Monday, 23 September 2019

Telugu Murli 24/09/2019

24-09-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - యోగబలము ద్వారా చెడు సంస్కారాలను పరివర్తన చేసి స్వయంలో మంచి సంస్కారాలను నింపుకోండి. జ్ఞానము మరియు పవిత్రతా సంస్కారాలు మంచి సంస్కారాలు. ''

ప్రశ్న :- పిల్లలైన మీ జన్మ సిద్ధ అధికారము ఏది ? మీకిప్పుడు ఏ ఫీలింగు(ఆలోచన) వస్తుంది ?
జవాబు :- ముక్తి-జీవన్ముక్తి మీ జన్మ సిద్ధ అధికారాలు. తండ్రితో పాటు మనము వాపసు ఇంటికి వెళ్లాలనే ఫీలింగ్‌ మీకిప్పుడు వస్తుంది. భక్తి ఫలితమైన ముక్తి, జీవన్ముక్తిని ఇచ్చేందుకు తండ్రి వచ్చారని మీకు తెలుసు. ఇప్పుడు అందరూ శాంతిధామానికి వెళ్లాలి. అందరూ తమ ఇంటిని సాక్షాత్కారము చేసుకోవాలి.

ఓంశాంతి. మానవులు(సిక్కులు) తండ్రిని సత్యమైన ఆధ్యాత్మిక చక్రవర్తి(పాత్‌షాహ్‌) అని కూడా అంటారు. ఆంగ్లములో అలా అనరు. అందులో కేవలం సత్యమైన ఫాదర్‌ అని అంటారు. గాడ్‌ఫాదర్‌ ఈజ్‌ ట్రూత్‌ అని అంటారు. భారతదేశములోనే సత్యమైన ఆధ్యాత్మిక పాత్‌షాహ్‌(చక్రవర్తి) అని అంటారు. ఆ రెండిటికీ చాలా తేడా ఉంది. వారు కేవలం సత్యమే చెప్తారు. సత్యమును నేర్పిస్తున్నారు, సత్యంగా తయారుచేస్తారు. ఇక్కడ సత్యమైన పాత్‌షాహ్‌ అని అంటారు. సత్యంగానూ చేస్తారు, సత్యఖండానికి చక్రవర్తిగా కూడా చేస్తారు. ముక్తినీ ఇస్తారు, జీవన్ముక్తిని కూడా ఇస్తారు. దీనిని భక్తి ఫలితమని అంటారు. లిబరేషన్‌(ముక్తి), ఫ్రూషన్‌(/జీవన్ముక్తి) - భక్తికిి ఫలమును ఇస్తారు, ముక్తులుగానూ చేస్తారు. మనకు రెండూ ఇస్తారని పిల్లలకు తెలుసు. ముక్తినైతే అందరికీ ఇస్తారు. ఫలమును(జీవన్ముక్తిని) మీకు మాత్రమే ఇస్తారు. లిబరేషన్‌ మరియు ఫ్రూషన్‌ - ఈ భాష కూడా తయారు చేయబడింది కదా. భాషలైతే చాలా ఉన్నాయి. భక్తిలో శివబాబాకు కూడా చాలా పేర్లు పెట్టేస్తారు. వారి పేరు శివబాబా అని ఎవరికైనా చెప్తే, వారిని మేమైతే మాలిక్‌(యజమాని) అనే అంటామని కొందరు అంటారు. మాలిక్‌ అని అనడం బాగానే ఉంది కానీ వారికి కూడా పేరుండాలి కదా. నామ-రూపాలకు అతీతంగా ఏ వస్తువూ ఉండదు. మాలిక్‌ కూడా ఏదో ఒక వస్తువుకు అధికారిగా అవుతారు కదా, నామ-రూపాలైతే తప్పకుండా ఉంటాయి. తండ్రి తప్పకుండా విడుదల కూడా చేస్తారు, తర్వాత అందరూ శాంతిధామానికి తప్పకుండా వెళ్లాలని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. తమ ఇంటిని అందరూ సాక్షాత్కారము చేసుకోవాలి. ఇంటి నుండి వచ్చారు కనుక మొదట ఇంటిని సాక్షాత్కారము చేసుకుంటారు. దానిని గతి-సద్గతి అని అంటారు. వారు గతి-సద్గతి అని అంటారు కానీ అర్థ రహితంగా అంటారు. మనము మన ఇంటికి వెళ్తాము, ఫలితము కూడా లభిస్తుందని పిల్లలైన మీరు ఫీల్‌ అవుతారు. మీకు నంబరువారుగా లభిస్తుంది. తర్వాత ఇతర ధర్మాల వారికి కూడా సమయానుసారంగా లభిస్తుంది. మీరు స్వర్గవాసులా లేక నరకవాసులా? అని ప్రశ్నించే ఈ కరపత్రము చాలా బాగుందని తండ్రి తెలియజేశారు. ఈ ముక్తి-జీవన్ముక్తి రెండూ తండ్రి ఇచ్చే జన్మ సిద్ధ అధికారమని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మీరు వ్రాయగలరు కూడా. తండ్రి ద్వారా పిల్లలైన మీకు ఈ జన్మ సిద్ధ అధికారము లభిస్తుంది. తండ్రి వారిగా అవ్వడము వలన ఈ రెండూ ప్రాప్తిస్తాయి. అది రావణుని జన్మ సిద్ధ అధికారము, ఇది పరమపిత పరమాత్ముని జన్మ సిద్ధ అధికారము. ఇది భగవంతుని జన్మ సిద్ధ అధికారము, ఇది సైతాన్‌(మాయ) జన్మ సిద్ధ అధికారము. అర్థము చేసుకునే విధంగా వ్రాయాలి. పిల్లలైన మీరిప్పుడు స్వర్గమును స్థాపించాలి. ఎంత పని చేయాలి! ఇప్పుడైతే పసి పిల్లల వలె(బేబీస్‌ వలె) ఉన్నారు. ఎలాగైతే మానవులు కలియుగము గురించి చెప్పునప్పుడు ఇది చిన్న బాలుని వలె ఉందని అంటారో అలా సత్యయుగ స్థాపనలో చిన్న బాలుని వలె ఉందని తండ్రి చెప్తారు. పిల్లలైన మీకిప్పుడు వారసత్వము లభిస్తోంది. రావణుని వారసత్వము అని అనరు. భగవంతుడైన తండ్రి ద్వారా అయితే వారసత్వము లభిస్తుంది. రావణుడు తండ్రి కాదు. రావణుని 5 వికారాలను సైతాన్‌ అని అంటారు. సైతాన్‌ నుండి వారసత్వముగా ఏం లభిస్తుంది? - పంచ వికారాలు లభిస్తాయి. వాటిని ప్రదర్శిస్తారు కూడా, తమోప్రధానంగా అవుతారు. ఇప్పుడు దశరాను ఎంతగా జరుపుకుంటారు. వేడుకగా జరుపుకుంటారు. చాలా ఖర్చు చేస్తారు. విదేశాల నుండి కూడా ఆహ్వానిస్తారు. అన్నింటికంటే దశరాను మైసూరులో బాగా జరుపుతారు. ధనవంతులు కూడా చాలామంది ఉన్నారు. రావణ రాజ్యములో ధనము లభిస్తే బుద్ధి పాడైపోతుంది. తండ్రి వివరంగా అర్థం చేయిస్తారు. దీని పేరే రావణ రాజ్యము. దానిని ఈశ్వరీయ రాజ్యమని అంటారు. రామరాజ్యమని అనడం కూడా తప్పు. గాంధీగారు రామరాజ్యాన్ని కోరుకునేవారు. గాంధీగారు కూడా అవతరించారని(అవతార పురుషుడని) మనుష్యులు భావిస్తారు. వారికి ఎంత ధనము ఇస్తూ ఉండేవారు. వారిని భారతదేశ బాపూజి(జాతిపిత) అని పిలిచేవారు. ఇప్పుడు వీరు(శివబాబా) విశ్వానికంతా బాపూజీగా ఉన్నారు. ఇప్పుడు మీరిక్కడ కూర్చున్నారు. జీవాత్మలు ఎంతమంది ఉంటారో తెలుసు. జీవమైతే(శరీరము) వినాశనమవుతుంది, ఆత్మ అవినాశి. ఆత్మలైతే చాలా ఉన్నాయి. పైన నక్షత్రాలు ఉన్న విధంగా ఆత్మలు ఉన్నాయి. నక్షత్రాలు ఎక్కువగా ఉన్నాయా లేక ఆత్మలు ఎక్కువగా ఉన్నాయా? ఎందుకంటే మీరు భూమి పై ఉన్న నక్షత్రాలు, అవి ఆకాశములోని నక్షత్రాలు. మిమ్ములను దేవతలని అంటారు. వారైతే వాటిని కూడా దేవతలని అంటారు. మిమ్ములను అదృష్ట నక్షత్రాలని అంటారు కదా.
మంచిది, దీని గురించి తర్వాత పరస్పరములో చర్చించండి. బాబా ఈ విషయమును ఇప్పుడే ప్రస్తావించరు. సర్వాత్మల తండ్రి ఒక్కరే అని తండ్రి అర్థం చేయించారు. ఇతని బుద్ధిలో అయితే జ్ఞానమంతా ఉంది. మానవ మాత్రులందరికీ వారు తండ్రి. మొత్తం సృష్టి అంతా సముద్రము పై నిలబడి ఉందని అందరికీ తెలుసు. ఈ విషయము కూడా కొందరికి తెలియదు. సృష్టి అంతటా రావణ రాజ్యముందని తండ్రి అర్థం చేయించారు. రావణ రాజ్యము సాగర తీరములో లేదు. సముద్రమైతే నలువైపులా ఉంది. క్రింద ఎద్దు ఉంది, దాని కొమ్ముల పైన సృష్టి నిల్చొని ఉందని అంటారు కదా. అది అలసిపోయినప్పుడు కొమ్మును మార్చుకుంటుంది, అప్పుడు పాత ప్రపంచము సమాప్తమై కొత్త ప్రపంచము స్థాపనవుతుంది - శాస్త్రాలలో అయితే ఇలాంటి చాలా విషయాలను కట్టుకథలుగా వ్రాసేశారు. ఇక్కడ ఆత్మలన్నీ శరీరాలతో పాటు ఉన్నాయని పిల్లలు అర్థం చేసుకున్నారు. వీరిని జీవాత్మలని అంటారని పిల్లలకు తెలుసు. అది ఆత్మలందరి ఇల్లు. అక్కడ శరీరాలు ఉండవు. దానిని నిరాకార ప్రపంచమని అంటారు. జీవమునకు ఆకారమున్నందున సాకారమని అంటారు. నిరాకారునికి శరీరముండదు. ఇది సాకార సృష్టి, అది నిరాకార ఆత్మల ప్రపంచము. దీనిని సృష్టి అని అంటారు. దానిని నిరాకార ప్రపంచమని అంటారు. ఆత్మ శరీరములోకి వచ్చినప్పుడు కదలికలు జరుగుతాయి(చుర్‌పుర్‌ చల్తీ హై). ఆత్మ లేకపోతే శరీరము దేనికీ పనికి రాదు. కావున దానిని నిరాకార ప్రపంచమని అంటారు. ఉన్న ఆత్మలందరూ చివర్లో రావాలి. అందువలన దీనిని పురుషోత్తమ సంగమ యుగమని అంటారు. ఆత్మలందరూ ఇక్కడకు వచ్చినప్పుడు అక్కడ ఒక్కరు కూడా ఉండరు. అక్కడ పూర్తి ఖాళీ అయినప్పుడు అందరూ వాపస్‌ వెళ్తారు. మీరు నంబరువారు పురుషార్థానుసారము ఈ సంస్కారాన్ని తీసుకెళ్తారు. కొందరు జ్ఞాన సంస్కారాన్ని తీసుకెళ్తారు, కొందరు పవిత్ర సంస్కారాన్ని తీసుకెళ్తారు. మళ్లీ ఇక్కడికే రావాలి. కానీ మొదట ఇంటికి వెళ్లాలి. అక్కడ మంచి సంస్కారము ఉంటుంది. ఇక్కడ చెడు సంస్కారముంది. మంచి సంస్కారము మారి చెడు సంస్కారంగా అవుతుంది. యోగబలము ద్వారా చెడు సంస్కారము మళ్లీ మంచిగా అవుతుంది. మంచి సంస్కారాన్ని మళ్లీ అక్కడికి తీసుకెళ్తారు. తండ్రిలో కూడా చదివించే సంస్కారముంది కదా. అందువలన వారు వచ్చి చదివిస్తారు(అర్థం చేయిస్తారు). రచయిత, రచనల ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. బీజము గురించి కూడా అర్థం చేయిస్తారు. అలాగే వృక్షమంతటి జ్ఞానము కూడా అర్థం చేయిస్తారు. బీజము జ్ఞానము, వృక్షము భక్తి. భక్తిలో చాలా వివరాలు ఉంటాయి కదా. బీజమును స్మృతి చేయడం సహజము. అక్కడికే వెళ్లిపోవాలి. తమోప్రధానము నుండి సతోప్రధానంగా అయ్యేందుకు కొద్ది సమయమే పడ్తుంది. మళ్లీ సతోప్రధానము నుండి తమోప్రధానంగా అయ్యేందుకు ఖచ్ఛితంగా 5 వేల సంవత్సరాలు పడ్తుంది. ఇది చాలా ఖచ్ఛితంగా తయారైన చక్రము. అది పునరావృతమౌతూ ఉంటుంది. ఇతరులెవ్వరూ ఈ విషయాలు తెలుపలేరు. మీరు తెలుపగలరు. అర్ధము-అర్ధము చేయబడ్తుంది. అర్ధము స్వర్గము, అర్ధము నరకము. తర్వాత వాటి వివరాలను కూడా తెలుపుతారు. స్వర్గములో తక్కువ జన్మలు, ఎక్కువ ఆయువు ఉంటుంది. నరకములో ఎక్కువ జన్మలు, ఆయువు తక్కువగా ఉంటుంది. అక్కడ యోగులుగా ఉంటారు, ఇక్కడ భోగులుగా ఉన్నారు. అందువలన ఇక్కడ చాలా జన్మలు ఉంటాయి. ఈ విషయాలు ఇతరులెవ్వరికీ తెలియదు. మనుష్యులకు కొంచెం కూడా తెలియదు. దేవతలు ఎప్పుడు ఉండేవారో, వారు ఎలా తయారయ్యారో, ఎంత తెలివిగలవారిగా అయ్యారో ఈ విషయాలన్నీ మీకు తెలుసు. తండ్రి ఈ సమయములో పిల్లలను చదివించి 21 జన్మల కొరకు వారసత్వము ఇస్తారు. ఆ తర్వాత ఈ సంస్కారము ఉండదు. తర్వాత దు:ఖ సంస్కారాలుంటాయి. రాజ్య సంస్కారమున్నప్పుడు ఈ జ్ఞానమును చదువుకునే సంస్కారము పూర్తి అవుతుంది. ఈ సంస్కారము పూర్తి అయితే నంబరువారు పురుషార్థానుసారము రుద్రమాలలో కూర్చబడ్తారు. మళ్లీ పాత్ర చేసేందుకు నంబరువారుగా వస్తారు. ఎవరైతే 84 జన్మలు పూర్తిగా తీసుకున్నారో వారు మొదట వస్తారు. వారి పేరు కూడా తెలుపుతారు. కృష్ణుడైతే స్వర్గానికి మొదటి రాకుమారుడు. రాజ్యములో కేవలం ఒక్కరే ఉండరని మీకు తెలుసు. రాజధాని అంతా ఉంటుంది కదా. రాజుతో పాటు ప్రజలు కూడా ఉండాలి. ఒకరి ద్వారా మరొకరు జన్మిస్తూ ఉంటారు. ఒకవేళ 8 మంది కలిసి వస్తారని చెప్పినా శ్రీ కృష్ణుడైతే మొదటి నంబరులో వస్తాడు కదా. 8 మంది కలిసి వస్తే కృష్ణునికి అంత మహిమ ఎందుకుంటుంది? ఈ విషయాలన్నీ పోను పోను అర్థము చేయిస్తాను. ఈ రోజు చాలా గుహ్యమైన విషయాలను వినిపిస్తానని అంటారు కదా. అనగా ఏదో కొంత మిగిలి ఉందని కదా! సర్వీసు చేస్తున్న సమయములో ఎవరికైనా అర్థము కాకుంటే మా పెద్ద అక్కయ్య సమాధానము ఇవ్వగలరని లేక ఇంతవరకు తండ్రి ఇంకా అర్థం చేయించలేదని యుక్తిగా చెప్పండి. రోజురోజుకు అతిగుహ్యమైన విషయాలను వినిపిస్తారు. ఇలా చెప్పడంలో సిగ్గుపడే విషయమేదీ లేదు. గుహ్యాతి గుహ్యమైన విషయాలు వినిపించినప్పుడు మీరు విని చాలా సంతోషిస్తారు. చివర్లో మన్మనాభవ, మధ్యాజీభవ అని అనేస్తారు. ఈ పదాలను కూడా శాస్త్రాలను తయారు చేయువారే వ్రాశారు. ఇందులో తికమకపడే అవసరము లేదు. కొడుకు తండ్రివానిగా అవ్వడంతోనే బేహద్‌ సుఖము లభించింది. ఇందులో మనసా, వాచా, కర్మణా పవిత్రత అవసరము. లక్ష్మినారాయణులకు తండ్రి వారసత్వం లభించింది కదా. వీరు మొదటి నంబరులో ఉన్నారు, వీరికే పూజలు జరుగుతాయి. మాలో ఇలాంటి గుణాలున్నాయా? అని స్వయాన్ని చూసుకోండి. ఇప్పుడైతే గుణహీనులుగా ఉన్నారు కదా. తమలో ఉన్న అవగుణాలను గురించి ఎవ్వరికీ తెలియదు.
మీరిప్పుడు తండ్రివారిగా అయ్యారు కనుక తప్పకుండా పరివర్తనవ్వాలి. తండ్రి బుద్ధి తాళమును తెరిచారు. బ్రహ్మ, విష్ణువుల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. ఇతను పతితుడు, అతను పావనుడు. ఈ సంగమ యుగములోనే దత్తత తీసుకోవడం జరుగుతుంది. ప్రజాపిత బ్రహ్మ ఉన్నప్పుడే దత్తు తీసుకుంటారు. సత్యయుగములో దత్తత ఉండదు. ఇక్కడ కూడా ఎవరికైనా పిల్లలు లేకుంటే దత్తత తీసుకుంటారు. ప్రజాపితకు కూడా బ్రాహ్మణ పిల్లలు తప్పకుండా కావాలి. వీరు ముఖవంశావళి, వారు కుఖవంశావళి. బ్రహ్మ అయితే చాలా ప్రసిద్ధి చెందారు. ఇతని ఇంటి పేరే బేహద్‌గా ఉంది. ప్రజాపిత బ్రహ్మ ఆదిదేవుడని, అతడిని ఆంగ్లములో గ్రేట్‌ గ్రేట్‌ గ్రాండ్‌ఫాదర్‌ అని అంటారని అందరికీ తెలుసు. ఇది బేహద్‌ ఇంటి పేరు. అవన్నీ హద్దుగా ఉన్న ఇంటి పేర్లు. అందువలన భారతదేశము చాలా గొప్ప తీర్థ స్థానమని, ఇక్కడ బేహద్‌ తండ్రి వచ్చారనే విషయము అందరికీ తప్పకుండా తెలియాలని తండ్రి చెప్తున్నారు. అలాగని మొత్తం భారతదేశములో విరాజమానమయ్యారని కాదు. శాస్త్రాలలో మగధ దేశమని వ్రాశారు. కానీ జ్ఞానాన్ని ఎక్కడ నేర్పించారు? ఆబూలో ఎలా వచ్చారు? దిల్వాడా మందిరములో కూడా జ్ఞాపక చిహ్నము పూర్తిగా ఉంది. తయారుచేసిన వారి బుద్ధికి ఏది వస్తే దానిని కూర్చుని తయారు చేయించారు. ఖచ్ఛితమైన నమూనానైతే తయారు చేయలేరు. తండ్రి ఇక్కడనే వచ్చి అందరికి సద్గతినిస్తారు. మగధ దేశములో కాదు. అది పాకిస్తాన్‌, ఇది పాక్‌(పవిత్రమైన) స్థానము. వాస్తవానికి పవిత్రమైన స్థానమును స్వర్గమని అంటారు. పవిత్రత, అపవిత్రత గురించే ఈ మొత్తం డ్రామా అంతా తయారు చేయబడింది.
కావున మధురాతి మధురమైన తప్పిపోయి దొరికిన పిల్లలారా! - ఆత్మలు, పరమాత్మ చాలాకాలంగా వేరుగా ఉన్నారని,............ (ఆత్మాయే పరమాత్మా అలగ్‌ రహే బహుకాల్‌.........) మీరు అర్థం చేసుకున్నారు. ఎంత కాలము తర్వాత కలుసుకున్నారు? మళ్లీ ఎప్పుడు కలుసుకుంటారు? సద్గురువు దళారి రూపములో లభించినప్పుడు సుందర కలయిక చేశారు. గురువులైతే చాలామంది ఉన్నారు కదా. అందువలన సద్గురువని అంటారు. స్త్రీకి కంకణము కట్టినప్పుడు - ఇతను నీకు పతి, గురువు, ఈశ్వరుడని కూడా చెప్తారు. కానీ ఆ పతియే మొట్టమొదట అపవిత్రంగా చేస్తాడు. నేటి ప్రపంచములో చాలా అశుద్ధత, మురికి ఉంది. పిల్లలైన మీరిప్పుడు పుష్పాలుగా అవ్వాలి. పిల్లలైన మీకు తండ్రి చాలా పక్కాగా కంకణమును కడ్తారు.
మీకు శివజయంతితో పాటే రక్షాబంధనము కూడా జరుగుతుంది. గీతాజయంతి కూడా జరగాలి. కృష్ణ జయంతి తర్వాత కాస్త ఆలస్యంగా కొత్త ప్రపంచములో జరిగింది. ఇక పండుగలన్నీ ఈ సమయములోనివే. రామనవమి ఎప్పుడు జరిగిందో ఎవరికైనా తెలుసా? కొత్త ప్రపంచములో 1250 సంవత్సరాల తర్వాత రామనవమి జరుగుతుందని మీరంటారు. శివజయంతి, కృష్ణ జయంతి, రామ జయంతి,............ ఎప్పుడు జరిగిందో ఎవ్వరూ తెలుపలేరు. పిల్లలైన మీరు కూడా ఇప్పుడే తండ్రి ద్వారా తెలుసుకున్నారు. మీరు ఖచ్ఛితంగా తెలుపగలరు. అనగా ప్రపంచమంతటి జీవిత కథను మీరు తెలుపగలరు. లక్షల సంవత్సరాల విషయాన్ని తెలుపలేరు. బేహద్‌ చదువును తండ్రి ఎంత బాగా చదివిస్తున్నారు! ఒకేసారి మీరు 21 జన్మల వరకు నగ్నంగా అవ్వడం నుండి సురక్షితమవుతారు. మీరిప్పుడు పంచ వికారాలనే రావణుని పరాయి రాజ్యములో ఉన్నారు. ఇప్పుడు 84 జన్మల చక్రమంతా మీ స్మృతిలోకి వచ్చింది. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. బేహద్‌(అనంతమైన) సుఖమును పొందేందుకు మనసా, వాచా, కర్మణా తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. యోగబలము ద్వారా మంచి సంస్కారాన్ని ధారణ చేయాలి. స్వయాన్ని గుణవంతులుగా చేసుకోవాలి.
2. సదా సంతోషంగా ఉండేందుకు తండ్రి ప్రతిరోజు వినిపించే గుహ్యమైన విషయాలను వినాలి, ఇతరులకు వినిపించాలి. ఏ విషయములోనూ తికమక పడరాదు. యుక్తిగా సమాధానము చెప్పాలి. సిగ్గుపడరాదు.

