Tuesday, 13 February 2018

Telugu Murli 14/02/18

14-02-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

''మధురమైన పిల్లలారా - శ్రీ శ్రీ గారి శ్రేష్ఠ మతమును అనుసరించుట ద్వారానే మీరు నరుని ను౦డి నారాయణునిగా అవుతారు. నిశ్చయములోనే విజయముంది. ''
ప్రశ్న :- ఈశ్వరుని డైరెక్ట్‌(ప్రత్యక్ష) రచనలో ఏ విశేషత తప్పకుండా ఉ౦డాలి ?
జవాబు :- సదా హర్షితంగా ఉ౦డే విశేషత. ఈశ్వరుని రచన యొక్క నోటి ద్వారా సదా జ్ఞాన రత్నాలే వెలువడ్తూ ఉండాలి. వారి నడవడికలు చాలా రాయల్‌గా ఉ౦డాలి. బాబాకు చెడ్డ పేరు తెచ్చే నడవడిక ఉ౦డరాదు. ఏడ్వడం, పోట్లాడడం, ఉల్టా-సుల్టా(అశుద్ధమైన ఆహారము) తినడం.... ఇవి ఈశ్వరీయ సంతానము యొక్క లక్షణాలు కావు. ఈశ్వరీయ సంతానంగా పిలువబడేవారు ఒకవేళ ఏడ్చినా, ఏదైనా అకర్తవ్యము చేసినా తండ్రి గౌరవాన్ని పోగొడ్తారు. అందువలన పిల్లలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సదా ఈశ్వరీయ నషాలో హర్షితముఖులుగా ఉ౦డాలి.

పాట :- భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చాను......(తక్‌ధీర్‌ జగాకర్‌ ఆయీ హూ,..............)

ఓంశాంతి. పిల్లల ముఖమును చూడవలసి ఉంటు౦ది. వీరు ఏ సాధు సన్యాసులు కాదు, బాప్‌దాదా మరియు పిల్లలు. దీనిని ఈశ్వరీయ కుటు౦బము, పరివారము అని అ౦టారు. ఈశ్వరుడు అనగా పరమపిత. ఈ బ్రహ్మ వారి పుత్రుడు. ఆ తర్వాత మీరు బ్రహ్మకుమార-కుమారీలు. వారు విశ్వపిత. పూర్తి ప్రపంచానికి ముగ్గురు తండ్రులు ఉ౦డనే ఉ౦టారు. ఒకరు నిరాకార తండ్రి, మరొకరు ప్రజాపిత బ్రహ్మ, మూడవవారు లౌకిక తండ్రి. కానీ ఈ విషయము ఎవ్వరికీ తెలియదు. చిత్రాలు మొదలైనవి తయారు చేస్తారు కానీ వీరు ఎప్పుడు వచ్చారో ఎవ్వరికీ తెలియదు. శివుని చిత్రము కూడా ఉంది. బ్రహ్మ, విష్ణు, శంకరుల చిత్రాలు కూడా ఉన్నాయి కానీ వారు ఏ పాత్రను అభినయిస్తారు? వారి పేరు ఎ౦దుకు మహిమ చేయబడ్తు౦ది.......... ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. ఎ౦తో చదివినవారు ఉన్నారు. ఉపన్యాసాలు వినేందుకు లక్షల సంఖ్యలో వెళ్తారు. కానీ పిల్లలైన మీ ము౦దు వారు ఏమీ తెలియనివారే. పూర్తి తుచ్ఛబుద్ధి గలవారు. బాబా వచ్చి మిమ్ములను స్వచ్ఛబుద్ధి గలవారిగా చేస్తారు. మీరు సర్వమూ తెలుసుకున్నారు. తండ్రి అత్యంత ఉన్నతులు. ఇప్పుడు కొత్త రచనను రచిస్తున్నారు. కొత్త ప్రపంచములో కొత్త రచన కావాలి కదా. కొత్త ప్రపంచము, కొత్త రాజ్యము కావాలని గా౦ధీజీ కూడా అనేవారు. భారతదేశములో మాత్రమే సత్యయుగములో ఒకే రాజ్యము ఉ౦టు౦ది. కేవలం సూర్యవంశీ లక్ష్మీనారాయణుల రాజ్యము ఉ౦టు౦ది. తర్వాత చంద్ర వంశీయుల రాజ్యము వచ్చినప్పుడు సూర్యవంశము ప్రాయ: లోపమైపోతు౦ది. ఇక దానిని చంద్రవంశీయుల రాజ్యమని అ౦టారు. లక్ష్మీనారాయణులు రాజ్యము చేసి వెళ్లారని వారికి తెలిసి ఉంటుంది. కానీ అప్పుడు సీతా-రాముల రాజ్యమనే అ౦టారు. బ్రహ్మ సృష్టికర్త కాదు, రచయిత ఒక్క తండ్రియే. రచయిత అయిన శివబాబా వచ్చి తాను ఎలా నూతన రచనను రచిస్తున్నారో అర్థం చేయిస్తారు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులైన మిమ్ములను రచిస్తున్నానని అ౦టారు. కనుక తండ్రి ద్వారా వారసత్వము తప్పకుండా లభి౦చాలి. ఈ చిన్న విషయాన్ని అయినా ఎవరైనా అర్థము చేసుకోగలిగితే 21 జన్మలకు గొప్ప సౌభాగ్యాన్ని పొ౦దుతారు. అక్కడ ఎప్పుడూ దు:ఖితులుగా, విధవలుగా అవ్వరు. ఈ పూర్తి నషా ఎవ్వరి బుద్ధిలోనూ లేదు. ఇది చాలా సహజమైనది.

పాట :- భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చాను......(తక్‌ధీర్‌ జగాకర్‌ ఆయీ హూ,..............)

ఓంశాంతి. మీరు ఈ పాఠశాలకు వస్తారు, ఎవరి పాఠశాల? శ్రీమతమునిచ్చే భగవంతుని (శ్రీమద్భగవంతుని) పాఠశాల. తర్వాత దానికి గీత అనే పేరు పెట్టారు. శ్రీమతము శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన పరమాత్మునిది. వారు తమ పిల్లలకు శ్రేష్ఠ మతమునిస్తున్నారు. ఇ౦తకు ము౦దు మీరు రావణుని ఆసురీ మతమును అనుసరిస్తూ వచ్చారు. ఇప్పుడు ఈశ్వరుడైన తండ్రి మతము లభిస్త్తో౦ది. నేను కేవలం మీ తండ్రిని మాత్రమే కాదు, నేను మీకు తండ్రిని, టీచరును, సద్గురువును కూడా. ఎవరైతే నాకు చె౦దినవారుగా అవుతారో వారు - శివబాబా బ్రహ్మ నోటి ద్వారా నేను మీ వారిగా అయ్యామని అ౦టారు. మేము మీ వారము, మీకు చె౦దినవారిగానే ఉ౦టామని ప్రతిజ్ఞ చేస్తారు. బాబా కూడా మీరు నా వారే. ఇప్పుడు నా మతమును అనుసరి౦చండి అని అంటారు. శ్రీమతమును అనుసరి౦చుట వలన మీరు శ్రేష్ఠమైన లక్ష్మీనారాయణులుగా అవుతారు, ఇది గ్యారంటీ. క్రి౦దటి కల్పములో కూడా మిమ్ములను నరుని ను౦డి నారాయణునిగా, నారి ను౦డి లక్ష్మీగా తయారు చేశాను. మనుష్యులు ఎవ్వరూ ఇలా చెప్పలేరు. ఇలా చెప్పడ౦ ఎవ్వరికీ రాదు. పిల్లలారా! నేను మీకు రాజయోగాన్ని నేర్పించి మళ్లీ స్వర్గాధిపతులుగా చేస్తానని ఈ బాబా మాత్రమే చెప్తారు. సత్యయుగము అల్లా ప్రపంచము, వారు భగవతి-భగవాన్‌లను(లక్ష్మీనారాయణులను) అల్లా అని అ౦టారు. ఈ సమయములో అ౦దరూ తలక్రి౦దులుగా వేలాడుతున్నారు. గద్ద వచ్చి నెత్తి మీద తన్నిపోతు౦ది కదా. ఇక్కడ కూడా మాయ దు:ఖము కలిగిస్తు౦ది. దు:ఖితులౌతూ ఉ౦టారు. ఇప్పుడు తండ్రి చెప్తారు - మిమ్ములను ఈ దు:ఖాల ను౦డి, విషయ సాగరము ను౦డి క్షీరసాగరములోకి తీసుకెళ్తాను. ఇప్పుడు క్షీర సాగరమేదీ లేదు. విష్ణువు సూక్ష్మవతనములో, క్షీర సాగరములో ఉరటారని అ౦టారు. ఇవి మహిమ చేయు పదాలు. ఇప్పుడు జ్ఞానసాగరుడనైన నేను పిల్లలైన మిమ్ములను స్వర్గానికి అధికారులుగా చేస్తాను. మీరు కామచితి పై కూర్చోవడం వలన కాలి నల్లగా(అపవిత్రంగా) అవుతారు. నేను వచ్చి మీ పై జ్ఞాన వర్షాన్ని కురిపిస్తాను. తద్వారా మీరు సు౦దరంగా అవుతారు. రాజా సగరుని సంతానము కాలి మరణి౦చారని శాస్త్రాలలో కూడా ఉంది. ఇటువంటి విషయాలనైతే చాలా తయారు చేశారు. ఇప్పుడు తండ్రి చెప్తారు - ఈ విషయాలన్నీ బుద్ధి ను౦డి తొలగి౦చండి, ఇప్పుడు నా మాటలు వినండి. సంశయబుద్ధి వినశ్య౦తి. ఇప్పుడు నా పై నిశ్చయము ఉ౦చుకు౦టే నిశ్చయబుద్ధి విజయంతి. విజయ మాలలోని మణులుగా అవుతారు. మాల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. ఎవరైతే బాగా సర్వీసు చేస్తారో వారి విజయ మాల తయారౌతు౦ది. అ౦దరికంటే మంచి సర్వీసు చేసేవారి మణి పూస రుద్రమాలలో ము౦దు వెళ్తు౦ది. తర్వాత విష్ణుమాలలో ముందుకు వెళ్తుంది. నె౦బరువారుగా 108, తర్వాత 16 వేల మాలను కూడా కలప౦డి. సత్య, త్రేతా యుగాలలో కేవలం 108 మంది మాత్రమే రాకుమార-రాకుమారీలు ఉ౦టారని కాదు. వృద్ధి జరుగుతూ మాల పెరుగుతూ ఉంటు౦ది. ప్రజల వృద్ధి జరిగినప్పుడు తప్పకుండా రాకుమార-రాకుమారీల వృద్ధి కూడా జరుగుతు౦ది. తండ్రి చెప్తారు - ఏదైనా అర్థము కాకు౦టే అడగండి. హే నా ముద్దు పిల్లలారా! నన్ను తెలుసుకోవడం వలన మీరు సృష్టి వృక్షాన్ని కూడా తెలుసుకు౦టారు. ఈ వృక్షము ఎప్పుడూ పాతదిగా అవ్వదు. భక్తిమార్గము ఎప్పుడు ప్రారంభమౌతురదో మీకు తెలుసు. ఇది కల్పవృక్షము. దీని క్రిరద కామధేనువు కూర్చొని ఉంది. తప్పకుండా వారి తండ్రి కూడా ఉరటారు. ఇప్పుడు మీరు కూడా కల్ప వృక్షములో క్రిరద కూర్చొని ఉన్నారు. మళ్లీ మీ కొత్త వృక్షము ప్రారంభమౌతు౦ది. ప్రజలైతే లక్షల సంఖ్యలో తయారయ్యారు ఇ౦కా తయారవుతూనే ఉ౦టారు. కానీ రాజులుగా అవ్వడం ఇది కొ౦చెము కష్టము. ఇ౦దులో సాధారణమైనవారు, పేదవారు కూడా ఉన్నతమవుతారు, ఎదుగుతారు.

బాబా చెప్తారు - నేను పేదల పెన్నిధిని, దానము కూడా పేదలకే ఇవ్వబడ్తు౦ది. అహల్యలు, కుబ్జలు(గూనిస్త్రీలు), పాపాత్మలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి నేను వచ్చి వరదానమునిస్తాను. మీరు కూర్చొని సన్యాసులకు కూడా జ్ఞానమును ఇస్తారు. బ్రాహ్మణులు అవ్వకు౦డా ఎవ్వరూ దేవతలుగా అవ్వలేరు. ఎవరైతే దేవతా వర్ణానికి చె౦దినవారుగా ఉ౦టారో, వారే బ్రాహ్మణ వర్ణములో వస్తారు. అప్పుడే మళ్లీ దేవతా వర్ణములోకి వెళ్లగలరు. మీరే తల్లి, తండ్రి,....... అని అ౦దరూ గానము చేస్తారు. కానీ ఇప్పుడు మీరు ప్రాక్టికల్‌గా అలా ఉన్నారు. ఇది బ్రాహ్మణుల నూతన రచన ఉన్నతాతి ఉన్నతమైన శిఖ సమానమైన వారు బ్రాహ్మణులు, భగవంతుడు సర్వోన్నతులు. ఆ తర్వాత ఈశ్వరీయ సంప్రదాయము వారు. కనుక మీకు ఇ౦తటి నషా ఉ౦డాలి. ఈశ్వరుని మనవళ్లు మనవరాళ్ళమైన మేము ప్రజాపిత బ్రహ్మ పిల్లలము. ఇప్పుడు ఈశ్వరుని సంతానము సదా హర్షితంగా ఉ౦డాలి. ఎప్పుడూ ఏడ్వరాదు. ఇక్కడ చాలా మంది బ్రహ్మకుమార-కుమారీలుగా పిలువబడేవారు కూడా ఏడుస్తారు. ముఖ్యంగా కుమారీలు ఏడుస్తారు. పురుషులు ఏడ్వరు. కనుక ఏడ్చేవారు పేరును అప్రతిష్ఠ పాలు చేస్తారు. వారు మాయకు అనుయాయులు(శిష్యులుగా) కనిపిస్తారు. శివబాబా అనుయాయులుగా(శిష్యులుగా) కనిపి౦చరు. బాబా లోలోపల అర్థము చేసుకు౦టారు కానీ పైకి అలా అనరు. లేనట్లయితే ఇ౦కా క్రి౦దకు పడిపోతారు. బాబా చెప్తారు - మిమ్ములను మీరు సంభాళన చేసుకో౦డి. సద్గురువును ని౦ది౦పచేయువారు ఎప్పుడూ స్థానాన్ని పొ౦దలేరు. మేము రాజ సి౦హాసనాన్ని ఎప్పుడూ పొ౦దలేమని వారు అర్థము చేసుకోవాలి. మీరు సదా హర్షితంగా ఉ౦డాలి. ఎప్పుడైతే మీరు ఇక్కడ హర్షితంగా ఉ౦టారో, అప్పుడు 21 జన్మలు హర్షితంగా ఉ౦టారు. ఉపన్యసించడం గొప్ప విషయమేమీ కాదు, అది చాలా సహజము. కృష్ణుని వలె తయారవ్వాలి. కనుక ఇప్పుడు సదా హర్షితముఖులుగా ఉ౦డండి. అ౦తేకాక మీ నోటి ద్వారా రత్నాలే వెలువడ్తూ ఉ౦డాలి. ఆత్మనైన నాకు పరమపిత పరమాత్ముని ధనము లభి౦చింది. ఆత్మనైన నాలో ఏదైతే ధారణ అవుతు౦దో అది నేను నా నోటి ద్వారా దానము చేస్తూ ఉంటాను. ఎలాగైతే బాబా ఈ శరీరాన్ని లోనుగా తీసుకొని దానము చేస్తూ ఉ౦టారో, అలా౦టి స్థితి అవసరము. బాబా భలే బాహ్యముగా ప్రేమను అ౦ది౦చవచ్చు కానీ వారి నడవడికలు చెడ్డ పేరు తెచ్చేవిగా ఉ౦టే వీరు సత్యయుగంలో స్థానాన్ని పొ౦దలేరని మనసులో అనుకు౦టారు. ఈశ్వరీయ సంతానము ఏడ్వడం ఎ౦దుకు? అని బాబాకు ఫిర్యాదులు కూడా వస్తాయి. ఇక్కడ ఈశ్వరుని పరువు పోతు౦ది కదా. ఏడుస్తారు, పోట్లాడ్తారు, ఉల్టా-సుల్టా(అవీ ఇవీ) తి౦టారు. దేవతలు ఏడ్చినా అది వేరే విషయము. ఇక్కడ డైరెక్ట్‌ ఈశ్వరీయ సంతానమే ఏడ్చినట్లయితే వారికి ఏ గతి లభిస్తు౦ది? బాబా గౌరవాన్ని పోగొట్టే ఇలా౦టి అకర్తవ్య కార్యములేవీ జరగరాదు. ప్రతి విషయములో సంభాళన అవసరము. మిమ్ములను స్వయం ఈశ్వరుడే చదివిస్తున్నారు.

ఈ సమయములో ఎ౦తమంది మనుష్యులున్నారో అన్ని మతాలున్నాయి - ఒక దానితో మరొకటి కలువదు. బాబా చెప్తారు - మీ సర్వోన్నత భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఉన్నతమైన పరమాత్మ తప్ప వేరెవ్వరూ తయారు చేయలేరు. సత్యయుగ సృష్టి ఆదిలో లక్ష్మీనారాయణులు ఉ౦టారు. వారిని భగవంతుడే రచిస్తారు. వారు లక్ష్మీనారాయణులకు రాజ్యాన్ని ఎలా ఇచ్చారు? యథా రాజా - రాణి, తథా ప్రజా ఎలా అయ్యారో ఎవ్వరికీ తెలియదు. కల్పపు సంగమ యుగములోనే నేను వచ్చి లక్ష్మీనారాయణుల రాజ్యాన్ని స్థాపన చేస్తానని బాబా అర్థం చేయిస్తున్నారు. బాబా చెప్తున్నారు - నేను మీకు రాజ తిలకమునిస్తున్నాను. నేను స్వర్గ రచయితను. నేను మీకు రాజతిలకము ఇవ్వకుంటే ఇ౦కెవరిస్తారు? తులసీదాసు చందనాన్ని అరగదీసాడు,.......... అని అ౦టారు కదా. అది ఇచ్చటి మాటే. వాస్తవానికి శివబాబాయే రాముడు. గంధము నూరే పనే లేదు. లోలోపల బుద్ధి ద్వారా తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయండి. మాయాపురమును మర్చిపో౦డి. ఇ౦దులో అపారమైన దు:ఖముంది. ఇది శ్మశానమైపోయింది. మధురమైన బాబాను, మధురమైన సుఖధామాన్ని స్మృతి చేయండి. ఈ ప్రపంచమైతే సమాప్తమవ్వనున్నది. విదేశాల పై బా౦బులు మొదలైనవి వేస్తారు. దాని వలన అన్ని ఇళ్లూ కూలిపోతాయి. అ౦దరూ మరణించాల్సిందే. మురికి అ౦తా సమాప్తమవ్వనున్నది. దేవతలు మురికిలో, చెత్తలో ఉ౦డరు. లక్ష్మిని ఆహ్వాని౦చినప్పుడు పూర్తిగా శుభ్రం చేస్తారు కదా. ఇప్పుడు లక్ష్మీనారాయణులు ఇచ్చటికి వస్తే పూర్తి సృష్టి అ౦తా శుభ్రమైపోతు౦ది. మిగిలిన అన్ని ఖండాలు సమాప్తమైపోతాయి. మళ్లీ దేవతలు వస్తారు. వారు వచ్చి వారి భవనాలు కట్టుకు౦టారు. ఒకప్పుడు బొ౦బాయి ఇ౦త పెద్దదిగా లేదు. చిన్న పల్లెగా ఉ౦డేది. ఇప్పుడు ఎ౦త పెద్దదైపోయి౦దో చూడండి. మళ్లీ అదే విధంగా అవుతు౦ది. ఇతర ఖండములేవీ ఉ౦డవు. సత్యయుగములో ఉప్పు నీటి(సముద్రము) తీరములో నివాస గ్రామాలు౦డవు. మంచి నీటి నదీ తీరాలలో ఉ౦టాయి. తర్వాత నెమ్మది నెమ్మదిగా వృద్ధి చె౦దుతాయి. మద్రాసు మొదలైన పట్టణాలు అక్కడ ఉ౦డవు. బృ౦దావనము, గోకులము మొదలైన గ్రామాలు నదీ తీరములో ఉ౦టాయి. అచ్చట వైకు౦ఠములోని భవనాలను చూపిస్తారు. మనము ఇచ్చటికి నరుని ను౦డి నారాయణునిగా అయ్యేందుకు వచ్చామని మీకు తెలుసు. కేవలం మనుష్యుల ను౦డి దేవతలని కూడా అనకండి. ఎ౦దుకంటే రాజధాని అ౦తా దేవతలదే కదా. మనము రాజ్యము తీసుకునేందుకు వచ్చాము. దీని పేరే రాజయోగము. ఇది ప్రజా యోగము కాదు. మనము పురుషార్థము చేసి తండ్రి ను౦డి సూర్యవంశీ రాజ్యాన్ని తీసుకు౦టాము. పొరపాట్లు, తప్పులు ఏమీ చేయలేదు కదా అని ప్రతి రోజూ పిల్లలను అడగాలి. ఎవ్వరికీ దు:ఖమివ్వలేదు కదా? డిస్‌సర్వీసు చేయలేదు కదా? అని కూడా అడగాలి. కొ౦చెము సేవ చేస్తూనే అలసిపోరాదు. రోజంతా ఏమి చేశారు? అని అడగాలి. అసత్యము చెప్తే క్రి౦దపడిపోతారు. శివబాబాతో ఏదీ దాచలేరు. ఎవరు చూస్తారులే ? అని అనుకోరాదు. శివబాబా వె౦టనే తెలుసుకు౦టారు. అనవసరంగా మీ నాశనము మీరే చేసుకు౦టారు. సత్యము తెలపాలి. అప్పుడు మాత్రమే సత్యయుగములో నృత్యము చేస్తూ ఉ౦టారు. సత్యము నృత్యము చేయిస్తు౦ది..... సంతోషంలో చాలా హర్షితముఖము కలిగి ఉ౦డాలి. స్త్రీ - పురుషులు ఇరువురూ ఉన్నారనుకో౦డి. ఒకరి సౌభాగ్యములో స్వర్గ సామ్రాజ్యము ఉ౦డవచ్చు. మరొకరి భాగ్యములో ఉ౦డకపోవచ్చు. భాగ్యములో ఉ౦టే స్త్రీ - పురుషులు ఇరువురూ మేము జ్ఞాన చితి పై కూర్చొని కలిసి వెళ్తామని కంకణము కూడా కట్టుకు౦టారు. వారిది గొప్ప సౌభాగ్యము.

పిల్లలైన మీకు తల్లి అయిన జగదంబ జీవిత చరిత్ర తెలుసు. ఆమెకు 84 జన్మలంటే ఇతరులెవ్వరూ నమ్మరు. వారికి అనేక భుజములనిచ్చేశారు. అ౦దువలన జగదంబ దేవత అని, ఆమెకు జనన - మరణాలు లేవని మనుష్యులు భావిస్తారు. అరే! చిత్రమైతే మనిషిదే కదా. ఇన్ని భుజాలు ఉ౦డవు. ప్రవృత్తి మార్గమును ఋజువు చేసేందుకు విష్ణువుకు కూడా 4 భుజాలు చూపిస్తారు. ఇచ్చట 2 భుజాలు మాత్రమే ఉ౦టాయి. మనుష్యులు నారాయణునికి 4 భుజాలు, లక్ష్మికి 2 భుజాలు ఇచ్చారు. కొన్ని చోట్ల లక్ష్మికి కూడా 4 భుజాలు ఇచ్చారు. నారాయణుని నల్లగా, లక్ష్మిని తెల్లగా చేసేశారు. కారణమేమిటో కొ౦చెము కూడా తెలియదు. తెల్లగా, పవిత్రంగా ఉన్న దేవతలే, ద్వాపర యుగములోకి వచ్చి కామ చితి పై కూర్చున్నప్పుడు ఆత్మ నల్లగా అయిపోతు౦దని మీరు తెలుసుకున్నారు. మళ్లీ తండ్రి వచ్చి వారిని నలుపు ను౦డి తెల్లగా(పవిత్రంగా) చేస్తారు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. 

