Wednesday, 31 January 2018

Hindi Murli 01/02/18

01-02-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

''మధురమైన పిల్లలారా - ఇది ఈశ్వరీయ విశ్వ విద్యాలయము - మనుష్యుల ను౦డి దేవతలుగా, నరుని ను౦డి నారాయణునిగా అయ్యే విద్యాలయము. ఈ నిశ్చయము ఎప్పుడైతే పక్కాగా ఉ౦టు౦దో, అప్పుడు మీరు ఈ చదువును చదవగలరు''


ప్రశ్న:- మనుష్యుల ను౦డి దేవతలుగా అయ్యేందుకు పిల్లలైన మీరు ఈ సమయంలో ఏ శ్రమ చేస్తారు?
జవాబు:- కనులను క్రిమినల్‌(అపవిత్రము) ను౦డి సివిల్‌గా(పవిత్రంగా) తయారు చేసుకునే శ్రమ, దానితో పాటు మధురంగా అయ్యే శ్రమ చేస్తారు. సత్యయుగములో అయితే అ౦దరి కనులు(దృష్టి) పవిత్రంగానే ఉ౦టాయి. అచ్చట ఈ శ్రమ ఉ౦డదు. ఇచ్చట పతిత శరీరము, పతిత ప్రపంచములో ఉ౦టూ పిల్లలైన మీరు కనులను పవిత్రంగా చేసుకునేందుకు మేమంతా ఆత్మలము, అ౦దరమూ భాయి - భాయి(సోదరులము) అని నిశ్చయముతో పురుషార్థము చేస్తున్నారు(చేయాలి). 

ప్రశ్న:- భక్తులు చెప్పే ఏ ఒక్క మాట ద్వారా 'సర్వవ్యాపి' అను మాట తప్పుగా అయిపోతు౦ది?
జవాబు:- ఓ బాబా, మీరు ఎప్పుడు వస్తారో, అప్పుడు మేము మీ పై సమర్పణ అయిపోతాము,......... అని అ౦టారు అ౦దువలన వారు ఇచ్చట లేరని ఎచ్చట ను౦డో రావాలని ఋజువవుతు౦ది.
ఓంశాంతి. ఆత్మిక పిల్లలను తండ్రి అడుగుతున్నారు - ఆత్మలైన మీరు మీ స్వధర్మములో కూర్చుని ఉన్నారా? అనంతమైన తండ్రి ఒక్కరేనని మీకు తెలుసు. వారిని సుప్రీమ్‌ రూహ్‌ లేక వారిని పరమాత్మ అని అ౦టారు. వారు తప్పకుండా పరమాత్మయే, పరమపిత కదా. పరమపిత అనగా పరమాత్మ. ఈ విషయాలు పిల్లలైన మీరు మాత్రమే అర్థము చేసుకోగలరు. 5 వేల సంవత్సరాల క్రితము కూడా ఈ జ్ఞానము మీరందరూ విన్నారు. ఆత్మ చాలా చిన్నదని, సూక్ష్మమైనదని, దానిని ఈ కనులతో చూడలేమని మీకు తెలుసు. ఆత్మను కంటితో చూచిన మనిషి ఎవ్వరూ ఉ౦డరు. చూడవచ్చు కానీ దివ్యదృష్టితో చూడవచ్చు. అది కూడా డ్రామా ప్లాను అనుసారము చూడగలరు. భక్తిమార్గములో కూడా ఏ సాక్షాత్కారమూ ఈ కనులతో జరగదు. దివ్యదృష్టి లభిస్తు౦ది. దాని ద్వారా చైతన్యములో చూస్తారు. దివ్యదృష్టి అనగా చైతన్యములో చూచుట. ఆత్మకు జ్ఞాన చక్షువు లభిస్తుంది. భక్తులు చాలా భక్తి చేస్తారు దానిని నౌధా భక్తి అని అ౦టారని తండ్రి అర్థం చేయి౦చారు. ఉదాహరణానికి మీరాబాయికి సాక్షాత్కారమైతే నృత్యము చేసేది. ఆ సమయములో వైకుంఠమైతే లేదు కదా. మీరాబాయి గతి౦చి 5-6 వందల సంవత్సరాలు అయ్యి ఉ౦టు౦ది. జరిగిపోయిన దానిని దివ్యదృష్టితో చూస్తారు. హనుమంతుడు, గణేశుడు మొదలైనవారి చిత్రాలకు చాలా భక్తి చేస్తూ చేస్తూ అ౦దులో లయమైనట్లు(లీనమైపోతారు) ఉంటారు. భలే సాక్షాత్కారమవుతు౦ది. కాని దాని వలన ఏ ముక్తి లభి౦చదు. ముక్తి, జీవన్ముక్తుల దారి చాలా అతీతమైనది. భారతదేశములో భక్తిమార్గపు మ౦దిరాలు అనేకమున్నాయి. అచ్చట శివలి౦గము కూడా ఉ౦చుతారు. కొన్ని చిన్నవిగా, కొన్ని పెద్దవిగా తయారు చేస్తారు. ఇప్పుడు మీరు ఎలాగైతే ఆత్మలమని అర్థం చేసుకున్నారో అలా వారు సుప్రీమ్‌ ఆత్మ. సైజు ఇరువురిదీ ఒక్కటిగానే ఉ౦టు౦ది. మనమంతా సోదరులమని కూడా అంటారు. ఆత్మలందరూ భాయి-భాయి అయ్యారు. అనంతమైన తండ్రి ఒక్కరు మాత్రమే. మిగిలినవారంతా భాయి - భాయి(సోదరులు). పాత్రను అభినయిస్తారు. ఇవి అర్థము చేసుకునే విషయాలు. ఈ జ్ఞాన విషయాలను ఒక్క తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు. ఎవరికైతే అర్థం చేయిస్తారో వారు మళ్లీ ఇతరులకు అర్థం చేయించగలరు. మొట్టమొదట ఒక్క నిరాకార తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు. అటువంటివారిని సర్వవ్యాపి అని అ౦టారు. రాయి-రప్పలలో ఉన్నారని కూడా అ౦టారు. ఇలా అనడం రైటు(సరి) కాదు కదా. బాబా మీరు వస్తే మేము సమర్పణ అయిపోతామని ఒకవైపు అ౦టారు. మీరు సర్వవ్యాపి అని ఎప్పుడూ అనరు. మీరు వస్తే సమర్పణ అయిపోతామని అ౦టారు. అనగా దీని అర్థము వారు ఇచ్చట లేరనే కదా. నాకు మీరు తప్ప ఇతరులెవ్వరూ లేరు అని కూడా అ౦టారు. అ౦దువలన వారిని తప్పక స్మృతి చేయవలసి వస్తు౦ది కదా. తండ్రే కూర్చొని ఈ విషయాలు పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. దీనిని ఆత్మిక జ్ఞానమని అ౦టారు. ఆత్మ-పరమాత్మలు చాలా కాలము వేరుగా ఉ౦డినారు,.......... అని కూడా గాయనము చేయబడుతు౦ది. దాని లెక్క కూడా అర్థం చేయించబడి౦ది. చాలా కాలము ను౦డి ఆత్మలైన మీరు వేరుగా ఉ౦టారు. ఇప్పుడు తండ్రి వద్దకు రాజయోగము నేర్చుకునేందుకు వచ్చారు. తండ్రి మీకు సేవ చేయువారు. పెద్ద మనుష్యులు సంతకము చేసినప్పుడు వినయ విధేయతలు గల సేవకుడు అని వ్రాసి సంతకము చేస్తారు. తండ్రి పిల్లలందరికీ సేవకుడు. పిల్లలూ! నేను మీ సేవకుడను అని అరటారు. మీరు ఎరతో హక్కుతో(అధికారంతో) వారిని ఓ భగవంతుడా! మీరు రండి, ఇచ్చటకు వచ్చి పతితులైన మమ్ములను పావనంగా చేయండి అని పిలుస్తారు. పావనులు పావన ప్రపంచములో మాత్రమే ఉ౦టారు. ఇవి అర్థము చేసుకునే విషయాలు. మిగిలినవన్నీ చెవులకు ఇ౦పు కలిగి౦చేవి. ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. దీని లక్ష్యమేమి? మనుష్యుల ను౦డి దేవతలుగా తయారు చేయడం. మేము ఇలా తయారవ్వాలని పిల్లలకు నిశ్చయముంది. ఎవరికైతే నిశ్చయము లేదో వారు పాఠశాలలో కూర్చు౦టారా? నిశ్చయము౦టే బ్యారిష్టరు ను౦డి, సర్జన్‌ ను౦డి నేర్చుకు౦టారు. లక్ష్యము గురించే తెలియకు౦టే రానే రారు. మేము మనుష్యుల ను౦డి దేవతలుగా, నరుని ను౦డి నారాయణునిగా అవుతామని పిల్లలైన మీరు భావిస్తారు. ఇది సత్య - సత్యమైన సత్యముగా నరుని ను౦డి నారాయణునిగా తయారయ్యే కథ. కథ అని ఎ౦దుకు అనబడ్తు౦ది? ఎ౦దుకంటే 5 వేల సంవత్సరాల ము౦దు కూడా ఈ జ్ఞానము నేర్చుకున్నారు. జరిగిపోయిన దానిని కథ అని అ౦టారు. ఇది నరుని ను౦డి నారాయణునిగా తయారయ్యే సత్య-సత్యమైన శిక్షణ(విద్య). నూతన ప్రప౦చములో దేవతలు, పాత ప్రపంచములో మనుష్యులు ఉ౦టారు. దేవతలలో ఏ దివ్య గుణాలు ఉ౦టాయో, అవి మనుష్యులలో లేవు. మనుష్యులు వారిని దేవతలని అ౦టారు. మీరు సర్వ గుణసంపన్నులు, 16 కళా సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారులని వారిని మహిమ చేస్తారు. స్వయాన్ని మేము పాపులము, నీచులము, వికారులము అని చెప్పుకు౦టారు. దేవతలు ఎప్పుడు ఉ౦డేవారు? తప్పకుండా సత్యయుగములో ఉండేవారు. కలియుగములో ఉన్నారని అనరు. ఈ సమయములో మనుష్యుల బుద్ధి తమోప్రధానమైనందున తండ్రి టైటిల్‌ను కూడా తమ పై ఉ౦చుకు౦టారు. వాస్తవానికి శ్రేష్ఠంగా తయారు చేయువారు శ్రీ శ్రీ(శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన) అయిన ఒక్క తండ్రి మాత్రమే. శ్రేష్ఠ దేవతల మహిమ వేరు. ఇప్పుడిది కలియుగము. సన్యాసుల గురి౦చి కూడా బాబా తెలిపిస్తున్నారు - ఒకటేమో హద్దు సన్యాసము, రె౦డవది బేహద్‌ సన్యాసము. మేము ఇల్లు-వాకిలి మొదలైనవన్నీ వదిలేశామని వారంటారు. కాని ఈ రోజులలో గమనిస్తే వారు కోటీశ్వరులై కూర్చొని ఉన్నారు. సన్యాసమనగా సుఖాన్ని త్యాగము చేయడం. పిల్లలైన మీరు అనంతమైన సన్యాసము చేస్తారు. ఎ౦దుకంటే ఈ పాత ప్రపంచము సమాప్తము కానున్నదని మీకు తెలుసు. అ౦దువలన దీని పై మీకు వైరాగ్యము కలిగింది. వారు ఇల్లు-వాకిలి వదిలి మళ్లీ గృహస్థములోకి చొచ్చుకొని వచ్చారు. ఇప్పుడు పర్వతాలు మొదలగు వాటి పై గల గుహలలో ఉ౦డరు. కుటీరాలు నిర్మి౦చుకున్నారు. వాటికి కూడా ఎ౦తో ఖర్చు చేస్తారు. వాస్తవానికి కుటీరము నిర్మి౦చేందుకు ఖర్చు ఏమీ ఉ౦డదు. గొప్ప-గొప్ప మహళ్ళు తయారు చేసుకొని ఉ౦టారు. ఈ రోజుల్లో అ౦దరూ తమోప్రధానంగా ఉన్నారు. ఇప్పుడిది కలియుగము. సత్యయుగములోని దేవతల చిత్రాలు లేకు౦టే స్వర్గానికి నామ-రూపాలు కూడా మాయమైపోయేవి. ఇప్పుడు మనుష్యుల ను౦డి దేవతలుగా అవ్వాలని మీకు అర్థం చేయించడం జరుగుతుంది. అర్ధకల్పము భక్తిమార్గపు కథలున్నాయి. అవి విని మెట్లు(తాపలు) క్రి౦దికి దిగుతూ వచ్చారు. మళ్లీ 5 వేల సంవత్సరాల తర్వాత ఖచ్ఛితంగా అదే డ్రామా రిపీట్‌ అవుతు౦ది. భక్తి వదలమని ఎవరికీ చెప్పరాదని కూడా బాబా తెలిపి౦చారు. జ్ఞానము ఎప్పుడు వచ్చేస్తు౦దో అప్పుడు దానంతకదే భక్తి వదలిపోతు౦ది. మేము ఆత్మలమని, అ౦తేకాక ఇప్పుడు మనము అనంతమైన తండ్రి ద్వారా వారసత్వము తీసుకోవాలని కూడా అర్థం చేసుకుంటారు. మొదట అనంతమైన తండ్రి పరిచయము కావాలి. అది నిశ్చయమైపోతే హద్దు తండ్రి ను౦డి బుద్ధి తొలగిపోతు౦ది. గృహస్థ వ్యవహారములో ఉ౦టూ బుద్ధియోగము తండ్రి జతలో లగ్నమైపోతు౦ది. తండ్రి స్వయంగా చెప్తున్నారు - శరీర నిర్వహణ కొరకు కర్మలాచరిస్తూ బుద్ధిలో ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉ౦డాలి. దేహధారుల స్మృతి ఉ౦డరాదు. అది శారీరిక యాత్ర అవుతు౦ది. ఇది మీ ఆత్మిక యాత్ర. ఇ౦దులో ఎదురు దెబ్బలు తినరాదు. భక్తి మార్గమే అ౦ధకారమైన రాత్రి. ఎదురుదెబ్బలు తినవలసి వస్తు౦ది. ఇచ్చట దెబ్బల మాటే లేదు. స్మృతి చేసేందుకు ఎవ్వరూ కూర్చోవలసిన అవసరం లేదు. భక్తిమార్గములో కృష్ణ భక్తులు నడుస్తూ తిరుగుతూ కృష్ణుని స్మృతి చేయలేరా? మనసులో వారి స్మృతి ఉ౦డిపోతు౦ది కదా. ఒకసారి చూడబడిన వస్తువు గుర్తు ఉంటు౦ది కదా. కావున మీరు ఇ౦టిలోనే కూర్చొని శివబాబాను స్మృతి చేయలేరా? ఇది కొత్త విషయము. కృష్ణుని స్మృతి చేయడం పాత విషయమైపోయింది. శివబాబాను గురి౦చి, వారి నామ -రూపాల గురి౦చి ఎవ్వరికీ తెలియదు. సర్వవ్యాపి అన్నా అది ఏమిటో ఎవరైనా తెలిపితే కదా. ఆత్మలమైన మనందరి తండ్రి పరమపిత పరమాత్మ అని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మను పరమాత్మ అని అనజాలరు. ఇరగ్లీషులో ఆత్మను ' సోల్‌ ' అని అ౦టారు. పారలౌకిక తండ్రిని గురి౦చి తెలిసిన మనిషి ఒక్కరు కూడా లేరు. ఆ తండ్రియే జ్ఞానసాగరుడు. వారిలో మనుష్యుల ను౦డి దేవతలుగా తయారు చేయు జ్ఞానముంది. తండ్రి అ౦టున్నారు - ప్రతి రోజు చాలా రహస్యమైన విషయాలు వినిపిస్తాను. ముఖ్యమైన విషయము - స్మృతి. స్మృతి చేయడమే మర్చిపోతారు. బాబా ప్రతి రోజు చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావి౦చి తండ్రిని స్మృతి చేయండి. నేను ఆత్మ ఒక బి౦దువును. ప్రకాశి౦చే విచిత్రమైన నక్షత్రము అని కూడా అ౦టారు. ఆత్మ శరీరము ను౦డి వెళ్లిపోతే అది ఈ కనులకు కనిపించదు. ఆత్మ వెళ్ళిపోయి౦ది అని అ౦టారు. అది వెళ్లి మరో శరీరములో ప్రవేశిస్తు౦ది. ఆత్మలమైన మనము పునర్జన్మలు తీసుకు౦టూ ఎలా అపవిత్రంగా అయ్యామో మీకు తెలుసు. మొదట ఆత్మలైన మీరు పవిత్రముగా ఉ౦డేవారు. మీ గృహస్థ ధర్మము పవిత్రముగా ఉ౦డేది. ఇప్పుడు రె౦డూ అపవిత్రమైపోయాయి. రె౦డూ పవిత్రముగా ఉన్నప్పుడు వారిని పూజిస్తారు. మీరు పవిత్రులు, మేము అపవిత్రులము అని అ౦టారు. అచ్చట రె౦డూ పవిత్రమే. ఇచ్చట రె౦డూ అపవిత్రమే. మొదట పవిత్రంగా ఉ౦డి తర్వాత అపవిత్రమయ్యారా? లేక అపవిత్రంగానే జన్మ తీసుకున్నారా? తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు - మొదట ఆత్మలైన మీరు పవిత్ర పూజ్యులుగా ఉ౦డేవారు మళ్లీ మీరే అపవిత్ర పూజారులుగా అయ్యారు. 84 జన్మలు తీసుకున్నారు. మొత్తము ప్రపంచ చరిత్ర-భూగోళాలు మీకు మాత్రమే తెలుసు. ఎవరెవరు రాజ్యపాలన చేసేవారో వారికి రాజ్యము ఎలా లభి౦చి౦దో ఈ చరిత్ర కూడా మీకు తెలుసు. ఇతరులెవ్వరికీ తెలియదు. మీరు కూడా ఇప్పుడు తెలుసుకున్నారు. ఇ౦తకు ముందు తెలియదు. రాతిబుద్ధిగా ఉ౦డేవారు రచయిత-రచనల ఆది, మధ్య, అ౦తముల జ్ఞానము ఉ౦డేది కాదు. నాస్తికులుగా ఉ౦డేవారు. ఇప్పుడు ఆస్తికులుగా అయినందున మీరు ఎ౦తో సుఖీలుగా అయిపోతారు. మీరు ఇచ్చటకు దేవతలుగా తయారయ్యేందుకే వచ్చారు. ఈ సమయములో చాలా మధురంగా తయారవ్వాలి. మీరందరూ ఒకే తండ్రి సంతానము, సోదరీ-సోదరులుగా అయ్యారు కదా. క్రిమినల్‌ (అపవిత్ర) దృష్టి ఉ౦డరాదు. ఈ సమయములో శ్రమ చేయవలసి వస్తు౦ది. అన్ని౦టికంటే ఎక్కువ క్రిమినల్‌గా ఉ౦డేవి కన్నులే. అర్ధకల్పము క్రిమినల్‌గా(అపవిత్రంగా) ఉ౦టాయి, అర్ధకల్పము సివిల్‌(పవిత్రము)గా ఉ౦టాయి. సత్యయుగములో దేవతల కనులు పవిత్రంగా ఉ౦టాయి. ఇచ్చట క్రిమినల్‌గా ఉ౦టాయి. దీనిని గురి౦చే సూరదాసు కథను వినిపిస్తారు. తండ్రి అ౦టున్నారు - నేను పతిత ప్రపంచములో, పతిత శరీరములోనే రావలసి వస్తు౦ది. ఎవరైతే పతితంగా అయ్యారో వారినే పవిత్రంగా చేయాలి.

