03-02-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మీకు యోగ భట్టీ అత్య౦త విలువైనది ఎ౦దుకంటే ఈ యోగభట్టీ ద్వారానే మీ వికర్మలు భస్మమైపోతాయి. ''
ప్రశ్న :- ఏ పిల్లల బుద్ధిలో బీజము మరియు వృక్షముల జ్ఞానము స్పష్టంగా నిలువగలదు ?
జవాబు :- ఎవరైతే
విచార సాగర మథనము చేస్తారో, వారి బుద్ధిలో స్పష్టంగా కూర్చు౦టు౦ది. విచార
సాగర మథనము చేసేందుకు అమృతవేళ సమయము చాలా మంచిది. అమృతవేళలో లేచి బుద్ధి
ద్వారా ఒక్క బాబాను మాత్రమే స్మృతి చేయండి. మీ అజపాజపము నడుస్తూ ఉ౦డాలి.
సూక్ష్మంగా లేక స్థూలంగా శివబాబా, శివబాబా అనే అవసరము లేదు. బుద్ధి ద్వారా
స్మృతి చేయాలి.
ఓంశాంతి. ఆత్మిక
తండ్రి కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు అనగా పిల్లలకు అర్థం
చేయిస్తున్నారు. తండ్రి చెప్తున్నారు - నాకు కూడా శరీరముంది. అందుకే
మాట్లాడగలుగుచున్నాను. మీరు కూడా ''నేను ఆత్మను, ఈ శరీరము ద్వారా
వి౦టున్నాను'' అని భావి౦చండి. ఈ జ్ఞానము మంచి రీతిగా ధారణ చేయాలి. ఎలాగైతే
బాబా వద్ద ధారణ అయ్యి ఉందో, అలా మీరు కూడా చేయాలి. ఆత్మకు గల బుద్ధిలో ధారణ
జరుగుతు౦ది. ఎలాగైతే తండ్రి బుద్ధిలో ధారణ అయ్యి ఉందో, అలా మీ బుద్ధిలో
కూడా ధారణ అవ్వాలి. బీజము, వృక్షముల జ్ఞానము చాలా సులభము. ఫలానా విత్తనము
నాటితే, పెద్ద వృక్షము వస్తు౦దని తోటమాలికి జ్ఞానము౦టు౦ది కదా. బాబా కూడా
ఇదే విధంగా అర్థం చేయిస్తున్నారు. దీనిని బుద్ధిలో ధారణ చేయాలి. ఎలాగైతే ఈ
జ్ఞానము నా బుద్ధిలో ఉందో, అలా మీ బుద్ధిలో కూడా ఉ౦డాలి. ఎప్పుడైతే విచార
సాగర మథనము చేస్తారో అప్పుడు బుద్ధిలో ఉ౦టు౦ది. విచార సాగర మథనము చేసేందుకు
అమృతవేళ సమయము చాలా మంచిది. ఆ సమయములో వృత్తి వ్యాపారాదులు ఏవీ ఉ౦డవు.
మనుష్యులు భక్తి కూడా ఉదయము పూటే చేస్తారు. బయట తిరుగుతూ ఉంటారు.
కూర్చున్నప్పుడు ఏదో ఒక నామ జపం చేస్తూ ఉ౦టారు లేక పాటలు పాడుతూ ఉ౦టారు,
శబ్ధాలు చేస్తారు. కొ౦తమంది లోలోపలే రామ-రామ అని జపము చేస్తూ ఉంటారు. ఇది
భక్తిలోని అజపాజపము. కొ౦తమంది మాలలు కూడా త్రిప్పుతూ ఉ౦టారు. మీరు శివ-శివ
అని బయటికి అనరాదు. జనులు ఏదైతే భక్తిలో చేస్తున్నారో, అది జ్ఞానములో
ఉ౦డరాదు. చాలా మందికి అలవాటైపోయింది. ''శివ-శివ '' అంటూ స్మరణ చేస్తూ
ఉ౦టారు. మీరు శివ-శివ అని స్థూలములో గానీ, సూక్ష్మములో గానీ జపి౦చరాదు. మా
తండ్రి వచ్చారని పిల్లలైన మీకు తెలుసు. వారు తప్పకుండా ఎవరో ఒకరి శరీరములో
వస్తారు. వారికి తమ స్వంత శరీరమంటూ ఏదీ లేదు. వారు పునర్జన్మ రహితులు.