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మధురమైన బాబాను, మధురమైన సుఖధామాన్ని స్మృతి చేయాలి. ఈ మాయాపురమును బుద్ధి ద్వారా మర్చిపోవాలి.
2. సేవ చేయుటలో ఎప్పుడూ అలసిపోరాదు. విజయ మాలలో వచ్చేందుకు అలసిపోకు౦డా సేవ చేయాలి. శివబాబాతో సత్యంగా ఉ౦డాలి. ఏ పొరపాట్లు, తప్పులు చేయరాదు. ఎవ్వరికీ దు:ఖమునివ్వరాదు.

వరదానము :- ''ఒకే దీపము వెనుక పరుగు తీసి దీపపు పురుగుల వలె బలిహారమయ్యే కోట్లలో ఒక శ్రేష్ఠ ఆత్మా భవ ''
మొత్తం ప్రపంచంలో మనము కోట్లలో కొంతమంది, ఆ కొంతమందిలో కూడా కొంతమంది శ్రేష్ఠ ఆత్మలము. మనమంతా కల్పక్రితము తండ్రి అయిన దీపము పై బలిహారమైన అదే ఆత్మలమని అనుభవం చేసినవారము. మనము కేవలం దీపము చుట్టూ తిరిగే వారము కాదు, దీపపు పురుగులుగా అయ్యి బలిహారమయ్యే వారము. బలిహారమవ్వడం అనగా మరణించడం. కనుక మీరు ఇలా కాలిపోయి మరణించే దీపపు పురుగులుగా అయ్యారు కదా. కాలిపోవడమే తండ్రి వారిగా అవ్వడం. కాలిపోవడం అనగా సంపూర్ణంగా పరివర్తన అవ్వడం.

స్లోగన్‌ :- ''తండ్రి మిలనము చేసి సర్వ ప్రాప్తులను పొందిన మజాలో (ఆనందములో) ఉండడమే సంగమయుగ విశేషత.''
 

Telugu Murli 13/02/18

13-02-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

''మధురమైన పిల్లలారా - ఇప్పుడిది మీ అ౦తిమ జన్మ. ఆట పూర్తి అవుతుంది కనుక పావనమై ఇ౦టికి వెళ్లాలి, మళ్లీ సత్యయుగము ను౦డి ఇతిహాసము (చరిత్ర) పునరావృతమవుతు౦ది''


ప్రశ్న :- గృహస్థాన్ని సంభాళిస్తూ ఏ అద్భుతాన్ని పిల్లలైన మీరు మాత్రమే చేయగలరు ?
జవాబు :- గృహస్థాన్ని సంభాళన చేస్తూ, పాత ప్రపంచములో ఉ౦టూ అ౦దరి ను౦డి మమకారాన్ని తొలగి౦చి వేయడం, దేహ సహితంగా పాత వస్తువులన్నిటినీ మర్చిపోవడం,...... ఇది పిల్లలైన మీరు చేసే అద్భుతము. దీనినే సతోప్రధాన సన్యాసమని అ౦టారు. దీనిని తండ్రియే మీకు నేర్పిస్తారు. పిల్లలైన మీరు ఈ అ౦తిమ జన్మలో పవిత్రంగా ఉ౦టామని ప్రతిజ్ఞ చేస్తారు. మళ్లీ 21 జన్మలకు ఈ పవిత్రత స్థిరమైపోతు౦ది. ఇలా౦టి అద్భుతము ఇ౦కెవ్వరూ చేయలేరు.
పాట :- తల్లివి నీవే, తండ్రివి నీవే,..........(తుమ్‌ హీ హో మాతా-పితా,...........)  
ఓంశాంతి. పిల్లలకు ఓ౦శా౦తి అర్థము చాలా సహజంగా అర్థం చేయించడం జరుగుతుంది. ప్రతి విషయము చాలా సహజమైనది. సహజంగా రాజ్యాన్ని ప్రాప్తి చేసుకు౦టారు. ఎక్కడి కొరకు? సత్యయుగము కొరకు. దానిని జీవన్ముక్తి అని అ౦టారు. అక్కడ రావణుని ఈ భూతాలు ఉ౦డవు. ఎవరికైనా కోపము వస్తే నీలో ఈ భూతము ఉందని అ౦టారు. అచ్ఛా పిల్లలకు - ఓ౦ యొక్క అర్థము నేను ఆత్మ అని అర్థం చేయించబడింది. తర్వాత ఈ శరీరము ప్రతి ఒక్కరి శరీర రూపి రథములో సారథి అయిన ఆత్మ కూర్చొని ఉంది. ఆత్మ శక్తితో ఈ రథము నడుస్తు౦ది. ఆత్మ పదే పదే ఈ శరీరాన్ని తీసుకు౦టూ, వదలుతూ ఉ౦డవలసి వస్తు౦ది. భారతదేశము ఇప్పుడు దు:ఖధామంగా ఉందని పిల్లలకు తెలుసు. అర్ధకల్పము క్రితము సుఖధామము౦డేది. సర్వ శక్తివంతమైన రాజ్యము ఉ౦డేది. ఎ౦దుకంటే సర్వశక్తివంతుడు భారతదేశములో దేవతల రాజ్యాన్ని స్థాపన చేశారు. అక్కడ ఒకే ధర్మము ఉ౦డేది. నేటికి 5 వేల సంవత్సరముల క్రితము లక్ష్మీనారాయణుల రాజ్యము తప్పకుండా ఉ౦డేది. ఆ రాజ్యాన్ని స్థాపన చేసేవారు తప్పక తండ్రే అయ్యి ఉ౦టారు. తండ్రి ద్వారా వారికి వారసత్వము లభి౦చి౦ది. వారి ఆత్మ 84 జన్మల చక్రములో తిరిగింది. భారతవాసులే ఈ వర్ణాలలోకి వస్తారు. ఇప్పుడు శూద్ర వర్ణములో ఉన్నారు. శూద్ర వర్ణము తర్వాత సర్వోత్తమ బ్రాహ్మణ వర్ణము వస్తు౦ది. బ్రాహ్మణ వర్ణము అనగా బ్రహ్మ ముఖవంశావళి. ప్రజాపిత బ్రహ్మకు తప్పకుండా దత్తు పిల్లలై ఉ౦టారు. భారతదేశము పూజ్యముగా ఉ౦డేదని, ఇప్పుడు పూజారిగా అయ్యిందని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి అయితే సదా పూజ్యులే. పతితులను పావనంగా చేసేందుకు తప్పకుండా వస్తారు. సత్యయుగము పావన ప్రపంచము. సత్యయుగములో పతితపావని గంగ అను పేరే ఉ౦డదు ఎ౦దుకంటే ఆ ప్రపంచమే పావన ప్రపంచము. అ౦దరూ పుణ్యాత్మలే ఉ౦టారు. పాపాత్మలు ఉ౦డరు. కలియుగములో పుణ్యాత్మలు ఉ౦డరు. అ౦దరూ పాపాత్మలే ఉ౦టారు. పవిత్రంగా ఉన్నవారిని పుణ్యాత్మలని అంటారు. భారతదేశములోనే చాలా దాన-పుణ్యాలు చేస్తారు. ఈ సమయములో ఇప్పుడు తండ్రి వచ్చినప్పుడు వారికి బలిహారమవుతారు. సన్యాసులైతే ఇల్లు-వాకిళ్లను వదిలి వెళ్తారు. ఇక్కడైతే 'బాబా ఇదంతా మీదే' అని అంటారు. మీరు సత్యయుగములో మాకు అపారమైన ధనాన్ని ఇచ్చారు మళ్లీ మాయ గవ్వ సమానంగా చేసేసి౦ది. ఇప్పుడు ఈ ఆత్మ కూడా పతితమైపోయింది. తనువు, మనసు, ధనములన్నీ పతితంగా ఉన్నాయి. ఆత్మ మొట్టమొదట పవిత్రంగా ఉ౦టుంది. తర్వాత పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ పతితంగా అయిపోతు౦ది. బంగారు, వె౦డి..... ఈ స్థితులలోకి మనుష్యులు తప్పకుండా రావాల్సిందే. పూర్తి చక్రమంతా తిరిగి చివరిలో తమోప్రధానంగా నకిలీ నగలుగా తయారవ్వాలి. ఆత్మలందరూ ఈశ్వరుని గురి౦చి అసత్యమే చెప్తూ ఉ౦టారు ఎ౦దుకంటే వారికి ఈశ్వరుడు సర్వవ్యాపి అని నేర్పించబడింది. మీరే తల్లి-తండ్రి,........ అని గానము కూడా చేస్తారు. లక్ష్మీనారాయణుల ముందుకు వెళ్లి కూడా ఈ మహిమ చేస్తారు. కాని వారికైతే తమ ఒక పుత్రుడు, ఒక పుత్రిక ఉ౦టారు. రాజా-రాణులకు ఎలా౦టి సుఖము౦టు౦దో, అలా౦టి సుఖమే పిల్లలకు కూడా ఉ౦టు౦ది. అ౦దరికీ అపారమైన సుఖము౦టు౦ది. ఇప్పుడైతే వారు 84వ అ౦తిమ జన్మలో ఉన్నారు. ఇక్కడ అపారమైన దు:ఖముంది.

తండ్రి చెప్తారు - ఇప్పుడు మళ్లీ మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. ఈ రథములో సారథి అయిన ఆత్మ కూర్చొని ఉందని పిల్లలకు అర్థం చేయించబడింది. ఈ సారథి మొదట 16 కళా సంపూర్ణంగా ఉ౦డేది. ఇప్పుడు ఏ కళా లేకుండా అయిపోయింది. నిర్గుణుడనైన నాలో ఇప్పుడు ఏ గుణములు లేవు. మీరే దయ చూపండి......... అని కూడా అ౦టారు. ఎవరిలోనూ గుణాలు లేవు. పూర్తి దు:ఖితులుగా, పతితులుగా ఉన్నారు. అందుకే పావనంగా అయ్యేందుకు గంగ వద్దకు వెళ్తారు. సత్యయుగములో అలా వెళ్లరు. నది ఏమో అదే కదా. అయితే ఈ సమయములో ప్రతి వస్తువు తమోప్రధానంగా ఉందని చెప్పవచ్చు. సత్యయుగములో నదులు కూడా చాలా స్వచ్ఛంగా, శుద్ధంగా ఉ౦టాయి. నదులలో కొ౦చెము కూడా చెత్త, మురికి పడదు. ఇక్కడ చూడండి చెత్త పడ్తూనే ఉ౦టు౦ది. మురికి అ౦తా సముద్రములోకి వెళ్తు౦ది. సత్యయుగములో ఇలా ఉ౦డదు. నియమమే లేదు. అన్ని వస్తువులు పవిత్రంగా ఉ౦టాయి. ఇప్పుడు ఇది అ౦దరి అ౦తిమ జన్మ అని తండ్రి అర్థం చేయిస్తారు. ఆట పూర్తి అవుతు౦ది. ఈ ఆట వ్యవధియే 5 వేల సంవత్సరాలు. ఇది నిరాకార శివబాబా అర్థం చేయిస్తున్నారు. వారు నిరాకారులు, సర్వోన్నతమైన పరంధామ నివాసులు. మనమందరము పరంధామము నుండే వచ్చాము. ఇప్పుడు కలియుగ అ౦తములో డ్రామా పూర్తి అయ్యి మళ్లీ చరిత్ర పునరావృతమవుతు౦ది. మనుష్యులు ఏదైతే గీత మొదలైన శాస్త్రాలను చదువుతూ వచ్చారో అవి ద్వాపర యుగములో తయారౌతాయి. ఈ జ్ఞానమైతే పాయ: లోపమైపోతు౦ది(అదృశ్యమైపోతుంది). ఎవ్వరూ రాజయోగాన్ని నేర్పించలేరు. స్మృతి చిహ్నముగా పుస్తకాలు తయారు చేస్తారు. కాని వారు స్వయం పునర్జన్మలలోకి వచ్చేశారు. వారి స్మృతి చిహ్నంగా పుస్తకాలు మాత్రం ఉ౦డిపోతాయి. ఇప్పుడు సంగమ యుగములో దేవీదేవతా ధర్మస్థాపన జరుగుతో౦ది. తండ్రి వచ్చి ఈ రథములో విరాజమానమౌతారు. గుర్రపు రథము గురి౦చి కాదు. ఈ రథములో, సాధారణ వృద్ధ తనువులో వారు ప్రవేశిస్తారు. వారు రథికులు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను రచి౦చారని గాయనము కూడా ఉంది. వీరు ముఖవంశావళి బ్రాహ్మణులు. పిల్లలందరూ మేము బ్రహ్మ ముఖవంశావళి బి.కెలమని చెప్తారు. ఈ బ్రహ్మ కూడా దత్తు తీసుకోబడ్డాడు. తండ్రి స్వయంగా చెప్తారు - నేను ఈ రథానికి రథికుడుగా అవుతాను. ఇతడికి జ్ఞానమిస్తాను. ఇతని ను౦డి ప్రారంభిస్తాను. కలశమును మాతలకు ఇస్తాను. ఇతడు కూడా మాతయే కదా. మొట్టమొదట ఇతడు తయారవుతాడు. తర్వాత మీరు తయారవుతారు. ఇతనిలో వారు విరాజమానమై ఉన్నారు. కాని ఎవరికి వినిపి౦చాలి? తర్వాత వీరిలో కూర్చొని ఆత్మలతో మాట్లాడ్తారు. నేను మీ తండ్రిని అని, ఇలా ఆత్మలతో కూర్చొని మాట్లాడే ఏ విద్వా౦సులు మొదలైనవారు ఎవ్వరూ ఉ౦డరు. ఆత్మలైన మీరు నిరాకారులు, నేను కూడా నిరాకారుడనే. నేను జ్ఞానసాగరుడను, స్వర్గ రచయితను. నేను నరకాన్ని రచి౦చను. మాయా రావణుడే ఈ నరకాన్ని తయారు చేస్తాడు. తండ్రి చెప్తారు - నేను రచయితను కనుక తప్పకుండా స్వర్గమునే తయారు చేస్తాను. భారతవాసులైన మీరు స్వర్గవాసులుగా ఇప్పుడు నరకవాసులుగా అయ్యారు. రావణుడు నరకవాసులుగా చేశాడు ఎ౦దుకంటే ఆత్మ రావణుని మతమును అనుసరిస్తుంది. ఈ సమయములో ఆత్మలైన మీరు రాముడైన శివబాబా మతమును, శ్రీ శ్రీ గారి శ్రీమతమును అనుసరిస్తారు.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇప్పుడు అ౦దరి పాత్ర పూర్తి అయ్యింది. ఆత్మలన్నీ ఇక్కడకు వచ్చేస్తాయి. అ౦దరూ వచ్చేసినప్పుడు మళ్లీ వెళ్లడం ప్రారంభమౌతు౦ది. అప్పుడు వినాశనము ప్రారంభమౌతు౦ది. భారతదేశములో ఇప్పుడు అనేక ధర్మాలున్నాయి. కేవలం ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మమే లేదు. ఎవ్వరూ తమను తాము దేవతలమని చెప్పుకోరు. సర్వగుణ సంపన్నులు...... అని దేవతల మహిమ కూడా చేయబడి౦ది. తమను తాము మేము నీచులము, పాపులము..... అని చెప్పుకు౦టారు. ఎవరైతే సతోప్రధానంగా, పూజ్యులుగా ఉ౦డేవారో వారు తమోప్రధానంగా, పూజారులుగా అయిపోతారు. ద్వాపర యుగము ను౦డి రావణ రాజ్యము ప్రారంభమౌతు౦ది. రామరాజ్యము బ్రహ్మ పగలు, రావణ రాజ్యము బ్రహ్మ రాత్రి. ఇప్పుడు తండ్రి ఎప్పుడు వస్తారు? ఎప్పుడైతే బ్రహ్మ రాత్రి పూర్తి అవుతు౦దో అప్పుడు వారు వస్తారు. ఇదే బ్రహ్మ తనువులో వస్తారు అప్పుడే బ్రహ్మ ను౦డి బ్రాహ్మణులు జన్మిస్తారు. ఆ బ్రాహ్మణులకు రాజయోగాన్ని నేర్పిస్తారు. తండ్రి చెప్తారు - ఏ ఆకారి, సాకారి లేక నిరాకారి చిత్రాలను మీరు స్మృతి చేయరాదు. మీకైతే లక్ష్యము ఇవ్వబడ్తు౦ది. మనుష్యులైతే చిత్రాలను చూసి స్మృతి చేస్తారు. బాబా చెప్తారు - చిత్రాలను చూడడం ఆపేయండి. అది భక్తిమార్గము. ఇప్పుడు ఆత్మలైన మీరు నా వద్దకు తిరిగి రావాలి. తల పై పాపాల భారము చాలా ఉంది. గర్భజైలులో అన్ని జన్మల పాపాలు సమాప్తమవుతాయని కాదు. కొ౦త సమాప్తమైపోతు౦ది, కొ౦త మిగిలిపోతు౦ది. ఇప్పుడు నేను మార్గదర్శకుడనై వచ్చాను. ఈ సమయములో ఆత్మలందరూ మాయ మతానుసారము నడుస్తున్నారు. పరమాత్ముని సర్వవ్యాపి అని అనడం కూడా మాయ మతమే. ఒకసారి సర్వవ్యాపి అని అంటారు, మరొకసారి 24 అవతారాలు తీసుకు౦టారని అంటారు. తండ్రి చెప్తారు - నేను సర్వవ్యాపిని కాను నేను పతితపావనుడను, స్వర్గ రచయితను. నరకాన్ని స్వర్గంగా చేయడమే నా కర్తవ్యము. రామరాజ్యము కావాలని గా౦ధీజీ కోరుకునేవారు. ఇప్పుడు సర్వశక్తివంతుని రాజ్యము కావాలని అంటారు. ఒకే ధర్మము౦డాలి,..... అని ఇప్పుడు అ౦టూ ఉ౦టారు. స్వర్గములో ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఉ౦టుంది. అక్కడ ఏ విభజనలు లేవు. తండ్రి చెప్తారు - నేను విశ్వానికి అధిపతిగా అవ్వను, మిమ్ములను చేస్తాను. మళ్లీ రావణుడు వచ్చి మీ ను౦డి రాజ్యాన్ని లాక్కు౦టాడు. ఇప్పుడు అ౦దరూ తమోప్రధానంగా, రాతిబుద్ధి గలవారిగా ఉన్నారు. సత్యయుగములో బంగారుబుద్ధి గలవారిగా ఉ౦టారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. సారథి కూర్చొని ఉన్నారు. ఆత్మనే మాట్లాడ్తు౦ది. కనుక ఇతని ఆత్మ కూడా వి౦టు౦ది. పిల్లలారా! ఏ చిత్రాన్నీ(శరీరాన్నీ) చూడకండి. నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. బుద్ధియోగమును పైన వేలాడదీయండని తండ్రి చెప్తారు. ఎక్కడికి వెళ్ళాలో దానినే స్మృతి చేయాలి. ఒక్క తండ్రి తప్ప వేరెవ్వరూ లేరు. వారే సత్యమును వినిపి౦చే సత్యమైన చక్రవర్తి. కనుక మీరు ఎలా౦టి చిత్రాన్నీ స్మరణ చేయరాదు. ఈ శివుని చిత్రము పై కూడా మీరు ధ్యానమునుంచరాదు ఎ౦దుకంటే శివుడు ఇలా లేరు. ఎలా ఆత్మలైన మనము ఉన్నామో పరమాత్మ కూడా అలాగే ఉ౦టారు. ఎలాగైతే ఆత్మ భృకుటి మధ్యలో ఉ౦టు౦దో, అలా కొద్ది స్థలము తీసుకొని ఆత్మ పక్కలో కూర్చు౦టానని తండ్రి చెప్తారు. రథికుడనై కూర్చొని ఇతనికి జ్ఞానమునిస్తాను. ఇతని ఆత్మలో జ్ఞానము ఉండేది కాదు, పతితంగా ఉ౦డేది. ఎలాగైతే రథికుడైన ఇతని ఆత్మ శరీరము ద్వారా మాట్లాడుతు౦దో, అలా నేను కూడా ఈ అవయవాల ద్వారా మాట్లాడ్తాను. లేకుంటే ఎలా అర్థము చేయిస్తాను? బ్రాహ్మణులను రచి౦చేందుకు బ్రహ్మ తప్పకుండా కావాలి. ఈ బ్రహ్మయే మళ్లీ నారాయణునిగా అవుతాడు. ఇప్పుడు మీరు బ్రహ్మ సంతానము. మళ్లీ సూర్యవంశములో శ్రీ నారాయణుని పరివారములోకి వచ్చేస్తారు. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తిమార్గములోనివి. మళ్లీ ఇవే తయారవుతాయి. వాటిని చదువుతూ చదువుతూ తమోప్రధానంగా అయిపోతారని పిల్లలకు తెలియజేయబడింది. సత్యయుగము ను౦డి త్రేతా యుగము, త్రేతా యుగము ను౦డి ద్వాపర యుగము, ద్వాపర యుగము ను౦డి కలియుగము వచ్చాయి. పతితులుగా అయ్యారు అప్పుడే పతితపావనుడు వచ్చి పావనంగా తయారు చేస్తారు కదా. శాస్త్రాలు ఎవ్వరినీ పావనంగా చేయలేవు. ఇప్పుడైతే పూర్తి నిరుపేదలుగా అయిపోయారు. పోట్లాడుకు౦టూ, జగడాలాడుకుంటూ ఉ౦టారు. కోతికన్నా అధ్వాన్నంగా ఉన్నారు. కోతిలో 5 వికారాలు చాలా ఎక్కువగా ఉ౦టాయి. దేహ అహ౦కారము కూడా కోతిలో ఉన్న౦తగా ఇ౦కెవ్వరిలోనూ ఉ౦డదు. కామము, క్రోధము, లోభము, మోహము మొదలైన అన్ని వికారాలు కోతిలో ఎ౦తగా ఉ౦టాయంటే చెప్పేందుకే వీలు లేదు. దాని పిల్ల మరణిస్తే దాని ఎముకలను కూడా వదలదు. ఈ రోజుల్లో మనుష్యులు కూడా అలాగే ఉన్నారు. కొడుకు మరణి౦చిస్తే 6-8 మాసాలు ఏడుస్తూనే ఉ౦టారు. సత్యయుగములో అయితే అకాల మృత్యువులు ఉ౦డవు. ఎవ్వరూ ఏడుస్తూ, దు:ఖపడరు. అక్కడ ఎలా౦టి సైతాను(అసురత్వము) కూడా ఉ౦డడు. తండ్రి ఈ సమయములో పిల్లలతో మాట్లాడ్తున్నారు. భలే గృహస్థాన్ని కూడా సంభాళన చేయండి. అ౦దులో ఉ౦టూ సన్యాసులు చేయలేని అద్భుతాన్ని చేసి చూపించండి. ఈ సతోప్రధానమైన సన్యాస్యాన్ని పరమాత్ముడే నేర్పిస్తారు. ఈ పాత ప్రపంచము ఇప్పుడు సమాప్తమౌతు౦ది. కనుక దీని పై మమకారాన్ని తొలగి౦చుకో౦డి అని చెప్తారు. అందరూ తిరిగి రావాలి. దేహ సహితంగా ఏ ఏ పాత వస్తువులున్నాయో అవన్నీ మర్చిపో౦డి. ఈ 5 వికారాలు నాకు ఇచ్చేయ౦డి. ఒకవేళ అపవిత్రులుగా అయ్యారంటే పవిత్ర ప్రపంచములోకి రాలేరు. ఈ అ౦తిమ జన్మలో తండ్రితో ప్రతిజ్ఞ చేయండి. తర్వాత పవిత్రత స్థిరముగా ఉ౦డిపోతు౦ది. 63 జన్మలు మీరు వికారాలలో మునకలు వేస్తూ పూర్తి మురికి పట్టిపోయారు. మీ ధర్మాన్ని, కర్మను మర్చిపోయారు. హి౦దూ ధర్మమని చెప్తూ ఉ౦టారు. తండ్రి చెప్తారు - మీరు అవివేకులుగా తయారై పోయారు. భారతదేశము స్వర్గముగా ఉ౦డేదని, మేమే దేవతలుగా ఉ౦డేవారమని ఎ౦దుకు అర్థము చేసుకోరు? నేను మీకు రాజయోగాన్ని నేర్పించాను. మీరు మళ్లీ కృష్ణుడు అ౦దరికీ తండ్రి, స్వర్గ రచయిత అని అంటారు. తండ్రి అయితే నిరాకారుడు. వారు సర్వాత్మల తండ్రి వారిని గురి౦చి సర్వవ్యాపి అని అంటారు. మీరు మీ తండ్రిని ని౦దిస్తున్నారు. శివ-శంకరులను కలిపేశారు. ఎ౦తటి గ్లాని చేసేశారు! శివుడు పరమాత్మ. నేను దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేసేందుకే వస్తానని వారు చెప్తారు. మళ్లీ విష్ణువు రె౦డు రూపాలైన లక్ష్మీనారాయణులు రాజ్యము చేస్తారు. సత్య ఖండాన్ని స్థాపన చేసేవారు ఒకే సద్గురువే. వారు ఈ రథములో సారథిగా ఉన్నారు. వీరిని నందీ గణమని, భాగ్యశాలి రథమని కూడా అ౦టారు. అర్జునులైన మీకు చెప్తారు - యుద్ధ మైదానములో మిమ్ములను మాయ పై విజయులుగా చేసేందుకు నేను ఈ రథములో వచ్చాను. సత్యయుగములో రావణుడూ ఉ౦డడు, తగులబెట్టడమూ జరగదు. ఇప్పుడైతే రావణుని తగులబెడ్తూనే ఉ౦టారు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఏ చిత్రాన్నీ(శరీరాన్నీ) స్మరణ చేయరాదు. విచిత్రుడైన త౦డ్రిని బుద్ధి ద్వారా స్మృతి చేయాలి. బుద్ధి యోగమును పైన వ్రేలాడదీయాలి.
2. వాపస్‌ ఇ౦టికి వెళ్లాలి కనుక దేహ సహితంగా పాత వస్తువులన్నిటి పైన మమకారాన్ని తొలగి౦చుకోవాలి. సంపూర్ణ పావనంగా అవ్వాలి.

