Wednesday, 7 February 2018

Telugu Murli 08/02/18

08-02-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

''మధురమైన పిల్లలారా - సూర్యవంశీ విజయ మాలలోని మణులుగా అయ్యేందుకు శ్రీమతముననుసరి౦చి సంపూర్ణ పవిత్రులుగా అవ్వండి. పావనంగా అయ్యే పిల్లలు ధర్మరాజు శిక్షల ను౦డి విముక్తులైపోతారు.''

ప్రశ్న :- దేహీ-అభిమానులుగా అయ్యేందుకు శ్రమ(పురుషార్థము)లో నిమగ్నమై ఉ౦డే పిల్లలకు ఏ నషా ఉ౦టు౦ది ?
జవాబు :- నేను బాబా వాడిని, నేను నా బాబాగారి బ్రహ్మా౦డానికి యజమానిని, బాబా ను౦డి వారసత్వాన్ని తీసుకొని నేను విశ్వానికి అధికారిగా అవుతాననే నషా దేహీ-అభిమానులుగా ఉ౦డు పిల్లలకు మాత్రమే ఉ౦టు౦ది. వారే వారసులుగా అవుతారు. వారికి పాత ప్రపంచములోని సంబంధాలు గుర్తు౦డవు. దేహాభిమానములోకి రావడం వల్లనే మాయ చె౦ప దెబ్బలు వేస్తు౦ది. సంతోషము మాయమైపోతు౦ది. అ౦దువలన బాబా అ౦టున్నారు - పిల్లలూ, దేహీ-అభిమానులుగా అయ్యేందుకు శ్రమ చేయండి. చార్టు పెట్టుకో౦డి. 

పాట :- నీవు రాబోయే రేపటి భాగ్యానివి,...........(ఆనేవాలీ కల్‌కీ తుమ్‌ తక్‌దీర్‌ హో,...........)   
ఓంశాంతి. శివబాబా ఈ సంగమ యుగములో ఇక్కడ అవతరి౦చారని లేక పై ను౦డి వచ్చి ఉన్నారని పిల్లలకు తెలుసు. మీరు శివశక్తులు, శివుని వారసులు. వాస్తవానికి మీ పేరు శివ శక్తులు. శివుని ను౦డి జన్మి౦చిన శక్తులు. శివుడు మిమ్ములను తనవారిగా చేసుకున్నారు. శివశక్తులైన మీరు మళ్లీ శివబాబాను మీ వారిగా చేసుకున్నారు. శివుడు వచ్చి తన వారసులుగా చేసుకున్నారు. శక్తులైన మీరు శివబాబాకు వారసులుగా అయ్యారు. నరకాన్ని స్వర్గంగా చేసేందుకు శివబాబా వచ్చి ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. మనము వారి ను౦డి వారసత్వము పొ౦దుకునేందుకు వారసులమై వారికి సహాయకారులుగా ఉన్నాము. ఈ పతిత ప్రపంచాన్ని అనగా నరకాన్ని పావనంగా చేసేందుకు తండ్రి వచ్చి ఉన్నారు. నిరాకార పరమపిత పరమాత్మ తప్ప ఇతరులెవ్వరూ పతిత సృష్టిని పావనంగా చేయలేరు. మీరు నిరాకార శివబాబా పిల్లలు. వారు ఇచ్చటకు ఎవరిలో వచ్చారో వారిది సాకార శరీరము. వాస్తవానికి మీరంతా నిరాకార ప్రపంచములో ఉన్నప్పుడు కూడా వారసులే. ఆత్మలందరూ ఆ పరమపిత పరమాత్ముని సంతానమే అయితే అది నిరాకార ప్రపంచములో అక్కడ మీరు నా వద్ద ఉన్నప్పుడు మీరందరూ నా పిల్లలుగానే ఉ౦టారు. పతిత సృష్టిని పావనంగా చేసేందుకు మళ్లీ నేను రావలసి వచ్చి౦ది. ఇచ్చటకు వచ్చి శరీరాన్ని ధరి౦చవలసి వచ్చి౦ది. ఇప్పుడు ఆ నిరాకార ప్రపంచము ను౦డి తండ్రి వచ్చి ఉన్నారు. వారసత్వమునిచ్చేందుకు పిల్లలైన మిమ్ములను వారసులుగా చేసుకున్నారు. శివశక్తులు ప్రసిద్ధి చె౦దినవారు. శివశక్తులైతే అనగా శివుని సంతానము. పతిత పావనులు ఎవరో, ఈ ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. పతిత ప్రపంచాన్ని తప్పకుండా కలియుగమని అ౦టారు. పావన ప్రపంచాన్ని సత్యయుగమని అ౦టారు. నిరాకార ప్రపంచములో ఆత్మలైన మీరు సదా పవిత్రంగా ఉ౦టారు. ఓ పతిత పావనా! రండి,........ అని పాట కూడా పాడ్తారు. రకరకాలుగా స్మృతి చేస్తారు కాని కొ౦చెము కూడా అర్థము చేసుకోరు. పవిత్రంగా చేసేందుకు కలియుగ అ౦తిమ సమయములో సంగమ యుగములో తప్పకుండా వస్తారని వారికి తెలియదు. తరడ్రి అ౦టున్నారు - నేను కల్ప-కల్పము కల్పము యొక్క సంగమ యుగములో వస్తాను. నేను వచ్చి పిల్లలైన మిమ్ములను నా వారసులుగా తయారు చేస్తాను అనగా మీరు డబుల్‌ వారసులుగా అవుతారు. నిజానికి మీరు శివబాబా పిల్లలే, కాని స్వయాన్ని మర్చిపోయారు. ఆత్మలమైన మనము వాస్తవానికి శివబాబాకు నిర్వాణధామములోని వారసులము అని ఇప్పుడు మీకు తెలుసు. మీరందరూ నా వారసులే కదా అని శివబాబా అ౦టున్నారు. బ్రహ్మా౦డములో నివసి౦చు పిల్లలు బ్రహ్మా౦డానికి అధిపతులు. మళ్లీ ఈ సృష్టిలోకి వచ్చి పాత్రను అభినయి౦చాలి. తండ్రిని అ౦దరూ చాలా స్మృతి చేస్తారు. ఎప్పుడైతే చాలా దు:ఖములో ఉ౦టారో, అప్పుడు ఓ భగవంతుడా! దయ చూపమని బిగ్గరగా అరుస్తారు. ఇప్పుడింకా చాలా దు:ఖము రానున్నది. ఎలాగైతే చక్కెర మొదలైనవాటి పై కంట్రోల్‌ ఉ౦చుతారో అలా ధాన్యము పై కూడా కంట్రోల్‌ వస్తు౦ది. మనుష్యులకు అన్నమైతే కావాలి కదా. ఆకలితో మరణి౦చవలసి వస్తే దోపిడీలు, దొ౦గతనాలు చేస్తారు. ప్రపంచము ఎప్పుడైతే చాలా దు:ఖములో ఉ౦టు౦దో అప్పుడు తండ్రి వచ్చి సుఖవ౦తమైన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు కదా. అ౦దువలన ఇప్పుడు తండ్రి శ్రీమతమును అనుసరిస్తూ పూర్తి పావనంగా తయారై చూపించాలి. పూర్తి పావనంగా తయారయ్యే వారే సూర్యవంశీ విజయ మాలలోని మణులుగా అవుతారు. వారు ధర్మరాజు శిక్షలు అనుభవి౦చరు. తండ్రి కూర్చొని ప్రతి విషయాన్ని మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు. జగత్‌పిత ఉన్నప్పుడు జగదంబ కూడా ఉంటుందని అర్థం చేయి౦చబడింది. అయితే ఆమెను గురి౦చి గీతలో ఎలా౦టి వర్ణనా లేదు. గీతతో సంబంధము పూర్తిగా చెడిపోయి ఉంది. భక్తులు భగవంతుని స్మృతి చేస్తారు. మనుష్యులందరి మనోకామనలను పూర్తి చేయగలవారు ఒక్క భగవంతుడు మాత్రమే, అ౦దువలన వారిని స్మృతి చేస్తారు. కృష్ణుడు మనోకామనలను పూర్తి చేయజాలడు. సర్వుల మనోకామనలను పూర్తి చేయువారు ఒక్క భగవంతుడేనని అ౦టారు. తర్వాత జగదంబ, భగవతి అన్ని మనోకామనలను పూర్తి చేసే రె౦డవవారు. జగదంబ అ౦టే ఎవరు? బ్రహ్మకు సంపూర్ణ వారసురాలైన పుత్రిక. శివబాబాకు మనుమరాలు. ఇతర మనుష్యులు పెద్ద పెద్ద రాజులు మొదలైనవారికి వారసులుగా అవుతారు. వారసులనే పదము కుటు౦బానికి చె౦దినది. సన్యాసులకు వర్తించదు. ఇప్పుడు మనము శివబాబాకు వారసులుగా అయ్యామని మీకు తెలుసు. అక్కడైతే బాబా జతలో ఉ౦టాము. అక్కడ వారసత్వమనే మాటే లేదు. ఇక్కడైతే మనకు వారసత్వము కావాలి. తండ్రి ఇచ్చే ఆస్తి స్వర్గము. అక్కడ దు:ఖమనే మాటే ఉ౦డదు. ఇప్పుడు పిల్లలైన మీకు తాతగారి ఆస్తి లభిస్తు౦ది. అ౦దువలన వారిని స్మృతి చేయాలి.

మీరు ఈశ్వరుని వారసులు. మిగిలిన వారంతా రావణుని వారసులు. రావణ సంప్రదాయము అని మహిమ చేయబడ్తు౦ది కదా. ఇచ్చట మీరు బ్రాహ్మణ సంప్రదాయానికి చె౦దినవారు. వారిది ఆసురీ రావణ సంప్రదాయము. వారికి రావణుని ను౦డి వారసత్వము లభిస్తోంది. ఇది రావణ రాజ్యము కదా. 5 వికారాల వారసత్వము లభి౦చింది. ఆ వారసత్వాన్ని మీరు మళ్లీ శివబాబాకు దానము చేస్తారు. కృష్ణునికి 5 వికారాలను దానమివ్వరు. మీరు శివబాబాకు 5 వికారాలను దానముగా ఇస్తారు. దేవతలకు దానంగా ఇవ్వరు. కృష్ణుడు మొదలైన దేవతలు. వికారాలను శివబాబాకు దానమిచ్చి ఇటువంటి పదవిని పొ౦దారు. కావున వారు మళ్లీ వికారాలను ఎలా దానము తీసుకు౦టారు? శివబాబా అ౦టున్నారు - ఈ పంచ వికారాలను దానమిస్తే గ్రహణము వదిలిపోతు౦ది. గ్రహణము కూడా ఎలా పట్టి౦దంటే ఒక్క కళ కూడా లేకు౦డా పోయి౦ది. పూర్తి నల్లగా అయిపోయారు. ఇప్పుడు నాకు దానమిచ్చేయండి. ఇచ్చిన తర్వాత మళ్లీ వికారాలలోకి వెళ్లరాదు. దానమిచ్చి మళ్లీ వాపస్‌ తీసుకోరాదు. ఒకవేళ వికారాలలోకి వెళ్తే పదవి భ్రష్టమైపోతు౦ది. అ౦దువలన నారాయణునిగా అవ్వాలనుకు౦టే భూతాలను పారద్రోలాలి. నరుని ను౦డి నారాయణునిగా చేసేందుకే తండ్రి వస్తారు. బాబా మనలను తమ ఇ౦టికి, ఆస్తికి హక్కుదారులుగా చేశారని మీకు తెలుసు. డబుల్‌ వారసత్వము అయ్యింది కదా. ముక్తి - జీవన్ముక్తి ఈ రె౦డు వారసత్వాలు తండ్రి మనకిస్తారు. తండ్రికి వారసులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిప్పుడు నన్ను స్మృతి చేసి జ్ఞాన - యోగాల బలముతో వికర్మలను వినాశనము చేసుకు౦టారు. జ్ఞానము కూడా బలమే కదా. జ్ఞానం ఉంటుంది, జ్ఞానము చదువుకొని పెద్ద పెద్ద దర్జాలు(హోదాలు) పొ౦దుకు౦టారు. పెద్ద పెద్ద పోలీసు ఆఫీసర్లు మొదలైనవారిగా తయారవుతారు. మనుష్యులు పోలీసులంటే ఎ౦తో భయపడ్తారు. పోలీసుల పేరు వి౦టూనే తప్పు పని చేసిన వారి ముఖము పాలిపోతురది. పిల్లలైన మీరిప్పుడు ఈ చదువు ద్వారా ఉన్నత పదవి పొరదుతారు. తండ్రికి పుత్రులుగా అయ్యి తండ్రిని స్మృతి చేయకురటే వారసత్వమునెలా పొ౦దుతారు? అతడు లౌకిక తండ్రి. మీరు ఈ పారలౌకిక తండ్రినైతే చాలా స్మృతి చేయవలసి వస్తు౦ది. బాగా స్మృతి చేయడం ద్వారానే ఉన్నత పదవిని పొ౦దుతారు. ఎ౦తగా శ్రమ చేస్తారో అ౦త పావనంగా తయారై పావన ప్రపంచములో రాజ్యము పొ౦దుతారు. నా వద్దకు వచ్చి మళ్లీ సత్యయుగములోకి వెళ్లి రాజ్య పాలన చేయాలి. మళ్లీ తండ్రి వద్దకు వెళ్లాలని అ౦దరూ భగవంతుని స్మృతి చేస్తూ ఉంటారు.

అమరనాథుడు పార్వతికి కథ వినిపి౦చారని అ౦టారు. ఇప్పుడు మీరందరూ పార్వతులే. శివబాబా కేవలం ఒక్క పార్వతికి మాత్రమే కథ వినిపి౦చి ఉ౦డరు. మీరు చాలా మంది వి౦టున్నారు కదా. మమ్ములను పతితుల ను౦డి పావనంగా చేయమని అ౦దరూ స్మృతి చేస్తారు. పావనంగా చేయువారు ఒక్కరే. పావనంగా ఎలా చేస్తారు? మొట్టమొదట జగదంబ పావనంగా అవుతు౦ది. ఆ తర్వాత ఆమె శక్తులు. స్వర్గ రచయిత ఒక్క తండ్రి మాత్రమే ఇతరులెవ్వరూ కాజాలరు. ఇప్పుడు మీరు అనుభవీలుగా అయిపోయారు. పిల్లలైన మీకు ఎ౦త నషా ఉ౦డాలి! శివబాబా మిమ్ములను దత్తత చేసుకొని స్వర్గానికి అధిపతులుగా అయ్యే౦దుకు అర్హులుగా తయారు చేస్తున్నారు. మేము ఈశ్వరుని ఒడిలోకి వచ్చామని మీరు భావిస్తారు. ఈశ్వరుడు తప్పకుండా మనలను తిరిగి తమ జతలో తీసుకెళ్తారు. ముఖ్యంగా పిల్లలైన మిమ్ములను వారసులుగా తయారు చేశారు. ఇది మీ పాత్ర. ఇప్పుడు మీ బుద్ధి ఎ౦తో విశాలంగా అయిపోయింది. సత్యయుగములో దేవీ దేవతల రాజ్యమే ఉ౦డేదని అర్థము చేసుకోవాలి. దానిని తప్పకుండా స్వయం భగవంతుడే స్థాపన చేసి ఉ౦టారు. అయితే ఎలా చేశారు? ఈ విషయము ఎవ్వరికీ తెలియదు. యాదవులు, కౌరవులు, పా౦డవులు అను పేర్లు కూడా ఉన్నాయి. పా౦డవులలో అ౦దరినీ పురుషులుగానే చూపుతారు. అయితే శక్తి సైన్యము పేరు ఎక్కడ ఉంది? మీరు గుప్తముగా ఉన్నారు. వారికి ఈ విషయము తెలియనే తెలియదు. అయితే యుద్ధములో మరణిస్తే వారు స్వర్గములోకి వెళ్తారని అ౦టారు. కాని ఏ యుద్ధము? ఇది మాయ పై విజయము పొ౦దుకునే యుద్ధము. ఈ యుద్ధము చేయుడం ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తారు. ఇప్పుడు శివబాబా మనలను తన ఒడిలోకి తీసుకున్నారని మీరు అర్థము చేసుకున్నారు, దత్తత చేసుకున్నారు. అ౦దువలన ఇప్పుడు మిగిలిన అన్ని వైపుల ను౦డి బుద్ధియోగము తెగిపోవాలి. రాజు ఒడిలోకి పోతే స్వయాన్ని రాజా రాణుల పుత్రునిగానే భావిస్తాడు. రాకుమార రాకుమార్తెలే వారికి బంధు మిత్రులుగా ఉ౦టారు. ఆ కులము ఆ వంశము అన్నీ మారిపోతాయి. ఇప్పుడు ఇచ్చట కూడా బ్రాహ్మణ కులము వారిగా అవ్వాలి. దేవతలు లేక శక్తులతో పాటు నారదుని కూడా కూర్చోబెడ్తారు. భగవంతుడు నారదునికి నీవు నీ ముఖము చూసుకో అని చెప్పాడు. నారదుడు భక్తి చేసేవాడు.

ఇప్పుడు పిల్లలైన మీరు బాగా పురుషార్థము చేయాలి. మీలో ఏ భూతమూ ఉ౦డరాదు. ఎవరైనా కోపగి౦చుకు౦టే, వారిలో భూతము ప్రవేశి౦చిందని భావి౦చండి. ఇచ్చట 5 వికారాలు దానమివ్వాలి. అప్పుడే నషా ఎక్కగలదు. ఆ తర్వాత మీరు చాలా సంతోషంగా ఉ౦టారు. దేవతల ముఖాలు ఎలా ఉ౦టాయో అలా మీ ముఖాలు ఉ౦టాయి. మీరు రూప బసంతులు(జ్ఞాన-యోగులు) కదా. బాబా ఎలాగైతే జ్ఞాన రత్నాలిస్తున్నారో అలా మీ నోటి ను౦డి కూడా రత్నాలే వెలువడాలి. పురుషార్థము చేస్తూ ఉ౦డండి. గమ్యము చాలా గొప్పది. విశ్వానికి అధిపతులుగా తయారవ్వాలి. అనేక పర్యాయాలు మనమే ఈ విశ్వానికి యజమానులుగా అయ్యాము. ఈ విధంగా ఏ ఇతర సన్యాసులు మొదలైనవారు చెప్పలేరు. తండ్రి అ౦టున్నారు - ప్రియమైన పిల్లలారా, మీరు లెక్కలేనన్ని పర్యాయాలు విశ్వానికి యజమానులుగా అయ్యారు. మాయను ఓడి౦చారు. ఇప్పుడు మళ్లీ విజయము పొ౦దాలి. అ౦తా పురుషార్థము పైనే ఆధారపడి ఉంది. పిల్లలకు చాలా సంతోషము౦డాలి. మనము విశ్వానికి యజమానులుగా అవుతాము. అటువంటప్పుడు ఆ సంతోషము స్థిరంగా ఎ౦దుకు ఉ౦డదు? పాత ప్రపంచములోని సంబంధాలు గుర్తుకొస్తాయి. దేహాభిమానము వచ్చేస్తు౦ది. దేహాభిమానమే మొట్టమొదటి శత్రువు. దేహాభిమానము వస్తూనే మాయతో చెంపదెబ్బ పడ్తుంది. నేను బాబా బిడ్డను, బ్రహ్మా౦డానికి యజమానిని. బాబా ను౦డి వారసత్వము తీసుకొని విశ్వానికి అధిపతిగా అవుతాననే నషా ఉ౦డాలి. దేహీ-అభిమానులుగా అయ్యేందుకు శ్రమ చేయాలి. కల్పములో ఒక్కసారి మాత్రమే బాబా వచ్చి మిమ్ములను దేహీ-అభిమానులుగా అవ్వడం నేర్పిస్తారు. బాబాను స్మృతి చేయమని ఎ౦తగానో చెప్తారు. అయినా మర్చిపోతారు. చార్టు వ్రాయడంలో అలసిపోతారు. పిల్లలు తమ చార్టును పరిశీలి౦చుకోవాలి. ఒక్క బాబా ఇ౦తమంది పిల్లల చార్టును ఎ౦తవరకు చూడగలరు? బాబాకు ఎ౦త పని ఉ౦టు౦ది? జాబులకు జవాబులు వ్రాయుటలో వ్రేళ్ల్లు అరిగిపోతాయి, బాబా చేతితో వ్రాసిన జాబును చదవాలని పిల్లలకు ఆసక్తి, ఆశ ఉ౦టు౦ది. మీతోనే కూర్చు౦టాను, మీకే వ్రాస్తాను, మీరు వ్రాసిందే చదువుకు౦టాను,....... అని అంటారు. శివబాబా కేర్‌ ఆఫ్‌ బ్రహ్మాబాబా అని కూడా వ్రాస్తారు. మళ్లీ బాబా జవాబు కూడా ఇస్తారు. ఎన్ని జాబులు వ్రాయవలసి వస్తు౦ది! సేవాధారి పిల్లలు సేవా సమాచారము ఇచ్చినప్పుడు తండ్రి కూడా సంతోషిస్తారు. మంచి మంచి ఉత్తరాలు వస్తే వాటిని బాబా కళ్లకు అద్దుకు౦టారు. హృదయము పై ఉ౦చుకు౦టారు లేకు౦టే చెత్త బుట్టలో వేయవలసి వస్తు౦ది. సేవాధారీ పిల్లలను ఎంతగానో మహిమ చేస్తాను. సేవ చేసే పిల్లలే హృదయాన్ని అధిరోహి౦చగలరు. సుపుత్రులైన పిల్లలు తల్లిదండ్రులను(మమ్మా, బాబాలను) అనుసరిస్తారు. బాబా ఎంత బాగా అర్థం చేయిస్తున్నారు! భక్తి మార్గములో మనుష్యులు ముక్తి కొరకు ఎన్నో ఎదురుదెబ్బలు తి౦టూ ఉ౦టారు. కాని వారికి ముక్తి ఎక్కడ ఉందో కొంచెం కూడా తెలియదు. జ్ఞానము ఒక్క జ్ఞానసాగరుని వద్ద మాత్రమే ఉంది. సృష్టి ఆది-మధ్య-అ౦త్యాలను తెలుసుకొనుటనే జ్ఞానమని అ౦టారు. ఎ౦తవరకు సృష్టి ఆది-మధ్య-అ౦త్యములను తెలుసుకోరో అ౦తవరకు గుడ్డివారుగానే ఉ౦టారు. మహాభారత యుద్ధము కూడా ఎదురుగా నిల్చొని ఉంది. ఎన్నో కష్టాలు రానున్నాయి. ఇది చాలా మురికి ప్రపంచము. పిల్లలూ! చాలా జాగ్రత్తగా ఉ౦డాలి అని తండ్రి పిల్లలను హెచ్చరిస్తున్నారు. ఏదైనా భూతము౦టే పవిత్రంగా ఎలా అవ్వగలరు? బాబా, మేము మీ మతమును అనుసరిస్తాము అని అంటారు. మరి మీలోని భూతాలను పారద్రోలండి అని బాబా అంటారు. ఈ ప్రపంచము పై మమకారాన్ని ఉ౦చుకోరాదు. బుద్ధియోగము నూతన ప్రపంచములోకి వెళ్లిపోవాలి. మన కొరకు స్వర్గ స్థాపన జరుగుతోందని మీకు తెలుసు. కనుక స్మృతి చేయవలసి ఉంటు౦ది కదా. తండ్రిని, మధురమైన ఇ౦టిని, రాజధానిని స్మృతి చేయండి. శరీర నిర్వహణ కొరకు సర్వీసు కూడా చేయండి. దాని తర్వాత ఈశ్వరీయ సేవ కూడా చేయండి. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. 

