01-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
''మధురమైన పిల్లలారా -
మరజీవగా అయ్యి ఉంటే అన్నీ మర్చిపోండి. ఒక్క తండ్రి ఏదైతే వినిపిస్తారో,
అది మాత్రమే వినండి, తండ్రిని స్మృతి చేయండి. వారి సాంగత్యములోనే
కూర్చోండి.''
ప్రశ్న :- సద్గతిదాత అయిన తండ్రి తన పిల్లల సద్గతి కొరకు ఏ శిక్షణనిస్తారు ?
జవాబు :- బాబా చెప్తున్నారు
- పిల్లలూ! సద్గతిలోకి వెళ్లేందుకు అశరీరులుగా అయ్యి తండ్రిని, చక్రాన్ని
స్మృతి చేయండి. యోగము ద్వారా మీరు సదా ఆరోగ్యవంతులుగా, నిరోగులుగా
అయిపోతారు. ఆ తర్వాత మీరు మీ కర్మలకు పశ్చాత్తాపపడే అవసరము ఉండదు.
ప్రశ్న :- ఎవరి భాగ్యములో స్వర్గ
సుఖాలు ఉండవో, వారి గుర్తులు ఏవి?
జవాబు :- ''వారు జ్ఞానము
వినేందుకు మాకు ఫుర్సత్తే(ఖాళీయే) లేదు'' అని అంటారు. వారు ఎప్పుడూ బ్రాహ్మణ
కులానికి చెందినవారిగా అవ్వరు. భగవంతుడు కూడా ఏదో ఒక సమయములో ఏదో ఒక రూపములో
వస్తారని వారికి తెలియనే తెలియదు.
పాట :- నిన్ను పిలవాలని నా మనస్సు కోరుకుంటూ ఉంది,.....(తుమ్‌హారే బులానే కో జీ చాహ్‌తా హై,....)
ఓంశాంతి. భగవంతుడు కూర్చుని
భక్తులకు అర్థం చేయిస్తున్నారు - భక్తులు కూడా భగవంతుని పిల్లలే. అందరూ
భక్తులే. తండ్రి మాత్రము ఒక్కరే. అందువలన పిల్లలు కనీసము ఒక్క జన్మలో అయినా
తండ్రి జతలో ఉండి చూడాలని కోరుకుంటారు. దేవతలతో కూడా చాలా జన్మలు గడిపాము.
ఆసురీ సంప్రదాయము వారితో కూడా అంతకంటే ఎక్కువ జన్మలు గడిపాము. ఇప్పుడు
భక్తుల మనస్సులో - కనీసము ఒక్క జన్మకైనా భగవంతుని వారమై భగవంతుని జతలో ఉండి
చూడాలని ఉంటుంది. ఇప్పుడు మీరు భగవంతుని వారిగా అయ్యారు. మర్‌జీవాగా
అయ్యారు. కనుక భగవంతుని జతలో ఉంటారు. ఈ అమూల్యమైన అంతిమ జన్మలో మీరు పరమపిత
పరమాత్మ జతలో ఉంటారు. గాయనము కూడా ఉంది - '' మీతోనే తింటాను, మీతోనే
కూర్చుంటాను, మీరు చెప్పింది వింటాను,............. ఎవరైతే మరజీవగా
అవుతారో, వారు ఈ జన్మలో తోడుగా ఉంటారు.'' ఈ ఒక్క జన్మ మాత్రమే అత్యంత
ఉన్నతమైన జన్మ. తండ్రి కూడా ఒక్కసారి మాత్రమే వస్తారు. తర్వాత ఎప్పుడూ
రాజాలరు. ఒక్కసారి మాత్రమే వచ్చి పిల్లల సర్వ కామనలను(కోరికలను) పూర్తి
చేసేస్తారు. భక్తి మార్గములో చాలా ప్రార్థిస్తూ, యాచిస్తూ ఉంటారు. సాధు
సత్పురుషులు, మహాత్ములు, దేవీ దేవతలు మొదలైన వారిని అర్ధకల్పము నుండి
వేడుకుంటూ వచ్చారు. అంతేకాక జపము, తపము, దానము, పుణ్యకర్మలు మొదలైనవి కూడా
జన్మ-జన్మాంతరాలుగా చేస్తూనే వచ్చారు. అనేక శాస్త్రాలు చదువుతారు. అనేకానేక
శాస్త్రాలను, మ్యాగజైనులు మొదలైనవి తయారు చేస్తారు, అలసిపోనే అలసిపోరు.