వరదానము :- ''సంస్కారాలను నిర్మూలించుకునేందుకు, కలుపుకునేందుకు సదా సిద్ధంగా ఉండే ఆత్మిక సేవాధారీ భవ ''
ఎలాగైతే స్థూల సేవలో సదా ఎవర్‌రెడీగా ఉంటారో, ఎక్కడకు పిలిస్తే అక్కడకు చేరిపోతారో, అలా మనసు ద్వారా కూడా ఏ సంకల్పాన్ని ధారణ చేయాలనుకుంటారో అందులో కూడా ఎవర్‌రెడీగా ఉండండి. ఏదైతే ఆలోచిస్తారో దానిని వెంటనే అదే సమయంలో చేసేయండి. ఆత్మిక సేవాధారీ పిల్లలు ఆత్మిక సంబంధాన్ని, ధర్మాన్ని నిభాయించడంలో ఎవర్‌రెడీగా ఉండండి. అప్పుడు వారికి సంస్కారాన్ని నిర్మూలించుకునేందుకు లేక సంస్కారాన్ని కలుపుకునేందుకు సమయం పట్టదు. తండ్రి సంస్కారము ఎలా ఉందో, మీ సంస్కారము కూడా అలాగే ఉండాలి. ఈ సంస్కార మిలనమే అతి పెద్ద రాస్‌(నృత్యము).

స్లోగన్‌ :- ''పవిత్రత యొక్క రాయల్టీని అనుభవం చేసి చేయించడమే రాయల్‌ ఆత్మల గుర్తు''
 

Sunday, 11 February 2018

Telugu Murli 12/02/18

12-02-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

'' మధురమైన పిల్లలారా - పరస్పరము ఒకరికొకరు బాబాను మరియు వారి వారసత్వాల స్మృతిని కలిగి౦చుకు౦టూ అప్రమత్తం చేసుకోవడం మీ కర్తవ్యము. ఇ౦దులోనే అందరి కళ్యాణము ఇమిడి ఉంది. '' 

ప్రశ్న :- విజ్ఞానులు కూడా అర్థము చేసుకోలేని ఏ గుహ్య రహస్యాన్ని పిల్లలైన మీరు అర్థము చేసుకున్నారు?
జవాబు :- ఆత్మ అత్య౦త సూక్ష్మమైన నక్షత్రమని, అ౦దులోనే అన్ని సంస్కారాలు ని౦డి ఉన్నాయని, అదే శరీరము ద్వారా తన పాత్రను అభినయిస్తూ ఉందని మీరు అర్థం చేసుకున్నారు. శరీరము జడము, ఆత్మ చైతన్యమైనది. అలాగే పరమాత్మ కూడా ఒక నక్షత్రము వంటివారే. వారిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. వారు మనుష్య సృష్టికి బీజ రూపులు, సత్యమైనవారు, చైతన్యమైనవారు. వారు వేలాది సూర్యుల కంటే తేజోమయమైనవారు కాదు. ఈ గుహ్య రహస్యాన్ని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. విజ్ఞానులు (సైన్సువారు) ఈ విషయాలను అర్థము చేసుకోలేరు. మీరు మొట్టమొదట అ౦దరికి ఆత్మ - పరమాత్మల పరిచయాన్ని ఇవ్వాలి. 

పాట :- మాతా ఓ మాతా! నీవు సర్వుల భాగ్యవిధాత.... (మాతా! ఓ మాతా! తూ సబ్‌ కీ భాగ్యవిధాతా......)
ఓంశాంతి. పిల్లలారా! స్వదర్శన చక్రధారులవ్వ౦డి అని బాబా పిల్లలకు చెప్పారు. తండ్రి ఈ విధంగా పిల్లలను హెచ్చరిస్తున్నారు. పిల్లలు కూడా ఒకరినొకరు అప్రమత్తము చేసుకోవాలి. తండ్రిని స్మృతి చేయడం ద్వారా వెంటనే ఆ నషా ఎక్కిపోతు౦ది. స్మృతిని కలిగి౦చేందుకు ఒకరినొకరు హెచ్చరి౦చుకోవాలి. ఎలాగైతే పరస్పరములో కలిసినప్పుడు నమస్తే అని చెప్తారు కదా. కాని దాని ద్వారా ఎలా౦టి కళ్యాణము జరగదు. పిల్లలైన మీరు ఒకరినొకరు ఎప్పుడైతే అప్రమత్తము చేసుకు౦టారో అప్పుడు కళ్యాణము జరుగుతు౦ది. స్వదర్శన చక్రధారి అను శబ్ధములో అన్నీ వచ్చేస్తాయి. తండ్రి పరిచయము, పదవి పరిచయము, చక్రము పరిచయము కూడా వచ్చేస్తు౦ది. కనుక ఒకరికొకరు సావధాన పరచుకోవడం మీ మొదటి కర్తవ్యము. స్మృతి కలిగి౦చడం వలన అప్రమత్తమైపోతారు. క్షణ క్షణము ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. తండ్రి మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉ౦డండి. స్వదర్శన చక్రధారులై స్వయాన్ని అశరీరిగా భావి౦చి అశరీరి అయిన తండ్రిని స్మృతి చేస్తారు. స్మృతి అనగా యోగము. యోగము ద్వారానే మీ శరీరము నిరోగిగా అవుతు౦ది. ఇది ఇప్పటి పురుషార్థము. అ౦త్యములో పూర్తి కర్మాతీత స్థితి తయారైనప్పుడు నిరోగులుగా అవుతారు. ఇప్పుడైతే మీరు పురుషార్థులు. ఇప్పుడు తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఎ౦దుకంటే అ౦దరూ బుద్ధిహీనులుగా ఉన్నారని వారికి తెలుసు. దేవతలు మొదలైన వారిని పూజించినప్పుడు వారి కర్తవ్యము గురించి ఎవ్వరికీ తెలియదు. కనుక మీరు ఎవరినైతే పూజిస్తున్నారో వారందరు ఎవరు, వీరందరి జీవిత చరిత్రలు మేము తెలియజేయగలమని వారికి చెప్పాలి. మొట్టమొదట పరమపిత పరమాత్ముని గురి౦చి తెలుసుకోవడం ముఖ్యము. ఇ౦దులోనే చాలామంది మనుష్యులు తికమక(కన్‌ఫ్యూజ్‌) అవుతారు. పరమాత్మునికి ఎలా౦టి నామ-రూపాలు లేవు అని వారంటారు. కనుక వారికి ఆత్మకు పరమాత్మకు గల బేధము గురించిన జ్ఞానమును తెలియజేయడం మొట్టమొదటి ముఖ్యమైన విషయము. అ౦దరూ ఆత్మలేనని తెలుసు. పుణ్యాత్మ, పాపాత్మ అని అంటారు కాని పాప పరమాత్మ అని అనరు. పతిత ప్రపంచము కదా. పరమాత్మ అయితే ఎప్పుడూ పతితంగా అవ్వరు. కనుక మనుష్యులు మొట్టమొదట ఆత్మను గురించి తెలుసుకోవాలి. ఎ౦దుకంటే ఆత్మ జ్ఞానము ఏ మనుష్యులలోనూ లేదు. ఆత్మనే వి౦టురది, ఆత్మనే తి౦టు౦ది, త్రాగుతు౦ది, ఈ అవయవాల ద్వారా అన్ని పనులు చేస్తు౦ది. ఆత్మ రూపమేమిటి ? భృకుటి మధ్యలో మెరుస్తున్న విచిత్రమైన నక్షత్రమని అంటారు. కనుక ఆత్మ రూపాన్ని గురించి అర్థం చేయించాల్సి ఉ౦టు౦ది కదా. ఆత్మ రూపము అ౦త పెద్దగా ఏమీ ఉరడదు. ఆత్మ అతిసూక్ష్మమైనది. ఆత్మ రూపము జీరో లేక బి౦దువుూట అని కూడా అ౦టారు. ఆత్మ ఎ౦త సూక్ష్మమైనదో ఇప్పుడు దీని గురి౦చి కూడా ఆలోచి౦చాలి. ఆత్మ ఈ శరీరము ను౦డి ఎలా వెలుపలికి వెళ్తు౦ది? ఎక్కడి ను౦డి వెళ్తు౦ది? అని మనుష్యులు ప్రశ్నిస్తారు. కొ౦దరు తల(పుర్రె) ను౦డి అని, మరి కొ౦దరు కళ్ళ ను౦డి అని..... అ౦టారు ఎ౦దుకంటే అనేక ద్వారాలు ఉన్నాయి కదా. కాని ఆత్మ ఎలా౦టి వస్తువో తెలుసుకోవడం చాలా అద్భుతమైనది. ఆత్మ ఎలా వెళ్ళిపోతు౦దని అడుగుతారు కాని ఆత్మ ఎలా వస్తు౦ది అని అడగరు. కాని మొదట ఆత్మ అంటే ఏమిటో తెలుసుకోవలసి ఉ౦టు౦ది. ఇ౦త చిన్న ఆత్మలో 84 జన్మల పాత్ర ని౦డి ఉంది. ఈ విషయాలు అత్యంత అద్భుతమైనవి. ఆత్మ అయితే నక్షత్ర సమానమైనది. దానిని పెద్దదని అనరు. విమానము పైకి వెళ్లినప్పుడు, అది చాలా చిన్నదిగా కనిపిస్తు౦ది కాని ఆత్మ పెద్దదిగా అవ్వదు. దానిది ఒకే రూపము. కనుక మొట్టమొదట ఆత్మను గురి౦చి తెలుసుకోవాలి. ఆత్మనైన నేను ఈ శరీరములో ఎలా ప్రవేశిస్తాను? భలే కొ౦దరికి నక్షత్రము వలె సాక్షాత్కారము కూడా అవుతు౦ది. ఆ చిన్న ఆత్మలో జ్ఞానమంతా ని౦డి ఉంది. ఆత్మ ఒక్కటే. ఇది చాలా అద్భుతమైనది. పరమాత్ముని రూపము గురి౦చి కూడా ఎవ్వరికీ తెలియదు. వాస్తవానికి ఆత్మ ఎలా ఉందో, పరమాత్మ కూడా అలాగే ఉంటారు. వారు ఆత్మల తండ్రి కూడా. ఇక్కడ తండ్రి మరియు పిల్లలు పెద్దగా, చిన్నగా ఉ౦టారు. కాని ఆత్మ చిన్నదిగా, పెద్దదిగా ఉండదు. ఆత్మ-పరమాత్మల రూపములో ఎలా౦టి వ్యత్యాసము ఉ౦డదు. కాని ఇరువురి పాత్ర, సంస్కారాలలో వ్యత్యాసముంది. వారి(పరమాత్మ)లో ఏ సంస్కారము ఉందో, ఆత్మలైన మీలో ఏ సంస్కారాలు ఉన్నాయో తండ్రి అర్థము చేయిస్తున్నారు. మనుష్యులకు ఆత్మ-పరమాత్మల రూపము తెలియని కారణంగా ఆత్మ-పరమాత్మ ఒక్కటే అని అనేస్తారు. చాలా గందరగోళము(అలజడి/ ఘోటాలా) చేసేశారు. ఈ విషయము తెలుసుకోవడం చాలా అవసరము. పరమాత్మ కూడా ఉన్నారు, బ్రహ్మ, విష్ణు, శంకరులు కూడా ఉన్నారు. వీరందరిలో ఆత్మ ఉంది. జగదంబ సరస్వతిని విద్యాదేవి అని అంటారు. కనుక తప్పకుండా సరస్వతి ఆత్మలో జ్ఞానము ఉరటు౦ది. కాని వారిలో ఏ జ్ఞానము ఉందో ఎవ్వరికీ తెలియదు. కేవలం విద్యాదేవి అని అ౦టారు. వార్తాపత్రికలలో ఆర్టికల్స్‌ (సాహిత్య రచనలు) మొదలైనవి వచ్చినప్పుడు వాటి గురి౦చి అర్థం చేయించాలి. మీరు సరస్వతిని విద్యాదేవి అని అ౦టారు కదా. కాని వారు ఏ జ్ఞానాన్ని ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? వారికి తప్పకుండా భగవంతుని ద్వారా జ్ఞానము లభి౦చి ఉ౦టు౦ది కదా. భగవంతుని రూపము ఏమిటి? విద్యాదేవి అను పేరు ఎలా వచ్చినది ? జ్ఞానసాగరులైతే భగవంతుడు ఒక్కడే కదా. వారు సరస్వతిని జ్ఞాన సంపన్నంగా ఎలా చేశారు? ఈ ఒక్క విషయముతోనే ఎవరినైనా సంగమ యుగము వద్ద నిలబెట్టాలి.

తండ్రి చెప్తున్నారు - నేను జ్ఞానమును అర్థం చేయిస్తాను కాని వ్రాసేందుకు సంజయ్‌(జగధీశ్‌ భాయి) నిమిత్తముగా ఉన్నారు. వీరు నె౦బరువన్‌ ముఖ్యమైన పాత్రధారి. ఇతడు బాబా జతలో కుడి భుజంగా ఉ౦డాలి. కాని వీరు ఢిల్లీలో కూడా ఉ౦డవలసి వచ్చింది. ఇది కూడా డ్రామాలో నిర్ణయమై ఉంది. కల్ప క్రితపు పాత్ర అర్జునుని పేరు ముఖ్యంగా గాయనము చేయబడింది. ఇప్పుడు పిల్లలైన మీరు ప్రతి విషయాన్ని అర్థము చేసుకున్నారు. మొట్టమొదట ఆత్మ పరమాత్మలను గురి౦చి అర్థము చేసుకోవాలి.

ఆత్మ ఒక నక్షత్రము వంటిదని, అరదులో పూర్తి జ్ఞానము ఎలా ని౦డి ఉందో తండ్రి తమ పిల్లలకు అర్థం చేయించారు. ఇది ఏ సైన్సువారు కూడా అర్థము చేసుకోలేరు. ఆత్మలోనే అన్ని సంస్కారాలు ఉ౦టాయి. ఇప్పుడు ఆత్మ అయితే ఒక నక్షత్రము వంటిది, మంచిది. పరమాత్ముని రూపము ఏమిటి? వారు కూడా ఆత్మ వలెనే ఉంటారు కాని వారు పరమ ఆత్మ. రూపములో వ్యత్యాసము లేదు. వారు(పరమాత్మ) వేల సూర్యులకన్నా తీక్షణమైనవారని ఏ మహిమను గానము చేశారో అది సత్యము కాదు. తండ్రి చెప్తారు - కేవలం ఆత్మలైన మీలో జ్ఞానము లేదు. కాని పరమాత్మనైన నేను జ్ఞాన సాగరుడను. ఇదే మీకు మాకు గల వ్యత్యాసము. మాయ మీ ఆత్మను పతితంగా చేసేసి౦ది. అ౦తేకాని ఆరిపోయిన దీపమేదీ లేదు. కేవలం ఆత్మ ను౦డి తండ్రి మరియు రచనల జ్ఞానము తొలగిపోయింది. ఇప్పుడు మీకు ఆ జ్ఞానము లభిస్తోంది. బాబాలో జ్ఞానముంది. వారు కూడా ఆత్మనే. సైజులో పెద్దగా ఏమీ ఉరడరు. వారిని కూడా నాలెడ్జ్‌ఫుల్‌ అని, సరస్వతిని కూడా నాలెడ్జ్‌ఫుల్‌ అని అ౦టారు. ఇప్పుడు వారికి(సరస్వతికి) జ్ఞానము ఎప్పుడు లభి౦చింది? సరస్వతి ఎవరి పుత్రిక ? ఇది ఎవ్వరికీ తెలియదు. వారికి ఎలా అర్థం చేయించాలని మనసులోకి రావాలి. తండ్రి అయిన పరమాత్మ ఎవరు? వారు నక్షత్ర సమానమైనవారు అని, వారిలో పూర్తి జ్ఞానముంతా ఉందని అర్థం చేయించాలి. గాడ్‌ఫాదర్‌ మనుష్య సృష్టికి బీజరూపులు. వారు అందరి అనంతమైన తండ్రి. వారు సత్యమైనవారు, చైతన్యమైనవారు, వారిలో సత్యమైన జ్ఞానముంది. వారిని సత్యము(ట్రూత్‌) అని కూడా అ౦టారు. ఇ౦కెవరిలోనూ సత్యమైన జ్ఞానము లేనే లేదు. రచయిత అయిన తండ్రి ఒక్కరే. కనుక పూర్తి రచన యొక్క జ్ఞానము కూడా వారిలోనే ఉంది. వృక్షానికి బీజరూపులు కదా. ఆత్మ అయితే చైతన్యమైనది, శరీరమైతే జడమైనది. ఎప్పుడైతే ఇందులోకి(శరీరములోకి) ఆత్మ వస్తు౦దో అప్పుడు ఇరదులో చైతన్యము కలుగుతు౦ది. కనుక తండ్రి అర్థం చేయిస్తున్నారు - నేను కూడా అలాగే ఉ౦టాను. ఆత్మ చిన్నదిగా, పెద్దదిగా అవ్వజాలదు. ఆత్మలైన మీరు ఎలా ఉన్నారో అలాగే పరమ - ఆత్మ అనగా పరమాత్మ కూడా అలాగే ఉన్నారు. కాని వారి మహిమ అందరికంటే ఉన్నతమైనది. మనుష్య సృష్టికి బీజరూపులు. మనుష్యులే వారిని స్మృతి చేస్తారు. తండ్రి పైన ఉ౦టారని మీకు తెలుసు. హే పరమపిత పరమాత్మ! అని ఆత్మ ఈ అవయవాల ద్వారా పిలుస్తు౦ది. మనుష్యులకు ఇది తెలియదు. ఎ౦దుకంటే దేహాభిమానులుగా ఉన్నారు. మీరిప్పుడు దేహీ-అభిమానులుగా అయ్యారు. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయము చేసుకున్నారు. భగవంతుడు అని నిరాకారుడినే అంటారు. మనము వారి సంతానమని మీకు తెలుసు. ఆ భగవంతుడే వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. వారిని జ్ఞాన సాగరులు, ఆనంద సాగరులు అని అ౦టారు. దయా సాగరులు, సుఖ సాగరులు, శా౦తి సాగరులు....... ఈ మహిమ వారికి ఇవ్వబడింది. కనుక తప్పకుండా తండ్రి ను౦డి పిల్లలకు వారసత్వము లభి౦చాలి. వారు ఏదో ఒక సమయములో వచ్చి ఆస్తినిచ్చారు. అందుకే మహిమ గానము చేయబడ్తు౦ది. దేవతల మహిమ వేరు, తండ్రి మహిమ వేరు. వారు ఆత్మలందరి తండ్రి. సృష్టికర్త అయిన కారణంగా, వారిని బీజరూపులని అ౦టారు. మొట్టమొదట తండ్రి పరిచయమును ఇవ్వాలి. అ౦గుష్ట ఆకారములో ఉ౦టారని శాస్త్రాలలో చూపిస్తారు. వారు జ్యోతిర్బి౦దువని మనము చెప్తాము. చిత్రమును కూడా తయారు చేశారు. కాని వారు అ౦త పెద్దగా లేరు. వారు అతిసూక్ష్మమైనవారు. కనుక ఏమని అర్థం చేయించాలి? చిత్రములో ఇ౦త పెద్ద చిత్రాన్ని ఎ౦దుకు చూపారు? అని మిమ్ములను ప్రశ్నిస్తారు. లేకుంటే మరెలా చూపి౦చాలి? వారైతే ఒక బి౦దువు. మరి వారిని ఎలా పూజిస్తారు? వారికి క్షీరాభిషేకము ఎలా చేస్తారు? పూజ కొరకే ఈ రూపాన్ని తయారు చేశారని చెప్పండి. వారు పరమపిత పరమ ఆత్మ అని, పరంధామములో ఉ౦టారని భావిస్తారు. ఆ పరంధామము మన మధురమైన ఇల్లు. నిరాకార ప్రపంచము మూల వతనము, సూక్ష్మ వతనము తర్వాత స్థూల వతనము. తండ్రి నిరాకార ప్రపంచములో ఉ౦టారు. నేను నిర్వాణధామానికి వెళ్లాలని ఆత్మ అ౦టు౦ది. అక్కడ ఈ ఇ౦ద్రియాలేవీ ఉ౦డవు. ఆత్మయే వచ్చి శరీరాన్ని ధారణ చేస్తు౦ది. ఆత్మ ఎక్కడి ను౦డి పోతు౦దో ఎలా అర్థం చేయించాలి? పి౦డములో ఆత్మ ప్రవేశి౦చడము వలన ఆ పిండము చైతన్యమైపోతు౦దని తెలుసు. కాని ఆత్మ ఎ౦త సూక్ష్మమైనది! అ౦దులోనే మొత్తం సంస్కారమంతా ని౦డి ఉంది. మళ్లీ ఒక్కొక్క జన్మ సంస్కారాలు ప్రకటితమౌతూ ఉ౦టాయి. కనుక ప్రతి విషయాన్ని చాలా బాగా అర్థము చేసుకోవాలని తండ్రి తెలుపుతున్నారు. సరస్వతి గురి౦చి కూడా అర్థం చేయించగలరు. వారు ఎవరి పుత్రిక? ఈ సమయములో మిమ్ములనైతే దేవీ అని అనేందుకు వీలు లేదు. సరస్వతి బ్రహ్మ పుత్రిక కనుక అతడు కూడా తప్పకుండా జ్ఞాన దేవుడే అవుతాడు కదా. బ్రహ్మ ముఖ కమలము ద్వారా జ్ఞానమిచ్చినట్లు చూపిస్తారు. బ్రహ్మ పేరు కూడా ఉంది కదా! ఈ సమయములో మీరు బ్రాహ్మణులుగా ఉన్నారు. భలే ఆత్మ పవిత్రంగా అవుతూ ఉ౦టు౦ది కాని శరీరము పవిత్రంగా అవ్వజాలదు. ఇది తమోప్రధానమైన శరీరము. కనుక తండ్రి అర్థం చేయిస్తారు - పిల్లలారా! ఒకరినొకరు సావధానపరచుకుంటూ ఉన్నతి పొ౦దాలి. తండ్రిని, వారసత్వమును స్మృతి చేస్తున్నారా? స్వదర్శన చక్రాన్ని స్మృతి చేస్తున్నారా? అని - ఒక్కరు కూడా ఇలా అప్రమత్తం చేసుకోవడం లేదని తండ్రి అ౦టున్నారు. తండిన్రి స్మృతి చేస్తూ చేస్తూ నిద్రాజీతులుగా అవ్వాలి. ఇ౦దులో చాలా సంపాదన ఉంది. సంపాదనలో ఎప్పుడూ అలసట రాదు. కాని స్థూలమైన పనులు కూడా చేయవలసి ఉ౦టు౦ది. అ౦దుకే అలసట కూడా కలుగుతు౦ది.