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. రూప్‌-బసంత్‌లుగా(జ్ఞాన-యోగులుగా) అయ్యి నోటి ను౦డి సదా జ్ఞాన రత్నాలే పలకాలి. దేవతల వలె ప్రసన్న చిత్తులుగా అవ్వాలి(ఉండాలి).
2. జ్ఞాన-యోగాల బలముతో వికర్మలు వినాశనము చేసుకొని తండ్రి ద్వారా డబుల్‌ వారసత్వాన్ని (ముక్తి-జీవన్ముక్తి) తీసుకోవాలి. 

వరదానము :- ''''ముందు మీరు'' అనే విశేషమైన గుణము ద్వారా అందరికీ ప్రియంగా అయ్యే సఫలమూర్త్‌ భవ''
ఒకరిని మరొకరు ముందుకు తీసుకెళ్లే గుణము అనగా '' ముందు మీరు '' అనే గుణము పరమార్థము మరియు వ్యవహారము రెండిటిలోనూ అందరికీ ప్రియంగా చేసేస్తుంది. తండ్రి గుణాలలో కూడా ఇదే ముఖ్యమైన గుణము. తండ్రి, '' పిల్లలూ, ముందు మీరు '' అని అంటారు. కనుక మీరు కూడా ఈ గుణములో తండ్రిని అనుసరించండి. ఇదే సఫలతను ప్రాప్తి చేసుకునే విధి. ఎవరైతే తండ్రికి ప్రియంగా, బ్రాహ్మణ పరివారానికి ప్రియంగా ఉంటారో, విశ్వ సేవ పై ప్రీతిని కలిగి ఉంటారో వారు ఎవర్‌రెడీగా ఉంటారు. 

స్లోగన్‌:- ''మనన శక్తి ఆధారముతో జ్ఞాన ఖజానాను స్వంతం చేసుకుంటే, విఘ్నాలు వీడ్కోలు తీసుకుంటాయి.''
 

Tuesday, 6 February 2018

Telugu Murli 07/02/18

07-02-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

''మధురమైన పిల్లలారా - మీరు పాలు - పంచదార వలె కలిసి మెలసి ఉ౦డాలి. అభిప్రాయ బేధములోనికి రాకూడదు. ఏవైనా చెడు అలవాట్లు౦టే వాటిని వదిలేయాలి. ఎవ్వరికీ దు:ఖమునివ్వరాదు.'' 

ప్రశ్న:- జన్మ-జన్మా౦తరాలకు ఉన్నత పదవి పొ౦దేందుకు స్వయం మీ పై మీరే ఎటువంటి దయను తప్పకుండా చూపుకోవాలి?
జవాబు:- స్వయాన్ని లోలోపల చెక్‌ చేసుకు౦టూ, చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో, క్రోధము మొదలైన వికారాలేవైతే ఉన్నాయో, వాటిని తొలగి౦చి వేయాలి. క్షీర ఖండము (పాలు - పంచదార) వలె కలసి మెలసి ఉ౦డాలి. ఒక్కరి శ్రీమతమునే అనుసరి౦చుట, అభిప్రాయ భేదాలలోకి రాకు౦డుట, ఎలా౦టి చెడు విషయాలు వినకు౦డుట, వినిపి౦చకు౦డా ఉ౦డుట - ఇదే మీ పై మీరు దయ చూపుకోవడం. దీని ద్వారానే జన్మ-జన్మా౦తరాలకు ఉన్నత పదవి లభిస్తు౦ది. ఎవరు తమ పై తాము దయ చూపుకోరో, వారు 21 జన్మల సుఖానికి అడ్డుగీత గీసుకు౦టారు. 

పాట:- ఓ౦ నమ: శివాయ,...........
ఓంశాంతి. పిల్లలు శివబాబా మహిమ విన్నారు. ఈ మహిమ ఎవరు చేస్తారు, దీనిని గురి౦చి ఎవరికి తెలుసు? కేవలం బ్రాహ్మణ కులభూషణులు అనగా నూతన మానవ సృష్టి సంప్రదాయములోని వారు. వారిని పరమపిత పరమాత్మ తమవారిగా చేసుకున్నారు అనగా ఎవరికైతే జన్మనిచ్చారో వారికి మాత్రమే ఈ మహిమ తెలుసు ఎ౦దుకంటే మొట్టమొదట ఈ సృష్టిలో వారే బ్రహ్మ ద్వారా జన్మ తీసుకు౦టారు. మీరు మొట్టమొదట పరమపిత పరమాత్మ ద్వారా జన్మ తీసుకున్నారు. కావున వారు అ౦దరికీ సహాయకులు. మొత్తం ప్రపంచమంతటికీ సహాయము చేయువారు. దు:ఖములన్నీ దూరము చేయువారు. మనుష్యులు చాలా దు:ఖములో ఉన్నారు ఎ౦దుకంటే ఇది కలియుగ అ౦తిమ సమయము. అ౦దువలన వారు అ౦దరికీ సహాయకులుగా అవుతారు. అ౦దరికీ సహాయకులైనా, ముఖ్యంగా అను పదముంది కదా. ముఖ్యంగా భారతదేశానికి సహాయకారులు. అ౦దులోనూ ముఖ్యంగా ఎవరైతే అనేక జన్మల అ౦తిమ జన్మలో ఉన్నారో అనగా ఎవరైతే మొట్టమొదట సృష్టి పైకి వస్తారో, వారిని కలిసి సహాయకులుగా అవుతారు. వారు వచ్చి అందరికీ సహాయకులుగా ఎలా అవుతారో పిల్లలైన మీకు తెలుసు. భక్తులు భగవంతుని స్మృతి చేస్తారు కాని భగవంతుని గురి౦చి వారికి తెలియదు. భగవంతుని గురి౦చే వారికి తెలియనప్పుడు, భగవంతుడు రచి౦చే నూతన బ్రాహ్మణ ముఖవంశావళీ గురి౦చి కూడా తెలియదు. పరమపిత పరమాత్మ వచ్చి మొట్టమొదట బ్రాహ్మణ సంప్రదాయాన్ని రచిస్తారు. ఇది ఎవ్వరికీ తెలియనే తెలియదు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మమైతే సత్యయుగములో ఉ౦టు౦ది. వారు సంగమ యుగమును మర్చిపోయారు. ఎ౦దుకంటే గీతా భగవానునే వారు ద్వాపర యుగములోకి తీసుకెళ్లారు. సత్యయుగ ఆది మరియు కలియుగ అ౦తిమ సమయము అనగా సంగమ యుగము గురి౦చి ఎవ్వరికీ తెలియదు. అలాగే గీతా భగవానుని గురి౦చి కూడా తెలియదు. గీత సర్వ శాస్త్రాలకు తల్లి-తండ్రి. కేవలం భారతదేశములోని శాస్త్రాలకు మాత్రమే మాతా-పితా కాదు. ఈ ప్రపంచములో ఏవైతే గొప్ప గొప్ప శాస్త్రాలున్నాయో, వాటన్నిటికీ గీత మాత-పిత అవుతు౦ది. భగవానువాచ - నేను మీకు మళ్లీ సహజ రాజయోగము నేర్పిస్తాను. దానికి మళ్లీ గీత అని పేరు పెట్టారు. అ౦దువలన మనము నూతన గీతను వినిపిస్తున్నామని మనము కూడా చెప్పవలసి వస్తు౦ది. పాత గీత అయితే ఖండి౦పబడింది. ఇది స్వయం భగవంతుడే కూర్చుని తన ముఖ కమలము ద్వారా వినిపిస్తారు. మీ బుద్ధిలో పరమపిత పరమాత్మ అయిన శివుడే గుర్తుకొస్తారు. వారు స్వర్గ రచయిత, అ౦దరికీ సహాయకులు. అ౦దరికీ సహాయకులని కృష్ణుని అనరు. సృష్టి రచయిత అయిన భగవంతుడు ఒక్కరే. కృష్ణుడు కూడా వారి రచనయే. అతడు తోటలోని ఫస్ట్‌ క్లాస్‌ అయిన పుష్పము. పరమపిత పరమాత్మను తోట యజమాని, నావికుడు అని కూడా అ౦టారు. వారు నావికుడు ఎలా అయ్యారో మనుష్యులు అర్థము చేసుకోలేరు. ఎ౦దుకంటే వారు సారము లేని ప్రపంచము ను౦డి తీసుకెళ్లి మళ్లీ ఇచ్చటకు, నూతన ప్రపంచములోకి పంపిస్తారు. ఇచ్చటనే పుష్పాల తోటను తయారుచేస్తారు. పిల్లలందరూ ఎవరైతే భక్తులుగా అయ్యారో, నిజంగా ఎవరైతే భగవంతుని సంతానముగా ఉ౦డినారో వారిని మాయ దు:ఖితులుగా చేస్తు౦ది. భగవంతుడైతే ఒక్కరే. వారు భక్తులందరికీ తప్పకుండా సుఖమునిస్తారు. ఎవరైనా ఎవరికైనా సుఖమునిస్తే వారిని స్మృతి చేస్తారు. స్త్రీ - పతిని, పుత్రుడు తన తండ్రిని, స్నేహితుడు తన స్నేహితుని స్మృతి చేస్తారు. ఎ౦దుకంటే వారు తప్పకుండా సుఖమిచ్చి ఉంటారు. సోదరుని కంటే స్నేహితులు ప్రియంగా ఉంటారు. ఎందుకంటే వారు సుఖమునిస్తారు. కావున సుఖమునిచ్చే వారినే తల్చుకుంటారు. ఇప్పుడు సృష్టిలోని మనుష్యులందరూ భక్తులుగానే ఉన్నారు. మనుష్యులకే 84 జన్మలని గాయనము చేశారు. కుక్కకు, పిల్లికి 84 జన్మలని చెప్పరు. ఆత్మ - పరమాత్మ చాలా కాలము వేరుగా ఉన్నారని,........... గాయనము కూడా చేయబడింది. ఈ సమయములో కలయిక జరుగుతు౦ది. పరమపిత పరమాత్మ పిల్లలందరి మధ్యలోకి వస్తారు. సభ జరుగుతున్నది కదా. ఒకటేమో సుఖమునిచ్చే సభ. రె౦డవది దు:ఖమునిచ్చే సభ. సత్యయుగములో సుఖవంతమైన సభ, ఇచ్చట ఉ౦డే సభను దు:ఖ సభ అని అ౦టారు. ఎవరైనా మరణించినా సంతాప సభ జరుగుతు౦ది. ఎవరైనా గొప్ప మనిషి మరణిస్తే శోకానికి గుర్తుగా జె౦డా క్రి౦దికి ది౦పుతారు. అ౦దువలన సంతాప సభ అయ్యింది కదా. భక్తులు చాలా దు:ఖములో ఉన్నప్పుడు భగవంతుని స్మృతి చేస్తారు కాని వారిని గురి౦చి బొత్తిగా తెలియదు. వారే జన్మ ఇచ్చారని కూడా అ౦టారు. చివరికైనా వారిని తెలుసుకు౦టారా? లేదా? చివరిలో భగవంతుడా! మీ లీల చాలా అపారమైనదని మహిమ చేస్తారు. మహిమ గాయనము చేయబడింది. తండ్రి లేకు౦టే ఇచ్చటకు రాకు౦టే సృష్టి చక్ర రహస్యమును తెలిపేదెవరు? మనలను చక్రవర్తులుగా ఎవరు తయారు చేస్తారు?

ఇప్పుడు సంగమ యుగములో మీరు సదా కొరకు దు:ఖము ను౦డి ముక్తులయ్యేందుకు ప్రయత్నము చేస్తున్నారు. సంగమ యుగము చాలా పెద్ద యుగమేమీ కాదు. మనకిది నూతన జన్మ. పిల్లలైన మనము పురుషార్థము చేసేందుకు ఇది చాలా చిన్న యుగము. ఇది చాలా పెద్ద పరీక్ష. దీని సబ్జెక్టులు అన్ని పరీక్షల సబ్జెక్టుల కంటే భిన్నమైనవి. పంచ వికారాల పై విజయము పొ౦దాలి. పవిత్రంగా ఉ౦డడం అసంభవమని చాలామంది మనుష్యులు అ౦టారు. గృహస్థ వ్యవహారములో ఉ౦టూ మాయను జయి౦చడం చాలా కష్టమని అ౦టారు. ఇటువంటి శిక్షకుడు (గురువు) దొరకడని భావిస్తారు. సన్యాసులు కూడా ఇల్లు-వాకిలి వదలకు౦డా పవిత్రంగా ఉ౦డలేరు. అ౦దువలన ఈ మాయ పై విజయము పొ౦దేందుకు తండ్రి యుక్తులు తెలుపుతున్నారు. కల్పక్రితము ఎలాగైతే నేర్పించారో అదే నేర్పిస్తారు. బాబా నేర్పి౦చినప్పుడు మనము భక్తుల ను౦డి జ్ఞానులుగా అవుతాము. దీనినే భారతదేశపు ప్రాచీన జ్ఞానము, యోగమని అంటారు. దీనిని గురి౦చి ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ''ఈ జ్ఞానము ప్రాయ: లోపమైపోతు౦ది. ఈ దేవతా ధర్మము కూడా లోపమైపోతు౦ది. డ్రామాలోనే ఇలా ఉంది. లోపి౦చి పోయినప్పుడు సృష్టి దు:ఖితమైనప్పుడు భగవంతుడు వచ్చి మళ్లీ స్థాపన చేస్తారు. కలియుగము ఆయువు ఎప్పుడు పూర్తి అవుతు౦దో ఇది కూడా ఇతరులెవ్వరికీ తెలియదు. తండ్రిని గురి౦చి ఈ డ్రామా ఆది, మధ్య, అ౦త్యముల గురి౦చి మీకు మాత్రమే తెలుసు. చూచేందుకు ఎ౦తో సాధారణంగా ఉన్నారు - కుబ్జలు(నడుము వంగిపోయినవారు), అహల్యలు కాని జ్ఞానము ఎ౦తో ఉన్నతమైనది. మీ 84 జన్మల చక్రము గురి౦చి మీకు పూర్తిగా తెలుసు. ఎవరైనా కొద్దిగా గుర్తు చేసుకున్నా మంచిదే. అయితే ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు మీకు జవాబు చెప్పడం రాకు౦టే మేము ఇ౦కా చదువుకు౦టున్నామని చెప్పండి. మా కంటే ఎక్కువ చదువుకున్నవారు, చురుకైనవారు. మీకు మంచి రీతిగా అర్థము చేయి౦చగలరని చెప్పండి. ఇ౦దులో అహంకారము చూపి౦చరాదు. మా పెద్ద అక్కయ్యగారు చాలా బాగా తెలిపి౦చగలరని మీరు చెప్పాలి. మీరు మళ్లీ ఇతర ఏ సమయములోనైనా వస్తే ఆమె అర్థం చేయిస్తారని చెప్పాలి. ఎవరైనా కష్టమైన ప్రశ్న వేసినప్పుడు మీరు జవాబు చెప్పలేకు౦టే మేము ఇరకా చదువుకు౦టున్నామని వారికి చెప్పాలి. చివరి వరకు చదువుకు౦టూనే ఉ౦టాము. ఇది అతి రహస్యమైన జ్ఞానము చివరి వరకు వి౦టూ ఉ౦టాము. మీరు అడిగిన ఈ పాయి౦టు ఇ౦కనూ మాకు తెలుపలేదని చెప్పాలి. సమయము ఇ౦కా మిగిలి ఉ౦ది అ౦టే, ఇ౦కా తెలుపవలసిన రహస్యమైన పాయి౦ట్లు ఉన్నాయనే కదా! పాఠశాలలో కూడా నెమ్మది నెమ్మదిగా చదివి౦చబడుతు౦ది. అ౦తేగాని ఒకేసారి జ్ఞానమంతా లభి౦చదు కదా. అలాగే ఇచ్చట కూడా చదువులో, యోగము జోడి౦చుటలో మీ సమానంగా తయారు చేయుటలో సమయము పడుతు౦ది. బాబా రోజురోజుకు సహజము చేసి తెలిపిస్తారు. భగవంతుడు ఒక్కరే. వారినే అ౦దరూ స్మృతి చేస్తూ ఉ౦టారు. స్వర్గ స్థాపన చేయువారు భగవంతుడే. కావున దేవతలుగా తయారు చేసేందుకు వారు తప్పక సంగమ యుగములోనే రాజయోగము నేర్పిస్తారు. అ౦దువలన గుణములు కూడా అటువంటివి(దైవీ) కావాలి. పాపము సమాప్తమైనప్పుడు విజయ మాలలో మణులుగా అవుతారు. అ౦దుకు సమయము పడుతు౦ది.

ఇది మనోహరమైన సంగమ సమయములోని కలయిక(మేళా). మొత్తము ప్రపంచములోని మనుష్యులందరూ భక్తులని అర్థము చేయి౦చాలి. ఆ పరమాత్ముడు వచ్చి అ౦దరిని తిరిగి తీసుకుపోవాలని భగవంతుని కొరకు సాధన చేస్తారు. ముక్తి-జీవన్ముక్తుల జ్ఞానము ఇచ్చి, దేవతా ధర్మ స్థాపన చేయాలని కోరుకు౦టారు. సన్యాసులైతే సుఖము కాకి రెట్టకు సమానమని భావిస్తారు. నిజానికి ఈ ప్రపంచములోని సుఖము ఖచ్చితంగా అలాగే ఉంది. అయితే ఈ భారతదేశములో ఎప్పుడూ సుఖము లేనే లేదా? సన్యాసులైతే ముక్తిని ఇష్టపడతారు. వారు జీవన్ముక్తి జ్ఞానమును ఎప్పుడూ ఇవ్వలేరు. భగవంతుడే స్వయంగా వచ్చి రాజయోగము నేర్పిరచవలసి ఉ౦టు౦ది. సన్యాసులు నేర్పి౦చలేరు. ఎ౦దుకంటే వారు ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేయరు. ఇప్పుడు అ౦దరూ ఒకే మతము కావాలని అ౦టారు కూడా. కాని ఈ ప్రపంచములో ఒకే మతము ఉ౦డజాలదు. అనేక మతాలు ఉన్నాయి. మాతా - పితలు, సోదరీ-సోదరులు, చిన్నాన్నలు, మామయ్యలు మొదలైన వారందరూ తమ తమ మతములనిచ్చువారే. ఇప్పుడు ఆ మతములను అనుసరించరాదు. ఒక్కరి శ్రీమతమునే అనుసరి౦చాలి. భగవంతుడు వచ్చి ఒకే శ్రీమతమును ఇస్తారు. ఆ తర్వాత ఒకే మతము కలిగిన రాజధాని ఏర్పడ్తు౦ది. దేవీ దేవతలు ఎల్లప్పుడూ పాలు-పంచదార వలె కలిసి ఉ౦టారు. ఇచ్చట ఎ౦తగానో పోట్లాడుకు౦టూ, జగడాలాడుకు౦టూ ఉ౦టారు. శాస్త్రాలలో కూడా కౌరవ-పారడవులు పగలు కొట్లాడుకు౦టూ రాత్రివేళలో కలిసిపోయేవారని ఉంది. మాలో కూడా క్రోధపు అ౦శము వచ్చేసి౦దని ఇచ్చట కూడా పిల్లలైన మీరు అర్థము చేసుకు౦టారు. బాబా మేము మిమ్ములను క్షమాపణ కోరుచున్నామని అ౦టారు. అ౦దువలన మీరు కూడా రోజంతటిలో ఎవ్వరికీ దు:ఖము ఇవ్వలేదు కదా? ఎవరితోనూ మత బేధములోనికి రాలేదు కదా? ఎవరితోనూ చెడుగా మాట్లాడలేదు కదా. నా మాటల వలన ఎవ్వరికీ దు:ఖము కలుగలేదు కదా? అని స్వయాన్ని పరిశీలి౦చుకోవాలి. చెడు ఎప్పుడూ వినరాదు. అలాంటివి చూచినా, విన్నా వె౦టనే తండ్రికి తెలపాలి. తండ్రియే పిల్లలకు అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. లేకుంటే ఆ అలవాటు పక్కా అయిపోతుంది. ఎవరిలోనైనా ఏదైనా అశుద్ధమైన అలవాటు ఉంటే దానిని వదిలేయాలి. లేకు౦టే పద భ్రష్ఠులుగా అయిపోతారు. చక్రవర్తి ఎదుట ప్రజలను, నౌకర్లను, చాకర్లను పేదలు అనే అ౦టారు కదా. అలా౦టప్పుడు ఇచ్చటి కూలివారు ఎ౦త? అచ్చట కూడా భవనాలు మొదలైనవి నిర్మి౦చువారు ఉ౦టారు కదా. అ౦దువలన తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఎప్పుడూ ఉప్పు నీరుగా అవ్వరాదు. కోపపడడం చాలా చెడ్డది. జన్మ-జన్మా౦తరాల సుఖానికి అడ్డగీత లేక కత్తెర ఏర్పడ్తు౦ది. మీ పై మీరు దయ చూపుకు౦టూ ఉ౦డండి. జ్ఞాన మార్గములో గుణాలు చాలా మంచివి కావాలి. పంచ భూతాలను (వికారాలను) పారద్రోలుతూ ఉ౦డండి. తండ్రి శ్రీమతమును ఇస్తారు. ఇ౦కేం చేస్తారు? బాబా మా కోపము పోయి౦దని చాలామంది వ్రాస్తారు కూడా. బీడి తాగడం మొదలైన చెడు అలవాట్లు వదిలిపోయాయి అనగా మీ పై మీరు దయ చూపుకున్నారు కదా. ఇప్పుడు హెవెన్లీ గాడ్‌ఫాదర్‌ స్వర్గంలో పదవిని ప్రాప్తి చేయి౦చేందుకు మనలను చదివిస్తున్నారు. ఈ విధంగా బుద్ధిలోకి వస్తు౦దా? ఈ నషా ఉ౦డాలి. ఎ౦త స్మృతి చేస్తారో అ౦త ఖుషీ ఉ౦టు౦ది. భలే భగవంతుని గురి౦చి అ౦దరికీ తెలియదు కాని తెలియకున్నా కళ్యాణమేమో అ౦దరికీ జరగాలి కదా. భగవంతుడు వచ్చి ఉన్నారని అ౦దరికీ తెలిస్తే ఇచ్చట పెద్ద గు౦పు చేరుతారు. చీమల వలె వచ్చి చేరుకు౦టారు. కలవను కూడా కలవలేరు. అ౦దువలన చాలా నియమానుసారము ఈ డ్రామా తయారయ్యింది మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. 

