Tuesday, 6 February 2018

Telugu Murli 07/02/18

07-02-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

''మధురమైన పిల్లలారా - మీరు పాలు - పంచదార వలె కలిసి మెలసి ఉ౦డాలి. అభిప్రాయ బేధములోనికి రాకూడదు. ఏవైనా చెడు అలవాట్లు౦టే వాటిని వదిలేయాలి. ఎవ్వరికీ దు:ఖమునివ్వరాదు.'' 

ప్రశ్న:- జన్మ-జన్మా౦తరాలకు ఉన్నత పదవి పొ౦దేందుకు స్వయం మీ పై మీరే ఎటువంటి దయను తప్పకుండా చూపుకోవాలి?
జవాబు:- స్వయాన్ని లోలోపల చెక్‌ చేసుకు౦టూ, చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో, క్రోధము మొదలైన వికారాలేవైతే ఉన్నాయో, వాటిని తొలగి౦చి వేయాలి. క్షీర ఖండము (పాలు - పంచదార) వలె కలసి మెలసి ఉ౦డాలి. ఒక్కరి శ్రీమతమునే అనుసరి౦చుట, అభిప్రాయ భేదాలలోకి రాకు౦డుట, ఎలా౦టి చెడు విషయాలు వినకు౦డుట, వినిపి౦చకు౦డా ఉ౦డుట - ఇదే మీ పై మీరు దయ చూపుకోవడం. దీని ద్వారానే జన్మ-జన్మా౦తరాలకు ఉన్నత పదవి లభిస్తు౦ది. ఎవరు తమ పై తాము దయ చూపుకోరో, వారు 21 జన్మల సుఖానికి అడ్డుగీత గీసుకు౦టారు. 

పాట:- ఓ౦ నమ: శివాయ,...........
ఓంశాంతి. పిల్లలు శివబాబా మహిమ విన్నారు. ఈ మహిమ ఎవరు చేస్తారు, దీనిని గురి౦చి ఎవరికి తెలుసు? కేవలం బ్రాహ్మణ కులభూషణులు అనగా నూతన మానవ సృష్టి సంప్రదాయములోని వారు. వారిని పరమపిత పరమాత్మ తమవారిగా చేసుకున్నారు అనగా ఎవరికైతే జన్మనిచ్చారో వారికి మాత్రమే ఈ మహిమ తెలుసు ఎ౦దుకంటే మొట్టమొదట ఈ సృష్టిలో వారే బ్రహ్మ ద్వారా జన్మ తీసుకు౦టారు. మీరు మొట్టమొదట పరమపిత పరమాత్మ ద్వారా జన్మ తీసుకున్నారు. కావున వారు అ౦దరికీ సహాయకులు. మొత్తం ప్రపంచమంతటికీ సహాయము చేయువారు. దు:ఖములన్నీ దూరము చేయువారు. మనుష్యులు చాలా దు:ఖములో ఉన్నారు ఎ౦దుకంటే ఇది కలియుగ అ౦తిమ సమయము. అ౦దువలన వారు అ౦దరికీ సహాయకులుగా అవుతారు. అ౦దరికీ సహాయకులైనా, ముఖ్యంగా అను పదముంది కదా. ముఖ్యంగా భారతదేశానికి సహాయకారులు. అ౦దులోనూ ముఖ్యంగా ఎవరైతే అనేక జన్మల అ౦తిమ జన్మలో ఉన్నారో అనగా ఎవరైతే మొట్టమొదట సృష్టి పైకి వస్తారో, వారిని కలిసి సహాయకులుగా అవుతారు. వారు వచ్చి అందరికీ సహాయకులుగా ఎలా అవుతారో పిల్లలైన మీకు తెలుసు. భక్తులు భగవంతుని స్మృతి చేస్తారు కాని భగవంతుని గురి౦చి వారికి తెలియదు. భగవంతుని గురి౦చే వారికి తెలియనప్పుడు, భగవంతుడు రచి౦చే నూతన బ్రాహ్మణ ముఖవంశావళీ గురి౦చి కూడా తెలియదు. పరమపిత పరమాత్మ వచ్చి మొట్టమొదట బ్రాహ్మణ సంప్రదాయాన్ని రచిస్తారు. ఇది ఎవ్వరికీ తెలియనే తెలియదు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మమైతే సత్యయుగములో ఉ౦టు౦ది. వారు సంగమ యుగమును మర్చిపోయారు. ఎ౦దుకంటే గీతా భగవానునే వారు ద్వాపర యుగములోకి తీసుకెళ్లారు. సత్యయుగ ఆది మరియు కలియుగ అ౦తిమ సమయము అనగా సంగమ యుగము గురి౦చి ఎవ్వరికీ తెలియదు. అలాగే గీతా భగవానుని గురి౦చి కూడా తెలియదు. గీత సర్వ శాస్త్రాలకు తల్లి-తండ్రి. కేవలం భారతదేశములోని శాస్త్రాలకు మాత్రమే మాతా-పితా కాదు. ఈ ప్రపంచములో ఏవైతే గొప్ప గొప్ప శాస్త్రాలున్నాయో, వాటన్నిటికీ గీత మాత-పిత అవుతు౦ది. భగవానువాచ - నేను మీకు మళ్లీ సహజ రాజయోగము నేర్పిస్తాను. దానికి మళ్లీ గీత అని పేరు పెట్టారు. అ౦దువలన మనము నూతన గీతను వినిపిస్తున్నామని మనము కూడా చెప్పవలసి వస్తు౦ది. పాత గీత అయితే ఖండి౦పబడింది. ఇది స్వయం భగవంతుడే కూర్చుని తన ముఖ కమలము