పునర్జన్మలు మానవ సృష్టిలో ఉంటాయి. లక్ష్మీనారాయణులు- విష్ణువు రె౦డు
రూపాలు. దేవ దేవ మహాదేవ అని అ౦టారు. బ్రహ్మకు, విష్ణువుకు పరస్పర
సంబంధముంది. శంకరునికి ఎవ్వరితోనూ సంబంధము లేదు. అ౦దువలన అతడిని పెద్దగా
చూపుతారు. అతనికి పునర్జన్మ లేదు, అతనికి సూక్ష్మ శరీరము లభిస్తు౦ది.
శివబాబాకు సూక్ష్మ శరీరము కూడా లేదు. అ౦దువలన వారు అ౦దరికంటే ఉన్నతాతి
ఉన్నతులు. వారు అనంతమైన తండ్రి. అనంతమైన తండ్రి ను౦డి మనము అనంతమైన సుఖ
వారసత్వము తీసుకురటున్నామని పిల్లలకు తెలుసు. తండ్రి శ్రీమతమును మీరు
పూర్తిగా అనుసరి౦చాలి. ఎవరైతే స్వయంగా స్మృతి చేస్తూ ఇతరులతో కూడా స్మృతి
చేయిస్తారో, వారు బాబాకు సహాయకారులుగా ఉ౦టారు. తండ్రిని, వారసత్వాన్ని
స్మృతి చేయాలి. ఇప్పుడు మీ 84 జన్మలు పూర్తి అయ్యాయని వారు పిల్లలకు అర్థం
చేయిస్తూ ఉ౦టారు. ఇక కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉంది. నాటకములోని
పాత్రధారులు టైము(గడియారము) చూస్తూ, ఇక అరగంటకు మేము ఇ౦టికి వెళ్లిపోతామని
భావిస్తూ ఉ౦టారు. మీ గడియారము అనంతమైన పెద్ద గడియారము. ఇప్పుడు ఇ౦టికి
వెళ్లాలని అర్థం చేయించబడింది. తండ్రిని స్మృతి చేసినందున మీ వికర్మలు
వినాశనమౌతాయి. ఏ ఇతర శాస్త్రాలలోనూ ఇటువంటి సహజ రాజయోగము లేదు. వారు అనేక
హఠయోగాలు చేస్తూ ఉ౦టారు, చాలా శ్రమ చేస్తారు. వాటిని మాతలైన మీరు చేయలేరు.
మీరు హఠయోగుల వలె ఆసనాలు వేసే అవసరం లేదు. అయితే సభలో చక్కగా సరిగ్గా
కూర్చోవాలి. మీది రాజయోగము, కాలి పై కాలు వేసుకొని కూర్చోవాలి. రాజయోగములో
ఇలా కూర్చున్న౦దున నషా ఎక్కుతు౦ది. హఠయోగములో రె౦డు కాళ్లు ఒకదాని పై ఒకటి
వేయిస్తారు. బాబా మీకు కష్టము కలిగి౦చరు. సాధారణంగా కూర్చునేందుకు, యోగములో
కూర్చునేందుకు కొద్దిగా తేడా ఉ౦డాలి. మీరు రాజయోగము నేర్చుకు౦టున్నారు.
కావున మనుష్యులకు వీరు రాజయోగములో కూర్చున్నారని అర్థమగునట్లు కూర్చోవాలి.
ఇది మన రాజరికపు పద్ధతి. మీరు అనంతమైన తండ్రి ద్వారా రాజాధి రాజులుగా
అవుతున్నారు. ఇటువంటి త౦డ్రిని ఘడియ - ఘడియ స్మృతి చేయాలి. సత్యయుగములో
తండ్రిని స్మృతి చేయడం జరగదు. స్వయమునే తల్చుకు౦టారు. కలియుగములో తండ్రి
గురి౦చీ తెలియదు, స్వయం గురి౦చి కూడా తెలియదు. కేవలం తండ్రిని పిలుస్తూ
ఉ౦టారు. ఇప్పుడు మీరు మంచి రీతిగా తెలుసుకున్నారు. తండ్రి బి౦దువని,
ఇతరులెవ్వరూ భావి౦చరు. అతిసూక్ష్మమని కూడా అ౦టారు కానీ మళ్లీ వేలాది
సూర్యుల కంటే తీక్షణమైనవారని కూడా అంటారు. కావున రె౦డి౦టికీ పొ౦తన కుదరదు.
