Saturday, 10 February 2018

Telugu Murli 11/02/18

11-02-2018 అవ్యక్త బాప్‌దాదా ఓంశాంతి రివైజ్‌: 10-04-1983 మధువనము 

''పరమ పూజ్యులుగా అయ్యేందుకు ఆధారం''
అందరూ మధువన మహాన్‌ తీర్థస్థానానికి మేళాను జరుపుకునేందుకు నలువైపుల నుండి చేరుకున్నారు. ఈ మహాన్‌ తీర్థ స్థానంలో ఇప్పుడు జరిగే మేళాకు స్మృతి చిహ్నంగా ఇప్పటికీ తీర్థ స్థానాలలో మేళాలు జరుగుతూ ఉంటాయి. ఈ సమయానికి చెందిన ప్రతీ శ్రేష్ఠ కర్మకు స్మృతి చిహ్నాన్ని చరిత్రల రూపంలో, పాటల రూపంలో ఇప్పుడు కూడా చూస్తున్నారు, వింటున్నారు. చైతన్యంలో ఉన్న శ్రేష్ఠ ఆత్మలైన మీరు తమ చిత్రాలను చూస్తున్నారు, చరిత్రలను వింటున్నారు. ఇటువంటి సమయంలో బుద్ధిలో ఏ శ్రేష్ఠ సంకల్పం నడుస్తుంది? ఒకప్పుడు మేమే ఇలా ఉండేవారము, ఇప్పుడు మేమే అలా ఉన్నాము, కల్ప-కల్పము మళ్లీ మేమే అలా అవుతామని భావిస్తున్నారు కదా! ఈ ' మళ్లీ ' అన్న స్మృతి, ఈ జ్ఞానము ఇక ఏ ఇతర ఆత్మలకు, మహాత్మలకు, ధర్మాత్మలకు, ధర్మపితలకు లేదు. కాని బ్రాహ్మణాత్మలైన మీ అందరికీ ఎంత స్పష్టమైన స్మృతి లేక స్పష్టమైన జ్ఞానము ఉందంటే 5 వేల సంవత్సరాల నాటి విషయం నిన్నటి విషయమన్నంత స్పష్టమైన స్మృతి ఉంది. నిన్న అలా ఉండేవారము, ఈ రోజు అలా ఉన్నాము, మళ్లీ రేపు అలా అవుతామనే నిశ్చయముంది. కావున ఈ రోజు మరియు రేపు - ఈ రెండు శబ్ధాల్లో 5 వేల సంవత్సరాల ఇతిహాసం ఇమిడిపోయి ఉంది. ఇంత సహజంగా, స్పష్టంగా అనుభవం చేస్తున్నారా! ఎవరో ఉంటారా? లేక మేమే ఉండేవారము, ఇప్పుడు కూడా మేమే అని భావిస్తున్నారా? జడ చిత్రాల్లో తమ చైతన్య శ్రేష్ఠ జీవితం సాక్షాత్కారమవుతోందా? లేక ఇవి మహారథుల చిత్రాలని భావిస్తున్నారా లేక మన అందరి చిత్రాలని భావిస్తున్నారా? భారతదేశంలో 33 కోట్ల దేవతలకు నమస్కారం చేస్తారు అనగా శ్రేష్ఠ బ్రాహ్మణాత్మల నుండి దేవతలుగా అయ్యే వంశానికి వంశజులు, ఆ వంశజులకు కూడా వంశజులందరికీ నమస్కరిస్తారు. అందరికీ పూజ చేయకపోయినా మహిమనైతే చేస్తూనే ఉంటారు. కావున ఎవరైతే స్వయం పూర్వజులుగా ఉన్నారో వారి పేరు ఎంత శ్రేష్ఠంగా ఉంటుందో, వారి పూజ కూడా ఎంత శ్రేష్ఠంగా జరుగుతుందో ఆలోచించండి. 9 లక్షలకు కూడా మహిమ ఉంది, వారి కంటే ముందు 16 వేలకు మహిమ ఉంది, వారి కంటే ముందు 108 మందికి ఉంది, వారి కంటే ముందు 8 మందికి ఉంది. వారి కంటే ముందు జంట పూసలు ఉన్నాయి. నంబరువారిగా ఉన్నారు కదా! మహిమ అయితే అందరికీ ఉంది. ఎందుకంటే ఎవరైతే భాగ్యవిధాత అయిన తండ్రికి పిల్లలుగా అయ్యారో, ఈ భాగ్యం కారణంగా వారికి మహిమ (గాయనము) మరియు పూజ రెండూ జరుగుతాయి. కాని రెండు రకాల పూజలున్నాయి. ఒకటి ప్రేమతో కూడిన విధిపూర్వకమైన పూజ, రెండవది కేవలం నియమానుసారంగా(నియమపూర్వకంగా) చేసే పూజ. రెండిటిలో తేడా ఉంది కదా! కావున నేను ఎటువంటి పూజ్య ఆత్మను అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. కొందరు భక్తులు, దేవతలు కోపగించుకోరాదన్న భయంతో పూజ చేస్తారని ఇంతకు ముందు కూడా వినిపించాము. కొందరు భక్తులు బయటికి చూపించడానికి కూడా పూజ చేస్తారు. మరి కొంతమంది భక్తిని నియమంగా లేక కర్తవ్యంగా భావించి నిర్వర్తించాలని భావిస్తారు. మనసులో ఉన్నా లేకపోయినా నిభాయించాలి అని ఒక కర్తవ్యంగా భావించి చేస్తారు. నాలుగు రకాల భక్తులు, ఏదో ఒక విధంగా తయారవుతారు. ఇక్కడ కూడా చూడండి, దేవాత్మలుగా అయ్యే బ్రహ్మకుమారీ-బ్రహ్మకుమారులుగా పిలువబడేవారు భిన్న-భిన్న రకాల వారున్నారు కదా! నంబరువన్‌ పూజ్యులు - సదా సహజ స్నేహంతో (ప్రేమతో) మరియు విధి పూర్వకమైన స్మృతి మరియు సేవ చేస్తూ యోగీ ఆత్మలుగా, దివ్యగుణాలను ధారణ చేసే ఆత్మలుగా అయ్యి నడుస్తున్నారు. నాలుగు సబ్జెక్టుల విధిని మరియు సిద్ధిని ప్రాప్తి చేసుకున్నారు. రెండవ నంబరు పూజ్యులు విధి పూర్వకంగా కాదు కాని నియమంగా భావించి చేస్తారు. నాలుగు సబ్జెక్టులు పూర్తిగా ఉంటాయి కానీ విధి మరియు సిద్ధి యొక్క ప్రాప్తి స్వరూపంగా అయ్యి ఉండరు. కాని నియమంగా భావించి నడవాల్సిందే, చేయాల్సిందే అనే లక్ష్యంతో ఎంత నియమమో(కాయిదా) అంత లాభాన్ని(ఫాయిదా) ప్రాప్తి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మొదటి రకము వారి హృదయపూర్వకమైన స్నేహం స్వతహాగా మరియు సహజంగా పూజ్యాత్మగా తయారు చేస్తుంది. రెండవ రకం నియమపూర్వకంగా చేసేవారికి ఒకసారి సహజంగా, ఒకసారి కష్టంగా అనిపిస్తుంది, ఒకసారి శ్రమ చేయవలసి ఉంటుంది, ఒకసారి ప్రేమ అనుభూతి ఉంటుంది. మొదటి నంబరు వారు లవలీనమై ఉంటారు, రెండవ నంబరు వారు ప్రేమలో ఉంటారు. మూడవ నంబరు వారు - మెజారిటి(అధిక) సమయాన్ని నాలుగు సబ్జెక్టులను హృదయపూర్వకంగా కాక చూపించేందుకు చేస్తారు. స్మృతిలో కూడా ప్రసిద్ధమైనవారిగా అవ్వాలనే భావంతో కూర్చుంటారు. అలాగే అందరికీ చూపించేందుకు సేవ కూడా చేస్తారు. ఎటువంటి సమయమో అటువంటి అల్పకాలిక రూపాన్ని కూడా ధారణ చేస్తారు. బుద్ధి తేజంగా ఉంటుంది కాని మనసు ఖాళీగా ఉంటుంది. నాల్గవ నంబరు వారు - కేవలం వీరు ఆఖరి నంబరు వారు లేక వీరు ముందుకు వెళ్లలేరని ఎవ్వరూ అనకూడదని, అటువంటి దృష్టితో ఎవ్వరూ చూడరాదనే భయంతో