Tuesday, 23 January 2018

Telugu Murli 24/01/18

24-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

''మధురమైన పిల్లలారా - మీరు రాజఋషులు, మీకు అనంతమైన తండ్రి మొత్తము పాత ప్రపంచమంతటిని సన్యసించడం నేర్పిస్తున్నారు, దాని ద్వారా మీరు రాజ్య పదవిని పొందగలుగుతారు.'' 

ప్రశ్న:- ఈ సమయములో మనుష్యులు ఆచరించే ఏ కర్మలూ అకర్మలు కాజాలవు, ఎందుకు?
జవాబు:- ప్రపంచమంతటి పై మాయ తన ప్రభావాన్ని వేసి రాజ్యపాలన చేస్తోంది. అందరిలో పంచ వికారాలు ప్రవేశమై ఉన్నాయి. అందువలన మనుష్యులు ఏ కర్మలు చేెసినా, అవి వికర్మలే అవుతాయి. సత్యయుగములో మాత్రమే కర్మలు అకర్మలుగా అవుతాయి ఎందుకంటే అక్కడ మాయ ఉండదు. 

ప్రశ్న:- ఏ పిల్లలకు చాలా మంచి బహుమతి లభిస్తుంది ?
జవాబు:- ఎవరైతే శ్రీమతమును అనుసరించి పవిత్రంగా తయారై అంధులకు ఊతకర్రగా అవుతారో, ఎప్పుడూ 5 వికారాలకు వశమై కులకళంకితులుగా అవ్వరో, వారికి చాలా మంచి బహుమతి లభిస్తుంది. ఎవరైనా పదే పదే మాయతో ఓడిపోతూ ఉంటే, వారి పాస్‌పోర్టే క్యాన్సల్‌(రద్దు) అయిపోతుంది.

పాట:- ఓం నమ: శివాయ,....................
ఓంశాంతి. అందరికంటే ఉన్నతమైనవారు పరమపిత పరమాత్మ అనగా పరమ ఆత్మ. వారు రచయిత. మొదట బ్రహ్మ-విష్ణు-శంకరులను రచిస్తారు, ఆ తర్వాత క్రిందకు అమరలోకములోకి రండి, అచ్చట లక్ష్మీనారాయణుల రాజ్యము ఉంటుంది. అది సూర్యవంశీయుల రాజ్యము, చంద్ర వంశీయులది కాదు. ఇది అర్థం చేయించింది ఎవరు? జ్ఞాన సాగరులు. మనుష్యులు మనుష్యులకు ఎప్పుడూ అర్థం చేయించలేరు. అందరికంటే ఉన్నతమైనవారు తండ్రి. వారిని భారతవాసులు మాతా - పిత అని అంటారు. అందువలన ప్రాక్టికల్‌గా ప్రత్యక్షములో మాతా-పితలు ఉండాలి. గానము చేస్తున్నారంటే తప్పకుండా ఏదో ఒక సమయములో వచ్చి ఉంటారు. అందువలన మొట్టమొదట ఉన్నతోన్నతమైనవారు ఆ నిరాకార పరమపిత పరమాత్మయే. పోతే మిగిలిన వారందరిలోనూ ఉండేది ఆత్మయే. ఆత్మ శరీరములో ఉన్నప్పుడు దు:ఖితముగానో లేక సుఖవంతముగానో అవుతుంది - ఇవి చాలా అర్థము చేసుకోవలసిన విషయాలు. ఇవి కట్టుకథలు కావు. గురువులు, సాధువులు మొదలైనవారు ఏవైతే వినిపిస్తున్నారో అవన్నీ కట్టుకథలే. ఇప్పుడు భారతదేశము నరకంగా ఉంది. సత్యయుగములో దీనిని స్వర్గము అని అంటారు. లక్ష్మీనారాయణులు రాజ్యపాలన చేసేవారు. అచ్చట అందరూ సౌభాగ్యశాలురుగా ఉండేవారు. దౌర్భాగ్యశాలురు ఒక్కరు కూడా ఉండరు. ఏ దు:ఖము గాని, రోగము కాని ఉండేవే కావు. ఇది పాపాత్మల ప్రపంచము, భారతవాసులు స్వర్గవాసులుగా ఉండేవారు. లక్ష్మీనారాయణుల రాజ్యము ఉండేది. కృష్ణుని అందరూ అంగీకరిస్తారు. చూడండి, అతని వారి రెండు గోళాలు చూపించారు. కృష్ణుని ఆత్మ ఇలా అంటుంది - నేను ఇప్పుడు నరకాన్ని కాలితో తంతున్నాను, స్వర్గాన్ని అరచేతిలో తీసుకొని వచ్చాను. ఇంతకుముందు కృష్ణపురము ఉండేది, ఇప్పుడు కంసపురముగా మారిపోయింది. ఇందులో ఈ కృష్ణుడు కూడా ఉన్నాడు. ఇది వీరి 84 జన్మల చక్రములోని అంతిమ జన్మ, అయితే ఇప్పుడు ఆ కృష్ణుని రూపము లేదు. ఈ విషయాలు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఆ తండ్రే స్వయంగా వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. ఇప్పుడు నరకంగా ఉంది. స్వర్గముగా తయారు చేసేందుకు తండ్రి వచ్చారు. ఇది పాత ప్రపంచము. ఏదైతే నూతన ప్రపంచంగా ఉండేదో, ఇప్పుడది పాత ప్రపంచమైపోయింది. ఇల్లు కూడా క్రొత్తది నుండి పాతదిగా అవుతుంది. పోను పోను చివరికి శిథిలావస్థకు చేరుకుని పడగొట్టే విధంగా అయిపోతుంది. ఇప్పుడు తండ్రి అంటున్నారు - పిల్లలను స్వర్గవాసులుగా చేసేందుకు రాజయోగము నేర్పిస్తున్నాను. మీరు రాజఋషులు, రాజ్యపదవి ప్రాప్తి చేసుకునేందుకు మీరు వికారాలను సన్యసిస్తారు. ఆ హద్దు సన్యాసులు ఇల్లు-వాకిళ్ళు వదిలి అడవులలోకి వెళ్ళిపోతారు కాని వారుండేది పాత ప్రపంచములోనే. అనంతమైన తండ్రి మీచే నరకాన్ని సన్యాసము చేయిస్తారు. మీకు స్వర్గాన్ని సాక్షాత్కారము చేయిస్తారు. తండ్రి అంటున్నారు - నేను మిమ్ములను తీసుకెళ్లేందుకు వచ్చాను. తండ్రి అందరికీ చెప్తున్నారు - మీకు మీ జన్మల గురించి తెలియదు. ఎవరు ఎటువంటి కర్మలు చేస్తారో మంచివైనా, చెడ్డవైనా ఆ సంస్కారాల అనుసారము వెళ్ళి జన్మ తీసుకుంటారు. కొంతమంది ధనవంతులుగా, కొంతమంది పేదవారిగా, కొంతమంది రోగులుగా, కొంతమంది ఆరోగ్యవంతముగా ఉన్నారు. ఇదంతా పూర్వజన్మల కర్మాచరణ ద్వారా తయారైన కర్మల లెక్కాచారము. ఎవరైనా ఆరోగ్యవంతులు ఉన్నారంటే, వారు తప్పకుండా క్రితము జన్మలో ఆసుపత్రి మొదలైనవి కట్టించి ఉంటారు. దాన-పుణ్యాలు ఎక్కువగా చేస్తే ధనవంతులుగా అవుతారు. నరకములో మనుష్యులు ఏ కర్మలు చేసినా, అవి తప్పకుండా వికర్మలుగానే అవుతాయి ఎందుకంటే అందరిలో 5 వికారాలు వ్యాపించి ఉన్నాయి. ఇప్పుడు సన్యాసులు పవిత్రంగా అవుతారు. పాపాలు చేయడం వదిలేస్తారు. అడవులకు వెళ్ళి నివసిస్తారు. దాని వలన వారు చేసే కర్మలు అకర్మలు అవుతాయని కాదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఈ సమయములో ఉండేదే మాయా రాజ్యము. అందువలన మనుష్యులు ఏ కర్మలు చేసినా, అవి పాప కర్మలుగానే ఉంటాయి. సత్య-త్రేతా యుగాలలో మాయ ఉండదు. అందువలన అక్కడ ఎప్పుడూ కర్మలు వికర్మలుగా అవ్వవు, దు:ఖము కూడా ఉండదు. ఈ సమయములో ఒకటేమో రావణుని సంకెళ్ళు, మరొకటి భక్తిమార్గపు సంకెళ్ళు, జన్మ-జన్మాంతరాలుగా ఎదురుదెబ్బలు తింటూ వచ్చారు. తండ్రి అంటున్నారు - నేను ఈ జప-తపాదులతో లభించను. ఈ విషయము ఇంతకు ముందు కూడా వినిపించాను. భక్తిమార్గపు అంతిమ సమయములో నేను వస్తాను. భక్తి మొదలయ్యేది ద్వాపరము నుండి, మనుష్యులు దు:ఖితులుగా అయినప్పుడు నన్ను స్మృతి చేస్తారు. సత్య, త్రేతా యుగాలలో సౌభాగ్యశాలురు ఉంటారు. ఇచ్చట అందరూ దుర్భాగ్యశాలురుగా ఉన్నారు. ఏడుస్తూ, బాదుకుంటూ ఉంటారు. అకాలమరణాలు సంభవిస్తూ ఉంటాయి. తండ్రి అంటున్నారు - నరకాన్ని స్వర్గముగా చేయవలసి వచ్చినప్పుడు నేను వస్తాను. భారతదేశము అత్యంత ప్రాచీనమైనది. ప్రారంభములో ఎవరు ఉండేవారో, వారే చివరివరకు ఉంటారు. 84 జన్మల చక్రము గాయనము చేయబడింది. ప్రభుత్వము వారు తయారు చేసిన త్రిమూర్తిలో బ్రహ్మా, విష్ణు, శంకరులు ఉండాలి. కాని వారు జంతువులను (సింహాలు) పెట్టేశారు. అందులో రచయిత అయిన తండ్రి చిత్రము లేనే లేదు. క్రింది భాగములో చక్రము కూడా వేశారు. వారు ఈ చక్రాన్ని చరఖా(రాట్నము) చక్రముగా భావిస్తారు కానీ నిజానికది డ్రామాను తెలిపే సృష్టి చక్రము. ఇప్పుడు వారు చక్రానికి అశోకచక్రమని పేరు పెట్టారు. అయితే మీరు ఈ చక్రము గురించి తెలుసుకోవడం ద్వారానే అశోకులుగా(దు:ఖము లేనివారుగా) అయిపోతారు. విషయము సరైనదే కాని అంతా కలగాపులగము చేసేశారు. మీరు ఈ 84 జన్మల చక్రాన్ని స్మృతి చేయడం ద్వారా 21జన్మలకు చక్రవర్తి రాజులుగా అయిపోతారు. ఈ దాదా కూడా 84 జన్మలు పూర్తి చేశారు. ఇతడిది కృష్ణుని అంతిమ జన్మ. తండ్రి కూర్చుని ఇతనికి అర్థం చేయిస్తున్నారు. వాస్తవానికిది మీ అందరి అంతిమ జన్మ. ఎవరైతే దేవీ దేవతా ధర్మానికి చెందిన భారతవాసులో, వారే పూర్తిగా 84 జన్మలు అనుభవించారు. ఇప్పుడు అందరి చక్రము పూర్తవుతుంది. ఇప్పుడు మీ శరీరము పనికి రాకుండా ఛీ-ఛీ గా పాడైపోయింది. ఈ ప్రపంచమే పాడైపోయింది. అందువలన మిమ్ములను ఈ ప్రపంచము నుండి సన్యాసము చేయిస్తారు. ఈ శ్మశానము పై మనస్సు పెట్టుకోరాదు. ఇప్పుడు తండ్రిని మరియు వారిచ్చే వారసత్వము పై మనస్సును సంలగ్నము చేయండి. మీరు అవినాశి ఆత్మలు, ఈ శరీరము వినాశనమయ్యేది. ఇప్పుడు నన్ను స్మృతి చేస్తే అంతిమతి సో గతి అయిపోతారు (అంతిమ సమయంలోని స్మృతిని బట్టి మరుసటి జన్మ లభిస్తుంది). ఎవరైతే అంత్యకాలములో స్త్రీని స్మరిస్తారో, వారు వేశ్య యోనిలో జన్మస్తారనే సామెత కూడా ఉంది. ఇప్పుడు తండ్రి అంటున్నారు - అంత్యకాలములో ఎవరైతే శివబాబాను స్మృతి చేస్తారో, వారు నారాయణ పదవిని ప్రాప్తి చేసుకోగలరు. నారాయణ పదవి లభించేది సత్యయుగములో. తండ్రి తప్ప ఈ పదవిని ఇతరులెవ్వరూ ఇప్పించలేరు. ఈ పాఠశాల మనుష్యులను దేవతలుగా తయారు చేస్తుంది. చదివించేవారు తండ్రి. వారి మహిమనే ఓం నమ: శివాయ అని పాటలో విన్నారు. మనము వారి పిల్లలుగా అయ్యామని మీకు తెలుసు. ఇప్పుడు వారసత్వము వారి నుండి తీసుకుంటున్నామని మీకు తెలుసు.

ఇప్పుడు మీరు మనుష్యుల మతమును అనుసరించరు. మనుష్యుల మతము పై నడిచినందునే అందరూ నరకవాసులుగా అయిపోయారు. శాస్త్రాలు కూడా మనుష్యులచే తయారు చేయబడినవే. భారతదేశమంతా ఈ సమయములో ధర్మ భ్రష్టము, కర్మ భ్రష్టముగా అయిపోయింది. దేవతలు పవిత్రంగా ఉండేవారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు - సౌభాగ్యశాలురుగా తయారవ్వాలనుకుంటే పవిత్రులుగా అవ్వండి. బాబా మేము పవిత్రమై మీ నుండి తప్పకుండా వారసత్వము తీసుకుంటామని ప్రతిజ్ఞ చేయండి. ఈ పాత పతిత ప్రపంచము సమాప్తమవ్వనున్నది. కొట్లాటలు, జగడాలు ఇందులో ఏమేమి జరుగుతున్నాయో చూడండి. క్రోధము ఎంత ఉందో గమనించండి. ఎంతో పెద్ద పెద్ద బాంబులు తయారు చేశారు. ఎంతో క్రోధులుగా, లోభులుగా ఉన్నారు. అచ్చట శ్రీ కృష్ణుడు ఏ విధంగా గర్భమహలు నుండి వెలువడ్తారో పిల్లలు సాక్షాత్కారములో చూశారు, ఇక్కడుండేది గర్భజైలు. శిశువు బయటకు వస్తూనే మాయ పాపాలు చేయించడం మొదలు పెడ్తుంది. అక్కడైతే గర్భమహలు నుండి పుత్రుడు వెలువడ్తాడు. వెంటనే అంతా ప్రకాశవంతమవుతుంది, చాలా విశ్రాంతిగా ఉంటారు. గర్భము నుండి వెలువడ్తూనే దాసీలు ఎత్తుకుంటారు, బాజా భజంత్రీలు మ్రోగడము మొదలవుతుంది. ఇక్కడికి, అక్కడికి ఎంత వ్యత్యాసముందో తెలుసుకోండి.

ఇప్పుడు పిల్లలైన మీకు బాబా మూడు ధామాలను గూర్చి అర్థం చేయించారు. ఆత్మలు శాంతిధామము నుండే వస్తాయి. ఆత్మ నక్షత్రము వలె ఉంటుంది, అది భృకుటి మధ్యలో ఉంటుంది. ఆత్మలో 84 జన్మల అవినాశి రికార్డు నిండి ఉంది. ఆత్మ ఎప్పుడూ వినాశనమవ్వదు. అలాగే ఆత్మ పాత్ర కూడా ఎప్పుడూ మార్పు అవ్వజాలదు. ఇది కూడా అద్భుతమే. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల పాత్ర పూర్తి ఖచ్ఛితంగా నిండి ఉంది. ఇది ఎప్పుడూ పాతదిగా అవ్వదు, నిత్య నూతనంగానే ఉంటుంది. ఖచ్ఛితంగా ఆత్మయే మళ్లీ అదే పాత్ర ప్రారంభము చేస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మయే పరమాత్మ అని అనరు. హమ్‌ సో, సో హమ్‌ అన్న పదానికి యథార్థమైన అర్థాన్ని తండ్రి అర్థం చేయిస్తున్నారు. వారు దాని అర్థమును ఉల్టా(వ్యతిరేకము)గా చెప్పేశారు. అహం బ్రహ్మాస్మి అనైనా అంటారు, మాయను రచించే పరమాత్మను నేనే అనైనా అంటారు. వాస్తవానికి మాయ రచింపబడదు. మాయ అనగా పంచ వికారాలు. తండ్రి మాయను రచించరు. తండ్రి నూతన సృష్టిని రచిస్తారు. నేను సృష్టి రచయితను అని అంటారు. ఈ మాట ఇతరులెవ్వరూ అనలేరు. అనంతమైన తండ్రి వారొక్కరే. ఓం అను పదానికి అర్థము కూడా పిల్లలకు అర్థం చేయించబడింది. ఆత్మ స్వరూపము శాంతి, శాంతిధామములో ఉంటుంది. కాని తండ్రి జ్ఞానసాగరులు, ఆనందసాగరులు. ఆత్మను ఇలా మహిమ చేయరు. అయితే ఆత్మలో జ్ఞానము వస్తుంది. తండ్రి అంటున్నారు - నేను ఒక్కసారి మాత్రమే వస్తాను. నేను వచ్చి నా వారసత్వమును కూడా తప్పకుండా ఇవ్వవలసి వస్తుంది. నా వారసత్వముతో భారతదేశము ఒక్కసారిగా స్వర్గముగా అయిపోతుంది. అచ్చట పవిత్రత, సుఖ-శాంతులు అన్నీ ఉండేవి. ఇవి అనంతమైన తండ్రి ఇచ్చిన సదా ఉండే సుఖ వారసత్వము. పవిత్రత ఉండేది కావున సుఖ-శాంతులు కూడా ఉండేవి. ఇప్పుడు అపవిత్రత ఉంది కనుక దు:ఖము - అశాంతులు ఉన్నాయి. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు - ఆత్మలైన మీరు మొట్టమొదట మూలవతనములో ఉండేవారు, తర్వాత మళ్లీ దేవీ దేవతా ధర్మములోకి వచ్చారు, ఆ తర్వాత క్షత్రియ ధర్మములోకి వచ్చారు. 8 జన్మలు సతోప్రధానములో, తర్వాత 12 జన్మలు సతోలో తర్వాత 21జన్మలు ద్వాపర యుగములో ఆ తర్వాత 42 జన్మలు కలియుగములో తీసుకున్నారు. ఇచ్చట శూద్రులుగా అయిపోయారు. ఇప్పుడు మళ్లీ బ్రాహ్మణ వర్ణములోకి రావాలి మళ్లీ దేవతా వర్ణములోకి వెళ్తారు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ ఒడిలో ఉన్నారు. తండ్రి ఎంతో మంచిరీతిగా అర్థం చేయిస్తున్నారు. 84 జన్మల గురించి తెలుసుకున్నందున అందులో అన్నీ వచ్చేస్తాయి. మొత్తం చక్రమంతటి జ్ఞానము బుద్ధిలో ఉంది. సత్యయుగములో ఒకే ధర్మముంటుందని మీకు తెలుసు. ప్రపంచ సర్వశక్తివంతమైన అథారిటీ(వరల్డ్‌ ఆల్‌మైటి అథారిటి) రాజ్యము ఒక్కటే ఉంటుంది. ఇప్పుడు మీరు లక్ష్మీనారాయణుల పదవిని పొందుకుంటున్నారు, సత్యయుగము పావన ప్రపంచము. అచ్చట చాలా తక్కువ మంది ఉంటారు. మిగిలిన ఆత్మలన్నీ ముక్తిధామములో ఉంటాయి. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రియే. వారిని గురించి ఎవ్వరికీ తెలియదు. అంతేకాక పరమాత్మ సర్వవ్యాపి అని కూడా అంటారు. ఈ మాట మీకు ఎవరు చెప్పారు? అని బాబా అడుగుతారు. గీతలో వ్రాయబడి ఉందని అంటారు. గీతను తయారు చేసిందెవరు? అని అడిగితే భగవానువాచ అని అంటారు. నేనైతే ఈ సాధారణ బ్రాహ్మ శరీరాన్ని ఆధారంగా తీసుకుంటాను. యుద్ధ మైదానములో ఒక అర్జునునికే కూర్చొని జ్ఞానమెలా వినిపిస్తారు? మీకు యుద్ధము గానీ, జూదము గానీ నేర్పించబడవు. భగవంతుడు మనుష్యులను దేవతలుగా తయారు చేసేవాడు. వారు జూదము ఆడమని, యుద్ధము చేయమని ఎలా చెప్తారు? ద్రౌపదికి ఐయిదుగురు పతులు ఉండేవారని అంటారు. ఇది ఎలా జరుగగలదు? కల్పక్రితము బాబా స్వర్గాన్ని తయారు చేశాడు. ఇప్పుడు మళ్లీ తయారు చేస్తున్నారు. కృష్ణుని 84 జన్మలు పూర్తి అయ్యాయి. యథా రాజా-రాణి, తథా ప్రజ. అందరి 84 జన్మలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు మీరు శూద్రుల నుండి మార్పు చెంది బ్రాహ్మణులుగా అయ్యారు. ఎవరైతే బ్రాహ్మణ ధర్మములోకి వస్తారో, వారే మమ్మా - బాబా అని అంటారు. మళ్లీ భలే ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అది వారి ఇష్టం. మా కొరకు ఈ లక్ష్యము చాలా ఉన్నతమైనదని భావిస్తారు అయినా ఎంతో కొంతైనా వింటారు. కాబట్టి స్వర్గములోకి తప్పకుండా వస్తారు, అయితే చిన్నపదవిని పొందుకుంటారు. అచ్చట యథా రాజా రాణి, తథా ప్రజ అందరూ సుఖంగా ఉంటారు. దాని పేరే స్వర్గము. హెవెన్లీ గాడ్‌ఫాదర్‌ హెవెన్‌ను స్థాపన చేస్తారు. ఇది నరకము. సీతలనందరినీ రావణుడు తన జైలులో బంధించి ఉంచాడు. అందరూ శోకతప్తులై - ఈ రావణుని నుండి విడిపించమని భగవంతుని స్మృతి చేస్తున్నారు. సత్యయుగము అశోకవాటిక. ఎంతవరకు మీ సూర్యవంశీ రాజధాని స్థాపన అవ్వదో అంతవరకు వినాశము జరగజాలదు. రాజధాని స్థాపనై పిల్లలకు కర్మాతీత స్థితి వచ్చినప్పుడు ఫైనల్‌ యుద్ధము జరుగుతుంది. అంతవరకు రిహార్సల్స్‌ జరుగుతూ ఉంటాయి. ఈ యుద్ధము తర్వాత స్వర్గ ద్వారాలు తెరచుకుంటాయి. పిల్లలైన మీరు స్వర్గములోకి వెళ్లేందుకు అర్హులుగా అవ్వాలి. బాబా పాస్‌పోర్టును తయారు చేయిస్తున్నారు. ఎంతెంతగా పవిత్రంగా అవుతారో, అంధులకు చేతికర్రగా అవుతారో బహుమతి కూడా అంత మంచిది లభిస్తుంది. మధురమైన బాబా మేము మీ స్మృతిలో తప్పకుండా ఉంటామని బాబాతో ప్రతిజ్ఞ చేయాలి. ముఖ్యమైన విషయము - పవిత్రత. ఐదు వికారాలను తప్పకుండా దానము ఇవ్వవలసి వస్తుంది. కొంతమంది ఓడిపోయి క్రింద పడి మళ్లీ లేచి కూడా నిల్చుంటారు కూడా. ఒకవేళ మూడు నాలుగు సార్లు మాయతో ఘూసాలు(దెబ్బలు) తిని మళ్లీ క్రింద పడిపోతే పాస్‌ అవ్వలేరు. పాస్‌పోర్టు క్యాన్సల్‌ అయిపోతుంది. తండ్రి అంటున్నారు - పిల్లలూ ! కులకళంకితులుగా అవ్వకండి. మీరు వికారాలను వదిలేయండి, నేను మిమ్ములను తప్పకుండా స్వర్గాధికారులుగా తయారుచేస్తాను. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. 