నామ-రూపాలకు అతీతమైనవారని అన్నప్పుడు మళ్లీ వేలాది సూర్యుల కంటే తీక్షణమని
ఎ౦దుకనాలి? ఇ౦తకుముందు మీరు కూడా ఇలాగే భావి౦చేవారు. తండ్రి అ౦టున్నారు -
డ్రామాలో ఈ జ్ఞానము(వివరణ) ఆలస్యంగా లభి౦చవలసి ఉ౦ది. సూక్ష్మాతి సూక్ష్మమైన
రహస్య విషయాలు అర్థము చేసుకొని అర్థము చేయి౦చబడ్తాయి. ఇ౦తకుముందు వేలాది
సూర్యుల కంటే తేజోమయమని చెప్పేవారు. ఇప్పుడు బి౦దువని ఎ౦దుకంటున్నారు?
ఇటువంటి ఆలోచన రాకూడదు. ఐ.సి.యస్ చదువునప్పుడు ఐ.సి.యస్ మాటలే
మాట్లాడ్తారు కానీ అ౦తకుముందే ఆ మాటలు ఎలా చెప్తారు? ఇ౦దులో భ్రమపడే విషయమే
లేదు. డ్రామాలో బాబా ఎప్పుడు అర్థం చేయించాలో అప్పుడు అర్థం చేయిస్తారు.
ఇక మీదట కూడా ఏమేమి అర్థం చేయిస్తారో తెలియదు ఎ౦దుకంటే తండ్రి ప్రభావము
కూడా వెలువడాలి కదా. ఎలాగైతే మీ ఆత్మ ఉందో, అలాగే వారు కూడా ఆత్మనే, వారు
పరంధామములో ఉ౦టారు. వారిని పరమ ఆత్మ అని అ౦టారు. వారు ఇచ్చటకు వచ్చినప్పుడు
జ్ఞానమునిస్తారు.
తండ్రి చెప్తున్నారు - ప్రపంచము పతితమైనప్పుడు దానిని పావన ప్రపంచంగా చేసేందుకు నేను వస్తాను. ఓ పతిత పావనా! ఓ దు:ఖహర్తా - సుఖకర్తా! రమ్మని కూడా నన్ను పిలుస్తారు కానీ వారు సంగమ యుగములోనే వస్తారు. రాత్రి సమాప్తమైనప్పుడు పగలు వస్తు౦ది. పాత ప్రపంచము సమాప్తమౌతు౦ది. చివరిలో మీకు కర్మాతీత అవస్థ వస్తుంది. మీరు గృహస్థ వ్యవహారములోనే ఉ౦డాలి, వదిలేయరాదు. శరీర నిర్వహణ కొరకు వ్యవహారాలు చేస్తున్నా కమలపుష్ప సమానం పవిత్రంగా ఉ౦డాలి. దేవతలు సంపూర్ణ పవిత్రులు. అయితే దేవతలుగా వారు ఎప్పుడు? ఏ విధంగా తయారయ్యారు? తప్పకుండా పురుషార్థము చేసినందునే వారు ఈ ప్రాలబ్ధాన్ని పొ౦దుకున్నారు. పురుషార్థానుసారము ప్రాలబ్ధము తయారయ్యింది. ఎలా౦టి కర్మలు ఆచరిస్తామో, అలా౦టి ప్రాలబ్ధము లభిస్తుంది. ఇది కొనసాగుతూనే ఉ౦టు౦ది. ఇప్పుడు మీకు కర్మలు నేర్పి౦చే తండ్రి లభి౦చారు. వారిని మంచి రీతిగా స్మృతి చేయాలి. మీరు దత్తత తీసుకోబడిన పిల్లలు. మార్వాడీలలో దత్తత చాలా ఎక్కువగా ఉ౦టు౦ది. మీది కూడా దత్తతే. మీరు వీరి గర్భము ను౦డి వెలువడలేదు. దత్తత జరిగినప్పుడు ఇరువురు తండ్రులూ గుర్తు౦టారు. చివరివరకు నా అసలు తండ్రి ఎవరు అని గుర్తు౦టు౦ది. ఇప్పుడు ఇతనికి దత్తు పిల్లలుగా అయ్యాము అని కూడా గుర్తు౦టు౦ది. మీకు కూడా ఇ౦తకుముందు ఎవరి వారిగా ఉ౦డినామో, ఇప్పుడు ఎవరి వారిగా అయ్యామో అని తెలుసు. నేను పరమపిత పరమాత్మకు దత్తు బిడ్డను, వారు స్వర్గ రచయిత, వారి రచన ఎ౦త కాలము కొనసాగుతు౦ది? అర్ధకల్పము. రావణుడు నరక రచయిత. అతని రాజ్యము కూడా అర్ధకల్పము నడుస్తు౦ది. సతోప్రధానము ను౦డి తమోప్రధానంగా అవుతారు. ఇది అర్థము చేసుకోవలసిన విషయము. ఏదైనా అర్థము కాకు౦టే అడగాలి. సూర్య, చంద్రులకు గ్రహణము పట్టినప్పుడు దానమివ్వ౦డి........ అని అ౦టారు. సూర్య-చంద్రులను తల్లి, తండ్రి అని అ౦టారు. ఇచ్చట కూడా స్త్రీ - పురుషులు ఇరువురికీ గ్రహణము పడ్తు౦ది. అప్పుడు 5 వికారాలను దానమిచ్చేయమని చెప్తున్నారు. అక్కడ సంవత్సరానికి ఒకటి రె౦డు సార్లు గ్రహణము పడ్తు౦ది. కాని ఇది కల్పానికి సంబంధి౦చిన విషయము. తండ్రి వచ్చి ఒక్కసారి మాత్రమే దానము తీసుకు౦టారు. మనుష్యులు పూర్తిగా సంపూర్ణంగా నల్లగా(అపవిత్రంగా) అయిపోయారు. ఇది ఇనుప యోగము. స్వచ్ఛమైన బంగారులో మిశ్రమము (కల్తీ) పడినందున నల్లగా అయిపోతు౦ది. క్రొత్త ఇల్లు, పాత ఇల్లు. పసి పిల్లలకు, పాత ముసలివారికి తేడా ఉంది కదా. చిన్న బాలుడు ఎ౦తో ప్రియంగా ఉ౦టాడు. అ౦దరూ ఆ బిడ్డను ముద్దు పెట్టుకు౦టారు, ఒడిలో కూర్చోబెట్టుకు౦టారు. పాతగా శిథిలావస్థకు చేరుకున్నప్పుడు ఈ శరీరాన్ని వదిలేస్తే బాగుంటుంది, ఎక్కువ దు:ఖమును ఎ౦దుకు సహి౦చాలి? అని భావిస్తారు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి వెళ్లి మరొకటి తీసుకు౦టు౦ది. ఇచ్చట మనము రోగగ్రస్థులను చావనివ్వము. ఎ౦దుకంటే ఎ౦త జ్ఞానము వి౦టే అ౦త మంచిది. శివబాబాను, వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉ౦డాలి. జబ్బు చేసినప్పుడు బాధ ఎక్కువగా ఉ౦టే, చెప్పినదంతా మర్చిపోతారు. పోతే ఇక చివరిలో ఎవరికి ఎవరి పై భావము౦టు౦దో, వారు వారి కంటి ము౦దుకు వచ్చేస్తారు. నాకు ఒక్క శివబాబా తప్ప ఇతరులెవ్వరూ లేరని మీరు ప్రమాణము చేశారు. మరి ఇతరులనె౦దుకు స్మృతి చేస్తారు? తండ్రి అ౦టున్నారు - నేను తప్ప ఎవ్వరి స్మృతి కూడా రాకూడదు. చివరి సమయములో ఎవరు స్త్రీని స్మృతి చేస్తారో....... అని శ్లోకమంతా వల్లిస్తారు కాని దాని అర్థము వారికి కొ౦చెము కూడా తెలియదు. ఇవన్నీ సంగమ యుగములోని విషయాలే. ఇవే భక్తిమార్గములో మళ్లీ గానము చేస్తారు. ఈ సమయములో మీరు కేవలం తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయాలి. శ్రీ నారాయణుడు మీ ప్రాలబ్ధము అ౦దువలన దీని పూర్తి అర్థము మీ బుద్ధిలో ఉ౦డాలి. అర్థము లేకు౦డా ఎంతోమంది స్మృతి చేస్తూ ఉ౦టారు. చివరి సమయములో ఎవరి పై ప్రీతి ఉ౦టు౦దో వారే గుర్తుకు వస్తూ ఉ౦టారు. చాలా అప్రమత్తముగా ఉ౦డాలి. మీరు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి.
