08-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
''మధురమైన
పిల్లలారా - ఎంతెంతగా ఇతరులకు జ్ఞానము వినిపిస్తారో, అంత మీ బుద్ధిలో
జ్ఞానము రిఫైన్ అవుతూ ఉంటుంది. అందువలన సేవ తప్పకుండా చేయాలి''
ప్రశ్న :- బాబా వద్ద ఏ రెండు రకాల పిల్లలున్నారు? వారిరువురికి గల తేడా ఏమిటి?
జవాబు :- బాబా
వద్ద గల రెండు రకాల పిల్లలలో మొదటి రకము వారు స్వంత పిల్లలు. రెండవ
రకమువారు సవతి పిల్లలు. సవతి పిల్లలు కేవలము నోటి ద్వారా ''బాబా-మమ్మా''
అని అంటూ ఉంటారు. కాని శ్రీమతమును పూర్తిగా అనుసరించలేరు, పూర్తిగా
బలిహారము అవ్వరు. స్వంత పిల్లలైతే తనువు, మనస్సు, ధనములతో పూర్తిగా
సమర్పితమౌతారు అనగా ట్రస్టీలుగా ఉంటారు. అడుగడుగునా శ్రీమతమును
అనుసరిస్తారు. సవతి పిల్లలు సేవ చేయని కారణంగా నడుస్తూ, నడుస్తూ క్రింద
పడిపోతారు, సంశయము వచ్చేస్తుంది. స్వంత పిల్లలు పూర్తిగా నిశ్చయబుద్ధి
గలవారిగా ఉంటారు.
పాట :- చిన్ననాటి రోజులు మర్చిపోరాదు,.......... (బచ్‌పన్ కే దిన్ భులాన దేనా,.........)
ఓంశాంతి. తండ్రి
పిల్లలకు అర్థము చేయిస్తారు. ఏ తండ్రి? వాస్తవానికి ఇరువురూ తండ్రులే.
ఒకరు ఆత్మిక తండ్రి. వారిని 'బాబా' అని అంటారు. రెండవవారు దైహిక తండ్రి.
వారిని 'దాదా' అని అంటారు. మనమంతా బాప్‌దాదా పిల్లలమని అన్ని సేవాకేంద్రాల
పిల్లలకు తెలుసు. ఆత్మిక తండ్రి శివుడు. వారు సర్వ ఆత్మలకు తండ్రి. దాదా
అయిన బ్రహ్మ మనుష్య వంశమంతటికీ పెద్దవారు. మీరు వచ్చి వారికి పిల్లలుగా
అయ్యారు. వారిలో కొంతమంది పక్కా స్వంత పిల్లలు. కొంతమంది సవతి పిల్లలు కూడా
ఉన్నారు. రెండు రకాల వారూ 'మమ్మా-బాబా' అని పిలుస్తారు. కాని సవతి పిల్లలు
బలి అవ్వలేరు. బలిహారమవ్వనివారికి అంతటి శక్తి లభించజాలదు అనగా తండ్రిని
తమ తనువు, మనసు, ధనాలకు ట్రస్టీగా చేయలేరు. అంతేకాక శ్రేష్ఠముగా
తయారయ్యేందుకు వారి శ్రీమతమును అనుసరించలేరు. సొంత పిల్లలకు సూక్ష్మ సహాయము
లభిస్తుంది. కాని వారు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. భలే స్వంత
పిల్లలుగా ఉన్నారు. కాని వారిని కూడా ఇప్పుడే 'పక్కా' అని అనరు. ఎప్పటివరకు
రిజల్టు(ఫలితము) వెలువడదో అంతవరకు 'పక్కా' అని అనలేరు. భలే ఇక్కడ ఉంటారు,
చాలా మంచిగా ఉంటారు, సేవ కూడా చేస్తారు. అయినా క్రింద కూడా పడ్తారు. ఇదంతా
బుద్ధియోగానికి సంబంధించిన విషయము. బాబాను మర్చిపోరాదు. బాబా ఈ భారతదేశమును
పిల్లల సహాయముతో స్వర్గముగా చేస్తారు. శివశక్తి సైన్యము అని గాయనము కూడా
చేయబడింది. ప్రతి ఒక్కరు తమతో తాము మాట్లాడుకోవాలి - ''తప్పకుండా మేము
శివబాబాకు దత్తత తీసుకోబడిన పిల్లలము.'' తండ్రి నుండి మేము స్వర్గవారసత్వము
పొందుకుంటున్నాము. ద్వాపరయుగము నుండి మనము ఏ లౌకిక తండ్రి వారసత్వమునైతే
పొందుకున్నామో అదంతా నరక వారసత్వమే. దాని వలన దు:ఖితులుగా అవుతూ వచ్చాము.
