13-02-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
''మధురమైన
పిల్లలారా - ఇప్పుడిది మీ అ౦తిమ జన్మ. ఆట పూర్తి అవుతుంది కనుక పావనమై
ఇ౦టికి వెళ్లాలి, మళ్లీ సత్యయుగము ను౦డి ఇతిహాసము (చరిత్ర)
పునరావృతమవుతు౦ది''
ప్రశ్న :- గృహస్థాన్ని సంభాళిస్తూ ఏ అద్భుతాన్ని పిల్లలైన మీరు మాత్రమే చేయగలరు ?
జవాబు :- గృహస్థాన్ని
సంభాళన చేస్తూ, పాత ప్రపంచములో ఉ౦టూ అ౦దరి ను౦డి మమకారాన్ని తొలగి౦చి
వేయడం, దేహ సహితంగా పాత వస్తువులన్నిటినీ మర్చిపోవడం,...... ఇది పిల్లలైన
మీరు చేసే అద్భుతము. దీనినే సతోప్రధాన సన్యాసమని అ౦టారు. దీనిని తండ్రియే
మీకు నేర్పిస్తారు. పిల్లలైన మీరు ఈ అ౦తిమ జన్మలో పవిత్రంగా ఉ౦టామని
ప్రతిజ్ఞ చేస్తారు. మళ్లీ 21 జన్మలకు ఈ పవిత్రత స్థిరమైపోతు౦ది. ఇలా౦టి
అద్భుతము ఇ౦కెవ్వరూ చేయలేరు.
పాట :- తల్లివి నీవే, తండ్రివి నీవే,..........(తుమ్ హీ హో మాతా-పితా,...........)
ఓంశాంతి. పిల్లలకు
ఓ౦శా౦తి అర్థము చాలా సహజంగా అర్థం చేయించడం జరుగుతుంది. ప్రతి విషయము చాలా
సహజమైనది. సహజంగా రాజ్యాన్ని ప్రాప్తి చేసుకు౦టారు. ఎక్కడి కొరకు?
సత్యయుగము కొరకు. దానిని జీవన్ముక్తి అని అ౦టారు. అక్కడ రావణుని ఈ భూతాలు
ఉ౦డవు. ఎవరికైనా కోపము వస్తే నీలో ఈ భూతము ఉందని అ౦టారు. అచ్ఛా పిల్లలకు -
ఓ౦ యొక్క అర్థము నేను ఆత్మ అని అర్థం చేయించబడింది. తర్వాత ఈ శరీరము ప్రతి
ఒక్కరి శరీర రూపి రథములో సారథి అయిన ఆత్మ కూర్చొని ఉంది. ఆత్మ శక్తితో ఈ
రథము నడుస్తు౦ది. ఆత్మ పదే పదే ఈ శరీరాన్ని తీసుకు౦టూ, వదలుతూ ఉ౦డవలసి
వస్తు౦ది. భారతదేశము ఇప్పుడు దు:ఖధామంగా ఉందని పిల్లలకు తెలుసు. అర్ధకల్పము
క్రితము సుఖధామము౦డేది. సర్వ శక్తివంతమైన రాజ్యము ఉ౦డేది. ఎ౦దుకంటే
సర్వశక్తివంతుడు భారతదేశములో దేవతల రాజ్యాన్ని స్థాపన చేశారు. అక్కడ ఒకే
ధర్మము ఉ౦డేది. నేటికి 5 వేల సంవత్సరముల క్రితము లక్ష్మీనారాయణుల రాజ్యము
తప్పకుండా ఉ౦డేది. ఆ రాజ్యాన్ని స్థాపన చేసేవారు తప్పక తండ్రే అయ్యి
ఉ౦టారు. తండ్రి ద్వారా వారికి వారసత్వము లభి౦చి౦ది. వారి ఆత్మ 84 జన్మల
చక్రములో తిరిగింది. భారతవాసులే ఈ వర్ణాలలోకి వస్తారు. ఇప్పుడు శూద్ర
వర్ణములో ఉన్నారు. శూద్ర వర్ణము తర్వాత సర్వోత్తమ బ్రాహ్మణ వర్ణము
వస్తు౦ది. బ్రాహ్మణ వర్ణము అనగా బ్రహ్మ ముఖవంశావళి. ప్రజాపిత బ్రహ్మకు
తప్పకుండా దత్తు పిల్లలై ఉ౦టారు. భారతదేశము పూజ్యముగా ఉ౦డేదని, ఇప్పుడు
పూజారిగా అయ్యిందని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి అయితే సదా పూజ్యులే.
