15-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
''మధురమైన పిల్లలారా -
ఆత్మ-పరమాత్మల మిలనము జరిగే సంగమ యుగము ఇదే. సద్గురువు ఈ ఒక్కసారి మాత్రమే
వచ్చి పిల్లలకు సత్యమైన జ్ఞానమునిచ్చి సత్యాన్ని చెప్పడం నేర్పిస్తారు.''
ప్రశ్న :- ఏ పిల్లల స్థితి చాలా ఫస్ట్‌క్లాస్‌గా ఉంటుంది ?
జవాబు :- ఏ పిల్లల బుద్ధిలో
అయితే ఈ సర్వస్వము బాబాదే అని ఉంటుందో, ప్రతి అడుగులో శ్రీమతము(సలహా)ను
తీసుకుంటారో, పూర్తిగా త్యాగము చేస్తారో వారి స్థితి చాలా ఫస్ట్‌క్లాస్‌గా
ఉంటుంది. ఈ యాత్ర చాలా దీర్ఘమైనది. అందువలన శ్రేష్ఠమైన తండ్రి నుండి
ఉన్నతమైన మతము (సలహా) తీసుకుంటూ ఉండాలి.
ప్రశ్న :- మురళి వినే సమయంలో అపారమైన
సుఖము ఏ పిల్లలకు అనుభవమౌతుంది ?
జవాబు :- ఏ పిల్లలైతే మేము
శివబాబా మురళి వింటున్నాము, ఈ మురళి శివబాబా, బ్రహ్మ శరీరము ద్వారా వినిపిస్తున్నారు,
అత్యంత ప్రియమైన బాబా మమ్ములను సదా సుఖీలుగా, మనుష్యుల నుండి దేవతలుగా తయారు
చేసేందుకు ఈ మురళీ వినిపిస్తున్నారని ఎవరు భావిస్తారో, మురళి వినేటప్పుడు ఎవరికైతే
ఈ స్మృతి ఉంటుందో వారికి సుఖము అనుభవమౌతుంది.
పాట :- ప్రియతమా! వచ్చి కలుసుకో....... (ప్రీతమ్ ఆన్ మిలో,............)
ఓంశాంతి. ఈ దు:ఖభరిత
జీవితము దు:ఖధామములో మాత్రమే ఉంటుంది. సుఖంగా ఉండే జీవాత్మలు సుఖధామంలో
ఉంటారు. భక్తులందరి ప్రియతముడు ఒక్కరే. వారినే స్మృతి చేయడం జరుగుతుంది.
వారిని ప్రియతముడని అంటారు. దు:ఖము కలిగినప్పుడు స్మృతి చేస్తారు. ఈ విధంగా
కూర్చొని ఎవరు అర్థం చేయిస్తున్నారు ? సత్య-సత్యమైన ప్రియతముడు, సత్యమైన
తండ్రి, సత్యమైన టీచరు, సత్యమైన సద్గురువు,............ అందరి ప్రియతముడు
వారొక్కరే. అయితే ఆ ప్రియతముడు ఎప్పుడు వస్తారో ఎవ్వరికీ తెలియదు. ఆ
ప్రియతముడే స్వయంగా వచ్చి తన భక్తులకు, తన పిల్లలకు నేను కేవలం సంగమ
యుగములో ఒక్కసారి మాత్రమే వస్తాను, నేను వచ్చేందుకు, వెళ్లేందుకు మధ్య గల
సమయాన్ని సంగమ సమయమని అంటారు. మిగిలిన ఆత్మలన్నీ అనేకసార్లు జనన - మరణాలలో
వస్తాయి. నేను ఒక్కసారి మాత్రమే వస్తాను. సద్గురువు కూడా నేనొక్కరిని
మాత్రమే. మిగిలిన గురువులైతే అనేకమంది ఉన్నారు. వారిని సద్గురువు అని అనరు
ఎందుకంటే వారెవ్వరూ సత్యాన్ని చెప్పరు. సత్యమైన పరమాత్ముని గురించి వారికి
తెలియనే తెలియదు. ఎవరైతే సత్యాన్ని తెలుసుకుంటారో వారు ఎల్లప్పుడూ సత్యమే
మాట్లాడ్తారు. ఆ సద్గురువు సత్యమునే మాట్లాడు సద్గురువు. సత్యమైన తండ్రి,
సత్యమైన శిక్షకుడు స్వయంగా వచ్చి నేను సంగమ యుగములో వస్తానని
తెలుపుతున్నారు. ఎంత సమయము నేనుంటానో అదే నా ఆయువు. పతితులను పావనంగా తయారు
