Thursday, 18 January 2018

Telugu Murli 04/01/18

04-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

''మధురమైన పిల్లలారా - గురువైన తండ్రి మీకు మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యే కళ (టెక్నిక్‌) నేర్పించారు, అలాగే మీరు శ్రీమతముననుసరించి ఇతరులను కూడా దేవతలుగా తయారు చేయు సేవ చేయండి'' 

ప్రశ్న :- ఇప్పుడు పిల్లలైన మీరు ఏ శ్రేష్ఠ కర్మ చేస్తారు? దాని రివాజు (పద్ధతి/ఆచారము) భక్తి మార్గములో కూడా కొనసాగుతూ వస్తున్నది?
జవాబు :- మీరు ఇప్పుడు శ్రీమతముననుసరించి మీ తనువు, మనస్సు, ధనాలను భారతదేశానికే కాక విశ్వమంతటి కళ్యాణము కొరకు అర్పణ చేస్తారు. ఈ పద్ధతే భక్తి మార్గములో మనుష్యులు ఈశ్వరార్థము దానము చేస్తారు. వారికి దానికి బదులు మరుసటి జన్మలో రాజ కుటుంబములో జన్మ లభిస్తుంది. పిల్లలైన మీరు సంగమ యుగములో తండ్రికి సహాయకులుగా అవుతారు. అందువలన మీరు మనుష్యుల నుండి దేవతలుగా అయిపోతారు. 

