06-11-2017 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
''మధురమైన
పిల్లలారా - మీరు జీవించి ఉండే బేహద్ తండ్రి ఒడిని తీసుకున్నారు, వారి
సంతానంగా అయ్యారు, కావున వారి శ్రీమతమును తప్పకుండా అనుసరించాలి. ప్రతి
ఆజ్ఞను అమలుపరచాలి''
ప్రశ్న:- ఈ సృష్టికి వానప్రస్థ అవస్థ ఎప్పుడు మొదలౌతుంది? ఎందుకు మొదలౌతుంది?
ఉత్తరం:- శివబాబా
ఈ బ్రహ్మ శరీరములో ఎప్పుడు ప్రవేశిస్తారో, అప్పటి నుండి ఈ మొత్తము
సృష్టికి వానప్రస్థ అవస్థ మొదలౌతుంది ఎందుకంటే తండ్రి అందరినీ వాపస్
ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చారు. ఇప్పుడు చిన్నా, పెద్దా అందరిదీ వానప్రస్థ
అవస్థయే. అందరూ మధురమైన ఇల్లైన ముక్తిధామానికి వాపస్ వెళ్ళాలి, తర్వాత
మళ్లీ జీవన్ముక్తిలోకి రావాలి, అలాగే బాబా ఈ బ్రహ్మ శరీరములో
ప్రవేశించినప్పుడు ఇతనికి కూడా 60 సంవత్సరాల వయస్సు ఉంటుంది అంటే ఇతనిది
కూడా వానప్రస్థ అవస్థయే.
పాట:- మరణించినా నీ ఒడి (దారి)లోనే, జీవించినా నీ ఒడి (దారి)లోనే.............(మర్‌నా తేరీ గలీమే............) 
ఓంశాంతి. ఎవరి
ఒడిలోకి వచ్చి మరణించవలసి ఉంటుంది? మనుష్యులు ముక్తిధామములోకి వెళ్ళాలని
కోరుకుంటారు. పరమపిత పరమాత్మ అయిన శివబాబా విజయమాలలో కూర్చబడాలని
కోరుకుంటారు. మనుష్యాత్మలందరూ తప్పకుండా తండ్రి కంఠహారమని(గలే కా హార్)
పిల్లలైన మీకు తెలుసు. ఎలాగైతే లౌకిక పిల్లలు వారి(లౌకిక) తండ్రికి
కంఠహారముగా అవుతారో, తండ్రి పిల్లలను, పిల్లలు తండ్రిని తలంపు చేస్తారో
అలాగే వాస్తవానికి ఆత్మలందరూ పరమపిత పరమాత్మను స్మృతి చేస్తారు. లౌకిక
తండ్రి హద్దులోని తండ్రి, వీరు అనంతమైన తండ్రి. మనుష్యులందరూ ముక్తిని
పొందాలని అనుకుంటారు. ఎందుకంటే నిరాకారుని కంఠహారము అనగా ముక్తి, విష్ణు
కంఠహారము అనగా జీవన్ముక్తి. అనంతమైన తండ్రి ముక్తి - జీవన్ముక్తులను
ఇస్తారు. అనంతమైన తండ్రికి సంతానంగా అవుతే వారి కంఠహారముగా అవుతారు. లౌకిక
తల్లి - తండ్రుల కంఠహారము వారి సంతానమే. ఆ తల్లి - తండ్రి కూడా మరొకరి
పిల్లలుగా ఉంటారు. మీరే తల్లి తండ్రి...... మేము మీ కంఠహారముగా అవుతే, సదా
సుఖంగా ఉంటామని పాట కూడా పాడ్తారు. అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు కాని