వీటి ద్వారానే భగవంతుడు లభిస్తాడని భావిస్తారు. కాని ఇప్పుడు తండ్రి
స్వయంగా చెప్తున్నారు - మీరు జన్మ జన్మాంతరాలుగా ఏదైతే చదివారో, ఇప్పుడు ఏ
శాస్త్రాలు మొదలైనవి చదువుతున్నారో వాటి ద్వారా నన్ను ప్రాప్తి చేసుకోలేరు.
అనేక పుస్తకాలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి. క్రైస్తవులు కూడా ఎంతో
నేర్చుకుంటూ ఉన్నారు. అనేక భాషలలో ఎంతగానో వ్రాస్తూ కూడా ఉంటారు. మనుష్యులు
చదువుతూనే ఉంటారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు - ఇంతవరకు చదివినదంతా
మర్చిపోండి, అనగా బుద్ధి నుండి తీసేయండి. చాలా పుస్తకాలు చదువుతారు.
పుస్తకాలలో ' ఫ˜లానా భగవంతుడు, ఫలానా అవతారము' అని వ్రాసి ఉన్నారు. ఇప్పుడు
తండ్రి అంటున్నారు - నేను స్వయంగా వస్తాను. కనుక ఎవరైతే నావారిగా అవుతారో
వారికి, వీటన్నింటినీ మర్చిపోండని చెప్తాను. మొత్తము ప్రపంచములోని వారి
బుద్ధిలో గాని, మీ బుద్ధిలో గాని ఏ విషయమైతే లేదో, దానిని ఇప్పుడు నేను
మీకు వినిపిస్తాను. తండ్రి ఏదైతే చెప్తున్నారో అది శాస్త్రము, మొదలైన
వాటిలో లేదని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థము చేసుకున్నారు. తండ్రి చాలా
రహస్యమైన, రమణీయమైన విషయాలను అర్థం చేయిస్తారు. డ్రామా ఆదిమధ్యాంతాలు,
రచయిత-రచనల సమాచారమంతా మీకు వినిపిస్తారు. అయినా ఎక్కువగా
గుర్తుంచుకోలేకుంటే, కనీసము మన్మనాభవ, మధ్యాజీభవ అను రెండు పదములైనా
గుర్తుంచుకోండి అని తండ్రి చెప్తున్నారు. ఈ పదాలు భక్తి మార్గములోని
భగవద్గీతలోనివి. అయితే తండ్రి ఈ పదాల వాస్తవిక అర్థాన్ని బాగా అర్థము
చేయిస్తారు. భగవంతుడైతే సహజ రాజయోగాన్ని నేర్పించారు. కేవలం తండ్రినైన
నన్ను మాత్రమే స్మృతి చేయండి అని చెప్తారు. భక్తిలో కూడా చాలా స్మృతి
చేస్తూ ఉండేవారు. దు:ఖములో అందరూ స్మృతి చేస్తారు,.......(దు:ఖ్ మే
సిమిరన్ సబ్ కరే,......) అని పాట కూడా పాడ్తారు. అయినా ఏమీ అర్థము
చేసుకోరు. సత్య-త్రేతా యుగాలలో తప్పకుండా సుఖ ప్రపంచము ఉండేది. కనుక వారు
ఎందుకు స్మృతి చేస్తారు? ఇప్పుడు మాయా రాజ్యములో దు:ఖము కలుగుతుంది.
అప్పుడు తండ్రిని స్మృతి చేయవలసి వస్తుంది. మళ్లీ సత్యయుగములోని అపారమైన
సుఖము కూడా గుర్తుకొస్తుంది. ఎవరైతే సంగమ యుగములో తండ్రి నుండి రాజయోగము,
జ్ఞానము నేర్చుకున్నారో వారు మాత్రమే ఆ సుఖ ప్రపంచములో ఉండేవారు. పిల్లలలో
ఎటువంటి చదువురాని వారున్నారో చూడండి. వారికిది ఇంకా మంచిది. ఎందుకంటే వారి
బుద్ధి ఏ ఇతర వైపుకూ వెళ్లదు. ఇచ్చట కేవలం మౌనంగా ఉండాలి. నోటితో కూడా ఏమీ
చెప్పే అవసరము లేదు. కేవలం బాబాను స్మృతి చేస్తూ ఉంటే వికర్మలు
వినాశనమవుతాయి. మళ్లీ నేను నా వెంట తీసుకెళ్తాను. ఈ విషయాలు కొన్ని గీతలో
ఉన్నాయి. ప్రాచీన భారత ధర్మ శాస్త్రము ఒక్కటే. ఈ భారతదేశమే కొత్తదిగా
ఉండేది. ఇప్పుడు పాతదైపోయింది. శాస్త్రమైతే ఒక్కటే ఉంటుంది కదా.