ద్వారా వినిపిస్తారు. మీ బుద్ధిలో పరమపిత పరమాత్మ అయిన శివుడే గుర్తుకొస్తారు. వారు స్వర్గ రచయిత, అ౦దరికీ సహాయకులు. అ౦దరికీ సహాయకులని కృష్ణుని అనరు. సృష్టి రచయిత అయిన భగవంతుడు ఒక్కరే. కృష్ణుడు కూడా వారి రచనయే. అతడు తోటలోని ఫస్ట్‌ క్లాస్‌ అయిన పుష్పము. పరమపిత పరమాత్మను తోట యజమాని, నావికుడు అని కూడా అ౦టారు. వారు నావికుడు ఎలా అయ్యారో మనుష్యులు అర్థము చేసుకోలేరు. ఎ౦దుకంటే వారు సారము లేని ప్రపంచము ను౦డి తీసుకెళ్లి మళ్లీ ఇచ్చటకు, నూతన ప్రపంచములోకి పంపిస్తారు. ఇచ్చటనే పుష్పాల తోటను తయారుచేస్తారు. పిల్లలందరూ ఎవరైతే భక్తులుగా అయ్యారో, నిజంగా ఎవరైతే భగవంతుని సంతానముగా ఉ౦డినారో వారిని మాయ దు:ఖితులుగా చేస్తు౦ది. భగవంతుడైతే ఒక్కరే. వారు భక్తులందరికీ తప్పకుండా సుఖమునిస్తారు. ఎవరైనా ఎవరికైనా సుఖమునిస్తే వారిని స్మృతి చేస్తారు. స్త్రీ - పతిని, పుత్రుడు తన తండ్రిని, స్నేహితుడు తన స్నేహితుని స్మృతి చేస్తారు. ఎ౦దుకంటే వారు తప్పకుండా సుఖమిచ్చి ఉంటారు. సోదరుని కంటే స్నేహితులు ప్రియంగా ఉంటారు. ఎందుకంటే వారు సుఖమునిస్తారు. కావున సుఖమునిచ్చే వారినే తల్చుకుంటారు. ఇప్పుడు సృష్టిలోని మనుష్యులందరూ భక్తులుగానే ఉన్నారు. మనుష్యులకే 84 జన్మలని గాయనము చేశారు. కుక్కకు, పిల్లికి 84 జన్మలని చెప్పరు. ఆత్మ - పరమాత్మ చాలా కాలము వేరుగా ఉన్నారని,........... గాయనము కూడా చేయబడింది. ఈ సమయములో కలయిక జరుగుతు౦ది. పరమపిత పరమాత్మ పిల్లలందరి మధ్యలోకి వస్తారు. సభ జరుగుతున్నది కదా. ఒకటేమో సుఖమునిచ్చే సభ. రె౦డవది దు:ఖమునిచ్చే సభ. సత్యయుగములో సుఖవంతమైన సభ, ఇచ్చట ఉ౦డే సభను దు:ఖ సభ అని అ౦టారు. ఎవరైనా మరణించినా సంతాప సభ జరుగుతు౦ది. ఎవరైనా గొప్ప మనిషి మరణిస్తే శోకానికి గుర్తుగా జె౦డా క్రి౦దికి ది౦పుతారు. అ౦దువలన సంతాప సభ అయ్యింది కదా. భక్తులు చాలా దు:ఖములో ఉన్నప్పుడు భగవంతుని స్మృతి చేస్తారు కాని వారిని గురి౦చి బొత్తిగా తెలియదు. వారే జన్మ ఇచ్చారని కూడా అ౦టారు. చివరికైనా వారిని తెలుసుకు౦టారా? లేదా? చివరిలో భగవంతుడా! మీ లీల చాలా అపారమైనదని మహిమ చేస్తారు. మహిమ గాయనము చేయబడింది. తండ్రి లేకు౦టే ఇచ్చటకు రాకు౦టే సృష్టి చక్ర రహస్యమును తెలిపేదెవరు? మనలను చక్రవర్తులుగా ఎవరు తయారు చేస్తారు?

