Wednesday, 6 November 2019

Telugu Murli 07/11/2019

07-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - మీకు ఆత్మిక నైపుణ్యము(కళను)ను నేర్పించేందుకు తండ్రి వచ్చారు. ఆ టెక్నిక్‌ ద్వారా మీరు సూర్య - చంద్రులను కూడా దాటుకొని పరంధామానికి వెళ్తారు ''

ప్రశ్న :- సైన్సు దర్పానికి(గర్వము), శాంతి దర్పానికి గల వ్యత్యాసమేది ?
జవాబు :- సైన్సు గర్విష్టులు చంద్రుడు, నక్షత్రాల పైకి వెళ్లేందుకు ఎంతో ఖర్చు చేస్తున్నారు. శరీరాన్ని కూడా కష్టము(రిస్క్‌)తో తీసుకెళ్తారు. వారికి రాకెట్‌ ఎక్కడ ఫెయిల్‌ అవుతుందోనని భయముంటుంది. పిల్లలైన మీరు శాంతి గర్వస్థులు, చిల్లిగవ్వ ఖర్చు కూడా లేకుండా సూర్య-చంద్రులను కూడా దాటుకొని మూలవతనానికి వెళ్లిపోతారు. మీకు ఏ భయమూ లేదు, ఎందుకంటే మీరు శరీరాన్ని ఇక్కడే వదిలి వెళ్తారు.

ఓంశాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. సైన్సువారు చంద్రుని పైకి వెళ్లేందుకు ప్రయత్నము చేస్తూ ఉన్నారని పిల్లలు వింటూనే ఉంటారు. కానీ వారు కేవలం చంద్రుని వరకు మాత్రమే వెళ్లేందుకు ప్రయత్నము చేస్తారు. ఎంతో ఖర్చు చేస్తున్నారు. పైకి వెళ్లడంలో చాలా భయముంటుంది. మేమెక్కడి నివాసులమని మీరే ఆలోచించండి. వారైతే చంద్రుని వైపు వెళ్తారు. మీరు సూర్య-చంద్రుల కంటే దూరంగా మూలవతనానికి వెళ్తారు. పైకి వెళ్లి వస్తే వారికి చాలా పైకము లభిస్తుంది. పైన ప్రదక్షిణాలు చేసి వస్తే వారికి లక్షల బహుమతులు లభిస్తాయి. శరీరమును రిస్క్‌ తీసుకు వెళ్తారు. వారు సైన్సు గర్విష్టులు. మీ వద్ద సైలెన్స్‌ గర్వముంది. ఆత్మలైన మనము మన శాంతిధామానికి బ్రహ్మాండములోకి వెళ్తామని మీకు తెలుసు. ఆత్మయే అన్ని పనులు చేస్తుంది. వారి ఆత్మలు కూడా వారి శరీరాలతో పాటు పైకి వెళ్తాయి. చాలా అపాయకరము. భయపడ్తారు కూడా. పై నుండి క్రింద పడ్తే ప్రాణము పోతుంది. అవన్నీ భౌతికమైన కళలు. మీకు తండ్రి ఆత్మిక కళను నేర్పిస్తారు. ఈ కళ నేర్చుకుంటే మీకు చాలా పెద్ద బహుమతి లభిస్తుంది. 21 జన్మలకు నంబరువారు పురుషార్థానుసారము బహుమతి లభిస్తుంది. ఈ రోజుల్లో ప్రభుత్వము లాటరీలు కూడా ప్రవేశపెడ్తోంది కదా. ఈ తండ్రి మీకు బహుమతినిస్తారు. అంతేకాక ఇంకా ఏం నేర్పిస్తారు? మిమ్ములను మీ ఇంటికి అత్యంత పైకి తీసుకెళ్తారు. మన ఇల్లు ఎక్కడ ఉందో ఇప్పుడు మీకు గుర్తు వస్తోంది కదా. అంతేకాక మనము పోగొట్టుకున్న రాజ్యము కూడా జ్ఞాపకమొస్తోంది కదా. అదెక్కడ ఉంది? రావణుడు లాక్కున్నాడు. ఇప్పుడు మళ్లీ మనము మన అసలు ఇంటికి కూడా వెళ్తాము. అంతేకాక రాజ్యము కూడా పొందుకుంటాము. మన ఇల్లు ముక్తిధామము, ఇది ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు నేర్పించేందుకు తండ్రి ఎక్కడ నుండి వస్తున్నారో చూడండి. ఎంత దూరము నుండి వస్తున్నారు? ఆత్మ కూడా రాకెట్టే. వారు పైకి పోయి చంద్రునిలో ఏముందో, నక్షత్రాలలో ఏముందో చూడాలనుకుంటారు. కానీ ఇవన్నీ ఈ నాటకరంగానికి కాంతినిచ్చే లైట్లు(బత్తీలు) అని పిల్లలైన మీకు తెలుసు. స్టేజికి లైట్లు వేసినట్లు ఇవి లైట్లు మాత్రమే. మ్యూజియంలో కూడా మీరు సీరియల్‌ సెట్లు వేస్తారు కదా. ఇదేమో అనంతమైన ప్రపంచము. ఇందులో ఈ సూర్య-చంద్రులు- నక్షత్రాలు కాంతినిచ్చేవి. మానవులు ఈ సూర్య-చంద్రులను దేవతలని భావిస్తారు. కానీ అవి దేవతలు కానే కాదు. ఆ తండ్రి వచ్చి మానవులైన మనలను దేవతలుగా ఎలా తయారు చేస్తున్నారో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వీరు జ్ఞాన సూర్యులు, జ్ఞాన చంద్రుడు, జ్ఞాన అదృష్ట నక్షత్రాలు(లక్కీ సితారే). జ్ఞానము ద్వారానే పిల్లలైన మీకు సద్గతి కలుగుతోంది. మీరు ఎంత దూర-దూరాలకు వెళ్తారు? ఆ తండి వచ్చి ఇంటికి వెళ్లే మార్గమును చూపిస్తున్నారు. తండి తప్ప మరెవ్వరూ వాపస్‌ ఇంటికి తీసుకు వెళ్లలేరు. తండి వచ్చి శిక్షణ ఇచ్చినప్పుడు మీరు తెలుసుకున్నారు. ఆత్మలైన మనము పవిత్రమ్రైనప్పుడు మాత్రమే మన ఇంటికి వెళ్లగలమని కూడా తెలుసుకున్నారు. యోగబలము ద్వారా లేక శిక్షలను అనుభవించి పవిత్రులుగా అవ్వాలి. తండ్రిని ఎంత స్మృతి చేస్తారో మీరు అంత పావనమౌతారని తండి అర్థం చేయిస్తున్నారు. స్మృతి చేయకుంటే పతితులుగానే ఉండిపోతారు. ఆ తర్వాత చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది. అంతేకాక పదవి కూడా తగ్గిపోతుంది. మీరు ఈ విధంగా ఇంటికి వెళ్లగలరని ఆ తండ్రి స్వయంగా కూర్చుని అర్థం చేయిస్తున్నారు. బ్రహ్మాండమనగా ఏమిటో, సూక్ష్మవతనమంటే ఏమిటో కొద్దిగా కూడా తెలియదు. విద్యార్థులకు మొదట తెలియనే తెలియదు. చదవడం మొదలైనప్పటి నుండి జ్ఞానము లభిస్తుంది. జ్ఞానము కూడా కొందరికి ఎక్కువగా, కొందరికి తక్కువగా ఉంటుంది. ఐ.సి.ఎస్‌ పరీక్ష వ్రాసినవారిని జ్ఞానసంపన్నులు(నాలెడ్జ్‌ఫుల్‌) అని అంటారు. ఇంతకంటే గొప్ప జ్ఞానమేదీ ఉండదు. ఇప్పుడు మీరు కూడా ఎంతో ఉన్నతమైన జ్ఞానమును నేర్చుకుంటున్నారు. ఆ తండ్రి మీకు పవిత్రంగా అయ్యేందుకు పిల్లలూ! నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే పతితుల నుండి పావనంగా అవుతారని పావనమయ్యే యుక్తులు తెలుపుతున్నారు. వాస్తవానికి ఆత్మలైన మీరు పవిత్రంగా ఉండేవారు. పైన మన ఇంటిలో పావనంగా ఉండేవారు. మీరు సత్యయుగములో జీవనముక్తిలో ఉన్నప్పుడు, మిగిలినవారంతా ముక్తిధామములో ఉంటారు. ముక్తిధామమును, జీవన్ముక్తిధామమును రెండింటినీ శివాలయమని అనవచ్చు. ముక్తిలో శివబాబా కూడా ఉంటారు. పిల్లలమైన మనము(ఆత్మలము) కూడా ఉంటాము. ఇది అత్యంత ఉన్నతమైన ఆత్మ జ్ఞానము. వారేమో మేము చంద్రుని పైకి వెళ్లి నివసిస్తామని అంటారు. దానికై ఎంతగానో తలలు బాదుకుంటున్నారు. సాహసము చూపిస్తారు. లక్షల మైళ్లు పైకి వెళ్లినా వారి ఆశలు నెరవేరవు. కాని మీ ఆశలు పూర్తి అవుతాయి. వారిది అసత్యమైన శారీరిక గర్వము. మీది ఆత్మిక గర్వము. వారు మాయావి సాహసాన్ని ఎంతో చూపిస్తారు. అందుకు మానవులు సంతోషముతో, చప్పట్లతో అభినందనలు తెలుపుతారు. చాలా ఎక్కువగా పారితోషకము కూడా లభిస్తుంది. లభిస్తే 5-10 కోట్లు లభించవచ్చు. కానీ వారికి లభించిన ధనమంతా సమాప్తమౌతుందని, వినాశి ధనమని పిల్లలైన మీకు తెలుసు. మిగిలింది చాలా కొద్ది సమయమేనని అర్థం చేసుకోండి. ఈ రోజు ఏముంది? రేపేమౌతుంది? ఈ రోజు మీరు నరకవాసులు, రేపు స్వర్గవాసులుగా అవుతారు. సమయము ఎక్కువగా పట్టదు. వారిది శారీరికమైన భౌతిక శక్తి. మీది ఆత్మిక శక్తి. దీనిని గురించి మీకు మాత్రమే తెలుసు. శారీరిక శక్తితో వారెంత దూరము వెళ్తారు? చంద్రుడు, నక్షత్రాల వరకు వెళ్తారు. యుద్ధము ప్రారంభమైపోతుంది. తర్వాత అవన్నీ సమాప్తమైపోతాయి. వారి కళలు ఇక్కడి వరకే సమాప్తమైపోతాయి. వారిది శారీరిక శక్తిలో అత్యంత పెద్దది. మీది అత్యంత ఉన్నతమైన ఆత్మిక శక్తి. మీరు శాంతిధామములోకి వెళ్తారు. దాని పేరే మధురమైన గృహము(స్వీట్‌ హోం). వారు ఎంత పైకి వెళ్తారో, మీరు ఎంత పైకి వెళ్తారో లెక్కతీయండి - మీరు ఎన్ని మైళ్లు పైకి పోతారు? మీరెవరు? ఆత్మలు. తండ్రి చెప్తున్నారు - నేను ఎన్ని మైళ్లు పైన ఉంటానో లెక్క వేయగలరా? వారి వద్ద అయితే లెక్కాచారముంది. ఇన్ని మైళ్ళు పైకి వెళ్లి మళ్లీ క్రిందకు వచ్చామని తెలుపుతారు. చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ విధంగా దిగుతాము, ఇలా చేస్తాము అని చెప్తారు. చాలా పెద్ద శబ్ధమౌతుంది. మీది ఏ శబ్ధమూ ఉండదు. మీరు ఎక్కడకు వెళ్తారో, ఎలా వస్తారో ఎవ్వరికీ తెలియదు. మీకు ఏ బహుమతి లభిస్తుందో కూడా మీకే తెలుసు. ఇది అద్భుతమైనది. బాబా గొప్పతనము(చమత్కారము) ఎవ్వరికీ తెలియదు. ఇదేమీ కొత్త విషయం కాదని మీరంటారు. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వారు అభ్యాసము చేస్తూనే ఉంటారు. మీకు ఈ సృష్టి అనే నాటకములో ఆదిమధ్యాంతాలు, దాని వ్యవధి మొదలైనవన్నీ బాగా తెలుసు. కావున మీకు ఆంతరిక నషా ఉండాలి. బాబా మనకు ఎంత గొప్ప జ్ఞానము నేర్పిస్తున్నారు! చాలా శ్రేష్టమైన పురుషార్థము చేయిస్తున్నారు. మళ్లీ కూడా చేస్తారు. ఈ విషయాలన్నీ ఇతరులెవ్వరికీ తెలియదు. తండి గుప్తంగా ఉన్నారు. మీకు ప్రతి రోజూ ఎంతగానో అర్థం చేయిస్తారు. మీకెంత జ్ఞానమునిస్తున్నారు. వారు హద్దు వరకు మాత్రమే వెళ్తారు. మీరు బేహద్‌(అనంతము)లోకి వెళ్తారు. వారు చంద్రుని వరకు వెళ్తారు. అవి పెద్ద పెద్ద బల్బులు. ఇంకేమీ కాదు. వారికి భూమి చాలా చిన్నదిగా కనిపిస్తుంది. వారి భౌతిక జ్ఞానానికి, మీ ఆత్మిక జ్ఞానానికి ఎంత వ్యత్యాసముంది. మీ ఆత్మ ఎంత సూక్ష్మమైనది! కానీ రాకెట్‌ కంటే తీక్షణమైనది. ఆత్మలు పైన ఉంటాయి. నాటకములో పాత్ర చేసేందుకు మళ్లీ వస్తాయి. వారు కూడా సుప్రీమ్‌ ఆత్మ. కానీ వారినెలా పూజించాలి. భక్తి కూడా తప్పకుండా జరగాల్సిందే.
బాబా అర్థం చేయించారు - అర్ధకల్పము జ్ఞానము పగలు, అర్ధకల్పము భక్తి రాత్రి. ఇప్పుడు సంగమ యుగములో మీరు జ్ఞానము తీసుకుంటున్నారు. సత్యయుగములో అయితే జ్ఞానమే ఉండదు. అందుకే దీనిని పురుషోత్తమ సంగమ యుగమని అంటారు. అందరినీ ఉత్తమ పురుషులుగా చేస్తారు. మీ ఆత్మ ఎంతో దూర-దూరాలకు వెళ్తుంది. మీకు ఖుషీ ఉంది కదా. వారు వారి కళలు చూపిస్తే వారికి చాలా ధనము లభిస్తుంది. ఎంత లభించినా అదేమీ వెంటరాదని మీకు తెలుసు. ఇప్పుడు అందరూ మరణించాల్సిందే. అంతా సమాప్తమైపోతుంది. ఇప్పుడు మీకెంత విలువైన రత్నాలు లభిస్తున్నాయి! దాని విలువనెవ్వరూ కట్టలేరు. ఒక్కొక్క వాక్యము లక్షల రూపాయల విలువ గలది. ఎంతోకాలము నుండి మీరు వింటూనే వస్తున్నారు. గీతలో ఎంత విలువైన జ్ఞానముంది. ఈ ఒక్క గీత మాత్రమే అత్యంత విలువైనది. శ్రీమద్భగవద్గీత సర్వ శాస్త్రములకు శిరోమణి. వారు భలే పఠిస్తారు కానీ అర్థము ఏమాత్రము తెలియదు. గీత చదివితే ఏమవుతుంది. నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారని ఆ తండ్రి ఇప్పుడు చెప్తున్నారు. వారు భలే గీతను పఠిస్తారు కానీ తండ్రితో ఒక్కరికి కూడా యోగము లేదు. వారు ఆ తండ్రినే సర్వవ్యాపి అని అంటారు. పవిత్రంగా కూడా అవ్వలేరు. ఈ లక్ష్మీనారాయణుల చిత్రము మీ ముందు ఉంది. వీరిని దేవతలని అంటారు. ఎందుకంటే వారిలో దైవీ గుణాలున్నాయి. ఆత్మలైన మిమ్ములనందరినీ పవిత్రంగా చేస్తారు. అందరూ ఇంటికి వెళ్లాలి. నూతన ప్రపంచములో అయితే ఇంతమంది మనుష్యులుండరు. మిగిలిన ఆత్మలంతా ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. మీకు ఈ తండ్రి అద్భుతమైన జ్ఞానమునిస్తారు. దీని వలన మీరు మానవుల నుండి దేవతలుగా, చాలా ఉన్నతమైనవారిగా అవుతారు. అటువంటి చదువు పై ఎంత గమనముంచాలి. కల్పక్రితము ఎవరు ఎంత గమనముంచారో ఇప్పుడు కూడా అలాగే ఉంచుతూ ఉంటారని కూడా మీకు తెలుసు. అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. తండ్రి సేవా సమాచారము విని సంతోషడ్తారు కూడా. తండ్రికి ఎప్పుడూ ఉత్తరము కూడా వ్రాయరు. అందువలన వారి బుద్ధియోగము ఎక్కడో రాయి-రప్పల పై ఉందని భావిస్తారు. దేహాభిమానములోనికి వచ్చి తండ్రిని మర్చిపోతారు లేకుంటే ప్రేమించి వివాహము(లవ్‌ మ్యారేజ్‌) చేసుకుంటే వారి మధ్య పరస్పరము ఎంత ప్రేమ ఉంటుందో ఆలోచించండి. కొంతమంది ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. వివాహమాడిన స్త్రీని చంపను కూడా చంపుతారు. మీది కూడా వారితో ప్రేమ వివాహము. తండ్రి వచ్చి మీకు తన పరిచయమునిస్తారు. మీకు పరిచయము కూడా తెలియదు. తండ్రి అయితే రావలసి వస్తుంది. ఈ ప్రపంచము పాతదైనప్పుడు తండ్రి వస్తారు. పాతదానిని క్రొత్తదిగా చేసేందుకు తప్పకుండా ఈ సంగమ యుగములోనే వస్తారు. నూతన ప్రపంచాన్ని స్థాపన చేయడం తండ్రి కర్తవ్యము. మిమ్ములను స్వర్గానికి అధికారులుగా చేస్తారు. కనుక అటువంటి తండ్రిని ఎంతగా ప్రేమించాలి. బాబా మేము మర్చిపోతామని ఎందుకంటారు? ఎంత ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి! ఇంతకంటే ఉన్నతమైనవారు లేనే లేరు. మానవులు ముక్తి కొరకు ఎన్నో ఉపాయాలు చేసి తలలు బాదుకుంటూ ఉంటారు. ఎంతో అసత్యము, మోసము నడుస్తూ ఉంది. మహర్షి మొదలైనవారికి ఎంతో పేరు ప్రఖ్యాతులున్నాయి. వారికి ప్రభుత్వము వారు 10-20 ఎకరాల భూమినిచ్చేస్తారు. అలాగని ప్రభుత్వము ధార్మికము కాదని కాదు. మినిష్టర్లు కొంతమంది ధార్మికంగా, కొంతమంది అధార్మికంగా ఉంటారు. కొంతమంది ధర్మమును ఒప్పుకోనే ఒప్పుకోరు. మతమే శక్తి(రిలీజియన్‌ ఈజ్‌ మైట్‌) అని అంటారు. క్రైస్తవులలో శక్తి ఉండేది కదా. భారతదేశమంతటినీ మింగేసింది. ఇప్పుడు భారతదేశములో ఏ శక్తీ లేదు. ఎన్నో కొట్లాటలు, మారణహోమాలు జరుగుతున్నాయి. అదే భారతదేశమెలా ఉండేది! తండ్రి ఎప్పుడు ఎలా వస్తారో ఎవ్వరికీ తెలియదు. మగధ దేశములో వస్తారని మీకు తెలుసు. అక్కడ మొసళ్ళు ఉంటాయి. మానవులు అన్నీ తినేవారిగా ఉన్నారు. అందరికంటే ఎక్కువ వైష్ణవముగా భారతదేశముండేది. ఇది వైష్ణవ రాజ్యము కదా. ఆ మహాన్‌ పవిత్ర దేవతలెక్కడ, ఈ రోజు అన్నీ తినేవారెక్కడ? మనుష్యులను కూడా చంపేవారిగా అయిపోతారు. దేనికి పనికి రానివారిగా అవుతున్నారు. భారతదేశానికి ఏ గతి పట్టింది. ఇప్పుడు మీకు రహస్యాలన్నీ అర్థం చేయిస్తున్నారు. పై నుండి క్రింది వరకు పూర్తి జ్ఞానమునిస్తున్నారు. మొట్టమొదట మీరే ఈ భూమి పైకి వస్తారు. ఆ తర్వాత మనుష్యులు వృద్ధి చెందుతారు. ఇక కొద్ది సమయములో హాహాకారాలౌతాయి. తర్వాత అయ్యో అయ్యో అంటూ ఉంటారు. స్వర్గములో ఎంత సుఖముంటుందో చూడండి. ఇది లక్ష్యమునకు గుర్తు. ఇవన్నీ పిల్లలైన మీరు ధారణ కూడా చేయాలి. ఇది ఎంతో గొప్ప చదువు. తండ్రి చాలా స్పష్టం చేసి అర్థం చేయిస్తున్నారు. మాల రహస్యమును కూడా అర్థం చేయించారు. మాల పై భాగములో పుష్పము శివబాబా, తర్వాత మేరు(జంటపూసలు).......... ప్రవృత్తి మార్గము కదా. నివృత్తి మార్గము వారికైతే మాల తిప్పే అనుమతి లేదు. ఇది దేవతల మాల. వారు రాజ్యమునెలా పొందుకున్నారు. మీలో కూడా నెంబరువారుగా ఉన్నారు. మీరు వస్తే ఇతరులెవ్వరూ అర్థం చేయించలేని విషయాలు తెలుపుతామని భయపడకుండా చెప్తారు. శివబాబాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. వారికి(దేవతలకు) ఈ రాజయోగమును నేర్పించారు? కూర్చుని చాలా రసవత్తరంగా అర్థం చేయించాలి. 84 జన్మలెలా తీసుకుంటారు. దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా ఎలా అవుతారో తండ్రి ఎంతో సహజంగా జ్ఞానము తెలుపుతున్నారు. పవిత్రంగా కూడా అవ్వాలి. అప్పుడే ఉన్నత పదవిని పొందుతారు. విశ్వమంతటా శాంతిస్థాపన చేసేవారు మీరే. ఆ తండ్రి మీకు రాజ్య భాగ్యమునిస్తారు. వారు దాత కదా. వారు ఏమీ తీసుకోరు. మీరు చదువుకున్న దానికిది బహుమతి. ఇటువంటి బహుమతి ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. ఇటువంటి తండ్రిని ప్రీతిగా ఎందుకు స్మృతి చేయరు! లౌకిక తండ్రినైతే జన్మంతా గుర్తుంచుకుంటారు. పారలౌకిక తండ్రిని ఎందుకు స్మృతి చేయరు! తండ్రి తెలిపిస్తున్నారు - ఇది యుద్ధ మైదానము, పవితంగా అయ్యేందుకు సమయం పడ్తుంది. యుద్ధము పూర్తి అయ్యేవరకు సమయము పడ్తుంది. అంతేగాని ప్రారంభములో వచ్చిన వారు పూర్తి పావనంగా అవుతారని కాదు. తండ్రి చెప్తున్నారు - మాయతో యుద్ధము చాలా తీవ్రంగా జరుగుతుంది. మంచి-మంచి వారిని కూడా మాయ జయిస్తుంది. మాయ అంత శక్తివంతమైనది. క్రిందపడినవారు మురళి కూడా వినలేరు. సెంటరుకే రాకుంటే వారికెలా తెలుస్తుంది. మాయ ఒక్కసారిగా పైసకు కొరగాకుండా చేసేస్తుంది. మురళి వింటేనే కదా మేల్కునేది. మురికి(అపవిత్ర) పనులు చేస్తూ ఉంటారు. ఎవరైనా తెలివిగల పిల్లలు, మాయతో వారెలా ఓడిపోయారో అర్థం చేయించాలి. బాబా మీకు ఏం వినిపిస్తున్నారు, మళ్లీ మీరెక్కడకు వెళ్తున్నారు. మాయ ఎవరినైనా తింటూ ఉందని గమనిస్తే వారిని రక్షించేందుకు ప్రయత్నించాలి. మాయ పూర్తిగా మింగేయకుండా చూడాలి. మళ్లీ వారు మేల్కోవాలి. లేకుంటే ఉన్నత పదవి పొందలేరు. సద్గురువును నిందలపాలు చేస్తారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తండ్రి ద్వారా శాంతిగా ఉండే కళను నేర్చుకొని, ఈ హద్దు ప్రపంచమును దాటి బేహద్‌లోకి వెళ్లాలి. ఆ తండ్రి మనకు ఎంత అద్భుతమైన జ్ఞానమునిచ్చి ఎంతో గొప్ప బహుమతినిస్తున్నారనే నషా ఉండాలి.
2. నిర్భయంగా చాలా రసవత్తరంగా సేవ చేయాలి. మాయతో చేసే యుద్ధములో శక్తివంతులై విజయము పొందుకోవాలి. మురళి విని సుజాగృతమై ఉండాలి. అందరినీ జాగృతము చేయాలి.

