Friday, 3 November 2017

Telugu Murli 03/10/2017

03-10-2017 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - తాబేలు వలె సర్వమూ ఇముడ్చుకొని మౌనంగా కూర్చుని స్వదర్శన చక్రాన్ని తిప్పండి. సర్వ సంబంధాల సాక్రిన్‌ అయిన తండ్రిని స్మృతి చేయండి. దీని ద్వారా మీ వికర్మలు వినాశనమైపోతాయి'' 

ప్రశ్న:- ఈశ్వరీయ కులానికి చెందిన పిల్లలకు తండ్రి ఇచ్చే శ్రీమతము ఏది ?
ఉత్తరం:- మీరు ఈశ్వరుని సంతానంగా అయ్యారు, వారి సన్ముఖములో కూర్చుని ఉన్నారు. కావున వారిని ప్రేమగా స్మృతి చేయండి, వారి శ్రీమతమును అనుసరించండి. వారిని ఎంత స్మృతి చేస్తారో, అంత నషా ఉంటుంది. కాని మాయా రావణుడు తన గిరాకులను(ఖాతాదారులను) లాక్కుంటున్నారని గమనించి తాను కూడా యుద్ధము చేస్తాడు. బాబా అంటున్నారు - పిల్లలూ! బలహీనులుగా అవ్వకండి, నేను మీకు శక్తినిచ్చేందుకే కూర్చుని ఉన్నాను.