పాట :- నీవు నిదురించి రాత్రిని పోగొట్టుకున్నావు,......... (తూనే రాత్‌ గవాయి,.........)
ఓంశాంతి. తండ్రి పిల్లలకు అర్థము చేయిస్తున్నారు - తండ్రి చెప్పే విషయాలు పిల్లలు అర్థము చేసుకుంటే వారు మళ్ళీ ఇతరులకు అర్థము చేయిస్తారు. అర్థము చేసుకోకుంటే ఇతరులకు అర్థము చేయించలేరు. స్వయం అర్థము చేసుకొని ఇతరులకు అర్థము చేయించలేకపోతే కొంచెము కూడా అర్థము చేసుకోనట్లే. ఎవరైనా ఏదైనా కళను నేర్చుకుంటే వారు దానిని వ్యాపింపచేస్తారు. మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేసే కళను గురువైన తండ్రి ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. దేవతల చిత్రాలు కూడా ఉన్నాయి. మనుష్యులను దేవతలుగా తయారు చేస్తున్నారంటే ఆ దేవతలు ఇప్పుడు లేరనే కదా. దేవతల గుణాలు మహిమ చేయబడ్తాయి. సర్వ గుణ సంపన్నము..... ఇచ్చట ఉన్న మనుష్యులెవ్వరికీ ఈ గుణగానముండదు. మనుష్యులు మందిరాలకు వెళ్ళి దేవతల గుణాలను మహిమ చేస్తారు. భలే సన్యాసులు కూడా పవిత్రంగా ఉన్నారు, కాని మనుష్యులు వారిని ఇలా గుణగానము చేయరు. ఆ సన్యాసులైతే శాస్త్రాలు మొదలైనవి కూడా వినిపిస్తారు. దేవతలు ఏ శాస్త్రాలు వినిపించలేదు. వారు కేవలము ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. పూర్వ జన్మలో పురుషార్థము చేసి మనుష్యుల నుండి దేవతలుగా అయ్యారు. అందువలన సన్యాసులు మొదలైన వారెవ్వరిలోనూ దేవతల వంటి గుణాలు లేవు. గుణాలు ఎక్కడ లేవో అక్కడ తప్పనిసరిగా అవగుణాలుంటాయి. సత్యయుగములో ఇదే భారతదేశములో యథా రాజా రాణి తథా ప్రజా అందరూ సర్వగుణ సంపన్నంగా ఉండేవారు. వారిలో అన్ని గుణాలు ఉండేవి. ఆ దేవతల గుణాలే మహిమ చేయబడ్తాయి. ఆ సమయములో ఇతర ధర్మములేవీ లేవు. గుణవంతులైన దేవతలు సత్యయుగములో ఉండేవారు. గుణహీనులైన (అవగుణవంతులైన) మనుష్యులు కలియుగములో ఉన్నారు. అయితే ఇప్పుడు ఇటువంటి అవగుణాలు కలిగిన మనుష్యులను గుణవంతులైన దేవతలుగా ఎవరు తయారు చేస్తారు? మనుష్యుల నుండి దేవతలు..... అని గాయనము కూడా ఉంది. ఈ మహిమ పరమపిత పరమాత్మది. వాస్తవానికి దేవతలు కూడా మనుష్యులే, కాని వారిలో గుణాలున్నాయి. ఈ మనుష్యులలో అవగుణాలున్నాయి. గుణాల ప్రాప్తి తండ్రి నుండి జరుగుతుంది. వారిని సద్గురువు అని కూడా అంటారు. అవగుణాల ప్రాప్తి మాయా రావణుని నుండి జరుగుతుంది. ఇంత గుణవంతులు మళ్ళీ అవగుణవంతులుగా ఎలా అవుతారు? సర్వగుణ సంపన్నులుగా మళ్ళీ సర్వ అవగుణ సంపన్నులుగా ఎవరు తయారు చేస్తారు? ఈ విషయాలు పిల్లలైన మీకు తెలుసు. నిర్గుణుడైన నాలో ఏ గుణాలు లేవు అని పాట కూడా పాడ్తారు. దేవతల గుణగానము ఎంతగా చేస్తారు! ఈ సమయములో ఆ గుణాలు ఎవరికి కూడా లేవు. ఆహార పానీయాలు మొదలైనవి ఎంత మురికిగా ఉన్నాయి! దేవతలు వైష్ణవ సంప్రదాయమువారు. ఈ సమయములోని మనుష్యులు రావణ సంప్రదాయము వారు. ఆహార పానీయాలు ఎంతగా మారిపోయాయి! కేవలం దుస్తులనే చూడరాదు. ఆహార పానీయాలను వికారీతనమును చూడాలి. తండ్రి స్వయంగా చెప్తున్నారు - నేను భారతదేశములోనే రావాల్సి వస్తుంది. బ్రహ్మ ముఖవంశావళీ బ్రాహ్మణ - బ్రాహ్మణీల ద్వారా స్థాపన చేయిస్తాను. ఇది బ్రాహ్మణుల యజ్ఞము కదా. ఆ వికారీ బ్రాహ్మణులు కుఖ వంశావళివారు. మీరు ముఖవంశావళి వారు. ఇరువురికి చాలా వ్యత్యాసముంది. ఆ ధనవంతులు రచించే యజ్ఞములో దేహ సంబంధమైన బ్రాహ్మణులు ఉంటారు. వీరు అనంతమైన తండ్రి, ధనవంతులకు ధనవంతులు. రాజులకు కూడా రాజు. ధనవంతులకు ధనవంతులని ఎందుకు అంటారు? ఎందుకంటే ధనవంతులు కూడా మాకు ఈశ్వరుడు ధనమిచ్చాడని అంటారు. ఈశ్వరార్ధము దానము చేస్తే మరుసటి జన్మలో ధనవంతులుగా అవుతారు. ఈ సమయములో మీరు శివబాబాకు తనువు, మనసు, ధనములన్నింటిని అర్పణ చేస్తారు. కావున ఎంత ఉన్నతమైన పదవి పొందుకుంటారు!

