Thursday, 31 October 2019

Telugu Murli 01/11/2019

01-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - మీ పై మీరు పూర్తి గమనముంచండి, నియమ విరుద్ధంగా నడుచుకోకండి. శ్రీమతమును ఉల్లంఘిస్తే క్రింద పడిపోతారు ''

ప్రశ్న :- పదమాపదమ్‌ పతిగా అయ్యేందుకు ఏ జాగ్రత్తలు వహించాలి ?
జవాబు :- '' మనమెలాంటి కర్మలు చేస్తామో, మనలను చూచి ఇతరులు కూడా చేస్తారు'' అని సదా గమనముంచుకోవాలి. ఏ విషయములోనూ మిథ్యా(అసత్యమైన) అహంకారము రాకూడదు. మురళి ఎప్పుడూ మిస్‌ చేయరాదు. మనసా-వాచా-కర్మణా స్వయాన్ని సంభాళన చేసుకోండి(అదుపులో ఉంచుకోండి). ఈ కనులు మోసగించకపోతే పదమాల సంపాదన జమ చేసుకోగలరు. దీని కొరకు అంతర్ముఖులై తండ్రిని స్మృతి చేయండి అంతేకాక వికర్మల నుండి రక్షింపబడి ఉండండి.

ఓంశాంతి. ఆత్మిక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇక్కడ పిల్లలైన మీరు తప్పనిసరిగా ఈ ఆలోచనతో కూర్చోవాలి - '' వీరు తండ్రి కూడా అయ్యారు, టీచరు-సద్గురువు కూడా అయ్యారు'' బాబాను స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రమై పవిత్రధామానికి చేరుకుంటామని కూడా మీరు అనుభవము చేస్తారు. మీరు పవిత్రధామము నుండే క్రిందకు దిగారని తండ్రి అర్థం చేయించారు. దాని పేరే పవిత్రధామము. సతోప్రధానము నుండి మళ్లీ సతో, రజో, తమోలోకి వచ్చి ఇప్పుడు క్రిందపడి ఉన్నామని అనగా వేశ్యాలయంలో ఉన్నామని కూడా మీరు అర్థం చేసుకున్నారు. భలే మీరు సంగమ యుగంలో ఉన్నారు కానీ జ్ఞానము ద్వారా మేము అతీతంగా, వేరుగా ఉన్నామని అర్థం చేసుకున్నారు. అయినా మనం శివబాబా స్మృతిలో ఉంటే శివాలయము దూరంగా లేదని కూడా మీరు అర్థం చేసుకున్నారు. శివబాబాను స్మృతి చేయకుంటే శివాలయము చాలా దూరంగా ఉంటుంది. శిక్షలను అనుభవించవలసి వస్తే చాలా దూరమైపోతుంది. కనుక తండ్రి పిల్లలకు ఎక్కువ కష్టమునివ్వడం లేదు. ఒకటేమో మనసా-వాచా-కర్మణా పవిత్రంగా అవ్వాలని పదే పదే చెప్తున్నారు. ఈ కనులు కూడా చాలా మోసము చేస్తాయి. వీటిని చాలా చాలా సంభాళన చేసుకుంటూ నడుచుకోవాలి. ధ్యానము, యోగము రెండూ పూర్తిగా వేరని తండ్రి అర్థము చేయించారు. యోగమనగా తలంపు. కనులు తెరచుకొని కూడా మీరు బాగా స్మృతి చేయవచ్చు. ధ్యానమును యోగమని అనరు. భోగ్‌ తీసుకెళ్లినా ఆదేశానుసారమే తీసుకెళ్లాలి. ఇందులో మాయ కూడా చాలా ప్రవేశిస్తుంది. మాయ ఎలాంటిదంటే ఒక్కసారిగా ముక్కుతో పట్టుకుని ఊపిరి ఆడకుండా చేస్తుంది. ఎలాగైతే తండ్రి శక్తివంతులో అలా మాయ కూడా చాలా బలమైనదే. ఎంత బలమైనదంటే మొత్తం ప్రపంచాన్నంతా వేశ్యాలయంలోకి తోసేసింది. కావున ఇందులో చాలా అప్రమత్తంగా ఉండాలి. తండ్రి తెలిపిన నియమానుసారము స్మృతి ఉండాలి. నియమ విరుద్ధంగా ఏ పని చేసినా మాయ ఒక్కసారిగా క్రింద పడేస్తుంది. ధ్యానములోకి వెళ్లాలని మొదలైన కోరికలేవీ ఉంచుకోరాదు. ఇచ్ఛా మాత్రమ్‌ అవిద్య..........అంటే కోరికలంటే ఏమో తెలియనట్లుండాలి. తండి ఆజ్ఞాపించినట్లు నడుస్తే, మీ సర్వ మనోకామనలను అడగకుండానే పూర్తి చేస్తారు. తండ్రి ఆజ్ఞను పాటించక వ్యతిరేక మార్గములో నడిస్తే, స్వర్గానికి బదులు నరకములోనే పడిపోవచ్చు. ఏనుగును మొసలి తినేసినట్ల్లు గాయనము కూడా ఉంది. అనేమంది ఇతరులకు జ్ఞానము తెలిపినవారు, భోగ్‌ తీసుకెళ్లేవారు ఈ రోజు లేనే లేరు. ఎందుకంటే నియమ విరుద్ధంగా నడుచుకున్నందున పూర్తి మాయావిగా అయిపోతారు. దేవతలుగా అవుతూ అవుతూ రాక్షసులుగా అయిపోయారు. దేవతలుగా తయారయ్యే చాలా మంచి పురుషార్థులు కూడా అసురులుగా అయ్యి అసురుల జతలో ఉన్నారని తండ్రికి తెలుసు. విద్రోహులై(ట్రైటర్‌) పోతారు. తండ్రికి చెందినవారిగా అయ్యి మళ్లీ మాయకు వశమయ్యేవారిని విద్రోహులు అని అంటారు. స్వయం పై గమనముంచుకోవాలి. శ్రీమతమును ఉల్లంఘిస్తే క్రిందపడేది కూడా తెలియనే తెలియదు. రసాతలము(పాతాళము)లోకి చేరే నడవడికలు కలిగి ఉండరాదని తండ్రి పిల్లలకు గమనమిప్పిస్తున్నారు.
చాలామంది గోపులు(అన్నయ్యలు) ఉన్నారని తండ్రి నిన్న కూడా అర్థం చేయించారు. వారు పరస్పరము కమిటీలు మొదలైనవి తయారు చేసుకొని ఏం చేసినా, శ్రీమతము ఆధారంగా చెయ్యకుంటే డిస్‌ సర్వీసు చేసినట్లే అవుతుంది. శ్రీమతము లేకుండా చేస్తే క్రిందపడుతూనే ఉంటారు. బాబా ప్రారంభములో కమిటీని తయారు చేసినప్పుడు మాతల కమిటీనే నిమిత్తంగా చేశారు. ఎందుకంటే కలశము మాతలకే లభిస్తుంది. వందేమాతరం అని గాయనముంది కదా. ఒకవేళ గోపుల కమిటీని చేస్తే వందే గోపులనే గాయనము లేనే లేదు కదా. శ్రీమతమును అనుసరించకపోతే మాయా జాలములో చిక్కుకుంటారు. బాబా మాతల కమిటీని ఏర్పాటు చేసి సర్వస్వము వారికి అర్పించేశారు. పురుషులు తరచుగా దివాలా(ఖాళీ అవ్వడము) తీస్తారు. స్త్రీలు అలా దివాలా తీయరు. అందుకే తండ్రి కూడా కలశము మాతల పై ఉంచారు. ఈ జ్ఞానమార్గములో మాతలు కూడా దివాలా తీయవచ్చు. పదమాపదమ్‌ భాగ్యశాలురుగా అయ్యేవారు కూడా మాయతో ఓడిపోయి దీవాలా తీయవచ్చు. ఇందులో స్త్రీలు - పురుషులు ఇరువురూ దివాలా తీయవచ్చు, తీస్తారు కూడా. ఎంతోమంది ఓటమి చెంది వెళ్లిపోయారు అనగా దివాలా తీశారు కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు - భారతవాసులైతే పూర్తిగా దివాలా తీశారు. మాయ ఎంతో శక్తివంతమైనది. మనము ఎలా ఉండేవారము, ఎంత పైన నుండి ఒక్కసారిగా క్రిందపడ్డామో కూడా అర్థం చేసుకోలేరు. ఇక్కడ కూడా ఉన్నతమవుతూ అవుతూ శ్రీమతమును మరచి సొంత మతమును అనుసరిస్తే దివాలా తీస్తారు. ప్రపంచములోని వారు దివాలా తీసినా, 5-6 సంవత్సరాల తర్వాత మళ్లీ నిలదొక్కుకుంటారు. ఇక్కడైతే 84 జన్మలకు దివాలా తీస్తారు. ఉన్నతపదవిని పొందలేరు. దివాలా తీస్తూనే ఉంటారు. బాబా వారి వద్ద ఫోటో ఉంటే చూపిస్తారు. బాబా చాలా కరెక్టుగా చెప్తారని మీరంటారు. చాలామందిని జాగృతము చేసిన మహారథులు ఈ రోజు లేనే లేరు. దివాలాలో ఉన్నారు. బాబా పదే పదే పిల్లలను అప్రమత్తము చేస్తూ ఉంటారు. మీ ఇష్టానుసారము కమిటీలు చేయడం వలన ఏ లాభమూ లేదు. పరస్పరములో కలిసినప్పుడు వారు అలా చేశారు, వీరు ఇలా చేశారు,.... అని లోకాభిరామాయణముతోనే రోజంతా గడిపేస్తారు. తండ్రితో బుద్ధియోగమును జోడించినప్పుడు మాత్రమే సతోప్రధానంగా అవుతారు. తండ్రికి చెందినవారిగా అయ్యి తండ్రిని స్మృతి చేయకుంటే మాటిమాటికి క్రింద పడ్తూనే ఉంటారు. సంబంధము(కనెక్షన్‌) తెగిపోతుంది. లింక్‌(సంబంధము) తెగిపోయినా భయపడరాదు. మాయ మనలను ఇంతగా ఎందుకు విసిగిస్తుంది. ప్రయత్నించి తండ్రితో మీరు మళ్లీ లింకు ఏర్పరుచుకోవాలి లేకుంటే బ్యాటరీ ఎలా ఛార్జ్‌ అవుతుంది? వికర్మలు చేసినందున బ్యాటరీ డిస్‌ఛార్జ్‌ అయిపోతుంది. ప్రారంభములో అనేకమంది బాబా వద్దకు వచ్చి బాబాకు చెందినవారిగా అయ్యారు. భట్టీలో వచ్చారు కానీ వారు ఈ రోజు లేనే లేరు. పాత ప్రపంచము గుర్తు వచ్చినందున వారు క్రింద పడిపోయారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - మీకు అనంతమైన వైరాగ్యము కలిగిస్తున్నాను. ఈ పాత ప్రపంచము వైపుకు మీ మనసు పోనీయరాదు. మనస్సును స్వర్గముతో జోడించండి. ఇలాంటి లక్ష్మీనారాయణులుగా అవ్వాలంటే శ్రమించవలసి వస్తుంది. బుద్ధియోగము ఒక్క తండ్రితోనే ఉండాలి. పాత ప్రపంచము పై వైరాగ్యము రావాలి. సుఖధామము, శాంతిధామాలను స్మృతి చేయండి. వీలైనంత ఎక్కువగా లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇది చాలా సులభము. నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకే మీరు ఇక్కడకు వచ్చారు. ఇప్పుడు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవ్వాలని అందరికీ అర్థం చేయించాలి. ఎందుకంటే ఇప్పుడిక తిరుగు ప్రయాణము(రిటర్న్‌ జర్ని) జరుగుతుంది. ప్రపంచ భూగోళము - చరిత్ర(హిస్టరి, జాగ్రఫి) పునరావృతమవుతుంది అనగా నరకము నుండి స్వర్గము మళ్లీ స్వర్గము నుండి నరకము. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది.
తండ్రి చెప్తున్నారు - ఇక్కడ స్వదర్శన చక్రధారులై కూర్చోండి. మనము ఎన్నోసార్లు చక్రములో తిరిగాము ఇప్పుడు మళ్లీ మనము దేవతలుగా అవుతున్నాము. ప్రపంచములోని వారెవ్వరికీ ఈ రహస్యము తెలియదు. ఈ జ్ఞానము దేవతలకు లేనే లేదు. ఎందుకంటే వారు పవిత్రులు. శంఖును పూరించేందుకు వారిలో జ్ఞానమే లేదు. వారు పవిత్రులు. వారికి ఆ అలంకారాలు ఇచ్చే అవసరమే లేదు. ఇరువురూ(స్త్రీ - పురుషులు) కలిసి ఉన్నప్పుడే ఈ గుర్తులుంటాయి. మీకు కూడా ఈ గుర్తులు లేవు. ఎందుకంటే ఈ రోజు దేవతలుగా అవుతూ రేపటి రోజు అసురులుగా అవుతారు. తండ్రి దేవతలుగా చేస్తారు. మాయ అసురులుగా చేస్తుంది. తండ్రి అర్థము చేయించినప్పుడు మా స్థితి నిజంగా దిగజారి పోయిందని అర్థమవుతుంది. పాపం ఎంతోమంది తెలియక శివబాబా ఖజానాలో జమ చేసుకుంటూ వాటిని మళ్లీ వాపస్‌ అడిగి అసురులుగా అయిపోతారు. ఇందుకు కారణము యోగము తక్కువగా ఉండడమే. యోగము ద్వారానే పవిత్రంగా అవ్వాలి. ''ఓ బాబా! రండి, మేము స్వర్గములోకి వెళ్లగల్గుటకు మమ్ములను పతితుల నుండి పావనంగా చేయమని తండ్రిని పిలుస్తారు. పావనంగా అయ్యి ఉన్నతపదవి పొందేందుకే స్మృతియాత్ర చేయాలి. కానీ కొంతమంది నడుస్తూ నడుస్తూ మరణిస్తారు. అలా మరణించినవారు కూడా ఈ జ్ఞానాన్ని కొద్దిగా విని ఉండినా శివాలయములోకి తప్పకుండా వస్తారు. ఏదో ఒక పదవి లభిస్తుంది. ఒక్కసారి స్మృతి చేసినా స్వర్గములోకి తప్పకుండా వస్తారు. కానీ ఉన్నతపదవిని పొందలేరు. స్వర్గము పేరు విని సంతోషించాలి. ఫెయిల్‌ అయ్యి చిన్న పదవిని పొందుకోవడంలో సంతోషపడరాదు. అలా నేను నౌకరుననే ఫీలింగ్‌ వస్తుంది కదా. చివరిలో స్వర్గములో ఏ పదవి పొందుతారో మీకు అన్ని సాక్షాత్కారాలు అవుతాయి. మాకీ దుస్థితి కలిగినందుకు మేము ఏ వికర్మలు చేశాము? నేను మహారాణిగా ఎందుకు కారాదు? అడుగడుగునా అప్రమత్తంగా నడుచుకుంటేనే మీరు పదమాపదమ్‌ పతులుగా అవ్వగలరు. మందిరాలలో దేవతలకు పద్మములను గుర్తుగా చూపిస్తారు. పదవులలో, హోదాలలో తేడా వస్తుంది. ఈ రోజు రాజులకు ఎంత ఆడంబరము (ప్రభావము, పలుకుబడి) ఉంది! అది అల్పకాలికమైనదే. సదా కాలానికి రాజులుగా అవ్వలేరు. అందువలన మీరు లక్ష్మినారాయణులుగా అవ్వాలంటే పురుషార్థము కూడా అలా చెయ్యాలని తండ్రి చెప్తున్నారు. మేము ఎంతమందికి కళ్యాణము చేస్తున్నాము? అంతర్ముఖులై ఎంత సమయము తండ్రిని స్మృతి చేస్తున్నాము? ఇప్పుడు మనము మన మధురమైన ఇంటికి వెళ్తున్నాము మళ్లీ సుఖధామములోకి వస్తాము. ఈ విధమైన జ్ఞాన మథనము లోలోపల జరుగుతూ ఉండాలి. తండ్రిలో జ్ఞానము, యోగము రెండూ ఉన్నాయి. మీలో కూడా ఉండాలి. శివబాబా మమ్ములను చదివిస్తున్నారని గుర్తుంచుకుంటే జ్ఞాన-యోగాలు రెండూ జరుగుతాయి. జ్ఞాన-యోగాలు రెండూ జత జతలో నడుస్తాయి. అంతేగాని యోగములో తండ్రిని స్మృతి చేస్తూ జ్ఞానము మర్చిపోరాదు. తండ్రి యోగమును నేర్పిస్తే జ్ఞానమును మర్చిపోతారా? మొత్తం జ్ఞానమంతా వారిలో ఉంది. పిల్లలైన మీలో కూడా జ్ఞానముండాలి, చదువుకోవాలి. నేనెలాంటి కర్మలు చేస్తానో నన్ను చూచి ఇతరులు కూడా అలాంటి కర్మలు చేస్తారు. నేను మురళి చదవకుంటే ఇతరులు కూడా చదవరు. మిథ్యా అహంకారము వస్తే వెంటనే మాయ యుద్ధము చేస్తుంది. అడుగడుగునా తండ్రి నుండి శ్రీమతము తీసుకుంటూ ఉండాలి. లేకుంటే ఏదో ఒక వికర్మ జరుగుతూ ఉంటుంది. చాలామంది పిల్లలు తప్పులు చేసి తండ్రికి వినిపించరు. దీని వలన సర్వనాశనమౌతారు. నిర్లక్ష్యము చేసినందున మాయ చెంపదెబ్బ వేస్తుంది. పైసకు కొరగాకుండా (వర్త్‌ నాట్‌ ఎ పెన్నీగా) చేసేస్తుంది. అహంకారములోకి వచ్చినందున మాయ చాలా వికర్మలు చేయిస్తుంది. పురుషుల కమిటీలు తయారు చేయమని బాబా ఏమైనా చెప్పారా? కమిటీలో ఒకరిద్దరు తెలివైన అక్కయ్యలు తప్పనిసరిగా ఉండాలి. వారి సలహా ప్రకారమే పని జరగాలి. కలశము లక్ష్మి పైనే ఉంచుతారు కదా. అమృతము త్రాగిస్తున్నా యజ్ఞములో విఘ్నాలు వేస్తూ ఉంటారనే గాయనముంది. అనేక ప్రకారాల విఘ్నాలు కలుగజేసే వారుంటారు. రోజంతా లోకాభి రామాయణము(వ్యర్థ చింతన, పరచింతన) మాట్లాడుతూనే ఉంటారు. ఇది చాలా చెడ్డది. ఏదైనా విషయముంటే తండ్రికి రిపోర్టు(ఫిర్యాదు) ఇవ్వాలి. తండ్రి ఒక్కరు మాత్రమే సరిదిద్దగలరు అనగా బాగు చేయగలరు. మీరు మీ చేతులలోకి చట్టము తీసుకోకండి. మీరు తండ్రి స్మృతిలో ఉండండి. అందరికీ తండ్రి పరిచయమిస్తూ ఉంటే ఇలా తయారవుతారు. మాయ చాలా కఠినమైనది, ఎవ్వరినీ వదిలిపెట్టదు. సదా తండ్రికి సమాచారము తెలుపుతూ ఉండండి. ఆదేశాలు తీసుకుంటూ ఉండాలి. ఆదేశాలు సదా లభిస్తూనే ఉంటాయి. బాబాయే స్వయంగా ఈ విషయాన్ని అర్థం చేయించారు, కావున బాబా అంతర్యామి అని పిల్లలు అనుకుంటారు. కానీ అలా నేను అంతర్యామిని కాను. నేను జ్ఞానాన్ని మాత్రమే చదివిస్తానని బాబా అంటున్నారు. ఇందులో అంతర్యామి మాటే లేదు అని బాబా అంటారు. కానీ మీరంతా నా పిల్లలే అని నాకు తెలుసు. ప్రతి శరీరములో నా పిల్లలున్నారు. అంతేకాని అందరిలో తండ్రి విరాజమానమై లేరు. మానవులంతా ఉల్టాగానే అర్థం చేసుకున్నారు. తండ్రి చెప్తున్నారు - అందరి(భృకుటి) సింహాసనాల పై ఆత్మ విరాజమానమై ఉందని నాకు తెలుసు. ఇది చాలా సహజమైన విషయం. చైతన్యమైన ఆత్మలన్నీ వాటి వాటి సింహాసనాల పై కూర్చొని ఉన్నాయి. కానీ పరమాత్ముడు సర్వవ్యాపి అని మనుష్యులంటారు. ఇది చాలా పెద్ద పొరపాటు(ఏకజ్‌ భూల్‌). ఈ కారణంగానే భారతదేశము ఎంతో దిగజారిపోయింది. తండ్రి చెప్తున్నారు - మీరు నన్ను చాలా గ్లాని చేశారు, నిందించారు. విశ్వానికి అధికారులుగా చేసే తండ్రిని మీరు నిందించారు. అందుకే యదా యదాహి,.......... అని తండ్రి చెప్చున్నారు. విదేశీయులు భారతీయుల నుండే ఈ సర్వవ్యాపి జ్ఞానాన్ని నేర్చుకున్నారు. ఎలాగైతే భారతవాసులు వారి నుండి హునర్‌(నైపుణ్యము/టెక్నిక్‌) నేర్చుకుంటారో అలా వారు మన నుండి ఉల్టా జ్ఞానాన్ని నేర్చుకుంటారు. మీరు ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. అంతేకాక తండ్రి పరిచయమును కూడా అందరికీ ఇవ్వాలి. మీరు గ్రుడ్డివారికి ఊతకర్రలాంటి వారు. ఊతకర్ర ద్వారానే మార్గదర్శనము చేస్తారు కదా. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.


ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ప్రతి కార్యము తండ్రి ఆజ్ఞానుసారము చేయాలి. ఎప్పుడూ శ్రీమతమును ఉల్లంఘించరాదు. అప్పుడే మీ మనోకామనలన్నీ అడగకుండానే పూర్తి అవుతాయి. ధ్యానము, సాక్షాత్కారములు కావాలనే కోరికనుంచుకోరాదు. ఇచ్ఛా మాత్రం అవిద్యాగా(కోరికంటే తెలియనివారుగా) అవ్వాలి.
2. పరస్పరము కలిసి పరచింతన చేయరాదు. అంతర్ముఖులై - ''ఎంత సమయము బాబా స్మృతిలో ఉన్నాము? లోలోపల జ్ఞాన మథనము జరుగుతోందా?'' అని స్వయాన్ని పరిశీలించుకోవాలి.

వరదానము :- '' బిందు రూపంలో స్థితమై ఉండి, ఇతరులకు కూడా డ్రామా బిందువనే స్మృతినిప్పించే ' విఘ్నవినాశక్‌ ' భవ ''
ఏ పిల్లలైతే ఏ విషయంలోనూ ప్రశ్నార్థకముంచరో, సదా బిందు రూపంలో స్థితమై ఉండి ప్రతి కార్యంలో ఇతరులకు కూడా డ్రామా బిందువనే స్మృతినిప్పిస్తారో - వారినే విఘ్నవినాశకులని అంటారు. వారు ఇతరులను కూడా సమర్థంగా చేసి సఫలతా గమ్యానికి చేరువగా(సమీపంగా) తీసుకొస్తారు. వారు హద్దు సఫలత యొక్క ప్రాప్తిని చూసి సంతోషపడరు. వారు అనంతమైన సఫలతామూర్తులుగా ఉంటారు. సదా ఏకరసంగా, ఒక శ్రేష్ఠమైన స్థితిలో స్థితులై ఉంటారు. వారు తమ సఫలత యొక్క స్వ స్థితి ద్వారా అసఫలతను కూడా పరివర్తన చేసేస్తారు.

స్లోగన్‌ :- '' ఆశీర్వాదాలిస్తూ, ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటే త్వరగా మాయాజీతులుగా అవుతారు ''

Wednesday, 30 October 2019

Telugu Murli 31/10/2019

31-10-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - తండ్రి నావికుడై వచ్చారు, మీ అందరి నావలను విషయ సాగరము నుండి క్షీర సాగరములోకి తీసుకెళ్తారు. ఇప్పుడు మీరు ఈ తీరము నుండి ఆ తీరానికి వెళ్లాలి ''

ప్రశ్న :- పిల్లలైన మీరు ప్రతి ఒక్కరి పాత్ర చూస్తూ ఎవ్వరినీ నిందించరాదు - ఎందుకు?
జవాబు :- ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా అని మీకు తెలుసు. ఈ డ్రామాలో ప్రతి పాత్రధారి ఎవరి పాత్ర వారు అభినయిస్తున్నారు. ఇందులో ఎవరి దోషమూ లేదు. ఈ భక్తిమార్గము కూడా మళ్లీ పాస్‌ అయ్యే తీరాలి. ఇందులో కొద్దిగా కూడా మార్పులు జరగవు.

ప్రశ్న :- ఏ రెండు శబ్ధాలలో సృష్టిచక్ర జ్ఞానమంతా ఇమిడి ఉంది?
జవాబు :- ఈ రోజు, రేపు. నిన్న మనము సత్యయుగములో ఉండేవారము. 84 జన్మల చక్రము పూర్తి చేసుకొని ఈ రోజు నరకములోకి చేరుకున్నాము. రేపు మళ్లీ మనము స్వర్గములోకి వెళ్లిపోతాము.

ఓంశాంతి. ఇప్పుడు పిల్లలు నా ముందే కూర్చొని ఉన్నారు. సేవాకేంద్రాలలో ఉన్నప్పుడు, ఉన్నతోన్నతమైన బాబా ఎదుట మేము కూర్చొని ఉన్నామని భావించరు. ఆ తండ్రే మనకు టీచరు, వారే మన నావను దాటించేవారు. వారినే గురువు అని అంటారు. ఇక్కడ మీరు సన్ముఖములో కూర్చొని ఉన్నామని భావిస్తారు. మనలను విషయ సాగరము నుండి క్షీరసాగరములోనికి తీసుకెళ్తారు. ఆవలి తీరానికి తీసుకెళ్లే తండ్రి కూడా సన్ముఖములో కూర్చొని ఉన్నారు. ఆ ఒక్క శివబాబా ఆత్మను మాతమ్రే సుపీమ్ర్‌ అనగా సర్వ శేష్ఠ్రమైన భగవంతుడు అని అంటారు. మనమిప్పుడు ఉన్నతోన్నతమైన భగవంతుడు శివబాబా సన్ముఖములో కూర్చొని ఉన్నామని పిల్లలైన మీకు తెలుసు. వారిప్పుడు ఈ (బహ్మ్ర) శరీరములో కూర్చొని ఉన్నారు. వారు మీ అందరినీ తీరానికి కూడా చేరుస్తారు. వారికి రథము కూడా తప్పకుండా కావాలి కదా! లేకుంటే శ్రీమతమును ఎలా ఇవ్వాలి? బాబా మన తండ్రే కాక, టీచరు, అంతేకాక ఆవలి తీరానికి తీసకెళ్లేవారు కూడా వారే. ఇప్పుడు ఆత్మలైన మనము, మన ఇల్లైన శాంతిధామానికి వెళ్తున్నాము. ఆ బాబా మనకు మార్గాన్ని చూపుతున్నారు. అక్కడ సెంటర్లలో కూర్చునేందుకు, ఇక్కడ సన్ముఖంలో కూర్చునేందుకు రాత్రికి-పగులుకు ఉన్నంత వ్యత్యాసముంది. అక్కడ సన్ముఖంలో కూర్చొని ఉన్నామని భావించరు. ఇక్కడ ఈ అనుభూతి కలుగుతుంది. ఇప్పుడింకా మనము పురుషార్థము చేస్తున్నాము. పురుషార్థము చేయించేవారికి సంతోషముంటుంది. ఇప్పుడు మనము పావనంగా అయ్యి ఇంటికి వెళ్తున్నాము. ఎలాగైతే నాటకములోని పాత్రధారులు నాటకమైపోయిందని భావిస్తారో అలా ఇప్పుడు ఆత్మలమైన మనలను తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారని మీరు తెలుసుకున్నారు. మీరు ఇంటికి ఎలా వెళ్లగలరో ఆ విధానము కూడా అర్థం చేయిస్తారు. వారు తండ్రే కాక నావను తీరానికి చేర్చే నావికుడు కూడా. ప్రపంచములోనివారు ఇలా పాడ్తారు కాని నావ అని దేనినంటారో వారికి ఏ మాత్రము తెలియదు. ఆ తండ్రి శరీరాలనేమైనా తీసుకెళ్తారా? మన ఆత్మలను తీరానికి చేరుస్తారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు ఆత్మ ఈ శరీరములో వేశ్యాలయము నందు విషయవైతరిణీ నదిలో పడి ఉంది. మనము వాస్తవానికి శాంతిధామములో నివసించేవారము. మనలను తీరానికి చేర్చేవారు అనగా ఇంటికి తీసుకెళ్లే తండి లభించారు. రావణుడు మీ రాజధానిని రావణుడు పూర్తిగా లాక్కున్నాడు. ఆ రాజధానిని మళ్లీ తప్పకుండా తీసుకోవాలి. అనంతమైన తండ్రి అంటున్నారు - పిల్లలూ, ఇప్పుడు మీ ఇంటిని స్మృతి చేయండి. అచ్చటికి వెళ్లి మళ్లీ క్షీరసాగరములోకి రావాలి. ఇక్కడ ఉండేది విషయసాగరము, అక్కడ ఉండేది క్షీరసాగరము, మూలవతనము శాంతిసాగరము వంటిది. మూడు ధామాలున్నాయి. ఇది దు:ఖధామము.
తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇలా చెప్పేదెవరు? ఎవరి ద్వారా చెప్తున్నారు? రోజంతా మధురమైన పిల్లలూ, మధురమైన పిల్లలూ అని అంటూ ఉంటారు. ఇప్పుడు ఆత్మ పతితంగా ఉంది. అందువలన శరీరము కూడా అటువంటిదే లభిస్తుంది. మనము పక్కా-పక్కా(స్వచ్ఛమైన) బంగారు ఆభరణాలుగా ఉండేవారము తర్వాత మలినము కలుస్తూ కలుస్తూ అసత్యమైపోయాము. ఇప్పుడు ఆ అసత్యము ఎలా తొలగాలి? దాని కొరకే ఈ స్మృతియాత్ర(యోగ) భట్టి. అగ్నిలో బంగారు స్వచ్ఛమౌతుంది కదా. తండ్రి మాటిమాటికి అర్థం చేయిస్తున్నారు - ఇప్పుడు నేను ఇచ్చే ఈ జ్ఞానము ప్రతి కల్పము ఇస్తూ వచ్చాను. ఇది నా పాత్ర. నేను మళ్లీ 5 వేల సంవత్సరాల తర్వాత వచ్చి '' పిల్లలూ! - పవిత్రులు కండి '' అని అందరికీ చెప్తున్నాను. సత్యయుగములో కూడా ఆత్మలైన మీరు పవిత్రంగా ఉండేవారు. శాంతిధామములో కూడా ఆత్మలు పావనంగా ఉంటాయి. అది మన ఇల్లు. అది ఎంతో మధురమైన ఇల్లు. అక్కడకు పోవాలని మనుష్యులు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, తల బాదుకుంటూ ఉంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇప్పుడు అందరూ వెళ్ళాల్సిందే. మళ్లీ పాత్ర చేసేందుకు రావాల్సిందే. ఇది పిల్లలు అర్థము చేసుకున్నారు. పిల్లలు దు:ఖములో ఉన్నప్పుడు - '' ఓ భగవంతుడా! మీ వద్దకు మమ్ములను తీసుకెళ్లండి, మమ్ములనెందుకు ఈ దు:ఖములో వదిలేశావు'' అని అంటారు. తండ్రి పరంధామములో ఉంటారని తెలుసు. అందుకే ''ఓ భగవంతుడా! మమ్ములను పరంధామానికి పిలుచుకొని వెళ్ళండి'' అని అంటారు. సత్యయుగములో అలా పిలువరు. అక్కడ సుఖమే సుఖముంటుంది. ఇక్కడ అనేక రకాలైన దు:ఖాలున్నాయి. అందుకే ఆత్మ 'ఓ భగవంతుడా!' అని పిలుస్తుంది. ఆత్మకు స్మృతి ఉంటుంది. కానీ భగవంతుడెవరో అసలు తెలియదు. ఇప్పుడు మీకు తండ్రి పరిచయము లభించింది. తండ్రి ఉండేదే పరంధామములో, ఇంటినే స్మృతి చేస్తారు. రాజధానికి పోవాలని కోరరు. రాజధాని కొరకు ఎప్పుడూ పిలువరు. పరంధామములో భగవంతుని వద్ద తప్పకుండా శాంతి ఉండనే ఉంటుంది. దానిని ముక్తిధామమని అంటారు. అది ఆత్మలుండే స్థానము. అక్కడ నుండే ఆత్మలు ఇక్కడకు వస్తాయి. సత్యయుగాన్ని ఇల్లు అని అనరు. అది రాజధాని. మీరు ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. తండ్రి పిల్లలూ!-పిల్లలూ! అంటూ మనతో మాట్లాడ్తారు. పిల్లలూ, పిల్లలూ! అని అంటారు. టీచరుగా అయ్యి సృష్టి ఆది, మధ్య, అంత్యముల రహస్యాన్ని అనగా చరిత్ర - భూగోళాలను అర్థం చేయిస్తారు. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. మూలవతనము ఆత్మలైన మన ఇల్లు అని మీకు తెలుసు. సూక్ష్మవతనము దివ్యదృష్టికి అందేది. సత్య, త్రేతా, ద్వాపర, కలియుగాలు ఇక్కడనే ఉంటాయి. మీరు పాత్రలు చేసేది కూడా ఇక్కడే. సూక్ష్మవతనములో ఏ పాత్రా లేదు. ఇది సాక్షాత్కారాల విషయం. ఈ రోజు, రేపు. ఇది బుద్ధిలో బాగా కూర్చోవాలి. నిన్న మనము సత్యయుగములో ఉండేవారము. తర్వాత 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ, ఈ రోజు నరకములోకి వచ్చేశాము. తండ్రిని పిలిచేది కూడా నరకములోనే. సత్యయుగములో అపారమైన సుఖముంటుంది. అందువలన ఎవ్వరూ పిలవనే పిలవరు. ఇక్కడ మీరు శరీరములో ఉన్నారు. అందుకే మాట్లాడ్తారు. తండ్రి కూడా నేను అన్నీ తెలిసిన వాడను(జానీ జానన్‌హార్‌) అనగా ఈ సృష్టి ఆదిమధ్యాంతాలు తెలిసినవాడను అని అంటారు. కానీ మీకు ఎలా వినిపించాలి? ఆలోచించాల్సిన విషయము కదా, అందుకే తండ్రి రథము తీసుకుంటారని వ్రాయబడి ఉంది. నా జన్మ మీ జన్మ వలె కాదు అని అంటున్నారు. నేను ఇతనిలో ప్రవేశిస్తాను. రథము పరిచయము కూడా ఇస్తాను. ఈ ఆత్మ కూడా అనేక నామ-రూపాలు కలిగిన శరీరాలను ధరిస్తూ-ధరిస్తూ తమోప్రధానమైపోయింది. ఇప్పుడు అందరూ అనాథలే. ఎందుకంటే తండ్రిని గురించే తెలియదు. కావున అందరూ అనాథలైపోయారు. పరస్పరములో కొట్లాడుతూ ఉంటే, ఎందుకు కొట్టుకుంటున్నారని అడుగుతారు కదా! నన్ను అందరూ మర్చిపోయారని తండ్రి చెప్తున్నారు. ఆత్మయే అనాథలుగా అయ్యారని అంటుంది. లౌకిక తండ్రి కూడా ఇలాగే అంటారు. అనంతమైన తండ్రి కూడా అలాగే అంటారు. ఇలా చేసే తండ్రిని అర్ధకల్పము నుండి పిలుస్తూ వచ్చిన ఆ తండ్రిని రాయి-రప్పలలో ఉన్నారని అంటున్నారు. ఇప్పుడు ఆ తండ్రి మీ ఎదురుగా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. బాబా వద్దకు వచ్చామని పిల్లలైన మీరిప్పుడు భావిస్తారు. ఈ బాబాయే మనలను చదివిస్తున్నారు. మన నావను తీరానికి చేరుస్తారు. ఎందుకంటే ఈ నావ చాలా పాతదైపోయింది అందుకే ఆవలి తీరానికి చేర్చమని అంటారు. మళ్లీ మాకు క్రొత్త నావ ఇవ్వమని అడుగుతారు. పాత నావ అపాయకరమైనది. దారిలో విరిగిపోవచ్చు, ప్రమాదము జరగవచ్చు. అందుకే మా నావ పాతదైపోయిందని, క్రొత్తది ఇవ్వమని అడుగుతారు. దీనిని వస్త్రమని కూడా అంటారు, నావ అని కూడా అంటారు. బాబా, మాకు ఇటువంటి(లక్ష్మీనారాయణుల) వస్త్రము కావాలని పిల్లలంటారు.
తండ్రి అంటున్నారు - మధురమైన పిల్లలూ, స్వర్గవాసులుగా అవ్వాలని అనుకుంటున్నారా? ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత మీ వస్త్రాలు పాతవైపోతాయి. మళ్లీ కొత్త వస్త్రమునిస్తాను. ఇది ఆసురీ వస్త్రము(శరీరము). ఆత్మ కూడా ఆసురీ(పైశాచికము)గా ఉంది. మానవులు పేదవారైతే పేద వస్త్రాలే ధరిస్తారు. ధనవంతులైతే వస్త్రాలు కూడా ఖరీదైనవే ధరిస్తారు. ఈ విషయాలన్నీ మీరు ఇప్పుడే అర్థం చేసుకున్నారు. మనము ఎవరి ముందు కూర్చొని ఉన్నామో తెలుసుకుంటే ఎంతో నషా ఎక్కుతుంది. సెంటర్లలో కూర్చుంటే అక్కడ మీకు ఈ భావముండదు. ఇక్కడ సన్ముఖములో ఉండుట వలన ఖుషీ ఉంటుంది. ఎందుకంటే తండ్రి డైరెక్టుగా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. అక్కడ ఎవరైనా అర్థం చేయిస్తే బుద్ధియోగము అన్ని వైపులా పరుగెడ్తూ ఉంటుంది. తీరిక లేని పనులలో ఇరుక్కొని ఉంటామని అంటారు కదా. ఫుర్సత్‌(తీరిక) దొరకదని అంటారు. నేను మీకు అర్థం చేయిస్తున్నాను. బాబా ఈ నోటి ద్వారా మనకు అర్థం చేయిస్తున్నారని మీకు కూడా తెలుసు. ఈ నోటికి కూడా ఎంతో మహిమ ఉంది. గోముఖము నుండి అమృతము తాగేందుకు ఎక్కడెక్కడికో వెళ్లి ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. ఎంతో శ్రమ కోర్చి వెళ్తారు. గోముఖమంటే ఏదో ఎవ్వరికీ తెలియదు. ఎంతో తెలివి గల మనుష్యులు కూడా అక్కడకెళ్తారు. ఇందులో లాభమేమీ లేదు. లాభము లేకపోగా ఇంకా సమయము వృథా అవుతుంది. ఈ సూర్యాస్తమయము(సన్‌ సెట్‌ పాయింట్‌) మొదలైనవేం చూస్తారు? ఇందులో ఏ లాభమూ లేదు. చదువుకుంటే లాభముంటుంది. గీతలో చదువుంది కదా. గీతలో హఠయోగము మొదలైన మాటలేవీ లేవు. అందులో ఉండేది రాజయోగము. మీరు రాజ్య పదవి తీసుకునేందుకు వస్తారు. ఈ ఆసురీ ప్రపంచములో కొట్లాటలు, జగడాలు మొదలైనవెన్నో ఉన్నాయి. బాబా మనలను యోగబలముతో పవిత్రంగా చేసి విశ్వ రాజ్యాధికారమునిస్తారు. దేవతలకు ఆయుధాలనిచ్చారు. వాస్తవానికి ఇందులో ఆయుధాల మాటే లేదు. కాళికా దేవిని ఎంతో భయంకరంగా చూపించారు. ఇవన్నీ మానవుల మానసిక భ్రాంతుల వలన అలా తయారు చేశారు. 4-8 భుజాలు గల దేవతలు ఉండనే ఉండరు. ఇవన్నీ భక్తి మార్గములోని విషయాలు. అందుకే తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇది ఒక అనంతమైన తయారైన నాటకము. ఇందులో ఎవరినీ నిందించే మాటే లేదు. ఇది తయారైన అనాది డ్రామా. ఇందులో తేడా ఏమీ ఉండదు. జ్ఞానమంటే ఏమిటో, భక్తి అనగా ఏమిటో మనకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు మళ్లీ భక్తిమార్గము ద్వారా వెళ్లాలి. ఇదే విధంగా మీరు 84 జన్మల చక్రములో తిరుగుతూ తిరుగుతూ క్రిందకు వచ్చేస్తారు. ఇది అనాదిగా తయారైన చాలా మంచి నాటకము. దీనిని గురించి తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ డ్రామా రహస్యాన్ని తెలుసుకుంటే మీరు విశ్వాధికారులుగా అవుతారు. ఇది అద్భుతము కదా! భక్తి ఎలా నడుస్తుందో, జ్ఞానమెలా నడుస్తుందో, ఈ అనాది నాటకమెలా తయారై ఉందో, ఇందులో ఏ మాత్రము మార్పుండదు. వారు బ్రహ్మములో లీనమయ్యారని అంటారు. జ్యోతి జ్యోతిలో లీనమైపోయిందని అంటారు. ఇది సంకల్పాల ప్రపంచము. ఎవరికేం తోస్తుందో అది అంటూ ఉంటారు. ఇది తయారై తయారవుతున్న డ్రామా. మానవులు సినిమాలు చూస్తున్నారు. దానిని సంకల్పాల డ్రామా(ఆట) అని అంటారా? తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, ఇది అనంతమైన నాటకము. ఉన్నదున్నట్లు రీపీట్‌(పునరావృతము) అవుతుంది. ఆ తండ్రే వచ్చి ఈ జ్ఞానమునిస్తున్నారు. ఎందుకంటే వారు జ్ఞానసాగరులు. మానవ సృష్టికి బీజరూపులు, చైతన్యము. వారే ఈ జ్ఞానమంతా తెలిసినవారు. మానవులు లక్షల సంవత్సరాల ఆయువుగా చూపించారు. అంత ఆయువు లేదని తండ్రి చెప్తున్నారు. లక్షల సంవత్సరాల సినిమా ఎవరి బుద్ధిలోనూ ఉండదు. మీరు పూర్తిగా వర్ణించగలరు. లక్షల సంవత్సరాల మాట అయితే ఎలా వర్ణించగలరు? అందువలన అదంతా భక్తి మార్గము. భక్తి మార్గపు పాత్ర కూడా మీరే అభినయించారు. రకరకాల దు:ఖాలను అనుభవిస్తూ ఇప్పుడు చివరికి వచ్చేశారు. వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడు అక్కడకు వెళ్లాలి. మిమ్ములను తేలికపరచుకోండి. ఇతను కూడా స్వయాన్ని తేలిక(బంధనముక్తము)గా చేసుకున్నారు కదా. అన్ని బంధనాలు తెగిపోవాలి. లేకుంటే పిల్లలు, ధనము, ఫ్యాక్టరీలు, కొనుగోలుదారులు, రాజులు, షాహుకార్లు మొదలైనవన్నీ జ్ఞాపకము వస్తూ ఉంటాయి. ఇతను వ్యాపారమే వదిలేశారు. కావున వారెందుకు గుర్తొస్తారు? ఇక్కడ అన్నిటినీ మర్చిపోవాలి. వీటన్నిటినీ మరచి మన ఇంటిని, రాజధానిని గుర్తు చేసుకోవాలి. శాంతిధామము, సుఖధామమును స్మృతి చేయాలి. శాంతిధామము నుండి మళ్లీ మనము ఇక్కడకు రావాలి. తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేయండి. దీనినే యోగాగ్ని అని అంటారు. ఇది రాజయోగము కదా. మీరు రాజఋషులు. ఋషి అనగా పవిత్రులు. మీరు రాజ్యము కొరకు పవిత్రంగా అవుతున్నారు. ఆ తండ్రి మీకు అన్ని సత్యాలు తెలుపుతున్నారు. ఇది నాటకమని మీకు తెలుసు. పాత్రధారులంతా ఇక్కడకు తప్పకుండా రావాల్సిందే. అప్పుడు తండ్రి మళ్లీ అందరినీ తీసుకెళ్తారు. ఇది ఈశ్వరుని వివాహ ఊరేగింపు(మెరవణి). అక్కడ తండ్రి, పిల్లలు ఉంటారు. ఇక్కడకు మళ్లీ పాత్ర చేసేందుకు వస్తారు. తండ్రి సదా అక్కడే ఉంటారు. దు:ఖములో ఉన్నప్పుడే నన్ను స్మృతి చేస్తారు. అక్కడ నేనేం చేస్తాను. మిమ్ములను శాంతిధామానికి, సుఖధామములోకి పంపించాను. ఇక నాకేం కావాలి! మీరు సుఖధామములో ఉండేవారు. మిగిలిన ఆత్మలంతా శాంతిధామములో ఉండేవారు. నెంబరువారుగా వస్తూ ఉంటారు. నాటకము పూర్తి కావచ్చింది. తండి చెప్తున్నారు - పిల్లలూ, ఇప్పుడు నిర్లక్ష్యము చేయకండి. తప్పకుండా పావనంగా అవ్వాలి. తండి చెప్తున్నారు - డామ్రానుసారము ఇతను పాత చేస్తున్నారు. మీ కొరకు డామ్రానుసారము కల్ప-కల్పము వస్తాను. ఇప్పుడు నూతన ప్రపంచములోకి వెళ్లాలి. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఇప్పుడు పాత వృక్షము శిథిలావస్థకు చేరుకుంది. ఆత్మ వాపస్‌ ఇంటికి వెళ్లాలి. అందువలన స్వయాన్ని బంధనముక్తము గావించుకొని తేలికగా చేసుకోవాలి. ఇక్కడిదంతా బుద్ధి ద్వారా మర్చిపోవాలి.
2. అనాది డ్రామాను బుద్ధిలో ఉంచుకొని ఏ పాత్రధారినీ నిందించరాదు. డ్రామా రహస్యాన్ని అర్థము చేసుకొని విశ్వాధికారులుగా అవ్వాలి.

