08-10-2017 అవ్యక్త బాప్‌దాదా ఓంశాంతి రివైజ్: 26-01-1983 మధువనము
'' దాత పిల్లలుగా అయ్యి సర్వులకు సహయోగము ఇవ్వండి ''ఈ రోజు బాప్‌దాదా తన సేవాధారీ సాథీలను(సహచరులను) కలుసుకునేందుకు వచ్చారు. ఎలాగైతే బాప్‌దాదా ఉన్నతోన్నతమైన స్థానంలో స్థితమై అనంతమైన సేవార్థం నిమిత్తంగా ఉన్నారో అలాగే మీరందరూ ఉన్నతోన్నతమైన సాకార స్థానంలో స్థితమై అనంతమైన సేవ చేసేందుకు నిమిత్తంగా ఉన్నారు. ఈ స్థానం వైపు అనేక ఆత్మల దృష్టి ఉంది. ఎలాగైతే తండ్రి నివసించే యదార్థ స్థానము తెలియకపోయినా అందరి దృష్టి పైకే వెళ్తుందో అలాగే సాకారంలో సర్వాత్మల దృష్టి ఈ మహోన్నత స్థానం పైకే వెళ్తూ(వస్తూ) ఉంది, ఇంకా వెళ్తుంది. ''ఎక్కడ ఉంది, ఎక్కడ ఉన్నారు'' అని ఇంతవరకు వెతుకుతూనే ఉన్నారు. ఏదో ఒక శ్రేష్ఠమైన గమ్యం లభించాలని అనుకుంటారు. కానీ ఇదే ఆ స్థానము. దీనిని గుర్తించడం కొరకు నలువైపులా పరిచయాన్ని ఇచ్చే సేవ అందరూ చేస్తున్నారు. కలుసుకోవాలి లేక పొందాలి అనే సేవను ఇక్కడి నుండే ఈ బేహద్ విశేష కార్యమే ప్రసిద్ధి చేస్తుంది. ఇదే మా శ్రేష్ఠ గమ్యము. విశ్వంలోని ఈ శ్రేష్ఠమైన మూల నుండే సదాకాలం కొరకు అందరికీ ప్రాణదానం లభించాలి. ఈ అనంతమైన కార్యము ద్వారా ఈ ప్రచారం విశాల రూపంలో జరగనున్నది. ఎలాగైతే భూమి లోపల ఏదైనా దాగబడినవి లేదా మట్టి లోపల కప్పబడినవి అకస్మాత్తుగా లభిస్తే ఖుషీ ఖుషీగా అన్ని వైపులా ప్రచారం చేస్తారో అలాగే ఈ ఆధ్యాత్మిక ఖజానా ప్రాప్తి అయ్యే స్థానం ఏదైతే ఇప్పుడు గుప్తంగా ఉందో దానిని అనుభవమనే నేత్రం ద్వారా చూసి పోగొట్టుకున్న, కోల్పోయిన గుప్త ఖజానా గల స్థానం మళ్లీ లభించిందని అర్థం చేసుకుంటారు. ఈ మారుమూలలో ఇంత గొప్ప శ్రేష్ఠమైన ప్రాప్తి లభించే స్థానం ఉంది అనే మాటలు మెల్ల మెల్లగా అందరి మనసు నుండి, నోటి నుండి వెలువడ్తాయి. దీనిని బాగా ప్రసిద్ధి చెయ్యండి. అప్పుడు విచిత్రమైన తండ్రి, విచిత్రమైన లీలలు మరియు విచిత్రమైన స్థానాన్ని చూసి చూసి అందరూ హర్షిస్తారు. అద్భుతమైన విషయము, అద్భుతమైన కార్యము అనే ఈ మాటలు అందరి నోటి నుండి వింటూ ఉంటారు. ఇలాంటి సదాకాలిక అనుభూతి చేయించేందుకు ఏ ఏ ఏర్పాట్లు చేశారు?
హాలు(హాల్) అయితే తయారు చేస్తున్నారు. హాలుతో పాటు నడవడిక(చాల్) కూడా బాగుందా? హాలుతో పాటు చాల్(నడవడిక) కూడా చూస్తారు కదా! కనుక హాల్ మరియు చాల్ రెండూ విశాలంగా, అనంతమైనవిగా ఉన్నాయి కదా. ఎలాగైతే శ్రామికుల నుండి పెద్ద పెద్ద ఇంజినీర్ల వరకు ఇరువురి సహయోగం మరియు సంఘటనతో హాలు సుందరమైన రూపురేఖలు తయారయ్యాయి. కూలివాళ్ళు(కార్మికులు) లేకపోతే ఇంజినీర్లు కూడా ఏమి చేస్తారు? వాళ్ళు కాగితం పై ప్లాన్(నమూనా) తయారు చేయగలరు. కాని ప్రత్యక్ష స్వరూపం కూలివాళ్ళు లేకుండా తయారవ్వదు. కనుక ఎలాగైతే స్థూల సహయోగం ఆధారంతో అందరి వేళ్ళు పడి(సహయోగంతో) హాలు తయారయ్యిందో అలాగే హాలుతో పాటు అద్భుతమైన నడవడిక చూపించేందుకు అటువంటి విశేష స్వరూపాన్ని ప్రత్యక్ష రూపంలో చూపించండి. కేవలం బుద్ధిలో సంకల్పం చేశాము అని కాదు. కానీ ఎలాగైతే ఇంజినీర్ల బుద్ధి సహాయం మరియు కార్మికుల కర్మ సహాయముతో కార్యము సంపన్నమవుతుందో అలా మానసిక శ్రేష్ఠ సంకల్పాలతో పాటు ప్రతి కర్మ ద్వారా కూడా విచిత్రమైన నడవడిక అనుభవమవ్వాలి. ప్రత్యక్ష స్వరూపం ప్రతి కర్మ ద్వారానే కనిపిస్తుంది కనుక ఇలా నడిచేందుకు, చేసేందుకు సంకల్పం, మాటలు, చేతులు మరియు పాదాల ద్వారా సంఘటిత రూపంలో విచిత్ర స్వరూపము ద్వారా చూపించాలని దృఢ సంకల్పము చేశారా? అందుకు పటం(ప్లాను) తయారు చేశారా? కేవలం మూడు వేల మంది సభ కాదు కాని మూడు వేల మందిలో సదా త్రిమూర్తులు కనిపించాలి. వీరందరూ బ్రహ్మ సమానంగా కర్మ యోగులుగా, విష్ణు సమానంగా ప్రేమ మరియు శక్తితో పాలన చేసేవారిగా, శంకరుని సమానంగా తపస్వీ వాతావరణాన్ని తయారు చేసేవారిగా ఉన్నారు అనే అనుభవం మీలో ప్రతి ఒక్కరి ద్వారా ఇతరులకు జరగాలి. ఇలాంటి సర్వ శక్తుల స్టాకును స్వయంలో జమ చేసుకున్నారా? ఈ భండారాను కూడా నిండుగా నింపారా? ఈ స్టాకును పరిశీలించుకున్నారా? లేక పరిశీలించుకునేందుకు వీలు లేనంత బిజీగా అయిపోయారా?
