15-10-2017 అవ్యక్త బాప్‌దాదా ఓంశాంతి రివైజ్: 15-02-1983 మధువనము
''విశ్వశాంతి సమ్మేళనము సమాప్తి సమారోహములో ప్రాణమైన అవ్యక్త బాప్‌దాదా అమూల్య మహావాక్యాలు''
ఈ
రోజు అనంతమైన తండ్రి సేవకు నిమిత్తమైన సేవాధారీ పిల్లలను చూస్తున్నారు. ఏ
పుత్రుని చూసినా ప్రతి ఒక్కరు ఒకరి కంటే ఒకరు శ్రేష్ఠ ఆత్మగా ఉన్నారు.
అందుచేత బాప్‌దాదా ప్రతి శ్రేష్ఠ ఆత్మలోని, సేవాధారీ ఆత్మలోని విశేషతలను
చూస్తున్నారు. ప్రతీ పుత్రుడు ఈ విశ్వ పరివర్తనా కార్యంలో ఆధారమూర్తిగా,
ఉద్ధారమూర్తిగా ఉన్నారని బాప్‌దాదా హర్షిస్తున్నారు. పిల్లలందరు బాప్‌దాదా
కార్యంలో సదా సహయోగీ ఆత్మలుగా ఉన్నారు. ఈ విధమైన సహయోగి, సహజయోగి,
శ్రేెష్ఠమైన విశేష ఆత్మలను లేక సేవలో నిమిత్తమైన పిల్లలను చూసి బాప్‌దాదా
అతి స్నేహయుక్త సువర్ణ పుష్పాలతో పిల్లలకు స్వాగతోత్సవాన్ని, అభినందనల
ఉత్సవాన్ని జరుపుతున్నారు. బాప్‌దాదా ప్రతి పుత్రుని మస్తక మణిలా, సంతుష్ట
మణిలా హృదయ మణిలా మెరుస్తున్న స్వరూపంలో చూస్తున్నారు. బాప్‌దాదా కూడా సదా
ఒక పాట పాడుతూ ఉంటారు. ఏ పాట పాడ్తారో తెలుసు కదా? '' ఓహో!(వాహ్) నా
పిల్లలూ ఓహో! ఓహో! మధురమైన పిల్లలూ ఓహో!, ఓహో! ప్రియాతి ప్రియమైన పిల్లలూ
ఓహో!, ఓహో! శ్రేష్ఠ ఆత్మలూ ఓహో...! '' అనే పాట పాడ్తారు. ఇలాంటి నిశ్చయము
మరియు నషా సదా ఉంటోంది కదా! భగవంతుడు తన పిల్లల పాటలు పాడడమనే శ్రేష్ఠ
భాగ్యము కల్పం మొత్తంలో ఎప్పుడూ ప్రాప్తించదు. భక్తులు భగవంతుని పాటలు చాలా
పాడ్తారు. మీరు కూడా చాలా పాటలు పాడారు కానీ ఎపుడైనా భగవంతుడు మన గురించి
పాటలు పాడ్త్తారని అనుకున్నారా? ఏది అనుకోలేదో దానిని సాకార రూపంలో
చూస్తున్నారు. విశ్వశాంతి సమ్మేళనాన్ని చేశారు. పిల్లలంతా నోటి ద్వారా చాలా
మంచి మంచి మాటలు వినిపించారు, అంతేకాక మనసు ద్వారా సర్వాత్మల పట్ల శుభ
భావన, శ్రేష్ఠ కామనల, శుభ సంకల్పాల ప్రకంపనాలు కూడా నలువైపులా జ్ఞాన
సూర్యులై వ్యాపింపజేస్తారు. కానీ బాప్‌దాదా ఉపన్యసించిన వారందరి ఉపన్యాసాల
సారాన్ని వినిపిస్తున్నారు. మీరు నాలుగు రోజులు ఉపన్యసించారు. బాప్‌దాదా
ఒక్క సెకండు ఉపన్యసిస్తారు. అవి రెండు శబ్ధాలు - రియలైజేషన్ మరియు
సొల్యూషన్(వాస్తవితకను గ్రహించడం మరియు పరిష్కారం) ఏదైతే మీరంతా
మాట్లాడారో దాని సారం - రియలైజేషనే. ఆత్మను అర్థం చేసుకోనప్పటికీ, మానవ
విలువలు తెలుసుకున్నా శాంతి వచ్చేస్తుంది. మానవుడు విశేషించి శక్తిశాలీ
స్వరూపము. ఒకవేళ ఇది కూడా తెలియకపోయినా మానవుని లెక్కలో చూసినా మానవ ధర్మము
స్నేహము, కాని యుద్ధాలు, కొట్లాటలు కాదని అర్థమవుతుంది. ఇంకొంచెం ముందుకు
వెళ్ళండి - మానవ జీవితములో మానవతకు ఆధారం ఆత్మ పైన ఉంది. నేను ఎలాంటి
ఆత్మను! ఎవరిని? ఈ వాస్తవాన్ని తెలుసుకున్నా శాంతి వారి స్వధర్మమైపోతుంది.