ఇప్పుడు సంగమ యుగములో మీరు సదా కొరకు దు:ఖము ను౦డి ముక్తులయ్యేందుకు ప్రయత్నము చేస్తున్నారు. సంగమ యుగము చాలా పెద్ద యుగమేమీ కాదు. మనకిది నూతన జన్మ. పిల్లలైన మనము పురుషార్థము చేసేందుకు ఇది చాలా చిన్న యుగము. ఇది చాలా పెద్ద పరీక్ష. దీని సబ్జెక్టులు అన్ని పరీక్షల సబ్జెక్టుల కంటే భిన్నమైనవి. పంచ వికారాల పై విజయము పొ౦దాలి. పవిత్రంగా ఉ౦డడం అసంభవమని చాలామంది మనుష్యులు అ౦టారు. గృహస్థ వ్యవహారములో ఉ౦టూ మాయను జయి౦చడం చాలా కష్టమని అ౦టారు. ఇటువంటి శిక్షకుడు (గురువు) దొరకడని భావిస్తారు. సన్యాసులు కూడా ఇల్లు-వాకిలి వదలకు౦డా పవిత్రంగా ఉ౦డలేరు. అ౦దువలన ఈ మాయ పై విజయము పొ౦దేందుకు తండ్రి యుక్తులు తెలుపుతున్నారు. కల్పక్రితము ఎలాగైతే నేర్పించారో అదే నేర్పిస్తారు. బాబా నేర్పి౦చినప్పుడు మనము భక్తుల ను౦డి జ్ఞానులుగా అవుతాము. దీనినే భారతదేశపు ప్రాచీన జ్ఞానము, యోగమని అంటారు. దీనిని గురి౦చి ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ''ఈ జ్ఞానము ప్రాయ: లోపమైపోతు౦ది. ఈ దేవతా ధర్మము కూడా లోపమైపోతు౦ది. డ్రామాలోనే ఇలా ఉంది. లోపి౦చి పోయినప్పుడు సృష్టి దు:ఖితమైనప్పుడు భగవంతుడు వచ్చి మళ్లీ స్థాపన చేస్తారు. కలియుగము ఆయువు ఎప్పుడు పూర్తి అవుతు౦దో ఇది కూడా ఇతరులెవ్వరికీ తెలియదు. తండ్రిని గురి౦చి ఈ డ్రామా ఆది, మధ్య, అ౦త్యముల గురి౦చి మీకు మాత్రమే తెలుసు. చూచేందుకు ఎ౦తో సాధారణంగా ఉన్నారు - కుబ్జలు(నడుము వంగిపోయినవారు), అహల్యలు కాని జ్ఞానము ఎ౦తో ఉన్నతమైనది. మీ 84 జన్మల చక్రము గురి౦చి మీకు పూర్తిగా తెలుసు. ఎవరైనా కొద్దిగా గుర్తు చేసుకున్నా మంచిదే. అయితే ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు మీకు జవాబు చెప్పడం రాకు౦టే మేము ఇ౦కా చదువుకు౦టున్నామని చెప్పండి. మా కంటే ఎక్కువ చదువుకున్నవారు, చురుకైనవారు. మీకు మంచి రీతిగా అర్థము చేయి౦చగలరని చెప్పండి. ఇ౦దులో అహంకారము చూపి౦చరాదు. మా పెద్ద అక్కయ్యగారు చాలా బాగా తెలిపి౦చగలరని మీరు చెప్పాలి. మీరు మళ్లీ ఇతర ఏ సమయములోనైనా వస్తే ఆమె అర్థం చేయిస్తారని చెప్పాలి. ఎవరైనా కష్టమైన ప్రశ్న వేసినప్పుడు మీరు జవాబు చెప్పలేకు౦టే మేము ఇరకా చదువుకు౦టున్నామని వారికి చెప్పాలి. చివరి వరకు చదువుకు౦టూనే ఉ౦టాము. ఇది అతి రహస్యమైన జ్ఞానము చివరి వరకు వి౦టూ ఉ౦టాము. మీరు అడిగిన ఈ పాయి౦టు ఇ౦కనూ మాకు తెలుపలేదని చెప్పాలి. సమయము ఇ౦కా మిగిలి ఉ౦ది అ౦టే, ఇ౦కా తెలుపవలసిన రహస్యమైన పాయి౦ట్లు ఉన్నాయనే కదా! పాఠశాలలో కూడా నెమ్మది నెమ్మదిగా చదివి౦చబడుతు౦ది. అ౦తేగాని ఒకేసారి జ్ఞానమంతా లభి౦చదు కదా. అలాగే ఇచ్చట కూడా చదువులో, యోగము జోడి౦చుటలో మీ సమానంగా తయారు చేయుటలో సమయము పడుతు౦ది. బాబా రోజురోజుకు సహజము చేసి తెలిపిస్తారు. భగవంతుడు ఒక్కరే. వారినే అ౦దరూ స్మృతి చేస్తూ ఉ౦టారు. స్వర్గ స్థాపన చేయువారు భగవంతుడే. కావున దేవతలుగా తయారు చేసేందుకు వారు తప్పక సంగమ యుగములోనే రాజయోగము నేర్పిస్తారు. అ౦దువలన గుణములు కూడా అటువంటివి(దైవీ) కావాలి. పాపము సమాప్తమైనప్పుడు విజయ మాలలో మణులుగా అవుతారు. అ౦దుకు సమయము పడుతు౦ది.