మీరు శ్రీమతముననుసరించి ఇంత ఉన్నతమైన కర్మలు నేర్చుకుంటే మీకు తప్పకుండా ఫలము లభించాలి. తనువు, మనసు, ధనములను అర్పణ చేస్తారు. వారు కూడా ఈశ్వరార్థము చేస్తారు కాని ఎవరో ఒకరి ద్వారా చేస్తారు. ఈ ఆచారము భారతదేశములో మాత్రమే ఉంది. ఇప్పుడు తండ్రి మీకు చాలా మంచి కర్మలు నేర్పిస్తారు. మీరు ఈ కర్తవ్యాన్ని కేవలం భారతదేశానికేకాక ప్రపంచమంతటి కళ్యాణార్థము చేస్తారు. కావున దానికి ప్రతిఫలంగా మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే ఫలము లభిస్తుంది. ఎవరెవరు శ్రీమతముననుసరించి ఎటువంటి కర్మలు ఆచరిస్తారో అటువంటి ఫలము లభిస్తుంది. శ్రీమతముననుసరించి మనుష్యులను దేవతలుగా తయారుచేసే సేవ ఎవరు చేస్తారో నేను సాక్షిగా ఉండి చూస్తూ ఉంటాను. జీవితము ఎంతగా పరివర్తన అయిపోతుంది! శ్రీమతమును అనుసరించేవారు బ్రాహ్మణులు. తండ్రి అంటున్నారు - బ్రాహ్మణుల ద్వారా శూద్రులకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను - ఇది 5 వేల సంవత్సరముల నాటి మాట, భారతదేశములోనే దేవీ దేవతల రాజ్యము ఉండేది. చిత్రాలు చూపించాలి. చిత్రాలు లేకుంటే ఇది ఏదో కొత్త ధర్మమని బహుశా విదేశాల నుండి వచ్చిందని భావిస్తారు. చిత్రాలు చూపినందున వీరు దేవతలను అంగీకరిస్తారని అర్థము చేసుకుంటారు. శ్రీ నారాయణుని అంతిమ 84 వ జన్మలో పరమపిత పరమాత్మ ప్రవేశించి రాజయోగము నేర్పిస్తున్నారని అర్థము చేయించాలి. అప్పుడు కృష్ణుని మాట ఎగిరిపోతుంది. ఇది కృష్ణుని జన్మలోని అంతిమ సమయము. ఎవరైతే సూర్యవంశీ దేవతలుగా ఉండినారో వారందరూ వచ్చి మళ్ళీ రాజయోగాన్ని నేర్చుకోవాలి. డ్రామానుసారము పురుషార్థము కూడా తప్పకుండా చేస్తారు. పిల్లలైన మీరు ఇప్పుడు సన్ముఖములో వింటున్నారు. ఇతర పిల్లలు ఈ టేపు ద్వారా వింటారు. అప్పుడు మేము కూడా మతా-పితల జతలో మళ్ళీ దేవతలుగా అవుతున్నామని అర్థము చేసుకుంటారు. ఈ సమయములో 84వ జన్మలో పూర్తి భికారిగా తప్పనిసరిగా అవ్వాలి. ఆత్మ తన సర్వస్వాన్ని తండ్రికి సమర్పణ చేస్తుంది. ఈ శరీరమే అశ్వము. అది స్వాహా అవుతుంది. ఆత్మ స్వయం అంటున్నది - నేను తండ్రి వారినిగా అయ్యాను. తండ్రి తప్ప నాకు ఇతరులెవ్వరూ లేరు. నేను ఆత్మను ఈ శరీరము ద్వారా పరమపిత పరమాత్మ ఆదేశానుసారము సేవ చేస్తున్నాను.