వరదానము :- '' స్వమానమనే సీటు పై స్థితమై ఉండి శక్తులను ఆజ్ఞానుసారము నడిపించే విశాల బుద్ధి భవ ''
మీ విశాల బుద్ధి ద్వారా సర్వ శక్తుల రూపి సేవాధారులను సమయానికి కార్యములో ఉపయోగించండి. పరమాత్మ ద్వారా డైరక్టుగా లభించిన ఏ టైటిల్స్‌ అయితే ఉన్నాయో వాటి నశాలో ఉండండి. స్వమాన స్థితి రూపి సీటు పై స్థితమై ( సెట్‌ అయ్యి ) ఉంటే సర్వ శక్తులు సేవ కొరకు సదా హాజరుగా ఉన్నాయని అనుభవమవుతుంది. మీ ఆజ్ఞ కొరకు వేచి ఉంటాయి. కనుక వరదానము మరియు వారసత్వాలను కార్యములో ఉపయోగించండి. యజమానిగా, యోగయుక్తముగా అయ్యి యుక్తియుక్తముగా సేవాధారుల నుండి సేవ తీసుకుంటే సదా రాజీగా(సంతోషంగా) ఉంటారు, పదే పదే అర్జీలు వేయకండి.

స్లోగన్‌ :- '' ఏ కార్యాన్ని అయినా ప్రారంభించేందుకు ముందు విశేషంగా '' సఫలత శ్రేష్ఠ బ్రాహ్మణాత్మ అయిన నా జన్మ సిద్ధ అధికారము '' అనే స్మృతిని ఎమర్జ్‌ చేయండి. ''

Sunday, 22 September 2019

Telugu Murli 23/09/2019

23-09-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - జ్ఞాన మూడవ నేత్రము సదా తెరవబడి ఉన్నట్లయితే సంతోషంలో తన్మయులైపోతారు (సంతోషముతో రోమాలు నిక్కబొడుచుకుంటాయి), ఖుషీ పాదరస మట్టము సదా పెరిగే ఉంటుంది''

ప్రశ్న :- ఈ సమయములో మానవుల దృష్టి చాలా బలహీనంగా ఉంది, అందువలన వారికి అర్థం చేయించే యుక్తి ఏది ?
జవాబు :- బాబా చెప్తున్నారు - మీరు ఎటువంటి పెద్ద పెద్ద చిత్రాలను తయారు చేయాలంటే మనుష్యులు దూరము నుండి చూసినా వెంటనే అర్థము చేసుకోగలగాలి. ఈ సృష్టి చక్ర చిత్రము చాలా పెద్దదిగా ఉండాలి. ఇది(సృష్టి చక్రము) అంధుల ఎదుట దర్పణము.

ప్రశ్న :- పూర్తి ప్రపంచాన్ని స్వచ్ఛంగా చేసేందుకు మీకు ఎవరు సహయోగులుగా అవుతారు ?
జవాబు :- ఈ ప్రకృతి వైపరీత్యాలు మీకు సహయోగులుగా అవుతాయి. ఈ అనంతమైన ప్రపంచాన్ని శుభ్రపరచేందుకు ఎవరిదైనా సహయోగము తప్పకుండా కావాలి.

ఓంశాంతి. తండ్రి ద్వారా ఒక్క క్షణములో వారసత్వము అనగా జీవన్ముక్తి లభిస్తుందని గాయనము కూడా ఉంది. మిగిలిన వారందరూ జీవన బంధనములో ఉన్నారు. ఈ త్రిమూర్తి చిత్రము, సృష్టిచక్ర చిత్రాలు చాలా ముఖ్యమైనవి. ఇవి చాలా పెద్ద పెద్దవిగా ఉండాలి. అంధులకైతే పెద్ద దర్పణము కావాలి, అది బాగా కనిపించే విధంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అందరి దృష్టి బలహీనంగా ఉంది, బుద్ధి తక్కువగా ఉంది. బుద్ధి అని మూడవ నేత్రమును అంటారు. మీ బుద్ధిలో ఇప్పుడు సంతోషముంది. సంతోషంతో పులకించకపోతే శివబాబాను స్మృతి చేయనట్లే. అనగా వారి జ్ఞాన మూడవ నేత్రము కొద్దిగానే తెరుచుకుంది, మసకగా ఉంది. ఎవరికైనా సంక్షిప్తంగా అర్థం చేయించాలి. తండ్రి చెప్తున్నారు - పెద్ద పెద్ద మేళాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. వాస్తవానికి సర్వీసు చేసేందుకు ఒక్క చిత్రము సరిపోతుందని పిల్లలకు తెలుసు. భలే సృష్టి చక్ర చిత్రము ఒక్కటే ఉన్నా పర్వాలేదు. తండ్రి, డ్రామా, కల్ప వృక్షము, 84 జన్మల చక్ర రహస్యాన్ని తండ్రి అర్థం చేయిస్తారు. బ్రహ్మ ద్వారా తండ్రి ఇచ్చే ఈ వారసత్వము లభిస్తుంది. ఇది కూడా చాలా స్పష్టంగా ఉంది. ఈ చిత్రములోనే అన్నీ వచ్చేస్తాయి, ఇన్ని చిత్రముల అవసరమే లేదు, ఈ రెండు చిత్రాలే చాలా పెద్ద పెద్ద అక్షరాలు కలిగి ఉండాలి. వ్రాత కూడా ఉండాలి. జీవన్ముక్తి, వినాశనానికి ముందే గాడ్‌ ఫాదర్‌ నుండి లభించే జన్మ సిద్ధ అధికారము. వినాశనము కూడా తప్పకుండా జరగాల్సిందే. డ్రామా ప్లాను అనుసారము వారంతట వారే అర్థం చేసుకుంటారు. మీరు అర్థం చేయించే అవసరము కూడా ఉండదు. అనంతమైన తండ్రి ద్వారా ఈ అనంతమైన వారసత్వము లభిస్తుంది. ఇది బాగా పక్కాగా గుర్తుండాలి. కానీ మాయ మీరు మర్చిపోయేలా చేస్తుంది. సమయము గడిచిపోతూ ఉంటుంది. చాలా గడిచిపోయింది, కొద్దిగా మిగిలి ఉంది,.............(బహుత్‌ గయీ థోడీ రహీ,..........) అని గాయనము కూడా ఉంది కదా! దీని అర్థం ఈ సమయానికి చెందినదే. ఇక కొద్ది సమయం మాత్రమే ఉంది. స్థాపన జరుగుతూనే ఉంది. వినాశనానికి కొద్ది సమయము మాత్రమే ఉంది. కొద్దిలో కూడా కొద్దిగానే ఉంటుంది. తర్వాత ఏమవుతుంది? అని ఆలోచిస్తారు. ఇప్పుడైతే మేలుకోరు, తర్వాత మేలుకుంటూ ఉంటారు, కళ్లు పెద్దవిగా అవుతూ ఉంటాయి. ఈ స్థూలమైన కళ్లు కాదు, బుద్ధి రూపీ కళ్లు. చిన్న-చిన్న చిత్రాలతో అంత మజా కలగదు, పెద్ద పెద్దవి తయారవుతూ ఉంటాయి. విజ్ఞానము కూడా చాలా సహయోగము చేస్తుంది. వినాశనంలో తత్వాలు కూడా చాలా సహాయము చేస్తాయి. ఏ ఖర్చు లేకుండా మీకు అవి ఎంత సహాయము చేస్తాయి! మీ కొరకు పూర్తిగా శుభ్రము చేస్తాయి. ఇది చాలా ఛీ-ఛీ ప్రపంచము. అజ్మీర్‌లో స్వర్గపు స్మారకముంది, ఇక్కడ దిల్‌వాడా మందిరములో స్థాపన స్మృతిచిహ్నముంది. కానీ కొంచెము కూడా అర్థం చేసుకోరు. మీరు ఇప్పుడు తెలివిగలవారిగా అయ్యారు. భలే మనుష్యులు వినాశనము ఎప్పుడు జరుగుతుందో మాకు తెలియదు, అర్థం కావడం లేదని అంటూ ఉంటారు. పులి వచ్చింది, పులి వచ్చింది, పులి వచ్చింది అని చెప్పినా వారు నమ్మలేదు, ఒక రోజు పులి వచ్చి అన్ని ఆవులను తినిపోయిందని ఒక కథ(నాన్న - పులి కథ) ఉంది కదా! మీరు కూడా ఈ పాత ప్రపంచము వినాశనము అవ్వనే అవుతుంది, సమయం చాలా అయిపోయింది, కొద్దిగా మాత్రమే మిగిలి ఉంది అని చెప్తూ ఉంటారు.
ఈ జ్ఞానమంతా పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి. ఆత్మయే ధారణ చేస్తుంది. ఆత్మలో తండ్రి జ్ఞానం కూడా ఉంది. ఎప్పుడైతే వారు శరీరాన్ని ధరిస్తారో, అప్పుడు జ్ఞానమునిస్తారు. వారిలో జ్ఞానముంది అందుకే నాలెడ్జ్‌ఫుల్‌ గాఢ్‌ఫాదర్‌ అని అంటారు. వారికి మొత్తం సృష్టి ఆదిమధ్యాంతాలు తెలుసు. స్వయం గురించి అయితే తెలుసు కదా, అంతేకాక సృష్టి చక్రము ఎలా తిరుగుతుందనే జ్ఞానము కూడా ఉంది. అందువలన ఆంగ్లములోని నాలెడ్జ్‌ఫుల్‌ అను పదము చాలా బాగుంది. వారు మానవ సృష్టి రూపి వృక్షానికి బీజ రూపము కనుక వారిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. నంబరువారు పురుషార్థానుసారముగా మీకు తెలుసు. శివబాబా నాలెడ్జ్‌ఫుల్‌, ఇది బుద్ధిలో చాలా బాగా ఉండాలి. అలాగని అందరి బుద్ధిలో ఒకే విధంగా ధారణ అవుతుందని కాదు. భలే వ్రాసుకుంటారు కానీ ధారణ కొద్దిగా కూడా లేదు. నామమాత్రంగా వ్రాస్తారు కానీ ఎవ్వరికీ తెలుపలేరు. కేవలం కాగితానికి చెప్తారు. కాగితము ఏం చేస్తుంది? కాగితము ద్వారా ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఈ చిత్రాల ద్వారా చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఇది చాలా గొప్ప జ్ఞానము. కావున అక్షరాలు కూడా పెద్ద పెద్దవిగా ఉండాలి. పెద్ద పెద్ద చిత్రాలను చూచి మనుష్యులు ఇందులో తప్పకుండా సారముందని భావిస్తారు. స్థాపన, వినాశనము కూడా వ్రాయబడి ఉన్నాయి. ఇప్పుడు రాజధాని స్థాపన తండ్రి ఇచ్చే జన్మ సిద్ధ అధికారము. అందరూ జీవన బంధనములో ఉన్నారు, వీరిని జీవన బంధనము నుండి జీవన్ముక్తిలోకి ఎలా తీసుకెళ్లాలి? అని పిల్లలు ఆలోచిస్తూ ఉండాలి. మొదట శాంతిధామానికి తర్వాత సుఖధామానికి వెళ్తారు. సుఖధామాన్ని జీవన్ముక్తిధామము అని అంటారు. ఈ చిత్రాలను ప్రత్యేకించి పెద్దవిగా చేయించాలి. ముఖ్యమైన చిత్రాలు కదా. చాలా పెద్ద పెద్ద అక్షరాలుంటే బ్రహ్మకుమారీలు ఇంత పెద్ద చిత్రాలను తయారుచేశారు కావున తప్పకుండా ఇందులో కొంత జ్ఞానముందని మానవులు అంటారు. అందువలన అచ్చటచ్చటా మీ పెద్ద పెద్ద చిత్రాలుంటే ఇవి ఏమిటి? అని అడుగుతారు. మీరు అర్థం చేసుకునేందుకే తయారు చేయించామని చెప్పండి. ఇందులో స్పష్టంగా, వీరికి బేహద్‌ వారసత్వము ఉండేదని వ్రాయబడి ఉంది. ఇది నిన్నటి విషయమే, ఈ రోజు వారు లేరు. ఎందుకంటే 84 జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ క్రిందకు వచ్చేశారు. సతోప్రధానంగా ఉన్నవారు తమోప్రధానంగా అయ్యే తీరాలి. జ్ఞానము మరియు భక్తి, పూజ్యులు మరియు పూజారుల ఆట కదా. అది సగము - ఇది సగముగా పూర్తి ఆట తయారు చేయబడింది. కావున ఇలాంటి పెద్ద పెద్ద చిత్రాలను తయారు చేయించేదుకు ధైర్యముండాలి. సర్వీసు చేసే ఆసక్తి కూడా ఉండాలి. ఢిల్లీలో అయితే మూల మూలలా సర్వీసు చేయాలి. ఉత్సవాలకు, తిరునాళ్లకు చాలామంది వెళ్తూ ఉంటారు. అక్కడ మీకు ఈ చిత్రాలే పనికి వస్తాయి. త్రిమూర్తి, సృష్టి చక్ర చిత్రాలు ముఖ్యమైనవి. ఇవి చాలా బాగున్నాయి, గ్రుడ్డివారి ఎదుట దర్పణము వలె ఉన్నాయి. అంధులను చదివిస్తారు. చదివేది ఆత్మనే కదా. కానీ ఆత్మ అవయవాలు చిన్నవి, కావున వారిని చదివించేందుకు చిత్రాలు మొదలైన వాటిని చూపిస్తారు. కొద్దిగా పెరిగిన తర్వాత ప్రపంచ పటమును చూపిస్తారు. అప్పుడు పటమంతా బుద్ధిలో ఉంటుంది. ఇప్పుడు డ్రామా చక్రము, ఇన్ని ధర్మాలున్నాయి. నంబరువారుగా ఎలా వస్తారు, మళ్లీ ఎలా వెళ్లిపోతారు - ఇదంతా మీ బుద్ధిలో ఉంది. అక్కడైతే ఆదిసనాతన దేవీ దేవతా ధర్మమొక్కటే ఉంటుంది. దానిని స్వర్గము, హెవన్‌ అని అంటారు. తండ్రితో యోగము చేయడం వలన పతితంగా ఉన్న ఆత్మ పావనంగా అవుతుంది. భారతదేశ ప్రాచీన యోగము ప్రసిద్ధి చెందింది. యోగము అనగా స్మృతి, తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని చెప్తారు. నన్ను స్మృతి చేయమని లౌకిక తండ్రి చెప్పనవసరము లేదు. పిల్లలు స్వతహాగా తల్లి-తండ్రి అని అంటూ ఉంటారు. వారు లౌకిక తల్లి-తండ్రి, వీరు పారలౌకి తల్లిదండ్రులు. మీ కృప ద్వారా అపారమైన సుఖము ప్రాప్తిస్తుందని గాయనముంది. దు:ఖమున్నవారే పాడ్తారు. సుఖమున్నప్పుడు ఇలా అనే అవసరమే లేదు. దు:ఖము కలిగినప్పుడే అందరూ పిలుస్తారు. వీరే తల్లి - తండ్రి అని మీరిప్పుడు తెలుసుకున్నారు. తండ్రి అంటారు కదా - రోజురోజుకు మీకు గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తాను. తల్లి-తండ్రి అని ఎవరిని అంటారో ఇంతకుముందు తెలుసా? తండ్రి అని వారినే అంటారని మీకిప్పుడు తెలుసు. బ్రహ్మ ద్వారా తండ్రి వారసత్వము లభిస్తుంది. తల్లి కూడా కావాలి కదా. ఎందుకంటే పిల్లలను దత్తు తీసుకోవాలి. ఈ విషయాన్ని ఎవ్వరూ గమనించరు. కావున బాబా క్షణ-క్షణము చెప్తారు - ''మధురాతి మధురమైన పిల్లలారా, తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి.'' లక్ష్యము లభించింది. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్లండి. విదేశాలకు వెళ్లండి, 7 రోజుల కోర్సును చాలామంది తీసుకున్నారు. తండ్రి ద్వారా వారసత్వమును తీసుకోవలసిందే. స్మృతి చేయడం ద్వారానే ఆత్మ పావనమవుతుంది. స్వర్గానికి అధికారులుగా అవుతారు. ఈ లక్ష్యమును బుద్ధిలో ఉంచుకొని ఎక్కడికైనా వెళ్లండి. గీతా జ్ఞానమంతా ఈ బ్యాడ్జిలో ఉంది. ఏమి చేయాలని ఎవ్వరినీ అడిగే అవసరము కూడా లేదు. తండ్రి ద్వారా వారసత్వము తీసుకోవాలనుకుంటే తప్పకుండా తండ్రిని స్మృతి చేయాలి. మీరు ఈ వారసత్వమును తండ్రి ద్వారా అనేకసార్లు తీసుకున్నారు. డ్రామా చక్రము పునరావృతమవుతూ ఉంటుంది కదా. అనేకసార్లు మీరు టీచరు ద్వారా చదువుకొని ఏదో ఒక పదవిని పొందుతారు. చదువుకొను సమయములో బుద్ధియోగము టీచరుతో ఉంటుంది కదా. పరీక్ష చిన్నదైనా, పెద్దదైనా చదివేది ఆత్మయే కదా, వీరి ఆత్మ కూడా చదువుకుంటుంది. టీచరును, లక్ష్యమును స్మృతి చేయాలి. సృష్టి చక్రమును కూడా బుద్ధిలో ఉంచుకోవాలి. తండ్రిని, వారసత్వమును స్మృతి చేయాలి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. ఎంత ధారణ చేస్తారో, అంత ఉన్నత పదవిని పొందుతారు. బాబాను బాగా స్మృతి చేస్తూ ఉంటే మళ్లీ ఇక్కడికి వచ్చే అవసరమేముంది. అయినా ఇక్కడకు వస్తారు. ఇటువంటి ఉన్నతమైన తండ్రి, వీరి ద్వారా ఇంతటి అనంతమైన ఆస్తి లభిస్తుంది, వారితో కలుసుకునేందుకు రావాలి. మంత్రము తీసుకొని అందరూ వస్తారు. మీకైతే చాలా గొప్ప మంత్రము లభిస్తుంది. మొత్తం జ్ఞానమంతా మీ బుద్ధిలో మంచిరీతిగా ఉంది.
వినాశనమయ్యే సంపాదన కొరకు సమయాన్ని ఎక్కువగా వృథా చేయరాదని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. అది అంతా మట్టిలో కలిసిపోతుంది. తండ్రికి ఏమైనా కావాలా? ఏమీ అవసరము లేదు. ఖర్చు మొదలైనవి ఏం చేసినా మీ కొరకే చేస్తారు. ఇందులో పైసా కూడా ఖర్చు కాదు. యుద్ధము కొరకు ఫిరంగి గుండు లేక ట్యాంకులు ఏవీ కొనరు. మీరు యుద్ధము చేస్తున్నా ప్రపంచములో గుప్తంగా ఉన్నారు. మీ యుద్ధము ఎలా ఉందో చూడండి. దీనిని యోగబలము అని అంటారు, అంతా గుప్తంగా ఉంది. ఇందులో ఎవ్వరినీ చంపే అవసరము లేదు. మీరు కేవలం తండ్రిని స్మృతి చేయాలి. వీరందరి మృత్యువు డ్రామాలో నిర్ణయించబడి ఉంది. 5 వేల సంవత్సరాల తర్వాత మీరు యోగబలమును జమ చేసుకునేందుకు చదువుకుంటున్నారు. చదువు పూర్తైన తర్వాత క్రొత్త ప్రపంచములో ప్రాలబ్ధము లభించాలి. పాత ప్రపంచ వినాశనము కొరకు ఈ ప్రకృతి ప్రకోపాలు ఉపయోగపడ్తాయి. తమ కులమును ఎలా వినాశనము చేసుకుంటారో గాయనము కూడా ఉంది కదా. ఎంత పెద్ద కులము! అందులో మొత్తం యూరప్‌ అంతా వచ్చేస్తుంది. ఈ భారతదేశమైతే ఒక మూలలో ఉంది. మిగిలినదంతా సమాప్తమవ్వనున్నది. యోగబలము ద్వారా మీరు మొత్తం విశ్వమంతటి పై విజయము పొందుతారు, ఈ లక్ష్మీనారాయణుల వలె పవిత్రంగా కూడా అవ్వాలి. అక్కడ చెడు దృష్టే ఉండదు. పోను పోను మీకు చాలా సాక్షాత్కారాలవుతాయి, తమ దేశానికి సమీపంగా వస్తున్నందు వలన మళ్లీ వృక్షము కనిపిస్తుంది కదా. ఇప్పుడు మన ఇంటికి సమీపంగా చేరుకున్నామని సంతోషం కలుగుతుంది. మీరు కూడా ఇంటికి వెళ్లి మళ్లీ తమ సుఖధామానికి వస్తారు. ఇక కొద్ది సమయముంది, స్వర్గము నుండి వీడ్కోలు తీసుకొని ఎంత సమయమైపోయింది! మళ్లీ ఇప్పుడు స్వర్గము సమీపంగా వస్తోంది. మీ బుద్ధి పైకి వెళ్తుంది. అది నిరాకార ప్రపంచము, దానిని బ్రహ్మాండము అని కూడా అంటారు. మనము అక్కడ ఉండేవారము, ఇక్కడ 84 జన్మల పాత్ర చేశాము. ఇప్పుడు మనము ఇంటికి వెళ్తాము. పిల్లలైన మీరు ఆల్‌రౌండర్లు. మీరు ప్రారంభము నుండి వచ్చి 84 జన్మలు తీసుకుంటారు. ఆలస్యంగా వచ్చేవారిని ఆల్‌రౌండర్‌ అని అనరు. ఎక్కువలో ఎక్కువ, తక్కువలో తక్కువ ఎన్ని జన్మలు తీసుకుంటారో తండ్రి అర్థం చేయించారు. ఒక్క జన్మ కూడా తీసుకోవచ్చు. చివర్లో అందరూ వాపస్‌ వెళ్లిపోతారు. నాటము పూర్తి అయ్యింది, ఆట సమాప్తమయ్యింది. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - నన్ను స్మృతి చేయండి, అంతమతి సో గతిగా అవుతుంది. తండ్రి వద్దకు పరంధామానికి వెళ్లిపోతారు. దానిని ముక్తిధామము, శాంతిధామము అని అంటారు తర్వాత సుఖధామములోకి వెళ్తారు. ఇది దు:ఖధామము, పై నుండి ప్రతి ఒక్కరు సతోప్రధానంగా వస్తారు, తర్వాత సతో, రజో, తమోగుణాలలోకి వస్తారు. ఒక్క జన్మ తీసుకున్నవారు కూడా ఈ 4 స్థితులను పొందుతారు. పిల్లలకు ఎంత బాగా అర్థం చేయించినా స్మృతి చెయ్యరు. తండ్రిని మర్చిపోతారు, నంబరువారుగా ఉన్నారు కదా. నంబరువారు పురుషార్థానుసారము రుద్ర మాల తయారవుతుందని పిల్లలకు తెలుసు. ఈ రుద్ర మాల కోట్లమందిది. ఇది బేహద్‌ విశ్వమంతటి మాల. బ్రహ్మ నుండి విష్ణువు, విష్ణువు నుండి బ్రహ్మ. ఇద్దరి ఇంటి పేరును చూడండి, ప్రజాపిత బ్రహ్మ అన్నది బ్రహ్మ పేరు. అర్ధకల్పము తర్వాత రావణుడు వస్తాడు. దైవీ మతము తర్వాత ఇస్లామ్‌ ధర్మము,............... ఆదమ్‌- బీబీని కూడా స్మృతి చేస్తారు, స్వర్గాన్ని కూడా స్మృతి చేస్తారు. భారతదేశము స్వర్గంగా ఉండేది, పిల్లలు చాలా సంతోషంగా ఉండాలి. అనంతమైన తండ్రి, ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు, ఉన్నతాతి ఉన్నతమైన చదువును చదివిస్తాడు. తద్వారా ఉన్నతాతి ఉన్నతమైన పదవి లభిస్తుంది. అందరికంటే ఉన్నతమైన టీచరు, తండ్రియే. వారు టీచరుగానూ ఉన్నారు, తమతో పాటు తీసుకెళ్లే సద్గురువుగా కూడా ఉన్నారు. ఇలాంటి తండ్రిని ఎందుకు స్మృతి చెయ్యరు. ఖుషీ పాదరస మట్టము పైకెక్కి ఉండాలి. కానీ యుద్ధ మైదానములో ఉన్నారు, మాయ నిలువనివ్వదు. క్షణ-క్షణము పడిపోతూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, మీరు స్మృతి చేయడం వలన మాయాజీతులుగా అవుతారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తండ్రి ఏదైతే నేర్పిస్తారో దానిని అమలు చేయాలి, కేవలం కాగితము పై వ్రాసుకోరాదు. వినాశనానికి ముందే జీవన బంధనము నుండి జీవన్ముక్తి పదవిని ప్రాప్తి చేసుకోవాలి.
2. తమ సమయాన్ని వినాశి సంపాదన కొరకు ఎక్కువగా వృథా చేసుకోరాదు. ఎందుకంటే ఇదంతా మట్టిలో కలసిపోతుంది. అందువలన అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వము తీసుకోవాలి, దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి.

