10-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
''మధురమైన పిల్లలారా -
సాకార శరీరాన్ని గుర్తు తెచ్చుకోవడం కూడా భూతాల అభిమానులుగా అవ్వడం.
ఎందుకంటే శరీరము పంచ భూతాలతో తయారు చేయబడింది. మీరు దేహీ-అభిమానులుగా అయ్యి
ఒక్క విదేహి తండ్రినే స్మృతి చేయాలి''
ప్రశ్న :- ఒక్క తండ్రియే చేసే అన్నింటికంటే సర్వోత్తమమైన కార్యము ఏది ?
జవాబు :- ఈ మొత్తము
తమోప్రధాన సృష్టినంతా సతోప్రధానంగా, సదా సుఖవంతముగా తయారు చేయడమే
అన్నింటికంటే సర్వోత్తమ కార్యము. ఇది ఒక్క తండ్రియే చేస్తారు. ఈ శ్రేష్ఠమైన
కార్యము కారణంగా వారి స్మృతి చిహ్నాలు కూడా చాలా ఉన్నతాతి ఉన్నతంగా తయారు
చేయబడ్డాయి.
ప్రశ్న :- ఏ రెండు శబ్ధాలలో మొత్తం
డ్రామా రహస్యమంతా పూర్తిగా వచ్చేస్తుంది ?
జవాబు :- పూజ్యులు మరియు పూజారులు.
మీరు పూజ్యులుగా ఉన్నప్పుడు ఉత్తమ పురుషులుగా ఉండేవారు తర్వాత మళ్లీ మధ్యమ పురుషులు,
కనిష్ఠులుగా అవుతారు. మాయ పూజ్యుల నుండి పూజారులుగా చేసేస్తుంది.
పాట :- సభలో దీపము వెలిగింది, ....... (మహఫిల్ మే జల్ ఉఠీ శమా,............)
ఓంశాంతి. భగవంతుడు కూర్చొని
పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - మనుష్యులను భగవంతుడని అనడానికి వీలు
లేదు. బ్రహ్మ, విష్ణు, శంకరులకు కూడా చిత్రాలు(శరీరాలు) ఉన్నాయి. కావున
వారిని కూడా భగవంతుడని అనడానికి వీలు లేదు. పరమపిత పరమాత్మ నివాసము, వారి
నివాసము కంటే ఉన్నతమైనది. వారిని మాత్రమే ప్రభూ! ఈశ్వరా! భగవంతుడా! అని
మొదలైన పేర్లతో పిలుస్తారు. మనుష్యులు వారిని పిలిచినప్పుడు, వారికి ఏ
ఆకారము గాని, సాకారమూర్తి గాని కనిపించదు. అందువలన ఏ మనిషి ఆకారమునైనా వారు
భగవంతుడని అనేస్తారు. సన్యాసులను చూచినా భగవాన్ అని అనేస్తారు. కాని
భగవంతుడు స్వయంగా అర్థం చేయిస్తున్నారు - మనుష్యులను భగవంతుడని అనడానికి
వీలు లేదు. నిరాకార భగవంతుని అయితే ఎంతగానో స్మృతి చేస్తారు. ఎవరైతే
గురువులను ఆశ్రయించలేదో వారికి, చిన్న పిల్లలకు కూడా పరమాత్మను స్మృతి
చేయమని నేర్పిస్తారు. కాని ఏ పరమాత్మను స్మృతి చేయాలో వారికి తెలుపబడదు. ఏ
చిత్రమూ బుద్ధిలో ఉండదు. దు:ఖ సమయాలలో ఓ ప్రభూ! అని అంటారు. అప్పుడు ఏ
గురువు చిత్రము కాని, దేవతల చిత్రము కాని, ఇక ఏ ఇతర చిత్రము గాని వారి
ముందుకు రాదు. భలే చాలామంది గురువులను అశ్రయించినా, వారు ఓ భగవంతుడా! అని
అన్నప్పుడు వారికి ఎప్పుడూ గురువులు గుర్తుకు రారు. ఒకవేళ గురువును
తలుచుకొని వారినే భగవంతుడని అన్నట్లయితే ఆ మనిషి కూడా జనన- మరణాలలోకి
వచ్చేవాడే అనగా ఇది పంచ తత్వాలతో తయారైన శరీరాన్ని స్మృతి చేసినట్లవుతుంది.
