03-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - బుద్ధియోగాన్ని తండ్రితో జోడిస్తూ ఉంటే, సుదీర్ఘమైన ఈ యాత్రను సహజంగా దాటుకుంటారు''
ప్రశ్న :- తండ్రి పై బలిహారమయ్యేందుకు ఏ విషయాన్ని త్యాగము చేయడం అవసరము?
జవాబు :- దేహాభిమానము.
దేహాభిమానము వచ్చిందంటే మరణిస్తారు(చదువును వదిలేస్తారు), వ్యభిచారులుగా
అవుతారు. అందుకే బలిహారమవ్వడంలో పిల్లల హృదయము విదీర్ణమౌతుంది (దు:ఖము
కలుగుతుంది). బలిహారమైన తర్వాత ఆ ఒక్కరి స్మృతే ఉండాలి. వారి పైనే
బలిహారమవ్వాలి. వారి శ్రీమతమునే అనుసరించాలి.
పాట :- ఓ రాత్రి ప్రయాణికుడా! అలసిపోకు,........... ( రాత్ కే రాహీ!.............. ) ఓంశాంతి. భగవానువాచ
- భగవంతుడు తమ పిల్లలకు రాజయోగాన్ని, జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు.
భగవంతుడు మనిషి కాదు. గీతలో కృష్ణ భగవానువాచ అని వ్రాయబడి ఉంది. ఇప్పుడు
శ్రీ కృష్ణుడు మొత్తం ప్రపంచమంతటినీ మాయ నుండి విముక్తులుగా చేయడం సంభవం
కాదు. ఎవరైతే తండ్రిని తమవారిగా చేసుకున్నారో, తండ్రి సన్ముఖములో కూర్చొని
ఉన్నారో ఆ పిల్లలకే తండ్రే స్వయంగా వచ్చి అర్థము చేయిస్తున్నారు. కృష్ణుని
తండ్రి అని అనేందుకు వీలు లేదు. తండ్రిని పరమపిత పరంధామ నివాసి అని అంటారు.
ఆత్మ ఈ శరీరము ద్వారా భగవంతుని స్మృతి చేస్తుంది. తండ్రి కూర్చొని అర్థము
చేయిస్తున్నారు - నేను మీ తండ్రిని, పరంధామ నివాసిని. నేను సర్వాత్మలకు
తండ్రిని. కల్పక్రితము కూడా నేనే వచ్చి మీ బుద్ధియోగమును పరమపిత అయిన నాతో
జోడించమని పిల్లలకు నేర్పించాను. ఆత్మలతో మాట్లాడటం జరుగుతుంది. ఆత్మ
ఎంతవరకు శరీరములోకి రాదో అంతవరకు కనుల ద్వారా చూడలేదు. చెవుల ద్వారా
వినలేదు. ఆత్మ లేకుంటే శరీరము జడమైపోతుంది. ఆత్మ చైతన్యమైనది. గర్భములో
శిశువు ఉంటుంది. కాని ఎంతవరకు అందులో ఆత్మ ప్రవేశించదో అంతవరకు వానిలో
కదలిక ఉండదు. కావున ఇటువంటి చైతన్య ఆత్మలతో తండ్రి మాట్లాడ్తారు. నేను ఈ
శరీరాన్ని అప్పుగా తీసుకున్నానని తండ్రి అంటున్నారు. నేను వచ్చి
ఆత్మలందరినీ వాపస్ తీసుకెళ్తాను. మళ్ళీ ఏ ఆత్మలైతే నా సన్ముఖములో ఉంటాయో
వారికి రాజయోగము నేర్పిస్తాను. రాజయోగాన్ని మొత్తము ప్రపంచమంతా నేర్చుకోదు.
కల్పక్రితము వారే రాజయోగమును నేర్చుకుంటున్నారని తండ్రి
తెలియజేస్తున్నారు.