వరదానము :- '' బుద్ధితో పాటు సహయోగమనే చెయ్యి ద్వారా ఆనందాన్ని అనుభవం చేసే భాగ్యశాలి ఆత్మా భవ ''
లాగైతే సహయోగానికి గుర్తుగా చేతిలో చేతిని చూపిస్తారో అలా తండ్రికి సదా సహయోగిగా అవ్వాలి - ఇదే చేతిలో చేయి వేయడం. సదా బుద్ధి ద్వారా జతలో (తోడుగా) ఉండాలి. అనగా మనసు ఒక్కరితోనే లగ్నమై ఉండాలి. సదా ఈశ్వరీయ గార్డెన్‌లో చేతిలో చేయి వేసి జతలో నడుస్తున్నామనే స్మృతి ఉండాలి. తద్వారా సదా మనోరంజనంలో ఉంటారు. సదా సంతోషంగా, సంపన్నంగా ఉంటారు. ఇటువంటి భాగ్యశాలి ఆత్మలు సదా ఆనందాన్ని అనుభవం చేస్తూ ఉంటారు.

స్లోగన్‌ :- '' ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకునే సాధనం - సంతుష్టంగా ఉండాలి, సంతుష్ట పరచాలి. ''

Tuesday, 29 October 2019

Telugu Murli 30/10/2019

30-10-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - ఒక్క తండ్రి స్మృతిలో ఉండడమే అవ్యభిచారి స్మృతి, ఈ స్మృతి ద్వారా మీ పాపాలు అంతరించగలవు ''

ప్రశ్న :- తండ్రి అర్థం చేయించే జ్ఞానాన్ని కొంతమంది సులభంగా అంగీకరిస్తారు, కొంతమంది కష్టంగా అర్థము చేసుకుంటారు - దీనికి కారణమేమి ?
జవాబు :- చాలా కాలము భక్తి చేసిన పిల్లలు, అర్ధకల్పపు పాత భక్తులు, తండ్రి అర్థం చేయించే ప్రతి విషయాన్ని సులభంగా, సహజంగా అంగీకరిస్తారు. ఎందుకంటే వారికి భక్తి ఫలము లభిస్తుంది. పాత భక్తులు కాకుంటే వారికి అర్థము చేసుకునేందుకు కష్టమౌతుంది. ఇతర ధర్మాలవారు ఈ జ్ఞానాన్ని అర్థము కూడా చేసుకోలేరు.

ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మల తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - పిల్లలైన మీరంతా ఏం చేస్తున్నారు? మీది అవ్యభిచారి స్మృతి. ఒకటేమో వ్యభిచారి స్మృతి, రెండవది అవ్యభిచారి స్మృతి. మీ అందరిదీ అవ్యభిచారి స్మృతి. ఎవరి స్మృతిలో ఉన్నారు? ఒకే ఒక్క తండ్రి స్మృతిలో ఉన్నారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పాపాలు సమాప్తమైపోతాయి. మీరు అక్కడకు చేరుకుంటారు. పావనంగా అయ్యి మళ్లీ నూతన ప్రపంచములోకి వెళ్లాలి. ఆత్మలైన మీరు వెళ్లాలి. ఆత్మనే ఈ అవయవాల ద్వారా అన్ని కర్మలు చేస్తుంది కదా. అందుకే తండ్రి చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. మానవులు అనేకమందిని స్మృతి చేస్తారు. భక్తిమార్గములో మీరు ఒక్కరినే స్మృతి చేస్తారు. మొట్టమొదట మీరు అత్యంత శ్రేష్ఠులైన శివబాబా భక్తినే చేశారు. దానిని అవ్యభిచారి భక్తి అని అంటారు. వారే అందరికి సద్గతినిచ్చే రచయిత, తండ్రి. వారి నుండి పిల్లలకు అనంతమైన వారసత్వము లభిస్తుంది. సోదరునికి సోదరుని నుండి వారసత్వము లభించదు. వారసత్వము తండ్రి నుండి పుత్రులకు మాత్రమే లభిస్తుంది. కన్యలకు ఏదో కొంత మాత్రమే లభిస్తుంది. వారు వెళ్లి జీవిత భాగస్వాములుగా అవుతారు. ఇక్కడ మీరందరూ ఆత్మలే. సర్వాత్మల తండ్రి ఒక్కరే. తండ్రి నుండి వారసత్వము తీసుకునేందుకు అందరికీ హక్కు ఉంది. మీరంతా సోదరులు. శరీరము స్త్రీ, పురుషులదే అయినా ఆత్మలంతా భాయి-భాయి(సోదరులే). వారు కేవలం మాట వరుసకు హిందూ - ముస్లిం భాయి-భాయి అని అంటారు. కానీ వారికి అర్థమే తెలియదు. ఇప్పుడు మీరు అర్థము తెలుసుకున్నారు. భాయి-భాయి అనగా అందరూ ఆత్మలే, ఒకే తండ్రి పిల్లలు, ప్రజాపిత బ్రహ్మకు సంతానమైనప్పుడు సోదరీ-సోదరులు. ఇప్పుడు ప్రపంచము నుండి అందరూ వాపస్‌ వెళ్లాలని మీకు తెలుసు. ఇప్పుడు మానవులందరి పాత్ర పూర్తి అవుతుంది. తండ్రి వచ్చి పాత ప్రపంచము నుండి నూతన ప్రపంచానికి తీసుకెళ్తారు. నావను తీరానికి చేర్చండి అనగా సుఖధామానికి తీసుకెళ్లండి అని పాట కూడా పాడ్తారు. ఈ పాత ప్రపంచము పరివర్తన చెంది మళ్లీ నూతన ప్రపంచంగా తప్పకుండా అవుతుంది. మూలవతనము నుండి మొత్తం ప్రపంచ పటము మీ బుద్ధిలో ఉంది. ఆత్మలైన మనమంతా మధురమైన ఇల్లు అయిన(స్వీట్‌ హోమ్‌) శాంతిధామ నివాసులము. ఇది బుద్ధిలో ఉంది కదా. మనము సత్యయుగ ప్రపంచములో ఉన్నప్పుడు మిగిలిన ఆత్మలంతా శాంతిధామములో ఉంటాయి. ఆత్మ ఎప్పుడూ నశించదు. ఆత్మలో అవినాశి పాత్ర నిండి ఉంది, అదెప్పుడూ నశించదు. ఒకరు ఇంజనీరు అనుకోండి, 5 వేల సంవత్సరాల తర్వాత మళ్లీ ఇదే విధంగా ఇంజనీరుగానే అవుతాడు. నామ-రూప-దేశ-కాలాలన్నీ ఇవే ఉంటాయి. ఈ విషయాలన్నీ తండ్రే స్వయంగా వచ్చి అర్థం చేయిస్తున్నారు. ఇది అనాది, అవినాశి డ్రామా. ఈ డ్రామా వయసు 5 వేల సంత్సరాలు. ఒక్క సెకండు కూడా తక్కువ-ఎక్కువ ఉండదు. ఇది అనాదిగా తయారైన డ్రామా. అందరికీ పాత్ర లభించే ఉంది. దేహీ-అభిమానులుగా అయ్యి సాక్షిగా ఉంటూ డ్రామాను చూస్తూ ఉండాలి. తండ్రికి దేహమే లేదు. వారు జ్ఞానసాగరులు, బీజరూపులు. పైనున్న నిరాకార ప్రపంచములోని ఆత్మలన్నీ నెంబరువారుగా పాత్ర చేసేందుకు వస్తారు. మొట్టమొదట నెంబరు దేవతలతో ప్రారంభమవుతుంది. మొదటి నెంబరు వంశము వారి చిత్రాలే ఉన్నాయి. ఆ తర్వాత చంద్ర వంశీయుల చిత్రాలు కూడా ఉన్నాయి. అన్నిటికంటే ఉన్నతమైనది సూర్యవంశము, లక్ష్మీనారాయణుల రాజ్యము. వారి రాజ్యము ఎప్పుడు ఎలా స్థాపన అయ్యిందో మానవమాత్రులెవ్వరికీ తెలియదు. సత్యయుగము ఆయువు లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. ఎవ్వరి జీవిత కథ గురించి కూడా తెలియదు. ఈ లక్ష్మీనారాయణుల జీవిత కథను తెలుసుకోవాలి. తెలుసుకోకుండా తల వంచి నమస్కరించడం లేక వారిని మహిమ చేయడం తప్పు. తండ్రి కూర్చొని ముఖ్యమైన వారి జీవితచరిత్రలు వినిపిస్తున్నారు. వీరి రాజ్యమెలా నడుస్తుందో మీకు బాగా తెలుసు. సత్యయుగములో శ్రీ కృష్ణుడుండే వాడు కదా. ఇప్పుడా కృష్ణపురము మళ్లీ స్థాపనవుతూ ఉంది. కృష్ణుడు స్వర్గములోని రాకుమారుడు. లక్ష్మీనారాయణుల రాజధాని ఎలా స్థాపన అయ్యిందో మీ అందరికీ తెలుసు.
మాల కూడా నంబరువారుగా తయారు చేస్తారు. ఫలానా ఫలానావారు మాలలోని పూసలుగా అవుతారు. కానీ నడుస్తూ నడుస్తూ మళ్లీ ఓటమి కూడా పొందుతారు. మాయ ఓడిస్తుంది. సైన్యములో ఉన్నంత వరకు వీరు కమాండర్‌, వీరు ఫలానా అని అంటారు. తర్వాత మరణిస్తారు. ఇక్కడ మరణించడం అనగా స్మృతి తగ్గిపోయి, మాయతో ఓడిపోయి సమాప్తమైపోతారు. ఆశ్చర్యంగా వింటారు, వర్ణిస్తారు, పారిపోతారు..... ఓహో మాయ......... విడాకులిస్తారు! మరజీవులుగా అవుతారు, తండ్రివారిగా అవుతారు. మళ్లీ రామరాజ్యము నుండి రావణరాజ్యములోకి వెళ్లిపోతారు. దీనినే కౌరవ పాండవ యుద్ధంగా చూపించారు. దేవ-దానవుల యుద్ధమును కూడా చూపిస్తారు. ఒక యుద్ధము చూపిస్తే చాలదా? రెండు ఎందుకు? ఇవన్నీ ఇక్కడి విషయాలేనని తండ్రి అర్థం చేయిస్తున్నారు. యుద్ధమంటే హింస. ఇది అహింసా పరమో దేవీదేవతా ధర్మము. ఇప్పుడు మీరు డబుల్‌ అహింసకులుగా అవుతారు. మీది యోగబలము. ఆయుధాలు మొదలైన వాటితో మీరు ఎవ్వరినీ ఏమీ చేయరు. ఆ శక్తి అయితే క్రైస్తవులలో కూడా చాలా ఉంది. రష్యా, అమెరికా ఇరువురూ సోదరులే. బాంబులు తయారు చేయడంలో ఇరువురు పోటీ పడ్తున్నారు. ఇరువురు ఒకరికంటే ఒకరు శక్తిశాలురు. ఇరువురు కలిస్తే ప్రపంచమంతటి పై రాజ్యము చేసేటంత శక్తి ఉంది. కానీ బాహుబలముతో విశ్వ రాజ్యాధికారాన్ని పొందుకునే నియమము (చట్టము, లా) లేదు. రెండు పిల్లులు పరస్పరము కొట్లాడుకుంటే వెన్న మధ్యలో మూడవ వారు తినిపోయారనే కథ కూడా ఉంది. ఈ విషయాలన్నీ తండ్రి ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు. ఇతనికే మాత్రము తెలిసేది కాదు. ఈ చిత్రాలు మొదలైనవి కూడా తండ్రియే దివ్యదృష్టి ద్వారా తయారు చేయించారు. వారు పరస్పరము కొట్లాడుకుంటారని, మొత్తం విశ్వచక్రవర్తి పదవిని మీరు తీసుకుంటారని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆ రెండు దేశాలు చాలా శక్తివంతమైనవి. అక్కడక్కడ కొట్లాటలు పెడ్తారు. మళ్లీ సహాయము చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారిది కూడా చాలా పెద్ద వ్యాపారము. రెండు పిల్లులు కొట్లాడినప్పుడే ఫిరంగులు మొదలైనవి పనికి వస్తాయి. పరస్పరములో అక్కడక్కడ యుద్ధాలు చేయిస్తారు. హిందుస్థాన్‌ - పాకిస్థాన్‌ మొదట వేరు వేరుగా ఉండేవా? రెండు కలిసే ఉండేవి. ఇదంతా డ్రామాలో రచింపబడింది. యోగబలము ద్వారా విశ్వాధికారులుగా అయ్యేందుకు మీరిప్పుడు పురుషార్థము చేస్తున్నారు. వారు పరస్పరములో కొట్లాడుకుంటారు. వెన్న మధ్యలో మీరు తినేస్తారు. వెన్న అనగా విశ్వచకవ్రర్తి పదవి. అది మీకు చాలా సులభంగా(సింపుల్‌గా) లభిస్తుంది. తండ్రి చెప్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ! మీరు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచంలోకిి వెళ్లాలి. దానిని నిర్వికారి ప్రపంచమని అంటారు. సంపూర్ణ నిర్వికారి ప్రపంచము. ప్రతి వస్తువు సతోప్రధానము, సతో, రజో, తమోల ద్వారా తప్పకుండా వస్తుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీలో ఇంతకుముందు ఈ తెలివి లేదు. ఎందుకంటే శాస్త్రాలలో లక్షల సంవత్సరాలని అనేశారు. భక్తిమార్గమే అజ్ఞానాంధకారము. ఇది కూడా ఇంతకుముందు మీకు తెలియదు. ఇప్పుడు మీకు అన్నీ తెలుసు. వారేమో ఇంకా 40 వేల సంవత్సరాలు జరుగుతుందని అంటారు. సరే అలాగే అనుకుంటాము. 40 వేల సంవత్సరాలైన తర్వాత ఏమవుతుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే అజ్ఞాన నిద్రలో నిదురిస్తున్నారని అంటారు. భక్తి అజ్ఞానము. జ్ఞానమిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఆ తండ్రి జ్ఞానసాగరులు. మీరు జ్ఞాన నదులు. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్ములను అనగా ఆత్మలను చదివిస్తారు. వారు తండ్రే కాక టీచరు కూడా అయ్యారు, సద్గురువు కూడా అయ్యారు. మా తండ్రి-టీచరు-సద్గురువు వీరేనని ఇతరులెవ్వరూ అనరు. ఇది అనంతమైన విషయము. అనంతమైన తండ్రి, టీచరు, సద్గురువు అన్నీ ఒక్కరే. స్వయంగా వారే కూర్చొని అర్థం చేయిస్తున్నారు. నేను మీ సుప్రీమ్‌ తండ్రిని, మీరందరూ నా పిల్లలు. మీరు కూడా - ''బాబా, మీరు అప్పటివారే'' అని అంటారు. తండ్రి కూడా - మీరు కల్ప-కల్పము వచ్చి కలుస్తారని చెప్తున్నారు. కనుక వారు పరమాత్మ, సుప్రీమ్‌. వారే వచ్చి పిల్లలందరికీ అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. కలియుగము ఆయువు ఇంకా 40 వేల సంవత్సరాలని చెప్పడం పూర్తిగా వ్యర్థ ప్రలాపము(తప్పు). 5 వేల సంవత్సరాలలో అన్ని వచ్చేస్తాయి. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిని మీరు అంగీకరిస్తారు, అర్థము చేసుకుంటారు. మీరు అంగీకరించరని కాదు, ఒకవేళ అంగీకరించకుంటే ఇక్కడకు రారు. ఈ ధర్మానికి చెందని వారు తండ్రి మాటలు అంగీకరించరు. ఆధారమంతా భక్తి పైనే ఉందని తండ్రి అర్థం చేయించారు. ఎక్కువ భక్తి చేసినవారి భక్తికి ఫలము లభించాలి కదా. తండ్రి నుండి వారికే అనంతమైన వారసత్వము లభిస్తుంది. మనమే దేవతలుగా, విశ్వానికి అధికారులుగా అవుతామని మీకు తెలుసు. ఇక కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ పురాతన ప్రపంచ వినాశనమైతే చూపించబడింది. ఇక ఏ ఇతర శాస్త్ర్రాలలోనూ ఈ విషయాలు లేవు. గీత ఒక్కటే భారతదేశ ధర్మశాస్త్రము. ప్రతి ఒక్కరు తమ ధర్మశాస్త్ర్రాన్ని చదవాలి. ఆ ధర్మము ఎవరి ద్వారా స్థాపన అయ్యిందో వారి గురించి కూడా తెలుసుకోవాలి. ఉదాహరణానికి క్రైస్తవులకు ఏసుక్రీస్తును గురించి తెలుసు. వారినే గౌరవిస్తారు, వారినే పూజిస్తారు. మీరు ఆదిసనాతన దేవీ దేవతా ధర్మము వారైతే దేవతలనే పూజిస్తారు. కానీ ఈ రోజుల్లో స్వయాన్ని హిందూ ధర్మము వారమని చెప్పుకుంటారు.
పిల్లలైన మీరిప్పుడు రాజయోగము నేర్చుకుంటున్నారు. మీరు రాజఋషులు, వారు హఠ యోగానికి చెందిన ఋషులు. రాత్రికి పగులుకు ఉన్నంత తేడా ఉంది. వారిది అపరిపక్వ(కచ్ఛా) సన్యాసము, హద్దు సన్యాసము. కేవలం ఇల్లు-వాకిలి వదిలేస్తారు. కానీ మీ సన్యాసము లేక వైరాగ్యము - ఈ పాత ప్రపంచాన్నే వదిలేయడం. మొట్టమొదట మీ ఇంటికి స్వీట్‌హోమ్‌కు(మధురమైన ఇంటికి) వెళ్లి మళ్లీ నూతన ప్రపంచము, సత్యయుగములోకి వస్తారు. బ్రహ్మ ద్వారా ఆది సనాతనా దేవీదేవతా ధర్మము స్థాపనవుతుంది. ఇప్పుడిది పాత ప్రపంచము. ఇవన్నీ అర్థము చేసుకోవాల్సిన విషయాలు. తండ్రి ద్వారా చదువుకుంటున్నారు. ఇది సత్యము కదా. ఇందులో నిశ్చయము లేకుండా ఉండే మాటే లేదు. ఈ జ్ఞానాన్ని చదివించేది ఆ తండ్రి ఒక్కరే. ఆ తండ్రి, టీచరు కూడా అయ్యారు. సత్యమైన సద్గురువు కూడా వారే, వెంట తీసుకెళ్తారు. ఆ గురువులైతే అర్ధములో వదిలేసి వెళ్లిపోతారు. ఒక గురువు పోతే మరొకరిని గురువుగా చేస్తారు. వారి శిష్యులను పీఠము పై కూర్చోబెడ్తారు. ఇక్కడ ఇది తండ్రి, పిల్లల విషయము. అది గురు-శిష్యుల వారసత్వపు హక్కు. వారసత్వము తండ్రిదే కదా. శివబాబా వచ్చేదే భారతదేశములో. శివరాత్రిని కూడా జరుపుకుంటారు. శివునికి జాతకము లేనే లేదు. ఎలానో తెలుపమంటారా? వారికి తిథి-తారీఖులు ఉండవు. మొదటి నెంబరులో వచ్చే కృష్ణునికి తిథి-నక్షత్రాలు చూపిస్తారు. దీపావళి పండుగ జరుపుకోవడం ప్రపంచములోని మానవులు చేసే పని. పిల్లలైన మీకు దీపావళి లేదు. మనకు నూతన సంవత్సరమంటే నూతన ప్రపంచము, సత్యయుగము. ఇప్పుడు మీరు నూతన ప్రపంచము కొరకు చదువుతున్నారు. మీరిప్పుడు పురుషోత్తమ సంగమ యుగములో ఉన్నారు. ఆ కుంభమేళాకు ఎంతోమంది మనుష్యులు గుంపులు గుంపులుగా వెళ్తారు. అది నదుల నీటి కలయిక. అనేక మేళాలు చేస్తారు. వారిలో కూడా చాలా పంచాయితీలు జరుగుతాయి. అప్పుడప్పుడు పరస్పరము చాలా కొట్లాడుకుంటారు. కారణం దేహాభిమానములో ఉన్నారు కదా. ఇక్కడ కొట్లాటలు మొదలైనవాటి ప్రసక్తే లేదు. తండ్రి కేవలం చెప్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా, నన్ను స్మృతి చేయండి. సతోప్రధానము నుండి తమోప్రధానమైన మీ ఆత్మలో మైల చేరింది కదా. అది యోగాగ్ని ద్వారానే తొలగిపోతుంది. ఈ విషయము కంసాలికి తెలుసు. తండ్రినే పతిత పావనుడని అంటారు. తండ్రి సుప్రీమ్‌ కంసాలి. అందరి మైలను తొలగించి సత్యమైన బంగారుగా చేసేస్తారు. బంగారును అగ్నిలో వేస్తారు. ఇది యోగము అనగా యోగాగ్ని. ఎందుకంటే స్మృతి ద్వారానే పాపాలు భస్మమౌతాయి. తమోప్రధానము నుండి సతోప్రధానంగా స్మృతియాత్ర ద్వారానే తయారవ్వాలి. అందరూ సతోప్రధానంగా అవ్వలేరు. కల్పక్రితము వలె పురుషార్థము చేస్తారు. పరమాత్మకు కూడా డ్రామాలో పాత్ర నిశ్చయింపబడే ఉంది. ఏదైతే రచింపబడిందో అదే జరుగుతూ ఉంటుంది. మార్పు ఉండదు. రీలు తిరుగుతూనే ఉంటుంది. పోను పోను మీకు చాలా నిగూఢమైన విషయాలు వినిపిస్తారు. మొట్టమొదట ఇది నిశ్చయము చేసుకోవాలి - వారు సర్వాత్మల తండ్రి. వారిని స్మృతి చేయాలి. మన్మనాభవకు అర్థమిదే. కృష్ణ భగవానువాచ లేనే లేదు. ఒకవేళ కృష్ణుడైతే అందరూ వారి వద్దకు వస్తారు, అందరూ గుర్తిస్తారు. మరి కోటిలో ఏ ఒక్కరో నన్ను తెలుసుకుంటారని ఎందుకు అంటారు? ఇది తండ్రి అర్థం చేయిస్తున్నారు. అందుకే మనుష్యులు అర్థం చేసుకోవడం కష్టము. ఇంతకు ముందు కూడా ఇదే విధంగా జరిగింది. నేనే వచ్చి దేవీదేవతా ధర్మాన్ని స్థాపన చేశాను. తర్వాత ఈ శాస్త్ర్రాలు మొదలైనవన్నీ కనిపించవు. మళ్లీ తమ సమయంలో భక్తిమార్గములో శాస్త్ర్రాలు మొదలైనవన్నీ అప్పటివే వెలవడ్తాయి. సత్యయుగములో ఒక్క శాస్త్రము కూడా ఉండదు. భక్తికి నామ-రూపాలే ఉండవు. ఇప్పుడుండేది భక్తి రాజ్యము. అందరికంటే గొప్పవారు శ్రీ శ్రీ 108 జగద్గురువని పిలిపించుకునే వారు. ఈ రోజులలో 1,008 అని కూడా అంటారు. వాస్తవానికి ఈ మాల ఇక్కడిదే. మాల జపించినప్పుడు (తిప్పినపుడు) పుష్పము నిరాకారమని, ఆ తర్వాత మేరు పూస అని తెలుసు. బ్రహ్మ-సరస్వతులు జంట పూసలు. ఎందుకంటే ప్రవృత్తి మార్గము కదా. ప్రవృత్తి మార్గము వారు, నివృత్తి మార్గము వారిని గురువులుగా చేసుకుంటే వారేమిస్తారు? హఠయోగము నేర్చుకోవాల్సి పడ్తుంది. అనేక ప్రకారాల హఠయోగాలున్నాయి. రాజయోగము ఒక్కటే. స్మృతియాత్ర ఒక్కటే. దానిని రాజయోగమని అంటారు. మిగిలినవన్నీ హఠయోగాలు. అవి శరీర ఆరోగ్యము కొరకు. ఈ రాజయోగాన్ని నేర్పించువారు తండ్రి ఒక్కరే. మొదటిది ఆత్మ తర్వాతనే శరీరము. మీరు స్వయాన్ని ఆత్మకు బదులు శరీరమని భావించి ఉల్టా అయిపోయారు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే అంతమతి సో గతి అయిపోతుంది. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఈ అనాది-అవినాశి తయారైన డ్రామాలో ప్రతి ఒక్కరి పాత్రను దేహీ-అభిమానులుగా అయ్యి సాక్షిగా ఉండి చూడాలి. మీ స్వీట్‌ హోమ్‌(మధురమైన ఇల్లు), స్వీట్‌ రాజధానిని స్మృతి చేయాలి. ఈ పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోవాలి.
2. మాయతో ఓడిపోరాదు. స్మృతి అనే అగ్నిలో పాపాలను నశింపజేసుకొని ఆత్మను పావనంగా చేసుకునే పురుషార్థము చేయాలి.

వరదానము :- '' హద్దు వయ్యారాల నుండి వెలువడి ఆత్మిక నాజ్‌ (నాశా)లో ఉండే ప్రీతి బుద్ధి భవ ''
చాలామంది పిల్లలు హద్దు స్వభావ సంస్కారాల వయ్యారాలు చాలా చేస్తారు. ఎక్కడైతే నా స్వభావము, నా సంస్కారము అనే శబ్ధాలు వస్తాయో అక్కడ ఇటువంటి నాజ్‌ నఖరాలు (వయ్యారాలు) ప్రారంభమవుతాయి. 'నాది' అనే ఈ శబ్ధమే భ్రమలోకి తీసుకొస్తుంది. తండ్రికి భిన్నంగా ఉన్న ఏ వస్తువైనా నాది కానే కాదు. నా స్వభావము తండ్రి స్వభావము కంటే భిన్నంగా ఉండజాలదు. అందువలన నాజ్‌ నఖరాల నుండి వెలువడి ఆత్మిక నశాలో(నాజ్‌లో) ఉండండి. ప్రీతిబుద్ధి గలవారై ప్రేమ నఖరాలు భలే చేయండి.

స్లోగన్‌ :- '' తండ్రి పై, సేవ పై, పరివారం పై ప్రేమ ఉంటే శ్రమ నుండి విడుదల అవుతారు. ''

Monday, 28 October 2019

Telugu Murli 29/10/2019

29-10-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - లేస్తూ - కూర్చుంటూ బుద్ధిలో జ్ఞానము ఉప్పొంగి పోతూ ఉంటే అపారమైన ఖుషీ (సంతోషము)లో ఉంటారు ''

ప్రశ్న :- పిల్లలైన మీరు ఎవరి సాంగత్యము నుండి చాలా చాలా కాపాడుకోవాలి ?
జవాబు :- ఎవరి బుద్ధిలో తండి స్మృతి నిలువదో, బుద్ధి అటూ-ఇటూ తిరుగుతూ ఉంటుందో, ఇటువంటి వారి సాంగత్యము నుండి మీరు చాలా కాపాడుకోవాలి. వారిని స్పర్శించను కూడా స్పర్శించరాదు. ఎందుకంటే స్మృతిలో లేని వారు వాయుమండలాన్ని పాడు చేస్తారు.

ప్రశ్న :- మనుష్యులకు పశ్చాత్తాపము ఎప్పుడు కలుగుతుంది ?
జవాబు :- వీరిని చదివించేవారు స్వయం భగవంతుడని తెలిసినప్పుడు వారి ముఖాలు వెలవెలపోతాయి (పాలిపోతాయి). అప్పుడు వారు మేము నిర్లక్ష్యము చేశాము, చదువుకోలేదే అని పశ్చాత్తాపపడ్తారు.