వరదానము :- '' అథారిటీగా అయ్యి సమయానికి సర్వ శక్తులను కార్యములో ఉపయోగించే మాస్టర్‌ సర్వశక్తివాన్‌ భవ ''
సర్వశక్తివంతుడైన తండ్రి ద్వారా ఏ శక్తులైతే ప్రాప్తించాయో వాటిని పరిస్థితులను బట్టి, సమయాన్ని బట్టి ఏ విధంగా మీరు కార్యములో ఉపయోగించాలనుకుంటారో అలా (అదే రూపంలో) ఈ శక్తులు మీ సహయోగులుగా అవ్వగలవు. ఈ శక్తులను లేక ప్రభువు వరదానాలను ఏ రూపంలో కావాలంటే ఆ రూపములో ధారణ చేయవచ్చు. ఇప్పుడిప్పుడే శీతలత రూపంలో, ఇప్పుడిప్పుడే కాల్చే (వికారాలను) రూపంలో ఉపయోగించవచ్చు, కేవలం సమయానికి కార్యములో ఉపయోగించే అథారిటీగా అవ్వండి. ఈ సర్వ శక్తులు మాస్టర్‌ సర్వశక్తివంతులైన మీ సేవాధారులు.

స్లోగన్‌ :- '' స్వ పురుషార్థము లేక విశ్వ కళ్యాణ కార్యములో ధైర్యమున్న చోట సఫలత ఉండనే ఉంటుంది.''

