Thursday, 18 January 2018

Telugu Murli 06/01/18

06-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

'' మధురమైన పిల్లలారా - ఇప్పుడు మీ శరీరము పూర్తిగా పాతబడిపోయింది, మీ శరీరాన్ని కల్పవృక్ష (కల్పతరువు) సమానంగా తయారు చేసేందుకు తండ్రి వచ్చారు. మీరు అర్ధకల్పము వరకు అమరులుగా అవుతారు '' 

ప్రశ్న :- ఈ అద్భుతమైన నాటకములో ఏ విషయాన్ని చాలా బాగా అర్థము చేసుకోవాలి ?
జవాబు :- ఈ నాటకములో పాత్రధారులు ఎవరైతే ఉన్నారో, వారి చిత్రాన్ని ఒక్కసారి మాత్రమే చూడగలరు. మళ్లీ 5 అదే చిత్రాన్ని వేల సంవత్సరాల తర్వాతే చూస్తారు. 84 జన్మలకు 84 చిత్రాలు తయారౌతాయి. అన్ని చిత్రాలు భిన్న భిన్నముగా ఉంటాయి. కర్మలు కూడా ఒకరివి మరొకరితో కలవవు. ఎవరు ఏ కర్మ చేశారో వారు మళ్లీ 5 వేల సంవత్సరాల తర్వాత అదే కర్మ చేస్తారు. ఇవి చాలా బాగా అర్థము చేసుకునే విషయాలు. పిల్లలైన మీ బుద్ధికి వేయబడిన తాళము ఇప్పుడు తెరుచుకున్నది. ఈ రహస్యాన్ని మీరు అందరికీ అర్థం చేయించవచ్చు. 