చేస్తారు. బ్రాహ్మణులుగా అయితే అవ్వనే అయ్యారు, శూద్ర జీవితాన్ని కూడా వదిలేసి నడుస్తున్నారు. కాని రెండూ వదిలినట్లుగా ఉండరు. ఇదీ వదలరు, అదీ వదలరు. శూద్ర జీవితమూ ఇష్టముండదు, బ్రాహ్మణ జీవితంలో విధి పూర్వకంగా నడిచే ధైర్యమూ ఉండదు. అందువలన నిస్సహాయ స్థితిలో ప్రవాహంలో వచ్చేసారు. అలాంటి నిస్సహాయతతో లేక భయంతో నడుస్తూనే ఉంటారు. వీరు అప్పుడప్పుడు తమ శ్రేష్ఠ జీవితాన్ని అనుభవం కూడా చేస్తూ ఉంటారు. అందువలన ఈ జీవితాన్ని వదలలేరు కూడా. అలాంటి వారిని నాల్గవ నంబరు పూజ్య ఆత్మలని అంటారు. కావున వారి పూజ కూడా అప్పుడప్పుడు భయంతో గత్యంతరం లేని భక్తులుగా అయ్యి పూజ చేయాలని దాని అనుసారంగా నడుస్తూ ఉంటుంది. చూపించేందుకు చేసేవారికి జరిగే పూజ కూడా మనస్ఫూర్తిగా కాక చూపించేందుకే దాని అనుసారంగానే నడుస్తూ ఉంటుంది. కావున నాలుగు రకాల పూజ్యులను చూశారు కదా. స్వయం ఇప్పుడు సంగమ యుగంలో ఎలా తయారవుతారో అలాగే సత్య త్రేతా యుగాలలో రాయల్‌ ఫ్యామిలీ వారిగా లేక ప్రజలుగా నంబరు ప్రమాణంగా తయారవుతారు, ద్వాపర కలియుగాలలో మీకు అలాంటి భక్తుల మాలయే తయారవుతుంది. ఇప్పుడు నేనెవరిని! అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి లేక ఈ నాల్గింటిలో ఒకప్పుడు ఒక చోటుకు, ఒకప్పుడు ఒక చోటుకు తిరుగుతున్నారా? అయినా భాగ్యవిధాతకు పిల్లలుగా అయ్యారు. కనుక పూజ్యులుగా అయితే తప్పకుండా అవుతారు. ప్రసిద్ధి చెందిన వారు అనగా శ్రేష్ఠ పూజ్యులు 16 వేల వరకు నంబరువారుగా అయిపోతారు. మిగిలిన 9 లక్షలు అంతిమ సమయం వరకు అనగా కలియుగ అంతిమ సమయం వరకు ఎంతో కొంత పూజ్యులుగా అయిపోతారు. కావున అర్థమయ్యిందా! మహిమైతే అందరికీ జరుగుతుంది. మహిమకు ఆధారం - భాగ్యవిధాత తండ్రి వారిగా అవ్వడం. పూజకు ఆధారం నాలుగు సబ్జక్టులలో పవిత్రత, స్వచ్ఛత, శుభ్రత (సఫాయి). అటువంటి వారి పై బాప్‌దాదా కూడా సదా స్నేహ పుష్పాలు కురిపిస్తూ వారిని పూజ్యులు అనగా శ్రేష్ఠులుగా అంగీకరిస్తారు. పరివారం కూడా వారిని శ్రేష్ఠమైన వారిగా అంగీకరిస్తారు. అంతేకాక విశ్వం కూడా వాహ్‌ వాహ్‌ అను ఢంకాను మ్రోగిస్తూ వారికి మనసుతో పూజ చేస్తుంది. ఇక భక్తులైతే తమ ఇష్టులుగా భావించి హృదయంలో ఇముడ్చుకుంటారు. కావున ఇటువంటి పూజ్యులుగా అయ్యారా? స్వయం పరమపితయే పూజ్యులుగా చేస్తున్నారు. వారు కేవలం పిత కాదు, పరమపిత (అత్యంత ఉన్నతమైన పిత). కనుక వారు పరమ అనగా అత్యంత ఉన్నతంగానే తయారు చేస్తారు కదా. పూజ్యులుగా అవ్వడమేమీ గొప్ప విషయం కాదు కానీ పరమ పూజ్యులుగా అవ్వాలి.

