02-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
''మధురమైన
పిల్లలారా - ఇది మీ మరజీవా జన్మ. మీరు తండ్రి అయిన ఈశ్వరుని నుండి
వారసత్వాన్ని తీసుకుంటున్నారు. మీకు చాలా పెద్ద లాటరీ లభించింది. కావున
మీరు అపారమైన ఖుషీలో ఉండాలి''
ప్రశ్న :- మీకు మీరు ఏ జ్ఞానాన్ని స్వీకరిస్తే(అర్థం చేసుకుంటే) చింతలు సమాప్తమైపోతాయి? కోపము తొలగిపోతుంది?
జవాబు :- నేను
ఈశ్వరుని సంతానాన్ని. నేను తండ్రి సమానము మధురంగా అవ్వాలి. ఎలాగైతే తండ్రి
మధురంగా అర్థము చేయిస్తారో, కోపగించుకోరో అలా మనం కూడా పరస్పరం మధురంగా
ఉండాలి. ఉప్పు నీరులా అవ్వరాదు. ఎందుకంటే జరిగిపోయిన ప్రతి క్షణము డ్రామాలో
పాత్రగా ఉండదని తెలుసు. కావున ఇక ఏ విషయము గురించి చింతించాలి? ఈ విధంగా
మీకు మీరు అర్థము చేయించుకుంటే, జ్ఞానము తెలుపుకుంటే చింతలు
సమాప్తమైపోతాయి. కోపము పారిపోతుంది.
పాట :- ఇదే వసంతఋతువు...... (యహీ బహార్ హై..........)
ఓంశాంతి. ఇది
ఈశ్వరీయ సంతానము అనుభవించు ఖుషీల గాయనము(పాట). మీరు ఇంతటి సంతోషపు గాయనము
సత్యయుగములో చేయలేరు. ఇప్పుడు మీకు ఖజానా లభిస్తోంది. ఇది అన్నిటికంటే
పెద్ద లాటరీ. లాటరీ లభించినప్పుడు సంతోషము కలుగుతుంది. ఈ లాటరీ ద్వారా మీరు
జన్మ-జన్మాంతరాలు స్వర్గములో సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇది మీ మరజీవా
జన్మ. ఎవరైతే జీవించి ఉండి మరణించరో వారిది 'మరజీవా జన్మ' అని అనరు. వారికి
అపారమైన సంతోషము కూడా కలగదు. ఎంతవరకు మరజీవాగా అవ్వరో అనగా తండ్రిని
తమవారిగా చేసుకోలేదో అంతవరకు సంపూర్ణ వారసత్వము కూడా లభించజాలదు. ఎవరైతే
తండ్రివారిగా అవుతారో, ఎవరైతే తండ్రిని స్మృతి చేస్తారో వారిని తండ్రి కూడా
స్మృతి చేస్తారు. మీరు ఈశ్వరీయ సంతానము. మేము ఈశ్వరుడైన తండ్రి నుండి
వారసత్వము లేక వరము తీసుకుంటున్నామనే నషా మీకు ఉంది. 'ఎవరి కొరకు భక్తులు
భక్తిమార్గములో ఎదురుదెబ్బలు తింటూ ఉంటారో దానిని పొందుకున్నాము' అనే నషా
మీకు ఉంది. తండ్రిని కలుసుకునేందుకు అనేక రకాలైన ఉపాయాలు చేస్తూ ఉంటారు.