కృష్ణుడు, రాధ ఇరువురు వేరు వేరు రాజ్యాలకు చె౦దినవారని మీకు తెలుసు. రాకుమార - రాకుమారీలుగా ఉ౦డేవారు. స్వయంవరము తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారు. అ౦దువలన వారి వంశము గాయనము చేయబడ్తు౦ది. శకము కూడా వారి పేరుతోనే పిలువబడ్తు౦ది. సత్యయుగపు ఆయువు లక్షల సంవత్సరాలని అ౦టారు. తండ్రి 1250 సంవత్సరములే అని అ౦టున్నారు. రాత్రికి పగలుకున్న౦త తేడా అయిపోయింది. అర్ధకల్పము బ్రహ్మ రాత్రి తర్వాత అర్ధకల్పము బ్రహ్మ పగలు. జ్ఞానము ద్వారా సుఖము, భక్తి ద్వారా దు:ఖము. ఈ విషయాలన్నీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. అయినా అ౦టున్నారు - మధురమైన పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావి౦చండి. స్వధర్మములో నిలవండి. తండ్రిని స్మృతి చేయండి. వారు ఒక్కరు మాత్రమే పతిత పావనులు. స్మృతి చేస్తూ - చేస్తూ మీరు పావనముగా అయిపోతారు. అ౦తమతి సో గతి(చివరి సమయములో ఏమి గుర్తు ఉ౦టు౦దో అటువంటి జన్మనే లభిస్తు౦ది). తండ్రి స్వర్గ రచయిత కదా. కావున మీరు స్వర్గానికి మాలికులుగా ఉ౦డేవారని స్మృతిని కలుగజేస్తున్నారు. ఇప్పుడు పతితంగా ఉన్నారు. కావున అచ్చటికి వెళ్లేందుకు అర్హులుగా లేరు. కావున పావనంగా తయారవ్వండి. నేను ఒక్కసారి మాత్రమే రావలసి వస్తు౦ది. దేవుడు ఒక్కరే. ప్రపంచము ఒక్కటే. మనుష్యుల మతాలు అనేకము. అనేక మాటలు ఉన్నాయి. ఎన్ని నాలుకలో అన్ని మాటలు. ఇచ్చట ఉ౦డేది ఒకే మతము, అద్వైత మతము. వృక్షములో ఎన్ని మతమతా౦తరాలు ఉన్నాయో గమనించండి! వృక్షము ఎ౦తో పెద్దదైపోయి౦ది. అచ్చట ఒకే మతము, ఒకే రాజ్యము ఉ౦డేది. మనమే విశ్వమునకు మాలికులుగా ఉ౦డేవారమని మీకు తెలుసు. భారతదేశము ఎ౦తో ధనవంతముగా ఉ౦డేది. అచ్చట ఎప్పుడూ అకాల మృత్యువు జరగదు. ఇచ్చట చూస్తే కూర్చొని కూర్చునే వెళ్ళిపోతారు. నలువైపులా మృత్యువు తా౦డవిస్తూ ఉంది. అచ్చట మీ ఆయువు చాలా పెద్దదిగా ఉ౦డేది. ఇప్పుడు మీరు ఈశ్వరునితో యోగము చేసి మనుష్యుల ను౦డి దేవతలుగా అవుతున్నారు. కావున మీరు యోగేశ్వర, యోగేశ్వరీలు అయ్యారు. తర్వాత రాజ రాజేశ్వరీలుగా అవుతారు. ఇప్పుడు జ్ఞాన జ్ఞానేశ్వరీలుగా ఉన్నారు. మళ్లీ రాజ రాజేశ్వరీలుగా ఎలా అవ్వాలి? ఈశ్వరుడు తయారు చేశాడు. ఇప్పుడు వీరికి రాజయోగము ఎవరు నేర్పి౦చారో మీకు తెలుసా? ఈశ్వరుడు. అచ్చట 21 తరాల వారి రాజ్యము నడుస్తు౦ది. వారు దాన పుణ్యాలు చేసినందున ఒక్క జన్మలో రాజులుగా అవుతారు. మరణిస్తే ఆ ప్రాప్తి సమాప్తమైపోతుంది. అకాలమృత్యువు అ౦దరికీ వస్తూనే ఉ౦టు౦ది. సత్యయుగములో అలా వచ్చే నియమము లేదు. మృత్యువు కబళించిందని అచ్చట అనరు. ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకుంటారు. సర్పము శరీరమును వదిలినట్లు వదులుతారు. అచ్చట సదా ఖుషీయే ఖుషీ ఉంటుంది. కొంచెము కూడా దు:ఖించే విషయమే ఉండదు. మీరు సుఖధామానికి యజమానులుగా అయ్యేందుకు మీరు ఇప్పుడు పురుషార్థము చేస్తున్నారు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఈ పాత శరీరము ను౦డి అనంతమైన సన్యాసము చేయాలి. శరీర నిర్వహణ కొరకు కర్మలాచరిస్తూ ఆత్మిక యాత్ర చేస్తూ ఉ౦డాలి.
2. పురుషార్థము చేసి కనులను తప్పకుండా సివిల్‌గా(పవిత్రంగా) చేసుకోవాలి. లక్ష్యాన్ని బుద్ధిలో ఉ౦చుకొని చాలా చాలా మధురంగా తయారవ్వాలి. 

వరదానము:- ''శుభ సంకల్పమనే యంత్రము ద్వారా సైలెన్స్‌ శక్తిని ప్రయోగము చేసే సిద్ధి స్వరూప భవ''
సైలెన్స్‌ శక్తితో పని చేసే విశేష యంత్రము ''శుభ సంకల్పము.'' ఈ సంకల్పమనే యంత్రము ద్వారా ఏది కావాలంటే, అది సిద్ధి స్వరూపంలో చూడగలరు. దీని ప్రయోగాన్ని ముందు స్వయం పట్ల చేయండి. శారీరిక వ్యాధి పై ప్రయోగము చేసి చూడండి. శాంతి శక్తి ద్వారా కర్మ బంధన రూపము మధురమైన సంబంధము రూపములోకి మారిపోతుంది. కర్మభోగము, కర్మల కఠినమైన బంధనము సైలెన్స్‌ శక్తి ద్వారా నీటి పై గీచిన గీత వలె అనుభవమవుతుంది. కనుక శరీరము పైన, మనసు పైన, సంస్కారాల పైన సైలెన్స్‌ శక్తిని ప్రయోగించి సిద్ధి స్వరూపులుగా అవ్వండి. 

స్లోగన్‌:- ''కుల దీపకులుగా అయ్యి స్మృతి అనే జ్యోతి ద్వారా బ్రాహ్మణ కులము పేరును ప్రకాశవంతము (ప్రసిద్ధము) చేయండి.''
 

Tuesday, 30 January 2018

Telugu Murli 30/01/18

30-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

'' మధురమైన పిల్లలారా - మీకు తండ్రి ద్వారా తండ్రి లీలలు అనగా డ్రామా ఆదిమధ్యాంతాల జ్ఞానము లభించింది. ఇప్పుడిక ఈ నాటకము పూర్తి కానున్నదని మనము ఇంటికి వెళ్తామని మీకు తెలుసు ''

ప్రశ్న :- స్వయాన్ని తండ్రి వద్ద రిజిస్టరు(నమోదు) చేసుకోవాలంటే పాటించవలసిన నియమాలేవి?
జవాబు :- తండ్రి వద్ద నమోదు అవ్వాలంటే, 1. తండ్రి పై పూర్తిగా బలిహారమవ్వాల్సి ఉంటుంది. 2. మీ సర్వస్వాన్ని భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సేవలో సఫలము చేసుకోవలసి వస్తుంది. 3. సంపూర్ణ నిర్వికారులై ఉంటామని ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది మరియు అలా ఉండి చూపవలసి వస్తుంది కూడా. ఇటువంటి పిల్లల పేర్లు ఆల్‌మైటీ గవర్నమెంటు(సర్వశక్తివంతుని ప్రభుత్వము) రిజిస్టరులో నమోదౌతాయి. మేము భారతదేశాన్ని స్వర్గముగా లేక రాజస్థానముగా తయారు చేస్తున్నాము, మేము భారతదేశానికి సేవ చేసేందుకు తండ్రి పై బలిహారమవుతాము అనే నషా ఉంటుంది.

పాట :- ఓం నమ: శివాయ.........
ఓంశాంతి. ఈ పాట ఎవరి మహిమకై ఉందో (ఈ పాటలో ఎవరిని మహిమ చేశారో) వారే స్వయంగా కూర్చొని తమ రచన(పిల్లల) యొక్క మహిమను వినిపిస్తారు. దీనిని లీల అని కూడా అంటారు. లీల అని నాటకమును అంటారు. గుణవంతులకే మహిమ జరుగుతుంది. అందువలన వారి మహిమ అందరికంటే భిన్నమైనది. మనుష్యులకైతే ఈ విషయాలు తెలియవు. ఇంత మహిమ ఆ పరమపిత పరమాత్మకు మాత్రమే ఉందని పిల్లలకు తెలుసు. వారి శివజయంతి కూడా ఇప్పుడు సమీపంలో ఉంది. శివజయంతికి ఈ పాట కూడా బాగుంది. పిల్లలైన మీకు వారి లీల, వారి మహిమ తెలుసు. తప్పకుండా ఇది లీలయే. దానిని నాటకము అని కూడా అంటారు. తండ్రి అంటున్నారు - దేవతల లీల కంటే నా లీల భిన్నమైనది. ప్రతి ఒక్కరి లీలలు వేరు వేరుగా ఉంటాయి. ఉదాహరణానికి ప్రభుత్వములో ప్రసిడెంటు(అధ్యక్షడు) పదవి, మినిష్టరు(మంత్రి) పదవి వేరు వేరుగా ఉంటాయి కదా. పరమాత్మ సర్వవ్యాపి అయితే అందరి పాత్ర ఒక్కటిగానే ఉంటుంది. సర్వవ్యాపి అన్నందునే ఆకలితో మరణించారు. ఏ మనిషికీ తండ్రిని గురించి గాని, తండ్రి అపారమైన మహిమను గురించి గాని తెలియదు. ఎంతవరకు తండ్రిని తెలుసుకోరో, అంతవరకు రచనను గురించి కూడా తెలుసుకోలేరు. ఇప్పుడు పిల్లలైన మీరు రచనను గురించీ తెలుసుకున్నారు, బ్రహ్మాండము, సూక్ష్మవతనము, మనుష్య సృష్టి చక్రము......... కూడా మీ బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది. ఇదే 'లీల' లేక సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానము. ఈ సమయములో ప్రపంచములోని మనుష్యులు నాస్తికులుగా ఉన్నారు. ఏమీ తెలియదు. కాని గొప్పలు(వ్యర్థ ప్రలాపాలు) ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. సాధువులు కూడా సమావేశాలు, సమ్మేళనాలు మొదలైనవి చేస్తూ ఉంటారు కాని పాపం వారికీ నాటకము ఇప్పుడు పూర్తి అవుతుందని తెలియదు. ఈ నాటకము పూర్తి అయ్యేందుకు వచ్చింది కనుక ఈ సమయములో వారికి కొద్దిగా టచ్‌ అవుతోంది. ఇప్పుడు అందుకే అందరూ రామరాజ్యము కావాలని అంటున్నారు. క్రైస్తవ రాజ్యములో నూతన భారతదేశము కావాలని అనేవారు కాదు. ఇప్పుడు దు:ఖము చాలా ఉంది. అందుకే అందరూ ఓ ప్రభూ! ఈ దు:ఖము నుండి విడుదల చేయండని అరుస్తున్నారు, పిలుస్తున్నారు. కలియుగాంతములో తప్పకుండా దు:ఖము ఎక్కువగా ఉంటుంది. రోజురోజుకు దు:ఖము ఎక్కువ అవుతూ పోతుంది. అందరూ ఎవరి రాజ్యాన్ని వారు పాలన చేసుకుంటారని భావిస్తారు కానీ ఈ వినాశనము తప్పకుండా జరగాల్సిందే. ఇది ఎవ్వరికీ తెలియదు.

పిల్లలైన మీరు ఎంత ఖుషీలో ఉండాలి. అనంతమైన తండ్రి స్వర్గ రచయిత కనుక స్వర్గములో చక్రవర్తి పదవి పిల్లలకు కూడా ఉండాలని మీరు ఎవ్వరికైనా చెప్పవచ్చు. అందుకే భారతవాసులు స్పష్టంగా స్మృతి చేస్తారు. భగవంతుని కలుసుకోవాలనుకుంటారు. భక్తి చేస్తారు. కృష్ణపురికి పోవాలనుకుంటారు. దానినే స్వర్గమని అంటారు. కాని కృష్ణుని రాజ్యము సత్యయుగములో ఉండేదని, ఇప్పుడు కలియుగము సమాప్తమై సత్యయుగము మళ్లీ వస్తుందని, అప్పుడు మళ్లీ శ్రీ కృష్ణుని రాజ్యముంటుందని వారికి తెలియదు. 'అందరూ పరమాత్ముని సంతానమే' అని అందరికీ తెలుసు. కావున మళ్లీ పరమాత్మ నూతన సృష్టిని రచించి ఉంటారు. కనుక తప్పకుండా బ్రహ్మ ముఖము(నోటి) ద్వారానే రచించి ఉంటారు. బ్రహ్మ ముఖవంశావళిగా అయితే తప్పకుండా బ్రాహ్మణ కుల భూషణులే అవుతారు. ఆ సమయము కూడా సంగమ యుగమే అయ్యి ఉంటుంది. ఈ సంగమ యుగము కళ్యాణకారి యుగము. ఈ యుగములో పరమాత్మ కూర్చుని రాజయోగము నేర్పించి ఉంటారు. ఇప్పుడు మనము బ్రహ్మ ముఖవంశావళీ బ్రాహ్మణులము. పోతే బ్రహ్మ శరీరములో పరమాత్మ ప్రవేశించి రాజయోగము నేర్పిస్తారని మేమెలా ఒప్పుకోవాలని అంటారు. మీరు కూడా ''బ్రహ్మ ముఖవంశావళిగా అయ్యి రాజయోగము నేర్చుకుంటే దానంతకదే అనుభవమౌతుంది'' అని చెప్పండి. ఇందులో మూఢ నమ్మకాలు గానీ, కట్టుకథలు గానీ ఏమీ లేవు. మూఢ నమ్మకాలైతే ప్రపంచమంతా ఉన్నాయి. అందులో కూడా ముఖ్యంగా భారతదేశములో బొమ్మల పూజ చాలా జరుగుతుంది. 'విగ్రహ ప్రస్థము(విగ్రహాల సంపుటి)' అని భారతదేశాన్నే అంటారు. బ్రహ్మకైతే ఎన్ని భుజాలనిచ్చారు! ఇప్పుడిది ఎలా సాధ్యము? బ్రహ్మకు అనేకమంది పిల్లలున్నారు. విష్ణువుకు ఎలాగైతే 4 భుజాలు చూపుతారో, 2 భుజాలు లక్ష్మివి, 2 భుజాలు నారాయణునివి. అదే విధంగా బ్రహ్మకు కూడా అంతమంది పిల్లలుంటారు. ఉదాహరణానికి 4 కోట్ల మంది పిల్లలుంటే బ్రహ్మకు 8 కోట్ల భుజాలు అవుతాయి. కాని అలా లేదు. పోతే ప్రజలైతే తప్పకుండా ఉంటారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. తండ్రి వచ్చి ఈ విషయాలన్నీ అర్థము చేయిస్తారు. చివరికి ఏమి అవ్వనున్నదో వారు అర్థము చేసుకోలేరు. ఎన్ని ప్లాన్లు (ప్రణాళికలను) తయారు చేస్తున్నారు! రకరకాల ప్లాన్లు తయారు చేస్తారు. ఇచ్చట పిల్లలైన మీ కొరకు బాబా ప్లాను(ప్రణాళిక) ఒక్కటే. దాని ప్రకారము రాజధాని స్థాపన జరుగుతూ ఉంది. ఎవరెంత శ్రమ చేసి, తమ సమానంగా తయారు చేస్తారో, అంత ఉన్నత పదవిని పొందుతారు. తండ్రిని జ్ఞాన సాగరులు, ఆనంద సాగరులు, దయాహృదయులని అంటారు. తండ్రి అంటున్నారు - నాకు కూడా డ్రామాలో పాత్ర ఉంది. మాయ అందరి పై నిర్దయ చూపుతోంది. నేను వచ్చి అందరి పై దయ చూపించవలసి వస్తుంది. పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. సృష్టిచక్ర రహస్యాన్ని కూడా అర్థము చేయిస్తాను. తండ్రిని నాలెడ్జ్‌ఫుల్‌, జ్ఞానసాగరులని అంటారు. ఇది పిల్లలైన మీకు తెలుసు. ఎవరికైనా అర్థము చేయించవచ్చు కూడా. ఇచ్చట మూఢనమ్మకాల ప్రసక్తే లేదు. మేము నిరాకార పరమపిత పరమాత్మను ఒప్పుకుంటాము. మొట్టమొదట వారిని మహిమ చేయాలి. వారు వచ్చి రాజయోగము ద్వారా స్వర్గాన్ని రచిస్తారు. తర్వాత స్వర్గవాసులను మహిమ చేయాలి. భారతదేశము స్వర్గముగా ఉన్నప్పుడు అందరూ సర్వ గుణ సంపన్నంగా, 16 కళా సంపూర్ణంగా ఉండేవారు. ఇది 5 వేల సంవత్సరాల విషయము. అందువలన పరమాత్ముని మహిమ అందరికంటే భిన్నమైనది. ఆ తర్వాత దేవతల మహిమ. ఇందులో మూఢ నమ్మకాల మాటే లేదు. ఇచ్చట ఉండేది అందరూ పిల్లలే. ఫాలోయర్స్‌(శిష్యులు) ఎవ్వరూ లేరు. ఇది ఒక కుటుంబము. మనము ఈశ్వరుని కుటుంబము. అసలుకు ఆత్మలైన మనందరము పరమాత్ముని పిల్లలము. అందువలన ఇదంతా ఒక కుటుంబముంది కదా. ఆ నిరాకారుడు సాకారములో వస్తారు. ఈ సమయములో ఇది అద్భుతమైన కుటుంబము. ఇందులో సంశయపడే మాటే లేదు. అందరూ శివుని సంతానమే. ప్రజాపిత బ్రహ్మ సంతానమని కూడా మహిమ చేయబడింది. మనం బ్రహ్మకుమార-కుమారీలము. నూతన సృష్టి స్థాపించబడ్తూ ఉంది. పాత సృష్టి ఎదుటనే ఉంది. మొదట తండ్రి పరిచయమునివ్వాలి. బ్రహ్మవంశీయులుగా అవ్వకుండా తండ్రి ఆస్తి లభించదు. బ్రహ్మ వద్ద ఈ జ్ఞానము లేదు. శివబాబా జ్ఞానసాగరులు. వారి నుండే మనము వారసత్వాన్ని పొందుతాము. మనము ముఖవంశావళి వారము. అందరూ రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. మనలనందరినీ చదివించేవారు శివబాబాయే. వారు ఈ బ్రహ్మ శరీరములో వచ్చి చదివిస్తారు. ఈ ప్రజాపిత బ్రహ్మ వ్యక్తములో ఉన్నాడు. అతడు సంపూర్ణమైనప్పుడు ఫరిస్తా (సూక్ష్మ దేవత)గా అయిపోతాడు. సూక్ష్మవతన వాసులను ఫరిస్తాలని అంటారు. అచ్చట రక్త మాంసాలు, ఎముకలు ఉండవు. పిల్లలు సాక్షాత్కారములో కూడా చూస్తారు. తండ్రి అంటున్నారు - భక్తిమార్గములో అల్పకాలిక సుఖము కూడా నా ద్వారానే మీకు లభిస్తుంది. ఇచ్చే దాతను నేనొక్కడినే. అందుకే ఈశ్వరార్పణ చేస్తారు. ఈశ్వరుడే ఫలమునిస్తారని భావిస్తారు. సాధు సత్పురుషులు మొదలైన వారి పేరును ఎప్పుడూ తీసుకోరు. ఇచ్చేవారు ఒక్క తండ్రియే. అయితే ఎవరినో నిమిత్తముంచి వారి మహిమను వృద్ధి చేసేందుకు వారి ద్వారా ఇప్పిస్తాను. అదంతా అల్పకాలిక సుఖము. ఇది అనంతమైన సుఖము. కొత్త కొత్త పిల్లలు వస్తారు. వారు ఇంతవరకు ఏ మతమనుసారము నడుచుకునేవారో అర్థము చేసుకున్న తర్వాత ఈ జ్ఞానము వారికి అర్థం చేయించాలని భావిస్తారు. ఈ సమయములో అందరూ మాయ మతమును అనుసరిస్తున్నారు. ఇచ్చటైతే మీకు ఈశ్వరీయ మతము లభిస్తుంది. ఈ మతము అర్ధకల్పము నడుస్తుంది. ఎందుకంటే సత్య, త్రేతా యుగాలలో మనము దీని ప్రాలబ్ధాన్ని అనుభవిస్తాము. అచ్చట వ్యతిరేక మతముండదు. ఎందుకంటే అచ్చట మాయయే ఉండదు. ఉల్టా(వ్యతిరేక) మతమైతే తర్వాతనే ప్రారంభమౌతుంది. ఇప్పుడు తండ్రి మనలను తమ సమానంగా త్రికాలదర్శి, త్రిలోకనాథులుగా చేస్తారు. బ్రహ్మాండానికి అధిపతులుగా కూడా అవుతాము. మళ్లీ ఈ సృష్టికి కూడా మనము అధిపతులుగా అవుతాము. తండ్రి పిల్లల మహిమను తన మహిమ కంటే ఉన్నతంగా చేశారు. మొత్తము సృష్టిలో ఇటువంటి తండ్రిని, పిల్లల కొరకు ఇంత శ్రమ చేసి తనకంటే ఉన్నతంగా చేయు తండ్రిని ఎప్పుడైనా చూశారా! పిల్లలైన మీకు విశ్వ చక్రవర్తి పదవిని ఇస్తాను. నేను చక్రవర్తి పదవిని అనుభవించను. పోతే ఒక్క దివ్యదృష్టి తాళం చెవిని మాత్రము నా చేతిలో ఉంచుకుంటాను. ఈ తాళము చెవి భక్తిమార్గములో కూడా నాకు పనికొస్తుంది. ఇప్పుడు కూడా బ్రహ్మను సాక్షాత్కారము చేయించి, ఈ బ్రహ్మ వద్దకెళ్లి రాజయోగాన్ని నేర్చుకొని భవిష్య రాకుమారునిగా తయారవ్వండి అని ప్రేరణ ఇస్తాను. ఈ సాక్షాత్కారమైతే చాలా మందికి జరుగుతుంది. రాకుమారులందరూ కిరీటధారులుగా ఉంటారు. కాని వారికి సూర్యవంశీ రాకుమారుల సాక్షాత్కారమయ్యిందా లేక చంద్రవంశ రాజుకుమారులదా అనునది పిల్లలకు తెలియదు. ఎవరైతే తండ్రికి పిల్లలుగా అవుతారో వారు తప్పకుండా రాకుమార-రాకుమార్తెలుగా అవుతారు. కొందరు మొదట, కొందరు వెనుక వస్తారు. మంచి పురుషార్థులైతే సూర్య వంశీయులుగా లేకుంటే చంద్ర వంశీయులుగా అవుతారు. అదంతా పురుషార్థము పైన ఆధారపడి ఉంటుంది. బాబా ఏమో ప్రతి విషయాన్ని స్పష్టము చేసి అర్థం చేయిస్తారు. ఇందులో మూఢ నమ్మకాలు లేనే లేవు. ఇది ఈశ్వరీయ కుటుంబము. ఈ లెక్కతో వారు కూడా ఈశ్వరీయ సంతానమే. కానీ వారు కలియుగములో ఉన్నారు. మీరు సంగమ యుగములో ఉన్నారు. ఎవరి వద్దకైనా వెళ్లి మేము శివవంశీ, బ్రహ్మ ముఖవంశావళీ బ్రాహ్మణులు మాత్రమే స్వర్గ వారసత్వాన్ని పొందగలమని చెప్పండి. ఎవరికైనా బాగా అర్థం చేయించేందుకు శ్రమ చేయవలసి ఉంటుంది. 100 - 50 మందికి అర్థం చేయిస్తే అందులో ఎవరో ఒక్కరు వెలువడ్తారు. ఎవరి అదృష్టములో ఉంటుందో, వారు కోట్లలో ఏ ఒక్కరో వెలువడ్తారు. మీ సమానంగా తయారు చేయడంలో సమయము పడ్తుంది. పోతే షాహుకార్లు చేయు శబ్ధము (ప్రచారము) పెద్దగా ఉంటుంది. అనగా ఎక్కువగా వ్యాపిస్తుంది. మినిష్టరు(మంత్రి) వద్దకు వెళ్తే, మొదట వారు '' మీ వద్దకు ఎవరైనా మంత్రి వస్తారా? '' అని అడుగుతారు. వస్తారని చెప్తే, నేను కూడా వస్తానని ఆ మినిష్టరు ఒప్పుకుంటాడు.

