28-01-2018 అవ్యక్త బాప్‌దాదా ఓంశాంతి రివైజ్: 24-04-1983 మధువనము
''ఆత్మిక వ్యక్తిత్వం (పర్సనాలిటి) ''
ఈ
రోజు బాప్‌దాదా విశ్వంలోని ఆత్మలందరికి జీవిత స్థాయిని(ప్రమాణాన్ని)
ప్రత్యక్షంగా తెలిపే పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. ఈ రోజు సంఘటనలో
కుమారుల నుండి బ్రహ్మ కుమారులు, తపస్వీకుమారులు, రాజఋషి కుమారులుగా అయిన
సర్వస్వ త్యాగం ద్వారా భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునే కుమారులు ఉన్నారు.
కుమార్ల జీవతం శక్తిశాలీ జీవితమని మహిమ చేయబడ్తుంది. కానీ బ్రహ్మకుమారులు
డబల్ శక్తిశాలీ కుమారులు. ఒకటేమో శారీరిక శక్తి, రెండవది ఆత్మిక శక్తి.
సాధారణ కుమారులు శారీరిక శక్తి లేక వినాశీ ఆక్యుపేషన్ శక్తి (ఉద్యోగ౦ వలన
వచ్చిన శక్తి) గలవారు. అవినాశీ ఉన్నతోన్నతమైన మాస్టర్ సర్వశక్తివంతుని
ఆక్యుపేషన్(కర్తవ్యము) చేసే శక్తిశాలురు ఆత్మ పవిత్రతా శక్తి ద్వారా ఏది
కావాలనుకుంటే, అది చేయగలదు. బ్రహ్మాకుమారుల సంఘటన (సమూహం) విశ్వ పరివర్తక
సంఘటన(సమూహం). అందరూ స్వయాన్ని ఇటువంటి శక్తిశాలి ఆత్మగా భావిస్తున్నారా?
మిమ్ములను మీరు పవిత్రతా శక్తిని జన్మ సిద్ధ అధికారంగా ప్రాప్తి చేసుకున్న
అధికారీ ఆత్మగా భావిస్తున్నారా? బ్రహ్మకుమారులు అంటేనే పవిత్ర కుమారులు అని
అర్థం. బ్రహ్మాబాబా దివ్య జన్మను ఇస్తూ ''పవిత్ర భవ, యోగీ భవ'' అన్న
వరదానమునే ఇచ్చారు. బ్రహ్మాబాబా జన్మ ఇస్తూనే పెద్ద తల్లి రూపంలో పవిత్రమైన
ప్రేమతో పాలన చేసారు. తల్లి రూపంలో ''సదా పవిత్రంగా అవ్వండి, యోగులుగా
అవ్వండి, శ్రేష్ఠంగా అవ్వండి, తండ్రి సమానంగా అవ్వండి, విశేషాత్మలుగా
అవ్వండి, సర్వ గుణ మూర్తులుగా అవ్వండి, జ్ఞాన మూర్తులుగా అవ్వండి.
సుఖ-శాంతి స్వరూపులుగా అవ్వండి.'' అనే లాలి పాట ప్రతిరోజూ పాడారు. తండ్రి
స్మృతి అనే ఒడిలో పాలన చేశారు. సదా సంతోషాల ఊయలలో ఊపారు. మీరు ఇటువంటి
మాతా-పితల శ్రేష్ఠ పిల్లలైన బ్రహ్మకుమారులు మరియు బ్రహ్మకుమారీలు. ఇటువంటి
స్మృతి కలిగిన సమర్థమైన నషా ఉంటోందా? బ్రహ్మకుమారుల విశేషమైన జీవిత
మహత్వాన్ని సదా గుర్తుంచుకుంటున్నారా? కేవలం నామమాత్రపు(పేరుకు)
బ్రహ్మకుమారులుగా అయితే లేరు కదా! మిమ్ములను మీరు శ్రేష్ఠ జీవనధారి
బ్రహ్మకుమారులుగా భావిస్తున్నారా? విశ్వం అనే విశాలమైన స్టేజ్ పైన పాత్రను
అభినయించే విశేషపాత్రధారిని అని సదా గుర్తుంటుందా? లేక కేవలం ఇంట్లో లేక
సేవాకేంద్రంలో లేక ఆఫీసులో పాత్రను అభినయించేవారా? ప్రతి కర్మను చేస్తూ
విశ్వంలోని ఆత్మలు మమ్ములను చూస్తున్నారు అని స్మృతిలో ఉంటుందా? విశ్వంలోని
ఆత్మలు మిమ్ములను వీరే విశేష పాత్రధారులు అనగా హీరో పాత్రధారులు అనే
దృష్టితో మీ అందరినీ చూస్తున్నారు. దాని అనుసారంగా ప్రతి కర్మను
చేస్తున్నారా? లేక సాధారణ రూపంలో పరస్పరం మాట్లాడుకుంటున్నాము,
నడుస్తున్నామనే స్మృతి ఉంటుందా?
బ్రహ్మకుమారులంటేనే సదా పవిత్రతా పర్సనాలిటీ(వ్యక్తిత్వం) మరియు రాయల్టీ(ఠీవితో) ఉండేవాని అర్థం. ఈ పవిత్రతా పర్సనాలిటీయే విశ్వంలోని ఆత్మలను పవిత్రత వైపు ఆకర్షిస్తుంది. అంతేకాక ఇదే పవిత్రతా పర్సనాలిటీ ధర్మరాజపురంలో రాయల్టీ(సుంకం/పన్ను) చెల్లించడం నుండి విడిపిస్తుంది. రాయల్టీకి రెండు అర్థాలున్నాయి. ఈ రాయల్టీ ప్రకారమే భవిష్యత్తులో రాయల్ పరివారంలోకి రాగలరు. కావున ఇటువంటి రాయల్టీ మరియు పర్సనాలిటీ మా జీవితంలోకి వచ్చాయా (మీవిగా చేసుకున్నారా?) అని పరిశీలించుకోండి. యూత్ గ్రూపు వారు(యువ వర్గం వారు) పర్సనాలిటీని ఎక్కువగా తయారు చేసుకుంటారు కదా. కావున తమ ఆత్మిక పర్సనాలిటీ, అవినాశి పర్సనాలిటీని మీదిగా చేసుకున్నారా? ఎవరు చూసినా ప్రతి బ్రహ్మకుమారుడు బ్రహ్మకుమారీ నుండి ఈ పర్సనాలిటీని అనుభవం చేయాలి. శారీరిక పర్సనాలిటీ అయితే ఆత్మలను దేహ భావంలోకి తీసుకొస్తుంది. పవిత్రతా వ్యక్తిత్వం ఆత్మాభిమానిగా తయారు చేసి తండ్రికి సమీపంగా తీసుకొస్తుంది. విశేషంగా కుమారుల గ్రూపు ఇప్పుడు ఏ సేవ చేయాలి? ఒకటేమో తమ జీవితాన్ని పరివర్తన చేసుకోవడం ద్వారా ఆత్మల సేవ, తమ జీవితం ద్వారా ఆత్మలకు ప్రాణదానం చేయడం. స్వ పరివర్తన ద్వారా ఇతరులను పరివర్తన చేయడం. బ్రహ్మకుమారులు అనగా వృత్తి, దృష్టి, కర్మలు మరియు మాటలలో పరివర్తన అయినవారని అనుభవం చేయించండి. ఎవరైనా మీ వద్దకు రావడంతోనే మిమ్ములను కలిసిన వెంటనే ఈ పర్సనాలిటీ వైపు ఆకర్షితులవ్వాలి. సదా తండ్రి పరిచయాన్ని ఇచ్చేవారిగా లేక తండ్రి సాక్షాత్కారాన్ని చేయించే ఆత్మిక దర్పణంగా అయిపోండి. చిత్రం మరియు చరిత్ర ద్వారా అందరికీ తండ్రియే కనిపించాలి. వీరిని ఇలా ఎవరు తయారు చేశారు అని తయారు చేసిన వారు(తండ్రి) సదా కనిపించాలి. ఎప్పుడైనా ఏదైనా అద్భుతమైన వస్తువును చూసినప్పుడు లేక అద్భుతమైన పరివర్తనను చూసినప్పుడు అందరి మనసు నుండి, నోటి నుండి ఎవరు తయారు చేశారు లేక ఈ పరివర్తన ఎలా జరిగింది, ఎవరి ద్వారా జరిగింది? అన్న శబ్ధమే వెలువడ్తుంది. ఈ విషయం తెలుసు కదా! గవ్వ నుండి వజ్రంగా అయిపోయే ఇంత గొప్ప పరివర్తన ఏదైతే జరిగిందో దానిని చూసి అందరి మనసులో తయారు చేసినవారు స్వతహాగా గుర్తుకొస్తారు. కుమారుల గ్రూపు చాలా పరుగులు తీస్తూ ఉంటారు. సేవలో కూడా పరుగులు తీస్తున్నారు కదా! కాని సేవారంగంలో(క్షేత్రంలో) పరుగులు తీస్తూ బ్యాలెన్సు(సమతుల్యం) ఉంచుకుంటున్నారా? 'స్వ సేవ' మరియు సర్వుల సేవ రెండిటి బ్యాలెన్సు సదా ఉంటోందా? బ్యాలెన్సు ఉండకపోతే సేవకై చేసే పరుగులో మాయ కూడా బుద్ధిని పరుగెత్తేలాగా చేసేస్తుంది.