చేసే వెళ్తాను. నా జన్మ జరిగినప్పటి నుండి నేను సహజ రాజయోగము నేర్పించడం
ప్రారంభిస్తాను. ఎప్పుడైతే నేర్పించి పూర్తి చేస్తానో అప్పుడు పతిత
ప్రపంచము వినాశనమౌతుంది, నేను వెళ్ళిపోతాను. నేను ఇంత సమయము మాత్రమే వచ్చి
ఉంటాను. శాస్త్రాలలో అయితే నా సమయము గురించి వ్రాయనే లేదు. శివబాబా ఎప్పుడు
జన్మ తీసుకుంటారో, ఎన్ని రోజులు భారతదేశములో ఉంటారో ఈ విషయాలు తండ్రే
స్వయంగా కూర్చొని తెలియజేస్తున్నారు - నేను సంగమ యుగములోనే వస్తాను. సంగమ
యుగము యొక్క ఆది, సంగమ యుగము యొక్క అంతిమము అనగా నేను వచ్చేది ఆది సమయము,
వెళ్ళిపోయేది అంత్య సమయము. ఇకపోతే మధ్యలో నేను కూర్చొని రాజయోగము
నేర్పిస్తాను. తండ్రి స్వయంగా కూర్చొని తెలియజేస్తున్నారు - నేను ఇతనిలోనే
ఇతని వానప్రస్థ అవస్థలో వస్తాను. పరాయి దేశములో, పరాయి శరీరములో వస్తాను
అనగా నేను అతిథినౌతాను కదా. ఈ రావణ ప్రపంచములో నేను అతిథిని. ఈ సంగమ యుగపు
మహిమ చాలా గొప్పది(జబర్‌దస్త్). రావణ రాజ్యాన్ని వినాశము చేసి రామరాజ్య
స్థాపన చేసేందుకే తండ్రి వస్తారు. శాస్త్రాలలో కట్టుకథలు చాలా వ్రాసేశారు.
రావణుని తగులబెడ్తూ వస్తారు. ఈ సమయములో ఈ మొత్తము సృష్టి అంతా లంక వలె
ఉంది. సిలోన్‌ను మాత్రమే లంక అని అనరు. ఈ మొత్తము సృష్టి అంతా రావణుడుండే
స్థానము లేక శోకవాటిక. అందరూ దు:ఖితులుగానే ఉన్నారు. తండ్రి చెప్తున్నారు -
నేను దీనిని అశోకవాటిక లేక స్వర్గంగా తయారు చేసేందుకు వస్తాను. స్వర్గములో
ఇన్ని ధర్మాలైతే ఉండవు. అచ్చట ఒకే ఒక ధర్మముండేది. ఆ ధర్మము ఇప్పుడు లేదు.
ఇప్పుడు మళ్లీ దేవతలుగా తయారు చేసేందుకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను.
అందరూ ఈ రాజయోగాన్ని నేర్చుకోరు. నేను భారతదేశములో మాత్రమే వస్తాను.
భారతదేశములోనే స్వర్గముంటుంది. క్రైస్తవులు కూడా స్వర్గాన్ని
అంగీకరిస్తారు. హెవెన్లీ అబోడ్(స్వర్గానికి) వెళ్ళిపోయారని, గాడ్‌ఫాదర్
వద్దకు వెళ్ళిపోయారని అంటారు. అయితే స్వర్గము గురించి వారికి తెలియదు.
హెవెన్(స్వర్గము) వేరే వస్తువు. అందువలన నేను ఎప్పుడు ఎలా వస్తానో అని
తండ్రి అర్థం చేయిస్తున్నారు. నేను వచ్చి త్రికాలదర్శులుగా తయారు చేస్తాను.
త్రికాలదర్శులు ఇతరులెవ్వరూ ఉండరు. సృష్టి ఆదిమధ్యాంతాలను గురించి నాకు
మాత్రమే తెలుసు. ఇప్పుడు కలియుగము వినాశనము అవ్వనున్నది. లక్షణాలు కూడా
కనిపిస్తున్నాయి. ఈ సమయము అదే సంగమ యుగ సమయము. ఖచ్ఛితమైన సమయము ఇది అని
చెప్పలేము కాని రాజధాని అయితే పూర్తిగా స్థాపనవుతుంది. పిల్లలు కర్మాతీత
అవస్థను పొందుకుంటే జ్ఞానము సమాప్తమైపోతుంది. యుద్ధము ప్రారంభమైపోతుంది.
