09-02-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
''మధురమైన
పిల్లలారా - ఉదయము ఉదయమే లేచి గాఢమైన ప్రేమతో బాబాకు గుడ్‌మార్నింగ్
చెప్పండి, తర్వాత జ్ఞాన చింతన చేస్తే ఖుషీ పాదరస మీటరు పైకెక్కి ఉంటుంది''
ప్రశ్న :- ఆక్యురేట్(కరెక్ట్, ఖచ్ఛితమైన) స్మృతి అనగా ఏమిటి ? దాని గుర్తులేవి ?
జవాబు :- ధైర్యము(ఓర్పు)
2. గంభీరత 3. వివేకము(జ్ఞానము/తెలివి)....... వీటి ద్వారా తండ్రిని స్మృతి
చేయడమే ఖచ్ఛితమైన స్మృతి. ఎవరైతే యదార్థముగా స్మృతి చేస్తారో, వారికి
కరెంటు(శక్తి) ఎక్కువగా లభిస్తుంది, పాప భారము తగ్గుతూ పోతుంది, ఆత్మ
సతోప్రధానమవుతూ ఉంటుంది, వారి ఆయువు పెరుగుతూ ఉంటుంది. వారికి బాబా నుండి
సర్చ్ లైట్ లభిస్తుంది.
ఓంశాంతి. తండ్రి
అంటున్నారు - మధురమైన పిల్లలూ, తత్ త్వం అనగా ఆత్మలైన మీరు కూడా
శాంతిస్వరూపులు. ఆత్మలైన మీ అందరి స్వధర్మమే శాంతి. శాంతిధామము నుండి
ఇచ్చటకు వచ్చి టాకీగా అవుతారు. పాత్ర చేసేందుకు మీకు ఈ కర్మేంద్రియాలు
లభిస్తాయి. ఆత్మ చిన్నదిగా - పెద్దదిగా అవ్వదు. శరీరము చిన్నదిగా,
పెద్దదిగా అవుతుంది. తండ్రి అంటున్నారు - నేను శరీరధారిని కాను. నేను
పిల్లలను సన్ముఖములో కలుసుకునేందుకు రావలసి వస్తుంది. ఒక తండ్రి
ఉన్నారనుకోండి. వారికి పిల్లలు జన్మిస్తే, ఆ పిల్లలు నేను పరంధామము నుండి
జన్మ తీసుకొని తల్లిదండ్రులను కలుసుకునేందుకు వచ్చానని అనరు. భలే ఏదైనా
నూతన ఆత్మ ఎవరి శరీరములో వచ్చినా లేక ఏదైనా పాత ఆత్మ ఎవరి శరీరములో
ప్రవేశించినా తల్లిదండ్రులను కలుసుకునేందుకు వచ్చానని అనరు. తల్లిదండ్రులు
వారికి ఆటోమేటిక్‌గా లభిస్తారు. ఇచ్చట ఇది నూతన విషయము. తండ్రి అంటున్నారు -
నేను పరంధామము నుండి వచ్చి పిల్లలైన మీ సన్ముఖములో ఉన్నాను. పిల్లలకు
మళ్లీ జ్ఞానమిస్తాను. ఎందుకంటే నేను జ్ఞానసాగరుడను, నాలెడ్జ్‌ఫుల్. నేను
పిల్లలైన మిమ్ములను చదివించేందుకు, రాజయోగము నేర్పేందుకు వస్తాను. రాజయోగము
నేర్పించేవారు భగవంతుడొక్కరే. కృష్ణుని ఆత్మకు ఈ ఈశ్వరీయ పాత్ర లేదు. ఎవరి
పాత్ర వారిదే. ఈశ్వరుని పాత్ర ఈశ్వరునిదే.
