Friday, 3 November 2017

Telugu Murli 02/10/2017

02-10-2017 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - మీ ఉన్నతి కొరకు పురుషార్థము చేస్తూ ఉండండి. జ్ఞాన రత్నాలను దానము చేస్తూ సదా స్వ కళ్యాణము, ఇతరుల కళ్యాణము చేసేందుకు నిమిత్తులుగా అవ్వండి ''
ప్రశ్న :- ఈశ్వరీయ సేవ చేసేందుకు పిల్లలలో ఏ గుణము కలిగి ఉండడం తప్పనిసరి? సేవ చేసే పిల్లలలో ఎలాంటి ఆలోచనలు రాకూడదు ?
ఉత్తరం :- ఈశ్వరీయ సేవలో స్వభావము చాలా మధురంగా ఉండాలి. కోపగించుకుని ఎవరి పైన అయినా కన్నెర్ర చేస్తే అనేకమందికి నష్టము వాటిల్లుతుంది. సేవాధారులైన పిల్లలలో అహంకారము, కోపము ఏ మాత్రము ఉండరాదు. ఈ వికారమే చాలా విఘ్న రూపంగా అవుతుంది. మళ్లీ మాయ ప్రవేశమై ఎంతోమంది పిల్లలను సంశయ బుద్ధి గలవారిగా మార్చేస్తుంది. ఈశ్వరీయ సేవ చేసేందుకు నేను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ఈ సేవ చేయాలనే ఆలోచన రాకూడదు. చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ఈ సేవ కూడా చేయకపోతే భారము ఇంకా ఎక్కువైపోతుంది.

పాట :- ఓం నమ: శివాయ,.................
ఓంశాంతి. భక్తులు ఓం నమ: శివాయ అన్నప్పుడు శివలింగము లేక శివుని మందిరాన్ని గుర్తు చేసుకుంటారు. నమ:(నమస్కరిస్తూ) అంటూ పూజ చేస్తారు. అది భక్తి మార్గము. మనము శివబాబాను మీరే తల్లి-తండ్రి(త్వమేవ మాతశ్చ పితా,................) అని అంటాము. ఇప్పుడు మీరు చిత్రము ముందు నిల్చొని అలా అనరు. ఆ శివబాబా మనలను చదివిస్తున్నారు. మీకు తెలుసు రెండింటికి రాత్రింబవళ్లకు ఉన్నంత వ్యత్యాసముంది. ఇది ప్రపంచములో ఉన్నవారికి తెలియదు. నిరాకారులైన శివబాబా వచ్చి పాఠశాలలో చదివిస్తారు. ఏమి చదివిస్తారు? - సహజ రాజయోగము మరియు జ్ఞానము. ఉదాహరణానికి ఏసుక్రీస్తు పుస్తకము ఉంది. ఏసుక్రీస్తు ఏ జ్ఞానాన్ని ఇచ్చారో ఆ జ్ఞానము బైబిల్‌గా తయారయ్యింది. అలాగే ఇచ్చట శివ పురాణముంది. కాని దానిని శివుడు తయారు చేయలేదు. ఎవరో ఇతరులు తయారు చేశారు. వాస్తవానికి సత్యమైన శివపురాణము గీత. తండ్రి మీకు అర్థం చేయించారు. మీరు మళ్లీ ఇతరులకు అర్థం చేయించాలి. శివబాబా ఏమి అర్థం చేయించారు? శివుని జన్మను గురించి కూడా వినిపిస్తారు. ఇప్పుడు శివ పురాణమని గీతను అనాలా? లేక ఎవరో రచించిన శివపురాణాన్ని అనాలా? రెండూ ఒకటి అయ్యేందుకు వీలు లేదు కదా! భారత ఖండపు ధర్మశాస్త్రము ఒక్కటే ఉండాలి. ఎవరు ధర్మస్థాపన