Thursday, 18 January 2018

Telugu Murli 14/01/18

14-01-2018 అవ్యక్త బాప్‌దాదా ఓంశాంతి రివైజ్‌: 19-04-1983 మధువనము 

''సంగమయుగములోని ప్రభు ఫలాన్ని తినడం వలన కలిగే సర్వ ప్రాప్తులు''
ఈ రోజు బాప్‌దాదా తన సర్వ స్నేహీ పిల్లలకు స్నేహానికి బదులు ఇవ్వడానికి, మిలనం చేసేందుకు, స్నేహానికి ప్రత్యక్ష ఫలం, స్నేహ భావనకు శ్రేష్ఠ ఫలాన్ని ఇచ్చేందుకు పిల్లల సంఘటనలోకి వచ్చారు. భక్తిలో కూడా స్నేహం మరియు భావన భక్త-ఆత్మల రూపంలో ఉండేది. కనుక భక్తుల రూపంలో భక్తి ఉండేది కానీ శక్తి ఉండేది కాదు. స్నేహం ఉండేది కానీ తండ్రి పరిచయం మరియు తండ్రితో సంబంధం శ్రేష్ఠంగా ఉండేవి కాదు. భావన ఉండేది కానీ అల్పకాలిక కోరికలతో నిండిన భావన ఉండేది. ఇప్పుడు కూడా స్నేహం మరియు భావన ఉంది కానీ స్నేహం సమీప సంబంధం ఆధారంతో ఉంది. అధికారీతనపు శక్తి ఉంది, అనుభవం అధారిటీతో శ్రేష్ఠ భావన ఉంది. భికారీ తనపు భావన మారి, సంబంధం మారి, అధికారిననే నిశ్చయం మరియు నశా పెరిగింది. ఇటువంటి శ్రేష్ఠ ఆత్మలకు సదా ప్రత్యక్ష ఫలం ప్రాప్తించింది. అందరూ ప్రత్యక్ష ఫలాన్ని అనుభవము చేసిన అనుభవీ ఆత్మలుగా ఉన్నారా? ప్రత్యక్ష ఫలం తిని చూశారా? ఇతర ఫలాలు అయితే సత్యయుగంలో కూడా లభిస్తాయి ఇప్పుడు కలియుగం యొక్క ఫలాలు కూడా చాలా తిన్నారు. కానీ సంగమ యుగంలోని ప్రభు ఫలము, ప్రత్యక్ష ఫలము ఇప్పుడు తినకపోయినట్లయితే మొత్తం కల్పంలో ఎప్పుడూ తినలేరు. బాప్‌దాదా పిల్లలందరినీ అడుగుతున్నారు - ప్రభుఫలం, అవినాశీ ఫలం అయిన సర్వ శక్తులు, సర్వ గుణాలు, సర్వ సంబంధాల స్నేహ రసంతో నిండిన ఫలం తిన్నారా? అందరూ తిన్నారా లేక ఎవరైనా మిగిలిపోయారా? ఇది ఈశ్వరీయ ఇంద్రజాలపు ఫలము. ఈ ఫలాన్ని తింటే ఇనుము నుండి బంగారము కంటే ఎక్కువ వజ్రంగా తయారైపోతారు. ఈ ఫలంతో ఏ సంకల్పము చేస్తే అది ప్రాప్తి చేసుకోగలరు. ఇది అవినాశీ ఫలం, అవినాశీ ప్రాప్తి. ఇలాంటి ప్రత్యక్ష ఫలం తినేవారు సదా మాయ రోగాల నుండి ఆరోగ్యంగా ఉంటారు. దు:ఖం నుండి, అశాంతి నుండి, సర్వ విఘ్నాల నుండి సదా దూరంగా ఉండే అమర ఫలం లభించింది! తండ్రివారిగా అవ్వడం మరియు ఇలాంటి శ్రేష్ఠ ఫలము ప్రాప్తించడం. ఇది ఎంత అద్భుతం!

ఈ రోజు బాప్‌దాదా ఇప్పుడు వచ్చిన విశేష పాండవ సైన్యాన్ని చూసి హర్షితమైతే అవుతున్నారు. హర్షితమవ్వడంతో పాటు బ్రహ్మాబాబా సహచరులతో(హంజిన్స్‌తో) సదా పార్టీ చేసుకుంటారు. పిక్నిక్‌ కూడా జరుపుకుంటారు. కావున ఈ రోజు ఈ ప్రభు ఫలంగా పిక్నిక్‌ జరుపుతున్నారు. లక్ష్మీ-నారాయణులు కూడా ఇటువంటి పిక్నిక్‌ జరుపుకోరు. ఇది బ్రహ్మాబాబా మరియు బ్రాహ్మణుల అలౌకిక పిక్నిక్‌. బ్రహ్మాబాబా సహచరులను చూసి సంతోషిస్తారు కానీ సహచరులుగానే అవ్వాలి. సహచరులు అనగా ప్రతి అడుగులో తండ్రిని అనుసరించేవారు, సమాన సాథీలు. ఇటువంటి సహచరులు కదా? లేక ఇంకా ఏమి చెయ్యాలి? ఎలా చెయ్యాలి? అని ఆలోచిస్తున్నారా? ఆలోచించేవారా? లేక సమానంగా చేసేవారిగా ఉన్నారా? సెకండులో వ్యాపారం చేసేవారా? లేక ఇంకా ఆలోచించేందుకు సమయం కావాలా? వ్యాపారం చేసి వచ్చారా లేక వ్యాపారం చేసేందుకు వచ్చారా? అనుమతి ఎవరికి లభించింది? అందరూ ఫారాలు నింపారు కదా? లేక చిన్న-చిన్న బ్రాహ్మణీలకు మాటలు చెప్పి చేరుకున్నారా? ఇటువంటి మధురాతి మధురమైన మాటలు చాలా మాట్లాడ్తారు, బాప్‌దాదా వద్దకు అందరి మానసిక స్వచ్ఛత చతురతలు రెండూ చేరుతాయి. నియమ ప్రమాణంగా వ్యాపారము చేసి రావాలి. కానీ మధువనానికి చాలామంది వ్యాపారం చేసేవారు కూడా వచ్చేస్తారు. చేసి వచ్చేందుకు బదులు ఇక్కడకు వచ్చి వ్యాపారం చేస్తారు. అందువలన బాప్‌దాదా క్వాంటిటీ(సంఖ్య)లో క్వాలిటీ(నాణ్యత)ని చూస్తున్నారు. క్వాంటిటీకి తన విశేషత ఉంది, క్వాలిటీకి కూడా తన విశేషత ఉంది. రెండూ కావాలి కదా! పుష్పగుచ్ఛంలో వెరైటీ(రకరకాల) రంగు, రూపం కల్గిన పుష్పాలతో అలంకరణ ఉంటుంది. అందులో ఆకులు కూడా లేకపోతే పుష్పగుచ్ఛం శోభించదు. కావున బాబా ఇంటికి అందరూ శృంగారముగా అయితే అయ్యారు. అందరి నోటి నుండి 'బాబా' అనే శబ్ధం తప్పకుండా వెలువడుతుంది. పిల్లలు ఇంటికి శృంగారంగా ఉంటారు. ఇప్పుడు కూడా చూడండి, ఈ ఓంశాంతి భవనంలోని హాలు మీ అందరూ రావడం వలన శృంగారించబడింది కదా! కావున ఇంటికి శృంగారం తండ్రికి శృంగారం అయిన మీరు సదా మెరుస్తూ ఉండండి. క్వాంటిటీ నుండి క్వాలిటీలోకి పరివర్తన అయిపోండి. అర్థమయ్యిందా - ఈ రోజు కేవలం కలుసుకునే రోజు అయినా బ్రహ్మాబాబాకు సహచరులంటే ఇష్టమైపోయింది. అందువలన పికినిక్‌ చేశారు. మంచిది.

సదా ప్రభుఫలం తినేందుకు అధికారులకు, సదా బ్రహ్మాబాబా సమానంగా సెకండులో వ్యాపారము చేసేవారు ప్రతి కర్మలో కర్మయోగులుగా ఉన్నవారు, బ్రహ్మాబాబాను అనుసరించేవారు, ఇటువంటి బాప్‌ సమానంగా ఉన్న విశేష ఆత్మలకు, నలువైపులా ఉన్న క్వాలిటీ మరియు క్వాంటిటీ పిల్లలకు బాప్‌దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో అవ్యక్త బాప్‌దాదా కలయిక

అధర్‌ కుమారులతో :- 1. సదా స్వయాన్ని విశ్వంలో కోట్లలోని కొద్దిమందిలో మేము ఉన్నామని అనుభవం చేస్తున్నారా? కోటానుకోట్లలో కొద్దిమంది, ఆ కొద్దిమందిలో కూడా నేను ఒకడిని అనే మాట విన్నప్పుడంతా ఆ ఒక్కరు నేనే అని భావిస్తున్నారా? యథా విధంగా(ఉన్నదున్నట్లుగా) పాత్ర రిపీట్‌ అవుతున్నట్లయితే ఆ రిపీట్‌ అయ్యే పాత్రలో ప్రతి కల్పము విశేషంగా మీరే ఉంటారు కదా! ఇలాంటి స్థిరమైన విశ్వాసం ఉండాలి. సదా నిశ్చయబుద్ధి గలవారుగా ఉన్నవారు అన్ని విషయాలలో నిశ్చింతగా ఉంటారు. నిశ్చయానికి గుర్తు నిశ్చింతత. మొత్తం చింతలన్నీ తొలగిపోయాయి. తండ్రి చింతలనే చితి నుండి రక్షించారు కదా! చింతలనే చితి నుండి పైకి తీసి హృదయ సింహాసనము పై కూర్చోబెట్టుకున్నారు. తండ్రితో లగ్నము (ఏకాగ్రత) కుదిరింది మరియు ఈ లగ్నము ఆధారంతో ఏకాగ్రత అనే(లగ్నమనే) అగ్నిలో చింతలన్నీ అసలు లేనే లేవు అన్నట్లుగా సమాప్తమైపోయాయి. ఒక్క సెకండులో సమాప్తమైపోయాయి కదా! ఇలాంటి శుభ చింతక ఆత్మలుగా స్వయాన్ని అనుభవం చేస్తున్నారా? ఎప్పుడూ చింత ఉండడం లేదు కదా! శరీరం గురించిన చింతా లేదు, మనసులో ఎలాంటి వ్యర్థ చింతా లేదు. మరియు ధనం గురించి చింత కూడా లేదు, ఎందుకంటే పప్పు, రొట్టె అయితే తినాలి మరియు తండ్రి గుణాలను గానం(కీర్తన) చెయ్యాలి. పప్పు, రొట్టె అయితే తప్పకుండా లభిస్తుంది కావున ధనం గురించిన చింత లేదు, మనసు గురించిన చింతా లేదు అంతేకాకా శరీరం యొక్క కర్మభోగం గురించిన చింత కూడా లేదు. ఎందుకంటే ఇది అంతిమ జన్మ, అంతిమ సమయమని తెలుసు. దీనిలోనే అన్నీ సమాప్తమవ్వాలని తెలుసు. అందువలన సదా శుభ చింతకులుగా ఉంటారు. ఏమవుతుంది అనే చింత ఏదీ ఉండదు. జ్ఞానశక్తితో అంతా తెలుసుకున్నారు. అంతా తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? ప్రశ్నలు సమాప్తమైపోతాయి ఎందుకంటే ఏది జరిగినా మంచి కంటే మంచిగానే(చాలా మంచిగా) జరుగుతుంది అనే జ్ఞానం ఉంది. కావున సదా శుభ చింతకులుగా, సదా అన్ని చింతలతో అతీతంగా ఉన్న నిశ్చయబుద్ధి గల నిశ్చింత ఆత్మలుగా ఉంటారు. జీవితం అంటే ఇదే కదా! ఒకవేళ జీవితంలో నిశ్చింతత లేకుంటే ఆ జీవితం జీవితమే కాదు. ఇటువంటి శ్రేష్ఠ జీవితాన్ని అనుభవం చేస్తున్నారా? పరివారం గురించిన చింత కూడా లేదు కదా? ప్రతి ఒక్క ఆత్మ తమ లెక్కాచారాలను సమాప్తి కూడా చేసుకుంటున్నారు, అంతేకాక తయారు కూడా చేసుకుంటున్నారు. ఇందులో మనం దేనిని గురించి చింత చెయ్యాలి? ఏ చింతా లేదు. మొదట చితి పైన కాలిపోతూ ఉండేవారు. ఇప్పుడు తండ్రి అమృతం పోసి కాలిపోతున్న చితి నుండి మరజీవులుగా తయారు చేశారు, జీవింపజేశారు. ఉదాహరణానికి చనిపోయిన వారిని బ్రతికించారని అంటారు కదా! కనుక తండ్రి అమృతం త్రాగించి అమరులుగా చేశారు. చనిపోయిన శవంలాగా ఉండేవారు ఇప్పుడు ఎలా అయ్యారో చూడండి శవంలాగా ఉన్నవారు మహోన్నతంగా అయిపోయారు. మొదట ఏ ప్రాణమూ లేదు కావున శవం సమానమనే అంటారు కదా! భాష కూడా ఏ భాష మాట్లాడేవారు, అజ్ఞానీ మనుషులు చచ్చిపోండి అని అనేవారు లేక మేము చచ్చిపోతే చాలా బాగుంటుంది అని అనేవారు కదా! ఇప్పుడైతే మరజీవులుగా అయిపోయారు, విశేష ఆత్మలుగా అయిపోయారు. ఈ సంతోషం ఉంది కదా. కాలిపోయే చితి నుండి అమరులుగా అయిపోయారు. ఇదేమైనా తక్కువ విషయమా? ఇంతకు ముందు భగవంతుడు చనిపోయిన వారిని బ్రతికిస్తారు అని వినేవారు కదా! కాని ఎలా చేస్తారో అర్థం అయ్యేది కాదు. ఇప్పుడు మనమే జీవితులుగా అయ్యామని అర్థం చేసుకున్నారు. కనుక సదా నశా మరియు సంతోషంలో ఉండండి.

టీచర్లతో :- సేవాధారుల విశేషత ఏమిటి? సేవాధారులనగా(మూడవ) కన్ను తెరుచుకోవాలి, అంతేకాక సదా తండ్రి జతలో తండ్రి సమాన స్థితిని అనుభవం చేయాలి. అమృతవేళ మహత్వాన్ని తెలుసుకున్న విశేష సేవాధారులు. విశేషమైన సేవాధారుల మహిమ - విశేష వరదాన సమయాన్ని తెలుసుకొని విశేషమైన వరదానాలను అనుభవం చెయ్యాలి. ఒకవేళ అనుభవం లేకుంటే సాధారణ సేవాధారులు, విశేషమైనవారు కాదు. విశేష సేవాధారులుగా అవ్వాలనుకుంటే విశేష అధికారాన్ని తీసుకొని విశేషంగా అవ్వగలరు. ఎవరికైతే అమృతవేళ గురించి, సంకల్పాల గురించి, సమయం మరియు సేవల గురించిన మహత్వం ఉంటుందో ఇలా అన్నిటి మహత్వాలను తెలిసినవారు విశేష సేవాధారులుగా ఉంటారు. కావున ఈ మహత్వాన్ని తెలుసుకొని మహోన్నతంగా అవ్వాలి, ఈ మహత్వాన్ని తెలుసుకొని స్వయం మీరూ మహాత్మలుగా అవ్వండి. ఇతరులకు కూడా మహత్వం గురించి తెలిపి అనుభవం చేయించి మహాన్‌గా(శ్రేష్ఠంగా) తయారు చెయ్యండి. మంచిది, ఓంశాంతి.

పర్సనల్‌(వ్యక్తిగత) అవ్యక్త మహావాక్యాలు

సఫలం చేయండి, సఫలతా మూర్తులుగా అవ్వండి - ఎలాగైతే బ్రహ్మాబాబా నిశ్చయం ఆధారంతో, ఆత్మిక నశా ఆధారంతో నిశ్చితమైన భవిష్యత్తు తెలిసిన జ్ఞాతగా సెకండులో అన్నీ సఫలం చేసుకున్నారు. స్వంతానికి ఏదీ ఉంచుకోలేదు. అంతా సఫలం చేసుకున్నారో ప్రత్యక్ష ఋజువును చూశారు. అంతిమ రోజు వరకు శరీరంతో లెటర్స్‌, వ్యవహారం ద్వారా సేవ చేయడం చూశారు. నోటితో మహావాక్యాలు ఉచ్ఛరించారు. చివరి రోజు కూడా సమయాన్ని, సంకల్పాన్ని, శరీరాన్ని సఫలం చేసుకున్నారు. సఫలం చేసుకోవడం అనగా మంచి వైపు అన్నీ వినియోగించడం. ఇలా సఫలం చేసుకునేవారికి సఫలత స్వతహాగానే ప్రాప్తిస్తుంది. సఫలత ప్రాప్తి చేసుకునేందుకు విశేష ఆధారము - ప్రతి సెకండు, ప్రతి శ్వాస, ప్రతి ఖజానాను సఫలం చేసుకోవాలి. సంకల్పం, మాట, కర్మ, సంబంధ-సంపర్కము ఎందులోనైనా సఫలతను అనుభవం చేసుకోవాలంటే వీటిని స్వయం పట్ల, ఇతర ఆత్మల పట్ల సఫలం చేసుకుంటూ వెళ్ళండి. వ్యర్థంగా పోనివ్వకుంటే స్వత:గానే సఫలత ద్వారా లభించిన సంతోషాన్ని అనుభవం చేస్తూ ఉంటారు. ఎందుకంటే సఫలం చేయడం అనగా వర్తమానం కొరకు సఫలతా మూర్తులుగా అవ్వడం, భవిష్యత్‌ కొరకు జమ చేసుకోవడం.

సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు సమర్పణ భావం మరియు నిశ్చింత స్థితి అవసరము. సేవలో కొంచెం కూడా నాది అనే భావం మిక్స్‌ అవ్వరాదు. ఏ విషయం గురించీ చింత ఉండరాదు. ఎందుకంటే చింత చేసేవారు సమయం కూడా పోగొట్టుకుంటారు. శక్తి కూడా వ్యర్థంగా పోతుంది, అంతేకాక పని కూడా పోగొట్టుకుంటారు. వారు ఏ కార్యము కొరకు చింత చేస్తారో ఆ పనే పాడైపోతుంది. రెండవది - సదా సఫలతా మూర్తులుగా అయ్యేందుకు సాధనం - ఒకే బలం, ఒకే నమ్మకం. నిశ్చయం సదా నిశ్చింతగా తయారుచేస్తుంది అంతేకాక నిశ్చింత స్థితి ఉన్నవారు ఏ కార్యం చేసినా అందులో తప్పకుండా సఫలమవుతారు. ఎలాగైతే బ్రహ్మాబాబా దృఢ సంకల్పంతో ప్రతి కార్యంలో సఫలతను ప్రాప్తి చేసుకున్నారో దృఢత సఫలతకు ఆధారం అయ్యిందో అలా తండ్రిని అనుసరించండి. ప్రతి ఖజానాను, గుణాలను, శక్తులను, కార్యంలో వినియోగించినట్లయితే అవి వృద్ధి చెందుతూ ఉంటాయి. పొదుపు చేసే విధిని, జమ చేసుకునే విధిని స్వంతం చేసుకుంటే వ్యర్థ ఖాతా స్వతహాగానే పరివర్తన జరిగి సఫలమైపోతుంది. తండ్రి ద్వారా లభించిన ఖజానాలను దానం చెయ్యండి. ఎప్పుడూ స్వప్నంలో కూడా ప్రభువు ఇచ్చిన వాటిని నాది అని పొరపాటున కూడా భావించకండి. ఇది నా గుణము, నా శక్తి, ఈ 'నాది' అనేది రావడం అనగా ఖజానాలను పోగొట్టుకోవడం అవుతుంది. తమ ఈశ్వరీయ సంస్కారాలను కూడా సఫలం చేసుకుంటే వ్యర్థ సంస్కారాలు స్వత:గానే వెళ్ళిపోతాయి. ఈశ్వరీయ సంస్కారాలను బుద్ధి అనే లాకర్‌లో ఉంచుకోకండి. కార్యంలో వినియోగించండి, సఫలం చేయండి. సఫలం చేయడం అనగా రక్షించుకోవడం లేక పెంచుకోవడం. మనసు ద్వారా సఫలం చేయండి. వాణి ద్వారా సఫలం చేయండి. సంబంధ-సంపర్కంతో, కర్మతో తమ శ్రేష్ఠ సాంగత్యముతో, తమ శక్తిశాలీ వృత్తితో సఫలం చేయండి. సఫలం చేయడమే సఫలతకు తాళంచెవి. మీ వద్ద సమయం మరియు సంకల్పం అనే శ్రేష్ఠ ఖజానాలు ఏవైతే ఉన్నాయో వాటిని 'తక్కువ ఖర్చు, ఎక్కువ లాభం' అనే విధానం ద్వారా సఫలం చెయ్యండి. సంకల్పాల ఖర్చు తక్కువగా ఉండాలి కాని ప్రాప్తి ఎక్కువగా ఉండాలి. సాధారణ వ్యక్తి రెండు, నాలుగు నిమిషాలు సంకల్పం నడిపించిన తర్వాత, ఆలోచించిన తర్వాత ఏ సఫలతను లేక ప్రాప్తిని చేసుకోగలరో, దానిని మీరు ఒకటి, రెండు సెకండ్లలో చేయగలరు. అలాగే వాణి మరియు కర్మలు(మాటలు, కర్మలు)తక్కువగా ఖర్చు అయ్యి సఫలత ఎక్కువగా ఉన్నప్పుడే అద్భుతం అని గాయనం చెయ్యబడ్తుంది. కనుక మీ వద్ద ఏదైతే సంపద, సమయం, సంకల్పం, శ్వాస, తనువు-మనసు-ధనం ఉన్నాయే అన్నీ సఫలం చేయండి. వ్యర్థంగా పోగొట్టుకోకండి. రాబోయే సమయం కొరకు దాచి ఉంచుకోండి. జ్ఞాన ధనం, శక్తుల ధనం, గుణాల ధనము అన్నిటిని 'నాది' అనే దాని నుండి అతీతంగా అయ్యి ప్రతి సమయం సఫలం చేసుకుంటే జమ అవుతూ ఉంటుంది. సఫలం చేయడం అనగా కోటాను రెట్ల(పదమా గుణాల) సఫలతను అనుభవం చెయ్యడం.

ఈ బ్రాహ్మణ జీవితంలో :-

- ఎవరైతే సమయాన్ని సఫలం చేసుకుంటారో, వారు సమయాన్ని సఫలం చేసుకున్న ఫల స్వరూపంగా వారు పూర్తి సమయం రాజ్య భాగ్యానికి రాజ్యాధికారిగా అవుతారు.

- ఎవరైతే శ్వాసలు సఫలం చేసుకుంటారో, వారు అనేక జన్మలు సదా ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడూ నడుస్తూ నడుస్తూ శ్వాస ఆగి గుండె ఆగిపోదు(హార్ట్‌ ఫెయిల్‌ అవ్వదు).

- ఎవరైతే జ్ఞాన ఖజానాను సఫలం చేసుకుంటారో, వారు ఎటువంటి వివేకవంతులుగా అవుతారంటే వారు భవిష్యత్తులో అనేక మంత్రుల సలహా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. స్వయం వారే వివేకవంతులై రాజ్యాన్ని నడిపిస్తారు.