నేను కూడా పవిత్రంగా చేసే నా పాత్రను పూర్తి చేసి వెళ్ళిపోతాను. దేవీ దేవతా
ధర్మాన్ని స్థాపన చేయడం నా పాత్రయే. భారత వాసులకు ఇది కొంచెం కూడా
తెలియదు. ఇప్పుడు శివరాత్రి పండుగ జరుపుతారు అనగా శివబాబా తప్పకుండా ఏదో ఒక
కార్యము చేసి ఉంటారు. అయితే వారు కృష్ణుని పేరు వేసేశారు. ఇది చూచేందుకు
సాధారణ పొరపాటుగా కనిపిస్తుంది. శివపురాణము మొదలైన ఏ శాస్త్రములోనూ శివబాబా
వచ్చి రాజయోగము నేర్పిస్తారని లేదు. వాస్తవానికి ప్రతి ధర్మానికి ఒక్కొక్క
శాస్త్రముంది. అందువలన దేవీ దేవతా ధర్మానికి కూడా ఒక శాస్త్రముండాలి. కాని
దాని రచయిత ఎవరు ? ఇందులోనే తికమక పడ్డారు.
తండ్రి అర్థం చేయిస్తున్నారు - నేను బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ ధర్మాన్ని తప్పకుండా రచించవలసి వచ్చింది. బ్రహ్మ ముఖవంశావళినీ బ్రహ్మకుమార-కుమారీలని అంటారు. చాలా మంది పేర్లు మార్పు చేశారు. అందులో చాలా మంది పారిపోయారు. స్థానము కూడా మార్చేశారు. పేరు మార్పు వలన ఎలాంటి లాభము లేదని గమనించడం జరిగింది. చివరికి వారు ఆ పేరును కూడా మర్చిపోతారు. వాస్తవానికి మీరు తండ్రితో యోగము జోడించాలి. శరీరానికి పేరు లభిస్తుంది. ఆత్మకైతే పేరే లేదు. ఆత్మ 84 జన్మలు తీసుకుంటుంది. ప్రతి జన్మలో నామ, రూప, దేశ, కాలములన్నీ మారిపోతాయి. డ్రామాలో ఏ ఆత్మ అయినా ఒకసారి చేసిన పాత్ర మరలా అదే రూపములో అదే పాత్ర చేయరు. అదే పాత్ర మళ్లీ 5 వేల సంవత్సరాల తర్వాత అభినయిస్తుంది. అంతేకాని కృష్ణుడు అదే నామ-రూపాలతో మళ్లీ రాగలడని కాదు. అలా జరగదు. ఆత్మ ఒక శరీరమును వదలి మరొకటి తీసుకుంటుందని తెలుసు. కావున రూపు రేఖలు మొదలైనవి ఒకదానితో ఒకటి కలువవు. 5 తత్వాల అనుసారము రూపురేఖలు మారిపోతూ ఉంటాయి. ఎన్ని రూపు రేఖలున్నాయి(ఫీచర్స్)!! అయితే ఇవన్నీ మొదటి నుండే డ్రామాలో ఫిక్స్ అయ్యి ఉన్నాయి. క్రొత్తదేదీ తయారవ్వదు. ఇప్పుడు శివరాత్రి జరుపబడుతుంది. శివుడు తప్పకుండా వచ్చారు. ప్రపంచములోని వారందరికీ వారొక్కరే ప్రియతముడు. లక్ష్మీనారాయణులను గాని, రాధా-కృష్ణులను గాని, బ్రహ్మ-విష్ణువు మొదలైనవారిని గాని ప్రియతముడని అనరు. గాడ్‌ఫాదర్ ఒక్కరే ప్రియతముడు. తండ్రి అయితే తప్పకుండా వారసత్వమునిస్తారు. అందువలన తండ్రి చాలా ప్రియమనిపిస్తారు. తండ్రి అంటున్నారు - నన్ను స్మృతి చేయండి ఎందుకంటే నా ద్వారా మీరు వారసత్వాన్ని పొందాలి. ఈ చదువు అనుసారము వెళ్లి మేము సూర్యవంశీ దేవతలు లేక చంద్రవంశీ క్షత్రియులుగా అవుతామని పిల్లలకు తెలుసు. వాస్తవానికి భారతవాసులందరి ధర్మము ఒక్కటిగానే ఉండాలి. కాని దేవతా ధర్మము పేరును మార్చి హిందూ ధర్మమని పేరు పెట్టారు. ఎందుకంటే ఆ దైవీ గుణాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు తండ్రి కూర్చొని ధారణ చేయిస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి అశరీరులుగా అవ్వండి అని అంటున్నారు. మీరెవ్వరూ పరమాత్మ కారు. పరమాత్మ అయితే ఒక్క శివుడు మాత్రమే. అందరికీ ప్రియతములైన వారు ఒక్కసారి మాత్రమే సంగమ యుగములో వస్తారు. ఇది చాలా చిన్న యుగము. అన్ని ధర్మాలు వినాశనమైపోతాయి. బ్రాహ్మణ కులము వారు కూడా వాపసు వెళ్తారు. ఎందుకంటే వారు మళ్లీ దైవీ కులములోకి బదిలీ అవ్వాలి. వాస్తవానికి ఇది ఒక చదువు. కేవలం పోలుస్తారు. ఆ విషయ వికారాలు విషము వంటివి. ఈ జ్ఞానము అమృతము వంటిది. ఇది మనుష్యులను దేవతలుగా తయారు చేసే పాఠశాల. ఆత్మలో మలినాలు ఏర్పడ్డాయి. అందుచేత ఆత్మ పూర్తిగా మిశ్రితమై పనికిరాకుండా పోయింది. దానిని తండ్రి వచ్చి వజ్ర సమానంగా తయారు చేస్తారు. శివరాత్రి అని అంటారు. శివుడు రాత్రిలో వచ్చారు. అయితే ఎలా వచ్చాడు? ఎవరి గర్భములో వచ్చాడు? లేక ఎవరి శరీరములో ప్రవేశించాడు? వారు గర్భములో అయితే రారు. వారు శరీరాన్ని లోనుగా(అప్పుగా) తీసుకోవలసి వచ్చింది. వారు తప్పకుండా వచ్చి నరకాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. కాని ఎప్పుడు, ఎలా వస్తారో ఎవ్వరికీ తెలియదు. శాస్త్రాలైతే చాలా చదువుతారు. కాని ముక్తి-జీవన్ముక్తి ఎవ్వరికీ లభించదు. ఇంకా తమోప్రధానంగా అయిపోయారు. అందరూ ఆ విధంగా అవ్వాల్సిందే. మనుష్యులందరూ స్టేజి పై తప్పకుండా హాజరయ్యే తీరాలి. తండ్రి వచ్చేది చివరి సమయములోనే. మీ గతి-మతి మీకే తెలియాలని(తుమ్‌హారి గత్-మత్ తుమ్ హీ జానో) అందరూ వారి మహిమనే గానము చేస్తారు. మీలో ఏ జ్ఞానముందో మీరు ఎలా సద్గతినిస్తారో అది మీకే తెలుసు. అందువలన వారు శ్రీమతమును ఇచ్చేందుకు తప్పకుండా వస్తారు కదా. కాని ఎలా వస్తారో, ఏ శరీరములో వస్తారో ఎవ్వరికీ తెలియదు. సాధారణ శరీరములో నేను వస్తానని స్వయంగా చెప్తారు. నేను తప్పకుండా బ్రహ్మ అని పేరు కూడా పెట్టవలసి వచ్చింది లేకుంటే బ్రాహ్మణులు ఎలా జన్మిస్తారు! బ్రహ్మ ఎచ్చటి నుండి వస్తారు? పై నుండి అయితే రారు కదా. అతడు సూక్ష్మవతన వాసి అవ్యక్త సంపూర్ణ బ్రహ్మ. ఇచ్చటైతే తప్పకుండా వ్యక్తములో వచ్చి రచనను రచించవలసి వస్తుంది. ఇంత సమయము వస్తారు, వెళ్తారని మనము అనుభవముతో చెప్పగలము. తండ్రి అంటున్నారు - నేను కూడా డ్రామాలో బంధింపబడ్డాను. నేను రావలసిన పాత్ర కూడా ఒక్కసారి మాత్రమే ఉంది. భలే ప్రపంచములో ఉపద్రవాలు చాలా జరుగుతూ ఉంటాయి. ఆ సమయములో ఈశ్వరుని ఎంతగానో పిలుస్తారు. కాని నేనైతే నా సమయములోనే రావాలి. అది కూడా వానప్రస్థ అవస్థలోనే వస్తాను. ఈ జ్ఞానమైతే చాలా సహజము. కాని స్థితిని తయారు చేసుకోవడంలో శ్రమ ఉంది. అందువలన గమ్యము చాలా ఉన్నతమైనదని అంటారు. తండ్రి జ్ఞానసాగరులు కావున వారు తప్పకుండా పిల్లలకు జ్ఞానమునిచ్చారు. అందుకే మీ గతి-మతి మీకే తెలుసు అనే గాయనముంది.