పాట :- భోలానాథునికి సాటి అయినవారు.......... (భోలేనాథ్‌ సే నిరాలా......)   
ఓంశాంతి. భోలానాథుడని ఎల్లప్పుడూ శివబాబానే అంటారు. శంకరుని అలా అనరు. అతడేమో నాశనము చేస్తాడు. శివబాబా స్థాపన చేస్తారు. తప్పకుండా స్వర్గాన్ని స్థాపన చేస్తారు, నరకాన్ని వినాశనము చేస్తారు. కనుక జ్ఞానసాగరుడని భోలానాథుడైన శివుని మాత్రమే అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరైతే అనుభవీలుగా అయ్యారు. కల్పక్రితము కూడా శివబాబా తప్పకుండా వచ్చి ఉంటారు. ఇప్పుడు కూడా వచ్చే ఉన్నారు. వారు తప్పకుండా రావాలి. ఎందుకంటే నూతన మనుష్య సృష్టిని రచించాలి. ఈ డ్రామా ఆది మధ్యాంతాల రహస్యాన్ని తెలపాలి. అందువలన వారు తప్పకుండా ఇచ్చటకు రావాలి. సూక్ష్మవతనములో అయితే తెలుపరు. సూక్ష్మ వతనములోని భాష వేరుగా ఉంటుంది. మూలవతనములో అయితే ఏ భాషా లేదు. ఇది శబ్ధ ప్రపంచము. శివబాబా ఒక్కరు మాత్రమే పాడైపోయినవారిని బాగు చేయువారు. ఈ సృష్టి తమోప్రధానమైనప్పుడు అందరికీ సద్గతినిచ్చువారు భగవంతుడని అంటారు. నేను అందుకే రావలసి వస్తుంది. స్మృతి చిహ్నము కూడా ఇక్కడ ఉంది. ఈ నాటకములో ఏ ఏ మనుష్య చిత్రాలున్నాయో అవి ఒక్కసారి మాత్రమే చూడగలరు. అంతేకాని లక్ష్మీనారాయణుల చిత్రము(ముఖము) సత్యయుగములో తప్ప ఎప్పుడూ, ఎక్కడా చూడలేము. వారు పునర్జన్మ తీసుకున్నప్పుడు వారి నామ-రూపాలు మారిపోతాయి. ఒకసారి చూచిన లక్ష్మీ నారాయణుల రూపము మళ్లీ 5 వేల సంవత్సరాల తర్వాతనే చూడగలము. ఉదాహరణానికి గాంధీజీ చిత్రము ఉన్నదున్నట్లు మళ్లీ 5 వేల సంవత్సరాల తర్వాత చూస్తాము. అనేకమంది మనుష్యులు ఉన్నారు. ఇప్పుడు చూచే మనుష్య చిత్రాలు మళ్లీ 5 వేల సంవత్సరాల తర్వాతనే చూస్తాము. 84 జన్మలకు 84 చిత్రాలు తయారౌతాయి. అవన్నీ వేరు వేరుగా ఉంటాయి. కర్మలు కూడా ఎవరితోనూ సమానంగా ఉండవు. ఇప్పుడు ఎవరు ఏ కర్మ చేశారో అదే కర్మ 5 వేల సంవత్సరాల తర్వాత మళ్లీ చేస్తారు. ఇవన్నీ చాలా లోతుగా అర్థము చేసుకునే విషయాలు. బాబా చిత్రము కూడా ఉంది. మొట్టమొదట సృష్టి రచించేందుకు వారు వచ్చి ఉంటారని మనము భావిస్తాము. మీ బుద్ధికి వేయబడిన తాళము ఇప్పుడు తెరవబడింది, కనుక ఇప్పుడు మీరు అర్థము చేసుకుంటారు. ఇప్పుడు ఇతరుల తాళము కూడా మీరు ఈ విధంగా తెరవాలి. నిరాకార తండ్రి తప్పకుండా పరంధామములో ఉంటారు. అదే విధంగా మీరందరూ నా జతలోనే ఉంటారు. మొట్టమొదట నేను వచ్చినప్పుడు నా జతలో బ్రహ్మ, విష్ణు, శంకరులు ఉంటారు. మనుష్య సృష్టి మొట్టమొదటి నుండే ఉంది. అటువంటప్పుడు అది ఎలా మారుతుంది? (పల్టా/పరివర్తన అవుతుంది) రిపీట్‌ ఎలా అవుతుంది? మొట్టమొదట తప్పకుండా సూక్ష్మవతనాన్ని రచించవలసి వచ్చింది. తర్వాత స్థూల వతనములోకి రావలసి వచ్చింది. ఎందుకంటే దేవతలుగా ఉండిన మనుష్యులే ఇప్పుడు శూద్రులుగా అయ్యారు. వారిని మళ్ళీ బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారు చేయవలసి వచ్చింది. కావున కల్పక్రితము నేను ఏ జ్ఞానమునిచ్చానో మళ్ళీ అదే జ్ఞానాన్ని రిపీట్‌ చేస్తాను. ఈ సమయములో కూర్చుని రాజయోగము నేర్పిస్తాను. మళ్ళీ అర్ధకల్పము తర్వాత భక్తి ప్రారంభమౌతుంది. ఈ పాత సృష్టి మళ్ళీ నూతనంగా ఎలా తయారౌతుందో, అంతము నుండి మళ్ళీ ఆది ఎలా జరుగుతుందో తండ్రి స్వయంగా కూర్చొని అర్థము చేయిస్తున్నారు. పరమాత్మ వచ్చి ఉండినారని మనుష్యులు భావిస్తారు. అయితే ఎప్పుడు, ఎలా వచ్చారో ఎవ్వరికీ తెలియదు. ఆదిమధ్యాంతాల రహస్యమును ఎలా విప్పినారో ఎవ్వరికీ తెలియదు.