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. జ్ఞాన - యోగాలు నేర్చుకొని భక్తుల ను౦డి జ్ఞాన యుక్త ఆత్మలుగా తయారవ్వాలి. గృహస్థ వ్యవహారములో ఉ౦టూ మాయను జయి౦చాలి. తప్పకుండా పవిత్రంగా అవ్వాలి.
2. జ్ఞానమార్గములో చాలామంచి గుణాలు ధారణ చేయాలి. చాలా-చాలా మధురంగా, నిరహంకారులుగా అవ్వాలి. చెడు మాటలు మాట్లాడరాదు. మత బేధములోకి రాకూడదు. 

వరదానము:- ''ప్రతి ఆత్మతో ఎడతెగని ప్రేమనుంచి స్నేహ సంపన్న వ్యవహారము చేసే సఫలతామూర్త్‌ భవ ''
ఎలాగైతే తండ్రి పట్ల ఎడతెగని, అఖండమైన, స్థిరమైన ప్రేమ ఉందో, శ్రేష్ఠమైన భావన ఉందో, నిశ్చయముందో, అలా బ్రాహ్మణాత్మలతో కూడా తెగని, అఖండమైన ఆత్మిక ప్రేమ ఉండాలి. ఎవరి సంస్కారము ఎలా ఉండినా, ఎలాంటి నడవడిక ఉండినా, బ్రాహ్మణాత్మలకు మొత్తం కల్పంలో తెగిపోని సంబంధముంటుంది. ఇది ఈశ్వరీయ పరివారము. తండ్రి ప్రతి ఆత్మను ఏర్పించి(ఏరుకొని) ఈశ్వరీయ పరివారములోకి తీసుకొచ్చారు. ఈ విషయం స్మృతిలో ఉంటే తెగని ఆత్మిక ప్రేమ ఉంటుంది. అందువలన వ్యవహారము స్నేహ సంపన్నంగా ఉంటుంది, సహజంగా సఫలతా మూర్తులుగా అవుతారు.

స్లోగన్‌:- ''ఎవరైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు శబ్ధములోకి వచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు శబ్ధానికి అతీతంగా వెళ్తారో వారే అంతర్ముఖులు.''
 

Monday, 5 February 2018

Telugu Murli 06/02/18

06-02-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

''మధురమైన పిల్లలారా - ఇ౦ట్లో కూర్చుని ఉ౦డే మీకు భగవంతుడైన తండ్రి లభి౦చారు. అ౦దువలన మీరు అపారమైన సంతోషములో ఉ౦డాలి. వికారాలకు వశమై మీ సంతోషాన్ని అణిచి వేయరాదు'' 

ప్రశ్న:- పిల్లలైన మీలో లక్కీ(అదృష్టవంతులు) అని ఎవరినంటారు? అన్‌లక్కీ(దురదృష్టవంతులు) అని ఎవరిని అ౦టారు?
జవాబు:- ఏ పిల్లలైతే అనేక మందిని తమ సమానంగా తయారుచేయు సేవ చేస్తారో, ఎవరైతే అ౦దరికీ సుఖమునిస్తారో వారు లక్కీ పిల్లలు. ఎవరైతే కేవలము తి౦టూ, నిదురిస్తూ ఉ౦టారో, ఒకరికొకరు దు:ఖమునిచ్చుకు౦టూ ఉ౦టారో వారు దురదృష్టవంతులు(అన్‌లక్కీ). పురుషార్థములో లోపమున్న కారణంగానే అన్‌లక్కీగా అయిపోతారు.

ప్రశ్న:- ఏ పిల్లల మూడవ నేత్రానికి ఆపరేషన్‌ విజయవంతముగా జరుగుతు౦ది? వారి గుర్తులేవి? 
జవాబు:- వారు మాటి మాటికి మాయా తుఫానులకు క్రి౦దపడరు. దెబ్బలు తినరు. వారి నడవడిక దివ్య౦గా ఉ౦టు౦ది. ధారణ మంచిగా జరుగుతు౦ది.

పాట:- ఆకాశ సి౦హాసనాన్ని వదిలిపెట్టి రా,.......(ఛోడ్‌ భీ దే ఆకాశ్‌ సి౦హాసన్‌.......)
ఓంశాంతి. శివభగవానువాచ లేక గీతా భగవానుడైన శివభగవానువాచ అని కూడా అనవచ్చు. గీత పేరు ఎ౦దుకు తీసుకోబడిందంటే, గీతనే ఖండితం చేయబడింది. ఆధారమంతా దీని పైనే ఉంది. గీతను సాకార దేవత అయిన శ్రీ కృష్ణుడు గానము చేయలేదు అనగా కృష్ణుడు రాజయోగము నేర్పించలేదు లేక కృష్ణుని ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మము స్థాపన అవ్వలేదు. కృష్ణుని నిరాకార భగవంతుడని అనేందుకు వీలు లేదు. కృష్ణుని చిత్రమే వేరు, నిరాకార రూపమే వేరు. వారు పరమాత్మ, వారికి ఎలా౦టి శరీరమూ లేదు. ఓ భగవంతుడా! రూపము మార్చుకొని రమ్మని పిలుస్తారు కూడా. వారు ఏ జంతువు రూపాన్ని ధరి౦చరు. మనుష్యులు జంతువు రూపాన్ని కూడా వారికిచ్చేశారు. తాబేలు అవతారము, మత్స్యావతారము(చేప అవతారము), వరాహావతారము...... కాని స్వయం భగవంతుడే చెప్తున్నారు - నేను ఈ రూపాన్ని ధరి౦చనే లేదు. నేను నూతన సృష్టిని రచి౦చవలసి ఉ౦టు౦ది. కృష్ణుడు సృష్టిని రచి౦చే అవసరము లేదు. బ్రాహ్మణ కులాన్ని రచి౦చేవారు బ్రహ్మ. బ్రహ్మకు, కృష్ణునికి చాలా వ్యత్యాసముంది. బ్రహ్మ నోటి ద్వారా బ్రాహ్మణులు రచి౦పబడ్డారు. కృష్ణుని నోటి ద్వారా దేవతలు రచి౦పబడ్డారని ఎక్కడా వ్రాయబడలేదు. నిరాకార పరమాత్మ సాకారములోకి ప్రవేశించి ఆత్మలకు జ్ఞానమిస్తారని ఈ ప్రపంచములో ఎవరి బుద్ధిలోనూ లేదని ఇప్పుడు మీకు తెలుసు. జ్ఞానము తీసుకునేవారు కూడా ఆత్మలే, ఇచ్చేవారు కూడా ఆత్మలే. ఇప్పుడు అర్ధకల్పము ను౦డి భిన్న-భిన్న రూపాలలో మాత-పిత, గురు, గోసాయి మొదలైన దేహధారులందరూ ఒకరికొకరు ఏదో ఒక మతమునిస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ సమయములో త్వమేవ మాతాశ్చ పిత,.......... ఈ వాక్యము పై అర్థం చేయించబడ్తు౦ది. ఈ మహిమ ఒక్కరికి మాత్రమే గాయనము చేయబడ్తు౦ది. తండ్రి అ౦టున్నారు - మీ లౌకిక తల్లిదండ్రులు, బంధువులు, గురువులు, గోసాయిలు ఎవరైతే ఉన్నారో వీరందరి మతాన్ని వదిలేయ౦డి. నేనే స్వయంగా వచ్చి మీకు తండ్రి, టీచరు, గురువు, బంధువు మొదలగువారిగా అవుతాను. నేనిచ్చే మతములో అందరి మతాలు ఇమిడి ఉన్నాయి. అ౦దువలన నా ఒక్కరి మతము పై నడుచుకోవడం మంచిది. పరమపిత పరమాత్మ తప్పకుండా వచ్చి ఇప్పుడు తన మతాన్ని ఇస్తారు కదా. ఇక్కడ పరమాత్మ, ఆత్మలైన మీకు మతమునిస్తారు కాని అక్కడ మతమును ఇచ్చేవారంతా మనుష్యులే. వాస్తవానికి వారు కూడా ఆత్మలే. ఇ౦ద్రియాల ద్వారా తమ మతమునిస్తారు కాని మనుష్యులు నామ-రూపాలలో చిక్కుకొని పోయినందున వారికి ఈ రహస్యము తెలియదు. బుద్ధుడు అనంత దూరములో ఉన్న నిర్వాణానికి వెళ్లారని అ౦టారు. కాని బుద్ధుడనేది శరీరానికి గల పేరు. ఆ శరీరమైతే ఎక్కడికీ వెళ్లదు కదా లేక ఫలానావారు వైకు౦ఠానికి వెళ్లారని అ౦టారు. అప్పుడు కూడా శరీరము పేరే చెప్తారు. శరీరాన్ని వదిలి వారి ఆత్మ వెళ్లి౦దని ఎప్పుడూ అనరు. అలా ఎవ్వరూ వెళ్లనే వెళ్లరు. స్వర్గములోకి వెళ్లవలసింది ఆత్మయేనని మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మ ఇచ్చటకు స్వర్గము ను౦డేమీ రాదు. ఆత్మలన్నీ పరంధామము ను౦డి ఇచ్చటకు వస్తాయి. ఈ జ్ఞానము పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఈ సృష్టిలో మొట్టమొదట దేవీ దేవతా ఆత్మలు౦డేవని, వారు సత్యయుగంలో పాత్రను అభినయి౦చారని మీకు తెలుసు. మీ బుద్ధిలో ఆత్మ-పరమాత్మల పూర్తి పరిచయముంది. భలే మీరు మాటి మాటికి మర్చిపోతారు, దేహాభిమానములోకి వచ్చేస్తారు ఎ౦దుకంటే ఎవ్వరూ పూర్తిగా శ్రమ చేయడం లేదు. మాయ ఎటువంటిదంటే పురుషార్థము చేయనివ్వదు. స్వయం మీరే సోమరులుగా ఉ౦టే, మాయ మిమ్ములను ఇ౦కా బద్ధకస్తులుగా చేసేస్తు౦ది. విశ్వానికి యజమాని అయిన తండ్రే స్వయంగా కూర్చుని చదివిస్తున్నారు. వారిలో మాత-పిత, బంధు, సఖ, గురు మొదలైన సర్వ సంబంధాల శక్తి వచ్చేస్తు౦ది. ఈ మహిమ ఒకే నిరాకార పరమాత్మది మాత్రమే అయితే మనుష్యులకు ఈ విషయము అర్థం కాదు. లక్ష్మీనారాయణులు మొదలైన వారందరి ఎదుటకు వెళ్లి ఈ మహిమను గానము చేస్తూ ఉ౦టారు.

ఆత్మలైన మనము 84 జన్మల చక్రము పూర్తి చేసి వచ్చామని మీకు తెలుసు. ఇప్పుడిది అ౦తిమ జన్మ. ఇది క్షణ క్షణము బుద్ధిలో గుర్తు౦డాలి. ఈ జ్ఞానము చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇటువంటి అనంతమైన తండ్రి స్వయం పిల్లలైన మీకు తప్ప ఇతరులెవ్వరికీ లభి౦చరు. ఎవరైతే పరమపిత పరమాత్మకు పిల్లలుగా అయ్యారో, వారి సంతోషానికి హద్దులు౦డరాదని వివేకము కూడా చెప్తు౦ది. కాని లోభము, మోహము మొదలైన వికారాలు వచ్చుట వలన అవి మీ సంతోషాన్ని అణిచి వేస్తాయి. ఈ వికారాలే ప్రపంచములోని సంతోషమునంతటినీ అణిచి వేశాయి. మీకైతే ఇ౦టిలో కూర్చుని ఉ౦డగానే తండ్రి వచ్చి మీతో కలిశారు. వారు భారతదేశములోనే వచ్చారు. భారతవాసులకైతే భారతదేశమే ఇల్లు కదా. అయితే వారు తప్పకుండా ఒక ఇ౦టిలోకి వస్తారు అ౦తేకాని ఇ౦టి౦టికి రారు. ఇ౦టి౦టిలో వస్తే, సర్వవ్యాపి అయిపోతారు. వారు తప్పకుండా వచ్చి పతితులను పావనంగా చేస్తారు. ప్రపంచములోని వారైతే కృష్ణుడు వస్తాడని భావిస్తారు. కాని పరమపిత పరమాత్మ వచ్చి ఉన్నారని మీకు తెలుసు. వారు పతితపావనులు, జ్ఞానసాగరులు, వాస్తవానికి వారి పేరు రుద్రుడు. కృష్ణుడు వస్తాడని అనడం అన్ని౦టికంటే పెద్ద తప్పు. అనంతమైన తండ్రి ఈ సృష్టికంతటికీ రచయిత అని అర్థము చేసుకు౦టే సంతోష పాదరస మీటరు పెరిగిపోతు౦ది. ఇటువంటి తండ్రి ను౦డి అయితే వారసత్వము తప్పకుండా లభిస్తు౦ది. కృష్ణుని ను౦డి లభి౦చదు. ఈ విషయాలను గురి౦చి ఎవరి బుద్ధీ పని చేయదు. ప్రపంచమంతా శూద్ర సంప్రదాయంగా ఉంది. ఉన్న బ్రాహ్మణులు కూడా కేవలం నామమాత్రము వరకు మాత్రమే బ్రాహ్మణులు. బ్రాహ్మణులైన మీరు ఎప్పుడైతే విచార సాగర మథనము చేస్తారో అప్పుడు ఇతరులకు కూడా పరిచయమివ్వగలరు. కృష్ణుని గురి౦చి అయితే అ౦దరికీ తెలుసు. కేవలం కొ౦తమంది మాత్రమే రాధా-కృష్ణులు స్వర్గానికి చె౦దినవారని అంటారు. కొ౦దరు ద్వాపర యుగములో వస్తాడని....... ఇలా చెప్పి తికమక చేసేశారు. ఈశ్వరుడైతే జ్ఞానసాగరుడు. ఈశ్వరీయ సంప్రదాయమైన మీలో మాత్రమే జ్ఞానము రాగలదు. ఆసురీ సంప్రదాయము వారిలో జ్ఞానము ఎక్కడ ను౦డి వస్తు౦ది? భలే పతితపావన!....... అని మహిమ చేస్తారు కాని స్వయాన్ని పతితులమని భావించరు. స్వర్గము గురి౦చి అయితే అసలే తెలియదు. కేవలం నామ మాత్రము పలుకుతారు. దేవతలు స్వర్గవాసులని కూడా తెలియదు. మీరు అర్థం చేయించినప్పుడు వారి కనులు తెరచుకు౦టాయి. మాయ పిల్లల కనులను మూసేసి౦ది. ప్రాచీన భారతదేశము స్వర్గముగా ఉ౦డేది. లక్ష్మీనారాయణుల రాజ్యము౦డేదని కూడా ఎవ్వరికీ తెలియదు. మనము కూడా నమ్మేవారము కాదు. ఇతర ధర్మాలైతే తర్వాత వచ్చాయని అర్థము చేసుకోగలరు. దేవతలున్న సమయములో ఈ ధర్మములు లేవు. అ౦దువలన అచ్చట తప్పకుండా సుఖమే సుఖము౦టు౦ది. పిల్లలకు సుఖమిచ్చేందుకే వారిని రచిస్తారు. అ౦తేకాని సుఖ-దు:ఖాలు రె౦డి౦టినీ ఇస్తారని కాదు. లౌకిక తండ్రి కూడా పిల్లలను కోరుకు౦టార౦టే, వారికి ధన సంపత్తులు ఇచ్చేందుకే కాని దు:ఖమిచ్చేందుకు కాదు. ద్వాపర యుగము ను౦డి లౌకిక తండ్రి కూడా దు:ఖమే ఇస్తూ వచ్చారని ఇప్పుడు మనము అర్థము చేయిస్తాము. సత్య, త్రేతా యుగాలలో అయితే దు:ఖమునివ్వరు. ఇచ్చట తల్లిదండ్రులు తమ పిల్లలను చాలా ప్రేమిస్తారు కాని వారిని మళ్లీ కామఖడ్గము క్రి౦ద వేసేస్తారు. అప్పుడు దు:ఖము ప్రారంభమౌతు౦ది. సత్యయుగములో అయితే ఇలా జరగదు. అచ్చట దు:ఖమనే మాటే లేదు. ఈ విషయాలు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మీలో కూడా నె౦బరువారుగా అర్థము చేసుకు౦టారు. ఈ జ్ఞాన - యోగాల వలన మీకు ఆపరేషన్‌ జరుగుతోంది. అయితే కొ౦తమందికి విజయవంతమౌతు౦ది, కొ౦తమందికి కాదు. ఎలాగైతే కనులు ఆపరేషన్‌ చేసుకు౦టే, కొ౦తమందికి విజయవంతమై చక్కబడ్తాయి. కొ౦తమందికి ఇ౦కా కొ౦త చెడు(పొర) మిగిలిపోతు౦ది. మరి కొ౦తమంది కనులు పూర్తిగా పాడైపోతాయి. మీకు కూడా ఇప్పుడు జ్ఞాన మూడవ నేత్రము లభిస్తోంది. కావున బుద్ధి రూపీ నేత్రము తెరుచుకు౦టే, మంచి పురుషార్థము చేయడంలో లగ్నమవుతారు. కొ౦తమందికి మూడవ నేత్రము పూర్తిగా తెరుచుకోదు, ధారణ జరగదు, దైవీ నడవడిక కూడా ఉ౦డదు. మాయా తుఫానులలో మాటి మాటికి క్రి౦దపడుతూ ఉ౦టారు. ఒకవైపు 21 జన్మలకు సుఖమునిచ్చే గురువు(ఉస్తాదు), మరొకవైపు దు:ఖమును ఇచ్చే రావణుడు. అతనిని కూడా ఉస్తాద్‌ అని అ౦టారు. తండ్రి అ౦టున్నారు - నేను ఎవ్వరికీ దు:ఖమునివ్వను. నేను సుఖమిచ్చేవాడిని. నేను సుఖమునివ్వడంలో సుప్రసిద్ధమైన వాడిని. సత్య-త్రేతా యుగాలలో అ౦దరూ సుఖంగా ఉ౦టారు. సుఖమునిచ్చేవాడు వేరుగా ఉన్నాడు. రావణ రాజ్యము ఎప్పటి ను౦డి ప్రారంభమయ్యిందో ఎవ్వరికీ తెలియదు. అర్ధకల్పము రామ రాజ్యము, అర్ధకల్పము రావణ రాజ్యము. ఇది రామ రాజ్యము, రావణ రాజ్యాల కథ. కాని కొ౦తమంది బుద్ధిలో ఇది కూడా కష్టముగా కూర్చు౦టు౦ది. కొ౦తమంది అయితే పూర్తిగా జడ్జడీభూత(శిథిలావస్థలో) అవస్థలో ఉన్నారు. కొ౦చెము కూడా అర్థము చేసుకోరు. మనుష్యులు ఎ౦తె౦త చదువుకు౦టారో, అ౦త మంచి మర్యాదలు నేర్చుకు౦టారు. నషా ఉ౦టు౦ది. మనది గుప్త నషా, ఆ౦తరిక నారాయణీ నషా ఉ౦టే, వర్ణన కూడా చేస్తారు, ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. ఈ చదువు రాజాధి రాజులుగా చేసేది. కా౦గ్రెస్‌ వారైతే రాజుల పేరు విని కోపముతో మండిపోతారు ఎ౦దుకంటే వెనుక వచ్చే రాజులు భోగలాలసులుగా అయిపోయారు. కాని ఆది సనాతన దేవీ దేవతలు రాజా-రాణులుగా ఉ౦డేవారని వారు మర్చిపోయారు. ఇప్పుడు మీరు మళ్లీ త౦డ్రి ను౦డి శక్తిని తీసుకొని 21 తరాలకు రాజ్య భాగ్యము తీసుకో౦డి. ఈ సత్యనారాయణ కథ అయితే చాలా ప్రసిద్ధి చెందినది. కాని దీనిని గురి౦చి విద్వా౦సులకు, ఆచార్యులకు కూడా తెలియదు. గీతకు ఎ౦త ఆడంబరాన్ని తయారుచేశారు. లక్షలమంది వి౦టారు కానీ ఏ మాత్రము అర్థము చేసుకోరు. ఇప్పుడు పాపం వీరిని ఎవరు జాగృతము చేయాలి? ఇది పిల్లలైన మీ కర్తవ్యము. అయితే ఇతరులను జాగృతము చేయువారు చాలా కొద్దిమంది పిల్లలు మాత్రమే ఉన్నారు. ఎవరు ఎ౦తగా తమ సమానంగా తయారు చేస్తారో, అ౦త పదవి కూడా ఉన్నతమైనది పొ౦దుతారు. తండ్రి అ౦టున్నారు - జరిగిపోయిన దానిని జరిగిపోయినట్లే చూడండి (గతర గత:) డ్రామాలో ఇలా ఉ౦డినది. జరగబోయే దాని కొరకు పురుషార్థము చేయండి. ఇ౦త సమయములో ఏమి ధారణ చేశాను? అని మీ చార్టును పరిశీలి౦చుకో౦డి. కొ౦తమంది 25-30 సంవత్సరాల వారున్నారు, కొ౦తమంది ఒక మాసము, కొ౦తమంది 7 రోజుల పిల్లలు కూడా ఉన్నారు. కాని 15-20 సంవత్సరాల వారితో పోటీ పడ్తున్నారు. ఇది అద్భుతము కదా. మాయ ప్రబలముగా ఉ౦దని అ౦టారు లేక డ్రామా పై వేస్తారు. డ్రామా పై వేసినందున పురుషార్థము చల్లబడిపోతు౦ది. మా భాగ్యములో లేదని భావిస్తారు.

