04-11-2017 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
''మధురమైన
పిల్లలారా - ' బాబా ' అని అన్నప్పుడు మీరు ఎంత సుఖమును అనుభవిస్తారో అంత
సుఖము భక్తులకు భగవంతుడా ! ఈశ్వరుడా ! అని అన్నప్పుడు అనుభవమవ్వజాలదు''
ప్రశ్న:- లోభవశమైన లౌకిక పిల్లలకు ఉండే ఏ భావము మీకు ఉండదు?
ఉత్తరం:- లోభిష్టులైన
లౌకిక పిల్లలు, ఎప్పుడెప్పుడు తండ్రి మరణిస్తాడా? ఎప్పుడెప్పుడు ఆస్తికి
మేము యజమానులుగా అవుతామా ......... అని ఆలోచిస్తూ ఉంటారు. పిల్లలైన మీరు
అనంతమైన తండ్రి పట్ల ఇటువంటి ఆలోచనలు ఎప్పుడూ చేయలేరు. ఎందుకంటే తండ్రి
అశరీరి, ఇచ్చట మీకు అవినాశి తండ్ర్రి ద్వారా అవినాశి వారసత్వము లభిస్తుంది.
పాట:- ఓ ప్రాణి! నీ ముఖము చూసుకో,..............(ముఖడా దేఖ్‌లే ప్రాణీ!.................)
ఓంశాంతి. ఓంశాంతి
! ఓంశాంతి ! రెండు సార్లు ఇలా అన్నప్పుడు ఒకసారి బాబా (తండ్రి) అంటారు,
రెండవసారి దాదా (అన్న) అంటాడు. ఒకరేమో ఆత్మ, రెండవ వారు పరమ-ఆత్మ అనగా
పరంధామములో నివసించువారు. అందుకే వారిని పరమ్ -ఆత్మ (పరమాత్మ) అని అంటారు.
ఇప్పుడు ఆత్మకు, పరమాత్మకు గల సంబంధమేమిటి ? తండ్రి ఒక్కరే కాని పిల్లలు
అనేకము. మనుష్యులు వారిని పిలిచేటప్పుడు ఇంగ్లీషులో కూడా ' ఓ గాడ్‌ఫాదర్ '
అని అంటారు అనగా వారు తండ్రి అయ్యారు కదా. కేవలం పరమాత్మ లేక ప్రభు,
ఈశ్వరా మొదలగు పిలుపులలో ఇంత మజా(ఆనందము) ఉండదు. తండ్రి (బాప్) అని
అన్నందున సుఖము లభిస్తుంది. పారలౌకిక తండ్రి ఇచ్చేదే సుఖము. అందుకే
భక్తిమార్గములో వారిని అంతగా తలంపు చేస్తారు. గాడ్‌ఫాదర్ అంటే వారు మన
తండ్రి. మనమందరము సోదరులమని కూడా అంటారు. బ్రదర్‌హుడ్ (సోదరత్వము ) అని
అంటారు. మనమంతా భాయి-భాయి(సోదరులము) అని భారతవాసులు అన్నప్పుడు కూడా వారి
ధ్యాస ఆత్మ వైపు వెళ్ళదు, దేహాభిమానములోకి వెళ్ళిపోతారు. మనమంతా ఆత్మలము,
పరస్పరము సోదరులమని (భాయి-భాయి) భావించరు. మనందరి తండ్రి ఒక్కరే. ఒకవేళ
పరమాత్మ సర్వవ్యాపి అయితే, భాయీ-భాయీ అని అనరు. ఆత్మలమని భావించినందునే
భాయి-భాయి అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి సన్ముఖములో కూర్చుని
ఉన్నారు. తండ్రి మిమ్ములను చదివిస్తున్నారు. ఇప్పుడు మాకు తండ్రి లభించాడని
ఆత్మ అంటుంది. తండ్రి లభించారంటే, సర్వము లభించినట్లే. తండ్రి ద్వారా
వారసత్వము లభిస్తుంది.పుత్రుడు జన్మిస్తూనే వారసుడు జన్మించాడని అంటారు.
బాబా అని అంటూనే పిల్లల వారసత్వ అధికారము ఋజువైపోతుంది. ఆడపిల్లలు తరచుగా
అమ్మ-అమ్మ అని అంటూ ఉంటారు. వారికి సాధారణంగా తల్లి పై చాలా ప్రేమ ఉంటుంది.
