Wednesday, 5 February 2020

Telugu Murli 05/02/2020

05-02-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - గౌరవయుక్తంగా ఉత్తీర్ణులు(పాస్‌ విత్‌ ఆనర్‌) అవ్వాలంటే, బుద్ధి యోగము కొద్దిగా కూడా ఎటూ వెళ్లరాదు, ఒక్క బాబా స్మృతి మాత్రమే ఉండాలి. దేహాన్ని స్మృతి చేయువారు ఉన్నత పదవిని పొందలేరు ''

ప్రశ్న :- అన్నిటికంటే ఉన్నతమైన గమ్యము ఏది ?
జవాబు :- ఆత్మ జీవించి ఉండగానే మరణించి ఒక్క తండ్రి సంతానంగా అవ్వాలి, ఇతరులెవ్వరూ గుర్తు రాకూడదు, దేహాభిమానము పూర్తిగా తొలగిపోవాలి - ఇదే అన్నిటికంటే శ్రేష్ఠమైన గమ్యము. నిరంతరము '' ఆత్మాభిమాని '' స్థితి ఉండాలి - ఇదే గొప్ప గమ్యము. దీని ద్వారానే కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకుంటారు.

పాట :- మీరు ప్రేమ సాగరులు,............. ( తూ ప్యార్‌ కా సాగర్‌,...........)  
ఓంశాంతి. ఇప్పుడు ఈ పాట కూడా తప్పే. ప్రేమకు బదులుగా జ్ఞానసాగరమని ఉండాలి. ప్ర్రేమ కొరకు చెంబులుండవు. అనగా ప్రేమాభిషేకము ఉండదు. గంగా జలము మొదలైన వాటి కొరకు చెంబులు ఉంటాయి. అనగా గంగా జలముతో అభిషేకము ఉంటుంది. ఇది భక్తి మార్గములోని మహిమ. ఇది తప్పు, జ్ఞానసాగరులు అని అనడం సరియైనది. తండ్రి మొట్టమొదట జ్ఞాన సాగరులు. పిల్లలలో కొద్దిగా జ్ఞానమున్నా చాలా ఉన్నతమైన పదవిని పొందుతారు. ఇప్పుడు ఈ సమయంలో మనము చైతన్య దిల్‌వాడా మందిరము వలె ఉన్నామని మీకు తెలుసు. అది జడ దిల్‌వాడా మందిరము. ఇది చైతన్య దిల్‌వాడా మందిరము. ఇది కూడా అద్భుతమే కదా. ఎక్కడ జడ స్మృతి చిహ్నముందో, అక్కడే మీరు చైతన్యములో వచ్చి కూర్చున్నారు. కానీ మనుష్యులకిది అర్థము కాదు. కానీ పోను పోను ఇది గాడ్‌ఫాదర్‌లీ యూనివర్సిటీ, ఇక్కడ భగవంతుడే చదువు నేర్పిస్తారని తెలుసుకుంటారు. దీని కంటే పెద్ద యూనివర్సిటీ ఏదీ లేదని, ఇదే చైతన్యమైన దిల్‌వాడా మందిరమని కూడా తెలుసుకుంటారు. ఈ దిల్‌వాడా మందిరము మీ ఖచ్చితమైన స్మృతి చిహ్నము. పై కప్పులో సూర్యవంశము - చంద్ర వంశాలు చిత్రీకరింపబడి ఉన్నాయి, క్రింద ఆదిదేవుడు, ఆదిదేవి, వారి పిల్లలు కూర్చొని ఉన్నారు. వీరి పేరు బ్రహ్మ, వీరి పుత్రిక సరస్వతి. ప్రజాపిత బ్రహ్మ ఉంటే గోప - గోపికలు కూడా తప్పకుండా ఉంటారు కదా. అవన్నీ జడ చిత్రాలే. ఎవరు గతిoచి వెళ్లిపోయారో, వారి చిత్రాలే తయారయ్యాయి. ఎవరైనా మరణిస్తే, వెంటనే వారి చిత్రాలను తయారుచేస్తారు. కానీ వారి హోదా, జీవితచరిత్రను గురించి తెలియదు. వారి వృత్తి(కర్తవ్యము) గురించి వ్రాయకుంటే, ఆ చిత్రము ఎందుకూ పనికి రాదు. ఫలానావారు వ్రాసినందున ఈ కర్తవ్యము నిర్వహించారని తెలుస్తుంది. ఇప్పుడు ఏ దేవతల మందిరాలున్నాయో, వారి కర్తవ్యాల గురించి, జీవితచరిత్ర గురించి ఎవ్వరికీ తెలియదు. ఉన్నతాతి ఉన్నతుడైన శివబాబాను గూర్చి కూడా ఎవ్వరికీ తెలియదు. ఈ సమయంలో పిల్లలైన మీకు అందరి జీవితచరిత్రలు తెలుసు. ఎవరెవరు ఉండి వెళ్లిపోయారో, ముఖ్యంగా ఎవరిని పూజిస్తారో వారి గురించి మీకు తెలుసు. ఉన్నతాతి ఉన్నతమైన వారు భగవంతుడు. శివరాత్రి కూడా జరుపుకుంటున్నారు కనుక తప్పకుండా వారి అవతరణ జరిగిందని అర్థమవుతుంది. కానీ ఎప్పుడు జరిగిందో, వారు వచ్చి ఏం చేశారో ఎవ్వరికీ తెలియదు. శివునితో పాటు బ్రహ్మ కూడా ఉన్నాడు. ఆదిదేవుడు, ఆదిదేవి ఎవరు? వారికి ఇన్ని భుజాలు ఎందుకు చూపించారు? ఎందుకంటే ఇది వృద్ధి జరుగుతూ ఉంటుంది కదా. ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఎంత వృద్ధి జరుగుతుంది! 100 భుజాలు, 1000 భుజాలు గలవాడని బ్రహ్మకే చెప్తారు. విష్ణువుకు, శంకరునికి ఇన్ని భుజాలని చెప్పరు. బ్రహ్మకు ఉన్నాయని ఎందుకు అంటారు? ఈ వంశమంతా ఈ ప్రజాపిత బ్రహ్మ ద్వారా వచ్చిన వారే కదా. ఇది భుజాల మాట కాదు. వేల భుజాల మాట కాదు. వేల భుజాల బ్రహ్మ అని వారంటారు కానీ వారికి అర్థము తెలియదు. ఇప్పుడు మీరు బ్రహ్మకు ఎన్ని భుజాలో ప్రాక్టికల్‌గా చూడండి. ఇవి బేహద్‌ భుజాలు. ప్రజాపిత బ్రహ్మను అందరూ ఒప్పుకుంటారు కాని వారి కర్తవ్యము గురించి తెలుసుకోలేరు. ఆత్మకు భుజాలు ఉండవు. భుజాలు శరీరానికి ఉంటాయి. ఇన్ని కోట్లమంది సోదరులున్నారు. వారందరివి కలిసి ఎన్ని భుజాలవుతాయి? కానీ ఎప్పుడైనా ముందు పూర్తి జ్ఞానాన్ని అర్థము చేసుకున్న తర్వాతనే ఈ విషయాలు అర్థం చేయించాలి. మొట్టమొదటి ముఖ్యమైన విషయము ఒక్కటే, బాబా చెప్తారు - నన్ను స్మృతి చేయండి, వారసత్వాన్ని స్మృతి చేయండి. తండ్రికి జ్ఞానసాగరుడనే మహిమ కూడా ఉంది. ఎన్ని పాయింట్లు అర్థం చేయిస్తారు. ఇన్ని పాయింట్లు జ్ఞాపకముండవు. సారము బుద్ధిలో ఉండిపోతుంది. చివరికి 'మన్మనాభవ' అనే సారము మిగిలిపోతుంది.

జ్ఞానసాగరులు అని కృష్ణుని అనరు. వారు రచన, రచయిత ఒక్క తండ్రి మాత్రమే. అందరికీ వారసత్వమునిచ్చేది తండ్రి, వారే ఆత్మలను ఇంటికి తీసుకెళ్తారు. తండ్రి మరియు ఇతర ఆత్మల ఇల్లు శాంతిధామము. విష్ణుపురమును తండ్రి ఇల్లు అని అనరు. బాబా మరియు ఆత్మల మధురమైన ఇల్లే శాంతిధామము. ఇల్లు మూలవతనము, ఆత్మలన్నీ అక్కడే నివసిస్తాయి. ఈ విషయాలన్నీ తెలివైన పిల్లలే ధారణ చేస్తారు. ఇంత విస్తారమైన జ్ఞానము ఎవ్వరి బుద్ధిలోనూ ఉండదు. ఇన్ని పేజీలు కూడా వ్రాయలేరు. ఈ మురళీలనంతా ప్రోగు చేస్తూ పోతే ఈ హాలంతా నిండిపోతుంది. ఆ చదువులో కూడా ఎన్ని పుస్తకాలుంటాయి. పరీక్ష పాస్‌ అవుతూనే సారము బుద్ధిలో కూర్చుంటుంది. బ్యారిస్టరీ పరీక్షను పాస్‌ చేయగానే, దాని వలన ఒక్క జన్మకు అల్పకాల సుఖము లభిస్తుంది. అది వినాశి సంపాదన. మీకు ఈ తండ్రి అవినాశి సంపాదన భవిష్యత్తు కొరకు చేయిస్తున్నారు. మిగిలిన గురువులు, మఠాధిపతులు వినాశి సంపాదనను చేయిస్తారు. వినాశనం దగ్గరవుతున్న కొలది, వారి సంపాదన తగ్గిపోతూ ఉంటుంది. ప్రపంచంలో సంపాదన పెరుగుతూ ఉందని అంటారు, కానీ సంపాదన పెరగడం లేదు. అదంతా సమాప్తమవ్వనున్నది. పూర్వము రాజుల సంపాదన బాగా ఉండేది. ఇప్పుడు వారు కూడా లేరు. మీ సంపాదన చాలా సమయము నడుస్తుంది. ఇది తయారుచేయబడిన డ్రామా అని మీకు తెలుసు, ఇది ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. మేము మా బంధు-మిత్రులకు మొదలైనవారికి అర్థం చేయిస్తామని కొందరంటారు, కానీ అది కూడా అల్పకాలమే కదా. మీలో కూడా ధారణ అయ్యేవారు నంబరువారుగా ఉన్నారు. కొంతమంది కొంచెము కూడా అర్థము చేయించలేరు. కొంతమంది మా బంధు-మిత్రులు మొదలైన వారికి అర్థం చేయిస్తామని అంటారు. అది కూడా అల్పకాలానికే కదా. ప్రదర్శనీలు మొదలైనవి ఇతరులకు ఎందుకు అర్థం చేయించరు? - ఎందుకంటే పూర్తిగా ధారణ చేస్తూ ఉండరు. మాకే అంతా తెలుసు అని భావించండి. సర్వీసు చేయు అభిరుచి ఉంటే బాగా అర్థము చేయించే వారి ద్వారా వినాలి. బాబా శ్రేష్ఠ పదవిని ప్రాప్తి చేయించేందుకు వస్తే పురుషార్థము చేయాలి కదా. కాని అదృష్టములో లేకుంటే శ్రీమతమును కూడా గౌరవించరు, పదవి భ్రష్ఠమవుతుంది. డ్రామా ప్లాను అనుసారము రాజధాని స్థాపనవుతూ ఉంది. అందులో అన్ని ప్రకారాల వారు కావాలి కదా. కొందరు మంచి ప్రజలుగా అయ్యేవారు ఉన్నారు, కొందరు సామాన్యులుగా ఉన్నారు. బాబా చెప్తున్నారు - నేను మీకు రాజయోగము నేర్పించేందుకు వచ్చాను. దిల్వాడా మందిరములో రాజుల చిత్రాలున్నాయి కదా. ఎవరు పూజ్యులుగా అవుతారో వారే మళ్లీ పూజారులుగా అవుతారు. రాజా-రాణుల పదవి గొప్పది కదా. వామమార్గములోకి వచ్చినప్పుడు కూడా రాజులుగా లేక మంచి షాహుకార్లుగా ఉంటారు. జగన్నాథ మందిరములో అందరికి కిరీటాలు చూపించారు. ప్రజలకు కిరీటముండదు. కిరీటధారి రాజులను కూడా వికారాలలో చూపించారు. వారికి కూడా సుఖ-సంపత్తులు చాలా ఉంటాయి. సంపద తక్కువ-ఎక్కువ ఉంటుంది కదా. వజ్రాల మహళ్లకు, వెండి మహళ్లకు వ్యత్యాసముంటుంది కదా. కనుక తండ్రి పిల్లలకు చెప్తున్నారు - మంచి పురుషార్థము చేసి శ్రేష్ఠ పదవిని పొందండి. రాజులకు చాలా సుఖముంటుంది. అక్కడ అందరూ సుఖంగా ఉంటారు. ఇక్కడ ఎలా అందరికీ దుఃఖము, జబ్బులు ఉన్నాయో అలా అక్కడ అందరికీ సుఖమే సుఖముంటుంది. అయినా పదవులు నంబరువారుగా ఉంటాయి. తండ్రి సదా చెప్తూనే ఉంటారు - పురుషార్థము చేస్తూ ఉండండి, సోమరులుగా అవ్వకండి. పురుషార్థము ద్వారా, డ్రామానుసారము వీరి సద్గతి ఈ విధంగా ఇంతమాత్రమే జరుగుతుందని అర్థము చేసుకోబడ్తుంది.

మీ సద్గతి కొరకు శ్రీమతానుసారము నడుచుకోవాలి. టీచరు మతానుసారము విద్యార్థి నడుచుకోలేదంటే దేనికీ పనికిరాడు. అందరూ నంబరువారు పురుషార్థానుసారంగా ఉన్నారు. మేము ఇది చేయలేదంటే ఇంకేమి నేర్చుకుంటారు. నేర్చుకుని తెలివైనవారిగా అవ్వాలి, వీరు బాగా అర్థం చేయిస్తారని అందరూ అనాలి, కానీ ఆత్మ జీవిస్తూ ఉండి, మరణించి ఒక్క తండ్రివారిగా అవ్వాలి, ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు. దేహాభిమానము పూర్తిగా వదిలిపోవడమే ఉన్నతమైన గమ్యము. అంతా మర్చిపోవాలి. పూర్తి ఆత్మాభిమాని స్థితి తయారవ్వాలి - ఇదే శ్రేష్ఠమైన గమ్యము. అక్కడ ఆత్మలు అశరీరిగానే ఉంటాయి, ఇక్కడకు వచ్చి శరీరాలను ధరిస్తాయి. ఇప్పుడిక్కడ దేహములో ఉంటున్నా స్వయాన్ని అశరీరిగా భావించాలి. ఇది చాలా పెద్ద కష్టము. స్వయాన్ని ఆత్మగా భావించి కర్మాతీత స్థితిలో ఉండాలి. సర్పానికి కూడా తెలివి ఉంది కదా - ఒక పాత పొరను(కుబుసాన్ని) వదిలి కొత్త దానిని ధారణ చేస్తుంది కదా. కావున మీరు దేహాభిమానాన్ని ఎంతగా తొలగించుకోవాలి! మూలవతనములో మీరు ఆత్మాభిమానులుగానే ఉంటారు. ఇక్కడ దేహములో ఉంటున్నా స్వయాన్ని ఆత్మగా భావించాలి. దేహాభిమానము అంతమైపోవాలి. ఎంత పెద్ద పరీక్ష. అందుకే భగవంతుడే స్వయంగా వచ్చి చదివించవలసి ఉంటుంది. దేహ సంబంధాలన్నీ వదిలి నాకు చెందినవారిగా అవ్వండి, స్వయాన్ని నిరాకార ఆత్మగా భావించండని ఇతరులెవ్వరూ చెప్పరు. ఏ వస్తువు పైనా అభిమానముండరాదు. మాయ పరస్పరములో దేహాభిమానములో బంధిస్తూ ఉంటుంది. అందుకే బాబా చెప్తారు - 'ఈ సాకారుని(బ్రహ్మను) కూడా స్మృతి చేయకండి.' బాబా చెప్తున్నారు - మీరు మీ దేహాన్ని కూడా మర్చిపోవాలి, ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ఇందులో చాలా శ్రమ ఉంది. మాయ చాలా మంచి-మంచి పిల్లలను కూడా నామ-రూపాలలో వ్రేలాడదీస్తుంది. ఈ అలవాటు చాలా చెడ్డది. శరీరాన్ని స్మృతి చేయడమంటే భూతాలను స్మృతి చేయడమే కదా. ఒక్క శివబాబానే స్మృతి చేయండని చెప్తెే మీరు పంచ భూతాలను స్మృతి చేస్తూ ఉంటారు. దేహము పై అస్సలు ఆకర్షణ(లగవ్‌) ఉండరాదు. బ్రాహ్మణి ద్వారా కూడా నేర్చుకోవాలి కానీ వారి నామ-రూపాలలో చిక్కుకోరాదు. ఆత్మాభిమానిగా అవ్వడంలోనే శ్రమ ఉంది. అనేకమంది పిల్లలు బాబా వద్దకు చార్టును పంపుతారు కానీ బాబా దానిని నమ్మరు. కొందరు మేము శివబాబాను తప్ప మరెవ్వరినీ స్మృతి చేయమని అంటారు, కాని బాబా చెప్తున్నారు - ఒక్క పైసా అంత స్మృతి కూడా చేయడం లేదు. స్మృతియే కష్టతరమైనది, ఎక్కడెక్కడో చిక్కుకుంటారు. దేహధారులను స్మృతి చేయడమంటే 5 భూతాలను స్మృతి చేయడం, దీనిని భూత పూజ అని అంటారు. భూతాలను స్మృతి చేస్తారు. మీరిక్కడ ఒక్క శివాబాబానే స్మృతి చేయాలి. పూజించే విషయమే లేదు. భక్తికి నామ-రూపాలే అదృశ్యమైపోతాయి. బొమ్మలను(విగ్రహాలను) ఎందుకు స్మృతి చేయాలి? అవి కూడా మట్టితో తయారైనవే కదా. తండ్రి చెప్తున్నారు - ఇది కూడా డ్రామాలో రచించబడి ఉంది. ఇప్పుడు మిమ్ములను మళ్లీ పూజారుల నుండి పూజ్యులుగా చేస్తాను. ఒక్క తండ్రిని తప్ప ఇంకెవ్వరి శరీరమును స్మృతి చేయరాదు. ఆత్మ పావనమైపోతే దానికి శరీరము కూడా పావనమైనదే లభిస్తుంది. ఇప్పుడీ శరీరము పావనమైనది కాదు. ఆత్మ సతోప్రధానము నుండి సతో, రజో, తమో అయినప్పుడు శరీరము కూడా అలాంటిదే లభిస్తుంది. ఇప్పుడు మీ ఆత్మ పావనమవుతూ పోతుంది కాని శరీరము ఇప్పుడే పావనంగా అవ్వదు. ఇవి అర్థము చేసుకునే విషయాలు. ఈ పాయింట్లు ఎవరైతే బాగా అర్థము చేసుకొని ఇతరులకు అర్థము చేయిస్తారో వారి బుద్ధిలోనే ఈ పాయింట్లు కూర్చుంటాయి. సతోప్రధానంగా అవ్వాల్సింది ఆత్మ. తండ్రిని స్మృతి చేయడమే చాలా కష్టము. కొందరికి కొద్దిగా కూడా గుర్తు ఉండదు. గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులయ్యేందుకు బుద్ధియోగము కొద్దిగా కూడా బయటకు పోరాదు. ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. కాని పిల్లల బుద్ధియోగము తిరుగుతూనే ఉంటుంది. ఎంత ఎక్కువమందిని మీ సమానంగా చేస్తారో అంత ఉన్నతపదవి లభిస్తుంది. దేహాన్ని స్మృతి చేసేవారు ఎప్పుడూ ఉన్నతమైన పదవిని పొందలేరు. ఇక్కడ గౌరవపూర్వకంగా(పాస్‌ విత్‌ ఆనర్‌గా) ఉత్తీర్ణులవ్వాలి. కష్టపడకుండా ఈ(లక్ష్మీనారాయణుల) పదవి ఎలా లభిస్తుంది! దేహాన్ని స్మృతి చేయువారు ఏ పురుషార్థమూ చేయలేరు. తండ్రి చెప్తున్నారు - పురుషార్థము చేసేవారిని అనుసరించాలి. ఇతను కూడా పురుషార్థియే కదా.

