Thursday, 18 January 2018

Telugu Murli 07/01/18

07-01-2018 అవ్యక్త బాప్‌దాదా ఓంశాంతి రివైజ్‌: 17-04-1983 మధువనము 

''కర్మాతీత స్థితిని పొందేందుకు సంకీర్ణ ( సమేట్‌నే కీ ) మరియు ఇముడ్చుకునే ( సమానేకీ ) శక్తులు అవసరము''
శబ్ధానికి అతీతంగా తమ శ్రేష్ఠ స్థితికి అనుభవం చేస్తున్నారా? ఆ శ్రేష్ఠ స్థితి సర్వ వ్యక్త ఆకర్షణలకు అతీతమైన శక్తిశాలీ మరియు ప్రియమైన స్థితి. ఒక్క సెకను అయినా ఈ శ్రేష్ఠ స్థితిలో స్థితమై దాని ప్రభావము ద్వారా రోజంతా కర్మలు చేస్తున్నా స్వయంలో విశేషంగా శాంతి శక్తిని అనుభవం చేస్తారు. ఈ స్థితినే కర్మాతీత స్థితి లేదా తండ్రి సమానమైన సంపూర్ణ స్థితి అని అంటారు. ఈ స్థితి ద్వారానే ప్రతి కార్యంలో సఫలతను అనుభవం చేయగలరు. అలాంటి శక్తిశాలీ స్థితిని అనుభవం చేశారా? బ్రాహ్మణ జీవితము యొక్క లక్ష్యము '' కర్మాతీత స్థితిని పొందడం''. అందుచేత లక్ష్యాన్ని పొందే ముందు ఇప్పటి నుండే ఈ అభ్యాసములో ఉంటేనే ఆ లక్ష్యాన్ని ప్రాప్తి చేసుకోగలరు. ఈ లక్ష్యాన్ని పొందేందుకు విశేషంగా స్వయంలో సంకీర్ణ శక్తి, ఇముడ్చుకునే శక్తి అవసరము ఎందుకంటే వికారీ జీవితము లేదా భక్తితో కూడిన జీవితము రెండింటిలో జన్మ-జన్మాంతరాలుగా బుద్ధిని విస్తారంగా భ్రమింపజేసే సంస్కారము చాలా పక్కాగా అయిపోయింది. అందుచేత అలా విస్తారములో భ్రమించే బుద్ధిని సార రూపంలో స్థితం చేసేందుకు ఈ రెండు శక్తులు అవసరము. ప్రారంభం నుండీ చూడండి - తమ దేహ భ్రాంతి యొక్క విస్తారము ఎన్ని రకాలుగా ఉందో, దాని గురించి అయితే తెలుసు కదా! నేను బాలుడను, నేను బాలుడను, నేను యువకుడను, నేను వృద్ధుడను, నేను ఫలానా, ఫలానా వృత్తి చేసేవాడిని ఈ రకమైన దేహ స్మృతి యొక్క విస్తారమెంత ఉంది? ఇక సంబంధాలలోకి వస్తే అది ఎంత విస్తారంగా ఉంది. ఎవరి బిడ్డను, ఎవరి తండ్రిని మొదలైన సంబంధాల విస్తారము ఎంత ఉంది! దానిని వర్ణించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాని గురించి తెలుసు కదా! ఈ విధంగానే దేహ పదార్ధాల విస్తారము కూడా ఎంత ఉంది! భక్తిలో అనేక దేవతలను తృప్తి పరచే విస్తారమెంత ఉంది! లక్ష్యమైతే ఒకరిని పొందేందుకే కాని భ్రమించేందుకు సాధనాలు అనేకమున్నాయి. ఇన్ని విధాల విస్తారాలను సార రూపంలోకి తీసుకొచ్చేందుకు ఇముడ్చుకునే శక్తి, సంకీర్ణ శక్తి కావాలి. అన్ని విస్తారాలను ఒకే శబ్ధంతో ఇముడ్చుకోవచ్చు. అది ఏది? '' బిందువు ''. నేనూ బిందువే, తండ్రి కూడా బిందువే. తండ్రి అయిన బిందువులో మొత్తం ప్రపంచమంతా ఇమిడి ఉంది. ఇదైతే మీకు బాగా అనుభవమే కదా! ప్రపంచంలో ఒకటి సంబంధం, రెండవది సంపత్తి(ధనం) ఈ రెండు విశేషతలూ బిందువైన తండ్రిలో ఇమిడి ఉన్నాయి. సర్వ సంబంధాలు ఒకరి నుండే అనుభవం చేశారా? సర్వ సంపదలు ప్రాప్తి సుఖము, శాంతి, సంతోషము ఇవి కూడా అనుభవం చేశారా లేక ఇప్పుడు చేయాలా? అంటే ఏమయింది? విస్తారము సారములో ఇమిడిపోయింది కదా, మిమ్ములను మీరు అడగండి, అనేకరకాల విస్తారాలలో భ్రమించే బుద్ధి సంకీర్ణ శక్తి ఆధారంతో ఒక్కరిలో ఏకాగ్రమయ్యిందా? లేదా ఇప్పుడు కూడా విస్తారములో ఎక్కడైనా భ్రమిస్తోందా? సంకీర్ణ శక్తి మరియు ఇముడ్చుకునే శక్తిని ప్రయోగించారా లేక కేవలం జ్ఞానము మాత్రమే ఉందా? ఒకవేళ ఈ రెండు శక్తులను ప్రయోగించడం వచ్చినట్లయితే దాని చిహ్నము - సెకండులో ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు బుద్ధి ఆ స్థితిలో స్థితమైపోతుంది. ఎలాగైతే స్థూలమైన వాహనములో శక్తివంతమైన బ్రేక్‌ ఉన్నట్లయితే, సెకండులో ఎక్కడ కావాలంటే అక్కడ ఆపగల్గుతారో ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆ దిశలో తీసుకెళ్లగలరు. అలాగే స్వయంలో ఆ శక్తిని అనుభవం చేస్తున్నారా లేక ఏకాగ్రం చేయడంలో సమయం పడుతోందా? లేక వ్యర్థం నుండి సమర్థంలోకి రావడంలో శ్రమ అనిపిస్తోందా? అలా అయినట్లయితే ఈ రెండు శక్తులు లోటుగా ఉన్నాయని అర్థం చేసుకోండి. సంగమ యుగంలో బ్రాహ్మణ జీవితము యొక్క విశేషతయే సార రూపంలో స్థితమవ్వడం, సదా సఖము, శాంతి, సంతోషము, జ్ఞానము, ఆనందాల ఉయ్యాలలో ఊగడం. సర్వ ప్రాప్తుల సంపన్న స్వరూపము యొక్క అవినాశీ నషాలో స్థితమై ఉండండి. సదా ముఖము పై ప్రాప్తియే కనిపించాలి. ఆ సంపన్న స్థితి యొక్క మెరుపు కనిపించాలి. కేవలం స్థూల ధనంతో సంపన్న వినాశీ రాజ్య పదవి ప్రాప్తి చేసుకునే రాజుల మొఖము పై కూడా ద్వాపర యుగం ఆరంభములో ఆ మెరుపు ఉండేది. కాని ఇక్కడైతే అవినాశి ప్రాప్తి ఉంది. కనుక ఎంత ఆత్మిక ప్రకాశము, మెరుపు, కళ ముఖములో కనిపించాలి! అలా అనుభవం చేస్తున్నారా? లేక కేవలం అనుభవము విని సంతోషపడ్తున్నారా! పాండవ సేన విశేషమైనవారు కదా! పాండవ సేనను చూసి తప్పకుండా హర్షితమవుతారు. కాని పాండవుల విశేషత - సదా వీరులుగా చూపిస్తారు, బలహీనులుగా కాదు. తమ స్మృతిచిహ్నాలు చూశారు కదా! చిత్రాలలో కూడా మహావీరులుగా చూపిస్తారు కదా. కనుక బాప్‌దాదా కూడా పాండవులందరినీ విశేష రూపములో సదా విజయులుగా, సదా తండ్రికి తోడుగా అంటే పాండవ పతి యొక్క తోడు. తండ్రి సమానంగా మాస్టర్‌ సర్వ శక్తివాన్‌ స్థితిలో ఉండాలి. ఇదే విశేష స్మృతిని వరదానంగా ఇస్తున్నారు. భలే కొత్తవారు కూడా వచ్చారు కాని కల్పక్రితపు అధికారీ ఆత్మలే కనుక సదా తమ సంపూర్ణ అధికారాన్ని పొందాల్సిందే - ఈ నషా మరియు నిశ్చయములో సదా ఉండండి. అర్థమయ్యిందా, అచ్ఛా!

సదా సెకండులో బుద్ధిని ఏకాగ్రం చేసి సర్వ ప్రాప్తులను అనుభవం చేసి సదా సర్వ శక్తులను సమయ ప్రమాణంగా ప్రయోగిస్తూ సదా ఒక్క తండ్రితో మొత్తం ప్రపంచాన్నంతా అనుభవం చేసే సంపన్న మరియు సమానమైన శ్రేష్ఠ ఆత్మలకు బాప్‌దాదా యాద్‌ప్యార్‌ మరియు నమస్తే.

పార్టీలతో :- 1. అధర్‌ కుమారులతో :- మాకు ఇలాంటి శ్రేష్ఠ భాగ్యము ఉందని ఎప్పుడైనా అనుకున్నారా? ఇంత శ్రేష్ఠ భాగ్యము మాకు ప్రాప్తిస్తుందనే ఆశ కూడా ఎప్పుడూ మీకు లేదు కానీ నిరాశతో ఉన్న ఆత్మలను బాబా ఆశ గలవారిగా చేశారు. నిరాశలో ఉండే సమయం ఇప్పుడు సమాప్తమైపోయింది. ఇప్పుడు ప్రతి అడుగులో మనకు సఫలత ఉంది అనే ఆశ ఉంటుంది. తెలియదు లేక కాదు అనే సంకల్పమైతే రావడం లేదు కదా. ఏ కార్యములోనైనా, అది స్వ పురుషార్థములో గాని, సేవలో గాని రెండింటిలో నిరాశా సంస్కారము సమాప్తమైపోవాలి. ఏ రకమైన సంస్కారమైనా, సంస్కారము గాని, లోభ సంస్కారము గాని, అహంకార సంస్కారము గాని మార్చడంలో నిరాశ చెందరాదు. నేను మారనే మారలేదు, మారడం చాలా కష్టం - ఇలాంటి సంకల్పాలు కూడా రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు సమాప్తం చేయకుంటే ఇంకెప్పుడు చేస్తారు? ఇప్పుడు దశరా(దశహరా) కదా! సత్యయుగంలో అయితే దీపమాల(దీపావళి) అయిపోతుంది. రావణుని హతమార్చే దశరా ఇప్పుడే ఇందులో సదా విజయం పొందుతామనే ఉమంగ-ఉత్సాహముండాలి. నిరాశా సంస్కారం ఉండరాదు. ఎటువంటి కష్టమైన కార్యమైనా అదేమంత పెద్ద విషయం కాదనేటంత సహజంగా అనుభవమవ్వాలి. ఎందుకంటే అనేకసార్లు ఆ పని చేశారు. కొత్త పనేదీ చేయడం లేదు. చాలాసార్లు చేసినదాన్ని రిపీట్‌ చేస్తున్నారు. అందువల్ల సదా ఆశతో(నమ్మకంతో) ఉండాలి. నిరాశకు నామ-రూపాలు ఉండరాదు. ఎప్పుడూ ఏ రకమైన స్వభావ సంస్కారము ద్వారా ఇది పరివర్తన అవుతుందో లేదో అనే సంకల్పము కూడా రాకూడదు. సదా విజయులమే, అప్పుడప్పుడు కాదు. ఒకవేళ ఏదైనా స్వప్నంలోనైనా లోటు కనిపించినా దానిని సదా కొరకు సమాప్తం చేయాలి. నిరాశను సదాకాలం కోసం ఆశలోకి మార్చేయాలి. నిశ్చయము చెదరకుండా ఉంటే విజయము కూడా సదా ఉంటుంది. నిశ్చయములో ఎప్పుడైనా ఎందుకు? ఏమిటి ? అనేది వస్తే విజయము అనగా ప్రాప్తిలో కూడా ఏదో ఒక లోపము కల్గుతుంది. సదా ఆశావాదులుగా ఉంటే సదా విజయులుగా ఉంటారు. మీరు నిరాశలను సదాకాలం కోసం ఆశల్లోకి మార్చేవారు.

2. సదా తమను సంగమ యుగంలోని శ్రేష్ఠ ఆత్మలు, పురుషోత్తమ ఆత్మలు, లేదా శ్రేష్ఠమైన ఉన్నతమైన బ్రాహ్మణ మహాన్‌ ఆత్మలుగా భావిస్తున్నారా? ఇప్పటి నుండే పురుషోత్తములుగా తయారయ్యారు కదా! ప్రపంచములో ఇంకా పురుషులున్నారు, కానీ వారికి అతీతంగా(భిన్నంగా) తండ్రికి ప్రియంగా అయ్యారు అందువలన పురుషోత్తములుగా అయ్యారు. ఇతరుల మధ్య ఉంటూ తమను అలౌకికంగా భావిస్తున్నారు కదా! లౌకిక ఆత్మల సంపర్కంలోకి వచ్చినా వారి మధ్య ఉంటున్నా నేను అలౌకికమైన అతీతమైన ఆత్మను అని ఎప్పుడూ మర్చిపోరాదు కదా! ఎందుకంటే మీరు హంసలుగా తయారయ్యారు, జ్ఞాన ముత్యాలను ఏరుకునే పవిత్రమైన హంసలు. వారు మురికిని తినే కొంగలు. వారు మురికినే తింటారు. మురికినే మాట్లాడ్తారు,...... కనుక కొంగల మధ్య ఉంటూ తమ పవిత్ర హంసల జీవితాన్ని ఎప్పుడూ మర్చిపోరు కదా. ఎప్పుడూ వారి ప్రభావము పడడం లేదు కదా! వాస్తవానికి వారి ప్రభావము వారి పైనే ఉండాలి, కాని వారి ప్రభావము మీ పైన పడరాదు. కనుక సదా స్వయాన్ని పవిత్ర హంసలుగా భావిస్తున్నారా? పవిత్ర హంసలు ఎప్పుడూ బుద్ధి ద్వారా జ్ఞాన ముత్యాలు తప్ప ఇతరమేదీ స్వీకరించలేరు. బ్రాహ్మణ ఆత్మలు ఎవరైతే ఉన్నతమైనవారో పిలక వంటివారో, వారెప్పుడూ క్రింది విషయాలను స్వీకరించలేరు. కొంగల నుండి హంసలుగా మారిపోయారు. కనుక పవిత్ర హంస అంటే సదా స్వచ్చము మరియు పవిత్రముగా ఉండేది. పవిత్రతయే స్వచ్ఛత. హంస ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది సదా తెల్లగానే ఉంటుంది. తెలుపుగా కూడా స్వచ్ఛతకు లేదా పవిత్రతకు గుర్తు. మీ వస్త్రాలు కూడా తెల్లగా ఉన్నాయి. ఇది పవిత్రతకు చిహ్నము. ఏ రకమైన అపవిత్రత ఉన్నా అది పవిత్ర హంస కాదు. పవిత్ర హంస సంకల్పంలో కూడా అశుద్ధంగా ఉండలేదు. సంకల్పాలు కూడా బుద్ధికి భోజనము. ఒకవేళ అశుద్ధమైన లేదా వ్యర్థమైన భోజనం తింటే సదా ఆరోగ్యంగా ఉండలేరు. వ్యర్థమైన వస్తువును పారేస్తారు, దగ్గర ఉంచుకోరు. అందుచేత వ్యర్థ సంకల్పాలను కూడా సమాప్తం చేయండి. దీనినే హోలీ హంస అని అంటారు అచ్ఛా!

పాండవులతో :- పాండవులనగా సంకల్పంలో, స్వప్నంలో కూడా ఓడిపోనివారు. విశేషంగా ఈ స్లోగన్‌ గుర్తు పెట్టుకోండి,...... '' పాండవులు అంటే సదా గెలిచేవారు. స్వప్నాలు కూడా విజయం కలిగేవే రావాలి. అంతగా పరివర్తన చేసుకోవాలి. ఇక్కడ కూర్చున్నవారంతా విజయులైన పాండవులేనా? అక్కడికి వెళ్ళాక ఓడిపోయామని ఉత్తరాలు వ్రాయరు కదా! మాయ రాదు కాని మీరు దానిని స్వయంగా మీరే పిలుస్తారు. బలహీనమవ్వడం అనగా మాయని పిలవడం. కనుక ఏదో రకమైన బలహీనత మాయను పిలుస్తుంది. అందువలన పాండవులు ఏ ప్రతిజ్ఞ చేశారు? సదా విజయులుగా ఉంటాము. ఓడిపోయి దాక్కోకండి, సదా విజయులుగా ఉండాలి. ఈ విధంగా ప్రతిజ్ఞ చేసేవారికి సదా బాప్‌దాదా అభినందనలు లభిస్తూ ఉంటాయి. సదా వాహ్‌ వాహ్‌ గీతాలు అలాంటి పిల్లల కోసమే తండ్రి పాడుతూ ఉంటారు. కనుక వాహ్‌ వాహ్‌ గీతాలు అందరూ వింటారు కదా! ఓడిపోతే హాయ్‌-హాయ్‌(అయ్యో-అయ్యో) అని అంటారు. విజయం పొందితే వాహ్‌-వాహ్‌ అని అంటారు. అందరూ విజయులే. మొత్తం గ్రూప్‌లో ఒక్కరు కూడా ఓడిపోయేవారు లేరు. అచ్ఛా! ఓంశాంతి.

మాస్టర్‌ దాతగా అవ్వండి (అవ్యక్త మహావాక్యాలు)

బాప్‌దాదా ఇప్పుడు పిల్లల నుండి ఇదే కోరుకుంటున్నారు - ప్రతి పుత్రుడు మాస్టర్‌ దాతగా అవ్వండి. ఏదైతే తండ్రి నుండి తీసుకున్నారో అది ఇతరులకు ఇవ్వండి. ఆత్మల నుండి తీసుకునే భావన ఉంచుకోకండి. దయాహృదయులై తమ గుణాల, శక్తుల సహయోగము అందరికీ ఇవ్వండి. విశాలహృదయులుగా అవ్వండి. ఇతరులకు ఎంతగా ఇస్తూ ఉంటారో అంతగా పెరుగుతూ ఉంటుంది. వినాశనమయ్యే ఖజానా ఇచ్చే కొద్దీ తరిగిపోతుంది, అవినాశీ ఖజానా ఇవ్వడం ద్వారా పెరుగుతుంది - ఒకటి ఇవ్వండి, వెయ్యి పొందండి.

మాస్టర్‌ దాతలనగా సదా నిండుగా, సంపన్నంగా ఉండేవారు. ఎవరి వద్ద అయితే అనుభూతుల ఖజానా సంపన్నంగా ఉంటుందో, ఆ సంపన్న మూర్తులు స్వతహాగా మాస్టర్‌ దాతలుగా అయిపోతారు. దాతలనగా సేవాధారులు. దాత ఇవ్వకుండా ఉండలేరు. వారు తమ దయాహృదయ గుణము ద్వారా ఎవరికైనా ధైర్యమిస్తారు కనుక ఎవరైనా నిర్బల ఆత్మలకు బలమునిస్తారు. వారు మాస్టర్‌ సుఖదాతలుగా ఉంటారు. సదా మేము సుఖదాత పిల్లలము మాస్టర్‌ సుఖదాతలమనే స్మృతి ఉండాలి. ఎవరైనా దాతగా ఉంటే వారి వద్ద ఉండబట్టే ఇస్తారు. ఒకవేళ స్వయం తినడానికే వారి వద్ద లేనివారు దాతలుగా ఎలా అవ్వగలరు? అందుచేత తండ్రి ఎలాంటివారో, పిల్లలు కూడా అలాంటివారే. తండ్రిని సాగరులని అంటారు. సాగరమనగా అనంతము తరగనిది, అలాగే మీరు కూడా మాస్టర్‌ సాగరులు, నదులు, కాల్వలు కారు. అందుచేత తండ్రి సమానంగా మీరు నిస్వార్థ భావనతోనే ఇస్తూ ఉండండి. అశాంతి సమయంలో మాస్టర్‌ శాంతిదాతగా అయ్యి ఇతరులను కూడా శాంతినివ్వండి. కంగారు పడకండి. ఎందుకంటే ఏది జరుగుతోందో అది కూడా మంచిదే మరియు ఏది జరగబోతుందో అది ఇంకా మంచిది అని మీకు తెలుసు. వికారాలకు వశీభూతమైన మనుష్యులైతే పోట్లాడుకుంటూనే ఉంటారు. వారి పనే అది. కానీ మీ పని అలాంటి ఆత్మలకు శాంతినివ్వడం, ఎందుకంటే మీరు విశ్వకళ్యాణకారులు. విశ్వకళ్యాణకారీ ఆత్మలు సదా మాస్టర్‌ దాతలుగా అయ్యి ఇస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరికీ సహయోగము, స్నేహము, సానుభూతి ఇవ్వడమే తీసుకోవడం.

వర్తమాన సమయంలో అందరికీ అవినాశీ సంతోషము అవసరముంది. అందరూ సంతోషానికి భికారిగా ఉన్నారు. మీరు దాత పిల్లలు. దాత పిల్లల పని - '' ఇవ్వడం.'' సంపర్కంలోకి ఎవరైతే వస్తారో వారికి సంతోషాన్ని పంచుతూ పోండి, ఇస్తూ ఉండండి. ఎవరూ ఖాళీగా వెళ్ళరాదు అంత భర్‌పూర్‌గా(సంపన్నంగా) అవ్వండి. ఇప్పుడు మొత్తం ప్రపంచంలోని ఆత్మలంతా సుఖ-శాంతుల భిక్షను యాచించేందుకు మీ ముందుకు వస్తారు. మీరు దాత పిల్లలు. మాస్టర్‌ దాతలుగా అయ్యి అందరినీ సంపన్నంగా చేస్తారు. కనుక ప్రారంభం నుండే స్వంత భండారాన్ని సర్వ ఖజానాలతో నింపుకుంటూ వెళ్లండి. శ్రేష్ఠ ఆత్మలైన మీరు సంగమ యుగంలో తరగని అఖండ మహాదానులుగా అవ్వండి, నిరంతరం నేను దాత బిడ్డను, అఖండ మహాదానీ ఆత్మను అని స్మృతిలో ఉండండి. ఏ రకమైన ఆత్మలు మీ ముందుకు వచ్చినా, వారు అజ్ఞానులు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు ఎంతో కొంత అందరికీ ఇవ్వాలి. రాజు అంటే అర్థమే దాత కనుక దానమివ్వకుండా ఒక్క సెకను కూడా ఉండలేరు. బ్రాహ్మణ ఆత్మల వద్ద జ్ఞానమైతే ముందే ఉంది, కానీ వారి పట్ల రెండు రకాల దాతలుగా అవ్వండి. 1. ఏ ఆత్మకు ఏ శక్తి అవసరమో, ఆ ఆత్మకు మనసు ద్వారా అనగా శుద్ధమైన వృత్తి, వైబ్రేషన్ల ద్వారా శక్తుల దానము అనగా సహయోగమునివ్వండి. 2. కర్మల ద్వారా సదా స్వంత జీవితములో గుణమూర్తులుగా అయ్యి ప్రత్యక్ష శాంపిల్‌గా అయ్యి ఇతరులు సహజంగా గుణ ధారణ చేసేలా సహయోగమివ్వండి. దానమంటే అర్థం - '' సహయోగమివ్వడం.''

