07-01-2018 అవ్యక్త బాప్‌దాదా ఓంశాంతి రివైజ్: 17-04-1983 మధువనము
''కర్మాతీత స్థితిని పొందేందుకు సంకీర్ణ ( సమేట్‌నే కీ ) మరియు ఇముడ్చుకునే ( సమానేకీ ) శక్తులు అవసరము''
శబ్ధానికి
అతీతంగా తమ శ్రేష్ఠ స్థితికి అనుభవం చేస్తున్నారా? ఆ శ్రేష్ఠ స్థితి సర్వ
వ్యక్త ఆకర్షణలకు అతీతమైన శక్తిశాలీ మరియు ప్రియమైన స్థితి. ఒక్క సెకను
అయినా ఈ శ్రేష్ఠ స్థితిలో స్థితమై దాని ప్రభావము ద్వారా రోజంతా కర్మలు
చేస్తున్నా స్వయంలో విశేషంగా శాంతి శక్తిని అనుభవం చేస్తారు. ఈ స్థితినే
కర్మాతీత స్థితి లేదా తండ్రి సమానమైన సంపూర్ణ స్థితి అని అంటారు. ఈ స్థితి
ద్వారానే ప్రతి కార్యంలో సఫలతను అనుభవం చేయగలరు. అలాంటి శక్తిశాలీ స్థితిని
అనుభవం చేశారా? బ్రాహ్మణ జీవితము యొక్క లక్ష్యము '' కర్మాతీత స్థితిని
పొందడం''. అందుచేత లక్ష్యాన్ని పొందే ముందు ఇప్పటి నుండే ఈ అభ్యాసములో
ఉంటేనే ఆ లక్ష్యాన్ని ప్రాప్తి చేసుకోగలరు. ఈ లక్ష్యాన్ని పొందేందుకు
విశేషంగా స్వయంలో సంకీర్ణ శక్తి, ఇముడ్చుకునే శక్తి అవసరము ఎందుకంటే వికారీ
జీవితము లేదా భక్తితో కూడిన జీవితము రెండింటిలో జన్మ-జన్మాంతరాలుగా
బుద్ధిని విస్తారంగా భ్రమింపజేసే సంస్కారము చాలా పక్కాగా అయిపోయింది.
అందుచేత అలా విస్తారములో భ్రమించే బుద్ధిని సార రూపంలో స్థితం చేసేందుకు ఈ
రెండు శక్తులు అవసరము. ప్రారంభం నుండీ చూడండి - తమ దేహ భ్రాంతి యొక్క
విస్తారము ఎన్ని రకాలుగా ఉందో, దాని గురించి అయితే తెలుసు కదా! నేను
బాలుడను, నేను బాలుడను, నేను యువకుడను, నేను వృద్ధుడను, నేను ఫలానా, ఫలానా
వృత్తి చేసేవాడిని ఈ రకమైన దేహ స్మృతి యొక్క విస్తారమెంత ఉంది? ఇక
సంబంధాలలోకి వస్తే అది ఎంత విస్తారంగా ఉంది. ఎవరి బిడ్డను, ఎవరి తండ్రిని
మొదలైన సంబంధాల విస్తారము ఎంత ఉంది! దానిని వర్ణించాల్సిన అవసరం లేదు,
ఎందుకంటే దాని గురించి తెలుసు కదా! ఈ విధంగానే దేహ పదార్ధాల విస్తారము కూడా
ఎంత ఉంది! భక్తిలో అనేక దేవతలను తృప్తి పరచే విస్తారమెంత ఉంది! లక్ష్యమైతే
ఒకరిని పొందేందుకే కాని భ్రమించేందుకు సాధనాలు అనేకమున్నాయి. ఇన్ని విధాల
విస్తారాలను సార రూపంలోకి తీసుకొచ్చేందుకు ఇముడ్చుకునే శక్తి, సంకీర్ణ
శక్తి కావాలి. అన్ని విస్తారాలను ఒకే శబ్ధంతో ఇముడ్చుకోవచ్చు. అది ఏది? ''
బిందువు ''. నేనూ బిందువే, తండ్రి కూడా బిందువే. తండ్రి అయిన బిందువులో
మొత్తం ప్రపంచమంతా ఇమిడి ఉంది. ఇదైతే మీకు బాగా అనుభవమే కదా! ప్రపంచంలో