చేస్తారో వారి జీవనకథను తయారు చేస్తారు. వీరు ఈ విషయాలు చెప్పారు అని వ్రాస్తారు. ఏసుక్రీస్తు కూడా జ్ఞానము వినిపించి ఉంటాడు. ఆ జ్ఞానమే బైబిల్‌గా తయారయ్యింది. ఆ పురాణములో చాలా కథలు ఉన్నాయి. ఇప్పుడు నేను కథ వినిపించింది పిల్లలకు కానీ వారు పార్వతి పేరును వేశారు. పవిత్రతా ప్రతిజ్ఞ చేయించారని ఆ కథలో చూపించలేదు. మన్మనాభవ అను పదము కూడా శివపురాణంలో లేదు. శివపురాణము వేరు. ఇది శ్రీమద్భగవద్గీత. భగవంతుడు ఒక్కరేనని నిరూపించాలి. వారి పేరు శివుడు. ఆ గీత కృష్ణ పురాణమవుతుంది. వాస్తవానికి కృష్ణుడు పతితపావనుడు కాదు. శివుడు ఒక్కరే పతితపావనులు. భారతదేశపు ధర్మశాస్త్రము గీత. శివపురాణాన్ని అందరూ గౌరవించరు, నమ్మరు. ఇప్పుడు భగవద్గీత ద్వారా దేవీ దేవతా ధర్మము స్థాపన జరిగిందని మీరంటారు. ఆ స్థాపన శివుడు ఒక్కరు మాత్రమే చేయగలరు. కృష్ణుడు కూడా నల్ల(అపవిత్రము)గా ఉండి తెల్లగా(పవిత్రంగా) అవుతాడు. వ్యత్యాసము చాలా ఉంది. ఇది పిల్లలకు అర్థము చేయించబడ్తుంది. ఎవరైతే అర్థం చేసుకున్నారో వారి కర్తవ్యము - ఈ అలౌకిక కర్తవ్యాన్ని నిర్వర్తించడం. ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు ఎంతో సంతోషముండాలి. అపారమైన ఖజానా లభిస్తున్నది కావున దానము చేయాలి. ఏ దానము ఇవ్వాలి? తండ్రి పరిచయమునివ్వాలి. ఇది చాలా సులభము. భక్తులు భగవంతుని స్మృతి చేస్తారు. భగవంతుడు వచ్చి ఫలమునిస్తారు, ఏ ఫలమునిస్తారు? భగవంతుడు జీవన్ముక్తినే ఇస్తారు. సర్వుల సద్గతిదాత అని కృష్ణుని అనరు. పరమపిత పరమాత్మను అంటారు. పరమాత్మ నిరాకారుడని మీకు తెలుసు. కృష్ణుని పరమాత్మ అని అనజాలరు. కృష్ణుడు సర్వాత్మలకు తండ్రి అవ్వలేడు. సర్వాత్మల తండ్రి అని పరమపిత పరమాత్మనే మహిమ చేస్తారు. పిల్లలు చాలా మంచిరీతిగా తండ్రి పరిచయమునివ్వాలి. వారేమో సర్వవ్యాపి లేక లింగము అని అంటారు. లింగమైతే లింగానికి కర్తవ్యమేముంటుంది? పరమపిత పరమాత్ముడు పతితపావనులు. జ్ఞానసాగరులు అనే మహిమ ఉంది - ఈ పోస్టర్‌ బయట అతికించాలి. ఎవరు వచ్చినా చదువుకోవాలి. మీరు రాధా-కృష్ణులు లేక లక్ష్మీనారాయణుల మందిరాలకు వెళ్ళి అర్థం చేయించాలి. మన లక్ష్మీనారాయణుల చిత్రము చాలా బాగుంది. ఆ చిత్రాలు చూపి అర్థం చేయించాలి. లక్ష్మీనారాయణుల మందిరానికి వెళ్లేవారు తరచుగా గీతను తప్పకుండా చదువుతూ ఉంటారు. మీ ఉన్నతి కొరకు పురుషార్థము చేయాలి. తండ్రి నుండి శ్రేష్ఠమైన