కుమారుడైతే నాన్న - నాన్న అని అంటూ ఉంటాడు. మగ పిల్లలకు తండ్రి పై ప్రేమ
ఎక్కువగా ఉంటుంది. తల్లి నుండి వారసత్వము లభించజాలదు. తండ్రి ద్వారా
వారసత్వము లభిస్తుంది. ఇచ్చట ఆత్మలైన మీరందరూ భాయి-భాయి (సోదరులు) అయ్యారు.
మీలో ప్రతి ఒక్కరు తండ్రి నుండి వారసత్వము తీసుకుంటున్నారు. తండ్రి ఇచ్చిన
శ్రీమతము - ప్రతి ఒక్కరు స్వయాన్ని తండ్రికి(శివబాబా) సంతానంగా భావించి
అందరికీ తండ్రి పరిచయమునిస్తూ ఉండాలి. అంతేకాక సృష్టిచక్ర రహస్యాన్ని కూడా
అర్థం చేయించాలి. తండ్రి ద్వారానే స్వర్గ వారసత్వము లభిస్తుంది. అనంతమైన
తండ్రి అంటున్నారు - మీరు స్వర్గ వారసులుగా ఉండేవారు, మళ్లీ మీరు
నరకవాసులుగా ఎలా అయ్యారు? 84 జన్మల చక్రములో ఎలా తిరిగారు? ఈ విషయాలన్నీ
వివరంగా విస్తారంగా తెలిపే మాటలు. తండ్రి తన పరిచయమిచ్చారు. ఆ తండ్రి
ద్వారా తప్పకుండా సత్యయుగ వారసత్వము లభిస్తుంది. ఎవరికి లభించి ఉంటుంది? ఈ
లక్ష్మీనారాయణులకు లభించింది. వారి చిత్రము ఇక్కడ ఉంది. వీరికి తండ్రి
వారసత్వము లభించింది. అయితే ఇప్పుడు అది ఎక్కడికి పోయింది? ఇది చక్రాన్ని
గురించిన విషయము. ఇప్పుడు మీకు సత్యయుగ వారసత్వము లభిస్తుంది. మళ్లీ
పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ 84 జన్మలు అనుభవించే తీరాలి. ఇప్పుడు మీలో
నంబరువారీ పురుషార్థమనుసారము 84 జన్మల చక్రము బుద్ధిలో ఉంది. అంతేకాక ఇది
మీ అంతిమ జన్మ అని కూడా నిశ్చయముంది. 84 జన్మల చక్రములో తిరిగి పూర్తి
చేశారు, ఇప్పుడు మీరు వస్తే మీ వెనుక అందరూ వచ్చేస్తారు. పిల్లలైన మీరేమో
తండ్రి ద్వారా వారసత్వము పొందారు, రాజయోగము నేర్చుకున్నారు. అందువలన మనము
మళ్లీ నూతన ప్రపంచములో రాజ్యపాలన చేసేందుకు వస్తామని మీకు తెలుసు. అచ్చట
ఇన్ని ధర్మాలుండవు. అందరూ వాపస్ వెళ్ళిపోతారు. మళ్లీ మొట్టమొదట మనమే
రావాలి అనగా దేవతల రాజ్యములో(డీటీయిజమ్‌లో) రావాలి. మనము శూద్ర కులము
వారిగా ఉండేవారము, ఇప్పుడు బ్రాహ్మణకులము వారిగా అయ్యాము. మళ్లీ సూర్యవంశీ,
చంద్రవంశీ కులము వారిగా అవుతాము. మనము బ్రాహ్మణ కులము, సూర్యవంశీ కులము,
చంద్రవంశీ కులము ఈ మూడింటి వారసత్వాన్ని ఒకే తండ్రి ద్వారా
తీసుకుంటున్నాము. సత్య, త్రేతాయుగాలలో ధర్మస్థాపన చేసేందుకు ఎవ్వరూ రారు.