శరీరాన్ని పంచ భూతాలని అంటారు. ఆత్మను భూతమని అనరు. అందువలన అది భూత పూజ
వంటిదే. బుద్ధియోగము శరీరము వైపు వెళ్ళిపోతుంది. ఒకవేళ ఎవరైనా మనుష్యులను
భగవంతుడని భావిస్తే అతనిలో ఉన్న ఆత్మను స్మృతి చేసినట్లు కాదు. ఆత్మ అయితే
ఇరువురిలోనూ ఉంది. స్మృతి చేసేవారిలో కూడా ఉంది, ఎవరిని స్మృతి చేస్తారో
వారిలో కూడా ఉంది. పరమాత్మనైతే సర్వవ్యాపి అని అంటారు. అయితే పరమాత్మను
పాపాత్మ అని అనరు. వాస్తవంలో పరమాత్మ అనే పదము వెలువడినప్పుడు బుద్ధి
నిరాకారము వైపు వెళ్ళిపోతుంది. నిరాకార తండ్రిని నిరాకార ఆత్మ స్మృతి
చేస్తుంది. దానిని దేహీ-అభిమానము అని అంటారు. సాకార శరీరాన్ని స్మృతి
చేయువారు, భూతాల అభిమానులు. భూతము, భూతాన్ని స్మృతి చేస్తుంది. ఎందుకంటే
స్వయాన్ని ఆత్మగా భావించేందుకు బదులు 5 భూతాల శరీరంగా భావిస్తారు. పేరు
కూడా శరీరానికే ఉంటుంది. స్వయాన్ని కూడా 5 తత్వాల భూతంగా భావిస్తారు. ఆ
గురువులను కూడా శరీరముగానే స్మృతి చేస్తారు. దేహీ-అభిమానులుగా అయితే లేనే
లేరు. స్వయాన్ని నిరాకార ఆత్మగా భావిస్తే నిరాకార పరమాత్మను స్మృతి
చేయగలరు. సర్వాత్మల సంబంధము మొట్టమొదట పరమాత్మతో ఉంది. ఆత్మ దు:ఖములో
ఉన్నప్పుడు పరమాత్మనే స్మృతి చేస్తుంది ఎందుకంటే వారితో సంబంధముంది. వారు
ఆత్మలను అన్ని దు:ఖాల నుండి విడిపిస్తారు. వారిని దీపము అని కూడా అంటారు.
అలాగని దీపము, వత్తి విషయము కాదు. వారు పరమపిత పరమాత్మ. దీపము అంటూనే
మనుష్యులు జ్యోతిగా భావిస్తారు. తండ్రి స్వయంగా అర్థం చేయిస్తున్నారు -
నేను పరమాత్మను, నా పేరు శివ. శివుని, రుద్రుడని కూడా అంటారు. ఆ
నిరాకారునికే అనేక పేర్లున్నాయి. ఇతరులెవ్వరికీ ఇన్ని పేర్లు లేవు. బ్రహ్మ,
విష్ణు, శంకరులకు ఒక్కొక్క పేరు మాత్రమే ఉంది. దేహధారులందరికీ ఒక్కొక్క
పేరు మాత్రమే ఉంటుంది. ఒక్క ఈశ్వరునికి మాత్రమే అనేక పేర్లు ఇవ్వబడ్తాయి.
