Tuesday, 30 January 2018

Telugu Murli 29/01/18

29-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

'' మధురమైన పిల్లలారా - క్రోధము చాలా దు:ఖమునిస్తుంది. అది స్వయాన్నీ దు:ఖపరుస్తుంది, ఇతరులను కూడా దు:ఖపరుస్తుంది. కనుక శ్రీమతముననుసరించి ఈ భూతము పై విజయాన్ని ప్రాప్తి చేసుకోండి.''

ప్రశ్న :- కల్ప-కల్పము ఏ పిల్లల పై మచ్చ పడ్తుంది? వారి గతి(నడవడికలు) ఏమిటి ?
జవాబు :- ఎవరైతే స్వయాన్ని చాలా తెలివిగలవారిగా భావిస్తారో, శ్రీమతమును పూర్తిగా అనుసరించరో, లోపల ఏదో ఒక వికారము గుప్త రూపములో లేక ప్రత్యక్ష రూపములో ఉండి దానిని తొలగించుకోరో వారిని మాయ చుట్టుముడుతూ సతాయిస్తూ ఉంటుంది. అటువంటి పిల్లల పై కల్ప-కల్పపు మచ్చ ఏర్పడ్తుంది. చివర్లో వారు చాలా పశ్చాత్తాపపడవలసి వస్తుంది. వారు తమను తామే నష్టపర్చుకుంటారు.

