Sunday, 5 November 2017

Telugu Murli 06/11/2017

06-11-2017 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - మీరు జీవించి ఉండే బేహద్‌ తండ్రి ఒడిని తీసుకున్నారు, వారి సంతానంగా అయ్యారు, కావున వారి శ్రీమతమును తప్పకుండా అనుసరించాలి. ప్రతి ఆజ్ఞను అమలుపరచాలి''
ప్రశ్న:- ఈ సృష్టికి వానప్రస్థ అవస్థ ఎప్పుడు మొదలౌతుంది? ఎందుకు మొదలౌతుంది?
ఉత్తరం:- శివబాబా ఈ బ్రహ్మ శరీరములో ఎప్పుడు ప్రవేశిస్తారో, అప్పటి నుండి ఈ మొత్తము సృష్టికి వానప్రస్థ అవస్థ మొదలౌతుంది ఎందుకంటే తండ్రి అందరినీ వాపస్‌ ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చారు. ఇప్పుడు చిన్నా, పెద్దా అందరిదీ వానప్రస్థ అవస్థయే. అందరూ మధురమైన ఇల్లైన ముక్తిధామానికి వాపస్‌ వెళ్ళాలి, తర్వాత మళ్లీ జీవన్ముక్తిలోకి రావాలి, అలాగే బాబా ఈ బ్రహ్మ శరీరములో ప్రవేశించినప్పుడు ఇతనికి కూడా 60 సంవత్సరాల వయస్సు ఉంటుంది అంటే ఇతనిది కూడా వానప్రస్థ అవస్థయే.
పాట:- మరణించినా నీ ఒడి (దారి)లోనే, జీవించినా నీ ఒడి (దారి)లోనే.............(మర్‌నా తేరీ గలీమే............)   
ఓంశాంతి. ఎవరి ఒడిలోకి వచ్చి మరణించవలసి ఉంటుంది? మనుష్యులు ముక్తిధామములోకి వెళ్ళాలని కోరుకుంటారు. పరమపిత పరమాత్మ అయిన శివబాబా విజయమాలలో కూర్చబడాలని కోరుకుంటారు. మనుష్యాత్మలందరూ తప్పకుండా తండ్రి కంఠహారమని(గలే కా హార్‌) పిల్లలైన మీకు తెలుసు. ఎలాగైతే లౌకిక పిల్లలు వారి(లౌకిక) తండ్రికి కంఠహారముగా అవుతారో, తండ్రి పిల్లలను, పిల్లలు తండ్రిని తలంపు చేస్తారో అలాగే వాస్తవానికి ఆత్మలందరూ పరమపిత పరమాత్మను స్మృతి చేస్తారు. లౌకిక తండ్రి హద్దులోని తండ్రి, వీరు అనంతమైన తండ్రి. మనుష్యులందరూ ముక్తిని పొందాలని అనుకుంటారు. ఎందుకంటే నిరాకారుని కంఠహారము అనగా ముక్తి, విష్ణు కంఠహారము అనగా జీవన్ముక్తి. అనంతమైన తండ్రి ముక్తి - జీవన్ముక్తులను ఇస్తారు. అనంతమైన తండ్రికి సంతానంగా అవుతే వారి కంఠహారముగా అవుతారు. లౌకిక తల్లి - తండ్రుల కంఠహారము వారి సంతానమే. ఆ తల్లి - తండ్రి కూడా మరొకరి పిల్లలుగా ఉంటారు. మీరే తల్లి తండ్రి...... మేము మీ కంఠహారముగా అవుతే, సదా సుఖంగా ఉంటామని పాట కూడా పాడ్తారు. అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు కాని వారి కంఠహారముగా ఎలా అవ్వాలి అనే (కోరిక) అందరికీ ఉంటుంది. ఎప్పుడైతే త్రిమూర్తి శివబాబా వచ్చి బ్రహ్మ-విష్ణు-శంకరులైన త్రిమూర్తులను రచిస్తారో, అప్పుడు బ్రహ్మ ద్వారా అనంతమైన తండ్రికి కంఠహారముగా అవ్వగలరు. మొదట లౌకిక తల్లి - తండ్రులకు కంఠహారముగా ఉంటారు, వారి నుండి జీవించి ఉండే మరణించి పారలౌకిక తండ్రికి చెందినవారిగా అయితే వారసత్వము లభిస్తుంది. ఎవరైనా ధనవంతులు పేదవారి పిల్లలను దత్తత తీసుకుంటే వారు జీవించి ఉండే ధనవంతుల ఒడిని తీసుకుంటారు కదా. ఆ పేదలు కూడా జీవించే ఉంటారు కదా. ఇరువురూ గుర్తు ఉంటారు. మీకు కూడా అదే విధంగా లౌకిక, పారలౌకిక రెండు సంబంధాలు గుర్తున్నాయి. ఇరువురితోనూ మిలనము జరుగుతుంది. మీరు పారలౌకిక తల్లిదండ్రుల నుండి అపార సుఖాన్ని పొందేందుకు వారి ఒడిలోకి వచ్చారు. అది హద్దు ఒడి(దత్తత), ఇది అనంతమైన ఒడి. జీవించి ఉండే ఒడిలోకి వచ్చాము. వీరి ఒడిలోకి వచ్చినందున మనము దేవీదేవతా కులములో అపారమైన సుఖము పొందుతామని మీకు తెలుసు. అందువలన ఏ తల్లితండ్రుల సంతానంగా అయ్యారో వారిని తప్పకుండా స్మృతి చేయవలసి ఉంటుంది. శ్రీమతానికి మహిమ ఉంది కదా. ఇప్పుడు మీరు ప్రాక్టికల్‌గా వారి మతమును అనుసరిస్తున్నారు. అలాగని వెంటనే అందరూ దత్తత అయిపోతారని కాదు. నెమ్మది నెమ్మదిగా అవుతారు. ఇప్పుడు దేవీ దేవతా ధర్మస్థాపన అవుతూ ఉంది. వృక్షము నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. క్రైస్తవ మతములో కూడా మొదట ఏసుక్రీస్తు వస్తాడు. తర్వాత 10 - 20 - 50 మంది పెరుగుతూ పోతారు. ఈ వృక్షము ఇక్కడే అందరి ముందు పెరుగుతుంది. ఏసుక్రీస్తు వెళ్ళిపోతాడు మళ్లీ వచ్చి చివరిలో కలుస్తాడు. వీరు అనంతమైన తండ్రి, అనేకమంది శివబాబాకు కంఠహారముగా అవ్వవలసి ఉంటుంది. అప్పుడు మళ్లీ విష్ణు కంఠహారముగా అవుతారు. శివబాబా ఏమో నిరాకారుడు. బ్రహ్మ ద్వారా ముఖ వంశావళిని రచిస్తారు. త్రిమూర్తి శివుడంటే అర్థముంది. త్రిమూర్తి బ్రహ్మ అనే పదానికి అర్థము లేదు. బాబా అనేక సవరణలు కూడా చేస్తూ ఉంటారు. గోలా చిత్రము క్రింద ఇది స్వదర్శన చక్రము, చరఖా కాదు అని వ్రాయాలి. ప్రభుత్వము వారు ఆ చరఖాను జండా పై వేశారు. ఇచ్చట ఇది స్వదర్శన చక్రము. రోజులు గడిచే కొలది సవరణలు జరుగుతూ ఉంటాయి.

సదా త్రిమూర్తి శివజయంతి అని అనాలని బాబా అర్థం చేయించారు. శివబాబా ఉన్నారంటే వారి వెంట వారసత్వము కూడా తప్పకుండా ఉండాలి. కావున ఈ విష్ణువే శివుని వారసత్వము. శంకరుని ద్వారా వినాశనమని గాయనము చేయబడింది. కావున త్రిమూర్తి చిత్రము ముఖ్యమైనది. త్రిమూర్తి చిత్రము కొనసాగుతూ వచ్చింది. సత్యయుగములో కూడా మీరు రాజ్యము చేయునప్పుడు సింహాసనము వెనుక విష్ణువు చిత్రముంటుంది. ఈ చిత్రము రాజముద్రిక(కోట్‌ ఆఫ్‌ ఆర్మ్‌ ) వంటిది. మనుష్యులకు దీని అర్థము తెలియదు. పిల్లలైన మీకు తండ్రి దీని అర్థమును తెలిపించారు. ఈ జ్ఞానము మీకిప్పుడే లభించింది. దేవతల వద్ద ఈ జ్ఞానముండదు. బ్రాహ్మణులైన మీ మూడవ నేత్రము తెరుచుకుంటుంది. తండ్రి ఎంతో సులభంగా మన్మనాభవ అని అర్థము చేయిస్తారు. తండ్రిని మరియు వారసత్వమును స్మృతి చేయండి. మీరు బ్రహ్మ ముఖ వంశావళి వారు కదా. అంతేకాక మీరు జ్ఞాన గంగలు కూడా అయ్యారు. మీరు జ్ఞానసాగరుని ద్వారా బ్రహ్మముఖ కమలము నుండి వెలువడిన ముఖవంశావళీ జ్ఞానకుమార - కుమారీలు. కావున మీరు జ్ఞానసాగరుని పిల్లలు.

వాస్తవానికి సత్య సత్యమైన తీర్థస్థానము ఇదే. ఇదే ఆత్మ - పరమాత్మల సత్యమైన సంగమము. జ్ఞానసాగరుడు మరియు జ్ఞానగంగలు కలుస్తారు. ఇవన్నీ అర్థము చేసుకునే చాలా గుప్తమైన విషయాలు. మంద బుద్ధి గలవారు వాటిని అర్థము చేసుకోలేరు. వారికి సులభమైన ఉపాయమేమంటే - శివబాబాను, వారసత్వాన్ని ఈ బ్రహ్మ ద్వారా స్మృతి చేయండి. ఇది బుద్ధిలో ఉన్నందున సంతోషమనే పాదరస మట్టము పైకెక్కుతుంది. ఇది ఈశ్వరీయ విద్యార్థి జీవితము కదా. అనంతమైన తండ్రి మనలను చదివిస్తున్నారు. మనిషి అయిన కృష్ణుడు చదివించడం లేదు. కృష్ణుని జ్ఞానసాగరులని అనరు. కృష్ణుడు త్రికాలదర్శి కాదు. రాజయోగ జ్ఞానము మీ బుద్ధిలో ఉంది. దాని ద్వారా మీరు ప్రాలబ్ధాన్ని పొందుతారు. అచ్చట ఈ జ్ఞానము అవసరము లేదు. దీని అవసరము ఇచ్చట మాత్రమే ఉంది. కల్ప-కల్పము నేను వచ్చి రాజయోగము నేర్పిస్తాను. సృష్టి ఆది-మధ్యాంతాల రహస్యాన్ని, ఈ చక్రమెలా తిరుగుతూ ఉందో అర్థం చేయిస్తాను. మహిమ అంతా సంగమయుగముదే. ఎందుకంటే ఈ సమయములోనే పతితపావనులైన తండ్రి వచ్చి పాత ప్రపంచము నుండి నూతన ప్రపంచములోకి తీసుకెళ్తారు. పాత ప్రపంచ వినాశనము కొరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనాటి ప్రపంచములో ఏమేమి జరుగుతోందో మీరు చూస్తున్నారు కదా. ఈ రోజు చక్రవర్తిగా ఉంటాడు, మిలిటరీవారు తిరుగుబాటు చేస్తే రేపు ఆ చక్రవర్తిని కూడా ఖైదీగా చేస్తారు. ఎవరినైనా హతమారుస్తారు. ఇటువంటి కేసులు చాలా జరుగుతూ ఉంటాయి. ఈ రోజుల్లో దేని పైనా నమ్మకము లేదు. ఎచ్చట చూసినా దు:ఖమే దు:ఖముంది. ఈ రోజు పుత్రుడు జన్మిస్తే సంతోషిస్తారు, రేపు మరణిస్తే, దు:ఖిస్తారు. అసలు ఈ ప్రపంచమే దు:ఖ ప్రపంచము. ఇప్పుడు తండ్రి నూతన సుఖమయ ప్రపంచానికి అర్హులుగా చేస్తున్నారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు - మీరు ఎంత అనర్హులుగా అయ్యారు! ఇప్పుడు మీరు అర్హులై స్వర్గానికి యజమానులుగా అవ్వగలరు. మీరే దేవీ దేవతలుగా ఉండేవారు, ఇప్పుడు అసురులుగా అయిపోయారు. నిన్నటి రోజు దేవతల మహిమను గాయనము చేసేవారు, స్వయాన్ని పాపులమని, నీచులమని అంటూ ఉండేవారు. గుణము లేని మా పై దయ చూపండి ..... (హమ్‌ నిర్గుణ్‌ హారే మే......) అని పాడుతూ ఉండేవారు. కావున పరమాత్మ ఎవరి పైనో దయ చూపి ఉంటారు కదా. ఈ దేవతలను గుణవంతులుగా ఎవరు తయారు చేశారో ఇప్పుడు మీకు తెలుసు. పరమపిత పరమాత్మ తప్ప ఇతరులెవ్వరూ దేవతలుగా తయారు చేయలేరు. మనుష్యులు పూర్తిగా వికారీ, పతితులుగా అయ్యి ఉన్నారు. వృద్ధులుగా అయినా వికారాలను వదలరు. లేకుంటే నియమానుసారము 60 సంవత్సరాల తర్వాత వానప్రస్థము తీసుకోవాలి. పూర్వము ఇలా చేస్తూ ఉండేవారు. 60 సంవత్సరాల లోపలే తమ భారమంతా దింపి పిల్లలకిచ్చేసేవారు. ఇప్పుడు 60 సంవత్సరాల వయస్సులో కూడా పిల్లలకు జన్మనిస్తూ ఉంటారు. తండ్రి అంటున్నారు - వీరి 60 సంవత్సరాల వయస్సులో అంటే అనేక జన్మల అంతిమ జన్మలో కూడా చివరి సమయములో అంటే ఇతని వానప్రస్థ సమయములో నేను ఇతనిలో ప్రవేశించాను. అప్పుడు ఇతడు కూడా సర్వస్వము వదిలేశాడు. తండ్రి రావడంతో ప్రపంచమంతా వానప్రస్థావస్థగా అయిపోతుంది. ఎందుకంటే అందరూ వాపస్‌ ఇంటికి వెళ్ళాలి. అందుకే తండ్రి అంటున్నారు - నన్ను ఒక్కరిని మాత్రమే స్మృతి చేయండి. చిన్న - పెద్ద ఎవ్వరూ ఉండబోరు.

తండ్రి వచ్చి అందరినీ మధురంగా తయారు చేస్తారు. ముక్తి- జీవన్ముక్తి రెండూ మధురమైన ధామాలే. అందరూ వినాశనమయ్యే తీరాలి. అందరి లెక్కాచారాలు కూడా చుక్తా అవుతాయి. శిక్షలు అనుభవించడంలో పెద్ద సమయము పట్టదు. కాశీలో కత్తులబావిలో(కాశీకల్వట్‌ అంటే శివుని అపారభక్తి చేయు భక్తులు శివుని పై బలిహారి అయ్యేందుకు కాశీలో ఉన్న లోతైన కత్తులబావిలో దూకేవారు, అడుగు భాగములో ఉన్న శివలింగము పై భక్తుల రక్తాభిషేకమై, శరీరము ముక్కలు ముక్కలుగా అయిపోయి ప్రాణాలను అర్పిస్తారు, కాశీలోని ఈ బావిని బ్రిటిష్‌వారు నిషేధించి మూయించారు) దూకినప్పుడు పాపాల నుండి ముక్తులవుతారు. మళ్లీ కొత్తగా లెక్కాచారము ప్రార౦భమవుతుంది, అంతే గాని ముక్తికి ఒక్కరు కూడా వెళ్ళరు. శివుని పై బలిహారమైతే నిర్వాణధామానికి వెళ్ళిపోతామని వారు భావిస్తారు. తండ్రి అంటున్నారు - ఒక్కరు కూడా వాపస్‌ వెళ్ళలేరు. పునర్జన్మ అయితే అందరూ తీసుకునే తీరాలి. మొదటి నంబరులోని ఇతడే పూర్తిగా పునర్జన్మలు తీసుకుంటున్నప్పుడు వెనుక వచ్చేవారు తప్పక తీసుకుంటారు కదా. మీరు 84 జన్మలు తీసుకున్నారు. ప్రారంభము నుండే మీ పాత్ర నడుస్తుంది. ఇది మీకు కళ్యాణకారి లీప్‌ జన్మ. ఈ జన్మలో లేక ఈ ధర్మయుగములో మీరు ధర్మాత్ములుగా అవుతారు. అవన్నీ హద్దు విషయాలు. వారు ధర్మ మాసము(ధనుర్మాసము), ధర్మ సంవత్సరమని అంటారు. కాని మీకు ఇది ధర్మ యుగము. ఈ లీప్‌ యుగము, లీప్‌ జన్మ బ్రాహ్మణులకు మాత్రమే. బ్రాహ్మణులు ఉన్నతమైనవారు(పిలక), తర్వాత మీరే దేవతలుగా అవుతారు. బాబా మనలను కంఠహారముగా చేసుకుంటారని మీకు తెలుసు. ఆత్మలైన మనము నిరాకార ప్రపంచములో ఉంటాము. తండ్రి స్వయంగా అంటున్నారు - మీరు అశరీరులుగా ఉన్నప్పుడు నా వద్ద ఉండేవారు. మనము మొట్టమొదట సత్యయుగములోనికి వస్తామని ఇప్పుడు మీరు అర్థము చేసుకున్నారు, అచ్చట ఉండేది దేవీ దేవతా ధర్మము. అచ్చట పురుషార్థము చేసే అవసరముండదు. పురుషార్థము ఈ సంగమ యుగములో మాత్రమే చేస్తారు. ఇది సంగమ యుగము. ఇతర సంగమయుగాలు ఏవైతే ఉన్నాయో వాని ఆయువు లెక్కింపబడదు. ఈ సంగమ యుగానికి మాత్రమే ఆయువు ఉంది. ఇది చాలా చిన్న యుగము. ఈ సంగమ యుగములోనే తండ్రి వచ్చి ఇతడిని పరివర్తన చేస్తారు. మిగిలిన ఆ యుగాలలో ఏమీ జరగదు. రెండు కళలు తగ్గినందు వలన రాజ్యము బదిలీ అవుతుంది. రాజ్యము ఎలా ఇస్తారో మీకు సాక్షాత్కారమౌతుంది. సత్యయుగములో రాజ్యమెలా అప్పగిస్తారో మీకు సాక్షాత్కారమవుతుంది. సంగమ యుగములో తండ్రి వచ్చి పతితులను పావనంగా చేస్తారు. అందువలన తండ్రి వచ్చినప్పటి నుండి ఈ యుగము యొక్క ఆయువును లెక్కిస్తారు. తప్పకుండా వారు వచ్చారు. వారు జ్ఞానసాగరులు. వారి ముఖవంశావళి అయిన బ్రహ్మకుమార-కుమారీలు జ్ఞాన నదులు. వీరి నుండే జ్ఞానము పొందాలి. బాబా అంటున్నారు - ఇతరులకు సులభంగా అర్థం చేయించేందుకు ఏదైనా ఒక నూతన వస్తువును తయారు చేయండి. అందులో త్రిమూర్తి శివజయంతి అని వ్రాయండి. బాబా ఆదేశాలనేమో ఇస్తారు, కాని తయారు చేయువారు, తెలివైనవారుగా ఉండాలి. ఈ జ్ఞాన యజ్ఞములో రకరకాల విఘ్నాలు కూడా పడ్తాయి. దాని వలన సేవ ఢీలాగా(వదులుగా, తక్కువగా) అయిపోతుంది. శివజయంతి రానే వస్తుంది, చాలా ధూమ్‌ధామ్‌గా(వైభవోపేతంగా) జరపాలి. ఢిల్లీలో అయితే చాలా ధూమ్‌ధామ్‌గా జరపవచ్చు. ఇరువురి రాజ ముద్రికలను చూపిస్తారు. మనము ఈశ్వరీయ విషయము గురించి మాట్లాడ్తాము. తండ్రి కళ్యాణకారి అయినారు. పిల్లలు కూడా ఇతరుల కళ్యాణము చేస్తూ ఉంటారు, కావున అది చూచి తండ్రి చాలా సంతోషిస్తారు. ధర్మకార్యము(దానకార్యము) ఇంటి నుండే మొదలౌతుందని(చారిటి బిగిన్స్‌ అట్‌ హోమ్‌) అని అంటారు. అనగా మొదట బంధు-మిత్రులకు కూడా అర్థం చేయించాలి. తెలపకుంటే ఫిర్యాదులు చేస్తారు. మీకు చాలా మంచి పాయింట్లు లభిస్తాయి. చిత్రాలు కూడా చాలా బాగున్నాయి. మాల కూడా చాలా బాగుంది. మొదట రుద్రమాలగా తయారై తర్వాత విష్ణుమాలగా తయారౌతుంది.