వరదానము :- ''స్వరాజ్య సంస్కారాల ద్వారా భవిష్య రాజ్య అధికారాన్ని ప్రాప్తి చేసుకునే భాగ్యశాలి ఆత్మా భవ ''
చాలాకాలము రాజ్యాధికారులుగా అయ్యే సంస్కారము, చాలాకాలము భవిష్య రాజ్య అధికారిగా చేస్తుంది. ఒకవేళ పదే పదే వశీభూతులుగా అయితే అధికారులుగా అయ్యే సంస్కారముండదు. కనుక రాజ్యాధికారుల రాజ్యములో ఉంటారు. రాజ్య భాగ్యము ప్రాప్తించదు. కనుక జ్ఞాన దర్పణంలో మీ భాగ్యశాలి ముఖాన్ని చూసుకోండి. చాలా సమయం అభ్యాసము చేయడం ద్వారా మీ విశేష సహయోగం చేసే కర్మచారులు లేక రాజ్య కార్యభారము నిర్వహించే సాథీలను మీ అధికారంతో నడిపించండి. రాజులుగా అవ్వండి అప్పుడు భాగ్యశాలి ఆత్మలని అంటారు.

స్లోగన్‌ :- ''సకాశ్‌నిచ్చే సేవ చేసేందుకు అనంతమైన వైరాగ్య వృత్తిని ఉత్పన్నం చేయండి''

Tuesday, 5 November 2019

Telugu Murli 06/11/2019

06-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - నేను ఎంత సమయము తండ్రి స్మృతిలో ఉన్నాను ? అని మిమ్ములను మీరే చెక్‌ చేసుకోండి, ఎందుకంటే లాభము స్మృతిలోనే ఉంది. విస్మృతిలో నష్టముంది ''

ప్రశ్న :- ఈ పాపాత్మల ప్రపంచములో ఏ విషయము పూర్తిగా అసంభవము - ఎందుకు?
జవాబు :- ఈ ప్రపంచములో ఎవరైనా 'మేము పుణ్యాత్మలము' అని చెప్తే అది పూర్తిగా అసంభవము ఎందుకంటే ఈ ప్రపంచమంతా కలియుగములో తమోప్రధానంగా ఉంది. పుణ్యకర్మలని భావించి మానవులు చేస్తున్న కార్యాలన్నీ పాపాలుగా అయిపోతున్నాయి ఎందుకంటే ఇప్పుడు చేసే పత్రి కర్మ వికారాలకు వశమయ్యే చేస్తున్నారు.