బాప్‌దాదా కూడా పిల్లలను చూసి హర్షితమవుతున్నారు. ప్రేమలో శ్రమను అనుభవం చేయకుండా చేరుకుంటారు. ఇప్పుడైతే రెస్ట్‌ హౌస్‌లోకి వచ్చేశారు కదా! తనువు, మనసు రెండిటికి విశ్రాంతి ఉంది కదా! రెస్ట్‌ అనగా నిద్రపోవడం కాదు. బంగారంగా తయారయ్యే రెస్ట్‌లోకి అనగా పారసపురిలోకి వచ్చేశారు కదా. ఇక్కడ పారస ఆత్మల సాంగత్యమే ఉంటుంది. వాయుమండలమే బంగారుగా తయారు చేసేదిగా ఉంటుంది. ఇక్కడి విషయాలే సదా (పగలు-రాత్రి) బంగారుగా తయారు చేసేవిగా ఉంటాయి. మంచిది.

అటువంటి సదా పరమపూజ్య ఆత్మలకు, సదా విధి ద్వారా శ్రేష్ఠ సిద్ధిని పొందేవారికి, సదా మహాన్‌గా అయ్యి మహాన్‌ ఆత్మలుగా తయారు చేసేవారికి, స్వయాన్ని సదా సహజంగా మరియు స్వతహా యోగి, నిరంతర యోగి, స్నేహ సంపన్న యోగిగా అనుభవం చేసేవారికి అలాంటి సర్వ శ్రేష్ఠ ఆత్మలకు, నలువైపులా ఉన్న ఆకారీ రూపధారులైన సమీప పిల్లలకు, ఇటువంటి సాకారీగా, ఆకారీగా సన్ముఖంగా ఉపస్థితులైన పిల్లలకు బాప్‌దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే.

దీదీ, దాదీలతో - అందరూ పరమపూజ్యులుగా ఉన్నారు కదా! పూజ బాగా జరుగుతోంది కదా! బాప్‌దాదాకైతే అనన్య పిల్లలంటే గర్వంగా ఉంది. తండ్రికి గర్వంగా ఉంది, పిల్లలు రాజయుక్తంగా ఉన్నారు. ఎవరైతే రాజయుక్తంగా ఉన్నారో, ఆ పిల్లల పై తండ్రికి సదా గర్వంగా ఉంటుంది. రాజయుక్తులు, యోగయుక్తులు, గుణ యుక్తులు అన్నింటి బ్యాలెన్స్‌ను ఉంచేవారు సదా తండ్రి ఆశీర్వాదాల నీడలో ఉంటారు. వారి పై ఆశీర్వాదాల వర్షం సదా కురుస్తూ ఉంటుంది. జన్మిస్తూనే ఈ ఆశీర్వాదాల వర్షం ప్రారంభమయ్యింది మరియు చివరి వరకు ఇదే ఛత్రఛాయలో బంగారు పుష్పాల వర్షం కురుస్తూ ఉంటుంది. ఇదే నీడలో నడిచారు, పాలింపబడ్డారు, చివరి వరకు నడుస్తూనే ఉంటారు. సదా ఆశీర్వాదాలనే బంగారు పుష్పాల వర్షం కురుస్తూ ఉంటుంది. ప్రతీ అడుగులో తండ్రి తోడుగా ఉన్నారు అనగా వారి ఆశీర్వాదాలు తోడుగా ఉన్నాయి. ఇదే నీడలో సదా ఉంటున్నారు.(దాదీతో) ప్రారంభం నుండి అలసటి లేని వారిగా ఉన్నారు. మీకు అథక్‌ భవ(అలసట లేని వారిగా అవ్వండి) అన్న వరదానముంది. కావున చేస్తూ కూడా చేయడం లేదు. ఇది చాలా బాగుంది. అయినా అవ్యక్తమయ్యే సమయంలో బాధ్యతా కిరీటమైతే పెట్టారు కదా! వీరికి(దీదీకి) సాకారుని జతలో నేర్పించారు, మీకు అవ్యక్తమయ్యే సమయంలో ఒక్క సెకనులో నేర్పించారు. ఇరువురికీ తమ తమ పద్ధతులలో నేర్పించారు. ఈ పాత్ర కూడా డ్రామాలో ఉంది. మంచిది.

