07-10-2017 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - మీరు తండ్రిని తలంపు చేసే పందెములో పాల్గొనాలి, తండ్రిని మర్చిపోతే మాయ తుపాకి గుండు తగులుతుంది''
ప్రశ్న:- ఈ డ్రామాలోని ఏ అత్యంత గొప్ప రహస్యము పిల్లలైన మీకు మాత్రమే తెలుసు?
సమా:- ఈ డ్రామాలో అనేక రకాల పాత్రధారులున్నారని ప్రతి ఒక్కరికి భిన్న భిన్నమైన పాత్ర ఉందని ఒకరి పాత్ర, ముఖ కవళికలు(ఫీచర్స్) ఇంకొకరితో కలవవని మీకు తెలుసు. ఎవరైతే ఆల్‌రౌండ్ హీరో పాత్రధారులుగా ఉన్నారో వారికే గాయనముంది. కొంచెము సమయము అంటే 1-2 జన్మలు పాత్ర చేసేవారు బలహీన పాత్రధారులు. 2. అన్ని పాత్రధారులలో పరమాత్మ వ్యాపకమై ఒంటరిగా అతడే డాన్స్(నృత్యము) చేయడు. అతడు ఈ అనంతమైన డ్రామాకు డైరక్టర్ (దర్శకులు). నామ-రూపాలకు అతీతుడు కాదు. అలా భిన్నముగా ఉంటే మీ గతి-మతి మీకే తెలుసు(తుమ్హారే గత్ మత్ తుమ్హీ జానో.......) అనే గాయనము తప్పు అవుతుంది.
ఓంశాంతి. నేను
సాధారణ వృద్ధ శరీరములో వస్తానని అనగా ఎవరు వానప్రస్థ అవస్థలో ఉంటారో, వారి
శరీరములో వస్తానని బాబా చెప్తారు. వానప్రస్థము అనగా శబ్ధానికి అతీతంగా
వెళ్లడం. అది నిర్వాణధామము. సుఖధామము, దు:ఖధామము అనగా మానవులుండే స్థానము.
సుఖధామములో మానవులుంటారు. అక్కడ వారికి సుఖము లభిస్తుంది. కనుక దానిని
సుఖధామము అని అంటారు. ధామము అనగా ఉండే స్థానము. అచ్ఛా, శాంతిధామము అని
అంటారు. అక్కడ మనుష్యులు ఉండరు. శాంతిధామము అనగానే అచ్చట ఆత్మలు ఉంటాయని
సిద్ధమౌతుంది. అచ్చట మానవులుండజాలరు. మానవులు సత్యయుగంలో శాంతిగా ఉంటారని
ఏదో గుహలో ఉంటారని లేక సంకల్ప రహితంగా(మన్‌కో అమన్) చేసుకుంటారని కాదు.
అక్కడ ఒకే ఒక అద్వైత ధర్మముంటుంది, ద్వైతము మాటే ఉండదు. తర్వాత వృద్ధి
చెందే అన్ని ధర్మాలలో ద్వైతము పెరుగుతూ పోతుంది. ఎక్కడ ద్వైతముంటుందో అక్కడ
అశాంతి ఉంటుంది. నిర్వాణధామాన్ని వానప్రస్థమని అంటారు. ఆత్మలైన మేము
నిర్వాణధామములో ఉంటామని దానిని ముక్తిధామమని అంటారని మీకు తెలుసు. అచ్చట
శాంతిలో ఆత్మలు మాత్రమే ఉంటాయి. సుఖధామములో శరీరముంది కదా. శరీరములో
ఉన్నప్పుడు ఎప్పుడూ శాంతిగా ఉండలేరు. హఠయోగము, ప్రాణాయామము మొదలైనవి చేస్తూ
10-20 రోజులు లేక ఒక మాసము కూడా అలాగే ఉంటారు. అయితే ఎంతవరకు శాంతిగా
ఉండగలరు? ముక్తి-జీవన్ముక్తిలోకి వెళ్లజాలరు. ఇది డ్రామా కదా. ఈ సమయంలో
