06-10-2017 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - ఈ సమయములో స్వయం భగవంతుడే మీ ఎదురుగా ప్రత్యక్షము (హాజిర్ నాజుర్)గా ఉన్నారు. వారు స్వర్గాన్ని కానుకగా తీసుకొచ్చారు. కావున మీరు అపారమైన సంతోషంలో ఉండండి''
ప్రశ్న:- తండ్రి తన పిల్లలకు ఎటువంటి దీవెనలను(బ్లెస్సింగ్స్) ఇస్తారు ?ఉత్తరం:- పిల్లలను తన సమానంగా, జ్ఞాన సంపన్నంగా చేయడమే వారి ఆశీర్వాదాలు. ఈ జ్ఞానము ఆధారముతో నరుని నుండి శ్రీ నారాయణునిగా అవుతారు. బాబా అంటున్నారు - పిల్లలారా! నేను మీకు రాజయోగ శిక్షణనిచ్చి రాజాధి రాజులుగా చేస్తాను. నేను తప్ప ఇటువంటి దీవెనలు ఇతరులెవ్వరూ ఇవ్వలేరు.
పాట:- నన్ను మీ హృదయానికి హత్తుకోండి,............... (బాహువులలోకి తీసుకోండి,.........)ఓంశాంతి. ఇది ఈ సమయములో బంధనములో ఉన్నవారి(బాంధేలియా అక్కయ్యల) పిలుపు. ఎందుకంటే మొత్తము ప్రపంచమంతా ఉదాసీనంగా ఉంది. అందులోనూ గోపికలు చాలా ఉదాసీనంగా ఉన్నారు. మేము సహించలేక పోతున్నామని దీనంగా పాడుతూ పిలుస్తూ ఉన్నారు. భక్తిలో కూడా పిలుస్తూ ఉంటారు. కాని వారికి భగవంతుడెవరో తెలియదు. కాని ఇచ్చటి గోపికలకు తెలుసు. కాని బంధనములో దు:ఖితులుగా ఉన్నారు. తండ్రి తమను కంఠహారముగా చేసుకోవాలని కోరుకుంటున్నారు. శివుని రుద్రమాల ఎంతో ప్రసిద్ధి గాంచింది. కావున ఈ సమయంలో బ్రాహ్మణ బ్రాహ్మణీలు తాము శివబాబా కంఠహారంలో కూర్చబడాలి అని కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ సమయములో స్త్రీ-పురుషులందరూ ఆసురీ కంఠహారంగా ఉన్నారు. ఇప్పుడు మేము ఈశ్వరీయ కంఠహారముగా అవ్వాలని పిల్లలు కోరుకుంటున్నారు. తప్పకుండా తండ్రి ప్రత్యక్షముగా వారి ఎదురుగా ఉన్నప్పుడే ఇలా అంటారు కదా. ప్రమాణము చేయునప్పుడు ఈశ్వరుని ఎదుట సత్యమే చెప్తాను అని కోర్టులో ప్రమాణము చేస్తారు. పెద్ద పెద్ద ప్రభుత్వ మినిస్టర్లు(మంత్రులు) కూడా ప్రతిజ్ఞ చేస్తారు. గీతను చేతిలోకి తీసుకుంటారు. ఎందుకంటే అది భారతదేశపు ధర్మ శాస్త్రము. అందువలన ఒక్క ఈశ్వరుని పైననే ప్రమాణము చేస్తారు. అందరూ ఈశ్వరులే అని అందరినీ సాక్షిగా ఉంచుకొని ప్రతిజ్ఞ చేయరు. దీనిని బట్టి తండ్రి ఎప్పుడో ఒకప్పుడు ప్రత్యక్షంగా తప్పక వచ్చి ఉంటారని అర్థమవుతుంది. ఈ సమయంలో అయితే వారు లేరు. కేవలం పిల్లలైన మీకు మాత్రమే హాజిర్‌నాజిర్‌గా ఉన్నారు. వారు పిల్లలైన మిమ్ములను చదివిస్తున్నారు. శివరాత్రి పండుగను కూడా జరుపుకుంటారు. కనుక