Saturday, 21 September 2019

Telugu Murli 22/09/2019

22-09-2019 ని అవ్యక్తబాప్‌దాదా కు ఓంశాంతి రివైజ్‌: 30-01-1985 మధువనము

'' మాయాజీతులు మరియు ప్రకృతిజీతులే స్వరాజ్య అధికారులు ''
ఈ రోజు నలువైపులా ఉన్న రాజ్యాధికారి పిల్లల రాజదర్బారును చూస్తున్నారు. నలువైపులా చాలాకాలం తర్వాత కలిసిన(అపురూపమైన) స్నేహితులైన, బేహద్‌ సేవాధారులైన, అనన్యమైన పిల్లలు ఉన్నారు. అటువంటి పిల్లలు ఇప్పుడు కూడా స్వరాజ్య అధికారి రాజదర్బారులో ఉపస్థితులై ఉన్నారు. బాప్‌దాదా ఇటువంటి యోగ్యులైన పిల్లలను, సదాకాలిక యోగీ పిల్లలను అతి నిర్మాణచిత్తులై, ఉన్నతమైన స్వమానములో ఉండే పిల్లలను చూసి హర్షితమవుతున్నారు. స్వరాజ్య దర్బారు మొత్తం కల్పంతటిలో అలౌకికమైనది, అన్ని దర్బారుల కంటే అతీతమైనది మరియు అతి ప్రియమైనది. స్వరాజ్య అధికారులు ప్రతి ఒక్కరూ విశ్వ జ్ఞానానికి పునాది, నూతన విశ్వానికి నిర్మాతలు. స్వరాజ్య అధికారులు ప్రతి ఒక్కరు ప్రకాశిస్తున్న దివ్య తిలకధారులు మరియు సర్వ విశేషతలతో ప్రకాశిస్తున్న అమూల్యమైన మణులతో అలంకరింపబడి ఉన్న కిరీటధారులు. దివ్య గుణాల మాలను ధారణ చేసి శ్రేష్ఠ స్థితి రూపి సింహాసనము పై ఉపస్థితులై ఉన్నారు. ఇటువంటి అలంకరింపబడిన రాజ్యాధికారులు దర్బారులో ఉపస్థితులై ఉన్నారు. ఇటువంటి రాజ్యదర్బారు బాప్‌దాదా ఎదురుగా ఉపస్థితమై ఉంది. ప్రతి స్వరాజ్య అధికారి ముందు ఎంతమంది దాస-దాసీలు ఉన్నారు? వారు ప్రకృతిజీతులు మరియు వికారాలను జయించినవారు. వికారాలు కూడా 5 ఉన్నాయి, ప్రకృతి తత్వాలు కూడా 5 ఉన్నాయి. కావున ప్రకృతి కూడా దాసిగా అయిపోయింది కదా! శత్రువులు సేవాధారులుగా అయిపోయారు. ఇలా ఆత్మిక నషాలో ఉండేవారు, వికారాలను కూడా పరివర్తన చేసి కామ వికారమును శుభభావన, శ్రేష్ఠకామనా స్వరూపంలోకి మార్చి సేవలో వినియోగించేవారు, ఇలా శత్రువులను సేవాధారులుగా చేసేవారు ప్రకృతి ఏ తత్వానికి వశీభూతులుగా అవ్వరు. కానీ ప్రతి తత్వమును తమో గుణి రూపము నుండి సతోప్రధాన స్వరూపంగా చేసుకుంటారు. కలియుగములో ఈ తత్వాలు మోసగిస్తాయి మరియు దు:ఖమునిస్తాయి, సంగమ యుగములో పరివర్తన అవుతాయి, రూపాన్ని మార్చుకుంటాయి. సత్యయుగములో ఈ పంచ తత్వాలు దేవతలకు సుఖసాధనాలుగా అయిపోతాయి. ఈ సూర్యుడు మీకు భోజనాన్ని తయారుచేసే వంటవానిగా అవుతాడు కదా, ఈ వాయువు మీకు ప్రకృతి సిద్ధమైన పంఖా(ఫ్యాన్‌)గా అయిపోతుంది, మీ మనోరంజన సాధనంగా అవుతుంది. వాయువు వీచినప్పుడు వృక్షాలు కదులుతాయి, అప్పుడు వాటి కొమ్మలు, రెమ్మలు ఎలా ఊగుతాయంటే అవి ఊగడం వలన రకరకాల సంగీత వాయిద్యాల వలే స్వతహాగా మ్రోగుతూ ఉంటాయి. కనుక అది మనోరంజన సాధనంగా అయిపోయింది కదా! ఈ ఆకాశము మీ అందరి కొరకు రాజమార్గంగా అవుతుంది. విమానాలు ఎక్కడ నడిపిస్తారు? ఈ ఆకాశమే మీ మార్గముగా అవుతుంది. ఇంతకన్నా పెద్ద హైవే(రాజమార్గము) ఇంకెక్కడైనా ఉందా? విదేశాలలో ఉందా? ఎన్ని మైళ్ళ విస్తారముతో తయారు చేసినా ఆకాశ మార్గాని కంటే చిన్నదిగానే ఉంటుంది కదా! ఇంత పెద్ద హైవే మార్గము ఇంకేదైనా ఉందా? అమెరికాలో ఉందా? అది ప్రమాద రహిత మార్గముగా ఉంటుంది. 8 సంవత్సరాల బాలుడు నడిపినా క్రింద పడడు(ప్రమాదము జరగదు). అర్థమయ్యిందా! ఈ జలము సుగంధ ద్రవ్యముగా(సెంటుగా) పని చేస్తుంది. ఎలాగైతే వనమూలికల కారణంగా గంగాజలము ఈనాటికి కూడా ఇతర జలాల కంటే పవిత్రంగా ఉందో, అదే విధంగా సుగంధ భరితమైన మూలికల కారణంగా జలములో ప్రకృతి సిద్ధమైన సుగంధము ఉంటుంది. ఎలాగైతే ఇక్కడ పాలు శక్తినిస్తాయో, అక్కడి జలమే శక్తిశాలిగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. అందుకే పాల నదులు ప్రవహిస్తాయని అంటారు. అందరూ ఇప్పటి నుండే సంతోషపడిపోతున్నారు కదా! అలాగే ఈ పృధ్వి ఎటువంటి శ్రేష్ఠమైన ఫలాలు ఇస్తుందంటే ఎటువంటి రకరకాల రుచులను కోరుకుంటే అటువంటి రుచుల ఫలాలు మీ ముందు హాజరై ఉంటాయి. ఈ ఉప్పు ఉండదు, పంచదార కూడా ఉండదు. ఎలాగైతే ఇప్పుడు పులుపు కోసం టమోటా ఉందో, దాని ద్వారా పులుపుదనం వచ్చేస్తుందో, అలా మీకు ఏ రుచి కావాలనుకుంటే అటువంటి ఫలాలు ఉంటాయి. ఆ రసాన్ని వేస్తూనే ఆ రుచి వచ్చేస్తుంది. కావున ఈ పృధ్వి - ఒకటేమో శ్రేష్ఠమైన ఫలాలను, శ్రేష్ఠమైన ఆహారమును ఇచ్చే సేవ చేస్తుంది, రెండవది - సహజ సిద్ధమైన దృశ్యాలు వేటినైతే ప్రకృతి అని అంటారో ఆ ప్రాకృతిక దృశ్యాలు ఉంటాయి. పర్వతాలు కూడా ఉంటాయి. ఇలా నిటారుగా ఉండే పర్వతాలు ఉండవు. ప్రకృతి సౌందర్యంతో కూడుకున్న భిన్న-భిన్న రూపాలలో పర్వతాలు ఉంటాయి. కొన్ని పక్షి రూపంలో, మరికొన్ని పుష్పాల రూపంలో ఉంటాయి. ఇలాంటి ప్రకృతి సిద్ధమైన నిర్మాణం కలిగి ఉంటాయి. కేవలం నిమిత్తమాత్రంగా కొద్దిగా చేయి వేయవలసి ఉంటుంది. ఇలా ఈ పంచ తత్వాలు సేవాధారులుగా అయిపోతాయి. కానీ ఎవరికి సేవాధారులుగా అవుతాయి? స్వరాజ్య అధికారి ఆత్మలకు సేవాధారులుగా అవుతాయి. కావున ఇప్పుడు స్వయాన్ని పరిశీలించుకోండి - పంచ వికారాలు శత్రువుల నుండి మారి సేవాధారులుగా అయ్యాయా? అప్పుడే స్వరాజ్య అధికారులని పిలవబడ్తారు. క్రోధాగ్ని - యోగాగ్నిగా మారిపోవాలి. అలాగే లోభమనే వికారము - లోభమనగా కోరిక. కావాలి అనే హద్దు కోరిక నుండి శుభ కామనగా అయిపోవాలి. నేను సదా ప్రతి సంకల్పము ద్వారా, వాక్కు ద్వారా, నిస్వార్థమైన బేహద్‌ సేవాధారిగా అయిపోవాలి. నేను తండ్రి సమానంగా అయిపోవాలనే శుభమైన కోరిక అనగా లోభము యొక్క పరివర్తన స్వరూపము. దీనిని శత్రుత్వానికి బదులు సేవాకార్యములో వినియోగించండి. మోహమైతే అందరికి చాలా ఉంది కదా! బాప్‌దాదా పైనైతే మోహముంది కదా! ఒక్క సెకను కూడా దూరంగా ఉండకూడదని భావించడం కూడా మోహమే కదా! కానీ ఈ మోహము సేవ చేయిస్తుంది. మీ నయనాలలోకి ఎవరు చూసినా వారు మీ నయనాలలో ఇమిడి ఉన్న తండ్రిని చూడాలి. ఏం మాట్లాడినా నోటి ద్వారా తండ్రి అమూల్యమైన మాటలనే వినపడాలి. కావున మోహ వికారము కూడా సేవలో వినియోగించబడింది కదా! పరివర్తన అయ్యింది కదా! అదే విధంగా అహంకారము కూడా - ఈ దేహాభిమానుల నుండి ఆత్మాభిమానులుగా అయిపోతారు. శుభమైన అహంకారము అనగా ఆత్మనైన నేను విశేషాత్మగా అయిపోయాను, పదమాపదమ్‌ భాగ్యశాలిగా అయిపోయాను, నిశ్చింత చక్రవర్తిగా అయిపోయాను అన్నదే శుభ అహంకారము. శుభ అహంకారము ఈశ్వరీయ నషా. ఇది సేవకు నిమిత్తంగా అయిపోతుంది. కావున ఈ విధంగా 5 వికారాలు మారి సేవా సాధనాలుగా అయిపోతే శత్రువుల నుండి సేవాధారులుగా అయిపోయినట్లే కదా! కావున మాయాజీతులుగా, ప్రకృతిజీతులుగా ఎంతవరకు అయ్యారని చెక్‌ చేసుకోండి. ఎప్పుడైతే మొదట దాస-దాసీలు అవుతారో, అప్పుడు రాజులుగా అవుతారు. ఎవరైతే స్వయం దాసులకు అధీనులుగా ఉంటారో వారు రాజ్యాధికారులుగా ఎలా అవుతారు?
ఈ రోజు భారతదేశ పిల్లల మేళా ప్రోగ్రాం అనుసారంగా చివరిరోజు. కావున ఇది మేళాలోని అంతిమ మునక. దీనికి మహత్వముంటుంది. ఈ మహత్వపూర్ణమైన రోజున ఆ మేళాలోకి వెళ్ళినప్పుడు పాపాలేవైతే మిగిలి ఉన్నాయో వాటన్నిటినీ భస్మం చేసి, సమాప్తం చేసి వెళ్తున్నామని భావిస్తారు. కావున అందరూ పంచ వికారాలను సదాకాలానికి సమాప్తం చేసే సంకల్పము చేయాలి. ఇది అంతిమ మునకకు గల మహత్వము. కావున అందరూ పరివర్తనవ్వాలనే దృఢ సంకల్పము చేశారా? వదలడం కాదు, పరివర్తన చెందాలి. శత్రువు మీకు సేవాధారిగా అయినట్లయితే మీకు శత్రువు ఇష్టమా లేక సేవాధారి ఇష్టమా? కావున ఈ రోజు చెక్‌ చేసుకొని చేంజ్‌ అవ్వండి. అదే మిలనమేళాకు గల మహత్వము. ఏం చేయాలో అర్థమయ్యిందా! నాలుగైతే సరిగ్గానే ఉన్నాయి, మిగిలిన ఒక్కటి నడుస్తుందిలే అని భావించకండి. ఆ ఒక్కటి నాల్గింటినీ మళ్ళీ తీసుకొస్తుంది. వీటిలో కూడా పరస్పర స్నేహముంది. అందుకే రావణుని తలలు జతలో తోడుగా ఉన్నట్లు చూపిస్తారు. కనుక దశరాను జరుపుకొని వెళ్ళండి. అంత్యము చేసి, కాల్చి వేసి, బూడిదను మీతో తీసుకెళ్లకండి. బూడిదను తీసుకెళ్లినా మళ్ళీ అది భూతంగా అయ్యి వస్తుంది. కావున దానిని కూడా జ్ఞానసాగరంలో సమాప్తంచేసి వెళ్ళండి. మంచిది.
ఇటువంటి సదా స్వరాజ్య అధికారులకు, అలౌకిక తిలకధారులకు, కిరీటధారులకు, పక్రృతిని దాసిగా తయారుచేసుకునే వారికి, 5 శతువ్రులను సేవాధారులుగా చేసుకునే వారికి, సదా నిశ్చింత చకవ్రర్తులకు, ఆత్మిక నశాలో ఉండే చకవ్రర్తులకు, తండి సమానమైన సదా విజయులైన పిల్లలకు బాప్‌దాదాల పియ్రస్మృతులకు మరియు నమస్తే.
కుమారీలతో అవ్యక్త బాప్‌దాదా కలయిక :-
1. అందరూ స్వయాన్ని శ్రేష్ఠ కుమారీలుగా అనుభవం చేసుకుంటున్నారా? సాధారణంగా కుమారీలు ఉద్యోగము అనే గంపనైనా ఎత్తుకుంటారు లేక దాసిగా అయినా అయిపోతారు. కాని శ్రేష్ఠ కుమారీలు విశ్వకళ్యాణకారులుగా అయిపోతారు. మీరు ఇటువంటి శ్రేష్ఠ కుమారీలే కదా! మీ జీవితములో శ్రేష్ఠమైన లక్ష్యము ఏది? సాంగత్య దోషము నుండి లేక సంబంధాల బంధనాల నుండి ముక్తులవ్వడమే కదా! బంధనంలో బంధింపబడేవారు కారు. ఏం చేయాలి బంధనాలున్నాయి, ఏం చేయాలి ఉద్యోగం చేయాలి అనేవారినే బంధనాలు గలవారని అంటారు. కనుక కుమారీలకు సంబంధాల బంధనమూ లేదు, ఉద్యోగమనే గంప ఎత్తుకునే బంధనమూ లేదు. ఈ రెండు బంధనాల నుండి అతీతంగా ఉన్నవారే తండ్రికి ప్రియమైనవారుగా అవుతారు. ఇలా నిర్బంధనులుగా ఉన్నారా? రెండు జీవితాలు మీ ముందు ఉన్నాయి. సాధారణ కుమారీల భవిష్యత్తు మరియు విశేష కుమారీల భవిష్యత్తు. రెండూ మీ ముందు ఉన్నాయి కావున రెండింటినీ చూసి స్వయమే నిర్ణయించుకోవచ్చు. ఎలా చెప్తే అలా చేస్తామని కాదు. మీ నిర్ణయాన్ని మీరే జడ్జిగా అయ్యి తీసుకోండి. శ్రీమతమైతే విశ్వకళ్యాణకారులుగా అవ్వండనే చెప్తుంది. అదైతే సరియైనదే కానీ శ్రీమతం జత జతలో మానసిక ఉల్లాసంతో ఎవరైతే ముందుకు వెళ్తారో వారు సదా సహజంగా ముందుకు వెళ్తారు. ఒకవేళ ఎవరైనా చెప్పడం ద్వారా లేక కొద్దిగా సిగ్గు కారణంగా ఇతరులు ఏమనుకుంటారో అని లేక నేను అలా అవ్వకపోతే అందరూ నన్ను బలహీనురాలిగా భావిస్తారని ఇలా భావిస్తూ ఎవరి బలవంతము కారణంగానైనా అయినట్లయితే పరీక్షలు పాస్‌ అవ్వడంలో కష్టపడవలసి వస్తుంది. స్వయం ఉత్సాహము గలవారికి ఎంత పెద్ద పరిస్థితులు వచ్చినా అవి వారికి సహజంగా అనుభవమవుతాయి. ఎందుకంటే వారి మనసు ఉల్లాసంగా ఉంది కదా! తమ ఉల్లాస-ఉత్సాహాలు వారికి రెక్కలుగా అవుతాయి. ఎంత పెద్ద పర్వతమునైనా ఎగిరే పక్షి సహజంగా దాటేస్తుంది. నడిచేవారు లేక ఎక్కేవారు ఎంతో కష్టంగా ఎంతో సమయం తర్వాత దాటుకుంటారు. కనుక ఈ మానసిక ఉల్లాసము రెక్కల వంటిది. ఈ రెక్కలతో ఎగిరేవారికి సదా సహజమవుతుంది. అర్థమయ్యిందా? కావున శ్రేష్ఠ మతము - విశ్వ కళ్యాణకారులుగా అవ్వండి. అయినా స్వయం మీకు మీరే జడ్జిగా అయ్యి మీ జీవిత నిర్ణయం తీసుకోండి. తండ్రి అయితే నిర్ణయం ముందే ఇచ్చేశారు. ఇది క్రొత్త విషయం కాదు. ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకుంటే సదా సఫలురుగా ఉంటారు. ఎవరైతే ఆలోచించి, అర్థం చేసుకొని ప్రతి అడుగు వేస్తారో వారు వివేకవంతులు, అలాగని ఆలోచిస్తూనే ఉండడం కాదు. కాని ఆలోచించి అర్థం చేసుకొని వెంటనే చేసెయ్యాలి. అటువంటి వారినే వివేకవంతులని అంటారు. సంగమ యుగంలో కుమారీలుగా అవ్వడం మొట్టమొదటి భాగ్యము. ఈ భాగ్యమైతే డ్రామానుసారము లభించింది. ఇప్పుడు భాగ్యములో భాగ్యాన్ని తయారు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇదే భాగ్యమును కార్యములో వినియోగించినట్లయితే భాగ్యము పెరుగుతూ ఉంటుంది. అలా కాక ఈ మొదటి భాగ్యమునే పోగొట్టుకున్నట్లయితే సదాకాలానికి అన్ని భాగ్యాలను పోగొట్టుకుంటారు. కావున మీరు భాగ్యవంతులు. భాగ్యవంతులుగా అయ్యి ఇప్పుడు ఇతర సేవాధారుల భాగ్యమును తయారు చేయండి. అర్థమయిందా!
సేవాధారి (టీచర్లు) అక్కయ్యలతో :-
సేవాధారులు అనగా సదా సేవ చేస్తూ దాని ఆనందములో ఉండేవారు. సదా స్వయాన్ని ఆనందమయమైన జీవితంలో అనుభవం చేసేవారు. సేవాధారి జీవితమనగా ఆనందాల జీవితము. కనుక మీరు ఇలా సదా స్మృతి మరియు సేవల ఆనందంలో ఉండేవారు కదా! స్మృతిలోనూ ఆనందముంది, సేవలోనూ ఆనందముంది. జీవితము కూడా ఆనందమయమైనదే, యుగము కూడా ఆనందకరమైనదే. ఎవరైతే సదా ఆనందంగా ఉంటారో వారిని చూసి ఇతరులు కూడా తమ జీవితంలో ఆనందాన్ని అనుభవం చేస్తారు. ఎవరు ఎంత చిక్కుల్లో ఉండి వచ్చినా, ఎవరైతే స్వయం ఆనందంగా ఉంటారో వారు ఇతరులను కూడా చిక్కుల నుండి విడిపించి ఆనందంలోకి తీసుకొస్తారు. ఇలా ఆనందంలో ఉండే సేవాధారులెవరైతే ఉన్నారో వారు సదా తనువు, మనసుతో ఆరోగ్యంగా ఉంటారు. ఆనందంగా ఉండేవారు సదా ఎగురుతూ ఉంటారు ఎందుకంటే వారికి సంతోషముంటుంది. వీరు సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారని అంటారు కదా! నడుస్తున్నారని అనరు. నాట్యం చేస్తున్నారని అంటారు. నాట్యం చేయడం అనగా పైకి లేవడం(ఉన్నతంగా అవ్వడం). పాదాలు పైన ఉన్నప్పుడే కదా నాట్యం చేయగలరు! కావున ఆనందాలలో ఉండేవారు అనగా సంతోషంగా ఉండేవారు. సేవాధారులుగా అవ్వడం అనగా వరదాత ద్వారా విశేషమైన వరదానాలు తీసుకోవడం. సేవాధారులకు విశేషమైన వరదానము - ఒకటి తమ అటెన్షన్‌, రెండవది వరదానము, డబల్‌ లిఫ్ట్‌. సేవాధారులుగా అవ్వడం అనగా సదా ముక్త ఆత్మలుగా అవ్వడం. జీవన్ముక్తిని అనుభవం చేయడం.
2. సదా సేవాధారులుగా, సఫలతా స్వరూపులుగా ఉన్నారా? సఫలత మీ జన్మ సిద్ధ అధికారము. అధికారము సదా సహజంగా లభిస్తుంది. శ్రమ అనిపించదు. కావున మీరు అధికార రూపంలో సఫలతను అనుభవం చేసేవారు. సఫలత ఉండనే ఉంది అన్న నిశ్చయము మరియు నషా ఉండాలి. సఫలత ఉంటుందా, ఉండదా! అనే సంకల్పాలైతే నడవడం లేదు కదా? అధికారమున్నట్లయితే అధికారికి అధికారము లభించకపోవడమన్నది జరగదు. నిశ్చయముంటే విజయము తప్పకుండా లభిస్తుంది. సేవాధారుల పరిభాష ఇదే, ఏదైతే పరిభాష ఉందో అదే ఆచరణగా ఉంది. సేవాధారులు అనగా సహజ సఫలతను అనుభవం చేసేవారు.
వీడ్కోలు సమయంలో :-
(ఇప్పుడే వదిలి వెళ్ళవద్దు అన్న పాట అందరూ పాడారు) బాప్‌దాదా ఎంత ప్రేమసాగరులో అంత అతీతంగా ఉంటారు. స్నేహ భరిత మాటలు మాట్లాడ్తారు. ఇవి సంగమయుగ ఆనందాలు. ఆనందమైతే భలే జరుపుకోండి, తినండి, తాగండి, నాట్యం చేయండి కానీ నిరంతరము ఉండాలి. ఇప్పుడు ఎలాగైతే స్నేహంలో ఇమిడిపోయి ఉన్నారో, అలాగే ఇమిడిపోయి ఉండండి. బాప్‌దాదా ప్రతి పుత్రుని హృదయగీతమునైతే వింటూనే ఉంటారు. ఈ రోజు నోటితో పాడిన పాట విన్నారు. బాప్‌దాదా శబ్ధాన్ని చూడరు, రాగాన్ని చూడరు. మనసులోని మాటను వింటారు. ఇప్పుడైతే సదా తోడుగా ఉన్నారు. సాకారంలో గాని, అవ్యక్తంలో గాని సదా జతలో ఉన్నారు. ఇప్పుడు వియోగపు రోజులు సమాప్తమైపోయాయి. ఇప్పుడు సంగమ యుగమంతా పూర్తిగా కలుసుకునే మేళా. కేవలం మేళాలో దృశ్యాలు రకరకాలుగా మారుతాయి. ఒకసారి వ్యక్తము, ఒకసారి అవ్యక్తము. మంచిది. గుడ్‌మార్నింగ్‌.

వరదానము :- '' ఆత్మిక శక్తి ఆధారము పై శారీరిక శక్తిని అనుభవం చేసే సదా స్వస్థ్‌ భవ (ఆరోగ్యవంతులుగా అవ్వండి) ''
ఈ అలౌకిక జీవితంలో ఆత్మ మరియు ప్రకృతి రెండిటి ఆరోగ్యము అవసరమే. ఆత్మ ఆరోగ్యంగా ఉన్నప్పుడు శారీరిక లెక్కాచారాలు లేక శారీరిక రోగాలు శూలము నుండి ముల్లుగా అవ్వడం వలన స్వ స్థితి కారణంగా ఆరోగ్యాన్ని అనుభవం చేస్తారు. వారి మోము పై, ముఖము పై రోగముతో బాధపడే కష్టాల చిహ్నాలు ఉండవు. కర్మభోగాన్ని వర్ణన చేసేందుకు బదులు కర్మయోగ స్థితిని వర్ణన చేస్తారు. వారు పరివర్తన శక్తి ద్వారా కష్టమును సంతుష్టతలోకి పరివర్తన చేసి సంతుష్టంగా ఉంటారు. అంతేకాక సంతుష్ట అలలను వ్యాపింపజేస్తారు.

స్లోగన్‌ :- '' హృదయ పూర్వకంగా తనువుతో, పరస్పర ప్రేమతో సేవ చేసినట్లయితే సఫలత నిశ్చితంగా లభిస్తుంది.''

Friday, 20 September 2019

Telugu Murli 21/09/2019

21-09-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - మీ ఈ చదువు సంపాదనకు మూలము. ఈ చదువు ద్వారా 21 జన్మల సంపాదనకు ఏర్పాటు జరుగుతుంది ''

ప్రశ్న :- ముక్తిధామానికి వెళ్లడం సంపాదనా లేక నష్టమా ?
జవాబు :- భక్తులకు ఇది కూడా సంపాదనే, ఎందుకంటే అర్ధకల్పము నుండి శాంతి-శాంతి అని వేడుకుంటూ వచ్చారు. చాలా కష్టపడిన తర్వాత కూడా శాంతి లభించలేదు. ఇప్పుడు తండ్రి ద్వారా శాంతి లభిస్తుంది అనగా ముక్తిధామములోకి వెళ్తారు కావున ఇది కూడా అర్ధకల్పము చేసిన కష్టానికి ఫలము. అందువలన దీనిని కూడా సంపాదన అని అంటారు, నష్టము కాదు. పిల్లలైన మీరైతే జీవన్ముక్తికి వెళ్లే పురుషార్థము చేస్తారు. మీ బుద్ధిలో ఇప్పుడు పూర్తి ప్రపంచ చరిత్ర - భూగోళమంతా నాట్యమాడుతోంది.