బ్రాహ్మణులైన మీరు సత్య సత్యమైన గీతను వినిపించేవారు. సత్య-సత్యమైన యాత్రను గురించిన రహస్యము మీరు అర్థం చేయిస్తారు. ఇచ్చట కూర్చుని స్మృతియాత్రలో ఉంటే మీ పాపాలు భస్మమైపోతాయి. తమోప్రధానము నుండి సతోప్రధానంగా తయారయ్యేందుకు ఇతర ఉపాయమేదీ లేదు. యోగానికి చాలా మహిమ ఉంది. శ్రమ కూడా ఇందులోనే ఉంది. తుఫాన్లు చాలా వస్తాయి. ఇది సులభానికి సులభము, కష్టానికి కష్టముగా కూడా ఉంటుంది. మీ యోగ తపస్సు చిత్రము కూడా ఉంది, మీ రాజదర్బారు చిత్రము కూడా ఉంది. రాజయోగము ద్వారా మీరు దేవతలుగా అవుతారు. మీరు రాజఋషులు, వారు హఠయోగ ఋషులు.మీకు సహజమైన జడలున్నాయి.ఇప్పుడు మనమందరము బాబా కంఠహారముగా ఉన్నాము. మనమంతా భాయి-భాయి(సోదరులము). తండ్రి నుండి వారసత్వము కూడా లభిస్తుంది. ప్రజాపిత బ్రహ్మా కూడా గాయనము చేయబడ్డాడు. వారు నిరాకార తండ్రి, ఇతడు సాకార తండ్రి. శంకరుని మూడవ నేత్రము తెరుచుకున్న వెంటనే వినాశనమౌతుందని చూపిస్తారు. శంకరునికి పార్వతి, గణేశుడు.......... మొదలైన వారిని చూపించి గృహస్థునిగా చూపించారు. మూఢనమ్మకాలు చాలా ఉన్నాయి. తండ్రి అంటున్నారు - నేను మిమ్ములను ధనవంతులుగా చేశాను. మీరు మందిరాలు కట్టించి, శాస్త్రాలు తయారుచేసి, దానధర్మాలు చేసి, వ్యర్థముగా ఖర్చు చేస్తూ చేస్తూ దుర్గతిపాలయ్యారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. అందుకే తండ్రి కూర్చుని అర్థము చేయిస్తున్నారు. బాబా మిమ్ములను త్రికాలదర్శులుగా తయారు చేస్తారు. మూడుకాలాల జ్ఞానము మీ బుద్ధిలో ఉంది. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఇది ధర్మావు(లీపు,ధనుర్మాసము)యుగము, ఈ సమయములో ధర్మాత్మలుగా అవ్వాలి. అందరికీ కళ్యాణము చేయాలి. ముక్తి - జీవన్ముక్తులకు వెళ్ళే మార్గాన్ని చూపించాలి.
2. ఇది మన ఈశ్వరీయ విద్యార్థి జీవితము. అనంతమైన తండ్రి మమ్ములను చదివిస్తున్నారనే ఖుషీలో ఉండాలి.

వరదానము:- ''శిక్షకులుగా అవ్వడంతో పాటు దయా భావన ద్వారా క్షమించగలిగే మాస్టర్‌ దయాసాగరులుగా అవ్వండి''
అందరి ఆశీర్వాదాలు తీసుకోవాలంటే శిక్షకులుగా అవ్వడంతో పాటు మాస్టర్‌ దయాసాగరులుగా అవ్వండి. దయాహృదయం గలవారై క్షమిస్తే ఈ క్షమించడమే శిక్షణ ఇవ్వడమైపోతుంది. కేవలం శిక్షకులుగా అవ్వరాదు. క్షమించాలి. ఈ సంస్కారాల ద్వారానే అందరికీ ఆశీర్వాదాలనివ్వగలరు. ఇప్పటి నుండే ఆశీర్వాదాలనిచ్చే సంస్కారాన్ని పక్కాగా చేసుకుంటే మీ జడచిత్రాల నుండి కూడా ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారు. అందుకు ప్రతి అడుగులో శ్రీమతమును అనుసరిస్తూ ఆశీర్వాదాల ఖజానాను నింపుకోండి.

స్లోగన్‌:- ''ఎవరి జోలె అయితే పరమాత్మ ఆశీర్వాదాలతో నిండుగా ఉంటుందో వారి వద్దకు మాయ రాజాలదు''

Telugu Murli 05/11/2017

05-11-2017 అవ్యక్త బాప్‌దాదా ఓంశాంతి రివైజ్‌: 24-02-1983 మధువనము

''హృదయాభి రాముడైన తండ్రి తమ హృదయానికి ప్రియమైన పిల్లలతో మిలనం''
ఈ రోజు విశేషంగా బాబాను కలుసుకోవాలని సదా ఉల్లాస-ఉత్సాహాలతో ఉండే పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. పిల్లలకు రాత్రింబవళ్ళు బాబాతో మిలనం చేయాలని ఒకే సంకల్పం ఉంటుంది. ఆకారీ రూపంలో కూడా మిలనం జరుపుకుంటారు. అయినా సాకార రూపం ద్వారా కలవాలనే ఆశ కూడా ఉంటుంది. మేము ఈ రోజు కలుసుకుంటామని రోజులన్నీ లెక్క పెడుతూ ఉంటారు. పిల్లల ప్రతి ఒక్కరి ఈ సంకల్పం బాప్‌దాదా వద్దకు చేరుకుంటూ ఉంటుంది. బాప్‌దాదా కూడా ఇందుకు బదులు ఇచ్చేందుకు పిల్లలు ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. కావున ఈ రోజు మురళి వినిపించేందుకు రాలేదు కాని కలుసుకోవాలనే పిల్లల సంకల్పాన్ని పూర్తి చేసేందుకు వచ్చారు. కొంతమంది పిల్లలు తమ మనసులోనే మిమ్ములనైతే మాటల ద్వారా పలకరించలేదని(కలుసుకోనివ్వలేదని) మధురాతి మధురమైన ఫిర్యాదులు కూడా చేస్తారు. బాప్‌దాదా కూడా ప్రతి పుత్రునితో మనసు నిండేంత వరకు కలుసుకోవాలనుకుంటారు, కానీ సమయాన్ని, మాధ్యమాన్ని చూడవలసి ఉంటుంది. ఆకారీ రూపంలో అయితే ఒకే సమయంలో ఎంతమంది కావాలంటే, అంతమంది ఎంత సమయం కావాలంటే, అంత సమయం కలుసుకోవచ్చు. దాని కొరకు టర్న్‌ వచ్చే అవసరం ఉండదు. కాని సాకార సృష్టిలో సాకార తనువు ద్వారా కలిసేటప్పుడు సాకారీ ప్రపంచం మరియు సాకారీ శరీర లెక్కను కూడా చూడవలసి ఉంటుంది. ఆకారీ వతనంలో కూడా ఫలానా గ్రూపువారు ఫలానా రోజు కలుసుకోవాలని ఒక గంట తర్వాత, అరగంట తర్వాత కలుసుకునేందుకు రావాలని ఎప్పుడైనా రోజులను నిర్ణయించడం జరుగుతుందా? ఈ బంధనం మీకు గాని, తండ్రికి గాని సూక్ష్మవతనంలో సూక్ష్మ శరీరంతో ఉండదు. ఆకారీ రూపంతో మిలనం జరుపుకోవడంలో అనుభవజ్ఞులే కదా! అక్కడ భలే రోజంతా కూర్చోండి, ఎవ్వరూ లేపరు. ఇక్కడైతే ఇప్పుడు వెనుకకు వెళ్ళండి, ఇప్పుడు ముందుకు వెళ్ళండి అని అంటారు. అయినా రెండు మిలనాలూ మధురమైనవే! డబుల్‌ విదేశీ పిల్లలైన మీరు లేక దేశంలో ఉండే పిల్లలెవరైతే సాకారంలో డ్రామా అనుసారంగా పాలనను లేదా ప్రాక్టికల్‌ స్వరూపాన్ని చూడలేకపోయారు. అటువంటి చాలా సమయం నుండి వెతుకుతూ మళ్ళీ వచ్చి కలుసుకున్న (అపురూపమైన) పిల్లల గుణగానం చేస్తారు. వారు వెనుక వచ్చినా ఆకార రూపం ద్వారా కూడా సాకార రూపాన్ని అనుభవం చేస్తారు. అటువంటి అనుభవం ఆధారంతో మేము సాకార బాబాను చూడలేదని మాకు అనిపించడంలేదని అంటారు సాకారంలో పాలన తీసుకున్నారు మరియు ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు. కావున ఆకార రూపంలో సాకారుని అనుభవం చేయడం ఇది బుద్ధి యొక్క లగ్నానికి, స్నేహానికి ప్రత్యక్ష స్వరూపం. ఆకారంలో కూడా సాకారుని చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. అటువంటి అనుభవం చేస్తున్నారు కదా! కావున ఇది పిల్లల బుద్ధి యొక్క చమత్కారానికి ఋజువు.అయితే హృదయాభిరాముడైన తండ్రికి సమీపంగా ఉన్న హృదయాభి రాముని ప్రియమైన పిల్లలుగా ఉన్నారనే దానికి ఇదే ఋజువు. ప్రియమైన పిల్లలు కదా! ప్రియమైన వారిపైన సదా ఏ పాట మ్రోగుతూ ఉంటుంది? ''వాహ్‌ బాబా, వాహ్‌ నా బాబా...''

బాప్‌దాదా ప్రతి పుత్రుని గుర్తు చేస్తున్నారు. ఫలానా వారిని జ్ఞాపకం చేసుకున్నారు, నన్ను గుర్తు చేసుకున్నారో లేదోనని భావించకండి. వీరి పై ఎక్కువ ప్రేమ ఉంది, నాపై తక్కువ ప్రేమ ఉందని అనుకోకండి. మీరే ఆలోచించండి, 5 వేల సంవత్సరాల తర్వాత బాప్‌దాదాకు తప్పిపోయిన పిల్లలు లభించినప్పుడు 5 వేల సంవత్సరాల ప్రేమ అంతా ఒకేసారి ప్రతి పుత్రునికి లభిస్తుంది కదా! కావున 5 వేల సంవత్సరాల ప్రేమ 5-6 సంవత్సరాలలో లేదా 10-12 సంవత్సరాలలో ఇవ్వవలసినప్పుడు పాత స్టాకును ఎంత కొద్ది సమయంలో ఇస్తారు! ఎక్కువలో ఎక్కువగా ఇచ్చినప్పుడే పూర్తవుతుంది. ఇంత ప్రేమ పూరితమైన స్టాకు ప్రతి ఒక్క పుత్రుని కోసం తండ్రి వద్ద ఉంది. ప్రేమ తక్కువ అవ్వజాలదు.

రెండవ విషయం - బాప్‌దాదా సదా పిల్లల విశేషతలనే చూస్తారు. కొన్ని సమయాలలో పిల్లలు మాయా ప్రభావం కారణంగా కొంచెం చలించే ఆట కూడా ఆడ్తారు. అయినా బాప్‌దాదా ఆ సమయంలో కూడా, ఈ పుత్రుడు, వచ్చిన విఘ్నాన్ని లగ్నంతో దాటి మళ్ళీ విశేషాత్మగా అయ్యి విశేష కార్యాన్ని చేసేవాడు అనే దృష్టితో చూస్తారు. విఘ్నంలో కూడా లగ్నం రూపాన్నే చూస్తారు. కనుక ప్రేమ ఎలా తగ్గిపోతుంది! ప్రతి పుత్రుని పై సదా అపారమైన ప్రేమ ఉంది మరియు ప్రతి పుత్రుడు సదా శ్రేష్ఠమే. అర్థమయిందా!

పార్టీలతో అవ్యక్త బాప్‌దాదా కలయిక

న్యూయార్క్‌ :- తండ్రికి చెందినవారుగా అవ్వడం అనగా విశేషాత్మలుగా అవ్వడం. ఎప్పటి నుండి తండ్రివారిగా అయ్యారో, ఆ ఘడియ నుండి విశ్వంలో సర్వ శ్రేష్ఠమైన గాయన యోగ్యులుగా, పూజ్యనీయ ఆత్మలుగా అయ్యారు. మీకు లభించే గౌరవాన్ని మీకు జరిగే పూజలో మళ్ళీ చైతన్య రూపంలో చూస్తున్నారు మరియు వింటున్నారు కూడా. ఈ విధంగా అనుభవం చేస్తున్నారా? ఎక్కడ భారతదేశం, ఎక్కడ అమెరికా! కాని తండ్రి ఆ మూల నుండి ఎన్నుకొని ఒకే తోటలోకి తీసుకొచ్చారు.ఇప్పుడు మీరంతా ఎవరు? అల్లా పూలతోటలోని ఆత్మిక గులాబీ పుష్పాలు. ఫలానా దేశం, ఫలానా దేశము అని ఇక్కడ పేర్లు చెప్పవలసి వస్తుంది. వాస్తవానికి మీరంతా ఒకే తోటకు చెందినవారు. ఒకే తండ్రి పాలనలోకి వచ్చే ఆత్మిక గులాబీ పుష్పాలు. మేమంతా ఒక్కరికి చెందిన వారమని, మేమంతా ఒకే దారిలో నడిచి ఒకే గమ్యానికి వెళ్ళేవారమని ఇప్పుడు అనుభవం అవుతోంది కదా! తండ్రి కూడా ప్రతి ఒక్కరిని చూసి హర్షిస్తున్నారు. అందరి శుభ భావన, అందరి సేవలో అలసిపోని లగ్నము, దృఢ సంకల్పము ప్రత్యక్ష ప్రమాణాన్ని ఇచ్చింది. నలువైపులా ఉత్సాహ-ఉల్లాసాల సహయోగం మంచి ఫలితాన్ని చూపించింది. బయట నుండి వచ్చిన శబ్ధము భారతవాసులను మేల్కొల్పుతుంది, కావున బాప్‌దాదా అభినందనలు తెలుపుతున్నారు.

బార్బడోస్‌ :- బాప్‌దాదా సదా పిల్లలకు నంబర్‌వన్‌గా అయ్యే సాధనాన్ని తెలియజేస్తారు. ఎవరు ఎంత వెనకాల వచ్చినా, ముందుకు వెళ్ళి మొదటి నంబరు తీసుకోవచ్చు. మాకు ఉన్నతమైన పాత్ర ఉంటుందో ఉండదో, మేము ఎలా ముందుకు వెళ్తాము అని ఆలోచించడం లేదు కదా! బాప్‌దాదా వద్దకు చివరిలో వచ్చిన వారికైనా, ఏ దేశానికి చెందిన వారికైనా, ఏ ధర్మానికి చెందిన వారికైనా ఎటువంటి మాన్యతకు చెందినవారైనా అందరికి ఒకే పూర్తి అధికారం ఉంది. తండ్రి ఒక్కరే అయినప్పుడు హక్కు కూడా అందరికీ ఒకే విధంగా ఉంటుంది. కేవలం ధైర్యం మరియు లగ్నానికి చెందిన విషయము. ఎప్పుడూ ధైర్య విహీనులుగా అవ్వకండి. ఎవరు ఎంత నిరుత్సాహ పరిచినా, మీకేమయిందో తెలియదు... ఎక్కడికి వెళ్ళిపోయారు? అని అన్నా మీరు వారి మాటలను పట్టించుకోకండి. పూర్తిగా గుర్తించి తెలుసుకునే వ్యాపారం చేశారు కదా! మేము బాబావారము, బాబా మావారు. బాబా ప్రతి పుత్రునీ అధికారీ ఆత్మగా భావిస్తారు. ఎవరు ఎంత తీసుకున్నా అందుకు ఎటువంటి ఆటంకము లేదు. ఇప్పుడింకా ఏ సీట్లూ బుక్‌ అవ్వలేదు. ఇప్పుడు సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇంకా ఈల మోగనే లేదు. అందువలన ధైర్యం చేస్తూ ఉంటే తండ్రి కూడా పదమాల రెట్లు(కోటాను కోట్లు) సహాయం చేస్తూ ఉంటారు.

కెనడా :- సదా ఎగిరే కళలోకి వెళ్ళేందుకు ఆధారమేది? డబల్‌ లైట్‌గా అవ్వడం కావున సదా ఎగిరే పక్షులుగా ఉన్నారు కదా! ఎగిరే పక్షి ఎప్పుడూ ఎవరి బంధనంలోకి రాదు. క్రిందకు వచ్చినట్లయితే బంధనంలో బంధింపబడ్తుంది. కావున సదా ఎగురుతూ ఉండండి. ఎగిరే పక్షి అనగా సర్వ బంధనాల నుండి ముక్తులుగా, జీవన్ముక్తులుగా ఉండడం. కెనడాలో సైన్స్‌ కూడా ఎగిరే కళను నేర్పిస్తుంది కదా! కావున కెనడా నివాసులు సదా ఎగిరే పక్షులు.

శాన్‌ఫ్రాన్సిస్కో :- అందరూ స్వయాన్ని విశ్వంలో విశేష పాత్రను అభినయించే హీరో యాక్టర్లుగా భావిస్తూ పాత్రను అభినయిస్తున్నారా?(అప్పుడప్పుడు). బాప్‌దాదాకు అప్పుడప్పుడు అనే పిల్లల మాట విన్నప్పుడు ఆశ్చర్యమనిపిస్తుంది. సదా బాబా తోడుగా ఉన్నప్పుడు సదా వారి స్మృతే ఉంటుంది కదా! స్మృతి చేసేందుకు బాబా తప్ప ఇంకెవరు ఉన్నారు? ఎవరిని స్మృతి చేస్తారు? ఇతరులను స్మృతి చేస్తూ చేస్తూ ఏమి పొందారు? ఎక్కడికి చేరుకున్నారో దీని అనుభవం కూడా ఉంది కదా. ఇది కూడా అనుభవం చేసిన తర్వాత ఇప్పుడు తండ్రి తప్ప ఇతరుల స్మృతి ఎలా రాగలదు? సర్వ సంబంధాలు ఒక్క తండ్రితో అనుభవం చేశారా? లేక ఇంకా ఏమైనా మిగిలిపోయాయా? ఒక్కరి ద్వారా సర్వ సంబంధాలను అనుభవం చేయగలిగినప్పుడు అనేక వైపులకు వెళ్ళే అవసరమే లేదు. దీనినే ''ఒకే బలం, ఒకే విశ్వాసము'' అని అంటారు. మంచిది.

అందరూ బాగా శ్రమ చేసి విశేషాత్మలను సంపర్కములోకి తీసుకొచ్చారు. ఎవరైతే సేవలో సహయోగమిచ్చారో ఆ సహయోగానికి ప్రతిఫలం అనేక జన్మల వరకు సహయోగం ప్రాప్తమవుతూ ఉంటుంది. ఈ ఒక్క జన్మలో చేసిన శ్రమ ద్వారా అనేక జన్మల శ్రమ నుండి విడుదలయ్యారు. సత్యయుగంలో ఏమైనా శ్రమ చేస్తారా! బాప్‌దాదా పిల్లల ధైర్యం మరియు నిమిత్త భావాన్ని చూసి సంతోషిస్తారు. ఒకవేళ నిమిత్త భావంతో చేయకపోతే ఫలితం కూడా వెలువడదు. మంచిది.

05-11-2017 అవ్యక్త బాప్‌దాదా ఓంశాంతి రివైజ్‌: 27-02-1983 మధువనము

'' సంగమ యుగంలో అలంకరించబడిన మధురమైన అలౌకిక మేళా (కలయిక) ''

ఈ రోజు తండ్రి మరియు పిల్లల మిలన మేళాను జరుపుకుంటున్నారు. మేళాలో చాలా వెరైటీ (భిన్నమైన) మరియు చాలా సుందరమైన వస్తువులు, చాలా సుందరమైన అలంకరణ ఉంటుంది. అంతేకాక ఒకరినొకరు కలుసుకోవడం జరుగుతుంది. బాప్‌దాదా ఈ మధురమైన మేళాలో ఏమి చూస్తున్నారు? ఇటువంటి అలౌకికంగా శృంగారించబడిన మేళా సంగమ యుగంలో తప్ప ఇంకెప్పుడూ, ఎవరూ జరుపుకోలేరు. ప్రతి ఒక్కరు ఒకరికన్నా ఒకరు విశేషంగా శృంగారించబడిన అమూల్య రత్నాలుగా ఉన్నారు. మీ శృంగారం గురించి తెలుసు కదా! అందరి శిరస్సు పైన ఎంతో సుందరమైన లైట్‌(ప్రకాశం) కిరీటం మెరుస్తోంది. తమ కిరీటధారీ స్వరూపాన్ని చూసుకుంటున్నారా? ప్రతి ఒక్కరు దివ్య గుణాల శృంగారంతో ఎంతో సుందరంగా అలంకరింపబడిన మూర్తులుగా ఉన్నారు. ఎటువంటి సుందరమైన శృంగారమంటే దీని ద్వారా విశ్వంలోని సర్వాత్మలు వద్దనుకున్నా స్వతహాగానే ఆకర్షితులవుతారు. అలాంటి శ్రేష్ఠమైన అవినాశీ శృంగారాన్ని చేసుకున్నారా? ఈ సమయంలోని మీ శృంగారానికి స్మృతి చిహ్నంగా, మీ జడ చిత్రాలను కూడా భక్తులు చాలా సుందరాతి సుందరంగా అలంకరిస్తూ ఉంటారు. ఇప్పటి శృంగారం ద్వారా అర్ధకల్పం జడచిత్రాల రూపంలో అలంకరించబడ్తారు. ఇటువంటి శ్రేష్ఠమైన అవినాశీ శృంగారం బాప్‌దాదా ద్వారా పిల్లలందరికి ఇప్పుడు జరిగింది. బాప్‌దాదా ఈ రోజు ప్రతి పుత్రుని మూడు స్వరూపాలు అనగా వర్తమానం మరియు తమ రాజ్యానికి చెందిన దేవాత్మ స్వరూపాలు మరియు భక్తి మార్గంలోని స్మృతి చిహ్నమైన చిత్రాలు ప్రతి ఒక్కరి ఈ మూడు స్వరూపాలను చూసి హర్షిస్తున్నారు. మీరంతా మీ మూడు స్వరూపాలను గురించి తెలుసుకున్నారు కదా! మీ మూడు రూపాలను జ్ఞాన నేత్రంతో చూశారు కదా!

ఈ రోజైతే బాప్‌దాదా మిలనానికి సంబంధించిన ఫిర్యాదులను పూర్తి చేసేందుకు వచ్చారు. ఎవరైతే నిర్బంధనుడిని కూడా బంధనంలో బంధిస్తారో ఆ పిల్లలదే అద్భుతమంతా. ఈ లెక్క ప్రకారం కలవండి అని బాప్‌దాదాకు కూడా లెక్కలు నేర్పిస్తారు. కావున ఇంద్రజాలికులుగా ఎవరయ్యారు? పిల్లలా లేక తండ్రియా? ఇటువంటి స్నేహమనే ఇంద్రజాలాన్ని పిల్లలు తండ్రికి అంటిస్తారు. దీనితో తండ్రికి పిల్లలు లేకపోతే తోచదు. నిరంతరం పిల్లలను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు. మీరందరూ తింటున్నప్పుడు ఒక్కరినే ఆహ్వానిస్తారు, అయితే ఎంతమంది పిల్లలతో కలిసి తినవలసి ఉంటుంది? ఎన్నిసార్లు భోజనానికి పిలుస్తారు? తింటారు, నడుస్తారు, నడుస్తున్నప్పుడు కూడా చేతిలో చేయి వేసి నడుస్తారు. నిద్రపోతున్నా తోడుగానే నిదురిస్తారు. కావున ఇంతగా అనేకమంది పిల్లలతో కలిసి తింటూ, నిద్రిస్తూ, నడుస్తూ ఉంటే తీరికేమి ఉంటుంది? కొంతమంది ఏ కర్మను చేస్తున్నా కార్యం మీద మేము నిమిత్తంగా ఉన్నామనే అంటారు. మీరు చేసి చేయించండి. నిమిత్తంగా చేతులను మేము నడిపిస్తామని అంటారు. కావున ఇది కూడా చేయవలసి ఉంటుంది కదా? అంతేకాక మళ్ళీ ఏ సమయంలోనైనా చిన్న-పెద్ద తుఫానులు వచ్చినా మీకే తెలియాలి అని అంటారు. తుఫానులను తొలగించే కార్యాన్ని కూడా తండ్రికే ఇస్తారు. కర్మల భారాన్ని కూడా తండ్రికే ఇస్తారు. సదా తోడుగా కూడా ఉంచుకుంటారు. కావున గొప్ప ఇంద్రజాలికులుగా ఎవరయ్యారు? భుజాల సహయోగం లేకుండా ఏమీ జరగజాలదు. అందుకే సదా మాలను జపిస్తారు!