వర్తమాన సమయంలో పరస్పరం విశేషించి కర్మల ద్వారా గుణదాతలుగా అయ్యే అవసరముంది. అందుచేత నేను సదా గుణమూర్తిగా అయ్యి అందరినీ గుణమూర్తులుగా చేసే విశేష కర్తవ్యాన్ని చేసే తీరాలనే సంకల్పం చేయండి. జ్ఞానమైతే చాలా ఉంది. ఇప్పుడు గుణాలను ఎమర్జ్‌(ప్రత్యక్షం) చేయండి, సర్వగుణ సంపన్నంగా తయారై ఇతరులను తయారు చేసే ఉదాహరణ మూర్తులుగా అవ్వండి. దాత పిల్లలైనట్లయితే ఎవరికి ఏది కావాలో అది ఇస్తూ పోండి. ఎవ్వరూ ఖాళీగా వెళ్ళరాదు. అపారమైన ఖజానా ఉంది. కొందరికి సంతోషం కావాలి, కొందరికి స్నేహం కావాలి, కొందరికి శక్తి కావాలి కనుక ఎవరికి ఏది కావాలో అది ఇస్తూ ఉండండి. ఇప్పుడు పిల్లలైన మీరంతా ఈ శుభ సంకల్పాన్ని ఉత్పన్నం చేయండి - ''దాత పిల్లలుగా అయ్యి ఆత్మలందరికి వారసత్వమిచ్చేందుకు నిమిత్తంగా అవ్వాలి. ఎవ్వరూ వంచితులుగా అవ్వరాదు. ఎవరెలాంటి వారైనా, వారు తండ్రికి చెందినవారే కదా! మీరు దాత పిల్లలైనట్లయితే, విశాల హృదయంతో పంచి పెట్టండి. ఎవరైతే అశాంతిలో, దు:ఖంలో భ్రమిస్తున్నారో వారంతా మీ పరివారమే. పరివారానికి సహయోగమివ్వబడ్తుంది. వర్తమాన సమయములో మహాదానులగా అయ్యేందుకు విశేషించి దయాహృదయుల గుణాన్ని ఉత్పన్నం చేయండి. ఎవరి నుండీ తీసుకునే కోరిక ఉంచుకోకండి - '' వారు మంచిగా మాట్లాడాలి, మంచిగా ఉంటే ఇద్దాం అని అనుకోకండి. మాస్టర్‌ దాతలుగా అయ్యి వృత్తి ద్వారా, వైబ్రేషన్ల ద్వారా, వాణి ద్వారా ఇస్తూ ఉండండి. బేహద్‌(అనంతమైన) దాతగా అయ్యి విశ్వగోళము పై నిల్చొని బేహద్‌ సేవ చేస్తూ ప్రకంపనలు వ్యాపింప చేయండి. మహాన్‌ దాతగా అవ్వండి. బేహద్‌లోకి(అనంతంలోకి) వెళ్తే హద్దులోని విషయాలు స్వతహాగా సమాప్తమైపోతాయి. అచ్ఛా! 

వరదానము :- ''పవిత్రతను విశేషంగా ధారణ చేయడం ద్వారా అతీంద్రియ సుఖాన్ని అనుభవము చేసే బ్రహ్మాచారీ భవ''
బ్రాహ్మణ జీవితము యొక్క విశేషమైన ధారణ పవిత్రత. ఇదే నిరంతరం అతీంద్రియ సుఖానికి, స్వీట్‌ సైలెన్స్‌కు విశేషమైన ఆధారము. పవిత్రత అనగా కేవలం బ్రహ్మచర్యమే కాదు, బ్రహ్మచారి మరియు సదా బ్రహ్మాచారీ అనగా బ్రహ్మాబాబా ఆచరణ పై ప్రతి అడుగు వేసి నడిచేవారు. సంకల్పము, మాట మరియు కర్మ అనే అడుగు బ్రహ్మబాబా అడుగులో అడుగు వేయడం. ఇలా ఎవరైతే బ్రహ్మాచారీగా ఉంటారో వారి ముఖము మరియు నడవడిక సదా అంతర్ముఖతను, అతీంద్రియ సుఖాన్ని అనుభవము చేయిస్తుంది. 

స్లోగన్‌ :- ''సేవలో త్రికాలదర్శి భావనను(సెన్సును), ఆత్మీయత అనే సుగంధాన్ని(ఎసెన్స్‌ను) నింపేవారే సేవాధారులు''
 

Telugu Murli 06/01/18

06-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

'' మధురమైన పిల్లలారా - ఇప్పుడు మీ శరీరము పూర్తిగా పాతబడిపోయింది, మీ శరీరాన్ని కల్పవృక్ష (కల్పతరువు) సమానంగా తయారు చేసేందుకు తండ్రి వచ్చారు. మీరు అర్ధకల్పము వరకు అమరులుగా అవుతారు '' 

ప్రశ్న :- ఈ అద్భుతమైన నాటకములో ఏ విషయాన్ని చాలా బాగా అర్థము చేసుకోవాలి ?
జవాబు :- ఈ నాటకములో పాత్రధారులు ఎవరైతే ఉన్నారో, వారి చిత్రాన్ని ఒక్కసారి మాత్రమే చూడగలరు. మళ్లీ 5 అదే చిత్రాన్ని వేల సంవత్సరాల తర్వాతే చూస్తారు. 84 జన్మలకు 84 చిత్రాలు తయారౌతాయి. అన్ని చిత్రాలు భిన్న భిన్నముగా ఉంటాయి. కర్మలు కూడా ఒకరివి మరొకరితో కలవవు. ఎవరు ఏ కర్మ చేశారో వారు మళ్లీ 5 వేల సంవత్సరాల తర్వాత అదే కర్మ చేస్తారు. ఇవి చాలా బాగా అర్థము చేసుకునే విషయాలు. పిల్లలైన మీ బుద్ధికి వేయబడిన తాళము ఇప్పుడు తెరుచుకున్నది. ఈ రహస్యాన్ని మీరు అందరికీ అర్థం చేయించవచ్చు. 

పాట :- భోలానాథునికి సాటి అయినవారు.......... (భోలేనాథ్‌ సే నిరాలా......)   
ఓంశాంతి. భోలానాథుడని ఎల్లప్పుడూ శివబాబానే అంటారు. శంకరుని అలా అనరు. అతడేమో నాశనము చేస్తాడు. శివబాబా స్థాపన చేస్తారు. తప్పకుండా స్వర్గాన్ని స్థాపన చేస్తారు, నరకాన్ని వినాశనము చేస్తారు. కనుక జ్ఞానసాగరుడని భోలానాథుడైన శివుని మాత్రమే అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరైతే అనుభవీలుగా అయ్యారు. కల్పక్రితము కూడా శివబాబా తప్పకుండా వచ్చి ఉంటారు. ఇప్పుడు కూడా వచ్చే ఉన్నారు. వారు తప్పకుండా రావాలి. ఎందుకంటే నూతన మనుష్య సృష్టిని రచించాలి. ఈ డ్రామా ఆది మధ్యాంతాల రహస్యాన్ని తెలపాలి. అందువలన వారు తప్పకుండా ఇచ్చటకు రావాలి. సూక్ష్మవతనములో అయితే తెలుపరు. సూక్ష్మ వతనములోని భాష వేరుగా ఉంటుంది. మూలవతనములో అయితే ఏ భాషా లేదు. ఇది శబ్ధ ప్రపంచము. శివబాబా ఒక్కరు మాత్రమే పాడైపోయినవారిని బాగు చేయువారు. ఈ సృష్టి తమోప్రధానమైనప్పుడు అందరికీ సద్గతినిచ్చువారు భగవంతుడని అంటారు. నేను అందుకే రావలసి వస్తుంది. స్మృతి చిహ్నము కూడా ఇక్కడ ఉంది. ఈ నాటకములో ఏ ఏ మనుష్య చిత్రాలున్నాయో అవి ఒక్కసారి మాత్రమే చూడగలరు. అంతేకాని లక్ష్మీనారాయణుల చిత్రము(ముఖము) సత్యయుగములో తప్ప ఎప్పుడూ, ఎక్కడా చూడలేము. వారు పునర్జన్మ తీసుకున్నప్పుడు వారి నామ-రూపాలు మారిపోతాయి. ఒకసారి చూచిన లక్ష్మీ నారాయణుల రూపము మళ్లీ 5 వేల సంవత్సరాల తర్వాతనే చూడగలము. ఉదాహరణానికి గాంధీజీ చిత్రము ఉన్నదున్నట్లు మళ్లీ 5 వేల సంవత్సరాల తర్వాత చూస్తాము. అనేకమంది మనుష్యులు ఉన్నారు. ఇప్పుడు చూచే మనుష్య చిత్రాలు మళ్లీ 5 వేల సంవత్సరాల తర్వాతనే చూస్తాము. 84 జన్మలకు 84 చిత్రాలు తయారౌతాయి. అవన్నీ వేరు వేరుగా ఉంటాయి. కర్మలు కూడా ఎవరితోనూ సమానంగా ఉండవు. ఇప్పుడు ఎవరు ఏ కర్మ చేశారో అదే కర్మ 5 వేల సంవత్సరాల తర్వాత మళ్లీ చేస్తారు. ఇవన్నీ చాలా లోతుగా అర్థము చేసుకునే విషయాలు. బాబా చిత్రము కూడా ఉంది. మొట్టమొదట సృష్టి రచించేందుకు వారు వచ్చి ఉంటారని మనము భావిస్తాము. మీ బుద్ధికి వేయబడిన తాళము ఇప్పుడు తెరవబడింది, కనుక ఇప్పుడు మీరు అర్థము చేసుకుంటారు. ఇప్పుడు ఇతరుల తాళము కూడా మీరు ఈ విధంగా తెరవాలి. నిరాకార తండ్రి తప్పకుండా పరంధామములో ఉంటారు. అదే విధంగా మీరందరూ నా జతలోనే ఉంటారు. మొట్టమొదట నేను వచ్చినప్పుడు నా జతలో బ్రహ్మ, విష్ణు, శంకరులు ఉంటారు. మనుష్య సృష్టి మొట్టమొదటి నుండే ఉంది. అటువంటప్పుడు అది ఎలా మారుతుంది? (పల్టా/పరివర్తన అవుతుంది) రిపీట్‌ ఎలా అవుతుంది? మొట్టమొదట తప్పకుండా సూక్ష్మవతనాన్ని రచించవలసి వచ్చింది. తర్వాత స్థూల వతనములోకి రావలసి వచ్చింది. ఎందుకంటే దేవతలుగా ఉండిన మనుష్యులే ఇప్పుడు శూద్రులుగా అయ్యారు. వారిని మళ్ళీ బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారు చేయవలసి వచ్చింది. కావున కల్పక్రితము నేను ఏ జ్ఞానమునిచ్చానో మళ్ళీ అదే జ్ఞానాన్ని రిపీట్‌ చేస్తాను. ఈ సమయములో కూర్చుని రాజయోగము నేర్పిస్తాను. మళ్ళీ అర్ధకల్పము తర్వాత భక్తి ప్రారంభమౌతుంది. ఈ పాత సృష్టి మళ్ళీ నూతనంగా ఎలా తయారౌతుందో, అంతము నుండి మళ్ళీ ఆది ఎలా జరుగుతుందో తండ్రి స్వయంగా కూర్చొని అర్థము చేయిస్తున్నారు. పరమాత్మ వచ్చి ఉండినారని మనుష్యులు భావిస్తారు. అయితే ఎప్పుడు, ఎలా వచ్చారో ఎవ్వరికీ తెలియదు. ఆదిమధ్యాంతాల రహస్యమును ఎలా విప్పినారో ఎవ్వరికీ తెలియదు.

తండ్రి అంటున్నారు - నేను మళ్ళీ అందరికీ సద్గతినిచ్చేందుకు సన్ముఖములోకి వచ్చాను. మాయా రావణుడు అందరి అదృష్టాన్ని పాడు చేశాడు. పాడైన భాగ్యాన్ని తయారు చేయువారు తప్పకుండా ఎవరో కావాలి. తండ్రి అంటున్నారు - 5 వేల సంవత్సరాల క్రితము కూడా బ్రహ్మ శరీరములో వచ్చాను. మానవ సృష్టి తప్పకుండా ఇచ్చటనే రచించాను. ఇచ్చటకు వచ్చి సృష్టిని మార్పు చేసి(పల్టాకర్‌) శరీరమును కల్పతరువు సమానంగా తయారు చేస్తాను. ఇప్పుడు మీ శరీరము పూర్తిగా పాతదైపోయింది. ఈ పాత శరీరాన్ని మళ్ళీ అర్ధకల్పము వరకు మీరు అమరులుగా అయ్యే విధంగా తయారు చేస్తాను. భలే అచ్చట కూడా శరీరాన్ని మారుస్తారు. కాని సంతోషంగా మారుస్తారు. పాత వస్త్రాన్ని వదిలి కొత్తది తీసుకున్నట్లు సంతోషంగా వదులుతారు. అచ్చటైతే ఫలానావారు మరణించారని అనరు. దానిని మరణము అని అనరు. ఎలాగైతే మీరు ఇచ్చట 'జీవించి ఉండే మరణిస్తారు' అని అంటారు కదా. కాని మీరు నిజంగా మరణించలేదు. మీరైతే శివబాబా వారిగా అయ్యారు. బాబా, '' మీరు నా కంటి పాపలు, అపురూపమైన పిల్లలు'' అని అంటున్నారు. ఈ మాటలు శివబాబా అంటున్నారు. బ్రహ్మాబాబా కూడా అంటున్నారు. వారేమో నిరాకార తండ్రి. వీరేమో సాకార తండ్రి. ''బాబా మీరు కూడా(అప్పటి) వారే కదా? '' అని ఇప్పుడు మీరు అంటున్నారు. మేము కూడా(అప్పటి) వారమే. మళ్ళీ ఇప్పుడు వచ్చి మిమ్ములను కలిశాము. తండ్రి అంటున్నారు - నేను వచ్చి స్వర్గ స్థాపన చేస్తాను. రాజ్యమైతే మీకు తప్పకుండా కావాలి. కనుక అందుకు రాజయోగము నేర్పిస్తున్నాను. చివరిలో మీకైతే రాజ్యము లభిస్తుంది. తర్వాత అచ్చట ఈ జ్ఞానము అవసరముండదు. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గములో ఉపయోగపడ్తాయి. చదువుతూ ఉంటారు. ఎవరైనా గొప్పవారు చరిత్ర - భూగోళాలను వ్రాసి పోతే వారి తర్వాత అందరూ చదువుతూ ఉంటారు. లెక్కలేనన్ని పుస్తకాలున్నాయి. మనుష్యులు చదువుతూనే ఉంటారు. స్వర్గములో అయితే ఇవేవీ ఉండవు. అచ్చట భాష కూడా ఒక్కటే ఉంటుంది. ఇప్పుడు సృష్టిని కొత్తదిగా తయారు చేసేందుకు నేను వచ్చాను. మొదట కొత్తదిగా ఉండేది. ఇప్పుడు అది పాతదిగా అయిపోయింది. నా పిల్లలందరినీ మాయ దగ్ధం చేసి బూడిద వలె చేసేసింది. అచ్చట సగరుని(సాగరుని) పిల్లలుగా,................. చూపిస్తారు. అయితే సగరుడు అనగా జ్ఞానసాగరుడు. మీరంతా వారి పిల్లలు. వాస్తవానికి ప్రపంచములోని వారందరూ నా పిల్లలే. అయితే పిల్లలైన మీరు ఇప్పుడు ప్రాక్టికల్‌గా మహిమ చేయబడ్డారు. మీ కొరకే తండ్రి ఇచ్చటకు వస్తారు. నేను మళ్ళీ మీకు స్పృహ తెప్పించేందుకు వచ్చాను. పూర్తి నల్లగా రాతిబుద్ధిగా అయినవారిని మళ్ళీ వచ్చి పారస బుద్ధిగా గలవారిగా తయారు చేస్తున్నాను. ఈ జ్ఞానము ద్వారా మనము పారసబుద్ధి గలవారిగా ఎలా అవుతామో మీకు తెలుసు. ఎప్పుడు మీరు పారస బుద్ధిగా అవుతారో అప్పుడు ఈ ప్రపంచము కూడా పరివర్తనై రాతి పురము నుండి పారసపురముగా తయారైపోతుంది. దీని కొరకే బాబా మీతో పురుషార్థము చేయిస్తున్నారు. అందువలన మానవ సృష్టిని రచించేందుకు బాబా ఇచ్చటికే రావలసి వస్తుంది కదా. ఎవరి శరీరములో వస్తానో వారి ద్వారా ముఖవంశావళిని తయారు చేస్తాను. అందువలన ఇతడు(బ్రహ్మబాబా) తల్లి అవుతాడు. ఇది ఎంత గుహ్యమైన విషయం! నిజానికి ఇతను పురుషుడు. ఇతడిలోకి(శివబాబా) ప్రవేశించినప్పుడు మాతగా ఎలా అయ్యాడు అని ఈ విషయాలు విని తప్పకుండా తికమక పడ్తారు.

ఈ మాతా-పితలు, బ్రహ్మ - సరస్వతులు ఇరువురూ కల్పవృక్షము క్రింద కూర్చుని రాజయోగము నేర్చుకుంటున్నారని, కనుక వారికి గురువు తప్పక ఉండాలని మీరు నిరూపించి తెలుపుతారు కనుక బ్రహ్మ, సరస్వతులను మరియు పిల్లలందరినీ రాజఋషులని అంటారు. రాజ్యము కొరకు యోగము చేస్తారు. తండ్రి వచ్చి రాజయోగము, జ్ఞానము నేర్పిస్తారు. ఇతరులెవ్వరూ ఈ జ్ఞాన-యోగాలను నేర్పించలేరు. ఇది తప్ప మరొక రాజయోగము లేదు. ''వారు కేవలము యోగము నేర్చుకోండి'' అని అంటారు. అనేక ప్రకారాలైన హఠయోగాలుంటాయి. ఏ సన్యాసులు గాని, ఉదాసీనులు గాని రాజయోగమును నేర్పించలేరు. భగవంతుడే స్వయంగా వచ్చి రాజయోగమును నేర్పించారు. నేను కల్ప-కల్పము నూతన మానవ సృష్టిని రచించవలసి వచ్చినప్పుడు, రావలసి వస్తుందని బాబా అంటున్నారు. ప్రళయమైతే జరగదు. ఒకవేళ ప్రళయము జరిగితే నేను ఎవరిలో రావాలి? నిరాకారమైన నేను వచ్చి ఏమి చేయాలి? ఈ సృష్టి మొదటి నుండే ఉందని తండ్రి అర్థము చేయిస్తారు. భక్తులు కూడా ఉన్నారు. భగవంతున్ని పిలువను కూడా పిలుస్తారు. దీని వలన భక్తులున్నారని ఋజువౌతుంది. భక్తులు చాలా దు:ఖములో ఉన్నప్పుడు కలియుగము అంతిమ సమయములో ఉన్నప్పుడు భగవంతుడు రావలసి వస్తుంది. రావణ రాజ్యము సమాప్తమవ్వనున్నది. అప్పుడే నేను రావలసి వస్తుంది. తప్పకుండా ఈ సమయములో అందరూ దు:ఖితులుగా ఉన్నారు. మహాభయంకరమైన యుద్ధము ఎదుట నిలబడి ఉంది.