తండ్రి అంటున్నారు - నేను చాలా సాధారణంగా ఉన్నాను. కావున ధనవంతులు ఎవరో అరుదుగా విశేషమైనవారు మాత్రమే వస్తారు. అందరూ తప్పకుండా వస్తారు. అయితే చివర్లో వస్తారు. పిల్లలైన మీకు చాలా నషా ఉండాలి. మేము ఈ తనువు, మనస్సు, ధనములతో భారతదేశ సేవ చేస్తామని వారికి అర్థము చేయించాలి. మీరు భారతదేశ సేవ కొరకే బలిహారమయ్యారు కదా! మీలాంటి ధర్మదాతలు ఎవ్వరూ ఉండరు. వారైతే ధనము కూడబెట్టుకొని ఇండ్లు మొదలైనవి నిర్మిస్తూ ఉంటారు. చివరికి ఇవన్నీ మట్టిలో కలిసిపోనున్నాయి. మీరు మీ సర్వస్వాన్ని బాబా పై బలిహారం చేయాలి. భారతదేశాన్ని స్వర్గంగా చేసే సేవలోనే మీ సర్వస్వాన్ని ఉపయోగించాలి. అప్పుడు మళ్లీ వారసత్వము కూడా మీరే పొందుతారు. మీకు మేము ఆల్‌మైటీ అథారిటీ (సర్వశక్తివంతుల) సంతానమని, మేము వారి వద్ద నమోదైపోయామనే నషా ఉంది. బాబా వద్ద నమోదయ్యేందుకు చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. సంపూర్ణ నిర్వికారులుగా అవుతామనే ప్రమాణము చేసి, అలా ఉండి చూపినప్పుడు బాబా వారిని రిజిస్టరు చేసుకుంటారు. మేము భారతదేశాన్ని స్వర్గము లేక రాజస్థానముగా తయారు చేస్తున్నామనే నషా పిల్లలకు ఉండాలి. అప్పుడు దాని పై రాజ్యపాలన చేస్తారు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మేము ఈశ్వరీయ సంతానము, మేమంతా ఒకే ఈశ్వరీయ కుటుంబములోని వారము, మాకిప్పుడు ఈశ్వరీయ మతము లభిస్తోందనే ఆత్మిక నషాలో ఉండాలి. వ్యతిరేక మతాల పై నడవరాదు.
2. భారతదేశానికి సేవ చేసేందుకు బ్రహ్మాబాబా సమానంగా పూర్తిగా బలిహారమవ్వాలి. తనువు, మనసు, ధనములను భారతదేశాన్ని స్వర్గంగా చేయుటలో సఫలం చేయాలి. పూర్తి దానీలుగా అవ్వాలి. 

వరదానము :- ''సమీప సంబంధము మరియు సర్వ ప్రాప్తుల ద్వారా సహజయోగులుగా అయ్యే సర్వ సిద్ధిస్వరూప భవ ''
ఏ పిల్లలైతే సమీప సంబంధములో ఉంటారో, సర్వ ప్రాప్తులను అనుభవం చేస్తారో వారికి సహజ యోగము అనుభవమవుతుంది. వారు సదా నేను తండ్రివాడిననే అనుభవం చేస్తారు. నేను ఆత్మను, నేను తండ్రి సంతానాన్ని అని గుర్తు చేయించాల్సిన అవసరముండదు. వారు సదా ఇదే నశాలో ప్రాప్తి స్వరూపాన్ని అనుభవం చేస్తారు. సదా శ్రేష్ఠ ఉల్లాస-ఉత్సాహాలు మరియు ఖుషీలో (సంతోషంలో) ఏకరసంగా ఉంటారు, సదా శక్తిశాలీ స్థితిలో ఉంటారు. అందువలన సర్వ సిద్ధి స్వరూపులుగా అయిపోతారు

స్లోగన్‌ :- ''ఆత్మిక శాన్‌ ( గౌరవము )లో ఉండు వారెప్పుడూ హద్దు మాన్‌, శాన్‌(గౌరవము, కీర్తి)లోకి రాజాలరు. ''
 

Telugu Murli 29/01/18

29-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

'' మధురమైన పిల్లలారా - క్రోధము చాలా దు:ఖమునిస్తుంది. అది స్వయాన్నీ దు:ఖపరుస్తుంది, ఇతరులను కూడా దు:ఖపరుస్తుంది. కనుక శ్రీమతముననుసరించి ఈ భూతము పై విజయాన్ని ప్రాప్తి చేసుకోండి.''

ప్రశ్న :- కల్ప-కల్పము ఏ పిల్లల పై మచ్చ పడ్తుంది? వారి గతి(నడవడికలు) ఏమిటి ?
జవాబు :- ఎవరైతే స్వయాన్ని చాలా తెలివిగలవారిగా భావిస్తారో, శ్రీమతమును పూర్తిగా అనుసరించరో, లోపల ఏదో ఒక వికారము గుప్త రూపములో లేక ప్రత్యక్ష రూపములో ఉండి దానిని తొలగించుకోరో వారిని మాయ చుట్టుముడుతూ సతాయిస్తూ ఉంటుంది. అటువంటి పిల్లల పై కల్ప-కల్పపు మచ్చ ఏర్పడ్తుంది. చివర్లో వారు చాలా పశ్చాత్తాపపడవలసి వస్తుంది. వారు తమను తామే నష్టపర్చుకుంటారు.

పాట :- ఈ రోజు మానవుడు అంధకారములో ఉన్నాడు,..........(ఆజ్‌ అంధేరే మే హై ఇన్‌సాన్‌,..........)
ఓంశాంతి. అనంతమైన తండ్రిని ఎవరినైతే ' హెవన్లీ గాడ్‌ఫాదర్‌ ' అని అంటారో వారు అందరికీ తండ్రి అని పిల్లలకు తెలుసు. వారే ఇప్పుడు పిల్లల ఎదుట కూర్చుని అర్థం చేయిస్తున్నారు. తండ్రే ఏమో పిల్లలందరినీ ఈ(బ్రహ్మ) నయనాల ద్వారా చూస్తారు. వారికి పిల్లలను చూచేందుకు దివ్యదృష్టి అవసరము లేదు. పరంధామము నుండి పిల్లల వద్దకు వచ్చానని, ఈ పిల్లలు కూడా ఇచ్చట దేహధారులై పాత్రను అభినయిస్తున్నారని, ఈ పిల్లల ఎదుట కూర్చుని వారిని చదివిస్తున్నానని తండ్రికి తెలుసు. స్వర్గ స్థాపన చేసే అనంతమైన తండ్రి మళ్లీ మమ్ములను భక్తిమార్గపు ఎదురుదెబ్బల నుండి విడుదల చేయించి మన జ్యోతిని వెలిగిస్తున్నారని పిల్లలకు కూడా తెలుసు. ఇప్పుడు మనము ఈశ్వరీయ కులానికి లేక బ్రాహ్మణ కులానికి చెందినవారమని అన్ని సెంటర్లలో ఉండే పిల్లలందరికీ తెలుసు. ' సృష్టి రచయిత ' అని పరమపిత పరమాత్మను అంటారు. సృష్టి ఎలా రచింపబడ్తుందో ఆ విధానము తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు. తల్లిదండ్రులు లేకుండా ఎప్పుడూ మనుష్య సృష్టి రచించబడదని పిల్లలకు తెలుసు. తండ్రి ద్వారా సృష్టి రచింపబడ్తుందని అనరు. అలా జరగదు. తల్లివి నీవే, తండ్రివి నీవే అను గాయనమే ఉంది. ఈ మాతా-పితలు సృష్టిని రచించి మళ్లీ వారిని అర్హులుగా చేస్తారు. ఇది చాలా గొప్ప మేలు(ఉపకారము). అంతేకాని పై నుండి దేవతలు దిగి వచ్చి ధర్మస్థాపన చేస్తారని కాదు. ఏసుక్రీస్తు క్రైస్తవ ధర్మాన్ని స్థాపన చేసినట్లు జరగదు. కనుక ఏసుక్రీస్తును కూడా క్రైస్తవులు 'ఫాదర్‌' అని అంటారు. ఫాదర్‌ అయితే మదర్‌ కూడా తప్పకుండా ఉండాలి. వారు మేరీని 'మదర్‌ మేరీ'(మేరీ మాత) అని అంటారు. మేరీని తల్లిగా పెట్టుకున్నారు. అయితే మేరీ ఎవరు? ఏసుక్రీస్తు మేరీ ద్వారా పిల్లలకు జన్మనిచ్చాడా? లేక స్వయం తల్లి తండ్రి ఇరువురూ ఏసుక్రీస్తేనా? క్రీస్తు యొక్క కొత్త ఆత్మ పై నుండి వచ్చి ఏ శరీరములో ప్రవేశించిందో ఆ నోటి ద్వారా ప్రజలను రచించాడు. వారు క్రైస్తవులుగా అయ్యారు. పై నుండి వచ్చిన నూతన ఆత్మకు దు:ఖమును అనుభవించే ఏ కర్మ లెక్కాచారమూ ఉండదు. అనగా అటువంటి కర్మ చేయలేదని కూడా అర్థము చేయించబడింది. పై నుండి వచ్చే ఆత్మ పవిత్రంగా ఉంటుంది. ఉదాహరణానికి పరమపిత పరమాత్మ ఎప్పుడూ దు:ఖమును అనుభవించరు కదా. దు:ఖము లేక తిట్లు మొదలైనవన్నీ ఈ సాకారానికి ఇస్తారు. అందువలన ఏసుక్రీస్తును కూడా శిలువ పైకి ఎక్కించినప్పుడు తప్పకుండా ఎవరి శరీరములో క్రీస్తు ఆత్మ ప్రవేశించిందో, అతని ఆత్మయే ఈ దు:ఖాన్ని సహించింది. పై నుండి వచ్చి ప్రవేశించిన పవిత్రమైన క్రీస్తు ఆత్మ దు:ఖమును అనుభవించదు. కావున ఇప్పుడు ఏసుక్రీస్తు ఫాదర్‌ అయితే మదర్‌ను ఎక్కడ నుండి తీసుకు రావాలి? మేరీని మదర్‌గా చేసేశారు. మేరిని కుమారిగా చూపిస్తారు. ఆమె నుండి ఏసుక్రీస్తు జన్మించినట్లు చూపిస్తారు. కుమారి నుండి బాలుడు జన్మించుట పూర్తిగా నియమ విరుద్ధము. ఇవన్నీ శాస్త్రాల నుండి తీసుకున్నారు. కుంతి 'కన్య అని, ఆమె కర్ణునికి జన్మనిచ్చిందని చూపిస్తారు కదా. ఇప్పుడిది దివ్య దృష్టి విషయము. కానీ దానిని వారు కాపీ చేశారు. ఇప్పుడు ఈ బ్రహ్మ తల్లిగా అయ్యి తన నోటి ద్వారా పిల్లలకు జన్మనిచ్చి, వారిని సంభాళించేందుకు మమ్మాకిచ్చారు. ఏసుక్రీస్తుది కూడా అలాగే. ఏసుక్రీస్తు ప్రవేశించి ధర్మ స్థాపన చేశాడు. వారు ఏసుక్రీస్తు ముఖవంశావళి అయిన సోదరీ-సోదరులు. క్రైస్తవుల ప్రజాపిత ఏసుక్రీస్తు. ఎవరిలో అయితే ప్రవేశించి జన్మనిచ్చారో అతడే తల్లి. సంభాళించేందుకు మేరీకి ఇచ్చారు. వారు మేరీని తల్లిగా భావించారు. ఇచ్చటైతే తండ్రి అంటున్నారు - నేను ఇతనిలో ప్రవేశించి నోటి ద్వారా సంతానాన్ని రచిస్తాను. అందులో ఈ మమ్మా కూడా ముఖ సంతానంగా ఉంది. ఇవన్నీ విస్తారంగా అర్థము చేసుకోవలసిన విషయాలు.

మరో విషయము - తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఈ రోజు ఆబూకు ఒక పార్టీ రానున్నది. వారు శాకాహారము గురించి ప్రచారము చేసేందుకు వస్తారు. అనంతమైన తండ్రి ఇప్పుడు దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారని, దేవతలనగా పక్కా శాకాహారులుగా ఉండేవారని, ఇక ఏ ఇతర ధర్మమువారు కూడా ఇంత పక్కా శాకాహారులుగా ఉండరని వారికి వినిపించి అర్థము చేయించాలి. వైష్ణవులుగా అవ్వడం వలన ఎన్ని లాభాలున్నాయో వారికి వినిపించాలి. అయితే అందరూ అలా అవ్వలేరు. ఎందుకంటే చాలా అలవాటు పడిపోయారు. వదలిపెట్టడం చాలా కష్టము. కాని అనంతమైన తండ్రి స్థాపించిన స్వర్గములో అందరూ వైష్ణవులుగా అనగా విష్ణు వంశావళీగా ఉండేవారని అర్థము చేయించాలి. దేవతలు సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. ఈనాటి శాకాహారులు కూడా వికారులుగా ఉన్నారు. క్రీస్తుకు 3 వేల సంవత్సరాల క్రితము భారతదేశము స్వర్గముగా ఉండేది. కనుక ఈ విధంగా వారికి అర్థము చేయించాలి. పిల్లలైన మీకు తప్ప ఇక ఏ ఇతర మనుష్యులకు కూడా స్వర్గమంటే ఏమిటో, అది ఎప్పుడు స్థాపించబడిందో, అచ్చట రాజ్యపాలన ఎవరు చేసేవారో ఎవ్వరికీ తెలియదు. లక్ష్మీనారాయణుల మందిరానికి భలే వెళ్తారు, ఈ బాబా కూడా వెళ్లేవాడు. కాని స్వర్గంలో వీరి రాజధాని ఉంటుందని తెలియదు. కేవలం వారి మహిమను గానము చేస్తారు. కాని వారికీ రాజ్యాన్ని ఎవరు ఇచ్చారో, కొంచెము కూడా తెలియదు. ఇప్పటికీ చాలా మందిరాలను నిర్మిస్తున్నారు. ఎందుకంటే లక్ష్మి ధనమునిచ్చిందని భావిస్తారు. అందుకే దీపావళి పండుగ నాడు వ్యాపారస్థులు లక్ష్మిని పూజిస్తారు. ఈ మందిరాలను కట్టించేవారికి కూడా అర్థము చేయించాలి. విదేశీయులు వచ్చినప్పుడు వారికి భారతదేశ మహిమను వినిపించాలి - క్రీస్తుకు 3 వేల సంవత్సరాల క్రితము భారతదేశము ఇలా శాకాహారిగా ఉండేది. అలా ఇతరులెవ్వరూ ఉండరు. వారిలో చాలా శక్తి ఉండేది. దానిని దేవీ దేవతల రాజ్యమని అంటారు. ఇప్పుడు మళ్లీ అదే రాజ్యము స్థాపన అవుతూ ఉంది. ఇది అదే సమయము. శంకరుని ద్వారా వినాశనము కూడా మహిమ చేయబడింది. తర్వాత మళ్లీ విష్ణు రాజ్యముంటుంది. తండ్రి ద్వారా స్వర్గ వారసత్వము తీసుకోవాలనుకుంటే వచ్చి తీసుకోవచ్చు. రమేష్‌, ఉష ఇరువురికి సేవ పై చాలా ఆసక్తి ఉంది. ఇది అద్భుతమైన జంట. వీరు చాలా మంచి సేవాధారులు. చూడండి, క్రొత్త క్రొత్త వారు వచ్చి పాతవారికంటే తీవ్రంగా ముందుకెళ్ళిపోతారు. బాబా అనేక యుక్తులు తెలుపుతారు. కాని ఏదైనా ఒక వికారపు నషా ఉంటే మాయ సంతోషంగా ఎగురనివ్వదు, ఉప్పొంగనివ్వదు. కొందరిలో కొద్దిగా కామ వికారపు అంశముంది, క్రోధమైతే చాలా మందిలో ఉంది. ఇంకా పరిపూర్ణంగా ఎవ్వరూ అవ్వలేదు. పరిపూర్ణులుగా అవుతున్నారు. మాయ కూడా లోలోపల కొరుకుతూ ఉంటుంది. ఎప్పటి నుండి రావణ రాజ్యము ప్రారంభమయిందో అప్పటి నుండి ఈ ఎలుకలు(వికారాలు) కొరకడం మొదలు పెట్టాయి. ఇప్పుడైతే భారతదేశము పూర్తి నిరుపేదగా అయిపోయింది. మాయ అందరినీ రాతి బుద్ధి గలవారిగా చేసేసింది. మంచి మంచి పిల్లలను కూడా మాయ ఎంతగా చుట్టుముట్టిందంటే, తమ అడుగులు వెనుకకు ఎలా పడుతున్నాయో వారికి తెలియదు. మళ్లీ అటువంటివారికి సంజీవిని మూలికను వాసన చూపించి స్పృహలోకి తెస్తారు. క్రోధము కూడా చాలా దు:ఖదాయిని. స్వయానికి దు:ఖము కలుగజేస్తుంది, ఇతరులకు కూడా దు:ఖము కలుగజేస్తుంది. కొంతమందిలో గుప్తముగా ఉంది. కొంతమందిలో ప్రత్యక్షంగా కనిపిస్తూ ఎంతగా అర్థము చేయించినా అర్థము చేసుకోరు. ఇప్పుడు స్వయాన్ని చాలా తెలివైన వారిగా భావిస్తారు. తర్వాత చివర్లో చాలా పశ్చాత్తాపపడవలసి వస్తుంది. కల్ప-కల్పానికి మచ్చ ఏర్పడిపోతుంది. శ్రీమతము పై నడుస్తే చాలా లాభము కూడా ఉంటుంది. లేకుంటే నష్టము కూడా ఎక్కువగా ఉంటుంది. ఇరువురి మతము చాలా ప్రసిద్ధి గాంచింది - శ్రీమతము మరియు బ్రహ్మ మతము. 'బ్రహ్మ దిగి వచ్చినా, ఇతడు వినడు,..........' అని అంటూ ఉంటారు. కృష్ణుని పేరు తీసుకోరు. ఇప్పుడైతే పరమపిత పరమాత్మ స్వయంగా వారి మతమునిస్తున్నారు. బ్రహ్మకు కూడా వారి నుండే మతము లభిస్తుంది. తండ్రికి పిల్లల పై చాలా ప్రేమ ఉంటుంది. పిల్లలను భుజాల పై కూర్చోబెట్టుకుంటాడు. పుత్రుడు ఉన్నతమౌతే తన కులాన్ని ప్రసిద్ధము చేస్తాడని తండ్రికి లక్ష్యముంటుంది. అయితే పిల్లలు తండ్రి మాట వినక, దాదా మాటను వినకుండా ఉంటే, పెద్ద తల్లి(బ్రహ్మ) మాట కూడా విననట్లే. అటువంటివారి గతి ఏమౌతుందో చెప్పలేము! పోతే సేవాధారి పిల్లలైతే బాప్‌దాదా హృదయాన్ని అధిరోహిస్తారు. వారిని స్వయం బాబాయే మహిమ చేస్తారు. అందువలన వారికి ఇదే భారతదేశములో విష్ణువంశము వారి రాజ్యముండేదని, అది మళ్లీ స్థాపనౌతూ ఉందని, ఇప్పుడు బాబా మళ్లీ అదే భారతదేశాన్ని విష్ణుపురిగా తయారు చేస్తున్నారని వారికి అర్థము చేయించాలి.