ఆస్ట్రేలియా నివాసులైన పిల్లలు చాలా మంచి త్యాగం చేశారు. అంతేకాక ప్రతిసారి త్యాగం చేస్తారు. సదా లాస్టు నుండి ఫాస్టుగా వెళ్ళి ఫస్టులో వస్తారు. ఎంతగా వారు త్యాగం చేస్తారో ఇతరులను ముందుంచుతారో అంతగానే ఎంతమంది కలుస్తూ ఉంటారో వారందరి షేర్‌(భాగం) కొద్ది కొద్దిగా ఆస్ట్రేలియా వారికి కూడా లభిస్తుంది. కావున త్యాగం చేశారా లేక భాగ్యాన్ని తీసుకున్నారా? తోడు-తోడుగా యు.కె. ది కూడా పెద్ద గ్రూపే. ఇవి రెండూ మొట్టమొదట నిమిత్తంగా అయిన సెంటర్లు. చాలా విశాలమైన సెంటర్లు. ఒక సెంటరు ద్వారా అనేక సెంటర్లలో తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలున్నారు. అందువలన ఇరువురూ (ఆస్ట్రేలియా మరియు యు.కె.) పెద్దవారిని, ఇతరులను ముందుంచవలసి ఉంటుంది. ఇతరుల సంతోషంతోనే మీరు సంతోషంగా ఉంటారు కదా! ఈ రెండు స్థానాల్లోని సేవాధారులు సహయోగులు. స్నేహీ పిల్లలు అన్ని విషయాలలో ఎంత విశాల హృదయులుగా ఉన్నారో చూడడం జరిగింది. ఈ విషయంలో కూడా సహయోగులుగా అవ్వడంలో మహాదానీ పిల్లలున్నారు. బాప్‌దాదాకు పిల్లలందరు గుర్తున్నారు. అందరితో కలుస్తారు. ఎంతో దూర-దూరాల నుండి కలుసుకోవాలనే ఉత్సాహంతో పిల్లలు ఎగురుతూ ఎగురుతూ తమ మధురమైన ఇంటికి చేరుకోవడం చూసి బాప్‌దాదాకు సంతోషమవుతుంది. భలే స్థూలంగా ఏ దేశానికి చెందినవారైనా అందరూ ఒకే దేశము వారే, అందరూ ఒక్కటే. ఒకే తండ్రి, ఒకే దేశం, ఒకే మతం మరియు ఏకరస స్థితిలో స్థితులై ఉండేవారు. ఇక్కడైతే కొద్ది సమయం కలవడానికి నిమిత్తమాత్రంగా దేశం పేరు చెప్తారు. అందరూ ఒక దేశము వారే. సాకార లెక్కలో కూడా అందరూ ఈ సమయంలో మధువన నివాసులుగా ఉన్నారు. తమను మధువన నివాసులుగా భావించుకోవడం బాగుందనిపిస్తోంది కదా!

క్రొత్త స్థానంలో సేవలో సఫలతకు ఆధారం :- ఎపుడైనా ఏ క్రొత్త స్థానంలోనైనా సేవ ప్రారంభించినట్లయితే ఒకే సమయంలో అన్ని రకాల సేవలు చేయండి. మనసులో శుభ భావన, వాణీలో తండ్రితో సంబంధాన్ని జోడింపజేసే మరియు శుభ కామనతో కూడిన శ్రేష్ఠమైన మాటలు మరియు సంబంధం - సంపర్కంలో వచ్చినప్పుడు స్నేహం మరియు శాంతి స్వరూపంలో ఆకర్షించండి. ఈ విధంగా అన్ని రకాల సేవల ద్వారా సఫలతను పొందుతారు. కేవలం వాణి ద్వారానే కాదు, ఒకే సమయంలో అన్ని సేవలు తోడు తోడుగా జరగాలి. అటువంటి ప్లాన్లు తయారు చేయండి. ఎందుకంటే ఎవరికైనా సేవ చేసేందుకు స్వయం స్థితిలో స్థితులవ్వవలసి ఉంటుంది. సేవలో ఫలితమెలా ఉన్నా సేవలోని ప్రతి అడుగులో కళ్యాణం నిండి ఉంది. ఒక్కరైనా ఇక్కడి వరకు చేరుకున్నా అందులో సఫలత అయితే ఇమిడిపోయి ఉంది. అనేక ఆత్మల భాగ్య రేఖను గీసేందుకు నిమిత్తంగా ఉన్నారు. అటువంటి విశేష ఆత్మలుగా భావించి సేవ చేస్తూ ఉండండి. మంచిది. ఓంశాంతి.

వరదానము:- ''పరమాత్మ ప్రేమ అనే శక్తి ద్వారా అసంభవాన్ని సంభవం చేసే పదమా పదమ్‌ భాగ్యశాలీ భవ!''
పదమా పదమ్‌ భాగ్యవంతులైన పిల్లలు సదా పరమాత్మ ప్రేమలో లవలీనమై ఉంటారు. పరమాత్మ ప్రేమ అనే శక్తి ఎటువంటి పరిస్థితినైనా శ్రేష్ఠ స్థితిలోకి మార్చేస్తుంది. అసంభవ కార్యం కూడా సంభవమైపోతుంది. కష్టము కూడా సహజమైపోతుంది. ఎందుకంటే ప్రతి సమస్యను దాటడంలో ప్రీతి యొక్క రీతిని నిభాయిస్తూ ఉంటామని బాప్‌దాదా వాగ్దానముంది. కానీ అప్పుడప్పుడు ప్రీతి ఉంచుకునే వారిగా అవ్వకండి. సదా ప్రీతిని నిభాయించేవారిగా అవ్వండి.

స్లోగన్‌:- ''తమ శ్రేష్ఠమైన కర్మ లేక శ్రేష్ఠమైన నడవడిక ద్వారా ఆశీర్వాదాలను జమ చేసుకుంటే పర్వతం లాంటి విషయం కూడా దూది సమానంగా అనుభవమవుతుంది''

Telugu Murli 03/11/2017

03-11-2017 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - ఏ దేహధారులను స్మృతి చేసినా మీకు ముక్తి -జీవన్ముక్తులు లభించజాలవు. తండ్రి ఒక్కరు మాత్రమే మీకు డైరెక్టుగా (నేరుగా/ప్రత్యక్షముగా) ఈ వారసత్వమును ఇస్తారు''
ప్రశ్న:- తండ్రివారైన పిదప కూడా మాయ ఏ పిల్లలను తన వైపుకు ఈడ్చుకుపోతుంది?
ఉత్తరం:- ఎవరి బుద్ధి యోగము పాత సంబంధాలలో తిరుగుతూ ఉంటుందో, సంపూర్ణ జ్ఞానము ఎవరికి ఉండదో లేక ఏవైనా పాత అలవాట్లుంటాయో అటువ౦టి పిల్లలను మాయ తనవైపుకు లాక్కొనిపోతుంది. బయటి ప్రపంచ సాంగత్యము కూడా చాలా అశుద్ధంగా ఉంది. అది అంతము చేసేస్తుంది. సాంగత్య ప్రభావము చాలా త్వరగా పడ్తుంది. అందువలన బాబా అంటున్నారు - పిల్లలూ, ఒక్క తండ్రితో మాత్రమే మీ బుద్ధియోగమును ఉంచుకోండి. ఒక్క తండ్రిని మాత్రమే అనుసరించండి(ఫాలో చేయండి). ఏ దేహధారుల పై ప్రీతిని ఉంచకండి.
పాట:- మిమ్ములను పొంది మేము ప్రప౦చమునే పొందుకున్నాము...... (తుమ్‌ హె పాకె హమ్‌నే జహాన్‌ పాలియా,......)   
ఓంశాంతి. మధురాతి మధురమైన పిల్లలకు ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి వారసత్వము లభిస్తోందని తెలుసు. ఇది చాలా అర్థము చేసుకునే విషయము. పరమపిత పరమాత్మ తమ తమ ధర్మాలను స్థాపన చేసేందుకు ధర్మస్థాపకులందరినీ పంపిస్తారనే మాట వాడుకలో ఉంది. కనుక వారు వచ్చి వారి వారి ధర్మాలను స్థాపన చేస్తారు. అంతేకాని వారు ఎవ్వరికీ వారసత్వమునిస్తారని కాదు. ఇవ్వరు. వారసత్వపు ప్రస్తావనే రాదు. వారసత్వమునిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఏసుక్రీస్తు ఆత్మ అందరికీ వారసత్వమునిచ్చే తండ్రి కాదు. క్రైస్తవులకు కూడా వారసత్వమునిచ్చే తండ్రి ఏసుక్రీస్తు కాదు. ఇచ్చినారనుకోండి, ఏ వారసత్వమునిస్తారు? అనే ప్రశ్న తలెత్తుతుంది. వారసత్వాన్ని ఎవరికిస్తారు? అతడు ధర్మస్థాపన చేసేందుకే వస్తాడు. అతని వెనుక క్రైస్తవ ధర్మానికి చెందిన ఇతర ఆత్మలు వస్తూ ఉంటారు. వారసత్వము మాటే లేదు. వారసత్వము తండ్రి నుండే తీసుకోవాల్సి ఉంటుంది. ఇబ్రహీమ్‌, బుద్ధుడు, ఏసుక్రీస్తు మొదలైన వారు వచ్చారనుకోండి, వారేం చేశారు? వారసత్వము ఎవరికిచ్చారు? ఎవ్వరికీ ఇవ్వలేదు. వారసత్వమిచ్చు కర్తవ్యము తండ్రిదే. వారైతే స్వయంగా వస్తారు. ఆత్మలు వస్తూ ఉంటాయి. జనాభా వృద్ధి చెందుతూ ఉంటుంది. వారసత్వము ఎల్లప్పుడూ సృష్టికర్త (రచయిత/క్రియేటర్‌) ద్వారానే లభిస్తుంది. క్రియేటర్‌ ఒకరేమో లౌకిక తండ్రి, రెండవ వారు పారలౌకిక తండ్రి. ఇది ధారణ చేయవలసిన విషయము. ధారణ కూడా ఇతరులకు దానము చేసేవారికే జరుగుతుంది. ఇప్పుడు అనంతమైన తండ్రి పిల్లలందరికీ వారసత్వమునిచ్చేందుకు వచ్చారు. అనంతమైన తండ్రియే పిల్లలకు అనంతమైన వారసత్వమునిస్తారు. క్రైస్తవులు, ఇస్లాములు, బౌద్ధులు మొదలైనవారందరి తండ్రి ఒక్కరే. వారిని అందరూ గాడ్‌ ఫాదర్‌ అని అంటారు. ఏసుక్రీస్తు కూడా గాడ్‌ ఫాదర్‌ అని అన్నాడు. తండ్రిని ఎప్పుడూ మర్చిపోరు. గాడ్‌ఫాదర్‌ అని ఒక్క నిరాకారుని మాత్రమే అంటారు. నిరాకార ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే. ధర్మ స్థాపకులకు కూడా ఆ నిరాకారుడు ఒక్కరే తండ్రి. వారి ద్వారానే వారసత్వము లభిస్తుంది. వారిని అందరూ గాడ్‌ఫాదర్‌ అని పిలుస్తూ ఉంటారు. ఒక భారతదేశములో మాత్రమే ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటారు. భారతదేశము నుండే మిగిలినవారందరూ సర్వవ్యాపి అనే మాట నేర్చుకున్నారు. ఒక్కవేళ ఈశ్వరుడు సర్వవ్యాపి అయితే అందరూ ఈశ్వరుని ఎందుకు స్మృతి చేస్తారు? సాధుసత్పురుషులు సాధన లేక ప్రార్థన ఎవరిని చేస్తారు? తండ్రి అడుగుతారు కదా. సర్వుల సృష్టికర్త ఒక్కరే. వారే పతితపావనులు. సత్యయుగములో అందరూ పావనంగానే ఉంటారు. మళ్లీ పతితులుగా ఎలా అవుతారు? దేవతలే వామమార్గములోకి వెళ్తారని వ్రాశారు. ఇప్పుడు మళ్లీ పావన ప్రపంచము తయారౌతూ ఉంది. ద్వాపర యుగము ఆది నుండి పతిత ప్రపంచము ప్రారంభమౌతుంది. ఈశ్వరీయ రాజ్యము, ఆసురీ రాజ్యము చెరి సగముగా ఉన్నాయి. ఇది భారతదేశపు విషయము మాత్రమే. రావణుని భారతదేశములోనే తగులబెడ్తారు. అందువలన బాబా అర్థం చేయించారు - ఇతర ధర్మస్థాపకులు ఎవ్వరికీ వారసత్వమును ఇవ్వరు. పోతే ధర్మస్థాపన మాత్రం చేస్తారు. అందుకే వారిని స్మృతి చేస్తారు. కాని ఏసుక్రీస్తును, బ్రహ్మను, విష్ణువును లేక శంకరుని స్మృతి చేసినా లేక వారిని ప్రార్థన చేసినా, వారు ఏమీ ఇవ్వలేరు. ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారు సన్ముఖములో రావలసి వస్తుంది. కృష్ణునిలో పరమాత్ముడు వస్తారని అంటే ఎవ్వరూ అంగీకరించరు. తండ్రి అంటున్నారు - నేను ఆత్మలైన మీకు వారసత్వమునిచ్చేందుకు కల్పానికి ఒక్కసారి మాత్రమే వస్తాను. వారసత్వమును తండ్రి పిల్లలకు ఇస్తారు. తండ్రి అని ఇరువురిని మాత్రమే అంటారు - ఒకరేమో శరీరానికి తండ్రి, రెండవ వారు ఆత్మలకు తండ్రి. వీరిరువురు తప్ప ఇతరులెవ్వరూ తండ్రి అవ్వలేరు. మీకు ఈ బాబా అనగా ప్రజాపిత బ్రహ్మ ద్వారా వారసత్వము లభించదు. వారసత్వము ఒక్క శివబాబా నుండి మాత్రమే లభిస్తుంది. బ్రహ్మ కూడా వారి నుండే వారసత్వము తీసుకుంటారు. వారు సర్వుల సద్గతిదాత. సర్వుల ముక్తి-జీవన్ముక్తి దాత కూడా వారే. అందువలన మొట్టమొదట ఎవ్వరికైనా త౦డ్రి పరిచయమునివ్వాల్సి ఉంటుంది. సాధారణంగా ఏ పెద్దవారినైనా బాబా అని లేక పితాజీ అని అంటారు. కాని వారు నిజమైన తండ్రి కారు. ఒకరేమో లౌకిక తండ్రి, రెండవవారేమో పారలౌకిక తండ్రి. ఈ బ్రహ్మ కూడా శారీరిక తండ్రి మాత్రమే. పిల్లలైన మిమ్ములను దత్తత చేసుకుంటారు. భలే మీరు బ్రహ్మను బాబా అని అంటారు కాని వారసత్వమైతే లభించేది శివబాబా నుండే కదా. ఏ వారసత్వము? సద్గతి, దుర్గతి మరియు జీవన బంధనము నుండి అయితే అందరూ విడుదల అవుతారు. ఈ సమయములో ముఖ్యంగా భారతదేశము జనరల్‌గా మొత్తము ప్రపంచము, రావణుని బంధనములో ఉన్నారు. మొట్టమొదట వచ్చే ఆత్మలు ఏవైతే ఉన్నాయో మొదట జీవన్ముక్తులుగా తర్వాత జీవన బంధనములోకి వస్తారు. మొదట సుఖాన్ని తర్వాత దు:ఖాన్ని అనుభవిస్తారు. ఇది బుద్ధిలో కూర్చోబెట్టుకోవాలి. ఏ దేహధారిని స్మృతి చేసినా ముక్తి - జీవన్ముక్తులు లభించజాలవు. సందేశకులు కూడా వారసత్వమును ఎవ్వరికీ ఇవ్వరు. ముక్తి-జీవన్ముక్తుల వారసత్వము తండ్రే స్వయంగా వచ్చి ఇస్తారు. కాని కొంతమందికి డైరెక్టు (నేరు)గా, కొంతమందికి ఇన్‌డైరెక్టు(పరోక్షముగా) ఇస్తారు. పిల్లలైన మీ సన్ముఖములోనే తండ్రి ఉంటారు. రోజులు గడిచిన కొలది బాబా మధువనము నుండి బయటకు ఎక్కడికీ వెళ్లరు. ఈ పాత ప్రపంచములో ఆశించతగింది ఇంకా ఏముంది? శివబాబా అంటున్నారు - నాకు స్వర్గములోకి వెళ్లడం గానీ లేక కనీసము స్వర్గమును చూచేందుకు కూడా ఇష్టముండదు, ఖుషీ ఉండదు. అటువంటప్పుడు ఈ పాత ప్రపంచములో నేను ఎచ్చటికి వెళ్తాను? నా పాత్రనే పాత ప్రపంచములో వచ్చే పాత్ర. ప్రపంచములో 7 అద్బుతాలు ఉన్నాయని అంటారు కాని అందులో స్వర్గము పేరు చెప్పరు. స్వర్గమైతే తర్వాత వస్తుంది. నేను పతిత ప్రపంచములో, పతిత శరీరములో, పరాయి రాజ్యములో రావలసి వస్తుంది. దూరదేశములో ఉండేవారు పరాయిదేశములోకి వచ్చారని పాడ్తారు కదా..... పిల్లలైన మీరు మాత్రమే దీనిని అర్థము చేసుకోగలరు. ఇప్పుడు మనము పురుషార్థము చేస్తున్నాము, మళ్లీ మన రాజ్యములోకి, మన దేశములోకి వస్తాము. ద్వాపరము తర్వాత ఏ ఆత్మలైతే వస్తాయో అవి పరాయి రాజ్యములో అనగా రావణ రాజ్యములో వస్తాయి. వారు పావన రాజ్యములో అయితే రారు. వారికి కొద్దిగా సుఖము, కొద్దిగా దు:ఖాల పాత్ర ఉంది. మీరు సత్యయుగము నుండి సంపూర్ణ సుఖమును చూస్తారు. ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర లభించి ఉంది. తండ్రి పిల్లలైన మీ ముందు కూర్చుని తాను ఏ విధంగా దేవీదేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారో, ఆ రహస్యాన్ని తెలుపుచున్నారు. అందులో సుఖమే సుఖముంటుంది. దానిలోకి వచ్చేందుకు మిమ్ములను అర్హులుగా చేస్తాను. మనము స్వర్గానికి యజమానులుగా ఉండినామని తర్వాత మాయ పూర్తిగా అనర్హులుగా చేసిందని మీకు తెలుసు. తండ్రి చెప్తున్నారు - ఇప్పుడు మీరు ఎంతో తెలివిహీనులుగా అయ్యారు. నారదుని కథ ఉంది కదా. తంబూరాను వాయించే భక్తుడైన నారదుడు లక్ష్మీని ఎలా వరించగలడు? రాజయోగము నేర్చుకుని పవిత్రంగా అవ్వనంతవరకు లక్ష్మిని వరించలేరని మీరు అర్థం చేసుకున్నారు. శరీరాలేమో అందరివీ భ్రష్టాచారమైనవే. ఎందుకంటే భ్రష్టాచారము ద్వారానే జన్మిస్తారు. మీరేమో ముఖవంశావళి వారు. ఇవి చాలా అర్థము చేసుకునే విషయాలు. రచయిత-రచనల జ్ఞానాన్ని స్వయంగా తండ్రే వచ్చి ఇస్తారు. అన్ని పాయింట్లు ఎవ్వరూ అర్థము కూడా చేసుకోలేరు. ఇచ్చట నుండి బయటికి వెళ్తూనే ఎవరి సాంగత్యమైనా లభిస్తూనే సమాప్తమైపోతుంది. మంచి సాంగత్యము తేలుస్తుందని, చెడు సాంగత్యము ముంచుతుందని......కూడా అంటారు. భలే ఇచ్చట కూర్చుని ఉన్నా బుద్ధి యోగము పూర్తిగా ఇచ్చట లేదు. జ్ఞానము లేకుంటే సాంగత్య దోషములో క్రిందకు పడిపోతారు. ఎవరికైనా, ఏదైనా అలవాటుంటే వారి సాంగత్యములోకి వెళ్లినందున వారి ప్రభావము వెంటనే పడ్తుంది. ఇచ్చట ఉండేది బాబా సాంగత్యము. ఎవరైతే మళ్లీ తండ్రిని ఫాలో చేస్తారో, వారు ఇతరులను కూడా ఉద్ధరిస్తారు. వారే ఉన్నత పదవిని పొందుతారు. చాలామంది క్రొత్త క్రొత్త పిల్లలు బాబా మేము ఉద్యోగము మొదలైనవి వదిలి ఈ సేవలో లగ్నమవ్వమంటారా? అని అడుగుతారు. బాబా అంటున్నారు - పోను పోను మాయ ముక్కును ఎలా పట్టుకుంటుందంటే, ఆ మాటే అడగవద్దు (చాలా గట్టిగా, ఊపిరి ఆడకుండా పట్టుకుంటుంది). ఈ విధంగా చాలామంది వదిలి వెళ్ళిపోయారని అనుభవము చెప్తుంది. ఈశ్వరీయ జన్మ అయితే తీసుకుంటారు కాని మాయ తన వైపుకు ఈడ్చుకుపోయింది. చాలా మంచి మంచి పిల్లలకు మాయ ఒక ఘూసా ఇచ్చి మూర్ఛితులుగా (ముష్ఠి ఘాతముతో) చేస్తుంది. ఎవరి బుద్ధియోగము బయట తిరుగుతూ ఉంటుందో, పాత సంబంధాలు మొదలైనవాటిలోకి పోతూ ఉంటుందో వారిని మూర్ఛితులుగా చేస్తుంది. అందువలన దేహధారులతో బుద్ధియోగమును ఎక్కువగా ఉంచుకోకండి అని బాబా అంటున్నారు. ఈ బాబా పై కూడా మీకు ఎంత ప్రేమ ఉండినా, ఇతనితో బుద్ధియోగమును జోడించకండి. తండ్రిని స్మృతి చేయకుంటే వికర్మలు వినాశనమవ్వవు. ఏ శరీరధారి పైనా ప్రీతిని ఉంచకండి. సత్సంగాలలో వినిపించే వారందరూ శరీరధారులే. ఏదో ఒక మహాత్ముని పేరు చెప్తుంటారు. పరమపిత పరమాత్మ శివుడు మనలను చదివిస్తున్నారని ఎవ్వరూ చెప్పరు. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఈ రచనకు మరియు ఈ సృష్టికి నేను చైతన్య బీజమును. నాకు మొత్తం ఈ కల్పవృక్ష జ్ఞానమంతా పూర్తిగా ఉంది. అది జడ బీజము, చైతన్య బీజమైతే వినిపించేది (చెప్తుంది). బీజమైన నాలో వృక్షము యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానమంతా పూర్తిగా ఉంటుంది. ఇది అనంతమైన విషయము. ఇప్పుడుండేది తమోప్రధాన రాజ్యము. అందువలన దీని ఆడంబరము తప్పక ఎక్కువగానే ఉంటుంది. జ్ఞానేశ్వరుడు, గంగేశ్వరానందుడు, నిత్యానందుడు,.......మొదలైన గొప్ప గొప్ప పేర్లుంచుకుంటారు. కాని సత్యమైన ఆనందము ఎవ్వరికీ లభించజాలదు. సన్యాసులు స్వయంగా సుఖము కాకిరెట్టకు సమానమని అంటారు. కాని స్వర్గమనే పేరు మాత్రము మర్చిపోరు. ఫలానావారు స్వర్గస్థులైనారని అంటారు. మళ్లీ వారిని పితృదేవతలని క్రిందికి పిలుస్తారు. ఆత్మ ఎవరిలోనైనా ప్రవేశించి మాట్లాడ్తుంది. కాని ఆత్మ ఎలా వస్తుందో, ఎవ్వరికీ తెలియదు. శరీరము ఇతరులది, తినేది కూడా వారి ఆత్మనే. వారి కడుపులోకే పోతుంది. కాని వచ్చిన ఆత్మ వాసనను మాత్రము అనుభవిస్తుంది. శివబాబా అయితే అభోక్త. ఏమీ భుజించరు. మమ్మా ఆత్మ వస్తే భుజిస్తుంది. అలాగే పితృలు వచ్చినా, భుజిస్తారు. ఇవన్నీ అర్థము చేసుకునే విషయాలు. ఆ ఒక్కరినే తప్ప ఇతరులెవ్వరినీ బాబా అని అనరు. ఇతని (బ్రహ్మబాబా) ద్వారా వారసత్వమేమి లభిస్తుంది? ఏమీ లభించజాలదు. ఏసుక్రీస్తు ఏదైనా వారసత్వమిచ్చాడా? వారేమో యుద్ధము చేసి రాజ్యస్థాపన చేశారు. క్రైస్తవులు యుద్ధము చేశారు. ధన వృద్ధి జరిగినప్పుడు, ధనము కూడబెట్టుకున్నప్పుడు, రాజ్యపాలన నడుస్తుంది. అంతేగాని ఏసుక్రీస్తు రాజ్యమిచ్చినారని అనరు. రాజ్యపదవి మీ పురుషార్థానుసారము, డ్రామా ప్లాను అనుసారము లభిస్తుందని బాబా అంటారు. పోతే మనుష్యులు ఎవ్వరికీ ఏమీ ఇవ్వలేరు. ఒకవేళ ఇచ్చినా, ఇది అల్పకాలిక సుఖము. ఇప్పుడంతా తమోప్రధానంగా ఉంది. మాయ జోరు చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మీరు మాయతో యుద్ధము చేయాలి. మాయను జయిస్తే జగత్‌జీతులుగా అవుతారు. మనుష్యులు శాంతిగా ఉండేందుకు ఎంతగానో బుర్ర బద్దలు కొట్టుకుంటారు. మనస్సు ఊరికే శాంతిగా ఉండలేదు. వారు ఏదో ఒకటి నేర్చుకుంటారు. కొంతమంది హిప్నాటిజమ్‌ (కృత్రిమ నిద్రను కలిగించి వశము చేసుకోవడం) మొదలైనవి చేసి తెలివి తప్పిపోవునట్లు చేస్తారు. శ్రమ కలుగుతుంది. కొంతమంది మెదడే చెడిపోతుంది. తండ్రి అంటున్నారు-ఏదైనా కర్మబంధనములోకి లేక బంధుమిత్రులు మొదలైనవారి పైకి బుద్ధి వెళ్తూ ఉంటే, వికర్మలు వినాశనమవ్వవు. దేహధారుల నుండి బుద్ధిని తొలగించాలి. అందరినీ మర్చిపోండి. మీరు మరణిస్తే, మీకు ప్రపంచము మరణిస్తుంది. ప్రపంచాన్ని స్మృతి చేస్తే, మీకు దండన పడ్తుంది. బాబా, '' మేము మరణించామని'' మీరంటారు. ''మేము మీ వారిమి.'' మరి బంధు మిత్రులు మొదలైనవారి వైపు బుద్ధి ఎందుకు పోతుంది? అనగా మీరు మరణించలేదు! తండ్రివారిగా అవ్వలేదని అర్థము. చాలా మందికి రాత్రింబవళ్లు వారి కర్మ బంధనాల చింతయే ఉంటుంది. స్మృతి చేసేందుకు కూర్చున్నా వారికి అవే సంకల్పాలు వస్తూ ఉంటాయి. ఇచ్చట బాబా ఒడిలో ఉంటున్నారనగా మరణించారు కదా. అందువలన మీ బుద్ధియోగము ఎటూ వెళ్ళరాదు. సన్యాసులైతే ఇల్లు-వాకిళ్ళు వదిలేస్తారు అనగా మరణించారు. ఒకవేళ ఇంకా స్మృతి వస్తూ ఉంటే, యోగములో ఎలా ఉంటారు? కొంతమంది మళ్లీ ఇంటికి తిరిగి వచ్చేస్తారు కూడా. కొంతమంది పక్కాగా అయిపోతారు. వారికి బొత్తిగా గుర్తుకు రాదు. పిల్లలైన మీ బుద్ధి కూడా బయటకు వెళ్తూ ఉంటే ఉన్నత పదవిని పొందలేరు. పిల్లలుగా అయ్యి ఉంటే, తండ్రిని పూర్తిగా ఫాలో చేయాలి. మోహము ఏ మాత్రమూ ఉండరాదు. కాని భాగ్యములో లేకుంటే మరణించి కూడా అటువైపు వెళ్లిపోతారు. 5 శాతము బుద్ధి ఇక్కడ, 95 శాతము అక్కడ ఉంటుంది. తిరుగుతూ, వెతుకుతూ ఉంటుంది. ఇటు కాకుండా, అటు కాకుండా అయిపోతారు. తండ్రివారుగా అవుతే ఇక ఆ బుద్ధే సమాప్తమవుతుంది. మీరు మరణించారు. ఈ బేహద్‌ సన్యాసములో ఎవరో, విశేషమైనవారు మాత్రమే వస్తారు. అటువంటివారే మాలలోని మణులుగా అవ్వగలరు. ఇది గొప్ప అదృష్టము. వాస్తవానికి ఇచ్చట వచ్చి ఉండువారికి శ్రమ అనిపించరాదు. కాని ఇచ్చట వచ్చి ఉండేవారికే శ్రమ ఎక్కువగా ఉన్నట్లు గమనించబడ్తుంది. బయట ఉండువారు చాలా వేగంగా ముందుకు వెళ్ళిపోతారు. ఎవ్వరి పైనా మోహముండదు. ఈ బంధనాలు తొలగిపోతే సేవలో లగ్నమైపోతామని అనుకుంటారు. జ్ఞానములో పక్కాగా ఉన్నారా? అని కూడా చూడవలసి వస్తుంది. ఒకవేళ కచ్ఛాగా ఉండి పతి మరణిస్తే, పుండు పై ఉప్పు చల్లినట్లౌతుంది. పూర్తిగా మరణించినంతవరకు గాయము పై ఉప్పు పడ్తూనే ఉంటుంది. ఇచ్చటైతే, బాబా అని అంటే చాలు, బాబావారిగా అయిపోయారు, పాత సంబంధాలన్నీ వదిలిపోయాయి. వారికి తెలియాలి. వారి కర్మలకు తెలియాలి. మధ్యలో మనకెందుకు? ఇంత పొంగు ఉత్సాహముండాలి అయితే ఇలాంటివారు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. తండ్రి లభించారు అంతే చాలు. ఎవరిని గురించిన చింతా లేదు. ఇంత ధైర్యముండాలి. సత్యమైన హృదయముతో శ్రీమతమును పూర్తిగా అనుసరిస్తూ ఉంటే ఎవ్వరూ ఆపలేరు. పవిత్రంగా అయ్యేందులో ఎవ్వరూ విఘ్నము కలిగించలేరు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. కర్మ బంధనాలను చింతన చేయరాదు. బుద్ధిని దేహధారుల నుండి తొలగించాలి. అనంతమైన సన్యాసము చేయాలి.
2. బంధనాల నుండి ముక్తులుగా అయ్యేందుకు పూర్తి నిర్మోహులుగా అవ్వాలి. సత్యమైన హృదయముండాలి. జ్ఞానములో పక్కాగా ధైర్యంగా ఉండాలి.
వరదానము:- ''నాది (మేరాపన్‌) అనే దోషాన్ని సమాప్తం చేసి నిండుతనాన్ని (సంపన్నతను) అనుభవం చేసే సంపూర్ణ ట్రస్టీ భవ''
ఒకవేళ తండ్రి శ్రీమతానుసారము నిమిత్తముగా ఉంటే ప్రవృత్తీ మీది కాదు, సెంటరూ మీది కాదు. ప్రవృత్తిలో ఉండినా ట్రస్టీలే, సెంటరులో ఉండినా అది తండ్రి సెంటరే గాని మీ సెంటరు కాదు. అందువలన సదా అది శివుని భండారమే, బ్రహ్మబాబా భండారమే - ఈ స్మృతి ద్వారా సంపన్నతను అనుభవం చేస్తారు. నాది అనేది ఉంటే భండారము గాని, వంట ఇల్లు గాని వృద్ధి చెందవు. ఏ కార్యములో అయినా ఏదైనా దోషము అనగా లోపముంటే అందుకు కారణం తండ్రి కాదు. అందుకు బదులు 'నాది (మేరాపన్‌)' అనే దోషము అనగా అశుద్ధత మిక్స్‌ అయి ఉంటుంది.

