Sunday, 24 November 2019

Telugu Murli 25/11/2019

25-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - మీ బలహీనతల(చెడుగుణాల)ను తొలగించుకోవాలంటే హృదయ పూర్వకంగా, సత్యంగా వాటిని తండ్రికి వినిపించండి. బాబా మీకు వాటిని తొలగించుకునే యుక్తిని తెలిపిస్తారు ''

ప్రశ్న :- తండ్రి నుండి కరెంటు(శక్తి) ఎటువంటి పిల్లలకు లభిస్తుంది ?
జవాబు :- ఏ పిల్లలైతే తమ జబ్బులను నిజాయితీగా సర్జన్‌కు వినిపిస్తారో వారికి బాబా దృష్టినిస్తారు. బాబాకు ఆ పిల్లల పై చాలా జాలి కలుగుతుంది. ఈ పిల్లలలోని భూతాలు తొలగిపోవాలని ఆంతరికములో అనిపిస్తుంది. బాబా వారికి కరెంటునిస్తారు.

ఓంశాంతి. తండ్రి పిల్లలను అడుగుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు స్వయాన్ని - '' తండ్రి నుండి ఏమైనా లభించిందా? '' అని ప్రశ్నించుకోవాలి. ఏ ఏ విషయాలలో ఇంకా లోపాలున్నాయి? ప్రతి ఒక్కరూ వారి లోపల పరిశీలించుకోవాలి. నారదుని ఉదాహరణ ఉంది కదా. లక్ష్మిని వరించేందుకు నాకు అర్హతలున్నాయా? అని అద్దములో నీ ముఖము నీవే చూచుకోమని చెప్పారు కదా, అలాగే తండ్రి కూడా పిల్లలైన మిమ్ములను అడుగుతున్నారు - లక్ష్మిని వరించేందుకు అర్హులుగా అయ్యారా? ఒకవేళ అవ్వకుంటే ఏ ఏ లోపాలున్నాయి? వాటిని తొలగించుకునేందుకు పిల్లలు పురుషార్థము చేస్తున్నారు. బలహీనతలు తొలగించుకునేందుకు పురుషార్థము చేస్తున్నారా లేక చేయడం లేదా? కొంతమంది పురుషార్థము చేస్తూ ఉంటారు. కొత్త కొత్త పిల్లలకు - ''మాలో ఏ బలహీనతలు లేవు కదా?'' అని మీ ఆంతరికములో చూసుకోండి. ఎందుకంటే మీరందరూ దోష రహితంగా సంపూర్ణంగా (పర్‌ఫెక్ట్‌గా) తయారవ్వాలి. తండ్రి పర్‌ఫెక్ట్‌గా తయారు చేసేందుకే వచ్చారు. అందుకే లక్ష్యమును చూపించే చిత్రాన్ని కూడా మీ ముందుంచారు. మీ ఆంతరికములో ప్రశ్నించుకోండి - వారి వలె పర్‌ఫెక్ట్‌గా తయారైనామా? ఇచ్చట భౌతిక విద్యను చదివించే టీచర్లు మొదలైన వారంతా ఇప్పుడు వికారులుగా ఉన్నారు. ఈ లక్ష్మీనారాయణులు సంపూర్ణ నిర్వికారులకు స్యాంపుల్‌(నమూనా). అర్ధకల్పము మీరు వీరిని మహిమ చేశారు. కావున ఇప్పుడు - '' మాలో ఏవైనా తొలగించుకోవలసిన లోపాలున్నాయా? '' అని స్వయాన్ని పశ్న్రించుకోండి. ఒకవేళ లోపాలుంటే తండిక్రి, బాబా మాలో ఈ లోపముంది అని తెలపండి. నా నుండి ఈ లోపము తొలగిపోవడం లేదు, ఏదైనా ఉపాయము తెలపండి అని చెప్పండి. జబ్బు సర్జన్‌ ద్వారానే నయమవుతుంది. కొంతమంది మంగలి సర్జన్లు కూడా తెలివైన సర్జన్లుగా ఉంటారు. డాక్టర్‌ నుండి కాంపౌండర్లు నేర్చుకుని తెలివి గల డాక్టర్లుగా అవుతారు. నిజాయితీతో స్వయాన్ని చెక్‌ చేసుకోండి - నాలో ఏ లోపాలున్నాయి? ఏ లోపాలున్నందున నేను ఈ(లక్ష్మీ నారాయణ) పదవి పొందుకోలేనని భావిస్తున్నాను? తండ్రేమో చెప్తారు కదా - మీరు వీరి వలె తయారవ్వగలరు. లోపాలు తెలిపితే బాబా సలహానిస్తారు. జబ్బులేమో చాలా ఉన్నాయి. చాలామందిలో దోషాలున్నాయి. కొంతమందిలో క్రోధము ఎక్కువగా ఉంది, కొంతమందిలో లోభముంది........ ఇటువంటి వారిలో ఇతరులకు ధారణ చేయించేటంత జ్ఞాన ధారణ జరగదు. బాబా ప్రతిరోజూ చాలా అర్థం చేయిస్తూనే ఉంటారు. వాస్తవానికి ఇంత అర్థం చేయించే అవసరమే కనిపించదు. మంత్రము యొక్క అర్థము తండ్రి తెలిపించారు. తండ్రి ఏమో ఒక్కరే. అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి. వారి నుండి ఈ వారసత్వము పొందుకొని మనము ఈ విధంగా తయారవ్వాలి. ఇతర పాఠశాలల్లో 5 వికారాలను జయించే విషయమే ఉండదు. తండ్రి వచ్చి అర్థం చేయించినప్పుడు మాత్రమే ఈ విషయాలు తెలుస్తాయి మీలో దు:ఖమిచ్చే భూతాలు ఏమేమి ఉన్నాయో వాటిని వర్ణన చేస్తే వాటిని తొలగించుకునేందుకు తండ్రి యుక్తి తెలుపుతారు. బాబా ఫలాని ఫలాని భూతాలు మమ్ములను విసిగిస్తూ దు:ఖ పెట్తున్నాయని తెలపాలి. భూతాలను తరిమేసే వారి ముందు వర్ణిస్తారు కదా. మీలో ఆ భూతాలు లేవు. ఈ 5 వికారాలనే భూతాలు జన్మ-జన్మాంతరాలవని మీకు తెలుసు. మాలో ఏ భూతముందని చూసుకోవాలి? దానిని తొలగించుకునేందుకు సలహా తీసుకోవాలి. కనులు కూడా చాలా మోసగిస్తాయి. అందుకే తండ్రి చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించి ఇతరులను కూడా ఆత్మలుగా భావించే అభ్యాసము చేయండి. ఈ యుక్తి ద్వారా మీలోని జబ్బు తొలగిపోతుంది. మనమంతా ఆత్మలము కనుక మనమంతా సోదరులము. శరీరాలు కానే కాదు. ఆత్మలమైన మనమంతా ఇప్పుడు వాపస్‌ వెళ్ళే వారమని మీకు తెలుసు. సర్వ గుణ సంపన్నంగా అయ్యామా? అని స్వయాన్ని పరిశీలించుకోవాలి లేకుంటే నాలో ఏ అవగుణాలున్నాయి? తండ్రి కూడా ఆ ఆత్మలను పరిశీలిస్తారు. ఈ దోషముంటే కరెంటు ఇస్తామనుకుంటారు. ఈ పుత్రునిలోని ఈ విఘ్నము తొలగిపోవాలని అనుకుంటారు. సర్జన్‌తోనే చెప్పకుండా దాచి ఉంచితే ఎవరేం చేయగలరు? మీరు మీలోని అవగుణాలను తెలుపుతూ ఉంటే తండ్రి కూడా సలహానిస్తారు. ఆత్మలైన మీరు తండ్రిని స్మృతి చేస్తారు. ఓ బాబా! మీరెంత మధురమైనవారు, ఎలా ఉండేవారిని ఎలా చేస్తున్నారు! తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే భూతాలు పారిపోతాయి. ఏదో ఒక భూతము ఉండనే ఉంది. తండ్రి మన సర్జన్‌, వారికి - '' బాబా మాకు యుక్తిని తెలపమని చెప్పండి.'' లేకుంటే చాలా నష్టపోతారు. వినిపిస్తే తండ్రికి కూడా దయ కలుగుతుంది. ఈ మాయా భూతము వీరిని ఏడిపిస్తూ ఉందని తెలుసుకుంటారు. భూతాలను తరిమేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. యుక్తితో పారద్రోలుతారు. ఈ 5 భూతాలను తరిమేయండి అని అర్థం చేయిస్తారు. అయినా అన్ని భూతాలు పారిపోవు. కొంతమందిలో ఎక్కువగా ఉంటాయి, కొంతమందిలో తక్కువగా ఉంటాయి. కానీ తప్పకుండా ఉండనే ఉంటాయి. వీరిలో ఈ భూతముందని తండ్రి గమనిస్తారు. దృష్టి ఇచ్చే సమయంలో దృష్టి లోపలికెళ్తుంది కదా. ఇతను చాలా మంచి పుత్రుడు, లోపల చాలా మంచి మంచి గుణాలున్నాయి. కానీ ఏమీ చెప్పలేడు, ఎవ్వరికీ అర్థం చేయించలేడు. మాయ ఇతని గొంతు నొక్కేసింది, గొంతు తెరుచుకుంటే ఇతరులకు సేవ కూడా చేస్తాడు. ఇతరుల సేవ చేయునప్పుడు తమ సేవను, శివబాబా సేవను మర్చిపోతాడు. శివబాబా స్వయంగా సర్వీసు చేసేందుకు వచ్చారు. జన్మ-జన్మాంతరాల ఈ భూతాలను పారద్రోలాలని చెప్తున్నారు.
తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు - వృక్షము క్రమక్రమంగా, నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. ఆకులు రాలుతూ ఉంటాయి. మాయ విఘ్నాలు కల్పిస్తూ ఉంటుంది. ఉన్నట్లుండి ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. ఉదాహరణానికి సన్యాసులకు అయిష్టత కలిగితే అకస్మాత్తుగా ఉన్నట్లుండి అదృశ్యమైపోతారు. ఏ కారణము, ఏ మాటలు ఉండవు. అందరి సంబంధము తండ్రితో అయితే ఉంది. పిల్లలు నెంబరువారుగా ఉన్నారు. తండిక్రి సత్యము తెలుపుతే, వారి అవగుణాలు తొలగిపోగలవు, ఉన్నత పదవి పొందగలరు. చాలామంది లోపాలను తెలియజేయని కారణంగా స్వయం ఎంతో నష్టపోతున్నారని తండికి తెలుసు. ఎంతగా అర్థం చేయించినా మళ్లీ అవే కర్మలే చేస్తూ ఉంటారు. మాయ పట్టుకుంటుంది. కొండచిలువ వలె మాయ అందరినీ కడుపులోకి వేసుకు కూర్చున్నది. ఊబిలో గొంతు వరకు దిగబడిపోయారు. తండ్రి ఎంతగానో అర్థం చేయిస్తున్నారు. ఇక ఏ మాటలు తెలుపలేకున్నా, కేవలం ఇద్దరు తండ్రులున్నారని చెప్పండి. ఒక్కరు లౌకిక తండ్రి - ఈ తండ్రి సదా లభిస్తారు. సత్యయుగములో కూడా లభిస్తారు, కలియుగంలో కూడా లభిస్తారు. అంతేకాని సత్యయుగంలో పారలౌకిక తండ్రి లభిస్తారని కాదు. లౌకిక తండ్రి ఎల్లప్పుడూ లభిస్తూనే ఉంటారు. ఆ పారలౌకిక తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు. పారలౌకిక తండ్రి వచ్చి నరకాన్ని స్వర్గంగా తయారుచేస్తారు. భక్తిమార్గంలో వారిని ఎంతగానో పూజిస్తారు, స్మృతి చేస్తారు. శివుని మందిరాలైతే చాలా ఉన్నాయి. పిల్లలు సర్వీసు లేదంటారు. అరే! శివుని మందిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడకు వెళ్లి మీరు వీరిని ఎందుకు పూజిస్తున్నారు? అని అడగండి. వీరికి శరీరము లేదే మరి వీరు ఎవరు? అని అడగండి. పరమాత్మ అని అంటారు. వీరిని తప్ప మరెవ్వరినీ అలా అనరు. వీరు తండ్రి అయిన పరమాత్మ కదా. వారిని ఖుదా అని కూడా అంటారు, అల్లా అని కూడా అంటారు. చాలామంది పరమపిత పరమాత్మ అని అంటారు. వారి ద్వారా ఏం లభిస్తుందో ఏమైనా తెలుసా? భారతదేశములో శివుని పేరు చాలా బాగా వ్యాపించి ఉంది. శివజయంతి పండుగను కూడా ఆచరిస్తారు. ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజము. తండ్రి అనేక రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. మీరెవరి వద్దకైనా వెళ్ళవచ్చు. కానీ చాలా చల్లగా, నమ్రతగా మాట్లాడాలి. మీ పేరు భారతదేశములో బాగా వ్యాపించి ఉంది. కొద్దిగా మాట్లాడినా వీరు బి.కెలని తెలుసుకుంటారు. గ్రామాల వైపు చాలా అమాయక వ్యక్తులున్నారు. కనుక దేవాలయాలకు వెళ్ళి సర్వీసు చేయడం చాలా సులభము. రండి, మేము మీకు శివుని జీవిత చరిత్ర తెలియజేస్తామని చెప్పండి. మీరు శివుని పూజిస్తున్నారు, వారి నుండి ఏం వేడుకుంటున్నారు? మేము మీకు వీరి జీవితకథను పూర్తిగా తెలుపుతామని చెప్పండి. మరొక రోజు లక్ష్మీనారాయణుల మందిరానికి వెళ్ళండి. మీకు చాలా సంతోషముంటుంది. పల్లెల సేవ చేయాలని పిల్లలు కోరుకుంటారు. అందరికీ వారి-వారి తెలివితేటలున్నాయి కదా. మొట్టమొదట శివబాబా మందిరాలకు వెళ్ళమని తండ్రి చెప్తున్నారు. తర్వాత లక్ష్మీనారాయణుల మందిరాలకు వెళ్ళి వీరికీ వారసత్వమెలా లభించిందని అడగండి. మీరు వస్తే ఈ దేవతల 84 జన్మల చరిత్ర వినిపిస్తామని చెప్పండి. పల్లెల వారిని కూడా మేల్కొల్పాలి. మీరు వెళ్ళి ప్రేమతో అర్థం చేయించాలి. మీరు ఆత్మలు, మాట్లాడేది కూడా ఆత్మలే. ఈ శరీరము సమాప్తమైపోతుంది. ఇప్పుడు ఆత్మలమైన మనము పావనమై తండ్రి వద్దకు వెళ్ళాలి. తండ్రి - నన్ను స్మృతి చేయమంటున్నారని చెప్పండి. ఈ మాటలు వింటూనే వారికి ఆసక్తి కలుగుతుంది. మీరు ఎంత దేహీ-అభిమానులుగా ఉంటారో అంత మీలో ఆకర్షణ వస్తుంది. ఇప్పుడింకా ఈ పాత ప్రపంచము, ఈ దేహము మొదలైన వాటి పై పూర్తిగా వైరాగ్యము రాలేదు. ఈ పాత దేహము వదలాలని మీకు తెలుసు. అందువలన దీని పై మమకారము ఎందుకుంచాలి? శరీరమున్నా శరీరము పై ఏ మమకారము ఉండరాదు. ఇప్పుడు ఆత్మలమైన మనము పావనమై మన ఇంటికి వెళ్ళాలని మనస్సులో తపన ఉండాలి. తర్వాత ఇప్పుడు ఇటువంటి బాబానెలా వదలాలనిపిస్తుంది. ఇటువంటి బాబా మళ్లీ ఎప్పుడూ లభించరు. ఇటువంటి ఆలోచనలు చేసినందున తండ్రి కూడా గుర్తుకొస్తారు. ఇల్లు కూడా గుర్తుకొస్తుంది. ఇప్పుడు మనము ఇంటికి వెళ్తాము. 84 జన్మలు పూర్తయ్యాయి. అయితే పగలు మీ వ్యాపారాదులు చేసుకోండి. గృహస్థ వ్యవహారములలో ఉండాల్సిందే. అందులో ఉంటున్నా ఇదంతా సమాప్తమవుతుందని బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు మీరు వాపస్‌ ఇంటికి వెళ్ళాలి. తండ్రి చెప్తున్నారు - గృహస్థ వ్యవహారములో కూడా ఉండాలి లేకుంటే ఎక్కడకెళ్తారు? వ్యాపారాలు మొదలైనవి చెయ్యండి. కానీ ఇదంతా వినాశనమవుతుందని బుద్ధిలో ఉండాలి. మొదట మన ఇంటికి వెళ్తాము. తర్వాత సుఖధామములోకి వస్తాము. సమయము దొరికినప్పుడంతా స్వయం మీలో మీరు మాట్లాడుకోవాలి. చాలా సమయముంటుంది, 8 గంటలు వ్యాపారాదులు చెయ్యండి, 8 గంటలు విశ్రాంతి కూడా తీసుకోండి. మిగిలిన 8 గంటలు ఈ తండ్రితో ఆత్మిక సంభాషణ చేసి ఆత్మిక సేవ చేయండి. ఎంత సమయము దొరికితే అంత శివబాబా మందిరాలకు మరియు లక్ష్మీనారాయణుల మందిరాలకు వెళ్ళి సేవ చేయండి. సేవ చేసేందుకు మీకు చాలా మందిరాలు లభిస్తాయి. మీరు ఎక్కడకెళ్లినా శివుని మందిరాలు తప్పకుండా ఉంటాయి. మీకు ముఖ్యమైనది స్మృతియాత్ర. మీరు బాగా స్మృతి చేస్తే మీరు కోరినదంతా లభిస్తుంది. ప్రకృతి దాసిగా అవుతుంది. వారి మొఖము మొదలైనవి కూడా ఆకర్షణ(అలౌకికముగా) చేసే విధంగా అవుతాయి. ఏమీ వేడుకునే అవసరమే ఉండదు. సన్యాసులలో కూడా కొంతమంది పక్కాగా ఉంటారు. మేము పరబ్రహ్మములోకి వెళ్ళి లీనమైపోతామని పక్కాగా విశ్వసిస్తారు. ఈ నిశ్చయములో చాలా పక్కాగా ఉంటారు. ఈ శరీరాన్ని వదిలే అభ్యాసము చేస్తూ ఉంటారు. కాని వారు రాంగ్‌(తప్పు) మార్గములో ఉన్నారు. బ్రహ్మతత్వములో లీనమయ్యేందుకు చాలా శ్రమిస్తారు. భక్తిమార్గములో సాక్షత్కారము కొరకు ఎంతో శ్రమిస్తారు. ప్రాణాలను కూడా అర్పిస్తారు. ఆత్మహత్య జరగదు. శరీరము హత్య చేయబడ్తుంది. ఆత్మ ఉండనే ఉంటుంది. అది వెళ్ళి మరో జీవితాన్ని అనగా మరో శరీరాన్ని తీసుకుంటుంది.
కానీ పిల్లలైన మీరు సేవ చేయాలని కుతూహలముతో ఉంటే తండ్రి కూడా గుర్తుకొస్తారు. ఇక్కడ కూడా మందిరాలు మొదలైనవి చాలా ఉన్నాయి. మీరు బాగా స్మృతి చేసి, యోగము చేసి ఎవరికి తెలిపినా ఎవ్వరూ ఏమీ అనరు. యోగములో ఉన్నవారి బాణము బాగా తగులుతుంది. మీరు చాలా సేవ చేయవచ్చు ప్రయత్నించి చూడండి. కానీ స్వయాన్ని మొదట పరిశీలించుకోండి - నాలో ఎలాంటి మాయా భూతము లేదు కదా? మాయా భూతములున్నవారు ఎవ్వరూ విజయము పొందలేరు. సర్వీసు చాలా ఉంది. బాబా వెళ్ళలేరు కదా. ఎందుకంటే ఆ తండ్రి జతలో ఉన్నారు. ఆ తండ్రిని మురికి, అపవిత్రములోకి ఎలా తీసుకెళ్ళాలి. ఎవరితో మాట్లాడాలి? ఆ తండ్రి పిల్లలతో మాత్రమే మాట్లాడాలనుకుంటారు. అందువలన సర్వీసు చేయవలసింది పిల్లలే. పుత్రుడు తండ్రిని ప్రత్యక్షము చేస్తారనే(సన్‌ షోస్‌ ఫాదర్‌) గాయనము కూడా ఉంది. తండ్రి తన పిల్లలను తెలివిగలవారిగా చేశారు కదా. సర్వీసు చేసేందుకు ఆసక్తి గల మంచి-మంచి పిల్లలు చాలామంది ఉన్నారు. పల్లెలకు వెళ్ళి సేవ చేయమంటారా? అని అడుగుతారు. బాబా భలే చేయమంటారు కేవలం ఫోల్డింగు (మడిచే) చిత్రాలు దగ్గర ఉంచుకోండి. చిత్రాలు లేకుండా ఎవరికి అర్థం చేయించాలన్నా కష్టమే. రాత్రింబవళ్ళు ఇతరుల జీవితాలను ఎలా తయారు చేయాలి, నాలోని చెడు గుణాలను ఎలా తొలగించుకొని ఉన్నతమవ్వాలనే ఆలోచన ఉండాలి, తపన ఉండాలి. మీకు ఖుషీ కూడా ఉంటుంది. బాబా ఇతను 8-9 మాసాల పుత్రుడని అంటారు. ఇటువంటివారు చాలామంది వస్తారు. త్వరగా సేవకు అర్హులుగా అవుతారు. పత్రి ఒక్కరికి నేను నా గామ్రాన్ని ఉన్నతము చేయాలి, నా సోదరుల సేవ చేయాలని పత్రి ఒక్కరికీ ఆలోచన మరియు కోరిక ఉంటుంది(చారిటి బిగిన్స్‌ అట్‌ హోం). సేవ చేయాలనే ఆసక్తి చాలా ఉండాలి. ఒకే చోట ఉండిపోరాదు, తిరుగుతూ ఉండాలి. సమయం చాలా తక్కువగా ఉంది కదా. వారికి పెద్ద పెద్ద మఠాలు, ఆశ్రమాలు తయారౌతాయి. ఏదో ఒక శిక్షణ ఇచ్చే ఆత్మ ప్రవేశిస్తుంది. చాలా గొప్ప పేరు, ప్రతిష్టలు లభిస్తాయి. ఇక్కడ అనంతమైన తండ్రి కల్పక్రితము వలె కూర్చుని శిక్షణనిస్తున్నారు. ఈ ఆత్మల కల్పవృక్షము పెరుగుతుంది. నిరాకార వృక్షము నుండి ఆత్మలు నెంబరువారుగా వస్తారు. శివబాబాగారి మాల లేక వృక్షము చాలా పెద్దదిగా తయారై ఉంది. ఈ విషయాలన్నీ స్మృతి చేయడం వలన కూడా తండ్రి స్మృతి వస్తుంది. త్వరగా ఉన్నతి జరుగుతుంది. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. కనీసము 8 గంటలు తండ్రితో ఆత్మిక సంభాషణ చేసి చాలా నెమ్మదిగా, నమ్రతతో ఆత్మిక సేవ చేయాలి. సేవలో విజయము పొందేందుకు మీలో ఎలాంటి మాయా భూతమూ ఉండరాదు.
2. మీతో మీరే మాట్లాడుకోవాలి - '' మేము ఇప్పుడు చూసేదంతా వినాశనమవుతుంది. మేము మా ఇంటికి వెళ్ళిపోతాము. తర్వాత సుఖధామములోనికి వస్తాము. ''