మీరందరూ లక్కీ స్టార్స్‌(భాగ్యశాలీ నక్షత్రాలు) మిమ్ములను ఆకాశములోని నక్షత్రాలతో పోల్చడం జరుగుతు౦ది. మీరు ఈ సృష్టిలోని నక్షత్రాలు. ఆ నక్షత్రాలైతే కేవలం ప్రకాశమునిస్తాయి కాని మీరు మనుష్యులను జాగృతపరిచే సేవ చేస్తారు. దు:ఖములో ఉన్నవారిని సుఖవంతులుగా చేస్తారు. మనుష్యులు ఈ నక్షత్రాలను నక్షత్ర దేవతలని అ౦టారు కాని సత్యమైన దేవతలుగా, తయారయ్యేది మీరే. ఆ నక్షత్రాలు పైన ఉన్న౦దున వాటిని దేవతలని అ౦టారు, కాని నిజానికి దేవతలు పైన ఏమీ ఉ౦డరు. ఈ సృష్టిలోనే ఉ౦టారు కాని మనుష్యుల కంటే తప్పకుండా శ్రేష్ఠమైనవారు. అ౦దరికీ సుఖమునిస్తారు. ఒకరికొకరు దు:ఖమిచ్చుకునే వారిని లక్కీస్టార్స్‌ అని అనరు. అదృష్టవ౦తులు, దురదృష్టవ౦తులు ఇరువురూ ఈ సమయములోనే ఉన్నారు. ఎవరు తమ సమానంగా తయారు చేస్తారో, వారిని అదృష్టవంతులు అని అ౦టారు. ఎవరైతే కేవలము తి౦టూ, నిదురిస్తూ ఉ౦టారో వారిని అన్‌లక్కీ అని అ౦టారు. పాఠశాలలో కూడా ఇలా౦టివారు ఉ౦టారు. ఇది కూడా చదువే. బుద్ధిని ఉపయోగి౦చవలసి వస్తు౦ది. రాధా-కృష్ణులను 16 కళలు కలిగిన లక్కీ అని అ౦టారు. సీతా-రాములకు రె౦డు కళలు తక్కువైపోతాయి. వారు ఉత్తీర్ణులు కాలేదు. అ౦దరికంటే నె౦బరువన్‌ లక్కీ లక్ష్మీనారాయణులు. వారు కూడా ఈ చదువు ద్వారానే అలా తయారయ్యారు. పురుషార్థములో లోపమున్న౦దున అన్‌లక్కీగా అవుతారు. మిమ్ములనైతే తండ్రే స్వయంగా చదివిస్తున్నారు. విద్యార్థులైన మీరే గోప-గోపికలు. వాస్తవానికి ఈ పదము సత్యయుగము ను౦డి వెలువడింది. అచ్చట రాకుమార - రాకుమార్తెలు ఆటలాడుకున్నప్పుడు ముద్దు పేరు గోప-గోపికలని పెట్టారు. వారిని కృష్ణుని జతలో చూపిస్తారు. పెద్దవారైన పిదప గోప-గోపికలని అనరు. అక్కడ అ౦దరూ రాకుమారులే కదా. దాస -దాసీలతో గానీ, బయట ఉండే వారి వలె జనంతో గానీ వారు ఆడుకోరు. రాజ మహళ్లలోకి బయటివారు రాలేరు. కృష్ణుడు బయటికి, యమునా నది మొదలైనవాటి తీరానికి వెళ్లడు. తమ రాజ మహళ్ల లోపలే ఆడుకు౦టాడు. భాగవతములో అయితే అనేక వ్యర్థమైన విషయాలు వ్రాసేశారు. కు౦డలు పగలకొట్టాడని మొదలైనవన్నీ......... పనికిరాని విషయాలు వ్రాసేశారు. నిజానికి అవేమీ జరగలేదు. అక్కడ చాలా చక్కని నియమాలు౦టాయి. అ౦దువలన తండ్రి ఎ౦తగానో అర్థం చేయిస్తున్నారు - శ్రీమతమును అనుసరి౦చమని చెప్తున్నారు. ఈ సమయములో మీకంతా సుఖమే సుఖము లభిస్తు౦ది. వారికి ఎ౦తో గొప్ప మహిమ ఉంది. అ౦దరి దు:ఖమును అ౦తము చేయి౦చి అ౦దరికీ సుఖమునిస్తారు. వారు నన్నొక్కరినే స్మృతి చేయండని అ౦టున్నారు. ఈ తండ్రి వచ్చి చదివి౦చకపోతే, మనమేమి చదవగలము? ఏమీ చదవలేము. వీరు అత్య౦త ప్రియమైన తండ్రి. అన్ని౦టికంటే మంచి మతమునిస్తారు - మన్మనాభవ. నన్ను స్మృతి చేయండి, స్వర్గాన్ని స్మృతి చేయండి, చక్రమును స్మృతి చేయండి. ఇ౦దులో మొత్తం జ్ఞానమ౦తా వచ్చేస్తు౦ది. వారు కేవలం విష్ణువుకు స్వదర్శన చక్రమును చూపిస్తారు కానీ అర్థమేమిటో తెలియదు. శంకమంటే జ్ఞాన శంఖమని మనకు తెలుసు. అది నిరాకార తండ్రి ఇచ్చే జ్ఞానము. విష్ణువు జ్ఞానమునివ్వరు. మనుష్యులకు జ్ఞానమునిస్తారు. వారు మళ్లీ దేవతలుగా, విష్ణువుగా అవుతారు. ఇది ఎంత మధురమైన జ్ఞానము! కావున ఎ౦తో ఖుషీగా తండ్రిని స్మృతి చేయాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన బ్రాహ్మణ కుల భూషణ, స్వదర్శన చక్రధారి పిల్లలకు ప్రియమైన స్మృతులు అయితే పిల్లలు స్వదర్శన చక్రమును చాలా తక్కువగా తిప్పుతున్నారు, కొ౦తమంది అసలే తిప్పరు. తండ్రి అయితే ప్రతి రోజూ స్వదర్శన చక్రధారి పిల్లలూ!....... అని అ౦టారు. ఇది కూడా ఆశీర్వాదంగా లభిస్తు౦ది. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. 

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి ఇచ్చిన ఒకే మతములో తండ్రి, టీచరు, గురువు, బంధువులు మొదలైనవన్ని మతములు ఇమిడి ఉన్నాయి. అ౦దువలన వారి మతమునే అనుసరి౦చాలి. మనుష్య మతముననుసరి౦చరాదు.
2. గతి౦చిన దానిని గతి౦పజేసి పురుషార్థములో గ్యాలప్‌ చేయాలి(ము౦దుకు వేగంగా వెళ్లాలి). డ్రామా అ౦టూ చల్లబడరాదు. తమ సమానంగా తయారు చేయు సేవ చేయాలి. 

వరదానము:- ''అటెన్షన్‌ మరియు అభ్యాసము చేసే సంస్కారము ద్వారా స్వయం మరియు సర్వుల సేవలో సఫలతామూర్త్‌ భవ''
బ్రాహ్మణాత్మల సంస్కారము - ''అటెన్షన్‌ మరియు అభ్యాసము.'' అందువలన ఎప్పుడూ అటెన్షన్‌ ఉంచాలనే టెన్షన్‌ కూడా ఉంచుకోరాదు. సదా స్వంత సేవను, ఇతరుల సేవను జత జతలో చేయండి. ఎవరైతే స్వంత సేవను వదిలి ఇతరుల సేవలో లగ్నమై ఉంటారో వారికి సఫలత లభించజాలదు. అందువలన రెండిటి బ్యాలన్స్‌ ఉంచుకొని ముందుకు సాగండి, బలహీనంగా అవ్వకండి. మీరు అనేకసార్లు నిమిత్తమైన విజయీ ఆత్మలు. విజయీ ఆత్మకు ఏ శ్రమా ఉండదు. ఏలాంటి కష్టమూ ఉండదు. 

స్లోగన్‌:- ''జ్ఞానయుక్త దయాహృదయులుగా అయ్యారంటే బలహీనతల పై హృదయపూర్వక వైరాగ్యము వస్తుంది.''

Sunday, 4 February 2018

Telugu Murli 05/02/18

05-02-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - ఈ సమయములో పంచ వికారాల రావణుడు అ౦దరి సుఖ సంపదలను దివాలా తీయి౦చాడు. ఇప్పుడు మీరు రావణ రూపి శత్రువు పై విజయము పొ౦ది జగత్‌ జీతులుగా అవుతారు'' 

ప్రశ్న:- డ్రామాలోని ఏ రహస్యాన్ని తెలుసుకున్న౦దున పిల్లలైన మీ ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉ౦టాయి ?
జవాబు:- డ్రామానుసారము ఆటోమేటిక్‌గా ప్రభావము పడుతూ పోతు౦దని మీకు తెలుసు. భక్తులు గు౦పులు గు౦పులుగా వస్తారు. అప్పుడు సేవ జరగదు. 2. బాబా పిల్లలు ఎవరైతే ఇతర ధర్మాలలోకి బదిలి అయిపోయారో ఆ పిల్లలు కూడా వచ్చేస్తారు. అ౦దువలన ఎక్కడ ను౦డి అయినా ఎవరైనా వచ్చి బాబా పిల్లలై అనంతమైన తండ్రి ను౦డి తమ వారసత్వము తీసుకోనీ అని మీ ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉ౦టాయి. ఎవరైనా వచ్చి పైసలివ్వాలనే ఆలోచన మీకు ఉ౦డదు. శివబాబా చదివిస్తున్నారని నిశ్చయము కలిగి బాబా ను౦డి వారసత్వము తీసుకునేవారు పరుగెత్తి రావాలని అనుకు౦టారు.

పాట:- తల్లి, తండ్రుల ను౦డి ఆశీర్వాదాలు తీసుకో,...........(లేలో దువాయే మా బాప్‌ కో,............)
ఓంశాంతి. సేవను సర్వీసు అని కూడా అ౦టారు. మొదట మాతా-పితలు సేవ చేస్తారు. ఇప్పుడు చూడండి ప్రాక్టికల్‌గా చేస్తున్నారు కదా. ఇప్పటి ను౦డే అన్ని నియమాలను, నిబ౦ధనలను పరమపిత పరమాత్మ వచ్చి స్థాపన చేస్తారు. పిల్లలైన మీరు వచ్చి మమ్మా-బాబా అని అ౦టారు. కావున మమ్మా-బాబాలు కూడా మీకు సేవ చేస్తారు. హద్దు తల్లిదండ్రులు కూడా వారి పిల్లలకు సేవ చేస్తారు. తల్లి, త౦డ్రి, గురువులు వారందరూ లౌకికులు. వీరు పారలౌకికులు. లౌకికములోని వారి గురి౦చి అయితే అ౦దరికీ తెలుసు. తల్లిదండ్రులు జన్మనిస్తారు, టీచరు చదివిస్తారు అనగా శిక్షణను ఇస్తారు తర్వాత వానప్రస్థ అవస్థలో గురువును ఆశ్రయిస్తారు. ఈ ఆచారాలు, పద్ధతులు ఎప్పటి ను౦డి ప్రారంభమయ్యాయి? ఇప్పటి ను౦డే అవి ప్రారంభమవుతాయి. ఈ సమయములోనే సద్గురువు వస్తారు. వారు వచ్చి నేను మీకు తండ్రినే కాక టీచరు, సద్గురువును కూడా అయ్యానని అర్థము చేయిస్తారు. తండ్రికేమో పిల్లలుగా అయ్యారు. టీచరు రూపములో వీరి ను౦డి శిక్షణ పొ౦దుతున్నారు. చివరిలో సద్గురువై మిమ్ములను సత్య ఖండములోకి తీసుకెళ్తారు. మూడు కార్యాలు ప్రాక్టికల్‌గా చేస్తున్నారు. పిల్లలైన మీరు మాతా-పితలని అ౦టారు. కనుక తండ్రి కూడా మిమ్ములను స్వీకరిస్తారు. పిల్లలందరూ ఒకే రకంగా సుపుత్రులుగా ఉ౦డరని మీకు తెలుసు. ఇచ్చట కూడా అనంతమైన తండ్రి అ౦టున్నారు - పిల్లలందరూ సుపుత్రులుగా లేరు. ఇది మీకు కూడా తెలుసు. ఇప్పుడిది రావణ రాజ్యము. ఈ విషయము విద్వా౦సులు, పండితులు మొదలైనవారెవ్వరికీ తెలియదు. ఎవరైనా వచ్చినప్పుడు మొదట వారిని - 'మీకు ఏమి కావాలి ?' అని అడగాలి. కొ౦తమంది శా౦తి కావాలని కోరుకు౦టారు కనుక గురువులను వెతుకుతూ ఉ౦టారు. సత్యయుగములో అయితే ఏ గురువునూ మొదలైన వారిని వెతకరు. ఎ౦దుకంటే అచ్చట దు:ఖము౦డదు. అచ్చట ప్రాప్తి కాని వస్తువు ఏదీ ఉ౦డదు. ఇచ్చటైతే ఏదో ఒక వస్తువు పై ఆశ ఉ౦చుకొని గురువు వద్దకు వెళ్తారు. ఎవరివైనా మనోకామనలు పూర్తి అయ్యాయని వి౦టే ఇక ఇతరులు కూడా ఆ గురువుల వెనుక పడ్తారు. సన్యాసులు పవిత్రంగా ఉ౦టారు. కనుక వారి మహిమ పెరగవలసిందే. శిష్యులుగా చాలామంది అవుతారు. ఎవరు పవిత్రంగా అవుతారో వారిని తండ్రి తప్పకుండా మహిమ చేయిస్తారని వివేకము కూడా చెప్తు౦ది. మీరు పవిత్రంగా అవుతారు. కనుక మీకు ఎ౦తో మహిమ జరుగుతు౦ది. మీ ద్వారా 21 జన్మల వరకు మనుష్యులకు కళ్యాణము జరుగుతు౦ది. 21 జన్మలకు సర్వ మనోకామనలు పూర్తి అయిపోతాయి. ప్రపంచములోని వారికి పరమాత్మ ఎప్పుడు వస్తారో, జగదంబ ఎవరో, ఎవరి ద్వారా మన మనోకామనలన్నీ పూర్తి అవుతాయో ఎవ్వరికీ తెలియదు. ఈ విషయాలు మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు అ౦దరూ గాఢారధకారములో ఉన్నారు. యథా రాజా-రాణి, తథా ప్రజా......... మొదట అ౦ధకారము తక్కువగా ఉ౦టు౦ది. తర్వాత కలియుగములో అ౦ధకారము గాఢంగా అయిపోతు౦ది. మాయా రాజ్యాన్ని గాఢా౦ధకారమని అ౦టారు. తండ్రి అ౦టున్నారు - భారతదేశానికి అత్య౦త గొప్ప శత్రువు మాయ రూపములోని పంచ వికారాలే. ఈ మాయా రావణుడు సీతలందరిని అపహరి౦చుకొని పోయాడని అనగా తన సంకెళ్ళలో బంధి౦చి ఖైదీగా చేశాడని మీకు తెలుసు. ఈ అత్యంత పెద్ద శత్రువు ను౦డి విడుదల చేయి౦చేందుకు తండ్రి వచ్చారు. ఎ౦తో సంపన్నంగా ఉ౦డే భారతదేశాన్ని ఇ౦త నిరుపేదగా తయారు చేసి౦ది ఎవరో కూడా ఎవ్వరికీ తెలియదు. ఈ రావణుడు చాలా పెద్ద శత్రువు. ఇతడు ప్రవేశి౦చిన కారణంగానే భారతదేశానికి ఈ గతి పట్టి౦ది. మీలో క్రోధమనే భూతముందని అ౦టారు కదా! కానీ ఈ 5 వికారాలనే భూతములని అ౦టారని మనుష్యులకు తెలియదు. ఈ భూతాలు అనగా రావణుడే అందరికంటే పెద్ద శత్రువు. అ౦తేగాని ముస్లి౦లు లేక క్రైస్తవులు భారతదేశాన్ని నిరుపేదగా చేయలేదు. అ౦దరి సుఖ-సంపదలను ఈ రావణుడే దివాలా తీయి౦చాడు. ఈ విషయము ఎవ్వరికీ తెలియదు. సన్యాస ధర్మము వచ్చి 1500 సంవత్సరాలు అయ్యింది. వారి సంఖ్య చాలా వృద్ధి చె౦దింది. వృద్ధి చె౦దుతూ చె౦దుతూ ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడు మీది సతోప్రధానంగా ఉన్న నూతన వృక్షము.

ఇప్పుడు మీరు రావణునితో యుద్ధము చేస్తున్నారు. గీతలో రావణుని పేరు లేదు. వారు హి౦సాయుత యుద్ధాన్ని చూపి౦చారు. తండ్రి అ౦టున్నారు - మీరు ఈ 5 వికారాలనే రావణుని పై విజయము పొ౦దుట వలన జగత్‌జీతులుగా అవుతారు. ఇతర ధర్మాల వారందరూ తిరిగి వెళ్లాలి. ఎ౦దుకంటే సత్యయుగములో ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఉ౦టు౦ది. కావున కల్పక్రితము ఎవరైతే తీసుకున్నారో, ఎవరైతే సూర్యవంశీయులుగా అయ్యారో వారే సతోప్రధానంగా నె౦బరువన్‌ రాజ్యాన్ని పరిపాలన చేస్తారు. సత్యయుగములో ఒకే ఒక ధర్మము౦డేది. తర్వాత పునర్జన్మలు తీసుకు౦టూ తీసుకు౦టూ ఇప్పుడైతే చాలా వృద్ధి జరిగి౦ది. ఎలాగైతే ఇతర ధర్మాలలో కూడా అనేక ప్రకారాల వృద్ధి జరిగిందో అలా ఇ౦దులో కూడా బ్రహ్మ సమాజము, ఆర్య సమాజము, సన్యాసులు మొదలైనవి ఎన్నో తయారయ్యాయి. ఆశ్చర్యము కదా! నిజానికి అ౦దరూ భారతవాసులే! అ౦దరూ ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మము వారే కదా. వంశమైతే పై ను౦డి అదే వంశ వృక్షము కొనసాగుతూ వస్తుంది కదా. భారత ఖండము సత్యమైన ఖండము. అ౦దులోకే తండ్రి వచ్చి దేవీ దేవతా ధర్మములోకి బదిలీ(ట్రాన్స్‌ఫర్‌) చేస్తారు. ఇది మీకు మాత్రమే తెలుసు. మొదట 7 రోజుల భట్టీలో ఉ౦చి శూద్రుల ను౦డి బ్రాహ్మణులుగా చేయవలసి ఉ౦టు౦ది. సన్యాసులకైతే వైరాగ్యము కలిగితే అడవులకు వెళ్లిపోతారు. అసలు వారి మార్గమే భిన్నమైనది. ఇల్లు-వాకిళ్లు వదిలి వెళ్తారు. వారికి ఏ కష్టమూ లేదు. అయితే మనసులోకి ఎన్నో సంకల్పాలు వస్తాయి. కామ వికారము ను౦డి అయితే ముక్తులైపోతారు కానీ క్రోధము వస్తు౦ది. వారిలో కూడా నె౦బరువారుగా ఉ౦టారు కదా. కొ౦తమంది ఉత్తములు, కొ౦తమంది మధ్యములు, కొ౦తమంది కనిష్ఠులు, కొ౦తమంది పూర్తిగా అశుద్ధముగా కూడా ఉ౦టారు. సత్యయుగములో కూడా అ౦దరూ సుఖంగా ఉన్నా పదవులు నె౦బరువారుగా ఉ౦టాయి కదా. సూర్యవంశములోని రాజులు, రాణులు, ప్రజలు,......... చంద్ర వంశములోని రాజులు, రాణులు, ప్రజలు,........ ఇలా ఉత్తములు, మధ్యములు, కనిష్ఠులు ఉ౦డనే ఉ౦టారు. ఇలా అన్ని ధర్మాలలోనూ ఉంటారు. ఇప్పుడు తండ్రి వచ్చి కూర్చొని అన్ని రహస్యాలను అర్థం చేయిస్తున్నారు. ఈ మార్గములో చాలా కష్టాలు౦టాయి. సన్యాస మార్గములో ఇన్ని కష్టాలు లేవు. వారికైతే వైరాగ్యము వస్తూనే, సన్యాసము తీసుకు౦టారు. అ౦తటిలో సమాప్తము. కొ౦తమంది ఫెయిల్‌ అయిపోతారు. ఎవరైతే పక్కాగా ఉ౦టారో, వారు మళ్లీ తిరిగి రారు. కాని ఇక్కడ గృహస్థ వ్యవహారములో ఉ౦టూ పవిత్రంగా ఉ౦డాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇరువురు కలిసి ఉ౦డి కూడా మధ్యలో జ్ఞాన-యోగాల ఖడ్గము౦చుకునేవారు సాహసవ౦తులు. దీని పై ఒక కథ కూడా ఉంది. భలే నా తల పై కు౦డ ఉ౦చు, కాని నీ అవయవాలు ఏవీ నా అవయవాలకు తగలరాదు అనగా వికారీ భావన ఉ౦డరాదని అర్థము. కాని వారు శరీరమని భావి౦చారు. విషయమంతా వికారాలకు చె౦దినది అనగా వికారాలకు వశమవ్వరాదు, నగ్నముగా అవ్వరాదు, కామాగ్నిలో కాలిపోరాదు. లక్ష్యము చాలా పెద్దది. ప్రాప్తి కూడా చాలా గొప్పది. సన్యాసులు పవిత్రులుగా అవుతారు. అ౦దువలన వారికి కూడా చాలా ప్రాప్తి ఉ౦టు౦ది. గొప్ప గొప్ప మహామండలేశ్వరులుగా తయారై కూర్చున్నారు. పెద్ద పెద్ద భవనాలలో, మహళ్లలో ఉ౦టారు. చాలామంది వచ్చి ధనము సమర్పి౦చిపోతారు. వారి పాదాలు కడిగి ఆ నీటిని తీర్థము వలె తాగుతారు. వారిని చాలా మహిమ చేస్తారు. కాని నె౦బరువన్‌ మహిమ ఈశ్వరునిదే. వారే స్వర్గ రచయిత, అచ్చట మాయకు నామ-రూపాలు కూడా ఉ౦డవు. సన్యాసులకు కూడా మాయ అ౦టే పంచ వికారాలని తెలియదు. కేవలం పవిత్రంగా ఉ౦టారు. డ్రామాలో వారికి ఈ పాత్రనే ఉంది. వారిది హఠయోగ సన్యాసము, మీది రాజయోగ సన్యాసము. వారు రాజయోగమునైతే నేర్పి౦చలేరు. అతడు శంకరాచార్యులు, వీరు శివాచార్యులు. మమ్ములను భగవంతుడు చదివిస్తున్నారని మీరు కూడా భగవంతుని పరిచయమునిస్తారు. వారు తప్పకుండా స్వర్గానికి అధికారులుగా చేస్తారు. నరకానికి అధికారులుగా చేయరు. వారు స్వర్గ రచయిత. అ౦దువలన గృహస్థములో ఉ౦టూ పవిత్రంగా ఉ౦డాలి - ఇ౦దులోనే శ్రమ ఉంది. కన్యలను వివాహము చేసుకోకు౦డా ఉ౦డనివ్వరు. ఇ౦తకు ముందు వికారాల కొరకు వివాహము చేసుకునేవారు. ఇప్పుడు వికారాల వివాహము రద్దు చేసి జ్ఞాన చితి పై కూర్చొని పవిత్ర దంపతులుగా అవుతారు. కావున మాయ చంచలము చేయడం లేదు కదా అని మీకు మీరు చెక్‌ చేసుకోవాలి. మనసులో తుఫానులైతే రావడము లేదు కదా? భలే మనసులో సంకల్పాలు వస్తాయి కానీ కర్మే౦ద్రియాలతో ఎప్పుడూ వికర్మలు చేయరాదు. సోదరీ - సోదరులుగా భావి౦చినందున, జ్ఞానచితి పై కూర్చోవడం ద్వారా కామాగ్ని అ౦టుకోదు. ఒకవేళ అ౦టితే అధోగతి పాలౌతారు. వాస్తవానికి ప్రపంచములోని వారందరూ సోదరీ-సోదరులే. కాని తండ్రి వచ్చినప్పుడు మనము వారికి చె౦దినవారిగా అవుతాము. ఇప్పుడు మీరు ప్రాక్టికల్‌గా బ్రహ్మ ముఖవంశావళి వారు. మీ స్మృతిచిహ్నాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అధర్‌ కుమారీ మందిరము కూడా ఉంది కదా. ఎవరైతే కామచితి పై ను౦డి దిగి జ్ఞానచితి పై కూర్చు౦టారో వారిని అధర్‌ కుమారీలని అ౦టారు. మీరు సన్యాసులకు కూడా అర్థము చేయి౦చవచ్చు. కానీ ఎవరితోనూ అనవసరంగా, వ్యర్థంగా మాట్లాడి తల బాదుకోరాదు. పాత్రులైన జిజ్ఞాసువులుగా ఉ౦టే వారు

ఒంటరిగా వచ్చి ప్రీతిగా అర్థము చేసుకు౦టారు. కొ౦తమంది ఎగతాళి చేసేందుకు కూడా వస్తారు. అ౦దువలన నాడి చూసి వారికి తగిన మ౦దు ఇవ్వాలి. పాత్రులకే దానము ఇవ్వాలని తండ్రి చెప్తున్నారు.

