05-11-2017 అవ్యక్త బాప్‌దాదా ఓంశాంతి రివైజ్: 24-02-1983 మధువనము
''హృదయాభి రాముడైన తండ్రి తమ హృదయానికి ప్రియమైన పిల్లలతో మిలనం''
ఈ
రోజు విశేషంగా బాబాను కలుసుకోవాలని సదా ఉల్లాస-ఉత్సాహాలతో ఉండే పిల్లలను
కలుసుకునేందుకు వచ్చారు. పిల్లలకు రాత్రింబవళ్ళు బాబాతో మిలనం చేయాలని ఒకే
సంకల్పం ఉంటుంది. ఆకారీ రూపంలో కూడా మిలనం జరుపుకుంటారు. అయినా సాకార రూపం
ద్వారా కలవాలనే ఆశ కూడా ఉంటుంది. మేము ఈ రోజు కలుసుకుంటామని రోజులన్నీ
లెక్క పెడుతూ ఉంటారు. పిల్లల ప్రతి ఒక్కరి ఈ సంకల్పం బాప్‌దాదా వద్దకు
చేరుకుంటూ ఉంటుంది. బాప్‌దాదా కూడా ఇందుకు బదులు ఇచ్చేందుకు పిల్లలు ప్రతి
ఒక్కరిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. కావున ఈ రోజు మురళి వినిపించేందుకు
రాలేదు కాని కలుసుకోవాలనే పిల్లల సంకల్పాన్ని పూర్తి చేసేందుకు వచ్చారు.
కొంతమంది పిల్లలు తమ మనసులోనే మిమ్ములనైతే మాటల ద్వారా
పలకరించలేదని(కలుసుకోనివ్వలేదని) మధురాతి మధురమైన ఫిర్యాదులు కూడా
చేస్తారు. బాప్‌దాదా కూడా ప్రతి పుత్రునితో మనసు నిండేంత వరకు
కలుసుకోవాలనుకుంటారు, కానీ సమయాన్ని, మాధ్యమాన్ని చూడవలసి ఉంటుంది. ఆకారీ
రూపంలో అయితే ఒకే సమయంలో ఎంతమంది కావాలంటే, అంతమంది ఎంత సమయం కావాలంటే, అంత
సమయం కలుసుకోవచ్చు. దాని కొరకు టర్న్ వచ్చే అవసరం ఉండదు. కాని సాకార
సృష్టిలో సాకార తనువు ద్వారా కలిసేటప్పుడు సాకారీ ప్రపంచం మరియు సాకారీ
శరీర లెక్కను కూడా చూడవలసి ఉంటుంది. ఆకారీ వతనంలో కూడా ఫలానా గ్రూపువారు
ఫలానా రోజు కలుసుకోవాలని ఒక గంట తర్వాత, అరగంట తర్వాత కలుసుకునేందుకు
రావాలని ఎప్పుడైనా రోజులను నిర్ణయించడం జరుగుతుందా? ఈ బంధనం మీకు గాని,
తండ్రికి గాని సూక్ష్మవతనంలో సూక్ష్మ శరీరంతో ఉండదు. ఆకారీ రూపంతో మిలనం
జరుపుకోవడంలో అనుభవజ్ఞులే కదా! అక్కడ భలే రోజంతా కూర్చోండి, ఎవ్వరూ లేపరు.
ఇక్కడైతే ఇప్పుడు వెనుకకు వెళ్ళండి, ఇప్పుడు ముందుకు వెళ్ళండి అని అంటారు.
