట్టె(భోజనం) లభిస్తే చాలు. వాస్తవానికి కడుపు ఎక్కువగా తినదు. మీరు భలే సన్యాసులే అయినా రాజయోగులు. అంత ఉన్నతమైనవారు కాదు, అంత నీచమైనవారూ కాదు. భలే తినండి కానీ అదే ఎక్కువగా అలవాటు పడరాదు. శివబాబా స్మృతి ఉందా? వారసత్వము గుర్తుందా? విశ్వరాజ్య అలంకారము గుర్తుందా? అని ఒకరికొకరు గుర్తు చేసుకోండి. ఇక్కడ కూర్చుని ఎంత సంపాదిస్తున్నారో ఆలోచించండి. ఈ సంపాదన ద్వారా అపారమైన సుఖం లభిస్తుంది. కేవలం స్మృతియాత్రను చేయడం తప్ప మరే కష్టమూ లేదు. భక్తిమార్గములో మనుష్యులు ఎన్నో ఎదురుదెబ్బలు తింటారు. ఇప్పుడు అలంకరించుకునేందుకు తండ్రి వచ్చారు. కనుక మీరు స్వయము గురించి బాగా ఆలోచించండి, మర్చిపోకండి. మాయ మరిపింపజేస్తుంది. తర్వాత ఎంతో సమయాన్ని వృథా చేస్తారు. మీ ఈ సమయము చాలా విలువైనది. కష్టపడి చదవడం వలన మనుష్యులు ఎలా ఉన్నవారు ఎలా తయారవుతారు! బాబా మీకు మరే కష్టమూ ఇవ్వరు. కేవలం నన్ను స్మృతి చేయండి అని అంటారు. పుస్తకాలు మొదలైనవేవీ తీసుకునే అవసరము లేదు. బాబా ఏ పుస్తకమైనా తీసుకుంటారా? నేను వచ్చి ఈ ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తు తీసుకుంటానని తండ్రి చెప్తారు. ఇతను ప్రజాపిత కదా. ఇంతమంది కుఖవంశావళులు(గర్భజనిత) ప్రజలెలా అవుతారు? పిల్లలు దత్తత తీసుకోబడ్తారు. తండ్రి ద్వారా వారసత్వము లభిస్తుంది. తండ్రి, బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటారు. కావున వారిని తల్లి, తండ్రి అని అంటారు. ఇది కూడా మీకు తెలుసు. తండ్రి రావడము చాలా ఖచ్ఛితంగా జరుగుతుంది. తండ్రి ఖచ్ఛితంగా సరియైన సమయంలో వస్తారు, వెళ్తారు. ప్రపంచము మార్పు అయితే జరగాల్సిందే. పిల్లలైన మీకిప్పుడు తండ్రి ఎంత తెలివినిస్తారు! తండ్రి మతమును అనుసరించాలి. విద్యార్థులు చదివిన దానినే బుద్ధిలో ఉంచుకోవాలి. మీరు కూడా ఈ సంస్కారమును తీసుకెళ్తారు. తండ్రిలో ఏ విధంగా సంస్కారముందో అలాగే ఆత్మలైన మీలో కూడా ఈ సంస్కారము నింపుకుంటారు. మళ్లీ ఇక్కడికి వచ్చినప్పుడు అదే పాత్ర పునరావృతమౌతుంది. నంబరువారు పురుషార్థానుసారము వస్తారు. అలంకరించుకునేందుకు ఎంత పురుషార్థము చేశాను, సమయాన్ని ఎక్కడా వృథా చేయలేదు కదా? అని మనసులో ప్రశ్నించుకోండి. బాబా హెచ్చరిస్తున్నారు - వ్యర్థమైన విషయాలలో ఎక్కడా సమయాన్ని వృథా చేయకండి. తండ్రి శ్రీమతమును గుర్తుంచుకోండి. మనుష్యుల మతమును అనుసరించకండి. మనము పాత ప్రపంచములో ఉన్నామని మీకు తెలియదు. మీరెలా ఉండేవారో తండ్రి తెలిపించారు. ఈ పాత ప్రపంచములో ఎంత అపారమైన దు:ఖముంది. ఈ పాత్ర కూడా డ్రామానుసారముగా లభించింది. డ్రామానుసారంగా అనేకానేక విఘ్నాలు కూడా వస్తాయి. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలారా! ఇది జ్ఞానము మరియు భక్తిల ఆట. అద్భుతమైన డ్రామా. ఇంత చిన్న ఆత్మలో మొత్తం పాత్ర అంతా అవినాశిగా నిండి ఉంది. ఆ పాత్రను చేస్తూనే ఉంటుంది. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఇతర విషయాలన్నీ వదిలి మేము లక్ష్మినారాయణుల వలె అలంకారమూర్తులుగా ఎలా అవ్వాలనే తపన(ధున్‌) ఉండాలి.
2. స్వయాన్ని ప్రశ్నించుకోవాలి - 1. శ్రీమతానుసారము నడుచుకొని మన్మనాభవ అనే తాళంచెవితో నా అలంకారాన్ని సరి చేసుకుంటున్నానా? 2. ఉల్టా విషయాలను విని, వినిపిస్తూ అలంకారము పాడు చేసుకోవడం లేదు కదా? 3. పరస్పరము ప్రేమగా ఉంటున్నామా? విలువైన మా సమయాన్ని ఎక్కడా వృథా చేసుకోవడం లేదు కదా? 4. దైవీ స్వభావాన్ని ధారణ చేశానా? అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి.

వరదానము :- '' స్వ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన కార్యములో ఇష్టమైన సఫలతను ప్రాప్తి చేసుకునే సిద్ధి స్వరూప భవ ''
ప్రతి ఒక్కరు స్వ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేసే సేవలో లగ్నమై ఉన్నారు. అందరి మనసులో ఈ విశ్వాన్ని పరివర్తన చేసే తీరాలి అన్న ఉల్లాస-ఉత్సాహాలున్నాయి. అంతేకాక పరివర్తన అవ్వనే అవుతుందనే నిశ్చయం కూడా ఉంది. ధైర్యమున్న చోట ఉల్లాస-ఉత్సాహాలుంటాయి. స్వ పరివర్తన ద్వారానే విశ్వ పరివర్తన కార్యములో ఇష్టమైన సఫలత ప్రాప్తిస్తుంది. కానీ ఈ సఫలత వృత్తి, వైబ్రేషన్లు, వాణి(వాచా) ఈ మూడు శక్తిశాలిగా ఉన్నప్పుడే ప్రాప్తిస్తుంది.

స్లోగన్‌ :- '' మాటలలో స్నేహము, సంయమము ఉంటే వాచా శక్తి జమ అవుతుంది ''

Thursday, 26 September 2019

Telugu Murli 27/09/2019

27-09-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - మీరు సర్వాత్మలకు కర్మ బంధనముల నుండి ముక్తి కలిగించు సాల్వేషన్‌ ఆర్మి. మీరు కర్మ బంధనములో చిక్కుకోరాదు. ''

ప్రశ్న :- ఏ అభ్యాసము చేస్తూ ఉంటే, ఆత్మ చాలా చాలా శక్తిశాలిగా అవుతుంది ?
జవాబు :- సమయము లభించినప్పుడంతా శరీరము నుండి భిన్నంగా ఉండే అభ్యాసము చేయండి. భిన్నముగా ఉండుట వలన ఆత్మకు శక్తి వస్తుంది, అందులో బలము నిండుతుంది. మీరు అంతర్భాగములో ఉన్న సైనికులు(అండర్‌గ్రౌండ్‌ మిలిటరి). మీకు 'అటెన్షన్‌ ప్లీస్‌' అనగా ఒక్క తండ్రి స్మృతిలో ఉండండి, అశరీరులుగా అవ్వండి అని అదేశము(డైరెక్షన్‌) లభిస్తుంది.

