Saturday, 5 October 2019

Telugu Murli 06/10/2019

06-10-2019 ని అవ్యక్తబాప్‌దాదా కు ఓంశాంతి రివైజ్‌: 18-02-1985 మధువనము

'' సంగమ యుగము తనువు, మనసు, ధనము మరియు సమయాలను సఫలం చేసుకునే యుగము ''
ఈ రోజు విశ్వకళ్యాణకారి అయిన తండ్రి తన సహయోగి పిల్లలను చూస్తున్నారు. ప్రతి పుత్రుని హృదయంలో తండ్రిని ప్రత్యక్షం చెయ్యాలనే పట్టుదల బాగుంది. అందరూ ఒకే శ్రేష్ఠ సంకల్పము చేస్తూ ఇదే కార్యములో ఉత్సాహ-ఉల్లాసాలతో నిమగ్నమై ఉన్నారు. ఒక్క తండ్రితో లగ్నమున్న కారణంగా సేవతో కూడా లగ్నము బాగా ఉంది. రాత్రి పగలు సాకార కర్మలో లేక స్వప్నంలో కూడా తండ్రి మరియు సేవయే కనిపిస్తూ ఉంది. తండ్రికి సేవ పై ప్రేమ ఉంది. అందువలన స్నేహి, సహయోగి పిల్లలకు కూడా సేవ అంటే మంచి ప్రేమ ఉంది. ఇది స్నేహానికి ఋజువు అనగా ప్రమాణము. ఇలాంటి సహయోగి పిల్లలను చూసి బాప్‌దాదా కూడా సంతోషిస్తారు. తమ తనువు, మనసు, ధనం, సమయం ఎంత ప్రేమగా సఫలం చేసుకుంటున్నారు. పాప ఖాతా నుండి మారిపోయి పుణ్యఖాతాలో వర్తమానానికి మరియు భవిష్యత్తుకు కూడా జమ చేసుకుంటున్నారు. సంగమ యుగము ఒకటికి కోటాను రెట్లు జమ చేసుకునే యుగము. శరీరాన్ని సేవలో వినియోగించండి, 21 జన్మల కొరకు సంపూర్ణ నిరోగి శరీరాన్ని ప్రాప్తి చేసుకోండి. ఎలాంటి బలహీన శరీరం కావచ్చు, రోగి కావచ్చు కానీ వాచా-కర్మణా లేకపోతే మనసా సేవ అంతిమ క్షణం వరకు చెయ్యవచ్చు. తమ అతీంద్రియ సుఖాన్ని శాంతిశక్తి ముఖంతో నయనాలతో చూపించవచ్చు. సంపర్కంలో ఉన్నవారు కూడా చూసి వీరు అద్భుతమైన రోగి అని అనాలి. డాక్టర్లు కూడా రోగిని చూసి సంతోషించాలి. వాస్తవానికి డాక్టర్లు రోగికి సంతోషాన్నిస్తారు, ఇప్పిస్తారు కానీ వారు ఇచ్చేందుకు బదులు తీసుకునే అనుభవం చేయాలి. ఎలాంటి జబ్బు అయినా కావచ్చు, దివ్య బుద్ధి పవిత్రంగా ఉన్నట్లయితే అంతిమ క్షణం వరకు సేవ చెయ్యవచ్చు. ఎందుకంటే ఈ తనువు ద్వారా చేసిన సేవకు ఫలము 21 జన్మలు తింటూ ఉంటారని తెలుసు. ఇలా శరీరంతో, మనసుతో స్వయం మనసా శాంతి స్వరూపంగా అయ్యి సదా ప్రతి సంకల్పంలో శక్తిశాలిగా అయ్యి శుభ భావన, శుభ కామన ద్వారా దాతగా అయ్యి సుఖ, శాంతి, శక్తి కిరణాలను వాతావరణంలో వ్యాపింపచేస్తూ ఉండండి. మీ రచన అయిన సూర్యుడు నలువైపులా ప్రకాశ కిరణాలను వ్యాపింపచేస్తూ ఉంటే, మాస్టర్‌ రచయితలు, మాస్టర్‌ సర్వశక్తివంతులు, విధాత, వరదాత, భాగ్యశాలురైన మీరు ప్రాప్తి కిరణాలను వ్యాపింప చెయ్యలేరా? సంకల్ప శక్తి అనగా మనసు ద్వారా ఒక స్థానంలో ఉండినా నలువైపులా వైబ్రేషన్ల ద్వారా వాయుమండలాన్ని తయారు చెయ్యవచ్చు. ఈ జన్మలో కొంచెం సమయం మనసు ద్వారా సేవ చేసినందున 21 జన్మలు సదా సుఖ-శాంతుల ఆనందంలో ఉంటారు. మళ్లీ అర్ధకల్పము భక్తిమార్గంలో చిత్రాల ద్వారా మానసిక శాంతి ఇచ్చేందుకు నిమిత్తంగా అవుతారు. చిత్రాలు కూడా శాంతి, శక్తి ఇచ్చే విధంగా తయారవుతాయి. కనుక ఒక్క జన్మలో చేసే మనసా సేవ ద్వారా కల్పంలో చైతన్య స్వరూపంతో లేక చిత్రాలతో శాంతి స్వరూపంగా అవుతారు.
అలాగే ధనం ద్వారా సేవకు నిమిత్తంగా అయ్యేవారు 21 జన్మలు లెక్కలేనంత ధనానికి యజమానులుగా అవుతారు. దీనితో పాటు ద్వాపరయుగం నుండి ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఆత్మ ఎప్పుడూ ధనానికి భికారిగా అవ్వరు. 21 జన్మలు రాజ్య భాగ్యం పొందుతారు. ధనం మట్టి సమానంగా ఉంటుంది అనగా అంత సహజంగా లెక్కలేనంతగా ఉంటుంది. మీ ప్రజల ప్రజలు కూడా అనగా ప్రజల సేవాధారులు కూడా లెక్కలేనంత ధనానికి యజమానులుగా ఉంటారు. కానీ 63 జన్మలలో ఏ జన్మలోనూ ధనానికి భికారిగా అవ్వరు. సంతోషంగా(మజాగా) పప్పు రొట్టె తినేవారిగా ఉంటారు. ఎప్పుడూ రొట్టెకు(ఆహారానికి) భికారులుగా అవ్వరు. కనుక ఒక్క జన్మ దాత పట్ల ధనం వినియోగిస్తే దాత కూడా ఏం చేస్తారు ? సేవలోనే వినియోగిస్తారు. మీరైతే తండ్రి భండారంలో వేస్తారు కదా! తర్వాత ఆ ధనాన్ని తండ్రి సేవలోనే వినియోగిస్తారు. కావున సేవార్థం లేక దాత అర్థముగా (కొరకు) ధనం వినియోగించడం అనగా పూర్తి కల్పము భికారితనం నుండి రక్షింపబడడం. ఎంత వినియోగిస్తే అంత ద్వాపరయుగం నుండి కలియుగం వరకు విశ్రాంతిగా, సుఖంగా తింటూ ఉంటారు. కనుక తనువు మనసు ధనము మరియు సమయం సఫలం చేసుకోవాలి.
సమయం వినియోగించేవారు ఒకటి సృష్టిచక్రంలో అన్నిటికంటే శ్రేష్ఠ సమయమైన సత్యయుగంలోకి వస్తారు. సతోప్రధానయుగంలోకి వస్తారు. ఈ సమయాన్ని భక్తులు ఇప్పుడు కూడా మహిమ చేస్తూ ఉంటారు. స్వర్గాన్ని మహిమ చేస్తూ ఉంటారు కదా! కావున సతోప్రధానంలో కూడా ఒకటి-ఒకటి-ఒకటి(01-01-01) ఇలాంటి సమయంలో అనగా సత్యయుగం మొదటి జన్మలో శ్రేష్ఠ సమయం యొక్క అధికారాన్ని పొందేవారిగా, మొదటి నెంబర్‌ ఆత్మతో పాటు జీవిత సమయాన్ని గడిపేవారిగా ఉంటారు. వారితో పాటు చదువుకునేవారిగా, ఆడుకునేవారిగా, తిరిగేవారిగా ఉంటారు. కావున సంగమ యుగంలో తమ సమయాన్ని ఎవరైతే సఫలం చేసుకుంటారో వారికి శ్రేష్ఠ ఫలమైన సంపూర్ణ స్వర్ణిమ శ్రేష్ఠ సమయంలో వచ్చే అధికారం ప్రాప్తిస్తుంది. సమయం వినియోగించడంలో నిర్లక్ష్యంగా ఉంటే మొదటి నెంబర్‌ ఆత్మ అనగా శ్రీ కృష్ణుని స్వరూపంలో స్వర్గంలో మొదటి సంవత్సరంలో రాకుండా వెనుక వెనుక నెంబర్‌వార్‌గా వస్తారు. ఇది సమయాన్ని వినియోగించే మహత్వము. ఏం ఇస్తారు? ఏం తీసుకుంటారు? అందువలన నాలుగు విషయాలను సదా పరిశీలించుకోండి. తనువు, మనసు, ధనము, సమయము నాల్గింటిని ఎంత వినియోగించగలరో అంత వినియోగిస్తున్నారా? ఎంత వినియోగించగలరో అంత వినియోగించకుండా అయితే లేరు కదా? యథాశక్తి వినియోగిస్తే ప్రాప్తి కూడా యథాశక్తిగా ఉంటుంది. సంపూర్ణంగా ఉండదు. బ్రాహ్మణాత్మలైన మీరు అందరికీ సందేశంలో ఏం చెప్తారు? సంపూర్ణ సుఖం, శాంతి మీ జన్మ సిద్ధ అధికారము అని చెప్తారు. యథాశక్తి మీ అధికారము అని చెప్పరు కదా! సంపూర్ణమని చెప్తారు కదా! సంపూర్ణ అధికారం ఉన్నట్లయితే సంపూర్ణ ప్రాప్తి చేసుకోవడమే బ్రాహ్మణ జీవితము. అధికారం అసంపూర్ణంగా ఉంటే వారు క్షత్రియులు. చంద్ర వంశీయులు సగంలో వస్తారు కదా! కావున యథాశక్తి అనగా అసంపూర్ణము. బ్రాహ్మణ జీవితం అనగా ప్రతి విషయంలో సంపూర్ణము. కావున అర్థమయ్యిందా! బాప్‌దాదా పిల్లల సహయోగం ఇచ్చే చార్టును చూస్తున్నారు. అందరూ సహయోగులుగానే ఉన్నారు. ఎప్పుడైతే సహయోగులుగా అయ్యారో అప్పుడు సహజయోగులుగా అయ్యారు. అందరూ సహయోగి, సహజయోగి శ్రేష్ఠ ఆత్మలే కదా! బాప్‌దాదా ప్రతి పుత్రుని సంపూర్ణ అధికారి ఆత్మగా చేస్తారు, అయినా యథాశక్తిగా ఎందుకు అవుతారు? ఎవరో ఒకరే కదా అయ్యేది, ఇలా తయారయ్యేవారు చాలామంది ఉన్నారు అని అనుకుంటున్నారా? మీరు కాదా? ఇప్పుడు కూడా సంపూర్ణ అధికారం పొందేందుకు సమయం ఉంది. వినిపించాను కదా! ఇప్పుడింకా టూ లేట్‌ (చాలా ఆలస్యమైనది) బోర్డు పడలేదు. ఆలస్యం అనగా వెనుక వచ్చేవారు. వారు కూడా ముందుకు వెళ్ళగలరు. అందువలన ఇప్పుడు కూడా మీకు స్వర్ణిమ అవకాశం ఉంది. టూ లేట్‌ బోర్డు పడగానే బంగారు అవకాశం బదులు వెండి అవకాశంగా అవుతుంది. కావున ఏం చెయ్యాలి? బంగారు అవకాశం తీసుకునేవారిగా ఉన్నారు కదా! బంగారు యుగంలోకి రాకుంటే బ్రాహ్మణులుగా అయ్యి ఏం చేసినట్లు? అందువలన బాప్‌దాదా స్నేహీ పిల్లలకు మళ్లీ స్మృతి ఇప్పిస్తున్నారు. ఇప్పుడింకా తండ్రి స్నేహం కారణంగా ఒకటికి పదమా రెట్లు లభించే అవకాశం ఉంది. ఇప్పుడింకా ఎంత చేస్తారో అంతే కాదు. ఒకటికి పదమా రెట్లు ఉంది. తర్వాత లెక్కఖాతా ఎంత చేస్తే అంతే ఉంటుంది. కానీ ఇప్పుడు భోళానాథుని సంపన్నంగా ఉన్న భండారం తెరవబడి ఉంది. ఎన్ని కావాలంటే అన్ని, ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు సత్యయుగంలో నెంబర్‌వన్‌ సీటు ఖాళీ లేదు అని అంటారు. అందువలన తండ్రి సమానం సంపూర్ణంగా అవ్వండి, మహత్వాన్ని తెలుసుకొని మహాన్‌గా అవ్వండి. డబల్‌ విదేశీయులు బంగారు అవకాశం తీసుకునేవారిగా ఉన్నారు కదా! ఇప్పుడు ఇంత లగనముతో ముందుకు వెళ్తున్నారు. స్నేహీగా ఉన్నారు, సహయోగిగా ఉన్నారు కావున ప్రతి విషయంలో సంపూర్ణ లక్ష్యము ద్వారా సంపూర్ణత లక్షణాలను ధారణ చెయ్యండి. లగనము లేకపోతే ఇక్కడకు ఎలా చేరుకుంటారు! ఎగురుతూ ఎగురుతూ ఎలా చేరుకున్నారో అలాగే సదా ఎగిరే కళలో ఎగురుతూ ఉండండి. శరీరంతో కూడా ఎగిరే అభ్యాసిగా ఉన్నారు. ఆత్మ కూడా సదా ఎగురుతూ ఉండాలి. ఇదే బాప్‌దాదా చూపించే స్నేహము. మంచిది.
సదా సఫలతా స్వరూపంగా అయ్యి సంకల్పాలను, సమయాన్ని సఫలం చేసుకునేవారు, ప్రతి కర్మలో సేవ చేసే ఉత్సాహ-ఉల్లాసాలు ఉంచుకునేవారు, సదా స్వయాన్ని సంపన్నంగా చేసుకొని సంపూర్ణ అధికారం పొందేవారు, లభించిన బంగారు అవకాశాన్ని సదా తీసుకునేవారు - ఇలా ఫాలో ఫాదర్‌ చేసే సుపుత్రులైన పిల్లలకు, నంబర్‌వన్‌ పిల్లలకు బాప్‌దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.
ఖాట్మండు మరియు విదేశీ సోదర-సోదరీల గ్రూప్‌తో బాప్‌దాదా వ్యక్తిగత కలయిక :-
1. అందరూ సదా స్వయాన్ని విశేష ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? మొత్తం విశ్వంలో ఇలాంటి విశేష ఆత్మలు ఎంతమంది ఉంటారు? కోట్లలో కొద్దిమంది అనే గాయనము ఏదైతే ఉందో వారు ఎవరు? మీరే కదా! కావున సదా స్వయాన్ని కోట్లలో కొద్దిమంది కొద్దిమందిలో కూడా కొంత మంది అయిన శ్రేష్ఠ ఆత్మలుగా భావిస్తున్నారా? ఇంత శ్రేష్ఠ ఆత్మలుగా అవుతామని ఎప్పుడూ స్వప్నంలో కూడా ఆలోచించలేదు కదా! కానీ సాకార రూపంలో అనుభవం చేస్తున్నారు. కావున తమ శ్రేష్ఠ భాగ్యము సదా స్మృతిలో ఉంటుందా? ఓ¬, నా శ్రేష్ఠ భాగ్యము! భగవంతుడు స్వయంగా మీ భాగ్యాన్ని తయారు చేశారు. డైరెక్ట్‌ భగవంతుడు భాగ్య రేఖలు గీశారు. మీది ఇలాంటి శ్రేష్ఠ భాగ్యము. ఈ శ్రేష్ఠ భాగ్యము ఎప్పుడైతే స్మృతిలో ఉంటుందో సంతోషంలో బుద్ధి అనే పాదము ఈ పృథ్వి పై ఉండదు. ఇలా భావిస్తున్నారు కదా! వాస్తవంగా ఫరిస్తాల పాదాలు ధరణి పైన ఉండవు. సదా పైన ఉంటాయి. కనుక మీ బుద్ధి అనే పాదము ఎక్కడ ఉంటుంది? క్రింద భూమి మీద కాదు. దేహాభిమానం కూడా ధరణి. దేహాభిమానం అనే ధరణికి పైన ఉండేవారు. వీరినే ఫరిస్తాలు అని అంటారు. కావున ఎన్ని టైటిల్స్‌ ఉన్నాయి - '' భాగ్యవంతులు, ఫరిస్తాలు, అల్లారు ముద్దు పిల్లలు. '' ఈ శ్రేష్ఠ టైటిల్స్‌ అన్నీ పిల్లలైన మీవే. కావున ఇదే సంతోషంలో నాట్యం చేస్తూ ఉండండి. అల్లారు ముద్దు పిల్లలు ధరణి పై కాలు పెట్టరు. సదా ఊయలలో ఉంటారు. ఎందుకంటే ధరణి పైన 63 జన్మలు ఉన్న అభ్యాసిగా ఉన్నారు. దానిని అనుభవం చేసి చూశారు. ధరణి పై మట్టిలో ఉండటం వలన మురికిగా అయ్యారు. ఇప్పుడు అల్లారుముద్దు పిల్లలుగా అయినందున సదా ధరణికి పైన ఉండాలి. మురికిగా కాదు. సదా స్వచ్ఛంగా ఉండాలి. సత్యమైన హృదయం, స్వచ్ఛమైన హృదయం కలిగిన పిల్లలు సదా తండ్రి జతలో ఉంటారు. ఎందుకంటే తండ్రి కూడా సదా స్వచ్ఛమైనవారు కదా! కనుక తండ్రి జతలో ఉండేవారు కూడా సదా స్వచ్ఛంగా ఉండాలి. చాలా మంచిది. మిలన మేళాలో వచ్చి చేరుకున్నారు. లగనము(పట్టుదల), మిలనము జరుపుకునేందుకు చేర్చేసింది. బాప్‌దాదా పిల్లలను చూసి సంతోషిస్తారు. ఎందుకంటే పిల్లలు లేకపోతే తండ్రి కూడా ఒంటరిగా ఏం చేస్తారు. భలే మీ ఇంటికి విచ్చేశారు. భక్తులు యాత్రకు వెళ్లినప్పుడు ఎంత కఠినమైన మార్గములో వెళ్తారు. మీరైతే ఖాట్మండు నుండి బస్సులో వచ్చారు. ఆనందంగా(మజాగా) ఉంటూ చేరుకున్నారు కదా! మంచిది.
లండన్‌ గ్రూప్‌ :- అందరు స్నేహ సూత్రంలో బంధింపబడి తండ్రి మాలలో పూసలుగా ఉన్నారు కదా! మాలకు ఇంత మహత్వం ఎందుకు ఉంది? ఎందుకంటే స్నేహ సూత్రం(దారము) అన్నిటికంటే శ్రేష్ఠమైన సూత్రము. కావున స్నేహ సూత్రములో అందరు ఒకే తండ్రివారిగా అయ్యారు. ఇందుకు స్మృతి చిహ్నము మాల. ఎవరికి ఒక్క తండ్రి తప్ప ఎవ్వరూ లేరో వారే స్నేహ సూత్రములో మాలలో పూసలుగా కూర్చబడ్తారు. సూత్రము ఒక్కటే కానీ పూసలు అనేకం ఉన్నాయి. కావున ఇది ఒక్క తండ్రి స్నేహానికి గుర్తు. ఇలా స్వయాన్ని మాలలో మణిగా భావిస్తున్నారు కదా! లేక 108లో అయితే చాలా కొద్దిమందే వస్తారు కదా? అని అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? ఈ 108 నెంబర్‌ నిమిత్తమాత్రము. ఎవరైతే తండ్రి స్నేహములో ఇమిడిపోయి ఉన్నారో వారు కంఠమాలలో ముత్యాలుగానే ఉన్నారు. ఇలా ఒక్కరి లగనములో నిమగ్నమై ఉండేవారిగా అయినట్లయితే వారినే మగ్నావస్థ నిర్విఘ్నంగా తయారు చేస్తుంది. ఇటువంటి నిర్విఘ్న ఆత్మలకు మాత్రమే గాయనము మరియు పూజ జరుగుతుంది. అందరికంటే ఎక్కువ మహిమ ఎవరు చేస్తారు? ఒక్క పుత్రుని గాయనము చెయ్యకపోయినా ఆ పుత్రుడు అలుగుతాడు అందువలన బాబా ప్రతి పుత్రుని మహిమ చేస్తాడు. ఎందుకంటే ప్రతి పుత్రుడు తన అధికారంగా భావిస్తాడు. అధికారం కారణంగా ప్రతి ఒక్కరు తమ హక్కుగా భావిస్తారు. తండ్రి వేగము ఎంత తీవ్రంగా ఉంటుందంటే అంత తీవ్రమైన వేగం గలవారు ఎవ్వరూ ఉండరు. ఒక్క సెకండులోనే అనేమందిని సంతుష్ట పరచగలరు. కనుక తండ్రి పిల్లలతో బిజీగా ఉంటారు, పిల్లలు తండ్రితో బిజీగా ఉంటారు. తండ్రి వ్యాపారము పిల్లలతోనే ఉంటుంది.
అవినాశీ రత్నాలుగా అయ్యారు, ఇందుకు శుభాకాంక్షలు.10సం||లు లేక 15సం||ల నుండి మాయ నుండి జీవిస్తూ(జయిస్తూ) ఉన్నారు. ఇందుకు శుభాకాంక్షలు. ఇకముందు సంగమ యుగమంతా జీవిస్తూ ఉండండి. అందరూ పక్కాగా ఉన్నారు. అందువలన బాప్‌దాదా ఇలాంటి పక్కా స్థిరమైన పిల్లలను చూసి సంతోషంగా ఉన్నారు. ప్రతి పుత్రునిలో గల విశేషతయే తండ్రి వారిగా చేసింది. విశేషతలు లేని పిల్లలే లేరు. అందువలన బాప్‌దాదా ప్రతి పుత్రుని విశేషతను చూసి సదా సంతోషిస్తారు. లేకపోతే కోట్లలో కొద్దిమంది కొద్దిమందిలో కొద్దిమందిగా మీరే ఎందుకు అవుతారు! ఏదో ఒక విశేషత తప్పకుండా ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన రత్నాలుగా ఉన్నారు. భిన్న భిన్న విశేషతలతో నవరత్నాలు అని గాయనం చేయబడ్డాయి. ప్రతి ఒక్క రత్నం విశేషించి విఘ్న వినాశకులుగా ఉంటారు. కావున మీరందరు కూడా విఘ్న వినాశకులుగా ఉన్నారు.
విదేశీ సోదరీ - సోదరుల ప్రియస్మృతులకు జాబులకు బదులిస్తూ :-
స్నేహీ పిల్లలందరి స్నేహం అందింది. అందరి హృదయాలలోని ఉత్సాహ-ఉల్లాసాలు తండ్రి వద్దకు చేరుకున్నాయి, అందరు ఉత్సాహ-ఉల్లాసాలతో ముందుకు వెళ్తున్నారు. సదా ముందుకు వెళ్ళే పిల్లల పై బాప్‌దాదా మరియు పరివారాల విశేషమైన ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ ఆశీర్వాదాల ద్వారానే ముందుకు వెళ్తూ ఉంటారు అంతేకాక ఇతరులను కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. సేవలో బాగా పోటీ పడ్తున్నారు. ఉత్సాహ-ఉల్లాసాలతో ఎలాగైతే పరుగులు తీస్తున్నారో, అలా అవినాశి ఉన్నతిని పొందుతూ ఉంటే మంచి నెంబర్‌ తీసుకోగలరు. అందరూ తమ పేరు, విశేషతతో స్మృతులను స్వీకరించండి. ఇప్పుడు కూడా పిల్లలందరూ తమ తమ విశేషతలతో బాప్‌దాదా సన్ముఖంలో ఉన్నారు అందువలన పదమా రెట్ల ప్రియస్మృతులు.
దాది చంద్రమణిగారు పంజాబ్‌ వెళ్ళేందుకు శెలవు తీసుకున్నారు :-
పిల్లలందరికి ప్రియస్మృతులు ఇవ్వండి మరియు ఎగిరే కళలోకి వెళ్లాలని విశేష సందేశం కూడా ఇవ్వండి. ఇతరులను ఎగిరించేందుకు సమర్థ స్వరూపాన్ని ధారణ చెయ్యండి. ఎలాంటి వాతావణంలోనైనా ఎగిరేకళ ద్వారా అనేక మంది ఆత్మలకు ఎగిరింపజేసే అనుభవము చేయించగలరు. అందువలన అందరికి స్మృతి మరియు సేవ జత జతలో నడుస్తూ సదా తోడుగా నడుస్తూ ఉండాలనే విశేష స్మృతిని ఇప్పించండి. పోతే అందరూ అల్లారు ముద్దు పిల్లలు, మంచి విశేషత కలిగిన ఆత్మలు. అందరు తమ తమ విశేషతతో ప్రియస్మృతులు స్వీకరించండి. మంచిది. డబుల్‌ పాత్ర అభినయిస్తున్నారు. బేహద్‌ ఆత్మలకు గుర్తు ఇదే - ఏ సమయంలో ఎక్కడ అవసరమో అక్కడకు చేరుకుంటారు. మంచిది.