- ఎవరైతే సర్వ శక్తుల ఖజానాను సఫలం చేసుకుంటారో అనగా వాటిని కార్యంలో వినియోగిస్తారో, వారు సర్వ శక్తి సంపన్నంగా అవుతారు. వారి భవిష్య రాజ్యంలో ఏ శక్తీ లోపంగా ఉండదు. సర్వ శక్తులు స్వత:గానే అఖండంగా, స్థిరంగా, నిర్విఘ్న కార్యాలు జరిగే సఫలతను అనుభవం చేయిస్తాయి.

- ఎవరైతే సర్వ గుణాల ఖజానాను సఫలం చేసుకుంటారో, వారు గుణమూర్తులుగా అవుతారు. ఈ రోజు అంతిమ సమయములో కూడా వారి జడ చిత్రాలను ''సర్వగుణ సంపన్న దేవత'' రూపంలో మహిమ జరుగుతుంది.

- ఎవరైతే స్థూల ధనం యొక్క ఖజానాను సఫలం చేసుకుంటారో వారు 21 జన్మలకు సంపన్నంగా ఉంటారు కనుక సఫలం చేయండి, సఫలతా మూర్తులుగా అవ్వండి. మంచిది. 

వరదానము:- ''నాది అనే దానిని నీదిలోకి పరివర్తన చేసి, సదా తేలికగా ఉండే డబల్‌ లైట్‌ ఫరిస్తా భవ''
నడుస్తూ - తిరుగుతూ సదా '' మేము ఫరిస్తాలము '' అని స్మృతిలో ఉండాలి. ఫరిస్తాల స్వరూపం ఎలా ఉంటుందో, మాటలు ఎలా ఉంటాయో, కర్మలు ఎలా ఉంటాయో..... అని సదా స్మృతిలో ఉండాలి. ఎందుకంటే, ఎవరైతే తండ్రి వారిగా అయ్యారో అన్నింటిలో నాది అనే దానిని నీదిగా చేసేశారు కావున తేలికగా (ఫరిస్తాగా) అయిపోయారు. ఈ లక్ష్యాన్ని సదా సంపన్నంగా చేసుకునేందుకు ''అంతా తండ్రిది నాది ఏమీ లేదు'' అనే ఒక్క శబ్దం జ్ఞాపకం ఉంచుకోండి. ఎపుడైతే నాది అనేది ఎక్కడ వస్తే అక్కడ నీది అని అనండి. తర్వాత ఏ భారం కూడా అనుభవం అవ్వదు. సదా ఎగిరే కళలో ఎగురుతూ ఉంటారు. 

స్లోగన్‌ :- ''తండ్రి పై బలిహారం అయ్యే హారము ధరించి ఉంటే, మాయతో ఓటమి ఉండదు (హార్‌ నహోగా).''
 

Telugu Murli 13/01/18

13-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - పవిత్రత లేకుండా భారతదేశము స్వర్గముగా అవ్వజాలదు. గృహస్థములో ఉంటూ పవిత్రముగా అవ్వండి అని మీకు శ్రీమతము ఉంది, రెండు వైపులా తోడు నిభాయించండి. '' 

ప్రశ్న :- ఇతర సత్సంగాలు లేక ఆశ్రమాలతో పోల్చినప్పుడు ఇచ్చటి ఏ విధానము పూర్తిగా భిన్నమైనది ?
జవాబు :- అచ్చటి ఆశ్రమాలలో మనుష్యులు వెళ్ళి ఉంటారు. అచ్చట మంచి సాంగత్యము లభిస్తుందని ఇల్లు మొదలైన వాటి గొడవలు ఏవీ ఉండవని భావిస్తారు. అక్కడ లక్ష్యము గాని, ఉద్ధేశ్యము గాని ఏదీ లేదు. కాని ఇచ్చట మీరు మరజీవాలుగా అవుతారు. మీచే ఇల్లు-వాకిళ్లను విడిపించరు. ఇంటిలో ఉంటూ మీరు జ్ఞానామృతాన్ని త్రాగాలి, ఆత్మిక సేవ చేయాలి. ఈ విధానము, ఆచారము ఆ సత్సంగాలలో లేదు.

ఓంశాంతి. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఎందుకంటే ఇచ్చట తండ్రే స్వయంగా అర్థము చేయిస్తున్నారని పిల్లలకు తెలుసు. అందుకే పదే పదే శివభగవానువాచ అనడం కూడా అంత బాగుండదు. ఆ గీతను వినిపించేవారు కృష్ణ భగవానువాచ అని అంటారు. కృష్ణుడు ఒకప్పుడు ఉండి వెళ్ళిపోయాడు. కృష్ణుడు గీతను వినిపించాడని, రాజయోగాన్ని నేర్పించాడని అంటారు. ఇచ్చటైతే శివబాబా మాకు రాజయోగము నేర్పిస్తున్నారని, రాజయోగము నేర్పించే ఏ ఇతర సత్సంగము లేదని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి అంటున్నారు - నేను మిమ్ములను రాజులకు రాజుగా తయారుచేస్తాను. వారైతే కేవలము కృష్ణ భగవానువాచ - '' మన్మనాభవ '' అని అంటారు. ఎప్పుడు అన్నారు? అని అడిగితే 5 వేల సంవత్సరాల క్రితమని కొందరు, క్రీస్తు పూర్వము 3 వేల సంవత్సరాల క్రితమని కొందరు అంటారు. 2 వేల సంవత్సరాలని ఎవ్వరూ అనరు. ఎందుకంటే మధ్యలో గల 1000 సంవత్సరాలలో ఇస్లామ్‌, బౌద్ధ మతాలు వచ్చాయి. అందువలన క్రీస్తు పూర్వము 3 వేల సంవత్సరాల క్రితము సత్యయుగము ఉండేదని ఋజువౌతుంది. ఇప్పటికి 5 వేల సంవత్సరాల క్రితము గీతను వినిపించే భగవంతుడు వచ్చారని, వారు వచ్చి దేవీ దేవతా ధర్మము స్థాపన చేశారని మనము అంటాము. ఇప్పుడు 5 వేల సంవత్సరాల తర్వాత మళ్లీ వారు రావలసి వచ్చింది. ఇది 5 వేల సంవత్సరాల చక్రము. బాబా ఇతని ద్వారా అర్థం చేయిస్తున్నారని పిల్లలకు తెలుసు. ప్రపంచములో అయితే మనుష్యులు అనేక రకాలైన సత్సంగాలకు వెళ్తూ ఉంటారు. కొంతమంది ఆశ్రమాలకు వెళ్ళి అచ్చటనే ఉంటారు కూడా. అప్పుడు వారిని మాతా-పితల వద్దకు వెళ్ళి జన్మ తీసుకున్నారని గాని, వారి నుండి వారసత్వము లభిస్తుందని గాని అనరు. కేవలం అచ్చట మంచి సాంగత్యము లభిస్తుందని భావిస్తారు. అచ్చట ఉన్నంత కాలము ఇల్లు మొదలైనవాటి హంగామా ఏదీ ఉండదు. అంతేకాని లక్ష్యమంటూ ఏదీ లేదు. ఇచ్చటైతే మేము మాతా-పితల వద్దకు వచ్చామని మీరంటారు. ఇది మీ మరజీవా జన్మ. అచ్చట జనులు పిల్లలను దత్తత చేసుకుంటారు. దానితో అతడు వెళ్ళి వారి ఇంటిలో నివసిస్తాడు. ఇచ్చట పుట్టింటిని, అత్తవారి ఇంటిని వదిలి ఇక్కడే కూర్చునే ఆచారము లేదు. అది జరగదు. ఇక్కడైతే గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానంగా ఉండాలి. కుమారి గాని లేక ఎవరైనా గాని, ఇంటిలో ఉంటూ ప్రతి రోజూ జ్ఞానామృతము త్రాగేందుకు రమ్మని ఇచ్చట చెప్పబడ్తుంది. జ్ఞానము అర్థము చేసుకొని మళ్లీ ఇతరులకు అర్థము చేయించమని, రెండు వైపులా తోడు నిభాయించండని చెప్తారు. గృహస్థ వ్యవహారములో కూడా ఉండాలి. చివరి వరకు రెండు వైపులా తోడు నిభాయించాలి. చివర్లో ఇక్కడున్నా, అక్కడున్నా మృత్యువైతే అందరికీ రావలసిందే. రాముడూ పోయాడు, రావణుడూ పోయాడు.......... అని అంటారు. అందరూ ఇక్కడకు వచ్చి ఉండాలని కాదు. ఎప్పుడైతే విషం కొరకు వారిని విసిగించడం జరుగుతుందో అప్పుడు అక్కడ నుండి(ఇంటి నుండి) బయటకు వస్తారు. కన్యలు కూడా తమ ఇళ్లలోనే ఉండాలి, బంధు-మిత్రులకు సేవ చేయాలి. సమాజ సేవకులైతే చాలామంది ఉన్నారు. ప్రభుత్వం వారు ఇంతమందినైతే తమ వద్ద ఉంచుకోలేరు. వారు తమ గృహస్థ వ్యవహారములో ఉంటారు. మళ్లీ ఏదో ఒక సేవ కూడా చేస్తారు. ఇక్కడ మీరు ఆత్మిక సేవ చేయాలి. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. అయితే వికారాల కోసం బాగా విసిగిస్తారో అప్పుడు వచ్చి ఈశ్వరీయ శరణు తీసుకుంటారు. ఇక్కడ విషం కారణంగా(కొరకు) పిల్లలు చాలా దెబ్బలు తింటారు. ఇంకెక్కడా ఇటువంటి విషయాలు ఉండవు. ఇక్కడైతే పవిత్రంగా ఉండవలసి ఉంటుంది. ప్రభుత్వము కూడా పవిత్రతను కోరుకుంటుంది. కాని గృహస్థ వ్యవహారంలో ఉండేవారిని పవిత్రంగా తయారు చేసే శక్తి ఈశ్వరునిలో మాత్రమే ఉంది. సమయం ఎలా ఉందంటే ప్రభుత్వము కూడా పిల్లలు ఎక్కువగా జన్మించరాదని చెప్తూ ఉంది. ఎందుకంటే చాలా పేదరికం ఉంది. కనుక భారతదేశంలో పవిత్రత ఉండాలని, పిల్లలు తక్కువ అవ్వాలని కోరుకుంటుంది.

తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, పవిత్రంగా ఉంటే పవిత్ర ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. ఈ విషయం వారి(ప్రభుత్వం) బుద్ధిలో లేదు. భారతదేశం పవిత్రంగా ఉండేది. ఇప్పుడు అపవిత్రంగా ఉంది. ఆత్మలందరూ స్వయం వారు కూడా పవిత్రంగా అవ్వాలని కోరుకుంటారు. ఇక్కడ చాలా దు:ఖముంది. పవిత్రత లేకుండా భారతదేశము స్వర్గంగా అవ్వజాలదని పిల్లలైన మీకు తెలుసు. నరకంలో అంతా దు:ఖమే ఉంది. ఇప్పుడు నరకమంటూ వేరే ఎక్కడా లేదు. ఎలాగైతే గరుడ పురాణంలో విషయ వైతరిణీ నది ఉందని, అందులో మనుష్యులు మునకలు వేస్తూ ఉంటారని చూపిస్తారో(వ్రాశారో) అలా మనుష్యులు శిక్షలు అనుభవించే నది ఏదీ లేదు. శిక్షలైతే గర్భ జైలులో లభిస్తాయి. సత్యయుగంలో అయితే శిక్షలు లభించేందుకు గర్భ జైలు ఉండనే ఉండదు. అక్కడ గర్భము మహలు వలె ఉంటుంది. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా చైతన్యములో ప్రత్యక్షముగా ఉన్న నరకము. ఇక్కడ మనుష్యులు దు:ఖముతో, రోగాలతో బాధపడ్తున్నారు. ఒకరికొకరు దు:ఖమునిచ్చుకుంటూ ఉంటారు. స్వర్గములో ఇవేవీ ఉండవు. నేను మీ అనంతమైన తండ్రిని, నేను రచయితను. కనుక తప్పకుండా నేను కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని రచిస్తానని బాబా అర్థం చేయిస్తున్నారు. స్వర్గం కొరకు ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని రచిస్తాను. నీవే తల్లివి, తండ్రివి........... అని అంటారు. కల్ప-కల్పము ఈ రాజయోగము నేర్పించాను. బ్రహ్మ ద్వారా కూర్చొని సర్వ వేద శాస్త్రాల ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. పూర్తిగా చదువురాని వారికి కూర్చొని చదివిస్తారు. ఓ భగవంతుడా! రండి అని మీరు పిలుస్తూ ఉండేవారు కదా. పతితులైతే అచ్చటికి వెళ్లలేరు. అందువలన పావనంగా చేసేందుకై వారు ఇచ్చటికి తప్పకుండా రావలసి వచ్చింది. పిల్లలైన మీకు స్మృతినిప్పిస్తున్నారు - కల్పక్రితము కూడా మీకు రాజయోగము నేర్పించాను. ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ జ్ఞానము తీసుకున్నారా? అని అడగబడ్తుంది. అప్పుడు 5 వేల సంవత్సరాల ముందు మేము ఈ జ్ఞానము తీసుకున్నామని అంటారు. ఇవన్నీ కొత్త విషయాలు. నూతన యుగము, నూతన ధర్మము మళ్లీ స్థాపన అవుతుంది. ఈశ్వరుడు తప్ప ఈ దైవీ ధర్మాన్ని ఎవ్వరూ స్థాపన చేయలేరు. బ్రహ్మ, విష్ణు, శంకరులు కూడా స్థాపన చేయలేరు. ఎందుకంటే వారు కూడా రచన అయిన దేవతలు. స్వర్గ రచయిత మాతా-పితలుగా ఉండాలి. మీకు అపారమైన సుఖము కూడా ఇక్కడే ఉండాలి. తండ్రి అంటున్నారు - నేను కూడా రచయితనే. మిమ్ములను కూడా బ్రహ్మ ముఖము ద్వారా నేనే రచించాను. నేను మానవ సృష్టికి బీజరూపుడను. భలే ఎంత గొప్ప సాధు-సత్పురుషులు మొదలైన వారైనా, వారెవ్వరి నోటి నుండి ఈ మాటలు రావు. ఇవి గీతలోని పదాలు. అయితే ఈ మాటలు అన్నవారే మళ్లీ అనగలరు. ఇతరులెవ్వరూ చెప్పలేరు. కేవలం నిరాకారునికి బదులు కృష్ణుని భగవంతుడు అని అనేశారు. తండ్రి అంటున్నారు - నేను మనుష్య సృష్టికి బీజరూపుడను. పరంధామములో ఉండే నిరాకార పరమాత్మను. మీరు కూడా అర్థము చేసుకోగలరు. సాకార మనుష్యులైతే స్వయాన్ని బీజరూపమని చెప్పుకోలేరు. బ్రహ్మ, విష్ణు, శంకరులు కూడా అలా అనజాలరు. అందరినీ రచించేవారు శివబాబాయే అని తెలుసు. నేను దైవీ ధర్మాన్ని స్థాపన చేస్తున్నానని చెప్పే శక్తి కూడా ఇతరులెవ్వరిలోనూ లేదు. భలే స్వయాన్ని కృష్ణుడని, బ్రహ్మ అని, శంకరుడని పిలిపించుకుంటారు,............... అనేకమంది స్వయాన్ని అవతార పురుషులు అని కూడా పిలిపించుకుంటారు. కాని అదంతా అసత్యము. ఇచ్చటకు వచ్చి విన్నప్పుడు తప్పకుండా తండ్రి ఒక్కరేనని, అవతారము కూడా ఒక్కటేనని అర్థము చేసుకుంటారు. వారు నేను మిమ్ములను వెంట తీసుకెళ్తానని అంటున్నారు. ఇలా చెప్పే శక్తి కూడా ఎవ్వరిలోనూ లేదు. 5 వేల సంవత్సరాల క్రితము కూడా గీతా భగవానుడైన శివబాబాయే ఈ మాట చెప్పారు. వారే ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేశారు. వారే ఇప్పుడు మళ్లీ చేస్తున్నారు. దోమల గుంపు వలె ఆత్మలు వెళ్ళిపోయాయనే గాయనముంది. అందువలన తండ్రి మార్గదర్శకులై వచ్చి అందరినీ లిబరేట్‌ చేస్తున్నారు. ఇప్పుడిది కలియుగ అంతిమ సమయము. దీని తర్వాత సత్యయుగము రానున్నది. అందువలన వారు తప్పకుండా వచ్చి పవిత్రంగా తయారు చేసి పవిత్ర ప్రపంచములోకి తీసుకెళ్తారు. గీతలో ఏవో కొన్ని పదాలు ఉన్నాయి. ఈ ధర్మము కొరకు శాస్త్రము కావాలి కదా అని భావిస్తారు. అందువలన వారు కూర్చొని గీతా శాస్త్రాన్ని తయారు చేశారు. సర్వ శాస్త్రాలకు శిరోమణి నెంబర్‌వన్‌ గీతా మాతయే. కాని పేరు మార్చేశారు. ఈ సమయములో ఏ తండ్రి అయితే ఈ కర్తవ్యాన్ని చేస్తున్నారో, వారే ద్వాపర యుగములో మళ్లీ కూర్చొని వ్రాయరు కదా. మళ్లీ అదే గీత వెలువడ్తుంది. డ్రామాలో ఈ గీతయే ఫిక్స్‌ అయ్యి ఉంది. ఎలాగైతే తండ్రి మళ్లీ మనుష్యులను దేవతలుగా చేస్తారో అలాగే శాస్త్రాలు కూడా తర్వాత ఎవరో కూర్చొని మళ్లీ వ్రాస్తారు. సత్యయుగములో ఏ శాస్త్రమూ ఉండదు. తండ్రి కూర్చొని మొత్తము చక్రము రహస్యమంతా అర్థం చేయిస్తున్నారు. మేము 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశామని మీరు భావిస్తారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము వారే అత్యధికంగా 84 జన్మలు తీసుకుంటారు. మిగిలిన మనుష్యులైతే తర్వాత వృద్ధి చెందుతారు. వారు ఇన్ని జన్మలు తీసుకోరు. తండ్రి కూర్చొని ఈ బ్రహ్మ నోటి ద్వారా అర్థం చేయిస్తున్నారు. నేను ఎవరి శరీరాన్ని అప్పుగా తీసుకున్నానో ఆ దాదాకు కూడా తన జన్మల గురించి తెలియదు. ఇతడు వ్యక్తములో ఉన్న ప్రజాపిత బ్రహ్మ, అతడు అవ్యక్తము కాని ఇరువురూ ఒక్కటే. మీరు కూడా ఈ జ్ఞానము వలన సూక్ష్మవతన వాసులైన ఫరిస్తాలుగా అవుతున్నారు. సూక్ష్మవతన వాసులను ఫరిస్తాలని(సూక్ష్మ దేవతలని) అంటారు. ఎందుకంటే ఫరిస్తాలకు మాంసము, ఎముకలు ఉండవు. బ్రహ్మ, విష్ణు, శంకరులకు కూడా మాంసము, ఎముకలు లేవు. అయితే మరి వారి చిత్రాలు ఎలా తయారు చేస్తారు? శివుని చిత్రము కూడా తయారు చేస్తారు. నిజానికి వారు ఒక నక్షత్రము వంటి వారు. నిరాకారులైన వారికి కూడా రూపాన్ని తయారు చేస్తారు. బ్రహ్మ, విష్ణు, శంకరులైతే సూక్ష్మమైనవారు. ఎలాగైతే మనుష్యుల రూపాన్ని తయారు చేస్తారో అలా శంకరుని రూపాన్ని తయారు చేయలేరు. ఎందుకంటే వారికి మాంసము, ఎముకల శరీరము లేనే లేదు. మనము ఇతరులకు అర్థము చేయించేందుకు ఇటువంటి స్థూల శరీరాన్ని తయారు చేస్తాము. కాని వారు సూక్ష్మమైనవారని మీరు కూడా చూస్తారు. మంచిది.