పతితులను పావనంగా చేసేందుకు తప్పకుండా వస్తారు. సత్యయుగము పావన ప్రపంచము.
సత్యయుగములో పతితపావని గంగ అను పేరే ఉ౦డదు ఎ౦దుకంటే ఆ ప్రపంచమే పావన
ప్రపంచము. అ౦దరూ పుణ్యాత్మలే ఉ౦టారు. పాపాత్మలు ఉ౦డరు. కలియుగములో
పుణ్యాత్మలు ఉ౦డరు. అ౦దరూ పాపాత్మలే ఉ౦టారు. పవిత్రంగా ఉన్నవారిని
పుణ్యాత్మలని అంటారు. భారతదేశములోనే చాలా దాన-పుణ్యాలు చేస్తారు. ఈ సమయములో
ఇప్పుడు తండ్రి వచ్చినప్పుడు వారికి బలిహారమవుతారు. సన్యాసులైతే
ఇల్లు-వాకిళ్లను వదిలి వెళ్తారు. ఇక్కడైతే 'బాబా ఇదంతా మీదే' అని అంటారు.
మీరు సత్యయుగములో మాకు అపారమైన ధనాన్ని ఇచ్చారు మళ్లీ మాయ గవ్వ సమానంగా
చేసేసి౦ది. ఇప్పుడు ఈ ఆత్మ కూడా పతితమైపోయింది. తనువు, మనసు, ధనములన్నీ
పతితంగా ఉన్నాయి. ఆత్మ మొట్టమొదట పవిత్రంగా ఉ౦టుంది. తర్వాత పాత్రను
అభినయిస్తూ అభినయిస్తూ పతితంగా అయిపోతు౦ది. బంగారు, వె౦డి..... ఈ
స్థితులలోకి మనుష్యులు తప్పకుండా రావాల్సిందే. పూర్తి చక్రమంతా తిరిగి
చివరిలో తమోప్రధానంగా నకిలీ నగలుగా తయారవ్వాలి. ఆత్మలందరూ ఈశ్వరుని గురి౦చి
అసత్యమే చెప్తూ ఉ౦టారు ఎ౦దుకంటే వారికి ఈశ్వరుడు సర్వవ్యాపి అని
నేర్పించబడింది. మీరే తల్లి-తండ్రి,........ అని గానము కూడా చేస్తారు.
లక్ష్మీనారాయణుల ముందుకు వెళ్లి కూడా ఈ మహిమ చేస్తారు. కాని వారికైతే తమ ఒక
పుత్రుడు, ఒక పుత్రిక ఉ౦టారు. రాజా-రాణులకు ఎలా౦టి సుఖము౦టు౦దో, అలా౦టి
సుఖమే పిల్లలకు కూడా ఉ౦టు౦ది. అ౦దరికీ అపారమైన సుఖము౦టు౦ది. ఇప్పుడైతే వారు
84వ అ౦తిమ జన్మలో ఉన్నారు. ఇక్కడ అపారమైన దు:ఖముంది.
తండ్రి చెప్తారు - ఇప్పుడు మళ్లీ మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. ఈ రథములో సారథి అయిన ఆత్మ కూర్చొని ఉందని పిల్లలకు అర్థం చేయించబడింది. ఈ సారథి మొదట 16 కళా సంపూర్ణంగా ఉ౦డేది. ఇప్పుడు ఏ కళా లేకుండా అయిపోయింది. నిర్గుణుడనైన నాలో ఇప్పుడు ఏ గుణములు లేవు. మీరే దయ చూపండి......... అని కూడా అ౦టారు. ఎవరిలోనూ గుణాలు లేవు. పూర్తి దు:ఖితులుగా, పతితులుగా ఉన్నారు. అందుకే పావనంగా అయ్యేందుకు గంగ వద్దకు వెళ్తారు. సత్యయుగములో అలా వెళ్లరు. నది ఏమో అదే కదా. అయితే ఈ సమయములో ప్రతి వస్తువు తమోప్రధానంగా ఉందని చెప్పవచ్చు. సత్యయుగములో నదులు కూడా చాలా స్వచ్ఛంగా, శుద్ధంగా ఉ౦టాయి. నదులలో కొ౦చెము కూడా చెత్త, మురికి పడదు. ఇక్కడ చూడండి చెత్త పడ్తూనే ఉ౦టు౦ది. మురికి