తండ్రి అర్థం చేయిస్తారు - రాత్రి కూడా మేల్కొని బాబాతో మాట్లాడుతూ, జ్ఞాన సాగరములో మునకలు వేస్తూ ఉ౦డాలి. ఎప్పుడూ మునకలు వేసే ఒక జంతువు ఉంది కదా. ఇలా మునకలు వేయడం వల్ల విచార సాగర మథనము చేయడం వలన చాలా పాయి౦ట్సు రావడం గమనిస్తారు. అవి ఎక్కడెక్కడి ను౦డో వెలువడుతూ ఉ౦టాయి. దీనిని రాత్రి మేల్కొని జ్ఞాన విచార సాగర మథనము చేయడమని అ౦టారు. మనుష్యులకు ఈ విషయాలు అసలు తెలియదు. వారికి అర్థం చేయించాలి - తండ్రి జ్ఞానసాగరులు, వారి ద్వారా ఆస్తి లభిస్తు౦ది. ఏ ఆది సనాతన దేవీ దేవతా ధర్మము వారు సత్యయుగములో ఉ౦డేవారో వారికి తప్పకుండా వారసత్వము లభి౦చి ఉంటుంది కదా. ఇప్పుడు మొత్తం రాజధానికి ఆస్తి ఎలా లభిస్తుంది? కలియుగము నుండి సత్యయుగము అయ్యేందుకు సమయమేమీ పట్టదు. రాత్రి పూర్తి అయ్యి పగలు వస్తు౦ది. ఇనుప యుగ ప్రపంచమైన దు:ఖధామమెక్కడ? ఆ సుఖధామమెక్కడ? బహ్మ్ర పగలుకు మరియు బహ్మ్ర రాత్రికి - ఎ౦త వ్యత్యాసముంది! ఇప్పుడు గాడ్‌ఫాదర్‌ ద్వారా మీకు జ్ఞానము లభిస్తోంది. సరస్వతి ఏమి చేసేవారో ఎవ్వరికీ తెలియదు. జ్ఞానదేవి సరస్వతి చిత్రము లభిస్తూనే సంతోషపడిపోతారు అ౦తే. కనుక వారిని సావధానపరచాలి. వారికి పరమాత్మ పరిచయమును ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత బ్రహ్మ, విష్ణు, శంకరుల పరిచయమును కూడా ఇవ్వాలి. తండ్రి వచ్చి ఈ జ్ఞానాన్ని ఇచ్చి నరుని ను౦డి నారాయణునిగా చేశారు. చాలా యుక్తితో ప్రతి ఒక్కరి కర్తవ్యాన్ని గురి౦చి తెలపాలి. సరస్వతి కూడా బ్రహ్మ ముఖవంశావళియే. కనుక తప్పకుండా పరమపిత పరమాత్మ వచ్చి బ్రహ్మ ద్వారా ముఖవంశావళిని రచి౦చి ఉ౦టారు కదా. మొట్టమొదట జ్ఞానాన్ని ఎవరికి ఇచ్చారు? కలశాన్ని సరస్వతికి ఇచ్చారని అ౦టారు. మధ్యలో ఉన్న బ్రహ్మను అదృశ్యము చేసేశారు. బ్రహ్మ తనువులో వచ్చి మాతలకు కలశాన్ని ఇచ్చారని కనుక తప్పకుండా బ్రహ్మ కూడా వి౦టూ ఉ౦టారని ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మ చేతిలో శాస్త్రాలు కూడా చూపిస్తారు. బ్రహ్మ మతము చాలా ప్రసిద్ధమైనది కనుక వారు కూడా సర్వ వేద శాస్త్రాల సారముల మతమునే ఇచ్చి ఉ౦టారు కదా. బ్రహ్మ ద్వారా శివబాబా అర్థం చేయిస్తారు. బ్రహ్మ ఎక్కడ ను౦డి వచ్చారు? ఈ రథము ఎక్కడి ను౦డి వెలువడి౦ది? ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. ఇప్పుడు బాబా తెలియజేశారు, దానిని మీరు ఇతరులకు అర్థం చేయించగలరు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.


ధారణ కొరకు ముఖ్యసారము:-
1. రాత్రులు మేల్కొని జ్ఞాన విచార సాగర మథనము చేయాలి. జ్ఞాన సాగరములో మునకలు వేయాలి. తండ్రిని స్మృతి చేస్తూ నిద్రాజీతులుగా అవ్వాలి.
2. స్వదర్శన చక్రాన్ని త్రిప్పుతూ ఉ౦డాలి. పరస్పరములో తండ్రి మరియు వారసత్వముల స్మృతిని కలిగి౦చుకు౦టూ ఒకరినొకరు సావధానపరచుకు౦టూ ఉన్నతిని పొ౦దాలి.


వరదానము :- '' మీ సహయోగ స్టాక్‌ ద్వారా ప్రతి కార్యములో సఫలతను ప్రాప్తి చేసుకునే మాస్టర్‌ దాతా భవ ''
సేవలో అవినాశి ప్రాప్తి పొందేందుకు మాస్టర్‌ దాతగా అయ్యి అందరికీ సహయోగమునివ్వండి. చెడిపోయిన పనిని, పాడైపోయిన సంస్కారాలను, చెడిపోయిన మూడ్‌ను శుభ భావన ద్వారా సరి చేయడంలో సదా అందరికీ సహయోగులుగా అవ్వడం అన్నిటికంటే గొప్ప దానము. ఇతడు ఈ మాట అన్నాడు, ఈ పని చేశాడు........ ఇవన్నీ చూస్తున్నా, వింటున్నా, అర్థం చేసుకున్నా మీ సహయోగపు స్టాక్‌ ద్వారా పరివర్తన చేయండి. ఎవరిలోనైనా ఏదైనా శక్తి తక్కువగా ఉన్నట్లు అనుభవమైతే మీ సహయోగము ద్వారా ఆ లోటును సరి చేయండి. దీనినే మాస్టర్‌ దాతగా అవ్వడం అని అంటారు.


స్లోగన్‌ :- '' సదా హర్షితంగా ఉండాలంటే, విశ్వ నాటకములోని ప్రతి దృశ్యాన్ని సాక్షిగా ఉండి చూడండి. ''
 

Saturday, 10 February 2018

Telugu Murli 11/02/18

11-02-2018 అవ్యక్త బాప్‌దాదా ఓంశాంతి రివైజ్‌: 10-04-1983 మధువనము 

''పరమ పూజ్యులుగా అయ్యేందుకు ఆధారం''
అందరూ మధువన మహాన్‌ తీర్థస్థానానికి మేళాను జరుపుకునేందుకు నలువైపుల నుండి చేరుకున్నారు. ఈ మహాన్‌ తీర్థ స్థానంలో ఇప్పుడు జరిగే మేళాకు స్మృతి చిహ్నంగా ఇప్పటికీ తీర్థ స్థానాలలో మేళాలు జరుగుతూ ఉంటాయి. ఈ సమయానికి చెందిన ప్రతీ శ్రేష్ఠ కర్మకు స్మృతి చిహ్నాన్ని చరిత్రల రూపంలో, పాటల రూపంలో ఇప్పుడు కూడా చూస్తున్నారు, వింటున్నారు. చైతన్యంలో ఉన్న శ్రేష్ఠ ఆత్మలైన మీరు తమ చిత్రాలను చూస్తున్నారు, చరిత్రలను వింటున్నారు. ఇటువంటి సమయంలో బుద్ధిలో ఏ శ్రేష్ఠ సంకల్పం నడుస్తుంది? ఒకప్పుడు మేమే ఇలా ఉండేవారము, ఇప్పుడు మేమే అలా ఉన్నాము, కల్ప-కల్పము మళ్లీ మేమే అలా అవుతామని భావిస్తున్నారు కదా! ఈ ' మళ్లీ ' అన్న స్మృతి, ఈ జ్ఞానము ఇక ఏ ఇతర ఆత్మలకు, మహాత్మలకు, ధర్మాత్మలకు, ధర్మపితలకు లేదు. కాని బ్రాహ్మణాత్మలైన మీ అందరికీ ఎంత స్పష్టమైన స్మృతి లేక స్పష్టమైన జ్ఞానము ఉందంటే 5 వేల సంవత్సరాల నాటి విషయం నిన్నటి విషయమన్నంత స్పష్టమైన స్మృతి ఉంది. నిన్న అలా ఉండేవారము, ఈ రోజు అలా ఉన్నాము, మళ్లీ రేపు అలా అవుతామనే నిశ్చయముంది. కావున ఈ రోజు మరియు రేపు - ఈ రెండు శబ్ధాల్లో 5 వేల సంవత్సరాల ఇతిహాసం ఇమిడిపోయి ఉంది. ఇంత సహజంగా, స్పష్టంగా అనుభవం చేస్తున్నారా! ఎవరో ఉంటారా? లేక మేమే ఉండేవారము, ఇప్పుడు కూడా మేమే అని భావిస్తున్నారా? జడ చిత్రాల్లో తమ చైతన్య శ్రేష్ఠ జీవితం సాక్షాత్కారమవుతోందా? లేక ఇవి మహారథుల చిత్రాలని భావిస్తున్నారా లేక మన అందరి చిత్రాలని భావిస్తున్నారా? భారతదేశంలో 33 కోట్ల దేవతలకు నమస్కారం చేస్తారు అనగా శ్రేష్ఠ బ్రాహ్మణాత్మల నుండి దేవతలుగా అయ్యే వంశానికి వంశజులు, ఆ వంశజులకు కూడా వంశజులందరికీ నమస్కరిస్తారు. అందరికీ పూజ చేయకపోయినా మహిమనైతే చేస్తూనే ఉంటారు. కావున ఎవరైతే స్వయం పూర్వజులుగా ఉన్నారో వారి పేరు ఎంత శ్రేష్ఠంగా ఉంటుందో, వారి పూజ కూడా ఎంత శ్రేష్ఠంగా జరుగుతుందో ఆలోచించండి. 9 లక్షలకు కూడా మహిమ ఉంది, వారి కంటే ముందు 16 వేలకు మహిమ ఉంది, వారి కంటే ముందు 108 మందికి ఉంది, వారి కంటే ముందు 8 మందికి ఉంది. వారి కంటే ముందు జంట పూసలు ఉన్నాయి. నంబరువారిగా ఉన్నారు కదా! మహిమ అయితే అందరికీ ఉంది. ఎందుకంటే ఎవరైతే భాగ్యవిధాత అయిన తండ్రికి పిల్లలుగా అయ్యారో, ఈ భాగ్యం కారణంగా వారికి మహిమ (గాయనము) మరియు పూజ రెండూ జరుగుతాయి. కాని రెండు రకాల పూజలున్నాయి. ఒకటి ప్రేమతో కూడిన విధిపూర్వకమైన పూజ, రెండవది కేవలం నియమానుసారంగా(నియమపూర్వకంగా) చేసే పూజ. రెండిటిలో తేడా ఉంది కదా! కావున నేను ఎటువంటి పూజ్య ఆత్మను అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. కొందరు భక్తులు, దేవతలు కోపగించుకోరాదన్న భయంతో పూజ చేస్తారని ఇంతకు ముందు కూడా వినిపించాము. కొందరు భక్తులు బయటికి చూపించడానికి కూడా పూజ చేస్తారు. మరి కొంతమంది భక్తిని నియమంగా లేక కర్తవ్యంగా భావించి నిర్వర్తించాలని భావిస్తారు. మనసులో ఉన్నా లేకపోయినా నిభాయించాలి అని ఒక కర్తవ్యంగా భావించి చేస్తారు. నాలుగు రకాల భక్తులు, ఏదో ఒక విధంగా తయారవుతారు. ఇక్కడ కూడా చూడండి, దేవాత్మలుగా అయ్యే బ్రహ్మకుమారీ-బ్రహ్మకుమారులుగా పిలువబడేవారు భిన్న-భిన్న రకాల వారున్నారు కదా! నంబరువన్‌ పూజ్యులు - సదా సహజ స్నేహంతో (ప్రేమతో) మరియు విధి పూర్వకమైన స్మృతి మరియు సేవ చేస్తూ యోగీ ఆత్మలుగా, దివ్యగుణాలను ధారణ చేసే ఆత్మలుగా అయ్యి నడుస్తున్నారు. నాలుగు సబ్జెక్టుల విధిని మరియు సిద్ధిని ప్రాప్తి చేసుకున్నారు. రెండవ నంబరు పూజ్యులు విధి పూర్వకంగా కాదు కాని నియమంగా భావించి చేస్తారు. నాలుగు సబ్జెక్టులు పూర్తిగా ఉంటాయి కానీ విధి మరియు సిద్ధి యొక్క ప్రాప్తి స్వరూపంగా అయ్యి ఉండరు. కాని నియమంగా భావించి నడవాల్సిందే, చేయాల్సిందే అనే లక్ష్యంతో ఎంత నియమమో(కాయిదా) అంత లాభాన్ని(ఫాయిదా) ప్రాప్తి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మొదటి రకము వారి హృదయపూర్వకమైన స్నేహం స్వతహాగా మరియు సహజంగా పూజ్యాత్మగా తయారు చేస్తుంది. రెండవ రకం నియమపూర్వకంగా చేసేవారికి ఒకసారి సహజంగా, ఒకసారి కష్టంగా అనిపిస్తుంది, ఒకసారి శ్రమ చేయవలసి ఉంటుంది, ఒకసారి ప్రేమ అనుభూతి ఉంటుంది. మొదటి నంబరు వారు లవలీనమై ఉంటారు, రెండవ నంబరు వారు ప్రేమలో ఉంటారు. మూడవ నంబరు వారు - మెజారిటి(అధిక) సమయాన్ని నాలుగు సబ్జెక్టులను హృదయపూర్వకంగా కాక చూపించేందుకు చేస్తారు. స్మృతిలో కూడా ప్రసిద్ధమైనవారిగా అవ్వాలనే భావంతో కూర్చుంటారు. అలాగే అందరికీ చూపించేందుకు సేవ కూడా చేస్తారు. ఎటువంటి సమయమో అటువంటి అల్పకాలిక రూపాన్ని కూడా ధారణ చేస్తారు. బుద్ధి తేజంగా ఉంటుంది కాని మనసు ఖాళీగా ఉంటుంది. నాల్గవ నంబరు వారు - కేవలం వీరు ఆఖరి నంబరు వారు లేక వీరు ముందుకు వెళ్లలేరని ఎవ్వరూ అనకూడదని, అటువంటి దృష్టితో ఎవ్వరూ చూడరాదనే భయంతో చేస్తారు. బ్రాహ్మణులుగా అయితే అవ్వనే అయ్యారు, శూద్ర జీవితాన్ని కూడా వదిలేసి నడుస్తున్నారు. కాని రెండూ వదిలినట్లుగా ఉండరు. ఇదీ వదలరు, అదీ వదలరు. శూద్ర జీవితమూ ఇష్టముండదు, బ్రాహ్మణ జీవితంలో విధి పూర్వకంగా నడిచే ధైర్యమూ ఉండదు. అందువలన నిస్సహాయ స్థితిలో ప్రవాహంలో వచ్చేసారు. అలాంటి నిస్సహాయతతో లేక భయంతో నడుస్తూనే ఉంటారు. వీరు అప్పుడప్పుడు తమ శ్రేష్ఠ జీవితాన్ని అనుభవం కూడా చేస్తూ ఉంటారు. అందువలన ఈ జీవితాన్ని వదలలేరు కూడా. అలాంటి వారిని నాల్గవ నంబరు పూజ్య ఆత్మలని అంటారు. కావున వారి పూజ కూడా అప్పుడప్పుడు భయంతో గత్యంతరం లేని భక్తులుగా అయ్యి పూజ చేయాలని దాని అనుసారంగా నడుస్తూ ఉంటుంది. చూపించేందుకు చేసేవారికి జరిగే పూజ కూడా మనస్ఫూర్తిగా కాక చూపించేందుకే దాని అనుసారంగానే నడుస్తూ ఉంటుంది. కావున నాలుగు రకాల పూజ్యులను చూశారు కదా. స్వయం ఇప్పుడు సంగమ యుగంలో ఎలా తయారవుతారో అలాగే సత్య త్రేతా యుగాలలో రాయల్‌ ఫ్యామిలీ వారిగా లేక ప్రజలుగా నంబరు ప్రమాణంగా తయారవుతారు, ద్వాపర కలియుగాలలో మీకు అలాంటి భక్తుల మాలయే తయారవుతుంది. ఇప్పుడు నేనెవరిని! అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి లేక ఈ నాల్గింటిలో ఒకప్పుడు ఒక చోటుకు, ఒకప్పుడు ఒక చోటుకు తిరుగుతున్నారా? అయినా భాగ్యవిధాతకు పిల్లలుగా అయ్యారు. కనుక పూజ్యులుగా అయితే తప్పకుండా అవుతారు. ప్రసిద్ధి చెందిన వారు అనగా శ్రేష్ఠ పూజ్యులు 16 వేల వరకు నంబరువారుగా అయిపోతారు. మిగిలిన 9 లక్షలు అంతిమ సమయం వరకు అనగా కలియుగ అంతిమ సమయం వరకు ఎంతో కొంత పూజ్యులుగా అయిపోతారు. కావున అర్థమయ్యిందా! మహిమైతే అందరికీ జరుగుతుంది. మహిమకు ఆధారం - భాగ్యవిధాత తండ్రి వారిగా అవ్వడం. పూజకు ఆధారం నాలుగు సబ్జక్టులలో పవిత్రత, స్వచ్ఛత, శుభ్రత (సఫాయి). అటువంటి వారి పై బాప్‌దాదా కూడా సదా స్నేహ పుష్పాలు కురిపిస్తూ వారిని పూజ్యులు అనగా శ్రేష్ఠులుగా అంగీకరిస్తారు. పరివారం కూడా వారిని శ్రేష్ఠమైన వారిగా అంగీకరిస్తారు. అంతేకాక విశ్వం కూడా వాహ్‌ వాహ్‌ అను ఢంకాను మ్రోగిస్తూ వారికి మనసుతో పూజ చేస్తుంది. ఇక భక్తులైతే తమ ఇష్టులుగా భావించి హృదయంలో ఇముడ్చుకుంటారు. కావున ఇటువంటి పూజ్యులుగా అయ్యారా? స్వయం పరమపితయే పూజ్యులుగా చేస్తున్నారు. వారు కేవలం పిత కాదు, పరమపిత (అత్యంత ఉన్నతమైన పిత). కనుక వారు పరమ అనగా అత్యంత ఉన్నతంగానే తయారు చేస్తారు కదా. పూజ్యులుగా అవ్వడమేమీ గొప్ప విషయం కాదు కానీ పరమ పూజ్యులుగా అవ్వాలి.

బాప్‌దాదా కూడా పిల్లలను చూసి హర్షితమవుతున్నారు. ప్రేమలో శ్రమను అనుభవం చేయకుండా చేరుకుంటారు. ఇప్పుడైతే రెస్ట్‌ హౌస్‌లోకి వచ్చేశారు కదా! తనువు, మనసు రెండిటికి విశ్రాంతి ఉంది కదా! రెస్ట్‌ అనగా నిద్రపోవడం కాదు. బంగారంగా తయారయ్యే రెస్ట్‌లోకి అనగా పారసపురిలోకి వచ్చేశారు కదా. ఇక్కడ పారస ఆత్మల సాంగత్యమే ఉంటుంది. వాయుమండలమే బంగారుగా తయారు చేసేదిగా ఉంటుంది. ఇక్కడి విషయాలే సదా (పగలు-రాత్రి) బంగారుగా తయారు చేసేవిగా ఉంటాయి. మంచిది.

అటువంటి సదా పరమపూజ్య ఆత్మలకు, సదా విధి ద్వారా శ్రేష్ఠ సిద్ధిని పొందేవారికి, సదా మహాన్‌గా అయ్యి మహాన్‌ ఆత్మలుగా తయారు చేసేవారికి, స్వయాన్ని సదా సహజంగా మరియు స్వతహా యోగి, నిరంతర యోగి, స్నేహ సంపన్న యోగిగా అనుభవం చేసేవారికి అలాంటి సర్వ శ్రేష్ఠ ఆత్మలకు, నలువైపులా ఉన్న ఆకారీ రూపధారులైన సమీప పిల్లలకు, ఇటువంటి సాకారీగా, ఆకారీగా సన్ముఖంగా ఉపస్థితులైన పిల్లలకు బాప్‌దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే.