మీకు చాలా నషా ఉండాలి. వారైతే ఏమీ చేయకుండానే ఊరకే తమ పేరును ప్రసిద్ధము చేసుకునేందుకు కష్టపడుతూ ఉంటారు. ఖర్చు అయితే గవర్నమెంటు నుండి లభిస్తూ ఉంటుంది. సన్యాసులకైతే చాలా ధనము లభిస్తుంది. ఇప్పుడు కూడా భారతదేశ ప్రాచీన యోగము నేర్పించేందుకు వెళ్తామంటే వెంటనే డబ్బు ఇస్తారు. బాబాకైతే ఎవ్వరి ధనమూ అవసరము లేదు. వారే స్వయంగా మొత్తం ప్రపంచమంతటికీ సహాయము చేసే భోలా భండారీ. పిల్లల నుండి సహాయము లభిస్తుంది. పిల్లలు ధైర్యము చేస్తే సహాయము లభిస్తుంది. బయట నుండి ఎవరైనా వస్తే అలవాటు ప్రకారము ఇది ఆశ్రమము కదా. ఏమైనా ఇవ్వాలి అని భావిస్తారు. కానీ మీరు వారితో ఇలా అనాలి - మీరెందుకు ఇస్తున్నారు? జ్ఞానమునైతే మీరేమీ వినలేదు. మీకేమీ తెలియదు. స్వర్గములో ఫలము లభించేందుకు మేము బీజము నాటుతున్నాము. మీరు జ్ఞానము విన్నప్పుడే ఈ విషయాలు అర్థమౌతాయి. అలా కోట్ల కొలది రానున్నారు. బాబా గుప్త రూపములో రావడం మంచిదయ్యింది. కృష్ణుని రూపములో వచ్చి ఉంటే ఇసుక వేస్తే రాలనంత జనము చేరేవారు. ఒక్కసారిగా మీద పడేవారు. ఇంట్లో ఎవ్వరూ కూర్చోలేకపోయేవారు. మీరు ఈశ్వరీయ సంతానమని మర్చిపోకండి. పిల్లలు పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలని తండ్రి హృదయములో ఉంటుంది. స్వర్గములోకి అయితే చాలా మంది వస్తారు. కాని ధైర్యము చేసి ఉన్నత పదవి పొందుకొనేవారు కోట్లలో ఏ ఒక్కరో వెలువడ్తారు. మంచిది

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

రాత్రి క్లాసు 15-6-1968



రాత్రి క్లాసు 15-6-1968

గతించిన విషయాలను గుర్తు తెచ్చుకుంటే (రివైజ్‌ చేసుకుంటే) బలహీన హృదయము గలవారికి వారి బలహీనతలు కూడా రివైజ్‌ అవుతాయి. అందువలన పిల్లలను డ్రామా పట్టాల పై నిల్చోబెట్టడం జరిగింది. ముఖ్యంగా స్మృతి ద్వారానే లాభము కలుగుతుంది. స్మృతి ద్వారానే ఆయువు వృద్ధి చెందుతుంది. డ్రామాను పిల్లలు అర్థము చేసుకుంటే ఎప్పుడూ గతము గుర్తు రాదు. డ్రామాలో ఇప్పుడు జ్ఞానము నేర్చుకుని నేర్పించే సమయము జరుగుతోంది. తర్వాత మళ్లీ ఈ పాత్ర సమాప్తమైపోతుంది. తండ్రి పాత్రా ఉండదు, మన పాత్ర్రా ఉండదు. వారికి ఇచ్చే పాత్రా ఉండదు, మనకు తీసుకునే పాత్రా ఉండదు. కనుక ఒక్కటైపోతాము కదా. మనకు కొత్త ప్రపంచములో పాత్ర ఉంటుంది. బాబాకు శాంతిధామములో పాత్ర ఉంటుంది. మన ప్రాలబ్ధ పాత్ర, బాబాకు శాంతిధామ పాత్ర డ్రామా రీలులో నింపబడి ఉంది కదా. ఇచ్చి పుచ్చుకునే పాత్ర పూర్తి అవుతూనే డ్రామాయే పూర్తవుతుంది. తర్వాత మళ్లీ మనము రాజ్య పాలన చేసేందుకు వస్తాము. ఆ పాత్ర మారిపోతుంది. జ్ఞానము నిలిచిపోతుంది. మనము వారిగా అయిపోతాము. పాత్రనే పూర్తి అయిపోతే ఇక తేడా ఏమీ ఉండదు. పిల్లలతో పాటు తండ్రి పాత్ర కూడా ఉండదు. పిల్లలు జ్ఞానాన్ని పూర్తిగా తీసుకుంటారు. కనుక వారి వద్ద కూడా ఏమీ ఉండదు. ఇచ్చేవారి వద్దా ఉండదు, తీసుకునే వారిలో తక్కువగా ఉండదు. కనుక ఇరువురూ పరస్పరము సమానమైపోతారు. ఇందులో విచార సాగర మథనము చేసే బుద్ధి కావాలి. ముఖ్యమైన పురుషార్థము స్మృతి యాత్ర. తండ్రి కూర్చుని అర్థము చేయిస్తున్నారు. వినిపించడం అయితే స్థూలమైన మాటే కానీ బుద్ధిలో అయితే సూక్ష్మముగా ఉంది కదా. ఆంతరికములో శివబాబా రూపమేదో తెలుసు. అర్థము చేయించుటలో రూపము స్థూలమైపోతుంది. భక్తిమార్గములో పెద్ద లింగ రూపంగా తయారు చేస్తారు. ఆత్మ చిన్నదే కదా. ఇది ప్రాకృతికము. ఎంతవరకు వారి అంతమును తెలుసుకుంటారు? చివరికి అంతము లేదు అనంతము అని అనేస్తారు. మొత్తం పాత్ర అంతా ఆత్మలో నింపబడి ఉందని బాబా అర్థము చేయించారు. ఇది ప్రాకృతికము(కుదరత్‌) అంతము తెలుసుకోలేము. సృష్టి చక్రము అంతమునైతే తెలుసుకుంటారు. రచయిత, రచనల ఆది, మధ్య, అంతములు మీకు మాత్రమే తెలుసు. బాబా జ్ఞానసాగరులు. మళ్లీ మనము ఫుల్‌గా అవుతాము. పొందుకునేందుకు ఏమీ ఉండదు. తండ్రి ఇతనిలో ప్రవేశించి చదివిస్తారు. వారు బిందువు. ఆత్మ గాని, పరమాత్మ గాని సాక్షాత్కారమైనందున సంతోషము కలగదు. పరిశ్రమ చేసి తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమైపోతాయి. తండ్రి చెప్తున్నారు - ''నాలో జ్ఞానము నిలిచిపోతే, మీలో కూడా నిలిచిపోతుంది (బంద్‌ అయిపోతుంది).'' జ్ఞానము తీసుకొని శ్రేష్ఠంగా, ఉన్నతంగా అయిపోతారు. అందరూ ఎంతో కొంత తీసుకుంటారు అయినా తండ్రి ఏమో తండ్రే కదా. ఆత్మలైన మీరు ఆత్మలుగానే ఉంటారు, తండ్రిగా అవ్వరు. ఇది జ్ఞానము, తండ్రి తండ్రే, పిల్లలు పిల్లలే. ఇవన్నీ విచార సాగర మథనము చేసి లోతుగా వెళ్లవలసిన విషయాలు. అందరూ వెళ్ళవలసిందేనని కూడా తెలుసు. అందరూ పోయేవారే. ఆత్మలు వెళ్లి అక్కడ ఉంటాయి. మొత్తం ప్రపంచమంతా సమాప్తమవ్వనున్నది. ఇందులో నిర్భయంగా ఉండవలసి వస్తుంది. నిర్భయంగా ఉండేందుకు పురుషార్థము చేయాలి. శరీరము మొదలైనవాటి భావనే(వాసనే) రారాదు. అదే స్థితిలో వెళ్ళాలి. తండ్రి తమ సమానంగా చేస్తారు. పిల్లలైన మీరు కూడా మీ సమానంగా తయారు చేస్తూ ఉంటారు. ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి, ఇటువంటి పురుషార్థము చేయాలి. ఇప్పుడింకా సమయముంది. ఈ రిహార్సలు తీవ్రంగా చేయవలసి వస్తుంది. అలవాటు లేకుంటే నిలబడిపోతారు. కాళ్ళు వణుకుతాయి. గుండె అకస్మాత్తుగా ఆగిపోతూ ఉంటుంది. తమోప్రధాన శరీరములోని గుండె ఆగిపోయేందుకు సమయము పట్టదు. ఎంతెంత అశరీరులుగా అవుతూ పోతారో, తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారో, అంత సమీపానికి వస్తూ ఉంటారు. యోగము చేసేవారే నిర్భయులుగా ఉంటారు. యోగము ద్వారానే శక్తి లభిస్తుంది. జ్ఞానము ద్వారా ధనము లభిస్తుంది. పిల్లలకు శక్తి కావాలి. కనుక శక్తిని పొందేందుకు తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. బాబా అవినాశి సర్జన్‌, వారెప్పుడూ పేషెంటుగా(రోగిగా) అవ్వరు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - మీరు మీ అవినాశి మందు తీసుకుంటూ ఉండండి. నేను మీకు ఎటువంటి సంజీవినీ మూలిక ఇస్తానంటే, ఎప్పుడూ ఎవ్వరూ జబ్బుపడరు. కేవలం పతిత పావనులైన తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే పావనమైపోతారు. దేవతలు సదా నిరోగులుగా, పావనంగా ఉంటారు కదా. మేము కల్ప-కల్పము వారసత్వము తీసుకుంటామని పిల్లలకు నిశ్చయమైపోయింది. బాబా ఇప్పుడు వచ్చినట్లు అనాది సమయము నుండి లెక్కలేనన్ని సార్లు వస్తూనే ఉన్నారు. బాబా ఏదైతే నేర్పిస్తారో, అర్థము చేయిస్తారో, అదే రాజయోగము. ఆ గీత మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఈ జ్ఞాన మార్గమును తండ్రి మాత్రమే తెలుపుతారు. తండ్రే స్వయంగా వచ్చి క్రింది నుండి పైకెత్తుతారు. ఎవరైతే పక్కా నిశ్చయబుద్ధి గలవారో, వారే మాలలోని పూసలుగా అవుతారు. భక్తి చేస్తూ-చేస్తూ క్రిందికి దిగజారుతూ వచ్చామని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు తండ్రి వచ్చి సత్యమైన సంపాదన చేయిస్తున్నారు. లౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి చేయించినంత సంపాదన చేయించలేరు. అచ్ఛా. పిల్లలకు గుడ్‌నైట్‌ మరియు నమస్తే. 

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. సేవాధారులుగా అయ్యేందుకు వికారాల అంశాన్ని కూడా సమాప్తము చేయాలి. సేవ చేయాలనే ఉత్సాహము ఉప్పొంగుతూ ఉండాలి.
2. మనము ఈశ్వరీయ సంతానము. శ్రీమతమును అనుసరించి భారతదేశాన్ని విష్ణుపురముగా తయారు చేస్తున్నాము. అక్కడ అందరూ పక్కా వైష్ణవులే ఉంటారు,................ ఈ నషాలో ఉండాలి.

వరదానము :- ''ఒక్క ధైర్యము అనే విశేషత ద్వారా సర్వుల సహయోగాన్ని ప్రాప్తి చేసుకొని ముందుకు వెళ్లే విశేష ఆత్మా భవ ''
ఏ పిల్లలైతే ధైర్యముంచి నిర్భయులుగా అయ్యి ముందుకు వెళ్తారో, వారికి తండ్రి నుండి సహాయము స్వతహాగా లభిస్తుంది. ధైర్యమనే విశేషత ద్వారా సర్వుల సహయోగము లభిస్తుంది. ఈ ఒక్క విశేషత ద్వారా అనేక విశేషతలు స్వతహాగానే వస్తూ ఉంటాయి. ఒక్క అడుగు ముందుకు వేస్తూనే అనేక అడుగుల సహయోగానికి అధికారులుగా అవుతారు. ఈ విశేషతనే ఇతరులకు కూడా దానంగా, వరదానంగా ఇస్తూ ఉండండి. అనగా ఈ విశేషతను సేవలో ఉపయోగిస్తే విశేష ఆత్మగా అయిపోతారు. 

స్లోగన్‌ :- ''బుద్ధి ద్వారా ఎంత తేలికగా ఉండాలంటే తండ్రి తన కనురెప్పల పై కూర్చోబెట్టుకొని వెంట తీసుకెళ్లాలి.''
 

Saturday, 27 January 2018

Telugu Murli 28/01/18

28-01-2018 అవ్యక్త బాప్‌దాదా ఓంశాంతి రివైజ్‌: 24-04-1983 మధువనము 

''ఆత్మిక వ్యక్తిత్వం (పర్సనాలిటి) ''
ఈ రోజు బాప్‌దాదా విశ్వంలోని ఆత్మలందరికి జీవిత స్థాయిని(ప్రమాణాన్ని) ప్రత్యక్షంగా తెలిపే పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. ఈ రోజు సంఘటనలో కుమారుల నుండి బ్రహ్మ కుమారులు, తపస్వీకుమారులు, రాజఋషి కుమారులుగా అయిన సర్వస్వ త్యాగం ద్వారా భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునే కుమారులు ఉన్నారు. కుమార్ల జీవతం శక్తిశాలీ జీవితమని మహిమ చేయబడ్తుంది. కానీ బ్రహ్మకుమారులు డబల్‌ శక్తిశాలీ కుమారులు. ఒకటేమో శారీరిక శక్తి, రెండవది ఆత్మిక శక్తి. సాధారణ కుమారులు శారీరిక శక్తి లేక వినాశీ ఆక్యుపేషన్‌ శక్తి (ఉద్యోగ౦ వలన వచ్చిన శక్తి) గలవారు. అవినాశీ ఉన్నతోన్నతమైన మాస్టర్‌ సర్వశక్తివంతుని ఆక్యుపేషన్‌(కర్తవ్యము) చేసే శక్తిశాలురు ఆత్మ పవిత్రతా శక్తి ద్వారా ఏది కావాలనుకుంటే, అది చేయగలదు. బ్రహ్మాకుమారుల సంఘటన (సమూహం) విశ్వ పరివర్తక సంఘటన(సమూహం). అందరూ స్వయాన్ని ఇటువంటి శక్తిశాలి ఆత్మగా భావిస్తున్నారా? మిమ్ములను మీరు పవిత్రతా శక్తిని జన్మ సిద్ధ అధికారంగా ప్రాప్తి చేసుకున్న అధికారీ ఆత్మగా భావిస్తున్నారా? బ్రహ్మకుమారులు అంటేనే పవిత్ర కుమారులు అని అర్థం. బ్రహ్మాబాబా దివ్య జన్మను ఇస్తూ ''పవిత్ర భవ, యోగీ భవ'' అన్న వరదానమునే ఇచ్చారు. బ్రహ్మాబాబా జన్మ ఇస్తూనే పెద్ద తల్లి రూపంలో పవిత్రమైన ప్రేమతో పాలన చేసారు. తల్లి రూపంలో ''సదా పవిత్రంగా అవ్వండి, యోగులుగా అవ్వండి, శ్రేష్ఠంగా అవ్వండి, తండ్రి సమానంగా అవ్వండి, విశేషాత్మలుగా అవ్వండి, సర్వ గుణ మూర్తులుగా అవ్వండి, జ్ఞాన మూర్తులుగా అవ్వండి. సుఖ-శాంతి స్వరూపులుగా అవ్వండి.'' అనే లాలి పాట ప్రతిరోజూ పాడారు. తండ్రి స్మృతి అనే ఒడిలో పాలన చేశారు. సదా సంతోషాల ఊయలలో ఊపారు. మీరు ఇటువంటి మాతా-పితల శ్రేష్ఠ పిల్లలైన బ్రహ్మకుమారులు మరియు బ్రహ్మకుమారీలు. ఇటువంటి స్మృతి కలిగిన సమర్థమైన నషా ఉంటోందా? బ్రహ్మకుమారుల విశేషమైన జీవిత మహత్వాన్ని సదా గుర్తుంచుకుంటున్నారా? కేవలం నామమాత్రపు(పేరుకు) బ్రహ్మకుమారులుగా అయితే లేరు కదా! మిమ్ములను మీరు శ్రేష్ఠ జీవనధారి బ్రహ్మకుమారులుగా భావిస్తున్నారా? విశ్వం అనే విశాలమైన స్టేజ్‌ పైన పాత్రను అభినయించే విశేషపాత్రధారిని అని సదా గుర్తుంటుందా? లేక కేవలం ఇంట్లో లేక సేవాకేంద్రంలో లేక ఆఫీసులో పాత్రను అభినయించేవారా? ప్రతి కర్మను చేస్తూ విశ్వంలోని ఆత్మలు మమ్ములను చూస్తున్నారు అని స్మృతిలో ఉంటుందా? విశ్వంలోని ఆత్మలు మిమ్ములను వీరే విశేష పాత్రధారులు అనగా హీరో పాత్రధారులు అనే దృష్టితో మీ అందరినీ చూస్తున్నారు. దాని అనుసారంగా ప్రతి కర్మను చేస్తున్నారా? లేక సాధారణ రూపంలో పరస్పరం మాట్లాడుకుంటున్నాము, నడుస్తున్నామనే స్మృతి ఉంటుందా?

బ్రహ్మకుమారులంటేనే సదా పవిత్రతా పర్సనాలిటీ(వ్యక్తిత్వం) మరియు రాయల్టీ(ఠీవితో) ఉండేవాని అర్థం. ఈ పవిత్రతా పర్సనాలిటీయే విశ్వంలోని ఆత్మలను పవిత్రత వైపు ఆకర్షిస్తుంది. అంతేకాక ఇదే పవిత్రతా పర్సనాలిటీ ధర్మరాజపురంలో రాయల్టీ(సుంకం/పన్ను) చెల్లించడం నుండి విడిపిస్తుంది. రాయల్టీకి రెండు అర్థాలున్నాయి. ఈ రాయల్టీ ప్రకారమే భవిష్యత్తులో రాయల్‌ పరివారంలోకి రాగలరు. కావున ఇటువంటి రాయల్టీ మరియు పర్సనాలిటీ మా జీవితంలోకి వచ్చాయా (మీవిగా చేసుకున్నారా?) అని పరిశీలించుకోండి. యూత్‌ గ్రూపు వారు(యువ వర్గం వారు) పర్సనాలిటీని ఎక్కువగా తయారు చేసుకుంటారు కదా. కావున తమ ఆత్మిక పర్సనాలిటీ, అవినాశి పర్సనాలిటీని మీదిగా చేసుకున్నారా? ఎవరు చూసినా ప్రతి బ్రహ్మకుమారుడు బ్రహ్మకుమారీ నుండి ఈ పర్సనాలిటీని అనుభవం చేయాలి. శారీరిక పర్సనాలిటీ అయితే ఆత్మలను దేహ భావంలోకి తీసుకొస్తుంది. పవిత్రతా వ్యక్తిత్వం ఆత్మాభిమానిగా తయారు చేసి తండ్రికి సమీపంగా తీసుకొస్తుంది. విశేషంగా కుమారుల గ్రూపు ఇప్పుడు ఏ సేవ చేయాలి? ఒకటేమో తమ జీవితాన్ని పరివర్తన చేసుకోవడం ద్వారా ఆత్మల సేవ, తమ జీవితం ద్వారా ఆత్మలకు ప్రాణదానం చేయడం. స్వ పరివర్తన ద్వారా ఇతరులను పరివర్తన చేయడం. బ్రహ్మకుమారులు అనగా వృత్తి, దృష్టి, కర్మలు మరియు మాటలలో పరివర్తన అయినవారని అనుభవం చేయించండి. ఎవరైనా మీ వద్దకు రావడంతోనే మిమ్ములను కలిసిన వెంటనే ఈ పర్సనాలిటీ వైపు ఆకర్షితులవ్వాలి. సదా తండ్రి పరిచయాన్ని ఇచ్చేవారిగా లేక తండ్రి సాక్షాత్కారాన్ని చేయించే ఆత్మిక దర్పణంగా అయిపోండి. చిత్రం మరియు చరిత్ర ద్వారా అందరికీ తండ్రియే కనిపించాలి. వీరిని ఇలా ఎవరు తయారు చేశారు అని తయారు చేసిన వారు(తండ్రి) సదా కనిపించాలి. ఎప్పుడైనా ఏదైనా అద్భుతమైన వస్తువును చూసినప్పుడు లేక అద్భుతమైన పరివర్తనను చూసినప్పుడు అందరి మనసు నుండి, నోటి నుండి ఎవరు తయారు చేశారు లేక ఈ పరివర్తన ఎలా జరిగింది, ఎవరి ద్వారా జరిగింది? అన్న శబ్ధమే వెలువడ్తుంది. ఈ విషయం తెలుసు కదా! గవ్వ నుండి వజ్రంగా అయిపోయే ఇంత గొప్ప పరివర్తన ఏదైతే జరిగిందో దానిని చూసి అందరి మనసులో తయారు చేసినవారు స్వతహాగా గుర్తుకొస్తారు. కుమారుల గ్రూపు చాలా పరుగులు తీస్తూ ఉంటారు. సేవలో కూడా పరుగులు తీస్తున్నారు కదా! కాని సేవారంగంలో(క్షేత్రంలో) పరుగులు తీస్తూ బ్యాలెన్సు(సమతుల్యం) ఉంచుకుంటున్నారా? 'స్వ సేవ' మరియు సర్వుల సేవ రెండిటి బ్యాలెన్సు సదా ఉంటోందా? బ్యాలెన్సు ఉండకపోతే సేవకై చేసే పరుగులో మాయ కూడా బుద్ధిని పరుగెత్తేలాగా చేసేస్తుంది.