వరదానము :- '' సేవలో విఘ్నాలను ఉన్నతి చెందే మెట్లుగా భావించి ముందుకు వెళ్ళే సత్యమైన నిర్విఘ్న సేవాధారీ భవ ''
సేవ బ్రాహ్మణ జీవితాన్ని సదా నిర్విఘ్నంగా తయారుచేసే సాధనము. అయితే సేవలోనే విఘ్నాల పేపర్లు కూడా ఎక్కువగా వస్తాయి. నిర్విఘ్న సేవాధారులను సత్యమైన సేవాధారులని అంటారు. విఘ్నాలు రావడం కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. రావాల్సిందే మరియు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఈ విఘ్నాలు లేక పేపర్లు అనుభవీలుగా చేస్తాయి. వీటిని విఘ్నాలుగా భావించక అనుభవం అవుతూ ఉందనే భావంతో చూస్తే ఉన్నతి చెందే మెట్లుగా అనుభవం అవుతాయి. తద్వారా ముందుకు వెళ్తూ ఉంటారు.

స్లోగన్‌ :- '' విఘ్న రూపులుగా కాదు, విఘ్న వినాశకులుగా అవ్వండి ''

Friday, 4 October 2019

Telugu Murli 05/10/2019

05-10-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - మిమ్ములను సుగంధభరిత పుష్పాలుగా చేసేందుకు తండ్రి వచ్చారు. పుష్పాల వంటి పిల్లలైన మీరు ఎప్పుడూ ఎవ్వరికీ దు:ఖమివ్వరాదు, సదా సుఖమిస్తూ ఉండండి ''

ప్రశ్న :- ఏ విషయములో పిల్లలైన మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి ?
జవాబు :- మనసా, వాచా, కర్మణా మీ నాలుక (మాటల) పై జాగ్రత్త వహించి ఉండాలి. బుద్ధి ద్వారా వికారి ప్రపంచములోని లోకమర్యాదలు, కులమర్యాదలు మర్చిపోవాలి. అన్ని దివ్యగుణాలను ధారణ చేసి లక్ష్మీనారాయణుల వలె పవిత్రమయ్యానా ? ఎంతవరకు పుష్పాల వలె అయ్యాను ? అని స్వయం చెక్‌ చేసుకోవాలి.

