Thursday, 18 January 2018

Telugu Murli 05/01/18

05-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

''మధురమైన పిల్లలారా - మీరు ఇక్కడ సుఖము-దు:ఖము, మానము-అవమానము అన్నీ సహించాలి. పాత ప్రపంచములోని సుఖాలను బుద్ధి నుండి తొలగించి వేయాలి. మీ స్వంత మతమును అనుసరించరాదు.'' 

ప్రశ్న :- దేవతా జన్మ కంటే ఈ జన్మ చాలా మంచిది ఎలా ?
జవాబు :- ఈ జన్మలో పిల్లలైన మీరు శివబాబా భండారము నుండి తింటారు. ఇచ్చట మీరు అంతులేని సంపాదన చేస్తారు. మీరు తండ్రి ఆశ్రయము(శరణు) తీసుకున్నారు. ఈ జన్మలోనే మీరు మీ ఇహలోకమును, పరలోకమును సుఖవంతముగా చేసుకుంటారు. సుదాముని వలె రెండు పిడికెళ్ళు ఇచ్చి 21 జన్మల చక్రవర్తిత్వ పదవిని తీసుకుంటారు.

పాట :- సమీపంగా ఉన్నా, దూరంగా ఉన్నా,........( చాహే పాస్‌ ¬, చాహే దూర్‌ ,.......)   
ఓంశాంతి. పాట అర్థము ఎంతో బాగున్నది. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. ఈ శరీరముతో దగ్గరగా ఉన్నా దూరముగా ఉన్నా,..... ఎందుకంటే సన్ముఖములో కూర్చుని యోగ శిక్షణను ఇస్తున్నారు. ప్రేరణతో అయితే ఇవ్వరు కదా. నేను దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా - మీరు నన్నే స్మృతి చేయాలి. భగవంతుని వద్దకు వెళ్ళేందుకే కదా భక్తి చేస్తారు. ''ఓ జీవాత్మలారా! ఈ శరీరములో నివసించు ఆత్మలారా! '' అని ఆత్మలతో పరమపిత పరమాత్మ కూర్చొని మాట్లాడ్తున్నారు. పరమాత్మను ఆత్మలు తప్పకుండా కలుసుకోవాలి. అందువలన జీవాత్మలు భగవంతుని స్మృతి చేస్తారు. ఎందుకంటే దు:ఖితులై ఉన్నారు. సత్యయుగములో అయితే ఎవ్వరూ స్మృతి చేయరు. మేము చాలా పాత భక్తులమని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఎప్పటి నుండి మాయ మనలను పట్టుకుందో అప్పటి నుండి భగవంతుని, శివుని స్మృతి ప్రారంభమయ్యింది. ఎందుకంటే శివబాబాయే మనలను స్వర్గానికి యజమానులుగా చేశారు. కావున వారి స్మృతిచిహ్నము(శివలింగము)ను తయారు చేసుకొని భక్తి చేస్తారు. ఇప్పుడు తండ్రి మనలను తీసుకెళ్ళేందుకు సన్ముఖములోనికి వచ్చారని మీకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు తండ్రి వద్దకు వెళ్ళాలి. ఇచ్చట ఉన్నంత వరకు పాత శరీరాన్ని, పాత ప్రపంచమును బుద్ధి నుండి మర్చిపోవాలి. యోగములో ఉండాలి. అప్పుడు ఈ యోగాగ్ని వలన పాపాలు భస్మమైపోతాయి. ఇందులో శ్రమ కలుగుతుంది. పదవి అయితే చాలా గొప్పది. విశ్వానికి యజమానులుగా అవ్వాలి. విశ్వానికి యజమాని శివబాబా అని మనుష్యులంటారు. కాని శివబాబా యజమానిగా అవ్వరు. విశ్వానికి యజమానులుగా మనుష్యులే అవుతారు. తండ్రి కూర్చొని పిల్లలను విశ్వానికి యజమానులుగా చేస్తారు. వారంటున్నారు - మీరే విశ్వానికి యజమానులుగా ఉండేవారు, మళ్ళీ 84 జన్మలు తీసుకొంటూ, తీసుకుంటూ ఇప్పుడు చిల్లిగవ్వకు కూడా మాలికులుగా లేరు. మొదటి నెంబరు జన్మకు, ఇప్పటి జన్మకు ఎంత తేడా ఉందో చూడండి! రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. తండ్రి వచ్చి సాక్షాత్కారము చేయించినంతవరకు ఎవ్వరికీ స్మృతి కలుగజాలదు. జ్ఞాన బుద్ధితో కూడా సాక్షాత్కారమవుతుంది. తెలివిగల పిల్లలకు, నిత్యము తండ్రిని స్మృతి చేయువారికి చాలా ఆనందము ఉంటుంది. ఇచ్చట మీరు వినే విషయాలన్నీ క్రొత్త విషయాలు. మనుష్యులకైతే ఏమీ తెలియదు. వారు గప్పాలు, వ్యర్థ మాటలు మాట్లాడుతూ, గడప గడప వద్ద ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. మీరు వెతుకులాట నుండి విడిపించబడ్డారు. తండ్రి అంటున్నారు - మీరందరూ ఆత్మలు, తండ్రి అయిన నన్ను స్మృతి చేస్తూ ఉండండి. బుద్ధిలో 'ఆత్మలమైన మేము ఇప్పుడు బాబా వద్దకు వెళ్ళాలి' అన్న ఆలోచన ఉండాలి. 