తండ్రి అంటున్నారు - యోగము కూడా నేర్పండి అంతేకాక సృష్టి చక్రము ఎలా తిరుగుతోందో అది కూడా అర్థము చేయించండి. ఎవరైతే పూర్తి చక్రమంతా తిరిగి ఉంటారో, వారు ఈ విషయాలను వెంటనే అర్థము చేసుకుంటారు. ఎవరైతే ఈ చక్రములో రానివారుగా ఉంటారో వారు నిలవరు. మొత్తము సృష్టి అంతా వస్తుందని కాదు. ఇందులో కూడా ప్రజలు అనేకమంది వస్తారు. రాజా-రాణి అయితే ఒక్కరే ఉంటారు కదా. ఉదాహరణానికి లక్ష్మీ నారాయణులు ఒక్కరే గాయనము చేయబడ్తారు. సీతా-రాములు ఒక్కరే గాయనము చేయబడ్తారు, యువరాజులు, యువరాణులైతే ఇంకా వేరే వారు కూడా ఉంటారు. ముఖ్యమైనవారు ఒక్కరే ఉంటారు కదా. అందువలన ఇటువంటి రాజా-రాణిగా తయారయ్యేందుకు చాలా శ్రమ చేయాలి. సాక్షిగా ఉండి చూచుట వలన వీరు ధనవంతులైన రాజకులానికి చెందినవారా లేక పేదకులానికి చెందినవారా? అని తెలిసిపోతుంది. కొంతమంది మాయతో ఎలా ఓడిపోతారంటే ఇచ్చట నిలువక పారిపోను కూడా పారిపోతారు. మాయ ఒక్కసారిగా పచ్చిగా తిని వేస్తుంది. అందుకే బాబా రాజీగా-ఖుషీగా ఉన్నారా? అని అడుగుతారు. మాయ వేసే చంపదెబ్బతో తెలివి తప్పిపోవడమో లేక జబ్బు పడడమో లేదు కదా? కొంతమంది ఈ విధంగా జబ్బు పడ్తారు. అప్పుడు పిల్లలు వారి వద్దకు వెళ్ళి జ్ఞాన-యోగాల సంజీవినీ మూలికనిచ్చి స్పృహ తెప్పిస్తారు. జ్ఞాన-యోగాలలో ఉండని కారణంగా మాయ ఒక్కసారిగా వారి పేరు ప్రతిష్టలను సమాప్తము చేసేస్తుంది. శ్రీమతమును వదిలి మన్మతమును అనుసరిస్తారు. మాయ ఒక్కసారిగా మూర్ఛితునిగా చేసేస్తుంది. వాస్తవానికి ఈ జ్ఞానమే సంజీవిని మూలిక. దీని వలన మాయ ద్వారా ఏర్పడిన మూర్ఛ తొలగిపోతుంది. ఈ విషయాలన్నీ ఈ సమయానికి చెందినవే. సీతలు కూడా మీరే. రాముడు వచ్చి మాయా రావణుని నుండి మిమ్ములను విడిపిస్తారు. కరాచి సింధ్‌లో పిల్లలను ఎలా విడిపించారో అలా విడిపిస్తారు. అయితే రావణ జనులు మళ్ళీ దొంగలించుకొని పోయేవారు. ఇప్పుడు మళ్ళీ మాయ పంజా నుండి అందరినీ విడిపించాలి. బాబాకైతే జాలి కలుగుతుంది. మాయ చెంపదెబ్బలు కొట్టి పిల్లల బుద్ధిని ఒక్కసారిగా ఎలా త్రిప్పివేస్తుందో బాబా గమనిస్తూ ఉంటారు. రాముని నుండి బుద్ధిని మళ్ళీ రావణుని వైపుకు తిప్పేస్తుంది. ఒక ఆట బొమ్మ ఉంటుంది. ఆ ఆట బొమ్మలో ఒకవైపు రాముడు ఉంటాడు, మరొక వైపు రావణుడు ఉంటాడు. ఆశ్చర్యంగా