ఓంశాంతి. ఆత్మయే అంతా అర్థము చేసుకుంటుందని ఆత్మిక తండ్రి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు అర్థం చేయించారు. ఈ సమయంలో పిల్లలైన మిమ్ములను తండ్రి ఆత్మిక ప్రపంచములోకి తీసుకెళ్తారు. దానిని ఆత్మిక దైవీ ప్రపంచమని, దీనిని దైహిక మానవుల ప్రపంచమని అంటారు. ఒకప్పుడు దేవతల ప్రపంచముండేదని, అది దైవీ మనుష్యుల పవిత్ర ప్రపంచమని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనుష్యులు అపవిత్రంగా ఉన్నారు అందువలన ఆ దేవతలను కీరిస్తూ, పూజిస్తారు. వృక్షములో మొదట ఒకే ధర్మముంటుందనే స్మృతి ఉంది. విరాట రూపములో వృక్షము గురించి కూడా అర్థం చేయించాలి. ఈ వృక్షానికి బీజరూపులు పైన ఉన్నారు. వృక్షానికి బీజము తండ్రి. ఎలాంటి బీజమో, అలాంటి ఫలము అనగా ఆకులు మొదలైనవి వెలువడ్తాయి. ఇది కూడా అద్భుతమే కదా. ఇంత చిన్న వస్తువు ఎంత ఫలమునిస్తుంది! దాని రూపము ఎన్ని విధాలుగా మారుతూ ఉంటుంది. ఈ మానవ సృష్టి రూపీ వృక్షము గురించి ఎవ్వరికీ తెలియదు. దీనిని కల్పవృక్షమని అంటారు. దీనిని గురించి గీతలో మాత్రమే వర్ణించబడింది. భగవద్గీతయే నెంబర్‌వన్‌ ధర్మ శాస్త్ర్రమని అందరికీ తెలుసు. శాస్త్రాలు కూడా నంబరువారుగా ఉంటాయి కదా. ధర్మాలు కూడా నంబరువారుగా ఎలా స్థాపించబడతాయో, అది కూడా కేవలం మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. మరెవ్వరిలోనూ ఈ జ్ఞానము ఉండదు. మొట్టమొదట ఏ ధర్మానికి చెందిన వృక్షము ఉండేదో, తర్వాత అందులో ఇతర ధర్మాలు ఎలా వృద్ధి చెందుతాయో మీ బుద్ధిలో ఉంది. దీనిని విరాట నాటకమని అంటారు. పిల్లల బుద్ధిలో మొత్తం వృక్షమంతా ఉంది. వృక్షము ఎలా ఉత్పన్నమవుతుందో ముఖ్యమైన విషయము. దేవీదేవతల వృక్షము ఇప్పుడు లేదు. మిగిలిన కొమ్మలు, రెమ్మలన్నీ ఉన్నాయి. కానీ ఆది సనాతన దేవీదేవతా ధర్మానికి పునాది లేనే లేదు. ఒకే ఒక ఆది సనాతన దేవీదేవతా ధర్మమును స్థాపిస్తారు. మిగిలిన ధర్మములన్నీ వినాశనమౌతాయని గాయనము కూడా ఉంది. దైవీ వృక్షము ఎంత చిన్నదిగా ఉంటుందో ఇప్పుడు మీకు తెలుసు. ఆ తర్వాత ఇన్ని ధర్మాలు ఉండనే ఉండవు. వృక్షము మొదట చిన్నదిగా ఉంటుంది. తర్వాత పెద్దదవుతూ ఉంటుంది. పెద్దదవుతూ అవుతూ ఇప్పుడు ఎంత పెద్దదైపోయింది. ఇప్పుడు దీని ఆయువు పూర్తి అవుతుంది. దీనికి ఉదాహరణగా మఱ్ఱి వృక్షమును చూపించి బాగా అర్థం చేయిస్తారు. ఇది కూడా గీతా జ్ఞానమే. మీ సన్ముఖములో కూర్చుని తండ్రి తెలియజేయు ఈ గీతా జ్ఞానము ద్వారా మీరు రాజాధి రాజులుగా అవుతారు. తర్వాత మళ్లీ భక్తిమార్గములో ఈ గీత మొదలైన శాస్త్రాలన్నీ తయారవుతాయి. ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా. మళ్లీ ఇదే విధంగా జరుగుతుంది. తర్వాత స్థాపించబడిన ధర్మముల వారికి తమవే అయిన శాస్త్రాలు ఉంటాయి. సిక్కు ధర్మము వారికి తమ శాస్త్రము అదే విధంగా క్రైస్తవులకు, బౌద్ధులకు తమ - తమ శాస్త్రాలు ఉంటాయి. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం ప్రపంచమంతటి చరిత్ర- భూగోళమంతా నాట్యము చేస్తూ ఉంది. బుద్ధి జ్ఞాన నాట్యమును చేస్తోంది. మీరు మొత్తం వృక్షమంతటిని తెలుసుకున్నారు. ధర్మాలు ఏ విధంగా వస్తాయో, ఏ విధంగా వృద్ధి చెందుతాయో కూడా తెలుసుకున్నారు. మళ్లీ మన ఏక ధర్మము మాత్రమే స్థాపించబడ్తుంది, మిగిలినవన్నీ సమాప్తమైపోతాయి. జ్ఞాన సూర్యుడు ఉదయించగానే,.............. అని పాడ్తారు కదా. ఇప్పుడు పూర్తి అంధకారముంది కదా. అనేకమంది మనుష్యులున్నారు తర్వాత ఇంతమంది ఉండనే ఉండరు. వీరంతా లక్ష్మీనారాయణుల రాజ్యములో ఉండేవారు కాదు. మళ్లీ ఒకే ధర్మము తప్పకుండా స్థాపన జరగనే జరగాలి. ఈ జ్ఞానము తండ్రియే వచ్చి వినిపిస్తారు. పిల్లలైన మీరు సంపాదన కొరకు ఎంత జ్ఞానమును చదువుకుంటున్నారు. తండ్రి టీచరై వస్తారు, అర్ధకల్పము వరకు మీకు సంపాదన కొరకు ఏర్పాటు జరుగుతుంది. మీరు చాలా ధనవంతులుగా అవుతారు. మనమిప్పుడు చదువుకుంటున్నామని మీకు తెలుసు. ఇది అవినాశి జ్ఞాన రత్నాల చదువు. భక్తిని అవినాశి జ్ఞాన రత్నాలని అనరు. భక్తిలో మనుష్యులు ఏమి చదివినా దాని ద్వారా నష్టమే కలుగుతుంది. రత్నాలుగా అవ్వరు. జ్ఞానరత్నసాగరులని ఒక్క తండ్రినే అంటారు. మిగిలినదంతా భక్తి. భక్తిలో ఏ లక్ష్యమూ లేదు. సంపాదన ఉండనే ఉండదు. సంపాదన కొరకు పాఠశాలలో చదువుకుంటారు. తర్వాత భక్తి చేసేందుకు గురువుల వద్దకు వెళ్తారు. కొందరు యవ్వనంలో గురువుల వద్దకు వెళ్తారు, కొందరు వృద్ధాప్యములో గురువులను ఆశ్రయిస్తారు. కొందరు చిన్నతనములోనే సన్యాసము పుచ్చుకుంటారు. కుంభమేళాకు ఎంతమంది వస్తారు. సత్యయుగములో ఇవేవీ ఉండవు. ఈ విషయాలన్నీ పిల్లలైన మీ స్మృతిలోకి వచ్చేశాయి. రచయిత-రచనల ఆదిమధ్యాంతాలను మీరు తెలుసుకున్నారు. వారైతే కల్పము ఆయువును కూడా పెంచేశారు. ఈశ్వరుడు సర్వవ్యాపి అని అనేశారు. వారికి జ్ఞానము గురించి తెలియదు. తండ్రి వచ్చి అజ్ఞాన నిద్ర నుండి మేల్కొల్పుతున్నారు. ఇప్పుడు మీకు జ్ఞాన ధారణ అవుతూ వస్తుంది. బ్యాటరీ నిండుతూ ఉంటుంది. జ్ఞానము ద్వారా సంపాదన, భక్తి ద్వారా నష్టము జరుగుతుంది. సమయానుసారము నష్టపోయే సమయము పూర్తి అయినప్పుడు మళ్లీ సంపాదన చేయించేందుకు తండ్రి వస్తారు. ముక్తికి వెళ్లడము కూడా సంపాదనే. శాంతినైతే అందరూ వేడుకుంటూ ఉంటారు. శాంతిదేవా! అని అనగానే బుద్ధి తండ్రి వైపు వెళ్తుంది. విశ్వములో శాంతి ఏర్పడాలని చెప్తారు కానీ అది ఎలా జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. శాంతిధామము, సుఖధామము వేరు వేరని కూడా తెలియదు. మొదటి నంబరులో ఉన్నవారికి కూడా ఈ విషయాలు తెలియదు. మీకిప్పుడు మొత్తం జ్ఞానమంతా ఉంది. ఈ కర్మక్షేత్రములో కర్మ పాత్రను అభినయించేందుకు వచ్చామని మీకు తెలుసు. ఎక్కడి నుండి వచ్చాము? బ్రహ్మలోకము నుండి, నిరాకార ప్రపంచము నుండి పాత్ర చేసేందుకు ఈ సాకార ప్రపంచములోకి వచ్చాము. ఆత్మలమైన మనము మరొక స్థానములో ఉండేవారము. ఇక్కడ ఈ పంచ తత్వాల శరీరము ఉంటుంది. శరీరమున్నప్పుడే మనము మాట్లాడగలము. మనము చైతన్య పాత్రధారులము. ఇప్పుడు మనము ఈ డ్రామా ఆదిమధ్యాంతాల గురించి మాకు తెలియదని చెప్పరు. ఇంతకుముందు మీకు కూడా తెలియదు. తమ తండ్రిని గురించి, తమ ఇంటిని గురించి, తమ రూపము గురించి యథార్థంగా ఇంతకు ముందు తెలియదు. ఆత్మ పాత్రను ఎలా అభినయిస్తూ ఉంటుందో ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మీకు గుర్తు వచ్చింది. ఇంతకు ముందు మీకు స్మృతి లేదు.
సత్యమైన తండ్రియే సత్యమును వినిపిస్తారని, దీని ద్వారా మనము సత్యఖండానికి అధికారులుగా అవుతామని మీకు తెలుసు. సత్యమును గురించి సుఖమణిలో(సిక్కుల గ్రంథములో) ఉంది. సత్య ఖండమును సత్యమని అంటారు. దేవతలందరూ సత్యమునే చెప్తారు. సత్యమును నేర్పించేవారు తండ్రి. వారి మహిమ ఎంత అపారమైనదో చూడండి. కీర్తించబడిన మహిమ మీకు ఉపయోగపడ్తుంది. శివబాబాను మహిమ చేస్తారు. వారికే వృక్ష ఆదిమధ్యాంతాల గురించి తెలుసు. తండ్రి సత్యమును వినిపిస్తున్నారు తద్వారా పిల్లలైన మీరు సత్య-సత్యంగా అవుతారు. సత్య ఖండము కూడా తయారవుతుంది. భారతదేశము సత్య ఖండముగా ఉండేది. సర్వ శ్రేష్ఠమైన నంబర్‌వన్‌ తీర్థ స్థానము కూడా ఇదే. ఎందుకంటే సర్వులకు సద్గతిని కలిగించే తండ్రి భారతదేశములోనే వస్తారు. ఒకే ధర్మము స్థాపించబడి మిగిలిన ధర్మములన్నీ వినాశనమైపోతాయి. సూక్ష్మవతనములో ఏమీ లేదని తండ్రి అర్థం చేయించారు. అక్కడ ఇవన్నీ సాక్షాత్కారమవుతాయి. భక్తిమార్గములో కూడా సాక్షాత్కారాలు అవుతాయి. సాక్షాత్కారము అవ్వకపోతే ఇన్ని మందిరాలు మొదలైనవి ఎలా నిర్మించబడ్తాయి! పూజలెందుకు జరుగుతాయి! సాక్షాత్కారమైనప్పుడు వీరు చైతన్యంగా ఉండేవారని అనుభవము చేస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - భక్త్తిమార్గములో తయారు చేయబడిన మందిరాలు, మొదలైనవి మీరు ఏవైతే చూశారో, విన్నారో అవన్నీ మళ్లీ పునరావృతమవుతాయి. చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఇది తయారైన జ్ఞానము మరియు భక్తి యొక్క ఆట. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అని సదా చెప్తూ ఉంటారు. కానీ వివరంగా ఎవ్వరికీ తెలియదు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు - జ్ఞానమంటే పగలు, భక్తి అంటే రాత్రి. రాత్రి పై వైరాగ్యము కలుగుతుంది, మళ్లీ పగలు వస్తుంది. భక్తిలో దు:ఖముంది, అందువలన దాని పై వైరాగ్యము కలుగుతుంది. సుఖము పై వైరాగ్యమని అనరు. సన్యాసము మొదలైనవి కూడా దు:ఖము వలన తీసుకుంటారు. పవిత్రతలో సుఖముందని అర్థం చేసుకొని స్త్రీని వదిలి వెళ్లిపోతారు. ఈ రోజుల్లో సన్యాసులు కూడా ధనవంతులుగా అయ్యారు ఎందుకంటే సంపద లేకుంటే సుఖము లభించదు. మాయ యుద్ధము చేసి అడవి నుండి మళ్లీ పట్టణములోకి తీసుకొస్తుంది. వివేకానంద మరియు రామకృష్ణ కూడా గొప్ప సన్యాసులుగా ఉండి వెళ్లిపోయారు. సన్యాసములోని శక్తి రామకృష్ణునిలో ఉండేది. భక్తి గురించి తెలియజేయడం, వినిపించడం వివేకానందుడు చేస్తూ ఉండేవాడు. ఇరువురి పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాన్ని వ్రాయునప్పుడు ఏకాగ్రచిత్తులై కూర్చుని వ్రాస్తారు. రామకృష్ణ తమ స్వీయ చరిత్రను వ్రాస్తున్నప్పుడు శిష్యులను కూడా దూరంగా వెళ్లి కూర్చోమని చెప్పేవాడు. చాలా గట్టి(తీక్షణమైన, చురుకైన) సన్యాసిగా ఉండేవాడు, గొప్ప పేరు కూడా ఉంది. భార్యను తల్లిగా భావించమని తండ్రి చెప్పరు. తండ్రి అయితే వారిని కూడా ఆత్మగా భావించమని చెప్తారు. ఆత్మలంతా సోదరులే. సన్యాసుల మాట వేరు. అతడు భార్యను తల్లిగా భావించాడు, కూర్చొని తల్లిని మహిమ చేశాడు. ఇది జ్ఞానమార్గము. వైరాగ్య మార్గము వేరు. వైరాగ్యము కలిగి స్త్రీని(భార్యను) తల్లిగా భావించాడు. తల్లి అను పదములో చెడు దృష్టి ఉండదు. సోదరి పై కూడా చెడు దృష్టి వెళ్లగలదు. తల్లి పై చెడు ఆలోచన ఎప్పుడూ ఉండదు. తండ్రికి కూతురు పై కూడా చెడు దృష్టి ఉంటుంది కానీ తల్లి పై ఎప్పుడూ చెడు దృష్టి ఉండదు. ఆ సన్యాసి స్త్రీని తల్లిగా భావించసాగాడు. మీరిలా సన్యసిస్తే ప్రపంచము ఎలా నడుస్తుంది? జనాభా ఎలా పెరుగుతుంది? అని వారిని అడగరు. ఒకరికి వైరాగ్యము వస్తే తల్లి అని అనేశాడు. అతనికి ఎంత మహిమ ఉందో చూడండి. ఇక్కడ సోదర-సోదరీ అని చెప్పినా చాలామందికి దృష్టి వెళ్తూ ఉంటుంది. అందువలన పరస్పరములో సోదరులుగా (భాయీ-భాయీ) భావించండి అని తండ్రి చెప్తారు. ఇది జ్ఞాన విషయము. అది ఒక్కరి విషయము. ఇక్కడైతే ప్రజాపిత బ్రహ్మకు సంతానులైనవారు, సోదర-సోదరీలుగా చాలామంది పిల్లలున్నారు. తండ్రి కూర్చొని అన్ని విషయాలు అర్థము చేయిస్తారు. ఇతను కూడా శాస్త్రాలు మొదలైనవన్నీ చదివారు. నివృత్తి మార్గములోని వారి ధర్మమే వేరు. అది కేవలం పురుషుల కొరకే. అది హద్దు వైరాగ్యము. మీకైతే మొత్తం బేహద్‌ ప్రపంచమంతటి పై వైరాగ్యముంది. సంగమ యుగములోనే తండ్రి వచ్చి మీకు బేహద్‌ విషయాలను అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచము పై వైరాగ్యము కలగాలి. ఇది చాలా పతితమైన ఛీ-ఛీ ప్రపంచము. ఇక్కడ శరీరము పావనంగా అవ్వలేదు. ఆత్మకు నూతన శరీరము సత్యయుగములోనే లభించగలదు. భలే ఇక్కడ ఆత్మ పవిత్రంగా అయినా, శరీరము అపవిత్రమైనదే లభిస్తుంది. కర్మాతీత స్థితి తయారయ్యే వరకు శరీరము అపవిత్రంగానే ఉంటుంది. బంగారులో మైల పడితే ఆభరణము కూడా అలాగే ఉంటుంది. మలినము పోయినప్పుడే ఆభరణము కూడా అసలైనదిగా తయారవుతుంది. ఈ లక్ష్మీనారాయణుల ఆత్మ మరియు శరీరము రెండూ సతోప్రధానమైనవి. మీ ఆత్మ మరియు శరీరము రెండూ తమోప్రధానంగా, నల్లగా ఉన్నాయి. ఆత్మ కామచితి పై కూర్చొని నల్లగా అయ్యింది. నేను మళ్లీ వచ్చి నల్లగా ఉన్నవారిని తెల్లగా(పవిత్రంగా) చేస్తానని తండ్రి చెప్తారు. ఇవన్నీ జ్ఞాన విషయాలు. అంతేకాని నీరు మొదలైనవాటి విషయం లేదు. అందరూ కామచితి పై కూర్చొని పతితమైనారు. అందువలన పావనంగా అయ్యే ప్రతిజ్ఞ చెయ్యమని రాఖీ కట్టబడ్తుంది.
నేను ఆత్మలతో మాట్లాడ్తానని తండ్రి చెప్తారు. నేను ఆత్మల తండ్రిని. నన్ను మీరు ''బాబా రండి, మమ్ములను సుఖధామానికి తీసుకెళ్లండి, దు:ఖమును హరించండి'' అని స్మృతి చేశారు. కలియుగములో అపారమైన దు:ఖముంది. తండ్రి అర్థం చేయించారు - మీరు కామచితి పై కూర్చొని నల్లగా, తమోప్రధానంగా అయిపోయారు. నేనిప్పుడు కామచితి పై నుండి దించి జ్ఞానచితి పై కూర్చోబెట్టేందుకు వచ్చాను. ఇప్పుడు పవిత్రంగా అయ్యి స్వర్గానికి వెళ్లాలి. తండ్రిని స్మృతి చేయాలి. తండ్ర్రి ఆకర్షించుకుంటారు. తండ్రి వద్దకు యుగల్స్‌(జంటలు) వస్తారు. ఒకరు ఆకర్షితమౌతారు, రెండవ వారు అవ్వరు. మేము ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉంటాము, కామచితి పై కూర్చోము అని కొందరు పురుషులు వెంటనే అనేస్తారు. అలాగని నిశ్చయము కలిగిందని చెప్పలేము. ఒకవేళ నిశ్చయము ఏర్పడితే బేహద్‌ తండ్రికి తప్పకుండా జాబు వ్రాస్తారు, తండ్రి సంబంధములో ఉంటారు. పవిత్రంగా ఉన్నారని, తమ వ్యాపారాలు మొదలైన వాటిలో నిమగ్నమై ఉన్నారని తెలిసింది. తండ్రి స్మృతి ఎక్కడ ఉంది! ఇటువంటి తండ్రిని ఎంత బాగా స్మృతి చేయాలి! స్త్రీ-పురుషులకు పరస్పరములో ఎంత ప్రేమ ఉంటుంది! పతిని ఎంతగా స్మృతి చేస్తుంది! బేహద్‌ తండ్రిని అయితే అందరికంటే ఎక్కువ స్మృతి చేయవలసి ఉంటుంది. మీరు ప్రీతించినా, విస్మరించినా మేము మీ చేతిని ఎప్పుడూ వదిలిపెట్టము (తూ ప్యార్‌ కరే యా టుక్‌రాయే....) అనే పాట కూడా ఉంది కదా. అలాగని ఇంటిని వదిలి ఇక్కడికి వచ్చి ఉండమని కాదు. అలా ఉంటే అది సన్యాసమైపోతుంది. గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రంగా అవ్వండి అని మీకు చెప్పబడ్తుంది. మొదట ఈ భట్టీ తయారవ్వవలసి ఉంది. తద్వారా ఇంతమంది తయారవ్వవలసి ఉంది, ఆ వృత్తాంతము కూడా చాలా బాగుంది. ఎవరైతే తండ్రికి చెందినవారిగా అవుతారో, వారు లోపలి వారిగా అవుతారు. వారు ఆత్మిక సర్వీసు చేయకుంటే దాస- దాసీలుగా అవుతారు. తర్వాత చివర్లో నంబరువారు పురుషార్థానుసారము కిరీటము లభిస్తుంది. వారి వంశము కూడా ఉంటుంది. ప్రజలలోకి రాలేరు. బయటి వారెవరైనా వస్తే పరివారము వారిగా అవ్వలేరు. వల్లభాచారి బయటివారిని లోపలికి ఎప్పుడూ రానిచ్చేవారు కాదు. ఇవన్నీ అర్థము చేసుకోవలసిన విషయాలు. జ్ఞానము క్షణములోనిది. మరి తండ్రిని జ్ఞానసాగరులని ఎందుకు అంటారు? చివరివరకు అర్థం చేయిస్తూనే ఉంటారు. రాజధాని స్థాపననైనప్పుడు, మీరు కర్మాతీత స్థితికి చేరుకున్నప్పుడు జ్ఞానము పూర్తవుతుంది. ఇది క్షణములోని మాటే. అయినా దీనిని అర్థము చేయించవలసిి ఉంటుంది. హద్దు తండ్రి ద్వారా హద్దు వారసత్వము లభిస్తుంది. బేహద్‌ తండ్రి విశ్వాధికారులుగా చేస్తారు. మీరు సుఖధామానికి వెళ్తే మిగిలిన వారందరూ శాంతిధామానికి వెళ్లిపోతారు. అక్కడ సుఖమే సుఖముంటుంది. తండ్రి వచ్చారు కనుక ఆ సత్కారము లభిస్తుంది. రాజయోగ విద్య ద్వారా మనము నూతన విశ్వానికి అధికారులుగా అవుతున్నాము. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
. ఈ పతిత ఛీ - ఛీ ప్రపంచము పై అనంతమైన వైరాగ్యము కలిగి ఆత్మను పావనంగా చేసుకునే పురుషార్థము పూర్తిగా చేయాలి. ఒక్క తండ్రి ఆకర్షణలోనే ఉండాలి. .
2. జ్ఞాన ధారణ చేసి తమ బ్యాటరీని నింపుకోవాలి. జ్ఞానరత్నాలతో స్వయాన్ని ధనవంతులుగా చేసుకోవాలి. ఇది సంపాదించుకునే సమయము, అందువలన నష్టము జరగకుండా చూసుకోవాలి.