వారి మహిమ అపారమైనది. మనుష్యులకు ఒకే పేరు స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు మీరు
మరజీవగా అయ్యారు. కనుక పాతదంతా మర్చిపోవాలని మీకు మరొక పేరు పెట్టారు. మీరు
పరమపిత పరమాత్మ ముందు జీవించి ఉండే మరణిస్తారు కనుక ఇది మీ మరుజీవా జన్మ.
మాత-పితల వద్ద తప్పకుండా జన్మ తీసుకోబడ్తుంది. ఈ రహస్యమైన విషయాలు తండ్రి
కూర్చొని మీకు అర్థం చేయిస్తున్నారు. ప్రపంచములోని వారికైతే శివుడంటే ఎవరో
తెలియదు. బ్రహ్మ, విష్ణు, శంకరులను గురించి తెలుసు. బ్రహ్మ పగలు, బ్రహ్మ
రాత్రి అని కూడా అంటారు. బ్రహ్మ ద్వారా స్థాపన అని కూడా కేవలం విన్నారు
కాని ఎలా జరుగుతుందో తెలియదు. ఇప్పుడు క్రియేటర్ తప్పక నూతన ధర్మాన్ని,
నూతన ప్రపంచమునే రచిస్తారు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ కులమునే రచిస్తారు.
బ్రాహ్మణులైన మీరు బ్రహ్మను స్మృతి చేయరు. పరమపిత పరమాత్మను స్మృతి
చేస్తారు ఎందుకంటే మీరు బ్రహ్మ ద్వారా శివునివారిగా అయ్యారు. బయటి
ప్రపంచములో ఉన్న దేహాభిమానులైన బ్రాహ్మణులు, మీలాగా తమను బ్రహ్మకు
పిల్లలము, శివుని పౌత్రులమని అనరు. శివబాబా జయంతిని జరుపుకుంటారు కాని
వారిని గురించి తెలియనందున వారి పై గౌరవము లేదు. వారి మందిరానికి వెళ్తారు.
వీరు బ్రహ్మ, విష్ణు, శంకరులు గాని, లక్ష్మీనారాయణులు గాని కారని
భావిస్తారు. వారు తప్పకుండా నిరాకార పరమాత్మ. మిగిలిన పాత్రధారులందరికీ
వారి వారి పాత్రలు వారికున్నాయి. పునర్జన్మలు తీసుకుంటారు, తమ పేర్లను
ధరిస్తారు. పరమపిత పరమాత్మ ఒక్కరికి మాత్రమే వ్యక్త నామ-రూపాలు లేవు. కాని
మూఢమతులైన మనుష్యులు అర్థము చేసుకోరు. పరమాత్మ స్మృతి చిహ్నము ఉందంటే, వారు
తప్పకుండా వచ్చి ఉంటారు, స్వర్గము రచించి ఉంటారు. లేకుంటే స్వర్గాన్ని
ఎవరు రచిస్తారు? ఇప్పుడు మళ్లీ వచ్చి ఈ రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారు.
దీనిని యజ్ఞమని అంటారు ఎందుకంటే ఇందులో స్వాహా అవ్వవలసి ఉంటుంది.
యజ్ఞాలనైతే చాలా మంది మనుష్యులు రచిస్తారు. ఆ యజ్ఞాలన్నీ భక్తిమార్గములోని
స్థూల యజ్ఞాలు, ఈ యజ్ఞాన్ని స్వయం పరమపిత పరమాత్మయే వచ్చి రచిస్తారు,
పిల్లలను చదివిస్తారు. యజ్ఞము రచించినప్పుడు అందులో కూడా బ్రాహ్మణులు
శాస్త్రాలు, కథలు మొదలైనవి వినిపిస్తారు. ఈ తండ్రి అయితే జ్ఞానసాగరులు. ఈ
గీత, భాగవతము మొదలైన శాస్త్రాలన్నీ భక్తిమార్గానికి చెందినవని అంటారు. ఈ
స్థూల యజ్ఞాలు కూడా భక్తిమార్గానికి చెందినవి. ఈ సమయమే భక్తిమార్గానికి
చెందినది. కలియుగ అంత్యము వచ్చినప్పుడు భక్తి కూడా అంత్యములోకి వస్తుంది.