తండ్రివారిగా అవుతారు. మళ్ళీ రావణునివారిగా అవుతారని దానినే అంటారు. మాయ చాలా శక్తివంతమైనది. ఎలుక వలె కొరికి ఆహారమును పాడు చేస్తుంది. అందువలన శ్రీమతమును ఎప్పుడూ వదలరాదు. కఠినమైన ఎక్కుడు కదా. మీ స్వంత మతము అనగా రావణుని మతము. దానిని అనుసరిస్తే చాలా గుటకలు మింగుతారు. చాలా అవమానాల పాలు చేయిస్తారు. ఇటువంటివారు అన్ని సెంటర్లలోనూ ఉన్నారు. స్వయాన్ని నష్టపరచుకుంటారు. సేవ చేసే రూపబసంత్‌లు దాగి ఉండరు. దైవీ రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఇందులో అందరూ తమ తమ పాత్ర కూడా అభినయిస్తారు. బాగా పరుగు తీస్తే తమ కళ్యాణమును చేసుకుంటారు. కళ్యాణము కూడా ఒక్కసారిగా స్వర్గానికి యజమానులుగా చేస్తుంది. తల్లిదండ్రులు సింహాసనాధికారులు అవుతే పిల్లలు కూడా అలాగే అవ్వాలి. తండ్రిని అనుసరించాలి. లేకుంటే మీ పదవిని మీరే తక్కువ చేసుకుంటారు. ఈ చిత్రాలను ఊరకే ఉంచుకొనుటకై తయారుచేయలేదు. వీటి ద్వారా చాలా సర్వీసు చేయాలి. గొప్ప-గొప్ప ధనవంతులు లక్ష్మీనారాయణుల మందిరాన్ని కట్టిస్తారు. కాని ఆ లక్ష్మీనారాయణులు ఎప్పుడు వచ్చారో వారు భారతదేశాన్ని సుఖవంతముగా ఎలా తయారుచేశారో ఎవ్వరికీ తెలియదు. సుఖవంతముగా చేసినందునే అందరూ వారిని స్మృతి చేస్తారు. ఒక్క దిల్‌వాలా మందిరము మాత్రమే ఉండాలని మీకు తెలుసు. ఇది ఒక్కటి ఉంటే చాలు. లక్ష్మీనారాయణుల మందిరము వలన కూడా ఏమి జరుగుతుంది? అదేమీ కళ్యాణకారి కాదు. శివుని మందిరాన్ని నిర్మిస్తారు. అది కూడా అర్థ రహితంగా నిర్మిస్తారు. వారి కర్తవ్యము గురించి అయితే తెలియనే తెలియదు. మందిరాన్ని నిర్మించి కర్తవ్యము గురించి తెలియకుంటే ఏమంటారు? దేవతలు స్వర్గములో ఉన్నప్పుడు మందిరాలు ఉండవు. మందిరాలను కట్టించిన వారిని ఈ లక్ష్మీనారాయణులు ఎప్పుడు వచ్చి వచ్చారు? వారు ఏ సుఖమునిచ్చారు? అని అడగాలి. కొద్దిగా కూడా తెలుపలేరు. దీని వలన ఎవరిలో అవగుణాలు ఉంటాయో వారు గుణవంతుల మందిరాలను కట్టిస్తారని ఋజువు అవుతుంది. అందువలన సర్వీసు చేయాలనే ఆసక్తి పిల్లలకు చాలా ఉండాలి. బాబాకు సేవ చేయాలని ఆసక్తి చాలా ఉంది. అందుకే ఇటువంటి చిత్రాలను తయారు చేయిస్తారు. భలే చిత్రాలను తయారు చేయించేది శివబాబాయే కాని బుద్ధి ఇరువురిదీ నడుస్తుంది. అచ్ఛా.