బుద్ధియోగాన్ని చివరి వరకు తండ్రితో జోడిస్తూ ఉండాలి. ఇందులో ఆగిపోరాదని ఇప్పుడు బాబా అర్థము చేయిస్తున్నారు. స్త్రీ - పురుషులు వివాహము కాక ముందు ఒకరికొకరు తెలియనివారిగా ఉంటారు. ఇద్దరి నిశ్చితార్థము(వివాహము) జరిగిన తర్వాత కొందరు 60 - 70 సంవత్సరాలు కూడా కలిసి ఉంటారు. కావున జీవితమంతా ఒకరి దేహాన్ని ఒకరు తల్చుకుంటూ ఉంటారు. ఆమె ఇతడు నా పతి అని అంటుంది. అతడు ఈమె నా పత్ని అని అంటాడు. ఇప్పుడు మీ నిశ్చితార్థము నిరాకారునితో జరిగింది. నిరాకార తండ్రియే స్వయంగా వచ్చి నిశ్చితార్థము చేయించారు. కల్పక్రితము వలె పిల్లలైన మీ నిశ్చితార్థము నాతో చేయిస్తానని అంటున్నారు. నిరాకారుడినైన నేను ఈ మానవ సృష్టికి బీజ రూపుడను. ఈ మానవ సృష్టిని గాడ్‌ఫాదర్ రచించాడని అందరూ అంటారు. అందువలన మీ తండ్రి సదా పరంధామములో ఉంటారు. ఇప్పుడు నన్ను స్మృతి చేయండి అని వారు చెప్తున్నారు. యాత్ర చాలా సుదీర్ఘమైనందున చాలామంది పిల్లలు అలసిపోతారు. బుద్ధియోగాన్ని పూర్తిగా జోడించలేరు. మాయతో చాలా దెబ్బలు తినడం వలన అలసిపోతారు, ఒక్కొక్కసారి మరణిస్తారు కూడా(చదువును వదిలేస్తారు). తర్వాత బాబా చేతిని వదిలేస్తారు. కల్పక్రితము కూడా ఇలాగే జరిగింది. ఎంతవరకు జీవించి ఉంటారో అంతవరకు స్మృతి చేయాలి. పతి మరణించినా స్త్రీ స్మృతి చేస్తూ ఉంటుంది. ఈ తండ్రి లేక పతి అలా వదలిపెట్టి వెళ్ళేవాడు కాదు. వారంటున్నారు - నేను ప్రేయసులైన మిమ్ములను నా వెంట తీసుకెళ్తాను. అయితే ఇందులో సమయము పడ్తుంది, అలసిపోరాదు. తల పై పాప భారము చాలా ఉంది. ఆ భారము యోగములో ఉండడం వల్లనే దిగిపోతుంది. చివరిలో తండ్రి లేక ప్రియుడు తప్ప ఇతరులెవరూ స్మృతిలోకి రాని విధంగా యోగముండాలి. ఒకవేళ ఇతరులెవరైనా గుర్తుకు వస్తే అది వ్యభిచారి స్మృతి అయిపోతుంది. తర్వాత పాపాలకు దండన భోగించవలసి ఉంటుంది. అందువలన తండ్రి అంటున్నారు - పరంధామ యాత్ర చేయు ప్రయాణికుడా! అలసిపోండి.
నేను బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మమును స్థాపన చేస్తున్నానని, శంకరుని ద్వారా అన్ని ధర్మాలను వినాశనము చేయిస్తానని మీకు తెలుసు. ఇప్పుడు సమావేశాలు జరుపుతూ ఉంటారు. అందులో అన్ని ధర్మాలు కలిసి ఒకే మతముగా ఎలా అవ్వాలి, అందరూ శాంతిగా ఎలా ఉండాలి అని దారి వెతుకుతారు. ఇప్పుడు అనేక ధర్మాలు కలిసి ఒకే మతముగా అవ్వలేవు. ఏకమతము వలన ఏక ధర్మ స్థాపన జరుగుతుంది. అన్ని ధర్మాలు సర్వ గుణ సంపన్నంగా, సంపూర్ణ నిర్వికారిగా అయినప్పుడు పరస్పరము పాలు-పంచదార వలె అవ్వగలరు. రామరాజ్యములో అందరూ క్షీర ఖండము (చెక్కెర-పాలు) వలె ఉండేవారు. జంతువులు కూడా పోట్లాడుకునేవి కావు. ఇచ్చట అయితే ఇంటి ఇంటిలో గొడవలు ఉన్నాయి. ఎప్పుడైతే వారికి దిక్కులేక నాథుడు ఎవ్వరూ ఉండరో అప్పుడు పోట్లాడుకుంటూ ఉంటారు. వారికి తమ తల్లిదండ్రులను గురించి తెలియదు. నీవే తల్లివి - తండ్రివి, మేము మీ పిల్లలము..... మీ కృప వలన అపారమైన సుఖము...... అని పాడుతూ కూడా ఉంటారు. అపారమైన సుఖమైతే ఇప్పుడు లేనే లేదు. కావున మాతా-పితల కృప లేదని అంటారు. తండ్రిని గురించి తెలియనే తెలియదు. అలాంటప్పుడు తండ్రి వారి పై కృపను ఎలా చూపుతారు? మళ్ళీ టీచరు ఆదేశానుసారము