స్లోగన్‌:- ''తండ్రి సమానంగా అవ్వాలంటే అర్థం చేసుకోవడం, కోరుకోవడం, చేయడం - మూడింటిని సమానం చేయండి''

Telugu Murli 02/11/2017

02-11-2017 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - వికారాలను దానిమిచ్చిన తర్వాత కూడా స్మృతిలో ఉండేందుకు పురుషార్థము తప్పకుండా చేయాలి. ఎందుకంటే స్మృతి ద్వారానే ఆత్మ పావనంగా అవుతుంది''

ప్రశ్న:- బాబా హృదయసింహాసన అధికారిగా లేక రుద్రమాలలో కూర్చబడేందుకు విధి ఏది?
ఉత్తరం :- తండ్రి సమానంగా దు:ఖహర్త-సుఖకర్తలుగా అవ్వండి. అందరి పై జ్ఞాన జలపు తుంపర్లు చల్లి శీతలంగా చేసే సేవ చేయండి. ఎవరికైనా దు:ఖము కలిగించే మాటలను వదిలేయండి. ఎలాంటి వికర్మలూ చేయకండి. మంచి నడవడికలను (మ్యానర్స్‌) ధారణ చేయండి. మీ సమయాన్ని తండ్రి స్మృతిలో సఫలము చేసుకుంటే, తండ్రి హృదయసింహానాధికారులుగా తయారై రుద్రమాలలో కూర్చబడ్తారు. ఒకవేళ ఎవరైనా తమ సమయాన్ని వ్యర్థము చేసుకుంటే తమ పదవిని అనవసరంగా పాడు చేసుకుంటారు.అసత్యము చెప్పడం, తప్పు చేసి దాచిపెట్టడం, ఎవరి హృదయానికైనా దు:ఖము కలిగించడం - ఇవన్నీ పాపాలే. దీని వలన నూరు రెట్ల శిక్ష లభిస్తుంది.

పాట :- వారు మా నుండి వేరు కారు, మేము వారి నుండి,......... (వహ్‌ హమ్‌ సే కభీ భీ జుదా న హోగే,.........)   
ఓంశాంతి. ఇది గోపికల పాట. ఆ గోపికలు ఎవరు? ప్రజాపిత ముఖవంశావళివారు. వారినే గోపీ వల్లభుని అనగా తండ్రికి చెందిన గోప గోపికలు అని అంటారు. మిగిలినవన్నీ వట్టి కథలే. ఎప్పుడైతే మీరు ఈశ్వరుని వారిగా అయ్యారో, అప్పుడు ఆసురీ వికారీ సంప్రదాయాలు మీకు శత్రువులుగా అవుతాయని అర్థం చేసుకోవాలి. హంసలు, కొంగలు కలసి ఉండలేవు. హంసలు చాలా కొద్దిగా ఉంటాయి. కొంగలు కోట్ల సంఖ్యలో ఉంటాయి. మీరు గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి. దీని గాయనము కూడా - గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రముగా ఉండండి అని ఉంది. విఘ్నాలైతే చాలా వస్తాయి. అర్ధకల్పము నుండి పతితులుగా ఉన్నారు. అంత సులభంగా, త్వరగా పావనంగా అయిపోరు. వికారాల కొరకు ఎన్నో గొడవలు, పెనుగులాటలు జరుగుతూ ఉంటాయి. అబలల పై అత్యాచారాలు జరుగుతాయి. ద్రౌపది పిలిచింది కూడా అందుకే. ద్రౌపది ఒక్కరు కాదు. ఈ సమయములో అందరూ ద్రౌపదులే, అందరూ దుశ్శాసనులే. చీరలు వలుస్తూ అవమానపరుస్తూ ఉంటారు. ఈ ప్రపంచమే పతిత వికారీ ప్రపంచము. సత్యయుగాన్ని నిర్వికారీ ప్రపంచమని అంటారు. ఇది వికారీ ప్రపంచము, రావణ రాజ్యము. ఈ ప్రపంచములో ఎంతో దు:ఖముంది. ఏడ్వడం, బాదుకోవడం, కొట్లాటలు, జగడాలు ఏమేమో జరుగుతున్నాయి! నూతన ప్రపంచములో దేవతలు రాజ్యపాలన చేయునప్పుడు పవిత్రత, సుఖ-శాంతులుండేవి.అశాంతినిచ్చే ధర్మాలు ఏవీ లేవు. ఇప్పుడైతే అశాంతిని వ్యాపింపజేసే ధర్మాలు అనేకమున్నాయి. అందరికంటే పాత శత్రువు రావణుడని, అతడు భారతదేశాన్ని చిల్లిగవ్వ సమానంగా పతితంగా చేశాడని నిరూపించి చెప్తారు. తండ్రి కూర్చుని కర్మ - అకర్మ - వికర్మల గతిని అర్థం చేయిస్తారు. రావణ రాజ్యములో ఎవరు ఎన్ని దాన-పుణ్యాలు చేసినా, యజ్ఞ జప తపాదులు ఆచరించినా, క్రిందికి దిగే తీరాలి. ఎవరికి దానము చేస్తారో, వారు కూడా వికారీ పాపాత్మలే. వికర్మలు చేస్తూ చేస్తూ ఇప్పుడు తలపై చాలా భారముంది. సతోప్రధానంగా ఉండిన ఆత్మలే ఇప్పుడు తమోప్రధానంగా అయిపోయాయి. ఈ విషయాలన్నీ కల్పక్రితము వలె తండ్రే స్వయంగా వచ్చి అర్థం చేయించి మనలను కల్ప-కల్పానికి దేవతలుగా చేస్తారు. సహజ రాజయోగాన్ని, జ్ఞానాన్ని వినిపిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి.ఇది సులభమే కదా.అందరూ ఓ భగవంతుడా! రండి అని పిలుస్తారు. పతితులైన మమ్ములను మీరు వచ్చి పావనంగా చేయండని అంటారు. అందువలన పతితపావనుడు తండ్రి ఒక్కరు మాత్రమే కదా. మనము పావనంగా తయారయ్యేందుకు తండ్రి మనతోనే పురుషార్థము చేయిస్తారని మీకు తెలుసు. భలే ఎవరైనా 5 వికారాల దానమిస్తారు. అంతమాత్రానికే సరిపోదు. మళ్లీ యోగము కూడా జోడించాలి. జన్మ-జన్మాంతరాలుగా తల పై ఉన్న పాపభారము, దేని ద్వారా మీరు తమోప్రధానంగా అయ్యారో ఆ పాపభారము యోగము చేయకుంటే ఎలా భస్మమైపోతుంది?