వరదానము :- '' ''తండ్రి మరియు వరదాత '' - ఈ డబల్‌ సంబంధము ద్వారా డబల్‌ ప్రాప్తి చేసుకునే సదా శక్తిశాలి ఆత్మా భవ ''
సర్వశక్తులు తండ్రి వారసత్వము మరియు వరదాత వరదానాలు. తండ్రి మరియు వరదాత - ఈ డబల్‌ సంబంధము ద్వారా ప్రతి పుత్రునికి ఈ శ్రేష్ఠమైన ప్రాప్తి జన్మతోనే లభిస్తుంది. జన్మించిన వెంటనే తండ్రి, బాలకుని నుండి సర్వ శక్తుల మాలికునిగా చేస్తాడు. జత జతలో వరదాత సంబంధము ద్వారా జన్మించిన వెంటనే మాస్టర్‌ సర్వశక్తివంతునిగా చేసి - ''సర్వశక్తి భవ'' అనే వరదానమునిచ్చేస్తారు. కనుక ఒకరి ద్వారానే ఈ డబల్‌ అధికారము లభించినందున సదా శక్తిశాలిగా అవుతారు.

స్లోగన్‌ :- ' దేహము, దేహముతో పాటు పాత స్వభావ - సంస్కారాలు లేక బలహీనతల నుండి అతీతంగా అవ్వడమే విదేహులుగా అవ్వడం ''

Telugu Murli 20/09/2019

20-09-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - ఇక్కడ మీకు ప్రవృత్తి మార్గములోని ప్రేమ లభిస్తుంది ఎందుకంటే తండ్రి '' నా పిల్లలారా '' అని హృదయ పూర్వకంగా పిలుస్తారు. తండ్రి ద్వారా వారసత్వము లభిస్తుంది. ఈ ప్రేమను దేహధారి గురువులు ఇవ్వలేరు ''

ప్రశ్న :- ఏ పిల్లల బుద్ధిలో జ్ఞాన ధారణ జరుగుతుంది, చురుకైన బుద్ధి గల పిల్లల లక్షణాలు ఎలా ఉంటాయి ?
జవాబు :- వారికి ఇతరులకు వినిపించాలనే ఆసక్తి ఉంటుంది. వారి బుద్ధి బంధు-మితుల్రు మొదలైన వారి వైపు భమ్రించదు. చురుకైన బుద్ధి(కుశాగ బుద్ధి) గలవారు చదువుకొను సమయములో ఎప్పుడూ ఆవళించడం మొదలైనవి చేయరు. పాఠశాలలో ఎప్పుడూ కళ్లు మూసుకొని కూర్చోరు. ఏ పిల్లలైతే వేడి పెనము వలె కూర్చుంటారో, ఎవరి బుద్ధి అటు-ఇటు తిరుగుతూ ఉంటుందో వారు జ్ఞానాన్ని అర్థము చేసుకోరు. వారికి తండిన్రి స్మృతి చేయడం చాలా కష్టము.

