04-10-2017 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
''మధురమైన పిల్లలారా -
మిమ్ములను అన్ని సంశయముల నుండి విడిపించేందుకు తండ్రి వచ్చారు. మీరు
ఇప్పుడు ఈ శోకవాటిక నుండి అశోకవాటికలోకి వెళ్తారు. ఈ విషయవైతరణి నదిని
దాటుకుంటారు.''
ప్రశ్న:- స్మృతిలో కూర్చున్నపుడు ఏ విషయంలో విఘ్నములు ఏర్పడవు? ఏ విషయంలో ఏర్పడుతాయి?
ఉత్తరం:- స్మృతిలో
కూర్చున్న సమయంలో ఏదైనా శబ్ధము లేక కోలాహలము ద్వారా విఘ్నము ఏర్పడదు, అది
జ్ఞానములో విఘ్నమవుతుంది. కాని స్మృతిలో మాయ ద్వారా విఘ్నము తప్పక
ఏర్పడ్తుంది. స్మృతి చేసే సమయములోనే మాయ విఘ్నము కలిగిస్తుంది. అనేక
విధాలైన సంకల్ప వికల్పాలను తీసుకొస్తుంది. అందవలన బాబా అంటున్నారు -
పిల్లలూ! అప్రమత్తముగా ఉండండి. మాయతో ఘూసాలు(ముష్టి ఘాతాలు) తినకండి.
అపారమైన సుఖమునిచ్చే, సర్వ సంబంధాల శ్యాక్రిన్ అయిన శివబాబాను చాలా చాలా
ప్రీతిగా స్మృతి చేయండి. స్మృతిలో చాలా వేగంగా దౌడు తీయండి (పరుగెత్త౦డి).
పాట:- రాత్రి ప్రయాణికుడా! అలసిపోకు,.......... (రాత్ కీ రాహీ, థక్ మత్ జానా,..........)
ఓంశాంతి. మధురాతి మధురమైన
పిల్లలు యాత్ర చేస్తున్నారు. నిజానికి కూర్చొని ఉన్నవారిని యాత్ర చేసేందుకు
వెళ్లారని అనరు. ఈ యాత్ర ఎంత అద్భుతమైనది! ఇది శాంతియాత్ర. శాంతిధామానికి
వెళ్లే యాత్ర. రావణ రాజ్యములో గుటకలు మ్రింగుతూ(మింగలేక కక్కలేక)
మరణించవలసి వస్తుంది. సావిత్రి - సత్యవంతుని కథ ఒకటి ఉంది కదా. యమధర్మరాజు
నుండి కూడా సావిత్రి సత్యవంతుని ఆత్మను వాపస్ తీసుకొచ్చిందని అంటారు.
వాస్తవానికి అటువంటి విషయమేదీ లేదు. పోతే అర్ధకల్పము మృత్యువు కబళిస్తూ
ఉంటుంది. చివరిలో గుటకలు మింగుతారు కదా! ప్రతి సంవత్సరము తగులబెట్టే
రావణుడు మన శత్రువు. కాని ఈ విషయము ఎవ్వరికీ తెలియదు. బాబా అంటున్నారు -
మిమ్ములను శోకవాటిక నుండి వెలుపలికి తీసి అశోక వాటికలోకి, గుటకలు మింగే
అవసరము లేని చోటుకు తీసుకెళ్లేందుకు నేను వచ్చాను. ఇచ్చట అనేక విధాలైన
కష్టాలు ఉన్నాయి. తల్లి, తండ్రి, పతి, పిల్లల ద్వారా గుటకాలు మింగుతూ,
చిక్కులలో చిక్కుకుంటూ ఉంటారు. పతి వికారాలలో బంధిస్తాడు. తండ్రి వచ్చి ఈ
అన్ని గుటకాల నుండి విడిపిస్తారు, నూతన ప్రపంచములోకి తీసుకెళ్తారు. ఇప్పుడు
ఆత్మకు గల రెక్కలు తెగిపోయాయి. ఆత్మ పైకి ఎగురజాలదు. అందువలన స్మృతియాత్ర
చేయజాలదు. ఇది ఖచ్ఛితంగా బుద్ధితో చేసే యాత్ర. 'మన్మనాభవ' అని వ్రాయబడి
ఉంది కదా. దీని అర్థము యాత్ర అని ఎవ్వరికీ తెలియదు. రాముడు వానర సైన్యాన్ని
సహాయంగా తీసుకున్నారని, కోతులతో వారధి(ఆనకట్ట) కట్టించారని అంటారు.