వారి కంఠహారముగా ఎలా అవ్వాలి అనే (కోరిక) అందరికీ ఉంటుంది. ఎప్పుడైతే
త్రిమూర్తి శివబాబా వచ్చి బ్రహ్మ-విష్ణు-శంకరులైన త్రిమూర్తులను రచిస్తారో,
అప్పుడు బ్రహ్మ ద్వారా అనంతమైన తండ్రికి కంఠహారముగా అవ్వగలరు. మొదట లౌకిక
తల్లి - తండ్రులకు కంఠహారముగా ఉంటారు, వారి నుండి జీవించి ఉండే మరణించి
పారలౌకిక తండ్రికి చెందినవారిగా అయితే వారసత్వము లభిస్తుంది. ఎవరైనా
ధనవంతులు పేదవారి పిల్లలను దత్తత తీసుకుంటే వారు జీవించి ఉండే ధనవంతుల
ఒడిని తీసుకుంటారు కదా. ఆ పేదలు కూడా జీవించే ఉంటారు కదా. ఇరువురూ గుర్తు
ఉంటారు. మీకు కూడా అదే విధంగా లౌకిక, పారలౌకిక రెండు సంబంధాలు
గుర్తున్నాయి. ఇరువురితోనూ మిలనము జరుగుతుంది. మీరు పారలౌకిక తల్లిదండ్రుల
నుండి అపార సుఖాన్ని పొందేందుకు వారి ఒడిలోకి వచ్చారు. అది హద్దు
ఒడి(దత్తత), ఇది అనంతమైన ఒడి. జీవించి ఉండే ఒడిలోకి వచ్చాము. వీరి ఒడిలోకి
వచ్చినందున మనము దేవీదేవతా కులములో అపారమైన సుఖము పొందుతామని మీకు తెలుసు.
అందువలన ఏ తల్లితండ్రుల సంతానంగా అయ్యారో వారిని తప్పకుండా స్మృతి చేయవలసి
ఉంటుంది. శ్రీమతానికి మహిమ ఉంది కదా. ఇప్పుడు మీరు ప్రాక్టికల్‌గా వారి
మతమును అనుసరిస్తున్నారు. అలాగని వెంటనే అందరూ దత్తత అయిపోతారని కాదు.
నెమ్మది నెమ్మదిగా అవుతారు. ఇప్పుడు దేవీ దేవతా ధర్మస్థాపన అవుతూ ఉంది.
వృక్షము నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. క్రైస్తవ మతములో కూడా మొదట
ఏసుక్రీస్తు వస్తాడు. తర్వాత 10 - 20 - 50 మంది పెరుగుతూ పోతారు. ఈ వృక్షము
ఇక్కడే అందరి ముందు పెరుగుతుంది. ఏసుక్రీస్తు వెళ్ళిపోతాడు మళ్లీ వచ్చి
చివరిలో కలుస్తాడు. వీరు అనంతమైన తండ్రి, అనేకమంది శివబాబాకు కంఠహారముగా
అవ్వవలసి ఉంటుంది. అప్పుడు మళ్లీ విష్ణు కంఠహారముగా అవుతారు. శివబాబా ఏమో
నిరాకారుడు. బ్రహ్మ ద్వారా ముఖ వంశావళిని రచిస్తారు. త్రిమూర్తి శివుడంటే
అర్థముంది. త్రిమూర్తి బ్రహ్మ అనే పదానికి అర్థము లేదు. బాబా అనేక సవరణలు
కూడా చేస్తూ ఉంటారు. గోలా చిత్రము క్రింద ఇది స్వదర్శన చక్రము, చరఖా కాదు
అని వ్రాయాలి. ప్రభుత్వము వారు ఆ చరఖాను జండా పై వేశారు. ఇచ్చట ఇది
స్వదర్శన చక్రము. రోజులు గడిచే కొలది సవరణలు జరుగుతూ ఉంటాయి.