తప్పక వచ్చి ఉంటారు. వారు ఎలా వచ్చారో, వచ్చి ఏమి చేశారో ఇది ఎవ్వరికీ తెలియదు. సోమనాథ మందిరము ఎంతో పెద్దది కానీ వారు ఏమి చేశారో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే గీతలో శివుని పేరుకు బదులు కృష్ణుని పేరు వేసేశారు. సంగమ యుగాన్ని తొలగించి ద్వాపర యుగమని వ్రాసేశారు. వారు నిరాకారులని, వారికి మనుష్యుల వంటి ఆకారము లేదని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు వారు మన ముందు కూర్చుని ఉన్నారు. మీరు వారిని హాజిర్‌నాజిర్‌గా(ప్రత్యక్షంగా) చూస్తున్నారు. వారు తప్పక జ్ఞానసాగరులు, ఆనందసాగరులు. వారు జ్ఞానమిస్తారు - ఇదే వారి ఆశీర్వాదము. ఈ జ్ఞాన దీవెనలతో మీరు నరుని నుండి నారాయణునిగా వారు స్వయంగా బ్రహ్మ తనువు ద్వారా చదివిస్తున్నారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు - ప్రియమైన పిల్లలూ, మీకు రాజయోగాన్ని నేర్పించి రాజాధి రాజులుగా చేస్తాను. కృష్ణుడు నేర్పించలేడు. అతడు స్వయం రాజాధి రాజుగా అయ్యాడు. అలా కేవలం ఒక్క కృష్ణుడు లేక లక్ష్మీనారాయణులే అవ్వరు. మొత్తం సూర్య వంశమంతా ఉంటారు. వారి రాజ్యమును ఇప్పుడు మాయ దోచుకుంది. ఇప్పుడు నేను మళ్లీ మీ ఎదుటకు వచ్చాను. ఇప్పుడు బ్రాహ్మణులైన మీ ఎదుట హాజిర్ నాజిర్‌గా ఉన్నాను.
ఇప్పుడు ఏ తండ్రి అయితే దూరదేశము నుండి వచ్చి ఉంటారో వారు తప్పకుండా ఏదో ఒక బహుమానము తెచ్చి ఉంటారు. లౌకిక తండ్రి వచ్చినప్పుడు కూడా ఏన్నో బహుమతులు తీసుకొస్తాడు. మీరు అందరికీ తండ్రి అయ్యారు. అందరూ వీరినే తలంపు చేస్తూ ఉంటారు. దూరదేశము నుండి వచ్చినప్పుడు ఖాళీ చేతులతో వస్తారా? తండ్రి అంటున్నారు - నేను మీ కొరకు ఏ మనుష్యులు ఇవ్వలేని బహుమతి తీసుకొస్తాను. నేను స్వర్గాన్ని తీసుకొస్తాను. ఇది ఎంత గొప్ప బహుమతి! అచ్చట ఎంత సుఖముంటుందో బాబా సాక్షాత్కారము కూడా చేయిస్తారు. అక్కడ ఎంతో సుఖముంటుంది. అంగాంగము సుగంధభరితంగా ఉంటుంది. లక్ష్మీనారాయణుల అంగాంగములో సుగంధముంటుంది. ఇచ్చటి శరీరము పురుగులతో, బ్యాక్టీరియాతో నిండి ఉంటుంది. బాబా పురుగులను తీసుకొచ్చి భ్రమరముగా చేస్తారు. ఇచ్చటి శరీరము కీటకాణువులతో నిండి రోగగ్రస్థమై ఉంది. అచ్చటి శరీరము ఎంతో సుందరంగా ఉంటుంది. మందిరాలలో కూడా ఎంతో సుందరమైన విగ్రహాలను తయారు చేసి ఉంచుతారు. ఇప్పటి శరీరాలకు మరియు అప్పటి శరీరాలకు ఎంతో తేడా ఉంది. 