ఒకటి సంబంధం, రెండవది సంపత్తి(ధనం) ఈ రెండు విశేషతలూ బిందువైన తండ్రిలో
ఇమిడి ఉన్నాయి. సర్వ సంబంధాలు ఒకరి నుండే అనుభవం చేశారా? సర్వ సంపదలు
ప్రాప్తి సుఖము, శాంతి, సంతోషము ఇవి కూడా అనుభవం చేశారా లేక ఇప్పుడు
చేయాలా? అంటే ఏమయింది? విస్తారము సారములో ఇమిడిపోయింది కదా, మిమ్ములను మీరు
అడగండి, అనేకరకాల విస్తారాలలో భ్రమించే బుద్ధి సంకీర్ణ శక్తి ఆధారంతో
ఒక్కరిలో ఏకాగ్రమయ్యిందా? లేదా ఇప్పుడు కూడా విస్తారములో ఎక్కడైనా
భ్రమిస్తోందా? సంకీర్ణ శక్తి మరియు ఇముడ్చుకునే శక్తిని ప్రయోగించారా లేక
కేవలం జ్ఞానము మాత్రమే ఉందా? ఒకవేళ ఈ రెండు శక్తులను ప్రయోగించడం
వచ్చినట్లయితే దాని చిహ్నము - సెకండులో ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు
కావాలంటే అప్పుడు బుద్ధి ఆ స్థితిలో స్థితమైపోతుంది. ఎలాగైతే స్థూలమైన
వాహనములో శక్తివంతమైన బ్రేక్ ఉన్నట్లయితే, సెకండులో ఎక్కడ కావాలంటే అక్కడ
ఆపగల్గుతారో ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆ దిశలో తీసుకెళ్లగలరు. అలాగే
స్వయంలో ఆ శక్తిని అనుభవం చేస్తున్నారా లేక ఏకాగ్రం చేయడంలో సమయం పడుతోందా?
లేక వ్యర్థం నుండి సమర్థంలోకి రావడంలో శ్రమ అనిపిస్తోందా? అలా అయినట్లయితే
ఈ రెండు శక్తులు లోటుగా ఉన్నాయని అర్థం చేసుకోండి. సంగమ యుగంలో బ్రాహ్మణ
జీవితము యొక్క విశేషతయే సార రూపంలో స్థితమవ్వడం, సదా సఖము, శాంతి, సంతోషము,
జ్ఞానము, ఆనందాల ఉయ్యాలలో ఊగడం. సర్వ ప్రాప్తుల సంపన్న స్వరూపము యొక్క
అవినాశీ నషాలో స్థితమై ఉండండి. సదా ముఖము పై ప్రాప్తియే కనిపించాలి. ఆ
సంపన్న స్థితి యొక్క మెరుపు కనిపించాలి. కేవలం స్థూల ధనంతో సంపన్న వినాశీ
రాజ్య పదవి ప్రాప్తి చేసుకునే రాజుల మొఖము పై కూడా ద్వాపర యుగం ఆరంభములో ఆ
మెరుపు ఉండేది. కాని ఇక్కడైతే అవినాశి ప్రాప్తి ఉంది. కనుక ఎంత ఆత్మిక
ప్రకాశము, మెరుపు, కళ ముఖములో కనిపించాలి! అలా అనుభవం చేస్తున్నారా? లేక
కేవలం అనుభవము విని సంతోషపడ్తున్నారా! పాండవ సేన విశేషమైనవారు కదా! పాండవ
సేనను చూసి తప్పకుండా హర్షితమవుతారు. కాని పాండవుల విశేషత - సదా వీరులుగా
చూపిస్తారు, బలహీనులుగా కాదు. తమ స్మృతిచిహ్నాలు చూశారు కదా! చిత్రాలలో
కూడా మహావీరులుగా చూపిస్తారు కదా. కనుక బాప్‌దాదా కూడా పాండవులందరినీ విశేష
రూపములో సదా విజయులుగా, సదా తండ్రికి తోడుగా అంటే పాండవ పతి యొక్క తోడు.