ఓంశాంతి. ఓంశాంతి అర్థమునైతే తండ్రి చాలా బాగా అర్థము చేయించారు. మిలిటరీవారు నిలబడినప్పుడు అటెన్షన్‌ అని అంటారు. అటెన్షన్‌ అనగా వారి దృష్టిలో మౌనంగా ఉండడం. ఇక్కడ కూడా మీకు తండ్రి అటెన్షన్‌ అని చెప్తారు అనగా ఒక్క తండ్రి స్మృతిలో ఉండండి. నోటితో మాట్లాడవలసి ఉంటుంది లేకపోతే వాస్తవానికి మాట్లాడటం నుండి కూడా దూరము కావాలి. అటెన్షన్‌, తండ్రి స్మృతిలో ఉన్నారా? తండ్రి ఆదేశము లేక శ్రీమతము లభిస్తుంది. మీరు ఆత్మనూ గుర్తించారు, తండ్రినీ గుర్తించారు కావున తండ్రిని స్మృతి చేయకుండా మీరు వికర్మాజీతులుగా లేక సతోప్రధాన పవిత్రులుగా అవ్వలేరు. ముఖ్యమైన విషయము ఇదే. తండ్రి చెప్తున్నారు - మధురాతి మధురమైన ప్రియమైన పిల్లలారా! స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి. ఇవన్నీ ఇప్పటి విషయాలే. వీటిని వారు అక్కడకు తీసుకెళ్లారు. వారూ మిలిట్రీవారే, అలాగే మీరు కూడా మిలిట్రీ వారే. అండర్‌గ్రౌండ్‌ మిలిట్రీ కూడా ఉంటుంది కదా. వారు గుప్తమైపోతారు. మీరు కూడా అండర్‌గ్రౌండులో ఉన్నారు. మీరు కూడా అదృశ్యమైపోతారు అనగా తండ్రిని స్మృతి చేయడంలో లీనమైపోతారు. దీనినే అండర్‌గ్రౌండ్‌ అని అంటారు. మిమ్ములను ఎవ్వరూ గుర్తించలేరు ఎందుకంటే మీరు గుప్తంగా ఉన్నారు కదా. మీరు చేయు స్మృతియాత్ర గుప్తంగా ఉంది. తండ్రి చెప్తున్నారు - కేవలం నన్ను స్మృతి చేయండి. ఎందుకంటే స్మృతి ద్వారానే ఈ ధీనులకు కళ్యాణము జరుగుతుందని తండ్రికి తెలుసు. ఇప్పుడు మిమ్ములను ధీనులని, దిక్కులేని వారని అంటారు కదా. స్వర్గములో ధీనులెవ్వరూ ఉండరు. ఎవరైతే బంధనములో చిక్కుకొని ఉంటారో వారిని ధీనులని, అభాగ్యులని అంటారు. ఇది కూడా మీకు తెలుసు. తండ్రి అర్థం చేయించారు - మిమ్ములను లైట్‌హౌస్‌ అని కూడా అంటారు. తండ్రిని కూడా లైట్‌హౌస్‌ అని అంటారు. ఒక కంటిలో శాంతిధామము, మరొక కంటిలో సుఖధామము ఉంచుకోండి అని క్షణ-క్షణము తండ్రి అర్థం చేయిస్తారు. మీరు లైట్‌హౌస్‌ వంటి వారు. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ మీరు లైటుగా ఉండండి. అందరికీ సుఖధామము - శాంతిధామాల మార్గమును తెలుపుతూ ఉండండి. ఈ దు:ఖధామములో అందరి నావలు చిక్కుకుపోయి ఉన్నాయి. అందుకే మా నావను తీరానికి చేర్చండి అని అంటారు. హే నావికుడా! అందరి నావ చిక్కుకుపోయింది. వారిని తీరానికి ఎవరు చేరుస్తారు? వారు ముక్తినిప్పించే సైన్యము కాదు. ఊరకనే ఆ పేరు పేట్టేశారు. వాస్తవానికి సాల్వేషన్‌ ఆర్మీ(ముక్తిని కలిగించు సైనికులు) మీరే, ప్రతి ఒక్కరికీ ముక్తినిప్పిస్తారు. అందరూ పంచ వికారాల సంకెళ్లలో చిక్కుకొని ఉన్నారు, అందువలన మమ్ములను విడిపించండి, ముక్తినివ్వండి....... అని వేడుకుంటూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు - ఈ స్మృతియాత్ర ద్వారా మీరు తీరానికి చేరుకుంటారు. ఇప్పుడైతే అందరూ చిక్కుకొని ఉన్నారు. తండ్రిని తోటమాలి అని కూడా అంటారు. ఈ విషయాలన్నీ ఇప్పటివే. మీరు పుష్పాలుగా తయారవ్వాలి. ఇప్పుడైతే అందరూ ముళ్ళుగా ఉన్నారు ఎందుకంటే హింసకులుగా ఉన్నారు. ఇప్పుడు అహింకులుగా అవ్వాలి. పావనంగా అవ్వాలి. ధర్మమును స్థాపించేందుకు పవిత్రమైన ఆత్మలే వస్తారు. వారు అపవిత్రంగా ఉండజాలరు. మొదట వచ్చినప్పుడు పవిత్రంగా ఉన్నందువలన వారి ఆత్మకు లేక శరీరానికి దు:ఖము లభించజాలదు ఎందుకంటే వారి పై ఏ పాప భారమూ ఉండదు. మనము పవిత్రంగా ఉన్నప్పుడు ఏ పాపమూ జరగదు. అలాగే ఇతరుల ద్వారా కూడా జరగదు. ప్రతి విషయము గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ధర్మమును స్థాపించేందుకు అక్కడి నుండి ఆత్మలు వస్తాయి. వారికి వంశము కూడా ఉంటుంది. సిక్కుధర్మము వారి వంశము కూడా ఉంటుంది. సన్యాసుల వంశము నడవదు. వారు రాజులుగా అవ్వరు. సిక్కు ధర్మములో మహారాజులు మొదలైనవారు ఉన్నారు కావున స్థాపన చేసే సమయంలో కొత్త ఆత్మయే వస్తుంది. ఏసుక్రీస్తు వచ్చి క్త్రెస్తవ ధర్మమును స్థాపించాడు. బుద్ధుడు బౌద్ధ ధర్మాన్ని, ఇబ్రహీం ఇస్లామ్‌ ధర్మాన్ని స్థాపించారు. అందరి పేర్లతో వారి రాశి కలుస్తుంది. దేవీ దేవతా ధర్మము వారిదైతే కలువదు. నిరాకారుడైన తండ్రియే వచ్చి దేవీ దేవతా ధర్మమును స్థాపిస్తారు, వారు దేహధారి కాదు. ఇతర ధర్మస్థాపకుల దేహాలకు పేరు ఉంటుంది. వీరు దేహధారి కారు. కొత్త ప్రపంచములో రాజ్యవంశము నడుస్తుంది. కావున తండ్రి చెప్తున్నారు - పిల్లలారా! స్వయాన్ని ఆత్మిక మిలిట్రీగా తప్పకుండా భావించండి. ఆ మిలిట్రీలోని కమాండర్‌ మొదలైనవారు వస్తే, ' అటెన్షన్‌ ' అని అన్న వెంటనే అందరూ అటెన్షన్‌లో నిలబడ్తారు. ఇప్పుడు వారైతే ప్రతి ఒక్కరూ తమ తమ గురువును స్మృతి చేస్తారు లేక శాంతిగా ఉంటారు. కానీ అది అసత్యమైన శాంతి. మనము ఆత్మలము, మన ధర్మమే శాంతి..... అని మీకు తెలుసు. మరి ఎవరిని స్మృతి చేయాలి? ఇప్పుడు మీకు జ్ఞానము లభించింది. జ్ఞాన సహితంగా స్మృతిలో ఉండుట వలన పాపము తొలగిపోతుంది. ఈ జ్ఞానము మరెవ్వరికీ లేదు. మనము ఆత్మలము, శాంతి స్వరూపులమని మానవులకు ఏ మాత్రము తెలియదు. మనము శరీరము నుండి భిన్నమై కూర్చోవాలి. ఇక్కడ మీకు ఆ బలము లభిస్తుంది. దీని ద్వారా స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయగలరు. స్వయాన్ని ఆత్మగా భావించి శరీరము నుండి డిటాచ్‌ అయ్యి ఎలా కూర్చోవాలో తండ్రి అర్థం చేయిస్తారు. ఆత్మలమైన మనము ఇప్పుడు ఇంటికి వాపస్‌ వెళ్లాలని మీకు తెలుసు. మనము అక్కడి నివాసులము. ఇన్ని రోజులు మనము ఇంటిని మర్చిపోయాము. మనము ఇంటికి వెళ్లాలని ఇతరులెవ్వరూ భావించరు. పతితమైన ఆత్మ వాపస్‌ వెళ్లజాలదు. ఎవరిని స్మృతి చేయాలో అర్థం చేయించేవారు కూడా లేరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఒక్కరినే స్మృతి చేయండి. ఇతరులెవ్వరినైనా స్మృతి చేసినా లాభమేముంది! భక్తి మార్గములో శివ, శివ అని అంటూ ఉంటారు, దీని వలన ఏమి జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. శివుని స్మృతి చేయడం వలన పాపము సమాప్తమవుతుందని ఎవ్వరికీ తెలియదు. శబ్ధము చేస్తే తప్పకుండా వినిపిస్తుంది. కానీ వీటన్నింటితో లాభమేమీ లేదు. బ్రహ్మబాబాకు ఈ గురువులందరి అనుభవముంది కదా.
తండ్రి చెప్పారు కదా - హే అర్జునా, వీటన్నింటిని వదిలేయ్‌......... సద్గురువు లభించినప్పుడు వీటన్నిటి అవసరము లేదు. సద్గురువు తేలుస్తారు(తార్‌తా హై). తండ్రి చెప్తున్నారు - నేను మిమ్ములను ఆసురీ ప్రపంచము నుండి దూరంగా తీసుకెళ్తాను. విషయ సాగరాన్ని దాటుకొని వెళ్లాలి. ఇవన్నీ అర్థము చేయించవలసిన విషయాలు. నావికుడు అనగా నావను నడిపేవాడు. కానీ అర్థము చేయించేందుకే తండ్రికి ఈ పేరు ఏర్పడింది. ఇప్పుడు వారిని ప్రాణేశ్వరుడైన బాబా అనగా ప్రాణదానము ఇచ్చే బాబా అని అంటారు, వారు అమరులుగా చేస్తారు. ఆత్మను ప్రాణమని అంటారు. ఆత్మ వెళ్లిపోతే, ప్రాణము వెళ్లిపోయిందని అంటారు. తర్వాత శరీరాన్ని ఉండనివ్వరు కదా. ఆత్మ ఉన్నప్పుడు శరీరము కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆత్మ లేకుంటే శరీరము నుండే దుర్వాసన వస్తుంది. తర్వాత దానిని ఉంచుకొని ఏం చేస్తారు? జంతువులు కూడా అలా చేయవు. కేవలం కోతి మాత్రమే తన బిడ్డ చనిపోయినా, దుర్వాసన వస్తున్నా ఆ శవాన్ని వదిలిపెట్టదు, కడుపుకు అతికించుకునే ఉంటుంది. అది జంతువు, మీరు మానవులు కదా. శరీరము వదిలేసిన వెంటనే, దానిని బయట పెట్టండని అంటారు. మానవులు స్వర్గస్థులైనారని అంటారు. శవాన్ని తీసుకేళ్లే సమయంలో మొదట కాళ్ళను శ్మశానము వైపు ఉంచుతారు. లోపలికి వెళ్ళినప్పుడు పూజ మొదలైనవి చేసిన తర్వాత స్వర్గానికి వెళ్తున్నారని ఆ శవాన్ని త్రిప్పి ముఖమును శ్మశానము వైపు ఉంచుతారు. మీరు కృష్ణుడిని కూడా ఆక్యురేట్‌గా చూపించారు. నరకాన్ని కాలితో తన్నినట్లు మీరు కృష్ణుని కూడా సరియైన విధంగా చూపించారు. కృష్ణునికి ఈ శరీరముండదు, వారి నామ-రూపాలు మారుతాయి. ఎన్ని విషయాలు అర్థం చేయించి చివరికి 'మన్మనాభవ' అని తండ్రి చెప్తారు.
ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు అటెన్షన్‌ ఉంచండి. బుద్ధి తండ్రితో జోడింపబడి ఉండాలి. ఈ విధంగా సదా కాలముండాలి. జీవించి ఉన్నంతవరకు తండ్రిని స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే జన్మ-జన్మల పాపము సమాప్తమవుతుంది. స్మృతే చేయకుంటే పాపము కూడా సమాప్తమవ్వదు. తండ్రిని స్మృతి చేయాలి, స్మృతిలో ఎప్పుడూ కళ్లు మూసుకోరాదు. సన్యాసులు కళ్ళు మూసుకొని కూర్చుంటారు. కొందరైతే స్త్రీ ముఖమును చూడరు. కళ్ళకు పట్టీ కట్టుకుని కూర్చుంటారు. మీరిక్కడ కూర్చున్నప్పుడు రచయిత, రచనల ఆది, మధ్య, అంత్యముల స్వదర్శన చక్రమును తిప్పాలి. మీరు లైట్‌హౌస్‌లు కదా. ఇది దు:ఖధామము. ఒక కంటిలో దు:ఖధామము, మరొక కంటిలో సుఖధామము. లేస్తూ, కూర్చుంటూ స్వయాన్ని లైట్‌హౌస్‌గా భావించండి. బాబా రకరకాల ఉదాహరణాలతో తెలియజేస్తారు. మీరు స్వయాన్ని కూడా సంభాళించుకుంటారు. లైట్‌హౌస్‌గా అవ్వడం ద్వారా మీ కళ్యాణము చేసుకుంటారు. తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. దారిలో ఎవరైనా లభిస్తే వారికి కూడా తెలపాలి. మీకు పరిచయమున్నవారు చాలామంది లభిస్తారు. వారైతే పరస్పరం రాం-రాం అని పలకరించుకుంటూ ఉంటారు. వారితో ఇది దు:ఖధామమని, అది శాంతిధామమని, సుఖధామము మీకు తెలుసా? అని అడగండి. మీరు శాంతిధామము, సుఖధామానికి వెళ్లాలని అనుకుంటున్నారా? అని అడగండి. ఈ మూడు చిత్రాలను ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజము. మీకు సూచనలు ఇస్తారు. లైట్‌హౌస్‌ కూడా సూచననిస్తుంది. ఈ నావ రావణుని జైలులో చిక్కుకొని ఉంది. మనుష్యులు మనుష్యులను రక్షించలేరు. అవన్నీ కృత్రిమమైన హద్దు విషయాలు. ఇవి బేహద్‌ విషయాలు. అది నిజానికి సమాజ సేవ కూడా కాదు. వాస్తవానికి అందరి నావను తీరానికి చేర్చడమే సత్యమైన సేవ. మానవులకు సర్వీసు ఎలా చేయాలో మీ బుద్ధిలో ఉంది.
ముక్తిధామానికి వెళ్లేందుకు, తండ్రితో కలుసుకునేందుకు మీరు గురువుల వద్దకు వెళ్తారు కానీ ఎవ్వరూ కలవరు. కలుసుకునే మార్గాన్ని తండ్రియే తెలియజేస్తారు. ఈ శాస్త్రాలు మొదలైనవి చదవడం వలన భగవంతుడు లభిస్తారని ఓర్పుతో ఉంటే ఏదో ఒక రూపంలో భగవంతుడు లభిస్తాడని భావిస్తారు. భగవంతుడు ఎప్పుడు లభిస్తారో అదంతా మీకు తండ్రి అర్థం చేయించారు. ఒక్కరినే స్మృతి చేయాలని మీరు చిత్రములో చూపించారు. ధర్మస్థాపకులు కూడా ఇలాగే సూచననిస్తారు. ఎందుకంటే మీరు శిక్షణనిచ్చారు కనుక వారు కూడా అలాగే సూచననిస్తారు. భగవంతుని జపించండి అని అంటారు. ఆ తండ్రి సద్గురువు. మిగిలిన వారందరూ అనేక రకాలుగా శిక్షణనిస్తారు. వారిని గురువులని అంటారు. పోతే అశరీరులుగా అయ్యే శిక్షణ గురించి ఎవ్వరికీ తెలియదు. మీరు శివబాబాను స్మృతి చేయమని చెప్తారు. వారు శివాలయానికి వెళ్లినప్పుడు సదా శివుని తండ్రి అనడం అలవాటైపోయింది. మరెవ్వరినీ బాబా అని అనరు. ఎందుకంటే వారు నిరాకారులు కారు, వారు శరీరధారులు. శివుడైతే నిరాకారుడు, సత్యమైన బాబా. వారు అందరికీ తండ్రి. ఆత్మలందరూ అశరీరులు.
పిల్లలైన మీరిక్కడ కూర్చున్నప్పుడు ఇదే తపనలో ఉండండి. మనమెలా చిక్కుకొని ఉండినామో మీకు తెలుసు. ఇప్పుడు బాబా వచ్చి దారి తెలిపించారు. మిగిలిన వారందరూ చిక్కుకొని ఉన్నారు. బయట పడడం లేదు. శిక్షలు అనుభవించిన తర్వాత అందరూ విడుదల అవుతారు. శిక్షలు అనుభవించి పదవిని పొందుకోరాదని పిల్లలైన మీకు తెలియజేస్తూ ఉంటారు. శిక్షలు ఎక్కువగా అనుభవిస్తే పదభ్రష్ఠులైపోతారు. రొట్టె(పదవి) తక్కువగా లభిస్తుంది. తక్కువగా శిక్షలు అనుభవిస్తే మంచి రొట్టె లభిస్తుంది. ఇది ముళ్ల అడవి. అందరూ ఒకరినొకరు ముళ్లతో గుచ్చుకుంటూ ఉంటారు. స్వర్గాన్ని భగవంతుని పూలతోట అని అంటారు. ఒకప్పుడు స్వర్గముండేదని క్రైస్తవులు కూడా అంటారు. ఒక్కొక్కసారి సాక్షాత్కారము కూడా పొందగలరు. ఈ ధర్మానికి చెందినవారిగా ఉండవచ్చు. వారు మళ్లీ తమ ధర్మములోకి రాగలరు. పోతే కెేవలం చూసినంత మాత్రాన ఏమీ రాదు. చూసినంత మాత్రాన ఎవ్వరూ వెళ్లలేరు. తండ్రిని గుర్తించి జ్ఞానము తెలుసుకోవాలి. అందరూ రాలేరు. అక్కడ దేవతలైతే చాలా కొద్దిమందే ఉంటారు. ఇప్పుడు ఇంతమంది హిందువులున్నారు. మొదట దేవతలుగా ఉండేవారు కదా. కానీ వారు పావనంగా ఉండేవారు. వీరు పతితంగా ఉన్నారు. పతితమైనవారిని దేవతలని అనడం శోభించదు. ఈ ఒక్క ధర్మమే కర్మభ్రష్ఠము, ధర్మభ్రష్ఠమయిందని చెప్తారు. ఆది సనాతన హిందూ ధర్మమని అంటారు. దేవతా ధర్మము వారని జనాభా లెక్కలో కూడా ఉండనే ఉండదు.
అతిప్రియమైన మన తండ్రి పిల్లలను ఎలా ఉండేవారిని ఎలా తయారు చేస్తారు! తండ్రి ఎలా వస్తారో మీరు అర్థం చేయించగలరు. ఈ పాత తమోప్రధాన సృష్టిలో దేవతలు పాదము కూడా మోపరు. మరి తండ్రి ఎలా వస్తారు? తండ్రి అయితే నిరాకారుడు, వారికి పాదాలే లేవు అందువలన ఇతనిలో ప్రవేశిస్తారు.
పిల్లలైన మీరిప్పుడు ఈశ్వరీయ ప్రపంచములో కూర్చుని ఉన్నారు, వారందరూ ఆసురీ ప్రపంచములో ఉన్నారు. ఇది చాలా చిన్న సంగమ యుగము. మనము దేవతల ప్రపంచములోనూ లేము, ఆసురీ ప్రపంచములోనూ లేమని మీరు అర్థం చేసుకున్నారు. మనము ఈశ్వరీయ ప్రపంచములో ఉన్నాము. మనలను ఇంటికి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. అది నా ఇల్లు అని తండ్రి చెప్తారు. మీ కొరకు నేను నా ఇంటిని వదిలి వస్తాను. భారతదేశము సుఖధామంగా అయిన తర్వాత నేను అందులోకి రాను. నేను విశ్వానికి అధిపతిగా అవ్వను, మీరు అధిపతులుగా అవుతారు. నేను బ్రహ్మాండానికి యజమానిని. బ్రహ్మాండములో అందరూ వచ్చేస్తారు. ఇప్పుడు కూడా అక్కడ అధికారులుగా కూర్చుని ఉన్నారు. పోతే వారు ఇక్కడకు రావాలి. అయితే వారు వచ్చి విశ్వానికి అధిపతులుగా అవ్వరు. చాలా బాగా అర్థం చేయిస్తారు. చాలా మంచి విద్యార్థులైతే స్కాలర్‌షిప్‌ తీసుకుంటారు. ఆశ్చర్యమేమంటే మేము పవిత్రంగా అవుతామని ఇక్కడ చెప్తారు, కానీ అక్కడకు వెళ్లి పతితంగా అవుతారు. ఇటువంటి కచ్ఛాగా ఉన్నవారిని తీసుకు రాకండి. పరిశీలించి పిలుచుకు రావడం బ్రాహ్మణి కర్తవ్యము. ఆత్మయే శరీరాన్ని ధారణ చేసి పాత్ర చేస్తుందని, దానికి అవినాశి పాత్ర లభించిందని మీకు తెలుసు. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. లైట్‌హౌస్‌గా అయ్యి అందరికీ శాంతిధామము, సుఖధామాల మార్గమును తెలపాలి. అందరి నావను దు:ఖధామము నుండి వెలికి తీసే సేవ చేయాలి. స్వ కళ్యాణము కూడా చేసుకోవాలి.
2. మీ శాంతి స్వరూపములో స్థితమై శరీరము నుండి భిన్నమయ్యే అభ్యాసము చెయ్యాలి. స్మృతి చేయునప్పుడు కళ్లు తెరచుకొని కూర్చోవాలి. బుద్ధిలో రచయిత, రచనను స్మరించండి.