ఓంశాంతి. ఇప్పుడు మేము బ్రహ్మ పిల్లలము, బ్రహ్మాకుమార-కుమారీలమని పిల్లలు అర్థం చేసుకున్నారు. తర్వాత దేవీ దేవతలుగా అవుతామని మీకు మాత్రమే తెలుసు, ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు. బ్రహ్మకుమార-బ్రహ్మకుమారీలైన మేము అనంతమైన(బేహద్‌) చదువు చదువుతున్నామని మీకు తెలుసు. 84 జన్మల చదువును కూడా చదువుకుంటున్నారు, సృష్టిచక్రపు చదువు కూడా చదువుకుంటున్నారు. అంతేకాక పవిత్రంగా అవ్వాలనే శిక్షణ కూడా మీకు లభిస్తుంది. ఇక్కడ కూర్చొని పిల్లలైన మీరు పావనంగా అయ్యేందుకు తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తారు. మేము సత్య-సత్యంగా తండ్రి స్మృతిలో ఉన్నామా? లేక మాయా రావణుడు బుద్ధిని మరోవైపు తీసుకెళ్లాడా? అని మీ హృదయాన్ని మీరే ప్రశ్నించుకోండి. తండ్రి అంటున్నారు - నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే(మామేకమ్‌ యాద్‌ కరో) మీ పాపాలు నశిస్తాయి. '' మేము బాబా స్మృతిలో ఉన్నామా లేక నా బుద్ధి ఎక్కడకైనా వెళ్లిందా ? '' అని ఇప్పుడు స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఎంత సమయము మేము తండ్రి స్మృతిలో ఉన్నాము, ఎంత సమయము మా బుద్ధి పక్కకు పోయింది? అని మీకు గుర్తుండాలి. మీ స్థితిని గమనించండి. ఎంత సమయము తండ్రిని స్మృతి చేస్తారో, అంత మాత్రమే మీరు పావనమౌతారు. లాభ-నష్టాల లెక్కాచారము కూడా(చార్టు) ఉంచుకోవాలి. అలవాటైతే గుర్తు కూడా ఉంటుంది, వాస్త్రూ ఉంటారు. అందరి వద్ద(పాకెట్‌లో) డైరీ ఉండనే ఉంటుంది. వ్యాపారస్థుల డైరీ హద్దులోనిది. మీది బేహద్‌ డైరి. మీరు మీ చార్టు వ్రాస్తూ ఉండాలి. తండ్రి ఆదేశిస్తున్నారు - వృత్తి వ్యాపారాదులన్నీ చేసుకోండి కానీ కొంత సమయాన్ని కేటాయించి నన్ను స్మృతి చేయండి. మీ లెక్కాచారము(చార్టు) గమనిస్తూ లాభము పెంచుకుంటూ ఉండండి, నష్టపోకండి. మీది యుద్ధము కదా. ఒక్క క్షణములో లాభము, ఒక్క క్షణములో నష్టము కలుగుతూ ఉంటుంది. మేము లాభము పొందుకున్నామా? లేక నష్టపోయామా? అని వెంటనే తెలిసిపోతుంది. మీరు వ్యాపారస్థులు కదా. చాలా కొంతమందే ఈ వ్యాపారము చేస్తారు. స్మృతి వలన లాభము, విస్మృతి వలన నష్టము కలుగుతుంది. ''నేను ఎంత సమయము విస్మృతిలో ఉన్నాను?'' అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. గమనించుకునే తపన ఉన్నత పదవి పొందుకునే వారికి మాత్రమే ఉంటుంది. నాకు ఈ తపన ఉందా? అని స్వయాన్ని పరిశీలించుకోండి. ఆత్మలైన మనందరి తండ్రి పతితపావనులని పిల్లలైన మీకు తెలుసు. మనమంతా నిజానికి ఆత్మలము. మన ఇంటి నుండి ఇక్కడకు వచ్చాము. ఈ శరీరము ధరించి పాత్రను అభినయిస్తున్నాము. శరీరము వినాశనమవుతుంది. ఆత్మ అవినాశి. సంస్కారాలు కూడా ఆత్మలోనే ఉంటాయి. బాబా అడుగుతున్నారు - '' ఓ ఆత్మలారా! స్మృతి చేయండి, ఈ జన్మలో బాల్యములో ఏవైనా వికర్మలు, చెడు పనులు చేయలేదు కదా? '' అని గుర్తుకు తెచ్చుకోండి - 3, 4 సంవత్సరాల వయస్సు నుండి జ్ఞాపకముంటుంది. బాల్యమును ఎలా గడిపాము? ఏమేమి చేశాము? ఏదైనా విషయము మనస్సును లోలోపల తినడం లేదు కదా? అని గుర్తు చేసుకోండి. సత్యయుగములో పాప కర్మలే ఉండవు. అడగవలసిన పనే ఉండదు. ఇక్కడ పాపాలు జరుగుతూనే ఉంటాయి. పుణ్యకర్మలని భావించి మానవులు చేస్తున్నవన్నీ పాపాలే. ఇది పాపాత్మల ప్రపంచము. మీరు ఇచ్చి-పుచ్చుకునేది కూడా పాపాత్మలతోనే. పుణ్యాత్మలు ఇక్కడ లేనే లేరు. పుణ్యాత్మల ప్రపంచములో ఒక్క పాపాత్మ కూడా ఉండరు. పాపాత్మల ప్రపంచములో ఒక్క పుణ్యాత్మ కూడా ఉండరు. ఏ గురువుల పాదాల పై పడ్తున్నారో, వారిలో ఒక్కరు కూడా పుణ్యాత్మలు లేరు. ఇది కలియుగము, తమోప్రధానమైనందు వలన ఇందులో ఒక్క పుణ్యాత్మ ఉండడం కూడా అసంభవము. పుణ్యాత్మలుగా అయ్యేందుకే ''మీరు వచ్చి మమ్ములను పావనాత్మలుగా చేయండి'' అని తండ్రిని పిలుస్తారు. అంతేకాని చాలా దాన-పుణ్యాలు చేసేవారు, ధర్మశాలలు మొదలైనవి కట్టించేవారు పుణ్యాత్మలని కాదు. వివాహాల కొరకు కళ్యాణమంటపాలు మొదలైనవి కట్టిస్తారు. వారు పుణ్యాత్మలు కాదు. ఇవి బాగా అర్థము చేసుకునే విషయాలు. ఇది రావణ రాజ్యము. పాపాత్మల ఆసురీ ప్రపంచము. ఈ విషయాలు మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. భలే రావణుడు ఉన్నాడు కానీ అతడిని గుర్తించలేరు. శివుని చిత్రాలు కూడా ఉన్నాయి. కానీ వారిని గుర్తించలేరు. పెద్ద పెద్ద శివలింగాలు మొదలైనవి నిర్మిస్తారు. అలా నిర్మిస్తారు అయినా నామ-రూపాలకు భిన్నమైనవారని, సర్వవ్యాపి అని అంటారు. అందుకే తండ్రి అంటున్నారు - యదా యదాహి............... భారతదేశములోనే శివబాబాను గ్లాని చేస్తారు. ఏ తండ్రి మిమ్ములను విశ్వానికి అధికారులుగా చేస్తారో అటువంటి తండ్రిని మానవ మతాలను అనుసరించి ఎంతగానో నిందిస్తారు. మానవ మతము - ఈశ్వరీయ మతము అనే పుస్తకము కూడా ఉంది కదా. మానవులు శ్రీమతమును అనుసరించి దేవతలుగా అవుతారని మీకు మాత్రమే తెలుసు, మీరు మాత్రమే అర్థము చేయించగలరు. రావణ మతముననుసరించి మళ్లీ ఆసురీ మానవులుగా అవుతామని మీకు తెలుసు. మానవుల మతమును ఆసురీ మతమని అంటారు. ఆసురీ కర్తవ్యములే చేస్తూ ఉంటారు. ముఖ్యమైనది - ఈశ్వరుని సర్వవ్యాపి అని అంటారు. మత్సావతారము, కూర్మావతారము........ అని అంటూ చాలా అసురులుగా, ఛీ-ఛీగా అయిపోయారు. ఆత్మలైన మీరు చేపలుగా, తాబేలుగా జన్మించరు, మానవ శరీరములోకే వస్తారు. ఇప్పుడు మనము చేపలుగా, తాబేలుగా అవ్వము, 84 లక్షల యోనులలోకి రామని మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీకు తండ్రి ద్వారా శ్రీమతము లభిస్తోంది - పిల్లలారా, మీరు 84 జన్మలు తీసుకుంటారు. 84కు, 84 లక్షలకు ఎంత శాతమంటారు! అసత్యములో కూడా పూర్తిగా అసత్యము(శుద్ధ అబద్ధము). గురిగింజంత(రవ్వంత) సత్యము కూడా లేదు. దీని అర్థమును కూడా తెలుసుకోవాలి. భారతదేశ స్థితి ఎలా ఉందో గమనించండి! భారతదేశము ఒకప్పుడు సత్యమైన ఖండముగా ఉండేది, దానినే స్వర్గమనేవారు. అర్ధకల్పము రామరాజ్యము, అర్ధకల్పము రావణ రాజ్యము. రావణ రాజ్యమంటే ఆసురీ సంప్రదాయమని అంటారు. ఇది ఎంత కఠినమైన శబ్ధము! అర్ధకల్పము దేవతల రాజ్యము నడుస్తుంది. ఎలా ఎడ్వర్డ్‌ ది ఫస్ట్‌, సెకెండ్‌.............. అని అంటారో అలా అక్కడ లక్ష్మీనారాయణ ది ఫస్ట్‌, ది సెకెండ్‌, ది థర్డ్‌ అని అంటారని తండ్రి అర్థం చేయిస్తున్నారు. మొదటి తరము, తర్వాత రెండవ తరము, ఇలా నడుస్తూ ఉంటుంది. మీలో కూడా మొదట సూర్యవంశము తర్వాత చంద్రవంశము. తండ్రి వచ్చి డ్రామా రహస్యాన్ని కూడా చాలా బాగా అర్థము చేయిస్తున్నారు. మీ శాస్త్రాలలో ఈ విషయాలు లేవు. కొన్ని కొన్ని శాస్త్రాలలో చాలా కొద్దిగా(ఒక గీత వలె) చూపించారు. కానీ ఆ సమయములో ఆ పుస్తకాలు వ్రాసినవారు కూడా ఏ మాత్రమూ అర్థము చేసుకోలేదు.
ఈ బాబా కూడా బెనారస్‌కు(కాశీకి) వెళ్లినప్పుడు, ఆ సమయములో ఈ ప్రపంచమే నచ్చలేదు అచ్చట కనబడిన గోడలన్నిటి పై గీతలు గీస్తూ ఉండేవాడు. ఇవన్నీ తండ్రి చేయించేవారు. కానీ ఆ సమయంలో నేను చిన్నబాలుడను కదా. పూర్తిగా అర్థమయ్యేది కాదు. కానీ ఎవరో నాతో చేయిస్తున్నారని మాత్రము అనిపించేది. కానీ ఏమీ అర్థమయ్యేది కాదు. వినాశనము చూచినప్పుడు ఆంతరికములో సంతోషము కూడా ఉండేది. రాత్రుళ్లు నిదురించేటప్పుడు కూడా ఎగురుతున్నట్లుండేది. కానీ అర్థమయ్యేది కాదు. ఊరికే గీతలు గీస్తూ ఉండేవాడిని. ఏదో శక్తి ప్రవేశించిందనిపించేది, ఆశ్చర్యపడేవాడిని. మొదట్లో వ్యాపారము చేసేవాడిని. తర్వాత ఏమయిందో తెలియదు. ఎవరిని చూసినా వారు ట్రాన్స్‌(ధ్యానము)లోకి వెళ్లిపోయేవారు. ఏమౌతోంది? ఎవరిని చూచినా వారి కనులు మూతపడేవి. ఏమి చూచారు? అని వారిని అడిగితే వైకుంఠము చూచాము, కృష్ణుని చూచాము అని అనేవారు. ఇవన్నీ అర్థము చేసుకునే విషయాలు కదా. అందుకే అంతా వదిలేసి, అర్థము చేసుకునేందుకు బనారస్‌ వెళ్లిపోయాను. రోజంతా కూర్చుని ఉండేవాడిని. పెన్సిలు, గోడ ఇవి తప్ప వేరే పనే లేదు. పసివాడిని(జ్ఞానములో) కదా. ఇవన్నీ చూచిన తర్వాత ఇంకేమీ చేయరాదని అనుకున్నాను. వ్యాపారము మొదలైనవి వదిలేయాల్సి వస్తుందని తలచాను. ఈ గాడిద బరువును వదిలేయాలంటే చాలా సంతోషంగా ఉండేది. ఇది రావణ రాజ్యము కదా. రావణునికి గాడిద తలను చూపిస్తారు కదా. అందువలన ఇది రాజ్యము కాదు, గాడిద బరువనిపించింది. గాడిద మాటిమాటికి మట్టిలో పొర్లాడి, ఉతికిన చాకలి బట్టలన్నీ పాడు చేస్తుంది. తండ్రి కూడా అంటున్నారు - మీరు ఎలా ఉండేవారు? ఇప్పుడు మీ స్థితి ఎలా పాడైపోయింది? ఇవన్నీ ఆ తండ్రే కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఈ దాదా కూడా అర్థం చేయిస్తారు. ఇరువురిదీ నడుస్తూ ఉంటుంది. జ్ఞానము బాగా అర్థము చేసుకున్నవారిని చురుకైనవారని అంటారు. నంబరువారుగా ఉంటారు కదా. ఈ రాజధాని స్థాపనవుతూ ఉందని పిల్లలైన మీరు కూడా అర్థం చేయిస్తారు. తప్పకుండా నెంబరువారుగా పదవి పొందుతారు. ఆత్మయే కల్ప-కల్పము తన పాత్రను అభినయిస్తూ ఉంటుంది. అందరూ ఒకే విధమైన జ్ఞానులుగా ఉండరు. ఈ స్థాపనా కార్యక్రమమే అద్భుతమైనది. ఈ స్థాపనా జ్ఞానమును మరెవ్వరూ ఇవ్వలేరు. సిక్కు ధర్మ స్థాపన జరిగిందనుకోండి, శుద్ధమైన పవిత్రమైన ఆత్మ ప్రవేశించిన కొంత సమయము తర్వాత సిక్కు ధర్మ స్థాపన జరిగింది. వారి హెడ్‌(పెద్ద) ఎవరు? - గురునానక్‌. వారు వచ్చి జప్‌ సాహెబ్‌ను తయారు చేశారు. మొదట నూతన ఆత్మనే ఉంటుంది. ఎందుకంటే పవిత్ర ఆత్మగా ఉంటుంది. పవిత్రంగా ఉన్నవారిని మహాత్ములని అంటారు. సుప్రీమ్‌(అత్యంత శ్రేష్ఠము) అని ఒక్క తండ్రిని మాత్రమే అంటారు. వారు కూడా ధర్మస్థాపన చేస్తారు కాబట్టి మహాన్‌ అని అంటారు. కానీ నంబరువారుగా క్రిందకు వస్తారు. 500 సంవత్సరాల క్రితము ఒక ఆత్మ వచ్చి సిక్కు ధర్మస్థాపన చేసింది. అప్పుడు గ్రంథము ఎక్కడి నుండి వస్తుంది! సుఖమణి, జప్‌ సాహ్‌బ్‌ మొదలైనవి ఆ తర్వాతనే తయారై ఉంటాయి కదా. ఎలాంటి శిక్షణ ఇస్తారు. ఉల్లాస-ఉత్సాహములున్నప్పుడు కూర్చొని తండ్రిని మహిమ చేస్తారు. పోతే ఈ పుస్తకాలు మొదలైనవన్నీ చాలామంది అయిన తర్వాత తయారవుతాయి. ఎందుకంటే చదివేవారు కూడా కావాలి కదా. అన్ని ధర్మశాస్త్రాలు తర్వాతనే తయారై ఉంటాయి. భక్తిమార్గము మొదలైనప్పుడే శాస్త్రాలు చదువుతారు. జ్ఞానము కూడా కావాలి కదా. మొదట సతోప్రధానంగా ఉంటారు. ఆ తర్వాత సతో, రజో, తమోలలోకి వస్తారు. చాలా వృద్ధి చెందినప్పుడు మహిమ ఉంటుంది. అప్పుడే శాస్త్రాలు మొదలైనవన్నీ తయారవుతాయి. లేకుంటే వృద్ధి ఎవరు చేస్తారు? శిష్యులు తయారైతే కదా. సిక్కు ధర్మానికి చెందిన ఆత్మలు వచ్చి అనుసరిస్తారు. కానీ దానికి చాలా సమయము పడ్తుంది.
కొత్త ఆత్మలు ఎవరైతే వస్తారో వారికి దుఃఖముండదు. ఆ నియమము లేదు. ఆత్మ సతోప్రధానము నుండి సతో, రజో, తమో గుణములోకి వచ్చినప్పుడు దుఃఖము కలుగుతుంది. ఇది కూడా చట్టమే కదా. ఇక్కడ మిక్స్‌(కల్తీ)గా ఉన్నారు. రావణ సంప్రదాయము, రామ సంప్రదాయము రెండూ ఉన్నాయి. ఇంకా సంపూర్ణమవ్వలేదు. సంపూర్ణమైతే శరీరము వదిలేస్తారు. కర్మాతీత స్థితిని పొందుకున్న వారెవ్వరికీ దుఃఖముండదు. వారు ఈ ఛీ-ఛీ ప్రపంచములో ఉండరు. వారు వెళ్లిపోతారు. మిగిలినవారికి ఇంకా కర్మాతీత స్థితి తయారై ఉండదు. అందరికీ ఒకేసారి కర్మాతీత స్థితి రాదు. వినాశనము జరిగినా ఇంకా కొంతమంది మిగిలే ఉంటారు. పళ్రయము జరగదు. రాముడూ పోయాడు, రావణుడూ పోయాడు....... అని పాడ్తారు కదా. రావణుని పరివారము చాలా పెద్దది. మన పరివారము చాలా చిన్నది. అక్కడ ధర్మాలు ఎన్ని ఉన్నాయి! వాస్తవానికి మన పరివారము చాలా పెద్దదిగా ఉండాలి. ఎందుకంటే అన్నిటికంటే మొదటి ధర్మము దేవీ దేవతా ధర్మము. ఇప్పుడైతే అంతా కలిసిపోయారు. క్రైస్తవులుగా చాలామంది అయ్యారు. సుఖమెక్కడ కనిపిస్తుందో, హోదా ఎక్కడ లభిస్తుందో ఆ ధర్మమువారిగా అయిపోతారు. పోప్‌ వస్తే చాలామంది క్రైస్తవులుగా అవుతారు. ఆ తర్వాత చాలా వృద్ధి కూడా జరుగుతుంది. సత్యయుగములో ఒక పుత్రుడు, ఒక పుత్రిక మాత్రమే ఉంటారు. ఇక ఏ ఇతర ధర్మమూ ఇలా వృద్ధి చెందదు. ఇప్పుడు చూస్తే అన్నిటికంటే క్రైస్తవ ధర్మము చాలా అధికంగా ఉంది. చాలామంది సంతానమున్న వారికి బహుమతులు లభిస్తాయి. ఎందుకంటే వారికి మనుష్యులు కావాలి కదా. వారు మిలిటరీలో, సైన్యములో ఉపయోగపడ్తారు. అందరూ క్రైస్తవులే. రష్యా, అమెరికా రెండింటిలో క్రిస్టియన్లే ఉన్నారు. రెండు కోతులు కొట్లాడితే మధ్యలో పిల్లి వెన్న తిని పోయిందని ఒక కథ ఉంది కదా. ఇది కూడా డ్రామాలో తయరై ఉంది. ఇంతకుముందు హిందువులు, ముస్లింలు కలిసి ఉండేవారు. వేరైనప్పుడు పాకిస్థాన్‌ క్రొత్త దేశంగా నిలబడింది. ఇది కూడా డ్రామాలో ఉంది. ఇద్దరు కొట్లాడితే తుపాకులు, ఫిరంగులు తీసుకుంటారు. వ్యాపారము జరుగుతుంది. వారికిది అత్యంత గొప్ప వ్యాపారము. కానీ ఈ డ్రామాలో మీ విజయము నూటికి నూరు శాతము ఖచ్ఛితము. మిమ్ములను ఎవ్వరూ జయించలేరు. మిగిలినవారంతా సమాప్తమైపోతారు. నూతన ప్రపంచములో మన రాజ్యమే ఉంటుంది. అందుకే చదువుతున్నారు, అర్హులుగా అవుతారు. మీరు అర్హులుగా ఉండేవారు. ఇప్పుడు అనర్హులుగా అయ్యారు మళ్లీ అర్హులుగా అవ్వాలి. పతితపావనా! రండి అని పాటలు పాడ్తారు. కానీ అర్థమే తెలియదు. ఇదంతా ఇప్పుడు ఒక అడవి. ఇప్డుడు తండ్రి వచ్చారు, వారు వచ్చి ముళ్ళ అడవిని పూలతోటగా చేస్తున్నారు. అది దైవీ(డైటీ) ప్రపంచము. ఇది భూతాల(డెవిల్‌) ప్రపంచము. ఈ మానవ సృష్టి రహస్యమంతటినీ ఆ తండ్రి అర్థం చేయించారు. తమ ధర్మమును మర్చిపోయి ధర్మ భ్రష్ఠులైపోయారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అందువలన మీరు చేసే కర్మలన్నీ వికర్మలుగానే ఉంటాయి. కర్మ-అకర్మ-వికర్మల గతిని తండ్రి మీకు అర్థం చేయించి వెళ్లిపోయారు. నిన్న మనము ఇలా ఉండేవారమని, ఈ రోజు మళ్లీ అలా అవుతున్నామని మీకు తెలుసు. సమీపములోనే ఉంది కదా. బాబా అంటున్నారు - నిన్న మిమ్ములను దేవతలుగా చేసి రాజ్యభాగ్యమును ఇచ్చాను, అదంతా ఎక్కడ పోగొట్టుకున్నారు? భక్తిమార్గములో ఎంత ధనము పోగొట్టుకున్నారో మీకు గుర్తుకొచ్చిందా? ఇది నిన్నటి మాటే కదా. తండ్రి వచ్చి అరచేతిలో వైకుంఠము తెచ్చి ఇస్తున్నారు. ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. ఈ కనులెంత మోసము చేస్తాయో కూడా తండ్రి మీకు అర్థం చేయించారు. వికారీ దృష్టిని జ్ఞానముతో పవిత్రంగా చేసుకోవాలి. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మీ బేహద్‌ డైరీలో ''నేను స్మృతిలో ఉండి ఎంత లాభం పొందాను?'' అని చార్టు వ్రాసుకోవాలి. నష్టపోలేదు కదా? స్మృతి చేయు సమయములో బుద్ధియోగము ఎక్కడెక్కడకు పోయింది? అని నోట్‌ చేసుకోవాలి.
2. ఈ జన్మలో బాల్యము నుండి ఏ ఏ విరుద్ధ కర్మలు లేక పాప కర్మలు చేశానని నోట్‌ చేయాలి? ఏ విషయాలలో మీ మనసు తింటూ ఉంటుందో, దానిని తండ్రికి వినిపించి తేలికగా అవ్వాలి. ఇప్పుడు ఏ పాప కర్మా చేయరాదు.

వరదానము :- '' '' మంచి '' పై ప్రభావితమయ్యేందుకు బదులు ఆ మంచిని స్వయంలో ధారణ చేసే పరమాత్మ స్నేహీ భవ ''
పరమాత్మ స్నేహీలుగా అవ్వాలంటే దేహాభిమానము వలన కలిగే ఆటంకాలను చెక్‌ చేసుకోండి(ఆపేయండి). చాలామంది పిల్లలు వీరు చాలా మంచివారు, కనుక కొంచెం దయ కలుగుతుంది...... అని అంటారు. కొందరికి కొంతమంది శరీరాల పై ఆకర్షణ ఉంటుంది. కొంతమందికి కొందరి గుణాలు లేక విశేషతల పై ఆకర్షణ ఉంటుంది. కానీ ఆ విశేషతలు లేక గుణాలు ఇచ్చేవారెవరు? ఏదైనా మంచి ఉంటే, ఆ మంచిని భలే ధారణ చేయండి కానీ వారి పై ప్రభావితమవ్వకండి. అతీతంగా తండ్రికి ప్రియంగా అవ్వండి.

స్లోగన్‌ :- '' సైలెన్స్‌ శక్తిని ఎమర్జ్‌ (ఉత్పన్నం) చేసుకుంటే, సేవ వేగంగా జరుగుతుంది ''

Monday, 4 November 2019

Telugu Murli 05/11/2019

05-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - ఈ కనులకు ఏవేవి కనిపిస్తున్నాయో వాటిని చూస్తున్నా చూడకండి, వాటి పై మమకారమును తొలగించండి, ఎందుకంటే దీనికి నిప్పు అంటుకోనున్నది.''

ప్రశ్న :- ప్రపంచానికి తెలియని ఈశ్వరీయ ప్రభుత్వము చేసే గుప్త కర్తవ్యమేది ?
జవాబు :- ఈశ్వరీయ ప్రభుత్వము ఆత్మలను పావనంగా చేసి దేవతలుగా చేస్తుంది. ఇది చాలా గుప్త కర్తవ్యము. దీనిని మనుష్యులు అర్థం చేసుకోలేరు. మనుష్యులు దేవతలుగా అయినప్పుడు, నరకవాసులుగా ఉన్నవారు స్వర్గవాసులుగా అవుతారు. వికారాలు మానవుల స్వభావము(క్యారెక్టర్‌)ను పాడు చేశాయి. ఇప్పుడు మీరు అందరినీ శ్రేష్ట స్వభావము గలవారిగా చేసే సేవ చేస్తారు. ఇదే మీ ముఖ్యమైన కర్తవ్యము.