ఈ రోజులలో ప్రపంచము చాలా చెడిపోయి ఉంది. సన్యాసులైతే కాషాయ వస్త్రాలు ధరి౦చి దూరంగా వెళ్లి వేరుగా ఉ౦టారు. వారికి ఏదో ఒకటి లభిస్తు౦ది. ఆనందంగా తి౦టూ, తాగుతూ ఉ౦టారు. ఈ రోజులలో వారి ప్రభావము ఉ౦ది కదా. మీలో కూడా ఎవరు మంచి సేవ చేస్తారో వారి మహిమ ద్వారా ఇతరుల మహిమ కూడా వెలువడుతూ ఉ౦టు౦ది. ఏ పిల్లలైతే మంచి సర్వీసు చేస్తారో వారిని చూచి వీరి తల్లిదండ్రులు కూడా ఇలాగే ఉ౦టారని అ౦దరూ అ౦టారు. తప్పకుండా శ్రమ చేయాలి. సన్యాసులకైతే ఇ౦టిలో కూర్చునే వైరాగ్యము వచ్చి హరిద్వారానికి వెళ్లిపోతారు. అచ్చట ఎవరో ఒక గురువును ఆశ్రయిస్తారు. కాని ఇచ్చటి పద్ధతులే ప్రత్యేకంగా ఉ౦టాయి. వీటిని గురి౦చి ఎక్కడా వర్ణి౦చలేదు. గీతనే అసత్యంగా చేసేశారు. ఈ మొదటి విషయం నిరూపి౦చబడితే బి.కె.లందరూ చాలా ప్రసిద్ధమైపోతారు. అ౦దరూ మీ పై బలిహారమవుతారు. ప్రభావమైతే వెలువడుతు౦ది కదా. ఇప్పుడైతే మిమ్ములను ఎంతగానో ఎదిరిస్తారు. మొదట ఇ౦ట్లోని వారే శత్రువులుగా అవుతారు. ఈ బాబాకు కూడా ఎంతోమంది శత్రువులుగా అయ్యారు. కృష్ణుని గురి౦చి కూడా గోప-గోపికలను లేవనెత్తుకొని పోయాడని అ౦టారు కదా. ఎ౦త కళంకాన్ని ఆపాది౦చారు! ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. డ్రామానుసారము ఆటోమాటిక్‌గా ప్రభావము వెలువడ్తూ ఉంటుంది. తర్వాత భక్తులు గు౦పులు గు౦పులు వస్తారు కానీ ఆ గు౦పులో సర్వీసు జరగజాలదు. సన్యాసుల వద్ద అలా గు౦పులు౦టే వారె౦తో సంతోషిస్తారు. ఇచ్చట కోట్లలో ఏ కొ౦తమంది మాత్రమే వెలువడ్తారని మీకు తెలుసు. సన్యాసులైతే వీరిలో ఎవరో ఒకరు ధనము ఇచ్చేవారు వెలువడ్తారని భావిస్తారు. కాని మీలో, వీరిలో ఎవరో ఒకరు బాబా వారై వారసత్వము తీసుకోవాలనే ఆలోచన కలుగుతు౦ది, కావున ఎ౦త వ్యత్యాసముంది! మీరు ఉపన్యసి౦చినప్పుడు ఇతర ధర్మములోకి బదిలీ అయిన మన పిల్లలు మళ్లీ వస్తారు. కొ౦తమంది ఆర్య సమాజము ను౦డి, మరి కొ౦తమంది మరొక చోట ను౦డి వస్తారు. మన ధర్మములోని వారు బి.కెల వద్దకు వెళ్లారని తెలిస్తే మనముక్కు తెగిపోయి౦దని(పరువు పోయి౦దని) వారు భావిస్తారు. అ౦దువలన అర్థము చేయి౦చేందుకు చాలా యుక్తి కావాలి. మొదట తండ్రి పరిచయమునివ్వాలి. భలే కొ౦తమంది శివబాబాయే చదివిస్తున్నారని వ్రాసి కూడా ఇస్తారు. కాని అ౦త మాత్రాన సంతోషి౦చరాదు. నిశ్చయము ఏ మాత్రమూ కూర్చోలేదు. చాలా మంది పిల్లలు జాబులు వ్రాసినా మీకు నిశ్చయము బొత్తిగా లేదని బాబా జాబు వ్రాస్తారు. అత్య౦త ప్రియమైన తండ్రి ను౦డి వారసత్వము లభిస్తు౦దని నిశ్చయము కూర్చు౦టే ఒక్క సెకె౦డు కూడా ఆగలేరు అని బాబా వారికి ఉత్తరము వ్రాస్తారు. పేదలు వె౦టనే పరుగెత్తుకొని వస్తారని వివేకము చెప్తు౦ది. ధనవంతులు అరుదుగా ఏ ఒక్కరో వస్తారు. సాధారణమైనవారు కొ౦తమంది వస్తారు. ఎవరైనా వస్తే ఇది రాజయోగ పాఠశాల అని చెప్ప౦డి. డాక్టర్‌ యోగము ఎలా ఉ౦టుందో అలా ఇది రాజయోగము. దీని ద్వారా రాజాధి రాజులుగా అవ్వాలి. మనుష్యుల ను౦డి దేవతలుగా తయారవ్వడమే మన ఉద్ధేశ్యము, లక్ష్యము అని చెప్ప౦డి.

బాప్‌దాదాల మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు నంబరువార్‌ పురుషార్థానుసారము ప్రియస్మృతులు

ఎవరైతే పురుషార్థము చేసి తమ సమానంగా చేస్తారో వారు హృదయాన్ని అధిరోహిస్తారు. అయితే తండ్రి అందరినీ ప్రేమిస్తారు. అచ్ఛా, ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. 

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. కర్మే౦ద్రియాల ద్వారా ఏ వికర్మలు చేయరాదు. జ్ఞాన-యోగ బలముతో మనసులో వచ్చే తుఫానుల పై విజయము ప్రాప్తి చేసుకోవాలి.
2. మాతా-పితల పేరు ప్రసిద్ధమయ్యే విధంగా సేవ చేయాలి. అ౦దరి ఆశీర్వాదాలు లభిస్తూ ఉ౦డాలి. 

వరదానము:- ''దివ్యబుద్ధి బలము ద్వారా పరమాత్మ టచింగ్‌ను అనుభవం చేసే మాస్టర్‌ సర్వశక్తివాన్‌ భవ''
దివ్యబుద్ధిని బుద్ధి బలమని అంటారు. ఈ బుద్ధి బలము ద్వారానే తండ్రి నుండి సర్వ శక్తులను గ్రహించి మాస్టర్‌ సర్వశక్తివాన్‌గా అవుతారు. ఉదాహరణానికి సైన్సు బుద్ధి బలము అయితే అది ప్రాపంచిక(లౌకిక) బుద్ధి. అందువలన ఆ బుద్ధి గలవారు ఈ ప్రపంచము పట్ల, ప్రకృతి పట్ల మాత్రమే ఆలోచించగలరు. కానీ మీది దివ్యబుద్ధి బలము. ఇది పరమాత్మ ప్రీతిని అనుభవం చేయిస్తుంది. దివ్యబుద్ధి ద్వారా ప్రతి కర్మలో పరమాత్మ పవిత్రమైన టచింగ్‌ను అనుభవం చేసి సఫలతను అనుభూతి చేయగలరు(పొందగలరు). దివ్యబుద్ధి బలము ద్వారా మాయను యుద్ధములో ఓడించగలరు. 

స్లోగన్‌:- ''మాస్టర్‌ జ్ఞాన సూర్యులుగా అయ్యి సర్వులకు జ్ఞాన లైట్‌ను మైట్‌ను ఇచ్చేవారే సత్యమైన సేవాధారులు''
 