ఓంశాంతి. ఇది తండ్రి పిల్లల మిలన మహోత్సవము, గురు-శిష్యుల మిలనము కాదు. ఆ గురువులకు వీరు మా శిష్యులు లేక అనుచరులు లేక జిజ్ఞాసువులనే దృష్టి ఉంటుంది అనగా అది చులకన(తేలిక) దృష్టి కదా. వారు ఆ తేలిక దృష్టితోనే(భావనతోనే) చూస్తారు, ఆత్మను చూడరు. వారు శరీరాలనే చూస్తారు. శిష్యులు కూడా దేహాభిమానులుగానే కూర్చుంటారు, వారిని తమ గురువులుగా భావిస్తారు. మా గురువులు అను దృష్ట్టియే ఉంటుంది. గురువులను గౌరవిస్తారు. ఇక్కడైతే చాలా వ్యత్యాసముంది. ఇక్కడ తండ్రియే పిల్లలను గౌరవిస్తారు. ఈ పిల్లలను చదివించాలని, ఈ సృష్టిచక్రము ఎలా తిరుగుతుందో, బేహద్‌ చరిత్ర-భూగోళాలు పిల్లలకు అర్థం చేయించాలని తండ్రికి తెలుసు. ఆ గురువుల హృదయంలో ' వీరు నా పిల్లలు ' అనే ప్రేమ ఉండదు. తండ్రికి పిల్లల పట్ల చాలా ప్రేమ ఉంటుంది, పిల్లలకు కూడా తండ్రి పైన చాలా ప్రేమ ఉంటుంది. బాబా మనకు సృష్టి చక్ర జ్ఞానాన్ని వినిపిస్తారని పిల్లలైన మీకు తెలుసు. ఆ గురువులేం నేర్పిస్తారు? అర్ధకల్పము శాస్త్ర్రాలు మొదలైనవి వినిపిస్తూ, భక్తిలో కర్మకాండలు చేస్తూ, గాయత్రి మంత్రము, సంధ్యా వందనము మొదలైనవి నేర్పిస్తూ ఉంటారు. ఇక్కడైతే తండ్రి వచ్చి తమ పరిచయాన్ని ఇస్తున్నారు. మనకు ఇంతకుముందు తండ్రి గురించి ఏ మాత్రము తెలియదు. మనము కూడా సర్వవ్యాపి అని అనేవారము. ఎప్పుడైనా పరమాత్మ ఎక్కడున్నారని అడిగితే వెంటనే సర్వవ్యాపి అని చెప్పేవారము. మనుష్యులు మీ వద్దకు వచ్చినప్పుడు ఇక్కడ ఏమి నేర్పిస్తారు? అని అడుగుతారు. మేము రాజయోగమును నేర్పిస్తాము, దీని ద్వారా మీరు మానవుల నుండి దేవతలుగా అనగా రాజులుగా అవ్వగలరని చెప్పండి. మేము మానవుల నుండి దేవతలుగా అయ్యే శిక్షణ ఇస్తామని చెప్పే ఏ సత్సంగమూ ఉండదు. దేవతలు సత్యయుగములో ఉంటారు, కలియుగములో మనుష్యులు ఉన్నారు. మేమిప్పుడు మీకు పూర్తి సృష్టిచక్ర రహస్యాన్ని అర్థం చేయిస్తాము, దీని ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు, అంతేకాక పావనంగా అయ్యేందుకు చాలా మంచి యుక్తిని తెలుపుతాము. ఇలాంటి ఉపాయము మరెవ్వరూ తెలియజేయలేరు. ఇది సహజ రాజయోగము. తండ్రి పతితపావనుడు. వారు సర్వశక్తివంతులు కూడా. కనుక వారిని స్మృతి చేయుట ద్వారానే పాపాలు భస్మమౌతాయి ఎందుకంటే ఇది యోగాగ్ని కదా. కావున ఇక్కడ కొత్త విషయాలను నేర్పిస్తామని చెప్పండి.
ఇది జ్ఞాన మార్గము. జ్ఞానసాగరులు ఒక్క తండ్రి మాత్రమే. జ్ఞానము వేరు, భక్తి వేరు. జ్ఞానము నేర్పించేందుకు తండ్రి రావలసి ఉంటుంది ఎందుకంటే వారే జ్ఞానసాగరులు. స్వయంగా వారే వచ్చి నేను సర్వుల తండ్రిని, బ్రహ్మ ద్వారా మొత్తం సృష్టినంతటిని పావనంగా చేస్తానని తమ పరిచయమును ఇస్తారు. సత్యయుగము పావన ప్రపంచము, కలియుగము పతిత ప్రపంచము. కావున ఇది సత్యయుగము ఆది మరియు కలియుగ అంత్యముల సంగమ యుగము. దీనిని లీపుయుగము అని కూడా అంటారు. దీనిని మనము జంప్‌ చేసి దాటుకుంటాము. ఎక్కడకు? పురాతన ప్రపంచము నుండి కొత్త ప్రపంచములోకి జంప్‌ చేస్తాము. అక్కడ నుండి మెల్ల మెల్లగా క్రిందకు దిగుతూ వచ్చాము. ఇక్కడైతే మనము ఛీ - ఛీ ప్రపంచము నుండి కొత్త ప్రపంచానికి ఒకేసారి జంప్‌ చేస్తాము. నేరుగా పైకి వెళ్లిపోతాము. పాత ప్రపంచాన్ని వదిలి మనము కొత్త ప్రపంచానికి వెళ్తాము. ఇది అనంతమైన విషయము. అనంతమైన పాత ప్రపంచములో అనేకమంది మనుష్యులు ఉన్నారు. కొత్త ప్రపంచములో అయితే చాలా కొద్దిమంది మనుష్యులే ఉంటారు. దానిని స్వర్గమని అంటారు. అక్కడ అందరూ పవిత్రంగా ఉంటారు. కలియుగములో అందరూ అపవిత్రంగా ఉన్నారు. రావణుడు అపవిత్రంగా తయారుచేస్తాడు. మీరిప్పుడు రావణ రాజ్యంలో లేక పాత ప్రపంచంలో ఉన్నారని అందరికీ అర్థం చేయిస్తారు. మొదట రామరాజ్యంలో ఉండేవారు, దానిని స్వర్గమని అనేవారు మళ్లీ 84 జన్మల చక్రములో తిరిగి ఎలా క్రిందకు పడిపోయారో మనము తెలుపగలము. బుద్ధివంతులైన వారు వెంటనే అర్థము చేసుకుంటారు. ఎవరి బుద్ధిలోకి ఇది రాదో వారు వేెడి పెనము పై ఏదీ నిలువనట్లు అటు-ఇటు చూస్తూ ఉంటారు. అటెన్షన్‌తో వినరు. నీవు వేడి పెనము వలె ఉన్నావని అంటారు కదా. సన్యాసులు కూడా కథ వినిపించునప్పుడు ఎవరైనా తూగితే లేక ఎటువైపైనా చూస్తూ ఉంటే తక్షణము వారిని ఏం వినిపించానో చెప్పండని అడుగుతారు. తండ్రి కూడా అందరినీ చూస్తుంటారు. ఎవరు వేడి పెనము వలె కూర్చోలేదు కదా! చాలా మంచి చురుకైన పిల్లలు చదువుకునే సమయంలో ఎప్పుడూ ఆవళించరు. పాఠశాలలో కూడా కళ్లు మూసుకుని కూర్చోవడం నియమము కాదు. జ్ఞానమును ఏ మాత్రము అర్థము చేసుకోలేని వారికి తండ్రిని స్మృతి చేయడం చాలా కష్టంగా ఉంటుంది. మరి పాపమెలా నశిస్తుంది! చురుకైన బుద్ధి గలవారు చాలా బాగా ధారణ చేసి ఇతరులకు వినిపించాలని ఆసక్తిని ఉంచుకుంటారు. జ్ఞానము లేకపోతే బుద్ధి బంధు-మిత్రుల వైపు భ్రమిస్తూ ఉంటుంది. ఇక్కడైతే అందరినీ మర్చిపోవాలని తండ్రి చెప్తారు. అంతిమ సమయములో ఏమీ గుర్తు రాకూడదు. బాబా సన్యాసులు మొదలైనవారిని చూశారు. మంచి-మంచి బ్రహ్మ జ్ఞానులు ఉదయమే లేచి కూర్చొని బ్రహ్మ మహాతత్వాన్ని స్మృతి చేస్తూ చేస్తూ శరీరాన్ని వదిలేస్తారు. వారి వద్ద శాంతి ప్రవాహము చాలా ఎక్కువగా ఉంటుంది. కాని వారు బ్రహ్మములో లీనమైతే అవ్వలేరు. మళ్లీ తల్లి గర్భము ద్వారా జన్మ తీసుకోవలసి ఉంటుంది.
తండ్రి అర్థం చేయించారు - వాస్తవానికి కృష్ణుని మహాత్మ అని అంటారు. మానవులైతే అర్థము తెలుసుకోకనే మహాత్మ అని ఊరకే అనేస్తారు. తండ్రి అర్థం చేయిస్తారు - శ్రీకృష్ణుడు సంపూర్ణ నిర్వికారి కాని అతడిని సన్యాసి అని అనరు, దేవత అని అంటారు. సన్యాసి అన్నా లేక దేవత అన్నా అందులో అర్థముంది. ఇతను దేవతగా ఎలా అయ్యాడు? సన్యాసి నుండి దేవతగా అయ్యాడు. బేహద్‌గా సన్యసించిన తర్వాత మళ్లీ కొత్త ప్రపంచములోకి వెళ్లిపోయాడు. వారైతే హద్దు సన్యాసము చేస్తారు. బేహద్‌లోకి వెళ్లలేరు. హద్దులోనే వికారాల ద్వారా పునర్జన్మలు తీసుకోవలసి వస్తుంది. బేహద్‌ అధికారులుగా అవ్వజాలరు. రాజా-రాణులుగా ఎప్పటికీ అవ్వలేరు ఎందుకంటే వారి ధర్మమే వేరు. సన్యాస ధర్మము దేవీ దేవతా ధర్మము కాదు. తండ్రి చెప్తున్నారు - నేను అధర్మమును వినాశనము చేసి దేవీదేవతా ధర్మమును స్థాపిస్తాను. వికారాలు కూడా అధర్మమే కదా. అందువలన వీటన్నిటి వినాశనము చేసి ఒకే ఒక ఆదిసనాతన దేవీ దేవతా ధర్మమును స్థాపించేందుకు నేను రావలసి ఉంటుందని తండ్రి చెప్తున్నారు. భారతదేశములో సత్యయుగము ఉన్నప్పుడు ఒకే ధర్మముండేది. ఆ ధర్మమే మళ్లీ అధర్మంగా అవుతుంది. మీరిప్పుడు మళ్లీ ఆది సనాతన దేవీదేవతా ధర్మాన్ని స్థాపిస్తున్నారు. ఎవరెంత పురుషార్థము చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోవాలి. భలే గృహస్థ వ్యవహారములో ఉండండి, ఎలాగైతే భక్తులు ఉదయమే లేచి ఏకాంతంగా కూర్చొని మాలను జపిస్తారో, అలా మీరు కూడా లేస్తూ, కూర్చుంటూ నేను ఆత్మను అని పక్కాగా అభ్యాసము చెయ్యండి. మీరైతే రోజంతటి లెక్కాచారాన్ని చూసుకుంటారు. ఫలానా సమయములో ఇంత స్మృతి చేశాను, రోజంతా ఇంత సమయము స్మృతి ఉందని టోటల్‌ను చూసుకుంటారు. వారైతే ఉదయమే లేచి మాలను తిప్పుతారు. కొందరు సత్యమైన భక్తులు కానీ వారు కూడా ఉంటారు. కొందరి బుద్ధి బయట ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. భక్తి ద్వారా లాభమేమీ లభించదని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. ఇది జ్ఞానము. దీని ద్వారా చాలా లాభము కలుగుతుంది. మీదిప్పుడు ఉన్నతమయ్యే కళ. క్షణ క్షణము 'మన్మనాభవ' అని తండ్రి చెప్తారు. ఈ పదము భగవద్గీతలో కూడా ఉంది కాని దాని అర్థమును ఎవ్వరూ వినిపించలేరు. జవాబు ఇవ్వడం రాదు. వాస్తవంగా స్వయాన్ని ఆత్మగా భావించి దేహ ధర్మములన్నీ వదిలి నన్ను ఒక్కరినే స్మృతి చేయమని అర్థము కూడా వ్రాయబడి ఉంది. భగవానువాచ అని ఉంది కదా. కాని వారి బుద్ధిలో కృష్ణ భగవానుడని ఉంది. అతడు దేహధారి. పునర్జన్మలు తీసుకుంటాడు కదా. అతడిని భగవంతుడని ఎలా అనగలరు? కావున సన్యాసులు మొదలైన వారెవ్వరి దృష్టి తండ్రి మరియు పిల్లల రూపములో ఉండదు. గాంధీని కూడా బాపూజీ అని అనేవారు కాని తండ్రి పిల్లలకున్న సంబంధమని అనరు. వారు కూడా సాకారములో ఉన్నారు కదా. మీకైతే స్వయాన్ని ఆత్మగా భావించమని అర్థము చేయించారు. ఇతనిలో కూర్చొని ఉన్న తండ్రి బేహద్‌ బాపూజీ. లౌకిక మరియు పారలౌకిక తండ్రులిరువురి ద్వారా వారసత్వము లభిస్తుంది. బాపూజీ (గాంధీ) ద్వారా ఏమీ లభించలేదు. భారత రాజధాని వాపస్‌ లభించింది కానీ దానిని వారసత్వమని అనరు. సుఖము లభించాలి కదా.
వారసత్వము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి హద్దు తండ్రి ద్వారా వారసత్వము, రెండవది బేహద్‌ తండ్రి ద్వారా వారసత్వము. బ్రహ్మ ద్వారా కూడా ఏ వారసత్వమూ లభించదు. వారు ప్రజాపితగా ఉండవచ్చు. వారినే గ్రేట్‌ గ్రేట్‌ గ్రాండ్‌ ఫాదర్‌(ముత్తాతల తాత) అని అంటారు. నా ద్వారా కూడా మీకు ఏ వారసత్వమూ లభించదని అతడే(బ్రహ్మ) స్వయంగా చెప్తాడు. నా ద్వారా లభించదని స్వయంగా చెప్పినప్పుడు మరి ఆ బాపూజీ ద్వారా ఏ వారసత్వము లభిస్తుంది? ఏమీ లభించదు. ఆంగ్లేయులైతే వెళ్లిపోయారు. రాజధానిలో వారున్నప్పుడైనా కొంత సుఖముండేది. ఇప్పుడేముంది? ఉపవాస సత్యాగ్రహాలు, పికెటింగ్‌లు, ధర్నాలు స్ట్రైకులు మొదలైనవి జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని మారణహోమాలు జరుగుతూ ఉన్నాయి! ఎవరి భయమూ లేదు. పెద్ద పెద్ద అధికారులను కూడా చంపుతున్నారు. సుఖానికి బదులు ఇంకా దు:ఖమే ఉంది. కావున బేహద్‌ విషయాలు ఇక్కడే ఉన్నాయి. మొట్టమొదట మేము ఆత్మలము, శరీరము కాదు అను పాఠాన్ని దృఢంగా నిశ్చయం చేసుకోమని తండ్రి చెప్తున్నారు. తండ్రి మనలను దత్తు తీసుకున్నారు. మనము దత్తు తీసుకోబడిన పిల్లలము. జ్ఞానసాగరులైన తండ్రి వచ్చారని, సృష్టిచక్ర రహస్యాన్ని అర్థం చేయిస్తారని మీకు తెలియజేయబడింది. మరెవ్వరూ అర్థం చేయించలేరు. దేహ సహితంగా దేహ ధర్మాలన్నీ మరచి నన్ను ఒక్కరినే స్మృతి చేయమని తండ్రి చెప్తారు. తప్పకుండా సతోప్రధానంగా అవ్వవలసి ఉంటుంది. పాత ప్రపంచము వినాశనము అవ్వవలసిందేనని కూడా మీకు తెలుసు. కొత్త ప్రపంచములో చాలా కొద్దిమందే ఉంటారు. కోటానుకోట్ల ఆత్మలెక్కడ, 9 లక్షల ఆత్మలు ఎక్కడ! ఇంతమంది ఎక్కడకు వెళ్తారు? ఆత్మలమైన మనమందరమూ పైన ఉండేవారమని, మళ్లీ పాత్ర చేసేందుకు ఇక్కడకు వచ్చామని మీ బుద్ధిలో ఉంది. ఆత్మనే పాత్రధారి అని అంటారు. ఈ శరీరముతో ఆత్మ పాత్ర చేస్తుంది. ఆత్మకు అవయవాలైతే కావాలి కదా. ఆత్మ ఎంత చిన్నది! 84 లక్షల జన్మలు లేనే లేవు. ఒకవేళ ప్రతి ఒక్కరు 84 లక్షల జన్మలు తీసుకుంటే మళ్లీ అదే పాత్రను ఎప్పుడు ఎలా చేస్తారు? గుర్తుండజాలదు. స్మృతిలో నుండి బయటకు వెళ్లిపోతుంది. 84 జన్మలు కూడా మీకు గుర్తుండవు, మర్చిపోతారు. పిల్లలైన మీరిప్పుడు తండ్రిని స్మృతి చేసి తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. ఈ యోగాగ్ని ద్వారా వికర్మలు వినాశనమౌతాయి. బేహద్‌ తండ్రి ద్వారా కల్ప-కల్పము బేహద్‌ వారసత్వమును మనము తీసుకుంటామని కూడా నిశ్చయముంది. ఇప్పుడు మళ్లీ స్వర్గవాసులుగా అయ్యేందుకు నన్ను ఒక్కరినే స్మృతి చేయండి ఎందుకంటే పతితపావనుడను నేనొక్కరినేనని తండ్రి చెప్పారు. మీరు తండ్రిని పిలిచారు కదా. కావున పావనంగా చేసేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు. దేవతలు పావనంగా ఉంటారు, మనుష్యులు పతితంగా ఉంటారు. పావనంగా అయ్యి మళ్లీ శాంతిధామములోకి వెళ్లాలి. మీరు శాంతిధామానికి వెళ్లాలనుకుంటున్నారా లేక సుఖధామానికి రావాలనుకుంటున్నారా? సుఖము కాకిరెట్టతో సమానము, మాకు శాంతి కావాలని సన్యాసులు చెప్తారు. కావున వారు సత్యయుగంలోకి ఎప్పటికీ రాలేరు. సత్యయుగములో ప్రవృత్తి మార్గ ధర్మముండేది. దేవతలు నిర్వికారులుగా ఉండేవారు. వారే పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పతితంగా అవుతారు. ఇప్పుడు నిర్వికారులుగా అవ్వాలని తండ్రి చెప్తున్నారు. స్వర్గంలోకి వెళ్లాలంటే నన్ను స్మృతి చేస్తే మీ పాపాలన్నీ సమాప్తమౌతాయి, పుణ్యాత్మలుగా అవుతారు, తర్వాత శాంతిధామ - సుఖధామాలకు వెళ్తారు. అక్కడ శాంతి ఉండేది, సుఖము కూడా ఉండేది. ఇప్పుడు దు:ఖధామంగా ఉంది. మళ్లీ తండ్రి వచ్చి దు:ఖధామమును వినాశనము చేసి సుఖధామమును స్థాపిస్తున్నారు. చిత్రము కూడా ఎదురుగా ఉంది. మీరిప్పుడు ఎక్కడ నిలబడి ఉన్నారో చెప్పండి? ఇది కలియుగ అంత్యము. వినాశనము సన్ముఖములో ఉంది. కొద్ది భూభాగమే మిగులుతుంది. ఇన్ని ఖండాలు అక్కడ ఉండవు. ఈ ప్రపంచ చరిత్ర-భూగోళమంతా తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తారు. ఇది పాఠశాల. భగవానువాచ - మొట్టమొదట తండ్రి పరిచయమును ఇవ్వవలసి ఉంటుంది. ఇది కలియుగము. మళ్లీ సత్యయుగములోకి వెళ్లాలి. అక్కడైతే సుఖమే సుఖముంటుంది. ఒక్కరినే స్మృతి చేయడం అవ్యభిచారి స్మృతి. శరీరాన్ని కూడా మర్చిపోవాలి. శాంతిధామము నుండి వచ్చారు మళ్లీ శాంతిధామములోకి వెళ్లాలి. అక్కడికి పతితులెవ్వరూ వెళ్లలేరు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పావనంగా అయ్యి మీరు ముక్త్తిధామంలోకి వెళ్తారు. దీనిని చాలా బాగా అర్థం చేయించవలసి ఉంటుంది. ఇంతకు ముందు ఇన్ని చిత్రాలుండేవి కావు. చిత్రాలు లేకున్నా సంక్షిప్తంగా అర్థం చేయించేవారు. ఈ పాఠశాలలో మానవుల నుండి దేవతలుగా అయ్యి వెళ్లాలి. ఇది కొత్త ప్రపంచము కొరకు ఇవ్వబడే జ్ఞానము. దీనిని తండ్రియే ఇస్తారు కదా. కావున తండ్రి దృష్టి పిల్లల పై ఉంటుంది. మనము ఆత్మలను చదివిస్తాము. మాకు బేహద్‌ తండ్రి అర్థం చేయిస్తున్నారని, వారి పేరు శివబాబా అని మీరు కూడా తెలియజేస్తారు. కేవలం బేహద్‌ బాబా అని అన్నా తికమకపడ్తారు. ఎందుకంటే బాబాలు కూడా అనేకమంది అయిపోయారు. మునిసిపాలిటి మేయర్‌ను కూడా బాబా అని అంటారు. నేను ఇతనిలో వస్తాను. అయినా నా పేరు శివునిగానే ఉంటుందని తండ్రి చెప్తున్నారు. నేను ఈ రథము ద్వారా మీకు జ్ఞానము ఇస్తాను. నేను ఇతడిని దత్తత తీసుకున్నాను. ఇతనికి ప్రజాపిత బ్రహ్మ అని పేరు పెట్టాను. ఇతనికి కూడా నా ద్వారా వారసత్వము లభిస్తుంది. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఇప్పుడు పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచములోకి జంప్‌ చేసే సమయము. అందువలన ఈ పాత ప్రపంచాన్ని అనంతంగా సన్యసించాలి. దీనిని బుద్ధి ద్వారా మర్చిపోవాలి.
2. చదువు పై పూర్తిగా గమనమివ్వాలి. పాఠశాలలో కళ్లు మూసుకొని కూర్చోవడం నియమము కాదు. చదువుకునే సమమయులో బుద్ధి అటు-ఇటు భ్రమించరాదని, ఆవళింతలు రాకూడదని గమనముంచాలి. విన్నదానిని ధారణ చేస్తూ ఉండాలి.

వరదానము :- '' సమయ ప్రమాణంగా స్వయాన్ని చెక్‌ చేసుకొని చేంజ్‌ (పరివర్తన) అయ్యే సదా విజయీ శ్రేష్ఠ ఆత్మా భవ ''
ఎవరైతే సత్యమైన రాజయోగులుగా ఉంటారో, వారు ఎప్పుడూ ఎటువంటి పరిస్థితిలోనూ విచలితమవ్వజాలరు. కనుక సమయానుసారము స్వయాన్ని ఈ రీతిగా చెక్‌ చేసుకోండి. చెక్‌ చేసుకున్న తర్వాత చేంజ్‌ చేసుకోండి. కేవలం చెక్‌ మాత్రమే చేసుకుంటే వ్యాకులపడ్తారు. నాలో ఈ బలహీనత కూడా ఉందా, ఇది బాగవుతుందో లేదో తెలియడం లేదని ఆలోచనలో పడ్తారు. అందువలన చెక్‌ చేసుకొని చేంజ్‌ చేసుకోండి. ఎందుకంటే సమయానుసారము కర్తవ్యము చేసేవారికి సదా విజయం లభిస్తుంది. సదా విజయం పొందే శ్రేష్ఠ ఆత్మలుగా అయ్యి తీవ్ర పురుషార్థము ద్వారా నంబరువన్‌లోకి వచ్చేయండి.

స్లోగన్‌ :- '' మనసు - బుద్ధిని కంట్రోల్‌ చేసే అభ్యాసముంటే సెకండులో విదేహులుగా అవ్వగలరు. ''

Telugu Murli 19/09/2019

19-09-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - వికారుల నుండి నిర్వికారులుగా అయ్యేందుకు మీరు బేహద్‌ తండ్రి వద్దకు వచ్చారు. అందువలన మీలో ఏ భూతమూ ఉండరాదు ''

ప్రశ్న :- మొత్తం కల్పమంతటిలో చదివించని ఏ చదువును మీకిప్పుడు తండ్రి చదివిస్తున్నారు ?
జవాబు :- కొత్త రాజధానిని స్థాపన చేసే చదువును, మనుష్యులకు రాజ్య పదవినిచ్చే చదువును ఈ సమయంలో సుప్రీమ్‌ తండ్రియే చదివిస్తారు. ఈ క్రొత్త చదువును కల్పమంతటిలో ఎప్పుడూ చదివించరు. ఈ చదువు ద్వారానే సత్యయుగ రాజధాని స్థాపన జరుగుతోంది.