అప్పుడే భగవంతుడు వచ్చి కలుసుకుంటారు. ఎందుకంటే భక్తికి ఫలమునిచ్చేది వారే.
వారిని జ్ఞాన సూర్యులని అంటారు. జ్ఞాన చంద్రుడు, జ్ఞాన సూర్యుడు, జ్ఞాన
అదృష్ట నక్షత్రాలు. తండ్రి జ్ఞాన సూర్యుడు. ఇప్పుడు తల్లి జ్ఞానచంద్రుడు
కూడా కావాలి. కనుక ఏ శరీరములో ప్రవేశించారో అతడు జ్ఞాన చంద్రుడు, మాత
అయ్యాడు. మిగిలినవారంతా పిల్లలు, జ్ఞాన నక్షత్రాలు. ఈ లెక్క ప్రకారము జగదంబ
కూడా లక్కీ(అదృష్ట) నక్షత్రమే. ఎందుకంటే అందరూ పిల్లలే కదా. నక్షత్రాలలో
కొన్ని అన్నింటికంటే తీక్షణమైనవి కూడా ఉంటాయి. అలాగే ఇచ్చట కూడా
నంబరువారుగా ఉన్నారు. వారు స్థూల ఆకాశములోని సూర్య చంద్రులు, నక్షత్రాలు.
ఇది జ్ఞాన విషయము. అవి నీటి నదులు, వీరు జ్ఞాన నదులు. జ్ఞాన నదులు జ్ఞాన
సాగరుని నుండి వెలువడ్డారు.
ఇప్పుడు శివజయంతి జరుపుకుంటారు. తప్పకుండా సృష్ట్టి అంతటికీ తండ్రి అయినవారు వస్తారు. వారు వచ్చి తప్పకుండా స్వర్గమును రచించి ఉంటారు. ప్రాయ: లోపమైపోయిన ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేసేందుకు తండ్రి వస్తారు. ప్రభుత్వము కూడా ఏ ధర్మాన్ని అంగీకరించదు. మాకు ఏ ధర్మము లేదని అంటారు. వారు సత్యమే చెప్తున్నారు. భారతదేశ ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ప్రాయ: లోపమైపోయిందని తండ్రి కూడా చెప్తున్నారు. ధర్మములో శక్తి ఉంటుంది. భారతవాసులు తమ దేవీదేవతా ధర్మములో ఉన్నప్పుడు చాలా సుఖంగా ఉండేవారు. ఈ ప్రపంచములో సర్వశక్తివంతమైన రాజ్యముండేది. పురుషోత్తములు రాజ్యపాలన చేసేవారు. శ్రీ లక్ష్మీనారాయణులనే పురుషోత్తములని అంటారు. నంబరువారుగా ఉన్నతులు, అధములు ఉండనే ఉంటారు. సర్వోత్తమ పురుషులు, ఉత్తమ పురుషులు, మధ్యమ పురుషులు, కనిష్ఠ పురుషులు ఉండనే ఉంటారు. మొట్టమొదట అందరికంటే సర్వోత్తమ పురుషులుగా ఎవరవుతారో వారే మళ్లీ మధ్యమ, కనిష్ఠ పురుషులుగా అవుతారు. లక్ష్మీనారాయణులు పురుషోత్తములు. పురుషులందరిలో ఉత్తములు. తర్వాత క్రిందికి దిగినప్పుడు దేవతల నుండి క్షత్రియులుగా, క్షత్రియుల నుండి మళ్లీ వైశ్యులుగా, కనిష్ఠులైన శూద్రులుగా అవుతారు. సీతారాములను కూడా పురుషోత్తములని అనరు. రాజులందరికీ రాజులు, సర్వోత్తమ సతోప్రధాన పురుషోత్తములు లక్ష్మీనారాయణులు. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో కూర్చున్నాయి. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుందో మీకు తెలుసు. మొట్టమొదట ఉత్తములు, తర్వాత మధ్యములు, తర్వాత కనిష్ఠులుగా అవుతారు. ఈ సమయములో మొత్తం ప్రపంచమంతా తమోప్రధానంగా ఉంది. ఇదంతా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. వారి జయంతినే ఇప్పుడు జరుపుకుంటాము. ఇప్పటికి 5 వేల సంవత్సరాల క్రితము పరమపిత పరమాత్మ అయిన శివుడు వచ్చారు. అలా రాకుంటే శివజయంతి ఎందుకు జరుపుకుంటారు! పరమపిత పరమాత్మ తప్పకుండా పిల్లల కొరకు బహుమతి తీసుకొని వస్తారు. తప్పకుండా సర్వోత్తమ కార్యము చేస్తారు. మొత్తము తమోప్రధాన సృష్టిని సతోప్రధానంగా సదా సుఖవంతంగా తయారు చేస్తారు. ఎంత ఉన్నతమైనవారో అంత ఉన్నతమైన స్మృతి చిహ్నము కూడా ఉండేది. ఆ మందిరాన్ని దోచుకొని తీసుకుపోయారు. మనుష్యులు దండెత్తి వచ్చేది ధనము కొరకే. ధనము కొరకు విదేశాల నుండి కూడా వచ్చారు. ఆ సమయంలో కూడా చాలా ధనముండేది. కాని మాయా రావణుడు భారతదేశాన్ని గవ్వ సమానంగా చేసేశాడు. తండ్రి వచ్చి వజ్ర తుల్యంగా తయారు చేస్తారు. ఇటువంటి శివబాబాను గురించి ఎవ్వరికీ తెలియదు. సర్వవ్యాపి అని అంటారు. ఇలా అనడం కూడా తప్పే. నావను ఆవలి తీరానికి చేర్చే సద్గురువు ఒక్కరే. నావను ముంచి వేసేవారు అనేక మంది ఉన్నారు. అందరూ విషయసాగరములో మునిగిపోయి ఉన్నారు. అందుకే ఈ సార విహీన ప్రపంచమైన విషయసాగరము నుండి, క్షీరసాగరమైన ఆవలి తీరానికి తీసుకెళ్ళండి అని అంటారు. విష్ణువు క్షీరసాగరములో ఉంటారని గాయనము కూడా ఉంది. స్వర్గాన్ని క్షీరసాగరమని అంటారు. అచ్చట లక్ష్మీనారాయణులు రాజ్యపాలన చేస్తారు. అంతేకాని అచ్చట విష్ణువు క్షీర సాగరములో విశ్రాంతి తీసుకుంటారని కాదు. వారు పెద్ద చెరువును తయారు చేసి దాని మధ్యలో విష్ణువునుంచుతారు. విష్ణువును కూడా చాలా పెద్దగా తయారుచేస్తారు. లక్ష్మీనారాయణులు అంత పెద్దగా అయితే ఉండరు. ఎక్కువలో ఎక్కువ ఆరడుగులు ఉంటారు. పాండవుల చిత్రాలు కూడా చాలా పెద్ద పెద్దవి తయారుచేస్తారు. రావణుని బొమ్మను ఎంతో పెద్దదిగా చేస్తారు. పెద్ద పేరుంది కావున చిత్రము కూడా పెద్దదిగా చేస్తారు. బాబా పేరు భలే గొప్పది కాని వారి చిత్రము చాలా చిన్నది. అర్థము చేసుకునేందుకు ఇంత పెద్ద రూపమును ఇచ్చేశారు. తండ్రి అంటున్నారు - నాకు ఇంత పెద్ద రూపము లేదు. ఆత్మ ఎలాగైతే చిన్నదిగా ఉంటుందో పరమాత్మ అయిన నేను కూడా నక్షత్రము వలె ఉన్నాను. వారిని సుప్రీమ్ సోల్ అని అంటారు. వారు