బ్యాలెన్సు ద్వారా అద్భుతం జరుగుతుంది. బ్యాలెన్స్ ఉంచినందుకు పరిణామంగా సేవలో కూడా అద్భుతం జరుగుతుంది. లేకుంటే బాహ్య ముఖత కారణంగా అద్భుతానికి బదులుగా తమ మరియు ఇతరుల భావ-స్వభావాల విపరీత పరిస్థితిలోనికి వచ్చేస్తారు. కావున సదా సర్వుల సేవకు జత జతలో ముందు స్వ సేవ అవసరమయింది. ఈ బ్యాలెన్సు సదా స్వయంలో మరియు సేవలో ఉన్నతిని ప్రాప్తింప చేయిస్తూ ఉంటుంది. కుమారులైతే చాలా అద్భుతాన్ని చేయగలరు. కుమార జీవితంలో పరివర్తన ప్రభావం ఎంతగా ప్రపంచం పైన పడుతుందో అంతగా పెద్దవారిది పడదు. కుమారుల గ్రూపు ప్రభుత్వానికి కూడా తమ పరివర్తన ద్వారా ప్రభువు పరిచయాన్ని ఇవ్వగలరు. ప్రభుత్వాన్ని కూడా మేల్కొల్పగలరు. కాని వారు పరీక్షిస్తారు. అలాగే(ఊరకే) అంగీకరించరు. కావున అలాంటి కుమారులు తయారుగా ఉన్నారా? ఎంతవరకు వికారాల పైన విజయులుగా అయ్యారని గుప్తంగా సి.ఐ.డి. లా మిమ్మల్ని పరీక్షిస్తారు. మీ అందరి పేర్లు ప్రభుత్వానికి చూపించమంటారా? 500 మంది కుమారులు తక్కువ మాటేమీ కాదు. అందరూ లెడ్జెర్‌లో తమ పేరు మరియు అడ్రసు నింపారు కదా! కావున లిస్టును పంపించమంటారా? ఎలాంటి సి.ఐ.డి. లు వస్తారో తెలియదని అందరూ ఆలోచిస్తున్నారు! కావాలని క్రోధం తెప్పిస్తారు. ప్రాక్టికల్‌గా(ఆచరణలో) పరీక్షిస్తారు కదా! ప్రాక్టికల్ పరీక్షను ఎదుర్కునేందుకు తయారుగా ఉన్నారా? బాప్‌దాదా వద్ద అందరి 'అవును' మరియు 'కాదు' అన్నది ఫిల్ము వలె నిండిపోతుంది. ఆత్మిక శక్తిశాలీ యువ వర్గమైన మేము విశ్వశాంతి స్థాపనా కార్యంలో సదా సహయోగిగా ఉన్నాము మరియు ఇదే సహయోగము ద్వారా విశ్వ పరివర్తనను చేసి చూపిస్తామని విశ్వాన్ని ఛాలెంజ్ చేసే ఆత్మిక శక్తిశాలీ యూత్ గ్రూపును తయారు చేయాలన్న లక్ష్యాన్ని ఉంచుకోండి. ఏమి చెయ్యాలో అర్థమయ్యిందా? ఇటువంటి పక్కా గ్రూపుగా ఉందా? ఈ రోజు ఛాలెంజ్ చేసి, రేపు స్వయమే మారిపోవడం కాదు. కావున అటువంటి మారిపోని సమూహాన్ని తయారు చేయండి. మెజారిటీ క్రొత్త-క్రొత్త కుమారులు ఉన్నారు. కాని లాస్ట్ నుండి ఫాస్ట్‌గా వెళ్ళి చూపించండి. బ్యాలెన్సు ద్వారా అద్భుతం చేసి విశ్వానికి అద్భుతాన్ని చూపించండి. మంచిది.