భారతదేశమంతటా ఒకే ధర్మముంటుంది. తర్వాత వెలుపల నుండి ఇస్లామీయులు, బౌద్ధులు
మొదలైనవారు వస్తారు. భారతదేశము చాలా ప్రాచీన దేశము, మొదట దేవీదేవతలు
మాత్రమే ఉండేవారు. ఇప్పుడు వారు ఇతర ధర్మములలోకి కన్వర్ట్ అయిపోయారు అంటే
మారిపోయారు. అనేక భిన్న-భిన్న భాషలున్నాయి. ఉదాహరణానికి యూరోపియన్ల భాష,
అమెరికా భాష, ఫ్రాన్స్ వారి భాషలు వేరు వేరు. కాని అందరూ క్రైస్తవులే,
అలాగే చైనావారిని చూడండి, అందరిదీ ఒకే బౌద్ధ మతము. కాని చైనా భాష వేరే,
జపాను భాష వేరే అయితే అందరూ బౌద్ధులే కాని సంఖ్య వృద్ధి చెందినందున భాషలు
వేరు వేరుగా అయిపోతాయి. పరస్పరము శత్రువులుగా కూడా అవుతారు. భారతదేశానికి
శత్రువులెవ్వరూ లేరు, ఇతర ధర్మాల వారే వచ్చి పోట్లాడ్తారు. వారు పరస్పరము
గొడవ పడ్తూ భారతదేశములో కూడా పోట్లాడింపజేస్తారు. లేకుంటే భారతవాసులు
పరస్పరములో యుద్ధము చేసుకోవడం ఎప్పుడూ జరగలేదు. లోభ కారణంగా ఇతరులు
పోట్లాడింపజేశారు. ఇది కూడా ఆటయే. మనమే విశ్వాధికారులుగా ఉండేవారిమని కూడా
భారతవాసులు మర్చిపోయారు. మనకు తండ్రి రాజ్యభాగ్యమును ఇచ్చారని కూడా
మర్చిపోయారు. సత్యయుగములో ఈ రాజ్యాన్ని ఎలా పొందామనే జ్ఞానము కూడా ఉండదు. ఈ
రాజ్యము ఎలా పొందుతున్నామో ఇప్పుడు మీకు తెలుసు. ఇది తండ్రి కూర్చొని
అర్థం చేయిస్తున్నారు. చాలా సులభమైనదే కాని మనుష్యుల బుద్ధికి తాళము ఎలా
వేయబడి ఉందంటే ఈ లక్ష్మీనారాయణులకు రాజ్యము ఎవరు ఎప్పుడు ఇచ్చారో ఎవ్వరికీ
తెలియదు. వీరికి పిల్లలు ఎంతమంది ఉండేవారో మొదలైన విషయాలు కొద్దిగా కూడా
తెలియదు. సత్యయుగములో లక్ష్మీనారాయణుల రాజ్యము ఉండేది. సత్యయుగము ఆయుష్షు
ఎంత? వారు లక్షల సంవత్సరాలని అంటారు. మరి లక్షల సంవత్సరాలలో సింహాసనాలు
ఎన్ని మారాయి! ఎంత వృద్ధి జరిగింది! ఎంతమంది మహారాజులు మహారాణులు ఉంటారు?
లక్షల సంవత్సరాలలో అయితే లెక్కలేనంత మంది అయ్యి ఉండాలి. సత్యయుగానికి లక్షల
సంవత్సరాలు, త్రేతాయుగానికి లక్షలాది సంవత్సరాలు, కలియుగము ఇంకా 40వేల
సంవత్సరాలు ఉంటుందని అనేస్తారు. ఈ విషయాలను గురించి ఎవరి బుద్ధీ పని చేయదు.
సుదీర్ఘమైన ఆయుష్షు ఇచ్చేశారు. క్రియేటర్(సృష్టికర్త),
డైరెక్టర్(దర్శకులు), సమయము మొదలైన వాటన్నిటిని గురించి తెలిసి ఉండాలి.
కాని ఇవన్నీ ఎవ్వరికీ తెలియదు. క్రీస్తుపూర్వము 5 వేల సంవత్సరాల క్రితము
భారతదేశము స్వర్గముగా ఉండేదని అంటారు, దేవీ దేవతల(గాడ్‌గాడెస్)
రాజ్యముండేదని అంటారు. అది ఎన్ని సంవత్సరాలు నడిచింది? ఎలా నడిచింది?