ఇది పాఠశాల. ఇచ్చట లక్ష్యముంది. సత్యయుగములో లక్ష్మీ నారాయణుల రాజ్యముండేదని ఆ తర్వాత సింగల్‌ కిరీటము గలవారి రాజ్యము వచ్చిందని మీకు తెలుసు. ఆ తర్వాత ఇతర ధర్మాలన్నీ వృద్ధి చెందాయి, ఆ తర్వాత మళ్ళీ రాజ్యము మొదలైన వాటిని పెంచేందుకు యుద్ధాలు మొదలైనవి జరిగాయని కూడా తెలుసు. ఏది జరిగిపోయిందో అదంతా మళ్ళీ రిపీట్‌ అవుతుందని మీకు తెలుసు. మళ్ళీ లక్ష్మీ నారాయణుల రాజ్యము ప్రారంభమౌతుంది. బాబా ప్రపంచ చరిత్ర-భూగోళాల రహస్యాన్ని పూర్తిగా అర్థము చేయిస్తారు. చాలా విస్తారములోకి పోవలసిన అవసరము లేదు. మనము సూర్యవంశీయులైతే పునర్జన్మ కూడా తప్పకుండా సూర్య వంశములోనే తీసుకొని ఉండవచ్చు. నామ-రూపాలైతే మారిపోతూ ఉంటాయి. తల్లి-తండ్రి కూడా వేరే వారు లభిస్తారు. ఈ మొత్తం డ్రామా అంతా బుద్ధిలో ఉంచుకోవాలి. తండ్రి ఎలా వస్తారో కూడా అర్థము చేసుకున్నారు. మనుష్యుల బుద్ధిలో అదే గీతా జ్ఞానము ఉంది. ఇంతకు ముందు మన బుద్ధిలో కూడా అదే పాత గీతా జ్ఞానముండేది. ఇప్పుడు తండ్రి రహస్యమైన విషయాలను వినిపిస్తున్నారు. అవి వింటూ-వింటూ మొత్తం రహస్యాలన్నీ అర్థము చేసుకున్నారు. మనుష్యులు కూడా ఇంతకు ముందు మీ జ్ఞానము వేరుగా ఉండేదని ఇప్పుడు చాలా బాగుందని అంటారు. ఎందుకంటే గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానంగా ఎలా అవ్వాలో ఇప్పుడు అర్థము చేసుకున్నారు. ఇది అందరికీ అంతిమ జన్మ. అందరూ మరణించాల్సిందే. స్వయం అనంతమైన తండ్రి అంటున్నారు - మీరు పవిత్రంగా అవుతామని ప్రతిజ్ఞ చేస్తే 21 జన్మలకు స్వర్గానికి అధిపతులుగా అవుతారు. ఇక్కడ పదమాపతులు కూడా దు:ఖములో ఉన్నారు. శరీరము నిరోగి(కల్పతరువు)గా ఉండదు. మీ శరీరము నిరోగి(కల్పతరువు)గా అవుతు౦ది. మీరు 21 జన్మలు మరణించరు. ఎవరైతే సూర్య వంశీయులు, చంద్ర వంశీయులుగా ఉండి కామచితి పై కూర్చుని నల్లగా(అపవిత్రము)గా అయిపోయారో వారే ఇచ్చటకు వస్తారని తండ్రి చెప్తున్నారు. అందుకే రాధా-కృష్ణులు, నారాయణుని అందరినీ నల్లగా చూపిస్తారు. ఇప్పుడైతే అందరూ నల్లగానే ఉన్నారు. కామచితి పై కూర్చున్నందున నల్లగా అయిపోయారు. ఇప్పుడు మీరు కామచితి నుండి క్రిందికి దిగి జ్ఞాన చితి పై కూర్చోవాలి. విషపు కంకణాన్ని రద్దు చేసి జ్ఞానామృత కంకణాన్ని కట్టుకోవాలి. మీరు శుభ కార్యము చేస్తున్నారని అందరూ అనేటట్లు మీరు అర్థము చేయించాలి. కుమారులు, కుమారీలుగా ఉన్నంతవరకు వారిని ' మలిన వస్త్రాలు(వికారులు)' అని అనరు. '' మీరు ఎప్పుడూ మురికిగా అవ్వరాదు'' అని తండ్రి అంటున్నారు. పోను పోను అనేకమంది వస్తారు. '' ఇది చాలా బాగుంది '' అని అంటారు. జ్ఞానచితి పై కూర్చున్నందున మనము స్వర్గానికి అధిపతులుగా అవుతాము. తరచుగా బ్రాహ్మణులే నిశ్చితార్థము చేయిస్తారు. రాజుల వద్ద కూడా బ్రాహ్మణులు ఉంటారు. వారిని రాజగురువులని అంటారు. ఈ రోజులలో సన్యాసులు కూడా కంకణము కడ్తారు. ఈ జ్ఞాన విషయాలు వినిపించినప్పుడు జనులు చాలా సంతోషిస్తారు. వెంటనే రాఖీ కూడా కట్టించుకుంటారు. మళ్ళీ ఇంటిలో గొడవలు కూడా జరుగుతాయి. కొంచెము సహించవలసి ఉంటుంది.

మీరు గుప్తముగా ఉన్న శివశక్తి సైన్యము. మీ వద్ద ఏ మారణాయుధమూ లేదు. దేవతలకు చాలా ఆయుధాలు చూపుతారు. ఇవన్నీ జ్ఞాన విషయాలు. ఇచ్చట ఉండేవి యోగబల విషయాలు. మీరు యోగబలము ద్వారా విశ్వచక్రవర్తి పదవిని తీసుకుంటారు. బాహుబలము ద్వారా హద్దులోని రాజ్య పదవి లభిస్తుంది. బేహద్‌ రాజ్యాన్ని బేహద్‌ అధిపతి మాత్రమే ఇస్తారు. యుద్ధమును గురించిన విషయమే లేదు. '' నేనెలా యుద్ధము చేయిస్తాను '' అని తండ్రి అంటారు. నేను యుద్ధాలు, జగడాలు నిర్మూలించేందుకే వచ్చాను. దీని తర్వాత యుద్ధము, జగడాల నామ-రూపాలు కూడా ఉండవు. అందుకే అందరూ పరమాత్మను స్మృతి చేస్తారు. ''నా మాట పై గౌరవముంచండి'' అని బాబా అంటున్నారు. అయినా ఒకరి పై నిశ్చయము లేకుంటే వేరు వేరుగా అనేక మందిని పట్టుకుంటూ ఉంటారు. మాలో కూడా ఈశ్వరుడు ఉన్నాడని అంటారు. అయితే స్వయం పై కూడా నమ్మకము ఉంచుకోరు. గురువులను ఆశ్రయిస్తూ ఉంటారు. మీలోనే భగవంతుడు ఉంటే గురువుల వద్దకు ఎందుకు వెళ్ళాలి? ఇచ్చటి విషయాలే భిన్నంగా ఉంటాయి. తండ్రి అంటున్నారు - కల్పక్రితము కూడా నేను ఎలా వచ్చానో అలాగే ఇప్పుడు వచ్చాను. రచయిత అయిన తండ్రి కూర్చుని ఎలా రచన చేస్తారో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఇది కూడా డ్రామాయే. ఎంతవరకు ఈ చక్రాన్ని గురించి తెలియదో, అంతవరకు ఇక ముందు ఏమౌతుందో అన్నది ఎలా తెలుసుకుంటారు. దీనిని కర్మ క్షేత్రమని అంటారు. మనము నిరాకార ప్రపంచము నుండి పాత్ర చేసేందకు వచ్చాము. అందువలన ఈ మొత్తము డ్రామా క్రియేటర్‌, డైరక్టర్‌ గురించి తెలియాలి. పాత్రధారులమైన మనందరము ఈ డ్రామా ఎలా తయారు చేయబడి ఉందో, ఈ సృష్టి ఎలా వృద్ధి పొందుతుందో తెలుసుకున్నాము. అంతేకాక ఇది కలియుగ అంతిమ సమయమని, సత్యయుగము తప్పకుండా స్థాపన అవ్వాలని కూడా తెలుసుకున్నాము. ఈ చక్ర జ్ఞానము పూర్తిగా సరైనదని, ఎవరైతే బ్రాహ్మణ కులానికి చెందినవారు ఉంటారో వారు అర్థము చేసుకుంటారు. ఇతడు ప్రజాపిత అయినందున తన కులము పెరుగుతూనే పోతుంది. పెరిగే తీరాలి. కల్పక్రితము వలె అందరూ పురుషార్థము చేస్తూనే ఉంటారు. మనము సాక్షిగా ఉండి చూస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరు - ''ఎంతవరకు సత్యయుగములో రాజధానిని తీసుకునేందుకు అర్హులుగా అయ్యాము? అని తాము ముఖాన్ని దర్పణములో చూసుకుంటూ ఉండాలి '' ఇది కల్ప-కల్పము ఆడే ఆట. ఎవరు ఎంత సేవ చేస్తారో అంత పొందుతారు. మీరు అనంతమైన ఆత్మిక సమాజ సేవకులు. మీరు పరమాత్మ మతమును అనుసరిస్తారు. ఇటువంటి మంచి మంచి పాయింట్లు ధారణ చేయాలి. తండ్రి వచ్చి మృత్యువు పంజా నుండి విడిపిస్తారు. అచ్చట మృత్యువు పేరే ఉండదు. ఇది మృత్యు లోకము. అది అమరలోకము. ఇచ్చట ఆదిమధ్యాంతాలు దు:ఖముంది. అచ్చట దు:ఖానికి నామ-రూపాలు కూడా ఉండవు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. 

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మనము నిరాకార తండ్రి, సాకార తండ్రి ఇరువురికీ అపురూపమైన కంటి పాపలము. మనము జీవించి ఉండే శివబాబాకు వారసులుగా అయ్యామనే నషాలో ఉండాలి.
2. యోగబలము ద్వారా విశ్వ రాజ్యాన్ని తీసుకోవాలి. పవిత్రతా రాఖీని కట్టుకున్నట్లయితే సహనము కూడా చేయాలి. ఎప్పుడూ పతితులుగా అవ్వరాదు.

వరదానము :- ''ఒకే సంకల్పములో స్థితమై మహాతీర్థ స్థానాన్ని ప్రత్యక్షము చేసే జిమ్మేవార్‌ ఆత్మా(బాధ్యత కలిగిన ఆత్మ) భవ''
ఈ ' ఆబూ ' విశ్వానికి లైట్‌హౌస్‌ అయ్యింది. ఈ మహాతీర్థ స్థానాన్ని ప్రత్యక్షము చేసేందుకు సర్వ బ్రాహ్మణ పిల్లలకు - విశ్వములోని ప్రతి ఆత్మకు ఇక్కడ నుండే ఠికానా(గమ్య స్థానం) లభించాలి. అందరికీ కళ్యాణము జరగాలి అనే ఒకే సంకల్పముండాలి. ఎప్పుడైతే ఈ శుభప్రదమైన ఆశల దీపము ప్రతి ఒక్కరిలో వెలుగుతుందో, అందరి సహయోగము ఉంటుందో అప్పుడు కార్యములో సఫలత లభిస్తుంది. '' ఇది నా బాధ్యత '' అనే శబ్ధము అందరి మనసు నుండి వెలువడాలి. ఎప్పుడైతే ప్రతి ఒక్కరు స్వయాన్ని ఇటువంటి బాధ్యత ఉందని భావిస్తారో అప్పుడు ప్రత్యక్షతా కిరణాలు తండ్రి ఇంటి నుండి నలువైపులా వ్యాపిస్తాయి. 

స్లోగన్‌ :- ''అంతర్ముఖతా విశేషతను ధారణ చేస్తే అందరి ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి''
 

Telugu Murli 05/01/18

05-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

''మధురమైన పిల్లలారా - మీరు ఇక్కడ సుఖము-దు:ఖము, మానము-అవమానము అన్నీ సహించాలి. పాత ప్రపంచములోని సుఖాలను బుద్ధి నుండి తొలగించి వేయాలి. మీ స్వంత మతమును అనుసరించరాదు.'' 

ప్రశ్న :- దేవతా జన్మ కంటే ఈ జన్మ చాలా మంచిది ఎలా ?
జవాబు :- ఈ జన్మలో పిల్లలైన మీరు శివబాబా భండారము నుండి తింటారు. ఇచ్చట మీరు అంతులేని సంపాదన చేస్తారు. మీరు తండ్రి ఆశ్రయము(శరణు) తీసుకున్నారు. ఈ జన్మలోనే మీరు మీ ఇహలోకమును, పరలోకమును సుఖవంతముగా చేసుకుంటారు. సుదాముని వలె రెండు పిడికెళ్ళు ఇచ్చి 21 జన్మల చక్రవర్తిత్వ పదవిని తీసుకుంటారు.

పాట :- సమీపంగా ఉన్నా, దూరంగా ఉన్నా,........( చాహే పాస్‌ ¬, చాహే దూర్‌ ,.......)   
ఓంశాంతి. పాట అర్థము ఎంతో బాగున్నది. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. ఈ శరీరముతో దగ్గరగా ఉన్నా దూరముగా ఉన్నా,..... ఎందుకంటే సన్ముఖములో కూర్చుని యోగ శిక్షణను ఇస్తున్నారు. ప్రేరణతో అయితే ఇవ్వరు కదా. నేను దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా - మీరు నన్నే స్మృతి చేయాలి. భగవంతుని వద్దకు వెళ్ళేందుకే కదా భక్తి చేస్తారు. ''ఓ జీవాత్మలారా! ఈ శరీరములో నివసించు ఆత్మలారా! '' అని ఆత్మలతో పరమపిత పరమాత్మ కూర్చొని మాట్లాడ్తున్నారు. పరమాత్మను ఆత్మలు తప్పకుండా కలుసుకోవాలి. అందువలన జీవాత్మలు భగవంతుని స్మృతి చేస్తారు. ఎందుకంటే దు:ఖితులై ఉన్నారు. సత్యయుగములో అయితే ఎవ్వరూ స్మృతి చేయరు. మేము చాలా పాత భక్తులమని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఎప్పటి నుండి మాయ మనలను పట్టుకుందో అప్పటి నుండి భగవంతుని, శివుని స్మృతి ప్రారంభమయ్యింది. ఎందుకంటే శివబాబాయే మనలను స్వర్గానికి యజమానులుగా చేశారు. కావున వారి స్మృతిచిహ్నము(శివలింగము)ను తయారు చేసుకొని భక్తి చేస్తారు. ఇప్పుడు తండ్రి మనలను తీసుకెళ్ళేందుకు సన్ముఖములోనికి వచ్చారని మీకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు తండ్రి వద్దకు వెళ్ళాలి. ఇచ్చట ఉన్నంత వరకు పాత శరీరాన్ని, పాత ప్రపంచమును బుద్ధి నుండి మర్చిపోవాలి. యోగములో ఉండాలి. అప్పుడు ఈ యోగాగ్ని వలన పాపాలు భస్మమైపోతాయి. ఇందులో శ్రమ కలుగుతుంది. పదవి అయితే చాలా గొప్పది. విశ్వానికి యజమానులుగా అవ్వాలి. విశ్వానికి యజమాని శివబాబా అని మనుష్యులంటారు. కాని శివబాబా యజమానిగా అవ్వరు. విశ్వానికి యజమానులుగా మనుష్యులే అవుతారు. తండ్రి కూర్చొని పిల్లలను విశ్వానికి యజమానులుగా చేస్తారు. వారంటున్నారు - మీరే విశ్వానికి యజమానులుగా ఉండేవారు, మళ్ళీ 84 జన్మలు తీసుకొంటూ, తీసుకుంటూ ఇప్పుడు చిల్లిగవ్వకు కూడా మాలికులుగా లేరు. మొదటి నెంబరు జన్మకు, ఇప్పటి జన్మకు ఎంత తేడా ఉందో చూడండి! రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. తండ్రి వచ్చి సాక్షాత్కారము చేయించినంతవరకు ఎవ్వరికీ స్మృతి కలుగజాలదు. జ్ఞాన బుద్ధితో కూడా సాక్షాత్కారమవుతుంది. తెలివిగల పిల్లలకు, నిత్యము తండ్రిని స్మృతి చేయువారికి చాలా ఆనందము ఉంటుంది. ఇచ్చట మీరు వినే విషయాలన్నీ క్రొత్త విషయాలు. మనుష్యులకైతే ఏమీ తెలియదు. వారు గప్పాలు, వ్యర్థ మాటలు మాట్లాడుతూ, గడప గడప వద్ద ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. మీరు వెతుకులాట నుండి విడిపించబడ్డారు. తండ్రి అంటున్నారు - మీరందరూ ఆత్మలు, తండ్రి అయిన నన్ను స్మృతి చేస్తూ ఉండండి. బుద్ధిలో 'ఆత్మలమైన మేము ఇప్పుడు బాబా వద్దకు వెళ్ళాలి' అన్న ఆలోచన ఉండాలి. 'ఈ సృష్టి ఇక మేముండేందుకు తగదని బుద్ధిలో ఉండాలి. ఈ పాత సృష్టి అయితే అంతమైపోతుంది. మళ్ళీ మేము స్వర్గములోకి వచ్చి నూతన మహళ్ళు తయారు చేస్తాము' అనే ఆలోచనలు రాత్రింబవళ్ళు మీ బుద్ధిలో నడుస్తూ ఉండాలి. తండ్రి తన అనుభవమును వినిపిస్తున్నారు - రాత్రి నిదురించునప్పుడు కూడా నాకు ఇవే ఆలోచనలు నడుస్తాయి. ఈ నాటకము ఇక పూర్తి అయిపోతుంది, ఈ పాత శరీరాన్ని వదిలేయాలి. అయితే వికర్మల భారము చాలా ఉంది. అందువలన నిరంతరము బాబాను స్మృతి చేయాలి. మీ స్థితిని దర్పణములో చూసుకోవాలి. ''నా బుద్ధి అన్నిటి నుండి తొలగిందా? '' వృత్తి వ్యాపారాదులలో ఉండినా బుద్ధితో ఈ పని చేయవచ్చు. బాబా పై ఎంత బాధ్యత ఉంది! ఎంతమంది పిల్లలున్నారు! వారి పై గమనముంచవలసి వస్తుంది. పిల్లలకు శరణునివ్వాలి. దు:ఖితులైతే చాలామంది ఉన్నారు కదా. గలాటాలలో ఎంత మంది దు:ఖితులై మరణిస్తున్నారు! ఇది చాలా చెడ్డ సమయము. అందువలన పిల్లలకు శరణు ఇచ్చేందుకు ఈ భవనాలు తయారవుతున్నాయి. ఇచ్చటైతే అందరూ నా పిల్లలే ఉన్నారు. ఏ భయమూ ఉండదు. అంతేకాక ఇక్కడ యోగబలము కూడా ఉంటుంది. పిల్లలు సాక్షాత్కారములో కూడా చూశారు - ఏ పిల్లలైతే తండ్రిని మంచి రీతిగా స్మృతి చేస్తారో, తండ్రి వారి రక్షణ కూడా చేస్తారు. శత్రువుకు భయంకర రూపాన్ని చూపించి పారద్రోలుతారు. మీకు ఎంతవరకు శరీరముందో అంతవరకు యోగములో ఉండాలి. లేకుంటే శిక్షలు అనుభవించవలసి వస్తుంది. గొప్ప వారి పిల్లలు శిక్షలు అనుభవిస్తే వారి భుజాలు(తలలు) క్రిందికి వాలిపోతాయి. మీరు కూడా భుజాలు క్రిందికి దించుకోవలసి వస్తుంది. పిల్లలకైతే ఇంకా కఠినమైన శిక్షలు ఉంటాయి. ఇప్పుడు మాయ అందించే సుఖాలు అనుభవించనీ. జరిగేటప్పుడు చూచుకుంటాము అనేవారు కూడా ఉన్నారు. చాలామందికి ఈ పాత ప్రపంచములోని సుఖాలు మధురంగా అనిపిస్తాయి. ఇచ్చట సుఖ-దు:ఖాలు, మాన-అవమానాలు అన్నీ సహించాల్సి వస్తుంది. ఉన్నత ప్రాప్తి కావాలనుకుంటే తండ్రిని ఫాలో చేయాలి. తల్లిదండ్రుల ఆజ్ఞానుసారము నడుచుకోవాలి. మీ స్వంత మతము అనగా రావణమతము. దానిని అనుసరిస్తే భాగ్యానికి అడ్డగీతను గీచుకొనుటే అవుతుంది. తండ్రిని అడిగితే, ఇది శ్రీమతము కాదని, ఆసురీ మతమని వెంటనే చెప్తారు. అడుగడుగులో శ్రీమతము కావాలి. ' ఎక్కడైనా ఉల్టా కర్మలు చేసి తండ్రిని నిందింపజేయడం లేదు కదా ' అని చూచుకోవాలి. దేవీ దేవతల లక్షణాలున్నప్పుడు మాత్రమే దేవీ దేవతలుగా అవుతారు. అంతేగానీ అచ్చట ఆటోమేటిక్‌గా లక్షణాలు వచ్చేస్తాయని కాదు. ఇచ్చట నడవడిక చాలా మధురముగా ఉండాలి. ఒకవేళ శివబాబా చెప్పలేదు. బ్రహ్మబాబా చెప్పినారనుకున్నా, బాధ్యుడుగా వీరే(శివబాబాయే) ఉంటారు కదా! ఒకవేళ ఏదైనా నష్టము జరిగినా ఫర్వాలేదు. ఇది డ్రామాలో ఉంది. అందువలన మీ పైన ఎలాంటి దోషముండదు. స్థితి చాలా బాగుండాలి. భలే మీరు ఇచ్చట కూర్చుని ఉన్నారు. బుద్ధిలో మేము బ్రహ్మాండానికి యజమానులము అచ్చట ఉండేవారమని ఉండాలి. ఈ విధంగా ఇంట్లో ఉంటూ వృత్తి, వ్యాపారాలు చేసుకుంటూ అతీతమౌతూపోతారు. ఎలాగైతే సన్యాసులు గృహస్థము నుండి అతీతంగా అవుతారో అలా అవుతారు. మీరైతే మొత్తము పాత ప్రపంచము నుండి ఉపరాంగా అవుతారు. ఆ హఠయోగ సన్యాసానికి, ఈ సన్యాసానికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఈ రాజయోగమును తండ్రి నేర్పిస్తారు. సన్యాసులు నేర్పించలేరు. ఎందుకంటే ముక్తి - జీవన్ముక్తుల దాత ఒక్క బాబా మాత్రమే. అందరూ ఇప్పుడు ముక్తము అవ్వనున్నారు. ఎందుకంటే అందరూ వాపసు వెళ్ళాలి. మేము వాపసు వెళ్ళాలని సాధువులు సాధన చేస్తారు. ఇచ్చట దు:ఖితులుగా ఉన్నారు. కొంతమంది '' మేము జ్యోతులము జ్యోతిలో కలసిపోవాలి '' అని అంటారు. అనేక మతములున్నాయి.

బాబా అర్థము చేయిస్తున్నారు - పాత సంబంధీకులు గుర్తు వచ్చే పిల్లలు కూడా కొంతమంది ఉన్నారు. ఆ ప్రపంచములోని సుఖాల పై కోరిక కలిగిందంటే ఇక్కడ మరణించినట్లే. మళ్ళీ వారి కాళ్ళు ఇచ్చట నిలువవు. మాయ చాలా ఊరిస్తుంది. ఆశ చూపిస్తుంది. 'భగవంతుని స్మృతి చేయండి, లేకుంటే బాజ్‌(డేగ) వచ్చేస్తుంది.' అని ఒక సామెత కూడా ఉంది. ఈ మాయ కూడా డేగ వలె దాడి చేస్తుంది. ఇప్పుడు స్వయం తండ్రి వచ్చి ఉన్నప్పుడే పురుషార్థము చేసి ఉన్నత పదవి పొందకుంటే కల్ప-కల్పాంతరాలు కూడా పొందలేరు. ఇచ్చట తండ్రి వద్ద మీకు ఎలాంటి దు:ఖమూ లేదు. అందువలన దు:ఖమునిచ్చే పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి కదా. ఎంత సమయము తండ్రిని స్మృతి చేశాను? ఎవరికైనా ప్రాణదానము చేశానా? అని రోజంతటి లెక్కాచారము చూచుకోవాలి. తండ్రి మీకు కూడా ప్రాణదానము ఇచ్చారు కదా. సత్య-త్రేతా యుగాల వరకు మీరు అమరులుగా ఉంటారు. ఇచ్చట ఎవరైనా మరణిస్తే ఎంత ఏడుస్తూ, బాదుకుంటూ ఉంటారు! స్వర్గములో దు:ఖము అన్న మాటే ఉండదు. పాత శరీరాన్ని వదిలి కొత్తది తీసుకుంటారని భావిస్తారు. ఈ ఉదాహరణ(సర్పము) కూడా మీకే సరిపోతుంది. ఇతరులెవ్వరూ ఈ ఉదాహరణమునివ్వలేరు. వారు పాత శరీరాన్ని మర్చిపోలేరు. వారైతే ధనము పోగు చేస్తూ ఉంటారు. ఇచ్చట మీరు ఏదైతే తండ్రికిస్తారో, దానిని తండ్రి ఏమీ తినరు, తన వద్ద ఉంచుకోరు. దాని ద్వారా పిల్లల పాలన, పోషణ చేస్తారు. అందువలన ఇది సత్యమైన శివబాబా భండారము. ఈ భండారము నుండి భుజించేవారు ఇచ్చట కూడా సుఖంగా ఉంటారు, జన్మ-జన్మాంతరాలకు సుఖంగా ఉంటారు.