అయినా రెండు మిలనాలూ మధురమైనవే! డబుల్ విదేశీ పిల్లలైన మీరు లేక దేశంలో
ఉండే పిల్లలెవరైతే సాకారంలో డ్రామా అనుసారంగా పాలనను లేదా ప్రాక్టికల్
స్వరూపాన్ని చూడలేకపోయారు. అటువంటి చాలా సమయం నుండి వెతుకుతూ మళ్ళీ వచ్చి
కలుసుకున్న (అపురూపమైన) పిల్లల గుణగానం చేస్తారు. వారు వెనుక వచ్చినా ఆకార
రూపం ద్వారా కూడా సాకార రూపాన్ని అనుభవం చేస్తారు. అటువంటి అనుభవం ఆధారంతో
మేము సాకార బాబాను చూడలేదని మాకు అనిపించడంలేదని అంటారు సాకారంలో పాలన
తీసుకున్నారు మరియు ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు. కావున ఆకార రూపంలో
సాకారుని అనుభవం చేయడం ఇది బుద్ధి యొక్క లగ్నానికి, స్నేహానికి ప్రత్యక్ష
స్వరూపం. ఆకారంలో కూడా సాకారుని చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. అటువంటి
అనుభవం చేస్తున్నారు కదా! కావున ఇది పిల్లల బుద్ధి యొక్క చమత్కారానికి
ఋజువు.అయితే హృదయాభిరాముడైన తండ్రికి సమీపంగా ఉన్న హృదయాభి రాముని ప్రియమైన
పిల్లలుగా ఉన్నారనే దానికి ఇదే ఋజువు. ప్రియమైన పిల్లలు కదా! ప్రియమైన
వారిపైన సదా ఏ పాట మ్రోగుతూ ఉంటుంది? ''వాహ్ బాబా, వాహ్ నా బాబా...''
బాప్‌దాదా
ప్రతి పుత్రుని గుర్తు చేస్తున్నారు. ఫలానా వారిని జ్ఞాపకం చేసుకున్నారు,
నన్ను గుర్తు చేసుకున్నారో లేదోనని భావించకండి. వీరి పై ఎక్కువ ప్రేమ ఉంది,
నాపై తక్కువ ప్రేమ ఉందని అనుకోకండి. మీరే ఆలోచించండి, 5 వేల సంవత్సరాల
తర్వాత బాప్‌దాదాకు తప్పిపోయిన పిల్లలు లభించినప్పుడు 5 వేల సంవత్సరాల
ప్రేమ అంతా ఒకేసారి ప్రతి పుత్రునికి లభిస్తుంది కదా! కావున 5 వేల
సంవత్సరాల ప్రేమ 5-6 సంవత్సరాలలో లేదా 10-12 సంవత్సరాలలో ఇవ్వవలసినప్పుడు
పాత స్టాకును ఎంత కొద్ది సమయంలో ఇస్తారు! ఎక్కువలో ఎక్కువగా ఇచ్చినప్పుడే
పూర్తవుతుంది. ఇంత ప్రేమ పూరితమైన స్టాకు ప్రతి ఒక్క పుత్రుని కోసం తండ్రి
వద్ద ఉంది. ప్రేమ తక్కువ అవ్వజాలదు.
రెండవ విషయం - బాప్‌దాదా సదా
పిల్లల విశేషతలనే చూస్తారు. కొన్ని సమయాలలో పిల్లలు మాయా ప్రభావం కారణంగా
కొంచెం చలించే ఆట కూడా ఆడ్తారు. అయినా బాప్‌దాదా ఆ సమయంలో కూడా, ఈ
పుత్రుడు, వచ్చిన విఘ్నాన్ని లగ్నంతో దాటి మళ్ళీ విశేషాత్మగా అయ్యి విశేష
కార్యాన్ని చేసేవాడు అనే దృష్టితో చూస్తారు. విఘ్నంలో కూడా లగ్నం రూపాన్నే
చూస్తారు. కనుక ప్రేమ ఎలా తగ్గిపోతుంది! ప్రతి పుత్రుని పై సదా అపారమైన
ప్రేమ ఉంది మరియు ప్రతి పుత్రుడు సదా శ్రేష్ఠమే. అర్థమయిందా!
పార్టీలతో అవ్యక్త బాప్‌దాదా కలయిక
న్యూయార్క్
:- తండ్రికి చెందినవారుగా అవ్వడం అనగా విశేషాత్మలుగా అవ్వడం. ఎప్పటి నుండి
తండ్రివారిగా అయ్యారో, ఆ ఘడియ నుండి విశ్వంలో సర్వ శ్రేష్ఠమైన గాయన
యోగ్యులుగా, పూజ్యనీయ ఆత్మలుగా అయ్యారు. మీకు లభించే గౌరవాన్ని మీకు జరిగే
పూజలో మళ్ళీ చైతన్య రూపంలో చూస్తున్నారు మరియు వింటున్నారు కూడా. ఈ విధంగా
అనుభవం చేస్తున్నారా? ఎక్కడ భారతదేశం, ఎక్కడ అమెరికా! కాని తండ్రి ఆ మూల
నుండి ఎన్నుకొని ఒకే తోటలోకి తీసుకొచ్చారు.ఇప్పుడు మీరంతా ఎవరు? అల్లా
పూలతోటలోని ఆత్మిక గులాబీ పుష్పాలు. ఫలానా దేశం, ఫలానా దేశము అని ఇక్కడ
పేర్లు చెప్పవలసి వస్తుంది. వాస్తవానికి మీరంతా ఒకే తోటకు చెందినవారు. ఒకే
తండ్రి పాలనలోకి వచ్చే ఆత్మిక గులాబీ పుష్పాలు. మేమంతా ఒక్కరికి చెందిన
వారమని, మేమంతా ఒకే దారిలో నడిచి ఒకే గమ్యానికి వెళ్ళేవారమని ఇప్పుడు
అనుభవం అవుతోంది కదా! తండ్రి కూడా ప్రతి ఒక్కరిని చూసి హర్షిస్తున్నారు.