వరదానము :- '' ఈ అలౌకిక జీవితంలో సంబంధాల శక్తితో అవినాశి స్నేహాన్ని సహయోగాన్ని ప్రాప్తి చేసుకునే శ్రేష్ఠ ఆత్మా భవ ''
ఈ అలౌకిక జీవితంలో పిల్లలైన మీకు సంబంధాల శక్తి డబల్‌ రూపంలో ప్రాప్తించింది. ఒకటేమో తండ్రి ద్వారా సర్వ సంబంధాలు, రెండవది దైవీ పరివారపు సంబంధాలు. ఈ సంబంధాల ద్వారా నిస్వార్థ స్నేహము, అవినాశి సహయోగాలు సదా ప్రాప్తి అవుతూ ఉంటాయి. కనుక మీ వద్ద సంబంధాల శక్తి కూడా ఉంది. ఇటువంటి శ్రేష్ఠమైన అలౌకిక జీవితము గడుపుతున్న శక్తి సంపన్నమైన వరదాని ఆత్మలు. అందువలన మీరు అర్జీ (ఫిర్యాదులు) చేసేవారు కాదు, సదా రాజీగా (సంతుష్టంగా, తృప్తిగా) ఉండేవారిగా అవ్వండి.

స్లోగన్‌ :- '' ఏ ప్లానునైనా విదేహిగా అయ్యి సాక్షిగా ఉండి ఆలోచించండి, సెకండులో ప్లెయిన్‌ స్థితిని చేసుకుంటూ వెళ్లండి. ''

Telugu Murli 26/09/2019

26-09-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - మీరు తండ్రి వద్దకు తమ గుణాలను (క్యారెక్టర్‌ను) సరిదిద్దుకునేందుకు వచ్చారు, మీరిప్పుడు దైవీ గుణాలను తయారు చేసుకోవాలి. ''

ప్రశ్న :- పిల్లలైన మీరు కళ్లు మూసుకొని కూర్చోరాదని ఎందుకు చెప్తారు ?
జవాబు :- ఎందుకంటే దృష్టి ద్వారా పరివర్తన చేసే(తృప్తిపరచే) తండ్రి మీ సన్ముఖములో ఉన్నారు. ఒకవేళ కళ్లు మూసుకుంటే ఎలా తృప్తి చెందుతారు? పాఠశాలలో కళ్లు మూసుకొని కూర్చోరు. కళ్లు మూసుకొని కూర్చుంటే సోమరితనము వచ్చేస్తుంది. పిల్లలైన మీరు పాఠశాలలో చదువుకుంటున్నారు, ఇది సంపాదనకు ఆధారము. లక్షల-పదమాల సంపాదన జరుగుతోంది. సంపాదన సమయంలో సోమరితనము, ఉదాసీనత రాజాలదు.

ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రి పరంధామము నుండి వచ్చి మనలను చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు. ఏం చదివిస్తున్నారు? తండ్రితో ఆత్మ యోగము చేయడం నేర్పిస్తున్నారు. దీనినే స్మృతియాత్ర అని అంటారు. మధురమైన ఆత్మిక పిల్లలారా, తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మీరు పవిత్రమై, తమ పవిత్రమైన శాంతిధామాన్ని చేరుకుంటారని కూడా తెలిపించారు. ఎంత సహజమైన జ్ఞానము. స్వయాన్ని ఆత్మగా భావించండి. తమ ప్రియమైన బేహద్‌ తండ్రిని స్మృతి చేస్తే మీ జన్మ-జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి. దీనినే యోగాగ్ని అని అంటారు. ఇది భారతీయ ప్రాచీన రాజయోగము, దీనిని ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత తండ్రియే వచ్చి నేర్పిస్తారు. బేహద్‌ తండ్రియే భారతదేశములో ఈ సాధారణ తనువులో వచ్చి పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. ఈ స్మృతి ద్వారానే మీ జన్మ-జన్మాంతరాల పాపము సమాప్తమవుతుంది. ఎందుకంటే తండ్రి పతితపావనుడు, సర్వశక్తివంతుడు. మీ ఆత్మ రూపీ బ్యాటరీ ఇప్పుడు తమోప్రధానమై పోయింది. ఒకప్పుడు సతోప్రధానంగా ఉండేది, ఇప్పుడు దానిని మళ్లీ సతోప్రధానంగా ఎలా తయారుచేయాలి. ఆత్మ సతోప్రధానమైన ప్రపంచానికి వెళ్లాలి లేక శాంతిధామమైన ఇంటికి పోగలగాలి. దీనిని పిల్లలు చాలా బాగా గుర్తుంచుకోవాలి. తండ్రి పిల్లలకు ఈ డోస్‌(హెచ్చరిక) ఇస్తారు. ఈ స్మృతి యాత్రను లేస్తూ - కూర్చుంటూ, నడుస్తూ - తిరుగుతూ మీరు చేయవచ్చు. గృహస్థ వ్యవహారములో ఉంటూ వీలైనంత కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి. తండ్రిని స్మృతి చేయుటతో పాటు దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి ఎందుకంటే ప్రపంచములోని వారివి ఆసురీ గుణాలు. పిల్లలైన మీరు ఇక్కడికి దైవీ గుణాలను తయారు చేసుకునేందుకు వచ్చారు. ఈ లక్ష్మీనారాయణుల నడవడిక(గుణాలు) చాలా మధురంగా ఉండేది. భక్తిమార్గములో వారి మహిమనే కీర్తించారు. భక్తిమార్గము ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో కూడా ఎవ్వరికీ తెలియదు, మీరిప్పుడు తెలుసుకున్నారు. రావణ రాజ్యము ఎప్పటి నుండి ప్రారంభమయ్యిందో కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. పిల్లలైన మీరు ఈ జ్ఞానమంతటినీ బుద్ధిలో ఉంచుకోవాలి. మనము జ్ఞాన సాగరుడైన ఆత్మిక తండ్రి పిల్లలము. ఇప్పుడు ఆత్మిక తండ్రి మనలను చదివించేందుకు వస్తారు. వీరు సాధారణమైన తండ్రి కాదని కూడా మీరు తెలుసుకున్నారు. వీరు ఆత్మిక తండ్రి, మనలను చదివించేందుకు వచ్చారు. వారి నివాస స్థానము సదా బ్రహ్మలోకము. అందరికీ లౌకిక తండ్రులు ఇక్కడే ఉన్నారు. ఆత్మలైన మనలను చదివించే పరమపిత పరమాత్మ అనంతమైన తండ్రి అని పిల్లలు బాగా నిశ్చయముంచుకోవాలి. భక్తిమార్గములో లౌకిక తండ్రి ఉన్నా పరమపిత పరమాత్మను పిలుస్తారు. వారి యదార్థమైన పేరు 'శివ ' ఒక్కటే. తండ్రి స్వయంగా అర్థం చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా, నా పేరు ఒక్కటే, 'శివ'. భలే అనేక పేర్లతో అనేక మందిరాలు తయారు చేశారు కానీ అవన్నీ భక్తిమార్గములోని సామాగ్రి. యదార్థమైన నా పేరు ఒక్కటే 'శివ'. పిల్లలైన మిమ్ములను ఆత్మ అనే అంటారు, సాలిగ్రామము అని అన్నా పర్వాలేదు. సాలిగ్రామాలు అనేకమున్నాయి, శివుడు ఒక్కరే. వారు అనంతమైన తండ్రి, మిగిలిన వారందరూ పిల్లలు. ఇంతకుముందు హద్దు పిల్లలైన మీరు హద్దు తండ్రి వద్ద ఉండేవారు. అప్పుడు మీకు జ్ఞానము లేదు. పోతే అనేక విధాలుగా భక్తి చేస్తూ ఉండేవారు. అర్ధకల్పము భక్తి చేశారు, ద్వాపర యుగము నుండి భక్తి ప్రారంభమవుతుంది. అప్పుడే రావణ రాజ్యము కూడా ప్రారంభమయ్యింది. ఇది చాలా సహజమైన విషయము. ఇంత సహజమైన విషయాన్ని కూడా కొందరు కష్టంగా అర్థము చేసుకుంటారు. రావణరాజ్యము ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో కూడా ఎవ్వరికీ తెలియదు. తండ్రియే జ్ఞాన సాగరులని మధురమైన పిల్లలైన మీకు తెలుసు. వారు వచ్చి వారిలో ఉన్న జ్ఞానమంతా పిల్లలకు ఇస్తారు. శాస్త్రాలు భక్తి మార్గములోనివి.
జ్ఞానము, భక్తి తర్వాత వైరాగ్యము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఈ మూడు ముఖ్యమైనవి. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అని సన్యాసులకు కూడా తెలుసు. కానీ సన్యాసులది హద్దు వైరాగ్యము. వారు బేహద్‌ వైరాగ్యమును నేర్పించలేరు. వైరాగ్యము రెండు రకాలు - 1. హద్దు వైరాగ్యము 2. బేహద్‌ వైరాగ్యము. వారిది హఠయోగీ సన్యాసుల వైరాగ్యము. ఇది బేహద్‌ వైరాగ్యము. మీది రాజయోగము, వారు ఇల్లు - వాకిళ్లను వదిలి అడవికి వెళ్లిపోతే, వారికి సన్యాసి అని పేరు వచ్చేస్తుంది. హఠయోగులు పవిత్రంగా ఉండేందుకు ఇంటిని వదిలేస్తారు, ఇది కూడా మంచిదే. భారతదేశము చాలా పవిత్రంగా ఉండేదని తండ్రి చెప్తారు. ఇంత పవిత్రమైన ఖండము మరేదీ ఉండదు. భారతదేశానికి ఉన్న చాలా ఉన్నతమైన మహిమను గురించి భారతవాసులకే తెలియదు. తండ్రిని మర్చిపోయినందున అన్నీ మర్చిపోతారు అనగా నాస్తికులుగా, అనాథులుగా అవుతారు. సత్యయుగములో ఎంతో సుఖము, శాంతి ఉండేది. ఇప్పుడు ఎంత దు:ఖము, అశాంతి ఉంది! మూలవతనమంటే శాంతిధామము, అక్కడ ఆత్మలమైన మనము ఉంటాము. ఆత్మలు తమ ఇంటి నుండి బేహద్‌ పాత్ర చేసేందుకు ఇక్కడకు వస్తాయి. ఈ పురుషోత్తమ సంగమ యుగములో బేహద్‌ తండ్రి కొత్త ప్రపంచానికి తీసుకెళ్లేందుకు వస్తారు. తండ్రి వచ్చి ఉత్తమోత్తమంగా చేస్తారు. ఉన్నతాతి ఉన్నతమైనవారు భగవంతుడని అంటారు. కానీ వారు ఎవరో, ఎవరిని అలా అంటారో ఏమీ తెలియదు. ఒక పెద్ద లింగమును ఉంచేశారు, వీరు నిరాకార పరమాత్మ అని భావిస్తారు. ఆత్మలమైన మనందరికీ వారు తండ్రి అని కూడా తెలియదు, కేవలం పూజ చేస్తారు. సదా శివబాబా అనే అంటారు, రుద్ర బాబా, బబుల్‌నాథ్‌ బాబా అని అనరు. మీరైతే శివబాబా స్మృతి ఉందా? వారసత్వము స్మృతి ఉందా? అని వ్రాస్తారు కూడా. శివబాబాను స్మృతి చేస్తే పాపాలు భస్మమవుతాయి. ఎందుకంటే పతితపావనుడు తండ్రి ఒక్కరే. ఈ పతిత ప్రపంచంలో ఒక్కరు కూడా పావనులు ఉండజాలరు. పావన ప్రపంచములో పతితులు ఒక్కరు కూడా ఉండజాలరు. శాస్త్రాలలో అయితే అన్ని స్థానాలలో పతితులు ఉన్నారని వ్రాసేశారు. త్రేతా యుగములో కూడా రావణుడు సీతను అపహరించుకు పోయాడని వ్రాశారు. కృష్ణునితో పాటు కంసుడు, జరాసంధుడు, హిరణ్యకశ్యపుడు మొదలైన వారిని చూపించారు. కృష్ణుని పై కళంకాలను మోపారు. సత్యయుగములో ఇవేమీ జరగజాలవు. అసత్య కళంకాలను ఎన్ని ఆపాదించారు! తండ్రి పై కూడా కళంకము ఆపాదించారు, అలాగే దేవతల పై కూడా కళంకాలను ఆపాదించారు. అందరినీ నిందిస్తూ ఉంటారు. కావున ఆత్మను పవిత్రంగా చేసే ఈ స్మృతియాత్ర చెయ్యమని తండ్రి చెప్తారు. పావనంగా అయ్యి మళ్లీ పావన ప్రపంచంలోకి వెళ్లాలి. తండ్రి 84 జన్మల చక్రమును కూడా అర్థం చేయిస్తారు. ఇది అంతిమ జన్మ. మళ్లీ ఇంటికి వెళ్లాలి. ఇంటికి శరీరమైతే వెళ్లదు. ఆత్మలందరూ వెళ్లాలి. అందువలన మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలారా! - స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి, దేహమని భావించకండి. ఇతర సత్సంగాలలో మీరు దేహాభిమానులుగా కూర్చుంటారు. ఇక్కడ ఆత్మాభిమానులై కూర్చోండి అని తండ్రి చెప్తారు. నేను జ్ఞాన సాగరుడను,............ నాలో ఈ సంస్కారముంది, పిల్లలైన మీరు కూడా ఇలాగే తయారవ్వాలి. బేహద్‌ తండ్రి మరియు హద్దు తండ్రికి గల భేదము కూడా తెలిపిస్తారు. బేహద్‌ తండ్రి కూర్చొని మీకు మొత్తం జ్ఞానమంతా అర్థము చేయిస్తారు. ఇంతకు ముందు మీకు ఈ జ్ఞానము తెలియదు. ఇప్పుడు సృష్టిచక్రము ఎలా తిరుగుతూ ఉందో, దాని ఆదిమధ్యాంతాల చక్రము ఆయువు ఎంతో, అన్ని విషయాలు తెలియజేస్తారు. భక్తిమార్గములో అయితే కల్పము ఆయువు లక్షల సంవత్సరాలని వినిపించి ఘోరమైన అంధకారములో పడేశారు. క్రిందికే దిగజారుతూ వచ్చారు. ఎంతగా భక్తి చేస్తే అంతగా తండ్రిని క్రిందికి ఆకర్షిస్తామని, తండ్రి వచ్చి మనలను పావనంగా తయారు చేస్తారని కూడా అంటారు కదా. తండ్రిని క్రిందికి లాగుతారు. ఎందుకంటే పతితులుగా అయ్యి దు:ఖిస్తున్నారు. అందుకే మేము తండ్రిని పిలుస్తున్నామని అంటారు. పూర్తిగా దు:ఖితులుగా, తమోప్రధానంగా అయ్యారని తండ్రి కూడా గమనిస్తారు. 5 వేల సంవత్సరాలు పూర్తైనప్పుడే మళ్లీ వస్తారు. ఈ చదువు ఈ పాత ప్రపంచము కొరకు కాదు. ఈ జ్ఞానాన్ని ఆత్మ ధారణ చేసి తన జతలో తీసుకెళ్తుంది. నేను ఎలాగైతే జ్ఞాన సాగరుడనో, అలా మీరు కూడా జ్ఞాన నదులు. ఈ జ్ఞానము ఈ పాత ప్రపంచము కొరకు కాదు. ఈ ఛీ-ఛీ(అసహ్యమైన) ప్రపంచము, ఛీ-ఛీ శరీరము వదిలేయాలి. శరీరమైతే ఇక్కడ పవిత్రంగా అవ్వజాలదు. నేను ఆత్మల తండ్రిని, ఆత్మలను పవిత్రంగా చేసేందుకు వచ్చాను. ఈ విషయాలను మనుష్యులు కొంచెం కూడా అర్థం చేసుకోలేరు. పూర్తిగా రాతిబుద్ధి గలవారిగా పతితులుగా ఉన్నారు. అందుకే ఓ పతితపావనా! అని పాడ్తారు. ఆత్మయే పతితమవుతుంది. ఆత్మయే అన్నీ చేస్తుంది. భక్తి కూడా ఆత్మయే చేస్తుంది, శరీరాన్ని కూడా ఆత్మయే తీసుకుంటుంది.
ఆత్మలైన మిమ్ములను తీసుకెళ్లేందుకు వచ్చానని తండ్రి చెప్తున్నారు. బేహద్‌ తండ్రినైన నేను, ఆత్మలైన మీ పిలుపుతో వచ్చాను. మీరు ఎంతగా పిలిచారు(ప్రార్థించారు)! ఇప్పటివరకు కూడా హే పతితపావనా, ఓ గాడ్‌ ఫాదర్‌! మీరు వచ్చి ఈ పాత ప్రపంచపు దు:ఖాల నుండి, మాయ(డెవిల్‌) నుండి ముక్తులుగా చేయండి. తద్వారా మేము ఇంటికి వచ్చేస్తామని పిలుస్తూనే ఉన్నారు. మన ఇల్లు ఎక్కడ ఉందో, ఇంటికి ఎలా, ఎప్పుడు వెళ్తామో మరెవ్వరికీ తెలియదు. ముక్తికి వెళ్లేందుకు ఎంతగా కష్టపడ్తూ ఉంటారు! ఎంతమంది గురువుల వద్దకు వెళ్తారు. జన్మ-జన్మల నుండి ఇలా తల కొట్టుకుంటూ, కష్టపడ్తూ వచ్చారు. ఆ గురువులకు జీవన్ముక్తిలోని సుఖాలను గురించి తెలియనే తెలియదు. వారు ముక్తిని కోరుకుంటారు. విశ్వములో శాంతి ఎలా స్థాపించబడ్తుంది? అని అంటారు కూడా. సన్యాసులకు కూడా ముక్తి మాత్రమే తెలుసు. జీవన్ముక్తి గురించి తెలియదు. కానీ ముక్తి - జీవన్ముక్తి రెండింటి వారసత్వమును తండ్రే ఇస్తారు. మీరు జీవన్ముక్తిలో ఉన్నప్పుడు మిగిలినవారంతా ముక్తిలోకి వెళ్లిపోతారు. పిల్లలైన మీరిప్పుడు ఇలా తయారయ్యేందుకు జ్ఞానము తీసుకుంటున్నారు. మీరే అందరికంటే ఎక్కువగా సుఖాన్ని చూచారు, అందరికంటే ఎక్కువగా దు:ఖమును కూడా మీరే చూచారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మములో ఉన్న మీరే మళ్లీ ధర్మభ్రష్ఠులుగా, కర్మ భ్రష్ఠులుగా అయిపోయారు. మీరు పవిత్రమైన ప్రవృత్తి మార్గములో ఉండేవారు, ఈ లక్ష్మీనారాయణులు పవిత్ర ప్రవృత్తి మార్గములోనివారు. ఇల్లు-వాకిలి వదిలిపెట్టడం సన్యాసుల ధర్మము. సన్యాసులు కూడా మొదట బాగుండేవారు, మీరు కూడా మొదట చాలా బాగుండేవారు, ఇప్పుడు తమోప్రధానంగా అయ్యారు. ఇది డ్రామా ఆట అని తండ్రి చెప్తారు. ఈ చదువు క్రొత్త ప్రపంచము కొరకని తండ్రి అర్థం చేయిస్తారు. పతిత శరీరములో, పతిత ప్రపంచములో డ్రామానుసారంగా నేను మళ్లీ 5 వేల సంవత్సరాల తర్వాత రావలసి ఉంటుంది. కల్పము లక్షల సంవత్సరాలూ కాదు, నేను సర్వవ్యాపినీ కాదు. ఇలా మీరు నన్ను నిందిస్తూ వచ్చారు. అయినా నేను మీకు ఎంత ఉపకారము చేస్తాను. శివబాబాను చేసినంత గ్లాని మరెవ్వరినీ చేయలేదు. విశ్వానికి అధిపతులుగా తయారుచేసే తండ్రిని సర్వవ్యాపి అని అంటూ ఉంటారు. అవమానము (గ్లాని) కూడా హద్దు దాటిపోయినప్పుడు మళ్లీ నేను వచ్చి మీకు ఉపకారము చేస్తాను. ఇది పురుషోత్తమ సంగమ యుగము, కళ్యాణకారి యుగము. ఈ యుగములో మిమ్ములను పవిత్రంగా చేసేందుకు వస్తాను. పావనంగా అయ్యేందుకు ఎంత సహజమైన యుక్తిని తెలుపుతాను. భక్తిమార్గములో మీరు చాలా ఎదురుదెబ్బలు తిన్నారు, చెరువులో కూడా స్నానము చేసేందుకు వెళ్తారు. ఇలా చేయడం వలన పావనంగా అవుతామని భావిస్తారు. ఆ నీరు ఎక్కడ! పతితపావనుడైన తండ్రి ఎక్కడ! అదంతా భక్తి మార్గము, ఇది జ్ఞాన మార్గము. మానవులు ఎంత ఘోరమైన అంధకారములో ఉన్నారు. కుంభకర్ణుని వలె నిద్రపోతున్నారు. వినాశ కాలములో విపరీత బుద్ధి గలవారందూ నశిస్తారు(వినాశ కాలే విపరీత బుద్ధి వినశ్యంతి) అని గానము కూడా చేస్తారని మీకు తెలుసు. మీకిప్పుడు నంబరువారు పురుషార్థానుసారము ప్రీతి బుద్ధి ఉంది, పూర్తిగా లేదు. ఎందుకంటే క్షణ క్షణము మాయ మరిపిస్తుంది. ఇది పంచ వికారాలతో యుద్ధము. పంచ వికారాలను రావణుడు అని అంటారు. రావణుని పై గాడిద తలను చూపిస్తారు.
పాఠశాలలో కళ్లు మూసుకొని ఎప్పుడూ కూర్చోరని కూడా తండ్రి అర్థం చేయించారు. వారైతే భక్తిమార్గములో భగవంతుని స్మృతి చేసేందుకు కళ్లు మూసుకొని కూర్చోమని శిక్షణ ఇస్తారు. ఇది పాఠశాల అని తండ్రి చెప్తున్నారు. దృష్టి ద్వారా పరివర్తన(నజర్‌ సే నిహాల్‌,........) అని కూడా విన్నారు, ఇది ఇంద్రజాలము అని అంటారు. అరే! ఆ గాయనము కూడా ఉంది కదా, దేవతలు కూడా దృష్టి ద్వారా తృప్తి చెందుతారు. దృష్టి ద్వారా మానవులను దేవతలుగా చేసేవాడు ఇంద్రజాలికుడే కదా. తండ్రి వచ్చి బ్యాటరీని నింపుతూ ఉంటే(చార్జ్‌ చేస్తూ ఉంటే) పిల్లలు కళ్లు మూసుకొని కూర్చుంటే ఏమంటారు! పాఠశాలలో కళ్లు ముసుకొని కూర్చోరు. అలా కూర్చుంటే సోమరితనము, నిద్ర వస్తుంది. చదువు సంపాదనకు ఆధారము. ఇందులో లక్షల-పదమాలంత సంపాదన ఉంది. సంపాదనలో ఎప్పుడూ ఆవళించరు. ఇక్కడ ఆత్మలు పరివర్తనవ్వాలి. మీ ఎదుట ఈ లక్ష్యము ఉంది. వారి రాజధాని చూడాలంటే దిల్వాడా మందిరానికి వెళ్లండి. అక్కడ జడ మూర్తులుగా ఉన్నారు, ఇది చైతన్యమైన దిల్వాడా మందిరము. దేవతలు కూడా ఉన్నారు, స్వర్గము కూడా ఉంది. సర్వుల సద్గతిదాత ఆబూలోనే వస్తారు, అందువలన ఆబూ చాలా గొప్ప తీర్థ స్థానము. ధర్మ స్థాపకులకు లేక గురువులందరికీ తండ్రి వచ్చి ఇక్కడ సద్గతినిస్తారు. ఇది అన్నింటికంటే గొప్ప తీర్థ స్థానము, కానీ గుప్తంగా ఉంది. దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తండ్రిలో ఏ సంస్కారాలున్నాయో వాటినే ధారణ చేయాలి. తండ్రి సమానం జ్ఞానసాగరులుగా అవ్వాలి. ఆత్మాభిమానులుగా ఉండే అభ్యాసము చేయాలి.
2. ఆత్మ రూపీ బ్యాటరీని సతోప్రధానంగా చేసుకునేందుకు నడుస్తూ - తిరుగుతూ స్మృతియాత్రలో ఉండాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. చాలా చాలా మధురంగా అవ్వాలి.