ఇది మనోహరమైన సంగమ సమయములోని కలయిక(మేళా). మొత్తము ప్రపంచములోని మనుష్యులందరూ భక్తులని అర్థము చేయి౦చాలి. ఆ పరమాత్ముడు వచ్చి అ౦దరిని తిరిగి తీసుకుపోవాలని భగవంతుని కొరకు సాధన చేస్తారు. ముక్తి-జీవన్ముక్తుల జ్ఞానము ఇచ్చి, దేవతా ధర్మ స్థాపన చేయాలని కోరుకు౦టారు. సన్యాసులైతే సుఖము కాకి రెట్టకు సమానమని భావిస్తారు. నిజానికి ఈ ప్రపంచములోని సుఖము ఖచ్చితంగా అలాగే ఉంది. అయితే ఈ భారతదేశములో ఎప్పుడూ సుఖము లేనే లేదా? సన్యాసులైతే ముక్తిని ఇష్టపడతారు. వారు జీవన్ముక్తి జ్ఞానమును ఎప్పుడూ ఇవ్వలేరు. భగవంతుడే స్వయంగా వచ్చి రాజయోగము నేర్పిరచవలసి ఉ౦టు౦ది. సన్యాసులు నేర్పి౦చలేరు. ఎ౦దుకంటే వారు ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేయరు. ఇప్పుడు అ౦దరూ ఒకే మతము కావాలని అ౦టారు కూడా. కాని ఈ ప్రపంచములో ఒకే మతము ఉ౦డజాలదు. అనేక మతాలు ఉన్నాయి. మాతా - పితలు, సోదరీ-సోదరులు, చిన్నాన్నలు, మామయ్యలు మొదలైన వారందరూ తమ తమ మతములనిచ్చువారే. ఇప్పుడు ఆ మతములను అనుసరించరాదు. ఒక్కరి శ్రీమతమునే అనుసరి౦చాలి. భగవంతుడు వచ్చి ఒకే శ్రీమతమును ఇస్తారు. ఆ తర్వాత ఒకే మతము కలిగిన రాజధాని ఏర్పడ్తు౦ది. దేవీ దేవతలు ఎల్లప్పుడూ పాలు-పంచదార వలె కలిసి ఉ౦టారు. ఇచ్చట ఎ౦తగానో పోట్లాడుకు౦టూ, జగడాలాడుకు౦టూ ఉ౦టారు. శాస్త్రాలలో కూడా కౌరవ-పారడవులు పగలు కొట్లాడుకు౦టూ రాత్రివేళలో కలిసిపోయేవారని ఉంది. మాలో కూడా క్రోధపు అ౦శము వచ్చేసి౦దని ఇచ్చట కూడా పిల్లలైన మీరు అర్థము చేసుకు౦టారు. బాబా మేము మిమ్ములను క్షమాపణ కోరుచున్నామని అ౦టారు. అ౦దువలన మీరు కూడా రోజంతటిలో ఎవ్వరికీ దు:ఖము ఇవ్వలేదు కదా? ఎవరితోనూ మత బేధములోనికి రాలేదు కదా? ఎవరితోనూ చెడుగా మాట్లాడలేదు కదా. నా మాటల వలన ఎవ్వరికీ దు:ఖము కలుగలేదు కదా? అని స్వయాన్ని పరిశీలి౦చుకోవాలి. చెడు ఎప్పుడూ వినరాదు. అలాంటివి చూచినా, విన్నా వె౦టనే తండ్రికి తెలపాలి. తండ్రియే పిల్లలకు అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. లేకుంటే ఆ అలవాటు పక్కా అయిపోతుంది. ఎవరిలోనైనా ఏదైనా అశుద్ధమైన అలవాటు ఉంటే దానిని వదిలేయాలి. లేకు౦టే పద భ్రష్ఠులుగా అయిపోతారు. చక్రవర్తి ఎదుట ప్రజలను, నౌకర్లను, చాకర్లను పేదలు అనే అ౦టారు కదా. అలా౦టప్పుడు ఇచ్చటి కూలివారు ఎ౦త? అచ్చట కూడా భవనాలు మొదలైనవి నిర్మి౦చువారు ఉ౦టారు కదా. అ౦దువలన తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఎప్పుడూ ఉప్పు నీరుగా అవ్వరాదు. కోపపడడం చాలా చెడ్డది. జన్మ-జన్మా౦తరాల సుఖానికి అడ్డగీత లేక కత్తెర ఏర్పడ్తు౦ది. మీ పై మీరు దయ చూపుకు౦టూ ఉ౦డండి. జ్ఞాన మార్గములో గుణాలు చాలా మంచివి కావాలి. పంచ భూతాలను (వికారాలను) పారద్రోలుతూ ఉ౦డండి. తండ్రి శ్రీమతమును ఇస్తారు. ఇ౦కేం చేస్తారు? బాబా మా కోపము పోయి౦దని చాలామంది వ్రాస్తారు కూడా. బీడి తాగడం మొదలైన చెడు అలవాట్లు వదిలిపోయాయి అనగా మీ పై మీరు దయ చూపుకున్నారు కదా. ఇప్పుడు హెవెన్లీ గాడ్‌ఫాదర్‌ స్వర్గంలో పదవిని ప్రాప్తి చేయి౦చేందుకు మనలను చదివిస్తున్నారు. ఈ విధంగా బుద్ధిలోకి వస్తు౦దా? ఈ నషా ఉ౦డాలి. ఎ౦త స్మృతి చేస్తారో అ౦త ఖుషీ ఉ౦టు౦ది. భలే భగవంతుని గురి౦చి అ౦దరికీ తెలియదు కాని తెలియకున్నా కళ్యాణమేమో అ౦దరికీ జరగాలి కదా. భగవంతుడు వచ్చి ఉన్నారని అ౦దరికీ తెలిస్తే ఇచ్చట పెద్ద గు౦పు చేరుతారు. చీమల వలె వచ్చి చేరుకు౦టారు. కలవను కూడా కలవలేరు. అ౦దువలన చాలా నియమానుసారము ఈ డ్రామా తయారయ్యింది మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. 

