23-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
''మధురమైన
పిల్లలారా - మీరు అత్యంత భాగ్యశాలీ పిల్లలు ఎందుకంటే మీ సన్ముఖములో
స్వయంగా తండ్రియే ఉన్నారు, వారే మీకు తెలిపిస్తున్నారు''
ప్రశ్న :- భక్తిమార్గములోని ఏ సంస్కారము ఇప్పుడు పిల్లలైన మీలో ఉండజాలదు, ఎందుకు?
జవాబు :- భక్తిమార్గములో
ఏ దేవీ దేవతల వద్దకు వెళ్ళినా వారిని ఏదో ఒకటి యాచిస్తూనే ఉంటారు, ఒకరిని
ధనమివ్వమని వేడుకుంటారు, ఒకరిని పుత్రుని ప్రసాదించమని అడుగుతారు - ఈ
యాచించే (అడుక్కునే) సంస్కారము ఇప్పుడు పిల్లలైన మీలో ఉండరాదు, ఎందుకంటే
తండ్రి మిమ్ములను ఈ సంగమయుగములో కామధేనువుగా తీర్చిదిద్దారు(చేశారు). మీరు
తండ్రి సమానంగా అందరి మనోకామనలను పూర్తి చేసేవారు. మీరు స్వయం కొరకు ఏ ఆశలూ
ఉంచుకోరాదు. ఫలమునిచ్చువారు దాత అయిన ఒక్క తండ్రి మాత్రమేనని మీకు తెలుసు.
వారిని స్మృతి చేయడం వలన సకల ప్రాప్తులు లభిస్తాయి. అందువలన యాచించే
సంస్కారాలు సమాప్తమైపోతాయి.
పాట :- ఓంనమ: శివాయ.........................
ఓంశాంతి. భగవానువాచ!
ఇప్పుడు బాగా అర్థము చేసుకొని మళ్లీ అర్థము చేయించేందుకు ఒక్క గీతా
శాస్త్రము మాత్రమే ఉంది. శాస్త్రాలను మనుష్యులే తయారు చేశారు, కాని
రాజయోగాన్ని మనుష్యులు నేర్పించలేరు. తండ్రి అంటున్నారు - 5 వేల సంవత్సరాల
క్రితము కూడా అపురూపమైన భారతవాసి పిల్లలైన మీకు రాజయోగము నేనే నేర్పించాను.
అపురూపమంటే అర్థము మీకు అర్థం చేయించాను. మీరే 84 జన్మలు పూర్తిగా
తీసుకున్న తర్వాత మళ్లీ వచ్చి నన్ను కలిశారు. 5 వేల సంవత్సరాల క్రితము కూడా
మీరు కలిశారు. మీరు వచ్చి బ్రహ్మ ముఖవంశావళి అనగా బ్రాహ్మణ -
బ్రాహ్మణీలుగా అయ్యారు. తండ్రి డైరెక్టు(నేరు)గా చెప్తున్నారు - ఆ గీతా
పారాణయము మొదలైనవి చేయువారు ఇలా మాట్లాడరు. తండ్రి నేరుగా అర్థం చేయించి
వెళ్ళిపోయారు, మళ్లీ భక్తిమార్గము నుండి శాస్త్రాలను తయారు చేస్తారు.
ఇప్పుడు డ్రామా పూర్తవుతుంది, మళ్లీ తండ్రి వచ్చారు. వారు పిల్లలతో
చెప్తున్నారు - ఏ పిల్లలకు? ప్రత్యేకించి మీకు మరియు మొత్తం ప్రపంచమంతటికి
చెప్తున్నాను. ఇప్పుడు మీరు సన్ముఖములో ఉన్నారు. బాబా కూర్చుని మీకు తమ
పరిచయమునిచ్చారు. ఈ రాజయోగమును మీకు ఇతరులెవ్వరూ నేర్పించలేరు. తండ్రియే
ఇంతకు ముందు మీకు రాజయోగాన్ని నేర్పించారు, ఇప్పుడు మళ్లీ
నేర్పిస్తున్నారు. దీని ద్వారా మీరు మళ్లీ రాజాధి రాజులుగా అవుతారు.