ఇప్పటి మీ జన్మ చాలా దుర్లభమైనది. దేవతల కంటే మీరు ఇచ్చట సుఖంగా ఉన్నారు. ఎందుకంటే తండ్రి శరణులో ఉన్నారు. ఇచ్చటి నుండే మీరు అంతులేని సంపాదన చేస్తారు. దానిని మీరు జన్మ -జన్మాంతరాలు అనుభవిస్తారు. సుదామునికి కూడా రెండు పిడికెళ్ళకు బదులు 21 జన్మలకు భవనాలు లభించాయి. ఈ లోకములో కూడా సుఖమే, పరలోకములో కూడా జన్మ-జన్మాంతరాల వరకు సుఖమే. అందువలన ఈ జన్మ చాలా మంచిది. కొంతమంది త్వరగా వినాశనమైతే మేము స్వర్గములోకి వెళ్ళిపోతామని అంటారు. కాని తండ్రి నుండి ఇంకా చాలా ఖజానా తీసుకోవలసి ఉంది. అప్పుడే రాజధాని ఎక్కడ తయారయ్యింది? మరి త్వరగా వినాశనమెలా చేయిస్తారు? పిల్లలంతా అర్హులుగా ఎక్కడ తయారయ్యారు! ఇప్పుడింకా తండ్రి పిల్లలను చదివించేందుకు వస్తూనే ఉంటారు. బాబా చేసే సర్వీసు అపారమైనది. అలాగే తండ్రి మహిమ కూడా అపారమైనది. నేను ఎంత ఉన్నతమైన వాడినో అంత ఉన్నతమైన సేవ కూడా చేస్తాను. అందుకే నా స్మృతి చిహ్నము ఉంది. బాబా(హృదయ) సింహాసనము అత్యంత ఉన్నతమైనది. ఎవరెంత పురుషార్థము చేస్తారో, వారు తమ భాగ్యాన్ని అంతగా తయారు చేసుకుంటారు. ఇది అవినాశి జ్ఞాన రత్నాల సంపాదన. ఈ సంపాదన అచ్చట(సత్యయుగము) అంతులేని ధనరాసులుగా అవుతాయి. కావున పిల్లలు పురుషార్థము చాలా బాగా చేయాలి. తండ్రిని ఇచ్చట కూడా స్మృతి చేయండి. అచ్చట(మూలవతనములో) కూడా స్మృతి చేయండి. మెటికలైతే ఉన్నాయి కదా. హృదయమనే దర్పణములో నేను తండ్రికి ఎంత సుపుత్రునిగా ఉన్నాను? అంధులకు దారి చూపుతున్నాను?' అని చూచుకోవాలి. స్వయం మీతో మీరే మాట్లాడుకుంటే ఖుషీ కలుగుతుంది. ఉదాహరణానికి ఈ బాబా అనుభవము తెలుపుతారు కదా. నిదురించినప్పుడు కూడా ఇలా మాట్లాడుకుంటాను - బాబా అద్భుతమంతా మీదే. భక్తిమార్గములో మళ్ళీ మేము మిమ్ములను మర్చిపోతాము. మళ్ళీ భక్తి మార్గములో మీ స్మృతిచిహ్నాన్ని తయారు చేస్తాము. మళ్ళీ ఇంతటి వారసత్వము మీ నుండి పొందుతాము, మళ్ళీ సత్యయుగములో ఇది మర్చిపోతాము, కాని మీ కర్తవ్యాన్ని పూర్తిగా మర్చిపోతాము. మూఢుల వలె, అజ్ఞానుల వలె అయిపోతాము. ఇప్పుడు తండ్రి వచ్చి ఎంత జ్ఞానులుగా తయారు చేశారు! రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఈశ్వరుడు సర్వవ్యాపి అనేది జ్ఞానము కానే కాదు. జ్ఞానమనగా సృష్టిచక్ర జ్ఞానము కలిగి ఉండాలి. ఇప్పుడు మనము 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసి వాపసు వెళ్ళిపోతాము. మళ్ళీ మనం జీవన్ముక్తిలో రావాలి. డ్రామా నుండి వెలుపలికి వెళ్ళలేము. మనము జీవన్ముక్తికి యాత్ర చేసే ప్రయాణీకులము. మంచిది.

రాత్రి క్లాసు 16-12-68

ఒక్కొక్కరిని బాబా బచ్చీ(బిడ్డా) అని అంటారు. కొందరిని మయ్యా(తల్లి) అని అంటారు. కనుక ఏదో వ్యత్యాసము తప్పకుండా ఉంటుంది. కొంతమందికి సేవ ద్వారా సుగంధము వస్తుంది. కొంతమంది జిల్లేడు పూల వలె వాసన లేనివారుగా ఉన్నారు. తండ్రి - ''నీవు నా జతలో వచ్చినట్లుంది అని అన్నారు. తండ్రి కూడా పై నుండి విశ్వాన్ని పావనంగా చేసేందుకు వచ్చారు. మీ కర్తవ్యము కూడా ఇదే. అక్కడ నుండి ఎవరైతే మొదట వస్తారో వారు పవిత్రంగా ఉంటారు. కొత్తగా వచ్చినవారు తప్పకుండా సువాసననిస్తూ ఉంటారు. వారిని ఉద్యానవనముతో కూడా పోలుస్తారు. ఎటువంటి సేవ చేస్తారో అటువంటి సువాసన కలిగిన పుష్పాలు. శివబాబా పుత్రుడని అనిపించుకొని, హక్కుదారునిగా అయ్యానని వివేకము చెప్తుంది. కనుక ఆ సువాసన రావాలి. హక్కుదారులైనందునే బాబా అందరికీ నమస్కారము చేస్తారు. మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. అనుమానమేమీలేదు కాని చదువులో అయితే చాలా వ్యత్యాసముంటుంది. ఇది(తేడా) తప్పకుండా ఉండాల్సిందే. వీరు బాబా అని పిల్లలకు నిశ్చయము కలుగుతుంది. చక్రము కూడా బుద్ధిలో ఉంది. కనుక తండ్రి చెప్తున్నారు - ''ఎక్కువగా ఎందుకు చెప్పాలి? '' తండ్రి తప్ప ఇతరులెవ్వరూ స్వదర్శన చక్రధారులుగా చెయ్యలేరు. సూచనతో తయారవుతారు. ఎవరైతే కల్పక్రితము తయారయ్యారో వారే తయారవుతారు. అనేకమంది పిల్లలు వస్తారు. పవిత్రత పై ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి! ఎవరి ద్వారా తండ్రి గీతను వినిపిస్తారో వారిని ఎంతగా తిట్తారు? శివబాబాను కూడా తిట్తారు. తాబేలు అవతారము, చేప అవతారము అనుట కూడా తిట్లే కదా. తెలియనందున తండ్రికి మీకు ఎన్ని కళంకాలు అంటకడ్తారు! పిల్లలు ఎంతో కష్టపడ్తారు. చదువు ద్వారా కొంతమంది చాలా పెద్ద ధనవంతులుగా అవుతారు. చాలా సంపాదిస్తారు. ఒకొక్క ఆపరేషన్‌కు రెండు వేలు, నాల్గు వేలు లభిస్తాయి. కొంతమంది అయితే వారి కుటుంబాలను కూడా పోషించలేరు. చింత ఉంటుంది కదా. కొంతమంది జన్మ-జన్మాంతరాలు చక్రవర్తి పదవి తీసుకుంటారు. కొంతమంది జన్మ-జన్మాంతరాలకు పేదవారిగా అవుతారు. తండ్రి చెప్తున్నారు - మిమ్ములను తెలివిగలవారిగా తయారు చేస్తాను. ఇప్పుడు అన్నిటికి డ్రామా అని అంటారు. అందరికీ పాత్ర ఉంది. ఏదైతే జరిగిపోయిందో అదంతా డ్రామా. డ్రామాలో ఉండేదే జరుగుతుంది. డ్రామానుసారము జరిగేదంతా సరియైనదే. మనము ఎంతగా అర్థము చేయించినా అర్థము చేసుకోరు. ఇందులో మంచి నడవడికలు కూడా ఉండాలి. ప్రతి ఒక్కరు మీ ఆంతరికములో చూచుకోండి ' ఏ లోపము లేదు కదా? ' మాయ చాలా కఠినమైనది, శక్తివంతమైనది. దానినెలాగైనా తొలగించాలి. అన్ని బలహీనతలను తీసేయాలి. తండ్రి చెప్తున్నారు - '' బంధనములో ఉన్న మాతలు అందరికంటే ఎక్కువ స్మృతి చేస్తారు. వారే మంచి పదవిని పొందుతారు. ఎంత ఎక్కువగా దెబ్బలు తింటారో అంత ఎక్కువ స్మృతిలో ఉంటారు. ' హాయ్‌ శివబాబా అని అంటూ ఉంటారు. జ్ఞానము ద్వారా శివబాబాను స్మృతి చేస్తారు. వారి చార్టు బాగుంటుంది. ఇలా దెబ్బలు తిని వచ్చేవారు సేవలో కూడా ఎక్కువగా లగ్నమౌతారు. తమ జీవితాలను ఉన్నతంగా చేసుకునేందుకు సేవ చాలా బాగా చేస్తారు. సేవ చేయకుంటే మనసు తింటూ ఉంటుంది. సేవ చేసేందుకు వెళ్లాలని మనస్సు ఉవ్విళ్లూరుతూ ఉంటుంది. భలే సెంటరు వదిలి వెళ్లాల్సి వస్తుందని తెలిసినా ప్రదర్శనిలో సేవ చాలా ఉంటే సెంటరును కూడా లెక్క పెట్ట పరుగెత్తాలి. మనము ఎంత దానము చేస్తామో అంత బలము కూడా నిండుతూ ఉంటుంది. దానము కూడా తప్పకుండా చేయాలి కదా. ఇవి అవినాశి జ్ఞానరత్నాలు. ఇవి ఎవరి వద్ద ఉంటాయో వారు మాత్రమే దానము చేస్తారు. పిల్లలకిప్పుడు మొత్తం సృష్టి ఆది-మధ్య-అంత్యముల జ్ఞానము గుర్తుకు వచ్చేయాలి. మొత్తం చక్రమంతా తిరగాలి. తండ్రి కూడా ఈ సృష్టి ఆది-మధ్య-అంత్యములు తెలిసినవారు. తప్పకుండా వారు జ్ఞానసాగరులు. సృష్టిచక్రము గురించి తెలిసినవారు. ఈ ప్రపంచములోని వారికి ఈ జ్ఞానము పూర్తిగా కొత్తది. ఈ జ్ఞానము పాతదెప్పుడూ కానే కాదు. ఇది అద్భుతమైన జ్ఞానము కదా. ఈ జ్ఞానాన్ని తండ్రి మాత్రమే తెలుపగలరు. ఎవరెంత సాధువులు, మహాత్ములైనా మెట్లు ఎక్కి పైకి పోనే పోరు. తండ్రి తప్ప ఏ మనుష్యులు గతి-సద్గతిని ఇవ్వలేరు. మనుష్యులూ ఇవ్వలేరు, దేవతలూ ఇవ్వలేరు. కేవలం తండ్రి ఒక్కరు మాత్రమే ఇవ్వగలరు. రోజురోజుకు వృద్ధి చెందాల్సిందే. బాబా చెప్పారు - ఉదయము చేసే శాంతియాత్రలు ఈ లక్ష్మీనారాయణ చిత్రము, మెట్ల చిత్రము ట్రాన్స్‌ లైట్‌గా ఉండాలి. కరెంటుతో వెలిగి మెరుపునిచ్చే వస్తువేదైనా ఉండాలి. స్లోగన్లు కూడా చెప్తూ వెళ్ళండి. సన్యాసులు ఎప్పుడూ రాజయోగము నేర్పించలేరు. రాజయోగమును పరమపిత పరమాత్మయే భగీరథుని ద్వారా నేర్పిస్తున్నారు. ఇటువంటి శబ్ధాలు చాలామంది వింటారు. అచ్ఛా.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఇప్పుడు ఈ నాటకము పూర్తి అవుతోంది. అందువలన ఈ పాత ప్రపంచము నుండి అతీతంగా ఉండాలి. శ్రీమతమును అనుసరించి మీ భాగ్యమును ఉన్నతంగా తయారు చేసుకోవాలి. ఎప్పుడూ ఎలాంటి వ్యతిరేక కర్మలు చేయరాదు.
2. అవినాశి జ్ఞాన రత్నాల సంపాదన చేయాలి, ఇతరులతో చేయించాలి. ఒకే తండ్రి స్మృతిలో ఉంటూ సుపుత్రులై అనేకమందికి దారి(మార్గమును) చూపాలి. 

వరదానము :- '' 'దివ్య బుద్ధి' అనే వాహనము ద్వారా మూడు లోకాలలో విహరించే జ్ఞాన స్వరూప విద్యాపతి భవ''
దివ్యబుద్ధి అనగా 'హోలీ హంస బుద్ధి'. హంస అనగా పాలను, నీటిని వేరు చేసేది. ముత్యాలను, రాళ్ళను గుర్తించి ముత్యాలను గ్రహించేది. అందువలన హోలీ హంస సంగమయుగీ జ్ఞాన స్వరూప విద్యాదేవీ సరస్వతికి వాహనము. మీరందరూ జ్ఞాన స్వరూపులే. అందువలన మీరు విద్యాపతులు లేక విద్యాదేవీలు. ఈ వాహనము దివ్యబుద్ధికి గుర్తు. ఈ దివ్యబుద్ధి అనే వాహనము ద్వారా మూడు లోకాలలో విహరిస్తారు. ఈ వాహనము అన్ని వాహనాల కంటే తీవ్ర వేగము గలది. 

స్లోగన్‌ :- '' మీ సర్వ శక్తులను ఇతర ఆత్మల కొరకు(పట్ల) విల్‌ చేయడమే సర్వ శ్రేష్ఠమైన సేవ''
 

Telugu Murli 04/01/18

04-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

''మధురమైన పిల్లలారా - గురువైన తండ్రి మీకు మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యే కళ (టెక్నిక్‌) నేర్పించారు, అలాగే మీరు శ్రీమతముననుసరించి ఇతరులను కూడా దేవతలుగా తయారు చేయు సేవ చేయండి'' 

ప్రశ్న :- ఇప్పుడు పిల్లలైన మీరు ఏ శ్రేష్ఠ కర్మ చేస్తారు? దాని రివాజు (పద్ధతి/ఆచారము) భక్తి మార్గములో కూడా కొనసాగుతూ వస్తున్నది?
జవాబు :- మీరు ఇప్పుడు శ్రీమతముననుసరించి మీ తనువు, మనస్సు, ధనాలను భారతదేశానికే కాక విశ్వమంతటి కళ్యాణము కొరకు అర్పణ చేస్తారు. ఈ పద్ధతే భక్తి మార్గములో మనుష్యులు ఈశ్వరార్థము దానము చేస్తారు. వారికి దానికి బదులు మరుసటి జన్మలో రాజ కుటుంబములో జన్మ లభిస్తుంది. పిల్లలైన మీరు సంగమ యుగములో తండ్రికి సహాయకులుగా అవుతారు. అందువలన మీరు మనుష్యుల నుండి దేవతలుగా అయిపోతారు. 

పాట :- నీవు నిదురించి రాత్రిని పోగొట్టుకున్నావు,......... (తూనే రాత్‌ గవాయి,.........)
ఓంశాంతి. తండ్రి పిల్లలకు అర్థము చేయిస్తున్నారు - తండ్రి చెప్పే విషయాలు పిల్లలు అర్థము చేసుకుంటే వారు మళ్ళీ ఇతరులకు అర్థము చేయిస్తారు. అర్థము చేసుకోకుంటే ఇతరులకు అర్థము చేయించలేరు. స్వయం అర్థము చేసుకొని ఇతరులకు అర్థము చేయించలేకపోతే కొంచెము కూడా అర్థము చేసుకోనట్లే. ఎవరైనా ఏదైనా కళను నేర్చుకుంటే వారు దానిని వ్యాపింపచేస్తారు. మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేసే కళను గురువైన తండ్రి ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. దేవతల చిత్రాలు కూడా ఉన్నాయి. మనుష్యులను దేవతలుగా తయారు చేస్తున్నారంటే ఆ దేవతలు ఇప్పుడు లేరనే కదా. దేవతల గుణాలు మహిమ చేయబడ్తాయి. సర్వ గుణ సంపన్నము..... ఇచ్చట ఉన్న మనుష్యులెవ్వరికీ ఈ గుణగానముండదు. మనుష్యులు మందిరాలకు వెళ్ళి దేవతల గుణాలను మహిమ చేస్తారు. భలే సన్యాసులు కూడా పవిత్రంగా ఉన్నారు, కాని మనుష్యులు వారిని ఇలా గుణగానము చేయరు. ఆ సన్యాసులైతే శాస్త్రాలు మొదలైనవి కూడా వినిపిస్తారు. దేవతలు ఏ శాస్త్రాలు వినిపించలేదు. వారు కేవలము ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. పూర్వ జన్మలో పురుషార్థము చేసి మనుష్యుల నుండి దేవతలుగా అయ్యారు. అందువలన సన్యాసులు మొదలైన వారెవ్వరిలోనూ దేవతల వంటి గుణాలు లేవు. గుణాలు ఎక్కడ లేవో అక్కడ తప్పనిసరిగా అవగుణాలుంటాయి. సత్యయుగములో ఇదే భారతదేశములో యథా రాజా రాణి తథా ప్రజా అందరూ సర్వగుణ సంపన్నంగా ఉండేవారు. వారిలో అన్ని గుణాలు ఉండేవి. ఆ దేవతల గుణాలే మహిమ చేయబడ్తాయి. ఆ సమయములో ఇతర ధర్మములేవీ లేవు. గుణవంతులైన దేవతలు సత్యయుగములో ఉండేవారు. గుణహీనులైన (అవగుణవంతులైన) మనుష్యులు కలియుగములో ఉన్నారు. అయితే ఇప్పుడు ఇటువంటి అవగుణాలు కలిగిన మనుష్యులను గుణవంతులైన దేవతలుగా ఎవరు తయారు చేస్తారు? మనుష్యుల నుండి దేవతలు..... అని గాయనము కూడా ఉంది. ఈ మహిమ పరమపిత పరమాత్మది. వాస్తవానికి దేవతలు కూడా మనుష్యులే, కాని వారిలో గుణాలున్నాయి. ఈ మనుష్యులలో అవగుణాలున్నాయి. గుణాల ప్రాప్తి తండ్రి నుండి జరుగుతుంది. వారిని సద్గురువు అని కూడా అంటారు. అవగుణాల ప్రాప్తి మాయా రావణుని నుండి జరుగుతుంది. ఇంత గుణవంతులు మళ్ళీ అవగుణవంతులుగా ఎలా అవుతారు? సర్వగుణ సంపన్నులుగా మళ్ళీ సర్వ అవగుణ సంపన్నులుగా ఎవరు తయారు చేస్తారు? ఈ విషయాలు పిల్లలైన మీకు తెలుసు. నిర్గుణుడైన నాలో ఏ గుణాలు లేవు అని పాట కూడా పాడ్తారు. దేవతల గుణగానము ఎంతగా చేస్తారు! ఈ సమయములో ఆ గుణాలు ఎవరికి కూడా లేవు. ఆహార పానీయాలు మొదలైనవి ఎంత మురికిగా ఉన్నాయి! దేవతలు వైష్ణవ సంప్రదాయమువారు. ఈ సమయములోని మనుష్యులు రావణ సంప్రదాయము వారు. ఆహార పానీయాలు ఎంతగా మారిపోయాయి! కేవలం దుస్తులనే చూడరాదు. ఆహార పానీయాలను వికారీతనమును చూడాలి. తండ్రి స్వయంగా చెప్తున్నారు - నేను భారతదేశములోనే రావాల్సి వస్తుంది. బ్రహ్మ ముఖవంశావళీ బ్రాహ్మణ - బ్రాహ్మణీల ద్వారా స్థాపన చేయిస్తాను. ఇది బ్రాహ్మణుల యజ్ఞము కదా. ఆ వికారీ బ్రాహ్మణులు కుఖ వంశావళివారు. మీరు ముఖవంశావళి వారు. ఇరువురికి చాలా వ్యత్యాసముంది. ఆ ధనవంతులు రచించే యజ్ఞములో దేహ సంబంధమైన బ్రాహ్మణులు ఉంటారు. వీరు అనంతమైన తండ్రి, ధనవంతులకు ధనవంతులు. రాజులకు కూడా రాజు. ధనవంతులకు ధనవంతులని ఎందుకు అంటారు? ఎందుకంటే ధనవంతులు కూడా మాకు ఈశ్వరుడు ధనమిచ్చాడని అంటారు. ఈశ్వరార్ధము దానము చేస్తే మరుసటి జన్మలో ధనవంతులుగా అవుతారు. ఈ సమయములో మీరు శివబాబాకు తనువు, మనసు, ధనములన్నింటిని అర్పణ చేస్తారు. కావున ఎంత ఉన్నతమైన పదవి పొందుకుంటారు!