సదా
త్రిమూర్తి శివజయంతి అని అనాలని బాబా అర్థం చేయించారు. శివబాబా ఉన్నారంటే
వారి వెంట వారసత్వము కూడా తప్పకుండా ఉండాలి. కావున ఈ విష్ణువే శివుని
వారసత్వము. శంకరుని ద్వారా వినాశనమని గాయనము చేయబడింది. కావున త్రిమూర్తి
చిత్రము ముఖ్యమైనది. త్రిమూర్తి చిత్రము కొనసాగుతూ వచ్చింది. సత్యయుగములో
కూడా మీరు రాజ్యము చేయునప్పుడు సింహాసనము వెనుక విష్ణువు చిత్రముంటుంది. ఈ
చిత్రము రాజముద్రిక(కోట్ ఆఫ్ ఆర్మ్ ) వంటిది. మనుష్యులకు దీని అర్థము
తెలియదు. పిల్లలైన మీకు తండ్రి దీని అర్థమును తెలిపించారు. ఈ జ్ఞానము
మీకిప్పుడే లభించింది. దేవతల వద్ద ఈ జ్ఞానముండదు. బ్రాహ్మణులైన మీ మూడవ
నేత్రము తెరుచుకుంటుంది. తండ్రి ఎంతో సులభంగా మన్మనాభవ అని అర్థము
చేయిస్తారు. తండ్రిని మరియు వారసత్వమును స్మృతి చేయండి. మీరు బ్రహ్మ ముఖ
వంశావళి వారు కదా. అంతేకాక మీరు జ్ఞాన గంగలు కూడా అయ్యారు. మీరు
జ్ఞానసాగరుని ద్వారా బ్రహ్మముఖ కమలము నుండి వెలువడిన ముఖవంశావళీ జ్ఞానకుమార
- కుమారీలు. కావున మీరు జ్ఞానసాగరుని పిల్లలు.
వాస్తవానికి సత్య
సత్యమైన తీర్థస్థానము ఇదే. ఇదే ఆత్మ - పరమాత్మల సత్యమైన సంగమము.
జ్ఞానసాగరుడు మరియు జ్ఞానగంగలు కలుస్తారు. ఇవన్నీ అర్థము చేసుకునే చాలా
గుప్తమైన విషయాలు. మంద బుద్ధి గలవారు వాటిని అర్థము చేసుకోలేరు. వారికి
సులభమైన ఉపాయమేమంటే - శివబాబాను, వారసత్వాన్ని ఈ బ్రహ్మ ద్వారా స్మృతి
చేయండి. ఇది బుద్ధిలో ఉన్నందున సంతోషమనే పాదరస మట్టము పైకెక్కుతుంది. ఇది
ఈశ్వరీయ విద్యార్థి జీవితము కదా. అనంతమైన తండ్రి మనలను చదివిస్తున్నారు.
మనిషి అయిన కృష్ణుడు చదివించడం లేదు. కృష్ణుని జ్ఞానసాగరులని అనరు.
కృష్ణుడు త్రికాలదర్శి కాదు. రాజయోగ జ్ఞానము మీ బుద్ధిలో ఉంది. దాని ద్వారా
మీరు ప్రాలబ్ధాన్ని పొందుతారు. అచ్చట ఈ జ్ఞానము అవసరము లేదు. దీని అవసరము
ఇచ్చట మాత్రమే ఉంది. కల్ప-కల్పము నేను వచ్చి రాజయోగము నేర్పిస్తాను. సృష్టి
ఆది-మధ్యాంతాల రహస్యాన్ని, ఈ చక్రమెలా తిరుగుతూ ఉందో అర్థం చేయిస్తాను.
మహిమ అంతా సంగమయుగముదే. ఎందుకంటే ఈ సమయములోనే పతితపావనులైన తండ్రి వచ్చి
పాత ప్రపంచము నుండి నూతన ప్రపంచములోకి తీసుకెళ్తారు. పాత ప్రపంచ వినాశనము
కొరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనాటి ప్రపంచములో ఏమేమి జరుగుతోందో
మీరు చూస్తున్నారు కదా. ఈ రోజు చక్రవర్తిగా ఉంటాడు, మిలిటరీవారు తిరుగుబాటు
చేస్తే రేపు ఆ చక్రవర్తిని కూడా ఖైదీగా చేస్తారు. ఎవరినైనా హతమారుస్తారు.
ఇటువంటి కేసులు చాలా జరుగుతూ ఉంటాయి. ఈ రోజుల్లో దేని పైనా నమ్మకము లేదు.