భక్తిమార్గములో అయితే ఉన్నవన్నీ గ్రుడ్డి నమ్మకాలే. ఎప్పటి నుండి
భక్తిమార్గము ప్రారంభమయ్యిందో అప్పటి నుండి ఒక్కొక్క సంవత్సరము గడిచే కొలది
మనము క్రిందికే దిగజారుతూ వచ్చాము. భక్తి కూడా మొదట అవ్యభిచారిగా ఉండేది.
ఒక్కరినే పూజించేవారము. అందుకు బదులు ఇప్పుడు అనేకులను పూజిస్తూ వచ్చాము. ఈ
విషయాలన్నీ అనగా భక్తిమార్గము ఎప్పటి నుండి ప్రారంభమౌతుందో ఋషులు, మునులు,
సాధు సత్పురుషులు మొదలైనవారికి ఎవ్వరికీ తెలియవు. శాస్త్రాలలో కూడా
'బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి' అని ఉంది. భలే బ్రహ్మ-సరస్వతులే
లక్ష్మీనారాయణులుగా అవుతారు, కాని పేరు మాత్రము బ్రహ్మదే చెప్తారు. 'బ్రహ్మ
పగలు, బ్రహ్మ రాత్రి' అని అంటారు. బ్రహ్మతో పాటు పిల్లలు కూడా చాలా మంది
ఉన్నారు. లక్ష్మీనారాయణులకైతే ఇంతమంది పిల్లలు ఉండరు. వారిని ' ప్రజాపిత '
అని కూడా అనరు. ఇప్పుడు కొత్త ప్రజలు తయారౌతూ ఉన్నారు. బ్రాహ్మణుల కులానికి
చెందినవారే కొత్త ప్రజలు. బ్రాహ్మణులే స్వయాన్ని ఈశ్వరీయ సంతానంగా
భావిస్తారు. దేవతలైతే అలా భావించరు. వారికి చక్రమును గురించే తెలియదు.
ఇప్పుడు మనము శివబాబా పిల్లలుగా అయ్యామని మీకు తెలుసు. వారే మనకు 84 జన్మల చక్రమును గురించి అర్థము చేయించారు. వారి సహాయముతోనే మనము భారతదేశాన్ని మళ్ళీ దైవీ పావన రాజస్థానముగా తయారు చేస్తున్నాము. ఇది చాలా అర్థము చేసుకునే విషయము. ఎవరికైనా అర్థము చేయించేందుకు కూడా ధైర్యము కావాలి. మీరు శివశక్తి పాండవ సైన్యము. అంతేకాక మార్గదర్శకులు కూడా మీరే. అందరికీ దారి చూపుతారు. మీరు తప్ప ఇతరులెవ్వరూ ఆత్మిక మధురమైన ఇంటికి దారి తెలుపలేరు. ఆ పండాలైతే 'అమరనాథ్'కు లేక ఇక ఏదైనా తీర్థ స్థానాలకు తీసుకెళ్తారు. బి.కెలైన మీరైతే ఒక్కసారిగా అన్నిటికీ దూరంగా పరంధామానికి తీసుకెళ్తారు. వారు దేహ సంబంధమైన మార్గదర్శకులు ఎదురుదెబ్బలు తినిపించేవారు. మీరు అందరినీ తండ్రి వద్దకు శాంతిధామానికి తీసుకెళ్తారు. కావున మేము భారతదేశాన్ని మరలా దైవీ రాజస్థానంగా తయారు చేస్తున్నామని సదా జ్ఞాపకము ఉంచుకోవలసి వస్తుంది. భారతదేశములో ఆది సనాతన దేవతా ధర్మముండేదని ఎవరైనా ఒప్పుకుంటారు. భారతదేశము సత్యయుగములో అనంతమైన దైవీ పావన రాజస్థానముగా ఉండేది. తర్వాత మళ్ళీ పావన క్షత్రియ రాజస్థానంగా తయారయ్యింది. ఆ తర్వాత మళ్ళీ మాయ ప్రవేశించినందున ఆసురీ రాజస్థానంగా తయారౌతుంది. ఇచ్చట కూడా మొదట రాజా-రాణులు రాజ్యపాలన