మీరు శ్రీమతముననుసరించి ఇంత ఉన్నతమైన కర్మలు నేర్చుకుంటే మీకు తప్పకుండా ఫలము లభించాలి. తనువు, మనసు, ధనములను అర్పణ చేస్తారు. వారు కూడా ఈశ్వరార్థము చేస్తారు కాని ఎవరో ఒకరి ద్వారా చేస్తారు. ఈ ఆచారము భారతదేశములో మాత్రమే ఉంది. ఇప్పుడు తండ్రి మీకు చాలా మంచి కర్మలు నేర్పిస్తారు. మీరు ఈ కర్తవ్యాన్ని కేవలం భారతదేశానికేకాక ప్రపంచమంతటి కళ్యాణార్థము చేస్తారు. కావున దానికి ప్రతిఫలంగా మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే ఫలము లభిస్తుంది. ఎవరెవరు శ్రీమతముననుసరించి ఎటువంటి కర్మలు ఆచరిస్తారో అటువంటి ఫలము లభిస్తుంది. శ్రీమతముననుసరించి మనుష్యులను దేవతలుగా తయారుచేసే సేవ ఎవరు చేస్తారో నేను సాక్షిగా ఉండి చూస్తూ ఉంటాను. జీవితము ఎంతగా పరివర్తన అయిపోతుంది! శ్రీమతమును అనుసరించేవారు బ్రాహ్మణులు. తండ్రి అంటున్నారు - బ్రాహ్మణుల ద్వారా శూద్రులకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను - ఇది 5 వేల సంవత్సరముల నాటి మాట, భారతదేశములోనే దేవీ దేవతల రాజ్యము ఉండేది. చిత్రాలు చూపించాలి. చిత్రాలు లేకుంటే ఇది ఏదో కొత్త ధర్మమని బహుశా విదేశాల నుండి వచ్చిందని భావిస్తారు. చిత్రాలు చూపినందున వీరు దేవతలను అంగీకరిస్తారని అర్థము చేసుకుంటారు. శ్రీ నారాయణుని అంతిమ 84 వ జన్మలో పరమపిత పరమాత్మ ప్రవేశించి రాజయోగము నేర్పిస్తున్నారని అర్థము చేయించాలి. అప్పుడు కృష్ణుని మాట ఎగిరిపోతుంది. ఇది కృష్ణుని జన్మలోని అంతిమ సమయము. ఎవరైతే సూర్యవంశీ దేవతలుగా ఉండినారో వారందరూ వచ్చి మళ్ళీ రాజయోగాన్ని నేర్చుకోవాలి. డ్రామానుసారము పురుషార్థము కూడా తప్పకుండా చేస్తారు. పిల్లలైన మీరు ఇప్పుడు సన్ముఖములో వింటున్నారు. ఇతర పిల్లలు ఈ టేపు ద్వారా వింటారు. అప్పుడు మేము కూడా మతా-పితల జతలో మళ్ళీ దేవతలుగా అవుతున్నామని అర్థము చేసుకుంటారు. ఈ సమయములో 84వ జన్మలో పూర్తి భికారిగా తప్పనిసరిగా అవ్వాలి. ఆత్మ తన సర్వస్వాన్ని తండ్రికి సమర్పణ చేస్తుంది. ఈ శరీరమే అశ్వము. అది స్వాహా అవుతుంది. ఆత్మ స్వయం అంటున్నది - నేను తండ్రి వారినిగా అయ్యాను. తండ్రి తప్ప నాకు ఇతరులెవ్వరూ లేరు. నేను ఆత్మను ఈ శరీరము ద్వారా పరమపిత పరమాత్మ ఆదేశానుసారము సేవ చేస్తున్నాను.

తండ్రి అంటున్నారు - యోగము కూడా నేర్పండి అంతేకాక సృష్టి చక్రము ఎలా తిరుగుతోందో అది కూడా అర్థము చేయించండి. ఎవరైతే పూర్తి చక్రమంతా తిరిగి ఉంటారో, వారు ఈ విషయాలను వెంటనే అర్థము చేసుకుంటారు. ఎవరైతే ఈ చక్రములో రానివారుగా ఉంటారో వారు నిలవరు. మొత్తము సృష్టి అంతా వస్తుందని కాదు. ఇందులో కూడా ప్రజలు అనేకమంది వస్తారు. రాజా-రాణి అయితే ఒక్కరే ఉంటారు కదా. ఉదాహరణానికి లక్ష్మీ నారాయణులు ఒక్కరే గాయనము చేయబడ్తారు. సీతా-రాములు ఒక్కరే గాయనము చేయబడ్తారు, యువరాజులు, యువరాణులైతే ఇంకా వేరే వారు కూడా ఉంటారు. ముఖ్యమైనవారు ఒక్కరే ఉంటారు కదా. అందువలన ఇటువంటి రాజా-రాణిగా తయారయ్యేందుకు చాలా శ్రమ చేయాలి. సాక్షిగా ఉండి చూచుట వలన వీరు ధనవంతులైన రాజకులానికి చెందినవారా లేక పేదకులానికి చెందినవారా? అని తెలిసిపోతుంది. కొంతమంది మాయతో ఎలా ఓడిపోతారంటే ఇచ్చట నిలువక పారిపోను కూడా పారిపోతారు. మాయ ఒక్కసారిగా పచ్చిగా తిని వేస్తుంది. అందుకే బాబా రాజీగా-ఖుషీగా ఉన్నారా? అని అడుగుతారు. మాయ వేసే చంపదెబ్బతో తెలివి తప్పిపోవడమో లేక జబ్బు పడడమో లేదు కదా? కొంతమంది ఈ విధంగా జబ్బు పడ్తారు. అప్పుడు పిల్లలు వారి వద్దకు వెళ్ళి జ్ఞాన-యోగాల సంజీవినీ మూలికనిచ్చి స్పృహ తెప్పిస్తారు. జ్ఞాన-యోగాలలో ఉండని కారణంగా మాయ ఒక్కసారిగా వారి పేరు ప్రతిష్టలను సమాప్తము చేసేస్తుంది. శ్రీమతమును వదిలి మన్మతమును అనుసరిస్తారు. మాయ ఒక్కసారిగా మూర్ఛితునిగా చేసేస్తుంది. వాస్తవానికి ఈ జ్ఞానమే సంజీవిని మూలిక. దీని వలన మాయ ద్వారా ఏర్పడిన మూర్ఛ తొలగిపోతుంది. ఈ విషయాలన్నీ ఈ సమయానికి చెందినవే. సీతలు కూడా మీరే. రాముడు వచ్చి మాయా రావణుని నుండి మిమ్ములను విడిపిస్తారు. కరాచి సింధ్‌లో పిల్లలను ఎలా విడిపించారో అలా విడిపిస్తారు. అయితే రావణ జనులు మళ్ళీ దొంగలించుకొని పోయేవారు. ఇప్పుడు మళ్ళీ మాయ పంజా నుండి అందరినీ విడిపించాలి. బాబాకైతే జాలి కలుగుతుంది. మాయ చెంపదెబ్బలు కొట్టి పిల్లల బుద్ధిని ఒక్కసారిగా ఎలా త్రిప్పివేస్తుందో బాబా గమనిస్తూ ఉంటారు. రాముని నుండి బుద్ధిని మళ్ళీ రావణుని వైపుకు తిప్పేస్తుంది. ఒక ఆట బొమ్మ ఉంటుంది. ఆ ఆట బొమ్మలో ఒకవైపు రాముడు ఉంటాడు, మరొక వైపు రావణుడు ఉంటాడు. ఆశ్చర్యంగా తండ్రివారిగా అవుతారు. మళ్ళీ రావణునివారిగా అవుతారని దానినే అంటారు. మాయ చాలా శక్తివంతమైనది. ఎలుక వలె కొరికి ఆహారమును పాడు చేస్తుంది. అందువలన శ్రీమతమును ఎప్పుడూ వదలరాదు. కఠినమైన ఎక్కుడు కదా. మీ స్వంత మతము అనగా రావణుని మతము. దానిని అనుసరిస్తే చాలా గుటకలు మింగుతారు. చాలా అవమానాల పాలు చేయిస్తారు. ఇటువంటివారు అన్ని సెంటర్లలోనూ ఉన్నారు. స్వయాన్ని నష్టపరచుకుంటారు. సేవ చేసే రూపబసంత్‌లు దాగి ఉండరు. దైవీ రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఇందులో అందరూ తమ తమ పాత్ర కూడా అభినయిస్తారు. బాగా పరుగు తీస్తే తమ కళ్యాణమును చేసుకుంటారు. కళ్యాణము కూడా ఒక్కసారిగా స్వర్గానికి యజమానులుగా చేస్తుంది. తల్లిదండ్రులు సింహాసనాధికారులు అవుతే పిల్లలు కూడా అలాగే అవ్వాలి. తండ్రిని అనుసరించాలి. లేకుంటే మీ పదవిని మీరే తక్కువ చేసుకుంటారు. ఈ చిత్రాలను ఊరకే ఉంచుకొనుటకై తయారుచేయలేదు. వీటి ద్వారా చాలా సర్వీసు చేయాలి. గొప్ప-గొప్ప ధనవంతులు లక్ష్మీనారాయణుల మందిరాన్ని కట్టిస్తారు. కాని ఆ లక్ష్మీనారాయణులు ఎప్పుడు వచ్చారో వారు భారతదేశాన్ని సుఖవంతముగా ఎలా తయారుచేశారో ఎవ్వరికీ తెలియదు. సుఖవంతముగా చేసినందునే అందరూ వారిని స్మృతి చేస్తారు. ఒక్క దిల్‌వాలా మందిరము మాత్రమే ఉండాలని మీకు తెలుసు. ఇది ఒక్కటి ఉంటే చాలు. లక్ష్మీనారాయణుల మందిరము వలన కూడా ఏమి జరుగుతుంది? అదేమీ కళ్యాణకారి కాదు. శివుని మందిరాన్ని నిర్మిస్తారు. అది కూడా అర్థ రహితంగా నిర్మిస్తారు. వారి కర్తవ్యము గురించి అయితే తెలియనే తెలియదు. మందిరాన్ని నిర్మించి కర్తవ్యము గురించి తెలియకుంటే ఏమంటారు? దేవతలు స్వర్గములో ఉన్నప్పుడు మందిరాలు ఉండవు. మందిరాలను కట్టించిన వారిని ఈ లక్ష్మీనారాయణులు ఎప్పుడు వచ్చి వచ్చారు? వారు ఏ సుఖమునిచ్చారు? అని అడగాలి. కొద్దిగా కూడా తెలుపలేరు. దీని వలన ఎవరిలో అవగుణాలు ఉంటాయో వారు గుణవంతుల మందిరాలను కట్టిస్తారని ఋజువు అవుతుంది. అందువలన సర్వీసు చేయాలనే ఆసక్తి పిల్లలకు చాలా ఉండాలి. బాబాకు సేవ చేయాలని ఆసక్తి చాలా ఉంది. అందుకే ఇటువంటి చిత్రాలను తయారు చేయిస్తారు. భలే చిత్రాలను తయారు చేయించేది శివబాబాయే కాని బుద్ధి ఇరువురిదీ నడుస్తుంది. అచ్ఛా.

రాత్రి క్లాసు - 28-6-68 :- ఇక్కడ అందరూ కూర్చుని ఉన్నారు. మనము ఆత్మలమని, మన తండ్రి కూర్చుని ఉన్నారని అర్థము చేసుకున్నారు. దీనిని ఆత్మాభిమానులై కూర్చోవడమని అంటారు. అందరూ మనము ఆత్మలమని, బాబా ముందు కూర్చుని ఉన్నామని అందరూ భావించరు. ఇప్పుడు బాబా స్మృతినిప్పించారు కనుక స్మృతి వస్తుంది. గమనము(అటెన్షన్‌) ఇస్తారు. బుద్ధి బయటకు పరిగెత్తే వారు చాలామంది ఉన్నారు. ఇక్కడ కూర్చుని ఉన్నా చెవులు మూయబడి ఉన్నట్లు ఉంటారు. బుద్ధి బయట ఎక్కడెక్కడికో పరుగెత్తుతూ ఉంటుంది. ఏ పిల్లలైతే తండ్రి స్మృతిలో కూర్చుని ఉన్నారో వారు సంపాదన చేసుకుంటున్నారు. చాలామంది బుద్ధియోగము బయట ఉంటుంది. వారు యాత్ర చేయనట్లే. వారి సమయము వృథా అవుతుంది. తండ్రిని చూచినా బాబా గుర్తుకొస్తారు. నంబరువారు పురుషార్థానుసారము ఉండనే ఉన్నారు. మేము ఆత్మలము, శరీరము కాదు అని కొంతమందికి పక్కాగా అలవాటైపోయింది. తండ్రి జ్ఞానసాగరులు కనుక పిల్లలకు కూడా జ్ఞానము వచ్చేస్తుంది. ఇప్పుడు వాపస్‌(తిరిగి) వెళ్లాలి. చక్రము పూర్తి అవుతుంది. ఇప్పుడు పురుషార్థము చేయాలి. చాలా సమయము గడిచిపోయింది. కొంతమాత్రము మిగిలి ఉంది. పరీక్షల సమయములో కూడా చాలా పురుషార్థము చేయడం ప్రారంభిస్తారు. పురుషార్థము చేయకుంటే ఉత్తీర్ణులు కాలేమని అర్థము చేసుకుంటారు. పదవి కూడా చాలా తగ్గిపోతుంది. పిల్లల పురుషార్థమైతే నడుస్తూనే ఉంటుంది. దేహాభిమానము వలన వికర్మలు జరుగుతాయి. ఇందుకు నూరు రెట్లు శిక్ష పడ్తుంది. ఎందుకంటే నన్ను నిందింపజేస్తారు. తండ్రిని అవమానము పాలు చేసే పనులు చేయరాదు. అందువలన సద్గురువు నిందకులకు స్థానము లేదని గాయనముంది. స్థానము అనగా స్వర్గ సామ్రాజ్యము. చదివించేవారు కూడా తండ్రియే ఏ సత్సంగములోనూ లక్ష్యము లేదు. ఇది మన రాజయోగము. మేము రాజయోగమును నేర్పిస్తామని ఇతరులెవ్వరూ చెప్పలేరు. వారు శాంతిలోనే సుఖముందని భావిస్తారు. అక్కడ సుఖము, దు:ఖముల మాటే లేదు. శాంతియే శాంతి ఉంటుంది. అప్పుడు వీరి అదృష్టములో లేదని భావించబడ్తుంది. మొదట పాత్ర చేసేవారి భాగ్యము చాలా శ్రేష్ఠమైనది. అక్కడ వారికి ఈ జ్ఞానము ఉండదు. అక్కడ సంకల్పము కూడా ఉండదు. మనమంతా అవతరిస్తామని పిల్లలకు తెలుసు. భిన్న భిన్న నామ-రూపాలలో వస్తారు. ఇది డ్రామా కదా. ఆత్మలమైన మనము శరీరాన్ని ధరించి ఇక్కడ పాత్రను అభినయిస్తాము. ఈ రహస్యమంతా తండ్రి కూర్చుని అర్థము చేయిస్తారు. పిల్లలైన మీకు అతీంద్రియ సుఖముంటుంది. మీ ఆంతరికములో సంతోషముంటుంది. వీరు దేహీ-అభిమానులు అని అంటారు. మీరు విద్యార్థులని తండ్రి అర్థము చేయిస్తారు. మనము దేవతలుగా, స్వర్గానికి అధికారులుగా అవుతామని కూడా మీకు తెలుసు. కేవలం దేవతలే కాదు. మనము విశ్వానికి యజమానులుగా అయ్యేవారము. కర్మాతీత అవస్థ వచ్చినప్పుడు ఈ స్థితి స్థిరంగా ఉంటుంది. డ్రామా ప్లాను అనుసారము తప్పకుండా అవ్వాల్సిందే. మనము ఈశ్వరీయ పరివారములో ఉన్నామని మీరకు అర్థము చేసుకున్నారు. తప్పనిసరిగా స్వర్గములో చక్రవర్తి పదవి లభిస్తుంది. ఎవరు ఎక్కువగా సేవ చేస్తారో చాలామందికి కళ్యాణము చేస్తారో, వారికి ఉన్నతపదవి తప్పకుండా లభిస్తుంది. ఇక్కడ యోగములో బాగా కూర్చోగలరని బాబా తెలిపించారు. బయట సెంటర్లో ఇలా జరగదు. నాలుగు గంటలకు వచ్చి యోగములో కూర్చోవడం అక్కడ ఎలా జరుగుతుంది? జరగదు. సెంటర్లో ఉన్నవారు భలే కూర్చున్నా బయటవారికి పొరపాటుగా కూడా చెప్పరాదు. సమయము అలా లేదు. అది ఇక్కడ బాగుంది. ఇంట్లోనే కూర్చొని ఉన్నాము. అక్కడైతే బయట నుండి రావలసి వస్తుంది. ఇది కేవలం ఇక్కడి వారి కొరకే. బుద్ధిలో జ్ఞాన ధారణ జరగాలి. మనము ఆత్మలము. ఇది వారి అకాల సింహాసనము అలవాటు పడాలి. మనమంతా సోదరులము. సోదరునితో మనము మాట్లాడ్తాము. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమైపోతాయి. అచ్ఛా.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. 

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. జ్ఞాన-యోగాల సంజీవిని మూలికతో స్వయాన్ని మాయ కలిగించే మూర్ఛ నుండి రక్షించుకుంటూ ఉండాలి. ఎప్పుడూ మన్మతము పై నడవరాదు.
2. రూప్‌బసంత్‌(జ్ఞాన-యోగులు)లై సేవ చేయాలి. మాతా-పితలను అనుసరించి సింహాసనాధికారులుగా అవ్వాలి. 

వరదానము :- ''దివ్య బుద్ధి మరియు ఆత్మిక దృష్టి యొక్క వరదానము ద్వారా ఒకటవ నంబరు తీసుకునే శ్రేష్ఠ పురుషార్థీ భవ''
ప్రతి బ్రాహ్మణ పుత్రునికి దివ్య బుద్ధి మరియు ఆత్మిక దృష్టి యొక్క వరదానము దివ్య జన్మతోనే ప్రాప్తిస్తాయి. ఈ వరదానమే బ్రాహ్మణ జీవితానికి పునాది. ఈ రెండు మాటల ఆధారముతో సంగమయుగీ పురుషార్థుల నంబరు తయారవుతుంది. వీరి ప్రతి సంకల్పము, మాట మరియు కర్మలో ఎవరు ఎంత ఉపయోగిస్తారో అంత ముందు నంబరు తీసుకుంటారు. ఆత్మిక దృష్టితో వృత్తి మరియు కృతి స్వతహాగానే మారిపోతాయి. దివ్యబుద్ధి ద్వారా యథార్థమైన నిర్ణయం చేసినందున స్వయం సేవ, సంబంధ-సంపర్కాలు యధార్థంగా శక్తిశాలిగా అయిపోతాయి. 

స్లోగన్‌ :- ''సంకల్పము, మాట మరియు కర్మలో పవిత్రత ధారణ ఉన్నట్లయితే, రూపురేఖలలో మెరుపు వస్తుంది''
 

Telugu Murli 03/01/18

03-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

''మధురమైన పిల్లలారా - బుద్ధియోగాన్ని తండ్రితో జోడిస్తూ ఉంటే, సుదీర్ఘమైన ఈ యాత్రను సహజంగా దాటుకుంటారు'' 

ప్రశ్న :- తండ్రి పై బలిహారమయ్యేందుకు ఏ విషయాన్ని త్యాగము చేయడం అవసరము?
జవాబు :- దేహాభిమానము. దేహాభిమానము వచ్చిందంటే మరణిస్తారు(చదువును వదిలేస్తారు), వ్యభిచారులుగా అవుతారు. అందుకే బలిహారమవ్వడంలో పిల్లల హృదయము విదీర్ణమౌతుంది (దు:ఖము కలుగుతుంది). బలిహారమైన తర్వాత ఆ ఒక్కరి స్మృతే ఉండాలి. వారి పైనే బలిహారమవ్వాలి. వారి శ్రీమతమునే అనుసరించాలి.
పాట :- ఓ రాత్రి ప్రయాణికుడా! అలసిపోకు,........... ( రాత్‌ కే రాహీ!.............. )   ఓంశాంతి. భగవానువాచ - భగవంతుడు తమ పిల్లలకు రాజయోగాన్ని, జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు. భగవంతుడు మనిషి కాదు. గీతలో కృష్ణ భగవానువాచ అని వ్రాయబడి ఉంది. ఇప్పుడు శ్రీ కృష్ణుడు మొత్తం ప్రపంచమంతటినీ మాయ నుండి విముక్తులుగా చేయడం సంభవం కాదు. ఎవరైతే తండ్రిని తమవారిగా చేసుకున్నారో, తండ్రి సన్ముఖములో కూర్చొని ఉన్నారో ఆ పిల్లలకే తండ్రే స్వయంగా వచ్చి అర్థము చేయిస్తున్నారు. కృష్ణుని తండ్రి అని అనేందుకు వీలు లేదు. తండ్రిని పరమపిత పరంధామ నివాసి అని అంటారు. ఆత్మ ఈ శరీరము ద్వారా భగవంతుని స్మృతి చేస్తుంది. తండ్రి కూర్చొని అర్థము చేయిస్తున్నారు - నేను మీ తండ్రిని, పరంధామ నివాసిని. నేను సర్వాత్మలకు తండ్రిని. కల్పక్రితము కూడా నేనే వచ్చి మీ బుద్ధియోగమును పరమపిత అయిన నాతో జోడించమని పిల్లలకు నేర్పించాను. ఆత్మలతో మాట్లాడటం జరుగుతుంది. ఆత్మ ఎంతవరకు శరీరములోకి రాదో అంతవరకు కనుల ద్వారా చూడలేదు. చెవుల ద్వారా వినలేదు. ఆత్మ లేకుంటే శరీరము జడమైపోతుంది. ఆత్మ చైతన్యమైనది. గర్భములో శిశువు ఉంటుంది. కాని ఎంతవరకు అందులో ఆత్మ ప్రవేశించదో అంతవరకు వానిలో కదలిక ఉండదు. కావున ఇటువంటి చైతన్య ఆత్మలతో తండ్రి మాట్లాడ్తారు. నేను ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నానని తండ్రి అంటున్నారు. నేను వచ్చి ఆత్మలందరినీ వాపస్‌ తీసుకెళ్తాను. మళ్ళీ ఏ ఆత్మలైతే నా సన్ముఖములో ఉంటాయో వారికి రాజయోగము నేర్పిస్తాను. రాజయోగాన్ని మొత్తము ప్రపంచమంతా నేర్చుకోదు. కల్పక్రితము వారే రాజయోగమును నేర్చుకుంటున్నారని తండ్రి తెలియజేస్తున్నారు.