మీరు పంచ వికారాలు దానము చేసి ఇక ఏ పాప కర్మలూ చేయమని అంటారు. కాని జన్మ-జన్మాంతరాల లెక్కాచారము ఏదైతే ఉందో, అది ఎలా సమాప్తమైపోతుంది? దానికి యుక్తి ఏమంటే ఎంతవరకు జీవించి ఉంటారో అంతవరకు తండ్రి స్మృతిలో ఉండాలి. ఈ తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమౌతాయి. పతిత ఆత్మలు అచ్చటికి వెళ్ళలేవు. ప్రతి ఒక్కరికి తమ-తమ పాత్ర, తమ-తమ పదవి లభించే ఉంది. మనుష్యులకు హోదా ఎలా ఉంటుందో అలా ఆత్మలకు కూడా హోదా ఉంటుంది. మొట్టమొదట ఆత్మ స్వర్గములోకి వస్తుంది. మొదటి నంబరులో లక్ష్మీ నారాయణులు ఉన్నారు. వారిది అందరికంటే పెద్ద పాత్ర, డ్రామాలో దేవీదేవతా ధర్మానికి చెందిన ఆత్మలు అందరికంటే మంచి పాత్ర అభినయించి అందరికంటే ఎక్కువ సుఖము అనుభవిస్తారు. తర్వాత సతో, రజో, తమోలోకి రావలసి ఉంటుంది. మురికి(వికారము) కలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ మురికి ఎలా తొలగాలి? బంగారును అగ్నిలో వేస్తే మలినాలు తొలగుతాయి. ఇది యోగాగ్ని, దీని ద్వారా వికర్మలు వినాశనమవ్వగలవని ఎవ్వరికీ తెలియదు. మాటిమాటికి యోగము తెగిపోతుందని, తండ్రిని మర్చిపోతామని పిల్లలంటారు. ఇవి మాయ కల్పించే విఘ్నాలు. విఘ్నాలు రాకూడదని యోగము త్వరగా జోడించాలని, త్వరగా వినాశనము అయిపోవాలని అనుకుంటారు. కాని అలా జరగదు. సమయము పడ్తుంది. అంతవరకు మీరు యోగము చేస్తూనే ఉండాలి. చివరిలో కర్మాతీత అవస్థ వస్తుంది. అప్పుడు ప్రపంచము కూడా సమాప్తమైపోతుంది. మీరు శ్రీమతము ద్వారా రావణుని పై విజయము పొందుతారు. గీత, మహాభారతము, రామాయణము అన్నిటిలోనూ భక్తి సామాగ్రి ఉంది. మీరు సంగమ యుగములో ఏ కర్తవ్యాలు చేశారో, వాటి స్మృతిచిహ్నాలుగా ఈ మందిరాలు మొదలైనవి తయారయ్యాయి. స్మృతి చిహ్నాలు తయారవ్వడం ద్వాపర యుగము నుండి ప్రారంభమౌతాయి. మొట్టమొదట పరమపిత పరమాత్మ ఎవరైతే వచ్చి పతితుల నుండి పావనంగా తయారు చేస్తారో ఆ శివుని స్మృతి చిహ్నము (శివలింగము) తయారౌతుంది.దేవతల మహిమ గాయనము చేయబడ్తుంది.లక్ష్మీనారాయణులకు చాలా పెద్ద మందిరాలున్నాయి. వారికి ఇంత పూజ ఎందుకు జరుగుతోంది? దీనికి జవాబు ఎవ్వరికీ తెలియదు. పూజ్యుల నుండి మళ్లీ పూజారులుగా తప్పకుండా తయారు కావలసి ఉంటుంది. పూజ్యులుగా ఉన్నప్పుడు ప్రాలబ్ధము అనుభవిస్తారు. ఎలాగైతే గొప్ప-గొప్ప రాజుల జీవిత చరిత్ర గాయనము చేయబడ్తుందో అలా సత్యయుగములో మొదటి నంబరు మహారాజ - మహారాణులు అనగా లక్ష్మీనారాయణుల మహిమ తప్పకుండా చేస్తారు. అయితే వారు అలా ఎలా అయ్యారో ఎవ్వరికీ తెలియదు. ఉదాహరణానికి బ్రహ్మ-సరస్వతులు ఇరువురికీ నేర్పించేవారు శివుడు. అయితే వీరి పేరు శాస్త్రాలలో అదృశ్యము చేసి, అగడం - బగడం(అర్థము లేని) వ్రాతలు వ్రాసేశారు. ఈ విషయాలన్నీ తెలివైన పిల్లలు నెంబరువారుగా తెలుసుకుంటారు. ఈ డ్రామా నడుస్తూ ఉంది. కల్పక్రితము కూడా మీరు ఇప్పుడు తయారవుతున్నట్లే అప్పుడు కూడా అలాగే తయారయ్యారు. ఈ వృక్షము వృద్ధి పొందుతూ ఉంటుంది. ఫలాలు కూడా తప్పకుండా పక్వమౌతాయి. వృక్షము పెరిగేందుకు సమయము పడ్తుంది కదా. వృక్షము పెరిగి పెద్దదైనప్పుడు మీరు దేవీ దేవతలుగా తయారై పోతారు. మిగిలినవారందరు వినాశనమైపోతారు. పిల్లలైన మీరు ఇప్పుడు పరిపక్వమౌతూ ఉన్నారు. కొందరు పూర్తిగా పక్వమౌతారు. కొందరు తక్కువగా అవుతారు. కొందరికి తుఫానులు వస్తాయి. సంపాదనలో గ్రహచారము వచ్చి కూర్చుంటుంది. బాబా అంటున్నారు - యోగము చేస్తూ ఉండండి, దాని వలన మీ పాపాలన్ని దగ్ధమైపోతాయి. ఇది చాలా పెద్ద సంపాదన, అందుకే భారతదేశపు ప్రాచీన యోగము ప్రసిద్ధి చెందింది. అయితే దాని ద్వారా ఏమి లభిస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీ ఆత్మలో మురికి ఏర్పడి ఉంది. మీరే పూజ్యులుగా, మీరే పూజారి మనుష్యాత్మలుగా అవుతారు. కాని భగవంతునిగా అవ్వజాలరు. వారు కూడా పూజారులుగా అవుతే, వారిని పూజ్యులుగా ఎవరు చేయాలి! మనలను పూజ్యులుగా చేయువారు తండ్రి. మనము పూజ్య పావన దేవతలుగా ఉండేవారము. మళ్లీ క్రిందికి దిగుతూ దిగుతూ శూద్రులుగా అయిపోయాము. సత్యయుగ దేవీ దేవతలను ఈశ్వరుని నూతన రచన అని అంటారు. మనుష్యులను దేవతలుగా తయారు చేసిన వారి మహిమ వర్ణనాతీతము..... అని సిక్కులు పాడ్తారు. మంచిరీతిగా చదవండని తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రి, టీచరు, గురువుల కర్తవ్యము పురుషార్థము చేయించుట. పిల్లలూ! సమయాన్ని వృథా చేయకండి, అనవసరంగా పదవి భ్రష్టమైపోతుంది. తర్వాత చాలా పశ్చాత్తాపపడ్తారు అని తండ్రి చెప్తున్నారు. కల్ప-కల్పము మీ స్థితి ఇలాగే ఉంటుంది, తర్వాత ఏమీ చేయలేరు. సాక్షాత్కారమైపోతుంది, కల్ప-కల్పము ఇలాంటి దుర్గతినే పొందుకుంటానని పక్కా పక్కాగా నిశ్చయమైపోతుంది. ఇటువంటి పరిస్థితి ఏర్పడితే చాలా ఏడ్వవలసి వస్తుందని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఒక తరగతి నుండి మరో తరగతికి మారునప్పుడు నెంబరువారుగా కూర్చుంటారు. మనము కూడా నూతన ప్రపంచములోకి(బదిలీ) ట్రాన్స్‌ఫర్‌ అవుతాము. బ్రాహ్మణుల మాల గాయనము చేయబడలేదు. రుద్రమాలయే పూజింపబడ్తుంది. అయితే ఈ మాల ఏమిటో ఎవ్వరికీ తెలియదు. మాల పై భాగాన మేరు(జంట) పూస చూపిస్తారు. మేరు పూస విష్ణువు. దాని పైన ఉన్న పుష్పము శివబాబా. ఆ తర్వాత మిగిలిన మాల ఉంటుంది. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు రుద్రమాలలో కూర్చబడేందుకు పురుషార్థము చేస్తున్నారు. సింహాసనాధికారులుగా తయారయ్యేందుకు పురుషార్థము చేయండి. ఎవరికైనా దు:ఖము కలిగించే విషయాలు వదిలేయండి. మన తండ్రి దు:ఖహర్త-సుఖకర్త. ఒకవేళ పిల్లలైన మీరు కూడా దు:ఖమిస్తే, వీరు ఈశ్వరీయ పిల్లలని ఎవరనుకుంటారు? వికర్మలు చేయడం అనగా జీవ హత్య చేసుకోవడం. అసత్యమాడరాదు, పాపాలు చేయరాదు. ఓడిపోతే తండ్రిని క్షమించమని అంటారు. భక్తిలో కూడా ఏదైనా తప్పు జరిగితే పశ్చాత్తాపపడి ముక్కుచెంపలు వేసుకుని క్షమించమంటారు. ఇది జ్ఞానమార్గము. ఇందులో ఎవరి హృదయాన్నీ దు:ఖపెట్టరాదు. జ్ఞాన తుంపర్లు(బిందువులు) శీతలంగా చేస్తాయి. పిల్లలైన మీరు చదువుకునేందుకు ఇచ్చటకు వచ్చారు. చదువులో మ్యానర్లు(గుణగణాలు) చాలా మంచివిగా ఉంచుకోవాలి. ఇది కూడా చదువే చదివించేవారు నిరాకార తండ్రి. వారికి మీ ఆంతర్యములోని అన్ని విషయాలు తెలుసు. ఒక సెంటర్లో ఒక విద్యార్థి తప్పు చేసినప్పుడు ధర్మరాజు కొరడాతో కొట్టారనే సమాచారము అందింది. కాని ఈ సంగతి ఈ బాబాకు తెలియనే తెలియదు. చాలామంది వికారాల వశమై సత్యమే తెలపరు. స్వయాన్ని రక్షించుకునేందుకు చేసిన తప్పును దాచి పెడ్తారు. కాని శివబాబా నుండి దాచిపెట్టలేరు. మిమ్ములను చదివించేవారు శివబాబాయే. వారిని కూడా మర్చిపోతారు. దీనిని తెలివి తక్కువతనమని, వారిని దురదృష్టవంతులని అంటారు. ఇచ్చట ఎవరి అసత్యము గాని, సత్యము గాని దాగి ఉండలేదు. ఈ బాబా అంటున్నారు - నేను అంతర్యామిని కాను, శివబాబా అంతర్యామి. తండ్రి స్వయంగా చెప్తున్నారు - నేను నిరాకారుడను. నాకు అన్నీ తెలుసు. ఇతడైతే సాకారములో ఉన్నాడు. నేను పునర్జన్మ రహితుడను. ఇతడు జనన-మరణాలలోకి వస్తాడు. అందుకే నీకు నీ జన్మల గురి౦చి తెలియదు. నేను వినిపిస్తున్నానని ఇతనితో అనడం జరుగుతుంది. సూర్యవంశములో వచ్చే వారందరికీ నేను వినిపిస్తున్నాను. చాలామంది పిల్లలు దాస్తూ ఉంటారు. బాబా ముందుకు రానే రారు. బాబా చెప్తున్నారు - ఏ విషయాలూ ఇతని నుండి దాచకండి. ఇతనికి అన్ని విషయాలు వినిపించండి. అప్పుడా తప్పులు క్షమించబడ్తాయి. ఇతడు నా కుమారుడే కదా. నాకైతే సర్వమూ తెలుసు. ఇతనికి ఎలా తెలియాలి? అందుకే ఇతనికి అన్నీ వినిపించండి. క్రిందటి జన్మ-జన్మాంతరాల లెక్కాచారమైతే నా వద్ద ఉంది. పోతే ఈ జన్మలో ఏ లెక్కాచారమైతే ఉందో దానిని ఇతనికి వినిపిస్తే, నేను కూడా వింటాను. అంతేకాని ఇంట్లో కూర్చుని శివబాబాకు అన్నీ తెలుసు అని భావించరాదు. అలా అనుకోకండి. ఆ విధంగా భక్తిమార్గములో చేస్తూ వచ్చారు. ఇప్పుడు నేను మీ సన్ముఖములో వచ్చాను. నాకు తెలిపిస్తే, మీకు సలహా కూడా లభిస్తుంది. నేను మీకు గమనము కూడా ఇప్పిస్తాను. హెచ్చరిక చేస్తాను. ముఖము నల్లగా చేసుకోకండని(వికారాలలోకి వెళ్లకండి) తండ్రి అర్థం చేయిస్తారు. పోను పోను చివరి సమయము చాలా నాజూకుగా ఉంటుంది. శిక్షలు చాలా లభిస్తాయి. ఉదాహరణ కూడా మీరు చూస్తూ-వింటూ ఉంటారు. చేసిన పాపము ఎప్పుడూ సర్జన్‌ వద్ద దాచిపెట్టకండి. క్షమించేవారు శివబాబా. ఈ బాబా కాదు. ఈ సమయములో పాపము చేస్తే, వంద రెట్ల శిక్ష పడ్తుంది. అలాగే వ్యర్థముగా అసత్యము చెప్పకండి. బాబా పిల్లలందరికీ వార్నింగ్‌ ఇస్తున్నారు. ఇది ఎంతో అనంతమైన పాఠశాల.

గోవులైన మీరు (అన్నయ్యలు) గుప్త వేషములో చాలా పనులు చేయవచ్చు. మీరు అర్థం చేయిస్తే ఇది కూడా ఒక ప్రభుత్వమని వారి హృదయాలకు తప్పకుండా తగులుతుంది. ఈ జ్ఞానము గుప్తమైనది. బీజము, వృక్షము, సృష్టి చక్రములను గురించి అర్థం చేసుకోవాలి. ఇది నాలుగు యుగాల చక్రము. దీని బదులు ఆ ప్రభుత్వము చరకా(రాట్నము)ను ఉంచేశారు. మీది బ్రహ్మకుమారుల పాండవ సైన్యము. మన రాజ ముద్రికను తీసుకెళ్లాలి. చరకా తిప్పినంత మాత్రాన సత్యమేమైనా జయిస్తుందా? సత్యమేవ జయతే సంభవమవుతుందా ? నిజానికి ఇది సృష్టి చక్రానికి సంబంధించిన విషయము. మీరు భయపడరాదు. గుప్త వేషములో మీరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు. మీరు బహురూపి అయిన శివబాబా పిల్లలు. మీరు కూడా బహురూపులుగా ఉండాలి. కాని ఎంత చెప్పినా పిల్లల బుద్ధిలోకి ఎక్కదు. కొద్దిగా సేవ చేయగానే సంతోషపడిపోతారు. బుర్ర ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తుకు ఎక్కిపోతుంది. ఇప్పుడు చేయవలసిన పని ఇంకా చాలా ఉంది. రకరకాల పురుషార్థము చేయాలి. బాబా అనేక పాయింట్లు ఇస్తారు. ఈ జ్ఞాన యజ్ఞమైతే నడుస్తూనే ఉంటుంది. అన్ని మార్గాలలోని వారిని పిలుస్తూ ఉండండి. రాజులను కూడా పిలువవచ్చు. సమావేశాలు కూడా జరపవచ్చు. ఎటువంటి మనుష్యులుగా ఉంటారో, అటువంటి కార్డులు ముద్రించవలసి వస్తుంది. ''ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతూ ఉందో వచ్చి తెలుసుకోండి. మీరు వస్తే మేము మీకు పరమపిత పరమాత్ముని కథను, 5 వేల సంవత్సరాల జీవాత్మల కథను వినిపిస్తాము. అద్భుతము కదా. '' మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. పావనంగా తయారయ్యేందుకు ఎంతవరకు జీవించి ఉంటారో అంతవరకు మాయ కలిగించే విఘ్నాలను లెక్కచేయరాదు.
2. మానవులందరి పై జ్ఞాన తుంపర్లు చల్లి శీతలంగా తయారుచేసే సేవ చేయాలి. ఎవరి హృదయాన్నీ ఎప్పుడూ దు:ఖపెట్టరాదు. తండ్రి సమానము దు:ఖహర్త-సుఖకర్తగా అవ్వాలి.
వరదానము:- ''నలువైపులా ఆందోళనకరంగా ఉన్న సమయంలో అవ్యక్త స్థితి లేక అశరీరిగా అయ్యే అభ్యాసము ద్వారా విజయీ భవ''
చివరి సమయంలో నలువైపులా వ్యక్తుల ద్వారా, ప్రకృతి ద్వారా చాలా ఆందోళనకర శబ్ధాలు వినిపిస్తాయి. వాయుమండలం కదిలించేదిగా, బాధతో అరిచేదిగా ఉంటుంది. ఇటువంటి సమయంలో '' ఒక సెకండులో అవ్యక్త ఫరిస్తా నుండి నిరాకారి అశరీరి ఆత్మను'' - అనే అభ్యాసమే విజయులుగా చేస్తుంది. అందువలన యజమానిగా అయ్యి ఎప్పుడు కావాలంటే అప్పుడు నోటి ద్వారా మాట్లడే, కావాలంటే చెవుల ద్వారా వినే, వద్దనుకుంటే ఒక సెకండులో స్టాప్‌ - ఈ అభ్యాసమే విజయ మాలలోకి తీసుకొస్తుంది.

స్లోగన్‌:- ''పురుషార్థాన్ని తీవ్రంగా చేయాలంటే నిర్లక్ష్యము అనే లూజ్‌ స్క్రూ ను టైట్‌ చేయండి''

Telugu Murli 01/11/2017

01-11-2017 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - శ్రీమతాన్ని అనుసరించి స్వచ్ఛంగా, శుద్ధంగా అయ్యి ధారణ చేసి మళ్లీ యుక్తి-యుక్తంగా సేవ చేయాలి. అహంకారములోకి రాకూడదు. శుద్ధ అహంకారములో ఉండాలి''
ప్రశ్న:- ఏ ఒక్క మాట కారణంగా బాబా ఇంత గొప్ప విస్తారమైన జ్ఞానాన్ని ఇవ్వవలసి వస్తుంది?
ఉత్తరం:- గీతా రచయిత నిరాకార పరమపిత పరమాత్మ అని ఋజువు చేసేందుకు తండ్రి మీకు ఇంత గొప్ప విస్తారమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు. అన్నిటికంటే పెద్ద తప్పు ఇదే. గీతలో పతితపావనులైన తండ్రి స్థానములో శ్రీ కృష్ణుని పేరు వేసేశారు. ఈ విషయాన్నే నిరూపించాలి. దీని కొరకు అనేక విధాలైన యుక్తులను రచించాలి. తండ్రి మహిమ, శ్రీ కృష్ణుని మహిమ వేరు వేరుగా తెలియజేయాలి.

పాట:- మరణించినా నీ ఒడి (దారి)లోనే, జీవించినా నీ ఒడిలోనే,..........(మర్‌నా తేరీ గలీమె, జీనా తేరీ గలీమే,.......)  
ఓంశాంతి. పిల్లలు పాట విన్నారు. బాబా ''మేము జీవించి ఉండే మరణించేందుకు మీ గడప వద్దకు వచ్చాము'' అని అంటారు. ఎవరి ద్వారము(గడప) వద్దకు? గీతా భగవానుడు కృష్ణుడైతే ఈ విషయాలన్నీ జరగవని మళ్లీ అదే మాట చెప్పవలసి వస్తుంది. శ్రీ కృష్ణుడు సత్యయుగ రాకుమారుడు. శ్రీకృష్ణుడు గీతను వినిపించలేదు. గీతను వినిపించింది పరమపిత పరమాత్మ. ఈ విషయము పైనే మొత్తమంతా ఆధారపడి ఉంది. ఈ ఒక్క విషయాన్ని అర్థము చేసుకుంటే భారతదేశములో ఉన్న శాస్త్రాలన్నీ అసత్యమైనవని ఋజువైపోతుంది. ఇవన్నీ భక్తిమార్గానికి చెందిన శాస్త్రాలు. ఈ శాస్త్రాలలో కర్మకాండ, తీర్థ యాత్రలు, జపము, తపము మొదలైన వాటిని గురించిన కథలు వ్రాయబడి ఉన్నాయి. భక్తి మార్గములో మీరు ఎంతో శ్రమ చేస్తూ వచ్చారు. ఇక్కడ ఆ శ్రమ అవసరమే లేదు. ఇది ఒక్క సెకండు విషయమే. ఈ ఒక్క విషయాన్ని ఋజువు చేసేందుకు కూడా తండ్రి ఎంత జ్ఞానమివ్వవలసి ఉంటుంది! భగవంతుడిచ్చిన ప్రాచీన జ్ఞానమే జ్ఞానము. మొత్తమంతా గీత పైనే ఆధారపడి ఉంది. స్వయం పరమపిత పరమాత్మయే వచ్చి దేవీ దేవతా ధర్మాన్ని స్థాపించేందుకు సహజ రాజయోగాన్ని, జ్ఞానాన్ని నేర్పించారు. ఆ జ్ఞానమిప్పుడు ప్రాయ: లోపమైపోయింది. కృష్ణుడు మళ్లీ వచ్చి గీతను వినిపిస్తారని మనుష్యులు భావిస్తారు. కాని ఇప్పుడు మీరు జ్ఞానసాగరులైన పరమపిత పరమాత్మ వచ్చి వినిపించారని మీరు మంచి రీతిగా ఋజువు చేయాలి. కృష్ణుని మహిమ, పరమపిత పరమాత్ముని మహిమ వేరు వేరుగా ఉన్నాయి. కృష్ణుడు సత్యయుగ రాకుమారుడు. అతడు సహజ రాజయోగము ద్వారా రాజ్యభాగ్యాన్ని పొందాడు. చదువుకునేటప్బుడు నామ-రూపాలు వేరే, రాజ్య భాగ్యము పొందినప్పుడు నామ-రూపాలు వేరే. మొదట పతితముగా ఉండి తర్వాత పావనంగా అయ్యాడని ఋజువు చేసి తెలిపించాలి. కృష్ణుని పతితపావనుడని ఎప్పుడూ అనరు. పతితపావనుడు తండ్రి ఒక్కరు మాత్రమే. ఇప్పుడు ఆ కృష్ణుని ఆత్మనే ఏదైతే నల్లగా అనగా శ్యామముగా అయ్యిందో, అదే ఆత్మ మళ్లీ ఇప్పుడు పతితపావనుని ద్వారా రాజయోగము నేర్చుకుని భవిష్య పావన ప్రపంచానికి రాకుమారునిగా తయారవుతూ ఉంది. ఇది ఋజువు చేసి అర్థము చేయించేందుకు యుక్తులు కావాలి. విదేశస్థులకు ఋజువు చేసి తెలిపించాలి. సర్వ శాస్త్రాల శిరోమణి శ్రీమత్‌భగవద్గీతా మాతయే నంబర్‌ వన్‌. అయితే ఈ గీతా మాతకు జన్మనిచ్చిందెవరు? ఆ తండ్రే స్వయంగా వచ్చి మాతను దత్తత చేసుకుంటారు. అలాగని ఏసుక్రీస్తు బైబిల్‌ను దత్తత చేసుకున్నాడని కాదు. ఏసుక్రీస్తు ఇచ్చిన శిక్షణలను బైబిల్‌గా తయారు చేసి చదువుకుంటూ ఉంటారు. ఇప్పుడు గీతలోని శిక్షణలను ఎవరిచ్చారు? అవన్నీ పుస్తకంగా తయారు చేసుకొని చదువుతూ ఉన్నారు. ఈ విషయము ఎవ్వరికీ తెలియదు. మిగిలిన అన్ని శాస్త్రాలను గురించి వివరంగా తెలుసు. ఈ సహజ రాజయోగ శిక్షణ ఎవరిచ్చారో నిరూపించాలి. ప్రపంచము రోజురోజుకు తమోప్రధానంగా అవుతూ పోతోంది. ఈ ఆలోచనలన్నీ స్వచ్ఛమైన బుద్ధిలోనే కూర్చుంటాయి. ఎవరైతే శ్రీమతాన్ని అనుసరించరో, వారికి ధారణ కూడా జరగదు. మీరు బొత్తిగా అర్థము చేయించలేరని శ్రీమతము చెప్తుంది. ముఖ్యమైన విషయము గీతా భగవానుడు పరమపిత పరమాత్మ అని బాబా వెంటనే చెప్తున్నారు. పతిత పావనులు కూడా వారే. మనుష్యులేమో సర్వవ్యాపి అని అంటారు లేక బ్రహ్మతత్వమని అంటారు. నోటికి ఏది వస్తే అది అర్థము చేసుకోకుండా అనేస్తారు. మొత్తము తప్పంతా గీత నుండే మొదలయ్యింది. ఎందుకంటే గీతా రచయిత కృష్ణుడని అనేశారు.అందువలన అర్థము చేయించేందుకు యుక్తులు రచించవలసి వచ్చింది. బెనారస్‌లో గీతా భగవానుడు శ్రీ కృష్ణుడు కాదని ఋజువు చేసి చెప్పమని గుప్తా గారికి కూడా చెప్పేవారు.