ఇది చాలా విచిత్రమైన జ్ఞానము. ప్రపంచములో ఈ జ్ఞానము ఎవ్వరికీ తెలియదు. ఆత్మ ఎలా పరివర్తన అవుతుందో, ఇది ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. ఇదంతా గుప్తమైన శ్రమ. బాబా కూడా గుప్తమే. మీరు రాజ్యమును ఎలా ప్రాప్తి చేసుకుంటారు! యుద్ధము, జగడాలు మొదలైనవేవీ లేవు. ఇది కేవలం జ్ఞాన-యోగాల విషయము మాత్రమే. మనము ఎవ్వరితోనూ యుద్ధము చేయము, మనము ఆత్మను పవిత్రంగా చేసుకునేందుకు కష్టపడాలి. ఆత్మ పతితమయ్యే కొలది శరీరము కూడా పతితమైన దానినే తీసుకుంటూ పోతుంది. మళ్లీ ఆత్మ పావనంగా అయి వెళ్లాలి, ఇది చాలా కష్టము. బాబా ఎవరెవరు ఎంత పురుషార్థము చేస్తున్నారో తెలుసుకోగలరు! ఇది శివబాబా భండారము. శివబాబా భండారములో మీరు సేవ చేస్తున్నారు. సర్వీసు చేయలేదంటే చాలా చిన్న పదవిని కూడా పొందలేరు. సేవ చేసేందుకే తండ్రి వద్దకు వచ్చారు, సర్వీసే చేయలేదంటే ఏ పదవి లభిస్తుంది! ఈ రాజధాని(స్వర్గము) స్థాపనవుతూ ఉంది, ఇందులో నౌకర్లు, చాకర్లు మొదలైనవారు కూడా తయారవుతారు కదా. ఇప్పుడు మీరు రావణుని పై విజయము పొందుతారు. ఇది తప్ప ఇంకే యుద్ధమూ లేదు. ఇదంతా అర్థము చేయించబడ్తుంది, ఇవి ఎంత గుప్తమైన విషయాలు! యోగబలముతో విశ్వచక్రవర్తి పదవిని మీరు తీసుకుంటారు. మనము మన శాంతిధామములో ఉండేవారమని మీకు తెలుసు. పిల్లలైన మీకు అనంతమైన ఇంటి స్మృతే ఉంది. ఇక్కడకు మనము పాత్రను అభినయించేందుకు వచ్చాము, తర్వాత మన ఇంటికి వెళ్తాము. ఆత్మ ఎలా వెళ్తుందో కూడా ఎవ్వరూ అర్థము చేసుకోరు. డ్రామా ప్లాను అనుసారము ఆత్మలు రానే రావాలి. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.


ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఏ దేహధారి పైనా ఆకర్షణ, ప్రేమ(లగావ్‌) ఉంచుకోరాదు. శరీరాన్ని స్మృతి చేయడం కూడా భూతాలను స్మృతి చేయడము వంటిదే, కావున ఎవరి నామ-రూపాలలోనూ చిక్కుకోరాదు. మీ దేహమును కూడా మర్చిపోవాలి.
2. భవిష్యత్తు కొరకు అవినాశి సంపాదనను జమ చేసుకోవాలి. వివేకవంతులుగా అయి జ్ఞాన పాయింట్లను బుద్ధిలో ధారణ చేయాలి. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తున్నారో దానిని అర్థము చేసుకొని ఇతరులకు వినిపించాలి.

వరదానము :- '' సత్యమైన, స్వచ్ఛమైన హృదయం ఆధారంతో మొదటి నంబరు తీసుకునే దిలారాం పసంద్‌ భవ ''
హృదయాభిరాముడైన తండ్రికి సత్యమైన హృదయం(దిల్‌) గలవారే ఇష్టము. ప్రాపంచిక (లౌకిక) బుద్ధి లేకున్నా సత్యమైన, స్వచ్ఛమైన మనసు ఉంటే మొదటి నంబరు తీసుకుంటారు. ఎందుకంటే బుద్ధినైతే తండ్రి ఎంత పెద్దదిస్తారంటే ఆ బుద్ధి ద్వారా రచయితను తెలుసుకున్నందున రచన ఆది-మధ్య-అంత్యముల జ్ఞానాన్ని తెలుసుకుంటారు. కనుక సత్యమైన, స్వచ్ఛమైన హృదయం ఆధారముతోనే నంబరు తయారవుతుంది. సేవ ఆధారముతో కాదు. సత్యమైన హృదయంతో చేసిన సేవల ప్రభావం హృదయం వరకు చేరుకుంటుంది. బుద్ధివంతులు పేరు సంపాదిస్తారు, హృదయం (మనసు) గలవారు ఆశీర్వాదాలు సంపాదిస్తారు.

స్లోగన్‌ :- '' సర్వుల పట్ల శుభచింతన, శుభకామనలు ఉండడమే సత్యమైన పరోపకారము ''

Monday, 3 February 2020

Telugu Murli 04/02/2020

04-02-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - మీరు ఇప్పటి వరకు ఏమేమి చదివారో దానినంతా మర్చిపోండి. జీవించి ఉండగానే మరణించడం అనగా అన్నీ మర్చిపోవడం, వెనుకటి స్మృతులేవీ రాకూడదు. ''

ప్రశ్న :- ఎవరు జీవించి ఉండగానే పూర్తిగా మరణించి(మరజీవాగా)ఉండరో, వారి గుర్తులు ఏమిటి?
జవాబు :- వారు తండ్రితో కూడా వాదిస్తూ ఉంటారు. శాస్త్రాల ఉదాహరణ ఇస్తూ ఉంటారు. ఎవరైతే పూర్తిగా మరణించి ఉంటారో, వారు - బాబా ఏమి వినిపిస్తున్నారో అదే సత్యము. అర్ధకల్పము ఏదైతే విన్నామో అదంతా అసత్యము కనుక వాటిని గురించి మాట్లాడరాదు. చెడు వినకండి,........... అని బాబా చెప్పారు.

పాట :- ఓం నమ: శివాయ,............  
ఓంశాంతి. ఎప్పుడు శాంతిలో కూర్చుండబెడ్తారో దానిని నిష్ఠ(నేష్ఠా) అని అన్నారని తండ్రి అర్థం చేయించారు. ఈ డ్రిల్లు చేయించబడ్తుంది. ఇప్పుడు తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఎవరైతే జీవించి ఉండగానే మరణించారో వారు మేము జీవించి ఉంటూ మరణించాము అని అంటారు. మనష్యులు మరణిస్తే అంతా మర్చిపోతారు. కేవలం సంస్కారము మిగిలిపోతుంది. ఇప్పుడు మీరు కూడా తండ్రికి చెందినవారిగా అయ్యి ప్రపంచము నుండి మరణించారు. తండ్రి చెప్తారు - మీలో భక్తి సంస్కారముండేది. ఇప్పుడు ఆ సంస్కారము పరివర్తన అవుతూ ఉంది. కనుక జీవించి ఉండగానే మీరు మరణిస్తారు కదా. మరణించడం వలన మనుష్యులు ఈ జన్మలో చదివినదంతా మర్చిపోతారు. మళ్లీ మరు జన్మలో కొత్తగా చదవడం జరుగుతుంది. మీరు ఏమేమి చదివారో అదంతా మర్చిపోండి అని తండ్రి కూడా చెప్తారు. మీరు తండ్రికి చెందిన వారిగా అయ్యారు కదా. నేను మీకు కొత్త విషయాన్ని వినిపిస్తాను. కనుక ఇప్పుడు వేదాలు, శాస్త్రాలు, గ్రంథము, జప, తపాలు మొదలైనవన్నీ మర్చిపోండి. అందుకే చెడు వినకు, చెడు చూడకు.............. అని చెప్పారు. ఇది పిల్లలైన మీ కొరకే. చాలామంది శాస్త్రాలు మొదలైనవి చాలా చదివారు, పూర్తిగా మరణించలేదు. కనుక వ్యర్థంగా వాదిస్తారు. మరణిస్తే ఎప్పుడూ వాదించరు. తండ్రి ఏదైతే వినిపించారో అదే సత్యము. మిగిలిన విషయాలు మేము మా నోటితో ఎందుకు మాట్లాడాలి అని అంటారు. వాటిని నోటి పైకి తీసుకు రాకండి, చెడు వినకండి, ఏమీ వినకండి అని తండ్రి ఆదేశాన్నిచ్చారు కదా. ఇప్పుడు మేము జ్ఞానసాగరుని సంతానంగా అయ్యాము, కనుక భక్తిని ఎందుకు స్మృతి చేయాలి! అని అడగండి. మేము ఒక్క భగవంతుని మాత్రమే స్మృతి చేస్తాము. తండ్రి చెప్తున్నారు - భక్తిమార్గాన్ని వదలండి. నేను మీకు సహజమైన విషయాన్ని వినిపిస్తాను - బీజమైన నన్ను స్మృతి చేస్తే వృక్షము పూర్తిగా బుద్ధిలోకి రానే వస్తుంది. మీకు గీత ముఖ్యమైనది. గీతలోనే భగవంతుడు తెలియజేసిన విషయాలున్నాయి. ఇప్పుడివి కొత్త విషయాలు. కొత్త విషయాల పై సదా ఎక్కువ గమనము ఇవ్వబడ్తుంది. విషయము కూడా చాలా సాధారణమైనది. అన్నిటికంటే గొప్ప విషయము స్మృతి చేయడము. 'మన్మనాభవ' అని మాటిమాటికి చెప్పవలసి వస్తుంది. తండ్రిని స్మృతి చేయండి. ఇవి చాలా గుప్తమైన విషయాలు. ఇందులోనే విఘ్నాలు వస్తూ ఉంటాయి. పూర్తి రోజులో రెండు నిముషాలు కూడా స్మృతి చేయని పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. తండ్రికి చెందినవారిగా అయ్యి కూడా మంచి కర్మలు చేయకుంటే స్మృతి కూడా చేయరు. వికర్మలు చేస్తూ ఉంటారు. బుద్ధిలోనే కూర్చోకుంటే వారు తండ్రి ఆజ్ఞను నిరాదరించినట్లవుతుంది. వారు చదవలేరు కనుక వారికి శక్తి లభించదు. దైహిక విద్య ద్వారా కూడా శక్తి లభిస్తుంది కదా! చదువు సంపాదనకు మూలము. చదువు ద్వారా శరీర నిర్వహణ జరుగుతుంది. అది కూడా అల్పకాలము కొరకే. ఎవరైనా చదువుతూ చదువుతూ మరణిస్తే ఆ చదువును వెంట తీసుకెళ్లరు. మరో జన్మ తీసుకొని మళ్లీ కొత్తగా చదవవలసి ఉంటుంది కానీ ఇక్కడ మీరు ఎంత చదువుతారో దానిని మీ జతలో తీసుకెళ్తారు. ఎందుకంటే మీరు మరు జన్మలో ప్రాలబ్ధాన్ని పొందుతారు. పోతే అదంతా భక్తిమార్గము. ఏ ఏ వస్తువులు ఉన్నాయో ఎవ్వరికీ తెలియదు. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మలైన మీకు జ్ఞానమునిస్తారు. ఒకేసారి తండ్రి, సుప్రీమ్‌ ఆత్మ(పరమ ఆత) వచ్చి ఆత్మలకు జ్ఞానమునిస్తారు. దీని ద్వారా మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు. భక్తిమార్గములో స్వర్గము ఉండదు. ఇప్పుడు మీరు ప్రభువుకు చెందినవారిగా అయ్యారు. మాయ చాలాసార్లు పిల్లలను కూడా అనాథలుగా చేసేస్తుంది. చిన్న-చిన్న విషయాలలో పరస్పరము కొట్లాడుకుంటారు. తండ్రి స్మృతిలో లేనందున అనాథలుగా అయ్యారు కదా. అనాథలుగా అయితే ఏదో ఒక పాప కర్మ తప్పకుండా చేసేస్తారు. తండ్రి చెప్తున్నారు - నా వారిగా అయ్యి నా పేరును పాడు చేయకండి. పరస్పరములో చాలా ప్రీతిగా నడుచుకోండి. ఉల్టా-సుల్టా మాటలను మాట్లాడకండి.

తండ్రి అలాంటి అహల్యలను, కుబ్జలను వికలాంగులను, కొండజాతి స్త్రీలను కూడా ఉద్ధరించవలసి ఉంటుంది. బోయ స్త్రీ ఇచ్చిన రేగి పండ్లు తిన్నారని చెప్తారు. ఆమె ఇచ్చిన పండ్లను అలాగే తినలేదు. ఎప్పుడు ఆ బోయ స్త్రీ బ్రాహ్మణిగా అవుతుందో అప్పుడు ఎందుకు తినరు! అందుకే బ్రహ్మ భోజనానికి మహిమ ఉంది. శివబాబా తినరు. వారు అభోక్త కానీ ఈ రథము తింటుంది కదా. పిల్లలైన మీరు ఎవరితోనూ వాదించనవసరము లేదు. సదా మిమ్ములను మీరు రక్షణ చేసుకోవాలి. శివబాబా చెప్తున్నారు అను రెండే అక్షరాలు చెప్పండి. శివబాబాను రుద్రుడని కూడా అంటారు. రుద్ర జ్ఞాన యజ్ఞము ద్వారా వినాశ జ్వాల వెలువడింది. కనుక రుద్రుడు భగవంతుడయ్యాడు కదా. కృష్ణుని రుద్రుడని అనరు. వినాశనము కూడా కృష్ణుడు చేయించడు. తండ్రే స్థాపన, వినాశనము, పాలన చేయిస్తారు. స్వయంగా ఏదీ చేయరు. లేకుంటే దోషము వస్తుంది కదా. వారు చేసి చేయించేవారు. తండ్రి చెప్తారు - వినాశనము చేయమని నేనేమీ చెప్పను. ఇదంతా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. శంకరుడు ఏమైనా చేస్తాడా? ఏమీ చేయడు. శంకరుని ద్వారా వినాశనము అని కేవలం గాయనముంది. కానీ వినాశనము వారు తమకు తామే చేసుకుంటున్నారు. ఇది అనాదిగా తయారైన డ్రామా. దానిని గురించి అర్థం చేయించబడ్తుంది. రచయిత అయిన తండ్రిని అందరూ మర్చిపోయారు. గాడ్‌ఫాదర్‌ను రచయిత అని అంటారు కానీ వారిని గురించి తెలియనే తెలియదు. వారు ప్రపంచాన్ని సృష్టిస్తారని అనుకుంటారు. తండ్రి చెప్తారు - నేను సృష్టించను కానీ పరివర్తన చేస్తాను. కలియుగాన్ని సత్యయుగంగా చేస్తాను. నేను సంగమయుగములో వస్తాను. దానిని సర్వ శ్రేష్ఠ పురుషోత్తమ యుగమని మహిమ చేస్తారు. భగవంతుడు కళ్యాణకారి. అందరి కళ్యాణము చేస్తారు కానీ ఎలా చేస్తారో, ఏ కళ్యాణము చేస్తారో ఎవ్వరికీ తెలియదు. ఆంగ్లములో లిబరేటర్‌(ముక్తిదాత), గైడ్‌(మార్గదర్శకుడు) అని అంటారు. కాని దాని అర్థము తెలియదు. భక్తి తర్వాత భగవంతుడు లభిస్తాడు, సద్గతి లభిస్తుందని అంటారు. సర్వులకు సద్గతి ఏ మనుష్యులూ ఇవ్వలేరు. లేకుంటే పరమాత్మను పతితపావనుడు, సర్వుల సద్గతిదాత అని ఎందుకు మహిమ చేస్తారు? తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు! అనాథలుగా ఉన్నారు. తండ్రితో విపరీత బుద్ధి ఉంది. ఇప్పుడు తండ్రి ఏం చేయాలి? తండ్రి స్వయంగా మాలికులు, వారి శివజయంతిని కూడా భారతదేశములోనే ఆచరిస్తారు. తండ్రి చెప్తారు - నేను భక్తులకు ఫలాన్ని ఇచ్చేందుకు వస్తాను, భారతదేశములోనే వస్తాను. వచ్చేందుకు నాకు శరీరమైతే తప్పకుండా కావాలి కదా. ప్రేరణ ద్వారా ఏమీ జరగదు. ఇతనిలో ప్రవేశించి ఇతని నోటి ద్వారా మీకు జ్ఞానమునిస్తాను. గోముఖము మాట లేదు. అది ఈ నోటి విషయము. మనుష్యుల నోరు కావాలి, జంతువులది కాదు. అంతమాత్రము కూడా బుద్ధి పని చేయదు. మరోవైపు భగీరథుని చూపిస్తారు. వారు ఎలా, ఎప్పుడు వస్తారో కొద్దిగా కూడా ఎవ్వరికీ తెలియదు. కనుక తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - మీరు మరణించారు కనుక భక్తిమార్గాన్ని పూర్తిగా మర్చిపోండి. శివ భగవానువాచ - నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశమవుతాయి. నేనే పతిత పావనుడను. మీరు పవిత్రంగా అవుతారు తర్వాత అందరినీ తీసుకెళ్తాను. ఇంటింటిలో ఈ సందేశమునివ్వండి. తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి, మీరు పావనంగా అవుతారు. వినాశనము ఎదురుగా నిలిచి ఉంది. ఓ పతితపావనా! రండి, పతితులను పావనంగా చేయండి, రామరాజ్యాన్ని స్థాపన చేయండి, రావణరాజ్యము నుండి ముక్తులుగా చేయండి అని మీరు పిలుస్తారు. అక్కడ అందరూ తమ-తమ కొరకు మాత్రమే ప్రయత్నము చేస్తారు. నేను వచ్చి అందరికీ ముక్త్తినిస్తానని తండ్రి చెప్తారు. అందరూ 5 వికారాల రూపి రావణుని జైలులో పడి ఉన్నారు. నేను సర్వులకు సద్గతినిస్తాను. నన్ను దు:ఖహర్త-సుఖకర్త అని అంటారు. రామరాజ్యమైతే తప్పకుండా కొత్త ప్రపంచములో ఉంటుంది.