'ఈ సృష్టి ఇక మేముండేందుకు తగదని బుద్ధిలో ఉండాలి. ఈ పాత సృష్టి అయితే అంతమైపోతుంది. మళ్ళీ మేము స్వర్గములోకి వచ్చి నూతన మహళ్ళు తయారు చేస్తాము' అనే ఆలోచనలు రాత్రింబవళ్ళు మీ బుద్ధిలో నడుస్తూ ఉండాలి. తండ్రి తన అనుభవమును వినిపిస్తున్నారు - రాత్రి నిదురించునప్పుడు కూడా నాకు ఇవే ఆలోచనలు నడుస్తాయి. ఈ నాటకము ఇక పూర్తి అయిపోతుంది, ఈ పాత శరీరాన్ని వదిలేయాలి. అయితే వికర్మల భారము చాలా ఉంది. అందువలన నిరంతరము బాబాను స్మృతి చేయాలి. మీ స్థితిని దర్పణములో చూసుకోవాలి. ''నా బుద్ధి అన్నిటి నుండి తొలగిందా? '' వృత్తి వ్యాపారాదులలో ఉండినా బుద్ధితో ఈ పని చేయవచ్చు. బాబా పై ఎంత బాధ్యత ఉంది! ఎంతమంది పిల్లలున్నారు! వారి పై గమనముంచవలసి వస్తుంది. పిల్లలకు శరణునివ్వాలి. దు:ఖితులైతే చాలామంది ఉన్నారు కదా. గలాటాలలో ఎంత మంది దు:ఖితులై మరణిస్తున్నారు! ఇది చాలా చెడ్డ సమయము. అందువలన పిల్లలకు శరణు ఇచ్చేందుకు ఈ భవనాలు తయారవుతున్నాయి. ఇచ్చటైతే అందరూ నా పిల్లలే ఉన్నారు. ఏ భయమూ ఉండదు. అంతేకాక ఇక్కడ యోగబలము కూడా ఉంటుంది. పిల్లలు సాక్షాత్కారములో కూడా చూశారు - ఏ పిల్లలైతే తండ్రిని మంచి రీతిగా స్మృతి చేస్తారో, తండ్రి వారి రక్షణ కూడా చేస్తారు. శత్రువుకు భయంకర రూపాన్ని చూపించి పారద్రోలుతారు. మీకు ఎంతవరకు శరీరముందో అంతవరకు యోగములో ఉండాలి. లేకుంటే శిక్షలు అనుభవించవలసి వస్తుంది. గొప్ప వారి పిల్లలు శిక్షలు అనుభవిస్తే వారి భుజాలు(తలలు) క్రిందికి వాలిపోతాయి. మీరు కూడా భుజాలు క్రిందికి దించుకోవలసి వస్తుంది. పిల్లలకైతే ఇంకా కఠినమైన శిక్షలు ఉంటాయి. ఇప్పుడు మాయ అందించే సుఖాలు అనుభవించనీ. జరిగేటప్పుడు చూచుకుంటాము అనేవారు కూడా ఉన్నారు. చాలామందికి ఈ పాత ప్రపంచములోని సుఖాలు మధురంగా అనిపిస్తాయి. ఇచ్చట సుఖ-దు:ఖాలు, మాన-అవమానాలు అన్నీ సహించాల్సి వస్తుంది. ఉన్నత ప్రాప్తి కావాలనుకుంటే తండ్రిని ఫాలో చేయాలి. తల్లిదండ్రుల ఆజ్ఞానుసారము నడుచుకోవాలి. మీ స్వంత మతము అనగా రావణమతము. దానిని అనుసరిస్తే భాగ్యానికి అడ్డగీతను గీచుకొనుటే అవుతుంది. తండ్రిని అడిగితే, ఇది శ్రీమతము కాదని, ఆసురీ మతమని వెంటనే చెప్తారు. అడుగడుగులో శ్రీమతము కావాలి. ' ఎక్కడైనా ఉల్టా కర్మలు చేసి తండ్రిని నిందింపజేయడం లేదు కదా ' అని చూచుకోవాలి. దేవీ దేవతల లక్షణాలున్నప్పుడు మాత్రమే దేవీ దేవతలుగా అవుతారు. అంతేగానీ అచ్చట ఆటోమేటిక్‌గా లక్షణాలు వచ్చేస్తాయని కాదు. ఇచ్చట నడవడిక చాలా మధురముగా ఉండాలి. ఒకవేళ శివబాబా చెప్పలేదు. బ్రహ్మబాబా చెప్పినారనుకున్నా, బాధ్యుడుగా వీరే(శివబాబాయే) ఉంటారు కదా! ఒకవేళ ఏదైనా నష్టము జరిగినా ఫర్వాలేదు. ఇది డ్రామాలో ఉంది. అందువలన మీ పైన ఎలాంటి దోషముండదు. స్థితి చాలా బాగుండాలి. భలే మీరు ఇచ్చట కూర్చుని ఉన్నారు. బుద్ధిలో మేము బ్రహ్మాండానికి యజమానులము అచ్చట ఉండేవారమని ఉండాలి. ఈ విధంగా ఇంట్లో ఉంటూ వృత్తి, వ్యాపారాలు చేసుకుంటూ అతీతమౌతూపోతారు. ఎలాగైతే సన్యాసులు గృహస్థము నుండి అతీతంగా అవుతారో అలా అవుతారు. మీరైతే మొత్తము పాత ప్రపంచము నుండి ఉపరాంగా అవుతారు. ఆ హఠయోగ సన్యాసానికి, ఈ సన్యాసానికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఈ రాజయోగమును తండ్రి నేర్పిస్తారు. సన్యాసులు నేర్పించలేరు. ఎందుకంటే ముక్తి - జీవన్ముక్తుల దాత ఒక్క బాబా మాత్రమే. అందరూ ఇప్పుడు ముక్తము అవ్వనున్నారు. ఎందుకంటే అందరూ వాపసు వెళ్ళాలి. మేము వాపసు వెళ్ళాలని సాధువులు సాధన చేస్తారు. ఇచ్చట దు:ఖితులుగా ఉన్నారు. కొంతమంది '' మేము జ్యోతులము జ్యోతిలో కలసిపోవాలి '' అని అంటారు. అనేక మతములున్నాయి.

