Friday, 3 November 2017

Telugu Murlis 01/10/2017

01-10-2017 అవ్యక్త బాప్‌దాదా ఓంశాంతి రివైజ్‌: 15-01-1983 మధువనము

'' సహజయోగులు మరియు ప్రయోగీల వ్యాఖ్య (అర్థము) ''
ఈ రోజు బాప్‌దాదా తన సహయోగి భుజాలను చూస్తున్నారు. నా సహయోగి భుజాలు శ్రేష్ఠమైన కార్యాన్ని ఎలా సఫలం చేస్తున్నారో చూస్తున్నారు. ప్రతీ భుజము దివ్యమైన అలౌకిక కార్యము చేసే వేగాన్ని చూసి బాప్‌దాదా సంతోషించి ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. కొన్ని భుజాలు సదా అలసట లేకుండా శ్రేష్ఠమైన ఉత్సాహ-ఉల్లాసాలతో, తీవ్ర గతితో సహయోగులుగా ఉన్నారు. మరి కొన్ని భుజాలు పని చేస్తూ ఉంటారు అయితే మధ్య-మధ్యలో ఉత్సాహ-ఉల్లాసాల తీవ్రగతిలో తేడా వచ్చేస్తుంది(వేగం తగ్గిపోతుంది). బాప్‌దాదా చూస్తూ ఉంటారు. కానీ సదా అలసట లేని తీవ్రగతి కల్గిన భుజాల ఉత్సాహ-ఉల్లాసాలను చూస్తూ, చూస్తూ స్వయం వారు కూడా మళ్లీ తీవ్ర వేగంతో కార్యం చేయడం మొదలు పెడ్తారు. పరస్పర సహయోగంతో వేగాన్ని తీవ్రంగా తయారు చేసుకుంటూ నడుస్తున్నారు.
బాప్‌దాదా ఈ రోజు మూడు రకాలైన పిల్లలను చూస్తున్నారు. ఒక రకము - సదా సహజ యోగులు, రెండవ రకము - ప్రతి విధిని(పద్ధతిని) మాటిమాటికీ(ప్రతిసారి) ప్రయోగించే ప్రయోగి పిల్లలు. మూడవ రకము - సహయోగులు. మూడు రకాల వారూ యోగులే కాని రకరకాల స్టేజికి చెందినవారుగా ఉన్నారు. సమీప సంబంధము, సర్వ ప్రాప్తులు ఉన్న కారణంగా సహజయోగులు సదా సహజయోగాన్ని స్వతహాగా అనుభవం చేస్తారు. సదా సమర్థ స్వరూపంగా ఉన్న కారణంగా నేను బాబా దానినే అను నషాను సదా అనుభవం చేస్తారు. నేను ఒక ఆత్మను, నేను తండ్రి పుత్రుడను అని స్వయానికి జ్ఞాపకం ఇప్పించుకోవాల్సిన అవసరం వారికి ఉండదు. నేను సదా బాబా వాడినే అని నిశ్చయం చేసుకొని స్వయం అనుభవం యొక్క నషాలో ప్రాప్తి స్వరూపులుగా ఉంటారు. సహజ యోగులకు అన్ని రకాల సిద్ధులు స్వతహాగానే అనుభవం అవుతాయి. అందువలన సహజ యోగులు ఎల్లప్పుడూ శ్రేష్ఠమైన ఉత్సాహ-ఉల్లాసాల సంతోషంలో ఏకరసంగా ఉంటారు. సహజ యోగులు సర్వ ప్రాప్తుల అధికారి స్వరూపంలో సదా శక్తిశాలి స్థితిలో స్థితులై ఉంటారు.
ప్రయోగం చేసే ప్రయోగి ఆత్మలు సదా ప్రతి స్వరూపాన్ని, ప్రతి పాయింటును, ప్రతి ప్రాప్తి స్వరూపాన్ని ప్రయోగము చేస్తూ ఆ స్థితిని అనుభవం చేస్తారు కానీ ఒకప్పుడు సఫలతను అనుభవం చేస్తారు, ఒకప్పుడు శ్రమను అనుభవం చేస్తారు. కానీ ప్రయోగీ ఆత్మగా ఉన్న కారణంగా బుద్ధి అభ్యాసం అనే ప్రయోగశాలలో బిజీగా ఉన్న కారణంగా 75% మాయ నుండి సురక్షితంగా ఉంటారు. కారణం? ప్రయోగి ఆత్మకు కొత్త కొత్త, రకరకాల అనుభవాలు చేసి చూడాలనే ఆసక్తి ఉంటుంది. ఈ ఆసక్తిలో నిమగ్నమై ఉన్న కారణంగా ప్రయోగశాలలో మాయ నుండి సురక్షితంగా ఉంటారు కానీ ఏకరసంగా ఉండరు. అప్పుడప్పుడు అనుభవము అయిన కారణంగా చాలా ఉత్సాహ- ఉల్లాసాలలో ఊగుతూ ఉంటారు. అప్పుడప్పుడు విధి ద్వారా సిద్ధి తక్కువగా ప్రాప్తించిన కారణంగా ఉత్సాహ-ఉల్లాసాలలో తేడా వచ్చేస్తుంది. ఉత్సాహ-ఉల్లాసాలు తక్కువైన కారణంగా శ్రమ అనుభవం అవుతుంది. అందువలన అప్పుడప్పుడు సహజ యోగులుగా, అప్పుడప్పుడు కష్టపడే యోగులుగా ఉంటారు. నేను 'అయ్యే ఉన్నాను' అనేదానికి బదులు 'నేను అయ్యాను' అని అంటారు. నేను ఆత్మను, నేను పుత్రుడను, నేను మాస్టర్‌ సర్వ శక్తివంతుడను అనే స్మృతుల ద్వారా సిద్ధిని పొందే ప్రయత్నం మాటిమాటికీ(ప్రతిసారి) చేయవలసి వస్తుంది. అందువలన అప్పుడప్పుడు ఏది అనుకున్నామో, అది అనుభవమయ్యింది అనే స్థితిలో స్థితులవుతారు. అప్పుడప్పుడు మాటిమాటికి ఆలోచించడం ద్వారా ఆ స్వరూపాన్ని అనుభవం చేస్తారు. ఇటువంటి వారిని ప్రయోగీ ఆత్మలని అంటారు. అధికార స్వరూపము అనగా సహజయోగీ స్వరూపము. మాటిమాటికి అధ్యయనం చేసే స్వరూపము అనగా ప్రయోగి అత్మ. కావున ఈ రోజు సహజ యోగులుగా ఎవరున్నారు? ప్రయోగులుగా ఎవరు ఉన్నారు? అని చూస్తున్నారు, ప్రయోగులు కూడా అప్పుడప్పుడు సహజయోగులుగా అయిపోతారు. కాని సదా అవ్వలేరు. ఏ సమయంలో ఏ పొజిషన్‌(స్థితి) ఉంటుందో దాని ప్రమాణంగా స్థూలమైన ముఖపు ఫోజులను (రూపాలను) కూడా మారుస్తూ ఉంటారు. మానసిక స్థితినీ చూస్తారు, ఫోజును కూడా చూస్తారు. రోజంతటిలో ఎన్ని ఫోజులు(భంగిమలు) మారుస్తారు! తమ భిన్న భిన్నమైన ఫోజుల గురించి తెలుసా? స్వయాన్ని సాక్షిగా అయ్యి చూసుకుంటున్నారా? బాప్‌దాదా సదా ఈ అనంతమైన ఆటను ఎప్పుడు కావాలంటే అప్పుడు చూస్తూ ఉంటారు.

