Wednesday, 29 January 2020

Telugu Murli 30/01/2020

30-01-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - తండ్రి మీకు జ్ఞాన-యోగాల పౌష్ఠికాహారాన్ని తినిపించి గొప్ప అతిథి సత్కారము చేస్తున్నారు, కనుక సదా ప్రసన్నంగా ఉండండి, శ్రీమతం అనుసారంగా అందరికీ అతిథి సత్కారాన్ని చేస్తూ ఉండండి ''

ప్రశ్న :- ఈ సంగమ యుగములో మీ వద్ద ఉన్న అతివిలువైన, జాగ్రత్తగా సంభాళించాల్సిన వస్తువు ఏది?
జవాబు :- ఈ సర్వోత్తమ బ్రాహ్మణ కులములో మీ జీవితము చాలా విలువైనది, కనుక శరీరాన్ని తప్పకుండా సంభాళించాలి. 'ఇది మట్టి బొమ్మ, ఎప్పటికైనా సమాప్తమైపోయేదే' అని అనుకోకండి. దీనిని జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఏదైనా జబ్బు వస్తే దీనితో విసిగిపోరాదు. నీవు శివబాబా స్మృతిలో ఉండు అని వారికి చెప్పండి. ఎంతగా స్మృతి చేస్తే అంతగా పాపం తగ్గిపోతూ ఉంటుంది. వారికి సేవ చేయాలి, జీవించి ఉండాలి, శివబాబాను స్మృతి చేస్తూ ఉండాలి.

ఓంశాంతి. జ్ఞాన మూడవ నేత్రాన్ని ఇచ్చే ఆత్మిక తండ్రి కూర్చొని పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. మూడవ నేత్రాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞాన మూడవ నేత్రము లభించింది. ఇప్పుడు ఈ పాత ప్రపంచము పరివర్తనవుతుందని పిల్లలైన మీకు తెలుసు. ఎవరు మారుస్తారో, ఎలా మారుస్తారో, పాపం! మనుష్యులకు తెలియదు. ఎందుకంటే వారికి మూడవ నేత్రమే లేదు. ఇప్పుడు పిల్లలైన మీకు మూడవ నేత్రం లభించింది. దానితో మీరు సృష్టి ఆది-మధ్య-అంత్యముల జ్ఞానం తెలుసుకున్నారు. ఇది జ్ఞాన శా్యకిన్‌(అతిమధురం). శాక్రిన్‌ ఒక్క బిందువైనా ఎంత మధురంగా ఉంటుంది. జ్ఞానంలో ఒకే పదముంది - 'మన్మనాభవ.' ఈ ఒక్క అక్షరమే ఎంత మధురమైనది! స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. తండ్రి శాంతిధామము, సుఖధామాలకు దారి తెలుపుతున్నారు. పిల్లలకు స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. కనుక పిల్లలకు ఎంత సంతోషముండాలి. ఖుషీ వంటి పౌష్ఠికాహారము(ఖురాక్‌) లేదని అంటారు కదా! సదా ఖుషీగా, ఆనందంగా ఉండేవారికి ఇది పౌష్ఠికాహారం వంటిదే. 21 జన్మలు ఆనందంగా ఉండేందుకు ఇది జబరదస్త్‌(శక్తివంతమైన) ఖురాక్‌. ఈ ఖురాక్‌ను సదా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉండండి. ఇది ఒకరికొకరు చేసే జబరదస్త్‌ అతిథి సత్కారం. ఇటువంటి అతిథి మర్యాద ఏ ఇతర మనుష్యులు మనుష్యులకు చేయలేరు.
పిల్లలైన మీరు శ్రీమతానుసారం అందరికీ ఆత్మిక అతిధి సత్కారం చేస్తారు. ఎవరికైనా తండ్రి పరిచయమివ్వడమే సత్యమైన ఖుష్‌ ఖైరాఫత్‌(శ్రేష్ఠమైన దానము లేక పుణ్యము) కూడా. అనంతమైన తండ్రి ద్వారా జీవన్ముక్తి బహుమతిగా లభిస్తుందని మధురమైన పిల్లలకు తెలుసు. సత్యయుగములో భారతదేశము జీవన్ముక్త స్థితిలో పావనంగా ఉండేది. తండ్రి చాలా శ్రేష్ఠమైన ఖురాక్‌ను ఇస్తారు. అందుకే అతీంద్రియ సుఖము గురించి అడగాలంటే గోప-గోపికలను అడగండి అని మహిమ ఉంది. ఈ జ్ఞాన-యోగాలు చాలా ఫస్ట్‌క్లాస్‌ వండర్‌ఫుల్‌ ఖురాక్‌(ఔషధము). ఇది ఒక్క ఆత్మిక సర్జన్‌ వద్ద మాత్రమే ఉంటుంది. ఇంకెవ్వరికీ ఈ ఖురాక్‌ గురించి తెలియదు. తండ్రి అంటారు - మధురమైన పిల్లలూ! మీ కొరకు అరచేతిలో బహుమతిని తీసుకొచ్చాను. ఈ ముక్తి-జీవన్ముక్తుల బహుమతి నా వద్ద మాత్రమే ఉంటుంది. కల్ప-కల్పమూ నేనే వచ్చి మీకు ఈ కానుకను ఇస్తాను. మళ్లీ రావణుడు దానిని లాక్కుంటాడు. కనుక ఇప్పుడు పిల్లలైన మీకు ఖుషీ ఎంత అపారమైన సంతోషముండాలి. మన తండ్రి, టీచరు, సత్య-సత్యమైన సద్గురువని వారు మనలను వెంట తీసుకువెళ్తారని మీకు తెలుసు. అతిప్రియమైన తండ్రి నుండి విశ్వ రాజ్యము లభిస్తుంది. ఇదేమైనా చిన్న విషయమా? పిల్లలు సదా హర్షితంగా ఉండాలి. గాడ్లీ స్టూడెంట్‌ లైఫ్‌ ఈజ్‌ ద బెస్ట్‌(ఈశ్వరీయ విద్యార్థి జీవితం ఉత్తమోత్తమమైనది). ఇది ఇప్పటి మహిమనే కదా! తర్వాత మళ్లీ నూతన ప్రపంచంలో మీరు సదా సంతోషాలు జరుపుకుంటూ ఉంటారు. సత్య సత్యమైన సంతోషాలు ఎప్పుడు జరుపుకుంటారో ప్రపంచానికి తెలియదు. మనుష్యులకైతే సత్యయుగ జ్ఞానమే లేదు కనుక ఇక్కడే జరుపుకుంటూ ఉంటారు. కానీ ఈ పాత తమోప్రధాన ప్రపంచంలో సంతోషము ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడైతే త్రాహి-త్రాహి (అయ్యో, అయ్యో) అంటూ ఉంటారు. ఇది ఎంత దుఃఖ ప్రపంచము!
పిల్లలైన మీకు తండ్రి ఎంత సహజమైన మార్గం తెలుపుతారు! గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా ఉండండి. వృత్తి-వ్యాపారాలు చేసుకుంటూ కూడా నన్ను స్మృతి చేస్తూ ఉండండి. ఉదాహరణానికి ప్రేయసీ-ప్రియులు ఒకరినొకరు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అతను ఆమెకు ప్రియుడు, ఆమె అతనికి ప్రేయసి. ఇక్కడ ఈ విషయం కాదు. ఇక్కడైతే మీరందరూ ఒకే ప్రియునికి జన్మ-జన్మలుగా ప్రేయసులుగా ఉన్నారు. తండ్రి మీకెప్పుడూ ప్రేయసిగా అవ్వరు. మీరు ఆ ప్రియుడు వచ్చేందుకు స్మృతి చేస్తూ వచ్చారు. దుఃఖం ఎక్కువైనప్పుడు ఎక్కువగా స్మరణ చేస్తారు. అందుకే దుఃఖంలో అందరూ స్మరణ చేస్తారు, సుఖంలో ఎవ్వరూ చేయరు అనే గాయనం కూడా ఉంది. ఈ సమయంలో సర్వశక్తివంతుడైన తండ్రి వలె రోజురోజుకు మాయ కూడా సర్వశక్తివంతంగా, తమోప్రధానంగా అవుతూ పోతుంది. అందుకే ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - మధురమైన పిల్లలూ! దేహీ-అభిమానులుగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. దీనితో పాటు దైవీగుణాలు కూడా ధారణ చేస్తే మీరు ఇలా(లక్ష్మీ నారాయణులుగా) అవుతారు. ఈ చదువులో ముఖ్యమైన విషయం స్మృతి. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రిని చాలా ప్రేమతో, చాలా స్నేహంతో స్మృతి చెయ్యాలి. ఆ ఉన్నతాతిఉన్నతమైన తండ్రే నూతన ప్రపంచ స్థాపన చేస్తారు. తండ్రి చెప్తున్నారు - పిల్లలైన మిమ్ములను విశ్వానికి అధిపతులుగా చేసేందుకే నేను వచ్చాను; కనుక ఇప్పుడు నన్ను స్మృతి చేస్తే మీ అనేక జన్మల పాపాలు నశిస్తాయి. పతితపావనుడైన తండ్రి చెప్తున్నారు - మీరు చాలా పతితమైపోయారు. కనుక ఇపుడు నన్ను స్మృతి చేస్తే మీరు పావనమై పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. పతితపావనుడైన తండ్రినే పిలుస్తారు కదా! ఇప్పుడు తండ్రి వచ్చారు కనుక తప్పకుండా పావనంగా అవ్వాల్సి వస్తుంది. తండ్రి దుఃఖహర్త-సుఖకర్త. సత్యయుగంలో ఖచ్చితంగా పావన ప్రపంచము ఉండేది, కనుక అందరూ సుఖంగానే ఉండేవారు. ఇప్పుడు తండ్రి మళ్లీ చెప్తున్నారు - పిల్లలూ! శాంతిధామము, సుఖధామాలను గుర్తు చేసుకుంటూ ఉండండి. ఇది సంగమ యుగము. నావికుడు మిమ్ములను ఈ తీరం నుండి ఆ తీరానికి తీసుకెళ్తారు. ఒక్కటే నావ కాదు; ప్రపంచం మొత్తం ఒక పెద్ద ఓడ వలె ఉంది. దీనిని ఆవలికి తీసుకెళ్తారు.
మధురమైన పిల్లలూ, మీకు ఎంత సంతోషముండాలి! మీకైతే సదా సంతోషమే సంతోషము. అనంతమైన తండ్రి మమ్ములను చదివిస్తున్నారు, వాహ్‌! ఈ మాటలు ఎపుడూ వినలేదు, చదవలేదు. భగవానువాచ - నేను ఆత్మిక పిల్లలైన మీకు రాజయోగం నేర్పిస్తున్నాను. కనుక పూర్తిగా నేర్చుకోవాలి, ధారణ చేయాలి, పూర్తిగా చదువుకోవాలి. చదువులో సదా నెంబరువారుగానే ఉంటారు. నేను ఉత్తమమా, మధ్యమమా లేక కనిష్టంగా ఉన్నానా? నేను ఉన్నతపదవిని పొందే యోగ్యత కలిగి ఉన్నానా? ఆత్మిక సేవ చేస్తున్నానా? అని స్వయాన్ని చూసుకోవాలి. ఎందుకంటే తండ్రి అంటారు - పిల్లలూ! సేవాయోగ్యులుగా అవ్వండి. నన్ను ఫాలో చేయండి. నేను సేవ చేసేందుకే వచ్చాను. రోజూ సేవ చేసేందుకు ఈ రథాన్ని తీసుకున్నాను. ఈ రథానికి జబ్బు చేస్తే నేను ఇతనిలో కూర్చొని మురళి వ్రాస్తాను. నోటి ద్వారా మాట్లాడలేకపోతే పిల్లలకు మురళి మిస్‌ అవ్వరాదని నేనే కూర్చొని వ్రాస్తాను. కనుక నేను కూడా సేవలో ఉన్నాను కదా. ఇది ఆత్మిక సేవ. మరి పిల్లలు కూడా తండ్రి సేవలో లగ్నమవ్వండి. ఆన్‌ గాడ్‌్‌ఫాదర్లీ సర్వీస్‌. మంచి సేవ చేసేవారిని, మంచి పురుషార్థం చేసేవారిని మహావీరులని అంటారు. బాబా ఆదేశానుసారంగా నడిచి ఎవరు మహావీరులుగా అవుతారో చూడాలి. స్వయాన్ని ఆత్మగా భావించి అందరినీ భాయి-భాయిగా(సోదరులుగా) చూడండి అని తండ్రి ఆదేశిస్తున్నారు. ఈ శరీరాన్ని మర్చిపోండి. బాబా కూడా శరీరాన్ని చూడరు. తండ్రి అంటారు - నేను ఆత్మలను చూస్తాను అయితే ఇది జ్ఞానం కనుక ఆత్మ శరీరము లేకుండా మాట్లాడలేదు. నేను కూడా లోను(అప్పు) తీసుకున్న ఈ శరీరములోకి వచ్చాను. శరీరముతోనే ఆత్మ చదువుకోగలదు. బాబా ఆసనం ఈ భృకుటిలో ఉంది. ఇది అకాల సింహాసనము(అకాల్‌ తక్త్‌). ఆత్మ అకాలమూర్తి. ఆత్మ ఎప్పుడూ చిన్నదిగా, పెద్దదిగా అవ్వదు. శరీరం చిన్నదిగా, పెద్దదిగా అవుతుంది. ఆత్మలందరికీ వారి భృకుటియే ఆసనం. శరీరాలు రకరకాలుగా ఉంటాయి. కొందరి అకాల్‌ తక్త్‌ పురుషులది, కొందరిది స్త్రీలది, కొందరిది చిన్న పిల్లలది. తండ్రి కూర్చొని పిల్లలకు ఆత్మిక డ్రిల్‌ నేర్పిస్తారు. ఎవరితోనైనా మాట్లాడునప్పుడు, మొదట స్వయాన్ని ఆత్మగా భావించండి. నేను ఆత్మను, ఫలానా సోదరునితో మాట్లాడుతున్నాను. శివబాబాను స్మృతి చేయండి అని తండ్రి సందేశమును ఇస్తాము. స్మృతి ద్వారానే ఆత్మలోని మలినం తొలగాలి. బంగారులో కల్తీ కలిసినప్పుడు బంగారు విలువ తగ్గిపోతుంది. ఆత్మలైన మీలో కూడా మలినం ఏర్పడినందున మీరు విలువ లేకుండా అయిపోయారు. ఇప్పుడు మళ్లీ పావనంగా అవ్వాలి. ఆత్మలైన మీకు ఇప్పుడు జ్ఞాన మూడవ నేత్రం లభించింది. ఈ మూడవ నేత్రంతోనే మీ సోదరులను చూడండి. సోదరులను చూస్తున్నప్పుడు కర్మేంద్రియాలు చంచలం అవ్వవు. రాజ్యభాగ్యం తీసుకోవాలి. విశ్వానికి యజమానిగా అవ్వాలంటే ఈ శ్రమ చేయండి. అందరినీ సోదరులుగా భావించి జ్ఞానం ఇస్తే ఈ అలవాటు పక్కా అయిపోతుంది. మీరందరూ సత్యమైన సోదరులు. తండ్రి కూడా పై నుండే వచ్చారు. మీరు కూడా పై నుండే వచ్చారు. తండ్రి, పిల్లలతో కలిసి సేవ చేస్తున్నారు. సేవ చేసేందుకు తండ్రి ధైర్యాన్నిస్తారు. ధైర్యం పిల్లలది, సహాయం తండ్రిది. కనుక ఇది ప్రాక్టీస్‌ చేయండి. ''నేను ఆత్మను, నా సోదరుని చదివిస్తున్నాను.'' ఆత్మ చదువుతుంది కదా! ఆత్మిక తండ్రి నుండే లభించే ఈ చదువును స్పిరిచువల్‌ నాలెడ్జ్‌(ఆత్మిక జ్ఞానం) అని అంటారు. స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి సంగమ యుగములోనే వచ్చి ఈ జ్ఞానమునిస్తారు. మీరు నగ్నంగా(శరీరము లేకుండా) వచ్చి ఇక్కడ శరీరాన్ని ధారణ చేసి 84 జన్మల పాత్రను అభినయించారు. ఇప్పుడు మళ్లీ వాపస్‌ ఇంటికి వెళ్లాలి కనుక స్వయాన్ని ఆత్మగా భావించి అందరినీ భాయి-భాయి దృష్టితో చూడాలి. ఈ శ్రమ చేయాలి. మీ కొరకు మీరు శ్రమ చేయాలి. వేరే విషయాలలోకి మనమెందుకు వెళ్లాలి. చారిటీ బిగిన్స్‌ ఎట్‌ హోమ్‌ అనగా మొదట స్వయాన్ని ఆత్మగా భావించి తర్వాత సోదరులకు అర్థం చేయించండి. అప్పుడు బాణం బాగా తగులుతుంది. ఈ పదును ఉండాలి. శ్రమ చేస్తేనే ఉన్నత పదవి పొందగలరు. ఇందులో కొంత సహించాల్సి ఉంటుంది కూడా. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడ్తే, మీరు మాట్లాడకుండా మౌనంగా ఉండండి. మీరు మాట్లాడకుంటే వారేం చేస్తారు? చప్పట్లు రెండు చేతులతోనే మ్రోగుతాయి. ఒకరు నోటితో తాళం మ్రోగిస్తే రెండవ వారు మాట్లాడకుండా ఉంటే, వారు తమంతట తామే మౌనంగా ఉండిపోతారు. తాళంతో తాళం మ్రోగిస్తే ధ్వని వెలువడ్తుంది. పిల్లలు ఒకరికొకరు కళ్యాణం(మంచి) చేసుకోవాలి. పిల్లలు సదా సంతోషంగా ఉండాలంటే తండ్రి మన్మనాభవ అని చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఆత్మల వైపు చూడండి. కనుక పిల్లలు ఆత్మిక యాత్రలో ఉండే అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ మీకే లాభించే విషయాలు. తండ్రి ఇచ్చే శిక్షణలు సోదరులకు ఇవ్వాలి. తండ్రి చెప్తున్నారు - నేను ఆత్మలైన మీకు జ్ఞానమునిస్తున్నాను. నేను ఆత్మనే చూస్తాను. మనుష్యులు మనుష్యులతో మాట్లాడాలంటే వారి ముఖమును చూస్తారు కదా! మీరు ఆత్మలతో మాట్లాడాలంటే ఆత్మలనే చూడాలి కదా! భలే శరీరము ద్వారా జ్ఞానమునిస్తారు కానీ ఇందులో దేహ భావమును తుంచేయాల్సి ఉంటుంది. తండ్రి అయిన పరమాత్మ మాకు జ్ఞానమునిస్తున్నారని ఆత్మలైన మీరు భావిస్తారు. తండ్రి కూడా ఆత్మలను చూస్తానని అంటారు. ఆత్మలు కూడా మేము మా తండ్రి అయిన పరమాత్మను చూస్తున్నామని, వారి నుండి జ్ఞానము తీసుకుంటున్నామని అంటారు. దీనినే స్పిరిచువల్‌ జ్ఞానాన్ని ఆత్మలతో ఆత్మలు ఇచ్చిపుచ్చుకోవడమని అంటారు. జ్ఞానము ఆత్మలోనే ఉంటుంది. ఆత్మయే జ్ఞానమునివ్వాలి. ఇది పదును వంటిది. మీ జ్ఞానములో ఈ శక్తి నిండుతుంది. అప్పుడు ఎవరికి అర్థం చేయించినా వెంటనే బాణము తగులుతుంది. తండ్రి అంటారు - ప్రాక్టీస్‌ చేసి చూడండి. బాణము తగులుతుంది కదా! ఈ కొత్త అలవాటు చేసుకుంటే దేహ భావము తొలగిపోతుంది. మాయ తుఫానులు తక్కువగా వస్తాయి, చెడు సంకల్పాలు రావు. క్రిమినల్‌(వికారి) దృష్టి కూడా ఉండదు. ఆత్మలమైన మనము 84 జన్మల చక్రంలో తిరిగాము. ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది. ఇప్పుడు తండ్రి స్మృతిలో ఉండాలి. స్మృతి ద్వారానే తమోప్రధానము నుండి సతోప్రధానంగా అయి సతోప్రధాన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఇది ఎంత సహజం! పిల్లలకు ఈ శిక్షణనివ్వడం కూడా తన పాత్ర అని తండ్రికి తెలుసు. క్రొత్త విషయమేమీ కాదు. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత నేను రావలసి ఉంటుంది. నేను బంధితుడనై ఉన్నాను. కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తాను - మధురమైన పిల్లలూ! ఆత్మికయాత్రలో ఉంటే అంతమతే సో గతి అవుతుంది. ఇది అంతకాలం కదా! నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీకు సద్గతి లభిస్తుంది. స్మృతి యాత్రతో పొందుకున్నది శక్తివంతమౌతుంది. దేహీ-అభిమానిగా అయ్యే శిక్షణ పిల్లలైన మీకు ఒక్క పర్యాయమే లభిస్తుంది. ఇది ఎంత వండర్‌ఫుల్‌ జ్ఞానము! బాబా వండర్‌ఫుల్‌ కనుక బాబా జ్ఞానము కూడా వండర్‌ఫుల్‌గా ఉంటుంది. ఎప్పుడూ ఎవ్వరూ ఇవ్వలేనిది. ఇప్పుడు వాపస్‌ వెళ్లాలి కనుక మధురమైన పిల్లలూ! మిమ్ములను ఆత్మగా భావించి ఆత్మలకు జ్ఞానం ఇవ్వడం ప్రాక్టీస్‌(అభ్యాసం) చేయండి. మూడవ నేత్రంతో సోదరులను చూడాలి. ఇదే గొప్ప శ్రమ.
ఇది మీ బ్రాహ్మణుల సర్వోత్తమ ఉన్నతాతి ఉన్నతమైన కులము. ఈ సమయములో మీ జీవితము అమూల్యమైనది కనుక ఈ శరీరాన్ని కూడా సంభాళించాలి. తమోప్రధానం అయినందున శరీర ఆయువు కూడా తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు మీరు ఎంత యోగములో ఉంటే అంత ఆయువు పెరుగుతూ ఉంటుంది. మీ ఆయువు పెరుగుతూ పెరుగుతూ సత్యయుగములో 150 సంవత్సరాలుగా అవుతుంది. అందువలన శరీరాన్ని కూడా సంభాళించాలి. 'ఇది మట్టి బొమ్మ, ఎప్పటికైనా పోయేదే' అని అనుకోరాదు. దీనిని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇది అమూల్యమైన జీవితం కదా! ఏదైనా జబ్బు చేస్తే దానితో విసిగి పోరాదు. 'శివబాబాను గుర్తు చేసుకో ' అని వారికి కూడా చెప్పండి. ఎంత స్మృతి చేస్తే అంత పాపాలు తొలగిపోతాయి. దీనితో సర్వీస్‌ చేయాలి, జీవించి ఉండాలి, శివబాబాను స్మృతి చేస్తూ ఉండాలి. మనము బాబాను స్మృతి చేయాలనే తెలివి అయితే ఉంటుంది కదా! తండ్రి నుండి వారసత్వము పొందేందుకు ఆత్మ స్మృతి చేస్తుంది. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
అవ్యక్త స్థితిని అనుభవం చేసేందుకు విశేషమైన హోంవర్క్‌
ఏ విధమైన విఘ్నమైనా బుద్ధిని సతాయిస్తూ ఉంటే యోగ ప్రయోగము ద్వారా ముందు ఆ విఘ్నాన్ని సమాప్తం చేయండి. మనసు, బుద్ధిలో కొంచెం కూడా డిస్టర్‌బెన్స్‌ ఉండరాదు. ఆత్మ, ఆత్మల విషయాలను లేక ఎవరి మనసులోని భావాలను సహజంగా తెలుసుకోగలిగినంతగా అవ్యక్త స్థితిలో స్థితమై ఉండే అభ్యాసము చేయాలి.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. నేను పురుషార్థములో ఉత్తమంగా ఉన్నానా, మధ్యమంగా ఉన్నానా, కనిష్టంగా ఉన్నానా? నాకు ఉన్నతపదవి పొందే యోగ్యత ఉందా? నేను ఆత్మిక సర్వీస్‌ చేస్తున్నానా? అని స్వయాన్ని పరిశీలించుకోండి.
2. మూడవ నేత్రంతో ఆత్మ సోదరుని చూస్తూ, సొదరునిగా భావించి అందరికీ జ్ఞానం ఇవ్వండి, ఆత్మిక స్థితిలో ఉండే అలవాటు చేసుకుంటే కర్మేంద్రియాలు చంచలమవ్వవు.