ఓంశాంతి. శివబాబాకు తన పిల్లలు ఆత్మలని తెలుసు. పిల్లలైన మీరు స్వయాన్ని ఆత్మగా భావించి శరీరాన్ని మరచి శివబాబాను స్మృతి చేయాలి. పిల్లలూ! నేను మిమ్ములను చదివిస్తున్నానని శివబాబా చెప్తున్నారు. శివబాబా కూడా నిరాకారులే, ఆత్మలైన మీరు కూడా నిరాకారులే. ఇక్కడకు వచ్చి పాత్ర చేస్తారు. తండ్రి కూడా వచ్చి పాత్రను అభినయిస్తారు. డ్రామా ప్లాను అనుసారము తండ్రి మనలను పుష్పాలుగా చేస్తారని కూడా మీకు తెలుసు. కావున అవగుణాలన్నీ వదిలి గుణవంతులుగా అవ్వాలి. గుణవంతులు ఎప్పుడూ ఎవ్వరికీ దు:ఖమివ్వరు. విని-విననట్లుండరు. ఎవరికైనా దు:ఖము కలిగితే, ఆ దు:ఖమును దూరము చేస్తారు. తండ్రి కూడా వచ్చారు కనుక ఈ మొత్తం ప్రపంచములోని దు:ఖము తప్పకుండా దూరమవ్వనున్నది. తండ్రి శ్రీమతమునిస్తున్నారు - ఎంత ఎక్కువ వీలైతే అంత పురుషార్థము చేసి అందరి దు:ఖమును దూరము చేస్తూ ఉండండి. పురుషార్థము ద్వారానే మంచి పదవి లభిస్తుంది. పురుషార్థము చేయకుంటే పదవి తగ్గిపోతుంది. కల్ప-కల్పాంతరము నష్టపోతారు. ఆ తండ్రి తన పిల్లలకు ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తున్నారు. పిల్లలు నష్టపడడం తండ్రికి ఇష్టముండదు. ప్రపంచములోని వారికి ఈ లాభ-నష్టాల గురించి తెలియదు. అందువలన పిల్లలు తమ పై తాము దయ చూపుకోవాలి. శ్రీమతముననుసరిస్తూ ఉండాలి. బుద్ధి అలా ఇలా పరుగెత్తినా, ఇటువంటి తండ్రినెందుకు స్మృతి చేయరాదని ప్రయత్నించాలి. ఈ స్మృతి ద్వారానే ఉన్నత పదవి లభిస్తుంది. స్వర్గములోకి అయితే వెళ్తారు కానీ స్వర్గములో ఉన్నత పదవిని పొందుకోవాలి. పిల్లల తల్లి-తండ్రులు ''మా పిల్లలు పాఠశాలలో చదువుకుని గొప్ప పదవిని పొందుకోవాలి'' అని అంటారు కదా. ఇక్కడ లభించే పదవి గురించి అయితే ఎవ్వరికీ తెలియదు. మీరు ఏ చదువు చదువుకుంటున్నారో మీ బంధు-మిత్రులకు తెలియదు. ఆ చదువును గురించి మీ బంధు-మిత్రులందరికీ తెలుసు. దీనిని గురించి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కొందరి తండ్రికి తెలిస్తే, వారి సోదరీ-సోదరులకు తెలియదు. కొందరి తల్లికి తెలిస్తే వారి తండ్రికి తెలియదు ఎందుకంటే ఇది విచిత్రమైన చదువు. అంతేకాక చదివించేవారు విచిత్రమైనవారు. నెంబరువారుగా అర్థము చేసుకుంటారు. తండ్రి అర్థం చేయిస్తారు - మీరు భక్తి చాలానే చేశారు. అది కూడా నెంబరువారుగా చేశారు. భక్తి ఎవరు ఎక్కువగా చేశారో, వారే మళ్లీ ఈ జ్ఞానము కూడా తీసుకుంటారు. ఇప్పుడు భక్తిమార్గపు ఆచారాలు, పద్ధతులు సమాప్తమౌతాయి. పూర్వము మీరాబాయి లోక మర్యాదలు, కులమర్యాదలు వదిలేసింది. మీరిప్పుడు వికారి కులమర్యాదలు వదలాలి. బుద్ధి ద్వారా అన్నీ సన్యసించాలి. ఈ వికారీ ప్రపంచానికి సంబంధించినవేవీ మంచివి కావు. వికర్మలు చేసేవారు అసలే బాగుండరు. వారు తమ భాగ్యమును వారే పాడు చేసుకుంటారు. ఇతరులను కష్టపెట్టే పిల్లలను గానీ లేక సరిగ్గా చదవని పిల్లలను గానీ ఏ తల్లి - తండ్రీ ఇష్టపడరు. అక్కడ ఇలాంటి పిల్లలు ఉండనే ఉండరు. వారి పేరే దేవీదేవతలు. చాలా పవిత్రమైన పేరు. మాలో దైవీగుణాలు ఉన్నాయా? అని స్వయాన్ని చెక్‌ చేసుకోవాలి. సహనశీలురుగా కూడా అవ్వాలి. ఇది బుద్ధి యోగానికి సంబంధించిన విషయము. ఈ యుద్ధము చాలా మధురమైనది. తండ్రిని స్మృతి చేయడంలో ఏ యుద్ధమూ లేదు. కానీ మాయ విఘ్నాలు కల్పిస్తుంది. విఘ్నాల నుండి స్వయాన్ని కాపాడుకోవాలి. మాయ పై విజయమైతే మీరే పొందుకోవాలి. కల్ప-కల్పమూ ఏం చేస్తూ వచ్చామో, ఖచ్చితంగా అదే పురుషార్థము కల్ప-కల్పమూ నడుస్తూ వచ్చిందని మీకు తెలుసు. ఇప్పుడు మనము పదమాపదమ్‌ భాగ్యశాలురుగా అవుతాము. తర్వాత మళ్లీ సత్యయుగములో అపార సుఖములో ఉంటాము.
కల్ప-కల్పము తండ్రి ఇదే విధంగా అర్థం చేయిస్తారు. ఇదేమీ క్రొత్త విషయము కాదు. ఇది చాలా పాత విషయము. పిల్లలు సంపూర్ణ సుగంధ పుష్పాలుగా అవ్వాలని తండ్రి కోరుకుంటారు. లౌకిక తండ్రి మనస్సులో కూడా నా పిల్లలు పుష్పాలుగా అవ్వాలని కోరుకుంటాడు. పారలౌకిక తండ్రి ముళ్ళను పుష్పాలుగా చేసేందుకే వస్తారు. కావున అలా తయారవ్వాలి కదా. మనసా, వాచా, కర్మణా నాలుక పై కూడా చాలా జాగ్రత్త వహించి ఉండాలి. ప్రతి కర్మేంద్రియము పై కూడా చాలా జాగరూకత వహించి అప్రమత్తంగా ఉండాలి. మాయ చాలా మోసగిస్తుంది. దాని నుండి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది చాలా గొప్ప గమ్యము. అర్ధకల్పము నుండి వికారి దృష్టి తయారయ్యింది. ఆ దృష్టిని ఈ ఒక్క జన్మలోనే పవిత్రంగా చేసుకోవాలి. ఈ లక్ష్మీనారాయణుల దృష్టి వలె మీ దృష్టి తయారవ్వాలి. వీరు సర్వ గుణ సంపన్నులు కదా. అక్కడ వికారీ దృష్టి ఉండదు. రావణుడే ఉండడు. ఇదేమీ క్రొత్త విషయము కాదు. మీరు అనేకసార్లు ఈ పదవిని పొందుకున్నారు. మీరు ఏ చదువు చదువుతున్నారో ప్రపంచానికి తెలియనే తెలియదు. తండ్రి మీ ఆశలను పూర్తి చేసేందుకు వస్తారు. అశుభ కోరికలు రావణుడివి. మానవి శుభమైన కోరికలు. వికారి కోరిలేవీ ఉండరాదు. పిల్లలు సుఖపు అలలలో తేలియాడుచూ ఉండాలి. మీరు అనుభవించే అపారమైన సుఖాన్ని వర్ణించలేరు. దు:ఖాలను వర్ణిస్తారు, సుఖాలను వర్ణించరు. ఎలాగైనా పావనమవ్వాలని పిల్లలందరికీ ఒకే ఆశ ఉంది. పావనమెలా అవ్వాలి? అలా పావనంగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే అని, వారి స్మృతి ద్వారా మాత్రమే పావనంగా అవుతామని కూడా మీకు తెలుసు. నూతన ప్రపంచములో మొదటి నంబరులో ఈ దేవీ దేవతలు మాత్రమే ఉంటారు. పావనంగా అయితే ఎంత శక్తి ఉంటుందో గమనించండి. మీరు పావనంగా అయ్యి పావన ప్రపంచ రాజ్యాన్ని పొందుతారు. అందుకే దేవీ-దేవతా ధర్మములో చాలా శక్తి ఉందని అంటారు. ఈ శక్తి ఎక్కడ నుండి లభిస్తుంది? సర్వశక్తివంతులైన తండ్రి నుండి. ప్రతి ఇంటిలో ముఖ్యమైన 2-3 చిత్రాలుంచుకొని చాలా సేవ చేయవచ్చు. కర్ఫ్యూ మొదలైనవి విధించే సమయము వస్తుంది. అప్పుడు మీరు ఎక్కడకూ రాలేరు, పోలేరు.
మీరు సత్యమైన గీతను వినిపించే బ్రాహ్మణులు. జ్ఞానము చాలా సులభము. ఎవరి ఇంటిలోని వారంతా వస్తారో వారు శాంతిగా ఉంటారు. వారికి చాలా సులభము. 2-3 ముఖ్యమైన చిత్రాలు ఇంటిలో ఉంచండి. ఈ త్రిమూర్తి, సృష్టిచక్రము, కల్పవృక్షము, మెట్ల(సీఢీ) చిత్రము చాలు. వాటితో పాటు '' గీతా భగవానుడు కృష్ణుడు కాదు '' అనే చిత్రము కూడా బాగుంది. ఎంతో సులభము. ఒక్క పైసా కూడా ఖర్చు కాదు. చిత్రాలేమో ఉన్నాయి. చిత్రాలు చూచిన వెంటనే జ్ఞానము స్మృతిలోకి వస్తుంది. ఒక చిన్న గదిని కట్టుకోవాలి. అందులో భలే నీవు నిదురించు. శ్రీమతముననుసరిస్తూ ఉంటే మీరు చాలా మంది కళ్యాణము చేయగలరు. కళ్యాణము చేస్తూ కూడా ఉండవచ్చు అయినా ఫలానా విధంగా మీరు చేయండని తండ్రి మళ్లీ గుర్తు చేస్తున్నారు. దేవతా విగ్రహముంచుకుంటారు కదా. కానీ ఇందులో అర్థము చేయించే విషయాలున్నాయి. జన్మ-జన్మాంతరాలు భక్తిమార్గములో మందిరాలలో వెతుకుతూ వచ్చారు. కానీ వారెవరో ఎవ్వరికీ తెలియదు. తెలుసుకోకుండా వెతికారు. మందిరాలలో దేవీలను పూజిస్తూ వచ్చారు. ఆ విగ్రహాలను కూడా నీటిలో ముంచుతూ వచ్చారు. ఇది ఎంత అజ్ఞానము! పూజ్యులను పూజించి తర్వాత సముద్రములో ముంచేస్తారు. గణేశుని, అంబను, సరస్వతిని కూడా ముంచేస్తారు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - కల్ప-కల్పము నేను ఈ విషయాలు అర్థం చేయిస్తాను. మీరు ఏం చేస్తున్నారో దానిని మీకు సత్యంగా అనుభవము చేయిస్తాను. ''మధురాతి మధురమైన పిల్లలూ!'' అంటూ మీరు ఏం చేస్తున్నారో ఇంతగా అర్థం చేయిస్తూ, అనుభవం చేయిస్తూ ఉంటే, మీరు చేసే పనుల పై మీకు అసహ్యము కలగాలి. దీనిని విషయవైతరిణి నది అని అంటారు. అక్కడ క్షీరసాగరమేదీ లేదు. కానీ అక్కడ ఏ వస్తువైనా కొరత లేకుండా అవసరము కంటే చాలా అధికంగా లభిస్తుంది. ఏ వస్తువును ధనంతో కొనే అవసరమే ఉండదు. అక్కడ డబ్బు అనేదే ఉండదు. బంగారు నాణేలే కనిపిస్తాయి. నివాస గృహాలు కూడా బంగారుతోనే నిర్మించి ఉంటారు. బంగారు ఇటుకలతో నిర్మిస్తారు. అందువలన అక్కడ బంగారుకు, వెండికి విలువ లేదని ఋజువవుతుంది. ఇక్కడ ఎంత విలువ ఉందో చూడండి. ఒక్కొక్క విషయము ఆశ్చర్యము కలిగిస్తుందని మీకు తెలుసు. మానవులు మానవులే. ఈ దేవతలు కూడా మానవులే. కానీ వారిని దేవతలని అంటారు. వీరి ముందు మానవులు తమలోని మురికిని ఒప్పుకుంటారు -'' మేము పాపులము, నీచులము మాలో ఏ గుణాలూ లేవు అని స్పష్టము చేస్తారు. పిల్లలైన మీ బుద్ధిలో మేము మానవుల నుండి దేవతలుగా అవుతాము అనే లక్ష్యముంది. దేవతలలో దైవీగుణాలుంటాయి. మందిరాలకు వెళ్లడం తెలుసు కానీ వీరు కూడా మానవులే అని తెలియదు. మనము కూడా మానవులమే, కానీ వారు దైవీగుణాలు గలవారు. మనము ఆసురీ గుణాలు గలవారము. మీ బుద్ధి ఎంత అనర్హంగా, పనికిరాకుండా ఉండినదో ఇప్పుడు మీకు అర్థమవుతూ ఉంది. వీరి ముందుకెళ్లి మీరు సర్వ గుణ సంపన్నులు.......... అని పాడుతూ ఉండేవారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - వీరు (దేవతలు) ఒకప్పుడు ఉండి వెళ్లిపోయారు. వీరిలో దైవీ గుణాలు ఉండేవి. వారికి చాలా సుఖముండేది. వారే మళ్లీ అపారమైన దు:ఖములో ఉన్నారు. ఇప్పుడు అందరిలో పంచ వికారాలు ప్రవేశమై ఉన్నాయి. మనము ఏ విధంగా ఉన్నతము నుండి క్రిందకు దిగూతూ దిగుతూ ఒక్కసారిగా అధోగతి పాలయ్యామో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. భారతీయులు ఎంతో ధనవంతులుగా ఉండేవారు. ఇప్పుడు అప్పులు తీసుకుంటున్నారు. ఇప్పుడు అన్ని విషయాలు తండ్రే కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. ఋషులు, మునులు నేతి - నేతి అంటూ ఉండేవారు అనగా మాకు తెలియదని అనేవారు. వారు సత్యము చెప్పేవారని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రిని గురించి గానీ, వారి రచన యొక్క ఆదిమధ్యాంతాల గురించి గానీ వారికి తెలియదు. ఇప్పుడు కూడా పిల్లలైన మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. గొప్ప-గొప్ప సన్యాసులకు, మహాత్ములకు కూడా తెలియదు. వాస్తవానికి ఈ లక్ష్మీనారాయణులే మహాత్ములు. సదా పవిత్రులు. ఈ బ్రహ్మకు కూడా ఇంతకుముందు తెలియదంటే ఇతరులకు ఎలా తెలుస్తుంది. ఇవి ఎంతో సహజమైన విషయాలు. తండ్రి అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు. కానీ చాలామంది పిల్లలు మర్చిపోతారు. చాలా మంది బాగా గుణ ధారణ చేస్తారు. కనుక వారు మధురంగా ఉంటారు. పిల్లలలో మంచి గుణాలెన్ని చూస్తారో తండ్రి అంత సంతోషిస్తాడు. కొంతమంది తండ్రి పేరును అవమానపరుస్తారు. ఇక్కడైతే తండ్రి, టీచరు, సద్గురువు ముగ్గురిని నిందలపాలు చేస్తారు. సత్యమైన తండ్రి, టీచరు, సత్యమైన సద్గురువును నిందల పాలు చేసినందున మూడింతలు శిక్షలు అనుభవించాలి. కానీ చాలా మంది పిల్లలలో కొంచెము కూడా తెలివి లేదు. అటువంటివారు కూడా తప్పకుండా ఉంటారని తండ్రి అర్థం చేయిస్తారు. మాయ కూడా తక్కువైనదేమీ కాదు. అర్ధకల్పము కొరకు పాపాత్మగా చేస్తుంది. తండ్రి మళ్లీ అర్ధకల్పము కొరకు పుణ్యాత్మగా చేస్తారు. అది కూడా నెంబరువారుగా అవుతారు. తయారు చేయువారు ఇరువురు - రాముడు, రావణుడు. రాముని పరమాత్మ అని అంటారు. రామ-రామ అంటూ చివర్లో శివునికి నమస్కరిస్తారు. వారే పరమాత్మ. పరమాత్ముని నామాన్ని జపము చేస్తారు. మీరు అలా చేసే అవసరం లేదు. ఈ లక్ష్నీనారాయణులు పవిత్రంగా ఉండేవారు కదా. వీరి ప్రపంచముండేది. అది ఇప్పుడు లేదు. దానిని స్వర్గము, నూతన ప్రపంచము అని అంటారు. ఇల్లు పాతదైపోయినప్పుడు పడగొట్టవలసి వచ్చినట్లు ఈ ప్రపంచము కూడా ఇప్పుడు అలాగే పాతదైపోయింది. ఇది కలియుగములో చివరి సమయము. ఇవి అర్థము చేసుకునేందుకు చాలా సులభమైన విషయాలు. ధారణ చేసి ఇతరులచే చేయించాలి. తండ్రి అందరి వద్దకు పోయి అర్థం చేయించరు. పిల్లలైన మీరు ఈశ్వరీయ సేవాధారులు. తండ్రి ఏ సేవ నేర్పిస్తారో, ఆ సేవనే చేయాలి. మీది ఈశ్వరీయ సేవ మాత్రమే. మీ పేరు ఉన్నతము, ప్రసిద్ధము చేసేందుకు బాబా మన తల పై కలశమునుంచారు. అలాగని పురుషులకు లభించదని కాదు. అందరికీ లభిస్తుంది. మనము స్వర్గవాసులుగా అయ్యి ఎంత సుఖంగా ఉండేవారమో ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. అక్కడ ఎలాంటి దు:ఖమూ ఉండదు. ఇప్పుడిది సంగమ యుగము. మళ్లీ మనము ఆ నూతన ప్రపంచానికి అధికారులుగా అవుతున్నాము. ఇది కలియుగము. పాత పతిత ప్రపంచము. పూర్తిగా మహిష(దున్నపోతు) బుద్ధి గల మానవులుగా తయారయ్యారు. ఇప్పుడీ విషయాలన్నీ మర్చిపోవాలి. దేహ సహితము దేహ సర్వ సంబంధాలు వదిలి, స్వయాన్ని ఆత్మగా భావించాలి. శరీరములో ఆత్మ లేకుంటే శరీరము ఏ పనీ చేయలేదు. అటువంటి శరీరము పై ఎంత మోహము ఉంచుకుంటున్నారు! శరీరము కాలిపోతే ఆత్మ వెళ్లి మరో శరీరము తీసుకున్నా 12 మాసాలు అయ్యో భగవంతుడా! అని ఏడుస్తూనే ఉంటారు. ఇప్పుడు మీ ఆత్మ శరీరాన్ని వదిలితే తప్పకుండా మంచి కుటుంబములో నెంబరువారుగా జన్మ తీసుకుంటుంది. జ్ఞానము కొద్దిగా ఉంటే సాధారణ కులములో జన్మిస్తారు. జ్ఞానము ఉన్నతంగా ఉంటే ఉన్నత కులములో జన్మిస్తారు. అక్కడ చాలా సుఖముంటుంది. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తండ్రి వినిపించే దానిని విని విననట్లుండరాదు. గుణవంతులై అందరికీ సుఖమునివ్వాలి. పురుషార్థము చేసి అందరి దు:ఖమును దూరము చేయాలి.
2. వికారాలకు వశమై ఎలాంటి వికర్మలు చేయరాదు. సహనశీలురుగా ఉండాలి. అశుద్ధ వికారి ఆశలేవీ ఉంచుకోరాదు.

వరదానము :- '' మై పన్‌ ను (''నాది'' ని) ''బాబా'' లో ఇమిడ్చి వేసే నిరంతర యోగి, సహజ యోగి భవ ''
ఏ పిల్లలకైతే తండ్రి పై ప్రతి శ్వాసలో ప్రేమ ఉందో, ప్రతి శ్వాసలో '' బాబా, బాబా '' ఉంటుందో వారు యోగం చేసేందుకు శ్రమ పడే అవసరం ఉండదు. స్మృతికి ఋజువు - ఎప్పుడూ వారి నోటి నుండి ''నేను'' అనే శబ్ధము వెలువడజాలదు. ''బాబా, బాబా'' అను శబ్ధమే వెలువడ్తుంది. 'మై పన్‌' బాబాలో ఇమిడిపోవాలి. 'బాబా' వెన్నెముక వంటివారు. బాబా చేయించారు. బాబా సదా జతలో ఉన్నారు. మీరు నా జతలో ఉండాలి, నా జతలో తినాలి, నడవాలి, తిరగాలి........ ఇది ఎమర్జ్‌ రూపంలో స్మృతిలో ఉంటే అప్పుడు వారిని సహజయోగులని అంటారు.

స్లోగన్‌ :- '' మై, మై (నేను, నేను)'' అనడం అనగా మాయ మార్జాలాన్ని (పిల్లిని) ఆహ్వానించడం ''

Thursday, 3 October 2019

Telugu Murli 04/10/2019

04-10-2019 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం

'' మధురమైన పిల్లలారా - స్మృతి యాత్ర పై సంపూర్ణ గమనము(అటెన్షన్) ఉంచండి. దీని ద్వారానే మీరు సతోప్రధానంగా అవుతారు ''

ప్రశ్న:- బాబా తన పిల్లల పై ఎటువంటి దయ చూపుతున్నారు ?
జవాబు:- పిల్లల కళ్యాణము కొరకు బాబా సూచనలు, ఆదేశాలు ఇస్తున్నారు. ఇదే వారు చూపించే దయ. తండ్రి ఇచ్చే మొట్టమొదటి సూచన(ఆదేశము) - మధురమైన పిల్లలారా, ఆత్మాభిమానులుగా అవ్వండి. ఆత్మాభిమానముతో ఉన్నవారు చాలా శాంతిగా ఉంటారు. వారికి ఎప్పుడూ చెడు ఆలోచనలు, వ్యతిరేక ఆలోచనలు రావు.

ప్రశ్న:- పిల్లలు ఎటువంటి సెమినార్లు(చర్చించుకొను సభలు) జరుపుకోవాలి ?
జవాబు:- ఎక్కడికైనా వాకింగ్కు వెళ్లినప్పుడు స్మృతి యాత్ర చేయండి. తర్వాత కూర్చొని ఎవరు ఎంత సమయము స్మృతిలో ఉండినామని పరస్పరము సెమినార్చేసుకోండి. ఇక్కడ స్మృతి చేసేందుకు ఏకాంతము కూడా చాలా బాగుంది.
ఓంశాంతి.
ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను - మీరు ఏం చేస్తున్నారు? అని అడుగుతున్నారు. ఆత్మిక పిల్లలు చెప్తున్నారు - బాబా! సతోప్రధానంగా ఉన్న మేము, తమోప్రధానంగా అయ్యాము. మళ్లీ మీ శ్రీమతముననుసరించి మేము తప్పకుండా సతోప్రధానంగా అవ్వాలి. ఇప్పుడు మీరు మార్గము చూపించారు. ఇది కొత్త విషయమేమీ కాదు. ఎంతో ప్రాచీన విషయము. అన్నింటికంటే పురాతనమైనది స్మృతి యాత్ర. ఇందులో షో చేసే(బయటకు చూపించే) మాటే లేదు. పత్రి ఒక్కరు నేను ఎంతవరకు తండిన్రి స్మృతి చేస్తున్నాను ? ఎంతవరకు సతోపధ్రానంగా అయ్యాను ? ఎలాంటి పురుషార్థము చేస్తున్నాను ? అని స్వయాన్ని పరిశీలించుకోండి. చివర్లో అంతిమ సమయము వచ్చినప్పుడు సతోప్రధానంగా అవుతాము. అది కూడా సాక్షాత్కారమవుతూ ఉంటుంది. ఎవరు ఏం చేసినా తమ కొరకే చేసుకుంటారు. తండ్రి కూడా దయ చూపేదేమీ లేదు. పిల్లల కళ్యాణము కొరకు సలహా ఇస్తారు. తండ్రి కళ్యాణకారి. చాలా మంది పిల్లలు జ్ఞానాన్ని ఉల్టాగా అర్థము చేసుకుంటారు. బాబా దేహాభిమానులను గర్విష్టులుగా భావిస్తారు. ఆత్మాభిమానులు చాలా శాంతిగా ఉంటారు. వారికి ఎప్పుడు అస్తవ్యస్త(వ్యతిరేక) ఆలోచనలు రావు. తండ్రి అన్ని ప్రకారాల పురుషార్థము చేయిస్తూ ఉంటారు. మాయ కూడా చాలా శక్తివంతమైనది. మంచి మంచి పిల్లల పై కూడా దాడి చేస్తుంది. అందుకే బ్రాహ్మణుల మాల తయారవ్వదు. ఈ రోజు చాలా బాగా స్మృతి చేస్తారు. రేపు అహంకార వశమై ఆంబోతుల వలె అవుతారు. వారికి చాలా అహంకారము ఉంటుంది. ఒక సామెత కూడా ఉంది - ''సురమండల సంగీతము దేహాభిమానులైన ఆంబోతులకు ఏం తెలుసు? '' దేహాభిమానము చాలా చెడ్డది. చాలా శ్రమ చేయవలసి వస్తుంది. నేను మీకు అత్యంత వినయ విధేయతలు గల సేవకుడను అని శివబాబా అంటున్నారు. అలాగని సేవకుడనని చెప్పుకుంటూ నవాబుగిరి చూపించరాదు. తండ్రి చెప్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా! తప్పకుండా సతోప్రధానంగా అవ్వాలి. ఇది చాలా సులభము. ఇందులో శబ్ధము చేసే పని ఏమీ లేదు. నోటితో ఏమీ మాట్లాడరాదు. ఎచ్చటకు వెళ్లినా లోలోపల స్మృతి చేస్తూ ఉండాలి. అంతేకాని ఇక్కడే కూర్చొని ఉంటే బాబా సహాయము చేస్తారని అనుకోరాదు. తండ్రి సహాయము చేసేందుకే వచ్చారు. పిల్లలు ఎక్కడ నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా ఉంటారోనని తండ్రికి సదా సంకల్పాలు వస్తుంటాయి. మాయ ఇక్కడేే ముష్టిఘాతముతో క్రింద పడేస్తుంది. దేహాభిమానము చాలా చాలా చెడ్డది. దేహాభిమానములోకి వచ్చినందున పూర్తిగా క్రింద పడిపోయారు. బాబా చెప్తున్నారు - ఇక్కడ వచ్చి కూర్చున్నా అత్యంత పియ్రమైన తండిన్రి స్మృతి చేయండి. తండి చెప్తున్నారు - పతితపావనుడను నేన్నొక్కరినే. నన్ను స్మృతి చేసినందున, ఈ యోగాగ్ని ద్వారా జన్మ-జన్మాంతరాల పాపాలు భస్మమవుతాయి. పిల్లలకు ఇంకా ఎవ్వరికీ బాగా అర్థం చేయించే స్థితి రాలేదు. జ్ఞాన ఖడ్గములో కూడా యోగమనే పదును లేకుంటే ఖడ్గము దేనికీ పనికిరాదు. ముఖ్యమైనది స్మృతి యాత. చాలామంది పిల్లలు ఉల్టా-సుల్టా వ్యాపారాలలో లగ్నమై ఉంటారు. స్మృతియాత్ర చేయరు, శ్రద్ధగా చదువుకోరు. అందుకే వారికి సమయము దొరకదు. తండ్రి చెప్తున్నారు - వృత్తి వ్యాపారాలు, వ్యవహారాలలో చిక్కుకుని మీ పదవిని పోగొట్టుకునే శ్రమ చేయకండి. మీ భవిష్యత్తును తయారు చేసుకోవాలి కదా. అందుకు సతోప్రధానంగా అవ్వాలి. ఇందులో చాలా శ్రమించాలి. చాలా పెద్ద పెద్ద మ్యూజియంలు మొదలైనవి సంభాళన చేయువారున్నారు. కానీ స్మృతియాత్రలో ఉండరు. బాబా అర్థం చేయించారు - పేదలు, బంధనములో ఉన్న మాతలు స్మృతియాత్ర ఎక్కువగా చేస్తున్నారు. మాటిమాటికి శివబాబాను స్మృతి చేస్తూ ఉంటారు. శివబాబా, మా బంధనాలను సమాప్తము చేయండి అని అంటూ ఉంటారు. అబలల పై అత్యాచారాలు జరుగుతాయి. ఇది కూడా గాయనముంది.