బాబా అర్థము చేయిస్తున్నారు - పాత సంబంధీకులు గుర్తు వచ్చే పిల్లలు కూడా కొంతమంది ఉన్నారు. ఆ ప్రపంచములోని సుఖాల పై కోరిక కలిగిందంటే ఇక్కడ మరణించినట్లే. మళ్ళీ వారి కాళ్ళు ఇచ్చట నిలువవు. మాయ చాలా ఊరిస్తుంది. ఆశ చూపిస్తుంది. 'భగవంతుని స్మృతి చేయండి, లేకుంటే బాజ్‌(డేగ) వచ్చేస్తుంది.' అని ఒక సామెత కూడా ఉంది. ఈ మాయ కూడా డేగ వలె దాడి చేస్తుంది. ఇప్పుడు స్వయం తండ్రి వచ్చి ఉన్నప్పుడే పురుషార్థము చేసి ఉన్నత పదవి పొందకుంటే కల్ప-కల్పాంతరాలు కూడా పొందలేరు. ఇచ్చట తండ్రి వద్ద మీకు ఎలాంటి దు:ఖమూ లేదు. అందువలన దు:ఖమునిచ్చే పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి కదా. ఎంత సమయము తండ్రిని స్మృతి చేశాను? ఎవరికైనా ప్రాణదానము చేశానా? అని రోజంతటి లెక్కాచారము చూచుకోవాలి. తండ్రి మీకు కూడా ప్రాణదానము ఇచ్చారు కదా. సత్య-త్రేతా యుగాల వరకు మీరు అమరులుగా ఉంటారు. ఇచ్చట ఎవరైనా మరణిస్తే ఎంత ఏడుస్తూ, బాదుకుంటూ ఉంటారు! స్వర్గములో దు:ఖము అన్న మాటే ఉండదు. పాత శరీరాన్ని వదిలి కొత్తది తీసుకుంటారని భావిస్తారు. ఈ ఉదాహరణ(సర్పము) కూడా మీకే సరిపోతుంది. ఇతరులెవ్వరూ ఈ ఉదాహరణమునివ్వలేరు. వారు పాత శరీరాన్ని మర్చిపోలేరు. వారైతే ధనము పోగు చేస్తూ ఉంటారు. ఇచ్చట మీరు ఏదైతే తండ్రికిస్తారో, దానిని తండ్రి ఏమీ తినరు, తన వద్ద ఉంచుకోరు. దాని ద్వారా పిల్లల పాలన, పోషణ చేస్తారు. అందువలన ఇది సత్యమైన శివబాబా భండారము. ఈ భండారము నుండి భుజించేవారు ఇచ్చట కూడా సుఖంగా ఉంటారు, జన్మ-జన్మాంతరాలకు సుఖంగా ఉంటారు.