ఇతరులెవ్వరు కూడా స్వర్గాధికారులుగా అవ్వలేరు. నేను మీ తండ్రిని, మీకు
మళ్లీ రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చాను. అచ్ఛా. ఇప్పుడు బాబా మీకు
కల్పవృక్షము గురించి అర్థం చేయిస్తారు. ఈ జ్ఞానము కూడా చాలా అవసరము, దీనిని
కల్పవృక్షమని అంటారు. తండ్రి అంటున్నారు - ఈ మనుష్య సృష్టి రూపి వృక్షమే
కల్పవృక్షము. ఆ గీతను(భక్తిమార్గము) వినిపించేవారు భగవంతుడు ఇలా అన్నాడు
అని అంటారు, కాని మీరు భగవంతుడు ఇలా చెప్తున్నారు (అంటే వర్తమానములో) అని
అంటారు. ఇది మనుష్యసృష్టి రూపి వృక్షము. ఇందులో ఫలాలు, మామిడి పండ్లు
మొదలైనవి ఏవీ లేవు. ఆ ఫల వృక్షాలలో బీజము క్రింద భూగర్భములో ఉంటుంది,
వృక్షము పైకి విస్తరించి ఉంటుంది. కాని దీని బీజము పైన ఉంటుంది, వృక్షము
క్రింద ఉంది. ఈశ్వరుడు మనలను సృష్టించారని కూడా అంటారు. అనగా
తండ్రి(శివబాబా) పిల్లలను ఇచ్చారు, తండ్రియే ధనమునిచ్చారని అంటారు. ఓ
తండ్రీ! మీరు మా దు:ఖాలను దూరం చేయండి అని అంటారు. బాబా - బాబా అని అంటూ
ఉంటారు. ఎంత అశాంతి ఉంటుంది! లక్ష్మీనారాయణుల సన్ముఖములోకి వెళ్తారు.
వారితో '' హే మహాలక్ష్మీ దేవీ మాకు ధనాన్ని ప్రసాదించు'' అని వేడుకుంటారు.
ఇవన్నీ యాచించే సంస్కారాలు. జగదంబ వద్ద కొంతమంది పుత్రులను ప్రసాదించమని
అడుగుతారు, కొంతమంది మా రోగాలను దూరం చేయండి అని ప్రార్థిస్తారు. లక్ష్మీ
ముందు ఇటువంటి ఆశలను పెట్టుకోరు, వారి వద్ద కేవలం ధనాన్ని అడుక్కుంటారు.
జగదంబయే లక్ష్మి. ఆమె 84 జన్మల చక్రములో తిరిగి మళ్లీ జగదంబగా అవుతుందని
మీకు తెలుసు. వృక్షములో జగదంబ కూర్చొని ఉంది, గమనించండి. ఆమె మళ్లీ
తప్పకుండా మహారాణిగా అవుతుంది. పిల్లలైన మీరు కూడా రాజధానిలో వస్తారు. మీరు
కల్పవృక్షము క్రింద కూర్చొని ఉన్నారు, సంగమ యుగములో పునాదిని
వేస్తున్నారు. కామధేనువు పిల్లలైన మీరే అందరి మనోకామనలను పూర్తి చేసేవారు.
మీరు భారతమాత శక్తి సైన్యము, ఇందులో పాండవులు కూడా ఉన్నారు.