వానరులు వారధిని ఎలా నిర్మిస్తాయి? ఇది మీ స్మృతియాత్ర రూపి ఆనకట్ట. అది
ఇప్పుడు తయారౌతూ ఉంది. ఈ వారధి ద్వారా మీరు విషయవైతరణీ నదిని దాటి
వెళ్తారు. తండ్రి ఈ నదిలో ఈదడం నేర్పిస్తారు. వారు నావికులు కదా.
విషయవైతరణీ నదిని దాటించి శివాలయంలోకి తీసుకెళ్తారు. అమృతాన్ని వదిలి
విషమెందుకు తింటారని బాబా అంటున్నారు. జ్ఞానాన్ని అమృతమని అంటారు. జ్ఞానము
ద్వారా సద్గతి అవుతుంది. శాస్త్రాలను జ్ఞానమని అనరు. అది భక్తిమార్గములోని
సామాగ్రి. శాస్త్రాలు చదివినందున సత్యయుగము రాజాలదు. సద్గతి లభించజాలదు.
అందువలన దానిని జ్ఞానామృతమని అనరు. అదంతా భక్తి. జ్ఞానములో మొదట నూటికి
నూరు శాతము సద్గతి లభిస్తుంది, ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా క్రిందికి
దిగుతూ వస్తారు. సత్యయుగములో కూడా దుర్గతి ఉంటుంది అని అనరాదు. అచ్చట
దుర్గతికి నామ-రూపాలు కూడా ఉండవు. కలియుగములో అందరూ దుర్గతిలోనే ఉంటారు.
అందరి పై దయ చూపేవారు ఒక్క తండ్రియేనని మీకు తెలుసు. వారిని శ్రీ-శ్రీ అని అంటారు. అయితే ఇచ్చట అందరికీ శ్రీ శ్రీ అనే బిరుదు తగిలిస్తారు. దేవతలను శ్రీ(శ్రేష్ఠులు) అని అంటారు. శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీ రామ - సీత అని అంటారు. ఇలా శ్రేష్ఠంగా తయారు చేసేవారిని శ్రీ శ్రీ అని అంటారు. మేము ఎప్పుడూ వికారాలకు వశము కామని తండ్రి ముందు ప్రతిజ్ఞ చేస్తారు. ప్రతిజ్ఞ చేసి మళ్లీ తప్పు చేస్తే తండ్రికి కుడి భుజంగా ధర్మరాజు కూర్చుని ఉన్నారు. ధర్మరాజు క్షమించరు. తండ్రి కూడా గుప్తమే. జ్ఞానము కూడా గుప్తమే. పదవి కూడా గుప్తమే. మనకు శ్రీమతమునిచ్చువారు మనుష్యులెవ్వరూ కాదని కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా తండ్రి రచనను రచిస్తారు. ప్రజాపిత సూక్ష్మ వతనములో అయితే ఉండడు. అతడు తప్పకుండా ఇక్కడనే ఉంటాడు. బ్రహ్మ ఈ సమయములో బ్రాహ్మణునిగా ఉన్నాడని మళ్లీ ఇతడికి భవిష్యత్తులో చక్రవర్తి పదవి లభిస్తుందని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. దేవతలు పతిత ప్రపంచములో రాజ్యపాలన చేయరు. కావున పాత ప్రపంచము వినాశనమవ్వాలి. వినాశనము తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉంది. నూతన వృక్షానికి అంటు కట్టుట ఇంకా పూర్తి అవ్వలేదు. ఇంతకు ముందు - త్వమేవ మాతశ్చ పితా............ అని పాడేవారు. అందరి ముందుకు వెళ్ళి ఈ మహిమనే పాడుతూ ఉంటారు. కొంచెము కూడా అర్థము చేసుకోరు. బ్రహ్మ మాతగా ఎలా అవుతాడో బాగా ఆలోచించండి. లక్ష్మీనారాయణులకు కూడా తమ రాజ్యము కూడా ఉంటుంది. అందువలన వారిని మాతా-పితలని అనలేరు. ఈ సమయములో పరమపిత పరమాత్మ ప్రాక్టికల్‌గా మాతా-పితల పాత్రను అభినయిస్తున్నారు. మళ్లీ భక్తి మార్గములో వారి మహిమ గాయనము చేయబడ్తుంది. అందులో కూడా మొట్టమొదట శివబాబాను త్వమేవ మాతాశ్చ పితా........అని మహిమ చేస్తారు. ఆ తర్వాత లక్ష్మీనారాయణులను, సీతా-రాములను అందరినీ కూడా మాతా-పితలని అంటూ ఉంటారు. కొంచెము కూడా తెలివిలేదు. శివబాబా మధురాతి మధురమైన శ్యాక్రీన్, ఈ మనుష్యమాత్రులందరూ ఆసురీ మతముననుసరించి దు:ఖమునే ఇస్తారు. కాని నేను అందరికీ వారి వారికి తగినట్లు అందరికంటే ఎక్కువ సుఖమునిస్తాను. నేను దాతను. పిల్లలూ! మీరు ఎంతగా స్మృతి యాత్రలో ఉంటారో, స్వదర్శన చక్రమును తిప్పుతూ ఉంటారో, కమలపుష్ప సమానంగా అవుతారో, అంత ఉన్నత పదవి పొందుతారని పిల్లలైన మీకు నేను శ్రీమతమును ఇస్తున్నాను. ఈ అలంకారాలకు అర్థము కూడా ఎవ్వరికీ తెలియదు. ఈ అలంకారాలను మీరు మాత్రమే ధరిస్తారు. కాని విష్ణువుకు గుర్తుగా ఇచ్చేశారు. మూడవ నేత్రాన్ని కూడా దేవతలకిచ్చేశారు. వాస్తవానికి మూడవ నేత్రము లభించేది కూడా మీకే. త్రినేత్రి, త్రికాలదర్శి............ అనే పదాలున్నాయి కదా. దీని అర్థము కూడా ఈ సమయములో ఆత్మలైన మీ బుద్ధిలో ఉంది. ఆత్మలో ఈ విషయాలన్నీ నిక్షిప్తమై ఉంటాయి. నా కనులు, నా ముక్కు, నా చెవి అని చెప్పేది కూడా శరీరము కాదు. ఈ శరీరమనే మహలు నాది అని ఆత్మ చెప్తుంది. ఆత్మనైన నాలో 84 జన్మల పాత్ర ఉందని ఆత్మకు తెలిసిపోయింది. ఇవన్నీ ఎంతో గుప్తమైన విషయాలు. ఆత్మను రాకెట్ అని కూడా అంటారు. శరీరాన్ని వదిలి లండన్‌కు పోవాలనుకుంటే ఒక్క సెకెండు కూడా పట్టదు. ఒక్క సెకెండులోనే వెళ్లిపోతుంది. వారు ఎంత వేగంగా ప్రయాణము చేసే రాకెట్ తయారు చేసినా ఉదయము బయలుదేరితే సాయంకాలము చేరుకుంటుంది. ఇంతకు ముందు స్టీమరులో అయితే 3-4 మాసాలు పట్టేది. ఇప్పుడు కూడా స్టీమరులో ఒక మాసము పడ్తుంది. విమానములో అయితే ఒక రోజు పడ్తుంది. కాని ఆత్మ అన్నిటికంటే అత్యంత వేగమైన రాకెట్. ఒక్క సెకెండులోనే చేరిపోతుంది. దీనిని(ఆత్మను) ఎవ్వరూ చూడలేరు. ఆత్మలైన మీకు ఆల్‌రౌండ్ పాత్ర ఉంది. అలా అయితే పరమాత్ముని పాత్ర ఏమిటి? ద్వాపరము నుండి సాక్షాత్కారాలు చేయించే పాత్ర నాది. ఎవరెవరు ఏ ఏ భావనతో నన్ను