వరదానము :- '' పరీక్షలో భయపడేందుకు బదులు ఫుల్‌స్టాప్‌ పెట్టి ఫుల్‌ పాస్‌ అయ్యే సఫలతామూర్త్‌ భవ ''
ఎప్పుడైనా ఏదైనా పరీక్ష (పేపర్‌) వచ్చినప్పుడు భయపడకండి, ప్రశ్నార్థకములోకి రాకండి. ఇది ఎందుకు వచ్చింది? అని ఆలోచిస్తూ సమయాన్ని వృథా చేయకండి. ప్రశ్నార్థకాన్ని సమాప్తం చేసి ఫుల్‌స్టాప్‌ పెట్టండి. అప్పుడు క్లాసు మారిపోతుంది అనగా పేపర్లో పాస్‌ అవుతారు. ఫుల్‌స్టాప్‌ పెట్టేవారు ఫుల్‌ పాస్‌ అవుతారు. ఎందుకంటే ఫుల్‌స్టాప్‌ అంటే బిందురూప స్థితి. చూస్తున్నా చూడకండి, వింటున్నా వినకండి. తండ్రి వినిపించిన దానినే వినండి, తండ్రి ఏది ఇచ్చారో అదే చూడండి. అప్పుడు ఫుల్‌ పాస్‌ అవుతారు. పాస్‌ అయిందానికి గుర్తు - సదా ఎక్కేకళను(ఉన్నతిని) అనుభవం చేస్తూ సఫలతా నక్షత్రాలుగా అవుతారు.

స్లోగన్‌ :- '' స్వ ఉన్నతి చేసుకోవాలంటే క్వశ్చన్‌, కరెక్షన్‌, కొటేషన్‌ను త్యాగము చేసి, మీ కనెక్షన్‌ను సరిగ్గా ఉంచుకోండి. ''

Telugu Murli 29/01/2020

29-01-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - తండ్రి శ్రీమతము మీకు 21 తరాలకు సుఖమునిస్తుంది. ఇంత అతీతమైన మతాన్ని బాబా తప్ప ఎవ్వరూ ఇవ్వలేరు. మీరు శ్రీమతమును అనుసరిస్తూ ఉండండి ''

ప్రశ్న :- స్వయానికి రాజ్య తిలకాన్ని ఇచ్చుకునేందుకు సహజ పురుషార్థమేది ?
జవాబు :- 1. స్వయానికి రాజ్యతిలకాన్ని ఇచ్చుకునేందుకు తండ్రి నుండి ఏ శిక్షణలు లభిస్తున్నాయో వాటిని పూర్తిగా అనుసరించండి. ఇందులో ఆశీర్వాదము, కృప చూపే మాటేదీ లేదు. 2. తండ్రినే అనుసరించండి(ఫాలో ఫాదర్‌), ఇతరులను చూడరాదు, మన్మనాభవ స్థితిలో ఉండాలి. దీని ద్వారా మీకు తిలకము తనకు తానుగా లభిస్తుంది. చదువు మరియు స్మృతియాత్ర ద్వారానే మీరు భికారుల నుండి రాకుమారులుగా అవుతారు (బెగ్గర్‌ టూ ప్రిన్స్‌).

పాట :- ఓం నమ: శివాయ,...............  
ఓంశాంతి. బాప్‌(తండ్రి) మరియు దాదా(అన్న) ఓంశాంతి అన్నప్పుడు రెండు సార్లు కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఇరువురూ ఒక్కరిలోనే ఉన్నారు. ఒకరు అవ్యక్తము, రెండవవారు వ్యక్తము. ఇరువురూ కలిసి ఉన్నారు. ఇరువురి శబ్ధమూ ఒకటిగా ఉండవచ్చు, వేరు వేరుగా కూడా ఉండవచ్చు. ఇది ఒక అద్భుతము. పరమపిత పరమాత్మ ఇతని శరీరములో కూర్చొని జ్ఞానాన్ని వినిపిస్తారని, ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. ఇది ఎక్కడా వ్రాయబడలేదు. నేను ఈ సాధారణ తనువులో అనేక జన్మల అంత్యములో ఇతనిలో ప్రవేశిస్తాను, ఇతని ఆధారాన్ని తీసుకుంటానని తండ్రి కల్పక్రితము కూడా చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. గీతలో ఇటువంటి కొన్ని వాస్తవమైన మహావాక్యాలు(వర్షన్స్‌) కూడా ఉన్నాయి. నేను అనేక జన్మల అంతములో, ఎప్పుడైతే ఇతను వానప్రస్థ స్థితిలో ఉంటాడో అప్పుడు ప్రవేశిస్తాను అనేది వాస్తవమైన విషయము. ఈ శ్లోకము ఇతనికి సరిగ్గా వర్తిస్తుంది. సత్యయుగములో మొట్టమొదటి జన్మ కూడా ఇతనిదే. మళ్లీ చివర్లో వానప్రస్థ స్థితిలో ఉన్నాడు, ఇతనిలోనే తండ్రి ప్రవేశిస్తారు. ఎన్ని పునర్జన్మలు తీసుకున్నాడో ఇతనికి తెలియదని ఇతని గురించే చెప్తారు. శాస్త్రాలలో 84 లక్షల పునర్జన్మలు అని వ్రాసేశారు. ఇదంతా భక్తిమార్గము. దీనిని భక్తి కాండము(సంప్రదాయము) అని అంటారు. జ్ఞానకాండము వేరు, భక్తికాండము వేరు. భక్తి చేస్తూ చేస్తూ క్రిందకు దిగుతూనే వస్తారు. ఈ జ్ఞానము ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. తండ్రి ఒకేసారి అందరికి సద్గతినిచ్చేందుకు వస్తారు. తండ్రి వచ్చి అందరికీ ఒకేసారి భవిష్య ప్రాలబ్ధాన్ని తయారు చేస్తారు. మీరు భవిష్య కొత్త ప్రపంచము కొరకే చదువుతున్నారు. తండ్రి నూతన రాజధాని స్థాపన చేసేందుకే వస్తారు. కనుక దీనిని రాజయోగమని అంటారు. దీనికి చాలా మహత్యముంది. భారతదేశ ప్రాచీన రాజయోగాన్ని ఎవరైనా నేర్పించనీ అని అనుకుంటారు. కాని ఈ రోజులలో సన్యాసులు విదేశాలకు వెళ్ళి మేము ప్రాచీన రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చామని చెప్పుకుంటారు. మేము నేర్చుకోవాలని విదేశీయులు కూడా అనుకుంటారు ఎందుకంటే యోగము ద్వారానే స్వర్గ స్థాపన జరిగిందని భావిస్తారు. యోగబలము ద్వారా మీరు స్వర్గానికి అధికారులుగా అవుతారని తండ్రి చెప్తున్నారు. స్వర్గాన్ని స్థాపన చేసినవారు తండ్రి. కానీ ఎలా స్థాపన చేస్తారో వారికి తెలియదు. ఈ రాజయోగాన్ని ఆత్మిక తండ్రి మాత్రమే నేర్పిస్తారు. దేహధారి మనుష్యులు ఎవ్వరూ నేర్పించలేరు. ఈ రోజుల్లో కల్తీ(అడల్‌ట్రేషన్‌), మోసము(కరప్షన్‌) చాలా ఉంది కదా. అందుకే తండ్రి - నేను పతితులను పావనంగా చేసేవాడినని చెప్తారు. మళ్లీ పతితంగా చేసేవారు కూడా తప్పకుండా ఎవరో ఉంటారు. అలాగే ఉంది కదా. ఇప్పుడు మీరు నిర్ణయించుకోండి. నేనే వచ్చి సర్వ వేదశాస్త్రాలు మొదలైనవాటి సారాన్ని వినిపిస్తాను. జ్ఞానము ద్వారా మీకు 21 జన్మల సుఖము లభిస్తుంది. భక్తి మార్గములో అల్పకాల క్షణ భంగుర సుఖముంది. ఇది 21 తరాలకు సుఖము, దీనిని తండ్రియే ఇస్తారు. తండ్రి మీకు సద్గతినిచ్చేందుకు ఏ శ్రీమతాన్ని ఇస్తారో, అది అన్నిటికంటే భిన్నమైనది. ఈ తండ్రి అందరి మనసులు తీసుకునేవారు. ఆ జడమైన దిల్‌వాడా మందిరము ఎలా ఉందో అలా ఇది చైతన్య దిల్‌వాడా మందిరము. అక్కడ ఖచ్ఛితంగా మీ కర్తవ్యాల చిత్రాలే తయారు చేయబడి ఉన్నాయి. ఈ సమయంలో మీ కర్తవ్యము నడుస్తోంది. అందరికి సద్గతినిచ్చేవారు, అందరి దు:ఖాన్ని హరించి, సుఖాన్నిచ్చే దిల్‌వాలా తండ్రి లభించారు. శివబాబా మహిమ ఎంతో ఉన్నతాతి ఉన్నతమైనదని మహిమ చేయబడింది. సర్వ శ్రేష్ఠమైనది భగవంతుడైన శివుని మహిమ. చిత్రాలలో శంకరుడు మొదలైనవారి ముందు కూడా శివుని చిత్రాన్ని చూపించారు. వాస్తవానికి దేవతల ముందు శివుని చిత్రాన్ని ఉంచడం నిషేధము. ఎందుకంటే వారు భక్తి చేయరు. భక్తి దేవతలూ చేయరు, సన్యాసులు కూడా చేయరు. వారు బ్రహ్మ జ్ఞానులు, తత్వ జ్ఞానులు. ఎలా ఈ ఆకాశ తత్వముందో, అలాగే ఆ బ్రహ్మ తత్వముంది. వారు తండ్రిని స్మృతి చేయరు, వారికి ఈ మహామంత్రము కూడా లభించదు. ఈ మహామంత్రాన్ని సంగమ యుగములో తండ్రియే వచ్చి ఇస్తారు. అందరి సద్గతిదాత అయిన తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి మన్మనాభవ మంత్రాన్ని సంగమ యుగములో ఇస్తారు. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, దేహ సహితంగా దేహ సర్వ ధర్మాలన్నీ త్యాగము చేసి స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఎంతో సులభంగా అర్థం చేయిస్తారు. రావణ రాజ్యం కారణంగా మీరందరూ దేహాభిమానులుగా అయ్యారు. ఇప్పుడు తండ్రి మిమ్ములను ఆత్మాభిమానులుగా చేస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేస్తూ ఉంటే ఆత్మలో ఏర్పడిన మలినాలు తొలగిపోతాయి. సతోప్రధానము నుండి సతోలోనికి వచ్చినందున కళలు తగ్గిపోతాయి కదా. బంగారానికి కూడా క్యారెట్లు ఉంటాయి కదా. ఇప్పుడు కలియుగాంతములో బంగారు చూచేందుకు కూడా కనిపించదు, సత్యయుగములో అయితే బంగారు భవనాలే ఉంటాయి. ఎంతటి రాత్రింబవళ్ళ వ్యత్యాసముంది! దాని పేరే స్వర్ణిమ యుగ ప్రపంచము. అక్కడ ఇటుకలు-రాళ్లు మొదలైనవాటి అవసరముండదు. భవనాలు నిర్మించినట్లయితే అందులో కూడా వెండి, బంగారు తప్ప ఇతర మురికి ఏదీ ఉండదు. అక్కడ సైన్స్‌ ద్వారా చాలా సుఖముంటుంది. ఇది కూడా తయారైన డ్రామాయే. ఈ సమయంలో సైన్స్‌ అహంకారము(సైన్స్‌ ఘమండ్‌) ఉంది. సత్యయుగములో అహంకారమని అనరు. అక్కడ సైన్స్‌ ద్వారా మీకు సుఖము లభిస్తుంది. ఇక్కడ అల్పకాల సుఖముంది, మళ్లీ దాని ద్వారానే చాలా భారీ దు:ఖము కూడా లభిస్తుంది. బాంబులు మొదలైనవన్నీ వినాశనము కొరకు తయారు చేస్తూనే ఉంటారు. బాంబులు తయారు చేయరాదని ఇతరులకు నిషేధము విధిస్తారు కానీ వారే తయారు చేస్తారు. ఈ బాంబుల ద్వారా మా మృత్యువే సంభవిస్తుందని కూడా తెలుసు. అయినా తయారు చేస్తూనే ఉంటారు అంటే బుద్ధి మరణించినట్లే కదా. ఇదంతా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. తయారు చేయకుండా ఉండలేరు. ఈ బాంబుల ద్వారా మా మృత్యువే సంభవిస్తుందని మనుష్యులకు తెలుసు. కానీ ఎవరు ప్రేరేపిస్తున్నారో తెలియడం లేదు, తయారు చేయకుండా మేము ఉండలేకపోతున్నామని అంటారు. తప్పకుండా తయారు చేయవలసే ఉంటుంది. వినాశనము కూడా డ్రామాలో నిర్దేశింపబడింది. ఎవరు ఎన్ని శాంతి బహుమతులిచ్చినా (పీస్‌ ప్రైజ్‌) శాంతి స్థాపన చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. శాంతిసాగరుడైన తండ్రియే శాంతి, సుఖము, పవిత్రతల వారసత్వమునిస్తారు. సత్యయుగములో అనంతమైన సంపద ఉంటుంది. అక్కడ పాల నదులు ప్రవహిస్తాయి. విష్ణువును క్షీరసాగరంలో చూపిస్తారు. ఈ పోలికనే చెప్పబడింది. ఆ క్షీరసాగరమెక్కడ, ఈ విషయ సాగరమెక్కడ. భక్తిమార్గములో సరోవరాలు మొదలైనవి తయారు చేసి అందులో రాతి పై విష్ణువును పరండబెట్తారు. భక్తిమార్గములో ఎంత ఖర్చు చేస్తారు. సమయాన్ని, ధనాన్ని ఎంతగానో వ్యర్థము చేస్తారు. దేవీల మూర్తులను ఎంతో ఖర్చు చేసి తయారు చేస్తారు. మళ్లీ సముద్రములో పడేస్తారు. కనుక ధనము వ్యర్థమైనట్లే కదా. ఇది బొమ్మల పూజ వంటిది. వారి కర్తవ్యాల గురించి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు ఎవరి మందిరాలకు వెళ్ళినా మీకు వారి ప్రతి ఒక్కరి కర్తవ్యము గురించి తెలుసు. ఎక్కడకు వెళ్లేందుకైనా పిల్లలకు నిషేధము లేదు. మొదట అవివేకులుగా వెళ్ళేవారు, ఇప్పుడు వివేకవంతులై వెళ్తారు. మాకు వీరి 84 జన్మలు తెలుసని మీరు చెప్తారు. భారతవాసులకు కృష్ణుని జన్మ గురించి కూడా తెలియదు. మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉంది. జ్ఞానము సంపాదనకు ఆధారము(నాలెడ్జ్‌ ఈజ్‌ సోర్స్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌) వేదశాస్త్రాలు మొదలైన వాటిలో ఏ ముఖ్య ఉద్ధేశ్యమూ(ఏయిమ్‌ అండ్‌ ఆబ్జెక్టు) లేదు. పాఠశాలలో సదా ముఖ్య ఉద్ధేశ్యము ఉంటుంది. ఈ చదువు ద్వారా మీరు చాలా ధనవంతులుగా అవుతారు.
జ్ఞానము ద్వారా సద్గతి కలుగుతుంది. ఈ జ్ఞానము ద్వారా మీరు ధనవంతులుగా అవుతారు. మీరు ఎవరి మందిరములోకి వెళ్ళినా, అది ఎవరి స్మృతిచిహ్నమో వెంటనే అర్థము చేసుకుంటారు. ఉదాహరణానికి దిల్‌వాలా మందిరముంది. అది జడమైనది, ఇది చైతన్యమైనది. ఇక్కడ వృక్షములో ఎలా చూపబడిందో, ఖచ్ఛితంగా అలాగే మందిరము తయారు చేయబడింది. క్రింద తపస్సులో కూర్చొని ఉన్నారు, పై కప్పులో స్వర్గమంతా ఉంది. చాలా ఖర్చుతో తయారుచేశారు. ఇక్కడైతే ఏమీ లేదు. భారతదేశము నూరు శాతము శ్రేష్ఠంగా, పావనంగా ఉండేది, ఇప్పుడు భారతదేశము నూరు శాతము కనిష్ఠంగా, దివాలా తీసి(ఇన్‌సాల్వంట్‌గా), పతితంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ అందరూ వికారాల ద్వారా జన్మిస్తారు. అక్కడ వికారాల మాటే ఉండదు. మనుష్యులు కొద్దిగానైనా పరివర్తన అవ్వాలని గరుడ పురాణములో భయము కలిగించే విషయాలు వ్రాశారు. కాని డ్రామాలో మనుష్యులు పరివర్తన అవ్వడం లేనే లేదు. ఇప్పుడు ఈశ్వరీయ స్థాపన జరుగుతోంది. ఈశ్వరుడే స్వర్గ స్థాపన చేస్తారు కదా. వారినే హెవెన్లీ గాడ్‌ఫాదర్‌ అని అంటారు. తండ్రి అర్థం చేయించారు - అక్కడ యుద్ధము చేసే ఆ సైన్యము రాజా-రాణుల కొరకు అంతా చేస్తారు. ఇక్కడ మీరు మీ కొరకు మాయ పై విజయం పొందుతారు. ఎంత చేస్తారో, అంత పొందుతారు. మీరు ప్రతి ఒక్కరు మీ తనువు, మనసు, ధనాలను భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయడంలో వినియోగించాల్సి వస్తుంది. ఎంత చేస్తారో అంత ఉన్నతమైన పదవి పొందుతారు. ఇక్కడ ఉండేది(మిగిలేది) ఏదీ లేదు. కొందరిది ధూళిలో కలిసిపోతుంది,.......... అను గాయనము ఈ సమయానిదే. మీకు రాజ్యభాగ్యాన్ని ఇప్పించేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు. ఇప్పుడు తనువు-మనసు-ధనములన్నీ ఇందులో వినియోగించండని చెప్తున్నారు. ఈ బ్రహ్మ సర్వస్వాన్ని సమర్పణ చేశారు కదా. ఇతనిని మహాదాని అని అంటారు. వినాశి ధనాన్ని దానము చేసిన తర్వాత అవినాశి ధనాన్ని కూడా దానము చేయాల్సి ఉంటుంది. ఎవరు ఎంత దానము చేస్తారో అంత పొందుతారు......... పేరు పొందిన దానులైతే ఫలానావారు గొప్ప దాతగా ఉండేవారని అంటారు. పేరు ఉంటుంది కదా. వారు ఇన్‌డైరెక్ట్‌గా(పరోక్షంగా) ఈశ్వరార్థము చేస్తారు. రాజ్యస్థాపన అయితే జరగదు. ఇప్పుడు రాజ్య స్థాపన జరుగుతుంది కనుక పూర్తిగా దాతలుగా అవ్వాలి. భక్తిమార్గములో మేము మీకు బలి అవుతామని గానము కూడా చేస్తారు. ఇందులో ఖర్చు కొంచెం కూడా లేదు. ప్రభుత్వానికి ఎంత ఖర్చు అవుతుంది. ఇక్కడ మీరు ఏమి చేస్తున్నా అది మీ కొరకే. 8 మాలలో అయినా రండి, 108 మాలలో అయినా రండి, 16,108 మాలలోనైనా రండి. గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులవ్వాలి. కర్మాతీత స్థితిని పొందే, ఏ శిక్షలు అనుభవించనంత యోగాన్ని సంపాదించండి.
మీరందరు సైనికులు. రావణునితో మీ యుద్ధము జరుగుతోంది, ఏ మనుష్యులతో కాదు. పాస్‌ (ఉత్తీర్ణులు) కాని కారణంగా రెండు కళలు తగ్గిపోయాయి. త్రేతా యుగమును రెండు కళలు తగ్గిన స్వర్గమని అంటారు. తండ్రిని పూర్తిగా అనుసరించే పురుషార్థమైతే చేయాలి కదా. ఇందులో మనస్సు-బుద్ధి ద్వారా సమర్పణ కావలసి ఉంటుంది. బాబా ఈ సర్వస్వమూ మీదే అని చెప్పినప్పుడు, దీనిని సర్వీసులో వినియోగించండి అని తండ్రి చెప్తారు. నేను మీకు ఏ సలహాను ఇస్తానో, ఆ కార్యము చేయండి, విశ్వవిద్యాలయాన్ని తెరవండి, సేవాకేంద్రాలను తెరవండి. అనేమందికి కళ్యాణము జరుగుతుంది. కేవలం తండ్రిని స్మృతి చేయండి వారసత్వమును తీసుకోండి అనే సందేశాన్ని ఇవ్వండి. మెసెంజర్‌(సందేశకులు), పైగంబర్‌(దేవదూత) అని పిల్లలైన మిమ్ములనే అంటారు. నన్ను స్మృతి చేసినట్లయితే, మీ వికర్మలు వినాశనమవుతాయి, జీవన్ముక్తి లభిస్తుంది అని తండ్రి బ్రహ్మ ద్వారా చెప్తున్నారనే సందేశాన్ని అందరికీ ఇవ్వండి. ఇప్పుడు జీవన బంధనముంది. తర్వాత జీవన్ముక్తి ఉంటుంది. నేను భారతదేశములోనే వస్తానని తండ్రి చెప్తున్నారు. ఇది అనాదిగా తయారైన డ్రామా. ఎప్పుడు తయారయింది, ఎప్పుడు పూర్తి అవుతుంది? ఈ ప్రశ్న తలెత్తదు. ఇది అనాదిగా నడుస్తూనే ఉంటుంది. ఆత్మ ఎంత చిన్న బిందువు. అందులో అవినాశి పాత్ర నిండి ఉంది. ఇవి ఎంత గుహ్యమైన విషయాలు. నక్షత్రము వలె చిన్న బిందువు. మాతలు కూడా ఇక్కడ మస్తకము పై బిందువునుంచుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థము ద్వారా మీకు మీరే రాజ్య తిలకాన్ని దిద్దుకుంటున్నారు. మీరు తండ్రి శిక్షణల అనుసారము బాగా నడిచినట్లయితే, మీరు స్వయానికి రాజ్య తిలకాన్ని దిద్దుకుంటున్నట్లే. ఇందులో ఆశీర్వాదము, కృప ఏమీ ఉండదు. మీరే స్వయానికి రాజ్య తిలకాన్ని దిద్దుకుంటారు. వాస్తవానికి ఇదే రాజ్య తిలకము. తండ్రిని అనుసరించే పురుషార్థము చేయాలి, ఇతరులను చూడరాదు, ఇది మన్మనాభవ స్థితి, దీని ద్వారా మీకు తనకు తానుగా తిలకము లభిస్తుంది, తండ్రి ఇవ్వరు. దీని పేరే రాజయోగము. మీరు భికారుల నుండి రాకుమారులుగా అవుతారు(బెగ్గర్‌ టూ ప్రిన్స్‌). కనుక పురుషార్థము ఎంత బాగా చేయాలి. ఇతడిని కూడా అనుసరించాలి. ఇది అర్థము చేసుకోవలసిన విషయము కదా. చదువు ద్వారా సంపాదన జరుగుతుంది. ఎంతెంత యోగము ఉంటుందో, అంతంత ధారణ జరుగుతుంది. యోగములోనే శ్రమ ఉంది. అందుకే భారతదేశ రాజయోగము మహిమ చేయబడింది. గంగా స్నానాలు చేస్తూ చేస్తూ ఆయువంతా అయిపోయినా పావనంగా అవ్వలేరు. భక్తిమార్గములో ఈశ్వరార్థము పేదవారికి ఇస్తారు. ఇక్కడ స్వయం ఈశ్వరుడే వచ్చి పేదవారికే విశ్వ సామ్రాజ్యాన్ని ఇస్తారు. వారు పేదల పెన్నిధి కదా. 100 శాతము సంపన్నంగా ఉన్న భారతదేశము ఈ సమయంలో 100 శాతము దివాలా తీసింది. దానము సదా పేదవారికే చేయబడ్తుంది. తండ్రి ఎంత శ్రేష్ఠంగా తయారు చేస్తారు. అలాంటి తండ్రిని తిడ్తారు. తండ్రి చెప్తారు - ఎప్పుడిలా గ్లాని చేస్తారో, అప్పుడు నేను రావలసి వస్తుంది. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. వీరు తండ్రి కూడా అయినారు, టీచరు కూడా అయినారు. సద్గురువు అకాల్‌ అని సిక్కులు అంటారు. పోతే భక్తిమార్గములోని గురువులు అనేకమంది ఉన్నారు. అకాలమూర్తికి కేవలం ఇదే సింహాసనంగా లభిస్తుంది. పిల్లలైన మీ సింహాసనాన్ని కూడా బాబా ఉపయోగించుకుంటారు. నేను ఇతనిలో ప్రవేశించి అందరి కళ్యాణము చేస్తానని తండ్రి అంటారు. ఈ సమయంలో ఇతని పాత్ర ఇది. ఇవి బాగా అర్థము చేసుకోవలసిన విషయాలు. కొత్తవారెవరూ అర్థము చేసుకోలేరు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
అవ్యక్త స్థితిని అనుభవం చేసేందుకు విశేషమైన హోంవర్క్‌
మధ్య-మధ్యలో సంకల్పాల ట్రాఫిక్‌ను స్టాప్‌ చేసే అభ్యాసము చేయండి. ఒక నిముషము శరీరము ద్వారా జరుగుతున్న కర్మలను ఆపి అయినా సంకల్పాలను నిలిపి బిందురూపాన్ని అభ్యాసము చేయండి. ఒక సెకండు ఈ అనుభవం చేసినా, అది అవ్యక్త స్థితిని తయారు చేసుకోవడంలో రోజంతా సహాయము చేస్తుంది.