బుద్ధియోగాన్ని చివరి వరకు తండ్రితో జోడిస్తూ ఉండాలి. ఇందులో ఆగిపోరాదని ఇప్పుడు బాబా అర్థము చేయిస్తున్నారు. స్త్రీ - పురుషులు వివాహము కాక ముందు ఒకరికొకరు తెలియనివారిగా ఉంటారు. ఇద్దరి నిశ్చితార్థము(వివాహము) జరిగిన తర్వాత కొందరు 60 - 70 సంవత్సరాలు కూడా కలిసి ఉంటారు. కావున జీవితమంతా ఒకరి దేహాన్ని ఒకరు తల్చుకుంటూ ఉంటారు. ఆమె ఇతడు నా పతి అని అంటుంది. అతడు ఈమె నా పత్ని అని అంటాడు. ఇప్పుడు మీ నిశ్చితార్థము నిరాకారునితో జరిగింది. నిరాకార తండ్రియే స్వయంగా వచ్చి నిశ్చితార్థము చేయించారు. కల్పక్రితము వలె పిల్లలైన మీ నిశ్చితార్థము నాతో చేయిస్తానని అంటున్నారు. నిరాకారుడినైన నేను ఈ మానవ సృష్టికి బీజ రూపుడను. ఈ మానవ సృష్టిని గాడ్‌ఫాదర్‌ రచించాడని అందరూ అంటారు. అందువలన మీ తండ్రి సదా పరంధామములో ఉంటారు. ఇప్పుడు నన్ను స్మృతి చేయండి అని వారు చెప్తున్నారు. యాత్ర చాలా సుదీర్ఘమైనందున చాలామంది పిల్లలు అలసిపోతారు. బుద్ధియోగాన్ని పూర్తిగా జోడించలేరు. మాయతో చాలా దెబ్బలు తినడం వలన అలసిపోతారు, ఒక్కొక్కసారి మరణిస్తారు కూడా(చదువును వదిలేస్తారు). తర్వాత బాబా చేతిని వదిలేస్తారు. కల్పక్రితము కూడా ఇలాగే జరిగింది. ఎంతవరకు జీవించి ఉంటారో అంతవరకు స్మృతి చేయాలి. పతి మరణించినా స్త్రీ స్మృతి చేస్తూ ఉంటుంది. ఈ తండ్రి లేక పతి అలా వదలిపెట్టి వెళ్ళేవాడు కాదు. వారంటున్నారు - నేను ప్రేయసులైన మిమ్ములను నా వెంట తీసుకెళ్తాను. అయితే ఇందులో సమయము పడ్తుంది, అలసిపోరాదు. తల పై పాప భారము చాలా ఉంది. ఆ భారము యోగములో ఉండడం వల్లనే దిగిపోతుంది. చివరిలో తండ్రి లేక ప్రియుడు తప్ప ఇతరులెవరూ స్మృతిలోకి రాని విధంగా యోగముండాలి. ఒకవేళ ఇతరులెవరైనా గుర్తుకు వస్తే అది వ్యభిచారి స్మృతి అయిపోతుంది. తర్వాత పాపాలకు దండన భోగించవలసి ఉంటుంది. అందువలన తండ్రి అంటున్నారు - పరంధామ యాత్ర చేయు ప్రయాణికుడా! అలసిపోండి.

నేను బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మమును స్థాపన చేస్తున్నానని, శంకరుని ద్వారా అన్ని ధర్మాలను వినాశనము చేయిస్తానని మీకు తెలుసు. ఇప్పుడు సమావేశాలు జరుపుతూ ఉంటారు. అందులో అన్ని ధర్మాలు కలిసి ఒకే మతముగా ఎలా అవ్వాలి, అందరూ శాంతిగా ఎలా ఉండాలి అని దారి వెతుకుతారు. ఇప్పుడు అనేక ధర్మాలు కలిసి ఒకే మతముగా అవ్వలేవు. ఏకమతము వలన ఏక ధర్మ స్థాపన జరుగుతుంది. అన్ని ధర్మాలు సర్వ గుణ సంపన్నంగా, సంపూర్ణ నిర్వికారిగా అయినప్పుడు పరస్పరము పాలు-పంచదార వలె అవ్వగలరు. రామరాజ్యములో అందరూ క్షీర ఖండము (చెక్కెర-పాలు) వలె ఉండేవారు. జంతువులు కూడా పోట్లాడుకునేవి కావు. ఇచ్చట అయితే ఇంటి ఇంటిలో గొడవలు ఉన్నాయి. ఎప్పుడైతే వారికి దిక్కులేక నాథుడు ఎవ్వరూ ఉండరో అప్పుడు పోట్లాడుకుంటూ ఉంటారు. వారికి తమ తల్లిదండ్రులను గురించి తెలియదు. నీవే తల్లివి - తండ్రివి, మేము మీ పిల్లలము..... మీ కృప వలన అపారమైన సుఖము...... అని పాడుతూ కూడా ఉంటారు. అపారమైన సుఖమైతే ఇప్పుడు లేనే లేదు. కావున మాతా-పితల కృప లేదని అంటారు. తండ్రిని గురించి తెలియనే తెలియదు. అలాంటప్పుడు తండ్రి వారి పై కృపను ఎలా చూపుతారు? మళ్ళీ టీచరు ఆదేశానుసారము నడుచుకున్నప్పుడు కృప లభిస్తుంది. వారేమో సర్వవ్యాపి అని అనేస్తారు. అయితే ఎవరు కృప చూపాలి? ఎవరి పై కృప చూపించాలి? కృపను పొందేవారు, కృపను చూపేవారు ఇరువురూ కావాలి. విద్యార్థులు మొదట టీచరు వద్దకు వచ్చి చదువుకోవాలి. ఈ చదువుకునే కృపను తమ పై తాము చూపుకోవాలి. తర్వాత టీచరు ఆదేశానుసారము నడుచుకోవాలి. పురుషార్థము చేయించేవారు కూడా కావాలి. వీరు తండ్రే కాక టీచరు, సద్గురువు కూడా అయ్యారు. వారిని పరమపిత, పరమ శిక్షకుడు, పరమ సద్గురువు అని కూడా అంటారు. తండ్రి అంటున్నారు - నేను కల్ప కల్పము వచ్చి ఈ స్థాపనా కార్యమును చేయిస్తాను. పతిత ప్రపంచాన్ని పావన ప్రపంచంగా తయారు చేస్తాను. వారు వరల్డ్‌ ఆల్‌మైటీ అథారిటీ(సర్వశక్తివంతులు) కదా. అందువలన వరల్డ్‌ అథారిటీ రాజ్యాన్ని స్థిరముగా స్థాపన చేస్తారు. మొత్తము సృష్టి పై ఒకే లక్ష్మీనారాయణుల రాజ్యము ఉండేది. వారిది సర్వ శక్తివంతమైన రాజ్యముగా ఉండేది. అచ్చట ఏ యుద్ధాలు, జగడాలు జరిగేవి కావు. అచ్చట మాయ ఉండనే ఉండదు. అది బంగారు యుగము, వెండి యుగము, సత్య-త్రేతా యుగాలు రెండింటిని స్వర్గము లేక వైకుంఠము అని అంటారు. అందరూ కూడా పాడ్తారు. బృందావనానికి పదండి. రాధా-గోవిందులను భజించండి......... అని పాటలు కూడా పాడ్తారు. కాని అచ్చటకు ఎవ్వరూ వెళ్లలేరు. కేవలం స్మృతి మాత్రము తప్పకుండా చేస్తారు. ఇప్పుడిది మాయావి రాజ్యము. అందరూ రావణుని మతమును అనుసరిస్తున్నారు. పైకి చూచేందుకు అయితే మనుష్యులు చాలా గొప్పవారిగా, మంచివారిగా కనిపిస్తారు. పెద్ద పెద్ద బిరుదులు లభిస్తాయి. కొంత దేహ సంబంధమైన ధైర్యాన్ని చూపుతారు లేక మంచి కర్మలు ఏవైనా చేస్తారు. దాని వలన వారికి బిరుదులు లభిస్తాయి. కొందరికి డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫి. కొందరికి ఇంకేమో......... రకరకాల బిరుదులు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా ఉన్నారు. ఖచ్చితంగా భారతదేశము సేవలో ఉన్నారు. మీరు దైవీ రాజధానిని స్థాపన చేస్తున్నారు. స్థాపన ఎప్పుడు పూర్తి అవుతుందో, అప్పుడు మీకు బిరుదులు లభిస్తాయి. సూర్యవంశీ రాజా-రాణి, చంద్రవంశీ రాజా-రాణి,....... అను బిరుదులు లభిస్తాయి. మళ్ళీ మీ రాజ్యము నడుస్తుంది. అచ్చట ఎవ్వరికీ బిరుదులు లభించవు. ఎందుకంటే అచ్చట ఎవరి దు:ఖమునైనా దూరము చేసేందుకు లేక సాహసము చూపించి బిరుదులు తీసుకునేందుకు అచ్చట దు:ఖమనే మాటే ఉండదు. ఇచ్చట ఉండే ఆచార-వ్యవహారాలు అచ్చట ఉండవు. లక్ష్మీనారాయణులు ఈ పతిత ప్రపంచములోనికి రాజాలరు. ఈ సమయములో ఒక్కరు కూడా పావన దేవతలు లేరు. ఇది పతిత ఆసురీ ప్రపంచము, అనేక మతమతాంతరాలలో తికమక చెంది ఉన్నారు. ఇచ్చట అయితే ఒకే ఒక శ్రీమతముంది, దాని ద్వారా రాజధాని స్థాపన అవుతూ ఉన్నది. అయితే నడుస్తూ-నడుస్తూ ఎవరికైనా మాయ యొక్క ముల్లు గ్రుచ్ఛుకుంటుంది. అప్పుడు కుంటుతూ నడుస్తూ ఉంటారు. అందువలన తండ్రి అంటున్నారు - సదా శ్రీమతమును అనుసరించండి. మీ స్వంత మతము పై నడిస్తే మోసపోతారు. సత్యమైన తండ్రి మతమును అనుసరిస్తే సత్యమైన సంపాదన జరుగుతుంది. మీ మతము పై నడుచుకుంటే నావ మునిగిపోతుంది. ఎంతోమంది మహావీరులు శ్రీమతమును అనుసరించని కారణంగా అధోగతి పాలయ్యారు.

ఇప్పుడు పిల్లలైన మీరు సద్గతిని పొందాలి. శ్రీమతమును అనుసరించక దుర్గతిని పొందితే తర్వాత ఎంతగానో పశ్చాత్తాప పడవలసి వస్తుంది. మళ్ళీ ధర్మరాజుపురములో శివబాబా ఈ శరీరములో కూర్చొని నేను మీకు అంతగా అర్థము చేయించాను. ప్రతి రోజూ చదివించాను. ఎంతగా కష్టపడ్డాను! శ్రీమతమును అనుసరిస్తామని నిశ్చయ పత్రము కూడా వ్రాసి ఇచ్చారు. కాని అలా నడుచుకోలేదని సాక్షాత్కారము చేయిస్తారు. శ్రీమతమును ఎప్పుడూ వదిలి పెట్టరాదు. ఏమి జరిగినా తండ్రికి తెలుపుట వలన మమ్ములను అప్రమత్తం చేయడం జరుగుతుంది. బాబాను ఎప్పుడు మర్చిపోతారో అప్పుడు ముల్లు గుచ్ఛుకుంటుంది. పిల్లలు సద్గతినిచ్చే తండ్రి నుండి కూడా మూడు కోసుల దూరము పారిపోతారు. బాబా మీ పై బలిహారమవుతాను. సమర్పణ అవుతానని పాడ్తారు కూడా. కాని ఎవరి పై ? సన్యాసుల పై బలిహారమౌతాము లేక బ్రహ్మ, విష్ణు, శంకరుల పై బలిహారమౌతాము లేక కృష్ణుని పై బలిహారమౌతాము అని వ్రాయలేదు కదా. పరమపిత పరమాత్మ పైననే బలిహారమవ్వాలి. ఏ ఇతర మనుష్యుల పైన కాదు. వారసత్వము లభించేది తండ్రి నుండి మాత్రమే. తండ్రి పిల్లల పై బలిహారమౌతారు. ఈ అనంతమైన తండ్రి కూడా అంటున్నారు - నేను బలిహారమయ్యేందుకు వచ్చాను. కానీ తండ్రి పై బలిహారమయ్యేందుకు పిల్లల హృదయము ఎంతో విలవిలలాడి(విదీర్ణము) పోతుంది. దేహాభిమానములోకి వచ్చారంటే మరణిస్తారు. వ్యభిచారిగా అవుతారు. ఆ ఒక్కరి స్మృతి మాత్రమే ఉండాలి. వారి పై బలిహారమవ్వాలి. ఇప్పుడు నాటకము పూర్తి అవుతుంది. మనము వాపసు వెళ్ళాలి. మిగిలిన బంధు-మిత్రులు మొదలైన వారందరూ శ్మశానగ్రస్థులుగా అవుతారు. అటువంటివారిని ఏమి స్మృతి చేస్తాము? ఇందుకై చాలా అభ్యాసము చేయాలి. గాయనము కూడా ఉంది. పైకి ఎక్కితే అమృత రసము త్రాగుతారు..... జోరుగా క్రింద పడితే పదవి పోగొట్టుకుంటారు. అయితే స్వర్గములోకి రారని కాదు. వస్తారు కాని రాజు-రాణిగా అవ్వడంలో, ప్రజలుగా అవ్వడంలో తేడా ఉంది కదా. ఇచ్చట ఆటవికులను చూడండి. మినిస్టరును చూడండి. తేడా ఉంది కదా. అందువలన పురుషార్థము పూర్తిగా చేయాలి. ఎవరైనా క్రింద పడినారంటే పూర్తిగా పతితులైపోతారు. శ్రీమతమును అనుసరించ లేకుంటే, మాయ ముక్కుతో పట్టుకుని పూర్తిగా మురికి కాలువలో పడేస్తుంది. బాప్‌దాదావారిగా తయారైన తర్వాత ద్రోహిగా అవ్వడం అనగా బాప్‌దాదాను ఎదిరించడం అవుతుంది. అందువలన తండ్రి అంటున్నారు - ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. ఇప్పుడు మాయ అంతమవ్వనుంది. అందువలన చాలామందిని క్రింద పడేస్తుంది. అందువలన పిల్లలు చాలా హెచ్చరికగా, అప్రమత్తంగా ఉండాలి. దారి కొద్దిగా పొడవైనది. పదవి కూడా చాలా గొప్పది. ద్రోహిగా తయారయ్యారంటే శిక్షలు కూడా చాలా భారీగా ఉంటాయి. ధర్మరాజు అయిన బాబా శిక్షించునప్పుడు ఎంతగానో ఆర్తనాదాలు చేస్తారు. ఆ శిక్షలు కల్ప-కల్పానికి స్థిరమైపోతాయి. మాయ చాలా ప్రబలమైనది. తండ్రిని ఏ కొద్దిగా అగౌరవపరచినా మరణిస్తారు. సద్గురువు నిందకులకు స్వర్గములో స్థానము దొరకదు అని గాయనము చేయబడి ఉంది. కామానికి వశమై, క్రోధానికి వశమై వ్యతిరేక కర్మలు చేస్తారు. అనగా తండ్రిని నిందలపాలు చేస్తారు. దండనకు నిమిత్తముగా శిక్షకు అర్హులుగా అవుతారు. అడుగడుగునా పదమాల సంపాదన ఉన్నప్పుడు పదమాల నష్టము కూడా ఉంది. సేవలో జమ అవుతే వ్యతిరేక కర్మల ద్వారా ఆ జమ అంతా శూన్యమైపోతుంది. బాబా వద్ద పూర్తి లెక్కాచారమంతా ఉంది. ఇప్పుడు సన్ముఖములో చదివిస్తున్నారంటే లెక్కాచారమంతా వారి అరచేతిలో ఉన్నట్లే. శివబాబాను అగౌరపరచకండి. అలా చేస్తే చాలా వికర్మలు తయారౌతాయని తండ్రి చెప్తున్నారు. యజ్ఞ సేవలో ఎముకలను సహితము ఇవ్వవలసి వస్తుంది. దధీచి ఋషి ఉదాహరణ ఉంది కదా. వారికి కూడా పదవి లభిస్తుంది. లేకపోతే ప్రజలలో కూడా భిన్న-భిన్న పదవులు ఉన్నాయి. ప్రజలలో కూడా నౌకర్లు, చాకర్లు మొదలైనవారందరూ కావాలి. భలే అచ్చట దు:ఖముండదు కాని పదవులైతే నెంబరువారుగా ఉంటాయి. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. 

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. స్మృతి యాత్రలో అలసిపోరాదు. చివరి సమయములో తండ్రి తప్ప ఇతరులెవ్వరూ గుర్తు రానంత సత్యమైన స్మృతి చేయు అభ్యాసము చేయాలి.
2. సత్యమైన తండ్రి మతము పై నడుస్తూ సత్యమైన సంపాదన చేయాలి. మీ స్వంత మతము పై (మన్మతము) నడవరాదు. సద్గురువును ఎప్పుడూ నిందలపాలు చేయరాదు. కామ-క్రోధాలకు వశమై ఏ వ్యతిరేక కర్మలూ చేయరాదు. 

వరదానము :- ''స్వయాన్ని అవతరించిన అవతారమని భావించి సదా ఉన్నతమైన స్థితిలో ఉండే అర్శ్‌(ఆకాశము లేక సూక్ష్మలోక) నివాసీ ఫరిస్తా భవ''
ఎలాగైతే తండ్రి అవతరించారో, అలా శ్రేష్ఠ ఆత్మలైన మీరు కూడా పై నుండి (మూలవతనం) క్రిందకు సందేశమునిచ్చేందుకు అవతరించారు, సూక్ష్మలోకము లేక మూలవతన నివాసులు. దేహ-భావమనే పృథ్వి పై మీ బుద్ధి రూపీ పాదము పడజాలదు. అందువలన ఫరిస్తాల పాదము సదా ఫర్శ్‌(భూమి, నేల)కు పైననే చూపిస్తారు. కనుక మీరంతా ఉన్నతమైన స్థితిలో స్థితమై ఉండే అర్శ్‌ నివాస్‌గా ఉండి అవతరించిన అవతారము - ఇదే స్మృతిలో ఎగిరే కళలో ఎగురుతూ ఉండండి. 

స్లోగన్‌ :- ''స్వ పరివర్తన చేసుకునే తీవ్ర పురుషార్థీ పిల్లలకే తండ్రి నుండి ఆశీర్వాదాల శుభాకాంక్షలు లభిస్తాయి''
 

Telugu Murli 02/01/18

02-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

''మధురమైన పిల్లలారా - ఇది మీ మరజీవా జన్మ. మీరు తండ్రి అయిన ఈశ్వరుని నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. మీకు చాలా పెద్ద లాటరీ లభించింది. కావున మీరు అపారమైన ఖుషీలో ఉండాలి'' 

ప్రశ్న :- మీకు మీరు ఏ జ్ఞానాన్ని స్వీకరిస్తే(అర్థం చేసుకుంటే) చింతలు సమాప్తమైపోతాయి? కోపము తొలగిపోతుంది?
జవాబు :- నేను ఈశ్వరుని సంతానాన్ని. నేను తండ్రి సమానము మధురంగా అవ్వాలి. ఎలాగైతే తండ్రి మధురంగా అర్థము చేయిస్తారో, కోపగించుకోరో అలా మనం కూడా పరస్పరం మధురంగా ఉండాలి. ఉప్పు నీరులా అవ్వరాదు. ఎందుకంటే జరిగిపోయిన ప్రతి క్షణము డ్రామాలో పాత్రగా ఉండదని తెలుసు. కావున ఇక ఏ విషయము గురించి చింతించాలి? ఈ విధంగా మీకు మీరు అర్థము చేయించుకుంటే, జ్ఞానము తెలుపుకుంటే చింతలు సమాప్తమైపోతాయి. కోపము పారిపోతుంది.