పాట :- ఈ రోజు మానవుడు అంధకారములో ఉన్నాడు,..........(ఆజ్‌ అంధేరే మే హై ఇన్‌సాన్‌,..........)
ఓంశాంతి. అనంతమైన తండ్రిని ఎవరినైతే ' హెవన్లీ గాడ్‌ఫాదర్‌ ' అని అంటారో వారు అందరికీ తండ్రి అని పిల్లలకు తెలుసు. వారే ఇప్పుడు పిల్లల ఎదుట కూర్చుని అర్థం చేయిస్తున్నారు. తండ్రే ఏమో పిల్లలందరినీ ఈ(బ్రహ్మ) నయనాల ద్వారా చూస్తారు. వారికి పిల్లలను చూచేందుకు దివ్యదృష్టి అవసరము లేదు. పరంధామము నుండి పిల్లల వద్దకు వచ్చానని, ఈ పిల్లలు కూడా ఇచ్చట దేహధారులై పాత్రను అభినయిస్తున్నారని, ఈ పిల్లల ఎదుట కూర్చుని వారిని చదివిస్తున్నానని తండ్రికి తెలుసు. స్వర్గ స్థాపన చేసే అనంతమైన తండ్రి మళ్లీ మమ్ములను భక్తిమార్గపు ఎదురుదెబ్బల నుండి విడుదల చేయించి మన జ్యోతిని వెలిగిస్తున్నారని పిల్లలకు కూడా తెలుసు. ఇప్పుడు మనము ఈశ్వరీయ కులానికి లేక బ్రాహ్మణ కులానికి చెందినవారమని అన్ని సెంటర్లలో ఉండే పిల్లలందరికీ తెలుసు. ' సృష్టి రచయిత ' అని పరమపిత పరమాత్మను అంటారు. సృష్టి ఎలా రచింపబడ్తుందో ఆ విధానము తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు. తల్లిదండ్రులు లేకుండా ఎప్పుడూ మనుష్య సృష్టి రచించబడదని పిల్లలకు తెలుసు. తండ్రి ద్వారా సృష్టి రచింపబడ్తుందని అనరు. అలా జరగదు. తల్లివి నీవే, తండ్రివి నీవే అను గాయనమే ఉంది. ఈ మాతా-పితలు సృష్టిని రచించి మళ్లీ వారిని అర్హులుగా చేస్తారు. ఇది చాలా గొప్ప మేలు(ఉపకారము). అంతేకాని పై నుండి దేవతలు దిగి వచ్చి ధర్మస్థాపన చేస్తారని కాదు. ఏసుక్రీస్తు క్రైస్తవ ధర్మాన్ని స్థాపన చేసినట్లు జరగదు. కనుక ఏసుక్రీస్తును కూడా క్రైస్తవులు 'ఫాదర్‌' అని అంటారు. ఫాదర్‌ అయితే మదర్‌ కూడా తప్పకుండా ఉండాలి. వారు మేరీని 'మదర్‌ మేరీ'(మేరీ మాత) అని అంటారు. మేరీని తల్లిగా పెట్టుకున్నారు. అయితే మేరీ ఎవరు? ఏసుక్రీస్తు మేరీ ద్వారా పిల్లలకు జన్మనిచ్చాడా? లేక స్వయం తల్లి తండ్రి ఇరువురూ ఏసుక్రీస్తేనా? క్రీస్తు యొక్క కొత్త ఆత్మ పై నుండి వచ్చి ఏ శరీరములో ప్రవేశించిందో ఆ నోటి ద్వారా ప్రజలను రచించాడు. వారు క్రైస్తవులుగా అయ్యారు. పై నుండి వచ్చిన నూతన ఆత్మకు దు:ఖమును అనుభవించే ఏ కర్మ లెక్కాచారమూ ఉండదు. అనగా అటువంటి కర్మ చేయలేదని కూడా అర్థము చేయించబడింది. పై నుండి వచ్చే ఆత్మ పవిత్రంగా ఉంటుంది. ఉదాహరణానికి పరమపిత పరమాత్మ ఎప్పుడూ దు:ఖమును అనుభవించరు కదా. దు:ఖము లేక తిట్లు మొదలైనవన్నీ ఈ సాకారానికి ఇస్తారు. అందువలన ఏసుక్రీస్తును కూడా శిలువ పైకి ఎక్కించినప్పుడు తప్పకుండా ఎవరి శరీరములో క్రీస్తు ఆత్మ ప్రవేశించిందో, అతని ఆత్మయే ఈ దు:ఖాన్ని సహించింది. పై నుండి వచ్చి ప్రవేశించిన పవిత్రమైన క్రీస్తు ఆత్మ దు:ఖమును అనుభవించదు. కావున ఇప్పుడు ఏసుక్రీస్తు ఫాదర్‌ అయితే మదర్‌ను ఎక్కడ నుండి తీసుకు రావాలి? మేరీని మదర్‌గా చేసేశారు. మేరిని కుమారిగా చూపిస్తారు. ఆమె నుండి ఏసుక్రీస్తు జన్మించినట్లు చూపిస్తారు. కుమారి నుండి బాలుడు జన్మించుట పూర్తిగా నియమ విరుద్ధము. ఇవన్నీ శాస్త్రాల నుండి తీసుకున్నారు. కుంతి 'కన్య అని, ఆమె కర్ణునికి జన్మనిచ్చిందని చూపిస్తారు కదా. ఇప్పుడిది దివ్య దృష్టి విషయము. కానీ దానిని వారు కాపీ చేశారు. ఇప్పుడు ఈ బ్రహ్మ తల్లిగా అయ్యి తన నోటి ద్వారా పిల్లలకు జన్మనిచ్చి, వారిని సంభాళించేందుకు మమ్మాకిచ్చారు. ఏసుక్రీస్తుది కూడా అలాగే. ఏసుక్రీస్తు ప్రవేశించి ధర్మ స్థాపన చేశాడు. వారు ఏసుక్రీస్తు ముఖవంశావళి అయిన సోదరీ-సోదరులు. క్రైస్తవుల ప్రజాపిత ఏసుక్రీస్తు. ఎవరిలో అయితే ప్రవేశించి జన్మనిచ్చారో అతడే తల్లి. సంభాళించేందుకు మేరీకి ఇచ్చారు. వారు మేరీని తల్లిగా భావించారు. ఇచ్చటైతే తండ్రి అంటున్నారు - నేను ఇతనిలో ప్రవేశించి నోటి ద్వారా సంతానాన్ని రచిస్తాను. అందులో ఈ మమ్మా కూడా ముఖ సంతానంగా ఉంది. ఇవన్నీ విస్తారంగా అర్థము చేసుకోవలసిన విషయాలు.