పిల్లలైన మీరు చాలా మధురంగా అవ్వాలి. సత్యమైన విద్యార్థులుగా అవ్వండి. మంచి విద్యార్థులు ఏకాంతంగా తోటలో కూర్చొని చదువుకుంటారు. తండి మీకు కూడా చెప్తున్నారు - మీరు ఎక్కడ తిరుగుతున్నా స్వయాన్ని ఆత్మగా భావించి బాబాను స్మృతి చేయండి. స్మృతి యాతల్రో ఆసక్తి కలిగి ఉండండి. ఆ ధన సంపాదనకు పోలిస్తే ఈ అవినాశి ధనము చాలా చాలా శ్రేష్ఠమైనది. ఆ వినాశి ధనము బూడిదైపోతుంది. బాబాకు తెలుసు - పిల్లలు సంపూర్ణ సేవ చేయడం లేదు. స్మృతియాత్రలో తక్కువగా ఉన్నారు. చేయవలసిన సత్యమైన సేవ చేయడం లేదు. స్థూల సేవలో శ్రద్ధ చూపిస్తున్నారు. భలే డ్రామానుసారము జరుగుతుంది. అయినా బాబా పురుషార్థమేమో చేయిస్తారు కదా. తండి చెప్తున్నారు - ఏ పని చేస్తున్నా, బట్టలు కుట్తున్నా, తండిన్రి స్మృతి చేయండి. స్మృతి చేయడంలోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది. బాబా అర్థం చేయిస్తున్నారు - రుస్తుంతో మాయ కూడా రుస్తుమ్(గొప్ప పహిల్వాన్)లాగే పోట్లాడ్తుంది. నేను రుస్తుమ్ను, నేను భికారి నుండి రాకుమారునిగా అయ్యే వాడినని కూడా నాకు తెలుసు. అయినా మాయ ఎదిరిస్తుందని ఈ బాబా(బ్రహ్మ) తన తపస్సు గురించి కూడా తెలుపుతున్నారు. మాయ ఎవ్వరినీ వదిలిపెట్టదు. పహిల్వానులయ్యే కొలది ఇంకా ఎక్కువగా పోట్లాడ్తుంది. చాలామంది పిల్లలు చాలా దేహ అహంకారములో ఉంటారు. తండ్రి ఎంతో నిరహంకారులుగా ఉంటారు. నేను కూడా పిల్లలైన మీకు నమస్కరించే సేవకుడనని అంటారు. వారేమో స్వయాన్ని చాలా గొప్పవారిగా భావిస్తారు. ఈ దేహ అహంకారాన్ని పూర్తిగా(సమూలంగా) నశింపచేయాలి. చాలామందిలో అహంకార భూతము కూర్చొని ఉంది. బాబా చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఇక్కడ చాలా మంచి అవకాశముంది. విహారములో తిరుగుట కూడా మంచిదే. ఫుర్సత్తు కూడా ఉంది. భలే తిరగండి, తర్వాత ఒకరినొకరు ఎంత సమయము స్మృతిలో ఉన్నాము? బుద్ధి ఇతర వైపులకు వెళ్లలేదు కదా? అని పరస్పరము సెమినార్చేసుకుంటూ ప్రశ్నించుకోండి. భలే స్త్రీలు వేరుగా, పురుషులు వేరుగా ఉండండి. తిరిగేందుకు స్త్రీలు ముందు వెళ్లండి, పురుషులు వారి వెనుక ఉండండి. ఎందుకంటే మాతలను సంభాళించాలి. కనుక మాతలను ముందుంచండి. ఇక్కడ ఏకాంతము చాలా బాగుంటుంది. సన్యాసులు కూడా ఏకాంతంగా ఉంటారు. సతోప్రధాన సన్యాసులు చాలా నిర్భయులుగా ఉండేవారు. జంతువులు మొదలైన వాటితో భయపడేవారు కాదు. ఆ నషాలో ఉండేవారు. ఇప్పుడు తమోప్రధానంగా అయ్యారు. ఏ ధర్మమైనా స్థాపన జరిగినప్పుడు మొదట సతోప్రధానంగా ఉండి తర్వాత రజో, తమోలోకి వస్తుంది. సతోప్రధానంగా ఉన్న సన్యాసులు బ్రహ్మతత్వపు మస్తీ(నషా)లో మస్త్గా ఉండేవారు. వారిలో చాలా ఆకర్షణ ఉండేది. అడవిలో భోజనము లభించేది కానీ క్రమ క్రమంగా తమోప్రధానంగా అయినందున శక్తి క్షీణిస్తూ ఉంటుంది.

ఇప్పుడు బాబా సలహానిస్తున్నారు - ఇక్కడ పిల్లల ఉన్నతికి చాలా మంచి అవకాశముంది. ఇక్కడకు మీరు వచ్చేదే సంపాదన కొరకు. బాబాతో కలిసినంత మాత్రాన సంపాదన జరగదు. తండ్రిని స్మృతి చేస్తే సంపాదన జమ అవుతుంది. బాబా ఆశీర్వాదిస్తారని భావించకండి. అదేమీ లేదు. సాధువులు మొదలైనవారు ఆశీర్వదిస్తారు. కానీ మీరు క్రిందకు దిగజారాల్సిందే. ఇప్పుడు తండి చెప్తున్నారు - జిన్నుగా తయారై మీ బుద్ధి యోగాన్ని సదా పైనున్న తండిత్రో జోడించండి. జిన్ను కథ తెలుసు కదా. నాకు పని చూపమని అడిగింది. తండి కూడా చెప్తున్నారు - స్మృతిలో ఉంటే మీ జీవిత నౌక తీరానికి చేరుతుందని సూచిస్తున్నాను, ఆదేశిస్తున్నాను. మీరు తప్పకుండా సతోపధ్రానంగా అవ్వాలి. మాయ ఎంతగా తల బాదుకున్నా మేము శేష్ఠ్రమైన తండిన్రి తప్పకుండా స్మృతి చేస్తామని లోలోపల మహిమ చేస్తూ తండిన్రి స్మృతి చేస్తూ ఉండాలి. ఏ మనిషినీ గుర్తు చేసుకోకండి. భక్తిమార్గములోని ఆచార పద్ధతులు జ్ఞాన మార్గములో ఉండవు. స్మృతియాత్రలో తీవ్రంగా వెళ్లాలని తండ్రి శిక్షణనిస్తున్నారు. ఇదే ముఖ్యమైన విషయము. సతోప్రధానంగా అవ్వాలి. తండ్రి ఆదేశిస్తున్నారు - మీరు విహరించేందుకు(వాకింగ్కు) వెళ్లినా స్మృతియాత్రలో ఉండండి. అలా ఉంటే ఇల్లు కూడా గుర్తుకొస్తుంది, రాజ్యపదవి కూడా గుర్తుకొస్తుంది. కానీ స్మృతిలో అలాగే కూర్చుని కింద పడిపోరాదు(స్పృహ తప్పరాదు). అలా జరిగితే అది హఠయోగమవుతుంది. ఇది చిక్కులు లేని విషయము - స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. చాలామంది పిల్లలు అలాగే కూర్చుని క్రింద పడిపోతారు. అందుకే బాబా అంటున్నారు - నడుసూ,్త తిరుగుతూ, తింటూ, తాగుతూ స్మృతిలో ఉండండి. అంతేకాని అలాగే కూర్చుని స్పృహ తప్పి పడిపోరాదు. దీని వలన మీ పాపాలు ఏవీ నశించవు. ఇందులో కూడా మాయ ద్వారా చాలా విఘ్నాలు ఏర్పడ్తాయి. ఈ భోగ్మొదలైనవి కూడా ఆచార పద్ధతులే. అంతేకాని ఇందులో ఏమీ లేదు. ఇందులో మాయ చాలా విఘ్నాలు కలుగజేస్తుంది. ఇది జ్ఞానమూ కాదు, యోగమూ కాదు. సాక్షాత్కారాల అవసరమే లేదు. చాలామందికి సాక్షాత్కారాలయ్యాయి. వారు ఈ రోజు లేనే లేరు. మాయ చాలా ప్రబలమైనది. సాక్షాత్కారము అవ్వాలనే ఆశ కూడా ఉంచుకోరాదు. ఇందులో సతోప్రధానమయ్యేందుకు తండ్రిని స్మృతి చేయాలి. ఇది అనాదిగా తయారైన డ్రామా అని కూడా మీకు తెలుసు. ఇది రిపీట్అవుతూ ఉంటుంది. ఈ డ్రామాను కూడా అర్థము చేసుకోవాలి. తండ్రి ఇచ్చిన ఆదేశము ప్రకారము కూడా నడుచుకోవాలి. మనమిప్పుడు మళ్లీ రాజయోగమును నేర్చుకునేందుకు వచ్చామని కూడా మీకు తెలుసు. ఇదంతా భారతదేశము విషయమే. భారతదేశమే తమోప్రధానంగా అయ్యింది. మళ్లీ ఇదే సతోప్రధానంగా అవ్వాలి. తండ్రి కూడా భారతదేశములోనే వచ్చి అందరికీ సద్గతిని కలుగజేస్తారు. ఇది చాలా అద్భుతమైన నాటకము. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలారా, స్వయాన్ని ఆత్మగా భావించండి. మీరు 84 జన్మల చక్రములో తిరుగుతూ 5 వేల సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇప్పుడు మళ్లీ వాపసు ఇంటికి వెళ్లాలి. ఈ విషయాలు మరెవ్వరూ వినిపించలేరు. పిల్లలైన మీలో కూడా నెంబరువారు పురుషార్థానుసారము నిశ్చయబుద్ధి గలవారిగా అవుతూ ఉంటారు. ఇది అనంతమైన పాఠశాల. అనంతమైన తండ్రి మనలను చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు. ఆ ఉస్తాదు టీచరు. చాలా పెద్ద ఉస్తాదు(గురువు). చాలా ప్రేమగా అర్థం చేయిస్తారు. ఎంతో మంచి మంచి పిల్లలు కూడా చాలా సుఖంగా ఉదయం 6 గంటల వరకు నిదురపోతూ ఉంటారు. మాయ ఒక్కసారిగా ముక్కుతో పట్టుకుంటుంది. అధికారము చలాయిస్తూ ఉంటారు. ప్రారంభములో మీరు భట్టీలో ఉన్నప్పుడు మమ్మా-బాబాలు కూడా అన్ని సేవలు చేసేవారు. మనము ఎలాంటి కర్మలు చేస్తామో, మనలను చూచి అందరూ చేస్తారు. మహారథులు, అశ్వారూఢులు, కాలినడకన వెళ్లేవారు అందరూ నెంబరువారుగా ఉన్నారని బాబాకు తెలుసు. చాలామంది పిల్లలు చాలా విశ్రాంతిగా ఉంటారు. లోపల నిదురిస్తూ ఉంటారు. ఎవరైనా బయట నుండి ఫలానావారు ఎక్కడ? అని అడిగితే, 'లేరు' అని చెప్తారు. కానీ లోపల నిదురిస్తూ ఉంటారు. ఏమేమి జరుగుతూ ఉంటుందో, అదంతా బాబా తెలిపిస్తూ ఉంటారు. ఇంకా ఎవ్వరూ సంపూర్ణమవ్వలేదు. చాలా డిస్సర్వీస్చేస్తారు. లేకుంటే తండి కొరకు గాయనముంది - కొట్టండి లేక పేమ్రించండి, మేము మీ ద్వారమును వదలము. ఇక్కడ చూస్తే చిన్న మాటకే అలుగుతారు. యోగము చాలా తక్కువగా ఉంది. బాబా పిల్లలకెంతగానో అర్థం చేయిస్తూ ఉంటారు. కాని ఎవ్వరిలోనూ స్మృతి చార్టు వ్రాసేందుకు శక్తి లేదు. యోగముంటే వ్రాసేందుకు కూడా శక్తి నిండుతుంది. గీతా భగవానుడు శివుడు, కృష్ణుడు కాదని ఋజువు చేయండి.

తండ్రి వచ్చి పిల్లలైన మీకు అన్ని విషయాలు అర్థము చేయిస్తారు. పిల్లలకు ఇక్కడ నషా పెరిగి ఉంటుంది. వెలుపలకు వెళ్తూనే సమాప్తమైపోతుంది. సమయాన్ని చాలా వృథా చేస్తూ ఉంటారు. మేము సంపాదించి యజ్ఞములో ఇవ్వాలి మొదలైన ఆలోచనలతో సమయాన్ని వృథా చేయరాదు. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, నేను మీ కళ్యాణము చేసేందుకు వచ్చాను. మీరేమో మీ అంతకు మీరు నష్టపోతున్నారు. యజ్ఞములో కల్పక్రితము సహాయము చేసినవారు ఇప్పుడూ చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు. మీరెందుకు తలలు బాదుకుంటారు - ఇది చేయాలి, అది చేయాలని అనుకుంటారు. డ్రామాలో నిర్ణయించబడే ఉంది. ఎవరు విత్తనము నాటారో, వారు ఇప్పుడు కూడా నాటుతారు. యజ్ఞమును గురించి మీరే చింతా చేయకండి. మీ కళ్యాణము మీరు చేసుకోండి. స్వయం మీకు మీరే సహాయము చేసుకోండి. భగవంతునికి మీరు సహాయము చేస్తారా? భగవంతుని నుండి మీరు తీసుకుంటారా? లేక ఆయనకే ఇస్తారా? ఈ సంకల్పము కూడా మీకు రాకూడదు. బాబా చెప్తున్నారు - అల్లారుముద్దు పిల్లలారా, స్వయాన్ని ఆత్మగా భావించి తండిన్రి స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఇప్పుడు మీరు సంగమ యుగములో ఉన్నారు. సంగమ యుగములో మీరు ఇరువైపులా చూడగలరు. ఇక్కడ జనాభా ఎంత ఎక్కువగా ఉంది! సత్యయుగములో చాలా తక్కువ మంది మనుష్యులుంటారు. రోజంతా సంగమ యుగములోనే నిలిచి ఉండాలి. బాబా మనలను ఎలా ఉండేవారిని ఎలా చేస్తున్నారు! తండ్రి పాత్ర చాలా అద్భుతమైనది. ఎక్కడ తిరుగుతున్నా స్మృతియాత్రలో ఉండండి. చాలామంది పిల్లలు సమయాన్ని వృథా చేస్తారు. స్మృతియాత్ర ద్వారానే మీ జీవిత నౌక తీరానికి చేరుతుంది. కల్పక్రితము కూడా పిల్లలకు ఇలాగే అర్థం చేయించాను. డ్రామా రిపీట్(పునరావృతము) అవుతూ ఉంటుంది. లేస్తూ, కూర్చుంటూ పూర్తి కల్పవృక్షము బుద్ధిలో గుర్తుకు రావాలి. ఇది చదువు, వృత్తి వ్యాపారాదులు భలే చేసుకోండి. చదువు కొరకు సమయాన్ని కేటాయించండి. మధురమైన తండిన్రి, స్వర్గమును స్మృతి చేయండి. ఎంత బాగా స్మృతి చేస్తే అంత అంతమతి సో గతిగా అవుతుంది. ఇక చాలు, బాబా మేము మీ వద్దకు వచ్చేస్తున్నామని అంటారు. తండి స్మృతిలో శ్వాస కూడా సుఖమయమవుతుంది. బ్రహ్మ జ్ఞానుల శ్వాస కూడా సుఖదాయకంగా అవుతుంది. బ్రహ్మతత్వపు స్మృతిలోనే ఉంటారు. కానీ బ్రహ్మలోకములోకి ఎవ్వరూ వెళ్లలేరు. వారు తమకు తామే(స్వ-ఇచ్ఛానుసారము) శరీరాలను వదిలేయవచ్చు. కొంతమంది ఉపవాస వ్రతాలతో శరీరమును వదిలేస్తారు. వారు దు:ఖముతో మరిణిస్తారు. తండ్రి చెప్తున్నారు - తినండి, తిరగండి తండ్రిని స్మృతి చేస్తే అంతిమతి సో గతి(చివరి సమయములో ఏ స్మృతి ఉంటుందో అలాంటి జన్మే లభిస్తుంది) అవుతుంది. ఎలాగైనా మరణించాల్సిందే కదా. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మనము ఏ కర్మలాచరిస్తామో, మనలను చూచి ఇతరులు కూడా చేస్తారు......... అని సదా గుర్తుంచుకోవాలి. డిస్సర్వీసు చేసేటంత విశ్రాంతి ప్రియులుగా అవ్వకండి. చాలా చాలా నిరహంకారులుగా ఉండాలి. మీకు మీరే సహాయము చేసుకొని మీ కళ్యాణము చేసుకోవాలి.
2. స్మృతి యాత్ర చేసేందుకు, చదువుకునేందుకు సమయము లేనంతగా వ్యాపార వ్యవహారాలలో తలమునకలవ్వరాదు. దేహాభిమానము అత్యంత చెడ్డది, చెల్లనిది, పనికిరానిది. దీనిని వదిలి దేహీ-అభిమానము(ఆత్మాభిమానము)లో ఉండే శ్రమ చేయాలి.

వరదానము:- '' విల్పవర్ద్వారా సెకండులో వ్యర్థానికి ఫుల్స్టాప్పెట్టే అశరీరి భవ ''
సెకండులో అశరీరిగా అయ్యేందుకు పునాది - ఈ బేహద్వైరాగ్య వృత్తి. ఈ వైరాగ్యము ఎటువంటి యోగ్యమైన ధరణి అంటే అందులో ఏ బీజము వేసినా వెంటనే దాని ఫలము వెలువడ్తుంది. కనుక ఇప్పుడు ఎటువంటి విల్పవర్ఉండాలంటే వ్యర్థము ఒక సెకండులో సమాప్తమైపోవాలని సంకల్పము చేస్తూనే అది సెకండులో సమాప్తమైపోవాలి. ఎప్పుడు కావాలంటే, ఎక్కడ కావాలంటే, ఏ స్థితిలో కావాలంటే సెకండులో సెట్చేసుకోండి. సేవ తనవైపు లాగరాదు. సెకండులో ఫుల్స్టాప్ ఉంచబడ్తే సహజంగానే అశరీరిగా అవుతారు.