ఒక్క బాబానే స్మృతి చేయాలని పిల్లలకు అర్థం చేయించబడింది. ఎందుకంటే ఇచ్చేవారు ఒక్క తండ్రియే. భలే మీరు ఎవరినైనా భక్తి చేయండి, ఎవరినైనా స్మృతి చేయండి కాని ఫలితమునిచ్చేవారు ఒక్క దాత అయిన తండ్రి మాత్రమే. వారే సర్వమూ(అన్నీ) ఇస్తారు. భక్తిమార్గములో మీరు నారాయణుని, కృష్ణుని పూజిస్తారు, కృష్ణుని ఊయలలో కూడా ఊపుతారు. అతడిని ప్రేమిస్తారు. అతని నుండి మీరు ఏమి కోరుకుంటారు? మేము వారి రాజధానిలోనికి వెళ్లాలి లేక మాకు కృష్ణుని వంటి పుత్రుడు లభించాలని కోరుకుంటారు. భజో రాధే గోవింద చలో బృందావన్(రాధా - గోవిందులను భజించండి, బృందావనానికి పదండి) అని పాట పాడుతూ భజన చేస్తారు. అక్కడ వైకుంఠములో రాజ్యపాలన చేసేవారు. ఆ సమయములో అప్రాప్తి అనే వస్తువు ఏదీ ఉండదు. కృష్ణుని రాజ్యాన్ని ఎంతగానో స్మృతి చేస్తూ ఉంటారు. భారతదేశములో కృష్ణుని రాజ్యమున్నప్పుడు ఏ ఇతర రాజ్యాలు లేవు. ఇప్పుడు తండ్రి వచ్చి అంటున్నారు - కృష్ణపురములోనికి పదండి, అచ్చటికి వెళ్ళి కృష్ణునికి పత్నిగా అవ్వండి లేక రాధకు పతిగా అవ్వండి. విషయము ఒక్కటే అని బాబా అంటారు, అచ్చట విషము లభించదు. అది సంపూర్ణ నిర్వికారి ప్రపంచము, ఇప్పుడు మీరు విద్యార్థులుగా ఉన్నారు. నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు భికారి నుండి రాకుమారునిగా తయారయ్యేందుకు చదువుకుంటున్నారు. ఇచ్చట భలే ఎవరైనా కోటీశ్వరులుగా ఉన్నా, 50 కోట్లు ఉన్నా మీ లెక్క(పోలిక)లో వారు పేదవారే ఎందుకంటే వారి ధనమంతా మట్టిలో కలిసిపోతుంది. ఏదీ వారి వెంట వెళ్ళదు, ఖాళీ చేతులతో వెళ్తారు. కాని మీరు 21 జన్మలకు చేతులు నింపుకొని వెళ్తారు. ఇప్పుడు మీరు రాజయోగము నేర్చుకుంటున్నారు. తర్వాత మళ్లీ సత్యయుగములోకి వెళ్లి రాజ్య పాలన చేస్తారు. మీరు పునర్జన్మలు తీసుకుంటూ వర్ణాలలోకి వస్తూ ఉంటారు, సత్యయుగములో 16 కళలు, త్రేతాలో 14 కళలు ఉంటాయి. తర్వాత మళ్లీ భక్తిమార్గము ప్రారంభమౌతుంది. ఆ తర్వాత ఇబ్రహిమ్, బుద్ధుడు వస్తారు. ఏసుక్రీస్తుకు 3 వేల సంవత్సరాల క్రితము దేవీ దేవతల రాజ్యముండేది. ఇప్పుడు మొత్తం వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడు మీరు కల్పవృక్షము క్రింద సంగమ యుగములో కూర్చొని ఉన్నారు. దీనిని కల్పము యొక్క సంగమ సమయము లేక కలియుగము - సత్యయుగాల సంగమ సమయమని అంటారు. సత్యయుగము తర్వాత త్రేతా యుగము, త్రేతా తర్వాత ద్వాపర యుగము తర్వాత కలియుగపు సంగమ సమయము. కలియుగము తర్వాత మళ్లీ తప్పకుండా సత్యయుగము వస్తుంది. మధ్యలో తప్పకుండా సంగమ యుగము ఉండాలి. కల్పము యొక్క సంగమ యుగములో తండ్రి వస్తారు. వారేమో కల్పమనే పదము మార్చి కేవలము యుగే - యుగే అని వ్రాసేశారు. తండ్రి అంటున్నారు - నేను నిరాకార పరమపిత పరమాత్మను, జ్ఞానసాగరుడను. భారతదేశములోనే శివజయంతి గాయనము చేయబడ్తుంది. కృష్ణుడైతే జ్ఞానమివ్వలేడు. గుర్రపుబండిలో కేవలం కృష్ణుని చిత్రము మాత్రమే చూపించారు. కాని కృష్ణుడు వచ్చేది ఎప్పుడు? ద్వాపర యుగములో ఎలా వస్తాడు? మీరేమో స్వర్గములో కృష్ణుని జతలో ఉంటామని అంటారు. తండ్రి అంటున్నారు - భక్తిమార్గములో మీకు కృష్ణుని సాక్షాత్కారము చేయించేది నేనే. కృష్ణజయంతి నాడు చాలా ప్రేమతో అతడిని ఊయలలో ఊపుతారు, పూజ చేస్తారు. వారికి సత్య-సత్యమైన కృష్ణుడు కనిపించినట్లు ఉంటుంది, కృష్ణుని సాక్షాత్కారము అవుతుంది. కృష్ణుని చిత్రము వారి ముందు ఉంటే ఆ చిత్రమును కూడా ప్రేమతో కౌగలించుకుంటారు. భక్తిమార్గములో సహాయము చేసేది నేనే, దాతను నేనే. లక్ష్మిని పూజిస్తారు, కాని నిజానికి అది కేవలం రాతి విగ్రహము మాత్రమే. ఆ విగ్రహము ఏమిస్తుంది? మళ్లీ నేనే ఇవ్వవలసి వస్తుంది, సాక్షాత్కారము కూడా నేనే చేయిస్తాను. ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయ్యి ఉంది. పరమపిత పరమాత్మ ఆజ్ఞ లేనిదే ఆకు కూడా కదలదు, వారి ఆజ్ఞానుసారమే ఆకు-ఆకు కదులుతుంది అని అంటారు ఎందుకంటే ఆకు-ఆకులో పరమాత్మ ఉన్నాడని వారు భావిస్తారు. పరమాత్మ కూర్చొని ఒక్కొక్క ఆకును కదలమని ఆజ్ఞాపిస్తారా? ఇది తయారైన డ్రామా, ఇప్పుడు మీరు ఏ విధంగా నటిస్తున్నారో కల్పము తర్వాత కూడా మీరు ఇదే విధంగా నటిస్తారు. షూటింగులో ఏది షూట్ చేయబడిందో అదే కొనసాగుతుంది. అందులో కొంచెము కూడా తేడా రాజాలదు. డ్రామాను కూడా బాగా అర్థము చేసుకోవాలి. అనంతమైన సుఖము కల్ప-కల్పము భారతదేశానికే లభిస్తుందని తండ్రి అర్థం చేయిస్తున్నారు. కాని ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో, వారే వర్ణాలలోకి వస్తారు. వారే 84 జన్మలు తీసుకుంటారు. ఇతరుల జన్మలు నంబరువారుగా తగ్గిపోతూ వస్తాయి. ఎన్నో చిన్న చిన్న మఠాలు, మార్గాలు ఉన్నాయి. భలే వారికి మహిమ ఉండవచ్చు ఎందుకంటే పవిత్రంగా ఉంటారు. స్వర్గాన్ని రచించినవారు తండ్రి, ఇతర మనుష్యులెవ్వరూ స్వర్గాన్ని రచించలేరు. మనుష్యులు స్వర్గాన్ని రచించగలిగినట్లయితే రాజయోగాన్ని కూడా ఎవరైనా నేర్పించనీ చూస్తాము (ఎవరూ నేర్పలేరు).