పాట:- దైర్యముగా ఉండు మనసా!,...............( ధీరజ్‌ ధర్‌ మనువా!,......................)
ఓంశాంతి. ఓ పిల్లలారా! అని ఎవరు అంటున్నారు? ఎందుకంటే ఓ మనసా! అని ఆత్మనే అంటున్నారు. ఆత్మలోనే మనస్సు-బుద్ధి ఉన్నాయి. అందువలనే ఈ పేరును కూడా(మనసా) పెట్టేశారు. ఎన్నో వస్తువులకు ఎన్నో పేర్లు పెట్టారు. ఉదాహరణానికి - పరమపిత పరమాత్మా అని, బాబా అని అంటారు. కొంతమంది ఫాదర్‌ అని కూడా అంటారు. బాబా అనే పదము అన్నింటికంటే సింపుల్‌ (సరళము). మీరు ఎవరి సంతానమో గుర్తు వస్తోందా? అని బాబా అడుగుతున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు కూర్చుని ఉన్నారు. మీ ముందు ఎవరున్నారు? బాబా కూర్చుని ఉన్నారని ఆత్మలు అంటారు. ఇది ఎంతో సింపుల్‌(సహజమైన) విషయము. ఆత్మలైన మన తండ్రి పరమపిత పరమాత్మ అని పిల్లలకు తెలుసు. మనుష్యులైతే చిన్న పెద్ద అందరినీ బాబా అని అంటారు. అయితే ఇక్కడ ఆత్మ తన తండ్రిని బాబా అని అంటుంది. ఓ గాడ్‌ఫాదర్‌! అని అంటారు. శారీరిక తండ్రినైతే గాడ్‌ఫాదర్‌ అని పిలువరు. మనము ఆ బాబా ముందు కూర్చుని ఉన్నామని మీకు తెలుసు. ఇది ఆత్మ విషయము. శివబాబా తాను ఎవరో అర్థం చేయిస్తున్నారు. నేను పరమ ఆత్మను. నేను పరంధామంలో ఉండే సర్వ ఆత్మల తండ్రిని. అందువలన నన్ను పరమాత్మ అని అంటారు. ఆ రెండు పదాలను కలిపితే పరమాత్మ అవుతుంది. ఇది ఎంత సహజము. ఇక్కడ ఎవరు కూర్చుని ఉన్నారు? శివబాబా. వారు లేకుంటే ఈ బ్రహ్మ కూడా ఉండరు. పిల్లలైన మీ హృదయాలలో సదా వారి స్మృతి ఉంటుంది. వారు కూడా ఆత్మయే. రూపములో ఏ వ్యత్యాసము లేదు. ఆత్మ ఎలాగైతే నక్షత్రము వలె ఉంటుందో దాని సాక్షాత్కారము ఎలా జరుగుతుందో అలా తండ్రి సాక్షాత్కారము కూడా నక్షత్ర రూపములో జరుగుతుంది. పోతే వారు చాలా తీక్షణమైన ప్రకాశమని, ఆ వెలుగును సహించలేమని........ ఏదైతే అంటున్నారో అది కేవలం వారి మానసిక భావన మాత్రమే. సత్యమేమిటో స్వయంగా తండ్రే అర్థము చేయిస్తున్నారు. ఆత్మలైన మీరు ఎలాగుంటారో నేను కూడా మీలాంటి ఆత్మనే. నేను కూడా అలాగే ఉంటాను. నేను కూడా ఈ తనువులో ఈ(బ్రహ్మ) ఆత్మ పక్కన భృకుటిలో కూర్చోవలసి వస్తుంది. ఇప్పుడు వారు కూర్చుని అర్థం చేయిస్తున్నారు - ఆత్మలైన మీలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. అది కూడా ప్రతి ఒక్కరిలో వారి వారి పాత్ర వేరు వేరుగా ఉంటుంది. ఆత్మ-పరమాత్మ చాలా కాలముగా వేరుగా ఉండినారు(ఆత్మ పరమాత్మ అలగ్‌ రహే బహుకాల్‌.....) అని అంటారు. ఇప్పుడు పరమాత్మ అన్న పదము స్పష్టముగా ఉంది. కాని వారిని పరమాత్మ అని అనడంతో తికమక పడ్తారు. వారు కూడా ఆత్మనే కాని వారు సదా పరంధామములో ఉంటారు. కాబట్టి వారిని పరమాత్మ అని అంటారు. బ్రహ్మను పరమాత్మ అని అనరు. మీరంతా జీవాత్మలు. వీరిలో కొందరు పాపాత్మలు, కొంతమంది పుణ్యాత్మలు ఉన్నారు. నన్ను పాపాత్మ అని గాని, పుణ్యాత్మ అని గాని అనరు. నన్ను కేవలము పరమాత్మ అని అంటారు. నాకు కూడా పాత్ర ఉంది. ఒక్కసారి మాత్రమే వచ్చి పతిత ప్రపంచాన్ని పావనంగా చేస్తాను. ఓ పతితపావనా! రండి అని నన్ను స్మృతి చేస్తారు కాని మేము పతితులమని గానీ, రావణ సంప్రదాయానికి చెందిన వారమని ఎవ్వరూ భావించరు. రామరాజ్యము రావాలని అందరూ కోరుకుంటారు. రావణుని తగులబెడ్తారు కూడా కాని తామే రావణ సంప్రదాయానికి చెందినవారిమని వారికి తెలియదు. తప్పకుండా పతితులగా ఉన్నందునే వారిని రమ్మని పిలుస్తారు. కృష్ణుడినైతే పిలువరు. వారిని పరమాత్మ అని అనరు. మనందరి తండ్రి ఎవరైతే పరంధామము నుండి వచ్చారో వారినే పరమాత్మ అని అంటారు. ఈశ్వరుడు లేక భగవంతుడు అని అన్నందున గొడవలు జరుగుతాయి. తండ్రి ఈ జీవాత్మ ద్వారా అర్థం చేయిస్తారు. పిల్లలు! అశరీరి భవ! అని మీతో అంటున్నారు. మిమ్ములను పంపినప్పుడు మీరు నా పిల్లలుగా ఉండేవారు. స్వర్గములోకి వచ్చి శరీరాన్ని ధారణ చేశారు. చక్రములో తిరుగుతూ తిరుగుతూ ఇప్పుడు మీరు 84 జన్మలు పూర్తి చేశారు. ఈ సమయములో అందరూ రావణుని సంతానంగానే ఉన్నారు. రావణుడే మిమ్ములను పతితంగా చేశాడు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానంగా అయ్యారు. ఇప్పుడు మీ కొరకు బాబా వచ్చారు. ఆసురీ సంప్రదాయాన్ని