బ్యాలెన్సు ద్వారా అద్భుతం జరుగుతుంది. బ్యాలెన్స్‌ ఉంచినందుకు పరిణామంగా సేవలో కూడా అద్భుతం జరుగుతుంది. లేకుంటే బాహ్య ముఖత కారణంగా అద్భుతానికి బదులుగా తమ మరియు ఇతరుల భావ-స్వభావాల విపరీత పరిస్థితిలోనికి వచ్చేస్తారు. కావున సదా సర్వుల సేవకు జత జతలో ముందు స్వ సేవ అవసరమయింది. ఈ బ్యాలెన్సు సదా స్వయంలో మరియు సేవలో ఉన్నతిని ప్రాప్తింప చేయిస్తూ ఉంటుంది. కుమారులైతే చాలా అద్భుతాన్ని చేయగలరు. కుమార జీవితంలో పరివర్తన ప్రభావం ఎంతగా ప్రపంచం పైన పడుతుందో అంతగా పెద్దవారిది పడదు. కుమారుల గ్రూపు ప్రభుత్వానికి కూడా తమ పరివర్తన ద్వారా ప్రభువు పరిచయాన్ని ఇవ్వగలరు. ప్రభుత్వాన్ని కూడా మేల్కొల్పగలరు. కాని వారు పరీక్షిస్తారు. అలాగే(ఊరకే) అంగీకరించరు. కావున అలాంటి కుమారులు తయారుగా ఉన్నారా? ఎంతవరకు వికారాల పైన విజయులుగా అయ్యారని గుప్తంగా సి.ఐ.డి. లా మిమ్మల్ని పరీక్షిస్తారు. మీ అందరి పేర్లు ప్రభుత్వానికి చూపించమంటారా? 500 మంది కుమారులు తక్కువ మాటేమీ కాదు. అందరూ లెడ్జెర్‌లో తమ పేరు మరియు అడ్రసు నింపారు కదా! కావున లిస్టును పంపించమంటారా? ఎలాంటి సి.ఐ.డి. లు వస్తారో తెలియదని అందరూ ఆలోచిస్తున్నారు! కావాలని క్రోధం తెప్పిస్తారు. ప్రాక్టికల్‌గా(ఆచరణలో) పరీక్షిస్తారు కదా! ప్రాక్టికల్‌ పరీక్షను ఎదుర్కునేందుకు తయారుగా ఉన్నారా? బాప్‌దాదా వద్ద అందరి 'అవును' మరియు 'కాదు' అన్నది ఫిల్ము వలె నిండిపోతుంది. ఆత్మిక శక్తిశాలీ యువ వర్గమైన మేము విశ్వశాంతి స్థాపనా కార్యంలో సదా సహయోగిగా ఉన్నాము మరియు ఇదే సహయోగము ద్వారా విశ్వ పరివర్తనను చేసి చూపిస్తామని విశ్వాన్ని ఛాలెంజ్‌ చేసే ఆత్మిక శక్తిశాలీ యూత్‌ గ్రూపును తయారు చేయాలన్న లక్ష్యాన్ని ఉంచుకోండి. ఏమి చెయ్యాలో అర్థమయ్యిందా? ఇటువంటి పక్కా గ్రూపుగా ఉందా? ఈ రోజు ఛాలెంజ్‌ చేసి, రేపు స్వయమే మారిపోవడం కాదు. కావున అటువంటి మారిపోని సమూహాన్ని తయారు చేయండి. మెజారిటీ క్రొత్త-క్రొత్త కుమారులు ఉన్నారు. కాని లాస్ట్‌ నుండి ఫాస్ట్‌గా వెళ్ళి చూపించండి. బ్యాలెన్సు ద్వారా అద్భుతం చేసి విశ్వానికి అద్భుతాన్ని చూపించండి. మంచిది.

సదా స్వ పరివర్తన ద్వారా సర్వులను పరివర్తన చేసేవారు, తమ జన్మ సిద్ధ వరదానం లేదా అధికారం పైన ''యోగీ భవ - పవిత్ర భవ'' ను సదా జీవితంలో అనుభవం చేయించేవారు, సదా ప్యూరిటీ పర్సనాలిటీ(పవిత్ర వ్యక్తిత్వం) ద్వారా ఇతర ఆత్మలను తండ్రి వైపు ఆకర్షింపజేసేవారు, అవినాశీ వృత్తి యొక్క నషాలో ఉండేవారు, మాతా-పితల శ్రేష్ఠ పాలనకు, పరివర్తన ద్వారా బదులు(రిటర్న్‌) ఇచ్చేవారికి ఇటువంటి ఆత్మిక రాయల్టీ కలిగిన విశేష ఆత్మలకు బాప్‌దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో :-

1. సదా స్వయాన్ని డబల్‌ లైట్‌ అనగా సర్వ బంధనాల నుండి ముక్తులుగా, తేలికగా భావిస్తున్నారా? తేలికదనానికి గుర్తు ఏమిటి? తేలికగా ఉండేది సదా ఎగురుతూ ఉంటుంది. భారం క్రిందకు తీసుకొచ్చేస్తుంది. స్వయాన్ని తండ్రికి అర్పించుకునేవారు సదా తేలికగా ఉంటారు. తమ బాధ్యతలను తండ్రికి ఇచ్చేయండి అనగా తమ భారాన్ని తండ్రికి ఇచ్చేసినట్లయితే స్వయం తేలికగా అయిపోతారు. బుద్ధిలో సమర్పితమవ్వండి. ఒకవేళ బుద్ధిలో సమర్పితమైనట్లయితే ఇక ఏ ఇతర విషయం బుద్ధిలోకి రాదు. సర్వస్వం తండ్రిదే. అన్నీ తండ్రిలోనే ఉన్నాయి. కనుక ఇంకేమీ మిగలలేదు. ఇంకేమీ మిగలనప్పుడు బుద్ధి ఎక్కడకు వెళ్తుంది? ఏదైనా పాత సందు, పాత దారి మిగలలేదు కదా! ఒకే బాబా, ఒకే స్మృతి చేసే మార్గం ఇదే మార్గం ద్వారా గమ్యానికి చేరుకోండి.

2. సదా సంతోషమనే ఊయలలో ఊగేవారు కదా! బాప్‌దాదా ద్వారా ఎంత గొప్ప ఊయల ప్రాప్తించింది! ఈ ఊయల ఎప్పుడూ తెగిపోదు కదా! స్మృతి మరియు సేవ అనే రెండు త్రాళ్ళు టైట్‌గా (బిగుతుగా) ఉన్నట్లయితే ఊయల సదా ఏకరసంగా ఉంటుంది. లేకపోతే ఒక త్రాడు వదులె,ౖ ఒకటి టైట్‌గా ఉన్నట్లయితే ఊయల కదులుతూ ఉంటుంది. ఊయల కదిలినట్లయితే ఊగేవారు పడిపోతారు. ఒకవేళ రెండు త్రాళ్ళూ ధృడంగా ఉన్నట్లయితే ఊగడంలో మనోరంజనముంటుంది. ఒకవేళ పడిపోతే మనోరంజనానికి బదులుగా దు:ఖం కలుగుతుంది. కావున స్మృతి మరియు సేవ అను రెండు త్రాళ్ళు సమానంగా ఉండాలి. అప్పుడు బ్రాహ్మణ జీవితంలో ఆనందాన్ని ఎంతగా అనుభవం చేస్తారో చూడండి. సర్వ శక్తివంతుడైన తండ్రి తోడుగా ఉన్నారు. సంతోషాల ఊయల ఉంది ఇంకేం కావాలి.

3. సదా తండ్రి మరియు సేవ రెండింటిని గుర్తుంచుకుంటారు కదా! సదా స్మృతి మరియు సేవ రెండిటి బ్యాలెన్స్‌ ఉంచుకుంటున్నారా? ఎందుకంటే స్మృతి లేకుండా సేవ సఫలమవ్వదు. సేవ లేకుండా మాయాజీతులుగా అవ్వజాలరు. ఎందుకంటే సేవలో బిజీగా ఉండడం వలన, ఈ జ్ఞానాన్ని మననం చేయడం వలన మాయ సహజంగానే దూరంగా వెళ్ళిపోతుంది. స్మృతి లేకుండా సేవ చేసినట్లయితే సఫలత తక్కువ, శ్రమ ఎక్కువగా ఉంటుంది. స్మృతిలో ఉండి సేవ చేసినట్లయితే సఫలత ఎక్కువ, శ్రమ తక్కువగా ఉంటుంది. కనుక రెండింటి బ్యాలెన్స్‌(సమతుల్యత) ఉంటోందా? బ్యాలెన్స్‌ ఉంచుకునే వారికి స్వతహాగా బ్లెస్సింగ్స్‌(ఆశీర్వాదాలు) లభిస్తూ ఉంటాయి, అడగవలసిన అవసరం ఉండదు. ఏ ఆత్మలకైతే సేవ చేస్తారో, ఆ ఆత్మల మనసు నుండి వాహ్‌ జ్ఞానం వినిపించే శ్రేష్ఠ ఆత్మ! వాహ్‌ నా జీవితాన్నే మార్చేసారు! ఈ వాహ్‌, వాహ్‌ అన్నదే ఆశీర్వాదంగా అయిపోతుంది. అటువంటి ఆశీర్వాదాన్ని అనుభవం చేస్తున్నారా? ఏ రోజైతే స్మృతిలో ఉండి సేవ చేస్తారో, ఆ రోజు శ్రమ లేకుండా సహజమైన సంతోషాన్ని అనుభవం చేస్తారు. అటువంటి సంతోషాన్ని అనుభవం చేస్తున్నారు కదా! ఈ ఆధారంతోనే అందరూ ముందుకు వెళ్తున్నారు. ప్రతీ సమయం మా ఉన్నతి మరియు విశ్వ ఉన్నతి జరుగుతూ ఉందని భావిస్తున్నారా? ఒకవేళ స్వ ఉన్నతి లేకపోతే విశ్వ ఉన్నతికి కూడా నిమిత్తంగా అవ్వజాలరు. స్వ ఉన్నతికి సాధనం స్మృతి. విశ్వ ఉన్నతి సాధనం సేవ. సదా ఇందులోనే ముందుకు వెళ్తూ ఉండండి. సంగమ యుగంలో తండ్రి అన్నింటికన్నా ఏ గొప్ప ఖజానాను ఇచ్చారు? సంతోషం. ఎన్నో రకాల సంతోషాల ఖజానాలు ప్రాప్తించాయి. ఒకవేళ సంతోషానికి చెందిన వెరైటీ(అనేక రకాల) పాయింట్లను తీసినట్లయితే ఎన్ని రకాలైనవి ఉంటాయి! సంగమయుగంలో అన్నింటికన్నా చాలా గొప్ప కానుక, ఖజానా, పికినిక్‌ సామాను..... అంతా సంతోషమే. ప్రతి రోజూ అమృతవేళలో ఒక సంతోషాన్నిచ్చే పాయింటును గురించి ఆలోచించండి..... అప్పుడు రోజంతా సంతోషంగా ఉంటారు. చాలా మంది పిల్లలు మురళీలో అయితే రోజూ అవే పాయింట్లు ఉంటాయని అంటారు. కానీ ఏ పాయింట్లయితే పక్కాగా ధారణ అవ్వలేదో, వాటిని పక్కా చేయించేందుకు రోజూ ఇవ్వవలసి ఉంటుంది. ఏ విధంగా స్కూల్లో విద్యార్థి ఏ విషయాన్నైనా పక్కాగా గుర్తుంచుకోలేకపోతే 50 సార్లయినా ఆ విషయాన్ని వ్రాస్తారు. కావున బాప్‌దాదా కూడా రోజూ పిల్లలూ! స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి అని చెప్తారు. ఎందుకంటే ఈ పాయింటులో ఇంకా అపరిపక్వంగానే(కచ్ఛాగానే) ఉన్నారు. కనుక రోజూ సంతోషమునిచ్చే క్రొత్త-క్రొత్త పాయింట్లను బుద్ధిలో ఉంచుకోండి. తద్వారా రోజంతా సంతోషంగా ఉంటూ ఇతరులకు కూడా సంతోషాన్ని దానం చేస్తూ ఉండండి. ఇదే అన్నింటికన్నా చాలా గొప్ప దానం. ప్రపంచంలో అనేక సాధనాలు ఉన్నా సత్యమైన ఆంతరిక అవినాశీ సంతోషం లేదు. మీ వద్ద ఆ సంతోషముంటే దానం చేస్తూ ఉండండి.

4) సదా స్వయాన్ని కమల పుష్ప సమానంగా పురాతన ప్రపంచ వాతావరణం నుండి అతీతంగా ఒక్క తండ్రికి ప్రియంగా ఉండు అనుభవాన్ని చేస్తున్నారా? ఎవరైతే అతీతంగా(భిన్నంగా) ఉంటారో, వారే తండ్రికి ప్రియమైనవారు. ఎవరైతే తండ్రికి ప్రియంగా ఉంటారో, వారే అతీతంగా అవుతారు. కావున కమలపుష్ప సమానంగా ఉంటున్నారా లేక వాతావరణమలో ఉంటూ దాని ప్రభావంలోకి వచ్చేస్తున్నారా? ఎక్కడ ఏ పాత్రను అభినయిస్తున్నా అక్కడ పాత్రను అభినయిస్తూ పాత్ర నుండి సదా అతీతంగా ఉంటున్నారా లేక పాత్రకు ప్రియంగా అయిపోతారా? ఏం జరుగుతోంది? ఒకసారి యోగం కుదురుతుంది, ఒకసారి కుదరదని అంటారు. ఇందుకు కూడా కారణమేమి? అతీతంగా అవ్వడంలో లోపం. అతీతంగా అవ్వని కారణంగా ప్రేమ అనుభవమవ్వదు. ఎక్కడైతే ప్రేమ ఉండదో అక్కడ స్మృతి ఎలా వస్తుంది? ఎంత ఎక్కువ ప్రేమ ఉంటుందో అంత ఎక్కువగా స్మృతి ఉంటుంది. తండ్రికి ప్రియంగా అయ్యేందుకు బదులుగా ఇతరులకు ప్రియంగా అవుతారు. తండ్రిని మర్చిపోతారు. పాత్రకు అతీతంగా, తండ్రికి ప్రియంగా అవ్వండి. ఇదే లక్ష్యంగా మరియు ప్రాక్టికల్‌ జీవితంగా ఉండాలి. లౌకికంలో పాత్రను అభినయిస్తూ ప్రియంగా అయినవారు అయితే ప్రేమకు రిటర్న్‌(బదులు) ఏమి లభించింది? ముళ్ళ పాన్పుయే లభించింది కదా! తండ్రి ప్రేమలో ఉండడం వలన సెకనులో ఏమి లభిస్తుంది? అనేక జన్మల అధికారం ప్రాప్తిస్తుంది. కావున సదా పాత్రను అభినయిస్తూ అతీతంగా ఉండండి. సేవ కారణంగా పాత్రను అభినయిస్తున్నారు. సంబంధాల ఆధారంగా పాత్ర కాదు. దేహ సంబంధాలలో ఉండడం వలన నష్టముంటుంది. సేవ కొరకు పాత్రగా భావించి ఉన్నట్లయితే అతీతంగా ఉంటారు. ఒకవేళ రెండువైపులా ప్రేమ ఉన్నట్లయితే ఏకరస స్థితి అనుభవమవ్వజాలదు.
వరదానము :- ''అభ్యాసమనే ఎక్సరసైజ్‌ (వ్యాయామం) ద్వారా సూక్ష్మ శక్తులను జీవితంలో ఇముడ్చుకునే శక్తి సంపన్న భవ ''
బ్రహ్మా తల్లికి పిల్లలంటే ఆత్మిక మమత ఉంది. అందువలన సూక్ష్మమైన స్నేహం ద్వారా ఆహ్వానించి పిల్లల స్పెషల్‌ గ్రూపును వతనంలో ఎమర్జ్‌ చేసి(ప్రత్యక్షం చేసి) శక్తులనే బలమైన ఆహారాన్ని తినిపిస్తారు. ఎలాగైతే ఇక్కడ నేయి త్రాగించేవారో, తోడు-తోడుగా వ్యాయామాన్ని కూడా చేయించేవారో అలా వతనంలో కూడా నేయి త్రాగిస్తారు అనగా సూక్ష్మ శక్తులు కలిగించే వస్తువులను ఇస్తారు. అంతేకాక అభ్యాసమనే వ్యాయామాన్ని కూడా చేయిస్తారు. మూడులోకాల్లో పరుగు తీసే పరుగుపందెం చేయిస్తారు. దీని ద్వారా విశేషమైన పాలన జీవితంలో ఇమిడిపోవాలి, పిల్లలందరూ శక్తి సంపన్నంగా అయిపోవాలి. 

స్లోగన్‌ :- ''స్వమానంలో స్థితులై ఉండే ఆత్మ ఇతరులకు కూడా గౌరవాన్నిచ్చి ముందుకు తీసుకెళ్తుంది ''
 

Friday, 26 January 2018

Telugu Murli 27/01/18

27-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - భక్తులకు ఎప్పుడైతే సమస్యలు, ఆపదలు (విపత్తులు) వచ్చాయో అప్పుడు జ్ఞానము ద్వారా గతి-సద్గతులనిచ్చేందుకు తండ్రి వచ్చారు.''

ప్రశ్న :- వికర్మాజీతులుగా ఎవరౌతారు? వికర్మాజీతులుగా అయ్యే వారి గుర్తులు ఏవి?
జవాబు :- ఎవరైతే కర్మ, అకర్మ, వికర్మల గతిని తెలుసుకొని శ్రేష్ఠ కర్మలు చేస్తారో, వారే వికర్మాజీతులుగా అవుతారు. వికర్మాజీతులుగా అయ్యేవారు ఎప్పుడూ తమ కర్మలను నిందించుకోరు. వారి కర్మలు వికర్మలుగా అవ్వవు. 

ప్రశ్న :- ఈ సమయములో తండ్రి చేసే డబుల్‌ సేవ ఏది ?
జవాబు :- ఆత్మ, శరీరము రెండింటినీ పావనంగా కూడా చేస్తారు. అంతేకాక తమ వెంట ఇంటికి వాపస్‌ కూడా తీసుకెళ్తారు. చరిత్ర ఒక్క తండ్రిది మాత్రమే. మనుష్యుల చరిత్ర కాజాలదు.

పాట :- ఓం నమ: శివాయ..................   
ఓంశాంతి. ఈ పాటను పిల్లలు విన్నారు. భక్తిమార్గములోని వారు ఇటువంటి పాటలు పాడుతూ ఉంటారు. గాఢాంధకారములో వెలుగును కోరుకుంటారు. దు:ఖము నుండి విడుదల పొందేందుకు పిలుస్తూ ఉంటారు. మీరు శివవంశీ బ్రహ్మకుమార - బ్రహ్మకుమారీలు. ఇది అర్థము చేసుకోవలసిన విషయము. ఇంతమంది పిల్లలు కుఖవంశావళి వారు అయ్యేందుకు వీలు లేదు. తప్పకుండా ముఖవంశావళి వారుగా ఉంటారు. కృష్ణునికి ఇంతమంది రాణులు లేక పిల్లలు లేరు. గీతాభగవానుడైతే రాజయోగాన్ని నేర్పిస్తారు. అందువలన తప్పకుండా ముఖవంశావళి వారుగా ఉంటారు. ప్రజాపిత అనే పదమైతే ప్రసిద్ధి గాంచినది. తండ్రి వచ్చి వీరి ముఖము(నోటి) ద్వారా బ్రాహ్మణ ధర్మాన్ని రచిస్తారు. ప్రజాపిత అనే పేరు తండ్రికి శోభిస్తుంది. ఇప్పుడు మీరు ప్రాక్టికల్‌గా ఆ తండ్రి వారిగా అయ్యారు. వారు కృష్ణుడూ భగవంతుడే, శివుడు కూడా భగవంతుడే అని అంటారు. రుద్ర భగవంతునికి బదులు కృష్ణ అనే పేరు వేసేశారు. శంకరుడు పార్వతి అని అంటారు కాని రుద్రుడు పార్వతి అని అనరు. శివశంకర మహాదేవా అని అంటారు. మరి కృష్ణుడు ఎక్కడ నుండి వచ్చాడు? ఎలా వచ్చాడు? అతడిని రుద్రుడు, శంకరుడని అనరు. భక్తులు పాట పాడ్తారు కాని భగవంతుడంటే ఎవరో వారిని గూర్చి తెలియదు. ఎవరైతే ఒకప్పుడు పూజ్యులుగా ఉండి ఇప్పుడు పూజారులుగా అయ్యారో వారే భారతదేశములోని వాస్తవమైన సత్యమైన భక్తులు. వారిలో కూడా నంబరువారుగా ఉన్నారు. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. మీరు బ్రాహ్మణులు, వారు శూద్రులు. దేవతా ధర్మము వారే చాలా దు:ఖితులుగా అవుతారు. ఎందుకంటే వారు చాలా సుఖాన్ని కూడా చూశారు, అనుభవించారు. ఇప్పుడు గడప గడపా తిరగడం మీకు అర్ధకల్పము కొరకు సమాప్తమైపోయింది. ఈ రహస్యము బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు, అది కూడా నంబరువారుగా తెలుసు. కల్పక్రితము ఎవరు ఎంత పురుషార్థము చేశారో, ఇప్పుడు కూడా అంతే పురుషార్థము చేస్తారు. అంతేకాని డ్రామాలో ఎలా ఉంటుందో అలా అవుతుందని అనుకోరాదు. అయినా పురుషార్థము పేరు వస్తుంది. డ్రామా పిల్లలచే పురుషార్థము చేయించే తీరాలి. ఎలాంటి పురుషార్థము చేస్తారో, అలాంటి పదవి లభిస్తుంది. కల్పక్రితము కూడా ఇటువంటి పురుషార్థము చేశామని మనకు తెలుసు. ఇటువంటి అత్యాచారాలు జరిగాయి. యజ్ఞములో విఘ్నాలు ఏర్పడ్డాయి. కష్టాలు కూడా ఇలాగే వచ్చాయి.

బాబా మళ్లీ వచ్చారని పిల్లలైన మీకు తెలుసు. కల్పక్రితము కూడా ఇదే సమయములో బ్రిటీష్‌ వారి రాజ్యమున్నప్పుడే వచ్చారు. వారి నుండి కాంగ్రెస్‌వారు రాజ్యాన్ని తీసుకున్నారు తర్వాత పాకిస్థాన్‌ విభజన జరిగింది. ఇది కల్పక్రితము కూడా జరిగింది. గీతలో ఈ విషయాలు లేవు. ఇది అదే సమయమని చివరికి తప్పకుండా తెలుసుకుంటారు. ఈశ్వరుడు వచ్చేశాడని ఎవరో కొంతమంది అర్థము చేసుకుంటారు. మహాభారత యుద్ధము జరిగినప్పుడు భగవంతుడు వచ్చారని అంటారు. వారు చెప్పేది సత్యమే. కేవలం పేరు మార్చేశారు. రుద్రుడనే పేరు వాడుకున్నా ఇది సరైనదే అని భావించాలి. రుద్రుడు జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. దాని ద్వారా ప్రపంచానికి వచ్చే ఆపదలు నిలిచిపోయాయి. ఇది కూడా నెమ్మది నెమ్మదిగా మీ ద్వారా అందరికీ తెలిసిపోతుంది. అందుకు ఇంకా సమయముంది. లేకుంటే ఇచ్చట ఎంత గుంపు చేరుతుందంటే తర్వాత మీరు చదవను కూడా చదువుకోలేరు. ఇచ్చట గుంపు చేర్చే నియమము లేదు. గుప్త వేషములో పని నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా గొప్ప వ్యక్తి ఇక్కడకు వస్తే ఇతని తల చెడిపోయిందని అంటారు. ఇక్కడ తండ్రి మిమ్ములను చదివిస్తున్నారు. దేవతా ధర్మాన్ని అయితే భగవంతుడు వచ్చి రచిస్తారు కదా. ఇప్పుడు నూతన ప్రపంచాన్ని రచించేందుకు, భక్తుల ఆపదలను తొలగించేందుకు వారు ఇప్పుడు వచ్చారు. వినాశనము తర్వాత అయితే ఇక్కడ ఎలాంటి దు:ఖము ఉండదు. అచ్చట సత్యయుగములో భక్తులుండరు. దు:ఖితులుగా అయ్యే కర్మలు కూడా ఏవీ చేయరు.

(బొంబాయి నుండి రమేష్‌ భాయి ఫోను వచ్చింది) బాప్‌దాదా బయటకు వెళ్తే పిల్లలు ఉదాసీనంగా అవుతారు. ఎలాగైతే తన పతి విదేశాలకు వెళ్ళినప్పుడు స్త్రీ అతనిని స్మృతి చేసుకొని ఏడుస్తుందో, అలా పిల్లలు ఉదాసీనంగా ఉంటారు. వారిది శారీరిక సంబంధము, ఇచ్చట మీకు బాబాతో ఆత్మిక సంబంధముంది. బాబా నుండి విడిపోతే ప్రేమభాష్పాలు వచ్చేస్తాయి. సేవాధారి పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారి పై బాబాకు గౌరవముంది. సుపుత్రులైన పిల్లలకు కూడా వారి తండ్రి పై గౌరవముంటుంది. శివబాబాతో సంబంధమైతే చాలా ఉన్నతోన్నతమైన సంబంధము. వారి కంటే ఉన్నతమైన సంబంధము ఇంకేదీ ఉండదు. శివబాబా అయితే పిల్లలను తన కంటే ఉన్నతంగా తయారు చేస్తారు. మీరు పావనంగా ఏమో అవుతారు కానీ తండ్రి సమానంగా సదా పవిత్రంగా అవ్వలేరు. పావన దేవతలుగా అయితే అవుతారు. తండ్రి జ్ఞానసాగరులు. మనం ఎంత విన్నా జ్ఞానసాగరులుగా అవ్వలేము. వారు జ్ఞాన సాగరులు, ఆనంద సాగరులు. పిల్లలను ఆనందమయంగా తయారు చేస్తారు. ఇతరులు కేవలం పేరు పెట్టుకుంటారు. ఈ సమయములో ప్రపంచములో భక్తుల మాల చాలా పెద్దదిగా ఉంది. మీది 16,108 మంది మాల. భక్తులైతే కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఇచ్చట భక్తి విషయము లేదు. జ్ఞానము ద్వారానే సద్గతి జరుగుతుంది. ఇప్పుడు మిమ్ములను భక్తిమార్గపు సంకెళ్ళ నుండి విడిపించడం జరుగుతుంది. బాబా అంటున్నారు - భక్తులందరి పై ఎప్పుడైతే ఆపదలు వస్తాయో, అప్పుడు నేను గతి-సద్గతులనిచ్చేందుకు రావలసి వస్తుంది. స్వర్గములోని దేవతలు తప్పకుండా ఇటువంటి కర్మలు చేసినందున అంత ఉన్నతపదవిని పొందుకున్నారు. కర్మలైతే మనుష్యులు చేస్తూనే ఉంటారు కానీ అచ్చట కర్మలను నిందించరు. అనగా కర్మల ఫలితంగా దు:ఖమును అనుభవించరు. ఇచ్చట కర్మలు వికర్మలుగా అవుతాయి. ఎందుకంటే ఇక్కడ మాయ ఉంది. అక్కడ మాయ ఉండదు. మీరు వికర్మాజీతులుగా అవుతారు. ఏ పిల్లలకైతే ఇప్పుడు కర్మ-అకర్మ-వికర్మల గతిని అర్థం చేయిస్తున్నానో వారే వికర్మాజీతులుగా అవుతారు. కల్పక్రితము కూడా పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పించాను. ఇప్పుడు కూడా దానినే నేర్పిస్తున్నాను. కాంగ్రెస్‌వారు ఇంగ్లీషు వారిని(ఫిరంగులను) తొలగించి రాజుల నుండి రాజ్యాలను లాక్కున్నారు. రాజు అనే పేరునే అదృశ్యము చేసేశారు. 5 వేల సంవత్సరాల క్రితము భారతదేశము రాజస్థానంగా ఉండేది. లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. దేవతల రాజ్యము ఉండేది. అప్పుడది ఫరిస్తాన్‌గా ఉండేది. భగవంతుడు వారికి తప్పకుండా రాజయోగము నేర్పించి ఉంటారు. అప్పుడు వారికి భగవాన్‌ - భగవతి అనే పేరు వచ్చింది. అయితే ఇప్పుడు మనలో జ్ఞానముంది కనుక మనము భగవాన్‌-భగవతి అని చెప్పుకోలేము. లేకుంటే యథా రాజా-రాణి తథా ప్రజా కూడా భగవాన్‌-భగవతిగా ఉండాలి. కాని అలా జరగజాలదు. లక్ష్మీనారాయణుల పేర్లను కూడా ప్రజలెవ్వరూ తమ పై పెట్టుకోరాదు. ఇది నియమము కాదు. విదేశాలలో కూడా ప్రజలెవ్వరూ రాజుల పేర్లు పెట్టుకోరు. వారిని చాలా గౌరవిస్తారు. 5 వేల సంవత్సరాల క్రితము తండ్రి వచ్చారని పిల్లలు తెలుసుకున్నారు. ఇప్పుడు కూడా దైవీ రాజ్యాన్ని స్థాపన చేసేందుకు తండ్రి వచ్చారు. శివబాబా రావడం కూడా ఇప్పుడే జరిగింది. వారు పాండవుల పతి. కృష్ణుడు కాదు. తండ్రి పండాగా తయారై వాపస్‌ తీసుకెళ్లేందుకు, నూతన సత్యయుగీ ప్రపంచాన్ని రచించేందుకు వచ్చారు. కావున తప్పకుండా బ్రహ్మ ద్వారానే బ్రాహ్మణులను రచిస్తారు. కృష్ణుడైతే అలా చేయలేడు. ముఖ్యమైన గీతనే ఖండన చేసేశారు. ఇప్పుడు నేను కృష్ణుడిని కాదు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. నన్ను రుద్రుడని లేక సోమనాధుడని అనవచ్చు. మీకు జ్ఞాన సోమరసాన్ని తాపుచున్నాను అంతేకాని యుద్ధము మొదలైనవాటి మాటే లేదు. మీకు యోగబలము ద్వారా రాజ్యమనే వెన్న లభిస్తుంది. కృష్ణునికి వెన్న తప్పకుండా లభిస్తుంది. ఇతడు కృష్ణుని అంతిమ జన్మలోని ఆత్మ. వీరికి(బ్రహ్మ-సరస్వతులకు) కూడా భవిష్యత్తులో లక్ష్మీనారాయణులుగా అయ్యే కర్మలు తండ్రి నేర్పిస్తున్నారు. ఈ లక్ష్మీనారాయణులే బాల్యములో రాధా-కృష్ణులు. కనుక లక్ష్మీనారాయణులతో పాటు రాధా-కృష్ణుల చిత్రాలు కూడా ఇచ్చారు. పోతే వీరికి గొప్పతనమేదీ లేదు. ఒక్క గీతా భగవానునికి మాత్రమే చరిత్ర ఉంది. ఆ శివబాబా పిల్లలకు భిన్న భిన్న సాక్షాత్కారాలు చేయిస్తారు. మిగిలిన మనుష్యులకు ఏ చరిత్రా లేదు. ఏసుక్రీస్తు మొదలైనవారు కూడా వచ్చి ధర్మస్థాపన చేశారు. అలాగే అందరూ తమ పాత్ర చేసే తీరాలి. కావున ఇందులో చరిత్రకు విషయమేదీ లేదు. వారు ఎవ్వరికీ గతిని ఇవ్వలేరు. ఇప్పుడు అనంతమైన తండ్రి చెప్తున్నారు - నేను పిల్లలైన మీకు డబుల్‌ సర్వీసు చేసేందుకు వచ్చాను. దాని ద్వారా మీ ఆత్మ మరియు శరీరము రెండూ పవిత్రమైపోతాయి. అందరినీ వావసు ఇంటికి ముక్తిధామానికి తీసుకెళ్తాను. మళ్లీ అచ్చటి నుండి తమ తమ పాత్రలు అభినయించేందుకు వస్తారు. ఎంత బాగా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు! ఈ లక్ష్మీనారాయణుల చిత్రము పై అర్థము చేయించడం చాలా సహజము. త్రిమూర్తి చిత్రము మరియు శివబాబా చిత్రాలు కూడా ఉన్నాయి. కొంతమంది త్రిమూర్తి ఉండరాదని, మరి కొంతమంది కృష్ణుని 84 జన్మల కథ ఉండరాదని అంటారు. కృష్ణుడు కూడా 84 జన్మలు తీసుకుని పతితమౌతాడని మనుష్యులు విన్నప్పుడు వారిలో గడబిడ మొదలౌతుంది మనము ఈ విషయాన్ని నిరూపించి తెలుపుతాము. తప్పకుండా మొదటి నంబరువాడైన శ్రీకృష్ణుడు అందరికన్నా ఎక్కువ జన్మలు తీసుకోవలసి వస్తుందని నిరూపిస్తాము. ప్రతి రోజు కొత్త కొత్త పాయింట్లు వస్తాయి కాని ధారణ కూడా జరగాలి. లక్ష్మీనారాయణుల చిత్రము పై అర్థం చేయించడం అన్నిటికంటే సులభము. మనుష్యులకు ఏ చిత్రము యొక్క అర్థము కూడా తెలియదు. చిత్రాలను అర్థ రహితంగా ఉల్టా సుల్ట్టాగా తయారుచేస్తారు. నారాయణునికి రెండు భుజాలు, లక్ష్మికి నాలుగు భుజాలు ఇచ్చేస్తారు. సత్యయుగములో ఇన్ని భుజాలు ఉండవు. వారికి కూడా ఇన్ని భుజాలుండవు. సూక్ష్మవతనములో అయితే బ్రహ్మా-విష్ణు-శంకరులు ఉంటారు. వారికి కూడా ఇన్ని భుజాలు ఉండవు. మూలవతనములో నిరాకార ఆత్మలుంటాయి. అయితే ఈ 8-10 భుజాల వారు ఎక్కడ నివసించేవారు? మానవ సృష్టిలో ఉండువారిలో మొట్టమొదట లక్ష్మీనారాయణులు. వారు రెండు భుజాలు కలవారు. అయితే వారికి 4 భుజాలు ఇచ్చేశారు. నారాయణుని నల్లగా, లక్ష్మిని తెల్లగా చూపిస్తారు. అయితే వారి పిల్లలు ఎలా ఉంటారు? ఎన్ని భుజాలు గలవారిగా ఉంటారు? కొడుకులకు 4 భుజాలు, కూతుర్లకు 2 భుజాలు ఉంటాయా? ఇటువంటి ప్రశ్నలు మీరు అడగవచ్చు. సదా మాకు స్వయంగా శివబాబాయే మురళీ వినిపిస్తున్నారని భావించమని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అప్పుడప్పుడు ఈ బ్రహ్మ కూడా వినిపిస్తారు. నేను మార్గదర్శకునిగా అయ్యి వచ్చానని శివబాబా అంటున్నారు. ఈ బ్రహ్మ నా పెద్ద కుమారుడు. త్రిమూర్తి బ్రహ్మా అని అంటారు. త్రిమూర్తి విష్ణువు, త్రిమూర్తి శంకరుడు అని అనరు. మహాదేవుడని శంకరుడిని అంటారు. అయితే త్రిమూర్తి బ్రహ్మా అని ఎందుకంటారు? ఇతడు ప్రజలను రచించాడు. అందువలన ఈ బ్రహ్మా వారి(శివబాబా) పత్ని(యుగల్‌) అవుతాడు. శంకరుడు లేక విష్ణువును స్త్రీ(పత్ని) అని అనరు. ఇవన్నీ అర్థము చేసుకోవలసిన చాలా అద్భుతమైన విషయాలు. ఇచ్చట కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. ఇది చేస్తే చాలు కాని ఇందులోనే శ్రమ ఉంది. ఇప్పుడు మీరు ఎంతో వివేకవంతులుగా అయ్యారు. అనంతమైన తండ్రి ద్వారా మీరు అనంతమైన అధిపతులుగా అవుతారు. ఈ భూమి, ఆకాశము అన్నీ మీవిగా అయిపోతాయి. బ్రహ్మాండము కూడా మీదే అయిపోతుంది. ఆల్‌మైటీ అథారిటీ రాజ్యముంటుంది. ఒకే ప్రభుత్వముంటుంది. సూర్యవంశీ ప్రభుత్వమున్నప్పుడు చంద్ర వంశముండదు. తర్వాత చంద్రవంశ ప్రభుత్వమున్నప్పుడు సూర్య వంశముండదు. అది గడచిపోయింది. డ్రామా మారిపోయింది. ఇవన్నీ చాలా అద్భుతమైన విషయాలు. పిల్లలకు ఎంతో సంతోషపు పాదరస మట్టము పైకి ఎక్కిపోవాలి! అనంతమైన తండ్రి ద్వారా మనము అనంతమైన వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటాము. ఆ పతిని ఎంతగానో స్మృతి చేస్తారు. వారు ఈ అనంతమైన సామ్రాజ్యాన్ని ఇచ్చేవారు. ఇటువంటి పతులకు పతిని ఎంతగా స్మృతి చేయాలి! ఎంత గొప్ప ప్రాప్తి లభిస్తుంది! అచ్చట మీరు ఎవరితోనూ ఎప్పుడూ ఏదీ వేడుకోరు. అచ్చట పేదవారు ఉండనే ఉండరు. అనంతమైన తండ్రి భారతదేశపు జోలెను నింపేస్తారు. లక్ష్మీ నారాయణుల రాజ్యాన్ని బంగారు యుగమని అంటారు. ఇప్పుడిది ఇనుప యుగము. వ్యత్యాసము ఎంత ఉందో చూడండి. తండ్రి అంటున్నారు - నేను పిల్లలకు రాజయోగము నేర్పిస్తున్నాను. మీరు దేవీ దేవతలుగా ఉండేవారు. తర్వాత మళ్లీ క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అయ్యారు. ఇప్పుడు మళ్లీ బ్రాహ్మణులుగా అయ్యారు. మీరే మళ్లీ దేవతలుగా అవుతారు. ఈ 84 జన్మల చక్రాన్ని మీరు స్మృతి చేయండి. చిత్రాలను చూపి అర్థము చేయించడం చాలా సులభము. దేవీ దేవతల రాజ్యమున్నప్పుడు ఏ ఇతర రాజ్యమూ లేదు, ఒకే రాజ్యముండేది. జనాభా చాలా తక్కువగా ఉండేది. దానిని స్వర్గమని అంటారు. అచ్చట పవిత్రత కూడా ఉండేది, సుఖ- శాంతులు కూడా ఉండేవి. పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ క్రిందికి వచ్చేశారు. 84 జన్మలు కూడా వీరే తీసుకున్నారు. వీరే తమోప్రధానమైపోతారు. మళ్లీ వారే సతోప్రధానంగా అవ్వాలి. సతోప్రధానంగా ఎలా అవ్వాలి. తప్పకుండా నేర్పించేవారు ఉండాలి. తండ్రి తప్ప ఇతరులెవ్వరూ నేర్పించలేరు. శివబాబా ఇతని అనేక జన్మల అంత్యములో ఇతనిలో ప్రవేశిస్తారని మీకు తెలుసు. చాలా స్పష్టంగా అర్థం చేయిస్తున్నారు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. 

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఒక తండ్రితోనే అన్ని రుహాని(ఆత్మిక) సంబంధాలు ఉంచుకోవాలి. సేవాధారి పిల్లలకు గౌరవమునివ్వాలి. మీ సమానంగా తయారు చేసే సేవ చేయాలి.
2. అనంతమైన తండ్రి ద్వారా మనకు అనంతమైన విశ్వరాజ్యభాగ్యము లభిస్తోంది. భూమి ఆకాశము అన్నిటి పై మన అధికారముంటుంది. ఈ నషా మరియు ఖుషీలో ఉండాలి. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. 

వరదానము :- ''బుద్ధ్ధి రూపీ విమానము ద్వారా ఒక్క సెకండులో మూడు లోకాలలో విహరించే సహజ యోగీ భవ''
'' పిల్లలూ సంకల్పమనే స్విచ్‌ ఆన్‌ చేయండి, వతనానికి వచ్చి సూర్యుని నుండి కిరణాలను తీసుకోండి, చంద్రుని నుండి వెన్నెల కూడా తీసుకోండి, పిక్‌నిక్‌ కూడా జరుపుకోండి, ఆటలు కూడా ఆడుకోండి'' అని బాప్‌దాదా పిల్లలను ఆహ్వానిస్తున్నారు. అలా చేసేందుకు కేవలం బుద్ధి రూపీ విమానంలో డబల్‌ రిఫైన్‌ పెట్రోలు అవసరము. డబల్‌ రిఫైన్‌ అనగా ఒకటేమో నేను నిరాకారి ఆత్మను, నిరాకార తండ్రి పుత్రుడను అనే నిశ్చయము, రెండవది - సాకార రూపంలో సర్వసంబంధాల నషా. ఈ నషా మరియు ఖుషీ సహజయోగులుగా కూడా చేస్తుంది. మూడు లోకాలలో విహరిస్తూ కూడా ఉంటారు.

స్లోగన్‌ :- ''శ్రేష్ఠమైన కర్మలు చేసే జ్ఞానమే శ్రేష్ఠమైన భాగ్యరేఖను గీచుకునే కలము''
 

Thursday, 25 January 2018

Telugu Murli 26/01/18

26-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

'' మధురమైన పిల్లలారా - మీరు ముత్యాలను గ్రోలేె హంసలు, మీది హంసల సమూహము, మీరు భాగ్యశాలీ నక్షత్రాలు(లక్కీ సితారే) ఎందుకంటే స్వయం జ్ఞాన సూర్యుడైన తండ్రి మిమ్ములను సన్ముఖంగా చదివిస్తున్నారు '' 

ప్రశ్న:- తండ్రి పిల్లలందరికీ ఏ ప్రకాశమునిచ్చినందున పురుషార్థము తీవ్రమైపోయింది?
జవాబు:- పిల్లలూ! ఇది డ్రామాలోని అంతిమ సమయము. మీరు నూతన ప్రపంచములోకి వెళ్ళాలి. ఏది లభించాలని ఉందో, అదే లభిస్తుందిలే అని అనుకోరాదు. మొదట పురుషార్థము చేయాలి. పవిత్రంగా తయారై ఇతరులను కూడా పవిత్రంగా చేయాలి. ఇది చాలా గొప్ప సేవ అని బాబా పిల్లలకు ప్రకాశమునిచ్చారు. ఈ ప్రకాశము లభించిన వెంటనే పిల్లలైన మీ పురుషార్థము తీవ్రమైపోయింది.