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. సౌభాగ్యశాలిగా అయ్యేందుకు తండ్రితో పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయాలి. ఈ ఛీ-ఛీ పతిత ప్రపంచము పై మనస్సు లగ్నము చేయరాదు.
2. మాయతో ఎప్పుడూ ముష్టి ఘాతాలు(ఘూసాలు) తినరాదు. కులకళంకితులుగా అవ్వరాదు. అర్హులుగా అయ్యి బాబా నుండి స్వర్గానికి పాస్‌పోర్టు తీసుకోవాలి. 

వరదానము :- '' మీ శ్రేష్ఠమైన స్థితి ద్వారా వెతుకుచున్న ఆత్మలకు శ్రేష్ఠమైన ఆశ్రయాన్ని (ఠికానాను) ఇచ్చే లైట్‌ స్వరూప భవ ''
ఎలాగైతే స్థూలమైన వెలుగు పై దీపపు పురుగులు స్వతహాగా వస్తాయో, అలా మెరిసిపోతున్న నక్షత్రాల వద్దకు భ్రమిస్తున్న, వెతుకుచున్న ఆత్మలు తీవ్రవేగంతో వస్తాయి. అందుకు ప్రతి ఒక్కరి మస్తకము పై సదా మెరిసిపోతున్న నక్షత్రాన్ని చూచే అభ్యాసము చేయండి. శరీరాలను చూస్తున్నా చూడకండి. సదా మీ దృష్టి మెరిసిపోతున్న నక్షత్రాల వైపుకు(లైటు వైపుకు) వెళ్లాలి. ఎప్పుడైతే మీ ఆత్మిక దృష్టి ఇంత న్యాచురల్‌గా అయిపోతుందో అప్పుడు మీ శ్రేష్ఠమైన స్థితి ద్వారా భ్రమిస్తున్న, వెతుకుచున్న ఆత్మలకు యదార్థమైన ఠికానా లభిస్తుంది. 

స్లోగన్‌:-'' సేవకు గల మహత్యాన్ని తెలుసుకొని ఏదో ఒక సేవలో బిజీగా (తలమునకలుగా) ఉండేవారే ఆల్‌రౌండ్‌ సేవాధారులు ''
 

Monday, 22 January 2018

Telugu Murli 23/01/18

23-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

''మధురమైన పిల్లలారా - మీరు అత్యంత భాగ్యశాలీ పిల్లలు ఎందుకంటే మీ సన్ముఖములో స్వయంగా తండ్రియే ఉన్నారు, వారే మీకు తెలిపిస్తున్నారు'' 

ప్రశ్న :- భక్తిమార్గములోని ఏ సంస్కారము ఇప్పుడు పిల్లలైన మీలో ఉండజాలదు, ఎందుకు?
జవాబు :- భక్తిమార్గములో ఏ దేవీ దేవతల వద్దకు వెళ్ళినా వారిని ఏదో ఒకటి యాచిస్తూనే ఉంటారు, ఒకరిని ధనమివ్వమని వేడుకుంటారు, ఒకరిని పుత్రుని ప్రసాదించమని అడుగుతారు - ఈ యాచించే (అడుక్కునే) సంస్కారము ఇప్పుడు పిల్లలైన మీలో ఉండరాదు, ఎందుకంటే తండ్రి మిమ్ములను ఈ సంగమయుగములో కామధేనువుగా తీర్చిదిద్దారు(చేశారు). మీరు తండ్రి సమానంగా అందరి మనోకామనలను పూర్తి చేసేవారు. మీరు స్వయం కొరకు ఏ ఆశలూ ఉంచుకోరాదు. ఫలమునిచ్చువారు దాత అయిన ఒక్క తండ్రి మాత్రమేనని మీకు తెలుసు. వారిని స్మృతి చేయడం వలన సకల ప్రాప్తులు లభిస్తాయి. అందువలన యాచించే సంస్కారాలు సమాప్తమైపోతాయి. 

పాట :- ఓంనమ: శివాయ.........................
ఓంశాంతి. భగవానువాచ! ఇప్పుడు బాగా అర్థము చేసుకొని మళ్లీ అర్థము చేయించేందుకు ఒక్క గీతా శాస్త్రము మాత్రమే ఉంది. శాస్త్రాలను మనుష్యులే తయారు చేశారు, కాని రాజయోగాన్ని మనుష్యులు నేర్పించలేరు. తండ్రి అంటున్నారు - 5 వేల సంవత్సరాల క్రితము కూడా అపురూపమైన భారతవాసి పిల్లలైన మీకు రాజయోగము నేనే నేర్పించాను. అపురూపమంటే అర్థము మీకు అర్థం చేయించాను. మీరే 84 జన్మలు పూర్తిగా తీసుకున్న తర్వాత మళ్లీ వచ్చి నన్ను కలిశారు. 5 వేల సంవత్సరాల క్రితము కూడా మీరు కలిశారు. మీరు వచ్చి బ్రహ్మ ముఖవంశావళి అనగా బ్రాహ్మణ - బ్రాహ్మణీలుగా అయ్యారు. తండ్రి డైరెక్టు(నేరు)గా చెప్తున్నారు - ఆ గీతా పారాణయము మొదలైనవి చేయువారు ఇలా మాట్లాడరు. తండ్రి నేరుగా అర్థం చేయించి వెళ్ళిపోయారు, మళ్లీ భక్తిమార్గము నుండి శాస్త్రాలను తయారు చేస్తారు. ఇప్పుడు డ్రామా పూర్తవుతుంది, మళ్లీ తండ్రి వచ్చారు. వారు పిల్లలతో చెప్తున్నారు - ఏ పిల్లలకు? ప్రత్యేకించి మీకు మరియు మొత్తం ప్రపంచమంతటికి చెప్తున్నాను. ఇప్పుడు మీరు సన్ముఖములో ఉన్నారు. బాబా కూర్చుని మీకు తమ పరిచయమునిచ్చారు. ఈ రాజయోగమును మీకు ఇతరులెవ్వరూ నేర్పించలేరు. తండ్రియే ఇంతకు ముందు మీకు రాజయోగాన్ని నేర్పించారు, ఇప్పుడు మళ్లీ నేర్పిస్తున్నారు. దీని ద్వారా మీరు మళ్లీ రాజాధి రాజులుగా అవుతారు. ఇతరులెవ్వరు కూడా స్వర్గాధికారులుగా అవ్వలేరు. నేను మీ తండ్రిని, మీకు మళ్లీ రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చాను. అచ్ఛా. ఇప్పుడు బాబా మీకు కల్పవృక్షము గురించి అర్థం చేయిస్తారు. ఈ జ్ఞానము కూడా చాలా అవసరము, దీనిని కల్పవృక్షమని అంటారు. తండ్రి అంటున్నారు - ఈ మనుష్య సృష్టి రూపి వృక్షమే కల్పవృక్షము. ఆ గీతను(భక్తిమార్గము) వినిపించేవారు భగవంతుడు ఇలా అన్నాడు అని అంటారు, కాని మీరు భగవంతుడు ఇలా చెప్తున్నారు (అంటే వర్తమానములో) అని అంటారు. ఇది మనుష్యసృష్టి రూపి వృక్షము. ఇందులో ఫలాలు, మామిడి పండ్లు మొదలైనవి ఏవీ లేవు. ఆ ఫల వృక్షాలలో బీజము క్రింద భూగర్భములో ఉంటుంది, వృక్షము పైకి విస్తరించి ఉంటుంది. కాని దీని బీజము పైన ఉంటుంది, వృక్షము క్రింద ఉంది. ఈశ్వరుడు మనలను సృష్టించారని కూడా అంటారు. అనగా తండ్రి(శివబాబా) పిల్లలను ఇచ్చారు, తండ్రియే ధనమునిచ్చారని అంటారు. ఓ తండ్రీ! మీరు మా దు:ఖాలను దూరం చేయండి అని అంటారు. బాబా - బాబా అని అంటూ ఉంటారు. ఎంత అశాంతి ఉంటుంది! లక్ష్మీనారాయణుల సన్ముఖములోకి వెళ్తారు. వారితో '' హే మహాలక్ష్మీ దేవీ మాకు ధనాన్ని ప్రసాదించు'' అని వేడుకుంటారు. ఇవన్నీ యాచించే సంస్కారాలు. జగదంబ వద్ద కొంతమంది పుత్రులను ప్రసాదించమని అడుగుతారు, కొంతమంది మా రోగాలను దూరం చేయండి అని ప్రార్థిస్తారు. లక్ష్మీ ముందు ఇటువంటి ఆశలను పెట్టుకోరు, వారి వద్ద కేవలం ధనాన్ని అడుక్కుంటారు. జగదంబయే లక్ష్మి. ఆమె 84 జన్మల చక్రములో తిరిగి మళ్లీ జగదంబగా అవుతుందని మీకు తెలుసు. వృక్షములో జగదంబ కూర్చొని ఉంది, గమనించండి. ఆమె మళ్లీ తప్పకుండా మహారాణిగా అవుతుంది. పిల్లలైన మీరు కూడా రాజధానిలో వస్తారు. మీరు కల్పవృక్షము క్రింద కూర్చొని ఉన్నారు, సంగమ యుగములో పునాదిని వేస్తున్నారు. కామధేనువు పిల్లలైన మీరే అందరి మనోకామనలను పూర్తి చేసేవారు. మీరు భారతమాత శక్తి సైన్యము, ఇందులో పాండవులు కూడా ఉన్నారు.

ఒక్క బాబానే స్మృతి చేయాలని పిల్లలకు అర్థం చేయించబడింది. ఎందుకంటే ఇచ్చేవారు ఒక్క తండ్రియే. భలే మీరు ఎవరినైనా భక్తి చేయండి, ఎవరినైనా స్మృతి చేయండి కాని ఫలితమునిచ్చేవారు ఒక్క దాత అయిన తండ్రి మాత్రమే. వారే సర్వమూ(అన్నీ) ఇస్తారు. భక్తిమార్గములో మీరు నారాయణుని, కృష్ణుని పూజిస్తారు, కృష్ణుని ఊయలలో కూడా ఊపుతారు. అతడిని ప్రేమిస్తారు. అతని నుండి మీరు ఏమి కోరుకుంటారు? మేము వారి రాజధానిలోనికి వెళ్లాలి లేక మాకు కృష్ణుని వంటి పుత్రుడు లభించాలని కోరుకుంటారు. భజో రాధే గోవింద చలో బృందావన్‌(రాధా - గోవిందులను భజించండి, బృందావనానికి పదండి) అని పాట పాడుతూ భజన చేస్తారు. అక్కడ వైకుంఠములో రాజ్యపాలన చేసేవారు. ఆ సమయములో అప్రాప్తి అనే వస్తువు ఏదీ ఉండదు. కృష్ణుని రాజ్యాన్ని ఎంతగానో స్మృతి చేస్తూ ఉంటారు. భారతదేశములో కృష్ణుని రాజ్యమున్నప్పుడు ఏ ఇతర రాజ్యాలు లేవు. ఇప్పుడు తండ్రి వచ్చి అంటున్నారు - కృష్ణపురములోనికి పదండి, అచ్చటికి వెళ్ళి కృష్ణునికి పత్నిగా అవ్వండి లేక రాధకు పతిగా అవ్వండి. విషయము ఒక్కటే అని బాబా అంటారు, అచ్చట విషము లభించదు. అది సంపూర్ణ నిర్వికారి ప్రపంచము, ఇప్పుడు మీరు విద్యార్థులుగా ఉన్నారు. నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు భికారి నుండి రాకుమారునిగా తయారయ్యేందుకు చదువుకుంటున్నారు. ఇచ్చట భలే ఎవరైనా కోటీశ్వరులుగా ఉన్నా, 50 కోట్లు ఉన్నా మీ లెక్క(పోలిక)లో వారు పేదవారే ఎందుకంటే వారి ధనమంతా మట్టిలో కలిసిపోతుంది. ఏదీ వారి వెంట వెళ్ళదు, ఖాళీ చేతులతో వెళ్తారు. కాని మీరు 21 జన్మలకు చేతులు నింపుకొని వెళ్తారు. ఇప్పుడు మీరు రాజయోగము నేర్చుకుంటున్నారు. తర్వాత మళ్లీ సత్యయుగములోకి వెళ్లి రాజ్య పాలన చేస్తారు. మీరు పునర్జన్మలు తీసుకుంటూ వర్ణాలలోకి వస్తూ ఉంటారు, సత్యయుగములో 16 కళలు, త్రేతాలో 14 కళలు ఉంటాయి. తర్వాత మళ్లీ భక్తిమార్గము ప్రారంభమౌతుంది. ఆ తర్వాత ఇబ్రహిమ్‌, బుద్ధుడు వస్తారు. ఏసుక్రీస్తుకు 3 వేల సంవత్సరాల క్రితము దేవీ దేవతల రాజ్యముండేది. ఇప్పుడు మొత్తం వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడు మీరు కల్పవృక్షము క్రింద సంగమ యుగములో కూర్చొని ఉన్నారు. దీనిని కల్పము యొక్క సంగమ సమయము లేక కలియుగము - సత్యయుగాల సంగమ సమయమని అంటారు. సత్యయుగము తర్వాత త్రేతా యుగము, త్రేతా తర్వాత ద్వాపర యుగము తర్వాత కలియుగపు సంగమ సమయము. కలియుగము తర్వాత మళ్లీ తప్పకుండా సత్యయుగము వస్తుంది. మధ్యలో తప్పకుండా సంగమ యుగము ఉండాలి. కల్పము యొక్క సంగమ యుగములో తండ్రి వస్తారు. వారేమో కల్పమనే పదము మార్చి కేవలము యుగే - యుగే అని వ్రాసేశారు. తండ్రి అంటున్నారు - నేను నిరాకార పరమపిత పరమాత్మను, జ్ఞానసాగరుడను. భారతదేశములోనే శివజయంతి గాయనము చేయబడ్తుంది. కృష్ణుడైతే జ్ఞానమివ్వలేడు. గుర్రపుబండిలో కేవలం కృష్ణుని చిత్రము మాత్రమే చూపించారు. కాని కృష్ణుడు వచ్చేది ఎప్పుడు? ద్వాపర యుగములో ఎలా వస్తాడు? మీరేమో స్వర్గములో కృష్ణుని జతలో ఉంటామని అంటారు. తండ్రి అంటున్నారు - భక్తిమార్గములో మీకు కృష్ణుని సాక్షాత్కారము చేయించేది నేనే. కృష్ణజయంతి నాడు చాలా ప్రేమతో అతడిని ఊయలలో ఊపుతారు, పూజ చేస్తారు. వారికి సత్య-సత్యమైన కృష్ణుడు కనిపించినట్లు ఉంటుంది, కృష్ణుని సాక్షాత్కారము అవుతుంది. కృష్ణుని చిత్రము వారి ముందు ఉంటే ఆ చిత్రమును కూడా ప్రేమతో కౌగలించుకుంటారు. భక్తిమార్గములో సహాయము చేసేది నేనే, దాతను నేనే. లక్ష్మిని పూజిస్తారు, కాని నిజానికి అది కేవలం రాతి విగ్రహము మాత్రమే. ఆ విగ్రహము ఏమిస్తుంది? మళ్లీ నేనే ఇవ్వవలసి వస్తుంది, సాక్షాత్కారము కూడా నేనే చేయిస్తాను. ఇది కూడా డ్రామాలో ఫిక్స్‌ అయ్యి ఉంది. పరమపిత పరమాత్మ ఆజ్ఞ లేనిదే ఆకు కూడా కదలదు, వారి ఆజ్ఞానుసారమే ఆకు-ఆకు కదులుతుంది అని అంటారు ఎందుకంటే ఆకు-ఆకులో పరమాత్మ ఉన్నాడని వారు భావిస్తారు. పరమాత్మ కూర్చొని ఒక్కొక్క ఆకును కదలమని ఆజ్ఞాపిస్తారా? ఇది తయారైన డ్రామా, ఇప్పుడు మీరు ఏ విధంగా నటిస్తున్నారో కల్పము తర్వాత కూడా మీరు ఇదే విధంగా నటిస్తారు. షూటింగులో ఏది షూట్‌ చేయబడిందో అదే కొనసాగుతుంది. అందులో కొంచెము కూడా తేడా రాజాలదు. డ్రామాను కూడా బాగా అర్థము చేసుకోవాలి. అనంతమైన సుఖము కల్ప-కల్పము భారతదేశానికే లభిస్తుందని తండ్రి అర్థం చేయిస్తున్నారు. కాని ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో, వారే వర్ణాలలోకి వస్తారు. వారే 84 జన్మలు తీసుకుంటారు. ఇతరుల జన్మలు నంబరువారుగా తగ్గిపోతూ వస్తాయి. ఎన్నో చిన్న చిన్న మఠాలు, మార్గాలు ఉన్నాయి. భలే వారికి మహిమ ఉండవచ్చు ఎందుకంటే పవిత్రంగా ఉంటారు. స్వర్గాన్ని రచించినవారు తండ్రి, ఇతర మనుష్యులెవ్వరూ స్వర్గాన్ని రచించలేరు. మనుష్యులు స్వర్గాన్ని రచించగలిగినట్లయితే రాజయోగాన్ని కూడా ఎవరైనా నేర్పించనీ చూస్తాము (ఎవరూ నేర్పలేరు).

ఇప్పుడు మీరు కృష్ణపురములోకి వెళ్లేందుకు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. పురుషార్థము ఎల్లప్పుడూ ఉన్నతంగా చేయాలి. కృష్ణుని వంటి పుత్రుడు లభించాలని, కృష్ణుని వంటి భర్త లభించాలని మీరంటారు. కృష్ణుడే నారాయణునిగా అవుతాడు. అయితే కృష్ణుని వంటి వారే కావాలని ఎందుకు అంటారు! మీరు నారాయణుని వంటి భర్త లభించాలని అనాలి కదా. నారదుడు కూడా లక్ష్మిని వరించాలని అన్నాడు, రాధను వరించాలని అనలేదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు కృష్ణపురములోకి వెళ్ళాలంటే పురుషార్థము బాగా చేయండి. అది కృష్ణుని దైవీకులము, కంసునిది రాక్షస కులము. మీరిప్పుడు సంగమ యుగములో ఉన్నారు. శూద్ర సంప్రదాయము వారు బ్రాహ్మణ - బ్రాహ్మణీలు అని అనిపించుకోలేరు. ఎవరైతే బ్రాహ్మణులుగా పిలవబడరో వారు శూద్ర వర్ణానికి చెందినవారు. ఇదంతా భారతదేశానికి సంబంధించిన విషయమే. భారతదేశమే స్వర్గముగా అవుతుంది, మళ్లీ భారతదేశమే నరకంగా అయిపోతుంది. లక్ష్మీనారాయణులు కూడా 84 జన్మలు తీసుకొని రజో, తమో గుణాలలోకి వచ్చే తీరాలి, వారు కూడా చక్రములోకి రావలసిందే. అలాంటప్పుడు బుద్ధుడు మొదలైనవారు నిర్వాణధామములోకి వాపసు ఎలా వెళ్ళగలరు? కొంతమంది అయితే కృష్ణుడు సర్వవ్యాపి అని అంటారు, ఎచ్చట చూసినా కృష్ణుడే కృష్ణుడు అని కూడా అంటారు. అదే విధంగా రాముని భక్తులు రాముడు సర్వవ్యాపి అని అంటారు, వారు కృష్ణుడిని అంగీకరించరు. బాబా వద్దకు ఒక రాధా భక్తుడు వచ్చాడు. ఎక్కడ చూచినా రాధయే రాధ......... రాధ సర్వవ్యాపి- అంతటా వ్యాపించి ఉంది. నీలోనూ, నాలోనూ, రాధయే రాధ ఉంది అని అనేవాడు. అలాగే గణేశుని పూజారి నీలో నాలో అంతటా గణేశుడే గణేశుడు......... అని అంటాడు. క్రైస్తవులు ఏసుక్రీస్తు దేవుని పుత్రుడని అంటారు. అరే! ఏసుక్రీస్తు దేవుని పుత్రుడైతే మరి నీవు ఎవరి కొడుకు? అనేక బేధాభిప్రాయాలున్నాయి, కాని మార్గము ఒక్కరికి కూడా లభించదు. కేవలం తల వంచి నమస్కరిస్తూ, పూజిస్తూ, అన్వేషిస్తూ అలమటిస్తూ ఉంటారు. ముక్తి-జీవన్ముక్తులను భగవంతుడే ఇస్తాడు కదా. వారిని మనం ఏమి అడగాలి? కొంతమందికి ఏమీ తెలియనే తెలియదు. తండ్రిని గూర్చి తెలియనందున అనాథలుగా అయిపోయారు. మళ్లీ ఆ భగవంతుడు(నాథుడు) వచ్చి వారి పిల్లలుగా సనాథలుగా తయారు చేస్తారు. మనుష్యులు ఎన్నో ఎదురుదెబ్బలు తింటారు. భక్తి వలన భగవంతుడు లభిస్తారని భావిస్తారు. తండ్రి అంటున్నారు - నేను నా సమయములో మాత్రమే వస్తాను. ఎవరు ఎంతగా పిలిచినా, నేను వచ్చేది సంగమ యుగములోనే. ఒక్కసారి మాత్రమే వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా తయారుచేసి అందరినీ శాంతిధామములోకి పంపిస్తాను మళ్లీ నంబరువారుగా తమ తమ సమయములో క్రిందికి వస్తారు. ఎవరైతే దేవీ దేవతలుగా ఉండేవారో ఆ ఆత్మలందరు కూడా ఇప్పుడు కూర్చొని ఉన్నారు. మళ్లీ తమ రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నారు. ఇప్పుడైతే దేవీ దేవతా ధర్మము లేనే లేదు. అందరూ స్వయాన్ని హిందువులని పిలిపించుకుంటున్నారు. డ్రామానుసారము మళ్లీ ఇలాగే జరుగుతుంది. ఏదైతే జరిగిపోయిందో అది మళ్లీ రిపీట్‌ అవుతుంది. మళ్లీ ఇదే విధంగా మనము చక్రములో వస్తాము, ఇన్ని జన్మలు తీసుకుంటాము. లెక్క తీయండి - ప్రతి ధర్మము వారు చివరిలో ఎన్ని జన్మలు తీసుకుంటారు? వృక్షము చిత్రము చూపించి అర్థము చేయించడం చాలా సులభము. ఎవరి ప్రేరణ ద్వారానో ఈ వినాశ జ్వాల తయారవుతూ ఉందని మనుష్యులకు దానంతటకదే టచ్‌ అవుతుంది. యూరప్‌లో నివసించు యాదవులు బాంబులు తయారు చేస్తారు, వారు కూడా మమ్ములను ప్రేరేపించేవారు ఎవరో ఉన్నారని అంటారు. వీటి ద్వారా మేము మా కులమునే వినాశనము చేసుకుంటామని కూడా మాకు తెలుసు అని కూడా అంటారు. కానీ అయిష్టముగానే(వద్దనుకున్నా) ఈ మృత్యువు సామాగ్రిని తయారు చేస్తారు. నెమ్మది నెమ్మదిగా ప్రభావము పడ్తుంది. వృక్షము నెమ్మది నెమ్మదిగా పెరుగుతుంది కదా. కొందరు ముళ్ళ నుండి మొగ్గలుగా, కొందరు పుష్పాలుగా అవుతారు. తుఫానులు వస్తే కొన్ని పుష్పాలు కూడా వాడిపోతాయి. బాబా కల్ప-కల్పము చెప్తారు - ఆశ్చర్యపడుతూ వింటారు, వర్ణిస్తారు...... ఇప్పుడు మళ్లీ బాబా స్వయం చెప్తున్నారు - నా వద్దకు వస్తారు, బ్రహ్మకుమార - కుమారీలుగా అవుతారు, వర్ణన చేస్తారు మళ్లీ ఓహో ఓ మాయా! మంచి మంచి పిల్లలను కూడా తినేస్తుంది, పోను పోను ఎటువంటి మంచి మంచి పిల్లలు కూడా సమాప్తమైపోతారో చూడండి.