తండ్రి అంటున్నారు - నా వద్ద ఉన్న సుఖ-శాంతుల ఖజానా ఏదైతే ఉందో అది నేను వచ్చి పిల్లలకే ఇస్తాను. మాతల పై జరిగే అత్యాచారాలు మొదలైనవన్నీ ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ డ్రామాలో నిశ్చయమై ఉన్నాయి. అప్పుడే కదా పాప భాండము నిండుతుంది అనగా పాపము పండుతుంది. కల్ప-కల్పము ఇదే విధంగా రిపీట్ అవుతుంది. ఈ విషయాలు కూడా మీకు ఇప్పుడు మాత్రమే తెలుసు. తర్వాత మళ్లీ మర్చిపోతారు. ఈ జ్ఞానము సత్యయుగములో ఉండదు. ఒకవేళ ఉండి ఉంటే పరంపరగా వచ్చేది. అచ్చటైతే ఇప్పటి పురుషార్థము ద్వారా పొందే ప్రాలబ్ధముంటుంది. ఇచ్చట పురుషార్థము చేసే ఆత్మలే అచ్చట ఉంటారు. ఇతర ఆత్మలు అచ్చట ఉండరు. అక్కడ వారికి జ్ఞానము అవసరముండదు. ఏ కొంతమంది మాత్రమే వెలువడ్తారని కూడా తెలుసు. చాలా బాగుంది, బాగుంది అని కూడా అంటారు. విదేశాల నుండి ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి వెలువడితే ఈ జ్ఞానము అర్థము చేసుకున్నా భట్టీలో ఎక్కడుంటారు? ఏమి అర్థము చేసుకుంటారు? ఈ విషయమైతే బాగుంది కాని పవిత్రంగా ఉండలేమని అంటారు. అరే! ఇంతమంది పవిత్రంగా ఉంటున్నారు కదా! వివాహము చేసుకొని కలిసి ఉంటూ కూడా పవిత్రంగా ఉంటారు. కనుక వారికి బహుమానము కూడా చాలా లభిస్తుంది. ఇది కూడా ఒక పరుగు పందెము(రేస్). ఆ రేసులో మొదటి నెంబరులో వస్తే 4-5 లక్షలు లభిస్తాయి. ఇచ్చట 21 జన్మల కొరకు పూర్తి రాజ్యపదవి లభిస్తుంది. ఇదేమైనా తక్కువ విషయమా! ఈ మురళి అయితే పిల్లలందరి వద్దకు వెళ్తుంది. టేపులో కూడా వింటారు. శివబాబా బ్రహ్మ శరీరము ద్వారా మురళి వినిపిస్తున్నారని అంటారు లేక పిల్లలు వినిపిస్తే శివబాబా మురళీని వినిపిస్తున్నారని అంటారు. అప్పుడు బుద్ధి ఒక్కసారిగా అచ్చటికి వెళ్ళిపోవాలి. ఆ సుఖము ఆంతరికములో అనుభవమవ్వాలి. అత్యంత ప్రియమైన బాబా మనలను సదా సుఖీలుగా, మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. అందువలన వారి స్మృతి చాలా ఎక్కువగా ఉండాలి. అయితే మాయ స్మృతిని నిలువనివ్వదు. త్యాగము కూడా పూర్తిగా చేయాలి. ఇదంతా బాబాదే - ఈ స్థితి ఫస్ట్‌క్లాస్‌గా ఉండాలి. చాలామంది పిల్లలు శ్రీమతము తీసుకుంటూ ఉంటారు. శ్రీమతములో తప్పకుండా కళ్యాణమే ఉంటుంది. మతము కూడా శ్రేష్ఠమైనది. యాత్ర చాలా దీర్ఘమైనది. మళ్లీ మీరు ఈ మృత్యు లోకములోకి రారు. సత్యయుగము అమరలోకము.