ఇప్పుడు పాండవులైన మీది ప్రీతిబుద్ధి. కొందరు వెంటనే ప్రీతిబుద్ధి గలవారిగా అవుతారు. కొందరికి నెమ్మది నెమ్మదిగా ప్రీతి కలుగుతుంది. మేము సర్వస్వాన్ని తండ్రికి అర్పణ చేస్తామని కొందరు అంటారు. ఒక్కరు తప్ప వేరెవ్వరూ లేనే లేరు. సర్వులకు ఆధారము ఒక్క భగవంతుడు మాత్రమే. ఎంత సాధారణమైన విషయము. తండ్రిని స్మృతి చేయండి, చక్రాన్ని స్మృతి చేయండి, చక్రవర్తి రాజా-రాణులుగా అవుతారు. ఇది విశ్వాధికారులుగా చేసే పాఠశాల. అందుకే చక్రవర్తి రాజా అని పేరు వచ్చింది. చక్రాన్ని తెలుసుకోవడం వలన చక్రవర్తులుగా అవుతారు. ఇది తండ్రే అర్థం చేయిస్తారు. ఏ వాదవివాదాలూ చేయరాదు. భక్తిమార్గములోని అన్ని విషయాలను వదిలేయమని చెప్పండి. కేవలం నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తారు. ఇదే ముఖ్యమైన విషయము. ఎవరైతే తీవ్ర పురుషార్థులుగా ఉంటారో వారు తీవ్రంగా చదువులో నిమగ్నమైపోతారు. ఎవరికైతే చదువు పై ఆసక్తి ఉంటుందో వారు ఉదయమే లేచి చదువుతారు. భక్తులు కూడా ఉదయమే లేస్తారు. నౌధా భక్తి కూడా ఎంతగా చేస్తారు! ఎప్పుడైతే శిరస్సును ఖండించుకునే సమయము వస్తుందో అప్పుడు సాక్షాత్కారము కలుగుతుంది. ఇక్కడ తండ్రి చెప్తారు - ఈ సాక్షాత్కారము కూడా నష్టము కలిగించేదే. సాక్షాత్కారములోకి వెళ్లడం వలన చదువు, యోగము రెండూ ఆగిపోతాయి. సమయము వ్యర్థమవుతుంది. కనుక ధ్యానము మొదలైనవాటిలో ఆసక్తి ఉండరాదు. ఇది కూడా పెద్ద జబ్బు. దీని ద్వారా మాయ ప్రవేశిస్తుంది. ఎలా యుద్ధ సమయంలో వార్తలు వినిపించునప్పుడు మధ్యలో అవి ఎవరూ వినకుండా ఉండేందుకు ఏదైనా పాడు చేస్తారో అలా మాయ కూడా చాలామందికి విఘ్నాలు కలిగిస్తుంది. తండ్రిని స్మృతి చేయనివ్వదు. వీరి భాగ్యములో విఘ్నముందని అర్థం చేసుకోవచ్చు. మాయ ప్రవేశించలేదు కదా అని గమనించుకోవాలి. నియమ విరుద్ధంగా ఏదైనా మాట్లాడితే తక్షణము బాబా క్రిందికి దించేస్తారు. మాకు కేవలం సాక్షాత్కారము జరిగితే మేము ఇంత ధనాన్ని, సంపాదనను మీకు ఇచ్చేస్తామని చాలామంది అంటారు. బాబా అంటారు - మీది మీ వద్దనే ఉంచుకోండి. భగవంతునికి మీ ధనము అవసరమేముంది? ఈ పాత ప్రపంచములో ఏమేమి ఉందో అదంతా భస్మమైపోతుందని తండ్రికి తెలుసు. బాబా ఏం చేసుకుంటారు? బాబా వద్ద ఒక్కొక్క నీటిబొట్టు చేరి చెరువైపోతుంది. తండ్రి ఆదేశానుసారము నడవండి. ఆసుపత్రి కమ్‌ యూనివర్సిటీని తెరవండి. అచ్చటికి ఎవరైనా వచ్చి విశ్వాధికారులుగా కావచ్చు. 3 అడుగుల భూమి పై కూర్చొని మీరు మనుష్యులను నరుల నుండి నారాయణులుగా చేయాలి. కాని 3 అడుగుల భూమి కూడా లభించదు. తండ్రి చెప్తారు - నేను మీకు సర్వ వేదశాస్త్రాల సారాన్ని తెలియజేస్తాను. ఈ శాస్త్రాలన్నీ భక్తిమార్గములోనివి. బాబా ఏమీ నిందించడం లేదు, ఇది తయారైన డ్రామా. ఇది కేవలం అర్థం చేయించేందుకు చెప్పబడ్తుంది. అయినా ఇది ఆటనే కదా. ఆటను మనము నిందించలేము. జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు అని మనము అంటాము. వారు ఆ చంద్రుడు మొదలైన వాటిలో అక్కడ ఏదైనా రాజ్యముందా? అని వెతుకుతారు. జపాన్‌ వారు సూర్యుని అంగీకరిస్తారు. మనము సూర్యవంశము అని చెప్తాము. వారు కూర్చొని సూర్యుని పూజిస్తారు, సూర్యునికి అర్ఘ్యమిస్తారు(నీటిని అర్పిస్తారు). కనుక బాబా పిల్లలకు అర్థం చేయించారు - ఏ విషయములోనూ ఎక్కువగా వాదించరాదు. ఒకే విషయాన్ని వినిపించండి. ''తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారు.'' ఇప్పుడు రావణరాజ్యములో అందరూ పతితులుగా ఉన్నారు కానీ ఎవ్వరూ తమను తాము పతితులమని ఒప్పుకోరు.

పిల్లలారా! మీ ఒక కంటిలో శాంతిధామము మరొక కంటిలో సుఖధామము ఉండాలి. పోతే ఈ దు:ఖధామాన్ని మర్చిపోండి. మీరు చైతన్య లైట్‌హౌస్‌లు. ఇప్పుడు ప్రదర్శినీలో కూడా భారతదేశము లైట్‌హౌస్‌......... అని పేరు పెట్టారు కానీ దానిని వారెవ్వరూ అర్థము చేసుకోలేరు. ఇప్పుడు మీరు లైట్‌హౌస్‌లు కదా. సాగర తీరములోని లైట్‌హౌస్‌ స్టీమర్లకు మార్గాన్ని చూపిస్తుంది. మీరు కూడా అందరికీ ముక్తి-జీవన్ముక్తి ధామాలకు మార్గాన్ని తెలుపుతారు. ఎవరైనా ప్రదర్శినీకి వచ్చినప్పుడు వారికి చాలా ప్రీతిగా చెప్పండి - గాడ్‌ఫాదర్‌ సర్వులకు ఒక్కరే కదా. గాడ్‌ఫాదర్‌ లేక పరమపిత నన్ను స్మృతి చేయమని చెప్తున్నారు. అనగా తప్పకుండా నోటి ద్వారానే చెప్తారు కదా. బ్రహ్మ ద్వారా స్థాపన, బ్రాహ్మణ - బ్రాహ్మణీలమైన మనమంతా బ్రహ్మ ముఖ వంశస్థులము. ఆ బ్రాహ్మణులు కూడా బ్రాహ్మణ దేవతాయ నమ: అని బ్రాహ్మణులైన మీ మహిమ చేస్తారు. అత్యంత ఉన్నతమైనవారు ఒక్క తండ్రి మాత్రమే. వారు చెప్తున్నారు - నేను మీకు ఉన్నతాతి ఉన్నతమైన రాజయోగాన్ని నేర్పిస్తాను. దాని ద్వారా మీరు పూర్తి విశ్వానికి అధిపతులుగా అవుతారు. ఆ రాజ్యాన్ని మీ నుండి ఎవ్వరూ లాక్కోలేరు. విశ్వము పై భారతదేశ పాలన ఉండేది. భారతదేశానికి చాలా మహిమ ఉంది. మేము శ్రీమతానుసారము ఈ స్వర్గ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని ఇప్పుడు మీకు తెలుసు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.


ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తీవ్ర పురుషార్థులుగా అయ్యేందుకు చదువు పై ఆసక్తిని ఉంచుకోవాలి. ఉదయము ఉదయమే లేచి చదువుకోవాలి. సాక్షాత్కారము అవ్వాలనే ఆశ ఉంచుకోరాదు. ఇందులో కూడా సమయం వ్యర్థమవుతుంది.
2. శాంతిధామము మరియు సుఖధామాలను స్మృతి చేయాలి. ఈ దు:ఖధామాన్ని మర్చిపోవాలి. ఎవ్వరితోనూ వాదించరాదు. ప్రేమగా ముక్తి-జీవన్ముక్తులకు మార్గము చూపించాలి.

వరదానము :- '' నిమిత్త భావము ద్వారా సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునే శ్రేష్ఠ సేవాధారీ భవ ''
సేవలో నిమిత్త భావము స్వతహాగా సఫలతను ఇప్పిస్తుంది. నిమిత్త భావము లేకుంటే సఫలత ఉండదు. శ్రేష్ఠమైన సేవాధారి అనగా ప్రతి అడుగు తండ్రి అడుగు పై ఉంచేవారు. ప్రతి అడుగు శ్రేష్ఠ మతమును అనుసరించి శ్రేష్ఠంగా చేసుకునేవారు. సేవలో, స్వయంలో వ్యర్థము ఎంత సమాప్తమై పోతుందో అంత సమర్థంగా అవుతారు. సమర్థమైన ఆత్మలు ప్రతి అడుగులో సఫలతను ప్రాప్తి చేసుకుంటారు. ఎవరైతే స్వయం ఉమంగ-ఉత్సాహములో ఉంటూ ఇతరులకు కూడా ఉమంగ - ఉత్సాహాలను ఇప్పిస్తారో వారే శ్రేష్ఠమైన సేవాధారులు.

స్లోగన్‌ :- '' ఈశ్వరీయ సేవలో స్వయాన్ని ఆఫర్‌ చేసుకుంటే, ఆఫరీన్‌ లభిస్తూ ఉంటుంది ''

Sunday, 2 February 2020

Telugu Murli 03/02/2020

03-02-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - ఇంటింటికి బాబా సందేశాన్ని ఇవ్వడం మీ బాధ్యత, ఎటువంటి పరిస్థితులలోనైనా యుక్తి రచించి ప్రతి ఒక్కరికి తండ్రి పరిచయాన్ని తప్పకుండా ఇవ్వండి ''

ప్రశ్న :- పిల్లలైన మీకు ఏ ఒక్క విషయంలో ఆసక్తి ఉండాలి ?
జవాబు :- కొత్త కొత్త పాయింట్లు ఏవైతే వెలువడుతాయో, వాటిని తమ వద్ద నోట్‌ చేసుకునే ఆసక్తి ఉండాలి, ఎందుకంటే ఇన్ని పాయింట్లు గుర్తు ఉండడం కష్టము. నోట్సు వ్రాసుకొని తర్వాత ఇతరులకు అర్థం చేయించాలి. అలాగని వ్రాసుకొని ఆ కాపీని అలాగే ఉంచుకోరాదు, ఉపయోగించాలి. ఏ పిల్లలైతే బాగా అర్థము చేసుకుంటారో, వారికి నోట్స్‌ వ్రాసుకునే ఆసక్తి చాలా ఉంటుంది.

పాట :- లక్షలను జమ చేసుకునేవారు,......... (లాఖ్‌ జమానే వాలే,............)  
ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. ఆత్మిక పిల్లలారా! అను మాట ఒక్క తండ్రి మాత్రమే అనగలరు. ఆత్మిక తండ్రి తప్ప ఎప్పుడూ, ఎవ్వరూ, ఎవ్వరినీ '' ఆత్మిక పిల్లలారా! '' అని సంబోధించలేరు. ఆత్మలందరి తండ్రి ఒక్కరేనని, మనమంతా సోదరులమని పిల్లలకు తెలుసు. భ్రాతృత్వము(సోదరత్వము) అని కూడా గానము చేస్తారు, అయినా మాయ ప్రవేశత వల్ల పరమాత్ముని సర్వవ్యాపి అని అంటారు. అప్పుడు ఫాదర్‌హుడ్‌(అందరూ తండ్రులే / పితృత్వము) అవుతంది కదా. రావణ రాజ్యము పాత ప్రపంచములోనే ఉంటుంది. కొత్త ప్రపంచము రామరాజ్యము లేక ఈశ్వరీయ రాజ్యము అని అనబడ్తుంది. ఇవి అర్థము చేసుకోవాల్సిన విషయాలు. ఈశ్వరీయ రాజ్యము, ఆసురీ రాజ్యము అను రెండు రాజ్యములున్నాయి. కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచము. కొత్త ప్రపంచాన్ని తప్పకుండా తండ్రే రచించి ఉంటారు. ఈ ప్రపంచములోని మనుష్యులు కొత్త ప్రపంచము, పాత ప్రపంచము అనగా ఏమిటో కూడా అర్థము చేసుకోలేరు. అనగా వారికేమీ తెలియదు. మీకు కూడా ఏమీ తెలిసేది కాదు, అవివేకులుగా ఉండేవారు. కొత్త సుఖమయ ప్రపంచము ఎవరు స్థాపన చేస్తారు, మళ్లీ పాత ప్రపంచములో దుఃఖము ఎందుకు ఉంటుంది? స్వర్గము నుండి నరకంగా ఎలా అవుతుంది? ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. ఈ విషయాలను అర్థము చేసుకునేది మనుష్యులే కదా. దేవతల చిత్రాలు కూడా ఉన్నాయి. కనుక ఆదిసనాతన దేవీదేవతల రాజ్యము తప్పకుండా ఉండేది. అయితే అది ఈ సమయములో లేదు. ఇది ప్రజల పై ప్రజా రాజ్యము. తండ్రి భారతదేశములోనే వస్తారు. శివబాబా భారతదేశములో వచ్చి ఏం చేస్తారో మనుష్యులకు తెలియదు. తమ ధర్మమునే మర్చిపోయారు. ఇప్పుడు మీరు త్రిమూర్తి పరిచయము, శివబాబా పరిచయము ఇవ్వాలి. బ్రహ్మ దేవతా, విష్ణు దేవతా, శంకర దేవతా అని అంటారు. తర్వాత శివ పరమాత్మాయ నమః అని అంటారు. కనుక పిల్లలైన మీరు త్రిమూర్తి శివుని పరిచయాన్నే అందరికీ ఇవ్వాలి. ఈ విధంగా సర్వీసు చేయాలి. ఎలాంటి పరిస్థితులలోనైనా తండ్రి పరిచయము అందరికి లభించినట్లయితే, తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. మనమిప్పుడు వారసత్వము తీసుకుంటున్నామని మీకు తెలుసు. ఇంకా చాలా మంది వారసత్వమును(ఆస్తిని) తీసుకోవాలి. ఇంటింటిలో తండ్రి సందేశాన్ని ఇచ్చే బాధ్యత మన పై ఉంది. వాస్తవంలో సందేశకులు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి తన పరిచయాన్ని మీకు ఇస్తారు. మీరు మళ్లీ ఇతరులకు తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. తండ్రి తెలిపిన జ్ఞానమునివ్వాలి. ముఖ్యమైనవారు త్రిమూర్తి శివ. దీనినే కోట్‌ ఆఫ్‌ ఆర్మ్స్‌(జాతీయ సంకేతము)గా కూడా తయారు చేశారు. ప్రభుత్వానికి దీని యదార్థమైన అర్థము తెలియదు. అందులో రాట్నము వలె చక్రాన్ని కూడా చూపారు, అందులో సత్యమేవ జయతే అని కూడా వ్రాశారు. దీనికి అర్థమే రాదు. ఇది సంస్కృత శబ్ధము. ఇప్పుడు తండ్రి సత్యమైనవారు. వారు ఏం అర్థం చేయిస్తారో, దాని ద్వారా పూర్తి విశ్వము పై మీకు విజయము కలుగుతుంది. తండ్రి చెప్తారు - నేను సత్యము చెప్తున్నాను, మీరు ఈ చదువు ద్వారా సత్య-సత్యమైన సత్యనారాయణులుగా అవ్వగలరు. వారు ఏమేమో అర్థాలు వెలికి తీస్తారు. అది కూడా వారిని అడగాలి. తండ్రి అనేక ప్రకారాలుగా అర్థం చేయిస్తారు. ఎక్కడెక్కడ మేళాలు జరుగుతాయో, అక్కడ నదీ తీరాలకు కూడా వెళ్ళి అర్థం చేయించండి. పతితపావని గంగ అయ్యేందుకు వీలు లేదు. నదులు సాగరము నుండి వెలువడ్తాయి. అది నీటి సాగరము. దాని ద్వారా నీటి నదులు వెలువడ్తాయి. జ్ఞాన సాగరము నుండి జ్ఞాన నదులు వెలువడ్తాయి. మాతలైన మీకిప్పుడు జ్ఞానముంది. గోముఖమునకు వెళ్తారు, దాని నోటి నుండి నీరు వెలువడ్తుంది, ఇది గంగా జలమని భావిస్తారు. ఇక్కడ గంగా జలము ఎక్కడ నుండి వస్తుంది అని విద్యావంతులైన మనుష్యులు కూడా అర్థము చేసుకోరు. బాణము వేశారు, గంగ వెలికి వచ్చిందని శాస్త్రాలలో ఉంది. ఇప్పుడివి జ్ఞాన మాటలు. అర్జునుడు బాణము వేశాడు, గంగ వెలువడింది - ఇవన్నీ జరగని విషయాలు. ఎంతో దూర-దూరంగా తీర్థ స్థానాలకు వెళ్తారు. శంకరుని జటాజూటము నుండి గంగ వెలువడిందని, దానిలో స్నానము చేయడం వలన మనుష్యులు దేవతలుగా అవుతారని అంటారు. మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు, ఇది కూడా దేవ కన్యల ఉదాహరణే కదా.

ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి పరిచయాన్నే ఇవ్వాలి. అందుకే బాబా ఈ చిత్రాలను తయారు చేయించారు. త్రిమూర్తి శివుని చిత్రములో పూర్తి జ్ఞానమంతా ఉంది. వారి త్రిమూర్తి చిత్రములో జ్ఞానాన్ని ఇచ్చే శివుని చిత్రము మాత్రము లేదు. జ్ఞానాన్ని తీసుకునే వారి చిత్రముంది. ఇప్పుడు మీరు త్రిమూర్తి శివుని చిత్రము చూపించి అర్థం చేయిస్తారు. చిత్రము పై భాగములో జ్ఞానాన్ని ఇచ్చేవారు ఉన్నారు. బ్రహ్మకు వారి ద్వారా జ్ఞానము లభిస్తుంది. తర్వాత బ్రహ్మ దానిని వ్యాపింపజేస్తారు. దీనికి ఈశ్వరుని ధర్మస్థాపనా సంస్థ(మిషినరీ) అని అంటారు. ఈ దేవీ దేవతా ధర్మము చాలా సుఖమునిచ్చేది. పిల్లలైన మీరు మీ సత్య ధర్మమేదో గుర్తించారు. మమ్ములను భగవంతుడు చదివిస్తున్నారని మీకు తెలుసు. మీరు ఎంతో సంతోషిస్తారు. తండ్రి చెప్తారు - మీ సంతోషానికి హద్దులు ఉండరాదు ఎందుకంటే మిమ్ములను చదివించేవారు స్వయము భగవంతుడు, భగవంతుడు నిరాకార శివుడు, శ్రీ కృష్ణుడు కాదు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు - సర్వుల సద్గతిదాత ఒక్కరే, సద్గతి అని సత్యయుగాన్ని అంటారు. దుర్గతి అని కలియుగాన్ని అంటారు. కొత్త ప్రపంచాన్ని కొత్తదని, పాత ప్రపంచాన్ని పాతదనే అంటారు. ఇప్పుడు ప్రపంచము పాతదిగా అయ్యేందుకు ఇంకా 40 వేల సంవత్సరాలు అవుతుంది అని మనుష్యులు అనుకుంటారు. ఎంత తికమకపడి ఉన్నారు. తండ్రి తప్ప ఈ విషయాలను వేరెవ్వరూ అర్థం చేయించలేరు. బాబా చెప్తారు - నేను పిల్లలైన మీకు రాజ్య భాగ్యాన్ని ఇచ్చి మిగిలిన అందరినీ ఇంటికి తీసుకెళ్తాను. ఎవరు నా మతమును అనుసరిస్తారో, వారు దేవతలుగా అవుతారు. ఈ మాటలు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. కొత్తవారెవ్వరూ అర్థము చేసుకోలేరు.

తోటను వేసి తయారు చేయడం తోటమాలురైన మీ కర్తవ్యము. తోటయజమాని ఆదేశము నిస్తారు. బాబా కొత్తవారిని కలిసి జ్ఞానమునివ్వరు. ఈ పని తోటమాలులైన మీది. బాబా కలకత్తాకు వెళ్లారనుకోండి - మేము ఫలానా ఆఫీసరును, ఫలానా మిత్రులను బాబా వద్దకు తీసుకెళ్ళాలని పిల్లలు భావిస్తారు, కాని బాబా చెప్తారు - వారు ఏమీ అర్థము చేసుకోలేరు. బుద్ధిహీనులని ఎదురుగా కూర్చుండబెట్టినట్లు అవుతుంది. కనుక కొత్తవారిని ఎప్పుడూ బాబా ముందుకు తీసుకు రాకండి అని బాబా చెప్తారు. ఈ పని మాలురైన మీది, తోట యజమానిది కాదు. తోటను వేయడము మాలి పని. ఇలా - ఇలా చేయండి అని తండ్రి ఆదేశాలనిస్తారు. అందువలన బాబా ఎప్పుడూ కొత్తవారిని కలువరు. కానీ ఎక్కడైనా అతిథులుగా ఇంటికి వచ్చినప్పుడు దర్శనము చేసుకోవాలని అంటారు. మీరు మమ్ములను ఎందుకు కలవనివ్వరు? శంకరాచార్యుడు మొదలైన వారి వద్దకు ఎంతమంది వెళ్తారు. ఈ రోజులలో శంకరాచార్యునికి గొప్ప స్థానముంది. విద్యావంతులైనా వికారాల ద్వారానే జన్మ తీసుకుంటారు కదా. ట్రస్టీలోని వారినెవరినైనా గద్దె పై కూర్చుండబెడ్తారు. అందరికీ తమ తమ మతాలున్నాయి. నేను కల్ప - కల్పము ఈ పాత తనువులో వస్తానని తండ్రి స్వయంగా వచ్చి పిల్లలకు తన పరిచయాన్నిస్తారు. ఇతనికి కూడా తన జన్మల గురించి తెలియదు. శాస్త్రాలలో కల్పము ఆయువు లక్షల సంవత్సరాలని చెప్పేశారు. మనుష్యులు ఇన్ని జన్మలు తీసుకోరు, జంతువులు మొదలైన యోనులను కూడా చేర్చుకొని 84 లక్షలుగా చేసేశారు. మనుష్యులు ఏం వింటారో, దానినంతా సత్యము-సత్యము(సత్‌ - సత్‌) అని అంటూ ఉంటారు. శాస్త్రాలలో ఉన్నదంతా భక్తిమార్గములోని విషయాలు. కలకత్తాలో చాలా శోభాయమానమైన సుందర దేవీల మూర్తులను తయారుచేస్తారు, అంలంకరిస్తారు. మళ్లీ వాటిని నీటిలో ముంచేస్తారు. వీరు కూడా బొమ్మల పూజ చేసే బేబీలు కదా. పూర్తి అమాయకులు. ఇది నరకమని మీకు తెలుసు. స్వర్గములో అపారమైన సుఖముండేది. ఇప్పుడు కూడా ఎవరైనా మరణిస్తే ఫలానా వారు స్వర్గస్థులయ్యారని అంటారు అనగా ఏదో ఒక సమయములో స్వర్గము తప్పకుండా ఉండేది, ఇప్పుడు లేదు, నరకము తర్వాత మళ్లీ స్వర్గము తప్పకుండా వస్తుంది. ఈ విషయాలు కూడా మీకు తెలుసు. మనుష్యులకు కొద్దిగా కూడా తెలియదు. అందువలన కొత్తవారు బాబా ముందు కూర్చొని ఏం చేస్తారు? కనుక పూర్తి పాలన చేసేందుకు మాలి కావాలి. ఇక్కడ తోటమాలీలు కూడా చాలా మంది అవసరము. మెడికల్‌ కాలేజీలో ఎవరైనా కొత్తవారు వెళ్ల్లి కూర్చుంటే వారికి ఏమీ అర్థము కాదు. ఈ జ్ఞానము కూడా కొత్తది. తండ్రి చెప్తారు - నేను అందరినీ పావనంగా చేసేందుకు వచ్చాను. నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారు. ఈ సమయంలో అందరూ తమోప్రధాన ఆత్మలు, అందువలననే ఆత్మయే పరమాత్మ అని అంటారు. అందరిలో పరమాత్మ ఉన్నారని అంటారు. తండ్రి అలాంటి వారితో కూర్చొని తల బాదుకోరు. ముళ్లను పుష్పాలుగా తయారు చేయడం మాలీలైన మీ పని.

భక్తి రాత్రి అని, జ్ఞానము పగలు అని మీకు తెలుసు. బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి అని గాయనము కూడా చేయబడింది. ప్రజాపిత బ్రహ్మకు తప్పకుండా పిల్లలు కూడా ఉంటారు కదా. కొందరు కొద్దిగా కూడా వివేకము లేకుండా ఇంతమంది బ్రహ్మకుమారి - కుమారులున్నారు, వీరి బ్రహ్మ ఎవరు? అని అడుగుతారు. అరే! ప్రజాపిత బ్రహ్మ ప్రసిద్ధమైనవారు. వారి ద్వారానే బ్రాహ్మణ ధర్మము స్థాపన అవుతుంది. బ్రహ్మ దేవతాయ నమః అని కూడా అంటారు. తండ్రి పిల్లలైన మిమ్ములను బ్రాహ్మణులుగా చేసి తర్వాత దేవతలుగా చేస్తారు.

ఏ కొత్త కొత్త పాయింట్లు ఏవైతే వెలువడ్తాయో, వాటిని తమ వద్ద నోట్‌ చేసుకునే ఆసక్తి పిల్లలకుండాలి. ఏ పిలలైతే బాగా అర్థము చేసుకుంటారో, వారికి నోట్స్‌ వ్రాసుకునే ఆసక్తి చాలా ఉంటుంది. నోట్స్‌ వ్రాసుకోవడము చాలా మంచిది. ఎందుకంటే ఇన్ని పాయింట్లు జ్ఞాపకం ఉండడం కష్టము. నోట్స్‌ వ్రాసుకుని తర్వాత ఇతరులకు అర్థం చేయించాలి. వ్రాసుకుని అలాగే ఆ కాపీని ఉంచుకోరాదు. కొత్త కొత్త పాయింట్లు లభిస్తూ ఉంటాయి, కనుక పాత పాయింట్ల కాపీలు అలాగే పడి ఉంటాయి. స్కూలులో కూడా చదువుతూ ఉంటారు, మొదటి తరగతి పుస్తకాలు అలాగే పడి ఉంటాయి. మీరు అర్థం చేయించినప్పుడు చివర్లో మన్మనాభవ గురించి తప్పకుండా అర్థం చేయించండి. తండ్రిని, సృష్టి చక్రాన్ని స్మృతి చేయండి. ముఖ్య విషయము ''నన్నొక్కరినే స్మృతి చేయండి''. (మామేకం యాద్‌ కరో) అని అంటారు. దీనినే యోగాగ్ని అని అంటారు. భగవంతుడు జ్ఞానసాగరుడు, మనుష్యులు శాస్త్రాల సాగరాలు. తండ్రి ఏ శాస్త్రాలను వినిపించరు, వారు కూడా శాస్త్రాలను వినిపించినట్లయితే, వారికి మనుష్యులకు వ్యత్యాసమేముంటుంది? తండ్రి చెప్తారు - ఈ భక్తి మార్గ శాస్త్రాల సారాన్ని నేను మీకు అర్థం చేయిస్తాను.

ఆ మురళి మోగించేవారు - సర్పాన్ని(పామును) పట్టుకుంటారు, వాటి దంతాలు(కోరలు) తీసేస్తారు. తండ్రి కూడా విషము తాగించడం నుండి మిమ్ములను ముక్తులుగా చేస్తారు. ఈ విషము ద్వారానే మనుష్యులు పతితులుగా అయ్యారు. వీటిని వదలండి అని తండ్రి చెప్తారు. అయినా వదలరు. తండ్రి సుందరంగా, తెల్లగా(పవిత్రంగా) తయారు చేస్తారు. అయినా పడిపోయి ముఖము నల్లగా(అపవిత్రంగా) చేసుకుంటారు. మిమ్ములను జ్ఞానచితి పై కూర్చోబెట్టేందుకు తండ్రి వచ్చారు. జ్ఞానచితి పై కూర్చోవడం వలన మీరు విశ్వానికి అధికారులుగా, జగత్‌జీతులుగా అవుతారు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.


ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మేము సత్య ధర్మస్థాపనకు నిమిత్తమై ఉన్నాము. స్వయం భగవంతుడు మమ్ములను చదివిస్తున్నారని, మా దేవీ దేవతా ధర్మము చాలా సుఖాన్నిచ్చేదని సదా ఖుషీ ఉండాలి.
2. తోటమాలురై ముళ్లను పుష్పాలుగా తయారు చేసే సేవ చేయాలి. పూర్తి పాలన ఇచ్చిన తర్వాత తండ్రి ముందుకు తీసుకురావాలి. శ్రమ పడాలి.

వరదానము :- '' ప్రతి శక్తిని కార్యములో ఉపయోగించి వృద్ధి చేసే శ్రేష్ఠ ధనవంతులుగా, వివేకవంతులుగా అవ్వండి.''
వివేకవంతులైన పిల్లలకు ప్రతి శక్తిని కార్యములో ఉపయోగించే విధానము తెలుసు. ఎవరు ఎంతగా శక్తులను కార్యములో ఉపయోగిస్తారో, వారికి అంతగా శక్తులు వృద్ధి చెందుతాయి. కనుక ఈశ్వరీయ బడ్జెట్‌ను ఎలా తయారు చేయాలంటే విశ్వములోని ప్రతి ఆత్మ మీ ద్వారా ఏదో కొంత ప్రాప్తి చేసుకొని మీ గుణగానము చేయాలి. అందరికీ ఏదో కొంత ఇవ్వనే ఇవ్వాలి. ముక్తినైనా ఇవ్వండి, జీవన్ముక్తినైనా ఇవ్వండి. ఈశ్వరీయ బడ్జెట్‌ తయారు చేసి, సర్వ శక్తులను పొదుపు చేసి జమ చేయండి. జమ అయిన శక్తుల ద్వారా సర్వ ఆత్మలను భికారితనము నుండి, దు:ఖము అశాంతుల నుండి ముక్తము చేయండి.

స్లోగన్‌ :- '' శుద్ధ సంకల్పాలను మీ జీవితంలో అమూల్యమైన ఖజానాగా చేసుకుంటే మాలామాల్‌గా(సంపన్నంగా) అవుతారు ''

Telugu Murli 02/02/2020

02-02-2020 ని అవ్యక్తబాప్‌దాదా కు ఓంశాంతి రివైజ్‌: 18-11-1985 మధువనము

'' భగవంతుని భాగ్యశాలి పిల్లల లక్షణాలు ''
బాప్‌దాదా పిల్లలందరి మస్తకం పై గల భాగ్య రేఖలను చూస్తున్నారు. ప్రతి పుత్రుని మస్తకం పై భాగ్యరేఖలు గీయబడి ఉన్నాయి. కాని కొంతమంది పిల్లల భాగ్యరేఖలు స్పష్టంగా ఉన్నాయి. కొంతమంది రేఖలు స్పష్టంగా లేవు. తండ్రి అయిన భగవంతుని పిల్లలుగా అయినప్పటి నుండి భాగ్యరేఖలను చూస్తున్నారు. భగవంతుడంటే భాగ్యవిధాత. భగవంతుడంటే దాత, విధాత. అందువలన వారి పిల్లలుగా అయినంతనే భాగ్యానికి అధికారులు అనగా వారసత్వము పిల్లలందరికి అవశ్యం ప్రాప్తిస్తుంది. అయితే లభించిన ఆ వారసత్వాన్ని జీవితంలో ధారణ చేయడం, సేవలో ఉపయోగించి శ్రేష్ఠంగా చేసుకోవడం, స్పష్టంగా చేసుకోవడం ఇందులో నంబరువార్‌గా ఉన్నారు. ఎందుకంటే ఈ భాగ్యాన్ని ఎంతగా స్వయం పట్ల లేక సేవ పట్ల కార్యములో ఉపయోగిస్తారో అంత వృద్ధి చెందుతుంది అనగా రేఖలు స్పష్టమౌతాయి. తండ్రి ఒక్కరే, వారు ఇచ్చేది కూడా అందరికి ఒకే విధంగానే ఇస్తారు. తండ్రి భాగ్యాన్ని నంబరువారుగా పంచరు. కాని భాగ్యాన్ని తయారు చేసుకునేవారు ఇంత గొప్ప భాగ్యాన్ని ప్రాప్తి చేసుకోవడంలో యథాశక్తిగా అయిన కారణంగా నంబరువారుగా అయిపోతారు. అందువలన కొంతమంది రేఖలు స్పష్టంగా ఉన్నాయి. కొంతమంది రేఖలు స్పష్టంగా లేవు. స్పష్టమైన రేఖలు గల పిల్లలు స్వయం కూడా ప్రతి కర్మలో తమను తాము భాగ్యశాలురమని అనుభవం చేస్తారు. దానితో పాటు వారి ముఖము ద్వారా, నడవడిక ద్వారా భాగ్యము ఇతరులకు కూడా అనుభవమవుతుంది. అంతేకాక ఇటువంటి భాగ్యశాలి పిల్లలను చూచి వీరు గొప్ప భాగ్యశాలి ఆత్మలని అనుకుంటారు, అంటారు. వీరి భాగ్యము సదా శ్రేష్ఠమైనది. ప్రతి కర్మలో మిమ్ములను మీరు భగవంతుని భాగ్యశాలి పిల్లలమని అనుభవం చేస్తున్నామా? అని ప్రశ్నించుకోండి. భాగ్యము మీ వారసత్వము. వారసత్వము ప్రాప్తి అవ్వకుండా ఉండడం ఎప్పుడూ ఉండజాలదు. భాగ్యాన్ని వారసత్వ రూపంలో అనుభవం చేస్తున్నారా? లేక శ్రమ చేయాల్సి వస్తోందా? వారసత్వము సులభంగా ప్రాప్తిస్తుంది. శ్రమ ఉండదు. లౌకికంలో కూడా తండ్రి ఖజానాల పై, ఆస్తుల పై పిల్లలకు స్వతహాగా అధికారముంటుంది. అంతేకాక తండ్రి వారసత్వము లభించిందనే నశా ఉంటుంది. ఇటువంటి భాగ్య నశా ఉందా లేక నశా ఎక్కుతూ, దిగుతూ ఉంటుందా? ఇది అవినాశి వారసత్వము కనుక ఎంత నశా ఉండాలి! ఒక జన్మకే కాదు, అనేక జన్మల భాగ్యము జన్మ సిద్ధ అధికారంగా లభించిందని నశాతో వర్ణన చేస్తారు. సదా ఈ భాగ్య మెరుపు ప్రత్యక్ష రూపంలో ఇతరులకు కనిపించాలి. మెరుపు మరియు పొంగు (ఉత్సాహము) రెండూ ఉన్నాయా? మర్జ్‌ రూపంలో ఉన్నాయా? ఎమర్జ్‌ రూపంలో ఉన్నాయా? (గుప్తంగా ఉన్నాయా? బయటకు కనిపిస్తున్నాయా?) భాగ్యశాలి ఆత్మల గుర్తులు - వారు సదా ఒడిలో పాలింపబడ్తారు. తివాచీల పై నడుస్తారు, ఊయలలో ఊగుతారు. మట్టిలో కాలు పెట్టరు. వారి కాళ్లు ఎప్పుడూ మైల పడవు. ప్రపంచంలోని వారు తివాచీల పై నడుస్తారు, మీరు బుద్ధి రూపి కాళ్లతో సదా నేల పై కాక ఫరిస్తాల ప్రపంచంలో ఉంటారు. ఈ పాత మట్టి ప్రపంచంలో బుద్ధి రూపి కాలు మోపరు అనగా బుద్ధిని మురికిగా చేసుకోరు. భాగ్యశాలురు మట్టి బొమ్మలతో ఆడుకోరు. సదా రత్నాలతో ఆడుకుంటారు. భాగ్యశాలురు సదా సంపన్నంగా ఉంటారు. అందువలన ఇచ్ఛా మాత్రం అవిద్యా స్థితిలో ఉంటారు. భాగ్యశాలి ఆత్మలు సదా మహాదాని పుణ్యాత్మలుగా అయి ఇతరుల భాగ్యాన్ని కూడా తయారుచేస్తూ ఉంటారు. భాగ్యశాలి ఆత్మలు సదా కిరీటము, సింహాసనము, తిలకధారులుగా ఉంటారు. భాగ్యశాలి ఆత్మలు భాగ్యానికి ఎంత అధికారులుగా ఉంటారో అంత త్యాగధారి ఆత్మలుగా ఉంటారు. భాగ్యానికి గుర్తు త్యాగము. త్యాగము భాగ్యాన్ని స్పష్టము చేస్తుంది. భాగ్యశాలి ఆత్మలు సదా భగవంతుని సమానం నిరాకారి, నిరహంకారి, నిర్వికారి - ఈ మూడు విశేషతలతో భర్‌పూర్‌గా ఉంటారు. ఈ గుర్తులన్నీ స్వయంలో అనుభవం చేస్తున్నారా? భాగ్యశాలుర లిస్టులో అయితే ఉండనే ఉన్నారు కదా. అయితే యథాశక్తిగా ఉన్నారా లేక సర్వశక్తివంతంగా ఉన్నారా? మాస్టర్‌గా ఉన్నారు కదా. తండ్రిని ఎప్పుడూ యథాశక్తివాన్‌ లేక నంబరువార్‌ అని అనరు. సదా సర్వశక్తివంతులనే అంటారు. మీరు మాస్టర్‌ సర్వశక్తివంతులు. యథాశక్తి ఎందుకు? సదా శక్తివంతులు. యథా అనే శబ్ధాన్ని మార్చి సదా శక్తివంతులుగా అవ్వండి, ఇతరులను కూడా చేయండి. అర్థమయిందా.