రాత్రి క్లాసు - 13-7-68

మనుష్యులు తప్పకుండా రెండు విషయాలు కోరుకుంటారు. మొదటిది - శాంతి, రెండవది - సుఖము. విశ్వములో శాంతి మరియు స్వయము కొరకు శాంతి కావాలి. మనుష్యులకు విశ్వములో సుఖము స్వయానికి కూడా సుఖము కావాలనే కోరిక ఉంటుంది. శాంతి కావాలంటున్నారు అనగా తప్పకుండా ఒకప్పుడు శాంతి ఉండనే ఉంటుంది. అయితే అది ఎప్పుడు, ఎలా అవుతుందో అశాంతి ఎందుకు అయ్యిందో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే గాఢాంధకారము(అజ్ఞానము)లో ఉన్నారు. ఇది పిల్లలైన మీకు తెలుసు. శాంతి, సుఖాల కొరకు మీరు చాలా మంచి దారిని తెలుపుతారు. వారికి చాలా సంతోషము కలుగుతుంది. అయితే అందుకు పావనంగా కూడా అవ్వాలని విన్నప్పుడు చల్లబడిపోతారు(నిరుత్సాహపడతారు). ఈ వికారాలు అందరికీ శత్రువులే. అయితే అందరికీ ప్రియమైనవి కూడా. వీటిని వదలాలంటే హృదయము విదీర్ణమవుతుంది (పగిలిపోతుంది, అంగీకరించదు). దాని పేరే విషము. అయినా వదిలిపెట్టరు. మీరు ఎంతో తలబద్దలు చేసుకుంటారు. అయినా ఓడిపోతారు. విషయం కూడా పవిత్రత గురించే. ఇందులో చాలామంది ఫెయిల్‌ అవుతారు. ఎవరైనా కన్యను చూస్తే ఆకర్షణ కలుగుతుంది. క్రోధము గాని, లోభము గాని, మోహము గాని ఆకర్షించదు. కామము మహాశత్రువు. దీని పై విజయము పొందడం మహావీరుల పని. దేహాభిమానము తర్వాత మొదట కామమే వస్తుంది. దీని పై విజయం పొందాలి. ఎవరైతే పవిత్రంగా ఉంటారో వారికి కాముకులైన మనుష్యులు నమస్కరిస్తారు. మేము వికారులము, మీరు నిర్వికారులు అని అంటారు. మేము క్రోధులము, లోభులము,......... అని అనరు. ముఖ్యమైన విషయమంతా ఈ వికారానిదే. వివాహము వికారము కొరకే చేసుకుంటారు. తల్లిదండ్రులకు ఈ వివాహ చింతే ఉంటుంది. పిల్లలు పెద్దవారవుతే ధనము కూడా ఇస్తారు, వికారాలలోకి కూడా వెళ్తారు. వికారాలలోకి వెళ్లకుంటే జగడాలు కూడా జరుగుతాయి. చిత్రము చూపించి ఈ దేవతలు సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారని పిల్లలైన మీరు అర్థం చేయించాలి. మీ లక్ష్యము మీ ఎదుటనే ఉంది. నరుని నుండి నారాయణునిగా, రాజాధి రాజులుగా అవ్వాలి. ఆ చిత్రము ఎదుటే ఉంది. దీనిని సత్సంగము అని అనరు. ఇది పాఠశాల. అక్కడ సత్సంగము లేనే లేదు. సన్ముఖములో రాజయోగము నేర్పినప్పుడే సత్యమైన సత్సంగము. సత్యమైన తోడు కావాలి, సత్యమైన సాంగత్యము కావాలి. వారే గీత అనగా రాజయోగాన్ని నేర్పిస్తారు. తండ్రి ఏ గీతనూ వినిపించరు. గీతా పాఠశాల అని పేరుంది. కనుక అక్కడకు వెళ్లి గీత వింటామని భావిస్తారు. ఇంత ఆకర్షణ ఉంటుంది. ఇది ఒక్క సెకెండులో సద్గతి, ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతోషము లభించే సత్యమైన గీతా పాఠశాల. సత్యమైన గీతా పాఠశాల అని ఎందుకు వ్రాస్తారు అని అడుగుతారు. కేవలం గీతా పాఠశాల అని వ్రాయడం సాధారణము. సత్యమైన అను పదము వ్రాయడం వలన ఆకర్షణ కలగవచ్చు. బహుశా అసత్యమైనవి కూడా ఉంటాయి. కనుక సత్యమైన అను పదము తప్పకుండా వ్రాయాల్సి ఉంటుంది. పవిత్ర ప్రవంచమని సత్యయుగమును, పతిత ప్రపంచమని కలియుగమును అంటారు. సత్యయుగములో వీరు పవిత్రంగా ఉండేవారు. అలా ఎలా అయ్యారో నేర్పిస్తారు. తండ్రి బ్రహ్మ ద్వారా చదివిస్తారు లేకుంటే ఎలా చదివిస్తారు? కల్పక్రితము అర్థము చేసుకున్నవారే దీనిని యాత్ర అని భావిస్తారు. భక్తి మార్గము అనే ఊబిలో కూరుకొని పోయి ఉన్నారు. భక్తిలో చాలా ఆడంబరముంది. ఇక్కడ ఏమీ లేదు. కేవలం ఇప్పుడు వాపస్‌ వెళ్లాలని స్మృతిలో ఉంచుకోండి. పవిత్రమై వెళ్లాలి. పవిత్రంగా అయ్యేందుకు స్మృతిలో ఉండాలి. స్వర్గానికి అధికారులుగా చేసే తండ్రిని స్మృతి చేయలేరు. ఇదే ముఖ్యమైన విషయము. అందరూ ఇదే కష్టమని అంటారు. పిల్లలు చాలా బాగా ఉపన్యసిస్తున్నారు. కాని యోగములో ఉండి అర్థం చేయిస్తే ప్రభావము కూడా బాగుంటుంది. స్మృతి ద్వారా మీకు శక్తి లభిస్తుంది. సతోప్రధానంగా అవ్వడం వలన సతోప్రధాన విశ్వానికి అధికారులుగా అవుతారు. స్మృతినే నేష్ఠా అని అంటారా ? మేము అర్ధ గంట నేష్ఠాలో కూర్చుంటాము అని అంటారు. ఇది తప్పు. తండ్రి కేవలం స్మృతిలో ఉండమని అంటారు. ఎదురులో కూర్చుని నేర్పించే అవసరము లేదు. అనంతమైన తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. ఎందుకంటే చాలా ఖజానాలనిస్తారు. స్మృతి వలన అపారమైన ఖుషీ పాదరస మట్టము పైకి ఎక్కాలి. అతీంద్రియ సుఖము అనుభవమవుతుంది. తండ్రి చెప్తున్నారు - మీ జీవితము చాలా విలువైనది. ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఎంత కాలము బ్రతుకుతారో అంత ఖజానా తీసుకుంటారు. మనము సతోప్రధానమైనప్పుడు ఖజానా పూర్తిగా లభిస్తుంది. మురళీలో కూడా బలము వస్తుంది. కత్తికి పదును ఉంటుంది కదా. మీలో కూడా స్మృతి అను పదును ఉంటే కత్తి తీవ్రమవుతుంది. జ్ఞానములో అంత పదును లేదు. అందుకే కొంతమందికి ప్రభావము పడదు. మళ్లీ వారి కళ్యాణము కొరకు బాబా రావాలి. ఎప్పుడైతే మీరు స్మృతిలో పదును నింపుకుంటారో అప్పుడు పండితులు, ఆచార్యులు మొదలైనవారికి బాణము తగులుతుంది. అందుకే బాబా చార్టు వ్రాయమని అంటారు. చాలామంది బాబాను మేము చాలా స్మృతి చేస్తామని అంటారు. కాని నోరు విప్పరు. మీరు స్మృతిలో ఉంటే వికర్మలు వినాశనమవుతాయి. అచ్ఛా. పిల్లలకు గుడ్‌ నైట్‌.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఇంటిలో ఉంటున్ననూ ఆత్మిక సేవ చేయాలి. పవిత్రముగా తయారై, ఇతరులను కూడా పవిత్రముగా తయారు చేయాలి.
2. ఈ ఆడంబరయుక్త నరకములో ఉంటున్ననూ అనంతమైన తండ్రి నుండి స్వర్గ వారసత్వమును తీసుకోవాలి. ఎవ్వరికి కూడా దు:ఖమును ఇవ్వరాదు. 

వరదానము :- '' ఒక్క ' బాబా ' అను శబ్ధాన్ని స్మృతి చేయడం ద్వారా ' బలహీనత ' అను శబ్ధాన్ని సమాప్తము చేసే సదా సమర్థ ఆత్మా భవ ''
ఏదైనా బలహీనతను వర్ణించునప్పుడు అది సంకల్పము, మాట, సంస్కార-స్వభావాలలోని బలహీనత ఏదైనా కావచ్చు, - '' నేనిలా అనుకున్నాను, నా భావమది కాదు, నా సంస్కారమే ఇలా ఉంది అని అంటారు. కాని తండ్రి సంస్కారమే నా సంస్కారము, తండ్రి సంకల్పమే నా సంకల్పము అని 'బాబా'ను స్మృతి చేయాలి. సమర్థతకు గుర్తు - '' తండ్రి సమానము. '' కనుక సంకల్పము, మాట, ప్రతి విషయంలో ' బాబా ' శబ్ధము న్యాచురల్‌గా(సహజంగా) ఉండాలి. ఇక కర్మలు చేస్తూ చేయించేవారి స్మృతి ఉంటే ' బాబా ' ముందు మాయ అనగా బలహీనత రాజాలదు. 

స్లోగన్‌ :- '' ఎవరి వద్ద ' గంభీరత ' అను విశేషత ఉంటుందో, వారికి ప్రతీ కార్యంలో స్వతహాగా సిద్ధి (సఫలత) ప్రాప్తిస్తుంది ''
 

Telugu Murli 12/01/18

12-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - బాబా నుండి ఆశీర్వాదాలు తీసుకోవాలంటే, ప్రతి అడుగు శ్రీమతమును అనుసరించి వేయండి. నడవడికలు మంచిగా ఉంచుకోండి '' 

ప్రశ్న :- శివబాబా హృదయాన్ని ఎవరు అధిరోహించగలరు ?
జవాబు :- ఈ పుత్రుడు మంచి సేవాధారి అని, ఇతడు అందరికీ సుఖము ఇస్తాడని, మనసా-వాచా-కర్మణా ఎవ్వరికీ దు:ఖమివ్వడని ఇలా బ్రహ్మాబాబా చెప్పినప్పుడు, ఎవరి గ్యారెంటీనైతే బ్రహ్మాబాబా గ్యారంటీ తీసుకుంటారో వారు శివబాబా హృదయాన్ని అధిరోహించగలరు. 

ప్రశ్న :- ఈ సమయములో ఆత్మిక సేవకులైన మీరు బాబాతో పాటు ఏ సేవను చేస్తారు ?
జవాబు :- మొత్తము విశ్వానికే కాక పంచ తత్వాలను కూడా పావనంగా చేసే సేవ ఆత్మిక సేవకులైన మీరు చేస్తారు. అందుకే మీరు సత్య సత్యమైన సమాజ సేవకులు. 

పాట :- తల్లి తండ్రుల ఆశీస్సులు తీసుకో,.........( లే లో దువాయే మా బాప్‌ కీ,........... )   
ఓంశాంతి. పిల్లలు పాట విన్నారు. లౌకిక తల్లిదండ్రుల ఆశీర్వాదాలనైతే అనేకమంది తీసుకుంటారు. తల్లిదండ్రుల పాదాలకు పిల్లలు నమస్కరిస్తే మాతా-పితలు ఆశీర్వదిస్తారు. కాని ఈ దండోరా(పాట) లౌకిక తల్లిదండ్రుల గురించి వేయబడింది కాదు. దండోరా అనగా అనేకులు వినేది. నీవే తల్లివి, తండ్రివి,....... మేము మీ పిల్లలము,...... మీ కృప లేక ఆశీర్వాదాల ద్వారా అపారమైన సుఖము లభిస్తుందని, అనంతమైన తండ్రిని గురించే మహిమ చేస్తారు. భారతదేశములోనే ఈ మహిమ గాయనము చేయబడ్తుంది. అందువలన ఇది తప్పకుండా భారతదేశములోనే జరిగింది. అందుకే ఈ విధంగా గాయనము చేయబడ్తుంది. ఒక్కసారిగా అనంతములోకి వెళ్లిపోవాలి. స్వర్గ రచయిత తండ్రి ఒక్కరేనని బుద్ధి చెప్తుంది. స్వర్గములో అయితే అన్ని సుఖాలు ఉన్నాయి. అచ్చట దు:ఖానికి నామ-రూపాలు కూడా ఉండజాలవు. అందుకే దు:ఖములో అందరూ స్మరిస్తారు. సుఖములో ఎవ్వరూ స్మరించరు అని గాయనముంది. అర్ధ కల్పము దు:ఖమున్నప్పుడు అందరూ స్మరణ చేస్తారు. సత్యయుగములో అపారమైన సుఖము ఉంటుంది. అందువలన అక్కడ స్మరణ చేయరు. మనుష్యులు రాతిబుద్ధి గలవారుగా ఉన్నందున కొంచెము కూడా అర్థము చేసుకోరు. కలియుగంలో అయితే అపారమైన దు:ఖముంది. ఎంత మారణహోమము జరుగుతోంది. ఎంత బాగా చదువుకున్నా, విద్వాంసులైనా ఈ పాటల వాస్తవిక అర్థము బొత్తిగా తెలియదు. నీవే తల్లివి, తండ్రివి..... అని పాడ్తారు. కాని ఈ మహిమ ఏ మాతా-పితలదో అర్థం చేసుకోరు. ఇది అనేకమంది విషయము కదా. అందరూ ఈశ్వరుని సంతానమే. కాని ఈ సమయములో అందరూ దు:ఖితులుగానే ఉన్నారు. అపారమైన సుఖము ఎవ్వరికీ లేదు. కృపతో అయితే సుఖము లభించాలి కదా. అకృపతో దు:ఖము కలుగుతుంది. తండ్రి కృపాళువుగా గాయనము చేయబడ్డారు. సాధు సత్పురుషులను కూడా కృపాళు అని అంటారు.

భక్తిమార్గములో తల్లివి నీవే, తండ్రివి నీవే అని ఏదైతే పాడ్తారో అది ఖచ్ఛితంగా యదార్థమైనదేనని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. కాని ఎవరైనా బుద్ధివంతులుగా(చదువుకున్న వారిగా) ఉంటే పరమాత్మను గాడ్‌ ఫాదర్‌ అని అంటారు కదా. మరి వారిని తల్లి అని ఎలా అంటారని అడుగుతారు. అప్పుడు వారి బుద్ధి జగదంబ వైపు పోతుంది. జగదంబ వైపు బుద్ధి వెళ్లినప్పుడు జగత్‌ పిత వైపు కూడా బుద్ధి పోవాలి. ఇప్పుడు బ్రహ్మ-సరస్వతులు భగవంతులేమీ కారు. ఈ మహిమ వారిది కాజాలదు. వారి ముందుకు వెళ్లి మీరు మాతా-పిత అని అనడం తప్పు. మనుష్యులు ఈ గాయనము చేసేది పరమపిత పరమాత్మ కొరకు. అయితే వారు మాతా-పితగా ఎలా అవుతారో వారికి తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు మాతా-పితల ఆశీర్వాదాలు తీసుకోండి....... అని చెప్పబడుతుంది. అనగా వారి శ్రీమతమును అనుసరించండి. మీ నడవడిక బాగుంటే మీ పై వాటంతకవే ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. ఒకవేళ నడవడిక బాగా లేకుంటే ఎవరికైనా దు:ఖము ఇస్తూ ఉంటే మాతా-పితలను స్మృతి చేయకుంటే ఇతరుల చేత స్మృతి చేయించకుంటే ఆశీర్వాదాలు లభించజాలవు. అప్పుడు ఇంత సుఖము కూడా పొందలేరు. తండ్రి హృదయాన్ని అధిరోహించలేరు. ఈ తండ్రి(బ్రహ్మ) హృదయము పైకి ఎక్కితే శివబాబా హృదయము పైకి కూడా ఎక్కినట్లే. ఆ మాతా-పితలదే ఈ గాయనము. బుద్ధి ఆ బేహద్‌ మాతా-పితల వైపుకు వెళ్లిపోవాలి. బ్రహ్మ వైపు కూడా ఎవ్వరి బుద్ధీ పోదు. భలే కొంతమంది బుద్ధి జగదంబ వైపుకు పోతుంది. వారి మేళా కూడా జరుగుతుంది. కాని వారి కర్తవ్యము గురించి ఎవ్వరికీ తెలియనే తెలియదు. నియమానుసారము మన సత్య-సత్యమైన మాత ఈ బ్రహ్మ అని మీకు తెలుసు. ఇది కూడా అర్థము చేసుకోవాలి. స్మృతి కూడా అలాగే చేస్తారు. ఇతడు(బ్రహ్మ) మాత కూడా అవుతాడు. తండ్రి కూడా అవుతాడు. శివబాబా కేర్‌ ఆఫ్‌ బ్రహ్మ అని వ్రాస్తారు కూడా. అందువలన తల్లే కాక తండ్రిగా కూడా అవుతాడు. ఇప్పుడు పిల్లలు ఈ తండ్రి హృదయమును అధిరోహించాలి. ఎందుకంటే శివబాబా ఇతనిలోనే ప్రవేశిస్తారు. ఈ పుత్రుడు చాలా మంచి సేవాధారి. అందరికీ సుఖమిచ్చేవాడు. మనసా-వాచా-కర్మణా ద్వారా ఎవ్వరికీ దు:ఖమివ్వడు అని బ్రహ్మబాబా గ్యారంటీ ఇచ్చినప్పుడే శివబాబా హృదయమును అధిరోహిస్తారు. మనసా-వాచా-కర్మణా ఏమి చేసినా, ఏమి మాట్లాడినా వారి ద్వారా అందరికీ సుఖమే లభించాలి. ఎవ్వరికీ దు:ఖమునివ్వరాదు. దు:ఖమునిచ్చే ఆలోచన మొదట మనసులో కలుగుతుంది. తర్వాత కర్మలో వచ్చినందున పాపము తయారవుతుంది. మనసా తుఫానులు అయితే తప్పకుండా వస్తాయి. కాని కర్మలోకి ఎప్పుడూ రాకండి. ఒకవేళ ఎవరైనా కోపపడితే లేక అసంతుష్టంగా ఉంటే తండ్రిని వచ్చి - బాబా ఏ విషయములో నా నుండి ఇతడు అసంతుష్టంగా ఉంటున్నాడు అని అడగండి. అప్పుడు బాబా అతనికి అర్థం చేయించి సముదాయిస్తారు. ఏ విషయమైనా మొదట మనసులో వస్తుంది. వాచా కూడా కర్మయే అవుతుంది. పిల్లలు తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకోవాలంటే శ్రీమతమును అనుసరించాలి. ఇది చాలా రహస్యమైన విషయము. ఒక్కరినే మాత - పిత అని అంటారు. ఈ బ్రహ్మ తండ్రే కాక పెద్ద తల్లి కూడా అయ్యాడు. ఇప్పుడు ఈ బాబా ఎవరిని అమ్మా అని పిలవాలి? ఈ మాత(బ్రహ్మ) ఎవరిని అమ్మా అని అనాలి? ఈ తల్లికైతే తల్లి ఎవ్వరూ లేరు. ఎలాగైతే శివబాబాకు తండ్రి ఎవ్వరూ లేరో అలాగే ఇతనికి తన తల్లి అంటూ ఎవ్వరూ లేరు.
పిల్లలకు ముఖ్యంగా అర్థం చేయిస్తున్నారు - మనసా-వాచా-కర్మణా ఎవరికైనా దు:ఖమునిస్తే దు:ఖము పొందుతారు. అంతేకాక పదవి భ్రష్టమైపోతుంది. సత్యమైన స్వామి(సాహెబ్‌) వద్ద సత్యంగా ఉండాలి. అలాగే ఇతనితో(బ్రహ్మతో) కూడా సత్యంగా ఉండాలి. బాబా ఈ పుత్రుడు చాలామంచి సుపుత్రుడు అని ఈ దాదా(బ్రహ్మ)యే సర్టిఫికెట్‌ ఇస్తాడు. బాబా మహిమ అయితే చేస్తారు కదా. ఎవరైతే సేవాధారి పిల్లలుగా ఉన్నారో తనువు, మనసు, ధనముతో సేవ చేస్తారో, ఎప్పుడూ ఎవ్వరికీ దు:ఖమివ్వరో వారే బాప్‌దాదా హృదయము పైకి, తల్లి హృదయము పైకి ఎక్కుతారు. ఇతని(బ్రహ్మ) హృదయము పైకి ఎక్కడం అనగా వారి(శివబాబా) సింహాసనము పై ఎక్కినట్లే. సదా సుపుత్రులైన పిల్లలకు మేము సింహాసనాధికారులుగా ఎలా అవ్వాలి? అను ఆలోచనే ఉంటుంది. ఇదే చింతలో లగ్నమై ఉంటారు. సింహాసనాలు కూడా నంబరువారుగా 8 ఉంటాయి. తర్వాత 108, ఆ తర్వాత 16,108 కూడా ఉంటాయి. కాని ఇప్పుడు మనము ఉన్నత పదవిని పొందాలి. రెండు కళలు తక్కువగా ఉండి గద్ది పై కూర్చుంటే అది శోభించదు. సుపుత్రులైన పిల్లలు ఇలా ఆలోచించి చాలా పురుషార్థము చేస్తారు - '' ఇప్పుడు మేము ప్రియమైన బాబా నుండి సూర్యవంశ వారసత్వమును పూర్తిగా తీసుకోకుంటే కల్ప-కల్పము తీసుకోలేము.'' ఇప్పుడు ఒకవేళ విజయ మాలలో కూర్చబడకుంటే కల్ప-కల్పము కూర్చబడము. ఇది కల్ప-కల్పపు పరుగు పందెము(రేస్‌). ఒకవేళ ఇప్పుడు నష్టపడితే కల్ప-కల్పము నష్టపడ్తూనే ఉంటారు. ఎవరైతే శ్రీమతము పై తల్లిదండ్రులను పూర్తిగా అనుసరిస్తారో, ఎప్పుడూ ఎవరికీ దు:ఖమివ్వరో వారే పక్కా వ్యాపారులు. అందులో నంబరు వన్‌ దు:ఖము కామ ఖడ్గాన్ని ఉపయోగించడం.
తండ్రి అంటున్నారు - అచ్ఛా, కృష్ణ భగవానువాచ అని అనుకున్నా అతడు కూడా నంబరు వన్‌యే కదా. వారి మాటనైనా గౌరవించాలి, అప్పుడే స్వర్గానికి అధికారులుగా అవుతారు. కృష్ణ భగవానుడు శ్రీమతము ద్వారా శిక్షణ ఇచ్చాడని భావిస్తారు. అది కూడా మంచిదే. అచ్ఛా, అతడి మతమును అనుసరించండి. కృష్ణుడు కూడా కామము మహాశత్రువు దాని పై విజయము పొందండి అని అన్నాడు కదా. ఈ వికారాలను జయించినప్పుడే కృష్ణపురములోకి రాగలరు. అయితే ఇది కృష్ణుని విషయము కాదు. కృష్ణుడైతే చిన్న బాలుడు, అతడు మతమునెలా ఇస్తాడు? పెద్దవాడై సింహాసనము పై కూర్చున్నప్పుడు అతడు మతమునిస్తాడు(సలహా ఇవ్వగలడు). సలహానిచ్చేందుకు అర్హుడైనప్పుడే రాజ్యపాలన చేస్తాడు కదా. ఇప్పుడు శివబాబా అంటున్నారు - నన్ను నిరాకార ప్రపంచములో స్మృతి చేయండి. కృష్ణుడు నన్ను స్వర్గములో స్మృతి చేయండి అని అంటాడు. అతడు కూడా కామము మహాశత్రువు, దాని పై విజయము పొందండి అని అంటున్నాడు. అక్కడ విషము లభించదు. కావున విషాన్ని వదిలి పవిత్రంగా అవ్వండి. ఈ విధంగా కృష్ణుని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. అచ్ఛా, మనుష్యులు నా పేరు తొలగించి నా కొడుకు పేరు వేసినారనుకోండి, అతడు కూడా సర్వ గుణ సంపన్నుడే కదా. గీతలో కామము మహాశత్రువని వ్రాయబడి ఉందని అతడు కూడా అంటాడు. కాని అతని మాట కూడా వినరు. అతని సలహాను కూడా పాటించరు. కృష్ణుడు స్వయంగా వచ్చినప్పుడు అతని మతమును అనుసరిస్తాము, అంతవరకు మునకలు వేస్తూనే ఉంటామని భావిస్తారు. నేను మీకు రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చానని సన్యాసులు మొదలైనవారు అనలేరు. ఈ విధంగా తండ్రి ఒక్కరు మాత్రమే అర్థం చేయిస్తారు. అంతేకాక ఇది సంగమ యుగములోని విషయమే. కృష్ణుడు సత్యయుగములో ఉంటాడు. అతడిని కూడా ఇలా అర్హునిగా తయారుచేసినవారు ఎవరో ఉంటారు కదా. ఇప్పుడు శివబాబా స్వయంగా చెప్తున్నారు - '' కృష్ణుడు మరియు అతని వంశములోని వారందరినీ ఇప్పుడు నేను స్వర్గములోకి వెళ్లేందుకు అర్హులుగా చేస్తున్నాను. '' పిల్లలు స్వర్గములోకి వెళ్లి ఉన్నత పదవి పొందాలని బాబా ఎంతో శ్రమ చేస్తున్నారు. లేకుంటే చదువుకున్నవారి ముందు మూటలు మోయవలసి వస్తుంది. తండ్రి నుండి అయితే పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. మేము ఇంత సుపుత్రులుగా ఉన్నామా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. సుపుత్రులు కూడా నంబరువారుగా ఉంటారు. ఉత్తములు, మధ్యములు, కనిష్టులు. ఉత్తములైతే ఎప్పుడూ దాగి ఉండలేరు. మేము భారతదేశానికి సేవ చేయాలని వారి హృదయములో దయ కలుగుతుంది. సమాజ సేవకులు కూడా నంబరువారుగా ఉంటారు. ఉత్తములు, మధ్యములు, కనిష్టులు. కొందరైతే చాలా దోచుకుంటారు. వస్తువులన్నీ అమ్ముకొని తినేస్తారు. అటువంటివారిని సుపుత్రులైన సమాజ సేవకులని ఎలా అంటారు? తమకు తాము సమాజ సేవకులుగా ఎంతోమంది పిలిపించుకుంటారు. ఎందుకంటే సమాజానికి సేవ చేస్తారు. అయితే సత్యమైన సేవ తండ్రి ఒక్కరు మాత్రమే చేస్తారు.
మేము కూడా బాబాతో పాటు ఆత్మిక సేవకులమని మీరంటారు. మొత్తము సృష్టికే కాదు తత్వాలను కూడా పవిత్రంగా చేస్తామని మీరు అంటారు. ఈ సమయములో తత్వాలు కూడా తమోప్రధానంగా ఉన్నాయని, వాటిని కూడా సతోప్రధానంగా చేయాలని సన్యాసులకు తెలియదు. సతోప్రధాన తత్వాలతో శరీరాలు కూడా సతోప్రధానంగా అయిపోతాయి. సన్యాసులకైతే ఎప్పుడూ సతోప్రధాన శరీరము తయారవ్వదు. ఎందుకంటే వారు వచ్చేదే రజోప్రధాన సమయములో. బాబా ఎంతగానో అర్థం చేయిస్తారు అయినా పిల్లలు మళ్లీ మర్చిపోతారు. ఎవరైతే ఇతరులకు వినిపిస్తూ ఉంటారో వారికి గుర్తుంటుంది. దానము చేయకపోతే ధారణ కూడా జరగదు. ఎవరైతే మంచి సర్వీసు చేస్తారో బాప్‌దాదా కూడా వారి పేరును ప్రసిద్ధము చేస్తారు. సేవ చేయడంలో ఎవరెవరు చురుకుగా ఉన్నారో పిల్లలకు కూడా తెలుసు. సర్వీసులో ఎవరైతే తత్పరులుగా ఉన్నారో వారు బాబా హృదయాన్ని అధిరోహిస్తారు. ఎల్లప్పుడూ మాతా-పితలను అనుసరించాలి. వారు మాత్రమే సింహాసనాధికారులుగా అవుతారు. ఎవరైతే సర్వీసు చేస్తారో వారు ఇతరులకు సుఖమునిస్తారు. నేను బాబాకు సుపుత్రునిగా అయ్యానా అని మీ ముఖాన్ని దర్పణములో చూసుకోండి. '' మా సర్వీసు చార్టు ఇలా ఉంది, నేను ఈ ఈ సేవలు చేస్తున్నాను బాబా మీరే నిర్ణయించండి అని మీరే స్వయంగా వ్రాయవచ్చు. అప్పుడు బాబాకు కూడా తెలుస్తుంది. స్వయం మీ అంతకు మీరే - నేను ఉత్తముడినా, మధ్యముడినా, లేక కనిష్ఠుడినా? అని నిర్ణయించుకోవచ్చు. మహారథులెవరో, అశ్వారూఢులు ఎవరో పిల్లలకు కూడా తెలుసు. ఎవ్వరూ దాగి ఉండలేరు. తండ్రికి లెక్కాచారాన్ని పంపితే బాబా అప్రమత్తము కూడా చేస్తారు. లెక్కాచారము పంపకున్నా అటెన్షన్‌ అయితే లభిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఎంత వారసత్వము తీసుకోవాలనుకుంటే అంత పూర్తి పూర్తిగా తీసుకోండి. తర్వాత మళ్లీ బాప్‌దాదా నుండి కూడా సర్టిఫికెట్‌ లభిస్తుంది. ఈ పెద్ద తల్లి కూర్చుని ఉంది. ఇతనితో సర్టిఫికెట్‌ లభించగలదు. ఈ అద్భుతమైన తల్లికి, తల్లి ఎవ్వరూ లేరు. ఎలాగైతే ఆ తండ్రికి తండ్రి ఎవ్వరూ లేరో అలా ఈ తల్లికి కూడా తల్లి ఎవ్వరూ లేరు. మమ్మా స్త్రీలలో నంబరువన్‌. డ్రామాలో జగదంబ గాయనము చేయబడింది. సేవ కూడా చాలా చేసింది. బాబా ఎలాగైతే సేవకు వెళ్తారో అలా మమ్మా కూడా వెళ్లేది. చిన్న - చిన్న పల్లెలలో సేవ చేసేది. అందరికంటే చురుకుగా ముందుకు వెళ్లింది. బాబా జతలో అయితే పెద్ద బాబా ఉన్నారు. కనుక పిల్లలు వీరిని చాలా సంభాళన చేయవలసి వస్తుంది. సత్యయుగములో ప్రజలు చాలా సుఖంగా ఉంటారు. వారికి తమ మహళ్లు, ఆవులు, ఎద్దులు మొదలైనవన్నీ ఉంటాయి. మంచిది. పిల్లలూ, ఖుషీగా ఉండండి, సదా సంపన్నంగా ఉండండి, మర్చిపోకండి. ఇతరులనెవ్వరినీ స్మృతి చేయకండి. ఎందుకంటే శివబాబా ఒక్కరిని మాత్రమే స్మృతి చేయాలి. మీ శరీరాన్ని కూడా మర్చిపోవాలి. మరి ఇతరులను ఎలా తల్చుకుంటారు? అచ్ఛా. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. 

