Saturday, 30 November 2019

Telugu Murli 01/12/2019

01-12-2019 ని అవ్యక్తబాప్‌దాదా కు ఓంశాంతి రివైజ్‌: 15-03-1985 మధువనము

''శ్రమ నుండి విడుదల అయ్యేందుకు సహజ సాధనము నిరాకార స్వరూప స్థితి''
బాప్‌దాదా పిల్లల పై ఉన్న స్నేహం కారణంగా వాచాకు అతీతంగా ఉన్న నిర్వాణ స్థితి నుండి వాచాలోకి వస్తారు. ఎందుకు? పిల్లలను తన సమానంగా నిర్వాణ స్థితిని అనుభవం చేయించేందుకు, నిశ్శబ్ధమైన, మధురమైన ఇంటికి తీసుకెళ్లేందుకు. నిర్వాణ స్థితి అనగా నిర్వికల్ప స్థితి. నిర్వాణ స్థితి అనగా నిర్వికార స్థితి. నిర్వాణ స్థితి నుండి నిరాకారి, నిరాకారి నుండి సాకార స్వరూపధారిగా అయ్యి వాచాలోకి వస్తారు. సాకారంలోకి వచ్చినా నిరాకారి స్వరూప స్మృతి వారి స్మృతిలో ఉంటుంది. నేను నిరాకారుడను, సాకార(శరీరం) ఆధారంతో మాట్లాడ్తున్నానని స్మృతి ఉంటుంది. సాకారంలో కూడా నిరాకార స్థితి స్మృతి ఉన్నప్పుడు దానిని నిరాకారము సాకారము ద్వారా వాచాలోకి, కర్మలోకి రావడం అని అంటారు. అసలు స్వరూపం నిరాకారము. సాకారము ఆధారంగా ఉంటుంది. ఈ డబల్‌ స్మృతి నిరాకారము నుండి సాకార శక్తిశాలి స్థితిగా ఉంటుంది. సాకారాన్ని ఆధారంగా తీసుకుంటూ నిరాకార స్వరూపాన్ని మర్చిపోకండి. మర్చిపోతున్నారు అందువలన స్మృతి చేసే శ్రమ చెయ్యవలసి వస్తుంది. ఎలాగైతే లౌకిక జీవితంలో నేను ఫలానా లేక ఈ సమయంలో ఫలానా కార్యము చేస్తున్నానని తమ శారీరిక స్వరూపం స్వతహాగానే సదా గుర్తుంటుంది. ఎలాగైతే కార్యము మారుతుంది కాని నేను ఫలానా అనేది మారదో, మర్చిపోరో అలా నేను నిరాకార ఆత్మను అని అసలు స్వరూపము ఏ కార్యము చేస్తున్నా స్వతహాగా, సదా గుర్తుండాలి. నేను నిరాకార ఆత్మను అని ఒకసారి స్మృతిలోకి వచ్చింది, పరిచయము కూడా లభించింది. పరిచయం అనగా జ్ఞానం. కావున జ్ఞాన శక్తి ద్వారా స్వరూపాన్ని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఎలా మర్చిపోగలరు? జ్ఞాన శక్తి వలన శరీర భ్రాంతి మరిపించినా మర్చిపోలేరు. కనుక ఈ ఆత్మిక స్వరూపాన్ని ఎలా మర్చిపోగలరు? కావున స్వయంతో స్వయం ప్రశ్నించుకోండి, అభ్యాసం చెయ్యండి. నడుస్తూ తిరుగుతూ పనులు చేస్తూ నిరాకారము నుండి సాకారం ఆధారంతో ఈ పని చేస్తున్నానా అని పరిశీలించుకోండి. అప్పుడు స్వతహాగానే నిర్వికల్ప స్థితి, నిరాకార స్థితి, నిర్విఘ్న స్థితి సహజంగా ఉంటుంది. శ్రమ నుండి విడుదల అవుతారు. మాటి మాటికి మర్చిపోతే శ్రమ అనిపిస్తుంది. తర్వాత స్మృతి చేసే శమ చేస్తారు. అసలు ఎందుకు మర్చిపోతారు, మర్చిపోవాలా? మీరు ఎవరు అని బాప్‌దాదా అడుగుతారు. సాకారులా, నిరాకారులా? నిరాకారులే కదా? నిరాకారులు. అయినా ఎందుకు మర్చిపోతారు? అసలు స్వరూపము మర్చిపోవుటకు ఆధారం గుర్తుంటుందా? ఏం చేస్తున్నాను అని స్వయం పైనే నవ్వు రావడం లేదా? ఇప్పుడు నవ్వు వస్తుంది కదా? అసలు స్వరూపాన్ని మర్చిపోయి నకిలీ వస్తువు జ్ఞాపకం వస్తుంది. బాప్‌దాదాకు అప్పుడప్పుడు పిల్లలను చూసి ఆశ్చర్యం కూడా కలుగుతుంది. స్వయాన్ని మర్చిపోతారు. మర్చిపోయి ఏం చేస్తారు? స్వయాన్ని మరచి బాధపడ్తారు(కలవరపడ్తారు). తండ్రిని స్నేహంతో నిరాకారం నుండి సాకారంలోకి ఆహ్వానం చేసి తీసుకొస్తారు. కావున ఎవరితో స్నేహం ఉందో వారిలా నిరాకారులగుట కష్టమా? మాస్టర్‌ సర్వశక్తివంతులు సర్వ శక్తులకు యజమానులుగా ఉంటారు. ఏ శక్తిని ఏ సమయంలో శుభ సంకల్పంతో ఆహ్వానించినా ఆ శక్తి యజమానులైన మీ ముందు ప్రత్యక్షంగా ఉంటుంది. ఇలాంటి యజమానులు ఎవరికైతే సర్వ శక్తులు సేవాధారులుగా ఉన్నాయో వారు శ్రమ చేస్తారా? లేక శుభ సంకల్పంతో ఆర్డర్‌ చేస్తారా? ఏం చేస్తారు? రాజులుగా ఉన్నారా లేక ప్రజలుగా ఉన్నారా? అక్కడ కూడా యోగ్యులైన పిల్లలను ఏమంటారు? రాజా పిల్లలని అంటారు కదా! కావున మీరు ఎవరు? రాజులుగా అయ్యే పిల్లలా లేక అధీనులుగా అయ్యే పిల్లలా? అధికారి ఆత్మలుగా ఉన్నారు కదా! ఈ శక్తులు, ఈ గుణాలు అన్నీ మీకు సేవాధారులు. ఆహ్వానించండి, అవి ప్రత్యక్షమవుతాయి. ఎవరైతే బలహీనంగా ఉంటారో వారు శక్తిశాలి శస్త్రము ఉన్నప్పటికి బలహీనత కారణంగా ఓడిపోతారు. మీరు బలహీనమైనవారా? మహావీర్‌ పిల్లలుగా ఉన్నారు కదా! సర్వశక్తివంతుని పిల్లలు బలహీనంగా ఉంటే అందరూ ఏమంటారు? బాగుంటుందా? కాబట్టి ఆహ్వానించండి. ఆర్డర్‌ చెయ్యడం నేర్చుకోండి. కాని సేవాధారి ఎవరి ఆజ్ఞను అంగీకరిస్తారు? ఎవరైతే యజమానులుగా ఉంటారో వారి ఆజ్ఞను అంగీకరిస్తారు. యజమాని స్వయం సేవాధారిగా అయ్యారు. ఎందుకంటే శ్రమ చేసేవారు సేవాధారులే కదా! మానసిక శ్రమ నుండి ఇప్పుడు విడుదల అయ్యారు. యజ్ఞ సేవ కొరకు చేసే శారీరిక శ్రమ వేరు. వారు కూడా యజ్ఞ సేవకు గల మహత్వాన్ని తెలుసుకుంటే కష్టమనిపించదు. మధువనంలో సంపర్కంలో ఉన్న ఆత్మలు వచ్చి, ఇంతమంది సంఖ్యలో ఆత్మల భోజనం ఎలా తయారవుతుందో, అన్ని పనులు ఎలా జరుగుతున్నాయో చూసినప్పుడు ఇంత కష్టమైన పని ఎలా చేస్తున్నారో అని చూసి చూసి అర్థం చేసుకుంటారు. ఇంత పెద్ద కార్యము ఎలా జరుగుతూ ఉందని వారికి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కాని చేసేవారు ఇంత పెద్ద కార్యాన్ని కూడా ఏమని భావిస్తారు? సేవకు మహత్వమున్న కారణంగా వారికి ఒక ఆటగా అనిపిస్తుంది, కష్టమనిపించదు. ఇలాంటి మహత్వం కారణంగా, తండ్రితో ప్రేమ ఉన్న కారణంగా శ్రమ రూపము మారిపోతుంది. ఈ విధంగా మానసిక శ్రమ నుండి ముక్తులుగా అయ్యే సమయం వచ్చింది. ద్వాపరయుగం నుండి వెతికే, పరితపించే, పిలిచే మానసిక శ్రమ చేస్తూ వచ్చారు. మానసిక శ్రమ కారణంగా ధనం సంపాదించేందుకు కూడా శ్రమ పెరుగుతూ వచ్చింది. ఈ రోజు ఎవరిని అడిగినా ఏమంటారు? ధనం సంపాదించడం పిన్నమ్మ ఇల్లు కాదని అంటారు. మానసిక శ్రమ వలన ధన సంపాదనకు కూడా శ్రమ పెరిగింది. తనువైతే రోగిగా అయిపోయింది. అందువలన శారీరిక కార్యంలో కూడా శ్రమ(కష్టము), మనసుకు కూడా కష్టము, ధనానికి కూడా కష్టము కలుగుతూ ఉంది. కేవలం ఇది మాత్రమే కాదు, ఈ రోజు కుటుంబాలలో ప్రేమ నిభాయించడంలో కూడా కష్టముంది. ఒకసారి ఒకరు అలుగుతారు, ఇంకొకసారి ఇంకొకరు..... తర్వాత వారిని ఓదార్చే కష్టంలో నిమగ్నమై ఉంటారు. ఈరోజు నీ వారిగా ఉంటారు, రేపు నీ వారిగా ఉండరు. విబేధం వస్తుంది. కావున అన్ని రకాల శ్రమ చేసి అలిసిపోయారు కదా! తనువుతో, మనసుతో, ధనంతో, సంబంధంతో అన్నిటితో అలిసిపోయారు.

బాప్‌దాదా మొదట మానసిక శ్రమను సమాప్తి చేసేస్తారు, ఎందుకంటే మనసు బీజము కదా. మానసిక శ్రమ, తనువు ధనాల శ్రమను అనుభవం చేయిస్తుంది. మనసు సరిగ్గా లేనప్పుడు ఏ కార్యము చేయాలన్నా, ఈ రోజు ఇది జరగదని అంటారు. రోగం ఉండదు కాని నాకు 103 జ్వరము ఉందని అంటారు. కావున మానసిక శ్రమ శారీరిక శ్రమను అనుభవం చేయిస్తుంది. ధనంలో కూడా ఇలాగే ఉంటుంది. మనసు కొంచెం బాగలేకపోయినా చాలా పని చెయ్యవలసి వస్తుందని అంటారు. సంపాదించడం చాలా కష్టము, వాయుమండలం చెడిపోయిందని అంటారు మరియు మనసు సంతోషంగా ఉన్నప్పుడు ఇది ఏమంత పెద్ద విషయము కాదని అంటారు. పని అదే ఉంటుంది కాని మానసిక శ్రమ ధనమును గురించిన శ్రమను కూడా అనుభవం చేయిస్తుంది. మానసిక బహీనత వాయుమండల బలహీనతలోకి తీసుకొస్తుంది. బాప్‌దాదా పిల్లల మానసిక శ్రమను చూడలేరు. 63 జన్మలు కష్టపడ్డారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మ సంతోషాల జన్మ. ప్రేమను అనుభవించే జన్మ, ప్రాప్తులు పొందే జన్మ, వరదానాల జన్మ, సహాయం తీసుకునే, సహాయం లభించే జన్మ. అయినా ఈ జన్మలో కూడా కష్టమెందుకు చేస్తారు? ఇప్పుడు కష్టాన్ని ప్రేమలోకి పరివర్తన చెయ్యండి. మహత్వంతో శ్రమను సమాప్తి చెయ్యండి.

ఈ రోజు బాప్‌దాదా పరస్పరం పిల్లల శ్రమ పై చాలా సంభాషిస్తున్నారు. ఏం చేస్తారు? బాప్‌దాదా నవ్వుతూ ఉన్నారు. మానసిక శ్రమకు కారణం ఏమవుతుంది, ఏం చేస్తారు? వంకర టింకర పిల్లలకు జన్మనిస్తారు. వారికి ఒకప్పుడు ముఖము ఉండదు, ఒకప్పుడు కాళ్లు ఉండవు, ఒకప్పుడు చేతులు ఉండవు. ఇలా వ్యర్థ వంశావళికి చాలా జన్మనిస్తారు. అంతేకాక దేనినైతే రచించారో దానినేం చేస్తారు? దానిని పాలించిన కారణంగా కష్టము చెయ్యవలసి వస్తుంది. ఇలాంటి రచన రచించిన కారణంగా ఎక్కువ శ్రమ చేసి అలసిపోతారు. అంతేకాక వ్యాకులపడ్తారు కూడా. చాలా కష్టమనిపిస్తుంది. మంచిదే కాని చాలా కష్టమని అంటారు. విడిచిపెట్టాలని కూడా ఉండదు, ఎగరాలని కూడా ఉండదు. కావున ఏం చెయ్యవలసి వస్తుంది? నడవాల్సి వస్తుంది. నడిచేందుకు తప్పకుండా శ్రమ కలుగుతుంది కదా. అందువలన ఇప్పుడు బలహీన రచనను సమాప్తి చేసినట్లయితే మానసిక శ్రమ నుండి విడుదల అవుతారు. తర్వాత నవ్వు వచ్చే విషయం ఏం చెప్తారు? ఇలాంటి రచన ఎందుకు చేస్తారని తండ్రి అంటారు. ఈ రోజులలో మనుష్యులు కూడా ఏం చెయ్యాలి, అన్నీ ఈశ్వరుడే ఇస్తాడని అంటారు కదా. మొత్తం దోషమంతా ఈశ్వరుని పై వేస్తారు. ఇలాంటి ఈ వ్యర్థ రచనను గురించి ఏం చెప్తారు? మేము కోరుకోవడం లేదు కాని మాయ వచ్చేస్తుంది. మేము కోరుకోవడం లేదు కాని జరిగిపోతుందని అంటారు. అందువలన సర్వశక్తివంతుడైన తండ్రికి పిల్లలైన మీరు యజమానులుగా అవ్వండి. రాజులుగా అవ్వండి. బలహీనత అనగా అధీనమైన ప్రజలు. యజమాని అనగా శక్తిశాలి రాజు. కావున యజమానిగా అయ్యి ఆహ్వానించండి. స్వ స్థితి అనే శ్రేష్ఠ సింహాసనం పై కూర్చోండి. సింహాసనం పై కూర్చొని శక్తులనే సేవాధారులను ఆహ్వానించండి, ఆజ్ఞాపించండి. మీ సేవాధారులు మీ ఆజ్ఞ పై నడవకుండా ఉండడం జరగదు. తర్వాత ఏం చెయ్యాలి? అని అనరు కదా. సహన శక్తి లేని కారణంగా శ్రమ చెయ్యవలసి వస్తుంది. ఇముడ్చుకునే శక్తి తక్కువగా ఉన్నందున ఇలా జరిగింది. మీ సేవాధారులు సమయానికి కార్యంలోకి రాకపోతే వారు సేవాధారులెలా అవుతారు? కార్యం పూర్తి అయిన తర్వాత సేవాధారులు వస్తే ఏమవుతుంది? ఎవరికైతే సమయం కొరకు మహత్వం ఉంటుందో వారి సేవాధారులు కూడా సమయ మహత్వం తెలుసుకొని హాజరవువుతారు. ఏ శక్తి లేక గుణము అయినా సమయానికి ప్రత్యక్షమవ్వకపోతే యజమానికి సమయ మహత్వం లేదని ఋజువవుతుంది. ఏం చెయ్యాలి? సింహాసనం పై కూర్చోవడం మంచిదా లేక శ్రమ చేయడం మంచిదా? ఇప్పుడు ఇంత సమయమిచ్చే అవసరం లేదు. శ్రమ చేయడం మంచిదా లేక యజమానిగా అవ్వడం మంచిదనిపిస్తుందా? ఏది మంచిగా అనిపిస్తుంది? వినిపించాను కదా! దీని కొరకు కేవలం ఈ ఒక్క అభ్యాసము సదా చేస్తూ ఉండండి. ''నిరాకారము నుండి సాకార శరీరం ఆధారముతో ఈ పని చేస్తున్నాను.'' మీరు చేసేవారిగా అయ్యి మీ కర్మేంద్రియాలతో చేయించండి. తమ నిరాకార వాస్తవిక స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకుంటే వాస్తవిక స్వరూపం యొక్క గుణాలు, శక్తులు స్వతహాగానే ఉత్పన్నమౌతాయి. ఎలాంటి స్వరూపం ఉంటే అలాంటి గుణాలు, శక్తులు స్వతహాగానే కర్మలోకి వచ్చేస్తాయి. కన్య తల్గిగా అయినప్పుడు తల్లి స్వరూపంలో సేవా భావము, త్యాగము, స్నేహము, అలసట లేని సేవ మొదలైన గుణాలు, శక్తులు స్వతహాగానే ప్రత్యక్షం అవుతాయి కదా! కావున అనాది, అవినాశి స్వరూపం స్మృతిలో ఉన్నందున స్వతహాగానే ఈ గుణాలు మరియు శక్తులు ఎమర్జ్‌ అవుతాయి. స్వరూపం యొక్క స్మృతి స్థితిని స్వత:గానే తయారు చేస్తుంది. ఏం చెయ్యాలో అర్థమయిందా! కష్టము లేక శ్రమ అనే మాటను జీవితంలో సమాప్తి చేయండి. శ్రమ కారణంగా కష్టమనిపిస్తుంది. శ్రమ సమాప్తమైతే కష్టము అనే శబ్ధము కూడా స్వతహాగానే సమాప్తమవుతుంది. మంచిది.

సదా కష్టాన్ని సహజంగా చేసుకునేవారు, శ్రమను ప్రేమ లోకి మార్చుకునేవారు, సదా స్వ స్వరూప స్మృతి ద్వారా శ్రేష్ఠ శక్తులు మరియు గుణాలను అనుభవం చేసేవారు, సదా తండి స్నేహానికి బదులు ఇచ్చేవారు, తండి సమానంగా తయారయ్యేవారు, సదా శ్రేష్ఠ స్మృతి అనే శేష్ఠ్ర ఆసనం పై స్థితులై యజమానిగా అయ్యి సేవాధారుల ద్వారా కార్యము చేయించే రాజా పిల్లలు, యజమానులుగా అయ్యే పిల్లలు - ఇటువంటి వారికి బాప్‌దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే.