కర్మక్షేత్రము పైకి ఆత్మలందరూ వచ్చే తీరాలి. ఎందుకంటే నెంబరువారుగా
వస్తారు. ఆత్మలలో కూడా నెంబరువారుగా ఉన్నారు కదా. కొంతమంది సతోప్రధానంగా,
కొంతమంది సతో, రజో, తమోలో ఉన్నారు. చివరిలో కొద్దిగా పాత్ర చేసేవారు బలహీన
ఆత్మలు. పాత్ర చాలా కొద్దిగా ఉంటుంది. వారిది గాయన యోగ్యము కానంత తక్కువ
ప్రభావము ఉంటుంది. ఎవరెవరు గాయన యోగ్యముగా ఉంటారో ఆలోచించండి. అత్యంత
ఉన్నతులు భగవంతుడు. ఇదంతా భారతదేశపు విషయమే. ఇతర ప్రదేశాలలో ఎవరిని గాయనము
చేస్తారు? ధర్మస్థాపకులను గాయనము చేస్తారు. ఉదాహరణకు ఏసుక్రీస్తు తర్వాత
వచ్చే పోపుల చిత్రాలు కూడా ఉన్నాయి. ఏ ఆత్మల గాయనము జరుగుతుందో వారికి
విశేషమైన పాత్ర ఉంటుంది. పిల్లలైన మీరు సృష్టి ఆదిమధ్యాంతాలను
తెలుసుకున్నారు. డ్రామాలో ఫస్ట్‌క్లాస్ పాత్రధారులు ఎవరో తెలుసుకున్నారు.
వార్తాపత్రికలలో వేసినప్పుడు ఫలానావారిని చూడాలని మానవులకు ఆకర్షణ
కలుగుతుంది. వారిని మాటిమాటికి చూడాలనిపిస్తుంది. ఈ బేహద్ 5 వేల సంవత్సరాల
డ్రామా గురించి ఎవ్వరికీ తెలియదు. విదేశాలలో కూడా చాలా ప్రగల్భాలు
(అసత్యాలు) చెప్తూ ఉంటారు. అందరికంటే ఎక్కువ ప్రగల్భాలు చెప్పేవారు ఇచ్చటి
వారే. అందుకే తండ్రి వచ్చి మనకు మొత్తం జ్ఞానమంతా ఇస్తున్నారు. ఇదంతా మీ
బుద్ధిలో తప్పకుండా ఉండాలి. ముఖ్యమైన సృష్టికర్త(క్రియేటర్),
డైరెక్టర్(దర్శకులు), ప్రముఖ పాత్రధారి(హీరో యాక్టరు) ఎవరు? శివబాబా. వారే
జ్ఞాన సాగరులు, ఆనంద సాగరులు. శివబాబాను పాత్రధారి అని అనవచ్చు. వారు
ఎప్పుడూ పాత్రను అభినయించరని మానవులంటారు. వారు నామ-రూపాలకు భిన్నమైనవారని
అంటారు. మళ్లీ సర్వవ్యాపి అని అంటారు. ఒకే పాత్రధారి అందరిలో నాట్యము
చేస్తారా? చేయరు. ప్రతి ఒక్కరి పాత్ర వేరు వేరుగా ఉంది. ఒకరి పాత్ర మరొకరి
పాత్రతో కలువదు. మనుష్యులు అనేకమంది ఉన్నారు. ఒకరి ఆకృతి మరొకరిని పోలి
ఉండదు. ఈ ప్రపంచ డ్రామా ఉన్నది ఉన్నట్లు పునరావృతమౌతూ ఉంటుందని పిల్లలకు
తెలుసు. మరలా గీతా జ్ఞానము వినిపించవలసి వచ్చిందని మీ వద్ద పాట కూడా ఉంది.
తండ్రి చెప్తున్నారు - మీకు నేను ఎన్ని సార్లు జ్ఞానము వినిపిస్తాను? మీరు,
నేను ఈ ప్రపంచమంతా ఇప్పుడూ ఉంది, కల్పక్రితము కూడా ఉండేది. కల్ప-కల్పము
మళ్లీ కలుస్తూ ఉంటాము. రెండవ ప్రపంచమేదీ ఉండదు. తండ్రి చెప్తున్నారు - నేను
ఒక్కడిని కనుక నా రచన కూడా ఒక్కటే. భగవంతుడు ఒక్కరే(గాడ్ ఈజ్ వన్).