సదా స్వ పరివర్తన ద్వారా సర్వులను పరివర్తన చేసేవారు, తమ జన్మ సిద్ధ వరదానం లేదా అధికారం పైన ''యోగీ భవ - పవిత్ర భవ'' ను సదా జీవితంలో అనుభవం చేయించేవారు, సదా ప్యూరిటీ పర్సనాలిటీ(పవిత్ర వ్యక్తిత్వం) ద్వారా ఇతర ఆత్మలను తండ్రి వైపు ఆకర్షింపజేసేవారు, అవినాశీ వృత్తి యొక్క నషాలో ఉండేవారు, మాతా-పితల శ్రేష్ఠ పాలనకు, పరివర్తన ద్వారా బదులు(రిటర్న్) ఇచ్చేవారికి ఇటువంటి ఆత్మిక రాయల్టీ కలిగిన విశేష ఆత్మలకు బాప్‌దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో :-
1. సదా స్వయాన్ని డబల్ లైట్ అనగా సర్వ బంధనాల నుండి ముక్తులుగా, తేలికగా భావిస్తున్నారా? తేలికదనానికి గుర్తు ఏమిటి? తేలికగా ఉండేది సదా ఎగురుతూ ఉంటుంది. భారం క్రిందకు తీసుకొచ్చేస్తుంది. స్వయాన్ని తండ్రికి అర్పించుకునేవారు సదా తేలికగా ఉంటారు. తమ బాధ్యతలను తండ్రికి ఇచ్చేయండి అనగా తమ భారాన్ని తండ్రికి ఇచ్చేసినట్లయితే స్వయం తేలికగా అయిపోతారు. బుద్ధిలో సమర్పితమవ్వండి. ఒకవేళ బుద్ధిలో సమర్పితమైనట్లయితే ఇక ఏ ఇతర విషయం బుద్ధిలోకి రాదు. సర్వస్వం తండ్రిదే. అన్నీ తండ్రిలోనే ఉన్నాయి. కనుక ఇంకేమీ మిగలలేదు. ఇంకేమీ మిగలనప్పుడు బుద్ధి ఎక్కడకు వెళ్తుంది? ఏదైనా పాత సందు, పాత దారి మిగలలేదు కదా! ఒకే బాబా, ఒకే స్మృతి చేసే మార్గం ఇదే మార్గం ద్వారా గమ్యానికి చేరుకోండి.
2. సదా సంతోషమనే ఊయలలో ఊగేవారు కదా! బాప్‌దాదా ద్వారా ఎంత గొప్ప ఊయల ప్రాప్తించింది! ఈ ఊయల ఎప్పుడూ తెగిపోదు కదా! స్మృతి మరియు సేవ అనే రెండు త్రాళ్ళు టైట్‌గా (బిగుతుగా) ఉన్నట్లయితే ఊయల సదా ఏకరసంగా ఉంటుంది. లేకపోతే ఒక త్రాడు వదులె,ౖ ఒకటి టైట్‌గా ఉన్నట్లయితే ఊయల కదులుతూ ఉంటుంది. ఊయల కదిలినట్లయితే ఊగేవారు పడిపోతారు. ఒకవేళ రెండు త్రాళ్ళూ ధృడంగా ఉన్నట్లయితే ఊగడంలో మనోరంజనముంటుంది. ఒకవేళ పడిపోతే మనోరంజనానికి బదులుగా దు:ఖం కలుగుతుంది. కావున స్మృతి మరియు సేవ అను రెండు త్రాళ్ళు సమానంగా ఉండాలి. అప్పుడు బ్రాహ్మణ జీవితంలో ఆనందాన్ని ఎంతగా అనుభవం చేస్తారో చూడండి. సర్వ శక్తివంతుడైన తండ్రి తోడుగా ఉన్నారు. సంతోషాల ఊయల ఉంది ఇంకేం కావాలి.