స్మృతి చేస్తారో, వారి మనసులోని కోరికలన్నీ పూర్తి చేస్తాను. ఇప్పుడు నాది జ్ఞానమిచ్చే పాత్ర. పతితులను పావనము చేయు పాత్ర. మిమ్ములను మాస్టర్ జ్ఞాన సాగరులుగా, భగవంతుని పిల్లలైన మిమ్ములను మాస్టర్ భగవంతుని(మాస్టర్‌గాడ్)గా తయారు చేస్తాను. ఎవరైతే కల్పక్రితము పురుషార్థము చేశారో, వారే ఇప్పుడు కూడా చేస్తారు. కల్ప క్రితము వచ్చాము. ఇప్పుడు మళ్లీ వారసత్వము తీసుకుంటున్నామని పిల్లలంటారు. ఎవరి వద్దకు వచ్చారు? మాతా-పితల వద్దకు. అందరికీ తల్లి సరస్వతి. సరస్వతికి తల్లి ఈ బ్రహ్మ. బ్రహ్మకు తల్లి అయితే ఎవ్వరూ లేరు. శివబాబా స్వయంగా నీవు నా పత్నివి అని అ౦టారు. అప్పుడు నేను పతి లేకుండా నేను ఎలా భోజనము చేయాలి అని అంటాను. కనుక నేనూ, శివబాబా ఇద్దరమూ కలిసే తింటాము. నషా అయితే ఉంటుంది కదా. తనతో నిశ్చితార్థము చేయించేందుకు బాబా దళారి అయ్యి వచ్చారని మీరు కూడా అంటారు. మీరు శ్రీమతమును అనుసరించి పరమాత్మతో అందరికీ నిశ్చితార్థము చేయిస్తారు. పండితులు ఏదైతే వికారీ కంకణాన్ని కట్టించారో దానిని తండ్రి రద్దు(కాన్సిల్) చేయిస్తారు. తండ్రి అంటున్నారు - మీరు జ్ఞానచితి పై కూర్చుంటే తెల్లగా(పవిత్రంగా) అవుతారు. కామ చితి పై కూర్చుని మీ ముఖాన్ని నల్లగా(అపవిత్రంగా) చేసుకుంటారు. శ్యామసుందరుని అర్థము మీకు తెలుసు. శ్రీ కృష్ణుడు సుందరుడు. ఇప్పుడు అతడే శ్యామంగా ఉన్నాడు. ఇప్పుడు తండ్రి వచ్చి తన పరిచయము ఇస్తున్నారు.
మీరు పతితపావనులైన గాడ్‌ఫాదర్ విద్యార్థులు. అందువలన ఇది మీరు చదువుకునే పాఠశాల. పాఠశాలలో చదువు చెప్తారు. శ్రమ చేయవలసి వస్తుంది. ఇతర సత్సంగాలలో శ్రమ ఉండదు. అచ్చటైతే గీత వి౦టారు, గ్రంథ్‌సాహెబ్ వి౦టారు, విన్న తర్వాత ఇంటికి పోతారు. అచ్చట మిమ్ములను పవిత్రంగా అవ్వమని, యాత్ర చేయమని ఎవ్వరూ చెప్పరు. పోను పోను ఈ దేహ సంబంధమైన యాత్రలు మొదలైనవన్నీ నిల్చిపోతాయి. మంచు కురిసినా, ప్రమాదాలు జరిగినా ఎవ్వరూ యాత్రలకు పోరు. ఎందుకంటే మీ యాత్ర జోరుగా జరుగుతూ ఉంటుంది. మన యాత్ర శివాలయము వైపు ఉంటుంది. మొదట శివపురి అయిన శివాలయానికి (మూలవతనానికి) వెళ్తారు. తర్వాత శివునిచే స్థాపించబడిన శివాలయానికి(స్వర్గానికి) వెళ్తారు. శివపురిని, విష్ణుపురిని రెండిటినీ శివాలయము అని అంటారు. ఎందుకంటే ముక్తి, జీవన్ముక్తి రెండిటినీ శివబాబాయే ఇస్తారు. కనుక సత్యయుగ దైవీ వంశాన్ని, కుటుంబాన్ని శివబాబాయే స్థాపన చేస్తారు.