దీదీ, దాదీలతో - అందరూ పరమపూజ్యులుగా ఉన్నారు కదా! పూజ బాగా జరుగుతోంది కదా! బాప్‌దాదాకైతే అనన్య పిల్లలంటే గర్వంగా ఉంది. తండ్రికి గర్వంగా ఉంది, పిల్లలు రాజయుక్తంగా ఉన్నారు. ఎవరైతే రాజయుక్తంగా ఉన్నారో, ఆ పిల్లల పై తండ్రికి సదా గర్వంగా ఉంటుంది. రాజయుక్తులు, యోగయుక్తులు, గుణ యుక్తులు అన్నింటి బ్యాలెన్స్‌ను ఉంచేవారు సదా తండ్రి ఆశీర్వాదాల నీడలో ఉంటారు. వారి పై ఆశీర్వాదాల వర్షం సదా కురుస్తూ ఉంటుంది. జన్మిస్తూనే ఈ ఆశీర్వాదాల వర్షం ప్రారంభమయ్యింది మరియు చివరి వరకు ఇదే ఛత్రఛాయలో బంగారు పుష్పాల వర్షం కురుస్తూ ఉంటుంది. ఇదే నీడలో నడిచారు, పాలింపబడ్డారు, చివరి వరకు నడుస్తూనే ఉంటారు. సదా ఆశీర్వాదాలనే బంగారు పుష్పాల వర్షం కురుస్తూ ఉంటుంది. ప్రతీ అడుగులో తండ్రి తోడుగా ఉన్నారు అనగా వారి ఆశీర్వాదాలు తోడుగా ఉన్నాయి. ఇదే నీడలో సదా ఉంటున్నారు.(దాదీతో) ప్రారంభం నుండి అలసటి లేని వారిగా ఉన్నారు. మీకు అథక్‌ భవ(అలసట లేని వారిగా అవ్వండి) అన్న వరదానముంది. కావున చేస్తూ కూడా చేయడం లేదు. ఇది చాలా బాగుంది. అయినా అవ్యక్తమయ్యే సమయంలో బాధ్యతా కిరీటమైతే పెట్టారు కదా! వీరికి(దీదీకి) సాకారుని జతలో నేర్పించారు, మీకు అవ్యక్తమయ్యే సమయంలో ఒక్క సెకనులో నేర్పించారు. ఇరువురికీ తమ తమ పద్ధతులలో నేర్పించారు. ఈ పాత్ర కూడా డ్రామాలో ఉంది. మంచిది.

ఉదయం 6-30 గంటలకు వీడ్కోలు సమయంలో - సంగమ యుగంలోని అన్ని ఘడియలు గుడ్‌మార్నింగ్‌ (శుభోదయం)గానే ఉన్నాయి. ఎందుకంటే పూర్తి సంగమ యుగమంతా అమృతవేళయే కదా! సృష్టి చక్రం లెక్కలో సంగమ యుగం అమృతవేళగా అయ్యింది కదా! కనుక సంగమ యుగంలో ప్రతి సమయం గుడ్‌మార్నింగే. కావున బాప్‌దాదా రావడమూ గుడ్‌మార్నింగ్‌లోనే, వెళ్లడం కూడా గుడ్‌మార్నింగ్‌లోనే. ఎందుకంటే తండ్రి వచ్చినప్పుడు రాత్రి (కలియుగము) నుండి సంగమ యుగముగా (అమృతవేళగా) అయిపోయింది. కనుక రావడం అమృతవేళలోనే వస్తారు, వెళ్లునప్పుడు పగలు వస్తుంది. అమృతవేళలోనే ఉంటారు, పగలు వచ్చినప్పుడు వెళ్లిపోతారు. మీరు ఉదయం అనగా సత్యయుగ పగలులో అనగా బ్రహ్మ పగలులో రాజ్యం చేస్తారు. తండ్రి అయితే అతీతంగా అయిపోతారు కదా! కావున పాత ప్రపంచం లెక్కలో చూస్తే ఈ సంగమ యుగము సదా గుడ్‌మార్నింగ్‌గానే ఉంది. సదా శుభమే ఉంది, సదా శుభమే ఉంటుంది. అందువలన శుభోదయం అన్నా, శుభరాత్రి అన్నా, శుభ దినం అన్నా అంతా శుభమే శుభము. కావున అందరికీ కలియుగ లెక్కలోనూ గుడ్‌మార్నింగే, సంగమ యుగ లెక్కలోనూ గుడ్‌మార్నింగే. డబల్‌ గుడ్‌మార్నింగ్‌. మంచిది.

అవ్యక్త మహావాక్యాలు -

స్మృతిని జ్వాలాస్వరూపంగా తయారు చేసుకోండి - ఎప్పుడైతే మీ స్మృతి జ్వాలా స్వరూపంగా ఉంటుందో అప్పుడు తండ్రి సమానంగా పాపకటేశ్వరులుగా, పాప హరిణిగా(పాపాలను హరించేవారిగా) తయారవ్వగలరు. అటువంటి స్మృతియే మీ దివ్య దర్శనీయ మూర్తిని ప్రత్యక్షం చేస్తుంది. దీని కొరకు ఏ సమయములోనూ సాధారణ స్మృతి ఉండరాదు. సదా జ్వాలా స్వరూపం, శక్తి స్వరూప స్మృతిలో ఉండండి. స్నేహంతో పాటు శక్తి రూపం కంబైండ్‌గా ఉండాలి. వర్తమాన సమయంలో సంఘటిత రూపంలోని జ్వాలా స్వరూపం చాలా అవసరము. జ్వాలా స్వరూప స్మృతియే శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేస్తుంది. అంతేకాక నిర్బల ఆత్మలు శక్తి సంపన్నంగా అవుతారు. విఘ్నాలన్నీ సహజంగా సమాప్తమైపోతాయి. అంతేకాక పాత ప్రపంచం వినాశ జ్వాలలో భగ్గుమంటుంది. ఎలాగైతే సూర్యుడు విశ్వానికి ప్రకాశాన్ని, అనేక వినాశీ ప్రాప్తులను అనుభూతి చేయిస్తాడో అలా పిల్లలైన మీరు తమ మహాన్‌ తపస్వీ రూపం ద్వారా ప్రాప్తి కిరణాలను అనుభవం చేయించండి. దీని కొరకు ముందు జమా ఖాతాను పెంచండి. ఎలాగైతే సూర్యుని కిరణాలు నలువైపులా వ్యాపిస్తాయో అలా మీరు మాస్టర్‌ సర్వశక్తివంతుని స్థితిలో ఉన్నట్లయితే శక్తులు లేక విశేషతల రూపీ కిరణాలు నలువైపులా వ్యాపిస్తున్నట్లు అనుభవం చేస్తారు.

జ్వాలా రూపంగా అయ్యేందుకు ముఖ్యమైన సహజ పురుషార్థము - ఇప్పుడు వాపస్‌ ఇంటికి వెళ్లాలి, అందరినీ వెంట తీసుకెళ్లాలనే ధున్‌(తపన) సదా ఉండాలి. ఈ స్మృతి ద్వారా స్వతహాగా సర్వ సంబంధాలు, సర్వ ప్రాకృతిక ఆకర్షణలతో ఉపరాంగా అనగా సాక్షిగా అయిపోతారు. సాక్షిగా అవ్వడం వలన సహజంగానే తండ్రికి సహచరునిగా లేక తండ్రి సమానంగా అయిపోతారు. జ్వాలా స్వరూప స్మృతి అనగా లైట్‌ హౌస్‌ మరియు మైట్‌ హౌస్‌ స్థితిని అర్థం చేసుకొని అదే పురుషార్థంలో ఉండడం. విశేషంగా జ్ఞాన స్వరూపాన్ని అనుభవం చేస్తూ శక్తిశాలిగా అవ్వండి. దీని ద్వారా శ్రేష్ఠ ఆత్మలైన మీ శుభ వృత్తి లేక కళ్యాణ వృత్తి మరియు శక్తిశాలి వాతావరణం ద్వారా తపిస్తున్న, భ్రమిస్తున్న, పిలుస్తున్న అనేక ఆత్మలకు ఆనందం, శాంతి మరియు శక్తులు అనుభూతి అవ్వాలి. ఎలాగైతే అగ్నిలో ఏదైనా వస్తువును వేయడం వలన దాని నామ-రూపాలు, గుణాలు అన్నీ మారిపోతాయో అలా తండ్రి స్మృతిలో లగ్నమనే అగ్నిలో పడినప్పుడు పరివర్తన అయిపోతారు. మనుష్యుల నుండి బ్రాహ్మణులుగా అయిపోతారు మళ్లీ బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలుగా, ఫరిస్తాల నుండి దేవతలుగా అయిపోతారు. ఎలాగైతే పచ్చి మట్టిని మూసలో పోసి(భట్టీలో) అగ్నిలో వేసినప్పుడు అది ఇటుకగా అయిపోతుందో అలా మీరు కూడా పరివర్తన అయిపోతారు. అందువలన ఈ స్మృతినే 'జ్వాలా రూప స్మృతి' అని అంటారు. మీరు సేవాధారులుగా ఉన్నారు, స్నేహితులుగా ఉన్నారు, ఒకే బలం - ఒకే విశ్వాసం గలవారిగా ఉన్నారు, ఇదంతా సరిగ్గానే ఉంది. కాని మాస్టర్‌ సర్వశక్తివంతుల స్థితి అనగా లైట్‌ హౌస్‌, మైట్‌ హౌస్‌ స్థితిలోకి వచ్చేయాలి, స్మృతి జ్వాలా స్వరూపంగా అయిపోవాలి. అప్పుడు అందరూ మీ ముందు దీపపు పురుగుల సమానంగా చుట్టూ తిరగడం ప్రారంభిస్తారు. జ్వాలా స్వరూప స్మృతి కొరకు మనసు, బుద్ధి రెండిటికీ - ఒకటేమో శక్తిశాలి బ్రేక్‌ కావాలి, అంతేకాక తిప్పుకునే శక్తి కావాలి. దీని ద్వారా బుద్ధి శక్తి లేక ఏ ఇతర శక్తీ వ్యర్థమవ్వకుండా జమ అవుతూ ఉంటుంది. ఎంతగా జమ అవుతుందో అంతగా పరిశీలించే శక్తి, నిర్ణయించే శక్తి పెరుగుతాయి. దీని కొరకు ఇప్పుడు సంకల్పాల పరుపును చుట్టి వేస్తూ వెళ్లాలి అనగా సర్దుకునే శక్తిని ధారణ చేయండి. ఏ కార్యము చేస్తున్నా లేక మాట్లాడుతున్నా మధ్య మధ్యలో సంకల్పాల ట్రాఫిక్‌ను ఆపేయండి. ఒక్క నిముషం కోసమైనా మనసులోని సంకల్పాలను, శరీరం ద్వారా చేస్తున్న కర్మలను మధ్యలో ఆపి కూడా ఈ అభ్యాసాన్ని చేయండి. అప్పుడు బిందురూపీ శక్తిశాలి స్థితిలో స్థితులవ్వగలరు. ఎలాగైతే అవ్యక్త స్థితిలో ఉండి కార్యం చేయడం సరళమవుతూ ఉందో, అలా ఈ బిందు రూప స్థితి కూడా సహజమైపోతుంది. ఎలాగైతే ఏవైనా కీటాణువులను చంపేందుకు డాక్టర్లు కరెంట్‌ కిరణాలను ఇస్తారో, అలా స్మృతి యొక్క శక్తిశాలి కిరణాలు ఒక్క సెకనులో అనేక వికర్మల రూపీ కీటాణువులను భస్మం చేసేస్తాయి. వికర్మలు భస్మం అయిపోతే స్వయాన్ని తేలికగా, శక్తిశాలిగా అనుభవం చేస్తారు. నిరంతర సహజ యోగులుగానే ఉన్నారు కేవలం ఈ స్మృతి యొక్క స్థితిని మధ్య మధ్యలో శక్తిశాలిగా తయారు చేసుకునేందుకు అటెన్షన్‌ అనే ఫోర్సును నింపుతూ ఉండండి. పవిత్రతను సంపూర్ణ రూపంలో ధారణ చేసినప్పుడు మీ శ్రేష్ఠ సంకల్పాల శక్తి లగ్నమనే అగ్నిని ప్రజ్వలితం చేస్తుంది. ఆ అగ్నిలో చెత్త అంతా భస్మమైపోతుంది. తర్వాత ఏమి ఆలోచిస్తారో అదే జరుగుతుంది. సేవ స్వతహాగా విహంగ మార్గంలో జరిగిపోతుంది. జ్వాల ద్వారా అసురులను భస్మం చేసేశారని దేవీల స్మృతిచిహ్నంలో చూపిస్తారు. ఆసురులను కాదు, ఆసురీ శక్తులను సమాప్తం చేసేస్తారు. ఇది ఇప్పటి స్మృతిచిహ్నమే. ఇప్పుడు జ్వాలాముఖులుగా అయ్యి ఆసురీ సంస్కారాలను, స్వభావాలనన్నిటిని భస్మం చేసేయండి. ప్రకృతి మరియు ఆత్మలలోని తమోగుణమేదైతే ఉందో దానిని భస్మం చేసేవారిగా అవ్వండి. ఇది చాలా గొప్ప పని. వేగంగా చేసినప్పుడే పూర్తవుతుంది. ఏదైనా లెక్కాచారం ఈ జన్మదైనా, వెనుకటి జన్మదైనా లగ్నమనే అగ్ని స్వరూప స్థితి లేకుండా భస్మం అవ్వదు. సదా అగ్ని స్వరూప స్థితి అనగా జ్వాలా రూప శక్తిశాలి స్మృతి. బీజరూప స్థితి, లైట్‌హౌస్‌, మైట్‌హౌస్‌ స్థితిలో పాత లెక్కాచారాలన్నీ భస్మమైపోతాయి. అంతేకాక మిమ్ములను మీరు డబల్‌లైట్‌గా అనుభవం చేస్తారు. స్మృతి లింకు సదా జోడించి ఉన్నప్పుడే శక్తిశాలి జ్వాలా స్వరూప స్థితి ఉంటుంది. ఒకవేళ పదే పదే లింకు తెగిపోతూ ఉంటే, దానిని జోడించేందుకు సమయం కూడా పడ్తుంది, శ్రమ కూడా కలుగుతుంది. శక్తిశాలిగా అయ్యేందుకు బదులు బలహీనంగా అయిపోతారు. స్మృతిని శక్తిశాలిగా చేసేందుకు విస్తారంలోకి వెళ్తూ సార స్థితిలో ఉండేందుకు చేయు అభ్యాసం తక్కువ అవ్వరాదు. విస్తారంలో సారాన్ని మర్చిపోరాదు. తినండి, త్రాగండి, సేవ చేయండి. కానీ అతీతత్వాన్ని మర్చిపోకండి. సాధన అనగా శక్తిశాలి స్మృతి. నిరంతరం తండ్రితో హృదయపూర్వక సంబంధం. కేవలం యోగంలో కూర్చుండిపోతే దానిని సాధన అని అనరు. కానీ ఏ విధంగా శరీరంతో కూర్చుంటారో, అదే విధంగా హృదయం, మనసు, బుద్ధి ఒక్క తండ్రితో జోడించి, తండ్రి జత జతలో కూర్చుండిపోవాలి. ఇటువంటి ఏకాగ్రతయే జ్వాలను ప్రజ్వలింపజేస్తుంది. స్మృతియాత్ర సహజంగా కూడా ఉండాలి, శక్తిశాలిగా కూడా ఉండాలి. శక్తిశాలి స్మృతి ఒకే సమయంలో డబల్‌ అనుభవం చేయిస్తుంది. ఒకవైపు స్మృతి అగ్నిగా అయ్యి భస్మం చేసే పని చేస్తుంది, రెండవ వైపు సంతోషం మరియు తేలికదనాన్ని అనుభవం చేయిస్తుంది. అటువంటి విధి పూర్వకమైన స్మృతినే యధార్థమైన మరియు శక్తిశాలి స్మృతి అని అంటారు. 

వరదానము :- ''స్నేహమనే లిఫ్ట్‌ ద్వారా ఎగిరేకళను అనుభవం చేసే అవినాశి స్నేహీ భవ''
శ్రమ నుండి ముక్తులుగా అయ్యేందుకు తండ్రికి స్నేహితులుగా అవ్వండి. ఈ అవినాశి స్నేహమే అవినాశీ లిఫ్ట్‌గా అయ్యి ఎగిరేకళను అనుభవం చేయిస్తుంది. కానీ ఒకవేళ స్నేహంలో నిర్లక్ష్యం ఉంటే తండ్రి నుండి కరెంటు(శక్తి) లభించదు. కనుక లిఫ్ట్‌ పని చేయదు. ఎలాగైతే లైట్‌ (కరెంట్‌) ఆగిపోవడం వలన, కనెక్షన్‌ తెగిపోవడం వలన లిఫ్ట్‌ ద్వారా సుఖానుభూతిని పొందజాలమో అదే విధంగా స్నేహం(ప్రేమ) తక్కువగా ఉంటే, శ్రమ అనుభవమవుతుంది. కావున అవినాశీ స్నేహితునిగా అవ్వండి. 

స్లోగన్‌ :- ''శుభ సంకల్పం మరియు దివ్యబుద్ధి అనే యంత్రం ద్వారా తీవ్ర గతితో ఎగురుతూ ఉండండి''
 

Telugu Murli 10/02/18

10-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - సాకార శరీరాన్ని గుర్తు తెచ్చుకోవడం కూడా భూతాల అభిమానులుగా అవ్వడం. ఎందుకంటే శరీరము పంచ భూతాలతో తయారు చేయబడింది. మీరు దేహీ-అభిమానులుగా అయ్యి ఒక్క విదేహి తండ్రినే స్మృతి చేయాలి'' 

ప్రశ్న :- ఒక్క తండ్రియే చేసే అన్నింటికంటే సర్వోత్తమమైన కార్యము ఏది ?
జవాబు :- ఈ మొత్తము తమోప్రధాన సృష్టినంతా సతోప్రధానంగా, సదా సుఖవంతముగా తయారు చేయడమే అన్నింటికంటే సర్వోత్తమ కార్యము. ఇది ఒక్క తండ్రియే చేస్తారు. ఈ శ్రేష్ఠమైన కార్యము కారణంగా వారి స్మృతి చిహ్నాలు కూడా చాలా ఉన్నతాతి ఉన్నతంగా తయారు చేయబడ్డాయి.

పాట :- సభలో దీపము వెలిగింది, ....... (మహఫిల్‌ మే జల్‌ ఉఠీ శమా,............)
ఓంశాంతి. భగవంతుడు కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - మనుష్యులను భగవంతుడని అనడానికి వీలు లేదు. బ్రహ్మ, విష్ణు, శంకరులకు కూడా చిత్రాలు(శరీరాలు) ఉన్నాయి. కావున వారిని కూడా భగవంతుడని అనడానికి వీలు లేదు. పరమపిత పరమాత్మ నివాసము, వారి నివాసము కంటే ఉన్నతమైనది. వారిని మాత్రమే ప్రభూ! ఈశ్వరా! భగవంతుడా! అని మొదలైన పేర్లతో పిలుస్తారు. మనుష్యులు వారిని పిలిచినప్పుడు, వారికి ఏ ఆకారము గాని, సాకారమూర్తి గాని కనిపించదు. అందువలన ఏ మనిషి ఆకారమునైనా వారు భగవంతుడని అనేస్తారు. సన్యాసులను చూచినా భగవాన్‌ అని అనేస్తారు. కాని భగవంతుడు స్వయంగా అర్థం చేయిస్తున్నారు - మనుష్యులను భగవంతుడని అనడానికి వీలు లేదు. నిరాకార భగవంతుని అయితే ఎంతగానో స్మృతి చేస్తారు. ఎవరైతే గురువులను ఆశ్రయించలేదో వారికి, చిన్న పిల్లలకు కూడా పరమాత్మను స్మృతి చేయమని నేర్పిస్తారు. కాని ఏ పరమాత్మను స్మృతి చేయాలో వారికి తెలుపబడదు. ఏ చిత్రమూ బుద్ధిలో ఉండదు. దు:ఖ సమయాలలో ఓ ప్రభూ! అని అంటారు. అప్పుడు ఏ గురువు చిత్రము కాని, దేవతల చిత్రము కాని, ఇక ఏ ఇతర చిత్రము గాని వారి ముందుకు రాదు. భలే చాలామంది గురువులను అశ్రయించినా, వారు ఓ భగవంతుడా! అని అన్నప్పుడు వారికి ఎప్పుడూ గురువులు గుర్తుకు రారు. ఒకవేళ గురువును తలుచుకొని వారినే భగవంతుడని అన్నట్లయితే ఆ మనిషి కూడా జనన- మరణాలలోకి వచ్చేవాడే అనగా ఇది పంచ తత్వాలతో తయారైన శరీరాన్ని స్మృతి చేసినట్లవుతుంది. శరీరాన్ని పంచ భూతాలని అంటారు. ఆత్మను భూతమని అనరు. అందువలన అది భూత పూజ వంటిదే. బుద్ధియోగము శరీరము వైపు వెళ్ళిపోతుంది. ఒకవేళ ఎవరైనా మనుష్యులను భగవంతుడని భావిస్తే అతనిలో ఉన్న ఆత్మను స్మృతి చేసినట్లు కాదు. ఆత్మ అయితే ఇరువురిలోనూ ఉంది. స్మృతి చేసేవారిలో కూడా ఉంది, ఎవరిని స్మృతి చేస్తారో వారిలో కూడా ఉంది. పరమాత్మనైతే సర్వవ్యాపి అని అంటారు. అయితే పరమాత్మను పాపాత్మ అని అనరు. వాస్తవంలో పరమాత్మ అనే పదము వెలువడినప్పుడు బుద్ధి నిరాకారము వైపు వెళ్ళిపోతుంది. నిరాకార తండ్రిని నిరాకార ఆత్మ స్మృతి చేస్తుంది. దానిని దేహీ-అభిమానము అని అంటారు. సాకార శరీరాన్ని స్మృతి చేయువారు, భూతాల అభిమానులు. భూతము, భూతాన్ని స్మృతి చేస్తుంది. ఎందుకంటే స్వయాన్ని ఆత్మగా భావించేందుకు బదులు 5 భూతాల శరీరంగా భావిస్తారు. పేరు కూడా శరీరానికే ఉంటుంది. స్వయాన్ని కూడా 5 తత్వాల భూతంగా భావిస్తారు. ఆ గురువులను కూడా శరీరముగానే స్మృతి చేస్తారు. దేహీ-అభిమానులుగా అయితే లేనే లేరు. స్వయాన్ని నిరాకార ఆత్మగా భావిస్తే నిరాకార పరమాత్మను స్మృతి చేయగలరు. సర్వాత్మల సంబంధము మొట్టమొదట పరమాత్మతో ఉంది. ఆత్మ దు:ఖములో ఉన్నప్పుడు పరమాత్మనే స్మృతి చేస్తుంది ఎందుకంటే వారితో సంబంధముంది. వారు ఆత్మలను అన్ని దు:ఖాల నుండి విడిపిస్తారు. వారిని దీపము అని కూడా అంటారు. అలాగని దీపము, వత్తి విషయము కాదు. వారు పరమపిత పరమాత్మ. దీపము అంటూనే మనుష్యులు జ్యోతిగా భావిస్తారు. తండ్రి స్వయంగా అర్థం చేయిస్తున్నారు - నేను పరమాత్మను, నా పేరు శివ. శివుని, రుద్రుడని కూడా అంటారు. ఆ నిరాకారునికే అనేక పేర్లున్నాయి. ఇతరులెవ్వరికీ ఇన్ని పేర్లు లేవు. బ్రహ్మ, విష్ణు, శంకరులకు ఒక్కొక్క పేరు మాత్రమే ఉంది. దేహధారులందరికీ ఒక్కొక్క పేరు మాత్రమే ఉంటుంది. ఒక్క ఈశ్వరునికి మాత్రమే అనేక పేర్లు ఇవ్వబడ్తాయి. వారి మహిమ అపారమైనది. మనుష్యులకు ఒకే పేరు స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు మీరు మరజీవగా అయ్యారు. కనుక పాతదంతా మర్చిపోవాలని మీకు మరొక పేరు పెట్టారు. మీరు పరమపిత పరమాత్మ ముందు జీవించి ఉండే మరణిస్తారు కనుక ఇది మీ మరుజీవా జన్మ. మాత-పితల వద్ద తప్పకుండా జన్మ తీసుకోబడ్తుంది. ఈ రహస్యమైన విషయాలు తండ్రి కూర్చొని మీకు అర్థం చేయిస్తున్నారు. ప్రపంచములోని వారికైతే శివుడంటే ఎవరో తెలియదు. బ్రహ్మ, విష్ణు, శంకరులను గురించి తెలుసు. బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి అని కూడా అంటారు. బ్రహ్మ ద్వారా స్థాపన అని కూడా కేవలం విన్నారు కాని ఎలా జరుగుతుందో తెలియదు. ఇప్పుడు క్రియేటర్‌ తప్పక నూతన ధర్మాన్ని, నూతన ప్రపంచమునే రచిస్తారు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ కులమునే రచిస్తారు. బ్రాహ్మణులైన మీరు బ్రహ్మను స్మృతి చేయరు. పరమపిత పరమాత్మను స్మృతి చేస్తారు ఎందుకంటే మీరు బ్రహ్మ ద్వారా శివునివారిగా అయ్యారు. బయటి ప్రపంచములో ఉన్న దేహాభిమానులైన బ్రాహ్మణులు, మీలాగా తమను బ్రహ్మకు పిల్లలము, శివుని పౌత్రులమని అనరు. శివబాబా జయంతిని జరుపుకుంటారు కాని వారిని గురించి తెలియనందున వారి పై గౌరవము లేదు. వారి మందిరానికి వెళ్తారు. వీరు బ్రహ్మ, విష్ణు, శంకరులు గాని, లక్ష్మీనారాయణులు గాని కారని భావిస్తారు. వారు తప్పకుండా నిరాకార పరమాత్మ. మిగిలిన పాత్రధారులందరికీ వారి వారి పాత్రలు వారికున్నాయి. పునర్జన్మలు తీసుకుంటారు, తమ పేర్లను ధరిస్తారు. పరమపిత పరమాత్మ ఒక్కరికి మాత్రమే వ్యక్త నామ-రూపాలు లేవు. కాని మూఢమతులైన మనుష్యులు అర్థము చేసుకోరు. పరమాత్మ స్మృతి చిహ్నము ఉందంటే, వారు తప్పకుండా వచ్చి ఉంటారు, స్వర్గము రచించి ఉంటారు. లేకుంటే స్వర్గాన్ని ఎవరు రచిస్తారు? ఇప్పుడు మళ్లీ వచ్చి ఈ రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. దీనిని యజ్ఞమని అంటారు ఎందుకంటే ఇందులో స్వాహా అవ్వవలసి ఉంటుంది. యజ్ఞాలనైతే చాలా మంది మనుష్యులు రచిస్తారు. ఆ యజ్ఞాలన్నీ భక్తిమార్గములోని స్థూల యజ్ఞాలు, ఈ యజ్ఞాన్ని స్వయం పరమపిత పరమాత్మయే వచ్చి రచిస్తారు, పిల్లలను చదివిస్తారు. యజ్ఞము రచించినప్పుడు అందులో కూడా బ్రాహ్మణులు శాస్త్రాలు, కథలు మొదలైనవి వినిపిస్తారు. ఈ తండ్రి అయితే జ్ఞానసాగరులు. ఈ గీత, భాగవతము మొదలైన శాస్త్రాలన్నీ భక్తిమార్గానికి చెందినవని అంటారు. ఈ స్థూల యజ్ఞాలు కూడా భక్తిమార్గానికి చెందినవి. ఈ సమయమే భక్తిమార్గానికి చెందినది. కలియుగ అంత్యము వచ్చినప్పుడు భక్తి కూడా అంత్యములోకి వస్తుంది. అప్పుడే భగవంతుడు వచ్చి కలుసుకుంటారు. ఎందుకంటే భక్తికి ఫలమునిచ్చేది వారే. వారిని జ్ఞాన సూర్యులని అంటారు. జ్ఞాన చంద్రుడు, జ్ఞాన సూర్యుడు, జ్ఞాన అదృష్ట నక్షత్రాలు. తండ్రి జ్ఞాన సూర్యుడు. ఇప్పుడు తల్లి జ్ఞానచంద్రుడు కూడా కావాలి. కనుక ఏ శరీరములో ప్రవేశించారో అతడు జ్ఞాన చంద్రుడు, మాత అయ్యాడు. మిగిలినవారంతా పిల్లలు, జ్ఞాన నక్షత్రాలు. ఈ లెక్క ప్రకారము జగదంబ కూడా లక్కీ(అదృష్ట) నక్షత్రమే. ఎందుకంటే అందరూ పిల్లలే కదా. నక్షత్రాలలో కొన్ని అన్నింటికంటే తీక్షణమైనవి కూడా ఉంటాయి. అలాగే ఇచ్చట కూడా నంబరువారుగా ఉన్నారు. వారు స్థూల ఆకాశములోని సూర్య చంద్రులు, నక్షత్రాలు. ఇది జ్ఞాన విషయము. అవి నీటి నదులు, వీరు జ్ఞాన నదులు. జ్ఞాన నదులు జ్ఞాన సాగరుని నుండి వెలువడ్డారు.