ఇక్కడ లౌకిక ప్రపంచంలో రకరకాల ఫోజులను(భంగిమలను) నవ్వులాటలో స్వయమే చూసుకుంటారు. విదేశాలలో ఈ ఆట ఉంటుందా? ఇక్కడ ప్రాక్టికల్‌గా ఇలాంటి ఆట ఆడడం లేదు కదా! ఇక్కడ కూడా అప్పుడప్పుడు బరువెక్కిన కారణంగా లావుగా అయిపోతారు, అప్పుడప్పుడు చాలా ఆలోచించే సంస్కారం ఉన్న కారణంగా ఉన్నదాని కంటే పొడవుగా అయిపోతారు, అప్పుడప్పుడు మనసు బలహీనంగా, వ్యాకులతగా ఉన్న కారణంగా చిన్నబుచ్చుకొని స్వయాన్ని చాలా చిన్నగా ఉన్నట్లు చూసుకుంటారు. ఒకసారి చిన్నగా అయిపోతారు, మరొకసారి లావుగా అయిపోతారు, ఇంకొకసారి పొడవుగా అయిపోతారు. ఇలాంటి ఆట బాగుంటుందా?
డబల్‌ విదేశీయులందరూ సహజ యోగులుగా ఉన్నారా? ఈ రోజు చార్టు సహజయోగి చార్టుగా ఉందా? కేవలం ప్రయోగము చేసే ప్రయోగులుగా లేరు కదా? డబల్‌ విదేశీయులు మధువనం నుండి సదాకాలం కొరకు సహజయోగులుగా ఉండే అనుభవం తీసుకొని వెళ్తున్నారా? మంచిది - సహయోగులు కూడా యోగులే. వీరి గురించి తర్వాత వినిపిస్తాను.