చేసేవారు. కాని ప్రకాశము లేని కిరీటమున్న రాజుల రాజ్యము నడుస్తూ వచ్చింది. దైవీ రాజస్థానము తర్వాత ఇది ఆసురీ పతిత రాజస్థానంగా అయ్యింది. ఇప్పుడైతే పతిత ప్రజా స్థానము, పంచాయితీ రాజస్థానంగా అయ్యింది. వాస్తవానికి దీనిని రాజస్థానమని అనరు. అయితే పేరును మాత్రము పెట్టేశారు. అసలు రాజరికమే లేదు. ఇది కూడా డ్రామాలో రచింపబడింది. ఈ లక్ష్మీనారాయణుల చిత్రము మీకు చాలా ఉపయోగపడ్తుంది. ఈ చిత్రాన్ని చూపించి భారతదేశము ఇటువంటి డబుల్ కిరీటధారిగా ఉండేదని అర్థము చేయించాలి. అప్పుడు ఈ లక్ష్మీనారాయణల రాజ్యము ఉండేది, బాల్యములో వీరు రాధా-కృష్ణులుగా ఉండేవారు, ఆ తర్వాత మళ్ళీ త్రేతా యుగములో రామరాజ్యముగా అయ్యింది ఆ తర్వాత ద్వాపర యుగములో మాయ వచ్చేసిందని అందరికీ తెలపాలి. ఇది చాలా సులభము కదా. భారతదేశ చరిత్ర-భూగోళాలను ఈ విధముగా క్లుప్తంగా అర్థము చేయిస్తారు. ద్వాపరములోనే మరలా పవిత్ర రాజా-రాణులైన లక్ష్మీ నారాయణల మందిరాలు తయారయ్యాయి. దేవతలు వారంతకు వారే వామమార్గము (మధు మాంసములు సేవిసూ, దాంపత్య సుఖమును అనుభవిస్తూ, పూజించుట)లోకి వెళ్ళిపోయారు. పతితులుగా అవ్వడం మొదలయ్యింది. మళ్ళీ పావన దేవతలు ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళిపోయారో, వారి మందిరాలను తయారు చేసి పూజలు ప్రారంభించారు. పతితులైన వారే పావనంగా ఉండువారికి తల వంచి నమస్కరిస్తారు. బ్రిటిష్ ప్రభుత్వము ఉన్నంతవరకు రాజరికము ఉండేది. కావున రాజా - రాణులు ఉండేవారు. జమీందారీలు కూడా రాజా-రాణుల టైటిల్ తీసుకునేవారు. వారిని దర్బారులో గౌరవించేవారు. ఇప్పుడైతే ఏ రాజులూ లేరు. ఆ తర్వాత పరస్పరము కొట్లాడుకొన్నప్పుడు ముసల్మానులు మొదలైనవారు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ కలియుగ అంతము వచ్చేసిందని పిల్లలైన మీకు తెలుసు. వినాశనము అతిసమీపంగా ఎదుటనే నిల్చొని ఉంది. బాబా మళ్ళీ రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. స్థాపన ఎలా అవుతుందో మీకు తెలుసు. తర్వాత ఈ చరిత్ర-భూగోళాలు చెరిగిపోతాయి మళ్ళీ భక్తిమార్గములో వారు తమ గీతను తయారు చేస్తారు. అందులో చాలా వ్యత్యాసము ఏర్పడ్తుంది. భక్తి చేసేందుకు వారికి దేవీ దేవతా ధర్మము యొక్క పుస్తకము తప్పకుండా కావాలి. అందువలన డ్రామానుసారము గీతను తయారుచేశారు. అంతేగాని భక్తిమార్గములోని ఆ గీత ద్వారా రాజ్య స్థాపన చేస్తారని లేక నరుని నుండి నారాయణునిగా చేస్తారని కాదు. అలా ఏ మాత్రమూ జరగదు.