ఇప్పుడు ఢిల్లీలో సమ్మేళనము జరుగుతుంది. అన్ని మతాలకు చెందిన గొప్పవారిని పిలుస్తున్నారు. పిలిపించి శాంతి నెలకొల్పేందుకు ఏ ఉపాయము చేయాలి...... అని ఆలోచిస్తారు. ఇప్పుడు శాంతిని స్థాపన చేయడం వారి చేతిలో లేనే లేదు. ఓ పతితపావనా! రమ్మని పిలుస్తారు. కావున ఈ పతితులు శాంతిని ఎలా స్థాపన చేయగలరు? ఒకవైపు పిలుస్తూనే ఉంటారు. కాని పతితపావనుడు ఎవరో వారికి తెలియదు. రఘుపతి రాఘవ రాజారామ అని అంటారు. కాని అతడు పతితపావనుడే కాదు. తెలియకుండా అసత్యపు పిలుపు పిలుస్తూ ఉంటారు. అయితే అచ్చటికి వెళ్ళి ఇది ఎవరు తెలపాలి? చాలా మంచి పిల్లలుగా ఉండాలి. తమను తాము గొప్ప జ్ఞానులమని భావించేవారు చాలామంది ఉన్నారు. అయితే వారిలో కొద్దిగా కూడా జ్ఞానము లేదు. ఉదాహరణానికి ఎలుకకు ఒక చిన్న పసుపుకొమ్ము లభిస్తే, తానే గొప్ప అని భావించినట్లు జ్ఞానమంతా మాకే తెలుసు అని అనుకుంటారు. అందరూ నెంబర్‌వారుగా ఉంటారు. ఇందులో చాలా మంచి యుక్తులు కావాలి. ఆ యుక్తుల ద్వారా గీతా రచయిత భగవంతుడని ఋజువు అవ్వాలి. ఎవరైతేనేమి అందరూ భగవంతులే కదా అని వారంటారు. భగవానువాచ - 84 జన్మలు పూర్తి చేసి, అంతిమ జన్మలో ఉన్న కృష్ణుని ఆత్మను దత్తత తీసుకుని, బ్రహ్మగా చేసి అతని ద్వారా గీతా జ్ఞానమును ఇస్తున్నాను. ఆ బ్రహ్మనే మళ్లీ ఈ సహజ రాజయోగము ద్వారా సత్యయుగములో మొదటి రాకుమారునిగా అవుతాడు. ఆ జ్ఞానపూరిత వివరణ ఇతరులెవ్వరి బుద్ధిలోనూ లేదు. పిల్లలైన మీలో కూడా ఆ శుద్ధ అహంకారము యదార్థ రీతిలో ఇంకనూ రాలేదు. అనేక ప్రదర్శనీలు మొదలైనవి ఎన్నో చేస్తున్నారు. కాని ఇంతవరకు నిరూపించలేదు. మొదట ఈ తప్పును నిరూపించి తెలపాలి. సర్వ శాస్త్రాల తల్లి-తండ్రి శ్రీమత్‌ భగవద్గీత అని నిరూపించాలి. దాని రచయిత ఎవరు? ఉదాహరణానికి ఏసుక్రీస్తు బైబిల్‌కు జన్మనిచ్చారు. అది క్రైస్తవ ధర్మశాస్త్రము. అయితే బైబిల్‌కు తండ్రి ఎవరు? ఏసుక్రీస్తు. కాని ఏసుక్రీస్తును తల్లితండ్రి అని ఎవ్వరూ అనరు. అచ్చట మదర్‌ (తల్లి) మాటే లేదు. ఇచ్చట మాత్రమే మాతా-పితల విషయం ఉంది. క్రిస్టియన్లు కృష్ణుని ధర్మమంటే ఈర్ష్య చెందారు. వారు ఏసుక్రీస్తును గౌరవిస్తారు(నమ్ముతారు). అయితే గీతను వినిపించిందెవరు? గీత ద్వారా ఏ ధర్మ స్థాపన జరిగింది? ఈ విషయము ఎవ్వరికీ తెలియదు. పతిత పావనుడైన పరమపిత పరమాత్మ యజ్ఞాన్ని రచించారని ఎప్పుడూ అనరు. సృష్టిచక్ర చిత్రము ద్వారా ఈ జ్ఞానాన్ని పరమపిత పరమాత్మ ఇచ్చారని అర్థము చేసుకోగలరు. రాధా-కృష్ణులైతే సత్యయుగములో కూర్చొని ఉన్నారు. వారంతకు వారే జ్ఞానమిచ్చుకోలేరు. జ్ఞానమిచ్చేవారు మరొకరుండాలి కదా. ఎవరో ఒకరు వారిని పాస్‌ చేయించి ఉంటారు కదా. రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునే ఈ జ్ఞానాన్ని ఎవరిచ్చారు? అదృష్టము దానంతదే తయారవ్వదు. అదృష్టాన్ని తయారుచేయు వారు తండ్రి లేక టీచరుగా ఉంటారు. గురువైతే గతినిస్తారు. కాని గతి-సద్గతుల గురించి కూడా అర్థము ఎవ్వరికీ తెలియదు. సద్గతి ప్రవృత్తిమార్గము వారికి చెందింది. గతి అనగా అందరూ తండ్రి వద్దకు వస్తారు. ఈ విషయాలు ఎవ్వరికీ అర్థము కావు. వారైతే భక్తిమార్గపు పెద్ద పెద్ద దుకాణాలు తెరచి కూర్చున్నారు. కాని సత్యమైన జ్ఞాన దుకాణము ఒక్కటి కూడా లేదు. అవన్నీ భక్తిమార్గపు దుకాణాలు. తండ్రి అంటున్నారు - ఈ వేద శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గపు సామగ్రి. ఈ జప-తపాదులతో నేను లభించను. నేను పిల్లలకు జ్ఞానమిచ్చి పావనంగా తయారు చేస్తాను. మొత్తము సృష్టికి సద్గతినిస్తాను, వయా గతిలోకి వెళ్ళి సద్గతిలోకి రావాలి. అందరూ సత్యయుగములోకి రాలేరు. ఇది తయారైన డ్రామా. కల్పక్రితము మీకు నేను ఏమి నేర్పించానో, ఏ చిత్రాలు తయారు చేయించానో ఆ చిత్రాలే ఇప్పుడు కూడా తయారు చేయిస్తున్నాను. ఈ పెద్ద తప్పు ఏదైతే ఉందో, అది ఋజువు అయ్యేందుకు మళ్లీ యుక్తితో చిత్రాలు తయారుచేస్తారు. మూడు ధర్మాల కాళ్ళ పై సృష్టి నిలబడి ఉందని అంటారు. దేవతా ధర్మమనే కాలు విరిగిపోయి ఉంది. అందుకే కదులుతూ ఉంటుంది. మొదట ఒకే కాలి పై ఈ మొత్తము సృష్టి ఫస్ట్‌క్లాస్‌గా నిలబడి ఉంటుంది. ఒకే ధర్మముండేది. దానిని అద్వైత రాజ్యమని అంటారు. తర్వాత మళ్లీ ఆ ఒక్క కాలు అదృశ్యమై మూడు కాళ్ళు వచ్చాయి. వాటిలో శక్తి కొంచెము కూడా ఉండదు. పరస్పరము కొట్లాటలు, పెనుగులాటలు నడుస్తూ ఉంటాయి. దిక్కు ఎవరో, ఆధారము ఎవరో తెలియనే తెలియదు. దిక్కులేని వారుగా, అనాథలుగా అయిపోయారు. ఈ విషయాలు అర్థం చేయించేందుకు చాలా యుక్తులు కావాలి. ప్రదర్శినీలో కూడా ముఖ్యంగా గీతా భగవానుడు కృష్ణుడు కాదని, పరమపిత పరమాత్మ అని, వారి జన్మ స్థానము భారతదేశమని అర్థం చేయించాలి. కృష్ణుడు సాకారుడు కాని వారు(పరమాత్మ) నిరాకారుడు. వారి మహిమ వేరే. ఈ విధంగా యుక్తిగా ఒక కార్టూన్‌ తయారు చేయాలి - దానిని చూచి గీతను వినిపించింది పరమాత్మనే అని, కృష్ణుడిని ఇలా తయారు చేసినవారు పరమాత్మయే అని ఋజువు చేయాలి. జ్ఞానాన్ని బ్రహ్మ పగలు అని, భక్తిని బ్రహ్మ రాత్రి అని అంటారు. ఇప్పుడిది రాత్రి. సత్యయుగాన్ని స్థాపించేదెవరు? బ్రహ్మ ఎక్కడ నుండి వచ్చాడు? సూక్ష్మవతనములోకి కూడా ఎక్కడ నుండి వచ్చాడు? ప్రజాపిత బ్రహ్మను పరమాత్మ దత్తత తీసుకున్నారు. పరమపిత పరమాత్మ రచించిన మొట్టమొదటి సృష్టి సూక్ష్మలోకము. అక్కడ బ్రహ్మను చూపిస్తారు. అక్కడ ప్రజాపిత బ్రహ్మ ఉండరు. అయితే ప్రజాపిత బ్రహ్మ ఎక్కడ నుండి వచ్చాడు? ఈ విషయాలు ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. కృష్ణుని అంతిమ జన్మలో ఇతడిని పరమపిత పరమాత్మ తన రథముగా చేసుకున్నారు. ఇది ఎవరి బుద్ధిలోనూ లేదు. ఇది చాలా పెద్ద క్లాసు(తరగతి). విద్యార్థులు ఎలా ఉంటారో టీచరుకు తెలుస్తుంది. అటువంటప్పుడు తండ్రి అర్థం చేసుకోలేరా? ఇది అనంతమైన తండ్రికి చెందిన అనంతమైన క్లాసు. ఇచ్చటి విషయాలు అతీతమైనవి, సాటిలేనివి. శాస్త్రాలలో ప్రళయము చూపించి గడిబిడి చేసేశారు.

కృష్ణుడు గీతను వినిపించలేదని మీకు తెలుసు. అతడు గీతా జ్ఞానాన్ని విని రాజ పదవిని పొందాడు. గీతా భగవానుడు నిరాకార శివుడని వారి గుణాలు ఫలానివని మీరు నిరూపించి తెలపాలి. ఈ తప్పు కారణంగానే భారతదేశము గవ్వ సమానంగా తయారయ్యింది. ఇప్పుడు పరమపిత పరమాత్మ జ్ఞాన కలశాన్ని మాతల పై ఉంచారు. మాతలే స్వర్గ ద్వారాలను తెరుస్తారు. ఈ విషయాలన్నీ నోట్‌ చేసుకొని అర్థం చేయించాలి. వాస్తవానికి భక్తి గృహస్థుల కొరకే. ఇది ప్రవృత్తి మార్గపు సహజ రాజయోగము. ఋజువు చేసి తెలిపి౦చేందుకే బాప్‌దాదా ఇచ్చటకు వచ్చారు. పిల్లలు యుక్తి యుక్తంగా పని చేయాలి. తండ్రిని ప్రత్యక్షము చేయవలసింది పిల్లలే. సదా హర్షిత ముఖముతో, స్థిరంగా, మస్తీలో(నషాలో) ఉండాలి. పోను పోను ఇటువంటి పిల్లలు తప్పక వెలువడ్తారు. 21 జన్మల వారసత్వాన్ని తండ్రి ద్వారా ఇప్పించువారే బ్రహ్మకుమారులు. కుమారీల మహిమ చాలా గొప్పది. వారిలో ముఖ్యమైనది మమ్మా. బాబా జ్ఞానసాగరులు. ఈ బ్రహ్మ గుప్తముగా ఉన్న తల్లి. ఈ రహస్యాన్ని చాలా కొద్దిమంది మాత్రమే కష్టము మీద అర్థము చేసుకుంటారు. మందిరాలు కూడా ఆ మమ్మాకే ఉన్నాయి. గుప్తముగా ఉన్న వృద్ధ (పెద్ద) మమ్మాకు(బ్రహ్మకు) మందిరాలు లేవు. ఈ మాతా-పితలు కంబైండుగా ఉన్నారు. కృష్ణుడు సత్యయుగ రాకుమారుడు. కృష్ణునిలోకి భగవంతుడు రాజాలడు. గీతా భగవానుని మహిమ వేరే, వారు పతితపావనులు, ముక్తిదాత, మార్గదర్శకుడు..... కనుక పరమాత్ముని మహిమ పూర్తిగా వేరు. ఇరువురూ ఒక్కరే ఎలా అవ్వగలరు? గీతను ఎవరు వినిపించారనేది ముఖ్యమైన విషయము. వేదశాస్త్రాలన్నీ గీతకు పిల్లల వంటివి. మిగిలినదంతా భక్తిమార్గపు సామాగ్రి. జ్ఞాన మార్గములో అవేమీ ఉండవు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ప్రతి పనిని చాలా యుక్తి యుక్తముగా చేయాలి. హర్షితముతో అచలముగా, స్థిరముగా, జ్ఞాన మస్తీలో ఉంటూ తండ్రిని ప్రత్యక్షము చేయాలి.
2. జ్ఞానములోని నూతన విషయాలను, అపూర్వమైన సాటిలేని విషయాలను నిరూపించాలి.

వరదానము:- ''గమ్యాన్ని (లక్ష్యాన్ని) ముందుంచుకొని తండ్రిని అనుసరిస్తూ మొదటి నంబరు తీసుకునే తీవ్ర పురుషార్థీ భవ''
తీవ్రపురుషార్థుల ముందు సదా గమ్యముంటుంది. వారెప్పుడూ అటు, ఇటు చూడరు. మొదటి నంబరులో వచ్చే ఆత్మలు వ్యర్థము కనిపిస్తున్నా వాటిని చూడరు.వ్యర్థ మాటలు వినిపిస్తున్నా వాటిని వినరు. వారు గమ్యాన్ని లేక లక్ష్యాన్ని ముందుంచుకొని బ్రహ్మాబాబాను అనుసరిస్తారు. బ్రహ్మాబాబా స్వయాన్ని కరన్‌హార్‌గా(చేసేవాడిగా) భావించి కర్మలు చేశాడు. ఎప్పుడూ కరావన్‌హార్‌గా (చేయించేవాడిగా) భావించలేదు. అందువలన బాధ్యతను సంభాళిస్తున్నా సదా తేలికగా ఉండినాడు. అలా తండ్రిని అనుసరించండి.

స్లోగన్‌:- ''ఏ మాటలు స్థితిని చెడిపేస్తాయో, వాటిని వింటున్నా విననట్లు ఉండండి''
మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాల
1) ఆత్మ - పరమాత్మకు గల తేడా, భేదము -
ఆత్మ మరియు పరమాత్మ చాలా కాలము వేరుగా ఉండినాయి, సద్గురువు దళారిగా లభించినప్పుడు సుందరమైన కలయిక చేసేశాడు..... అని అంటారు. ఈ మాటలకు యథార్థమైన అర్థమేమంటే ఆత్మలు పరమాత్మ నుండి చాలాకాలము నుండి విడిపోయాయి. చాలా కాలమంటే అర్థము చాలా సమయము నుండి ఆత్మలు పరమాత్మ నుండి విడిపోయాయి. కనుక ఈ శబ్ధము ఆత్మ, పరమాత్మ వేరే వేరని నిరూపిస్తుంది. రెండిటిలో ఆంతరిక భేదముంది. కాని ప్రపంచములోని మనుష్యులకు తెలియని కారణంగా వారు ఈ శబ్ధానికి అర్థము ఎలా చెప్తారంటే ఆత్మ అయిన నేనే పరమాత్మను కాని ఆత్మ పై మాయ ఆవరించినందున తన అసలు స్వరూపాన్ని మర్చిపోయింది, అది తొలగిపోతే మళ్లీ ఆ ఆత్మనే పరమాత్మగా అవుతుంది. కనుక వారు ఈ అర్థముతో ఆత్మ, పరమాత్మ నుండి వేరని చెప్తారు. ఇంకా కొంతమంది ఆత్మనైన నేనే పరమాత్మను కాని ఆత్మ స్వయాన్ని మర్చిపోయినందున దు:ఖితమైపోయింది, మళ్లీ ఆత్మ ఎప్పుడైతే తనంతకు తాను గుర్తించి శుద్ధమైపోతుందో అది మళ్లీ పరమాత్మతో కలిసి ఒక్కటిగా అయిపోతుంది. కనుక వారు ఈ అర్థముతో ఆత్మను పరమాత్మ నుండి వేరని చెప్తారు. కాని ఆత్మ, పరమాత్మ వేరు వేరని మనకు తెలుసు. ఆత్మ పరమాత్మగా అవ్వలేదని, ఆత్మ పరమాత్మతో కలిసి ఒక్కటిగా అవ్వలేదని అంతేకాక పరమత్మ పై ఏ ఆవరణా ఏర్పడదని మనకు తెలుసు.
2) కర్మ బంధనాలు తెగిపోతేనే మానసిక శాంతిని అనగా జీవన్ముక్త స్థితిని పొందగలరు -
వాస్తవానికి ప్రతి మనిషికి మాకు మానసిక శాంతి లభించాలని తప్పకుండా ఉంటుంది. అందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయితే మనసుకు ఇంతవరకు శాంతి ప్రాప్తి అవ్వలేదు. అందుకు యథార్థమైన కారణమేది? ఇప్పుడు మొదట మనసు అశాంతిగా అయినందుకు మూల కారణమేది అని ఆలోచించాలి. మానసిక అశాంతికి ముఖ్యమైన కారణము - కర్మబంధనంలో చిక్కుకోవడం. ఎంత వరకైతే మనసు ఈ పంచవికారాల నుండి, కర్మ బంధనాల నుండి విడుదల అవ్వదో అంతవరకు మనుష్యులు అశాంతి నుండి విడుదల అవ్వలేరు. ఎప్పుడైతే కర్మబంధనాలు తెగిపోతాయో అప్పుడు మానసిక శాంతి అనగా జీవన్ముక్త స్థితిని ప్రాప్తి చేసుకోగలరు. అయితే ఈ కర్మ బంధనాలు ఎలా తెగిపోవాలో ఆలోచించాలి. వాటి నుండి విడిపించేవారు ఎవరు? ఏ మనుష్యాత్మ అయినా వేరే ఏ మనుష్యాత్మనూ విడుదల చేయించలేరు. ఈ కర్మ బంధనాల లెక్కాచారాన్ని తెంచేవారు కేవలం ఒక్క పరమాత్మ మాత్రమే. చివరికి వారే ఈ జ్ఞాన యోగ బలముతో కర్మబంధనాల నుండి విడిపిస్తారు. అందుకే పరమాత్మను సుఖదాత అని అంటారు. నేను ఆత్మను, అసలు నేను ఎవరి సంతానాన్ని? నా అసలు గుణము ఏది? అనే జ్ఞానము ఎంతవరకు లేదో అంతవరకు కర్మబంధనాలు తెగిపోవు. ఎప్పుడైతే ఈ జ్ఞానము బుద్ధిలోకి వస్తుందో అప్పుడు కర్మబంధనాలు తెగిపోతాయి. ఇప్పుడు ఈ జ్ఞానము మనకు పరమాత్మ ద్వారానే ప్రాప్తిస్తుంది అనగా పరమాత్మ ద్వారానే కర్మబంధనాలు తెగిపోతాయి.

Friday, 3 November 2017

Telugu Murli 19/10/2017

19-10-2017 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - తండ్రికి సహాయకులై నూతన ప్రపంచము కొరకు అందరిచే పురుషార్థము చేయించండి - ఎలాగైతే స్వయం నాలెడ్జ్‌ఫుల్‌గా తయారయ్యారో, అలా ఇతరులను కూడా తయారు చేస్తూ ఉండండి ''
ప్రశ్న:- పిల్లలైన మీరు ఇప్పుడు ఏ స్మృతిలో ఉండాలి? స్మృతి చేసే అద్భుతము ఏది?
సమా:- ఇప్పుడు మీకు లభించిన బీజము, వృక్షముల జ్ఞానము ఏదైతే ఉందో, ఆ జ్ఞానము స్మృతిలో ఉండాలి. ఈ స్మృతి ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అయిపోతారు - స్మృతి చేసే చమత్కారము ఇదే. తండ్రి పిల్లలకు స్మృతిని ఇప్పిస్తున్నారు - పిల్లలూ! జ్ఞాపకం వచ్చిందా మీరు అర్ధకల్పము చాలా భక్తి చేశారు. ఇప్పుడు నేను మీకు భక్తికి ఫలం ఇచ్చేందుకు వచ్చాను. మీరు మళ్లీ వైకుంఠానికి యజమానిగా అవుతారు. ఎలాగైతే తండ్రి మధురమో - అలా తండ్రి జ్ఞానము కూడా మధురమే. ఆ జ్ఞానాన్ని స్మరణ చేసి స్మరిస్తూ - స్మరిస్తూ సుఖం పొందాలి.
పాట:- మేలుకోండి, ప్రేయసులారా! మేలుకోండి,........... ( జాగ్‌ సజనియా జాగ్‌,..............)

ఓంశాంతి. మధురాతి మధురమైన పిల్లలు పాట విన్నారు. నేడు దీపమాల(దీపావళి), దీపమాల అని కొత్త యుగాన్ని అంటారు. సత్యయుగంలో ఏ దీపావళి పండుగను జరుపుకోరు ఎందుకంటే అక్కడ అందరి ఆత్మ రూపీ జ్యోతి వెలిగే ఉంటుంది. మనము క్రొత్త ప్రపంచంలో రాజ్య భాగ్యం తీసుకునే పురుషార్థము శ్రీమతం అనుసారంగా చేస్తున్నామని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మీరు త్రికాలదర్శులుగా అయ్యారు. త్రికాలదర్శి అని పాస్ట్‌, ప్రజెంట్‌, ఫ్యూచర్‌(భూత, వర్తమాన, భవిష్యత్తు) తెలిసిన వారిని అంటారు. మీకిప్పుడు మూడు కాలాల జ్ఞానముంది కనుక మీరు ఇతరులకు కూడా అర్థం చేయించాలి. స్వయం మీరు కూడా ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు. అలా ఇతరులను కూడా తయారు చేయాలి. గత చరిత్ర-భూగోళము గురించి తెలియడం ద్వారా భవిష్యత్తులో ఏమి జరుగుతుందో కూడా తెలుసుకున్నారు. భవిష్యత్తు తెలియడం ద్వారా భూత, వర్తమానాలు కూడా తెలుసుకుంటారు - దీనినే నాలెడ్జ్‌ఫుల్‌ అని అంటారు. కలియుగము గతించిపోయింది, ఇప్పుడిది సంగమ యుగము. భవిష్యత్తులో మళ్లీ సత్యయుగము, త్రేతా యుగము రావాలి. కనుక పిల్లలైన మీరు ఈ చక్రాన్ని అర్థం చేసుకున్నారు, క్రొత్త ప్రపంచములోకి వెళ్ళేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు, బాబాకు సహాయకులై ఇతరులతో కూడా పురుషార్థం చేయించే పనిలో ఉన్నారు. తండ్రి అపురూపమైన వారు. మీరు కూడా అపురూపమైన పిల్లలు ఎందుకంటే 5 వేల సంవత్సరాల తర్వాత కలిశారు. కనుక ప్రేయసులను అలంకరించి క్రొత్త ప్రపంచములోకి తీసుకెళ్ళేందుకు తండ్రి వచ్చారు. పిల్లల బుద్ధిలో పైన ఉన్న మూలవతనము, సూక్ష్మవతనాల జ్ఞానముంది. ధర్మస్థాపకులు ఎవరెవరు ఎప్పుడు ఎలా పై నుండి వచ్చి ధర్మస్థాపన చేస్తారో పిల్లలకు తెలుసు, తండ్రి నాలెడ్జ్‌ఫుల్‌గా చేశారు. వారిని మోస్ట్‌ బిలవెడ్‌(అత్యంత ప్రియమైనవారు) అని అంటారు. మధురాతి మధురమైనవారు ఎంత మధురమో మీకు తెలుసు. వారి మహిమ అపారము, వారి వారసత్వం కూడా అపరం అపారమే! దాని పేరే స్వర్గము, హెవెన్‌, పారడైజ్‌, బహిశ్త్‌. పరమాత్మను గాడ్‌ఫాదర్‌, దు:ఖహర్త-సుఖకర్త అని అంటారు. కనుక వారిని ఎంతగా స్మృతి చెయ్యాలి! కానీ డ్రామా అనుసారం వారు గుర్తుకు రారు. ఈ పాట ఎంత బాగుంది! ఇంట్లో 3-4 రికార్డులు తప్పకుండా ఉండాలి. ఈ రికార్డులు కూడా తండ్రి గుర్తును తెప్పిస్తాయి. నూతన దైవీ ప్రపంచ స్వరాజ్యం అనగా ఇప్పుడు ఆత్మకు రాజ్యం లభిస్తోందని బ్రాహ్మణులకు మాత్రమే తెలుసు. లౌకిక తండ్రి ద్వారా ఏదైతే వారసత్వం లభిస్తుందో అది పరమాత్మ ద్వారా లభించిందని అనరు. తండ్రి నుండి రాజ్యం తీసుకొని మళ్లీ పోగొట్టుకున్నామని మీకు తెలుసు. ఇప్పుడు మళ్లీ తీసుకుంటున్నారు. సత్యయుగంలో తెల్లగా ఉండేవారు మళ్లీ నల్లగా అయ్యారు. శ్యామ సుందరుడని పాడ్తారు కూడా. శ్యామముగా(నల్లగా) ఉండేవాడు - ఇప్పుడు సుందరంగా తయారు చేసేందుకు సద్గురువు లభించారు. ఇప్పుడు సద్గురువు మరియు గోవిందుడు ఇరువురూ నిలబడి ఉన్నారు. మళ్లీ గురువా మీది బలిహారము అని అంటారు. మీరు కృష్ణునిగా అవుతున్నారు. ఇలా తయారవుతున్న పిల్లలైన మీదే బలిహారము. కృష్ణుడు గోవులను మేపాడు అని వారంటారు. ఇంకా బ్రహ్మ గురించి కూడా వారికి గోశాల ఉండేదని అంటారు. అయితే గోశాల కృష్ణునిదీ కాదు, బ్రహ్మదీ కాదు. గోశాల శివబాబాది.