వ్యక్తిగత కలయిక (విదేశీ సోదర-సోదరీలతో) :- 1. సేవ తండ్రి తోడును అనుభవం చేయిస్తుంది. సేవకు వెళ్లడమంటే సదా తండ్రి జతలో ఉండటం. సాకార రూపంలో ఉండవచ్చు, ఆకార రూపంలో ఉండవచ్చు కానీ సేవాధారి పిల్లల జతలో తండ్రి సదా తోడుగానే ఉంటారు. చేయించేవారు చేయిస్తున్నారు, నడిపించేవారు నడిపిస్తున్నారు. అయితే స్వయం ఏం చేస్తున్నారు? నిమిత్తంగా అయ్యి ఆట్లాడుకుంటూ ఉంటారు. ఇలాగే అనుభవం అవుతూ ఉంది కదా? ఇలాంటి సేవాధారులు సఫలతకు అధికారులుగా అవుతారు. సఫలత జన్మ సిద్ధ అధికారము. సఫలత సదా మహాన్‌ పుణ్యాత్మగా అయ్యే అనుభవం చేయిస్తుంది. మహాన్‌ పుణ్యాత్మలుగా అయ్యేవారికి అనేకమంది ఆత్మల ఆశీర్వాదాల లిఫ్ట్‌ లభిస్తుంది. మంచిది.

ఇప్పుడైతే అందరి నోటి నుండి ''ఒక్కరే, ఒక్కటే'' అనే పాట వెలువడే రోజు కూడా రానున్నది. డ్రామాలో ఇదే పాత్ర మిగిలి ఉంది. ఇది జరుగుతూనే సమాప్తి అయిపోతుంది. ఇప్పుడు ఈ పాత్రను సమీపానికి తీసుకురావాలి. దీని కొరకు అనుభవం చేయించడమే విశేష ఆకర్షణకు సాధనము. జ్ఞానం వినిపిస్తూ ఉండండి, అనుభవం చేయిస్తూ ఉండండి. జ్ఞానం కేవలం విన్నందున సంతుష్టంగా అవ్వరు కాని జ్ఞానం వినిపిస్తూ అనుభవం కూడా చేయిస్తూ ఉంటే జ్ఞానానికి కూడా మహత్వం ఉంటుంది అంతేకాక ప్రాప్తి కారణంగా పోను పోను ఉత్సాహంలోకి కూడా వచ్చేస్తారు. వారందరి ఉపన్యాసాలు కేవలం జ్ఞానవంతంగా ఉంటాయి. మీ ఉపన్యాసాలు కేవలం జ్ఞానవంతమే కాదు, అనుభవం చేయించే అథారిటీ గలవిగా ఉండాలి. అనుభవాల అథారిటీతో మాట్లాడ్తూ అనుభవం చేయిస్తూ ఉండండి. కొంతమంది మంచి ఉపన్యాసకులు ఉంటారు. వారు మాట్లాడుతూ ఏడిపిస్తారు, నవ్విస్తారు కూడా. శాంతిలోకి, సైలెన్సులోకి కూడా తీసుకెళ్తారు. ఎలాంటి మాటలు మాట్లాడితే అలాంటి వాతావరణాన్ని హాలులో తయారు చేస్తారు. అదంతా తాత్కాలికము. వారు చెయ్యగలిగినప్పుడు మాస్టర్‌ సర్వశక్తివంతులైన మీరు చేయలేనిదేముంది? ఎవరైనా శాంతి అని మాట్లాడితే శాంతి వాతావరణం ఉండాలి. ఆనందం గురించి మాట్లాడితే ఆనందం కలిగించే వాతావరణం ఉండాలి. ఇలాంటి అనుభూతి చేయించే ఉపన్యాసాలు ప్రత్యక్షతా జెండాను ఎగిరేస్తాయి. ఏదో ఒక విశేషత చూస్తారు కదా! మంచిది - సమయం స్వతహాగానే శక్తులు నింపుతూ ఉంది. అంతా అయ్యే ఉంది, కేవలం రిపీట్‌ చెయ్యాలి.

వీడ్కోలు తీసుకునే సమయంలో దాది జానకిగారితో బాప్‌దాదా కలయిక :-

చూసి చూసి సంతోషిస్తూ ఉంటావు! అందరికంటే ఎక్కువ సంతోషం అనన్య పిల్లలకు ఉంటుంది కదా! వారు సదా సంతోషాల సాగరంలో ఓలలాడుతూ ఉంటారు. సుఖసాగరంలో సర్వ ప్రాప్తుల సాగరంలో ఓలలాడుతూ ఉంటారు. వారు ఇతరులను కూడా అదే సాగరంలో ఓలలాడేలా చేస్తారు. రోజంతా ఏం చేస్తారు? ఎవరికైనా సాగరంలో స్నానం చేయడం రాకపోతే ఏం చేస్తారు? చెయ్యి పట్టుకొని స్నానం చేయిస్తారు కదా! ఈ పనే చేస్తున్నారు. సుఖంలో ఓలలాడించండి, సంతోషంలో ఓలలాడించండి..... ఇలా చేస్తూ ఉన్నారు కదా! బిజీగా ఉండే మంచి పని లభించింది. ఎంత బిజీగా ఉంటున్నారు! సమయం ఉందా? ఇందులోనే సదా బిజీగా ఉన్నారు. కనుక ఇతరులు కూడా మిమ్ములను చూసి అనుసరిస్తారు. స్మృతి మరియు సేవ తప్ప ఇంకేమీ కనిపించదు. స్వత:గానే బుద్ధి స్మృతి మరియు సేవలోకి వెళ్తుంది. ఇంకెక్కడికి వెళ్లజాలదు. నడిపించాల్సిన అవసరం ఉండదు. నడుస్తూనే ఉంటుంది. దీనినే నేర్చుకొని, నేర్పిస్తున్నారని అంటారు. మంచి పని ఇచ్చారు కదా! తండ్రి తెలివిగలవారిగా తయారు చేసి వెళ్లారు కదా! బలహీనంగా తెలివి తక్కువగా వదిలిపెట్టి వెళ్లలేదు కదా! తెలివిగలవారిగా చేసి స్థానం ఇచ్చి వెళ్లారు కదా! తోడుగా అయితే ఉండమే ఉన్నారు కానీ నిమిత్తంగా అయితే చేశారు కదా. తెలిగలవారిగా చేసి సీటు ఇచ్చారు. సీటు ఇచ్చే ఆచారం ఇక్కడ నుండే మొదలయింది. సేవ చేసే సింహాసనం లేక సేవకు సీటు ఇచ్చి ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు సాక్షిగా అయ్యి పిల్లలు ఎలా మున్ముందుకు వెళ్తున్నారో చూస్తున్నారు. తోడుకు తోడుగా కూడా ఉన్నారు, సాక్షికి సాక్షిగా కూడా ఉన్నారు. రెండు పాత్రలూ అభినయిస్తున్నారు. సాకార రూపంలో సాక్షి అని అంటారు. అవ్యక్త రూపంలో జతగా(తోడుగా) ఉన్నారని అంటారు. రెండు పాత్రలూ అభినయిస్తున్నారు. మంచిది.

వరదానము :- '' శ్వాస శ్వాసలో స్మృతి మరియు సేవల బ్యాలన్స్‌ ద్వారా ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునే సదా ప్రసన్నచిత్త్‌ భవ ''
ఎలాగైతే స్మృతి లింకు సదా జోడింపబడి ఉండాలని అటెన్షన్‌ ఉంచుకుంటారో, అలా సేవలో కూడా సదా లింకు జోడింపబడి ఉండాలి. శ్వాస శ్వాసలో స్మృతి మరియు శ్వాస శ్వాసలో సేవ ఉండాలి. దీనినే బ్యాలన్స్‌ అని అంటారు. ఈ బ్యాలన్స్‌ ద్వారా సదా ఆశీర్వాదాలను అనుభవం చేస్తూ ఉంటారు. అంతేకాక ఆశీర్వాదాలతో పాలింపబడ్తున్నామనే శబ్ధము హృదయము నుండి వెలువడ్తుంది. శ్రమ నుండి, యుద్ధము నుండి విడుదల అవుతారు. ఏమిటి, ఎందుకు, ఎలా అనే ప్రశ్నలతో ముక్తులైతే సదా ప్రసన్నచిత్తులుగా ఉంటారు. తర్వాత సఫలత జన్మ సిద్ధ అధికార రూపంలో అనుభవమవుతుంది.

స్లోగన్‌ :- '' తండ్రితో బహుమతి తీసుకోవాలంటే స్వయంతో, తోటివారితో నిర్విఘ్నంగా ఉన్నారనే సర్టిపికెట్‌ జతలో ఉండాలి ''

Friday, 29 November 2019

Telugu Murli 30/11/2019

30-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - పిల్లలైన మిమ్ములను భక్తాత్మల నుండి జ్ఞానీ ఆత్మలుగా, పతితుల నుండి పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు ''

ప్రశ్న :- జ్ఞానయుక్తమైన పిల్లలు ఎల్లప్పుడూ ఏ చింతనలో ఉంటారు ?
జవాబు :- నేను అవినాశి ఆత్మను, ఈ శరీరము వినాశనమయ్యేది. నేను 84 శరీరాలు ధరించాను, ఇప్పుడిది అంతిమ జన్మ. ఆత్మ ఎప్పుడూ చిన్నదిగా, పెద్దదిగా అవ్వదు. చిన్నదిగా, పెద్దదిగా అయ్యేది శరీరమే. ఈ కనులు శరీరములో ఉన్నాయి. కానీ కనులతో చూచేది ఆత్మనైన నేను. బాబా ఆత్మలకే జ్ఞాన మూడవ నేత్రమునిస్తారు. వారు కూడా శరీరాన్ని ఆధారంగా తీసుకోనంతవరకు చదివించలేరు. జ్ఞానయుక్తమైన పిల్లలెప్పుడూ ఇలాంటి చింతనే చేస్తారు.

ఓంశాంతి. ఇలా అనింది ఎవరు? ఆత్మనే. అవినాశి ఆత్మ శరీరము ద్వారా అంటుంది. శరీరము మరియు ఆత్మలో ఎంత తేడా ఉంది. ఈ పంచ తత్వాల శరీరము పెద్ద తోలుబొమ్మ వలె తయారవుతుంది. భలే చిన్నదిగా ఉన్నా, ఆత్మ కంటే ఎప్పుడూ పెద్దదిగానే ఉంటుంది. మొదట చాలా చిన్నదిగా ఉన్న పిండము కొంచెము పెద్దదైనప్పుడు ఆత్మ అందులో ప్రవేశిస్తుంది. శరీరము పెద్దదవుతూ, అవుతూ ఇంత పెద్దదైపోతుంది. ఆత్మ చైతన్యమైనది కదా. ఆత్మ ప్రవేశించనంత వరకు శరీరము దేనికీ పనికిరాదు. ఎంతో గొప్ప తేడా ఉంది. మాట్లాడేది, నడిచేది కూడా ఆత్మనే. అది ఎంతో సూక్ష్మమైన బిందువు. అది ఎప్పుడూ చిన్నదిగా, పెద్దదిగా అవ్వదు, వినాశనమవ్వదు. నేను అవినాశి ఆత్మను. శరీరము వినాశనమయ్యేదని ఇప్పుడు పరమాత్మ తండ్రి అర్థం చేయించారు. అందులో నేను ప్రవేశించి పాత్రను అభినయిస్తాను. ఈ విషయాల గురించి మీరు ఇప్పుడు మాత్రమే ఆలోచిస్తారు. ఇంతకుముందు మీకు ఆత్మ గురించి గానీ, పరమాత్మ గురించి గానీ తెలియదు. కేవలం ఓ పరమపిత పరమాత్మా ! అని నామమాత్రానికి అనేవారు. స్వయాన్ని ఆత్మగా భావించేవారు. తర్వాత ఎవరో, మీరే పరమాత్మ అని అనేశారు. అలా తెలిపినవారు ఎవరు? - ఈ భక్తిమార్గపు గురువులు, శాస్త్రాలు. సత్యయుగములో ఇలా ఎవ్వరూ చెప్పరు. మీరు నా పిల్లలు అని ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. ఆత్మ సహజమైనది. శరీరము అసహజమైన మట్టితో తయారైనది. ఆత్మ ఉంటేనే శరీరము మాట్లాడ్తుంది, నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన ఆత్మలకు ఆ తండ్రే వచ్చి అర్థం చేయించారు. నిరాకార శివబాబా ఈ సంగమ యుగములోనే, ఈ శరీరములో వచ్చి వినిపిస్తున్నారు. ఈ కళ్ళు శరీరములోనే ఉంటాయి, ఇప్పుడు తండ్రి జ్ఞాన చక్షువునిస్తారు. ఆత్మలో జ్ఞానము లేకుంటే అజ్ఞాన చక్షువు అని అంటారు. తండ్రి వచ్చినప్పుడు మాత్రమే ఆత్మకు జ్ఞాన నేత్రము లభిస్తుంది. అంతా చేసేది ఆత్మనే. ఆత్మ శరీరము ద్వారా కర్మ చేస్తుంది. ఇప్పుడు తండ్రి ఈ శరీరాన్ని ధరించి ఉన్నారని మీరు గ్రహించారు. తన రహస్యాన్ని కూడా తెలుపుతున్నారు అంతేకాక సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని కూడా తెలుపుతున్నారు. నాటకాన్ని గురించిన సంపూర్ణ జ్ఞానమును కూడా ఇస్తున్నారు. మొదట మీకు కూడా ఏమీ తెలిసేది కాదు. అవును, ఇది నాటకమే. సృష్టి చక్రము తిరుగుతూ ఉంది, కానీ ఎలా తిరుగుతూ ఉందో ఎవ్వరికీ తెలియదు. రచయిత-రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానము ఇప్పుడు మాత్రమే మీకు లభిస్తోంది. మిగిలినదంతా భక్తియే. తండ్రియే వచ్చి మిమ్ములను జ్ఞానీ ఆత్మలుగా చేస్తున్నారు, మొదట మీరు భక్తాత్మలుగా ఉండేవారు. ఆత్మలైన మీరు భక్తి చేసేవారు, మీరిప్పుడు జ్ఞానమును వింటున్నారు. భక్తిని అంధకారమని అంటారు. భక్తి ద్వారా భగవంతుడు లభిస్తారని అనరు. భక్తి పాత్ర మరియు జ్ఞాన పాత్ర కూడా ఉందని తండ్రి అర్థం చేయించారు. భక్తి చేయునప్పుడు ఏ సుఖము లభించలేదని మీకు తెలుసు. భక్తి చేస్తూ మోసపోతూ ఉండేవారు. తండ్రి కోసము అన్వేషిస్తూ ఉండేవారు. యజ్ఞతపాలు, దానపుణ్యాలు మొదలైనవి చేస్తూ వెతుకుతూ వెతుకుతూ మోసపోతూ అలసిపోయి విసిగిపోతారని మీరు అర్థం చేసుకున్నారు. దిగజారారు కనుక తమోప్రధానంగా అయిపోయారు. అసత్య పనులు చేసి ఛీ-ఛీగా తయారవుతారు, పతితులుగా కూడా అయ్యారు. పావనంగా అయ్యేందుకు భక్తి చేశారని కాదు. భగవంతుని ద్వారా పావనంగా అవ్వకుండా మనము పావన ప్రపంచానికి వెళ్లలేము. పావనంగా అవ్వకుండా భగవంతునితో కలవలేము అందుకే వచ్చి పావనంగా చేయమని భగవంతుని వేడుకుంటారు. పతితులే పావనంగా అయ్యేందుకు భగవంతునితో మిలనము చేస్తారు. పావనుల(సత్యయుగములో)తో భగవంతుడు కలవరు. సత్యయుగములోని లక్ష్మీనారాయణులతో భగవంతుడు మిలనము చేస్తారా ? భగవంతుడే వచ్చి పతితులైన మిమ్ములను పావనంగా చేస్తారు, తర్వాత మీరు ఈ శరీరాన్ని వదిలేస్తారు. పావనంగా అయితే ఈ తమోప్రధాన పతిత సృష్టిలో ఉండలేరు. తండ్రి మిమ్ములను పావనంగా చేసి అదృశ్యమైపోతారు. డ్రామాలో వారి పాత్రే అద్భుతమైనది. ఈ కనులకు ఆత్మ కనిపించదు ఒకవేళ ఆత్మ సాక్షాత్కారమైనా అర్థము చేసుకోలేరు. వీరు ఫలానావారు, ఫలనావారు అని అందరి గురించి తెలుసుకోగలరు, స్మృతిస్తారు. ఫలానావారిది చైతన్యములో సాక్షాత్కారము చేసుకోవాలని కోరుకుంటారు, ఇంకేమీ లక్ష్యపెట్టరు. సరే చైతన్యంగా సాక్షాత్కారము అవుతారనుకోండి, ఆ తర్వాత ఏమవుతుంది? సాక్షాత్కారమై మళ్లీ అదృశ్యమైపోతారు. అల్పకాల క్షణ భంగుర సుఖము పొందే ఆశ పూర్తి అవుతుంది, దానిని అల్పకాల క్షణభంగుర సుఖమని అంటారు. సాక్షాత్కారమవ్వాలనే కోరిక ఉండేది, అది పూర్తి అయింది. కాని ఇక్కడ ముఖ్యమైన విషయము ఏమిటంటే - పతితుల నుండి పావనంగా అయితే దేవతలుగా అవుతారు అనగా స్వర్గములోకి వెళ్తారు.