ఇప్పుడు మీరు కృష్ణపురములోకి వెళ్లేందుకు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. పురుషార్థము ఎల్లప్పుడూ ఉన్నతంగా చేయాలి. కృష్ణుని వంటి పుత్రుడు లభించాలని, కృష్ణుని వంటి భర్త లభించాలని మీరంటారు. కృష్ణుడే నారాయణునిగా అవుతాడు. అయితే కృష్ణుని వంటి వారే కావాలని ఎందుకు అంటారు! మీరు నారాయణుని వంటి భర్త లభించాలని అనాలి కదా. నారదుడు కూడా లక్ష్మిని వరించాలని అన్నాడు, రాధను వరించాలని అనలేదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు కృష్ణపురములోకి వెళ్ళాలంటే పురుషార్థము బాగా చేయండి. అది కృష్ణుని దైవీకులము, కంసునిది రాక్షస కులము. మీరిప్పుడు సంగమ యుగములో ఉన్నారు. శూద్ర సంప్రదాయము వారు బ్రాహ్మణ - బ్రాహ్మణీలు అని అనిపించుకోలేరు. ఎవరైతే బ్రాహ్మణులుగా పిలవబడరో వారు శూద్ర వర్ణానికి చెందినవారు. ఇదంతా భారతదేశానికి సంబంధించిన విషయమే. భారతదేశమే స్వర్గముగా అవుతుంది, మళ్లీ భారతదేశమే నరకంగా అయిపోతుంది. లక్ష్మీనారాయణులు కూడా 84 జన్మలు తీసుకొని రజో, తమో గుణాలలోకి వచ్చే తీరాలి, వారు కూడా చక్రములోకి రావలసిందే. అలాంటప్పుడు బుద్ధుడు మొదలైనవారు నిర్వాణధామములోకి వాపసు ఎలా వెళ్ళగలరు? కొంతమంది అయితే కృష్ణుడు సర్వవ్యాపి అని అంటారు, ఎచ్చట చూసినా కృష్ణుడే కృష్ణుడు అని కూడా అంటారు. అదే విధంగా రాముని భక్తులు రాముడు సర్వవ్యాపి అని అంటారు, వారు కృష్ణుడిని అంగీకరించరు. బాబా వద్దకు ఒక రాధా భక్తుడు వచ్చాడు. ఎక్కడ చూచినా రాధయే రాధ......... రాధ సర్వవ్యాపి- అంతటా వ్యాపించి ఉంది. నీలోనూ, నాలోనూ, రాధయే రాధ ఉంది అని అనేవాడు. అలాగే గణేశుని పూజారి నీలో నాలో అంతటా గణేశుడే గణేశుడు......... అని అంటాడు. క్రైస్తవులు ఏసుక్రీస్తు దేవుని పుత్రుడని అంటారు. అరే! ఏసుక్రీస్తు దేవుని పుత్రుడైతే మరి నీవు ఎవరి కొడుకు? అనేక బేధాభిప్రాయాలున్నాయి, కాని మార్గము ఒక్కరికి కూడా లభించదు. కేవలం తల వంచి నమస్కరిస్తూ, పూజిస్తూ, అన్వేషిస్తూ అలమటిస్తూ ఉంటారు. ముక్తి-జీవన్ముక్తులను భగవంతుడే ఇస్తాడు కదా. వారిని మనం ఏమి అడగాలి? కొంతమందికి ఏమీ తెలియనే తెలియదు. తండ్రిని గూర్చి తెలియనందున అనాథలుగా అయిపోయారు. మళ్లీ ఆ భగవంతుడు(నాథుడు) వచ్చి వారి పిల్లలుగా సనాథలుగా తయారు చేస్తారు. మనుష్యులు ఎన్నో ఎదురుదెబ్బలు తింటారు. భక్తి వలన భగవంతుడు లభిస్తారని భావిస్తారు. తండ్రి అంటున్నారు - నేను నా సమయములో మాత్రమే వస్తాను. ఎవరు ఎంతగా పిలిచినా, నేను వచ్చేది సంగమ యుగములోనే. ఒక్కసారి మాత్రమే వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా తయారుచేసి అందరినీ శాంతిధామములోకి పంపిస్తాను మళ్లీ నంబరువారుగా తమ తమ సమయములో క్రిందికి వస్తారు. ఎవరైతే దేవీ దేవతలుగా ఉండేవారో ఆ ఆత్మలందరు కూడా ఇప్పుడు కూర్చొని ఉన్నారు. మళ్లీ తమ రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నారు. ఇప్పుడైతే దేవీ దేవతా ధర్మము లేనే లేదు. అందరూ స్వయాన్ని హిందువులని పిలిపించుకుంటున్నారు. డ్రామానుసారము మళ్లీ ఇలాగే జరుగుతుంది. ఏదైతే జరిగిపోయిందో అది మళ్లీ రిపీట్ అవుతుంది. మళ్లీ ఇదే విధంగా మనము చక్రములో వస్తాము, ఇన్ని జన్మలు తీసుకుంటాము. లెక్క తీయండి - ప్రతి ధర్మము వారు చివరిలో ఎన్ని జన్మలు తీసుకుంటారు? వృక్షము చిత్రము చూపించి అర్థము చేయించడం చాలా సులభము. ఎవరి ప్రేరణ ద్వారానో ఈ వినాశ జ్వాల తయారవుతూ ఉందని మనుష్యులకు దానంతటకదే టచ్ అవుతుంది. యూరప్‌లో నివసించు యాదవులు బాంబులు తయారు చేస్తారు, వారు కూడా మమ్ములను ప్రేరేపించేవారు ఎవరో ఉన్నారని అంటారు. వీటి ద్వారా మేము మా కులమునే వినాశనము చేసుకుంటామని కూడా మాకు తెలుసు అని కూడా అంటారు. కానీ అయిష్టముగానే(వద్దనుకున్నా) ఈ మృత్యువు సామాగ్రిని తయారు చేస్తారు. నెమ్మది నెమ్మదిగా ప్రభావము పడ్తుంది. వృక్షము నెమ్మది నెమ్మదిగా పెరుగుతుంది కదా. కొందరు ముళ్ళ నుండి మొగ్గలుగా, కొందరు పుష్పాలుగా అవుతారు. తుఫానులు వస్తే కొన్ని పుష్పాలు కూడా వాడిపోతాయి. బాబా కల్ప-కల్పము చెప్తారు - ఆశ్చర్యపడుతూ వింటారు, వర్ణిస్తారు...... ఇప్పుడు మళ్లీ బాబా స్వయం చెప్తున్నారు - నా వద్దకు వస్తారు, బ్రహ్మకుమార - కుమారీలుగా అవుతారు, వర్ణన చేస్తారు మళ్లీ ఓహో ఓ మాయా! మంచి మంచి పిల్లలను కూడా తినేస్తుంది, పోను పోను ఎటువంటి మంచి మంచి పిల్లలు కూడా సమాప్తమైపోతారో చూడండి.
ఏదైతే గతించిపోయిందో మళ్లీ దానిని వర్తమాన సమయములో తండ్రి అర్థం చేయిస్తున్నారు. మళ్లీ భక్తిమార్గములో శాస్త్రాలను తయారు చేస్తారు. ఈ డ్రామా ఈ విధంగా తయారు చేయబడి ఉంది. ఇప్పుడు తండ్రి వచ్చి బ్రహ్మ ద్వారా సర్వ వేద శాస్త్ర్రాల సారాన్ని అర్థం చేయిస్తున్నారు. ఎవరైతే ధర్మ స్థాపన చేస్తారో, వారి పేరు మీదనే శాస్త్రాలు తయారు చేస్తారు. దానిని ధర్మశాస్త్రమని అంటారు. దేవీ దేవతా ధర్మ శాస్త్రము ఒక్క గీత మాత్రమే. ప్రతీ ఒక్క ధర్మానికి ఒక శాస్త్రము ఉండాలి. శ్రీమద్భగవద్గీత సరి అయినది. అందులో భగవానువాచ అని ఉంది. భగవంతుడు ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపించారు. ఇది అన్నింటికంటే ప్రాచీనమైన ధర్మము. ప్రతీ ధర్మానికి తమ తమ శాస్త్రముంది. ఆ శాస్త్రమునే చదువుతూ ఉంటారు. ఇప్పుడు మీరు దేవతలుగా అవుతారు. కానీ మీకు శాస్త్రము చదివే అవసరము లేదు. అచ్చట శాస్త్రాలు ఉండనే ఉండవు. ఇవన్నీ సమాప్తమైపోతాయి. మరి గీత ఎక్కడ నుండి వస్తుంది? ద్వాపరములో మనుష్యులు కూర్చొని తయారు చేశారు. ఇప్పుడు ఏ గీత ఉందో మళ్లీ అదే గీతను వెతికి తీస్తారు. కల్పక్రితము ఎలాగైతే తయారు చేశారో మళ్లీ అదే విధంగా ఈ శాస్త్రాలు తయారౌతాయి. భక్తిమార్గపు సామగ్రి తయారౌతూనే ఉంటుంది.