మీరు గుప్త సైన్యమని ఇప్పుడు తండ్రి అర్థము చేయిస్తున్నారు. బాబా కూడా గుప్తమైనవారే. మీకు కూడా గుప్త యోగబలముతో రాజ్యమును ప్రాప్తి చేయిస్తున్నారు. బాహుబలముతో హద్దు రాజ్యము లభిస్తుంది. ఇప్పుడు మనము భారతదేశాన్ని అదే దైవీ రాజస్థానముగా తయారు చేస్తున్నామని పిల్లలైన మీ హృదయములో నిశ్చయముంది. ఎవరు శ్రమ చేస్తారో, వారి శ్రమ దాగి ఉండలేదు. వినాశనమైతే అయ్యే తీరాలి. గీతలో కూడా ఈ విషయముంది. ఈ సమయములో చేసిన శ్రమను బట్టి 'మాకు భవిష్యత్తులో ఏ పదవి లభిస్తుంది?' అని అడుగుతారు. ఇచ్చట కూడా ఎవరైనా శరీరాన్ని వదిలితే 'వారు ఏ పదవిని ప్రాప్తి చేసుకుంటారు?' అని సంకల్పము నడుస్తుంది. వారు ఏ విధంగా తనువు, మనస్సు, ధనముల ద్వారా సేవ చేశారో తండ్రికి మాత్రమే తెలుసు ఇది పిల్లలకు తెలుసుకోలేరు. బాప్‌దాదాకు తెలుసు. 'ఈ విధమైన సేవ నీవు చేశావు' అని తెలుపను కూడా తెలుపగలరు. జ్ఞానము తీసుకున్నా తీసుకోకపోయినా సహాయమైతే చాలా చేస్తారు. మనుష్యులు దానము చేస్తారు కదా. 'ఈ సంస్థ చాలా బాగుంది. మంచి కార్యం చేస్తోంది. కాని నాలో పవిత్రముగా ఉండే శక్తి లేదు. నేను యజ్ఞానికి సహాయము చేస్తాను' అని భావిస్తారు. కావున అందుకు కూడా వారికి ఫలితము లభిస్తుంది. మనుష్యులు కాలేజీలు, ఆసుపత్రులు ఇతరుల కొరకే తయారు చేస్తారు కదా. 'నాకు జబ్బు చేస్తే నేను ఆసుపత్రికి వెళ్తాను' అని భావిస్తూ చేయరు కదా. వేటినైతే నిర్మిస్తారో అవన్నీ ఇతరుల కొరకే నిర్మిస్తారు. అందువలన దాని ఫలము కూడా వారికి లభిస్తుంది. దానిని 'దానము' అని అంటారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? మీకు 'ఇహలోకము, పరలోకము సుఖంగా ఉండాలి' అని ఆశీర్వదిస్తారు. లోకము, పరలోకము అనేది ఈ సంగమ యుగములోని విషయమే. ఇది మృత్యులోక జన్మ. అమరలోక జన్మ కూడా అయ్యింది, రెండూ కూడా సఫలమౌతాయి. తప్పక ఇప్పటి మీ జన్మ సఫలమౌతూ ఉంది. కొంతమంది తనువు ద్వారా, కొందరు మనస్సు ద్వారా, కొందరు ధనము ద్వారా సేవ చేస్తారు. జ్ఞానము తీసుకోలేనివారు చాలా మంది ఉన్నారు. ''బాబా మాకు అంతటి ధైర్యము లేదు కాని సహాయము చేయగలము'' అని అంటారు. అప్పుడు మీరు ఇంత ధనవంతులుగా అవ్వగలరని బాబా తెలిపిస్తారు. ఏదైనా విషయముంటే, అనుమానముంటే అడగవచ్చు. బాబాను అనుసరించాలి. అందువలన ''ఈ పరిస్థితిలో మేము ఏమి చేయాలి బాబా?'' అని వారినే అడగాలి. శ్రీమతమునిచ్చే తండ్రి కూర్చుని ఉన్నారు, కావున వారిని అడగాలి, ఏ విషయమూ దాచరాదు. అలా దాచితే జబ్బు పెరిగిపోతుంది. అడుగడుగునా శ్రీమతమును అనుసరించకపోతే చాలా గొడవ జరుగుతుంది, బాబా దూరముగా లేరు కదా. సన్ముఖములో వచ్చి అడగాలి. ఇటువంటి బాప్‌దాదా వద్దకు ఘడియ ఘడియ రావాలి. వాస్తవానికి ఇటువంటి అతిప్రియమైన తండ్రితో సదా కలిసి ఉండాలి. ప్రియుని సదా అంటి పెట్టుకొని ఉండాలి. ఆ ప్రియులు దేహ సంబంధమైనవారు. కాని వీరు ఇచ్చట ఆత్మిక సంబంధమైనవారు. ఇందులో అంటిపెట్టుకొనే విషయము లేదు. ఇచ్చటనే అందరినీ కూర్చోబెట్టరు. ఇది ఎటువంటి విషయమంటే వారి ముందు కూర్చునే ఉండాలి. వింటూనే ఉండాలి. వారి మతమును అనుసరిస్తూనే ఉండాలి. కాని బాబా '' ఇక్కడే కూర్చుండి పోరాదు'' అని అంటున్నారు. గంగా నదిగా అవ్వండి. సేవ చేసేందుకు వెళ్ళండి. పిల్లల ప్రేమ ఎలా ఉండాలంటే అందులోనే మస్త్ అయ్యి ఉండాలి, మైమరచిపోవాలి. కాని మళ్ళీ సేవ కూడా చేయాలి. నిశ్చయబుద్ధి కలిగినవారైతే పూర్తిగా తగులుకొని ఉంటారు. ఫలానివారు చాలా మంచి నిశ్చయబుద్ధి కలిగినవారని పిల్లలు వ్రాస్తారు. కాని కొద్దిగా కూడా అర్థము చేసుకోలేదని నేను వ్రాస్తాను. ఒకవేళ నిశ్చయబుద్ధి కలిగినవారే అయితే స్వర్గానికి అధికారులుగా తయారు చేసే బాబా వచ్చేశాక వారిని కలుసుకోకుండా ఒక్క క్షణము కూడా ఉండలేరు. తపించిపోయే పిల్లలు చాలామంది ఉన్నారు. అటువంటివారికి ఇంట్లో కూర్చొని ఉండినా వారికి బ్రహ్మ సాక్షాత్కారము, కృష్ణుని సాక్షాత్కారము జరుగుతుంది. బాబా పరంధామము నుండి మనకు రాజధానిని ఇచ్చేందుకు వచ్చారని నిశ్చయముంటే వెంటనే వచ్చి బాబాను కలుసుకోవాలి. అలా కూడా చాలా మంది వస్తారు. మీరు మళ్ళీ 'జ్ఞాన గంగలుగా అవ్వండి' అని వారికి అర్థము చేయించడం జరుగుతుంది. ప్రజలేమో అనేక మంది కావాలి. రాజధాని స్థాపనవుతూ ఉంది. ఈ చిత్రాలు ఇతరులకు అర్థము చేయించేందుకు చాలా బాగున్నాయి. మేము మళ్ళీ రాజధాని స్థాపన చేస్తున్నామని మీరు ఎవరికైనా చెప్పవచ్చు. వినాశనము కూడా ఎదురుగానే నిల్చొని ఉంది. మరణించేందుకు ముందే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. ఒకే సర్వశక్తివంతమైన ప్రభుత్వము ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే ఇప్పుడు అందరూ కలిసి ఒక్కటిగా అవ్వలేరు. ఒకప్పుడు తప్పకుండా ఒకే రాజ్యముండేది. దానికి గాయనము కూడా ఉంది. సత్యయుగము చాలా ప్రసిద్ధి చెందింది. మరలా అది స్థాపన అవుతూ ఉంది. కొంతమంది ఈ విషయాలను వెంటనే అంగీకరిస్తారు. కొంతమంది అంగీకరించరు. 5 వేల సంవత్సరాల క్రితము లక్ష్మీనారాయణుల రాజ్యముండేది మళ్ళీ ఈ రాజుల రాజ్యము వచ్చేసింది. ఇప్పుడు రాజులు కూడా పతితమైపోయారు. ఇప్పుడు మళ్ళీ పావన లక్ష్మీనారాయణుల రాజ్యము వస్తుంది. ఇతరులకు అర్థము చేయించడం మీకు చాలా సులభము. శివబాబా శ్రీమతము ద్వారా, వారి సహాయము ద్వారా మనము దైవీ రాజ్యస్థాపన చేస్తున్నాము. శివబాబా నుండి శక్తి కూడా లభిస్తుంది. ఈ నషా ఉండాలి. మీరు యోధులు. మందిరాలకు కూడా