అచ్ఛా, స్మృతి చేయునప్పుడు శబ్ధముల ద్వారా విఘ్నము కలగజాలదు. జ్ఞానాన్ని వినునప్పుడు శబ్ధముల ద్వారా విఘ్నము కలుగుతు౦ది. మనుష్యులేమో శాంతిగా ఉండండి. లేకుంటే స్మృతిలో విఘ్నాలు పడ్తాయని అంటారు. కాని యోగములో శబ్ధము విఘ్నము కలుగజేయదు. విఘ్నాన్ని కలిగించేది మాయ. మాయ పిల్లలతో యుద్ధము చేస్తుంది. పిల్లలు యుద్ధ మైదానములో ఓడిపోరాదు. మాయ ఘూసాలు(ముష్టి ఘాతాలు) కొడ్తూనే ఉంటుంది. ముక్కు పై బలంగా గుద్దుతే క్రిందపడ్తారు. ఏదో ఒక విధంగా లేచి నిలబడ్తారు. మళ్లీ ముక్కు పై గుద్దుతే మళ్లీ క్రిందపడ్తారు. అందువలన తండ్రి అంటున్నారు - ఈ మాయ కామ క్రోధములనే ముష్టిఘాతాలతో కొడ్తుంది. కావున మీరు ఈ మాయతో చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. దానితో ఘూసాలు తినరాదు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. జ్ఞాన
అలంకారాలన్నీ ధారణ చేసి స్వదర్శన చక్రధారులుగా, త్రినేత్రులుగా,
త్రికాలదర్శులుగా అనగా మాస్టర్ గాడ్‌గా(భగవంతునిగా) తయారవ్వాలి.
2. తండ్రికి
కుడిభుజమైన ధర్మరాజును స్మృతిలో ఉంచుకొని ఏ వికర్మా చేయరాదు. ' పవిత్రము'
గా ఉంటామని ప్రతిజ్ఞ చేసి వికారాల వశము అవ్వరాదు.
వరదానము:- ''బ్రాహ్మణ జీవితములో సదా సంతోషమనే ఖురాక్‌ను (బలమైన ఆహారాన్ని) తింటూ ఇతరులకు తినిపించే శ్రేష్ఠ భాగ్యశాలి భవ''
విశ్వమంతటి
యజమానికి మనము బాలకులమైన యజమానులము. ఈ ఈశ్వరీయ నషాలో సంతోషంగా ఉండండి.
వాహ్ నా శ్రేష్ఠమైన భాగ్యము అనే సంతోషపు ఊయలలో సదా ఊగుతూ ఉండండి. సదా
శ్రేష్ఠమైన భాగ్యశాలురే కాక సదా సంతోషమనే ఖురాక్‌ను తింటూ,
తినిపిస్తున్నారు కూడా. ఇతరులకు కూడా సంతోషమనే మహాదానమునిచ్చి గొప్ప
భాగ్యశాలురుగా తయారుచేస్తారు. మీ జీవితమంతా సంతోషమయమే. సంతోషంగా ఉండడమే
జీవితము. ఇదే బ్రాహ్మణ జీవితానికి శ్రేష్ఠమైన వరదానము.
స్లోగన్:- ''ప్రతి పరిస్థితిలో సహనశీలురుగా అయితే ఆనందాన్ని అనుభవము చేస్తూ ఉంటారు''
మాతేశ్వరి గారి
అమూల్యమైన మహావాక్యాలు ( 23-01-1951 )
ఇప్పుడు ప్రపంచానికంతా భగవంతుడు ఒక్కడే అని తెలుసు. ఆ పరమాత్మనే కొంతమంది ఒక శక్తి అని భావిస్తారు. కొంతమంది కుదరత్(ప్రకృతి) అని అంటారు. అనగా ఏదో ఒక రూపంలో తప్పకుండా భగవంతుడున్నాడని భావిస్తున్నారు. కనుక ఏ వస్తువునైతే ఆరాధిస్తున్నారో తప్పకుండా ఆ వస్తువేదో ఉంటుంది. అయితే వారికొక పేరు పెట్టారు కాని ఈ ప్రపంచములో ఎంతమంది మనుష్యులున్నారో ఆ వస్తువును గురించి అన్ని మతాలున్నాయి. అయినా ఆ వస్తువేమో ఒక్కటే. ఇందులో ముఖ్యంగా 4 మతాలున్నాయి. కొంతమంది ఈశ్వరుడు సర్వత్రా ఉన్నాడని అంటారు. కొంతమంది బ్రహ్మయే సర్వత్రా ఉన్నాడని అంటారు. సర్వత్ర బ్రహ్మయే బ్రహ్మమని అంటారు. కొంతమంది ఈశ్వరుడు సత్యం, మాయ మిథ్య అని అంటారు. కొంతమంది ఈశ్వరుడు లేనే లేడు, అంతా ప్రకృతే ప్రకృతి అని అంటారు. వారు ఈశ్వరుడున్నాడని అంగీకరించరు. ఇన్ని మతాలున్నాయి. వారు జగత్తు అంటే ప్రకృతి అని, వేరే ఇంకేదీ లేదని భావిస్తారు. ఇప్పుడు వారు జగత్తును అంగీకరిస్తున్నారు. ఏ పరమాత్ముడైతే జగత్తును రచించాడో ఆ యజమానిని అంగీకరించరా! ప్రపంచంలో ఎంత అనేక మంది మనుష్యులున్నారో, వారి అన్ని అనేక మతాలున్నాయి. చివరికి ఈ అన్ని మతాల నిర్ణయము స్వయం భగవంతుడే వచ్చి చేస్తారు లేక ఎవరైతే సర్వోత్తమ శక్తివంతులుగా ఉంటారో వారే తమ రచనను గురించిన నిర్ణయాన్ని విస్తార పూర్వకంగా అర్థం చేయిస్తారు. వారే మనకు రచయితను గురించిన పరిచయము కూడా ఇస్తారు. అంతేకాక తమ రచనను గురించిన పరిచయాన్ని కూడా ఇస్తారు.