ఏ జోన్‌ వారు వచ్చారు? అందరూ వరదాన భూమిలోకి వచ్చి వరదానాలతో జోలె నింపుకుంటున్నారు కదా. వరదాన భూమిలో ఒక్కొక్కరి చరిత్రలో, కర్మలో విశేష వరదానాలు నిండి ఉన్నాయి. యజ్ఞ భూమిలోకి వచ్చి కూరగాయలు తరిగినా, ధాన్యము శుభ్రము చేసినా అందులో కూడా యజ్ఞ సేవ వరదానాలు నిండి ఉన్నాయి. ఎలాగైతే యాత్రకు వెళ్లినప్పుడు మందిరాన్ని శుభ్రపరచడం కూడా ఒక పెద్ద పుణ్యంగా భావిస్తారో అలా ఈ మహా తీర్థ స్థానము లేక వరదాన భూమిలో చేయు ప్రతి కర్మలో, ప్రతి అడుగులో వరదానాలే వరదానాలు నిండి ఉన్నాయి. జోలెలో ఎంత భాగము నింపుకున్నారు? జోలెను పూర్తిగా నింపుకొని వెళ్తారా? లేక యథాశక్తి నింపుకుంటారా? ఎవరు ఎక్కడ నుండి వచ్చినా మేళా జరుపుకునేందుకే వచ్చారు. మధువనంలో ఒక సంకల్పము గానీ, ఒక సెకండు గానీ వ్యర్థంగా పోరాదు. సమర్థంగా అయ్యే ఈ అభ్యాసము మీ స్థానములో కూడా సహయోగం చేస్తుంది. చదువు మరియు పరివారము - చదువులోని లాభము కూడా తీసుకోండి, పరివారములో విశేషమైన అనుభవం కూడా చేయండి. అర్థమయిందా.

బాప్‌దాదా అన్ని జోన్ల వారికి సదా వరదానులుగా, మహాదానులుగా అయినందుకు అభినందనలు తెలుపుతున్నారు. జనుల ఉత్సవము సమాప్తమయింది కానీ మీ ఉత్సాహము నిండిన ఉత్సవము సదా ఉంటుంది. మీది సదా గొప్ప రోజే. అందువలన ప్రతి రోజు మీకు శుభాకాంక్షలే శుభాకాంక్షలు. మహారాష్ట్ర సదా మహాన్‌గా అయి మహాన్‌గా చేసే వరదానాలతో జోలెను నింపేవారు. కర్ణాటక వారు సదా తమ హర్షితముఖము ద్వారా స్వయం కూడా సదా హర్షితంగా ఉండి, ఇతరులను కూడా హర్షితంగా చేసి జోలెను నింపుతూ ఉండేవారు. యు.పి వారు ఏం చేస్తారు? సదా శీతలంగా ఉండు నదుల సమానంగా శీతలతా వరదానమునిచ్చి శీతలా దేవీలుగా అయి అందరినీ శీతలా దేవీలుగా చేయండి. శీతలత ద్వారా సదా సర్వుల అన్ని విధాలైన దు:ఖాలను దూరం చేయండి. అటువంటి వరదానాలతో జోలెను నింపండి. అచ్ఛా.

సదా స్పష్టమైన శ్రేష్ఠ భాగ్యరేఖలు గలవారు, సదా తండ్రి సమానం సర్వ శక్తులతో సంపన్న, సంపూర్ణ స్థితిలో స్థితమై ఉండేవారు, సదా ఈశ్వరీయ మెరుపు మరియు భాగ్య నశాలో ఉండేవారు, ప్రతి కర్మ ద్వారా భాగ్యవంతులై భాగ్య వారసత్వమునిప్పించే మాస్టర్‌ భాగ్యవంతులు, శ్రేష్ఠ భాగ్యవాన్‌ పిల్లలకు బాప్‌దాదా యాద్‌ప్యార్‌ ఔర్‌ నమస్తే.

పెద్ద దాదీలతో అవ్యక్త బాప్‌దాదా కలయిక -

ఆది నుండి ఇంతవరకు ఎవరైతే ప్రతి కార్యములో నా తోడుగా వస్తున్నారో వారి విశేషత ఏమంటే - ఎలాగైతే బ్రహ్మబాబా ప్రతి అడుగులో అనుభవీగా అయి అథారిటీతో విశ్వరాజ్యధికారము తీసుకుంటాడో అలా మీ అందరూ చాలాకాలము నుండి అన్ని ప్రకారాలైన అనుభవాల అథారిటి కారణంగా చాలాకాలపు రాజ్యాధికారములో కూడా సాథీలుగా అయ్యేవారు. ఆది నుండి ''ఎక్కడ కూర్చోబెడ్తారో, ఎలా నడిపిస్తారో'' అలా నడుస్తూ జతలో వస్తామని సంకల్పము చేసినవారు కనుక వెంట నడుస్తాము అనే మొదటి ప్రతిజ్ఞ బాప్‌దాదా నిభాయించవలసే వస్తుంది. బ్రహ్మబాబా వెంట వెళ్లేవారు రాజ్యములో కూడా జతలో ఉంటారు, భక్తిలో కూడా వెంట ఉంటారు. ఒకవేళ ఇప్పుడు కొంచెం దూరంగా ఉంటే ఏదో ఒక జన్మలో దూరంగా ఉంటారు, ఒక జన్మలో దగ్గరగా ఉంటారు. కాని ఎవరైతే సదా బుద్ధి ద్వారా జతలో ఉంటారో వారు అక్కడ కూడా జతలో ఉంటారు. సాకారంలో మీరంతా 14 సంవత్సరాలు తోడుగా ఉన్నారు. సంగమ యుగంలోని 14 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలకు సమానమవుతుంది? సంగమ యుగంలోని ఇంత సమయం సాకార రూపంలో జతలో ఉన్నారు, ఇది కూడా ఎంత పెద్ద భాగ్యము. అంతేకాక బుద్ధితో కూడా జతలో ఉన్నారు, ఇంట్లో కూడా జతలో ఉంటారు. రాజ్యములో కూడా జతలో ఉంటారు. భలే సింహాసనము పై కూర్చోరు కానీ రాయల్‌ కుటుంబానికి సమీప సంబంధములో మొత్తం దినచర్యలో జతలో ఉండే పాత్రను తప్పకుండా అభినయిస్తారు. కనుక ఆదిలో జతలో ఉంటామని చేసిన ప్రతిజ్ఞ మొత్తం కల్పమంతా నడుస్తూ ఉంటుంది. భక్తిలో కూడా చాలా కాలము జతలో ఉంటారు. ఈ చివరి జన్మలో కొంతమంది కొంచెం దూరంగా కొంతమంది దగ్గరగా ఉంటారు. కాని మొత్తం కల్పమంతా ఏదో ఒక రూపంలో ఉంటారు. ఇలా ప్రతిజ్ఞ చేశారు కదా! అందువలన మిమ్ములను అందరూ ఏ దృష్టితో చూస్తారు! మీరు తండ్రి రూపాలు - దీనినే భక్తిలో వారు, వీరంతా భగవంతుని రూపాలని అన్నారు. ఎందుకంటే తండ్రి సమానంగా అవుతారు కదా! మీ రూపము ద్వారా తండ్రి కనిపిస్తారు. అందువలన తండ్రి రూపమని అంటారు. ఎవరైతే తండ్రి జతలో ఉంటారో వారి విశేషత ఇదే ఉంటుంది - వారిని చూచి తండ్రి గుర్తుకొస్తారు. వారిని స్మృతి చేయరు కానీ తండ్రిని స్మృతి చేస్తారు. వారి ద్వారా తండ్రి చరిత్ర, తండ్రి దృష్టి, తండ్రి కర్మలు అన్నీ అనుభవమవుతాయి. స్వయం వారు కనిపించరు కాని వారి ద్వారా తండ్రి కర్మలు లేక దృష్టి అనుభవమవుతుంది. అనన్యమైన సమాన పిల్లల విశేషత ఇదే. అందరూ ఇలా ఉన్నారు కదా! మీలో అయితే చిక్కుకోరు కదా! ఫలానావారు చాలా మంచివారని అనరు కదా, తండ్రి వీరిని మంచిగా చేశారని అనాలి. వీరి ద్వారా తండ్రి దృష్టి, తండ్రి పాలన లభిస్తుందని అనాలి. వీరి ద్వారా తండ్రి మహావాక్యాలు వింటామని అనాలి. ఇదే వీరి విశేషత. దీనిని ప్రియంగానూ ఉన్నారు, భిన్నంగానూ ఉన్నారని అంటారు. అందరికి భలే ప్రియంగా ఉండండి కానీ ఇరికించుకొను వారిగా ఉండకండి. తండ్రికి బదులు మిమ్ములను స్మృతి చేయరాదు. తండ్రి శక్తి తీసుకునేందుకు, తండ్రి మహావాక్యాలు వినేందుకు మిమ్ములను గుర్తు చేసుకోవాలి. దీనినే ప్రియంగానూ ఉన్నారు, అతీతంగానూ ఉన్నారని అంటారు. మీరు ఇటువంటి గ్రూపు కదా! సాకార పాలన తీసుకున్నారు. ఏదో విశేషత ఉంటుంది కదా. మీ వద్దకు వస్తే మిమ్ములను ఏమడుగుతారు - తండ్రి ఏం చేసేవారు, ఎలా నడిచేవారు...... ఇదే గుర్తొస్తుంది కదా. మీరు ఇటువంటి విశేషమైన ఆత్మలు. దీనిని డివైన్‌(దైవీ ఐకమత్యము) అని అంటారు. డివైన్‌ స్మృతినిప్పించి డివైన్‌గా చేస్తారు. అందువలన డివైన్‌ యూనిటి అని అంటారు. 50 సంవత్సరాలు అవినాశిగా ఉన్నారు. కనుక 'అవినాశి భవ' కు అభినందనలు. చాలామంది వచ్చారు, చాలామంది తిరిగి వచ్చేందుకు వెళ్లారు. మీరేమో అనాది, అవినాశిగా అయ్యారు. అనాదిలోనూ జతలోనే, ఆదిలో కూడా జతలోనే ఉంటారు. వతనంలో తోడుగా ఉంటే సేవ ఎలా చేస్తారు! మీరు కొద్దిగా విశ్రాంతి కూడా తీసుకుంటారు. తండ్రికి విశ్రాంతి కూడా అవసరం లేదు. బాప్‌దాదా విశ్రాంతి నుండి కూడా విడుదల అయ్యారు. అవ్యక్తానికి విశ్రాంతి అవసరం లేదు. వ్యక్తంలో ఉండేవారికి అవసరము. ఇందులో మీ సమానంగా చేస్తే పని సమాప్తమైపోతుంది. అయినా ఎప్పుడైనా సేవకు అవకాశం లభిస్తే తండ్రి సమానం అథక్‌గా(అలసట లేకుండా) అవుతారు, అలసిపోరు. అచ్ఛా.

దాదీగారితో - బాల్యం నుండే తండ్రి కిరీటధారిగా చేశాడు. వస్తూనే సేవ చేసే బాధ్యతా కిరీటాన్ని ధరింపజేశారు. సమయ ప్రతి సమయం ఏ పాత్ర అయితే నడిచిందో భికారి(బెగ్గరి) పాత్ర అయినా, సంతోషాల పాత్ర అయినా అన్ని పాత్రలలో బాధ్యతా కిరీటాన్ని డ్రామానుసారము ధారణ చేస్తూ వచ్చావు. అందువలన అవ్యక్త పాత్రలో కూడా కిరీటాన్ని ధరించి నిమిత్తంగా అయ్యావు. కనుక ఈ విశేషమైన పాత్ర ఆది నుండే ఉంది. సదా బాధ్యతను నిభాయించేదానివి. తండ్రి బాధ్యులుగా ఉన్నట్లు బాధ్యతా కిరీటాన్ని ధరించే విశేషమైన పాత్ర ఉంది. అందువలన అంత్యములో కూడా దృష్టి ద్వారా కిరీటము, తిలకము అన్ని ఇచ్చి వెళ్లారు. అందువలన మీ స్మృతిచిహ్నము ఏదైతే ఉందో అందులో కిరీటము తప్పకుండా ఉంటుంది. ఎలాగైతే కృష్ణునికి బాల్యము నుండే కిరీటాన్ని చూపిస్తారు కనుక స్మృతి చిహ్నములో కూడా బాల్యము నుండే కిరీటధారి రూపముతో పూజిస్తారు. మిగిలిన వారంతా జతలో ఉంటారు కానీ నీవు కిరీటధారివి. అందరూ తోడు నిభాయిస్తారు కానీ సమాన రూపంలో తోడు నిభాయించడంలో వ్యత్యాసముంది.

పార్టీలతో అవ్యక్త బాప్‌దాదా కలయిక - కుమారులతో - 1. కుమారులు అనగా నిర్బంధనులు. అన్నిటికంటే పెద్ద బంధనము మానసిక వ్యర్థ సంకల్పాల బంధనము. ఇందులో కూడా నిర్బంధనులు. అప్పుడప్పుడు ఈ బంధనము బంధించడం లేదు కదా? ఎందుకంటే సంకల్పశక్తి ప్రతి అడుగులో సంపాదన చేసేందుకు ఆధారము. స్మృతియాత్ర ఏ ఆధారముతో చేస్తారు? సంకల్పశక్తి ఆధారముతో బాబా వద్దకు చేరుకుంటారు కదా! అశరీరిగా అయి వెళ్తారు. కనుక మానసిక శక్తి విశేషమైనది. వ్యర్థ సంకల్పాలు మానసిక శక్తిని బలహీనపరుస్తాయి. అందువలన ఈ బంధనము నుండి ముక్తులవ్వండి. కుమార్లు అనగా సదా తీవ్ర పురుషార్థులు. ఎందుకంటే నిర్బంధనులుగా ఉండేవారి వేగం స్వతహాగానే తీవ్రంగా ఉంటుంది. బరువుగా ఉండేవారు నెమ్మదిగా నడుస్తారు. తేలికగా ఉండేవారు సదా తీవ్ర వేగంతో నడుస్తారు. ఇప్పుడు సమయానుసారము పురుషార్థము చేసే సమయం గతించిపోయింది. ఇప్పుడు తీవ్ర పురుషార్థులుగా అయి గమ్యానికి చేరుకోవాలి.

2. కుమార్లు పాత వ్యర్థ ఖాతాను సమాప్తం చేసుకున్నారా? కొత్త ఖాతా సమర్థమైనది, పాత ఖాతా వ్యర్థమైనది. కనుక పాత ఖాతా సమాప్తమైపోయింది. అక్కడ కూడా వ్యవహారములో ఎప్పుడూ పాత ఖాతాను ఉంచుకోరు. పాతదానిని సమాప్తం చేసి కొత్త ఖాతాను పెంచుకుంటూ ఉంటారు. కనుక ఇక్కడ కూడా పాత ఖాతాలను సమాప్తం చేసి సదా కొత్తగా, ప్రతి అడుగులో సమర్థంగా ఉండాలి. ప్రతి సంకల్పము సమర్థంగా ఉండాలి. తండ్రి ఎలా ఉన్నారో పిల్లలు అలా ఉండాలి. తండ్రి సమర్థులు కనుక పిల్లలు కూడా తండ్రిని అనుసరించి సమర్థంగా అవుతారు.

మాతలతో - 1. మాతలు ఏ గుణములో విశేషమైన అనుభవీలు? ఆ విశేష గుణమేది? (త్యాగము, సహనశీలత). ఇంకా ఏదైనా గుణముందా? మాతల స్వరూపము విశేషంగా దయాస్వరూపము. మాతలు దయాహృదయులు. బేహద్‌ మాతలైన మీకు బేహద్‌ ఆత్మల పట్ల దయ కలుగుతూ ఉందా? దయ కలిగినప్పుడు ఏం చేస్తారు? ఎవరైతే దయాహృదయులుగా ఉంటారో వారు సేవ లేకుండా ఉండలేరు. దయాహృదయులుగా అయినప్పుడు అనేక ఆత్మల కళ్యాణము జరగనే జరుగుతుంది. అందువలన మాతలను కళ్యాణి అని కూడా అంటారు. కళ్యాణి అనగా కళ్యాణం చేయువారు. ఎలాగైతే తండ్రిని విశ్వకళ్యాణకారి అని అంటారో అలా మాతలకు విశేషంగా తండ్రి సమానం 'కళ్యాణి' అనే టైటిల్‌ లభించింది. ఇలా ఉత్సాహం వస్తోందా? ఎలా ఉండేవారు ఎలా అయ్యారు? స్వ పరివర్తన ద్వారా ఇతరులకు కూడా ఉల్లాస-ఉత్సాహాలు వస్తాయి. హద్దు మరియు బేహద్‌ సేవల బ్యాలన్స్‌ ఉందా? ఆ సేవలో అయితే లెక్కాచారము చుక్త అవుతుంది. అది హద్దు సేవ. మీరు బేహద్‌ సేవాధారులు. స్వయంలో సేవ చేయాలనే ఉల్లాస-ఉత్సాహాలు ఉంటే అంత సఫలత లభిస్తుంది.