తండ్రి సమానంగా మాస్టర్ సర్వ శక్తివాన్ స్థితిలో ఉండాలి. ఇదే విశేష
స్మృతిని వరదానంగా ఇస్తున్నారు. భలే కొత్తవారు కూడా వచ్చారు కాని
కల్పక్రితపు అధికారీ ఆత్మలే కనుక సదా తమ సంపూర్ణ అధికారాన్ని పొందాల్సిందే -
ఈ నషా మరియు నిశ్చయములో సదా ఉండండి. అర్థమయ్యిందా, అచ్ఛా!
సదా సెకండులో బుద్ధిని ఏకాగ్రం చేసి సర్వ ప్రాప్తులను అనుభవం చేసి సదా సర్వ శక్తులను సమయ ప్రమాణంగా ప్రయోగిస్తూ సదా ఒక్క తండ్రితో మొత్తం ప్రపంచాన్నంతా అనుభవం చేసే సంపన్న మరియు సమానమైన శ్రేష్ఠ ఆత్మలకు బాప్‌దాదా యాద్‌ప్యార్ మరియు నమస్తే.
పార్టీలతో :- 1. అధర్ కుమారులతో :- మాకు ఇలాంటి శ్రేష్ఠ భాగ్యము ఉందని ఎప్పుడైనా అనుకున్నారా? ఇంత శ్రేష్ఠ భాగ్యము మాకు ప్రాప్తిస్తుందనే ఆశ కూడా ఎప్పుడూ మీకు లేదు కానీ నిరాశతో ఉన్న ఆత్మలను బాబా ఆశ గలవారిగా చేశారు. నిరాశలో ఉండే సమయం ఇప్పుడు సమాప్తమైపోయింది. ఇప్పుడు ప్రతి అడుగులో మనకు సఫలత ఉంది అనే ఆశ ఉంటుంది. తెలియదు లేక కాదు అనే సంకల్పమైతే రావడం లేదు కదా. ఏ కార్యములోనైనా, అది స్వ పురుషార్థములో గాని, సేవలో గాని రెండింటిలో నిరాశా సంస్కారము సమాప్తమైపోవాలి. ఏ రకమైన సంస్కారమైనా, సంస్కారము గాని, లోభ సంస్కారము గాని, అహంకార సంస్కారము గాని మార్చడంలో నిరాశ చెందరాదు. నేను మారనే మారలేదు, మారడం చాలా కష్టం - ఇలాంటి సంకల్పాలు కూడా రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు సమాప్తం చేయకుంటే ఇంకెప్పుడు చేస్తారు? ఇప్పుడు దశరా(దశహరా) కదా! సత్యయుగంలో అయితే దీపమాల(దీపావళి) అయిపోతుంది. రావణుని హతమార్చే దశరా ఇప్పుడే ఇందులో సదా విజయం పొందుతామనే ఉమంగ-ఉత్సాహముండాలి. నిరాశా సంస్కారం ఉండరాదు. ఎటువంటి కష్టమైన కార్యమైనా అదేమంత పెద్ద విషయం కాదనేటంత సహజంగా అనుభవమవ్వాలి. ఎందుకంటే అనేకసార్లు ఆ పని చేశారు. కొత్త పనేదీ చేయడం లేదు. చాలాసార్లు చేసినదాన్ని రిపీట్ చేస్తున్నారు. అందువల్ల సదా ఆశతో(నమ్మకంతో) ఉండాలి. నిరాశకు నామ-రూపాలు ఉండరాదు. ఎప్పుడూ ఏ రకమైన స్వభావ సంస్కారము ద్వారా ఇది పరివర్తన అవుతుందో లేదో అనే సంకల్పము కూడా రాకూడదు. సదా విజయులమే, అప్పుడప్పుడు కాదు. ఒకవేళ ఏదైనా స్వప్నంలోనైనా లోటు కనిపించినా దానిని సదా కొరకు సమాప్తం చేయాలి. నిరాశను సదాకాలం కోసం ఆశలోకి మార్చేయాలి. నిశ్చయము చెదరకుండా ఉంటే విజయము కూడా సదా ఉంటుంది. నిశ్చయములో ఎప్పుడైనా ఎందుకు? ఏమిటి ? అనేది వస్తే విజయము అనగా ప్రాప్తిలో కూడా ఏదో ఒక లోపము కల్గుతుంది. సదా ఆశావాదులుగా ఉంటే సదా విజయులుగా ఉంటారు. మీరు నిరాశలను సదాకాలం కోసం ఆశల్లోకి మార్చేవారు.