స్లోగన్:- '' తండ్రి సమానంగా అవ్వాలంటే, చెడిపోయిన వారిని బాగుచేసే వారిగా అవ్వండి ''

Telugu Murli 03/10/2019

03-10-2019 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం

'' మధురమైన పిల్లలారా - అపారమైన సుఖాన్ని పొందేందుకు మీరు మాత - పితల సన్ముఖములోకి వచ్చారు. తండ్రి మిమ్ములను అపారమైన దు:ఖముల నుండి వెలికి తీసి అపారమైన సుఖాలలోకి తీసుకెళ్తారు ''

ప్రశ్న:- ఒక్క తండ్రి మాత్రమే రిజర్వ్లో ఉంటారు, పునర్జన్మలు తీసుకోరు, ఎందుకు ?
జవాబు:- ఎందుకంటే ఎవరో ఒకరు మిమ్ములను తమోప్రధానము నుండి సతోప్రధానంగా చేసేవారు కావాలి. ఒకవేళ తండ్రి కూడా పునర్జన్మలో వచ్చినట్లైతే నల్లగా(అపవిత్రంగా) ఉన్న మిమ్ములను సుందరంగా(పవిత్రంగా) ఎవరు చేస్తారు! కనుక బాబా రిజర్వ్లో ఉంటారు.

ప్రశ్న:- దేవతలు సదా సుఖీలుగా ఎందుకుంటారు ?
జవాబు:- ఎందుకంటే వారు పవిత్రులు. పవిత్రత కారణంగా వారి నడవడికలు పరివర్తన చెంది ఉంటాయి. ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ సుఖ-శాంతులు ఉంటాయి. ముఖ్యమైనది పవిత్రత.

ఓంశాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు - వారు తండ్రే కాక మతా-పిత కూడా అయినారు. మీరు మా మాతా-పితలు, మేము మీ సంతానము........ అని పాడేవారు కదా. అందరూ పిలుస్తూ ఉంటారు. ఎవరిని పిలుస్తారు? పరమపిత పరమాత్మను. కాని వారి కృప ద్వారా ఎలాంటి అపారమైన సుఖము ఎప్పుడు లభించిందో వారికి తెలియదు. అపారమైన సుఖము అని దేనిని అంటారో కూడా వారికి తెలియదు. ఇప్పుడు మీరు సన్ముఖములో కూర్చుని ఉన్నారు. ఇక్కడ ఎంత అపార దు:ఖముందో మీకు తెలుసు. ఇది దు:ఖధామము, అది సుఖధామము. మేము 21 జన్మలు స్వర్గములో చాలా సుఖంగా ఉన్నామని ఎవరి బుద్ధిలోనూ ఉండదు. మీకు కూడా మొదట ఈ అనుభవము ఉండేది కాదు. మనము ఆ పరమపిత పరమాత్మ మాతా-పిత సన్ముఖములో ఉన్నాము, మేము 21 జన్మల కొరకు స్వర్గ సామాజ్య్రాన్ని పాప్త్రి చేసుకునేందుకు ఇక్కడికి వచ్చామని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రిని కూడా తెలుసుకున్నారు. ఆ తండ్రి ద్వారా పూర్తి సృష్టి చక్రాన్ని కూడా అర్థం చేసుకున్నారు. మనము మొదట అపారమైన సుఖములో ఉండేవారము తర్వాత దు:ఖములోకి వచ్చామని కూడా నెంబరువారుగా ప్రతి ఒక్కరి బుద్ధిలో ఉంటుంది. విద్యార్థికి సదా స్మృతి ఉండాలి కానీ క్షణ-క్షణము మర్చిపోవడం బాబా గమనిస్తున్నారు. అందువల్లనే మళ్లీ వాడిపోతారు. స్థితి బలహీనమౌతుంది(అత్తిపత్తి వలె). మాయ యుద్ధము చేస్తుంది. ఉండవలసినంత సంతోషము ఉండదు. పదవులు నంబరువారుగా ఉన్నాయి కదా. స్వర్గములోకి వెళ్తారు కానీ అక్కడ కూడా రాజుల నుండి పేదవారి వరకు ఉంటారు కదా. వారు పేద ప్రజలు, వారు శ్రీమంతులు, స్వర్గములోనూ ఉంటారు, నరకములో కూడా ఉంటారు. ఉన్నతమైనవారు మరియు నీచమైనవారు. అపార సుఖమును పొందేందుకు మనము పురుషార్థము చేస్తున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణులకు అందరికంటే ఎక్కువ సుఖముంది కదా. ముఖ్యమైనది పవితత్ర. పవితత్ర లేకుండా శాంతి, సంపదలు లభించవు. ఇందులో నడవడిక చాలా బాగుండాలి. పవితత్ర ద్వారానే మనుష్యుల నడవడిక బాగుపడ్తుంది. పవిత్రంగా ఉండువారిని దేవతలని అంటారు. మీరు ఇక్కడకు దేవతలుగా అయ్యేందుకే వచ్చారు. దేవతలు సదా సుఖంగా ఉండేవారు. మనుష్యులు సదా సుఖంగా ఉండేందుకు వీలు లేదు. దేవతలకు మాత్రమే సుఖము ఉంటుంది. ఈ దేవతలనే మీరు పూజిస్తుండేవారు కదా! ఎందుకంటే వారు పవిత్రంగా ఉండేవారు. పూర్తి ఆధారమంతా పవిత్రత పై ఉంది. విఘ్నాలు కూడా ఇందులోనే వస్తాయి. ప్రపంచములో శాంతి కావాలని కోరుకుంటారు. పవిత్రత లేకుండా శాంతి ఉండేందుకు వీలు లేదని బాబా చెప్తున్నారు. మొట్టమొదటి ముఖ్యమైన విషయమే పవితత్ర. పవితత్ర ద్వారానే నడవడికలు బాగుపడ్తాయి. పతితులుగా అగుట వల్ల మళ్లీ నడవడికలు పాడవుతాయి. ఇప్పుడు మనము మళ్లీ దేవతలుగా అవ్వాలంటే పవిత్రత తప్పకుండా అవసరమని అర్థం చేసుకోవాలి. దేవతలు పవిత్రమైనవారు. అందువల్లనే అపవిత్ర మనుష్యులు వారి ముందు తల వంచి నమస్కరిస్తారు. ముఖ్యమైన విషయమే పవిత్రత. పిలవడము కూడా '' హే పతితపావనా! వచ్చి మమ్ములను పావనంగా చేయండి '' అని పిలుస్తారు. తండి చెప్తున్నారు - కామము మహాశతువ్రు, దీని పైన విజయము పొందండి. దీని పై విజయము పొందడం వల్లనే మీరు పవితంగా అవుతారు. మీరు పవితుల్రుగా, సతోపధ్రానంగా ఉన్నప్పుడు సుఖ-శాంతులు ఉండేవి. పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞాపకము వచ్చింది. ఇది నిన్నటి మాటే. మీరు పవిత్రంగా ఉన్నప్పుడు అపారమైన సుఖము, శాంతి సర్వస్వమూ ఉండేవి. ఇప్పుడు మళ్లీ మీరు ఈ లక్ష్మీనారాయణులుగా అవ్వాలి. ఇందులో మొట్టమొదట ముఖ్యమైన విషయము సంపూర్ణ నిర్వికారులుగా అవ్వడము. ఇది జ్ఞాన యజ్ఞము, ఇందులో విఘ్నాలు తప్పకుండా ఏర్పడ్తాయని గాయనముంది. పవిత్రత పై ఎంత వేధిస్తారు! ఆసురీ సంప్రదాయము, దైవీ సంప్రదాయాలు కూడా గాయనము చేయబడ్డాయి. సత్యయుగములో ఈ దేవతలు ఉండేవారని మీ బుద్ధిలో ఉంది. భలే రూపము మనుష్యులది కానీ వారిని దేవతలని అంటారు. అక్కడ సంపూర్ణ సతోప్రధానంగా ఉంటారు. అక్కడ ఏ లోపాలు ఉండవు. ప్రతి వస్తువు లోప రహితంగా, సంపూర్ణంగా ఉంటుంది. తండి సంపూర్ణులు(పర్ఫెక్ట్) కాబట్టి పిల్లలను కూడా అలాగే తయారు చేస్తారు. యోగబలము ద్వారా మీరు ఎంత పవితంగా, అందంగా అవుతారు! ఈ యాత్రికుడు సదా పవిత్రమైనవారు. వారు నల్లగా(అపవిత్రులుగా) ఉన్న మిమ్ములను సుందరంగా (పవిత్రంగా) చేస్తారు. అక్కడ సహజ సౌందర్యము ఉంటుంది. అందంగా చేసుకునే అవసరముండదు. సతోప్రధానమైనవారు సౌందర్యవంతులుగానే ఉంటారు. వారే మళ్లీ తమోప్రధానంగా అవ్వడం వలన నల్లగా అవుతారు. శ్యామసుందర అను పేరు కూడా ఉంది. కృష్ణుని శ్యామసుందరుడని ఎందుకు అంటారు? దీని అర్థము తండ్రి తప్ప ఇతరులెవ్వరూ తెలియచేయలేరు. భగవంతుడైన తండ్రి ఏ విషయాలను వినిపిస్తారో ఆ విషయాలను ఏ మనుష్యులూ వినిపించలేరు. చిత్రాలలో స్వదర్శన చక్రాన్ని దేవతలకు ఇచ్చేశారు.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురమైన పిల్లలారా! స్వదర్శన చక్రము దేవతలకు అవసరము లేదు. వారు శంఖము మొదలైనవి ఏం చేస్తారు? బాహ్మ్రణ పిల్లలైన మీరే స్వదర్శన చకధ్రారులు. శంఖుధ్వని కూడా మీరే చేయాలి. ఇప్పుడు విశ్వములో ఎలా శాంతి స్థాపన జరుగుతూ ఉందో మీకు తెలుసు. దానితో పాటు నడవడికలు కూడా బాగుండాలి. భక్తిమార్గములో కూడా మీరు దేవతల ముందుకు వెళ్లి తమ నడవడికలను వర్ణన చేస్తారు కదా. కానీ దేవతలు మీ నడవడికలను బాగు చేయరు. బాగు చేయువారు వేరొకరున్నారు. ఆ శివబాబా నిరాకారులు. వారి ముందు మీరు సర్వ గుణ సంపన్నులు,............. అని మహిమ చెయ్యరు. శివుని మహిమయే వేరుగా ఉంటుంది. దేవతల మహిమను గానము చేస్తారు. కానీ మనము అలా ఎలా తయారవ్వాలి? పవిత్రంగా, అపవిత్రంగా అయ్యేది ఆత్మయే. ఇప్పుడు మీ ఆత్మ పవితంగా అవుతూ ఉంది, ఆత్మ సంపూర్ణమైనప్పుడు ఈ పతిత శరీరము ఉండదు. మళ్లీ వెళ్లి పావన శరీరము తీసుకుంటుంది. ఇక్కడ పావన శరీరము ఉండేందుకు వీలు లేదు. ఎప్పుడైతే ప్రకృతి కూడా సతోప్రధానంగా ఉంటుందో అప్పుడు పావన శరీరము ఉంటుంది. క్రొత్త ప్రపంచములో ప్రతి వస్తువు సతోప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు 5 తత్వాలు తమోప్రధానంగా ఉన్నాయి. కనుక ఎన్ని ఉపద్రవాలు సంభవిస్తూ ఉంటాయి! ఎలా మనుష్యులు మరణిస్తూ ఉంటారు! తీర్థయాత్రలకు వెళ్తారు, ఏవైనా ప్రమాదాలు సంభవించినాయంటే మరణిస్తారు! నీరు, పృథ్వి మొదలైనవి ఎంత నష్టపరుస్తాయి! ఈ తత్వాలన్నీ మీకు సహాయము చేస్తాయి. వినాశములో ఆకస్మికంగా వరదలు వస్తాయి, తుఫానులు వస్తాయి - ఇవి ప్రాకృతిక ఆపదలు. వారు బాంబులు మొదలైనవి ఏవైతే తయారు చేస్తున్నారో అది కూడా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. వాటిని ఈశ్వరీయ ఆపదలని అనరు. అవి మనుష్యుల ద్వారా తయారైనవి. భూకంపాలు మొదలైనవేవీ మనుష్యుల ద్వారా తయారైనవి కావు. ఈ ఆపదలన్నీ పరస్పరము కలుస్తాయి. భూభారము తగ్గి తేలికైపోతుంది. బాబా మనలను ఎలా పూర్తి తేలికగా తయారు చేసి కొత్త ప్రపంచానికి జతలో తీసుకెళ్తారో మీకు తెలుసు. తల తేలికైనప్పుడు మళ్లీ చురుకుగా అవుతారు కదా. మిమ్ములను బాబా పూర్తి తేలికగా చేసేస్తారు. అన్ని దు:ఖాలు దూరమైపోతాయి. ఇప్పుడు మీ అందరి తలలు చాలా భారంగా ఉన్నాయి. తర్వాత అందరూ తేలికగా, శాంతిగా, సుఖంగా ఉంటారు. ఎవరు ఏ ధర్మము వారైనా అందరికీ సంతోషముండాలి. సర్వులకు సద్గతినిచ్చేందుకు బాబా వచ్చి ఉన్నారని అందరికీ సంతోషముండాలి. స్థాపన ఎప్పుడైతే పూర్తిగా జరిగిపోతుందో అప్పుడు మళ్లీ అన్ని ధర్మాలు వినాశనమైపోతాయి. మొదట మీ బుద్ధిలో కూడా ఈ ఆలోచనలు లేవు. ఇప్పుడు అర్థం చేసుకున్నారు. బ్రహ్మ ద్వారా స్థాపన అని మహిమ కూడా ఉంది. మిగిలిన అనేక ధర్మాలను వినాశనము చేసే కర్తవ్యాన్ని ఒక్క తండ్రి మాత్రమే చేస్తారు. వేరెవ్వరూ చేయలేరు. ఒక్క శివబాబాకు తప్ప ఇలాంటి అలౌకిక జన్మ, అలౌకిక కర్తవ్యాలు వేరెవ్వరికీ ఉండవు. తండి సర్వోన్నతమైనవారు. కనుక వారి కర్తవ్యము కూడా చాలా ఉన్నతమైనది. చేసి చేయించేవారు కదా. మీరు జ్ఞానాన్ని వినిపిస్తారు. ఈ సృష్టి నుండి పాపాత్మల భారాన్ని తొలగించేందుకు తండి వచ్చి ఉన్నారు. ఏక ధర్మ స్థాపన, అనేక ధర్మాల వినాశనము కొరకు బాబా వస్తారని గాయనము కూడా ఉంది కదా. మిమ్ములను ఇప్పుడు ఎంత ఉన్నతమైన మహాత్ములుగా చేస్తున్నారు! దేవతలు తప్ప మహాత్ములెవ్వరూ ఉండరు. ఇక్కడ అనేమందిని మహాత్మలని అంటూ ఉంటారు. కానీ మహాత్మ అని మహోన్నతమైన ఆత్మలకే చెప్తారు. స్వర్గమును రామ రాజ్యమని అంటారు. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. కనుక వికారాల ప్రశ్నే తలెత్తదు. కనుక వారిని సంపూర్ణ నిర్వికారులని అంటారు. ఎంత సంపూర్ణంగా అవుతారో అంత అధిక సమయము సుఖాన్ని పొందుతారు. అసంపూర్ణులు అంత సుఖాన్ని పొందలేరు. పాఠశాలలో కూడా కొందరు సంపూర్ణులు, మరి కొందరు అసంపూర్ణులు ఉంటారు. వ్యత్యాసము కనపడ్తుంది. డాక్టరంటే డాక్టరే కానీ కొందరి వేతనము చాలా తక్కువ, మరి కొందరి వేతనము చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే దేవతలంటే దేవతలే. కానీ పదవిలో వ్యత్యాసము చాలా ఉంటుంది. తండ్రి వచ్చి మీకు శ్రేష్ఠమైన చదువును చదివిస్తారు. కృష్ణుని భగవంతుడని అనరాదు. కృష్ణుని శ్యామసుందరుడని అంటారు. కృష్ణుని నల్లగా కూడా చూపిస్తారు. కృష్ణుడు నల్లగా ఉండడు. నామ-రూపాలు మారిపోతాయి కదా. ఆత్మ భిన్న భిన్న నామ-రూప-దేశ-కాలాలలో నల్లగా (అపవిత్రంగా) అవుతుంది. ఇప్పుడిదంతా మీకు అర్థం చేయించబడ్తుంది. మనము ప్రారంభము నుండి ఎలా పాత్రలోకి వస్తామో మీరు అర్థం చేసుకున్నారు. మొదట దేవతలుగా ఉండేవారు. తర్వాత దేవతల నుండి అసురులుగా అయ్యారు. తండ్రి 84 జన్మల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. దీనిని గురించి ఇతరులెవ్వరికీ తెలియదు. తండ్రియే వచ్చి అన్ని రహస్యాలు అర్థం చేయిస్తారు. తండ్రి చెప్తున్నారు - నా ముద్దు పిల్లలారా, మీరు నాతో పాటు ఇంట్లో ఉండేవారు. మీరంతా సోదరులుగా ఉండేవారు. అక్కడ మీకు శరీరాలు లేవు. అందరూ ఆత్మలుగానే ఉండేవారు. తండ్రి మరియు సోదరులైన మీరు ఉండేవారు. వేరే ఏ సంబంధమూ లేదు. తండ్రి పునర్జన్మలోకి రారు. వారు డ్రామానుసారంగా రిజర్వ్లో ఉంటారు. వారి పాత్రయే అలాంటిది. మీరు ఎంత సమయము పిలిచారో, అది కూడా తండ్రి తెలిపించారు. ద్వాపరము నుండి పిలవడం ప్రారంభించలేదు. చాలా సమయము తర్వాత మీరు పిలవడం ప్రారంభించారు. మిమ్ములను తండ్రి సుఖవంతులుగా చేస్తున్నారు అనగా సుఖ వారసత్వాన్ని ఇస్తున్నారు. బాబా మేము మీ వద్దకు కల్ప-కల్పము అనేకసార్లు వచ్చామని మీరు కూడా చెప్తారు. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత బాబా మీతో అంటారు. వారసత్వాన్ని మీరు పొందుతారు. దేహధారులందరూ విద్యార్థులే, చదివించేవారు విదేహీ. ఇది వారి దేహము కాదు. వారు స్వయంగా విదేహి. ఇక్కడకు వచ్చి దేహ ధారణ చేస్తారు. దేహము లేకుండా పిల్లలను ఎలా చదివిస్తారు? సర్వాత్మలకు వారు తండ్రి. భక్తిమార్గములో అందరూ వారిని పిలుస్తారు. రుద్రమాలను స్మరిస్తారు. పైన పుష్పము తర్వాత జంటపూస. వారు ఒకే విధంగా ఉన్నారు. పుష్పానికి ఎందుకు నమస్కరిస్తారో, ఎవరి మాలను తిప్పుతున్నారో కూడా ఇప్పుడు మీకు తెలిసింది. దేవతల మాలను తిప్పుతారా లేక మీ మాలను తిప్పుతారా? మాల దేవతలదా లేక మీదా? దేవతలది కాదు. మాల బ్రాహ్మణులదే. వీరికే తండ్రి కూర్చొని చదువు నేర్పిస్తున్నారు. బ్రాహ్మణుల నుండి మళ్లీ మీరే దేవతలుగా అవుతారు. ఇప్పుడు చదువుతున్నారు తర్వాత అక్కడకు వెళ్లి దేవతా పదవిని పొందుతారు. మాల బ్రాహ్మణులైన మీదే. మీరు తండ్రి ద్వారా చదివి, శ్రమపడి మళ్లీ దేవతలుగా అవుతారు. బలిహారము (సమర్పణ) చదివించేవారిది. తండ్రి పిల్లలకు ఎంత సేవ చేశారు! అక్కడైతే తండ్రిని ఎవ్వరూ స్మృతి కూడా చేయరు. భక్తిమార్గములో మీరు మాలను తిప్పేవారు. ఇప్పుడు ఆ పుష్పము(శివబాబా) వచ్చి మిమ్ములను కూడా పుష్పాలుగా చేస్తున్నారు. అనగా తన మాలలోని మణులుగా చేస్తున్నారు. మీరు పుష్పాలుగా అవుతున్నారు కదా. ఆత్మ జ్ఞానము కూడా మీకు ఇప్పుడే లభిస్తుంది. పూర్తి సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానము మీ బుద్ధిలో ఉంది. మహిమ మీదే, బ్రాహ్మణులైన మీరు మీ సమానంగా బ్రాహ్మణులను తయారుచేసి మళ్లీ స్వర్గవాసులైన దేవీ దేవతలుగా చేస్తారు. దేవతలు స్వర్గములో ఉంటారు. మీరెప్పుడు దేవతలుగా అవుతారో అప్పుడు అక్కడ మీకు భూత, వర్తమాన, భవిష్యత్తుల జ్ఞానము ఉండదు.

