20-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
''మధురమైన పిల్లలారా -
ఒక్క మన్మనాభవ అను మహామంత్రము ద్వారా మీరు వివేకవంతులుగా అవుతారు, ఈ
మంత్రమే అన్ని పాపాల నుండి ముక్తులుగా చేస్తుంది.''
ప్రశ్న :- పూర్తి జ్ఞానమంతటి సారమేది? మన్మనాభవగా ఉండేవారి గుర్తులు ఏవి?
జవాబు :- పూర్తి జ్ఞాన
సారమేమంటే - ఇప్పుడు మనము వాపసు ఇంటికి వెళ్లాలి. ఇది ఛీ - ఛీ (పాడైపోయిన)
ప్రపంచము. దీనిని వదలి మనము మన ఇంటికి వెళ్లాలి. ఇది గుర్తున్నా మన్మనాభవగా
ఉన్నట్లే. మన్మనాభవగా ఉండే పిల్లలు సదా జ్ఞానాన్ని విచార సాగర మథనము
చేస్తూ ఉంటారు. వారు బాబాతో మధురాతి మధురంగా ఆత్మిక సంభాషణ చేస్తారు.
ప్రశ్న :- ఏ అలవాటుకు వశీభూతమైన ఆత్మ
తండ్రి స్మృతిలో ఉండలేదు ?
జవాబు :- అశుద్ధమైన చిత్రాలను చూసే
అలవాటు ఉన్నా, అశుద్ధమైన సమాచారము చదివే అలవాటు ఉన్నా తండ్రి స్మృతి ఉండదు. సినిమా
నరకానికి ద్వారము. అది మానసిక వృత్తులను పాడు చేస్తుంది.
ఓంశాంతి. ఆత్మిక తండ్రి
కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. తక్కువ తెలివి ఉన్నవారికే
అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు చాలా తెలివి గలవారిగా అయ్యారు. వీరు మా
అనంతమైన తండ్రే కాక అనంతమైన శిక్షణ కూడా ఇస్తున్నారని మీరు అర్థం
చేసుకున్నారు. సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తారు.
విద్యార్థుల బుద్ధిలో జ్ఞానముండాలి కదా. తర్వాత మళ్లీ తండ్రి తన జతలో కూడా
తప్పకుండా తీసుకెళ్తారు. ఎందుకంటే ఇది పాడైపోయిన పాత ప్రపంచమని తండ్రికి
తెలుసు. ఈ పాత ప్రపంచము నుండి నేను పిల్లలను ఇంటికి తీసుకెళ్లేందుకు
వచ్చాను. బాబా అర్థం చేయిస్తున్నారు - ఇచ్చట కూర్చుంటూ కూర్చుంటూ పిల్లల
మనసులలో తప్పకుండా ఇలా వస్తూ ఉంటుంది - ఓహో! వీరు మా అనంతమైన తండ్రే కాక
మాకు చాలా శ్రేష్ఠమైన శిక్షణ కూడా ఇస్తారు. మొత్తము రచన యొక్క ఆదిమధ్యాంతాల
రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. ఇవన్నీ స్మృతి చేయడం కూడా మన్మనాభవయే.
ఇది కూడా మీ చార్టులోకి రాగలదు. ఇది చాలా సులభము. ఇంకేమీ చేయకపోయినా
కూర్చుంటూ - లేస్తూ - నడుస్తూ - తిరుగుతూ బుద్ధిలో ఇది గుర్తుండాలి.
అద్భుతమైన వస్తువును స్మృతి చేయవలసి ఉంటుంది. తండ్రిని స్మృతి చేసినందున
తండ్రి చెప్పిన చదువు చదువుకున్నందున మనము మళ్లీ విశ్వానికి యజమానులుగా
అవుతామని మీకు తెలుసు. ఇది బుద్ధిలో నడుస్తూ ఉండాలి. మీరు బస్సు, రైలు
మొదలైనవాటిలో కూర్చొని ఎక్కడికి వెళ్తున్నా బుద్ధిలో స్మృతి ఉండాలి.