మళ్లీ ఇంకొద్దిగా ముందుకెళ్ళండి - నేను శ్రేష్ఠమైన ఆత్మను. సర్వశక్తివంతుని
సంతానాన్ని. ఈ రియలైజేషన్ నిర్బలత్వం నుండి శక్తి స్వరూపంగా చేసేస్తుంది.
శక్తి స్వరూప ఆత్మ లేదా మాస్టర్ సర్వశక్తివంతమైన ఆత్మ ఏది కావాలంటే, ఎలా
కావాలంటే అది ప్రాక్టికల్‌గా చేయగలరు. అందువలన మొత్తం ఉపన్యాసాల సారం
'రియలైజేషన్' ఒక్కటే అని వినిపించాను కదా. బాప్‌దాదా అందరి ఉపన్యాసాలు
విన్నారు కదా! బాప్‌దాదా సదా పిల్లల జతలో ఉండనే ఉంటారు. అచ్ఛా!
సేవలో
సమర్పితమైన పిల్లలందరికి అన్ని జోన్ల నుండి వచ్చిన పిల్లలు ప్రతి ఒక్కరు
బాప్‌దాదా నాకే చెప్తున్నారు అని భావించండి. ఒక్కొక్కరితో
మాట్లాడ్తున్నారని భావించండి. పిల్లలందరు ప్రత్యక్షంగా ఏ ఋజువునైతే
చూపించారో దానికి బదులుగా బాప్‌దాదా ప్రతి పుత్రుని నామ సహితంగా వారి
రూపాన్ని చూస్తున్నారు. పేరు సహితంగా అభినందిస్తున్నారు. ఇప్పుడిక
ఎప్పుడైతే మీరు సమయ పరివర్తన గురించిన సూచన ఇస్తున్నారో అపుడు బాప్‌దాదా
మిలనం కూడా పరివర్తన అవుతుంది కదా. మా పరివారం వృద్ధి అయితే పాత వారిని
త్యాగం చెయ్యాల్సి ఉంటుందని మీరంతా సంకల్పం చేసారు కదా. కాని వారి ఈ
త్యాగంలోనే భాగ్యముంది. వేరేవారిని ముందుకు తీసుకెళ్ళడమంటే స్వయం ముందుకు
వెళ్ళడమే అవుతుంది. బాప్‌దాదాకు దేశంలోని పిల్లలకంటే విదేశీయులైన పిల్లలంటే
ఎందుకు ఇష్టం! అని అనుకోకండి లేదా కొంతమంది విశేషమైన పిల్లలంటే ఇష్టం అని
అనుకోకండి. బాప్‌దాదాకు ప్రతి పుత్రుడు హృదయానికి ఆసరాగా, మస్తకముపై
కిరీటములోని మణిగా ఉన్నాడు. అందువలన బాప్‌దాదా అందరికంటే ముందు తన కుడి
భుజాల వలె ఉన్న సహయోగి పిల్లలను, అతి ప్రియమైన పిల్లలను చాలా ప్రేమగా
ప్రియస్మృతుల నిస్తున్నారు. వీరు తప్పకుండా దూరంనుండి వచ్చిన వాళ్ళు..