ఓంశాంతి. ఓంశాంతి అన్నప్పుడు మన ఆత్మ స్వధర్మము, మన ఇల్లు గుర్తుకు వస్తాయి. అలాగని ఇంటిలోనే కూర్చుండిపోరాదు. ఆ తండ్రికి పిల్లలుగా అయినాము, కనుక స్వర్గ వారసత్వము తప్పకుండా గుర్తుకొస్తుంది. ఓంశాంతి అని అనడం ద్వారా కూడా జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శాంతిసాగరుడైన తండ్రి సంతానాన్ని అని గుర్తుకొస్తుంది. స్వర్గ స్థాపన చేసే తండ్రే మనలను పవిత్రంగా, శాంతి స్వరూపులుగా చేస్తారు. ముఖ్యమైన విషయము పవిత్రత. పవిత్ర ప్రపంచము మరియు అపవిత్ర ప్రపంచము. పవిత్ర ప్రపంచములో ఒక్క వికారము కూడా ఉండదు. అపవిత్ర ప్రపంచములో 5 వికారాలున్నాయి. అందుకే దీనిని వికారాల ప్రపంచమని అంటారు. అది నిర్వికార ప్రపంచము. నిర్వికార ప్రపంచము నుండి మెట్లు దిగుతూ దిగుతూ మళ్లీ క్రిందకు అనగా వికారాల ప్రపంచములోకి వస్తారు. అది పవిత్ర ప్రపంచము. ఇది పతిత ప్రపంచము. రామ రాజ్యము, రావణ రాజ్యము అని అంటారు కదా. సమయానుసారము పగలు, రాత్రి అని గాయనం చేయబడింది. బ్రహ్మకు పగలు, బ్రహ్మకు రాత్రి అని అంటారు. పగలంటే సుఖము, రాతి అంటే దు:ఖము. రాత్రిలో వెతకడం జరుగుతుంది. నిజానికి రాత్రి(చీకటి)లో ఎవ్వరూ వెతకరు. అయితే భక్తిని 'వెతకడము' అని అంటారు. పిల్లలైన మీరు సద్గతి పొందేందుకు ఇక్కడకు వచ్చారు. ఆత్మలైన మీలో పంచ వికారాల కారణంగా పాపముంది. అందులోనూ ముఖ్యమైనది కామ వికారము. దాని వల్లనే మనుష్యులు పాపాత్మలుగా అవుతారు. మనము పతితులుగా ఉన్నామని ప్రతి ఒక్కరికి తెలుసు. భ్రష్టాచారముతోనే జన్మించారు. ఒకే ఒక్క కామ వికారము కారణంగా మీ అర్హతలన్నీ(క్వాలిఫికేషన్స్‌,) పాడైపోతాయి. అందుకే ఈ కామ వికారమును జయిస్తే జగత్‌జీతులుగా, నూతన ప్రపంచానికి అధికారులుగా అవుతారని తండ్రి చెప్తున్నారు. అందువలన ఆంతరికములో ఎంత సంతోషముండాలి! మానవులు పతితమైపోయినందున వారు ఏ మాత్రము అర్థం చేసుకోరు. ఈ కామ వికారము కొరకే ఎన్నో గలాటాలు జరుగుతున్నాయి. ఎంతో అశాంతి ఏర్పడుతుంది. ఎన్నో హాహాకారాలు వినపడుతూ ఉన్నాయి. ఈ సమయంలో ప్రపంచములో హాహాకారాలెందుకున్నాయి? ఎందుకంటే అందరూ పాపాత్మలుగా ఉన్నారు. వికారాల కారణంగానే అసురులనబడ్తారు. ఇప్పుడు తండ్రి ద్వారా మనము గవ్వ సమానము, పైసకు కొరగాకుండా(వర్త్‌ నాట్‌ ఏ పెెన్నీ) ఉండేవారమని అర్థం చేసుకున్నారు. పనికిరాని వస్తువులను అగ్నిలో కాల్చేస్తారు(కామదహన పండుగ). ఈ ప్రపంచములో పనికి వచ్చే వస్తువే లేదని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. మానవమాత్రులందరికీ అగ్ని అంటుకోనున్నది. ఈ కనులతో చూచే వాటికంతా నిప్పు అంటుకుంటుంది. ఆత్మకైతే అగ్ని అంటుకోదు(అగ్నిలో కాలదు). ఆత్మ భీమా చేసినట్లు భద్రంగా ఉంటుంది. ఆత్మను ఎప్పుడైనా భీమా చేయిస్తారా! శరీరాన్ని భీమా చేయిస్తారు. ఇది ఆట(డ్రామా) అని పిల్లలకు అర్థం చేయించారు. ఆత్మ ఉపరి భాగములో పంచ తత్వాలకు పైన ఉంటుంది. ఈ ప్రపంచములోని వస్తువులు, పదార్థములన్నీ పంచ తత్వాలతోనే తయారైనవి. ఆత్మ అలా తయారవ్వదు. ఆత్మ సదా ఉండనే ఉంటుంది. కేవలం పుణ్యాత్మ, పాపాత్మగా అవుతూ ఉంటుంది. 5 వికారాల వలన ఎంతో మురికిగా తయారవుతుంది. ఇప్పుడు పాపాల నుండి విడుదల చేయించేందుకు తండ్రి వచ్చారు. వికారాల వల్లనే స్వభావాలు(క్యారెక్టర్లు) చెడిపోతాయి. క్యారెక్టరు అని దేనినంటారో కూడా ఎవ్వరికీ తెలియదు. పాండవ రాజ్యము, కౌరవ రాజ్యము అని గాయనం కూడా ఉంది. ఇప్పుడు పాండవులంటే ఎవరో కూడా ఎవ్వరికీ తెలియదు. మనము ఈశ్వరీయ ప్రభుత్వానికి చెందినవారమని మీరు భావిస్తున్నారు. రామరాజ్యాన్ని స్థాపన చేసేందుకు తండ్రి వచ్చారు. ఈ సమయములో ఈశ్వరీయ ప్రభుత్వము ఏం చేస్తుంది? ఆత్మలను పావనంగా చేసి దేవతలుగా చేస్తుంది. లేకుంటే దేవతలు ఎక్కడ నుండి వస్తారు! ఇది ఎవ్వరికీ తెలియదు. అందుకే దీనిని 'గుప్త ప్రభుత్వము' అని అంటారు. ఇది కూడా మానవులదే కానీ దేవతలుగా ఎలా తయారవ్వాలి, ఎవరు చేశారు? దేవీ దేవతలైతే స్వర్గములోనే ఉంటారు అయితే వారిని స్వర్గవాసులుగా చేసింది ఎవరు? స్వర్గవాసులే మళ్లీ నరకవాసులుగా అవుతారు. నరకవాసులే మళ్లీ స్వర్గవాసులుగా అవుతారు. మొదట ఇది మీకు కూడా తెలియదు. మీకే తెలియకుంటే ఇతరులకెలా తెలుస్తుంది? స్వర్గమని సత్యయుగాన్ని, నరకమని కలియుగాన్ని అంటారు. ఇది కూడా మీరు ఇప్పుడే అర్థం చేసుకున్నారు. ఇది తయారైన డ్రామా. ఈ చదువు పతితుల నుండి పావనంగా చేయుటకే. ఆత్మయే పతితంగా అవుతుంది. పతితుల నుండి పావనంగా చేసే వ్యాపారాన్ని ఆ తండ్రే మీకు నేర్పించారు. పవిత్రమైతే పావన ప్రపంచములోకి వెళ్తారు. ఆత్మయే పావనమైనప్పుడు స్వర్గానికి అర్హత పొందుతుంది. ఈ జ్ఞానము మీకు ఈ సంగమ యుగములో మాత్రమే లభిస్తుంది. పవిత్రంగా అయ్యేందుకు ఆయుధము లభిస్తుంది. పతితపావనుడని ఆ తండ్రిని ఒక్కరిని మాత్రమే అంటారు. మమ్ములను పావనంగా చేయండి అని అంటారు. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి అధికారులుగా ఉండేవారు. తర్వాత 84 జన్మలు తీసుకొని పతితంగా అయ్యారు. శ్యామము, సుందరము(పతితము, పావనము) వీరి పేరు కూడా అలాగే పెట్టారు. కానీ మనుష్యులకు దాని అర్థము తెలియదు. కృష్ణుడంటే ఎవరో స్పష్టమైన జ్ఞానము కూడా లభిస్తుంది. ఇందులో రెండు ప్రపంచాలుగా చేసేశారు. వాస్తవానికి ఉన్నది ఒకే ప్రపంచము. అదే ప్రపంచము క్రొత్తదిగా, పాతదిగా అవుతూ ఉంటుంది. మొదట చిన్న పిల్లలుగా ఉంటారు, వారే పెరిగి పెద్దవారై వృద్ధులుగా అవుతారు. అలాగే ఈ ప్రపంచము కూడా కొత్తది నుండి పాతదిగా అవుతూ ఉంటుంది. ఈ విషయాలను అర్థం చేయించేందుకు మీరెంతగానో తలను బాదుకుంటారు(కష్టపడతారు). మీ రాజధానిని మీరే స్థాపన చేసుకుంటున్నారు కదా. వీరు కూడా అర్థం చేసుకున్నారు కదా. ఈ జ్ఞానము ద్వారా ఎంతో మధురంగా తయారయ్యారు. అర్థం చేయించిన వారెవరు? స్వయం భగవంతుడు. యుద్ధము మొదలైనవాటి మాటే లేదు. భగవంతుడు మనలను ఎంతో తెలివిగలవారిగా, జ్ఞాన సంపన్నులుగా చేస్తున్నారు. శివాలయానికి వెళ్లి నమస్కరిస్తారు. అయితే వారెవరు? ఏమిటి? అనేది ఎవ్వరికీ తెలియదు. శివకాశి విశ్వనాథ గంగ,.............. అని కేవలం నోటితో పలుకుతూ ఉంటారు. కానీ అర్థం కొంచెము కూడా తెలియదు. మీరు తెలిపితే, మీరు మాకేం చెప్తారు? మేము వేదశాస్త్రాలు మొదలైనవన్నీ చదువుకున్నామని అంటారు. పిల్లలైన మీలో కూడా ఈ విషయాలను ధారణ చేయువారు నెంబరువారుగా ఉన్నారు. కొంతమంది అయితే మర్చిపోతారు. ఎందుకంటే పూర్తి రాతిబుద్ధిగా అయ్యారు. ఇప్పుడు పారస(బంగారు) బుద్ధిగా అయినవారి కర్తవ్యము - ఇతరులను కూడా పారసబుద్ధిగా తయారు చేయడం. రాతి బుద్ధిగలవారి పనులే ఇలా ఉంటాయి. ఎందుకంటే హంసలు-కొంగలు అయినారు కదా. హంసలు ఎప్పుడూ ఎవ్వరికీ దు:ఖము ఇవ్వరు. కొంగలు దు:ఖమునిస్తారు. అటువంటి వారిని అసురులని అంటారు. వారిని గుర్తు పట్టలేము. చాలా సెంటర్లకు కూడా ఇలాంటి వికారులు చాలామంది వస్తారు. పవిత్రంగా ఉన్నామని అంటారు, సాకులు కూడా చెప్తారు. కానీ చెప్పేదంతా అసత్యము. అసత్య ప్రపంచము.......... అని కూడా అంటారు. ఇప్పుడిది సంగమ యుగము. ఎంత వ్యత్యాసముంది. అసత్యము చెప్పేవారు, అసత్య కర్మలు చేయువారు మూడవ గ్రేడ్‌గా అవుతారు. ఫస్ట్‌, సెకెండు, థర్డ్‌ గ్రేడులు ఉంటాయి కదా. తండ్రి చెప్తున్నారు - ఇది థర్డ్‌ గ్రేడ్‌.
తండ్రి అర్థం చేయిస్తున్నారు - పవిత్రతకు పూర్తి ఋజువునివ్వండి. ఉదాహరణంగా అవ్వండి. మీరిరువురూ (స్త్రీ, పురుషులు) కలిసి పవిత్రంగా ఉండడం అసంభవమని చాలామంది అంటారు. కానీ పిల్లలలో యోగబలము లేని కారణంగా ఇంత సులభమైన విషయాన్ని కూడా పూర్ణ రీతిగా అర్థము చేయించలేరు. ఇక్కడ మమ్ములను భగవంతుడు చదివిస్తున్నారనే విషయము వారికి ఎవ్వరూ అర్థం చేయించలేరు. పవిత్రులవ్వడం వలన మీరు 21 జన్మలు స్వర్గానికి అధికారులవుతారని భగవంతుడు చెప్తున్నారు. చాలా గొప్ప లాటరీ లభిస్తుంది. మనకు చాలా సంతోషంగా ఉంటుంది. చాలామంది పిల్లలు గాంధర్వ వివాహము చేసుకొని పవిత్రంగా ఉండి చూపిస్తారు. దేవీ దేవతలు పవిత్రులు కదా. అపవిత్రులను పవిత్రంగా చేయగలిగేది ఒక్క తండ్రి మాత్రమే. జ్ఞానము, భక్తి, వైరాగ్యాలను గురించి కూడా అర్థం చేయించారు. జ్ఞానము సగము, భక్తి సగము, భక్తి తర్వాత వైరాగ్యము. ఇప్పుడు ఈ పతిత ప్రపంచములో ఉండరాదు, ఈ శరీరమనే వస్త్ర్రాన్ని ఇక్కడే వదిలి ఇంటికి వెళ్లాలి. 84 జన్మల చక్రము ఇప్పుడు పూర్తి అయ్యింది. ఇప్పుడు మనము శాంతిధామానికి వెళ్తాము. మొట్టమొదట అల్ఫ్‌(శివబాబా)ను మర్చిపోరాదు. పాత ప్రపంచము తప్పకుండా సమాప్తమవుతుందని పిల్లలకు తెలుసు. తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. తండ్రి అనేకసార్లు నూతన ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు వచ్చారు. మళ్లీ నరకము వినాశనమవుతుంది. నరకము చాలా పెద్దది. స్వర్గము చాలా చిన్నది. నూతన ప్రపంచములో ఒకే ధర్మము ఉంటుంది. ఇక్కడైతే అనేక ధర్మాలున్నాయి. శంకరుని ద్వారా వినాశనమవుతుందని వ్రాయను కూడా వ్రాశారు. అనేక ధర్మాలు నశించి బ్రహ్మ ద్వారా ఒకే ఒక ధర్మము స్థాపనవుతుంది. ఈ ధర్మాన్ని స్థాపించిన వారెవరు? బ్రహ్మ అయితే చేయలేడు. ఈ బ్రహ్మనే పతితము నుండి మళ్లీ పావనంగా అవుతాడు. నన్ను ఎప్పుడూ పతితము నుండి పావనంగా అవుతానని అనరు. పావనులనగా లక్ష్మీనారాయణులు. పతితమంటే బ్రహ్మ. బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి. వారిని(శివబాబాను) అనాది సృష్టికర్త అని అంటారు. ఆత్మలైతే ఉండనే ఉన్నాయి. నన్ను ఆత్మల సృష్టికర్త అని అనరు. అందుకే ఆత్మలను అనాది అని అంటారు. తండి అనాది, ఆత్మలు కూడా అనాదియే. ఈ డ్రామా కూడా అనాదే. ఇది అనాదిలో తయారుచేయబడిన డ్రామా. ఆత్మకు సృష్టి చక్రము యొక్క ఆదిమధ్యాంతాల వ్యవధి గురించిన జ్ఞానము లభిస్తుంది. ఆ జ్ఞానము ఎవరు ఇచ్చారు? తండ్రి ఇచ్చారు. 21 జన్మలు ఆ తండ్రికి చెందినవారిగా ఉంటారు. తర్వాత రావణ రాజ్యములో అనాథలైపోతారు. ఆ స్వభావము, గుణాలు చెడిపోతాయి. వికారాల వశమైపోతారు. నరకము, స్వర్గము కలిసి నడుస్తాయని మానవులు భావిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఎంతో స్పష్టంగా అర్థం చేయించబడ్తుంది. ఇప్పుడు మీరు గుప్తంగా ఉన్నారు. శాస్త్రాలలో ఏమేమో వ్రాసేశారు. పిల్లలెంతో గందరగోళములో పడి ఉన్నారు. మేమెందుకూ పనికి రాకుండా ఉన్నామని, మీరు వచ్చి పావనంగా చేసి మా స్వభావాన్ని చక్కదిద్దండి అని తండ్రిని పిలుస్తారు. వారు వచ్చి మీ స్వభావమును, మీ వ్యక్తిత్వమును ఎంతగా బాగు చేస్తారు! చక్కదిద్దుతారు! కొంతమంది బాగుపడేందుకు బదులు ఇంకా పాడవుతారు. నడవడిక ద్వారానే తెలిసిపోతుంది. ఈ రోజు హంసలుగా ఉంటారు, రేపు కొంగలుగా అయిపోతారు. ఆలస్యమే ఉండదు. మాయ కూడా చాలా గుప్తమైనది. ఇక్కడ ఏ మాత్రము కనిపించదు. బయటకు వెళ్తూనే కనిపిస్తుంది. మళ్లీ ఆశ్చర్యంగా వింటారు, చెప్తారు....... పారిపోతారు. ఎముకలు విరుగునట్లు వేగంగా క్రింద పడిపోతారు. ఇది ఇంద్రప్రస్థము. వెంటనే తెలిసిపోతుంది. అటువంటివారు మళ్లీ సభలోకి రాకూడదు. కొద్దిగా జ్ఞానము విన్నా స్వర్గములోకి రానే వస్తారు. జ్ఞానము నశించదు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - పురుషార్థము చేసి ఉన్నత పదవి పొందుకోండి. వికారాలకు వశమైతే పదవి భ్రష్ఠమైపోతుంది. ఇప్పుడు సృష్టి చక్రము ఎలా తిరుగుతూ ఉందో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు.
ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధి ఎంతో మార్పు చెందుతుంది. అయినా మాయ మళ్లీ తప్పకుండా మోసము చేస్తుంది. ఇచ్ఛా మాత్రం అవిద్యగా అవ్వాలి. ఏ కోరికా మిగిలిపోలేదు కదా. అలా ఉంచుకుంటే పైసకు కొరగాకుండా అయిపోతారు. మంచి-మంచి మహారథులను కూడా ఏదో ఒక విధంగా మోసగిస్తుంది. అటువంటివారు మళ్లీ హృదయమును అధిరోహించలేరు. కొంతమంది పిల్లలు తమ తండ్రిని కూడా చంపేందుకు వెనుకాడరు, ఆలస్యము చేయరు. కుటుంబాన్ని కూడా సమాప్తము చేసేస్తారు. వారు మహాపాపాత్మలు. రావణుడు ఏమేమో చేయిస్తాడు. చాలా అసహ్యము కలుగుతుంది. ఇది ఎంత మురికి ప్రపంచంగా ఉంది! దీని పై ఎప్పుడూ మనసు ఉంచరాదు. పవిత్రంగా అయ్యేందుకు చాలా ధైర్యముండాలి. విశ్వ చక్రవర్తి పదవిని బహుమతిగా పొందేందుకు పవిత్రతయే ముఖ్యమైనది. పవిత్రత విషయములో ఎన్నో గలాటాలు జరుగుతాయి. గాంధీ కూడా ''ఓ పతితపావనా! రండి'' అని పిలిచేవాడు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - చరిత్ర, భూగోళాలు మళ్లీ రిపీట్‌ అవుతాయి. అందరూ వాపస్‌ రావలసిందే. అప్పుడే అందరూ కలిసి వెళ్తారు. తండ్రి కూడా అందరినీ ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చారు కదా. తండ్రి రాకుండా ఎవ్వరూ ఇంటికి వెళ్లలేరు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మాయ చేసే మోసము నుండి తప్పించుకునేందుకు ఎలాంటి కోరికలు ఉంచుకోరాదు. ఇచ్ఛా మత్రం అవిద్యగా అవ్వాలి.
2. విశ్వ చక్రవర్తిత్వ పదవిని బహుమతిగా తీసుకునేందుకు ముఖ్యమైనది పవిత్రత. అందుకే పవిత్రంగా అయ్యేందుకు ధైర్యము వహించండి. మీ స్వభావాన్ని చక్కదిద్దుకోండి.

వరదానము :- '' దయా భావన ద్వారా నిమిత్త భావముతో సేవ చేసే సర్వ ఆకర్షణ (లగావ్‌) ముక్త్‌ భవ ''
వర్తమాన సమయంలో ఆత్మలందరు అలసి, నిరాశ చెంది దయ, కరుణను వేడుకుంటున్నారు. ఇప్పుడు దాత పిల్లలైన మీరు మీ సోదరి - సోదరుల పై దయాహృదయులుగా అవ్వండి. ఎవరు ఎంత చెడ్డవారైనా వారి పై కూడా దయా భావన కలిగి ఉంటే ఎప్పుడూ ఘృణ, ఈర్ష్య లేక క్రోధ భావన రాదు. దయా భావన సహజంగా నిమిత్త భావమును ఉత్పన్నము చేస్తుంది. ఆకర్షణ వలన దయ కలగదు. సత్యమైన దయ ఆకర్షణ ముక్తులుగా చేస్తుంది. ఎందుకంటే అందులో దేహ భావముండదు.

స్లోగన్‌ :- '' ఇతరులకు సహయోగమివ్వడమే స్వంత ఖాతాను జమ చేసుకోవడం ( పెంచుకోవడం ) ''

Sunday, 3 November 2019

Telugu Murli 04/11/2019

04-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - మొట్టమొదట అందరికీ అల్ఫ్‌(భగవంతుని) పాఠాన్ని పక్కా చేయించండి, మీరంతా ఆత్మలు పరస్పరములో సోదరులు(భాయి - భాయి). ''

ప్రశ్న :- ఏ విషయములో శ్రీమతము, మానవ మతము నుండి పూర్తి విపరీతంగా ఉంది ?
జవాబు :- '' మేము మోక్షములోకి వెళ్తాము '' అని మనుష్య మతము చెప్తుంది. ''ఈ డ్రామా అనాది, అవినాశి'' అని శ్రీమతము చెప్తుంది. మోక్షము ఎవ్వరికీ లభించదు. ఈ పాత్రను అభినయించేందుకు నాకు ఇష్టము లేదని ఎవరు చెప్పినా ఇందులో ఎవ్వరూ ఏమీ చేయలేరు. పాత్రను అభినయించేందుకు తప్పకుండా రావలసిందే. శ్రీమతం ఒక్కటే మిమ్ములను శ్రేష్ఠంగా చేస్తుంది. మానవ మతాలైతే అనేక ప్రకారాలుగా ఉన్నాయి.