ధారణ కొరకు ముఖ్య సారము :-
1. అవినాశి జ్ఞాన ధనాన్ని దానము చేసి, మహాదానులుగా అవ్వాలి. ఎలాగైతే బ్రహ్మాబాబా తన సర్వస్వాన్ని ఇందులో వినియోగించారో, అలా తండ్రిని అనుసరించి రాజ్యములో ఉన్నత పదవిని తీసుకోవాలి.
2. శిక్షల నుండి తప్పించుకునేందుకు కర్మాతీత స్థితిని పొందే విధంగా యోగాన్ని సంపాదించాలి. గౌరవయుక్తంగా ఉత్తీర్ణులయ్యేందుకు పురుషార్థము చేయాలి, ఇతరులను చూడరాదు.

వరదానము :- '' మీ పూర్వజ రూప స్మృతి ద్వారా సర్వ ఆత్మలను శక్తిశాలిగా చేసే ఆధారమూర్త్‌, ఉద్ధారమూర్త్‌ భవ ''
ఈ సృష్టి రూపి వృక్షానికి ముఖ్యమైన కాండము అందరి పూర్వజులైన బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యే మీరే. ప్రతి కర్మకు ఆధారము, కులమర్యాదలకు ఆధారము, ఆచార పద్ధతులకు ఆధారము పూర్వజులైన మీరే. సర్వ ఆత్మలకు ఆధారమూర్తులు, ఉద్ధారమూర్తులు మీరే. కాండమైన మీ ద్వారానే సర్వ ఆత్మలకు శ్రేష్ఠ సంకల్పాల శక్తి లేక సర్వ శక్తుల ప్రాప్తి జరుగుతుంది. అందరూ మిమ్ములను అనుసరిస్తున్నారు. అందువలన మా పై ఇంత పెద్ద బాధ్యత ఉందని భావించి ప్రతి సంకల్పము, ప్రతి కర్మ చేయండి. ఎందుకంటే పూర్వజ ఆత్మలైన మీ ఆధారం పైనే సృష్టి యొక్క సమయం మరియు స్థితి ఆధారపడి ఉంది.

స్లోగన్‌ :- '' ఎవరి నుండి సర్వ శక్తుల కిరణాలు నలువైపులా వ్యాపిస్తాయో, వారే మాస్టర్‌ జ్ఞానసూర్యులు ''

Monday, 27 January 2020

Telugu Murli 28/01/2020

28-01-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - మీరు స్వయాన్ని సంగమయుగ బ్రాహ్మణులుగా భావిస్తే సత్యయుగ వృక్షము కనిపిస్తుంది, మీరు అపారమైన ఖుషీలో ఉంటారు ''

ప్రశ్న :- ఎవరు జ్ఞానములో ఆసక్తి గల పిల్లలుగా ఉంటారో వారి గుర్తులు ఎలా ఉంటాయి ?
జవాబు :- వారు పరస్పరములో జ్ఞాన విషయాలే మాట్లాడ్తారు. ఎప్పుడూ పరచింతన చేయరు ఏకాంతములోకి వెళ్ళి విచార సాగర మథనము చేస్తారు.

ప్రశ్న :- ఈ సృష్టి డ్రామాలోని ఏ రహస్యాన్ని పిల్లలైన మీరు మాత్రమే అర్థము చేసుకుంటారు ?
జవాబు :- ఈ సృష్టి డ్రామాలో ఒక్క శివబాబా తప్ప ఏ వస్తువూ సదా స్థిరంగా ఉండదు. పాత ప్రపంచములోని ఆత్మలను క్రొత్త ప్రపంచానికి తీసుకెెళ్లేందుకు ఎవరైనా కావాలి, ఈ డ్రామా రహస్యం కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు.