మొదలైన విషయాలు కొంచెము కూడా తెలియదు. ఒకవేళ రాధా-కృష్ణులు సత్యయుగములో
రాకుమారులు - రాకుమార్తెలుగా ఉండి ఉంటే, వారు కూడా ఎవరో ఒక్కరి ద్వారా ఆ
పదవిని పొంది ఉంటారు కదా?ఒకవేళ కృష్ణుడు గీతను వినిపించి ఉంటే ఎప్పుడు
వినిపించి ఉంటాడు? ఈ విషయాలన్నీ స్వయంగా తండ్రియే అర్థం చేయిస్తున్నారు.
పాఠశాలలో మొదట అల్ఫ్, బే(ఓనామాలు) నేర్పుతారు తర్వాత పెద్ద పెద్ద
పరీక్షలలో పాస్ అవుతారు. మరి ప్రారంభములోనే అభ్యసించే ఓనామాల చదువుకు
మరియు తర్వాత చదివే చదువుకు ఎంత తేడా ఉంటుంది? ఇక్కడైనా అంతే. ప్రారంభములో
తెలుపుతూ ఉన్న దాని కంటే ఇప్పుడు ఇంకా సహజంగా అర్థము చేయిస్తారు. పోను పోను
ఇంకా ఎక్కువ సహజంగా అర్థం చేయిస్తారు. ఎవరైనా క్రొత్తవారు వస్తే మొదట
వారిచే ఫారమ్ నింపించడం జరుగుతుంది. ఆ తర్వాత పరమపిత పరమాత్మతో వారికి గల
సంబంధమేదో అర్థం చేయిస్తారు. వారు అందరికీ తప్పకుండా తండ్రే కదా. ఈ విషయాలు
అర్థము చేసుకోగలిగిన వారు మాత్రమే అర్థము చేసుకుంటారు. తండ్రి నుండి
తప్పకుండా వారసత్వము తీసుకోవాలనే గట్టి నిశ్చయముండాలి. తండ్రి స్వర్గాన్ని
రచిస్తారు, అందువలన వారు తప్పకుండా స్వర్గ వారసత్వమును ఇస్తారు. ఎవరైతే
కల్పక్రితము నిశ్చయము చేసుకొని ఉంటారో వారి బుద్ధిలో మాత్రమే కూర్చుంటుంది.
చాలామంది పిల్లలు ఉదయము ఉదయమే నిద్ర లేవ లేకపోవడం మీరు
చూస్తున్నారు. 10 - 15 సంవత్సరాల నుండి శ్రమ పడుతున్నా సమయానికి నిదుర
లేవలేరు. కనీసము 3-4 గంటలకు నిద్ర లేవండి, భక్తులు కూడా ఉదయమే లేచి ధ్యానము
చేస్తారు. హనుమంతుని జపము, శివుని జపము చేస్తారు. అయితే వాటి వలన ఎలాంటి
లాభమూ లేదు. కొంతమంది భక్తుల లక్షణాలు ఎంతో బాగుంటాయి కాని వారికి
ముక్తి-జీవన్ముక్తులు లభించవు, క్రిందకు దిగిపోయే కళ కలుగుతుంది.
లక్ష్మీనారాయణులు ఎవరైతే సత్యయుగములో రాజ్యం చేశారో వారు కూడా రెండవ
జన్మలో, మూడవ జన్మలో క్రిందికి వస్తూ పోతారు. దిగజారే కళ ఏర్పడుతూ పోతుంది.
అర్ధకల్పము పూర్తి అయిన తర్వాత మళ్లీ వామమార్గము (స్త్రీ, మాంసము,మదిరాలకు
వశమయ్యే మార్గము)లోకి వెళ్ళిపోతారు. మళ్లీ భక్తిమార్గము ప్రారంభమవుతుంది.
లెక్కలేనన్ని మందిరాలు తయారౌతాయి. ఇప్పుడు కూడా ఎన్ని మందిరాలున్నాయి!
కొన్ని మందిరాలు శిథిలమై కూలిపోయాయి కూడా. మందిరాలలో వామమార్గములోకి
వెళ్లిన చిత్రాలు కూడా ఉన్నాయి. దుస్తులు మాత్రము దేవతల వలె ఉన్నాయి.
వాస్తవానికి వారి డ్రస్సు వేరుగా ఉంటుంది. అవి తర్వాత మారుతూ వచ్చాయి.