ఈ డ్రామా ఎంత అద్భుతంగా తయారయ్యిందో కూడా ఇప్పుడు మీరు అర్థం చేయిస్తారు. ఇది పురుషోత్తమ సంగమ యుగము. ఇంత మాత్రము గుర్తున్నా, మేము సత్యయుగములోకి వెళ్లేవారమని పక్కా అయిపోతుంది. ఇప్పుడు సంగమ యుగములో ఉన్నారు తర్వాత మన ఇంటికి వెళ్లాలి. ఇంటికి వెళ్లాలంటే తప్పక పావనంగా అవ్వాలి. లోపల చాలా సంతోషముండాలి. ఓహో! అనంతమైన తండ్రి చెప్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా, నన్ను స్మృతి చేస్తే మీరు సతోప్రధానంగా అవుతారు, విశ్వానికి అధికారులుగా అవుతారు. తండ్రి పిల్లలను ఎంతగానో ప్రేమిస్తారు. కేవలం టీచరు రూపములో చదివించి ఇంటికి వెళ్లిపోరు. వీరు తండ్రి కూడా అయ్యారు, టీచరు కూడా అయ్యారు. మిమ్ములను చదివించుటే కాక స్మృతియాత్రను కూడా నేర్పిస్తారు.
ఇలా విశ్వానికి అధిపతులుగా తయారు చేసే, పతితుల నుండి పావనంగా తయారు చేసే తండ్రి పై చాలా ప్రేమ ఉండాలి. ఉదయము ఉదయము లేస్తూనే మొట్టమొదట శివబాబాకు గుడ్‌మార్నింగ్ చెప్పాలి. మీరు ఎంత ప్రీతితో స్మృతి చేస్తారో, అంత సంతోషంగా ఉంటారు. మేము ఉదయము లేచి అనంతమైన తండ్రిని ఎంతగా స్మృతి చేస్తున్నాము? అని పిల్లలు తమ మనస్సులో ప్రశ్నించుకోవాలి. మనుష్యులు భక్తి కూడా ఉదయమే చేస్తారు కదా. భక్తి ఎంతో ప్రీతిగా చేస్తారు. కాని చాలామంది పిల్లలు హృదయ పూర్వక ప్రేమతో స్మృతి చేయరని బాబాకు తెలుసు. ఉదయమే లేచి బాబాకు గుడ్‌మార్నింగ్ చెప్పి, జ్ఞాన చింతనలో ఉంటే సంతోషపు పాదరస మీటరు పైకెక్కుతుంది. తండ్రికి గుడ్‌మార్నింగ్ చెప్పకుంటే పాపాల భారము ఎలా దిగిపోతుంది? ముఖ్యమైనది స్మృతి. దీని వలన మీ భవిష్యత్తు కొరకు చాలా గొప్ప సంపాదన జరుగుతుంది. కల్ప-కల్పాంతరము ఈ సంపాదన ఉపయోగపడ్తుంది. చాలా ఓర్పు(సహనము)తో, గంభీరంగా, జ్ఞానపూర్వకంగా స్మృతి చేయవలసి ఉంటుంది. మేము బాబాను చాలా స్మృతి చేస్తామని మొరటు లెక్కాచారంగా అంటారు. కాని ఖచ్ఛితమైన స్మృతి చేయడంలో శ్రమ ఉంది. ఎవరైతే తండ్రిని ఎక్కువగా స్మృతి చేస్తారో వారికి కరెంటు ఎక్కువగా లభిస్తుంది. ఎందుకంటే స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. యోగము, జ్ఞానము రెండూ వేరు వేరు విషయాలు. యోగ సబ్జెక్టు వేరే. ఇది చాలా భారీ సబ్జెక్టు. యోగము ద్వారానే ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. స్మృతి చేయకుంటే సతోప్రధానంగా అవ్వడం అసంభవము. మంచి రీతిగా ప్రీతితో తండ్రిని స్మృతి చేస్తే ఆటోమేటిక్‌గా కరెంట్ లభిస్తుంది. ఆరోగ్యవంతముగా తయారై పోతారు. కరెంటు(శక్తి) వలన ఆయువు కూడా వృద్ధి చెందుతుంది. పిల్లలు స్మృతి చేస్తే బాబా కూడా సర్చిలైటును ఇస్తారు. తండ్రి ఎంతో గొప్ప ఖజానా పిల్లలైన మీకు ఇస్తారు.