వరదానము :- '' విశ్వంలో ఈశ్వరీయ పరివార స్నేహమనే బీజాన్ని నాటే విశ్వ సేవాధారీ భవ ''
విశ్వ సేవాధారీ పిల్లలైన మీరు విశ్వములో ఈశ్వరీయ పరివార స్నేహమనే బీజాన్ని నాటుతారు. ఆస్తికులు గానీ, నాస్తికులు గానీ అందరికీ అలౌకిక లేక ఈశ్వరీయ స్నేహాన్ని, నిస్వార్థ స్నేహాన్ని అనుభూతి చేయించడమే విత్తనం నాటడం. ఈ బీజము సహయోగులుగా అయ్యే వృక్షాన్ని స్వతహాగా ఉత్పన్నము చేస్తుంది. అంతేకాక సమయానికి సహయోగులుగా అయ్యే ఫలము కనిపిస్తుంది. అయితే ఒక్కొక్క ఫలము త్వరగా వెలువడ్తుంది, ఒక్కొక్క ఫలము సమయానికి వెలువడ్తుంది.

స్లోగన్‌ :- '' భాగ్యవిధాత అయిన తండ్రిని తెలుసుకోవడం, గుర్తించడం, వారికి డైరక్టు పిల్లలుగా అవ్వడం, అన్నిటికంటే గొప్ప భాగ్యము ''

Saturday, 23 November 2019

Telugu Murli 24/11/2019

24-11-2019 ని అవ్యక్తబాప్‌దాదా కు ఓంశాంతి రివైజ్‌: 12-03-1985 మధువనము

'' సత్యతా శక్తి ''
ఈ రోజు సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు తమ సత్యతా శక్తి స్వరూపులైన పిల్లలను చూస్తున్నారు. సత్యమైన జ్ఞానము లేక సత్యతా శక్తి ఎంత ఉన్నతమైనదో దాని అనుభవం కలిగిన ఆత్మలు మీరు. దూరదేశవాసులైన పిల్లలందరూ భిన్న ధర్మాలు, భిన్న భిన్న విశ్వాసాలు, భిన్న ఆచార వ్యవహారాలలో ఉంటున్నా ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయము వైపుకు లేక రాజయోగము వైపుకు ఎందుకు ఆకర్షితులయ్యారు? సత్యమైన తండ్రి సత్యమైన పరిచయము లభించింది. అనగా సత్యమైన జ్ఞానము లభించింది, సత్యమైన పరివారం లభించింది, సత్యమైన స్నేహం లభించింది, సత్యమైన ప్రాప్తి అనుభవమయింది. అందుకే సత్యతా శక్తి వెనుక ఆకర్షితులయ్యారు. జీవితముంది, ప్రాప్తి కూడా ఉంది, యథాశక్తి జ్ఞానము కూడా ఉంది. కానీ సత్యమైన జ్ఞానము లేదు. కావున సత్యతా శక్తి సత్యమైన తండ్రికి చెందినవారిగా తయారు చేసింది.
సత్యత అన్న పదానికి రెండు అర్థాలున్నాయి. సత్యము అనగా సత్యము, రెండవది సత్యము అనగా నాశనము లేనిది. కావున సత్యతా శక్తి అవినాశి కూడా. కావున అవినాశి ప్రాప్తి, అవినాశి సంబంధాలు, అవినాశి స్నేహము, అవినాశి పరివారము లభించాయి. ఇదే పరివారము 21 జన్మలు భిన్న భిన్న నామ-రూపాలతో కలుస్తూ ఉంటారు. కానీ తెలుసుకోలేరు. మేమే అనేక రకాల సంబంధాలతో పరివారంలోకి వస్తూ ఉంటామని ఇప్పుడు తెలుసుకున్నారు. ఈ అవినాశి ప్రాప్తి, పరిచయము దూరదేశములో ఉంటున్నా తమ సత్యమైన పరివారము, సత్యమైన తండ్రి, సత్యమైన జ్ఞానము వైపుకు ఆకర్షించబడ్డారు. ఎక్కడైతే సత్యత కూడా ఉంటుందో, అవినాశిగా కూడా ఉంటుందో అదే పరమాత్మ గుర్తింపు. కావున ఎలాగైతే మీరందరు ఇదే విశేషత ఆధారంగా ఆకర్షితులయ్యారో అలా సత్యతా శక్తిని, సత్య జ్ఞానమును విశ్వములో ప్రత్యక్షం చేయండి. 50 సంవత్సరాలు ధరణిని తయారు చేసారు, స్నేహములోకి తీసుకొచ్చారు, సంపర్కములోకి తీసుకొచ్చారు. రాజయోగము ఆకర్షణలోకి తీసుకొచ్చారు, శాంతిని అనుభవము చేయించడం ద్వారా ఆకర్షణలోకి తీసుకొచ్చారు. ఇంకేం మిగిలి ఉంది? ఎలాగైతే పరమాత్మ ఒక్కరేనని భిన్న-భిన్న ధర్మాల వారు విశ్వసిస్తారో, అలా యథార్థమైన సత్య జ్ఞానము ఒక్క తండ్రిదే, మార్గమూ ఒక్కటే అనే శబ్ధము ఎప్పటి వరకైతే మారుమ్రోగదో అప్పటివరకు ఆత్మలు అనేక గడ్డిపోచల ఆధారం వైపుకు వెళ్లడం సమాప్తమవ్వదు. ఇప్పుడు ఇది కూడా ఒక మార్గమని, మంచి మార్గమని భావిస్తున్నారు. కానీ చివరికి ఒకే తండ్రి, ఒకే పరిచయాన్ని, ఒకే మార్గమని తెలుసుకుంటారు. అనేకత అనే ఈ భ్రాంతి సమాప్తమవ్వడమే విశ్వశాంతికి ఆధారము. ఈ సత్యతా పరిచయము లేక సత్య జ్ఞానమనే శక్తి యొక్క అల ఎప్పటి వరకైతే నలువైపులా వ్యాపించదో అప్పటివరకు ప్రత్యక్షతా జెండా క్రింద సర్వాత్మలం ఆధారము తీసుకోజాలము. కావున ఈ స్వర్ణిమ జయంతి సందర్భంగా విశేష ఆహ్వానమునిచ్చి తండ్రి ఇంటికి పిలుస్తున్నారు. ఇది మన స్టేజ్‌. ఇక్కడ శ్రేష్ఠ వాతావరణముంది, స్వచ్ఛమైన బుద్ధి యొక్క ప్రభావముంది, స్నేహముతో కూడిన ధరణి ఉంది, పవిత్రమైన పాలన ఉంది. ఇటువంటి వాయుమండలం మధ్య మన సత్య జ్ఞానాన్ని ప్రసిద్ధం చేయడంతో ప్రత్యక్షత ప్రారంభమవుతుంది. ప్రదర్శనల ద్వారా విహంగమార్గ సేవ ప్రారంభమైనప్పుడు ఏం చేసేవారో గుర్తుందా? జ్ఞానములో ముఖ్యమైన ప్రశ్నల ఫారాన్ని నింపించేవారు కదా! అందులో పరమాత్ముడు సర్వవ్యాపి - అవునా? కాదా? గీతా భగవానుడు ఎవరు? ఈ ఫారం నింపించేవారు కదా. అభిప్రాయం వ్రాయించుకునేవారు. చిక్కు ప్రశ్నలు అడిగేవారు. మొదట ఇలా ప్రారంభించారు. కానీ నడుస్తూ నడుస్తూ ఈ విషయాలను గుప్త రూపంలో అందిస్తూ సంపర్కాన్ని, స్నేహాన్ని ముందుంచుతూ సమీపంగా తీసుకొచ్చారు. ఈసారి ఈ ధరణి పైకి వచ్చినప్పుడు సత్య పరిచయమును, స్పష్ట పరిచయమును ఇవ్వండి. ఇది కూడా మంచిదే. ఇదైతే సంతుష్టపరచే విషయం. కానీ ఒకే తండ్రి యొక్క ఒకే యథార్థమైన పరిచయం స్పష్టంగా బుద్ధిలోకి తీసుకొచ్చే సమయాన్ని ఇప్పుడు తీసుకు రావాలి. కేవలం నేరుగా తండ్రి ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు, తండ్రి వచ్చారని చెప్తూ ఉండేవారు. కాని ఇదే పరమాత్ముని జ్ఞానము, ఇక్కడ పరమాత్ముని కర్తవ్యం కొనసాగుతోందని వారు భావించేవారా? జ్ఞానములో నవీనత ఉందని అనుభవం చేసుకుంటున్నారా? ఇటువంటి చర్చను(వర్క్‌షాప్‌ను) ఎప్పుడైనా జరిపారా? పరమాత్ముడు సర్వవ్యాపి అవునా, కాదా? ఒకే సమయంలో వస్తారా? లేక పదే పదే వస్తారా? అన్న స్పష్ట పరిచయము వారికి లభించాలి. తద్వారా ప్రపంచములో వినని దానిని ఇక్కడ విన్నామని భావించాలి. ఈ విధంగా విశేష వక్తలు ఎవరైతే వస్తారో వారితో ఈ జ్ఞాన రహస్యాలను ఆత్మిక సంభాషణ చేయడం ద్వారా వారి బుద్ధిలోకి వస్తాయి. అలాగే మీరు ఏ భాషణలైతే చేస్తారో వాటిలో కూడా తమ పరివర్తనను గురించిన అనుభవాలను వినిపిస్తూ, ఒక్కొక్క వక్త జ్ఞానానికి సంబంధించిన ఒక్కొక్క విషయాన్ని స్పష్టం చేయగలరు. పరమాత్మ సర్వవ్యాపి అవునా, కాదా? అన్న అంశము నేరుగా చెప్పకుండా ఒకే తండ్రిని, ఒకే రూపం ద్వారా తెలుసుకోవడం వలన ఏ ఏ విశేష ప్రాప్తులు లభించాయో ఆ ప్రాప్తులను వినిపిస్తూ, సర్వవ్యాపి కారు అన్న విషయం స్పష్టం చేయగలరు. ఒకే పరంధామ నివాసిగా భావించి స్మృతి చేయడం వలన ఏ విధంగా బుద్ధి ఏకాగ్రమవుతుందో లేక తండ్రి సంబంధం ద్వారా ఏ ప్రాప్తులు అనుభవమవుతాయో అర్థం చేయించాలి. ఈ విధంగా సత్యత మరియు నిర్మానత(నిరహంకారత) రెండు రూపాల ద్వారా నిరూపించగలరు. దీని ద్వారా వీరు తమ మహిమ చేసుకుంటున్నారని అభిమానం కూడా అనిపించదు. నమ్రత మరియు దయా భావన అభిమానంగా అనిపించదు. మురళీలు వినేటప్పుడు దానిని అభిమానంగా చెప్తున్నారని ఎవ్వరూ అనలేరు. అథారిటీతో చెప్తున్నారనే అంటారు. పదాలు ఎంత కఠినంగా ఉన్నా దానిని అభిమానమని అనరు. అథారిటీని అనుభవం చేస్తారు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎంతెంత అథారిటీ ఉంటుందో అంత నమ్రత మరియు దయా భావాలున్నాయి. తండ్రి అయితే ఈ విధంగా పిల్లల ముందే మాట్లాడ్తారు. కానీ మీరందరూ ఈ విశేషతతో స్టేజి పైన ఈ విధి ద్వారా స్పష్టం చేయగలరు. ఏ విధంగా వినిపించారో అలాగే ఒకటి - సర్వవ్యాపి అన్న విషయాన్ని ఉంచండి, రెండవది - నామ-రూపాలకు అతీతుడు అన్న విషయాన్ని ఉంచండి. మూడవది - డ్రామా. డ్రామా పాయింట్లు బుద్ధిలో ఉంచుకోవాలి. ఆత్మ యొక్క క్రొత్త విశేషతలను బుద్ధిలో ఉంచుకోవాలి. విశేషమైన అంశాలేవైతే ఉన్నాయో వాటిని లక్ష్యంగా ఉంచుకొని అనుభవము మరియు ప్రాప్తుల ఆధారంగా స్పష్టం చేస్తూ వెళ్ళండి. తద్వారా ఈ సత్య జ్ఞానము ద్వారానే సత్యయుగ స్థాపన జరుగుతోందని అర్థం చేసుకోవాలి. భగావానువాచలో, భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ వినిపించలేని విశేషత ఏమిటో అర్థం చేసుకోవాలి. మనుష్యులు ఎప్పుడూ మనుష్యులకు సద్గురువుగా, సత్యమైన తండ్రిగా అవ్వజాలరని, మనుష్యులు పరమాత్మ అవ్వజాలరని మీరు స్పష్టమైన పదాలతో స్లోగన్లను చెప్తారో అలా ఏ విశేష పాయింట్లనైతే సమయానుసారంగా వింటూ వచ్చారో దాని రూపురేఖ చేసుకోండి. దాని ద్వారా సత్యమైన జ్ఞానము స్పష్టమవ్వాలి. క్రొత్త ప్రపంచము కొరకు ఇది క్రొత్త జ్ఞానము. దీని ద్వారా నవీనత మరియు సత్యత ఈ రెండూ అనుభవమవ్వాలి. మీరు సమ్మేళనాలు(కాన్ఫరెన్సులు) చేస్తారు. వాటి ద్వారా మంచి సేవ జరుగుతుంది. కాన్ఫరెన్సు ద్వారా ఒకసారి చార్టరు, ఒకసారి మరొక సాధనాన్ని తయారుచేస్తారు. వాటి ద్వారా కూడా సంపర్కాన్ని ముందుకు తీసుకెళ్లే సాధనాన్ని స్వంతం చేసుకుంటారు. ఈ సాధనాలు కూడా మంచివే. ఎందుకంటే తర్వాత కూడా కలుస్తూ ఉండే అవకాశం లభిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఇవి చాలా మంచి విషయాలని, ప్లాను బాగుందని చార్టరు బాగుందని, సేవా సాధనాలు బాగున్నాయని ఏ విధంగా అంటున్నారో, అలా ఈ రోజు క్రొత్త జ్ఞానము స్పష్టమయిందని అనాలి. ఇలా విశేషంగా ఐదారుగురిని తయారు చేయాలి. ఎందుకంటే అందరి మధ్యలో ఈ సంభాషణ జరగజాలదు. విశేషంగా ఎవరైతే వస్తారో, టికెట్‌ను ఇచ్చి తీసుకొస్తారో వారికి విశేష పాలన కూడా లభిస్తుంది. వారిలో ఎవరైతే ప్రసిద్ధులుగా ఉంటారో వారితో ఈ ఆత్మిక సంభాషణ చేసి తప్పకుండా వారి బుద్ధిలో స్పష్టం చేయవలసిన అవసరముంది. ఇటువంటి ప్లాను ఏదైనా తయారు చేయండి. తద్వారా వారికి, మీలో నశా చాలా ఉందన్న భావనే కాక, ఇది సత్యమైనదని అనిపించాలి. దీనినే బాణమ తగలాలి, బాధ ఉండరాదని అంటారు. బాధతో అరవరాదు. సంతోషంతో నాట్యం చేయాలి. ఉపన్యాసాల రూపురేఖలను కూడా కొత్తగా తయారు చేయండి. విశ్వశాంతికి సంబంధించిన చాలా ఉపన్యాసాలు చేసారు. ఇప్పుడు ఆధ్యాత్మికత అవసరముంది. ఆధ్యాత్మిక శక్తి లేకుండా ఏమీ జరగజాలదు. ఈ విషయం వార్తాపత్రికలలో వస్తుంది. కానీ ఆధ్యాత్మిక శక్తి అంటే ఏమిటో, ఆధ్యాత్మిక జ్ఞానమంటే ఏమిటో, దీనికి మూలం ఎవరో అక్కడ వరకు చేరుకోలేదు. భగవంతుని కార్యం జరుగుతోందని అర్థం చేసుకోవాలి. ఇప్పుడైతే మాతలు చాలా మంచి కార్యం చేస్తున్నారని అంటున్నారు. సమయానుసారం ఈ భూమిని కూడా తయారు చేయాలి. ఎలాగైతే పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేస్తారో, అలా తండ్రి పిల్లలను ప్రత్యక్షం చేస్తారు. ఇప్పుడు తండ్రి పిల్లలను ప్రత్యక్షం చేస్తున్నారు. కావున ఈ పెద్ద శబ్ధము ప్రత్యక్షతా జెండాను ఎగురవేస్తుంది. అర్థమయిందా!
స్వర్ణిమ జయంతి సందర్భంగా ఏం చెయ్యాలో అర్థమయింది కదా! ఇతర స్థానాలలో అయితే వాతావరణాన్ని చూడవలసి ఉంటుంది. కానీ తండ్రి ఇంటిలో..... ఇది మన ఇల్లు, మన స్టేజ్‌ కావున ఇటువంటి స్థానంలో ఈ ప్రత్యక్షతా శబ్ధాన్ని మారుమ్రోగించగలరు. ఈ విధంగా కొద్దిమందైనా ఈ విషయంలో నిశ్చయబుద్ధి గలవారిగా అయితే వారే ఆ శబ్ధాన్ని ప్రఖ్యాతం చేయగలరు. ఇప్పుడు రిజల్టు ఎలా ఉంది? ఇప్పుడు సంపర్కము మరియు స్నేహంలోకి వారంతకు వారే వచ్చి సేవ చేస్తున్నారు. ఇతరులను కూడా స్నేహ సంపర్కాలలోకి తీసుకొస్తున్నారు. ఎంతవరకు స్వయం తయారయ్యారో అంత సేవ కూడా చేస్తున్నారు. దీనిని కూడా సఫలత అనే అంటారు కదా! కాని ఇప్పుడింకా ముందుకు వెళ్లాలి. మొదట పేరు చెడ్డ పేరుతో(చెడుగా) మారుమ్రోగింది. ఇంతకు ముందు భయపడేవారు. ఇప్పుడు రావాలనుకుంటున్నారు. ఈ తేడా అయితే వచ్చింది కదా! ఇంతకుముందు పేరు వినేందుకు కూడా ఇష్టపడేవారు కాదు. ఇప్పుడు ఆ పేరును ప్రస్తావించాలని కోరుకుంటున్నారు. యాభై సంవత్సరాలలో ఈ సఫలతను పొందారు. ధరణిని తయారు చేయడంలో సమయం పడ్తుంది. ఇందులోనే 50 సంవత్సరాలు పడితే ఇంకేమవుతుందని అనుకోకండి. మొదట నాగలి నడిపించి ధరణిని యోగ్యంగా చేయడంలో సమయం పడ్తుంది. బీజాలను నాటడంలో సమయం పట్టదు. శక్తిశాలి బీజానికి శక్తిశాలి ఫలము వెలువడ్తుంది. ఇప్పటివరకు ఏదైతే జరిగిందో, అది జరగవలసి ఉంది. అదే యథార్థంగా జరిగింది. అర్థమయిందా!
(విదేశీ పిల్లలను చూసి) ఈ ఛాత్రకులు బాగున్నారు. బ్రహ్మాబాబా చాలాకాలం ఆహ్వానం తర్వాత మీకు జన్మనిచ్చారు. విశేష ఆహ్వానము ద్వారా మీరు జన్మించారు. ఆలస్యం అయితే తప్పకుండా జరిగింది. కానీ ఆరోగ్యంగా, మంచిగా జన్మించారు. తండ్రి పిలుపు చేరుకుంది కానీ సమయం వచ్చినప్పుడు సమీపానికి వచ్చి చేరుకున్నారు. విశేషంగా బ్రహ్మాబాబా సంతోషిస్తారు. తండ్రి సంతోషిస్తే పిల్లలు కూడా సంతోషిస్తారు. కానీ విశేషంగా బ్రహ్మాబాబా స్నేహముంది. కావున మెజారిటి బ్రహ్మబాబాను చూడకపోయినా చూసినట్లుగానే అనుభవం చేసుకుంటున్నారు. చిత్రములో కూడా చైతన్యతను అనుభవం చేసుకుంటారు. ఇది విశేషత. బ్రహ్మబాబా విశేష స్నేహము, సహయోగము ఆత్మలైన మీకు లభించింది. బ్రహ్మలోనే ఎందుకు? ఇక్కడే ఎందుకు? అని భారతదేశంవారు ప్రశ్నిస్తారు. కానీ విదేశీ పిల్లలు వస్తూనే బ్రహ్మబాబా ఆకర్షణలో బంధింపబడ్తారు. కావున ఇది విశేష సహయోగము యొక్క వరదానము. కావున చూడకపోయినా, పాలన ఎక్కువగా అనుభవం చేస్తూ ఉంటారు. బ్రహ్మబాబా అని హృదయపూర్వకంగా అంటారు. కావున ఇది విశేష సూక్ష్మ స్నేహానికి సంబంధించింది. వీరు మా వెనుక ఎలా వచ్చారని తండ్రి ఆలోచించరు. మీరూ ఆలోచించరు, బ్రహ్మా ఆలోచించరు. ఎదురుగానే ఉన్నారు. ఆకార రూపము కూడా సాకార సమానంగా పాలన అందిస్తోంది. ఆ విధంగా అనుభవం చేస్తున్నారు కదా! కొద్ది సమయంలో ఎంతమంది టీచర్లు తయారయ్యారు! విదేశీ సేవలో ఎంత సమయం గడిచింది? ఎంతమంది టీచర్లు తయారయ్యారు? బాగుంది. బాప్‌దాదా పిల్లల సేవా లగ్నాన్ని చూస్తూ ఉంటారు ఎందుకంటే విశేషమైన సూక్ష్మ పాలన లభిస్తోంది కదా! బ్రహ్మబాబాలో ఏ విశేష సంస్కారాన్ని చూశారు? సేవ లేకుండా వారు ఉండగలిగేవారా? కావున విదేశాలలో దూరంగా ఉండేవారికి ఈ విశేష పాలన యొక్క సహయోగమున్న కారణంగా సేవ చేయాలనే ఉల్లాసం ఎక్కువగా ఉంటుంది.
స్వర్ణిమ జయంతిలో ఇంకా ఏం చేశారు? స్వయం కూడా స్వర్ణిమంగా అయ్యారు మరియు జయంతి కూడా స్వర్ణిమ జయంతిగా జరుపుకున్నారు. బాగుంది. బ్యాలెన్సు(సమతుల్యత) పై అటెన్షన్‌ తప్పకుండా ఉంచండి. స్వయం మరియు సేవ. స్వ ఉన్నతి మరియు సేవా ఉన్నతి. బ్యాలన్స్‌ ఉంచడం ద్వారా అనేక ఆత్మలకు స్వ సహితంగా దీవెనలు ప్రాప్తింపజేసేందుకు నిమిత్తంగా అయిపోతారు. అర్థమయిందా! సేవకు ప్లాను తయారుచేస్తూ మొదట స్వస్థితి పై అటెన్షన్‌ ఉంచాలి. అప్పుడు ప్లానులో శక్తి నిండుతుంది. ప్లాను(ప్రణాళిక) బీజము వంటిది. కావున బీజములో ఒకవేళ శక్తి లేకుంటే, శక్తిశాలి బీజము కాకపోతే ఎంతగా శ్రమ చేసినా శ్రేష్ఠ ఫలమునివ్వదు. కావున ప్లానుతో పాటుగా స్వ స్థితిలో తప్పకుండా శక్తిని నింపుకుంటూ ఉండండి. మంచిది.
ఇలా సత్యతను పత్య్రక్షం చేసేవారికి, సదా సత్యత మరియు నమత్రల బ్యాలెన్స్‌ ఉంచేవారికి, పత్రి మాట ద్వారా ఒక్క తండి పరిచయాన్ని నిరూపించేవారికి, సదా స్వ ఉన్నతి ద్వారా సఫలతను పొందేవారికి, సేవలో తండి పత్య్రక్షతా జెండాను ఎగురవేసేవారికి, ఇటువంటి సద్గురువు, సత్యమైన తండి యొక్క సత్యమైన పిల్లలకు బాప్‌దాదాల పియ్రస్మృతులు మరియు నమస్తే.
వీడ్కోలు సమయంలో దాదీజీ భోపాల్‌ వెళ్లేందుకు శెలవు తీసుకుంటున్నారు :-
వెళ్లడంలో కూడా సేవ ఉంది, ఉండడంలో కూడా సేవ ఉంది. సేవకు నిమిత్తంగా అయిన పిల్లల ప్రతి సంకల్పంలో, ప్రతి సెకనులో సేవ ఉంది. మిమ్ములను చూసి ఎంతగా ఉల్లాస ఉత్సాహాలు పెరుగుతాయో అంతగా తండ్రిని స్మృతి చేస్తారు. సేవలో ముందుకు వెళ్తారు. కావున సఫలత సదా జతలో ఉండనే ఉంది. తండ్రిని కూడా వెంట తీసుకెళ్తున్నారు. సఫలతను కూడా జతలో తీసుకు వెళ్తున్నారు. ఏ స్థానానికి వెళ్తారో, అక్కడ సఫలత ఉంటుంది. (మోహినీ బెహన్‌తో) నలువైపులా తిరిగేందుకు వెళ్తున్నారు. తిరగడం అనగా అనేక ఆత్మలకు స్వ ఉన్నతి యొక్క సహయోగమునివ్వడం. తోడు తోడుగా స్టేజ్‌ పై అవకాశము లభించినప్పుడు క్రొత్త ఉపన్యాసములాంటిది(భాషణ) చేసి రండి. మొదట మీరు ప్రారంభించండి, నెంబర్‌వన్‌గా అయిపోతారు. ఎక్కడికి వెళ్లినా అందరూ ఏమంటారు? బాప్‌దాదా ప్రియస్మృతులు తీసుకొచ్చారా? కావున ఎలాగైతే బాప్‌దాదా స్నేహము, సహయోగాల శక్తినిస్తారో, అలా మీరు కూడా తండ్రి నుండి తీసుకున్న స్నేహము, సహయోగ శక్తులను ఇస్తూ వెళ్లండి. అందరినీ ఉత్సాహ-ఉల్లాసాలలోకి ఎగిరింపజేసేందుకు ఆకర్షించేటట్లుగా మాట్లాడుతూ ఉండండి. అందరూ సంతోషంగా నాట్యము చేస్తూ ఉంటారు. ఆత్మీయతా సంతోషంలో అందరినీ నాట్యం చేయించండి మరియు రమణీకత ద్వారా అందరికీ చాలా సంతోషంతో పురుషార్థంలో ముందుకు వెళ్లడం నేర్పించండి. మంచిది.