మరో విషయము - తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఈ రోజు ఆబూకు ఒక పార్టీ రానున్నది. వారు శాకాహారము గురించి ప్రచారము చేసేందుకు వస్తారు. అనంతమైన తండ్రి ఇప్పుడు దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారని, దేవతలనగా పక్కా శాకాహారులుగా ఉండేవారని, ఇక ఏ ఇతర ధర్మమువారు కూడా ఇంత పక్కా శాకాహారులుగా ఉండరని వారికి వినిపించి అర్థము చేయించాలి. వైష్ణవులుగా అవ్వడం వలన ఎన్ని లాభాలున్నాయో వారికి వినిపించాలి. అయితే అందరూ అలా అవ్వలేరు. ఎందుకంటే చాలా అలవాటు పడిపోయారు. వదలిపెట్టడం చాలా కష్టము. కాని అనంతమైన తండ్రి స్థాపించిన స్వర్గములో అందరూ వైష్ణవులుగా అనగా విష్ణు వంశావళీగా ఉండేవారని అర్థము చేయించాలి. దేవతలు సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. ఈనాటి శాకాహారులు కూడా వికారులుగా ఉన్నారు. క్రీస్తుకు 3 వేల సంవత్సరాల క్రితము భారతదేశము స్వర్గముగా ఉండేది. కనుక ఈ విధంగా వారికి అర్థము చేయించాలి. పిల్లలైన మీకు తప్ప ఇక ఏ ఇతర మనుష్యులకు కూడా స్వర్గమంటే ఏమిటో, అది ఎప్పుడు స్థాపించబడిందో, అచ్చట రాజ్యపాలన ఎవరు చేసేవారో ఎవ్వరికీ తెలియదు. లక్ష్మీనారాయణుల మందిరానికి భలే వెళ్తారు, ఈ బాబా కూడా వెళ్లేవాడు. కాని స్వర్గంలో వీరి రాజధాని ఉంటుందని తెలియదు. కేవలం వారి మహిమను గానము చేస్తారు. కాని వారికీ రాజ్యాన్ని ఎవరు ఇచ్చారో, కొంచెము కూడా తెలియదు. ఇప్పటికీ చాలా మందిరాలను నిర్మిస్తున్నారు. ఎందుకంటే లక్ష్మి ధనమునిచ్చిందని భావిస్తారు. అందుకే దీపావళి పండుగ నాడు వ్యాపారస్థులు లక్ష్మిని పూజిస్తారు. ఈ మందిరాలను కట్టించేవారికి కూడా అర్థము చేయించాలి. విదేశీయులు వచ్చినప్పుడు వారికి భారతదేశ మహిమను వినిపించాలి - క్రీస్తుకు 3 వేల సంవత్సరాల క్రితము భారతదేశము ఇలా శాకాహారిగా ఉండేది. అలా ఇతరులెవ్వరూ ఉండరు. వారిలో చాలా శక్తి ఉండేది. దానిని దేవీ దేవతల రాజ్యమని అంటారు. ఇప్పుడు మళ్లీ అదే రాజ్యము స్థాపన అవుతూ ఉంది. ఇది అదే సమయము. శంకరుని ద్వారా వినాశనము కూడా మహిమ చేయబడింది. తర్వాత మళ్లీ విష్ణు రాజ్యముంటుంది. తండ్రి ద్వారా స్వర్గ వారసత్వము తీసుకోవాలనుకుంటే వచ్చి తీసుకోవచ్చు. రమేష్‌, ఉష ఇరువురికి సేవ పై చాలా ఆసక్తి ఉంది. ఇది అద్భుతమైన జంట. వీరు చాలా మంచి సేవాధారులు. చూడండి, క్రొత్త క్రొత్త వారు వచ్చి పాతవారికంటే తీవ్రంగా ముందుకెళ్ళిపోతారు. బాబా అనేక యుక్తులు తెలుపుతారు. కాని ఏదైనా ఒక వికారపు నషా ఉంటే మాయ సంతోషంగా ఎగురనివ్వదు, ఉప్పొంగనివ్వదు. కొందరిలో కొద్దిగా కామ వికారపు అంశముంది, క్రోధమైతే చాలా మందిలో ఉంది. ఇంకా పరిపూర్ణంగా ఎవ్వరూ అవ్వలేదు. పరిపూర్ణులుగా అవుతున్నారు. మాయ కూడా లోలోపల కొరుకుతూ ఉంటుంది. ఎప్పటి నుండి రావణ రాజ్యము ప్రారంభమయిందో అప్పటి నుండి ఈ ఎలుకలు(వికారాలు) కొరకడం మొదలు పెట్టాయి. ఇప్పుడైతే భారతదేశము పూర్తి నిరుపేదగా అయిపోయింది. మాయ అందరినీ రాతి బుద్ధి గలవారిగా చేసేసింది. మంచి మంచి పిల్లలను కూడా మాయ ఎంతగా చుట్టుముట్టిందంటే, తమ అడుగులు వెనుకకు ఎలా పడుతున్నాయో వారికి తెలియదు. మళ్లీ అటువంటివారికి సంజీవిని మూలికను వాసన చూపించి స్పృహలోకి తెస్తారు. క్రోధము కూడా చాలా దు:ఖదాయిని. స్వయానికి దు:ఖము కలుగజేస్తుంది, ఇతరులకు కూడా దు:ఖము కలుగజేస్తుంది. కొంతమందిలో గుప్తముగా ఉంది. కొంతమందిలో ప్రత్యక్షంగా కనిపిస్తూ ఎంతగా అర్థము చేయించినా అర్థము చేసుకోరు. ఇప్పుడు స్వయాన్ని చాలా తెలివైన వారిగా భావిస్తారు. తర్వాత చివర్లో చాలా పశ్చాత్తాపపడవలసి వస్తుంది. కల్ప-కల్పానికి మచ్చ ఏర్పడిపోతుంది. శ్రీమతము పై నడుస్తే చాలా లాభము కూడా ఉంటుంది. లేకుంటే నష్టము కూడా ఎక్కువగా ఉంటుంది. ఇరువురి మతము చాలా ప్రసిద్ధి గాంచింది - శ్రీమతము మరియు బ్రహ్మ మతము. 'బ్రహ్మ దిగి వచ్చినా, ఇతడు వినడు,..........' అని అంటూ ఉంటారు. కృష్ణుని పేరు తీసుకోరు. ఇప్పుడైతే పరమపిత పరమాత్మ స్వయంగా వారి మతమునిస్తున్నారు. బ్రహ్మకు కూడా వారి నుండే మతము లభిస్తుంది. తండ్రికి పిల్లల పై చాలా ప్రేమ ఉంటుంది. పిల్లలను భుజాల పై కూర్చోబెట్టుకుంటాడు. పుత్రుడు ఉన్నతమౌతే తన కులాన్ని ప్రసిద్ధము చేస్తాడని తండ్రికి లక్ష్యముంటుంది. అయితే పిల్లలు తండ్రి మాట వినక, దాదా మాటను వినకుండా ఉంటే, పెద్ద తల్లి(బ్రహ్మ) మాట కూడా విననట్లే. అటువంటివారి గతి ఏమౌతుందో చెప్పలేము! పోతే సేవాధారి పిల్లలైతే బాప్‌దాదా హృదయాన్ని అధిరోహిస్తారు. వారిని స్వయం బాబాయే మహిమ చేస్తారు. అందువలన వారికి ఇదే భారతదేశములో విష్ణువంశము వారి రాజ్యముండేదని, అది మళ్లీ స్థాపనౌతూ ఉందని, ఇప్పుడు బాబా మళ్లీ అదే భారతదేశాన్ని విష్ణుపురిగా తయారు చేస్తున్నారని వారికి అర్థము చేయించాలి.