నడుచుకున్నప్పుడు కృప లభిస్తుంది. వారేమో సర్వవ్యాపి అని అనేస్తారు. అయితే ఎవరు కృప చూపాలి? ఎవరి పై కృప చూపించాలి? కృపను పొందేవారు, కృపను చూపేవారు ఇరువురూ కావాలి. విద్యార్థులు మొదట టీచరు వద్దకు వచ్చి చదువుకోవాలి. ఈ చదువుకునే కృపను తమ పై తాము చూపుకోవాలి. తర్వాత టీచరు ఆదేశానుసారము నడుచుకోవాలి. పురుషార్థము చేయించేవారు కూడా కావాలి. వీరు తండ్రే కాక టీచరు, సద్గురువు కూడా అయ్యారు. వారిని పరమపిత, పరమ శిక్షకుడు, పరమ సద్గురువు అని కూడా అంటారు. తండ్రి అంటున్నారు - నేను కల్ప కల్పము వచ్చి ఈ స్థాపనా కార్యమును చేయిస్తాను. పతిత ప్రపంచాన్ని పావన ప్రపంచంగా తయారు చేస్తాను. వారు వరల్డ్ ఆల్‌మైటీ అథారిటీ(సర్వశక్తివంతులు) కదా. అందువలన వరల్డ్ అథారిటీ రాజ్యాన్ని స్థిరముగా స్థాపన చేస్తారు. మొత్తము సృష్టి పై ఒకే లక్ష్మీనారాయణుల రాజ్యము ఉండేది. వారిది సర్వ శక్తివంతమైన రాజ్యముగా ఉండేది. అచ్చట ఏ యుద్ధాలు, జగడాలు జరిగేవి కావు. అచ్చట మాయ ఉండనే ఉండదు. అది బంగారు యుగము, వెండి యుగము, సత్య-త్రేతా యుగాలు రెండింటిని స్వర్గము లేక వైకుంఠము అని అంటారు. అందరూ కూడా పాడ్తారు. బృందావనానికి పదండి. రాధా-గోవిందులను భజించండి......... అని పాటలు కూడా పాడ్తారు. కాని అచ్చటకు ఎవ్వరూ వెళ్లలేరు. కేవలం స్మృతి మాత్రము తప్పకుండా చేస్తారు. ఇప్పుడిది మాయావి రాజ్యము. అందరూ రావణుని మతమును అనుసరిస్తున్నారు. పైకి చూచేందుకు అయితే మనుష్యులు చాలా గొప్పవారిగా, మంచివారిగా కనిపిస్తారు. పెద్ద పెద్ద బిరుదులు లభిస్తాయి. కొంత దేహ సంబంధమైన ధైర్యాన్ని చూపుతారు లేక మంచి కర్మలు ఏవైనా చేస్తారు. దాని వలన వారికి బిరుదులు లభిస్తాయి. కొందరికి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫి. కొందరికి ఇంకేమో......... రకరకాల బిరుదులు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా ఉన్నారు. ఖచ్చితంగా భారతదేశము సేవలో ఉన్నారు. మీరు దైవీ రాజధానిని స్థాపన చేస్తున్నారు. స్థాపన ఎప్పుడు పూర్తి అవుతుందో, అప్పుడు మీకు బిరుదులు లభిస్తాయి. సూర్యవంశీ రాజా-రాణి, చంద్రవంశీ రాజా-రాణి,....... అను బిరుదులు లభిస్తాయి. మళ్ళీ మీ రాజ్యము నడుస్తుంది. అచ్చట ఎవ్వరికీ బిరుదులు లభించవు. ఎందుకంటే అచ్చట ఎవరి దు:ఖమునైనా దూరము చేసేందుకు లేక సాహసము చూపించి బిరుదులు తీసుకునేందుకు అచ్చట దు:ఖమనే మాటే ఉండదు. ఇచ్చట ఉండే ఆచార-వ్యవహారాలు అచ్చట ఉండవు. లక్ష్మీనారాయణులు ఈ పతిత ప్రపంచములోనికి రాజాలరు. ఈ సమయములో ఒక్కరు కూడా పావన దేవతలు లేరు. ఇది పతిత ఆసురీ ప్రపంచము, అనేక మతమతాంతరాలలో తికమక చెంది ఉన్నారు. ఇచ్చట అయితే ఒకే ఒక శ్రీమతముంది, దాని ద్వారా రాజధాని స్థాపన అవుతూ ఉన్నది. అయితే నడుస్తూ-నడుస్తూ ఎవరికైనా మాయ యొక్క ముల్లు గ్రుచ్ఛుకుంటుంది. అప్పుడు కుంటుతూ నడుస్తూ ఉంటారు. అందువలన తండ్రి అంటున్నారు - సదా శ్రీమతమును అనుసరించండి. మీ స్వంత మతము పై నడిస్తే మోసపోతారు. సత్యమైన తండ్రి మతమును అనుసరిస్తే సత్యమైన సంపాదన జరుగుతుంది. మీ మతము పై నడుచుకుంటే నావ మునిగిపోతుంది. ఎంతోమంది మహావీరులు శ్రీమతమును అనుసరించని కారణంగా అధోగతి పాలయ్యారు.