టీచర్లందరూ క్రింద హాలులో మురళి వింటున్నారు -

బాప్‌దాదాతో పాటు నిమిత్త సేవాధారులనండి, నిమిత్త టీచర్లు అనండి, ఈ రోజు సాథీల గ్రూప్‌ కూడా వచ్చింది కదా! చిన్న వారైతే ఇంకా ఎక్కువ ప్రియంగా ఉంటారు. క్రింద ఉన్నప్పటికీ అందరూ పైననే కూర్చొని ఉన్నారు. చిన్నవారు కానీ లేక పెద్దవారు కానీ ధైర్యం పెట్టు పెట్టుకునే వారికి, సేవాక్షేత్రంలో స్వయాన్ని సదా బిజీగా ఉంచుకునే సేవాధారులకు బాప్‌దాదా చాలా చాలా ప్రియస్మృతులు ఇస్తున్నారు. త్యాగులుగా అయ్యి అనేకమంది భాగ్యాన్ని తయారు చేసేందుకు నిమిత్తంగా తయారుచేసే సేవాధారులను బాప్‌దాదా త్యాగం గల విశేష ఆత్మలుగా చూస్తున్నారు. ఇలాంటి విశేష ఆత్మలకు విశేష రూపంతో శుభాకాంక్షలతో పాటు ప్రియ స్మృతులు. డబల్‌ అద్భుతం ఏమిటి? ఒకటేమో తండ్రిని తెలుసుకునే అద్భుతం చేశారు. దూరదేశం అయినా, ధర్మాల తెర, ఆచార సాంప్రదాయాలు, ఆహార పానీయాలు అన్నిటిలో అంతరం ఉన్నా తండ్రిని తెలుసుకున్నారు. అందువలన డబల్‌ అద్భుతం. తెర లోపల దాగి ఉండేవారు సేవ చేసేందుకు ఇప్పుడు జన్మ తీసుకున్నారు. పొరపాటు చెయ్యలేదు, కాని డ్రామానుసారంగా సేవకు నిమిత్తంగా అయ్యి నలువైపులకు చెదిరిపోయారు. లేకపోతే ఇన్ని విదేశాలలో సేవ ఎలా జరుగుతుంది? కేవలం సేవ కొరకే మీరు కొద్ది సమయం కొరకు నామమాత్రం లెక్కా ఖాతాలు జోడించారు. అందువలన డబల్‌ అద్భుతం చూపించే వారికి, సదా తండ్రి స్నేహానికి ఛాత్రకులుగా ఉన్నవారికి, సదా హృదయపూర్వకంగా నా బాబా అని పాటలు పాడేవారికి, వెళ్ళాలి-వెళ్ళాలి అని12 నెలలు ఇదే ధ్యాసలో ఉండేవారికి, ధైర్యం పెట్టుకొని బాప్‌దాదాకు సహాయకులుగా అయ్యే పిల్లలకు ప్రియ స్మృతులు మరియు నమస్తే.