తండ్రి అంటున్నారు - నేను మళ్ళీ అందరికీ సద్గతినిచ్చేందుకు సన్ముఖములోకి వచ్చాను. మాయా రావణుడు అందరి అదృష్టాన్ని పాడు చేశాడు. పాడైన భాగ్యాన్ని తయారు చేయువారు తప్పకుండా ఎవరో కావాలి. తండ్రి అంటున్నారు - 5 వేల సంవత్సరాల క్రితము కూడా బ్రహ్మ శరీరములో వచ్చాను. మానవ సృష్టి తప్పకుండా ఇచ్చటనే రచించాను. ఇచ్చటకు వచ్చి సృష్టిని మార్పు చేసి(పల్టాకర్‌) శరీరమును కల్పతరువు సమానంగా తయారు చేస్తాను. ఇప్పుడు మీ శరీరము పూర్తిగా పాతదైపోయింది. ఈ పాత శరీరాన్ని మళ్ళీ అర్ధకల్పము వరకు మీరు అమరులుగా అయ్యే విధంగా తయారు చేస్తాను. భలే అచ్చట కూడా శరీరాన్ని మారుస్తారు. కాని సంతోషంగా మారుస్తారు. పాత వస్త్రాన్ని వదిలి కొత్తది తీసుకున్నట్లు సంతోషంగా వదులుతారు. అచ్చటైతే ఫలానావారు మరణించారని అనరు. దానిని మరణము అని అనరు. ఎలాగైతే మీరు ఇచ్చట 'జీవించి ఉండే మరణిస్తారు' అని అంటారు కదా. కాని మీరు నిజంగా మరణించలేదు. మీరైతే శివబాబా వారిగా అయ్యారు. బాబా, '' మీరు నా కంటి పాపలు, అపురూపమైన పిల్లలు'' అని అంటున్నారు. ఈ మాటలు శివబాబా అంటున్నారు. బ్రహ్మాబాబా కూడా అంటున్నారు. వారేమో నిరాకార తండ్రి. వీరేమో సాకార తండ్రి. ''బాబా మీరు కూడా(అప్పటి) వారే కదా? '' అని ఇప్పుడు మీరు అంటున్నారు. మేము కూడా(అప్పటి) వారమే. మళ్ళీ ఇప్పుడు వచ్చి మిమ్ములను కలిశాము. తండ్రి అంటున్నారు - నేను వచ్చి స్వర్గ స్థాపన చేస్తాను. రాజ్యమైతే మీకు తప్పకుండా కావాలి. కనుక అందుకు రాజయోగము నేర్పిస్తున్నాను. చివరిలో మీకైతే రాజ్యము లభిస్తుంది. తర్వాత అచ్చట ఈ జ్ఞానము అవసరముండదు. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గములో ఉపయోగపడ్తాయి. చదువుతూ ఉంటారు. ఎవరైనా గొప్పవారు చరిత్ర - భూగోళాలను వ్రాసి పోతే వారి తర్వాత అందరూ చదువుతూ ఉంటారు. లెక్కలేనన్ని పుస్తకాలున్నాయి. మనుష్యులు చదువుతూనే ఉంటారు. స్వర్గములో అయితే ఇవేవీ ఉండవు. అచ్చట భాష కూడా ఒక్కటే ఉంటుంది. ఇప్పుడు సృష్టిని కొత్తదిగా తయారు చేసేందుకు నేను వచ్చాను. మొదట కొత్తదిగా ఉండేది. ఇప్పుడు అది పాతదిగా అయిపోయింది. నా పిల్లలందరినీ మాయ దగ్ధం చేసి బూడిద వలె చేసేసింది. అచ్చట సగరుని(సాగరుని) పిల్లలుగా,................. చూపిస్తారు. అయితే సగరుడు అనగా జ్ఞానసాగరుడు. మీరంతా వారి పిల్లలు. వాస్తవానికి ప్రపంచములోని వారందరూ నా పిల్లలే. అయితే పిల్లలైన మీరు ఇప్పుడు ప్రాక్టికల్‌గా మహిమ చేయబడ్డారు. మీ కొరకే తండ్రి ఇచ్చటకు వస్తారు. నేను మళ్ళీ మీకు స్పృహ తెప్పించేందుకు వచ్చాను. పూర్తి నల్లగా రాతిబుద్ధిగా అయినవారిని మళ్ళీ వచ్చి పారస బుద్ధిగా గలవారిగా తయారు చేస్తున్నాను. ఈ జ్ఞానము ద్వారా మనము పారసబుద్ధి గలవారిగా ఎలా అవుతామో మీకు తెలుసు. ఎప్పుడు మీరు పారస బుద్ధిగా అవుతారో అప్పుడు ఈ ప్రపంచము కూడా పరివర్తనై రాతి పురము నుండి పారసపురముగా తయారైపోతుంది. దీని కొరకే బాబా మీతో పురుషార్థము చేయిస్తున్నారు. అందువలన మానవ సృష్టిని రచించేందుకు బాబా ఇచ్చటికే రావలసి వస్తుంది కదా. ఎవరి శరీరములో వస్తానో వారి ద్వారా ముఖవంశావళిని తయారు చేస్తాను. అందువలన ఇతడు(బ్రహ్మబాబా) తల్లి అవుతాడు. ఇది ఎంత గుహ్యమైన విషయం! నిజానికి ఇతను పురుషుడు. ఇతడిలోకి(శివబాబా) ప్రవేశించినప్పుడు మాతగా ఎలా అయ్యాడు అని ఈ విషయాలు విని తప్పకుండా తికమక పడ్తారు.