వరదానము :- '' స్వంత చక్రాన్ని(స్వదర్శన చక్రాన్ని) తెలుసుకొని జ్ఞానయుక్త ఆత్మగా అయ్యి ప్రభు ప్రియగా అవ్వండి ''
ఆత్మకు ఈ సృష్టి చక్రంలో ఏ ఏ పాత్ర ఉందో దానిని తెలుసుకోవడం అనగా స్వదర్శన చక్రధారిగా అవ్వడం. పూర్తి చ జ్ఞానాన్ని బుద్ధిలో యథార్థ రీతిగా ధారణ చేయడమే స్వదర్శన చక్రమును నడిపించడం. స్వంత చక్రమును తెలుసుకోవడం అనగా జ్ఞానయుక్త ఆత్మగా అవ్వడం. అటువంటి జ్ఞానయుక్త ఆత్మలే ప్రభు ప్రియులు. వారి ముందు మాయ నిలబడజాలదు. ఈ స్వదర్శన చక్రమే భవిష్యత్తులో చక్రవర్తి రాజుగా తయారు చేస్తుంది.

స్లోగన్‌ :- '' ప్రతి పుత్రుడు తండ్రి సమానం ప్రత్యక్ష ప్రమాణంగా అయితే ప్రజలు త్వరగా తయారవుతారు.''

Friday, 22 November 2019

Telugu Murli 23/11/2019

23-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - సంగమ యుగము అదృష్టవంతులుగా తయారయ్యే యుగము. ఈ యుగములో మీరు మీ భాగ్య నక్షత్రాన్ని ఎంత కావాలంటే అంత మెరియునట్లు చేసుకోగలరు ''

ప్రశ్న :- మీ పురుషార్థాన్ని తీవ్రంగా చేసుకునే సాధనము ఏది ?
జవాబు :- (ఫాలో ఫాదర్‌). తండ్రిని అనుసరిస్తూ ఉంటే పురుషార్థము తీవ్రమవుతుంది. తండ్రినే చూడండి. తల్లి అయితే గుప్తంగా ఉంది. తండ్రిని ఫాలో చేస్తే తండ్రి సమానంగా ఉన్నతంగా అవుతారు. కనుక ఆక్యురేట్‌(ఖచ్ఛితం)గా ఫాలో చేస్తూ ఉండండి.

ప్రశ్న :- తండ్రి ఏ పిల్లలను మందమతి(తెలివితక్కువ వారు) అని భావిస్తారు ?
జవాబు :- ఎవరికైతే తండ్రి లభించారనే సంతోషము ఉండదో వారు తెలివితక్కువ వారే కదా! విశ్వానికి యజమానిగా తయారుచేసే తండ్రికి పుత్రునిగా అయిన తర్వాత కూడా సంతోషం ఉండకపోతే మందమతి అనే అంటారు కదా.