ఎచ్చట చూసినా దు:ఖమే దు:ఖముంది. ఈ రోజు పుత్రుడు జన్మిస్తే సంతోషిస్తారు,
రేపు మరణిస్తే, దు:ఖిస్తారు. అసలు ఈ ప్రపంచమే దు:ఖ ప్రపంచము. ఇప్పుడు
తండ్రి నూతన సుఖమయ ప్రపంచానికి అర్హులుగా చేస్తున్నారు. తండ్రి స్వయంగా
చెప్తున్నారు - మీరు ఎంత అనర్హులుగా అయ్యారు! ఇప్పుడు మీరు అర్హులై
స్వర్గానికి యజమానులుగా అవ్వగలరు. మీరే దేవీ దేవతలుగా ఉండేవారు, ఇప్పుడు
అసురులుగా అయిపోయారు. నిన్నటి రోజు దేవతల మహిమను గాయనము చేసేవారు,
స్వయాన్ని పాపులమని, నీచులమని అంటూ ఉండేవారు. గుణము లేని మా పై దయ చూపండి
..... (హమ్ నిర్గుణ్ హారే మే......) అని పాడుతూ ఉండేవారు. కావున పరమాత్మ
ఎవరి పైనో దయ చూపి ఉంటారు కదా. ఈ దేవతలను గుణవంతులుగా ఎవరు తయారు చేశారో
ఇప్పుడు మీకు తెలుసు. పరమపిత పరమాత్మ తప్ప ఇతరులెవ్వరూ దేవతలుగా తయారు
చేయలేరు. మనుష్యులు పూర్తిగా వికారీ, పతితులుగా అయ్యి ఉన్నారు. వృద్ధులుగా
అయినా వికారాలను వదలరు. లేకుంటే నియమానుసారము 60 సంవత్సరాల తర్వాత
వానప్రస్థము తీసుకోవాలి. పూర్వము ఇలా చేస్తూ ఉండేవారు. 60 సంవత్సరాల లోపలే
తమ భారమంతా దింపి పిల్లలకిచ్చేసేవారు. ఇప్పుడు 60 సంవత్సరాల వయస్సులో కూడా
పిల్లలకు జన్మనిస్తూ ఉంటారు. తండ్రి అంటున్నారు - వీరి 60 సంవత్సరాల
వయస్సులో అంటే అనేక జన్మల అంతిమ జన్మలో కూడా చివరి సమయములో అంటే ఇతని
వానప్రస్థ సమయములో నేను ఇతనిలో ప్రవేశించాను. అప్పుడు ఇతడు కూడా సర్వస్వము
వదిలేశాడు. తండ్రి రావడంతో ప్రపంచమంతా వానప్రస్థావస్థగా అయిపోతుంది.
ఎందుకంటే అందరూ వాపస్ ఇంటికి వెళ్ళాలి. అందుకే తండ్రి అంటున్నారు - నన్ను
ఒక్కరిని మాత్రమే స్మృతి చేయండి. చిన్న - పెద్ద ఎవ్వరూ ఉండబోరు.
తండ్రి
వచ్చి అందరినీ మధురంగా తయారు చేస్తారు. ముక్తి- జీవన్ముక్తి రెండూ మధురమైన
ధామాలే. అందరూ వినాశనమయ్యే తీరాలి. అందరి లెక్కాచారాలు కూడా చుక్తా
అవుతాయి. శిక్షలు అనుభవించడంలో పెద్ద సమయము పట్టదు. కాశీలో
కత్తులబావిలో(కాశీకల్వట్ అంటే శివుని అపారభక్తి చేయు భక్తులు శివుని పై
బలిహారి అయ్యేందుకు కాశీలో ఉన్న లోతైన కత్తులబావిలో దూకేవారు, అడుగు
భాగములో ఉన్న శివలింగము పై భక్తుల రక్తాభిషేకమై, శరీరము ముక్కలు ముక్కలుగా
అయిపోయి ప్రాణాలను అర్పిస్తారు, కాశీలోని ఈ బావిని బ్రిటిష్‌వారు నిషేధించి
మూయించారు) దూకినప్పుడు పాపాల నుండి ముక్తులవుతారు. మళ్లీ కొత్తగా
లెక్కాచారము ప్రార౦భమవుతుంది, అంతే గాని ముక్తికి ఒక్కరు కూడా వెళ్ళరు.