ఇప్పుడు పిల్లలైన మీరు సద్గతిని పొందాలి. శ్రీమతమును అనుసరించక దుర్గతిని పొందితే తర్వాత ఎంతగానో పశ్చాత్తాప పడవలసి వస్తుంది. మళ్ళీ ధర్మరాజుపురములో శివబాబా ఈ శరీరములో కూర్చొని నేను మీకు అంతగా అర్థము చేయించాను. ప్రతి రోజూ చదివించాను. ఎంతగా కష్టపడ్డాను! శ్రీమతమును అనుసరిస్తామని నిశ్చయ పత్రము కూడా వ్రాసి ఇచ్చారు. కాని అలా నడుచుకోలేదని సాక్షాత్కారము చేయిస్తారు. శ్రీమతమును ఎప్పుడూ వదిలి పెట్టరాదు. ఏమి జరిగినా తండ్రికి తెలుపుట వలన మమ్ములను అప్రమత్తం చేయడం జరుగుతుంది. బాబాను ఎప్పుడు మర్చిపోతారో అప్పుడు ముల్లు గుచ్ఛుకుంటుంది. పిల్లలు సద్గతినిచ్చే తండ్రి నుండి కూడా మూడు కోసుల దూరము పారిపోతారు. బాబా మీ పై బలిహారమవుతాను. సమర్పణ అవుతానని పాడ్తారు కూడా. కాని ఎవరి పై ? సన్యాసుల పై బలిహారమౌతాము లేక బ్రహ్మ, విష్ణు, శంకరుల పై బలిహారమౌతాము లేక కృష్ణుని పై బలిహారమౌతాము అని వ్రాయలేదు కదా. పరమపిత పరమాత్మ పైననే బలిహారమవ్వాలి. ఏ ఇతర మనుష్యుల పైన కాదు. వారసత్వము లభించేది తండ్రి నుండి మాత్రమే. తండ్రి పిల్లల పై బలిహారమౌతారు. ఈ అనంతమైన తండ్రి కూడా అంటున్నారు - నేను బలిహారమయ్యేందుకు వచ్చాను. కానీ తండ్రి పై బలిహారమయ్యేందుకు పిల్లల హృదయము ఎంతో విలవిలలాడి(విదీర్ణము) పోతుంది. దేహాభిమానములోకి వచ్చారంటే మరణిస్తారు. వ్యభిచారిగా అవుతారు. ఆ ఒక్కరి స్మృతి మాత్రమే ఉండాలి. వారి పై బలిహారమవ్వాలి. ఇప్పుడు నాటకము పూర్తి అవుతుంది. మనము వాపసు వెళ్ళాలి. మిగిలిన బంధు-మిత్రులు మొదలైన వారందరూ శ్మశానగ్రస్థులుగా అవుతారు. అటువంటివారిని ఏమి స్మృతి చేస్తాము? ఇందుకై చాలా అభ్యాసము చేయాలి. గాయనము కూడా ఉంది. పైకి ఎక్కితే అమృత రసము త్రాగుతారు..... జోరుగా క్రింద పడితే పదవి పోగొట్టుకుంటారు. అయితే స్వర్గములోకి రారని కాదు. వస్తారు కాని రాజు-రాణిగా అవ్వడంలో, ప్రజలుగా అవ్వడంలో తేడా ఉంది కదా. ఇచ్చట ఆటవికులను చూడండి. మినిస్టరును చూడండి. తేడా ఉంది కదా. అందువలన పురుషార్థము పూర్తిగా చేయాలి. ఎవరైనా క్రింద పడినారంటే పూర్తిగా పతితులైపోతారు. శ్రీమతమును అనుసరించ లేకుంటే, మాయ ముక్కుతో పట్టుకుని పూర్తిగా మురికి కాలువలో పడేస్తుంది. బాప్‌దాదావారిగా తయారైన తర్వాత ద్రోహిగా అవ్వడం అనగా బాప్‌దాదాను ఎదిరించడం అవుతుంది. అందువలన తండ్రి అంటున్నారు - ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. ఇప్పుడు మాయ అంతమవ్వనుంది. అందువలన చాలామందిని క్రింద పడేస్తుంది. అందువలన పిల్లలు చాలా హెచ్చరికగా, అప్రమత్తంగా