మొట్టమొదట పిల్లలకు తండ్రి కావాలి. ఆత్మలైన మనకు, వారు సర్వాత్మల ఆత్మిక
అనంతమైన తండ్రి అని మీకు తెలుసు. సులభంగా గుర్తు వచ్చేందుకు బాబా యుక్తులను
తెలిపిస్తున్నారు. నన్నొక్కరినే స్మృతి చేస్తే మీరు అర్ధకల్పము నుండి
చేసిన వికర్మలన్నీ యోగాగ్ని ద్వారా భస్మమైపోతాయి. జన్మ-జన్మాంతరాలుగా యజ్ఞ,
జపతపాదులు అనేకము చేశారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో భక్తిమార్గము వారికి
తెలియదు. వీటి ద్వారా ఏ ప్రాప్తి జరుగుతుందో కూడా వారికి తెలియదు.
మందిరాలకు వెళ్తారు. ఎంతో భక్తి చేస్తారు. ఇవన్నీ పరంపర నుండి కొనసాగుతూ
వస్తున్నాయని భావిస్తారు. శాస్త్రాలు కూడా పరంపర నుండి వస్తున్నాయని
అంటారు. స్వర్గములో శాస్త్రాలు ఉండనే ఉండవని మనుష్యులకు తెలియదు. సృష్టి
ప్రారంభము నుండే ఇవన్నీ కొనసాగుతూ వస్తున్నాయని వారు భావిస్తారు. అనంతమైన
తండ్రి ఎవరో కూడా వారు ఎవ్వరికీ చెప్పలేరు. ఇచ్చట హద్దు తండ్రి గాని, హద్దు
టీచరు గాని లేరు. హద్దు టీచరు ద్వారా అయితే మీరందరూ చదువుకున్నారు.
చదువుకున్న తర్వాతనే ఉద్యోగము మొదలైనవి చేస్తారు, సంపాదిస్తారు. మన అందరి
అనంతమైన తండి ఎవరైతే ఉన్నారో వారికి తండి లేరని, వారు మనకు అనంతమైన టీచరు
కూడా అయినారని పిల్లలైన మీకు తెలుసు, వీరికి టీచరు కూడా ఎవ్వరూ లేరు. ఈ
దేవతలను ఎవరు చదివించారో వారు తప్పకుండా గుర్తు రావాలి కదా! ఇది కూడా
మన్మనాభవయే. ఈ చదువును ఎక్కడ నుండీ చదవలేదు. ఎందుకంటే తండ్రే స్వయంగా
జ్ఞానసాగరులు. వీరిని ఎవరైనా చదివించారా? మానవ సృష్టికి వారు బీజరూపులు,
చైతన్యమైనవారు, జ్ఞానసాగరులు. చైతన్యమైనందున మానవ సృష్టి రూపి వృక్ష
రహస్యమును ఆది నుండి అంత్యము వరకు వినిపిస్తారు. చివరి సమయములో వచ్చి ఆది
సమయపు జ్ఞానము వినిపిస్తారు. వారంటున్నారు ఓ పిల్లలారా! నేను ఏ శరీరములో
విరాజమానమై ఉన్నానో, ఇతని ద్వారా నేను ఆది నుండి ఈ సమయము వరకు సర్వమూ
వినిపిస్తాను. అంతము గురించి అయితే తర్వాత వినిపిస్తాను. పోను పోను ఇది
అంతిమ సమయమని మీరు అర్థము చేసుకుంటారు, ఎందుకంటే ఆ సమయానికి మీరు కర్మాతీత
అవస్థకు చేరుకుంటారు. అంతేకాక ఈ పాత ఛీ - ఛీ ప్రపంచము వినాశనము అవ్వనే
అవుతుందని సూచనలు కూడా చూస్తారు. ఇది కొత్త విషయమేమీ కాదు. అనేకసార్లు
చూశారు. ఇక మీదట కూడా చూస్తూ ఉంటారు. కల్పక్రితము రాజ్యము తీసుకున్నారు.