వారసత్వము పొందుకోవాలనే ఆసక్తి ఉండాలి. మీ కళ్యాణాన్ని, ఇతరుల కళ్యాణాన్ని చేయాలి. శివబాబా ఏమో అందరి కళ్యాణము చేయువారు. మీరు కూడా అలాగే కళ్యాణకారులుగా అవ్వాలి. బాబా అంటున్నారు - నాకు ఎప్పుడూ అకళ్యాణము జరగదు. అకళ్యాణకారి రావణుడని మానవులకు తెలియదు - మీరు వెళ్లి ఈ విషయాన్ని అర్థం చేయించాలి. మేఘాల వలె నింపుకొని వెళ్లి మళ్లీ వర్షించాలి. వర్షించేందుకు చాలా ఆసక్తి ఉండాలి! దానము చేయకపోతే మీ కళ్యాణమును మీరు చేసుకోలేదని తప్పకుండా అంటారు. మీరు మీ కళ్యాణమే చేసుకోకుంటే ఇతరులది అసలు చేయలేరు. సేవాకేంద్రాలకు చాలా మంచి మంచివారు ఎంతో మంది వస్తారు కాని వారు ఇతరుల కళ్యాణము చేయడం లేదు. వారు వింటారు మళ్లీ వారి వారి వ్యాపారాలలో మునిగిపోయి అలసిపోయి ఇంటికి పోతూనే సమాప్తమైపోతుంది. దానము ఇవ్వకపోతే వారు బ్రాహ్మణులే కారు. మేము దేవతలుగా అవ్వాలని బ్రాహ్మణులకు తెలుసు. ప్రతి ఒక్కరు తమ మనస్సులో తామే మాట్లాడుకోవాలి. ఎవ్వరినీ దేవతలుగా తయారు చేయలేదంటే వారు బ్రాహ్మణులని ఎలా పిలువబడ్తారు? నేను సదా కళ్యాణకారినే అని శివబాబా అంటున్నారు. కనుక మీరు కూడా కళ్యాణకారులుగా అవ్వాలి. ఈ విషయాలు ఎవరైనా ధారణ చేయలేకుంటే వారి కొరకు స్థూలమైన సేవ ఉంది. ఎవరికి సేవ చేసి ఉంటారో ఆ పిల్లలే ఇచ్చటకు వస్తారు. సేవా స్థానములలోని పిల్లలు తమంతకు తాము ప్రశ్నించుకోవాలి - మేము ఎంతమందికి కళ్యాణము చేశాము? రావడానికేమో చాలామంది వస్తారు కాని సేవ చేసేవారు ఏ కొద్దిమంది మాత్రమే ఉంటారు, మిగిలిన వారందరూ వారి వృత్తి వ్యాపారాదులలో మునిగిపోతారు. కేవలం పవిత్రమైతే చాలు అని భావిస్తారు. కాని ధనాన్ని దానము కూడా చేయాలి. నేను ఎవ్వరికీ కళ్యాణము చేయకుంటే ఏ పదవి లభిస్తుంది? అని మిమ్ములను మీరు ప్రశ్నించుకోవాలి. చాలామంది పిల్లలు కళ్యాణము చేసి పండాలు(మార్గదర్శకులు)గా తయారై వస్తారు. వారిలో కూడా నెంబరువారుగా ఉంటారు. కొంతమందిని ఫస్ట్‌ క్లాస్‌(ప్రథమ శ్రేణి)లో కొంతమంది సెకండు క్లాస్‌(ద్వితీయ శ్రేణి)లో కొంతమందిని థర్డ్‌ క్లాస్‌(తృతీయ శ్రేణి)లో ఉండడం జరుగుతుంది. అందువలన మీ కళ్యాణము మీరే చేసుకోవాలి. ఎవరికైతే స్వంత కళ్యాణము చేసుకోవాలని ఉండదో వారు ఏ పదవిని పొందుతారు? చాలా సేవాకేంద్రాలలోని పిల్లలు సేవ చేయరు, వారికి దానమిచ్చే శక్తి లేదు. ఉదయమే మందిరానికి వెళ్లాలి. అచ్చటికి వెళ్లి దేవతా ధర్మము వారు ఎవరు అని వెతకాల్సి ఉంటుంది.