ఓంశాంతి. ఆత్మికయాత్రను గురించి పిల్లలకిప్పుడు బాగా అర్థమయింది. ఏ హఠయోగములోనూ యాత్ర ఉండదు. దీనిని స్మృతి అని అంటారు. స్మృతి చేసేందుకు ఏ కష్టమూ లేదు. తండిన్రి స్మృతి చేయడంలో ఏ కష్టమూ లేదు. ఇది తరగతి. అందువలన కేవలం నియమానుసారం కూర్చోవాలి. మీరు తండ్రికి పిల్లలుగా అయ్యారు. పిల్లల పాలన జరుగుతూ ఉంది. ఎటువంటి పాలన ? అవినాశి జ్ఞాన రత్నాల ఖజానా లభిస్తూ ఉంది. తండ్రిని స్మృతి చేయడంలో ఏ కష్టమూ లేదు. కేవలం మాయ మీ బుద్ధి యోగాన్ని తుంచి వేస్తుంది. పోతే ఎలాగైనా కూర్చోండి, దానికి స్మృతితో ఎలాంటి సంబంధము లేదు. చాలామంది పిల్లలు హఠముతో 3-4 గంటలు కూడా కూర్చుంటారు. పూర్తి రాత్రి కూడా కూర్చుంటారు. ఇంతకుముందు మీకు భట్టీ ఉండేది. అది వేరే విషయము. అక్కడ మీకు ప్రవృత్తి వ్యాపార వ్యవహారాలు ఉండేవి కావు. అందువలన ఇది నేర్పించేవారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - మీరు గృహస్థ
వ్యవహారములో ఉండండి. వృత్తి వ్యాపారాదులు కూడా భలే చేసుకోండి. ఏ పని చేస్తున్నా తండ్రిని స్మృతి చేయాలి. అలాగని ఇప్పుడు మీరు నిరంతరము స్మృతి చేయగలరని కాదు. ఈ స్థితి వచ్చేందుకు సమయము పడ్తుంది. నిరంతరము స్మృతి ఉంటే కర్మాతీత స్థితి వచ్చేస్తుంది. తండి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, డ్రామా ప్లాను అనుసారము ఇప్పుడు కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉంది. లెక్కాచారమంతా బుద్ధిలో ఉంటుంది. క్రీస్తుకు 3 వేల సంవత్సరాల క్రితము భారతదేశము మాత్రమే ఉండేదని, అది స్వర్గమనబడేదని అంటారు. ఇప్పుడు 2 వేల సంవత్సరాలు పూర్తి కావచ్చింది. అంతా కలిస్తే 5 వేల సంవత్సరాల లెక్క పూర్తవుతుంది.
మీ కీర్తి ప్రతిష్ఠలు విదేశాల నుండే ప్రఖ్యాతమౌతాయి. ఎందుకంటే వారి బుద్ధి భారతీయుల కంటే చురుకైనది. భారతదేశము నుండి వారు శాంతిని కూడా కోరుతారు. భారతీయులే లక్షల సంవత్సరాలని అంటూ సర్వవ్యాపి జ్ఞానమునిచ్చి బుద్ధిని చెడగొట్టారు, తమోప్రధానమైపోయారు. వారు ఇంత తమోప్రధానంగా అవ్వలేదు. వారి బుద్ధి చాలా చురుకైనది. భారతీయుల నుండి వారు చాలా నేర్చుకుంటారు. వారి నుండి ఎప్పుడు శబ్ధము వ్యాపిస్తుందో అప్పుడు భారతీయులు మేల్కొంటారు. ఎందుకంటే భారతీయులు పూర్తిగా గాఢనిద్రలో నిద్రించి ఉన్నారు. వారు కొద్దిగా మాత్రమే నిద్రించి ఉన్నారు. వారి ద్వారా శబ్ధము బాగా వెలువడ్తుంది. విదేశాల నుండి కూడా ఇక్కడకు వచ్చి శాంతి ఎలా లభిస్తుందో ఎవరైనా చెప్పగలరా? అని అడిగారు. ఎందుకంటే తండ్రి కూడా భారతదేశములోనే వస్తారు. ఈ ప్రపంచములో శాంతి ఎప్పుడు, ఎలా వ్యాపిస్తుందో పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేయించగలరు. స్వర్గము లేక ప్యారడైజ్‌ లేక హెవెన్‌ ఉండేదని పిల్లలైన మీకు తెలుసు. నూతన ప్రపంచములో భారతదేశము స్వర్గంగా ఉండేది. ఇది ఇతరులెవ్వరికీ తెలియదు.
ఈశ్వరుడు సర్వవ్యాపి అని, కల్పమంటే లక్షల సంవత్సరాలని మానవుల బుద్ధిలో గట్టిగా కూర్చుండిపోయింది. ప్రపంచమంతటిలో ఎక్కువగా రాతి బుద్ధి గలవారు భారతీయులే. ఈ గీతాశాస్త్రము మొదలైనవన్నీ భక్తిమార్గానికి చెందినవే. మళ్లీ ఇవన్నీ ఇదే విధంగా తయారౌతాయి. భలే డ్రామాను గురించి తెలుసు. అయినా తండ్రి పురుషార్థము చేయిస్తారు. వినాశము తప్పకుండా జరుగుతుందని పిల్లలైన మీకు తెలుసు. నూతన ప్రపంచ స్థాపన చేసేందుకే తండ్రి వస్తారు. ఇది సంతోషించే విషయము కదా. ఏదైనా పెద్ద పరీక్ష పాస్‌ అయితే లోపల సంతోషము కలుగుతుంది కదా. మనము ఇవన్నీ పాస్‌ అయ్యి,అక్కడకెళ్లి దేవతలుగా అవుతాము. ఇదంతా చదువు పై ఆధారపడి ఉంది.తండ్రి మనలను చదివించి ఇలా దేవతలుగా(లక్ష్మినారాయణులుగా) తప్పకుండా తయారు చేస్తారని మీకు తెలుసు. ప్యారడైజ్‌ - హెవెన్‌(స్వర్గము) ఉండేదని కూడా మీకు తెలుసు. పాపం ఈ మానవులంతా పూర్తిగా దిక్కు తెలియక భ్రమలో పడి ఉన్నారు. అనంతమైన తండ్రి వద్ద గల జ్ఞానాన్ని పిల్లలైన మీకు ఇస్తున్నారు. బాబా జ్ఞానసాగరులు, ఆనందసాగరులే కాక ఖజానాలు కూడా వారి వద్ద ఫుల్‌గా(సంపూర్ణముగా) ఉన్నాయని మీరు తండ్రిని మహిమ చేస్తారు. మిమ్ములను ఇంత గొప్ప ధనవంతులుగా ఎవరు చేస్తారు? ఇక్కడకు మీరెందుకు వచ్చారు? వారసత్వము పొందుకునేందుకు. ఎవరికైనా ఆరోగ్యము బాగుండి ధనము లేకుంటే ఏమవుతుంది! వైకుంఠములో మీ వద్ద ధనము చాలా ఉంటుంది. ఇక్కడ ఉన్న షాహుకార్లకు మా వద్ద ఇంత ధనముంది, ఈ ఫ్యాక్టరీలు మొదలైనవి ఉన్నాయని నషా ఉంటుంది. శరీరము వదిలినట్లైతే ఇవన్నీ సమాప్తమైపోతాయి. మనకు 21 జన్మలకు బాబా ఎంతో గొప్ప ఖజానా ఇస్తారని మీకు తెలుసు. తండ్రి స్వయంగా ఖజానాలకు అధికారిగా అవ్వరు. పిల్లలైన మిమ్ములను అధికారులుగా చేస్తారు. ఈ
విశ్వములో శాంతిని గాడ్‌ఫాదర్‌ తప్ప మరెవ్వరూ స్థాపించలేరని కూడా మీకు తెలుసు. అన్నింటికంటే ఫస్ట్‌క్లాస్‌ చిత్రాలు - ఈ త్రిమూర్తి, సృష్టి చక్రము. ఈ చక్రములోనే సంపూర్ణ జ్ఞానము నిండి ఉంది. మీ వద్ద ఇటువంటి అద్భుతమైన వస్తువేదైనా ఉంటే ఇందులో ఏదో రహస్యముందని వారు భావిస్తారు. కొంతమంది పిల్లలు చిన్న చిన్న చిత్రాలు తయారుచేస్తారు. అవి బాబాకు నచ్చవు. పెద్ద పెద్ద చిత్రాల ఉంచమని బాబా చెప్తూనే ఉన్నారు. అప్పుడు దూరము నుండే ఎవరైనా చదువుకొని అర్థము చేసుకుంటారు. మానవుల గమనము పెద్ద వస్తువుల పైకి వెళ్తుంది. ఈ చిత్రములో ఒకవైపు కలియుగము, మరొకవైపు సత్యయుగము స్పష్టంగా చూపించబడింది. పెద్ద - పెద్ద చిత్రాలుంటే మానవుల అటెన్షన్‌ను ఆకర్షిస్తుంది. యాత్రికులు కూడా చూస్తారు. బాగా అర్థము కూడా చేసుకుంటారు. క్రీస్తుకు 3 వేల సంవత్సరాల క్రితము స్వర్గము ఉండేదని కూడా తెలుసు. ఈ విధంగా బయటవారికి తెలియదు. 5 వేల సంవత్సరాల లెక్కాచారము మీరు స్పష్టంగా తెలిపేందుకు దూరము నుండే కనిపించి చదవగలిగేటంత పెద్ద చిత్రాన్ని తయారుచేయాలి. దాని ద్వారా ఈ
ప్రపంచము తప్పకుండా అంత్యమౌతుందని అర్థం చేసుకుంటారు. బాంబులేమో తయారవుతూనే ఉంటాయి. ప్రకృతి భీభత్సాలు కూడా జరుగుతాయి. వినాశనము పేరు వింటే మీకు లోపల చాలా సంతోషము కలగాలి. కానీ జ్ఞానమే లేకుంటే సంతోషము కూడా ఉండదు. దేహ సహితంగా సర్వమూ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలైన మీరు తండ్రి అయిన నాతో యోగము చేయండి. ఇది శ్రమ చేసే విషయము. పావనంగా అయ్యి పావన ప్రపంచములోకి రావాలి. మనమే చక్రవర్తి పదవి పొందుతామని, మళ్లీ పోగొట్టుకుంటామని మీకు తెలుసు. ఇది చాలా సులభము. లేస్తూ - కూర్చుంటూ, నడుస్తూ బుద్ధిలో జ్ఞానము మెదులుతూ ఉండాలి. బాబా వద్ద జ్ఞానమెలా ఉందో అలా మీ వద్ద ఏం చేస్తున్నా ఈ జ్ఞానము మెదులుతూ ఉండాలి. చదివించి దేవతలుగా చేసేందుకే బాబా వచ్చారు. కనుక పిల్లలకు ఇంత అపారమైన సంతోషము ఉండాలి. నాకు ఇంత సంతోషముందా? అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. తండ్రిని అంత బాగా స్మృతి చేస్తున్నారా? చక్ర జ్ఞానమంతా బుద్ధిలో ఉంటే ఎంత ఖుషీ ఉండాలి. నన్ను స్మృతి చేసి పూర్తిగా సంతోషములో ఉండండి అని తండ్రి చెప్తున్నారు. మిమ్ములను చదివించేవారెవరో గమనించండి. ఇది అందరికీ తెలిస్తే అందరి ముఖాలు పాలిపోతాయి. కానీ వారు తెలుసుకునేందుకు ఇంకా కొంత సమయముంది. దేవతా ధర్మానికి చెందినవారు అంత సంఖ్యలో ఇంకా తయారవ్వలేదు. పూర్తి రాజ్యస్థాపన ఇంకా జరగలేదు. తండ్రి సందేశాన్ని ఎంతమంది మనుష్యులకు ఇవ్వాలి? అనంతమైన తండ్రి మళ్లీ మాకు స్వర్గ చక్రవర్తి పదవిని ఇస్తున్నారు. మీరు కూడా ఆ తండ్రిని స్మృతి చేయండి అని అందరికి చెప్పండి. అనంతమైన తండ్రి అనంతమైన సుఖమును తప్పకుండా ఇస్తారు కదా. పిల్లలలో అపారమైన జ్ఞానయుక్త సంతోషముండాలి. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తూ ఉంటారో అంత పావనమౌతూ ఉంటారు.
డ్రామా ప్లాను అనుసారము పిల్లలైన మీరు సేవ ఎంత బాగా చేసి ప్రజలను తయారు చేసుకుంటారో వారికి ఎంత కళ్యాణము జరుగుతుందో అంత వారి నుండి మీకు ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. పేదల సేవ చేస్తారు. ఆహ్వానిస్తూ పిలుస్తూ ఉండండి. రైలులో కూడా మీరు చాలా సేవ చేయవచ్చు. చిన్న బ్యాడ్జిలోనే ఎంతో జ్ఞానము ఇమిడి ఉంది. చదువు సారమంతా ఇందులో ఇమిడి ఉంది. మంచి-మంచి బ్యాడ్జిలు చాలా తయారు చేయాలి. ఇతరులకు కానుకగా కూడా ఇవ్వగలగాలి. ఇతరులకు అర్థం చేయించడం కూడా చాలా సులభము. కేవలం శివబాబాను స్మృతి చేయండి. శివబాబా నుండే వారసత్వము లభిస్తుంది. అలాంటప్పుడు తండ్రిని, తండ్రి ఇచ్చే వారసత్వమైన స్వర్గ చక్రవర్తి పదవిని, కృష్ణపురమును స్మృతి చేయండి. మానవుల మతములన్నీ చాలా తికమకగా ఉన్నాయి. కొద్దిగా కూడా అర్థము చేసుకోరు. వికారాల కొరకు ఎంతో విసిగిస్తారు. కామ వికారము కొరకు ఎంతో పడి చస్తున్నారు. ఏ మాటనూ అర్థము చేసుకోరు. మానవులందరి బుద్ధి పూర్తిగా నశించింది. తండ్రిని గురించి తెలియనే తెలియదు. ఇది కూడా డ్రామాలో నిర్ణియించబడి ఉంది. అందరి బుద్ధి పూర్తిగా ఖాళీ అయిపోయింది. తండ్రి అంటున్నారు - పిల్లలూ, మీరు పవిత్రంగా ఉంటే స్వర్గానికి ఇటువంటి అధికారులుగా అయిపోతారు. కానీ అర్థము చేసుకోవడం లేదు. ఆత్మలోని శక్తి అంతా ఖాళీ అయిపోయింది. ఎంతగానో అర్థం చేయిస్తున్నారు. అయినా పురుషార్థము చేయాలి, చేయించాలి. పురుషార్థములో అలసిపోరాదు, హార్ట్‌ఫెయిల్‌ అవ్వరాదు. ఎంతో శ్రమ చేశాము, ఎంతో బాగా ఉపన్యసించాము. ఒక్కరు కూడా తయారవ్వలేదని నిరుత్సాహ పడరాదు. మీరేం వినిపించారో, దానిని ఎవరు విన్నారో వారి పై దాని ప్రభావము తప్పకుండా పడ్తుంది. చివర్లో అందరూ తప్పకుండా తెలుసుకుంటారు. బి.కెల మహిమ అనంతంగా, అపారంగా వెలువడ్తుంది. కానీ పని చూస్తే చాలా తెలివితక్కువ పని చేశామనిపిస్తుంది, గౌరవమే లేదు. పూర్తిగా తెలుసుకోనే లేదు. పరిచయమే లేదు. బుద్ధి బయట తిరుగుతూ ఉంటుంది. తండ్రిని స్మృతి చేస్తే సహాయము కూడా లభిస్తుంది. తండ్రిని స్మృతి చెయ్యరు అనగా వారు పతితులు. మీరు పావనంగా అవుతారు. ఎవరు తండ్రిని స్మృతి చేయరో వారి బుద్ధి తప్పకుండా ఎక్కడో భ్రమిస్తూ ఉంటుంది. కనుక వారిని స్పర్శించను కూడా స్పర్శించరాదు. ఎందుకంటే స్మృతిలో లేనందున వారు వాయుమండలాన్ని పాడు చేస్తారు. పవిత్రులు, అపవిత్రులు కలిసి ఉండలేరు. అందుకే తండ్రి పాత సృష్టిని సమాప్తం చేస్తారు. పోను పోను నియమాలు కఠినమౌతూ పోతాయి. తండ్రిని స్మృతి చేయకుంటే లాభానికి బదులు ఇంకా నష్టపోతారు. పవిత్రతకు ఆధారమంతా స్మృతి. ఒక్కచోట కూర్చునే అవసరమే లేదు. ఇక్కడ కలిసి కూర్చోవడం కంటే కొండ పైకి వెళ్లి వేరు వేరుగా కూర్చోవడం మంచిది. ఎవరు స్మృతి చేయరో వారు పతితులు. వారితో స్నేహము కూడా చేయరాదు. నడవడికలోనే తెలిసిపోతుంది. స్మృతి చేయకుంటే పావనంగా అవ్వలేరు. ప్రతి ఒక్కరి పై జన్మ-జన్మాంతరాల పాప భారము చాలా ఉంది. స్మృతియాత్ర చేయకుంటే పాప భారము ఎలా తొలగిపోతుంది అనగా వారు పతితులే.
తండ్రి చెప్తున్నారు - పిల్లలైన మీ కొరకు మొత్తం పతిత ప్రపంచాన్నంతా సమాప్తం చేస్తాను. వారి సాంగత్యమే ఉండరాదు. ఎవరి సాంగత్యములో ఉండాలి అన్న బుద్ధి కూడా లేదు. పవిత్రులైన మీ ప్రేమ పవిత్రులతోనే ఉండాలి. దీనికి కూడా బుద్ధి కావాలి కదా. మధురమైన తండ్రి, మధురమైన రాజధాని తప్ప ఇతరులెవ్వరూ స్మృతిలోకి రాకూడదు. ఇంత త్యాగము చేయడం పిన్నమ్మ ఇల్లేమీ కాదు (సులభము కాదు). తండ్రికి పిల్లల పై అపారమైన ప్రేమ ఉంది.పిల్లలూ! మీరు పావనంగా అయితే పావన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. నేను మీ కొరకు పావన ప్రపచాన్ని స్థాపన చేస్తాను. ఈ పతిత ప్రపంచాన్ని పూర్తిగా సమాప్తము చేసేస్తాను. ఈ పతిత ప్రపంచములోని ప్రతి వస్తువు మీకు దు:ఖమే కలుగజేస్తుంది. మీ ఆయువు కూడా తగ్గిపోతూ వస్తుంది. ఇది పైసకు కూడా కొరగానిదని అంటారు. గవ్వకు, వజ్రానికి తేడా ఉంది కదా. అందువలన పిల్లలైన మీకు ఎంత ఖుషీ ఉండాలి! సత్యంగా ఉన్నవారు నాట్యము చేస్తూ ఉంటారనే గాయనము కూడా ఉంది(సచ్‌ తో బిటో నచ్‌). మీరు సత్యయుగములో సంతోషంగా నాట్యము చేస్తారు. ఇక్కడ ఏ వస్తువునూ ప్రేమించండి. వీటిని చూస్తున్నా చూడనట్లుండాలి. కనులు తెరుచుకొని ఉన్నా నిదురించినట్లు ఉండాలి. కానీ ఆ ధైర్యము, ఆ స్థితి కావాలి. ఈ పాత పప్రంచము ఉండనే ఉండదనడం నిశ్చితము. సంతోషపు పాదరస మీటరు ఎంతో పైకి ఎక్కి ఉండాలి. శివబాబాను స్మృతి చేస్తే మాకు ఈ విశ్వ చకవ్రర్తి పదవి లభిస్తుందని సంతోషముతో చిటికెలు వేయాలి. హఠయోగముతో అట్లే కూర్చోరాదు. తింటూ, తిరుగుతూ, పని చేస్తూ తండ్రిని స్మృతి చేయండి. రాజధాని స్థాపనౌతూ ఉందని కూడా మీకు తెలుసు. తండ్రి దాసీలుగా అవ్వమని చెప్పరు. పవిత్రంగా అయ్యేందుకు పురుషార్థము చేయమంటారు. తండ్రి పావనంగా అయ్యేందుకు పురుషార్థము చేయిస్తారు. మీరు మళ్లీ పతితమౌతారు. ఎన్నో అసత్యాలు చెప్తారు, ఎంతో పాపము చేస్తారు. సదా శివబాబాను
స్మృతి చేస్తే పాపాలన్నీ స్వాహా అయిపోతాయి. ఇది బాబా యజ్ఞము కదా, చాలా గొప్ప యజ్ఞము. వారు లక్షల రూపాయల ఖర్చుతో యజ్ఞము చేస్తారు. ఈ యజ్ఞములో ప్రపంచమంతా స్వాహా అవుతుందని మీకు తెలుసు. వెలుపలి నుండి శబ్ధము వ్యాపిస్తుంది. భారతదేశంలో కూడా వ్యాపిస్తుంది. మొదటిది తండ్రితో బుద్ధి యోగముంటే పాపాలు నశిస్తాయి. ఉన్నత పదవి కూడా లభిస్తుంది. పిల్లలతో పురుషార్థము చేయించడం తండ్రి కర్తవ్యము. లౌకిక తండ్రి పిల్లల సేవ చేస్తారు. పిల్లలతో సేవ కూడా చేయించుకుంటారు. ఈ తండ్రి చెప్తున్నారు - నేను మీకు 21 జన్మల వారసత్వమును ఇస్తాను. అటువంటి తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. స్మృతి ద్వారా మీ పాపాలు తొలగిపోతాయి. పోతే నీటితో పాపాలు నశించవు. నీరు ఎక్కడైనా లభిస్తుంది. విదేశాలలో కూడా నదులున్నాయి. ఇక్కడి నదులు పావనంగా చేసి, అక్కడి నదులు పతితులుగా చేస్తాయా! మానవులకే మాత్రము తెలియదు. తండ్రికి జాలి కలుగుతుంది కదా. తండి అర్థం చేయిస్తున్నారు - ''పిల్లలూ నిర్లక్ష్యము చేయకండి. తండి ఇంత పవితమ్రైన పుష్పాలుగా చేస్తూ ఉంటే శమ్ర చేయాలి కదా. మీ పై మీరే దయ చూపుకోండి.'' అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఇక్కడ ఉన్న ఏ వస్తువుల పైనా మనస్సు ఉంచరాదు. చూస్తున్నా చూడనట్లే ఉండాలి. కనులు తెరిచి ఉన్నా నిద్ర మత్తు ఉన్నట్లు సంతోషపు నషా పెరిగి ఉండాలి.
2. అంతా పవిత్రత పై ఆధారపడి ఉంది. పతితులను కనీసము స్పర్శించను కూడా స్పర్శించకుండా స్వయాన్ని సంభాళించుకోవాలి. మధురమైన తండ్రి మధురమైన రాజధాని తప్ప ఇతరమేదియు గుర్తు రాకూడదు.