సేవలో అవినాశీ సఫలత కోసం స్వయంలోని ఏ విశేష పరివర్తనను ఆహుతి చేస్తారు? అందుకు మీ అంతకు మీరు ప్లాన్ తయారు చేసుకున్నారా? దాత పిల్లలుగా అయ్యి అందరికి సహయోగం ఇవ్వడం అన్నింటికంటే గొప్ప కంటే గొప్ప దానము. చెడిపోయిన కార్యాన్ని, చెడిపోయిన సంస్కారాలను, చెడిపోయిన మూడ్‌ను(మానసిక స్థితిని) శుభ భావనతో బాగు చేయడంలో ఎల్లప్పుడూ అందరికీ సహయోగులుగా అవ్వడమే గొప్ప కంటే గొప్ప విశేషమైన దానము. వీళ్ళు ఇది అన్నారు, ఇది చేశారు - ఇవి చూస్తూ, వింటూ అర్థం చేసుకున్నా తమ సహయోగం యొక్క స్టాకు ద్వారా వారిని పరివర్తన చేయాలి. ఎలాగైతే ఏదైనా ఖాళీ సేవా స్థానము(సెంటరు) ఉంటే అన్ని సేవలు చేసే సేవాధారులు(ఆల్‌రౌండ్ సేవాధారులు) సమయ ప్రమాణంగా ఆ స్థానాన్ని నింపేస్తారో అలా ఎవరి ద్వారానైనా ఏదైనా శక్తి లోపంగా అనుభవం అయినట్లయితే తమ సహయోగంతో ఆ స్థానాన్ని నింపేయండి. దీని ద్వారా ఇతరుల లోపం కూడా ఇతరులెవ్వరికీ అనుభవం అవ్వదు. దీనిని దాత పిల్లలుగా అయ్యి సమయ ప్రమాణంగా వారికి సహయోగ దానమునివ్వడం అని అంటారు. వీరు ఇలా చేశారు, అలా చేశారు అని ఆలోచించకండి. కాని ఏది చేయాలో అది చేస్తూ ఉండండి. ఎవ్వరి లోపాలనూ చూడకండి కాని ముందుకు వెళ్తూ ఉండండి. అత్యంత మంచి పని ఏమిటి అని కేవలం ఆలోచించడం కాదు కానీ ఆ పనిని చెయ్యాలి. దీనినే విచిత్రమైన నడవడిక (విచిత్ర స్థితి) యొక్క ప్రత్యక్ష స్వరూపము అని అంటారు. సదా అత్యంత మంచే జరుగుతూ ఉంది, అత్యంత మంచి పనే చేస్తూ ఉండాలి అనే సమర్థ సంకల్పాన్ని జతలో ఉంచుకోండి. కేవలం వర్ణన చెయ్యడం కాదు కాని నివారణ చేస్తూ నవ నిర్మాణ కర్తవ్యం యొక్క సఫలతను ప్రత్యక్ష రూపంలో చూస్తూ ఇతరులకు చూపిస్తూ ఉండాలి. ఈ ఏర్పాట్లు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి కదా ఎందుకంటే అందరికీ బాధ్యత ఉన్నా విశేషించి మధువన నివాసులకు ఎక్కువ బాధ్యత ఉంది. డబల్ బాధ్యత తీసుకున్నారు కదా. ఎలాగైతే హాలును ప్రారంభోత్సవము చేయించారో అలా మీ నడవడిక (స్థితి) ప్రారంభోత్సవం కూడా జరిగిందా? అది కూడా రిహార్సల్ అయ్యిందా అవ్వలేదా? రెండిటి కలయిక జరిగినప్పుడే సఫలతా ఢంకా ధ్వని నలువైపులకు చేరుకుంటుంది(వ్యాపిస్తుంది). ఎంత ఉన్నత స్థానమో అంత లైటు(ప్రకాశము) నలువైపులా ఎక్కువగా వ్యాపిస్తుంది. ఇది అన్నింటికంటే చాలా ఉన్నతమైన స్థానము కావున ఇక్కడ నుండి బయలుదేరిన శబ్ధము నలువైపులకు వ్యాపించాలి. అందుకు మీరు లైట్ మైట్ హౌస్‌గా అవ్వాలి. మంచిది.
సదా స్వయాన్ని ప్రతి గుణము, ప్రతి శక్తితో సంపన్నంగా సాక్షాత్తు తండ్రి స్వరూపంగా అయ్యి అందరికి సాక్షాత్కారం చేయించే వారికి, సదా విచిత్ర స్థితిలో స్థితమై సాకార చిత్రం ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేసేవారికి, ఉన్నతోన్నతమైన స్థితి ద్వారా ఉన్నతోన్నతమైన స్థానాన్ని ఉన్నతోన్నతమైన ప్రాప్తుల భండారాన్ని ప్రత్యక్షం చేసేవారికి, అందరి మనసుల నుండి ''లభించింది'' ''పొందాము'' ఈ పాటలు బయటకు రావాలి అనే శుభ భావన, శుభ కామన సదా ఉంచుకునే వారికి ఇలాంటి సర్వ శ్రేష్ఠమైన అనంతమైన సేవాధారులకు బాప్‌దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే.