ఇప్పటి మీ జన్మ చాలా దుర్లభమైనది. దేవతల కంటే మీరు ఇచ్చట సుఖంగా ఉన్నారు. ఎందుకంటే తండ్రి శరణులో ఉన్నారు. ఇచ్చటి నుండే మీరు అంతులేని సంపాదన చేస్తారు. దానిని మీరు జన్మ -జన్మాంతరాలు అనుభవిస్తారు. సుదామునికి కూడా రెండు పిడికెళ్ళకు బదులు 21 జన్మలకు భవనాలు లభించాయి. ఈ లోకములో కూడా సుఖమే, పరలోకములో కూడా జన్మ-జన్మాంతరాల వరకు సుఖమే. అందువలన ఈ జన్మ చాలా మంచిది. కొంతమంది త్వరగా వినాశనమైతే మేము స్వర్గములోకి వెళ్ళిపోతామని అంటారు. కాని తండ్రి నుండి ఇంకా చాలా ఖజానా తీసుకోవలసి ఉంది. అప్పుడే రాజధాని ఎక్కడ తయారయ్యింది? మరి త్వరగా వినాశనమెలా చేయిస్తారు? పిల్లలంతా అర్హులుగా ఎక్కడ తయారయ్యారు! ఇప్పుడింకా తండ్రి పిల్లలను చదివించేందుకు వస్తూనే ఉంటారు. బాబా చేసే సర్వీసు అపారమైనది. అలాగే తండ్రి మహిమ కూడా అపారమైనది. నేను ఎంత ఉన్నతమైన వాడినో అంత ఉన్నతమైన సేవ కూడా చేస్తాను. అందుకే నా స్మృతి చిహ్నము ఉంది. బాబా(హృదయ) సింహాసనము అత్యంత ఉన్నతమైనది. ఎవరెంత పురుషార్థము చేస్తారో, వారు తమ భాగ్యాన్ని అంతగా తయారు చేసుకుంటారు. ఇది అవినాశి జ్ఞాన రత్నాల సంపాదన. ఈ సంపాదన అచ్చట(సత్యయుగము) అంతులేని ధనరాసులుగా అవుతాయి. కావున పిల్లలు పురుషార్థము చాలా బాగా చేయాలి. తండ్రిని ఇచ్చట కూడా స్మృతి చేయండి. అచ్చట(మూలవతనములో) కూడా స్మృతి చేయండి. మెటికలైతే ఉన్నాయి కదా. హృదయమనే దర్పణములో నేను తండ్రికి ఎంత సుపుత్రునిగా ఉన్నాను? అంధులకు దారి చూపుతున్నాను?' అని చూచుకోవాలి. స్వయం మీతో మీరే మాట్లాడుకుంటే ఖుషీ కలుగుతుంది. ఉదాహరణానికి ఈ బాబా అనుభవము తెలుపుతారు కదా. నిదురించినప్పుడు కూడా ఇలా మాట్లాడుకుంటాను - బాబా అద్భుతమంతా మీదే. భక్తిమార్గములో మళ్ళీ మేము మిమ్ములను మర్చిపోతాము. మళ్ళీ భక్తి మార్గములో మీ స్మృతిచిహ్నాన్ని తయారు చేస్తాము. మళ్ళీ ఇంతటి వారసత్వము మీ నుండి పొందుతాము, మళ్ళీ సత్యయుగములో ఇది మర్చిపోతాము, కాని మీ కర్తవ్యాన్ని పూర్తిగా మర్చిపోతాము. మూఢుల వలె, అజ్ఞానుల వలె అయిపోతాము. ఇప్పుడు తండ్రి వచ్చి ఎంత జ్ఞానులుగా తయారు చేశారు! రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఈశ్వరుడు సర్వవ్యాపి అనేది జ్ఞానము కానే కాదు. జ్ఞానమనగా సృష్టిచక్ర జ్ఞానము కలిగి ఉండాలి. ఇప్పుడు మనము 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసి వాపసు వెళ్ళిపోతాము. మళ్ళీ మనం జీవన్ముక్తిలో రావాలి. డ్రామా నుండి వెలుపలికి వెళ్ళలేము. మనము జీవన్ముక్తికి యాత్ర చేసే ప్రయాణీకులము. మంచిది.