అందరి శుభ భావన, అందరి సేవలో అలసిపోని లగ్నము, దృఢ సంకల్పము ప్రత్యక్ష
ప్రమాణాన్ని ఇచ్చింది. నలువైపులా ఉత్సాహ-ఉల్లాసాల సహయోగం మంచి ఫలితాన్ని
చూపించింది. బయట నుండి వచ్చిన శబ్ధము భారతవాసులను మేల్కొల్పుతుంది, కావున
బాప్‌దాదా అభినందనలు తెలుపుతున్నారు.
బార్బడోస్ :- బాప్‌దాదా సదా
పిల్లలకు నంబర్‌వన్‌గా అయ్యే సాధనాన్ని తెలియజేస్తారు. ఎవరు ఎంత వెనకాల
వచ్చినా, ముందుకు వెళ్ళి మొదటి నంబరు తీసుకోవచ్చు. మాకు ఉన్నతమైన పాత్ర
ఉంటుందో ఉండదో, మేము ఎలా ముందుకు వెళ్తాము అని ఆలోచించడం లేదు కదా!
బాప్‌దాదా వద్దకు చివరిలో వచ్చిన వారికైనా, ఏ దేశానికి చెందిన వారికైనా, ఏ
ధర్మానికి చెందిన వారికైనా ఎటువంటి మాన్యతకు చెందినవారైనా అందరికి ఒకే
పూర్తి అధికారం ఉంది. తండ్రి ఒక్కరే అయినప్పుడు హక్కు కూడా అందరికీ ఒకే
విధంగా ఉంటుంది. కేవలం ధైర్యం మరియు లగ్నానికి చెందిన విషయము. ఎప్పుడూ
ధైర్య విహీనులుగా అవ్వకండి. ఎవరు ఎంత నిరుత్సాహ పరిచినా, మీకేమయిందో
తెలియదు... ఎక్కడికి వెళ్ళిపోయారు? అని అన్నా మీరు వారి మాటలను
పట్టించుకోకండి. పూర్తిగా గుర్తించి తెలుసుకునే వ్యాపారం చేశారు కదా! మేము
బాబావారము, బాబా మావారు. బాబా ప్రతి పుత్రునీ అధికారీ ఆత్మగా భావిస్తారు.
ఎవరు ఎంత తీసుకున్నా అందుకు ఎటువంటి ఆటంకము లేదు. ఇప్పుడింకా ఏ సీట్లూ
బుక్ అవ్వలేదు. ఇప్పుడు సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇంకా ఈల మోగనే లేదు.
అందువలన ధైర్యం చేస్తూ ఉంటే తండ్రి కూడా పదమాల రెట్లు(కోటాను కోట్లు) సహాయం
చేస్తూ ఉంటారు.
కెనడా :- సదా ఎగిరే కళలోకి వెళ్ళేందుకు ఆధారమేది?
డబల్ లైట్‌గా అవ్వడం కావున సదా ఎగిరే పక్షులుగా ఉన్నారు కదా! ఎగిరే పక్షి
ఎప్పుడూ ఎవరి బంధనంలోకి రాదు. క్రిందకు వచ్చినట్లయితే బంధనంలో
బంధింపబడ్తుంది. కావున సదా ఎగురుతూ ఉండండి. ఎగిరే పక్షి అనగా సర్వ బంధనాల
నుండి ముక్తులుగా, జీవన్ముక్తులుగా ఉండడం. కెనడాలో సైన్స్ కూడా ఎగిరే కళను
నేర్పిస్తుంది కదా! కావున కెనడా నివాసులు సదా ఎగిరే పక్షులు.