3. సదా తండ్రి మరియు సేవ రెండింటిని గుర్తుంచుకుంటారు కదా! సదా స్మృతి మరియు సేవ రెండిటి బ్యాలెన్స్ ఉంచుకుంటున్నారా? ఎందుకంటే స్మృతి లేకుండా సేవ సఫలమవ్వదు. సేవ లేకుండా మాయాజీతులుగా అవ్వజాలరు. ఎందుకంటే సేవలో బిజీగా ఉండడం వలన, ఈ జ్ఞానాన్ని మననం చేయడం వలన మాయ సహజంగానే దూరంగా వెళ్ళిపోతుంది. స్మృతి లేకుండా సేవ చేసినట్లయితే సఫలత తక్కువ, శ్రమ ఎక్కువగా ఉంటుంది. స్మృతిలో ఉండి సేవ చేసినట్లయితే సఫలత ఎక్కువ, శ్రమ తక్కువగా ఉంటుంది. కనుక రెండింటి బ్యాలెన్స్(సమతుల్యత) ఉంటోందా? బ్యాలెన్స్ ఉంచుకునే వారికి స్వతహాగా బ్లెస్సింగ్స్(ఆశీర్వాదాలు) లభిస్తూ ఉంటాయి, అడగవలసిన అవసరం ఉండదు. ఏ ఆత్మలకైతే సేవ చేస్తారో, ఆ ఆత్మల మనసు నుండి వాహ్ జ్ఞానం వినిపించే శ్రేష్ఠ ఆత్మ! వాహ్ నా జీవితాన్నే మార్చేసారు! ఈ వాహ్, వాహ్ అన్నదే ఆశీర్వాదంగా అయిపోతుంది. అటువంటి ఆశీర్వాదాన్ని అనుభవం చేస్తున్నారా? ఏ రోజైతే స్మృతిలో ఉండి సేవ చేస్తారో, ఆ రోజు శ్రమ లేకుండా సహజమైన సంతోషాన్ని అనుభవం చేస్తారు. అటువంటి సంతోషాన్ని అనుభవం చేస్తున్నారు కదా! ఈ ఆధారంతోనే అందరూ ముందుకు వెళ్తున్నారు. ప్రతీ సమయం మా ఉన్నతి మరియు విశ్వ ఉన్నతి జరుగుతూ ఉందని భావిస్తున్నారా? ఒకవేళ స్వ ఉన్నతి లేకపోతే విశ్వ ఉన్నతికి కూడా నిమిత్తంగా అవ్వజాలరు. స్వ ఉన్నతికి సాధనం స్మృతి. విశ్వ ఉన్నతి సాధనం సేవ. సదా ఇందులోనే ముందుకు వెళ్తూ ఉండండి. సంగమ యుగంలో తండ్రి అన్నింటికన్నా ఏ గొప్ప ఖజానాను ఇచ్చారు? సంతోషం. ఎన్నో రకాల సంతోషాల ఖజానాలు ప్రాప్తించాయి. ఒకవేళ సంతోషానికి చెందిన వెరైటీ(అనేక రకాల) పాయింట్లను తీసినట్లయితే ఎన్ని రకాలైనవి ఉంటాయి! సంగమయుగంలో అన్నింటికన్నా చాలా గొప్ప కానుక, ఖజానా, పికినిక్ సామాను..... అంతా సంతోషమే. ప్రతి రోజూ అమృతవేళలో ఒక సంతోషాన్నిచ్చే పాయింటును గురించి ఆలోచించండి..... అప్పుడు రోజంతా సంతోషంగా ఉంటారు. చాలా మంది పిల్లలు మురళీలో అయితే రోజూ అవే పాయింట్లు ఉంటాయని అంటారు. కానీ ఏ పాయింట్లయితే పక్కాగా ధారణ అవ్వలేదో, వాటిని పక్కా చేయించేందుకు రోజూ ఇవ్వవలసి ఉంటుంది. ఏ విధంగా స్కూల్లో విద్యార్థి ఏ విషయాన్నైనా పక్కాగా గుర్తుంచుకోలేకపోతే 50 సార్లయినా ఆ విషయాన్ని వ్రాస్తారు. కావున బాప్‌దాదా కూడా రోజూ పిల్లలూ! స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి అని చెప్తారు. ఎందుకంటే ఈ పాయింటులో ఇంకా అపరిపక్వంగానే(కచ్ఛాగానే) ఉన్నారు. కనుక రోజూ సంతోషమునిచ్చే క్రొత్త-క్రొత్త పాయింట్లను బుద్ధిలో ఉంచుకోండి. తద్వారా రోజంతా సంతోషంగా ఉంటూ ఇతరులకు కూడా సంతోషాన్ని దానం చేస్తూ ఉండండి. ఇదే అన్నింటికన్నా చాలా గొప్ప దానం. ప్రపంచంలో అనేక సాధనాలు ఉన్నా సత్యమైన ఆంతరిక అవినాశీ సంతోషం లేదు. మీ వద్ద ఆ సంతోషముంటే దానం చేస్తూ ఉండండి.
4) సదా స్వయాన్ని కమల పుష్ప సమానంగా పురాతన ప్రపంచ వాతావరణం నుండి అతీతంగా ఒక్క తండ్రికి ప్రియంగా ఉండు అనుభవాన్ని చేస్తున్నారా? ఎవరైతే అతీతంగా(భిన్నంగా) ఉంటారో, వారే తండ్రికి ప్రియమైనవారు. ఎవరైతే తండ్రికి ప్రియంగా ఉంటారో, వారే అతీతంగా అవుతారు. కావున కమలపుష్ప సమానంగా ఉంటున్నారా లేక వాతావరణమలో ఉంటూ దాని ప్రభావంలోకి వచ్చేస్తున్నారా? ఎక్కడ ఏ పాత్రను అభినయిస్తున్నా అక్కడ పాత్రను అభినయిస్తూ పాత్ర నుండి సదా అతీతంగా ఉంటున్నారా లేక పాత్రకు ప్రియంగా అయిపోతారా? ఏం జరుగుతోంది? ఒకసారి యోగం కుదురుతుంది, ఒకసారి కుదరదని అంటారు. ఇందుకు కూడా కారణమేమి? అతీతంగా అవ్వడంలో లోపం. అతీతంగా అవ్వని కారణంగా ప్రేమ అనుభవమవ్వదు. ఎక్కడైతే ప్రేమ ఉండదో అక్కడ స్మృతి ఎలా వస్తుంది? ఎంత ఎక్కువ ప్రేమ ఉంటుందో అంత ఎక్కువగా స్మృతి ఉంటుంది. తండ్రికి ప్రియంగా అయ్యేందుకు బదులుగా ఇతరులకు ప్రియంగా అవుతారు. తండ్రిని మర్చిపోతారు. పాత్రకు అతీతంగా, తండ్రికి ప్రియంగా అవ్వండి. ఇదే లక్ష్యంగా మరియు ప్రాక్టికల్ జీవితంగా ఉండాలి. లౌకికంలో పాత్రను అభినయిస్తూ ప్రియంగా అయినవారు అయితే ప్రేమకు రిటర్న్(బదులు) ఏమి లభించింది? ముళ్ళ పాన్పుయే లభించింది కదా! తండ్రి ప్రేమలో ఉండడం వలన సెకనులో ఏమి లభిస్తుంది? అనేక జన్మల అధికారం ప్రాప్తిస్తుంది. కావున సదా పాత్రను అభినయిస్తూ అతీతంగా ఉండండి. సేవ కారణంగా పాత్రను అభినయిస్తున్నారు. సంబంధాల ఆధారంగా పాత్ర కాదు. దేహ సంబంధాలలో ఉండడం వలన నష్టముంటుంది. సేవ కొరకు పాత్రగా భావించి ఉన్నట్లయితే అతీతంగా ఉంటారు. ఒకవేళ రెండువైపులా ప్రేమ ఉన్నట్లయితే ఏకరస స్థితి అనుభవమవ్వజాలదు.

వరదానము :- ''అభ్యాసమనే ఎక్సరసైజ్ (వ్యాయామం) ద్వారా సూక్ష్మ శక్తులను జీవితంలో ఇముడ్చుకునే శక్తి సంపన్న భవ ''
బ్రహ్మా
తల్లికి పిల్లలంటే ఆత్మిక మమత ఉంది. అందువలన సూక్ష్మమైన స్నేహం ద్వారా
ఆహ్వానించి పిల్లల స్పెషల్ గ్రూపును వతనంలో ఎమర్జ్ చేసి(ప్రత్యక్షం చేసి)
శక్తులనే బలమైన ఆహారాన్ని తినిపిస్తారు. ఎలాగైతే ఇక్కడ నేయి
త్రాగించేవారో, తోడు-తోడుగా వ్యాయామాన్ని కూడా చేయించేవారో అలా వతనంలో కూడా
నేయి త్రాగిస్తారు అనగా సూక్ష్మ శక్తులు కలిగించే వస్తువులను ఇస్తారు.
అంతేకాక అభ్యాసమనే వ్యాయామాన్ని కూడా చేయిస్తారు. మూడులోకాల్లో పరుగు తీసే
పరుగుపందెం చేయిస్తారు. దీని ద్వారా విశేషమైన పాలన జీవితంలో ఇమిడిపోవాలి,
పిల్లలందరూ శక్తి సంపన్నంగా అయిపోవాలి.
స్లోగన్ :- ''స్వమానంలో స్థితులై ఉండే ఆత్మ ఇతరులకు కూడా గౌరవాన్నిచ్చి ముందుకు తీసుకెళ్తుంది ''
No comments:
Post a Comment