రాత్రి క్లాసు 16-12-68

ఒక్కొక్కరిని బాబా బచ్చీ(బిడ్డా) అని అంటారు. కొందరిని మయ్యా(తల్లి) అని అంటారు. కనుక ఏదో వ్యత్యాసము తప్పకుండా ఉంటుంది. కొంతమందికి సేవ ద్వారా సుగంధము వస్తుంది. కొంతమంది జిల్లేడు పూల వలె వాసన లేనివారుగా ఉన్నారు. తండ్రి - ''నీవు నా జతలో వచ్చినట్లుంది అని అన్నారు. తండ్రి కూడా పై నుండి విశ్వాన్ని పావనంగా చేసేందుకు వచ్చారు. మీ కర్తవ్యము కూడా ఇదే. అక్కడ నుండి ఎవరైతే మొదట వస్తారో వారు పవిత్రంగా ఉంటారు. కొత్తగా వచ్చినవారు తప్పకుండా సువాసననిస్తూ ఉంటారు. వారిని ఉద్యానవనముతో కూడా పోలుస్తారు. ఎటువంటి సేవ చేస్తారో అటువంటి సువాసన కలిగిన పుష్పాలు. శివబాబా పుత్రుడని అనిపించుకొని, హక్కుదారునిగా అయ్యానని వివేకము చెప్తుంది. కనుక ఆ సువాసన రావాలి. హక్కుదారులైనందునే బాబా అందరికీ నమస్కారము చేస్తారు. మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. అనుమానమేమీలేదు కాని చదువులో అయితే చాలా వ్యత్యాసముంటుంది. ఇది(తేడా) తప్పకుండా ఉండాల్సిందే. వీరు బాబా అని పిల్లలకు నిశ్చయము కలుగుతుంది. చక్రము కూడా బుద్ధిలో ఉంది. కనుక తండ్రి చెప్తున్నారు - ''ఎక్కువగా ఎందుకు చెప్పాలి? '' తండ్రి తప్ప ఇతరులెవ్వరూ స్వదర్శన చక్రధారులుగా చెయ్యలేరు. సూచనతో తయారవుతారు. ఎవరైతే కల్పక్రితము తయారయ్యారో వారే తయారవుతారు. అనేకమంది పిల్లలు వస్తారు. పవిత్రత పై ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి! ఎవరి ద్వారా తండ్రి గీతను వినిపిస్తారో వారిని ఎంతగా తిట్తారు? శివబాబాను కూడా తిట్తారు. తాబేలు అవతారము, చేప అవతారము అనుట కూడా తిట్లే కదా. తెలియనందున తండ్రికి మీకు ఎన్ని కళంకాలు అంటకడ్తారు! పిల్లలు ఎంతో కష్టపడ్తారు. చదువు ద్వారా కొంతమంది చాలా పెద్ద ధనవంతులుగా అవుతారు. చాలా సంపాదిస్తారు. ఒకొక్క ఆపరేషన్‌కు రెండు వేలు, నాల్గు వేలు లభిస్తాయి. కొంతమంది అయితే వారి కుటుంబాలను కూడా పోషించలేరు. చింత ఉంటుంది కదా. కొంతమంది జన్మ-జన్మాంతరాలు చక్రవర్తి పదవి తీసుకుంటారు. కొంతమంది జన్మ-జన్మాంతరాలకు పేదవారిగా అవుతారు. తండ్రి చెప్తున్నారు - మిమ్ములను తెలివిగలవారిగా తయారు చేస్తాను. ఇప్పుడు అన్నిటికి డ్రామా అని అంటారు. అందరికీ పాత్ర ఉంది. ఏదైతే జరిగిపోయిందో అదంతా డ్రామా. డ్రామాలో ఉండేదే జరుగుతుంది. డ్రామానుసారము జరిగేదంతా సరియైనదే. మనము ఎంతగా అర్థము చేయించినా అర్థము చేసుకోరు. ఇందులో మంచి నడవడికలు కూడా ఉండాలి. ప్రతి ఒక్కరు మీ ఆంతరికములో చూచుకోండి ' ఏ లోపము లేదు కదా? ' మాయ చాలా