సేవాధారీ సోదరీ-సోదరులతో :-

మహాయజ్ఞంలో మహా సేవాప్రసాదం తిన్నారా? ప్రసాదం ఎప్పుడూ తక్కువగా అయ్యేది లేదు. ఇలాంటి అవినాశి మహా ప్రసాదం ప్రాప్తి చేసుకున్నారా? ఎంత వెరైటీ ప్రసాదం లభించింది! సదా కాలం కొరకు సంతోషం, సదాకాలం కొరకు నషా అనుభూతి, ఇలాంటి అన్ని రకాల ప్రసాదం పొందారా? ప్రసాదాన్ని పంచుకొని తింటారు కదా! ప్రసాదాన్ని కళ్ళకు, మస్తకానికి అద్దుకొని తింటారు. కావున ఈ ప్రసాదం కళ్ళల్లో ఇమిడిపోవాలి, మస్తకంలో స్మృతి స్వరూపంగా అయిపోవాలి అనగా ఇమిడిపోవాలి. ఇలాంటి ప్రసాదం ఈ మహాయజ్ఞంలో లభించిందా? మహా ప్రసాదం తీసుకునేవారు ఎంత గొప్ప మహాభాగ్యవంతులు! ఇలాంటి అవకాశం ఎంత మందికి లభిస్తుంది? చాలా కొద్ది మందికి లభిస్తుంది. ఆ కొద్ది మందిలో మీరు ఉన్నారు. కావున మహాభాగ్యవంతులుగా అయ్యారు కదా! ఇక్కడ తండ్రి మరియు సేవ తప్ప మూడవది ఏదీ గుర్తు లేదు. కావున ఇక్కడి అనుభవాన్ని సదా స్థిరంగా ఉంచుకోండి. ఎక్కడకు వెళ్ళినా అక్కడి నుండి విశేషించి ఏదో ఒక స్మృతి చిహ్నాన్ని తీసుకొని వెళ్తారు కదా! మధువనం యొక్క విశేష స్మృతి చిహ్నం ఏమి తీసుకొని వెళ్తారు? నిరంతరం సర్వ ప్రాప్తి స్వరూపులుగా అయ్యి ఉంటారు. అక్కడకు వెళ్ళిన తర్వాత కూడా ఇలాగే ఉంటారా? లేక వాతావరణం ఇలా ఉంది, సాంగత్యం అలా ఉంది అని అంటారా? పరివర్తన భూమి నుండి పరివర్తనై వెళ్ళాలి. వాయుమండలం ఎలా ఉన్నా మీరు తమ శక్తితో పరివర్తన చేసుకోండి. ఇంత శక్తి ఉంది కదా! వాయుమండలం ప్రభావం మీ పై ఉండరాదు. అందరూ సంపన్నంగా అయ్యి వెళ్ళాలి. మంచిది.

మాతలతో :-

మాతల కొరకు అయితే చాలా సంతోషించే విషయము. ఎందుకంటే తండ్రి మాతల కోసమే వచ్చారు. గోపాలునిగా అయ్యి గో మాతల కొరకు వచ్చారు. దీని స్మృతిచిహ్నమే గాయనం చేయబడింది. ఎవరినైతే ఎవ్వరూ యోగ్యులుగా భావించలేదో వారినే అనగా మిమ్ములనే తండ్రి యోగ్యులుగా భావించారు. ఇదే సంతోషంలో సదా ఎగురుతూ వెళ్లండి. దు:ఖం కలిగించే ఏ అలా రాజాలదు. ఎందుకంటే సుఖసాగరుని పిల్లలుగా అయిపోయారు. సుఖ సాగరంలో ఇమిడిపోయే వారికి ఎప్పుడూ దు:ఖం కలిగించే అల రాజాలదు. మీరు ఇలాంటి సుఖ స్వరూపులు.

01-10-2017 అవ్యక్త బాప్‌దాదా ఓంశాంతి రివైజ్‌: 21-01-1983 మధువనము

'' సంగమ యుగములో తండ్రి మరియు బ్రాహ్మణులు సదా జత జతలో ఉంటారు''