2. సదా తమను సంగమ యుగంలోని శ్రేష్ఠ ఆత్మలు, పురుషోత్తమ ఆత్మలు, లేదా శ్రేష్ఠమైన ఉన్నతమైన బ్రాహ్మణ మహాన్ ఆత్మలుగా భావిస్తున్నారా? ఇప్పటి నుండే పురుషోత్తములుగా తయారయ్యారు కదా! ప్రపంచములో ఇంకా పురుషులున్నారు, కానీ వారికి అతీతంగా(భిన్నంగా) తండ్రికి ప్రియంగా అయ్యారు అందువలన పురుషోత్తములుగా అయ్యారు. ఇతరుల మధ్య ఉంటూ తమను అలౌకికంగా భావిస్తున్నారు కదా! లౌకిక ఆత్మల సంపర్కంలోకి వచ్చినా వారి మధ్య ఉంటున్నా నేను అలౌకికమైన అతీతమైన ఆత్మను అని ఎప్పుడూ మర్చిపోరాదు కదా! ఎందుకంటే మీరు హంసలుగా తయారయ్యారు, జ్ఞాన ముత్యాలను ఏరుకునే పవిత్రమైన హంసలు. వారు మురికిని తినే కొంగలు. వారు మురికినే తింటారు. మురికినే మాట్లాడ్తారు,...... కనుక కొంగల మధ్య ఉంటూ తమ పవిత్ర హంసల జీవితాన్ని ఎప్పుడూ మర్చిపోరు కదా. ఎప్పుడూ వారి ప్రభావము పడడం లేదు కదా! వాస్తవానికి వారి ప్రభావము వారి పైనే ఉండాలి, కాని వారి ప్రభావము మీ పైన పడరాదు. కనుక సదా స్వయాన్ని పవిత్ర హంసలుగా భావిస్తున్నారా? పవిత్ర హంసలు ఎప్పుడూ బుద్ధి ద్వారా జ్ఞాన ముత్యాలు తప్ప ఇతరమేదీ స్వీకరించలేరు. బ్రాహ్మణ ఆత్మలు ఎవరైతే ఉన్నతమైనవారో పిలక వంటివారో, వారెప్పుడూ క్రింది విషయాలను స్వీకరించలేరు. కొంగల నుండి హంసలుగా మారిపోయారు. కనుక పవిత్ర హంస అంటే సదా స్వచ్చము మరియు పవిత్రముగా ఉండేది. పవిత్రతయే స్వచ్ఛత. హంస ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది సదా తెల్లగానే ఉంటుంది. తెలుపుగా కూడా స్వచ్ఛతకు లేదా పవిత్రతకు గుర్తు. మీ వస్త్రాలు కూడా తెల్లగా ఉన్నాయి. ఇది పవిత్రతకు చిహ్నము. ఏ రకమైన అపవిత్రత ఉన్నా అది పవిత్ర హంస కాదు. పవిత్ర హంస సంకల్పంలో కూడా అశుద్ధంగా ఉండలేదు. సంకల్పాలు కూడా బుద్ధికి భోజనము. ఒకవేళ అశుద్ధమైన లేదా వ్యర్థమైన భోజనం తింటే సదా ఆరోగ్యంగా ఉండలేరు. వ్యర్థమైన వస్తువును పారేస్తారు, దగ్గర ఉంచుకోరు. అందుచేత వ్యర్థ సంకల్పాలను కూడా సమాప్తం చేయండి. దీనినే హోలీ హంస అని అంటారు అచ్ఛా!