ఇతరులెవ్వరూ లేనే లేరు. ఉన్నతాతి ఉన్నతులు ఒక్క శివబాబాయే. మళ్లీ
త్రిమూర్తి బ్రహ్మ అని అంటారు. త్రిమూర్తులలో ఎక్కువగా బ్రహ్మను ఉంచుతారు.
త్రిమూర్తీ శంకరుడు అని అనరు. 'దేవ దేవ మహాదేవ' అని గాయనము కూడా ఉంది.
మొట్టమొదట బ్రహ్మ వస్తాడు. ఈ ముగ్గురు దేవతలలో బ్రహ్మ నెంబరువన్ దేవత.
బ్రహ్మనే గురువు అని అంటారు. శంకరుని లేక విష్ణువును ఎప్పుడూ గురువు అని
అనరు. త్రిమూర్తులలో ముఖ్యమైన వారు బ్రహ్మ, ఆయన సూక్ష్మ వతనవాసి అయినప్పుడు
సంపూర్ణ బ్రహ్మగా అవుతాడు. ఆకృతి, ముఖకవళికలు ఒకే విధంగా ఉంటాయి. కావున
అత్యంత ఉన్నతులు శివబాబా. వారే అందరి బాబా. తర్వాత గ్రేట్ గ్రేట్
గ్రాండ్ ఫాదర్ అనే గాయనముంది. అతడి నుండే మానవ సృష్టి రూపీ వంశము
మొదలౌతుంది. ఇది మానవ సృష్టి రూపీ కల్పవృక్షము. మొట్టమొదట ఆడమ్ లేక ఆది
దేవుడు, ఆది దేవి ద్వారా రచనను రచిస్తారు. అయితే బి.కెలుగా అందరూ అవ్వరు.
ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో, వారే మళ్లీ దేవతలుగా అవుతారు. ఇది చదువు.
యజ్ఞములో బ్రాహ్మణులు కావాలి. ఆ బ్రాహ్మణులే భౌతిక యజ్ఞాలను రచిస్తారు.
మీది ఆత్మిక యజ్ఞము. వారి యజ్ఞము కొంత సమయమే జరుగుతుంది. చివర్లో నూగులు,
నెయ్యి మొదలైనవి ఆహుతి చేస్తారు. ఇది చాలా గొప్ప యజ్ఞము. ఇందులో ప్రపంచమంతా
స్వాహా అవ్వవలసి ఉంది. సత్య యుగము, త్రేతా యుగములో ఎప్పుడూ యజ్ఞాలు జరగవు.
వారు ఉపద్రవాలను నిర్మూలించేందుకు యజ్ఞాలను రచిస్తారు. ద్వాపర యుగము నుండి
ఉపద్రవాలు మొదలౌతాయి. ఈ యజ్ఞము తర్వాత అర్ధకల్పము వరకు ఎటువంటి యజ్ఞమూ
జరగదు. ఇప్పుడు రైటు(సరియైనవారు) ఎవరు? అని నిర్ణయించండి. ఆ చిన్న చిన్న
యజ్ఞాలన్నీ హద్దులోనివి. ఇది బేహద్(అనంతమైన) యజ్ఞము. ఈ యజ్ఞములో మొత్తము
ఆహుతి అయిపోతుంది. తర్వాత అర్ధకల్పము ఏ యజ్ఞమూ ఉండదు. కొన్ని మందిరాలు పూజ
కొరకు ఉండవు. మందిరాలు భక్తిమార్గములో తయారౌతాయి. అత్యంత ఉన్నతమైన
శివబాబాను భక్తులందరూ స్మృతి చేస్తారు. కాని పరిచయము లేనందున తెలియదు
తెలియదు(నేతి-నేతి) అని అంటారు. రచయిత మరియు రచనల ఆద్యంతము మనము పొందలేము.