ఓంశాంతి. మేము బాబా ఎదురుగా కూర్చొని ఉన్నామని పిల్లలకు తెలుసు. పిల్లలు నా ఎదురుగా కూర్చొని ఉన్నారని తండ్రికి కూడా తెలుసు. తండ్రి మనకు శిక్షణ ఇస్తున్నారని, దానిని మనము ఇతరులకు ఇవ్వాలని కూడా పిల్లలైన మీకు తెలుసు. మొట్టమొదట తండ్రి పరిచయమునే ఇవ్వాలి. ఎందుకంటే అందరూ తండ్రిని, వారిచ్చిన శిక్షణలను మర్చిపోయారు. ఇప్పుడు తండ్రి చదివించే చదువు మళ్లీ 5 వేల సంవత్సరాల తర్వాత లభిస్తుంది. ఈ జ్ఞానము ఇతరులెవ్వరికీ లేనే లేదు. ముఖ్యమైనది తండ్రి పరిచయము, ఆ తర్వాత ఇదంతా అర్థం చేయించాలి. మనమంతా సోదరులము. ప్రపంచములోని ఆత్మలంతా పరస్పరము సోదరులే. అందరూ వారికి లభించిన తమ-తమ పాత్రలను ఈ శరీరాల ద్వారా అభినయిస్తున్నారు. నూతన ప్రపంచములోకి తీసుకెళ్లేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు. దానిని స్వర్గమని అంటారు. అయితే ఇప్పుడు సోదరులమైన మనమంతా పతితులుగా ఉన్నాము. ఒక్కరు కూడా పవిత్రంగా లేరు. పతితులందరినీ పావనంగా చేయువారు ఆ తండ్రి ఒక్కరే. ఇది పతిత వికారీ రావణ ప్రపంచము. రావణుడంటే స్త్రీలోని 5 వికారాలు, పురుషునిలోని 5 వికారాలు. తండ్రి చాలా సులభమైన(సింపుల్‌) పద్ధతిలో అర్థం చేయిస్తున్నారు, మీరు కూడా ఇతరులకు ఇలాగే అర్థం చేయించండి. మొట్టమొదట వారు ఆత్మలమైన మన తండ్రి అని, మనమంతా సోదరులమని అర్థం చేయించండి. ఇది సరియైనదేనా? అని అడగండి. మనమంతా సోదరులము (భాయి-భాయి) అని వ్రాయండి. మన అందరి తండ్రి కూడా ఒక్కరే. మనమంతా ఆత్మలము. వారు పరమ-ఆత్మ(సుప్రీమ్‌సోల్‌). వారిని అందరూ తండ్రి అని అంటారు. ఇది పక్కాగా బుద్ధిలో కూర్చోబెట్తే సర్వవ్యాపి మొదలైన చెత్త, మురికి అంతా తొలగిపోతుంది. మొదట భగవంతుని(అల్ఫ్‌) గురించి చదివించాలి. ''మొదట సర్వవ్యాపి అని అంటూ ఉండేవాడిని, కానీ పరమాత్మ సర్వవ్యాపి కాదని ఇప్పుడు అర్థం చేసుకున్నాను'' అని అర్థం చేయించిన తర్వాత వారితో వ్రాయించండి. మనమంతా సోదరులము. ఆత్మలంతా వారిని గాడ్‌ఫాదర్‌, పరమపిత పరమాత్మ, అల్లా అని అంటారు. మనమంతా ఆత్మలము, పరమాత్మ కాదు అని మొదట నిశ్చయము చేయించాలి. పరమాత్మ మాలో సర్వవ్యాపకంగా లేరు. అందరిలో ఆత్మ వ్యాపకంగా ఉంది. ఆత్మ శరీరము ఆధారముతో పాత్రను అభినయిస్తుంది. ఈ విషయాన్ని పక్కా చేయించండి. ఆ తండ్రి వచ్చి ఈ సృష్టిచక్రము ఆదిమధ్యాంతాల జ్ఞానము వినిపిస్తున్నారు. ఆ తండ్రియే టీచరు రూపములో కూర్చొని అర్థం చేయిస్తున్నారు. లక్షల సంవత్సరాల మాటే లేదు. ఈ చక్రము అనాదిగా తయారై ఉంది. సమానంగా ఎట్లుందో కూడా తెలుసుకోవాలి. సత్య-త్రేతా యుగాలు గతించి పోయాయని నోట్‌ చేసుకోండి. వాటిని స్వర్గము, సెమీ స్వర్గమని అంటారు. అక్కడ దేవీ దేవతల రాజ్యము నడుస్తుంది. సత్యయుగములో 16 కళలు, త్రేతాలో 14 కళలు ఉంటాయి. సత్యయుగ ప్రభావము చాలా గొప్పది. దాని పేరే స్వర్గము, హెవెన్‌. సత్యయుగమును నూతన ప్రపంచమని అంటారు. దానినే మహిమ చేయాలి. నూతన ప్రపంచములో ఒకే ఒక ఆది సనాతన దేవీ దేవతా ధర్మముంటుంది. నిశ్చయము చేయించేందుకు మీ వద్ద చిత్ర్రాలు కూడా ఉన్నాయి. ఈ సృష్టిచక్రము తిరుగుతూనే ఉంటుంది. కల్పము ఆయువు 5 వేల సంవత్సరాలు. ఇప్పుడు సూర్యవంశమంటే ఏమిటో, చంద్రవంశమంటే ఏమిటో బుద్ధిలో కూర్చుంది కదా. విష్ణుపురమే పరివర్తనై సీతా-రాముల పురంగా అవుతుంది. వారి వంశము కూడా నడుస్తుంది కదా. రెండు యుగాలు గతించిన తర్వాత మళ్లీ ద్వాపరయుగము వస్తుంది. అది రావణ రాజ్యము. దేవతలు వామమార్గము(వేద విరుద్ధమైన తంత్ర-మంత్రములతో కూడి మధు,మాంస, మిధునత్వాలకు తావిచ్చెడి జీవితము)లోకి వెళ్లిపోతారు. అప్పటి నుండి వికారాల పద్ధతి తయారవుతుంది. సత్య-త్రేతా యుగాలలో అందరూ నిర్వికారులుగా ఉంటారు. ఆదిసనాతనా దేవీ దేవతా ధర్మమొక్కటే ఉంటుంది. చిత్రాలు చూపిస్తూ, నోటితో కూడా అర్థం చేయించాలి. ఆ తండ్రి, టీచరుగా అయ్యి మనలను ఇలా చదివిస్తున్నారు. తండ్రి వచ్చి తన పరిచయము తానే ఇస్తున్నారు - '' పతితులను పావనంగా చేసేందుకు నేను వస్తాను, కనుక నాకు తప్పకుండా శరీరము కావాలి.'' లేకుంటే నేను ఎలా మాట్లాడాలి? నేను చైతన్యాన్ని, సత్యాన్ని, అమరుడను. ఆత్మయే సతో, రజో, తమోలోకి వస్తుంది. ఆత్మయే పతితంగా, ఆత్మయే పావనంగా అవుతుంది. ఆత్మలోనే అన్ని సంస్కారాలు ఉంటాయి. జరిగిపోయిన(గత జన్మలోని) కర్మ, వికర్మల సంస్కారాలు ఆత్మయే తన వెంట తీసుకొస్తుంది. సత్యయుగములో అయితే వికర్మలు జరగనే జరగవు. కర్మలు చేస్తారు, పాత్రను అభినయిస్తారు. కానీ అక్కడ కర్మలు అకర్మలుగా అవుతాయి. గీతలో కూడా ఈ పదాలున్నాయి. ఇప్పుడు మీరు ప్రాక్టికల్‌గా అర్థం చేసుకుంటున్నారు. పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి నూతన ప్రపంచంగా చేసేందుకు బాబా వచ్చారని మీకు తెలుసు. అక్కడ కర్మలు అకర్మలుగా ఉంటాయి. దానినే సత్యయుగమని అంటారు. ఇక్కడ కర్మలు వికర్మలుగానే అవుతాయి. దానిని కలియుగమని అంటారు. మీరిప్పుడు సంగమ యుగములో ఉన్నారు. ఇప్పుడు బాబా ఇరువైపులా ఉన్న విషయాలన్నీ వినిపిస్తారు. ఆ తండ్రి టీచరై, ఏమేమి అర్థం చేయిస్తున్నారో ఒక్కొక్క విషయాన్ని బాగా అర్థము చేసుకోండి. ఆ తర్వాత గురువుగారి కర్తవ్యము, పతితులైన మమ్ములను మీరు వచ్చి, పావనంగా చేయండని పిలిచింది మీరే కదా. ఆత్మ పావనంగా అయితే శరీరము కూడా పావనంగా అవుతుంది. బంగారమెలా ఉంటుందో ఆభరణము కూడా అలాగే ఉంటుంది. 24 క్యారెట్ల బంగారము తీసుకొని అందులో కల్తీ వేయకుంటే నగ(ఆభరణము) కూడా అదే విధంగా స్వచ్ఛంగా, సతోప్రధానంగా తయారవుతుంది. కల్తీ చేస్తే(అలాయ్‌ కలిపితే) తమోప్రధానంగా అవుతుంది. ఎందుకంటే ఇతర లోహము(రాగి మొదలైనవి) కలుపుతారని తెలుసు కదా. మొట్టమొదట భారతదేశము 24 క్యారెట్లు స్వచ్ఛమైన బంగారు పక్షి అనగా సతోప్రధానంగా, నూతన ప్రపంచంగా ఉండేది. అది ఇప్పుడు మళ్లీ తమోప్రధానంగా అయిపోయింది. మొట్టమొదట స్వచ్ఛమైన బంగారుగా ఉండేది. నూతన ప్రపంచము పవిత్రమైనది. పాత ప్రపంచము అపవిత్రమైనది. కల్తీ(మురికి) ఏర్పడుతూ పోతుంది. ఇదంతా ఆ తండ్రే తెలుపుచున్నారు. ఏ ఇతర మానవ గురువులకు తెలియదు. మీరు వచ్చి పావనంగా చేయమని పిలుస్తారు. సద్గురువు కర్తవ్యము వానప్రస్థ స్థితిలో ఉన్న మనుష్యులను గృహస్థము నుండి అతీతంగా చేయించడం. స్వయంగా ఆ తండ్రియే వచ్చి ఈ జ్ఞానమంతా డ్రామా ప్లాను అనుసారము ఇస్తున్నారు. వారు మానవ సృష్టికి బీజరూపులు. వారే స్వయంగా కల్పవృక్ష జ్ఞానమంతా పూర్తిగా అర్థం చేయిస్తున్నారు. శివబాబా పేరు ఎల్లప్పుడూ శివుడే(సదా శివుడు). మిగిలిన ఆత్మలు పాత్రను అభినయించేందుకు వచ్చినప్పుడు భిన్న భిన్న నామ-రూపాలను ధరిస్తాయి. తండ్రినేమో పిలుస్తారు కానీ వారెవరో, వారు మిమ్ములను పావన ప్రపంచములోకి తీసుకెళ్లేందుకు భాగ్యశాలి రథములో ఎలా వస్తారో తెలియదు. కనుక తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకుంటారో వారి అంతిమ జన్మలోని శరీరములో వస్తాను. రాజాధి రాజులుగా తయారు చేసేందుకు ఈ భాగ్యశాలి రథములో ప్రవేశించాల్సి వస్తుంది. మొదటి నంబరులోని వారు శ్రీకృష్ణుడు. అతడు నూతన ప్రపంచానికి అధికారి. తర్వాత అతడే క్రిందకు దిగుతాడు. సూర్యవంశి, చంద్రవంశి, వైశ్య, శూద్ర వంశీయులుగా, ఆ తర్వాత బ్రాహ్మ వంశీయులుగా అవుతాడు. బంగారు నుండి వెండి.......... మళ్లీ ఇప్పుడు మీరు ఇనుము నుండి బంగారుగా తయారవుతూ ఉన్నారు. తండ్రి చెప్తున్నారు - మీ తండ్రి అయిన నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. నేను ఎవరి శరీరములో ప్రవేశించానో, వారి ఆత్మలో కూడా మొదట కొంచెము కూడా ఈ జ్ఞానము లేదు. ఇతనిలో నేను ప్రవేశిస్తాను. అందుకే ఇతడిని భాగ్యశాలి రథమని అంటారు. వారు స్వయంగా చెప్తున్నారు - నేను ఇతని అనేక జన్మల అంత్యములో వస్తాను. గీతలో ఈ పదాలు ఆక్యురేట్‌(రైట్‌)గా ఉన్నాయి. అందుకే గీతను సర్వశాస్త్రమయి శిరోమణి అని అంటారు.
ఈ సంగమ యుగములోనే తండ్రి వచ్చి బ్రాహ్మణ కులమును, దేవీ దేవతా కులమును స్థాపన చేస్తున్నారు. ఇతరుల గురించి అందరికీ తెలుసు కానీ వీరిని గురించి ఎవ్వరికీ తెలియదు. అనేక జన్మల అంతిమ జన్మలో అనగా సంగమ యుగములోనే తండ్రి వస్తారు. తండ్రి చెప్తున్నారు - నేను బీజరూపమును. కృష్ణుడైతే సత్యయుగ నివాసి. ఇతర సమయాలలో, ఇతర ప్రదేశాలలో, అతనిని ఎవ్వరూ చూడలేరు. పునర్జన్మలలో నామ, రూప, దేశ, కాలములన్నీ మారిపోతాయి. మొదట చిన్న బాలుడు చాలా సుందరంగా ఉంటాడు, తర్వాత పెరిగి పెద్దవాడవుతాడు. తర్వాత మళ్లీ ఆ శరీరాన్ని వదిలి మరో చిన్న శరీరము తీసుకుంటాడు. ఇది తయారైన డ్రామా. డ్రామాలో అలా నిర్ణయించబడింది. తర్వాత శరీరములో అతడిని(ఆ ఆత్మను) కృష్ణుడని అనరు. తర్వాతి శరీరములో నామ-రూపాలు మొదలైనవన్నీ వేరుగా ఉంటాయి. సమయము, రూపు రేఖలు, తిథి-తారీఖులు మొదలైనవన్నీ మారిపోతాయి. ప్రపంచ చరిత్ర-భూగోళము ఉన్నదున్నట్లు రిపీట్‌ అవుతాయని అంటారు. కనుక ఈ డ్రామా రిపీట్‌ అవుతూ ఉంటుంది. సతో, రజో, తమోలో తప్పకుండా రావాల్సిందే. సృష్టి పేరు, యుగము పేరు అన్నీ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడిది సంగమ యుగము. నేను సంగమ యుగములోనే వస్తాను. దీనిని మనము ఆంతరికములో పక్కా చేసుకోవాలి. ఆ తండ్రి మనకు తండ్రి, టీచరు, గురువు అయ్యారు. వారు మళ్లీ మనము సతోప్రధానంగా అయ్యేందుకు యుక్తులను కూడా చాలా బాగా అర్థం చేయిస్తారు. గీతలో కూడా - దేహ సహితంగా దేహ ధర్మాలన్నీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించమని ఉంది కదా. మనము ఇంటికి వాపస్‌ వెళ్లే తీరాలి. భగవంతుని వద్దకు వెళ్లేందుకు భక్తిమార్గములో ఎంతో శ్రమిస్తారు. అది ముక్తిధామము, కర్మల నుండి ముక్తమై మనము నిరాకార ప్రపంచములోకి వెళ్లి కూర్చుంటాము. నటించేవారు ఇంటికి వెళ్తే పాత్ర నుండి ముక్తులుగా అవుతారు. అందరూ ముక్తి పొందాలని కోరుకుంటారు. కానీ ముక్తి ఎవ్వరికీ లభించజాలదు. ఇది అనాది, అవినాశి డ్రామా. ఈ పాత్ర చేయడం నాకిష్టము లేదు అని ఎవరైనా అన్నా, ఇందులో ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇది అనాదిగా తయారైన డ్రామా. ఒక్కరు కూడా ముక్తిని పొందలేరు. అవన్నీ అనేక ప్రకారాల మనుష్యుల మతాలు. ఇది శ్రేష్ఠంగా తయారు చేసే శ్రీమతము. మనుష్యులను శ్రేష్ఠులని అనరు. దేవతలను శ్రేష్ఠులని అంటారు. వారి ముందు అందరూ తల వంచి నమస్కరిస్తారు. కనుక వారు శ్రేష్ఠమైనవారే కదా. కానీ ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు 84 జన్మలు తీసుకోవలసిందేనని అర్థం చేసుకున్నారు. శ్రీ కృష్ణుడు దేవత, వైకుంఠములోని రాకుమారుడు. అతడు ఇక్కడికెలా వస్తాడు? అతడు గీతను కూడా వినిపించలేదు, కేవలం అతడొక దేవత. అందువలన అతడిని అందరూ పూజిస్తారు. దేవతలు పవిత్రులు. పూజించేవారు పతితులుగా ఉన్నారు. నిర్గుణడైన నాలో ఏ గుణాలు లేవని, మీరు మమ్ములను ఇలా తయారుచేయండని కూడా అంటారు. శివుని ముందుకు వెళ్లి మాకు ముక్తిని ఇవ్వమని అంటారు. వారెప్పుడూ జీవన్ముక్తిలోకి గానీ, జీవన బంధనములోకి గానీ రానే రారు. అందుకే ముక్తినివ్వమని వారిని పిలుస్తారు. జీవన్ముక్తిని ఇచ్చేది కూడా వారే.
ఇప్పుడు మనమంతా బాబా-మమ్మా పిల్లలమని వారి నుండి మనకు అపారమైన ధనము లభిస్తుందని అర్థం చేసుకున్నారు. తెలియనందువలన(తెలివిహీనులైనందున) మానవులు యాచిస్తూ ఉంటారు. తెలివిలేని వారు తప్పక దుఃఖములోనే ఉంటారు కదా. అపారమైన దుఃఖమును అనుభవించివలసి వస్తుంది. కనుక ఈ విషయాలన్నీ పిల్లలు బుద్ధిలో ఉంచుకోవాలి. ఆ అనంతమైన తండ్రిని తెలుసుకోనందున పరస్పరము ఎంతగానో పోట్లాడుకుంటూ ఉంటారు, అనాథలుగా అయిపోయారు. వారు హద్దులోని అనాథలు(సాకార ప్రపంచములో ఆధారములైన తల్లిదండ్రులను కోల్పోయినవారు), వీరు బేహద్‌ అనాథలు. తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. ఇప్పుడిది పతితాత్మల పతిత ప్రపంచము. సత్యయుగాన్ని పావన ప్రపంచమని అంటారు. కలియుగమును పాత ప్రపంచమని అంటారు. కనుక ఈ విషయాలన్నీ బుద్ధిలో ఉన్నాయి కదా. పాత ప్రపంచము వినాశనమైపోతుంది తర్వాత మళ్లీ నూతన ప్రపంచములోకి బదిలీ అవుతారు. ఇప్పుడు మనము తాత్కాలికంగా సంగమ యుగములో నిల్చొని ఉన్నాము. పాత ప్రపంచము నుండి నూతన ప్రపంచము తయారవుతూ ఉంది. నూతన ప్రపంచము గురించి కూడా మీకు తెలుసు. మీ బుద్ధి ఇప్పుడు నూతన ప్రపంచములోకి వెళ్లాలి. కూర్చుంటూ, లేస్తూ మనము చదువుకుంటున్నామని, చదివించేవారు తండ్రి అని గుర్తుండాలి. విద్యార్థులకిది జ్ఞాపకముండాలి. అయినా ఆ స్మృతి నెంబరువారు పురుషార్థానుసారముగా ఉంటుంది. తండ్రి కూడా నంబరువారు పురుషార్థానుసారము ప్రియస్మృతులను తెలుపుతారు. బాగా చదివేవారిని టీచరు తప్పకుండా ఎక్కువగా ప్రేమిస్తారు. ఎంత తేడా ఏర్పడ్తుంది. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు, పిల్లలు ధారణ చేయాలి. ఒక్క తండ్రి పట్ల తప్ప ఇతరులెవ్వరి వైపుకు బుద్ధి పోరాదు. తండ్రిని స్మృతి చేయకుంటే పాపాలెలా నశిస్తాయి. మాయ పదే పదే మీ బుద్ధియోగమును తుంచేస్తుంది. మాయ చాలా మోసగిస్తుంది. భక్తిమార్గములో నేను లక్ష్మిని చాలా పూజించేవాడినని ఈ బాబా తన ఉదాహరణను ఇస్తున్నారు. లక్ష్మి పాదాలొత్తుచున్నట్లు చిత్రములో చూచి నేను ఆమెను దాని నుండి విముక్తి చేయించాను. శివబాబా స్మృతిలో కూర్చున్నప్పుడు బుద్ధి అటు ఇటు పోతే ''ఓ బుద్ధీ నీవు మరోవైపు ఎందుకు వెళ్తావు? '' అని నాకు నేను చెంప దెబ్బలు వేసుకునేవాడిని. చివరికి వినాశనము, స్థాపనలు కూడా చూశాను. సాక్షాత్కారమవ్వాలనే ఆశ పూర్తి అయ్యింది. కొత్త ప్రపంచం వస్తోందని, నేను ఇలా తయారవుతానని అర్థమయ్యింది. పోతే ఈ పాత ప్రపంచమైతే వినాశనమైపోతుందని దృఢ నిశ్చయము ఏర్పడింది. మా రాజధాని కూడా సాక్షాత్కారమయింది. అటువంటప్పుడు ఈ రావణ రాజ్యమును ఏం చేసుకోవాలి? స్వర్గ రాజ్యాధికారమే లభిస్తున్నపుడు దీనినేమి చేసుకోవాలి? ఇలా నిర్ణయించుకోవడమే ఈశ్వరీయ బుద్ధి. ఈశ్వరుడే ప్రవేశించి నా బుద్ధిని నడిపించారు. జ్ఞాన కలశమేమో మాతలకు లభిస్తుంది. అందుకే సర్వస్వమూ మాతలకే ఇచ్చేశాను. మీరు ఈ కార్యవ్యవహారాలన్నీ సంభాళించండి. అందరికీ నేర్పించండి. నేర్పిస్తూ, నేర్పిస్తూ ఇంతవరకు వచ్చారు. క్రమక్రమంగా ఒకరికొకరు వినిపిస్తూ వినిపిస్తూ ఇప్పుడు ఎంతమంది తయారయ్యారో చూడండి. ఆత్మ పవిత్రమౌవుతూ పోతుంది. తర్వాత ఆత్మకు శరీరము కూడా పవిత్రమైనది కావాలి. అర్థము కూడా చేసుకుంటారు కానీ మాయ మరిపింపచేస్తుంది.
ఏడు రోజుల కోర్సు తీసుకోమని మీరు చెప్తే రేపటి నుండి వస్తామని చెప్తారు, ఆ రెండవ రోజు మాయ తినేస్తుంది. రానే రారు. భగవంతుడు చదివిస్తున్నారంటే వచ్చి చదువుకోరు. తప్పకుండా వస్తామని కూడా అంటారు కానీ మాయ ఎగరగొట్టేస్తుంది. రెగ్యులర్‌గా రానివ్వదు. కల్పక్రితము ఎవరైతే పురుషార్థము చేశారో, వారు తప్పకుండా చేస్తారు. వేరే దుకాణమేదీ లేదు. మీరు చాలా పురుషార్థము చేస్తారు. పెద్ద పెద్ద మ్యూజియంలు నిర్మిస్తారు. కల్పక్రితము అర్థము చేసుకున్నవారే అర్థం చేసుకుంటారు. వినాశనమవుతుంది, స్థాపన కూడా జరుగుతూ ఉంటుంది. ఆత్మ చదువుకొని ఫస్ట్‌క్లాస్‌ శరీరము తీసుకుంటుంది. ఇది మీ లక్ష్యము కదా. ఎందుకు గుర్తుండదు? ఇప్పుడు మనము నూతన ప్రపంచములోకి మన పురుషార్థానుసారము వెళ్తాము. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. బుద్ధిలో ఇది సదా గుర్తుండాలి - మనమిప్పుడు కొంత సమయము కొరకు సంగమ యుగములో కూర్చొని ఉన్నాము, పాత ప్రపంచము వినాశనమవుతే మనము నూతన ప్రపంచములోకి బదిలీ అవుతాము. అందువలన దీని నుండి బుద్ధియోగమును తొలగించాలి.
2. సర్వాత్మలకు తండ్రి పరిచయాన్నిచ్చి కర్మ - అకర్మ - వికర్మల గుహ్య గతిని వినిపించాలి. మొట్టమొదట అల్ఫ్‌ (భగవంతుని) పాఠమును పక్కా చేయించాలి.