శివబాబా మమ్ములను చదివిస్తున్నారని మధురమైన పిల్లలు పక్కాగా గుర్తుంచుకోవాలి. శివబాబా పతిత పావనులు. సద్గతిదాత కూడా అయ్యారు. సద్గతి అనగా స్వర్గములో రాజ్య పదవినిస్తారు. బాబా ఎంతో మధురమైనవారు. ఎంత ప్రీతిగా పిల్లలను కూర్చొని చదివిస్తారు! తండ్రి ఈ దాదా ద్వారా మనలను చదివిస్తారు. బాబా ఎంతో మధురమైనవారు. ఎంతగానో ప్రేమిస్తారు. ఏ కష్టమూ ఇవ్వరు. కేవలం నన్ను స్మృతి చేయండి. చక్రమును స్మృతి చేయండి అని చెప్తారు. తండ్రి స్మృతిలో హృదయము ఒక్కసారిగా శూన్యమైపోవాలి(పూర్తిగా నిల్చిపోవాలి). ఒక్క తండ్రి స్మృతే సతాయించాలి. ఎందుకంటే తండ్రి ద్వారా ఎంతో గొప్ప వారసత్వము లభిస్తుంది. స్వయాన్ని పరిశీలించుకోవాలి - నాకు తండ్రి పై ఎంత ప్రేమ ఉంది? నాలో దైవీగుణాలు ఎంతవరకు ఉన్నాయి? ఎందుకంటే పిల్లలైన మీరిప్పుడు ముళ్ల నుండి పుష్పాలుగా అవుతున్నారు. ఎంతెంత యోగములో ఉంటారో అంతంత ముళ్ళ నుండి పుష్పాలుగా, సతోప్రధానంగా అవుతూ పోతారు. పుష్పాలుగా తయారైన తర్వాత ఇచ్చట ఉండలేరు. పుష్పాల తోట అనగా స్వర్గము. ఎవరైతే చాలా ముళ్ళను పుష్పాలుగా చేస్తారో వారినే సత్యమైన సుగంధ పుష్పాలు అని అంటారు. ఎప్పుడూ ఎవ్వరికీ ముళ్ళు గుచ్చరు. క్రోధము కూడా చాలా పెద్ద ముల్లు. చాలామందికి దు:ఖమునిస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు ముళ్ళ ప్రపంచము నుండి ఆవలి తీరము పైకి వచ్చేశారు. మీరిప్పుడు సంగమ యుగములో ఉన్నారు. ఎలాగైతే తోటమాలి పుష్పాలను తీసి వేరే పాత్రలో ఉంచుతారో అలా పుష్పాలైన మిమ్ములను కూడా ఇప్పుడు సంగమ యుగమనే పాత్రలో వేరుగా ఉంచారు. తర్వాత పుష్పాలైన మీరు స్వర్గములోకి వెళ్ళిపోతారు. కలియుగములోని ముళ్ళు భస్మమైపోతాయి.