శాన్‌ఫ్రాన్సిస్కో
:- అందరూ స్వయాన్ని విశ్వంలో విశేష పాత్రను అభినయించే హీరో యాక్టర్లుగా
భావిస్తూ పాత్రను అభినయిస్తున్నారా?(అప్పుడప్పుడు). బాప్‌దాదాకు
అప్పుడప్పుడు అనే పిల్లల మాట విన్నప్పుడు ఆశ్చర్యమనిపిస్తుంది. సదా బాబా
తోడుగా ఉన్నప్పుడు సదా వారి స్మృతే ఉంటుంది కదా! స్మృతి చేసేందుకు బాబా
తప్ప ఇంకెవరు ఉన్నారు? ఎవరిని స్మృతి చేస్తారు? ఇతరులను స్మృతి చేస్తూ
చేస్తూ ఏమి పొందారు? ఎక్కడికి చేరుకున్నారో దీని అనుభవం కూడా ఉంది కదా. ఇది
కూడా అనుభవం చేసిన తర్వాత ఇప్పుడు తండ్రి తప్ప ఇతరుల స్మృతి ఎలా రాగలదు?
సర్వ సంబంధాలు ఒక్క తండ్రితో అనుభవం చేశారా? లేక ఇంకా ఏమైనా మిగిలిపోయాయా?
ఒక్కరి ద్వారా సర్వ సంబంధాలను అనుభవం చేయగలిగినప్పుడు అనేక వైపులకు వెళ్ళే
అవసరమే లేదు. దీనినే ''ఒకే బలం, ఒకే విశ్వాసము'' అని అంటారు. మంచిది.
అందరూ
బాగా శ్రమ చేసి విశేషాత్మలను సంపర్కములోకి తీసుకొచ్చారు. ఎవరైతే సేవలో
సహయోగమిచ్చారో ఆ సహయోగానికి ప్రతిఫలం అనేక జన్మల వరకు సహయోగం ప్రాప్తమవుతూ
ఉంటుంది. ఈ ఒక్క జన్మలో చేసిన శ్రమ ద్వారా అనేక జన్మల శ్రమ నుండి
విడుదలయ్యారు. సత్యయుగంలో ఏమైనా శ్రమ చేస్తారా! బాప్‌దాదా పిల్లల ధైర్యం
మరియు నిమిత్త భావాన్ని చూసి సంతోషిస్తారు. ఒకవేళ నిమిత్త భావంతో చేయకపోతే
ఫలితం కూడా వెలువడదు. మంచిది.
05-11-2017 అవ్యక్త బాప్‌దాదా ఓంశాంతి రివైజ్: 27-02-1983 మధువనము
'' సంగమ యుగంలో అలంకరించబడిన మధురమైన అలౌకిక మేళా (కలయిక) ''
ఈ
రోజు తండ్రి మరియు పిల్లల మిలన మేళాను జరుపుకుంటున్నారు. మేళాలో చాలా
వెరైటీ (భిన్నమైన) మరియు చాలా సుందరమైన వస్తువులు, చాలా సుందరమైన అలంకరణ
ఉంటుంది. అంతేకాక ఒకరినొకరు కలుసుకోవడం జరుగుతుంది. బాప్‌దాదా ఈ మధురమైన
మేళాలో ఏమి చూస్తున్నారు? ఇటువంటి అలౌకికంగా శృంగారించబడిన మేళా సంగమ
యుగంలో తప్ప ఇంకెప్పుడూ, ఎవరూ జరుపుకోలేరు. ప్రతి ఒక్కరు ఒకరికన్నా ఒకరు
విశేషంగా శృంగారించబడిన అమూల్య రత్నాలుగా ఉన్నారు. మీ శృంగారం గురించి
తెలుసు కదా! అందరి శిరస్సు పైన ఎంతో సుందరమైన లైట్(ప్రకాశం) కిరీటం
మెరుస్తోంది. తమ కిరీటధారీ స్వరూపాన్ని చూసుకుంటున్నారా? ప్రతి ఒక్కరు
దివ్య గుణాల శృంగారంతో ఎంతో సుందరంగా అలంకరింపబడిన మూర్తులుగా ఉన్నారు.