2. మాతలు తమ త్యాగము మరియు తపస్సు ద్వారా విశ్వకళ్యాణము చేసేందుకు నిమిత్తంగా అయి ఉన్నారు. మాతలలో త్యాగము మరియు తపస్సుల విశేషత ఉంది. ఈ రెండు విశేషతల ద్వారా సేవకు నిమిత్తంగా అయి ఇతరులను కూడా తండ్రికి చెందినవారిగా చేయడంలో బిజీగా ఉంటున్నారా? సంగమయుగ బ్రాహ్మణుల పనే - సేవ చేయడం. బ్రాహ్మణులు సేవ లేకుండా ఉండలేరు. ఎలాగైతే నామధారి బ్రాహ్మణులు తప్పకుండా కథలు చెప్తారు కనుక ఇక్కడ కూడా కథ చెప్పడం అనగా సేవ చేయడం. కనుక జగన్మాతలుగా అయి జగత్తు కొరకు ఆలోచించండి. అనంతమైన పిల్లల కొరకు ఆలోచించండి. కేవలం ఇంట్లోనే కూర్చోకండి. బేహద్‌ సేవాధారులుగా అయి సదా ముందుకు వెళ్తూ ఉండండి. హద్దులో 63 జన్మలు గడిచాయి. ఇప్పుడు బేహద్‌ సేవలో ముందుకు వెళ్లండి.

వీడ్కోలు సమయం పిల్లలందరికి ప్రియస్మృతులు - అన్నివైపుల ఉన్న స్నేహీ, సహయోగి పిల్లలు బాప్‌దాదా గారి విశేష స్నేహ సంపన్న ప్రియ స్మృతులు స్వీకరించండి. ఈ రోజు బాప్‌దాదా పిల్లలందరికి సదా నిర్విఘ్నంగా అయి విఘ్న వినాశకులుగా అయి విశ్వాన్ని నిర్విఘ్నంగా చేసే కార్యము కొరకు అభినందనలు తెలుపుతున్నారు. ప్రతి పుత్రుడు సేవలో సదా ముందుకు వెళ్లాలని శ్రేష్ఠ సంకల్పము చేస్తాడు. ఈ శ్రేష్ఠ సంకల్పము సేవలో సదా ముందుకు తీసుకెళ్తూ ఉంది, ఇంకా తీసుకెళ్తూ ఉంటుంది. సేవతో పాటు స్వఉన్నతి మరియు సేవలో ఉన్నతి - రెండిటిలో బ్యాలన్స్‌ ఉంచి ముందుకు వెళ్తూ ఉండండి. అప్పుడు బాప్‌దాదా మరియు సర్వ ఆత్మల ద్వారా ఎవరి కొరకైతే నిమిత్తంగా అవుతారో వారి హృదయపూర్వక ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. కనుక సదా బ్యాలన్స్‌ ద్వారా ఆశీర్వాదాలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. స్వ ఉన్నతి మరియు సేవా ఉన్నతి - రెండూ జత జతలో ఉన్నందున సదా సహజ సఫలతా స్వరూపులుగా అవుతారు. అందరూ తమ తమ పేర్లతో విశేషమైన ప్రియస్మృతులు స్వీకరించండి. అచ్ఛా.

వరదానము :- '' అందరికి సంతోషకరమైన వార్తను వినిపించే ఖుషీ ఖజానాతో భర్‌పూర్‌ భండార్‌ భవ ''
సదా మీ ఈ స్వరూపాన్ని ముందుంచుకోండి - ''నేను ఖుషీ ఖజానాతో నిండుగా ఉండే భండారమును.'' లెక్కలేనన్ని అవినాశి ఖజానాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఖజానాలను స్మృతిలోకి తీసుకు రండి. ఖజానాలను స్మృతిలోకి తెచ్చినందున సంతోషము కలుగుతుంది. ఎక్కడ సంతోషముంటుందో అక్కడ సదా కాలము కొరకు దు:ఖము దూరమైపోతుంది. ఖజానాల స్మృతి ద్వారా ఆత్మ సమర్థంగా అవుతుంది, వ్యర్థము సమాప్తమైపోతుంది. నిండుగా ఉన్న ఆత్మ ఎప్పుడూ ఆందోళనలోకి రాదు. వారు స్వయం కూడా సంతోషంగా ఉంటారు, ఇతరులకు కూడా సంతోషకరమైన వార్తను వినిపిస్తారు.

స్లోగన్‌ :- '' యోగ్యులుగా అవ్వాలంటే కర్మ మరియు యోగాల బ్యాలన్స్‌ ఉంచండి ''

Saturday, 1 February 2020

Telugu Murli 01/02/2020

01-02-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - ఈ శరీరమనే వస్త్రాన్ని ఇక్కడే వదిలేయాలి, కనుక దీని పై మమకారాన్ని తొలగించండి, బంధు - మిత్రులెవ్వరూ గుర్తు రాకూడదు ''

ప్రశ్న :- యోగ బలమున్న పిల్లల గుర్తులేవి ?
జవాబు :- వారికి ఏ విషయములోనూ కొద్దిగానైనా నష్టము, ఆపద సంభవించదు. దేనిపైనా మోహము, ఆకర్షణ ఉండదు. ఈ రోజు ఎవరైనా శరీరము వదిలినా, వారికి దుఃఖము కలుగదు. ఎందుకంటే డ్రామాలో వారి పాత్ర అంతవరకే, ఆత్మ ఒక శరీరాన్ని వదిలి, మరొకటి తీసుకుంటుందని వారికి తెలుసు.

ఓంశాంతి. ఈ జ్ఞానము చాలా గుప్తమైనది. ఇందులో నమస్కరించే అవసరము కూడా ఉండదు. ప్రపంచములో నమస్తే లేక రాం-రాం మొదలైన పదాలు అంటూ ఉంటారు. ఇక్కడ ఈ విషయాలేవీ ఉండవు. ఎందుకంటే ఇది ఒక కుటుంబము. కుటుంబములో ఒకరికొకరు నమస్తే లేక గుడ్‌మార్నింగ్‌ చెప్పడం అంత శోభించదు. ఇంటిలో అయితే ఆహార-పానీయాలు తీసుకుంటారు, ఆఫీసుకు వెళ్తారు, మళ్లీ వస్తారు మొదలైనవి జరిగిపోతూ ఉంటాయి. నమస్కారము చేసే అవసరముండదు. గుడ్‌మార్నింగ్‌ చెప్పే ఫ్యాషన్‌ కూడా యూరోపువాసుల నుండి వచ్చింది. లేకుంటే అంతకుముందు ఇవేవీ లేవు. ఏ సత్సంగములోనైనా పరస్పరము కలిసినప్పుడు నమస్కరిస్తారు, పాద నమస్కారము చేస్తారు. పాదాల పై పడడం మొదలైనవి నమ్రత కొరకు నేర్పిస్తారు. ఇక్కడ పిల్లలైన మీరు దేహీ-అభిమానులుగా అవ్వాలి. ఆత్మ, ఆత్మకు ఏం చేస్తుంది? అయినా పలకరించవలసి వస్తుంది. ఉదాహరణానికి మీరు బాబాతో - ''బాబా నమస్తే'' అని చెప్తారు కదా. ఇప్పుడు తండ్రి కూడా చెప్తున్నారు - నేను సాధారణ బ్రహ్మ శరీరము ద్వారా మిమ్ములను చదివిస్తాను, ఇతని ద్వారా స్థాపన చేయిస్తాను. ఎలా? తండ్రి సన్ముఖములో ఉన్నప్పుడు అర్థము చేయిస్తారు. లేకుంటే ఎలా అర్థం చేసుకోగలరు. తండ్రి సన్ముఖంగా కూర్చొని అర్థము చేయిస్తుంటే పిల్లలు అర్థము చేసుకుంటున్నారు. ఇరువురికి నమస్కరించాలి - బాప్‌దాదాలకు నమస్తే. బయటివారు ఈ మాట వింటే, ఇదేమిటి వీరు బాప్‌దాదా అని ఒక్కరినే అంటున్నారే అని తికమకపడ్తారు. చాలామంది మనుష్యులకు కూడా ఒక్కరికే రెండు పేర్లు కలిసి ఉంటాయి కదా. ఉదాహరణకు లక్ష్మినారాయణ, రాధా-కృష్ణుడు,........ అని డబల్‌ పేర్లు కూడా ఉన్నాయి. ఈ పేర్లు వింటే స్త్రీ - పురుషులు కలిసి ఉన్నట్లుంటుంది. అయితే ఇప్పుడు వీరు బాప్‌దాదా. ఈ విషయాలు పిల్లలైన మీరు మాత్రమే అర్థము చేసుకోగలరు. తప్పకుండా తండ్రి పెద్దవారుగా ఉంటారు. ఆ పేరు భలే డబల్‌ పేరు కావచ్చు కానీ వ్యక్తి ఒక్కరే కదా. అయితే రెండు పేర్లు ఎందుకు పెట్టారు? ఇప్పుడు పిల్లలైన మీకు ఈ పేరు తప్పు అని తెలుసు. బాబాను ఇతరులెవ్వరూ గుర్తించలేరు. మీరు నమస్తే బాప్‌దాదా అని అంటారు. తండ్రి మళ్లీ ''నమస్తే శారీరిక, ఆత్మిక పిల్లలారా!'' అని అంటారు, అయితే ఇంత పొడవుగా ఉంటే శోభించదు. పదాలేమో రైటే. ఇప్పుడు మీరు శారీరిక పిల్లలే కాదు, ఆత్మిక పిల్లలు కూడా అయ్యారు. శివబాబా ఆత్మలందరికీ తండ్రి, అంతేకాక ప్రజాపిత కూడా ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు సోదరీ-సోదరులు. ఇది ప్రవృత్తి మార్గమవుతుంది. మీరంతా బ్రహ్మకుమార-కుమారీలు. బి.కె.లైనందున ప్రజాపిత ఉన్నారని కూడా ఋజువైపోతుంది. ఇందులో గ్రుడ్డి నమ్మకాల మాటే లేదు. బి.కె.లకు తండ్రి ద్వారా వారసత్వము లభిస్తుందని చెప్పండి. బ్రహ్మ ద్వారా లభించదు, బ్రహ్మ కూడా శివబాబా కుమారుడే. సూక్ష్మ వతనవాసులైన బ్రహ్మ-విష్ణు-శంకరులు వారి రచన. వీరి రచయిత శివుడు. శివుని సృష్టించినదెవరు? అని ఎవ్వరూ అడగరాదు. శివుని సృష్టించిన వారెవ్వరూ లేరు(స్వయంభూ). బ్రహ్మ-విష్ణు-శంకరులు వారి రచన. వీరి పై ఉన్నవారు శివుడు, వారు సర్వాత్మల తండ్రి, సృష్టికర్త అయితే ఎప్పుడు సృష్టిస్తారు? అనేది తర్వాతి ప్రశ్న. అలా సృష్టించేది లేదు. ఈ సృష్టి అనాది. ఇంతమంది ఆత్మలను ఎప్పుడు సృష్టించారు? ఈ ప్రశ్నే రాదు. ఈ డ్రామా అనాది నుండి నడుస్తూనే ఉంది. అంతము లేనిది. ఇది ఎప్పుడూ సమాప్తమవ్వదు. ఈ విషయాలు పిల్లలైన మీరు కూడా నంబరువారుగా అర్థము చేసుకుంటారు, ఇది చాలా సహజము. ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరి పైన ఆకర్షణ ఉండరాదు, ఎవరు పుట్టినా, ఎవరు గిట్టినా ఎలాంటి లగావ్‌(ఆకర్షణ, ఆసక్తి) ఉండరాదు. అమ్మ మరణించినా హల్వా తినండి, పత్ని మరణించినా హల్వా తినండి(అమ్మా మరే తో భీ హల్వా ఖానా, బీబీ మరే తోభీ హల్వా ఖానా,......)అను గాయనము కూడా ఉంది. ఎవరైనా మరణించారనుకోండి చింతించే విషయము కాదు, ఎందుకంటే ఇది అనాదిలో తయారైన డ్రామా. డ్రామానుసారము వారు ఈ సమయములో వెళ్లిపోవలసే ఉంది, ఇందులో మనమేం చేయగలము? కొద్దిగా కూడా దుఃఖించే విషయమే లేదు. ఇది యోగబలము వలన కలుగు స్థితి. కొద్దిగా కూడా కుదుపు దుఃఖము రాకూడదని 'లా'(చట్టము) చెప్తుంది. అందరూ పాత్రధారులే కదా. తమ-తమ పాత్రను అభినయిస్తూ ఉంటారు. పిల్లలకు జ్ఞానము లభించింది.

''ఓ పరమపిత పరమాత్మా! వచ్చి మమ్ములను తీసుకెళ్లండి'' అని తండ్రిని పిలుస్తారు. ఇన్ని శరీరాలను వినాశనము చేయించి ఆత్మలన్నింటినీ వెంట తీసుకెళ్లడం చాలా భారీ(పెద్ద) కర్తవ్యము. ఇక్కడ ఎవరైనా ఒక్కరు మరణిస్తే 12 మాసాలు ఏడుస్తూ ఉంటారు. తండ్రి అయితే ఇంతమంది ఆత్మలను కలిపి తీసుకెళ్తారు. అందరి శరీరాలు ఇక్కడే ఊడిపోతాయి. మహాభారత యుద్ధము జరుగుతే అందరూ దోమల వలె వెళ్తూ ఉంటారని పిల్లలకు తెలుసు. ప్రకృతి భీవత్సాలు కూడా రానున్నాయి. ఈ ప్రపంచమంతా పరివర్తనవుతుంది. ఇప్పుడు ఇంగ్లండు, రష్యా మొదలైన దేశాలు ఎంత పెద్దవిగా ఉన్నాయో చూడండి. సత్యయుగములో ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ మన రాజ్యములో లేనే లేవని కూడా ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. ఒకే ధర్మము, ఒకే రాజ్యముండేది. మీలో కూడా బుద్ధిలో స్థిరంగా ఉంచుకునేవారు నంబరువారుగా ఉన్నారు. కొందరికి నషా చాలా కష్టంగా ఎక్కుతుంది. బంధు-మిత్రులు మొదలైనవారందరి నుండి స్మృతి తొలగించుకొని ఒకే అనంతమైన సంతోషములో ఉండడం చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇది కూడా అంతములో జరుగుతుంది. కర్మాతీత అవస్థను చివర్లో పొందుతారు. శరీరము పై కూడా అభిమానము తెగిపోతుంది. ఇక చాలు ఇప్పుడు మేము వెళ్లిపోతాము - ఈ భావము అందరిలో సాధారణమైపోతుంది. నాటకములోని పాత్రధారులు నాటకమైపోయిన వెంటనే ఇంటికి వెళ్లిపోతారు. ఈ దేహమనే వస్త్రాన్ని మీరు ఇక్కడేే వదిలేయాలి. ఈ వస్త్రాలను ఇక్కడే ధరిస్తారు, ఇక్కడే వదిలేస్తారు. ఈ నూతన విషయాలన్నీ మీ బుద్ధిలో మాత్రమే ఉన్నాయి. ఇతరులెవ్వరి బుద్ధిలోనూ లేవు. అల్ఫ్‌(బాబా), బే(వారసత్వము). అందరికంటే పైనున్నవారు అల్ఫ్‌. బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనము, విష్ణువు ద్వారా పాలన అని చెప్తారు కూడా. మంచిదే. అయితే శివుని కర్తవ్యమేమి? అత్యంత ఉన్నతులైన శివబాబా గురించి ఎవ్వరికీ తెలియదు. వారు సర్వవ్యాపి అని అనేస్తారు. ఇవన్నీ వారి రూపాలే అని అంటారు. ప్రపంచములోని వారందరి బుద్ధిలో ఇది పక్కా అయిపోయింది. అందుకే అందరూ తమోప్రధానమై పోయారు. తండ్రి చెప్తున్నారు - ప్రపంచమంతా దుర్గతిపాలైపోయింది. మళ్లీ నేనే వచ్చి అందరికి సద్గతినిస్తాను. ఒకవేళ సర్వవ్యాపి అయితే అందరూ భగవంతులే భగవంతులవుతారా? ఒక వైపేమో మనమంతా సోదరులమని అంటారు. మరోవైపు అందరూ తండ్రులే(భగవంతులే) అని అంటారు. అర్థమే చేసుకోరు. ఇప్పుడు పిల్లలైన మీకు అనంతమైన తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమౌతాయి. మీరు ఈ దాదాను గానీ, మమ్మాను గానీ స్మృతి చేయరాదు. తండ్రి చెప్తున్నారు - మమ్మాకు గానీ, బాబాకు గానీ మహిమ ఏ మాత్రమూ లేదు. శివబాబా లేకుంటే ఈ బ్రహ్మ కూడా ఏం చేసేవారు? ఇతనిని స్మృతి చేస్తే ఏమవుతుంది(ఏం లభిస్తుంది)? అయితే వీరి ద్వారా మనము తండ్రి నుండి వారసత్వము తీసుకుంటున్నామని మీకు తెలుసు. ఇతని(బ్రహ్మ) నుండి కాదు. ఇతను కూడా వారి నుండే వారసత్వము తీసుకుంటాడు. కనుక స్మృతి వారిని చేయాలి. ఇతడు మధ్యలో ఉన్న దళారి మాత్రమే. అబ్బాయికి-అమ్మాయికి నిశ్చితార్థము జరిగితే ఒకరినొకరు స్మృతి చేసుకుంటూ ఉంటారు కదా. వివాహము చేయించేవారు మధ్యలో దళారే కదా. ఇతని ద్వారా తండ్రి, ఆత్మలైన మీ నిశ్చితార్థము తనతో చేసుకుంటారు. అందుకే సద్గురువు దళారి(మధ్యవర్తి) రూపములో లభించారనే గాయనముంది. సద్గురువు దళారి కాదు. సద్గురువు నిరాకారులు. భలే గురు బ్రహ్మ, గురుర్విష్ణు అంటారు. కానీ వారెవ్వరు గురువులే కారు. సద్గురువు ఒక్క తండ్రి మాత్రమే. వారు సర్వులకు సద్గతినిస్తారు. తండ్రి మీకు నేర్పించారు. అందుకే మీరు ఇతరులకు కూడా దారి చూపిస్తారు. చూస్తూ కూడా చూడకండి అని అందరికి చెప్తారు. బుద్ధి శివబాబాతో జోడింపబడి ఉండాలి. ఈ కనులతో చూచేదంతా శ్మశానగ్రస్థము అవ్వనున్నది. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. ఇతనిని స్మృతి చేయరాదు. ఇతనితో ఏ వారసత్వము లభించదని బుద్ధి చెప్తుంది. వారసత్వమైతే తండ్రితో లభించాలి. వెళ్లాల్సింది కూడా తండ్రి వద్దకే. విద్యార్థులు విద్యార్థులను స్మృతి చేయరు. విద్యార్థులు టీచరును స్మృతి చేస్తారు కదా. పాఠశాలలో తెలివిగల పిల్లలు, ఇతర పిల్లలను కూడా పైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. తండ్రి కూడా ఒకరినొకరు ఉన్నతి చేసుకునేందుకు ప్రయత్నించండని చెప్తారు. కాని భాగ్యములో లేకుంటే వారు పురుషార్థము కూడా చేయరు. కొద్దిలోనే సంతోషిస్తారు. ప్రదర్శిని చూచేందుకు చాలామంది వస్తారు. వారందరికి అర్థం చేయించాలి. చాలా మందికి అర్థం చేయించడం వలన చాలా ఉన్నతి జరుగుతుంది. ఆహ్వానించి తీసుకొస్తారు. కనుక గొప్ప-గొప్ప వివేకవంతులు వస్తారు. ఆహ్వానము లేకుండా అనేక ప్రకారాలైన జనులు వచ్చేస్తారు. ఏవేవో ఉల్టా - సుల్టా మాటలు వ్యర్థ మాటలు వాగుతూ ఉంటారు. రాయల్‌ మనుష్యుల నడవడికలు కూడా రాయల్‌గా ఉంటాయి. రాయల్‌ మనుష్యులు రాయల్‌(హుందా)గా లోపలకు వస్తారు. నడవడికలో కూడా చాలా వ్యత్యాసముంటుంది. వారి నడవడికలో, మాటలలో ఎలాంటి గౌరవము ఉండదు. మేళాకు అనేక విధాలైన మనుష్యులు వచ్చేస్తారు. ఎవ్వరినీ వద్దనలేము. కనుక ఎక్కడ ప్రదర్శిని జరిగినా, ఆహ్వాన కార్డు పంపి రప్పించుకుంటే మంచి-మంచి రాయల్‌ మనుష్యులు వస్తారు. వారు పోయి ఇతరులకు కూడా తప్పకుండా వినిపిస్తారు. అప్పుడప్పుడు స్త్రీల కార్యక్రమము ప్రత్యేకంగా ఉంచండి. కేవలం స్త్రీలు మాత్రమే వచ్చి చూస్తారు. ఎందుకంటే అక్కడక్కడ స్త్రీలు పర్దా చాటున బురఖాలో ఉంటారు. కనుక కేవలం స్త్రీల కొరకు మాత్రమే ప్రోగ్రాము ఉంచండి. అప్పుడు పురుషులెవ్వరూ రాకూడదు. మొట్టమొదట మీరు శివబాబా నిరాకారుడని అర్థం చేయించమని తండ్రి చెప్తున్నారు. శివబాబా మరియు ప్రజాపిత బ్రహ్మ ఇరువురూ తండ్రులే, ఇరువురు బాబాల నుండి వారసత్వము లభించేందుకు ఇరువురు ఏకరసంగా ఉండరు, వారసత్వము లభించేది తాతగారిదా, లేక తండ్రిదా? తాతగారి ఆస్తి పై హక్కు ఉంటుంది. ఎటువంటి కుపుత్రుడైనా తాతగారి వారసత్వము(ఆస్తి) లభిస్తుంది. ఇది ఇక్కడి చట్టము, ఇతనికి ధనము లభిస్తే ఒక సంవత్సరము లోపలే పోగొడ్తాడని కూడా తెలుసు. కాని ప్రభుత్వ చట్టము(లా ) ఉన్నందున ఇవ్వవలసి వస్తుంది. ప్రభుత్వమేమీ చేయలేదు. ఇందులో ఈ బాబా అనుభవజ్ఞుడు. ఒక రాకుమారుడు, ఒక కోటి రూపాయలు 12 మాసాల లోపలే ఖర్చు చేసేశాడు. ఇటువంటివి చూచానని శివబాబా చెప్పరు, ఇటువంటి ఉదాహరణలు ఎన్నో చూచానని, ఈ దాదా చెప్తారు. ఇది చాలా మురికి ప్రపంచము. ఈ ప్రపంచమే పాతదైపోయింది. ఇల్లు కూడా పాతదైపోయింది, పాత ఇంటిని పడగొట్టవలసి వస్తుంది. ఈ లక్ష్మినారాయణుల రాజ భవనాలు ఎంత ఫస్ట్‌క్లాసుగా ఉన్నాయో చూడండి.