శాస్త్రాలలో కల్పము లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. కలియుగము ఇంకా 40 వేల సంవత్సరాలుందని భావిస్తారు కాని వాస్తవానికి కల్పమంతా కలిసి 5 వేల సంవత్సరాలే అని తండ్రి తెలిపిస్తున్నారు. కనుక మానవులు అంధకారములో ఉన్నారు కదా. దీనినే గాడాంధకారమని అంటారు. జ్ఞానము ఎవరిలోనూ లేదు. అదంతా భక్తి. రావణుడు వచ్చినప్పటి నుండే భక్తి ప్రారంభమయింది. తండ్రి జ్ఞానముతో వస్తారు. తండ్రి నుండి ఒక్కసారి మాత్రమే జ్ఞాన వారసత్వము లభిస్తుంది. పదే పదే లభించదు. అక్కడ మీరు ఎవ్వరికీ జ్ఞానమివ్వరు, అవసరమే లేదు. అజ్ఞానములో ఉన్నవారికే జ్ఞానము లభిస్తుంది. తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు. వారిని నిందించకుండా మాట్లాడరు. ఈ విషయము కూడా పిల్లలైన మీరిప్పుడు తెలుసుకున్నారు. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదని మీరంటారు. వారు ఆత్మలైన మనకు తండ్రి. వారేమో పరమాత్మ రాళ్లు-రప్పలలో ఉన్నారని అంటారు, భక్తి పూర్తిగా భిన్నమైనదని, అందులో జ్ఞానము కొద్దిగా కూడా లేదని పిల్లలైన మీరు చాలా బాగా అర్థం చేసుకున్నారు. సమయం పూర్తిగా మారిపోతుంది. భగవంతుని పేరు కూడా మారిపోతుంది, తర్వాత మనుష్యుల పేరు కూడా మారిపోతుంది. మొదట దేవతలు తర్వాత క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని అంటారు. వారు దైవీగుణాలు గల మానవులు. వీరు ఆసురీగుణాలు ఉండే మనుష్యులు. పూర్తి ఛీ-ఛీ (అసహ్యము, మురికి)గా ఉన్నారు. గురునానక్‌ కూడా పరమాత్ముని - అశంక్‌ చోర్‌ అని అన్నారు. మనుష్యులెవరినైనా కోరికల దొంగ(అశంక్‌ చోర్‌) అని అంటే వెంటనే ఎందుకిలా తిడుతున్నారని అంటారు. ఇవన్నీ ఆసురీ సంప్రదాయాలని తండ్రి అంటున్నారు. రావణ సంప్రదాయమేదో, రాముని సంప్రదాయమేదో, తండ్రి మీకు స్పష్టపరచి తెలుపుతున్నారు. గాంధీజీ కూడా మాకు రామరాజ్యము కావాలని అనేవారు. రామరాజ్యములో అందరూ నిర్వికారులుగా ఉంటారు. రావణ రాజ్యములోనివారంతా వికారులుగా ఉన్నారు. దీని పేరే వేశ్యాలయము, రౌరవ నరకము కదా. ఇప్పటి మానవులు విషయవైతరణీ నదిలో పడి ఉన్నారు. మనుష్యులు, జంతువులు అందరూ సమానంగా ఉన్నారు. మనుష్యులకు ఏ మహిమా లేదు. 5 వికారాల పై పిల్లలైన మీరు విజయము పొంది మనుష్యుల నుండి దేవతా పదవిని పొందుతారు, మిగిలిన వారంతా సమాప్తమైపోతారు. దేవతలను సంపూర్ణ నిర్వికారులని, అసురులను సంపూర్ణ వికారులని అంటారు. వారు 16 కళా సంపూర్ణులు, వీరు ఏ కళలు లేనివారు. అందరూ కళావిహీనమైనవారు. ఇప్పుడీ తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - పాత ఆసురీ ప్రపంచాన్ని పరివర్తన(చేంజ్‌ / జష్ట్రaఅస్త్రవ) చేసేందుకు తండ్రి వస్తారు. రావణ రాజ్యపు వేశ్యాలయమును శివాలయంగా చేస్తారు. వారు ఇక్కడే త్రిమూర్తి భవనము, త్రిమూర్తి మార్గము(త్రిమూర్తి హౌస్‌, త్రిమూర్తి రోడ్‌) అని పేర్లు పెట్టారు. ఇంతకుముందు ఈ పేర్లేవీ ఉండేవి కావు. ఇప్పుడేం జరగాలి? ఈ మొత్తం ప్రపంచమంతా ఎవరిది? పరమాత్మదే కదా. పరమాత్ముని ప్రపంచము అర్ధకల్పము పవిత్రంగా, అర్ధకల్పము అపవిత్రంగా ఉంటుంది. సృష్టికర్త (క్రియేటర్‌) అని బాబాకే చెప్తారు కదా. కనుక ఈ ప్రపంచము వారిదే కదా. యజమాని నేనే అని తండ్రి అంటున్నారు. నేను బీజరూపాన్ని, చైతన్యాన్ని, జ్ఞానసాగరుడను. నాలో పూర్తి జ్ఞానమంతా ఉంది, మరెవ్వరిలోనూ ఈ జ్ఞానము లేదు. ఈ సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానము బాబాలోనే ఉందని మీరు తెలుసుకోగలరు. మిగిలినవన్నీ కట్టుకథలే, ప్రలోభాలే, ప్రగల్భాలే. ముఖ్యమైన అసత్యమేమిటి అంటే మీరు నన్ను రాయి-రప్పలలో, కుక్క- పిల్లిలో ఉన్నారని అనుకొని కూర్చుని ఉన్నారు. మీకు ఎంత దుర్దశ పట్టింది.

కొత్త ప్రపంచ మానవులకు, పాత ప్రపంచ మానవులకు రాత్రికి-పగలుకు ఉన్నంత వ్యత్యాసముంది. అర్ధకల్పము నుండి అపవిత్ర మనుష్యులు పవిత్ర దేవతలకు నతమస్తకులై(తల వంచి) నమస్కరిస్తారు. మొట్టమొదట శివబాబానే పూజిస్తారని పిల్లలకు అర్థం చేయించారు. ఆ శివబాబాయే మిమ్ములను పూజారుల నుండి పూజ్యులుగా చేస్తారు, రావణుడు మిమ్ములను పూజ్యుల నుండి పూజారులుగా చేస్తాడు మళ్లీ తండ్రి డ్రామా ప్లాను అనుసారంగా మిమ్ములను పూజ్యులుగా చేస్తారు. రావణుడు మొదలైన పేేర్లు అయితే ఉన్నాయి కదా. దశరా ఉత్సవాలకు బయట(విదేశాల) నుండి ఎంతోమందిని ఆహ్వానిస్తారు, కానీ అర్థము ఏ మాత్రము తెలియదు. దేవతలను ఎంతగానో నిందిస్తారు. ఇలాంటి విషయాలు అసలు లేనే లేవు. ఈశ్వరుడు నావ-రూపాలకు భిన్నమని అంటారు అనగా లేరని అర్థము. అలాగే ఇక్కడ తయారుచేసే నాటకాలు మొదలైనవేవి వాస్తవానికి లేనే లేవు. ఇదంతా మానవుల బుద్ధి. మనుష్య మతమును ఆసురీ మతమని అంటారు. యథారాజా-రాణి తథా ప్రజలు......... అందరూ అలానే తయారవుతారు. దీనిని దానవ(డెవిల్‌) ప్రపంచమంటారు. అందరూ ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారు. ఆత్మ అని తెలుసుకొని తండ్రి స్మృతిలో కూర్చోండి. అజ్ఞాన కాలములో పరమాత్మ పైన ఉంటారని భావించేవారు. కానీ ఇప్పుడు తండ్రి ఇక్కడకు వచ్చారని తెలుసు. అందువలన పైన ఉంటారని అనుకోరు. మీరు తండ్రిని ఇక్కడకు పిలిచారు, ఈ శరీరములోకి రమ్మని పిలిచారు. మీరు మీ మీ సేవాకేంద్రాలలో ఉన్నప్పుడు శివబాబా మధువనములో వీరి శరీరములో ఉన్నారని భావిస్తారు. భక్తిమార్గములో పరమాత్మ పైన ఉంటారని భావించేవారు. ఓ భగవంతా!........... ఇప్పుడు మీరు బాబాను ఎక్కడ స్మృతి చేస్తారు? కూర్చుని ఏం చేస్తారు? బ్రహ్మ శరీరములో ఉన్నారంటే ఇక్కడే స్మృతి చేయాలని మీకు తెలుసు. పైన లేరు. పురుషోత్తమ సంగమ యుగములో ఇక్కడకు వచ్చారు. మిమ్ములను ఇంత ఉన్నతంగా తయారు చేసేందుకు వచ్చాను. పిల్లలైన మీరు ఇక్కడే స్మృతి చేస్తారు. భక్తులు ఇప్పుడు కూడా పైననే స్మృతి చేస్తారు. మీరు విదేశాలలో ఉన్నా బ్రహ్మ శరీరములో శివబాబా ఉన్నారని అంటారు. శరీరమేమో తప్పకుండా కావాలి కదా. మీరు ఎక్కడ కూర్చుని ఉన్నా ఇక్కడే స్మృతి చేస్తారు కదా. బ్రహ్మ శరీరములోనే స్మృతి చేయవలసి వస్తుంది. చాలామంది బుద్ధిహీనులు బ్రహ్మను గౌరవించరు, బ్రహ్మను స్మృతి చేయవద్దని బాబా చెప్పరు. బ్రహ్మ లేకుంటే శివబాబా ఎలా గుర్తుకు వస్తారు. తండ్రి చెప్తున్నారు - నేను ఈ శరీరంలో ఉన్నాను, ఇందులో నన్ను స్మృతి చేయండి. అందుకే మీరు బాప్‌(తండ్రి) దాదా(అన్న) - ఇద్దరినీ స్మృతి చేస్తారు. వీరిలో వీరి ఆత్మ ఉందని బుద్ధిలో జ్ఞానముంది. శివబాబాకు తన స్వంత శరీరము లేదు. నేను ప్రకృతిని ఆధారంగా తీసుకుంటాను. తండ్రి కూర్చుని ఈ బ్రహ్మాండము మరియు ఈ సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని తెలిపిస్తున్నారు. ఇతరులెవ్వరికీ ఇది తెలియనే తెలియదు. మీరు, నేను నివసించేది బ్రహ్మతత్వములోనే. సుప్రీమ్‌ అయిన పరమాత్మ మరియు సుప్రీమ్‌ కానీ ఆత్మలుంటున్న ఆ బ్రహ్మలోకము శాంతిధామమే. శాంతిధామము చాలా మధురమైన పేరు. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. మనము వాస్తవానికిి బ్రహ్మమహాతత్వ నివాసులము. దానిని నిర్వాణధామము, వానప్రస్థము అని అంటారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి. భక్తిమార్గములో ఉన్నప్పుడు ఒక్క అక్షరము జ్ఞానము కూడా తెలియదు. ఇది పురుషోత్తమ సంగమ యుగము. పరివర్తన చెందే సమయము. పాత ప్రపంచములో అసురులుంటారు, నూతన ప్రపంచములో దేవతలుంటారు. వారిని పరివర్తన చేసేందుకు తండ్రి రావల్సి వచ్చింది. సత్యయుగములో మీకు ఏ మాత్రము గుర్తుండదు. కలియుగములో కూడా ఏమీ గుర్తు లేదు. నూతన ప్రపంచంలో ఉన్నప్పుడు ఈ పాత ప్రపంచము గుర్తుండదు. అదే విధంగా పాత ప్రపంచములో ఉన్నప్పుడు నూతన ప్రపంచము ఎలా ఉండేదో కూడా తెలియదు, అది ఎప్పుడు ఉండేదో ఎవ్వరికీ తెలియదు. వారేమో లక్షల సంవత్సరాలని అంటారు. పిల్లలైన మీకు బాగా తెలుసు - ఆ తండ్రి కల్ప-కల్పము ఈ సంగమ యుగములోనే వస్తారు. వారు వచ్చి ఈ వెరైటీ వృక్ష రహస్యాన్ని అర్థం చేయిస్తారు. అంతేకాక ఈ చక్రమెలా తిరుగుతూ ఉందో తెలుపుతారు. ఇవన్నీ అర్థం చేయించడమే మీ వ్యాపారము(కర్తవ్యము). ఒక్కొక్కరికి అర్థం చేయించాలంటే చాలా సమయము పడ్తుంది. మీరిప్పుడు చాలామందికి తెలియజేస్తున్నారు, చాలామంది తెలుసుకుంటారు. ఈ మధురాతి మధురమైన విషయాలు మీరు ఇంకా చాలామందికి అర్థం చేయించాలి. మీరు ప్రదర్శనీలు మొదలైన వాటిలో తెలిపిస్తారు కదా. శివజయంతి పండుగనాడు అందరినీ ఆహ్వానించి బాగా అర్థం చేయించండి. ఈ డ్రామా ఎంత కాలముదో మీరు సరిగ్గా అర్థం చేయించగలరు. ఇవన్నీ టాపిక్‌లు. నేనే ఇదంతా మీకు తెలుపుచున్నాను. మీకు తండ్రి తెలిపే జ్ఞానము వలన మీరు దేవతలుగా తయారవుతారు. మీరు అర్థము చేసుకొని దేవతలుగా అవుతారో, అలా ఇతరులను కూడా తయారుచేస్తారు. తండ్రి మనకు ఈ విషయాలు అర్థం చేయించారు. మనము ఎవ్వరినీ నిందించము. జ్ఞానాన్ని సద్గతిమార్గమని, ఒక్క సద్గురువు మాత్రమే ఆవలి తీరానికి దాటించేవారని మనము తెలుపుతాము. ఇటువంటి ముఖ్యమైన పాయింట్లు వెలికి తీసి అర్థం చేయించండి. ఈ జ్ఞానమునంతా తండ్రి తప్ప ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. పూజారుల నుండి పూజ్యులుగా అయ్యేందుకు సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి. జ్ఞానవంతులై స్వయాన్ని స్వయమే పరివర్తన చేసుకోవాలి. అల్పకాలిక సుఖాల వెంట వెళ్లరాదు.
2. బాప్‌ మరియు దాదా ఇరువురిని మాత్రమే స్మృతి చేయాలి. బ్రహ్మ లేకుంటే శివబాబా గుర్తు రారు. భక్తిమార్గములో శివబాబాను ఉపరిభాగములో స్మృతి చేశారు, ఇప్పుడు బ్రహ్మ శరీరములో వచ్చారు, కావున ఇద్దరూ గుర్తు రావాలి.

వరదానము :- '' హద్దు కోరికల నుండి ముక్తముగా ఉండి అన్ని ప్రశ్నల నుండి దూరంగా ఉండే సదా ప్రసన్నచిత్త్‌ భవ ''
ఏ పిల్లలైతే హద్దు కోరికల నుండి ముక్తంగా ఉంటారో, వారి ముఖము పై ప్రసన్నతా మెరుపు కనిపిస్తుంది. ప్రసన్న చిత్తులుగా ఉండేవారు ఏ విషయంలోనూ ప్రశ్నచిత్తులుగా ఉండరు. వారు సదా నిస్వార్థంగా ఉండి, సదా అందరిని నిర్దోషులుగా అనుభవం చేస్తారు. ఎవ్వరి పైనా దోషమును ఆపాదించరు. ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఏదైనా లెక్కాచారాన్ని చుక్త చేసుకునే ఆత్మ ఎదురుగా వచ్చినా, శారీరిక కర్మభోగము ఎదురైనా సంతుష్టత కారణంగా వారు సదా ప్రసన్నచిత్తులుగా ఉంటారు.

స్లోగన్‌ :- '' వ్యర్థాన్ని అటెన్షన్‌తో చెక్‌ చేయండి, నిర్లక్ష్యంగా కాదు ''

Thursday, 28 November 2019

Telugu Murli 29/11/2019

29-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - మీరు ఈ రాజయోగ చదువును రాజ్యము కొరకు చదువుతున్నారు, ఇది మీకు నూతన చదువు ''

ప్రశ్న :- ఈ చదువులో అనేక పిల్లలు నడుస్తూ నడుస్తూ ఎందుకు ఫెయిల్‌ అవుతారు ?
జవాబు :- ఎందుకంటే ఈ చదువులో మాయతో మల్లయుద్ధము(బాక్సింగ్‌) ఉంటుంది. మాయతో మల్లయుద్ధము చేయునప్పుడు బుద్ధికి చాలా గట్టి దెబ్బ తగిలేందుకు కారణము - తండ్రితో పిల్లలు సత్యంగా ఉండరు. సత్యమైన పిల్లలు సదా సురక్షితంగా ఉంటారు.