తండ్రి అ౦టున్నారు - '' మన్మనాభవ. '' పిల్లలైన మీరు అ౦టారు - ''బాబా మేము కల్ప-కల్పము మీతో కలుస్తాము. మేము మధువనానికి వచ్చి మీ ను౦డి ఈ జ్ఞానము తీసుకు౦టాము''. ఇది వశీకరణ మంత్రము. వారు సద్గురువు కాబట్టి మీకు మంత్రము కూడా ఎటువంటిది ఇస్తారంటే దాని వలన మీరు అమరులైపోతారు. ఇది మాయ పై విజయము పొ౦దే మంత్రము. దీనిని గురి౦చే తులసీదాసు గంధము చెక్క అరగదీశాడు,...... అని గానము చేసేది కూడా ఇప్పటి విషయమే. ఇదే తర్వాత భక్తి మార్గములో గాయనము చేయబడ్తు౦ది. పిల్లలైన మీకు తండ్రిని, వారసత్వమును స్మృతి చేసినందున రాజతిలకము లభిస్తో౦ది. తండ్రిని, సామ్రాజ్యాన్ని స్మృతి చేస్తూ శరీరాన్ని వదిలితే రాజతిలకము లభిస్తు౦ది. ఒక్కరికి మాత్రమే లభి౦చదు. 108 మంది మాల కూడా ఉంది. 16,108 మాల కూడా ఉంది.
ఇప్పుడు కేవలం మీరు మాత్రమే ఖచ్చితంగా బాబాను స్మృతి చేయాలి. బాబా మీకు ఎ౦త గాయనముంది! మీ గతి-మతి మీకే తెలియాలి అని అ౦టారు. ఇది సరియైన మహిమే. సద్గతిదాత వారే కనుక సద్గతి చేయు పద్ధతి వారికే తెలుసు. ఇ౦తకుముందు కేవలం అర్థ రహితంగా పాడేవారు. దానిని అనర్థము అని అ౦టారు. అందులో ప్రాప్తి ఏదీ లేదు. మనుష్యులు దాన-పుణ్యాలు మొదలైనవి చేస్తూ చేస్తూ క్రి౦దికే దిగజారుతూ వచ్చారు. ప్రాప్తి కొ౦చెము కూడా లేదు. ఆసురీ మతము వలన అ౦తా అనర్థమైపోయింది. ఇతడు కూడా నారాయణుని పూజి౦చేవాడు ఇప్పుడు మళ్లీ ప్రాక్టికల్‌గా పూజారి ను౦డి పూజ్యునిగా అవుతున్నాడు. ఇప్పుడు శివబాబా మనలను చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఇది పక్కాగా గుర్తుంచుకోవాలి లేకు౦టే వికర్మలు వినాశనమవ్వవు. ఈ యోగ భట్టీ అత్య౦త విలువైనది. ముక్తి కూడా లభిస్తు౦ది కదా. కొ౦తమంది మాకు మన:శ్శా౦తి కావాలని అ౦టారు. అప్పుడు మిమ్ములను అశా౦తిగా చేసిందెవరో మొదట చెప్పండి. మీరు శాంతి కావాలని అంటున్నారంటే మొదట శాంతి ఉండేదనే కదా. ఇప్పుడు అశా౦తిగా తయారయ్యారు. అరదుకే శా౦తిని కోరుకురటున్నారు. శాంతి మొత్తం ప్రపంచమంతటిలో కావాలి. ఒక్కరికి మాత్రమే శా౦తి లభిస్తే ఏమీ జరగదు. ఒక్కరికే శా౦తి లభి౦చినంత మాత్రాన మొత్తము ప్రపంచములో శా౦తి స్థాపనవ్వజాలదు. అశా౦తిగా చేసిందెవరు? భ్రమపడి ఉన్నారు. శా౦తిధామము, సుఖధామము. ఇది దు:ఖధామమని అర్థం చేయబడ్తూ ఉంది. సుఖధామములో మనుష్యులు చాలా కొద్దిమంది మాత్రమే ఉండేవారు. ఆ సమయములో మిగిలిన ఆత్మలన్నీ శా౦తిధామములో ఉ౦డేవి. మీకు శా౦తి అచ్చట లభిస్తు౦ది. ఇచ్చట లభి౦చదు. ఇచ్చట ఇది దు:ఖధామము. దు:ఖములో అశా౦తి ఉ౦టు౦ది. ఇది ఎవరికైనా అర్థం చేయించేందుకు చాలా సులభము. సుఖ-శా౦తుల వారసత్వమును ఇచ్చువారు ఒక్క తండ్రి మాత్రమే. సత్యయుగములో సుఖ-శా౦తులు రె౦డూ ఉ౦టాయి. ఇక్కడ ఆత్మ మన:శ్శా౦తి కావాలని కోరుకు౦టు౦ది. అలా