మధువన నివాసులతో :- వరదాన భూమిలో ఉండేవారికి సదా సంతుష్టంగా ఉండే వరదానం లభించింది కదా. స్వయాన్ని ఎంతగా సర్వ ప్రాప్తులతో అనుభవం చేస్తే అంత సదా సంతుష్టంగా (తృప్తిగా) ఉంటారు. కొంచెమైనా లోపం అనుభవం అయ్యిందంటే ఎక్కడ లోపం ఉంటుందో అక్కడ అసంతుష్టత ఉంటుంది. కనుక సర్వ ప్రాప్తులు ఉన్నాయి కదా. సంకల్ప సిద్ధి అయితే జరుగుతోంది కదా. కొంచెం శ్రమ చెయ్యాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది మన రాజ్యం అయితే కాదు, ఇతరులకు ఎన్ని సమస్యలు వస్తాయో అన్నీ ఇక్కడ ఉండవు. ఇక్కడ సమస్య ఆటలాగా అయిపోయింది. అయినా సమయానికి చాలా సహయోగం లభిస్తూ ఉంటుంది. ఎందుకంటే ధైర్యము ఉంచుకున్నారు, ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ సహయోగం ప్రాప్తిస్తూనే ఉంటుంది. తమ మనసులో ఎలాంటి అలజడి ఉండరాదు. మనసు సదా తేలికగా ఉండుట వలన అందరి వద్దా మీ కొరకు తేలికదనం ఉంటుంది. చాలా కొద్దిగా లెక్కాచారాలు ఉండనే ఉంటాయి. ఆ లెక్కాచారాలను కూడా ఇదేమీ పెద్ద విషయమేమీ కాదు అని అన్నట్లుగా దాటుకోండి. చిన్న విషయాన్ని పెద్దదిగా చేయకండి. చిన్నదిగా చేసుకోవడం పెద్దదిగా చేసుకోవడం ఇది తమ బుద్ధి పైనే ఆధారపడి ఉంది. ఇప్పుడు అనంతమైన సేవ చేసే సమయం కనుక బుద్ధిని కూడా అనంతంగానే ఉంచుకోండి. వాతావరణాన్ని శక్తిశాలిగా తయారుచేయాలి. ఇది ప్రతి ఒక్క ఆత్మ స్వయానికి బాధ్యునిగా భావించాలి. ఒకరు ఇంకొకరి స్వభావ సంస్కారాలను తెలుసుకున్నారు కనుక జ్ఞానవంతులు ఎప్పుడూ ఎవరి స్వభావ సంస్కారాలతోనూ ఘర్షణ పడరు. ఇక్కడ గొయ్యి ఉంది లేదా పర్వతం ఉంది అని తెలుసుకున్న వారు ఎప్పుడూ దానిని ఢీ కొనరు, దాటుకుంటారు. కావున స్వయాన్ని సదా సురక్షితంగా ఉంచుకోవాలి. ఒకరు ఘర్షణ పడక (ఢీ కొనక)పోతే రెండవవారు స్వతహాగానే స్వయం రక్షించబడ్తారు. దాటుకోండి (కినారా కరో) అనగా స్వయాన్ని సురక్షితంగా ఉంచుకోండి మరియు వాతావరణాన్ని సురక్షితంగా ఉంచండి. పని చేయకుండా దూరం కాకండి. తమ రక్షణ శక్తితో ఇతరులను కూడా రక్షించాలి. దాటుకోవడం అంటే ఇదే. ఇటువంటి శక్తి అయితే వచ్చేసింది కదా!