ఓంశాంతి. ఆత్మలైన మనలను తండ్రి చదివిస్తున్నారని పిల్లలందరికీ నిశ్చయము ఉంటుంది. అనంతమైన తండ్రి 5 వేల సంవత్సరాల తర్వాత అనంతమైన పిల్లలను ఒక్కసారి మాత్రమే చదివిస్తున్నారు. క్రొత్తవారెవరైనా ఈ మాటలు వింటే వారికివి అర్థము కావు. ఆత్మిక తండ్రి అనగా ఎవరు, ఆత్మిక పిల్లలంటే ఎవరో కూడా అర్థము చేసుకోలేరు. మనమంతా సోదరులమని పిల్లలైన మీకు తెలుసు. వారు మనకు తండ్రి, టీచరే కాక సుప్రీమ్‌(పరమ) గురువు అని కూడా మీకు తెలుసు. పిల్లలైన మీకు ఆటోమేటిక్‌గా(స్వతహాగా) స్మృతిలో ఉంటుంది. '' సర్వాత్మలకు ఆత్మిక తండ్రి ఒక్కరే '' అని ఇక్కడ కూర్చున్న వారందరికీ తెలుసు. సర్వాత్మలు వారినే స్మృతి చేస్తారు. ఏ ధర్మానికి చెందినవారైనా, మానవ మాత్రులందరూ తప్పకుండా స్మృతి చేస్తారు. అందరిలోనూ ఆత్మ ఉందని తండ్రి అర్థం చేయించారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - దేహ ధర్మాలన్నీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు ఆత్మలైన మీరు ఇక్కడ పాత్రను అభినయిస్తున్నారు. పాత్రనెలా అభినయిస్తున్నారో కూడా అర్థం చేయించారు. పిల్లలు కూడా నంబరువారుగా పురుషార్థానుసారమే అర్థము చేసుకుంటారు. మీరు రాజయోగులు కదా. చదువుకునే వారంతా యోగులే. చదివించే టీచరుతో తప్పకుండా యోగముంచాలి. ఈ చదువు ద్వారా ఫలానాగా అవుతామని లక్ష్యము కూడా మీకు తెలుసు. ఇది రాజాధి రాజులుగా తయారుచేసే ఏకైక చదువు. దీని పేరు రాజయోగము కదా. ఇది రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు తండ్రితో యోగము. ఇతర మనుష్యులెవ్వరూ ఎప్పుడూ ఈ రాజయోగమును నేర్పించలేరు. మీకు నేర్పించేది మానవ మాత్రులు కాదు. ఆత్మలైన మీకు పరమాత్మ నేర్పిస్తున్నారు, తర్వాత మీరు ఇతరులకు నేర్పిస్తారు. మీరు కూడా స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలైన మనకు తండ్రి నేర్పిస్తున్నారు. ఇది జ్ఞాపకము లేకుంటే పదును నిండదు, అందుకే చాలా మంది బుద్ధిలో కూర్చోదు. అందుకే తండ్రి సదా చెప్తూనే ఉన్నారు - యోగయుక్తంగా ఉండండి, స్మృతియాత్రలో ఉండి అర్థం చేయించండి. మన సోదరులకు నేర్పిస్తున్నాము. మీరు కూడా ఆత్మలే. వారు అందరికీ తండ్రి. అంతేకాక టీచరు, సద్గురువు కూడా అయ్యారు. ఆత్మనే చూడాలి. భలే ఒక్క సెకెండులో జీవన్ముక్తి అనే గాయనమైతే ఉన్నది కానీ ఇందులో శ్రమ చాలా ఉంది. ఆత్మాభిమానులుగా అవ్వనందున మీ మాటలలో శక్తి ఉండదు ఎందుకంటే తండ్రి అర్థం చేయించినట్లు మీరు అర్థం చేయించలేరు. కొంతమంది చాలా బాగా అర్థం చేయిస్తారు. పుష్పాలు ఎవరో, ముళ్ళు ఎవరో తెలిసిపోతుంది. పాఠశాలలో 5 - 6 తరగతులు చదువుకున్న తర్వాత బదిలీ(ట్రాన్స్‌ఫర్‌) అవుతారు. మంచి మంచి పిల్లలు ఉన్నత తరగతులకు బదిలీ అయినప్పుడు ఆ (మరుసటి) టీచరుకు కూడా వెంటనే తెలిసిపోతుంది. ఈ పిల్లలు మంచి(తీక్షణమైన) పురుషార్థము చేశారు, వీరు బాగా చదువుకున్నారు అందుకే ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారని టీచర్లకు తప్పకుండా తెలుస్తుంది కదా. అది లౌకిక చదువు. ఇక్కడ ఆ విషయమే లేదు. ఇది పారలౌకిక చదువు. ఇక్కడ అలా చెప్పరు, మొదట బాగా చదువుకొని వచ్చారు, అందుకే బాగా చదువుకుంటున్నారని అనరు. అక్కడ పరీక్షలో పాసై బదిలీ అవుతే బాగా కష్టపడి చదువుకున్నారని కనుకనే మొదటి నంబరులో ఉత్తీర్ణులయ్యారని టీచరు భావిస్తారు కాని ఇది నూతన చదువు. ఇంతకుముందు ఈ చదువును ఎవ్వరూ చదువుకోలేదు. చదువు చెప్పేవారు కూడా కొత్తవారే. అందరూ కొత్తవారే. కొత్తవారినే చదివిస్తారు. వారిలో ఎవరు బాగా చదువుకుంటారో, వారిని మంచి పురుషార్థులని అంటారు. ఇది నూతన ప్రపంచము కొరకు నూతన జ్ఞానము. దీనిని చదివించేవారు ఒక్క బాబా తప్ప వేరెవ్వరూ లేరు. ఎవరెవరు ఎంతెంత గమనముంచుతారో అంత ఉన్నతమైన నంబరు లభిస్తుంది. కొంతమంది చాలా మధురమైన మంచి ఆజ్ఞాకారులుగా ఉంటారు. చూస్తూనే తెలిసిపోతుంది. ఈ చదివించేవారు చాలా మంచివారు, వీరిలో ఏ అవగుణము లేదు. నడవడికల ద్వారా, మాటలు మాట్లాడుటలోనే తెలిసిపోతుంది. బాబా అందరినీ అడుగుతారు - వీరు ఎలా చదువు చెప్తున్నారు ? వారిలో ఏ లోపమూ లేదు కదా? చాలా మంది అంటారు - మమ్ములను అడగకుండా ఏ సమాచారము ఇవ్వరాదు. కొంతమంది బాగా చదివిస్తారు. కొంతమందికి చురుకైన బుద్ధి ఉండదు. మాయ తీవ్రంగా దాడి చేస్తుంది. మాయ వారిని చాలా మోసము చేస్తుందని తండ్రికి తెలుసు. 10 సంవత్సరాలు చదివించినా మాయ ఎంత శక్తివంతమైనదంటే దేహ అహంకారానికి వశమయ్యారంటే ఇరుక్కుంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఎటువంటి యోద్ధులైనా మాయ గాయపరుస్తుంది. మాయ బలశాలురతో బలశాలిగా అయ్యి యుద్ధము చేస్తుంది.
బాబా ఎవరిలో అయితే ప్రవేశించారో వారు నంబరువన్‌గా అవుతారని మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ తర్వాత నంబరువారుగా చాలామంది ఉన్నారు కదా. బాబా ఉదాహరణ కొరకు ఒకరినో - ఇద్దరినో చూపిస్తారు. నంబరువారుగా అయితే చాలా మంది ఉంటారు. ఉదాహరణానికి ఢిల్లీలో గీతా అక్కయ్య చాలా తెలివిగలది కదా. చాలా మధురమైన బిడ్డ. గీత అంటే సత్యమైన గీత అని బాబా ఎప్పుడూ అంటూ ఉంటారు. మనుష్యులు ఆ గీతను పఠిస్తూ ఉంటారు కానీ భగవంతుడు రాజయోగమును ఎలా నేర్పించి రాజాధి రాజులుగా తయారు చేశారో తెలియదు. సత్యయుగములో ఒకే ధర్మము ఉండేది. ఇది నిన్నటి మాటే. నేను మిమ్ములను ఎంత ధనవంతులుగా చేసి వెళ్లాను. మీరు పదమా పదమ్‌ భాగ్యశాలురుగా ఉండేవారు, ఇప్పుడు మీరెలా తయారయ్యారో మీరు ఫీల్‌ చేస్తున్నారు కదా. ఈ గీతను వినిపించేవారికిలా అనిపిస్తుందా? వారు కొంచెము కూడా అర్థము చేసుకోరు. ఉన్నతోన్నతమైనదిగా శ్రీమద్భగవద్గీతకు మహిమ ఉంది. వారు గీత పుస్తకాన్ని చదువుతారు లేక వినిపిస్తారు. తండ్రి పుస్తకము చదవరు. బేధము ఉంది కదా. వారికి స్మృతియాత్ర లేనే లేదు. వారు క్రింద పడ్తూనే(పతితమవుతూ) వచ్చారు. సర్వవ్యాపి జ్ఞానము వలన అందరూ ఎలా అయ్యారో చూడండి. కల్ప-కల్పము ఇలాగే అవుతుందని మీకు తెలుసు. తండ్రి చెప్తున్నారు - మీకు నేర్పించి విషయ సాగరము నుండి దాటిస్తాను. ఎంత తేడా ఉంది. శాస్త్రాలు చదివేది భక్తిమార్గము కదా. తండ్రి చెప్తున్నారు - అవి చదివినందున నాతో ఎవ్వరూ కలవలేరు. ఎటువైపు నుండి వెళ్లినా అందరూ ఒకే చోటికి చేరుతారని భావిస్తారు. భగవంతుడు ఏదో ఒక రూపములో వచ్చి చదివిస్తారని కూడా అప్పుడప్పుడు అంటారు. తండ్రే వచ్చి చదివిస్తారన్నప్పుడు మీరు ఏం చదివిస్తున్నారు ? గీతలో పిండిలో ఉప్పు వేసినంత సత్యముంది అనగా చాలా కొన్ని పదాలే సత్యము. వాటిని మీరు పట్టుకోగలరు అనగా తెలుసుకోగలరు. సత్యయుగములో శాస్త్ర్రాలు మొదలైనవి ఉండనే ఉండవు. అవి భక్తిమార్గములోని శాస్త్ర్రాలు, ఇవి అనాది కాదు. ఎప్పటి నుండో పరంపరగా రావడం లేదు. మనుష్యులకు అనాది అంటే ఏమిటో అర్థము తెలియదు. తప్పకుండా ఈ డ్రామా అనాది అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీకు తండ్రి రాజయోగము నేర్పిస్తున్నారు. ఇప్పుడు మీకు నేర్పిస్తున్నాను, తర్వాత ఉండనే ఉండను, అదృశ్యమైపోతాను. మా రాజ్యము అనాది అని మీరంటారు. రాజ్యమేమో అదే. కేవలం పావనంగా ఉండేది, మారిపోయి పతితమైపోయినందున పేరు మారిపోతుంది. దేవతలకు బదులు హిందువులని పిలిపించుకుంటారు. నిజానికి ఆది సనాతన దేవీదేవతా ధర్మానికి చెందినవారే కదా! ఇతరులు ఎలాగైతే సతోప్రధానము నుండి సతో, రజో, తమోలోకి వస్తారో మీరు కూడా అదే విధంగా క్రిందకు దిగుతారు. రజో గుణములోకి వస్తూనే అపవిత్రత కారణంగా దేవతలకు బదులుగా హిందువులని అనబడ్తారు. లేకుంటే హిందు అనేది హిందూస్థానానికి పేరు. మీరు వాస్తవానికి దేవీ దేవతలుగా ఉండేవారు కదా. దేవతలు సదా పావనంగా ఉంటారు. ఇప్పుడు మనుష్యులు పతితమైపోయారు. అందువలన హిందువులని పేరుంచుకున్నారు. హిందూ ధర్మము ఎప్పుడు, ఎలా రచింపబడింది? అని అడగండి. ఎవ్వరూ తెలుపలేరు. ఆదిసనాతన దేవీదేవతా ధర్మముండేది. దానిని స్వర్గమని(ప్యారడైస్‌) మొదలైన మంచి మంచి పేర్లతో పిలుస్తారు. జరిగిపోయింది మళ్లీ రిపీట్‌ అవుతుంది. ఇప్పుడు మీరు ప్రారంభము నుండి చివరి వరకు అంతా తెలుసుకున్నారు. తెలుసుకుంటూ పోతే జీవిస్తూ ఉంటారు. చాలా మంది మరణించనూ మరణిస్తారు. తండ్రికి చెందినవారిగా అయితే మాయతో యుద్ధము జరుగుతుంది. యుద్ధము జరిగినందున విద్రోహులుగా అవుతారు. రావణునికి చెందినవారిగా ఉండేవారు, ఇప్పుడు రామునివారిగా అయ్యారు. మళ్లీ రావణుడు రాముని పిల్లల పై విజయము పొంది తన వైపుకు తీసుకెళ్తాడు. కొంతమంది జబ్బు పడ్తారు. అప్పుడు వారు ఇక్కడకూ లేకుండా, అక్కడకూ లేకుండా పోతారు. సంతోషమూ ఉండదు, అలాగని దు:ఖమూ ఉండదు. మధ్యలో ఊగిసలాడుతూ ఉంటారు. మీ వద్ద కూడా మధ్యలో ఉండేవారు చాలామంది ఉన్నారు. ఇక్కడ పూర్తి బాబావారిగానూ అవ్వరు, పోనీ అటు పూర్తి రావణునివారిగా కూడా అవ్వరు.
ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగములో ఉన్నారు. ఉత్తమ పురుషునిగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. ఇవన్నీ చాలా లోతుగా అర్థము చేసుకోవలసిన విషయాలు. బాబా అడిగినప్పుడు చాలా మంది పిల్లలు చేతులెత్తుతారు. కానీ బుద్ధి లేదని బాబా అర్థం చేసుకుంటారు. భలే శుభాన్నే పలకండని బాబా అంటారు. అందరూ మేము నరుని నుండి నారాయణునిగా అవుతామనే అంటారు. నరుని నారాయణునిగా చేసే కథ ఇదే. అజ్ఞాన కాలములో కూడా సత్యనారాయణ కథ విన్నారు కదా. అక్కడ ఎవ్వరూ ఏమీ అడగరు. ఈ తండ్రి ఒక్కరే అడిగేవారు. ఇంత ధైర్యముందా? మీరు తప్పకుండా పావనంగా కూడా అవ్వాలి. ఈ జన్మలో ఏ పాపకార్యము చేయలేదా? అని ఎవరైనా వచ్చినప్పుడు అడగండి. జన్మ-జన్మాంతరాలుగా పాపం చేస్తూనే ఉన్నారు. ఈ జన్మలోని పాపాలు తెలిపితే తేలికైపోతారు. చాలా మంది పిల్లలు సత్యము చెప్పనందున మాయ ఒక్కసారిగా తీవ్ర్రంగా ముష్ఠిఘాతాలు తగిలిస్తుంది. మీది చాలా కఠినమైన ముష్ఠి యుద్ధము(బాక్సింగ్‌). ఆ బాక్సింగ్‌లో శరీరానికి దెబ్బ తగులుతుంది. ఇందులో బుద్ధికి పెద్ద గాయమవుతుంది. ఇది బాబాకు కూడా తెలుసు. ఈ బ్రహ్మ చెప్తున్నారు - నేనిప్పుడు అనేక జన్మల అంతిమ జన్మలో ఉన్నాను. అందరికంటే ఎక్కువ పవిత్రంగా ఉన్నాను, ఇప్పుడు అందరికంటే ఎక్కువ పతితంగా అయ్యాను మళ్లీ పావనంగా అవుతాను. అలాగని నేను మహాత్మనని చెప్పను. ఇతడు అందరికంటే ఎక్కువ పతితమైనాడని తండ్రి కూడా చెప్తున్నారు. నేను పరాయి దేశములో, పరాయి శరీరములో వస్తాను. ఇతని అనేక జన్మల అంతిమంలో నేను ప్రవేశిస్తాను. ఇతడే పూర్తిగా 84 జన్మలు తీసుకున్న ఆత్మ. ఇప్పుడు ఇతడు కూడా పావనంగా అయ్యే పురుషార్థము చేస్తున్నాడు. చాలా జాగరూకతతో ఉండాలి. తండ్రికి తెలుసు కదా. బాబాకు ఇతడు చాలా సమీప పుత్రుడు. తండ్రి నుండి ఎప్పుడూ విడిపోడు. వదిలి వెళ్లాలనే ఆలోచన కూడా రాదు. నా ప్రక్కనే కూర్చున్నారు. నా తండ్రి కదా, నా ఇంట్లోనే కూర్చుని ఉన్నారు. బాబాకు తెలుసు. బాబాతో తమాషాగా మాట్లాడ్తాడు - బాబా నాకు స్నానము చేయించు, భోజనము తినిపించు, నేను చిన్న బాలుని కదా.... ఇలా అనేక విధాలుగా బాబాను స్మృతి చేస్తాను. పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నాను - ఈ రీతిగా నన్ను స్మృతి చేయండి. బాబా, మీరు చాలా మధురమైనవారు. మమ్ములను విశ్వమంతటికీ చక్రవర్తులుగా చేస్తారు. ఈ మాటలు మరెవ్వరి బుద్ధిలో ఉండవు. తండ్రి అందరినీ తాజా(రిఫ్రెష్‌)గా చేస్తున్నారు. అందరూ పురుషార్థము చేస్తున్నారు కానీ నడవడికలు కూడా అలా ఉండాలి కదా. తప్పు జరిగితే వెంటనే బాబా, మా వలన ఈ తప్పు జరిగింది అని తండ్రితో చెప్పేయాలి. కొంతమంది బాబా, ఈ తప్పు చేశాము, మమ్ములను క్షమించండి అని కూడా వ్రాశారు. నా పిల్లలుగా అయ్యి తప్పు చేస్తే నూరు రెట్లు శిక్ష పెరిగిపోతుంది. మాయతో ఓడిపోతే అక్కడే అలాగే ఉండిపోతారు. నిస్తేజులైపోతారు. చాలామంది ఓడిపోతుంటారు. ఇది చాలా గొప్ప మల్లయుద్ధము. రామ-రావణుల యుద్ధములో వానర సైన్యాన్ని సహాయంగా తీసుకున్నట్లు చూపించారు. ఇదంతా పిల్లల నాటకము వలె తయారయ్యింది. చిన్న పిల్లలకు తెలివి తక్కువగా ఉంటుంది కదా. వారికి పైసా భాగము తెలివి కూడా లేదు. ప్రతి ఒక్కరు ఈశ్వరుని రూపమే అని అంటారు. అలాగైతే ప్రతి ఒక్కరు ఈశ్వరుడై సృష్టిస్తారు, పాలన, వినాశనము కూడా చేసేవారు. ఈశ్వరుడు ఎవరినైనా వినాశనం చేస్తాడా? వినాశనము చేస్తారనడం పూర్తిగా అజ్ఞానము. అందుకే బొమ్మలాట అని అంటారు. విచిత్రము కదా. మానవుల బుద్ధి ఏమైపోతుంది? ఎంతగా ఖర్చులు చేస్తుంటారు. తండ్రి అడుగుతున్నారు. నేను ఇంత గొప్పగా తయారు చేసి పోయాను, మీరు ఏం చేశారు! మనమే దేవతలుగా ఉండేవారమని చక్రములో తిరిగి ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యామని మీకు తెలుసు. మళ్లీ మనము దేవతలుగా అవుతాము. ఇది బుద్ధిలో ఉంది కదా. ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ జ్ఞానము బుద్ధిలో ఉండాలి. తండ్రి కూడా జ్ఞానసాగరులు కదా. భలే శాంతిధామములో ఉన్నా వారిని జ్ఞానసాగరులని అంటారు. మీ ఆత్మలో కూడా జ్ఞానమంతా ఉంటుంది కదా. ఈ జ్ఞానము వలన మా కనులు తెరచుకున్నాయని అంటారు కదా. ఆ తండ్రి మీకు జ్ఞాన నేత్రమునిస్తారు. ఆత్మకు సృష్టి ఆదిమధ్యాంతాలు తెలిసిపోయాయి. చక్రము తిరుగుతూ ఉంటుంది. బ్రాహ్మణులకే స్వదర్శన చక్రము లభిస్తుంది. దేవతలను చదివించేవారు ఎవ్వరూ ఉండరు. వారికి శిక్షణ అవసరము లేదు. దేవతలుగా తయారయ్యేందుకు చదవాల్సింది మీరే. ఇప్పుడు తండ్రి కొత్త - కొత్త విషయాలు అర్థం చేయిస్తున్నారు. ఈ కొత్త చదువును చదువుకొని మీరు ఉన్నతంగా అవుతారు. ఫస్ట్‌(ఆది)లోని వారే లాస్ట్‌గా(చివరివారిగా) అయ్యారు. తిరిగి లాస్ట్‌లోని వారే ఫస్ట్‌(ప్రథమము)గా అవుతారు. ఇది చదువు కదా. ప్రతి కల్పము వచ్చి పతితుల నుండి పావనంగా చేస్తారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ జ్ఞానము సమాప్తమైపోతుంది. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. చాలా చాలా ఆజ్ఞాకారులుగా, మధురంగా తయారై నడుచుకోవాలి. దేహ అహంకారములోకి రాకూడదు. తండ్రికి పిల్లలుగా అయిన తర్వాత ఏ తప్పులు చేయరాదు. మాయతో చేసే మల్ల యుద్ధములో(బాక్సింగ్‌లో) చాలా హెచ్చరికగా ఉండాలి.
2. మీ మాటలలో శక్తిని నింపుకునేందుకు ఆత్మాభిమానులుగా ఉండే అభ్యాసము చేయాలి. స్మృతి ఉండాలి - తండ్రి నేర్పించిన దానిని మేము వినిపిస్తున్నామని భావిస్తే అందులో పదును నిండుతుంది.

వరదానము :- '' అపవిత్ర అంశమైన సోమరితనాన్ని, నిర్లక్ష్యాన్నిత్యాగము చేసే సంపూర్ణ నిర్వికారి భవ ''
దినచర్యలో ఏ కర్మలోనైనా హెచ్చు-తగ్గులుగా అగుట, సోమరితనము లేక నిర్లక్ష్యంగా ఉండుట - ఇది వికారాల అంశము. దీని ప్రభావము పూజ్యనీయులుగా అవ్వడం పై పడ్తుంది. ఒకవేళ మీరు అమృతవేళలో స్వయాన్ని జాగృత స్థితిలో అనుభవం చేయకుంటే, విధి లేక గానీ, సోమరితనంతో గానీ కూర్చుంటే మీ పూజార్లు కూడా విధి లేక లేక సుస్తీగా(సోమరితనంతో) పూజిస్తారు. కనుక సోమరితనం లేక నిర్లక్ష్యాన్ని కూడా త్యాగం చేయండి. అప్పుడు సంపూర్ణ నిర్వికారులుగా అవ్వగలరు.