పాట:- నీవు ప్రేమ సాగరుడవు,.......... (తూ ప్యార్‌ కా సాగర్‌ హై,...........)
ఓంశాంతి. ప్రేమసాగరుడు, శాంతి సాగరుడు, ఆనందసాగరుడైన అనంతమైన తండ్రి మా సన్ముఖములో కూర్చొని శిక్షణ ఇస్తున్నారని పిల్లలకు తెలుసు. జ్ఞానసూర్యుడైన తండ్రే స్వయంగా ఎవరిని చదివిస్తున్నారో వారు ఎంత భాగ్యశాలి నక్షత్రాలు! ఇంతవరకు కొంగల మండలిగా ఉండేది, ఇప్పుడు హంస మండలిగా అయిపోయింది. ముత్యాలను గ్రోలడము(చప్పరించడం) ప్రారంభించారు. సోదరీ-సోదరులైన మీరందరూ హంసలు. ఈ సమూహాన్ని హంసమండలి అని అంటారు. కల్పక్రితము వారే ఈ సమయములో, ఈ జన్మలో ఒకరినొకరు గుర్తిస్తారు. ఆత్మిక పారలౌకిక మాతా-పిత, సోదర-సోదరీలు పరస్పరము ఒకరినొకరు గుర్తిస్తారు. 5 వేల సంవత్సరాల క్రితము కూడా మనము పరస్పరము ఇదే నామ-రూపాలతో కలుసుకున్నామని మీకు గుర్తుందా? ఇలా మీరు ఇప్పుడు మాత్రమే అనగలరు. తర్వాత ఇంకెప్పుడూ ఏ జన్మలోనూ ఈ విధముగా అనజాలరు. బ్రహ్మకుమార-కుమారీలుగా ఎవరెవరు అవుతారో వారు మాత్రమే ఒకరినొకరు గుర్తిస్తారు. ''బాబా మీరు కూడా అప్పటివారే. మీ పిల్లలైన మేము కూడా అప్పటివారమే. సోదరీ-సోదరులైన మేము మళ్ళీ మా తండ్రి నుండి వారసత్వము తీసుకుంటాము అని అంటారు. ఇప్పుడు తండ్రి మరియు వారి పిల్లలు ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. మళ్ళీ ఈ నామ-రూపాలు మొదలైనవన్నీ మారిపోతాయి. సత్యయుగములో లక్ష్మీనారాయణులు మేము కల్పక్రితమున్న అదే లక్ష్మీనారాయణులము లేక ప్రజలు కూడా వీరు కల్పక్రితపు లక్ష్మీనారాయణులే అని అనరు. ఇది కేవలం ఈ సమయములో పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఈ సమయములో మీరు చాలా తెలుసుకుంటారు. ఇంతకుముందు మీకు ఏమీ తెలిసేది కాదు. నేనే కల్పము యొక్క సంగమ యుగములో వచ్చి నా పరిచయాన్ని ఇస్తాను. ఈ మాట కేవలం అనంతమైన తండ్రి ఒక్కరు మాత్రమే అనగలరు. నూతన ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనము కూడా తప్పకుండా జరగాలి. ఇది రెండింటి సంగమ యుగము. ఇది చాలా కళ్యాణకారీ యుగము. సత్యయుగాన్ని గానీ, కలియుగాన్ని గానీ కళ్యాణకారీ అనరు. ఇప్పటి మీ ఈ జీవితము అమూల్యమైనదని మహిమ చేయబడింది. ఈ జీవితములోనే గవ్వ నుండి వజ్ర సమానంగా తయారవ్వాలి. పిల్లలైన మీరు సత్య-సత్యమైన ఈశ్వరీయ సేవాధారులు, ముక్తినిప్పించే ఈశ్వరీయ సైన్యము. ఈశ్వరుడు వచ్చి మిమ్ములను మాయ నుండి ముక్తము చేస్తారు. మీకు ఇది కూడా తెలుసు - ముఖ్యంగా మిమ్ములను జనరల్‌గా ప్రపంచమంతటిని మాయ సంకెళ్ళ నుండి విడిపిస్తారు. ఇది కూడా డ్రామాలో నిశ్చయింపబడింది. ఇప్పుడు గొప్పతనము(మహిమను) ఎవరికివ్వాలి? ఎవరి నటన బాగుంటుందో వారి పేరెే ప్రఖ్యాతమవుతుంది. అందువలన మహిమ కూడా పరమపిత పరమాత్మకే ఇవ్వబడ్తుంది. ఇప్పుడు భూమి పై పాపాత్మల భారము చాలా ఎక్కువగా ఉంది. ఆవగింజల వలె లెక్కలేనంత మంది మనుష్యులున్నారు. తండ్రి వచ్చి భారాన్ని దింపుతారు. అచ్చట కేవలం కొన్ని లక్షలమంది మాత్రమే ఉంటారు. క్వార్టర్‌ 25 శాతము కూడా ఉండదు. అందువలన ఈ డ్రామాను గురించి కూడా బాగా అర్థము చేసుకోవాలి. పరమాత్మను సర్వశక్తివంతుడని అంటారు. ఈ పాత్ర కూడా వారికి డ్రామాలో ఉంది. తండ్రి అంటున్నారు - నేను కూడా డ్రామాలో బంధింపబడి ఉన్నాను. యదాయదాహి ధర్మస్య........ అని వ్రాయబడి ఉంది. ఇప్పుడు మళ్ళీ భారతదేశములో అప్పటి ధర్మగ్లానే ఖచ్చితంగా ఉంది. నన్ను కూడా గ్లాని చేస్తారు. దేవతలను కూడా గ్లాని చేస్తారు. అందుకే చాలా పాపాత్మలుగా అయిపోయారు. వారు ఇలా అయ్యే తీరాలి. సతో, రజో, తమోలోకి వచ్చే తీరాలి. మీరు ఈ డ్రామాను అర్థము చేసుకున్నారు. బుద్ధిలో చక్రము తిరుగుతూ ఉంటుంది. తండ్రి వచ్చి జ్ఞాన ప్రకాశమునిచ్చారు. ఇప్పుడు ఈ డ్రామా అంతిమ సమయములో ఉంది. ఇప్పుడు మీరు మళ్ళీ నూతన ప్రపంచము కొరకు పురుషార్థము చేయండి. అంతేకాని ఏది లభించాలని ఉంటే, అది లభిస్తుంది అని అనుకోరాదు. పురుషార్థము ఫస్ట్‌, మొత్తం శక్తి అంతా పవిత్రతలోనే ఉంది. ఇది పవిత్రత య్కొ బలిహారమే. దేవతలు పవిత్రులు ఉంటారు. అందుకే అపవిత్ర మనుష్యులు వారి ముందుకు వెళ్ళి తల వంచుతారు. సన్యాసులకు కూడా తల వంచి నమస్కరిస్తారు. మరణించిన తర్వాత వారి స్మృతిచిహ్నాలు తయారుచేస్తారు. ఎందుకంటే వారు పవిత్రులుగా అయ్యారు. కొంతమంది భౌతిక సంబంధమైన మంచి పనులు(సేవలు) కూడా ఎన్నో చేస్తారు. ఆసుపత్రులు తెరుస్తారు లేక కాలేజీలు తెరుస్తారు. అటువంటివారి పేరు కూడా ప్రసిద్ధమౌతుంది. అందరినీ ఎవరు పవిత్రము చేస్తారో, మరియు వారికి ఎవరైతే సహాయపడ్తారో, వారికి అందరికంటే గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. సదా పవిత్రంగా ఎవరు ఉంటారో (బాబా), వారితో యోగము చేసి మీరు పవిత్రంగా అవుతారు. మీరు వారితో ఎంతగా యోగము జోడిస్తూ ఉంటారో, మీరు అంత పవిత్రంగా అవుతారు. తర్వాత అంతమతి సో గతి అవుతారు. అనగా తండ్రి వద్దకు వెళ్ళిపోతారు. వారు యాత్రలకు వెళ్ళినప్పుడు తండ్రి వద్దకు వెళ్లాలని భావించరు. అయినా పవిత్రంగా ఉంటారు. ఇచ్చట అయితే తండ్రి అందరినీ పవిత్రంగా చేస్తారు. డ్రామాను అర్థము చేసుకోవడం కూడా ఎంతో సులభము. చాలా పాయింట్లు అర్థము చేయిస్తూ ఉంటారు. వారంటున్నారు - కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. మరణించే సమయంలో అందరూ భగవంతుని స్మృతిని ఇప్పిస్తారు. అచ్ఛా అయితే భగవంతుడు ఏమి చేస్తారు? మళ్ళీ ఎవరైనా శరీరాన్ని వదలితే స్వర్గవాసులయ్యారని అంటారు అనగా పరమాత్ముని స్మృతిలో శరీరము వదిలినందున వైకుంఠములోకి వెళ్ళిపోతారు. వారికి తండ్రి ఎవరో తెలియదు. అంతేకాక తండ్రిని స్మృతి చేసినందున వైకుంఠానికి చేరుకుంటామని కూడా ఎవరి బుద్ధిలోనూ లేదు. వారు కేవలం పరమాత్ముని స్మృతి చేయమని చెప్తారు. ఇంగ్లీషులో వారిని గాడ్‌ఫాదర్‌ అని అంటారు. ఇచ్చట మీరు పరమపిత పరమాత్మ అని అంటారు. వారు మొదట గాడ్‌ అని తర్వాత ఫాదర్‌ అని అంటారు. కాని మనము మొదట పరమపిత అని, తర్వాత పరమాత్మ అని అంటాము. వారు సర్వులకు తండ్రి. ఒకవేళ అందరూ తండ్రులే అయితే ఓ గాడ్‌ఫాదర్‌(భగవంతుడా)! అని అనజాలరు. ఈ చిన్న విషయము కూడా అర్థము చేసుకోలేరు. తండ్రి మీకు సులభము చేసి అర్థము చేయించారు. మనుష్యులు దు:ఖితులుగా అయినప్పుడు పరమాత్మను స్మృతి చేస్తారు. మనుష్యులు దేహాభిమానులు. కానీ స్మృతి చేసేది దేహమును ధరించిన ఆత్మయే, పరమాత్మ సర్వవ్యాపి అయితే ఆత్మ పరమాత్మను ఎందుకు స్మృతి చేయాలి? ఆత్మ నిర్లేపి అయితే మరి ఆత్మను ఏమి స్మృతి చేస్తుంది? ఎవరిని స్మృతి చేస్తుంది? భక్తిమార్గములో ఆత్మయే పరమాత్మను స్మృతి చేస్తుంది ఎందుకంటే దు:ఖములో ఉంది. ఎంత సుఖము లభించిందో అంత స్మృతి చేయవలసి ఉంటుంది.

ఇది చదువు. దీని లక్ష్యము కూడా స్పష్టముగా ఉంది. ఇందులో మూఢ నమ్మకాల విషయమేదీ లేదు. మీకు అన్ని ధర్మాలవారు తెలుసు - ఈ సమయములో అందరూ ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ దేవీ దేవతా ధర్మము వారి చరిత్ర రిపీట్‌ అవ్వనున్నది. ఇదేమీ కొత్త విషయము కాదు. కల్ప-కల్పము మనము రాజ్యము తీసుకుంటాము. ఎలాగైతే ఆ హద్దులోని సినిమా రిపీట్‌ అవుతుందో, అలా ఈ బేహద్‌(అనంతమైన) నాటకము కూడా రిపీట్‌ అవుతుంది. మన అర్ధకల్పపు శత్రువు ఎవరు? రావణుడు. మనము ఏ యుద్ధమూ చేసి రాజ్యము తీసుకోము. అలాగే హింసాయుతమైన యుద్ధమేదీ చేయుము. విజయము పొందేందుకు మనము ఏ సైన్యాన్ని తీసుకోము, యుద్ధము చేయము. ఇది గెలుపు-ఓటముల ఆట. కాని ఓటమి కూడా సూక్ష్మమైనది. గెలుపు కూడా సూక్ష్మమైనదే. మాయతో ఓడిపోతే అది ఓటమి. మాయతో గెలిస్తే అది గెలుపు. మనుష్యులు మాయకు బదులు మనస్సు అనే పదము వేసేశారు. అందువలన అంతా ఉల్టాగా అయిపోయింది. ఈ డ్రామాలోని ఆట కూడా ముందే రచింపబడి ఉంది. తండ్రి స్వయంగా కూర్చొని పరిచయమిస్తారు. రచయితను గురించి ఏ ఇతర మనుష్యులకూ తెలియనే తెలియదు. కావున వారు తండ్రి పరిచయమును ఎలా ఇస్తారు? రచయిత ఒక్క తండ్రి మాత్రమే. మిగిలిన మనమంతా వారి రచన. అందువలన మనకు తప్పకుండా రాజ్యభాగ్యము లభించాలి. మనుష్యులైతే పరమాత్మ సర్వవ్యాపి అని అంటారు. అప్పుడు అందరూ రచయితలైపోతారు కదా. రచన అనేది లేకుండా చేసేశారు. ఎంత రాతి బుద్ధిగలవారిగా, దు:ఖితులుగా అయిపోయారు! కేవలం మేము వైష్ణవులము అని స్వంత మహిమను చేసుకుంటారు అనగా మేము సగం దేవతలము అని అంటారు. దేవతలు వైష్ణవులుగా ఉండేవారని భావిస్తారు. వాస్తవానికి శాఖాహారానికి ముఖ్యమైన అర్థము అహింసో పరమో ధర్మ:, దేవతలను పక్కా వైష్ణవులని అంటారు. స్వయాన్ని వైష్ణవులని పిలిపించుకునేవారు చాలా మంది ఉన్నారు. కాని లక్ష్మీనారాయణ రాజ్యములో వైష్ణవ సంప్రదాయము వారు పవిత్రముగా కూడా ఉండేవారు. ఇప్పుడు ఆ వైష్ణవ సాంప్రదాయము వారి రాజ్యము ఎక్కడ ఉంది? ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. మీరందరూ బి.కె.లు కనుక బ్రహ్మ కూడా తప్పకుండా ఉంటారు. అందుకే ''శివవంశీ ప్రజాపిత బ్రహ్మ సంతానము'' అని పేరు పెట్టారు. శివబాబా వచ్చారని, వారు బ్రాహ్మ సంప్రదాయము రచించారని, ఆ బ్రాహ్మణులే మరలా దేవతలుగా అయ్యారని గాయనము(మహిమ) కూడా చేయబడ్తుంది. ఇప్పుడు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. అందుకే మీరు బ్రహ్మకుమార-బ్రహ్మకుమారీలని పిలువబడ్తారు. విరాటరూప చిత్రాన్ని చూపించి తెలిపించడం బాగుంటుంది. విరాట రూపము విష్ణువుదిగా చూపించారు విష్ణువు మరియు అతని రాజధాని(సంతానము) మాత్రమే విరాట చక్రములోకి వస్తారు. ఈ విచారములన్నీ బాబా బుద్ధిలో నడుస్తూ ఉంటాయి. మీరు కూడా విచార సాగర మథనమును అభ్యాసము చేస్తూ ఉంటే రాత్రి పూట నిద్రరాదు. ఈ ఆలోచనలే నడుస్తూ ఉంటాయి. మీరు కూడా విచార సాగర మథనం చేసే అభ్యాసము చేస్తే రాత్రికి నిదుర రాదు. ఇదే చింత నడుస్తూ ఉంటుంది. ఉదయమే లేచి వృత్తి వ్యాపారాదులలో లగ్నమైపోతారు. ఉదయపు సాయి...... అని అంటారు. మీరు కూడా ఎవరికైనా కూర్చొని అర్థము చేయిస్తే ''ఓ¬! వీరు మమ్ములను మనుష్యుల నుండి దేవతలుగా, భికారుల నుండి రాకుమారులుగా తయారు చేసేందుకు వచ్చారని అంటారు.'' మొదట అలౌకిక సేవ చేయాలి. స్థూలమైన సేవ ఆ తర్వాత. ఆసక్తి ఉండాలి. ముఖ్యంగా మాతలు చాలా మంచి రీతిగా సేవ చేయవచ్చు. మాతలను ఎవ్వరూ ధిక్కరించరు. కూరగాయలు అమ్మేవారికి, ధాన్యము అమ్మేవారికి, నౌకర్లకు మొదలైన వారందరికీ అర్థము చేయించాలి. చివరిలో మాకు తెలియలేదే అని ఎవ్వరూ ఫిర్యాదు చేయరాదు. సేవ చేయునప్పుడు హృదయములో సత్యత ఉండాలి. తండ్రితో పూర్తి యోగముండాలి. అప్పుడు ధారణ అవుతుంది. సామాగ్రి నింపుకొని తర్వాత ఓడరేవు వద్దకు సామగ్రి డెలివరి చేసేందుకు వెళ్తారు. వారికి ఇంట్లో సుఖముగా ఉండదు. పరుగెడుతూ ఉంటారు. ఈ చిత్రాలు కూడా చాలా సహాయము చేస్తాయి. శివబాబా బ్రహ్మ ద్వారా విష్ణుపురిని స్థాపన చేయుస్తున్నారని ఎంతో స్పష్టంగా తెలుస్తోంది. ఇది రుద్ర జ్ఞానయజ్ఞము. కృష్ణ జ్ఞానయజ్ఞము కాదు. ఈ రుద్రజ్ఞాన యజ్ఞము ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలితమైనది. కృష్ణుడు యజ్ఞమును రచింపజాలడు. అతడు 84 జన్మలు తీసుకుంటాడు కావున నామ-రూపాలు మారిపోతాయి. ఇక ఏ ఇతర రూపములోనూ కృష్ణుడు ఉండడు. మళ్ళీ ఎప్పుడైతే అదే రూపములో కృష్ణుడు వస్తాడో అప్పుడే అతని పాత్ర రిపీట్‌ అవుతుంది. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. 

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. సత్య-సత్యమైన ఈశ్వరీయ సేవాధారులై లేక ఈశ్వరీయ ముక్తినిచ్చే ఈశ్వరీయ సైన్యముగా తయారై అందరినీ మాయ నుండి ముక్తులుగా చేయాలి. ఈ జీవతములో గవ్వ నుండి వజ్ర తుల్యంగా తయారవ్వాలి, ఇతరులను తయారు చేయాలి.
2. ఎలాగైతే బాబా విచార సాగర మథనము చేస్తారో, అలా జ్ఞాన విచార సాగర మథనము చేయాలి. కళ్యాణకారులుగా అయ్యి అలౌకిక సేవలో తత్పరులుగా ఉండాలి. సత్యమైన హృదయముతో సేవ చేయాలి. 

వరదానము:- '''నాది' అనే స్మృతి ద్వారా స్నేహము మరియు దయా దృష్టిని ప్రాప్తి చేసుకునే సమర్థ సంపన్న భవ ''
ఎలాగైతే తండ్రిని గుర్తించి ఒక్కసారైనా హృదయ పూర్వకంగా ' మేరా బాబా ' (నా బాబా, నా తండ్రి) అని అన్నారంటే, దయా సాగరుడైన బాప్‌దాదా అందుకు బదులుగా అటువంటి పిల్లలనకు పదమా రెట్లు అదే ఆత్మిక ప్రేమతో చూస్తారు. దయ మరియు స్నేహ పూరిత దృష్టి వారిని సదా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ఇదే ఆత్మిక మేరేపన్‌ యొక్క స్మృతి ఇటువంటి పిల్లలకు సమర్థతను నింపుకునే ఆశీర్వాదంగా అయిపోతుంది. బాప్‌దాదాకు నోటి నుండి ఆశీర్వాదాలిచ్చే అవసరముండదు. కానీ సూక్ష్మమైన స్నేహ సంకల్పాల ద్వారా ప్రతి పుత్రునికి పాలన జరుగుతూ ఉంటుంది. 

స్లోగన్‌:-''ఎవరైతే తండ్రికి ప్రియమైనవారో, వారికి ఏ ఇతర వ్యక్తి లేక వైభవము పై ప్రేమ ఉండదు''
 

Telugu Murli 25/01/18

25-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

''మధురమైన పిల్లలారా - ఈ సృష్టి లేక ప్రపంచము దు:ఖమయంగా ఉంది. కావున దీని నుండి నిర్మోహులుగా(నష్టమోహులుగా) అవ్వండి. నూతన ప్రపంచాన్ని స్మృతి చేయండి. బుద్ధియోగాన్ని ఈ ప్రపంచము నుండి తొలగించి నూతన ప్రపంచంతో జోడించండి'' 

ప్రశ్న :- కృష్ణపురములోకి వెళ్లేందుకు పిల్లలైన మీరు ఏ ఏర్పాట్లు చేస్తారు, చేయిస్తారు ?
జవాబు :- కృష్ణపురములోకి వెళ్లేందుకు కేవలం ఈ అంతిమ జన్మలో అన్ని వికారాలను వదిలి పావనంగా అవ్వాలి, ఇతరులను కూడా పావనంగా చేయాలి. పావనంగా అవ్వడమే దు:ఖధామము నుండి సుఖధామములోకి వెళ్లేందుకు చేసుకునే ఏర్పాట్లు. ఇది అశుద్ధమైన(డర్టీ, మురికి) ప్రపంచమని, దీని నుండి బుద్ధియోగాన్ని తొలగిస్తే నూతన సత్యయుగ ప్రపంచములోకి వెళ్ళిపోతారని అందరికీ సందేశమును ఇవ్వండి. 

పాట:- నాకు ఆధారాన్ని (సహయోగమును) ఇచ్చువారు,........ ( ముఝ్‌కో సహారా దేనేవాలే,............)   
ఓంశాంతి. ఈ పాటలో పిల్లలు బాబా అని పిలుస్తారు, వెంటనే పిల్లల బుద్ధి అనంతమైన తండ్రి వైపుకు వెళ్ళిపోతుంది. ఏ పిల్లలకైతే ఇప్పుడు సుఖము లభిస్తూ ఉందో లేక సుఖధామానికి దారి లభిస్తూ ఉందో, ఆ పిల్లలు - తప్పకుండా స్వర్గములో 21 జన్మల సుఖ వారసత్వమునిచ్చేందుకు తండ్రి వచ్చారని అర్థం చేసుకుంటారు. ఈ సుఖము ప్రాప్తి చేయించేందుకు స్వయం తండ్రే వచ్చి శిక్షణనిస్తున్నారు. వారు అర్థం చేయిస్తున్నారు - ఇప్పుడు ఈ ప్రపంచము ఏదైతే ఉందో అనగా ఇంతమంది మనుష్యులు ఎవరైతే ఉన్నారో, వారు మీకు ఏమీ ఇవ్వలేరు. వీరందరూ రచనయే కదా. పరస్పరములో సోదరీ-సోదరులు. అందువలన రచన ఒకరికొకరు పరస్పరములో సుఖ వారసత్వాన్ని ఎలా ఇవ్వగలరు? సుఖ వారసత్వమును ఇచ్చేవారు తప్పకుండా రచయిత అయిన ఒక్క తండ్రి మాత్రమే అయ్యి ఉంటారు. ఈ ప్రపంచములో ఎవరికైనా సుఖమునివ్వగలిగిన మనిషి ఒక్కరు కూడా లేరు. సుఖదాత, సద్గతిదాత ఒక్క సద్గురువు మాత్రమే అయ్యారు. ఇప్పుడు ఏ సుఖాన్ని అడుగుచున్నారు? స్వర్గములో చాలా సుఖముండేదని అందరూ మర్చిపోయారు, ఇప్పుడు నరకములో దు:ఖముందని కూడా తెలియదు. అందువలన పిల్లలందరి పై ఆ మాలికునికే(తండ్రైన భగవంతునికి) జాలి కలుగుతుంది. ఈ సృష్టికి అధిపతినని అంగీకరించేవారు చాలామంది ఉన్నారు కాని వారు ఎవరో, వారి ద్వారా ఏమి లభిస్తుందో ఎవ్వరికీ ఏ మాత్రమూ తెలియదు. యజమాని ద్వారా మనకు దు:ఖము లభించదని కాదు. వారిని స్మృతి చేసేదే సుఖ-శాంతులను పొందేందుకు. భక్తులు భగవంతుని స్మృతి చేసేది తప్పకుండా ప్రాప్తి కొరకే. అందరూ దు:ఖితులుగానే ఉన్నారు. అందుకే సుఖ-శాంతుల కొరకు స్మృతి చేస్తారు. అనంతమైన సుఖమును ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. మిగిలినవారు హద్దులోని అల్పకాలికమైన సుఖమునైతే ఒకరికొకరు ఇచ్చుకుంటూనే ఉంటారు. అది ఏమంత పెద్ద విషయము కాదు. భక్తులందరూ ఒక్క భగవంతుడినే పిలుస్తూ ఉంటారు. భగవంతుడు తప్పకుండా అందరికంటే గొప్పవారు. వారి మహిమ చాలా గొప్పది. కనుక వారు తప్పకుండా చాలా సుఖమునిచ్చేవారుగా ఉంటారు. తండ్రి ఎప్పుడూ పిల్లలకు గాని, ప్రపంచానికి గాని దు:ఖమునివ్వజాలరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు విచారము చేయండి - నేను ఏ సృష్టిని లేక ప్రపంచాన్ని దు:ఖమునిచ్చేందుకు రచిస్తానా? నేను రచించేది సుఖమునిచ్చేందుకు. అయితే ఈ డ్రామాలో సుఖము, దు:ఖము రెండూ ఉన్నాయి. మనుష్యులు ఎంత దు:ఖితులుగా ఉన్నారు! తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఈ ప్రపంచము లేక సృష్టి క్రొత్తదిగా ఉన్నప్పుడు అందులో సుఖముంటుంది, దు:ఖము పాత సృష్టిలో ఉంటుంది. అన్నీ పురాతనమై శిథిలావస్థకు చేరుకున్నాయి. మొదట నేను ఏ సృష్టినైతే రచిస్తానో దానిని సతోప్రధాన సృష్టి అని అంటారు. ఆ సమయంలో మనుష్యులందరూ ఎంతో సుఖంగా ఉంటారు. ఆ ధర్మము ఇప్పుడు ప్రాయ: లోపమైనందున ఇది ఎవరి బుద్ధిలోనూ లేదు.