ఉదయం 6-30 గంటలకు వీడ్కోలు సమయంలో - సంగమ యుగంలోని అన్ని ఘడియలు గుడ్‌మార్నింగ్‌ (శుభోదయం)గానే ఉన్నాయి. ఎందుకంటే పూర్తి సంగమ యుగమంతా అమృతవేళయే కదా! సృష్టి చక్రం లెక్కలో సంగమ యుగం అమృతవేళగా అయ్యింది కదా! కనుక సంగమ యుగంలో ప్రతి సమయం గుడ్‌మార్నింగే. కావున బాప్‌దాదా రావడమూ గుడ్‌మార్నింగ్‌లోనే, వెళ్లడం కూడా గుడ్‌మార్నింగ్‌లోనే. ఎందుకంటే తండ్రి వచ్చినప్పుడు రాత్రి (కలియుగము) నుండి సంగమ యుగముగా (అమృతవేళగా) అయిపోయింది. కనుక రావడం అమృతవేళలోనే వస్తారు, వెళ్లునప్పుడు పగలు వస్తుంది. అమృతవేళలోనే ఉంటారు, పగలు వచ్చినప్పుడు వెళ్లిపోతారు. మీరు ఉదయం అనగా సత్యయుగ పగలులో అనగా బ్రహ్మ పగలులో రాజ్యం చేస్తారు. తండ్రి అయితే అతీతంగా అయిపోతారు కదా! కావున పాత ప్రపంచం లెక్కలో చూస్తే ఈ సంగమ యుగము సదా గుడ్‌మార్నింగ్‌గానే ఉంది. సదా శుభమే ఉంది, సదా శుభమే ఉంటుంది. అందువలన శుభోదయం అన్నా, శుభరాత్రి అన్నా, శుభ దినం అన్నా అంతా శుభమే శుభము. కావున అందరికీ కలియుగ లెక్కలోనూ గుడ్‌మార్నింగే, సంగమ యుగ లెక్కలోనూ గుడ్‌మార్నింగే. డబల్‌ గుడ్‌మార్నింగ్‌. మంచిది.