స్లోగన్‌ :- '' సేవ భలే చేయండి కానీ వ్యర్థంగా ఖర్చు చేయకండి. ''

Wednesday, 27 November 2019

Telugu Murli 28/11/2019

28-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - మీ అన్ని ఖజానాల(భండారాల)ను పూర్తిగా నింపేందుకు శివబాబా వచ్చారు. భండారము నిండగానే కష్టాలన్నీ దూరమైపోతాయి (భండారా భర్‌పూర్‌ కాల్‌కంటక్‌ దూర్‌) అని అంటారు ''

ప్రశ్న :- జ్ఞానయుక్తమైన పిల్లల బుద్ధిలో ఏ విషయము పై గట్టి నిశ్చయముంటుంది ?
జవాబు :- వారికి మన పాత్ర ఎప్పుడూ అరగదు, తరగదు, తొలగదు అనే దృఢ నిశ్చయముంటుంది. ఆత్మనైన నాలో 84 జన్మల అవినాశి పాత్ర నిర్ణయించబడి ఉంది. జ్ఞానము బుద్ధిలో ఉంటే వారిని జ్ఞాన స్వరూపులని అంటారు లేకుంటే బుద్ధి నుండి జ్ఞానమంతా ఆరిపోతుంది, ఎగిరిపోతుంది.

ఓంశాంతి. తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలకు ఏం చెప్తున్నారు ? ఏ సేవ చేస్తున్నారు ? ఇప్పుడు తండ్రి ఈ ఆత్మిక చదువును చదివించే సేవ చేస్తారు. తండ్రి పాత్ర, టీచరు పాత్ర మరియు గురువు పాత్ర కూడా ఉందని మీకు తెలుసు. మూడు పాత్రలను చాలా బాగా అభినయిస్తున్నారు. వారు అందరికీ తండ్రే కాక సద్గతినిచ్చే గురువు కూడా అయ్యారని మీకు తెలుసు. చిన్న, పెద్ద, ముసలివారు, యువకులు అందరికీ ఒక్కరే సుప్రీమ్‌ తండ్రి, సుప్రీమ్‌ టీచరు, అనంతమైన శిక్షణనిస్తున్నారు. మాకు అందరి జీవిత చరిత్రలు తెలుసునని కాన్ఫరెన్స్‌(సమ్మేళనాలలో) కూడా చెప్పండి. పరమపిత పరమాత్ముని జీవిత కథ కూడా తెలుసునని చెప్పండి. నెంబరువారుగా అంతా బుద్ధిలో స్మృతి ఉండాలి. విరాట రూపమంతా బుద్ధిలో ఉంటుంది. మనమిప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము, తర్వాత మళ్లీ మనము దేవతలుగా అవుతాము, ఆ తర్వాత క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతాము. ఇది పిల్లలకు గుర్తుంది కదా. పిల్లలైన మీకు తప్ప ఇతరులెవ్వరికీ ఈ విషయాలు స్మృతిలో ఉండవు. ఉత్థాన-పతనాల పూర్తి రహస్యము బుద్ధిలో ఉండాలి. మనము ఉన్నతంగా ఉండేవారము, తర్వాత పతనంలోకి వచ్చాము. ఇప్పుడు మధ్య(స్థితి)లో ఉన్నాము, శూద్రులమూ కాము అలాగని పూర్తి బ్రాహ్మణులుగా కూడా అవ్వలేదు. ఇప్పుడు పక్కా బ్రాహ్మణులుగా అయితే శూద్ర పనులు చేయరాదు. బ్రాహ్మణులలో కూడా అప్పుడప్పుడు శూద్రత్వము వచ్చేస్తుంది. పాపము ఎప్పటి నుండి ప్రారంభమయిందో కూడా మీకు తెలుసు, కామచితి పైకి ఎక్కినప్పటి నుండి మొదలయింది. మీ బుద్ధిలో పూర్తి చక్ర జ్ఞానమంతా ఉంది. పై భాగములో పరమపిత పరమాత్మ తండ్రి, ఆ తర్వాత ఆత్మలైన మీరు. ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలో తప్పకుండా గుర్తు ఉండాలి. ఇప్పుడు మనము బ్రాహ్మణులము, దేవతలుగా అవుతున్నాము. వైశ్య, శూద్ర వంశాలలోకి వస్తాము. తండ్రి వచ్చి మనలను శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేస్తున్నారు, తర్వాత మనము మళ్లీ బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము. బ్రాహ్మణులుగా అయ్యి కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకొని మళ్లీ వాపస్‌ ఇంటికి వెళ్ళిపోతాము. మీరు తండ్రిని కూడా తెలుసుకున్నారు. పల్టీల ఆట లేక 84 జన్మల చక్రము కూడా మీకు తెలుసు. పల్టీల ఆట ద్వారా మీకు సులభంగా అర్థం చేయిస్తున్నారు. మిమ్ములను చాలా తేలికగా చేస్తున్నారు - దాని వలన మీరు బిందువై వెంటనే ఎగిరిపోగలరు. తరగతిలో కూర్చున్నప్పుడు పిల్లల బుద్ధిలో చదువే స్మృతిలో ఉంటుంది, అలాగే మనకు ఈ చదువు గుర్తుకుండాలి. ఇప్పుడు మనము సంగమ యుగములో ఉన్నాము మళ్లీ ఇదే విధంగా చక్రములో తిరుగుతాము. ఈ చక్రము సదా బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. ఈ చక్రము మొదలైనవాటి జ్ఞానము బ్రాహ్మణులైన మీ వద్ద మాత్రమే ఉంది. శూద్రులకు గానీ, దేవతలకు గానీ ఈ జ్ఞానము లేదు. భక్తిమార్గములో తయారు చేసిన చిత్రములో లోపాలున్నాయని(డిఫెక్టడ్‌) ఇప్పుడు మీకు తెలుసు. మీ వద్ద ఉండే చిత్రాలు చాలా ఖచ్ఛితమైనవి(ఆక్యురేట్‌) ఎందుకంటే మీరు సరిగ్గా తయారవుతున్నారు. ఇప్పుడు మీకు జ్ఞానము లభించింది. అందువలన మీకు ఇప్పుడు భక్తి అంటే ఏమో, జ్ఞానమంటే ఏమో తెలుసు. జ్ఞానాన్ని ఇచ్చే తండ్రి జ్ఞానసాగరులు. ఇప్పుడు వారు లభించారు. పాఠశాలలో చదువునప్పుడు లక్ష్యముంటుంది కదా, భక్తిమార్గములో లక్ష్యముండదు. మనము శ్రేష్ఠమైన దేవీదేవతలుగా ఉండేవారము, తర్వాత పతితంగా అయ్యాము. అప్పుడు మీకు తెలియదు, ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు. మీకిప్పుడు అన్ని విషయాలు తెలుసు. బి.కె.లుగా ఇంతకుముందు కూడా అయ్యారు. ప్రజాపిత బ్రహ్మ పేరు ప్రసిద్ధి చెందింది. ప్రజాపిత మానవుడు కదా. వారికంత మంది పిల్లలున్నారంటే తప్పకుండా దత్తు పిల్లలే అని అర్థము కదా. ఎంతమంది దత్తు పిల్లలుగా అయ్యారు ! ఆత్మ రూపములో అందరూ సోదరులే(భాయి-భాయి) కదా. ఇప్పుడు మీ బుద్ధి ఎంతో దూరాలకు వెళ్తుంది. పైన ఆకాశములోని నక్షత్రాలు దూరము నుండి ఎంతో చిన్నవిగా కనిపిస్తాయి. మీరు కూడా చాలా చిన్న ఆత్మలు. ఆత్మ ఎప్పుడూ చిన్నదిగా, పెద్దదిగా మారదు. కానీ మీ పదవి అత్యంత ఉన్నతమైనది. ఆత్మలన్నీ ఒకే విధంగా చిన్నవిగా ఉంటాయి. వాటిని కూడా సూర్య దేవత, చంద్ర దేవత,....... అని అంటారు. సూర్యుని తండ్రి, చంద్రుని తల్లి అని అంటారు. ఇక మిగిలిన ఆత్మలన్నీ నక్షత్రాలు. ఆత్మలన్నీ ఒకే రకంగా చిన్నవిగా ఉంటాయి. ఇక్కడకు వచ్చి పాత్రధారులుగా అవుతాయి, మీరు మాత్రమే దేవతలుగా అవుతారు.
మనము చాలా శక్తిశాలురుగా అవుతున్నాము. తండ్రిని స్మృతి చేసినందున మనము సతోప్రధాన దేవతలుగా అవుతాము. నంబరువారుగా కొద్ది కొద్దిగా తేడా ఉండనే ఉంటుంది. కొన్ని ఆత్మలు పవిత్రంగా అయ్యి సతోప్ర్రధాన దేవతలుగా అవుతాయి. కొన్ని ఆత్మలు సంపూర్ణ పవిత్రంగా అవ్వలేవు. జ్ఞానము కొద్దిగా కూడా తెలియదు. తండ్రి అర్థం చేయించారు. తండ్రి పరిచయము అందరికీ తప్పకుండా లభించాలి. చివరిలోనైనా తండ్రిని గుర్తిస్తారు కదా. వినాశన సమయములో తండ్రి వచ్చారని అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు కూడా కొంత మంది భగవంతుడెక్కడో అవతరించి ఉన్నారు కానీ ఎక్కడ ఉన్నారో తెలియదని అంటారు. ఏదో ఒక రూపములో వస్తారని భావిస్తారు. మానవ మతాలు(అభిప్రాయాలు) అనేకమున్నాయి కదా. మీది మాత్రము ఒకే ఈశ్వరీయ మతము. ఈ ఈశ్వరీయ మతము ద్వారా మీరు ఎలా తయారవుతారు? ఒకటేమో మానవ మతము రెండవది ఈశ్వరీయ మతము మూడవది దేవతా మతము. దేవతలకు కూడా మతమునిచ్చేదెవరు? తండ్రి. తండ్రి శ్రీమతము శ్రేష్ఠంగా తయారు చేస్తుంది. శ్రీ శ్రీ అని తండ్రినే అనాలి. మానవులను అనరాదు. శ్రీ శ్రీ యే స్వయంగా వచ్చి శ్రీ(శ్రేష్ఠము)గా తయారు చేస్తారు. దేవతలను శ్రేష్ఠంగా తయారు చేయువారు తండ్రి ఒక్కరు మాత్రమే. వారిని శ్రీ శ్రీ అని అంటారు, నేను మిమ్ములను అలాంటి యోగ్యులుగా తయారుచేస్తాను. వారు కూడా తమకు శ్రీ శ్రీ అనే బిరుదు తగిలించుకున్నారు. సమావేశాలలో కూడా మీరు తెలపండి. తెలిపించేందుకు మీరే నిమిత్తంగా అయ్యారు. శ్రీ శ్రీ అయినవారు ఒక్క శివబాబా మాత్రమే. వారు ఇటువంటి శ్రేష్ఠమైన దేవతలుగా చేస్తారు. వారు శాస్త్రాలు మొదలైన చదువులు చదివి టైటిల్‌(బిరుదు) తీసుకుంటారు. మిమ్ములను శ్రీ శ్రీ అయిన తండ్రి, శ్రీ అనగా శ్రేష్ఠంగా చేస్తున్నారు. ఈ ప్రపంచము తమోప్రధాన, భ్రష్టాచార ప్రపంచంగా ఉంది. భ్రష్టాచారము ద్వారానే జన్మిస్తారు. ఆ తండ్రి మహిమలెక్కడ? ఈ పతిత మానవుల బిరుదులెక్కడ? ఈ పతిత మానవులు ఆ తండ్రి బిరుదులు తమ పై ఉంచుకుంటారు. సత్య-సత్యమైన మహాత్మలు దేవీదేవతలు కదా. సతోప్రధాన ప్రపంచములో తమోప్రధాన మానవులుండేందుకు వీలే లేదు. రజోలో రజో మానవులే ఉంటారు. తమో గుణమువారుండరు. వర్ణముల గాయనము ఇప్పుడు మీకు అర్థము అవుతోంది. ఇంతకు ముందు మీకేమీ తెలిసేది కాదు. ఇప్పుడు తండ్రి ఎంత తెలివిగలవారిగా చేస్తున్నారు! మీరు ఎంతో ధనవంతులుగా అవుతారు. శివబాబా భండారము భర్‌పూర్‌(నిండు)గా ఉంది. శివబాబా భండారమేది?(అవినాశి జ్ఞాన రత్నాలు) శివబాబా భండారము భర్‌పూర్‌, కష్టాలు దూరము(భండారా భర్‌పూర్‌ కాల్‌కంటక్‌ దూర్‌). తండ్రి పిల్లలైన మీకు జ్ఞాన రత్నాలను ఇస్తున్నారు. వారు స్వయం సాగరులయ్యారు. జ్ఞానరత్నసాగరుని పిల్లల బుద్ధి బేహద్‌ వైపుకు వెళ్ళాలి. ఇన్ని కోట్ల ఆత్మలన్నీ తమ తమ శరీరాలనే సింహాసనాలలో విరాజమానమై ఉన్నాయి. ఇది అనంతమైన నాటకము. ఆత్మ ఈ సింహాసనము పై విరాజమానమై ఉంటుంది. ఒక సింహాసనమున్నట్లు మరో సింహాసనము ఉండదు. రూపురేఖలు వేరు వేరుగా ఉంటాయి. దానినే ప్రాకృతికము(కుదరత్‌) అని అంటారు. ప్రతి ఒక్కరిది అవినాశి పాత్రనే. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉంటుంది. ఆత్మ అతి సూక్ష్మమైనది, ఇంతకంటే సూక్ష్మమైనది, అద్భుతమైననది వేరేదేదీ లేదు. ఇంత చిన్న ఆత్మలో పాత్ర అంతా నిండి ఉంది. పాత్రను ఇక్కడే అభినయిస్తారు. సూక్ష్మవతనములో ఏ పాత్రనూ అభినయించరు. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తున్నారు. తండ్రి ద్వారా మీరు సర్వమూ తెలుసుకుంటారు. జ్ఞానమంటే ఇదే. అంతేగాని అందరి ఆంతర్యాలను తెలుసునని కాదు. ఈ జ్ఞానము మీలో కూడా ఉత్పన్నమవుతూ ఉంది. దాని ద్వారానే ఇంత ఉన్నత పదవిని పొందుతారు. దానిని గురించి కూడా మీకు తెలుసు. తండ్రి బీజరూపులు, వారిలో వృక్షం ఆదిమధ్యాంతాల జ్ఞానముంది. మానవులు లక్షల సంవత్సరాల ఆయువును ఇచ్చేశారు కావున జ్ఞానము వారికి రాదు. ఇప్పుడు మీకు సంగమ యుగములో ఈ జ్ఞానమంతా లభిస్తూ ఉంది. తండ్రి ద్వారా మీరు మొత్తం చక్ర జ్ఞానమంతా తెలుసుకుంటారు. ఇంతకుముందు తెలిసేది కాదు. ఇప్పుడు మీరు సంగమ యుగములో ఉన్నారు. ఇదే మీ అంతిమ జన్మ. పురుషార్థము చేస్తూ చేస్తూ మీరు సంపూర్ణ బ్రాహ్మణులుగా తయారైపోతారు. ఇప్పుడింకా తయారవ్వలేదు. ఇప్పుడైతే మంచి మంచి పిల్లలు కూడా బ్రాహ్మణుల నుండి శూద్రులుగా అయిపోతారు. దానినే మాయతో ఓడిపోవడమని అంటారు. ఓడినందున బాబా ఒడి నుండి రావణుని ఒడిలోకి వెళ్ళిపోతారు. శ్రేష్ఠముగా తయారు చేసే బాబా ఒడి ఎక్కడ? భ్రష్టులుగా తయారుచేసే ఒడి ఎక్కడ? ఒక్క సెకండులో జీవన్ముక్తి అలాగే ఒక సెకండులో పూర్తి దుర్దశపాలవుతారు. దుర్దశ ఎలా కలుగుతుందో బ్రాహ్మణ పిల్లలైన మీకు చాలా బాగా తెలుసు. ఈ రోజు బాబాకు చెందినవారిగా అవుతారు, మళ్లీ రేపటి రోజు మాయ పిడికిలిలో చిక్కుకుని రావణుని వారిగా అవుతారు. మీరు రక్షించేందుకు ప్రయత్నిస్తే కొంతమంది రక్షింపబడ్తారు. మునిగిపోతున్నవారిని చూస్తే రక్షించేందుకు ప్రయత్నము చేస్తూ ఉండండి. కానీ ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, గొడవలు జరుగుతాయి.
తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు పాఠశాలలో చదువుతున్నారు కదా. మనము చక్రములో ఎలా తిరుగుచున్నామో మీకు తెలుసు. ఈ విధంగా చేయమని పిల్లలైన మీకు శ్రీమతము లభిస్తుంది. ఇవన్నీ భగవానువాచ(భగవంతుడే తెలిపిన విషయాలు). వారిది శ్రీమతము కూడా అయ్యింది కదా. ఇప్పుడు నేను పిల్లలైన మిమ్ములము శూద్రుల నుండి దేవతలుగా చేసేందుకు వచ్చాను. ఇప్పుడు కలియుగములో ఉండేది శూద్ర సంప్రదాయము, కలియుగము ముగుస్తోందని మీకు తెలుసు. మీరు సంగమ యుగములో కూర్చొని ఉన్నారు. ఈ తండ్రి ద్వారా జ్ఞానము లభించింది. తయారైన శాస్త్రాలన్నిటిలో మానవ మతాలున్నాయి. ఈశ్వరుడు శాస్త్రాలను తయారుచేయరు. ఒక్క గీతా శాస్త్రము పైననే ఎన్నో పేర్లు ఉంచారు. గాంధీ గీత, ఠాగూర్‌ గీత మొదలైనవి అనేక పేర్లు ఉన్నాయి. గీతను మానవులు ఎందుకు ఇంతగా చదువుతున్నారో కొద్దిగా కూడా అర్థము చేసుకోరు. అదే అధ్యాయాన్ని పట్టుకొని వారి వారి వాఖ్యానాలు వేరు వేరుగా చేస్తుంటారు. అవన్నీ మానవులు చేసినవి కదా. మానవులు తయారు చేసిన గీతను చదువడం వల్లనే ఈనాటి భారతదేశ పరిస్థితి ఇలా తయారయిందని మీరు చెప్పండి. మొదటి నంబరు శాస్త్రము గీతనే కదా. అది సనాతన దేవీదేవతా ధర్మపు శాస్త్రము. ఇది మీ బ్రాహ్మణ కులము, ఇది బ్రాహ్మణ ధర్మము కదా. ఎన్ని ధర్మాలున్నాయి! ఎవరెవరు ఏ ఏ ధర్మాన్ని స్థాపించారో వారి పేరు మీదే నడుస్తూ ఉంటాయి. జైనులు మహావీరుడని అంటారు. పిల్లలైన మీరంతా మహావీరులు - మహావీర వనితలు. మందిరాలలో మీ స్మృతిచిహ్నాలు ఉన్నాయి. రాజయోగులు కదా. క్రింద యోగ తపస్సులో కూర్చుని ఉన్నారు, పైన రాజ్యమును చూపించే చిత్రాలున్నాయి. రాజయోగము గురించి తెలిపే సరియైన మందిరము(దిల్వాడా మందిరము). కానీ ఎవరెవరో ఏవేవో పేేర్లు ఉంచారు. స్మారకచిహ్నాలు సరిగ్గా(ఆక్యురేట్‌గా) ఉన్నాయి. బుద్ధికి పని కలిగించి సరిగ్గా తయారుచేశారు. తర్వాత ఏ పేరు చెబితే ఆ పేరుంచారు. దానిని స్మృతిచిహ్నముగా (మాడల్‌గా) తయారుచేశారు. స్వర్గము మరియు సంగమయుగ రాజయోగాల మాడల్స్‌ తయారుచేశారు. మీరు ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నారు. ఆదిని కూడా మీరు చూశారు, ఆది అని సంగమ యుగమును అనాలా? లేక సత్యయుగమును అనాలా? సంగమయుగ దృశ్యమును క్రింద చూపిస్తారు, రాజ్యమును పై కప్పులో చూపిస్తారు. కావున సత్యయుగము ఆదియుగము, ద్వాపరము మధ్యయుగము. అంత్యమును మీరు చూడనే చూస్తారు. ఇదంతా సమాప్తమవ్వనున్నది. పూర్తి స్మారకచిహ్నాలు తయారు చేయబడ్డాయి. దేవీదేవతలు వామమార్గములోకి వెళ్తారు. ద్వాపరము నుండి వామమార్గము మొదలవుతుంది. స్మారకచిహ్నము నూటికి నూరుపాళ్ళు సరిగ్గా ఉంది. స్మృతిచిహ్నాలుగా చాలా మందిరాలను నిర్మించారు. అన్ని గుర్తులు ఇక్కడనే ఉన్నాయి. మందిరాలు కూడా ఇక్కడే తయారవుతాయి. దేవీదేవతలైన భారతదేశ వాసులే రాజ్యమును పాలించి వెళ్లిపోయారు. వారి తర్వాత ఎన్నో మందిరాలు తయారయ్యాయి. సిక్కుల సంఖ్య వృద్ధి అయినప్పుడు వారి మందిరాలను వారు నిర్మించుకుంటారు. మిలట్రీవారు తమ మందిరాలను ట్టుకుంటారు. భారతదేశ వాసులు వారి కృష్ణ మందిరము లేక లక్ష్మీనారాయణుల మందిరాలను తయారు చేసుకుంటారు. హనుమంతుడు, గణేశుల మందిరాలను తయారుచేస్తారు. సృష్టి అంతా ఎలా తిరుగుతుందో, ఎలా స్థాపించబడిందో, ఎలా వినాశమవుతుందో, ఎలా పాలన జరుగుతుందో ఇదంతా మీరు మాత్రమే అర్థం చేసుకున్నారు. దీనిని అంధకార రాత్రి అని అంటారు. బ్రహ్మపగలు - బ్రహ్మ రాత్రిని గురించిన గాయనముంది ఎందుకంటే బ్రహ్మయే చక్రములోకి వస్తారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు మళ్లీ దేవతలుగా అవుతారు. ముఖ్యమైనవారు బ్రహ్మ కదా. బ్రహ్మను ఉంచుకోవచ్చు లేక విష్ణువును ఉంచుకోవచ్చు. బ్రహ్మను రాత్రికి, విష్ణువును పగలుకు ఉంచుతారు. మళ్లీ వారే రాత్రి నుండి పగలుకు వస్తారు. పగలు నుండి 84 జన్మల తర్వాత రాత్రిలోకి వస్తారు. ఇదెంతో సులభంగా అర్థం చేయించాలి. కానీ పిల్లలు ఇది కూడా పూర్తిగా గుర్తుంచుకోరు. పూర్తిగా చదువుకోరు కనుక నంబరువారు పురుషార్థానుసారము పదవిని పొందుతారు. ఎంత బాగా స్మృతి చేస్తారో, అంత సతోప్రధానంగా అవుతారు. సతోప్రధానంగా ఉన్న భారతదేశమే తమోప్రధానంగా అవుతుంది. పిల్లలలో జ్ఞానము చాలా ఉంది. ఈ జ్ఞానాన్ని స్మరిస్తూ ఉండాలి. అనంతమైన తండ్రి ఇచ్చే ఈ జ్ఞానము నూతన ప్రపంచము కొరకే. మానవులంతా అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు. ఇంగ్లీషువారు కూడా ఓ గాడ్‌ఫాదర్‌, లిబరేటర్‌, గైడ్‌ అని స్మృతి చేస్తారు. దీని అర్థము మీకు బాగా తెలుసు. తండ్రి వచ్చి దు:ఖ ప్రపంచము నుండి బంగారు యుగములోకి తీసుకెళ్తారు. బంగారు యుగము గతములో తప్పకుండా ఉండేది. అందుకే దానిని అందరూ స్మృతి చేస్తారు. పిల్లలైన మీకు ఆంతరికములో చాలా ఖుషీ ఉండాలి. దైవీ కర్మలు ఆచరించాలి. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తండ్రి నుండి లభిస్తున్న తరగని అవినాశి జ్ఞాన రత్నాల ఖజానాను స్మృతిలో ఉంచుకొని బుద్ధిని అనంతములోకి తీసుకెళ్లాలి. ఈ అనంతమైన నాటకములో ఆత్మలు తమ తమ సింహాసనాల పై విరాజమానమై ఉన్నాయి. ఈ ప్రాకృతికాన్ని(స్వాభావిక నాటకమును) సాక్షిగా చూస్తూ ఉండాలి.
2. సదా బుద్ధిలో మేము సంగమ యుగంలోని బ్రాహ్మణులము, మాకు శ్రేష్ఠమైన తండ్రి ఒడి లభించింది, రావణుని ఒడిలోకి వెళ్లము అని గుర్తుండాలి. మునిగేవారిని రక్షించడం కూడా మీ కర్తవ్యము.