దైవీ సంప్రదాయంగా చేయడం నా పాత్ర అని అంటున్నారు. డ్రామానుసారము నేను కూడా నా సమయమైన కల్పము యొక్క సంగమ యుగములోనే వస్తాను. కలియుగము పతిత పురాతన తమోప్రధానమైన ప్రపంచమైనప్పుడు నేను సూర్యవంశీ, చంద్రవంశీ కులాల రాజ్య స్థాపన చేసేందుకు వస్తాను. అది లేనప్పుడే కదా స్థాపన చేసేది. సూర్య వంశము, చంద్ర వంశములున్నప్పుడు వైశ్య వంశము, శూద్ర వంశములు ఉండవు. ఇప్పుడు మీరు దైవీ సంతానంగా అయ్యేందుకు ఈశ్వరీయ సంతానంగా అయ్యారు. అయితే తండ్రితో యోగముండాలి. యోగము ద్వారా వికర్మలు వినాశనమౌతాయి. సదా ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా అయ్యేందుకు స్వదర్శన చక్రాన్ని త్రిప్పవలసి ఉంటుంది. తండ్రిని స్మృతి చేయడంలోనే శ్రమ ఉంది. ఎంత సమయము బాబాను స్మృతి చేస్తున్నాను? అని చార్టు ఉంచండి. స్మృతిలో ఎంత ఎక్కువగా ఉంటారో, అంత ఎక్కువగా అతీంద్రియ సుఖాన్ని అనుభవము చేస్తారు. అందుకే అతీంద్రియ సుఖాన్ని గురించి అడగాలంటే గోపీ వల్లభుని గోప-గోపికలను అడగండి అని అంటారు. తండ్రిని వల్లభుడు అని అంటారు. తండ్రి రూపము కూడా కొడుకు రూపము వలె ఉంటుంది. అలాగే ఆత్మల తండ్రి కూడా ఆత్మయే కదా. కాని వారు పరంధామములో ఉండేవారు. ఒకవేళ ఆ బీజము క్రిందికి చక్రములోనికి వస్తే వృక్షము పైకి వెళ్ళిపోతుంది. లౌకికములో ఆ వృక్ష బీజము క్రింద ఉంటుంది. వృక్షము పైన ఉంటుంది కాని తలక్రిందులుగా ఉన్న ఈ కల్పవృక్ష బీజము పరమాత్మ. వారు పరంధామములో నివసిస్తారు. ఆత్మలు కూడా పాత్రను అభినయించేందుకు పై నుండి క్రిందికి వస్తాయి. అనేక కొమ్మలు-రెమ్మలు వెలువడుతూ ఉంటాయి. ఇప్పుడు తండ్రి అంటున్నారు - మిమ్ములను రావణుడు నల్లగా(వికారిగా) చేసేశాడు. ఇప్పుడు మీరు తెల్లగా(పవిత్రంగా) అవ్వాలి. కృష్ణుడిని, నారాయణుని ఇరువురిని నల్లగా చేసేశారు. లక్ష్మిని తెల్లగా చేస్తారు, ఎందుకు? కామచితి పై అయితే ఇరువురూ కూర్చునే ఉంటారు. కృష్ణుని తక్షకుడు అనే సర్పము కాటేసిందని అందుకే నల్లగా అయిపోయాడని అంటారు. అయితే నారాయణుని ఎవరు కాటేశారు? కొంచెము కూడా అర్థము చేసుకోరు. చిత్రాలు మొదలైనవన్నీ రావణుని మతమును అనుసరించే తయారు చేశారు. ఇప్పుడు శ్రీమతమునిచ్చి రావణుని నుండి ముక్తులుగా చేసే బాబా వచ్చారు. నేను సర్వుల సద్గతిదాతను శ్రీ శ్రీ 108 జగద్గురువు అనే టైటిల్‌ కూడా వీరిదే. జగత్తుకు సద్గతినిస్తారు. గ్రంథ్‌ సాహెబ్‌లో కూడా వీరి మహిమను గురించి చాలా వ్రాశారు. సద్గురువు సత్యమైన పాత్‌షాహ్‌(మార్గదర్శకుడు/చక్రవర్తి) సత్య ఖండాన్ని స్థాపన చేసేవాడు. బాబాకు ఇదంతా(గ్రంథ్‌సాహెబ్‌) కంఠస్థము వచ్చేది కాని అర్థము తెలిసేది కాదు. స్వయాన్ని చాలా ధార్మిక బుద్ధి(చింతన) గలవాడిగా భావించేవాడు. కాని ఆ సమయంలో రావణుని కులానికి చెందినవాడే కదా. ఇప్పుడు మీరు ఈశ్వరీయ కులానికి చెందినవారిగా అయ్యారు కనుక వారిని ఎంతో ప్రీతిగా స్మృతి చేయాలి. బాబా మీరు ఎంతో మధురమైనవారు! మమ్ములను స్వర్గములోకి తీసుకెళ్తారు. హెవన్లీ గాడ్‌ఫాదర్‌ను ఎంత స్మృతి చేస్తే అంత నషా పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఎవరి ఎదుట కూర్చుని ఉన్నారు? తండ్రి అంటున్నారు - ఓ ప్రియమైన పిల్లలారా! నేను మీ పరమపితను. ఆత్మలైన మీతో మాట్లాడ్తున్నాను. ఇప్పుడు నా శ్రీమతమును ఎందుకు అనుసరించరు? కాని కామరూప భూతము క్రింద పడేస్తుంది. తండ్రి అంటున్నారు - ఎందుకు బలహీనంగా అవుతారు? శ్రీమతము లభిస్తోంది అయినా ఆసురీ మతమును ఎందుకు అనుసరిస్తారు? ఈ యుద్ధమైతే చేసే తీరాలి. మాయ తన గిరాకులను(ఖాతాదారులను) లాక్కుంటాడని భావించి యుద్ధము చేస్తుంది. మీకు తండ్రి శక్తినిస్తున్నారు. ఇంతగా పాఠాన్ని చదివిస్తున్నారు. అన్ని వేదశాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారు. సూక్ష్మవతనంలో అయితే వినిపించరు. విష్ణు నాభి నుండి బ్రహ్మ వెలువడినట్లు చూపిస్తారు. సూక్ష్మవతనములో నాభి ఎక్కడ నుండి వస్తుంది? కూర్చుని ఏమేమో వ్రాసేశారు. ఇప్పుడు మీకు లభించే ఈ జ్ఞానము పరంపరగా నడవదు. ఇచ్చటనే సమాప్తమైపోతుంది. తర్వాత తయారు చేసే శాస్త్రాలు మొదలైనవి పరంపరగా నడుస్తాయి. ఈ జ్ఞానము ప్రాయ: లోపమైపోతుంది.