కఠినమైనది, శక్తివంతమైనది. దానినెలాగైనా తొలగించాలి. అన్ని బలహీనతలను తీసేయాలి. తండ్రి చెప్తున్నారు - '' బంధనములో ఉన్న మాతలు అందరికంటే ఎక్కువ స్మృతి చేస్తారు. వారే మంచి పదవిని పొందుతారు. ఎంత ఎక్కువగా దెబ్బలు తింటారో అంత ఎక్కువ స్మృతిలో ఉంటారు. ' హాయ్‌ శివబాబా అని అంటూ ఉంటారు. జ్ఞానము ద్వారా శివబాబాను స్మృతి చేస్తారు. వారి చార్టు బాగుంటుంది. ఇలా దెబ్బలు తిని వచ్చేవారు సేవలో కూడా ఎక్కువగా లగ్నమౌతారు. తమ జీవితాలను ఉన్నతంగా చేసుకునేందుకు సేవ చాలా బాగా చేస్తారు. సేవ చేయకుంటే మనసు తింటూ ఉంటుంది. సేవ చేసేందుకు వెళ్లాలని మనస్సు ఉవ్విళ్లూరుతూ ఉంటుంది. భలే సెంటరు వదిలి వెళ్లాల్సి వస్తుందని తెలిసినా ప్రదర్శనిలో సేవ చాలా ఉంటే సెంటరును కూడా లెక్క పెట్ట పరుగెత్తాలి. మనము ఎంత దానము చేస్తామో అంత బలము కూడా నిండుతూ ఉంటుంది. దానము కూడా తప్పకుండా చేయాలి కదా. ఇవి అవినాశి జ్ఞానరత్నాలు. ఇవి ఎవరి వద్ద ఉంటాయో వారు మాత్రమే దానము చేస్తారు. పిల్లలకిప్పుడు మొత్తం సృష్టి ఆది-మధ్య-అంత్యముల జ్ఞానము గుర్తుకు వచ్చేయాలి. మొత్తం చక్రమంతా తిరగాలి. తండ్రి కూడా ఈ సృష్టి ఆది-మధ్య-అంత్యములు తెలిసినవారు. తప్పకుండా వారు జ్ఞానసాగరులు. సృష్టిచక్రము గురించి తెలిసినవారు. ఈ ప్రపంచములోని వారికి ఈ జ్ఞానము పూర్తిగా కొత్తది. ఈ జ్ఞానము పాతదెప్పుడూ కానే కాదు. ఇది అద్భుతమైన జ్ఞానము కదా. ఈ జ్ఞానాన్ని తండ్రి మాత్రమే తెలుపగలరు. ఎవరెంత సాధువులు, మహాత్ములైనా మెట్లు ఎక్కి పైకి పోనే పోరు. తండ్రి తప్ప ఏ మనుష్యులు గతి-సద్గతిని ఇవ్వలేరు. మనుష్యులూ ఇవ్వలేరు, దేవతలూ ఇవ్వలేరు. కేవలం తండ్రి ఒక్కరు మాత్రమే ఇవ్వగలరు. రోజురోజుకు వృద్ధి చెందాల్సిందే. బాబా చెప్పారు - ఉదయము చేసే శాంతియాత్రలు ఈ లక్ష్మీనారాయణ చిత్రము, మెట్ల చిత్రము ట్రాన్స్‌ లైట్‌గా ఉండాలి. కరెంటుతో వెలిగి మెరుపునిచ్చే వస్తువేదైనా ఉండాలి. స్లోగన్లు కూడా చెప్తూ వెళ్ళండి. సన్యాసులు ఎప్పుడూ రాజయోగము నేర్పించలేరు. రాజయోగమును పరమపిత పరమాత్మయే భగీరథుని ద్వారా నేర్పిస్తున్నారు. ఇటువంటి శబ్ధాలు చాలామంది వింటారు. అచ్ఛా.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఇప్పుడు ఈ నాటకము పూర్తి అవుతోంది. అందువలన ఈ పాత ప్రపంచము నుండి అతీతంగా ఉండాలి. శ్రీమతమును అనుసరించి మీ భాగ్యమును ఉన్నతంగా తయారు చేసుకోవాలి. ఎప్పుడూ ఎలాంటి వ్యతిరేక కర్మలు చేయరాదు.
2. అవినాశి జ్ఞాన రత్నాల సంపాదన చేయాలి, ఇతరులతో చేయించాలి. ఒకే తండ్రి స్మృతిలో ఉంటూ సుపుత్రులై అనేకమందికి దారి(మార్గమును) చూపాలి. 