ఉండాలి. దారి కొద్దిగా పొడవైనది. పదవి కూడా చాలా గొప్పది. ద్రోహిగా తయారయ్యారంటే శిక్షలు కూడా చాలా భారీగా ఉంటాయి. ధర్మరాజు అయిన బాబా శిక్షించునప్పుడు ఎంతగానో ఆర్తనాదాలు చేస్తారు. ఆ శిక్షలు కల్ప-కల్పానికి స్థిరమైపోతాయి. మాయ చాలా ప్రబలమైనది. తండ్రిని ఏ కొద్దిగా అగౌరవపరచినా మరణిస్తారు. సద్గురువు నిందకులకు స్వర్గములో స్థానము దొరకదు అని గాయనము చేయబడి ఉంది. కామానికి వశమై, క్రోధానికి వశమై వ్యతిరేక కర్మలు చేస్తారు. అనగా తండ్రిని నిందలపాలు చేస్తారు. దండనకు నిమిత్తముగా శిక్షకు అర్హులుగా అవుతారు. అడుగడుగునా పదమాల సంపాదన ఉన్నప్పుడు పదమాల నష్టము కూడా ఉంది. సేవలో జమ అవుతే వ్యతిరేక కర్మల ద్వారా ఆ జమ అంతా శూన్యమైపోతుంది. బాబా వద్ద పూర్తి లెక్కాచారమంతా ఉంది. ఇప్పుడు సన్ముఖములో చదివిస్తున్నారంటే లెక్కాచారమంతా వారి అరచేతిలో ఉన్నట్లే. శివబాబాను అగౌరపరచకండి. అలా చేస్తే చాలా వికర్మలు తయారౌతాయని తండ్రి చెప్తున్నారు. యజ్ఞ సేవలో ఎముకలను సహితము ఇవ్వవలసి వస్తుంది. దధీచి ఋషి ఉదాహరణ ఉంది కదా. వారికి కూడా పదవి లభిస్తుంది. లేకపోతే ప్రజలలో కూడా భిన్న-భిన్న పదవులు ఉన్నాయి. ప్రజలలో కూడా నౌకర్లు, చాకర్లు మొదలైనవారందరూ కావాలి. భలే అచ్చట దు:ఖముండదు కాని పదవులైతే నెంబరువారుగా ఉంటాయి. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. స్మృతి యాత్రలో అలసిపోరాదు. చివరి సమయములో తండ్రి తప్ప ఇతరులెవ్వరూ గుర్తు రానంత సత్యమైన స్మృతి చేయు అభ్యాసము చేయాలి.
2.
సత్యమైన తండ్రి మతము పై నడుస్తూ సత్యమైన సంపాదన చేయాలి. మీ స్వంత మతము పై
(మన్మతము) నడవరాదు. సద్గురువును ఎప్పుడూ నిందలపాలు చేయరాదు. కామ-క్రోధాలకు
వశమై ఏ వ్యతిరేక కర్మలూ చేయరాదు.
వరదానము :- ''స్వయాన్ని అవతరించిన అవతారమని భావించి సదా ఉన్నతమైన స్థితిలో ఉండే అర్శ్(ఆకాశము లేక సూక్ష్మలోక) నివాసీ ఫరిస్తా భవ''
ఎలాగైతే
తండ్రి అవతరించారో, అలా శ్రేష్ఠ ఆత్మలైన మీరు కూడా పై నుండి (మూలవతనం)
క్రిందకు సందేశమునిచ్చేందుకు అవతరించారు, సూక్ష్మలోకము లేక మూలవతన
నివాసులు. దేహ-భావమనే పృథ్వి పై మీ బుద్ధి రూపీ పాదము పడజాలదు. అందువలన
ఫరిస్తాల పాదము సదా ఫర్శ్(భూమి, నేల)కు పైననే చూపిస్తారు. కనుక మీరంతా
ఉన్నతమైన స్థితిలో స్థితమై ఉండే అర్శ్ నివాస్‌గా ఉండి అవతరించిన అవతారము -
ఇదే స్మృతిలో ఎగిరే కళలో ఎగురుతూ ఉండండి.
స్లోగన్ :- ''స్వ పరివర్తన చేసుకునే తీవ్ర పురుషార్థీ పిల్లలకే తండ్రి నుండి ఆశీర్వాదాల శుభాకాంక్షలు లభిస్తాయి''
No comments:
Post a Comment