వరదానము :- '' జ్ఞాన ధనము ద్వారా ప్రకృతిలోని సాధనాలన్నీ ప్రాప్తి చేసుకునే పదమా పదమ్‌ పతి భవ ''
జ్ఞాన ధనము, స్థూల ధనాన్ని స్వతహాగా ప్రాప్తి చేయిస్తుంది. ఎక్కడైతే జ్ఞాన ధనముంటుందో అక్కడ ప్రకృతి స్వతహాగానే దాసిగా అవుతుంది. జ్ఞాన ధనము ద్వారా ప్రకృతిలోని సాధనాలన్నీ స్వతహాగా ప్రాప్తి అవుతాయి. అందువలన జ్ఞాన ధనము అన్ని ధనాలకు రాజు వంటిది. రాజు ఎక్కడుంటాడో అక్కడ సర్వ పదార్థాలు స్వతహాగా ప్రాప్తి అవుతాయి. ఈ జ్ఞాన ధనమే పదమాపదమ్‌ పతులుగా చేస్తుంది. పరమార్థము మరియు వ్యవహారము స్వతహాగా సిద్ధిస్తాయి. జ్ఞాన ధనములో ఎంత శక్తి ఉందంటే ఆ శక్తి అనేక జన్మలకు రాజాధి రాజులుగా చేసేస్తుంది.

స్లోగన్‌ :- '' '' కల్ప -కల్పము నేను విజయీ ఆత్మను '' - ఈ ఆత్మిక నశా ఎమర్జ్‌గా ఉంటే, మాయాజీత్‌లుగా అవుతారు. ''

Wednesday, 25 September 2019

Telugu Murli 25/09/2019

25-09-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - మాయను వశం చేసుకునే మంత్రం - 'మన్మనాభవ,' ఈ మంత్రంలోనే అన్ని గొప్పతనాలు ఇమిడి ఉన్నాయి. ఈ మంత్రమే మిమ్ములను పవిత్రంగా చేసేస్తుంది ''

ప్రశ్న :- ఆత్మకు నంబర్‌ వన్‌ సేఫ్టీ(భద్రత) సాధనం ఏది? ఎలా?
జవాబు :- స్మృతియాత్రయే నంబర్‌ వన్‌ సేఫ్టీ సాధనం, ఎందుకంటే ఈ స్మృతి ద్వారానే మీ స్వభావము (క్యారెక్టర్‌) సంస్కరింపబడుతుంది, మీరు మాయ పై మీరు విజయం పొందుతారు. స్మృతితో పతితమైన కర్మేంద్రియాలు శాంతమైపోతాయి. స్మృతితోనే బలం వస్తుంది. జ్ఞాన ఖడ్గానికి స్మృతి అనే పదును కావాలి. స్మృతితోనే సతోప్రధానంగా అవుతారు. ఎవ్వరి పై కోపగించరు. అందుకే స్మృతియాత్రలో బలహీనంగా అవ్వరాదు. మేము ఎంతవరకు స్మృతిలో ఉంటున్నామని మిమ్ములను మీరు ప్రశ్నించుకోవాలి.

ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ప్రతి రోజూ అప్రమత్తం(హెచ్చరిక) చేయాల్సి ఉంటుంది. ఏ హెచ్చరిక? సేఫ్టీ ఫస్ట్‌(మొదట భద్రత) ఎటువంటి సేఫ్టీ ? స్మృతియాత్ర ద్వారా మీరు చాలా చాలా సేఫ్‌(భద్రం)గా ఉంటారు. పిల్లల కొరకు ముఖ్యమైన విషయం ఇదే. తండ్రి అర్థం చేయించారు - పిల్లలైన మీరు స్మృతియాత్రలో ఎంతగా తత్పరులై ఉంటారో, అంత సంతోషము కూడా ఉంటుంది. పావనంగా అవ్వాలి కనుక నడవడిక(మ్యానర్స్‌) కూడా సరిగ్గా ఉంటుంది. స్వభావమును కూడా సరిదిద్దుకోవాలి. తమను తాము బాగా పరిశీలించుకోవాలి - '' నా స్వభావము (క్యారెక్టర్‌) ఎవ్వరినీ దు:ఖపరిచేదిగా లేదు కదా! నాకు ఎలాంటి దేహాభిమానమైతే రావడం లేదు కదా? '' ఈ విధంగా బాగా స్వయాన్ని చెక్‌ చేసుకోవాలి. తండ్రి కూర్చుని పిల్లలను చదివిస్తారు. పిల్లలైన మీరు చదువుకుంటారు, ఇతరులను చదివిస్తారు కూడా. అనంతమైన తండ్రి కేవలం చదివిస్తారు, మిగిలిన వారందరూ దేహధారులు. ఇందులో మొత్తం ప్రపంచం అంతా వచ్చేస్తుంది. ఒక్క తండ్రి మాత్రమే విదేహి. వారు పిల్లలైన మీరు కూడా విదేహులుగా అవ్వాలని చెప్తున్నారు. మిమ్ములను విదేహిగా చేసేందుకే నేను వచ్చాను. పవిత్రంగా అయితేనే అక్కడికి వెళ్తారు. ఛీ - ఛీ(అపవిత్రం)గా ఉన్నవారిని వెంట తీసుకెళ్లరు. అందుకే మొట్టమొదట ఈ మంత్రమే ఇస్తారు. ఈ మంత్రము మాయను వశం చేసుకునేది. ఇది పవిత్రంగా అయ్యే మంత్రము. ఈ మంత్రంలో చాలా గొప్పతనాలు నిండి ఉన్నాయి. దీనితోనే పవిత్రంగా అవ్వాలి. మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి. తప్పకుండా మనమే దేవతలుగా ఉండేవారము. అందుకే తండ్రి చెప్తున్నారు - మీకు సేఫ్టీ కావాలన్నా, బలవంతులై మహావీరులుగా అవ్వాలన్నా ఈ పురుషార్థం చేయండి. తండ్రి ఏమో శిక్షణను ఇస్తూ ఉంటారు. భలే! డ్రామా అని కూడా చెప్తూ ఉంటారు. డ్రామా అనుసారం పూర్తి ఖచ్చితంగా నడుస్తోంది. ఇంకా భవిష్యత్తు కొరకు కూడా అర్థం చేయిస్తూ ఉంటారు. స్మృతియాత్రలో బలహీనం అవ్వరాదు. వెలుపల బంధనాలలో ఉండే గోపికలు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా ఎదుట ఉండేవారు కూడా స్మృతి చేయరు. ఎందుకంటే వారికి శివబాబాను కలవాలన్న తపన ఉంటుంది. కలిసినవారికి కడుపు నిండినట్లుగా ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా స్మృతి చేస్తారో, వారు ఉన్నత పదవిని పొందగలరు. మంచి-మంచి, పెద్ద పెద్ద సెంటర్లు సంభాళించే ముఖ్యమైనవారు కూడా స్మృతి యాత్రలో బలహీనంగా ఉండటం గమనించబడింది. స్మృతి పదును చాలా బాగుండాలి. జ్ఞాన ఖడ్గంలో స్మృతి పదును లేనందునే ఎవ్వరికీ బాణం(గురి) తగలడమే లేదు. పూర్తిగా మరణించటం లేదు. జ్ఞాన బాణం వేసి, తండ్రివారిగా లేక మరజీవగా తయారు చేసేందుకు పిల్లలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మరణించరు అనగా తప్పకుండా జ్ఞాన ఖడ్గంలో ఏదో గడబిడ ఉంది. డ్రామా పూర్తి ఆక్యురేట్‌గా నడుస్తోంది అని బాబాకు భలే తెలుసు. కానీ జరగబోయేదాని గురించి ఏమి చేయాలో బాబా అర్థం చేయిస్తూ ఉంటారు కదా! ప్రతి ఒక్కరూ మేము ఎంత స్మృతి చేస్తున్నామని తమ హృదయాన్ని ప్రశ్నించుకోండి. స్మృతి ద్వారానే బలం వస్తుంది. అందుకే జ్ఞాన ఖడ్గానికి పదును ఉండాలని అంటారు. జ్ఞానమైతే చాలా సహజ రీతిగా అర్థం చేయించవచ్చు.
ఎంతెంత స్మృతిలో ఉంటారో, అంత మధురంగా అవుతూ ఉంటారు. మీరు సతోప్రధానంగా ఉన్నప్పుడు చాలా మధురంగా ఉండేవారు. ఇప్పుడు మళ్లీ సతోప్రధానంగా అవ్వాలి. మీ స్వభావము కూడా చాలా మధురంగా ఉండాలి. ఎప్పుడూ కోపపడరాదు. ఇతరులు అసంతుష్టంగా అయ్యే వాతావరణం ఉండరాదు. ఈ ఈశ్వరీయ కాలేజిని స్థాపన చేయు సేవ చాలా ఉన్నతమైనది కనుక అందుకు ప్రయత్నం చేయాలి. విశ్వ విద్యాలయాలైతే భారతదేశంలో చాలా కీర్తించబడ్తున్నాయి. వాస్తవానికి అవి విశ్వవిద్యలయాలే కాదు. విశ్వ విద్యాలయం అయితే ఒక్కటే ఉంటుంది. తండ్రి వచ్చి అందరికి ముక్తి-జీవన్ముక్తులనిస్తారు. మొత్తం ప్రపంచములో ఉన్న మనుష్యులందరూ సమాప్తమవుతారని తండ్రికి తెలుసు. ఛీ-ఛీ ప్రపంచాన్ని సమాప్తం చేసి క్రొత్త ప్రపంచాన్ని స్థాపన చేయమనే తండ్రిని పిలిచారు. తండ్రి వచ్చి ఉన్నారని పిల్లలకు కూడా తెలుసు. మాయ ఆడంబరం(డాంబికం) ఇప్పుడు ఎంతగా ఉంది! ఫాల్‌ ఆఫ్‌ పాంపియా(ఖీaశ్రీశ్రీ ూట ూశీఎజూ) అను ఒక ఆటను కూడా చూపిస్తారు. పెద్ద పెద్ద గృహాలు మొదలైనవి నిర్మిస్తున్నారు. ఇదే ఆడంబరం(అట్టహాసము). సత్యయుగంలో ఇన్ని అంతస్థుల భవనాలు నిర్మించరు. ఉండేందుకు స్థలం తక్కువగా ఉంది కనుక ఇక్కడ నిర్మిస్తారు. వినాశన సమయంలో పెద్ద పెద్ద భవనాలు కూడా కూలిపోతాయి. ఇంతకుముందు ఇంతింత పెద్ద భవనాలు నిర్మించేవారు కాదు. బాంబులు వేశారంటే భవనాలు పేకముక్కల వలె కూలిపోతాయి. దీని అర్థం ఆ భవనాల్లో ఉండేవారే మరణిస్తారు, మిగిలినవారు అలాగే ఉంటారని కాదు. సముద్రంలో ఉన్నా, భూమి పై ఉన్నా, ఆకాశంలో ఉన్నా, పర్వతాల పై ఉన్నా, ఎగురుతూ ఉన్నా,............ ఎక్కడ ఉన్నవారైనా సమాప్తమైపోతారు. ఇది పాత ప్రపంచం కదా! 84 లక్షల యోనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమాప్తమైపోతాయి. అక్కడి నూతన ప్రపంచములో ఇవేవీ జరగవు. ఇంతమంది మనుష్యులూ ఉండరు, దోమలు, జీవ జంతువులు మొదలైనవేవీ ఉండవు. ఇక్కడైతే లెక్కలేనన్ని ఉన్నాయి! ఇప్పుడు పిల్లలైన మీరు కూడా దేవతలుగా అయితే, అక్కడ ప్రతి వస్తువూ సతోప్రధానంగా ఉంటుంది. ఇక్కడ కూడా గొప్పవారి ఇళ్లకు వెళ్తే అక్కడ చాలా శుభ్రత ఉంటుంది. మీరైతే అందరికన్నా గొప్ప దేవతలుగా అవుతారు. గొప్ప మనుష్యులు అని కూడా అనరు, మీరు చాలా ఉన్నతమైన దేవతలుగా అవుతారు. ఇది క్రొత్త విషయమేమీ కాదు. 5 వేల సంవత్సరాల క్రితం కూడా మీరు నంబరువారీగా ఇలా అయ్యారు. ఇక్కడ ఉన్నంత చెత్త మొదలైనవేవీ అక్కడ ఉండవు. మనము కూడా చాలా ఉన్నతమైన దేవతలుగా అవుతామని పిల్లలకు చాలా సంతోషం కలుగుతుంది. ఒక్క తండ్రియే మనలను చదివించి చాలా ఉన్నతంగా చేస్తారు. చదువులో నంబరువారీ పొజిషన్‌ వారు ఎప్పుడూ ఉంటారు. కొంతమంది తక్కువగా చదువుతారు, కొంతమంది ఎక్కువగా(బాగా) చదువుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థం చేస్తున్నారు. గొప్ప గొప్ప వ్యక్తులకు తెలియాలని పెద్ద పెద్ద సెంటర్లు తెరుస్తున్నారు. భారతదేశ ప్రాచీన రాజయోగము కూడా మహిమ చేయబడింది. ముఖ్యంగా విదేశీయులకు రాజయోగం నేర్చుకోవాలని చాలా ఉత్సుకత ఉంటుంది. భారతవాసులదైతే తమోప్రధాన బుద్ధి. వారిది తమో బుద్ధి అందుకే భారతదేశ ప్రాచీన రాజయోగం నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటుంది. భారతదేశ ప్రాచీన రాజయోగము ప్రసిద్ధి గాంచింది. దాని ద్వారానే భారతదేశము స్వర్గముగా అయ్యింది. పూర్తిగా అర్థం చేసుకునేవారు చాలా కొద్దిమందే వస్తారు. స్వర్గం, హెవెన్‌ ఏదైతే ఒకప్పుడు ఉండి పోయిందో అది మళ్లీ తప్పకుండా వస్తుంది. హెవెన్‌ అంటే ప్యారడైజ్‌. అది ప్రపంచంలో అన్నింటికన్నా గొప్ప అద్భుతము. స్వర్గం అను పేరు ఎంత ప్రసిద్ధి గాంచింది! స్వర్గము-నరకము, శివాలయం - వేశ్యాలయం. పిల్లలకు మనం ఇప్పుడు శివాలయానికి వెళ్లాలని నంబరువారిగా గుర్తుంది. అక్కడకు వెళ్లేందుకు శివబాబాను స్మృతి చేయాలి. వారే అందరినీ తీసుకొని వెళ్లే మార్గదర్శకులు. భక్తిని రాత్రి అని అంటారు. జ్ఞానాన్ని పగలు అని అంటారు. ఇది అనంతమైన విషయం. క్రొత్త వస్తువుకు, పాత వస్తువుకు చాలా తేడా ఉంటుంది. ఇంత ఉన్నతాతి ఉన్నతమైన చదువును, ఉన్నతమైన భవనాల్లో మనం చదివిస్తే గొప్ప గొప్పవారు