ఈ మాతా-పితలు, బ్రహ్మ - సరస్వతులు ఇరువురూ కల్పవృక్షము క్రింద కూర్చుని రాజయోగము నేర్చుకుంటున్నారని, కనుక వారికి గురువు తప్పక ఉండాలని మీరు నిరూపించి తెలుపుతారు కనుక బ్రహ్మ, సరస్వతులను మరియు పిల్లలందరినీ రాజఋషులని అంటారు. రాజ్యము కొరకు యోగము చేస్తారు. తండ్రి వచ్చి రాజయోగము, జ్ఞానము నేర్పిస్తారు. ఇతరులెవ్వరూ ఈ జ్ఞాన-యోగాలను నేర్పించలేరు. ఇది తప్ప మరొక రాజయోగము లేదు. ''వారు కేవలము యోగము నేర్చుకోండి'' అని అంటారు. అనేక ప్రకారాలైన హఠయోగాలుంటాయి. ఏ సన్యాసులు గాని, ఉదాసీనులు గాని రాజయోగమును నేర్పించలేరు. భగవంతుడే స్వయంగా వచ్చి రాజయోగమును నేర్పించారు. నేను కల్ప-కల్పము నూతన మానవ సృష్టిని రచించవలసి వచ్చినప్పుడు, రావలసి వస్తుందని బాబా అంటున్నారు. ప్రళయమైతే జరగదు. ఒకవేళ ప్రళయము జరిగితే నేను ఎవరిలో రావాలి? నిరాకారమైన నేను వచ్చి ఏమి చేయాలి? ఈ సృష్టి మొదటి నుండే ఉందని తండ్రి అర్థము చేయిస్తారు. భక్తులు కూడా ఉన్నారు. భగవంతున్ని పిలువను కూడా పిలుస్తారు. దీని వలన భక్తులున్నారని ఋజువౌతుంది. భక్తులు చాలా దు:ఖములో ఉన్నప్పుడు కలియుగము అంతిమ సమయములో ఉన్నప్పుడు భగవంతుడు రావలసి వస్తుంది. రావణ రాజ్యము సమాప్తమవ్వనున్నది. అప్పుడే నేను రావలసి వస్తుంది. తప్పకుండా ఈ సమయములో అందరూ దు:ఖితులుగా ఉన్నారు. మహాభయంకరమైన యుద్ధము ఎదుట నిలబడి ఉంది.

ఇది పాఠశాల. ఇచ్చట లక్ష్యముంది. సత్యయుగములో లక్ష్మీ నారాయణుల రాజ్యముండేదని ఆ తర్వాత సింగల్‌ కిరీటము గలవారి రాజ్యము వచ్చిందని మీకు తెలుసు. ఆ తర్వాత ఇతర ధర్మాలన్నీ వృద్ధి చెందాయి, ఆ తర్వాత మళ్ళీ రాజ్యము మొదలైన వాటిని పెంచేందుకు యుద్ధాలు మొదలైనవి జరిగాయని కూడా తెలుసు. ఏది జరిగిపోయిందో అదంతా మళ్ళీ రిపీట్‌ అవుతుందని మీకు తెలుసు. మళ్ళీ లక్ష్మీ నారాయణుల రాజ్యము ప్రారంభమౌతుంది. బాబా ప్రపంచ చరిత్ర-భూగోళాల రహస్యాన్ని పూర్తిగా అర్థము చేయిస్తారు. చాలా విస్తారములోకి పోవలసిన అవసరము లేదు. మనము సూర్యవంశీయులైతే పునర్జన్మ కూడా తప్పకుండా సూర్య వంశములోనే తీసుకొని ఉండవచ్చు. నామ-రూపాలైతే మారిపోతూ ఉంటాయి. తల్లి-తండ్రి కూడా వేరే వారు లభిస్తారు. ఈ మొత్తం డ్రామా అంతా బుద్ధిలో ఉంచుకోవాలి. తండ్రి ఎలా వస్తారో కూడా అర్థము చేసుకున్నారు. మనుష్యుల బుద్ధిలో అదే గీతా జ్ఞానము ఉంది. ఇంతకు ముందు మన బుద్ధిలో కూడా అదే పాత గీతా జ్ఞానముండేది. ఇప్పుడు తండ్రి రహస్యమైన విషయాలను వినిపిస్తున్నారు. అవి వింటూ-వింటూ మొత్తం రహస్యాలన్నీ అర్థము చేసుకున్నారు. మనుష్యులు కూడా ఇంతకు ముందు మీ జ్ఞానము వేరుగా ఉండేదని ఇప్పుడు చాలా బాగుందని అంటారు. ఎందుకంటే గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానంగా ఎలా అవ్వాలో ఇప్పుడు అర్థము చేసుకున్నారు. ఇది అందరికీ అంతిమ జన్మ. అందరూ మరణించాల్సిందే. స్వయం అనంతమైన తండ్రి అంటున్నారు - మీరు పవిత్రంగా అవుతామని ప్రతిజ్ఞ చేస్తే 21 జన్మలకు స్వర్గానికి అధిపతులుగా అవుతారు. ఇక్కడ పదమాపతులు కూడా దు:ఖములో ఉన్నారు. శరీరము నిరోగి(కల్పతరువు)గా ఉండదు. మీ శరీరము నిరోగి(కల్పతరువు)గా అవుతు౦ది. మీరు 21 జన్మలు మరణించరు. ఎవరైతే సూర్య వంశీయులు, చంద్ర వంశీయులుగా ఉండి కామచితి పై కూర్చుని నల్లగా(అపవిత్రము)గా అయిపోయారో వారే ఇచ్చటకు వస్తారని తండ్రి చెప్తున్నారు. అందుకే రాధా-కృష్ణులు, నారాయణుని అందరినీ నల్లగా చూపిస్తారు. ఇప్పుడైతే అందరూ నల్లగానే ఉన్నారు. కామచితి పై కూర్చున్నందున నల్లగా అయిపోయారు. ఇప్పుడు మీరు కామచితి నుండి క్రిందికి దిగి జ్ఞాన చితి పై కూర్చోవాలి. విషపు కంకణాన్ని రద్దు చేసి జ్ఞానామృత కంకణాన్ని కట్టుకోవాలి. మీరు శుభ కార్యము చేస్తున్నారని అందరూ అనేటట్లు మీరు అర్థము చేయించాలి. కుమారులు, కుమారీలుగా ఉన్నంతవరకు వారిని ' మలిన వస్త్రాలు(వికారులు)' అని అనరు. '' మీరు ఎప్పుడూ మురికిగా అవ్వరాదు'' అని తండ్రి అంటున్నారు. పోను పోను అనేకమంది వస్తారు. '' ఇది చాలా బాగుంది '' అని అంటారు. జ్ఞానచితి పై కూర్చున్నందున మనము స్వర్గానికి అధిపతులుగా అవుతాము. తరచుగా బ్రాహ్మణులే నిశ్చితార్థము చేయిస్తారు. రాజుల వద్ద కూడా బ్రాహ్మణులు ఉంటారు. వారిని రాజగురువులని అంటారు. ఈ రోజులలో సన్యాసులు కూడా కంకణము కడ్తారు. ఈ జ్ఞాన విషయాలు వినిపించినప్పుడు జనులు చాలా సంతోషిస్తారు. వెంటనే రాఖీ కూడా కట్టించుకుంటారు. మళ్ళీ ఇంటిలో గొడవలు కూడా జరుగుతాయి. కొంచెము సహించవలసి ఉంటుంది.