Telugu Murli 04/02/18

04-02-2018 అవ్యక్త బాప్‌దాదా ఓంశాంతి రివైజ్‌: 27-04-1983 మధువనము 

''దృష్టి - వృత్తులు పరివర్తనయ్యేందుకు యుక్తులు''
ఈ రోజు బాప్‌దాదా సర్వ పురుషార్థుల సమూహాన్ని చూస్తున్నారు. ఈ 'పురుషార్థి' అనే శబ్ధంలోనే జ్ఞానమంతా ఇమిడి ఉంది. పురుషార్థం అనగా పురుషుడు (ప్లస్‌) రథి. దేనికి రథికుడు ? ఎవరి పురుషుడు ? ఈ ప్రకృతికి(శరీరానికి) యజమాని అనగా రథానికి రథికుడు. ఈ ఒకే శబ్ధం యొక్క అర్థ స్వరూపంలో స్థితులవుతే ఏమవుతుంది? సర్వ బలహీనతలను సహజంగా దాటేస్తారు. పురుషుడు ప్రకృతికి అధికారి, అధీనుడు కాదు. రథికుడు రథాన్ని నడిపించేవాడు, రథానికి అధీనమై నడిపించేవాడు కాదు. అధికారి సదా సర్వశక్తివంతుడైన తండ్రి సర్వ శక్తులకు అధికారిగా అనగా వారసత్వానికి అధికారిగా లేక హక్కుదారునిగా ఉంటాడు. సర్వశక్తులు తండ్రి ఆస్తి. ప్రతి పుత్రుడు ఆ ఆస్తికి అధికారిగా ఉన్నాడు. ఈ సర్వ శక్తుల రాజ్య భాగ్యాన్ని బాప్‌దాదా అందరికీ జన్మ సిద్ధ అధికార రూపంలో ఇస్తారు. జన్మిస్తూనే ఈ సర్వ శక్తుల స్వరాజ్యం, అధికారీ స్వరూపాన్ని అనే స్మృతి తిలకం మరియు తండ్రి స్నేహంలో లీనమయ్యే స్వరూప రూపంలోని హృదయ సింహాసనం - అందరికీ జన్మ తీసుకుంటూనే ఇచ్చారు. జన్మిస్తూనే విశ్వ కళ్యాణ సేవా కిరీటం ప్రతి పుత్రునికి ఇచ్చారు. కావున జన్మతోనే అధికారంగా సింహాసనం, తిలకం, కిరీటం మరియు రాజ్యం అందరికీ లభించాయి కదా! ఇటువంటి నాలుగు ప్రాప్తుల ప్రాప్తి స్వరూప ఆత్మలు బలహీనంగా అవ్వగలరా? ఈ నాలుగు ప్రాప్తులు సంభాళించలేరా? ఒకసారి తిలకం చెరిగిపోతుంది, ఒకసారి సింహాసనం వదిలిపోతుంది, ఒకసారి కిరీటానికి బదులుగా బరువును ఎత్తుకుంటారు, వ్యర్థమైన చెత్త గంపను ఎత్తుకుంటారు. పేరుకు స్వరాజ్యం కానీ స్వయమే రాజుకు బదులుగా అధీనమైన ప్రజలుగా అయిపోతారు. అటువంటి ఆటను ఎందుకు ఆడుతున్నారు ? ఒకవేళ ఇలాగే ఆట ఆడుతూ ఉంటే సదా కాలానికి రాజ్య భాగ్య అధికార సంస్కారాలు అవినాశిగా ఎప్పుడు అవుతాయి? ఒకవేళ ఇదే ఆటలోనే నడుస్తూ ఉంటే ఏమి ప్రాప్తిస్తుంది? ఎవరైతే తమ ఆది సంస్కారాన్ని అవినాశిగా తయారు చేసుకోలేదో, వారు ఆది కాల రాజ్య అధికారిగా ఎలా అవుతారు? ఒకవేళ చాలాకాలం యుద్ధ సంస్కారమే ఉంటే అనగా యుద్ధం చేస్తూ చేస్తూ సమయాన్ని గడిపేస్తే ఈ రోజు గెలుపు, రేపు ఓటమి, ఇప్పుడిప్పుడే గెలుపు, ఇప్పుడిప్పుడే ఓడిపోతూ ఉంటే, సదా విజయీ సంస్కారం లేకుంటే వారిని క్షత్రియులని అంటారా ? లేక బ్రాహ్మణులని అంటారా? బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. క్షత్రియులైతే ఇంటికి వెళ్లి మళ్లీ క్షత్రియులుగానే అవుతారు. దేవతల చిహ్నాలకు, క్షత్రియుల చిహ్నాలకు ఉన్న తేడాను గమనించండి. స్మృతిచిహ్న చిత్రాలలో క్షత్రియులకు బాణాన్ని చూపించారు. దేవతలకు మురళిని చూపించారు. మురళీని ధరించినవారు అనగా మాస్టర్‌ మరళీధరులుగా అయ్యి, వికారాల రూపీ సర్పాల వలన విషపూరితంగా అవ్వడానికి బదులు విషాన్ని సమాప్తి చేసి శయ్యగా చేసుకున్నారు. విషమున్న సర్పం ఎక్కడ, శయ్య(పానుపు) ఎక్కడ ? ఇంత పరివర్తన దేని ద్వారా చేశారు ? మురళి ద్వారా. అలాంటి పరివర్తన చేసుకునే వారినే విజయీ బ్రాహ్మణులని అంటారు. కావున నేను ఎవరు? అని స్వయాన్ని ప్రశ్నించుకోండి.
అందరూ ఎవరి బలహీనతలను వారు సత్యతతో స్పష్టం చేశారు. సత్యాన్ని స్పష్టం చేసినందుకు మార్కులైతే లభిస్తాయి. కాని ఇప్పటి వరకు తమ సంస్కారాలను పరివర్తన చేసుకునే శక్తి రాకుంటే విశ్వ పరివర్తకులుగా ఎప్పుడు అవుతారు? దృష్టి పరివర్తన, వృత్తి పరివర్తన అవినాశిగా ఎప్పటికి అవుతాయి? అని బాప్‌దాదా చూస్తున్నారు. మీరు దృష్టాలు(చూసేవారు). దృష్టి ద్వారా చూసే దృష్టాలు. దృష్టి ఎందుకు విచలితం చేస్తుంది? దివ్యనేత్రంతో చూస్తున్నారా లేక ఈ చర్మ చక్షువులతో చూస్తున్నారా? దివ్యనేత్రం ద్వారా సదా స్వతహాగానే దివ్య రూపమే కనిపిస్తుంది. చర్మ నేత్రాలు చర్మాన్నే చూస్తాయి. చర్మాన్ని చూడడం, చర్మం గురించి ఆలోచించడం ఇది ఎవరి పని? ఫరిస్తాలదా? బ్రాహ్మణులదా? స్వరాజ్య అధికారులదా? మీరు బ్రాహ్మణులా లేక పేరు చెప్పాలా ఏమిటి? ఇతరులా?
సదా ప్రతి నారిని, శరీరధారి ఆత్మను శక్తి రూపంగా, జగన్మాత రూపంగా, దేవీ రూపంగా చూడండి. ఇదే దివ్య నేత్రంతో చూడడం. స్త్రీ - కుమారిగా ఉన్నా, మాతగా ఉన్నా, అక్కయ్యగా ఉన్నా, సేవాధారి నిమిత్త టీచరుగా ఉన్నా ఎవరు? శక్తి రూపం. సోదరీ సోదర సంబంధంలో కూడా అప్పుడప్పుడు వృత్తి మరియు దృష్టి చంచలమైపోతుంది. అందువలన సదా శక్తి రూపంగా, శివశక్తిగా చూడాలి. శక్తి ముందు ఎవరైనా ఒకవేళ ఆసురీ వృత్తితో వచ్చినట్లయితే వారి గతి ఏమవుతుందో తెలుసు కదా! మా టీచరు కాదు, శివశక్తి. ఈశ్వరీయ అక్కయ్య రూపంలో కాక ఉన్నతమైన శివశక్తి రూపంలో చూడండి. మాతలు, అక్కయ్యలు కూడా సదా తమ శివశక్తి స్వరూపంలో స్థితులై ఉండాలి. నా విశేషమైన సోదరుడు, విశేషమైన విద్యార్థి అని అనుకోరాదు. వీరు శివశక్తులు, వీరు మహావీరులు అని భావించాలి. లంకను కాల్చేవారు ముందు స్వయంలోని రావణ వంశాన్ని కాల్చేయాలి. మహావీరులకు ఏ విశేషత చూపిస్తారు? సదా వారి హృదయంలో ఏమి చూపిస్తారు? ఒక్క రాముడు తప్ప ఇంకెవ్వరూ ఉండరు. చిత్రాన్ని చూశారు కదా! కావున ప్రతీ సోదరుడు మహావీరుడు, ప్రతీ సోదరి శివశక్తి. మహావీరుడు కూడా రాముని వాడే, శక్తి కూడా శివునిదే. ఏ దేహధారిని చూచినా మస్తకంలోని ఆత్మను చూడండి. ఆత్మతో మాట్లడాలా? లేక శరీరంతో మాట్లాడాలా? కార్య వ్యవహారాల్లో కార్యం ఆత్మ చేస్తుందా? లేక శరీరం చేస్తుందా? సదా ప్రతీ సెకండు శరీరంలోని ఆత్మనే చూడండి. దృష్టి మస్తక మణి వైపే వెళ్లాలి. అప్పుడు ఏమవుతుంది? ఆత్మ ఆత్మను చూస్తూ స్వతహాగా ఆత్మాభిమానిగా అయిపోతుంది. అసలు ఇదే కదా మొదటి పాఠం! మొదటి పాఠమే పక్కా అవ్వకపోతే, భగవంతుని (అల్ఫ్‌) పక్కాగా చేసుకోకపోతే, చక్రవర్తి వారసత్వం(బే) ఎలా లభిస్తుంది? కేవలం ఒక్క విషయంలో సదా జాగ్రత్త వహించండి. ఏది చేయాలన్నా శ్రేష్ఠ కర్మను చేయాలి లేక అది శ్రేష్ఠంగా అవ్వాలి. ప్రతీ విషయంలో దృఢ సంకల్పం చేయువారిగా అవ్వండి. ఎంత సహించవలసి వచ్చినా, ఎదుర్కోవలసి వచ్చినా, శ్రేష్ఠ కర్మ లేక శ్రేష్ఠ పరివర్తన చేయవలసిందే. ఇందులో పురుషార్థిని అనే శబ్ధాన్ని నిర్లక్ష్య రూపంతో ఉపయోగించకండి. నేను పురుషార్థిని, నడుస్తున్నాను, చేస్తున్నాను, చేయాల్సిందే........ ఇది నిర్లక్ష్యంతో కూడిన భాష. అదే ఘడియలో 'పురుషార్థి' అనే శబ్ధము యొక్క అర్థ స్వరూపంలో స్థితమైపోండి. నేను పురుషుడిని, నన్ను ప్రకృతి మోసం చేయలేదు అని అనుకోవాలి. ఈ అన్ని రకాల బలహీనతలు సోమరితనానికి లేక నిర్లక్ష్యానికి గుర్తులు. మహావీరులంటే పర్వతాన్ని కూడా సెకండులో అరచేతిలో ఉంచుకొని ఎగిరిపోతారు అనగా పర్వతాన్ని కూడా నీటి సమానంగా తేలికగా చేసుకునేవారు. కనుక చిన్న చిన్న పరిస్థితులేం చేస్తాయి? నిర్లక్ష్యంగా ఉంటే, అలాంటి మహావీరులను చీమలకు భయపడేవారని అంటారు. ఏమి చేయను? జరిగిపోతుంది..... ఇవి మహావీరుల మాటలా? తెలివైనవారు ఏమి చేయను, దొంగలు వచ్చేస్తారని అనరు. తెలివైనవారు పదే పదే మోసపోరు. నిర్లక్ష్యంగా ఉండేవారు పదే పదే మోసపోతారు. రక్షణ సాధనం ఉండినా దానిని కార్యంలో ఉపయోగించకపోతే వారిని ఏమంటారు? ఇలా అవ్వరాదని తెలుసు కాని అయిపోతోంది అని అంటారు. వారిని తెలివైనవారని అంటారా?
దృఢ సంకల్పం చేసేవారిగా అవ్వండి. పరివర్తన అవ్వాల్సిందే. రేపు కూడా కాదు, ఈ రోజే అవ్వాలి, ఈ రోజు కూడా కాదు ఇప్పుడే అవ్వాలి. ఇటువంటివారినే మహావీరులని, రాముని ఆజ్ఞాకారులని అంటారు. ఈ రోజు అయితే కలిసే రోజు. అయినా పిల్లలు శ్రమ చేశారు కనుక శ్రమకు ఫలంగా బదులు ఇవ్వవలసి వచ్చింది. కాని ఈ బలహీనతలను తోడుగా తీసుకెళ్లాలా? ఇచ్చేసిన వస్తువులను తిరిగి తీసుకోరాదు కదా! బలహీనతలు బలవంతంగా వచ్చినా రానివ్వరాదు. శత్రువును రానిస్తారా ఏమిటి? అటెన్షన్‌, చెకింగ్‌ - ఇది ఒక డబల్‌ లాక్‌. స్మృతి మరియు సేవ - ఇది మరొక డబల్‌ లాక్‌. అందరి వద్ద ఈ రెండూ ఉన్నాయి కదా! కావున సదా ఈ డబల్‌ లాక్‌ వేసి ఉండాలి. రెండు వైపులా లాక్‌ వెయ్యండి. అర్థమయ్యిందా. ఒకవైపే వెయ్యకండి. స్థూలంగా, సూక్ష్మంగా అతిథి సత్కారమైతే చాలా జరిగింది. డబల్‌ మర్యాద జరిగింది కదా! దీదీ, దాదీ మరియు నిమిత్తంగా ఉన్న ఆత్మలు హృదయ పూర్వకంగా(మర్యాద) ఇచ్చారు. దీనికి రిటర్న్‌గా దీదీ, దాదీలకు ఇప్పటి నుండి మేము సదా విజయులుగా ఉంటామనే మాటను ఇచ్చి వెళ్లండి. కేవలం నోటితో చెప్పకండి, మనసుతో చెప్పండి. మళ్లీ ఒక నెల తర్వాత ఏమి చేస్తున్నారని ఈ ఫోటోలో ఉన్నవారిని చూస్తారు. ఎవరి నుండి దాచినా తండ్రి నుండి అయితే దాచలేరు. మంచిది.
సదా దృఢ సంకల్పం ద్వారా ఆలోచించడం మరియు చెయ్యడం రెండూ సమానం చేయువారికి, సదా దివ్యనేత్రం ద్వారా ఆత్మిక రూపాన్ని చూసేవారికి, ఎక్కడ చూసినా అక్కడ ఆత్మయే ఆత్మను చూసే అలాంటి అర్థ స్వరూప పురుషార్థీ ఆత్మలకు బాప్‌దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.
అవ్యక్త మహావాక్యాలు
తండ్రి సమానంగా నిరాకారీ, నిరహంకారి మరియు నిర్వికారులుగా అవ్వండి.
బ్రహ్మబాబా ఉచ్ఛరించిన అంతిమ మూడు శబ్ధాలను గుర్తుంచుకోండి. నిరాకారి, నిరహంకారి, నిర్వికారి. సంకల్పంలో సదా నిరాకారి అనగా అందరితో అతీతంగా, తండ్రికి ప్రియంగా ఉండాలి. వాచా(మాటలు) సదా నిరహంకారిగా అనగా సదా ఆత్మిక మధురతతో నిర్మాణతా సంపన్నంగా ఉండాలి. కర్మలు చేయునప్పుడు ప్రతి కర్మేంద్రియము ద్వారా నిర్వికారి అనగా పవిత్రతా వ్యక్తిత్వం గలవారిగా అవ్వండి. ''నేను నిరాకార ఆత్మను, సాకార శరీరం ఆధారంతో మాట్లాడ్తున్నాను'' అని అభ్యాసం చెయ్యండి. సాకారంలో కూడా నిరాకార స్థితి స్మృతిలో ఉండాలి. దీనినే నిరాకారము నుండి సాకారము ద్వారా శబ్ధము లేక కర్మలోకి రావడం అని అంటారు. అసలైన స్వరూపం నిరాకారము. సాకారము నిరాకారానికి ఆధారంగా ఉంది. ఈ నిరాకారం నుండి సాకారం అన్న డబల్‌ స్మృతి ఉండడం శక్తిశాలి స్థితి. తమ నిరాకార వాస్తవిక స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకుంటే ఆ స్వరూపం యొక్క అసలు(ఒరిజనల్‌) గుణాలు, శక్తులు స్వతహాగా ఉత్పన్నం అవుతాయి. సంగమ యుగంలో నిరాకార తండ్రి సమానంగా కర్మాతీత, నిరాకారీ స్థితిని అనుభవం చేయండి. తర్వాత భవిష్యత్‌ 21 జన్మలు బ్రహ్మబాబా సమానంగా సర్వ గుణ సంపన్నంగా, సంపూర్ణ నిర్వికారీ శ్రేష్ఠ జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. '' బాలకుని నుండి యజమానిని '' - ఈ స్మృతి సదా నిరహంకారీ, నిరాకారీ స్థితిని అనుభవం చేయిస్తుంది. బాలునిగా అవ్వడం అనగా హద్దు జీవితం పరివర్తన అవ్వడం. బ్రాహ్మణులుగా అయినప్పుడు బ్రాహ్మణ జీవితంలోని మొదటి సహజాతి సహజమైన పాఠాన్ని చదివారు - పిల్లలు 'బాబా' అని అన్నారు, తండ్రి 'పిల్లలూ అనగా బాలకులారా' అని అన్నారు. ఈ ఒక్క శబ్ధం యొక్క పాఠం జ్ఞాన స్వరూపంగా(నాలెడ్జ్‌ఫుల్‌గా) తయారు చేస్తుంది.
సేవలో నిమిత్త భావమే సఫలతకు ఆధారం. నిరాకారి, నిర్వికారి మరియు నిరహంకారి. ఈ మూడు విశేషతలు నిమిత్త భావం ద్వారా స్వతహాగా వచ్చేస్తాయి. నిమిత్త భావం లేకుంటే అనేక రకాల నేను, నాది అనే భావాలు సేవను ఢీలాగా చేసేస్తాయి. అందువలన 'నేను' వద్దు, 'నాది' వద్దు. నేను నిమిత్తంగా ఉన్నాననే ఒక్క శబ్ధాన్ని గుర్తుంచుకోండి. నిమిత్తంగా అవ్వడం వల్లనే నిరాకారి, నిరహంకారి మరియు నమ్రచిత్తులుగా నిస్సంకల్ప స్థితిలో ఉండగలరు. ఎలాగైతే నిమిత్తంగా అవ్వడం వలన నిరాకారి, నిరహంకారి, నిస్సంకల్ప స్థితి ఉంటుందో అలాగే 'నేను, నేను' అన్నది రావడం వలన గర్వం, నిరాశ, నిరుత్సాహం వస్తాయి. అంతిమంలో దాని ఫలితంగా నడుస్తూ నడుస్తూ జీవించి ఉన్నా చనిపోతారు. అందువలన నేను నిమిత్తంగా ఉన్నాను అన్న ముఖ్యమైన శిక్షణను సదా మీ జతలో ఉంచుకోండి. నిమిత్తంగా అవ్వడం వలన ఎలాంటి అహంకారమూ ఉత్పన్నమవ్వదు. మత భేద చక్రంలోకి కూడా రారు.
ఎంత నిరాకారి స్థితిలో ఉంటారో అంత నిర్భయంగా ఉంటారు. ఎందుకంటే దేహ భావం ఉన్నప్పుడే భయం కలుగుతుంది. కావున నిర్భయతా గుణాన్ని ధారణ చేసేందుకు నిరాకారిగా అవ్వండి. ఎంత నిరాకారి స్థితిలో, అతీతమైన స్థితిలో ఉంటారో అంత యోగంలో బిందు రూప స్థితిని అనుభవం చేస్తారు. అంతేకాక నడుస్తూ, తిరుగుతూ అవ్యక్త స్థితిలో ఉంటారు. ఎలాగైతే స్థూల శరీరంలోని కాళ్లు, చేతులు మీ ఆదేశానుసారంగా నడుస్తూ ఉంటాయో అలా ఒక్క సెకండులో సాకారం నుండి నిరాకారి అనగా తమ అసలైన నిరాకారీ స్వరూపంలో స్థితులయ్యే అభ్యాసాన్ని చేసినట్లయితే అహంకారం రాదు. అహంకారం అలంకార హీనంగా తయారు చేస్తుంది. ఎవరైతే నిరహంకారి మరియు నిరాకారి మళ్లీ అలంకారీ స్థితిలో స్థితులై ఉంటారో వారు సర్వ ఆత్మల కళ్యాణకారిగా అవ్వగలరు. ఎవరైతే సర్వుల కళ్యాణకారిగా అవుతారో వారే విశ్వ రాజ్యధికారులుగా అవుతారు.
ఆకారంలో ఉంటూ నిరాకారీ స్థితిలో ఉన్నప్పుడే సాక్షాత్కార మూర్తులుగా అవుతారు. ఎలాగైతే అనేక జన్మలు తమ దేహ స్వరూప స్థితి సహజంగా ఉంటుందో అలా తమ అసలైన స్వరూప స్మృతి అనుభవం కూడా చాలాకాలం ఉండాలి. ఈ మొదటి పాఠం పూర్తయినప్పుడే, ఆత్మాభిమాని స్థితిలో స్థితులై ఉన్నప్పుడే సర్వ ఆత్మలకు సాక్షాత్కారం చేయించేందుకు నిమిత్తంగా అవుతారు. ఒకటేమో నిరాకారీ ఆత్మిక స్మృతి లేక ఆత్మాభిమానిగా అయ్యే లక్ష్యం. రెండవది నిర్వికారీ స్థితి. ఇందులో మానసికంగా కూడా నిర్వికారీతనపు స్థితిని చేసుకోవలసి వస్తుంది. ఎలాగైతే పూర్తి రోజంతా యోగులుగా, పవిత్రంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారో, అలా నిర్వికారీ స్థితి అనే లక్ష్యం ఎదురుగా ఉన్నప్పుడే ఫరిస్తా లేక కర్మాతీత స్థితి తయారవుతుంది. అప్పుడు ఎటువంటి అపవిత్రత అనగా పంచ తత్వాల ఆకర్షణ ఆకర్షించదు. ఇప్పటికిప్పుడు తమ సంపూర్ణ నిర్వికారి, నిరాకారి, నిరహంకారి స్థితిలో స్థితులవ్వండి అని ఆజ్ఞ లభిస్తూనే ఆ స్థితిలో స్థితమైపోండి. '' నాది, నాది, పేరు - ప్రతిష్ఠలు, గౌరవాల'' అంశం కొద్దిగా కూడా ఉండరాదు. అంశ మాత్రం ఉన్నా వంశం వచ్చేస్తుంది. అందువలన సంకల్పంలో కూడా ఏ వికారమూ అంశ మాత్రము కూడా ఉండరాదు. అప్పుడే ఈ మూడు స్థితులు వస్తాయి. తర్వాత మళ్లీ ఆ ప్రభావంతో ఎవరైతే వారసులు లేక ప్రజలు వెలువడవలసి ఉంటుందో వారు వెంటనే (ఫటాఫట్‌) వెలువడ్తారు. సేవ త్వరిత గతిలో(క్విక్‌ సర్వీస్‌) కనిపిస్తుంది.
ఇప్పుడు తమ నిరాకారీ ఇంటికి వెళ్లాలంటే ఎలాంటి దేశమో, అలాంటి వేషాన్ని మీరు తయారు చేసుకోవాలి. కనుక ఇప్పుడు నేను తిరిగి వెళ్లాలి, అంతేకాక అందరినీ తీసుకెళ్లాలనే విశేష పురుషార్థమే జరగాలి. ఈ స్మృతి ద్వారా స్వతహాగా సర్వ సంబంధాల నుండి, సర్వ ప్రాకృతిక ఆకర్షణల నుండి ఉపరాంగా అనగా సాక్షిగా అయిపోతారు. సాక్షిగా అవ్వడం వలన సహజంగా తండ్రికి సహచరునిగా (సాథీగా) తండ్రి సమానంగా అయిపోతారు. మధ్య మధ్యలో సమయాన్ని కేటాయించి ఈ దేహ భావం నుండి అతీతమైన నిరాకారీ ఆత్మ స్వరూపంలో స్థితులయ్యే అభ్యాసాన్ని చేయండి. ఏ కార్యాన్ని చేస్తున్నా ఆ కార్యం చేస్తూ కూడా నేను నిరాకార ఆత్మను, ఈ సాకార కర్మేంద్రియాల ఆధారంతో కర్మ చేయిస్తున్నాను అని అభ్యాసం చెయ్యండి. నిరాకార స్థితి అంటే చేయించే(కరావన్‌ స్థితి) స్మృతి. కర్మేంద్రియాలు చేసేవి, ఆత్మ చేయించేది. కావున నిరాకార ఆత్మిక స్థితి ద్వారా సాకార తండ్రి స్వతహాగా గుర్తుకొస్తారు. మొత్తం రోజులో ఎన్నిసార్లు 'నేను' అన్న శబ్ధాన్ని మాట్లాడినా అన్ని సార్లు నిరాకార ఆత్మనైన నేను సాకారంలో ప్రవేశించాను అని గుర్తు చేసుకోండి. నిరాకారీ స్థితి గుర్తుకొచ్చినట్లయితే స్వతహాగా నిరహంకారిగా అయిపోతారు. దేహ భావం(దేహ భ్రాంతి) సమాప్తమైపోతుంది. ఆత్మ గుర్తుకు రావడం వలన నిరాకార స్థితి పక్కా అయిపోతుంది. నిరాకారీ, నిరహంకారి మరియు నిర్వికారి భవ అన్న వరదానమేదైతే వరదాత అయిన తండ్రి ద్వారా ప్రాప్తించిందో ఇప్పుడు ఆ వరదానాన్ని సాకార రూపంలోకి తీసుకురండి. అనగా స్వయాన్ని జ్ఞాన మూర్తులుగా, స్మృతి మూర్తులుగా మరియు సాక్షాత్కార మూర్తులుగా తయారు చేసుకోండి. మీ ఎదురుగా ఎవరు వచ్చినా వారికి మీ మస్తకం ద్వారా మస్తకమణి కనిపించాలి, నయనాల ద్వారా జ్వాల కనిపించాలి, నోటి ద్వారా వరదాన మాటలు వెలువడ్తూ వినిపించాలి(కనిపించాలి). అప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది. 

వరదానము:- ''ఒకేసారి వాచా మరియు మనసా రెండింటి ద్వారా సేవ చేసే సహజ సఫలతా మూర్త్‌ భవ''
వాచాకు తోడు తోడుగా సంకల్ప శక్తి ద్వారా సేవ చేయడమే శక్తిశాలి అంతిమ సేవ. ఎప్పుడైతే మనసా సేవ మరియు వాచా సేవ రెండింటి కంబైండ్‌ రూపముంటుందో అప్పుడు సహజ సఫలత ఉంటుంది. దీని ద్వారా రెట్టింపు ఫలితం వెలువడ్తుంది. వాచా సేవ చేసేవారైతే కొద్దిమందే ఉంటారు. ఇక మిగిలినవి చూసుకునేవారు, వేరే కార్యాలలో ఎవరైతే ఉంటారో, వారు మనసా సేవ చేయాలి. దీని ద్వారా వాయుమండలం యోగయుక్తంగా అవుతుంది. నేను సేవ చేయాలని ప్రతి ఒక్కరు భావించినట్లయితే వాతావరణం కూడా శక్తిశాలిగా అవుతుంది అంతేకాక సేవ కూడా రెట్టింపు అవుతుంది. 

స్లోగన్‌:- ''సదా ఏకరస స్థితి అనే ఆసనం పై విరాజమానమై ఉంటే అచంచలంగా, స్థిరంగా ఉంటారు.''
 

Telugu Murli 03/02/18

03-02-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

'' మధురమైన పిల్లలారా - మీకు యోగ భట్టీ అత్య౦త విలువైనది ఎ౦దుకంటే ఈ యోగభట్టీ ద్వారానే మీ వికర్మలు భస్మమైపోతాయి. '' 

ప్రశ్న :- ఏ పిల్లల బుద్ధిలో బీజము మరియు వృక్షముల జ్ఞానము స్పష్టంగా నిలువగలదు ?
జవాబు :- ఎవరైతే విచార సాగర మథనము చేస్తారో, వారి బుద్ధిలో స్పష్టంగా కూర్చు౦టు౦ది. విచార సాగర మథనము చేసేందుకు అమృతవేళ సమయము చాలా మంచిది. అమృతవేళలో లేచి బుద్ధి ద్వారా ఒక్క బాబాను మాత్రమే స్మృతి చేయండి. మీ అజపాజపము నడుస్తూ ఉ౦డాలి. సూక్ష్మంగా లేక స్థూలంగా శివబాబా, శివబాబా అనే అవసరము లేదు. బుద్ధి ద్వారా స్మృతి చేయాలి. 

ఓంశాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు అనగా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. తండ్రి చెప్తున్నారు - నాకు కూడా శరీరముంది. అందుకే మాట్లాడగలుగుచున్నాను. మీరు కూడా ''నేను ఆత్మను, ఈ శరీరము ద్వారా వి౦టున్నాను'' అని భావి౦చండి. ఈ జ్ఞానము మంచి రీతిగా ధారణ చేయాలి. ఎలాగైతే బాబా వద్ద ధారణ అయ్యి ఉందో, అలా మీరు కూడా చేయాలి. ఆత్మకు గల బుద్ధిలో ధారణ జరుగుతు౦ది. ఎలాగైతే తండ్రి బుద్ధిలో ధారణ అయ్యి ఉందో, అలా మీ బుద్ధిలో కూడా ధారణ అవ్వాలి. బీజము, వృక్షముల జ్ఞానము చాలా సులభము. ఫలానా విత్తనము నాటితే, పెద్ద వృక్షము వస్తు౦దని తోటమాలికి జ్ఞానము౦టు౦ది కదా. బాబా కూడా ఇదే విధంగా అర్థం చేయిస్తున్నారు. దీనిని బుద్ధిలో ధారణ చేయాలి. ఎలాగైతే ఈ జ్ఞానము నా బుద్ధిలో ఉందో, అలా మీ బుద్ధిలో కూడా ఉ౦డాలి. ఎప్పుడైతే విచార సాగర మథనము చేస్తారో అప్పుడు బుద్ధిలో ఉ౦టు౦ది. విచార సాగర మథనము చేసేందుకు అమృతవేళ సమయము చాలా మంచిది. ఆ సమయములో వృత్తి వ్యాపారాదులు ఏవీ ఉ౦డవు. మనుష్యులు భక్తి కూడా ఉదయము పూటే చేస్తారు. బయట తిరుగుతూ ఉంటారు. కూర్చున్నప్పుడు ఏదో ఒక నామ జపం చేస్తూ ఉ౦టారు లేక పాటలు పాడుతూ ఉ౦టారు, శబ్ధాలు చేస్తారు. కొ౦తమంది లోలోపలే రామ-రామ అని జపము చేస్తూ ఉంటారు. ఇది భక్తిలోని అజపాజపము. కొ౦తమంది మాలలు కూడా త్రిప్పుతూ ఉ౦టారు. మీరు శివ-శివ అని బయటికి అనరాదు. జనులు ఏదైతే భక్తిలో చేస్తున్నారో, అది జ్ఞానములో ఉ౦డరాదు. చాలా మందికి అలవాటైపోయింది. ''శివ-శివ '' అంటూ స్మరణ చేస్తూ ఉ౦టారు. మీరు శివ-శివ అని స్థూలములో గానీ, సూక్ష్మములో గానీ జపి౦చరాదు. మా తండ్రి వచ్చారని పిల్లలైన మీకు తెలుసు. వారు తప్పకుండా ఎవరో ఒకరి శరీరములో వస్తారు. వారికి తమ స్వంత శరీరమంటూ ఏదీ లేదు. వారు పునర్జన్మ రహితులు. పునర్జన్మలు మానవ సృష్టిలో ఉంటాయి. లక్ష్మీనారాయణులు- విష్ణువు రె౦డు రూపాలు. దేవ దేవ మహాదేవ అని అ౦టారు. బ్రహ్మకు, విష్ణువుకు పరస్పర సంబంధముంది. శంకరునికి ఎవ్వరితోనూ సంబంధము లేదు. అ౦దువలన అతడిని పెద్దగా చూపుతారు. అతనికి పునర్జన్మ లేదు, అతనికి సూక్ష్మ శరీరము లభిస్తు౦ది. శివబాబాకు సూక్ష్మ శరీరము కూడా లేదు. అ౦దువలన వారు అ౦దరికంటే ఉన్నతాతి ఉన్నతులు. వారు అనంతమైన తండ్రి. అనంతమైన తండ్రి ను౦డి మనము అనంతమైన సుఖ వారసత్వము తీసుకురటున్నామని పిల్లలకు తెలుసు. తండ్రి శ్రీమతమును మీరు పూర్తిగా అనుసరి౦చాలి. ఎవరైతే స్వయంగా స్మృతి చేస్తూ ఇతరులతో కూడా స్మృతి చేయిస్తారో, వారు బాబాకు సహాయకారులుగా ఉ౦టారు. తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయాలి. ఇప్పుడు మీ 84 జన్మలు పూర్తి అయ్యాయని వారు పిల్లలకు అర్థం చేయిస్తూ ఉ౦టారు. ఇక కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉంది. నాటకములోని పాత్రధారులు టైము(గడియారము) చూస్తూ, ఇక అరగంటకు మేము ఇ౦టికి వెళ్లిపోతామని భావిస్తూ ఉ౦టారు. మీ గడియారము అనంతమైన పెద్ద గడియారము. ఇప్పుడు ఇ౦టికి వెళ్లాలని అర్థం చేయించబడింది. తండ్రిని స్మృతి చేసినందున మీ వికర్మలు వినాశనమౌతాయి. ఏ ఇతర శాస్త్రాలలోనూ ఇటువంటి సహజ రాజయోగము లేదు. వారు అనేక హఠయోగాలు చేస్తూ ఉ౦టారు, చాలా శ్రమ చేస్తారు. వాటిని మాతలైన మీరు చేయలేరు. మీరు హఠయోగుల వలె ఆసనాలు వేసే అవసరం లేదు. అయితే సభలో చక్కగా సరిగ్గా కూర్చోవాలి. మీది రాజయోగము, కాలి పై కాలు వేసుకొని కూర్చోవాలి. రాజయోగములో ఇలా కూర్చున్న౦దున నషా ఎక్కుతు౦ది. హఠయోగములో రె౦డు కాళ్లు ఒకదాని పై ఒకటి వేయిస్తారు. బాబా మీకు కష్టము కలిగి౦చరు. సాధారణంగా కూర్చునేందుకు, యోగములో కూర్చునేందుకు కొద్దిగా తేడా ఉ౦డాలి. మీరు రాజయోగము నేర్చుకు౦టున్నారు. కావున మనుష్యులకు వీరు రాజయోగములో కూర్చున్నారని అర్థమగునట్లు కూర్చోవాలి. ఇది మన రాజరికపు పద్ధతి. మీరు అనంతమైన తండ్రి ద్వారా రాజాధి రాజులుగా అవుతున్నారు. ఇటువంటి త౦డ్రిని ఘడియ - ఘడియ స్మృతి చేయాలి. సత్యయుగములో తండ్రిని స్మృతి చేయడం జరగదు. స్వయమునే తల్చుకు౦టారు. కలియుగములో తండ్రి గురి౦చీ తెలియదు, స్వయం గురి౦చి కూడా తెలియదు. కేవలం తండ్రిని పిలుస్తూ ఉ౦టారు. ఇప్పుడు మీరు మంచి రీతిగా తెలుసుకున్నారు. తండ్రి బి౦దువని, ఇతరులెవ్వరూ భావి౦చరు. అతిసూక్ష్మమని కూడా అ౦టారు కానీ మళ్లీ వేలాది సూర్యుల కంటే తీక్షణమైనవారని కూడా అంటారు. కావున రె౦డి౦టికీ పొ౦తన కుదరదు. నామ-రూపాలకు అతీతమైనవారని అన్నప్పుడు మళ్లీ వేలాది సూర్యుల కంటే తీక్షణమని ఎ౦దుకనాలి? ఇ౦తకుముందు మీరు కూడా ఇలాగే భావి౦చేవారు. తండ్రి అ౦టున్నారు - డ్రామాలో ఈ జ్ఞానము(వివరణ) ఆలస్యంగా లభి౦చవలసి ఉ౦ది. సూక్ష్మాతి సూక్ష్మమైన రహస్య విషయాలు అర్థము చేసుకొని అర్థము చేయి౦చబడ్తాయి. ఇ౦తకుముందు వేలాది సూర్యుల కంటే తేజోమయమని చెప్పేవారు. ఇప్పుడు బి౦దువని ఎ౦దుకంటున్నారు? ఇటువంటి ఆలోచన రాకూడదు. ఐ.సి.యస్‌ చదువునప్పుడు ఐ.సి.యస్‌ మాటలే మాట్లాడ్తారు కానీ అ౦తకుముందే ఆ మాటలు ఎలా చెప్తారు? ఇ౦దులో భ్రమపడే విషయమే లేదు. డ్రామాలో బాబా ఎప్పుడు అర్థం చేయించాలో అప్పుడు అర్థం చేయిస్తారు. ఇక మీదట కూడా ఏమేమి అర్థం చేయిస్తారో తెలియదు ఎ౦దుకంటే తండ్రి ప్రభావము కూడా వెలువడాలి కదా. ఎలాగైతే మీ ఆత్మ ఉందో, అలాగే వారు కూడా ఆత్మనే, వారు పరంధామములో ఉ౦టారు. వారిని పరమ ఆత్మ అని అ౦టారు. వారు ఇచ్చటకు వచ్చినప్పుడు జ్ఞానమునిస్తారు.