ఉదాహరణానికి బైబుల్ ఒక్కటే ఉంది. ఎప్పటి నుండి క్రైస్తవ ధర్మము స్థాపన
అయ్యిందో అప్పటి నుండి అంతిమం వరకు వారి శాస్త్రము ఒక్కటే. క్రీస్తును కూడా
ఎంతో మహిమ చేస్తారు. క్రీస్తు శాంతిని స్థాపన చేశాడని అంటారు. అతడు వచ్చి
క్రైస్తవ ధర్మాన్ని స్థాపించాడు. అందులో శాంతి మాటే లేదు. ఎవరైతే వస్తారో
వారినందరినీ మహిమ చేస్తూ ఉంటారు. ఎందుకంటే తమ స్వంత మహిమను మర్చిపోయి
ఉన్నారు. బౌద్ధులు, క్రైస్తవులు మొదలైనవారు తమ ధర్మాలను తప్ప ఇతరులెవ్వరినీ
మహిమ చెయ్యరు. భారతవాసులకు తమ ధర్మము లేనే లేదు. ఇది కూడా డ్రామాలో
నిశ్చితమై ఉంది. పూర్తి నాస్తికులుగా అయినప్పుడే తండ్రి మళ్లీ వస్తారు.
తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ! పాఠశాలలు మొదలైన వాటిలో ఏ పుస్తకాలైతే చదివిస్తున్నారో, వాటిలో కనీసము లక్ష్యమైనా ఉంది, లాభము కూడా ఉంది, దాని ద్వారా సంపాదన జరుగుతుంది, పదవి లభిస్తుంది. కాని శాస్త్రాలు మొదలైనవి ఏవైతే చదువుతున్నారో అవన్నీ మూఢ నమ్మకాలు - చదువును ఎప్పుడూ మూఢ నమ్మకమని అనరు. మూఢ నమ్మకముతో చదువుతున్నారని అనరు. చదువు ద్వారా బ్యారిష్టరు, ఇంజనీరు మొదలైనవారిగా అవుతారు. ఆ చదువులను మూఢ నమ్మకాలని ఎలా అంటారు? ఇది కూడా పాఠశాలయే. ఇది ఏ సత్సంగమూ కాదు. ఈశ్వరీయ విశ్వ విద్యాలయమని వ్రాయబడి ఉంది. కనుక ఇది తప్పకుండా ఈశ్వరుని చాలా గొప్ప విద్యాలయమని అర్థం చేసుకోవాలి. అది కూడా ప్రపంచానికంతా అని భావించాలి. దేహ సహితము అన్ని ధర్మాలను వదిలి తమ స్వధర్మములో స్థితము అవ్వండి, తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే ''అంతమతి సో గతి'' అవుతుందని సందేశము కూడా ఇవ్వాలి. మీరు చార్టు వ్రాయాలి. ''ఎంత సమయము మేము యోగము చేస్తున్నాము'' ? అని చార్టు వ్రాయాలి. అందరూ రెగ్యులర్‌గా చార్టు వ్రాస్తారని కాదు. వ్రాయరు, అలసిపోతారు. వాస్తవానికి ఏమి చేయాలి? ప్రతి రోజూ మీ ముఖాన్ని జ్ఞాన దర్పణములో చూసుకోండి. అప్పుడు మేము లక్ష్మీని గాని, సీతను గాని వరించేందుకు అర్హులుగా ఉన్నామా లేక ప్రజలలోకి వెళ్లిపోయేవారమా? అని తెలిసిపోతుంది. తీవ్రముగా పురుషార్థము చేయించేందుకు చార్టు వ్రాయమని చెప్పబడ్తుంది. అంతేకాక మేము ఎంత సమయము శివబాబాను స్మృతి చేశామని చూసుకోగలరు కూడా. చార్టు వ్రాయడం వలన మొత్తము దినచర్య అంతా గుర్తుకు వస్తుంది. బాల్యము నుండి చివరివరకు మొత్తము ఆయుష్షు అంతా జీవితము గుర్తుంటుంది కదా. అటువంటప్పుడు ఒక రోజులో ఏమి చేశారో గుర్తుండదా? మేము బాబాను, చక్రమును ఎంత సమయము స్మృతి చేశామని పరిశీలించుకోవాలి. ఇలా అభ్యాసము చేయడం వలన రుద్ర మాలలో కూర్చబడేందుకు త్వరగా పరుగు తీస్తారు. ఇది యోగ యాత్ర. దీనిని గురించి ఇతరులెవ్వరికీ తెలియదు. కావున వారు ఇతరులకు ఎలా నేర్పించగలరు? ఇప్పుడు బాబా వద్దకు వాపసు వెళ్లాలని మీకు తెలుసు. బాబా నుండి లభించే వారసత్వము రాజ్య పదవి. అందువలన దీనికి రాజయోగమని పేరు వచ్చింది.