తండ్రి అర్థం చేయిస్తున్నారు - అవురూపమైన పిల్లలారా! తండ్రి అయిన నా శ్రీమతమును అనుసరించి శ్రేష్ఠంగా తయారవ్వండి. ఇప్పుడు మీరు సంగమ యుగములో రాజయోగము నేర్చుకుంటున్నారు. ఇప్పుడు కలియుగాన్ని సత్యయుగంగా తయారు చేయాలి. వారు కల్పము యొక్క ఆయువును చాలా పెద్దదిగా చూపించి అందరినీ గాడాంధకారములో వేసేశారు. మనుష్యులైతే భ్రమించి, తికమక చెంది ఉన్నారు. డ్రామానుసారము పిల్లలైన మీరు మాత్రమే అనంతమైన తండ్రి నుండి వారసత్వము తీసుకోవాలి. బాబా చాలా యుక్తులు తెలిపించారు. కేవలం బాబాను స్మృతి చేయండి. చార్టు ఉంచండి. భోజనము తయారు చేసే సమయములో కూడా స్మృతి చేయండి. భోజనము తయారు చేయు సమయములో పతి, పుత్రుడు గుర్తు వచ్చినప్పుడు శివబాబా ఎందుకు గుర్తు రారు? ఇది మీరు చేయవలసిన పని, బాబా బుద్ధికి నిచ్చెనను ఇస్తారు. ఆ నిచ్చెనను ఎక్కుతారో, ఎక్కరో అది మీకు సంబంధించిన పని. ఎంతగా స్మృతి చేస్తారో, అంత మెటికలు పైకి ఎక్కుతూ పోతారు లేకుంటే అంత సుఖము లభించదు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన అనగా 5 వేల సంవత్సరాల తర్వాత మళ్లీ వచ్చి కలిసిన పిల్లలకు నంబరువారు పురుషార్థానుసారము మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. కృష్ణపురములోకి వెళ్లేందుకు పురుషార్థము చాలా బాగా చేయాలి. శూద్ర సంస్కారాలను పరివర్తన చేసుకొని పక్కా బ్రాహ్మణులుగా అవ్వాలి.
2. బుద్ధి బలముతో స్మృతి నిచ్చెన పైకి ఎక్కాలి. మెటికలు(నిచ్చెన) ఎక్కితేనే అపారమైన సుఖము అనుభవమవుతుంది.
వరదానము :- ''ప్రతి ఆత్మకు సెకండులో ముక్తి - జీవన్ముక్తుల అధికారాన్ని ఇప్పించే మాస్టర్ సద్గురు భవ''
ఇంతవరకు
మాస్టర్ దాత పాత్ర లేక మాస్టర్ శిక్షకుల పాత్రను చేస్తున్నారు. అయితే
ఇప్పుడు సద్గురువు పిల్లలుగా అయ్యి గతి-సద్గతులను ఇచ్చే వరదాత పాత్రను
చేయాలి. మాస్టర్ సద్గురువు అనగా పూర్తిగా అనుసరించేవారు. సద్గురువు
వచనాలను సదా సంపూర్ణంగా అనుసరించేవారు. ఇటువంటి మాస్టర్ సద్గురువులే ఒక
సెకండులో దృష్టి ద్వారా తృప్తి పరచే అనగా ముక్తి - జీవన్ముక్తుల
అధికారాన్ని ఇప్పించే సేవ చేయగలరు.
స్లోగన్ :- ''ఆజ్ఞాకారులుగా అయితే వరదాత నుండి హృదయపూర్వక ఆశీర్వాదాలు ప్రాప్తి అవుతూ ఉంటాయి''
No comments:
Post a Comment