వస్తారని పిల్లల మనసులో ఉంటుంది(ఇష్టపడ్తారు). కూర్చొని ఒక్కొక్కరికి అర్థం చేయించాల్సి ఉంటుంది. వాస్తవానికి చదువు లేక శిక్షణ కొరకు స్థానము ఏకాంతములో ఉంటుంది. బ్రహ్మ జ్ఞానుల ఆశ్రమాలు కూడా పట్టణాల నుండి దూరంగా క్రిందే ఉంటాయి. ఇంత పై అంతస్థులలో ఉండవు. ఇప్పుడైతే తమోప్రధానంగా అవ్వడంతో పట్టణాలలోకి చొచ్చుకొని వచ్చేశారు. ఆ బలం సమాప్తమైపోయింది. ఈ సమయంలో అందరి బ్యాటరీ ఖాళీ అయ్యింది. ఇప్పుడు బ్యాటరీని ఎలా నింపాలి - ఈ తండ్రి తప్ప ఇంకెవ్వరూ బ్యాటరీని చార్జ్‌ చేయలేరు. బ్యాటరీ ఛార్జ్‌ చేసుకుంటేనే పిల్లలకు బలం వస్తుంది. దీని కొరకు ముఖ్యమైనది స్మృతి. స్మృతిలోనే మాయ విఘ్నాలు వస్తాయి. కొంతమంది సర్జన్‌కు సత్యం చెప్తారు. కొంతమంది దాచుకుంటారు. లోపల ఉన్న లోపాలు తండ్రికి తెలుపవలసి ఉంటుంది. ఈ జన్మలో చేసిన పాపం ఆ అవినాశీ సర్జన్‌కు వర్ణించి చెప్పాలి. లేకపోతే అది మనసును తింటూ ఉంటుంది. వినిపించిన తర్వాత ఇక తినేయదు. లోపల ఉంచుకోవడం - ఇది కూడా నష్టము కలిగిస్తుంది. సత్యమైన పిల్లలు, ఈ జన్మలో ఈ ఈ ఈ పాపాలు చేశామని అన్ని విషయాలు తండ్రికి తెలిపేస్తారు. ఇది మీ అంతిమ జన్మ అని ప్రతి రోజూ తండ్రి నొక్కి చెప్తూ ఉంటారు. తమోప్రధానత ద్వారా పాపాలు తప్పకుండా జరుగుతూ ఉంటాయి కదా!
తండ్రి చెప్తున్నారు - చాలా జన్మల అంతిమంలో నంబర్‌వన్‌ పతితంగా అయిన వారిలోనే నేను ప్రవేశిస్తాను. ఎందుకంటే అతనే మళ్లీ నంబర్‌వన్‌లోకి వెళ్లాలి. చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. ఈ జన్మలో కూడా చాలా పాపాలు జరిగాయి కదా! తాము ఏమి చేస్తున్నామో కూడా చాలామందికి తెలియదు. నిజం చెప్పరు. కొంతమంది నిజం చెప్పేస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ! కర్మాతీత అవస్థ తయారైనప్పుడు మీ కర్మేంద్రియాలు శాంతమైపోతాయి. మనుష్యులు వృద్ధులుగా అయినప్పుడు కర్మేంద్రియాలు ఆటోమేటిక్‌గా శాంతమైపోయినట్లు శాంతమైపోతాయి. ఇందులో అయితే చిన్నతనంలోనే అన్నీ శాంతంగా అయిపోవాలి. యోగబలం బాగా ఉంటే ఈ విషయాలన్ని అంతమైపోతాయి. అక్కడ ఇటువంటి మురికి రోగాలు, చెత్త మొదలైనవి ఏవీ ఉండవు. మనుష్యులు చాలా శుభ్రంగా, శుద్ధంగా ఉంటారు. అక్కడ ఉండేదే రామ రాజ్యం. ఇది రావణ రాజ్యం. అందుకే అనేక రకాల అశుద్ధమైన రోగాలు మొదలైనవి ఉన్నాయి. సత్యయుగంలో ఇవేవీ ఉండవు. ఎంత బాగుంటుందో వర్ణించలేము. పేరు ఎంత ఫస్ట్‌క్లాస్‌గా ఉంది! - స్వర్గము, కొత్త ప్రపంచము. చాలా శుభ్రత ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే మీరు ఈ విషయాలన్నీ వింటారు. నిన్న వినలేదు. నిన్న మృత్యులోకానికి అధిపతులు, ఈ రోజు అమరలోకానికిి యజమానులుగా అవుతారు. నిన్న మృత్యులోకంలో ఉండేవారమని, ఇప్పుడు సంగమ యుగంలోకిి రావడంతో అమరలోకంలోకి వెళ్లేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారని నిశ్చయమైపోయింది. చదివించేవారు కూడా ఇప్పుడు లభించారు. బాగా చదువుకుంటే ధనము మొదలైనవి కూడా బాగా సంపాదిస్తారు. బలిహారము చదువుదే అని అంటారు. అలాగే ఇక్కడ కూడా మీరు ఈ చదువుతో చాలా ఉన్నత పదవి పొందుతారు. ఇప్పుడు మీరు ప్రకాశంలో ఉన్నారు. ఇది కూడా పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. మీరు కూడా మాటి మాటికీ మర్చిపోతారు, పాత ప్రపంచములోకి వెళ్లిపోతారు. మర్చిపోవడం అనగా పాత ప్రపంచంలోకి వెళ్లిపోవడం.
ఇప్పుడు మేము కలియుగంలో లేమని సంగమయుగ బ్రాహ్మణులైన మీకు తెలుసు. మేము కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతున్నామని సదా గుర్తుంచుకోవాలి. తండ్రి మమ్ములను నూతన ప్రపంచానికి తీసుకెళ్లేందుకే చదివిస్తున్నారు. ఇది శుద్ధమైన అహంకారం. అది అశుద్ధమైన అహంకారం. పిల్లలైన మీకు ఎప్పుడూ అశుద్ధమైన ఆలోచనలు రాకూడదు. పురుషార్థం చేయగా చేయగా ఆఖరికి చివర్లో రిజల్టు వెలువడ్తుంది. ఈ సమయం వరకు అందరూ పురుషార్థులేనని తండ్రి అర్థం చేయిస్తారు. పరీక్షలు జరిగినప్పుడు నంబరువారీగా పాస్‌ అయ్యి ట్రాన్స్‌ఫర్‌ అయిపోతారు. మీది అనంతమైన చదువు. దాని గురించి కేవలం మీకు మాత్రమే తెలుసు. మీరు ఎంతగా అర్థం చేయిస్తారు! కొత్త కొత్త వారు తండ్రి నుండి వారసత్వాన్ని పొందేందుకు వస్తూ ఉంటారు. భలే! దూరంగా ఉంటారు, అయినా వింటూ వింటూ ఇటువంటి బాబా సన్ముఖంలోకి వెళ్లాలని నిశ్చయబుద్ధి గలవారిగా అవుతారు. ఏ తండ్రి అయితే పిల్లలను చదివించారో, అటువంటి తండ్రిని సన్ముఖంలో తప్పకుండా కలవాలని భావించే ఇక్కడకు వస్తారు. ఎవరికైనా అర్థం తెలియకపోయినా ఇక్కడికి రావడంతో అర్థమైపోతుంది. మనసులో ఏ విషయం ఉన్నా, అర్థం కాకపోయినా భలే అడగండి అని తండ్రి చెప్తున్నారు. తండ్రి ఆయస్కాంతం కదా! ఎవరి అదృష్టంలో ఉందో వారు బాగా పట్టుకోగలరు. అదృష్టంలో లేకుంటే సమాప్తమైపోతారు. విని విననట్లు వదిలేస్తారు. ఇక్కడ ఎవరు కూర్చుని చదివిస్తున్నారు? భగవంతుడు. వారి పేరు శివ. శివబాబాయే మనకు స్వర్గ చక్రవర్తి పదవిని ఇస్తారు. మరి ఏ చదువు మంచిది? శివబాబా మమ్ములను చదివించే చదువుతో 21 జన్మల చక్రవర్తి పదవి లభిస్తుందని మీరు అంటారు. ఇలా ఇలా అర్థం చేయిస్తూ చేయిస్తూ తీసుకెళ్తారు. కొంతమంది పూర్తిగా అర్థం చేసుకోని కారణంగా అంత సేవ చేయలేరు. బంధనాల సంకెళ్ళలో చిక్కుకొని ఉంటారు. ప్రారంభంలో అయితే మీ సంకెళ్లను ఎలా మీరు విడిపించుకొని వచ్చారు! మత్తెక్కిన వారి వలె వచ్చేశారు. ఇలా ఆకర్షితులవ్వడం కూడా డ్రామాలో ఉంది. డ్రామాలో భట్టీ తయారవ్వాల్సి ఉంది. జీవిస్తూ మరణించారు, మళ్లీ కొంతమంది మాయ వైపుకు వెళ్లిపోయారు. యుద్ధం అయితే జరుగుతుంది కదా! వీరు చాలా ధైర్యం చూపించారు మరి పక్కాగా ఉన్నారా? లేదా? అని నేను కూడా తట్టి(దెబ్బ వేసి) చూస్తానని మాయ గమనిస్తూ ఉంటుంది. పిల్లలను చాలా సంభాళన చేశారు. అన్నీ నేర్పించేవారు. పిల్లలైన మీరు ఆల్బమ్‌ మొదలైనవి చూస్తూ ఉంటారు కానీ కేవలం చిత్రాలు చూచినందున అర్థం చేసుకోలేరు. భట్టీలో ఎలా ఉండేవారో, ఏమేమి జరిగాయో ఎవరెవరు ఎలా వచ్చారో ఎవరైనా కూర్చుని అర్థం చేయించాలి. రూపాయలు ముద్రించేటప్పుడు కూడా కొన్ని కొన్ని చెడిపోతుంటాయి కదా. ఇది కూడా ఈశ్వరీయ మిషనరీ. ఈశ్వరుడు కూర్చుని ధర్మ స్థాపన చేస్తున్నారు. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. తండ్రిని కూడా పిలుస్తారు కానీ వేడి పెనం వలె ఏమీ అర్థం చేసుకోరు. ఇది ఎలా జరుగుతుంది అని అంటారు. మాయా రావణుడు వారిని అలా తయారు చేస్తాడు. శివబాబాను కూడా పూజిస్తూ ఉంటారు మళ్లీ వారిని సర్వవ్యాపి అని అనేస్తారు. శివబాబా అని పిలుస్తుంటారు, మరి వారు సర్వవ్యాపి ఎలా అవుతారు! లింగ పూజ చేస్తుంటారు, ఆ లింగాన్నే శివుడని పిలుస్తారు. లింగములో శివుడు కూర్చున్నారని అనరు. ఇప్పుడు రాయి-రప్పలలో భగవంతుడున్నారని చెప్పడం...... మరి వీరందరూ భగవంతులేనా! భగవంతుడు అనంతముగా(అన్‌లిమిటెడ్‌గా) అయితే ఉండరు కదా. కల్పక్రితము కూడా ఇలాగే అర్థం చేయించానని తండ్రి తెలిపిస్తున్నారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఎటువంటి మధురమైన వాతావరణం తయారుచేయాలంటే, అందులో ఎవ్వరూ కోపగించుకోరాదు. తండ్రి సమానం విదేహీగా అయ్యే పురుషార్థం చేయాలి. స్మృతి బలంతో తమ స్వభావాన్ని మధురంగా, కర్మేంద్రియాలను శాంతంగా చేసుకోవాలి.
2. ఇది సంగమ యుగము, కలియుగము కాదు, తండ్రి నన్ను నూతన విశ్వానికి యజమానిగా చేసేందుకు చదివిస్తున్నారనే నషాలో సదా ఉండాలి. అశుద్ధమైన ఆలోచనలు సమాప్తం చేసెయ్యాలి.