అచ్చట మీరు మరణించరని ఆ రోజు బాబా చాలా మంచిరీతిగా అర్థం చేయించారు. సంతోషంగా పాత శరీరాన్ని వదిలి కొత్తది తీసుకుంటారు. సర్పము ఉదాహరణ మీ కొరకే. భ్రమరము ఉదాహరణ కూడా మీదే, తాబేలు ఉదాహరణ కూడా మీదే. సన్యాసులైతే వాటిని కాపీ చేశారు. భ్రమరము ఉదాహరణ చాలా బాగుంది. అశుద్ధములో ఉండే పురుగులను జ్ఞాన భూ-భూ చేసి వారిని స్వర్గములోని దేవతలుగా తయారు చేస్తారు. ఇప్పుడు పురుషార్థము చాలా మంచి రీతిగా చేయాలి. ఉన్నత పదవి లేక మంచి నెంబరు తీసుకోవాలంటే శ్రమ కూడా చేయాలి. భలే వృత్తి - వ్యాపారాదులు చేసుకోండి. వాటికి బాగా సమయమిస్తారు. అయినా మీకు చాలా సమయము లభిస్తుంది. మీ యోగ చార్టును చూసుకోవాలి ఎందుకంటే మాయ చాలా విఘ్నాలను కలిగిస్తుంది.
బాబా పిల్లలకు పదే పదే అర్థం చేయిస్తారు - మధురమైన పిల్లలూ! పొరపాటున కూడా ఇటువంటి అత్యంత ప్రియమైన తండ్రి లేక ప్రియునికి విడాకులు ఎప్పుడూ, ఎవ్వరూ ఇవ్వకండి. అలాంటి మహామూర్ఖులుగా ఎవ్వరూ అవ్వకండి. కాని మాయ మూర్ఖులుగా తయారు చేస్తుంది. ఇప్పుడు ఎవరు బలిహారి అవుతారో, చాలా మంచి సేవ చేస్తారో వారిని కూడా మాయ ఎటువంటి స్థితికి చేరుస్తుందో పోను పోను మీరు చూస్తారు. ఎందుకంటే వారు శ్రీమతమును వదిలేస్తారు. అందువలన అటువంటి అతిగొప్ప మహామూర్ఖులుగా తయారవ్వరాదని బాబా అంటున్నారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తండ్రి ద్వారా లభించిన సుఖ-శాంతుల ఖజానాను అందరికీ ఇవ్వాలి. జ్ఞానము ద్వారా మీ స్థితిని తయారు చేసుకునేందుకు శ్రమ చేయాలి.
2. దైవీ గుణాలను ధారణ చేసేందుకు దేహ భావాన్ని మరిచి స్వయాన్ని ఆత్మగా భావించి అశరీరులుగా అయి ఒక్క ప్రియతముడినే స్మృతి చేయాలి.
వరదానము:- ''స్వయాన్ని అనంతమైన స్టేజి పై ఉన్నట్లు భావించి సదా శ్రేష్ఠమైన పాత్రను అభినయించే హీరో పాత్రధారీ భవ''
మీరందరూ విశ్వమనే
'షో కేసులో ' ఉండే 'షో పీసులు. అనంతములోని అనేక ఆత్మల మధ్య అత్యంత పెద్ద
స్టేజి పై ఉన్నారు. ప్రతి సంకల్పము, ప్రతి మాట, ప్రతి కర్మను విశ్వములోని
ఆత్మలు మమ్ములను చూస్తున్నారనే స్మృతిలోనే చేయండి. తద్వారా ప్రతి పాత్ర
శ్రేష్ఠంగా జరుగుతుంది. మీరు హీరో పాత్రధారులుగా అయిపోతారు. అందరూ నిమిత్త
ఆత్మలైన మీ నుండి ప్రాప్తి లభించాలనే భావనను ఉంచుకుంటారు. కనుక సదా దాత
పిల్లలైన మీరు ఇస్తూ ఉండండి, అందరి ఆశలను పూర్తి చేస్తూ ఉండండి.
స్లోగన్ :- ''సత్యతా శక్తి దగ్గరుంటే సంతోషము మరియు శక్తి ప్రాప్తి అవుతూ ఉంటాయి''
No comments:
Post a Comment