ఇప్పుడు శివజయంతి జరుపుకుంటారు. తప్పకుండా సృష్ట్టి అంతటికీ తండ్రి అయినవారు వస్తారు. వారు వచ్చి తప్పకుండా స్వర్గమును రచించి ఉంటారు. ప్రాయ: లోపమైపోయిన ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేసేందుకు తండ్రి వస్తారు. ప్రభుత్వము కూడా ఏ ధర్మాన్ని అంగీకరించదు. మాకు ఏ ధర్మము లేదని అంటారు. వారు సత్యమే చెప్తున్నారు. భారతదేశ ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ప్రాయ: లోపమైపోయిందని తండ్రి కూడా చెప్తున్నారు. ధర్మములో శక్తి ఉంటుంది. భారతవాసులు తమ దేవీదేవతా ధర్మములో ఉన్నప్పుడు చాలా సుఖంగా ఉండేవారు. ఈ ప్రపంచములో సర్వశక్తివంతమైన రాజ్యముండేది. పురుషోత్తములు రాజ్యపాలన చేసేవారు. శ్రీ లక్ష్మీనారాయణులనే పురుషోత్తములని అంటారు. నంబరువారుగా ఉన్నతులు, అధములు ఉండనే ఉంటారు. సర్వోత్తమ పురుషులు, ఉత్తమ పురుషులు, మధ్యమ పురుషులు, కనిష్ఠ పురుషులు ఉండనే ఉంటారు. మొట్టమొదట అందరికంటే సర్వోత్తమ పురుషులుగా ఎవరవుతారో వారే మళ్లీ మధ్యమ, కనిష్ఠ పురుషులుగా అవుతారు. లక్ష్మీనారాయణులు పురుషోత్తములు. పురుషులందరిలో ఉత్తములు. తర్వాత క్రిందికి దిగినప్పుడు దేవతల నుండి క్షత్రియులుగా, క్షత్రియుల నుండి మళ్లీ వైశ్యులుగా, కనిష్ఠులైన శూద్రులుగా అవుతారు. సీతారాములను కూడా పురుషోత్తములని అనరు. రాజులందరికీ రాజులు, సర్వోత్తమ సతోప్రధాన పురుషోత్తములు లక్ష్మీనారాయణులు. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో కూర్చున్నాయి. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుందో మీకు తెలుసు. మొట్టమొదట ఉత్తములు, తర్వాత మధ్యములు, తర్వాత కనిష్ఠులుగా అవుతారు. ఈ సమయములో మొత్తం ప్రపంచమంతా తమోప్రధానంగా ఉంది. ఇదంతా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. వారి జయంతినే ఇప్పుడు జరుపుకుంటాము. ఇప్పటికి 5 వేల సంవత్సరాల క్రితము పరమపిత పరమాత్మ అయిన శివుడు వచ్చారు. అలా రాకుంటే శివజయంతి ఎందుకు జరుపుకుంటారు! పరమపిత పరమాత్మ తప్పకుండా పిల్లల కొరకు బహుమతి తీసుకొని వస్తారు. తప్పకుండా సర్వోత్తమ కార్యము చేస్తారు. మొత్తము తమోప్రధాన సృష్టిని సతోప్రధానంగా సదా సుఖవంతంగా తయారు చేస్తారు. ఎంత ఉన్నతమైనవారో అంత ఉన్నతమైన స్మృతి చిహ్నము కూడా ఉండేది. ఆ మందిరాన్ని దోచుకొని తీసుకుపోయారు. మనుష్యులు దండెత్తి వచ్చేది ధనము కొరకే. ధనము కొరకు విదేశాల నుండి కూడా వచ్చారు. ఆ సమయంలో కూడా చాలా ధనముండేది. కాని మాయా రావణుడు భారతదేశాన్ని గవ్వ సమానంగా చేసేశాడు. తండ్రి వచ్చి వజ్ర తుల్యంగా తయారు చేస్తారు. ఇటువంటి శివబాబాను గురించి ఎవ్వరికీ తెలియదు. సర్వవ్యాపి అని అంటారు. ఇలా అనడం కూడా తప్పే. నావను ఆవలి తీరానికి చేర్చే సద్గురువు ఒక్కరే. నావను ముంచి వేసేవారు అనేక మంది ఉన్నారు. అందరూ విషయసాగరములో మునిగిపోయి ఉన్నారు. అందుకే ఈ సార విహీన ప్రపంచమైన విషయసాగరము నుండి, క్షీరసాగరమైన ఆవలి తీరానికి తీసుకెళ్ళండి అని అంటారు. విష్ణువు క్షీరసాగరములో ఉంటారని గాయనము కూడా ఉంది. స్వర్గాన్ని క్షీరసాగరమని అంటారు. అచ్చట లక్ష్మీనారాయణులు రాజ్యపాలన చేస్తారు. అంతేకాని అచ్చట విష్ణువు క్షీర సాగరములో విశ్రాంతి తీసుకుంటారని కాదు. వారు పెద్ద చెరువును తయారు చేసి దాని మధ్యలో విష్ణువునుంచుతారు. విష్ణువును కూడా చాలా పెద్దగా తయారుచేస్తారు. లక్ష్మీనారాయణులు అంత పెద్దగా అయితే ఉండరు. ఎక్కువలో ఎక్కువ ఆరడుగులు ఉంటారు. పాండవుల చిత్రాలు కూడా చాలా పెద్ద పెద్దవి తయారుచేస్తారు. రావణుని బొమ్మను ఎంతో పెద్దదిగా చేస్తారు. పెద్ద పేరుంది కావున చిత్రము కూడా పెద్దదిగా చేస్తారు. బాబా పేరు భలే గొప్పది కాని వారి చిత్రము చాలా చిన్నది. అర్థము చేసుకునేందుకు ఇంత పెద్ద రూపమును ఇచ్చేశారు. తండ్రి అంటున్నారు - నాకు ఇంత పెద్ద రూపము లేదు. ఆత్మ ఎలాగైతే చిన్నదిగా ఉంటుందో పరమాత్మ అయిన నేను కూడా నక్షత్రము వలె ఉన్నాను. వారిని సుప్రీమ్‌ సోల్‌ అని అంటారు. వారు అందరికంటే ఉన్నతులు. వారిలోనే పూర్తి జ్ఞానమంతా నిండి ఉంది. మనుష్య సృష్టికి బీజరూపులు, జ్ఞానసాగరులు, చైతన్య ఆత్మ అని వారి మహిమ గాయనము చేయబడింది. కాని వినిపించవలసినప్పుడు అవయవాలను(శరీరము) తీసుకుంటారు. ఉదాహరణకు చిన్న బాలుడు తన చిన్న అవయవాల ద్వారా మాట్లాడలేడు. పెద్దవాడైనప్పుడు శాస్త్రాలు మొదలైనవి చూస్తూనే పూర్వ జన్మ సంస్కారాలు స్మృతిలోకి వచ్చేస్తాయి. ఇప్పుడు తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - నేను మళ్లీ 5 వేల సంవత్సరాల తర్వాత మీకు అదే రాజయోగము నేర్పించేందుకు వచ్చాను. కృష్ణుడు ఏ రాజయోగాన్ని నేర్పలేదు. అతడు ప్రాలబ్ధాన్ని అనుభవించాడు. 8 జన్మలు సూర్యవంశము, 12 జన్మలు చంద్రవంశము, మళ్లీ 63 జన్మలు వైశ్య, శూద్ర వంశములలో వచ్చాడు. ఇప్పుడిది అందరిదీ అంతిమ జన్మ. ఈ విషయాలు కృష్ణుని ఆత్మ కూడా వింటున్నది. మీరు కూడా వింటున్నారు. ఇది సంగమయుగీ బ్రాహ్మణుల వర్ణము. మళ్లీ మీరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. బ్రాహ్మణ ధర్మము, సూర్యవంశీ దేవతా ధర్మము, చంద్రవంశీ క్షత్రియ ధర్మము ఈ మూడింటి స్థాపకులు ఒక్క పరమపిత పరమాత్మయే. అందువలన ఈ మూడు ధర్మాల శాస్త్రము కూడా ఒక్కటిగానే ఉండాలి. వేరు వేరు శాస్త్రాలేవీ లేవు. బ్రహ్మ ఎంతో పెద్దవాడు. అందరికీ తండ్రి ప్రజాపిత. అతడి శాస్త్రము కూడా ఏదీ లేదు. ఒక్క గీతలోనే భగవానువాచ అని ఉంది. బ్రహ్మ భగవానువాచ అని లేదు. ఇది బ్రహ్మ ద్వారా శివ భగవానువాచ. దాని ద్వారా శూద్రులను పరివర్తన చేసి బ్రాహ్మణులుగా తయారు చేయడం జరుగుతుంది. బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు. ఎవరైతే పాస్‌ అవ్వరో వారు క్షత్రియులుగా అవుతారు, రెండు కళలు తగ్గిపోతాయి. ఎంతో బాగా అర్థం చేయిస్తారు! అత్యంత ఉన్నతమైనవారు పరమపిత పరమాత్మ తర్వాత బ్రహ్మ, విష్ణు, శంకరులు. వారిని కూడా పురుషోత్తములని అనరు. ఎవరైతే పురుషోత్తములుగా అవుతారో మళ్లీ వారే కనిష్ఠులుగా కూడా అవుతారు. మనుష్యులలో సర్వోత్తములు లక్ష్మీనారాయణులు. వారి మందిరాలు కూడా ఉన్నాయి. కాని వారి మహిమను గూర్చి ఎవ్వరికీ తెలియదు. కేవలం పూజలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు పూజారుల నుండి పూజ్యులుగా అవుతూ ఉన్నారు. మాయ మళ్లీ పూజారులుగా చేసేస్తుంది. డ్రామా అలా తయారై ఉంది. నాటకమెప్పుడు పూర్తి అవుతుందో, అప్పుడు నేను రావలసి వస్తుంది. మళ్లీ వృద్ధి అగుట కూడా ఆటోమేటిక్‌గా(స్వతహాగా) నిలిచిపోతుంది. పిల్లలైన మీరు మళ్లీ వచ్చి మీ మీ పాత్రలు రిపీట్‌ చేయాలి. ఇది పరమపిత పరమాత్మ స్వయంగా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గములో వారి జయంతిని జరుపుతారు. ఇలా జరుపుతూనే ఉంటారు. స్వర్గములో అయితే ఎవ్వరి జయంతినీ జరుపుకోరు. కృష్ణుడు, రాముడు మొదలైన వారి జయంతులు కూడా జరుపుకోరు. ఎందుకంటే వారు ప్రాక్టికల్‌గా అక్కడే ఉంటారు. వీరు ఉండి వెళ్ళిపోయారు అందుకే శివజయంతిని జరుపుకుంటారు. అచ్చట ప్రతి సంవత్సరము కృష్ణుని పుట్టిన రోజు జరుపుకోరు. అచ్చట సదా సంతోషమే ఉంటుంది కనుక జన్మ దినము జరుపుకునే అవసరము లేదు. పిల్లల పేర్లు అయితే మాతా-పితలే పెెడ్తారు. అచ్చట గురువే ఉండడు. వాస్తవానికి ఈ విషయాలకు, జ్ఞాన యోగాలకు ఏ సంబంధమూ లేదు. పోతే అచ్చటి సంప్రదాయాలు, ఆచారాలేమిటో అడగవలసి వస్తుంది. అచ్చటి నియమానుసారము ఎలా ఉంటే అలా జరుగుతాయని, మీరు అడిగే అవసరమే లేదని బాబా అంటారు. మొదట శ్రమ చేసి మీ పదవిని ప్రాప్తి చేసుకోండి. అర్హులుగా అవ్వండి. తర్వాత అడగండి. డ్రామాలో ఏదో ఒక నియమముంటుంది. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.


ధారణ కొరకు ముఖ్య సారము:-
1. స్వయాన్ని నిరాకార ఆత్మగా భావించి నిరాకార తండ్రిని స్మృతి చేయాలి. ఏ దేహధారినీ స్మృతి చేయరాదు. మరజీవాగా అయ్యి పాత విషయాలను బుద్ధి నుండి మర్చిపోవాలి.
2. తండ్రి రచించిన ఈ రుద్ర యజ్ఞములో సంపూర్ణంగా స్వాహా అవ్వాలి. శూద్రులను బ్రాహ్మణ ధర్మములోకి పరివర్తన చేసే సేవ చేయాలి.

వరదానము :- ''మీ విల్‌ పవర్‌ ద్వారా ప్రతి ఒక్కరిచే విల్లు చేయించే శ్రేష్ఠ సేవాధారీ భవ''
వర్తమాన సమయంలో చాలామంది ఆత్మలు మీ సహయోగము కొరకు దాహముతో చాత్రక పక్షి వలె ఉన్నారు. అయితే వారికి తమ స్వంత శక్తి లేదు. వారికి మీరు విశేషంగా మీ శక్తుల సహాయాన్ని ఇవ్వవలసి ఉంటుంది. అందుకు నిమిత్తంగా ఉన్న సేవాధారులలో సర్వశక్తుల పవర్‌ అవసరము. ఎలాగైతే బ్రహ్మాబాబా చివర్లో పిల్లలకు శక్తులను విల్‌ చేశాడో, ఆ విల్లు ద్వారా ఈ కార్యము జరుగుతూ ఉందో అలా తండ్రిని అనుసరించండి. మీ శక్తులను ఆత్మల పట్ల విల్లు చేస్తే సమయ ప్రమాణంగా(సమయానుసారంగా) సేవ సంపన్నమైపోతుంది. 

స్లోగన్‌ :- ''ఎక్కడైతే ఏకత మరియు ఏకాగ్రతా శక్తి ఉందో, అక్కడ సఫలత సహజంగా ప్రాప్తి అవుతుంది.''
 

Thursday, 8 February 2018

Telugu Murli 09/02/18

09-02-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

''మధురమైన పిల్లలారా - ఉదయము ఉదయమే లేచి గాఢమైన ప్రేమతో బాబాకు గుడ్‌మార్నింగ్‌ చెప్పండి, తర్వాత జ్ఞాన చింతన చేస్తే ఖుషీ పాదరస మీటరు పైకెక్కి ఉంటుంది'' 

ప్రశ్న :- ఆక్యురేట్‌(కరెక్ట్‌, ఖచ్ఛితమైన) స్మృతి అనగా ఏమిటి ? దాని గుర్తులేవి ?
జవాబు :- ధైర్యము(ఓర్పు) 2. గంభీరత 3. వివేకము(జ్ఞానము/తెలివి)....... వీటి ద్వారా తండ్రిని స్మృతి చేయడమే ఖచ్ఛితమైన స్మృతి. ఎవరైతే యదార్థముగా స్మృతి చేస్తారో, వారికి కరెంటు(శక్తి) ఎక్కువగా లభిస్తుంది, పాప భారము తగ్గుతూ పోతుంది, ఆత్మ సతోప్రధానమవుతూ ఉంటుంది, వారి ఆయువు పెరుగుతూ ఉంటుంది. వారికి బాబా నుండి సర్చ్‌ లైట్‌ లభిస్తుంది.

ఓంశాంతి. తండ్రి అంటున్నారు - మధురమైన పిల్లలూ, తత్ త్వం అనగా ఆత్మలైన మీరు కూడా శాంతిస్వరూపులు. ఆత్మలైన మీ అందరి స్వధర్మమే శాంతి. శాంతిధామము నుండి ఇచ్చటకు వచ్చి టాకీగా అవుతారు. పాత్ర చేసేందుకు మీకు ఈ కర్మేంద్రియాలు లభిస్తాయి. ఆత్మ చిన్నదిగా - పెద్దదిగా అవ్వదు. శరీరము చిన్నదిగా, పెద్దదిగా అవుతుంది. తండ్రి అంటున్నారు - నేను శరీరధారిని కాను. నేను పిల్లలను సన్ముఖములో కలుసుకునేందుకు రావలసి వస్తుంది. ఒక తండ్రి ఉన్నారనుకోండి. వారికి పిల్లలు జన్మిస్తే, ఆ పిల్లలు నేను పరంధామము నుండి జన్మ తీసుకొని తల్లిదండ్రులను కలుసుకునేందుకు వచ్చానని అనరు. భలే ఏదైనా నూతన ఆత్మ ఎవరి శరీరములో వచ్చినా లేక ఏదైనా పాత ఆత్మ ఎవరి శరీరములో ప్రవేశించినా తల్లిదండ్రులను కలుసుకునేందుకు వచ్చానని అనరు. తల్లిదండ్రులు వారికి ఆటోమేటిక్‌గా లభిస్తారు. ఇచ్చట ఇది నూతన విషయము. తండ్రి అంటున్నారు - నేను పరంధామము నుండి వచ్చి పిల్లలైన మీ సన్ముఖములో ఉన్నాను. పిల్లలకు మళ్లీ జ్ఞానమిస్తాను. ఎందుకంటే నేను జ్ఞానసాగరుడను, నాలెడ్జ్‌ఫుల్‌. నేను పిల్లలైన మిమ్ములను చదివించేందుకు, రాజయోగము నేర్పేందుకు వస్తాను. రాజయోగము నేర్పించేవారు భగవంతుడొక్కరే. కృష్ణుని ఆత్మకు ఈ ఈశ్వరీయ పాత్ర లేదు. ఎవరి పాత్ర వారిదే. ఈశ్వరుని పాత్ర ఈశ్వరునిదే.

ఈ డ్రామా ఎంత అద్భుతంగా తయారయ్యిందో కూడా ఇప్పుడు మీరు అర్థం చేయిస్తారు. ఇది పురుషోత్తమ సంగమ యుగము. ఇంత మాత్రము గుర్తున్నా, మేము సత్యయుగములోకి వెళ్లేవారమని పక్కా అయిపోతుంది. ఇప్పుడు సంగమ యుగములో ఉన్నారు తర్వాత మన ఇంటికి వెళ్లాలి. ఇంటికి వెళ్లాలంటే తప్పక పావనంగా అవ్వాలి. లోపల చాలా సంతోషముండాలి. ఓహో! అనంతమైన తండ్రి చెప్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా, నన్ను స్మృతి చేస్తే మీరు సతోప్రధానంగా అవుతారు, విశ్వానికి అధికారులుగా అవుతారు. తండ్రి పిల్లలను ఎంతగానో ప్రేమిస్తారు. కేవలం టీచరు రూపములో చదివించి ఇంటికి వెళ్లిపోరు. వీరు తండ్రి కూడా అయ్యారు, టీచరు కూడా అయ్యారు. మిమ్ములను చదివించుటే కాక స్మృతియాత్రను కూడా నేర్పిస్తారు.