వరదానము :- '' సేవ ద్వారా మేవాను (బలమైన ఆహారము) ప్రాప్తి చేసుకునే సర్వ హద్దు కోరికలకు అతీతంగా సదా సంపన్నం మరియు సమాన్‌ భవ ''
సేవ అంటే అర్థము మేవా ఇచ్చేది. ఒకవేళ ఏదైనా సేవ అసంతుష్టంగా చేసిందంటే, అది సేవ కాదు. అటువంటి సేవను భలే వదిలేయండి, కానీ సంతుష్టతను వదలకండి. ఎలాగైతే శారీరికంగా తృప్తిగా ఉండేవారు సదా సంతుష్టంగా ఉంటారో అలా మానసిక తృప్తి గలవారు కూడా సంతుష్టంగా ఉంటారు. తృప్తికి గుర్తు సంతుష్టత. తృప్తిగా ఉన్న ఆత్మలో ఎలాంటి హద్దు కోరిక, గౌరవం, కీర్తి, పరిష్కారము, సాధనాల ఆకలి ఉండదు. వారు హద్దులోని అన్ని కోరికలకు అతీతంగా సంపన్నంగా, సమానంగా ఉంటారు.

స్లోగన్‌ :- '' సత్యమైన హృదయం ద్వారా నిస్వార్థమైన సేవలో ముందుకు వెళ్లడం అనగా పుణ్య ఖాతా జమ అవ్వడం ''

Sunday, 27 October 2019

Telugu Murli 28/10/2019

28-10-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - విశ్వ రాజ్యమును బాహుబలముతో తీసుకోలేరు, దాని కొరకు యోగబలము కావాలి. ఇది కూడా ఒక నియమము ''

ప్రశ్న :- శివబాబా తమలో తాము ఏ విషయములో ఆశ్చర్యపడ్తారు ?
జవాబు :- బాబా చెప్తున్నారు - ఎంత ఆశ్చర్యమో చూడండి నేను మిమ్ములను చదివిస్తున్నాను. కాని నేను ఎవ్వరి వద్ద ఎప్పుడూ చదువుకోలేదు. నాకు ఎవ్వరూ తండ్రి లేరు, టీచరు కూడా లేరు, గురువు కూడా లేరు. నేను సృష్టి చక్రములో పునర్జన్మ తీసుకోను. అయినా మీకు అన్ని జన్మల కథను వినిపిస్తాను. స్వయం 84 జన్మల చక్రములో రాను కాని చక్ర జ్ఞానమును చాలా ఖచ్చితంగా ఇస్తాను.

ఓంశాంతి. ఆత్మిక తండ్రి పిల్లలైన మిమ్ములను స్వదర్శన చక్రధారులుగా చేస్తారు అనగా మీరు ఈ 84 జన్మల చక్రమును తెలుసుకుంటారు.
ఇంతకుముందు తెలియదు. ఇప్పుడు తండ్రి ద్వారా మీరు తెలుసుకున్నారు. 84 జన్మల చక్రములో మీరు తప్పనిసరిగా వస్తారు. పిల్లలైన మీకు 84 జన్మల చక్ర జ్ఞానమునిస్తాను. నేను స్వదర్శన చక్ర ధారిని కానీ పాక్ట్రికల్‌గా 84 జన్మల చక్రములోకి రాను. అందువలన దీని ద్వారా శివబాబాలో మొత్తం జ్ఞానమంతా ఉందని మీరు అర్థం చేసుకోవాలి. బ్రాహ్మణులైన మనము ఇప్పుడు స్వదర్శన చక్రధారులుగా అవుతామని మీకు తెలుసు. బాబా అలా తయారవ్వరు. కానీ వారిలో ఈ అనుభవము ఎలా వచ్చింది? మనకైతే అనుభవము ప్రాప్తిస్తుంది. మీకు వినిపించేందుకు బాబాకు అనుభవము ఎలా వస్తుంది? ప్రాక్టికల్‌ అనుభవము కావాలి కదా. నన్ను జ్ఞానసాగరుడని అంటారు కానీ నేను 84 జన్మల చక్రములో రాను. అయితే నాకు ఈ జ్ఞానము ఎలా వచ్చింది? చదివించే టీచరు తప్పకుండా స్వయం చదువుకొని ఉంటాడు కదా. శివబాబా ఇది ఎలా చదివారు? వారికి 84 జన్మల చక్రము ఎలా తెలిసింది? వారేమో చక్రములోకి రారు. తండ్రి బీజరూపులైనందు వలన వారికి తెలుసు. స్వయం 84 జన్మల చక్రములోకి రారు. కానీ మీకు అంతా అర్థం చేయిస్తారు. ఇది కూడా ఎంత అద్భుతము! అలాగని బాబా శాస్త్ర్రాలు మొదలైనవన్నీ చదివారని కాదు. డ్రామానుసారము మీకు వినిపించే జ్ఞానమంతా వారిలో ఇమిడి ఉందని చెప్పబడ్తుంది. అందువలన వారు అద్భుతమైన టీచరు కదా. ఆశ్చర్యపడాలి కదా. అందుకే వారికి గొప్ప-గొప్ప పేర్లు ఉంచారు. ఈశ్వరుడు, ప్రభవు, అంతర్యామి మొదలైనవి. ఈశ్వరునిలో ఈ జ్ఞానమంతా ఎలా నిండి ఉందని మీరు ఆశ్చర్యపడ్తారు. మీకు తెలిపే జ్ఞానమంతా వారికెలా వచ్చింది? వారికి జన్మనిచ్చిన తండ్రి గానీ, జ్ఞానము తెలిసినవారు గానీ ఎవ్వరూ లేరు. మీరందరూ సోదరులు(భాయీ-భాయీ). ఆ ఒక్కరే మీకు తండ్రి, వారు బీజరూపులు. కూర్చుని పిల్లలకు ఎంతో జ్ఞానమును వినిపిస్తారు. 84 జన్మలు నేను తీసుకోను. మీరు తీసుకుంటారని చెప్తున్నారు. అలాంటప్పుడు తప్పకుండా ప్రశ్న
తలెత్తుతుంది - బాబా మీకెలా తెలుసు? బాబా చెప్తున్నారు - పిల్లలూ, అనాది డ్రామానుసారము నాలో మొదటి నుండి ఈ జ్ఞానముంది. దానినే మీకు వినిపించి చదివిస్తున్నాను. అందుకే నన్ను అత్యంత ఉన్నతమైన భగవంతుడని అంటారు. స్వయం చక్రములో రారు కానీ వారిలో సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానమంతా ఉంది. కనుక పిల్లలైన మీకెంత ఖుషీ ఉండాలి. వారికి 84 జన్మల చక్ర జ్ఞానము ఎక్కడ నుండి లభించింది? మీకైతే తండ్రి ద్వారా లభించింది. తండ్రిలో ఒరిజినల్‌ జ్ఞానముంది. వారిని జ్ఞానసాగరులని అంటారు. ఎవరి వద్దా చదువుకోలేదు కూడా. కనుక వారికి ఒరిజినల్‌గానే తెలుసు. అందుకే వారిని జ్ఞానసాగరులని అంటారు. ఇది అద్భుతము కదా. అందుకే ఇది అత్యంత ఉన్నతమైన చదువు అని గాయనము చేయబడ్తుంది. పిల్లలు తండ్రిని చూసి ఆశ్చర్యపడ్తారు. ఒకటేమో, వారిని జ్ఞానసాగరులని ఎందుకు అంటారో అర్థం చేసుకోవలసిన విషయము. రెండవది ఏ విషయము? మీరు ఈ చిత్రాలు
చూపించినప్పుడు మిమ్ములను ఎవరైనా ఇలా అడుగుతారు - బహ్మ్రలో కూడా తన ఆత్మ ఉంటుంది, నారాయణునిగా అయినప్పుడు వారిలో కూడా వారి ఆత్మ ఉంటుంది. రెండు ఆత్మలు కదా. ఒకటేమో బహ్మ్రది, రెండవది నారాయణునిది. కానీ ఆలోచిస్తే రెండు ఆత్మలు లేవు. ఆత్మ ఒక్కటే, రెండు ఆత్మలు లేవు. ఇది ఒక శ్యాంపుల్‌గా దేవతది చూపించారు. ఈ బహ్మ్రనే విష్ణువు అనగా నారాయణునిగా అవుతాడు - వీటినే రహస్యయుక్తమైన విషయాలని అంటారు. తండి చాలా నిగూఢమైన జ్ఞానము వినిపిస్తారు. ఈ విషయాలు తండి తప్ప ఇతరులెవ్వరూ చదివించలేరు. అందువలన బ్రహ్మ, విష్ణువులవి రెండు వేరు వేరు ఆత్మలు కాదు. అదే విధంగా సరస్వతి, లక్ష్మి వీరిద్దరికీ రెండు ఆత్మలా లేక ఒకే ఆత్మనా? ఆత్మ ఒక్కటే, శరీరాలు రెండు. ఈ సరస్వతియే తర్వాత లక్ష్మిగా అవుతుంది. అందుకే ఒకే ఆత్మగా లెక్కించబడ్తుంది. ఒక్క ఆత్మయే 84 జన్మలు తీసుకుంటుంది. ఇవి చాలా బాగా అర్థము చేసుకునే విషయాలు. బాహ్మ్రణులే దేవతలుగా, దేవతలే క్షత్రియులుగా అవుతారు. ఆత్మ ఒక శరీరమును వదిలి మరొకటి తీసుకుంటుంది. ఆత్మ ఒక్కటే. బ్రాహ్మణులే దేవతలుగా ఎలా అవుతారో, ఇది ఒక శ్యాంపుల్‌గా చూపించారు. '' హమ్‌ సో ''కు అర్థము ఎంతో బాగుంది. వీటినే నిగూఢమైన విషయాలని అంటారు. ఇందులో కూడా మొట్టమొదట మనమంతా ఒకే తండ్రికి పిల్లలమనే జ్ఞానము అవసరము. ఆత్మలన్నీ మొదట పరంధామములో ఉండేవి. ఇక్కడ పాత్ర చేసేందుకు వచ్చాయి. ఇది ఒక ఆట(డ్రామా). ఈ ఆటను గురించిన సమాచారాన్ని తండ్రి కూర్చుని వినిపిస్తారు. తండ్రికేమో ఒరిజినల్‌గా ఈ జ్ఞానము తెలుసు. వారికి ఎవ్వరూ నేర్పించలేదు. ఈ 84 జన్మల చక్రము వారికే తెలుసు. దానిని ఇప్పుడు ఈ సమయములో మీకు వినిపిస్తున్నారు. మళ్లీ మీరు మర్చిపోతారు. మళ్లీ వారి శాస్త్రాలు ఎలా తయారవుతాయి? తండ్రి అయితే ఏ శాస్త్ర్రాలూ చదవలేదు. మరి వారు వచ్చి కొత్త కొత్త విషయాలు వినిపిస్తున్నారు. అర్ధకల్పము భక్తిమార్గము. ఈ మాట కూడా శాస్త్రాలలో లేదు. ఈ శాస్త్రాలు కూడా డ్రామానుసారంగా భక్తిమార్గములో తయారయ్యాయి. మీ బుద్ధిలో ప్రారంభము నుండి చివరి వరకు ఈ డ్రామా గురించిన ఎంతో గొప్ప జ్ఞానముంది! వారు తప్పనిసరిగా మానవ శరీరమును ఆధారంగా తీసుకోవలసి వచ్చింది. శివబాబా ఈ బ్రహ్మ శరీరములో కూర్చుని ఈ సృష్టి చక్ర జ్ఞానమును వినిపిస్తారు. మానవులు ఎన్నో వ్యర్థ విషయాలు కల్పించి సృష్టి ఆయువునే ఎంతో పెంచేశారు. నూతన ప్రపంచమే మళ్లీ పాత ప్రపంచంగా అవుతుంది. నూతన ప్రపంచాన్ని స్వర్గమని, పాత ప్రపంచాన్ని నరకమని అంటారు. ఉన్న ప్రపంచమేమో ఒక్కటే. నూతన ప్రపంచములో నివసించేవారు దేవీ దేవతలు, అక్కడ అపారమైన సుఖముంది. సృష్టి అంతా నూతనంగా ఉంటుంది. ఇప్పుడు దీనిని పాతదని అంటారు. దీని పేరే ఇనుప యుగ ప్రపంచము. ఉదాహరణానికి పాత ఢిల్లి, కొత్త ఢిల్లీ అని అంటారు కదా. తండ్రి అర్థము చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా, కొత్త ప్రపంచములో కొత్త ఢిల్లీ ఉంటుంది. ఈ పాత ప్రపంచములోనే కొత్త ఢిల్లీ అని ఇక్కడ అంటారు కానీ దీనిని కొత్తదని ఎలా అంటారు! తండ్రి అర్థం చేయిస్తున్నారు - నూతన ప్రపంచములో నూతన ఢిల్లీ ఉంటుంది. అందులో ఈ లక్ష్మీ నారాయణులు రాజ్య పాలన చేస్తారు. దానిని సత్యయుగమని అంటారు. మీరు ఈ మొత్తం భారతదేశము పై రాజ్య పాలన చేస్తారు. మీ సింహాసనము యమునా నది తీరములో ఉంటుంది. చివరి సమయములో రావణ రాజ్య సింహాసనము కూడా ఇక్కడే ఉంది. రామరాజ్య సింహాసనము కూడా ఇక్కడే ఉంటుంది. కానీ పేరు ఢిల్లీగా ఉండదు, దానిని ఫరిస్తాన్‌ అని అంటారు. ఆ తర్వాత రాజును బట్టి సింహాసనము పేరు కూడా మార్చుకుంటారు. ఇప్పుడు మీరందరూ పాత ప్రపంచములో ఉన్నారు. నూతన ప్రపంచములోకి వెళ్లేందుకు మీరు చదువుతున్నారు. మళ్లీ మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు, చదివించేవారు తండ్రి.అత్యంత ఉన్నతులైన తండ్రి క్రిందకు వచ్చి రాజయోగమును నేర్పించారని మీకు తెలుసు. ఇప్పుడు మీరు సంగమ యుగములో ఉన్నారు. ఈ పాత కలియుగ ప్రపంచము సమాప్తమవ్వనున్నది. తండ్రి దీని లెక్కాచారమంతా తెలిపించారు. నేను బ్రహ్మ శరీరములో వస్తాను. మనుష్యులకు బ్రహ్మ అనగా ఎవరో తెలియనే తెలియదు. వారు ప్రజాపిత బ్రహ్మ గురించి విన్నారు. మీరు బ్రహ్మకు ప్రజలు కదా. అందుకే స్వయాన్ని బి.కెలని పిలుచుకుంటారు. వాస్తవానికి మీరు నిరాకారులుగా ఉన్నప్పుడు శివబాబాకు పిల్లలు, శివ వంశీయులు. తర్వాత సాకారములో ప్రజాపిత బ్రహ్మకు పిల్లలు - సోదర - సోదరీలు. ఇది తప్ప వేరే సంబంధమేదీ లేదు. ఇప్పుడు మీరు ఆ కలియుగ సంబంధాలను మర్చిపోతారు. ఎందుకంటే అందులో బంధనాలున్నాయి. మీరు నూతన ప్రపంచములోకి వెళ్తారు. బ్రాహ్మణులకు శిఖ(పిలక) ఉంటుంది. పిలక బ్రాహ్మణులకు గుర్తు. ఇది మీ బ్రాహ్మణ కులము. వారు
కలియుగములోని బ్రాహ్మణులు. తరచుగా బ్రాహ్మణులు పండాలుగా(మార్గదర్శకులుగా) ఉంటారు. ఒక రకమేమో భిక్షాటనతో జీవిస్తారు, రెండవ రకము వారు గీతను వినిపిస్తారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు ఈ గీతను వినిపిస్తారు. వారు కూడా గీతను వినిపిస్తారు, మీరు కూడా గీతను వినిపిస్తారు. వ్యత్యాసమెంత ఉందో గమనించండి. మీరేమో కృష్ణుడు భగవంతుడు కాదని, దేవత అని వారిలో దైవీ గుణాలున్నాయి, వారిని ఈ కనులతో చూడవచ్చని అంటారు. శివుని మందిరములో చూస్తే, శివునికి తన స్వంత శరీరము లేదు. వారు పరమ ఆత్మ అనగా పరమాత్మ. ఈశ్వరుడు, ప్రభువు, భగవంతుడు మొదలైన పదాలకు ఏ అర్థమూ ఉండదు. పరమాత్మయే సుప్రీమ్‌ ఆత్మ. మీరు సుప్రీమ్‌ కాదు. ఆత్మలైన మీకు, పరమాత్మ అయిన వారికి ఎంత వ్యత్యాసముందో చూడండి. ఆత్మలైన మీరు ఇప్పుడు పరమాత్మ నుండి నేర్చుకుంటున్నారు కానీ వారు ఎవరి వద్ద నేర్చుకోలేదు. వీరు తండ్రి కదా. ఆ పరమపిత పరమాత్మను మీరు తండ్రి అని కూడా అంటారు, టీచరు అని కూడా అంటారు, గురువు అని కూడా అంటారు. వారుండేది ఒక్కరే. ఏ ఇతర
ఆత్మలు కూడా తండ్రి, టీచరు, సద్గురువుగా అవ్వలేరు. పరమ ఆత్మ ఒక్కరే. వారినే సుప్రీమ్‌ అని అంటారు. ప్రతి ఒక్కరికి మొదట తండ్రి కావాలి, ఆ తర్వాత టీచరు, చివర్లో గురువు కావాలి. తండ్రి కూడా చెప్తున్నారు - నేను మీకు తండ్రిగా కూడా అవుతాను, తర్వాత టీచరుగా అవుతాను, ఆ తర్వాత నేనే మీ సద్గతిదాత అయిన సద్గురువుగా కూడా అవుతాను. సద్గతినిచ్చే గురువు ఒకే ఒక్కరు. ఇతర గురువులు అనేకమంది ఉన్నారు. తండ్రి చెప్తున్నారు - నేను మీ అందరికీ సద్గతినిస్తాను, మీరంతా సత్యయుగములోకి వెళ్తారు. మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్లిపోతారు. దానిని పరంధామము అని అంటారు. సత్యయుగములో ఆదిసనాతన దేవీదేవతా ధర్మముండేది. ఇక ఏ ఇతర ధర్మము లేదు. మిగిలిన ఆత్మలంతా ముక్తిధామానికి వెళ్లిపోతారు.
సద్గతి అని సత్యయుగమును అంటారు. మీరే పాత్ర చేస్తూ చేస్తూ మళ్లీ దుర్గతిలోకి వచ్చేస్తారు. మీరే సద్గతి నుండి మళ్లీ దుర్గతిలోకి వచ్చేస్తారు. మీరే పూర్తిగా 84 జన్మలు తీసుకుంటారు. ఆ సమయంలో యథా రాజా రాణి తథా ప్రజలుగా ఉంటారు. మొదట 9 లక్షల మంది వస్తారు. ఈ 9 లక్షల మంది 84 జన్మలు తీసుకుంటారు కదా. తర్వాత ఇతరులు కూడా వస్తూ ఉంటారు, ఇది లెక్కించవచ్చు. తండ్రి ఈ లెక్కాచారాన్ని అర్థం చేయిస్తారు. అందరూ 84 జన్మలు తీసుకోరు. మొట్టమొదట వచ్చేవారే 84 జన్మలు తీసుకుంటారు. ఆ తర్వాత వచ్చేవారు తక్కువ-తక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు. ఈ విషయాలన్నీ ఏ ఇతర మానవులకు తెలియదు. తండ్రి ఒక్కరు మాత్రమే కూర్చుని అర్థం చేయిస్తారు. గీతలో భగవానువాచ అని
ఉంది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మమును కృష్ణుడు రచించలేదని మీరిప్పుడు తెలుసుకున్నారు. దీనిని తండ్రియే స్థాపన చేస్తారు. కృష్ణుని ఆత్మ 84 జన్మల అంత్యములో ఈ జ్ఞానము విని మొదటి జన్మలో వచ్చింది. ఇవి అర్థము చేసుకునే విషయాలు. ప్రతి రోజూ చదవాలి. మీరు భగవంతుని విద్యార్థులు. భగవానువాచ కదా. నేను మిమ్ములను రాజాధి రాజులుగా చేస్తాను. ఇది పాత ప్రపంచము. నూతన ప్రపంచమంటే సత్యయుగము. ఇప్పుడిది కలియుగము. తండ్రి వచ్చి కలియుగపు పతితుల నుండి సత్యయుగ పావన దేవతలుగా చేస్తారు. అందుకే కలియుగములోని మానవులు ఆక్రందనలు చేస్తారు - ''ఓ తండ్రీ! మీరు వచ్చి మమ్ములను పావనంగా చేయండి, పతిత కలియుగమును పావన సత్యయుగంగా చేయండి.'' ఎంత తేడా ఉందో చూడండి. కలియుగములో అపార దు:ఖముంది. కొడుకు జన్మిస్తూనే సంతోషము, సుఖము కలుగుతుంది, రేపు మరణిస్తే దు:ఖపడ్తారు. జీవితమంతా ఎంతో దు:ఖపడ్తారు. ఇది దు:ఖ ప్రపంచము. ఇప్పుడు తండ్రి సుఖ ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. మిమ్ములను స్వర్గవాసులైన దేవతలుగా చేస్తారు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగములో ఉన్నారు. ఉత్తమోత్తమ పురుషులుగా లేక స్త్రీలుగా అవుతారు. మీరు ఈ లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకే వస్తారు. విద్యార్థికి టీచరుతో యోగముంటుంది. ఎందుకంటే వీరి ద్వారా మేము చదువుకొని ఫలానాగా అవుతామని భావిస్తారు. ఇక్కడ మీరు పరమపిత పరమాత్మ శివునితో యోగముంచుతారు. వారు మిమ్ములను దేవతలుగా చేస్తారు. సాలిగామ్రులైన పిల్లలూ, మీ తండిన్రైన నన్ను స్మృతి చేయండి. స్వయాన్ని ఆత్మగా భావించి తండిన్రి స్మృతి చేయండి. వారే జ్ఞాన సాగరులు. తండ్రి మీకు సత్యమైన గీతను వినిపిస్తారు. కానీ స్వయం వారు చదవలేదు. వారు చెప్తున్నారు - నేను ఎవ్వరికీ పుత్రుడను కాదు, ఎవరి వద్దా నేను చదువుకోలేదు. నాకు గురువెవ్వరూ లేరు. కానీ నేను పిల్లలైన మీకు తండ్రి, టీచరు, గురువును. వారిని పరమ ఆత్మ అని అంటారు. వారికి ఈ మొత్తము సృష్టి ఆదిమధ్యాంతాలు తెలుసు. వారు వినిపించినంత వరకు మీరు దిమధ్యాంతాలను అర్థము చేసుకోలేరు. ఈ చక్రమును తెలుసుకున్నందున మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. ఈ బాబా మిమ్ములను చదివించడం లేదు. ఇతనిలో శివబాబా ప్రవేశమై ఆత్మలను చదివిస్తున్నారు. ఇది నూతన విషయము కదా. ఇది సంగమ యుగములోనే జరుగుతుంది. పాత ప్రపంచము సమాప్తమైపోతుంది. కొంతమందిది మట్టిలో కలుస్తుంది, కొంతమందిది రాజులు తింటారు..... (కిస్‌కీ దబీ రహీ ధూల్‌ మే, కిస్‌కీ రాజా ఖాయే.........) పిల్లలకు చెప్తున్నారు - చాలామందికి కళ్యాణము చేసేందుకు మళ్లీ దేవతలుగా తయారు చేసేందుకు ఈ పాఠశాల, మ్యూజియం తెరవండి.
అక్కడకు చాలామంది వచ్చి సుఖ వారసత్వము పొందుతారు. ఇప్పుడిది రావణరాజ్యము కదా. రామరాజ్యములో అపారమైన సుఖముండేది. రావణ రాజ్యములో దు:ఖముంది. ఎందుకంటే అందరూ వికారులుగా అయిపోయారు. అది నిర్వికారి ప్రపంచము. ఈ లక్ష్మీనారాయణులకు కూడా పిల్లలు మొదలైనవారున్నారు కదా. కానీ అక్కడ యోగబలముంటుంది. తండ్రి మీకిప్పుడు యోగబలము నేర్పిస్తారు. యోగబలము ద్వారా మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. బాహుబలముతో ఎవ్వరూ విశ్వమంతటికి యజమానులుగా అవ్వలేరు. నియమము లేదు. పిల్లలైన మీరు స్మృతి బలముతో మొత్తం విశ్వానికి చకవ్రర్తి పదవి తీసుకుంటున్నారు. ఇది ఎంతో ఉన్నతమైన చదువు. తండి చెప్తున్నారు - మొట్టమొదట పవిత్రతా ప్రతిజ్ఞ చేయండి. పవితంగా అయితేనే మీరు పవిత పప్రంచానికి అధికారులుగా అవుతారు. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. కలియుగములోని సంబంధాలు ఏవైతే ఈ సమయములోని బంధనములుగా ఉన్నాయో వాటిని మర్చిపోయి స్వయాన్ని సంగమయుగ బ్రాహ్మణులుగా భావించాలి. సత్యమైన గీత వినాలి, వినిపించాలి.
2. పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది. అందువలన మీ సర్వస్వమూ సఫలము చేసుకోవాలి. అనేకమంది కళ్యాణము కొరకు మానవులను దేవతలుగా చేసేందుకు ఈ పాఠశాలలు, మ్యూజియంలు తెరవాలి.