సంపర్కంలోకి వచ్చిన వారిని సంబంధములోకి తీసుకొచ్చేందుకు మీరంతా సంతోషంగా
వారిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు.
ఈ
సమయంలో అందరు సేవ కొరకు వచ్చారు. అందువలన ఈ సేవ కూడా అయిపోయింది. ప్రతి
జోన్ పేరు చెప్పాలా ఏంటి? ఒకవేళ ఒక పేరు తీసుకొని ఏదైనా మిగిలిపోతే?
అందుచేత ప్రతి జోన్ వారూ బాప్‌దాదా నా నెంబరునే ముందు ఉంచారని భావించండి.
దేశ విదేశాల్లోని పిల్లలందరు ఇపుడు మధువన నివాసులుగా అయ్యారు. అందుచేత
విశ్వశాంతి హాల్‌లో ఉపస్థితులైన పిల్లలందరికీ, ఓంశాంతి భవనంలో నివసించే
పిల్లలకు బాప్‌దాదా - '' సదా స్మృతిలో ఉండండి, ఇతరులకు స్మృతినిప్పిస్తూ
ఉండండి. ప్రతి అడుగు స్మృతి చిహ్న చరిత్రను తయారు చేస్తూ నడవండి. ప్రతి
సెకండు తమ ప్రాక్టికల్ జీవితమనే దర్పణం ద్వారా సర్వాత్మలకు స్వయం యొక్క
తండ్రి యొక్క సాక్షాత్కారము చేయిస్తూ నడవండి. ఇలాంటి వరదానీ, మహాదానీ సదా
సంపన్నులైన పిల్లలకు బాప్‌దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే!
రాబర్ట్
ముల్లర్ (అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ యు.ఎన్.ఓ.) పట్ల మహా వాక్యాలు :-
మీరు సేవలో శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన పాత్రధారి ఆత్మ. మనసులో ఏ కార్యము కోసం
నిమిత్తమయ్యామో అది చేసి చూపిస్తామనే శ్రేష్ఠ సంకల్పాన్ని ఉంచారు. ఈ
సంకల్పము బాప్‌దాదా మరియు మొత్తం బ్రాహ్మణ పరివారము యొక్క సహయోగము ద్వారా
సాకారములోకి వస్తూనే ఉంటుంది. సంకల్పము చాలా బాగుంది. ప్లాన్లు కూడా చాలా
మంచి మంచివి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్లాన్ మధ్యలో ఈ ఆధ్యాత్మిక శక్తి
కలుస్తే ప్లాన్ సాకారములోకి వస్తూ ఉంటుంది. బాప్‌దాదా వద్దకు పిల్లలందరి
ఉత్సాహము చేరుతూ ఉంటుంది. సదా స్థిరంగా ఉండండి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి.
విశ్వశాంతి జెండాలు విశ్వంలో నలువైపులా ఎగిరే రోజును కూడా ఈ కళ్ళతో
చూస్తారు అందువలన ముందుకు వెళ్తూ ఉండండి. ప్రపంచంలోనివారు ఉదాసీనతలోకి
తీసుకొస్తారు. మీరు అలా కాకండి. ఒకే బలము, ఒకే నమ్మకము - ఈ నిశ్చయంతో
నడుస్తూ ఉండండి. ఏ సమయంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా తండ్రిని తోడుగా
చేసుకోండి. అలా చేసుకుంటే నేను ఒంటరిగా లేను నా జతలో విశేషమైన శక్తి ఉందని
అనుభవమవుతుంది. స్వప్నాలు పూర్తి అయిపోతాయి. ఎక్కడ తండ్రి ఉంటారో అక్కడ
ఎన్ని తుఫానులు వచ్చినా, అది తోఫా(కానుక)గా మారిపోతుంది. ''నిశ్చయ బుద్ధి
విజయంతి''. ఈ టైటిల్‌ను గుర్తు పెట్టుకోండి. 'నేను నిశ్చయ బుద్ధి విజయ
రత్నాన్ని.' అచ్ఛా!