పారలౌకిక తండ్రి ద్వారా మనకు అవినాశి వారసత్వము లభిస్తుందని మధురమైన పిల్లలకు తెలుసు. సత్య సత్యమైన పిల్లలెవరైతే ఉన్నారో, ఎవరికి బాప్‌దాదా పై పూర్తి ప్రేమ ఉందో, వారికి చాలా సంతోషముంటుంది. మనము విశ్వానికి అధిపతులుగా అవుతాము. అయితే పురుషార్థము చేస్తేనే విశ్వానికి అధిపతులుగా చేయబడ్తారు. కేవలం మాటలతో అవ్వరు. అనన్య పిల్లలెవరైతే ఉన్నారో వారికి సదా ఇది గుర్తుంటుంది - '' మేము మా కొరకు మళ్లీ అదే సూర్యవంశీ, చంద్రవంశీ రాజధానిని స్థాపన చేస్తున్నాము''. తండ్రి అంటున్నారు - మధురమైన పిల్లలూ, మీరు ఎంతగా అనేకమందికి కళ్యాణము చేస్తారో, అంత మీకు ప్రతిఫలము లభిస్తుంది. చాలా మందికి దారి చూపుతే చాలామంది నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి. జ్ఞానరత్నాలతో ఒడిని నింపుకొని ఇతరులకు దానము చేయాలి. జ్ఞానసాగరుడు మీకు రత్నాలతో కూడిన పళ్ళెములను నిండుగా నింపి నింపి ఇస్తారు. ఎవరైతే ఆ రత్నాలను దానము చేస్తారో వారే అందరికి ప్రియమనిపిస్తారు. పిల్లల ఆంతరికములో చాలా సంతోషముండాలి. తెలివి గల పిల్లలెవరైతే ఉన్నారో వారు మేము బాబా నుండి పూర్తి వారసత్వము తీసుకుంటామని అంటారు. తండ్రికి పూర్తిగా అతుక్కొని పోతారు. తండ్రి పై చాలా ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ప్రాణదానమిచ్చే తండ్రి లభించారని వారికి తెలుసు. జ్ఞాన వరదానాన్ని ఎలా ఇస్తారంటే దాని ద్వారా మనము ఎటువంటి వారము ఎలా తయారవుతాము! దివాలా నుండి సంపన్నంగా అవుతాము. భండారమును ఎంతో నిండుగా, భర్‌పూర్‌గా చేసేస్తారు. తండ్రిని ఎంత స్మృతి చేస్తారో, అంత ప్రేమ ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది. సూది శుభ్రంగా ఉంటే అయస్కాంతము వైపు లాగబడుతుంది కదా. తండ్రి స్మృతి ద్వారా తుప్పు వదులుతూ పోతుంది. ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ గుర్తుకు రాకూడదు. ఉదాహరణానికి స్త్రీకి తన పతి పట్ల ఎంత ప్రేమ ఉంటుంది! మీకు కూడా నిశ్చితార్థము జరిగింది కదా. నిశ్చితార్థపు ఖుషీ ఎప్పుడైనా తగ్గిపోతుందా? శివబాబా అంటున్నారు - మధురమైన పిల్లలూ! నాతో మీకు నిశ్చితార్థము (సగాయీ) జరిగింది. బ్రహ్మతో కాదు. సగాయీ(నిశ్చితార్థము) పక్కా అయిన తర్వాత వారి స్మృతే సతాయించాలి.
తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురమైన పిల్లలూ! పొరపాట్లు చేయకండి. అజాగ్రత్తగా ఉండకండి. స్వదర్శన చక్రధారులుగా అవ్వండి. లైట్ హౌస్‌గా అవ్వండి. స్వదర్శన చక్రధారులయ్యే అలవాటు బాగుంటే మీరు జ్ఞానసాగరుల వలె అయిపోతారు. ఉదాహరణానికి విద్యార్థులు బాగా చదువుకొని టీచరుగా అవుతారు కదా! మీ వ్యాపారమే ఇది. అందరినీ స్వదర్శన చక్రధారులుగా చేయండి. అప్పుడే చక్రవర్తి రాజా-రాణులుగా అవుతారు. అందువలన బాబా సదా పిల్లలను ఇలా అడుగుతారు - '' పిల్లలూ, స్వదర్శన చక్రధారులై కూర్చొని ఉన్నారా? తండ్రి కూడా స్వదర్శన చక్రధారిగా ఉన్నారు కదా. మధురమైన పిల్లలైన మిమ్ములను వాపసు తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. పిల్లలైన మీరు లేకుంటే నాకు కూడా విశ్రాంతి ఉండదు, సుఖముండదు. సమయము వచ్చినప్పుడు అన్‌ఈజీ (బే ఆరామి)గా అవుతుంది. ఇప్పుడే పోవాలనిపిస్తుంది. పిల్లలు చాలా పిలుస్తారు. ఎందుకంటే చాలా దు:ఖములో ఉన్నారు. జాలి కలుగుతుంది. ఇప్పుడు పిల్లలైన మీరు ఇంటికి రావాలి. మళ్లీ అచ్చట నుండి మీ అంతకు మీరే సుఖధామానికి వెళ్ళిపోతారు. అచ్చట నేను మీకు సాథీగా(సహచరునిగా) ఉండను. మీ స్థితి అనుసారము మీ ఆత్మ వెళ్లిపోతుంది.