ఇప్పుడు పిల్లలైన మీరు పండుగల రహస్యం కూడా అర్థం చేసుకున్నారు. దీపమాల సత్యయుగంలో ఉంటుందని మీకు తెలుసు. అక్కడ జ్యోతి వెలిగి ఉంటుంది. మీది 21జన్మల దీపమాల. ఇక్కడ ప్రతీ సంవత్సరం జరుపుకుంటారు. ఈ రోజు జరుపుకుంటారు, రేపు దీపము ఆరిపోతుంది. ఒకవేళ సత్యయుగంలో జరుపుకున్నా కారొనేషన్‌(సింహాసనాధిరోహణ రోజును) జరుపుకుంటారు, ఆ రోజున బాణసంచా కాలుస్తారు. ఇక్కడైతే పైసా విలువ చేసే బాణసంచా కాలుస్తారు. వీటి ద్వారా ప్రమాదాలు కూడా జరుగుతాయి. అక్కడైతే గొప్ప కారోనేషన్‌ అవుతుంది. ఇక్కడ రాజ్యపదవి లభిస్తే ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. కాని ఈ రాజ్యపదవిలో సుఖము లేదు. ఇది భ్రష్ఠాచారీ (అవినీతి) ప్రపంచము, అది శ్రేష్ఠాచారీ ప్రపంచము. తండ్రి చెప్తారు - చూడండి, మిమ్ములను ఎంత వివేకవంతులుగా చేస్తున్నానో చూడండి. తండ్రిని త్రిలోకనాథుడని అంటారు. మూడు లోకాలకు యజమానిగా అవ్వరు. వారిలో మూడు లోకాల జ్ఞానముంది. మిమ్ములను వైకుంఠానికి యజమానిగా చేస్తారు. మరి మీకు ఎంత సంతోషం ఉండాలి! మీరు అర్ధకల్పం భక్తి చేశారు. ఇప్పుడు తండ్రి లభించారు. ఇప్పుడు తండ్రి స్మృతిని ఇప్పిస్తున్నారు - స్మరించండి, స్మరించండి,....... అని అంటారు, ఎవరిని? తండ్రిని, తండ్రి రచన యొక్క జ్ఞానాన్ని, బీజాన్ని, మరియు వృక్షాన్ని. ఈ స్మృతి ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అయిపోతారు. చూశారా,...... స్మృతి చేసే చమత్కారము, ఎటువంటి వారి నుండి ఎటువంటి వారిగా తయారు చేస్తుంది! దీనిని స్పిరిచ్యుయల్‌ నాలెడ్జ్‌(ఆధ్యాత్మిక జ్ఞానము) అని అంటారు. ఆత్మలకు తండ్రి ఎవరైతే ఉన్నారో వారు జ్ఞానాన్ని వినిపిస్తారు. గీతలో కృష్ణుని పేరు వేసేశారు. కాని తండ్రి మీకు జ్ఞానమునిచ్చి తమ కంటే ఉన్నతంగా తయారుచేస్తారు. మీరు వైకు౦ఠానికి యజమానిగా అవుతారు. ఎలాగైతే ఆ చదువు చదువుతూ, మేము బ్యారిష్టర్‌గా అవుతామని బుద్ధిలో ఉంటుందో, అలాగే మేము భికారుల నుండి రాకుమారులుగా అవుతామని మళ్లీ మహారాజులుగా అవుతామని మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి టీచరు రూపంలో చదివిస్తున్నారు, లౌకికంలో కొడుకు 5 సంవత్సరాలు తండ్రి వద్ద ఉంటాడు. తర్వాత టీచరు వద్దకు వెళ్తాడు, వృద్ధాప్యంలో గురువును ఆశ్రయిస్తాడు. ఇక్కడైతే తండ్రికి చెందినవారిగా అయ్యారు. తండ్రి, టీచరు రూపంలో శిక్షణనిస్తారు, అంతేకాక సద్గతినిచ్చేందుకు వెంట తీసుకెళ్తారు. ఆ గురువు తన వెంట తీసుకెళ్ళడు. తానే ముక్తిలోకి వెళ్ళలేడు. వారు యాత్రకు తీసుకెళ్తారు. మీరూ మార్గదర్శకులే, వారూ మార్గదర్శకులే. కాని అది పనికిమాలిన రాయి-రప్పల యాత్ర. ఇప్పుడు మీకు ఈ జ్ఞానం ఉంది. కనుక మీకు సంతోషం ఉండాలి. ఇది విద్యార్థి జీవితము. మరి ఎందుకు మర్చిపోవాలి? కాని మాయ ఆ సంతోషాన్ని ఉండనీయదు. ఎందుకంటే కర్మాతీత అవస్థ అంతిమంలో వస్తుంది. స్మృతి లబ్ధా అని అంటారు కదా. స్మరించి, స్మరించి సుఖం పొందు, అక్కడ క్లేశం(దు:ఖము) ఉండదు. దానిని జీవన్ముక్తి అని అంటారు. ఎలాగైతే తండ్రి మధురమైన వారో అలా తండ్రి జ్ఞానం కూడా మధురమైనది. బాబా మహిమ అపరం అపారము అనగా ఆవలి తీరం లభించదు(అంతు చిక్కదు). ఇలా భక్తిలో అంటారు. మీరు ఇలా అనలేరు ఎందుకంటే మీకు మొత్తం జ్ఞానమంతా లభించింది. మీరు చాలా మధురంగా తయారవ్వాలి. నాలో ఏ వికారమూ లేదు కదా, ఎవరి అవగుణాన్ని చూడటం లేదు కదా? అని స్వయాన్ని చూసుకోండి. చాలా మధురమైన దృష్టి కలిగి ఉండాలి. బాబాకు ఎంతమంది పిల్లలున్నారు! వారికి అందరి పైనా మధురమైన దృష్టి ఉంది కదా! మీరు కూడా అలా మంచి దృష్టిని ఉంచుకోవాలి. రాధా-కృష్ణులకు, లక్ష్మీ నారాయణులకు గల సంబంధమేమిటో మనుష్యులకు తెలియదు కనుక చిత్రాలు కూడా తయారుచేశారు. చిన్నతనంలోని రాధా-కృష్ణులు, స్వయంవరం తర్వాత లక్ష్మీ నారాయణులుగా అవుతారు. తండ్రి వచ్చి, '' పిల్లలూ, మీరు దేవతలుగా ఉండేవారు '' అని స్మృతినిప్పిస్తున్నారు. దేవతలుగా ఉండేవారమని పిల్లలు చెప్తారు. బ్రాహ్మణ దేవీ దేవతాయ నమ: అని అంటారు. బ్రాహ్మణులు ఇలా అంటారు కాని బ్రాహ్మణ, దేవత, క్షత్రియ అనే మూడు ధర్మాలు స్థాపన చేస్తారని తెలియదు. కనుక బ్రాహ్మణుల తండ్రి - బ్రహ్మ మరియు శివుడు. తండ్రి సాధారణ రూపంలో వస్తారు. ఈ రథము నిశ్చితమైనది. ఇది భాగ్యశాలీ రథము.

మనుష్యులు దీపావళి రోజున లక్ష్మిని ధనం కోరేందుకు ఆహ్వానిస్తారు. ఇంతకుముందు మీరు కూడా వేడుకునేవారు. ఇప్పుడు మీరు లక్ష్మీ-నారాయణులుగా అవుతున్నారు. ఇక్కడైతే బిక్షమే భిక్షాన్ని అడుక్కుంటారు. పుత్రుని ఇవ్వు, ధనం ఇవ్వు అంటూ కేకలు పెడ్తారు. సత్యయుగంలో అలా యాచించరు. శివబాబా పిల్లల భండారాలన్నీ నిండుగా చేస్తారు. తండ్రి అయితే స్వర్గాన్ని రచిస్తారు. నరకాన్ని ఎంతమాత్రం రచించరు. మనలను స్వర్గవాసులుగా తయారు చేసేందుకు ఇప్పుడు బాబా నరకంలోకి వచ్చారు. అందరూ పతితులుగానే ఉన్నారు. మేము నరకవాసులమని వారికి తెలియదు. ఎవరైతే స్వర్గవాసులుగా ఉండేవారో, వారు ఇప్పుడు నరకవాసులుగా అయ్యారు. ఇప్పుడు మళ్లీ స్వర్గవాసులుగా అవుతున్నారు. ఈ బ్రహ్మాబాబా శివబాబాకు అకాలసింహాసనం ఇతడిలో అకాలమూర్తి అయిన పరమాత్మ వచ్చి కూర్చుంటారు. ఆత్మ కూడా అకాలమూర్తియే. ఆత్మకు సింహాసనం ఈ భృకుటి. మస్తకం పై తిలకం దిద్దు చిహ్నము కూడా ఉంది, ఈ రోజుల్లో ఎద్దులకు కూడా తిలకం దిద్దుతారు. కనుక ఈ భృకుటి బ్రహ్మ మరియు శివబాబా ఇరువురికీ సింహాసనము. నేను జ్ఞానసాగరుడను కనుక వచ్చి జ్ఞానమునిస్తాను. నాకు ఏమీ అందరి మనసుల గురించి తెలియదు. నేను థాట్‌ రీడర్‌ను కాను. హా..... 'మనసుకు యజమాని' అని అనవచ్చు ఎందుకంటే మనసు అని ఆత్మను అంటారు. కాబట్టి నేను ఆత్మకు యజమానిని, శరీరానికి యజమానిని కాను. నేను యజమానిని అని సాధువులు అంటారు కదా. అయితే నేను అవినాశీ ఆత్మకు యజమానిని ఎందుకంటే నేను స్వయం అవినాశిని. మీరు వినాశీ వస్తువులకు యజమానిగా అవుతారు ఎందుకంటే మీరు ఒక వినాశీ శరీరం వదిలి మరొక శరీరం తీసుకుంటారు. మీరిప్పుడు వైకుంఠంలోకి వెళ్తారు. అందుకే ఈ చదువు చదువుకుంటున్నారు. ఎప్పటి వరకు జీవిస్తామో అప్పటి వరకు తాగాలి అని అంటారు కదా! చదువు ఎప్పుడు పూర్తి అవుతుందో అప్పుడు ఈ శరీరమే విడుదలైపోతుంది. సృష్టిని రచించేందుకు వెళ్ళనా అని పరమాత్మకు సంకల్పం కలిగింది అని అంటారు. కాని ఎప్పుడైతే సమయం వస్తుందో అప్పుడే పాత్ర చేయాలనే ఆలోచన వస్తుంది. ఇక వచ్చి పాత్రను అభినయిస్తారు. తండ్రి చెప్తారు - మీరు మీ పాత్రను ఎలా పోషిస్తారో అలాగే నేను కూడా పోషిస్తాను. కాని నేను జన్మ- మరణాలలోకి రాను. అందుకే నాకు ఇంత మహిమ ఉంది! వైకుంఠానికి కూడా మహిమ ఉంది. సన్యాసులకు సత్యయుగ సుఖం గురించి తెలియదు. అక్కడి సుఖం వారికి లభించనే లభించదు. సత్యయుగం గురించి కూడా అక్కడ కంసుడు ఉండేవాడని విన్నారు కదా. కనుక అక్కడ కూడా సుఖం ఉండదని భావిస్తారు. అందువలన సుఖం కాకిరెట్టతో సమానమని ఇతరులకు కూడా అలాగే వినిపిస్తారు. ఈ విధంగా వినిపించి ఇతరులను కూడా సన్యాసులుగా చేస్తారు. పిల్లలైన మీరైతే స్వర్గ సుఖాలను పొందుతారు. ఇది అంతిమ జన్మ. అందరూ మరణిస్తారు. నేను వచ్చిందే తీసుకెళ్ళేందుకు. అయితే మీరు ఇక్కడే కూర్చొని ఉంటారా? దోమల గుంపు వలె అందరినీ తీసుకెళ్తాను. కనుక మమ్మా-బాబా వలె పురుషార్థం చేసి పదవి తీసుకోవాలి. మీరు బ్రహ్మముఖవంశావళి వారు కదా. సత్యయుగం, త్రేతా యుగంలో ఎంతమంది దేవతలు ఉంటారో ఇప్పుడు బ్రహ్మ ముఖ వంశావళిగా అంతమంది తయారవ్వాలి. అయితే నియమానుసారంగా మాత-పిత కూడా ఉన్నారు మరి సంభాళించేందుకు ఎవరిని నియమించాలి. కొత్త-కొత్త పిల్లలైతే వస్తూ ఉంటారు, చదువు కొనసాగుతూ ఉంటుంది. చివరివరకు వృద్ధి అవుతూనే ఉంటారు. పోషణ చాలా బాగా చేయాలి. వారు తోట యజమాని. సెంటరులో ఉండువారు తోటమాలులు. మాలి మొక్కలను సంభాళించాల్సి ఉంటుంది. ఏ మాలి అయితే సరిగ్గా ఉండరో వారు మొక్కలను ఏం సంభాళన చేస్తారు? మంచి-మంచి తోటను తయారుచేయు మాలిని చూస్తే తోట యజమానికి చాలా సంతోషం కలుగుతుంది. ఎవరెవరు పెద్ద మంచి తోటను తయారు చేశారో చూసేందుకు తోట యజమాని వెళ్తారు. ఎవరెవరు మంచి మాలి అని మీకు కూడా తెలుసు. మంచి మాలీలుగా ఎవరుంటారో వారికి బహుమతి కూడా లభిస్తుంది. మాలీలైన మీ వేతనము కూడా పెరుగుతూ ఉంటుంది.

ఇప్పుడు మీరు మీ గమ్య స్థానాన్ని స్మృతి చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు వాపసు ఇంటికి వెళ్లాలి కనుక ఇంటిని స్మృతి చేయాల్సి ఉంటుంది. స్మృతి చేయకుండా శాంతిధామానికి వెళ్లలేరు. లేకపోతే చెప్పు దెబ్బలు(శిక్ష) చాలా తినాల్సి ఉంటుంది. పదవి కూడా మంచిది పొందలేరు. ఈ సమయంలో ఎవరైతే సూక్ష్మ వతనానికి వెళ్తారో, వారు సేవార్థం వెళ్తారు. మొదటి నంబరులో బాబా సర్వీస్‌ చేస్తారు, సెకండ్‌ నంబరులో మమ్మా, ఎందుకంటే మమ్మా అయితే సెకండ్‌ నంబరులో రావాల్సి ఉంది. మరి పిల్లలైన మీరు కూడా మమ్మా-బాబాను అనుసరించాలి. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తండ్రి సమానంగా చాలా మధురంగా తయారవ్వాలి. అందరినీ మధుర(మంచి) దృష్టితో చూడాలి. ఎవరి అవగుణాన్ని చూడరాదు.
2. గాడ్లీ స్టూడెంట్‌ లైఫ్‌ యొక్క సంతోషంలో ఉండాలి. జీవించినంత కాలం చదువు రోజూ చదువుకోవాలి.

వరదానము:- ''బాప్‌దాదా ఆశల దీపాన్ని వెలిగించి సత్యమైన దీపావళిని జరుపుకునే కులదీపక్‌ భవ''
నాలుగు రకాలైన దీపాలు మహిమ చేయబడ్డాయి : 1. అంధకారాన్ని నశింపజేసి వెలుగునిచ్చే మట్టితో తయారైన స్థూలమైన దీపము 2. ఆత్మ రూపీ దీపము 3. కుల దీపము 4. ఆశల దీపము. మట్టి దీపాన్ని చాలా జన్మలు వెలిగించారు. ఇప్పుడు ఆత్మ రూపీ దీపము సదా వెలిగి ఉండాలి. కుల దీపము ఆరిపోయే ఎటువంటి కర్మా చేయరాదు. బాప్‌దాదా ఆశల దీపం ఆరిపోయే ఎటువంటి నడవడిక ఉండరాదు. కనుక ఇప్పుడు ఇటువంటి కులదీపకులుగా అయ్యి బాప్‌దాదా ఆశల దీపాన్ని వెలిగిస్తూ సత్యమైన దీపావళిని జరుపుకోండి.

స్లోగన్‌:- ''పవిత్రతయే బ్రాహ్మణ జీవితానికి ముఖ్యమైన ఫౌండేషన్‌ (పునాది). భూమి బ్రద్దలైనా ధర్మాన్ని విడనాడకండి.''