ఓంశాంతి. మనము ఆత్మలమని శరీరము కాదని పిల్లలకు తెలుసు. అటువంటి వారినే ఆత్మాభిమానులని అంటారు. మనుష్యులందరూ దేహాభిమానులుగా ఉన్నారు. ఇది పాపాత్మల ప్రపంచము అనగా వికారి ప్రపంచము, రావణ రాజ్యము. సత్యయుగము గడిచిపోయింది. అక్కడ అందరూ నిర్వికారులుగా ఉండేవారు. మేమే పవిత్ర దేవీదేవతలుగా ఉండేవారమని, 84 జన్మల తర్వాత పతితమైపోయామని పిల్లలకు తెలుసు. 84 జన్మలను అందరూ తీసుకోరు. భారతీయులే దేవీదేవతలుగా ఉండేవారు. వారు 82, 83, 84 జన్మలు తీసుకున్నారు. వారే పతితమయ్యారు. భారతదేశమే అవినాశి ఖండముగా కీర్తించబడింది. భారతదేశములో లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. అప్పుడది కొత్త ప్రపంచమని, కొత్త భారతదేశమని పిలువబడేది. ఇప్పుడు పాత ప్రపంచము, పాత భారతదేశముగా ఉంది. అక్కడైతే సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. వారికి ఏ వికారమూ లేదు. ఆ దేవతలే 84 జన్మలు తీసుకుని ఇప్పుడు పతితులుగా అయ్యారు. కామమనే భూతము, క్రోధమనే భూతము, లోభమనే భూతము. ఇవన్నీ కఠినమైన భూతాలు. ఇందులో ముఖ్యమైనది దేహాభిమానమనే భూతము. రావణ రాజ్యము కదా. ఈ రావణుడు భారతదేశానికి అర్ధకల్పపు శత్రువు. మనుష్యులలో 5 వికారాలు ప్రవేశించినప్పుడు రావణుడు శత్రువుగా అవుతాడు. దేవతలలో ఈ భూతాలు ఉండవు. పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ వారి ఆత్మలు కూడా వికారాలలోకి వచ్చేశాయి. మనము దేవీ దేవతలుగా ఉన్నప్పుడు ఏ భూతమూ ఉండేది కాదని మీకు తెలుసు. సత్య, త్రేతా యుగాలను రామరాజ్యమని, ద్వాపర కలియుగాలను రావణరాజ్యమని అంటారు. ఇక్కడ ప్రతి ఒక్క నర-నారిలో పంచ వికారాలున్నాయి. ద్వాపర యుగము నుండి కలియుగము వరకు పంచ వికారాలు ఉంటాయి. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగములో ఉన్నారు. వికారుల నుండి నిర్వికారులుగా అయ్యేందుకు బేహద్‌ తండ్రి వద్దకు వచ్చారు. నిర్వికారులైన తర్వాత ఏ వికారానికి వశమైనా మీ ముఖాన్ని నల్లగా చేసుకున్నారని, ఇప్పుడిక తెల్లగా అవ్వడం కష్టమని బాబా వ్రాస్తారు. అది 5 అంతస్థుల నుండి పడిపోయినట్లే. ఎముకలు విరిగిపోతాయి. గీతలో కూడా భగవానువాచ - ''కామము మహాశత్రువు''. భారతదేశపు వాస్తవిక ధర్మశాస్త్రము ఒక్క గీతయే. ప్రతి ఒక్క ధర్మానికి ఒక్క శాస్త్రమే ఉంది. భారతీయులకైతే చాలా శాస్త్రాలున్నాయి. దీనిని భక్తి అని అంటారు. కొత్త ప్రపంచము సతోప్రధానమైన బంగారు యుగము. అక్కడ యుద్ధాలు మొదలైనవేవీ ఉండవు. దీర్ఘాయువు గలవారిగా నిరంతరము ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా ఉండేవారు. దేవతలమైన మనము చాలా సుఖంగా ఉండేవారమని మీకు గుర్తుకొచ్చింది. అక్కడ అకాలమృత్యువు ఉండదు. మృత్యు భయముండదు. అక్కడ ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతోషము అన్నీ ఉంటాయి. నరకములో సంతోషము ఉండదు. శరీరానికి ఏదో ఒక రోగము వస్తూనే ఉంటుంది. ఇది అత్యంత దు:ఖపూరిత ప్రపంచము. అది అపారమైన సుఖాల ప్రపంచము. బేహద్‌ తండ్రి దు:ఖ ప్రపంచమును రచించరు. తండ్రి సుఖ ప్రపంచమును రచించారు. రావణ రాజ్యము వచ్చిన తర్వాత రావణుని ద్వారా దు:ఖము, అశాంతి లభించింది. సత్యయుగము సుఖధామము. కలియుగము దు:ఖధామము. వికారములో వెళ్లడం అనగా ఒకరి పై ఒకరు కామ ఖడ్గమును ఉపయోగించడం. ఇది భగవంతుని రచనే కదా అని మనుష్యులు అంటారు. కానీ కాదు. భగవంతుని రచన కాదు. ఇది రావణుని రచన. భగవంతుడు స్వర్గాన్ని రచించారు. అక్కడ కామ వికారము(ఖడ్గము) ఉండదు. సుఖ-దు:ఖాలను భగవంతుడే ఇస్తాడని కాదు. అరే! భగవంతుడు అనంతమైన తండ్రి. పిల్లలకు దు:ఖమునెలా ఇస్తారు! నేను సుఖవారసత్వమునిస్తాను. అర్ధకల్పము తర్వాత రావణుడు శాపమిస్తాడని తండ్రి చెప్తారు. సత్యయుగములో చాలా సుఖంగా, సంపన్నంగా ఉండేవారు. ఒక్క సోమనాథ మందిరములోనే ఎన్ని వజ్రవైఢూర్యాలుండేవి. భారతదేశము ఎంత సంపన్నంగా ఉండేది. ఇప్పుడు దివాలా తీసింది. సత్యయుగములో 100% సంపన్నంగా, కలియుగములో 100% దివాలాగా ఉంటారు. ఇది తయారు చేయబడిన డ్రామా. ఇప్పుడిది ఇనుప యుగము. తుప్పుపడుతూ పడుతూ పూర్తిగా తమోప్రధానమై పోయింది. ఎంత దు:ఖముంది. ఈ విమానాలు మొదలైనవి కూడా ఈ 100 సంవత్సరాల లోపే తయారయ్యాయి. దీనిని మాయ ఆడంబరమని అంటారు. సైన్సు స్వర్గమును తయారు చేసిందని భావిస్తారు. కానీ ఇది రావణుని స్వర్గము. కలియుగములో మాయ ఆడంబరము చూసి మీ వద్దకు చాలా కష్టంగా వస్తారు. మా దగ్గర మహళ్ళు, మోటర్లు మొదలైనవి ఉన్నాయని భావిస్తారు. లక్ష్మీనారాయణుల రాజ్యమున్నప్పుడు సత్యయుగమును స్వర్గమని అంటారని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు ఈ లక్ష్మీనారాయణుల రాజ్యము లేదు. ఇప్పుడిది కలియుగము. దీని తర్వాత వీరి రాజ్యము వస్తుంది. మొదట భారతదేశము చాలా చిన్నదిగా ఉండేది. క్రొత్త ప్రపంచములో 9 లక్షల మంది దేవతలు మాత్రమే ఉండేవారు. తర్వాత వృద్ధి చెందుతూ ఉంటారు. మొత్తం సృష్టి అంతా వృద్ధి చెందుతూ ఉంటుంది కదా. మొట్టమొదట కేవలం దేవీదేవతలు మాత్రమే ఉండేవారు. కావున బేహద్‌ తండ్రి కూర్చుని ప్రపంచ చరిత్ర-భూగోళాలను అర్థం చేయిస్తారు. తండ్రి తప్ప మరెవ్వరూ తెలుపలేరు. వారిని నాలెడ్జ్‌ఫుల్‌, గాడ్‌ఫాదర్‌ అని అంటారు. వారు సర్వాత్మలకు తండ్రి. ఆత్మలందరూ పరస్పరములో సోదరులు(భాయి-భాయి) తర్వాత సోదర - సోదరీలుగా అవుతారు. మీరందరూ ప్రజాపిత బ్రహ్మకు దత్తు పిల్లలు. ఆత్మలందరూ వారి సంతానమే. వారిని పరమపిత అని అంటారు. వారి పేరు శివ. తండ్రి అర్థం చేయిస్తున్నారు - నాకు శివ అను పేరు ఒక్కటే ఉంది. తర్వాత భక్తిమార్గములో మనుష్యులు చాలా మందిరాలు నిర్మించారు. కనుక చాలా పేర్లు పెట్టేశారు. భక్తి సామాగ్రి చాలా ఉంది. దానిని చదువు అని అనరు. అందులో లక్ష్యము లేదు. అది ఇంకా క్రిందకు దిగజారుస్తుంది. దిగుతూ దిగుతూ తమోప్రధానమైపోతారు. మళ్లీ అందరూ సతోప్రధానంగా అవ్వాలి. మీరు సతోప్రధానంగా అయ్యి స్వర్గములోకి వస్తారు. మిగిలిన వారందరూ సతోప్రధానమై శాంతిధామములో ఉంటారు. దీనిని బాగా గుర్తుంచుకోండి. బాబా, మీరు వచ్చి పతితులను పావనంగా తయారు చేయండి అని మీరు నన్ను పిలిచారు. కనుక ఈ మొత్తం ప్రపంచాన్ని పావనంగా చేసేందుకు నేను వచ్చాను. గంగా స్నానము చేయడం వలన పావనంగా అవుతారని మానవులు అనుకుంటారు. గంగను పతితపావనిగా భావిస్తారు. కుంటలో లేక బావిలో నుండి నీరు వచ్చినా దానిని కూడా గంగ నీరు అని భావించి స్నానము చేస్తారు. గుప్త గంగగా భావిస్తారు. తీర్థ యాత్రలకు గానీ, ఏ కొండ పైకో గానీ వెళ్లినప్పుడు, దానిని కూడా గుప్త గంగ అని అంటారు. దీనిని అసత్యమని అంటారు. భగవంతుడు అనగా సత్యమని (గాడ్‌ ఈజ్‌ ట్రూత్‌) అంటారు. పోతే రావణ రాజ్యములో అందరూ అసత్యాన్నే చెప్తారు. భగవంతుడైన తండ్రి ఒక్కరే సత్య ఖండమును స్థాపిస్తారు. అక్కడ అసత్యమనే విషయమే ఉండదు. దేవతలకు నైవేద్యము(భోగ్‌) కూడా శుద్ధంగా పెడ్తారు. ఇప్పుడు ఆసురీ రాజ్యముంది. సత్య, త్రేతా యుగాలలో ఈశ్వరీయ రాజ్యము ఉంటుంది. అది ఇప్పుడు స్థాపనవుతూ ఉంది. ఈశ్వరుడే వచ్చి అందరినీ పావనంగా చేస్తారు. దేవతలలో ఏ వికారమూ ఉండదు. యథా రాజా రాణి, తథా ప్రజా. అందరూ పవిత్రంగా ఉంటారు. ఇక్కడ అందరూ పాపులుగా, కాముకులుగా, క్రోధులుగా ఉన్నారు. కొత్త ప్రపంచాన్ని స్వర్గమని, దీనిని నరకమని అంటారు. నరకాన్ని స్వర్గంగా తండ్రి తప్ప మరెవ్వరూ చేయలేరు. ఇక్కడ అందరూ పతితమై నరకవాసులుగా ఉన్నారు. సత్యయుగములో పావనంగా ఉంటారు. మేము పతితుల నుండి పావనమయ్యేందుకు స్నానం చేసేందుకు వెళ్తున్నామని అక్కడ అనరు.
ఇది వెరైటి మానవ సృష్టి రూపి వృక్షము. భగవంతుడు బీజరూపుడు. వారే రచనను రచిస్తారు. మొట్టమొదట దేవీదేవతలను రచిస్తారు. తర్వాత వృద్ధి చెందుతూ చెందుతూ ఇన్ని ధర్మాలైపోతాయి. మొదట ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఉండేది, చాలా సుఖముండేది. విశ్వములో శాంతి ఉండాలని మానవులు కోరుకుంటారు. దానిని మీరిప్పుడు స్థాపిస్తున్నారు. మిగిలినవన్నీ సమాప్తమైపోతాయి. కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కలియుగాంతము, మరియు సత్యయుగాదుల పురుషోత్తమ సంగమ యుగము. దీనిని కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగమని అంటారు. కలియుగము తర్వాత సత్యయుగము స్థాపనవుతూ ఉంది. సంగమ యుగములో మీరు చదువుకుంటున్నారు. దీని ఫలితము సత్యయుగములో లభిస్తుంది. ఇక్కడ ఎంత పవిత్రంగా అవుతారో, ఎంత బాగా చదకువుకుంటారో అక్కడ అంత ఉన్నత పదవిని పొందుతారు. ఇటువంటి చదువు ఎక్కడా ఉండదు. మీకు ఈ చదువు ద్వారా సుఖము కొత్త ప్రపంచంలో లభిస్తుంది. ఒకవేళ ఏదైనా భూతముంటే ఒకటేమో శిక్షలు అనుభవించవలసి ఉంటుంది, రెండవది అక్కడ మీరు తక్కువ పదవిని పొందుతారు. ఎవరైతే సంపూర్ణమై ఇతరులను కూడా చదివిస్తారో, వారు పదవిని కూడా ఉన్నతమైనది పొందుతారు. ఎన్ని సేవాకేంద్రాలున్నాయి! లక్షల సేవాకేంద్రాలవుతాయి. విశ్వమంతటా సేవాకేంద్రాలు తెరవబడుతాయి. పాపాత్మలుగా ఉన్నవారు పుణ్మాత్మలుగా అవ్వాల్సిందే. మీ లక్ష్యము - ఉద్ధేశ్యము కూడా ఉంది. చదివించేవారు ఒక్క శివబాబాయే. వారు జ్ఞానసాగరులు, సుఖసాగరులు. తండ్రియే వచ్చి చదివిస్తారు. ఇతను చదివించరు. ఇతని ద్వారా శివబాబా చదివిస్తారు. ఇతడిని భగవంతుని రథమని, భాగ్యశాలీ రథమని అంటారు. మిమ్ములను ఎంతో పదమాపదమ్‌ భాగ్యశాలురుగా చేస్తారు. మీరు చాలా ధనవంతులుగా అవుతారు. ఎప్పటికీ జబ్బుపడరు. ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతోషము అన్నీ లభిస్తాయి. ఇక్కడ భలే ధనమున్నా జబ్బులు మొదలైనవి చాలా ఉన్నాయి. ఆ సంతోషము ఉండజాలదు. ఏదో ఒక దు:ఖముంటుంది. దాని పేరే సుఖధామము, స్వర్గము, ప్యారడైజ్‌. ఈ లక్ష్మీనారాయణులకు ఈ రాజ్యమును ఎవరు ఇచ్చారో ఎవ్వరికీ తెలియదు. వీరు భారతదేశములో ఉండేవారు. విశ్వానికి అధికారులుగా ఉండేవారు. అప్పుడు ఏ విధమైన విభజనలు మొదలైనవి లేవు. ఇప్పుడైతే ఎన్ని విభజనలున్నాయి! ఇక్కడ రావణరాజ్యముంది. ఎంతగా ముక్కలు ముక్కలుగా అయిపోయింది! కొట్లాడుతూ ఉంటారు. అక్కడైతే మొత్తం భారతదేశమంతటా ఈ దేవీ దేవతల రాజ్యముండేది. అక్కడ మంత్రులు మొదలైనవారెవ్వరూ ఉండరు. ఇక్కడైతే ఎంతమంది మంత్రులున్నారో చూడండి. ఎందుకంటే తెలివిహీనులుగా ఉన్నారు. మంత్రులు కూడా అదే విధంగా తమోప్రధానమై పతితంగా ఉన్నారు. పతితులతో పతితులు చేరి, చేయి - చేయి కలిపి పొడవైన చేయి అయినట్లు............. నిరుపేదలుగా అవుతూ ఉంటారు. అప్పు కూడా తీసుకుంటూ ఉంటారు. సత్యయుగములో అయితే ధాన్యము, ఫలాలు మొదలైనవన్నీ చాలా రుచికరంగా ఉంటాయి. మీరు అక్కడకు వెళ్లి అన్నీ అనుభవము చేసి వస్తారు. సూక్ష్మవతనములోకి వెళ్తారు, స్వర్గములోకి కూడా వెళ్తారు. సృష్టిచక్రము ఎలా తిరుగుతుందో తండ్రి చెప్త్తారు. భారతదేశములో మొట్టమొదట దేవీ దేవతా ధర్మమొక్కటే ఉండేది. మరే ధర్మము ఉండేది కాదు. తర్వాత ద్వాపర యుగము నుండి రావణ రాజ్యము ప్రారంభమవుతుంది. ఇప్పుడిది వికారీ ప్రపంచము. తర్వాత మీరు పవిత్రంగా అయ్యి నిర్వికారి దేవతలుగా అవుతారు. ఇది పాఠశాల. భగవానువాచ - నేను పిల్లలైన మీకు రాజయోగమును నేర్పిస్తాను. భవిష్యత్తులో మీరు ఇలా(లక్ష్మినారాయణులుగా) అవుతారు. రాజ్యమును పొందేే చదువు మరెక్కడా లభించదు. తండ్రియే చదివించి, కొత్త ప్రపంచ రాజధానిని ఇస్తారు. సుప్రీమ్‌ ఫాదర్‌, టీచర్‌, సద్గురువు శివబాబా ఒక్కరే. తండ్రి అనగా తప్పకుండా వారసత్వము లభించాలి. భగవంతుడు తప్పకుండా స్వర్గ వారసత్వమునే ఇస్తారు. రావణున్ని ప్రతి సంవత్సరము తగులబెడ్తారు. ఇతడు భారతదేశానికి నెంబర్‌వన్‌ శత్రువు. రావణుడు ఎలాంటి అసురులుగా చేసేశాడు! ఇతని రాజ్యము 2500 సంవత్సరాలుంటుంది. నేను మిమ్ములను సుఖధామానికి అధికారులుగా చేస్తానని తండ్రి చెప్తారు. రావణుడు మిమ్ములను దు:ఖధామములోకి తీసుకెళ్తాడు. మీ ఆయువు కూడా తగ్గిపోతుంది. అకస్మాత్తుగా అకాలమృత్యువు సంభవిస్తుంది. అనేక జబ్బులు వస్తూ ఉంటాయి. అక్కడ ఇలాంటి విషయాలేవీ ఉండవు. దాని పేరే స్వర్గము. ఇప్పుడు మిమ్ములను హిందువులని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే పతితులుగా ఉన్నారు. కావున దేవతలని చెప్పుకునే యోగ్యత లేదు. తండ్రి ఈ రథము ద్వారా కూర్చొని అర్థం చేయిస్తారు. ఇతని ప్రక్కనే భృకుటి మధ్యలో వచ్చి కూర్చుని మిమ్ములను చదివిస్తారు. ఇతను కూడా చదువుకుంటారు. మనమందరము విద్యార్థులము. తండ్రి ఒక్కరే టీచరు. ఇప్పుడు తండ్రి చదివిస్తున్నారు. మళ్లీ 5000 సంవత్సరాల తర్వాత వచ్చి చదివిస్తారు. ఈ జ్ఞానము, ఈ చదువు మళ్లీ అదృశ్యమైపోతుంది. చదువుకొని మీరు దేవతలుగా అయినప్పుడు 2500 సంవత్సరాలు సుఖ వారసత్వము తీసుకుంటారు. తర్వాత దు:ఖముంటుంది. అది రావణుని శాపము. ఇప్పుడు భారతదేశము చాలా దు:ఖపూరితమైపోయింది. ఇది దు:ఖధామము. ''పతితపావనా! రండి, వచ్చి పావనంగా చేయండి'' అని అంటారు కదా. ఇప్పుడు మీలో ఏ వికారమూ ఉండరాదు. కానీ అర్ధకల్పము నుండి ఉన్న జబ్బులన్నీ అంత త్వరగా నయం కావు. ఆ చదువులో కూడా బాగా చదవనివారు ఫెయిల్‌ అవుతారు. గౌరవపూర్వకంగా పాస్‌ అయినవారు స్కాలర్‌షిప్‌ తీసుకుంటారు. అలా ఇక్కడ కూడా సంపూర్ణ పవిత్రంగా అయ్యి ఇతరులను కూడా తయారు చేసేవారు ఈ బహుమతిని తీసుకుంటారు. అష్టరత్నాల మాల ఉంటుంది. వారు గౌరవపూర్వకంగా పాస్‌ అయ్యేవారు. తర్వాత 108 మాల కూడా ఉంటుంది. ఆ మాల కూడా స్మరించబడ్తుంది. దీని రహస్యము మానవులకు అర్థం కాదు. మాలలో పైన పుష్పముంది. తర్వాత జంట పూస(మేరు) ఉంటుంది. స్త్రీ - పురుషులిరువురు పవిత్రంగా అవుతారు. మీరు పవిత్రంగా ఉండేవారు కదా. మీరు స్వర్గవాసులని పిలువబడేవారు. ఈ ఆత్మయే పునర్జన్మలు తసుకుంటూ - తీసుకుంటూ ఇప్పుడు పతితమైపోయింది. మళ్లీ ఇప్పుడు పావనమై పావన ప్రపంచములోకి వెళ్తుంది. ప్రపంచ చరిత్ర - భూగోళము పునారావృతమౌతుంది కదా. వికారీ రాజులు, నిర్వికారులైన రాజులకు మందిరాలు మొదలైనవి నిర్మించి వారిని పూజిస్తారు. పూజ్యులుగా ఉన్నవారే మళ్లీ పూజారులుగా అవుతారు. వికారులుగా అయినందున ఆ ప్రకాశ కిరీటము కూడా ఉండదు. ఇది తయారు చేయబడిన ఆట. ఇది బేహద్‌ అద్భుతమైన డ్రామా. మొదట ఒకే ధర్మముంటుంది. దీనిని రామరాజ్యమని అంటారు. తర్వాత వేరు వేరు ధర్మాలవారు వస్తారు. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతూ ఉందో తండ్రి ఒక్కరు మాత్రమే అర్థం చేయించగలరు. భగవంతుడు ఒక్కరే. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. స్వయం భగవంతుడే టీచరుగా అయ్యి చదివిస్తున్నారు. కావున చాలా బాగా చదువుకోవాలి. స్కాలర్‌షిప్‌్‌ తీసుకునేందుకు పవిత్రంగా అయ్యి ఇతరులను కూడా పవిత్రంగా చేయు సేవ చేయాలి.
2. ఆంతరికములో ప్రవేశించిన కామ, క్రోధాలనే భూతాలన్నిటినీ తొలగించాలి. లక్ష ్యము ఎదురుగా ఉంచుకొని పురుషార్థము చేయాలి.

వరదానము :- '' అనుభూతి శక్తి ద్వారా పాత స్వభావ - సంస్కారాల నుండి అతీతంగా అయ్యే మాయాజీత్‌ భవ ''
ఈ పాత దేహము యొక్క స్వభావ-సంస్కారాలు చాలా కఠినమైనవి. అవి మాయాజీతులుగా అవ్వడంలో పెద్ద విఘ్న రూపాలుగా అవుతాయి. స్వభావ-సంస్కారాలనే పాము సమాప్తం కూడా అవుతుంది, కానీ దాని రేఖ మిగిలిపోతుంది. అది సమయం వచ్చినప్పుడు పదే పదే మోసం చేసేస్తుంది. చాలాసార్లు మాయకు ఎంతగా వశమైపోతారంటే తప్పును తప్పుగా కూడా భావించరు, పరవశమైపోతారు. అందువలన చెక్‌ చేసుకొని అనుభూతి శక్తి ద్వారా పాత, దాగి ఉన్న స్వభావ-సంస్కారాల నుండి అతీతంగా అవ్వండి. అప్పుడు మాయాజీతులుగా అవుతారు.

స్లోగన్‌ :- '' విదేహి స్థితిని అభ్యాసము చేయండి, అచానక్‌ (అకస్మాత్తుగా వచ్చే) పరీక్షలో పాస్‌ అవ్వండి ''