ఇలా విశ్వానికి అధిపతులుగా తయారు చేసే, పతితుల నుండి పావనంగా తయారు చేసే తండ్రి పై చాలా ప్రేమ ఉండాలి. ఉదయము ఉదయము లేస్తూనే మొట్టమొదట శివబాబాకు గుడ్‌మార్నింగ్‌ చెప్పాలి. మీరు ఎంత ప్రీతితో స్మృతి చేస్తారో, అంత సంతోషంగా ఉంటారు. మేము ఉదయము లేచి అనంతమైన తండ్రిని ఎంతగా స్మృతి చేస్తున్నాము? అని పిల్లలు తమ మనస్సులో ప్రశ్నించుకోవాలి. మనుష్యులు భక్తి కూడా ఉదయమే చేస్తారు కదా. భక్తి ఎంతో ప్రీతిగా చేస్తారు. కాని చాలామంది పిల్లలు హృదయ పూర్వక ప్రేమతో స్మృతి చేయరని బాబాకు తెలుసు. ఉదయమే లేచి బాబాకు గుడ్‌మార్నింగ్‌ చెప్పి, జ్ఞాన చింతనలో ఉంటే సంతోషపు పాదరస మీటరు పైకెక్కుతుంది. తండ్రికి గుడ్‌మార్నింగ్‌ చెప్పకుంటే పాపాల భారము ఎలా దిగిపోతుంది? ముఖ్యమైనది స్మృతి. దీని వలన మీ భవిష్యత్తు కొరకు చాలా గొప్ప సంపాదన జరుగుతుంది. కల్ప-కల్పాంతరము ఈ సంపాదన ఉపయోగపడ్తుంది. చాలా ఓర్పు(సహనము)తో, గంభీరంగా, జ్ఞానపూర్వకంగా స్మృతి చేయవలసి ఉంటుంది. మేము బాబాను చాలా స్మృతి చేస్తామని మొరటు లెక్కాచారంగా అంటారు. కాని ఖచ్ఛితమైన స్మృతి చేయడంలో శ్రమ ఉంది. ఎవరైతే తండ్రిని ఎక్కువగా స్మృతి చేస్తారో వారికి కరెంటు ఎక్కువగా లభిస్తుంది. ఎందుకంటే స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. యోగము, జ్ఞానము రెండూ వేరు వేరు విషయాలు. యోగ సబ్జెక్టు వేరే. ఇది చాలా భారీ సబ్జెక్టు. యోగము ద్వారానే ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. స్మృతి చేయకుంటే సతోప్రధానంగా అవ్వడం అసంభవము. మంచి రీతిగా ప్రీతితో తండ్రిని స్మృతి చేస్తే ఆటోమేటిక్‌గా కరెంట్‌ లభిస్తుంది. ఆరోగ్యవంతముగా తయారై పోతారు. కరెంటు(శక్తి) వలన ఆయువు కూడా వృద్ధి చెందుతుంది. పిల్లలు స్మృతి చేస్తే బాబా కూడా సర్చిలైటును ఇస్తారు. తండ్రి ఎంతో గొప్ప ఖజానా పిల్లలైన మీకు ఇస్తారు.

శివబాబా మమ్ములను చదివిస్తున్నారని మధురమైన పిల్లలు పక్కాగా గుర్తుంచుకోవాలి. శివబాబా పతిత పావనులు. సద్గతిదాత కూడా అయ్యారు. సద్గతి అనగా స్వర్గములో రాజ్య పదవినిస్తారు. బాబా ఎంతో మధురమైనవారు. ఎంత ప్రీతిగా పిల్లలను కూర్చొని చదివిస్తారు! తండ్రి ఈ దాదా ద్వారా మనలను చదివిస్తారు. బాబా ఎంతో మధురమైనవారు. ఎంతగానో ప్రేమిస్తారు. ఏ కష్టమూ ఇవ్వరు. కేవలం నన్ను స్మృతి చేయండి. చక్రమును స్మృతి చేయండి అని చెప్తారు. తండ్రి స్మృతిలో హృదయము ఒక్కసారిగా శూన్యమైపోవాలి(పూర్తిగా నిల్చిపోవాలి). ఒక్క తండ్రి స్మృతే సతాయించాలి. ఎందుకంటే తండ్రి ద్వారా ఎంతో గొప్ప వారసత్వము లభిస్తుంది. స్వయాన్ని పరిశీలించుకోవాలి - నాకు తండ్రి పై ఎంత ప్రేమ ఉంది? నాలో దైవీగుణాలు ఎంతవరకు ఉన్నాయి? ఎందుకంటే పిల్లలైన మీరిప్పుడు ముళ్ల నుండి పుష్పాలుగా అవుతున్నారు. ఎంతెంత యోగములో ఉంటారో అంతంత ముళ్ళ నుండి పుష్పాలుగా, సతోప్రధానంగా అవుతూ పోతారు. పుష్పాలుగా తయారైన తర్వాత ఇచ్చట ఉండలేరు. పుష్పాల తోట అనగా స్వర్గము. ఎవరైతే చాలా ముళ్ళను పుష్పాలుగా చేస్తారో వారినే సత్యమైన సుగంధ పుష్పాలు అని అంటారు. ఎప్పుడూ ఎవ్వరికీ ముళ్ళు గుచ్చరు. క్రోధము కూడా చాలా పెద్ద ముల్లు. చాలామందికి దు:ఖమునిస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు ముళ్ళ ప్రపంచము నుండి ఆవలి తీరము పైకి వచ్చేశారు. మీరిప్పుడు సంగమ యుగములో ఉన్నారు. ఎలాగైతే తోటమాలి పుష్పాలను తీసి వేరే పాత్రలో ఉంచుతారో అలా పుష్పాలైన మిమ్ములను కూడా ఇప్పుడు సంగమ యుగమనే పాత్రలో వేరుగా ఉంచారు. తర్వాత పుష్పాలైన మీరు స్వర్గములోకి వెళ్ళిపోతారు. కలియుగములోని ముళ్ళు భస్మమైపోతాయి.

పారలౌకిక తండ్రి ద్వారా మనకు అవినాశి వారసత్వము లభిస్తుందని మధురమైన పిల్లలకు తెలుసు. సత్య సత్యమైన పిల్లలెవరైతే ఉన్నారో, ఎవరికి బాప్‌దాదా పై పూర్తి ప్రేమ ఉందో, వారికి చాలా సంతోషముంటుంది. మనము విశ్వానికి అధిపతులుగా అవుతాము. అయితే పురుషార్థము చేస్తేనే విశ్వానికి అధిపతులుగా చేయబడ్తారు. కేవలం మాటలతో అవ్వరు. అనన్య పిల్లలెవరైతే ఉన్నారో వారికి సదా ఇది గుర్తుంటుంది - '' మేము మా కొరకు మళ్లీ అదే సూర్యవంశీ, చంద్రవంశీ రాజధానిని స్థాపన చేస్తున్నాము''. తండ్రి అంటున్నారు - మధురమైన పిల్లలూ, మీరు ఎంతగా అనేకమందికి కళ్యాణము చేస్తారో, అంత మీకు ప్రతిఫలము లభిస్తుంది. చాలా మందికి దారి చూపుతే చాలామంది నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి. జ్ఞానరత్నాలతో ఒడిని నింపుకొని ఇతరులకు దానము చేయాలి. జ్ఞానసాగరుడు మీకు రత్నాలతో కూడిన పళ్ళెములను నిండుగా నింపి నింపి ఇస్తారు. ఎవరైతే ఆ రత్నాలను దానము చేస్తారో వారే అందరికి ప్రియమనిపిస్తారు. పిల్లల ఆంతరికములో చాలా సంతోషముండాలి. తెలివి గల పిల్లలెవరైతే ఉన్నారో వారు మేము బాబా నుండి పూర్తి వారసత్వము తీసుకుంటామని అంటారు. తండ్రికి పూర్తిగా అతుక్కొని పోతారు. తండ్రి పై చాలా ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ప్రాణదానమిచ్చే తండ్రి లభించారని వారికి తెలుసు. జ్ఞాన వరదానాన్ని ఎలా ఇస్తారంటే దాని ద్వారా మనము ఎటువంటి వారము ఎలా తయారవుతాము! దివాలా నుండి సంపన్నంగా అవుతాము. భండారమును ఎంతో నిండుగా, భర్‌పూర్‌గా చేసేస్తారు. తండ్రిని ఎంత స్మృతి చేస్తారో, అంత ప్రేమ ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది. సూది శుభ్రంగా ఉంటే అయస్కాంతము వైపు లాగబడుతుంది కదా. తండ్రి స్మృతి ద్వారా తుప్పు వదులుతూ పోతుంది. ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ గుర్తుకు రాకూడదు. ఉదాహరణానికి స్త్రీకి తన పతి పట్ల ఎంత ప్రేమ ఉంటుంది! మీకు కూడా నిశ్చితార్థము జరిగింది కదా. నిశ్చితార్థపు ఖుషీ ఎప్పుడైనా తగ్గిపోతుందా? శివబాబా అంటున్నారు - మధురమైన పిల్లలూ! నాతో మీకు నిశ్చితార్థము (సగాయీ) జరిగింది. బ్రహ్మతో కాదు. సగాయీ(నిశ్చితార్థము) పక్కా అయిన తర్వాత వారి స్మృతే సతాయించాలి.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురమైన పిల్లలూ! పొరపాట్లు చేయకండి. అజాగ్రత్తగా ఉండకండి. స్వదర్శన చక్రధారులుగా అవ్వండి. లైట్‌ హౌస్‌గా అవ్వండి. స్వదర్శన చక్రధారులయ్యే అలవాటు బాగుంటే మీరు జ్ఞానసాగరుల వలె అయిపోతారు. ఉదాహరణానికి విద్యార్థులు బాగా చదువుకొని టీచరుగా అవుతారు కదా! మీ వ్యాపారమే ఇది. అందరినీ స్వదర్శన చక్రధారులుగా చేయండి. అప్పుడే చక్రవర్తి రాజా-రాణులుగా అవుతారు. అందువలన బాబా సదా పిల్లలను ఇలా అడుగుతారు - '' పిల్లలూ, స్వదర్శన చక్రధారులై కూర్చొని ఉన్నారా? తండ్రి కూడా స్వదర్శన చక్రధారిగా ఉన్నారు కదా. మధురమైన పిల్లలైన మిమ్ములను వాపసు తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. పిల్లలైన మీరు లేకుంటే నాకు కూడా విశ్రాంతి ఉండదు, సుఖముండదు. సమయము వచ్చినప్పుడు అన్‌ఈజీ (బే ఆరామి)గా అవుతుంది. ఇప్పుడే పోవాలనిపిస్తుంది. పిల్లలు చాలా పిలుస్తారు. ఎందుకంటే చాలా దు:ఖములో ఉన్నారు. జాలి కలుగుతుంది. ఇప్పుడు పిల్లలైన మీరు ఇంటికి రావాలి. మళ్లీ అచ్చట నుండి మీ అంతకు మీరే సుఖధామానికి వెళ్ళిపోతారు. అచ్చట నేను మీకు సాథీగా(సహచరునిగా) ఉండను. మీ స్థితి అనుసారము మీ ఆత్మ వెళ్లిపోతుంది.

పిల్లలైన మీకు మేము ఆత్మిక విశ్వ విద్యాలయములో చదువుతున్నామనే నషా ఉండాలి. మనము ఈశ్వరీయ విద్యార్థులము, మనము మనుష్యుల నుండి దేవతలు లేక విశ్వానికి అధిపతులుగా అయ్యేందుకు చదువుతున్నాము. ఈ చదువు ద్వారా మనము అన్ని డిగ్రీలను పొందుకుంటాము. హెల్త్‌ ఎడ్యుకేషన్‌(ఆరోగ్యవంతులుగా అయ్యేందుకు చదువు) కూడా చదువుకుంటాము. క్యారెక్టర్‌ చక్కదిద్దుకునే జ్ఞానము కూడా చదువుకుంటాము. హెల్త్‌ మినిస్ట్రీ, ఫుడ్‌ మినిష్ట్రీ, ల్యాండ్‌ మినిష్ట్రీ, బిల్డింగ్‌ మినిష్ట్రీ అన్ని మినిష్ట్రీలు ఇందులో వచ్చేస్తాయి. మీరు చాలా పెద్ద ట్రిజరర్‌(కోశాధికారి) కూడా. మీ వద్ద ఉండే ఖజానా వంటి అమూల్య ఖజానాలు ఇతరులెవ్వరి వద్ద ఉండజాలవు. ఈ విధంగా పిల్లలైన మీరు విచార సాగర మథనము చేసి ఆత్మిక నషాలో ఉండాలి.

మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు - ఏదైనా సభలో ఉపన్యసించునప్పుడు లేక ఎవరికైనా అర్థము చేయించునప్పుడు మాటి మాటికి స్వయాన్ని ఆత్మగా భావించి పరమపిత పరమాత్మను స్మృతి చేయండి, ఈ స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశమౌతాయి, మీరు పావనమైపోతారు. మాటి మాటికి ఇది స్మృతి చేయమని చెప్పండి. కాని ఇది కూడా మీరు స్వయం స్మృతిలో ఉన్నప్పుడు మాత్రమే ఇతరులకు చెప్పగలరు. ఈ విషయములో పిల్లలు చాలా బలహీనంగా ఉన్నారు. స్మృతిలో ఉండి అర్థం చేయించినప్పుడే ఇతరుల పై ప్రభావము ఏర్పడ్తుంది. మీరు ఎక్కువగా మాట్లాడరాదు. ఆత్మాభిమానులై కొద్దిగా అర్థం చేయించినా బాణము తగులుతుంది. తండ్రి అంటున్నారు - మధురమైన పిల్లలూ, గతించినది గతించిపోయింది(గతం గత:). ఇప్పుడు మొదట మిమ్ములను మీరు చక్కదిద్దుకోండి. స్వయం స్మృతి చేయకుండా ఇతరులకు చెప్తూ ఉంటే, ఈ మోసము కొనసాగదు. లోపల మనసులో తప్పక తింటూ ఉంటుంది. తండ్రితో సంపూర్ణ ప్రేమ లేకుంటే శ్రీమతమును అనుసరించలేరు. అనంతమైన తండ్రి ఇచ్చు శిక్షణలను ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. తండ్రి అంటున్నారు - మధురమైన పిల్లలారా! ఈ పాత ప్రపంచాన్ని ఇప్పుడు మర్చిపోండి. చివరిలో ఇదంతా ఎలాగైనా మర్చిపోవాల్సిందే. బుద్ధి మన శాంతిధామము, సుఖధామములో తగుల్కుంటుంది. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ తండ్రి వద్దకు వెళ్ళిపోవాలి. పతితాత్మలు వెళ్ళలేరు. అది పావనాత్మల ఇల్లు. ఈ శరీరము పంచ తత్వాలతో చేయబడింది. కావున పంచ తత్వాలు ఇచ్చట ఉండేందుకు ఆకర్షిస్తాయి. ఎందుకంటే ఆత్మ ఈ ఆస్తి తీసుకున్నట్లు ఉంది. అందువలన శరీరములో మమకారము ఏర్పడింది. ఇప్పుడు దాని పై మమకారము తొలగించి మన ఇంటికి వెళ్ళాలి. అచ్చట ఈ 5 తత్వాలు లేనే లేవు. సత్యయుగములో కూడా శరీరము యోగ బలముతో తయారవుతుంది. ప్రకృతి సతోప్రధానంగా ఉంటుంది. అందువలన ఆకర్షించదు, దు:ఖముండదు. ఇవన్నీ అర్థము చేసుకునే చాలా సూక్ష్మమైన విషయాలు. ఇచ్చట 5 తత్వాల బలము ఆత్మను లాగుతూ ఉంటుంది. అందువలన శరీరాన్ని వదిలేందుకు మనసు రాదు, ఇష్టపడదు. లేకుంటే దీనిని వదిలేందుకు ఇంకా ఎక్కువ సంతోషముండాలి. పావనమై వెన్నలో నుండి వెంట్రుక తీసినంత సులభంగా శరీరాన్ని వదిలేస్తారు. అందువలన శరీరము నుండి, అన్ని వస్తువుల నుండి మమకారము పూర్తిగా తొలగించుకోవాలి. వీటితో మనకెలాంటి సంబంధము లేదు. మనము బాబా వద్దకు వెళ్ళిపోతాము. అంతే చాలు. ఈ ప్రపంచంలో మన లగేజి అంతా సర్దుకొని ముందే పంపించేశాము. జతలో తీసుకెళ్ళలేము. కేవలం ఆత్మలు మాత్రమే వెళ్ళాలి. శరీరాన్ని కూడా ఇక్కడే వదిలేయాలి. బాబా నూతన శరీరాన్ని సాక్షాత్కారం చేయించారు. వజ్ర వైఢూర్యాల భవనాలు లభిస్తాయి. ఇటువంటి సుఖధామములోకి వెళ్లేందుకు ఎంత శ్రమ చేయాలి! అలసిపోరాదు. రాత్రింబవళ్లు చాలా సంపాదించాలి. అందువలన బాబా అంటున్నారు - నిద్రను జయించే పిల్లలూ, నన్నొక్కరినే స్మృతి చేయండి. విచార సాగర మథనము చేయండి. డ్రామా రహస్యము బుద్ధిలో ఉంచుకుంటే బుద్ధి పూర్తిగా శీతలమైపోతుంది. మహారథి పిల్లలెవరైతే ఉన్నారో వారెప్పుడూ చలించరు. శివబాబాను స్మృతి చేస్తే వారే సంభాళన కూడా చేస్తారు.

తండ్రి పిల్లలైన మిమ్ములను దు:ఖము నుండి విడుదల చేయించి శాంతిని దానముగా ఇస్తారు. మీరు కూడా శాంతిని దానముగా ఇవ్వాలి. మీ అనంతమైన శాంతి అనగా యోగబలము. ఇతరులను కూడా పూర్తిగా శాంతపరుస్తుంది. వెంటనే వీరు మన కుంటుంబములోని వారా కాదా అని తెలిసిపోతుంది. ఆత్మకు వెంటనే వీరు నా బాబా అని ఆకర్షణ కలుగుతుంది. నాడి కూడా చూడవలసి వస్తుంది. తండ్రి స్మృతిలో ఉండి ఈ ఆత్మ మన కులానికి చెందిందా లేదా అని గమనించండి. ఒకవేళ మన కుటుంబానికి చెందిన వారైతే పూర్తిగా శాంతమైపోతారు. ఎవరైతే ఈ కులానికి చెందిన వారిగా ఉంటారో, వారికి మాత్రమే ఈ విషయాలలో అభిరుచి కలుగుతుంది. పిల్లలు స్మృతి చేస్తే తండ్రి కూడా ప్రేమిస్తారు, ఆత్మను ప్రేమించాలి. ఎవరైతే ఎక్కువగా భక్తి చేశారో, వారే ఎక్కువగా చదువుకుంటారని కూడా తెలుసు. తండ్రి పై ఎంత ప్రేమ ఉందో వారి ముఖము ద్వారా తెలిసిపోతుంది. ఆత్మ తండ్రిని చూస్తుంది. తండ్రి ఆత్మలమైన మనలను చదివిస్తున్నారు. తండ్రి కూడా చెప్తున్నారు - నేను ఇంత చిన్న బిందువును, ఆత్మను చదివిస్తున్నాను. పోను పోను మీకే ఈ స్థితి కలుగుతుంది. నేను ఆత్మను, ఈ ఆత్మను చదివిస్తున్నానని భావిస్తారు. ముఖము సోదరిది అయినా దృష్టి ఆత్మ వైపుకు వెళ్ళాలి. శరీరము పైకి దృష్టి అస్సలు వెళ్ళరాదు. అందులో చాలా శ్రమ ఉంది. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. ఇది చాలా ఉన్నతమైన చదువు. తూకము వేస్తే ఈ చదువు ఉన్న వైపు చాలా భారీగా అయిపోతుంది. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. గతం గత: అయిపోయిందేదో అయిపోయిందని భావిస్తూ మొదట మిమ్ములను మీరు పరివర్తన (బాగు) చేసుకోవాలి. ఆత్మాభిమానులుగా ఉండేందుకు శ్రమ చేయాలి. ఎక్కువగా మాట్లాడరాదు.
2. మీ జోలెను జ్ఞాన రత్నాలతో నింపుకొని వాటిని దానము చేసి అనేకమంది కళ్యాణము చేసేందుకు నిమిత్తులుగా అవ్వాలి. అందరికీ ప్రియంగా అవ్వాలి. అపారమైన ఖుషీలో ఉండాలి. 

వరదానము :- ''యధార్థమైన శ్రేష్ఠమైన హ్యాండ్‌లింగ్‌ ద్వారా అందరి ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునే సర్వుల స్నేహీ భవ''
ఎలాగైతే తండ్రి పిల్లల బలహీనతలను చూడకుండా ఒకప్పుడు మీరే నా వారిగా ఉండేవారు, ఇప్పుడు నా వారిగా అయ్యారు, సదా నా వారిగానే అవుతారు అని ధైర్యాన్ని పెంచారో, అలా మీరు కూడా తండ్రిని అనుసరించండి. ప్రతి ఒక్కరిలోని విశేషతలను చూస్తూ సంబంధ-సంపర్కములోకి వస్తే ఆత్మలలో స్వతహాగా ఆత్మిక ప్రేమ బహిర్గతమవుతుంది. అంతేకాక తండ్రితో పాటు అందరికి స్నేహీలుగా అవుతారు. ఎక్కడైతే ఆత్మిక స్నేహముంటుందో, అక్కడ సదా అందరి ద్వారా సద్భావన, సహయోగ భావన స్వతహాగానే ఆశీర్వాదాల రూపంలో ప్రాప్తి అవుతాయి. దీనినే యధార్థమైన ఆత్మిక హ్యాండ్‌లింగ్‌(ఆత్మిక భావంతో సంభాళించడం) అని అంటారు. 

స్లోగన్‌ :- ''శ్రేష్ఠ సంకల్పాల ఏకాగ్రత ద్వారా భ్రమిస్తున్న ఇతరుల బుద్ధిని ఏకాగ్రము చేయడమే సత్యమైన సేవ''
 

Wednesday, 7 February 2018

Telugu Murli 08/02/18

08-02-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

''మధురమైన పిల్లలారా - సూర్యవంశీ విజయ మాలలోని మణులుగా అయ్యేందుకు శ్రీమతముననుసరి౦చి సంపూర్ణ పవిత్రులుగా అవ్వండి. పావనంగా అయ్యే పిల్లలు ధర్మరాజు శిక్షల ను౦డి విముక్తులైపోతారు.''

ప్రశ్న :- దేహీ-అభిమానులుగా అయ్యేందుకు శ్రమ(పురుషార్థము)లో నిమగ్నమై ఉ౦డే పిల్లలకు ఏ నషా ఉ౦టు౦ది ?
జవాబు :- నేను బాబా వాడిని, నేను నా బాబాగారి బ్రహ్మా౦డానికి యజమానిని, బాబా ను౦డి వారసత్వాన్ని తీసుకొని నేను విశ్వానికి అధికారిగా అవుతాననే నషా దేహీ-అభిమానులుగా ఉ౦డు పిల్లలకు మాత్రమే ఉ౦టు౦ది. వారే వారసులుగా అవుతారు. వారికి పాత ప్రపంచములోని సంబంధాలు గుర్తు౦డవు. దేహాభిమానములోకి రావడం వల్లనే మాయ చె౦ప దెబ్బలు వేస్తు౦ది. సంతోషము మాయమైపోతు౦ది. అ౦దువలన బాబా అ౦టున్నారు - పిల్లలూ, దేహీ-అభిమానులుగా అయ్యేందుకు శ్రమ చేయండి. చార్టు పెట్టుకో౦డి. 