మీరందరూ రాజఋషులు, వారు హఠయోగ ఋషులు. వారు కూడా పవిత్రంగా ఉంటారు. రాజ్యములో రాజు, రాణి, ప్రజలు అందరూ ఉండాలి. సన్యాసులలో అయితే రాజులు, రాణులు ఉండనే ఉండరు. వారిది హద్దు వైరాగ్యము. మీది బేహద్(అనంతమైన) వైరాగ్యము. వారు ఇల్లు- వాకిళ్లు వదిలినా, ఈ వికారి ప్రపంచములోనే ఉంటారు. మీకైతే ఈ ప్రపంచము తర్వాత స్వర్గముంటుంది. అది దైవీ ఉద్యానవనము. కావున అవే గుర్తుకు వస్తాయి. ఈ విషయాలను పిల్లలైన మీరు మాత్రమే బుద్ధిలో ఉంచుకోగలరు. చార్టు వ్రాయలేనివారు కూడా చాలామంది ఉన్నారు. నడుస్తూ-నడుస్తూ అలసిపోతారు. బాబా అంటున్నారు - నేను ఎంత సమయము అత్యంత ప్రియమైన (మోస్ట్ బిలెవెడ్) బాబాను స్మృతి చేశానని నోటు చేసుకోండి. ఆ తండ్రి స్మృతి ద్వారానే మీరు వారసత్వము తీసుకోవాలి. రాజ పదవిని వారసత్వముగా తీసుకోవాలంటే ప్రజలను కూడా తయారు చేసుకోవాలి. బాబా స్వర్గ రచయిత, అందువలన వారి నుండి స్వర్గ వారసత్వము ఎందుకు లభించదు? చాలా మందికి స్వర్గ వారసత్వము లభిస్తుంది. మిగిలిన వారికి శాంతి లభిస్తుంది. తండ్రి పిల్లలందరికీ చెప్తున్నారు - పిల్లలూ! దేహ సహితము దేహ సంబంధాలన్నీ మర్చిపోండి. మీరు అశరీరులుగా వచ్చారు, 84 జన్మలు అనుభవించారు. ఇప్పుడు మళ్లీ అశరీరులుగా అవ్వండి. క్రైస్తవ ధర్మము వారికి కూడా మీరు ఏసుక్రీస్తుకు తర్వాత వచ్చిన వారు మీరు కూడా శరీరము లేకుండా వచ్చారు, ఇచ్చట శరీరము తీసుకొని పాత్ర చేశారు. ఇప్పుడు మీ పాత్ర కూడా పూర్తి అవుతుంది. కలియుగము అంత్య దశకు వచ్చేసింది. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేయండి అని చెప్పండి. ఈ విషయాలు ముక్తిధామము వారు విని చాలా సంతోషిస్తారు. వారు కోరుకునేదే ముక్తి. జీవన్ముక్తి(సుఖము) పొందుకొని, మళ్లీ దు:ఖములోకి రావడం కంటే ముక్తిధామమే బాగుంటుందని భావిస్తారు. సుఖము చాలా ఉంటుందని వారికి తెలియదు. ఆత్మలమైన మనము తండ్రి జతలో పరంధామములో ఉండేవారము. కాని ఇప్పుడు పరంధామాన్ని మర్చిపోయాము. తండ్రి వచ్చి సందేశకులందరినీ పంపిస్తారని అంటారు. వాస్తవానికి అలా ఎవ్వరూ పంపరు. ఇదంతా తయారైన డ్రామా. ఇప్పుడు మనము మొత్తం డ్రామా అంతా తెలుసుకున్నాము. పిల్లలైన మీ బుద్ధిలో తండ్రి మరియు చక్రము గుర్తున్నాయి. కనుక మీరు తప్పకుండా చక్రవర్తి రాజులుగా అవుతారు. ఇచ్చట దు:ఖము చాలా ఉందని మనుష్యులు భావించి ముక్తిని కోరుకుంటారు. గతి-సద్గతి అనే రెండు పదాలు వస్తూనే ఉన్నాయి, వాడుతూనే ఉన్నారు. కాని వీటి అర్థము ఎవ్వరికీ తెలియదు. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రే అని మిగిలిన వారంతా పతితులని పిల్లలైన మీకు తెలుసు. మొత్తం ప్రపంచమంతా పతితమై ఉంది. ఈ మాటలకు కూడా కొంతమంది కోపపడుతారు. తండ్రి అంటున్నారు - ఈ శరీరాన్ని మర్చిపోండి. మిమ్ములను అశరీరులుగా పంపాను. ఇప్పుడు కూడా మళ్లీ అశరీరులుగా అయ్యి నా జతలో రావాలి. దీనిని 'జ్ఞానము లేక శిక్షణ' అని అంటారు. ఈ విద్య ద్వారానే సద్గతి లభిస్తుంది. యోగము ద్వారా మీరు సదా ఆరోగ్యవంతులుగా (ఎవర్ హెల్తీగా) అవుతారు. మీరు సత్యయుగములో చాలా సుఖంగా ఉండేవారు. ఏ వస్తువుకూ కొరత ఉండేది కాదు. దు:ఖమిచ్చే వికారము ఏదీ ఉండేది కాదు. మోహజీత్ రాజు కథను వినిపిస్తారు కదా. బాబా అంటున్నారు - నేను మీకు ఎటువంటి కర్మలు నేర్పిస్తానంటే ఎప్పుడు కూడా మీరు మీ కర్మలకు పశ్చాత్తాపపడే పని ఉండదు. అచ్చట ఇంత చలి కూడా ఉండదు. ఇప్పుడైతే 5 తత్వాలు కూడా తమోప్రధానంగా ఉన్నాయి. అప్పుడప్పుడు చాలా ఎక్కువ వేడి, అప్పుడప్పుడు చాలా ఎక్కువ చలి. అచ్చట ఇలాంటి ఆపదలేవీ ఉండవు. సదా వసంత ఋతువే ఉంటుంది. ప్రకృతి సతోప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు ప్రకృతి తమోప్రధానంగా ఉంది. అందువలన ఇక్కడ మంచి మనుష్యులెలా ఉంటారు? భారతదేశములోని గొప్ప గొప్ప అధికారులు సన్యాసుల వెంట తిరుగుతూ ఉంటారు. వారి వద్దకు పిల్లలు(మన కుమారీలు) వెళ్తే ఫుర్సత్తు లేదని అంటారు. దీని వలన వారి భాగ్యములో స్వర్గ సుఖము లేదని అర్థమైపోతుంది. బ్రాహ్మణ కులానికి చెందినవారిగా అవ్వనే అవ్వరు. వారికి భగవంతుడు ఎలా వస్తారో, ఎప్పుడు ఇచ్చటకు వస్తారో వారికి తెలియనే తెలియదు. శివజయంతి పండుగ జరుపుకుంటారు. కాని అందరూ శివుని భగవంతునిగా భావించరు. ఒకవేళ వారిని పరమపిత పరమాత్మ అని భావిస్తే శివజయంతిని శెలవు రోజుగా జరుపుకునేవారు. తండ్రి అంటున్నారు - నా జన్మ భారతదేశములోనే జరుగుతుంది. నా మందిరాలు కూడా ఇక్కడే ఉన్నాయి. తప్పకుండా ఏదో ఒక శరీరములో ప్రవేశించి ఉంటారు. దక్ష ప్రజాపతి యజ్ఞమును రచించినట్లు చూపుతారు. అయితే అందులో ఏమైనా వచ్చి ఉంటారా! అలా అని కూడా చెప్పరు. కృష్ణుడైతే సత్యయుగములో ఉంటాడు. తండ్రి స్వయంగా చెప్తారు - నేను బ్రహ్మ నోటి ద్వారా బ్రాహ్మణ వంశాన్ని రచించాల్సి ఉంటుంది. ఈ విషయము