ఓంశాంతి. ఆత్మిక పిల్లలకు పురుషోత్తమ సంగమ యుగములో వచ్చే తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు తమను తాము బ్రాహ్మణులమని భావిస్తారు. స్వయాన్ని బ్రాహ్మణులమని భావిస్తున్నారా లేక ఇది కూడా మర్చిపోతున్నారా? బ్రాహ్మణులు తమ కులాన్ని ఎప్పుడూ మర్చిపోరు. మీకు కూడా మేము బ్రాహ్మణులమని తప్పకుండా గుర్తుండాలి. ఈ ఒక్క విషయము స్మృతిలో ఉన్నా నావ తీరానికి చేరుతుంది. సంగమ యుగములో మీరు కొత్త కొత్త విషయాలు వింటారు. కనుక మీలో వాటి చింతన నడుస్తూ ఉండాలి. దానిని విచార సాగర మథనమని అంటారు. మీరు జ్ఞానులు-యోగులు(రూప్‌ బసంత్‌). మీ ఆత్మలో మొత్తం జ్ఞానమంతా నింపబడ్తుంది. కనుక మీ నోటి నుండి రత్నాలే వెలువడాలి. మేము సంగమయుగ బ్రాహ్మణులమని స్వయాన్ని భావించాలి. కొంతమంది ఇది కూడా అర్థము చేసుకోరు. ఒకవేళ స్వయాన్ని సంగమ యుగవాసులుగా భావిస్తే సత్యయుగ వృక్షము కనిపించాలి అంతేకాక అపారమైన సంతోషము కూడా ఉండాలి. తండ్రి ఏం అర్థం చేయిస్తున్నారో, దానిని మనసులో పునరావృతము(రిపీట్‌) చేస్తూ ఉండాలి. ఇప్పుడు మేము సంగమ యుగములో ఉన్నామనే విషయము కూడా మీకు తప్ప వేరెవ్వరికీ తెలియదు. సంగమ యుగములోని చదువు కొంత సమయము కుడా తీసుకుంటుంది. నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు, నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయ్యేందుకు చదువు ఇది ఒక్కటే. మేము దేవతలుగా, స్వర్గవాసులుగా అవుతున్నామనే మాట గుర్తున్నా సంతోషంగా ఉంటారు. సంగమయుగ నివాసులైనప్పుడే స్వర్గవాసులుగా అవుతారు. ఇంతకుముందు నరకవాసులుగా ఉన్నప్పుడు చాలా చెడు(మురికి) స్థితి ఉండేది, చెడు పనులు చేసేవారు, ఇప్పుడు వాటిని సమాప్తము చేయాలి. మనుష్యుల నుండి దేవతలుగా, స్వర్గవాసులుగా అవ్వాలి. ఎవరి పత్ని అయినా మరణించినప్పుడు మీ యుగల్‌(భార్య) ఎక్కడ ఉంది? అని మీరు ప్రశ్నిస్తే స్వర్గవాసి అయిందని చెప్తారు. స్వర్గమంటే ఏమిటో కూడా తెలియదు. స్వర్గవాసిగా అయి ఉంటే సంతోషించాలి కదా! ఇప్పుడు పిల్లలైన మీకు ఈ విషయాలు తెలుసు. మేమిప్పుడు సంగమ యుగంలో ఉన్నాము, పావనంగా అవుతున్నామని, స్వర్గ వారసత్వాన్ని తండ్రి నుండి తీసుకుంటున్నామని లోలోపల అనుకుంటూ ఉండాలి. క్షణ-క్షణము దీనిని స్మరణ చేయాలి, మర్చిపోరాదు. కానీ మాయ మరపింపజేసి ఒక్కసారిగా కలియుగవాసులుగా చేసేస్తుంది. పూర్తి కలియుగవాసుల వలె కర్మలు చేస్తారు. ఆ అపారమైన సంతోషము ఉండదు. ముఖము శవము వలె ఉంటుంది. అందరూ కామచితి పై కూర్చొని కాలి శవాల వలె అయిపోయారని తండ్రి కూడా అంటారు. మేము మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు కనుక ఆ ఖుషీ ఉండాలి కదా. అందువల్లనే అతీంద్రియ సుఖము యొక్క అనుభూతిని అడగాలంటే గోప-గోపికలను అడగమని గాయనముంది. మేము ఆ అనుభూతిలో ఉన్నామా? అని మీ మనసును మీరే ప్రశ్నించుకోండి. మీరు ఈశ్వరీయ మిషన్‌(సంస్థ) కదా. ఈశ్వరీయ మిషన్‌ ఏ పని చేస్తుంది? మొదట శూద్రుల నుండి బ్రాహ్మణులుగా, బ్రాహ్మణుల నుండి దేవతలుగా చేస్తుంది. మేము బ్రాహ్మణులమని మర్చిపోరాదు. ఆ బ్రాహ్మణులైతే వెంటనే మేము బ్రాహ్మణులమని అంటారు. వారు గర్భజనితులు, మీరు ముఖవంశావళి. బ్రాహ్మణులైన మీకు చాలా నషా ఉండాలి. బ్రహ్మ భోజనము,............ అని మహిమ కూడా ఉంది. మీరు ఎవ్వరికైనా బ్రహ్మాభోజనాన్ని తినిపించినట్లయితే, మేము పవిత్ర బ్రాహ్మణుల చేతి నుండి తింటున్నామని ఎంతో సంతోషపడ్తరు. మనసా-వాచా-కర్మణా ఎంత పవిత్రంగా ఉండాలి. ఏ అపవిత్ర కర్తవ్యమూ చేయరాదు. కొంత సమయము పడ్తుంది. జన్మత: ఎవ్వరూ అవ్వలేరు. భలే ఒక్క సెకెండులో జీవన్ముక్తి అనే గాయనముంది, తండ్రి పిల్లలుగా అయ్యారంటే ఆస్తి లభించినట్లే. ఇతను ప్రజాపిత బ్రహ్మ, శివుని కుమారుడు అని ఒక్కసారి గుర్తించి ఉంటే చాలు, ఆ నిశ్చయము కలిగిన వెంటనే వారసులుగా అవుతారు. ఒకవేళ మళ్లీ ఏదైనా అకర్తవ్యము చేసినట్లయితే, చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది. కాశీకల్వట్‌(కాశీలోని కత్తులబావిలో పడి శివలింగము పై ప్రాణార్పణ చేయడం) గురించి అర్థం చేయించినట్లు, శిక్షలు అనుభవించడం ద్వారా లెక్కాచారము సమాప్తమవుతుంది. ముక్తి కొరకే కాశీలో కత్తుల బావిలో దూకేవారు. ఇక్కడ అలాంటి విషయాలేవీ లేవు. నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని శివబాబా పిల్లలకు చెప్తున్నారు. ఎంత సులభము! అయినా అనేక మాయ చక్రాలు వచ్చేస్తాయి. మీ ఈ యుద్ధము అన్ని యుద్ధాల కంటే ఎక్కువ సమయం నడుస్తుంది. బాహుబల యుద్ధము ఇంత సమయము నడవదు. మీరు వచ్చినప్పటి నుండి యుద్ధము ప్రారంభమయ్యింది. పాతవారితో ఎంత యుద్ధము జరుగుతుంది, కొత్తగా వచ్చేవారితో కూడా నడుస్తుంది. ఆ యుద్ధములో కూడా మరణిస్తూ ఉంటారు, ఇతరులు వచ్చి చేరుతూ ఉంటారు. ఇక్కడ కూడా మరణిస్తూ ఉంటారు. వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. వృక్షము తప్పకుండా పెద్దదిగా అవ్వాల్సిందే. వారు తండ్రి కూడా అయినారు, సుప్రీమ్‌ టీచరు కూడా అయినారు, సద్గురువు కూడా అయినారు అనునది గుర్తుండాలి అని బాబా మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. కృష్ణుని సద్గురువు, తండ్రి, టీచరు అని అనరు.
అందరికి కళ్యాణము చేయాలనే ఆసక్తి మీలో ఉండాలి. మహారథి పిల్లలు సర్వీసు చేస్తూ ఉంటారు. వారికైతే చాలా సంతోషముంటుంది. ఎక్కడ నుండి ఆహ్వానము లభిస్తుందో అక్కడకు పరుగులు పెడ్తూ ఉంటారు. ప్రదర్శని సర్వీసు కమిటీలో కూడా మంచి మంచి పిల్లలే ఎన్నుకోబడ్తారు. వారికి ఆదేశాలు లభిస్తాయి, సర్వీసు చేెస్తూ ఉంటే వీరు ఈశ్వరీయ మిషన్‌కు చెందిన మంచి పిల్లలని అంటారు. వీరు చాలా మంచి సర్వీసు చేస్తారని తండ్రి కూడా సంతోషిస్తారు. మేము సర్వీసు చేస్తున్నామా ? అని మీ మనసును మీరే ప్రశ్నించుకోండి. ఆన్‌ గాడ్‌ఫాదర్‌లీ సర్వీస్‌(గాడ్‌ఫాదర్‌ సేవలో) అని చెప్తారు. గాడ్‌ఫాదర్‌ సర్వీసు ఏది ? మన్మనాభవ అను సందేశాన్ని అందరికీ ఇవ్వండి, అంతే. ఆదిమధ్యాంతాల జ్ఞానము మీ బుద్ధిలో ఉంది. మీ పేరే స్వదర్శన చక్రధారులు కనుక దాని చింతన నడవాలి. స్వదర్శన చక్రము ఎప్పుడూ ఆగదు. మీరు చైతన్యమైన లైట్‌ హౌస్‌లు, మీ మహిమ చాలా గాయనం చేయబడ్తుంది. బేహద్‌ తండ్రి మహిమ కూడా మీరు తెలుసుకున్నారు. వారు జ్ఞాన సాగరులు, పతితపావనులు, గీతా భగవంతుడు, వారే జ్ఞాన-యోగాల బలము ద్వారా ఈ కార్యాన్ని చేయిస్తారు. ఇందులో యోగబలము యొక్క ప్రభావము చాలా ఉంది. భారతదేశ ప్రాచీన యోగము ప్రసిద్ధమైనది. అది మీరు ఇప్పుడే నేర్చుకుంటున్నారు. సన్యాసులైతే హఠయాగులు, వారు పతితులను పావనంగా చేయలేరు. జ్ఞానము ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది. జ్ఞానము ద్వారా మీరు జన్మ తీసుకుంటారు. గీతను తల్లి-తండ్రి అని అంటారు, మాత-పితలు కదా. మీరు శివబాబా పిల్లలు. మరి మాతా-పితలు కావాలి కదా. మనుష్యులు మాతా-పితలని గానము చేస్తారు కానీ అర్థము తెలియదు. దీని అర్థము ఎంత గుహ్యమైనదో తండ్రి అర్థం చేయిస్తున్నారు. గాడ్‌ఫాదర్‌ అని అంటారు, మళ్లీ మాత-పిత అని ఎందుకు అంటారు? సరస్వతి ఉంది కానీ వాస్తవానికి సత్య-సత్యమైన తల్లి పుత్రుడైన బ్రహ్మయే అని బాబా అర్థం చేయించారు. సాగరము మరియు బ్రహ్మ పుత్ర(నది), మొట్టమొదట వీరి కలయికే జరుగుతుంది. బాబా ఇతనిలో ప్రవేశిస్తారు. ఇవి ఎంతటి సూక్ష్మమైన విషయాలు. చింతన చేసేందుకు ఈ విషయాలు చాలామంది బుద్ధిలో ఉండవు. తక్కువ పదవిని పొందేవారు, పూర్తి తక్కువ బుద్ధి ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా భావించమని వారి కొరకు తండ్రి మళ్లీ మళ్లీ చెప్తారు. ఇది సులభం కదా. ఆత్మలమైన మన తండ్రి పరమాత్మ. నన్ను ఒక్కరినే(మామేకమ్‌ యాద్‌ కరో) స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనము అవుతాయని వారు ఆత్మలైన మీకు చెప్తున్నారు. ఇది ముఖ్యమైన విషయము. మందబుద్ధి కలిగిన వారు పెద్ద విషయాలను అర్థము చేసుకోరు. కనుకనే మన్మనాభవ అని గీతలో కూడా ఉంది. బాబా, స్మృతియాత్ర చాలా కష్టమైనది, క్షణ-క్షణము మర్చిపోతాము, ఏదో ఒక పాయింట్‌ పై ఓడిపోతాము అని అందరూ బాబాకు వ్రాస్తారు. ఇది మాయకు మరియు ఈశ్వరీయ సంతానానికి మధ్య జరిగే బాక్సింగ్‌(మల్ల యుద్ధము), దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు. మాయ పై విజయము పొంది కర్మాతీత స్థితిలోకి వెళ్ళాలని అర్థం చేయిస్తారు. మొట్టమొదట మీరు కర్మ సంబంధములోకి వచ్చారు. అందులో వస్తూ వస్తూ మళ్లీ మీరు అర్ధకల్పము తర్వాత కర్మ బంధనములోకి వచ్చారు. మొట్టమొదట మీరు పవిత్రాత్మలుగా వచ్చారు. సుఖ-దు:ఖాల కర్మబంధనము ఉండేది కాదు. తర్వాత సుఖ సంబంధంలోకి వచ్చారు. మేము సంబంధములో ఉండేవారము, ఇప్పుడు దు:ఖములో ఉన్నాము, మళ్లీ తప్పకుండా సుఖములో ఉంటామని కూడా ఇప్పుడు మీకు తెలుసు. క్రొత్త ప్రపంచము ఉన్నప్పుడు అధిపతులుగా ఉండేవారము, పవిత్రంగా ఉండేవారము, ఇప్పుడు పాత ప్రపంచంలో పతితులుగా ఉన్నాము. మళ్లీ మనమే దేవతలుగా అవుతాము కనుక ఇది గుర్తు చేసుకోవాలి కదా.
తండ్రి చెప్తారు - నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు నశిస్తాయి, మీరు నా ఇంటికి వచ్చేస్తారు. శాంతిధామం ద్వారా సుఖధామంలోకి వచ్చేస్తారు. మొట్టమొదట ఇంటికి వెళ్ళాలి. తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేసినట్లయితే, మీరు పవిత్రంగా అవుతారు. పతితపావనుడైన నేను మీరు ఇంటికి వచ్చేందుకు మిమ్ములను పవిత్రంగా చేస్తున్నాను. ఇలా ఇలా స్వయంతో మాట్లాడుకోవాల్సి ఉంటుంది. దాదాపు ఇప్పుడు చక్రము తప్పకుండా పూర్తి అవుతుంది, మేము ఇన్ని జన్మలు తీసుకున్నాము. ఇప్పుడు పతితుల నుండి పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు. యోగబలముతోనే పావనంగా అవుతాము. ఈ యోగబలము చాలా ప్రసిద్ధమైనది. ఇది తండ్రియే నేర్పించగలరు. ఇందులో శరీరము ద్వారా ఏమీ చేయవలసిన అవసరము లేదు. కనుక పూర్తి రోజంతా ఈ విషయాల గురించి మథనము నడవాలి. ఏకాంతములో ఎక్కడైనా కూర్చోండి లేక వెళ్ళండి, బుద్ధిలో ఇదే నడుస్తూ ఉండాలి. ఏకాంతము చాలా ఉంది. ఇంటి పైకప్పు పైకి వెళ్లేందుకు భయపడాల్సిన అవసరము లేదు. మొదట మీరు మురళి విన్న తర్వాత పర్వతాల పైకి వెళ్ళేవారు, విన్నదానిని గురించి చింతన చేసేందుకు మీరు పర్వతాల పైకి వెళ్ళి కూర్చునేవారు. జ్ఞానములో ఆసక్తి ఉన్నవారు పరస్పరము జ్ఞానము విషయాలే మాట్లాడుకుంటారు. జ్ఞానము లేకుంటే పరచింతన చేస్తూ ఉంటారు. ప్రదర్శనిలో మీరు ఎంతమందికి ఈ మార్గాన్ని తెలుపుతారు. మన ధర్మము చాలా సుఖమునిచ్చేదని అర్థం చేసుకున్నారు. ఇతర ధర్మాల వారికి కేవలం తండ్రిని స్మృతి చేయండి అని అర్థం చేయించాలి. వీరు ముసల్మానులు, నేను ఫలానా అని భావించరాదు. ఆత్మను చూడాలి, ఆత్మకే అర్థం చేయించాలి. ప్రదర్శినిలో అర్థం చేయిస్తూ ఉంటే నేను నా సోదర ఆత్మకు అర్థం చేయిస్తున్నానని అభ్యాసమవుతుంది. ఇప్పుడు మనకు తండ్రి నుండి వారసత్వము లభిస్తూ ఉంది. స్వయాన్ని ఆత్మగా బావించి సోదరులకు జ్ఞానాన్నిస్తారు - ఇప్పుడు తండ్రి వద్దకు పదండి, చాలా సమయము విడిపోయి ఉన్నారు. అది శాంతిధామము, ఇక్కడ ఎంత దు:ఖము, అశాంతి మొదలైనవి ఉన్నాయి! ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించే అభ్యాసము చేసినట్లయితే, నామ, రూప, దేహములన్నీ మర్చిపోతారు. ఫలానావారు ముసల్మానులు అని ఎందుకు భావిస్తారు? ఆత్మగా భావించి అర్థము చేయించండి. ఈ ఆత్మ మంచిదా లేక చెడ్డదా? అని అర్థం చేసుకోగలరు. చెడు నుండి దూరంగా తొలగిపోవాలని ఆత్మ గురించే చెప్పబడ్తుంది. ఇప్పుడు మీరు బేహద్‌ తండ్రి పిల్లలు. ఇక్కడ పాత్రను అభినయించారు. ఇప్పుడు మళ్లీ వాపసు వెళ్ళాలి, పావనమవ్వాలి. తండ్రిని తప్పకుండా స్మృతి చేయాల్సి వస్తుంది. పావనంగా అయితే, పావన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది. తండ్రి కూడా ప్రతిజ్ఞ చేయమని అంటారు. బాబా యుక్తి కూడా తెలుపుతారు - ఆత్మలైన మీరు సోదరులు. శరీరములోకి వస్తే సోదరీ-సోదరులు. సోదరీ-సోదరులు ఎప్పుడూ వికారాలోకి వెళ్ళరు. పవిత్రంగా అయి తండ్రిని స్మృతి చేయడం వలన మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు. మాయతో ఓడిపోయినా మళ్లీ లేచి నిల్చోండి. ఎంత బాగా నిల్చుకుంటే అంత ప్రాప్తి అవుతుంది. లాభ- నష్టాలుంటాయి కదా. అర్ధకల్పము జమ అవుతుంది. మళ్లీ రావణ రాజ్యములో నష్టమైపోతుంది. లెక్కాచారము కదా. గెలవడం అంటే జమ, ఓడిపోవడం అంటే నష్టము. కనుక స్వయాన్ని పూర్తిగా పరిశీలించుకోవాలి. తండ్రిని స్మృతి చేస్తే పిల్లలైన మీకు సంతోషము కలుగుతుంది. వారు కేవలం మహిమ చేస్తారు. కొంచెం కూడా తెలివి లేదు. అన్ని పనులు తెలివిహీనులై చేస్తారు. మీరు పూజలు మొదలైనవి చేయరు, మహిమ అయితే చేస్తారు కదా. ఆ ఒక్క తండ్రి భక్తికే అవ్యభిచారి భక్తి అని మహిమ ఉంది. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్ములను స్వయంగా చదివిస్తారు. మీరు ప్రశ్నలడిగే అవసరమే లేదు. చక్రము స్మృతిలో ఉండాలి. మనము మాయ పై విజయం ఎలా పొందుతామో, మళ్లీ ఓడిపోతామో అర్థం చేసుకోవాలి. ఓడిపోతే 100 రెట్లు శిక్ష లభిస్తుందని తండ్రి అర్థం చేయిస్తారు. సద్గురువును నిందింపజేయకండి అని తండ్రి చెప్తున్నారు. లేకుంటే స్వర్గంలో స్థానము లభించదు. ఇది సత్యనారాయణ కథ. దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు. గీతను, సత్యనారాయణ కథను వేరు చేశారు. నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకే ఈ గీత ఉంది.
తండ్రి చెప్తున్నారు - నేను మీకు నరుని నుండి నారాయణునిగా అయ్యే కథను వినిపిస్తాను, దీనిని గీత అని కూడా అంటారు, అమరనాథుని కథ అని కూడా అంటారు. మూడవ నేత్రాన్ని ఆ తండ్రియే ఇస్తారు. మనం దేవతలుగా అవుతామని కూడా మీకు తెలుసు కనుక గుణాలు కూడా తప్పకుండా కావాలి. ఈ సృష్టిలో ఏ వస్తువూ సదా స్థిరంగా ఉండదు. సదా స్థిరంగా ఉండేవారు ఒక్క శివబాబా మాత్రమే. మిగిలినవారంతా క్రిందకి రావాల్సిందే. కానీ వారు కూడా సంగమ యుగంలో వచ్చి అందరిని వాపసు తీసుకెళ్తారు. పాత ప్రపంచములోని ఆత్మలను నూతన ప్రపంచములోకి తీసుకెళ్లేందుకు ఎవరో ఒకరు కావాలి కదా. డ్రామాలో ఈ రహస్యమంతా ఉంది. తండ్రి వచ్చి పవిత్రంగా చేస్తారు. దేహధారులెవ్వరినీ భగవంతుడని అనజాలరు. ఈ సమయంలో ఆత్మకు గల రెక్కలు తెగిపోయాయి కనుక ఎగరలేదని తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రి వచ్చి జ్ఞాన-యోగాలనే రెక్కలనిస్తారు. యోగబలముతో మీ పాపాలు భస్మమైపోతాయి, పుణ్యాత్మలుగా అవుతారు. మొట్టమొదట శ్రమ కూడా చేయాలి అందువలన తండ్రి మామేకం యాద్‌ కరో, చార్టు పెట్టండి అని చెప్తున్నారు. ఎవరి చార్టు బాగుంటుందో వారు వ్రాస్తారు. వారికి సంతోషముంటుంది. ఇప్పుడు అందరూ శ్రమ చేస్తారు. చార్టు వ్రాయకుంటే యోగమనే పదును నిండదు. చార్టు వ్రాయడంలో చాలా లాభముంది. చార్టుతో పాటు పాయింట్లు కూడా ఉండాలి. చార్టులో అయితే సేవ ఎంత చేశారు? స్మృతి ఎంత చేశారు? రెండూ వ్రాస్తారు. పురుషార్థము ఎలా చేయాలంటే చివర్లో ఏ వస్తువూ గుర్తు రాకూడదు. స్వయాన్ని ఆత్మగా భావించి పుణ్యాత్మగా అవ్వాలి. ఈ శ్రమ చేయాలి. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
అవ్యక్త స్థితిని అనుభవం చేసేందుకు విశేషమైన హోంవర్క్‌
అవ్యక్త స్థితిని అనుభవం చేసేందుకు సదా ' సమస్యలను దూరంగా తరిమేయాలి, సంపూర్ణతను సమీపానికి తీసుకురావాలి' అని గుర్తుంచుకోండి. అలా ఉండేందుకు ఈశ్వరీయ మర్యాదలలో నిర్లక్ష్యంగా ఉండరాదు. ఆసురీ మర్యాదలు లేక మాయను నిర్లక్ష్యం చేయండి. సమస్యను ఎదిరిస్తే సమస్య సమాప్తమైపోతుంది.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఏకాంతములో జ్ఞాన మనన చింతన చేయాలి. స్మృతియాత్రలో ఉంటూ మాయ పై విజయాన్ని పొంది, కర్మాతీత స్థితిని పొందుకోవాలి.
2. ఎవరికైనా జ్ఞానాన్ని తెలియజేసే సమయములో, మేము సోదర ఆత్మకు జ్ఞానాన్నిస్తున్నామని బుద్ధిలో ఉండాలి. నామ, రూప, దేహములను మరచిపోవాలి. పావనులగుటకు ప్రతిజ్ఞ చేసి పావనులై పావన ప్రపంచానికి యజమానులవ్వాలి.

వరదానము :- '' అఖండయోగ పద్ధతి ద్వారా అఖండ పూజ్యులుగా అయ్యే శ్రేష్ఠ మహాన్‌ ఆత్మా భవ ''
ఈ రోజులలో ఎవరైతే మహాత్ములని పిలువబడ్తున్నారో వారికి అఖండానంద్‌ మొదలైన పేర్లు పెడ్తారు. కాని అన్నిటిలో అఖండ స్వరూపులు మీరే. ఆనందములోనూ అఖండము, సుఖములోనూ అఖండము......... కేవలం సాంగత్య దోషములోకి రాకండి. ఇతరుల అవగుణాలను చూస్తున్నా, వింటున్నా వాటిని లెక్క చేయకండి. అలా ఉంటే ఈ విశేషత ద్వారా అఖండ యోగులుగా అవుతారు. ఎవరైతే అఖండ యోగులుగా ఉంటారో వారే అఖండ పూజ్యులుగా అవుతారు. మీరు ఎటువంటి మహాత్ములంటే అర్థకల్పము మీ జడచిత్రాలకు పూజ జరుగుతుంది.