ఇప్పుడు తండ్రి అంటున్నారు - నా మతమును అనుసరించండి, దేహీ-అభిమానులుగా అవ్వండి. ఇందులో దౌడు(పరుగు) తీసి నా కంఠహారముగా అవ్వండి. ఇది బుద్ధికి సంబంధించిన పరుగు. సన్యాసులు ఎప్పుడూ ''అశరీరీభవ, నన్నొక్కరినే స్మృతి చేయండని చెప్పలేరు. పరమాత్మ అందరికీ చెప్తారు. ఎందుకంటే అందరూ నా సంతానమే. అందరినీ వాపస్‌ తీసుకెళ్లేందుకే వచ్చాను. అయితే సన్ముఖములో నా పిల్లలు మాత్రమే వింటారు. ప్రపంచమంతా వినదు. శివరాత్రి పండుగ జరుపుకుంటారు. శివుని మందిరాలు కూడా ఉన్నాయి. శివుడు తప్పకుండా వచ్చారు. కాని శివునికి ఇంత పెద్ద చిత్రము లేదు. వారొక నక్షత్రము వంటి వారు. ఒకవేళ ఈ మాట చెప్తే మందిరాలలో ఉండే చిత్రాలు తప్పా? అని అంటారు. అందుకే తండ్రి అర్థం చేయిస్తున్నారు - నేను కూడా ఆత్మనే, మీరు జనన - మరణాలలోకి వస్తారు, నేను రాను. అందుకే మిమ్ములను లిబరేటర్‌(విడుదల లేక ముక్తి) చేయగలను. నేను పతితపావనుడను కావున నేను తప్పకుండా పతిత ప్రపంచములో రావలసి ఉంటుంది కదా. ఒకవేళ పతితపావనుడని అనకపోతే నూతన ప్రపంచాన్ని తయారు చేస్తారేమోనని భావిస్తారు. ప్రళయము జరిగిపోతుంది, మళ్లీ నూతన సృష్టిని రచిస్తారని భావిస్తారు. కాని వీరిని పతితపావనుడని అంటారు. అందువలన ఈ సృష్టి అనాది అని, ప్రళయము జరగదని నిరూపించబడ్తుంది. కేవలం పతితంగా అవుతుంది, నేను వచ్చి దానిని పవిత్రంగా చేస్తాను. అలా నేను నంది పై లేక భాగ్యశాలి రథములో మిమ్ములను నరుని నుండి నారాయణునిగా తయారు చేసేందుకు వస్తాను. మేము సూర్యవంశస్థులుగా అవ్వాలని అందరూ కోరుకుంటారు. ఒక కథ కూడా ఉంది. ఒక భక్తుడు నేను లక్ష్మిని వరించగలనా? అని అంటాడు. నారదుడు భక్తుడు కదా. అప్పుడు నీ ముఖము చూసుకో, మొదట కోతి నుండి మందిరానికి అర్హునిగా తయారవ్వు అప్పుడు లక్ష్మిని వరించగలవు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు మందిరానికి అర్హులుగా అవుతున్నారు. ఈ విషయాలన్నీ ఈ సమయానికి చెందినవే. ఇదంతా ఇది మీకు తెలుపుతున్నది ఎవరు? శివబాబా బ్రహ్మ దాదా(అన్న) భృకుటి మధ్యలో కూర్చుని మీకు అర్థం చేయిస్తున్నారు. ఇతని భృకుటిలో ఆత్మ ఎలాగైతే కూర్చొని ఉందో అలాగే ఆ ఆత్మ పక్కనే కూర్చొని ఉంటారు కదా. జ్ఞానసాగరులైన ఈ తండ్రి మీకు ఆదిమధ్యాంతాల రహస్యమంతా అర్థం చేయిస్తున్నారు. దీని ద్వారా మీకు స్వదర్శన చక్రాన్ని తిప్పడం సహజమౌతుంది. స్వదర్శన చక్రాన్ని తిప్పడం వలన మీ వికర్మలు వినాశనమవుతాయి. లేకుంటే శిక్షలను అనుభవిస్తారు. వారు విజయమాలలో కూడా రారు. ఫ్రీగా ఉన్నప్పుడు(పని లేనప్పుడు) తాబేలు వలె మౌనంగా కూర్చొని చక్రాన్ని తిప్పండి. ఇప్పుడు మీరు ఇంటికి వాపస్‌ వెళ్ళాలి. ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉండండి. వాటిని లోక మర్యాదలని అంటారు. పతితులుగా చేసే మర్యాదలను (సంప్రదాయాలను) త్రెంచి వేయండి. ఇతరులెవరినీ స్మృతి చేయకండి. మీరు మరణిస్తే మీ కొరకు ప్రపంచమే మరణిస్తుంది(ఆప్‌ ముయే మర్‌గయా దునియా) అశరీరులుగా అయ్యి నా వారిగా అవ్వండి. అప్పుడు వికర్మలు వినాశనమైపోతాయి. అందరూ మరణించియే తీరాలి. అప్పుడు ఎవరు ఎవరి కొరకు ఏడుస్తారు? హిరోషిమాలో అందరూ మరణించారు. ఏడ్చేందుకు కూడా ఎవ్వరూ మిగలలేదు. అందువలన ఇప్పుడు ఏడ్చే ప్రపంచము నుండి వాపస్‌ వెళ్ళాలి. ఈ మురికి ప్రపంచములో ప్రతి ఒక్కరి అంగాంగములో పురుగులు పడి ఉన్నాయి. దానిని ఎందుకు తలుచుకోవాలి!!!! స్వర్గములో ఇటువంటి శరీరము ఏదీ ఉండదు. అక్కడ అంగాంగములో సుగంధముంటుంది. దుర్గంధ భూయిష్టమైన వాటిని బాబా సుగంధ భరితమైన పుష్పాలుగా తయారు చేస్తారో చూడండి అందువలన వారు పురాతన లాంగ్‌ బూట్‌ లోనే రావలసి వస్తుంది. బాబా అంటున్నారు భలే ఇంట్లోనే ఉండండి కాని శ్రీమతమును అనుసరించండి. వికారాలలోకి వెళ్ళకండి. మీ ముందు శివబాబా కూర్చొని ఉన్నారు. వారిని మర్చిపోకండి. మంచిది.