ఇప్పుడు బ్రాహ్మణ పిల్లలైన మీకే భూత, వర్తమాన, భవిష్యత్తుల జ్ఞానము లభించింది, ఇతరులెవ్వరికీ ఈ జ్ఞానము లభించదు. మీరు చాలా చాలా భాగ్యశాలురు కానీ మాయ మళ్లీ మరపింపజేస్తుంది. మిమ్ములను ఈ బాబా చదివించడం లేదు. ఇతడు కూడా మనిషే. ఇతను కూడా చదువుకుంటున్నారు. ఇతను అందరికంటే చివరిలో ఉండేవారు. మొదటి నంబరు పతితులైనవారే మళ్లీ మొదటి నంబరు పావనంగా అవుతారు. ఎంత సుఖీలుగా అవుతారు! లక్ష్యము ఎదురుగా ఉంది. తండ్రి మిమ్ములను ఎంతో ఉన్నతంగా చేస్తారు. ఆయుష్మాన్ భవ, పుత్రవాన్ భవ,........ ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. ఒకవేళ నేను ఆశ్వీదించినట్లైతే అందరినీ ఆశీర్వదించాలి. నేను పిల్లలైన మిమ్ములను చదివించేందుకు వస్తాను. ఈ చదువు ద్వారానే మీకు అన్ని ఆశీర్వాదాలు లభిస్తాయని తండ్రి చెప్తారు. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి ఎలా పరిపూర్ణులో, అలా స్వయాన్ని పరిపూర్ణంగా(పర్ఫెక్ట్గా) చేసుకోవాలి. పవిత్రతను ధారణ చేసి మీ నడవడికలను బాగు చేసుకోవాలి. సత్యమైన సుఖ-శాంతులను అనుభవము చేయాలి.
2. సృష్టి ఆది-మధ్యాంత జ్ఞానములను బుద్ధిలో ఉంచుకొని బ్రాహ్మణుల నుండి దేవతలుగా చేసే సేవ చేయాలి. మీ శ్రేష్ఠ భాగ్యాన్ని ఎప్పుడూ మర్చిపోరాదు.

వరదానము:- '' సాధనాల ప్రవృత్తిలో ఉంటూ కమలపుష్ప సమానంగా న్యారా, ప్యారాగా ఉండే బేహద్ వైరాగీ భవ ''
సాధనాలు లభించాయంటే వాటిని విశాల హృదయంతో ఉపయోగించండి. ఈ సాధనాలు మీ కొరకే ఉన్నాయి. కానీ సాధనను మర్జ్ చేయకండి(మానకండి). రెండిటి బ్యాలెన్స్ పూర్తిగా ఉండాలి. సాధనాలు చెడ్డవి కాదు. అవి మీ కర్మలకు, యోగానికి లభించిన ఫలము. కానీ సాధనాల ప్రవృత్తిలో ఉంటూ కమలపుష్ప సమానం న్యారాగా(అతీతంగా), తండ్రికి ప్రియంగా అవ్వండి. ఉపయోగిస్తూ వాటి ప్రభావంలోకి రాకండి. సాధనాలను ఉపయోగిస్తూ అందులో అనంతమైన వైరాగ్య వృత్తిని మర్జ్ చేయకండి. మొదట స్వయంలో దీనిని(వైరాగ్య వృత్తిని) ఎమర్జ్ చేయండి. తర్వాత విశ్వములో వాయుమండలాన్ని వ్యాపింపజేయండి.

స్లోగన్:- '' పరేశాన్ను (వ్యాకులతను) తమ శాన్లో స్థితం చేయడమే అన్నిటికంటే మంచి సేవ ''

Wednesday, 2 October 2019

Telugu Murli 02/10/2019

02-10-2019 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం

'' మధురమైన పిల్లలారా - మీ అందరిదీ పరస్పరములో ఒకే మతము, మీరు స్వయాన్ని ఆత్మగా భావించి ఒక్క తండ్రిని స్మృతి చేస్తారు కనుక భూతాలన్నీ పారిపోతాయి ''

ప్రశ్న:- పదమాపదమ్భాగ్యశాలురుగా అయ్యేందుకు ముఖ్య ఆధారమేది ?
జవాబు:- బాబా వినిపించే ఒక్కొక్క మాటను ధారణ చేయువారే పదమాపదమ్భాగ్యశాలురుగా అవుతారు. బాబా ఏమి చెప్తున్నారు? రావణ సాంప్రదాయము వారేమి చెప్తున్నారు? అని మీకు మీరే పరిశీలించి నిర్ణయించండి. తండి తెలిపిస్తున్న జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకొని, స్వదర్శన చకధ్రారులుగా అవ్వడమే పదమాపదమ్భాగ్యశాలురుగా అవ్వడం. ఈ జ్ఞానము ద్వారానే మీరు గుణవంతులుగా అవుతారు.

ఓంశాంతి. ఆత్మిక తండ్రిని - ఆంగ్ల భాషలో స్పిరిచ్యువల్ఫాదర్అని అంటారు. సత్యయుగానికి వెళ్లినప్పుడ అక్కడ ఇంగ్లీషు మొదలైన ఇతర భాషలేవీ ఉండవు. సత్యయుగములో మన రాజ్యముంటుంది. అక్కడ మన భాష ఏదైతే ఉంటుందో అదే నడుస్తుందని మీకు తెలుసు. తర్వాత మళ్లీ ఆ భాష మారుతూ వస్తుంది. ఇప్పుడైతే అనేక భాషలున్నాయి. రాజును అనుసరించి భాష నడుస్తుంది. సేవాకేంద్రాలలో పిల్లలందరిదీ ఒకే మతమని మీకు తెలుసు. స్వయాన్ని ఆత్మగా భావించి ఒక్క తండిన్రి మాతమ్రే స్మృతి చేయాలి అప్పుడే భూతాలన్నీ పారిపోతాయి. ఆ తండ్రి పతితపావనులు. 5 భూతాలు అందరిలో ప్రవేశమై ఉన్నాయి. ఆత్మలోనే భూతాలు ప్రవేశిస్తాయి. ఆ భూతాలకు పేరు కూడా పెడ్తారు. దేహాభిమానము, కామము, క్రోధము............... మొదలైనవి. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు. ఎప్పుడైనా ఎవరైనా ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటే, సర్వవ్యాపి ఆత్మలని, ఆత్మలలో 5 వికారాలు స్వర్వవ్యాపిగా ఉన్నాయని చెప్పండి. అంతేకాని అందరిలో పరమాత్మ విరాజమానంగా లేరు. పరమాత్మలో 5 భూతాలు ఎలా ప్రవేశిస్తాయి! ఒక్కొక్క మాటను బాగా ధారణ చేయడం వలన మీరు పదమాపదమ్భాగ్యశాలురుగా అవుతారు. ఈ ప్రపంచములోని రావణ సాంప్రదాయమువారు ఏమంటున్నారు, తండ్రి ఏమంటున్నారు అని ఆలోచించి నిర్ణయము తీసుకోండి. ప్రతి ఒక్కరి శరీరములో ఆత్మ ఉంది. ఆత్మలో 5 వికారాలు ప్రవేశమై ఉన్నాయి, శరీరములో కాదు. ఆత్మలో 5 వికారాలు లేక 5 భూతాలు ప్రవేశమవుతాయి. సత్యయుగములో ఈ 5 భూతాలు ఉండవు. దాని పేరే దైవీ ప్రపంచము. ఇది సైతాన్ప్రపంచము. సైతాన్అని, డెవిల్అని అసురులను అంటారు. రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసముంది. ఇప్పుడు మీరు పరివర్తనవుతారు. అక్కడ మీలో ఏ వికారము గానీ, ఏ అవగుణము గానీ ఉండదు. మీలో గుణాలు సంపూర్ణంగా ఉంటాయి. మీరు 16 కళా సంపూర్ణులుగా అవుతారు. మొదట అలా ఉండేవారు తర్వాత క్రిందకు దిగుతూ వచ్చారు. ఈ చక్రము గురించి, 84 జన్మల చక్రమెలా తిరుగుతూ ఉందో మీకిప్పుడే అర్థమయ్యింది. ఆత్మలైన మనకు స్వదర్శనము జరిగింది అనగా ఈ చక్ర జ్ఞానము లభించింది. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ మీ బుద్ధిలో ఈ జ్ఞానముండాలి. తండ్రి జ్ఞానమును చదివిస్తున్నారు అనగా ఆత్మిక జ్ఞానాన్ని చదివిస్తున్నారు. ఈ ఆత్మిక జ్ఞానాన్ని తండ్రి భారతదేశములోనే వచ్చి ఇస్తారు. మా భారతదేశమని అంటారు కదా. వాస్తవానికి హిందుస్థాన్అని అనడం తప్పు. భారతదేశము స్వర్గంగా ఉన్నప్పుడు కేవలం మన రాజ్యమే ఉండేది. ఇతర ధర్మమేదీ లేదు. నూతన ప్రపంచంగా ఉండేది. న్యూ ఢిల్లీ అని అంటారు కదా. ఢిల్లీ అసలు పేరు కాదు, ఫరిస్తాన్అని అనేవారు. ఇప్పుడు కొత్త ఢిల్లీ, పాత ఢిల్లీ అని అంటారు. తర్వాత పాతదీ ఉండదు, క్రొత్తదీ ఉండదు. ఫరిస్తాన్అని పిలువబడ్తుంది. ఢిల్లీని ముఖ్య పట్టణము అని అంటారు. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యము వస్తుంది. ఇంకే రాజ్యమూ ఉండదు. మన రాజ్యమే ఉంటుంది. ఇప్పుడు రాజ్యమే లేదు. అందుకే మా భారతదేశము అని అంటారు. రాజులు లేనే లేరు. పిల్లలైన మీ బుద్ధిలో జ్ఞానమంతా తిరుగుతూ ఉంటుంది. మొట్టమొదట ఈ విశ్వములో దేవీదేవతల రాజ్యముండేది. ఇతర రాజ్యమేదీ ఉండేది కాదు. దేవతల ముఖ్య పట్టణము ఢిల్లీనే, యమునా నది తీరాన ఉండేది. దానిని ఫరిస్తాన్అని అనేవారు. అందుకే అది అందరినీ ఆకర్షిస్తుంది. అన్నింటికంటే పెద్దది. కరెక్టుగా మధ్యలో ఉంది.

మధురాతి మధురమైన పిల్లలూ! పాపాలు చేసి పాపాత్మలుగా అయ్యామని అర్థం చేసుకున్నారు. సత్యయుగములో పుణ్యాత్మలుంటారు. స్వయం తండ్రియే వచ్చి పావనంగా చేస్తారు. ఆ తండ్రిదే మీరు శివజయంతి కూడా జరుపుకుంటారు. జయంతి అనే పదము అందరికీ అన్వయిస్తుంది. అందుకే దీనిని శివరాత్రి అని అంటారు. రాత్రికి అసలైన అర్థము మీకు మాత్రమే తెలుసు. ఇతరులెవ్వరికీ తెలియదు. శివరాత్రి అంటే ఏమిటో గొప్ప-గొప్ప విద్వాంసులకే తెలియదు. ఇక పండుగ ఏమి జరుపుకుంటారు! రాత్రి అంటే అర్థమేమిటో తండ్రి తెలుపుచున్నారు. ఈ 5 వేల సంవత్సరాల చకమ్రులో సుఖ-దు:ఖాల నాటకముంది. సుఖమును పగలని, దు:ఖమును రాతి అని అంటారు. ఈ రాతిక్రి - పగులుకు మధ్య సంగమ యుగము వస్తుంది. అర్ధకల్పము వెలుగు, అర్ధకల్పము అంధకారము. భక్తిమార్గములో చాలా నెమ్మదిగా ముందుకు వెళ్తారు. ఇక్కడ ఒక్క సెకండు చాలు. చాలా సులభము. ఇది సహజ యోగము. మీరు మొదట ముక్తిధామానికి వెళ్లాలి. ఆ తర్వాత జీవన్ముక్తిలో ఎంత సమయముండినారో పిల్లలైన మీ స్మృతిలో ఉంది. కానీ క్షణ-క్షణము మర్చిపోతారు. యోగము అనే శబ్ధము సరియైనది. వారిది శారీరిక యోగము. ఇది పరమాత్మతో ఆత్మల యోగము. సన్యాసులు అనేక ప్రకారాల హఠయోగము మొదలైనవి నేర్పిస్తారు. అందువలన మనుష్యులు తికమకపడ్తూ ఉంటారు. ఇక్కడ తండే కాక టీచరు కూడా వారే. కావున వారితో యోగము చేయాల్సి పడ్తుంది కదా. టీచరు ద్వారా చదువుకోవలసి వస్తుంది. పిల్లలు జన్మిస్తూనే మొదట తండ్రితో యోగముంటుంది. 5 సంవత్సరాల తర్వాత టీచరుతో యోగము చేయవలసి వస్తుంది. ఆ తర్వాత వానప్రస్థ స్థితిలో గురువుతో యోగము చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా 3 సంబంధాలు గుర్తుంటాయి. అక్కడ వేరు వేరుగా ఉంటారు. ఇక్కడ ఈ తండి వచ్చేది ఒక్కసారి మాతమ్రే. ఈ తండే టీచరుగా అవుతారు. అద్భుతము కదా. ఇటువంటి తండిన్రి తప్పకుండా స్మృతి చేయాలి. జన్మ-జన్మాంతరాలు వేరు వేరుగా స్మృతి చేస్తూ వచ్చారు. సత్యయుగములో కూడా తండ్రితో యోగముంటుంది. ఆ తర్వాత టీచరుతో ఉంటుంది. చదువుకునేందుకు వెళ్తారు కదా. అక్కడ గురువు అవసరముండదు ఎందుకంటే అందరూ సద్గతిలో ఉంటారు. ఈ విషయాలను స్మృతి చేయడంలో కష్టమేముంది? చాలా సులభము. దీనిని సహజయోగమని అంటారు. అయితే ఇది అసాధారణమైనది. తండ్రి చెప్తున్నారు - నేను ఈ శరీరాన్ని తాత్కాలికంగా అప్పు తీసుకున్నాను. అది కూడా చాలా కొంత సమయము కొరకే. 60 సంవత్సరాలకు వానప్రస్థ స్థితి అవుతుంది. 60 వస్తూనే చేతికి కర్ర వచ్చింది అని అంటారు. ఈ సమయంలో అందరికీ చేతికర్రలొచ్చాయి. అందరూ వానప్రస్థ స్థితికి, నిర్వాణధామములోకి వెళ్తారు. అది మధురమైన ఇల్లు(స్వీట్హోమ్) అత్యంత మధురమైన ఇల్లు. దాని కొరకే ఎంతో భక్తి చేశారు. ఇప్పుడు చక్రములో తిరిగి వచ్చారు. మానవులకిది ఎంత మాత్రము తెలియదు. కానీ మానవులు లక్షల సంవత్సరాల చక్రమని కల్పనలు, వ్యర్థ ప్రలాపాలు చేశారు. లక్షల సంవత్సరాలైతే విశ్రాంతే లభించదు. విశ్రాంతి లభించడమే కష్టమవుతుంది. మీకు విశ్రాంతి లభిస్తుంది. దానిని సైలెన్స్హోమ్, నిరాకార ప్రపంచమని అంటారు. ఇది స్థూలమైన స్వీట్హోమ్, అది మూలమైన స్వీట్హోమ్. ఆత్మ అతిచిన్న రాకెట్. దాని కంటే వేగవంతమైనదేదీ లేదు. ఇది అన్నింటికంటే వేగవంతమైనది. ఒక శరీరాన్ని వదిలి తయారుగా ఉన్న మరొక శరీరములోకి పరుగు తీస్తుంది. డ్రామానుసారము ఆత్మ ఖచ్చితమైన సమయానికి వెళ్లే తీరాలి. డ్రామా చాలా ఖచ్చితమైనది. ఇందులో ఏ పొరపాటూ లేదు. ఇదంతా మీకు తెలుసు. తండ్రి కూడా డ్రామానుసారము చాలా ఖచ్చితమైన సమయానికి వస్తారు. ఒక్క సెకండు కూడా వ్యత్యాసముండదు. ఇతనిలో భగవంతుడున్నారని ఎలా తెలుస్తుంది? జ్ఞానము తెలుపునప్పుడు వారే కూర్చుని పిల్లలకు చెప్తారు. శివరాత్రి కూడా జరుపుకుంటారు కదా. నేను శివుడను, ఎప్పుడు ఎలా వస్తానో మీకు తెలియదు. శివరాత్రి, కృష్ణరాత్రిని జరుపుకుంటారు. రాముని రాత్రి జరుపుకోరు ఎందుకంటే వ్యత్యాసముంది కదా. శివరాత్రితో పాటు కృష్ణరాత్రిని కూడా జరుపుకుంటారు. కానీ దీనిని గురించి ఏ మాత్రము తెలియదు. ఇక్కడ ఉండేదే ఆసురీ రావణ రాజ్యము. ఇవి అర్థము చేసుకునే విషయాలు. ఇతను బాబా. వృద్ధులను బాబా అని అంటారు. చిన్న పిల్లలను బాబా అని అనరు. కొంతమంది పిల్లలను కూడా ప్రేమతో బాబా అని అంటారు. అందుకే వారు కూడా ప్రేమతో కృష్ణుని బాబా అని అన్నారు. పెద్దవారై పిల్లలు కలిగినప్పుడు తండ్రి అని అంటారు. కృష్ణుడు స్వయం రాకుమారుడు. అతనికి పిల్లలు ఎక్కడ నుండి వచ్చారు? నేను వానప్రస్థ(అనుభవీ) శరీరములో వస్తానని తండ్రి చెప్తున్నారు. శాస్త్రాలలో కూడా ఈ విషయముంది. అయితే శాస్త్రాలలోని అన్ని మాటలు సరి కాదు. కొన్ని మాటలు సరిగ్గా ఉన్నాయి. బ్రహ్మ ఆయుష్షు అనగా ప్రజాపిత బ్రహ్మ ఆయుష్షు. ఆయన ఇప్పుడు తప్పకుండా ఇక్కడనే ఉంటాడు. బ్రహ్మ ఆయువు మృత్యులోకములోనే సమాప్తమౌతుంది. ఇది అమరలోకము కాదు. దీనిని పురుషోత్తమ సంగమ యుగమని అంటారు. ఇది మీ బుద్ధిలో తప్ప మరెవ్వరి బుద్ధిలోనూ ఉండదు.

తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా, మీ జన్మల గురించి మీకు తెలియదు. మీరు 84 జన్మలు తీసుకుంటారని నేను చెప్తున్నాను. ఏ విధంగా తీసుకుంటారో కూడా మీకు తెలిసిపోయింది. ఒక్కొక్క యుగము ఆయువు 1250 సంవత్సరాలని, ఒక్కొక్క యుగములో ఇన్ని జన్మలు తీసుకున్నారని కూడా తెలుసు. 84 జన్మల లెక్కాచారముంది కదా. 84 లక్షలంటే లెక్క చెప్పలేరు. దీనిని 84 జన్మల చక్రమని అంటారు. 84 లక్షలంటే గుర్తే ఉండదు. ఇక్కడ ఎంతో అపారమైన దు:ఖముంది. దు:ఖమును కలిగించే పిల్లలే జన్మిస్తారు. దీనిని ఘోర నరకమని అంటారు. మీది పూర్తిగా పాడైపోయిన వికారీ(ఛీ-ఛీ) ప్రపంచము. ఇప్పుడు మనము నూతన ప్రపంచములోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. పాపాలు సమాప్తమైతే పుణ్యాత్మలుగా అవుతాము. ఇప్పుడు ఏ పాపమూ చేయరాదు. ఒకరి పై ఒకరు కామ ఖడ్గమును ఉపయోగిస్తే

(వికారము కలిగి ఉండుట), అది ఆదిమధ్యాంతాలు దు:ఖమునిస్తుంది. ఇప్పుడీ రావణ రాజ్యము సమాప్తమౌతుంది. ఇది

కలియుగ అంతిమ సమయము. ఇది అంతిమ మహాభారీ యుద్ధము. ఆ తర్వాత యుద్ధమే ఉండదు. అక్కడ ఏ యజ్ఞమూ రచింపబడదు. యజ్ఞమును రచించినప్పుడు అందులో స్పాహా చేస్తారు. పిల్లలు తమ పాత సామాగిన్రంతటిని స్వాహా చేసేస్తారు. ఇది రుద జ్ఞాన యజ్ఞమని తండి అర్థం చేయిస్తున్నారు. శివుని రుద్రుడని అంటారు. రుద్రమాల అని అంటారు కదా. నివృత్తి మార్గములోని వారికి ప్రవృత్తి మార్గపు ఆచార వ్యవహారాలేవీ తెలియవు. వారు ఇల్లు-వాకిళ్లు వదిలి అడవులకు వెళ్లిపోతారు. దాని పేరే సన్యాసము. దేనిని సన్యసిస్తారు? ఇల్లు-వాకిళ్లను సన్యసిస్తారు. వట్టి చేతులతో బయటకు వస్తారు. ఇంతకు పూర్వము గురువులు చాలా పరీక్ష చేసేవారు, పని చేయించేవారు. మొదట భిక్షాటనలో కేవలం పిండి లేక బియ్యము, ధాన్యము తీసుకునేవారు. వండిన పదార్థాలు స్వీకరించేవారు కాదు. వారు అడవులలోనే ఉండాలి. అక్కడ కంద-మూలాలు, ఫలాలు లభిస్తాయి. సతోప్రధానమైన సన్యాసులు ఈ పదార్థాలనే భుజిస్తారనే గాయనముంది. ఇప్పుడైతే అడగాల్సిన పనే లేదు. ఏమేమో చేస్తారు. దీని పేరే వికారి ప్రపంచము. అది నిర్వికారి ప్రపంచము. ఇక్కడ అందరూ పతిత మానవులే. అందుకే దేవీ-దేవతలకు బదులు హిందువులని పేరుంచుకున్నారు. తండ్రి అన్ని విషయాలు అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు నిజానికి అనంతమైన ఆ తండ్రి పిల్లలు. వారు మీకు 21 జన్మల వారసత్వమునిస్తారు. అందువలన తండి తన మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - మీ తల పై జన్మ-జన్మాంతరాల పాప భారముంది. పాపాల నుండి ముక్తి పొందేందుకే మీరు నన్ను పిలుస్తారు. సాధు సత్పురుషులంతా ''ఓ పతితపావనా!..........'' అని పిలుస్తూ ఉంటారు. కానీ వారికి అర్థము కొంచెము కూడా తెలియదు. ఊరికే పాడుతూ తాళాలు, చప్పట్లు చరుస్తూ ఉంటారు. ఎవరైనా పరమాత్మతో యోగమెలా చేయాలని, వారినెలా కలవాలని అడిగితే, పరమాత్మ సర్వవ్యాపి అని అంటారు. మార్గమును చూపడమంటే ఇదేనా? వేదశాస్త్రాలు చదివితే భగవంతుడు లభిస్తారని అంటారు. తండి అంటున్నారు - నేను పత్రి 5 వేల సంవత్సరాల తర్వాత డామ్రా ప్లాను అనుసారంగా వస్తాను. ఈ డామ్రా రహస్యము తండిక్రి తప్ప మరెవ్వరికీ తెలియదు. లక్షల సంవత్సరాల డామ్రా ఉండనే ఉండదు. ఇప్పుడు తండి చెప్తున్నారు - ఇది 5 వేల సంవత్సరాల మాట. కల్పకిత్రము కూడా బాబా వచ్చి 'మన్మనాభవ' అని చెప్పారు. ఇది మహామంతమ్రు. ఇది మాయ పై విజయము పొందుకునే మంతమ్రు. తండ్రే కూర్చుని అర్థము చేయిస్తున్నారు. ఇతరులెవ్వరూ దారి తెలుపలేరు. సర్వుల సద్గతిదాత ఒకే ఒక్కరు. మానవులెవ్వరూ చెప్పలేరు. దేవతలు కూడా చెప్పలేరు. అక్కడ సుఖమే సుఖముంటుంది. అక్కడ ఎవ్వరూ భక్తి చేయరు. భగవంతుని కలుసుకునేందుకు ఇక్కడ భక్తి చేస్తారు. సత్యయుగములో భక్తి ఉండదు ఎందుకంటే 21 జన్మల వారసత్వము లభించింది. అందుకే దు:ఖములో స్మరిస్తే.......... ఇక్కడ అంతులేని దు:ఖముంది. మాటిమాటికి '' భగవంతుడా! దయ చూపండి '' అని అంటూ ఉంటారు. ఈ దు:ఖభరితమైన ప్రపంచము సదా ఉండదు. సత్య-త్రేతా యుగాలు గతించిపోయాయి. మళ్లీ వస్తాయి. లక్షల సంవత్సరాలైతే జ్ఞాపకము కూడా ఉండదు. ఇప్పుడు ఆ తండ్రి జ్ఞానమంతా అర్థం చేయిస్తున్నారు. తమ పరిచయమును కూడా ఇస్తున్నారు. అంతేకాక రచన ఆదిమధ్యాంతాల రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తున్నారు. 5 వేల సంవత్సరాల మాట. పిల్లలైన మీకు స్మృతిలోకి వచ్చేసింది. ఇప్పుడు మీరు పరాయి రాజ్యములో ఉన్నారు. మీకు మీ రాజ్యముండేది. ఇక్కడ యుద్ధము చేసి రాజ్యమును పొందుతారు. ఆయుధాలతో, మారణహోమాలతో రాజ్యమును పొందుతారు. పిల్లలైన మీరు యోగబలముతో రాజ్యమును స్థాపన చేస్తున్నారు. మీకు సతోప్రధానమైన ప్రపంచము కావాలి. పాత ప్రపంచము సమాప్తమై నూతన ప్రపంచము తయారవుతుంది. దీనిని కలియుగమని, పాత ప్రపంచమని అంటారు. నూతన ప్రపంచమును సత్యయుగమని అంటారు. ఇది మీ కల్పన అని సన్యాసులంటారు. సత్యయుగము ఇక్కడనే ఉంటుంది. కలియుగము కూడా ఇక్కడనే ఉంది. తండ్రిని తెలుసు కున్నవారు ఒక్కరు కూడా లేరని తండ్రి తెలియజేస్తున్నారు. ఎవరికైనా తెలిస్తే పరిచయమిస్తారు కదా. సత్య, త్రేతా యుగాలంటే ఏమో ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీకు ఆ తండ్రి బాగా అర్థం చేయిస్తున్నారు. ఆ తండ్రికి సర్వమూ తెలుసు. అన్నీ తెలిసినవారు అనగా జ్ఞానసాగరులు, సుఖసాగరులు, వారి ద్వారానే మనకు వారసత్వము లభిస్తుంది. తండ్రి జ్ఞానములో తమ సమానంగా చేస్తారు. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఇది పాపాల నుండి ముక్తులయ్యే సమయము అందువలన ఇప్పుడు ఏ పాపమూ చేయరాదు. పాత సామాగ్రినంతా ఈ రుద్ర యజ్ఞములో స్వాహా చేయాలి.
2. ఇప్పుడు వానప్రస్థ స్థితి కనుక తండ్రి, శిక్షకులతో పాటు సద్గురువును కూడా స్మృతి చేయాలి. స్వీట్హోమ్లోకి వెళ్లేందుకు ఆత్మను సతోప్రధానంగా పావనంగా చేసుకోవాలి.

వరదానము:- '' సమయాన్ని శిక్షకునిగా చేసుకునేందుకు బదులు తండ్రిని శిక్షకునిగా చేసుకునే మాస్టర్రచయిత భవ ''
చాలామంది పిల్లలకు సేవ చేయాలనే ఉత్సాహముంది కానీ వైరాగ్య వృత్తి పై అటెన్షన్లేదు. అందులో నిర్లక్ష్యంగా ఉన్నారు. నడుస్తుంది,....... జరుగుతుంది,..... అయిపోతుంది....... సమయమొచ్చినప్పుడు అంతా సరిపోతుంది,........ ఇలా అనుకోవడం అనగా సమయాన్ని తమ శిక్షకునిగా చేసుకోవడం. పిల్లలు తండ్రికి కూడా, చింతించండి బాబా, సమయానికి సరిపోతుంది, చేసుకుంటాము అని దిలాసానిస్తారు. కానీ మీరు మాస్టర్రచయితలు, సమయం మీ రచన. రచన మాస్టర్రచయితలకు శిక్షకునిగా అవ్వడం శోభనివ్వదు.

స్లోగన్:- ''తండ్రి పాలనకు రిటర్న్స్వయాన్ని మరియు సర్వులను పరివర్తన చేయడంలో సహయోగులుగా అవ్వడం. ''

Telugu Murli 01/10/2019

01-10-2019 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం

''మధురమైన పిల్లలారా - చెడు వినకు,..... ఇక్కడ మీరు సత్సంగములో కూర్చుని ఉన్నారు, మీరు మాయావి కుసంగాలకు వెళ్లరాదు. చెడు సాంగత్యము వలన సంశయ రూపములో ఆటంకాలు వస్తాయి''

ప్రశ్న:- ఈ సమయంలో ఏ మనిషిని కూడా స్పిరిచ్యువల్(ఆధ్యాత్మికము) అని అనరాదు - ఎందుకు?
జవాబు:- ఎందుకంటే అందరూ దేహాభిమానములో ఉన్నారు. దేహాభిమానుములో ఉన్నవారు స్పిరిచ్యువల్ అని ఎలా పిలువబడ్తారు? స్పిరిచ్యువల్ ఫాదర్ ఒక్క నిరాకార తండ్రి మాత్రమే. వారు మీకు కూడా దేహీ-అభిమానులుగా తయారయ్యే శిక్షణనిస్తున్నారు. ఒక్క తండ్రికి మాత్రమే సుప్రీమ్ (పరమ) అను టైటిల్(బిరుదు) ఇవ్వగలరు. తండ్రి తప్ప సుప్రీమ్(అత్యంత శ్రేష్ఠులు) అని ఎవ్వరూ అనబడరు.

ఓంశాంతి. పిల్లలిచ్చట కూర్చున్నప్పుడు బాబా మనకు తండ్రే కాక, టీచరు, సద్గురువు కూడా అయ్యారని స్మృతి ఉంటుంది. ముగ్గురి అవసరము ఉంటుంది. మొదట తండ్రి, తర్వాత చదివించే టీచరు, ఆ తర్వాత గురువు. ఇచ్చట స్మృతి కూడా ఇలాగే చేయాలి ఎందుకంటే ఇది కొత్త విషయము కదా. వారు అనంతమైన తండ్రి. అనంతమనగా సర్వులకు అని అర్థము. ఇచ్చటకు ఎవరు వచ్చినా ఇది స్మృతిలోకి తెచ్చుకోండి అని చెప్తారు. ఇందులో సంశయమెవరికైనా ఉంటే చేతులెత్తండి. ఇది అద్భుతమైన విషయము కదా. జన్మ-జన్మాంతరాలుగా ఎప్పుడూ ఇటువంటివారు అనగా తండ్రి, టీచరు, సద్గురువు ఒక్కరే అయిన వారెవరైనా లభించారా? అందులోనూ సుప్రీమ్. అనంతమైన తండ్రి, అనంతమైన టీచరు, అనంతమైన సద్గురువు. ఇటువంటివారు ఎప్పుడైనా ఎవరైనా లభించారా? ఈ పురుషోత్తమ సంగమ యుగములో తప్ప మరెప్పుడూ లభించరు. ఇందులో సంశయమున్న వారు చేతులెత్తండి. ఇచ్చట అందరూ నిశ్చయబుద్ధితో కూర్చుని ఉన్నారు. ఈ ముగ్గురే ముఖ్యమైనవారు. అనంతమైన తండ్రి ఇచ్చే జ్ఞానము కూడా అనంతమే. ఈ జ్ఞానమొక్కటే అనంతమైనది(బేహద్). అనేక ప్రకారాలైన పరిమిత(హద్దు) విద్యలను మీరు చదువుతూనే వచ్చారు. కొంతమంది వకీళ్ళుగా, కొంతమంది సర్జన్లుగా అవుతారు ఎందుకంటే ఇక్కడ డాక్టరు, జడ్జి, వకీలు అందరూ అవసరమే. అక్కడ వీరి అవసరముండదు. అక్కడ దు:ఖమనే మాటే ఉండదు. అందుకే ఇప్పుడు తండ్రి కూర్చొని పిల్లలకు బేహద్(అనంతమైన) శిక్షణను ఇస్తారు. ఇక మీదట అర్ధకల్పము మీరెవ్వరి వద్దా శిక్షణ పొందే అవసరముండదు. ఈ ఒక్కసారి లభించిన శిక్షణ(విద్య) ద్వారా 21 జన్మలకు ఫలితము లభిస్తుంది. ఇది అటువంటి ఫలితమునిచ్చే చదువు. అచ్చట వకీలు, డాక్టరు, జడ్జీ మొదలైన వారెవ్వరూ ఉండరు. ఇది నిశ్చయముంది కదా. అంతే కదా? అక్కడ దు:ఖముండదు, కర్మ భోగముండదు. తండ్రి కర్మల విధానాన్ని కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఆ గీత వినిపించేవారు ఈ విధంగా వినిపిస్తారా? తండ్రి చెప్తున్నారు - నేను పిల్లలైన మీకు రాజయోగము నేర్పిస్తున్నాను. దానిలో కృష్ణ భగవానువాచ అని వ్రాశారు. కానీ కృష్ణుడు దైవీగుణాలు గల మానవుడు. శివబాబా ఏ పేరూ పెట్టుకోరు. వారికి ఇతర పేరే లేదు. తండ్రి చెప్తున్నారు - నేను ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నాను. ఈ శరీరమనే ఇల్లు నాది కాదు. ఇది ఇతని(బ్రహ్మ) ఇల్లు. ఈ ఇంటికి కిటికీలు మొదలైనవన్నీ ఉన్నాయి. నేను మీ అనంతమైన తండ్రిని అనగా సర్వాత్మల తండ్రిని. ఆత్మలకు చదువు కూడా చెప్తాను. వీరిని స్పిరిచ్యువల్ ఫాదర్(ఆత్మిక తండ్రి) అని అంటారు అనగా ఆత్మల తండ్రి. ఇతరులెవ్వరినీ ఆత్మల తండ్రి అని అనరు. వీరు అనంతమైన(బేహద్) తండ్రి అని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు స్పిరిచ్యువల్ కాన్ఫరెన్స్(ఆధ్యాత్మిక సమ్మేళనము) జరుగుతోంది. వాస్తవానికి స్పిరిచ్యువల్ కాన్ఫరెన్స్ ఉండనే ఉండదు. ఇది సత్యమైన స్పిరిచ్యువల్ కానే కాదు. వారు దేహాభిమానంలో ఉన్నారు. తండి చెప్తున్నారు - పిల్లలూ! దేహీ-అభిమానులుగా అవ్వండి. దేహాభిమానాన్ని వదిలేయండి. ఈ విధంగా ఎవ్వరూ చెప్పరు. స్పిరిచ్యువల్ అనే పదము ఇప్పుడే వ్రాస్తున్నారు. ఇంతకుముందు రిలీజియస్(మత సంబంధమైన) కాన్ఫరెన్స్ అనేవారు. స్పిరిచ్యువల్కు అర్థము వారికి తెలియనే తెలియదు. స్పిరిచ్యువల్ ఫాదర్ అనగా నిరాకార తండ్రి. ఆత్మలైన మీరే స్పిరిచ్యువల్(ఆత్మిక) పిల్లలు. స్పిరిచ్యువల్ ఫాదర్ వచ్చి మిమ్ములను చదివిస్తున్నారు. ఈ జ్ఞానము ఇతరులెవ్వరిలోనూ లేదు. తండ్రి స్వయంగా కూర్చుని తానెవరో అర్థం చేయిస్తున్నారు. గీతలో ఇది లేదు. నేను మీకు అనంతమైన శిక్షణనిస్తాను. ఇందులో వకీలు, జడ్జీ, సర్జన్ మొదలైనవారి అవసరము లేదు. ఎందుకంటే అక్కడ అపారమైన సుఖముంటుంది. దు:ఖానికి నామ-రూపాలు కూడా ఉండవు. ఇక్కడ సుఖానికి నామ-రూపాలు లేనే లేవు. ఇలా జరుగుటను ప్రాయ: లోపమని అంటారు. సుఖము కాకిరెట్టతో సమానము. అంత కొంచెమే సుఖముంటే అనంతమైన సుఖము లభించే జ్ఞానమునెలా ఇస్తారు? మొదట దేవీదేవతల రాజ్యమున్నప్పుడు సత్యత నూటికి నూరు శాతము ఉండేది. ఇప్పుడు అంతా అసత్యమే అసత్యముంది.