ఓంశాంతి. మధురాతి మధురమైన పిల్లలూ! మీరు లక్కీ సితారలు(భాగ్యశాలి నక్షత్రాలు). మనము శాంతిధామాన్నే కాక తండ్రిని కూడా స్మృతి చేస్తామని మీకు తెలుసు. తండ్రి స్మృతి ద్వారా మనము పవిత్రంగా అయ్యి ఇంటికి వెళ్తాము. ఇక్కడ కూర్చొని ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు కదా. తండ్రి ఇక ఏ కష్టమూ ఇవ్వరు. జీవన్ముక్తి గురించి ఎవ్వరికీ తెలియదు. వారందరూ ముక్తి కొరకు పురుషార్థము చేస్తారు. కానీ ముక్తి అంటే ఏమిటో అర్థమే తెలియదు. కొందరు మేము బ్రహ్మములో లీనమైపోతాము, మళ్లీ ఇక్కడకు రానే రాము అని అంటారు కానీ ఈ చక్రములోకి తప్పకుండా రావాలని వారికి తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ విషయాలన్నీ అర్థము చేసుకున్నారు. స్వదర్శన చక్రధారులైన మనము భాగ్యశాలి నక్షత్రాలమని పిల్లలైన మీకు తెలుసు. అదృష్టవంతులను లక్కీ అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మిమ్ములను తండ్రియే అదృష్టవంతులుగా తయారు చేస్తున్నారు. తండ్రి ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు. కొందరి తండ్రులు ధనవంతులుగా, కొందరి తండ్రులు పేదవారుగా కూడా ఉంటారు. మనకు అనంతమైన తండ్రి లభించారని పిల్లలైన మీకు తెలుసు. ఎంత లక్కీగా తయారవ్వాలనుకుంటే అంత లక్కీగా తయారవ్వగలరు. ఎంత ధనవంతులుగా అవ్వాలనుకుంటే అంత ధనవంతులుగా అవ్వగలరు. ఏది కావాలన్నా పురుషార్థము ద్వారా తీసుకోండి అని తండ్రి అంటున్నారు. మొత్తం పురుషార్థం పైననే ఆధారపడి ఉంది. పురుషార్థం చేసి ఎంత ఉన్నత పదవి తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. అత్యంత ఉన్నత పదవి - ఈ లక్ష్మీ నారాయణులు. స్మృతి చార్టు తప్పకుండా ఉంచుకోవాలి. ఎందుకంటే తమోప్రధానము నుండి తప్పకుండా సతోప్రధానంగా అవ్వాలి. మందమతిగా తయారై అలాగే కూర్చోరాదు. ఇప్పుడు పాత ప్రపంచము కొత్తదిగా అవుతుందని తండ్రి అర్థం చేయించారు. సతోప్రధాన కొత్త ప్రపంచానికి తీసుకెళ్లేందుకే తండ్రి వస్తారు. వారు అనంతమైన తండ్రి, అనంతమైన సుఖమునిచ్చేవారు. సతోప్రధానంగా తయారవుతేనే అనంతమైన సుఖమును పొందగలరని అర్థం చేయిస్తున్నారు. సతోగా అయితే తక్కువ సుఖము, రజోగా అయితే అంతకన్నా తక్కువ సుఖము. మొత్తం లెక్కాచారమంతా తండ్రి చెప్పేస్తారు. మీకు లెక్కలేనంత ధనం లభిస్తుంది, అనంతమైన సుఖము లభిస్తుంది. అనంతమైన తండ్రి నుండి వారసత్వము పొందేందుకు తండ్రిని స్మృతి చేయడం తప్ప వేరే ఏ ఉపాయమూ లేదు. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, అంత దైవీగుణాలు కూడా ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. సతోప్రధానంగా అవ్వాలంటే దైవీగుణాలు కూడా తప్పకుండా కావాలి. తమను తామే చెక్‌ చేసుకోవాలి. పురుషార్థం ద్వారా ఎంత ఉన్నత పదవి కావాలన్నా తీసుకోవచ్చు. చదివించే టీచరు కూర్చొని ఉన్నారు. తండ్రి అంటున్నారు - కల్ప-కల్పము మీకు ఇలాగే అర్థం చేయిస్తాను. కేవలం రెండే మాటలు - మన్మనాభవ, మధ్యాజీభవతో అనంతమైన తండ్రిని గుర్తించగలరు. ఈ అనంతమైన తండ్రే అనంతమైన జ్ఞానమును ఇచ్చేవారు. పతితుల నుండి పావనంగా అయ్యే మార్గాన్ని కూడా ఆ బేహద్‌ తండ్రియే అర్థం చేయిస్తారు. కనుక తండ్రి కొత్త విషయమునేమీ అర్థం చేయించడం లేదు. పిండిలో ఉప్పు వలె గీతలో కూడా వ్రాసి ఉంది. స్వయాన్ని దేహీ(ఆత్మ)గా భావించండి. దేహమునకు సంబంధించిన అన్ని ధర్మాలు మర్చిపోండి. మీరు మొదట అశరీరిగా ఉండేవారు. ఇప్పుడు అనేక రకాల బంధు-మిత్రుల బంధనాలలోకి వచ్చారు. అందరూ తమోప్రధానంగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ సతోప్రధానంగా అవ్వాలి. ఇప్పుడు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతామని తర్వాత బంధు-మిత్రులు మొదలైన వారందరూ పవిత్రంగా అవుతారని మీకు తెలుసు. కల్పక్రితం ఎంత సతోప్రధానంగా అయ్యారో మళ్లీ అంతే అవుతారు. వారి పురుషార్థమే అలా ఉంటుంది. ఇప్పుడు ఎవరిని ఫాలో చేయాలి? ఫాలోఫాదర్‌ అని గాయనముంది. ఇతడు(బ్రహ్మబాబా) ఎలాగైతే తండ్రిని స్మృతి చేస్తారో, పురుషార్థం చేశారో అదే విధంగా ఇతనిని అనుసరించండి. అయితే పురుషార్థం చేయించేవారు తండ్రియే. వారు పురుషార్థం చేయరు, చేయిస్తారు. వారు మళ్లీ చెప్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ, ఫాలోఫాదర్‌. గుప్తమైన తల్లి, తండ్రి ఉన్నారు కదా! తల్లి గుప్తంగా ఉన్నారు, తండ్రి అయితే కనిపిస్తారు. ఇది చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఇటువంటి ఉన్నత పదవి పొందాలంటే ఈ ఫాదర్‌(బ్రహ్మ) స్మృతి చేసే విధంగా తండ్రిని బాగా స్మృతి చేయండి. ఈ ఫాదరే(బ్రహ్మ) అందరికంటే ఉన్నత పదవి పొందుతారు. ఇతను చాలా ఉన్నతంగా ఉండేవాడు తర్వాత ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమ సమయములో నేను ప్రవేశించాను. ఈ విషయము బాగా గుర్తుంచుకోండి, మర్చిపోకండి. మాయ చాలామందిని మరపింపజేస్తుంది. మీరు నరుని నుండి నారాయణగా అవుతామని అంటారు. అలా అయ్యేందుకు కూడా తండ్రి యుక్తిని తెలియజేస్తారు. అందరూ ఆక్యురేట్‌(ఖచ్ఛితం)గా తండ్రిని ఫాలో చేయరని కూడా మీకు తెలుసు. తండ్రి లక్ష్యమును తెలియజేస్తారు. ఫాలోఫాదర్‌ అనేది ఇప్పటి గాయనమే. తండ్రి కూడా ఇప్పుడే పిల్లలకు జ్ఞానం ఇస్తారు. సన్యాసుల ఫాలోయర్స్‌ అని పిలువబడ్తారు. కానీ అది రాంగ్‌ కదా! వారు ఫాలో చేయనే చేయరు. వారందరూ బ్రహ్మజ్ఞానులు, తత్వజ్ఞానులు. వారికి ఈశ్వరుడు జ్ఞానమునివ్వరు. వారు తత్వము లేక బ్రహ్మజ్ఞానులని పిలువబడ్తారు. అయితే తత్వము అనగా బ్రహ్మము వారికి జ్ఞానమునివ్వదు. అదంతా శాస్త్రాల జ్ఞానము. ఇక్కడ మీకు తండ్రి జ్ఞానమునిస్తారు. వారిని జ్ఞానసాగరులని అంటారు. దీనిని బాగా నోట్‌ చేసుకోండి. ఇది హృదయంలో చాలా బాగా ధారణ చేసే విషయమని మీరు మర్చిపోతారు. తండ్రి ప్రతిరోజూ - మధురమైన పిల్లలూ! స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి, ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్లాలని అర్థం చేయిస్తూ ఉంటారు. పతితులుగా ఉంటే వెళ్లలేరు. పవిత్రంగా అవ్వాలంటే యోగబలముతో అవ్వాలి లేకుంటే శిక్షలు అనుభవించి వెళ్తారు. అందరి లెక్కాచారాలు తప్పకుండా చుక్తా అవ్వాల్సింది. ఆత్మలైన మీరు వాస్తవానికి పంరంధామములో ఉండేవారు అని తండ్రి అర్థం చేయించారు. ఇక్కడకు వచ్చి సుఖ - దు:ఖాల పాత్రను అభినయించారు. రామరాజ్యంలో సుఖప్రదమైన పాత్ర, రావణరాజ్యంలో దు:ఖ పాత్రను చేశారు. రామరాజ్యమని స్వర్గాన్ని అంటారు. అక్కడ పూర్తిగా సుఖమే ఉంటుంది. స్వర్గవాసులు మరియు నరకవాసులు అని పాడ్తారు కూడా. కనుక ఇది బాగా ధారణ చేయాలి - ఎంతెంత తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతూ ఉంటారో మీకు లోపల అంత సంతోషము కూడా ఉంటుంది. ద్వాపరంలో రజోలో ఉన్నప్పుడు కూడా మీరు సంతోషంగానే ఉండేవారు. అప్పుడు మీరు ఇంత దు:ఖితులుగా, వికారులుగా లేరు. ఇప్పుడు ఇక్కడ ఎంత దు:ఖితులుగా, వికారులుగా ఉన్నారు! ఎంత వికారులుగా, త్రాగుబోతులుగా ఉన్నారో మీరు మీ పెద్దవారిని చూడండి. మద్యము చాలా చెడ్డది. సత్యయుగంలో అయితే శుద్ధ ఆత్మలే ఉంటారు. తర్వాత క్రిందికి దిగుతూ దిగుతూ పూర్తి ఛీ-ఛీగా అయిపోతారు. అందుకే దీనిని రౌరవ నరకమని అంటారు. మద్యము(సారాయి) ఎటువంటిదంటే కొట్లాటలు, చంపుకోవడం వంటి హాని చేసేందుకు కూడా ఆలస్యం చేయరు. ఈ రోజుల్లో మనుష్యుల బుద్ధి భ్రష్ఠమైపోయింది. మాయ చాలా బలమైనది. తండ్రి సర్వశక్తివంతుడు, సుఖమునిచ్చేవారు. మాయ చాలా దు:ఖమునిస్తుంది. కలియుగంలో మనుష్యుల స్థితి పూర్తిగా శిథిలమైపోతుంది. రాతిబుద్ధి వలె ఏమీ అర్థమే చేసుకోరు. ఇది కూడా డ్రామాయే కదా. అదృష్టంలో లేకుంటే ఇటువంటి రాతిబుద్ధి గలవారిగా అయిపోతారు. తండ్రి జ్ఞానాన్ని చాలా సహజంగా అర్థం చేయిస్తారు. పిల్లలూ! పిల్లలూ! అంటూ అర్థము చేయిస్తూ ఉంటారు. మాతలు కూడా ''మాకు 5 మంది లౌకిక పుత్రులు, ఒకరు పారలౌకిక పుత్రుడు అని చెప్తారు.'' ఆ పుత్రుడు మమ్ములను సుఖధామానికి తీసుకెళ్లేందుకు వచ్చారు అని అంటారు. తండ్రి అర్థము చేసుకుంటే పిల్లలు కూడా అర్థము చేసుకుంటారు. ఇంద్రజాలికుడు వచ్చారు కదా! తండ్రి ఇంద్రజాలికుడైతే పిల్లలు కూడా ఇంద్రజాలికులవుతారు. బాబా మాకు కొడుకు కూడా అని అంటారు కనుక ఆ తండ్రిని ఫాలో చేసి ఇలా తయారవ్వాలి. స్వర్గంలో వీరి రాజ్యమే ఉండేది కదా. శాస్త్రాలలో ఈ విషయాలే లేవు. ఈ భక్తిమార్గ శాస్త్రాలు కూడా డ్రామాలో ఉన్నాయి. మళ్లీ కూడా ఉంటాయి. ఇది కూడా తండ్రి అర్థం చేయిస్తున్నారు. చదివించేందుకు టీచరు కావాలి కదా. పుస్తకాలు టీచరుగా అవ్వలేవు. పుస్తకాలే టీచరైతే, టీచరు అవసరమే ఉండదు. ఈ పుస్తకాలు మొదలైనవి సత్యయుగంలో ఉండవు.
మీరు ఆత్మను తెలుసుకున్నారు కదా. ఆత్మల తండ్రి కూడా తప్పకుండా ఉన్నారు. ఎవరైనా వస్తే అందరూ హిందు-ముస్లిమ్‌ భాయీ-భాయీ అని అంటారు. కానీ దాని అర్థము కొంచెము కూడా తెలియదు. భాయీ-భాయీ అంటే అర్థము తెలుసుకోవాలి కదా. తప్పకుండా వారికి తండ్రి కూడా ఉంటాడు. పైసా అంత తెలివి కూడా లేకుండా పోయింది. భగవానువాచ - ఇది చాలా జన్మల అంతిమ జన్మ. అర్థం ఎంత స్పష్టంగా ఉంది. ఎవరూ గ్లాని చేయరు. తండ్ర్రి అయితే మార్గము తెలియజేస్తారు. నంబరువన్‌లో ఉన్నవారే లాస్ట్‌గా, తెల్లగా ఉన్నవారే నల్లగా అవుతారు. మేము తెల్లగా ఉండేవారము, మళ్లీ అలా అవుతామని మీకు కూడా తెలుసు. ఇది రావణ రాజ్యము. రామరాజ్యాన్ని శివాలయమని అంటారు. సీత యొక్క రాముడు త్రేతాలో రాజ్యము చేశాడు. ఇందులో కూడా జ్ఞాన విషయముంది. రెండు కళలు తగ్గాయని అంటారు. సత్యయుగము ఉన్నతమైనది. సత్యయుగాన్ని గుర్తు చేసుకున్నంతగా త్రేతా, ద్వాపర యుగాలను గుర్తు చేసుకోరు. సత్యయుగము కొత్త ప్రపంచము, కలియుగము పాత ప్రపంచము. నూరు శాతము సుఖము, నూరు శాతము దు:ఖము. త్రేతా మరియు ద్వాపరము సెమీ(మధ్యస్థము). కనుక ముఖ్యంగా సత్యయుగము మరియు కలియుగము చెప్పుకోబడ్తాయి. తండ్రి సత్యయుగాన్ని స్థాపన చేస్తున్నారు. ఇప్పుడు మీ పని పురుషార్థం చేయడం. సత్యయుగ నివాసులుగా అవుతారా? త్రేతాయుగ నివాసులుగా అవుతారా? ద్వాపరంలో కిందికి దిగుతారు అయినా దేవీ దేవతా ధర్మము వారిగానే ఉంటారు. కానీ పతితులైన కారణంగా తమను దేవీ దేవతలమని చెప్పుకోలేరు. తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు రోజూ అర్థం చేయిస్తూ ఉంటారు - మన్మనాభవయే ముఖ్యమైనది. మీరే నంబరువన్‌గా అవుతారు. 84 జన్మల చక్రంలో తిరుగుతూ చివరికి వచ్చేస్తారు మళ్లీ నంబరువన్‌లోకి వెళ్తారు. ఇప్పుడు బేహద్‌ తండ్రిని స్మృతి చేయాలి. వారు అనంతమైన తండ్రి. వారు సంగమ యుగములోనే వచ్చి మీకు 21 తరాల స్వర్గ సుఖాన్ని ఇస్తారు. అక్కడ ఆయువు పూర్తి అవ్వగానే మీ అంతట మీరే శరీరాన్ని వదిలేస్తారు. యోగబలం కదా. పద్ధతియే ఆ విధంగా రచింపబడి ఉంది. దీనినే యోగబలము అని అంటారు. అక్కడ జ్ఞానమే ఉండదు. ఆటోమేటిక్‌గా మీరు వృద్ధులుగా అవుతారు. అక్కడ అస్వస్థత మొదలైనవి ఉండవు. ఎవ్వరూ జబ్బుపడరు. అక్కడ కుంటివారు లేక వికలాంగులు మొదలైనవారు ఉండరు. ఎవర్‌హెల్దీగా(సదా ఆరోగ్యంగా) ఉంటారు. అక్కడ దు:ఖానికి నామ-రూపాలు కూడా ఉండవు. తర్వాత కొద్ది కొద్దిగా కళలు తగ్గుతూ వస్తాయి. అనంతమైన తండ్రి నుండి ఉన్నతమైన వారసత్వం పొందేందుకు ఇప్పుడు పిల్లలు పురుషార్థం చేయాలి. పాస్‌ విత్‌ ఆనర్‌ అవ్వాలి కదా. ఉన్నత పదవి అందరూ పొందలేరు. సర్వీసే చేయనివారు ఏ పదవి పొందుతారు! మ్యూజియంకు పిలవకుండానే జనం వచ్చేస్తూ ఉంటారు. పిల్లలు ఎంత సేవ చేస్తారు. దీనినే విహంగమార్గ సేవ అని అంటారు. దీనితో పాటు ఇంకా ఏదైనా విహంగమార్గ సేవ వెలువడవచ్చేమో తెలియదు. రెండు - నాలుగు ముఖ్యమైన చిత్రాలు తప్పకుండా వెంట ఉంచుకోవాలి. ప్రతి చోట త్రిమూర్తి, కల్పవృక్షము, సృష్టి చక్రము, మెట్ల చిత్రము చాలా పెద్దవిగా ఉండాలి. పిల్లలు తెలివైనవారిగా అయినప్పుడు సర్వీసు జరుగుతుంది కదా. సర్వీసు జరగనే జరుగుతుంది. గ్రామాల్లో కూడా సర్వీసు చేయాలి. మాతలు భలే చదువుకోకపోయినా తండ్రి పరిచయమివ్వడం చాలా సులభము. ఇంతకు ముందు స్త్రీలు చదువుకునేవారు కాదు. ముసల్మానుల రాజ్యంలో ఒక్క కన్నే తెరచి బయటికి వెళ్లేవారు. ఈ బాబా చాలా అనుభవజ్ఞుడు. నాకు ఇవన్నీ తెలియవు అని తండ్రి అంటున్నారు. నేను పైననే ఉంటాను. ఈ విషయాలన్నీ ఈ బ్రహ్మ మీకు అర్థం చేయిస్తాడు. ఇతడు అనుభవీ. నేనైతే మన్మనాభవ విషయాలే వినిపిస్తాను అంతేకాక సృష్టిచక్ర రహస్యాన్ని అర్థం చేయిస్తాను. ఈ రహస్యము ఇతనికి తెలియదు. ఇతడు తన అనుభవాన్ని విడిగా తెలియజేస్తాడు. ఆ విషయాల్లోకి నేను రాను. కేవలం మీకు మార్గము తెలియజేయడమే నా పాత్ర. నేను తండ్రి, టీచరు, గురువును. టీచరుగా అయ్యి మిమ్ములను చదివిస్తాను. ఇందులో కృప మొదలైనవేవీ లేవు. చదివిస్తాను, వెంట కూడా తీసుకెళ్తాను. ఈ చదువుతోనే సద్గతి లభిస్తుంది. నేను మిమ్ములను తీసుకెళ్లేందుకే వచ్చాను. శివుని వివాహ ఊరేగింపుకు మహిమ ఉంది కదా. శంకరుని ఊరేగింపు ఉండదు. శివుని ఊరేగింపు. ఆత్మలన్నీ వరుడి వెనుకే వెళ్తాయి కదా. అందరూ భక్తులు, నేను భగవంతుడిని. పావనంగా చేసి వెంట తీసుకెళ్లమనే మీరు నన్ను పిలిచారు. కనుక నేను పిల్లలైన మిమ్ములను వెంట తీసుకునే వెళ్తాను. లెక్కాచారాలన్నీ చుక్తా చేయించే తీసుకెళ్లాలి.
తండ్రి మాటిమాటికి మన్మనాభవ అని చెప్తారు. తండ్రిని స్మృతి చేస్తే వారసత్వం కూడా తప్పకుండా గుర్తుకొస్తుంది. విశ్వరాజ్యం లభిస్తుంది కదా. అందుకు పురుషార్థము కూడా అలాగే చేయాలి. పిల్లలైన మీకు ఎలాంటి కష్టమూ ఇవ్వను. మీరు చాలా దు:ఖమును అనుభవించారని నాకు తెలుసు. ఇప్పుడు మీకు ఏ కష్టమూ ఇవ్వను. భక్తిమార్గంలో ఆయువు కూడా తక్కువగా ఉంటుంది. అకాలమృత్యువు సంభవిస్తుంది. ఓ భగవంతుడా! అని ఎంతగానో దు:ఖిస్తారు, మతి చెడిపోతుంది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - కేవలం నన్ను స్మృతి చేస్తూ ఉండండి. స్వర్గానికి అధికారులుగా అవ్వాలంటే దైవీగుణాలు కూడా ధారణ చేయాలి. పురుషార్థము సదా ఉన్నతంగా లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకే చేస్తారు. తండ్రి చెప్తున్నారు - నేను సూర్యవంశము, చంద్రవంశము రెండు ధర్మాలను స్థాపన చేస్తాను. పాస్‌(ఉత్తీర్ణులు) అవ్వని వారిని క్షత్రియులని అంటారు. ఇది యుద్ధ మైదానం కదా! మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. సుఖధామ వారసత్వ అధికారాన్ని పూర్తిగా తీసుకునేందుకు సంగమ యుగములో ఆత్మిక ఇంద్రజాలికులుగా అయ్యి తండ్రిని కూడా తమ పుత్రునిగా చేసుకోవాలి. పూర్తిగా బలిహారమవ్వాలి.
2. స్వదర్శన చక్రధారులుగా అయ్యి స్వయాన్ని లక్కీ సితారాగా చేసుకోవాలి. విహంగమార్గ సేవ కొరకు నిమిత్తంగా అయ్యి ఉన్నత పదవి తీసుకోవాలి. గ్రామ-గ్రామాలలో సర్వీసు చేయాలి. సేవతో పాటు స్మృతి చార్టు తప్పకుండా ఉంచుకోవాలి.

వరదానము :- '' దేహము మరియు దేహ ప్రపంచ స్మృతి నుండి ఉన్నతంగా ఉండే సర్వ బంధనాల నుండి ముక్త్‌ ఫరిస్తా భవ ''
ఎవరికైతే దేహము, దేహధారులతో సంబంధము అనగా మానసిక లగావ్‌(ఆకర్షణ) లేదో వారే ఫరిస్తాలు. ఫరిస్తాల పాదాలు సదా భూమికి తాకకుండా పైన ఉంటాయి. భూమికి పైన అనగా దేహ భావపు స్మృతి నుండి ఉన్నతంగా, ఎవరైతే దేహము మరియు దేహ ప్రపంచ స్మృతి నుండి ఉన్నతంగా ఉంటారో వారే సర్వ బంధనాల నుండి ముక్తులుగా ఉండే ఫరిస్తాలుగా అవుతారు. ఇటువంటి ఫరిస్తాలే డబల్‌లైట్‌ స్థితిని అనుభవం చేస్తారు.

స్లోగన్‌ :- '' వాచాతో పాటు నడవడిక మరియు ముఖము ద్వారా తండ్రి సమానమైన గుణాలు కనిపించినపుడు ప్రత్యక్షత జరుగుతుంది ''

Thursday, 21 November 2019

Telugu Murli 22/11/2019

22-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - ఈ సమయంలో నిరాకార తండ్రి సాకారములోకి వచ్చి మిమ్ములను అలంకరిస్తారు, ఒంటరిగా కాదు ''

ప్రశ్న :- పిల్లలైన మీరు స్మృతి యాత్రలో ఎందుకు కూర్చుంటారు ?
జవాబు :- ఎందుకంటే 1. ఈ స్మృతి ద్వారానే మనకు దీర్ఘాయువు లభిస్తుందని, నిరోగులుగా అవుతామని మీకు తెలుసు. 2. స్మృతి చేయడం ద్వారా మన పాపాలు నశిస్తాయి. మనము సత్యమైన బంగారుగా అవుతాము. ఆత్మలో ఏర్పడిన రజో, తమోల మలినాలు తొలగిపోతాయి. ఆత్మ స్వచ్ఛంగా కంచనముగా(బంగారుగా) అవుతుంది. 3. స్మృతి ద్వారానే మీరు పావన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. 4. మీరు అలంకరించబడ్తారు. 5. మీరు గొప్ప ధనవంతులుగా అవుతారు. ఈ స్మృతియే మిమ్ములను పదమాపదమ్‌ భాగ్యశాలురుగా చేస్తుంది.

ఓంశాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ కూర్చొని మీరు ఏం చేస్తున్నారు? కేవలం శాంతి(నిశ్శబ్ధము)గా కూర్చోలేదు. అర్థ సహితంగా జ్ఞానమయ స్థితిలో కూర్చొని ఉన్నారు. తండ్రిని మనమెందుకు స్మృతి చేస్తామో పిల్లలైన మీకు తెలుసు. ఆ తండ్రి మనకు దీర్ఘాయువునిస్తారు. తండ్రిని స్మృతి చేసినందున మన పాపాలు నశిస్తాయి. మనము సత్యమైన బంగారుగా, సతోప్రధానంగా అవుతాము. మీకు ఎంతో మంచి అలంకారము జరుగుతుంది. మీ ఆయువు వృద్ధి అవుతుంది. మీ ఆత్మ కంచనంగా అవుతుంది. ఇప్పుడు ఆత్మలో మలినాలు చేరి ఉన్నాయి. స్మృతియాత్ర ద్వారా రజో-తమో గుణాల ఆ మలినమంతా తొలగిపోతుంది. మీరు ఇంతగా లాభపడ్తారు! ఆయువు వృద్ధి చెందుతుంది. మీరు స్వర్గవారసులుగా అవుతారు. చాలా గొప్ప ధనవంతులుగా అవుతారు. మీరు పదమాపదమ్‌ భాగ్యశాలురుగా అవుతారు. అందుకే తండ్రి చెప్తున్నారు - ''మన్మనాభవ, మామేకమ్‌ యాద్‌ కరో(నన్ను ఒక్కరినే స్మృతి చేయండి)'', ఏ దేహధారి కొరకు ఇలా చెప్పరు. తండ్రికి శరీరమే లేదు. మీలోని ఆత్మలు కూడా నిరాకారమే. పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పారసబుద్ధిగా ఉన్నవారు రాతి బుద్ధిగా అయ్యారు. ఇప్పుడు మళ్లీ కాంచనంగా అవ్వాలి. ఇప్పుడు మీరు పవిత్రంగా అవుతున్నారు. జన్మ-జన్మాంతరాలుగా నీటితో స్నానము చేశారు, ఈ స్నానాల ద్వారా పావనంగా అవుతామని అనుకున్నారు. కానీ పావనంగా అయ్యేందుకు బదులు ఇంకా పతితమై నష్టపోయారు. ఎందుకంటే ఇది అయినదే అసత్యపు మాయ, అందరికీ అసత్యము చెప్పే సంస్కారమైపోయింది. తండ్రి చెప్తున్నారు - నేను మిమ్ములను పావనంగా చేసి వెళ్తాను, మళ్లీ మిమ్ములను పతితులుగా చేసేదెవరు? ఇప్పుడు మీరు ఫీల్‌ చేస్తున్నారు కదా. ఎన్నో గంగా స్నానాలు చేస్తూ వచ్చారు కానీ పావనంగా అవ్వలేదు. పావనంగా అయ్యి పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. శాంతిధామము, సుఖధామము పావనధామాలు. ఇది రావణ ప్రపంచము. దీనిని దు:ఖధామమని అంటారు. ఇది సులభంగా అర్థము చేసుకునే విషయము కదా. ఇందులో ఏ కష్టమూ లేదు. ఇతరులకు వినిపించేందుకు కూడా కష్టమేదీ లేదు. ఎవరినైనా కలిసినప్పుడు కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి అనంతమైన తండ్రిని స్మృతి చేయమని చెప్పండి. ఆత్మల తండ్రి పరమపిత పరమాత్మ శివుడు. ప్రతి ఒక్కరి శరీరానికి తండ్రి వేరు వేరుగా ఉంటారు. ఆత్మలన్నిటికి తండ్రి ఒక్కరే. ఎంతో మంచిరీతిగా అర్థం చేయిస్తున్నారు. అది కూడా హిందీలోనే అర్థం చేయిస్తారు. హిందీ భాషనే ముఖ్యమైనది. పదమాపదమ్‌ భాగ్యశాలురని ఈ దేవతలను అంటారు కదా. వీరు ఎంత భాగ్యశాలురు! వీరు స్వర్గానికి అధికారులుగా ఎలా అయ్యారో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీకు తండ్రి వినిపిస్తున్నారు. ఈ సహజ యోగము ద్వారా ఈ పురుషోత్తమ సంగమ యుగములోనే ఇలా అవుతారు. ఇప్పుడిది పాత, క్రొత్త ప్రపంచాల సంగమము. మళ్లీ మీరు నూతన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - కేవలం రెండు పదాలు అర్థ సహితంగా స్మృతి చేయండి. గీతలో మన్మనాభవ అనే పదముంది. పదమునేమో చదువుతారు కానీ దాని అర్థము బొత్తిగా తెలియదు. తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేయండి. ఎందుకంటే నేన్నొక్కరినే పతితపావనుడను. ఈ విధంగా ఇతరులెవ్వరూ చెప్పలేరు. నన్ను స్మృతి చేస్తేనే మీరు పావనంగా అయ్యి పావన ప్రపంచంలోకి వెళ్ళిపోతారని తండ్రి ఒక్కరు మాత్రమే చెప్తున్నారు. మొట్టమొదట మీరు సతోప్రధానంగా ఉండేవారు, తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ తమోప్రధానంగా అయ్యారు. ఇప్పుడు 84 జన్మల తర్వాత మళ్లీ మీరు నూతన ప్రపంచములో దేవతలుగా అవుతారు.
రచయిత మరియు రచన, రెండింటి గురించి మీరు తెలుసుకున్నారు. అందువలన ఇప్పుడు మీరు ఆస్తికులుగా అయ్యారు. ఇంతకుముందు జన్మ-జన్మాంతరాలు మీరు నాస్తికులుగా ఉండేవారు. తండ్రి వినిపించే ఈ విషయాలు ఇతరులెవ్వరికీ తెలియనే తెలియవు. ఎక్కడికైనా వెళ్లండి, ఎవ్వరూ మీకు ఈ విషయాలు వినిపించరు. ఒకవేళ చెప్పినా, ఈ విషయాలు ఎవ్వరూ ఎక్కడా వినిపించలేరు. ఇప్పుడు ఇరువురు తండ్రులు కలిసి మిమ్ములను అలంకరిస్తున్నారు. మొట్టమొదట తండ్రి ఒంటరిగా ఉండేవారు. శరీరము లేకుండా ఉండేవారు. పైన కూర్చొని మిమ్ములను అలంకరించలేరు. ఒకటి రెండు కలిస్తే 12 అవుతుంది అని అంటారు కదా. పోతే ప్రేరణ లేక శక్తి మొదలైనవేవీ లేవు. పై నుండి మిమ్ములను అలంకరిస్తారు. బాబా మనలను సుఖధామానికి తీసుకెళ్తున్నారని అర్థము కూడా చేసుకుంటారు. డ్రామా ప్లాను అనుసారము బాబా బంధితులై ఉన్నారు. వారికి డ్యూటీ(కర్తవ్యము) లభించింది. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత పిల్లలైన మీ కొరకు వస్తారు. ఈ యోగబలము ద్వారా మీరు ఎంతో కంచనంగా(సతోప్రధానంగా) అవుతారు. ఆత్మ మరియు శరీరము రెండూ కంచనంగా అవుతాయి. మళ్లీ ఛీ-ఛీగా అవుతాయి. ఈ పురుషార్థము ద్వారా మేము ఈ విధంగా అలంకరించబడిన వారిగా అవుతామని మీరు సాక్షాత్కారములో చూస్తారు. అక్కడ చెడు దృష్టి ఉండదు. అది కూడా అవయవాలన్నీ దాచబడి ఉంటాయి. ఇక్కడ చూడండి, రావణ రాజ్యములో ఛీ-ఛీ మాటలు నేర్చుకుంటారు. ఈ లక్ష్మీనారాయణుల వస్త్రాలంకరణ మొదలైనవి ఎంత బాగున్నాయో చూడండి. ఇక్కడ అందరూ దేహాభిమానులుగా ఉన్నారు. వారిని దేహాభిమానులని అనరు. వారిది సహజ సౌందర్యము. తండ్రి మిమ్ములను ఇంత సహజ సుందరంగా చేస్తున్నారు. ఈ రోజులలో అసలైన నగలు ఎవ్వరూ ధరించను కూడా ధరించలేరు. ఎవరైనా ధరిస్తే వారిని దోచుకుంటారు. అక్కడైతే ఇటువంటి మాటలుండవు. అటువంటి తండ్రి మీకు లభించారు. కానీ ఇతను లేకుండా మీరు అలా అవ్వలేరు. మేము శివబాబా నుండి డైరక్టుగా వారసత్వము తీసుకుంటామని చాలామంది అంటారు. కానీ వారు ఎలా ఇస్తారు? నేరుగా అడిగి ప్రయత్నము చేయండి. లభిస్తుందేమో చూడండి. మేము శివబాబా నుండి వారసత్వము తీసుకుంటామని చాలామంది అంటారు. బ్రహ్మను అడిగే అవసరమేముందని అంటారు. శివబాబా ప్రేరణ ద్వారా ఏమైనా ఇచ్చేస్తారని అంటారు. మంచి-మంచి పాత పిల్లలను కూడా మాయ ఇలా కాటేస్తుంది. ఒక్కరినే అంగీకరిస్తారు. అయితే ఒంటరిగా ఏం చేస్తారు? నేను ఒక్కరినే ఎలా వస్తానని తండ్రి అంటున్నారు. నోరు లేకుండా ఎలా మాట్లాడగలను? నోటికి గాయనముంది కదా. గోముఖము నుండి అమృతము తీసుకునేందుకు ఎన్నో దెబ్బలు తింటారు(కష్టపడ్తారు). శ్రీనాథ ద్వారానికి వెళ్ళి దర్శనము చేసుకుంటారు. కానీ దర్శనము వలన ఏం లభిస్తుంది. దానిని భూతపూజ అని అంటారు. వాటిలో(విగ్రహాలలో) ఆత్మ లేనే లేదు. కేవలం 5 తత్వాలచే చేయబడిన బొమ్మ అనగా మాయను స్మృతి చేయడమే. పంచ తత్వాలంటే ప్రకృతి కదా. వాటిని స్మృతి చేస్తే ఏమౌతుంది? అందరికీ ప్రకృతి ఆధారముండనే ఉంది. కానీ అక్కడ సతోప్రధాన ప్రకృతి ఉంటుంది. ఇక్కడ ఉండేది తమోప్రధానమైన ప్రకృతి. తండ్రి సతోప్రధాన ప్రకృతిని(శరీరమును) ఎప్పుడూ తీసుకోరు. ఇక్కడ సతోప్రధాన ప్రకృతి లభించదు. తండ్రి చెప్తున్నారు - ఈ సాధువులు- సన్యాసులు అందరినీ నేనే ఉద్ధరించాల్సి వస్తుంది. నేను నివృత్తి మార్గములో రానే రాను. ఇది అయ్యిందే ప్రవృత్తి మార్గము. అందరికీ చెప్తున్నాను. పవిత్రులుగా అవ్వండి. అక్కడ నామ-రూపాలన్నీ మారిపోతాయి. ఈ నాటకమెలా తయారయ్యిందో గమనించమని తండ్రి చెప్తున్నారు. ఒకరి రూపురేఖలు మరొకరితో కలవవు. ఇన్ని కోట్లమంది ఉన్నారు. అందరి రూపాలు, ముఖ కవళికలు వేర్వేరుగా ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా ఒకరి రూపురేఖలు మరొకరితో కలవవు. దీనిని ప్రాకృతికము, అద్భుతమని అంటారు. స్వర్గమును అద్భుతమని అంటారు కదా. ఎంత శోభాయమానంగా ఉంటుంది! మాయ యొక్క అద్భుతాలు 7. తండ్రిది ఒకే అద్భుతము. త్రాసులో ఆ 7 అద్భుతాలు ఒకవైపు, ఈ ఒక్క అద్భుతము రెండవ వైపు ఉంచినా ఇదే భారంగా ఉంటుంది. ఒకవైపు జ్ఞానము, ఒకవైపు భక్తిని ఉంచండి. జ్ఞానము వైపే తూగుతుంది. భక్తి నేర్పించేవారు అనేకమంది ఉన్నారు. జ్ఞానమిచ్చేది ఒక్క తండ్రి మాత్రమే. ఆ తండ్రి కూర్చొని పిల్లలను చదివిస్తున్నారు, అలంకరిస్తున్నారు. తండ్రి పవిత్రంగా అవ్వండి అంటూ ఉంటే, లేదు మేము ఛీ-ఛీగా అవుతామని అంటారు. గరుడ పురాణంలో కూడా విషయవైతరిణీి నదిని చూపిస్తారు కదా. తేలు, మండ్రగబ్బ, సర్పము మొదలైనవన్నీ ఒక దానిని ఒకటి కాటేసుకుంటూ ఉంటాయి. తండ్రి చెప్తున్నారు - మీరు ఎంత అనాథలుగా అయిపోతారు! పిల్లలైన మీకు మాత్రమే తండ్రి అర్థం చేయిస్తారు. బయట ఎవరికైనా ఇలా నేరుగా చేప్తే వారు కోపపడ్తారు. చాలా యుక్తిగా అర్థం చేయించాల్సి ఉంటుంది. చాలామంది పిల్లలకు మాట్లాడేది కూడా తెలియదు. చిన్న పిల్లలు పూర్తి అమాయకులుగా ఉంటారు. అందుకే వారిని మహాత్ములని అంటారు. మహాత్ముడైన కృష్ణుడెక్కడ? నివృత్తి మార్గములోని సన్యాసులనబడే మహాత్ములెక్కడ? నివృత్తిమార్గము వారు మహాత్ములని పిలువబడ్తారు. అది ప్రవృత్తి మార్గము. అక్కడ ఎప్పుడూ భ్రష్టాచారముతో జన్మించరు. కృష్ణుని శ్రేష్ఠాచారుడని అంటారు. ఇప్పుడు మీరు శ్రేష్ఠాచారులుగా అవుతున్నారు. ఇక్కడ బాప్‌దాదా ఇరువురూ కలిసి ఉన్నారని పిల్లలకు తెలుసు. వీరు మీకు తప్పకుండా బాగా అలంకరిస్తారు. వీరిని ఇంత బాగా అలంకరించిన వారి వద్దకు మేము కూడా వెళ్ళాలని అనుకుంటారు కదా. అందుకే మీరు ఇక్కడకు రిఫ్రెష్‌(తాజా)గా అయ్యేందుకు వస్తారు. తండ్రి వద్దకు రావాలని మనసు ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. పూర్తి నిశ్చయమున్నవారు - చంపినా ఏం చేసినా, మేము ఎప్పుడూ తండ్రి జతను వదలము అని అంటారు. కొంతమంది ఏ కారణము లేకుండా వదిలేస్తారు. ఇది కూడా నాటకములో తయారయ్యే ఉంది. తండ్రికి విడాకులు ఇచ్చేస్తారు.
వీరు రావణ వంశము వారని తండ్రికి తెలుసు. కల్ప-కల్పము ఇలాగే జరుగుతుంది. విడాకులిచ్చిన వారిలో కొంతమంది మళ్లీ వచ్చేస్తారు. తండ్రి చేతిని వదిలేస్తే పదవి తగ్గిపోతుందని అర్థం చేయిస్తారు. మేము ఎప్పటికీి ఇలాంటి తండ్రిని వదలమని సన్ముఖములో ప్రతిజ్ఞ కూడా చేస్తారు. కాని మాయా రావణుడు కూడా తక్కువైనవాడు కాదు. వెంటనే తన వైపుకు లాక్కుంటాడు. కానీ మళ్లీ సన్ముఖములోకి వస్తే వారికి అర్థం చేయించబడ్తుంది. బాబా ఎప్పుడూ బెత్తము తీసుకోరు, కొట్టరు. తండ్రి ఇంకా ప్రేమతోనే అర్థం చేయిస్తారు. నిన్ను మాయావి మొసలి తినేసిందా? తప్పించుకొని రావడము చాలా మంచిదయ్యింది. గాయపడ్తే పదవి తగ్గిపోతుంది. ఎవరైతే సదా ఏకరసములో ఉంటారో వారు ఎప్పుడూ దూరంగా పోరు, ఎప్పుడూ చేయి వదలరు. ఇక్కడ నుండి తండ్రిని వదిలి, మరణించి మాయా రావణునికి చెందినవారిగా అయితే వారిని మాయ ఇంకా గట్టిగా తినేస్తుంది. తండ్రి అంటున్నారు - మిమ్ములను ఎంతగా అలంకరిస్తున్నాను! మంచిగా నడుచుకోండి అని అర్థం చేయిస్తారు. ఎవ్వరికీ దు:ఖమివ్వకండని చెప్తారు. రక్తముతో కూడా వ్రాసి ఇస్తారు. మళ్లీ అలాగే అవుతారు. మాయ చాలా శక్తివంతమైనది. ముక్కు, చెవులు పట్టుకొని చాలా విలవిలలాడిస్తుంది. ఇప్పుడు మీకు తండ్రి జ్ఞాన మూడవ నేత్రమునిస్తారు. అందువలన వికారి దృష్టితో ఎప్పుడూ చూడరాదు. విశ్వానికి అధికారులుగా అవ్వాలంటే కొంచెమైనా శ్రమించాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు మీ శరీరము మరియు ఆత్మ రెండూ తమోప్రధానంగా ఉన్నాయి. ఆత్మలో తుప్పు(మురికి) ఏర్పడింది. ఈ మురికిని భస్మము చేసేందుకు తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేయండి. మీరు అలాంటి తండ్రిని స్మృతి చేయలేకుంటే సిగ్గు వేయదా? స్మృతి చేయకుంటే మాయా భూతము మింగేస్తుంది. మీరు ఎంత ఛీ-ఛీ(వికారులు)గా అయ్యారు. రావణరాజ్యంలో వికారాల నుండి జన్మించని వారు ఒక్కరు కూడా లేరు. అక్కడ వికారమనే పేరే ఉండదు. రావణుడే ఉండడు. రావణరాజ్యము ద్వాపరయుగము నుండి వస్తుంది. పావనంగా చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, ఈ ఒక్క జన్మ మాత్రమే పవిత్రంగా ఉండండి. ఆ తర్వాత వికారాల మాటే ఉండదు. అది నిర్వికార ప్రపంచము. వీరు పవిత్ర దేవీదేవతలుగా ఉండేవారని 84 జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ క్రిందకు వచ్చారని మీకు తెలుసు. ఇప్పుడు పతితులుగా అయ్యారు. అందుకే శివబాబా, మమ్ములను ఈ పతిత ప్రపంచము నుండి విడిపించండి అని పిలుస్తారు. ఇప్పుడు తండ్రి వచ్చినందున ఇది పతిత కార్యమని మీకు అర్థమయింది. ఇంతకుముందు మీకు తెలియదు. ఎందుకంటే మీరు రావణరాజ్యంలో ఉండేవారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - సుఖధామానికి వెళ్ళాలంటే ఛీ-ఛీగా అవ్వడం వదిలేయండి. అర్ధకల్పము మీరు ఛీ-ఛీగా అయ్యారు. తల పై పాపభారము చాలా ఉంది. అంతేకాక మీరు చాలా నిందించారు, తిట్టినారు. తండ్రిని తిట్టినందున పాపభారము చాలా పెరిగింది. అయితే ఈ పాత్ర కూడా డ్రామాలో ఉంది. ఆత్మలైన మీకు కూడా 84 జన్మల పాత్ర లభించింది. అది చేసే తీరాలి. ప్రతి ఒక్కరు తమ-తమ పాత్ర చేయాల్సిందే. అలాంటప్పుడు ఏడ్చేదెందుకు? సత్యయుగములో ఎవ్వరూ ఏడ్వరు. జ్ఞానదశ పూర్తయినప్పుడు ఆ దేవతలే ఏడ్చుట, గుండెలు బాదుకొనుట ప్రారంభమవుతుంది. మోహజీత్‌ కథ కూడా మీరు విన్నారు. ఇది ఒక అసత్యపు దృష్టాంతము. కథగా తయారు చేశారు. సత్యయుగములో ఎవ్వరూ అకాలమృత్యువు పాలు అవ్వరు. మోహజీతులుగా చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. పరమపిత పరమాత్మకు మీరు వారసులుగా అవుతారు. వారు మిమ్ములను ఈ విశ్వానికి యజమానులుగా చేస్తారు. స్వయాన్ని ప్రశ్నించుకోండి - మేము(ఆత్మలము) వారికి వారసులుగా ఉన్నామా? పోతే ఈ భౌతిక చదువులో ఏముంది? ఈ రోజులలో పతిత మనుష్యుల మొఖము కూడా మీరు చూడరాదు. మీ పిల్లలకు కూడా చూపించరాదు. బుద్ధిలో మేము సంగమ యుగములో ఉన్నామని సదా భావించండి. మనము ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తాము, ఇతరులను చూస్తున్నా చూడనట్లు ఉంటాము. మనము నూతన ప్రపంచమును మాత్రమే చూస్తాము. మనము దేవతలుగా అవుతాము. ఆ నూతన సంబంధాలను మాత్రమే చూస్తాము. పాత సంబంధాలను చూస్తున్నా చూడము. ఇవన్నీ భస్మమైపోయేవి. మనము ఒంటరిగా వచ్చాము, మళ్లీ ఒంటరిగానే వెళ్తాము. ఆ తండ్రి ఒక్కసారి మాత్రమే వెంట తీసుకెళ్లేందుకు వస్తారు. దానిని శివబాబావారి పెళ్ళి ఊరేగింపు (మెరవణి) అని అంటారు. అందరూ శివబాబా పిల్లలే. తండ్రి విశ్వ చక్రవర్తి పదవినిస్తారు. మానవులను దేవతలుగా చేస్తారు. ఇంతకుముందు విషము కక్కేవారు, ఇప్పుడు అమృతమును వర్షిస్తున్నారు. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. స్వయాన్ని సంగమయుగ నివాసినని భావించి నడుచుకోవాలి. పాత సంబంధాలను చూస్తున్నా చూడనట్లుండాలి. మేము ఒంటరిగా వచ్చాము, ఒంటరిగానే వెళ్ళాలని బుద్ధిలో ఉండాలి.
2. ఆత్మ, శరీరము రెండింటిని కంచనము(పవిత్రముగా) చేసుకునేందుకు జ్ఞాన మూడవ నేత్రముతో చూచే అభ్యాసము చేయాలి. అపవిత్ర(క్రిమినల్‌) దృష్టిని సమాప్తము చేయాలి. జ్ఞాన-యోగాల ద్వారా స్వయాన్ని అలంకరించుకోవాలి.