వరదానము :- '' శ్రేష్ఠ సంకల్ప శక్తి ద్వారా సిద్ధులను ప్రాప్తి చేసుకునే సిద్ధి స్వరూప భవ ''
మాస్టర్‌ సర్వశక్తివాన్‌ పిల్లల సంకల్పంలో ఎంత శక్తి ఉందంటే, ఏ సమయంలో ఏం కావాలంటే అది చేయగలరు, చేయించగలరు కూడా. ఎందుకంటే మీ సంకల్పాలు సదా శుభంగా, శ్రేష్ఠంగా, కళ్యాణకారిగా ఉంటాయి. శ్రేష్ఠమైన కళ్యాణకారి సంకల్పము ఏదైతే ఉందో అది తప్పకుండా సిద్ధమౌతుంది. మనసు సదా ఏకాగ్రం అనగా ఒక స్థిరమైన స్థానము పై స్థితమై ఉంటుంది, భ్రమించదు. ఎప్పుడు కావాలంటే, అప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ స్థితం చేయగలరు. దీని ద్వారా స్వతహాగా సిద్ధి స్వరూపులుగా అవుతారు.

స్లోగన్‌ :- '' పరిస్థితుల ఆందోళనకర ప్రభావము నుండి రక్షించుకోవాలంటే, విదేహి స్థితిలో ఉండే అభ్యాసము చేయండి. ''