ఏదైతే గతించిపోయిందో మళ్లీ దానిని వర్తమాన సమయములో తండ్రి అర్థం చేయిస్తున్నారు. మళ్లీ భక్తిమార్గములో శాస్త్రాలను తయారు చేస్తారు. ఈ డ్రామా ఈ విధంగా తయారు చేయబడి ఉంది. ఇప్పుడు తండ్రి వచ్చి బ్రహ్మ ద్వారా సర్వ వేద శాస్త్ర్రాల సారాన్ని అర్థం చేయిస్తున్నారు. ఎవరైతే ధర్మ స్థాపన చేస్తారో, వారి పేరు మీదనే శాస్త్రాలు తయారు చేస్తారు. దానిని ధర్మశాస్త్రమని అంటారు. దేవీ దేవతా ధర్మ శాస్త్రము ఒక్క గీత మాత్రమే. ప్రతీ ఒక్క ధర్మానికి ఒక శాస్త్రము ఉండాలి. శ్రీమద్భగవద్గీత సరి అయినది. అందులో భగవానువాచ అని ఉంది. భగవంతుడు ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపించారు. ఇది అన్నింటికంటే ప్రాచీనమైన ధర్మము. ప్రతీ ధర్మానికి తమ తమ శాస్త్రముంది. ఆ శాస్త్రమునే చదువుతూ ఉంటారు. ఇప్పుడు మీరు దేవతలుగా అవుతారు. కానీ మీకు శాస్త్రము చదివే అవసరము లేదు. అచ్చట శాస్త్రాలు ఉండనే ఉండవు. ఇవన్నీ సమాప్తమైపోతాయి. మరి గీత ఎక్కడ నుండి వస్తుంది? ద్వాపరములో మనుష్యులు కూర్చొని తయారు చేశారు. ఇప్పుడు ఏ గీత ఉందో మళ్లీ అదే గీతను వెతికి తీస్తారు. కల్పక్రితము ఎలాగైతే తయారు చేశారో మళ్లీ అదే విధంగా ఈ శాస్త్రాలు తయారౌతాయి. భక్తిమార్గపు సామగ్రి తయారౌతూనే ఉంటుంది.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - అవురూపమైన పిల్లలారా! తండ్రి అయిన నా శ్రీమతమును అనుసరించి శ్రేష్ఠంగా తయారవ్వండి. ఇప్పుడు మీరు సంగమ యుగములో రాజయోగము నేర్చుకుంటున్నారు. ఇప్పుడు కలియుగాన్ని సత్యయుగంగా తయారు చేయాలి. వారు కల్పము యొక్క ఆయువును చాలా పెద్దదిగా చూపించి అందరినీ గాడాంధకారములో వేసేశారు. మనుష్యులైతే భ్రమించి, తికమక చెంది ఉన్నారు. డ్రామానుసారము పిల్లలైన మీరు మాత్రమే అనంతమైన తండ్రి నుండి వారసత్వము తీసుకోవాలి. బాబా చాలా యుక్తులు తెలిపించారు. కేవలం బాబాను స్మృతి చేయండి. చార్టు ఉంచండి. భోజనము తయారు చేసే సమయములో కూడా స్మృతి చేయండి. భోజనము తయారు చేయు సమయములో పతి, పుత్రుడు గుర్తు వచ్చినప్పుడు శివబాబా ఎందుకు గుర్తు రారు? ఇది మీరు చేయవలసిన పని, బాబా బుద్ధికి నిచ్చెనను ఇస్తారు. ఆ నిచ్చెనను ఎక్కుతారో, ఎక్కరో అది మీకు సంబంధించిన పని. ఎంతగా స్మృతి చేస్తారో, అంత మెటికలు పైకి ఎక్కుతూ పోతారు లేకుంటే అంత సుఖము లభించదు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన అనగా 5 వేల సంవత్సరాల తర్వాత మళ్లీ వచ్చి కలిసిన పిల్లలకు నంబరువారు పురుషార్థానుసారము మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ 

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. కృష్ణపురములోకి వెళ్లేందుకు పురుషార్థము చాలా బాగా చేయాలి. శూద్ర సంస్కారాలను పరివర్తన చేసుకొని పక్కా బ్రాహ్మణులుగా అవ్వాలి.
2. బుద్ధి బలముతో స్మృతి నిచ్చెన పైకి ఎక్కాలి. మెటికలు(నిచ్చెన) ఎక్కితేనే అపారమైన సుఖము అనుభవమవుతుంది. 

వరదానము :- ''ప్రతి ఆత్మకు సెకండులో ముక్తి - జీవన్ముక్తుల అధికారాన్ని ఇప్పించే మాస్టర్‌ సద్గురు భవ''
ఇంతవరకు మాస్టర్‌ దాత పాత్ర లేక మాస్టర్‌ శిక్షకుల పాత్రను చేస్తున్నారు. అయితే ఇప్పుడు సద్గురువు పిల్లలుగా అయ్యి గతి-సద్గతులను ఇచ్చే వరదాత పాత్రను చేయాలి. మాస్టర్‌ సద్గురువు అనగా పూర్తిగా అనుసరించేవారు. సద్గురువు వచనాలను సదా సంపూర్ణంగా అనుసరించేవారు. ఇటువంటి మాస్టర్‌ సద్గురువులే ఒక సెకండులో దృష్టి ద్వారా తృప్తి పరచే అనగా ముక్తి - జీవన్ముక్తుల అధికారాన్ని ఇప్పించే సేవ చేయగలరు. 

స్లోగన్‌ :- ''ఆజ్ఞాకారులుగా అయితే వరదాత నుండి హృదయపూర్వక ఆశీర్వాదాలు ప్రాప్తి అవుతూ ఉంటాయి''
 


Telugu Murli 22/01/18

22-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

''మధురమైన పిల్లలారా - మీరు ఈశ్వరీయ సంతానము, ఇది మీ అమూల్యమైన జీవితము, మీ ఈశ్వరీయ కులము చాలా శ్రేష్ఠమైనది, స్వయం భగవంతుడే మిమ్ములను దత్తత తీసుకున్నారు - ఈ నషాలో ఉండండి'' 

ప్రశ్న :- దేహ భావము (స్త్రీ - పురుషులనే దేహ గుర్తింపు, దేహభాన్‌) తొలగిపోయేందుకు ఏ అభ్యాసము అవసరము ?
జవాబు :- 1. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ ఈ శరీరములో మేము కొద్ది సమయము కొరకు మాత్రమే నిమిత్తమాత్రముగా ఉన్నాము అని అభ్యాసము చేయండి. ఎలాగైతే తండ్రి కొద్ది సమయము కొరకు శరీరములోకి ప్రవేశించారో, అలాగే ఆత్మలమైన మేము కూడా శ్రీమతమును అనుసరించి భారతదేశాన్ని స్వర్గముగా తయారు చేసేందుకు ఈ శరీరాన్ని ధరించాము. తండ్రి మరియు వారసత్వము గుర్తుంటే శరీర భావము తొలగిపోతుంది. దీనినే సెకండులో జీవన్ముక్తి అని అంటారు. 2. అమృతవేళలో నిదుర లేచి తండ్రితో మధురాతి మధురంగా మాట్లాడితే శరీర భావము (భానము) సమాప్తమైపోతుంది. 

పాట :- ఓంనమ: శివాయ.........................
ఓంశాంతి. భగవంతుడు ఒక్కరే, వారు తండ్రి కూడా అవుతారు. ఆ తండ్రి పిల్లలకు అర్థము చేయిస్తున్నారు - ఆత్మ రూపము ఇంత పెద్ద లింగము వలె ఉండదు. ఆత్మ అత్యంత చిన్న నక్షత్రము వలె భృకుటి మధ్యలో ఉంటుంది. మందిరాలలో ఉంచినట్లు ఇంత పెద్ద జ్యోతిర్లింగమేమీ కాదు. ఆత్మ ఎలా ఉంటుందో పరమాత్మ అయిన తండ్రి కూడా అలాగే ఉంటారు. ఆత్మ రూపము మనిషి వలె ఉండదు. ఆత్మ అయితే మనుష్య శరీరాన్ని ఆధారంగా తీసుకుంటుంది. అన్ని కార్యాలు చేసేది ఆత్మయే. సంస్కారమంతా ఆత్మలోనే ఉంటుంది. ఆత్మ ఒక నక్షత్రము వంటిది. మంచి-చెడు సంస్కారాల అనుసారము ఆత్మయే జన్మ తీసుకుంటుంది. ఈ విషయాలను బాగా అర్థము చేసుకోవాలి. మందిరాలలో లింగము ప్రతిష్ఠించబడి ఉంటుంది, అందుకే అందరికీ అర్థము చేయించేందుకు ఇక్కడ మనము కూడా శివలింగాన్ని చూపిస్తాము. వీరి పేరు శివుడు. పేరు లేకుండా ఏ వస్తువూ ఉండదు, ప్రతి వస్తువుకు ఏదో ఒక ఆకారము ఉంటుంది. తండ్రి పరంధామములో ఉంటారు. పరమాత్మ అయిన తండ్రి చెప్తున్నారు - ఎలాగైతే ఆత్మ శరీరములోకి వస్తుందో అలా నేను కూడా నరకాన్ని స్వర్గంగా తయారు చేసేందుకు రావలసి ఉంటుంది. తండ్రి మహిమ అందరికంటే అతీతమైనది, భిన్నమైనది. ఆత్మలైన మీరు పాత్రను అభినయించేందుకు ఇచ్చటకు వచ్చారని ఇప్పుడు మీకు తెలుసు. ఇది అనంతమైన అనాది అవినాశి డ్రామా, ఇది ఎప్పుడూ నాశనమవ్వదు. ఇది తిరుగుతూనే ఉంటుంది. రచయిత అయిన తండ్రి కూడా ఒక్కరే, రచన కూడా ఒక్కటే. ఇది అనంతమైన సృష్టి చక్రము. ఇందులో నాలుగు యుగాలున్నాయి. ఇంకొకటి కల్పము యొక్క సంగమ యుగము. అందులోనే తండ్రి వచ్చి పతిత ప్రపంచాన్ని పావనంగా చేస్తారు, ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఆత్మలైన మనమందరమూ పరంధామములో ఉండేవారమని పిల్లలైన మీకిప్పుడు స్మృతి కలిగింది. ఈ కర్మక్షేత్రములో పాత్రను అభినయించేందుకు వచ్చాము. ఈ బేహద్‌ డ్రామా పునరావృతమవ్వనున్నది. తండ్రి అనంతమైన యజమాని. వారి మహిమ అపరం అపారమైనది. ఇటువంటి మహిమ ఇతరులెవ్వరికీ లేదు. వారు మనుష్యు సృష్టికి బీజరూపులు. అందరికీ తండ్రి కూడా వారే. తండ్రి అంటున్నారు - నేను పరాయి రావణ ప్రపంచములో వస్తాను. ఒకవైపు ఆసురీ గుణాల సంప్రదాయము గలవారు, మరోవైపు దైవీగుణాల సంప్రదాయము వారున్నారు. దీనిని కంసపురమని కూడా అంటారు. కంసుడని అసురుని అంటారు, కృష్ణుని దేవత అని అంటారు. ఇప్పుడు దేవతలుగా తయారు చేసేందుకు, అందరినీ వాపస్‌ తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. ఇతరులెవ్వరికీ ఆ శక్తి(తాకత్‌) లేదు. తండ్రే స్వయంగా కూర్చొని శిక్షణనిచ్చి దైవీ గుణాలను ధారణ చేయిస్తారు. ఈ బాధ్యత, కర్తవ్యము తండ్రిదే. తండ్రి అంటున్నారు - ఎప్పుడైతే అందరూ తమోప్రధానంగా అవుతారో, నన్ను విస్మరిస్తారో, కేవలం విస్మరించడమే కాదు, నన్ను రాళ్ళు రప్పలలో తోసేస్తారో, ఇంత గ్లాని చేస్తారో అప్పుడు నేను వస్తాను. నాకు జరిగినంత గ్లాని ఎవ్వరికీ జరగదు. అప్పుడు నేను వచ్చి మీకు ముక్తిదాతగా అవుతాను, అందరినీ దోమల వలె తీసుకెళ్తాను. '' మన్మనాభవ '' అని ఇతరులెవ్వరూ చెప్పలేరు. పరమపిత పరమాత్మ అయిన నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలన్నీ వినాశనమౌతాయి. కృష్ణుడైతే ఇలా చెప్పలేడు. పిల్లలకు పరమాత్ముని మహిమ తెలుసు. వారు జ్ఞానసాగరులు, సుఖసాగరులు. వారి తర్వాత రెండవ నంబరులో బ్రహ్మ, విష్ణు, శంకరులున్నారు. బ్రహ్మ ద్వారా స్థాపన ఎవరు చేస్తారు? శ్రీ కృష్ణుడా? పరమపిత పరమాత్మ శివుడు కూర్చుని అర్థం చేయిస్తున్నారు - మొట్టమొదట నాకు బ్రాహ్మణులు అవసరము. అందువలన బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ ముఖవంశావళిని రచిస్తాను, వారు కుఖవంశావళి(గర్భము ద్వారా జన్మ తీసుకున్నవారు). మీరిప్పుడు సంగమ యుగములో బ్రహ్మ సంతానమయ్యారు. తండ్రి వచ్చి శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేస్తారు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ కులానికి చెందినవారు. ఈశ్వరుడు నిరాకారులు, బ్రహ్మా సాకారులు. తండ్రి మొట్టమొదట బ్రాహ్మణులుగా చేసి తర్వాత మళ్లీ దేవతలుగా చేస్తారు. దేవతల తర్వాత క్షత్రియులు......... ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. తర్వాత మళ్లీ వీరి నుండి ఇతర ధర్మాలు వచ్చాయి. ముఖ్యమైనది భారతదేశము, ఈ భారతదేశము అవినాశి ఖండము. తండ్రి ఇచ్చటకు వచ్చి(భారతదేశాన్ని) స్వర్గముగా తయారుచేస్తారు. వారు తండ్రే కాక టీచరు, మీ సద్గురువు కూడా అయ్యారు. అటువంటి వారిని సర్వవ్యాపి అని ఎలా అంటారు! వారు మీ తండ్రి, ఈ ప్రపంచములో బ్రాహ్మణులైన మీరు తప్ప త్రికాలదర్శులు ఎవ్వరూ అవ్వజాలరు. పరమపిత పరమాత్మతో పాటు మనము పరంధామములో నివసించే వారమని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. అచ్చట నుండి నంబరువారుగా కర్మక్షేత్రములోకి వస్తారు. తర్వాత చివరిలో వాపస్‌ మనమే వెళ్ళిపోతాము. 84 జన్మలు పూర్తిగా తీసుకోవాలి.

మీరు ఎన్ని జన్మలు తీసుకున్నారో, ఏ విధంగా వర్ణాలలోకి వచ్చారో ఈ విషయాలను తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సాంప్రదాయము వారు. ఇప్పటి మీ జీవితము అమూల్యమైనది ఎందుకంటే ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానముగా అయ్యారు. బ్రహ్మ ద్వారా తండ్రి వచ్చి దత్తత తీసుకుంటారు. తండ్రి స్వర్గాన్ని రచించే రచయిత. కావున వారే స్వయంగా వచ్చి స్వర్గానికి యజమానులుగా కూడా చేస్తారు. ఇప్పుడు విశ్వమంతటా శాంతిని స్థాపన చేయాలి - ఈ కర్తవ్యము తండ్రిదే. తండ్రి అంటున్నారు - మీకు మళ్లీ రాజయోగము నేర్పించుటే నా పాత్ర. దీని వలన సదా మీరు ఆరోగ్యవంతులుగా(ఎవర్‌హెల్తీగా) అవుతారు. ఏ విధంగా దేవతలుగా అయ్యారో మళ్లీ అదిప్పుడు రిపీట్‌ అవుతుంది. ఇప్పుడు నాటు కట్టబడుతోంది. తండ్రి తోటయజమాని (బాగ్‌వాన్‌), ఇతని ద్వారా నాటు వేయిస్తున్నారు. వారు సన్ముఖములో కూర్చుని అర్థం చేయిస్తున్నారు. నా అపురూపమైన పిల్లలారా! చాలా సమయము నుండి విడిపోయిన పిల్లలారా! గుర్తుంది కదా! నేను మిమ్ములను స్వర్గములోకి పంపించాను. మీరు మళ్లీ 84 జన్మల చక్రము చుట్టి వచ్చి ఇప్పుడు నన్ను కలుసుకున్నారు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి అయిన నన్ను స్మృతి చేయండి. మిమ్ములను తప్పకుండా వాపసు తీసుకెళ్ళాలి. మీకు ఇష్టమున్నా లేకపోయినా తప్పకుండా తీసుకువెళ్ళాలి. మొదట ఆది సనాతన దైవీ రాజ్యము నడిచింది. తర్వాత ఆసురీ రాజ్యము నడిచింది. దైవీ రాజ్యము తర్వాత పవిత్రత లోపిస్తూ పూర్తిగా నశించింది, మళ్లీ సింగల్‌ కిరీటమైపోయింది. ఇప్పుడు ప్రజల పై ప్రజా రాజ్యముంది. మళ్లీ దైవీ రాజ్యము స్థాపనవుతూ ఉంది. ఆసురీ రాజ్యము వినాశనము కొరకు ఈ రుద్ర యజ్ఞము ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలితమయ్యింది. మీరు పతిత సృష్టి పై రాజ్యపాలన చేయరు, ఇప్పుడిది సంగమ యుగము. సత్యయుగములో అయితే ఇలా అనరు. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థము చేస్తున్నారు. చేయించేవారు ఎవరు? శ్రీమతాన్నిచ్చే సమర్థులు, శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవారు ఒక్క తండ్రి మాత్రమే. వారే బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తున్నారు. నేను భారతదేశానికి అత్యంత వినయ విధేయతలు గల సేవకుడను(మోస్ట్‌ ఒబీడియంట్‌ సర్వంట్‌) భారతదేశాన్ని స్వర్గముగా తయారు చేస్తాను. అచ్చట యథా రాజా-రాణి తథా ప్రజా,................ అందరూ సుఖంగా ఉంటారు. సహజ సౌందర్యము ఉంటుంది. లక్ష్మీనారాయణులు ఎంత సుందరంగా ఉన్నారో చూడండి. స్వర్గాన్ని తయారు చేయువారు హెవీన్లీ గాడ్‌ఫాదర్‌. మొత్తం ప్రప౦చమంతా గీత కొరకు కృష్ణ భగవానువాచ అని అంటారు. అయితే కృష్ణుడైతే '' మన్మనాభవ - నన్నొక్కరినే స్మృతి చేస్తే వికర్మలు భస్మము అవుతాయి '' అని అనలేరు. ఇక ఏ ఇతర ఉపాయము కూడా లేదు. గంగానది అయితే పతితపావని కానే కాదు. నన్ను ఒక్కరినే స్మృతి చేయమని(మామేకమ్‌ యాద్‌ కరో) గంగా నది చెప్పదు. తండ్రి ఒక్కరు మాత్రమే కూర్చుని ఇలా అర్థం చేయిస్తున్నారు. తండ్రి ఆత్మలతో మాట్లాడ్తారు - ఆ తండ్రే సర్వుల సద్గతిదాత, వారి మందిరాలు కూడా ఉన్నాయి. ద్వాపర యుగము నుండి అన్ని స్మృతిచిహ్నాలు తయారవ్వడం ప్రారంభమౌతాయి. సోమనాథుని మందిరముంది, అయితే వారు ఏమి చేసిపోయారో ఎవ్వరికీ తెలియదు. వారు శివ - శంకరులను కలిపేస్తారు. అయితే పరంధామ నివాసి అయిన శివుడు ఎక్కడ ? సూక్ష్మవతనవాసి అయిన శంకరుడు ఎక్కడ? ఏమీ అర్థము చేసుకోరు. తండ్రి అంటున్నారు - ఎవరెన్ని వేదశాస్త్ర్రాలు మొదలైనవి చదివినా, జప-తపాలు చేసినా, నన్ను కలవలేరు. భలే నేను భావనకు ఫలాన్ని(భావనా కా భాడా) అందరికీ ఇస్తాను అయితే వారైతే అఖండ జ్యోతిర్మయ బ్రహ్మతత్వమునే పరమాత్మ అని అర్థము చేసుకుంటారు. బ్రహ్మతత్వము సాక్షాత్కారమైనా దాని వలన కొంచెము కూడా లాభము లేదు(ప్రాప్తించదు). కొందరికి హనుమంతుని సాక్షాత్కారము, కొంతమందికి గణేశుని సాక్షాత్కారము చేయిస్తాను. అలా నేను అల్పకాలము కొరకు మనోకామనలను పూర్తి చేస్తాను. అల్పకాలము కొరకు సంతోషమైతే ఉంటుంది కదా. కానీ మళ్లీ అందరూ తమోప్రధానంగా అవ్వాల్సిందే. రోజంతా గంగలో మునిగి కూర్చున్నా అందరూ తమోప్రధానంగా అయితే అయ్యే తీరాలి.