మళ్లీ పోగొట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ తీసుకుంటున్నారు. బాబా మనలను
చదివిస్తారు. మనమే విశ్వానికి అధిపతులుగా ఉండేవారమని తర్వాత 84 జన్మలు
తీసుకున్నామని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ విశ్వానికి అధిపతులుగా
తయారు చేసేందుకు బాబా అదే జ్ఞానాన్ని ఇస్తున్నారని బాబా టీచరు కూడా అని
మీరు లోలోపల అర్థము చేసుకున్నారు. అచ్ఛా ఒకవేళ తండ్రి గుర్తుకు రాకుంటే
టీచరును స్మృతి చేయండి. టీచరును ఎప్పుడైనా మర్చిపోతారా? టీచరు ద్వారా
చదువుకుంటూ ఉంటారు. అయితే మాయ ఏమారుస్తుంది. అది మీకు తెలియనే తెలియదు. మాయ
ఒక్కసారిగా కళ్లలో దుమ్ము చల్లుతుంది. దాని వలన భగవంతుడు మనలను
చదివిస్తున్నారని పూర్తిగా మర్చిపోతారు. తండ్రి ప్రతి విషయాన్ని బాగా
వివరిస్తారు. ఇది అనంతమైన జ్ఞానము, వారిది హద్దు జ్ఞానము. ఈ బేహద్
జ్ఞానాన్ని బాబా కల్ప-కల్పము పిల్లలైన మీకు ఇస్తారు. అచ్ఛా. ఎక్కువగా
చదవలేకపోతే భలే వారిని తండ్రి రూపములో స్మృతి చేయండి. వారికి ఏ తండ్రీ లేరు
ఎందుకంటే వారే సర్వులకు తండ్రి. అందరూ వారి పిల్లలే. శివబాబా ఎవరి కొడుకో
ఎవరైనా చెప్పగలరా? వారు అనంతమైన తండ్రి, మేము అనంతమైన తండ్రివారిగా
అయ్యామని పిల్లలకు అర్థము చేసుకున్నారు. మన ఈ చదువు కూడా అద్భుతమైనది.
బ్రాహ్మణులైన మనము మాత్రమే ఈ చదువును చదువుకుంటాము. దేవతలు లేక
క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఈ చదువును చదవలేరు. తండ్రి తెలిపే ఈ
జ్ఞానము పూర్తిగా భిన్నమైనది. మీరు తప్ప ఇతరులెవరూ అర్థము చేసుకోలేరు.
పిల్లలైన మీ ఖుషీ పాదరసము మీటరు పైకి ఎక్కాలి. ఎందుకంటే మనము తమోప్రధానము
నుండి సతోప్రధానంగా అయ్యాము. ఇప్పుడు ఉన్నత పదవి పొందేందుకు పురుషార్థము
చాలా బాగా చేయాలి. అంతేకాని స్వర్గములోకి అయితే అందరూ వస్తారు కదా అని
అనుకోరాదు. జ్ఞాన-యోగాలు ధారణ జరగకుంటే ఉన్నతమైన పదవి లభించదు.