తండ్రి అంటున్నారు - ఇప్పుడు నేను ఈ శరీరములో వచ్చాను, అచ్చట అయితే ఆత్మ వెళ్లి చిన్న శరీరములో ప్రవేశిస్తుంది. ప్రేతాత్మలు(భూతాలు) నీడ వలె వస్తాయి. ఇది కూడా ఆశ్చర్యమే. అది ఎలా తిరుగుతూ ఉంటాయో కూర్చుని ఎవరు గమనించాలి. అడ్రస్‌(చిరునామా) ఎవరు కనుక్కోవాలి? డ్రామాలో ఆత్మలకు శరీరము లభించకుంటే అలమటిస్తూ వెతుకుతూ ఉంటాయి. ఛాయా రూపాన్ని తీసుకుంటాయి. దయ్యాలు మరియు భూతాలు నీడ పడదు. అవి వస్తాయి అదృశ్యమైపోతాయి. మనము ఆ విషయాలలోకి పోరాదు. మనకు దాని అవసరమే లేదు. ఈ విషయాలను వెతుకుతూ కూర్చుంటే శివబాబాను మర్చిపోతాము. బాబా ఆజ్ఞాపిస్తున్నారు - నిరాకార శివుని స్మృతి చేయండి. మీ దేహాన్ని మరియు ఇతర దేహాలను మర్చిపోవాలి. అందరికీ ప్రియమైన శివబాబా అంటున్నారు - ఇతర విషయాలలోకి వెళ్లక తండ్రిని స్మృతి చేయండి. ఇది స్మృతియాత్ర మన్మనాభవకు కూడా అర్థము ఇదే. కృష్ణుడు ఈ విధంగా చెప్పలేడు. కృష్ణుని గైడ్‌(మార్గదర్శకుడు) అని అనరు. ఒక్క నిరాకారుడే గైడుగా తయారై ఆత్మలందరినీ దోమల వలె తీసుకెళ్తారు. ఆత్మలకు గైడ్‌ కృష్ణుడు కాడు. ఇతడు పునర్జన్మలలోకి వెళ్లాలి. కావున మీరు అందరికీ తండ్రి పరిచయమునివ్వాలి. భక్తుల భగవంతుడు ఒక్కరే. ఆ తండ్రి చెప్తున్నారు - నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమైపోతాయి. పిల్లలకు సేవ చేయాలనే ఆసక్తి ఉండాలి.

పిల్లలు మురళి వినేందుకు మధువనానికి వస్తారు. మరి వినిపించేవారు కూడా తప్పకుండా కావాలి కదా. బాబా ఎచ్చటకు వెళ్ళినా సేవయే చేస్తారు. సేవ చేయాలని ఆసక్తి ఉంటుంది. పిల్లలు స్మృతి చేస్తారు. వారు సన్ముఖములో మురళి విని సంతోషిస్తారు. ఒకేసారి పది కార్యాలు సిద్ధిస్తాయి. పెద్ద పెద్ద సభలకు తండ్రి వెళ్లలేరు. అది పిల్లల కర్తవ్యము. పిల్లలతోనే ప్రశ్నోత్తరాలు జరుపుతారు. సన్యాసులు మొదలైనవారు తండ్రి ముందుకు రానే రారు. వారికి గౌరవము కావాలి. తండ్రి పాత్ర చాలా అద్భుతమైనది. జరిగిపోయినదంతా డ్రామాయే. పోను పోను కలుసుకునేందుకు చాలా మంది వస్తారు. మొదట పిల్లలు అర్థం చేయించాలి. గోప-గోపికలే ఇంటింటికి వెళ్ళి తండ్రి పరిచయమునివ్వాలి. మాకు తెలియనే తెలియదని ఎవ్వరూ ఫిర్యాదు చేయరాదు. ముందు కాలములో వలె సూచనలిచ్చేందుకు