పాండవులతో :- పాండవులనగా సంకల్పంలో, స్వప్నంలో కూడా ఓడిపోనివారు. విశేషంగా ఈ స్లోగన్ గుర్తు పెట్టుకోండి,...... '' పాండవులు అంటే సదా గెలిచేవారు. స్వప్నాలు కూడా విజయం కలిగేవే రావాలి. అంతగా పరివర్తన చేసుకోవాలి. ఇక్కడ కూర్చున్నవారంతా విజయులైన పాండవులేనా? అక్కడికి వెళ్ళాక ఓడిపోయామని ఉత్తరాలు వ్రాయరు కదా! మాయ రాదు కాని మీరు దానిని స్వయంగా మీరే పిలుస్తారు. బలహీనమవ్వడం అనగా మాయని పిలవడం. కనుక ఏదో రకమైన బలహీనత మాయను పిలుస్తుంది. అందువలన పాండవులు ఏ ప్రతిజ్ఞ చేశారు? సదా విజయులుగా ఉంటాము. ఓడిపోయి దాక్కోకండి, సదా విజయులుగా ఉండాలి. ఈ విధంగా ప్రతిజ్ఞ చేసేవారికి సదా బాప్‌దాదా అభినందనలు లభిస్తూ ఉంటాయి. సదా వాహ్ వాహ్ గీతాలు అలాంటి పిల్లల కోసమే తండ్రి పాడుతూ ఉంటారు. కనుక వాహ్ వాహ్ గీతాలు అందరూ వింటారు కదా! ఓడిపోతే హాయ్-హాయ్(అయ్యో-అయ్యో) అని అంటారు. విజయం పొందితే వాహ్-వాహ్ అని అంటారు. అందరూ విజయులే. మొత్తం గ్రూప్‌లో ఒక్కరు కూడా ఓడిపోయేవారు లేరు. అచ్ఛా! ఓంశాంతి.
మాస్టర్ దాతగా అవ్వండి (అవ్యక్త మహావాక్యాలు)
బాప్‌దాదా ఇప్పుడు పిల్లల నుండి ఇదే కోరుకుంటున్నారు - ప్రతి పుత్రుడు మాస్టర్ దాతగా అవ్వండి. ఏదైతే తండ్రి నుండి తీసుకున్నారో అది ఇతరులకు ఇవ్వండి. ఆత్మల నుండి తీసుకునే భావన ఉంచుకోకండి. దయాహృదయులై తమ గుణాల, శక్తుల సహయోగము అందరికీ ఇవ్వండి. విశాలహృదయులుగా అవ్వండి. ఇతరులకు ఎంతగా ఇస్తూ ఉంటారో అంతగా పెరుగుతూ ఉంటుంది. వినాశనమయ్యే ఖజానా ఇచ్చే కొద్దీ తరిగిపోతుంది, అవినాశీ ఖజానా ఇవ్వడం ద్వారా పెరుగుతుంది - ఒకటి ఇవ్వండి, వెయ్యి పొందండి.
మాస్టర్ దాతలనగా సదా నిండుగా, సంపన్నంగా ఉండేవారు. ఎవరి వద్ద అయితే అనుభూతుల ఖజానా సంపన్నంగా ఉంటుందో, ఆ సంపన్న మూర్తులు స్వతహాగా మాస్టర్ దాతలుగా అయిపోతారు. దాతలనగా సేవాధారులు. దాత ఇవ్వకుండా ఉండలేరు. వారు తమ దయాహృదయ గుణము ద్వారా ఎవరికైనా ధైర్యమిస్తారు కనుక ఎవరైనా నిర్బల ఆత్మలకు బలమునిస్తారు. వారు మాస్టర్ సుఖదాతలుగా ఉంటారు. సదా మేము సుఖదాత పిల్లలము మాస్టర్ సుఖదాతలమనే స్మృతి ఉండాలి. ఎవరైనా దాతగా ఉంటే వారి వద్ద ఉండబట్టే ఇస్తారు. ఒకవేళ స్వయం తినడానికే వారి వద్ద లేనివారు దాతలుగా ఎలా అవ్వగలరు? అందుచేత తండ్రి ఎలాంటివారో, పిల్లలు కూడా అలాంటివారే. తండ్రిని సాగరులని అంటారు. సాగరమనగా అనంతము తరగనిది, అలాగే మీరు కూడా మాస్టర్ సాగరులు, నదులు, కాల్వలు కారు. అందుచేత తండ్రి సమానంగా మీరు నిస్వార్థ భావనతోనే ఇస్తూ ఉండండి. అశాంతి సమయంలో మాస్టర్ శాంతిదాతగా అయ్యి ఇతరులను కూడా శాంతినివ్వండి. కంగారు పడకండి. ఎందుకంటే ఏది జరుగుతోందో అది కూడా మంచిదే మరియు ఏది జరగబోతుందో అది ఇంకా మంచిది అని మీకు తెలుసు. వికారాలకు వశీభూతమైన మనుష్యులైతే పోట్లాడుకుంటూనే ఉంటారు. వారి పనే అది. కానీ మీ పని అలాంటి ఆత్మలకు శాంతినివ్వడం, ఎందుకంటే మీరు విశ్వకళ్యాణకారులు. విశ్వకళ్యాణకారీ ఆత్మలు సదా మాస్టర్ దాతలుగా అయ్యి ఇస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరికీ సహయోగము, స్నేహము, సానుభూతి ఇవ్వడమే తీసుకోవడం.