బాబా అంటున్నారు - 16 కళా సంపూర్ణంగా అవ్వడంలో స్మృతి చేయు శ్రమ ఉంది. ఎవ్వరికీ దు:ఖము ఇవ్వలేదు కదా? అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. మనము సుఖదాత పిల్లలము. అందరికీ సుఖమునే ఇవ్వాలి. మనసా, వాచా, కర్మణా ఎవ్వరికీ దు:ఖమునివ్వరాదు. ఈ సమయములో ఎవరైతే చదువుకుంటారో, వారు సుగంధ భరిత పుష్పాలుగా అవుతారు. మీ వెంట వచ్చేది ఈ సంపాదనే. ఇందులో ఏ పుస్తకాలు మొదలైనవి చదవవలసిన అవసరమే లేదు. ఆ చదువులో ఎన్నో పుస్తకాలు మొదలైనవి చదవవలసి వస్తుంది. బాబా చెప్పిన ఈ జ్ఞానము అన్నిటికంటే భిన్నమైనది. అంతేకాక సులభమైనది కూడా. కాని ఇదంతా గుప్తము. మీరు ఏం చదువుతున్నారో మీరు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇది అద్భుతమైన చదువు. తండ్రి అంటున్నారు - ఎప్పుడూ ఆబ్సెంటు అవ్వరాదు. చదువును ఎప్పుడూ వదలరాదు. బాబా వద్ద అందరి రిజిస్టరు ఉంటుంది. ఆ రిజిస్ట్టరు ద్వారా ఇతడు పది మాసాలు ఆబ్సెంటు, ఇతడు ఆరు మాసాలు ఆబ్సెంటు అని బాబా తెలుసుకుంటారు. కొంతమంది నడుస్తూ - నడుస్తూ చదువు కూడా వదిలేస్తారు. ఇది చాలా అద్భుతమైనది. ఇటువంటి అద్భుతమైన వస్తువు మరొకటేదీ ఉండదు. కల్ప-కల్పము పిల్లలైన మిమ్ములను ఇటువంటి తండ్రి వచ్చి కలుసుకుంటారు. ఈ సాకార బాబా అయితే పునర్జన్మలోకి వస్తారని పిల్లలైన మీకు తెలుసు. ఇతడు 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశాడు. తతత్వమ్(మీరు కూడా అలాగే తిరుగుతారు) ఇది ఆట కదా. ఆటను ఎప్పుడూ మర్చిపోరు. ఆట సదా గుర్తుంటుంది.
బాబా అర్థం చేయిస్తున్నారు - ఒకటేమో ఈ ప్రపంచము నరకంగా ఉంది. దానిలోనూ ముఖ్యంగా సినిమాలు నరక కూపాలు. అక్కడకు వెళ్లి సినిమాలు చూచినందున వృత్తులు(భావాలు) ఎంతో పాడైపోతాయి. వార్తాపత్రికలలో కూడా ఎవైనా మంచి-మంచి అందమైన చిత్రాలు చూస్తే అందులోకిి కూడా బుద్ధి పోతుంది - వీరు అందముగా ఉన్నారు, వీరికి బహుమతి లభించాలి. ఇటువంటి ఆలోచనలు నడుస్తాయి. అటువంటి చిత్రాలు అసలు ఎందుకు చూడాలి? ఈ మొత్తం ప్రపంచమే సమాప్తము అవ్వనున్నదని బుద్ధి ద్వారా తెలుసుకున్నారు. మీరు కేవలం నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. ఇటువంటి వస్తువులను చూడకండి. వాటిని గురించి ఆలోచించకండి. ఇవి పాత ప్రపంచములోని ఛీ-ఛీ(మురికి) శరీరాలు, వాటి వైపు చూసే పని ఏముంది? ఒక్క తండ్రిని మాత్రమే చూడాలి. బాబా అంటున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా! గమ్యము చాలా ఉన్నతమైనది. మాయ తక్కువైనదేమీ కాదు. మాయ ఆడంబరాలు, అట్టహాసము ఎంతగా ఉందో చూడండి. ఆ వైపు సైన్సు, ఇటువైపు మీ సైలెన్సు ఉంది. వారు ముక్తిని పొందాలనుకుంటారు. ఇచ్చట