పాట:- భూమిని ఆకాశము పిలిచింది,............ (ధర్‌తీ కో ఆకాశ్‌ పుకారే,..........) భూమి పై నివసించేవారిని ఆకాశములో ఉన్న తండ్రి పిలుస్తున్నారు. ఇప్పుడు నా వద్దకు రావాలి. కావున నిర్మోహులుగా అవ్వండి. నేను మీకు అపారమైన స్వర్గ సుఖాలను ఇస్తాను. మన తండ్రి సర్వ సుఖాల సాక్రిన్‌. మామలు, పిన తండ్రులు మీకు దు:ఖమునే ఇస్తారు. మీది మొత్తము ఆసురీ ప్రపంచమంతటి సన్యాసము. అంటే నరక సన్యాసము. ఆ సన్యాసులది కేవలం ఇల్లు-వాకిళ్ళ సన్యాసము మీరు ఈ అశుద్ధమైన ప్రపంచాన్ని, నరకాన్ని మర్చిపోవాలి.

ఈ సమయంలో మనుష్యులకు కొద్ది పాటి ధనము లభించినా, మేము స్వర్గములో ఉన్నామని భావిస్తారు. కాని ఈ ప్రపంచములో ఎవరు ఎంత ధనవంతులైనా దివాలా తీస్తే విమానము మొదలైనవి క్రిందపడితే సర్వము సమాప్తము అయిపోతుంది, ఏడుస్తారు. తల బాదుకుంటారు. అచ్చట ప్రమాదాల మాటే ఉండదు. ఎవ్వరూ ఏడ్వరు, తల బాదుకోరు. బాబా అంటున్నారు - మీకు ఇదే స్వర్గమనిపిస్తే ఇక్కడే ఖుషీగా ఉండండి. నేను నరకములో ఉన్న పేదల కొరకు వచ్చాను. దానము కూడా పేదలకే ఇవ్వబడ్తుంది. ధనవంతులెక్కడైనా దానము చేస్తారా? నేను అందరికంటే గొప్ప ధనవంతుడను పేదలకు దానము ఇస్తాను. ఇప్పుడున్న ధనవంతులు తమ ధనపు నషా(మత్తు)లో ఫ్యాషన్ల నషాలో మునిగి మగ్నమై ఉన్నారు. మంచిది. బాబా వివరిస్తున్నారు - ఇది ఇంద్రప్రస్థము ఇక్కడ హంసలు ముత్యాలను ఏరుకుంటాయి. ఎవరైనా కొంగలుగా ఉంటారో, అటువంటివారు రాళ్లే ఏరుకుంటారు. అందువలన బాబా అంటున్నారు - ఇచ్చటికి హంసలు(గుణగ్రాహకులు) మాత్రమే రావాలి. కొంగలు(అవగుణాలు చూచేవారు) రాకూడదు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. 