పాట :- ఇదే వసంతఋతువు...... (యహీ బహార్‌ హై..........)
ఓంశాంతి. ఇది ఈశ్వరీయ సంతానము అనుభవించు ఖుషీల గాయనము(పాట). మీరు ఇంతటి సంతోషపు గాయనము సత్యయుగములో చేయలేరు. ఇప్పుడు మీకు ఖజానా లభిస్తోంది. ఇది అన్నిటికంటే పెద్ద లాటరీ. లాటరీ లభించినప్పుడు సంతోషము కలుగుతుంది. ఈ లాటరీ ద్వారా మీరు జన్మ-జన్మాంతరాలు స్వర్గములో సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇది మీ మరజీవా జన్మ. ఎవరైతే జీవించి ఉండి మరణించరో వారిది 'మరజీవా జన్మ' అని అనరు. వారికి అపారమైన సంతోషము కూడా కలగదు. ఎంతవరకు మరజీవాగా అవ్వరో అనగా తండ్రిని తమవారిగా చేసుకోలేదో అంతవరకు సంపూర్ణ వారసత్వము కూడా లభించజాలదు. ఎవరైతే తండ్రివారిగా అవుతారో, ఎవరైతే తండ్రిని స్మృతి చేస్తారో వారిని తండ్రి కూడా స్మృతి చేస్తారు. మీరు ఈశ్వరీయ సంతానము. మేము ఈశ్వరుడైన తండ్రి నుండి వారసత్వము లేక వరము తీసుకుంటున్నామనే నషా మీకు ఉంది. 'ఎవరి కొరకు భక్తులు భక్తిమార్గములో ఎదురుదెబ్బలు తింటూ ఉంటారో దానిని పొందుకున్నాము' అనే నషా మీకు ఉంది. తండ్రిని కలుసుకునేందుకు అనేక రకాలైన ఉపాయాలు చేస్తూ ఉంటారు. ఎన్నో వేద శాస్త్రాలు, మ్యాగజైనులు మొదలైనవెన్నో చదువుతూ ఉంటారు. కాని ప్రపంచమేమో రోజురోజుకు దు:ఖితంగానే అవుతూ ఉంటుంది. ఇది తమోప్రధానంగా అవ్వవలసిందే. ఇది ముళ్ల వృక్షము కదా. బబుల్‌నాథుడు మళ్లీ వచ్చి ముళ్ళను పుష్పాలుగా చేస్తారు. ముళ్ళు చాలా పెద్ద పెద్దవిగా అయిపోయాయి. చాలా జోరుగా గుచ్చుకుంటాయి. వాటికి అనేక ప్రకారాల పేర్లు ఇచ్చారు. సత్యయుగములో ముళ్ళు ఉండనే ఉండవు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇది ముళ్ళ ప్రపంచము. ఒకరికొకరు దు:ఖము కలిగించుకుంటూ ఉంటారు. ఇంటిలో పిల్లలు కూడా ఎటువంటి కుపుత్రులుగా అవుతారంటే వర్ణించలేము(చెప్పలేము). తల్లిదండ్రులను చాలా దు:ఖితులుగా చేస్తారు. అందరూ ఒకే విధంగా కూడా ఉండరు. అందరికంటే వక్కువ దు:ఖమిచ్చేవారు ఎవరో మనుష్యులకు తెలియదు. ఈ గురువులు పరమాత్మ మహిమను మాయము చేశారని తండ్రి అంటున్నారు. మనము వారిని చాలా మహిమ చేస్తాము. వారు పరమ పూజ్య పరమపిత పరమాత్మ శివుని చిత్రము కూడా చాలా బాగుంది. అయితే శివుడు ఒక జ్యోతిర్బిందువుగా ఉన్నారని చాలా మంది అంగీకరించరు. ఎందుకంటే వారు 'ఆత్మయే పరమాత్మ' అని అనేస్తారు. ఆత్మ అతిసూక్ష్మమైనది. భృకుటి మధ్యలో కూర్చొని ఉంది. అలాంటప్పుడు పరమాత్మ ఇంత పెద్ద ఆకారము గలవారిగా ఎలా అవ్వగలరు? అనేకమంది విద్వాంసులు, ఆచార్యులు మొదలైనవారు బి.కెలను అపహాస్యం, హేళన చేస్తారు. పరమాత్మ రూపము అసలు ఇలా ఉండనే ఉండదు. వారు అఖండ జ్యోతిర్మయ తత్వము, వేలాది సూర్యుల కంటే తేజోమయమని అంటారు. వాస్తవానికి ఇది పెద్ద తప్పు. వారి సరైన మహిమను వారే (తండ్రియే) స్వయంగా తెలుపుచున్నారు. వారు మనుష్య సృష్టికి బీజరూపులు. ఈ సృష్టి ఒక తలక్రిందులుగా ఉన్న వృక్షము. సత్య, త్రేతా యుగాలలో వారిని ఎవ్వరూ స్మృతి చేయరు. మనుష్యులకు దు:ఖము కలిగినప్పుడు - '' ఓ భగవంతుడా! ఓ పరమపిత పరమాత్మా! దయ చూపండి'' అని వారిని స్మృతి చేస్తారు. సత్య-త్రేతా యుగాలలో దయా భిక్షను వేడుకునేవారు ఎవ్వరూ ఉండరు. అది రచయిత అయిన తండ్రి రచించిన నూతన రచన. ఈ తండ్రి మహిమ అపారమైనది. వారు జ్ఞానసాగరులు, పతితపావనులు. జ్ఞానసాగరులైతే తప్పకుండా జ్ఞానమిచ్చి ఉంటారు. వారు సత్‌, చిత్‌, ఆనంద స్వరూపులు, చైతన్యమైనవారు. జ్ఞానాన్ని చైతన్య ఆత్మయే ధారణ చేస్తుంది. మనము శరీరాన్ని వదలి వెళ్లినప్పుడు ఆత్మలో జ్ఞాన సంస్కారము ఉండనే ఉంటుందని తెలుసుకోండి. చిన్న బిడ్డగా జన్మించినా ఆ సంస్కారము ఉంటుంది. కాని అవయవాలు చిన్నవైనందున మాట్లాడలేరు. అవయవాలు పెద్దవైతే స్మృతినిప్పిస్తే స్మృతిలోకి వచ్చేస్తుంది. చిన్న పిల్లలు కూడా శాస్త్రాలు మొదలైనవి కంఠస్థము చేస్తారు. ఇవన్నీ పూర్వ జన్మ సంస్కారాలు. ఇప్పుడు తండ్రి మనకు తన జ్ఞాన వారసత్వాన్ని ఇస్తున్నారు. మొత్తము సృష్టిని గురించిన జ్ఞానము వీరి వద్ద ఉంది, ఎందుకంటే వారు బీజరూపులు. మనము స్వయాన్ని బీజరూపులమని చెప్పుకోము. బీజములో తప్పకుండా వృక్ష ఆదిమధ్యాంతాల జ్ఞానముంటుంది కదా. కావున తండ్రి స్వయంగా చెప్తున్నారు - నేను ఈ సృష్టికి బీజరూపుడను. ఈ వృక్షానికి బీజము పైన ఉంది. ఆ తండ్రి సత్‌, చిత్‌, ఆనంద స్వరూపులు, జ్ఞానసాగరులు. సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానమే వారిలో ఉంటుంది, లేకుంటే వారిలో ఏముంటుంది! శాస్త్రాల జ్ఞానమేమైనా ఉంటుందా? ఆ జ్ఞానమైతే చాలామందిలో ఉంది. పరమాత్మ వద్ద ఉండేది తప్పకుండా ఏదైనా కొత్త జ్ఞానముంటుంది కదా. ఆ జ్ఞానము గురించి ఏ విద్వాంసులు మొదలైన వారికి తెలియదు. ఈ సృష్టి రూపి వృక్షము ఉత్పత్తి, పాలన, సంహారము ఎలా జరుగుతుందో, దాని ఆయువెంతో, అది ఎలా వృద్ధి చెందుతుందో...... మొదలైన విషయాలను గురించి ఎవరిని అడిగినా ఎవ్వరూ ఏ మాత్రమూ అర్థం చేయించలేరు.

గీత ఒక్కటి మాత్రమే సర్వ శాస్త్రాల శిరోమణి. మిగిలినవన్నీ గీత నుండి జన్మ తీసుకున్న పిల్లలే. గీత చదివిన వారికే తెలియకపోతే మిగిలిన శాస్త్రాలు చదివినందువలన లాభమేముంది? వారసత్వమైతే గీత నుండే లభించాలి. ఇప్పుడు తండ్రి మొత్తం డ్రామా రహస్యమంతా అర్థం చేయిస్తారు. తండ్రి రాతిబుద్ధి నుండి పారసబుద్ధి గలవారిగా తయారు చేసి పారసనాథులుగా చేస్తున్నారు. ఇప్పుడైతే అందరూ రాతిబుద్ధిగల రాళ్ళనాథులుగానే ఉన్నారు. కాని వారు స్వయానికి పెద్ద పెద్ద బిరుదులు ఇచ్చుకొని స్వయాన్ని పారసబుద్ధి గలవారిగా భావించి కూర్చుని ఉన్నారు. నా మహిమ అందరి మహిమ కంటే అలౌకికమైనదని, నేను జ్ఞానసాగరుడను, ఆనందసాగరుడను, సుఖసాగరుడనని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ విధంగా దేవతలను మహిమ చేయరాదు. భక్తులు దేవతల ముందుకెళ్ళి '' మీరు సర్వ గుణ సంపన్నులు,...........'' అని అంటారు. తండ్రికి ఒకే ఒక మహిమ ఉంది. అది కూడా మనకు తెలుసు. ఇప్పుడు మనము మందిరాలకు వెళ్తే, మన బుద్ధిలో వీరు పూర్తిగా 84 జన్మలు తీసుకొని ఉంటారనే పూర్తి జ్ఞానముంటుంది. ఇప్పుడు మీకు ఎంత ఖుషీ ఉంది! ఇంతకు ముందు ఇటువంటి ఆలోచనలు వచ్చేవి కావు. ఇప్పుడు 'మేము ఇలా తయారవ్వాలి' అని భావిస్తారు. బుద్ధిలో చాలా పరివర్తన వచ్చేస్తుంది.

తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - పరస్పరము చాలా మధురంగా అవ్వండి. ఉప్పు నీరులా అవ్వకండి. బాబా ఎప్పుడైనా, ఎవరినైనా కోపగించుకుంటారా? చాలా మధురంగా అర్థము చేయిస్తారు, జ్ఞానమునిస్తారు. ఒక్క సెకండు గడిచినా ఇది కూడా డ్రామాలో పాత్ర ' అని అంటారు. దానిని గురించిన చింత ఎందుకు చేయాలి? ఈ విధంగా స్వయానికి అర్థం చేయించాలి - మీరు ఈశ్వరీయ సంతానము. తక్కువైనవారు కాదు. ఈశ్వరీయ సంతానము తప్పకుండా ఈశ్వరుని వద్ద ఉంటారని ఎవరైనా అర్థము చేసుకోగలరు. ఈశ్వరుడు నిరాకారులైతే వారి సంతానము కూడా నిరాకారులే. ఆ సంతానమే ఇచ్చట శరీరము తీసుకొని పాత్ర చేస్తూ ఉంది. స్వర్గములో దేవీ దేవతా ధర్మానికి చెందిన మనుష్యులున్నారు. అందరి లెక్కాచారము కూర్చుని తీస్తే ఎంతగానో తలలు బద్దలు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే నెంబరువారు సమయానుసారము కొద్ది కొద్ది ఆత్మలకు జన్మ లభిస్తూ ఉంటుందని అర్థము చేసుకోగలరు. ఇంతకుముందు మనుష్యులు కుక్కలు, పిల్లలుగా అవుతారని భావించేవారు. ఇప్పటి బుద్ధికి, అప్పటి బుద్ధికి రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసము వచ్చేసింది. ఇవన్నీ ధారణ చేయవలసిన విషయాలు. ఇప్పుడు 84 జన్మల చక్రము పూర్తి అయ్యిందని క్లుప్తంగా అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఈ ఛీ-ఛీ(పాడైపోయిన) శరీరాన్ని వదిలేయాలి. ఇది అన్నిటికంటే పురాతనమైన శిథిలావస్థకు చేరిన తమోప్రధానమైన శరీరము. దీని పై మమకారము పూర్తిగా తొలగించి వేయాలి. పాత శరీరాన్ని స్మృతి ఏమి చేస్తారు? ఎందుకు చేస్తారు? ఇప్పుడు మీ నూతన శరీరాన్ని, సత్యయుగములో లభించబోయే శరీరాన్ని స్మృతి చేయాలి. ముక్తిధామము ద్వారా సత్యయుగములోకి వస్తారు. మనము జీవన్ముక్తిలోకి వెళ్తాము. మిగిలిన వారందరూ ముక్తిధామములోకి వెళ్లిపోతారు. దీనిని 'జయ జయ ధ్వనులు' అని అంటారు. హాహాకారాల తర్వాత జయ జయ ధ్వనులు జరగనున్నవి. ఇంతమంది మరణించేందుకు ఎవరో ఒకరు నిమిత్త కారణంగా అవుతారు. ప్రాకృతిక ఆపదలు సంభవిస్తాయి. కేవలం సముద్రము ఒక్కటే అన్ని ఖండాలను సమాప్తము చేయదు. సర్వమూ సమాప్తము అవ్వనే అవ్వాలి. కాని అవినాశి ఖండమైన భారతదేశము మిగిలిపోతంది. ఎందుకంటే ఇది శివబాబా జన్మ స్థానము. అందువలన ఇది అన్నిటికంటే గొప్ప తీర్థ స్థానమయ్యింది. తండ్రి అందరికీ సద్గతినిస్తారు. ఇది మనుష్యమాత్రులకు ఎవ్వరికీ తెలియదు. వారికి తెలియకుండా ఉండడమే డ్రామాలో నిశ్చితమై ఉంది. అందుకే తండ్రి అంటున్నారు - ఓ పిల్లలూ! మీకు ఏమీ తెలిసేది కాదు. నేనే వచ్చి మీకు రచయిత, రచనల జ్ఞానము అనగా మనుష్య సృష్టి ఆదిమధ్యాంతాల పూర్తి రహస్యాన్ని అర్థం చేయిస్తాను. దేనినైతే ఋషులు, మునులు కూడా అంతము లేనిది, అంతము లేనిది(బేఅంత్‌)................ అని వెళ్ళిపోయారో దానిని గురించి నేను అర్థం చేయిస్తాను. ఈ మొత్తము ప్రపంచానికి అన్నిటికంటే పెద్ద శత్రువు 'పంచ వికారాలు' అని కూడా వారికి తెలియదు. ఆ రావణాసురుని భారతీయులు ప్రతి సంవత్సరము తగులబెడ్తూనే వస్తున్నారు. అతనిని గురించి ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే రావణునికి శరీరమూ లేదు. ఆత్మ కూడా లేదు. వికారాలకైతే ఏ రూపమూ ఉండదు. మనుష్యులు కర్మలలోకి వచ్చినప్పుడు వీరిలో కామ భూతము, క్రోధ భూతము ప్రవేశించాయని తెలుస్తుంది. ఈ వికారాల స్టేజిలో కూడా ఉత్తమము, మధ్యమము, కనిష్టము ఉంటాయి. కొంతమందిలో కామ నషా ఒక్కసారిగా తమోప్రధానమైపోతుంది. కొంతమందిలో రజో నషా, కొంతమందిలో సతో నషా ఉంటుంది. కొంతమంది అయితే బాలబ్రహ్మచారులుగా కూడా ఉంటారు. సంసారాన్ని సంభాళించడం ఒక జంఝాటమని భావిస్తారు. వారినే అందరికంటే మంచివారని అంటారు. సన్యాసులలో కూడా బాలబ్రహ్మచారులను మంచివారిగా లెక్కిస్తారు. ప్రభుత్వము వారికి కూడా ఇలా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే సంతాన వృద్ధి జరగదు, పవిత్రతా శక్తి లభిస్తుంది. ఇవన్నీ గుప్తమైన విషయాలు. సన్యాసులు కూడా పవిత్రంగా ఉంటారు. చిన్న పిల్లలు కూడా పవిత్రంగా ఉంటారు. వానప్రస్థులు కూడా పవిత్రంగా ఉంటారు. అందువలన పవిత్రతా బలము లభిస్తూనే ఉంటుంది. పిల్లలు ఇంత వయస్సు వరకు పవిత్రంగా ఉండాలనే వారి నియమము కూడా ఆచరణలో ఉంటుంది. అందువలన ఆ బలము కూడా లభిస్తుంది. మీరు సతోప్రధాన పవిత్రులు. ఈ అంతిమ జన్మలో మీరు తండ్రితో ప్రతిజ్ఞ చేస్తారు. మీరు సత్యయుగాన్ని స్థాపన చేసేవారు. ఎవరు చేస్తారో వారు పవిత్ర ప్రపంచానికి నెంబరువారు పురుషార్థానుసారము యజమానులుగా అవుతారు.

ఇది ఈశ్వరీయ కుటుంబము. మనము కల్పానికి ఒక్కసారి ఈశ్వరుని జతలో ఉంటాము. తర్వాత మళ్లీ దైవీ వంశములో చాలా జన్మల వరకు ఉంటాము. ఈ ఒక్క జన్మయే దుర్లభమైనది. ఈ ఈశ్వరీయ కులము అత్యంత ఉత్తమమైనది. బ్రాహ్మణ కులము అన్నిటికంటే ఉన్నతమైన శిఖరము. నీచాతి నీచమైన కులము నుండి మనము ఉన్నతమైన బ్రాహ్మణ కులము వారిగా అయిపోయాము. శివబాబా బ్రహ్మను రచించినప్పుడు బ్రాహ్మణులను రచించారు. ఎవరైతే బాబా సేవలో ఉంటారో వారికి ఎంతో సంతోషము ఉంటుంది. మనము ఈశ్వరుని సంతానముగా అయ్యాము. ఈశ్వరుని శ్రీమతమును అనుసరిస్తున్నాము. మన నడవడిక ద్వారా వారి పేరును ప్రసిద్ధము చేస్తాము. బాబా అంటున్నారు - వారు ఆసురీ గుణాలకు చెందినవారు. మీరు దైవీగుణాల వారిగా అవుతూ ఉన్నారు. మీరు ఎప్పుడైతే సంపూర్ణంగా అవుతారో అప్పుడు మీ నడవడిక చాలా మంచిగా అయిపోతుంది. బాబా ''వీరు నంబరువారు పురుషార్థానుసారము దైవీగుణాల వారు'' అని అంటారు. ఆసురీ గుణాల వారు కూడా నంబరువారుగా ఉన్నారు. బాలబ్రహ్మచారులు కూడా ఉన్నారు. సన్యాసులు పవిత్రంగా ఉంటారు. అది కూడా చాలా మంచిది. అయితే వారు ఎవ్వరికీ సద్గతినివ్వలేరు. ఎవరైనా గురువులు సద్గతినిచ్చేవారుగా ఉంటే వారి వెంట తీసుకెళ్ళేవారు. కాని వారే స్వయంగా వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఇచ్చట ఈ తండ్రి అంటున్నారు - నేను మిమ్ములను నా జతలో తీసుకెళ్తాను. మిమ్ములను జతలో తీసుకెళ్ళేందుకే నేను వచ్చాను. వారు అలా తీసుకెళ్ళలేరు. స్వయంగా వారే గృహస్థుల వద్ద జన్మ తీసుకుంటూ ఉంటారు. సంస్కారాల కారణంగా మళ్లీ వారు సన్యాసుల గుంపులోకి వెళ్ళిపోతారు. నామ-రూపాలైతే ప్రతి జన్మలో మారిపోతూ ఉంటాయి. సత్యయుగములో ఇచ్చటి పురుషార్థానుసారము పదవి లభిస్తుందని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. ఈ పదవిని మనము ఎలా పొందుకున్నామో అచ్చట మనకు తెలియదు. ఇప్పుడు మాత్రమే మనము అన్ని రహస్యాలను తెలుసుకున్నాము. కల్పక్రితము ఎవరు ఏ విధంగా పురుషార్థము చేశారో అలాగే ఇప్పుడు కూడా చేస్తారు. అచ్చట వివాహాదులు ఎలా జరుగుతాయో కూడా పిల్లలకు సాక్షాత్కారము చేయించారు. పెద్ద పెద్ద మైదానాలు, ఉద్యానవనాలు మొదలైనవి ఉంటాయి. ఇప్పుడైతే భారతదేశములోని జనాభా కోట్ల సంఖ్యలో ఉంది. అచ్చటైతే కొన్ని లక్షలు మాత్రమే ఉంటుంది. అచ్చట ఇన్ని అంతస్తుల భవనాలు ఉండవు. ఇప్పుడు మాత్రమే ఇన్ని అంతస్తుల భవనాలున్నాయి. ఎందుకంటే తగినంత స్థలము లేదు. అచ్చట ఇంత చలి కూడా ఉండదు. అచ్చట దు:ఖానికి నామ-రూపాలు కూడా ఉండవు. ఎక్కువ వేడి కూడా ఉండదు, వేసవి కాలములో పర్వతాల పైకి వెళ్లే అవసరముండదు. దాని పేరే స్వర్గము. ఈ సమయములో మనుష్యులు ముళ్ళ అడవిలో పడి ఉన్నారు. సుఖము కావాలని ఎంత కోరుకుంటున్నారో అంత దు:ఖము పెరిగిపోతూనే ఉంటుంది. ఇక మీదట ఇంకా దు:ఖము ఉంటుంది. యుద్ధము జరిగితే రక్తపు నదులు ప్రవహిస్తాయి. మంచిది.

ఈ మురళిని పిల్లలందరి ముందు వినిపించారు. సన్ముఖములో వినుట నెంబర్‌ ఒన్‌. టేపు ద్వారా వినుట రెండవ నెంబరు. మురళీ చదువడం మూడవ నెంబరు. ఇది సతోప్రధానము, సతో, రజో అయింది. తమో అని అయితే అనరు. టేపులో ఉన్నదున్నట్లే వస్తుంది. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. 

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మీ చలనము(నడవడికలు) లేక దైవీ గుణాల ద్వారా తండ్రి పేరును ప్రసిద్ధము చేయాలి. ఆసురీ అవగుణాలను తొలగించి వేయాలి.
2. ఈ పురాతన, శిథిలావస్థకు వచ్చిన శరీరము పై మమకారముంచుకోరాదు. కొత్త సత్యయుగీ శరీరాన్ని స్మృతి చేయాలి. పవిత్రంగా ఉండి గుప్తమైన సహాయము చేయాలి. 

వరదానము :- ''తండ్రి ఇచ్చిన ప్రతి ఆదేశము లేక నియమము ద్వారా లాభాన్ని(ఫాయిదా) పొందే మర్యాదా పురుషోత్తమ భవ''
నియమాలు ఎంతగా పాటిస్తే అంత లాభమని అంటారు. అందువలన అమృతవేళ నుండే నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాటరాదు. చదువు, అమృతవేళ(యోగము) సేవ మొదలైన వాటితో దినచర్య ఏదైతే తయారు చేయబడిందో, అందులో మనసు లగ్నమవ్వకపోయినా దినచర్యలో ఏదియూ మిస్‌ చేయకండి. ఉదాహరణానికి భక్తులు నియమాలను తప్పకుండా పాటిస్తారో, మందిరములో మనసు లగ్నము కాకున్నా వారు తప్పకుండా మందిరానికి వెళ్తారు. మీరు స్వయం నియమాలను తయారు చేయువారు. ఇదే అనుభవంతో ప్రతీ నియమాన్ని పాలన చేస్తూ వెళ్తూ ఉంటే మర్యాదా పురుషోత్తములుగా అయిపోతారు. 

స్లోగన్‌ :- ''ఎవరి వద్ద సంతుష్టత (తృప్తి) అనే విశేష గుణముంటుందో వారి వద్దకు సర్వ గుణాలు స్వతహాగానే వచ్చేస్తాయి.''
 

Telugu Murli 01/01/18

01-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

''మధురమైన పిల్లలారా - మరజీవగా అయ్యి ఉంటే అన్నీ మర్చిపోండి. ఒక్క తండ్రి ఏదైతే వినిపిస్తారో, అది మాత్రమే వినండి, తండ్రిని స్మృతి చేయండి. వారి సాంగత్యములోనే కూర్చోండి.'' 

ప్రశ్న :- సద్గతిదాత అయిన తండ్రి తన పిల్లల సద్గతి కొరకు ఏ శిక్షణనిస్తారు ?
జవాబు :- బాబా చెప్తున్నారు - పిల్లలూ! సద్గతిలోకి వెళ్లేందుకు అశరీరులుగా అయ్యి తండ్రిని, చక్రాన్ని స్మృతి చేయండి. యోగము ద్వారా మీరు సదా ఆరోగ్యవంతులుగా, నిరోగులుగా అయిపోతారు. ఆ తర్వాత మీరు మీ కర్మలకు పశ్చాత్తాపపడే అవసరము ఉండదు. 

ప్రశ్న :- ఎవరి భాగ్యములో స్వర్గ సుఖాలు ఉండవో, వారి గుర్తులు ఏవి? 
జవాబు :- ''వారు జ్ఞానము వినేందుకు మాకు ఫుర్సత్తే(ఖాళీయే) లేదు'' అని అంటారు. వారు ఎప్పుడూ బ్రాహ్మణ కులానికి చెందినవారిగా అవ్వరు. భగవంతుడు కూడా ఏదో ఒక సమయములో ఏదో ఒక రూపములో వస్తారని వారికి తెలియనే తెలియదు. 

పాట :- నిన్ను పిలవాలని నా మనస్సు కోరుకుంటూ ఉంది,.....(తుమ్‌హారే బులానే కో జీ చాహ్‌తా హై,....)