ఎన్నో వేద శాస్త్రాలు, మ్యాగజైనులు మొదలైనవెన్నో చదువుతూ ఉంటారు. కాని
ప్రపంచమేమో రోజురోజుకు దు:ఖితంగానే అవుతూ ఉంటుంది. ఇది తమోప్రధానంగా
అవ్వవలసిందే. ఇది ముళ్ల వృక్షము కదా. బబుల్‌నాథుడు మళ్లీ వచ్చి ముళ్ళను
పుష్పాలుగా చేస్తారు. ముళ్ళు చాలా పెద్ద పెద్దవిగా అయిపోయాయి. చాలా జోరుగా
గుచ్చుకుంటాయి. వాటికి అనేక ప్రకారాల పేర్లు ఇచ్చారు. సత్యయుగములో ముళ్ళు
ఉండనే ఉండవు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇది ముళ్ళ ప్రపంచము. ఒకరికొకరు
దు:ఖము కలిగించుకుంటూ ఉంటారు. ఇంటిలో పిల్లలు కూడా ఎటువంటి కుపుత్రులుగా
అవుతారంటే వర్ణించలేము(చెప్పలేము). తల్లిదండ్రులను చాలా దు:ఖితులుగా
చేస్తారు. అందరూ ఒకే విధంగా కూడా ఉండరు. అందరికంటే వక్కువ దు:ఖమిచ్చేవారు
ఎవరో మనుష్యులకు తెలియదు. ఈ గురువులు పరమాత్మ మహిమను మాయము చేశారని తండ్రి
అంటున్నారు. మనము వారిని చాలా మహిమ చేస్తాము. వారు పరమ పూజ్య పరమపిత
పరమాత్మ శివుని చిత్రము కూడా చాలా బాగుంది. అయితే శివుడు ఒక
జ్యోతిర్బిందువుగా ఉన్నారని చాలా మంది అంగీకరించరు. ఎందుకంటే వారు 'ఆత్మయే
పరమాత్మ' అని అనేస్తారు. ఆత్మ అతిసూక్ష్మమైనది. భృకుటి మధ్యలో కూర్చొని
ఉంది. అలాంటప్పుడు పరమాత్మ ఇంత పెద్ద ఆకారము గలవారిగా ఎలా అవ్వగలరు?
అనేకమంది విద్వాంసులు, ఆచార్యులు మొదలైనవారు బి.కెలను అపహాస్యం, హేళన
చేస్తారు. పరమాత్మ రూపము అసలు ఇలా ఉండనే ఉండదు. వారు అఖండ జ్యోతిర్మయ
తత్వము, వేలాది సూర్యుల కంటే తేజోమయమని అంటారు. వాస్తవానికి ఇది పెద్ద
తప్పు. వారి సరైన మహిమను వారే (తండ్రియే) స్వయంగా తెలుపుచున్నారు. వారు
మనుష్య సృష్టికి బీజరూపులు. ఈ సృష్టి ఒక తలక్రిందులుగా ఉన్న వృక్షము. సత్య,
త్రేతా యుగాలలో వారిని ఎవ్వరూ స్మృతి చేయరు. మనుష్యులకు దు:ఖము
కలిగినప్పుడు - '' ఓ భగవంతుడా! ఓ పరమపిత పరమాత్మా! దయ చూపండి'' అని వారిని
స్మృతి చేస్తారు. సత్య-త్రేతా యుగాలలో దయా భిక్షను వేడుకునేవారు ఎవ్వరూ
ఉండరు. అది రచయిత అయిన తండ్రి రచించిన నూతన రచన. ఈ తండ్రి మహిమ అపారమైనది.
వారు జ్ఞానసాగరులు, పతితపావనులు. జ్ఞానసాగరులైతే తప్పకుండా జ్ఞానమిచ్చి
ఉంటారు. వారు సత్, చిత్, ఆనంద స్వరూపులు, చైతన్యమైనవారు. జ్ఞానాన్ని
చైతన్య ఆత్మయే ధారణ చేస్తుంది. మనము శరీరాన్ని వదలి వెళ్లినప్పుడు ఆత్మలో
జ్ఞాన సంస్కారము ఉండనే ఉంటుందని తెలుసుకోండి. చిన్న బిడ్డగా జన్మించినా ఆ
సంస్కారము ఉంటుంది. కాని అవయవాలు చిన్నవైనందున మాట్లాడలేరు. అవయవాలు
పెద్దవైతే స్మృతినిప్పిస్తే స్మృతిలోకి వచ్చేస్తుంది. చిన్న పిల్లలు కూడా
శాస్త్రాలు మొదలైనవి కంఠస్థము చేస్తారు. ఇవన్నీ పూర్వ జన్మ సంస్కారాలు.