అవ్యక్త మహావాక్యాలు -

స్మృతిని జ్వాలాస్వరూపంగా తయారు చేసుకోండి - ఎప్పుడైతే మీ స్మృతి జ్వాలా స్వరూపంగా ఉంటుందో అప్పుడు తండ్రి సమానంగా పాపకటేశ్వరులుగా, పాప హరిణిగా(పాపాలను హరించేవారిగా) తయారవ్వగలరు. అటువంటి స్మృతియే మీ దివ్య దర్శనీయ మూర్తిని ప్రత్యక్షం చేస్తుంది. దీని కొరకు ఏ సమయములోనూ సాధారణ స్మృతి ఉండరాదు. సదా జ్వాలా స్వరూపం, శక్తి స్వరూప స్మృతిలో ఉండండి. స్నేహంతో పాటు శక్తి రూపం కంబైండ్‌గా ఉండాలి. వర్తమాన సమయంలో సంఘటిత రూపంలోని జ్వాలా స్వరూపం చాలా అవసరము. జ్వాలా స్వరూప స్మృతియే శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేస్తుంది. అంతేకాక నిర్బల ఆత్మలు శక్తి సంపన్నంగా అవుతారు. విఘ్నాలన్నీ సహజంగా సమాప్తమైపోతాయి. అంతేకాక పాత ప్రపంచం వినాశ జ్వాలలో భగ్గుమంటుంది. ఎలాగైతే సూర్యుడు విశ్వానికి ప్రకాశాన్ని, అనేక వినాశీ ప్రాప్తులను అనుభూతి చేయిస్తాడో అలా పిల్లలైన మీరు తమ మహాన్‌ తపస్వీ రూపం ద్వారా ప్రాప్తి కిరణాలను అనుభవం చేయించండి. దీని కొరకు ముందు జమా ఖాతాను పెంచండి. ఎలాగైతే సూర్యుని కిరణాలు నలువైపులా వ్యాపిస్తాయో అలా మీరు మాస్టర్‌ సర్వశక్తివంతుని స్థితిలో ఉన్నట్లయితే శక్తులు లేక విశేషతల రూపీ కిరణాలు నలువైపులా వ్యాపిస్తున్నట్లు అనుభవం చేస్తారు.

జ్వాలా రూపంగా అయ్యేందుకు ముఖ్యమైన సహజ పురుషార్థము - ఇప్పుడు వాపస్‌ ఇంటికి వెళ్లాలి, అందరినీ వెంట తీసుకెళ్లాలనే ధున్‌(తపన) సదా ఉండాలి. ఈ స్మృతి ద్వారా స్వతహాగా సర్వ సంబంధాలు, సర్వ ప్రాకృతిక ఆకర్షణలతో ఉపరాంగా అనగా సాక్షిగా అయిపోతారు. సాక్షిగా అవ్వడం వలన సహజంగానే తండ్రికి సహచరునిగా లేక తండ్రి సమానంగా అయిపోతారు. జ్వాలా స్వరూప స్మృతి అనగా లైట్‌ హౌస్‌ మరియు మైట్‌ హౌస్‌ స్థితిని అర్థం చేసుకొని అదే పురుషార్థంలో ఉండడం. విశేషంగా జ్ఞాన స్వరూపాన్ని అనుభవం చేస్తూ శక్తిశాలిగా అవ్వండి. దీని ద్వారా శ్రేష్ఠ ఆత్మలైన మీ శుభ వృత్తి లేక కళ్యాణ వృత్తి మరియు శక్తిశాలి వాతావరణం ద్వారా తపిస్తున్న, భ్రమిస్తున్న, పిలుస్తున్న అనేక ఆత్మలకు ఆనందం, శాంతి మరియు శక్తులు అనుభూతి అవ్వాలి. ఎలాగైతే అగ్నిలో ఏదైనా వస్తువును వేయడం వలన దాని నామ-రూపాలు, గుణాలు అన్నీ మారిపోతాయో అలా తండ్రి స్మృతిలో లగ్నమనే అగ్నిలో పడినప్పుడు పరివర్తన అయిపోతారు. మనుష్యుల నుండి బ్రాహ్మణులుగా అయిపోతారు మళ్లీ బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలుగా, ఫరిస్తాల నుండి దేవతలుగా అయిపోతారు. ఎలాగైతే