స్టీవ్ నారాయణ్(ఉపాద్యక్షులు, గయానా) పట్ల
మహావాక్యాలు :- స్వయాన్ని తండ్రి హృదయ సింహాసనానికి సమీపంగా ఉండే రత్నంగా
అనుభవం చేస్తున్నారా? దూర దేశంలో ఉన్నా హృదయానికి దూరంగా లేరు. పిల్లలలోని
ఉత్సాహ-ఉల్లాసాలు చూసి బాప్‌దాదా హర్షితమవుతున్నారు. మీకు నెంబర్‌వన్
ఇస్తున్నారు. మీరు సదా ఎగిరేకళలో ఉండే బాప్‌దాదా కంటిపాపలు(నూరేరతన్)
అందుచేత బాప్‌దాదా అభినందిస్తున్నారు.
(ఆంటీ కుమార్తెతో) - కొత్త
జన్మ తీసుకుంటూనే మీకు ఆశీర్వాదము లభించింది. అదేమంటే మీరు సేవాధారులు,
అనుభవీ మూర్తులు. గయానాలో ఉంటున్నా విశ్వ సేవకు నిమిత్తమైన మూర్తులుగా
ఉన్నారు, ఇకమీద కూడా ఉంటారు. స్మృతి ద్వారా తండ్రి సహయోగము మరియు వరదానాలు
అనుభవమవుతున్నాయి కదా! మీ స్మృతి తండ్రికి చేరుతూ ఉంటుంది. సర్వ సంకల్పాలు
సిద్ధి అవుతున్నాయి కదా! శ్రేష్ఠ ఆత్మ అయిన మీరు చేసిన ఒకే శ్రేష్ఠ
సంకల్పము ద్వారా మొత్తం పరివారమంతా శ్రేష్ఠ పదవిని పొందుతున్నారు. నీవు
పదమాపదమ్ భాగ్యశాలివి.
విశ్వ శాంతి సమ్మేళనానికి వచ్చిన సోదరీ -
సోదరుల పట్ల అవ్యక్త బాప్‌దాదా మధుర సందేశం (గుల్జార్ దాదీజీ) - ఎప్పటి
వలెనే ఈ రోజు నేను వతనంలోకి చేరుకోగానే బాప్‌దాదా చాలా మధురమైన దృష్టి
ద్వారా పిల్లలందరికి ప్రియ స్మృతులిస్తున్నారు. బాబా దృష్టి ద్వారా ఈ రోజు
అతిశాంతి, శక్తి, ప్రేమ, ఆనందము యొక్క కిరణాలు వెలువడుతున్నట్లు
అనుభవమయ్యింది. ఇలా ఆత్మిక దృష్టి ద్వారా నాలుగు విషయాలూ ప్రాప్తి అవుతూ
ఉన్నవి. నేను చాలా పొందినట్లుగా అనిపించింది. ఆ విధంగా బాప్‌దాదా పిల్లలైన
మనందరిని స్వాగతించి ఇలా అన్నారు - బచ్చీ, అందరి స్మృతిని తీసుకొచ్చావా?