అందుకే '' ఓ భగవంతుడా! మీ గతి మతి భిన్నమైనది అది మీకే తెలుసు '' అని గానము
చేస్తారు. ఏదైనా ఒక వస్తువు ఉంటే కదా - మీకే తెలుసు అనేది. కావున
తప్పకుండా నామ-రూపాలు ఉంటాయి అందుకే ఓ భగవంతుడా! మీ గతి-మతి భిన్నమైనది అని
అంటారు. అయితే మానవులకు దీని అర్థము తెలియదు. నా విధానము(మతము)
అన్నింటికంటే భిన్నమైనదని తండ్రి అర్థం చేయిస్తున్నారు. మిమ్ములను శూద్రుల
నుండి బ్రాహ్మణులుగా తయారు చేసి మళ్లీ శ్రేష్ఠ దేవతలుగా చేస్తాను. నేను
జీవన్ముక్తి దాతను, సర్వుల ముక్తిదాతను. కలియుగము అంతమైన తర్వాత మళ్లీ
సత్యయుగము మొదలౌతుంది. సత్యయుగములో దు:ఖము మాటే ఉండదు. తండ్రి ఇప్పుడు
దు:ఖము నుండి విడుదల చేస్తారు. మిగిలిన వారంతా శాంతిధామములోకి
వెళ్ళిపోతారు. కలియుగ అంత్యములోనే ముక్తిదాత వస్తారు. వారు వచ్చి నరకాన్ని
స్వర్గముగా చేస్తారు. ఇచ్చట చాలా దు:ఖముంది. దీనిని స్వర్గమని అనజాలరు. పాత
ప్రపంచాన్ని క్రొత్త ప్రపంచమని పిలువరు. నూతన ప్రపంచములో లక్ష్మీనారాయణుల
రాజ్యముండేది. పాత ప్రపంచములో ఏమేమి ఉంటాయో చూడండి. ఇది మళ్లీ నూతన
ప్రపంచముగా అవుతుంది. అత్యంత ఉన్నతమైన బాబాయే వచ్చి పాత ప్రపంచము నుండి
కొత్త ప్రపంచముగా తయారు చేస్తారు. సూక్ష్మవతన వాసులైన బ్రహ్మ, విష్ణు,
శంకరులను దేవతలని అంటారు. ప్రజాపిత బ్రహ్మ సూక్ష్మవతనవాసి అని ఎక్కడా
వ్రాయబడలేదు. సూక్ష్మవతనములో ప్రజలు ఉండరు. కావున ప్రజాపిత బ్రహ్మ
తప్పకుండా ఇక్కడే ఉండాలి. అత్యంత ఉన్నతమైన శివబాబా ఆ తర్వాత రెండవ నెంబరులో
బ్రహ్మ ఉన్నాడు. శివబాబా ఈ బ్రహ్మ ద్వారా సేవ చేస్తారు. బ్రాహ్మణులను
దేవతలుగా తయారు చేస్తారు. అసలు ఈ ప్రపంచమే పాపాత్మల ప్రపంచము. రావణ రాజ్యము
ఏ పని చేసినా దాని వల్ల మానవులచే పాపమే జరుగుతుంది. భ్రష్ఠాచారులతోనే
ఇచ్చి పుచ్చుకోవడం ఉంటుంది. ద్వాపర యుగము నుండి భ్రష్ఠాచారము మొదలౌతుంది.
మళ్లీ అంత్యములో తండ్రి వచ్చి మహాన్ శ్రేష్ఠాచారులుగా తయారు చేస్తారు.
కళలు తగ్గడంలో 5 వేల సంవత్సరాలు పడ్తుంది. శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన దేవతలుగా
ఉన్నవారే మళ్లీ క్రిందకు దిగుతారు. ఈ ఆటయే అలా ఉంది. తండ్రి కూర్చుని ఎంత
బాగా అర్థం చేయిస్తారు. ఎవరైనా కూర్చుని అర్థం చేసుకుంటే చాలా బాగా అర్థం
చేసుకోగలరు. మీరు కరాచీలో భట్టీలో ఉండేవారు. అర్థం చేసుకునేందుకు చాలామంది
వచ్చేవారు. విభజన తర్వాత అందరూ పారిపోయారు. మీరు అక్కడే భట్టీలోనే
ఉండేవారు. మీకు ఎవ్వరి సాంగత్యముండేది కాదు. సాంగత్యము నుండి దూరంగా ఉంటూ
పురుషార్థము నెంబరువారుగా చేశారు. అందరూ ఒకే విధంగా పురుషార్థము చేయలేరు.