తండ్రి అంటున్నారు - పిల్లలూ! పవిత్రంగా అయితే పవిత్ర ప్రపంచానికి 21 జన్మలకు అధికారులుగా అవుతారు. ఇంత గొప్ప ప్రాప్తులను కలిగించే సత్సంగమేదీ లేదు. తండ్రే స్వయంగా వచ్చి రాజయోగము నేర్పిస్తున్నారు. కావున శ్రీమతము పై ఎంత బాగా నడుచుకోవాలి! చదువు పై గమనమివ్వాలి. తండ్రి అత్యంత శ్రేష్ఠమైన మతమునిస్తారు. శ్రీమతము ద్వారా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయాలి. మీరు డ్రామా రహస్యాన్ని మంచిరీతిగా అర్థము చేసుకోవాలి. పురుషార్థము చేయాలి. పురుషార్థము చేసి ఇలా అర్హులుగా తయారవ్వాలి. మేము తండ్రితో పాటు స్వర్గ స్థాపన చేసేందుకు వచ్చామని పిల్లలైన మీకు నషా ఉండాలి. మనము అచ్చటి నివాసులము. ఈ శరీరములో కొంత సమయము కొరకు మనము నిమిత్తమాత్రంగా ఉన్నాము. బాబా కూడా కొంత సమయము కొరకు ఇచ్చటకు వచ్చారు. ఈ శరీర భావము సమాప్తమైపోవాలి. మీ తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. దీనినే సెకండులో జీవన్ముక్తి అని అంటారు. తండ్రి అంటున్నారు - అందరినీ వాపసు తీసుకెళ్లేందుకు నేను వచ్చాను. ఇప్పుడు మీరు స్వయాన్ని ఆత్మగా భావించి ఉదయమే లేచి బాబాను స్మృతి చేయండి. వారితో మాట్లాడండి. మన 84 జన్మలు పూర్తి అయ్యాయని మీకు తెలుసు. ఇప్పుడు మనము ఈశ్వరీయ సంతానంగా అయ్యాము. తర్వాత మళ్లీ దైవీ సంతానంగా, ఆ తర్వాత క్షత్రియ సంతానంగా అవుతాము. బాబా మనలను విశ్వాధికారులుగా తయారు చేస్తారు. మీరు కూర్చొని బాబాను మహిమ చేయండి - '' బాబా! మీరైతే అద్భుతము చేశారు, కల్ప-కల్పము వచ్చి మమ్ములను చదివిస్తారు, బాబా మీ జ్ఞానము చాలా అద్భుతమైనది. స్వర్గము ఎంత అద్భుతమైనది ! అవి ప్రపంచములోని భౌతిక సప్త (7) విచిత్రాలు, ఇది ఆత్మిక తండ్రి స్థాపన చేసిన అద్భుతము. కృష్ణపురమును స్థాపన చేసేందుకు తండ్రి వచ్చారు. ఈ లక్ష్మీనారాయణులు ఈ ప్రాలబ్ధాన్ని ఎచ్చట నుండి పొందారు? తండ్రి ద్వారా. జగదాంబ, జగత్పితలతో పాటు పిల్లలు కూడా ఉంటారు. వారు బ్రాహ్మణులు, జగదంబ అయితే బ్రాహ్మణిగా ఉండేది. ఆమె కామధేనువు, అందరి మనోకామనలను పూర్తి చేసేస్తుంది. ఈ జగదంబనే తర్వాత స్వర్గములో మహారాణిగా అవుతుంది. ఇది ఎంతో అద్భుతమైన రహస్యము. ఈ తండ్రి మన స్థితిని స్థిరము చేసుకునేందుకు రకరకాల యుక్తులు తెలుపుతూ ఉంటారు. రాత్రుళ్ళు మేల్కోండి, బాబాను స్మృతి చేస్తే అంతమతి సోగతి అయిపోతుంది. పురుషార్థము పూర్తిగా చేస్తే స్మృతి నిలుస్తుంది. గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులవ్వాలి. 8 మందికి మాత్రమే స్కాలర్‌షిప్‌(ఉపకారవేతనము) లభిస్తుంది, మేము లక్ష్మీనారాయణులను వరిస్తాము అని అందరూ అంటారు. అలా వరించాలంటే ఉత్తీర్ణులై చూపించాలి. నాలో ఇంకా ఏదైనా వానరత్వము(కోతి బుద్ధి) లేదు కదా? అని పరిశీలించుకోవాలి. దానిని తొలగిస్తూ పోండి. మొత్తం రోజంతటిలో ఎవ్వరికీ దు:ఖము ఇవ్వలేదు కదా? అని చూచుకోండి. తండ్రి అందరికీ సుఖమిచ్చేవారు. పిల్లలు కూడా అలా తయారవ్వాలి. వాచా, కర్మల ద్వారా ఎవ్వరికీ దు:ఖమునివ్వరాదు. సత్య-సత్యమైన మార్గాన్ని చూపించాలి. అది హద్దు తండ్రి వారసత్వము, ఇది అనంతమైన తండ్రి ఇచ్చే వారసత్వము. ఇది ఎవరికైతే లభిస్తుందో, వారే తెలియజేయగలరు. ఎవరైతే మన ధర్మానికి చెందినవారిగా ఉంటారో, వారికి వెంటనే టచ్‌ అవుతుంది.

తండ్రి అంటున్నారు - మళ్లీ దైవీ ధర్మాన్ని స్థాపన చేసేందుకు నేను బ్రహ్మ శరీరములో వస్తాను. ఇప్పుడు మనము బ్రాహ్మణులమని, తర్వాత మళ్లీ దేవతలుగా తయారవ్వాలని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మొదట సూక్ష్మవతనములోకి వెళ్ళి తర్వాత శాంతిధామములోకి వెళ్తాము. అక్కడ నుండి మళ్లీ నూతన ప్రపంచములో గర్భమహలులోకి వస్తారు, ఇచ్చట గర్భజైలులోకి వస్తారు. దీనినే అసత్య మాయ, అసత్య శరీరము....... (ఝూఠీ మాయా, ఝూఠీ కాయా...........)అని అంటారు. తండ్రి అంటున్నారు - ఎంత ధర్మ గ్లాని చేశారు! శివజయంతిని జరుపుతారు. కాని శివుడు ఎప్పుడు వచ్చారో, ఎవరిలో ప్రవేశించారో ఎవ్వరికీ తెలియదు. తప్పకుండా ఏదో ఒక శరీరములో వచ్చి నరకాన్ని స్వర్గముగా తయారు చేసి ఉంటారు కదా. తండ్రి పిల్లలకు చాలా మంచిరీతిగా అర్థము చేయిస్తున్నారు. మీ చార్టు తయారు చేయమని సలహా ఇస్తున్నారు. రోజంతటిలో ఎంత సమయము తండ్రిని స్మృతి చేశాము ? అని చార్టు వ్రాయండి. ఉదయమే లేచి తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. మనము అనంతమైన తండ్రితో పాటు గుప్త వేషములో భారతదేశాన్ని స్వర్గముగా తయారు చేసేందుకు వచ్చాము. ఇప్పుడు మనము వాపస్‌ ఇంటికి వెళ్ళాలి. వెళ్లేందుకు ముందు మన రాజధానిని తప్పకుండా స్థాపన చేయాలి. ఇప్పుడు మీరు సంగమ యుగములో ఉన్నారు, మిగిలిన ప్రపంచమంతా కలియుగములో ఉంది. మీరు సంగమ యుగీ బ్రాహ్మణులు. తండ్రి తన పిల్లల కొరకు ముక్తి - జీవన్ముక్తుల బహుమతిని తీసుకొస్తారు. సత్యయుగములో భారతదేశము జీవన్ముక్తముగా ఉండేది. మిగిలిన ఆత్మలన్నీ ముక్తిధామములో ఉండేవి. తండ్రి అరచేతిలో వైకుంఠాన్ని తీసుకొస్తారు. అందుకు అర్హులుగా కూడా ఆ తండ్రే స్వయంగా తయారు చేస్తారు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. 

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మేము తండ్రితో పాటు స్వర్గ స్థాపన కొరకు నిమిత్తమైనవారమనే నషాలో సదా ఉండాలి. తండ్రి మనలను విశ్వాధికారులుగా తయారు చేస్తారు.
2. తండ్రి సమానం సుఖమునిచ్చే వారిగా తయారవ్వాలి. ఎప్పుడూ ఎవ్వరినీ దు:ఖితులుగా చేయరాదు. అందరికీ సత్యమైన మార్గమును తెలపాలి. మీ ఉన్నతి కొరకు స్వంత చార్టు ఉంచుకోవాలి. 

వరదానము :- '' అన్ని కర్మల భారాన్ని తండ్రి పై వదిలి(తండ్రికి ఇచ్చి) స్వయం ట్రస్టీలుగా ఉండే డబల్‌లైట్‌ ఫరిస్తా భవ ''
ధైర్యము చేసే పిల్లలకు బాప్‌దాదా సదా సహాయము చేస్తారు. పిల్లలు శ్రేష్ఠమైన సంకల్పము చేస్తూనే తండ్రి హాజరైపోతారు. కేవలం మొత్తం పనినంతా తండ్రి పై వదిలేస్తే ఇక దానిని గురించి తండ్రికి తెలుసు, ఆ కార్యానికి తెలుసు. స్వయం మీరే ఆ కార్య బాధ్యతను, భారాన్ని పైకెత్తుకోకండి. ట్రస్టీలుగా ఉంటే సదా తేలికగా, డబల్‌లైట్‌ ఫరిస్తాలుగా అయ్యి ఎగురుతూ ఉంటారు. హృదయం శుద్ధంగా ఉంటే, కోరికలు పూర్తి అవుతాయి(తీర్తాయి). 

స్లోగన్‌ :- ''ఉమంగ - ఉత్సాహాల రెక్కలు జతలో ఉంటే, ఎగిరే కళలో ఎగురుతూ ఉంటారు''
 

Sunday, 21 January 2018

Telugu Murli 21/01/18

21-01-2018 అవ్యక్త బాప్‌దాదా ఓంశాంతి రివైజ్‌: 21-04-1983 మధువనము 

''సంగమయుగ మర్యాదలలో నడవడమే పురుషోత్తములుగా అవ్వడం''
ఈ రోజు బాప్‌దాదా మర్యాదా పురుషోత్తములైన పిల్లలందరినీ చూస్తున్నారు. సంగమ యుగ మర్యాదలే పురుషోత్తములుగా తయారుచేస్తాయి. అందువల్లనే మర్యాదా పురుషోత్తములని అంటారు. ఈ తమోగుణీ మనుష్యాత్మలు, తమోగుణీ ప్రకృతి యొక్క వాయుమండలం నుండి, వైబ్రేషన్ల (ప్రకంపనలు) నుండి రక్షించుకునేందుకు సహజ సాధనం ఈ మర్యాదలే. మర్యాదల లోపల ఉండేవారు శ్రమ నుండి సదా రక్షింపబడ్తారు. మర్యాదల రేఖ నుండి సంకల్పాలు, మాటలు మరియు కర్మల ద్వారా బయటకు వచ్చినప్పుడు శ్రమ చేయవలసి వస్తుంది. ప్రతి అడుగు కోసం బాప్‌దాదా ద్వారా మర్యాదలు లభించాయి. దాని అనుసారంగా ప్రతి అడుగు వేయడం ద్వారా స్వతహాగా మర్యాదా పురుషోత్తములుగా అయిపోతారు. అమృతవేళ నుండి రాత్రి వరకు గల మర్యాదా పూర్వకమైన జీవితాన్ని గురించి మీకు బాగా తెలుసు. దాని అనుసారంగా నడవడమే పురుషోత్తములుగా అవ్వడం. మీ పేరే పురుషోత్తములు అనగా సర్వ సాధారణ పురుషులలో ఉత్తములు. కావున శ్రేష్ఠ ఆత్మలైన ''మా మొదటి ముఖ్య విషయమైన స్మృతి ఉత్తమంగా ఉందా? '' అని పరిశీలించుకోండి. స్మృతి ఉత్తమంగా ఉంటే సృష్టి, వృత్తి మరియు స్థితి స్వతహాగా శ్రేష్ఠంగానే ఉంటాయి. స్మృతి చేసే మర్యాదా రేఖ గురించి తెలుసా? 'నేను శ్రేష్ఠమైన ఆత్మనే, అందరూ ఒక్క శ్రేష్ఠమైన తండ్రి సంతానమైన ఆత్మలే. వెరైటీ(రకరకాల) ఆత్మలు వెరైటీ పాత్రలను అభినయిస్తున్నారు.' ఈ మొదటి పాఠం సహజ రూపంలో స్మృతి స్వరూపంలో ఉండాలి. దేహాన్ని చూస్తున్నా ఆత్మనే చూడాలి. ఈ సమర్థ స్మృతి ప్రతి సెకను మీ స్వరూపంలోకి రావాలి (స్వరూపంలో ఉండాలి). స్మృతి స్వరూపులుగా అయిపోవాలి. కేవలం నేను ఆత్మను, వీరు ఆత్మ అని స్మరించడం కాదు. నేను ఆత్మనే, వీరు కూడా ఆత్మయే అన్న ఈ మొదటి స్మృతి యొక్క మర్యాద స్వయాన్ని సదా నిర్విఘ్నంగా తయారు చేస్తుంది. అంతేకాక ఇతరులకు కూడా ఈ శ్రేష్ఠ స్మృతి యొక్క సమర్థ వైబ్రేషన్లను(ప్రకంపనాలను) వ్యాపింపజేసేందుకు నిమిత్తంగా అయిపోతారు. దీని ద్వారా ఇంకా నిర్విఘ్నంగా అయిపోతారు.

పాండవ సైన్యం మిలనం జరుపుకోవడానికైతే వచ్చారు కాని మిలనంతో పాటు మొదటి మర్యాదా రేఖకు పునాది అయిన 'స్మృతి భవ' అను వరదానాన్ని కూడా సదా వెంట తీసుకు వెళ్ళండి. స్మృతి భవయే ' సమర్థ భవ ' అవుతుంది. ఏదైతే విన్నారో దాని సారం ఏమి తీసుకొని వెళ్తారు? దాని సారం స్మృతి భవ. ఇదే వరదానాన్ని సదా అమృతవేళ రివైజ్‌(పునరావృతం) చేయండి. ప్రతి కార్యం చేసే ముందు ఈ వరదానాన్ని సమర్థ స్థితి అనే ఆసనం పైన కూర్చొని ఇది వ్యర్థమా లేక సమర్థమా అని నిర్ణయించిన తర్వాత కర్మలోకి రావాలి. కర్మ చేసిన తర్వాత కర్మ యొక్క ఆదికాలం నుండి అంత్యకాలం వరకు సమర్థంగా ఉన్నానా? అని మళ్ళీ పరిశీలించుకోండి. లేకుంటే చాలామంది పిల్లలు కర్మ యొక్క ఆదికాలంలో సమర్థ స్వరూపంలో కర్మ చేయడం ప్రారంభిస్తారు కానీ మధ్యలో వ్యర్థమైన లేక సాధారణ కర్మలుగా ఎలా అయిపోతాయో సమర్థానికి బదులుగా వ్యర్థం లైనులోకి ఏ సమయంలో ఎలా వెళ్ళి పోయారో కూడా తెలియదు. మళ్ళీ అంతములో ఎలా చెయ్యాలో అలా చెయ్యలేదని అనుకుంటారు. కాని ఫలితం ఏమయ్యింది! చేసిన తర్వాత ఆలోచంచడం త్రికాలదర్శీ ఆత్మల లక్షణం కాదు. అందువలన మూడు కాలాలలో 'స్మృతి భవ' లేక 'సమర్థ భవ'. ఏమి తీసుకొని వెళ్ళాలో అర్థమయ్యిందా? సమర్థ స్థితి అనే ఆసనాన్ని ఎప్పుడూ వదలరాదు. ఈ ఆసనమే హంస ఆసనం. హంస యొక్క విశేషత నిర్ణయ శక్తి. నిర్ణయ శక్తి ద్వారా సదా మర్యాదా పురుషోత్తమ స్థితిలో ముందుకు వెళ్తూ ఉంటారు. 'ఆసనం' అనే వరదానం మరియు ఈశ్వరీయ టైటిల్‌(బిరుదు) 'మర్యాదా పురుషోత్తములు' ఈ రెండింటినీ జతలో ఉంచుకోండి. మంచిది. ఈ రోజు కేవలం శుభాకాంక్షలు తెలిపే రోజు. సేవ కోసం వెళ్తున్నారు, కొంగల మధ్యలోకి కూడా వెళ్తున్నారు, కానీ సేవార్థం వెళ్తున్నారు. కర్మ సంబంధంగా భావించి వెళ్ళకండి, కాని సేవా సంబంధమని భావించి వెళ్ళండి. కర్మ సంబంధాన్ని సమాప్తం చేసుకునేందుకు కూర్చోలేదు. సేవా సంబంధాన్ని నిభాయించేందుకు కూర్చున్నారు. కర్మ బంధనం కాదు, సేవా బంధనం. మంచిది.

సదా వ్యర్థాన్ని సమాప్తం చేసి సమర్థ స్థితి అనే హంస ఆసనం పై స్థితులై ఉండేవారికి, ప్రతి కర్మను త్రికాలదర్శి శక్తితో మూడు కాలాలను సమర్థంగా తయారు చేసుకునే వారికి, సదా స్వతహాగా ఆత్మిక స్థితిలో స్థితులయ్యే మర్యాదా పురుషోత్తములైన శ్రేష్ఠ ఆత్మలకు బాప్‌దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో అవ్యక్త బాప్‌దాదా కలయిక :- సదా స్వయాన్ని శ్రేష్ఠ భాగ్యశాలురుగా అనుభవం చేస్తున్నారా? ఎవరి తండ్రి అయితే భాగ్యవిధాతగా ఉన్నారో, వారెంత భాగ్యశాలురుగా ఉంటారు! తండ్రే భాగ్యవిధాతగా ఉన్నప్పుడు వారసత్వంగా ఏమిస్తారు? తప్పకుండా శ్రేష్ఠ భాగ్యమే ఇస్తారు కదా! సదా భాగ్యవిధాత అయిన తండ్రి మరియు భాగ్యం రెండూ గుర్తుండాలి. ఎప్పుడైతే మీ శ్రేష్ఠ భాగ్యము స్మృతిలో ఉంటుందో అప్పుడు ఇతరులను కూడా భాగ్యవంతులుగా తయారు చేసే ఉమంగ-ఉత్సాహాలు ఉంటాయి. ఎందుకంటే దాత పిల్లలుగా ఉన్నారు, భాగ్యవిధాత అయిన తండ్రి బ్రహ్మాబాబా ద్వారా భాగ్యాన్ని పంచారు కావున బ్రాహ్మణులైన మీరు కూడా ఏమి చేస్తారు? బ్రహ్మ కార్యం ఏదైతే ఉందో, అదే బ్రాహ్మణుల కార్యం కావున మీరు అటువంటి భాగ్యాన్ని పంచేవారు. వారైతే బట్టలు పంచుతారు, ధాన్యం పంచుతారు, నీరు పంచుతారు. కానీ శ్రేష్ఠ భాగ్యాన్ని అయితే భాగ్యవిధాత పిల్లలే పంచగలరు. కనుక మీరు భాగ్యాన్ని పంచే శ్రేష్ఠ భాగ్యవంతులైన ఆత్మలు. ఎవరికైతే భాగ్యం ప్రాప్తించిందో వారికి సర్వస్వం లభించింది. ఒకవేళ ఈ రోజు ఎవరికైనా వస్త్రాలను ఇచ్చినట్లయితే, రేపు ధాన్యం కొరత ఉంటుంది. అలాగే రేపు ధాన్యాన్ని ఇచ్చినట్లయితే నీటి కొరత ఉంటుంది. ఒక్కొక్క వస్తువును ఎంతవరకు పంచుతారు! దానితో తృప్తిగా అవ్వజాలరు. భాగ్యాన్ని కనుక పంచినట్లయితే, ఎక్కడ భాగ్యముంటుందో అక్కడ అన్నీ ఉంటాయి. ఎవరికైనా ఏదైనా ప్రాప్తించినట్లయితే వాహ్‌ నా భాగ్యము! అని అంటారు. ఎక్కడ భాగ్యముంటుందో అక్కడ అన్నీ పాప్తిస్తాయి. కావున మీరందరూ శ్రేష్ఠ భాగ్యాన్ని దానం చేసేవారు. ఇలాంటి మహాదానుల, శ్రేష్ఠ భాగ్యవంతుల ఇదే స్మృతి సదా ఎగిరేకళలోకి తీసుకెళ్తుంది. ఎక్కడైతే శ్రేష్ఠ భాగ్య స్మృతి ఉంటుందో, అక్కడ సర్వ ప్రాప్తుల స్మృతి ఉంటుంది. ఈ భాగ్యాన్ని పంచడంలో విశాల హృదయులుగా అవ్వండి. ఇది తరగనిది. పదార్థము కొద్దిగా ఉంటే పిసినారితనపు భావన రావచ్చు, కాని ఇది తరగనిది. కనుక పంచుతూ ఉండండి, సదా ఇస్తూ ఉండండి. ఒక్క రోజు కూడా దానం ఇవ్వకుండా ఉండరాదు. సదా దానం చేసేవారు ప్రతీ సమయంలో తమ ఖజానాలను తెరిచి ఉంచుతారు. ఒక గంట కూడా దానాన్ని ఆపరు. బ్రాహ్మణుల కర్తవ్యమే సదా విద్యను తీసుకోవడం, విద్యాదానం చేయడం. కావున ఈ కార్యంలో సదా తత్పరులై ఉండండి.