ఓంశాంతి. భగవంతుడు కూర్చుని భక్తులకు అర్థం చేయిస్తున్నారు - భక్తులు కూడా భగవంతుని పిల్లలే. అందరూ భక్తులే. తండ్రి మాత్రము ఒక్కరే. అందువలన పిల్లలు కనీసము ఒక్క జన్మలో అయినా తండ్రి జతలో ఉండి చూడాలని కోరుకుంటారు. దేవతలతో కూడా చాలా జన్మలు గడిపాము. ఆసురీ సంప్రదాయము వారితో కూడా అంతకంటే ఎక్కువ జన్మలు గడిపాము. ఇప్పుడు భక్తుల మనస్సులో - కనీసము ఒక్క జన్మకైనా భగవంతుని వారమై భగవంతుని జతలో ఉండి చూడాలని ఉంటుంది. ఇప్పుడు మీరు భగవంతుని వారిగా అయ్యారు. మర్‌జీవాగా అయ్యారు. కనుక భగవంతుని జతలో ఉంటారు. ఈ అమూల్యమైన అంతిమ జన్మలో మీరు పరమపిత పరమాత్మ జతలో ఉంటారు. గాయనము కూడా ఉంది - '' మీతోనే తింటాను, మీతోనే కూర్చుంటాను, మీరు చెప్పింది వింటాను,............. ఎవరైతే మరజీవగా అవుతారో, వారు ఈ జన్మలో తోడుగా ఉంటారు.'' ఈ ఒక్క జన్మ మాత్రమే అత్యంత ఉన్నతమైన జన్మ. తండ్రి కూడా ఒక్కసారి మాత్రమే వస్తారు. తర్వాత ఎప్పుడూ రాజాలరు. ఒక్కసారి మాత్రమే వచ్చి పిల్లల సర్వ కామనలను(కోరికలను) పూర్తి చేసేస్తారు. భక్తి మార్గములో చాలా ప్రార్థిస్తూ, యాచిస్తూ ఉంటారు. సాధు సత్పురుషులు, మహాత్ములు, దేవీ దేవతలు మొదలైన వారిని అర్ధకల్పము నుండి వేడుకుంటూ వచ్చారు. అంతేకాక జపము, తపము, దానము, పుణ్యకర్మలు మొదలైనవి కూడా జన్మ-జన్మాంతరాలుగా చేస్తూనే వచ్చారు. అనేక శాస్త్రాలు చదువుతారు. అనేకానేక శాస్త్రాలను, మ్యాగజైనులు మొదలైనవి తయారు చేస్తారు, అలసిపోనే అలసిపోరు. వీటి ద్వారానే భగవంతుడు లభిస్తాడని భావిస్తారు. కాని ఇప్పుడు తండ్రి స్వయంగా చెప్తున్నారు - మీరు జన్మ జన్మాంతరాలుగా ఏదైతే చదివారో, ఇప్పుడు ఏ శాస్త్రాలు మొదలైనవి చదువుతున్నారో వాటి ద్వారా నన్ను ప్రాప్తి చేసుకోలేరు. అనేక పుస్తకాలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి. క్రైస్తవులు కూడా ఎంతో నేర్చుకుంటూ ఉన్నారు. అనేక భాషలలో ఎంతగానో వ్రాస్తూ కూడా ఉంటారు. మనుష్యులు చదువుతూనే ఉంటారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు - ఇంతవరకు చదివినదంతా మర్చిపోండి, అనగా బుద్ధి నుండి తీసేయండి. చాలా పుస్తకాలు చదువుతారు. పుస్తకాలలో ' ఫ˜లానా భగవంతుడు, ఫలానా అవతారము' అని వ్రాసి ఉన్నారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు - నేను స్వయంగా వస్తాను. కనుక ఎవరైతే నావారిగా అవుతారో వారికి, వీటన్నింటినీ మర్చిపోండని చెప్తాను. మొత్తము ప్రపంచములోని వారి బుద్ధిలో గాని, మీ బుద్ధిలో గాని ఏ విషయమైతే లేదో, దానిని ఇప్పుడు నేను మీకు వినిపిస్తాను. తండ్రి ఏదైతే చెప్తున్నారో అది శాస్త్రము, మొదలైన వాటిలో లేదని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థము చేసుకున్నారు. తండ్రి చాలా రహస్యమైన, రమణీయమైన విషయాలను అర్థం చేయిస్తారు. డ్రామా ఆదిమధ్యాంతాలు, రచయిత-రచనల సమాచారమంతా మీకు వినిపిస్తారు. అయినా ఎక్కువగా గుర్తుంచుకోలేకుంటే, కనీసము మన్మనాభవ, మధ్యాజీభవ అను రెండు పదములైనా గుర్తుంచుకోండి అని తండ్రి చెప్తున్నారు. ఈ పదాలు భక్తి మార్గములోని భగవద్గీతలోనివి. అయితే తండ్రి ఈ పదాల వాస్తవిక అర్థాన్ని బాగా అర్థము చేయిస్తారు. భగవంతుడైతే సహజ రాజయోగాన్ని నేర్పించారు. కేవలం తండ్రినైన నన్ను మాత్రమే స్మృతి చేయండి అని చెప్తారు. భక్తిలో కూడా చాలా స్మృతి చేస్తూ ఉండేవారు. దు:ఖములో అందరూ స్మృతి చేస్తారు,.......(దు:ఖ్‌ మే సిమిరన్‌ సబ్‌ కరే,......) అని పాట కూడా పాడ్తారు. అయినా ఏమీ అర్థము చేసుకోరు. సత్య-త్రేతా యుగాలలో తప్పకుండా సుఖ ప్రపంచము ఉండేది. కనుక వారు ఎందుకు స్మృతి చేస్తారు? ఇప్పుడు మాయా రాజ్యములో దు:ఖము కలుగుతుంది. అప్పుడు తండ్రిని స్మృతి చేయవలసి వస్తుంది. మళ్లీ సత్యయుగములోని అపారమైన సుఖము కూడా గుర్తుకొస్తుంది. ఎవరైతే సంగమ యుగములో తండ్రి నుండి రాజయోగము, జ్ఞానము నేర్చుకున్నారో వారు మాత్రమే ఆ సుఖ ప్రపంచములో ఉండేవారు. పిల్లలలో ఎటువంటి చదువురాని వారున్నారో చూడండి. వారికిది ఇంకా మంచిది. ఎందుకంటే వారి బుద్ధి ఏ ఇతర వైపుకూ వెళ్లదు. ఇచ్చట కేవలం మౌనంగా ఉండాలి. నోటితో కూడా ఏమీ చెప్పే అవసరము లేదు. కేవలం బాబాను స్మృతి చేస్తూ ఉంటే వికర్మలు వినాశనమవుతాయి. మళ్లీ నేను నా వెంట తీసుకెళ్తాను. ఈ విషయాలు కొన్ని గీతలో ఉన్నాయి. ప్రాచీన భారత ధర్మ శాస్త్రము ఒక్కటే. ఈ భారతదేశమే కొత్తదిగా ఉండేది. ఇప్పుడు పాతదైపోయింది. శాస్త్రమైతే ఒక్కటే ఉంటుంది కదా. ఉదాహరణానికి బైబుల్‌ ఒక్కటే ఉంది. ఎప్పటి నుండి క్రైస్తవ ధర్మము స్థాపన అయ్యిందో అప్పటి నుండి అంతిమం వరకు వారి శాస్త్రము ఒక్కటే. క్రీస్తును కూడా ఎంతో మహిమ చేస్తారు. క్రీస్తు శాంతిని స్థాపన చేశాడని అంటారు. అతడు వచ్చి క్రైస్తవ ధర్మాన్ని స్థాపించాడు. అందులో శాంతి మాటే లేదు. ఎవరైతే వస్తారో వారినందరినీ మహిమ చేస్తూ ఉంటారు. ఎందుకంటే తమ స్వంత మహిమను మర్చిపోయి ఉన్నారు. బౌద్ధులు, క్రైస్తవులు మొదలైనవారు తమ ధర్మాలను తప్ప ఇతరులెవ్వరినీ మహిమ చెయ్యరు. భారతవాసులకు తమ ధర్మము లేనే లేదు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. పూర్తి నాస్తికులుగా అయినప్పుడే తండ్రి మళ్లీ వస్తారు.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ! పాఠశాలలు మొదలైన వాటిలో ఏ పుస్తకాలైతే చదివిస్తున్నారో, వాటిలో కనీసము లక్ష్యమైనా ఉంది, లాభము కూడా ఉంది, దాని ద్వారా సంపాదన జరుగుతుంది, పదవి లభిస్తుంది. కాని శాస్త్రాలు మొదలైనవి ఏవైతే చదువుతున్నారో అవన్నీ మూఢ నమ్మకాలు - చదువును ఎప్పుడూ మూఢ నమ్మకమని అనరు. మూఢ నమ్మకముతో చదువుతున్నారని అనరు. చదువు ద్వారా బ్యారిష్టరు, ఇంజనీరు మొదలైనవారిగా అవుతారు. ఆ చదువులను మూఢ నమ్మకాలని ఎలా అంటారు? ఇది కూడా పాఠశాలయే. ఇది ఏ సత్సంగమూ కాదు. ఈశ్వరీయ విశ్వ విద్యాలయమని వ్రాయబడి ఉంది. కనుక ఇది తప్పకుండా ఈశ్వరుని చాలా గొప్ప విద్యాలయమని అర్థం చేసుకోవాలి. అది కూడా ప్రపంచానికంతా అని భావించాలి. దేహ సహితము అన్ని ధర్మాలను వదిలి తమ స్వధర్మములో స్థితము అవ్వండి, తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే ''అంతమతి సో గతి'' అవుతుందని సందేశము కూడా ఇవ్వాలి. మీరు చార్టు వ్రాయాలి. ''ఎంత సమయము మేము యోగము చేస్తున్నాము'' ? అని చార్టు వ్రాయాలి. అందరూ రెగ్యులర్‌గా చార్టు వ్రాస్తారని కాదు. వ్రాయరు, అలసిపోతారు. వాస్తవానికి ఏమి చేయాలి? ప్రతి రోజూ మీ ముఖాన్ని జ్ఞాన దర్పణములో చూసుకోండి. అప్పుడు మేము లక్ష్మీని గాని, సీతను గాని వరించేందుకు అర్హులుగా ఉన్నామా లేక ప్రజలలోకి వెళ్లిపోయేవారమా? అని తెలిసిపోతుంది. తీవ్రముగా పురుషార్థము చేయించేందుకు చార్టు వ్రాయమని చెప్పబడ్తుంది. అంతేకాక మేము ఎంత సమయము శివబాబాను స్మృతి చేశామని చూసుకోగలరు కూడా. చార్టు వ్రాయడం వలన మొత్తము దినచర్య అంతా గుర్తుకు వస్తుంది. బాల్యము నుండి చివరివరకు మొత్తము ఆయుష్షు అంతా జీవితము గుర్తుంటుంది కదా. అటువంటప్పుడు ఒక రోజులో ఏమి చేశారో గుర్తుండదా? మేము బాబాను, చక్రమును ఎంత సమయము స్మృతి చేశామని పరిశీలించుకోవాలి. ఇలా అభ్యాసము చేయడం వలన రుద్ర మాలలో కూర్చబడేందుకు త్వరగా పరుగు తీస్తారు. ఇది యోగ యాత్ర. దీనిని గురించి ఇతరులెవ్వరికీ తెలియదు. కావున వారు ఇతరులకు ఎలా నేర్పించగలరు? ఇప్పుడు బాబా వద్దకు వాపసు వెళ్లాలని మీకు తెలుసు. బాబా నుండి లభించే వారసత్వము రాజ్య పదవి. అందువలన దీనికి రాజయోగమని పేరు వచ్చింది.
మీరందరూ రాజఋషులు, వారు హఠయోగ ఋషులు. వారు కూడా పవిత్రంగా ఉంటారు. రాజ్యములో రాజు, రాణి, ప్రజలు అందరూ ఉండాలి. సన్యాసులలో అయితే రాజులు, రాణులు ఉండనే ఉండరు. వారిది హద్దు వైరాగ్యము. మీది బేహద్‌(అనంతమైన) వైరాగ్యము. వారు ఇల్లు- వాకిళ్లు వదిలినా, ఈ వికారి ప్రపంచములోనే ఉంటారు. మీకైతే ఈ ప్రపంచము తర్వాత స్వర్గముంటుంది. అది దైవీ ఉద్యానవనము. కావున అవే గుర్తుకు వస్తాయి. ఈ విషయాలను పిల్లలైన మీరు మాత్రమే బుద్ధిలో ఉంచుకోగలరు. చార్టు వ్రాయలేనివారు కూడా చాలామంది ఉన్నారు. నడుస్తూ-నడుస్తూ అలసిపోతారు. బాబా అంటున్నారు - నేను ఎంత సమయము అత్యంత ప్రియమైన (మోస్ట్‌ బిలెవెడ్‌) బాబాను స్మృతి చేశానని నోటు చేసుకోండి. ఆ తండ్రి స్మృతి ద్వారానే మీరు వారసత్వము తీసుకోవాలి. రాజ పదవిని వారసత్వముగా తీసుకోవాలంటే ప్రజలను కూడా తయారు చేసుకోవాలి. బాబా స్వర్గ రచయిత, అందువలన వారి నుండి స్వర్గ వారసత్వము ఎందుకు లభించదు? చాలా మందికి స్వర్గ వారసత్వము లభిస్తుంది. మిగిలిన వారికి శాంతి లభిస్తుంది. తండ్రి పిల్లలందరికీ చెప్తున్నారు - పిల్లలూ! దేహ సహితము దేహ సంబంధాలన్నీ మర్చిపోండి. మీరు అశరీరులుగా వచ్చారు, 84 జన్మలు అనుభవించారు. ఇప్పుడు మళ్లీ అశరీరులుగా అవ్వండి. క్రైస్తవ ధర్మము వారికి కూడా మీరు ఏసుక్రీస్తుకు తర్వాత వచ్చిన వారు మీరు కూడా శరీరము లేకుండా వచ్చారు, ఇచ్చట శరీరము తీసుకొని పాత్ర చేశారు. ఇప్పుడు మీ పాత్ర కూడా పూర్తి అవుతుంది. కలియుగము అంత్య దశకు వచ్చేసింది. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేయండి అని చెప్పండి. ఈ విషయాలు ముక్తిధామము వారు విని చాలా సంతోషిస్తారు. వారు కోరుకునేదే ముక్తి. జీవన్ముక్తి(సుఖము) పొందుకొని, మళ్లీ దు:ఖములోకి రావడం కంటే ముక్తిధామమే బాగుంటుందని భావిస్తారు. సుఖము చాలా ఉంటుందని వారికి తెలియదు. ఆత్మలమైన మనము తండ్రి జతలో పరంధామములో ఉండేవారము. కాని ఇప్పుడు పరంధామాన్ని మర్చిపోయాము. తండ్రి వచ్చి సందేశకులందరినీ పంపిస్తారని అంటారు. వాస్తవానికి అలా ఎవ్వరూ పంపరు. ఇదంతా తయారైన డ్రామా. ఇప్పుడు మనము మొత్తం డ్రామా అంతా తెలుసుకున్నాము. పిల్లలైన మీ బుద్ధిలో తండ్రి మరియు చక్రము గుర్తున్నాయి. కనుక మీరు తప్పకుండా చక్రవర్తి రాజులుగా అవుతారు. ఇచ్చట దు:ఖము చాలా ఉందని మనుష్యులు భావించి ముక్తిని కోరుకుంటారు. గతి-సద్గతి అనే రెండు పదాలు వస్తూనే ఉన్నాయి, వాడుతూనే ఉన్నారు. కాని వీటి అర్థము ఎవ్వరికీ తెలియదు. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రే అని మిగిలిన వారంతా పతితులని పిల్లలైన మీకు తెలుసు. మొత్తం ప్రపంచమంతా పతితమై ఉంది. ఈ మాటలకు కూడా కొంతమంది కోపపడుతారు. తండ్రి అంటున్నారు - ఈ శరీరాన్ని మర్చిపోండి. మిమ్ములను అశరీరులుగా పంపాను. ఇప్పుడు కూడా మళ్లీ అశరీరులుగా అయ్యి నా జతలో రావాలి. దీనిని 'జ్ఞానము లేక శిక్షణ' అని అంటారు. ఈ విద్య ద్వారానే సద్గతి లభిస్తుంది. యోగము ద్వారా మీరు సదా ఆరోగ్యవంతులుగా (ఎవర్‌ హెల్తీగా) అవుతారు. మీరు సత్యయుగములో చాలా సుఖంగా ఉండేవారు. ఏ వస్తువుకూ కొరత ఉండేది కాదు. దు:ఖమిచ్చే వికారము ఏదీ ఉండేది కాదు. మోహజీత్‌ రాజు కథను వినిపిస్తారు కదా. బాబా అంటున్నారు - నేను మీకు ఎటువంటి కర్మలు నేర్పిస్తానంటే ఎప్పుడు కూడా మీరు మీ కర్మలకు పశ్చాత్తాపపడే పని ఉండదు. అచ్చట ఇంత చలి కూడా ఉండదు. ఇప్పుడైతే 5 తత్వాలు కూడా తమోప్రధానంగా ఉన్నాయి. అప్పుడప్పుడు చాలా ఎక్కువ వేడి, అప్పుడప్పుడు చాలా ఎక్కువ చలి. అచ్చట ఇలాంటి ఆపదలేవీ ఉండవు. సదా వసంత ఋతువే ఉంటుంది. ప్రకృతి సతోప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు ప్రకృతి తమోప్రధానంగా ఉంది. అందువలన ఇక్కడ మంచి మనుష్యులెలా ఉంటారు? భారతదేశములోని గొప్ప గొప్ప అధికారులు సన్యాసుల వెంట తిరుగుతూ ఉంటారు. వారి వద్దకు పిల్లలు(మన కుమారీలు) వెళ్తే ఫుర్సత్తు లేదని అంటారు. దీని వలన వారి భాగ్యములో స్వర్గ సుఖము లేదని అర్థమైపోతుంది. బ్రాహ్మణ కులానికి చెందినవారిగా అవ్వనే అవ్వరు. వారికి భగవంతుడు ఎలా వస్తారో, ఎప్పుడు ఇచ్చటకు వస్తారో వారికి తెలియనే తెలియదు. శివజయంతి పండుగ జరుపుకుంటారు. కాని అందరూ శివుని భగవంతునిగా భావించరు. ఒకవేళ వారిని పరమపిత పరమాత్మ అని భావిస్తే శివజయంతిని శెలవు రోజుగా జరుపుకునేవారు. తండ్రి అంటున్నారు - నా జన్మ భారతదేశములోనే జరుగుతుంది. నా మందిరాలు కూడా ఇక్కడే ఉన్నాయి. తప్పకుండా ఏదో ఒక శరీరములో ప్రవేశించి ఉంటారు. దక్ష ప్రజాపతి యజ్ఞమును రచించినట్లు చూపుతారు. అయితే అందులో ఏమైనా వచ్చి ఉంటారా! అలా అని కూడా చెప్పరు. కృష్ణుడైతే సత్యయుగములో ఉంటాడు. తండ్రి స్వయంగా చెప్తారు - నేను బ్రహ్మ నోటి ద్వారా బ్రాహ్మణ వంశాన్ని రచించాల్సి ఉంటుంది. ఈ విషయము కూడా మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. బాబా కేవలం ''నన్ను స్మృతి చేయండి'' అని ఎంతో సులభంగా అర్థం చేయిస్తారు. అయితే మాయ ఎంత ప్రబలమైనదంటే స్మృతి చేయనివ్వదు. అది అర్ధకల్పపు శత్రువు. ఈ శత్రువు పైనే విజయము పొందాలి. భక్తిమార్గములో మనుష్యులు చలిలో స్నానము చేసేందుకు వెళ్తారు. ఎన్నో ఎదురుదెబ్బలు తింటారు. దు:ఖము సహిస్తారు. ఇక్కడైతే ఇది పాఠశాల. ఇచ్చట చదువుకోవాలి. ఇందులో ఎదురుదెబ్బలు తినే మాటే లేదు. పాఠశాలలో గుడ్డి నమ్మకాల మాట లేదు. మనుష్యులైతే చాలా గుడ్డి నమ్మకాలలో చిక్కుకొని, కూరుకొనిపోయి ఉన్నారు. అనేకమంది గురువులను మొదలైన వారిని ఆశ్రయిస్తారు. కాని మనుష్యులు ఎప్పుడూ మనుష్యులకు సద్గతినివ్వలేరు. ఎవరైతే మనుష్యులను గురువులుగా చేసుకుంటారో వారిదంతా మూఢ నమ్మకమే కదా. ఈ రోజులలో చిన్న పిల్లలను కూడా గురువుల వద్దకు తీసుకెళ్తారు. వారి చేత కూడా గురువులను ఆశ్రయింపజేయిస్తారు. నిజానికి వానప్రస్థములో గురువులను ఆశ్రయించే నియమముంది. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తీవ్ర పురుషార్థము కొరకు స్మృతి చార్టును తప్పకుండా ఉంచుకోవాలి. ప్రతి రోజు దర్పణములో మీ ముఖాన్ని చూసుకోవాలి. అత్యంత ప్రియమైన తండ్రిని ఎంత సమయము స్మృతి చేస్తున్నామని చెక్‌ చేసుకోవాలి.
2. ఇంతవరకు ఏదైతే చదివారో, అదంతా మర్చిపోయి మౌనంగా ఉండాలి. నోటితో ఏమీ అనే అవసరము లేదు. తండ్రి స్మృతిలో వికర్మలను వినాశనము చేసుకోవాలి. 

వరదానము :- ''బ్రహ్మబాబా అడుగులో అడుగు వేస్తూ హద్దును బేహద్‌లో ఇమిడ్చి వేసే బేహద్‌ బాద్‌షాహ్‌ (బేహద్‌ చక్రవర్తి ) భవ ''
తండ్రిని అనుసరించడం అనగా 'నాది' ని 'నీది' లో ఇమిడ్చి వేయడం. హద్దును బేహద్‌లో(అనంతంలో) ఇమిడ్చి వేయడం - ఇప్పుడు ఈ అడుగు పై అడుగు ఉంచే(వేసే) అవసరముంది. అందరి సంకల్పాలు, మాటలు, సేవ చేసే విధి అనంతమైనవిగా అనుభవమవ్వాలి. స్వ పరివర్తన కొరకు హద్దును సర్వ వంశ సహితంగా సమాప్తము చేయండి. ఎవ్వరిని చూచినా లేక ఎవరు మిమ్ములను చూచినా అనంతమైన చక్రవర్తి అనే నశా అనుభవమవ్వాలి. సేవ కూడా ఉండాలి, సెంటర్లు కూడా ఉండాలి, కానీ హద్దు నామ-రూపాలు కూడా ఉండరాదు. అప్పుడు విశ్వ రాజ్య సింహాసనము ప్రాప్తి అవుతుంది. 

స్లోగన్‌ :- ''మీ ఆలోచనలను విశాలంగా చేసుకుంటే, చిన్న చిన్న విషయాలలో సమయం వృథా అవ్వదు ''