పచ్చి మట్టిని మూసలో పోసి(భట్టీలో) అగ్నిలో వేసినప్పుడు అది ఇటుకగా అయిపోతుందో అలా మీరు కూడా పరివర్తన అయిపోతారు. అందువలన ఈ స్మృతినే 'జ్వాలా రూప స్మృతి' అని అంటారు. మీరు సేవాధారులుగా ఉన్నారు, స్నేహితులుగా ఉన్నారు, ఒకే బలం - ఒకే విశ్వాసం గలవారిగా ఉన్నారు, ఇదంతా సరిగ్గానే ఉంది. కాని మాస్టర్‌ సర్వశక్తివంతుల స్థితి అనగా లైట్‌ హౌస్‌, మైట్‌ హౌస్‌ స్థితిలోకి వచ్చేయాలి, స్మృతి జ్వాలా స్వరూపంగా అయిపోవాలి. అప్పుడు అందరూ మీ ముందు దీపపు పురుగుల సమానంగా చుట్టూ తిరగడం ప్రారంభిస్తారు. జ్వాలా స్వరూప స్మృతి కొరకు మనసు, బుద్ధి రెండిటికీ - ఒకటేమో శక్తిశాలి బ్రేక్‌ కావాలి, అంతేకాక తిప్పుకునే శక్తి కావాలి. దీని ద్వారా బుద్ధి శక్తి లేక ఏ ఇతర శక్తీ వ్యర్థమవ్వకుండా జమ అవుతూ ఉంటుంది. ఎంతగా జమ అవుతుందో అంతగా పరిశీలించే శక్తి, నిర్ణయించే శక్తి పెరుగుతాయి. దీని కొరకు ఇప్పుడు సంకల్పాల పరుపును చుట్టి వేస్తూ వెళ్లాలి అనగా సర్దుకునే శక్తిని ధారణ చేయండి. ఏ కార్యము చేస్తున్నా లేక మాట్లాడుతున్నా మధ్య మధ్యలో సంకల్పాల ట్రాఫిక్‌ను ఆపేయండి. ఒక్క నిముషం కోసమైనా మనసులోని సంకల్పాలను, శరీరం ద్వారా చేస్తున్న కర్మలను మధ్యలో ఆపి కూడా ఈ అభ్యాసాన్ని చేయండి. అప్పుడు బిందురూపీ శక్తిశాలి స్థితిలో స్థితులవ్వగలరు. ఎలాగైతే అవ్యక్త స్థితిలో ఉండి కార్యం చేయడం సరళమవుతూ ఉందో, అలా ఈ బిందు రూప స్థితి కూడా సహజమైపోతుంది. ఎలాగైతే ఏవైనా కీటాణువులను చంపేందుకు డాక్టర్లు కరెంట్‌ కిరణాలను ఇస్తారో, అలా స్మృతి యొక్క శక్తిశాలి కిరణాలు ఒక్క సెకనులో అనేక వికర్మల రూపీ కీటాణువులను భస్మం చేసేస్తాయి. వికర్మలు భస్మం అయిపోతే స్వయాన్ని తేలికగా, శక్తిశాలిగా అనుభవం చేస్తారు. నిరంతర సహజ యోగులుగానే ఉన్నారు కేవలం ఈ స్మృతి యొక్క స్థితిని మధ్య మధ్యలో శక్తిశాలిగా తయారు చేసుకునేందుకు అటెన్షన్‌ అనే ఫోర్సును నింపుతూ ఉండండి. పవిత్రతను సంపూర్ణ రూపంలో ధారణ చేసినప్పుడు మీ శ్రేష్ఠ సంకల్పాల శక్తి లగ్నమనే అగ్నిని ప్రజ్వలితం చేస్తుంది. ఆ అగ్నిలో చెత్త అంతా భస్మమైపోతుంది. తర్వాత ఏమి ఆలోచిస్తారో అదే జరుగుతుంది. సేవ స్వతహాగా విహంగ మార్గంలో జరిగిపోతుంది. జ్వాల ద్వారా అసురులను భస్మం చేసేశారని దేవీల స్మృతిచిహ్నంలో చూపిస్తారు. ఆసురులను కాదు, ఆసురీ శక్తులను సమాప్తం చేసేస్తారు. ఇది ఇప్పటి స్మృతిచిహ్నమే. ఇప్పుడు జ్వాలాముఖులుగా అయ్యి ఆసురీ సంస్కారాలను, స్వభావాలనన్నిటిని భస్మం చేసేయండి. ప్రకృతి మరియు ఆత్మలలోని