మీ లక్ష్యము జీవన్ముక్తిని పొందుకోవడం. జీవన్ముక్తి పొందు దారిని ఎవ్వరూ తెలపలేరు. సన్యాసులు మొదలైనవారెవ్వరూ ఈ జ్ఞానమునివ్వలేరు. గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రంగా ఉండమని వారు ఎవ్వరికీ అర్థము చేయించలేరు. ఇలా అర్థము చేయించేవారు తండ్రి ఒక్కరు మాత్రమే. భక్తి మార్గములో సమయము వృథా అవుతూనే వచ్చింది. ఎన్ని తప్పులు(భూలే) చేస్తూ ఉంటారు! తప్పులు చేస్తూ చేస్తూ భోలాగా(అమాయకంగా) అయిపోయారు. ఈ చివరి జన్మ నూరు శాతము తప్పుల తడికగా ఉంది. కొద్దిగా కూడా బుద్ధి పని చేయదు. ఇప్పుడు బాబా మీకు అర్థం చేయిస్తున్నారు, అందుకే మీరు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు అన్నీ అర్థం చేసుకున్నారు. కావున ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. సంతోష పాదరస మట్టము కూడా మీకే పైకి ఎక్కుతుంది. ఇది అద్భుతము కదా - ఈ తండ్రికి తన తండ్రి అంటూ ఎవ్వరూ లేదు. శిక్షకులు కూడా ఎవ్వరూ లేరు. అయితే వీరు ఎక్కడి నుండి నేర్చుకున్నారు? మనుష్యులు ఆశ్చర్యపడ్తారు. తప్పకుండా వారికి ఎవరో గురువు ఉంటారని చాలామంది భావిస్తారు. ఒకవేళ వీరు కూడా గురువు నుండి నేర్చుకొని ఉంటే ఆ గురువుకు ఇంకా వేరే శిష్యులు కూడా ఉండాలి కదా. కేవలం ఈ ఒక్క శిష్యుడు మాత్రమే ఉండడు. గురువుకైతే శిష్యులు చాలామంది ఉంటారు. ఆగాఖాన్‌కు ఎంతమంది శిష్యులో చూడండి. వారు గురువును ఎంత గౌరవిస్తారో చూడండి. వారిని వజ్రాలతో తులాభారము చేశారు. మీరు దేనితో తూకము వేస్తారు? వీరేమో అందరికంటే సుప్రీమ్(అత్యంత ఉన్నతమైనవారు). వీరి బరువు ఎంత ఉంటుంది? మీరు ఏమి చేస్తారు! తూకము వేస్తే ఎంత బరువు ఉంటాడు? ఏదైనా వస్తువు వీరిని తూచగలదా? శివబాబా ఏమో బిందువు కదా. ఈ రోజులలో అలా చాలా మందిని తూచుతూ ఉంటారు. కొందరు బంగారముతో, కొందరు వెండితో, కొందరు ప్లాటినమ్‌తో కూడా తూచుతారు. ప్లాటినమ్ బంగారు కంటే ఖరీదైనది. ఆ దేహ సంబంధమైన గురువులు మీకు సద్గతిని ఇవ్వలేరని తండ్రి అర్థం చేయిస్తారు. సద్గతిలోకి తీసుకెళ్ళేవారు ఒక్క తండ్రి మాత్రమే అని అర్థం చేయిస్తున్నారు. మరి వారిని దేనితో తులాభారము చేస్తారు? మనుష్యులైతే కేవలం భగవంతుడా, భగవంతుడా! అని అంటూ ఉంటారు. కానీ ఆ తండ్రి శిక్షకుడు కూడా అని వారికి తెలియదు. వారు ఎంత సాధారణంగా కూర్చొని ఉన్నారో చూడండి. పిల్లల ముఖాన్ని చూచేందుకు కొంచెము పైన కూర్చుంటారు. సహాయకారులైన పిల్లలు లేకుండా నేను స్థాపన ఎలా చేయగలను? ఎవరు ఎక్కువగా సహాయము చేస్తారో వారిని బాబా తప్పకుండా ప్రేమిస్తారు. లౌకికములో కూడా ఒక కొడుకు 2 వేలు సంపాదిస్తాడు. మరొకరు వేయి రూపాయలే సంపాదించవచ్చు. మరి