అందరికంటే ఉన్నతులు. వారిలోనే పూర్తి జ్ఞానమంతా నిండి ఉంది. మనుష్య సృష్టికి బీజరూపులు, జ్ఞానసాగరులు, చైతన్య ఆత్మ అని వారి మహిమ గాయనము చేయబడింది. కాని వినిపించవలసినప్పుడు అవయవాలను(శరీరము) తీసుకుంటారు. ఉదాహరణకు చిన్న బాలుడు తన చిన్న అవయవాల ద్వారా మాట్లాడలేడు. పెద్దవాడైనప్పుడు శాస్త్రాలు మొదలైనవి చూస్తూనే పూర్వ జన్మ సంస్కారాలు స్మృతిలోకి వచ్చేస్తాయి. ఇప్పుడు తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - నేను మళ్లీ 5 వేల సంవత్సరాల తర్వాత మీకు అదే రాజయోగము నేర్పించేందుకు వచ్చాను. కృష్ణుడు ఏ రాజయోగాన్ని నేర్పలేదు. అతడు ప్రాలబ్ధాన్ని అనుభవించాడు. 8 జన్మలు సూర్యవంశము, 12 జన్మలు చంద్రవంశము, మళ్లీ 63 జన్మలు వైశ్య, శూద్ర వంశములలో వచ్చాడు. ఇప్పుడిది అందరిదీ అంతిమ జన్మ. ఈ విషయాలు కృష్ణుని ఆత్మ కూడా వింటున్నది. మీరు కూడా వింటున్నారు. ఇది సంగమయుగీ బ్రాహ్మణుల వర్ణము. మళ్లీ మీరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. బ్రాహ్మణ ధర్మము, సూర్యవంశీ దేవతా ధర్మము, చంద్రవంశీ క్షత్రియ ధర్మము ఈ మూడింటి స్థాపకులు ఒక్క పరమపిత పరమాత్మయే. అందువలన ఈ మూడు ధర్మాల శాస్త్రము కూడా ఒక్కటిగానే ఉండాలి. వేరు వేరు శాస్త్రాలేవీ లేవు. బ్రహ్మ ఎంతో పెద్దవాడు. అందరికీ తండ్రి ప్రజాపిత. అతడి శాస్త్రము కూడా ఏదీ లేదు. ఒక్క గీతలోనే భగవానువాచ అని ఉంది. బ్రహ్మ భగవానువాచ అని లేదు. ఇది బ్రహ్మ ద్వారా శివ భగవానువాచ. దాని ద్వారా శూద్రులను పరివర్తన చేసి బ్రాహ్మణులుగా తయారు చేయడం జరుగుతుంది. బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు. ఎవరైతే పాస్ అవ్వరో వారు క్షత్రియులుగా అవుతారు, రెండు కళలు తగ్గిపోతాయి. ఎంతో బాగా అర్థం చేయిస్తారు! అత్యంత ఉన్నతమైనవారు పరమపిత పరమాత్మ తర్వాత బ్రహ్మ, విష్ణు, శంకరులు. వారిని కూడా పురుషోత్తములని అనరు. ఎవరైతే పురుషోత్తములుగా అవుతారో మళ్లీ వారే కనిష్ఠులుగా కూడా అవుతారు. మనుష్యులలో సర్వోత్తములు లక్ష్మీనారాయణులు. వారి మందిరాలు కూడా ఉన్నాయి. కాని వారి మహిమను గూర్చి ఎవ్వరికీ తెలియదు. కేవలం పూజలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు పూజారుల నుండి పూజ్యులుగా అవుతూ ఉన్నారు. మాయ మళ్లీ పూజారులుగా చేసేస్తుంది. డ్రామా అలా తయారై ఉంది. నాటకమెప్పుడు పూర్తి అవుతుందో, అప్పుడు