పిల్లలైన మీకు మేము ఆత్మిక విశ్వ విద్యాలయములో చదువుతున్నామనే నషా ఉండాలి. మనము ఈశ్వరీయ విద్యార్థులము, మనము మనుష్యుల నుండి దేవతలు లేక విశ్వానికి అధిపతులుగా అయ్యేందుకు చదువుతున్నాము. ఈ చదువు ద్వారా మనము అన్ని డిగ్రీలను పొందుకుంటాము. హెల్త్ ఎడ్యుకేషన్(ఆరోగ్యవంతులుగా అయ్యేందుకు చదువు) కూడా చదువుకుంటాము. క్యారెక్టర్ చక్కదిద్దుకునే జ్ఞానము కూడా చదువుకుంటాము. హెల్త్ మినిస్ట్రీ, ఫుడ్ మినిష్ట్రీ, ల్యాండ్ మినిష్ట్రీ, బిల్డింగ్ మినిష్ట్రీ అన్ని మినిష్ట్రీలు ఇందులో వచ్చేస్తాయి. మీరు చాలా పెద్ద ట్రిజరర్(కోశాధికారి) కూడా. మీ వద్ద ఉండే ఖజానా వంటి అమూల్య ఖజానాలు ఇతరులెవ్వరి వద్ద ఉండజాలవు. ఈ విధంగా పిల్లలైన మీరు విచార సాగర మథనము చేసి ఆత్మిక నషాలో ఉండాలి.
మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు - ఏదైనా సభలో ఉపన్యసించునప్పుడు లేక ఎవరికైనా అర్థము చేయించునప్పుడు మాటి మాటికి స్వయాన్ని ఆత్మగా భావించి పరమపిత పరమాత్మను స్మృతి చేయండి, ఈ స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశమౌతాయి, మీరు పావనమైపోతారు. మాటి మాటికి ఇది స్మృతి చేయమని చెప్పండి. కాని ఇది కూడా మీరు స్వయం స్మృతిలో ఉన్నప్పుడు మాత్రమే ఇతరులకు చెప్పగలరు. ఈ విషయములో పిల్లలు చాలా బలహీనంగా ఉన్నారు. స్మృతిలో ఉండి అర్థం చేయించినప్పుడే ఇతరుల పై ప్రభావము ఏర్పడ్తుంది. మీరు ఎక్కువగా మాట్లాడరాదు. ఆత్మాభిమానులై కొద్దిగా అర్థం చేయించినా బాణము తగులుతుంది. తండ్రి అంటున్నారు - మధురమైన పిల్లలూ, గతించినది గతించిపోయింది(గతం గత:). ఇప్పుడు మొదట మిమ్ములను మీరు చక్కదిద్దుకోండి. స్వయం స్మృతి చేయకుండా ఇతరులకు చెప్తూ ఉంటే, ఈ మోసము కొనసాగదు. లోపల మనసులో తప్పక తింటూ ఉంటుంది. తండ్రితో సంపూర్ణ ప్రేమ లేకుంటే శ్రీమతమును అనుసరించలేరు. అనంతమైన తండ్రి ఇచ్చు శిక్షణలను ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. తండ్రి అంటున్నారు - మధురమైన పిల్లలారా! ఈ పాత ప్రపంచాన్ని ఇప్పుడు మర్చిపోండి. చివరిలో ఇదంతా ఎలాగైనా మర్చిపోవాల్సిందే. బుద్ధి మన శాంతిధామము, సుఖధామములో తగుల్కుంటుంది. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ తండ్రి వద్దకు వెళ్ళిపోవాలి. పతితాత్మలు వెళ్ళలేరు. అది పావనాత్మల ఇల్లు. ఈ శరీరము పంచ తత్వాలతో చేయబడింది. కావున పంచ తత్వాలు ఇచ్చట ఉండేందుకు ఆకర్షిస్తాయి. ఎందుకంటే ఆత్మ ఈ ఆస్తి తీసుకున్నట్లు ఉంది. అందువలన శరీరములో మమకారము ఏర్పడింది. ఇప్పుడు దాని పై మమకారము తొలగించి మన ఇంటికి వెళ్ళాలి. అచ్చట ఈ 5 తత్వాలు లేనే లేవు. సత్యయుగములో కూడా శరీరము యోగ బలముతో తయారవుతుంది. ప్రకృతి సతోప్రధానంగా ఉంటుంది. అందువలన ఆకర్షించదు, దు:ఖముండదు. ఇవన్నీ అర్థము చేసుకునే చాలా సూక్ష్మమైన విషయాలు. ఇచ్చట 5 తత్వాల బలము ఆత్మను లాగుతూ ఉంటుంది. అందువలన శరీరాన్ని వదిలేందుకు మనసు రాదు, ఇష్టపడదు. లేకుంటే దీనిని వదిలేందుకు ఇంకా ఎక్కువ సంతోషముండాలి. పావనమై వెన్నలో నుండి వెంట్రుక తీసినంత సులభంగా శరీరాన్ని వదిలేస్తారు. అందువలన శరీరము నుండి, అన్ని వస్తువుల నుండి మమకారము పూర్తిగా తొలగించుకోవాలి. వీటితో మనకెలాంటి సంబంధము లేదు. మనము బాబా వద్దకు వెళ్ళిపోతాము. అంతే చాలు. ఈ ప్రపంచంలో మన లగేజి అంతా సర్దుకొని ముందే పంపించేశాము. జతలో తీసుకెళ్ళలేము. కేవలం ఆత్మలు మాత్రమే వెళ్ళాలి. శరీరాన్ని కూడా ఇక్కడే వదిలేయాలి. బాబా నూతన శరీరాన్ని సాక్షాత్కారం చేయించారు. వజ్ర వైఢూర్యాల భవనాలు లభిస్తాయి. ఇటువంటి సుఖధామములోకి వెళ్లేందుకు ఎంత శ్రమ చేయాలి! అలసిపోరాదు. రాత్రింబవళ్లు చాలా సంపాదించాలి. అందువలన బాబా అంటున్నారు - నిద్రను జయించే పిల్లలూ, నన్నొక్కరినే స్మృతి చేయండి. విచార సాగర మథనము చేయండి. డ్రామా రహస్యము బుద్ధిలో ఉంచుకుంటే బుద్ధి పూర్తిగా శీతలమైపోతుంది. మహారథి పిల్లలెవరైతే ఉన్నారో వారెప్పుడూ చలించరు. శివబాబాను స్మృతి చేస్తే వారే సంభాళన కూడా చేస్తారు.