మీరు గుప్తముగా ఉన్న శివశక్తి సైన్యము. మీ వద్ద ఏ మారణాయుధమూ లేదు. దేవతలకు చాలా ఆయుధాలు చూపుతారు. ఇవన్నీ జ్ఞాన విషయాలు. ఇచ్చట ఉండేవి యోగబల విషయాలు. మీరు యోగబలము ద్వారా విశ్వచక్రవర్తి పదవిని తీసుకుంటారు. బాహుబలము ద్వారా హద్దులోని రాజ్య పదవి లభిస్తుంది. బేహద్‌ రాజ్యాన్ని బేహద్‌ అధిపతి మాత్రమే ఇస్తారు. యుద్ధమును గురించిన విషయమే లేదు. '' నేనెలా యుద్ధము చేయిస్తాను '' అని తండ్రి అంటారు. నేను యుద్ధాలు, జగడాలు నిర్మూలించేందుకే వచ్చాను. దీని తర్వాత యుద్ధము, జగడాల నామ-రూపాలు కూడా ఉండవు. అందుకే అందరూ పరమాత్మను స్మృతి చేస్తారు. ''నా మాట పై గౌరవముంచండి'' అని బాబా అంటున్నారు. అయినా ఒకరి పై నిశ్చయము లేకుంటే వేరు వేరుగా అనేక మందిని పట్టుకుంటూ ఉంటారు. మాలో కూడా ఈశ్వరుడు ఉన్నాడని అంటారు. అయితే స్వయం పై కూడా నమ్మకము ఉంచుకోరు. గురువులను ఆశ్రయిస్తూ ఉంటారు. మీలోనే భగవంతుడు ఉంటే గురువుల వద్దకు ఎందుకు వెళ్ళాలి? ఇచ్చటి విషయాలే భిన్నంగా ఉంటాయి. తండ్రి అంటున్నారు - కల్పక్రితము కూడా నేను ఎలా వచ్చానో అలాగే ఇప్పుడు వచ్చాను. రచయిత అయిన తండ్రి కూర్చుని ఎలా రచన చేస్తారో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఇది కూడా డ్రామాయే. ఎంతవరకు ఈ చక్రాన్ని గురించి తెలియదో, అంతవరకు ఇక ముందు ఏమౌతుందో అన్నది ఎలా తెలుసుకుంటారు. దీనిని కర్మ క్షేత్రమని అంటారు. మనము నిరాకార ప్రపంచము నుండి పాత్ర చేసేందకు వచ్చాము. అందువలన ఈ మొత్తము డ్రామా క్రియేటర్‌, డైరక్టర్‌ గురించి తెలియాలి. పాత్రధారులమైన మనందరము ఈ డ్రామా ఎలా తయారు చేయబడి ఉందో, ఈ సృష్టి ఎలా వృద్ధి పొందుతుందో తెలుసుకున్నాము. అంతేకాక ఇది కలియుగ అంతిమ సమయమని, సత్యయుగము తప్పకుండా స్థాపన అవ్వాలని కూడా తెలుసుకున్నాము. ఈ చక్ర జ్ఞానము పూర్తిగా సరైనదని, ఎవరైతే బ్రాహ్మణ కులానికి చెందినవారు ఉంటారో వారు అర్థము చేసుకుంటారు. ఇతడు ప్రజాపిత అయినందున తన కులము పెరుగుతూనే పోతుంది. పెరిగే తీరాలి. కల్పక్రితము వలె అందరూ పురుషార్థము చేస్తూనే ఉంటారు. మనము సాక్షిగా ఉండి చూస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరు - ''ఎంతవరకు సత్యయుగములో రాజధానిని తీసుకునేందుకు అర్హులుగా అయ్యాము? అని తాము ముఖాన్ని దర్పణములో చూసుకుంటూ ఉండాలి '' ఇది కల్ప-కల్పము ఆడే ఆట. ఎవరు ఎంత సేవ చేస్తారో అంత పొందుతారు. మీరు అనంతమైన ఆత్మిక సమాజ సేవకులు. మీరు పరమాత్మ మతమును అనుసరిస్తారు. ఇటువంటి మంచి మంచి పాయింట్లు ధారణ చేయాలి. తండ్రి వచ్చి మృత్యువు పంజా నుండి విడిపిస్తారు. అచ్చట మృత్యువు పేరే ఉండదు. ఇది మృత్యు లోకము. అది అమరలోకము. ఇచ్చట ఆదిమధ్యాంతాలు దు:ఖముంది. అచ్చట దు:ఖానికి నామ-రూపాలు కూడా ఉండవు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. 