వరదానము :- '' కర్మ మరియు యోగాల బ్యాలన్స్‌ ద్వారా కర్మాతీత స్థితిని అనుభవం చేసే కర్మబంధనముక్త్‌ భవ ''
కర్మతో పాటు యోగం బ్యాలన్స్‌లో ఉంటే ప్రతి కర్మలో సఫలత స్వతహాగా ప్రాప్తి అవుతుంది. కర్మయోగి ఆత్మలు ఎప్పుడూ కర్మబంధనంలో చిక్కుకోరు. కర్మబంధనము నుండి ముక్తులుగా ఉన్నవారినే కర్మాతీతులని అంటారు. కర్మాతీతులంటే కర్మలు చేయకుండా అతీతంగా ఉండేవారని కాదు. కర్మతో అతీతం కాదు, కర్మబంధనంలో చిక్కుకోకుండా అతీతమవ్వండి. ఇటువంటి కర్మయోగి ఆత్మలు తమ కర్మలతో అనేకమంది కర్మలను శ్రేష్ఠంగా చేసేవారిగా ఉంటారు. వారికి ప్రతి కార్యము మనోరంజనంగా ఉంటుంది, కష్టంగా అనుభవమవ్వదు.

స్లోగన్‌ :- '' పరమాత్మ ప్రేమయే అమృతవేళలో నిదుర లేపే సమయమనే గంట ''

Saturday, 2 November 2019

Telugu Murli 03/11/2019

03-11-2019 ని అవ్యక్తబాప్‌దాదా కు ఓంశాంతి రివైజ్‌: 02-03-1985 మధువనము

'' వర్తమాన ఈశ్వరీయ జన్మ అమూల్యమైన జన్మ ''
ఈ రోజు రత్నాగరుడైన తండ్రి తమ అమూల్యమైన రత్నాలను చూస్తున్నారు. ఇది అలౌకిక అమూల్యమైన రత్నాల దర్బారు. ఒక్కొక్క రత్నము అమూల్యమైనది. ఈ వర్తమాన సమయము విశ్వంలోని మొత్తం సంపద లేక విశ్వంలోని మొత్తం ఖజానా ఒక దగ్గరకు చేర్చండి, దానితో పోలిస్తే ఒక్కొక్క ఈశ్వరీయ రత్నము చాలా రెట్లు విలువైనది. ఒక్కొక్క రత్నమైన మీ ముందు విశ్వంలోని మొత్తం ఖజానాలు ఏమీ కావు. మీరు అంత గొప్ప అమూల్యమైన రత్నాలు. ఈ అమూల్య రత్నాలు సంగమ యుగంలో తప్ప మొత్తం కల్పంలో మరెప్పుడూ లభించజాలవు. సత్యయుగ దేవాత్మల పాత్ర ఈ సంగమయుగ ఈశ్వరీయ అమూల్య రత్నాలుగా తయారయ్యే మీ పాత్ర ముందు సెకండ్‌ నెంబరుగా అవుతుంది. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానంగా ఉన్నారు. సత్యయుగంలో దైవీ సంతానంగా ఉంటారు. ఎలాగైతే ఈశ్వరునికి అందరికంటే శ్రేష్ఠమైన పేరు, మహిమ, జన్మ, కర్మ ఉందో అలా ఈశ్వరీయ రత్నాలకు లేక ఈశ్వరీయ సంతాన ఆత్మలైన మీకు సర్వ శ్రేష్ఠమైన విలువ ఉంది. ఈ శ్రేష్ఠమైన మహిమ లేక శ్రేష్ఠమైన విలువకు స్మృతి చిహ్నముగా ఇప్పుడు కూడా నవరత్నాల రూపంలో గాయనం మరియు పూజలు చేస్తారు. తొమ్మిది రత్నాలు భిన్న భిన్న విఘ్నవినాశక రత్నాలు అని గాయనం చేయబడ్తాయి. ఎలాంటి విఘ్నమో అలాంటి విశేషత గల రత్నంతో రింగు(ఉంగరం) తయారు చేసి ధరిస్తారు లేక లాకెట్‌లో వేసుకుని ధరిస్తారు లేక ఏదో ఒక రూపంలో ఆ రత్నాన్ని ఇంట్లో ఉంచుకుంటారు. ఇప్పుడు అంతిమ జన్మ వరకు విఘ్నవినాశక రూపంలో తమ స్మృతి చిహ్నాన్ని చూస్తున్నారు. నెంబర్‌వార్‌గా అయితే తప్పకుండా ఉన్నారు కానీ నెంబర్‌వార్‌గా ఉన్నా అందరూ అమూల్యంగా మరియు విఘ్న వినాశకులుగా ఉన్నారు. ఈ రోజు కూడా శ్రేష్ఠ స్వరూపంతో రత్నాలైన మిమ్ములను ఆత్మలు స్వమానంతో ఉంచుకుంటారు. చాలా ప్రేమతో, స్వచ్ఛతతో సంభాళించి ఉంచుకుంటారు. ఎందుకంటే మీరు స్వయాన్ని అంత యోగ్యులుగా భావించకపోవచ్చు కానీ తండ్రి ఆత్మలైన మీ అందరినీ యోగ్యులుగా భావించి తనవారిగా చేసుకున్నారు. ''నీవు నా వాడివి, నేను మీ వాడిని'' అని స్వీకరించారు. ఏ ఆత్మల పై తండ్రి దృష్టి పడిందో ఆ ఆత్మలు అమూల్యంగా అవుతూ ఉంటారు. ప్రభు దృష్టి కారణంగా ఈశ్వరీయ సృష్టిలో ఈశ్వరీయ ప్రపంచంలో శ్రేష్ఠ ఆత్మలగా అవ్వనే అవుతారు. పారసనాథుని సంబంధంలోకి వచ్చినందున పారస రంగు తప్పకుండా అంటుకుంటుంది. అందువలన పరమాత్మ ప్రేమ, దృష్టి లభించడం వలన మొత్తం కల్పమంతా చైతన్య దేవతల రూపంలో, అర్ధకల్పము జడ చిత్రాల రూపంలో లేక భిన్న-భిన్న స్మృతిచిహ్నాల రూపంలో ఉదాహరణానికి రత్నాల రూపంలో కూడా మీ స్మృతిచిహ్నం ఉంది. నక్షత్రాల రూపంలో కూడా మీ స్మృతిచిహ్నం ఉంది. ఏ రూపంలో మీ స్మృతిచిహ్నం ఉన్నా మొత్తం కల్పమంతా సర్వులకు ప్రియంగా ఉన్నారు. ఎందుకంటే అవినాశి ప్రేమసాగరుని ప్రేమ దృష్టి మొత్తం కల్పమంతా ప్రేమకు అధికారిగా తయారు చేస్తుంది. అందువలన భక్తులు అర్ధ ఘడియ, ఒక్క ఘడియ దృష్టి కొరకు, దృష్టి ద్వారా తృప్తి చెందాలని తపిస్తారు. అందువలన ఈ సమయంలోని ప్రేమ దృష్టి అవినాశి ప్రేమకు యోగ్యులుగా తయారు చేస్తుంది. అవినాశి ప్రాప్తి స్వత:గానే జరుగుతుంది. ప్రేమగా స్మృతి చేస్తారు, ప్రేమతో ఉంచుకుంటారు, ప్రేమతో చూస్తారు.
రెండవ విషయము - స్వచ్ఛత అనగా పవిత్రత. మీరు ఈ సమయంలో తండ్రి ద్వారా పవిత్రతను జన్మ సిద్ధ అధికారంగా ప్రాప్తి చేసుకుంటారు. పవిత్రత లేక స్వచ్ఛతను తమ స్వధర్మంగా తెలుసుకుంటారు. అందువలన పవిత్రతను స్వంతం చేసుకున్న కారణంగా ఎక్కడైతే మీ స్మృతిచిహ్నం ఉంటుందో అక్కడ పవిత్రత లేక స్వచ్ఛత ఇప్పుడు కూడా స్మృతిచిహ్న రూపంలో నడుస్తూ ఉంది అంతేకాక అర్ధకల్పమైతే పవిత్ర పాలన, పవిత్రతా ప్రపంచము ఉండనే ఉంటుంది. కావున అర్ధకల్పము పవిత్రతతోనే జన్మిస్తారు, పవిత్రతతోనే పాలింపబడ్తారు, మరో అర్ధకల్పము పవిత్రతతో పూజింపబడ్తారు.
మూడవ విషయము - గొప్ప మనసుతో శ్రేష్ఠంగా భావించి, విలువైనదిగా భావించి సంభాళిస్తారు, ఎందుకంటే ఈ సమయంలో స్వయం భగవంతుడు మాత-పిత రూపంలో పిల్లలైన మిమ్ములను సంభాళిస్తారు అనగా పాలన చేస్తారు. కావున అవినాశి పాలన అయిన కారణంగా, అవినాశి స్నేహంతో సంభాళించిన కారణంగా మొత్తం కల్పమంతా గొప్ప రాయల్టీతో, స్నేహంతో, గౌరవంతో సంభాళించబడ్తారు. ఇలాంటి ప్రేమ, స్వచ్ఛత, పవిత్రత మరియు స్నేహంతో సంభాళించబడేందుకు అవినాశి పాత్రులుగా అవుతారు. కావున ఎంత అమూల్యమైనవారో అర్థమయిందా? ప్రతి రత్నానికి ఎంతో విలువ ఉంది! కావున ఈరోజు రత్నాగరుడైన తండ్రి ప్రతి రత్నం విలువను చూస్తున్నారు. మొత్తం ప్రపంచంలోని అక్షోణి ఆత్మలు ఒకవైపు ఉన్నారు, కానీ పంచ పాండవులైన మీరు అక్షోణి కంటే శక్తిశాలి అయినవారు. అక్షోణి మీ ముందు ఒక్కరితో కూడా సమానం కాదు. మీరు ఇంత శక్తిశాలి అయినవారు. కావున ఎంత విలువైనవారిగా అయ్యారు. ఇంత విలువ ఉందని తెలుసా? లేక అప్పుడప్పుడు మిమ్ములను మీరు మర్చిపోతారా? మిమ్ములను మీరు మర్చిపోయినట్లయితే కలత చెందుతారు, బాధపడ్తారు. మిమ్ములను మీరు మర్చిపోకండి. సదా స్వయాన్ని విలువైన వారిగా భావించి నడవండి, కాని చిన్న తప్పు చెయ్యకండి. అమూల్యమైన వారు కాని తండ్రి జతలో ఉన్న కారణంగా అమూల్యమైన వారు. తండ్రిని మరిచి కేవలం స్వయాన్ని అమూల్యమని భావిస్తే తప్పు అవుతుంది. అమూల్యంగా తయారు చేసేవారిని మర్చిపోకండి. తయారయ్యారు కానీ తయారుచేసే వారి జతలో తయారయ్యారు. ఇది అర్థం చేసుకునే పద్ధతి. పద్ధతి మర్చిపోతే తెలివి, తెలివి తక్కువ రూపంలోకి మారిపోతుంది. తర్వాత 'నాది' అనేది వస్తుంది. పద్ధతిని మర్చిపోతే సిద్ధి అనుభవమవ్వదు. అందువలన విధి పూర్వకంగా స్వయాన్ని విలువైనవారని భావించి విశ్వానికి పూజ్యులుగా అవ్వండి. నేనేమీ కాను అని బాధపడకండి. నేనేమీ కాను అని ఆలోచించకండి. అలాగని అన్నీ నేనే అని కూడా భావించకండి. రెండూ తప్పే అవుతాయి. నేను ఉన్నాను కానీ తయారు చేసేవారు తయారు చేశారు, తండ్రిని తీసేసినట్లయితే పాపం అవుతుంది. తండ్రి ఉంటే పాపం లేదు. ఎక్కడ తండ్రి పేరు ఉందో అక్కడ పాపానికి నామ-రూపాలు కూడా ఉండవు. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ తండ్రి పేరు గుర్తులు ఉండవు. కావున స్వయం మీ విలువను అర్థం చేసుకున్నారా?
భగవంతుని దృష్టికి పాత్రులుగా అయ్యారు, ఇది సాధారణ విషయం కాదు. భగవంతుని పాలనకు పాత్రులుగా అయ్యారు. అవినాశి పవిత్రతకు జన్మ సిద్ధ అధికారానికి అధికారిగా అయ్యారు. జన్మ సిద్ధ అధికారము ఎప్పుడూ కష్టంగా ఉండదు. సహజంగా ప్రాప్తిస్తుంది. అందుకే అధికారి పిల్లలకు పవిత్రత కష్టంగా అనిపించదు. దీనిలో స్వయం అనుభవీగా ఉన్నారు. అధికారి పిల్లలకు పవిత్రత కష్టంగా అనిపించదు. ఎవరికైతే పవిత్రత కష్టమనిపిస్తుందో వారు ఎక్కువగా కదిలిపోతారు (డగ్‌మగ్‌ అవుతారు). పవిత్రత మీ స్వధర్మము, జన్మ సిద్ధ అధికారము కనుక సదా సహజంగా అనిపిస్తుంది. ప్రపంచంలోని వారు దూరం పరిగెడ్తారు. ఎందుకు? పవిత్రత కష్టంగా అనిపిస్తుంది. ఎవరైతే అధికారి ఆత్మలు కారో వారికి కష్టమే అనిపిస్తుంది. అధికారి ఆత్మ వస్తూనే పవిత్రత నా తండ్రి ఇచ్చిన అధికారము అందువలన పవిత్రంగా తయారవ్వాల్సిందే అని దృఢ సంకల్పం చేస్తారు. మనసును సదా పవిత్రత ఆకర్షిస్తూ ఉంటుంది. నడుస్తూ, నడుస్తూ అక్కడక్కడ మాయ పరీక్ష తీసుకునేందుకు వచ్చినా సంకల్ప రూపంలో, స్వప్నం రూపంలో వస్తుంది అయినా అధికారి ఆత్మ జ్ఞాన వంతులుగా ఉన్న కారణంగా భయపడరు. కానీ జ్ఞాన శక్తితో సంకల్పాలను పరివర్తన చేసుకుంటారు. ఒక్క సంకల్పం వెనుక అనేక సంకల్పాలను ఉత్పన్నం చెయ్యరు. అంశాన్ని వంశం రూపంలోకి తీసుకు రారు. ఏమయ్యింది, ఇది జరిగింది....... అని అనడమే వంశము. వినిపించాను కదా. ఎందుకు(క్యో) అనేదానితో క్యూ పెట్టేస్తారు. ఇది వంశాన్ని ఉత్పన్నం చేస్తుంది. వచ్చింది మరియు సదాకాలం కొరకు పోయింది. పేపర్‌ తీసుకునేందుకు వచ్చింది పాసయ్యారు, సమాప్తమయింది. మాయ ఎందుకు వచ్చింది? ఎక్కడ నుండి వచ్చింది? ఇక్కడ నుండి వచ్చిందా? అక్కడ నుండి వచ్చిందా? వచ్చి ఉండరాదు, ఎందుకు వచ్చింది?........ ఈ వంశం ఉండరాదు. మంచిది. వచ్చినా మీరు కూర్చోబెట్టుకోకండి, తరిమేయండి. ఎందుకు వచ్చింది? అని ఆలోచిస్తూ ఉంటే అది వచ్చి కూర్చుంటుంది. ముందుకు తీసుకెళ్లేందుకే వచ్చింది, పేపర్‌ తీసుకునేందుకు వచ్చింది, క్లాసును పెంచేందుకు, అనుభవీగా తయారు చేసేందుకు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? అలా వచ్చింది అని ఆలోచించకండి. మాయకు ఇలాంటి రూపం ఉంటుందా అని తర్వాత ఆలోచిస్తారు. ఎఱ్ఱగా ఉందా, పచ్చగా ఉందా లేక పసుపు పచ్చగా ఉందా అని ఈ విస్తారంలోకి వెళ్లిపోతారు. అందులోకి వెళ్లకండి. ఎందుకు భయపడ్తున్నారు? దాటుకోండి, గౌరవపూర్వకంగా పాస్‌ అవ్వండి. జ్ఞాన శక్తి ఉంది, అది శస్త్రము. మాస్టర్‌ సర్వశక్తివంతులుగా ఉన్నారు, త్రికాలదర్శిగా ఉన్నారు, త్రివేణిగా ఉన్నారు. ఏం తక్కువగా ఉంది? త్వరగా భయపడకండి. చీమ వచ్చినా భయపడ్తారు. ఎక్కువగా ఆలోచిస్తారు. ఆలోచించడం అనగా మాయకు ఆతిథ్యం ఇవ్వడం. తర్వాత అది ఇల్లుగా తయారు చేసుకుంటుంది. మార్గ మధ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు ఏదైనా మురికి వస్తువు కనిపించినట్లయితే ఏం చేస్తారు? నిలబడి ఇది ఎవరు వేశారు? ఎందుకు వేశారు? ఏమయింది? ఇలా జరగరాదు అని ఆలోచిస్తారా లేక దాటుకొని వెళ్లిపోతారా? ఎక్కువగా వ్యర్థ సంకల్పాల వంశానికి జన్మనివ్వండి. అంశ రూపంలోనే సమాప్తి చెయ్యండి. మొదట సెకండ్‌ విషయంగా ఉంటుంది. తర్వాత దానిని గంటలలో, రోజులలో, నెలలలోకి పెంచుకుంటారు. నెల తర్వాత ఏమయింది అని అడిగినట్లయితే విషయం సెకండ్‌ మాత్రమే ఉంటుంది. అందులో భయపడకండి. లోతుగా వెళ్ళండి, జ్ఞాన లోతులలోకి వెళ్ళండి. మాటల లోతులలోకి వెళ్లకండి. బాప్‌దాదా ఇంత శ్రేష్ఠమైన విలువైన రత్నాలు, చిన్న చిన్న మట్టి కణాలతో ఆడుకుంటూ ఉన్నట్లు చూసినట్లయితే ఈ రత్నాలు, రత్నాలతో ఆడుకునేవారు మట్టి కణాలతో అడుకుంటున్నారు! అని అనుకుంటారు. రత్నాలతో ఆడుకోండి! రత్నాలు అని అంటారు.
బాప్‌దాదా ఎంతో అల్లారు ముద్దుగా, ప్రేమతో పాలించారు కాబట్టి మిమ్ములను మట్టి కణాలతో ఎలా చూడగలరు? మళ్లీ మురికిగా అయ్యి ఇప్పుడు శుభ్రం చెయ్యండి, శుభ్రం చెయ్యండి అని అంటారు. భయపడ్తారు కూడా. ఇప్పుడు ఎలా చెయ్యాలి? ఏం చెయ్యాలి? అని అంటారు. అసలు మట్టితో ఆడుకోవడమే ఎందుకు! అవి కూడా మట్టిలో పడి ఉండే కణాలే. కావున సదా తమ విలువను తెలుసుకోండి. మంచిది.
ఇలా మొత్తం కల్పంలో విలువైన ఆత్మలకు, పభ్రు పేమ్రకు పాతుల్రైన ఆత్మలకు, పభ్రు పాలనకు పాతుల్రుగా ఉన్న ఆత్మలకు, పవితత్ర జన్మ సిద్ధ అధికారంగా గల అధికారి ఆత్మలకు సదా ''తండి మరియు నేను'' ఈ విధితో సిద్ధిని పొందే ఆత్మలకు సదా అమూల్య రత్నాలుగా అయ్యి రత్నాలతో ఆడుకునే రాయల్‌ పిల్లలకు బాప్‌దాదా పియ్రస్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో :- 1. సదా తండ్రి నయనాలలో ఇమిడిపోయి ఉన్న ఆత్మగా స్వయాన్ని అనుభవం చేస్తున్నారా? నయనాలలో ఎవరు ఇమిడిపోతారు? ఎవరైతే చాలా తేలికగా బిందువుగా ఉన్నారో వారు. కనుక సదా బిందువుగా ఉన్నారు మరియు బిందువుగా అయ్యి తండ్రి నయనాలలో ఇమిడిపోయేవారు. బాప్‌దాదా మీ నయనాలలో ఇమిడిపోయి ఉన్నారు, మీరందరూ బాప్‌దాదా నయనాలలో ఇమిడిపోయి ఉన్నారు. నయనాలలోనే బాప్‌దాదా ఉన్నప్పుడు ఇంకేమీ కనిపించదు. కావున సదా ఈ స్మృతితో నేనున్నదే బిందువును అని డబల్‌లైట్‌గా ఉండండి. బిందువులో ఏ భారమూ లేదు. ఈ స్మృతి స్వరూపము సదా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. కళ్ళ మధ్యలో చూసినట్లయితే బిందువే ఉంటుంది. బిందువే చూస్తుంది. బిందువు లేకపోతే కనులు ఉన్నా చూడలేరు. కావున సదా ఇదే స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకొని ఎగిరే కళను అనుభవం చెయ్యండి. బాప్‌దాదా పిల్లల వర్తమానం మరియు భవిష్య భాగ్యాన్ని చూసి సంతోషంగా ఉన్నారు. వర్తమానము, భవిష్య భాగ్యాన్ని తయారు చేసే కలము. వర్తమానాన్ని శ్రేష్ఠంగా తయారు చేసుకునే సాధనము - పెద్దల సూచనలను సదా స్వీకరిస్తూ స్వయాన్ని పరివర్తన చేసుకోవడం. ఇదే విశేష గుణంతో వర్తమానం మరియు భవిష్య భాగ్యము శ్రేష్ఠంగా తయారవుతుంది.
2. అందరి మస్తకం పై భాగ్య నక్షత్రం మెరుస్తూ ఉంది కదా! సదా మెరుస్తోందా? అప్పుడప్పుడు మెరుస్తూ ఆరిపోతూ, వెలిగీ వెలగనట్లు అయితే లేదు కదా! అఖండ జ్యోతి అయిన తండ్రితో పాటు మీరు కూడా అఖండ జ్యోతిగా సదా వెలుగుతున్న నక్షత్రంగా అయ్యామని అనుభవం చేస్తున్నారా? అప్పుడప్పుడు దీపాన్ని లేక నక్షత్రాన్ని వాయువు కదిలించడం లేదు కదా! ఎక్కడ తండ్రి స్మృతి ఉంటుందో వారు అవినాశిగా వెలుగుతూ ఉన్న నక్షత్రాలు. వెలుగుతూ ఆరిపోతూ లేరు కదా! లైటు కూడా వెలుగుతూ, ఆరిపోతూ ఉంటే ఆర్పేస్తారు. ఎవ్వరికీ మంచిగా అనిపించదు. కావున మీరు కూడా సదా వెలుగుతూ ఉన్న నక్షత్రాలు. సదా జ్ఞాన సూర్యుడైన తండ్రితో ప్రకాశం తీసుకొని ఇతరులకు కూడా ప్రకాశాన్ని ఇచ్చేవారు. సేవ చేయాలనే ఉత్సాహ-ఉల్లాసాలు స్థిరంగా ఉంటాయి. అందరూ శ్రేష్ఠమైన ఆత్మలే. శ్రేష్ఠమైన తండ్రికి శ్రేష్ఠ ఆత్మలుగా ఉన్నారు.
స్మృతి శక్తితో సఫలత సహజంగా ప్రాప్తిస్తుంది. ఎంతెంత స్మృతి మరియు సేవలు జత జతలో ఉంటాయో ఆ రెండిటి బ్యాలన్స్‌ అంత సదా సఫలత యొక్క ఆశీర్వాదాలను స్వత:గానే ప్రాప్తి చేయిస్తుంది. అందువలన సదా శక్తిశాలి స్మృతి స్వరూప వాతావరణం తయారై శక్తిశాలి ఆత్మల ఆహ్వానం జరుగుతుంది అంతేకాక సఫలత లభిస్తుంది. లౌకిక కార్యము నిమిత్తంగా ఉంటుంది కానీ తండ్రి మరియు సేవతో లగ్నముంటుంది. లౌకికం కూడా సేవ పట్లనే ఉంటుంది. స్వంత లగ్నంతో చెయ్యరు. ఆదేశానుసారము చేస్తారు. అందువలన తండ్రి స్నేహమనే హస్తము ఇలాంటి పిల్లలకు తోడుగా ఉంటుంది. సదా సంతోషంగా పాడండి, నాట్యం చెయ్యండి, ఇదే సేవకు సాధనము. మీ సంతోషాన్ని చూసి ఇతరులు సంతోషిస్తారు. అదే సేవగా అవుతుంది. ఎంత మహాదానిగా అయితే ఖజానా అంత పెరుగుతూ ఉంటుందని బాప్‌దాదా పిల్లలకు సదా చెప్తారు. మహాదానిగా అవ్వండి, ఖజానాలను పెంచండి. మహాదానిగా అయ్యి బాగా దానం చెయ్యండి ఈ ఇవ్వడమే తీసుకోవడం. మంచి వస్తువు లభిస్తే అది ఇవ్వకుండా ఉండలేరు.
సదా తమ భాగ్యాన్ని చూసి సంతోషంగా ఉండండి. ఎంత గొప్ప భాగ్యము లభించింది. ఇంట్లో కూర్చునే భగవంతుడు లభించాడు. ఇంతకంటే గొప్ప భాగ్యము ఏముంటుంది! ఈ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకొని సంతోషంగా ఉండండి. దు:ఖం, అశాంతి సదా కాలం కొరకు సమాప్తమైపోతాయి. సుఖ స్వరూపంగా, శాంత స్వరూపంగా అవుతారు. ఎవరి భాగ్యాన్ని స్వయం భగవంతుడే తయారు చేస్తారో వారు ఎంత శ్రేష్ఠమైనవారు! కావున సదా కొత్త ఉత్సాహం, కొత్త ఉల్లాసాలను అనుభవం చేస్తూ ముందుకు వెళ్తూ ఉండండి ఎందుకంటే సంగమ యుగంలో ప్రతిరోజు కొత్త ఉత్సాహం, కొత్త ఉల్లాసం ఉంటుంది.
ఏదో నడుస్తున్నామని కాదు, కొత్త ఉల్లాసం, కొత్త ఉత్సాహం సదా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ప్రతిరోజు కొత్తదిగానే ఉంటుంది. సదా స్వయంలో లేక సేవలో ఏదో ఒక నవీనత తప్పకుండా కావాలి. స్వయాన్ని ఎంత ఉత్సాహ-ఉల్లాసాలలో ఉంచుకుంటే అంత కొత్త కొత్త టచింగ్‌లు వస్తూ ఉంటాయి. స్వయం ఏదో ఇతర విషయాలలో బిజీగా ఉన్నట్లయితే కొత్త టచింగ్‌ కూడా రాదు, మననం చేసినట్లయితే కొత్త ఉత్సాహం ఉంటుంది.
బంధనాలలో ఉన్నవారికి ప్రియ స్మృతులు ఇస్తూ :- బంధనాలలో ఉన్నవారి స్మృతి సదా తండ్రి వద్దకు చేరుకుంటుంది మరియు బాప్‌దాదా బంధనాలో ఉన్నవారందరికి యోగం అనగా స్మృతి యొక్క లగ్నాన్ని అగ్ని రూపంగా చేసుకోండి అని చెప్తున్నారు. లగ్నము అగ్ని రూపంగా అయినప్పుడు అగ్నిలో అన్నీ భస్మమైపోతాయి. కనుక ఈ బంధనాలు కూడా లగ్నమనే అగ్నిలో సమాప్తమైపోతాయి స్వతంత్ర ఆత్మగా అయ్యి ఏ సంకల్పము చేస్తే దాని సిద్ధిని ప్రాప్తి చేసుకుంటారు. స్నేహీలుగా ఉండండి. స్నేహంతో చేసే స్మృతి చేరుకుంటుంది. స్నేహానికి బదులుగా స్నేహం లభిస్తుంది. కానీ ఇప్పుడు స్మృతిని శక్తిశాలి అగ్ని రూపంగా చేసుకోండి. అప్పుడు సన్ముఖంలోకి చేరుకునే రోజు వచ్చేస్తోంది.