పాఠశాలలో కూడా అందరూ ఒకే విధంగా నెంబరు తీసుకోరు. ఇద్దరు విద్యార్థులకు ఒకే
విధంగా 99 మార్కులు లభించజాలవు. క్లాసులో ఒకరి పై ఒకరు కూర్చోరు కదా.
గుర్రాల రేస్(పందెము) కూడా ఉంటుంది. అందులో కూడా ఒకే విధంగా రెండు
గుర్రాలు ఉండజాలవు. దీనీ పేరు ''రాజశ్వ అశ్వమేధము''. గుర్రమును అశ్వమని
అంటారు. మీరు ఆత్మిక గుర్రాలు. మీ పరుగు ఇంటి వైపు ఉంది. ముందు మేము తండ్రి
వద్దకు చేరుకోవాలని పరుగు తీస్తున్నారు. అచ్చట సైకిలు పందెము, గుర్రపు
పందెములు ఉంటాయి. యుద్ధములో కూడా రేసు ఉంటుంది. మీది యుద్ధానికి యుద్ధము,
రేస్‌కు రేస్. మీది మాయ పైన విజయము పొందే యుద్ధము. తండ్రిని స్మృతి చేయమనే
మీకు చెప్పడం జరుగుతుంది. గురునానక్‌ను తలంపు చేయమని లేక ఎవరైనా స్మృతి
చేయమని ఎవ్వరికీ చెప్పబడదు. సర్వుల సద్గతిదాత ఒక్కరే. వాస్తవానికి సర్వుల
పై దయ చూపేవారు కూడా ఒక్కరే. సర్వుల సద్గతిదాత, పతిత పావనుడు కూడా ఒక్కరే.
వారు(సర్వోదయా గ్రూపు) స్వయము ఈ పేర్లతో పిలిపించుకుంటే అసత్యమౌతుంది కదా.
సర్వులకు సుఖమిచ్చేవారు ఒక్కరే. సుఖధామానికి కూడా తండ్రే తీసుకెళ్తారు.
కావున తండ్రి ద్వారానే సుఖదామపు వారసత్వము తీసుకోవాలి. అర్ధకల్పము రావణుడు
శాపమిచ్చాడు. ఇప్పుడు తండ్రి నుండి వారసత్వము తీసుకోండి. ఈ ప్రపంచమే
పాపాత్మల ప్రపంచము. దేవతలది పుణ్యాత్మల ప్రపంచము. పాపపు ప్రపంచములో
పుణ్యముండదు. ఫలానావారు మరణిస్తే స్వర్గ వాసులయ్యారని అసత్యాలు చెప్తారు.