కూడా మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. బాబా కేవలం ''నన్ను స్మృతి చేయండి'' అని ఎంతో సులభంగా అర్థం చేయిస్తారు. అయితే మాయ ఎంత ప్రబలమైనదంటే స్మృతి చేయనివ్వదు. అది అర్ధకల్పపు శత్రువు. ఈ శత్రువు పైనే విజయము పొందాలి. భక్తిమార్గములో మనుష్యులు చలిలో స్నానము చేసేందుకు వెళ్తారు. ఎన్నో ఎదురుదెబ్బలు తింటారు. దు:ఖము సహిస్తారు. ఇక్కడైతే ఇది పాఠశాల. ఇచ్చట చదువుకోవాలి. ఇందులో ఎదురుదెబ్బలు తినే మాటే లేదు. పాఠశాలలో గుడ్డి నమ్మకాల మాట లేదు. మనుష్యులైతే చాలా గుడ్డి నమ్మకాలలో చిక్కుకొని, కూరుకొనిపోయి ఉన్నారు. అనేకమంది గురువులను మొదలైన వారిని ఆశ్రయిస్తారు. కాని మనుష్యులు ఎప్పుడూ మనుష్యులకు సద్గతినివ్వలేరు. ఎవరైతే మనుష్యులను గురువులుగా చేసుకుంటారో వారిదంతా మూఢ నమ్మకమే కదా. ఈ రోజులలో చిన్న పిల్లలను కూడా గురువుల వద్దకు తీసుకెళ్తారు. వారి చేత కూడా గురువులను ఆశ్రయింపజేయిస్తారు. నిజానికి వానప్రస్థములో గురువులను ఆశ్రయించే నియమముంది. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తీవ్ర
పురుషార్థము కొరకు స్మృతి చార్టును తప్పకుండా ఉంచుకోవాలి. ప్రతి రోజు
దర్పణములో మీ ముఖాన్ని చూసుకోవాలి. అత్యంత ప్రియమైన తండ్రిని ఎంత సమయము
స్మృతి చేస్తున్నామని చెక్ చేసుకోవాలి.
2. ఇంతవరకు ఏదైతే
చదివారో, అదంతా మర్చిపోయి మౌనంగా ఉండాలి. నోటితో ఏమీ అనే అవసరము లేదు.
తండ్రి స్మృతిలో వికర్మలను వినాశనము చేసుకోవాలి.
వరదానము :- ''బ్రహ్మబాబా అడుగులో అడుగు వేస్తూ హద్దును బేహద్‌లో ఇమిడ్చి వేసే బేహద్ బాద్‌షాహ్ (బేహద్ చక్రవర్తి ) భవ ''
తండ్రిని
అనుసరించడం అనగా 'నాది' ని 'నీది' లో ఇమిడ్చి వేయడం. హద్దును
బేహద్‌లో(అనంతంలో) ఇమిడ్చి వేయడం - ఇప్పుడు ఈ అడుగు పై అడుగు ఉంచే(వేసే)
అవసరముంది. అందరి సంకల్పాలు, మాటలు, సేవ చేసే విధి అనంతమైనవిగా
అనుభవమవ్వాలి. స్వ పరివర్తన కొరకు హద్దును సర్వ వంశ సహితంగా సమాప్తము
చేయండి. ఎవ్వరిని చూచినా లేక ఎవరు మిమ్ములను చూచినా అనంతమైన చక్రవర్తి అనే
నశా అనుభవమవ్వాలి. సేవ కూడా ఉండాలి, సెంటర్లు కూడా ఉండాలి, కానీ హద్దు
నామ-రూపాలు కూడా ఉండరాదు. అప్పుడు విశ్వ రాజ్య సింహాసనము ప్రాప్తి
అవుతుంది.
స్లోగన్ :- ''మీ ఆలోచనలను విశాలంగా చేసుకుంటే, చిన్న చిన్న విషయాలలో సమయం వృథా అవ్వదు ''
No comments:
Post a Comment