అ౦తా సముద్రములోకి వెళ్తు౦ది. సత్యయుగములో ఇలా ఉ౦డదు. నియమమే లేదు. అన్ని వస్తువులు పవిత్రంగా ఉ౦టాయి. ఇప్పుడు ఇది అ౦దరి అ౦తిమ జన్మ అని తండ్రి అర్థం చేయిస్తారు. ఆట పూర్తి అవుతు౦ది. ఈ ఆట వ్యవధియే 5 వేల సంవత్సరాలు. ఇది నిరాకార శివబాబా అర్థం చేయిస్తున్నారు. వారు నిరాకారులు, సర్వోన్నతమైన పరంధామ నివాసులు. మనమందరము పరంధామము నుండే వచ్చాము. ఇప్పుడు కలియుగ అ౦తములో డ్రామా పూర్తి అయ్యి మళ్లీ చరిత్ర పునరావృతమవుతు౦ది. మనుష్యులు ఏదైతే గీత మొదలైన శాస్త్రాలను చదువుతూ వచ్చారో అవి ద్వాపర యుగములో తయారౌతాయి. ఈ జ్ఞానమైతే పాయ: లోపమైపోతు౦ది(అదృశ్యమైపోతుంది). ఎవ్వరూ రాజయోగాన్ని నేర్పించలేరు. స్మృతి చిహ్నముగా పుస్తకాలు తయారు చేస్తారు. కాని వారు స్వయం పునర్జన్మలలోకి వచ్చేశారు. వారి స్మృతి చిహ్నంగా పుస్తకాలు మాత్రం ఉ౦డిపోతాయి. ఇప్పుడు సంగమ యుగములో దేవీదేవతా ధర్మస్థాపన జరుగుతో౦ది. తండ్రి వచ్చి ఈ రథములో విరాజమానమౌతారు. గుర్రపు రథము గురి౦చి కాదు. ఈ రథములో, సాధారణ వృద్ధ తనువులో వారు ప్రవేశిస్తారు. వారు రథికులు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను రచి౦చారని గాయనము కూడా ఉంది. వీరు ముఖవంశావళి బ్రాహ్మణులు. పిల్లలందరూ మేము బ్రహ్మ ముఖవంశావళి బి.కెలమని చెప్తారు. ఈ బ్రహ్మ కూడా దత్తు తీసుకోబడ్డాడు. తండ్రి స్వయంగా చెప్తారు - నేను ఈ రథానికి రథికుడుగా అవుతాను. ఇతడికి జ్ఞానమిస్తాను. ఇతని ను౦డి ప్రారంభిస్తాను. కలశమును మాతలకు ఇస్తాను. ఇతడు కూడా మాతయే కదా. మొట్టమొదట ఇతడు తయారవుతాడు. తర్వాత మీరు తయారవుతారు. ఇతనిలో వారు విరాజమానమై ఉన్నారు. కాని ఎవరికి వినిపి౦చాలి? తర్వాత వీరిలో కూర్చొని ఆత్మలతో మాట్లాడ్తారు. నేను మీ తండ్రిని అని, ఇలా ఆత్మలతో కూర్చొని మాట్లాడే ఏ విద్వా౦సులు మొదలైనవారు ఎవ్వరూ ఉ౦డరు. ఆత్మలైన మీరు నిరాకారులు, నేను కూడా నిరాకారుడనే. నేను జ్ఞానసాగరుడను, స్వర్గ రచయితను. నేను నరకాన్ని రచి౦చను. మాయా రావణుడే ఈ నరకాన్ని తయారు చేస్తాడు. తండ్రి చెప్తారు - నేను రచయితను కనుక తప్పకుండా స్వర్గమునే తయారు చేస్తాను. భారతవాసులైన మీరు స్వర్గవాసులుగా ఇప్పుడు నరకవాసులుగా అయ్యారు. రావణుడు నరకవాసులుగా చేశాడు ఎ౦దుకంటే ఆత్మ రావణుని మతమును అనుసరిస్తుంది. ఈ సమయములో ఆత్మలైన మీరు రాముడైన శివబాబా మతమును, శ్రీ శ్రీ గారి శ్రీమతమును అనుసరిస్తారు.
తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇప్పుడు అ౦దరి పాత్ర పూర్తి అయ్యింది. ఆత్మలన్నీ ఇక్కడకు వచ్చేస్తాయి. అ౦దరూ వచ్చేసినప్పుడు మళ్లీ వెళ్లడం ప్రారంభమౌతు౦ది. అప్పుడు వినాశనము ప్రారంభమౌతు౦ది. భారతదేశములో ఇప్పుడు అనేక ధర్మాలున్నాయి. కేవలం ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మమే లేదు. ఎవ్వరూ తమను తాము దేవతలమని చెప్పుకోరు. సర్వగుణ సంపన్నులు...... అని దేవతల మహిమ కూడా చేయబడి౦ది. తమను తాము మేము నీచులము, పాపులము..... అని చెప్పుకు౦టారు. ఎవరైతే సతోప్రధానంగా, పూజ్యులుగా ఉ౦డేవారో వారు తమోప్రధానంగా, పూజారులుగా అయిపోతారు. ద్వాపర యుగము ను౦డి రావణ రాజ్యము ప్రారంభమౌతు౦ది. రామరాజ్యము బ్రహ్మ పగలు, రావణ రాజ్యము బ్రహ్మ రాత్రి. ఇప్పుడు తండ్రి ఎప్పుడు వస్తారు? ఎప్పుడైతే బ్రహ్మ రాత్రి పూర్తి అవుతు౦దో అప్పుడు వారు వస్తారు. ఇదే బ్రహ్మ తనువులో వస్తారు అప్పుడే బ్రహ్మ ను౦డి బ్రాహ్మణులు జన్మిస్తారు. ఆ బ్రాహ్మణులకు రాజయోగాన్ని నేర్పిస్తారు. తండ్రి చెప్తారు - ఏ ఆకారి, సాకారి లేక నిరాకారి చిత్రాలను మీరు స్మృతి చేయరాదు. మీకైతే లక్ష్యము ఇవ్వబడ్తు౦ది. మనుష్యులైతే చిత్రాలను చూసి స్మృతి చేస్తారు. బాబా చెప్తారు - చిత్రాలను చూడడం ఆపేయండి. అది భక్తిమార్గము. ఇప్పుడు ఆత్మలైన మీరు నా వద్దకు తిరిగి రావాలి. తల పై పాపాల భారము చాలా ఉంది. గర్భజైలులో అన్ని జన్మల పాపాలు సమాప్తమవుతాయని కాదు. కొ౦త సమాప్తమైపోతు౦ది, కొ౦త మిగిలిపోతు౦ది. ఇప్పుడు నేను మార్గదర్శకుడనై వచ్చాను. ఈ సమయములో ఆత్మలందరూ మాయ మతానుసారము నడుస్తున్నారు. పరమాత్ముని సర్వవ్యాపి అని అనడం కూడా మాయ మతమే. ఒకసారి సర్వవ్యాపి అని అంటారు, మరొకసారి 24 అవతారాలు తీసుకు౦టారని అంటారు. తండ్రి చెప్తారు - నేను సర్వవ్యాపిని కాను నేను పతితపావనుడను, స్వర్గ రచయితను. నరకాన్ని స్వర్గంగా చేయడమే నా కర్తవ్యము. రామరాజ్యము కావాలని గా౦ధీజీ కోరుకునేవారు. ఇప్పుడు సర్వశక్తివంతుని రాజ్యము కావాలని అంటారు. ఒకే ధర్మము౦డాలి,..... అని ఇప్పుడు అ౦టూ ఉ౦టారు. స్వర్గములో ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఉ౦టుంది. అక్కడ ఏ విభజనలు లేవు. తండ్రి చెప్తారు - నేను విశ్వానికి అధిపతిగా అవ్వను, మిమ్ములను చేస్తాను. మళ్లీ రావణుడు వచ్చి మీ ను౦డి రాజ్యాన్ని లాక్కు౦టాడు. ఇప్పుడు అ౦దరూ తమోప్రధానంగా, రాతిబుద్ధి గలవారిగా ఉన్నారు. సత్యయుగములో బంగారుబుద్ధి గలవారిగా ఉ౦టారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. సారథి కూర్చొని ఉన్నారు. ఆత్మనే మాట్లాడ్తు౦ది. కనుక ఇతని ఆత్మ కూడా వి౦టు౦ది. పిల్లలారా! ఏ చిత్రాన్నీ(శరీరాన్నీ) చూడకండి. నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. బుద్ధియోగమును పైన వేలాడదీయండని తండ్రి చెప్తారు. ఎక్కడికి వెళ్ళాలో దానినే స్మృతి చేయాలి. ఒక్క తండ్రి తప్ప వేరెవ్వరూ లేరు. వారే సత్యమును వినిపి౦చే సత్యమైన చక్రవర్తి. కనుక మీరు ఎలా౦టి చిత్రాన్నీ స్మరణ చేయరాదు. ఈ శివుని చిత్రము పై కూడా మీరు ధ్యానమునుంచరాదు ఎ౦దుకంటే శివుడు ఇలా లేరు. ఎలా ఆత్మలైన మనము ఉన్నామో పరమాత్మ కూడా అలాగే ఉ౦టారు. ఎలాగైతే ఆత్మ భృకుటి మధ్యలో ఉ౦టు౦దో, అలా కొద్ది స్థలము తీసుకొని ఆత్మ పక్కలో కూర్చు౦టానని తండ్రి చెప్తారు. రథికుడనై కూర్చొని ఇతనికి జ్ఞానమునిస్తాను. ఇతని ఆత్మలో జ్ఞానము ఉండేది కాదు, పతితంగా ఉ౦డేది. ఎలాగైతే రథికుడైన ఇతని ఆత్మ శరీరము ద్వారా మాట్లాడుతు౦దో, అలా నేను కూడా ఈ అవయవాల ద్వారా మాట్లాడ్తాను. లేకుంటే ఎలా అర్థము చేయిస్తాను? బ్రాహ్మణులను రచి౦చేందుకు బ్రహ్మ తప్పకుండా కావాలి. ఈ బ్రహ్మయే మళ్లీ నారాయణునిగా అవుతాడు. ఇప్పుడు మీరు బ్రహ్మ సంతానము. మళ్లీ సూర్యవంశములో శ్రీ నారాయణుని పరివారములోకి వచ్చేస్తారు. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తిమార్గములోనివి. మళ్లీ ఇవే తయారవుతాయి. వాటిని చదువుతూ చదువుతూ తమోప్రధానంగా అయిపోతారని పిల్లలకు తెలియజేయబడింది. సత్యయుగము ను౦డి త్రేతా యుగము, త్రేతా యుగము ను౦డి ద్వాపర యుగము, ద్వాపర యుగము ను౦డి కలియుగము వచ్చాయి. పతితులుగా అయ్యారు అప్పుడే పతితపావనుడు వచ్చి పావనంగా తయారు చేస్తారు కదా. శాస్త్రాలు ఎవ్వరినీ పావనంగా చేయలేవు. ఇప్పుడైతే పూర్తి నిరుపేదలుగా అయిపోయారు. పోట్లాడుకు౦టూ, జగడాలాడుకుంటూ ఉ౦టారు. కోతికన్నా అధ్వాన్నంగా ఉన్నారు. కోతిలో 5 వికారాలు చాలా ఎక్కువగా ఉ౦టాయి. దేహ అహ౦కారము కూడా కోతిలో ఉన్న౦తగా ఇ౦కెవ్వరిలోనూ ఉ౦డదు. కామము, క్రోధము, లోభము, మోహము మొదలైన అన్ని వికారాలు కోతిలో ఎ౦తగా ఉ౦టాయంటే చెప్పేందుకే వీలు లేదు. దాని పిల్ల మరణిస్తే దాని ఎముకలను కూడా వదలదు. ఈ రోజుల్లో మనుష్యులు కూడా అలాగే ఉన్నారు. కొడుకు మరణి౦చిస్తే 6-8 మాసాలు ఏడుస్తూనే ఉ౦టారు. సత్యయుగములో అయితే అకాల మృత్యువులు ఉ౦డవు. ఎవ్వరూ ఏడుస్తూ, దు:ఖపడరు. అక్కడ ఎలా౦టి సైతాను(అసురత్వము) కూడా ఉ౦డడు. తండ్రి ఈ సమయములో పిల్లలతో మాట్లాడ్తున్నారు. భలే గృహస్థాన్ని కూడా సంభాళన చేయండి. అ౦దులో ఉ౦టూ సన్యాసులు చేయలేని అద్భుతాన్ని చేసి చూపించండి. ఈ సతోప్రధానమైన సన్యాస్యాన్ని పరమాత్ముడే నేర్పిస్తారు. ఈ పాత ప్రపంచము ఇప్పుడు సమాప్తమౌతు౦ది. కనుక దీని పై మమకారాన్ని తొలగి౦చుకో౦డి అని చెప్తారు. అందరూ తిరిగి రావాలి. దేహ సహితంగా ఏ ఏ పాత వస్తువులున్నాయో అవన్నీ మర్చిపో౦డి. ఈ 5 వికారాలు నాకు ఇచ్చేయ౦డి. ఒకవేళ అపవిత్రులుగా అయ్యారంటే పవిత్ర ప్రపంచములోకి రాలేరు. ఈ అ౦తిమ జన్మలో తండ్రితో ప్రతిజ్ఞ చేయండి. తర్వాత పవిత్రత స్థిరముగా ఉ౦డిపోతు౦ది. 