వరదానము :- '' దృఢ సంకల్పమనే అగ్గిపుల్లతో ఆత్మిక బాంబు యొక్క బురుజును వెలిగించే సదా విజయీ భవ ''
ఈ రోజుల్లో బురుజుతో బాంబులు తయారు చేస్తున్నారు. కానీ మీరు దృఢ సంకల్పమనే అగ్గిపుల్లతో ఆత్మిక బాంబు అనే బురుజును వెలిగించండి. తద్వారా పాతదంతా సమాప్తమైపోతుంది. వారు ఆ బురుజులు వెలిగించి ధనం పోగొట్టుకుంటారు. కాని మీరు సంపాదన జమ చేసుకుంటారు. అవి బురుజులు, మీది ఎగిరేకళ యొక్క ఆట. ఇందులో మీరు విజయులుగా అవుతారు. కనుక డబల్‌ లాభము తీసుకోండి. కాలుస్తారు, సంపాదిస్తారు కూడా - ఈ విధిని అనుసరించండి.

స్లోగన్‌ :- '' ఏదైనా విశేష కార్యములో సహాయకారులుగా అవ్వడమే ఆశీర్వాదాల లిఫ్ట్‌ను తీసుకోవడం ''

Saturday, 26 October 2019

Telugu Murli 27/10/2019

27-10-2019 ని అవ్యక్తబాప్‌దాదా కు ఓంశాంతి రివైజ్‌: 27-02-1985 మధువనము

''శివశక్తి పాండవ సేనల విశేషతలు ''
ఈ రోజు బాప్‌దాదా అమృతవేళ నుండి విశేషంగా సన్ముఖంగా వచ్చిన దూరదేశములో ఉంటున్నా, హృదయం ద్వారా సమీపంగా ఉన్న డబల్‌ విదేశీ పిల్లలను చూస్తున్నారు. ఈ రోజు తండ్రి మరియు దాదా ఇరువురి మధ్య మధురమైన ఆత్మిక సంభాషణ నడుస్తూ ఉంది. ఏ విషయం పై ? బ్రహ్మాబాబా విశేషంగా డబల్‌ విదేశీ పిల్లలను చూసి హర్షిస్తూ - ఇంత దూరదేశ వాసులుగా ఉంటున్నా సదా స్నేహముతో అందరికీ ఎలాగైనా బాప్‌దాదాల సందేశాన్ని తప్పకుండా అందించాలనే ఒకే లగ్నములో ఉన్నారు, అద్భుతము ఆ పిల్లలదే అని అన్నారు. దాని కొరకు చాలా మంది పిల్లలు డబల్‌ కార్యాలు చేస్తున్నా లౌకికము మరియు అలౌకికములో డబల్‌ బిజీగా ఉంటున్నా తమ విశ్రాంతిని కూడా లెక్కచేయక రాత్రింబవళ్లు అదే లగ్నములో లగ్నమై ఉన్నారు. తమ ఆహార పానీయాలను కూడా లెక్క చేయక ఏకాగ్రతతో సేవలో నిమగ్నమై ఉంటారు. ఏ పవిత్రత విషయాన్ని అప్రాకృతికమైన జీవితంగా భావించేవారో, ఆ పవిత్రతను ధారణ చేసేందుకు, అపవిత్రతను త్యజించేందుకు, ధైర్యముతో, దృఢ సంకల్పముతో, తండ్రి స్నేహముతో, స్మృతియాత్ర ద్వారా శాంతిని ప్రాప్తి చేసుకున్న ఆధారంతో, చదువు మరియు పరివార సాంగత్యము ఆధారంతో తమ జీవితములో ధారణ చేసుకున్నారు. దేనినైతే కష్టంగా భావించేవారో దానిని సహజంగా చేసుకున్నారు. బ్రహ్మబాబా విశేషంగా పాండవ సేనను చూసి పిల్లల మహిమను గానం చేస్తున్నారు. ఏ విషయం గురించి? పవిత్రతయే యోగులుగా అయ్యేందుకు మొదటి సాధనమని ప్రతి ఒక్కరి మనసులో ఉంది. పవిత్రతయే తండ్రి స్నేహాన్ని అనుభవం చేసే సాధనము, పవిత్రతయే సేవలో సఫలతను పొందేందుకు ఆధారము. ఈ శుభ సంకల్పము ప్రతి ఒక్కరి హృదయంలో పక్కాగా ఉంది. అంతేకాక పాండవుల అద్భుతమేమంటే, వారు శక్తులను ముందు ఉంచుతూ స్వయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు సాగుతున్నారు. పాండవుల తీవ్ర పురుషార్థము చేసే వేగము మంచి ఉన్నతిని పొందేదిగా కనిపిస్తోంది. మెజారిటీ ఇదే వేగముతో ముందుకు వెళ్తున్నారు.
పాండవులు విశేషంగా రిగార్డు(గౌరవం) ఇచ్చే తమ రికార్డును మంచిగా చూపించారని శివబాబా అన్నారు. అలాగే నవ్వు పుట్టించే విషయాన్ని కూడా చెప్పారు. వీరు మధ్య మధ్యలో సంస్కారాల ఆట కూడా ఆడుతూ ఉంటారు. అయినా మళ్లీ ఉన్నతి చెందేందుకు ఉత్సాహమున్న కారణంగా, తండ్రితో అతిస్నేహమున్న కారణంగా అర్థం చేసుకుంటారు. స్నేహం వెనుక ఈ పరివర్తనయే తండ్రికి ప్రియమైనదని భావిస్తారు అందువలన బలిహారమైపోతారు. తండ్రి ఏం చెప్తారో, ఏం కోరుకుంటారో అదే చేస్తామనే సంకల్పముతో తమను తాము పరివర్తన చేసుకుంటారు. ప్రేమ ఉన్నందున శ్రమ, శ్రమగా అనిపించదు. స్నేహము ఉన్నప్పుడు సహించడం, సహించడముగా అనిపించదు. అందుకే మళ్లీ బాబా బాబా అంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ జన్మలోని శారీరిక సంస్కారాలు, పురుషత్వ సంస్కారాలుగా ఉన్నా అనగా హద్దులోని రచయితను అనే భావనతో ఉన్నా స్వయాన్ని బాగా పరివర్తన చేసుకున్నారు. రచయిత అయిన తండ్రిని ముందుంచుకున్న కారణంగా నిరహంకారతను, నమ్రతా భావమును ధారణ చేయాలనే లక్ష్యమును, లక్షణాలను బాగా ధారణ చేశారు, ఇంకా చేస్తున్నారు. ప్రపంచ వాతావరణము సంపర్కములోకి వస్తున్నా స్మృతి చేయాలనే లగ్నమనే ఛత్రఛాయ ఉన్న కారణంగా సురక్షితంగా ఉండే ప్రమాణాన్ని మంచిగా చూపుతున్నారు. పాండవుల విషయాలను విన్నారా! ఈ రోజు బాప్‌దాదా ప్రియునికి బదులు పాండవుల గుణాలకు ప్రేయసిగా అయిపోయారు. అందుకే చూస్తూ చూస్తూ హర్షితమవుతున్నారు. ఇరువురికీ పిల్లల పై విశేషమైన స్నేహమైతే ఉంది కదా! కావున ఈ రోజు అమృతవేళ నుండి పిల్లల విశేషతల గుణాల మాలను స్మరణ చేశారు. మీరందరు 63 జన్మలలో మాలను స్మరణ చేశారు, తండ్రి ప్రతిఫలంగా ఇప్పుడు మీ గుణమాలను స్మరిస్తూ బదులు ఇస్తున్నారు.
అచ్ఛా! శక్తుల ఏ మాలను స్మరించారు? శక్తి సేనలోని అన్నిటికంటే పెద్ద విశేషత ఏమంటే స్నేహము కొరకు అన్ని వేళలా ఒక తండ్రి ప్రేమలో లీనమై ఉండి, సర్వ సంబంధాల అనుభవాలలో మంచి లగ్నములో ముందుకు వెళ్తున్నారు. ఒక కంటిలో తండ్రి, రెండవ కంటిలో సేవ. రెండు నయనాలలో సదా ఇవే ఇమిడి ఉన్నాయి. తమ నిర్లక్ష్యాన్ని, నాజూకుతనమును త్యాగం చేయడం విశేష పరివర్తన. ధైర్యవంతులైన శక్తి స్వరూపులుగా అయ్యారు. బాప్‌దాదా ఈ రోజు విశేషంగా చిన్న వయసు కలిగిన శక్తులను చూస్తున్నారు. ఈ యువావస్థలో అనేక రకాల అల్పకాలిక ఆకర్షణలను వదిలి ఒక్క తండ్రి ఆకర్షణలో మంచి ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు వెళ్తున్నారు. ప్రపంచాన్ని నిస్సార ప్రపంచంగా అనుభవం చేసి తండ్రినే ప్రపంచంగా చేసుకున్నారు. తమ తనువు, మనసు, ధనములను తండ్రి మరియు సేవలో వినియోగించడం ద్వారా ప్రాప్తిని అనుభవం చేస్తూ ఎగిరేకళలో ముందుకు వెళ్తున్నారు. సేవ చేయాలనే బాధ్యతా కిరీటము మంచి రీతిగా ధారణ చేశారు. అప్పుడప్పుడు అలసటను అనుభవం చేస్తూ, అప్పుడప్పుడు బుద్ధి పై భారమును అనుభవం చేస్తున్నా తండ్రిని అనుసరించాల్సిందే, తండ్రిని ప్రత్యక్షము చేయాల్సిందే అన్న దృఢత్వంతో ఈ విషయాలన్నీ సమాప్తం చేసి సఫలతను పొందుతున్నారు. అందువలన బాప్‌దాదా పిల్లల ప్రేమను చూసి ''పిల్లలు ధైర్యము చేస్తే, తండ్రి సహాయం చేస్తారు'' అన్న వరదానమును పదే పదే ఇస్తున్నారు. సఫలత మీ జన్మ సిద్ధ అధికారంగా ఉండనే ఉంది. తండ్రి తోడు ఉండడం ద్వారా ప్రతి పరిస్థితిని వెన్న నుండి వెంట్రుక తీసినంత సులభంగా దాటేస్తారు. సఫలత పిల్లల మెడలోని హారము వంటిది. సఫలత మాల పిల్లలైన మిమ్ములను స్వాగతం చేస్తుంది. కనుక పిల్లల త్యాగము, తపస్సు మరియు సేవల పట్ల బాప్‌దాదా కూడా బలిహారమవుతారు. స్నేహము కారణంగా ఏ కష్టమూ అనుభవమవ్వదు. మీరు ఇలాగే ఉన్నారు కదా! ఎక్కడైతే స్నేహముందో ఆ స్నేహ ప్రపంచంలో లేక తండ్రి ప్రపంచంలో, తండ్రి భాషలో కష్టమనే పదము ఉండనే ఉండదు. కష్టమును సహజతరం చేయడమే శక్తిసేన విశేషత. అందరికన్నా ఎక్కువగా త్వరత్వరగా సందేశమును ఇచ్చేందుకు నిమిత్తులుగా అయ్యి తండ్రి ముందుకు ఆత్మిక గులాబీల పుష్ప గుచ్ఛమును తీసుకురావాలని ప్రతి ఒక్కరి హృదయంలో ఉత్సాహముంది. ఎలాగైతే బాబా మనలను తయారుచేశారో అలా మనం ఇతరులను తయారుచేసి తండ్రి ముందుకు తీసుకురావాలి. శక్తి సైన్యము పరస్పరము సహయోగము ద్వారా సంఘటిత రూపంలో భారతదేశము కంటే ఏదైనా విశేష నవీనతను విదేశంలో చూపించే శుభ ఉత్సాహంలో ఉన్నారు. ఎక్కడైతే సంకల్పము ఉంటుందో అక్కడ సఫలత తప్పకుండా ఉంటుంది. శక్తి సేనలో ప్రతి ఒక్కరు తమ తమ భిన్న భిన్న స్థానాలలో వృద్ధిని మరియు సిద్ధిని ప్రాప్తించుకోవడంలో సఫలమవుతున్నారు ఇంకా అవుతూనే ఉంటారు. కావున ఇరువురి స్నేహమును చూసి సేవ చేయాలనే ఉత్సాహమును చూసి బాప్‌దాదా హర్షిస్తున్నారు. ఒక్కొక్క పుత్రుని గుణాన్ని ఎంతగా మహిమ చేయగలరు? కానీ వతనంలో బాప్‌దాదా పిల్లల ఒక్కొక్కరి గుణాలను వర్ణన చేస్తున్నారు. దేశంలోని వారు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎంతోమంది ఉండిపోతారు. కానీ విదేశం వారు గుర్తించి అధికారులుగా అయిపోయారు. వారు చూస్తూ ఉండిపోతారు, మీరు బాబాతో ఇంటికి వెళ్లిపోతారు. వారు ఆర్తనాదాలు చేస్తారు, మీరు వరదానాల దృష్టి ద్వారా ఎంతో కొంత అంచలిని ఇస్తూ ఉంటారు సహాయము చేస్తూ ఉంటారు.