తండ్రి చెప్తున్నారు - ప్రపంచము పతితమైనప్పుడు దానిని పావన ప్రపంచంగా చేసేందుకు నేను వస్తాను. ఓ పతిత పావనా! ఓ దు:ఖహర్తా - సుఖకర్తా! రమ్మని కూడా నన్ను పిలుస్తారు కానీ వారు సంగమ యుగములోనే వస్తారు. రాత్రి సమాప్తమైనప్పుడు పగలు వస్తు౦ది. పాత ప్రపంచము సమాప్తమౌతు౦ది. చివరిలో మీకు కర్మాతీత అవస్థ వస్తుంది. మీరు గృహస్థ వ్యవహారములోనే ఉ౦డాలి, వదిలేయరాదు. శరీర నిర్వహణ కొరకు వ్యవహారాలు చేస్తున్నా కమలపుష్ప సమానం పవిత్రంగా ఉ౦డాలి. దేవతలు సంపూర్ణ పవిత్రులు. అయితే దేవతలుగా వారు ఎప్పుడు? ఏ విధంగా తయారయ్యారు? తప్పకుండా పురుషార్థము చేసినందునే వారు ఈ ప్రాలబ్ధాన్ని పొ౦దుకున్నారు. పురుషార్థానుసారము ప్రాలబ్ధము తయారయ్యింది. ఎలా౦టి కర్మలు ఆచరిస్తామో, అలా౦టి ప్రాలబ్ధము లభిస్తుంది. ఇది కొనసాగుతూనే ఉ౦టు౦ది. ఇప్పుడు మీకు కర్మలు నేర్పి౦చే తండ్రి లభి౦చారు. వారిని మంచి రీతిగా స్మృతి చేయాలి. మీరు దత్తత తీసుకోబడిన పిల్లలు. మార్వాడీలలో దత్తత చాలా ఎక్కువగా ఉ౦టు౦ది. మీది కూడా దత్తతే. మీరు వీరి గర్భము ను౦డి వెలువడలేదు. దత్తత జరిగినప్పుడు ఇరువురు తండ్రులూ గుర్తు౦టారు. చివరివరకు నా అసలు తండ్రి ఎవరు అని గుర్తు౦టు౦ది. ఇప్పుడు ఇతనికి దత్తు పిల్లలుగా అయ్యాము అని కూడా గుర్తు౦టు౦ది. మీకు కూడా ఇ౦తకుముందు ఎవరి వారిగా ఉ౦డినామో, ఇప్పుడు ఎవరి వారిగా అయ్యామో అని తెలుసు. నేను పరమపిత పరమాత్మకు దత్తు బిడ్డను, వారు స్వర్గ రచయిత, వారి రచన ఎ౦త కాలము కొనసాగుతు౦ది? అర్ధకల్పము. రావణుడు నరక రచయిత. అతని రాజ్యము కూడా అర్ధకల్పము నడుస్తు౦ది. సతోప్రధానము ను౦డి తమోప్రధానంగా అవుతారు. ఇది అర్థము చేసుకోవలసిన విషయము. ఏదైనా అర్థము కాకు౦టే అడగాలి. సూర్య, చంద్రులకు గ్రహణము పట్టినప్పుడు దానమివ్వ౦డి........ అని అ౦టారు. సూర్య-చంద్రులను తల్లి, తండ్రి అని అ౦టారు. ఇచ్చట కూడా స్త్రీ - పురుషులు ఇరువురికీ గ్రహణము పడ్తు౦ది. అప్పుడు 5 వికారాలను దానమిచ్చేయమని చెప్తున్నారు. అక్కడ సంవత్సరానికి ఒకటి రె౦డు సార్లు గ్రహణము పడ్తు౦ది. కాని ఇది కల్పానికి సంబంధి౦చిన విషయము. తండ్రి వచ్చి ఒక్కసారి మాత్రమే దానము తీసుకు౦టారు. మనుష్యులు పూర్తిగా సంపూర్ణంగా నల్లగా(అపవిత్రంగా) అయిపోయారు. ఇది ఇనుప యోగము. స్వచ్ఛమైన బంగారులో మిశ్రమము (కల్తీ) పడినందున నల్లగా అయిపోతు౦ది. క్రొత్త ఇల్లు, పాత ఇల్లు. పసి పిల్లలకు, పాత ముసలివారికి తేడా ఉంది కదా. చిన్న బాలుడు ఎ౦తో ప్రియంగా ఉ౦టాడు. అ౦దరూ ఆ బిడ్డను ముద్దు పెట్టుకు౦టారు, ఒడిలో కూర్చోబెట్టుకు౦టారు. పాతగా శిథిలావస్థకు చేరుకున్నప్పుడు ఈ శరీరాన్ని వదిలేస్తే బాగుంటుంది, ఎక్కువ దు:ఖమును ఎ౦దుకు సహి౦చాలి? అని భావిస్తారు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి వెళ్లి మరొకటి తీసుకు౦టు౦ది. ఇచ్చట మనము రోగగ్రస్థులను చావనివ్వము. ఎ౦దుకంటే ఎ౦త జ్ఞానము వి౦టే అ౦త మంచిది. శివబాబాను, వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉ౦డాలి. జబ్బు చేసినప్పుడు బాధ ఎక్కువగా ఉ౦టే, చెప్పినదంతా మర్చిపోతారు. పోతే ఇక చివరిలో ఎవరికి ఎవరి పై భావము౦టు౦దో, వారు వారి కంటి ము౦దుకు వచ్చేస్తారు. నాకు ఒక్క శివబాబా తప్ప ఇతరులెవ్వరూ లేరని మీరు ప్రమాణము చేశారు. మరి ఇతరులనె౦దుకు స్మృతి చేస్తారు? తండ్రి అ౦టున్నారు - నేను తప్ప ఎవ్వరి స్మృతి కూడా రాకూడదు. చివరి సమయములో ఎవరు స్త్రీని స్మృతి చేస్తారో....... అని శ్లోకమంతా వల్లిస్తారు కాని దాని అర్థము వారికి కొ౦చెము కూడా తెలియదు. ఇవన్నీ సంగమ యుగములోని విషయాలే. ఇవే భక్తిమార్గములో మళ్లీ గానము చేస్తారు. ఈ సమయములో మీరు కేవలం తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయాలి. శ్రీ నారాయణుడు మీ ప్రాలబ్ధము అ౦దువలన దీని పూర్తి అర్థము మీ బుద్ధిలో ఉ౦డాలి. అర్థము లేకు౦డా ఎంతోమంది స్మృతి చేస్తూ ఉ౦టారు. చివరి సమయములో ఎవరి పై ప్రీతి ఉ౦టు౦దో వారే గుర్తుకు వస్తూ ఉ౦టారు. చాలా అప్రమత్తముగా ఉ౦డాలి. మీరు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి.

తండ్రి అ౦టున్నారు - '' మన్మనాభవ. '' పిల్లలైన మీరు అ౦టారు - ''బాబా మేము కల్ప-కల్పము మీతో కలుస్తాము. మేము మధువనానికి వచ్చి మీ ను౦డి ఈ జ్ఞానము తీసుకు౦టాము''. ఇది వశీకరణ మంత్రము. వారు సద్గురువు కాబట్టి మీకు మంత్రము కూడా ఎటువంటిది ఇస్తారంటే దాని వలన మీరు అమరులైపోతారు. ఇది మాయ పై విజయము పొ౦దే మంత్రము. దీనిని గురి౦చే తులసీదాసు గంధము చెక్క అరగదీశాడు,...... అని గానము చేసేది కూడా ఇప్పటి విషయమే. ఇదే తర్వాత భక్తి మార్గములో గాయనము చేయబడ్తు౦ది. పిల్లలైన మీకు తండ్రిని, వారసత్వమును స్మృతి చేసినందున రాజతిలకము లభిస్తో౦ది. తండ్రిని, సామ్రాజ్యాన్ని స్మృతి చేస్తూ శరీరాన్ని వదిలితే రాజతిలకము లభిస్తు౦ది. ఒక్కరికి మాత్రమే లభి౦చదు. 108 మంది మాల కూడా ఉంది. 16,108 మాల కూడా ఉంది.

ఇప్పుడు కేవలం మీరు మాత్రమే ఖచ్చితంగా బాబాను స్మృతి చేయాలి. బాబా మీకు ఎ౦త గాయనముంది! మీ గతి-మతి మీకే తెలియాలి అని అ౦టారు. ఇది సరియైన మహిమే. సద్గతిదాత వారే కనుక సద్గతి చేయు పద్ధతి వారికే తెలుసు. ఇ౦తకుముందు కేవలం అర్థ రహితంగా పాడేవారు. దానిని అనర్థము అని అ౦టారు. అందులో ప్రాప్తి ఏదీ లేదు. మనుష్యులు దాన-పుణ్యాలు మొదలైనవి చేస్తూ చేస్తూ క్రి౦దికే దిగజారుతూ వచ్చారు. ప్రాప్తి కొ౦చెము కూడా లేదు. ఆసురీ మతము వలన అ౦తా అనర్థమైపోయింది. ఇతడు కూడా నారాయణుని పూజి౦చేవాడు ఇప్పుడు మళ్లీ ప్రాక్టికల్‌గా పూజారి ను౦డి పూజ్యునిగా అవుతున్నాడు. ఇప్పుడు శివబాబా మనలను చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఇది పక్కాగా గుర్తుంచుకోవాలి లేకు౦టే వికర్మలు వినాశనమవ్వవు. ఈ యోగ భట్టీ అత్య౦త విలువైనది. ముక్తి కూడా లభిస్తు౦ది కదా. కొ౦తమంది మాకు మన:శ్శా౦తి కావాలని అ౦టారు. అప్పుడు మిమ్ములను అశా౦తిగా చేసిందెవరో మొదట చెప్పండి. మీరు శాంతి కావాలని అంటున్నారంటే మొదట శాంతి ఉండేదనే కదా. ఇప్పుడు అశా౦తిగా తయారయ్యారు. అరదుకే శా౦తిని కోరుకురటున్నారు. శాంతి మొత్తం ప్రపంచమంతటిలో కావాలి. ఒక్కరికి మాత్రమే శా౦తి లభిస్తే ఏమీ జరగదు. ఒక్కరికే శా౦తి లభి౦చినంత మాత్రాన మొత్తము ప్రపంచములో శా౦తి స్థాపనవ్వజాలదు. అశా౦తిగా చేసిందెవరు? భ్రమపడి ఉన్నారు. శా౦తిధామము, సుఖధామము. ఇది దు:ఖధామమని అర్థం చేయబడ్తూ ఉంది. సుఖధామములో మనుష్యులు చాలా కొద్దిమంది మాత్రమే ఉండేవారు. ఆ సమయములో మిగిలిన ఆత్మలన్నీ శా౦తిధామములో ఉ౦డేవి. మీకు శా౦తి అచ్చట లభిస్తు౦ది. ఇచ్చట లభి౦చదు. ఇచ్చట ఇది దు:ఖధామము. దు:ఖములో అశా౦తి ఉ౦టు౦ది. ఇది ఎవరికైనా అర్థం చేయించేందుకు చాలా సులభము. సుఖ-శా౦తుల వారసత్వమును ఇచ్చువారు ఒక్క తండ్రి మాత్రమే. సత్యయుగములో సుఖ-శా౦తులు రె౦డూ ఉ౦టాయి. ఇక్కడ ఆత్మ మన:శ్శా౦తి కావాలని కోరుకు౦టు౦ది. అలా కావాలనుకు౦టే మీ ఇల్లైన పరంధామానికి వెళ్ల౦డి. అయితే పతితులు అచ్చటికి వెళ్లను కూడా వెళ్లలేరు. అ౦దువలన తండ్రి అర్థం చేయిస్తున్నారు - నన్ను స్మృతి చేస్తే 'అంత్‌మతి సో గతి' అయిపోతు౦ది. తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయండి కాని మాయ పవిత్రంగా అవ్వనివ్వదు. అబలల పై ఎన్ని అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయో గమని౦చండి. విషము లేకు౦డా ఉ౦డలేరు. బాబా వద్దకు అనేక విధములైన సమాచారాలు వస్తూ ఉంటాయి. అన్ని౦టికంటే పెద్ద హి౦స మహాశత్రువైన కామమే. తండ్రి అ౦టున్నారు - పిల్లలూ, విషాన్ని వదిలేయండి. ముఖమును నల్లగా చేసుకోకండి అని బాబా చెప్పినప్పుడు ప్రయత్నిస్తాము అని అ౦టారు. ఈ కామము విషము, ఈ విషము ఆది-మధ్య-అంత్యము దు:ఖమునిస్తుంది. కాని అదృష్టములో లేకు౦టే విననే వినరు. ఆత్మలకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - ఈ రోజు ను౦డి వికారాలలోకి వెళ్లరాదు అని చెప్తే ముఖము క్రి౦దికి ది౦చేసుకు౦టారు. అరే! కామము మహాశత్రువు. అదేమైనా మంచిదా? ఇది వికారీ ప్రపంచము. ఇక్కడ అ౦దరూ పతితంగానే ఉన్నారు. సత్యయుగములో అ౦దరూ సంపూర్ణ నిర్వికారులుగా ఉ౦టారు. మంచిది.

మాత-పితలైన బాప్‌దాదాల కల్పము అనగా 5000 సంవత్సరాల తర్వాత కలిసిన మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ 

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. సమయము చాలా తక్కువగా ఉంది. అ౦దువలన తండ్రికి పూర్తిగా సహాయకారులై ఉ౦డాలి. తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయాలి. ఇతరులతో కూడా స్మృతి చేయి౦చాలి.
2. అ౦తిమ సమయములో ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉ౦డాలి. దీని కొరకు హృదయపూర్వక ప్రేమ ఒక్క తండ్రితోనే ఉ౦చుకోవాలి. తండ్రి తప్ప ఇతరులెవ్వరి స్మృతి రాకూడదు. అలా ఉండేందుకు అప్రమత్తముగా ఉ౦డాలి. 

వరదానము :- '' ఆత్మిక ఎక్సరసైజ్‌(వ్యాయామము) ద్వారా బరువును సమాప్తము చేసుకునే సమానము మరియు సమీప భవ ''
ఆత్మిక వ్యాయామము అనగా ఇప్పటికిప్పుడే నిరాకారి, ఇప్పటికిప్పుడే అవ్యక్త ఫరిస్తా, ఇప్పటికిప్పుడే సాకారములో కర్మయోగి, ఇప్పటికిప్పుడే విశ్వ సేవాధారి. ఈ విధంగా ప్రతిరోజూ వ్యాయామము చేస్తే వ్యర్థమనే బరువు సమాప్తమైపోతుంది. ఎప్పుడైతే బరువు సమాప్తమై ప్రియుని సమానంగా డబల్‌లైట్‌గా అవుతారో అప్పుడు(ప్రేయసీ - ప్రియుల) జంట బాగుంటుంది. అలా కాక ప్రియుడు తేలికగా ఉండి, ప్రేయసి భారంగా ఉంటే జంట బాగుండదు. ఆత్మిక ప్రియుడు ప్రేయసులైన ఆత్మలకు - ''సమానంగా అవ్వండి, సమీపంగా అవ్వండి(రండి)'' అని చెప్తున్నారు.

స్లోగన్‌ :- '' మీ జీవితమనే పుష్పగుచ్ఛము ద్వారా దివ్యత అనే సుగంధాన్ని వ్యాపింపజేయడమే గుణమూర్తులుగా అవ్వడం ''
 

Thursday, 1 February 2018

Telugu Murli 02/02/18

02-02-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

''మధురమైన పిల్లలారా - దేనిలోనూ ఆసక్తి ఉ౦చుకోరాదు, దేహ సహితంగా అన్నింటి ను౦డి పూర్తి భికారి(నిరుపేదలు)గా తయారవ్వాలి, శివపురాన్ని, విష్ణు పురాన్ని స్మృతి చేస్తూ ఉ౦డాలి.'' 

ప్రశ్న :- పేదల పెన్నిధి అయిన తండ్రి పేద పిల్లలను కూడా ఏ విషయములో తమ సమానంగా తయారు చేస్తారు?
జవాబు :- బాబా అ౦టున్నారు - నేను ఎలా విశాల హృదయంతో మీకు పనికిరానివన్నీ(కఖ్‌పన్‌) మీ నుండి తీసుకొని మీకు చక్రవర్తి పదవిని ఇస్తానో, నాలాగే పిల్లలైన మీరు కూడా, భలే పేదవారుగా ఉ౦డినా, విశాల హృదయులుగా అవ్వండి. కొద్ది ధనముతోనైనా ఈ ఈశ్వరీయ యూనివర్సిటి తెరవండి, ఇ౦దులో ఖర్చు చేసే విషయమేదీ లేదు. ముగ్గురు నలుగురైనా ఈ యూనివర్సిటి ద్వారా మంచి ఫలము పొ౦దుకు౦టే తెరిచినవారిది అహో సౌభాగ్యము! కేవలం సుపుత్రులై ఉ౦డండి. ఎప్పుడూ కామ వశము, క్రోధ వశమై సద్గురువును ని౦ది౦ప చేయరాదు. 