ఒక్కొక్కరి తలపాగా ఒక్కొక్కలాగా ఉంటుంది. అలాగే వేరు వేరు కిరీటాలు ధరించిన
వేరు వేరు చిత్రాలు, నమూనాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్కరి కిరీటము
ఒక్కొక్కలాగా ఉంది. సూర్యవంశీ రాజుల వస్త్రధారణ వేరుగా ఉంటుంది. ఇది
ఫలానావారి తలపాగా అని బాబా సాక్షాత్కారములో కూడా చూశారు. ద్వారకాధీశుని
తలపాగా వంకరగా ఉండేది. డ్రామాలో ఆది నుండి అంత్యము వరకు ఏవైతే
జరుగుతున్నాయో అవన్నీ మళ్లీ అదే విధంగా జరుగుతాయి. మళ్లీ వామమార్గములోకి
వెళ్తారు. అందరి మతాలు వేరైపోతాయి. ఆచారాలు, పద్ధతులు వేరైపోతాయి.
సూర్యవంశీయులది వేరు, చంద్రవంశీయులది వేరు...... ఇది తయారైన డ్రామా. అది
మళ్లీ పునరావృతమవుతుంది.
మనము కూడా మళ్లీ అనంతమైన తండ్రి ద్వారా
గతి-సద్గతులను పొందుతామని మీకు తెలుసు. పాత ప్రపంచము వినాశనము అవ్వనున్నది.
అనంతమైన తండ్రి రాజయోగము నేర్పిస్తున్నారు. వారు రాజయోగము నేర్పిస్తారని
ప్రపంచములోని వారికి తెలియదు. పిల్లలైన మీకు బాగా తెలుసు. మీకు తండ్రి పై
చాలా ప్రేమ ఉంది అయితే అందరి ప్రేమ ఒకేలా ఉండజాలదు. అజ్ఞానములో కూడా
అందరికీ ఒకే రకమైన ప్రేమ ఉండదు. కొంతమంది లోభవశమై తండ్రి మరణిస్తే ఆస్తి
లభిస్తుందని అంటారు..... ఇక్కడ ఈ శివబాబాకు శరీరమే లేదు, బాబా అయితే
అవినాశి. ఈ శరీరాన్ని అద్దెకు(లోన్‌గా) తీసుకున్నారు. మనము పూర్తిగా 84
జన్మలు తీసుకున్నామని మీకు తెలుసు. బాబా అయితే పునర్జన్మలను తీసుకోరు, ఈ
శరీరములో దివ్యప్రవేశము చేసి వస్తారు. లేకుంటే లక్ష్మీనారాయణుల శరీరములోకి
రావాలా? కాని వారు పావన ప్రపంచానికి అధికారులు. ఇది పతిత ప్రపంచము, పతిత
శరీరము ఎందుకంటే విషము ద్వారా జన్మిస్తారు. బాబా కల్పక్రితము వలె, నేను
సాధారణ శరీరములో ప్రవేశిస్తాను అని అంటారు. నాకు తప్పకుండా అనుభవీ రథము
కావాలి. ఎవరైనా మంచి నటులుగా ఉంటే వారికి మంచి బహుమానము లభిస్తుంది. ఈ బాబా
రథము కూడా మహిమ చేయబడింది. బ్రహ్మ ద్వారా స్థాపన అని అంటారు. బ్రహ్మను
వృద్ధునిగా కూడా చూపిస్తారు. ప్రజాపిత బ్రహ్మ, విష్ణు, శంకరుల రూపాలే వేరు
వేరుగా ఉన్నాయి. బ్రహ్మ రూపము పూర్తి ఆక్యూరేట్‌గా(ఖచ్ఛితంగా) ఉంది. తండ్రే
స్వయంగా ఇతని పేరు ప్రజాపిత బ్రహ్మ అని పెట్టారు. ఇతడు పూర్తిగా 84 జన్మలు
తీసుకున్నాడు. మేమందరమూ పూర్తిగా 84 జన్మలు తీసుకున్నామని మీరు కూడా
అంటారు. అందుకే మొట్టమొదట తండ్రితో కలిశాము. మన రాజ్యము మళ్లీ స్థాపనౌతూ
ఉంది. ఓ పరమపిత పరమాత్మా! ఓ భగవంతుడా! అని కూడా అంటారు. కనుక భగవంతుడు మన
తండ్రి అని తప్పకుండా భావించాలి. కాని సర్వాత్మల తండ్రి నిరాకారుడని
మనుష్యులకు అర్థం కాదు. తండ్రి అయినందునే భక్తులందరూ స్మృతి చేస్తారు.