సాకార రూపములో అనుసరించే లెక్కతో అందరికీ మధువనమే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఉన్నతమైన స్థానము. మధువనంలో ఉన్నవారు ఎల్లప్పుడూ ఊయలలో ఊగుతూ ఉంటారు. ఇక్కడైతే అన్నీ ఊయలలే ఉన్నాయి. స్థూల ప్రాప్తి కూడా చాలా ఉంది. దానితో పాటు సూక్ష్మ ప్రాప్తి కూడా చాలా ఉంది. సదా ఊయలలో ఉంటే ఎప్పుడూ తప్పులు జరగవు. ప్రాప్తి యొక్క ఊయల నుండి దిగిపోయినట్లయితే తమ పొరపాట్లు, ఇతరుల పొరపాట్లు రెండూ కనిపిస్తాయి. ఊయలలో కూర్చుంటే భూమిని వదిలిపెట్టాల్సి ఉంటుంది. మధువనం వారైతే సర్వ ప్రాప్తులనే ఊయలలో సదా ఊగుతూనే ఉంటారు. కేవలం ప్రాప్తి ఆధారంతో జీవితం ఉండరాదు. మీ ముందుకు ప్రాప్తులు భలే వచ్చినప్పటికి మీరు ప్రాప్తులను స్వీకరించకండి. ఒకవేళ కోరిక ఉంచుకుంటే సర్వ ప్రాప్తులు ఉన్నా లోపం అనుభవమవుతుంది. సదా స్వయాన్ని ఖాళీగా అనుభవం చేస్తారు. కష్టపడకుండానే ప్రాప్తి స్వయంగా వచ్చినట్లయితే దానినే భాగ్యము అని అంటారు. కావున ఈ భాగ్యాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. స్వయం ఎంత నిష్కాములుగా అయితే అంత ప్రాప్తి మీ ముందుకు స్వతహాగానే వస్తుంది. అచ్ఛా.
సేవాధారులతో :- సేవాధారికి అర్థమే ప్రత్యక్ష ఫలం తినేవారు. సేవ చేశారు, సంతోషాన్ని అనుభవం చేశారు. ఇది ప్రత్యక్ష ఫలం తినడమే కదా! సేవాధారిగా అవ్వడం గొప్ప కంటే గొప్ప భాగ్యానికి గుర్తు. జన్మ-జన్మలకు స్వయాన్ని రాజ్యాధికారిగా తయారు చేసుకునేందుకు సహజ సాధనము సేవయే. అందువలన సేవ చెయ్యడం అనగా భాగ్య నక్షత్రం మెరిసిపోవడం. ఇలా భావిస్తూ సేవ చేస్తున్నారు కదా! సేవ అనిపిస్తుందా లేక ప్రాప్తి అనిపిస్తుందా? పేరుకు సేవ కానీ ఇది సేవ చెయ్యడం కాదు, లభించడం అవుతుంది. ఎంత లభిస్తుంది? చేసేది ఏమీ ఉండదు కానీ అన్నీ లభిస్తాయి. చెయ్యడానికి అన్ని సుఖ సాధనాలూ లభిస్తాయి. ఏ కష్టం చేయాల్సిన అవసరం ఉండదు. ఎంత కష్టమైన పని అయినా అందుకు పరిష్కారం, సాధనం కూడా దానితో పాటు లభిస్తుంది. కావున అది కష్టమైన పని అని అనిపించదు. ఆటలాగా అనిపిస్తుంది. అందువలన సేవాధారిగా అవ్వడం అనగా ప్రాప్తులకు యజమానిగా అవ్వడం. రోజంతటిలో ఎంత ప్రాప్తి చేసుకుంటున్నారు? ఒక్కొక్క రోజుకు, ఒక్కొక్క గంటకు ఎంత ప్రాప్తి లభించిందో లెక్క తీసినట్లయితే ఎంత లెక్కపెట్టలేనంతగా ఉంటుంది! అందువలన సేవాధారిగా అవ్వడం భాగ్యానికి గుర్తు. సేవకు అవకాశం లభించింది అంటే ప్రాప్తుల భండారము సంపన్నమైపోయినట్లే. స్థూల ప్రాప్తి కూడా ఉంది, సూక్ష్మ ప్రాప్తి కూడా ఉంది. ఎక్కడ ఏ సేవ చేసినా మధువనంలో లభించినంత స్థూల సాధనాలు ఇంకెక్కడా లభించవు. ఇక్కడ సేవతో పాటు మొదట స్వంత ఆత్మకు, శరీరానికి పాలన డబల్‌గా జరుగుతుంది. కనుక సేవ చేస్తూ సంతోషం ఉంటుందా లేక అలసట ఉంటుందా? సేవ చేస్తూ డబల్ సేవ చేస్తున్నానా? అని ఎల్లప్పుడూ చెక్ చేసుకోండి. మనసు ద్వారా వాయుమండలాన్ని శ్రేష్ఠంగా తయారు చేయాలి మరియు కర్మల ద్వారా స్థూల సేవ చెయ్యాలి. ఒకే సేవ చెయ్యకండి. కాని ఒకే సమయంలో డబల్ సేవాధారిగా అయ్యి తమ డబల్ సంపాదనకు అవకాశం తీసుకోవాలి.