మీకు చాలా నషా ఉండాలి. వారైతే ఏమీ చేయకుండానే ఊరకే తమ పేరును ప్రసిద్ధము చేసుకునేందుకు కష్టపడుతూ ఉంటారు. ఖర్చు అయితే గవర్నమెంటు నుండి లభిస్తూ ఉంటుంది. సన్యాసులకైతే చాలా ధనము లభిస్తుంది. ఇప్పుడు కూడా భారతదేశ ప్రాచీన యోగము నేర్పించేందుకు వెళ్తామంటే వెంటనే డబ్బు ఇస్తారు. బాబాకైతే ఎవ్వరి ధనమూ అవసరము లేదు. వారే స్వయంగా మొత్తం ప్రపంచమంతటికీ సహాయము చేసే భోలా భండారీ. పిల్లల నుండి సహాయము లభిస్తుంది. పిల్లలు ధైర్యము చేస్తే సహాయము లభిస్తుంది. బయట నుండి ఎవరైనా వస్తే అలవాటు ప్రకారము ఇది ఆశ్రమము కదా. ఏమైనా ఇవ్వాలి అని భావిస్తారు. కానీ మీరు వారితో ఇలా అనాలి - మీరెందుకు ఇస్తున్నారు? జ్ఞానమునైతే మీరేమీ వినలేదు. మీకేమీ తెలియదు. స్వర్గములో ఫలము లభించేందుకు మేము బీజము నాటుతున్నాము. మీరు జ్ఞానము విన్నప్పుడే ఈ విషయాలు అర్థమౌతాయి. అలా కోట్ల కొలది రానున్నారు. బాబా గుప్త రూపములో రావడం మంచిదయ్యింది. కృష్ణుని రూపములో వచ్చి ఉంటే ఇసుక వేస్తే రాలనంత జనము చేరేవారు. ఒక్కసారిగా మీద పడేవారు. ఇంట్లో ఎవ్వరూ కూర్చోలేకపోయేవారు. మీరు ఈశ్వరీయ సంతానమని మర్చిపోకండి. పిల్లలు పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలని తండ్రి హృదయములో ఉంటుంది. స్వర్గములోకి అయితే చాలా మంది వస్తారు. కాని ధైర్యము చేసి ఉన్నత పదవి పొందుకొనేవారు కోట్లలో ఏ ఒక్కరో వెలువడ్తారు. మంచిది