ఈ రోజు బాప్‌దాదా తమ కుడి భుజాలతో కేవలం కరచాలనం చేసేందుకు వచ్చారు. కరచాలానికి ఎంత సమయం పడ్తుంది? అందరూ కరచాలనం చేశారా? ఒక్క దృఢ సంకల్పం చేసి సత్యమైనప్రియునికి ప్రేయసులుగా అయితే అయిపోయారు. అప్పుడే విశ్వ సేవా కార్యాన్ని సంభాళించేందుకు నిమిత్తంగా అయ్యారు. ప్రతిజ్ఞ దృఢంగా ఉన్న కారణంగా బాప్‌దాదా కూడా ప్రతిజ్ఞ నిలబెట్టుకోవాల్సి వస్తుంది. ప్రతిజ్ఞ అయితే పూర్తి అయ్యింది కదా! అందరి కంటే చాలా సమీపంగా ఉన్న భగవంతుని స్నేహితులు ఎవరు? మీరందరు భగవంతునికి అతి సమీపంగా ఉన్న స్నేహితులు, ఎందుకంటే సమానమైన కర్తవ్య నిర్వహణలో ఉన్నారు. ఎలాగైతే తండ్రి అనంతమైన సేవ కొరకు ఉన్నారో అలా మీరు కూడా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ అనంతమైన సేవాధారులుగానే ఉన్నారు. ఈ రోజు ముఖ్యంగా చిన్న చిన్న స్నేహితుల కోసం విశేషించి వచ్చారు. ఎందుకంటే చిన్న వారే కానీ బాధ్యత అయితే పెద్దదే తీసుకున్నారు కదా! అందువలన చిన్నగా ఉన్న స్నేహితులు ఎక్కువ ప్రియంగా ఉంటారు. ఇప్పుడైతే ఎలాంటి ఫిర్యాదు లేదు కదా. మంచిది(అక్కయ్యలందరూ పాట పాడారు - చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకోవాల్సి వస్తుంది అనే పాట.)

బాప్‌దాదా ఎల్లప్పుడూ పిల్లల సేవలోనే నిమిగ్నమై ఉంటారు. ఇప్పుడూ తోడుగానే ఉన్నారు అంతేకాక సదా తోడుగానే ఉంటారు. కంబైండు(సంయుక్త) స్వరూపమే అయినప్పుడు కంబైండు స్వరూపాన్ని ఎవరైనా వేరు చేయగలరా? ఈ ఆత్మిక యుగళ్‌ స్వరూపము ఎప్పుడూ ఒకరి నుండి ఒకరు వేరుగా అవ్వలేరు. ఉదాహరణానికి బ్రహ్మబాబా మరియు దాదా(తాత) కంబైండుగా ఉన్నారు. వారిని వేరు చేయగలరా? కావున ఫాలో ఫాదర్‌ చేసే ''శ్రేష్ఠమైన బ్రాహ్మణులు మరియు తండ్రి'' కంబైండుగా ఉన్నారు. ఇక్కడకు రావడం మరియు వెళ్ళడం అనేది డ్రామాలోని డ్రామా. అనాది డ్రామా అనుసారంగా అనాది కంబైండు స్వరూపంగా సంగమ యుగములో అయ్యే ఉన్నారు. సంగమ యుగం ఉన్నంత వరకు తండ్రి మరియు శ్రేష్ఠ ఆత్మలు సదా జతలోనే ఉంటారు. అందువలన ఆటలో ఆట ఆడుతూ పాటలు భలే పాడుకోండి. నాట్యం చేయండి, పాడండి, నవ్వండి, హాయిగా ఉండండి. కానీ కంబైండు రూపాన్ని మర్చిపోకండి. బాప్‌దాదా అయితే మాస్టర్‌ శిక్షకులను చాలా శ్రేష్ఠమైన దృష్టితో చూస్తారు. బ్రాహ్మణులందరూ శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవారే. కాని ఎవరైతే మాస్టర్‌ శిక్షకులుగా అయ్యి తమ ప్రాణానికి ప్రాణంగా హృదయంతో, అనంతమైన ప్రేమతో(దిల్‌ వ జాన్‌, సిక్‌ వ ప్రేమ్‌ సే) రాత్రి పగలు సత్యమైన సేవకులుగా అయ్యి సేవ చేస్తారో వారు విశేషమైన వారిలో కూడా విశేషమైనవారు మరియు ఆ విశేషమైన వారిలో కూడా చాలా విశేషమైన వారిగా ఉంటారు. ఇంత గొప్పగా ఉన్న మీ స్వమానాన్ని సదా స్మృతిలో ఉంచుకుంటూ సంకల్పము, మాట మరియు కర్మలు చేయండి. మేము కంటిపాపలము, మస్తక మణులము, కంఠహారములోని విజయీ మణులము, తండ్రి పెదవుల పై చిరునవ్వు మేము అని సదా జ్ఞాపకం ఉంచుకోండి. ఈ విధంగా నలువైపుల నుండి వచ్చిన చిన్న చిన్న స్నేహితులు, ప్రియమైన పెద్ద స్నేహితులు లేక వచ్చిన పిల్లలందరూ తమ తమ పేరు సహితంగా ప్రియ స్మృతులను స్వీకరించండి. క్రింద కూర్చున్నవారు కావచ్చు, పైన కూర్చున్నవారు కావచ్చు, క్రింద ఉన్నవారు నయనాలలో ఉన్నారు. పైన ఉన్నవాళ్ళు నయనాలకు సన్ముఖంలో ఉన్నారు. అందువలన ఇప్పుడు ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నాము. ఇప్పుడు స్నేహితులందరికి, సాథీలందరికి ప్రియ స్మృతులు మరియు నమస్తే.