వరదానము :- '' 'దివ్య బుద్ధి' అనే వాహనము ద్వారా మూడు లోకాలలో విహరించే జ్ఞాన స్వరూప విద్యాపతి భవ''
దివ్యబుద్ధి అనగా 'హోలీ హంస బుద్ధి'. హంస అనగా పాలను, నీటిని వేరు చేసేది. ముత్యాలను, రాళ్ళను గుర్తించి ముత్యాలను గ్రహించేది. అందువలన హోలీ హంస సంగమయుగీ జ్ఞాన స్వరూప విద్యాదేవీ సరస్వతికి వాహనము. మీరందరూ జ్ఞాన స్వరూపులే. అందువలన మీరు విద్యాపతులు లేక విద్యాదేవీలు. ఈ వాహనము దివ్యబుద్ధికి గుర్తు. ఈ దివ్యబుద్ధి అనే వాహనము ద్వారా మూడు లోకాలలో విహరిస్తారు. ఈ వాహనము అన్ని వాహనాల కంటే తీవ్ర వేగము గలది. 

స్లోగన్‌ :- '' మీ సర్వ శక్తులను ఇతర ఆత్మల కొరకు(పట్ల) విల్‌ చేయడమే సర్వ శ్రేష్ఠమైన సేవ''
 

No comments:

Post a Comment