5 వేల సంవత్సరాల క్రితపు మాట - ఈ భారతదేశము ఇంద్రప్రస్థముగా ఉండేది. అచ్చట ఆత్మ కూడా పవిత్రంగా ఉండేది, శరీరము కూడా పవిత్రముగా ఉండేది. బాబా రాతి చిప్ప నుండి మిమ్ములను బంగారు పాత్రగా తయారు చేస్తారు. తండ్రి మీకు పూర్తిగా సేవ చేసి ఎలా ఉండేవారిని ఎలా తయారు చేస్తారో చూడండి. తండ్రికి కూడా ఎలాంటి పాత్ర ఉందో చూడండి? వారు టీచరు పాత్ర, సద్గురువు పాత్ర చేస్తారు. వారికి తండ్రి గానీ, టీచరు గానీ, గురువు గానీ ఎవ్వరూ లేరు. మీ లౌకిక తండ్రికైతే తండ్రి, టీచరు, గురువు తప్పకుండా ఉంటారు. శివబాబా అంటారు - నాకు ఎవ్వరూ లేరు కాని వారి కర్తవ్యము గురించి ఎవ్వరికీ తెలియదు. స్వర్గము గురించి ఎంతవరకు తెలియదో అంతవరకు మేము నరకములో ఉన్నామని ఎవ్వరికీ తెలియదు. గ్రంథ్‌సాహెబ్‌లో మలిన వస్త్రాలు ఉతికినారు,........ (మూత్ పలీ థీ కపడ్ ధోయే,..........) అని చదువుతారు కానీ ఆ మలిన వస్త్రాలు మేమే అని ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. జ్ఞానమిచ్చి నల్లగా ఉన్న వారిని తెల్లగా తయారు చేసేందుకు తండ్రి వచ్చారు. ఈ సమయంలో మీరు జ్ఞాన సూర్యులుగా, జ్ఞాన చంద్రులుగా అవుతూ ఉన్నారు. సన్యాసులు పవిత్ర ప్రవృత్తి మార్గాన్ని తయారు చేయలేరు. నేను మిమ్ములను రాజాధి రాజులుగా తయారు చేస్తానని వారు అనలేరు. వారు నివృత్తి మార్గానికి చెందినవారు. భయపడి ఇల్లు వాకిళ్లు వదలి వెళ్లిపోతారు. ఇచ్చట ఏ భయమూ లేదు. తండ్రి వద్దకు పిల్లలు వచ్చారు. బాబా మాలో శక్తి ఉందని అంటారు. కలిసి ఉండి కూడా పవిత్రంగా ఉండగలము బాబా అని అంటారు. ఎవరైనా కన్యల పై దెబ్బలు పడుతుంటే ఆ కన్యను బంధనము నుండి విడిపించి గాంధర్వ వివాహము చేసుకోవచ్చు. మేము అగ్ని(కామాగ్ని)లో పడి కాలిపోము. జ్ఞాన ఖడ్గాన్ని మధ్యలో ఉంచుకుంటాము. బ్రాహ్మణ - బ్రాహ్మణీ ఇరువురు సోదర-సోదరీలు. వారు విషమెలా త్రాగగలరు? శాస్త్రాలలో కూడా గాంధర్వ వివాహము గురించి వ్రాశారు. అయితే దాని అర్థము వారికి తెలియదు. సన్యాసులేమో నారి నరకానికి ద్వారమని అంటారు. సన్యాసుల వద్ద జ్ఞాన ఖడ్గము లేనే లేదు. అందువలన కలిసి ఉంటూ పవిత్రంగా ఉండలేరు. మీరు వారి కంటే మహావీరులు. కామచితి నుండి క్రిందికి దిగి జ్ఞానచితి పై కూర్చుంటారు కావున నలుపు నుండి తెల్లగా అవుతారు. సన్యాసులైతే ఈ రోజులలో వివాహాలు కూడా చేయిస్తారు. చర్చిలో కూడా వివాహాలు జరుగుతాయి. ఏసుక్రీస్తును శిలువ పైకి ఎందుకు ఎక్కించారు? ఈ పవిత్రత కారణంగానే. మమ్ములను పవిత్రంగా ఉండమని