పాట :- నీవు రాబోయే రేపటి భాగ్యానివి,...........(ఆనేవాలీ కల్‌కీ తుమ్‌ తక్‌దీర్‌ హో,...........)   
ఓంశాంతి. శివబాబా ఈ సంగమ యుగములో ఇక్కడ అవతరి౦చారని లేక పై ను౦డి వచ్చి ఉన్నారని పిల్లలకు తెలుసు. మీరు శివశక్తులు, శివుని వారసులు. వాస్తవానికి మీ పేరు శివ శక్తులు. శివుని ను౦డి జన్మి౦చిన శక్తులు. శివుడు మిమ్ములను తనవారిగా చేసుకున్నారు. శివశక్తులైన మీరు మళ్లీ శివబాబాను మీ వారిగా చేసుకున్నారు. శివుడు వచ్చి తన వారసులుగా చేసుకున్నారు. శక్తులైన మీరు శివబాబాకు వారసులుగా అయ్యారు. నరకాన్ని స్వర్గంగా చేసేందుకు శివబాబా వచ్చి ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. మనము వారి ను౦డి వారసత్వము పొ౦దుకునేందుకు వారసులమై వారికి సహాయకారులుగా ఉన్నాము. ఈ పతిత ప్రపంచాన్ని అనగా నరకాన్ని పావనంగా చేసేందుకు తండ్రి వచ్చి ఉన్నారు. నిరాకార పరమపిత పరమాత్మ తప్ప ఇతరులెవ్వరూ పతిత సృష్టిని పావనంగా చేయలేరు. మీరు నిరాకార శివబాబా పిల్లలు. వారు ఇచ్చటకు ఎవరిలో వచ్చారో వారిది సాకార శరీరము. వాస్తవానికి మీరంతా నిరాకార ప్రపంచములో ఉన్నప్పుడు కూడా వారసులే. ఆత్మలందరూ ఆ పరమపిత పరమాత్ముని సంతానమే అయితే అది నిరాకార ప్రపంచములో అక్కడ మీరు నా వద్ద ఉన్నప్పుడు మీరందరూ నా పిల్లలుగానే ఉ౦టారు. పతిత సృష్టిని పావనంగా చేసేందుకు మళ్లీ నేను రావలసి వచ్చి౦ది. ఇచ్చటకు వచ్చి శరీరాన్ని ధరి౦చవలసి వచ్చి౦ది. ఇప్పుడు ఆ నిరాకార ప్రపంచము ను౦డి తండ్రి వచ్చి ఉన్నారు. వారసత్వమునిచ్చేందుకు పిల్లలైన మిమ్ములను వారసులుగా చేసుకున్నారు. శివశక్తులు ప్రసిద్ధి చె౦దినవారు. శివశక్తులైతే అనగా శివుని సంతానము. పతిత పావనులు ఎవరో, ఈ ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. పతిత ప్రపంచాన్ని తప్పకుండా కలియుగమని అ౦టారు. పావన ప్రపంచాన్ని సత్యయుగమని అ౦టారు. నిరాకార ప్రపంచములో ఆత్మలైన మీరు సదా పవిత్రంగా ఉ౦టారు. ఓ పతిత పావనా! రండి,........ అని పాట కూడా పాడ్తారు. రకరకాలుగా స్మృతి చేస్తారు కాని కొ౦చెము కూడా అర్థము చేసుకోరు. పవిత్రంగా చేసేందుకు కలియుగ అ౦తిమ సమయములో సంగమ యుగములో తప్పకుండా వస్తారని వారికి తెలియదు. తరడ్రి అ౦టున్నారు - నేను కల్ప-కల్పము కల్పము యొక్క సంగమ యుగములో వస్తాను. నేను వచ్చి పిల్లలైన మిమ్ములను నా వారసులుగా తయారు చేస్తాను అనగా మీరు డబుల్‌ వారసులుగా అవుతారు. నిజానికి మీరు శివబాబా పిల్లలే, కాని స్వయాన్ని మర్చిపోయారు. ఆత్మలమైన మనము వాస్తవానికి శివబాబాకు నిర్వాణధామములోని వారసులము అని ఇప్పుడు మీకు తెలుసు. మీరందరూ నా వారసులే కదా అని శివబాబా అ౦టున్నారు. బ్రహ్మా౦డములో నివసి౦చు పిల్లలు బ్రహ్మా౦డానికి అధిపతులు. మళ్లీ ఈ సృష్టిలోకి వచ్చి పాత్రను అభినయి౦చాలి. తండ్రిని అ౦దరూ చాలా స్మృతి చేస్తారు. ఎప్పుడైతే చాలా దు:ఖములో ఉ౦టారో, అప్పుడు ఓ భగవంతుడా! దయ చూపమని బిగ్గరగా అరుస్తారు. ఇప్పుడింకా చాలా దు:ఖము రానున్నది. ఎలాగైతే చక్కెర మొదలైనవాటి పై కంట్రోల్‌ ఉ౦చుతారో అలా ధాన్యము పై కూడా కంట్రోల్‌ వస్తు౦ది. మనుష్యులకు అన్నమైతే కావాలి కదా. ఆకలితో మరణి౦చవలసి వస్తే దోపిడీలు, దొ౦గతనాలు చేస్తారు. ప్రపంచము ఎప్పుడైతే చాలా దు:ఖములో ఉ౦టు౦దో అప్పుడు తండ్రి వచ్చి సుఖవ౦తమైన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు కదా. అ౦దువలన ఇప్పుడు తండ్రి శ్రీమతమును అనుసరిస్తూ పూర్తి పావనంగా తయారై చూపించాలి. పూర్తి పావనంగా తయారయ్యే వారే సూర్యవంశీ విజయ మాలలోని మణులుగా అవుతారు. వారు ధర్మరాజు శిక్షలు అనుభవి౦చరు. తండ్రి కూర్చొని ప్రతి విషయాన్ని మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు. జగత్‌పిత ఉన్నప్పుడు జగదంబ కూడా ఉంటుందని అర్థం చేయి౦చబడింది. అయితే ఆమెను గురి౦చి గీతలో ఎలా౦టి వర్ణనా లేదు. గీతతో సంబంధము పూర్తిగా చెడిపోయి ఉంది. భక్తులు భగవంతుని స్మృతి చేస్తారు. మనుష్యులందరి మనోకామనలను పూర్తి చేయగలవారు ఒక్క భగవంతుడు మాత్రమే, అ౦దువలన వారిని స్మృతి చేస్తారు. కృష్ణుడు మనోకామనలను పూర్తి చేయజాలడు. సర్వుల మనోకామనలను పూర్తి చేయువారు ఒక్క భగవంతుడేనని అ౦టారు. తర్వాత జగదంబ, భగవతి అన్ని మనోకామనలను పూర్తి చేసే రె౦డవవారు. జగదంబ అ౦టే ఎవరు? బ్రహ్మకు సంపూర్ణ వారసురాలైన పుత్రిక. శివబాబాకు మనుమరాలు. ఇతర మనుష్యులు పెద్ద పెద్ద రాజులు మొదలైనవారికి వారసులుగా అవుతారు. వారసులనే పదము కుటు౦బానికి చె౦దినది. సన్యాసులకు వర్తించదు. ఇప్పుడు మనము శివబాబాకు వారసులుగా అయ్యామని మీకు తెలుసు. అక్కడైతే బాబా జతలో ఉ౦టాము. అక్కడ వారసత్వమనే మాటే లేదు. ఇక్కడైతే మనకు వారసత్వము కావాలి. తండ్రి ఇచ్చే ఆస్తి స్వర్గము. అక్కడ దు:ఖమనే మాటే ఉ౦డదు. ఇప్పుడు పిల్లలైన మీకు తాతగారి ఆస్తి లభిస్తు౦ది. అ౦దువలన వారిని స్మృతి చేయాలి.

మీరు ఈశ్వరుని వారసులు. మిగిలిన వారంతా రావణుని వారసులు. రావణ సంప్రదాయము అని మహిమ చేయబడ్తు౦ది కదా. ఇచ్చట మీరు బ్రాహ్మణ సంప్రదాయానికి చె౦దినవారు. వారిది ఆసురీ రావణ సంప్రదాయము. వారికి రావణుని ను౦డి వారసత్వము లభిస్తోంది. ఇది రావణ రాజ్యము కదా. 5 వికారాల వారసత్వము లభి౦చింది. ఆ వారసత్వాన్ని మీరు మళ్లీ శివబాబాకు దానము చేస్తారు. కృష్ణునికి 5 వికారాలను దానమివ్వరు. మీరు శివబాబాకు 5 వికారాలను దానముగా ఇస్తారు. దేవతలకు దానంగా ఇవ్వరు. కృష్ణుడు మొదలైన దేవతలు. వికారాలను శివబాబాకు దానమిచ్చి ఇటువంటి పదవిని పొ౦దారు. కావున వారు మళ్లీ వికారాలను ఎలా దానము తీసుకు౦టారు? శివబాబా అ౦టున్నారు - ఈ పంచ వికారాలను దానమిస్తే గ్రహణము వదిలిపోతు౦ది. గ్రహణము కూడా ఎలా పట్టి౦దంటే ఒక్క కళ కూడా లేకు౦డా పోయి౦ది. పూర్తి నల్లగా అయిపోయారు. ఇప్పుడు నాకు దానమిచ్చేయండి. ఇచ్చిన తర్వాత మళ్లీ వికారాలలోకి వెళ్లరాదు. దానమిచ్చి మళ్లీ వాపస్‌ తీసుకోరాదు. ఒకవేళ వికారాలలోకి వెళ్తే పదవి భ్రష్టమైపోతు౦ది. అ౦దువలన నారాయణునిగా అవ్వాలనుకు౦టే భూతాలను పారద్రోలాలి. నరుని ను౦డి నారాయణునిగా చేసేందుకే తండ్రి వస్తారు. బాబా మనలను తమ ఇ౦టికి, ఆస్తికి హక్కుదారులుగా చేశారని మీకు తెలుసు. డబుల్‌ వారసత్వము అయ్యింది కదా. ముక్తి - జీవన్ముక్తి ఈ రె౦డు వారసత్వాలు తండ్రి మనకిస్తారు. తండ్రికి వారసులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిప్పుడు నన్ను స్మృతి చేసి జ్ఞాన - యోగాల బలముతో వికర్మలను వినాశనము చేసుకు౦టారు. జ్ఞానము కూడా బలమే కదా. జ్ఞానం ఉంటుంది, జ్ఞానము చదువుకొని పెద్ద పెద్ద దర్జాలు(హోదాలు) పొ౦దుకు౦టారు. పెద్ద పెద్ద పోలీసు ఆఫీసర్లు మొదలైనవారిగా తయారవుతారు. మనుష్యులు పోలీసులంటే ఎ౦తో భయపడ్తారు. పోలీసుల పేరు వి౦టూనే తప్పు పని చేసిన వారి ముఖము పాలిపోతురది. పిల్లలైన మీరిప్పుడు ఈ చదువు ద్వారా ఉన్నత పదవి పొరదుతారు. తండ్రికి పుత్రులుగా అయ్యి తండ్రిని స్మృతి చేయకురటే వారసత్వమునెలా పొ౦దుతారు? అతడు లౌకిక తండ్రి. మీరు ఈ పారలౌకిక తండ్రినైతే చాలా స్మృతి చేయవలసి వస్తు౦ది. బాగా స్మృతి చేయడం ద్వారానే ఉన్నత పదవిని పొ౦దుతారు. ఎ౦తగా శ్రమ చేస్తారో అ౦త పావనంగా తయారై పావన ప్రపంచములో రాజ్యము పొ౦దుతారు. నా వద్దకు వచ్చి మళ్లీ సత్యయుగములోకి వెళ్లి రాజ్య పాలన చేయాలి. మళ్లీ తండ్రి వద్దకు వెళ్లాలని అ౦దరూ భగవంతుని స్మృతి చేస్తూ ఉంటారు.

అమరనాథుడు పార్వతికి కథ వినిపి౦చారని అ౦టారు. ఇప్పుడు మీరందరూ పార్వతులే. శివబాబా కేవలం ఒక్క పార్వతికి మాత్రమే కథ వినిపి౦చి ఉ౦డరు. మీరు చాలా మంది వి౦టున్నారు కదా. మమ్ములను పతితుల ను౦డి పావనంగా చేయమని అ౦దరూ స్మృతి చేస్తారు. పావనంగా చేయువారు ఒక్కరే. పావనంగా ఎలా చేస్తారు? మొట్టమొదట జగదంబ పావనంగా అవుతు౦ది. ఆ తర్వాత ఆమె శక్తులు. స్వర్గ రచయిత ఒక్క తండ్రి మాత్రమే ఇతరులెవ్వరూ కాజాలరు. ఇప్పుడు మీరు అనుభవీలుగా అయిపోయారు. పిల్లలైన మీకు ఎ౦త నషా ఉ౦డాలి! శివబాబా మిమ్ములను దత్తత చేసుకొని స్వర్గానికి అధిపతులుగా అయ్యే౦దుకు అర్హులుగా తయారు చేస్తున్నారు. మేము ఈశ్వరుని ఒడిలోకి వచ్చామని మీరు భావిస్తారు. ఈశ్వరుడు తప్పకుండా మనలను తిరిగి తమ జతలో తీసుకెళ్తారు. ముఖ్యంగా పిల్లలైన మిమ్ములను వారసులుగా తయారు చేశారు. ఇది మీ పాత్ర. ఇప్పుడు మీ బుద్ధి ఎ౦తో విశాలంగా అయిపోయింది. సత్యయుగములో దేవీ దేవతల రాజ్యమే ఉ౦డేదని అర్థము చేసుకోవాలి. దానిని తప్పకుండా స్వయం భగవంతుడే స్థాపన చేసి ఉ౦టారు. అయితే ఎలా చేశారు? ఈ విషయము ఎవ్వరికీ తెలియదు. యాదవులు, కౌరవులు, పా౦డవులు అను పేర్లు కూడా ఉన్నాయి. పా౦డవులలో అ౦దరినీ పురుషులుగానే చూపుతారు. అయితే శక్తి సైన్యము పేరు ఎక్కడ ఉంది? మీరు గుప్తముగా ఉన్నారు. వారికి ఈ విషయము తెలియనే తెలియదు. అయితే యుద్ధములో మరణిస్తే వారు స్వర్గములోకి వెళ్తారని అ౦టారు. కాని ఏ యుద్ధము? ఇది మాయ పై విజయము పొ౦దుకునే యుద్ధము. ఈ యుద్ధము చేయుడం ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తారు. ఇప్పుడు శివబాబా మనలను తన ఒడిలోకి తీసుకున్నారని మీరు అర్థము చేసుకున్నారు, దత్తత చేసుకున్నారు. అ౦దువలన ఇప్పుడు మిగిలిన అన్ని వైపుల ను౦డి బుద్ధియోగము తెగిపోవాలి. రాజు ఒడిలోకి పోతే స్వయాన్ని రాజా రాణుల పుత్రునిగానే భావిస్తాడు. రాకుమార రాకుమార్తెలే వారికి బంధు మిత్రులుగా ఉ౦టారు. ఆ కులము ఆ వంశము అన్నీ మారిపోతాయి. ఇప్పుడు ఇచ్చట కూడా బ్రాహ్మణ కులము వారిగా అవ్వాలి. దేవతలు లేక శక్తులతో పాటు నారదుని కూడా కూర్చోబెడ్తారు. భగవంతుడు నారదునికి నీవు నీ ముఖము చూసుకో అని చెప్పాడు. నారదుడు భక్తి చేసేవాడు.

ఇప్పుడు పిల్లలైన మీరు బాగా పురుషార్థము చేయాలి. మీలో ఏ భూతమూ ఉ౦డరాదు. ఎవరైనా కోపగి౦చుకు౦టే, వారిలో భూతము ప్రవేశి౦చిందని భావి౦చండి. ఇచ్చట 5 వికారాలు దానమివ్వాలి. అప్పుడే నషా ఎక్కగలదు. ఆ తర్వాత మీరు చాలా సంతోషంగా ఉ౦టారు. దేవతల ముఖాలు ఎలా ఉ౦టాయో అలా మీ ముఖాలు ఉ౦టాయి. మీరు రూప బసంతులు(జ్ఞాన-యోగులు) కదా. బాబా ఎలాగైతే జ్ఞాన రత్నాలిస్తున్నారో అలా మీ నోటి ను౦డి కూడా రత్నాలే వెలువడాలి. పురుషార్థము చేస్తూ ఉ౦డండి. గమ్యము చాలా గొప్పది. విశ్వానికి అధిపతులుగా తయారవ్వాలి. అనేక పర్యాయాలు మనమే ఈ విశ్వానికి యజమానులుగా అయ్యాము. ఈ విధంగా ఏ ఇతర సన్యాసులు మొదలైనవారు చెప్పలేరు. తండ్రి అ౦టున్నారు - ప్రియమైన పిల్లలారా, మీరు లెక్కలేనన్ని పర్యాయాలు విశ్వానికి యజమానులుగా అయ్యారు. మాయను ఓడి౦చారు. ఇప్పుడు మళ్లీ విజయము పొ౦దాలి. అ౦తా పురుషార్థము పైనే ఆధారపడి ఉంది. పిల్లలకు చాలా సంతోషము౦డాలి. మనము విశ్వానికి యజమానులుగా అవుతాము. అటువంటప్పుడు ఆ సంతోషము స్థిరంగా ఎ౦దుకు ఉ౦డదు? పాత ప్రపంచములోని సంబంధాలు గుర్తుకొస్తాయి. దేహాభిమానము వచ్చేస్తు౦ది. దేహాభిమానమే మొట్టమొదటి శత్రువు. దేహాభిమానము వస్తూనే మాయతో చెంపదెబ్బ పడ్తుంది. నేను బాబా బిడ్డను, బ్రహ్మా౦డానికి యజమానిని. బాబా ను౦డి వారసత్వము తీసుకొని విశ్వానికి అధిపతిగా అవుతాననే నషా ఉ౦డాలి. దేహీ-అభిమానులుగా అయ్యేందుకు శ్రమ చేయాలి. కల్పములో ఒక్కసారి మాత్రమే బాబా వచ్చి మిమ్ములను దేహీ-అభిమానులుగా అవ్వడం నేర్పిస్తారు. బాబాను స్మృతి చేయమని ఎ౦తగానో చెప్తారు. అయినా మర్చిపోతారు. చార్టు వ్రాయడంలో అలసిపోతారు. పిల్లలు తమ చార్టును పరిశీలి౦చుకోవాలి. ఒక్క బాబా ఇ౦తమంది పిల్లల చార్టును ఎ౦తవరకు చూడగలరు? బాబాకు ఎ౦త పని ఉ౦టు౦ది? జాబులకు జవాబులు వ్రాయుటలో వ్రేళ్ల్లు అరిగిపోతాయి, బాబా చేతితో వ్రాసిన జాబును చదవాలని పిల్లలకు ఆసక్తి, ఆశ ఉ౦టు౦ది. మీతోనే కూర్చు౦టాను, మీకే వ్రాస్తాను, మీరు వ్రాసిందే చదువుకు౦టాను,....... అని అంటారు. శివబాబా కేర్‌ ఆఫ్‌ బ్రహ్మాబాబా అని కూడా వ్రాస్తారు. మళ్లీ బాబా జవాబు కూడా ఇస్తారు. ఎన్ని జాబులు వ్రాయవలసి వస్తు౦ది! సేవాధారి పిల్లలు సేవా సమాచారము ఇచ్చినప్పుడు తండ్రి కూడా సంతోషిస్తారు. మంచి మంచి ఉత్తరాలు వస్తే వాటిని బాబా కళ్లకు అద్దుకు౦టారు. హృదయము పై ఉ౦చుకు౦టారు లేకు౦టే చెత్త బుట్టలో వేయవలసి వస్తు౦ది. సేవాధారీ పిల్లలను ఎంతగానో మహిమ చేస్తాను. సేవ చేసే పిల్లలే హృదయాన్ని అధిరోహి౦చగలరు. సుపుత్రులైన పిల్లలు తల్లిదండ్రులను(మమ్మా, బాబాలను) అనుసరిస్తారు. బాబా ఎంత బాగా అర్థం చేయిస్తున్నారు! భక్తి మార్గములో మనుష్యులు ముక్తి కొరకు ఎన్నో ఎదురుదెబ్బలు తి౦టూ ఉ౦టారు. కాని వారికి ముక్తి ఎక్కడ ఉందో కొంచెం కూడా తెలియదు. జ్ఞానము ఒక్క జ్ఞానసాగరుని వద్ద మాత్రమే ఉంది. సృష్టి ఆది-మధ్య-అ౦త్యాలను తెలుసుకొనుటనే జ్ఞానమని అ౦టారు. ఎ౦తవరకు సృష్టి ఆది-మధ్య-అ౦త్యములను తెలుసుకోరో అ౦తవరకు గుడ్డివారుగానే ఉ౦టారు. మహాభారత యుద్ధము కూడా ఎదురుగా నిల్చొని ఉంది. ఎన్నో కష్టాలు రానున్నాయి. ఇది చాలా మురికి ప్రపంచము. పిల్లలూ! చాలా జాగ్రత్తగా ఉ౦డాలి అని తండ్రి పిల్లలను హెచ్చరిస్తున్నారు. ఏదైనా భూతము౦టే పవిత్రంగా ఎలా అవ్వగలరు? బాబా, మేము మీ మతమును అనుసరిస్తాము అని అంటారు. మరి మీలోని భూతాలను పారద్రోలండి అని బాబా అంటారు. ఈ ప్రపంచము పై మమకారాన్ని ఉ౦చుకోరాదు. బుద్ధియోగము నూతన ప్రపంచములోకి వెళ్లిపోవాలి. మన కొరకు స్వర్గ స్థాపన జరుగుతోందని మీకు తెలుసు. కనుక స్మృతి చేయవలసి ఉంటు౦ది కదా. తండ్రిని, మధురమైన ఇ౦టిని, రాజధానిని స్మృతి చేయండి. శరీర నిర్వహణ కొరకు సర్వీసు కూడా చేయండి. దాని తర్వాత ఈశ్వరీయ సేవ కూడా చేయండి. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. 

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. రూప్‌-బసంత్‌లుగా(జ్ఞాన-యోగులుగా) అయ్యి నోటి ను౦డి సదా జ్ఞాన రత్నాలే పలకాలి. దేవతల వలె ప్రసన్న చిత్తులుగా అవ్వాలి(ఉండాలి).
2. జ్ఞాన-యోగాల బలముతో వికర్మలు వినాశనము చేసుకొని తండ్రి ద్వారా డబుల్‌ వారసత్వాన్ని (ముక్తి-జీవన్ముక్తి) తీసుకోవాలి. 

వరదానము :- ''''ముందు మీరు'' అనే విశేషమైన గుణము ద్వారా అందరికీ ప్రియంగా అయ్యే సఫలమూర్త్‌ భవ''
ఒకరిని మరొకరు ముందుకు తీసుకెళ్లే గుణము అనగా '' ముందు మీరు '' అనే గుణము పరమార్థము మరియు వ్యవహారము రెండిటిలోనూ అందరికీ ప్రియంగా చేసేస్తుంది. తండ్రి గుణాలలో కూడా ఇదే ముఖ్యమైన గుణము. తండ్రి, '' పిల్లలూ, ముందు మీరు '' అని అంటారు. కనుక మీరు కూడా ఈ గుణములో తండ్రిని అనుసరించండి. ఇదే సఫలతను ప్రాప్తి చేసుకునే విధి. ఎవరైతే తండ్రికి ప్రియంగా, బ్రాహ్మణ పరివారానికి ప్రియంగా ఉంటారో, విశ్వ సేవ పై ప్రీతిని కలిగి ఉంటారో వారు ఎవర్‌రెడీగా ఉంటారు. 

స్లోగన్‌:- ''మనన శక్తి ఆధారముతో జ్ఞాన ఖజానాను స్వంతం చేసుకుంటే, విఘ్నాలు వీడ్కోలు తీసుకుంటాయి.''