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఎవ్వరినీ అసంతుష్ట పరచరాదు. మనసా-వాచా-కర్మణా అందరికీ సుఖమునిచ్చి తండ్రి ఆశీర్వాదాలను, పరివారము నుండి ఆశీర్వాదాలను తీసుకోవాలి.
2. సుపుత్రులుగా అయ్యి భారతదేశానికి ఆత్మిక సేవ చేయాలి. దయా హృదయులై ఆత్మిక సమాజ సేవకులుగా తయారవ్వాలి. తనువు-మనసు-ధనములతో సేవ చేయాలి. సత్యమైన స్వామితో (సచ్చే సాహెబ్‌ సే) సత్యముగా ఉండాలి. 

వరదానము :- ''హృదయము (దిల్‌) ఒక్క హృదయాభిరామునిలోనే (దిలారామునిలోనే) నిలిపి సహజయోగులుగా అయ్యే సర్వ ఆకర్షణా ముక్త్‌ భవ ''
దిలారామునికి దిల్‌ ఇవ్వడం అనగా దిల్‌లో నిలుపుకోవడం. దీనినే సహజ యోగము అని అంటారు. ఎక్కడైతే దిల్‌ ఉంటుందో, అక్కడకే దిమాగ్‌(బుద్ధి) కూడా వెళ్తుంది. ఎప్పుడైతే దిల్‌ మరియు దిమాగ్‌ అనగా స్మృతి, సంకల్పము, శక్తి అన్నీ తండ్రికి ఇచ్చేశారో, మనసా, వాచా, కర్మణా తండ్రి వారిగా అయిపోతే ఏ ఇతర సంకల్పము వచ్చేందుకు లేక ఏ విధమైన ఆకర్షణ కలిగేందుకు అవకాశమే లేదు. స్వప్నాలు కూడా ఈ ఆధారముతోనే వస్తాయి. ఎప్పుడైతే అన్నీ మీవే అన్నప్పుడు, వేరే ఆకర్షణ రానే రాజాలదు. సహజంగానే సర్వ ఆకర్షణా ముక్తులుగా అయిపోతారు. 

స్లోగన్‌ :- ''తండ్రి పై, ఈశ్వరీయ పరివారము పై గాఢమైన ప్రేమ ఉంటే, సఫలత లభిస్తూ ఉంటుంది ''
 

Telugu Murli 11/01/18

11-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - మీరు శాంతిని స్థాపించేందుకు నిమిత్తమైనవారు, అందువలన మీరు చాలా చాలా శాంతిగా ఉండాలి. మేము బాబా ద్వారా దత్తత తీసుకోబడిన పిల్లలము, పరస్పరము సోదరీ-సోదరులము అని బుద్ధిలో ఉండాలి ''

ప్రశ్న :- పూర్తిగా సమర్పణ అయినవారు అని ఎవరిని అంటారు? వారి గుర్తులు ఏవి ?
జవాబు :- ఎవరి బుద్ధిలో అయితే మేము ఈశ్వరీయ మాతా-పితల ద్వారా పాలింపబడుతున్నాము, బాబా, మా సర్వస్వమూ మీదే, మీరే మమ్ములను పాలన చేస్తున్నారు అని ఉంటుందో, వారే పూర్తిగా సమర్పణ అయినవారు. భలే ఏదైనా ఉద్యోగము మొదలైనవి చేస్తున్నా ఈ సర్వస్వము బాబా కొరకే అని భావిస్తూ బాబాకు సహాయము చేస్తూ ఉంటారో, తద్వారా ఇంత గొప్ప యజ్ఞ కార్య వ్యవహారాలు నడుస్తాయో, అందరి పాలన జరుగుతుందో........... ఇటువంటి పిల్లలు కూడా సమర్పణ బుద్ధిగలవారే. సమర్పణ బుద్ధితో పాటు ఉన్నత పదవిని పొందుకునేందుకు చదవాలి, చదివించాలి కూడా. శరీర నిర్వహణార్థము కర్మలు చేస్తూ అనంతమైన మాతా-పితలను శ్వాస శ్వాసలో స్మృతి చేయాలి. 

పాట :- ఓం నమ: శివాయ,...............
ఓంశాంతి. ఇది మహిమ చేసే పాట. వాస్తవానికి మహిమ అంతా అత్యంత శ్రేష్ఠమైన ఉన్నతాతి ఉన్నతమైన ఆ పరమాత్మదే. వారిని గురించి పిల్లలకు తెలుసు. పిల్లల ద్వారా ప్రపంచమంతా వారే మా మాతా-పితలని తెలుసుకుంటారు. ఇప్పుడు మీరు మాతా-పితలతో పాటు కుటుంబములో కూర్చొని ఉన్నారు. శ్రీ కృష్ణుని అయితే మాత-పిత అని అనజాలరు. భలే కృష్ణునితో పాటు రాధ ఉండినా వారిని మాతా-పితలని అనరు. ఎందుకంటే వారు రాకుమార-రాకుమారీలు. శాస్త్రాలలో ఈ పొరపాటు ఉంది. ఇప్పుడు ఈ అనంతమైన తండ్రి మీకు సర్వ శాస్త్రాల సారాన్ని తెలుపుచున్నారు. భలే ఈ సమయములో పిల్లలైన మీరు మాత్రమే నా సన్ముఖములో కూర్చొని ఉన్నారు. కొందరు పిల్లలు దూరంగా ఉన్నా వారు కూడా వింటున్నారు. మాతా-పితలు మనకు సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారని, సదా సుఖీలుగా చేసేందుకు దారిని లేక యుక్తిని తెలుపుతున్నారని వారికి తెలుసు. ఇది ఖచ్ఛితంగా ఇల్లు వంటిదే. కొంతమంది పిల్లలు ఇక్కడ ఉన్నారు, చాలామంది అయితే బయట ఉన్నారు. వీరు బ్రహ్మ ముఖవంశావళి అయిన నూతన రచన. అది పాత రచన. బాబా మనలను సదా సుఖవంతంగా తయారు చేసేందుకు వచ్చారని పిల్లలకు తెలుసు. లౌకిక తల్లి-తండ్రి కూడా పిల్లలను పెంచి పాఠశాలకు తీసుకెళ్తారు. ఇచ్చట అనంతమైన తండ్రి మనలను చదివిస్తూ ఉండడమే కాక మన పాలన కూడా చేస్తున్నారు. పిల్లలైన మీకిప్పుడు ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ లేనే లేరు. మాతా-పితలు కూడా వీరు మా పిల్లలని భావిస్తారు. లౌకిక కుటుంబములో అయితే 10-15 మంది పిల్లలుంటారు, ఇద్దరు, ముగ్గురికి వివాహము చేసి ఉంటారు. ఇచ్చట అయితే అందరూ బాబా పిల్లలే కూర్చుని ఉన్నారు. ఎంతమంది పిల్లలకు జన్మనివ్వాలన్నా ఇప్పుడే బ్రహ్మ ముఖకమలము ద్వారా ఇవ్వాలి. చివర్లో అయితే పిల్లలకు జన్మనిచ్చేదే ఉండదు. అందరూ వాపస్‌ వెళ్ళాలి. ఈ ఒక్క దత్తు తీసుకోబడిన మాతయే నిమిత్తమై ఉంది. ఇది చాలా అద్భుతమైన విషయము. పేదవాని కొడుకు, నా తండ్రి పేదవాడు అని తప్పకుండా భావిస్తాడు. ధనవంతుని కొడుకు నా తండ్రి ధనవంతుడని భావిస్తాడు. అచ్చట అయితే అనేకమంది తల్లిదండ్రులున్నారు. కాని వీరు మొత్తము ప్రపంచమంతటికీ ఒకే మాతా-పిత అయ్యారు. మనము వారి ముఖము(నోటి) ద్వారా దత్తత తీసుకోబడ్డామని మీరందరికీ తెలుసు. వీరు మన పారలౌకిక మాతా-పిత. మనుష్యులందరూ చాలా-చాలా దు:ఖములో ఉన్నప్పుడు వారు ఈ పాత సృష్టిలోనే వస్తారు. మనము ఈ పారలౌకిక మాతా-పితల ఒడిని తీసుకున్నామని పిల్లలకు తెలుసు. మనమందరమూ పరస్పరము సోదరీ-సోదరులము. మన మధ్య ఇక ఏ ఇతర సంబంధమూ లేదు. అందువలన సోదరీ-సోదరులందరూ పరస్పరము చాలా మధురంగా, రాయల్‌గా, పీస్‌ఫుల్‌, నాలెడ్జ్‌ఫుల్‌, బ్లిస్‌ఫుల్‌గా అవ్వాలి. మీరు శాంతి స్థాపన చేస్తున్నందున మీరు కూడా చాలా శాంతిగా ఉండాలి. మనము పారలౌకిక తండ్రికి దత్తు పిల్లలమని, తండ్రి పరంధామము నుండి వచ్చారని పిల్లల బుద్ధిలో ఉండాలి. వారు తాత(దాదా), వీరు దాదా(పెద్ద అన్న). ఎవరైతే పూర్తి సరెండర్‌గా ఉన్నారో, వారు ఈశ్వరీయ తల్లిదండ్రుల నుండి పాలింపబడుతున్నామని భావిస్తారు. బాబా ఈ సర్వస్వమూ మీదే. మీరే మమ్ములను పాలన చేస్తున్నారు. ఏ పిల్లలైతే సమర్పణ అవుతారో వారి ద్వారా అందరి పాలన జరుగుతుంది. భలే ఎవరైనా ఏదైనా ఉద్యోగము చేస్తూ ఉండినా ఇదంతా బాబా కొరకే అని భావిస్తారు. అలా భావించడము వలన తండ్రికి కూడా సహాయము చేస్తూ ఉంటారు. లేకుంటే యజ్ఞ కార్య వ్యవహారాలు ఎలా నడవాలి? రాజా-రాణులను కూడా మాతా-పితలని పిలుస్తారు కాని వారు శారీరిక తల్లి-తండ్రులౌతారు. రాజ మాత, రాజ పిత అని కూడా అంటారు. కాని వీరు అనంతమైనవారు. మనము ఇప్పుడు మతా-పితల జతలో కూర్చొని ఉన్నామని పిల్లలకు తెలుసు. మనము ఎంత చదువుకుంటామో, చదివిస్తామో అంత ఉన్నత పదవిని పొందుతామని కూడా పిల్లలకు తెలుసు. దానితో పాటు శరీర నిర్వహణార్థము కర్మలు కూడా చేయాలి. ఈ దాదా కూడా వృద్ధుడు. శివబాబాను ఎప్పుడూ వృద్ధుడని, యువకుడని అనరు. వారు నిరాకారులు. ఆత్మలైన మనలను నిరాకార తండ్రి దత్తత తీసుకున్నారని కూడా పిల్లలైన మీకు తెలుసు. ఈ బ్రహ్మ సాకారములో ఉన్నాడు. తండ్రిని నా వారిగా చేసుకున్నాను,........ అని ఆత్మ అంటుంది. క్రిందికి వస్తే సోదరీ-సోదరులైన మేము బ్రహ్మను మావారిగా చేసుకున్నామని అంటారు. శివబాబా అంటున్నారు - మీరు బ్రహ్మ ద్వారా మా బ్రహ్మ ముఖవంశావళి వారిగా అయ్యారు. బ్రహ్మ కూడా - మీరు నా పిల్లలుగా అయ్యారని అంటారు. బ్రాహ్మణులైన మీ బుద్ధిలో శ్వాస శ్వాసలో వీరు మా తండ్రి అని, వీరు మా దాదా అని మెదులుతూ ఉంటుంది. తండ్రి కంటే ఎక్కువగా తాతను స్మృతి చేస్తారు. మనుష్యులైతే తండ్రితో జగడమాడి అయినా తాత ఆస్తిని తీసుకుంటారు. మీరు కూడా ప్రయత్నించి తండ్రి కంటే ఎక్కువగా తాత నుండి వారసత్వము తీసుకోవాలి. బాబా అడిగినప్పుడు అందరూ మేము నారాయణుని వరిస్తామని అంటారు. నూతనంగా వచ్చేవారు పవిత్రంగా లేకుంటే చేతులు ఎత్తలేరు. మాయ చాలా ప్రబలమయ్యిందని అంటారు. మేము శ్రీ నారాయణుని లేక లక్ష్మిని వరిస్తామని చెప్పను కూడా చెప్పలేరు. బాబా సన్ముఖములో వినిపించినప్పుడు ఎంత ఖుషీ పాదరస మీటరు పైకి ఎక్కుతుందో చూడండి. బుద్ధిని రిఫ్రెష్‌ చేసినప్పుడు నషా ఎక్కుతుంది. కొంతమందికి ఈ నషా స్థిరంగా ఉంటుంది, కొంతమందికి తగ్గిపోతుంది. అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి, 84 జన్మలను గుర్తు చేసుకోవాలి, అంతేకాక చక్రవర్తి పదవిని కూడా స్మృతి చేయాలి. ఎవరైతే అంగీకరించరో వారికి గుర్తుండదు. బాబా-బాబా అని నోటితోనేమో అంటారు కాని సత్య-సత్యమైన స్మృతి చేయరని, లక్ష్మీనారాయణులను వరించేందుకు అర్హులుగా కూడా లేరని బాప్‌దాదా భావిస్తారు. వారి నడవడికే అలా ఉంటుంది. అంతర్యామి అయిన తండ్రి ప్రతి ఒక్కరి బుద్ధిని అర్థము చేసుకుంటారు. ఇచ్చట శాస్త్రాల మాటే లేదు. తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పించారు. దానికి గీత అని పేరు పెట్టారు. ఇకపోతే చిన్న పెద్ద ధర్మాల వారందరూ తమ తమ శాస్త్రాలను తయారు చేసుకుంటారు. ఆ శాస్త్రాలనే చదువుతూ ఉంటారు. బాబా శాస్త్రాలు చదవలేదు. తండ్రి అంటున్నారు - పిల్లలూ, నేను మీకు స్వర్గానికి దారి తెలిపేందుకు వచ్చాను. మీరు ఎలాగైతే అశరీరులుగా వచ్చారో అలాగే వెళ్ళిపోవాలి. దేహ సహితము దు:ఖమునిచ్చు ఈ కర్మ బంధనాలన్నీ తుంచేయాలి. ఎందుకంటే దేహము కూడా దు:ఖమునిస్తుంది. జబ్బు చేస్తే క్లాసుకు కూడా రాలేరు. ఇది కూడా దేహ బంధనమై పోయింది కదా. ఇందులో బుద్ధి చాలా దృఢంగా(సాలిమ్‌గా) ఉండాలి. మొదట బాబా తప్పకుండా స్వర్గాన్ని రచిస్తారని నిశ్చయముండాలి. ఇప్పుడిది నరకము. ఎవరైనా మరణించినప్పుడు స్వర్గస్థులయ్యారని అంటారు అనగా తప్పకుండా నరకములో ఉన్నట్లే కదా. అయితే ఈ విషయాలన్నీ మీరు ఇప్పుడే అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీ బుద్ధిలో స్వర్గముంది. బాబా ప్రతి రోజు క్రొత్త - క్రొత్త పద్ధతులలో అర్థం చేయిస్తారు. కావున మీ బుద్ధిలో మంచిరీతిగా కూర్చుంటాయి. వీరు మన అనంతమైన మాతా-పితలు. కావున మొదట మీ బుద్ధి ఒక్కసారిగా పైకి వెళ్ళిపోతుంది. తర్వాత మళ్లీ ఈ సమయములో బాబా ఆబూలో ఉన్నారని అంటారు. ఉదాహరణానికి యాత్రలకు వెళ్ళినప్పుడు బదిరీనాథ్‌ ఆలయము పైన ఉంటుంది. పండాలు అచ్చటికి తీసుకెళ్తారు. స్వయంగా బదిరీనాథ్‌ వచ్చి తీసుకెళ్ళరు. మనుష్యులు పండాలుగా అవుతారు. కాని ఇచ్చట శివబాబా స్వయం పరంధామము నుండి వస్తారు. వారంటున్నారు - ఓ ఆత్మలారా! మీరు ఈ శరీరాలను వదిలి శివపురానికి రావాలి అని అంటారు. ఎక్కడికి వెళ్ళాలో ఆ లక్ష్యము తప్పకుండా గుర్తుంటుంది. ఆ బదిరీనాథుడు చైతన్యములో వచ్చి పిల్లలను తన వెంట తీసుకొని వెళ్లడం జరగదు కదా. అతడైతే ఇక్కడి నివాసియే. కాని పరమపిత పరమాత్మ నేను పరంధామ నివాసినని అంటున్నారు. మిమ్ములను తీసుకెళ్లేందుకు వచ్చాను. కృష్ణుడైతే ఈ విధంగా అనలేడు. కాని రుద్రుడైన శివబాబా చెప్తున్నారు. ఈ రుద్ర యజ్ఞము రచింపబడింది. గీతలో కూడా రుద్రుని విషయము వ్రాయబడి ఉంది. నన్ను స్మృతి చేయండని ఆ ఆత్మిక తండ్రి చెప్తున్నారు. తండ్రి ఎటువంటి యుక్తితో యాత్ర నేర్పిస్తారంటే ఎప్పుడు వినాశనము జరిగినా ఆత్మలైన మీరు శరీరాలను వదిలి నేరుగా తండ్రి వద్దకు వెళ్ళిపోతారు. మళ్లీ శుద్ధమైన ఆత్మకు శుద్ధమైన శరీరము కావాలి. ఈ పాత సృష్టి వినాశనమైన తర్వాత కొత్త శరీరము లభిస్తుంది. ఇప్పుడు ఆత్మలందరూ బాబా జతలో దోమల వలె వాపస్‌ వెళ్ళిపోతారు. ఈ విషయ సాగరము నుండి ఆవలి తీరానికి తీసుకెళ్తారు కనుక వారిని నావికుడని కూడా అంటారు. కృష్ణుని నావికుడని అనజాలరు. ఈ దు:ఖ ప్రపంచము నుండి సుఖ ప్రపంచానికి తండ్రియే తీసుకెళ్తారు. ఇదే భారతదేశము విష్ణుపురముగా ఉండేది. అందులో లక్ష్మీనారాయణుల రాజ్యము ఉండేది. ఇప్పుడిది రావణ పురము. రావణుని చిత్రము కూడా చూపించాలి. చిత్రాలను బాగా ఉపయోగించాలి. మన ఆత్మ ఎలా ఉంటుందో బాబా ఆత్మ కూడా అలాగే ఉంటుంది. వారికి, మనకు ఒకే ఒక తేడా - మనము మొదట అజ్ఞానులుగా ఉండేవారము, కాని వారు జ్ఞానసాగరులు. ఎవరికైతే రచయిత, రచనల గురించి తెలియదో వారిని అజ్ఞానులని అంటారు. రచయిత ద్వారా ఎవరైతే రచయిత, రచనల గురించి తెలుసుకుంటారో వారిని జ్ఞానులని అంటారు. మీకు ఈ జ్ఞానము ఇచ్చట మాత్రమే లభిస్తుంది, సత్యయుగములో లభించదు. పరమాత్మ విశ్వానికి అధిపతులని వారంటారు. మనుష్యులు ఆ మాలికుని స్మృతి చేస్తారు. కాని వాస్తవానికి విశ్వము లేక సృష్టికి యజమానులుగా లక్ష్మీనారాయణులు అవుతారు. నిరాకార శివబాబా విశ్వానికి యజమానిగా అవ్వరు. కనుక ఆ మాలికుడు నిరాకారమా, సాకారమా? అని వారిని అడగాలి. నిరాకారమైతే సాకార సృష్టికి అధిపతులుగా అవ్వలేరు. వారు బ్రహ్మాండానికి యజమాని. వారే స్వయంగా వచ్చి పతిత ప్రపంచాన్ని పావన ప్రపంచంగా తయారు చేస్తారు. అంతేకాని స్వయం పావన ప్రపంచానికి మాలికులుగా అవ్వరు. ఆ ప్రపంచానికి లక్ష్మీనారాయణులు మాలికులుగా అవుతారు. అలా తయారు చేయువారు నిరాకార తండ్రి. ఇవన్నీ అర్థము చేసుకునే చాలా రహస్యమైన విషయాలు. ఆత్మలైన మనము కూడా బ్రహ్మతత్వములో ఉన్నప్పుడు బ్రహ్మాండానికి అధికారులము. ఉదాహరణానికి రాజా-రాణులు, మేము భారతదేశానికి అధికారులమని అంటారు. ప్రజలు కూడా వారిలాగా మేము మాలికులమని అంటారు. ఎందుకంటే అచ్చట నివసిస్తారు కదా. అలాగే తండ్రి బ్రహ్మాండానికి మాలికులు. అచ్చట నివసించినందున మనము కూడా మాలికులమే. బాబా వచ్చి మళ్లీ నూతన సృష్టిని రచిస్తారు. వారంటున్నారు - నేను దీని పై రాజ్యపాలన చేయను, నేను మనిషిగా అవ్వను. నేను ఈ శరీరాన్ని కూడా లోను(అప్పు)గా తీసుకుంటాను. మిమ్ములను ఈ సృష్టికి యజమానులుగా చేసేందుకు రాజయోగము నేర్పిస్తాను. మీరు ఎంత పురుషార్థము చేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు. ఇందులో తక్కువ చేయకండి. టీచరైతే అందరినీ చదివిస్తారు. పరీక్షలో చాలామంది పాస్‌ అవుతే టీచరు ప్రత్యక్షత కూడా జరుగుతుంది. అప్పుడు వారికి ప్రభుత్వము నుండి లిఫ్ట్‌(ప్రమోషన్‌) లభిస్తుంది. ఇది కూడా అటువంటిదే. ఎంత బాగా చదువుకుంటారో అంత మంచి పదవి లభిస్తుంది. తల్లి-తండ్రి కూడా సంతోషిస్తారు. పరీక్షలో పాస్‌ అవుతే మిఠాయిలు పంచుతారు. ఇచ్చటైతే మీరు ప్రతి రోజూ మిఠాయి పంచుతారు. మళ్లీ పరీక్షలో పాస్‌ అయినప్పుడు బంగారు పుష్పాల వర్షము కురుస్తుంది. మీ పై ఆకాశము నుండి పుష్పాలేవీ పడవు కాని మీరు ఒక్కసారిగా బంగారు మహళ్ళకు అధిపతులుగా అవుతారు. ఇలా ఎవరినైనా మహిమ చేసేందుకు బంగారుతో పుష్పాలు తయారుచేసి వారి పై వేస్తారు. ఉదాహరణానికి దర్భంగా రాజు చాలా ధనవంతుడు. వారి కుమారుడు విదేశాలకు వెళ్లినప్పుడు పెద్ద పార్టీ ఇచ్చి చాలా ఖర్చు చేశాడు. బంగారు పుష్పాలు తయారు చేయించి కుమారుని పై వర్షింపచేశాడు. దానికి చాలా ఖర్చయ్యింది. అప్పుడు అతని పేరు చాలా ప్రఖ్యాతమయ్యింది. భారతవాసులు ధనము ఎలా వెదజల్లుతారో చూడండి అనేవారు. కాని మీరు స్వయమే బంగారు మహళ్ళలోకి వెళ్ళి కూర్చుంటారు. కావున మీకు ఎంత నషా ఉండాలి. తండ్రి అంటున్నారు - కేవలం నన్ను మరియు చక్రాన్ని స్మృతి చేస్తే మీ నావ ఆవలి తీరానికి వెళ్లిపోతుంది. ఎంత సులభము! అని బాబా అంటున్నారు.