ఎటువంటి సుందరమైన శృంగారమంటే దీని ద్వారా విశ్వంలోని సర్వాత్మలు
వద్దనుకున్నా స్వతహాగానే ఆకర్షితులవుతారు. అలాంటి శ్రేష్ఠమైన అవినాశీ
శృంగారాన్ని చేసుకున్నారా? ఈ సమయంలోని మీ శృంగారానికి స్మృతి చిహ్నంగా, మీ
జడ చిత్రాలను కూడా భక్తులు చాలా సుందరాతి సుందరంగా అలంకరిస్తూ ఉంటారు.
ఇప్పటి శృంగారం ద్వారా అర్ధకల్పం జడచిత్రాల రూపంలో అలంకరించబడ్తారు.
ఇటువంటి శ్రేష్ఠమైన అవినాశీ శృంగారం బాప్‌దాదా ద్వారా పిల్లలందరికి ఇప్పుడు
జరిగింది. బాప్‌దాదా ఈ రోజు ప్రతి పుత్రుని మూడు స్వరూపాలు అనగా వర్తమానం
మరియు తమ రాజ్యానికి చెందిన దేవాత్మ స్వరూపాలు మరియు భక్తి మార్గంలోని
స్మృతి చిహ్నమైన చిత్రాలు ప్రతి ఒక్కరి ఈ మూడు స్వరూపాలను చూసి
హర్షిస్తున్నారు. మీరంతా మీ మూడు స్వరూపాలను గురించి తెలుసుకున్నారు కదా!
మీ మూడు రూపాలను జ్ఞాన నేత్రంతో చూశారు కదా!
ఈ రోజైతే బాప్‌దాదా
మిలనానికి సంబంధించిన ఫిర్యాదులను పూర్తి చేసేందుకు వచ్చారు. ఎవరైతే
నిర్బంధనుడిని కూడా బంధనంలో బంధిస్తారో ఆ పిల్లలదే అద్భుతమంతా. ఈ లెక్క
ప్రకారం కలవండి అని బాప్‌దాదాకు కూడా లెక్కలు నేర్పిస్తారు. కావున
ఇంద్రజాలికులుగా ఎవరయ్యారు? పిల్లలా లేక తండ్రియా? ఇటువంటి స్నేహమనే
ఇంద్రజాలాన్ని పిల్లలు తండ్రికి అంటిస్తారు. దీనితో తండ్రికి పిల్లలు
లేకపోతే తోచదు. నిరంతరం పిల్లలను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు. మీరందరూ
తింటున్నప్పుడు ఒక్కరినే ఆహ్వానిస్తారు, అయితే ఎంతమంది పిల్లలతో కలిసి
తినవలసి ఉంటుంది? ఎన్నిసార్లు భోజనానికి పిలుస్తారు? తింటారు, నడుస్తారు,
నడుస్తున్నప్పుడు కూడా చేతిలో చేయి వేసి నడుస్తారు. నిద్రపోతున్నా తోడుగానే
నిదురిస్తారు. కావున ఇంతగా అనేకమంది పిల్లలతో కలిసి తింటూ, నిద్రిస్తూ,
నడుస్తూ ఉంటే తీరికేమి ఉంటుంది? కొంతమంది ఏ కర్మను చేస్తున్నా కార్యం మీద
మేము నిమిత్తంగా ఉన్నామనే అంటారు. మీరు చేసి చేయించండి. నిమిత్తంగా చేతులను
మేము నడిపిస్తామని అంటారు. కావున ఇది కూడా చేయవలసి ఉంటుంది కదా? అంతేకాక
మళ్ళీ ఏ సమయంలోనైనా చిన్న-పెద్ద తుఫానులు వచ్చినా మీకే తెలియాలి అని
అంటారు. తుఫానులను తొలగించే కార్యాన్ని కూడా తండ్రికే ఇస్తారు. కర్మల
భారాన్ని కూడా తండ్రికే ఇస్తారు. సదా తోడుగా కూడా ఉంచుకుంటారు. కావున గొప్ప
ఇంద్రజాలికులుగా ఎవరయ్యారు? భుజాల సహయోగం లేకుండా ఏమీ జరగజాలదు. అందుకే
సదా మాలను జపిస్తారు!