చెప్పేందుకు ఇతనెవరు? అని అన్నారు. ఆపదలు రానే వస్తాయి. ఇచ్చట కూడా శివబాబా పైకి ఆపదలు రావు. అయితే వారు ఎవరిలో ప్రవేశిస్తారో ఆ లాంగ్ బూట్ కూ ఆపదలు వస్తాయి. ఏమి? ఎందుకు ?......... దారిలో వెళ్తూ వెళ్తూ బ్రాహ్మణుడు చిక్కుకుపోయాడు(రాస్తే చల్‌తే బ్రాహ్మణ్ ఫస్ గయా). పాత చెప్పు కదా. నేను కృష్ణుడిని అని ఇతడు చెప్పడు. రాజయోగము నేర్చుకుంటే నరుని నుండి నారాయణునిగా అవుతాను ఇప్పుడింకా అవ్వలేదు అని అంటున్నాడు. ఇప్పుడు మనము నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అవుతామని పిల్లలకు నిశ్చయముంది. ఫెయిల్ అయ్యి క్షత్రియులుగా అవ్వము. రామునికి 33 కంటే తక్కువ మార్కులు లభించినందున చంద్ర వంశములోకి వెళ్లిపోయాడు. సూర్య వంశీయులు కూడా జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ చంద్ర వంశములోకి వస్తారు. సత్యయుగ అంత్యములో లక్ష్మీనారాయణులు, సీతా-రాములకు రాజ్యమునిస్తారు. లక్ష్మీనారాయణులు కూడా పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ త్రేతాలోకి వస్తారు. రాజుల వంశములో జన్మ తీసుకుంటూ ఉంటారు. తర్వాత సీతా-రాముల పేర్లు కొనసాగుతూ వస్తాయి. లక్ష్మీనారాయణుల పేర్లు సమాప్తమైపోతాయి.
ఇప్పుడు ప్రశ్నిస్తున్నాను - స్వదర్శన చక్రము అనగా ఏమిటి?(బాబా ఒకరిద్దరిని అడిగారు) అవును చక్రమంటే ఇది. దేవతల నుండి క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా,.......... అయ్యి ఇప్పుడు మళ్లీ బ్రాహ్మణ వర్ణములోకి వస్తారు. ఈ చక్రాన్ని ఎంతగా తిప్పుతారో మీ వికర్మలు అంతగా వినాశనమౌతాయి. ఈ చక్రముతో రావణుని గొంతు కోయబడ్తుంది. మెడ నరకబడ్తుంది. పిల్లలైన మీకు అనంతమైన తండ్రి పై అపారమైన ప్రేమ ఉంది. బాబా! మీ వియోగాన్ని మేము సహించలేము. అని కూడా మీరంటారు. కొంతమంది పిల్లలు బంధనములో ఉండి తపిస్తూ ఉంటారు. ఎందుకంటే వీరు మాతా-పితలు,........ సర్వమూ వీరే అయ్యారు. ఒక మాత ఏమో జగదంబ అందరూ వారిని స్మృతి చేస్తారు. కాని జగదంబ తండ్రి ఎవరో ఎవ్వరికీ తెలియదు. సరస్వతికి తండ్రి ఈ బ్రహ్మ అని ఎవ్వరికీ తెలియదు. ఈ సరస్వతే మళ్లీ లక్ష్మిగా అవుతుందని పూజారులకు తెలియదు. ఆ లక్ష్మియే మళ్లీ 84 జన్మలు తీసుకొని ఇదే సరస్వతిగా తయారౌతుంది. ఈ జ్ఞానము మొదట ఈ బ్రహ్మాబాబా వద్ద కూడా లేదు. ఇతనిలో జ్ఞానము ఉండి ఉంటే తప్పక ఎవరైనా గురువు నుండి లభించి ఉంటుంది. ఆ గురువును మహిమ కూడా చేసేవాడు. అంతేకాక