రాత్రి క్లాసు - 28-6-68 :- ఇక్కడ అందరూ కూర్చుని ఉన్నారు. మనము ఆత్మలమని, మన తండ్రి కూర్చుని ఉన్నారని అర్థము చేసుకున్నారు. దీనిని ఆత్మాభిమానులై కూర్చోవడమని అంటారు. అందరూ మనము ఆత్మలమని, బాబా ముందు కూర్చుని ఉన్నామని అందరూ భావించరు. ఇప్పుడు బాబా స్మృతినిప్పించారు కనుక స్మృతి వస్తుంది. గమనము(అటెన్షన్‌) ఇస్తారు. బుద్ధి బయటకు పరిగెత్తే వారు చాలామంది ఉన్నారు. ఇక్కడ కూర్చుని ఉన్నా చెవులు మూయబడి ఉన్నట్లు ఉంటారు. బుద్ధి బయట ఎక్కడెక్కడికో పరుగెత్తుతూ ఉంటుంది. ఏ పిల్లలైతే తండ్రి స్మృతిలో కూర్చుని ఉన్నారో వారు సంపాదన చేసుకుంటున్నారు. చాలామంది బుద్ధియోగము బయట ఉంటుంది. వారు యాత్ర చేయనట్లే. వారి సమయము వృథా అవుతుంది. తండ్రిని చూచినా బాబా గుర్తుకొస్తారు. నంబరువారు పురుషార్థానుసారము ఉండనే ఉన్నారు. మేము ఆత్మలము, శరీరము కాదు అని కొంతమందికి పక్కాగా అలవాటైపోయింది. తండ్రి జ్ఞానసాగరులు కనుక పిల్లలకు కూడా జ్ఞానము వచ్చేస్తుంది. ఇప్పుడు వాపస్‌(తిరిగి) వెళ్లాలి. చక్రము పూర్తి అవుతుంది. ఇప్పుడు పురుషార్థము చేయాలి. చాలా సమయము గడిచిపోయింది. కొంతమాత్రము మిగిలి ఉంది. పరీక్షల సమయములో కూడా చాలా పురుషార్థము చేయడం ప్రారంభిస్తారు. పురుషార్థము చేయకుంటే ఉత్తీర్ణులు కాలేమని అర్థము చేసుకుంటారు. పదవి కూడా చాలా తగ్గిపోతుంది. పిల్లల పురుషార్థమైతే నడుస్తూనే ఉంటుంది. దేహాభిమానము వలన వికర్మలు జరుగుతాయి. ఇందుకు నూరు రెట్లు శిక్ష పడ్తుంది. ఎందుకంటే నన్ను నిందింపజేస్తారు. తండ్రిని అవమానము పాలు చేసే పనులు చేయరాదు. అందువలన సద్గురువు నిందకులకు స్థానము లేదని గాయనముంది. స్థానము అనగా స్వర్గ సామ్రాజ్యము. చదివించేవారు కూడా తండ్రియే ఏ సత్సంగములోనూ లక్ష్యము లేదు. ఇది మన రాజయోగము. మేము రాజయోగమును నేర్పిస్తామని ఇతరులెవ్వరూ చెప్పలేరు. వారు శాంతిలోనే సుఖముందని భావిస్తారు. అక్కడ సుఖము, దు:ఖముల మాటే లేదు. శాంతియే శాంతి ఉంటుంది. అప్పుడు వీరి అదృష్టములో లేదని భావించబడ్తుంది. మొదట పాత్ర చేసేవారి భాగ్యము చాలా శ్రేష్ఠమైనది. అక్కడ వారికి ఈ జ్ఞానము ఉండదు. అక్కడ సంకల్పము కూడా ఉండదు. మనమంతా అవతరిస్తామని పిల్లలకు తెలుసు. భిన్న భిన్న నామ-రూపాలలో వస్తారు. ఇది డ్రామా కదా. ఆత్మలమైన మనము శరీరాన్ని ధరించి ఇక్కడ పాత్రను అభినయిస్తాము. ఈ రహస్యమంతా తండ్రి కూర్చుని అర్థము చేయిస్తారు. పిల్లలైన మీకు అతీంద్రియ సుఖముంటుంది. మీ ఆంతరికములో సంతోషముంటుంది. వీరు దేహీ-అభిమానులు అని అంటారు. మీరు విద్యార్థులని తండ్రి అర్థము చేయిస్తారు. మనము దేవతలుగా, స్వర్గానికి అధికారులుగా అవుతామని కూడా మీకు తెలుసు. కేవలం దేవతలే కాదు. మనము విశ్వానికి యజమానులుగా అయ్యేవారము. కర్మాతీత అవస్థ వచ్చినప్పుడు ఈ స్థితి స్థిరంగా ఉంటుంది. డ్రామా ప్లాను అనుసారము తప్పకుండా అవ్వాల్సిందే. మనము ఈశ్వరీయ పరివారములో ఉన్నామని మీరకు అర్థము చేసుకున్నారు. తప్పనిసరిగా స్వర్గములో చక్రవర్తి పదవి లభిస్తుంది. ఎవరు ఎక్కువగా సేవ చేస్తారో చాలామందికి కళ్యాణము చేస్తారో, వారికి ఉన్నతపదవి తప్పకుండా లభిస్తుంది. ఇక్కడ యోగములో బాగా కూర్చోగలరని బాబా తెలిపించారు. బయట సెంటర్లో ఇలా జరగదు. నాలుగు గంటలకు వచ్చి యోగములో కూర్చోవడం అక్కడ ఎలా జరుగుతుంది? జరగదు. సెంటర్లో ఉన్నవారు భలే కూర్చున్నా బయటవారికి పొరపాటుగా కూడా చెప్పరాదు. సమయము అలా లేదు. అది ఇక్కడ బాగుంది. ఇంట్లోనే కూర్చొని ఉన్నాము. అక్కడైతే బయట నుండి రావలసి వస్తుంది. ఇది కేవలం ఇక్కడి వారి కొరకే. బుద్ధిలో జ్ఞాన ధారణ జరగాలి. మనము ఆత్మలము. ఇది వారి అకాల సింహాసనము అలవాటు పడాలి. మనమంతా సోదరులము. సోదరునితో మనము మాట్లాడ్తాము. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమైపోతాయి. అచ్ఛా.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. 