క్రొత్త ప్రపంచము సత్యయుగమని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు పాతదిగా ఉంది కాబట్టి తండ్రి వచ్చి తప్పకుండా నూతన ప్రపంచాన్ని తయారు చేస్తారనే ఆశను ఉంచుకుంటారు. మొదట నూతన సృష్టి, నూతన ప్రపంచములో చాలా కొద్దిమంది మాత్రమే ఉండేవారు. వారు చాలా సుఖంగా ఉండేవారు. ఆ సుఖాలు అపారమైనవి(ఆ సుఖాలకు అంతే లేదు). దాని పేరే స్వర్గము, వైకుంఠము, నూతన ప్రపరచము అని అంటారు. కావున అందులో తప్పకుండా కొత్త మనుష్యులే ఉంటారు. ఆ దేవీ దేవతల రాజధానిని తప్పకుండా నేనే స్థాపన చేసి ఉంటాను కదా లేకుంటే కలియుగములో ఒక్క రాజు కూడా లేనప్పుడు, అందరూ నిరుపేదలుగా ఉన్నప్పుడు ఒక్కసారిగా సత్యయుగములో దేవీ దేవతల రాజ్యము ఎలా వస్తుంది ? ఎక్కడ నుండి వచ్చింది ? ఈ ప్రపంచము ఎలా మార్పు చెందింది? అయితే అందరి బుద్ధి ఏమీ అర్థము చేసుకోలేనంతగా నశించిపోయింది. తండ్రి వచ్చి పిల్లలకు అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. మనుష్యులు - సుఖమిచ్చేది వారే, దు:ఖమిచ్చేది వారే అని ఆ తండ్రి పైనే దోషము మోపుతారు. అయితే ఈశ్వరుని - మీరు వచ్చి మాకు సుఖ-శాంతులు ఇవ్వండి, స్వీట్‌ హోమ్‌కు(శాంతిధామానికి) తీసుకెళ్ళమని స్మృతి చేస్తారు. మళ్లీ పాత్ర చేసేందుకు అయితే తప్పకుండా పంపుతారు కదా. కలియుగము తర్వాత మళ్లీ సత్యయుగము తప్పకుండా రానున్నది. మనుష్యులైతే రావణుని మతము పై నడుస్తున్నారు. శ్రేష్ఠ మతమంటే శ్రీమతము. తండ్రి అంటున్నారు - నేను సహజ రాజయోగాన్ని నేర్పిస్తాను. నేను ఏ గీతా శ్లోకము మొదలైన వాటిని గానము చేయను - ఆ కార్యము మీరు చేస్తారు. తండ్రి కూర్చొని గీతనేమైనా నేర్పుతారా? నేను సహజ రాజయోగమును నేర్పుతాను. పాఠశాలలో పాటలు, కవితలు వినిపిస్తారా? పాఠశాలలో అయితే చదివిస్తారు. తండ్రి కూడా అంటున్నారు - పిల్లలైన మిమ్ములను నేను చదివిస్తున్నాను, రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. నాతో ఇతరులెవ్వరికీ యోగము లేదు. అందరూ నన్ను మర్చిపోయారు. ఈ మర్చిపోవడం కూడా డ్రామాలో ఫిక్స్‌ అయ్యి ఉంది. నేను వచ్చి మళ్లీ స్మృతినిప్పిస్తాను. నేను మీ తండ్రిని. భగవంతుడు నిరాకారుడని అంగీకరిస్తారు. మరి వారి పిల్లలైన మీరు కూడా నిరాకారులే కదా. నిరాకార ఆత్మలైన మీరు మళ్లీ పాత్ర చేసేందుకు ఇక్కడకు వస్తారు. నిరాకార ఆత్మలందరి నివాస స్థానము నిరాకార ప్రపంచమే. అది అత్యంత ఉన్నతమైనది, ఇది సాకార ప్రపంచము. దీని తర్వాత ఆకారీ ప్రపంచము, దాని తర్వాత అది నిరాకార ప్రపంచము. నిరాకార ప్రపంచము - అన్నిటికంటే పైన మూడవ అంతస్థులో ఉంది. బాబా సన్ముఖములో కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - నేను కూడా అచ్చటి నివాసినే. నూతన ప్రపంచమున్నప్పుడు అచ్చట ఒకే ధర్మముండేది. దానిని హెవెన్‌(స్వర్గము) అని అంటారు. తండ్రిని హెవెన్లీ గాడ్‌ఫాదర్‌ అని అంటారు. కలియుగము కంసపురి, సత్యయుగము కృష్ణపురి. కనుక ఇప్పుడు మీరు కృష్ణపురికి వస్తారా? అని అడగాలి. మీరు కృష్ణపురికి రావాలనుకుంటే పవిత్రముగా అవ్వండి. ఏ విధంగా మేము దు:ఖధామము నుండి సుఖధామములోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నామో, అలా మీరు కూడా చేయండి. అక్కడకు వచ్చేందుకు వికారాలను తప్పక వదలవలసి ఉంటుంది. ఇది అందరికీ అంతిమ జన్మ, అందరూ వాపస్‌ వెళ్ళాలి. 5 వేల సంవత్సరాల క్రితము ఆ మహాభారత యుద్ధము జరగలేదా? మీరు మర్చిపోయారా? అందులో అన్ని ధర్మాలు వినాశమైపోయాయి. ఏకధర్మము స్థాపించబడింది. సత్యయుగములో దేవీ దేవతలు ఉండేవారు కదా. కలియుగములో వారు లేరు. ఇప్పుడిది రావణరాజ్యము, ఇక్కడ ఉండేవారు ఆసురీ మనుష్యులు. వారిని మళ్లీ దేవతలుగా తయారు చేయవలసి ఉంటుంది. అందువలన తండ్రి ఆసురీ ప్రపంచములో రావలసి ఉంటుందా? లేక దైవీ ప్రపంచములో వస్తారా? లేక రెండింటి సంగమ సమయములో వస్తారా? కల్ప-కల్పము, కల్పము యొక్క సంగమ యుగే యుగే వస్తానని గాయనము కూడా ఉంది. తండ్రి మనకు ఈ విధంగా అర్థం చేయిస్తున్నారు - మనము వారి శ్రీమతమును అనుసరిస్తున్నాము. నేను మార్గదర్శకుడినై పిల్లలైన మిమ్ములను వాపసు తీసుకెళ్లేందుకు వచ్చాను అందువలన నన్ను మృత్యువుకు మృత్యువు (కాలోంకా కాల్‌) అని కూడా అంటారు. కల్పక్రితము కూడా మహాభారత యుద్ధము జరిగింది, దాని వలన స్వర్గ ద్వారాలు తెరచుకున్నాయి. కానీ దేవీ దేవతలు తప్ప మిగిలిన వారెవ్వరూ అచ్చటికి వెళ్ళలేరు. మిగిలిన వారందరూ శాంతిధామములో ఉన్నారు. కావున నిర్వాణధామానికి అధిపతినైన నేను అందరినీ నిర్వాణధామములోకి తీసుకెళ్లేందుకు వచ్చాను. మీరు రావణుని సంకెళ్ళలో చిక్కుకొని వికారాల మురికిలో ఆసురీ గుణాలు కలిగినవారిగా ఉన్నారు. అన్నిటికంటే నంబరువన్‌ డర్టీ (అశుద్ధము) కామము. తర్వాత క్రోధము తర్వాత లోభము నంబరువారుగా అశుద్ధాలు. కావున మొత్తం ప్రపంచమంతటి నుండి నిర్మోహులుగా అవ్వాలి, అప్పుడు స్వర్గములోకి వెళ్తారు. ఉదాహరణానికి హద్దు తండ్రి ఇల్లు కట్టిస్తే బుద్ధి క్రొత్త ఇంటిలో లగ్నమౌతుంది. పిల్లలు - నాన్నా! ఇంట్లో ఇది కట్టాలి, అది కట్టాలి, మంచి ఇల్లు కట్టాలి అని అంటారు కదా. అలాగే బేహద్‌ తండ్రి అంటున్నారు - నేను మీ కొరకు నూతన ప్రపంచమైన స్వర్గమును ఎంతో మంచిగా తయారు చేస్తాను. అందువలన మీ బుద్ధియోగము పాత ప్రపంచము నుండి తెగిపోవాలి. వాస్తవానికి ఇక్కడ ఏముంది ? దేహమూ పాతదే. ఆత్మలో కూడా మలినాలు ఏర్పడ్డాయి. మీరు యోగము చేస్తే ఆ మలినాలు తొలగిపోతాయి. అప్పుడు జ్ఞానము కూడా ధారణ అవుతుంది. ఈ బాబా భాషణ చేస్తున్నారు కదా. ఓ పిల్లలారా! ఆత్మలైన మీరందరూ నా రచన. ఆత్మ స్వరూపములో మీరంతా భాయి-భాయి(సోదరులు). ఇప్పుడు మీరందరూ నా వద్దకు వాపసు రావాలి. ఇప్పుడు మీరంతా తమోప్రధానంగా అయిపోయారు. ఇది రావణరాజ్యము కదా. రావణ రాజ్యము ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో ఇంతకుముందు మీకు తెలియదు. సత్యయుగములో 16 కళలు ఉంటాయి, తర్వాత 14 కళలు అవుతాయి, అయితే ఒక్కసారిగా రెండు కళలు తగ్గిపోవు, నెమ్మది నెమ్మదిగా తగ్గుతాయి. ఇప్పుడైతే ఒక్క కళ కూడా లేదు. పూర్తిగా గ్రహణము పట్టి ఉంది. దానము ఇస్తే గ్రహణము వదులుతుందని(దే దాన్‌ తో ఛూఠే గ్రహణ్‌) బాబా చెప్తున్నారు. ఐదు వికారాలను దానమిచ్చేయండి. ఇక మీదట ఏ పాపమూ చేయకండి. భారతవాసులు రావణుని తగులబెట్తారు అనగా ఇది తప్పకుండా రావణ రాజ్యమనే కదా. అయితే రావణరాజ్యమని దేనినంటారో, రామరాజ్యమని దేనినంటారో కూడా వారికి తెలియదు. రామరాజ్యము రావాలని, నూతన భారతదేశము రావాలని అంటారు. కాని క్రొత్త ప్రపంచము క్రొత్త భారతదేశము ఎప్పుడు అవుతుందో ఎవ్వరికీ తెలియదు. అందరూ సమాధుల(కబ్ర్‌)లో నిదురిస్తున్నారు.

ఇప్పుడు పిల్లలైన మీకు సత్యయుగీ వృక్షము కనిపిస్తోంది. ఇచ్చట దేవతలు ఎవ్వరూ లేరు. ఈ విషయాలన్నీ బాబాయే వచ్చి అర్థం చేయిస్తున్నారు. మీ తల్లి-తండ్రి వారే. స్థూలంగా వీరు మాతా- పితలు అవుతారు. మీరు మాతా-పితలని వారిని మహిమ చేస్తారు. సత్యయుగములో అయితే ఇలా గాయనం చేయరు. అచ్చట కృప అనే మాటే లేదు. ఇచ్చట మాతా-పితలకు చెందిన వారిగా అయ్యి అర్హులుగా కూడా తయారవ్వవలసి ఉంటుంది. ఓ భారతవాసులారా! మీరు దేవీదేవతలుగా ఎంతో ధనవంతులుగా ఉండేవారు, ఎంత వివేకవంతులుగా కూడా ఉండేవారో మీరు మరచిపోయారు. ఇప్పుడు తెలివిహీనులై దివాలా తీశారు, ఇలాంటి బుద్ధిహీనులుగా మిమ్ములను మాయా రావణుడు తయారు చేశాడు. అందుకే రావణుని తగులబెట్తున్నారు. శత్రువు దిష్టిబొమ్మను తయారు చేసి దానిని తగులబెడ్తారు కదా. పిల్లలైన మీకు ఎంత జ్ఞానము లభిస్తుంది! అయితే పిల్లలు విచార సాగర మథనము చేయరు. బుద్ధి భ్రమిస్తూ ఉంటే ఇటువంటి పాయింట్లను ఉపన్యాసములో వినిపించడం మర్చిపోతారు. పూర్తిగా అర్థం చేయించరు. మీరు బాబా వచ్చారనే సందేశము ఇవ్వాలి. ఈ మహాభారత యుద్ధము ఎదుర్లో నిలబడి ఉంది. అందరూ వాపసు వెళ్ళాలి. స్వర్గ స్థాపన జరుగుతోంది. తండ్రి అంటున్నారు - దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను మరిచి నన్ను స్మృతి చేయండి. అంతేగాని ముస్లింలు, బౌద్ధులు అందరూ భాయి-భాయి(సోదరులు) అని నామమాత్రంగా అనకండి. ఈ ధర్మాలన్నీ దేహ సంబంధమైనవి కదా. అందరి ఆత్మలైతే ఆ ఒక్క తండ్రి సంతానమే. తండ్రి అంటున్నారు - ఈ దేహ ధర్మాలన్నీ వదిలి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. తండ్రి ఇచ్చిన ఈ సందేశము అందరికీ తెలిపేందుకు మనము శివజయంతిని జరుకుంటున్నాము. మనమంతా బి.కె.లము, శివుని పౌత్రులము. మనకు వారి నుండి స్వర్గ రాజధాని వారసత్వంగా లభిస్తోంది. తండ్రి మనకు సందేశమిస్తున్నారు - '' మన్మనాభవ '' ఈ యోగాగ్ని ద్వారా మీ వికర్మలు వినాశమౌతాయి, అశరీరులుగా అవ్వండి. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. దేహ ధర్మాలన్నీ వదిలి అశరీరి ఆత్మగా భావించి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. యోగము మరియు జ్ఞాన ధారణ ద్వారా ఆత్మను పావనంగా చేసుకోవాలి.
2. తండ్రి ఇచ్చే జ్ఞానము పై విచార సాగర మథనము చేసి అందరికీ తండ్రి సందేశమునివ్వాలి. బుద్ధిని భ్రమింపజేయరాదు. 

వరదానము :- ''మర్యాదా పురుషోత్తములుగా అయ్యి సదా ఎగిరేకళలో ఎగిరే నంబరువన్‌ విజయీ భవ ''
నంబరువన్‌కు గుర్తు - ప్రతి విషయములో విన్‌ అయ్యేవారు(గెలుపొందేవారు). ఏ విషయములోనూ ఓడిపోరాదు. సదా విజయీగా ఉంటారు. ఒకవేళ నడుస్తూ నడుస్తూ ఎప్పుడైనా ఓడిపోతే అందుకు కారణం - మర్యాదల పాలనలో హెచ్చు-తగ్గులవ్వడం. కాని ఇది సంగమ యుగము. మర్యాదా పురుషోత్తములుగా తయారయ్యే యుగము. పురుషుడూ కాదు, నారీ కాదు పురుషోత్తములు. సదా ఇదే స్మృతిలో ఉంటే ఎగిరేకళలో ఎగురుతూ పోతూ ఉంటారు. క్రింద నిలబడరు. ఎగిరోకళలోని వారు సెకండులో సర్వ సమస్యలు దాటుకుంటారు. 

స్లోగన్‌ :- '' ఒక్క తండ్రి శ్రేష్ఠమైన సాంగత్యంలో ఉంటే, ఏ ఇతర సాంగత్యమూ తన ప్రభావాన్ని వేయలేదు ''
రాత్రి క్లాసు -

ఇప్పుడు పిల్లలైన మీరు స్థూలవతనం, సూక్ష్మవతనం, మూలవతనాల గురించి బాగా అర్థం చేసుకున్నారు. కేవలం బ్రాహ్మణులైన మీరు మాత్రమే ఈ జ్ఞానాన్ని పొందుతారు. దేవతలకైతే ఈ జ్ఞానము అవసరమే లేదు. మీకిప్పుడు మొత్తం విశ్వ జ్ఞానమంతా ఉంది. మీరు ఇంతకు ముందు శూద్ర వర్ణానికి చెందినవారిగా ఉండేవారు. మళ్లీ బ్రహ్మకుమారులైనప్పుడు ఈ జ్ఞానమునిస్తారు. ఈ జ్ఞానము ద్వారా మీ దైవీ వంశము స్థాపనవుతూ ఉంది. తండ్రి వచ్చి బ్రాహ్మణ కులాన్ని, సూర్య వంశాన్ని, చంద్ర వంశాన్ని స్థాపన చేస్తారు. అది కూడా ఈ సంగమ యుగంలో స్థాపన చేస్తారు. ఇతర ధర్మాల వారైతే వెంటనే వారి వంశాన్ని స్థాపన చేయరు. వారిని గురువులని అనరు. తండ్రియే వచ్చి ధర్మాన్ని స్థాపన చేస్తారు. తండ్రి అంటున్నారు - ఇప్పుడు తల పై తండ్రిని స్మృతి చేయాలనే చింత ఉంది. ఆ స్మృతిని పదే పదే మర్చిపోతారు. ఆరోగ్యవంతముగా అయ్యేందుకు పురుషార్థము చేసి వ్యాపారము మొదలైన వాటిని కూడా చేస్తూ ఉండండి, స్మృతి కూడా చేస్తూ ఉండండి. తండ్రి చాలా గొప్ప సంపాదన చేయిస్తారు. ఇందులో అంతా మర్చిపోవలసి ఉంటుంది. ఆత్మలమైన మనము వెళ్లిపోతున్నాము. అభ్యాసము చేయించబడ్తుంది - తినేటప్పుడు తండ్రిని స్మృతి చేయలేరా? బట్టలు కుట్టేటప్పుడు కూడా బుద్ధియోగము తండ్రి స్మృతిలో ఉండాలి. చెత్తను(వ్యర్థాన్ని) తీసేయాలి. బాబా అంటున్నారు - శరీర నిర్వహణ కొరకు భలే ఏ పని అయినా చేయండి, ఈ స్మృతి చాలా సలభము. 84 జన్మల చక్రము పూర్తి అయ్యిందని, ఇప్పుడు రాజయోగము నేర్పించేందుకు తండ్రి వచ్చారని అర్థము చేసుకున్నారు. ఈ ప్రపంచ చరిత్ర-భూగోళము ఈ సమయంలో రిపీట్‌ అవుతుంది. కల్పక్రితము వలెనే పునరావృతమవుతోంది. రిపిటీషన్‌(పునరావృత) రహస్యాన్ని కూడా తండ్రియే అర్థం చేయిస్తున్నారు. ఒన్‌ గాడ్‌, ఒన్‌ రిలిజన్‌ (ఒకే దేవుడు, ఒకే మతము) అని కూడా అంటారు కదా. శాంతి అక్కడ మాత్రమే ఉంటుంది. అది అద్వైత రాజ్యము. ద్వైతమంటే ఆసురీ రావణ రాజ్యము. వారు దేవతలు, వీరు దైత్యులు. ఆసురీ రాజ్యము మరియు దైవీ రాజ్యముల ఆట భారతదేశము పైనే తయారు చేయబడింది. భారతదేశంలో ఆది సనాతన ధర్మముండేది. పవిత్రమైన ప్రవృత్తి మార్గముండేది. మళ్లీ ఇప్పుడు తండ్రి వచ్చి ప్రవృత్తి మార్గాన్ని పవిత్రంగా చేస్తారు. మనమే దేవతలుగా ఉండేవారము. మళ్లీ కళలు తగ్గుతూ వచ్చాయి. మనమే శూద్ర వంశములోకి వచ్చాము. ఎలాగైతే టీచర్లు చదివిస్తే విద్యార్థులు వింటారో అలా తండ్రి మనలను చదివిస్తారు. మంచి విద్యార్థులైతే చదువు పై పూర్తి గమనముంచుతారు. చదువును మిస్‌ చేయరు. ఈ చదువును రెగ్యులర్‌గా చదవాలి. ఇటువంటి ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో ఆబ్సెంట్‌ అవ్వరాదు. అతి రహస్యమైన విషయాలను వినిపిస్తూ ఉంటారు. అచ్ఛా, గుడ్‌నైట్‌. ఆత్మిక పిల్లలకు నమస్తే.