వరదానము :- '' సదా ఆత్మిక స్థితిలో ఉంటూ ఇతరులలో కూడా ఆత్మను చూసే ఆత్మిక గులాబీ భవ ''
ఆత్మిక గులాబి అనగా వారిలో సదా ఆత్మిక సుగంధం ఉండాలి. ఆత్మిక సుగంధం గలవారు ఎక్కడ చూస్తున్నా, ఎవరిని చూస్తున్నా ఆత్మను చూస్తారు, శరీరాన్ని చూడరు. స్వయం కూడా సదా ఆత్మిక స్థితిలో ఉండండి, ఇతరులలో కూడా ఆత్మనే చూడండి. తండ్రి ఎలాగైతే ఉన్నతోన్నతమైనవారో, అలా వారి తోట కూడా ఉన్నతోన్నతమైనది. ఈ తోటకు విశేష శృంగారము ఆత్మిక గులాబి పిల్లలైన మీరే. మీ ఆత్మిక సుగంధం అనేకమంది ఆత్మల కళ్యాణం చేస్తుంది.

స్లోగన్‌ :- '' మర్యాదను అతిక్రమించి ఎవరికైనా సుఖాన్నిచ్చినా, అది కూడా దు:ఖ ఖాతాలో జమ అవుతుంది.''

Friday, 1 November 2019

Telugu Murli 02/11/2019

02-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - పిల్లలైన మిమ్ములను అలంకరించేందుకు తండ్రి వచ్చారు, పవిత్రత అన్నిటికంటే గొప్ప అలంకారము. ''

ప్రశ్న :- పూర్తి 84 జన్మలు తీసుకునేవారి ముఖ్యమైన గుర్తులేవి ?
జవాబు :- 1. వారు తండ్రితో పాటు టీచరు, సద్గురువు ముగ్గురినీ స్మృతి చేస్తారు. తండ్రి స్మృతిలో ఉన్నప్పుడు టీచరును మర్చిపోవాలని కాదు. ముగ్గురుని స్మృతి చేసినప్పుడే కృష్ణపురానికి వెళ్లగలరు అనగా ఆది నుండి పాత్ర అభినయించగలరు. 2. మాయా తుఫానులు వారినెప్పుడూ ఓడించలేవు.