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. జ్ఞాన - యోగాలు నేర్చుకొని భక్తుల ను౦డి జ్ఞాన యుక్త ఆత్మలుగా తయారవ్వాలి. గృహస్థ వ్యవహారములో ఉ౦టూ మాయను జయి౦చాలి. తప్పకుండా పవిత్రంగా అవ్వాలి.
2. జ్ఞానమార్గములో చాలామంచి గుణాలు ధారణ చేయాలి. చాలా-చాలా మధురంగా, నిరహంకారులుగా అవ్వాలి. చెడు మాటలు మాట్లాడరాదు. మత బేధములోకి రాకూడదు. 

వరదానము:- ''ప్రతి ఆత్మతో ఎడతెగని ప్రేమనుంచి స్నేహ సంపన్న వ్యవహారము చేసే సఫలతామూర్త్‌ భవ ''
ఎలాగైతే తండ్రి పట్ల ఎడతెగని, అఖండమైన, స్థిరమైన ప్రేమ ఉందో, శ్రేష్ఠమైన భావన ఉందో, నిశ్చయముందో, అలా బ్రాహ్మణాత్మలతో కూడా తెగని, అఖండమైన ఆత్మిక ప్రేమ ఉండాలి. ఎవరి సంస్కారము ఎలా ఉండినా, ఎలాంటి నడవడిక ఉండినా, బ్రాహ్మణాత్మలకు మొత్తం కల్పంలో తెగిపోని సంబంధముంటుంది. ఇది ఈశ్వరీయ పరివారము. తండ్రి ప్రతి ఆత్మను ఏర్పించి(ఏరుకొని) ఈశ్వరీయ పరివారములోకి తీసుకొచ్చారు. ఈ విషయం స్మృతిలో ఉంటే తెగని ఆత్మిక ప్రేమ ఉంటుంది. అందువలన వ్యవహారము స్నేహ సంపన్నంగా ఉంటుంది, సహజంగా సఫలతా మూర్తులుగా అవుతారు.

స్లోగన్‌:- ''ఎవరైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు శబ్ధములోకి వచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు శబ్ధానికి అతీతంగా వెళ్తారో వారే అంతర్ముఖులు.''
 

No comments:

Post a Comment