వరదానము :- '' తండ్రి ఛత్రఛాయలో సదా ఆనందాన్ని అనుభవం చేసి, చేయించే విశేష ఆత్మా భవ ''
తండ్రి ఛత్రఛాయ ఎక్కడుంటుందో అక్కడ సదా మాయ నుండి సురక్షితంగా ఉంటారు. ఛత్రఛాయలోకి మాయ రాజాలదు. శ్రమ నుండి స్వతహాగా దూరమైపోతారు, ఆనందంగా ఉంటారు. ఎందుకంటే శ్రమ మజాను అనుభవమవ్వనివ్వదు. ఛత్రఛాయలో ఉండే ఇటువంటి విశేషమైన ఆత్మలు ఉన్నతమైన చదువు చదువుతున్నా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే వారికి 'మేము కల్ప-కల్పము విజయీ ఆత్మలమే, పాస్‌ అయ్యే ఉన్నాము' అనే నిశ్చయముంటుంది. కనుక సదా ఆనందంగా ఉండండి, ఇతరులకు ఆనందంగా ఉండేందుకు సందేశమిస్తూ ఉండండి. ఇదే మీరు చేయాల్సిన సేవ.

స్లోగన్‌ :- '' డ్రామా రహస్యము(రాజ్‌) తెలియని వారు నారాజ్‌గా (అసంతుష్టంగా) ఉంటారు ''

Wednesday, 20 November 2019

Telugu Murli 21/11/2019

21-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - కుమారుడు తండ్రిని ప్రత్యక్షము చేస్తాడు ( సన్‌ షోస్‌ ఫాదర్‌ ). మనుష్యుల మతమును (మన్మతాన్ని) వదిలి శ్రీమతముననుసరిస్తే తండ్రిని ప్రత్యక్షము చేయగలరు ''

ప్రశ్న :- ఎటువంటి పిల్లలను తండ్రి తప్పక రక్షిస్తూనే ఉంటారు ?
జవాబు :- ఏ పిల్లలైతే సత్యంగా ఉంటారో, వారిని తండ్రి తప్పకుండా రక్షిస్తూనే ఉంటారు, రక్షణ జరగలేదంటే లోపల ఏదో ఒక అసత్యము ఉంటుంది. చదువును పోగొట్టుకోవడం(మిస్‌ చేయడం), సంశయపడడం అనగా ఆంతరికములో ఏదో కొంత అసత్యముంటుంది. వారిని మాయ ఎర్రగా వాచిపోయేలా చెంప దెబ్బ వేస్తుంది.

ప్రశ్న :- ఎటువంటి పిల్లలను మాయ అయస్కాంతము వలె ఆకర్షిస్తుంది ?
జవాబు :- మాయావి సౌందర్యము వైపు ఆకర్షితమయ్యే వారిని మాయ అయస్కాంతము వలె ఆకర్షిస్తుంది. కానీ శ్రీమతమునును అనుసరించే పిల్లలు ఆకర్షింపబడరు.

ఓంశాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక పిల్లలైన మమ్ములను ఆత్మిక తండ్రి చదివిస్తున్నారని పిల్లలు నిశ్చయము చేసుకున్నారు. వారి కొరకే ఆత్మలు, పరమాత్మ చాలాకాలము నుండి వేరుగా ఉన్నారు,..........(ఆత్మా పరమాత్మ అలగ్‌ రహే బహుకాల్‌..........) అనే గాయనముంది. మూలవతనములో వేరుగా ఉండరు. అక్కడైతే అందరూ కలిసే ఉంటారు. వేరుగా ఉంటారంటే, అక్కడ నుండి విడిపోయి ఇక్కడకు తప్పకుండా వచ్చి తమ తమ పాత్రలను అభినయిస్తున్నారు. సతోప్రధానము నుండి దిగజారుతూ దిగజారుతూ తమోప్రధానంగా అవుతారు. ''ఓ పతితపావనా! వచ్చి మమ్ములను పావనం చేయండి'' అని పిలుస్తారు. నేను ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వస్తానని తండ్రి కూడా చెప్తున్నారు. ఈ సృష్టి చక్రమే 5 వేల సంవత్సరాలది. ఇంతకు ముందు మీకు ఈ విషయం తెలియదు. శివబాబా తెలియజేస్తున్నారంటే ఏదో ఒక శరీరము ద్వారానే తెలియజేస్తారు. పై నుండి ఎవ్వరూ శబ్ధము చేయరు, మాట్లాడరు. శక్తి గానీ, ప్రేరణ గానీ కాదు. ఆత్మలైన మీరు కూడా శరీరములోకి వచ్చిన తర్వాతనే మాట్లాడ్తారు. అదే విధంగా నేను కూడా శరీరములో ప్రవేశించిన తర్వాతనే శరీరము ద్వారా ఆదేశమిస్తానని తండ్రి చెప్తున్నారు. ఎవరెంత తండ్రిని అనుసరిస్తారో అంత వారి కళ్యాణము వారే చేసుకుంటారు. శ్రీమతముననుసరించనీ, అనుసరించకపోనీ, టీచరు మాటలు విననీ, వినకపోనీ, కళ్యాణము చేసుకోవడం, అకళ్యాణం చేసుకోవడం పిల్లల పైనే ఆధారపడి ఉంది. చదవకపోతే తప్పకుండా ఫెయిల్‌ అవుతారు. అంతేకాక శివబాబా నుండి నేర్చుకొని ఇతరులకు నేర్పించాలని కూడా అర్థం చేయిస్తారు. తండి పిల్లలను పత్య్రక్షము చేస్తున్నారు. ఇది శారీరిక తండ్రిని గురించి కాదు. వీరు ఆత్మిక తండ్రి. మనమెంత బాగా శ్రీమతముననుసరిస్తామో అంత వారసత్వము పొందుతామని కూడా మీకు తెలుసు. పూర్తిగా అనుసరించేవారు, ఉన్నత పదవిని పొందుతారు. అనుసరించకపోతే ఉన్నత పదవిని పొందలేరు. నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు తొలగిపోతాయని తండ్రి చెప్తున్నారు. రావణ రాజ్యములో మీ పై పాప భారము చాలా ఎక్కువగా ఉంది. వికారాల వశమైనందునే పాపాత్మలుగా అవుతారు. పాపాత్మలు, పుణ్యాత్మలు తప్పకుండా ఉంటారు.
పుణ్యాత్మల ముందు పాపాత్మలు తల వంచి నమస్కరిస్తారు. పుణ్యాత్మలుగా ఉండే దేవతలే పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పాపాత్మలుగా అవుతారని మానవులకు తెలియదు. దేవతలు సదా పుణ్యాత్మలుగానే ఉంటారని వారు భావిస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ సతోప్రధానము నుండి తమోప్రధానము వరకు వస్తారు. పూర్తి పాపాత్మలుగా
అయినప్పుడు మళ్ళీ తండ్రిని పిలుస్తారు. పుణ్యాత్మలుగా ఉన్నప్పుడు స్మృతి చేసే అవసరమే ఉండదు. కనుక సేవ చేయాలని పిల్లలైన మీరు అర్థం చేయించాలి. తండ్రి వెళ్ళి అందరికీ వినిపించరు. సేవ చేసేందుకు యోగ్యులుగా అయితే పిల్లలే వెళ్ళాలి. మానవులు రోజురోజుకు అసురులుగా అవుతూ ఉంటారు. తెలియనందున మానవులు వ్యర్థ ప్రలాపాలు చేసేందుకు(వాగుటకు) కూడా ఆలస్యము
చేయరు. గీతా భగవానుడు కృష్ణుడని మనుష్యులంటారు. కృష్ణుడు దేహధారి అని, అతడిని దేవత అని అంటారని మీరు అర్థం చేయిస్తారు. కృష్ణుని తండ్ర్రి అని పిలువరు. అందరూ తండ్రిని స్మృతి చేస్తారు కదా. ఆత్మల తండ్రి ఇతరులెవ్వరూ ఉండరు. ఈ ప్రజాపిత బ్రహ్మ కూడా చెప్తున్నారు - నిరాకార తండ్రినే స్మృతి చేయాలి. బ్రహ్మ శారీరిక తండ్రి అవుతాడు. చాలా బాగా అర్థం చేయిస్తారు. కొంతమంది పూర్తిగా అర్థము చేసుకోనందున వక్ర మార్గములో(వ్యతిరేక, ఉల్టా) అడివిలోకి వెళ్ళిపోతారు. తండ్రి ఏమో స్వర్గంలోకి వెళ్లి మార్గమును చూపిస్తారు. అయినా అడవి వైపే వెళ్ళిపోతారు. అడవి వైపు తీసుకెళ్లేవాడు రావణుడని తండ్రి తెలియజేస్తున్నారు. మీరు మాయతో ఓడిపోతారు. మార్గము మర్చిపోయినందున అడవికి వెళ్ళి మీరు కూడా అడవి ముళ్ళుగా అవుతారు. వారు మళ్లీ స్వర్గానికి ఆలస్యంగా వస్తారు. మీరు స్వర్గములోకి వచ్చే పురుషార్థము చేసేందుకు ఇక్కడకు వచ్చారు. త్రేతా యుగమును కూడా స్వర్గమని అనరు. 25 శాతము తగ్గిపోతుంది కదా. వారు ఫెయిల్‌ అయిన వారి క్రింద లెక్కింపబడ్తారు. మీరు
ఇక్కడకు పాత ప్రపంచాన్ని వదిలి నూతన ప్రపంచములోకి వెళ్లేందుకు వచ్చారు. త్రేతా యుగమును నూతన ప్రపంచమని అనరు. పాస్‌ కాని వారు అక్కడకు వెళ్ళిపోతారు. ఎందుకంటే మార్గమును కరెక్టుగా పట్టుకోరు. హెచ్చు-తగ్గులవుతూ ఉంటారు. ఎంత స్మృతి ఉండాలో అంత లేదని మీరు అనుభవము చేస్తారు. స్వర్గవాసులుగా అయ్యేవారిని బాగా పాస్‌ అయ్యారని అంటారు. త్రేతా యుగములోని వారు పాస్‌ కాని వారి క్రింద లెక్కింపబడ్తారు. మీరు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతారు లేకుంటే
పాస్‌ అవ్వలేదని అంటారు. ఆ చదువులో అయితే రెండవసారి చదువుతారు. ఇందులో రెండవసారి చదివే మాటే లేదు. కల్పక్రితము పాస్‌ అయినవారే, జన్మ-జన్మాంతరాలు, కల్ప-కల్పము పరీక్షలో పాస్‌ అవుతారు. ఈ డ్రామా రహస్యాన్ని బాగా అర్థము చేసుకోవాలి. మేము నడవలేము, మా వల్లకాదని కొందరు భావిస్తారు. ముసలివారైతే వారిని చేయి పట్టుకుని నడిపిస్తే నడుస్తారు. లేకుంటే క్రింద పడిపోతారు. కానీ అదృష్టములో లేకుంటే పుష్పాలుగా తయారు చేయాలని ఎంత తీవ్రంగా ప్రయత్నించినా తయారు కారు. జిల్లేడు పూలు కూడా ఉన్నాయి. ముళ్ళు అయితే గ్రుచ్చుకుంటాయి. తండ్రి ఎంతగానో అర్థం చేయిస్తున్నారు. నిన్నటి వరకు ఏ శివుని మీరు పూజించేవారో ఆ శివుడే ఈ రోజు మిమ్ములను చదివిస్తున్నారు. ప్రతి మాటలో పురుషార్థము చేసేందుకే ప్రాధాన్యత ఇవ్వబడ్తుంది. మాయ మంచి-మంచి పుష్పాలను(పిల్లలను) కూడా కింద పడేయడం చూస్తున్నారు. ఎముక-ఎముక విరిచేస్తుంది (సంబంధమును తుంచేస్తుంది). వారిని ద్రోహులని అంటారు. ఒక రాజధాని(పార్టీ)ని వదిలి మరో రాజధానికి వెళ్ళిపోయిన వారిని ద్రోహులని అంటారు. తండ్రి కూడా అంటున్నారు - నా వారిగా అయ్యి మళ్లీ మాయకు చెందిన వారిగా అయితే వారు కూడా ద్రోహులే. వారి నడవడికలే అలా(ద్రోహులు) అయిపోతాయి. ఇప్పుడు ఆ తండ్రి మాయ నుండి విడిపించేందుకు వచ్చారు. మాయ
చాలా శక్తివంతమైనదని తనవైపు ఆకర్షిస్తుందని పిల్లలు చెప్తారు. మాయ అయస్కాంతము వలె ఉంది. ఇప్పుడది అయస్కాంత రూపమును ధరిస్తుంది. ప్రపంచములో ఎంత సౌందర్యము పెరిగిపోయింది. ఇంతకుముందు ఈ సినిమాలు వగైరా లేవు. ఇవన్నీ గత 100 సంవత్సరాల నుండే వెలిశాయి. బాబా అనుభవశాలి కదా. పిల్లలు ఈ డ్రామాలోని నిగూఢ రహస్యమును బాగా అర్థము చేసుకోవాలి. ప్రతి విషయం ఖచ్చితంగా నిర్ణయింపబడి ఉంది. గడిచిన 100 సంవత్సరాల నుండి ఈ ప్రపంచము అపొజిషన్‌ కొరకు మాయావి స్వర్గంగా తయారయ్యింది. అందుకే బాబా అర్థం చేయిస్తున్నారు - ఇప్పుడు స్వర్గము వేగంగా తయారవ్వాలి. సైన్సు కూడా చాలా ఉపయోగపడ్తుంది. ఇది చాలా సుఖమునిచ్చేది కూడా. ఈ సుఖము స్థిరంగా ఉండేందుకు ఈ పాత ప్రపంచము వినాశనము కూడా జరగాలి. సత్యయుగ సుఖము కేవలము భారతదేశపు భాగ్యములో మాత్రమే ఉంది. వారంతా భక్తిమార్గము ప్రారంభమైన తర్వాతనే వస్తారు. భారతవాసులు క్రిందపడిన(పతితులైన) తర్వాతనే ఇతర ధర్మాలవారు నంబరువారుగా వస్తారు. భారతదేశము దిగజారుతూ దిగజారుతూ ఒక్కసారిగా క్రింద పడిపోతుంది. మళ్లీ పైకి ఎక్కాలి. ఇక్కడ కూడా పైకి ఎక్కుతారు మళ్లీ క్రింద పడ్తారు. ఎంతగా దిగజారుతారో చెప్పలేము - అడగవద్దు. తండ్రి మమ్ములను చదివిస్తున్నాడంటే కొంతమంది అంగీకరించరు. నమ్మనే నమ్మరు.
మంచి-మంచి సేవాధారులని తండి ఎవరినైతే మహిమ చేస్తారో వారు కూడా మాయ పంజా(పిడికిలి)లోకి వచ్చేస్తారు. కుస్తీ పోటీ జరుగుతుంది కదా. మాయ కూడా అలాగే యుద్ధము చేస్తుంది. ఒక్క దెబ్బలో పూర్తిగా కింద పడేస్తుంది. పోను పోను పిల్లలైన మీకు అర్థమౌతూ ఉంటుంది. మాయ ఒక్కసారిగా పూర్తిగా కింద పడేస్తుంది. అయినా బాబా చెప్తున్నారు - ఒక్కసారి జ్ఞానము విన్నా తప్పకుండా స్వర్గములోకి వస్తారు. కానీ పదవి పొందుకోలేరు కదా. కల్ప క్రితము ఎవరు ఎంత పురుషార్థము చేశారో లేక పురుషార్థము చేస్తూ చేస్తూ కిందపడ్డారో, అదే విధంగా ఇప్పుడు కూడా కిందపడుతూ, లేస్తూ ఉంటారు. గెలుపు-ఓటములుంటాయి కదా. అంతా పిల్లల స్మృతి పైననే ఆధారపడి ఉంది. పిల్లలకు ఈ తరగని అవినాశి ఖజానా లభిస్తుంది. వారైతే లక్షల రూపాయలకు దివాలా తీస్తారు. కొంతమంది లక్షాధికారులైన ధనవంతులుగా అవుతారు. అది కూడా కేవలం ఒక్క జన్మకే. మరుసటి జన్మలో అంత ధనముండదు. కర్మభోగము కూడా చాలా ఉంది. అక్కడ స్వర్గములో అయితే కర్మభోగమనే మాటే ఉండదు. ఈ సమయంలో మీరు 21 జన్మలకు ఎంతో సంపాదన జమ చేసుకుంటున్నారు. పూర్తిగా పురుషార్థము చేయువారు పూర్తిగా స్వర్గ వారసత్వమును పొందుకుంటారు. మేము స్వర్గ వారసత్వము తప్పకుండా పొందుతామని బుద్ధిలో ఉండాలి. మళ్లీ క్రింద పడిపోతామని అనుకోరాదు. ఇతడు అందరికంటే ఎక్కువగా క్రిందపడ్డాడు. ఇప్పుడు మళ్లీ పైకి ఎక్కే తీరాలి. స్వతహాగా పురుషార్థము కూడా జరుగుతూ ఉంటుంది. మాయ ఎంత ప్రబలమైనదో గమనించమని అర్థం చేయిస్తూ ఉంటారు. మానవులలో పూర్తిగా అజ్ఞానము నిండుకొని ఉంది. అజ్ఞాన కారణంగా తండ్రిని కూడా సర్వవ్యాపి అని అంటారు. భారతదేశమెంతో ఫస్ట్‌క్లాస్‌గా ఉండేది. మనమిలా(దేవతలుగా) ఉండేవారమని, మళ్లీ అలాగే అవుతున్నామని మీకు తెలుసు. పిల్లలైన మీకు తప్ప ఇతరులెవ్వరికీ ఈ దేవతలకు ఎంత మహిమ ఉందో తెలియదు. ఇప్పుడు జ్ఞానసాగరులైన బేహద్‌ తండ్రి వచ్చి మమ్ములను చదివిస్తున్నారని కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. అయినా మాయ చాలామందిని సంశయములోకి తెస్తుంది. అసత్యాన్ని, కపటాన్ని వదిలిపెట్టరు. అందువలన తండి చెప్తున్నారు - మీ చార్టును సత్య సత్యంగా వ్రాయండి. కానీ దేహాభిమానము వలన సత్యము తెలపరు. కనుక ఇది కూడా వికర్మగా అవుతుంది.సత్యము తెలపాలి కదా లేకుంటే చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది. గర్భజైలులో కూడా చాలా శిక్షలు లభిస్తాయి. మళ్లీ ఇటువంటి పని చేయనని తోబా-తోబా (ప్రమాణము) అంటూ ఒట్టు వేసుకుని, లెంపలేసుకుని పశ్చాత్తాప పడ్తారు. ఎవరికైనా దెబ్బలు పడినప్పుడు కూడా ఇలా క్షమాపణ అడుగుతారు కదా. శిక్షలు లభించినప్పుడు కూడా అలాగే పశ్చాత్తాపపడ్తారు. మాయా రాజ్యము ఎప్పటి నుండి మొదలయ్యిందో పిల్లలైన మీకు తెలుసు. పాపము చేస్తూ ఉంటారు. పిల్లలు ఇంత(లక్ష్మీనారాయణులు) మధురాతి మధురంగా, సున్నితంగా, నమ్రతగా తయారవ్వడం లేదని తండ్రి గమనిస్తున్నారు. తండ్రి ఎంత సున్నితమైనవారు! చిన్న పిల్లల వలె ఎంతో ములాయంగా నడుస్తున్నారు. ఎందుకంటే డ్రామానుసారము నడుస్తూ ఉంటారు. జరిగిపోయినదంతా డ్రామాలో నిశ్చయింపబడిందని అంటారు. ఇక ముందు అలా జరగరాదని అర్థం చేయిస్తూ కూడా ఉంటారు. ఇక్కడ బాప్‌దాదా ఇరువురు కలిసే ఉన్నారు కదా. దాదా మతము దాదాది, ఈశ్వరుని మతము ఈశ్వరునిది. మనకు మతము(సలహా) ఇచ్చిందెవరో అర్థం చేసుకోవాలి. ఇతడు కూడా తండ్రే కదా. తండ్రి మాటేమో వినాలి కదా. బాబా ఏమో పెద్ద(గొప్ప) బాబా కదా. అందుకే ఈ బాబా - శివబాబా చెప్తున్నారనే
భావించమంటున్నారు. అలా భావించకుంటే పదవి కూడా పొందలేరు. డ్రామా ప్లాను అనుసారము తండ్రి కూడా ఉన్నారు, దాదా కూడా ఉన్నారు. తండ్రి శ్రీమతము లభిస్తుంది. మాయ ఎటువంటిదంటే మహావీరులు, పహిల్వానులతో కూడా ఏదో ఒక వికర్మ, వ్యతిరేక కర్మ చేయిస్తుంది. తండ్రి శ్రీమతమును అనుసరించలేదని అర్థమైపోతుంది. నేను నా ఆసురీ మతము అనుసారముగా నడుస్తున్నానని స్వయం కూడా అర్థం చేసుకుంటారు. శ్రీమతమును ఇచ్చేవారే ఇక్కడ వచ్చి ఉపస్థితులై ఉన్నారు. వారిది ఈశ్వరీయ మతము. తండ్రి స్వయంగా చెప్తున్నారు - ఒకవేళ అటువంటి మతము లభించినా, సరి చేసేందుకు నేను కూర్చొని ఉన్నాను. అయినా నేను రథము తీసుకున్నాను కదా. నేను రథము తీసుకున్నప్పుడే ఇతడు తిట్లు తిన్నాడు. లేకుంటే మునుపెప్పుడూ ఇతడు తిట్లు తినలేదు. నా
కారణంగా ఎన్నో తిట్లు తింటున్నాడు. అందువలన ఇతడిని కూడా సంభాళించాల్సి వస్తుంది(ఓదార్చాలి). తండి తప్పకుండా రక్షిస్తారు. తండి పిల్లలను రక్షిస్తారు కదా. ఎంత సత్యంగా నడుచుకుంటారో అంత రక్షణ జరుగుతుంది. అసత్యంగా ఉన్నవారికి రక్షణ జరగదు. వారికి ఇంకా ఎక్కువ శిక్షలు స్థిరపడ్తాయి. అందుకే తండి అర్థం చేయిస్తున్నారు - మాయ ఒక్కసారిగా ముక్కు పట్టుకుని ఊపిరి ఆడకుండా చేసి సమాప్తము చేసేస్తుంది. పిల్లలు స్వయంగా మాయ తినేసినట్లు అనుభవం చేస్తారు. తర్వాత చదువు మానేస్తారు. తండ్రి చెప్తున్నారు - తప్పకుండా చదువుకోండి, చదివి తీరాలి. మంచిది. అయితే ఎక్కడ ఎవరిది దోషము? ఇందులో ఎవరు ఎలా చేస్తారో, భవిష్యత్తులో వారు అంతే పొందుతారు. ఎందుకంటే ఈ ప్రపంచము ఇప్పుడు పరివర్తన చెందుతూ ఉంది. మాయ ఎర్రగా వాచిపోయేటట్లు చెంపదెబ్బ వేస్తుంది. అప్పుడు ఈ ఖుషీ ఉండదు. తర్వాత ''బాబా ఏమయిందో, ఏమో తెలియదని మొరపెట్టుకుంటూ బిగ్గరగా అరుస్తారు. యుద్ధ మైదానములో, ఎవరూ దెబ్బలు కొట్టకుండా, క్రింద పడిపోకుండా జాగరూకతలో ఉండాలి. ఎక్కువ శక్తి కలిగినవారు అవతలి వారిని క్రింద పడేస్తారు. మళ్లీ రెండవ రోజు యుద్ధము ప్రకటిస్తారు. మాయతో జరిగే ఈ యుద్ధము చివరి వరకు జరుగుతూనే ఉంటుంది. క్రింద-మీద అవుతూనే ఉంటుంది. చాలామంది సత్యము తెలపరు. బాబా ఏమంటారో, అగౌరవము పాలవుతామని భయపడ్తారు. ఎంతవరకు సత్యము చెప్పరో అంతవరకు ముందుకు వెళ్లలేరు. సత్యము చేప్తేనే ఉన్నతమౌతారు. లోలోపల గ్రుచ్చుకుంటూనే ఉంటుంది. ఇంకా వృద్ధి చెందుతుంది. వారంతకు వారు సత్యము ఎప్పుడూ చెప్పనే చెప్పరు. ఎక్కడైనా ఇద్దరుంటే, వీరు బాబాకు వినిపిస్తే అప్పుడు నేను కూడా వినిపిస్తానని అనుకుంటారు. మాయ చాలా శక్తివంతమైనది. వారి అదృష్టములో అంత ఉన్నతపదవి లేకుంటే సర్జన్‌ వద్ద దాచిపెడ్తారని అర్థం చేసుకోబడ్తుంది. దాచిపెడ్తే వ్యాధి నయము కాదు. ముదురుతూ పోతుంది. ఎంత దాచి పెడ్తారో అంత క్రింద పడిపోతూనే ఉంటారు. భూతాలేమో అందరిలో ఉన్నాయి కదా. ఎంతవరకు కర్మాతీత స్థితి తయారవ్వదో అంతవరకు చెడు దృష్టి కూడా వదలదు. అన్నింటికంటే పెద్ద శత్రువు కామము. చాలామంది క్రింద పడిపోతారు. శివబాబాను తప్ప ఏ ఇతర దేహాధారిని స్మృతి చేయవద్దని బాబా పదే పదే అర్థం చేయిస్తూ ఉంటారు. కొంతమంది ఎంత పక్కాగా ఉన్నారంటే శివబాబా తప్ప వారికెవ్వరూ గుర్తుకే రారు. పతివ్రతా స్త్రీకి ఎప్పుడూ చెడు బుద్ధి(దుర్బుద్ధి) ఉండదు. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మనలను చదివించేవారు స్వయం జ్ఞానసాగరులు, అనంతమైన తండ్రి. ఇందులో ఎప్పుడూ సంశయము రాకూడదు. అసత్యము, కపటము(మోసము) వదిలి సత్య-సత్యమైన చార్టును ఉంచాలి. దేహాభిమానములోకి వచ్చి ఎప్పుడూ ద్రోహులుగా అవ్వరాదు.
2. డ్రామాను బుద్ధిలో ఉంచుకొని తండ్రి సమానంగా చాలా చాలా మధురంగా, సున్నితంగా, నమ్రతగా తయారై ఉండాలి. ఎప్పుడూ అహంకారాన్ని చూపించరాదు. మీ మతమును వదిలి తండ్రి మతమునే అనుసరించాలి.