పిల్లలైన మీరు చైతన్యమైన దీపపు పురుగులు. బాబా చైతన్య దీపము. ఇప్పుడు మా రాజ్యము స్థాపన జరగనున్నదని మీరంటారు. భక్తికి ఫలమిచ్చేందుకు సత్యమైన బాబా వచ్చారు. బాబా స్వయంగా వచ్చి ఎలా నూతన బ్రాహ్మణ సృష్టిని రచిస్తారో తెలుపుచున్నారు. నేను తప్పకుండా రావలసి వచ్చింది. మేమంతా బి.కెలమని, శివబాబా పౌత్రులమని పిల్లలైన మీకు తెలుసు. ఇది అద్భుతమైన కుటుంబము. దేవీ దేవతా ధర్మము నాటు(అంటు) ఎలా పడుతోందో చిత్రములో స్పష్టంగా ఉంది. వృక్షము క్రింద వేర్లలో మీరు కూర్చొని ఉన్నారు. పిల్లలైన మీరు ఎంతో సౌభాగ్యశాలురు. పిల్లలైన మిమ్ములను రావణుని సంకెళ్ల నుండి విడిపించేందుకు వచ్చానని, రావణుడు మిమ్ములను రోగులుగా చేశాడని అత్యంత ప్రియమైన తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు - నన్ను స్మృతి చేయండి, అనగా శివబాబాను స్మృతి చేయండి. ఈ స్మృతి ద్వారా మీ జ్యోతి వెలుగుతుంది. మళ్లీ మీరు ఎగిరేందుకు అర్హులుగా అవుతారు. మాయ అందరి రెక్కలు విరిచేసింది. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. 

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. బుద్ధిని దృఢంగా చేసుకునేందుకు దేహములో ఉంటూ దేహ బంధనాల నుండి భిన్నంగా ఉండాలి. అశరీరులయ్యే అభ్యాసము చేయాలి. రోగాలు మొదలైనవి వచ్చిన సమయములో కూడా తండ్రి స్మృతిలో ఉండాలి.
2. పారలౌకిక మాతా-పితల పిల్లలుగా అయ్యారు. అందువలన చాలా - చాలా మధురంగా, రాయల్‌గా, శాంతియుతంగా, నాలెడ్జ్‌ఫుల్‌గా, బ్లిస్‌ఫుల్‌గా(జ్ఞాన సంపన్నులుగా, ఆనందంగా) ఉండాలి. శాంతిగా ఉంటూ శాంతి స్థాపన చేయాలి. 

వరదానము :- ''తెగిపోని స్మృతి ద్వారా సర్వ సమస్యలను పరిష్కరించే ఉడ్‌తా పంఛీ భవ(ఎగిరే పక్షిగా అవ్వండి).''
బాబా నా వాడని ఎప్పుడైతే అనుభవమవుతుందో అప్పుడు స్వతహాగా బాబా గుర్తుంటాడు. ఏదైతే నాదిగా ఉంటుందో అది స్వతహాగా గుర్తుంటుంది. స్మృతి చేసే అవసరముండదు. నాది అనగా అధికారము ప్రాప్తమవ్వడం. బాబా నా వాడు, నేను బాబా వాడిని/దానిని - దీనినే సహజయోగము అని అంటారు. ఇటువంటి సహజ యోగులుగా అయ్యి ఒక్క తండ్రి స్మృతి అనే లగ్నములో మగ్నమై ఉంటూ ముందుకు వెళ్తూ ఉండండి. ఈ తెగిపోని స్మృతియే అన్ని సమస్యలను పరిష్కరించి ఎగిరేపక్షిగా తయారు చేసి ఎగిరేకళలోకి తీసుకెళ్తుంది. 

స్లోగన్‌ :- ''మనన శక్తిని అనుభవం చేసే అనుభవీగా అయితే జ్ఞాన ధనము వృద్ధి చెందుతూ ఉంటుంది''
 

Telugu Murli 10/01/18

10-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - సాకార శరీరాన్ని గుర్తు తెచ్చుకోవడం కూడా భూతాల అభిమానులుగా అవ్వడం. ఎందుకంటే శరీరము పంచ భూతాలతో తయారు చేయబడింది. మీరు దేహీ-అభిమానులుగా అయ్యి ఒక్క విదేహి తండ్రినే స్మృతి చేయాలి'' 

ప్రశ్న :- ఒక్క తండ్రియే చేసే అన్నింటికంటే సర్వోత్తమమైన కార్యము ఏది ?
జవాబు :- ఈ మొత్తము తమోప్రధాన సృష్టినంతా సతోప్రధానంగా, సదా సుఖవంతముగా తయారు చేయడమే అన్నింటికంటే సర్వోత్తమ కార్యము. ఇది ఒక్క తండ్రియే చేస్తారు. ఈ శ్రేష్ఠమైన కార్యము కారణంగా వారి స్మృతి చిహ్నాలు కూడా చాలా ఉన్నతాతి ఉన్నతంగా తయారు చేయబడ్డాయి. 

ప్రశ్న :- ఏ రెండు శబ్ధాలలో మొత్తం డ్రామా రహస్యమంతా పూర్తిగా వచ్చేస్తుంది ?
జవాబు :- పూజ్యులు మరియు పూజారులు. మీరు పూజ్యులుగా ఉన్నప్పుడు ఉత్తమ పురుషులుగా ఉండేవారు తర్వాత మళ్లీ మధ్యమ పురుషులు, కనిష్ఠులుగా అవుతారు. మాయ పూజ్యుల నుండి పూజారులుగా చేసేస్తుంది. 

పాట :- సభలో దీపము వెలిగింది, ....... (మహఫిల్‌ మే జల్‌ ఉఠీ శమా,............) 
ఓంశాంతి. భగవంతుడు కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - మనుష్యులను భగవంతుడని అనడానికి వీలు లేదు. బ్రహ్మ, విష్ణు, శంకరులకు కూడా చిత్రాలు(శరీరాలు) ఉన్నాయి. కావున వారిని కూడా భగవంతుడని అనడానికి వీలు లేదు. పరమపిత పరమాత్మ నివాసము, వారి నివాసము కంటే ఉన్నతమైనది. వారిని మాత్రమే ప్రభూ! ఈశ్వరా! భగవంతుడా! అని మొదలైన పేర్లతో పిలుస్తారు. మనుష్యులు వారిని పిలిచినప్పుడు, వారికి ఏ ఆకారము గాని, సాకారమూర్తి గాని కనిపించదు. అందువలన ఏ మనిషి ఆకారమునైనా వారు భగవంతుడని అనేస్తారు. సన్యాసులను చూచినా భగవాన్‌ అని అనేస్తారు. కాని భగవంతుడు స్వయంగా అర్థం చేయిస్తున్నారు - మనుష్యులను భగవంతుడని అనడానికి వీలు లేదు. నిరాకార భగవంతుని అయితే ఎంతగానో స్మృతి చేస్తారు. ఎవరైతే గురువులను ఆశ్రయించలేదో వారికి, చిన్న పిల్లలకు కూడా పరమాత్మను స్మృతి చేయమని నేర్పిస్తారు. కాని ఏ పరమాత్మను స్మృతి చేయాలో వారికి తెలుపబడదు. ఏ చిత్రమూ బుద్ధిలో ఉండదు. దు:ఖ సమయాలలో ఓ ప్రభూ! అని అంటారు. అప్పుడు ఏ గురువు చిత్రము కాని, దేవతల చిత్రము కాని, ఇక ఏ ఇతర చిత్రము గాని వారి ముందుకు రాదు. భలే చాలామంది గురువులను అశ్రయించినా, వారు ఓ భగవంతుడా! అని అన్నప్పుడు వారికి ఎప్పుడూ గురువులు గుర్తుకు రారు. ఒకవేళ గురువును తలుచుకొని వారినే భగవంతుడని అన్నట్లయితే ఆ మనిషి కూడా జనన- మరణాలలోకి వచ్చేవాడే అనగా ఇది పంచ తత్వాలతో తయారైన శరీరాన్ని స్మృతి చేసినట్లవుతుంది. శరీరాన్ని పంచ భూతాలని అంటారు. ఆత్మను భూతమని అనరు. అందువలన అది భూత పూజ వంటిదే. బుద్ధియోగము శరీరము వైపు వెళ్ళిపోతుంది. ఒకవేళ ఎవరైనా మనుష్యులను భగవంతుడని భావిస్తే అతనిలో ఉన్న ఆత్మను స్మృతి చేసినట్లు కాదు. ఆత్మ అయితే ఇరువురిలోనూ ఉంది. స్మృతి చేసేవారిలో కూడా ఉంది, ఎవరిని స్మృతి చేస్తారో వారిలో కూడా ఉంది. పరమాత్మనైతే సర్వవ్యాపి అని అంటారు. అయితే పరమాత్మను పాపాత్మ అని అనరు. వాస్తవంలో పరమాత్మ అనే పదము వెలువడినప్పుడు బుద్ధి నిరాకారము వైపు వెళ్ళిపోతుంది. నిరాకార తండ్రిని నిరాకార ఆత్మ స్మృతి చేస్తుంది. దానిని దేహీ-అభిమానము అని అంటారు. సాకార శరీరాన్ని స్మృతి చేయువారు, భూతాల అభిమానులు. భూతము, భూతాన్ని స్మృతి చేస్తుంది. ఎందుకంటే స్వయాన్ని ఆత్మగా భావించేందుకు బదులు 5 భూతాల శరీరంగా భావిస్తారు. పేరు కూడా శరీరానికే ఉంటుంది. స్వయాన్ని కూడా 5 తత్వాల భూతంగా భావిస్తారు. ఆ గురువులను కూడా శరీరముగానే స్మృతి చేస్తారు. దేహీ-అభిమానులుగా అయితే లేనే లేరు. స్వయాన్ని నిరాకార ఆత్మగా భావిస్తే నిరాకార పరమాత్మను స్మృతి చేయగలరు. సర్వాత్మల సంబంధము మొట్టమొదట పరమాత్మతో ఉంది. ఆత్మ దు:ఖములో ఉన్నప్పుడు పరమాత్మనే స్మృతి చేస్తుంది ఎందుకంటే వారితో సంబంధముంది. వారు ఆత్మలను అన్ని దు:ఖాల నుండి విడిపిస్తారు. వారిని దీపము అని కూడా అంటారు. అలాగని దీపము, వత్తి విషయము కాదు. వారు పరమపిత పరమాత్మ. దీపము అంటూనే మనుష్యులు జ్యోతిగా భావిస్తారు. తండ్రి స్వయంగా అర్థం చేయిస్తున్నారు - నేను పరమాత్మను, నా పేరు శివ. శివుని, రుద్రుడని కూడా అంటారు. ఆ నిరాకారునికే అనేక పేర్లున్నాయి. ఇతరులెవ్వరికీ ఇన్ని పేర్లు లేవు. బ్రహ్మ, విష్ణు, శంకరులకు ఒక్కొక్క పేరు మాత్రమే ఉంది. దేహధారులందరికీ ఒక్కొక్క పేరు మాత్రమే ఉంటుంది. ఒక్క ఈశ్వరునికి మాత్రమే అనేక పేర్లు ఇవ్వబడ్తాయి. వారి మహిమ అపారమైనది. మనుష్యులకు ఒకే పేరు స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు మీరు మరజీవగా అయ్యారు. కనుక పాతదంతా మర్చిపోవాలని మీకు మరొక పేరు పెట్టారు. మీరు పరమపిత పరమాత్మ ముందు జీవించి ఉండే మరణిస్తారు కనుక ఇది మీ మరుజీవా జన్మ. మాత-పితల వద్ద తప్పకుండా జన్మ తీసుకోబడ్తుంది. ఈ రహస్యమైన విషయాలు తండ్రి కూర్చొని మీకు అర్థం చేయిస్తున్నారు. ప్రపంచములోని వారికైతే శివుడంటే ఎవరో తెలియదు. బ్రహ్మ, విష్ణు, శంకరులను గురించి తెలుసు. బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి అని కూడా అంటారు. బ్రహ్మ ద్వారా స్థాపన అని కూడా కేవలం విన్నారు కాని ఎలా జరుగుతుందో తెలియదు. ఇప్పుడు క్రియేటర్‌ తప్పక నూతన ధర్మాన్ని, నూతన ప్రపంచమునే రచిస్తారు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ కులమునే రచిస్తారు. బ్రాహ్మణులైన మీరు బ్రహ్మను స్మృతి చేయరు. పరమపిత పరమాత్మను స్మృతి చేస్తారు ఎందుకంటే మీరు బ్రహ్మ ద్వారా శివునివారిగా అయ్యారు. బయటి ప్రపంచములో ఉన్న దేహాభిమానులైన బ్రాహ్మణులు, మీలాగా తమను బ్రహ్మకు పిల్లలము, శివుని పౌత్రులమని అనరు. శివబాబా జయంతిని జరుపుకుంటారు కాని వారిని గురించి తెలియనందున వారి పై గౌరవము లేదు. వారి మందిరానికి వెళ్తారు. వీరు బ్రహ్మ, విష్ణు, శంకరులు గాని, లక్ష్మీనారాయణులు గాని కారని భావిస్తారు. వారు తప్పకుండా నిరాకార పరమాత్మ. మిగిలిన పాత్రధారులందరికీ వారి వారి పాత్రలు వారికున్నాయి. పునర్జన్మలు తీసుకుంటారు, తమ పేర్లను ధరిస్తారు. పరమపిత పరమాత్మ ఒక్కరికి మాత్రమే వ్యక్త నామ-రూపాలు లేవు. కాని మూఢమతులైన మనుష్యులు అర్థము చేసుకోరు. పరమాత్మ స్మృతి చిహ్నము ఉందంటే, వారు తప్పకుండా వచ్చి ఉంటారు, స్వర్గము రచించి ఉంటారు. లేకుంటే స్వర్గాన్ని ఎవరు రచిస్తారు? ఇప్పుడు మళ్లీ వచ్చి ఈ రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. దీనిని యజ్ఞమని అంటారు ఎందుకంటే ఇందులో స్వాహా అవ్వవలసి ఉంటుంది. యజ్ఞాలనైతే చాలా మంది మనుష్యులు రచిస్తారు. ఆ యజ్ఞాలన్నీ భక్తిమార్గములోని స్థూల యజ్ఞాలు, ఈ యజ్ఞాన్ని స్వయం పరమపిత పరమాత్మయే వచ్చి రచిస్తారు, పిల్లలను చదివిస్తారు. యజ్ఞము రచించినప్పుడు అందులో కూడా బ్రాహ్మణులు శాస్త్రాలు, కథలు మొదలైనవి వినిపిస్తారు. ఈ తండ్రి అయితే జ్ఞానసాగరులు. ఈ గీత, భాగవతము మొదలైన శాస్త్రాలన్నీ భక్తిమార్గానికి చెందినవని అంటారు. ఈ స్థూల యజ్ఞాలు కూడా భక్తిమార్గానికి చెందినవి. ఈ సమయమే భక్తిమార్గానికి చెందినది. కలియుగ అంత్యము వచ్చినప్పుడు భక్తి కూడా అంత్యములోకి వస్తుంది. అప్పుడే భగవంతుడు వచ్చి కలుసుకుంటారు. ఎందుకంటే భక్తికి ఫలమునిచ్చేది వారే. వారిని జ్ఞాన సూర్యులని అంటారు. జ్ఞాన చంద్రుడు, జ్ఞాన సూర్యుడు, జ్ఞాన అదృష్ట నక్షత్రాలు. తండ్రి జ్ఞాన సూర్యుడు. ఇప్పుడు తల్లి జ్ఞానచంద్రుడు కూడా కావాలి. కనుక ఏ శరీరములో ప్రవేశించారో అతడు జ్ఞాన చంద్రుడు, మాత అయ్యాడు. మిగిలినవారంతా పిల్లలు, జ్ఞాన నక్షత్రాలు. ఈ లెక్క ప్రకారము జగదంబ కూడా లక్కీ(అదృష్ట) నక్షత్రమే. ఎందుకంటే అందరూ పిల్లలే కదా. నక్షత్రాలలో కొన్ని అన్నింటికంటే తీక్షణమైనవి కూడా ఉంటాయి. అలాగే ఇచ్చట కూడా నంబరువారుగా ఉన్నారు. వారు స్థూల ఆకాశములోని సూర్య చంద్రులు, నక్షత్రాలు. ఇది జ్ఞాన విషయము. అవి నీటి నదులు, వీరు జ్ఞాన నదులు. జ్ఞాన నదులు జ్ఞాన సాగరుని నుండి వెలువడ్డారు.