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మనము నిరాకార తండ్రి, సాకార తండ్రి ఇరువురికీ అపురూపమైన కంటి పాపలము. మనము జీవించి ఉండే శివబాబాకు వారసులుగా అయ్యామనే నషాలో ఉండాలి.
2. యోగబలము ద్వారా విశ్వ రాజ్యాన్ని తీసుకోవాలి. పవిత్రతా రాఖీని కట్టుకున్నట్లయితే సహనము కూడా చేయాలి. ఎప్పుడూ పతితులుగా అవ్వరాదు.

వరదానము :- ''ఒకే సంకల్పములో స్థితమై మహాతీర్థ స్థానాన్ని ప్రత్యక్షము చేసే జిమ్మేవార్‌ ఆత్మా(బాధ్యత కలిగిన ఆత్మ) భవ''
ఈ ' ఆబూ ' విశ్వానికి లైట్‌హౌస్‌ అయ్యింది. ఈ మహాతీర్థ స్థానాన్ని ప్రత్యక్షము చేసేందుకు సర్వ బ్రాహ్మణ పిల్లలకు - విశ్వములోని ప్రతి ఆత్మకు ఇక్కడ నుండే ఠికానా(గమ్య స్థానం) లభించాలి. అందరికీ కళ్యాణము జరగాలి అనే ఒకే సంకల్పముండాలి. ఎప్పుడైతే ఈ శుభప్రదమైన ఆశల దీపము ప్రతి ఒక్కరిలో వెలుగుతుందో, అందరి సహయోగము ఉంటుందో అప్పుడు కార్యములో సఫలత లభిస్తుంది. '' ఇది నా బాధ్యత '' అనే శబ్ధము అందరి మనసు నుండి వెలువడాలి. ఎప్పుడైతే ప్రతి ఒక్కరు స్వయాన్ని ఇటువంటి బాధ్యత ఉందని భావిస్తారో అప్పుడు ప్రత్యక్షతా కిరణాలు తండ్రి ఇంటి నుండి నలువైపులా వ్యాపిస్తాయి. 

స్లోగన్‌ :- ''అంతర్ముఖతా విశేషతను ధారణ చేస్తే అందరి ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి''
 

No comments:

Post a Comment