2. సదా స్వయాన్ని సంగమయుగ వజ్ర సమానమైన ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? మీరందరూ సత్యమైన వజ్రాలుగా ఉన్నారు కదా! వజ్రానికి విలువ చాలా ఉంటుంది. మీ బ్రాహ్మణ జీవితానికి ఎంత విలువ ఉంది? అందుకే బ్రాహ్మణులను సదా శిఖరం(పిలక) స్థానంలో చూపిస్తారు. పిలక అనగా ఉన్నతమైన స్థానం. వాస్తవానికి ఉన్నతమైనవారు దేవతలు. కాని దేవతల కంటే బ్రాహ్మణులైన మీరు ఉన్నతమైనవారు - ఇటువంటి నషా ఉంటుందా? నేను తండ్రి వాడిని, తండ్రి నా వారు. ఈ జ్ఞానముంది కదా! ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. సదా మనసులో, 'పొందవలసినందంతా పొందేశాను(జో పానా థా వహ్‌ పాలియా).' అన్న ఈ పాటయే మ్రోగుతూ ఉండాలి. నోటి ద్వారా ఒక గంటసేపు పాడితే అలసిపోతారు కానీ మనసుతో పాట పాడడంలో అలసట రాదు. తండ్రివారిగా అవ్వడం వలన నృత్యం చేసేవారిగా కూడా, పాట పాడేవారిగా కూడా, చిత్రకారులుగా కూడా అన్ని రకాలవారిగా అయిపోతారు. ప్రాక్టికల్‌గా మీ ఫరిస్తా చిత్రాన్ని తయారు చేసుకుంటున్నారు. కావున ఏమనుకుంటే అవన్నీ అవుతారు. చాలా గొప్ప బిజినెస్‌ మాన్‌గా(వ్యాపారవేత్తగా) కూడా ఉన్నారు. మిల్లుల యజమానిగా కూడా ఉన్నారు. కావున తమ కర్తవ్యాన్ని సదా నిశ్చితితో ఉంచుకోండి. ఒకసారి గనుల యజమానిగా అయిపోండి. ఒకసారి ఆర్టిస్ట్‌(కళకారునిగా) అయిపోండి, ఒకసారి నృత్యం చేసేవారిగా అయిపోండి..... ఇది చాలా రమణీకమైన జ్ఞానం. రసం లేనిది కాదు. రోజూ ఇదే ఆత్మ-పరమాత్మ జ్ఞానాన్ని వింటూ ఉండాలా అని కొందరంటూ ఉంటారు. కాని ఇది ఆత్మ-పరమాత్మల రసం లేని జ్ఞానం కాదు. చాలా రమణీకమైన జ్ఞానం. కేవలం రోజూ మీ క్రొత్త - క్రొత్త టైటిల్స్‌(బిరుదులు) గుర్తుంచుకోండి. నేను ఆత్మనే కానీ ఎటువంటి ఆత్మను? ఒకసారి ఆర్టిస్టు(కళాకారుడు) ఆత్మను, ఒకసారి బిజినెస్‌(వ్యాపారస్థుడు) ఆత్మను. కావున ఇలా రమణీకతతో ముందుకు వెళ్తూ ఉండండి. తండ్రి రమణీకమైనవారు కదా! చూడండి, ఒకసారి చాకలిగా అయిపోతారు, ఒకసారి విశ్వరచయితగా, ఒకసారి విధేయుడైన సేవకుడిగా..... అయిపోతారు. కావున తండ్రి ఎలాంటివారో, పిల్లలు కూడా అలాంటివారే..... ఈ విధంగా రమణీకమైన జ్ఞానాన్ని స్మరిస్తూ హర్షితంగా ఉండండి.

వర్తమాన సమయ ప్రమాణంగా స్వయం మరియు సేవ రెండిటి వేగాల బ్యాలెన్స్‌(సమతుల్యం) ఉండాలి. ఎంత సేవ తీసుకున్నానో అంతగా రిటర్న్‌(బదులు) ఇస్తున్నానా? అని ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇప్పుడిది సేవ చేసే సమయం. ఎంతగా ముందుకు వెళ్ళాలో అంతగా సేవకు యోగ్యమైన సమయమవుతూ పోతుంది. కాని ఆ సమయంలో అనేక పరిస్థితులు కూడా ఉంటాయి. ఆ పరిస్థితులలో సేవ చేసేందుకు ఇప్పటి నుండే సేవ చేసే అభ్యాసముండాలి. రావడం, వెళ్ళడం కూడా కష్టమవుతుంది. ముందుకు వెళ్ళేందుకు మనసు ద్వారానే సేవ చేయవలసి ఉంటుంది. ఇది ఇచ్చే సమయంగా అయ్యింది. స్వయంలో నింపుకునే సమయం కాదు. అందువలన మొదటి నుండే సర్వ శక్తుల స్టాకు నింపుకున్నామా? అని మీ స్టాకును పరిశీలించుకోండి. సర్వ శక్తులు, సర్వ గుణాలు, సర్వ జ్ఞాన ఖజానాలు స్మృతి శక్తితో సదా నిండుగా ఉండాలి. దేనికీ లోటు ఉండరాదు.

28వ తేది అమృతవేళలో బాప్‌దాదా సద్గురువారపు అభినందనలు తెలియచేశారు---- వృక్షపతి దినాన అభినందనలు. వృక్షపతి రోజున సదాకాలానికి బృహస్పతి దశ స్థిరంగా ఉండాలి. సదా ఇదే స్మృతి స్వరూపంలో ఉండాలి. ఇప్పుడైతే అందరూ ప్రతిజ్ఞను పక్కాగా చేశారు కదా! కుమారుల గ్రూపు తయారైపోయినట్లయితే ధ్వని బిగ్గరగా వస్తుంది. ప్రభుత్వం వరకు వ్యాపిస్తుంది. కాని అవినాశీగా ఉంటేనే...! గడబిడ చేయకండి. ఉమంగ-ఉత్సాహాలు, ధైర్యం బాగున్నాయి. ఎక్కడ ధైర్యముందో అక్కడ సహాయము ఉండనే ఉంది. శక్తులు ఏమి ఆలోచిస్తున్నారు? శక్తులు లేకుంటే శివుడు కూడా లేడు. తండ్రి కూడా భుజాలు లేకుండా ఏమి చేయగలరు? కావున మొదటి భుజాలు ఎవరు? వాహ్‌ నేనే! మంచిది.

పరమాత్మ ప్రేమలో సదా లీనమై ఉండండి. (వ్యక్తిగత అవ్యక్త మహావాక్యాలు)

పరమాత్మ ప్రేమను అనుభవించిన అనుభవజ్ఞులుగా అయినట్లయితే, తన అనుభవము ద్వారా సహజయోగులుగా అయ్యి ఎగురుతూ ఉంటారు. పరమాత్మ ప్రేమ ఎగిరించే సాధనము. ఎగిరే వారెప్పుడూ భూమ్యాకర్షణలోకి రాలేరు. మాయ రూపము ఎంతగా ఆకర్షించినా, ఆ ఆకర్షణ ఎగిరేకళలో ఉన్న వారి వద్దకు చేరుకోజాలదు. ఈ పరమాత్మ ప్రేమ అనే దారము దూరం-దూరం నుండి ఆకర్షించి తీసుకొస్తుంది. ఇది ఎటువంటి సుఖాన్నిచ్చే ప్రేమ అంటే ఎవరైతే ఈ ప్రేమలో ఒక్క సెకను అయినా మునిగిపోతారో, వారు వారి అనేక దు:ఖాలను మర్చిపోతారు. అంతేకాక సదా కొరకు సుఖమనే ఊయలలో ఊగడం ప్రారంభిస్తారు. జీవితంలో ఏది కావాలో అది ఎవరైనా ఇచ్చినట్లయితే అదే ప్రేమకు గుర్తుగా అవుతుంది. కావున తండ్రికి పిల్లల పైన ఎంత ప్రేమ ఉందంటే జీవితంలోని సుఖం-శాంతి మొదలైన కామనలన్నింటినీ పూర్తి చేస్తారు. తండ్రి సుఖమే ఇవ్వడం లేదు, సుఖ భండారానికి యజమానిగా చేస్తారు. ఇందుకు తోడు-తోడుగా శ్రేష్ఠ భాగ్యరేఖను గీసుకునే కలము కూడా ఇస్తారు. ఎంత కావాలంటే అంత భాగ్యాన్ని తయారు చేసుకోగలరు. ఇదే పరమాత్మ ప్రేమ. ఏ పిల్లలైతే పరమాత్మ ప్రేమలో సదా లీనమై మునిగిపోయి ఉంటారో వారి మెరుపు మరియు నషా అనుభూతుల కిరణాలు ఎంత శక్తిశాలిగా ఉంటాయంటే ఏ సమస్యా సమీపంగా రాలేదు సరి కదా కన్నెత్తి కూడా చూడలేదు. వారికి ఎన్నడూ ఏ విధమైన శ్రమా ఉండజాలదు. తండ్రికి పిల్లలంటే ఎంత ప్రేమ ఉందంటే అమృతవేళ నుండే పిల్లల పాలన చేస్తూ ఉంటారు. రోజు ప్రారంభమే ఎంత శ్రేష్ఠంగా ఉంటుంది! స్వయం భగవంతుడే మిలనం చేసేందుకు పిలుస్తారు. ఆత్మిక సంభాషణ చేస్తారు. శక్తులు నింపుతారు. తండ్రి పాడే ప్రేమ పాట మిమ్మల్ని నిద్ర లేపుతుంది(మేల్కొల్పుతుంది). మధురమైన పిల్లలూ, ప్రియమైన పిల్లలూ! రండి,..... అని ఎంతో ప్రేమతో పిలుస్తారు, నిద్ర లేపుతారు. కావున ఈ ప్రేమతో కూడిన పాలనకు ప్రాక్టికల్‌ స్వరూపం ''సహజయోగీ జీవితం''. ఎవరి పై ప్రేమ ఉంటుందో, వారికి ఏది బాగుంటుందో అదే చేయడం జరుగుతుంది. కావున తండ్రికి పిల్లలు నిరుత్సాహంగా ఉండడం(అప్‌సెట్‌ అవ్వడం) బాగుండదు. అందువలన ఎప్పుడు ఏమి చేయాలి, విషయమే అలా ఉంది, అందువలన అప్‌సెట్‌ అయ్యామని అనకండి. ఒకవేళ నిరుత్సాహపడే విషయం వచ్చినా మీరు నిరుత్సాహ స్థితిలోకి రాకండి. బాప్‌దాదాకు పిల్లలంటే ఎంత ప్రేమ ఉందంటే ప్రతి పుత్రుడు నా కన్నా ముందు ఉండాలని భావిస్తారు. ప్రపంచంలో కూడా ఎవరి పై ఎక్కువ ప్రేమ ఉంటుందో, వారిని తమ కంటే ముందుకు తీసుకెళ్తారు. ఇదే ప్రేమకు గుర్తు. కావున బాప్‌దాదా కూడా నా పిల్లల్లో ఇప్పుడు ఏ విధమైన లోపం, బలహీనత ఉండరాదు. అందరూ సంపూర్ణంగా, సంపన్నంగా మరియు సమానంగా అయిపోవాలని అంటారు.

పరమాత్మ ప్రేమ ఆనందకరమైన ఊయల. ఈ సుఖాన్నిచ్చే ఊయలలో ఊగుతూ సదా పరమాత్మ ప్రేమలో లవలీనమై ఉన్నట్లయితే ఎప్పుడూ ఏ పరిస్థితి లేక మాయ ద్వారా అలజడి రాజాలదు. పరమాత్మ ప్రేమ తరగనిది, చలించనిది. సర్వులకు ప్రాప్తి అవ్వజాలదు. సదా అనంతమైన ప్రాప్తులలో మగ్నమై ఉంటారు. వారి నుండి ఆత్మీయతా సుగంధం వస్తూ ఉంటుంది. ప్రేమకు గుర్తు - ఎవరి పై ప్రేమ ఉంటుందో వారికి తమ సర్వస్వం సమర్పితం చేసేస్తారు. తండ్రికి పిల్లలంటే ఎంత ప్రేమ ఉందంటే రోజూ బాబా మీ ప్రేమకు బదులు(రెస్పాండ్‌) ఇవ్వడానికి ఇంత పెద్ద ఉత్తరాన్ని వ్రాస్తారు. ప్రియమైన పిల్లలకు ఇస్తారు. అంతేకాక సహచరునిగా అయ్యి సదా తోడు నిభాయిస్తారు. కావున ఈ ప్రేమలో తమ బలహీనతలన్నీ బలిహారం చెయ్యండి. పిల్లలంటే తండ్రికి ప్రేమ ఉంది. అందువలన పిల్లలూ! మీరు ఎలా ఉన్నా నా వారే అని సదా అంటారు. అదే విధంగా మీరు కూడా సదా ప్రేమలో లవలీనమై ఉండండి. బాబా! ఎలా ఉన్నా గానీ అందరూ మీవారిగానే ఉన్నామని హృదయపూర్వకంగా చెప్పండి. ఎప్పుడూ ఆ అసత్య రాజ్య ప్రభావంలోకి రాకండి. ఎవరైతే ప్రియంగా ఉన్నారో వారిని స్మృతి చేయనవసరం లేదు. వారి స్మృతి స్వతహాగానే వస్తుంది. కేవలం హృదయ పూర్వకమైన ప్రేమ ఉండాలి. సత్యంగా మరియు నిస్వార్థంగా ఉండాలి. ఎప్పుడైతే ' మేరా బాబా(నా తండ్రి), ప్యారా బాబా(ప్రియమైన తండ్రి) ' అని అంటున్నారో ప్రియమైన వారు ఎప్పుడూ మర్చిపోజాలరు. నిస్వార్థ ప్రేమ తండ్రి నుండి తప్ప ఏ ఇతర ఆత్మ నుండి లభించజాలదు. అందువలన ఎప్పుడూ స్వార్థంతో స్మృతి చేయకండి. నిస్వార్థ ప్రేమలో లవలీనమై ఉండండి.

ఆదికాలం అమృతవేళ తమ హృదయంలో పరమాత్మ ప్రేమను 83 జన్మలు సంపూర్ణ రూపంలో ధారణ చేయండి. ఒకవేళ మనసులో పరమాత్మ ప్రేమ, పరమాత్మ శక్తులు, పరమాత్మ జ్ఞానం వింటూ ఉన్నట్లయితే ఎప్పుడూ ఎవ్వరి వైపు ఆకర్షణ లేక స్నేహం వెళ్ళజాలదు. ఈ పరమాత్మ ప్రేమ ఈ ఒక్క జన్మలోనే ప్రాప్తిస్తుంది. 83 జన్మలు దేవాత్మలు లేక సాధారణ ఆత్మల ద్వారా ప్రేమ లభించింది. ఇప్పుడే పరమాత్మ ప్రేమ లభిస్తుంది. ఆ ఆత్మల ప్రేమ రాజ్య భాగ్యాన్ని పోగొడ్తుంది. కానీ పరమాత్మ ప్రేమ రాజ్య భాగ్యాన్ని ఇప్పిస్తుంది. కావున ఈ ప్రేమ అనుభూతులలో ఇమిడిపోయి ఉండండి. తండ్రి పట్ల సత్యమైన ప్రేమ ఉన్నట్లయితే ప్రేమకు గుర్తు - సమానంగా, కర్మాతీతంగా అవ్వండి. చేయించేవారిగా అయ్యి కర్మలు చేయండి, చేయించండి. కర్మేంద్రియాలు మీ చేత చేయించరాదు. మీరు కర్మేంద్రియాలతో చేయించండి. ఎప్పుడూ మనసు-బుద్ధి లేక సంస్కారాలకు వశమై ఏ కర్మనూ చేయకండి. మంచిది.
వరదానము :- ''చేయించేవారి స్మృతి ద్వారా అతి పెద్ద కార్యాన్ని సహజంగా చేసే నిమిత్త కరన్‌హార్‌ భవ (చేసేవారిగా అవ్వండి)''
బాప్‌దాదా(స్వర్గ) స్థాపన చేసే అతి పెద్ద కార్యాన్ని స్వయం చేయించేవారిగా అయ్యి నిమిత్తంగా చేసే పిల్లల ద్వారా చేయిస్తున్నారు. చేసి-చేయించేవారు అన్న ఈ పదంలో తండ్రి మరియు పిల్లలు ఇరువురూ కంబైండుగా(సంయుక్తంగా) ఉన్నారు. చేతులు పిల్లలవి, కార్యం తండ్రిది. సహయోగమునిచ్చే గోల్డెన్‌ ఛాన్స్‌(బంగారు అవకాశం) పిల్లలకే లభించింది. కానీ చేయించేవారు చేయిస్తున్నారు. నిమిత్తంగా తయారు చేసి నడిపిస్తున్నారనే అనుభవాన్నే చేస్తారు. ప్రతి కర్మలో చేయించేవారి రూపంలో తోడుగా ఉన్నారు. 

స్లోగన్‌ :- ''అర్జీ చేసేందుకు బదులు సదా రాజీగా ఉండువారే జ్ఞాన యుక్త ఆత్మలు''
 

Friday, 19 January 2018

Telugu Murli 20/01/18

20-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

''మధురమైన పిల్లలారా - ఒక్క మన్మనాభవ అను మహామంత్రము ద్వారా మీరు వివేకవంతులుగా అవుతారు, ఈ మంత్రమే అన్ని పాపాల నుండి ముక్తులుగా చేస్తుంది.'' 

ప్రశ్న :- పూర్తి జ్ఞానమంతటి సారమేది? మన్మనాభవగా ఉండేవారి గుర్తులు ఏవి?
జవాబు :- పూర్తి జ్ఞాన సారమేమంటే - ఇప్పుడు మనము వాపసు ఇంటికి వెళ్లాలి. ఇది ఛీ - ఛీ (పాడైపోయిన) ప్రపంచము. దీనిని వదలి మనము మన ఇంటికి వెళ్లాలి. ఇది గుర్తున్నా మన్మనాభవగా ఉన్నట్లే. మన్మనాభవగా ఉండే పిల్లలు సదా జ్ఞానాన్ని విచార సాగర మథనము చేస్తూ ఉంటారు. వారు బాబాతో మధురాతి మధురంగా ఆత్మిక సంభాషణ చేస్తారు.

ప్రశ్న :- ఏ అలవాటుకు వశీభూతమైన ఆత్మ తండ్రి స్మృతిలో ఉండలేదు ?