Hindi Murli 04/11/2017

04-11-2017 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - ' బాబా ' అని అన్నప్పుడు మీరు ఎంత సుఖమును అనుభవిస్తారో అంత సుఖము భక్తులకు భగవంతుడా ! ఈశ్వరుడా ! అని అన్నప్పుడు అనుభవమవ్వజాలదు''
ప్రశ్న:- లోభవశమైన లౌకిక పిల్లలకు ఉండే ఏ భావము మీకు ఉండదు?
ఉత్తరం:- లోభిష్టులైన లౌకిక పిల్లలు, ఎప్పుడెప్పుడు తండ్రి మరణిస్తాడా? ఎప్పుడెప్పుడు ఆస్తికి మేము యజమానులుగా అవుతామా ......... అని ఆలోచిస్తూ ఉంటారు. పిల్లలైన మీరు అనంతమైన తండ్రి పట్ల ఇటువంటి ఆలోచనలు ఎప్పుడూ చేయలేరు. ఎందుకంటే తండ్రి అశరీరి, ఇచ్చట మీకు అవినాశి తండ్ర్రి ద్వారా అవినాశి వారసత్వము లభిస్తుంది.
పాట:- ఓ ప్రాణి! నీ ముఖము చూసుకో,..............(ముఖడా దేఖ్‌లే ప్రాణీ!.................)
ఓంశాంతి.  ఓంశాంతి ! ఓంశాంతి ! రెండు సార్లు ఇలా అన్నప్పుడు ఒకసారి బాబా (తండ్రి) అంటారు, రెండవసారి దాదా (అన్న) అంటాడు. ఒకరేమో ఆత్మ, రెండవ వారు పరమ-ఆత్మ అనగా పరంధామములో నివసించువారు. అందుకే వారిని పరమ్‌ -ఆత్మ (పరమాత్మ) అని అంటారు. ఇప్పుడు ఆత్మకు, పరమాత్మకు గల సంబంధమేమిటి ? తండ్రి ఒక్కరే కాని పిల్లలు అనేకము. మనుష్యులు వారిని పిలిచేటప్పుడు ఇంగ్లీషులో కూడా ' ఓ గాడ్‌ఫాదర్‌ ' అని అంటారు అనగా వారు తండ్రి అయ్యారు కదా. కేవలం పరమాత్మ లేక ప్రభు, ఈశ్వరా మొదలగు పిలుపులలో ఇంత మజా(ఆనందము) ఉండదు. తండ్రి (బాప్‌) అని అన్నందున సుఖము లభిస్తుంది. పారలౌకిక తండ్రి ఇచ్చేదే సుఖము. అందుకే భక్తిమార్గములో వారిని అంతగా తలంపు చేస్తారు. గాడ్‌ఫాదర్‌ అంటే వారు మన తండ్రి. మనమందరము సోదరులమని కూడా అంటారు. బ్రదర్‌హుడ్‌ (సోదరత్వము ) అని అంటారు. మనమంతా భాయి-భాయి(సోదరులము) అని భారతవాసులు అన్నప్పుడు కూడా వారి ధ్యాస ఆత్మ వైపు వెళ్ళదు, దేహాభిమానములోకి వెళ్ళిపోతారు. మనమంతా ఆత్మలము, పరస్పరము సోదరులమని (భాయి-భాయి) భావించరు. మనందరి తండ్రి ఒక్కరే. ఒకవేళ పరమాత్మ సర్వవ్యాపి అయితే, భాయీ-భాయీ అని అనరు. ఆత్మలమని భావించినందునే భాయి-భాయి అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి సన్ముఖములో కూర్చుని ఉన్నారు. తండ్రి మిమ్ములను చదివిస్తున్నారు. ఇప్పుడు మాకు తండ్రి లభించాడని ఆత్మ అంటుంది. తండ్రి లభించారంటే, సర్వము లభించినట్లే. తండ్రి ద్వారా వారసత్వము లభిస్తుంది.పుత్రుడు జన్మిస్తూనే వారసుడు జన్మించాడని అంటారు. బాబా అని అంటూనే పిల్లల వారసత్వ అధికారము ఋజువైపోతుంది. ఆడపిల్లలు తరచుగా అమ్మ-అమ్మ అని అంటూ ఉంటారు. వారికి సాధారణంగా తల్లి పై చాలా ప్రేమ ఉంటుంది. కుమారుడైతే నాన్న - నాన్న అని అంటూ ఉంటాడు. మగ పిల్లలకు తండ్రి పై ప్రేమ ఎక్కువగా ఉంటుంది. తల్లి నుండి వారసత్వము లభించజాలదు. తండ్రి ద్వారా వారసత్వము లభిస్తుంది. ఇచ్చట ఆత్మలైన మీరందరూ భాయి-భాయి (సోదరులు) అయ్యారు. మీలో ప్రతి ఒక్కరు తండ్రి నుండి వారసత్వము తీసుకుంటున్నారు. తండ్రి ఇచ్చిన శ్రీమతము - ప్రతి ఒక్కరు స్వయాన్ని తండ్రికి(శివబాబా) సంతానంగా భావించి అందరికీ తండ్రి పరిచయమునిస్తూ ఉండాలి. అంతేకాక సృష్టిచక్ర రహస్యాన్ని కూడా అర్థం చేయించాలి. తండ్రి ద్వారానే స్వర్గ వారసత్వము లభిస్తుంది. అనంతమైన తండ్రి అంటున్నారు - మీరు స్వర్గ వారసులుగా ఉండేవారు, మళ్లీ మీరు నరకవాసులుగా ఎలా అయ్యారు? 84 జన్మల చక్రములో ఎలా తిరిగారు? ఈ విషయాలన్నీ వివరంగా విస్తారంగా తెలిపే మాటలు. తండ్రి తన పరిచయమిచ్చారు. ఆ తండ్రి ద్వారా తప్పకుండా సత్యయుగ వారసత్వము లభిస్తుంది. ఎవరికి లభించి ఉంటుంది? ఈ లక్ష్మీనారాయణులకు లభించింది. వారి చిత్రము ఇక్కడ ఉంది. వీరికి తండ్రి వారసత్వము లభించింది. అయితే ఇప్పుడు అది ఎక్కడికి పోయింది? ఇది చక్రాన్ని గురించిన విషయము. ఇప్పుడు మీకు సత్యయుగ వారసత్వము లభిస్తుంది. మళ్లీ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ 84 జన్మలు అనుభవించే తీరాలి. ఇప్పుడు మీలో నంబరువారీ పురుషార్థమనుసారము 84 జన్మల చక్రము బుద్ధిలో ఉంది. అంతేకాక ఇది మీ అంతిమ జన్మ అని కూడా నిశ్చయముంది. 84 జన్మల చక్రములో తిరిగి పూర్తి చేశారు, ఇప్పుడు మీరు వస్తే మీ వెనుక అందరూ వచ్చేస్తారు. పిల్లలైన మీరేమో తండ్రి ద్వారా వారసత్వము పొందారు, రాజయోగము నేర్చుకున్నారు. అందువలన మనము మళ్లీ నూతన ప్రపంచములో రాజ్యపాలన చేసేందుకు వస్తామని మీకు తెలుసు. అచ్చట ఇన్ని ధర్మాలుండవు. అందరూ వాపస్‌ వెళ్ళిపోతారు. మళ్లీ మొట్టమొదట మనమే రావాలి అనగా దేవతల రాజ్యములో(డీటీయిజమ్‌లో) రావాలి. మనము శూద్ర కులము వారిగా ఉండేవారము, ఇప్పుడు బ్రాహ్మణకులము వారిగా అయ్యాము. మళ్లీ సూర్యవంశీ, చంద్రవంశీ కులము వారిగా అవుతాము. మనము బ్రాహ్మణ కులము, సూర్యవంశీ కులము, చంద్రవంశీ కులము ఈ మూడింటి వారసత్వాన్ని ఒకే తండ్రి ద్వారా తీసుకుంటున్నాము. సత్య, త్రేతాయుగాలలో ధర్మస్థాపన చేసేందుకు ఎవ్వరూ రారు. భారతదేశమంతటా ఒకే ధర్మముంటుంది. తర్వాత వెలుపల నుండి ఇస్లామీయులు, బౌద్ధులు మొదలైనవారు వస్తారు. భారతదేశము చాలా ప్రాచీన దేశము, మొదట దేవీదేవతలు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు వారు ఇతర ధర్మములలోకి కన్వర్ట్‌ అయిపోయారు అంటే మారిపోయారు. అనేక భిన్న-భిన్న భాషలున్నాయి. ఉదాహరణానికి యూరోపియన్ల భాష, అమెరికా భాష, ఫ్రాన్స్‌ వారి భాషలు వేరు వేరు. కాని అందరూ క్రైస్తవులే, అలాగే చైనావారిని చూడండి, అందరిదీ ఒకే బౌద్ధ మతము. కాని చైనా భాష వేరే, జపాను భాష వేరే అయితే అందరూ బౌద్ధులే కాని సంఖ్య వృద్ధి చెందినందున భాషలు వేరు వేరుగా అయిపోతాయి. పరస్పరము శత్రువులుగా కూడా అవుతారు. భారతదేశానికి శత్రువులెవ్వరూ లేరు, ఇతర ధర్మాల వారే వచ్చి పోట్లాడ్తారు. వారు పరస్పరము గొడవ పడ్తూ భారతదేశములో కూడా పోట్లాడింపజేస్తారు. లేకుంటే భారతవాసులు పరస్పరములో యుద్ధము చేసుకోవడం ఎప్పుడూ జరగలేదు. లోభ కారణంగా ఇతరులు పోట్లాడింపజేశారు. ఇది కూడా ఆటయే. మనమే విశ్వాధికారులుగా ఉండేవారిమని కూడా భారతవాసులు మర్చిపోయారు. మనకు తండ్రి రాజ్యభాగ్యమును ఇచ్చారని కూడా మర్చిపోయారు. సత్యయుగములో ఈ రాజ్యాన్ని ఎలా పొందామనే జ్ఞానము కూడా ఉండదు. ఈ రాజ్యము ఎలా పొందుతున్నామో ఇప్పుడు మీకు తెలుసు. ఇది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. చాలా సులభమైనదే కాని మనుష్యుల బుద్ధికి తాళము ఎలా వేయబడి ఉందంటే ఈ లక్ష్మీనారాయణులకు రాజ్యము ఎవరు ఎప్పుడు ఇచ్చారో ఎవ్వరికీ తెలియదు. వీరికి పిల్లలు ఎంతమంది ఉండేవారో మొదలైన విషయాలు కొద్దిగా కూడా తెలియదు. సత్యయుగములో లక్ష్మీనారాయణుల రాజ్యము ఉండేది. సత్యయుగము ఆయుష్షు ఎంత? వారు లక్షల సంవత్సరాలని అంటారు. మరి లక్షల సంవత్సరాలలో సింహాసనాలు ఎన్ని మారాయి! ఎంత వృద్ధి జరిగింది! ఎంతమంది మహారాజులు మహారాణులు ఉంటారు? లక్షల సంవత్సరాలలో అయితే లెక్కలేనంత మంది అయ్యి ఉండాలి. సత్యయుగానికి లక్షల సంవత్సరాలు, త్రేతాయుగానికి లక్షలాది సంవత్సరాలు, కలియుగము ఇంకా 40వేల సంవత్సరాలు ఉంటుందని అనేస్తారు. ఈ విషయాలను గురించి ఎవరి బుద్ధీ పని చేయదు. సుదీర్ఘమైన ఆయుష్షు ఇచ్చేశారు. క్రియేటర్‌(సృష్టికర్త), డైరెక్టర్‌(దర్శకులు), సమయము మొదలైన వాటన్నిటిని గురించి తెలిసి ఉండాలి. కాని ఇవన్నీ ఎవ్వరికీ తెలియదు. క్రీస్తుపూర్వము 5 వేల సంవత్సరాల క్రితము భారతదేశము స్వర్గముగా ఉండేదని అంటారు, దేవీ దేవతల(గాడ్‌గాడెస్‌) రాజ్యముండేదని అంటారు. అది ఎన్ని సంవత్సరాలు నడిచింది? ఎలా నడిచింది? మొదలైన విషయాలు కొంచెము కూడా తెలియదు. ఒకవేళ రాధా-కృష్ణులు సత్యయుగములో రాకుమారులు - రాకుమార్తెలుగా ఉండి ఉంటే, వారు కూడా ఎవరో ఒక్కరి ద్వారా ఆ పదవిని పొంది ఉంటారు కదా?ఒకవేళ కృష్ణుడు గీతను వినిపించి ఉంటే ఎప్పుడు వినిపించి ఉంటాడు? ఈ విషయాలన్నీ స్వయంగా తండ్రియే అర్థం చేయిస్తున్నారు. పాఠశాలలో మొదట అల్ఫ్‌, బే(ఓనామాలు) నేర్పుతారు తర్వాత పెద్ద పెద్ద పరీక్షలలో పాస్‌ అవుతారు. మరి ప్రారంభములోనే అభ్యసించే ఓనామాల చదువుకు మరియు తర్వాత చదివే చదువుకు ఎంత తేడా ఉంటుంది? ఇక్కడైనా అంతే. ప్రారంభములో తెలుపుతూ ఉన్న దాని కంటే ఇప్పుడు ఇంకా సహజంగా అర్థము చేయిస్తారు. పోను పోను ఇంకా ఎక్కువ సహజంగా అర్థం చేయిస్తారు. ఎవరైనా క్రొత్తవారు వస్తే మొదట వారిచే ఫారమ్‌ నింపించడం జరుగుతుంది. ఆ తర్వాత పరమపిత పరమాత్మతో వారికి గల సంబంధమేదో అర్థం చేయిస్తారు. వారు అందరికీ తప్పకుండా తండ్రే కదా. ఈ విషయాలు అర్థము చేసుకోగలిగిన వారు మాత్రమే అర్థము చేసుకుంటారు. తండ్రి నుండి తప్పకుండా వారసత్వము తీసుకోవాలనే గట్టి నిశ్చయముండాలి. తండ్రి స్వర్గాన్ని రచిస్తారు, అందువలన వారు తప్పకుండా స్వర్గ వారసత్వమును ఇస్తారు. ఎవరైతే కల్పక్రితము నిశ్చయము చేసుకొని ఉంటారో వారి బుద్ధిలో మాత్రమే కూర్చుంటుంది.

చాలామంది పిల్లలు ఉదయము ఉదయమే నిద్ర లేవ లేకపోవడం మీరు చూస్తున్నారు. 10 - 15 సంవత్సరాల నుండి శ్రమ పడుతున్నా సమయానికి నిదుర లేవలేరు. కనీసము 3-4 గంటలకు నిద్ర లేవండి, భక్తులు కూడా ఉదయమే లేచి ధ్యానము చేస్తారు. హనుమంతుని జపము, శివుని జపము చేస్తారు. అయితే వాటి వలన ఎలాంటి లాభమూ లేదు. కొంతమంది భక్తుల లక్షణాలు ఎంతో బాగుంటాయి కాని వారికి ముక్తి-జీవన్ముక్తులు లభించవు, క్రిందకు దిగిపోయే కళ కలుగుతుంది. లక్ష్మీనారాయణులు ఎవరైతే సత్యయుగములో రాజ్యం చేశారో వారు కూడా రెండవ జన్మలో, మూడవ జన్మలో క్రిందికి వస్తూ పోతారు. దిగజారే కళ ఏర్పడుతూ పోతుంది. అర్ధకల్పము పూర్తి అయిన తర్వాత మళ్లీ వామమార్గము (స్త్రీ, మాంసము,మదిరాలకు వశమయ్యే మార్గము)లోకి వెళ్ళిపోతారు. మళ్లీ భక్తిమార్గము ప్రారంభమవుతుంది. లెక్కలేనన్ని మందిరాలు తయారౌతాయి. ఇప్పుడు కూడా ఎన్ని మందిరాలున్నాయి! కొన్ని మందిరాలు శిథిలమై కూలిపోయాయి కూడా. మందిరాలలో వామమార్గములోకి వెళ్లిన చిత్రాలు కూడా ఉన్నాయి. దుస్తులు మాత్రము దేవతల వలె ఉన్నాయి. వాస్తవానికి వారి డ్రస్సు వేరుగా ఉంటుంది. అవి తర్వాత మారుతూ వచ్చాయి. ఒక్కొక్కరి తలపాగా ఒక్కొక్కలాగా ఉంటుంది. అలాగే వేరు వేరు కిరీటాలు ధరించిన వేరు వేరు చిత్రాలు, నమూనాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్కరి కిరీటము ఒక్కొక్కలాగా ఉంది. సూర్యవంశీ రాజుల వస్త్రధారణ వేరుగా ఉంటుంది. ఇది ఫలానావారి తలపాగా అని బాబా సాక్షాత్కారములో కూడా చూశారు. ద్వారకాధీశుని తలపాగా వంకరగా ఉండేది. డ్రామాలో ఆది నుండి అంత్యము వరకు ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ మళ్లీ అదే విధంగా జరుగుతాయి. మళ్లీ వామమార్గములోకి వెళ్తారు. అందరి మతాలు వేరైపోతాయి. ఆచారాలు, పద్ధతులు వేరైపోతాయి. సూర్యవంశీయులది వేరు, చంద్రవంశీయులది వేరు...... ఇది తయారైన డ్రామా. అది మళ్లీ పునరావృతమవుతుంది.

మనము కూడా మళ్లీ అనంతమైన తండ్రి ద్వారా గతి-సద్గతులను పొందుతామని మీకు తెలుసు. పాత ప్రపంచము వినాశనము అవ్వనున్నది. అనంతమైన తండ్రి రాజయోగము నేర్పిస్తున్నారు. వారు రాజయోగము నేర్పిస్తారని ప్రపంచములోని వారికి తెలియదు. పిల్లలైన మీకు బాగా తెలుసు. మీకు తండ్రి పై చాలా ప్రేమ ఉంది అయితే అందరి ప్రేమ ఒకేలా ఉండజాలదు. అజ్ఞానములో కూడా అందరికీ ఒకే రకమైన ప్రేమ ఉండదు. కొంతమంది లోభవశమై తండ్రి మరణిస్తే ఆస్తి లభిస్తుందని అంటారు..... ఇక్కడ ఈ శివబాబాకు శరీరమే లేదు, బాబా అయితే అవినాశి. ఈ శరీరాన్ని అద్దెకు(లోన్‌గా) తీసుకున్నారు. మనము పూర్తిగా 84 జన్మలు తీసుకున్నామని మీకు తెలుసు. బాబా అయితే పునర్జన్మలను తీసుకోరు, ఈ శరీరములో దివ్యప్రవేశము చేసి వస్తారు. లేకుంటే లక్ష్మీనారాయణుల శరీరములోకి రావాలా? కాని వారు పావన ప్రపంచానికి అధికారులు. ఇది పతిత ప్రపంచము, పతిత శరీరము ఎందుకంటే విషము ద్వారా జన్మిస్తారు. బాబా కల్పక్రితము వలె, నేను సాధారణ శరీరములో ప్రవేశిస్తాను అని అంటారు. నాకు తప్పకుండా అనుభవీ రథము కావాలి. ఎవరైనా మంచి నటులుగా ఉంటే వారికి మంచి బహుమానము లభిస్తుంది. ఈ బాబా రథము కూడా మహిమ చేయబడింది. బ్రహ్మ ద్వారా స్థాపన అని అంటారు. బ్రహ్మను వృద్ధునిగా కూడా చూపిస్తారు. ప్రజాపిత బ్రహ్మ, విష్ణు, శంకరుల రూపాలే వేరు వేరుగా ఉన్నాయి. బ్రహ్మ రూపము పూర్తి ఆక్యూరేట్‌గా(ఖచ్ఛితంగా) ఉంది. తండ్రే స్వయంగా ఇతని పేరు ప్రజాపిత బ్రహ్మ అని పెట్టారు. ఇతడు పూర్తిగా 84 జన్మలు తీసుకున్నాడు. మేమందరమూ పూర్తిగా 84 జన్మలు తీసుకున్నామని మీరు కూడా అంటారు. అందుకే మొట్టమొదట తండ్రితో కలిశాము. మన రాజ్యము మళ్లీ స్థాపనౌతూ ఉంది. ఓ పరమపిత పరమాత్మా! ఓ భగవంతుడా! అని కూడా అంటారు. కనుక భగవంతుడు మన తండ్రి అని తప్పకుండా భావించాలి. కాని సర్వాత్మల తండ్రి నిరాకారుడని మనుష్యులకు అర్థం కాదు. తండ్రి అయినందునే భక్తులందరూ స్మృతి చేస్తారు. ఆత్మలకు ఒకప్పుడు వారి నుండి సుఖము లభించింది అందుకే దు:ఖములో ఉన్నప్పుడు వారినే స్మృతి చేస్తారు. మీరు కూడా అర్ధకల్పము తండ్రిని స్మృతి చేస్తూ వచ్చారు. ప్రారంభములోనే సోమనాథ మందిరము నిర్మించబడ్తుంది, అందువలన తప్పకుండా తండ్రినే స్మృతి చేస్తారు. ఇది తండ్రి మందిరమని వారికి తెలుసు. ఆ తండ్రే వారసత్వమునిచ్చారు. అందుకే మొట్టమొదట మందిరము కూడా తండ్రిదే తయారయ్యింది. మీరిప్పుడు తండ్రికి వారసులుగా అయ్యారు. తండ్రి విశ్వరచయిత, వారి నుండే వారసత్వము లభిస్తుంది. మిగిలిన వారెవరెవరున్నారో వారేమి చేశారు? మనము వారినెందుకు పూజిస్తున్నాము? వారు 84 జన్మలు తీసుకుంటారు. అయితే భక్తి కూడా వ్యభిచారీ భక్తిగా అయ్యే తీరాలి. అర్ధకల్పానికి సరిపోయే సామగ్రి కావాలి. సత్య-త్రేతా యుగాలలో సామగ్రి అవసరముండదు. ఇవన్నీ బుద్ధిలో ధారణ చేసుకోవాలి. వాస్తవానికి ఏమీ వ్రాయనవసరము లేదు. బుద్ధి సంపన్నంగా ఉంటే వెంటనే ధారణ అవుతుంది కానీ ఎవరికైనా వినిపించేందుకు నోట్స్‌ వ్రాసుకుంటారు. పుస్తకాలు మొదలైనవి ఉంచే అవసరము లేదు. మన పుస్తకాలు చివర్లో ఎవరు చదువుతారు? ఇతరుల శాస్త్రాలు చివరిలో కొనసాగుతూ ఉంటాయి. వాటిని చదివే వారుంటారు. మీరైతే చదివే పనే లేదు. ప్రాలబ్ధము లభించింది తర్వాత అర్ధకల్పము వరకు శాస్త్రాలు మొదలైనవేవీ అవసరము లేదు.ఈ జ్ఞానము ప్రాయ: లోపమై పోతుంది. శాస్త్రాలన్నీ సమాప్తమైపోతాయి. అందరికీ ఇద్దరు తండ్రులున్నారని మొట్టమొదట అర్థము చేయించండి. శారీరిక తండ్రైతే ఉన్నారు. శారీరిక తండ్రి కూడా ఆ తండ్రినే స్మృతి చేస్తాడు. దు:ఖములో అందరూ స్మృతి చేస్తారు, సుఖములో ఎవరూ స్మృతి చేయరని గాయనము(దు:ఖ్‌ మే సిమిరన్‌ సబ్‌ కరే, సుఖ్‌ మే కరే న కోయీ.........) చేయబడ్తుంది. ఇది విశేషంగా భారతదేశానికి అన్వయిస్తుంది. తండ్రి కూడా భారతదేశములోనే అవతరిస్తారు, శివజయంతి వస్తుంది. మేము మా తండ్రిగారి జన్మ దినోత్సవము జరుపుకుంటున్నామని మీరంటారు. బ్రహ్మకుమార-కుమారీలు ఉన్నారు కాబట్టి వారి తండ్రి తప్పక వచ్చి ఉంటారు కదా. ఇది శివుని జ్ఞానయజ్ఞము, కావున బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. బ్రహ్మ ఎక్కడ నుండి వచ్చాడు? బ్రహ్మను దత్తత చేసుకున్నారు, మళ్లీ పిల్లలు జన్మిస్తారు. వారు కూడా వీరి ముఖ కమలము ద్వారానే రచిస్తారు. మొట్టమొదట అందరికి తండ్రి పరిచయమునివ్వాలి. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. అమృతవేళనే (ఉదయము ఉదయమే) నిదుర లేచి తండ్రిని ప్రీతితో స్మృతి చేసే అలవాటును పక్కాగా చేసుకోవాలి. కనీసము 3-4 గంటలకు తప్పక నిద్ర లేవాలి.
2.అనంతమైన తండ్రి పై సత్యమైన ప్రేమనుంచాలి. శ్రీమతమును అనుసరిస్తూ సంపూర్ణ వారసత్వాన్ని తీసుకోవాలి.

వరదానము:- ''సర్వ శక్తులతో సంపన్నంగా అయి ప్రతీ శక్తిని కార్యములో ఉపయోగించే మాస్టర్‌ సర్వశక్తివాన్‌ భవ''
ఏ పిల్లలైతే సర్వశక్తులతో సదా సంపన్నంగా ఉంటారో, వారే మాస్టర్‌ సర్వశక్తివంతులు. ఏ శక్తి అయినా సమయానికి పనికి రాకుంటే వారిని మాస్టర్‌ సర్వశక్తివాన్‌ అని అనజాలరు. ఒక్క శక్తి తక్కువగా ఉండినా, అది సమయానికి మోసము చేస్తుంది. ఫెయిల్‌ అయిపోతారు. మా వద్ద సర్వశక్తులు ఉన్నాయి. వాటిలో ఒక శక్తి తక్కువగా ఉంటే నష్టమేముంది? అని అనుకోరాదు. ఒక్క దానిలో ఆటంకముంటుంది, ఆ ఒక్కటే ఫెయిల్‌ చేసేస్తుంది. అందువలన ఒక్క శక్తి కూడా తక్కువగా ఉండరాదు. సమయానికి ఆ శక్తి పనికి వస్తే అప్పుడు మాస్టర్‌ సర్వశక్తివాన్‌ అని అంటారు.

స్లోగన్‌:- ''ప్రాప్తులను మర్చిపోవడమే అలసిపోవడం. అందువలన ప్రాప్తులను సదా ముందుంచుకోండి''