వరదానము :- '' సాథీని (బాబాను) సదా జతలో ఉంచుకొని సహయోగాన్ని అనుభవం చేసుకునే కంబైండ్‌ రూపధారీ భవ ''
సదా ''ఆప్‌ ఔర్‌ బాప్‌''(మీరు మరియు తండ్రి) ఇలా ఎవ్వరూ వేరు చేయలేని కంబైండ్‌ రూపంగా ఉండండి. ఎప్పుడూ స్వయాన్ని ఒంటరిగా భావించకండి. అవినాశి తోడును నిభాయించే బాప్‌దాదా మీఅందరికి తోడుగా ఉన్నారు. 'బాబా' అని అంటూనే బాబా హాజరైపోతారు. మనము బాబాకు చెందినవారము, బాబా మనవారు. ప్రతి సేవలో బాబా సహయోగమిచ్చేవారు. కేవలం మీ కంబైండుస్వరూపము యొక్క ఆత్మిక నశాలో ఉండండి.

స్లోగన్‌ :- '' సేవ మరియు స్వ ఉన్నతి రెండిటి బ్యాలన్స్‌ ఉంటే సదా సఫలత లభిస్తూ ఉంటుంది ''

Tuesday, 19 November 2019

Telugu Murli 20/11/2019

20-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - శివబాబా పై గౌరవముంటే వారి శ్రీమతమును అనుసరిస్తూ ఉండండి. శ్రీమతమును అనుసరించడం అంటే తండ్రిని గౌరవించడం ''

ప్రశ్న :- పిల్లలు తండ్రి కంటే గొప్ప ఇంద్రజాలికులు - ఎలా ?
జవాబు :- సర్వ శేష్ఠ్రమైన తండ్రిని తమ కుమారునిగా చేసుకోవడం, తనువు-మనసు-ధనముల ద్వారా తండ్రిని వారసునిగా చేసుకొని సమర్పణగుట - ఇది పిల్లలు చేసే ఇంద్రజాలము. ఇప్పుడు ఎవరైతే భగవంతుని వారసునిగా చేసుకుంటారో, వారు 21 జన్మల వారసత్వానికి అధికారులుగా అవుతారు.

ప్రశ్న :- ట్రిబ్యునల్‌(న్యాయాధిపతుల సభ) ఎటువంటి పిల్లల కొరకు కూర్చుంటుంది?
జవాబు :- దానమిచ్చిన వస్తువును వాపసు తీసుకోవాలని సంకల్పము చేసిన వారికి, మాయకు వశమై డిస్‌ సర్వీసు చేయువారి కొరకు, టిబ్య్రునల్‌ కూర్చుంటుంది.