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

రాత్రి క్లాసు 15-6-1968



రాత్రి క్లాసు 15-6-1968

గతించిన విషయాలను గుర్తు తెచ్చుకుంటే (రివైజ్‌ చేసుకుంటే) బలహీన హృదయము గలవారికి వారి బలహీనతలు కూడా రివైజ్‌ అవుతాయి. అందువలన పిల్లలను డ్రామా పట్టాల పై నిల్చోబెట్టడం జరిగింది. ముఖ్యంగా స్మృతి ద్వారానే లాభము కలుగుతుంది. స్మృతి ద్వారానే ఆయువు వృద్ధి చెందుతుంది. డ్రామాను పిల్లలు అర్థము చేసుకుంటే ఎప్పుడూ గతము గుర్తు రాదు. డ్రామాలో ఇప్పుడు జ్ఞానము నేర్చుకుని నేర్పించే సమయము జరుగుతోంది. తర్వాత మళ్లీ ఈ పాత్ర సమాప్తమైపోతుంది. తండ్రి పాత్రా ఉండదు, మన పాత్ర్రా ఉండదు. వారికి ఇచ్చే పాత్రా ఉండదు, మనకు తీసుకునే పాత్రా ఉండదు. కనుక ఒక్కటైపోతాము కదా. మనకు కొత్త ప్రపంచములో పాత్ర ఉంటుంది. బాబాకు శాంతిధామములో పాత్ర ఉంటుంది. మన ప్రాలబ్ధ పాత్ర, బాబాకు శాంతిధామ పాత్ర డ్రామా రీలులో నింపబడి ఉంది కదా. ఇచ్చి పుచ్చుకునే పాత్ర పూర్తి అవుతూనే డ్రామాయే పూర్తవుతుంది. తర్వాత మళ్లీ మనము రాజ్య పాలన చేసేందుకు వస్తాము. ఆ పాత్ర మారిపోతుంది. జ్ఞానము నిలిచిపోతుంది. మనము వారిగా అయిపోతాము. పాత్రనే పూర్తి అయిపోతే ఇక తేడా ఏమీ ఉండదు. పిల్లలతో పాటు తండ్రి పాత్ర కూడా ఉండదు. పిల్లలు జ్ఞానాన్ని పూర్తిగా తీసుకుంటారు. కనుక వారి వద్ద కూడా ఏమీ ఉండదు. ఇచ్చేవారి వద్దా ఉండదు, తీసుకునే వారిలో తక్కువగా ఉండదు. కనుక ఇరువురూ పరస్పరము సమానమైపోతారు. ఇందులో విచార సాగర మథనము చేసే బుద్ధి కావాలి. ముఖ్యమైన పురుషార్థము స్మృతి యాత్ర. తండ్రి కూర్చుని అర్థము చేయిస్తున్నారు. వినిపించడం అయితే స్థూలమైన మాటే కానీ బుద్ధిలో అయితే సూక్ష్మముగా ఉంది కదా. ఆంతరికములో శివబాబా రూపమేదో తెలుసు. అర్థము చేయించుటలో రూపము స్థూలమైపోతుంది. భక్తిమార్గములో పెద్ద లింగ రూపంగా తయారు చేస్తారు. ఆత్మ చిన్నదే కదా. ఇది ప్రాకృతికము. ఎంతవరకు వారి అంతమును తెలుసుకుంటారు? చివరికి అంతము లేదు అనంతము అని అనేస్తారు. మొత్తం పాత్ర అంతా ఆత్మలో నింపబడి ఉందని బాబా అర్థము చేయించారు. ఇది ప్రాకృతికము(కుదరత్‌) అంతము తెలుసుకోలేము. సృష్టి చక్రము అంతమునైతే తెలుసుకుంటారు. రచయిత, రచనల ఆది, మధ్య, అంతములు మీకు మాత్రమే తెలుసు. బాబా జ్ఞానసాగరులు. మళ్లీ మనము ఫుల్‌గా అవుతాము. పొందుకునేందుకు ఏమీ ఉండదు. తండ్రి ఇతనిలో ప్రవేశించి చదివిస్తారు. వారు బిందువు. ఆత్మ గాని, పరమాత్మ గాని సాక్షాత్కారమైనందున సంతోషము కలగదు. పరిశ్రమ చేసి తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమైపోతాయి. తండ్రి చెప్తున్నారు - ''నాలో జ్ఞానము నిలిచిపోతే, మీలో కూడా నిలిచిపోతుంది (బంద్‌ అయిపోతుంది).'' జ్ఞానము తీసుకొని