తండ్రి పిల్లలైన మిమ్ములను దు:ఖము నుండి విడుదల చేయించి శాంతిని దానముగా ఇస్తారు. మీరు కూడా శాంతిని దానముగా ఇవ్వాలి. మీ అనంతమైన శాంతి అనగా యోగబలము. ఇతరులను కూడా పూర్తిగా శాంతపరుస్తుంది. వెంటనే వీరు మన కుంటుంబములోని వారా కాదా అని తెలిసిపోతుంది. ఆత్మకు వెంటనే వీరు నా బాబా అని ఆకర్షణ కలుగుతుంది. నాడి కూడా చూడవలసి వస్తుంది. తండ్రి స్మృతిలో ఉండి ఈ ఆత్మ మన కులానికి చెందిందా లేదా అని గమనించండి. ఒకవేళ మన కుటుంబానికి చెందిన వారైతే పూర్తిగా శాంతమైపోతారు. ఎవరైతే ఈ కులానికి చెందిన వారిగా ఉంటారో, వారికి మాత్రమే ఈ విషయాలలో అభిరుచి కలుగుతుంది. పిల్లలు స్మృతి చేస్తే తండ్రి కూడా ప్రేమిస్తారు, ఆత్మను ప్రేమించాలి. ఎవరైతే ఎక్కువగా భక్తి చేశారో, వారే ఎక్కువగా చదువుకుంటారని కూడా తెలుసు. తండ్రి పై ఎంత ప్రేమ ఉందో వారి ముఖము ద్వారా తెలిసిపోతుంది. ఆత్మ తండ్రిని చూస్తుంది. తండ్రి ఆత్మలమైన మనలను చదివిస్తున్నారు. తండ్రి కూడా చెప్తున్నారు - నేను ఇంత చిన్న బిందువును, ఆత్మను చదివిస్తున్నాను. పోను పోను మీకే ఈ స్థితి కలుగుతుంది. నేను ఆత్మను, ఈ ఆత్మను చదివిస్తున్నానని భావిస్తారు. ముఖము సోదరిది అయినా దృష్టి ఆత్మ వైపుకు వెళ్ళాలి. శరీరము పైకి దృష్టి అస్సలు వెళ్ళరాదు. అందులో చాలా శ్రమ ఉంది. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. ఇది చాలా ఉన్నతమైన చదువు. తూకము వేస్తే ఈ చదువు ఉన్న వైపు చాలా భారీగా అయిపోతుంది. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1.
గతం గత: అయిపోయిందేదో అయిపోయిందని భావిస్తూ మొదట మిమ్ములను మీరు పరివర్తన
(బాగు) చేసుకోవాలి. ఆత్మాభిమానులుగా ఉండేందుకు శ్రమ చేయాలి. ఎక్కువగా
మాట్లాడరాదు.
2.
మీ జోలెను జ్ఞాన రత్నాలతో నింపుకొని వాటిని దానము చేసి అనేకమంది కళ్యాణము
చేసేందుకు నిమిత్తులుగా అవ్వాలి. అందరికీ ప్రియంగా అవ్వాలి. అపారమైన ఖుషీలో
ఉండాలి.
వరదానము :- ''యధార్థమైన శ్రేష్ఠమైన హ్యాండ్‌లింగ్ ద్వారా అందరి ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునే సర్వుల స్నేహీ భవ''
ఎలాగైతే
తండ్రి పిల్లల బలహీనతలను చూడకుండా ఒకప్పుడు మీరే నా వారిగా ఉండేవారు,
ఇప్పుడు నా వారిగా అయ్యారు, సదా నా వారిగానే అవుతారు అని ధైర్యాన్ని
పెంచారో, అలా మీరు కూడా తండ్రిని అనుసరించండి. ప్రతి ఒక్కరిలోని విశేషతలను
చూస్తూ సంబంధ-సంపర్కములోకి వస్తే ఆత్మలలో స్వతహాగా ఆత్మిక ప్రేమ
బహిర్గతమవుతుంది. అంతేకాక తండ్రితో పాటు అందరికి స్నేహీలుగా అవుతారు.
ఎక్కడైతే ఆత్మిక స్నేహముంటుందో, అక్కడ సదా అందరి ద్వారా సద్భావన, సహయోగ
భావన స్వతహాగానే ఆశీర్వాదాల రూపంలో ప్రాప్తి అవుతాయి. దీనినే యధార్థమైన
ఆత్మిక హ్యాండ్‌లింగ్(ఆత్మిక భావంతో సంభాళించడం) అని అంటారు.
స్లోగన్ :- ''శ్రేష్ఠ సంకల్పాల ఏకాగ్రత ద్వారా భ్రమిస్తున్న ఇతరుల బుద్ధిని ఏకాగ్రము చేయడమే సత్యమైన సేవ''
No comments:
Post a Comment