ఓంశాంతి. విచిత్రమైన ఆత్మిక తండ్రి కూర్చొని విచిత్రమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు అనగా దూరదేశములో నివసించే పరమపిత పరమాత్మ చాలా చాలా దూరదేశము నుండి వచ్చి ఈ శరీరము ద్వారా మిమ్ములను చదివిస్తున్నారు. ఇప్పుడేం చదువుతున్నారో, దానిని చదివించే వారితో స్వతహాగానే యోగముంచుతారు. ఓ పిల్లలూ! టీచరుతో సంబంధము ఉంచుకోమని, స్మృతి చేయమని చెప్పే అవసరమే ఉండదు. కానీ ఇక్కడ తండ్రి - ఓ ఆత్మిక పిల్లలారా, నేను మీ తండ్రి, టీచరు, గురువును కూడా అయ్యాను, ఈ సంబంధాలతో యోగము జోడించండి అనగా తండ్రిని స్మృతి చేయండని చెప్తున్నారు. వీరు విచిత్రులైన తండ్రి. మీరు క్షణ-క్షణము వీరిని మర్చిపోతారు. అందుకే చెప్పవలసి వస్తుంది. చదివించేవారిని స్మృతి చేసినందున మీ పాపాలు భస్మమైపోతాయి. టీచరు ''నన్ను చూడమని చెప్పడం చట్ట సమ్మతము కాదు.'' కానీ ఇందులో అయితే చాలా లాభముంది. తండ్రి చెప్తున్నారు - కేవలం నన్ను స్మృతి చేయండి. ఈ స్మృతి బలము ద్వారానే మీ పాపాలు తొలగిపోతాయి. దీనిని స్మృతియాత్ర అని అంటారు. ఇప్పుడు ఆత్మల విచిత్రమైన తండ్రి పిల్లలను చూస్తున్నారు. పిల్లలు కూడా స్వయాన్ని ఆత్మగా భావించి విచిత్రులైన తండ్రినే స్మృతి చేస్తారు. మీరేమో మాటిమాటికి దేహములోకి వస్తారు. నేనేమో మొత్తం కల్పమంతా శరీరములోకి రాను. కేవలం ఈ సంగమ యుగములో మాత్రము పిల్లలైన మిమ్ములను చదివించేందుకు చాలా దూరదేశము నుండి వస్తాను. బాబా మా తండ్రి, టీచరు, సద్గురువు అని మంచిరీతిగా స్మృతి చేయాలి. వారు విచిత్రులు వారికి తమ స్వంత శరీరము లేదు. అయితే వారెలా వస్తారు? నేను ఈ శరీరములో, నోటిని ఆధారంగా తీసుకోవలసి వస్తుందని చెప్తున్నారు. నేను విచిత్రుడను. మీరందరూ చిత్రములున్న(దేహాలున్న) వారు. నాకు తప్పకుండా రథము కావాలి కదా. గుఱ్ఱం బండిలో అయితే రాను కదా. తండ్రి చెప్తున్నారు - నేను ఈ శరీరములో ప్రవేశిస్తాను. నెంబరువన్‌గా ఉన్న ఇతనే మళ్లీ చివరి నెంబరుగా అవుతారు. సతోప్రధానంగా ఉన్నవారే తమోప్రధానంగా అవుతారు. వారినే మళ్లీ సతోప్రధానంగా చేసేందుకు తండ్రి చదివిస్తున్నారు. పిల్లలైన మీరు ఈ రావణ రాజ్యములో 5 వికారాల పై విజయము పొంది జగజీతులుగా పిల్లలైన మీరే అవ్వాలి. విచిత్రులైన తండ్రి చదివిస్తున్నారని పిల్లలైన మీరు గుర్తుంచుకోవాలి. తండ్రిని స్మృతి చేయకుంటే పాపాలెలా భస్మమవుతాయి? ఈ మాటలు కూడా కేవలం ఈ సంగమ యుగములోనే మీరు వింటారు. ఒక్కసారి జరిగింది కల్పము తర్వాత మళ్లీ అదే రిపీట్‌(పునరావృతము) అవుతుంది. ఇది ఎంతో మంచి జ్ఞానము. ఇందులో చాలా విశాలమైన బుద్ధి కావాలి. ఇది సాధు సన్యాసులు మొదలైనవారి సత్సంగము కాదు. వారిని తండ్రి అని కూడా అంటారు, కుమారుడని కూడా అంటారు. వీరు మన తండ్రే కాదు, కుమారుడు కూడా అని మీకు తెలుసు. మనము సర్వస్వము ఈ కుమారునికి వారసత్వంగా ఇచ్చి తండ్రి నుండి 21 జన్మలకు వారసత్వము తీసుకుంటాము. పనికిరానిదంతా ఇచ్చి తండ్రి నుండి మనము విశ్వ చక్రవర్తి పదవిని తీసుకుంటాము. పిల్లలంటారు - ''బాబా, మేము భక్తిమార్గములో ఉన్నప్పుడు మీరు వస్తే మా తనువు-మనస్సు-ధనము సహితంగా సమర్పణవుతామని అన్నాము.'' లౌకిక తండ్రి కూడా పిల్లలకు సర్వమూ అప్పగించి సమర్పణౌతారు కదా. ఇక్కడ మీకు ఎంత విచిత్రమైన తండ్రి లభించారంటే - వారిని స్మృతి చేసినందున మీ పాపాలు భస్మమై మన ఇంటికి వెళ్ళిపోతాము. ఇది ఎంతో సుదీర్ఘమైన ప్రయాణము. తండ్రి ఎక్కడ వస్తున్నారో చూడండి! పాత రావణ రాజ్యములో వస్తారు. వారంటున్నారు - నా భాగ్యములో పావన శరీరము లభించనే లభించదు. పతితులను పావనంగా చేసేందుకు ఎలా రావాలి? నేను పతిత ప్రపంచములోనే వచ్చి మిమ్ములను పావనంగా చేయవలసి వస్తుంది. అటువంటి టీచరు పై గౌరవము కూడా ఉంచాలి కదా. చాలామందికి గౌరవించడమే తెలియదు. అయితే ఇది కూడా డ్రామాలో జరగాల్సిందే. రాజధానిలో అయితే నెంబరువారుగా అందరూ ఉండాల్సిందే కదా. కనుక అన్ని రకాలవారు ఇక్కడే తయారవుతారు. తక్కువ హోదా పొందుకునే వారికి ఈ స్థితి ఉంటుంది. చదువుకోరు, తండ్రి స్మృతిలో కూడా ఉండరు. వీరు చాలా విచిత్రమైన తండ్రి కదా. వీరి నడవడిక కూడా అలౌకికము. వీరి పాత్ర ఇతరులెవ్వరికీ లభించదు. ఈ తండ్రి వచ్చి మీకు అత్యంత ఉన్నతమైన చదువును చదివిస్తున్నారు. అలాంటివారిని గౌరవించాలి కదా. వారి శ్రీమతమును అనుసరించాలి. కానీ మాయ మాటిమాటికి మరిపింపజేస్తుంది. మాయ మంచి మంచి పిల్లలను కూడా క్రింద పడ వేసేటంత శక్తిశాలి. ఆ తండ్రి ఎంతో ధనవంతులుగా చేస్తారు. కానీ మాయ ఒక్కసారిగా తల తిప్పేస్తుంది. మాయ నుండి రక్షించుకునేందుకు తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. చాలా మంచి మంచి పిల్లలు తండ్రికి చెందినవారిగా అయ్యి మళ్లీ మాయకు వశమై పక్కా ద్రోహులుగా అయిపోతారు. మాయ ఒక్కసారిగా ముక్కుతో పట్టుకుంటుంది. ఏనుగును మొసలి తినేసింది(గజేంద్ర మోక్షము) అనే పదము కూడా ఉంది కదా. కానీ దాని అర్థము ఎవ్వరికీ తెలియదు. తండ్రి ప్రతి విషయాన్ని బాగా అర్థం చేయిస్తారు. చాలామంది పిల్లలు అర్థము కూడా చేసుకుంటారు కానీ నెంబరువారు పురుషార్థానుసారము. కొంతమందికి కొంచెము కూడా ధారణ జరగదు. చాలా ఉన్నతమైన చదువు కదా. కనుక ధారణ చేయలేరు. వారి అదృష్టములో రాజ్యభాగ్యము లేదని తండ్రి అంటారు. కొంతమంది వాసన లేని జిల్లేడు పూలుగా ఉన్నారు, కొంతమంది సుగంధభరిత పుష్పాలుగా ఉన్నారు. వెరైటీ పుష్పాల ఉద్యానవనము కదా. అటువంటివారు కూడా కావాలి కదా. రాజధానిలో మీకు నౌకర్లు - చాకర్లు కూడా లభిస్తారు. అలాంటివారు లేకుంటే నౌకర్లు - చాకర్లు ఎలా లభిస్తారు? రాజుల రాజ్యమిక్కడే తయారవుతుంది. నౌకర్లు - చాకర్లు, చండాలురు మొదలైన వారంతా లభిస్తారు. ఇప్పుడు రాజధాని స్థాపనవుతూ ఉంది. ఆశ్చర్యకరమైన విషయము. ఇంత ఉన్నతంగా తయారు చేయు తండ్రిని స్మృతి చేస్తూ ప్రేమభాష్పాలు ప్రవహించాలి.
మీరు మాలలోని ముత్యాలుగా అవుతారు కదా. బాబా మీరు ఎంత విచిత్రమైనవారు! మీరు వచ్చి పతితులైన మమ్ములను పావనంగా చేసేందుకు చదివిస్తున్నారని అంటారు. భక్తిమార్గములో భలే శివుని పూజిస్తారు కానీ వీరే పతితపావనులని అర్థమే చేసుకోరు. కానీ '' ఓ పతితపావనా! రండి, మీరు వచ్చి సుగంధ పుష్పాలైన దేవీ దేవతలుగా తయారు చేయండి '' అని పాడుతూ ఉంటారు. పిల్లల ఆజ్ఞలను తండ్రి మన్నిస్తారు. వారు వచ్చినప్పుడు - ''పిల్లలూ! పవిత్రంగా అవ్వండి అని అంటారు''. ఈ విషయములోనే హంగామాలు(గలాటాలు) జరుగుతాయి. తండ్రి అద్భుతమైనవారు కదా. పిల్లలకు చెప్తున్నారు - నన్ను స్మృతి చేస్తే పాపాలు సమాప్తమైపోతాయి. తండ్రికి తెలుసు - నేను ఆత్మలతో మాట్లాడ్తాను. సర్వము చేసేది ఆత్మనే. వికర్మలు కూడా ఆత్మనే చేస్తుంది. ఆత్మయే శరీరము ద్వారా అనుభవిస్తుంది. మీ కొరకు ట్రిబ్యునల్‌ కూర్చుంటుంది. ముఖ్యంగా సేవ చేసేందుకు అర్హులుగా అయ్యి మళ్లీ ద్రోహులుగా అవుతారు. మాయ ఎలా మింగేస్తుందో ఆ తండ్రికే తెలుసు. బాబా మేము ఓడిపోయాము, ముఖము నల్లగా చేసుకున్నాము(పతితులయ్యాము),......... ఇప్పుడు క్షమించండి అని అంటారు. ఇప్పుడు క్రిందపడ్డారు - మాయకు వశమయ్యారు - ఇక క్షమ ఎక్కడ నుండి లభిస్తుంది! వారు చాలా ఎక్కువగా శ్రమ చేయాల్సి వస్తుంది. మాయతో ఓడిపోయేవారు చాలా మంది ఉన్నారు. తండ్రి చెప్తున్నారు - ఇక్కడ తండ్రి వద్దకు వచ్చి దానము ఇచ్చి వెళ్ళండి. మళ్లీ వాపసు తీసుకోరాదు. లేకుంటే సమాప్తమైపోతారు. హరిశ్చంద్రుని ఉదాహరణ ఉంది కదా. దానమిచ్చిన తర్వాత వాపస్‌ తీసుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్లీ తీసుకుంటే 100 రెట్లు దండన ఉంటుంది. తర్వాత చాలా చిన్న పదవి లభిస్తుంది. రాజధాని స్థాపనవుతూ ఉందని పిల్లలకు తెలుసు. ఇతర ధర్మాల స్థాపనకు ముందే వారి రాజ్యముండదు. వారి ధర్మమును అనుసరించు వారి సంఖ్య 50 - 60 కోట్లు అయినప్పుడే వారి రాజ్యము స్థాపనవుతుంది, సైన్యము తయారవుతుంది. ప్రారంభములో ఒకరో-ఇద్దరో వస్తారు. తర్వాత నెమ్మదిగా వృద్ధి చెందుతారు. ఏసుక్రీస్తు కూడా ఏదో ఒక వేషములో వస్తారని మీకు తెలుసు. భికారి రూపములో ఉన్న మొదటి నెంబరులోని వారే, మళ్లీ తప్పకుండా చివరి నెంబరులో ఉంటారు. ఈ సమయములో ఏసుక్రీస్తు భికారి రూపములో ఉన్నాడని, అది సత్యమని క్రైస్తవులు వెంటనే అంటారు. పునర్జన్మ తీసుకోవలసిందేనని అర్థము చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ తమోప్రధానంగా అయ్యే తీరాలి. ఈ సమయంలో ప్రపంచమంతా తమోప్రధానమై శిథిలావస్థలో ఉంది. ఈ పాత ప్రపంచమంతా తప్పనిసరిగా వినాశనమయ్యే తీరాలి. క్రైస్తవులు కూడా క్రీస్తుకు 3 వేల సంవత్సరాల క్రితము స్వర్గముండేది, ఆ స్వర్గము మళ్లీ ఇప్పుడు వస్తుంది అని అంటారు కానీ ఈ విషయాలను ఎవరు అర్థము చేయిస్తారు? పిల్లలకు ఇంకా ఆ స్థితి ఎక్కడుందని తండ్రి అంటున్నారు. మేము యోగములో ఉండలేమని పిల్లలు మాటి మాటికీ వ్రాస్తారు. వారి చేష్టలు చూచి బాబానే అర్థం చేసుకుంటారు. తండ్రికి సమాచారము తెలిపేందుకు కూడా పిల్లలు భయపడ్తారు. తండ్రి పిల్లలను ఎంతో ప్రేమిస్తారు. ప్రేమతో నమస్కరిస్తారు. పిల్లలకు అహంకారముంటుంది. మంచి-మంచి పిల్లలను కూడా మాయ మరిపింపజేస్తుంది. బాబా అర్థము చేసుకోగలరు. నేను జ్ఞానసాగరుడనని తండ్రి అంటున్నారు. సర్వజ్ఞుడనగా అందరి ఆంతరికములోనిదంతా నాకు తెలుసని కాదు. నేను వచ్చిందే అందరినీ చదివించేందుకు. నేను ఎవరి ఆంతరికమును రీడ్‌ చేయను(చదవను) అనగా తెలుసుకోను. నాలాగే ఈ సాకారము కూడా ఎవ్వరినీ చదవడు. ఇతను అన్నింటినీ మర్చిపోవాలి. చదివి ఏం చేయాలి? మీరు ఇక్కడకు వచ్చింది చదువుకునేందుకు. భక్తిమార్గమే వేరు. భక్తి క్రింద పడిపోయేందుకు సాధనంగా అవ్వాలి కదా. ఈ భక్తి మాటలతోనే మీరు క్రింద పడిపోతారు. ఇది తయారైన డ్రామా. భక్తి మార్గములో శాస్త్రాలు చదువుతూ చదువుతూ క్రిందకు దిగజారుతూ మీరు తమోప్రధానంగా అవుతారు. ఇప్పుడు మీరు ఈ ఛీ-ఛీ ప్రపంచములో ఉండనే ఉండరాదు. కలియుగము నుండి మళ్లీ సత్యయుగములోకి రావాలి. ఇప్పుడిది సంగమ యుగము. ఈ విషయాలన్నీ ధారణ చేయాలి. తండ్రి ఒక్కరు మాత్రమే అర్థం చేయిస్తారు. ప్రపంచములో మిగిలిన వారందరి బుద్ధికి గాడ్రెజ్‌ తాళము వేయబడి ఉంది. వీరు దైవీ గుణాలు గలవారిగా ఉండి తర్వాత వారే మళ్లీ ఆసురీ గుణాలు గలవారిగా అయ్యారని మీకు తెలుసు. ఇప్పుడు భక్తి మార్గములోని విషయాలన్నీ మర్చిపోండి అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు వినిపించేది మాత్రమే వినండి. చెడు వినకు,........... ఇప్పుడు నా ఒక్కరి ద్వారానే వినండి. మీరు మునిగిపోకుండా పైకి తేల్చేందుకే నేను వచ్చాను.
మీరు ఈశ్వరీయ సంప్రదాయానికి చెందినవారు. ప్రజాపిత బ్రహ్మ ముఖ కమలము ద్వారా జన్మించారు కదా. ఎంతమంది దత్తు పిల్లలు ఉన్నారు చూడండి! అందరూ దత్తు పిల్లలే. వారిని ఆదిదేవుడని, మహావీరుడని కూడా అంటారు. పిల్లలైన మీరు మహావీరులే కదా. మీరు యోగబలము ద్వారా మాయ పై విజయము పొందుతారు. ఆ తండ్రిని జ్ఞానసాగరులని అంటారు. జ్ఞానసాగరులైన తండ్రి మీకు అవినాశి జ్ఞాన రత్నాలతో పళ్ళెములు నింపి ఇస్తున్నారు. మిమ్ములను సంపన్నంగా చేస్తున్నారు. ఎవరైతే జ్ఞాన ధారణ చేస్తారో, వారు ఉన్నత పదవిని పొందుతారు. ధారణ చేయనివారు తప్పకుండా తక్కువ పదవే పొందుతారు. తండ్రి నుండి మీరు తరగని ఖజానాలు పొందుతారు. అల్లాఉద్ధీన్‌ - అద్భుత దీపము కథ కూడా ఉంది కదా. అక్కడ మనకు అప్రాప్తిగా ఉండు వస్తువే ఉండదు. 21 జన్మల వారసత్వాన్ని తండ్రి ఇచ్చేస్తారు. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వము ఇస్తారు. హద్దు వారసత్వము లభించినా '' ఓ పరమాత్మా! దయ చూపండి, కృప చూపండి '' అని బేహద్‌ తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తారు. కానీ వారేం ఇస్తారో ఎవ్వరికీ తెలియదు. బాబా మనలను విశ్వమంతటికీ యజమానులుగా చేస్తారని మీకు తెలుసు. బ్రహ్మ ద్వారా స్థాపన అని చిత్రములో కూడా ఉంది. బ్రహ్మ సాధారణ రూపములో ఎదురుగా కూర్చుని ఉన్నారు. స్థాపన చేస్తున్నారంటే తప్పకుండా వారినే తయారుచేస్తారు కదా. తండ్రి ఎంతో బాగా అర్థం చేయిస్తున్నారు. మీరు పూర్ణ రీతిగా అర్థం చేయించలేరు. భక్తి మార్గములో శంకరుని ముందుకెళ్ళి - జోలెను నింపమని వేడుకుంటారు. మేము నిరుపేదలుగా అయ్యామని ఆత్మ అంటుంది. మా జోలెను నింపి, మమ్ములను ఈ విధంగా తయారు చేయమని అంటారు. ఇప్పుడు మీరు జోలెను నింపుకునేందుకు వచ్చారు. మేము నరుని నుండి నారాయణునిగా అవ్వాలని కోరుతారు. ఈ చదువే నరుని నుండి నారాయణునిగా చేస్తుంది. పాత ప్రపంచములోకి రావాలని ఎవరికుంటుంది? కానీ అందరూ నూతన ప్రపంచములోకి రాలేరు. కొందరు 25 శాతము పాతదైన తర్వాత వస్తారు. కొంత తగ్గిపోతుంది కదా. ఏ కొద్దిగానైనా సందేశమిస్తూ ఉంటే మీరు తప్పకుండా స్వర్గానికి అధికారులుగా అవుతారు. ఇప్పుడు అందరూ నరకానికి అధికారులుగా ఉన్నారు కదా. రాజు, రాణి, ప్రజలు అందరూ నరకానికి అధికారులుగా ఉన్నారు. అక్కడ డబల్‌ కిరీటధారులు ఉండేవారు. ఇప్పుడు వారు లేరు. ఈ రోజులలో అయితే ధర్మము మొదలైన వాటిని ఎవ్వరూ ఒప్పుకోరు. దేవీదేవతా ధర్మము పూర్తిగా సమాప్తమైపోయింది. ధర్మమే శక్తి అని గాయనముంది. కానీ ధర్మాన్ని అనుసరించని కారణంగా శక్తి లేకుండా పోయింది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా! మీరే పూజ్యుల నుండి పూజారులుగా అవుతారు. 84 జన్మలు తీసుకుంటారు కదా. మనమే బ్రాహ్మణులము, మనమే దేవతలము తర్వాత మనమే క్షత్రియులము,........... బుద్ధిలో ఈ చక్రమంతా మెదులుతుంది కదా. ఈ 84 జన్మల చక్రములో మనము తిరుగుతూనే ఉంటాము. ఇప్పుడు మళ్లీ వాపస్‌ ఇంటికెళ్ళాలి. పతితులైనవారు ఎవ్వరూ వెళ్ళలేరు. ఆత్మయే పతితంగా మరియు పావనంగా అవుతుంది. బంగారులో మలినము ఏర్పడ్తుంది కదా. నగలో చేరదు. ఇది 'జ్ఞానాగ్ని'. దీని ద్వారా మురికి అంతా సమాప్తమై మీరు స్వచ్ఛమైన బంగారుగా అవుతారు. తర్వాత మళ్లీ ఆభరణము(శరీరం) కూడా మంచిది లభిస్తుంది. ఇప్పుడు ఆత్మ పతితంగా ఉంది. అందుకే పవిత్రుల ముందుకెళ్లి నమస్కరిస్తారు. చేసేదంతా ఆత్మయే కదా. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, నన్నొక్కరిని మాత్రమే స్మృతి చేస్తే మీ నావ తీరానికి చేరుతుంది. పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎవరెంత పురుషార్థము చేస్తారో అంత లభిస్తుంది. అందరికీ ఇదే పరిచయాన్ని ఇస్తూ ఉండండి. అతను హద్దు తండ్రి, వీరు బేహద్‌ తండ్రి. ఈ తండ్రి స్వర్గ వారసత్వమునిచ్చేందుకు సంగమ యుగములో మాత్రమే వస్తారు. కావున ఇటువంటి తండ్రిని స్మృతి చేయాల్సి వస్తుంది కదా. టీచరును విద్యార్థి ఎప్పుడైనా మర్చిపోతాడా? కానీ ఇక్కడ మాయ మరిపిస్తూ ఉంటుంది. చాలా హెచ్చరికగా ఉండాలి. యుద్ధ మైదానము కదా. తండ్రి అంటున్నారు - ఇప్పుడు వికారాలకు వశమవ్వకండి. మైల పడకండి. ఇప్పుడు స్వర్గములోకి వెళ్ళాలి. పవిత్రంగా అవుతేనే పవిత్ర నూతన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. మీకు విశ్వానికి చక్రవర్తి పదవిని ఇస్తాను. ఇదేమైనా చిన్న విషయమా! కేవలం ఈ ఒక్క జన్మలో మాత్రమే పవిత్రంగా అవ్వండి. ఇప్పుడు పవిత్రంగా అవ్వకుంటే క్రింద పడిపోతారు. ఆకర్షణలు, ప్రలోభాలు చాలా ఉంటాయి. కామము పై విజయం సాధిస్తే మీరు ప్రపంచానికి యజమానులుగా అవుతారు. పరమపిత పరమాత్మయే జగద్గురువని, ప్రపంచమంతటికి సద్గతినిచ్చేవారని నేరుగా చెప్పండి. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. అవినాశి జ్ఞాన రత్నాలతో బుద్ధి రూపీ జోలెను నింపుకొని సంపన్నంగా అవ్వాలి. ఏ విధమైన అహంకారమును చూపించరాదు.
2. సేవకు అర్హులుగా తయారైన తర్వాత మళ్లీ ద్రోహులుగా అయ్యి ఎప్పుడూ డిస్‌సర్వీసు చేయరాదు. దానిమిచ్చిన తర్వాత చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ వాపస్‌ తీసుకునే ఆలోచన కూడా రాకూడదు.

వరదానము :- '' బ్రాహ్మణ జీవితంలో ఏకవ్రత అనే పాఠము ద్వారా ఆత్మిక రాయల్టీలో ఉండే సంపూర్ణ పవిత్ర భవ ''
ఈ బ్రాహ్మణ జీవితంలో 'ఏకవ్రత' పాఠాన్ని పక్కాగా చేసుకొని పవిత్రతా రాయల్టీని ధారణ చేస్తే మొత్తం కల్పమంతటిలో ఈ ఆత్మిక రాయల్టీ కొనసాగుతూ ఉంటుంది. మీ ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రతల ప్రకాశము పరంధామములో ఆత్మలన్నిటిలో శ్రేష్ఠమైనది. ఆదికాలంలో దేవతా స్వరూపంలో కూడా ఈ విశేషమైన పర్సనాలిటి ఉండేది. తర్వాత మధ్య కాలంలో కూడా మీ చిత్రాలకు విధిపూర్వకమైన పూజ జరుగుతుంది. ఈ సంగమ యుగంలో బ్రాహ్మణ జీవితానికి ఆధారము - 'పవిత్రత యొక్క రాయల్టీ'. అందువలన ఎంతవరకు బ్రాహ్మణ జీవితంలో జీవించాలో అంతవరకు సంపూర్ణ పవిత్రంగా ఉండాల్సిందే.

స్లోగన్‌ :- '' మీరు సహనశక్తి దేవీ దేవతలుగా అయితే, నిందించేవారు కూడా కౌగలించుకుంటారు ''