స్లోగన్‌ :- '' దివ్యబుద్ధియే సైలెన్స్‌ శక్తికి ఆధారము ''

Sunday, 26 January 2020

Telugu Murli 27/01/2020

27-01-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - మీ ఒక్కొక్క మాట(పలుకు) చాలా మధురంగా, ఫస్ట్‌క్లాస్‌గా ఉండాలి. తండ్రి ఎలా దుఃఖహర్త - సుఖకర్తగా ఉన్నారో, అలా తండ్రి సమానంగా అందరికీ సుఖాన్నివ్వండి ''

ప్రశ్న :- లౌకిక బంధు-మిత్రులకు జ్ఞానాన్ని ఇచ్చే యుక్తి ఏమిటి ?
జవాబు :- ఎవరైనా బంధు-మిత్రులుంటే వారితో చాలా నమ్రతగా, ప్రేమపూర్వకంగా చిరునవ్వుతో మాట్లాడాలి - ఇది అదే మహాభారత యుద్ధమని అర్థం చేయించాలి. తండ్రి రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. నేను మీకు సత్యాన్ని తెలియజేస్తున్నాను. భక్తి మొదలైనవి జన్మ-జన్మాంతరాలుగా చేశారు. ఇప్పుడు జ్ఞానము ప్రారంభమవుతుంది. ఇలా అవకాశము దొరికినప్పుడంతా చాలా యుక్తిగా మాట్లాడాలి. పరివారమువారితో చాలా ప్రేమగా వ్యవహరించాలి. ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకండి.

పాట :- చివరికి ఆ రోజు నేడు వచ్చింది,...............(ఆఖిర్‌ వహ్‌ దిన్‌ ఆయా ఆజ్‌,...............)  
ఓంశాంతి. ఏదైనా పాట వినిపించినప్పుడు పిల్లలు తమ మనసులో దాని అర్థాన్ని గురించి ఆలోచించి వెలికి తీయాలి. ఒక్క సెకండులో అర్థము తెలుసుకోవచ్చు. ఇది అనంతమైన డ్రామాను తెలిపే అతి పెద్ద గడియారము కదా. భక్తిమార్గములో మనుష్యులు పిలుస్తారు కూడా. ఎలాగైతే కోర్టులో కేసు జరుగుతున్నప్పుడు ఎప్పుడు ఎప్పుడు విచారణ జరుగుతుంది, పిలుపు వస్తుంది, మా కేసు సమాప్తమవుతుందని అంటారు కదా. అలాగే పిల్లల కేసు కూడా ఉంది, ఏ కేసు? రావణుడు మిమ్ములను చాలా దుఃఖితులుగా చేశాడు, మీ కేసు పెద్ద కోర్టులో దాఖలు అవుతుంది. బాబా రండి, వచ్చి మమ్ములను దుఃఖాల నుండి విడుదల చేయండని పిలుస్తూ ఉంటారు. ఒక రోజు విచారణ(సున్‌వాయీ, విచారణ చేసి తీర్పునివ్వడము) తప్పకుండా ఉంటుంది. తండ్రి వింటారు, డ్రామానుసారంగా సరియైన సమయానికి వస్తారు. అందులో ఒక్క సెకెండు వ్యత్యాసము కూడా ఉండదు. అనంతమైన గడియారము చాలా ఖచ్ఛితంగా నడుస్తుంది. ఇక్కడ మీ వద్ద ఈ చిన్న గడియారాలు కూడా ఖచ్చితంగా నడవవు. యజ్ఞములోని ప్రతి కార్యము ఖచ్ఛితంగా ఉండాలి. గడియారాలు కూడా ఖచ్ఛితంగా ఉండాలి. తండ్రి చాలా ఖచ్ఛితమైనవారు, విచారణ కూడా ఖచ్ఛితంగా ఉంటుంది. కల్ప-కల్పము, కల్పము యొక్క సంగమ యుగములో ఖచ్ఛితమైన(ఆక్యూరేట్‌) సమయానికి వస్తారు కనుక ఇప్పుడు పిల్లల కేసు విచారణ ఉంది. బాబా వచ్చి ఉన్నారు. ఇప్పుడు మీరు అందరికీ అర్థము చేయిస్తారు. దుఃఖాన్ని ఎవరు ఇస్తారో ఇంతకుముందు మీకు కూడా తెలియదు. రావణ రాజ్యము ద్వాపరము నుండి ప్రారంభమవుతుందని ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. బాబా కల్ప-కల్పము సంగమ యుగములో వస్తారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలిసిపోయింది. ఇది బేహద్‌ రాత్రి, శివబాబా బేహద్‌ రాత్రిలో వస్తారు, కృష్ణుని విషయం కాదు. ఎప్పుడైతే ఘోరాంధకారములో అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉంటారో, అప్పుడు పిల్లలను పగలులోకి తీసుకెళ్లేందుకు జ్ఞాన సూర్యుడైన తండ్రి వస్తారు. నన్ను స్మృతి చేయండి అని చెప్తారు ఎందుకంటే పతితుల నుండి పావనంగా అవ్వాలి. బాబాయే పతితపావనుడు, ఆయన ఎప్పుడు వస్తారో అప్పుడు విచారణ ఉంటుంది. ఇప్పుడు మీ విచారణ జరిగింది. నేను పతితులను పావనంగా చేసేందుకు వచ్చాను. పావనంగా అయ్యేందుకు మీకు ఎంత సహజ యుక్తిని తెలియజేస్తాను! అని తండ్రి చెప్తారు. ఈ రోజులలో సైన్సు(విజ్ఞానము) తీవ్రత ఎంత ఉందో చూడండి. అణుబాంబులు మొదలైన వాటి శబ్ధము ఎంత ఎక్కువగా ఉంటుంది. పిల్లలైన మీరు సైలెన్స్‌(శాంతి)శక్తి ద్వారా ఈ సైన్సు శక్తి పై విజయము పొందుతారు. సైలెన్సు శక్తిని యోగము అని కూడా అంటారు. బాబా మీరు వచ్చినట్లయితే మేము శాంతిధామానికి వెళ్ళి నివసిస్తాము అని ఆత్మ తండ్రిని తలంపు చేస్తుంది. పిల్లలైన మీరు ఈ యోగబలము ద్వారా, సైలెన్సు శక్తి ద్వారా సైన్సు శక్తి పై విజయము పొందుతారు. శాంతి శక్తిని ప్రాప్తించుకుంటారు. విజ్ఞానము ద్వారానే ఇదంతా వినాశనము కానున్నది. సైలెన్సు ద్వారా పిల్లలైన మీరు విజయము పొందుతారు. బాహుబలము ద్వారా ఎప్పుడూ విశ్వము పై విజయాన్ని పొందలేరు. ఈ పాయింట్లు కూడా మీరు ప్రదర్శినిలో వ్రాయాలి.
ఢిల్లీలో చాలా సేవ చేయవచ్చు ఎందుకంటే ఢిల్లీ అన్నిటికీ రాజధాని, మీ రాజధాని కూడా ఢిల్లీనే ఉంటుంది. ఢిల్లీని ఫరిస్తాన్‌ అని అంటారు. పాండవులకు కోట ఉండదు. ఎప్పుడు శత్రువులు ఆక్రమణ చేస్తారో అప్పుడే కోట నిర్మించబడుతుంది. మీకు కోటలు మొదలైనవి అవసరముండదు. మనము సైలెన్స్‌ శక్తి ద్వారా మన రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము. వారిది కృత్రిమమైన సైలెన్స్‌(ఆర్టిఫిషియల్‌ సైలెన్స్‌) అని మీకు తెలుసు. మీది నిజమైన శాంతి(రీయల్‌ సైలెన్స్‌). జ్ఞాన శక్తి, శాంతి శక్తి అని అంటారు. జ్ఞానము అనగా చదువు. చదువు ద్వారానే శక్తి లభిస్తుంది. పోలీసు సూపరిండెంటు అవుతారు, అతనికి ఎంతటి శక్తి ఉంటుంది. అవన్నీ దుఃఖాన్ని ఇచ్చే దేహ సంబంధమైన విషయాలు. మీ ప్రతి మాట ఆత్మికము. మీ నోటి ద్వారా ఏ మాట వెలువడినా ఆ ఒక్కొక్క మాట వినేవారు సంతోషపడే విధంగా ఫస్ట్‌క్లాస్‌గా, మధురంగా ఉండాలి. ఎలాగైతే బాబా దుఃఖహర్త-సుఖకర్త అయ్యారో, అలా మీరు కూడా అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. మీ కుటుంబ పరివారములోని వారికి కూడా దుఃఖము మొదలైనవి కలగరాదు. అందరితో నియమానుసారము వ్యవహరించాలి. పెద్దలతో ప్రీతిగా వ్యవహరించాలి. అందరూ సంతోషపడే విధంగా మధురమైన ఫస్ట్‌క్లాస్‌ మాటలు నోటి నుండి వెలువడాలి. శివబాబా - మన్మనాభవ అని చెప్తున్నారని అందరికీ చెప్పండి. నేను సర్వ శ్రేష్ఠుడను. నన్ను స్మృతి చేయడం ద్వారానే మీ వికర్మలు వినాశనమవుతాయి. అందరితో చాలా ప్రేమగా మాట్లాడాలి. ఎవరైనా పెద్దవారు ఉన్నట్లయితే వారికి - అన్నగారూ! నన్ను స్మృతి చేయండి అని శివబాబా చెప్తున్నారని చెప్పండి. రుద్రుడు అని పిలువబడే శివబాబాయే జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తారు కృష్ణ జ్ఞాన యజ్ఞము అనే మాట విని ఉండము. రుద్ర జ్ఞాన యజ్ఞము అని అంటారు. కనుక రుద్రుడైన శివబాబా ఈ యజ్ఞాన్ని రచించారు. రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు జ్ఞానము మరియు యోగాన్ని నేర్పిస్తున్నారు. ఈ దాదా కూడా చెప్తున్నారు - భగవానువాచ! నన్ను ఒక్కరినే స్మృతి చేయండి ఎందుకంటే ఇప్పుడిది అందరి అంతిమ సమయము, వానప్రస్థ అవస్థ. అందరూ వాపస్‌ వెళ్ళాలి. మరణించే సమయంలో ఈశ్వరుని స్మృతి చేయండి అని మనుష్యులకు చెప్తారు. ఇక్కడ మృత్యువు సమీపంలో నిల్చుకొని ఉంది, దీని నుండి ఎవ్వరూ తప్పించుకోలేరని స్వయం ఈశ్వరుడే చెప్తున్నారు. పిల్లలారా, నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయి. దీనిని యోగాగ్ని అని అంటారు. దీని ద్వారా మీ పాపాలు దగ్ధమౌతాయని తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు. వికర్మలు వినాశనము చేసుకునేందుకు పావనంగా అయ్యేందుకు ఇతర ఏ ఉపాయమూ లేదు. పాపాల భారము తల పై పెరుగుతూ, పెరుగుతూ మలినాలు చేరుతూ చేరుతూ బంగారు 9 క్యారెట్లదిగా అయిపోయింది. ఇంకా తగ్గితే గిల్టు(ములమ్మా) వేయబడిన బంగారు అని అనబడ్తుంది. ఇప్పుడు మళ్లీ 24 క్యారెట్ల బంగారుగా ఎలా అవ్వాలి, ఆత్మ పవిత్రంగా ఎలా అవ్వాలి? పవిత్ర ఆత్మకు ఆభరణము(శరీరము) కూడా పవిత్రమైనదే లభిస్తుంది.
మీ బంధు-మిత్రులు మొదలైనవారు ఎవరైనా ఉంటే వారితో చాలా నమ్రతతో, ప్రీతితో నవ్వుతూ మాట్లాడాలి. వారికి ఆ మహాభారత యుద్ధము ఇదే అని అర్థము చేయించాలి. రుద్ర జ్ఞాన యజ్ఞము కూడా ఇదే. తండ్రి ద్వారా మనకు సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానము లభిస్తూ ఉంది. ఇంకెక్కడా ఈ జ్ఞానము లభించదు. నేను మీకు సత్యము చెప్తున్నాను.ఈ భక్తి మొదలైనవి జన్మ-జన్మాంతరాలుగా చేశారు. ఇప్పుడు జ్ఞానము ప్రారంభమవుతుంది. భక్తి రాత్రి(చీకటి) వంటిది, జ్ఞానము పగలు(వెలుతురు) వంటిది. సత్యయుగంలో భక్తి ఉండదు. ఈ విధంగా యుక్తిగా మాట్లాడాలి. అవకాశమొచ్చినప్పుడు బాణము వేయవలసి వచ్చినప్పుడు సమయాన్ని, అవకాశాన్ని గమనించవలసి ఉంటుంది. జ్ఞానమిచ్చేందుకు కూడా చాలా యుక్తి కావాలి. తండ్రి అందరికీ యుక్తులేమో తెలుపుతూనే ఉంటారు. పవిత్రత చాలా మంచిది, ఈ లక్ష్మినారాయణులు మనకు అందరికంటే గొప్ప పూజ్యులుగా ఉన్నారు కదా. పూజ్యులుగా, పావనులుగా ఉన్నవారే మళ్లీ పూజారులుగా, పతితులుగా అయ్యారు. పతితులు పావనుల ముందు కూర్చొని పూజించడం అంతగా శోభించదు. చాలామంది పతితులను చూస్తూనే దూరంగా పారిపోతారు. వల్లభాచారి ఎప్పుడూ తన పాదాలను కూడా ముట్టుకోనివ్వరు. వీరు ఛీ-ఛీ(పతిత) మనుష్యులని భావిస్తారు. మందిరాలలో కూడా మూర్తిని తాకేందుకు బ్రాహ్మణులకు మాత్రమే అనుమతి ఉంటుంది. శూద్ర మనుష్యులను ముట్టుకోనివ్వరు. బ్రాహ్మణులే విగ్రహాలకు స్నానము(అభిషేకము) మొదలైనవి చేయిస్తారు. ఇతరులనెవ్వరినీ లోపలకు పోనివ్వరు. తేడా ఉంది కదా. వారు కుఖవంశావళి(గర్భజనిత) బ్రాహ్మణులు. మీరు ముఖవంశావళి పవిత్ర బ్రాహ్మణులు. మీరు ఆ బ్రాహ్మణులకు, బ్రాహ్మణులలో రెండు రకాలున్నారు, ఒకరు ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళి, రెండవ వారు కుఖవంశావళి అని బాగా అర్థము చేయించవచ్చు. బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులు అత్యంత ఉన్నతమైన శిఖరము వంటివారు. యజ్ఞము రచించేందుకు కూడా బ్రాహ్మణులనే నియమిస్తారు. ఇది జ్ఞాన-యజ్ఞము. బ్రాహ్మణులకు జ్ఞానము లభిస్తుంది. ఆ జ్ఞానముతో వారు మళ్లీ దేవతలుగా అవుతారు. వర్ణాల గురించి కూడా అర్థము చేయించబడింది. సేవాధారి పిల్లలకు సదా సేవ చేయాలనే ఆసక్తి ఉంటుంది. ఎక్కడ ప్రదర్శిని జరిగినా వెంటనే సేవ చేసేందుకు పరుగెడ్తారు,....... మేము వెళ్లి ఈ పాయింట్లు అర్థము చేయించాలని భావిస్తారు. ప్రదర్శిని ప్రజలను తయారు చేసుకునేందుకు విహంగ మార్గము. అనేకమంది వారంతట వారే వచ్చేస్తారు. కనుక అర్థము చేయించేవారు కూడా బాగుండాలి. ఎవరైనా బాగా అర్థము చేయించకపోతే బి.కెల వద్ద ఉన్న జ్ఞానము ఇదేనా అని అంటారు. డిస్‌సర్వీసు అయిపోతుంది. కనుక ప్రదర్శినిలో అర్థం చేయించే గైడ్స్‌ను గమనించే ఒక చురుకైన వారుండాలి. ఎవరైనా పెద్ద మనిషి వస్తే వారికి అర్థము చేయించేందుకు మంచి గైడునివ్వాలి. తక్కువగా అర్థము చేయించేవారిని తొలగించాలి. సూపర్‌వైజ్‌ చేసేందుకు ఒక మంచి వ్యక్తి ఉండాలి. మీరు మహాత్ములను కూడా పిలవాలి. మీరు కేవలం బాబా ఇలా చెప్తున్నారని చెప్పండి. వారు అత్యంత ఉన్నతమైన భగవంతుడు, అతనే రచయిత. ఇక మిగిలినవారంతా వారి రచన. వారసత్వం తండ్రి నుండి లభిస్తుంది. సోదరులు, సోదరులకు వారసత్వమేమిస్తారు! సుఖధామాన్ని వారసత్వంగా ఎవ్వరూ ఇవ్వలేరు. వారసత్వమును ఇచ్చేవారు తండ్రి మాత్రమే. సర్వులకు సద్గతినిచ్చేది ఒక్క తండ్రి మాత్రమే. వారిని స్మృతి చేయాలి. తండ్రి స్వయంగా వచ్చి బంగారు యుగాన్ని తయారుచేస్తారు. బ్రహ్మ తనువు ద్వారా స్వర్గ స్థాపన చేస్తారు. శివజయంతిని కూడా జరుపుకుంటారు. కాని వారు వచ్చి ఏం చేస్తారో ఈ మనుష్యులందరూ మర్చిపోయారు. శివబాబాయే వచ్చి రాజయోగాన్ని నేర్పించి వారసత్వమునిస్తారు. 5 వేల సంవత్సరాల క్రితము భారతదేశము స్వర్గంగా ఉండేది, లక్షల సంవత్సరముల మాటే లేదు. తిథి-తారీఖులు అన్నీ ఉన్నాయి, దీనిని ఎవ్వరూ ఖండించలేరు. నూతన ప్రపంచము మరియు పాత ప్రపంచము సగము-సగము ఉండాలి. వారు సత్యయుగం ఆయువును లక్షల సంవత్సరాలని అనేయడం వలన ఏ లెక్కా కుదరదు. స్వస్తిక్‌లో కూడా పూర్తి 4 భాగాలున్నాయి. ప్రతి యుగానికి 1250 సంవత్సరాలు పంచడం జరిగింది. లెక్క వేయబడుతుంది కదా. వారికి ఈ లెక్కలు కొంచెం కూడా తెలియదు. అందుకే గవ్వ సమానమని అంటారు. ఇప్పుడు తండ్రి వజ్ర సమానముగా తయారు చేస్తున్నారు. అందరూ పతితులే, భగవంతుని స్మృతి చేస్తూ ఉంటారు. వారిని భగవంతుడు వచ్చి జ్ఞానము ద్వారా పుష్పాలుగా చేస్తున్నారు. పిల్లలైన మిమ్ములను జ్ఞాన రత్నాలతో అలంకరిస్తున్నారు. మళ్లీ మీరు ఎలా అవుతారో చూడండి, మీ ముఖ్య లక్ష్యము ఏది? భారతదేశము ఎంత తలమానికంగా ఉండేదో అందరూ మర్చిపోయారు. ముసల్మానులు మొదలైనవారు కూడా ఎంతగా సోమనాథ మందిరాన్ని లూటీ చేసి మసీదులు మొదలైన వాటిలో వజ్రాలు మొదలైనవాటిని పొదిగారు. ఇప్పుడు వాటి విలువ ఎవ్వరూ కట్టలేరు కూడా. ఎంతో పెద్ద పెద్ద మాణులు రాజుల కిరీటాలలో ఉండేవి. కొన్ని కోటి రూపాయల విలువ చేసేవి, కొన్ని 5 కోట్ల విలువ చేసేవి కూడా ఉండేవి. ఈ రోజుల్లో అన్నీ నకిలీవి(ఇమిటేషన్‌) వెలువడ్డాయి. ఈ ప్రపంచంలో ఉన్న సుఖం కృత్రిమమైనది. పైసా విలువ చేసే సుఖము, మిగిలినదంతా దుఃఖమే. అందుకే సన్యాసులు కూడా కాకిరెట్టతో సమానమైన సుఖముందని అంటారు. అందుకే వారు ఇల్లు-వాకిళ్ళను వదిలేస్తారు, కానీ ఇప్పుడు వారు కూడా తమోప్రధానమైపోయారు. పట్టణాలలోకి చొరబడినారు. మరి ఇప్పుడు ఎవరికి వినిపించాలి, రాజా-రాణులైతే ఎవ్వరూ లేరు. ఎవ్వరూ ఒప్పుకోరు కూడా. అందరికీ తమ-తమ అభిప్రాయాలున్నాయి. ఎవ్వరూ ఒప్పుకోరు. ఎవరు ఎలా కావాలంటే అలా చేసుకుంటూ ఉంటారు. సంకల్పముతో సృష్టి అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీతో తండ్రి గుప్తంగా పురుషార్థము చేయిస్తూ ఉంటారు. మీరు ఎంత సుఖాన్ని అనుభవిస్తారు. ఇతర ధర్మాలు కూడా చివరిలో ఎప్పుడైతే వృద్ధి చెందుతాయో అప్పుడు యుద్ధాలు మొదలైన గొడవలు ప్రారంభమవుతాయి. మూడు భాగాల సమయము సుఖంలో ఉంటారు. అందుకే మీ దేవీదేవతా ధర్మము చాలా సుఖమునిచ్చేదని తండ్రి చెప్తున్నారు. నేను మిమ్ములను విశ్వాధికారులుగా చేస్తాను. ఇతర ధర్మస్థాపకులు ఏ రాజ్యాన్నీ స్థాపించరు. వారు సద్గతి చెయ్యలేరు. కేవలం తమ ధర్మాన్ని స్థాపించేందుకే వస్తారు. అవి కూడా చివర్లో తమోప్రధానమైనప్పుడు సతోప్రధానంగా చేసేందుకు తండ్రి రావలసి ఉంటుంది.
మీ వద్దకు వందల మంది మనుష్యులు వస్తారు కానీ ఏమీ అర్థము చేసుకోరు. బాబాకు ఫలానావారు చాలా బాగా అర్థము చేసుకుంటున్నారు, చాలా మంచివారు అని వ్రాస్తారు. బాబా చెప్తారు - ఏమీ అర్థము చేసుకోలేదు. ఒకవేళ బాబా వచ్చి ఉన్నారు, విశ్వాధికారులుగా తయారు చేస్తున్నారని అర్థము చేసుకుంటే వెంటనే(అదే సమయంలో) నషా పెరిగిపోవాలి. వెంటనే టికెట్‌ తీసుకుని ఇక్కడకు పరుగెత్తి రావాలి. కానీ తండ్రితో కలిసేందుకు బ్రాహ్మణి వద్ద నుండి జాబు తప్పకుండా తీసుకు రావాల్సి ఉంటుంది. తండ్రిని గుర్తించి ఉంటే మిలనము చేయకుండా ఉండలేరు, ఒక్కసారిగా నషా పెరిగిపోవాలి. ఎవరికి నషా ఎక్కి ఉంటుందో వారికి ఆంతరికములో చాలా సంతోషముంటుంది. వారి బుద్ధి బంధు-మిత్రులు మొదలైనవారి వైపు పరిగెత్తదు. కానీ చాలా మంది బుద్ధి తిరుగుతూనే ఉంటుంది. గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి, అంతేకాక తండ్రి స్మృతిలో ఉండాలి. వాస్తవానికి చాలా సులభము. ఎంత సాధ్యమైతే అంత తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఎలాగైతే ఆఫీసులో శెలవు తీసుకుంటారో, అలా మీ వ్యాపార వ్యవహారాల నుండి శెలవు తీసుకొని 1-2 రోజులు స్మృతియాత్రలో కూర్చోండి. క్షణ-క్షణము స్మృతిలో కూర్చునేందుకు రోజంతా బాబాను స్మృతి చేయాలనే వ్రతము పెట్టుకోవాలి. అప్పుడు ఎంతో జమ అవుతుంది. వికర్మలు కూడా వినాశమౌతాయి. తండ్రి స్మృతి ద్వారానే సతోప్రధానంగా అవ్వాలి. పూర్తి రోజంతా ఎవ్వరూ యోగము చేయలేరు. మాయ తప్పకుండా విఘ్నాలు వేస్తూ ఉంటుంది, అయినా పురుషార్థము చేస్తూ చేస్తూ విజయము పొందుకునేస్తారు. చాలు, ఈ రోజంతా తోటలో కూర్చుని తండ్రిని స్మృతి చేస్తాను. భోజనము తినే సమయంలో కూడా స్మృతిలో కూర్చునేస్తాను. ఇదే శ్రమ. మనము తప్పకుండా పావనముగా అవ్వాలి. కష్టపడాలి, ఇతరులకు కూడా దారి చూపించాలి. బ్యాడ్జ్‌ చాలా మంచి వస్తువు. మార్గములో కూడా పరస్పరములో మాట్లాడుకుంటూ ఉంటే చాలామంది వచ్చి వింటారు. తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేయండి - ఈ సందేశము లభిస్తే మనము బాధ్యత నుండి విడుదల అవుతాము.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
అవ్యక్త స్థితిని అనుభవం చేసేందుకు విశేషమైన హోంవర్క్‌
అమృతవేళలో నిద్ర లేచినప్పటి నుండి ప్రతి కర్మ, ప్రతి సంకల్పము, ప్రతి మాటలో రెగ్యులర్‌గా అవ్వండి. ఒక్క మాట కూడా వ్యర్థమైనది వెలువడరాదు. ఎలాగైతే గొప్ప వ్యక్తులు మాట్లాడే మాటలు ఫిక్సెడ్‌గా ఉంటాయో, అలా మీ మాటలు ఫిక్స్‌గా ఉండాలి, అదనంగా మాట్లాడరాదు.