ఆస్ట్రేలియా నివాసులైన పిల్లలు చాలా మంచి
త్యాగం చేశారు. అంతేకాక ప్రతిసారి త్యాగం చేస్తారు. సదా లాస్టు నుండి
ఫాస్టుగా వెళ్ళి ఫస్టులో వస్తారు. ఎంతగా వారు త్యాగం చేస్తారో ఇతరులను
ముందుంచుతారో అంతగానే ఎంతమంది కలుస్తూ ఉంటారో వారందరి షేర్(భాగం) కొద్ది
కొద్దిగా ఆస్ట్రేలియా వారికి కూడా లభిస్తుంది. కావున త్యాగం చేశారా లేక
భాగ్యాన్ని తీసుకున్నారా? తోడు-తోడుగా యు.కె. ది కూడా పెద్ద గ్రూపే. ఇవి
రెండూ మొట్టమొదట నిమిత్తంగా అయిన సెంటర్లు. చాలా విశాలమైన సెంటర్లు. ఒక
సెంటరు ద్వారా అనేక సెంటర్లలో తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలున్నారు.
అందువలన ఇరువురూ (ఆస్ట్రేలియా మరియు యు.కె.) పెద్దవారిని, ఇతరులను
ముందుంచవలసి ఉంటుంది. ఇతరుల సంతోషంతోనే మీరు సంతోషంగా ఉంటారు కదా! ఈ రెండు
స్థానాల్లోని సేవాధారులు సహయోగులు. స్నేహీ పిల్లలు అన్ని విషయాలలో ఎంత
విశాల హృదయులుగా ఉన్నారో చూడడం జరిగింది. ఈ విషయంలో కూడా సహయోగులుగా
అవ్వడంలో మహాదానీ పిల్లలున్నారు. బాప్‌దాదాకు పిల్లలందరు గుర్తున్నారు.
అందరితో కలుస్తారు. ఎంతో దూర-దూరాల నుండి కలుసుకోవాలనే ఉత్సాహంతో పిల్లలు
ఎగురుతూ ఎగురుతూ తమ మధురమైన ఇంటికి చేరుకోవడం చూసి బాప్‌దాదాకు
సంతోషమవుతుంది. భలే స్థూలంగా ఏ దేశానికి చెందినవారైనా అందరూ ఒకే దేశము
వారే, అందరూ ఒక్కటే. ఒకే తండ్రి, ఒకే దేశం, ఒకే మతం మరియు ఏకరస స్థితిలో
స్థితులై ఉండేవారు. ఇక్కడైతే కొద్ది సమయం కలవడానికి నిమిత్తమాత్రంగా దేశం
పేరు చెప్తారు. అందరూ ఒక దేశము వారే. సాకార లెక్కలో కూడా అందరూ ఈ సమయంలో
మధువన నివాసులుగా ఉన్నారు. తమను మధువన నివాసులుగా భావించుకోవడం
బాగుందనిపిస్తోంది కదా!
క్రొత్త స్థానంలో సేవలో సఫలతకు ఆధారం :-
ఎపుడైనా ఏ క్రొత్త స్థానంలోనైనా సేవ ప్రారంభించినట్లయితే ఒకే సమయంలో అన్ని
రకాల సేవలు చేయండి. మనసులో శుభ భావన, వాణీలో తండ్రితో సంబంధాన్ని
జోడింపజేసే మరియు శుభ కామనతో కూడిన శ్రేష్ఠమైన మాటలు మరియు సంబంధం -
సంపర్కంలో వచ్చినప్పుడు స్నేహం మరియు శాంతి స్వరూపంలో ఆకర్షించండి. ఈ
విధంగా అన్ని రకాల సేవల ద్వారా సఫలతను పొందుతారు. కేవలం వాణి ద్వారానే
కాదు, ఒకే సమయంలో అన్ని సేవలు తోడు తోడుగా జరగాలి. అటువంటి ప్లాన్లు తయారు
చేయండి. ఎందుకంటే ఎవరికైనా సేవ చేసేందుకు స్వయం స్థితిలో స్థితులవ్వవలసి
ఉంటుంది. సేవలో ఫలితమెలా ఉన్నా సేవలోని ప్రతి అడుగులో కళ్యాణం నిండి ఉంది.
ఒక్కరైనా ఇక్కడి వరకు చేరుకున్నా అందులో సఫలత అయితే ఇమిడిపోయి ఉంది. అనేక
ఆత్మల భాగ్య రేఖను గీసేందుకు నిమిత్తంగా ఉన్నారు. అటువంటి విశేష ఆత్మలుగా
భావించి సేవ చేస్తూ ఉండండి. మంచిది. ఓంశాంతి.
No comments:
Post a Comment