ఇది అనంతమైన జ్ఞానము. ఇది మానవ సృష్టి వృక్షము. దీనికి బీజము 'నేను' అని మీకు తెలుసు. వారిలో వృక్ష జ్ఞానము సంపూర్ణంగా ఉంది. మానవులకు ఈ జ్ఞానము లేదు. నేను చైతన్య బీజరూపాన్ని. నన్ను జ్ఞానసాగరుడని అంటారు. జ్ఞానము వలన సెకండులో గతి-సద్గతి జరుగుతుంది. నేను సర్వుల తండ్రిని. నన్ను తెలుసుకొని గుర్తించినందున పిల్లలైన మీకు వారసత్వము లభిస్తుంది. కానీ రాజధాని కదా. స్వర్గములో కూడా నంబరువారు పదవులు చాలా ఉంటాయి. ఆ తండ్రి ఒకే విధమైన చదువును చదివిస్తారు. చదివేవారు నంబరువారుగా ఉండనే ఉంటారు. ఇందులో ఇతర చదువుల అవసరముండదు. అక్కడ ఎవ్వరూ జబ్బు పడరు. అక్కడ ధన సంపాదన కొరకు చదువుకోరు. మీరు ఇక్కడి నుండి అనంతమైన వారసత్వము తీసుకెళ్తారు. అక్కడ మనకు ఈ పదవి ఎవరు ఇప్పించారో కూడా తెలియదు. ఇక్కడ మీరు అవన్నీ అర్థం చేసుకుంటారు. హద్దులోని జ్ఞానాన్ని మీరు చదువుతూ వచ్చారు. ఇప్పుడు అనంతమైన చదువును చదివించేవారిని చూచారు, అర్థం చేసుకున్నారు. ఈ తండ్రి తండ్రే కాక టీచరు కూడా అని తెలుసుకున్నారు. వారు వచ్చి మనలను చదివిస్తున్నారు. వారు సుప్రీమ్ టీచరు, రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. సత్యమైన సద్గురువు కూడా అయ్యారు. వారు వచ్చి మనలను చదివిస్తున్నారు. ఇది బేహద్ రాజయోగము. వారు వకీలు చదువు, డాక్టరు చదువు మాత్రమే నేర్పిస్తారు. ఎందుకంటే ఈ ప్రపంచమే దు:ఖమయంగా ఉంది. అదంతా హద్దు చదువు. ఇది బేహద్ చదువు. తండ్రి మీకు అనంతమైన చదువును చదివిస్తున్నారు. ఈ తండ్రి, టీచరు, సద్గురువు కల్ప-కల్పమూ వస్తారని కూడా మీకు తెలుసు. సత్య, త్రేతా యుగాల కొరకు ఈ చదువునే మళ్లీ చదివిస్తారని కూడా మీకు తెలుసు. తర్వాత ఈ చదువు ప్రాయ: లోపమైపోతుంది. సుఖ ప్రాలబ్ధము డ్రామానుసారము పూర్తి అయిపోతుంది. అనంతమైన తండ్రి కూర్చుని చదివిస్తున్నారు. వారిని పతితపావనులని అంటారు. కృష్ణుని త్వమేవ మాతా, పిత లేక పతితపావనా అని అంటారా? వీరి మహిమకు, వారి మహిమకు రాత్రికి పగులుకు ఉన్నంత తేడా ఉంది. నన్ను తెలుసుకుంటే మీరు ఒక్క క్షణములో జీవన్ముక్తి పొందుకుంటారని తండ్రి చెప్తున్నారు. కృష్ణ భగవానుడు ఇప్పుడుంటే ఎవరైనా వెంటనే గుర్తిస్తారు. కృష్ణుని జన్మ దివ్యమైనదని, అలౌకికమైనదని మహిమ చేయబడలేదు. కేవలం పవిత్రత ద్వారా జరుగుతుంది. ఈ తండ్రి ఏ గర్భము ద్వారా జన్మించరు. వారు వచ్చి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలారా! అని అర్థం చేయిస్తున్నారు. చదివేది ఆత్మలే. మంచి సంస్కారము గానీ, చెడు సంస్కారాలు గానీ అన్నీ ఆత్మలోనే ఉంటాయి. ఎటువంటి కర్మలు చేస్తారో అటువంటి శరీరాలు లభిస్తాయి. కొంతమంది చాలా దు:ఖమును అనుభవిస్తారు. కొంతమంది ఒంటికన్ను వారు, మెల్లకన్ను వారు, చెవిటి వారు కూడా ఉంటారు. పోయిన జన్మలో చేసిన కర్మఫలము అని అంటారు. ఆత్మలకు వారి వారి కర్మల అనుసారమే రోగి శరీరాలు మొదలైనవి లభిస్తాయి.

ఇప్పుడు మనలను చదివించేవారు గాడ్ఫాదర్ అని పిల్లలైన మీకు తెలుసు. గాడ్ టీచరు, గాడ్ గురువు(ప్రిసిప్టర్) కూడా వారే. వారినే గాడ్ అని, పరమాత్మ అని కూడా అంటారు. పరమ మరియు ఆత్మ కలిసి పరమాత్మ, సుప్రీమ్ సోల్ అని అంటారు. బ్రహ్మను సుప్రీమ్ అని అనరు. సుప్రీమ్ అనగా ఉన్నతోన్నతులు. అత్యంత పవిత్రులు. ప్రతి ఒక్కరి పదవులు వేరు వేరుగా ఉంటాయి. కృష్ణుని పదవి ఇతరులకు లభించదు. ప్రధానమంత్రి పదవి ఇతరులకు లభించదు. తండ్రి పదవి కూడా ప్రత్యేకంగా ఉంది. బ్రహ్మ, విష్ణు, శంకరులది కూడా ఎవరి పదవి వారిదే. బ్రహ్మ, విష్ణు, శంకరులను దేవతలని, శివుని పరమాత్మ అని అంటారు. ఇద్దరినీ కలిపిి శివ శంకరుడని ఎలా అంటారు? ఇరువురూ వేరు వేరు కదా. తెలియనందున శివ-శంకరులు ఒక్కటే అని అంటారు. పేరు కూడా అలా పెట్టుకుంటారు. ఈ విషయాలన్నీ ఆ తండ్రే వచ్చి అర్థము చేయిస్తున్నారు. వీరు మన తండ్రి, టీచరు, సద్గురువు కూడా అయ్యారని మీకు తెలుసు. ప్రతి మనిషికి తండ్రి కూడా ఉంటాడు, టీచరు ఉంటాడు, గురువు కూడా ఉంటాడు. ముసలివారైనప్పుడు గురువును ఆశ్రయిస్తారు. ఈ రోజుల్లో చిన్నతనములోనే గురువుల వద్దకు పంపుతారు. అలా పంపకుంటే ఆజ్ఞను ఉల్లంఘించినట్లు అని భావిస్తారు. ఇంతకుముందు 60 సంవత్సరాల తర్వాత గురువులను ఆశ్రయించేవారు. అది వానప్రస్థ అవస్థ. నిర్వాణము అనగా వాణి(శబ్ధము) నుండి దూరము అనగా మధురమైన నిశ్శబ్ధమైన ఇల్లు(స్వీట్ సైలెన్స్ హోమ్). అందులోకి వెళ్లేందుకు అర్ధకల్పము నుండి మీరు శ్రమ చేశారు. అయితే అది ఎక్కడ ఉందో తెలియకుంటే అక్కడకు ఎవ్వరూ పోలేరు. ఎవరికైనా దారినెలా చూపగలరు? ఆ ఒక్కరు తప్ప ఇతరులెవ్వరూ దారి చూపించలేరు. అందరి బుద్ధి ఒకే విధంగా ఉండదు. కొంతమంది కథలు విన్నట్లు వింటారు. దాని వలన లాభమేమీ లేదు. ఉన్నతి జరగనే జరగదు. ఇప్పుడు మీరు ఉద్యానవనములోని పుష్పాలుగా అవుతున్నారు. పుష్పాల నుండి ముళ్ళుగా అయ్యారు. ఇప్పుడు మళ్లీ ముళ్ళ నుండి పుష్పాలుగా తండ్రి తయారు చేస్తున్నారు. పూజ్యులుగా ఉన్న మీరే మరలా పూజారులుగా అయ్యారు. 84 జన్మలలో సతోప్రధానము నుండి తమోప్రధానముగా, పతితులుగా అయ్యారు. తండ్రి మెట్ల చిత్రమును విశదముగా తెలిపించారు. ఇప్పుడు మళ్లీ పతితము నుండి పావనంగా ఎలా అవుతారో ఎవ్వరికీ తెలియదు. '' ఓ పతితపావనా! రండి వచ్చి పావనంగా చేయండి'' అని మహిమ కూడా చేస్తారు. అలాంటప్పుడు మళ్లీ నదులను సముద్రాన్ని పతితపావనులని భావించి అందులో స్నానమెందుకు చేస్తారు? గంగా నదిని పతితపావని అని అంటారు. కానీ నదులన్నీ ఎక్కడ నుండి వెలువడ్డాయి? సముద్రము నుండే కదా. వీరంతా సాగరుని సంతానము. అందువలన ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

ఇక్కడ పిల్లలైన మీరు సత్సంగములో కూర్చుని ఉన్నారు. బయట చెడు సాంగత్యములోకి వెళ్తే మీకు విరుద్ధమైన విషయాలను చాలా వినిపిస్తారు. మీరు ఈ విషయాలన్నీ మళ్లీ మర్చిపోతారు. చెడు సాంగత్యములోకి వెళ్లడం వలన ఆటంకాలు ఏర్పడ్తాయి. సంశయము కలుగుతుంది. అయితే ఈ(బాబా చెప్పిన) విషయాలను మర్చిపోరాదు. బాబా, మన అనంతమైన తండ్రే కాక, టీచరు కూడా. ఆవలి తీరానికి కూడా తీసుకెళ్తారు. ఈ నిశ్చయముతోనే మీరు ఇచ్చటికి వచ్చారు. అదంతా లౌకిక చదువు, లౌకిక భాషలు(మాటలు). ఇది అలౌకిక చదువు. నా జన్మ కూడా అలౌకికమే అని తండ్రి చెప్తున్నారు. నేను అప్పు తీసుకుంటాను. అది కూడా పాత చెప్పును తీసుకుంటాను. అది కూడా అన్నింటికంటే పాతది. తండ్రి తీసుకున్న ఈ పాత చెప్పును ' లాంగ్ బూట్ ' అని అంటారు. ఇది ఎంతో సహజమైన విషయము. ఇది మర్చిపోరాదు. కానీ మాయ ఇంత సులభమైన విషయాలను కూడా మరిపింపజేస్తుంది. తండ్రి తండ్రే కాక అనంతమైన శిక్షణనిచ్చేవారు. ఈ చదువు మరెవ్వరూ చెప్పలేరు. బాబా చెప్తున్నారు - ఎక్కడైనా ఇది లభిస్తుందేమో వెళ్లి చూడండి. అందరూ మనుష్యులే. వారు ఈ జ్ఞానమును ఇవ్వలేరు. భగవంతుడు ఒకే రథమును తీసుకుంటారు. దానిని భాగ్యశాలి రథమని అంటారు. ఇతనిలోనే తండ్రి ప్రవేశించి పదమాపదమ్ భాగ్యశాలిగా చేస్తారు. చాలా సమీపంగా ఉండే పూస. ఇతను బ్రహ్మ నుండి విష్ణువుగా అవుతాడు. శివబాబా ఇతనినే కాదు, ఇతని ద్వారా మిమ్ములను కూడా విశ్వానికి అధికారులుగా చేస్తారు. విష్ణుపురి స్థాపనవుతుంది. దీనిని రాజ్యస్థాపన కొరకు రాజయోగమని అంటారు. ఇప్పుడు మీరంతా వింటున్నారు కానీ చాలామందికి ఒక చెవి నుండి విని మరొక చెవి ద్వారా బయటకు పోతుందని, కొంతమంది మాత్రమే ధారణ చేసి వినిపించగలరని కూడా బాబాకు తెలుసు. అటువంటి వారిని మహారథులని అంటారు. విని ధారణ చేస్తారు. అంతేకాక ఇతరులకు కూడా చాలా ఇష్టముతో అభిలాషతో వినిపిస్తారు. వినిపించేవారు మహారథులుగా ఉంటే వెంటనే అర్థము చేసుకుంటారు, అశ్వారూఢులైతే తక్కువగా, పదాతిదళము వారైతే ఇంకా తక్కువగా అర్థము చేసుకుంటారు. తండ్రికి మహారథులెవరో, అశ్వారూఢులెవరో బాగా తెలుసు. ఇందులో తికమక చెందే విషయమేదీ లేదు. కానీ పిల్లలు తికమక చెంది, సంశయపడి తూగుతూ ఉంటారు. కనులు మూసుకొని కూర్చుంటారు. సంపాదనలో ఎప్పుడైనా తూగు వస్తుందా? అలా తూగుతూ ఉంటే ధారణ ఎలా అవుతుంది? ఆవళింతలు వస్తే వీరు అలసిపోయారని బాబా భావిస్తారు. సంపాదనలో ఎప్పుడూ అలసట రాదు. ఆవళింతలు ఉదాసీనతకు గుర్తు. ఏదో ఒక విషయము ఆంతరికములో ఆటంకపరుస్తుంటే ఆవళింతలు చాలా వస్తాయి. ఇప్పుడు మీరు తండ్రి ఇంటిలో కూర్చుని ఉన్నారు. అందువలన మీరు పరివారంగా కూడా ఉన్నారు. టీచరుగా కూడా అవుతారు. మార్గమును చూపించే గురువుగా కూడా అవుతారు. మిమ్ములను మాస్టర్ గురువు అని అంటారు. అందువలన తండ్రికి కుడిభుజంగా అవ్వాలి కదా. మీరు అనేకమందికి కళ్యాణము చేయగలరు. అన్ని వ్యాపారాలలో నష్టముంటుంది. కానీ ఇది వ్యాపారము చేయకనే నరుని నుండి నారాయణునిగా చేసే వ్యాపారము. అందరి సంపాదన సమాప్తమైపోతుంది. నరుని నుండి నారాయణునిగా అయ్యే చదువు ఈ తండ్రి ఒక్కరు మాత్రమే నేర్పిస్తారు. కావున ఏ చదువు చదవాలి? చాలా ధనముండేవారు స్వర్గమిచ్చటనే ఉందని భావిస్తారు. గాంధీ రామరాజ్యమును స్థాపన చేశాడా? అరే! ఈ ప్రపంచము పాతది, తమోప్రధానమైనది కదా. పోను పోను దు:ఖము ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఇటువంటి దానిని రామరాజ్యమని ఎలా అంటారు? మనుష్యులు ఎంతో తెలివిహీనులై పోయారు. తెలివిహీనులను తమోప్రధానులని అంటారు. తెలివిగలవారైతే సతోప్రధానులని అంటారు. ఈ చమ్రు తిరుగుతూనే ఉంటుంది. ఇందులో తండ్రిని అడిగేది ఏమీ ఉండదు. రచన, రచయితల జ్ఞానమివ్వడం తండ్రి కర్తవ్యము, వారేమో ఇస్తూనే ఉంటారు. మురళిలో అన్ని విషయాలు అర్థం చేయిస్తూ ఉంటారు. అన్నిటికి జవాబు లభిస్తుంది. ఇంకా అడిగేది ఏముంది? తండ్రి తప్ప మరెవ్వరూ అర్థము చేయించలేరు. అందువలన ఎలా ప్రశ్నించగలరు? ఇది కూడా బోర్డు పై వ్రాయండి - 21 జన్మలకు సదా ఐశ్వర్యవంతులుగా, సదా ఆరోగ్యవంతులుగా అవ్వాలనుకుంటే వచ్చి తెలుసుకోండి. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి వినిపించేదంతా, విని మంచిరీతిగా ధారణ చేయాలి. ఇతరులకు చాలా అభిరుచితో వినిపించాలి. ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయరాదు. సంపాదించుకునే సమయంలో ఎప్పుడూ ఆవళించరాదు.
2. బాబాకు కుడి భుజములై అనేమంది కళ్యాణము చేయాలి. నరుని నుండి నారాయణునిగా తయారై, ఇతరులను తయారు చేసే కర్తవ్యము(వ్యాపారము) చేయాలి.

వరదానము:- '' నడవడిక మరియు ముఖము ద్వారా పవిత్రతా అలంకారపు మెరుపును చూపించే అలంకారమూర్త్ భవ ''
పవిత్రత బ్రాహ్మణ జీవితానికి అలంకారము. ప్రతి సమయంలో మీ ముఖము మరియు నడవడికల ద్వారా ఇతరులకు పవిత్రతా అలంకారము అనుభవమవ్వాలి. దృష్టిలో, ముఖములో, చేతులలో, కాళ్లలో సదా పవిత్రతా అలంకారము ప్రత్యక్షమవ్వాలి. వీరి రూపురేఖల(ఫీచర్స్) ద్వారా పవిత్రత కనిపిస్తూ ఉందని ప్రతి ఒక్కరు వర్ణించాలి. కనులలో పవిత్రతా ప్రకాశముందని, పెదవుల పై పవిత్రమైన చిరునవ్వు ఉందని అందరూ వర్ణించాలి. వారికి పవిత్రత తప్ప ఇంకేదీ కనిపించరాదు. వారినే పవిత్రతతో అలంకరింపబడిన అలంకారమూర్తులని అంటారు.

స్లోగన్:- '' వ్యర్థ సంబంధ - సంపర్కాలు కూడా అక్కౌంటును (జమ ఖాతాను) సమాప్తం చేసేస్తాయి. కనుక వ్యర్థాన్ని సమాప్తం చేయండి. ''