వర్తమాన సమయంలో అందరికీ అవినాశీ సంతోషము అవసరముంది. అందరూ సంతోషానికి భికారిగా ఉన్నారు. మీరు దాత పిల్లలు. దాత పిల్లల పని - '' ఇవ్వడం.'' సంపర్కంలోకి ఎవరైతే వస్తారో వారికి సంతోషాన్ని పంచుతూ పోండి, ఇస్తూ ఉండండి. ఎవరూ ఖాళీగా వెళ్ళరాదు అంత భర్‌పూర్‌గా(సంపన్నంగా) అవ్వండి. ఇప్పుడు మొత్తం ప్రపంచంలోని ఆత్మలంతా సుఖ-శాంతుల భిక్షను యాచించేందుకు మీ ముందుకు వస్తారు. మీరు దాత పిల్లలు. మాస్టర్ దాతలుగా అయ్యి అందరినీ సంపన్నంగా చేస్తారు. కనుక ప్రారంభం నుండే స్వంత భండారాన్ని సర్వ ఖజానాలతో నింపుకుంటూ వెళ్లండి. శ్రేష్ఠ ఆత్మలైన మీరు సంగమ యుగంలో తరగని అఖండ మహాదానులుగా అవ్వండి, నిరంతరం నేను దాత బిడ్డను, అఖండ మహాదానీ ఆత్మను అని స్మృతిలో ఉండండి. ఏ రకమైన ఆత్మలు మీ ముందుకు వచ్చినా, వారు అజ్ఞానులు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు ఎంతో కొంత అందరికీ ఇవ్వాలి. రాజు అంటే అర్థమే దాత కనుక దానమివ్వకుండా ఒక్క సెకను కూడా ఉండలేరు. బ్రాహ్మణ ఆత్మల వద్ద జ్ఞానమైతే ముందే ఉంది, కానీ వారి పట్ల రెండు రకాల దాతలుగా అవ్వండి. 1. ఏ ఆత్మకు ఏ శక్తి అవసరమో, ఆ ఆత్మకు మనసు ద్వారా అనగా శుద్ధమైన వృత్తి, వైబ్రేషన్ల ద్వారా శక్తుల దానము అనగా సహయోగమునివ్వండి. 2. కర్మల ద్వారా సదా స్వంత జీవితములో గుణమూర్తులుగా అయ్యి ప్రత్యక్ష శాంపిల్‌గా అయ్యి ఇతరులు సహజంగా గుణ ధారణ చేసేలా సహయోగమివ్వండి. దానమంటే అర్థం - '' సహయోగమివ్వడం.''