కొంచెం కొంచెం కలవడం బాగుంది. మీరందరు ఇదే ప్రతిజ్ఞ చేశారు కదా, (పాట - మమ్మల్ని వదిలి ఇప్పుడే వెళ్లొద్దు, ఎందుకంటే మా హృదయం ఇంకా నిండలేదు (తనివి తీరలేదు).......) హృదయం ఎప్పుడైనా నిండుతుందా? ఎంత మిలనం చేస్తే అంత హృదయం నిండుతుంది. మంచిది. దీదీ గారిని చూస్తూ బాగున్నావు కదా - సాకారంలో ఉన్నప్పుడు దీదీతో ప్రతిజ్ఞ చేశారు కావున ఇది కూడా నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. మీ హృదయం నిండిపోయినట్లయితే ఖాళీ చేయవలసి ఉంటుంది. అందువలన నింపుకుంటూనే ఉండడం బాగుంది.

దీదీ గారితో :- వీరి సంకల్పం ఎక్కువగా వచ్చింది. చిన్న చిన్న అక్కయ్యలైన మీ పై దాదీ దీదీకి ఎక్కువ ప్రేమ ఉంటుంది. దాదీ దీదీలు నిమిత్తంగా ఉన్నారు. వారికి మీ పై విశేషమైన ప్రేమ ఉంది. మంచి పని చేశారు. బాప్‌దాదా కూడా ఆఫరీన్‌ ఇస్తారు(ప్రశంసిస్తారు). ఏ ప్రేమతో మీకు ఈ అవకాశం లభించిందో ఆ ప్రేమతో కలవడం కూడా జరిగింది. నియమ ప్రమాణంగా రావడం గొప్ప విషయమేమీ కాదు. ఇప్పుడు విశేషమైన స్నేహానికి, విశేషమైన ప్రేమకు ప్రతిఫలం లభిస్తోంది. అందువలన ఏ ఉత్సాహముతో మీరు వచ్చారో అది డ్రామాలో మీ అందరికి చాలా మంచి సువర్ణ అవకాశంగా ఉంది. కనుక అందరు స్వర్ణిమ అవకాశాన్ని తీసుకున్న వారిగా(గోల్డెన్‌ ఛాన్స్‌లర్‌గా) అయ్యారు కదా. వారు కేవలం ఛాన్స్‌లర్‌గా ఉంటారు. మీరు స్వర్ణిమ ఛాన్స్‌లర్లు. మంచిది.

వరదానము :- ''సర్వ ఖజానాలను విధి పూర్వకంగా జమ చేసుకుని సంపూర్ణతా సిద్ధిని ప్రాప్తి చేసుకునే సిద్ధి స్వరూప భవ''
63 జన్మలు ఖజానాలన్నీ వ్యర్థంగా పోగొట్టుకున్నారు. ఇప్పుడు సంగమ యుగములో అన్ని ఖజానాలను యదార్థంగా, విధి పూర్వకంగా జమ చేసుకోండి. జమ చేసుకునే విధి ఏమంటే - ఏ ఏ ఖజానాలున్నాయో వాటిని స్వయం పట్ల, ఇతరుల పట్ల శుభ వృత్తితో కార్యంలో వినియోగించండి. కేవలం బుద్ధి అనే లాకర్‌లో జమ చేసుకోకండి. కానీ ఖజానాలన్నిటినీ కార్యంలో వినియోగించండి. వాటిని స్వయం పట్ల కూడా ఉపయోగించండి. లేకపోతే బలహీనులుగా(లూజ్‌గా) అయిపోతారు. అందువలన యాదార్థమైన విధితో జమ చేసుకుంటే సంపూర్ణతా సిద్ధిని ప్రాప్తి చేసుకొని సిద్ధి స్వరూపులుగా అయిపోతారు.

స్లోగన్‌ :- ''పరమాత్మ ప్రేమ అనుభవం అయినట్లయితే ఏ విఘ్నాలూ ఆపలేవు''

No comments:

Post a Comment