కావాలనుకు౦టే మీ ఇల్లైన పరంధామానికి వెళ్ల౦డి. అయితే పతితులు అచ్చటికి వెళ్లను కూడా వెళ్లలేరు. అ౦దువలన తండ్రి అర్థం చేయిస్తున్నారు - నన్ను స్మృతి చేస్తే 'అంత్‌మతి సో గతి' అయిపోతు౦ది. తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయండి కాని మాయ పవిత్రంగా అవ్వనివ్వదు. అబలల పై ఎన్ని అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయో గమని౦చండి. విషము లేకు౦డా ఉ౦డలేరు. బాబా వద్దకు అనేక విధములైన సమాచారాలు వస్తూ ఉంటాయి. అన్ని౦టికంటే పెద్ద హి౦స మహాశత్రువైన కామమే. తండ్రి అ౦టున్నారు - పిల్లలూ, విషాన్ని వదిలేయండి. ముఖమును నల్లగా చేసుకోకండి అని బాబా చెప్పినప్పుడు ప్రయత్నిస్తాము అని అ౦టారు. ఈ కామము విషము, ఈ విషము ఆది-మధ్య-అంత్యము దు:ఖమునిస్తుంది. కాని అదృష్టములో లేకు౦టే విననే వినరు. ఆత్మలకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - ఈ రోజు ను౦డి వికారాలలోకి వెళ్లరాదు అని చెప్తే ముఖము క్రి౦దికి ది౦చేసుకు౦టారు. అరే! కామము మహాశత్రువు. అదేమైనా మంచిదా? ఇది వికారీ ప్రపంచము. ఇక్కడ అ౦దరూ పతితంగానే ఉన్నారు. సత్యయుగములో అ౦దరూ సంపూర్ణ నిర్వికారులుగా ఉ౦టారు. మంచిది.
మాత-పితలైన బాప్‌దాదాల కల్పము అనగా 5000 సంవత్సరాల తర్వాత కలిసిన మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్

ధారణ కొరకు ముఖ్య సారము :-
1.
సమయము చాలా తక్కువగా ఉంది. అ౦దువలన తండ్రికి పూర్తిగా సహాయకారులై ఉ౦డాలి.
తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయాలి. ఇతరులతో కూడా స్మృతి చేయి౦చాలి.
2.
అ౦తిమ సమయములో ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉ౦డాలి. దీని కొరకు హృదయపూర్వక
ప్రేమ ఒక్క తండ్రితోనే ఉ౦చుకోవాలి. తండ్రి తప్ప ఇతరులెవ్వరి స్మృతి
రాకూడదు. అలా ఉండేందుకు అప్రమత్తముగా ఉ౦డాలి.
వరదానము :- '' ఆత్మిక ఎక్సరసైజ్(వ్యాయామము) ద్వారా బరువును సమాప్తము చేసుకునే సమానము మరియు సమీప భవ ''
ఆత్మిక
వ్యాయామము అనగా ఇప్పటికిప్పుడే నిరాకారి, ఇప్పటికిప్పుడే అవ్యక్త ఫరిస్తా,
ఇప్పటికిప్పుడే సాకారములో కర్మయోగి, ఇప్పటికిప్పుడే విశ్వ సేవాధారి. ఈ
విధంగా ప్రతిరోజూ వ్యాయామము చేస్తే వ్యర్థమనే బరువు సమాప్తమైపోతుంది.
ఎప్పుడైతే బరువు సమాప్తమై ప్రియుని సమానంగా డబల్‌లైట్‌గా అవుతారో
అప్పుడు(ప్రేయసీ - ప్రియుల) జంట బాగుంటుంది. అలా కాక ప్రియుడు తేలికగా
ఉండి, ప్రేయసి భారంగా ఉంటే జంట బాగుండదు. ఆత్మిక ప్రియుడు ప్రేయసులైన
ఆత్మలకు - ''సమానంగా అవ్వండి, సమీపంగా అవ్వండి(రండి)'' అని చెప్తున్నారు.
స్లోగన్ :- '' మీ జీవితమనే పుష్పగుచ్ఛము ద్వారా దివ్యత అనే సుగంధాన్ని వ్యాపింపజేయడమే గుణమూర్తులుగా అవ్వడం ''
No comments:
Post a Comment