వెళ్ళి అర్థము చేయించగలరు. అందువలన స్వర్గ స్థాపన తప్పకుండా రచయిత ద్వారానే జరుగుతుంది కదా. అనంతమైన తండ్రి ఒక్కరేనని మీకు తెలుసు. వారు మీ సన్ముఖములో ఉండి మిమ్ములను జ్ఞానముతో శృంగారిస్తున్నారు. రాజయోగాన్ని నేర్పుతున్నారు. ఆ గీతను వినిపించువారు ఎప్పుడూ రాజయోగమును నేర్పలేరు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఈ నషా ఎక్కించడం జరుగుతుంది. స్వర్గ స్థాపన చేసేందుకు బాబా వచ్చారు. స్వర్గములో ఉండేదే పావన రాజస్థానము. మనుష్యులైతే లక్ష్మీనారాయణుల రాజ్యమునే మర్చిపోయారు. ఇప్పుడు తండ్రి సన్ముఖములో కూర్చుని అర్థము చేయిస్తున్నారు. మీరు ఏదైనా గీతా పాఠశాల మొదలైన వాటికైనా వెళ్ళండి. ఎవ్వరూ 84 జన్మల సమాచారము లేక మొత్తము చరిత్ర-భూగోళాలను వినిపించలేరు. లక్ష్మీనారాయణుల చిత్రముతో పాటు రాధా-కృష్ణుల చిత్రము కూడా ఉంటే అర్థము చేయించేందుకు సులభముగా ఉంటుంది. ఇది కరెక్ట్ (ఖచ్చితమైన) చిత్రము. దాని క్రింద వ్రాత కూడా చాలా బాగుండాలి. మీ బుద్ధిలో పూర్తి సృష్టి చక్రమంతా గుర్తుంది. దానితో పాటు చక్రమును అర్థము చేయించే బాబా కూడా గుర్తున్నారు. కాని నిరంతరము స్మృతి చేసే అభ్యాసములో శ్రమ చాలా ఉంది. నిరంతర స్మృతి ఎంత పక్కాగా ఉండాలంటే చివరి సమయములో ఏ చెత్తాచెదారము గుర్తు రాకూడదు. తండ్రిని ఎప్పుడూ మర్చిపోరాదు. చిన్న పిల్లలు తండ్రిని చాలా స్మృతి చేస్తారు. ఆ పిల్లలు పెద్దవారైతే తండ్రి ఇచ్చే ధనమును స్మృతి చేస్తారు. మీకు కూడా ధనము లభిస్తుంది. దానిని మంచిరీతిగా ధారణ చేసి ఇతరులకు దానము చేయాలి. పూర్తి ధర్మదాతలుగా అవ్వాలి. నేను సన్ముఖములో వచ్చి రాజయోగాన్ని నేర్పుతాను. ఆ గీతనైతే జన్మ-జన్మాంతరాలుగా చదివారు. కాని ప్రాప్తి కొద్దిగా కూడా లేదు. ఇచ్చట అయితే నరుని నుండి నారాయణునిగా తయారయ్యేందుకు మీకు ఈ శిక్షణనిస్తున్నాను. అది భక్తిమార్గము. ఇచ్చట కూడా మీ దైవీ కుటుంబానికి చెందినవారు కోట్లలో ఏ ఒక్కరో వెలువడ్తారు. మళ్ళీ బ్రాహ్మణులుగా తయారయ్యేందుకు తప్పకుండా వస్తారు. రాజా-రాణులుగా అవ్వవచ్చు, ప్రజలుగా అవ్వవచ్చు. అందులో కూడా కొంతమంది వింటారు, వర్ణన చేస్తారు, మళ్ళీ పారిపోతారు. ఎవరైతే బాబా పిల్లలుగా అయ్యి మళ్ళీ విడాకులు ఇస్తారో వారి పై ఎంతో దండన పడ్తుంది చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. మేము నిరంతరము స్మృతి చేస్తూ ఉన్నామని ఈ సమయములో ఎవ్వరూ చెప్పలేరు. ఒకవేళ అలా ఎవరైనా అంటే తమ చార్టు వ్రాసి పంపితే బాబా అంతా అర్థము చేసుకుంటారు. భారతదేశ సేవలోనే తనువు, మనస్సు, ధనాలను ఉపయోగిస్తున్నారు. లక్ష్మీనారాయణుల చిత్రము సదా జేబులో ఉండాలి. పిల్లలకు చాలా నషా ఉండాలి.