శ్రేష్ఠంగా, ఉన్నతంగా అయిపోతారు. అందరూ ఎంతో కొంత తీసుకుంటారు అయినా తండ్రి ఏమో తండ్రే కదా. ఆత్మలైన మీరు ఆత్మలుగానే ఉంటారు, తండ్రిగా అవ్వరు. ఇది జ్ఞానము, తండ్రి తండ్రే, పిల్లలు పిల్లలే. ఇవన్నీ విచార సాగర మథనము చేసి లోతుగా వెళ్లవలసిన విషయాలు. అందరూ వెళ్ళవలసిందేనని కూడా తెలుసు. అందరూ పోయేవారే. ఆత్మలు వెళ్లి అక్కడ ఉంటాయి. మొత్తం ప్రపంచమంతా సమాప్తమవ్వనున్నది. ఇందులో నిర్భయంగా ఉండవలసి వస్తుంది. నిర్భయంగా ఉండేందుకు పురుషార్థము చేయాలి. శరీరము మొదలైనవాటి భావనే(వాసనే) రారాదు. అదే స్థితిలో వెళ్ళాలి. తండ్రి తమ సమానంగా చేస్తారు. పిల్లలైన మీరు కూడా మీ సమానంగా తయారు చేస్తూ ఉంటారు. ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి, ఇటువంటి పురుషార్థము చేయాలి. ఇప్పుడింకా సమయముంది. ఈ రిహార్సలు తీవ్రంగా చేయవలసి వస్తుంది. అలవాటు లేకుంటే నిలబడిపోతారు. కాళ్ళు వణుకుతాయి. గుండె అకస్మాత్తుగా ఆగిపోతూ ఉంటుంది. తమోప్రధాన శరీరములోని గుండె ఆగిపోయేందుకు సమయము పట్టదు. ఎంతెంత అశరీరులుగా అవుతూ పోతారో, తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారో, అంత సమీపానికి వస్తూ ఉంటారు. యోగము చేసేవారే నిర్భయులుగా ఉంటారు. యోగము ద్వారానే శక్తి లభిస్తుంది. జ్ఞానము ద్వారా ధనము లభిస్తుంది. పిల్లలకు శక్తి కావాలి. కనుక శక్తిని పొందేందుకు తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. బాబా అవినాశి సర్జన్‌, వారెప్పుడూ పేషెంటుగా(రోగిగా) అవ్వరు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - మీరు మీ అవినాశి మందు తీసుకుంటూ ఉండండి. నేను మీకు ఎటువంటి సంజీవినీ మూలిక ఇస్తానంటే, ఎప్పుడూ ఎవ్వరూ జబ్బుపడరు. కేవలం పతిత పావనులైన తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే పావనమైపోతారు. దేవతలు సదా నిరోగులుగా, పావనంగా ఉంటారు కదా. మేము కల్ప-కల్పము వారసత్వము తీసుకుంటామని పిల్లలకు నిశ్చయమైపోయింది. బాబా ఇప్పుడు వచ్చినట్లు అనాది సమయము నుండి లెక్కలేనన్ని సార్లు వస్తూనే ఉన్నారు. బాబా ఏదైతే నేర్పిస్తారో, అర్థము చేయిస్తారో, అదే రాజయోగము. ఆ గీత మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఈ జ్ఞాన మార్గమును తండ్రి మాత్రమే తెలుపుతారు. తండ్రే స్వయంగా వచ్చి క్రింది నుండి పైకెత్తుతారు. ఎవరైతే పక్కా నిశ్చయబుద్ధి గలవారో, వారే మాలలోని పూసలుగా అవుతారు. భక్తి చేస్తూ-చేస్తూ క్రిందికి దిగజారుతూ వచ్చామని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు తండ్రి వచ్చి సత్యమైన సంపాదన చేయిస్తున్నారు. లౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి చేయించినంత సంపాదన చేయించలేరు. అచ్ఛా. పిల్లలకు గుడ్‌నైట్‌ మరియు నమస్తే. 