జవాబు :- అశుద్ధమైన చిత్రాలను చూసే అలవాటు ఉన్నా, అశుద్ధమైన సమాచారము చదివే అలవాటు ఉన్నా తండ్రి స్మృతి ఉండదు. సినిమా నరకానికి ద్వారము. అది మానసిక వృత్తులను పాడు చేస్తుంది.
ఓంశాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. తక్కువ తెలివి ఉన్నవారికే అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు చాలా తెలివి గలవారిగా అయ్యారు. వీరు మా అనంతమైన తండ్రే కాక అనంతమైన శిక్షణ కూడా ఇస్తున్నారని మీరు అర్థం చేసుకున్నారు. సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తారు. విద్యార్థుల బుద్ధిలో జ్ఞానముండాలి కదా. తర్వాత మళ్లీ తండ్రి తన జతలో కూడా తప్పకుండా తీసుకెళ్తారు. ఎందుకంటే ఇది పాడైపోయిన పాత ప్రపంచమని తండ్రికి తెలుసు. ఈ పాత ప్రపంచము నుండి నేను పిల్లలను ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చాను. బాబా అర్థం చేయిస్తున్నారు - ఇచ్చట కూర్చుంటూ కూర్చుంటూ పిల్లల మనసులలో తప్పకుండా ఇలా వస్తూ ఉంటుంది - ఓహో! వీరు మా అనంతమైన తండ్రే కాక మాకు చాలా శ్రేష్ఠమైన శిక్షణ కూడా ఇస్తారు. మొత్తము రచన యొక్క ఆదిమధ్యాంతాల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. ఇవన్నీ స్మృతి చేయడం కూడా మన్మనాభవయే. ఇది కూడా మీ చార్టులోకి రాగలదు. ఇది చాలా సులభము. ఇంకేమీ చేయకపోయినా కూర్చుంటూ - లేస్తూ - నడుస్తూ - తిరుగుతూ బుద్ధిలో ఇది గుర్తుండాలి. అద్భుతమైన వస్తువును స్మృతి చేయవలసి ఉంటుంది. తండ్రిని స్మృతి చేసినందున తండ్రి చెప్పిన చదువు చదువుకున్నందున మనము మళ్లీ విశ్వానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు. ఇది బుద్ధిలో నడుస్తూ ఉండాలి. మీరు బస్సు, రైలు మొదలైనవాటిలో కూర్చొని ఎక్కడికి వెళ్తున్నా బుద్ధిలో స్మృతి ఉండాలి. మొట్టమొదట పిల్లలకు తండ్రి కావాలి. ఆత్మలైన మనకు, వారు సర్వాత్మల ఆత్మిక అనంతమైన తండ్రి అని మీకు తెలుసు. సులభంగా గుర్తు వచ్చేందుకు బాబా యుక్తులను తెలిపిస్తున్నారు. నన్నొక్కరినే స్మృతి చేస్తే మీరు అర్ధకల్పము నుండి చేసిన వికర్మలన్నీ యోగాగ్ని ద్వారా భస్మమైపోతాయి. జన్మ-జన్మాంతరాలుగా యజ్ఞ, జపతపాదులు అనేకము చేశారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో భక్తిమార్గము వారికి తెలియదు. వీటి ద్వారా ఏ ప్రాప్తి జరుగుతుందో కూడా వారికి తెలియదు. మందిరాలకు వెళ్తారు. ఎంతో భక్తి చేస్తారు. ఇవన్నీ పరంపర నుండి కొనసాగుతూ వస్తున్నాయని భావిస్తారు. శాస్త్రాలు కూడా పరంపర నుండి వస్తున్నాయని అంటారు. స్వర్గములో శాస్త్రాలు ఉండనే ఉండవని మనుష్యులకు తెలియదు. సృష్టి ప్రారంభము నుండే ఇవన్నీ కొనసాగుతూ వస్తున్నాయని వారు భావిస్తారు. అనంతమైన తండ్రి ఎవరో కూడా వారు ఎవ్వరికీ చెప్పలేరు. ఇచ్చట హద్దు తండ్రి గాని, హద్దు టీచరు గాని లేరు. హద్దు టీచరు ద్వారా అయితే మీరందరూ చదువుకున్నారు. చదువుకున్న తర్వాతనే ఉద్యోగము మొదలైనవి చేస్తారు, సంపాదిస్తారు. మన అందరి అనంతమైన తండి ఎవరైతే ఉన్నారో వారికి తండి లేరని, వారు మనకు అనంతమైన టీచరు కూడా అయినారని పిల్లలైన మీకు తెలుసు, వీరికి టీచరు కూడా ఎవ్వరూ లేరు. ఈ దేవతలను ఎవరు చదివించారో వారు తప్పకుండా గుర్తు రావాలి కదా! ఇది కూడా మన్మనాభవయే. ఈ చదువును ఎక్కడ నుండీ చదవలేదు. ఎందుకంటే తండ్రే స్వయంగా జ్ఞానసాగరులు. వీరిని ఎవరైనా చదివించారా? మానవ సృష్టికి వారు బీజరూపులు, చైతన్యమైనవారు, జ్ఞానసాగరులు. చైతన్యమైనందున మానవ సృష్టి రూపి వృక్ష రహస్యమును ఆది నుండి అంత్యము వరకు వినిపిస్తారు. చివరి సమయములో వచ్చి ఆది సమయపు జ్ఞానము వినిపిస్తారు. వారంటున్నారు ఓ పిల్లలారా! నేను ఏ శరీరములో విరాజమానమై ఉన్నానో, ఇతని ద్వారా నేను ఆది నుండి ఈ సమయము వరకు సర్వమూ వినిపిస్తాను. అంతము గురించి అయితే తర్వాత వినిపిస్తాను. పోను పోను ఇది అంతిమ సమయమని మీరు అర్థము చేసుకుంటారు, ఎందుకంటే ఆ సమయానికి మీరు కర్మాతీత అవస్థకు చేరుకుంటారు. అంతేకాక ఈ పాత ఛీ - ఛీ ప్రపంచము వినాశనము అవ్వనే అవుతుందని సూచనలు కూడా చూస్తారు. ఇది కొత్త విషయమేమీ కాదు. అనేకసార్లు చూశారు. ఇక మీదట కూడా చూస్తూ ఉంటారు. కల్పక్రితము రాజ్యము తీసుకున్నారు. మళ్లీ పోగొట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ తీసుకుంటున్నారు. బాబా మనలను చదివిస్తారు. మనమే విశ్వానికి అధిపతులుగా ఉండేవారమని తర్వాత 84 జన్మలు తీసుకున్నామని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ విశ్వానికి అధిపతులుగా తయారు చేసేందుకు బాబా అదే జ్ఞానాన్ని ఇస్తున్నారని బాబా టీచరు కూడా అని మీరు లోలోపల అర్థము చేసుకున్నారు. అచ్ఛా ఒకవేళ తండ్రి గుర్తుకు రాకుంటే టీచరును స్మృతి చేయండి. టీచరును ఎప్పుడైనా మర్చిపోతారా? టీచరు ద్వారా చదువుకుంటూ ఉంటారు. అయితే మాయ ఏమారుస్తుంది. అది మీకు తెలియనే తెలియదు. మాయ ఒక్కసారిగా కళ్లలో దుమ్ము చల్లుతుంది. దాని వలన భగవంతుడు మనలను చదివిస్తున్నారని పూర్తిగా మర్చిపోతారు. తండ్రి ప్రతి విషయాన్ని బాగా వివరిస్తారు. ఇది అనంతమైన జ్ఞానము, వారిది హద్దు జ్ఞానము. ఈ బేహద్‌ జ్ఞానాన్ని బాబా కల్ప-కల్పము పిల్లలైన మీకు ఇస్తారు. అచ్ఛా. ఎక్కువగా చదవలేకపోతే భలే వారిని తండ్రి రూపములో స్మృతి చేయండి. వారికి ఏ తండ్రీ లేరు ఎందుకంటే వారే సర్వులకు తండ్రి. అందరూ వారి పిల్లలే. శివబాబా ఎవరి కొడుకో ఎవరైనా చెప్పగలరా? వారు అనంతమైన తండ్రి, మేము అనంతమైన తండ్రివారిగా అయ్యామని పిల్లలకు అర్థము చేసుకున్నారు. మన ఈ చదువు కూడా అద్భుతమైనది. బ్రాహ్మణులైన మనము మాత్రమే ఈ చదువును చదువుకుంటాము. దేవతలు లేక క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఈ చదువును చదవలేరు. తండ్రి తెలిపే ఈ జ్ఞానము పూర్తిగా భిన్నమైనది. మీరు తప్ప ఇతరులెవరూ అర్థము చేసుకోలేరు. పిల్లలైన మీ ఖుషీ పాదరసము మీటరు పైకి ఎక్కాలి. ఎందుకంటే మనము తమోప్రధానము నుండి సతోప్రధానంగా అయ్యాము. ఇప్పుడు ఉన్నత పదవి పొందేందుకు పురుషార్థము చాలా బాగా చేయాలి. అంతేకాని స్వర్గములోకి అయితే అందరూ వస్తారు కదా అని అనుకోరాదు. జ్ఞాన-యోగాలు ధారణ జరగకుంటే ఉన్నతమైన పదవి లభించదు.

బాబా అంటున్నారు - 16 కళా సంపూర్ణంగా అవ్వడంలో స్మృతి చేయు శ్రమ ఉంది. ఎవ్వరికీ దు:ఖము ఇవ్వలేదు కదా? అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. మనము సుఖదాత పిల్లలము. అందరికీ సుఖమునే ఇవ్వాలి. మనసా, వాచా, కర్మణా ఎవ్వరికీ దు:ఖమునివ్వరాదు. ఈ సమయములో ఎవరైతే చదువుకుంటారో, వారు సుగంధ భరిత పుష్పాలుగా అవుతారు. మీ వెంట వచ్చేది ఈ సంపాదనే. ఇందులో ఏ పుస్తకాలు మొదలైనవి చదవవలసిన అవసరమే లేదు. ఆ చదువులో ఎన్నో పుస్తకాలు మొదలైనవి చదవవలసి వస్తుంది. బాబా చెప్పిన ఈ జ్ఞానము అన్నిటికంటే భిన్నమైనది. అంతేకాక సులభమైనది కూడా. కాని ఇదంతా గుప్తము. మీరు ఏం చదువుతున్నారో మీరు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇది అద్భుతమైన చదువు. తండ్రి అంటున్నారు - ఎప్పుడూ ఆబ్సెంటు అవ్వరాదు. చదువును ఎప్పుడూ వదలరాదు. బాబా వద్ద అందరి రిజిస్టరు ఉంటుంది. ఆ రిజిస్ట్టరు ద్వారా ఇతడు పది మాసాలు ఆబ్సెంటు, ఇతడు ఆరు మాసాలు ఆబ్సెంటు అని బాబా తెలుసుకుంటారు. కొంతమంది నడుస్తూ - నడుస్తూ చదువు కూడా వదిలేస్తారు. ఇది చాలా అద్భుతమైనది. ఇటువంటి అద్భుతమైన వస్తువు మరొకటేదీ ఉండదు. కల్ప-కల్పము పిల్లలైన మిమ్ములను ఇటువంటి తండ్రి వచ్చి కలుసుకుంటారు. ఈ సాకార బాబా అయితే పునర్జన్మలోకి వస్తారని పిల్లలైన మీకు తెలుసు. ఇతడు 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశాడు. తతత్వమ్‌(మీరు కూడా అలాగే తిరుగుతారు) ఇది ఆట కదా. ఆటను ఎప్పుడూ మర్చిపోరు. ఆట సదా గుర్తుంటుంది.

బాబా అర్థం చేయిస్తున్నారు - ఒకటేమో ఈ ప్రపంచము నరకంగా ఉంది. దానిలోనూ ముఖ్యంగా సినిమాలు నరక కూపాలు. అక్కడకు వెళ్లి సినిమాలు చూచినందున వృత్తులు(భావాలు) ఎంతో పాడైపోతాయి. వార్తాపత్రికలలో కూడా ఎవైనా మంచి-మంచి అందమైన చిత్రాలు చూస్తే అందులోకిి కూడా బుద్ధి పోతుంది - వీరు అందముగా ఉన్నారు, వీరికి బహుమతి లభించాలి. ఇటువంటి ఆలోచనలు నడుస్తాయి. అటువంటి చిత్రాలు అసలు ఎందుకు చూడాలి? ఈ మొత్తం ప్రపంచమే సమాప్తము అవ్వనున్నదని బుద్ధి ద్వారా తెలుసుకున్నారు. మీరు కేవలం నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. ఇటువంటి వస్తువులను చూడకండి. వాటిని గురించి ఆలోచించకండి. ఇవి పాత ప్రపంచములోని ఛీ-ఛీ(మురికి) శరీరాలు, వాటి వైపు చూసే పని ఏముంది? ఒక్క తండ్రిని మాత్రమే చూడాలి. బాబా అంటున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా! గమ్యము చాలా ఉన్నతమైనది. మాయ తక్కువైనదేమీ కాదు. మాయ ఆడంబరాలు, అట్టహాసము ఎంతగా ఉందో చూడండి. ఆ వైపు సైన్సు, ఇటువైపు మీ సైలెన్సు ఉంది. వారు ముక్తిని పొందాలనుకుంటారు. ఇచ్చట మీ లక్ష్యము జీవన్ముక్తిని పొందుకోవడం. జీవన్ముక్తి పొందు దారిని ఎవ్వరూ తెలపలేరు. సన్యాసులు మొదలైనవారెవ్వరూ ఈ జ్ఞానమునివ్వలేరు. గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రంగా ఉండమని వారు ఎవ్వరికీ అర్థము చేయించలేరు. ఇలా అర్థము చేయించేవారు తండ్రి ఒక్కరు మాత్రమే. భక్తి మార్గములో సమయము వృథా అవుతూనే వచ్చింది. ఎన్ని తప్పులు(భూలే) చేస్తూ ఉంటారు! తప్పులు చేస్తూ చేస్తూ భోలాగా(అమాయకంగా) అయిపోయారు. ఈ చివరి జన్మ నూరు శాతము తప్పుల తడికగా ఉంది. కొద్దిగా కూడా బుద్ధి పని చేయదు. ఇప్పుడు బాబా మీకు అర్థం చేయిస్తున్నారు, అందుకే మీరు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు అన్నీ అర్థం చేసుకున్నారు. కావున ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. సంతోష పాదరస మట్టము కూడా మీకే పైకి ఎక్కుతుంది. ఇది అద్భుతము కదా - ఈ తండ్రికి తన తండ్రి అంటూ ఎవ్వరూ లేదు. శిక్షకులు కూడా ఎవ్వరూ లేరు. అయితే వీరు ఎక్కడి నుండి నేర్చుకున్నారు? మనుష్యులు ఆశ్చర్యపడ్తారు. తప్పకుండా వారికి ఎవరో గురువు ఉంటారని చాలామంది భావిస్తారు. ఒకవేళ వీరు కూడా గురువు నుండి నేర్చుకొని ఉంటే ఆ గురువుకు ఇంకా వేరే శిష్యులు కూడా ఉండాలి కదా. కేవలం ఈ ఒక్క శిష్యుడు మాత్రమే ఉండడు. గురువుకైతే శిష్యులు చాలామంది ఉంటారు. ఆగాఖాన్‌కు ఎంతమంది శిష్యులో చూడండి. వారు గురువును ఎంత గౌరవిస్తారో చూడండి. వారిని వజ్రాలతో తులాభారము చేశారు. మీరు దేనితో తూకము వేస్తారు? వీరేమో అందరికంటే సుప్రీమ్‌(అత్యంత ఉన్నతమైనవారు). వీరి బరువు ఎంత ఉంటుంది? మీరు ఏమి చేస్తారు! తూకము వేస్తే ఎంత బరువు ఉంటాడు? ఏదైనా వస్తువు వీరిని తూచగలదా? శివబాబా ఏమో బిందువు కదా. ఈ రోజులలో అలా చాలా మందిని తూచుతూ ఉంటారు. కొందరు బంగారముతో, కొందరు వెండితో, కొందరు ప్లాటినమ్‌తో కూడా తూచుతారు. ప్లాటినమ్‌ బంగారు కంటే ఖరీదైనది. ఆ దేహ సంబంధమైన గురువులు మీకు సద్గతిని ఇవ్వలేరని తండ్రి అర్థం చేయిస్తారు. సద్గతిలోకి తీసుకెళ్ళేవారు ఒక్క తండ్రి మాత్రమే అని అర్థం చేయిస్తున్నారు. మరి వారిని దేనితో తులాభారము చేస్తారు? మనుష్యులైతే కేవలం భగవంతుడా, భగవంతుడా! అని అంటూ ఉంటారు. కానీ ఆ తండ్రి శిక్షకుడు కూడా అని వారికి తెలియదు. వారు ఎంత సాధారణంగా కూర్చొని ఉన్నారో చూడండి. పిల్లల ముఖాన్ని చూచేందుకు కొంచెము పైన కూర్చుంటారు. సహాయకారులైన పిల్లలు లేకుండా నేను స్థాపన ఎలా చేయగలను? ఎవరు ఎక్కువగా సహాయము చేస్తారో వారిని బాబా తప్పకుండా ప్రేమిస్తారు. లౌకికములో కూడా ఒక కొడుకు 2 వేలు సంపాదిస్తాడు. మరొకరు వేయి రూపాయలే సంపాదించవచ్చు. మరి ఆ తండ్రికి ఎవరి పై ఎక్కువ ప్రేమ ఉంటుంది. కాని ఈ రోజులలో అసలు పిల్లలు తండ్రిని ఎక్కడ లెక్కపెడ్తున్నారు? అనంతమైన తండ్రి కూడా ఫలానా - ఫలానా పిల్లలు చాలా మంచి సహాయకులని గమనిస్తారు. పిల్లలను చూస్తూ చూస్తూ బాబా హర్షితమౌతారు. ఆత్మ సంతోషిస్తుంది. నేను కల్ప-కల్పము వస్తాను. పిల్లలను చూచి చాలా సంతోషిస్తాను. కల్ప-కల్పము ఈ పిల్లలు నాకు సహాయకారులుగా అవుతారని తెలుసు. ఈ బాబా ప్రేమ కల్ప-కల్పానికి నిశ్చయమైపోతుంది. ఎక్కడ కూర్చొని ఉన్నా బుద్ధిలో ఇలా ఆలోచించండి - ఈ తండ్రి మాకు తండ్రే కాక టీచరు కూడా అయ్యారు, గురువు కూడా అయ్యారు. స్వయం వారే మాకు సర్వస్వము, అందుకే అందరూ వారినే స్మృతి చేస్తారు. సత్యయుగములో ఎవ్వరూ స్మృతి చేయరు. ఎందుకంటే బాబా 21 జన్మలకు నావను ఆవలి తీరానికి చేరుస్తారు. ఈ విధంగా స్మరిస్తూ స్మరిస్తూ పిల్లలు హర్షితమవ్వాలి. మేము ఇటువంటి తండ్రి సేవను చేయాలని సంతోషము కలగాలి. అందరికీ తండ్రి పరిచయమునివ్వాలి. వీరు అనంతమైన తండ్రి, ఈ తండ్రియే స్వర్గ స్థాపన చేస్తారు. మనందరినీ తన వెంట కూడా తీసుకెళ్తారు. ఈ విధంగా అర్థము చేయిస్తే సర్వవ్యాపి అని అనలేరు. '' వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి '' అని తండ్రి చెప్పారు. వారందరూ సమాప్తమైపోతారు. పోతే మిగిలిన మీరు విజయము పొందుతారు. మీరు రాజధానిని స్థాపన చేస్తున్నారు. ఆత్మల తండ్రి కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఇటువంటి అద్భుతమైన విషయాలు మీరు అందరికీ వినిపించాలి. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. 

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మనము సుఖదాత పిల్లలము, అందరికీ సుఖమునివ్వాలి. మనసా, వాచా, కర్మణా ఎవ్వరికీ దు:ఖమునివ్వరాదు.
2. చదువు మరియు చదివించేవారు ఇరువురూ అద్భుతమైనవారు. ఇటువంటి అద్భుతమైన చదువును ఎప్పుడూ మిస్‌ చేయరాదు. గైర్హాజరు(ఆబ్స్‌౦టు) అవ్వరాదు. 

వరదానము :- '' జతలో ఉంటాము, జతలో జీవిస్తాము..... ఈ ప్రతిజ్ఞను స్మృతిలో ఉంచుకొనుట ద్వారా కంబైండుగా (సంయుక్తంగా) ఉండే సహజయోగీ భవ ''
పిల్లలైన మీరు జతలో ఉంటాము, జతలో జీవిస్తాము, జతలో నడుస్తాము......... ఈ ప్రతిజ్ఞను స్మృతిలో ఉంచుకొని బాప్‌ ఔర్‌ ఆప్‌(తండ్రి మరియు మీరు) కంబైండు రూపంలో ఉండండి. ఈ స్వరూపాన్ని సహజయోగి అని అంటారు. యోగము జోడించేవారు కాదు, సదా కంబైండుగా అనగా జతలో ఉండేవారు, ఈ విధంగా జతలో ఉండేవారే నిరంతర యోగులు. సదా సహయోగులు ఎగిరే కళలో వెళ్లే ఫరిస్తాలుగా అవుతారు. 

స్లోగన్‌ :- ''ప్రశ్నార్థక (ప్రశ్నించే) వంకర మార్గాన్ని తీసుకునేందుకు బదులు కళ్యాణము చేసే బిందువును ఉంచడమే కళ్యాణకారులుగా అవ్వడం.''
 

Thursday, 18 January 2018

Telugu Murli 19/01/18

19-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - పారసబుద్ధిగల వారిగా అయ్యేందుకు తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో, దానిని మంచిరీతిగా అర్థము చేసుకోవాలి, స్వయంలో ధారణ చేసుకొని ఇతరులతో చేయించాలి''

ప్రశ్న :- ఏ ఒక్క రహస్యము చాలా గుహ్యమైనది, గోపనీయమైనది, అర్థము చేసుకోవలసినది?
జవాబు :- నిరాకార తండ్రి సర్వులకు మాతా-పితగా ఎలా అవుతారో, వారు సృష్టిని ఏ విధంగా రచిస్తారో, ఈ విషయము చాలా గుహ్యమైన, గోపనీయ రహస్యము. నిరాకార తండ్రి తల్లి లేకుండా సృష్టిని రచించలేరు. వారు శరీర ధారణ ఎలా చేస్తారో, అందులో ప్రవేశించి అతని నోటి ద్వారా పిల్లలను ఎలా దత్తత చేసుకుంటారో, ఈ బ్రహ్మ తండ్రే కాక తల్లిగా కూడా ఎలా అవుతారో - ఈ విషయాలు బాగా అర్థము చేసుకొని స్మరించవలసిన లేక స్మృతిలో ఉంచుకోవలసిన విషయము. 

పాట:- తల్లివి నీవే, తండ్రివి నీవే.......... (తుమ్‌హీ హో మాతా............)
ఓంశాంతి. ఎవరినైతే తల్లివి నీవే, తండ్రివి నీవే అని అంటారో, వారిలో తప్పకుండా తండ్రియే ఆజ్ఞను ఇస్తారు కదా. ఇక్కడ తల్లి-తండ్రి సంయుక్తము(కంబైండ్‌)గా ఉన్నారు. ఈ విషయాన్ని మనుష్యులు అర్థము చేసుకునేందుకు చాలా కష్టము. అయితే అర్థము చేసుకోవలసిన ముఖ్యమైన విషయము కూడా ఇదే. నిరాకారులైన పరమపిత పరమాత్మ ఎవరినైతే తండ్రి అని అంటారో, వారిని తల్లి అని కూడా అంటారు. ఇది అద్భుతమైన విషయము. పరమపిత పరమాత్మ మానవ సృష్టిని రచిస్తారు. కనుక రచించేందుకు తప్పకుండా తల్లి కావాలి. ఈ విషయము చాలా రహస్యమైనది. ఇతరులెవ్వరి బుద్ధిలోకి ఎప్పుడూ రాజాలదు. వారు అందరికి తండ్రి. మరి తల్లి కూడా తప్పకుండా కావాలి కదా. ఆ తండ్రి నిరాకారులు. అయితే తల్లిగా ఎవరిని ఉంచాలి? వివాహమైతే చేసుకొని ఉండరు కదా. ఇవి చాలా గుహ్యమైన గోపనీయమైన అర్థము చేసుకోవలసిన విషయాలు. కొత్త కొత్తగా వచ్చిన వారైతే అర్థము చేసుకోలేరు. పాతవారు కూడా కష్టంగా అర్థము చేసుకొని ఆ స్మృతిలో ఉంటారు. పిల్లలే మాతా-పితల స్మృతిలో ఉంటారు కదా. భారతదేశములో లక్ష్మీనారాయణులను కూడా మీరే మాతా-పితలు,....... అని అంటారు. అలాగే రాధా-కృష్ణుల ముందుకు వెళ్లి కూడా మీరే తల్లిదండ్రులు అని అంటారు. అయితే వాస్తవానికి వారు రాకుమార-రాకుమార్తెలు(యువరాజు-యువరాణి) కావున ఏ బుద్ధిహీనుడు కూడా వారిని తల్లి - తండ్రి అని అనరు. మనుష్యులకైతే అలా అనడం అలవాటైపోయింది. అయితే ఈ విషయమే అతిభిన్నమైనది. లక్ష్మీనారాయణులనైతే వారి పిల్లలు మాత్రమే తల్లి-తండ్రి అని పిలుస్తారు. ఎవరి వద్ద చాలా ధనముంటుందో, మిద్దెలు-మహళ్లు ఉంటాయో వారు స్వర్గములో ఉన్నారని మనుష్యులు భావిస్తారు. వారి పిల్లలు మా తల్లిదండ్రుల వద్ద చాలా సుఖముందని అంటారు. తప్పకుండా వారు పూర్వ జన్మలో కొన్ని మంచి కర్మలు చేసి ఉంటారు. అచ్ఛా! నీవే తల్లివి, నీవే తండ్రివి........ అని ఎవరిని మహిమ చేస్తారో ఆ పరమపిత పరమాత్మ ఒక్కరే రచయిత. మనమంతా ఎవరి పిల్లలమో, వారు కూడా నిరాకారులే, ఆత్మలమైన మనము కూడా నిరాకారులమే. అయితే నిరాకారుడు సృష్టిని ఎలా రచిస్తారు? తల్లి లేకుండా సృష్టి రచింపబడజాలదు. ఈ సృష్టి రచన చాలా అద్భుతమైనది. ఒకటేమో పరమాత్మ నూతన ప్రపంచానికి రచయిత. పాత ప్రపంచములోకి వచ్చి నూతన ప్రపంచాన్ని రచిస్తారు. అయితే ఎలా రచిస్తారు? ఇది చాలా రహస్యమైన విషయము. ఆ నిరాకారుని మనము మాతా - పిత అని అంటున్నాము. నేను పిల్లలను దత్తత చేసుకుంటానని తండ్రే స్వయంగా అర్థం చేయిస్తున్నారు. గర్భము నుండి పిల్లలకు జన్మనిచ్చే విషయమే లేదు. ఇంత లెక్క లేనంత మంది పిల్లలు గర్భము నుండి ఎలా జన్మిస్తారు? కావున నేను ఈ శరీరాన్ని ధరించి ఇతని (బ్రహ్మ) నోటి ద్వారా పిల్లలను దత్తత చేసుకుంటాను. ఈ బ్రహ్మ మానవ సృష్టిని రచించే తండ్రే కాక తల్లి కూడా అవుతాడు. అతని నోటి ద్వారా పిల్లలను దత్తత చేసుకుంటాను. ఈ విధంగా పిల్లలను దత్తు తీసుకోవడం కేవలం ఒక్క తండ్రి కర్తవ్యము మాత్రమే. సన్యాసులు ఆ పని చేయలేరు. వారికి జిజ్ఞాసువులు, శిష్యులు, అనుచరులు ఉంటారు. ఇక్కడైతే ఇది రచనను గురించిన విషయము. అందువలన బాబా ఇతనిలో ప్రవేశిస్తారు. మీరంతా ముఖవంశావళివారు. నీవే తల్లివి, నీవే తండ్రివి అని అంటారు. అందువలన మాత కూడా ఇతడే అని నిరూపించబడ్తుంది. ఆ తండ్రి ఇతనిలో ప్రవేశించి రచిస్తారు. ఈ వృద్ధుడు ప్రజాపిత అవ్వడమే కాక వృద్ధ మాత కూడా అవుతాడు. వృద్ధ తండ్రికి వృద్ధురాలే కావాలి కదా. ఇప్పుడు పిల్లలు మాతా - పితలను స్మృతి చేయవలసి వస్తుంది. ఇతనికి ఆస్తి ఏమీ లేదు. మీరు వారసులుగా అవుతారు. అందుకే వీరిని బాప్‌దాదా అని అంటారు. మీరు ప్రజాపిత బ్రహ్మ నుండి ఆస్తిని తీసుకోరు. ఈ దాదా(బ్రహ్మ) కూడా వారి నుండే తీసుకుంటాడు. ఇతడిని దాదా (అన్న) అని, మాతా అని కూడా పిలుస్తారు లేకుంటే మాతా-పితలని ఎలా నిరూపించబడ్తుంది. మాతా-పితలు లేకుండా పిల్లలెలా జన్మిస్తారు - ఇవన్నీ అర్థము చేసుకొని స్మరించే చాలా రహస్యమైన విషయాలు. బాబా మీరు తండ్రి ఈ మాత ద్వారా మేము జన్మ తీసుకున్నామని అంటారు. మాతా- పిత అన్నప్పుడు వారసత్వము కూడా తప్పకుండా గుర్తు వస్తుంది, ఆ తండ్రిని స్మృతి చేయాలి. ఈ పతిత ప్రపంచములోకి తండ్రి ఎలా వస్తారో జ్ఞానము వలన మీరు అర్థము చేసుకోగలరు. బాబా అంటున్నారు - నేను ఎవరిలో ప్రవేశిస్తానో అతడు నాకు కుమారుడే కాక మీకు తండ్రి కూడా అయ్యాడు. అంతేకాక మీ తల్లి కూడా అయ్యాడు. మీరంతా పిల్లలు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేసినందున వారసత్వము లభిస్తుంది. తల్లిని స్మృతి చేసినందున వారసత్వము లభించదు. నిరంతరము ఆ నిరాకార తండ్రినే స్మృతి చేయాలి. ఈ శరీరాన్ని మర్చిపోవాలి. ఇవన్నీ అర్థము చేసుకునే జ్ఞాన విషయాలు.