రాజు-రాణులు ఎవ్వరూ లేరు కదా. క్రొత్త కళ(హునర్‌) ఏదైనా కనుగొంటే ప్రభుత్వానికి చూపించి వృద్ధి చేయిస్తారు. ఇచ్చట ప్రజల పై ప్రజా(ప్రజాస్వామ్యము) రాజ్యముంది. పిల్లలే అందరికీ ఆహ్వానము ఇవ్వాలి. దీని కొరకు చిత్రాలు మొదలైనవి ముద్రిస్తూ ఉంటారు. ఈ చిత్రాలు విదేశాలకు కూడా వెళ్తాయి. పిల్లలు బాగా శ్రమించాలి. ఎవరికి ఏ భాష తెలుసో, వారు వెళ్లి ఆ భాషలో అర్థం చేయించాలి. అనేక భాషలున్నాయి. పూనా, బెంగళూరు వైపు వెళ్లి చాలా అభివృద్ధి చేయమని బాబా సలహా ఇస్తున్నారు. అందరికీ తెలియాలి. అన్ని భాషలలో కరపత్రాలు అచ్చు వేయించాలి. విశాలమైన బుద్ధి ఉండాలి. అలాగని బాబాతో - '' చేసే ఉద్యోగాన్ని వదిలేస్తునా? '' అని అడగరాదు. ఉద్యోగము వదిలి మళ్లీ సర్వీసు కూడా చేయలేకుంటే భారము ఇంకా పెరుగుతుంది. ఇందులో స్వభావము చాలా మధురంగా ఉండాలి. చాలామందిలో కోపముంది. కన్నెర్ర చేస్తారు. నా వద్దకు రిపోర్టు వస్తుంది. నా మాట వినడం లేదు అని మంచి మంచి పిల్లలు వ్రాస్తారు. ఈ పదాలు మీ నోటి నుండి రాకూడదు. పిల్లలలో దేహ అహంకారము లేక క్రోధము ఉంటే అనేకమందికి నష్టము కలిగిస్తారు. తండ్రికి పిల్లల పై ఎంత గమనముంటుంది. పిల్లలందరి పై దృష్టి ఉంచవలసి ఉంటుంది. మమ్మా చిన్న కుమారిగా ఉండేది. అయినా మమ్మా అని పిలువబడేది. ఆమెకు తపన ఉండేది. జ్ఞానములో కూడా అచ్చటచ్చట మాయ ప్రవేశిస్తుంది. అప్పుడు చాలా మంది సంశయబుద్ధి గలవారిగా అవుతారు. అడుగడుగునా ఎన్నో విఘ్నాలు ఏర్పడ్తాయి. ఈ రోజు పుత్రుడుగా ఉంటాడు రేపు మారిపోతాడు. వికారాలకై ఎన్నో కొట్లాటలు జరుగుతాయి. ఈ సంస్థకు ఇంత గ్లాని ఎందుకుంది? అని చాలామంది అడుగుతారు. వారికి అర్థము కాక అలా అడుగుతారు. శాస్త్రాలలో కృష్ణుని ఎంత గ్లాని చేశారు! ఫలానావారిని అపహరించుకుని పోయాడు, ఇది చేశాడు,........... అని వ్రాశారు కాని కృష్ణుడు అలా చేయజాలడు. ఇచ్చట కూడా ఎత్తుకు వెళ్ళారని కళంకము ఆపాదించారు. ఇల్లు వాకిళ్ళు వదిలింపజేస్తారని కూడా నింద మోపినారు. ఎందుకు విడిపిస్తారో అది ఎవ్వరికీ తెలియదు. ఎంతవరకు అర్థము చేయించరో అప్పటివరకు అర్థము చేసుకోలేరు. ఎందుకంటే అనేక విఘ్నాలు వస్తాయి. ముఖ్యమైనది కామ వికారము. దాని పై పిల్లలైన మీరు విజయము పొందుతారు.