ధారణ కొరకు ముఖ్య సారము :-
1. వ్యాపారము మొదలైనవాటి నుండి శెలవు లభిస్తే స్మృతియాత్రలో ఉండే వ్రతము తీసుకోవాలి. మాయ పై విజయము ప్రాప్తి చేసుకునేందుకు స్మృతిలో ఉండే శ్రమ చేయాలి.
2. చాలా నమ్రత మరియు ప్రేమ భావముతో మందహాసము చేస్తూ బంధు-మిత్రులకు సేవ చేయాలి. వారిలో బుద్ధిని భ్రమించనీయరాదు. ప్రీతితో తండ్రి పరిచయమును ఇవ్వాలి.

వరదానము :- '' లౌకికాన్ని అలౌకికంలోకి పరివర్తన చేసి అన్ని బలహీనతల నుండి ముక్తులయ్యే మాస్టర్‌ సర్వశక్తివాన్‌ భవ ''
ఎవరైతే మాస్టర్‌ సర్వశక్తివాన్‌, జ్ఞానసంపన్న ఆత్మలుగా ఉంటారో, వారు ఎలాంటి బలహీనతకు గాని, సమస్యలకు గాని వశీభూతులుగా అవ్వరు. ఎందుకంటే వారు అమృతవేళ నుండి ఏం చూస్తారో, వింటారో, ఆలోచిస్తారో లేక కర్మలు చేస్తారో వాటిని లౌకికం నుండి అలౌకికంలోకి పరివర్తన చేస్తారు. ఏ లౌకిక వ్యవహారమైనా నిమిత్తమాత్రం చేస్తున్నా, అలౌకిక కార్యము సదా స్మృతిలో ఉంటే ఏ విధమైన మాయావి వికారాలకు వశీభూతమైన వ్యక్తి సంపర్కము ద్వారా స్వయం వశీభూతులుగా అవ్వరు. తమోగుణి వైబ్రేషన్లలో కూడా సదా కమలపుష్ప సమానంగా ఉంటారు. లౌకిక బురదలో ఉంటున్నా దాని నుండి భిన్నంగా(అతీతంగా), వేరుగా ఉంటారు.

స్లోగన్‌ :- '' అందరినీ తృప్తి(సంతుష్ట) పరిస్తే పురుషార్థంలో స్వతహాగా హైజంప్‌ జరుగుతుంది ''

Saturday, 25 January 2020

Telugu Murli 26/01/2020

26-01-2020 ని అవ్యక్తబాప్‌దాదా కు ఓంశాంతి రివైజ్‌: 13-11-1985 మధువనము

'' సంకల్పాలు, సంస్కారాలు, సంబంధాలు, మాటలు మరియు కర్మలలో నవీనతను తీసుకు రండి ''
ఈ రోజు కొత్త ప్రపంచానికి, కొత్త రచనకు రచయిత అయిన తండ్రి తమ కొత్త ప్రపంచానికి అధికారులైన పిల్లలను అనగా కొత్త రచనను చూస్తున్నారు. కొత్త రచన సదా ప్రియంగా అనిపిస్తుంది. ప్రపంచం లెక్కలో పాత యుగములో కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు. కానీ మీరు కొత్త రచన యొక్క కొత్త యుగమును, కొత్త జీవితమును అనుభవం చేస్తున్నారు. అంతా కొత్తగా అయిపోయింది. పాతదంతా సమాప్తమై కొత్త జన్మ, కొత్త జీవితం ప్రారంభమయింది. జన్మ కొత్తదైనందున జన్మ ద్వారా జీవితము స్వతహాగా మారుతుంది. జీవితం మారడం అనగా సంకల్పాలు, సంస్కారాలు, సంబంధాలు అన్నీ మారిపోయాయి. అనగా కొత్తగా అయిపోయాయి. ధర్మమూ కొత్తదే, కర్మా కొత్తదే. వారు కేవలం కొత్త సంవత్సరమని అంటారు. కానీ మీ అందరి కొరకు అంతా కొత్తగా అయిపోయింది. ఈ రోజు అమృతవేళ నుండి కొత్త సంవత్సర శుభాకాంక్షలనైతే తెలిపారు. కానీ కేవలం నోటితోనే శుభాకాంక్షలు తెలిపారా లేక మనస్సు ద్వారా తెలిపారా? నవీన సంకల్పాలు చేశారా? విశేషమైన ఈ మూడు విషయాల నవీన సంకల్పాలను చేశారా? సంకల్పాలు, సంస్కారాలు మరియు సంబంధాలు సంస్కారాలు మరియు సంకల్పాలు కొత్తగా అనగా శ్రేష్ఠంగా అయిపోయాయి. కొత్త జన్మ, కొత్త జీవితము ఉండి కూడా ఇప్పటి వరకూ పాత జన్మ లేక జీవితములోని సంకల్పాలు, సంస్కారాలు మరియు సంబంధాలు మిగిలిపోలేదు కదా! ఒకవేళ ఈ మూడు విషయాలలో ఏ విషయంలోనైనా అంశమాత్రముగానైనా పాతదనం మిగిలి ఉన్నట్లయితే ఈ అంశము కొత్త జీవితము, కొత్త యుగము, కొత్త సంబంధాల, కొత్త సంస్కారాల సుఖము లేక సర్వ ప్రాప్తుల నుండి వంచితులుగా చేసేస్తుంది. చాలా మంది పిల్లలు బాప్‌దాదా ముందు ఇలా తమ మనసులోని మాటలను ఆత్మిక సంభాషణలో చెప్తూ ఉంటారు. బయటికి చెప్పరు. బయట నుండి ఎవరైనా ఎలా ఉన్నారని అడిగినప్పుడు అందరూ చాలా బాగున్నామనే అంటారు. ఎందుకంటే బాహర్యాములైన ఆత్మలకు లోపల ఏముందో తెలియదని తెలుసు. కానీ తండ్రితో ఆత్మిక సంభాషణ చేయునప్పుడు దాచలేరు. బ్రాహ్మణులుగా అయితే అయిపోయాము, శూద్ర తనము నుండి దూరమయ్యాము, కానీ బ్రాహ్మణ జీవితము యొక్క మహానత, విశేషతలైన సర్వ శ్రేష్ఠ ప్రాప్తులు లేక అంతీంద్రియ సుఖము, ఫరిస్తా జీవితము, డబల్‌ లైట్‌ జీవితాల విశేషమైన అనుభవం ఎంతగా ఉండాలో అంతగా జరగడం లేదని తమ మనసులోని విషయాలను చెప్తారు. ఈ శ్రేష్ఠ యుగము, శ్రేష్ఠ జీవితాల వర్ణన ఏదైతే ఉందో అటువంటి అనుభవము, అటువంటి స్థితి చాలా కొద్ది సమయమే కలుగుతుంది. దీనికి కారణమేమి? బ్రాహ్మణులుగా అయినా బ్రాహ్మణ జీవిత అధికారము అనుభవమవ్వడం లేదు. ఎందుకు? రాజు పిల్లలుగా ఉంటూ భికారుల సంస్కారమున్నట్లయితే వారిని ఏమంటారు? రాకుమారులని అంటారా? ఇక్కడ కూడా కొత్త జన్మ, కొత్త బ్రాహ్మణ జీవితము లభించాయి. అయినా పాత సంకల్పాలు లేక సంస్కారాలు ప్రత్యక్షమవుతూ ఉంటే లేక అవి కర్మలలోకి వస్తూ ఉంటే లేక సంస్కారాలు ఎమర్జ్‌ అవుతూ ఉంటే లేక అవి కర్మలలో కనిపిస్తూ ఉంటే వారిని బ్రహ్మాకుమారులని అంటారా? లేక సగం శూద్రకుమారులు సగం బ్రహ్మకుమారులని అంటారా? సగం తెల్లగా, సగం నల్లగా డ్రామాలో ఒక ఆటను చూపిస్తారు కదా! సంగమ యుగమని దీనినైతే భావించడం లేదు కదా! సంగమ యుగమనగా కొత్త యుగము. యుగము కొత్తదైతే అన్నీ కొత్తవిగానే ఉంటాయి.

'నూతన సంవత్సర శుభాకాంక్షలు' అనే స్వరాన్ని(శబ్ధాన్ని) బాప్‌దాదా ఈ రోజు అందరి నుండి వింటున్నారు. కార్డులు కూడా పంపిస్తారు, ఉత్తరాలు కూడా వ్రాస్తారు కానీ చెప్పడం మరియు చేయడం రెండూ ఒక్కటిగా ఉన్నాయా? అభినందనలు తెలిపారు. చాలా బాగా చేశారు. బాప్‌దాదా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందరి నోటి మాటలలో అవినాశి భవ అనే వరదానముంది. మీ నోటిలో గులాబ్‌జామ్‌ అని మీరు అంటారు కదా! అలా మీ నోటిమాటలలో అవినాశి వరాదనాలుండాలని బాప్‌దాదా అంటారు. ఈనాటి నుండి కేవలం 'కొత్త' అన్న ఈ ఒక్క పదమును గుర్తుంచుకోండి. ఏ సంకల్పాలు చేసినా, ఏం మాట్లాడినా, ఏ కర్మలు చేసినా కొత్తగా ఉన్నాయా అని పరిశీలించుకోండి, గుర్తుంచుకోండి. ఇదే లెక్కాచారాల పుస్తకము(చౌపడా). ఈ రిజష్టరును ఈ రోజు నుండి ప్రారంభించండి. దీపావళినాడు లెక్కాచారాల పుస్తకాలను(చౌపడే) ఏం చేస్తారు? వాటి పై స్వస్తిక్‌ను దిద్దుతారు కదా! (గణేష్‌) వినాయకుని చిత్రాన్ని గీస్తారు మరియు నాలుగు యుగాలలో బిందువును తప్పకుండా దిద్దుతారు. అలా ఎందుకు దిద్దుతారు? ఏ కార్యమును ప్రారంభించే సమయములోనైనా స్వస్తిక్‌ లేక గణేశాయ నమః అని తప్పకుండా అంటారు. ఇది ఎవరి స్మృతి చిహ్నము? స్వస్తిక్‌ను కూడా గణేష్‌ అని ఎందుకంటారు? స్వస్థికము స్వస్థితిలో స్థితులయ్యేందుకు మరియు పూర్తి రచన యొక్క జ్ఞానానికి సూచకము(గుర్తు). వినాయకుడు జ్ఞాన సంపన్నుడు. ఈ ఒక్క స్వస్తిక్‌ చిత్రములో పూర్తి జ్ఞానమంతా ఇమిడి ఉంది. నాలెడ్జ్‌ఫుల్‌కు(జ్ఞానసంపన్నులు) స్మృతి చిహ్నంగా వినాయకుడిని లేక స్వస్తిక్‌ను చూపిస్తారు. దీని అర్థమేమిటి ? ఏ కార్యము సఫలమవ్వాలన్నా దానికి ఆధారం నాలెడ్జ్‌ఫుల్‌ అనగా వివేకవంతులుగా, జ్ఞానస్వరూపులుగా అవ్వడం. జ్ఞానస్వరూపులుగా, వివేకవంతులుగా అయినట్లయితే ప్రతి కర్మ శ్రేష్ఠంగా మరియు సఫలంగా అవుతుంది కదా! వారైతే కేవలం కాగితము పై స్మృతిచిహ్నాన్ని దిద్దుతారు. కానీ బ్రాహ్మణ ఆత్మలైన మీరు స్వయం జ్ఞాన సంపన్నులుగా అయి ప్రతి సంకల్పాన్ని చేసినట్లయితే సంకల్పము మరియు సఫలత రెండూ జత జతలో అనుభవం చేస్తారు. కావున నేటి నుండి ఈ దృఢ సంకల్పమనే రంగు ద్వారా మీ జీవితమనే పుస్తకము పై ప్రతి సంకల్పము, సంస్కారము కొత్తగానే ఉండాలి. అవుతుందని కూడా కాదు. అవ్వాల్సిందే, జరగాల్సిందే. స్వస్థితిలో స్థితులై ఈ శ్రీగణేష్‌ను అనగా ప్రారంభము చేయండి. స్వయం శ్రీగణేష్‌గా అయి ప్రారంభించండి. ఇదైతే జరుగుతూనే ఉంటుందని ఆలోచించకండి. సంకల్పాలను ఎన్నోసార్లు చేస్తూ ఉంటారు. కానీ సంకల్పాలు దృఢంగా ఉండాలి. ఎలాగైతే ఫౌండేషన్‌(పునాది)లో సిమెంట్‌ మొదలైన వాటిని పక్కాగా ధృఢంగా చేస్తారో, అలా ధృఢ సంకల్పము చేయాలి. ఇసుకతో ఫౌండేషన్‌ వేసినట్లయితే అది ఎంత కాలము కొనసాగుతుంది? కావున ఏ సమయంలో అయితే సంకల్పాలు చేస్తారో ఆ సమయంలో, చేసి చూస్తాము, ఎంత వీలైతే అంత చేస్తాము, ఇతరులు కూడా ఇలాగే చేస్తున్నారు కదా అని అంటారు. ఈ విధమైన ఇసుకను కలిపేస్తారు. అందువలన ఫౌండేషన్‌ పక్కాగా ఉండదు. ఇతరులను చూడడం సులభమనిపిస్తుంది. తమను తాము చూసుకోవడం శ్రమ అనిపిస్తుంది. ఒకవేళ ఇతరులను చూడాలనుకుంటే, అ అలవాటుకు వశమై ఉంటే బ్రహ్మాబాబాను చూడండి. అతను కూడా వేరే వారే కదా! అందువలన బాప్‌దాదా దీపావళి లెక్కాచారాన్ని చూశారు. లెక్కాచారంలో విశేష కారణము బ్రాహ్మణులుగా అయినా బ్రాహ్మణ జీవిత అనుభూతి కలగకపోవడం, ఎంత కలగాలో అంత జరగకపోవడం, ఇందుకు విశేష కారణం - పరదృష్టి, పరచింతన పరుల వద్దకు వెళ్లడం, పరిస్థితుల వర్ణన మరియు మననములో ఎక్కువగా ఉంటారు. అందువలన స్వదర్శన చక్రధారులుగా అవ్వండి. స్వ ద్వారా పర సమాప్తమైపోతుంది. ఎలాగైతే అందరూ కలిసి ఈ రోజు కొత్త సంవత్సరం సందర్భంగా అభినందనలు తెలిపారో అలా ప్రతిరోజూ కొత్త రోజు, కొత్త జీవితము, కొత్త సంకల్పము, కొత్త సంస్కారాలను స్వతహాగానే అనుభవం చేసుకుంటారు. మనసు ద్వారా ప్రతి ఘడియ తండ్రి పట్ల, బ్రాహ్మణ పరివారం పట్ల అభినందనలతో కూడుకున్న శుభ ఉత్సాహము స్వతహాగానే ఉత్పన్నమవుతూ ఉంటుంది. అందరి దృష్టిలో అభినందనలు, శుభాకాంక్షలు, గ్రీటింగుల అల ఉంటుంది. కావున ఈ విధంగా ఈనాటి అభినందనా ఫలాలను అవినాశిగా చేయండి. అర్థమయిందా? మనుష్యులైతే కొత్త పుస్తకాలను ఉంచుకుంటారు. తండ్రి లెక్కాచారాలు చూపారు. సర్వస్వమూ లభిస్తూ కూడా అసంపూర్ణంగా ఎందుకు తీసుకుంటున్నారు? అని బాప్‌దాదాకు పిల్లల పై దయ లుగుతుంది. బ్రహ్మాకుమారీలు, కుమారులు అన్న కొత్త పేరు ఉంది కానీ పని మిక్స్‌గా ఉంది. దాత పిల్లలు, విధాత పిల్లలు, వరదాత పిల్లలు మరి కొత్త సంవత్సరంలో ఏం గుర్తుంచుకుంటారు? అన్నీ కొత్తగా చేయాలి అనగా బ్రాహ్మణ జీవిత మర్యాదలలో అన్నీ కొత్తవే. కొత్తదనము అనగా ఎటువంటి కల్తీ చేయకుండా ఉండడం. చాలా చతురులుగా కూడా అయిపోయారు కదా. తండ్రిని కూడా చదివిస్తారు. చాలామంది పిల్లలు - కొత్తవి చేయాలని బాబా చెప్పారు కదా! కావున మేము ఈ కొత్తవి చేస్తున్నామని అంటారు. కానీ కొత్తవి కూడా బ్రాహ్మణ జీవితములోని మర్యాదల అనుసారంగా కొత్తగా ఉండాలి. బ్రాహ్మణ జీవితము మరియు బ్రాహ్మణ జన్మ ద్వారా బాప్‌దాదా మర్యాదల రేఖను ఇచ్చేశారు. కొత్త సంవత్సరం ఎలా జరుపుకోవాలో అర్థమయిందా! 18వ అధ్యాయం ప్రారంభమవుతోందని వినిపించారు కదా!