తండ్రి పాత ప్రపంచములోకి వచ్చి నూతన ప్రపంచాన్ని రచిస్తారు. పాతదానిని సమాప్తము చేసేస్తారు. లేకపోతే ఎవరు సమాప్తము చేయగలరు? శంకరుని ద్వారా పాత ప్రపంచ వినాశనము అని గాయనము కూడా ఉంది. ఇది డ్రామాలో నిశ్చయమై ఉంది. అందువలన గాయనములో కూడా వస్తుంది. మన కొరకు నూతన రాజధాని తయారౌతూ ఉందని పిల్లలైన మీకు తెలుసు. వినాశనానికి ఏర్పాట్లు పూర్తిగా జరుగుతున్నాయి. మీరు ఇంతమంది ఉన్నారు అందరూ రాజ్యపదవిని పొందుకుంటున్నారు. ఏదో గుడ్డినమ్మకాలతో నమ్మేశారని కాదు. ఎవరో రాముని సీత దొంగలించబడిందని అంటే సత్యం సత్యమని అనేశారు. ఏదైనా విషయము అర్థము కాకుంటే అర్థము చేసుకునేందుకు ప్రయత్నించండి. లేకుంటే బుద్ధిహీనులు బుద్ధిహీనులుగానే ఉండిపోతారు. భక్తి మార్గములో అయితే అల్పకాలిక సుఖము లభిస్తుంది. దాని ఫలితము అదే జన్మలో లేక మరుసటి జన్మలో అల్పకాలము కొరకు లభిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. కొంత సమయము మాత్రమే పవిత్రంగా ఉంటారు. పాపాలు చేయరు. దాన-పుణ్యాలు కూడా చేస్తారు. వీటి వల్ల లభించే సుఖమును కాకిరెట్టకు సమానమని అంటారు. ఈ విషయాలు పిల్లలైన మీరు మాత్రమే అర్థము చేసుకోగలరు ఎందుకంటే మీరు బందర్‌(కోతి) నుండి పరివర్తనై మందిరానికి అర్హులుగా అయ్యారు. సత్యయుగములో మీరు పారసబుద్ధి గలవారిగా ఉండేవారు ఎందుకంటే అప్పుడు పారసనాథుడు, పారసనాథినీల రాజ్యముండేది. బంగారు మహళ్ళు ఉండేవి. ఇప్పుడైతే అన్నీ రాళ్ళే. పారసబుద్ధి గలవారి నుండి పత్తర్‌(రాతి) బుద్ధి గలవారిగా ఎవరు తయారు చేస్తారు? 5 వికారాలనే రావణుడు అని అంటారు. అందరూ రాతిబుద్ధి గలవారిగా అయినప్పుడే పారసబుద్ధిగా తయారు చేయు తండ్రి ఇచ్చటకు వస్తారు. ఎంత సులభంగా అర్థము చేసుకొని అర్థము చేయించగలరు! ఇది బీజము మరియు వృక్షము. మిగిలిన విస్తారమైన విషయాలు కూడా అర్థం చేయిస్తూ ఉంటారు. ఇక మీదట కూడా అర్థం చేయిస్తూ ఉంటారు. క్లుప్తంగా ఒక్క మాటలో ''తండ్రిని స్మృతి చేయండి'' వారి నుండి వారసత్వము లభిస్తుందని అంటున్నారు. తల్లిని స్మృతి చేసే అవసరము లేదు. తండ్రి అంటున్నారు - పిల్లలూ! నన్ను స్మృతి చేయండి. అంటే తప్పకుండా తండ్రి నుండి వారసత్వము తీసుకునేందుకే తల్లి నుండి జన్మ తీసుకొని ఉంటారు. అందువలన ఈ తల్లిని కూడా వదిలేయండి. దేహధారులందరినీ వదిలేయండి. ఎందుకంటే ఇప్పుడు తండ్రి నుండి వారసత్వము తీసుకోవాలి. ఆత్మలమైన మేము ఆత్మిక తండ్రి పిల్లలమని, మళ్లీ శారీరిక మాతా - పితలకు కూడా పిల్లలుగా అయ్యామని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థము చేసుకున్నారు. ఈ అనంతమైన తండ్రి నూతన సృష్టిని రచిస్తారు. భారతదేశము స్వర్గముగా ఉండేది కదా. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు లేరు. అనంతమైన తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు ప్రతి జన్మలో హద్దు వారసత్వము తీసుకుంటూ వచ్చారు. నరకములో ఉండేదే హద్దు వారసత్వము. స్వర్గములోని వారసత్వాన్ని హద్దు వారసత్వమని అనరు. అది అనంతమైన వారసత్వము ఎందుకంటే అనంతము అనగా మొత్తము సృష్టికి యజమానులుగా ఉంటారు. అప్పుడు ఏ ఇతర ధర్మమూ ఉండదు. హద్దు(పరిమిత) వారసత్వము ద్వాపరము నుండి ప్రారంభమౌతుంది. సత్యయుగములో బేహద్‌(అనంతమైన) వారసత్వముంటుంది. మీరు ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. అచ్చట మీకు అనంతమైన సామ్రాజ్యముంటుంది. యథా రాజా రాణి తథా ప్రజా. ప్రజలు కూడా మేము ఈ సృష్టి అంతటికి యజమానులమని అంటారు. ఇప్పుడు ప్రజలు అలా మేము ఈ సృష్టికంతటికీ అధిపతులమని అనరు. ఇప్పుడు అనేక హద్దులు ఏర్పడ్డాయి. మా నీటిలోనికి మీరు రారాదు. ఈ తుంట(భాగము) మాది అని వారంటారు. అచ్చట ప్రజలు కూడా మేము విశ్వానికి అధిపతులమని అంటారు. మా మహారాజు, మా మహారాణి అయిన లక్ష్మీనారాయణులు కూడా విశ్వమంతటికి యజమానులు అని అంటారు. అచ్చట ఒకే రాజ్యముండేదని ఇప్పుడు మనము అర్థం చేసుకున్నాము. అది అనంతమైన సామ్రాజ్యము. భారతదేశము ఎలా ఉండేదో ఎవరి బుద్ధిలోనూ లేదు. పిల్లలైన మీరు అనంతమైన తండ్రి నుండి వారసత్వము తీసుకోండి అని ఇప్పుడు శిక్షణ లభిస్తున్నది. నేను కూడా(బ్రహ్మ) చెప్తున్నానంటే మనము తప్పకుండా తీసుకుంటున్నాము. అనంతమైన తండ్రి స్వర్గ రచయిత. 21 తరాల రాజ్యభాగ్యమని గాయనము కూడా ఉంది. తరము అని ఎందుకంటారు? ఎందుకంటే అక్కడ ముసలివారైన తర్వాతనే మరణిస్తారు. అచ్చట అకాలమృత్యువు ఉండదు. మాతలు ఎప్పుడూ విధవలుగా అవ్వరు. ఏడ్చే పని, బాదుకునే పని ఉండదు. ఇచ్చటైతే ఎంతగానో ఏడుస్తూ, బాదుకుంటూ ఉంటారు. అక్కడ పిల్లలు కూడా ఏడ్వవలసిన అవసరముండదు. ఇక్కడైతే పిల్లల నోరు పెద్దదిగా అవ్వాలని ఏడిపిస్తూ ఉంటారు. అక్కడ ఇటువంటి విషయాలు ఉండవు. మేము ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి కల్పక్రితము వలె వారసత్వము తీసుకుంటున్నామని ఇప్పుడు పిల్లలందరూ అర్థం చేసుకున్నారు. 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు వాపసు వెళ్లాలి. నిరంతరము తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయడం వలన వికర్మలు వినాశనమౌతాయి. మన్మనాభవ అర్థము ఎంతో సులభమైనది. గీత భలే అసత్యమైనది, కాని అందులో ఎంతో కొంత సత్యము కూడా ఉంది కదా. తండ్రి అయిన నన్ను స్మృతి చేయండి. ఈ విధంగా కృష్ణుడైతే నన్ను స్మృతి చేయండి, మీరు నా వద్దకు రావాలని అనజాలడు కదా. పరమాత్మ ఇప్పుడు సర్వ ఆత్మలకు చెప్తున్నాడు - ఆత్మలైన మీరంతా దోమల వలె రావాలి. కావున తప్పకుండా ఆత్మ పరమాత్మ అయిన తండ్రినే అనుసరిస్తుంది. కృష్ణుడైతే దేహధారి అయిపోయాడు. అతడు ఈ విధంగా చెప్పలేడు. ఆత్మనైన నన్ను స్మృతి చేయమని అతడు చెప్పలేడు. అతని పేరే కృష్ణుడు. ఏ ఆత్మ కూడా ఇలా చెప్పలేదు. ఆత్మలంతా భాయి-భాయి. తండ్రి అంటున్నారు - నేను నిరాకారుడను, పరమాత్మ అయిన నా పేరు శివుడు. అలా కృష్ణుడు ఎలా అంటాడు? అతడికైతే తన శరీరముంది. శివబాబాకు తమ స్వంత శరీరము లేనే లేదు. శివబాబా అంటున్నారు - పిల్లలూ! మీకు కూడా మొదట మీ శరీరము లేదు. ఆత్మలైన మీరు నిరాకారులుగా ఉండేవారు. ఆ తర్వాత శరీరము తీసుకున్నారు. ఇప్పుడు మీకు డ్రామా ఆదిమధ్యాంతాల స్మృతి కలిగింది. తండ్రి ఈ సృష్టిని ఎలా, ఎప్పుడు, ఎందుకు రచిస్తారు? సృష్టి అయితే ఉంది కదా. బ్రహ్మ ద్వారా నూతన సృష్టిని రచించారనే గాయనము కూడా ఉంది. అందువలన తప్పకుండా పాత సృష్టి నుండే నూతన సృష్టిని రచించి ఉంటారు. మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేశారని కూడా అంటారు. తండ్రి అంటున్నారు - ఈ చదువు ద్వారా నేను మిమ్ములను మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేస్తాను. పూజ్య దేవతలుగా ఉండేవారు తర్వాత మళ్లీ పూజారులుగా అయిపోయారు. 84 జన్మలు ఎలా తీసుకుంటారో మనుష్యులకు అర్థము కాదు. అందరూ 84 జన్మలు ఎలా తీసుకుంటారా? సృష్టి వృద్ధిని పొందుతూ ఉంటుంది. మరి అందరూ 84 జన్మలు ఎలా తీసుకుంటారు? తప్పకుండా వెనుక వచ్చేవారి జన్మలు తక్కువగా ఉంటాయి. 25-50 సంవత్సరాలలో 84 జన్మలు ఎలా తీసుకుంటారు? ఇది స్వదర్శన చక్రము. అయితే వారు స్వదర్శన చక్రాన్ని ఒక మారణాయుధము రూపములో తయారు చేశారు. ఇప్పుడు ఆత్మలైన మీకు 84 జన్మలు ఫలానా-ఫలానా విధంగా అనుభవించామని స్మృతి కలిగింది. ఇప్పుడు చక్రము పూర్తవుతుంది. మళ్లీ డ్రామా రిపీట్‌ అవుతుంది. మొట్టమొదట ఆది సనాతన దేవీదేవతా ధర్మము తప్పకుండా ఉండాలి. అది ఇప్పుడు ప్రాయ: లోపమైపోయింది.

ఓ గాడ్‌ ఫాదర్‌!....... దయ చూపమని మనుష్యులు అంటారు. అందువలన తండ్రి అంటారు - అచ్ఛా మిమ్ములను దు:ఖము నుండి ముక్తులుగా చేసి సుఖీలుగా తయారు చేస్తాను. అందరినీ సుఖవంతంగా చేయడమే తండ్రి కర్తవ్యము. అందువలన నేను కల్ప-కల్పము వస్తాను. వచ్చి భారతదేశాన్ని వజ్ర తుల్యముగా తయారు చేస్తాను. చాలా సుఖవంతముగా తయారు చేస్తాను. మిగిలిన వారందరినీ ముక్తిధామములోకి పంపేస్తాను. భక్తులు భగవంతుని కలవాలని కోరుకుంటారు. ఎందుకంటే సన్యాసులు ఈ సుఖము కాకిరెట్టకు సమానమని అన్నారు. ఇంకా కొంతమంది ఈ డ్రామాలో మళ్లీ రానే రాకూడదని కూడా అంటారు. అందువలన మోక్షము పొందుకోండి అని చెప్తారు. కాని మోక్షము లభించనే లభించదు. ఇది తయారైన డ్రామా. ఈ సృష్టి చరిత్ర-భూగోళమంతా పిల్లలైన మీరిప్పుడు తెలుసుకున్నారు. ఈ చక్రములో ఎలా తిరుగుతారో కూడా తెలుసుకున్నారు. దానినే స్వదర్శన చక్రమని అంటారు. స్వదర్శన చక్రముతో అందరి శిరస్సులను ఖండించినట్లు చూపిస్తారు. కంసవధ నాటకములో కూడా ఏది చూపిస్తారో వాస్తవానికి అటువంటిదేమీ లేదు. ఇచ్చట హింస అనే మాటే లేదు. ఈ చదువు చదువుకోవాలి. తండ్రి నుండి వారసత్వము తీసుకోవాలి. తండ్రి నుండి వారసత్వము తీసుకునేందుకు ఎవరినైనా హతమారుస్తారా? అది హద్దులోని వారసత్వము. ఇది అనంతమైన తండ్రి నుండి బేహద్‌ వారసత్వము తీసుకోవడం. గీతలో యుద్ధము మొదలైన వాటి విషయాలు అనేకము వ్రాసేశారు. నిజానికి అవేవీ జరగలేదు. పాండవులు ఎవరితోనూ యుద్ధము చేయరు. అలా జరగదు. ఇక్కడ యోగబలము ద్వారా అనంతమైన తండ్రి నుండి పిల్లలైన మీరు నూతన ప్రపంచము కొరకు వారసత్వము తీసుకుంటున్నారు. ఇందులో యుద్ధము మాటే లేదు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తండ్రి నుండి 21 తరాలకు వారసత్వము తీసుకునేందుకు నిరంతరము తండ్రిని, వారి వారసత్వాన్ని స్మృతి చేసే పురుషార్థము చేయాలి. ఏ దేహధారినీ స్మృతి చేయరాదు.
2. బుద్ధిలో స్వదర్శన చక్రాన్ని త్రిప్పుతూ ఉండాలి. మనము పూజ్యులుగా ఉండేవారము తర్వాత మళ్లీ పూజారులుగా అయ్యాము, 84 చక్రాన్ని పూర్తి చేశాము. మళ్లీ డ్రామా రిపీట్‌ అవ్వనున్నది. మనము పూజారుల నుండి పూజ్యులుగా అవ్వాలి అనే స్మృతియే స్వదర్శన చక్రము. 

వరదానము :- ''సదా స్నేహ సహయోగాల ద్వారా అవినాశి రత్నాలనే బిరుదును ప్రాప్తి చేసుకునే అమర భవ''
ఎవరైతే స్థాపనా కార్యంలో సదా స్నేహీలుగా, సహయోగులుగా ఉంటారో వారికి అవినాశీ రత్నాలనే టైటిల్‌(బిరుదు) లభిస్తుంది. ఇటువంటి అవినాశీ రత్నాలను ఎప్పుడూ ఎవ్వరూ కదిలించలేరు. ఏ ఆటంకమూ ఆపలేదు. అటువంటి అవినాశీ రత్నాలే అమర భవ అనే వరదానులు. వారు రియల్‌ గోల్డ్‌గా(నిజమైన ప్యూర్‌బంగారుగా), తండ్రికి సాథీలుగా(సహయోగులుగా, స్నేహితులుగా) ఉంటారు. వారు తండ్రి కార్యాన్ని తమ స్వంత కార్యముగా భావిస్తారు. సదా జతలో ఉంటారు. అందువలన వారు అవినాశిగా అయిపోతారు. 

స్లోగన్‌ :- ''పవిత్రతను యథార్థంగా ధారణ చేస్తే, ప్రతీ కర్మ యథార్థంగా యుక్తి యుక్తంగా జరుగుతుంది''
 


Telugu Murli 18/01/18

18-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

పితాశ్రీ వారి పుణ్య స్మృతి దినమున క్లాసులో వినిపించే౦దుకు బాప్‌దాదా మధుర మహావాక్యాలు
''మధురమైన పిల్లలారా - మీ స్వభావాన్ని చాలా మధురంగా, చాలా శాంతిగా చేసుకోండి, మీ మాటలు, నడవడికలు ఎలా ఉండాలంటే, అందరూ '' వీరు దేవతల వలె ఉన్నారు '' అని అనాలి '' 

ప్రశ్న :- హృదయాన్ని శుద్ధంగా తయారు చేసుకునేందుకు ఏ ఆసక్తి ఉండాలి ?
జవాబు :- హృదయాన్ని శుద్ధంగా చేసుకునేందుకు స్వయాన్ని యోగులుగా చేసుకొని, ఇతరులను యోగులుగా తయారు చేయాలనే ఆసక్తి ఉండాలి. యోగ స్థితి ద్వారానే హృదయము శుద్ధంగా అవుతుంది. ఒకవేళ దేహము పై మోహముంటే, దేహ అభిమానముంటే మా స్థితి చాలా కచ్ఛాగా (అపరిపక్వము)గా ఉందని అర్థము చేసుకోండి. దేహీ-అభిమానులుగా ఉండు పిల్లలే సత్యమైన వజ్రాలుగా అవుతారు. అందువలన దేహీ-అభిమానులుగా అయ్యే అభ్యాసము వీలైనంత ఎక్కువగా చేయండి, తండ్రిని స్మృతి చేయండి.  