ఇప్పుడు తండ్రి మనకు తన జ్ఞాన వారసత్వాన్ని ఇస్తున్నారు. మొత్తము సృష్టిని
గురించిన జ్ఞానము వీరి వద్ద ఉంది, ఎందుకంటే వారు బీజరూపులు. మనము స్వయాన్ని
బీజరూపులమని చెప్పుకోము. బీజములో తప్పకుండా వృక్ష ఆదిమధ్యాంతాల
జ్ఞానముంటుంది కదా. కావున తండ్రి స్వయంగా చెప్తున్నారు - నేను ఈ సృష్టికి
బీజరూపుడను. ఈ వృక్షానికి బీజము పైన ఉంది. ఆ తండ్రి సత్, చిత్, ఆనంద
స్వరూపులు, జ్ఞానసాగరులు. సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానమే వారిలో ఉంటుంది,
లేకుంటే వారిలో ఏముంటుంది! శాస్త్రాల జ్ఞానమేమైనా ఉంటుందా? ఆ జ్ఞానమైతే
చాలామందిలో ఉంది. పరమాత్మ వద్ద ఉండేది తప్పకుండా ఏదైనా కొత్త జ్ఞానముంటుంది
కదా. ఆ జ్ఞానము గురించి ఏ విద్వాంసులు మొదలైన వారికి తెలియదు. ఈ సృష్టి
రూపి వృక్షము ఉత్పత్తి, పాలన, సంహారము ఎలా జరుగుతుందో, దాని ఆయువెంతో, అది
ఎలా వృద్ధి చెందుతుందో...... మొదలైన విషయాలను గురించి ఎవరిని అడిగినా
ఎవ్వరూ ఏ మాత్రమూ అర్థం చేయించలేరు.
గీత ఒక్కటి మాత్రమే సర్వ శాస్త్రాల శిరోమణి. మిగిలినవన్నీ గీత నుండి జన్మ తీసుకున్న పిల్లలే. గీత చదివిన వారికే తెలియకపోతే మిగిలిన శాస్త్రాలు చదివినందువలన లాభమేముంది? వారసత్వమైతే గీత నుండే లభించాలి. ఇప్పుడు తండ్రి మొత్తం డ్రామా రహస్యమంతా అర్థం చేయిస్తారు. తండ్రి రాతిబుద్ధి నుండి పారసబుద్ధి గలవారిగా తయారు చేసి పారసనాథులుగా చేస్తున్నారు. ఇప్పుడైతే అందరూ రాతిబుద్ధిగల రాళ్ళనాథులుగానే ఉన్నారు. కాని వారు స్వయానికి పెద్ద పెద్ద బిరుదులు ఇచ్చుకొని స్వయాన్ని పారసబుద్ధి గలవారిగా భావించి కూర్చుని ఉన్నారు. నా మహిమ అందరి మహిమ కంటే అలౌకికమైనదని, నేను జ్ఞానసాగరుడను, ఆనందసాగరుడను, సుఖసాగరుడనని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ విధంగా దేవతలను మహిమ చేయరాదు. భక్తులు దేవతల ముందుకెళ్ళి '' మీరు సర్వ గుణ సంపన్నులు,...........'' అని అంటారు. తండ్రికి ఒకే ఒక మహిమ ఉంది. అది కూడా మనకు తెలుసు. ఇప్పుడు మనము మందిరాలకు వెళ్తే, మన బుద్ధిలో వీరు పూర్తిగా 84 జన్మలు తీసుకొని ఉంటారనే పూర్తి జ్ఞానముంటుంది. ఇప్పుడు మీకు ఎంత ఖుషీ ఉంది! ఇంతకు ముందు ఇటువంటి ఆలోచనలు వచ్చేవి కావు. ఇప్పుడు 'మేము ఇలా తయారవ్వాలి' అని భావిస్తారు. బుద్ధిలో చాలా పరివర్తన వచ్చేస్తుంది.
తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - పరస్పరము చాలా మధురంగా అవ్వండి. ఉప్పు నీరులా అవ్వకండి. బాబా ఎప్పుడైనా, ఎవరినైనా కోపగించుకుంటారా? చాలా మధురంగా అర్థము చేయిస్తారు, జ్ఞానమునిస్తారు. ఒక్క సెకండు గడిచినా ఇది కూడా డ్రామాలో పాత్ర ' అని అంటారు. దానిని గురించిన చింత ఎందుకు చేయాలి? ఈ విధంగా స్వయానికి అర్థం చేయించాలి - మీరు ఈశ్వరీయ సంతానము. తక్కువైనవారు కాదు. ఈశ్వరీయ సంతానము తప్పకుండా ఈశ్వరుని వద్ద ఉంటారని ఎవరైనా అర్థము చేసుకోగలరు. ఈశ్వరుడు నిరాకారులైతే వారి సంతానము కూడా నిరాకారులే. ఆ సంతానమే ఇచ్చట శరీరము తీసుకొని పాత్ర చేస్తూ ఉంది. స్వర్గములో దేవీ దేవతా ధర్మానికి చెందిన మనుష్యులున్నారు. అందరి లెక్కాచారము కూర్చుని తీస్తే ఎంతగానో తలలు బద్దలు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే నెంబరువారు సమయానుసారము కొద్ది కొద్ది ఆత్మలకు జన్మ లభిస్తూ ఉంటుందని అర్థము చేసుకోగలరు. ఇంతకుముందు మనుష్యులు కుక్కలు, పిల్లలుగా అవుతారని భావించేవారు. ఇప్పటి బుద్ధికి, అప్పటి బుద్ధికి రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసము వచ్చేసింది. ఇవన్నీ ధారణ చేయవలసిన విషయాలు. ఇప్పుడు 84 జన్మల చక్రము పూర్తి అయ్యిందని క్లుప్తంగా అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఈ ఛీ-ఛీ(పాడైపోయిన) శరీరాన్ని వదిలేయాలి. ఇది అన్నిటికంటే పురాతనమైన శిథిలావస్థకు చేరిన తమోప్రధానమైన శరీరము. దీని పై మమకారము పూర్తిగా తొలగించి వేయాలి. పాత శరీరాన్ని స్మృతి ఏమి చేస్తారు? ఎందుకు చేస్తారు? ఇప్పుడు మీ నూతన శరీరాన్ని, సత్యయుగములో లభించబోయే శరీరాన్ని స్మృతి చేయాలి. ముక్తిధామము ద్వారా సత్యయుగములోకి వస్తారు. మనము జీవన్ముక్తిలోకి వెళ్తాము. మిగిలిన వారందరూ ముక్తిధామములోకి వెళ్లిపోతారు. దీనిని 'జయ జయ ధ్వనులు' అని అంటారు. హాహాకారాల తర్వాత జయ జయ ధ్వనులు జరగనున్నవి. ఇంతమంది మరణించేందుకు ఎవరో ఒకరు నిమిత్త కారణంగా అవుతారు. ప్రాకృతిక ఆపదలు సంభవిస్తాయి. కేవలం సముద్రము ఒక్కటే అన్ని ఖండాలను సమాప్తము చేయదు. సర్వమూ సమాప్తము అవ్వనే అవ్వాలి. కాని అవినాశి ఖండమైన భారతదేశము మిగిలిపోతంది. ఎందుకంటే ఇది శివబాబా జన్మ స్థానము. అందువలన ఇది అన్నిటికంటే గొప్ప తీర్థ స్థానమయ్యింది. తండ్రి అందరికీ సద్గతినిస్తారు. ఇది మనుష్యమాత్రులకు ఎవ్వరికీ తెలియదు. వారికి తెలియకుండా ఉండడమే డ్రామాలో నిశ్చితమై ఉంది. అందుకే తండ్రి అంటున్నారు - ఓ పిల్లలూ! మీకు ఏమీ తెలిసేది కాదు. నేనే వచ్చి మీకు రచయిత, రచనల జ్ఞానము అనగా మనుష్య సృష్టి ఆదిమధ్యాంతాల పూర్తి రహస్యాన్ని అర్థం చేయిస్తాను. దేనినైతే ఋషులు, మునులు కూడా అంతము లేనిది, అంతము లేనిది(బేఅంత్)................ అని వెళ్ళిపోయారో దానిని గురించి నేను అర్థం చేయిస్తాను. ఈ మొత్తము ప్రపంచానికి అన్నిటికంటే పెద్ద శత్రువు 'పంచ వికారాలు' అని కూడా వారికి తెలియదు. ఆ రావణాసురుని భారతీయులు ప్రతి సంవత్సరము తగులబెడ్తూనే వస్తున్నారు. అతనిని గురించి ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే రావణునికి శరీరమూ లేదు. ఆత్మ కూడా లేదు. వికారాలకైతే ఏ రూపమూ ఉండదు. మనుష్యులు కర్మలలోకి వచ్చినప్పుడు వీరిలో కామ భూతము, క్రోధ భూతము ప్రవేశించాయని తెలుస్తుంది. ఈ వికారాల స్టేజిలో కూడా ఉత్తమము, మధ్యమము, కనిష్టము ఉంటాయి. కొంతమందిలో కామ నషా ఒక్కసారిగా తమోప్రధానమైపోతుంది. కొంతమందిలో రజో నషా, కొంతమందిలో సతో నషా ఉంటుంది. కొంతమంది అయితే బాలబ్రహ్మచారులుగా కూడా ఉంటారు. సంసారాన్ని సంభాళించడం ఒక జంఝాటమని భావిస్తారు. వారినే అందరికంటే మంచివారని అంటారు. సన్యాసులలో కూడా బాలబ్రహ్మచారులను మంచివారిగా లెక్కిస్తారు. ప్రభుత్వము వారికి కూడా ఇలా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే సంతాన వృద్ధి జరగదు, పవిత్రతా శక్తి లభిస్తుంది. ఇవన్నీ గుప్తమైన విషయాలు. సన్యాసులు కూడా పవిత్రంగా ఉంటారు. చిన్న పిల్లలు కూడా పవిత్రంగా ఉంటారు. వానప్రస్థులు కూడా పవిత్రంగా ఉంటారు. అందువలన పవిత్రతా బలము లభిస్తూనే ఉంటుంది. పిల్లలు ఇంత వయస్సు వరకు పవిత్రంగా ఉండాలనే వారి నియమము కూడా ఆచరణలో ఉంటుంది. అందువలన ఆ బలము కూడా లభిస్తుంది. మీరు సతోప్రధాన పవిత్రులు. ఈ అంతిమ జన్మలో మీరు తండ్రితో ప్రతిజ్ఞ చేస్తారు. మీరు సత్యయుగాన్ని స్థాపన చేసేవారు. ఎవరు చేస్తారో వారు పవిత్ర ప్రపంచానికి నెంబరువారు పురుషార్థానుసారము యజమానులుగా అవుతారు.
ఇది ఈశ్వరీయ కుటుంబము. మనము కల్పానికి ఒక్కసారి ఈశ్వరుని జతలో ఉంటాము. తర్వాత మళ్లీ దైవీ వంశములో చాలా జన్మల వరకు ఉంటాము. ఈ ఒక్క జన్మయే దుర్లభమైనది. ఈ ఈశ్వరీయ కులము అత్యంత ఉత్తమమైనది. బ్రాహ్మణ కులము అన్నిటికంటే ఉన్నతమైన శిఖరము. నీచాతి నీచమైన కులము నుండి మనము ఉన్నతమైన బ్రాహ్మణ కులము వారిగా అయిపోయాము. శివబాబా బ్రహ్మను రచించినప్పుడు బ్రాహ్మణులను రచించారు. ఎవరైతే బాబా సేవలో ఉంటారో వారికి ఎంతో సంతోషము ఉంటుంది. మనము ఈశ్వరుని సంతానముగా అయ్యాము. ఈశ్వరుని శ్రీమతమును అనుసరిస్తున్నాము. మన నడవడిక ద్వారా వారి పేరును ప్రసిద్ధము చేస్తాము. బాబా అంటున్నారు - వారు ఆసురీ గుణాలకు చెందినవారు. మీరు దైవీగుణాల వారిగా అవుతూ ఉన్నారు. మీరు ఎప్పుడైతే సంపూర్ణంగా అవుతారో అప్పుడు మీ నడవడిక చాలా మంచిగా అయిపోతుంది. బాబా ''వీరు నంబరువారు పురుషార్థానుసారము దైవీగుణాల వారు'' అని అంటారు. ఆసురీ గుణాల వారు కూడా నంబరువారుగా ఉన్నారు. బాలబ్రహ్మచారులు కూడా ఉన్నారు. సన్యాసులు పవిత్రంగా ఉంటారు. అది కూడా చాలా మంచిది. అయితే వారు ఎవ్వరికీ సద్గతినివ్వలేరు. ఎవరైనా గురువులు సద్గతినిచ్చేవారుగా ఉంటే వారి వెంట తీసుకెళ్ళేవారు. కాని వారే స్వయంగా వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఇచ్చట ఈ తండ్రి అంటున్నారు - నేను మిమ్ములను నా జతలో తీసుకెళ్తాను. మిమ్ములను జతలో తీసుకెళ్ళేందుకే