మీరు కూడా నరుని నుండి నారాయణునిగా అవుతారని ఇప్పుడు మీరు తండ్రి ద్వారా అర్థము చేసుకుంటున్నారు. ఇదే సత్యనారాయణ కథ. ఇది కూడా పిల్లలైన మీరు మాత్రమే అర్థము చేసుకుంటారు. మీలో కూడా ఇంకా పూర్తి పుష్పాలుగా అవ్వలేదు, ఇందులో చాలా మంచి రాయల్టీ కావాలి. మీరు రోజు రోజుకు ఉన్నతి అవుతూ ఉంటారు. పుష్పాలుగా అవుతూ ఉంటారు.

పిల్లలైన మీరు ప్రేమగా ''బాప్‌దాదా'' అని అంటారు. ఇది కూడా మీ నూతన భాష. ఈ భాష మనుష్యులకు అర్థము కాదు. బాబా ఎక్కడికెళ్ళినా పిల్లలు ''బాప్‌దాదా నమస్తే'' అని అంటారు. అందుకు బదులుగా తండ్రి ఆత్మిక, శారీరిక పిల్లలకు నమస్తే అని అంటారు. ఇలా చెప్పవలసి వస్తుంది కదా. ఎవరైనా వింటే ఇదేదో కొత్త మాట. తండ్రి, అన్న ఇరువురూ కలిసి ఎలా ఉంటారు? అని అంటారు. తండ్రి-అన్న ఇరువురూ ఎప్పుడైనా ఒక్కరిగానే ఉంటారా? ఇరువురి పేర్లు కూడా వేరు వేరుగా ఉన్నాయి, శివబాబా, బ్రహ్మ దాదా, మీరు వీరిరువురి పిల్లలు. ఇతని(బ్రహ్మ)లో శివబాబా కూర్చొని ఉన్నారని మీకు తెలుసు. మనము బాప్‌దాదా పిల్లలము. ఇది బుద్ధిలో గుర్తున్నా ఖుషీ పాదరస మీటరు పైకెక్కి ఉంటుంది. డ్రామా పై కూడా పక్కా నిశ్చయముండాలి. ఎవరైనా శరీరము వదిలినారనుకోండి. వారు వెళ్లి మరో పాత్ర చేస్తారు. ప్రతి ఆత్మకు అవినాశి పాత్ర లభించి ఉంది, ఇందులో ఆలోచించే అవసరము కొద్దిగా కూడా లేదు. వారు వెళ్లి మరో పాత్ర చేయవలసి ఉంది. వాపసు పిలువలేరు. ఇది డ్రామా కదా. ఇందులో ఏడ్చే అవసరమేదీ లేదు. ఇటువంటి స్థితి కలిగినవారే అక్కడ నిర్మోహ రాజులు(మోహజీత్‌ రాజులు)గా అవుతారు. సత్యయుగంలో అందరూ నిర్మోహులుగా ఉంటారు. ఇక్కడ ఎవరైనా మరణిస్తే ఎంతగానో ఏడుస్తారు. తండ్రిని పొందుకున్నాము ఇక ఏడ్చే అవసరమే లేదు. బాబా ఎంతో మంచి దారి చూపిస్తారు. కన్యలకైతే ఇది చాలా మంచిది. లౌకిక తండ్రి వ్యర్థంగా, అనవసరంగా ధనము ఖర్చు చేస్తాడు, మీరు పోయి నరకములో పడ్తారు. ఇంతకంటే మేము ఈ ధనముతో ఆత్మిక యూనివర్సిటి కమ్‌ ఆసుపత్రి తెరుస్తాము అని చెప్పండి. అనేకమందికి కళ్యాణము చేస్తే మీకు పుణ్యమే, మాకు పుణ్యమే అని మీ లౌకిక తండ్రికి చెప్పండి. మేము భారతదేశాన్ని స్వర్గంగా చేసేందుకు తనువు-మనసు-ధనము అన్నీ ఖర్చు చేస్తాము అని చెప్పే ఉత్సాహము స్వయం పిల్లలైన మీలో ఉండాలి. ఇంతటి నషా ఉండాలి. మీ తండ్రితో - మీరు ధనము ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. వద్దనుకుంటే ఇవ్వకండి. మీరు మీ కళ్యాణము, ఇతర అనేకమంది కళ్యాణము చేయాలని కోరుకోరా? అని అడగండి. ఇంత మస్తీ (నశా) ఉండాలి, ముఖ్యంగా కుమారీలు చాలా దృఢంగా నిలబడాలి. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మీ నడవడిక చాలా రాయల్‌గా, శ్రేష్ఠంగా ఉంచుకోవాలి. చాలా గౌరవ పూర్వకంగా మాట్లాడాలి. నమ్రతా గుణాన్ని ధారణ చేయాలి.
2. ఈ కనులకు కనిపించేదంతా శ్మశానగ్రస్థము అవ్వనున్నది. కనుక దీనిని చూస్తూ కూడా చూడకుండా ఉండాలి. ఒక్క శివబాబాను మాత్రమే స్మృతి చేయాలి. ఏ దేహధారిని స్మృతి చేయరాదు.

వరదానము :- '' విశేషత అనే సంజీవని మూలిక ద్వారా మూర్ఛితులైన వారిని మేల్కొలిపే విశేష ఆత్మా భవ ''
ప్రతి ఆత్మకు శ్రేష్ఠ స్మృతులు, విశేషతల స్మృతి అనే సంజీవిని మూలికను తినిపించండి. అప్పుడు మూర్ఛితుల నుండి మేల్కుంటారు. విశేషతల స్వరూపమనే దర్పణాన్ని వారి ముందుంచండి. ఇలా స్మృతినిప్పించుట ద్వారా మీరు విశేషాత్మలుగా అవ్వనే అవుతారు. ఒకవేళ మీరు బలహీనతను వినిపిస్తే వారు దాచిపెట్తారు, పక్కకు నెట్టేస్తారు. విశేషతలు వినిపిస్తే స్వయం తమ బలహీనతను స్పష్టంగా అనుభవం చేస్తారు. ఈ సంజీవిని మూలికతో మూర్ఛితులైన వారిని మేల్కొలిపి ఎగురుతూ వెళ్లండి, ఇతరులను ఎగిరిస్తూ ఉండండి.

స్లోగన్‌ :- '' పేరు ప్రతిష్ఠలు మరియు సాధనాలను సంకల్పంలో కూడా త్యాగం చేయడమే మహోన్నతమైన త్యాగము. ''

Telugu Murli 31/01/2020

31-01-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - యోగము అగ్నితో సమానము. అందులో మీ పాపాలన్నీ కాలిపోతాయి. ఆత్మ సతోప్రధానమైపోతుంది. కనుక ఒక్క తండ్రి స్మృతిలో (యోగములో) ఉండండి ''

ప్రశ్న :- పుణ్యాత్మలుగా అయ్యే పిల్లలు ఏ విషయంలో చాలా చాలా గమనముంచాలి ?
జవాబు :- ఎవరికైనా ధనము దానము చేయాలనే విషయంలో పూర్తిగా గమనముంచాలి. ఎవరికైనా ధనము దానమిచ్చినప్పుడు వారు పోయి సారాయి మొదలైనవి తాగితే, చెడు కర్మలు చేస్తే, ఆ పాపము మీ పైకి వస్తుంది. ఇప్పుడు మీరు పాపాత్మలతో ఇచ్చి - పుచ్చుకోవడం చేయరాదు. ఇక్కడ మీరు పుణ్యాత్మలుగా అవ్వాలి.