గోల్డెన్‌ జూబ్లీ (స్వర్ణిమ జయంతి) కంటే ముందు విశ్వవిద్యాలయము యొక్క స్వర్ణిమ జయంతి ఉంది. కేవలం 50 సంవత్సరాలు నిండిన వారి స్వర్ణ జయంతి అని భావించకండి. ఇది ఈశ్వరీయ కార్యానికి గోల్డెన్‌ జూబ్లీ. స్థాపనా కార్యంలో సహయోగులెవరైతే ఉన్నారో వారు 2 సవత్సరాలు వారైనా, లేక 50 సంవత్సరాల వారైనా అందరూ స్వయాన్ని బ్రహ్మాకుమారులుగానే పిలుచుకుంటారు కదా! లేక ఇంకేమైనా పేరు ఉందా? కావున ఇది బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుల రచనకు స్వర్ణ జయంతి. ఇందులో బ్రహ్మాకుమారులు, కుమారీలు ఉన్నారు. గోల్డెన్‌ జూబ్లీ వరకు స్వయంలో స్వర్ణిమ యుగము అనగా సతోప్రధాన సంకల్పాలను, సంస్కారాలను, ఎమర్జ్‌(ఉత్పన్నం) చేసుకోవాలి. ఇటువంటి గోల్డెన్‌ జూబ్లీని జరుపుకోవాలి. ఇది కేవలం నిమిత్తమాత్రంగా, ఆచార రూపంలో జరుపుకుంటారు. కానీ వాస్తవికమైన గోల్డెన్‌ జూబ్లీ అంటే స్వర్ణిమ యుగం వారిగా అయ్యే జూబ్లీ. కార్యం సఫలమవ్వడం అనగా కార్యార్థము నిమిత్తంగా ఉన్న ఆత్మలు సఫలతా స్వరూపులుగా అవ్వాలి. ఇప్పుడు కూడా సమయముంది. ఈ మూడు మాసాలలో ప్రపంచమనే స్టేజి పై అతీతమైన గోల్డెన్‌జూబ్లీని జరిపి చూపించండి. ప్రపంచంలోనివారు గౌరవిస్తారు. ఇక్కడ సమాన స్థితిని ప్రత్యక్షము చేయాలి. గౌరవమునిచ్చేందుకు ఏం చేసినా అదంతా నిమిత్త మాత్రమే. వాస్తవికతను ప్రపంచం ముందు చూపించాలి. మనమంతా ఒక్కటే, ఒక్కరికి చెందిన వారము, ఏకరస స్థితి గలవారము. ఒక్కరి లగ్నంలో మగ్నమై ఉండి ఒక్కరి పేరును ప్రత్యక్షము చేసేవారము. ఈ అతీతమైన మరియు ప్రియమైన స్వర్ణిమ స్థితి అనే జెండాను ఎగురవేయండి. స్వర్ణిమ ప్రపంచ దృశ్యాలు మీ కనుల ద్వారా, మాటల ద్వారా, కర్మల ద్వారా స్పష్టంగా కనిపించాలి. ఇటువంటి స్వర్ణిమ జయంతిని జరుపుకోవాలి. మంచిది.

ఇటువంటి సదా అవినాశి అభినందనలకు పాత్రులైన తమ శ్రేష్ఠమైన పిల్లలకు, తమ ప్రతి సంకల్పము, కర్మల ద్వారా కొత్త సంస్కారాల సాక్షాత్కారము చేయించే పిల్లలకు, తమ స్వర్ణిమ స్థితి ద్వారా స్వర్ణిమ ప్రపంచం ఇక వచ్చేస్తోంది అనే శుభ ఆశా దీపాలను విశ్వంలోని ఆత్మలలో వెలిగింపజేసే సదా ప్రకాశిస్తున్న నక్షత్రాలకు, సఫలతా దీపాలను దృఢ సంకల్పం ద్వారా కొత్త జీవితాన్ని దర్శనం చేయించే దర్శనీయ మూర్తులైన పిల్లలకు బాప్‌దాదా ప్రియస్మృతులు, అవినాశి అభినందనలు మరియు అవినాశి వరదానాల సహితంగా నమస్తే.

పాదయాత్ర మరియు సైకిల్‌ యాత్ర చేసిన వారితో అవ్యక్త బాప్‌దాదా మిలనము :- యాత్ర ద్వారా సేవనైతే అందరూ చేశారు. ఏ సేవ అయితే చేశారో ఆ సేవకు ప్రత్యక్ష ఫలాన్ని కూడా అనుభవం చేశారు. సేవలో విశేషమైన సంతోషాన్ని అనుభవం చేశారు కదా. పాదయాత్రనైతే చేశారు, అందరూ మిమ్ములను పాదయాత్రికుల రూపంలో చూశారు. ఇప్పుడు ఆత్మిక యాత్రికుల రూపంలో చూడాలి. సేవా రూపంలో అయితే చూశారు కాని ఇప్పుడు ఇంతటి అతీతమైన యాత్రను చేయించే అలౌకిక యాత్రికులు అని అనుభవమవ్వాలి. ఎలాగైతే ఈ సేవలో లగ్నము ద్వారా సఫలత పొందారో అలాగే ఇప్పుడు ఆత్మిక యాత్రలో కూడా సఫలమవ్వాలి. శ్రమ చేస్తారు, చాలా మంచి సేవ చేస్తారు, చాలా బాగా వినిపిస్తారు, వీరి జీవితం చాలా బాగుందని అనడమైతే జరిగింది. కానీ ఇప్పుడిక జీవితాన్ని తయారు చేసుకోవడంలో లగ్నమవ్వాలి. ఈ జీవితం కాకుండా అసలు ఇక ఏ జీవితమూ లేదని అనుభవమవ్వాలి. కావున ఆత్మిక యాత్ర లక్ష్యముంచుకొని ఆత్మిక యాత్రను అనుభవం చేయించండి. ఏం చేయాలో అర్థమయిందా! నడుస్తూ, తిరుగుతూ వీరు సాధారణమైనవారు కారు, వీరు ఆత్మిక యాత్రికులు అనే విధంగా చూడాలి. అందుకు ఏం చేయాలి? స్వయం మీరు యాత్రలో ఉంటూ ఇతరులకు కూడా యాత్రను అనుభవం చేయించండి. పాదయాత్రను అనుభవం చేయించారు, ఇప్పుడిక ఫరిస్తా స్థితిని అనుభవం చేయించండి. వీరు భూమి పై నివసించేవారు కాదు, వీరు ఎవరో ఫరిస్తాలు, వీరి పాదాలు ఈ ధరణి పై ఉండవు అని అనుభవం చేయాలి. రోజురోజుకు ఎగిరేకళ ద్వారా ఇతరులను ఎగిరించండి. ఇప్పుడు ఎగిరించే సమయం. నడిపించే సమయం కాదు. నడవడంలో సమయం పడ్తుంది. ఎగరడంలో సమయం పట్టదు. మీ ఎగిరేకళ ద్వారా ఇతరులను కూడా ఎగిరించండి. అర్థమయిందా. ఇటువంటి స్థితి ద్వారా, స్మృతి ద్వారా అందరినీ సంపన్నంగా చేస్తూ ఉండండి. మాకు ఏదో లభించింది, మేము నిండుగా అయిపోయామని వారు భావించాలి. ఖాళీగా ఉండేవారము కానీ ఇప్పుడు నిండుగా అయిపోయామని వారు భావించాలి. ఎక్కడైతే ప్రాప్తి ఉంటుందో అక్కడ క్షణములో బలిహారమైపోతారు. మీకు ప్రాప్తి లభించింది కనుకనే వదిలిపెట్టారు కదా. అన్నీ నచ్చాయి, అనుభవం చేస్తున్నారు, కనుకనే వదిలిపెట్టారు కదా. ఏదో అలా వదిలేయలేదు. అలాగే ఇతరులకు కూడా ప్రాప్తిని అనుభవం చేయించండి. అర్థమయిందా. మిగిలినదంతా బాగుంది. సేవలో ఏ రోజులనైతే గడిపారో అది స్వయాన్ని, ఇతరులను కూడా శ్రేష్ఠంగా తయారు చేశాయి. ఉల్లాస-ఉత్సాహాలు బాగున్నాయి. ఆత్మిక యాత్ర సదా ఉన్నట్లయితే సఫలత కూడా సదా ఉంటుంది. పాదయాత్రను పూర్తి చేయడంతో సేవ పూర్తి అయిపోయిందని కాదు. మళ్లీ ఎలా ఉన్నారో అలా అయిపోవడం కాదు. సేవాక్షేత్రంలో సేవ లేకుండా బ్రాహ్మణులు ఉండలేరు. కేవలం సేవ పాత్ర మారింది. సేవ అయితే చివరి వరకు చేయాలి. మీరు ఇటువంటి సేవాధారులే కదా! లేక మూడు నెలలు, రెండు నెలల సేవాధారులా? సదాకాలిక సేవాధారులకు సదా ఉల్లాస - ఉత్సాహాలు ఉండాలి. మంచిది. డ్రామాలో ఏదైతే సేవ చేసే పాత్ర లభిస్తుందో అందులో విశేషత నిండి ఉంది. ధైర్యంగా సహాయాన్ని అనుభవం చేశారు. మంచిది.

స్వయం ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేసే శ్రేష్ఠ సంకల్పం మిగిలి ఉంది. ఎందుకంటే తండ్రిని ప్రత్యక్షం చేసినప్పుడే ఈ పాత ప్రపంచం సమాప్తమవుతుంది, మీ రాజ్యం వస్తుంది. తండ్రిని ప్రత్యక్షం చేయడమనగా మీ రాజ్యాన్ని తీసుకురావడం. మీ రాజ్యాన్ని తీసుకు రావాలన్న ఉల్లాస-ఉత్సాహాలు సదా ఉంటాయి కదా. ఎలాగైతే విశేష ప్రోగ్రాంలో ఉల్లాస-ఉత్సాహాలు ఉంటాయో, అలా సదా ఈ సంకల్పము గురించిన ఉల్లాస-ఉత్సాహాలు ఉండాలి. అర్థమయిందా.

పార్టీలతో :- వినడమైతే ఎంతో విన్నారు. ఇప్పుడు ఆ విన్న విషయాలను ఇముడ్చుకోవాలి. ఎందుకంటే ఎంతగా ఇముడ్చుకుంటారో అంత తండ్రి సమానం శక్తిశాలిగా అవుతారు. మీరు మాస్టర్లు కదా. అయితే తండ్రి ఎలాగైతే సర్వశక్తివంతులో, అలా మీరందరు కూడా మాస్టర్‌ సర్వశక్తివంతులు అనగా సర్వశక్తులను ఇముడ్చుకునేవారు, తండ్రి సమానంగా అయ్యేవారు. తండ్రి మరియు పిల్లలలో, జీవితం ఆధారంగా తేడా కనిపించరాదు. ఎలాగైతే బ్రహ్మాబాబా జీవితాన్ని చూసినట్లయితే బ్రహ్మాబాబా మరియు పిల్లలు సమానంగా కనిపించారు. సాకారంలో బ్రహ్మాబాబా కర్మలు చేసి చూపించేందుకు నిమిత్తంగా అయ్యారు కదా. అలా సమానంగా అవ్వడమనగా మాస్టర్‌ సర్వశక్తివంతులుగా అవ్వడం. మరి సర్వశక్తులు ఉన్నాయా. ధారణనైతే చేశారు కానీ శాతంగా చేశారు. ఎంత ఉండాలో అంత లేదు. సంపన్నంగా లేరు. సంపన్నంగా అయితే అవ్వాలి కదా. కావున శాతాన్ని పెంచండి. శక్తులను సమయానికి కార్యంలో ఉపయోగించాలి. దీని ఆధారంగానే నెంబరు లభిస్తుంది. ఒకవేళ సమయానికి కార్యంలో వినియోగించకుంటే ఏమంటారు? ఉన్నా కూడా లేనట్లే అని అంటారు. ఎందుకంటే అవి సమాయనికి ఉపయోగపడలేదు. కావున సమయానుసారంగా ఏ శక్తి అవసరమో ఆ శక్తిని కార్యంలో వినియోగించగలమా అని పరిశీలించుకోండి. కావున తండ్రి సమానం మాస్టర్‌ సర్వశక్తివంతులుగా ప్రత్యక్ష రూపంలో విశ్వం ముందు కనిపించాలి. అప్పుడే సర్వశక్తివంతులు ప్రత్యక్షమయ్యారని విశ్వం అంగీకరిస్తుంది. ఇదే లక్ష్యముంది కదా. గోల్డెన్‌ జూబ్లీ వరకు నెంబరు ఎవరు తీసుకుంటారో చూస్తాము. అవ్యక్త స్థితిని అనుభవం చేసుకునేందుకు విశేషమైన హోంవర్క్‌

ఒకవేళ ఏ విధమైన భారీతనం లేక భారము ఉంటే ఆత్మిక వ్యాయామం చేయండి. ఇప్పుడిప్పుడే కర్మయోగి అనగా సాకారీ స్వరూపధారిగా అయి సాకార సృష్టి పై పాత్రను అభినయించండి. ఇప్పుడిప్పుడే ఆకారి ఫరిస్తాగా అయి ఆకారీ వతనవాసిగా అయి అవ్యక్త రూపాన్ని అనుభవం చేయండి. ఇప్పుడిప్పుడే నిరాకారిగా అయి మూలవతన వాసిగా అనుభవం చేయండి. ఈ అభ్యాసము ద్వారా తేలికగా అయిపోతారు, భారీతనము సమాప్తమైపోయింది.

వరదానము :- '' విశ్వకళ్యాణ భావన ద్వారా ప్రతి ఆత్మకు భద్రతా ప్రణాళిక (సేఫ్టీ ప్లాన్‌)ను తయారు చేసే సత్యమైన దయాహృదయులుగా అవ్వండి (రహమ్‌దిల్‌ భవ) ''
వర్తమాన సమయంలో అనేక ఆత్మలు తమకు తామే స్వయానికి అకళ్యాణానికి నిమిత్తంగా అవుతున్నారు. వారి కోసం దయాహృదయులుగా అయి ప్లాను ఏదైనా తయారు చేయండి. ఏ ఆత్మ పాత్రనైనా చూసి స్వయం అలజడిలోకి రాకండి. కానీ వారి భద్రతా(సేఫ్టీ) సాధనము గురించి ఆలోచించండి. ఇదైతే జరుగుతూనే ఉంటుంది, వృక్షానికి రాలడం(విరగడం) సహజం అని కాదు. వచ్చిన విఘ్నాలను సమాప్తం చేయండి. విశ్వకళ్యాణకారి లేక విఘ్నవినాశకులనే టైటిల్‌ ఏదైతే ఉందో దాని అనుసరించి సంకల్పాలు, వాక్కు మరియు కర్మలలో దయాహృదయులుగా అయి వాయుమండలాన్ని పరివర్తన చేయడంలో సహయోగిగా అవ్వండి.

స్లోగన్‌ :- '' ఎవరైతే బుద్ధి పై అటెన్షన్‌ అనే కాపలా ఉంచుతారో, వారే కర్మయోగులుగా అవ్వగలరు ''

Telugu Murli 25/01/2020

25-01-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - మీరు వికర్మల శిక్షల నుండి ముక్తులుగా అయ్యే పురుషార్థము చేయాలి. ఈ అంతిమ జన్మలో లెక్కాచారమంతా చుక్త చేసుకొని పావనంగా అవ్వాలి ''

ప్రశ్న :- మోసకారి మాయ ఏ ప్రతిజ్ఞను ఉల్లంఘన చేయించేందుకు ప్రయత్నిస్తుంది ?
జవాబు :- ఏ దేహధారితోనూ మేము మా హృదయాన్ని జోడించమని మీరు ప్రతిజ్ఞ చేశారు. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తానని, నా దేహాన్ని కూడా స్మృతి చేయనని ఆత్మ అంటుంది. తండ్రి దేహ సహితంగా అన్నిటినీ సన్యాసము చేయిస్తారు. కానీ మాయ ఈ ప్రతిజ్ఞను ఉల్లంఘింపజేస్తుంది. దేహము పై మోహము(ఆకర్షణ) కలుగుతుంది. ఎవరైతే ప్రతిజ్ఞను ఉల్లంఘిస్తారో, వారు చాలా శిక్షలు కూడా అనుభవించాల్సి వస్తుంది.