ఆ తండ్రికి ఎవరి పై ఎక్కువ ప్రేమ ఉంటుంది. కాని ఈ రోజులలో అసలు పిల్లలు తండ్రిని ఎక్కడ లెక్కపెడ్తున్నారు? అనంతమైన తండ్రి కూడా ఫలానా - ఫలానా పిల్లలు చాలా మంచి సహాయకులని గమనిస్తారు. పిల్లలను చూస్తూ చూస్తూ బాబా హర్షితమౌతారు. ఆత్మ సంతోషిస్తుంది. నేను కల్ప-కల్పము వస్తాను. పిల్లలను చూచి చాలా సంతోషిస్తాను. కల్ప-కల్పము ఈ పిల్లలు నాకు సహాయకారులుగా అవుతారని తెలుసు. ఈ బాబా ప్రేమ కల్ప-కల్పానికి నిశ్చయమైపోతుంది. ఎక్కడ కూర్చొని ఉన్నా బుద్ధిలో ఇలా ఆలోచించండి - ఈ తండ్రి మాకు తండ్రే కాక టీచరు కూడా అయ్యారు, గురువు కూడా అయ్యారు. స్వయం వారే మాకు సర్వస్వము, అందుకే అందరూ వారినే స్మృతి చేస్తారు. సత్యయుగములో ఎవ్వరూ స్మృతి చేయరు. ఎందుకంటే బాబా 21 జన్మలకు నావను ఆవలి తీరానికి చేరుస్తారు. ఈ విధంగా స్మరిస్తూ స్మరిస్తూ పిల్లలు హర్షితమవ్వాలి. మేము ఇటువంటి తండ్రి సేవను చేయాలని సంతోషము కలగాలి. అందరికీ తండ్రి పరిచయమునివ్వాలి. వీరు అనంతమైన తండ్రి, ఈ తండ్రియే స్వర్గ స్థాపన చేస్తారు. మనందరినీ తన వెంట కూడా తీసుకెళ్తారు. ఈ విధంగా అర్థము చేయిస్తే సర్వవ్యాపి అని అనలేరు. '' వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి '' అని తండ్రి చెప్పారు. వారందరూ సమాప్తమైపోతారు. పోతే మిగిలిన మీరు విజయము పొందుతారు. మీరు రాజధానిని స్థాపన చేస్తున్నారు. ఆత్మల తండ్రి కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఇటువంటి అద్భుతమైన విషయాలు మీరు అందరికీ వినిపించాలి. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మనము సుఖదాత పిల్లలము, అందరికీ సుఖమునివ్వాలి. మనసా, వాచా, కర్మణా ఎవ్వరికీ దు:ఖమునివ్వరాదు.
2. చదువు మరియు
చదివించేవారు ఇరువురూ అద్భుతమైనవారు. ఇటువంటి అద్భుతమైన చదువును ఎప్పుడూ
మిస్ చేయరాదు. గైర్హాజరు(ఆబ్స్‌౦టు) అవ్వరాదు.
వరదానము :- '' జతలో ఉంటాము, జతలో జీవిస్తాము..... ఈ ప్రతిజ్ఞను స్మృతిలో ఉంచుకొనుట ద్వారా కంబైండుగా (సంయుక్తంగా) ఉండే సహజయోగీ భవ ''
పిల్లలైన మీరు
జతలో ఉంటాము, జతలో జీవిస్తాము, జతలో నడుస్తాము......... ఈ ప్రతిజ్ఞను
స్మృతిలో ఉంచుకొని బాప్ ఔర్ ఆప్(తండ్రి మరియు మీరు) కంబైండు రూపంలో
ఉండండి. ఈ స్వరూపాన్ని సహజయోగి అని అంటారు. యోగము జోడించేవారు కాదు, సదా
కంబైండుగా అనగా జతలో ఉండేవారు, ఈ విధంగా జతలో ఉండేవారే నిరంతర యోగులు. సదా
సహయోగులు ఎగిరే కళలో వెళ్లే ఫరిస్తాలుగా అవుతారు.
స్లోగన్ :- ''ప్రశ్నార్థక (ప్రశ్నించే) వంకర మార్గాన్ని తీసుకునేందుకు బదులు కళ్యాణము చేసే బిందువును ఉంచడమే కళ్యాణకారులుగా అవ్వడం.''
No comments:
Post a Comment