పాట :- వారు మాతో విడిపోరు................. ( నా వహ్‌ హమ్‌ సే జుదా హోంగే,................)  
ఓంశాంతి. దీనినే యోగాగ్ని అని అంటారు. యోగాగ్ని అనగా స్మృతి వలన వచ్చే అగ్ని. అగ్ని అని ఎందుకన్నారు? ఎందుకంటే ఇందులో పాపాలు కాలిపోతాయి. మనము తమోప్రధానము నుండి సతోప్రధానంగా ఎలా అవుతామో కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. సతోప్రధానమంటే పుణ్యాత్మ. తమోప్రధానమంటే పాపాత్మ. ఇతను చాలా పుణ్యాత్మ అని, ఇతను పాపాత్మ అని అంటూ ఉంటారు. దీని వలన ఆత్మనే సతోప్రధానమవుతుందని, పునర్జన్మ తీసుకుంటూ తీసుకుంటూ మళ్లీ తమోప్రధానమవుతుందని అందుకే పాపాత్మ అని అంటారని ఋజువవుతుంది. పతిత పావనులైన తండ్రిని కూడా ''మీరు వచ్చి పావనంగా చేయమనే పిలుస్తారు.'' పతితాత్మగా చేసిందెవరో ఎవ్వరికీ తెలియదు. పావనాత్మలుగా ఉన్నప్పుడు దానిని రామరాజ్యమని అనేవారు. ఇప్పుడు అందరూ పతితాత్మలే ఉన్నారు. అందువలన దీనిని రావణ రాజ్యమని అంటారు. భారతదేశమే పావనంగా, భారతదేశమే పతితంగా అవుతుంది. తండ్రే స్వయంగా వచ్చి భారతదేశాన్ని పావనంగా చేస్తారు. మిగిలిన ఆత్మలన్నీ పావనంగా అయి శాంతిధామానికి వెళ్లిపోతాయి. ఇప్పుడిది దు:ఖధామము. ఇంత సులభమైన విషయము కూడా బుద్ధిలో కూర్చోదు. హృదయపూర్వకంగా అర్థము చేసుకుంటే సత్యమైన బ్రాహ్మణులుగా అవుతారు. బ్రాహ్మణులుగా అవ్వకుంటే తండ్రి నుండి వారసత్వము లభించదు.
ఇప్పుడిది సంగమ యుగములోని యజ్ఞము. యజ్ఞము కొరకు బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. ఇది మృత్యులోకములో అంతిమ యజ్ఞమని మీకు తెలుసు. యజ్ఞాలు మృత్యులోకములోనే ఉంటాయి. అమరలోకములో యజ్ఞాలుండవు. భక్తుల బుద్ధిలో ఈ మాటలు కూర్చోవు. భక్తి వేరు, జ్ఞానము వేరు. మనుష్యులు వేదశాస్త్రాలనే జ్ఞానమని భావిస్తారు. వాటిలో జ్ఞానముంటే మనుష్యులు వాపసు వెళ్లేవారు. కానీ డ్రామానుసారము వాపస్‌ ఎవ్వరూ వెళ్లరు. మొదటి నంబరులోని వారే సతో, రజో, తమోలోకి తప్పకుండా రావాలని బాబా అర్థం చేయించారు. అటువంటప్పుడు ఇతరులు సతో పాత్రను చేసి వాపసు ఎలా వెళ్లగలరు? వారు మళ్లీ తమోప్రధానములోకి రావాల్సిందే. పాత్రను అభినయించాల్సిందే. ప్రతి పాత్రధారి శక్తి వేరు వేరుగా ఉంటుంది కదా. గొప్ప-గొప్ప నటులు ఎంత పేరు ప్రతిష్ఠలు కలిగి ఉంటారు! అందరికంటే ముఖ్యమైన సృష్టికర్త, డైరక్టరు, ముఖ్య పాత్రధారి ఎవరు? ముఖ్యమైనవారు గాడ్‌ఫాదర్‌ అని ఇప్పుడు మీకు తెలుసు. వారి తర్వాత జగదంబ, జగత్పిత. వారు జగత్తుకు అధికారులు, విశ్వానికి యజమానులుగా అవుతారు. వీరి పాత్ర తప్పకుండా ఉన్నతమైనది. కనుక వారి జీతము కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. జీతమిచ్చేది అత్యంత ఉన్నతమైన తండ్రి. నీవు నాకు ఇంత సహాయము చేస్తున్నావు కనుక నీకు జీతము కూడా అంత ఎక్కువగా లభిస్తుందని తండ్రి అంటారు. బ్యారిస్టరు చదివిస్తే, ఇంత ఉన్నతమైన పదవి ప్రాప్తి చేయిస్తున్నానని అంటారు. ఇంత ఉన్నతమైన పదవి ప్రాప్తి చేయిస్తాను. కనుక ఈ చదువు పై పిల్లలు ఎంత గమనమివ్వాలి! గృహస్థములో కూడా ఉండాలి. కర్మయోగ సన్యాసులు కదా. గృహస్థ వ్యవహారములో ఉంటూ అన్ని పనులు చేస్తూ తండ్రి నుండి వారసత్వము పొందే పురుషార్థము చేయవచ్చు. ఇందులో ఏ కష్టమూ లేదు. పని పాట చేసుకుంటూ శివబాబా స్మృతిలో ఉండాలి. జ్ఞానమైతే చాలా సహజము. ఓ పతితపావనా! రండి, మీరు వచ్చి మమ్ములను పావనంగా చేయమని కూడా పాడ్తారు కదా. పావన ప్రపంచంలో అయితే రాజధాని ఉంటుంది. తండ్రి ఆ రాజధానికి కూడా అర్హులుగా చేస్తారు.
ఈ జ్ఞానములో ముఖ్యంగా రెండు సబ్జక్టులున్నాయి - 1. అల్ఫ్‌. 2. బే. స్వదర్శన చక్రధారులుగా అయి తండ్రిని స్మృతి చేస్తే మీరు సదా ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా అవుతారు. తండ్రి చెప్తున్నారు - నన్ను అక్కడ(పరంధామంలో) స్మృతి చేయండి. ఇంటిని కూడా స్మృతి చేయండి. నన్ను స్మృతి చేస్తే మీరు ఇంటికి వెళ్లిపోతారు. స్వదర్శన చక్రధారులుగా అయినందున మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. బుద్ధిలో ఇది మంచి రీతిగా గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో అందరూ తమోప్రధానంగా ఉన్నారు. సుఖధామంలో సుఖము, శాంతి, సంపద అన్నీ లభిస్తాయి. అక్కడ ఒకే ధర్మముంటుంది. ఇప్పుడు ఇంటింటా అశాంతి ఉందని మీరు చూస్తున్నారు. విద్యార్థులెంత గలాటా చేస్తున్నారో చూడండి. తమ ఉడుకు రక్తాన్ని చూపిస్తారు. ఇది తమోప్రధాన ప్రపంచము. సత్యయుగము నూతన ప్రపంచము. తండ్రి సంగమ యుగములో వచ్చి ఉన్నారు. మహాభారత యుద్ధము కూడా సంగమ యుగములోనిదే. ఇప్పుస్త్ర ఈ ప్రపంచము పరివర్తన చెందుతుంది. తండ్రి కూడా చెప్తున్నారు - నేను నూతన ప్రపంచ స్థాపన చేసేందుకు సంగమ యుగములో వస్తాను. దీనినే పురుషోత్తమ సంగమ యుగమని అంటారు. పురుషోత్తమ మాసము, పురుషోత్తమ సంవత్సరాన్ని కూడా ఆచరిస్తారు. కానీ ఈ పురుషోత్తమ సంగమ యుగము గురించి ఎవ్వరికీ తెలియదు. సంగమ యుగములోనే తండ్రి వచ్చి మిమ్ములను వజ్ర సమానంగా చేస్తారు. అయితే వీరిలో కూడా నంబరువార్‌గా ఉండనే ఉంటారు. వజ్ర సమానమైన రాజులుగా అవుతారు, మిగిలినవారు బంగారు సమానమైన ప్రజలుగా అవుతారు. పిల్లలు జన్మించిన వెంటనే వారసత్వానికి హక్కుదారులుగా అవుతారు. ఇప్పుడు మీరు పావన ప్రపంచానికి హక్కుదారులుగా అవుతారు. అందులో ఉన్నత పదవి పొందేందుకు పురుషార్థము చేయాలి. ఈ సమయములో మీరు చేసే పురుషార్థము కల్ప-కల్పానికి పురుషార్థమైపోతుంది. కల్ప-కల్పము ఇలాంటి పురుషార్థమే చేస్తారని, ఎక్కువ పురుషార్థము జరగనే జరగదని తెలిసిపోతుంది. జన్మ-జన్మాంతరాలు, కల్ప-కల్పాంతరాలు వీరు ప్రజలలోనే వస్తారు. వీరు శ్రీమంతులైన ప్రజలకు దాస-దాసీలుగా అవుతారు. నంబరువారుగా ఉంటారు కదా. చదువు ఆధారంగా అంతా తెలిసిపోతుంది. ఈ స్థితిలో మీ శరీరము వదిలేస్తే ఏ పదవి పొందుతారో బాబా వెంటనే తెలుపగలరు. రోజురోజుకు సమయము తగ్గిపోతూ వస్తుంది. ఒకవేళ ఎవరైనా శరీరాన్ని వదిలేస్తే తర్వాత చదవలేరు. అయితే కొద్దిగా బుద్ధికి తోస్తుంది. శివబాబాను స్మృతి చేస్తారు. ఉదాహరణానికి చిన్న పిల్లలు కూడా మీరు స్మృతి చేయిస్తే, శివబాబా శివబాబా అని అంటూ ఉంటారు. వారికి కూడా కొద్దిగా లభిస్తుంది. చిన్నపిల్లలు మహాత్ముల వంటి వారు. వారికి వికారాల గురించి తెలియదు. ఎంత పెరిగి పెద్దవారౌతూ ఉంటారో అంత వికారాల ప్రభావము పడ్తూ ఉంటుంది. క్రోధముంటుంది, మోహముంటుంది.......... ఇప్పుడు ఈ ప్రపంచంలో, మీరు కనులతో ఏమేం చూస్తున్నారో వాటి పై మమకారాన్ని నశింపజేయాలి. ఇదంతా శ్మశాన గ్రస్థమైపోతుందని ఆత్మకు తెలుసు. అన్నీ తమోప్రధాన వస్తువులే. మానవులు మరణిస్తే వారి పాత వస్తువులన్నీ శ్మశాన బ్రాహ్మణులకు ఇచ్చేస్తారు. తండ్రి అనంతమైన శ్మశాన బ్రాహ్మణుడు. చాకలి కూడా వారే. మీ నుండి ఏం తీసుకుంటారు? ఏమిస్తారు? మీరిచ్చే అంతో ఇంతో ధనము కూడా సమాప్తమయ్యే తీరాలి. అయినా ఈ ధనము మీ వద్దనే ఉంచుకోండి, కేవలం దాని పై మమకారాన్ని తీసేయమని తండ్రి చెప్తున్నారు. లెక్కాచారము తండ్రికి ఇస్తూ ఉండండి. అప్పుడు మీకు ఆదేశాలు లభిస్తూ ఉంటాయి. మీ వద్ద ఉండే పనికిరానిదంతా యూనివర్సిటీలో, ఆసుపత్రి కొరకు, ఆరోగ్యము, ఐశ్యర్యాల కొరకు ఖర్చు చేస్తారు. ఆసుపత్రి జబ్బులు బాగు చేసేందుకు, యూనివర్సిటి చదివించేందుకు ఉపయోగపడ్తాయి. అయితే కాలేజి ఇదే, ఆసుపత్రి కూడా ఇదే. దీని కొరకు కేవలం 3 అడుగుల నేల చాలు. ఎవరి వద్ద ఇంకేమీ ఉండదో వారు కేవలం 3 అడుగుల నేల ఇస్తే చాలు. అందులో క్లాసు జరపండి. 3 అడుగులు అనగా కేవలం కూర్చునేే స్థలమే కదా. ఆసనము 3 అడుగులు మాత్రమే ఉంటుంది. 3 అడుగుల నేల పై ఎవరైనా కూర్చొని మంచి రీతిగా అర్థము చేసుకొని వెళ్తారు. ఎవరైనా వస్తే ఆసనము పై కూర్చోబెట్టి తండ్రి పరిచయమునిస్తారు. బ్యాడ్జిలు కూడా చాలా తయారు చేయిస్తున్నారు. సేవ కొరకు ఇది చాలా సింపుల్‌ సాధనము. చిత్రాలు కూడా బాగున్నాయి. అందులో పూర్తి వివరముంది. వీటితో సేవ చాలా బాగా జరుగుతుంది. రోజురోజుకు అనేక ఆపదలు వస్తూ ఉంటాయి. దీని వలన మనుష్యులకు వైరాగ్యము కూడా కలుగుతుంది. తండ్రిని స్మృతి చేయడం ప్రారంభిస్తారు. మనము అవినాశి ఆత్మలము. మన అవినాశి తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి స్వయంగా చెప్తున్నారు - నన్ను స్మృతి చేస్తే మీ జన్మ-జన్మాంతరాల పాపాలన్నీ తొలగిపోతాయి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని పూర్తిగా ప్రేమించాలి. దేహాభిమానములోకి రాకండి. అయితే పిల్లలు మొదలైనవారితో బాహ్య సంబంధమైన ప్రేమ కలిగి ఉండండి. కానీ ఆత్మిక సత్యమైన ప్రేమ ఆత్మిక తండ్రితో ఉండాలి. వారి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమౌతాయి. బంధు-మిత్రులను, పిల్లలను మొదలైన వారిని చూస్తున్నా మీ బుద్ధిలో తండ్రి స్మృతి మెదులుతూ ఉండాలి. పిల్లలైన మీరు స్మృతి అనే ఉరితాడు పై వ్రేలాడుతున్నట్లుండాలి. ఆత్మలు తమ తండ్రి అయిన పరమాత్మను మాత్రమే స్మృతి చేయాలి. బుద్ధి పైన వ్రేలాడుతూ ఉండాలి. తండ్రి ఇల్లు కూడా పైన ఉంది కదా. మూలవతనము, సూక్ష్మవతనము, ఇది స్థూలవతనము. ఇప్పుడు మళ్లీ వాపసు వెళ్లాలి.
ఇప్పుడు మీ యాత్ర పూర్తి అయింది. ఇప్పుడు మీరు యాత్ర నుండి వాపసు వస్తున్నారు. కనుక మీ ఇల్లు ఎంత ప్రియమనిపిస్తుంది! అది అనంతమైన ఇల్లు. వాపసు మన ఇంటికి వెళ్లాలి. మనుష్యులు ఇంటికి వెళ్లేందుకు భక్తి చేస్తారు. కానీ పూర్తి జ్ఞానము లేకుంటే ఇంటికి వెళ్లలేరు. భగవంతుని వద్దకు వెళ్లేందుకు లేక నిర్వాణ ధామానికి వెళ్లేందుకు తీర్థ యాత్రలు మొదలైనవి ఎన్నో చేస్తారు, ఎంత శ్రమ చేస్తారు! సన్యాసులు కేవలం శాంతి కొరకు మాత్రమే దారి తెలుపుతారు. సుఖధామము గురించి వారికి తెలియనే తెలియదు. సుఖధామానికి దారి కేవలం తండ్రి ఒక్కరు మాత్రమే తెలిపిస్తారు. మొదట తప్పకుండా నిర్వాణధామము లేక వానప్రస్థములోకి వెళ్లాలి. దానిని బ్రహ్మాండము అని కూడా అంటారు. వారు బ్రహ్మతత్వమునే ఈశ్వరుడని భావించి ఉన్నారు. ఆత్మలమైన మనము బిందువులము. మన నివాస స్థానము బ్రహ్మాండము. మీకు కూడా పూజ జరుగుతుంది కదా. ఇప్పుడు బిందువును ఎలా పూజిస్తారు? పూజించినప్పుడు సాలిగ్రాములను తయారు చేసి ఒక్కొక్క ఆత్మను పూజిస్తారు. బిందువునెలా పూజిస్తారు? అందువలన పెద్ద పెద్దవిగా సాలిగ్రామాలను తయారు చేస్తారు. తండ్రికైతే తమ శరీరము లేనే లేదు. ఈ విషయాలు ఇప్పుడు మీకు తెలుసు. చిత్రాలలో కూడా మీరు పెద్ద రూపంగా చూపవలసి వచ్చింది. బిందువునెలా అర్థము చేసుకుంటారు. అందుకని నక్షత్రంగా తయారు చేయాలి. ఇటువంటి (నక్షత్రము వంటి) తిలకమును కూడా చాలా మంది మాతలు ధరిస్తారు. తెల్లవి రెడిగా లభిస్తాయి. ఆత్మ కూడా తెల్లగా నక్షత్రము వలె ఉంటుంది కదా. ఇది కూడా ఆత్మకు ఒక గుర్తు. భృకుటి మధ్యలో ఆత్మ ఉంటుంది. అయితే దీని అర్థము ఎవ్వరికీ తెలియదు. ఇంత చిన్న ఆత్మలో ఎంత జ్ఞానముందో తండ్రి అర్థము చేయిస్తున్నారు. ఇన్ని బాంబులు మొదలైనవి ఎన్నో తయారు చేస్తూ ఉంటారు. అద్భుతము కదా. ఆత్మలో ఇంత పాత్ర నిండి ఉంది. ఇవి చాలా నిగూఢమైన విషయాలు. ఇంత చిన్న ఆత్మ శరీరము ద్వారా ఎంత పని చేస్తుంది! ఆత్మ అవినాశి. దాని పాత్ర ఎప్పుడూ నశించదు, మార్పు చెందదు. ఇప్పుడు వృక్షము చాలా పెద్దదిగా ఉంది. సత్యయుగములో చాలా చిన్న వృక్షముంటుంది. పాతవి ఉండవు. మధురమైన చిన్న వృక్షము ఇప్పుడు అంటు కట్టబడ్తూ ఉంది. మీరు పతితులుగా ఉండినారు. ఇప్పుడు మళ్లీ పావనంగా అవుతున్నారు. ఇంత చిన్న ఆత్మలో ఎంత పాత్ర ఉంది! ఇది ప్రాకృతికము. అవినాశి పాత్ర నడుస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడూ సమాప్తమవ్వదు. ఆత్మ అవినాశి వస్తువు. అందులో అవినాశి పాత్ర నిండి ఉంది. ఇది అద్భుతము కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ! దేహీ-అభిమానులుగా అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి, ఇందులోనే శ్రమ ఉంది. ఎక్కువగా మీ పాత్రనే ఉంది. బాబాకు మీకున్నంత పాత్ర లేదు.
తండ్రి చెప్తున్నారు - మీరు స్వర్గములో సుఖంగా ఉంటే నేను విశ్రాంతిలో(శాంతిధామంలో) కూర్చుండిపోతాను. నాకు అక్కడ ఏ పాత్రా లేదు. ఈ సమయంలో ఇంత సేవ చేస్తాను కదా. ఈ జ్ఞానము ఇంత అద్భుతమైనది. మీరు తప్ప ఇతరులెవ్వరికీ కొంచెము కూడా తెలియదు. తండ్రి స్మృతిలో లేకుంటే ధారణ కూడా జరగదు. ఆహార-పానీయాలలో వ్యత్యాసము వస్తే ధారణలో తేడా వచ్చేస్తుంది. ఇందులో చాలా మంచి పవిత్రత ఉండాలి. తండ్రిని స్మృతి చేయడం చాలా సులభము. తండ్రిని స్మృతి చేయాలి, వారసత్వము పొందాలి. అందుకే బాబా ''మీ వద్ద కూడా చిత్రాలుంచుకోండి'' అని అన్నారు. యోగమును గురించిన చిత్రాలు, వారసత్వమును గురించిన చిత్రాలు తయారుచేస్తే నషా ఉంటుంది. మనము బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతున్నాము. తర్వాత మళ్లీ మనము దేవతల నుండి క్షత్రియులుగా అవుతాము. బ్రాహ్మణులు పురుషోత్తమ సంగమ యుగానికి చెందినవారు. మీరు పురుషోత్తములుగా అవుతారు కదా. మనుష్యుల బుద్ధిలో ఈ విషయాలు కూర్చోబెట్టేందుకు చాలా శ్రమ చేయవలసి వస్తుంది. రోజురోజుకు జ్ఞానమును ఎంతగా అర్థము చేసుకుంటూ ఉంటారో అంత సంతోషము కూడా వృద్ధి చెందుతుంది.
బాబా మనకు చాలా కళ్యాణము చేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. కల్ప-కల్పము మనకు ఉన్నతమయ్యే కళ ఉంటుంది. ఇక్కడ ఉండి శరీర నిర్వహణ కొరకు అన్ని పనులు చేయవలసి వస్తుంది. మేము శివబాబా భండారము నుండి భుజిస్తున్నామని బుద్ధిలో ఉండాలి. శివబాబాను స్మృతి చేస్తూ ఉంటే కాలకంటకాలన్నీ(కష్టాలన్నీ) దూరమైపోతాయి. తర్వాత ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్లిపోతారు. బాబా ఏమీ తీసుకోరని పిల్లలకు తెలుసు. వారు దాత. తండ్రి చెప్తున్నారు - నా శ్రీమతాన్ని అనుసరించండి. మీరు ధనము ఎవరికి దానము చేయాలనే విషయము పై పూర్తి గమనముంచాలి. ఎవరికైనా ధనము దానము ఇస్త్తే, వారు వెళ్లి సారాయి మొదలైనవి తాగి చెడుకర్మలు చేస్తే ఆ పాపము మీ పైకి వచ్చేస్తుంది. పాపాత్మలతో ఇచ్చి-పుచ్చుకుంటూ పాపాత్మలుగా అయిపోతారు. ఎంత తేడా ఉంది! పాపాత్మలు, పాపాత్మలతో ఇచ్చి - పుచ్చుకుంటూ పాపాత్మలుగా అయిపోతారు. ఇక్కడ మీరు పుణ్యాత్మలుగా అవ్వాలి. అందువలన పాపాత్మలతో ఇచ్చి పుచ్చుకోరాదు. తండ్రి చెప్తున్నారు - ఇతరులెవ్వరికీ దు:ఖమివ్వరాదు. ఎవ్వరిలోను మోహముంచరాదు. తండ్రి కూడా శ్యాక్రిన్‌గా తయారై వస్తారు. పనికిరాని పాతదంతా తీసుకుంటారు. ఎంత వడ్డీ ఇస్తారో చూడండి. చాలా పెద్ద వడ్డీ లభిస్తుంది. ఎంత అమాయకుడు(భోలా)! రెండు పిడికెళ్లకు బదులు భవనాలు ఇచ్చేస్తారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
అవ్యక్త స్థితిని అనుభవం చేసేందుకు విశేషమైన హోంవర్క్‌
పరస్పరంలో బ్రాహ్మణుల భాష అవ్యక్త భాషగా ఉండాలి. ఎవరి తప్పులైనా వినబడి ఉంటే వాటిని సంకల్పంలో కూడా స్వీకరించరాదు, ఇతరులచే స్వీకరింపజేయరాదు. సంఘటనలో పరస్పరము విశేషంగా అవ్యక్త అనుభవాలను ఇచ్చి - పుచ్చుకోవాలి.


ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఇప్పుడు యాత్ర పూర్తి అయింది. వాపసు ఇంటికి వెళ్లాలి. కనుక ఈ పాత ప్రపంచము పై అనంతమైన వైరాగ్యముతో బుద్ధియోగాన్ని తండ్రి స్మృతిలో పైన వ్రేలాడదీయాలి.
2. సంగమ యుగములో తండ్రి ఏ యజ్ఞమునైతే రచించారో, ఈ యజ్ఞాన్ని సంభాళించేందుకు సత్య సత్యమైన పవిత్ర బ్రాహ్మణులుగా అవ్వాలి. పనిపాటలు చేసుకుంటూ తండ్రి స్మృతిలో ఉండాలి.

వరదానము :- '' మీ సర్వ ఖజానాలను ఇతర ఆత్మల సేవలో ఉపయోగించి సహయోగులుగా అయ్యే సహజయోగీ భవ ''
సహజయోగులుగా అయ్యేందుకు సాధనం - సదా స్వయాన్ని సంకల్పం ద్వారా, వాణి ద్వారా, ప్రతి కర్మ ద్వారా విశ్వములోని సర్వ ఆత్మల పట్ల 'నేను సేవాధారిని' అని భావించి సర్వస్వము సేవలో ఉపయోగించాలి. బ్రాహ్మణ జీవితంలో తండ్రి ద్వారా ప్రాప్తించిన గుణాలు, జ్ఞానము, శ్రేష్ఠ సంపాదన చేసుకునే సమయ ఖజానాలను సేవలో ఉపయోగించండి అనగా సహయోగులుగా అయితే సహజయోగులుగా అవ్వనే అవుతారు. అయితే ఎవరైతే సంపన్నంగా ఉంటారో, వారే సహయోగులుగా అవ్వగలరు. సహయోగులుగా అవ్వడమంటే మహాదానులుగా అవ్వడం.

స్లోగన్‌ :- '' బేహద్‌ వైరాగులుగా అయితే ఆకర్షింపబడే అన్ని సంస్కారాలు సహజంగానే సమాప్తమౌతాయి. ''