వీరు అద్భుతమైన, విచిత్రమైన తండ్రి. బ్రహ్మ ద్వారానే బ్రాహ్మణులు రచింపబడ్తారు. మొట్టమొదట శివబాబా పరిచయమునివ్వాలి. వారి నుండి వారసత్వము లభిస్తుంది. భాగ్యములో లేకుంటే మాయ మరిపింపజేస్తుంది. మాయ విఘ్నాలు ఎన్నో ఏర్పడ్తాయి. ధారణ జరగదు. అది కూడా విఘ్నమే కదా. ఇంత సులభమైన సర్వీసు ఎందుకు చేయలేరు! వారు భగవంతుడైన తండ్రి, ఆ అల్ఫ్‌(అల్లా, బాబా)ను స్మృతి చేయండి. భగవానువాచ - నన్నొకరినే స్మృతి చేస్తే నా నుండి వారసత్వము లభిస్తుంది. ఓ గాడ్‌ఫాదర్‌! అని భక్తులు అంటారు కదా. అందువలన తండ్రి నుండి వారసత్వము లభిస్తూ ఉంది. సేవ చేయాలనే ఆసక్తి ఉండాలి. ఉన్నతపదవిని ఎలా పొందుతారు? చేయవలసిన సేవ చాలా ఉంది. గొడవలు కూడా చాలా ఉన్నాయి. తండ్రి పేరు కూడా అదృశ్యమైపోయింది. జ్ఞానము కూడా అదృశ్యమైపోయింది. అందువలన పరిచయమివ్వవలసి వస్తుంది. మాకు తండ్రి ఆజ్ఞ లభించింది అంటూ అందరికీ నిమంత్రణనివ్వాలి. ఈ విషయంలో ఎవ్వరూ కోపగించుకోరు. పోస్టర్లు సేవ కొరకు ముద్రింపబడ్డాయి. ఊరికే ఉంచుకునేందుకు కాదు. ఓం నమ: శివాయ అనే పదము చాలా బాగుంది. దీనిలో శివబాబా పరిచయము పూర్తిగా వచ్చేస్తుంది. నిరాకార శివబాబా వచ్చారు. వారసత్వాన్ని ఇచ్చారు. వారు వచ్చి పతిత ప్రపంచాన్ని పావన ప్రపంచంగా తయారు చేశారు. ఈ విధంగా మీలో మీరు ఆలోచించుకొని ఆ తర్వాత వెళ్లి ఇతరులకు అర్థం చేయించవలసి ఉంటుంది. శివుని మందిరాలు కూడా చాలా ఉన్నాయి. గుప్త వేషములో వెళ్లి తెలపాలి. ఈ శివుడంటే ఎవరు? అని అడగాలి. శివబాబాను నిరాకార పరమాత్మ అని అంటారు అని అర్థం చేయించాలి. ఆయన ఏమి చేశాడని ఇన్ని మందిరాలను కట్టించారు? ఈ విధంగా యుక్తిగా ప్రశ్నిస్తూ అర్థం చేయించాలి. తర్వాత అర్థము చేసుకోనీ, చేసుకోకపోనీ అది వారి ఇష్టము. అంతిమ సమయములో వీరు (బ్రహ్మాకుమారీలు) వచ్చి మాకు అర్థం చేయించారని స్మృతి కలుగుతుంది. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మీ కళ్యాణము చేసుకునేందుకు సేవ చేయాలనే ఆసక్తిని చాలా చాలా ఉంచుకోవాలి. అలసిపోయి కూర్చుండిపోరాదు. మనుష్యులను దేవతలుగా తయారు చేసే సేవ తప్పకుండా చేయాలి.
2. ఎవరైనా ఫిర్యాదు చేసే విధంగా లేక మాతా-పితలకు చింత కలిగించేలా ఏ పనులూ చేయరాదు. ఎట్టి పరిస్థితులలోనూ విఘ్నరూపంగా అవ్వరాదు.

వరదానము:- ''బాబా'' శబ్ధాన్ని స్మృతిలో ఉంచుకొనుట ద్వారా హద్దులోని ''నాది (మేరాపన్‌)'' అను దానిని అర్పణ చేసే బేహద్‌ వైరాగీ భవ''
చాలామంది పిల్లలు '' ఇది నా గుణము, ఇది నా శక్తి '' అని అంటారు. ఇది కూడా తప్పే. పరమాత్ముడు ఇచ్చిన దానిని 'నాది' అని అనుకోవడం మహాపాపము. చాలామంది పిల్లలు సాధారణ భాషలో నా గుణాన్ని, నా బుద్ధిని ఉపయోగించడం లేదు అని అంటారు. కాని 'నాది' అని అనుట మైల పడుట. ఇది కూడా మోసమే అవుతుంది. అందువలన ఈ హద్దులోని మేరేపన్‌ను అర్పణ చేసి సదా బాబా అను శబ్ధము గుర్తుంచుకోవాలి. అప్పుడు బేహద్‌(అనంతమైన) వైరాగీ ఆత్మ అని అంటారు.

స్లోగన్‌ :- ''మీ సేవను తండ్రి ముందు అర్పణ చేస్తే, సేవకు ఫలము, బలము ప్రాప్తి అవుతూ ఉంటాయి''

No comments:

Post a Comment