ఓంశాంతి. తండ్రి మొదట పిల్లలను అడుగుతున్నారు - తండ్రి సన్ముఖములో, టీచరు సన్ముఖములోనే కాక సద్గురువు సన్ముఖములో కూర్చుని ఉన్నామని మర్చిపోరు కదా. అందరూ స్మృతి యాత్రలో కూర్చుని ఉన్నారని బాబా అనుకోవడం లేదు. అయినా అర్థం చేయించడం తండ్రి కర్తవ్యము. ఇది అర్థ సహితంగా స్మృతి చేయడం. మన బాబా అనంతమైన తండ్రి, టీచరు అంతేకాక పిల్లలందరిని తప్పకుండా వెంట తీసుకెళ్లే సద్గురువు కూడా అయ్యారు. పిల్లలను అలంకరించేందుకే తండ్రి వచ్చారు, పవిత్రతతో అలంకరిస్తూ వస్తారు. అపారమైన ధనరాసులను కూడా ఇస్తారు. మీరు వెళ్లబోయే నూతన ప్రపంచము కొరకు ధనమునిస్తారు. పిల్లలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. పిల్లలు నిర్లక్ష్యముతో మర్చిపోతారు. అందువలన ఉండవలసిన సంపూర్ణ ఖుషీ తక్కువైపోతుంది. ఇటువంటి తండ్రి ఎప్పుడూ లభించనే లభించరు. మనమంతా ఆ తండ్రి పిల్లలమని మీకు తెలుసు. వారు మనలను చదివిస్తున్నారు కాబట్టి వారు తప్పకుండా టీచరు కూడా అయ్యారు. మన చదువు నూతన ప్రపంచమైన అమరపురము కొరకని మీకు తెలుసు. ఇప్పుడు మనము సంగమ యుగములో కూర్చొని ఉన్నాము. పిల్లలకు ఈ స్మృతి తప్పకుండా ఉండాలి. పక్కా పక్కాగా స్మృతి చేయాలి. అంతేకాక ఇప్పుడు కంసపురము, ఆసురీ ప్రపంచములో ఉన్నామని కూడా మీకు తెలుసు. ఎవరికైనా సాక్షాత్కారము జరిగినా దాని వలన ఎవ్వరూ కృష్ణపురములోకి గాని, వారి వంశములోకి గాని వెళ్లలేరు. తండ్రి, టీచరు, సద్గురువు ముగ్గురినీ స్మృతి చేసినప్పుడే వెళ్లగలరు. ఇక్కడ ఆత్మలతోనే మాట్లాడ్తున్నారు. ఆత్మనే చెప్తుంది - ''అవును బాబా, మీరేమో సత్యమే చెప్తున్నారు, మీరు తండ్రి కూడా అయ్యారు, చదివించే టీచరు కూడా అయ్యారు.'' సుప్రీమ్‌ ఆత్మ (పరమాత్మ) చదివిస్తుంది, లౌకిక చదువు కూడా ఆత్మయే శరీరము ద్వారా చదివిస్తుంది. కానీ అక్కడ ఆత్మా పతితమైనదే, శరీరము కూడా పతితమైనదే. ప్రపంచములోని మానవులకు మేము నరకములో నివసిస్తున్నామని తెలియదు.
ఇప్పుడు మనము మన వతనానికి వెళ్తామని మీకు తెలుసు. ఇది మీ వతనము కాదు. ఇది రావణుని పరాయి వతనము. మీ వతనములో అపారమైన సుఖముంటుంది. మనము పరాయి రాజ్యములో ఉన్నామని కాంగ్రెస్‌ వారు భావించరు. ఇంతకు ముందు ముసల్మానుల రాజ్యములో ఉండేవారము, తర్వాత క్రైస్తవుల రాజ్యములో ఉన్నాము. ఇప్పుడు మనము మన రాజ్యములోకి వెళ్తామని మీకు తెలుసు. మనము ఇంతకు ముందు రావణరాజ్యమును మన రాజ్యంగా భావించేవారము, అంతకంటే ముందు రామరాజ్యములో ఉండేవారమని మర్చిపోయాము. తర్వాత 84 జన్మల చక్రములోకి రావడం వలన రావణ రాజ్యములోకి దు:ఖములోకి వచ్చి పడ్డాము. పరాయి రాజ్యములో దు:ఖమే ఉంటుంది. ఈ జ్ఞానమంతా ఆంతరికములో ఉత్పన్నమవ్వాలి. తండ్రి తప్పకుండా గుర్తుకొస్తారు. కానీ ముగ్గురినీ స్మృతి చేయాలి. ఈ జ్ఞానము కూడా మనుష్యులే తీసుకోగలరు. జంతువులైతే చదువుకోవు. అక్కడ న్యాయశాస్త్రము మొదలైన చదువులేవీ ఉండవని కూడా పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. తండ్రి ఇక్కడే మిమ్ములను సంపన్నులుగా చేస్తున్నారు. అలాగని అందరూ రాజులుగా అవ్వరు. వ్యాపారాలు కూడా ఉంటాయి కానీ అక్కడ మీ వద్ద అపారమైన ధనముంటుంది. నష్టపోయే నియమమే లేదు. దోచుకోవడం, చంపడం మొదలైనవి అక్కడ ఉండనే ఉండవు. దాని పేరే స్వర్గము. మేము స్వర్గములో ఉండేవారము తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ క్రిందకు వచ్చామని ఇప్పుడు పిల్లలైన మీకు స్మృతి వచ్చింది. బాబా కథను కూడా వారికే తెలుపుతారు. 84 జన్మలు తీసుకోనివారిగా ఉంటే వారిని మాయ ఓడిస్తుంది. ఇది కూడా తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. మాయా తుఫానులు ఎంతో పెద్దవి. చాలామందిని మాయ ఓడించే ప్రయత్నము చేస్తుంది. పోను పోను మీరు చాలా చూస్తారు, వింటారు. తండ్రి వద్ద వారందరి చిత్రాలు(ఫోటోలు) ఉంటే మీరు ఆశ్చర్యపడునట్లు - ఫలానావారు ఇలా ఇన్ని రోజులు వచ్చారు, తండ్రివారైన తర్వాత మాయ తినేసింది అని చూపేవారు. మరణించి మాయతో కలుసుకున్నారు. ఇక్కడెవరైనా శరీరాన్ని వదిలితే వారు ఇదే ప్రపంచములో వచ్చి జన్మ తీసుకుంటారు. మీరిప్పుడు ఈ సమయములో శరీరాన్ని వదిలితే బాబాతో పాటు అనంతమైన(బేహద్‌) ఇంటికి వెళ్తారు. అక్కడ బాబా-మమ్మా, పిల్లలు అందరూ ఉంటారు కదా. కుటుంబము ఇలాగే ఉంటుంది. మూలవతనములో తండ్రి, వారితో పాటు సోదరులందరూ ఉంటారు. ఇతర సంబంధాలేవీ ఉండవు. ఇక్కడ తండ్రి, వారితో పాటు సోదరీ-సోదరులందరూ ఉన్నారు. తర్వాత వృద్ధి అవుతూ ఉంటారు. చిన్నాన్న, మామ మొదలైన అనేక సంబంధాలు ఈ ప్రపంచములో ఏర్పడ్తాయి. ఈ సంగమ యుగములో మీరు ప్రజాపిత బ్రహ్మకు చెందినవారిగా అయ్యారు కనుక మీరు సోదర-సోదరీలు. శివబాబాను స్మృతి చేస్తారు కనుక మీరంతా సోదరులు(భాయీ-భాయీ). ఈ విషయాలన్నీ బాగా గుర్తుంచుకోవాలి. కానీ చాలామంది పిల్లలు మర్చిపోతూ ఉంటారు. తండ్రి ఏమో అర్థం చేయిస్తూనే ఉంటారు. పిల్లలను ప్రేమించి తల పై కూర్చోపెట్టుకోవడం తండ్రి కర్తవ్యము. అందుకే తండ్రి నమస్తే నమస్తే అంటూ ఉంటారు. అర్థము కూడా తెలిపిస్తున్నారు. భక్తిమార్గములోని సాధు-సన్యాసులు మొదలైన వారెవ్వరూ మీకు జీవన్ముక్తికి మార్గము తెలియజేయలేరు. వారు ముక్తి కొరకే పురుషార్థము చేస్తూ ఉంటారు. వారు నివృత్తి మార్గానికి చెందినవారు. వారు రాజయోగమునెలా నేర్పించగలరు? రాజయోగము ప్రవృత్తి మార్గానికి చెందింది. ప్రజాపిత బ్రహ్మకు నాలుగు భుజాలు చూపిస్తారు అనగా ప్రవృత్తి మార్గము కదా. ఇక్కడ వీరిని తండ్రి దత్తత తీసుకొని బ్రహ్మ-సరస్వతులు అని పేరు పెట్టారు. డ్రామాలో ఎలా నిర్ణయింపబడిందో చూడండి! వానప్రస్థ అవస్థలోనే, 60 సంవత్సరాల తర్వాత మానవులు గురువులను ఆశ్రయిస్తారు. అలాగే ఇక్కడ కూడా 60 సంవత్సరాల తర్వాత తండ్రి ఇతనిలో ప్రవేశించి తండ్రి, టీచరు, సద్గురువుగా అయ్యారు. ఇప్పుడు(కలియుగములో) నియమాలు కూడా చెడిపోయాయి. చిన్న పిల్లలను కూడా గురువు దగ్గరకు పంపుతారు. వీరు నిరాకారులు. ఆత్మలైన మీకు తండ్రి, టీచరు, సద్గురువు కూడా అవుతారు. నిరాకార ప్రపంచాన్ని ఆత్మల ప్రపంచమని అంటారు. అలాగని ప్రపంచమే కాదని అనరు. దానిని శాంతిధామమని అంటారు. అక్కడ ఆత్మలు నివసిస్తాయి. పరమాత్మకు నామ-రూప-దేశ -కాలాలు లేనిచో పిల్లలెక్కడ నుండి వస్తారు?
ఈ ప్రపంచ చరిత్ర-భూగోళాలు ఎలా రిపీట్‌(పునరావృతము) అవుతాయో ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. చరిత్ర చైతన్యానికి సంబంధించినది. భూగోళము జడానికి సంబంధించినది. మనము ఎంతవరకు రాజ్యము చేస్తామో ఆత్మలైన మీకు తెలుసు. చరిత్ర గాయనము చేయబడ్తుంది. దానిని కథ అని అంటారు. భూగోళము అంటే దేశానికి సంబంధించింది. చైతన్యంగా ఉన్నవారే రాజ్యపాలన చేస్తారు. జడ పదార్థమైతే రాజ్యమును పాలించదు. ఎంత సమయము నుండి ఎవరి రాజ్యముండినది, క్రైస్తవులు భారతదేశములో ఎప్పటి నుండి ఎప్పటి వరకు రాజ్యము చేశారో తెలుసు. కాని ప్రపంచ చరిత్ర-భూగోళాల గురించి ఎవ్వరికీ తెలియనే తెలియదు. సత్యయుగము గడిచి లక్షల సంవత్సరాలయిందని చెప్తారు. అందులో ఎవరు రాజ్యపాలన చేశారో, ఎంతకాలము చేశారో ఎవ్వరికీ తెలియదు. దీనిని చరిత్ర అని అంటారు. ఆత్మ చైతన్యము, శరీరము జడము. మొత్తం ఆటంతా జడము, చైతన్యానికి సంబంధించినది. మానవ జీవితమే ఉత్తమమైనదని గాయనముంది. జనాభా లెక్కలు(జనసంఖ్య) కూడా మానవులదే లెక్కిస్తారు. జంతువులను ఎవ్వరూ లెక్క పెట్టలేరు. మొత్తం ఆట అంతా మీ పైనే ఉంది. చరిత్ర-భూగోళాలు కూడా మీరు వింటున్నారు. తండ్రి ఇతనిలో ప్రవేశించి మీకు అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు. దీనిని బేహద్‌ చరిత్ర- భూగోళము అని అంటారు. ఈ జ్ఞానము లేనందున మీరు చాలా తెలివిహీనులుగా అయ్యారు. మనుష్యులై ఉండి ప్రపంచ చరిత్ర-భూగోళాలను తెలియకుంటే వారు దేనికి పనికి వస్తారు. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా ప్రపంచ చరిత్ర-భూగోళాలను వింటున్నారు. ఈ చదువు ఎంత బాగుంది! చదివించేది ఎవరు? తండ్రి చదివిస్తున్నారు. ఆ తండ్రే అత్యంత ఉన్నతమైన పదవినిప్పించేవారు. ఈ లక్ష్మీనారాయణులు మరియు వారితో స్వర్గములో నివసించేవారి పదవి అత్యంత శ్రేష్ఠమైనది కదా. అక్కడ బ్యారిస్టర్‌ చదువు మొదలైనవి ఉండవు. అక్కడ కేవలం కళలు నేర్చుకోవలసి ఉంటుంది. ఆ కళలు నేర్చుకోకుంటే భవనాలు మొదలైనవి ఎలా నిర్మిస్తారు? పరస్పరములో కళలు(నైపుణ్యాలు) నేర్చుకుంటారు లేకుంటే ఇన్ని భవనాలు మొదలైనవి ఎవరు నిర్మిస్తారు? వాటంతకవే తయారవ్వవు కదా. ఈ రహస్యాలన్నీ ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో కూడా నంబరువారు పురుషార్థానుసారము ఉంటాయి. ఈ చక్రము తిరుగుతూ ఉంటుందని ఇంత సమయము రాజ్యము చేసి మరలా రావణ రాజ్యములోకి వస్తామని మీకు తెలుసు. రావణ రాజ్యములో ఉన్నామని బయటి ప్రపంచము వారికి తెలియదు. ''బాబా! రావణరాజ్యము నుండి ముక్తులుగా చేయండి'' అని తండ్రిని పిలుస్తారు. కాంగ్రెస్‌వారు క్రైస్తవుల రాజ్యము నుండి తమను ముక్తులుగా చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ''ఓ గాడ్‌ఫాదర్‌, మమ్ములను విడుదల చేయండి'' అని పిలుస్తారు. స్మృతిలోకి వస్తోంది కదా. ఈ విధంగా ఎందుకు అంటున్నారో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడీ మొత్తము సృష్టి పై రావణ రాజ్యముందని మీరు అర్థం చేసుకున్నారు. అందరూ రామరాజ్యము కావాలని కోరుకుంటారు. కానీ ముక్తులుగా ఎవరు చేస్తారు? గాడ్‌ఫాదర్‌ ముక్తినిచ్చి మార్గదర్శకులై తీసుకెళ్తారని భావిస్తారు. భారతవాసులకు ఇంత తెలివి లేదు. వీరు పూర్తిగా తమోప్రధానమై ఉన్నారు. ఇతరులకు ఇంత దు:ఖమూ లేదు, సుఖమూ లేదు. అందరికంటే ఎక్కువ సుఖంగా ఉండేవారు, ఎక్కువ దు:ఖంగా ఉండేవారు భారతీయులే. అంతా లెక్కాచారమే కదా. ఇప్పుడెంతో దు:ఖముంది. ఓ గాడ్‌ఫాదర్‌, లిబరేటర్‌(విముక్తిదాత)! అని ధార్మిక పరాయణులు పిలుస్తూ ఉంటారు. ''బాబా, మీరు వచ్చి మా దు:ఖాలను హరించి సుఖధామములోకి తీసుకెళ్లమని మీ హృదయాలలో కూడా ఉంది. వారేమో శాంతిధామానికి తీసుకెళ్లమంటారు. కానీ మీరు శాంతిధామానికి, సుఖధామానికి తీసుకెళ్లమని అంటారు. ఇప్పుడా తండ్రి వచ్చి ఉన్నారంటే చాలా సంతోషముండాలి. భక్తిమార్గములో చెవులకు ఎంతో ఇంపుగా ఉంటుంది. అందులో సత్యమైన మాట ఒక్కటి కూడా లేదు. పిండిలో ఉప్పు వేసినంత ఉంది. చండికా దేవికి కూడా జాతర(మేళా) జరుగుతుంది. అయితే ఎందుకు జరుగుతుంది? చండిక అంటే ఎవరు? ఛండాల జన్మ కూడా ఇక్కడే తయారుచేసుకొని వెళ్తారని బాబా తెలిపించారు. ఇక్కడే ఉండి తాగి, తిని ఏదైనా కొంత ఇచ్చి మళ్లీ మేమిచ్చింది మాకు వాపస్‌ ఇవ్వమని అంటారు. మాకు ఇష్టము లేదు, ఒప్పుకోము అని అంటారు. సంశయపడి వెళ్లిపోతే వారు ఎలా తయారవుతారు? ఇలాంటి చండికల జాతర కూడా జరుగుతుంది. అయినా సత్యయుగ వాసులుగా ఏమో అవుతారు కదా. కొంత సమయానికైనా సహాయకారులుగా అవుతే స్వర్గములోకేమో వచ్చేస్తారు. భక్తులకు తెలియదు. జ్ఞానమైతే ఎవ్వరి వద్దా లేదు. ఆ చిత్రాల గీత ద్వారా ఎంత ధనము సంపాదిస్తారు! ఈ రోజులలో చిత్రాలంటే అందరికీ ఇష్టమే. దానిని కళ అని అనుకుంటారు. దేవతల చిత్రాలు ఎలా ఉంటాయో మనుష్యులకేం తెలుసు! వాస్తవానికి మీరు ఎంతో ఫస్ట్‌క్లాస్‌గా ఉండేవారు తర్వాత ఎలా తయారయ్యారు? అక్కడ గుడ్డివారు, చెవిటివారు, వికలాంగులు ఎవ్వరూ ఉండరు. దేవతలలో సహజమైన శోభ ఉంటుంది. అక్కడ సహజ సౌందర్యముంటుంది. అందువలన తండ్రి కూడా అంతా అర్థం చేయించిన తర్వాత ''పిల్లలూ! తండ్రిని స్మృతి చేయండి'' అని చెప్తున్నారు. ఆ తండ్రి, తండ్రి మాత్రమే కాదు, టీచరు, సద్గురువు కూడా అయ్యారు. మూడు రూపాలలో స్మృతి చేస్తే మూడు వారసత్వాలు లభిస్తాయి. వెనుక వచ్చేవారు మూడు రూపాలలో స్మృతి చేయలేరు. మళ్లీ ముక్తిలోకి వెళ్లిపోతారు.
సూక్ష్మవతనము మొదలైన వాటిలో చూచేవన్నీ సాక్షాత్కార విషయాలని తండ్రి అర్థం చేయించారు. ఇక మిగిలిన చరిత్ర-భూగోళాలన్నీ ఇక్కడివే. దీని ఆయువు గురించి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయించారు. తర్వాత మీరు ఇతరులెవ్వరికైనా అర్థం చేయించగలరు. మొట్టమొదట తండ్రి పరిచయమునివ్వాలి. ఆ బేహద్‌ తండ్రిని సుప్రీమ్‌ అని అంటారు. లౌకిక తండ్రిని ఎవ్వరూ పరమాత్మ అని గానీ, సుప్రీమ్‌ ఆత్మ అని గానీ అనరు. ఒక్కరు మాత్రమే సుప్రీమ్‌. వారిని భగవంతుడని అంటారు. వారు జ్ఞానసాగరులు కనుక మీకు జ్ఞానము నేర్పిస్తారు. ఈ ఈశ్వరీయ జ్ఞానము సంపాదనకు మూలము. జ్ఞానములో కూడా ఉత్తమము, మధ్యమము, కనిష్ఠము ఉంటాయి కదా. తండి అత్యంత ఉన్నతులు కనుక ఈ చదువు కూడా అత్యున్నతమైనది. పదవి కూడా ఉన్నతమైనదే. చరిత్ర, భూగోళాలనైతే వెంటనే అర్థం చేసుకోగలరు. కానీ స్మృతియాత్రలోనే యుద్ధము జరుగుతుంది. దానిలో ఓడిపోతే జ్ఞానములో కూడా ఓడిపోతారు. ఓటమి చెంది పారిపోతే జ్ఞానములో కూడా ఉండకుండా పారిపోతారు. ముందెలా ఉండేవారో అలాగే అవుతారు. ఇంకా అంతకంటే హీనంగా అవుతారు. తండ్రి ముందు మీ నడవడికల ద్వారా మీ దేహాభిమానము వెంటనే తెలిసిపోతుంది. బ్రాహ్మణుల మాల కూడా ఉంది. కానీ చాలామందికి ఇక్కడ ఎలా నంబరువారుగా కూర్చొని ఉన్నామో తెలియదు. దేహాభిమానముంది కదా. నిశ్చయమున్న వారికి తప్పకుండా చాలా ఖుషీ ఉంటుంది. ఈ శరీరాన్ని వదిలిన తర్వాత రాకుమారులుగా అవుతామని నిశ్చయము ఎవరికి ఉంది?(అందరూ చేతులు ఎత్తారు) పిల్లలకు ఇంత ఖుషీ ఉంటుంది. మీ అందరిలో దివ్యగుణాలు పూర్తిగా ఉండాలి. అప్పుడే నిశ్చయమున్నట్లు తెలుస్తుంది. నిశ్చయబుద్ధి అనగా విజయమాలలో కూర్చబడ్తారు అనగా చక్రవర్తులు గా అవుతారు. విదేశీయులంతా ఎక్కువగా ఆబూలో వచ్చి రాజయోగాన్ని నేర్చుకోవాలని అభిలాషించే రోజులు తప్పకుండా వస్తాయి. ఇతర తీర్థయాత్రలకు వెళ్లడం వదిలేస్తారు. భారతదేశ రాజయోగాన్ని నేర్చుకోవాలని కోరుకుంటారు. స్వర్గమును(ప్యారడైజ్‌) స్థాపన చేసిందెవరు? కల్పక్రితము జరిగి ఉంటే తప్పకుండా ఇప్పుడు కూడా మ్యూజియమ్‌ తయారైపోతుందని పురుషార్థము చేస్తారు. ఇటువంటి ప్రదర్శినీని సదా కాలానికి ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. 4-5 సంవత్సరాలకు భవనాలు లీజుకు తీసుకొని కూడా ఏర్పాటు చేయవచ్చు. భారతదేశమునే సుఖధామంగా మార్చేందుకు సేవ చేస్తున్నాము, ఇందులో అనేకమందికి కళ్యాణము జరుగుతుంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. అపారమైన సంతోషంలో ఉండేందుకు స్వయంగా ఆ భగవంతుడే మమ్ములను అలంకరిస్తున్నారు, వారు మాకు అనంతమైన ధన సంపదలను ఇస్తున్నారు, నూతన ప్రపంచమైన అమరపురము కొరకు మేము చదువుతున్నామని సదా స్మృతిలో ఉండాలి.
2. విజయ మాలలో కూర్చబడేందుకు నిశ్చయబుద్ధి గలవారై దైవీ గుణాలను ధారణ చేయాలి. ఇచ్చిన దానిని వాపస్‌ తీసుకోవాలనే సంకల్పము కూడా ఎప్పుడూ రాకూడదు. సంశయబుద్ధి గలవారిగా అయ్యి మీ పదవిని పోగొట్టుకోరాదు.

వరదానము :- '' విఘ్నాలను మనోరంజనం కలిగించే ఆటగా భావించి దాటుకునే నిర్విఘ్న విజయీ భవ ''
విఘ్నాలు రావడం మంచిదే. కానీ వాటికి ఓడిపోరాదు. శక్తిశాలిగా చేసేందుకే విఘ్నాలు వస్తాయి. అందువలన విఘ్నాలతో భయపడేందుకు బదులు వాటిని మనోరంజనం కలిగించే ఆటగా భావించి దాటుకోండి. అప్పుడు నిర్విఘ్న విజయీలని అంటారు. సర్వశక్తివంతుడైన తండ్రి జతలో ఉన్నప్పుడు భయపడే విషయమేదీ ఉండదు. కేవలం తండ్రి స్మృతి మరియు సేవలో బిజీగా ఉంటే నిర్విఘ్నంగా ఉంటారు. బుద్ధి ఫ్రీ గా ఉంటే విఘ్నాలు వస్తాయి లేక మాయ వస్తుంది. బిజీగా ఉంటే మాయను, విఘ్నాలను దాటుకుంటారు.

స్లోగన్‌ :- '' సుఖ ఖాతాను జమ చేసుకునేందుకు మర్యాదా పూర్వకంగా అందరికీ హృదయపూర్వక సుఖమునివ్వండి. ''