అరే! స్వర్గమే లేనప్పుడు స్వర్గములో జన్మ ఎలా లభిస్తుంది? ఇది కూడా అర్థము
చేసుకునేవారే అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకునేందుకు ఇక్కడే ఉండాల్సిన
అవసరం లేదు. భలే విదేశాలలో ఉండండి. అయితే 7 రోజులు బాబా సాంగత్యములో తప్పక
ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే సంగ్ తారే, కుసంగ్ బోరే(సత్సంగము
తేలుస్తుంది, కుసంగము ముంచేస్తుంది). బాణం తగిలిందంటే ఇంకా కొన్ని రోజులు
ఉంటాము అని అంటారు. అప్పుడు బాబా, పూర్తి నిశ్చయముందా? మనస్సు దీని వైపు
ఉందా? బాణము తగులుతోందా ? అని పరీక్ష కూడా తీసుకుంటారు. తండ్రి
చదివిస్తున్నారు. అరే! తండ్రి వద్ద అయితే ఉండాలి కదా. ఎప్పుడు పక్కా రంగు
ఏర్పడుతుందో అప్పుడు విదేశాలకు కూడా వెళ్ళవచ్చు. ఇప్పుడు పవిత్రంగా అయితే
21 జన్మలకు రాజ్య పదవి లభిస్తుంది. ఇదేమైనా తక్కువ మాటనా? ఒక్క జన్మ
పవిత్రంగా ఉండడం పెద్ద మాటేమీ కాదు. బాబా యుక్తులైతే చాలా
తెలిపిస్తున్నారు. నెమ్మది నెమ్మదిగా యుక్తిగా నడుచుకోండి. ఎవరితోనూ గొడవ
రాకూడదు. స్నేహితంగా కూడా ఉండాలి. మిమ్ములను మీరు విడిపించుకుంటూ కూడా
ఉండాలి. బాబా రంజూ రమజ్ బాజ్ (రహస్యము తెలుసుకొని యుక్తి చెప్పేవారు)
అయ్యారు. కావున ఇలా ఇలా చేయమని యుక్తులెన్నో తెలుపుతారు. బాబా మంచి పిల్లలు
భూ - భూ(మాటి-మాటికి జ్ఞానంచెప్పి) చేసి పతిని తీసుకొస్తారు. తర్వాత పతి,
ఈమె నన్ను రక్షించింది అని స్త్రీ చరణాల పై పడ్తాడు. ఈ బ్రాహ్మణులైతే
వికారాల కంకణాన్ని కట్టిస్తారు. ఇక్కడ బ్రహ్మ మరియు బ్రాహ్మణులు పవిత్రతా
కంకణాన్ని కడ్తారు. దానిని అంటే వికారాల ఒప్పందాన్ని రద్దు చేస్తారు. బాబా
మీరు మమ్ములను స్వర్గానికి తీసుకువెళ్తారని పిల్లలైన మీరు అంటారు. మీ మాట
ఎందుకు వినము! సంతోషంగా పవిత్రతా కంకణాన్ని కట్టుకుంటారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-1. పవిత్రంగా అయ్యేందుకు యుక్తులు మీరే రచించాలి. 21 జన్మల రాజ్యము కొరకు పవిత్రతా ప్రతిజ్ఞ చేయాలి.2. శ్రేష్ఠాతి శ్రేష్ఠంగా అయ్యేందుకు శ్రేష్ఠాచారులతో ఇచ్చి పుచ్చుకోవాలి. తండ్రి సాంగత్యములో ఉంటూ నిర్భయులుగా అవ్వాలి.
వరదానము:- ''కర్మలు చేస్తూ న్యారీ, ప్యారీ అవస్థలో ఉండి తేలికతనాన్ని అనుభూతి చేసే కర్మాతీత్ భవ ''కర్మాతీతులనగా న్యారా-ప్యారాగా ఉండేవారు. కర్మలు చేసిన తర్వాత మేము చేసింది ఏమీ లేదని అనుభవమవ్వాలి. చేయించుకునేవారు చేయించుకున్నారు. ఇటువంటి స్థితిని అనుభవం చేయడం ద్వారా సదా తేలికతనముంటుంది. కర్మలు చేయిస్తూ శరీరము కూడా తేలికగా, మానసిక స్థితి కూడా తేలికగా అనుభవమవ్వాలి. పని ఎంతగా పెరుగుతూ ఉంటుందో అంత తేలికతనము కూడా పెరుగుతూ ఉండాలి. కర్మ తన వైపు ఆకర్షించరాదు. యజమానిగా అయ్యి కర్మేంద్రియాలతో కర్మలు చేయించాలి. సంకల్పములో కూడా తేలికతనాన్ని అనుభవం చేయాలి - దీనినే కర్మాతీతులుగా అవ్వడం అని అంటారు.
స్లోగన్:- ''సర్వ ప్రాప్తులతో సదా సంపన్నంగా ఉంటే, సదా హర్షితంగా, సదా సుఖంగా, అదృష్ట్టవంతులుగా అవుతారు ''
No comments:
Post a Comment