వరదానము :- '' సేవా భావంతో సేవ చేస్తూ, ముందుకు వెళ్తూ ఇతరులను తీసుకెళ్లే నిర్విఘ్న సేవాధారీ భవ ''
సేవా భావము సఫలతనిప్పిస్తుంది. ఒకవేళ సేవలో అహంభావము వచ్చిందంటే, దానిని సేవా భావమని అనరు. ఏ సేవలో అయినా అహం భావం మిక్స్‌ అయ్యి ఉంటే ఎక్కువ శ్రమ, ఎక్కువ సమయం పడ్తుంది. అంతేకాక స్వయం సంతుష్టంగా కూడా ఉండరు. సేవా భావమనగా పిల్లలు స్వయం వారు కూడా ముందుకు వెళ్తారు, ఇతరులను కూడా ముందుకు తీసుకెళ్తారు. వారు సదా ఎగిరేకళను అనుభవం చేస్తారు. వారి ఉమంగ-ఉత్సాహాలు స్వయాన్ని నిర్విఘ్నంగా చేస్తాయి, అంతేకాక ఇతరుల కళ్యాణము కూడా చేస్తాయి.

స్లోగన్‌ :- '' ఎవరైతే సూక్ష్మమైన మరియు ఆకర్షించే దారాల నుండి కూడా ముక్తులుగా ఉంటారో, వారే జ్ఞానయుక్త ఆత్మలు ''

Tuesday, 26 November 2019

Telugu Murli 27/11/2019

27-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - తండ్రి దృష్టి హద్దు, బేహద్‌లను కూడా దాటి వెళ్తుంది. మీరు కూడా హద్దు(సత్యయుగము), బేహద్‌(కలియుగము) లను దాటి వెళ్లాలి ''

ప్రశ్న :- శ్రేష్ఠాతిశ్రేష్ఠమైన జ్ఞానరత్నాల ధారణ ఎటువంటి పిల్లలకు బాగా జరుగుతుంది ?
జవాబు :- బుద్ధియోగము ఒక్క తండ్రి జతలో మాత్రమే ఉన్నవారికి, పవిత్రమైన వారికి జ్ఞానరత్నాల ధారణ బాగా జరుగుతుంది. ఈ జ్ఞానరత్నాల ధారణ కొరకు పాత్ర శుద్ధంగా ఉండాలి. ఉల్టా - సుల్టా (వ్యతిరేక, విరుద్ధమైన) సంకల్పాలు కూడా సమాప్తమవ్వాలి. తండ్రితో యోగాన్ని జోడిస్తూ జోడిస్తూ పాత్ర బంగారమైనప్పుడు రత్నాలు నిలువగలవు (జ్ఞానరత్నాల ధారణ జరుగుతుంది).

ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు కూర్చుని ప్రతిరోజు అర్థం చేయిస్తున్నారు. ఈ సృష్టిచక్రము జ్ఞానము, భక్తి, వైరాగ్యాలతో తయారైనదని పిల్లలకు అర్థం చేయించబడింది. బుద్ధిలో ఈ జ్ఞానము గుర్తుండాలి. పిల్లలైన మీరు ఈ హద్దు - బేహద్‌లకు అతీతంగా వెళ్లాలి. తండ్రి అయితే హద్దు, బేహద్‌లకు అతీతంగా ఉన్నారు. ఇది కూడా అర్థము చేసుకోవాలి కదా. ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - జ్ఞానము, భక్తి తర్వాత వైరాగ్యమనే విషయాన్ని కూడా అర్థం చేయించాలి. జ్ఞానాన్ని పగలు అని అంటారు, అప్పుడు నూతన ప్రపంచముంటుంది. అక్కడ ఈ భక్తి అను అజ్ఞానము ఉండదు. అది హద్దు ప్రపంచము ఎందుకంటే అక్కడ చాలా కొద్ది మందే ఉంటారు. తర్వాత నెమ్మదినెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటుంది. అర్ధ సమయము తర్వాత భక్తి ప్రారంభమవుతుంది. అక్కడ సన్యాస ధర్మము ఉండదు, సన్యాసము లేక త్యాగము ఉండదు. తర్వాత సృష్టి వృద్ధి చెందుతుంది. పై నుండి ఆత్మలు వస్తూ ఉంటాయి, ఇక్కడ వృద్ధి జరుగుతూ ఉంటుంది. హద్దు నుండి బేహద్‌కు వెళ్తుంది. తండ్రి దృష్టి హద్దు - బేహద్‌లకు దూరంగా వెళ్తుంది. హద్దులో చాలా కొద్దిమందే ఉంటారని తెలుసు. తర్వాత రావణ రాజ్యములో చాలా వృద్ధి జరుగుతుంది. ఇప్పుడు మీరు హద్దు - బేహద్‌ల నుండి అతీతంగా అవ్వాలి. సత్యయుగములోని ప్రపంచము చాలా చిన్నది. అక్కడ సన్యాసము లేక వైరాగ్యము మొదలైనవేవీ ఉండవు. తర్వాత ద్వాపరము నుండి ఇతర ధర్మాలు ప్రారంభమవుతాయి. సన్యాస ధర్మము కూడా ఉంటుంది. అందులో ఇల్లువాకిళ్ళు వదిలేస్తారు. అన్ని విషయాలు తెలుసుకోవాలి కదా. వారిది హఠయోగము, హద్దు సన్యాసము అంటారు. కేవలం ఇల్లు - వాకిళ్ళు వదిలి అడవులకు వెళ్లిపోతారు. ద్వాపరము నుండి భక్తి మొదలవుతుంది, జ్ఞానము ఉండనే ఉండదు. జ్ఞానమంటే సత్య-త్రేతాయుగాలు. అందులో సుఖముంటుంది. భక్తి అనగా అజ్ఞానము, దు:ఖము. ఇది బాగా అర్థము చేసుకొని చేయించాలి. తర్వాత సుఖ - దు:ఖాల నుండి అతీతంగా వెళ్లాలి. హద్దు - బేహద్‌లకు అతీతంగా వెళ్లాలి. సముద్రమెంతవరకు ఉందో, ఆకాశమెంతవరకు ఉందోనని మనుష్యులు పరిశోధిస్తూ ఉంటారు. ఎంత ప్రయత్నించినా అంతములను తెలుసుకోలేరు. పరిశోధించేందుకు విమానాలలో వెళ్తారు కాని వాపస్‌ వచ్చేందుకు కూడా తగినంత పెట్రోలు ఉండాలి కదా. ఎంతో దూరాలకు వెళ్తారు. కాని అనంతములోకి (సూక్ష్మలోకము, మూలలోకాలలోకి) వెళ్లలేరు. హద్దు వరకు వెళ్తారు. మీరు హద్దు - బేహద్‌లను దాటి వెళ్లిపోతారు. నూతన ప్రపంచములో మొదట హద్దు(పరిమితము)ఉంటుందని ఇప్పుడు మీరు అర్థం చేయించగలరు. అక్కడ మనుష్యులు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. దానిని సత్యయుగమని అంటారు. రచనను గురించిన ఆదిమధ్యాంతాల జ్ఞానముండాలి కదా. ఈ జ్ఞానము ఇతరులెవ్వరిలోనూ లేదు. మీకు అర్థం చేయించేవారు తండ్రి. ఆ తండ్రి హద్దు బేహద్‌లకు అతీతంగా ఉంటారు. ఈ జ్ఞానాన్ని ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. రచనను గురించిన ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయించి వాటి నుండి అతీతంగా ఉండమని చెప్తున్నారు. అక్కడ ఏమీ ఉండదు. ఎంత దూరము పోయినా ఆకాశమే ఆకాశముంటుంది. దానినే హద్దు - బేహద్‌ల నుండి దూరమని అంటారు. అంతమెవ్వరూ తెలుసుకోలేరు. అంతము లేనిదని, అనంతమని అంటారు. అనంతమని చెప్పడము సులభమే కాని అంతమనగా అర్థము తెలుసుకోవాలి. నాకు హద్దు మరియు బేహద్‌ గురించి కూడా తెలుసు అని తండ్రి ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు. ఫలానా ఫలానా ధర్మము, ఫలానా ఫలానా సమయములో స్థాపన అవుతుందని నాకు తెలుసు. హద్దులోని సత్యయుగము వైపుకు దృష్టి పోతుంది, తర్వాత బేహద్‌ కలియుగము వైపుకు వెళ్తుంది. ఆ తర్వాత మనము రెండింటిని దాటి వెళ్లిపోతాము. అక్కడ ఏమీ లేదు. సూర్యచంద్రులను దాటి ఇంకా పైకి వెళ్తాము. అక్కడ మన ఇల్లు శాంతిధామము, మధురమైన ఇల్లు( స్వీట్‌ హోమ్‌) ఉంది. సత్యయుగము కూడా మధురమైన ఇల్లే. అక్కడ శాంతితో పాటు రాజ్యభాగ్య సుఖము కూడా ఉంటుంది - రెండూ ఉంటాయి. ఇంటికి వెళ్తే అక్కడ కేవలం శాంతి ఉంటుంది. సుఖమనే పేరే ఎత్తరు. ఇప్పుడు మీరు శాంతి స్థాపన చేస్తున్నారు, అంతేకాక సుఖశాంతులను కూడా స్థాపన చేస్తున్నారు. అక్కడ శాంతితో పాటు సుఖమైన రాజ్యము కూడా ఉంటుంది. మూలవతనములో సుఖమనే మాటే ఉండదు.
అర్ధకల్పము మీ రాజ్యము నడుస్తుంది. అర్ధకల్పము రావణ రాజ్యము నడుస్తుంది. 5 వికారాల వల్లనే అశాంతి కలుగుతుంది. 2500 సంవత్సరాలు మీరు రాజ్యపాలన చేస్తారు, మళ్లీ 2500 సంవత్సరాల తర్వాత రావణ రాజ్యము ఉంటుంది. వారేమో లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. పూర్తి బుద్ధిహీనులుగా తయారుచేశారు. 5 వేల సంవత్సరాల కల్పమును లక్షల సంవత్సరాలని చెప్పడం బుద్ధిహీనత అనే అంటారు కదా. సభ్యత ఏ మాత్రము లేదు. దేవతలలో ఎంతో దైవీ సభ్యత ఉండేది. ఇప్పుడు అసభ్యంగా అయ్యారు. ఏమీ తెలియదు. ఆసురీ గుణాలు వచ్చేశాయి. ఇదంతా మీకు కూడా ఇంతకుముందు తెలిసేది కాదు. కామఖడ్గము ఆదిమధ్యాంతాలు దు:ఖీలుగా తయారు చేస్తుంది. అందుకే వారిని రావణ సంప్రదాయానికి చెందిన వారని అంటారు. రాముడు వానరసైన్యాన్ని సహాయంగా తీసుకున్నట్లు చూపిస్తారు. రామచంద్రుడు త్రేతాయుగానికి చెందినవాడు. అక్కడ కోతులెక్కడివి? అంతేకాక రాముని భార్య సీత అపహరింపబడిందని అంటారు. ఇటువంటి ఘటనలు అక్కడ జరగనే జరగవు. ఇక్కడున్నట్లు 84 లక్షల జీవరాసులు సత్యత్రేతాయుగాలలో ఉండవు. ఈ బేహద్‌ డ్రామా గురించి తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. పిల్లలు చాలా దూరదృష్టి గలవారిగా ఉండాలి. ఇంతకుముందు మీకు ఏమీ తెలిసేది కాదు. మానవులై ఉండి నాటకము గురించి తెలియకుండా ఉండేవారు. అందరిలో గొప్పవారెవరో మీకు తెలుసు. అత్యంత ఉన్నతమైనవారు భగవంతుడు. శ్లోకాలు కూడా చదువుతారు. మీ పేరు ఉన్నతమే,........ (ఊంచా తేరా నామ్‌, ఊంచా తేరా ధామ్‌.........) ఇప్పుడు మీకు తప్ప ఇతరులెవ్వరి బుద్ధిలోనూ లేదు. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. తండ్రి హద్దు - బేహద్‌ల రెండింటి రహస్యాన్ని తెలియజేస్తున్నారు. వాటి కంటే పైన ఏమీ లేదు. అది మీరుండే స్థానము. దానిని బ్రహ్మాండము అని కూడా అంటారు. మీరిక్కడ ఆకాశతత్వములో ఉన్నారు. ఇందులో ఏదైనా కనిపిస్తుందా? రేడియోలో ఆకాశవాణి అని అంటారు. ఈ ఆకాశానికి అంతము లేదు. అంతము చూడలేరు. ఆకాశవాణి అంటే మానవులు ఏమనుకుంటారు? వీరి నోరు పోలార్‌. నోటి నుండి శబ్ధము వెలువడ్తుంది. ఇది సాధారణ విషయము. నోటి నుండి శబ్ధాలు వెలువడుటను ఆకాశవాణి అని అంటారు. తండ్రి కూడా ఆకాశము ద్వారా శబ్ధము చేయవలసి వచ్చింది. పిల్లలైన మీకు తన రహస్యమంతా అర్థం చేయించారు. అందరికీ ఎవరి పాత్ర వారికి లభించింది. అందరికంటే శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన వారు భగవంతుడు. తర్వాత ప్రవృత్తి మార్గములోని జంట పూస(మేరు). ఆ తర్వాత నంబరువారుగా ఉంటారు. మాల చాలా చిన్నది. ఆ తర్వాత సృష్టి వృద్ధి చెందుతూ ఎంతో పెద్దదిగా అవుతుంది. ఎన్ని కోట్ల ఆత్మల మాల. ఇదంతా చదువే. తండ్రి అర్థం చేయించిన దానినంతా బుద్ధిలో బాగా ధారణ చేయాలి. వృక్షాన్ని గురించిన వివరాలు మీరు వింటూనే ఉంటారు. బీజము ఉపరి భాగములో ఉంది. అది వెరైటీ వృక్షము. దాని ఆయుష్షు ఎన్ని సంవత్సరాలు? వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. రోజంతా ఇది బుద్ధిలో ఉండాలి. ఈ సృష్టి అనే కల్పవృక్షము ఆయువు చాలా ఖచ్ఛితంగా ఉంటుంది. 5 వేల సంవత్సరాలకు ఒక్క సెకెండు కూడా వ్యత్యాసము ఉండదు. పిల్లలైన మీ బుద్ధిలో ఇప్పుడు చాలా జ్ఞానముంది. మీరు శక్తిశాలిగా ఉన్నారు. పవిత్రంగా ఉంటే శక్తిశాలిగా ఉంటారు. ఈ జ్ఞానాన్ని ధారణ చేసేందుకు బంగారు పాత్ర (బుద్ధి) అవసరము. ఆ తర్వాత బాబాకు ఎంత సహజమో, మీకు కూడా అంత సహజంగా అయిపోతుంది. అప్పుడు మిమ్ములను కూడా మాస్టర్‌ జ్ఞానసాగరులని అంటారు. మీరు మాలలోని పూసలుగా అవుతారు. ఇటువంటి విషయాలను బాబా తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. ఈ(బ్రహ్మ) ఆత్మ కూడా తెలుపుతూ ఉంది, తండ్రి కూడా ఈ శరీరము ద్వారానే అర్థం చేయిస్తారు, దేవతల శరీరము ద్వారా కాదు. తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి గురువుగా అవుతారు. అయినా తండ్రి పాత్రను అభినయించాలి. 5 వేల సంవత్సరాలకు ఒకసారి వచ్చి పాత్ర చేస్తారు.
తండ్రి చేయిస్తున్నారు - నేను సర్వోన్నతమైన వాడిని. నా తర్వాత జంటపూస. ఆదిలో మహారాజ - మాహారాణిగా ఉన్నవారే మళ్లీ ఆదిదేవుడు, ఆదిదేవిగా అవుతారు. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది. ఈ జ్ఞానాన్ని మీరెక్కడ వినిపించినా ఆశ్చర్యపడ్తారు. వీరు సరిగ్గా చెప్తున్నారు. మానవ సృష్టికి బీజరూపులు ఒక్క జ్ఞానసాగరులు మాత్రమే. వారు తప్ప మరెవ్వరూ జ్ఞానము అర్థం చేయించలేరు. ఈ విషయాలన్నీ ధారణ చేయాలి. కాని పిల్లలకు ధారణ అవ్వదు. చాలా సులభమైనదే. ఏ కష్టమూ లేదు. మొదటిది స్మృతియాత్ర చేయాలి. పాత్ర పవిత్రంగా, శుద్ధంగా ఉండాలి, అప్పుడు మాత్రమే జ్ఞానరత్నాలు నిలుస్తాయి. ఇవి అత్యంత శ్రేష్ఠమైన రత్నాలు. బాబా రత్నాల వ్యా.పారము చేసేవారు. చాలా మంచి మంచి వజ్రాలు, మణులు వస్తే వాటిని వెండి డబ్బీలలో, దూది మొదలైన వాటిలో భద్రంగా ఉంచేవారు. ఎవరైనా చూస్తే ఇది చాలా ఫస్ట్‌క్లాస్‌ వస్తువు అని అనేవారు. ఇది కూడా అంత మంచిది. మంచి - మంచి వస్తువులు మంచి పాత్రలలో శోభిస్తాయి. మీ చెవులు వింటున్నాయి. అందులో ఈ జ్ఞానము ధారణ అవుతుంది. పవిత్రంగా ఉంటే బుద్ధియోగము తండ్రి జతలో ఉంటుంది. ధారణ బాగా జరుగుతుంది లేకుంటే ఉన్నదంతా వెలుపలికి పోతుంది. ఆత్మ ఎంతో చిన్నది. అందులో ఎంతో జ్ఞానము నిండి ఉంది. చాలా మంచి శుద్ధమైన పాత్ర కావాలి. ఏ ఇతర సంకల్పమూ రాకూడదు. ఉల్టా - సుల్టా(అపవిత్ర) సంకల్పాలన్నీ పూర్తిగా నిలిచిపోవాలి. అన్ని వైపుల నుండి బుద్ధిని తొలగించాలి. నాతో యోగము చేస్తూ - చేస్తూ పాత్రను బంగారుగా(పవిత్రంగా) చేసుకోండి. అందులో రత్నాలు నిలవాలి. తర్వాత ఇతరులకు దానము చేస్తూ ఉంటారు. భారతదేశాన్ని మహాదాని దేశమని అంటారు. వారు ధనదానము చేస్తారు. కాని ఇది అవినాశి జ్ఞానరత్నాల దానము. దేహ సహితము ఉన్నదంతా వదిలి ఒక్కరితోనే బుద్ధియోగముంచాలి. మనము తండ్రి వారిగా అయ్యాము. ఇందులోనే శ్రమ ఉంది. లక్ష్యమేమో తండ్రి అర్థం చేయించారు, పురుషార్థము చేసేది పిల్లల కర్తవ్యము. ఉన్నత పదవి పొందుకునేది ఇప్పుడు మాత్రమే. ఏ వికారి సంకల్పాలు, వికల్పాలు రాకూడదు. జ్ఞానసాగరులు ఆ తండ్రి ఒక్కరు మాత్రమే. వారు హద్దు - బేహద్‌లకు దూరంగా ఉండేవారు. అన్ని విషయాలు కూర్చునే అర్థం చేయిస్తారు. నేను మిమ్ములను చూస్తున్నానని మీరు అనుకుంటారు. కానీ నేను హద్దు - బేహద్‌లకు దూరంగా వెళ్లిపోతాను. నేను అక్కడే నివసించేవాడిని. మీరు కూడా హద్దు - బేహద్‌లకు దూరంగా వెళ్లిపోండి. సంకల్ప, వికల్పాలేవీ రాకూడదు. దాని కొరకు శ్రమించాలి. గృహస్థములో ఉంటూ కమలపుష్ప సమానంగా అవ్వాలి. చేతులు పని చేస్తూ ఉండాలి, మనస్సు భగవంతుని స్మృతి చేస్తూ ఉండాలి(హత్‌ కార్‌ డే, దిల్‌ యార్‌ డే). గృహస్థులు చాలా మంది ఉన్నారు. గృహస్థులు ఎంత తీసుకుంటారో, ఇంట్లో ఉండే పిల్లలు అంత తీసుకోలేరు. సేవాకేంద్రాలు నడిపేవారు, మురళి వినిపించేవారు కూడా పాస్‌ అవ్వలేరు. కాని చదువుకునే వారు ఉన్నతంగా అవుతారు. పోను పోను మీకంతా తెలిసిపోతుంది. బాబా చాలా సరిగ్గా చెప్తున్నారు. మనలను చదివించేవారిని మాయ తినేసింది. మహారథులను మాయ ఒక్కసారిగా మింగేసింది. వారిప్పుడు లేనే లేరు. మాయావి విద్రోహులుగా(ట్రైటర్‌లుతీaఱ్‌శీతీ)గా అవుతారు. విదేశాలలో కూడా ద్రోహులుగా అవుతారు కదా. ఎక్కడెక్కడికో వెళ్లి శరణు తీసుకుంటారు. ఎవరు శక్తిశాలురుగా ఉంటారో ఆ వైపుకు వెళ్లిపోతారు. ఇప్పుడు మృత్యువు ఎదురుగా ఉంది కదా. అందువలన చాలా శక్తి గలవారే ఉత్తీర్ణులవుతారు. ఇప్పుడు తండ్రియే శక్తివంతులని మీరు అర్థం చేసుకున్నారు. ఆ తండ్రి సర్వశక్తివంతులు, మనకు నేర్పిస్తూ - నేర్పిస్తూ విశ్వమంతటికి అధికారులుగా చేస్తారు. అక్కడ సర్వస్వము లభిస్తాయి. లభించని వస్తువేదీ ఉండదు. ఏ వస్తువు కొరకు కూడా పురుషార్థము చేసే పనే ఉండదు. మీ వద్ద లేని వస్తువేదీ ఉండదు. అయినా నంబరువారు పురుషార్థమనుసారము పదవి లభిస్తుంది. తండ్రికి తప్ప ఇటువంటి విషయాలు వేరెవ్వరికీ తెలియదు. అందరూ పూజారులే, గొప్ప గొప్పవారు శంకరాచార్యులు మొదలైనవారున్నారు. బాబావారి గొప్పతనము గురించి కూడా తెలుపుతారు. మొదట పవిత్రతా శక్తి ద్వారా సహాయము చేసి భారతదేశాన్ని సంభాళించేందుకు వారు నిమిత్తంగా అవుతారు, అది కూడా వారు సతోప్రధానంగా ఉన్నప్పుడు మాత్రమే. ఇప్పుడు వారు కూడా తమోప్రధానంగా ఉన్నారు. వారిలో ఇప్పుడు అంత శక్తి లేదు. ఇప్పుడు పూజారులుగా ఉండిన మీరు మళ్లీ పూజ్యులుగా అవుతారు. అర్థము చెప్తున్నారు. ఇప్పుడు మీ బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. బుద్ధిలో ధారణ చేస్తూ ఇతరులకు అర్థం చేయిస్తూ ఉండండి. తండ్రిని కూడా స్మృతి చేయండి. ఆ తండ్రి వృక్ష రహస్యాన్ని పూర్తిగా అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలు కూడా ఇంత మధురంగా తయారవ్వాలి. యుద్ధము కదా. మాయావీ తుఫానులు కూడా చాలా వస్తాయి. అన్నీ సహించవలసి వస్తుంది. తండ్రి స్మృతిలో ఉంటే అన్ని తుఫానులు తొలగిపోతాయి. హాతమ్‌తాయి నాటకము గురించి తెలుపుతారు కదా. నోటిలో తావీజు(గులకరాయి) వేసుకుంటే మాయ పారిపోతుంది. అది తీసేస్తే మాయ తిరిగి వచ్చేస్తుంది. లజ్జావతి(అత్తిపత్తి, తాకగానే ముడుచుకునే ఒక మొక్క) ఆకు ఉంటుంది కదా. మాయ చాలా తీక్షణమైనది. ఇంతటి ఉన్నతమైన విద్యను అభ్యసిస్తూ ఉన్నట్లుండి క్రిందకు తోసేస్తుంది. అందుకే తండ్రి తెలుపుతున్నారు - మీరంతా భాయి - భాయి(సహోదరులు) అని భావిస్తే హద్దు - బేహద్‌లకు అతీతంగా వెళ్లిపోతారు. శరీరమే ఉండదు. అప్పుడు దృష్టి ఎక్కడకెళ్తుంది? అంత శ్రమించాలి. వింటూ వింటూ అలసిపోయి క్రిందపడరాదు. కల్ప-కల్పము మీరు పురుషార్థము చేస్తారు. మీ భాగ్యాన్ని పొందుకుంటారు. తండ్రి అంటున్నారు - ఇంతవరకు చదివిందంతా మర్చిపోండి. ఇంతవరకు చదవనిది, విననిది ఇప్పుడు వినండి, స్మృతి చేయండి. దానిని భక్తిమార్గమని అంటారు. మీరు రాజఋషులు కదా. మీరు జడలు విరబోసుకుని మురళి వినిపించండి. సాధు-సన్యాసులు వినిపించేదంతా మానవుల మురళి, ఇది బేహద్‌ తండ్రి వినిపించే మురళి. సత్య-త్రేతా యుగాలలో జ్ఞాన మురళి అవసరము లేదు. అక్కడ జ్ఞానము గానీ, భక్తి గానీ అవసరము లేదు. ఈ సంగమ యుగములోనే మీకు ఈ జ్ఞానము లభిస్తుంది. ఇచ్చేవారు ఆ తండ్రి మాత్రమే. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. బుద్ధిలో జ్ఞాన రత్నాలను ధారణ చేసుకొని దానము చేయాలి. హద్దు, బేహద్‌లకు దూరంగా వికల్పాలు, అపవిత్ర సంకల్పాలు రాకుండా ఉండు స్థితిలో ఉండాలి. మనమంతా ఆత్మలము, భాయి - భాయి అను స్మృతిలో ఉండాలి.
2. మాయావి తుఫానుల నుండి రక్షణ పొందేందుకు తండ్రి స్మృతి అనే గులకరాయి వేసుకోవాలి. అన్నీ సహించాలి. లజ్జావతి(తాకగానే ముడుచుకునే అత్తపత్తి)గా అవ్వరాదు. మాయతో ఓడిపోరాదు.

వరదానము :- '' సర్వ శక్తులను సహయోగిగా చేసుకొని ప్రత్యక్షతా పర్దాను తెరిచే సత్యమైన సేవాధారి భవ ''
ఎప్పుడైతే అన్ని సత్తాలు (శక్తులు) కలిసి శ్రేష్ఠమైన శక్తి, ఈశ్వరీయ శక్తి, అధ్యాత్మిక శక్తి లేక పరమాత్మ శక్తి ఒక్కటే, అందరూ ఒకే స్టేజి పై కలిసి ఇటువంటి స్నేహమిలనము చేయాలి. అందుకు అందరిని స్నేహ సూత్రములో బంధించి సమీపానికి తీసుకురండి, సహయోగులుగా చేయండి. ఈ స్నేహమే అయస్కాంతంగా అయి అందరిని ఒకేసారి సంఘటన రూపంలో తండ్రి స్టేజి పైకి చేరుస్తుంది. కనుక ఇప్పుడు అంతిమ ప్రత్యక్షము చేయించే హీరో పాత్రలో నిమిత్తంగా అయ్యే సేవ చేయండి. అప్పుడే మిమ్ములను సత్యమైన సేవాధారులని అంటారు.

స్లోగన్‌ :- '' సేవ ద్వారా అందరి ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకోవడమే ముందుకు వెళ్లే లిఫ్ట్‌ ''

Monday, 25 November 2019

Telugu Murli 26/11/2019

26-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - శ్రేష్ఠమైన డ్రామా జ్ఞానము పిల్లలైన మీ వద్ద మాత్రమే ఉంది, ఈ డ్రామా యథాతథంగా రిపీట్‌ అవుతుందని మీకు తెలుసు ''

ప్రశ్న :- ప్రవృత్తివారు బాబాను ఏ ప్రశ్న అడుగుతారు ? బాబా వారికి ఏమని సలహా ఇస్తారు ?
జవాబు :- చాలా మంది పిల్లలు - ''బాబా మేము వ్యాపారం చేసుకోమా?'' అని అడుగుతారు. బాబా చెప్తారు - పిల్లలూ! భలే వ్యాపారం చేయండి, కానీ రాయల్‌ వ్యాపారం చేయండి. బ్రాహ్మణ పిల్లలు, మద్యము, సిగిరెట్లు, బీడి మొదలైన ఛీ - ఛీ(నీచమైన) వ్యాపారాలు చేయరాదు. ఎందుకంటే వాటి వలన ఇంకా ఎక్కువగా వికారాల ఆకర్షణ ఉంటుంది.

ఓంశాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఇప్పుడు ఒకటి ఆత్మిక తండ్రి ఇచ్చిన శ్రీమతము, రెండవది రావణుని ఆసురీ మతము. తండ్రి మతమును ఆసురీ మతమని అనరు. రావణుడిని, తండ్రి అని అనము కదా! అది రావణుని ఆసురీ మతము. ఇప్పుడు పిల్లలైన మీకు లభించేది ఈశ్వరీయ మతము. రెండిటికి రాత్రింబవళ్ళకున్నంత తేడా ఉంది. ఈశ్వరీయ మతంతో దైవీగుణాలు ధారణ చేస్తూ వచ్చామని బుద్ధిలోకి వస్తుంది. ఇది కేవలం పిల్లలైన మీరు మాత్రమే తండ్రి ద్వారా వింటారు - ఇంకెవ్వరికీ తెలియదు. సంపద కొరకే తండ్రి లభిస్తారు. రావణుని వలన సంపద తగ్గిపోతూ వస్తుంది. ఈశ్వరీయ మతము ఎక్కడికి తీసుకు వెళ్తుందో, ఆసురీ మతము ఎక్కడకు తీసుకెళ్తుందో మీకు మాత్రమే తెలుసు. ఆసురీ మతము లభించినప్పటి నుండి మీరు క్రిందికి పడిపోతూనే వచ్చారు. క్రొత్త ప్రపంచంలో కొద్ది కొద్దిగానే కింద పడ్తారు. పడిపోవడం ఎలా జరుగుతుందో మళ్లీ ఎక్కడం ఎలా జరుగుతుందో - ఇది కూడా పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ శ్రేష్ఠంగా తయారయ్యేందుకు పిల్లలైన మీకు శ్రీమతము లభిస్తుంది. మీరు ఇక్కడకు శ్రేష్ఠంగా తయారయ్యేందుకు వచ్చారు. మనం మళ్లీ శ్రేష్ఠ మతము ఏ విధంగా పొందుతామో మీకు తెలుసు. అనేకసార్లు మీరు శ్రేష్ఠ మతముతో ఉన్నతమైన పదవిని పొందారు, మళ్లీ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ క్రిందికి పడిపోతూ వచ్చారు, తిరిగి ఒకేసారిగా ఎక్కుతారు. నంబరువారు పురుషార్థం అనుసారంగానే ఇది అవుతుంది. టైమ్‌ పడ్తుందని తండ్రి తెలియజేస్తున్నారు. పురుషోత్తమ సంగమయుగ సమయము కూడా పూర్తి ఆక్యురేట్‌గా ఉంది. డ్రామా చాలా ఆక్యురేట్‌గా నడుస్తుంది అంతేకాక చాలా వండర్‌ఫుల్‌గా ఉంటుంది. పిల్లలకు చాలా సులువుగా అర్థమవుతుంది. ''తండ్రిని స్మృతి చేయాలి, వారసత్వం తీసుకోవాలి'',.......... అంతే! కాని పురుషార్థం చేయడం అంటే చాలామందికి కష్టం అనిపిస్తుంది కూడా. ఇంత ఉన్నతాతి ఉన్నతమైన పదవి పొందడం అంత తేలిక ఏమీ కాదు. తండ్రి స్మృతి మరియు వారసత్వము రెండూ చాలా సహజమైనవి. ఒక సెకండు విషయమే. అయితే పురుషార్థం చేయడంలో మాయ విఘ్నాలు కూడా కలిగిస్తుంది. రావణుని పై గెలుపు పొందాల్సి వస్తుంది. ఈ మొత్తం సృష్టి పై రావణ రాజ్యముంది. ఇప్పుడు మనము యోగబలముతో రావణుని పై ప్రతి కల్పము గెలుపు పొందుతూ వచ్చామని, ఇప్పుడు కూడా గెలుపు పొందుతున్నామని మీకు తెలుసు. నేర్పించేవారు అనంతమైన తండ్రి. భక్తిమార్గంలో కూడా మీరు బాబా అని అంటూ వచ్చారు కానీ మొదట తండ్రిని గురించి తెలియదు. ఆత్మను గురించి తెలుసు. భృకుటి మధ్యలో అజబ్‌ సితారా మెరుస్తూ ఉంటుంది,.......... అని అనేవారు. ఆత్మను గురించి తెలిసినా కానీ తండ్రిని గురించి తెలియదు. ఇది ఎంత విచిత్రమైన డ్రామా! ఓ పరమపిత పరమాత్మ! అని కూడా అనేవారు. స్మృతి చేసేవారు, అయినా వారిని గురించి తెలియదు. ఆత్మ కర్తవ్యాన్ని గురించి గానీ, పరమాత్మ కర్తవ్యాన్ని గురించి గానీ తెలియదు. తండ్రియే స్వయంగా వచ్చి అర్థం చేయిస్తారు. తండ్రి లేకుండా ఎప్పుడూ, ఎవరూ రియలైజ్‌ చేయించలేకపోయారు. ఎవ్వరికీ ఆ పాత్రే లేదు! ఈశ్వరీయ సంప్రదాయము, ఆసురీ సంప్రదాయము, దైవీ సంప్రదాయము అని గాయనం కూడా ఉంది. చాలా సహజంగా ఉంది కానీ ఈ విషయాలు గుర్తుండాలి - ఇందులోనే మాయ విఘ్నాలు కలుగజేస్తుంది, మరపింపజేస్తుంది. తండ్రి చెప్తున్నారు - నంబరువారు పురుషార్థానుసారం స్మృతి చేయగా చేయగా డ్రామా అంతమవుతుంది అనగా పాత ప్రపంచం అంత్యమవుతుంది. అప్పుడు నంబరువారీ పురుషార్థానుసారం రాజధాని స్థాపన అవ్వనే అవుతుంది. శాస్త్రాలతో ఈ విషయం ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. గీత మొదలైన వాటిని ఇతడు కూడా చాలా చదివాడు కదా! ఇప్పుడు వీటికి ఏ విలువా లేదని తండ్రి చెప్తున్నారు. కానీ భక్తిలో చాలా కర్ణ రసం లభిస్తుంది కనుక వదిలి పెట్టరు.
ఆధారమంతా పురుషార్థం పై ఉంది అని మీకు తెలుసు. కొంతమంది వ్యాపారాలు రాయల్‌గా ఉంటాయి, కొంతమంది వ్యాపారాలు ఛీ-చీగా ఉంటాయి. మద్యం, సిగరెట్‌, బీడీ మొదలైనవి అమ్ముతూ ఉంటారు. ఈ వ్యాపారాలు చాలా చెడ్డవి. మద్యం అన్ని వికారాలను ఆకర్షిస్తుంది. ఎవరినైనా మద్యం తాగేవానిగా చేసే ఈ వ్యాపారం మంచిది కాదు. యుక్తితో ఈ వ్యాపారం ఛేంజ్‌ చేసుకోమని తండ్రి సలహా ఇస్తారు లేకుంటే ఉన్నతమైన పదవి పొందలేరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - అవినాశి జ్ఞాన రత్నాల వ్యాపారంలో తప్ప ఈ అన్ని వ్యాపారాలలో నష్టమే ఉంది. భలే ఇతడు వజ్రాల వ్యాపారం చేసేవాడు(బ్రహ్మ) కాని లాభం అయితే ఏమీ కలుగలేదు కదా! అయితే లక్షాధికారిగా అయ్యాడు. ఈ వ్యాపారంతో ఏం అవుతారు? బాబా ఉత్తరాలలో కూడా పదమాపదం భాగ్యశాలి అని ఎప్పుడూ వ్రాస్తుంటారు. అది కూడా 21జన్మలకు అవుతారు. బాబా చెప్పేది సరైనదేనని మీకు కూడా తెలుసు. మనమే ఈ దేవీ దేవతలుగా ఉండేవారము, మళ్లీ చక్రములో తిరిగి తిరిగి క్రిందికి వచ్చాము. సృష్టి ఆది-మధ్య-అంత్యములు కూడా తెలుసుకున్నారు. నాలెడ్జ్‌ అయితే తండ్రి ద్వారా లభించింది కానీ దైవీగుణాలు కూడా ధారణ చేయాలి. మాలో ఎటువంటి ఆసురీ గుణము లేదు కదా అని తమను తాము పరిశీలించుకోవాలి. ''నేను నా ఈ శరీరమనే ఇంటిని అద్దెకు ఇచ్చాను'' అని ఈ బాబాకు కూడా తెలుసు. ఇది ఇల్లే కదా! ఇందులో ఆత్మ ఉంటుంది, భగవంతునికి, నేను నా ఇల్లు అద్దెకు ఇచ్చానని నాకు చాలా గర్వంగా ఉంటుంది. డ్రామా ప్లాను అనుసారం ఇక ఎవ్వరి ఇల్లూ వారు తీసుకోరు. కల్ప-కల్పము ఈ ఇల్లే తీసుకోవాల్సి ఉంటుంది. ఇతనికైతే సంతోషంగా ఉంటుంది కదా! అయితే హంగామా కూడా ఎంత జరిగింది! ఈ బాబా, హాస్యానికి అప్పుడప్పుడూ బాబాతో - ''బాబా, తమకు రథంగా అయినందున నేను ఇన్ని తిట్లు తినవలసి వస్తోంది'' అని అనేవాడు. అప్పుడు తండ్రి - అందరికంటే ఎక్కువ తిట్లు నాకు లభించాయి, ఇప్పుడు నీ వంతు వచ్చిందని అంటారు. బ్రహ్మకు ఎప్పుడూ తిట్లు లభించలేదు. ఇప్పుడా వంతు వచ్చింది. రథం ఇచ్చినందుకు తండ్రి నుండి తప్పకుండా సహాయం కూడా లభిస్తుంది కదా. అయినా బాబా అంటారు - తండ్రిని నిరంతరం స్మృతి చేయండి. ఇందులో పిల్లలైన మీరు ఇతని కంటే ఎక్కువ వేగంగా వెళ్లగలరు. ఎందుకంటే ఇతని పై చాలా బాధ్యతలున్నాయి. భలే! డ్రామా అంటూ వదిలేస్తారు. అయినా కొన్ని సంకల్పాలు తప్పకుండా నడుస్తాయి(ప్రభావము తప్పక పడ్తుంది, బాధ కలుగుతుంది). వీరు పాపం మంచి సర్వీస్‌ చేసేవారు, సాంగత్యదోషంతో చెడిపోయారు. ఎంత డిస్‌సర్వీస్‌ జరుగుతుంది! ఎలాంటి పనులు చేస్తారంటే, కోపము, బాధ వచ్చేస్తుంది. ఆ సమయంలో ఇది కూడా డ్రామాలో తయారు చేయబడి ఉందని భావించరు. తర్వాత ఇది డ్రామాలో ఉంది కదా అని ఆలోచన వస్తుంది. మాయ స్థితిని పాడు చేయటంతో చాలా డిస్‌సర్వీస్‌ జరిగిపోతుంది. ఎంతమంది అబలలు మొదలైనవారి పై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇక్కడైతే పిల్లలే ఎంత డిస్‌సర్వీస్‌ చేస్తారు, ఉల్టా-సుల్టాగా(ఎద్వా, తద్వా) మాట్లాడ్తారు.
ఇప్పుడు తండ్రి ఏం వినిపిస్తున్నారో పిల్లలకు తెలుసు. శాస్త్రాలు మొదలైనవేవీ వినిపించరు. ఇప్పుడు మనము శ్రీమతంతో ఎంత శ్రేష్ఠంగా తయారవుతాము! ఆసురీ మతముతో ఎంత భ్రష్టులుగా అయ్యాము. టైమ్‌ పడ్తుంది కదా! మాయతో యుద్ధం నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకు తప్పకుండా విజయం లభిస్తుంది. శాంతిధామము, సుఖధామాల పై విజయం మనదే అని మీకు తెలుసు. కల్ప-కల్పము మనం విజయం పొందుతూ వచ్చాము. ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే స్థాపన మరియు వినాశనం జరుగుతాయి. ఇది మొత్తం వివరంగా మీ బుద్ధిలో ఉంది. ఖచ్ఛితంగా తండ్రి మన ద్వారా స్థాపన చేయిస్తున్నారు, మళ్లీ మనమే రాజ్యపాలన చేస్తాము. బాబాకు థాంక్స్‌ కూడా చెప్పరు. ఇది కూడా డ్రామాలో ఉంది అని తండ్రి అంటారు. నేను కూడా ఈ డ్రామాలో పాత్రధారిని. డ్రామాలో అందరి పాత్ర రచింపబడి ఉంది. శివబాబాకు కూడా పాత్ర ఉంది, నా పాత్ర కూడా ఉంది. థాంక్స్‌ చెప్పే పనే లేదు. శివబాబా అంటారు - ''ఇంకెవ్వరూ ఇవ్వలేని శ్రీమతం నేను మీకు ఇచ్చి మార్గం తెలియజేస్తాను'' సతోప్రధాన క్రొత్త ప్రపంచం స్వర్గం ఉండేది కదా అని ఎవరు వచ్చినా చెప్పండ.ి ఈ పాత ప్రపంచాన్ని తమోప్రధాన ప్రపంచమని అంటారు. మళ్లీ సతోప్రధానంగా అయ్యేందుకు దైవీగుణాలు ధారణ చేయాలి. తండ్రిని స్మృతి చేయాలి. ''మన్మనాభవ, మద్యాజీభవ'' ఇదే మంత్రం! అంతే! నేను సుప్రీమ్‌ గురువును అని కూడా చెప్తున్నాను.
పిల్లలైన మీరిప్పుడు స్మృతియాత్రతో సృష్టి మొత్తాన్ని సద్గతికి చేరుస్తారు. జగద్గురువు ఒక్క శివబాబాయే. వారు మీకు కూడా శ్రీమతమును ఇస్తారు. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత మనకు ఈ శ్రీమతం లభించిందని మీకు తెలుసు. చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఈనాడు పాత ప్రపంచం ఉంది, రేపు క్రొత్త ప్రపంచము ఉంటుంది. ఈ చక్రాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా సహజం. ఇది జ్ఞాపకం ఉన్నా ఎవరికైనా అర్థం చేయించగలరు కానీ ఇది కూడా మర్చిపోతారు. ఎవరైనా పడిపోతే ఇక జ్ఞానం మొత్తం సమాప్తమైపోతుంది. కళలను, కాయమును మాయ తీసేసుకుంటుంది. కళలన్నీ తీసేసి కళారహితంగా చేసేస్తుంది. వికారాల్లో ఎలా చిక్కుకుపోతారంటే అడగనే వద్దు. ఇప్పుడు మీకు మొత్తం చక్రమంతా గుర్తుంది. మీరు జన్మ-జన్మాంతరాలుగా వేశ్యాలయంలో ఉండి, వేల కొలది పాపాలు చేస్తూ వచ్చారు. జన్మ-జన్మల పాపిని నేను, అని అందరి ఎదుట అన్నారు. మనమే మొదట పుణ్యాత్మలుగా ఉండేవారము, తర్వాత పాపాత్మలుగా అయ్యాము. ఇప్పుడు మళ్లీ పుణ్యాత్మలుగా అవుతాము. ఈ జ్ఞానము పిల్లలైన మీకు లభిస్తోంది. మళ్లీ ఈ జ్ఞానాన్ని ఇతరులకు చెప్పి, తమ సమానంగా తయారు చేస్తారు. గృహస్థ వ్యవహారములో ఉండడం వలన తేడా అయితే ఉంటుంది కదా! మీరు అర్థం చేసుకున్నంతగా వారు అర్థం చేసుకోలేరు. కానీ అందరూ వదిలేయలేరు. తండ్రి స్వయంగా చెప్తారు - గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానంగా అవ్వాలి. అందరూ వదిలేసి వస్తే ఇంతమంది ఎక్కడ కూర్చుంటారు. తండ్రి నాలెడ్జ్‌ఫుల్‌ వారు శాస్త్రాలు మొదలైనవేవీ చదవరు. ఇతడు శాస్త్రాలు మొదలైనవి చదివాడు. ''నన్ను అయితే ఫాదర్‌ ఈజ్‌ నాలెడ్జ్‌ఫుల్‌ '' అని అంటారు. తండ్రి వద్ద ఏ జ్ఞానముందో కూడా ఈ మనుష్యులకు తెలియదు. ఇప్పుడు సృష్టి ఆది-మధ్య-అంత్యముల మొత్తం నాలెడ్జ్‌ అంతా మీకు ఉంది. ఈ భక్తి మార్గ శాస్త్రాలు అనాదిగా ఉన్నాయని మీరు తెలుసుకున్నారు. భక్తిమార్గంలో ఈ శాస్త్రాలు కూడా తప్పకుండా వెలువడ్తాయి. పర్వతం విరిగిపోతే మళ్లీ ఎలా తయారవుతుంది అని అంటారు. కానీ ఇది డ్రామాయే కదా! శాస్త్రాలు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి - మళ్లీ సమయం వచ్చినప్పుడు అవే తయారవుతాయి.
మనము మొట్టమొదట శివపూజ చేస్తాము. శివుని భక్తి ఏ విధంగా చేయబడ్తుందో, ఎన్ని శ్లోకాలు మొదలైనవి పాడ్తారో కూడా శాస్త్రాలలో ఉంటుంది కదా! మీరు కేవలం స్మృతి చేస్తారు. శివబాబా జ్ఞానసాగరులు, వారు ఇప్పుడు మనకు జ్ఞానం ఇస్తున్నారు. ఈ సృష్టిచక్రం ఎలా తిరుగుతుందో తండ్రి మీకు అర్థం చేయించారు. శాస్త్రాలలో ఎంత పెద్ద బడాయిలు వ్రాశారంటే అవి ఎప్పుడూ గుర్తు కూడా రావు. అనంతమైన తండ్రి చదివిస్తున్నారని పిల్లలైన మీ ఆంతరికములో ఎంత ఖుషీ ఉండాలి. స్టూడెంట్‌ లైఫ్‌ ఈజ్‌ ది బెస్ట్‌(ూ్‌బసవఅ్‌ కూఱటవ ఱర ్‌ష్ట్రవ దీవర్‌) అని మహిమ చేస్తారు.
భగవానువాచ - నేను మిమ్ములను రాజాధి రాజులుగా చేస్తాను. ఇక ఏ శాస్త్రాలలోనూ ఈ విషయాలు లేవు. ఇదే ఉన్నతాతి ఉన్నతమైన ప్రాప్తి. వాస్తవానికి అందరికీ సద్గతినిచ్చే గురువు ఒక్కరే. భలే స్థాపన చేయువారిని కూడా గురువు అనవచ్చు కానీ సద్గతినిచ్చేవారే గురువు. వీరైతే తమ వెనుక అందరినీ పాత్ర చేసేందుకు తీసుకెళ్లరు. వాపసు తీసుకెళ్లేందుకు మార్గాన్ని తెలియజేస్తారు. శివుని ఊరేగింపే కీర్తించబడుతోంది, మరి ఏ ఇతర గురువులది కాదు. మనుష్యులైతే శివ, శంకరులను కలిపేశారు. ఆ సూక్ష్మవతన వాసి ఎక్కడ, ఆ మూలవతన వాసి ఎక్కడ! ఇద్దరూ ఒక్కటే ఎలా అవుతారు? భక్తిమార్గంలో ఇలా వ్రాసేశారు. బ్రహ్మ, విష్ణు, శంరులు ముగ్గురు పిల్లలు కదా! బ్రహ్మ గురించి కూడా మీరు అర్థం చేయించగలరు. వీరిని దత్తత చేసుకోవడం వలన ఇతడు శివబాబా పుత్రునిగా అయ్యాడు కదా! తండ్రి ఉన్నతాతి ఉన్నతమైనవారు. పోతే ఇతడు వారి రచన. ఇవి ఎంతో అర్థం చేసుకోవలసిన విషయాలు! మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. అవినాశి జ్ఞానరత్నాల వ్యాపారం చేసి 21 జన్మలకు పదమాపదం భాగ్యశాలురుగా అవ్వాలి. మాలో ఎటువంటి ఆసురీ గుణము లేదు కదా? మేము వికారాలు ఉత్పత్తి అయ్యే ఏ వ్యాపారము చేయడం లేదు కదా? అని మిమ్ములను మీరు పరిశీలించుకోవాలి.
2. స్మృతియాత్రలో ఉండి మొత్తం సృష్టిని సద్గతిలోకి చేర్చాలి. సద్గురువైన తండ్రి శ్రీమతమును అనుసరిస్తూ తమ సమానంగా తయారుచేసే సేవ చేయాలి. మాయ ఎప్పుడూ కళా రహితంగా తయారు చేయకుండా గమనముంచాలి.

వరదానము :- '' శుభ భావన, శుభ కామనల సహయోగం ద్వారా ఆత్మలను పరివర్తన చేసే సఫలతా సంపన్న భవ ''
ఎప్పుడైతే ఏదైనా కార్యములో బ్రాహ్మణ పిల్లలందరూ సంఘటిత రూపంలో తమ శుభ భావనలు మరియు శుభ కామనల సహయోగమిస్తారో అప్పుడు ఈ సహయోగం ద్వారా వాయుమండలంలో ఒక కోట తయారవుతుంది. ఈ కోట ఆత్మలను పరివర్తన చేస్తుంది. ఎలాగైతే అయిదు వ్రేళ్ల సహయోగం ద్వారా ఎంత పెద్ద కార్యమైనా సులభమైపోతుందో అలా ప్రతి బ్రాహ్మణ పుత్రుని సహయోగం, సేవలలో సఫలతా సంపన్నంగా చేస్తుంది. సహయోగానికి ఫలితము సఫలత.

స్లోగన్‌ :- '' అడుగడుగులో పదమాల సంపాదన జమ చేసుకునేవారే, అందరికంటే గొప్ప ధనవంతులు. ''