ఆ గురువుకు శిష్యులు కూడా ఉండేవారు. వారు కూడా తెలిపేవారు. కాని బాబాకు సాకార గురువు ఎవ్వరూ లేరు. తండ్రి అంటున్నారు - నేను మీ తండ్రిని, టీచరును, గురువును. నేను ఈ పాత చెప్పులో(శరీరంలో) కూర్చుని చదివిస్తాను. అందువలన ఇతడు మాత కూడా అయ్యాడు. అందుకే వారిని మాతా-పితలని ఏదైతే గాయనము చేస్తారో ఆ గాయనము బ్రహ్మ-సరస్వతులకు వర్తించదు. బ్రహ్మ వైకుంఠాన్ని రచించరు. తండ్రి ఏమో తండ్రి(శివబాబా తండ్రి), ఈ బ్రహ్మ మీ తల్లి. కలశము మొదట ఈ బ్రహ్మకు లభిస్తుంది. కాని సరస్వతికి మహిమను పెంచేందుకు ఆమెను ముందుంచారు. సరస్వతి జ్ఞాన దేవి(గాడెజ్ ఆఫ్ నాలెడ్జ్)గా ప్రసిద్ధి చెందింది. విద్యావేత్తల(విద్వాంసుల, పండితుల) వర్గములు కూడా సరస్వతి అను బిరుదును ఉంచుకుంటారు.
బాబా అంటున్నారు - అచ్ఛా, మీకు ఎంత అర్థము చేయించినా, ఇంకా ఎంత అర్థం చేయించాలి? 'మన్మనాభవ!' కేవలం నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. నా వారసత్వాన్ని కూడా స్మృతి చేయండి తద్వారా మీరు స్వర్గములోకి వెళ్లిపోతారు. అచ్చట కూడా నెంబరువారుగానే ఉంటారు. సూర్యవంశములో రాయల్ దాస-దాసీలు కూడా ఉంటారు. అంతేకాక ప్రజలకు కూడా దాస దాసీలుంటారు. చంద్ర వంశములో రాజా-రాణికి కూడా దాస-దాసీలైతే ఉంటారు. వారందరు ఇచ్చటనే తయారవుతున్నారు. ఇప్పుడే శరీరాన్ని వదలితే అచ్చటకు వెళ్ళి ఏమవుతారో బాబాను అడిగితే సమాదానము చెప్పగలరు. ఏ విషయమైనా అర్థమవ్వకుంటే అడగవచ్చు. యోగము సరిగా లేకుంటే ఆ సుఖము అనుభవము కాదని గుర్తించుకోవాలి. శోకవాటికలోకి వెళ్ళి కూర్చుంటారు. స్వర్గము అశోక వాటిక. సీత అశోకవాటికలో కాదు శోకవాటికలో ఉండేది. ఇప్పుడైతే అందరూ శోకవాటికలో కూర్చుని ఉన్నారు కదా. యుద్ధము జరిగితే ఏమవుతుందో అనే చింత మనుష్యులకు ఉంటుంది. యుద్ధము మొదలైతే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని మనమంటాము.
అచ్ఛా! సత్యమైన హృదయము పై భగవంతుడు రాజీ అవుతాడని గుర్తుంచుకోండి. ఒకవేళ లోపల సైతాను తనముంటే(ఆసురత్వము) విఘ్నాలు వేస్తూ ఉంటారు. తర్వాత కఠినమైన శిక్షలు అనుభవిస్తారు. ద్రోహులకు ఎప్పుడూ కఠినమైన శిక్షలు లభిస్తాయి. వీరు సుప్రీమ్ జడ్జ్ కూడా అయ్యారు. (కృష్ణుని చిత్రము చూపిస్తూ) ఇతని పై కూడా ఎన్ని కళంకాలు అపాదించారో చూడండి. నిజానికి ఇతడు దుస్తులు దొంగిలించలేదు. కంస, జరాసంధులను కూడా చంపలేదు. అటువంటి కృష్ణుని ముఖము కూడా నల్లగా చేశారు. మంచిది.