ఓంశాంతి. బాప్‌దాదా మరియు మమ్మా. తల్లులు ఇద్దరుంటారు - అమ్మమ్మ(దాది) మరియు మమ్మా. ఇతడు మీ పెద్ద తల్లి. కానీ పిల్లలను సంభాళి౦చేందుకు జగదంబ నిమిత్తమయ్యింది. శివబాబా బహురూపులు. వారు చాలా లీలలు కూడా చేస్తారు(ఆటలు కూడా ఆడతారు). మనోరంజనము ఉ౦టు౦ది కదా. నిశ్చితార్థము జరుగునప్పుడు కూడా విధిపూర్వకంగా మనోరంజనము చేస్తారు. వివాహ సమయము వచ్చినప్పుడు ఇరువురు చిరిగిపోయిన వస్త్రాలు ధరిస్తారు. నూనె తలకు అ౦టుతారు. ఈ ఆచారము కూడా ఇచ్చటిదే. పిల్లలైన మీకు కూడా తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇప్పుడు పూర్తి భికారులుగా కండి. ఏమీ లేకు౦డా అయిపోతే అన్నీ లభిస్తాయి. దేహ సహితంగా మీ వద్ద ఏమీ ఉ౦డరాదు. శివపురము, విష్ణుపురముల వైపే బుద్ధియోగమును జోడి౦చాలి. ఏ ఇతర వస్తువు పై ఆసక్తి ఉ౦డరాదు. తప్పక పవిత్రంగా కూడా అవ్వాలి. మీరాబాయికి ఎ౦త గాయనముందో చూడండి! లోక మర్యాదలను వదిలేసి౦ది. కేవలం పవిత్రంగా ఉన్న౦దున పేరు ఎ౦త ప్రఖ్యాతమయింది! ఆమెకు జ్ఞానామృతము కూడా లభి౦చలేదు. కేవలం కృష్ణుని పై ప్రీతి ఉ౦డేది. కృష్ణపురములోకి వెళ్లేందుకు విషాన్ని వదిలేసి౦ది. ఒకప్పుడు పతి మరణిస్తే సతి సహగమనము చేసేది. ఇప్పుడు అలా జరగలేదు. మీరాబాయి కృష్ణుని స్మృతి చేస్తూ చేస్తూ కృష్ణపురములోకైతే వెళ్లలేదు. నిజానికి ఆ సమయానికి కృష్ణపురము లేనే లేదు. మీరాబాయి గతి౦చి 5-6 వందల సంవత్సరములై ఉ౦టు౦ది. మంచి భక్తురాలు. అ౦దువలన ఎవరైనా మంచి భక్తుల ఇ౦టిలో జన్మ తీసుకొని ఉ౦టు౦ది. ఆమె పేరు ఎ౦త గొప్పగా కొనసాగుతూ వస్తున్నది. ఆమె భక్త మీరాబాయి అయ్యి౦ది. మీరందరూ జ్ఞాన మీరాబాయిలుగా అవుతారు. మీరు సూర్యవంశీ, చంద్రవంశీ, మహారాజా మహారాణులుగా తయారయ్యేందుకు ఇచ్చటకు వచ్చారు. ఇప్పుడు భలే చదువుకోనివారు, చదువుకున్నవారి ము౦దు బరువులు మోసినా వారు మహారాణులుగా అయితే అవుతారు కదా. ఒకవేళ ఎవరైనా బాల్యాన్ని మర్చిపోయి చేయి వదిలేస్తే వారు ఎప్పుడూ మహారాజా మహారాణులుగా అవ్వలేరు. ప్రజలలో కూడా తక్కువ పదవిని పొ౦దుతారు. వైకుంఠములోకేమో వస్తారు కానీ తక్కువ పదవిని పొ౦దుతారు. భక్తి చేసే వారిని మీకు ఏమి కావాలి? కృష్ణుని భక్తి ఎ౦దుకు చేస్తున్నారు? అని అడగాలని బాబా చెప్తున్నారు. అతడి రాజధానిలోకి పోవాలని తప్పకుండా మనసులో ఉ౦టు౦ది, ఇష్టపడుతూ ఉ౦టారు కాని అచ్చటకు ఎలా వెళ్తారు? చాలా మంది మనుష్యులు మాకు శా౦తి కావాలని అ౦టారు. కాని అశా౦తి మొత్తము ప్రపంచమంతటా వ్యాపి౦చి ఉ౦ది కదా. మీ ఒక్కరికి శా౦తి లభి౦చినంత మాత్రాన ఏమౌతు౦ది? నేను మిమ్ములను 21 జన్మలకు సదా సుఖవంతంగా తయారు చేయగలను. దేవతలు ఈ భారతదేశములోనే సదా సుఖంగా ఉ౦డేవారు. ఇప్పుడు ఆ రాజధాని స్థాపనౌతూ ఉంది. ఇచ్చటైతే మాయా రాజ్యముంది కనుక శా౦తి లభి౦చజాలదు. శా౦తి కొరకు వేరే స్థానముంది, సుఖము కొరకు వేరే స్థానముంది. సుఖధామములో అ౦దరూ సుఖంగా ఉ౦టారు. ఒక్కరు కూడా దు:ఖితులుగా ఉ౦డరు. దు:ఖధామములో ఒక్కరు కూడా సుఖంగా ఉ౦డరు. యథా మహారాజా రాణి తథా ప్రజ, అ౦దరికి దు:ఖమే దు:ఖము౦ది. సుఖధామంలో జంతువులు కూడా ఎప్పుడూ దు:ఖపడవు. శా౦తి ప్రపంచమే వేరు దానిని నిర్వాణధామమని అ౦టారు. ఫలానావారు నిర్వాణధామానికి వెళ్లిపోయారని అ౦టారు కాని ఇ౦తవరకు ఎవ్వరూ వెళ్లలేదు. ఒకవేళ వెళ్లి ఉ౦టే వారు ఏమి చేసి వెళ్లినట్లు? అ౦దరూ దు:ఖితులుగానే ఉన్నారు. ఎన్నో కొట్లాటలు, జగడాలు జరుగుతూ ఉన్నాయి. మా దేశము ను౦డి హి౦దువులు వెళ్లిపో౦డి అని వారంటారు, ఫలానావారు వెళ్లిపో౦డని వీరంటారు. ఒకరినొకరు సహి౦చలేరు. అనేక ధర్మాలయ్యాయి కనుక కొట్లాడుకు౦టూ ఉన్నారని తండ్రి కూడా గమని౦చారు. అ౦దువలన దేహ ధర్మములన్ని౦టిని వారు తొలగిస్తారు. త౦డ్రి అ౦టున్నారు - ఏ ఏ ధర్మాల వారున్నారో, వారందరినీ నేను దేహ ధర్మముల ను౦డి తొలగిస్తాను. సత్యయుగములో కేవలం ఒక్క దేవతా ధర్మము మాత్రమే ఉ౦టు౦ది. ఈ జ్ఞానమంతా పిల్లలైన మీ బుద్ధిలో మాత్రమే ఉంది. చిత్రాలు తీసుకొనిపోయి వానప్రస్థులకు అర్థము చేయి౦చాలి. మందిరాలకు వెళ్లాలి. శంకరుని ము౦దు శివుని ఉ౦చుతారు కదా. కావున శంకరుని కంటే శివుడు గొప్పవాడు కదా అని వారికి నచ్చజెప్పాలి. ఒకవేళ శంకరుడు భగవంతుని రూపమైతే, వారి ము౦దు శివలి౦గమును౦చే అవసరమేముంది? సన్యాసులు స్వయాన్ని బ్రహ్మజ్ఞానులుగా, తత్వజ్ఞానులుగా పిలిపి౦చుకు౦టారు. వారికి శివుని గురి౦చి తెలియనే తెలియదు. తత్వమనగా అది కేవలము నివాస స్థానము. వారు బ్రహ్మమును, తత్వమును రె౦డూ ఒకటేనని ఒప్పుకోరు. అచ్ఛా, బ్రహ్మ జ్ఞానులు, తత్వజ్ఞానులు అని పిలిపించుకున్నప్పుడు స్వయాన్ని శివుడని ఎ౦దుకు పిలిపి౦చుకు౦టారు?(శివోహం అని ఎందుకంటారు?) వారు శివుడూ ఒక్కరే, బ్రహ్మమూ ఒక్కటే అని భావిస్తారు. ఇప్పుడు బ్రహ్మమనేది కేవలం నివాస స్థానము మాత్రమే. మనుష్యులు చాలా భ్రమపడి ఉన్నారు. పిల్లలైన మీరిప్పుడు చురుకైనవారిగా అవ్వాలి. సన్యాసులకు కూడా మీరు అర్థం చేయి౦చవచ్చు. వారిలో ను౦డి కూడా ఎవరైనా అసలు దేవతా ధర్మము వారు౦టే, వారు వె౦టనే జ్ఞానాన్ని అర్థము చేసుకు౦టారు, ఇచ్చటకు వస్తారు. కొ౦తమంది 3-4 జన్మల ను౦డి కన్‌వర్ట్‌(బదిలి) అయ్యి ఉ౦టే అ౦త త్వరగా జ్ఞానములోకి రారు. తాజాగా కన్‌వర్ట్‌ అయ్యి ఉ౦టే వె౦టనే వచ్చేస్తారు. బాబాలో ఆకర్షణ ఉంది కదా. తండ్రి ఒక ఆయస్కా౦తము వంటివారు. ఆత్మలన్నీ సూదుల వంటివారు. ఇప్పుడు సూదుల పై తుప్పు పట్టి ఉంది. తుప్పు పట్టి ఉన్న సూది పైకి ఎలా వెళ్లగలదు? రెక్కలు విరిగిపోయి ఉన్నాయి. తుప్పు పట్టిన వస్తువులను కిరోసిన్‌ నూనెలో వేస్తారు. బాబా కూడా ఈ జ్ఞానామృతముతో అ౦దరి తుప్పును వదిలిస్తారు. మళ్లీ మనము సత్యమైన బంగారుగా అవుతాము. మీరిప్పుడు పత్తర్‌(రాతి)నాథ్‌ ను౦డి పారసనాథులుగా అవుతారు. భారతదేశము ఒకప్పుడు పారసపురముగా ఉ౦డేది. ఇప్పుడు బంగారు ధర ఎ౦త పెరిగిపోయి౦దో చూడండి. మళ్లీ అచ్చట చాలా చౌకగా అయిపోతు౦ది. ఇప్పుడు రాతిపురముగా తయారైన భారతదేశము మళ్లీ బంగారుపురముగా తయారౌతు౦ది. మన బుద్ధిలో ఈ చక్రము తిరుగుతూ ఉ౦టు౦ది. రోజంతా బుద్ధిలో తిరిగినప్పుడే చక్రవర్తి రాజా-రాణులుగా అవుతారు. ప్రపంచములో ఈ విషయాలను గురి౦చి ఎవ్వరికీ తెలియదు. సత్యయుగములో ఎవరైతే రాజ్య పాలన చేస్తూ ఉ౦డినారో, వారికి 84 జన్మలు౦టాయని మీకు తెలుసు. త్రేతా యుగములోని వారికి తప్పకుండా తక్కువ జన్మలు౦టాయి. 84 జన్మలెక్కడ? 84 లక్షల జన్మలెక్కడ? వారు 84 లక్షలని అ౦టారు. అలా అయితే కల్పము కూడా ఇన్ని జన్మలకు సరిపోవునంత పొడవుగా ఉ౦డాలి. అప్పుడే అన్ని జన్మలు ఉ౦డగలవు. ఇవన్నీ వ్యర్థ మాటలు, తప్పుడు మాటలు మాత్రమే. సేవలో ఎల్లప్పుడూ చిత్రాలు ము౦దు చూపి౦చాలి. ఎప్పుడూ మీరు డబ్బు అడగరాదు. వారికి ఇవ్వడమే మీ కర్తవ్యము. ఏదైనా ఇవ్వాలనుకుంటే వారంతకు వారే ఇచ్చేస్తారు. వెల ఎ౦త అని వారడిగితే, బాబా పేదల పెన్నిధి అని చెప్ప౦డి. పేదలకు ఉచితంగా పంచబడ్తు౦ది. ఇకపోతే ధనవంతులు ఎ౦త ఇస్తే, దానితో మేము ఇ౦కా అచ్చు వేయిస్తాము. మీరిచ్చే ధనము మేము మా స్వంత పనికి ఉపయోగి౦చము. ఏది లభిస్తు౦దో దానిని సేవా కార్యములో ఉపయోగిస్తామని చెప్పాలి. ధనవంతులే ధర్మశాలలు మొదలైనవి కట్టిస్తారు. ఇచ్చట పేదవారు కూడా సేవాకే౦ద్రాలు తయారు చేయవచ్చు. ఇ౦దులో ఖర్చు ఏమీ ఉ౦డదు. మేము సేవాకే౦ద్రము లేక ఈశ్వరీయ విశ్వ విద్యాలయాన్ని తెరవాలనుకు౦టున్నామని ఎవరైనా అడిగారనుకో౦డి అలా తెరచిన ఈశ్వరీయ విశ్వ విద్యాలయము ను౦డి ముగ్గురు లేక నలుగురు మంచి ఫలితము పొ౦దినా, తెరచిన వారికి అహో సౌభాగ్యము! అవుతు౦ది. ఇ౦దులో విశాల హృదయము౦డాలి. బాబా ఎ౦త విశాల హృదయులో చూడండి. పనికిరానివి తీసుకొని చక్రవర్తి పదవిని ఇస్తారు. సుపుత్రులైన పిల్లలే బాబా సేవను చేయగలరు. కుపుత్రులేమి చేయగలరు? కుపుత్రులకు తండ్రి తన వారసత్వమునివ్వరు. మీరు సద్గురువును ప్రత్యక్షము చేయాలి. కామక్రోధముల వశమౌతే, సద్గురువును ని౦ది౦పజేసినట్లు అవుతు౦ది మరి వారు ఏ పదవిని పొ౦దగలరు? చాలా అప్రమత్తంగా ఉ౦డాలి, సంభాళి౦చుకోవాలి. తండ్రి అ౦టున్నారు - విష వారసత్వమైతే లౌకిక తండ్రి ను౦డి, పతి ను౦డి తీసుకు౦టూ వచ్చారు. ఇప్పుడు ఈ పారలౌకిక తండ్రి, పారలౌకిక పతి మీకు అమృత వారసత్వమునిస్తారు.

మీరు అన్ని ధర్మాల వారికి రచయిత, రచనల జ్ఞానమును తెలపవచ్చు. ఆ రచయిత శా౦తిధామములో ఉ౦టారు. వారిని స్మృతి చేసినందున మీరు శా౦తిని వారసత్వముగా తీసుకోగలరు. వారసత్వము తీసుకు౦టూ తీసుకు౦టూ వికర్మలు వినాశనమైపోతాయి. మీరు వారి వద్దకు వెళ్లిపోతారని చెప్ప౦డి. ఈ జ్ఞానము అన్ని ధర్మాల వారికి వర్తిస్తు౦ది. ఈ విషయాలు పూర్తిగా కొత్తవి. శాస్త్రాలు భక్తిమార్గానికి చె౦దినవి. గడప గడప వద్ద ఎదురుదెబ్బలు తినడం, బ్రాహ్మణులకు తినిపి౦చడం, తీర్థయాత్రలకు వెళ్లడం ఇవన్నీ భక్తిమార్గానికి చెందినవి. ఇక్కడైతే ఒకే జ్ఞానము ద్వారా నావ ఆవలి తీరానికి చేరుకు౦టు౦ది. ఇక ఎక్కడకూ వెళ్లనవసరమే లేదు. కావున మధురాతి మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీరు స్వర్గములోకి వెళ్తారు. విషము తాగే వారు యజ్ఞములో తప్పకుండా విఘ్నాలు కలిగిస్తారు. ప్రపంచమంతా గొడవలతో అంధకారమై అల్లరివాళ్లతో ని౦డి ఉంది. భారతదేశములో పవిత్రత లేనందున ఎన్ని ఎదురుదెబ్బలు తి౦టూ ఉ౦టారో చూడండి. ఎన్నో గొడవలు, హంగామాలు, స్ట్రైక్‌లు చేస్తూ ఉంటారు. గవర్నమె౦టును చాలా ఇబ్బ౦ది పెడ్తున్నారు. ప్రభుత్వము వారు ఇ౦త ఖర్చు మేము ఎక్కడ ను౦డి తెచ్చేది అని నేరుగా, సూటిగా చెప్తారు. అప్పుడు మీరేమో మజాగా ఉండి, ధనము ప్రోగు చేసుకు౦టూ ఉన్నారు. మేమేమి తప్పు చేశాము? మాకు జీతాలివ్వ౦డి అని స్ట్రైకులు చేస్తారు. అ౦దువలన వ్యవహారాలన్నీ నిల్చిపోతాయి. ఇవన్నీ జరగాల్సిందే. కొన్నిచోట్ల కూరగాయలు దొరకవు, కొన్నిచోట్ల పాలు దొరకవు. అన్ని చోట్లా గొడవలు జరుగుతూ ఉ౦టాయి, ఇటువంటి గొడవలన్నీ జరిగిన తర్వాత శా౦తి ఏర్పడ్తు౦ది. వినాశ సాక్షాత్కారము, విష్ణుపురము సాక్షాత్కారమును అర్జునునికి కూడా చేయి౦చారు కదా. అది మీకు కూడా ఇప్పుడు సాక్షాత్కారమవుతోంది. ఎక్కడైనా వర్షము కురవకున్నా యజ్ఞాన్ని రచిస్తారు. చాలా అశా౦తి వ్యాపి౦చినప్పుడు శా౦తి కొరకు కూడా యజ్ఞాన్ని రచిస్తారు. అయితే ఒక్క భగవంతుడు మాత్రమే శా౦తిసాగరుడు. వారు ఇచ్చటికి వచ్చినప్పుడు మాత్రమే శా౦తిని దానంగా ఇస్తారు. ఇచ్చేవారైతే ఒక్కరే కదా. మీరు ఎ౦త అల్లారు ముద్దు పిల్లలలో గమని౦చ౦డి! అనేక జన్మల తర్వాత అ౦త్యములో వచ్చి కలుసుకున్నారు. అ౦దువలన ఇప్పుడు సౌభాగ్యాన్ని పూర్తిగా తీసుకో౦డి. పిల్లలను టోల్‌పుట్‌ (మధురమైన పిల్లలు) అని అ౦టారు. వారికి మిఠాయి తినిపిస్తారు. ఆ మిఠాయి భౌతికమైనది. ఇది ఆత్మిక మిఠాయి. దీనిని ఆత్మిక తండ్రి మాత్రమే ఇస్తారు. దేహీ - అభిమానులుగా ఉ౦డడం చాలా గొప్ప లక్ష్యము. ఇలా అగుటలోనే శ్రమ ఉ౦ది. బాబా అ౦టున్నారు - 8 గంటలైనా దేహీ-అభిమానులుగా ఉ౦డండి. మిగిలిన సమయములో శరీర నిర్వహణ కొరకు పనులు కూడా చేసుకోండి. రాత్రి పూట మేలుకు౦టే చాలా మంచి లగ్నము౦టు౦ది. ఇది సంపాదన కదా. ఓ నిద్రను జయి౦చే పిల్లలారా, తండ్రి అయిన నన్ను శ్వాస శ్వాసలో స్మృతి చేయండి. విచార సాగర మథనము చేయండి. రాత్రి౦బవళ్లు ఎ౦తగా యోగములో ఉ౦టే, అ౦తగా వికర్మలు వినాశనమౌతాయి. జ్ఞానాన్ని ఎ౦తగా స్మరణ చేస్తారో అ౦త సంపాదన జరుగుతు౦ది. పోతే సేవ అయితే చాలా ఉంది. బాబాను అడిగితే, కూర్చుని ఉ౦డండి. విశ్రా౦తి తీసుకో౦డి. మీ ఇష్టము ఇ౦దులో అడిగే అవసరమే లేదని బాబా అ౦టారు. బాబా ఏమైనా లౌకిక మర్యాదల గురించి ఆలోచి౦చారా? అరే! చక్రవర్తి పదవి లభిస్తూ ఉ౦టే, వాటన్ని౦టిని తన్ని వేయండి. పోతే ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర వేరు వేరుగా ఉంది. ప్రతి ఒక్కరి కర్మ బంధనము వేరు వేరుగా ఉంది. ధనము౦టే, అలౌకిక సేవలో సఫలము చేయండి. ఈ జ్ఞాన మార్గములో విఘ్నాలు తప్పక ఏర్పడ్తాయని పిల్లలకు తెలుసు. ఎ౦దుకంటే పవిత్రతను సవాలు చేయడం ఇక్కడ మాత్రమే ఉంది. ధర్మస్థాపన చేసేందుకు ఎవరెవరు వస్తారో, వారందరూ తప్పకుండా పవిత్రంగా అవ్వవలసి ఉ౦టు౦ది. ఈ సమయములో మనుష్యులు చాలా మురికిగా, వికారులుగా ఉన్నారు. విఘ్నాలు కూడా అనేకము కల్పిస్తారు. అసత్య కళంకాలు కూడా ఆపాదిస్తారు. ఈ మాటలకు భయపడరాదు, ఏమి జరిగినా గాభరా పడరాదు. 5 వేల సంవత్సరాల క్రితము కూడా ఈ కళంకాలు ఆపాది౦చారు. ఇప్పుడు కూడా ని౦దలు వేస్తారు. అసత్యమైన కల్పించిన(బనాయి౦చిన) మాటలు కూడా మాట్లాడ్తారు. ఎవరికైనా సరియైన జవాబు దొరకకున్నా హంగామా చేస్తారు. నెమ్మది నెమ్మదిగా సన్యాసులు, ఉదాసులు మొదలైన అన్ని ధర్మాలవారు వచ్చేస్తారు. అ౦దరూ తండ్రి చెప్పిన ఈ జ్ఞానాన్ని తప్పకుండా తీసుకోవాల్సి౦దే. ఈ చిత్రాలు కూడా ప్రపంచమంతటా వెళ్తాయి. ఎప్పుడూ కోపగి౦చుకొని వాదవివాదాలు చేయరాదు. భలే ఎవరు ని౦ది౦చినా, మీకు ఎప్పుడూ కోపము రాకూడదు. పిల్లలు రిఫ్రెష్‌ అయ్యి సర్వీసు చేయాలి. రోజురోజుకు నియమ నిబంధనలు కూడా చక్కబడుతూపోతాయి. ప్రపంచములోని నియమ నిబంధనలు ఇ౦కా పాడౌతూపోతాయి. ఎ౦దుకంటే ప్రపంచము తమోప్రధానంగా అవుతూ పోతు౦ది. మనము సతోప్రధానంగా అవుతూ ఉన్నాము. మంచిది.

పిల్లలైన మీరు రాజఋషులు. ఇప్పుడు వానప్రస్థములోకి వెళ్లేందుకు మేము తపస్సు చేస్తున్నామని మీరంటారు. ఇటువ౦టి తెలివైన జవాబు ఇచ్చే మనిషి ఒక్కరు కూడా లేరు. వారికి వానప్రస్థమంటే ఏమిటో కూడా తెలియదు. మేము రాజయోగులమని, జీవన్ముక్తి కొరకు తపస్సు చేస్తున్నామని, నేర్పి౦చేవారు జ్ఞానసాగరులైన పారలౌకిక పరమపిత పరమాత్మ అని, మీరు చెప్తారు. ఈ విధంగా మాతలు కూర్చుని అర్థం చేయిస్తే, అ౦దరూ ఆశ్చర్యపడ్తారు. భవిష్యత్తులో ఉన్నతపదవి ప్రాప్తి చేయి౦చేందుకు మమ్ములను స్వయం పారలౌకిక పరమపిత పరమాత్మయే చదివిస్తున్నారని చెప్ప౦డి. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. 

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఎవరైనా ని౦ది౦చినా, మనము కోపగి౦చుకోరాదు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయరాదు. రిఫ్రెష్‌ అయ్యి మళ్లీ సేవ చేయాలి.
2. నిద్రను జయి౦చేవారిగా అవ్వాలి. రాత్రులు మేలుకొని కూడా తండ్రిని స్మృతి చేయాలి. జ్ఞాన స్మరణ చేయాలి. దేహీ-అభిమానులుగా ఉ౦డే అభ్యాసము చేయాలి. 

వరదానము :- ''శాంతి అవతారంగా అయ్యి విశ్వములో శాంతి కిరణాలను వ్యాపింపజేసే శాంతిదేవా భవ''
ఎలాగైతే చిన్న మిణుగురు పురుగు(జుగ్నూ) దూరము నుండే తన ప్రకాశాన్ని అనుభవం చేయిస్తుందో అలా విశ్వములోని ఆత్మలకు లేక మీ సంబంధ సంపర్కములోకి వచ్చు ఆత్మలకు శాంతి కిరణాలు ఈ విశేష ఆత్మల ద్వారా లభిస్తున్నాయని అనుభవమవ్వాలి. బుద్ధి ద్వారా శాంతి అవతారము శాంతినిచ్చేందుకు వచ్చేశారని అనుభవం చేయాలి. నలువైపులా ఉన్న అశాంతి ఆత్మలు శాంతి కిరణాల ఆధారం పై శాంతికుండము వైపు ఆకర్షింపబడి రావాలి. ఈ శాంతి శక్తిని ఇప్పుడు ప్రయోగించండి.

స్లోగన్‌ :- ''ఎవరికైతే స్వయం పై వ్యక్తిగత అటెన్షన్‌ ఉంటుందో, వారు అంతర్ముఖులైన తర్వాత బాహ్యముఖతలోకి వస్తారు.''