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తండ్రి ఇచ్చే శ్రీమతమును అనుసరించి దేహీ-అభిమానులై తండ్రి కంఠహారంగా తయారవ్వాలి. తండ్రి స్మృతిలో ఉండి అతీంద్రియ సుఖాన్ని అనుభవము చేయాలి.
2. ఈ ప్రపంచము నుండి పూర్తిగా నిర్మోహులుగా అవ్వాలి. ఎవ్వరి ఛీ-ఛీ శరీరాలనూ స్మృతి చేయరాదు. 

వరదానము:- ''ఈశ్వరీయ సంస్కారాలను కార్యములో ఉపయోగించి సఫలము చేసుకునే సఫలతామూర్త్‌ భవ''
ఏ పిల్లలైతే తమ ఈశ్వరీయ సంస్కారాలను కార్యములో ఉపయోగిస్తారో వారి వ్యర్థ సంకల్పాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. సఫలము చేసుకోవడమనగా పొదుపు చేసుకోవడం లేక పెంచుకోవడం. పాత సంస్కారాలనే ఉపయోగిస్తూ ఈశ్వరీయ సంస్కారాలను బుద్ధి అనే లాకర్‌లో పెట్టుకోమని కాదు. ఉదాహరణానికి చాలామందికి మంచి వస్తువులను లేక ధనాన్ని బ్యాంకులో గానీ, అల్మైరాలో గానీ పెట్టే అలవాటు ఉంటుంది, పాత వస్తువుల పై చాలా ప్రేమ ఉంటుంది. వాటినే ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ అలా చేయరాదు. ఇక్కడ మనసా, వాచా శక్తిశాలి వృత్తి ద్వారా తమ సర్వస్వాన్ని సఫలము చేసుకుంటే సఫలతా మూర్తులుగా అవుతారు. 

స్లోగన్‌:-'' తండ్రి మరియు నేను'' - ఈ ఛత్రఛాయ జతలో ఉంటే, ఏ విఘ్నమూ మీ ముందు నిలువలేదు ''

No comments:

Post a Comment