ఆత్మలకు ఒకప్పుడు వారి నుండి సుఖము లభించింది అందుకే దు:ఖములో ఉన్నప్పుడు
వారినే స్మృతి చేస్తారు. మీరు కూడా అర్ధకల్పము తండ్రిని స్మృతి చేస్తూ
వచ్చారు. ప్రారంభములోనే సోమనాథ మందిరము నిర్మించబడ్తుంది, అందువలన
తప్పకుండా తండ్రినే స్మృతి చేస్తారు. ఇది తండ్రి మందిరమని వారికి తెలుసు. ఆ
తండ్రే వారసత్వమునిచ్చారు. అందుకే మొట్టమొదట మందిరము కూడా తండ్రిదే
తయారయ్యింది. మీరిప్పుడు తండ్రికి వారసులుగా అయ్యారు. తండ్రి విశ్వరచయిత,
వారి నుండే వారసత్వము లభిస్తుంది. మిగిలిన వారెవరెవరున్నారో వారేమి చేశారు?
మనము వారినెందుకు పూజిస్తున్నాము? వారు 84 జన్మలు తీసుకుంటారు. అయితే
భక్తి కూడా వ్యభిచారీ భక్తిగా అయ్యే తీరాలి. అర్ధకల్పానికి సరిపోయే సామగ్రి
కావాలి. సత్య-త్రేతా యుగాలలో సామగ్రి అవసరముండదు. ఇవన్నీ బుద్ధిలో ధారణ
చేసుకోవాలి. వాస్తవానికి ఏమీ వ్రాయనవసరము లేదు. బుద్ధి సంపన్నంగా ఉంటే
వెంటనే ధారణ అవుతుంది కానీ ఎవరికైనా వినిపించేందుకు నోట్స్ వ్రాసుకుంటారు.
పుస్తకాలు మొదలైనవి ఉంచే అవసరము లేదు. మన పుస్తకాలు చివర్లో ఎవరు
చదువుతారు? ఇతరుల శాస్త్రాలు చివరిలో కొనసాగుతూ ఉంటాయి. వాటిని చదివే
వారుంటారు. మీరైతే చదివే పనే లేదు. ప్రాలబ్ధము లభించింది తర్వాత అర్ధకల్పము
వరకు శాస్త్రాలు మొదలైనవేవీ అవసరము లేదు.ఈ జ్ఞానము ప్రాయ: లోపమై పోతుంది.
శాస్త్రాలన్నీ సమాప్తమైపోతాయి. అందరికీ ఇద్దరు తండ్రులున్నారని మొట్టమొదట
అర్థము చేయించండి. శారీరిక తండ్రైతే ఉన్నారు. శారీరిక తండ్రి కూడా ఆ
తండ్రినే స్మృతి చేస్తాడు. దు:ఖములో అందరూ స్మృతి చేస్తారు, సుఖములో ఎవరూ
స్మృతి చేయరని గాయనము(దు:ఖ్ మే సిమిరన్ సబ్ కరే, సుఖ్ మే కరే న
కోయీ.........) చేయబడ్తుంది. ఇది విశేషంగా భారతదేశానికి అన్వయిస్తుంది.
తండ్రి కూడా భారతదేశములోనే అవతరిస్తారు, శివజయంతి వస్తుంది. మేము మా
తండ్రిగారి జన్మ దినోత్సవము జరుపుకుంటున్నామని మీరంటారు.
బ్రహ్మకుమార-కుమారీలు ఉన్నారు కాబట్టి వారి తండ్రి తప్పక వచ్చి ఉంటారు కదా.
ఇది శివుని జ్ఞానయజ్ఞము, కావున బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. బ్రహ్మ
ఎక్కడ నుండి వచ్చాడు? బ్రహ్మను దత్తత చేసుకున్నారు, మళ్లీ పిల్లలు
జన్మిస్తారు. వారు కూడా వీరి ముఖ కమలము ద్వారానే రచిస్తారు. మొట్టమొదట
అందరికి తండ్రి పరిచయమునివ్వాలి. మంచిది.
మధురాతి మధురమైన
అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు
గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
No comments:
Post a Comment