బాప్‌దాదా పిల్లలైన మీ ఎదుట హాజీర్‌నాజీర్‌గా ఉన్నారు. మా కళ్ళ ముందే ఉన్నారని మీరంటారు. ఆయన పతిత శరీరములో పాత చెప్పులోనే వచ్చారు. భగవంతుడు స్వయముగా చెప్తున్నారు. నేను పతిత బూటులో ప్రవేశించాను. అప్పుడే పావనంగా అవుతాడు. ఇప్పుడు బ్రహ్మ రాత్రి అనగా బ్రహ్మ కూడా రాత్రిలోనే ఉంటాడు కదా. మళ్లీ విష్ణువుగా అయితే పగలుగా మారిపోతుంది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు ప్రియస్మృతులనిస్తున్నారు. అన్న(దాదా) అనండి లేక గుప్తముగా ఉన్న తల్లి అని అయినా అనండి ఇది అద్బుతమైన, విచిత్రమైన రహస్యము. బాప్‌దాదా మధురాతి మధురమైన పిల్లలకు నెంబరువారుగా పురుషార్థానుసారమని ఎందుకు అంటున్నారు? తండ్రి వలె ఎప్పుడు సేవ చేస్తామో అప్పుడు బాబా ప్రేమిస్తారని మీకు తెలుసు. ఎవరు ఎలా సహాయం చేస్తారో, వారు కూడా ప్రజలలోకి వచ్చేస్తారు కదా. ప్రజలలో కూడా నెంబరువారుగా షాహుకారు ప్రజలు కూడా ఉంటారు కదా. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-1. సత్యమైన సాహెబ్‌ను(భగవంతుని) రాజీ చేసుకునేందుకు చాలా చాలా సత్యమైన హృదయమును కలిగి ఉండాలి. ఎలాంటి విఘ్నాలు కలిగించరాదు.2. సుఖాన్ని అనుభవము చేసేందుకు మీ యోగాన్ని సరిగ్గా ఉంచుకోవాలి. స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ వికర్మలను భస్మము చేసుకోవాలి.
వరదానము:- ''ప్రతి సంకల్పము, మాట మరియు కర్మల ద్వారా పుణ్యకర్మలు చేసే ఆశీర్వాదాలకు అధికారీ భవ''
మీతో మీరు ఈ దృఢ సంకల్పము చేయండి - మొత్తం రోజంతా సంకల్పము ద్వారా, మాటల ద్వారా, కర్మల ద్వారా పుణ్యాత్మలుగా అయ్యి పుణ్యకార్యాలే చేస్తాము. పుణ్యానికి ప్రత్యక్ష ఫలము ప్రతి ఆత్మ నుండి ఆశీర్వాదాలు. కనుక ప్రతి సంకల్పములో, మాటలో ఆశీర్వాదాలు జమ అవ్వాలి. సంబంధ సంపర్కాల ద్వారా మనస్ఫూర్తిగా సహయోగానికి ధన్యవాదాలు వెలువడాలి. ఇటువంటి ఆశీర్వాదాలకు అధికారియే విశ్వపరివర్తనకు నిమిత్తంగా అవుతాడు. బహుమతి వారికే లభిస్తుంది.
స్లోగన్:- ''సదా ఒక్క తండ్రి కంపెనీలో (జతలో) ఉండండి, తండ్రిని మీ కంపానియన్‌గా చేసుకోండి - ఇదే శ్రేష్ఠత.''
మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు
''ఆత్మ ఎప్పుడూ పరమాత్ముని అంశము కాజాలదు ''
చాలామంది మనుష్యులు ఆత్మలమైన మనమంతా పరమాత్ముని అంశాలమని భావిస్తారు. అంశమంటే భాగము లేక తుంట. ఒకవైపు పరమాత్మ అనాది, అవినాశి అని అంటారు. అయితే అటువంటి పరమాత్మను తుంటలుగా ఎలా చేయగలరు? పరమాత్మ కట్ ఎలా అవ్వగలడు? ఆత్మ అజరము, అమరము కనుక తప్పకుండా ఆత్మను తయారు చేసిన లేక ఉత్పత్తి చేసిన వారు కూడా అమరంగానే ఉంటారు. అటువంటి పరమాత్మను తుంటలలోకి తీసుకు రావడం అనగా పరమాత్మను కూడా వినాశీగా చేసేశారు. కాని ఆత్మలమైన మనము పరమాత్ముని సంతానమని మనకు తెలుసు. కనుక మనము వారి వంశజులము అనగా పిల్లలము కనుక వారి అంశములెలా అవ్వగలము? అందువలన పరమాత్ముని మహావాక్యాలు గమనించండి - పిల్లలూ, నేను స్వయం అవినాశిని, వెలిగే జ్యోతిని, నేను దీపాన్ని, నేను ఎప్పుడూ ఆరిపోను. కాని మనుష్యులందరి ఆత్మలు వెలుగుతాయి, ఆరిపోతాయి కూడా. వాటిని మళ్లీ వెలిగించేవాడిని నేను. ఎందుకంటే లైటు, మైటు ఇచ్చేవాడిని నేనే. పోతే పరమాత్మ అయిన నా లైటుకు, ఆత్మ లైటుకు తప్పకుండా వ్యత్యాసముంది. ఎలాగైతే ఎక్కువ పవర్ బల్బులు, తక్కువ పవర్ బల్బులు ఉంటాయో అలా ఆత్మలు కూడా కొన్ని ఎక్కువ పవర్ కలిగినవి, కొన్ని తక్కువ పవర్ కలిగినవి ఉంటాయి. కాని పరమాత్ముని పవర్ ఏ ఆత్మ పవర్ వలె ఎక్కువగా, తక్కువగా అవ్వదు. అందుకే పరమాత్మను సర్వశక్తివంతుడని అంటారు. అనగా సర్వ ఆత్మల కంటే వారిలో శక్తి ఎక్కువగా ఉంది. వారు సృష్టి అంతములో వస్తారు. కొంతమంది పరమాత్మ సృష్టిలో మధ్యలో అనగా యుగే యుగే వస్తారని భావిస్తారు. పరమాత్మ మధ్యలో వచ్చారంటే వారు అందరికంటే శ్రేష్ఠమైన వారెలా అవుతారు? ఎవరైనా పరమాత్మ యుగే యుగే వచ్చారని అంటే పరమాత్మ ఘడియ ఘడియ తన శక్తిని ఉపయోగిస్తాడని, నడిపిస్తాడని భావించాలి కదా. అటువంటి సర్వశక్తివంతుని శక్తి ఇలా వస్తే, మధ్యలోనే తన శక్తితో అందరికి శక్తిని లేక సద్గతిని ఇచ్చి ఉంటే వారి శక్తి స్థిరంగా ఉండాలి. మరి ఆత్మలు దుర్గతిని ఎందుకు ప్రాప్తి చేసుకుంటారు? అందువలన పరమాత్మ యుగే యుగే రాడని అనగా మధ్యలో రాడని ఋజువవుతుంది. వారు కల్పాంత సమయంలో ఒక్కసారి మాత్రమే వస్తారు. తన శక్తి ద్వారా అందరికి సద్గతిని కలగజేస్తారు. పరమాత్మ ఇంత గొప్ప సేవ చేశాడు కనుకనే వారి స్మృతిచిహ్నంగా పెద్ద శివలింగాన్ని చేసి ఇంతగా పూజిస్తున్నారు. కనుక తప్పకుండా పరమాత్మ సత్యమూ, చైతన్యమూ, ఆనంద స్వరూపము కూడా అయ్యారు. అచ్ఛా. ఓంశాంతి.
No comments:
Post a Comment