కనుక ఈ రోజు విశేషంగా బాప్‌దాదా ఏం చేశారో మీరు విన్నారా? మొత్తం సంఘటనంతా చూసి బాప్‌దాదా భాగ్యశాలి పిల్లల భాగ్యాన్ని తయారుచేసే మహిమను గానం చేస్తున్నారు. దూరంగా ఉన్నవారు సమీపంగా అయిపోయారు, సమీపంగా ఆబూలో ఉండేవారు ఎంత దూరమైపోయారు! వారు సమీపంగా ఉంటున్నా దూరంగా ఉన్నారు కానీ మీరు దూరంగా ఉంటున్నా సమీపంగా ఉన్నారు. వారు చూసేవారు, మీరు సదా హృదయ సింహాసనము పై కూర్చునేవారు. ఎంతో స్నేహంతో మధువనం వచ్చేందుకు సాధనాలను తయారుచేసుకుంటారు. ప్రతి నెల బాబాను కలుసుకోవాలి, వెళ్లాలి, జమ చేసుకోవాలి అన్న పాటనే గానం చేస్తూ ఉంటారు. కావున ఈ లగ్నము కూడా మాయాజీతులుగా అయ్యేందుకు సాధనంగా అయిపోతుంది. సహజంగా టికెట్‌ లభించినట్లయితే లగ్నములో విఘ్నాలు ఎక్కువగా కలుగుతాయి. కానీ ఒక్కొక్క చుక్కతో సరోవరంగా చేస్తారు. కనుక బిందువు బిందువును జమ చేయడంలో బాబా స్మృతి ఇమిడి ఉంటుంది. కావున డ్రామాలో ఏదైతే జరుగుతుందో అది కూడా కళ్యాణకారియే. ఎక్కువ ధనం లభించినట్లయితే మాయ వచ్చేస్తుంది, సేవను మర్చిపోతారు. కావున ధనవంతులు బాబాకు అధికారి పిల్లలుగా అవ్వరు.
సంపాదించారు, జమ చేసుకున్నారు. తమ సత్యమైన సంపాదనను జమ చేసుకోవడంలోనే శక్తి ఉంది. సత్యంగా సంపాదించిన ధనం బాబా కార్యంలో సఫలమవుతోంది. ధనము దానంతట అదే వచ్చేస్తే తనువును ఉపయోగించడం జరగదు. తనువును ఉపయోగించకపోతే మనసు కూడా పైకి క్రిందికి అవుతుంది. అందుకే తనువు, మనసు, ధనము మూడూ వినియోగించబడ్తున్నాయి. కావున సంగమ యుగంలో సంపాదించి ఈశ్వరీయ బ్యాంకులో జమ చేసుకుంటారు. ఇటువంటి జీవితమే నంబర్‌వన్‌ జీవితము. సంపాదించి లౌకిక వినాశి బ్యాంకులలో జమ చేసినట్లయితే సఫలమవ్వదు. సంపాదించారు మరియు అవినాశి బ్యాంకులో జమ చేసినట్లయితే ఒకటికి పదమాల రెట్లు తయారవుతుంది. 21 జన్మల కొరకు జమ అవుతుంది. హృదయపూర్వకంగా చేసింది హృదయాభిరాముని వద్దకు చేరుకుంటుంది. ఒకవేళ ఎవరైనా చూపించుకునేందుకు చేసినట్లయితే ఆ చూపించుకోవడంలోనే సమాప్తమైపోతుంది, హృదయాభిరాముని వద్దకు చేరదు. కావున హృదయపూర్వకంగా చేసే మీరే మంచివారు. హృదయపూర్వకంగా రెండు రూపాయలు చేసేవారైనా పదమా పదమ్‌పతులుగా అవుతారు. ప్రదర్శించడం కోసం వేలు చేసేవారు పదమా పదమ్‌ పతులుగా అవ్వరు. హృదయపూర్వకమైన సంపాదన, స్నేహముతో కూడిన సంపాదనయే సత్యమైన సంపాదన. ఎందుకోసం సంపాదిస్తున్నారు? సేవ కొరకు. మీ విశ్రాంతి కోసం కాదు కదా! కావున ఇదే సత్యమైన, హృదయపూర్వకమైన సంపాదన. ఒకటి కూడా పదమారెట్లుగా అయిపోతుంది. ఒకవేళ మీ విశ్రాంతి కొరకు సంపాదించినా లేక జమ చేసుకున్నా, భలే ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు కానీ అక్కడ ఇతరుకు విశ్రాంతినిచ్చేందుకు నిమిత్తులుగా అవుతారు. దాస-దాసీలు ఏం చేస్తారు? రాయల్‌ ఫ్యామిలీకి (రాజకుటుంబానికి) విశ్రాంతినిచ్చేందుకే ఉంటారు కదా? ఇక్కడ విశ్రాంతి ద్వారా అక్కడ విశ్రాంతినిచ్చేందుకు నిమిత్తులుగా అవ్వవలసి ఉంటుంది. అందువలన ఎవరైతే ప్రేమతో, సత్యమైన హృదయంతో సంపాదించి, సేవలో వినియోగిస్తారో వారే సఫలం చేసుకుంటున్నారు, అనేక ఆత్మల ఆశీర్వాదాలను తీసుకుంటున్నారు. ఎవరి కొరకైతే నిమిత్తులుగా అవుతారో వారే మీ భక్తులుగా అయ్యి మిమ్ములను పూజిస్తారు. ఎందుకంటే మీరు ఆ ఆత్మల కోసం సేవ చేశారు. కనుక సేవకు ప్రతిఫలంగా వారు మీ జడచిత్రాలకు సేవ చేస్తారు. పూజ చేస్తారు. సేవకు ప్రతిఫలాన్ని 63 జన్మల వరకు ఇస్తూ ఉంటారు. తండ్రి నుండైతే లభిస్తుంది కానీ ఆ ఆత్మల ద్వారా కూడా లభిస్తుంది. ఎవరికైతే సందేశమునిస్తారో, ఎవరైతే అధికారులుగా అవ్వరో, వారు మళ్లీ ఈ రూపము ద్వారా రిటర్ను ఇస్తారు. ఎవరైతే అధికారులుగా అవుతారో వారు మీ సంబంధంలోకి వచ్చేస్తారు. కొందరు సంబంధంలోకి వస్తారు, కొందరు భక్తులుగా అవుతారు, కొందరు ప్రజలుగా అవుతారు. రకరకాల ఫలితము వెలువడ్తుంది. అర్థమయిందా! మీరు సేవ వెనుక ఎందుకు పడ్తున్నారు? తినండి, తాగండి, ఆనందించండి, మీకేం లభిస్తుందని రాత్రింబవళ్లు ఈ సేవ వెనుక పడ్తున్నారని కొంతమంది జనులు అడుగుతారు కదా! మీరేమంటారు? మీకేదైతే లభించిందో దానిని అనుభవం చేసి చూడండి. అనుభవజ్ఞులకే ఈ సుఖము ఎలాంటిదో తెలుస్తుంది అనే పాటను గానం చేస్తారు కదా! అచ్ఛా!
సదా స్నేహములో ఇమిడి ఉంటూ, సదా త్యాగమునే భాగ్యంగా అనుభవము చేసుకునేవారికి, సదా ఒకటిని పదమారెట్లుగా చేసుకునేవారికి, సదా బాప్‌దాదాను అనుసరించేవారికి, తండిన్రే పప్రంచంగా అనుభవం చేసుకునే హృదయ సింహాసనాధికారులైన పిల్లలకు మనోభిరాముడైన తండి పియ్రస్మృతులు మరియు నమస్తే.
విదేశీ సోదరులతో వ్యక్తిగత మిలనము - 1. స్వయాన్ని భాగ్యవంతులైన ఆత్మలుగా భావిస్తున్నారా? భాగ్యవిధాత స్థానము వరకు చేరుకునేంతటి భాగ్యమునైతే తయారు చేసుకున్నారు. ఇది ఎటువంటి స్థానమో అర్థమయిందా! శాంతి స్థానము వరకు చేరుకోవడం కూడా భాగ్యమే. కావున ఇది కూడా భాగ్యమును పొందేందుకు మార్గము తెరుచుకుంది. డ్రామా అనుసారంగా భాగ్యమును పొందే స్థానము వరకు వచ్చి చేరుకున్నారు. భాగ్యరేఖ ఇక్కడే గీయబడ్తుంది కనుక మీరు మీ శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకున్నారు. ఇప్పుడు కేవలం ఇంకొద్దిగా సమయము కేటాయించాలి. సమయము కూడా ఉంది మరియు సాంగత్యము కూడా చేయగలరు. ఇంకే కష్టమూ లేదు. ఏదైతే కష్టంగా ఉంటుందో దానిని గూర్చి కాస్త ఆలోచించబడ్తుంది. సహజంగా ఉంటే చేయండి. దీని ద్వారా జీవితములో అల్పకాలికమైన ఆశలు, కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవినాశి ప్రాప్తిలో పూర్తయిపోతాయి. ఈ అల్పకాలిక కోరికల వెనుక పడడం తమ నీడ వెనుక పరిగెత్తడం వంటిది. ఎంతగా నీడ వెనుక పరిగెడుతుంటారో అది అంతగా ముందుకు వెళ్తూ ఉంటుంది. దానిని మీరు పొందలేరు. కానీ మీరు ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే ఆ నీడ మీ వెనుకే వస్తుంది. కావున ఇటువంటి అవినాశి ప్రాప్తి వైపుకు వెళ్లే వారికి ఈ వినాశి విషయాలన్నీ పూర్తయిపోతాయి. అర్థమయిందా! సర్వ ప్రాప్తులకు సాధనము ఇదే. కొద్దికాలపు త్యాగము సదాకాలికమైన భాగ్యమును తయారు చేస్తుంది. కావున సదా ఇదే లక్ష్యమును అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. దీని ద్వారా ఎంతో సంతోషము యొక్క ఖజానా లభిస్తుంది. జీవితంలో అన్నిటికంటే పెద్ద ఖజానా సంతోషమే. సంతోషము లేకపోతే జీవితము లేదు. కావున అవినాశి సంతోషమనే ఖజానాను పొందగలరు.
2. బాప్‌దాదా, సదా ముందుకు వెళ్లాలనే ఉల్లాస ఉత్సాహాలను పిల్లలలో చూస్తారు. పిల్లలలోని ఉత్సాహము బాప్‌దాదా వద్దకు చేరుతుంది. విశ్వంలోని వి.వి.ఐ.పి.లను తండ్రి ముందుకు తీసుకెళ్ళాలని పిల్లలలో ఉంది. ఈ ఉత్సాహము కూడా సాకార రూపములోకి వస్తుంది. ఎందుకంటే నిస్వార్థ సేవకు ఫలము తప్పకుండా లభిస్తుంది. సేవయే స్వ స్థితిని తయారు చేస్తుంది. కావున ఇంత సేవ ఉంది, నా స్థితి అయితే అలా లేదని ఎప్పుడూ అనుకోకండి. సేవ మీ స్థితిని తయారు చేస్తుంది. ఇతరుల సేవయే స్వ ఉన్నతికి సాధనము. సేవ దానంతటదే శక్తిశాలి స్థితిని తయారు చేస్తూ ఉంటుంది. తండ్రి సహాయము లభిస్తూ ఉంటుంది కదా! తండ్రి సహాయము లభిస్తూ లభిస్తూ ఆ శక్తి పెరుగుతూ పెరుగుతూ ఆ స్థితి కూడా వచ్చేస్తుంది. అర్థమయిందా! కనుక ఇంత సేవ నేనెలా చేయను, నా స్థితి అలా లేదని భావించకండి. చేస్తూ ముందుకు వెళ్లండి. వెళ్లవలసిందేనని బాప్‌దాదా వరదానముంది. మధురమైన సేవా బంధనము కూడా ముందుకు వెళ్లేందుకు సాధనమే. ఎవరైతే హృదయపూర్వకంగా మరియు అనుభవం అథారిటీతో మాటాడ్తారో వారి శబ్ధము హృదయము వరకు చేరుకుంటుంది. అనుభవపూర్వకమైన అథారిటి మాటలు ఇతరులకు అనుభవం చేయాలనే ప్రేరణనిస్తుంది. సేవలో ముందుకు వెళ్తూ వెళ్తూ ఏ పరీక్షలైతే వస్తాయో అవి కూడా ముందుకు తీసుకెళ్లేందుకు సాధనాలే, ఎందుకంటే బుద్ధి పని చేస్తుంది, స్మృతిలో ఉండాలనే విశేషమైన అటెన్షన్‌ ఉంటుంది, కావున ఇది కూడా విశేషమైన లిఫ్ట్‌గా అవుతుంది. మేము వాతావరణాన్ని ఎలా శక్తిశాలిగా చేయాలని బుద్ధిలో సదా ఉంటుంది. విఘ్నము ఎంత పెద్ద రూపము ధరించి వచ్చినా శ్రేష్ఠ ఆత్మలైన మీకు అందులో లాభమే ఉంటుంది. ఆ పెద్ద రూపము కూడా స్మృతి శక్తి ద్వారా చిన్నగా అయిపోతుంది. అది కాగితపు పులి వంటిది. మంచిది.

వరదానము :- '' దీపావళి నాడు యథార్థ విధి ద్వారా తమ దైవీ పదవిని ఆహ్వానించే పూజ్య ఆత్మా భవ ''
పూర్వము దీపావళి రోజున జనులు విధి పూర్వకంగా దీపాలను వెలిగించేవారు, దీపము ఆరిపోకుండా ఉండాలనే ధ్యాస ఉంచుకునేవారు, నేయి వేస్తూ ఉండేవారు, విధి పూర్వకంగా ఆహ్వానించే అభ్యాసములో ఉండేవారు. ఇప్పుడైతే దీపాలకు బదులుగా బల్బులను వెలిగిస్తున్నారు. దీపావళిని జరుపుకోవడం లేదు. ఇప్పుడైతే మనోరంజనమైపోయింది. ఆహ్వానము చేసే విధి లేక సాధన సమాప్తమైపోయింది. స్నేహము సమాప్తమై కేవలం స్వార్థం మిగిలిపోయింది. అందుచేత యథార్థమైన దాతా రూపధారి లక్ష్మి ఎవరి వద్దకూ రావడం లేదు. మీరందరూ యథార్థ విధి ద్వారా తమ దైవీ పదవిని ఆహ్వానిస్తారు, అందుచేత పూజ్య దేవీ దేవతలుగా అవుతారు

స్లోగన్‌ :- ''అనంతమైన వృత్తి, దృష్టి మరియు స్థితి సదా ఉన్నప్పుడే విశ్వ కళళ్యాణ కార్యము సంపన్నమవుతుంది.''