ఇప్పుడు శివజయంతి జరుపుకుంటారు. తప్పకుండా సృష్ట్టి అంతటికీ తండ్రి అయినవారు వస్తారు. వారు వచ్చి తప్పకుండా స్వర్గమును రచించి ఉంటారు. ప్రాయ: లోపమైపోయిన ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేసేందుకు తండ్రి వస్తారు. ప్రభుత్వము కూడా ఏ ధర్మాన్ని అంగీకరించదు. మాకు ఏ ధర్మము లేదని అంటారు. వారు సత్యమే చెప్తున్నారు. భారతదేశ ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ప్రాయ: లోపమైపోయిందని తండ్రి కూడా చెప్తున్నారు. ధర్మములో శక్తి ఉంటుంది. భారతవాసులు తమ దేవీదేవతా ధర్మములో ఉన్నప్పుడు చాలా సుఖంగా ఉండేవారు. ఈ ప్రపంచములో సర్వశక్తివంతమైన రాజ్యముండేది. పురుషోత్తములు రాజ్యపాలన చేసేవారు. శ్రీ లక్ష్మీనారాయణులనే పురుషోత్తములని అంటారు. నంబరువారుగా ఉన్నతులు, అధములు ఉండనే ఉంటారు. సర్వోత్తమ పురుషులు, ఉత్తమ పురుషులు, మధ్యమ పురుషులు, కనిష్ఠ పురుషులు ఉండనే ఉంటారు. మొట్టమొదట అందరికంటే సర్వోత్తమ పురుషులుగా ఎవరవుతారో వారే మళ్లీ మధ్యమ, కనిష్ఠ పురుషులుగా అవుతారు. లక్ష్మీనారాయణులు పురుషోత్తములు. పురుషులందరిలో ఉత్తములు. తర్వాత క్రిందికి దిగినప్పుడు దేవతల నుండి క్షత్రియులుగా, క్షత్రియుల నుండి మళ్లీ వైశ్యులుగా, కనిష్ఠులైన శూద్రులుగా అవుతారు. సీతారాములను కూడా పురుషోత్తములని అనరు. రాజులందరికీ రాజులు, సర్వోత్తమ సతోప్రధాన పురుషోత్తములు లక్ష్మీనారాయణులు. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో కూర్చున్నాయి. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుందో మీకు తెలుసు. మొట్టమొదట ఉత్తములు, తర్వాత మధ్యములు, తర్వాత కనిష్ఠులుగా అవుతారు. ఈ సమయములో మొత్తం ప్రపంచమంతా తమోప్రధానంగా ఉంది. ఇదంతా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. వారి జయంతినే ఇప్పుడు జరుపుకుంటాము. ఇప్పటికి 5 వేల సంవత్సరాల క్రితము పరమపిత పరమాత్మ అయిన శివుడు వచ్చారు. అలా రాకుంటే శివజయంతి ఎందుకు జరుపుకుంటారు! పరమపిత పరమాత్మ తప్పకుండా పిల్లల కొరకు బహుమతి తీసుకొని వస్తారు. తప్పకుండా సర్వోత్తమ కార్యము చేస్తారు. మొత్తము తమోప్రధాన సృష్టిని సతోప్రధానంగా సదా సుఖవంతంగా తయారు చేస్తారు. ఎంత ఉన్నతమైనవారో అంత ఉన్నతమైన స్మృతి చిహ్నము కూడా ఉండేది. ఆ మందిరాన్ని దోచుకొని తీసుకుపోయారు. మనుష్యులు దండెత్తి వచ్చేది ధనము కొరకే. ధనము కొరకు విదేశాల నుండి కూడా వచ్చారు. ఆ సమయంలో కూడా చాలా ధనముండేది. కాని మాయా రావణుడు భారతదేశాన్ని గవ్వ సమానంగా చేసేశాడు. తండ్రి వచ్చి వజ్ర తుల్యంగా తయారు చేస్తారు. ఇటువంటి శివబాబాను గురించి ఎవ్వరికీ తెలియదు. సర్వవ్యాపి అని అంటారు. ఇలా అనడం కూడా తప్పే. నావను ఆవలి తీరానికి చేర్చే సద్గురువు ఒక్కరే. నావను ముంచి వేసేవారు అనేక మంది ఉన్నారు. అందరూ విషయసాగరములో మునిగిపోయి ఉన్నారు. అందుకే ఈ సార విహీన ప్రపంచమైన విషయసాగరము నుండి, క్షీరసాగరమైన ఆవలి తీరానికి తీసుకెళ్ళండి అని అంటారు. విష్ణువు క్షీరసాగరములో ఉంటారని గాయనము కూడా ఉంది. స్వర్గాన్ని క్షీరసాగరమని అంటారు. అచ్చట లక్ష్మీనారాయణులు రాజ్యపాలన చేస్తారు. అంతేకాని అచ్చట విష్ణువు క్షీర సాగరములో విశ్రాంతి తీసుకుంటారని కాదు. వారు పెద్ద చెరువును తయారు చేసి దాని మధ్యలో విష్ణువునుంచుతారు. విష్ణువును కూడా చాలా పెద్దగా తయారుచేస్తారు. లక్ష్మీనారాయణులు అంత పెద్దగా అయితే ఉండరు. ఎక్కువలో ఎక్కువ ఆరడుగులు ఉంటారు. పాండవుల చిత్రాలు కూడా చాలా పెద్ద పెద్దవి తయారుచేస్తారు. రావణుని బొమ్మను ఎంతో పెద్దదిగా చేస్తారు. పెద్ద పేరుంది కావున చిత్రము కూడా పెద్దదిగా చేస్తారు. బాబా పేరు భలే గొప్పది కాని వారి చిత్రము చాలా చిన్నది. అర్థము చేసుకునేందుకు ఇంత పెద్ద రూపమును ఇచ్చేశారు. తండ్రి అంటున్నారు - నాకు ఇంత పెద్ద రూపము లేదు. ఆత్మ ఎలాగైతే చిన్నదిగా ఉంటుందో పరమాత్మ అయిన నేను కూడా నక్షత్రము వలె ఉన్నాను. వారిని సుప్రీమ్‌ సోల్‌ అని అంటారు. వారు అందరికంటే ఉన్నతులు. వారిలోనే పూర్తి జ్ఞానమంతా నిండి ఉంది. మనుష్య సృష్టికి బీజరూపులు, జ్ఞానసాగరులు, చైతన్య ఆత్మ అని వారి మహిమ గాయనము చేయబడింది. కాని వినిపించవలసినప్పుడు అవయవాలను(శరీరము) తీసుకుంటారు. ఉదాహరణకు చిన్న బాలుడు తన చిన్న అవయవాల ద్వారా మాట్లాడలేడు. పెద్దవాడైనప్పుడు శాస్త్రాలు మొదలైనవి చూస్తూనే పూర్వ జన్మ సంస్కారాలు స్మృతిలోకి వచ్చేస్తాయి. ఇప్పుడు తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - నేను మళ్లీ 5 వేల సంవత్సరాల తర్వాత మీకు అదే రాజయోగము నేర్పించేందుకు వచ్చాను. కృష్ణుడు ఏ రాజయోగాన్ని నేర్పలేదు. అతడు ప్రాలబ్ధాన్ని అనుభవించాడు. 8 జన్మలు సూర్యవంశము, 12 జన్మలు చంద్రవంశము, మళ్లీ 63 జన్మలు వైశ్య, శూద్ర వంశములలో వచ్చాడు. ఇప్పుడిది అందరిదీ అంతిమ జన్మ. ఈ విషయాలు కృష్ణుని ఆత్మ కూడా వింటున్నది. మీరు కూడా వింటున్నారు. ఇది సంగమయుగీ బ్రాహ్మణుల వర్ణము. మళ్లీ మీరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. బ్రాహ్మణ ధర్మము, సూర్యవంశీ దేవతా ధర్మము, చంద్రవంశీ క్షత్రియ ధర్మము ఈ మూడింటి స్థాపకులు ఒక్క పరమపిత పరమాత్మయే. అందువలన ఈ మూడు ధర్మాల శాస్త్రము కూడా ఒక్కటిగానే ఉండాలి. వేరు వేరు శాస్త్రాలేవీ లేవు. బ్రహ్మ ఎంతో పెద్దవాడు. అందరికీ తండ్రి ప్రజాపిత. అతడి శాస్త్రము కూడా ఏదీ లేదు. ఒక్క గీతలోనే భగవానువాచ అని ఉంది. బ్రహ్మ భగవానువాచ అని లేదు. ఇది బ్రహ్మ ద్వారా శివ భగవానువాచ. దాని ద్వారా శూద్రులను పరివర్తన చేసి బ్రాహ్మణులుగా తయారు చేయడం జరుగుతుంది. బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు. ఎవరైతే పాస్‌ అవ్వరో వారు క్షత్రియులుగా అవుతారు, రెండు కళలు తగ్గిపోతాయి. ఎంతో బాగా అర్థం చేయిస్తారు! అత్యంత ఉన్నతమైనవారు పరమపిత పరమాత్మ తర్వాత బ్రహ్మ, విష్ణు, శంకరులు. వారిని కూడా పురుషోత్తములని అనరు. ఎవరైతే పురుషోత్తములుగా అవుతారో మళ్లీ వారే కనిష్ఠులుగా కూడా అవుతారు. మనుష్యులలో సర్వోత్తములు లక్ష్మీనారాయణులు. వారి మందిరాలు కూడా ఉన్నాయి. కాని వారి మహిమను గూర్చి ఎవ్వరికీ తెలియదు. కేవలం పూజలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు పూజారుల నుండి పూజ్యులుగా అవుతూ ఉన్నారు. మాయ మళ్లీ పూజారులుగా చేసేస్తుంది. డ్రామా అలా తయారై ఉంది. నాటకమెప్పుడు పూర్తి అవుతుందో, అప్పుడు నేను రావలసి వస్తుంది. మళ్లీ వృద్ధి అగుట కూడా ఆటోమేటిక్‌గా(స్వతహాగా) నిలిచిపోతుంది. పిల్లలైన మీరు మళ్లీ వచ్చి మీ మీ పాత్రలు రిపీట్‌ చేయాలి. ఇది పరమపిత పరమాత్మ స్వయంగా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గములో వారి జయంతిని జరుపుతారు. ఇలా జరుపుతూనే ఉంటారు. స్వర్గములో అయితే ఎవ్వరి జయంతినీ జరుపుకోరు. కృష్ణుడు, రాముడు మొదలైన వారి జయంతులు కూడా జరుపుకోరు. ఎందుకంటే వారు ప్రాక్టికల్‌గా అక్కడే ఉంటారు. వీరు ఉండి వెళ్ళిపోయారు అందుకే శివజయంతిని జరుపుకుంటారు. అచ్చట ప్రతి సంవత్సరము కృష్ణుని పుట్టిన రోజు జరుపుకోరు. అచ్చట సదా సంతోషమే ఉంటుంది కనుక జన్మ దినము జరుపుకునే అవసరము లేదు. పిల్లల పేర్లు అయితే మాతా-పితలే పెెడ్తారు. అచ్చట గురువే ఉండడు. వాస్తవానికి ఈ విషయాలకు, జ్ఞాన యోగాలకు ఏ సంబంధమూ లేదు. పోతే అచ్చటి సంప్రదాయాలు, ఆచారాలేమిటో అడగవలసి వస్తుంది. అచ్చటి నియమానుసారము ఎలా ఉంటే అలా జరుగుతాయని, మీరు అడిగే అవసరమే లేదని బాబా అంటారు. మొదట శ్రమ చేసి మీ పదవిని ప్రాప్తి చేసుకోండి. అర్హులుగా అవ్వండి. తర్వాత అడగండి. డ్రామాలో ఏదో ఒక నియమముంటుంది. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. స్వయాన్ని నిరాకార ఆత్మగా భావించి నిరాకార తండ్రిని స్మృతి చేయాలి. ఏ దేహధారినీ స్మృతి చేయరాదు. మరజీవాగా అయ్యి పాత విషయాలను బుద్ధి నుండి మర్చిపోవాలి.
2. తండ్రి రచించిన ఈ రుద్ర యజ్ఞములో సంపూర్ణంగా స్వాహా అవ్వాలి. శూద్రులను బ్రాహ్మణ ధర్మములోకి పరివర్తన చేసే సేవ చేయాలి. 

వరదానము :- ''మీ విల్‌ పవర్‌ ద్వారా ప్రతి ఒక్కరిచే విల్లు చేయించే శ్రేష్ఠ సేవాధారీ భవ''
వర్తమాన సమయంలో చాలామంది ఆత్మలు మీ సహయోగము కొరకు దాహముతో చాత్రక పక్షి వలె ఉన్నారు. అయితే వారికి తమ స్వంత శక్తి లేదు. వారికి మీరు విశేషంగా మీ శక్తుల సహాయాన్ని ఇవ్వవలసి ఉంటుంది. అందుకు నిమిత్తంగా ఉన్న సేవాధారులలో సర్వశక్తుల పవర్‌ అవసరము. ఎలాగైతే బ్రహ్మాబాబా చివర్లో పిల్లలకు శక్తులను విల్‌ చేశాడో, ఆ విల్లు ద్వారా ఈ కార్యము జరుగుతూ ఉందో అలా తండ్రిని అనుసరించండి. మీ శక్తులను ఆత్మల పట్ల విల్లు చేస్తే సమయ ప్రమాణంగా(సమయానుసారంగా) సేవ సంపన్నమైపోతుంది.

స్లోగన్‌ :- ''ఎక్కడైతే ఏకత మరియు ఏకాగ్రతా శక్తి ఉందో, అక్కడ సఫలత సహజంగా ప్రాప్తి అవుతుంది.''
 

Telugu Murli 09/01/18

09-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

''మధురమైన పిల్లలారా - మీ భాగ్యాన్ని ఉన్నతంగా చేసుకునేందుకు మీరు ఈ పాఠశాలకు వచ్చారు. మీరు నిరాకార తండ్రి ద్వారా చదువుకొని రాజాధి రాజులుగా తయారవ్వాలి '' 

ప్రశ్న :- చాలామంది పిల్లలు భాగ్యశాలీ పిల్లలే, కాని వారు దౌర్భాగ్యశాలురుగా ఎలా అవుతారు?
జవాబు :- ఎవరికైతే ఏ కర్మ బంధనాలూ లేవో అనగా కర్మ బంధనముక్తులుగా ఉన్నారో, ఆ పిల్లలు భాగ్యశాలురు. అయినా వారు చదువు పై గమనమివ్వకుంటే బుద్ధి అటు - ఇటు భ్రమిస్తూ ఉంటే ఏ తండ్రి నుండి ఇంత గొప్ప వారసత్వము లభిస్తుందో, వారిని స్మృతి చేయకుంటే భాగ్యశాలురుగా ఉండినా వారిని దౌర్భాగ్యశాలురనే అంటారు.

ప్రశ్న :- శ్రీమతములో ఏ ఏ రసాలు నిండి ఉన్నాయి?
జవాబు :- ఎందులో అయితే మాత-పిత-తండ్రి-టీచరు-గురువు అందరి మతము కలిసి ఒక్కటిగా ఉంటుందో, అదే శ్రీమతము. శ్రీమతము చాలా మధురమైన శ్యాక్రీన్‌ వంటిది. అందులో ఈ రహస్యాలన్నీ నిండి ఉన్నాయి. 

పాట :- నేను భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చాను ,..........( తక్‌దీర్‌ జగాకర్‌ ఆయీ హూ,........) 
ఓంశాంతి. శివభగవానువాచ - మనుష్యులు గీతను వినిపించినప్పుడు కృష్ణుని పేరును చెప్తూ వినిపిస్తారు. అయితే ఇచ్చట ఏదైతే వినిపిస్తారో, దానిని ' శివభగవానువాచ! అని అంటారు. శివభగవానువాచ అని స్వయం మీరు కూడా అనవచ్చు. ఎందుకంటే స్వయం శివబాబాయే మాట్లాడ్తారు. ఇరువురూ కలిసి కూడా మాట్లాడగలరు. పిల్లలు వారిరువురికీ పిల్లలుగానే అవుతారు. కుమారులు, కుమారీలు ఇరువురూ కూర్చుని ఉన్నారు. కావున పిల్లలైన మిమ్ములను ఎవరు చదివిస్తున్నారో అర్థమయ్యిందా? బాప్‌దాదా చదివిస్తున్నారని అంటారు. పెద్దవారిని 'తండ్రి' అని, చిన్నవారిని 'దాదా' అని అనగా అన్నను 'దాదా' అని అంటారు. అందువలన ఇరువురినీ కలిపి బాప్‌దాదా అని అంటారు. ఇప్పుడు పిల్లలకు కూడా మేము విద్యార్థులమని తెలుసు. పాఠశాలలో విద్యార్థులు తమ భాగ్యాన్ని తయారు చేసుకునేందుకే కూర్చుని ఉన్నారు. మేము చదువుకొని ఫలానా పరీక్ష పాస్‌ అవుతామని భావిస్తారు. ఆ దేహ సంబంధమైన పరీక్షలైతే చాలా ఉంటాయి. ఇచ్చట పిల్లలైన మీ హృదయంలో మమ్ములను అనంతమైన తండ్రి అయిన పరమపిత పరమాత్మ చదివిస్తున్నారని ఉంది. ఈ బ్రహ్మను తండ్రి అని అనరు. నిరాకార తండ్రి అర్థం చేయిస్తున్నారు - తండ్రి నుండి రాజయోగము నేర్చుకొని రాజాధి రాజులుగా తయారవుతామని మీకు తెలుసు. సాధారణ రాజులూ ఉంటారు. రాజాధి రాజులు అనగా చక్రవర్తులు కూడా ఉంటారు. ఎవరైతే రాజాధి రాజులుగా ఉంటారో, వారిని రాజులు కూడా పూజిస్తారు. ఈ ఆచారము భారత ఖండములోనే ఉంది. పతిత రాజులు పావన రాజులను పూజిస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - చాలా పెద్ద ఆస్తి కలిగిన వారిని మహారాజులని అంటారు. రాజులు చిన్నవారిగా కూడా ఉంటారు. ఈ రోజుల్లో అయితే కొంతమంది రాజులకు మహారాజుల కంటే ఎక్కువ ఆస్తి ఉంటుంది. కొంతమంది ధనవంతులకు రాజుల కంటే ఎక్కువ ఆస్తులు ఉంటాయి. అక్కడ(స్వర్గంలో) ఇటువంటి నిమయ విరుద్ధము ఉండదు. అచ్చట అన్నీ నియమానుసారంగానే ఉంటాయి. పెద్ద మహారాజుల వద్ద పెద్ద ఆస్తులుంటాయి. ఇప్పుడు మనలను అనంతమైన తండ్రి కూర్చుని చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ మనలను రాజాధి రాజులుగా, స్వర్గాధిపతులుగా చేయించలేరు. స్వర్గ రచయిత ఒక్క నిరాకారుడైన తండ్రియే. వారిని ' హెవెన్లీ గాడ్‌ ఫాదర్‌ (స్వర్గ రచయిత)' అని కూడా మహిమ చేస్తారు. నేను పిల్లలైన మీకు మళ్లీ స్వరాజ్యమునిచ్చి రాజాధి రాజులుగా తయారు చేస్తానని తండ్రి నేరుగా అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మనము భాగ్యమును తయారు చేసుకొని ఇచ్చటకు వచ్చామని మీకు తెలుసు. అనంతమైన తండ్రి ద్వారా రాజాధి రాజులుగా అయ్యేందుకు వచ్చాము. ఇది ఎంత సంతోషించవలసిన విషయము! ఇది చాలా పెద్ద పరీక్ష. బాబా చెప్తున్నారు - శ్రీమతమును అనుసరించండి. ఇందులో మాత-పిత-శిక్షకుడు-గురువు మొదలైనవారందరి మతము కలిసి ఉంది. అన్నిటి శ్యాక్రిన్‌ తయారై ఉంది. అందరి రసాలు ఈ ఒక్కరిలో నిండి ఉన్నాయి. అందరి ప్రియుడు ఒక్కరే. పతితులను పావనంగా చేసేవారు ఆ ఒక్క తండ్రియే కదా. గురునానక్‌ కూడా వారిని మహిమ చేశాడు. కావున వారిని తప్పకుండా స్మృతి చేయాల్సి ఉంటుంది. మొదట వారు మనలను తమ వద్దకు తీసుకెళ్తారు. తర్వాత పవిత్ర ప్రపంచములోకి పంపుతారు. ఎవరైనా వస్తే ' ఇది గాడ్‌లీ కాలేజ్‌(ఈశ్వరీయ కళాశాల) ' అని వారికి అర్థం చేయించాలి. ఇచ్చట 'భగవానువాచ' అని చెప్తారు. మిగిలిన పాఠశాలలో ఎప్పుడూ 'భగవానువాచ' అని అనరు. భగవంతుడనగా నిరాకార జ్ఞానసాగరుడు, మానవ సృష్టికి బీజరూపుడు. ఇప్పుడు కూర్చుని పిల్లలైన మిమ్ములను చదివిస్తున్నాను. ఇది ఈశ్వరీయ జ్ఞానము. సరస్వతిని 'జ్ఞాన దేవత లేక చదవుల తల్లి(విద్యా దేవి)' అని అంటారు. అందువలన ఈశ్వరీయ జ్ఞానము ద్వారా తప్పకుండా దేవీ దేవతలుగానే తయారౌతారు కదా. బ్యారిస్టరు జ్ఞానము ద్వారా బ్యారిస్టరుగానే అవుతారు. ఇది ఈశ్వరీయ జ్ఞానము. సరస్వతికి భగవంతుడు జ్ఞానమునిచ్చారు. కావున ఎలాగైతే సరస్వతి జ్ఞాన దేవిగా అయ్యిందో అలా పిల్లలైన మీరు కూడా జ్ఞాన దేవతలుగా అవుతారు. సరస్వతికి చాలామంది పిల్లలున్నారు కదా. అయితే ప్రతి ఒక్కరూ జ్ఞాన దేవత అనిపించుకోవడం సాధ్యము కాదు. ఈ సమయములో స్వయాన్ని 'దేవత' అని పిలుచుకోలేరు. అచ్చట కూడా దేవీ దేవతలనే అంటారు. భగవంతుడు తప్పకుండా జ్ఞానమునిస్తారు. చాలా పెద్ద పదవినిచ్చే విధంగా పాఠాలను ధారణ చేయిస్తారు. మిగిలిన దేవతలు గాడ్‌, గాడెజ్‌(భగవాన్‌, భగవతీలు)గా అవ్వలేరు. ఈ మాతా-పితలైతే గాడ్‌ - గాడెజ్‌ వలె అవుతారు. కాని ఇప్పుడైతే అలా లేరు కదా. నిరాకార తండ్రిని 'గాడ్‌ ఫాదర్‌ ' అని అంటారు. ఈ సాకారాన్ని 'గాడ్‌' అని అనరు. ఇవన్నీ చాలా రహస్యమైన విషయాలు. ఆత్మ - పరమాత్మల రూపము, వారి మధ్య గల సంబంధము. ఇవన్నీ ఎంత గుహ్యమైన విషయాలు! ఆ శారీరిక సంబంధాలు చిన్నాన్న, పెద్దనాన్న, మామ మొదలైనవి సాధారణ సంబంధాలు. కాని ఇవి ఆత్మిక సంబంధాలు. అర్థం చేయించేందుకు చాలా యుక్తి కావాలి. మాత-పితలనే పదాలను మహిమ చేస్తారు. కనుక తప్పకుండా ఏదో గొప్ప అర్థము ఉంది కదా. ఆ పదాలు అవినాశిగా అయిపోతాయి. భక్తిమార్గములో కూడా కొనసాగుతాయి.