తమోగుణమేదైతే ఉందో దానిని భస్మం చేసేవారిగా అవ్వండి. ఇది చాలా గొప్ప పని. వేగంగా చేసినప్పుడే పూర్తవుతుంది. ఏదైనా లెక్కాచారం ఈ జన్మదైనా, వెనుకటి జన్మదైనా లగ్నమనే అగ్ని స్వరూప స్థితి లేకుండా భస్మం అవ్వదు. సదా అగ్ని స్వరూప స్థితి అనగా జ్వాలా రూప శక్తిశాలి స్మృతి. బీజరూప స్థితి, లైట్‌హౌస్‌, మైట్‌హౌస్‌ స్థితిలో పాత లెక్కాచారాలన్నీ భస్మమైపోతాయి. అంతేకాక మిమ్ములను మీరు డబల్‌లైట్‌గా అనుభవం చేస్తారు. స్మృతి లింకు సదా జోడించి ఉన్నప్పుడే శక్తిశాలి జ్వాలా స్వరూప స్థితి ఉంటుంది. ఒకవేళ పదే పదే లింకు తెగిపోతూ ఉంటే, దానిని జోడించేందుకు సమయం కూడా పడ్తుంది, శ్రమ కూడా కలుగుతుంది. శక్తిశాలిగా అయ్యేందుకు బదులు బలహీనంగా అయిపోతారు. స్మృతిని శక్తిశాలిగా చేసేందుకు విస్తారంలోకి వెళ్తూ సార స్థితిలో ఉండేందుకు చేయు అభ్యాసం తక్కువ అవ్వరాదు. విస్తారంలో సారాన్ని మర్చిపోరాదు. తినండి, త్రాగండి, సేవ చేయండి. కానీ అతీతత్వాన్ని మర్చిపోకండి. సాధన అనగా శక్తిశాలి స్మృతి. నిరంతరం తండ్రితో హృదయపూర్వక సంబంధం. కేవలం యోగంలో కూర్చుండిపోతే దానిని సాధన అని అనరు. కానీ ఏ విధంగా శరీరంతో కూర్చుంటారో, అదే విధంగా హృదయం, మనసు, బుద్ధి ఒక్క తండ్రితో జోడించి, తండ్రి జత జతలో కూర్చుండిపోవాలి. ఇటువంటి ఏకాగ్రతయే జ్వాలను ప్రజ్వలింపజేస్తుంది. స్మృతియాత్ర సహజంగా కూడా ఉండాలి, శక్తిశాలిగా కూడా ఉండాలి. శక్తిశాలి స్మృతి ఒకే సమయంలో డబల్‌ అనుభవం చేయిస్తుంది. ఒకవైపు స్మృతి అగ్నిగా అయ్యి భస్మం చేసే పని చేస్తుంది, రెండవ వైపు సంతోషం మరియు తేలికదనాన్ని అనుభవం చేయిస్తుంది. అటువంటి విధి పూర్వకమైన స్మృతినే యధార్థమైన మరియు శక్తిశాలి స్మృతి అని అంటారు. 

వరదానము :- ''స్నేహమనే లిఫ్ట్‌ ద్వారా ఎగిరేకళను అనుభవం చేసే అవినాశి స్నేహీ భవ''
శ్రమ నుండి ముక్తులుగా అయ్యేందుకు తండ్రికి స్నేహితులుగా అవ్వండి. ఈ అవినాశి స్నేహమే అవినాశీ లిఫ్ట్‌గా అయ్యి ఎగిరేకళను అనుభవం చేయిస్తుంది. కానీ ఒకవేళ స్నేహంలో నిర్లక్ష్యం ఉంటే తండ్రి నుండి కరెంటు(శక్తి) లభించదు. కనుక లిఫ్ట్‌ పని చేయదు. ఎలాగైతే లైట్‌ (కరెంట్‌) ఆగిపోవడం వలన, కనెక్షన్‌ తెగిపోవడం వలన లిఫ్ట్‌ ద్వారా సుఖానుభూతిని పొందజాలమో అదే విధంగా స్నేహం(ప్రేమ) తక్కువగా ఉంటే, శ్రమ అనుభవమవుతుంది. కావున అవినాశీ స్నేహితునిగా అవ్వండి. 

స్లోగన్‌ :- ''శుభ సంకల్పం మరియు దివ్యబుద్ధి అనే యంత్రం ద్వారా తీవ్ర గతితో ఎగురుతూ ఉండండి''
 

No comments:

Post a Comment