అందరూ సంతుష్టంగా ఉన్నారా? అందరూ తమ తమ కార్యంలో పూర్తి నిర్విఘ్నంగా ఉన్నారా? ఏ కార్యంలోనూ ఏ గొడవలూ లేవు కదా? పరస్పరంలో ఎప్పుడూ గొడవ పడడం లేదు కదా? అప్పుడప్పుడు 'నీది నాది, నేను చేశాను నీవు చేశావు' అనే భావన అయితే రావడం లేదు కదా? ఎందుకంటే చేసిన తర్వాత సంకల్పంలో కూడా నేను చేశాను అని వచ్చిందంటే చేసిన మొత్తమంతా సమాప్తమైవుతుంది. నాది అనేది రావడం అనగా చేసిన పని మొత్తం పై నీళ్ళు పోయడం అవుతుంది. ఇలా అయితే చెయ్యడం లేదు కదా? సేవాధారి అనగా చేయించే తండ్రి నిమిత్తంగా అయ్యి చేయిస్తున్నారు. చేయించేవారిని మర్చిపోరాదు. ఎక్కడ నాది అనేది వస్తే అక్కడ మాయ కూడా వస్తుంది. నిమిత్తంగా ఉన్నాను, నిర్మానంగా ఉన్నాను అనుకుంటే మాయ రాలేదు. సంకల్పం లేక స్వప్నంలో కూడా మాయ వస్తూ ఉంటే ఎక్కడో నాది అనే ద్వారము(తలుపు) తెరచి ఉంది అని ఋజువు అవుతుంది. నాది అనే ద్వారం మూసేసినట్లయితే ఎప్పుడూ మాయ రాజాలదు. మంచిది.
వరదానము:- ''తమ తేలిక స్థితి ద్వారా ప్రతి కార్యాన్ని తేలికగా చేసుకునే తండ్రి సమానం న్యారే - ప్యారే (అతీతంగా - ప్రియంగా) భవ''మనసు, బుద్ధి, సంస్కారము - ఈ మూడు ఆత్మకు గల సూక్ష్మ శక్తులు. మూడింటిలో లైటుగా అనుభవం చేయడమే తండ్రి సమానంగా న్యారా-ప్యారాగా(అతీతంగా - ప్రియంగా) అవ్వడం. ఎందుకంటే సమయ ప్రమాణంగా బయటి తమోప్రధాన వాతావరణము, మనుష్యాత్మల వృత్తులలో భారీతనము లేక భారీ స్థితి ఉంటుంది. బయట వాతావరణం ఎంత భారంగా ఉంటే పిల్లలైన మీ సంకల్పాలు, కర్మలు, సంబంధాలు అంత తేలికగా అవుతూ పోతాయి. తేలికదనం వలన మొత్తం కార్యమంతా నడుస్తూ ఉంటుంది. కార్య వ్యవహారాల ప్రభావం మీ పై పడదు. ఇదే తండ్రి సమాన స్థితి.
స్లోగన్:- ''ఆహా 'నేను' అనే అలౌకిక నశాలో ఉన్నట్లయితే మనసు మరియు శరీరంతో న్యాచురల్ నృత్యము జరుగుతూ ఉంటుంది''
No comments:
Post a Comment