నేను రావలసి వస్తుంది. మళ్లీ వృద్ధి అగుట కూడా ఆటోమేటిక్‌గా(స్వతహాగా) నిలిచిపోతుంది. పిల్లలైన మీరు మళ్లీ వచ్చి మీ మీ పాత్రలు రిపీట్ చేయాలి. ఇది పరమపిత పరమాత్మ స్వయంగా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గములో వారి జయంతిని జరుపుతారు. ఇలా జరుపుతూనే ఉంటారు. స్వర్గములో అయితే ఎవ్వరి జయంతినీ జరుపుకోరు. కృష్ణుడు, రాముడు మొదలైన వారి జయంతులు కూడా జరుపుకోరు. ఎందుకంటే వారు ప్రాక్టికల్‌గా అక్కడే ఉంటారు. వీరు ఉండి వెళ్ళిపోయారు అందుకే శివజయంతిని జరుపుకుంటారు. అచ్చట ప్రతి సంవత్సరము కృష్ణుని పుట్టిన రోజు జరుపుకోరు. అచ్చట సదా సంతోషమే ఉంటుంది కనుక జన్మ దినము జరుపుకునే అవసరము లేదు. పిల్లల పేర్లు అయితే మాతా-పితలే పెెడ్తారు. అచ్చట గురువే ఉండడు. వాస్తవానికి ఈ విషయాలకు, జ్ఞాన యోగాలకు ఏ సంబంధమూ లేదు. పోతే అచ్చటి సంప్రదాయాలు, ఆచారాలేమిటో అడగవలసి వస్తుంది. అచ్చటి నియమానుసారము ఎలా ఉంటే అలా జరుగుతాయని, మీరు అడిగే అవసరమే లేదని బాబా అంటారు. మొదట శ్రమ చేసి మీ పదవిని ప్రాప్తి చేసుకోండి. అర్హులుగా అవ్వండి. తర్వాత అడగండి. డ్రామాలో ఏదో ఒక నియమముంటుంది. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. స్వయాన్ని
నిరాకార ఆత్మగా భావించి నిరాకార తండ్రిని స్మృతి చేయాలి. ఏ దేహధారినీ
స్మృతి చేయరాదు. మరజీవాగా అయ్యి పాత విషయాలను బుద్ధి నుండి మర్చిపోవాలి.
2. తండ్రి రచించిన ఈ రుద్ర యజ్ఞములో సంపూర్ణంగా స్వాహా అవ్వాలి. శూద్రులను బ్రాహ్మణ ధర్మములోకి పరివర్తన చేసే సేవ చేయాలి.
వరదానము :- ''మీ విల్ పవర్ ద్వారా ప్రతి ఒక్కరిచే విల్లు చేయించే శ్రేష్ఠ సేవాధారీ భవ''
వర్తమాన సమయంలో
చాలామంది ఆత్మలు మీ సహయోగము కొరకు దాహముతో చాత్రక పక్షి వలె ఉన్నారు. అయితే
వారికి తమ స్వంత శక్తి లేదు. వారికి మీరు విశేషంగా మీ శక్తుల సహాయాన్ని
ఇవ్వవలసి ఉంటుంది. అందుకు నిమిత్తంగా ఉన్న సేవాధారులలో సర్వశక్తుల పవర్
అవసరము. ఎలాగైతే బ్రహ్మాబాబా చివర్లో పిల్లలకు శక్తులను విల్ చేశాడో, ఆ
విల్లు ద్వారా ఈ కార్యము జరుగుతూ ఉందో అలా తండ్రిని అనుసరించండి. మీ
శక్తులను ఆత్మల పట్ల విల్లు చేస్తే సమయ ప్రమాణంగా(సమయానుసారంగా) సేవ
సంపన్నమైపోతుంది.
స్లోగన్ :- ''ఎక్కడైతే ఏకత మరియు ఏకాగ్రతా శక్తి ఉందో, అక్కడ సఫలత సహజంగా ప్రాప్తి అవుతుంది.''
No comments:
Post a Comment