వర్తమాన సమయంలో పరస్పరం విశేషించి కర్మల ద్వారా గుణదాతలుగా అయ్యే అవసరముంది. అందుచేత నేను సదా గుణమూర్తిగా అయ్యి అందరినీ గుణమూర్తులుగా చేసే విశేష కర్తవ్యాన్ని చేసే తీరాలనే సంకల్పం చేయండి. జ్ఞానమైతే చాలా ఉంది. ఇప్పుడు గుణాలను ఎమర్జ్(ప్రత్యక్షం) చేయండి, సర్వగుణ సంపన్నంగా తయారై ఇతరులను తయారు చేసే ఉదాహరణ మూర్తులుగా అవ్వండి. దాత పిల్లలైనట్లయితే ఎవరికి ఏది కావాలో అది ఇస్తూ పోండి. ఎవ్వరూ ఖాళీగా వెళ్ళరాదు. అపారమైన ఖజానా ఉంది. కొందరికి సంతోషం కావాలి, కొందరికి స్నేహం కావాలి, కొందరికి శక్తి కావాలి కనుక ఎవరికి ఏది కావాలో అది ఇస్తూ ఉండండి. ఇప్పుడు పిల్లలైన మీరంతా ఈ శుభ సంకల్పాన్ని ఉత్పన్నం చేయండి - ''దాత పిల్లలుగా అయ్యి ఆత్మలందరికి వారసత్వమిచ్చేందుకు నిమిత్తంగా అవ్వాలి. ఎవ్వరూ వంచితులుగా అవ్వరాదు. ఎవరెలాంటి వారైనా, వారు తండ్రికి చెందినవారే కదా! మీరు దాత పిల్లలైనట్లయితే, విశాల హృదయంతో పంచి పెట్టండి. ఎవరైతే అశాంతిలో, దు:ఖంలో భ్రమిస్తున్నారో వారంతా మీ పరివారమే. పరివారానికి సహయోగమివ్వబడ్తుంది. వర్తమాన సమయములో మహాదానులగా అయ్యేందుకు విశేషించి దయాహృదయుల గుణాన్ని ఉత్పన్నం చేయండి. ఎవరి నుండీ తీసుకునే కోరిక ఉంచుకోకండి - '' వారు మంచిగా మాట్లాడాలి, మంచిగా ఉంటే ఇద్దాం అని అనుకోకండి. మాస్టర్ దాతలుగా అయ్యి వృత్తి ద్వారా, వైబ్రేషన్ల ద్వారా, వాణి ద్వారా ఇస్తూ ఉండండి. బేహద్(అనంతమైన) దాతగా అయ్యి విశ్వగోళము పై నిల్చొని బేహద్ సేవ చేస్తూ ప్రకంపనలు వ్యాపింప చేయండి. మహాన్ దాతగా అవ్వండి. బేహద్‌లోకి(అనంతంలోకి) వెళ్తే హద్దులోని విషయాలు స్వతహాగా సమాప్తమైపోతాయి. అచ్ఛా!

వరదానము :- ''పవిత్రతను విశేషంగా ధారణ చేయడం ద్వారా అతీంద్రియ సుఖాన్ని అనుభవము చేసే బ్రహ్మాచారీ భవ''
బ్రాహ్మణ
జీవితము యొక్క విశేషమైన ధారణ పవిత్రత. ఇదే నిరంతరం అతీంద్రియ సుఖానికి,
స్వీట్ సైలెన్స్‌కు విశేషమైన ఆధారము. పవిత్రత అనగా కేవలం బ్రహ్మచర్యమే
కాదు, బ్రహ్మచారి మరియు సదా బ్రహ్మాచారీ అనగా బ్రహ్మాబాబా ఆచరణ పై ప్రతి
అడుగు వేసి నడిచేవారు. సంకల్పము, మాట మరియు కర్మ అనే అడుగు బ్రహ్మబాబా
అడుగులో అడుగు వేయడం. ఇలా ఎవరైతే బ్రహ్మాచారీగా ఉంటారో వారి ముఖము మరియు
నడవడిక సదా అంతర్ముఖతను, అతీంద్రియ సుఖాన్ని అనుభవము చేయిస్తుంది.
స్లోగన్ :- ''సేవలో త్రికాలదర్శి భావనను(సెన్సును), ఆత్మీయత అనే సుగంధాన్ని(ఎసెన్స్‌ను) నింపేవారే సేవాధారులు''
No comments:
Post a Comment