శివుని పై బలిహారమైతే నిర్వాణధామానికి వెళ్ళిపోతామని వారు భావిస్తారు.
తండ్రి అంటున్నారు - ఒక్కరు కూడా వాపస్ వెళ్ళలేరు. పునర్జన్మ అయితే అందరూ
తీసుకునే తీరాలి. మొదటి నంబరులోని ఇతడే పూర్తిగా పునర్జన్మలు
తీసుకుంటున్నప్పుడు వెనుక వచ్చేవారు తప్పక తీసుకుంటారు కదా. మీరు 84 జన్మలు
తీసుకున్నారు. ప్రారంభము నుండే మీ పాత్ర నడుస్తుంది. ఇది మీకు కళ్యాణకారి
లీప్ జన్మ. ఈ జన్మలో లేక ఈ ధర్మయుగములో మీరు ధర్మాత్ములుగా అవుతారు.
అవన్నీ హద్దు విషయాలు. వారు ధర్మ మాసము(ధనుర్మాసము), ధర్మ సంవత్సరమని
అంటారు. కాని మీకు ఇది ధర్మ యుగము. ఈ లీప్ యుగము, లీప్ జన్మ బ్రాహ్మణులకు
మాత్రమే. బ్రాహ్మణులు ఉన్నతమైనవారు(పిలక), తర్వాత మీరే దేవతలుగా అవుతారు.
బాబా మనలను కంఠహారముగా చేసుకుంటారని మీకు తెలుసు. ఆత్మలైన మనము నిరాకార
ప్రపంచములో ఉంటాము. తండ్రి స్వయంగా అంటున్నారు - మీరు అశరీరులుగా
ఉన్నప్పుడు నా వద్ద ఉండేవారు. మనము మొట్టమొదట సత్యయుగములోనికి వస్తామని
ఇప్పుడు మీరు అర్థము చేసుకున్నారు, అచ్చట ఉండేది దేవీ దేవతా ధర్మము. అచ్చట
పురుషార్థము చేసే అవసరముండదు. పురుషార్థము ఈ సంగమ యుగములో మాత్రమే
చేస్తారు. ఇది సంగమ యుగము. ఇతర సంగమయుగాలు ఏవైతే ఉన్నాయో వాని ఆయువు
లెక్కింపబడదు. ఈ సంగమ యుగానికి మాత్రమే ఆయువు ఉంది. ఇది చాలా చిన్న యుగము. ఈ
సంగమ యుగములోనే తండ్రి వచ్చి ఇతడిని పరివర్తన చేస్తారు. మిగిలిన ఆ యుగాలలో
ఏమీ జరగదు. రెండు కళలు తగ్గినందు వలన రాజ్యము బదిలీ అవుతుంది. రాజ్యము ఎలా
ఇస్తారో మీకు సాక్షాత్కారమౌతుంది. సత్యయుగములో రాజ్యమెలా అప్పగిస్తారో
మీకు సాక్షాత్కారమవుతుంది. సంగమ యుగములో తండ్రి వచ్చి పతితులను పావనంగా
చేస్తారు. అందువలన తండ్రి వచ్చినప్పటి నుండి ఈ యుగము యొక్క ఆయువును
లెక్కిస్తారు. తప్పకుండా వారు వచ్చారు. వారు జ్ఞానసాగరులు. వారి ముఖవంశావళి
అయిన బ్రహ్మకుమార-కుమారీలు జ్ఞాన నదులు. వీరి నుండే జ్ఞానము పొందాలి. బాబా
అంటున్నారు - ఇతరులకు సులభంగా అర్థం చేయించేందుకు ఏదైనా ఒక నూతన వస్తువును
తయారు చేయండి. అందులో త్రిమూర్తి శివజయంతి అని వ్రాయండి. బాబా ఆదేశాలనేమో
ఇస్తారు, కాని తయారు చేయువారు, తెలివైనవారుగా ఉండాలి. ఈ జ్ఞాన యజ్ఞములో
రకరకాల విఘ్నాలు కూడా పడ్తాయి. దాని వలన సేవ ఢీలాగా(వదులుగా, తక్కువగా)
అయిపోతుంది. శివజయంతి రానే వస్తుంది, చాలా ధూమ్‌ధామ్‌గా(వైభవోపేతంగా)