నేనన్నాను - స్మృతినైతే తీసుకొచ్చాను, దానితో పాటు అందరి ఆహ్వానము యొక్క
సంకల్పము కూడా తీసుకొచ్చాను. అప్పుడు బాబా అన్నారు, ఈ సమయంలో ఇంతమంది
ప్రియమైన నా పిల్లలు ఎవరైతే వచ్చారో, తెలుసుకోవడం కోసం వచ్చారో వారు నన్ను
కలుసుకునే రోజు కూడా వస్తుంది. బాప్‌దాదా అయితే పిల్లలందరి దృశ్యాన్ని
వతనంలో ఉంటున్నా సదా చూస్తూనే ఉంటారు. అలా చెప్తూ బాబా ఒక దృశ్యాన్ని
చూపించారు. భారతదేశంలో ఎలాగైతే భక్తులు మందిరాలలో శివలింగ ప్రతిమను తయారు
చేస్తారో అలా వతనంలో ఒక ప్రతిమను చూపించారు. కాని ఆ ప్రతిమ గోళాకారంలో
ఉంది. ఆ గోళాకారంలో అనేక మెరుస్తున్న వజ్రాలు నలువైపులా కనిపిస్తున్నాయి. ఆ
ప్రకాశిస్తున్న వజ్రాల పైన నాలుగు రకాల లైటు పడుతోంది. ఒకటి శ్వేత వర్ణం,
రెండవది ఆకుపచ్చ, మూడవది లేత నీలి రంగు, నాల్గవది బంగారు రంగు. కొద్ది
సమయంలో ఆ ప్రకాశము శబ్ధాలలోకి మారిపోయింది. తెల్లని ప్రకాశము నుండి 'శాంతి'
అనే అక్షరాలు వ్రాయబడినవి, రెండవ దాని పై 'ఉమంగం', మూడవ దాని పై
'ఉత్సాహము' నాల్గవ ప్రకాశము పై ' సేవ '.
పిల్లలంతా చాలా
ఉమంగ-ఉత్సాహాలతో, శాంతి సంకల్పం ద్వారా విశ్వ సేవ చేశారని బాబా చెప్పారు.
ఒక్కొక్క ఆత్మ సంఘటిత రూపంలో ఎంత మెరుస్తూ ఉందో చూడండి. మళ్లీ బాబా అన్నారు
- నా పిల్లలు నన్ను యథా శక్తిగా తెలుసుకున్నారు అయినా నా పిల్లలే కదా! నా
మధురాతి మధురమైన పిల్లలందరికి ప్రియ స్మృతులు తెలపండి. ఏ పిల్లలైతే వచ్చారో
వారందరి నోటి నుండి ఈ శబ్ధము వెలువడ్తుంది - మేము మా ఇంటికి వచ్చాము.
బాప్‌దాదా పిల్లల ఈ శబ్ధము విని మందహాసము చేస్తున్నారు. పిల్లలు ఇంటికి
వచ్చినప్పుడు పూర్తి అధికారము తీసుకునేందుకు వచ్చారా లేదా కొద్దిగానా? బాబా
ఇలా అన్నారు - సాగర తీరానికి వచ్చి లోటాతో నింపుకొని వెళ్లరాదు, మాస్టర్
సాగరునిగా తయారై వెళ్ళాలి. గని వద్దకు వచ్చి రెండు గుప్పెళ్లు నింపుకొని
వెళ్ళకండి. బాప్‌దాదా మూడు రకాల పిల్లలకు మూడు రకాల కానుకలు ఇచ్చారు. 1.
బాబా అన్నారు - నా కలంధారీ పిల్లలు(ప్రెస్ వాళ్ళు) ఎవరైతే వచ్చారో వారికి
బాప్‌దాదా కమలపుష్పాన్ని కానుకగా ఇస్తారు, నా కలంధారీ పిల్లలతో చెప్పండి -
సదా వారు కమలాసన ధారులై మొత్తం విశ్వంలోని తమోగుణ వాతావరణానికి అతీతంగా
మరియు తండ్రియైన పరమాత్మకు ప్రియమైన వారిగా అవ్వాలి. ఒకవేళ అలాంటి స్థితిలో
స్థితమై కలం నడిపిస్తే మీ వ్యవహారము కూడా సిద్ధి అవుతుంది, పరమార్థము కూడా
సిద్ధి అవుతుంది.