నేను వచ్చాను. వారు అలా తీసుకెళ్ళలేరు. స్వయంగా వారే గృహస్థుల వద్ద జన్మ తీసుకుంటూ ఉంటారు. సంస్కారాల కారణంగా మళ్లీ వారు సన్యాసుల గుంపులోకి వెళ్ళిపోతారు. నామ-రూపాలైతే ప్రతి జన్మలో మారిపోతూ ఉంటాయి. సత్యయుగములో ఇచ్చటి పురుషార్థానుసారము పదవి లభిస్తుందని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. ఈ పదవిని మనము ఎలా పొందుకున్నామో అచ్చట మనకు తెలియదు. ఇప్పుడు మాత్రమే మనము అన్ని రహస్యాలను తెలుసుకున్నాము. కల్పక్రితము ఎవరు ఏ విధంగా పురుషార్థము చేశారో అలాగే ఇప్పుడు కూడా చేస్తారు. అచ్చట వివాహాదులు ఎలా జరుగుతాయో కూడా పిల్లలకు సాక్షాత్కారము చేయించారు. పెద్ద పెద్ద మైదానాలు, ఉద్యానవనాలు మొదలైనవి ఉంటాయి. ఇప్పుడైతే భారతదేశములోని జనాభా కోట్ల సంఖ్యలో ఉంది. అచ్చటైతే కొన్ని లక్షలు మాత్రమే ఉంటుంది. అచ్చట ఇన్ని అంతస్తుల భవనాలు ఉండవు. ఇప్పుడు మాత్రమే ఇన్ని అంతస్తుల భవనాలున్నాయి. ఎందుకంటే తగినంత స్థలము లేదు. అచ్చట ఇంత చలి కూడా ఉండదు. అచ్చట దు:ఖానికి నామ-రూపాలు కూడా ఉండవు. ఎక్కువ వేడి కూడా ఉండదు, వేసవి కాలములో పర్వతాల పైకి వెళ్లే అవసరముండదు. దాని పేరే స్వర్గము. ఈ సమయములో మనుష్యులు ముళ్ళ అడవిలో పడి ఉన్నారు. సుఖము కావాలని ఎంత కోరుకుంటున్నారో అంత దు:ఖము పెరిగిపోతూనే ఉంటుంది. ఇక మీదట ఇంకా దు:ఖము ఉంటుంది. యుద్ధము జరిగితే రక్తపు నదులు ప్రవహిస్తాయి. మంచిది.
ఈ మురళిని పిల్లలందరి ముందు వినిపించారు. సన్ముఖములో వినుట నెంబర్ ఒన్. టేపు ద్వారా వినుట రెండవ నెంబరు. మురళీ చదువడం మూడవ నెంబరు. ఇది సతోప్రధానము, సతో, రజో అయింది. తమో అని అయితే అనరు. టేపులో ఉన్నదున్నట్లే వస్తుంది. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మీ చలనము(నడవడికలు) లేక దైవీ గుణాల ద్వారా తండ్రి పేరును ప్రసిద్ధము చేయాలి. ఆసురీ అవగుణాలను తొలగించి వేయాలి.
2.
ఈ పురాతన, శిథిలావస్థకు వచ్చిన శరీరము పై మమకారముంచుకోరాదు. కొత్త
సత్యయుగీ శరీరాన్ని స్మృతి చేయాలి. పవిత్రంగా ఉండి గుప్తమైన సహాయము చేయాలి.
వరదానము :- ''తండ్రి ఇచ్చిన ప్రతి ఆదేశము లేక నియమము ద్వారా లాభాన్ని(ఫాయిదా) పొందే మర్యాదా పురుషోత్తమ భవ''
నియమాలు
ఎంతగా పాటిస్తే అంత లాభమని అంటారు. అందువలన అమృతవేళ నుండే నియమాలు ఏవైతే
ఉన్నాయో వాటిని దాటరాదు. చదువు, అమృతవేళ(యోగము) సేవ మొదలైన వాటితో దినచర్య
ఏదైతే తయారు చేయబడిందో, అందులో మనసు లగ్నమవ్వకపోయినా దినచర్యలో ఏదియూ మిస్
చేయకండి. ఉదాహరణానికి భక్తులు నియమాలను తప్పకుండా పాటిస్తారో, మందిరములో
మనసు లగ్నము కాకున్నా వారు తప్పకుండా మందిరానికి వెళ్తారు. మీరు స్వయం
నియమాలను తయారు చేయువారు. ఇదే అనుభవంతో ప్రతీ నియమాన్ని పాలన చేస్తూ వెళ్తూ
ఉంటే మర్యాదా పురుషోత్తములుగా అయిపోతారు.
స్లోగన్ :- ''ఎవరి వద్ద సంతుష్టత (తృప్తి) అనే విశేష గుణముంటుందో వారి వద్దకు సర్వ గుణాలు స్వతహాగానే వచ్చేస్తాయి.''
No comments:
Post a Comment