జరపాలి. ఢిల్లీలో అయితే చాలా ధూమ్‌ధామ్‌గా జరపవచ్చు. ఇరువురి రాజ
ముద్రికలను చూపిస్తారు. మనము ఈశ్వరీయ విషయము గురించి మాట్లాడ్తాము. తండ్రి
కళ్యాణకారి అయినారు. పిల్లలు కూడా ఇతరుల కళ్యాణము చేస్తూ ఉంటారు, కావున అది
చూచి తండ్రి చాలా సంతోషిస్తారు. ధర్మకార్యము(దానకార్యము) ఇంటి నుండే
మొదలౌతుందని(చారిటి బిగిన్స్ అట్ హోమ్) అని అంటారు. అనగా మొదట
బంధు-మిత్రులకు కూడా అర్థం చేయించాలి. తెలపకుంటే ఫిర్యాదులు చేస్తారు. మీకు
చాలా మంచి పాయింట్లు లభిస్తాయి. చిత్రాలు కూడా చాలా బాగున్నాయి. మాల కూడా
చాలా బాగుంది. మొదట రుద్రమాలగా తయారై తర్వాత విష్ణుమాలగా తయారౌతుంది.
బ్రాహ్మణులైన
మీరు సత్య సత్యమైన గీతను వినిపించేవారు. సత్య-సత్యమైన యాత్రను గురించిన
రహస్యము మీరు అర్థం చేయిస్తారు. ఇచ్చట కూర్చుని స్మృతియాత్రలో ఉంటే మీ
పాపాలు భస్మమైపోతాయి. తమోప్రధానము నుండి సతోప్రధానంగా తయారయ్యేందుకు ఇతర
ఉపాయమేదీ లేదు. యోగానికి చాలా మహిమ ఉంది. శ్రమ కూడా ఇందులోనే ఉంది.
తుఫాన్లు చాలా వస్తాయి. ఇది సులభానికి సులభము, కష్టానికి కష్టముగా కూడా
ఉంటుంది. మీ యోగ తపస్సు చిత్రము కూడా ఉంది, మీ రాజదర్బారు చిత్రము కూడా
ఉంది. రాజయోగము ద్వారా మీరు దేవతలుగా అవుతారు. మీరు రాజఋషులు, వారు హఠయోగ
ఋషులు.మీకు సహజమైన జడలున్నాయి.ఇప్పుడు మనమందరము బాబా కంఠహారముగా ఉన్నాము.
మనమంతా భాయి-భాయి(సోదరులము). తండ్రి నుండి వారసత్వము కూడా లభిస్తుంది.
ప్రజాపిత బ్రహ్మా కూడా గాయనము చేయబడ్డాడు. వారు నిరాకార తండ్రి, ఇతడు సాకార
తండ్రి. శంకరుని మూడవ నేత్రము తెరుచుకున్న వెంటనే వినాశనమౌతుందని
చూపిస్తారు. శంకరునికి పార్వతి, గణేశుడు.......... మొదలైన వారిని చూపించి
గృహస్థునిగా చూపించారు. మూఢనమ్మకాలు చాలా ఉన్నాయి. తండ్రి అంటున్నారు -
నేను మిమ్ములను ధనవంతులుగా చేశాను. మీరు మందిరాలు కట్టించి, శాస్త్రాలు
తయారుచేసి, దానధర్మాలు చేసి, వ్యర్థముగా ఖర్చు చేస్తూ చేస్తూ
దుర్గతిపాలయ్యారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. అందుకే తండ్రి
కూర్చుని అర్థము చేయిస్తున్నారు. బాబా మిమ్ములను త్రికాలదర్శులుగా తయారు
చేస్తారు. మూడుకాలాల జ్ఞానము మీ బుద్ధిలో ఉంది. మంచిది.
మధురాతి
మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు
గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
No comments:
Post a Comment