పిల్లలైన మీరు పాఠశాలలో కూర్చుని ఉన్నారని మీకు తెలుసు. చదివించేవారు జ్ఞానసాగరుడు. ఇతని(బ్రహ్మ) ఆత్మ కూడా చదువుకుంటుంది. ఈ ఆత్మకు తండ్రి ఆ పరమాత్మయే. వారు(శివబాబా) అందరికీ తండ్రి. ఇప్పుడు వారే చదివిస్తున్నారు. వారు ఎప్పుడూ గర్భములో ప్రవేశించరు. అయితే జ్ఞానమునెలా చదివిస్తారు? వారు బ్రహ్మ శరీరములో వస్తారు. కాని వారు మళ్లీ బ్రహ్మకు బదులు కృష్ణుని పేరు వేసేశారు. ఇది కూడా డ్రామలో ఉంది. ఏదైనా తప్పు జరిగినప్పుడే కదా తండ్రి వచ్చి ఆ తప్పును కరెక్టు చేసి తప్పు లేనివారిగా తయారు చేస్తారు. నిరాకారుడైన తండ్రిని గురించి తెలియని కారణంగానే తికమక పడిపోయారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - నేను మీ అనంతమైన తండ్రిని. మీకు అనంతమైన ఆస్తినిచ్చేవాడిని. లక్ష్మీనారాయణులు స్వర్గానికి అధికారులుగా ఎలా అయ్యారో ఎవ్వరికీ తెలియదు. తప్పకుండా ఎవరో అటువంటి కర్మలు వారికి నేర్పించి ఉంటారు కదా. వారికి ఇంత ఉన్నతపదవిని ప్రాప్తి చేయించినవారు తప్పకుండా పెద్దవారై ఉంటారు. మనుష్యులకు ఇవన్నీ కొంచెము కూడా తెలియదు. తండ్రి ఎంతో ప్రేమగా అర్థం చేయిస్తున్నారు. వారు ఎంత గొప్ప అథారిటీ! ప్రపంచమంతటినీ పతితుల నుండి పావనంగా తయారు చేసే మాలికులు. 'ఇది తయారైన డ్రామా' అని అర్థం చేయిస్తున్నారు. మీరు చక్రములో తిరగవలసి వస్తుంది. దీని నిర్మాణము (రచన) గురించి ఎవ్వరికీ తెలియదు. ఈ డ్రామాలో మనము ఏ విధమైన పాత్రధారులము? ఈ చక్రము ఎలా తిరుగుతూ ఉందో, దు:ఖధామము నుండి సుఖధామంగా ఎవరు తయారు చేస్తారో, ఇవన్నీ మీకు తెలుసు. మిమ్ములను సుఖదామము కొరకు చదివిస్తాను. 21 జన్మలకు సదా సుఖవంతంగా తయారయ్యేది మీరే. ఇతరులెవ్వరూ అచ్చటికి వెళ్లలేరు. సుఖధామంలో తప్పకుండా కొద్ది మంది మనుష్యులు మాత్రమే ఉంటారు. అర్థము చేయించేందుకు చాలా మంచి పాయింట్లు ఉండాలి. బాబా, మేమ మీ వారమని నోటితో చెప్తారు కాని పూర్తిగా అలా తయారయ్యేందుకు సమయము పడ్తుంది. కొంతమంది కర్మ బంధనాలు వెంటనే వదిలిపోతాయి. కొంతమందికి సమయము పడ్తుంది. కర్మ బంధనాలు తెగిపోయిన భాగ్యశాలురు కూడా చాలా మంది ఉన్నారు. కాని వారు చదువు పై గమనమివ్వకపోతే వారిని 'దుర్భాగ్యశాలురు ' అని అంటారు. పుత్రులు, పౌత్రులు, మునిమనవళ్ళు మొదలైనవారికి పైకి బుద్ధి వెళ్లిపోతుంది. ఇక్కడైతే ఒకే ఒక్కరిని స్మృతి చేయాలి. చాలా గొప్ప వారసత్వము లభిస్తుంది. మనము రాజాధి రాజులుగా అవుతామని మీకు తెలుసు. పతిత రాజులు ఎలా అవుతారు? పావన రాజులకు రాజుగా, స్వర్గానికి అధిపతులుగా ఎలా అవుతారో కూడా తండ్రి మీకు అర్థం చేయిస్తారు. నేను స్వయంగా వచ్చి ఈ రాజయోగము ద్వారా రాజాధి రాజులుగా, స్వర్గానికి అధిపతులుగా చేస్తాను. ఆ పతిత రాజులుగా అయితే దానం చేయడం ద్వారా తయారవుతారు. నేను వచ్చి వారిని అలా తయారు చేయను. వారు చాలా దాతలుగా ఉంటారు. దానము చేయడం ద్వారా రాజ కులములో జన్మ తీసుకుంటారు. నేను మీకు 21 జన్మల కొరకు సుఖమునిస్తాను. కాని వారు ఒక్క జన్మ కొరకే అలా అవుతారు. అందులో కూడా పతితులుగా, దు:ఖితులుగా ఉంటారు. నేను వచ్చి పిల్లలను పావనంగా చేస్తాను. కేవలం గంగా స్నానాలు చేయడం ద్వారా పావనంగా అవుతారని మనుష్యులు భావిస్తారు. ఎన్నో ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. గంగా, యమునా మొదలైన వాటి మహిమను ఎంతగానో చేస్తారు. ఇప్పుడు ఇందులో మహిమ చేయు మాటే లేదు. నీరు సాగరము నుండి వస్తుంది. ఇటువంటి నదులైతే అనేకమున్నాయి. విదేశాలలో కూడా భూమిని తవ్వి పెద్ద పెద్ద నదులను తయారు చేస్తారు. ఇందులో పెద్ద విషయమేముంది. జ్ఞాన సాగరులెవరో, జ్ఞాన గంగలెవరో అనే విషయాలు వారికి తెలియనే తెలియవు. శక్తులు ఏమి చేశారో వారికి ఏ మాత్రము తెలియదు. వాస్తవానికి జ్ఞాన గంగ లేక జ్ఞాన సరస్వతి ఎవరంటే ఈ జగదంబయే. మనుష్యులకు ఈ విషయాలు తెలియనే తెలియవు. వారు ఆటవికుల(భిల్లుల) వలె ఉన్నారు. పూర్తిగా మూర్ఖులు, తెలివిలేనివారుగా ఉన్నారు. తండ్రి వచ్చి అవివేకులను ఎంతో వివేకము గలవారిగా తయారు చేస్తారు. వీరిని (లక్ష్మినారాయణులను) రాజాధి రాజులుగా ఎవరు తయారు చేశారో మీరు తెలియజేయవచ్చు. గీతలో కూడా నేను రాజులకు రాజుగా తయారు చేస్తానని ఉంది. మనుష్యులకైతే ఈ విషయాలేవీ తెలియవు. మనకు కూడా ఇంతకు ముందు ఈ విషయాలు తెలియవు. స్వయం అలా తయారైన ఇతడు(బ్రహ్మ) కూడా ఇప్పుడలా లేడు. అతడికే తెలియనప్పుడు ఇతరులెలా తెలుసుకోగలరు? సర్వవ్యాపి జ్ఞానములో ఏ సారమూ లేదు. యోగము ఎవరితో చేయాలి? ఎవరిని పిలవాలి? స్వయం ఖుదా(భగవంతుడు) అయినప్పుడు ఇక ప్రార్థన ఎవరిని చేస్తారు? ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయము. ఎవరైతే చాలా భక్తి చేస్తారో, వారికి చాలా గౌరవముంటుంది. భక్తుల మాల కూడా ఉంది కదా! జ్ఞాన మాల అనగా రుద్రమాల. ఇది మళ్లీ భక్తి మాల. అదేమో నిరాకారి మాల. ఆత్మలన్నీ అక్కడ ఉంటాయి. అందులో కూడా నంబర్‌ వన్‌ ఆత్మ ఎవరిది? ఎవరైతే నంబర్‌ వన్‌లోకి వెళ్తారో, సరస్వతి ఆత్మ లేక బ్రహ్మ ఆత్మ నంబరువన్‌గా చదువుకుంటాయి. ఇది ఆత్మల విషయము. భక్తి మార్గములో అన్నీ దేహ సంబంధమైన విషయాలే ఉంటాయి. ఫలానా భక్తులు ఇలా ఉండినారని, వారి శరీరము పేరునే చెప్తారు. మీరు మనుష్యుల గురించి చెప్పరు. బ్రహ్మ ఆత్మ ఏమవుతుందో మీకు తెలుసు. అది వెళ్లి శరీరాన్ని ధారణ చేసి రాజులకు రాజుగా అవుతుంది. ఆత్మ శరీరములో ప్రవేశించి రాజ్య పాలన చేస్తుంది. ఇప్పుడైతే రాజులెవ్వరూ లేరు. రాజ్యము చేసేది ఆత్మయే కదా. నేను రాజును. నేను ఆత్మను. ఈ శరీరానికి అధిపతిని. అహం ఆత్మను, నారాయణుడు అని పిలువబడే శరీరాన్ని ధరించి మళ్లీ రాజ్యపాలన చేస్తాను. ఆత్మయే వింటుంది, ఆత్మయే ధారణ చేస్తుంది. ఆత్మలోనే సంస్కారముంటుంది. మనము తండ్రి నుండి శ్రీమతమును అనుసరించుట ద్వారా రాజ్యము తీసుకంటామని ఇప్పుడు మీకు తెలుసు. బాప్‌దాదా ఇరువురూ కలిసి అంటున్నారు - పిల్లలూ! మా ఇరువురికీ మిమ్ములను పిల్లలూ! అని పిలిచే హక్కు ఉంది. ' నిరాకారీ పిల్లలూ! ' తండ్రినైన నన్ను స్మృతి చేయండని ఆత్మల తండ్రి అంటారు. ఇతరులెవ్వరూ ఓ నిరాకార పిల్లలూ, ఓ ఆత్మలారా, తండ్రినైన నన్ను స్మృతి చేయండని అనలేరు. తండ్రి ఒక్కరు మాత్రమే ఆత్మలతో మాట్లాడ్తారు. అంతేకాని ఓ పరమాత్మా! పరమాత్మ అయిన నన్ను స్మృతి చేయమని అనరు. ఓ ఆత్మలారా! తండ్రినైన నన్ను స్మృతి చేస్తే ఈ యోగ అగ్ని ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయని అంటున్నారు. పోతే గంగా స్నానము వలన ఎప్పుడూ ఏ పాపాత్మా పుణ్యాత్మగా అవ్వలేదు. గంగా స్నానము చేసి ఇంటికి వచ్చి మళ్లీ పాప కార్యాలు చేస్తారు. ఈ వికారాల కారణంగానే పాపాత్మలుగా అవుతారు. ఈ విషయాలు ఎవ్వరూ అర్థము చేసుకోరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇప్పుడు మీకు చాలా కఠినమైన రాహు గ్రహణము పట్టి ఉంది. మొదట గ్రహణము తేలికగా ఉంటుంది. ఇప్పుడు దానమిస్తే గ్రహణము వదిలిపోతుంది. ఇది చాలా గొప్ప ప్రాప్తి. అందువలన పురుషార్థము కూడా అంత గొప్పగా చేయాలి కదా. తండ్రి అంటున్నారు - నేను మిమ్ములను రాజులకు రాజుగా తయారు చేస్తాను. అందువలన నన్ను, నేనిచ్చే వారసత్వాన్ని స్మృతి చేయండి. మీ 84 జన్మలను స్మృతి చేయండి. అందుకే బాబా, స్వదర్శన చక్రధారి పిల్లలు అని పేరు పెట్టారు. కావున స్వదర్శన చక్ర జ్ఞానము కూడా కావాలి కదా.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది. మిమ్ములను నేను నూతన ప్రపంచములోకి తీసుకెళ్తాను. సన్యాసులు కేవలము ఇల్లు - వాకిళ్లను మర్చిపోతారు కాని మీరు ఈ మొత్తము ప్రపంచాన్నంతా మర్చిపోతారు. '' అశరీరులుగా అవ్వండి '' అని ఈ తండ్రి ఒక్కరు మాత్రమే చెప్తారు. నేను మిమ్ములను నూతన ప్రపంచములోకి తీసుకెళ్తాను. అందువలన పాత ప్రపంచము, పాత శరీరము పై మమకారాన్ని తుంచి వేయండి. మళ్లీ నూతన ప్రపంచములో మీకు నూతన శరీరము లభిస్తుంది. చూడండి కృష్ణుని శ్యామసుందరుడని అంటారు కదా. సత్యయుగములో అతడు తెల్లగా(పవిత్రంగా) ఉండేవాడు. ఇప్పుడు అంతిమ జన్మలో నల్లగా(అపవిత్రంగా) అయిపోయాడు. అందుకే కదా శ్యామంగా ఉన్నవాడే సుందరంగా అవుతాడు. మళ్లీ సుందరంగా ఉన్నవాడే శ్యామంగా అవుతాడని అంటారు. అందుకే శ్యామసుందరుడని పేరు పెట్టారు. నల్లగా తయారు చేసేది పంచ వికారాల రావణుడు. మళ్లీ తెల్లగా తయారు చేసేవారు పరమపిత పరమాత్మ. చిత్రములో కూడా - పాత ప్రపంచాన్ని కాళ్ళతో తన్ని తెల్లగా తయారౌతున్నానని చూపించారు. తెల్లటి ఆత్మ స్వర్గానికి అధికారిగా అవుతుంది. నల్లటి ఆత్మ నరకానికి అధికారిగా అవుతుంది. ఆత్మయే తెల్లగా, నల్లగా తయారవుతుంది. ఇప్పుడు తండ్రి అంటున్నారు - మీరు పవిత్రంగా అవ్వాలి. ఆ హఠయోగులు పవిత్రంగా తయారయ్యేందుకు చాలా హఠము చేస్తారు. కాని యోగము చేయకుండా పవిత్రంగా అవ్వలేరు. లేకపోతే శిక్షలు అనుభవించి పవిత్రంగా అవ్వవలసి ఉంటుంది. అందువలన తండ్రిని ఎందుకు స్మృతి చేయరాదు? అంతేకాక 5 వికారాలను కూడా జయించాలి. తండ్రి అంటున్నారు - ఈ కామ వికారమే ఆదిమధ్యాంతాలు దు:ఖమునిస్తుంది. ఎవరైతే వికారాలను జయించలేరో వారు వైకుంఠానికి రాజులుగా అవ్వలేరు. అందువలన తండ్రి చెప్తున్నారు - నేను మీకు ఎంతో శ్రేష్ఠమైన కర్మలు నేర్పుతాను - తండ్రి-టీచరు-సద్గురువు రూపములో నేర్పిస్తాను. యోగబలము ద్వారా వికర్మలను వినాశనము చేయించి వికర్మాజీత్‌ రాజుగా తయారు చేస్తాను. వాస్తవానికి సత్యయుగములోని దేవీ దేవతలను మాత్రమే వికర్మాజీతులని అంటారు. అచ్చట వికర్మలు ఉండనే ఉండవు. వికర్మాజీత్‌ శకము వేరే. వికర్మల శకము వేరే. వికర్మలు చేసిన రాజు ఒకప్పుడు ఉండి వెళ్లిపోయాడు. వికర్మలను జయించిన రాజు కూడా ఒకప్పుడు ఉండి వెళ్లిపోయాడు. ఇప్పుడు మనము వికర్మలను జయిస్తున్నాము. మళ్లీ ద్వాపరము నుండి నూతనంగా వికర్మలు ప్రారంభమవుతాయి. అందుకే ' రాజా వికర్ముడు ' అని పేరు పెట్టారు. దేవతలు వికర్మాజీతులు. ఇప్పుడు మనము మళ్లీ అలా తయారౌతాము. మళ్లీ ఎప్పుడైతే వామమార్గములోకి వస్తామో అప్పుడు వికర్మల ఖాతా ప్రారంభమవుతుంది. ఇచ్చట వికర్మల ఖాతాను చుక్తా చేసుకొని మళ్లీ మనము వికర్మాజీతులుగా అవుతాము. అక్కడ వికర్మలేవీ ఉండవు. అందువలన ఇచ్చట మేము శ్రేష్ఠమైన భాగ్యమును తయారు చేసుకుంటున్నామనే నషా పిల్లలకు ఉండాలి. ఇది అత్యంత గొప్ప అదృష్టాన్ని తయారు చేసుకునే పాఠశాల. సత్యయుగంలో అదృష్టాన్ని తయారు చేసుకునే మాటే ఉండదు. పాఠశాలలోనే సదా భాగ్యము తయారవుతుంది. మేము నరుని నుండి నారాయణునిగా లేక రాజాధి రాజులుగా తయారౌతామని మీకు తెలుసు. పతిత రాజులు తప్పనిసరిగా పావన రాజులను పూజిస్తారు. నేను మిమ్ములను పావనంగా తయారు చేస్తాను. పతిత ప్రపంచములో అయితే రాజ్య పాలన చేయరు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. బుద్ధిలో స్వదర్శన చక్ర జ్ఞానముంచుకొని రాహు గ్రహణము నుండి ముక్తులుగా అవ్వాలి. శ్రేష్ఠ కర్మలు, యోగబలము ద్వారా వికర్మల ఖాతాను చుక్తా(సమాప్తము) చేసుకొని వికర్మాజీత్‌లుగా అవ్వాలి.
2. మీ భాగ్యమును ఉన్నతంగా తయారు చేసుకునేందుకు చదువు పై పూర్తిగా గమనముంచాలి. 

వరదానము :- ''సాధన మరియు సాధనాల సమతుల్యత (బ్యాలెన్స్‌) ద్వారా తమ ఉన్నతి చేసుకునే ఆశీర్వాదాలకు (బ్లెస్సింగ్స్‌) అధికారీ భవ''
సాధనాలను ఆధారంగా చేసుకునేందుకు బదులు మీ సాధన ఆధారంతో సాధనాలను కార్యంలో ఉపయోగించండి. ఏ సాధనాన్నీ ఉన్నతికి ఆధారంగా చేసుకోకండి. ఆధారంగా చేసుకుంటే, ఆధారము కదులుటతో పాటు ఉమంగ-ఉత్సాహాలు కూడా కదిలిపోతాయి. ఎందుకంటే సాధనాలను ఆధారంగా చేసుకున్నందున మధ్యలో తండ్రి వెళ్లిపోతాడు, అందువలన హల్‌చల్‌(ఆందోళన) కలుగుతుంది. సాధనాలతో పాటు సాధన ఉంటే ప్రతీ కార్యంలో తండ్రి ఆశీర్వాదాన్ని అనుభవం చేస్తారు, ఉమంగ-ఉత్సాహాలు కూడా తగ్గిపోవు. 

స్లోగన్‌ :- '' అగర్‌ మగర్‌ (ఇదిగో,అదిగో అంటూ వాయిదా వేయడం) '' అను చక్కర్‌ (మోసము, గందరగోళము) నుండి అతీతంగా అవ్వాలంటే తండ్రి సమానంగా శక్తిశాలిగా అవ్వండి. ''
 

Telugu Murli 08/01/18

08-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - ఎంతెంతగా ఇతరులకు జ్ఞానము వినిపిస్తారో, అంత మీ బుద్ధిలో జ్ఞానము రిఫైన్‌ అవుతూ ఉంటుంది. అందువలన సేవ తప్పకుండా చేయాలి'' 

ప్రశ్న :- బాబా వద్ద ఏ రెండు రకాల పిల్లలున్నారు? వారిరువురికి గల తేడా ఏమిటి?
జవాబు :- బాబా వద్ద గల రెండు రకాల పిల్లలలో మొదటి రకము వారు స్వంత పిల్లలు. రెండవ రకమువారు సవతి పిల్లలు. సవతి పిల్లలు కేవలము నోటి ద్వారా ''బాబా-మమ్మా'' అని అంటూ ఉంటారు. కాని శ్రీమతమును పూర్తిగా అనుసరించలేరు, పూర్తిగా బలిహారము అవ్వరు. స్వంత పిల్లలైతే తనువు, మనస్సు, ధనములతో పూర్తిగా సమర్పితమౌతారు అనగా ట్రస్టీలుగా ఉంటారు. అడుగడుగునా శ్రీమతమును అనుసరిస్తారు. సవతి పిల్లలు సేవ చేయని కారణంగా నడుస్తూ, నడుస్తూ క్రింద పడిపోతారు, సంశయము వచ్చేస్తుంది. స్వంత పిల్లలు పూర్తిగా నిశ్చయబుద్ధి గలవారిగా ఉంటారు. 

పాట :- చిన్ననాటి రోజులు మర్చిపోరాదు,.......... (బచ్‌పన్‌ కే దిన్‌ భులాన దేనా,.........) 
ఓంశాంతి. తండ్రి పిల్లలకు అర్థము చేయిస్తారు. ఏ తండ్రి? వాస్తవానికి ఇరువురూ తండ్రులే. ఒకరు ఆత్మిక తండ్రి. వారిని 'బాబా' అని అంటారు. రెండవవారు దైహిక తండ్రి. వారిని 'దాదా' అని అంటారు. మనమంతా బాప్‌దాదా పిల్లలమని అన్ని సేవాకేంద్రాల పిల్లలకు తెలుసు. ఆత్మిక తండ్రి శివుడు. వారు సర్వ ఆత్మలకు తండ్రి. దాదా అయిన బ్రహ్మ మనుష్య వంశమంతటికీ పెద్దవారు. మీరు వచ్చి వారికి పిల్లలుగా అయ్యారు. వారిలో కొంతమంది పక్కా స్వంత పిల్లలు. కొంతమంది సవతి పిల్లలు కూడా ఉన్నారు. రెండు రకాల వారూ 'మమ్మా-బాబా' అని పిలుస్తారు. కాని సవతి పిల్లలు బలి అవ్వలేరు. బలిహారమవ్వనివారికి అంతటి శక్తి లభించజాలదు అనగా తండ్రిని తమ తనువు, మనసు, ధనాలకు ట్రస్టీగా చేయలేరు. అంతేకాక శ్రేష్ఠముగా తయారయ్యేందుకు వారి శ్రీమతమును అనుసరించలేరు. సొంత పిల్లలకు సూక్ష్మ సహాయము లభిస్తుంది. కాని వారు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. భలే స్వంత పిల్లలుగా ఉన్నారు. కాని వారిని కూడా ఇప్పుడే 'పక్కా' అని అనరు. ఎప్పటివరకు రిజల్టు(ఫలితము) వెలువడదో అంతవరకు 'పక్కా' అని అనలేరు. భలే ఇక్కడ ఉంటారు, చాలా మంచిగా ఉంటారు, సేవ కూడా చేస్తారు. అయినా క్రింద కూడా పడ్తారు. ఇదంతా బుద్ధియోగానికి సంబంధించిన విషయము. బాబాను మర్చిపోరాదు. బాబా ఈ భారతదేశమును పిల్లల సహాయముతో స్వర్గముగా చేస్తారు. శివశక్తి సైన్యము అని గాయనము కూడా చేయబడింది. ప్రతి ఒక్కరు తమతో తాము మాట్లాడుకోవాలి - ''తప్పకుండా మేము శివబాబాకు దత్తత తీసుకోబడిన పిల్లలము.'' తండ్రి నుండి మేము స్వర్గవారసత్వము పొందుకుంటున్నాము. ద్వాపరయుగము నుండి మనము ఏ లౌకిక తండ్రి వారసత్వమునైతే పొందుకున్నామో అదంతా నరక వారసత్వమే. దాని వలన దు:ఖితులుగా అవుతూ వచ్చాము. భక్తిమార్గములో అయితే ఉన్నవన్నీ గ్రుడ్డి నమ్మకాలే. ఎప్పటి నుండి భక్తిమార్గము ప్రారంభమయ్యిందో అప్పటి నుండి ఒక్కొక్క సంవత్సరము గడిచే కొలది మనము క్రిందికే దిగజారుతూ వచ్చాము. భక్తి కూడా మొదట అవ్యభిచారిగా ఉండేది. ఒక్కరినే పూజించేవారము. అందుకు బదులు ఇప్పుడు అనేకులను పూజిస్తూ వచ్చాము. ఈ విషయాలన్నీ అనగా భక్తిమార్గము ఎప్పటి నుండి ప్రారంభమౌతుందో ఋషులు, మునులు, సాధు సత్పురుషులు మొదలైనవారికి ఎవ్వరికీ తెలియవు. శాస్త్రాలలో కూడా 'బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి' అని ఉంది. భలే బ్రహ్మ-సరస్వతులే లక్ష్మీనారాయణులుగా అవుతారు, కాని పేరు మాత్రము బ్రహ్మదే చెప్తారు. 'బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి' అని అంటారు. బ్రహ్మతో పాటు పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. లక్ష్మీనారాయణులకైతే ఇంతమంది పిల్లలు ఉండరు. వారిని ' ప్రజాపిత ' అని కూడా అనరు. ఇప్పుడు కొత్త ప్రజలు తయారౌతూ ఉన్నారు. బ్రాహ్మణుల కులానికి చెందినవారే కొత్త ప్రజలు. బ్రాహ్మణులే స్వయాన్ని ఈశ్వరీయ సంతానంగా భావిస్తారు. దేవతలైతే అలా భావించరు. వారికి చక్రమును గురించే తెలియదు.