ఓంశాంతి. ఇప్పుడు భగవంతుడు సన్ముఖములో కూర్చొని మనకు జ్ఞాన గీతాలు వినిపిస్తారని లేక జ్ఞాన డ్యాన్స్‌ చేయిస్తారని పిల్లలకు తెలుసు. ఈ జ్ఞాన డాన్స్‌ వలన మీరు దేవతల వలె సదా సుఖంగా, హర్షితంగా ఉంటారు. అనంతమైన తండ్రి అని, విశ్వ రచయిత అని భగవంతుడినే అంటారు. మన కొరకు బాబా స్వర్గాన్ని బహుమతిగా తెచ్చారని ఆత్మకు తెలుసు. వారే రచయిత. స్వర్గానికి అధికారిగా తయారు చేసేందుకు రాజయోగాన్ని నేర్పిస్తారు. తండ్రిని, విశ్వాధికారాన్ని స్మృతి చేయమని చెప్తారు. తండ్రి అనంతమైన యజమాని కనుక తప్పకుండా అనంతమైన గొప్ప ప్రపంచాన్నే రచిస్తారు. పిల్లలైన మీకు విశ్వమంతా ఇల్లే అనగా పాత్రను అభినయించే స్థానము. అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన విశ్వాన్ని లేక ఇంటిని తయారు చేస్తారు, అదే స్వర్గము. అటువంటి తండ్రికి పిల్లలు ఎన్ని కృతజ్ఞతలు తెలపాలి! విశ్వ రచయిత అయిన తండ్రి నేరుగా చెప్తున్నారు - నేను మిమ్ములను విశ్వానికి అధికారులుగా చేసేందుకు వచ్చాను కనుక మీ స్వభావము చాలా ఫస్ట్‌క్లాస్‌గా ఉండాలి. మీ నడవడిక ఎలా ఉండాలంటే అందరూ '' వీరు దేవతల వలె ఉన్నారు '' అని అనాలి. దేవతలు ప్రసిద్ధి చెందినవారు. వీరి స్వభావము పూర్తి దేవతల వలె ఉంది, మిక్కిలి మధురమైన శాంత స్వభావము గలవారని అంటారు. ఇటువంటి పిల్లలను చూచి తండ్రి కూడా సంతోషిస్తారు. బాబా స్వర్గానికి అధికారులుగా చేసేందుకు వస్తారు. కనుక మీరు ఎంత సహాయకారులుగా అవ్వాలి. సేవలో మీ అంతకు మీరే లగ్నమైపోవాలి. నేను అలసిపోయాను, ఫుర్సత్తు(తీరిక) లేదు అని అనరాదు. సమయానికి అందరూ పని చేయడంలో కళ్యాణముంది. యజ్ఞ సేవ చేస్తే ఫలితము శివబాబా ఇస్తారు. పిల్లల దైవీ నడవడికను చూచి బలిహారమౌతారు.
మధురమైన పిల్లలూ, మనలను చదివించేవారెవరో మీకు తెలుసు. ఈ చైతన్య డబ్బీలో చైతన్యమైన వజ్రమై కూర్చొని ఉన్నారు. వారే సత్‌-చిత్‌-ఆనంద స్వరూపులు. సత్యమైన తండ్రి మీకు సత్య-సత్యమైన శ్రీమతమునిస్తారు. తండ్రి వారైనారంటే అడుగడుగునా శ్రీమతమును అనుసరించాలి. నిశ్శబ్ధముగా(మౌనంగా) ఉండి చదువుకోవాలి. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. పదే పదే ఈ బ్యాడ్జిని చూస్తూ ఉంటే తండ్రి మరియు వారసత్వము గుర్తుకొస్తుంది. స్మృతి ద్వారానే మీరు మొత్తం విశ్వమంతటికీ శాంతిని దానము చేస్తారు. ప్రతి పుత్రుడు తన ప్రజలను కూడా తయారు చేసుకోవాలి, వారసులను కూడా తయారు చేసుకోవాలి. ఏ మురళినీ మిస్‌ చేయరాదు. బాబా చాలా ప్రీతిగా అర్థం చేయిస్తున్నారు - మధురమైన పిల్లలూ, మీ పై మీరు దయ చూపుకోండి, ఏ ఆజ్ఞనూ పాటించకుండా ఉండరాదు(అవజ్ఞ చేయరాదు).
తండ్రి హృదయములో పిల్లలందరినీ సదా సుఖంగా తయారు చేయాలనే ఫస్ట్‌ క్లాస్‌ ఆశ ఉంటుంది - పిల్లలు అర్హులై స్వర్గానికి అధికారులుగా అవ్వాలనే ఆశ ఉంటుంది. ఎవరైతే సుగంధభరిత పుష్పాలుగా ఉంటారో, వారు ఆకర్షిస్తారు. ఎవరు ఎటువంటివారుగా ఉంటారో అటువంటి సర్చ్‌లైట్‌ తీసుకునేందుకు ఆకర్షిస్తారు. సుగంధ భరితమైన, గుణవంతులైన పిల్లలను చూచి ప్రేమతో, సంతోషముతో కనులు చెమ్మగిల్లుతాయి. వారికేమైనా కష్టము కలుగుతే బాబా వారికి సర్చ్‌లైట్‌ ఇస్తారు.
బాబా అర్థం చేయిస్తారు - మధురమైన పిల్లలూ, మీరు ఈ పాత ప్రపంచములో ఎలాంటి ఆశలూ ఉంచుకోరాదు. ఇప్పుడిక సుఖధామానికి వెళ్లాలనే ఒకే ఒక శ్రేష్ఠమైన ఆశ ఉంచుకోవాలి. ఇంకెక్కడా నిలబడరాదు, చూడరాదు, ముందుకు వెళ్తూ ఉండాలి. ఒకేవైపు చూస్తూ ఉండండి. అప్పుడే చలించని, స్థిరమైన స్థితి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రపంచము సమాప్తమవ్వనే అవుతుంది. దీని స్థితి చాలా సీరియస్‌గా ఉంది. ఈ సమయములో ప్రకృతికి అందరికంటే ఎక్కువ కోపము ప్రకృతికి వస్తుంది. అందువలన అన్నీ సమాప్తము చేసేస్తుంది. ఇప్పుడీ ప్రకృతి తన కోపాన్ని చాలా జోరుగా చూపిస్తుందని మీకు తెలుసు. మొత్తం పాత ప్రపంచాన్నంతా ముంచేస్తుంది. భూకంపములో ఇండ్లు మొదలైనవన్నీ క్రింద పడిపోతాయి. అనేక విధాలుగా మృత్యువు సంభవిస్తుంది. ఇదంతా డ్రామా ప్లానులో తయారై ఉంది. ఇందులో ఎవ్వరి దోషమూ లేదు. వినాశనమైతే జరిగే తీరాలి. అందువలన మీరు ఈ పాత ప్రపంచము నుండి బుద్ధియోగాన్ని తొలగించాలి. మీరేమో మీ సర్వస్వము ఇన్‌ష్యూర్‌ చేసేశారు కనుక మీకు ఎలాంటి చింతా లేదు. మీ సర్వస్వమూ సఫలమౌతూ ఉంది.
ఇప్పుడు మీరు ''వాహ్‌! సద్గురూ వాహ్‌!'' అని అంటారు. ఆ సద్గురువు మనకు ఈ దారి తెలిపించారు. ''వాహ్‌! నా భాగ్యము వాహ్‌!'' ''వాహ్‌! డ్రామా వాహ్‌!''. మీ హృదయము నుండి - ''థాంక్స్‌(ధన్యవాదాలు) బాబా, మీరు మా నుండి పిడికెడు అటుకులు తీసుకొని మాకు భద్రంగా భవిష్యత్తులో నూరు రెట్లు రిటర్న్‌ ఇస్తారు అయితే ఇందులో కూడా పిల్లలకు చాలా విశాల బుద్ధి ఉండాలి. పిల్లలకు అపారమైన జ్ఞాన ధన ఖజానా లభిస్తూ ఉంటే అపారమైన ఖుషీ ఉండాలి కదా. వారి హృదయము ఎంత శుద్ధంగా ఉంటుందో, ఇతరులను కూడా అంత శుద్ధంగా చేస్తారు. యోగ స్థితి ద్వారానే హృదయము శుద్ధంగా అవుతుంది. పిల్లలైన మీకు యోగులుగా అయ్యి యోగులుగా చేసే ఆసక్తి ఉండాలి. ఒకవేళ దేహములో మోహము, దేహాభిమానము ఉంటే మా స్థితి చాలా కచ్ఛాగా ఉందని అర్థము చేసుకోండి. దేహి-అభిమానులుగా ఉన్న పిల్లలే సత్యమైన వజ్రాలుగా అవుతారు. అందువలన ఎంత ఎక్కువగా వీలైతే అంత దేహి-అభిమానులుగా అయ్యే అభ్యాసము చేయండి. తండ్రిని స్మృతి చేయండి. బాబా అనే పదము అన్నిటికంటే ఎక్కువ మధురమైనది. తండ్రి చాలా ప్రేమతో పిల్లలను కనురెప్పల పై కూర్చోబెట్టుకొని(క్షేమంగా) వెంట తీసుకెళ్తారు. ఇటువంటి తండ్రి స్మృతి అను నషాలో చూర్ణమైపోవాలి. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ సంతోషములో మునిగిపోవాలి. తండ్రి ఎలాగైతే అపకారులకు కూడా ఉపకారము చేస్తారో - అలా మీరు కూడా తండ్రిని అనుసరించండి. సుఖదాతలుగా అవ్వండి.
పిల్లలైన మీరు ఈ చదువు ద్వారా ఎంత గొప్ప సంపాదన చేస్తారు! మీరు పదమాపతులుగా అవుతారు. బాబా మిమ్ములను ఎంత ధనవంతులుగా చేస్తారు! తండ్రి మిమ్ములను ఎంత తరగని ఖజానాలతో తూచుతారంటే 21 జన్మలు ఆ ఖజానాలు మీ వెంటనే ఉంటాయి. అక్కడ దు:ఖానికి నామ-రూపాలే ఉండవు. ఎప్పుడూ అకాలమృత్యువు పాలు కారు. మృత్యువుతో ఎప్పుడూ భయపడరు. ఇక్కడ ఎంతగానో భయపడ్తారు, ఏడుస్తారు. ఈ పాత శరీరాన్ని వదిలేసి వెళ్లి కొత్త ప్రపంచములో రాకుమారులుగా అవుతామని మీకు సంతోషముంది. మీరు ఈ పాత ప్రపంచము పై మమకారాన్ని తొలగిస్తూ ఈ దేహమును కూడా మర్చిపోతూ వెళ్లండి. మేము ఆత్మలము, స్వతంత్రులము. ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ గుర్తు రాకూడదు. జీవించి ఉండే మరణించిన స్థితిలో ఉండాలి. ఈ ప్రపంచము నుండి మరణించారు. మీరు మరణిస్తే ప్రపంచము మరణించిందని అంటారు కదా(ఆప్‌ ముయే మర్‌ గయీ దునియా). శరీర భావమును తొలగిస్తూ ఉండండి. ''బాబా ఇక చాలు, ఇప్పుడు మేము మీ ఒడిలోకి వచ్చేస్తాము'' అని ఏకాంతముగా కూర్చొని అభ్యాసము చేయండి. ఒక్కరి స్మృతిలోనే శరీరము అంతమవ్వాలి - దీనినే ఏకాంతము అని అంటారు.
ఇప్పుడు పిల్లలైన మీకు డ్రామా రహస్యము కూడా తెలుసు. తండ్రి మిమ్ములను నిరాకార, ఆకార, సాకార ప్రపంచాల సమాచారమంతా వినిపిస్తారు. ఆత్మ చెప్తుంది - '' ఇప్పుడు మేము నూతన ప్రపంచములోకి వెళ్లేందుకు పురుషార్థము చేస్తున్నాము.'' స్వర్గములోకి వెళ్లేందుకు తప్పకుండా అర్హులుగా అవుతాము. మా కళ్యాణము, ఇతరుల కళ్యాణమును చేస్తాము. అచ్ఛా - తండ్రి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - తండ్రి దు:ఖహర్త - సుఖకర్త కనుక పిల్లలు కూడా అందరికీ సుఖమునివ్వాలి. తండ్రికి కుడి భుజముగా(రైట్‌ హ్యాండ్‌గా) అవ్వాలి. ఇటువంటి పిల్లలే తండ్రికి ప్రియమనిపిస్తారు. శుభకార్యములో కుడిచేతినే ఉపయోగిస్తారు. కనుక తండ్రి చెప్తున్నారు - ప్రతి కార్యములో న్యాయయుక్తముగా అవ్వండి. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తే అంతమతి సో గతి అయిపోతుంది. ఈ పాత ప్రపంచము పై మమకారాన్ని తొలగించండి. ఇది శ్మశానమైపోయింది. వృత్తి, వ్యాపారాలు, పిల్లలు మొదలైనవాటి చింతలో మరణిస్తే అనవసరంగా స్వయం మీరే నష్టపోతారు. శివబాబాను స్మృతి చేస్తే మీరు చాలా లాభపడ్తారు. దేహాభిమానము వలన చాలా నష్టము వాటిల్లుతుంది. దేహీ-అభిమానులుగా అవుతే లాభపడ్తారు. ధనము పై కూడా ఎక్కువ ఆశ ఉంచుకోరాదు. అదే చింతలో శివబాబాను కూడా మర్చిపోతారు. సర్వమూ తండ్రికి సమర్పించి శ్రీమతమును ఎంతగా అనుసరిస్తున్నారో శివబాబా చూస్తారు. ప్రారంభములో తండ్రి(బ్రహ్మాబాబా) కూడా ట్రస్టీగా ఉండి చూపించారు కదా. సర్వమూ ఈశ్వరార్పణ చేసి స్వయం ట్రస్టీగా అయిపోయాడు. ఈశ్వరుని కార్యములోనే ఉపయోగించాలి. విఘ్నాలకు ఎప్పుడూ భయపడరాదు. వీలైనంత వరకు సేవలో మీ సర్వస్వము సఫలము చేసుకోవాలి. ఈశ్వరార్పణ చేసి ట్రస్టీలుగా అయ్యి ఉండాలి. అచ్ఛా. 

సృష్టి పరివర్తనకు ఆధారము - సంఘటిత రూపంలో అందరి సంకల్పమూ ఒక్కటిగానే ఉండాలి
(అవ్యక్త మహావాక్యాలు) - 1975
సంఘటిత రూపముతో బ్రాహ్మణులందరిలో దయా భావన, విశ్వకళ్యాణ భావన, సర్వ ఆత్మలను దు:ఖాల నుండి విడుదల చేసే శుభ కామనలు ఎంతవరకు ప్రతి ఒక్కరి హృదయము నుండి ఉత్పన్నము అవ్వవో అంతవరకు విశ్వపరివర్తన కార్యము ఆగి ఉంటుంది. ఇప్పుడు సంఘటిత రూపంలో ఒక్క సంకల్పాన్ని చేయండి. అనగా దృఢ సంకల్పమనే సహయోగాన్ని అందరూ కలిసి ఇవ్వండి. అప్పుడు ఈ కలియుగ పర్వతాన్ని పరివర్తన చేసి బంగారు ప్రపంచాన్ని తీసుకు రాగలరు.
కనుక మా ఈ సంఘటన ఒకే సంకల్పము గలదిగా ఎంతవరకు తయారయ్యింది అని చెక్‌ చేసుకోండి. శాస్త్రాలలో బ్రహ్మకు సృష్టి రచించాలనే సంకల్పము కలిగినప్పుడు సృష్టి రచింపబడిందని వ్రాయబడింది. ఇక్కడ కేవలం ఒక్క బ్రహ్మ మాట కాదు. బ్రహ్మ సహితంగా బ్రాహ్మణులందరికి ఒకే సంకల్పము కలగాలి - ఇప్పుడు మేమందరమూ ఎవరెడీగా ఉన్నాము, నూతన ప్రపంచము స్థాపనయ్యే తీరాలి లేక అవ్వనే అవుతుంది - ఇటువంటి దృఢ సంకల్పము ఎప్పుడైతే బ్రాహ్మణులందరిలో ఉత్పన్నమవుతుందో అప్పుడే ఈ సృష్టి పరివర్తన అవుతుంది అనగా నూతన సృష్టి రచన ప్రాక్టికల్‌గా కనిపిస్తుంది. ఇందులో కూడా సంఘటన బలము అవసరము. ఒకరిద్దరు లేక కేవలం ఎనిమిది మందిది కాదు, మొత్తం సంఘటనలో ఒకే సంకల్పము కావాలి. సంకల్పము ద్వారా సృష్టి రచన జరుగుతుంది. దీని రహస్యము ఈ విధంగా ఉంది. ఎప్పుడైతే అందరిలో సంకల్పము ఉత్పన్నమవుతుందో అప్పుడు ఒక సెకండులో సమాప్తి ఢంకా మ్రోగడం ప్రారంభమైపోతుంది.
ఒకవైపు సమాప్తి ఢంకా, రెండవ వైపు నూతన ప్రపంచ దృశ్యము జత జతలో కనిపిస్తుంది. అక్కడే వినాశనము అతిగా జరుగుతుంది. అక్కడే జలమయము మధ్య నలువైపులా వినాశనములో ఒక భాగము భూమి, మిగిలిన 3 భాగాలు జలము కనిపిస్తుంది. వెనుక వచ్చిన అనేక ధర్మాల కారణంగా అనేక ఖండాలు ఏవైతే తయారయ్యాయో అవన్నీ సమాప్తమైపోతాయి. కొన్ని దేశాలు ఒక విహార స్థలము రూపంలో నీటి మధ్యలో ఒక ద్వీపము వలె అయిపోతాయి. కనుక ఒకవైపు అతి వినాశనము జరిగే ఢంకా మోగుతుంది. రెండవ వైపు మొదటి రాకుమారుడు(శ్రీకృష్ణుడు) జన్మించిన శబ్ధము పెద్దగా వ్యాపిస్తుంది. శ్రీకృష్ణుడు రావి ఆకు పై రాడు. జలమయం తర్వాత ఆకు పైన శ్రీకృష్ణుడు వచ్చాడని చూపిస్తారు కదా. దీని రహస్యము కూడా ఉంది. భారతదేశము ఫరిస్తాన్‌గా అయినప్పుడు 3 భాగాలు జలమయమైన కారణంగా దానిని జలమయంగా చూపించారు. ఇటువంటి జలమయము మధ్య మొదటి ఆకు ఎవరైతే ఫస్ట్‌ ఆత్మగా ఉంటారో, వారి జన్మ స్థలానికి నలువైపులా ఫస్ట్‌ రాకుమారుడు ప్రత్యక్షమైపోయాడు, వారి జన్మ జరిగిందనే శబ్ధము ప్రసిద్ధమైపోతుంది. కనుక అది కూడా అతిగా జరుగుతుంది. అనగా 3 భాగాలు జలమయమైన దృశ్యము కనిపిస్తుంది. ఒక భాగముగా భారతదేశము స్వర్గము రూపంలో ప్రకటితమవుతుంది. దానినే బంగారు ద్వారక నీటి నుండి వెలువడింది అని చూపిస్తారు. కాని నీటి నుండి రాదు. 3 భాగాలు నీరు ఉంటుంది. ఆ నీటి మధ్య బంగారు ద్వారక కనిపిస్తుంది. అందువలన బంగారు ద్వారక నీటి నుండి బయటకు వచ్చిందని చూపిస్తారు. ఆ సమయంలోనే ఫస్టు ఆత్మ జన్మించిన జయ జయ ధ్వనులు వినిపిస్తాయి. ఇటువంటి దృశ్యము కనిపిస్తోందా? కనుక పాత ప్రపంచ మహావినాశనమయ్యే ఢంకా, కొత్త ఫస్ట్‌ రాకుమారుని జన్మ దృశ్యము జత జతలో కనిపిస్తుంది. ఎలాగైతే ఢంకా మోగించేందుకు ముందు ఢంకాను వేడి చేస్తారు. అప్పుడు శబ్ధము గట్టిగా వ్యాపిస్తుంది. అలాగే ఇది కూడా ఢంకా మోగేందుకు ముందే యోగాగ్ని ద్వారా తయారవ్వాలి. అప్పుడు ఢంకాలోని శబ్ధము గట్టిగా వినిపిస్తుంది. ఈ ఏర్పాటులో లగ్నమై ఉన్నారు కదా. వేచి ఉండేవారిని కూడా ఏర్పాట్లలో ఉపయోగించండి. అప్పుడు జయ జయ ధ్వనులు వినిపిస్తాయి.
ఎప్పుడైతే శరీరాన్ని నడిపించడం వచ్చేస్తే అప్పుడు రాజ్యాన్ని నడిపించడం కూడా వచ్చేస్తుంది. శరీరాన్ని నడిపించడం అనగా రాజ్యము చేయడం. కనుక రాజ్యము చేసే సంస్కారాన్ని నింపుకోవాలి కదా. నాలెడ్జ్‌ఫుల్‌ అని అంటారు కదా. కనుక ఫుల్‌ నాలెడ్జ్‌ అనగా తనువు, మనసు, ధనము, జనము అన్నీ వచ్చేస్తాయి. ఒకవేళ దాని గురించిన నాలెడ్జ్‌ తక్కువగా ఉండినా నాలెడ్జ్‌ఫుల్‌ అని అనరు. అర్థమయ్యిందా? సదా సఫలతా మూర్తులుగా అయ్యేందుకు ఆధారము కూడా నాలెడ్జ్‌ఫుల్‌గా ఉండడమే. నాలెడ్జ్‌ లేకుంటే సఫలతా మూర్తులుగా కూడా అవ్వలేరు. సమయానుసారము పురుషార్థ వేగము తీవ్రంగా ఉండాలి. సమయ వేగము ఎక్కువగా ఉండి నడిచేవారి వేగము ఢీలాగా ఉంది. కనుక సమయానికి ఎలా చేరగలరు? ఒకే బలము, ఒకే నమ్మకము - ఇదే ముఖ్యమైన సబ్జక్టు. ప్రతీ సమయంలో ఒక్కరి స్మృతిలోనే ఏకరసంగా ఉండాలి. ఈ పురుషార్థములో సదా సఫలంగా ఉంటే గమ్యానికి చేరుకుంటారు. ఎవరైతే స్థిరమైన స్నేహంలో ఉంటారో, వారికి సహయోగము కూడా స్వతహాగానే ప్రాప్తి అవుతుంది. మురళి అనగా లాఠీ వంటిది. దీని ఆధారముతో ఏదైనా లోపముండినా అది పూర్తి అవుతుంది. ఈ ఆధారమే మన ఇంటి వరకు, మన రాజ్యము వరకు చేరుస్తుంది. కాని లక్ష్యముండాలి. నియమానుసారము కాదు, లగ్నముతో మురళి చదవడం లేక వినడం అనగా మురళీధరుని లగ్నములో ఉండడం. మురళీధరునితో స్నేహానికి గుర్తు మురళి. మురళితో ఎంత స్నేహముందో అంత మురళీధరుని పై కూడా స్నేహముందని భావించండి. సత్యమైన బ్రాహ్మణులను మురళితో గుర్తించవచ్చు. మురళి పై లగ్నముంటే వారు సత్యమైన బ్రాహ్మణులని అర్థము. లగ్నము తక్కువగా ఉంటే వారు హాఫ్‌కాస్ట్‌ బ్రాహ్మణులు. 

వరదానము :- ''మస్తకం మధ్యలో సదా తండ్రి స్మృతిని ఎమర్జ్‌గా(ఉత్పన్నంగా) ఉంచుకొను మస్తకమణి భవ''
మస్తకమణి అనగా మస్తకంలో సదా తండ్రి స్మృతి ఉండేవారు. దీనినే ఉన్నతమైన స్థితి అని అంటారు. స్వయాన్ని సదా ఇటువంటి ఉన్నతమై స్థితిలో స్థితమై ఉండే శ్రేష్ఠమైన ఆత్మగా భావించి ముందుకు వెళ్తూ ఉండండి. ఎవరైతే ఈ ఉన్నతమైన స్థితిలో ఉంటారో, వారు క్రింద ఉండే అనేక ప్రకారాలైన విషయాలను సులభంగా దాటుకుంటారు. సమస్యలు క్రింద ఉండిపోతాయి, స్వయం పైన ఉంటారు. మస్తకమణి ఉండే స్థానమే ఉన్నతమైన మస్తకము. అందువలన క్రిందికి రాకండి. సదా పైనే ఉండండి. 

స్లోగన్‌ :- ''చింతలేని చక్రవర్తి స్థితిని అనుభవం చేయాలంటే 'నాది' ని ' నీది ' లోకి పరివర్తన చేయండి''