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. జ్ఞాన-యోగాల సంజీవిని మూలికతో స్వయాన్ని మాయ కలిగించే మూర్ఛ నుండి రక్షించుకుంటూ ఉండాలి. ఎప్పుడూ మన్మతము పై నడవరాదు.
2. రూప్‌బసంత్‌(జ్ఞాన-యోగులు)లై సేవ చేయాలి. మాతా-పితలను అనుసరించి సింహాసనాధికారులుగా అవ్వాలి. 

వరదానము :- ''దివ్య బుద్ధి మరియు ఆత్మిక దృష్టి యొక్క వరదానము ద్వారా ఒకటవ నంబరు తీసుకునే శ్రేష్ఠ పురుషార్థీ భవ''
ప్రతి బ్రాహ్మణ పుత్రునికి దివ్య బుద్ధి మరియు ఆత్మిక దృష్టి యొక్క వరదానము దివ్య జన్మతోనే ప్రాప్తిస్తాయి. ఈ వరదానమే బ్రాహ్మణ జీవితానికి పునాది. ఈ రెండు మాటల ఆధారముతో సంగమయుగీ పురుషార్థుల నంబరు తయారవుతుంది. వీరి ప్రతి సంకల్పము, మాట మరియు కర్మలో ఎవరు ఎంత ఉపయోగిస్తారో అంత ముందు నంబరు తీసుకుంటారు. ఆత్మిక దృష్టితో వృత్తి మరియు కృతి స్వతహాగానే మారిపోతాయి. దివ్యబుద్ధి ద్వారా యథార్థమైన నిర్ణయం చేసినందున స్వయం సేవ, సంబంధ-సంపర్కాలు యధార్థంగా శక్తిశాలిగా అయిపోతాయి. 

స్లోగన్‌ :- ''సంకల్పము, మాట మరియు కర్మలో పవిత్రత ధారణ ఉన్నట్లయితే, రూపురేఖలలో మెరుపు వస్తుంది''
 

No comments:

Post a Comment