ఇప్పుడు మనము శివబాబా పిల్లలుగా అయ్యామని మీకు తెలుసు. వారే మనకు 84 జన్మల చక్రమును గురించి అర్థము చేయించారు. వారి సహాయముతోనే మనము భారతదేశాన్ని మళ్ళీ దైవీ పావన రాజస్థానముగా తయారు చేస్తున్నాము. ఇది చాలా అర్థము చేసుకునే విషయము. ఎవరికైనా అర్థము చేయించేందుకు కూడా ధైర్యము కావాలి. మీరు శివశక్తి పాండవ సైన్యము. అంతేకాక మార్గదర్శకులు కూడా మీరే. అందరికీ దారి చూపుతారు. మీరు తప్ప ఇతరులెవ్వరూ ఆత్మిక మధురమైన ఇంటికి దారి తెలుపలేరు. ఆ పండాలైతే 'అమరనాథ్‌'కు లేక ఇక ఏదైనా తీర్థ స్థానాలకు తీసుకెళ్తారు. బి.కెలైన మీరైతే ఒక్కసారిగా అన్నిటికీ దూరంగా పరంధామానికి తీసుకెళ్తారు. వారు దేహ సంబంధమైన మార్గదర్శకులు ఎదురుదెబ్బలు తినిపించేవారు. మీరు అందరినీ తండ్రి వద్దకు శాంతిధామానికి తీసుకెళ్తారు. కావున మేము భారతదేశాన్ని మరలా దైవీ రాజస్థానంగా తయారు చేస్తున్నామని సదా జ్ఞాపకము ఉంచుకోవలసి వస్తుంది. భారతదేశములో ఆది సనాతన దేవతా ధర్మముండేదని ఎవరైనా ఒప్పుకుంటారు. భారతదేశము సత్యయుగములో అనంతమైన దైవీ పావన రాజస్థానముగా ఉండేది. తర్వాత మళ్ళీ పావన క్షత్రియ రాజస్థానంగా తయారయ్యింది. ఆ తర్వాత మళ్ళీ మాయ ప్రవేశించినందున ఆసురీ రాజస్థానంగా తయారౌతుంది. ఇచ్చట కూడా మొదట రాజా-రాణులు రాజ్యపాలన చేసేవారు. కాని ప్రకాశము లేని కిరీటమున్న రాజుల రాజ్యము నడుస్తూ వచ్చింది. దైవీ రాజస్థానము తర్వాత ఇది ఆసురీ పతిత రాజస్థానంగా అయ్యింది. ఇప్పుడైతే పతిత ప్రజా స్థానము, పంచాయితీ రాజస్థానంగా అయ్యింది. వాస్తవానికి దీనిని రాజస్థానమని అనరు. అయితే పేరును మాత్రము పెట్టేశారు. అసలు రాజరికమే లేదు. ఇది కూడా డ్రామాలో రచింపబడింది. ఈ లక్ష్మీనారాయణుల చిత్రము మీకు చాలా ఉపయోగపడ్తుంది. ఈ చిత్రాన్ని చూపించి భారతదేశము ఇటువంటి డబుల్‌ కిరీటధారిగా ఉండేదని అర్థము చేయించాలి. అప్పుడు ఈ లక్ష్మీనారాయణల రాజ్యము ఉండేది, బాల్యములో వీరు రాధా-కృష్ణులుగా ఉండేవారు, ఆ తర్వాత మళ్ళీ త్రేతా యుగములో రామరాజ్యముగా అయ్యింది ఆ తర్వాత ద్వాపర యుగములో మాయ వచ్చేసిందని అందరికీ తెలపాలి. ఇది చాలా సులభము కదా. భారతదేశ చరిత్ర-భూగోళాలను ఈ విధముగా క్లుప్తంగా అర్థము చేయిస్తారు. ద్వాపరములోనే మరలా పవిత్ర రాజా-రాణులైన లక్ష్మీ నారాయణల మందిరాలు తయారయ్యాయి. దేవతలు వారంతకు వారే వామమార్గము (మధు మాంసములు సేవిసూ, దాంపత్య సుఖమును అనుభవిస్తూ, పూజించుట)లోకి వెళ్ళిపోయారు. పతితులుగా అవ్వడం మొదలయ్యింది. మళ్ళీ పావన దేవతలు ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళిపోయారో, వారి మందిరాలను తయారు చేసి పూజలు ప్రారంభించారు. పతితులైన వారే పావనంగా ఉండువారికి తల వంచి నమస్కరిస్తారు. బ్రిటిష్‌ ప్రభుత్వము ఉన్నంతవరకు రాజరికము ఉండేది. కావున రాజా - రాణులు ఉండేవారు. జమీందారీలు కూడా రాజా-రాణుల టైటిల్‌ తీసుకునేవారు. వారిని దర్బారులో గౌరవించేవారు. ఇప్పుడైతే ఏ రాజులూ లేరు. ఆ తర్వాత పరస్పరము కొట్లాడుకొన్నప్పుడు ముసల్మానులు మొదలైనవారు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ కలియుగ అంతము వచ్చేసిందని పిల్లలైన మీకు తెలుసు. వినాశనము అతిసమీపంగా ఎదుటనే నిల్చొని ఉంది. బాబా మళ్ళీ రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. స్థాపన ఎలా అవుతుందో మీకు తెలుసు. తర్వాత ఈ చరిత్ర-భూగోళాలు చెరిగిపోతాయి మళ్ళీ భక్తిమార్గములో వారు తమ గీతను తయారు చేస్తారు. అందులో చాలా వ్యత్యాసము ఏర్పడ్తుంది. భక్తి చేసేందుకు వారికి దేవీ దేవతా ధర్మము యొక్క పుస్తకము తప్పకుండా కావాలి. అందువలన డ్రామానుసారము గీతను తయారుచేశారు. అంతేగాని భక్తిమార్గములోని ఆ గీత ద్వారా రాజ్య స్థాపన చేస్తారని లేక నరుని నుండి నారాయణునిగా చేస్తారని కాదు. అలా ఏ మాత్రమూ జరగదు.

మీరు గుప్త సైన్యమని ఇప్పుడు తండ్రి అర్థము చేయిస్తున్నారు. బాబా కూడా గుప్తమైనవారే. మీకు కూడా గుప్త యోగబలముతో రాజ్యమును ప్రాప్తి చేయిస్తున్నారు. బాహుబలముతో హద్దు రాజ్యము లభిస్తుంది. ఇప్పుడు మనము భారతదేశాన్ని అదే దైవీ రాజస్థానముగా తయారు చేస్తున్నామని పిల్లలైన మీ హృదయములో నిశ్చయముంది. ఎవరు శ్రమ చేస్తారో, వారి శ్రమ దాగి ఉండలేదు. వినాశనమైతే అయ్యే తీరాలి. గీతలో కూడా ఈ విషయముంది. ఈ సమయములో చేసిన శ్రమను బట్టి 'మాకు భవిష్యత్తులో ఏ పదవి లభిస్తుంది?' అని అడుగుతారు. ఇచ్చట కూడా ఎవరైనా శరీరాన్ని వదిలితే 'వారు ఏ పదవిని ప్రాప్తి చేసుకుంటారు?' అని సంకల్పము నడుస్తుంది. వారు ఏ విధంగా తనువు, మనస్సు, ధనముల ద్వారా సేవ చేశారో తండ్రికి మాత్రమే తెలుసు ఇది పిల్లలకు తెలుసుకోలేరు. బాప్‌దాదాకు తెలుసు. 'ఈ విధమైన సేవ నీవు చేశావు' అని తెలుపను కూడా తెలుపగలరు. జ్ఞానము తీసుకున్నా తీసుకోకపోయినా సహాయమైతే చాలా చేస్తారు. మనుష్యులు దానము చేస్తారు కదా. 'ఈ సంస్థ చాలా బాగుంది. మంచి కార్యం చేస్తోంది. కాని నాలో పవిత్రముగా ఉండే శక్తి లేదు. నేను యజ్ఞానికి సహాయము చేస్తాను' అని భావిస్తారు. కావున అందుకు కూడా వారికి ఫలితము లభిస్తుంది. మనుష్యులు కాలేజీలు, ఆసుపత్రులు ఇతరుల కొరకే తయారు చేస్తారు కదా. 'నాకు జబ్బు చేస్తే నేను ఆసుపత్రికి వెళ్తాను' అని భావిస్తూ చేయరు కదా. వేటినైతే నిర్మిస్తారో అవన్నీ ఇతరుల కొరకే నిర్మిస్తారు. అందువలన దాని ఫలము కూడా వారికి లభిస్తుంది. దానిని 'దానము' అని అంటారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? మీకు 'ఇహలోకము, పరలోకము సుఖంగా ఉండాలి' అని ఆశీర్వదిస్తారు. లోకము, పరలోకము అనేది ఈ సంగమ యుగములోని విషయమే. ఇది మృత్యులోక జన్మ. అమరలోక జన్మ కూడా అయ్యింది, రెండూ కూడా సఫలమౌతాయి. తప్పక ఇప్పటి మీ జన్మ సఫలమౌతూ ఉంది. కొంతమంది తనువు ద్వారా, కొందరు మనస్సు ద్వారా, కొందరు ధనము ద్వారా సేవ చేస్తారు. జ్ఞానము తీసుకోలేనివారు చాలా మంది ఉన్నారు. ''బాబా మాకు అంతటి ధైర్యము లేదు కాని సహాయము చేయగలము'' అని అంటారు. అప్పుడు మీరు ఇంత ధనవంతులుగా అవ్వగలరని బాబా తెలిపిస్తారు. ఏదైనా విషయముంటే, అనుమానముంటే అడగవచ్చు. బాబాను అనుసరించాలి. అందువలన ''ఈ పరిస్థితిలో మేము ఏమి చేయాలి బాబా?'' అని వారినే అడగాలి. శ్రీమతమునిచ్చే తండ్రి కూర్చుని ఉన్నారు, కావున వారిని అడగాలి, ఏ విషయమూ దాచరాదు. అలా దాచితే జబ్బు పెరిగిపోతుంది. అడుగడుగునా శ్రీమతమును అనుసరించకపోతే చాలా గొడవ జరుగుతుంది, బాబా దూరముగా లేరు కదా. సన్ముఖములో వచ్చి అడగాలి. ఇటువంటి బాప్‌దాదా వద్దకు ఘడియ ఘడియ రావాలి. వాస్తవానికి ఇటువంటి అతిప్రియమైన తండ్రితో సదా కలిసి ఉండాలి. ప్రియుని సదా అంటి పెట్టుకొని ఉండాలి. ఆ ప్రియులు దేహ సంబంధమైనవారు. కాని వీరు ఇచ్చట ఆత్మిక సంబంధమైనవారు. ఇందులో అంటిపెట్టుకొనే విషయము లేదు. ఇచ్చటనే అందరినీ కూర్చోబెట్టరు. ఇది ఎటువంటి విషయమంటే వారి ముందు కూర్చునే ఉండాలి. వింటూనే ఉండాలి. వారి మతమును అనుసరిస్తూనే ఉండాలి. కాని బాబా '' ఇక్కడే కూర్చుండి పోరాదు'' అని అంటున్నారు. గంగా నదిగా అవ్వండి. సేవ చేసేందుకు వెళ్ళండి. పిల్లల ప్రేమ ఎలా ఉండాలంటే అందులోనే మస్త్‌ అయ్యి ఉండాలి, మైమరచిపోవాలి. కాని మళ్ళీ సేవ కూడా చేయాలి. నిశ్చయబుద్ధి కలిగినవారైతే పూర్తిగా తగులుకొని ఉంటారు. ఫలానివారు చాలా మంచి నిశ్చయబుద్ధి కలిగినవారని పిల్లలు వ్రాస్తారు. కాని కొద్దిగా కూడా అర్థము చేసుకోలేదని నేను వ్రాస్తాను. ఒకవేళ నిశ్చయబుద్ధి కలిగినవారే అయితే స్వర్గానికి అధికారులుగా తయారు చేసే బాబా వచ్చేశాక వారిని కలుసుకోకుండా ఒక్క క్షణము కూడా ఉండలేరు. తపించిపోయే పిల్లలు చాలామంది ఉన్నారు. అటువంటివారికి ఇంట్లో కూర్చొని ఉండినా వారికి బ్రహ్మ సాక్షాత్కారము, కృష్ణుని సాక్షాత్కారము జరుగుతుంది. బాబా పరంధామము నుండి మనకు రాజధానిని ఇచ్చేందుకు వచ్చారని నిశ్చయముంటే వెంటనే వచ్చి బాబాను కలుసుకోవాలి. అలా కూడా చాలా మంది వస్తారు. మీరు మళ్ళీ 'జ్ఞాన గంగలుగా అవ్వండి' అని వారికి అర్థము చేయించడం జరుగుతుంది. ప్రజలేమో అనేక మంది కావాలి. రాజధాని స్థాపనవుతూ ఉంది. ఈ చిత్రాలు ఇతరులకు అర్థము చేయించేందుకు చాలా బాగున్నాయి. మేము మళ్ళీ రాజధాని స్థాపన చేస్తున్నామని మీరు ఎవరికైనా చెప్పవచ్చు. వినాశనము కూడా ఎదురుగానే నిల్చొని ఉంది. మరణించేందుకు ముందే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. ఒకే సర్వశక్తివంతమైన ప్రభుత్వము ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే ఇప్పుడు అందరూ కలిసి ఒక్కటిగా అవ్వలేరు. ఒకప్పుడు తప్పకుండా ఒకే రాజ్యముండేది. దానికి గాయనము కూడా ఉంది. సత్యయుగము చాలా ప్రసిద్ధి చెందింది. మరలా అది స్థాపన అవుతూ ఉంది. కొంతమంది ఈ విషయాలను వెంటనే అంగీకరిస్తారు. కొంతమంది అంగీకరించరు. 5 వేల సంవత్సరాల క్రితము లక్ష్మీనారాయణుల రాజ్యముండేది మళ్ళీ ఈ రాజుల రాజ్యము వచ్చేసింది. ఇప్పుడు రాజులు కూడా పతితమైపోయారు. ఇప్పుడు మళ్ళీ పావన లక్ష్మీనారాయణుల రాజ్యము వస్తుంది. ఇతరులకు అర్థము చేయించడం మీకు చాలా సులభము. శివబాబా శ్రీమతము ద్వారా, వారి సహాయము ద్వారా మనము దైవీ రాజ్యస్థాపన చేస్తున్నాము. శివబాబా నుండి శక్తి కూడా లభిస్తుంది. ఈ నషా ఉండాలి. మీరు యోధులు. మందిరాలకు కూడా వెళ్ళి అర్థము చేయించగలరు. అందువలన స్వర్గ స్థాపన తప్పకుండా రచయిత ద్వారానే జరుగుతుంది కదా. అనంతమైన తండ్రి ఒక్కరేనని మీకు తెలుసు. వారు మీ సన్ముఖములో ఉండి మిమ్ములను జ్ఞానముతో శృంగారిస్తున్నారు. రాజయోగాన్ని నేర్పుతున్నారు. ఆ గీతను వినిపించువారు ఎప్పుడూ రాజయోగమును నేర్పలేరు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఈ నషా ఎక్కించడం జరుగుతుంది. స్వర్గ స్థాపన చేసేందుకు బాబా వచ్చారు. స్వర్గములో ఉండేదే పావన రాజస్థానము. మనుష్యులైతే లక్ష్మీనారాయణుల రాజ్యమునే మర్చిపోయారు. ఇప్పుడు తండ్రి సన్ముఖములో కూర్చుని అర్థము చేయిస్తున్నారు. మీరు ఏదైనా గీతా పాఠశాల మొదలైన వాటికైనా వెళ్ళండి. ఎవ్వరూ 84 జన్మల సమాచారము లేక మొత్తము చరిత్ర-భూగోళాలను వినిపించలేరు. లక్ష్మీనారాయణుల చిత్రముతో పాటు రాధా-కృష్ణుల చిత్రము కూడా ఉంటే అర్థము చేయించేందుకు సులభముగా ఉంటుంది. ఇది కరెక్ట్‌ (ఖచ్చితమైన) చిత్రము. దాని క్రింద వ్రాత కూడా చాలా బాగుండాలి. మీ బుద్ధిలో పూర్తి సృష్టి చక్రమంతా గుర్తుంది. దానితో పాటు చక్రమును అర్థము చేయించే బాబా కూడా గుర్తున్నారు. కాని నిరంతరము స్మృతి చేసే అభ్యాసములో శ్రమ చాలా ఉంది. నిరంతర స్మృతి ఎంత పక్కాగా ఉండాలంటే చివరి సమయములో ఏ చెత్తాచెదారము గుర్తు రాకూడదు. తండ్రిని ఎప్పుడూ మర్చిపోరాదు. చిన్న పిల్లలు తండ్రిని చాలా స్మృతి చేస్తారు. ఆ పిల్లలు పెద్దవారైతే తండ్రి ఇచ్చే ధనమును స్మృతి చేస్తారు. మీకు కూడా ధనము లభిస్తుంది. దానిని మంచిరీతిగా ధారణ చేసి ఇతరులకు దానము చేయాలి. పూర్తి ధర్మదాతలుగా అవ్వాలి. నేను సన్ముఖములో వచ్చి రాజయోగాన్ని నేర్పుతాను. ఆ గీతనైతే జన్మ-జన్మాంతరాలుగా చదివారు. కాని ప్రాప్తి కొద్దిగా కూడా లేదు. ఇచ్చట అయితే నరుని నుండి నారాయణునిగా తయారయ్యేందుకు మీకు ఈ శిక్షణనిస్తున్నాను. అది భక్తిమార్గము. ఇచ్చట కూడా మీ దైవీ కుటుంబానికి చెందినవారు కోట్లలో ఏ ఒక్కరో వెలువడ్తారు. మళ్ళీ బ్రాహ్మణులుగా తయారయ్యేందుకు తప్పకుండా వస్తారు. రాజా-రాణులుగా అవ్వవచ్చు, ప్రజలుగా అవ్వవచ్చు. అందులో కూడా కొంతమంది వింటారు, వర్ణన చేస్తారు, మళ్ళీ పారిపోతారు. ఎవరైతే బాబా పిల్లలుగా అయ్యి మళ్ళీ విడాకులు ఇస్తారో వారి పై ఎంతో దండన పడ్తుంది చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. మేము నిరంతరము స్మృతి చేస్తూ ఉన్నామని ఈ సమయములో ఎవ్వరూ చెప్పలేరు. ఒకవేళ అలా ఎవరైనా అంటే తమ చార్టు వ్రాసి పంపితే బాబా అంతా అర్థము చేసుకుంటారు. భారతదేశ సేవలోనే తనువు, మనస్సు, ధనాలను ఉపయోగిస్తున్నారు. లక్ష్మీనారాయణుల చిత్రము సదా జేబులో ఉండాలి. పిల్లలకు చాలా నషా ఉండాలి.

'మీరు భారతదేశానికి ఏ సేవ చేస్తున్నారు?' అని సమాజ సేవకులు మిమ్ములను అడుగుతారు. మా తనువు-మనస్సు-ధనముల ద్వారా భారతదేశాన్ని దైవీ రాజస్థానముగా తయారు చేస్తున్నామని చెప్పండి. ఇటువంటి సేవ ఇతరులెవ్వరూ చేయలేరు. మీరు ఎంత సేవ చేస్తారో మీ బుద్ధి అంత రిఫైన్‌ (విశుద్ధము)గా అవుతూ పోతుంది. బాగా అర్థము చేయించలేని పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. వారు బాబా పేరును అప్రతిష్టపాలు చేస్తారు. కొంతమందిలో క్రోధ భూతము కూడా ఉంది. ఈ కోపము కూడా వినాశన కార్యము చేయిస్తుంది కదా. అటువంటివారికి 'మీ ముఖము చూచుకోండి' అని అంటారు. మీరు లక్ష్మీ లేక నారాయణులను వరించుటకు అర్హులుగా అయ్యారా? ఈ విధంగా ఎవరైతే గౌరవమును పోగొట్టే పిల్లలు ఏ పదవిని పొందుతారు! వారు కాలినడకన వెళ్లే సిపాయిల లైనులో వచ్చేస్తారు. మీరు కూడా సైన్యము కదా. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. 

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. అవినాశి జ్ఞాన రత్నాలను దానము చేసే మహాదానిగా తయారు కావాలి. తనువు, మనస్సు, ధనముల ద్వారా భారతదేశాన్ని స్వర్గముగా తయారు చేసే సేవ చేయాలి.
2. వినాశనం చేసే ఏ కార్యాన్ని చేయరాదు. నిరంతరము స్మృతి చేసే అభ్యాసములో ఉండాలి. 

వరదానము :- '' సత్యమైన హృదయ పూర్వక సంబంధము ద్వారా యథార్థమైన సాధన చేసే నిరంతర యోగీ భవ ''
సాధన అనగా శక్తిశాలీ స్మృతి, తండ్రితో హృదయ పూర్వక సత్యమైన సంబంధము. ఎలాగైతే యోగము చేయునప్పుడు శరీరముతో ఏకాగ్రమై కూర్చుంటారో అలా హృదయము, మనసు-బుద్ధి అన్నీ ఒక్క తండ్రి వైపు, తండ్రి జత-జతలో కూర్చోవాలి. ఇదే యథార్థమైన సాధన. ఇటువంటి సాధన లేకుంటే మళ్ళీ ఆరాధన(భక్తిమార్గము) నడుస్తుంది, ఒకసారి స్మృతి(యాద్‌) చేస్తారు, ఒకసారి ఫిర్యాదులు(ఫరియాద్‌) చేస్తారు. వాస్తవానికి స్మృతిలో ఫిర్యాదుల ఆవశ్యకత లేదు. ఎవరికైతే తండ్రితో హృదయపూర్వక సంబంధముందో వారు నిరంతర యోగులుగా అయిపోతారు. 

స్లోగన్‌ :- ''కరావన్‌హార్‌ (చేయించేవారు) తండ్రి '' - ఈ స్మృతి ద్వారా చింతలేని చక్రవర్తులై ఎగిరే కళను అనుభవం చేస్తూ వెళ్ళండి (ఎగరండి).