పాట :- మీరే తల్లి - తండ్రి, మీరే బంధువు,...............( తుమ్‌ హీ హో మాతా-పితా, తుమ్‌ హీ హో,..........)  
ఓంశాంతి. ఉన్నతాతి ఉన్నతులైన భగవంతుని మహిమ కూడా చేశారు, మళ్లీ గ్లాని కూడా చేశారు అనగా నిందించారు. ఇప్పుడు ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడే స్వయంగా వచ్చి తన పరిచయమునిస్తున్నారు. మళ్లీ రావణ రాజ్యము ప్రారంభమైనప్పుడు తన గొప్పతనాన్ని చూపిస్తాడు. భక్తిమార్గములో భక్తి రాజ్యమే ఉంటుంది. అందుకే రావణ రాజ్యమని అంటారు. అది రామరాజ్యము, ఇది రావణ రాజ్యము. రాముడు, రావణుని పోల్చుతారు. పోతే ఆ రాముడైతే త్రేతా యుగములోని రాజు. అతను ఈ రాముడు కాదు. రావణుడు అర్ధకల్పానికి రాజు. అలాగని రాముడు అర్ధకల్పానికి రాజు అని అనరు. ఇవి విస్తారంగా అర్థము చేసుకోవాల్సిన విషయాలు. కాని అర్థము చేసుకోవడం చాలా చాలా సులభము. మనమంతా సోదరులము(భాయి-భాయి) మనందరి తండ్రి ఆ నిరాకారుడు ఒక్కరే. ఇప్పుడు తన పిల్లలందరూ రావణుని జైలులో ఉన్నారని తండ్రికి తెలుసు. కామచితి పై కూర్చుని అందరూ నల్లగా మాడిపోయారని బాబాకు తెలుసు. జ్ఞానమంతా ఆత్మలోనే ఉంది కదా. ఇందులో కూడా అన్నిటికంటే ఎక్కవ మహత్యము ఆత్మ-పరమాత్మల గురించి తెలుసుకునేందుకు ఇవ్వాలి. ఇంత చిన్న ఆత్మలో ఎంతో పెద్ద పాత్ర నిండి ఉంది. ఆత్మ ఆ పాత్రను అభినయిస్తూనే ఉంటుంది. దేహాభిమానములోకి వచ్చి పాత్ర చేసినప్పుడు స్వధర్మాన్ని మర్చిపోతుంది. ఇప్పుడు తండ్రి వచ్చి ఆత్మాభిమానులుగా చేస్తారు ఎందుకంటే ఆత్మయే నేను పావనంగా అవ్వాలని కోరుకుంటుంది. పావనంగా అయ్యేందుకు నన్నొక్కరినే స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు. ఓ పరమపితా, ఓ పతిత పావనా, మేము ఆత్మలము పతితంగా అయ్యాము, మీరు వచ్చి మమ్ములను పావనంగా చేయమని ఆత్మలే పిలుస్తాయి ఎందుకంటే సంస్కారమంతా ఆత్మలోనే ఉంటుంది కదా. నేను పతితంగా అయ్యానని ఆత్మ స్పష్టంగా చెప్తుంది. వికారాలకు లోబడినవారిని పతితులని అంటారు. పతిత మనుష్యులు, పావన నిర్వికార దేవతల ముందుకు వెళ్లి, మందిరాలలో వారిని మహిమ చేస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ! మీరే పూజ్య దేవతలుగా ఉండేవారు. 84 జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ తప్పకుండా క్రిందకు దిగాల్సి వచ్చింది. ఇది పతితుల నుండి పావనంగా, పావనం నుండి పతితంగా అయ్యే ఆట. ఈ జ్ఞానమంతా ఆ తండ్రే వచ్చి సూచనలతో అర్థం చేయిస్తారు. ఇప్పుడిది అందరికీ అంతిమ జన్మ. అందరూ వారి లెక్కాచారాలను చుక్త్త చేసుకొని వెళ్లాలి. బాబా సాక్షాత్కారము చేయిస్తారు. పతితులు తమ వికర్మల శిక్షలు తప్పకుండా అనుభవించవలసి పడ్తుంది. చివర్లో ఏదో ఒక్క జన్మను ఇచ్చి వారిని శిక్షిస్తారు. మనుష్య శరీరములోనే శిక్షలు అనుభవిస్తారు. అందువలన తప్పకుండా శరీరాన్ని ధరించవలసి వస్తుంది. నేను శిక్షలను అనుభవిస్తున్నానని ఆత్మ అనుభవం చేస్తుంది. కాశీకల్వట్‌(కాశీలోని కత్తుల బావిలో దూకి ప్రాణ త్యాగము చేసుకొను ఆచారము) సమయంలో శిక్షలు అనుభవిస్తున్నామని అనుభవం చేస్తారు. గతంలో చేసిన పాపాల సాక్షాత్కారము జరుగుతుంది. ఓ భగవంతుడా! క్షమించండి, మేము మళ్లీ ఇలా పాపము చేయము అని వేడుకుంటారు. సాక్షాత్కారములోనే క్షమించమని యాచిస్తారు. ఫీల్‌ చేస్తారు, దు:ఖాన్ని అనుభవిస్తారు. ఆత్మ- పరమాత్మలకే ఎక్కువ గొప్పతనముంది. ఆత్మనే 84 జన్మల పాత్ర అభినయిస్తుంది. కనుక ఆత్మ అన్నింటికంటేె శక్తివంతమయింది కదా. మొత్తం డ్రామాలో ఆత్మ-పరమాత్మలకే ప్రాధాన్యత ఉంది. దీనిని గురించి ఇతరులెవ్వరికీ తెలియదు. ఆత్మ అంటే ఏమిటో, పరమాత్మ అంటే ఎవరో ఒక్క మనిషికి కూడా తెలియదు. డ్రామానుసారంగా ఇది కూడా జరగాల్సిందే, ఇది క్రొత్త విషయమేమీ కాదని పిల్లలైన మీకు తెలుసు. కల్పక్రితం కూడా ఇదే విధంగా జరిగింది. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అని కూడా అంటారు కానీ అర్థము తెలియదు. ఈ బాబా సాధువులు మొదలైనవారి సాంగత్యము చాలా చేేశారు. వారు కేవలం జ్ఞానము, భక్తి, వైరాగ్యమని పేరుకు మాత్రం అంటారు. ఈ పాత ప్రపంచము నుండి క్రొత్త ప్రపంచములోకి వెళ్తున్నామని పిల్లలైన మీకు బాగా తెలుసు. కనుక మనకు ఈ పాత ప్రపంచము పై తప్పకుండా వైరాగ్యము కలగాలి. ఇంకా దీని పై మనసు ఎందుకు పెట్టాలి. ఏ దేహధారి పైనా మనసు పెట్టుకోము అని మీరు ప్రతిజ్ఞ చేశారు. ఒక్క తండ్రినే స్మృతి చేస్తానని, స్వంత దేహాన్ని కూడా స్మృతి చేయనని ఆత్మ అంటుంది. తండ్రి దేహ సహితంగా అన్నిటినీ సన్యాసము చేయిస్తారు. అటువంటప్పుడు ఇతరుల దేహము పై ఎందుకు ఆకర్షణ ఉంచాలి? ఎవరి పై ఆకర్షణ ఉండినా వారి స్మృతి వస్తూ ఉంటుంది. అప్పుడు ఈశ్వరుడు గుర్తుకు రాడు. ప్రతిజ్ఞను ఉల్లంఘన చేస్తే, చాలా శిక్షలు కూడా అనుభవించాల్సి వస్తుంది. పదవి కూడా తగ్గిపోతుంది. అందువలన ఎంత ఎక్కువ వీలైతే అంత తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. మాయ చాలా మోసకారి. ఏ పరిస్థితిలోనూ మాయ నుండి స్వయాన్ని రక్షించుకోవాలి. దేహాభిమానము చాలా కఠినమైన జబ్బు. ఇప్పుడు దేహీ-అభిమానులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. తండ్రిని స్మృతి చేస్తే దేహాభిమానమనే జబ్బు వదిలిపోతుంది. రోజంతా దేహాభిమానములో ఉంటారు. తండ్రిని చాలా కష్టంగా స్మృతి చేస్తారు. బాబా అర్థం చేయించారు - చేతులతో పనులు చేయండి, హృదయములో స్మృతి చేయండి(హాత్‌ కార్‌ డే దిల్‌ యార్‌ డే........). వ్యాపార-వ్యవహారాలు మొదలైనవి చేస్తున్నా ప్రేయసి తన ప్రియుడినే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆత్మలైన మీరు పరమాత్మను ప్రేమించాలి. అందువలన వారినొక్కరినే స్మృతి చేయాలి కదా. మనము దేవీ దేవతలుగా అవ్వాలని మీ లక్ష్యము. అందుకొరకు పురుషార్థము చేయాలి. మాయ తప్పకుండా మోసగిస్తుంది. స్వయాన్ని దాని నుండి విడిపించుకోవాలి లేకుంటే చిక్కుకొని మరణిస్తారు. గ్లాని కూడా జరుగుతుంది. చాలా నష్టము కూడా కలుగుతుంది.
మనమంతా ఆత్మలము, బిందువులము. మన తండ్రి కూడా బీజరూపులు, జ్ఞానసాగరులు......... అని పిల్లలైన మీకు తెలుసు. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. ఆత్మ అనగా ఏమిటో అందులో అవినాశి పాత్ర ఎలా నిండి ఉందో ఈ రహస్యమైన విషయాలను మంచి-మంచి పిల్లలు కూడా పూర్తిగా అర్థము చేసుకోరు. స్వయాన్ని యథార్థ రీతిగా ఆత్మగా భావించి, తండ్రిని కూడా బిందు సమానమని భావించి స్మృతి చేయాలి. వారు జ్ఞానసాగరులు, బీజరూపులు, ఇలా భావించి చాలా కష్టంగా(అరుదుగా) స్మృతి చేస్తారు. మందబుద్ధి ఆలోచనలతో కాకుండా సూక్ష్మమైన బుద్ధితో పని చేయాలి. మనము ఆత్మలము, మన తండ్రి వచ్చి ఉన్నారు. వారు బీజరూపులు, జ్ఞానసాగరులు మనకు జ్ఞానము వినిపిస్తున్నారు. ధారణ కూడా అత్యంత సూక్ష్మమైన నా ఆత్మలోనే జరుగుతుంది. చాలామంది ఊరకే(అర్థము తెలియకుండానే) ఆత్మ మరియు పరమాత్మ.... అంటారు. కానీ యథార్థంగా బుద్ధిలోకి రాదు. అసలు చేయకపోవడం కంటే ఇలా మందస్మృతి చేసినా మంచిదే. కానీ ఆ యథార్థ స్మృతి చాలా ఫలదాయకము. వారు అంత శ్రేష్ఠమైన పదవిని పొందలేరు. ఇందులో చాలా శ్రమ ఉంది. నేను ఆత్మ, చిన్న బిందువును, బాబా కూడా ఇంత చిన్న బిందువే. వారిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. మీరు ఇక్కడ కూర్చున్నారు కనుక కొంచెమైనా బుద్ధిలోకి వస్తుంది. కానీ నడుస్తూ, తిరుగుతూ ఆ చింతన ఉండాలి, కానీ అలా లేదు, మర్చిపోతారు. మొత్తం రోజంతా అదే చింతన ఉండాలి. ఇదే సత్య-సత్యమైన స్మృతి. ఎలా స్మృతి చేస్తున్నారో యథార్థంగా ఎవ్వరూ తెలుపరు. చార్టు భలే పంపుతారు. కానీ స్వయాన్ని బిందువుగా భావించి తండ్రిని కూడా బిందువుగా భావించి స్మృతి చేస్తున్నానని ఎవ్వరూ వ్రాయరు. పూర్తి సత్యంగా ఎవ్వరూ వ్రాయరు. చాలా బాగా మురళి చదివి వినిపిస్తారు. కానీ యోగము చాలా తక్కువగా ఉంది. దేహాభిమానము చాలా ఎక్కువగా ఉంది. ఈ గుప్త విషయాలను పూర్తిగా అర్థము చేసుకోరు. స్మృతి చేయరు. స్మృతి ద్వారానే పావనంగా అవ్వాలి. మొదట కర్మాతీత స్థితి కావాలి కదా. వారే ఉన్నత పదవి పొందగలరు. మురళి చదివేవారు అనేకమంది ఉన్నారు కానీ యోగములో ఉండలేరని బాబాకు తెలుసు. విశ్వానికి అధికారులుగా అవ్వడం పిన్నమ్మ ఇంటిలో ఉన్నంత సులభము కాదు. వారు అల్పకాల పదవి పొందుకునేందుకు ఎంతగానో చదువుకుంటారు. ఆదాయానికి మూలము(సోర్స్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌) ఇప్పుడు దొరికింది. ఇంతకుముందు బ్యారిష్టరు మొదలైన వారికి ఇంత సంపాదన ఉండేది కాదు. ఇప్పుడు చాలా ఎక్కువగా సంపాదిస్తున్నారు.
యథార్థ పద్ధతిలో పిల్లలు తమ కళ్యాణము కొరకు స్వయాన్ని ఆత్మగా భావించి యథార్థ రీతిగా తండ్రిని స్మృతి చేయాలి. త్రిమూర్తి శివుని పరిచయము ఇతరులకు కూడా ఇవ్వాలి. కేవలం శివ అన్నందున అర్థము చేసుకోరు. త్రిమూర్తి అని తప్పకుండా ఉండాలి. ముఖ్యమైనవి రెండు చిత్రాలు. 1. త్రిమూర్తి 2. కల్పవృక్షము. మెట్ల చిత్రము కంటే వృక్షము చిత్రములో ఎక్కువ జ్ఞానముంది. ఈ చిత్రాలు అందరి వద్ద ఉండాలి. ఒకవైపు త్రిమూర్తి, సృష్టి చక్రము, మరోవైపు కల్ప వృక్షమును పెట్టాలి. పాండవ సైన్యము యొక్క ఈ జెండా ఉండాలి. డ్రామా మరియు కల్పవృక్ష జ్ఞానాన్ని కూడా తండ్రి ఇస్తున్నారు. లక్ష్మీనారాయణులు, విష్ణువు మొదలైనవారు ఎవరో ఎవ్వరికీ తెలియదు. మహాలక్ష్మిని పూజిస్తే లక్ష్మి(ధనము) వస్తుందని భావిస్తారు. కానీ లక్ష్మికి ధనము ఎక్కడ నుండి వస్తుంది? నాలుగు భుజాల దేవతలు, 8 భుజాల దేవతల చిత్రాలు చాలా తయారు చేశారు. కొంచెం కూడా అర్థము చేసుకోరు. 8-10 భుజాలున్న మనుష్యులు ఎవ్వరూ ఉండరు. ఎవరికి ఎలా తోస్తే అలా తయారు చేశారు. అలాగే నడుస్తూ పోయారు. ఎవరో హనుమంతుని పూజ చేయండి అని చెప్పగానే పూజ చేయడం ప్రారంభించారు. సంజీవని మూలికను తీసుకుని వచ్చారని చూపిస్తారు, దాని అర్థము కూడా పిల్లలైన మీకు తెలుసు. సంజీవిని మూలిక అనగా ' మన్మనాభవ.' ఎంతవరకు బ్రాహ్మణులుగా అవ్వమో, తండ్రి పరిచయము లభించదో అంతవరకు పైసకు కొరగానివారే (వర్త్‌ నాట్‌ ఏ పెన్నీ ). మనుష్యులకు వారి పదవులంటే చాలా అభిమానము. వారికి అర్థం చేయించాలంటే చాలా కష్టము. రాజ్య స్థాపనలో ఎంతో శ్రమ కలుగుతుంది. వారిది బాహుబలము. మీది యోగబలము. ఈ విషయాలు శాస్త్రాలలో లేనే లేవు. వాస్తవానికి మీరు ఏ శాస్త్రాలు మొదలైన వాటిని రెఫర్‌ చేయరు. మీరు శాస్త్రాలను ఒప్పుకుంటారా? అని ఎవరైనా అడిగితే శాస్త్రాలన్నీ భక్తిమార్గానికి చెందినవి. ఇప్పుడు మేము జ్ఞాన మార్గములో ఉన్నామని చెప్పండి. జ్ఞానమిచ్చేవారు ఒకే ఒక జ్ఞానసాగరులైన తండ్రి మాత్రమే. దీనిని ఆత్మిక జ్ఞానమని అంటారు. ఆత్మ కూర్చొని ఆత్మలకు జ్ఞానమిస్తున్నారు. అక్కడ మనుష్యులు మనుష్యులకు ఇస్తారు. మనుష్యులు ఆత్మిక జ్ఞానాన్ని ఎప్పుడూ ఇవ్వలేరు. జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, ముక్తిదాత, సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే.
ఇది చేయండి, ఇది చేయండి అని తండ్రి మనకు అర్థం చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు శివజయంతి రాబోతుంది. శివజయంతి ఎంత వైభవంగా చేస్తారో చూడాలి. ట్రాన్స్‌ లైట్‌ చిత్రము చిన్నదైనా అందరికీ అందాలి. మీది పూర్తిగా క్రొత్త విషయము. ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. వార్తాపత్రికలలో చాలా ఎక్కువగా ప్రచురింపచేయాలి. శబ్ధము వ్యాపించాలి. సెంటర్లు తెరిచేవారు కూడా ఇలా శక్తిశాలిగా ఉండాలి. అయితే ఇంకా పిల్లలలో అంత నషా ఎక్కలేదు. నంబరువారు పురుషార్థానుసారము అర్థం చేయిస్తారు. ఎంతోమంది బి.కె.లు ఉన్నారు. బ్రహ్మ పేరు తప్పకుండా ఉండాలి. బ్రహ్మ పేరు తీసి వేరే పేరు ఏదైనా వ్రాసినామనుకోండి. రాధా-కృష్ణుల పేర్లు వేసినామనుకోండి. అప్పుడు బి.కె.లు ఎక్కడి నుండి వస్తారు? ఎవరో ఒక బ్రహ్మ ఉండాలి కదా. అప్పుడు వారి ముఖవంశావళి బి.కె.లని అంటారు. పిల్లలు పోను పోను చాలా అర్థం చేసుకుంటారు. ఖర్చు తప్పకుండా చేయవలసి వస్తుంది. చిత్రాలైతే చాలా స్పష్టంగా ఉన్నాయి. లక్ష్మీనారాయణుల చిత్రము చాలా బాగుంది. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
అవ్యక్త స్థితిని అనుభవం చేసేందుకు విశేషమైన హోంవర్క్‌
సంపూర్ణ ఫరిస్తా లేక అవ్యక్త ఫరిస్తా డిగ్రీ తీసుకునేందుకు అన్ని గుణాలలో ఫుల్‌గా అవ్వండి. నాలెడ్జ్‌ఫుల్‌తో పాటు ఫెయిత్‌ఫుల్‌, పవర్‌ఫుల్‌, సక్సెస్‌ఫుల్‌గా(విజయులుగా) అవ్వండి. ఇప్పుడు ఈ సున్నితమైన సమయంలో వయ్యారంగా నడవడం మాని, వికర్మలు మరియు వ్యర్థ కర్మలను తమ వికరాల రూపంతో(శక్తి రూపంతో) సమాప్తం చేయండి.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. కర్మాతీతులుగా అయ్యేందుకు తండ్రిని సూక్ష్మ బుద్ధితో గుర్తించి యథార్థంగా స్మృతి చేయాలి. చదువుతో పాటు యోగము పై పూర్తి గమనముంచాలి.
2. స్వయాన్ని మాయ చేసే మోసము నుండి రక్షించుకోవాలి. ఎవరి దేహములోనూ మోహముంచుకోరాదు. సత్యమైన ప్రేమ ఒక్క తండ్రి పైనే ఉంచాలి. దేహాభిమానములోకి రారాదు.

వరదానము :- '' సమయం మహత్వాన్ని తెలుసుకొని స్వయాన్ని సంపన్నం చేసుకునే విశ్వానికి ఆధారమూర్త్‌ భవ ''
ఇది మొత్తం కల్పానికంతా సంపాదన చేసుకునే, శ్రేష్ఠ కర్మ రూపి బీజాన్ని నాటే, 5 వేల సంవత్సరాల రికార్డును నింపుకునే విశ్వ కళ్యాణ సమయము లేక విశ్వ పరివర్తన జరిగే సమయం. ఒకవేళ సమయం గురించిన జ్ఞానమున్నవారు కూడా ఈ సమయాన్ని పోగొట్టుకుంటే లేక రాబోయే సమయం పై వదిలేస్తే, అది సమయం ఆధారం పై పురుషార్థమవుతుంది. కానీ విశ్వ ఆధారమూర్తులు ఏ విధమైన ఆధారము పై నడవరు. వారు ఒక అవినాశి ఆధారము పై కలియుగ ప్రపంచం నుండి దూరమై స్వయాన్ని సంపన్నంగా చేసుకునే పురుషార్థము చేస్తారు.

స్లోగన్‌ :- '' స్వయాన్ని సంపన్నంగా చేసుకుంటే, విశాల కార్యములో స్వతహాగా