'మీరు భారతదేశానికి ఏ సేవ చేస్తున్నారు?' అని సమాజ సేవకులు మిమ్ములను అడుగుతారు. మా తనువు-మనస్సు-ధనముల ద్వారా భారతదేశాన్ని దైవీ రాజస్థానముగా తయారు చేస్తున్నామని చెప్పండి. ఇటువంటి సేవ ఇతరులెవ్వరూ చేయలేరు. మీరు ఎంత సేవ చేస్తారో మీ బుద్ధి అంత రిఫైన్ (విశుద్ధము)గా అవుతూ పోతుంది. బాగా అర్థము చేయించలేని పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. వారు బాబా పేరును అప్రతిష్టపాలు చేస్తారు. కొంతమందిలో క్రోధ భూతము కూడా ఉంది. ఈ కోపము కూడా వినాశన కార్యము చేయిస్తుంది కదా. అటువంటివారికి 'మీ ముఖము చూచుకోండి' అని అంటారు. మీరు లక్ష్మీ లేక నారాయణులను వరించుటకు అర్హులుగా అయ్యారా? ఈ విధంగా ఎవరైతే గౌరవమును పోగొట్టే పిల్లలు ఏ పదవిని పొందుతారు! వారు కాలినడకన వెళ్లే సిపాయిల లైనులో వచ్చేస్తారు. మీరు కూడా సైన్యము కదా. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1.
అవినాశి జ్ఞాన రత్నాలను దానము చేసే మహాదానిగా తయారు కావాలి. తనువు,
మనస్సు, ధనముల ద్వారా భారతదేశాన్ని స్వర్గముగా తయారు చేసే సేవ చేయాలి.
2. వినాశనం చేసే ఏ కార్యాన్ని చేయరాదు. నిరంతరము స్మృతి చేసే అభ్యాసములో ఉండాలి.
వరదానము :- '' సత్యమైన హృదయ పూర్వక సంబంధము ద్వారా యథార్థమైన సాధన చేసే నిరంతర యోగీ భవ ''
సాధన
అనగా శక్తిశాలీ స్మృతి, తండ్రితో హృదయ పూర్వక సత్యమైన సంబంధము. ఎలాగైతే
యోగము చేయునప్పుడు శరీరముతో ఏకాగ్రమై కూర్చుంటారో అలా హృదయము, మనసు-బుద్ధి
అన్నీ ఒక్క తండ్రి వైపు, తండ్రి జత-జతలో కూర్చోవాలి. ఇదే యథార్థమైన సాధన.
ఇటువంటి సాధన లేకుంటే మళ్ళీ ఆరాధన(భక్తిమార్గము) నడుస్తుంది, ఒకసారి
స్మృతి(యాద్) చేస్తారు, ఒకసారి ఫిర్యాదులు(ఫరియాద్) చేస్తారు.
వాస్తవానికి స్మృతిలో ఫిర్యాదుల ఆవశ్యకత లేదు. ఎవరికైతే తండ్రితో
హృదయపూర్వక సంబంధముందో వారు నిరంతర యోగులుగా అయిపోతారు.
స్లోగన్ :- ''కరావన్‌హార్ (చేయించేవారు) తండ్రి '' - ఈ స్మృతి ద్వారా చింతలేని చక్రవర్తులై ఎగిరే కళను అనుభవం చేస్తూ వెళ్ళండి (ఎగరండి).
No comments:
Post a Comment