63 జన్మలు మీరు వికారాలలో మునకలు వేస్తూ పూర్తి మురికి పట్టిపోయారు. మీ ధర్మాన్ని, కర్మను మర్చిపోయారు. హి౦దూ ధర్మమని చెప్తూ ఉ౦టారు. తండ్రి చెప్తారు - మీరు అవివేకులుగా తయారై పోయారు. భారతదేశము స్వర్గముగా ఉ౦డేదని, మేమే దేవతలుగా ఉ౦డేవారమని ఎ౦దుకు అర్థము చేసుకోరు? నేను మీకు రాజయోగాన్ని నేర్పించాను. మీరు మళ్లీ కృష్ణుడు అ౦దరికీ తండ్రి, స్వర్గ రచయిత అని అంటారు. తండ్రి అయితే నిరాకారుడు. వారు సర్వాత్మల తండ్రి వారిని గురి౦చి సర్వవ్యాపి అని అంటారు. మీరు మీ తండ్రిని ని౦దిస్తున్నారు. శివ-శంకరులను కలిపేశారు. ఎ౦తటి గ్లాని చేసేశారు! శివుడు పరమాత్మ. నేను దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేసేందుకే వస్తానని వారు చెప్తారు. మళ్లీ విష్ణువు రె౦డు రూపాలైన లక్ష్మీనారాయణులు రాజ్యము చేస్తారు. సత్య ఖండాన్ని స్థాపన చేసేవారు ఒకే సద్గురువే. వారు ఈ రథములో సారథిగా ఉన్నారు. వీరిని నందీ గణమని, భాగ్యశాలి రథమని కూడా అ౦టారు. అర్జునులైన మీకు చెప్తారు - యుద్ధ మైదానములో మిమ్ములను మాయ పై విజయులుగా చేసేందుకు నేను ఈ రథములో వచ్చాను. సత్యయుగములో రావణుడూ ఉ౦డడు, తగులబెట్టడమూ జరగదు. ఇప్పుడైతే రావణుని తగులబెడ్తూనే ఉ౦టారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఏ చిత్రాన్నీ(శరీరాన్నీ) స్మరణ చేయరాదు. విచిత్రుడైన త౦డ్రిని బుద్ధి ద్వారా స్మృతి చేయాలి. బుద్ధి యోగమును పైన వ్రేలాడదీయాలి.
2. వాపస్ ఇ౦టికి వెళ్లాలి కనుక దేహ సహితంగా పాత వస్తువులన్నిటి పైన మమకారాన్ని తొలగి౦చుకోవాలి. సంపూర్ణ పావనంగా అవ్వాలి.
వరదానము :- ''సంస్కారాలను నిర్మూలించుకునేందుకు, కలుపుకునేందుకు సదా సిద్ధంగా ఉండే ఆత్మిక సేవాధారీ భవ ''
ఎలాగైతే
స్థూల సేవలో సదా ఎవర్‌రెడీగా ఉంటారో, ఎక్కడకు పిలిస్తే అక్కడకు
చేరిపోతారో, అలా మనసు ద్వారా కూడా ఏ సంకల్పాన్ని ధారణ చేయాలనుకుంటారో
అందులో కూడా ఎవర్‌రెడీగా ఉండండి. ఏదైతే ఆలోచిస్తారో దానిని వెంటనే అదే
సమయంలో చేసేయండి. ఆత్మిక సేవాధారీ పిల్లలు ఆత్మిక సంబంధాన్ని, ధర్మాన్ని
నిభాయించడంలో ఎవర్‌రెడీగా ఉండండి. అప్పుడు వారికి సంస్కారాన్ని
నిర్మూలించుకునేందుకు లేక సంస్కారాన్ని కలుపుకునేందుకు సమయం పట్టదు. తండ్రి
సంస్కారము ఎలా ఉందో, మీ సంస్కారము కూడా అలాగే ఉండాలి. ఈ సంస్కార మిలనమే
అతి పెద్ద రాస్(నృత్యము).
స్లోగన్ :- ''పవిత్రత యొక్క రాయల్టీని అనుభవం చేసి చేయించడమే రాయల్ ఆత్మల గుర్తు''
No comments:
Post a Comment