2. వి.ఐ.పి పిల్లలు ఎవరైతే వచ్చారో వారికి బాబా
సింహాసనము బదులుగా హంస ఆసనాన్ని ఇచ్చారు. బాబా అన్నారు - వీరు ఎవరైతే నా
వి.ఐ.పి. పిల్లలు వచ్చారో వారి నోటిలో(మాటలలో) శక్తి ఉంది. వీరికి నేను హంస
ఆసనాన్ని ఇస్తున్నాను. మీరు ఈ ఆసనం పై కూర్చొని ఏ కార్యమైనా చేయాలి. హంస
ఆసనం పై కూర్చోవడం వలన మీ నిర్ణయ శక్తి శ్రేష్ఠంగా ఉంటుంది అంతేకాక ఏ
కార్యము చేసినా అందులో విశేషత ఉంటుంది. ఎలాగైతే కుర్చీ పై కూర్చొని పనులు
చేస్తారో అలాగే బుద్ధిని హంస ఆసనం పై ఉంచితే లౌకిక కార్యము ద్వారా కూడా
ఆత్మలకు స్నేహము మరియు శక్తి లభిస్తూ ఉంటుంది.
3. సమర్పిత సేవాధారీ
పిల్లలకు ఒక చక్కటి లైటు పుష్పాలతో తయారుచేయబడిన హారాన్ని ఇచ్చారు. ప్రతి
ప్రకాశము పై ఏదో ఒక దివ్య గుణము వ్రాసి ఉంది. మరి బాబా అన్నారు, నా
పిల్లలైన వీరు సర్వ గుణాలు ధారణ చేసే గుణమూర్తులైన పిల్లలు. పిల్లలంతా ఒకే
బలము, ఒకే మతముగా అయ్యి అనంతమైన సేవను చేశారు. దానికి బదులుగా బాప్‌దాదా ఈ
దివ్య గుణాల మాలను పిల్లలందరికి కానుక రూపంలో ఇస్తున్నారు. చివరిగా ఇలా
చెప్పారు - పిల్లలందరికి బాప్‌దాదా యొక్క ఈ మహా వాక్యాలకు వినిపించండి -
అవి ఏమంటే సదా సంతోషంగా ఉండాలి, అదృష్టవంతులుగా అవ్వాలి మరియు అందరినీ
సంతోషము యొక్క వరదానాలతో, ఖజానాలతో సంపన్నంగా తయారు చేస్తూ ఉండండి. అలా
మధుర మహావాక్యాలు వింటూ యాద్‌ప్యార్ ఇస్తూ తీసుకుంటూ నేను సాకార వతనంలోకి
చేరుకున్నాను.
వరదానము:- ''తండ్రి ద్వారా ప్రాప్తించిన సర్వ ఖజానాలను కార్యంలో ఉపయోగించి పెంపొందించే జ్ఞానీ - యోగీ ఆత్మా భవ''
బాప్‌దాదా
పిల్లలను సర్వ ఖజానాలతో సంపన్నంగా చేశారు కానీ ఎవరైతే సమయానికి ప్రతి
ఖజానాను కార్యంలో ఉపయోగిస్తారో, వారి ఖజానా సదా వృద్ధి చెందుతూ ఉంటుంది.
వారు ఎప్పుడూ - అలా నేను కోరుకోలేదు కానీ జరిగిపోయింది అని అనరు. ఖజానాలతో
సంపన్నంగా ఉన్న జ్ఞానీ-యోగీ ఆత్మలు ఏ పనినైనా ఆలోచించిన తర్వాతనే చేస్తారు.
వారికి సమయ ప్రమాణంగా టచ్ అవుతుంది. వారు దానిని క్యాచ్ చేసి(గ్రహించి)
కార్య రూపంలో తీసుకొస్తారు, చేసిన ఒక్క సెకను తర్వాత ఆలోచించినా వారిని
జ్ఞానీ ఆత్మలని అనరు.
No comments:
Post a Comment