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. సేవాధారులుగా అయ్యేందుకు వికారాల అంశాన్ని కూడా సమాప్తము చేయాలి. సేవ చేయాలనే ఉత్సాహము ఉప్పొంగుతూ ఉండాలి.
2. మనము ఈశ్వరీయ సంతానము. శ్రీమతమును అనుసరించి భారతదేశాన్ని విష్ణుపురముగా తయారు చేస్తున్నాము. అక్కడ అందరూ పక్కా వైష్ణవులే ఉంటారు,................ ఈ నషాలో ఉండాలి.

వరదానము :- ''ఒక్క ధైర్యము అనే విశేషత ద్వారా సర్వుల సహయోగాన్ని ప్రాప్తి చేసుకొని ముందుకు వెళ్లే విశేష ఆత్మా భవ ''
ఏ పిల్లలైతే ధైర్యముంచి నిర్భయులుగా అయ్యి ముందుకు వెళ్తారో, వారికి తండ్రి నుండి సహాయము స్వతహాగా లభిస్తుంది. ధైర్యమనే విశేషత ద్వారా సర్వుల సహయోగము లభిస్తుంది. ఈ ఒక్క విశేషత ద్వారా అనేక విశేషతలు స్వతహాగానే వస్తూ ఉంటాయి. ఒక్క అడుగు ముందుకు వేస్తూనే అనేక అడుగుల సహయోగానికి అధికారులుగా అవుతారు. ఈ విశేషతనే ఇతరులకు కూడా దానంగా, వరదానంగా ఇస్తూ ఉండండి. అనగా ఈ విశేషతను సేవలో ఉపయోగిస్తే విశేష ఆత్మగా అయిపోతారు. 

స్లోగన్‌ :- ''బుద్ధి ద్వారా ఎంత తేలికగా ఉండాలంటే తండ్రి తన కనురెప్పల పై కూర్చోబెట్టుకొని వెంట తీసుకెళ్లాలి.''
 

No comments:

Post a Comment