చాలామంది మనుష్యులు ఎటువంటి ప్రశ్నలడుగుతారంటే మేము ఆత్మలమని ఎలా అనుకోవాలి? ఋజువేముంది? అని అడుగుతారు. నేను ఆత్మను, ఆ పరమాత్ముని సంతానము అని అన్నప్పుడు ఇది తమంతకు తామే ప్రశ్నించుకోవాల్సిన విషయము. రోజంతా 'నేను, నేను' అంటూ ఉంటాము కదా. ఆ శక్తి ఏది? ఇక ఎవరినైతే స్మృతి చేస్తూ ఉన్నామో వారు మనకేమవుతారు? ఎవరినైనా స్మృతి చేస్తున్నామంటే తప్పకుండా ఆత్మలమైన మనకు వారి ద్వారా ఏదో కావాలి. వారిని ప్రతి సమయంలో స్మృతి చేస్తేనే మనకు వారి ద్వారా ప్రాప్తి అవుతుంది. మనుష్యులు ఏ పని చేసినా తప్పకుండా వారి మనసులో ఏదో ఒక శుభమైన కోరిక ఉంటుంది. కొంతమందికి సుఖము, కొంతమందికి శాంతి కావాలనే కోరిక ఉంటుంది. కోరిక ఉత్పన్నమవుతూ ఉందంటే తీసుకునేవారు ఎవరో ఉండాలి, ఎవరి ద్వారా ఆ కోరిక పూర్తి అవుతుందో అది ఇచ్చేవారు కూడా ఎవరో తప్పకుండా ఉండాలి. అందుకే కదా వారిని స్మృతి చేస్తారు. ఇప్పుడు ఈ రహస్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి - వారు ఎవరు? ఈ మాటలు మాట్లాడే శక్తి అయిన 'నేను' ఆత్మను. ఆత్మ ఆకారము జ్యోతిర్బిందువు వలె ఉంది. మనుష్యులు తమ స్థూల శరీరాన్ని వదిలినప్పుడు అది బయటకు వెళ్లిపోతుంది. అది కంటికి కనిపించదు. కనుక దానికి స్థూలమైన ఆకారము లేదని నిరూపించబడ్తుంది. కాని అది వెళ్లిపోయిందని మనుష్యులు తప్పకుండా అనుభవం చేస్తారు. కనుక మనము దానిని 'ఆత్మ' అనే అంటాము. అది జ్యోతి స్వరూపము. కనుక దానికి జన్మనిచ్చే పరమాత్మ కూడా అదే రూపములో ఉంటారు. ఎవరు ఎలా ఉంటారో వారి రచన కూడా అలాగే ఉంటుంది. ఆత్మలమైన మనము ఆ పరమాత్మను, వారు సర్వాత్మల కంటే శ్రేష్ఠమైన వారని(పరమ అని) ఎందుకంటాము? ఎందుకంటే వారి పై మాయ లేప - చాపాలు ఏవీ ఉండవు. ఆత్మలమైన మన పై మాయ లేప-చాపాలు తప్పకుండా అంటుకుంటాయి. ఎందుకంటే మనము జనన-మరణ చక్రములో తిరుగుతాము. ఆత్మకు, పరమాత్మకు ఉన్న వ్యత్యాసమిదే. అచ్ఛా.

No comments:
Post a Comment