Tuesday, 30 January 2018

Telugu Murli 30/01/18

30-01-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము 

'' మధురమైన పిల్లలారా - మీకు తండ్రి ద్వారా తండ్రి లీలలు అనగా డ్రామా ఆదిమధ్యాంతాల జ్ఞానము లభించింది. ఇప్పుడిక ఈ నాటకము పూర్తి కానున్నదని మనము ఇంటికి వెళ్తామని మీకు తెలుసు ''

ప్రశ్న :- స్వయాన్ని తండ్రి వద్ద రిజిస్టరు(నమోదు) చేసుకోవాలంటే పాటించవలసిన నియమాలేవి?
జవాబు :- తండ్రి వద్ద నమోదు అవ్వాలంటే, 1. తండ్రి పై పూర్తిగా బలిహారమవ్వాల్సి ఉంటుంది. 2. మీ సర్వస్వాన్ని భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సేవలో సఫలము చేసుకోవలసి వస్తుంది. 3. సంపూర్ణ నిర్వికారులై ఉంటామని ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది మరియు అలా ఉండి చూపవలసి వస్తుంది కూడా. ఇటువంటి పిల్లల పేర్లు ఆల్‌మైటీ గవర్నమెంటు(సర్వశక్తివంతుని ప్రభుత్వము) రిజిస్టరులో నమోదౌతాయి. మేము భారతదేశాన్ని స్వర్గముగా లేక రాజస్థానముగా తయారు చేస్తున్నాము, మేము భారతదేశానికి సేవ చేసేందుకు తండ్రి పై బలిహారమవుతాము అనే నషా ఉంటుంది.

పాట :- ఓం నమ: శివాయ.........
ఓంశాంతి. ఈ పాట ఎవరి మహిమకై ఉందో (ఈ పాటలో ఎవరిని మహిమ చేశారో) వారే స్వయంగా కూర్చొని తమ రచన(పిల్లల) యొక్క మహిమను వినిపిస్తారు. దీనిని లీల అని కూడా అంటారు. లీల అని నాటకమును అంటారు. గుణవంతులకే మహిమ జరుగుతుంది. అందువలన వారి మహిమ అందరికంటే భిన్నమైనది. మనుష్యులకైతే ఈ విషయాలు తెలియవు. ఇంత మహిమ ఆ పరమపిత పరమాత్మకు మాత్రమే ఉందని పిల్లలకు తెలుసు. వారి శివజయంతి కూడా ఇప్పుడు సమీపంలో ఉంది. శివజయంతికి ఈ పాట కూడా బాగుంది. పిల్లలైన మీకు వారి లీల, వారి మహిమ తెలుసు. తప్పకుండా ఇది లీలయే. దానిని నాటకము అని కూడా అంటారు. తండ్రి అంటున్నారు - దేవతల లీల కంటే నా లీల భిన్నమైనది. ప్రతి ఒక్కరి లీలలు వేరు వేరుగా ఉంటాయి. ఉదాహరణానికి ప్రభుత్వములో ప్రసిడెంటు(అధ్యక్షడు) పదవి, మినిష్టరు(మంత్రి) పదవి వేరు వేరుగా ఉంటాయి కదా. పరమాత్మ సర్వవ్యాపి అయితే అందరి పాత్ర ఒక్కటిగానే ఉంటుంది. సర్వవ్యాపి అన్నందునే ఆకలితో మరణించారు. ఏ మనిషికీ తండ్రిని గురించి గాని, తండ్రి అపారమైన మహిమను గురించి గాని తెలియదు. ఎంతవరకు తండ్రిని తెలుసుకోరో, అంతవరకు రచనను గురించి కూడా తెలుసుకోలేరు. ఇప్పుడు పిల్లలైన మీరు రచనను గురించీ తెలుసుకున్నారు, బ్రహ్మాండము, సూక్ష్మవతనము, మనుష్య సృష్టి చక్రము......... కూడా మీ బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది. ఇదే 'లీల' లేక సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానము. ఈ సమయములో ప్రపంచములోని మనుష్యులు నాస్తికులుగా ఉన్నారు. ఏమీ తెలియదు. కాని గొప్పలు(వ్యర్థ ప్రలాపాలు) ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. సాధువులు కూడా సమావేశాలు, సమ్మేళనాలు మొదలైనవి చేస్తూ ఉంటారు కాని పాపం వారికీ నాటకము ఇప్పుడు పూర్తి అవుతుందని తెలియదు. ఈ నాటకము పూర్తి అయ్యేందుకు వచ్చింది కనుక ఈ సమయములో వారికి కొద్దిగా టచ్‌ అవుతోంది. ఇప్పుడు అందుకే అందరూ రామరాజ్యము కావాలని అంటున్నారు. క్రైస్తవ రాజ్యములో నూతన భారతదేశము కావాలని అనేవారు కాదు. ఇప్పుడు దు:ఖము చాలా ఉంది. అందుకే అందరూ ఓ ప్రభూ! ఈ దు:ఖము నుండి విడుదల చేయండని అరుస్తున్నారు, పిలుస్తున్నారు. కలియుగాంతములో తప్పకుండా దు:ఖము ఎక్కువగా ఉంటుంది. రోజురోజుకు దు:ఖము ఎక్కువ అవుతూ పోతుంది. అందరూ ఎవరి రాజ్యాన్ని వారు పాలన చేసుకుంటారని భావిస్తారు కానీ ఈ వినాశనము తప్పకుండా జరగాల్సిందే. ఇది ఎవ్వరికీ తెలియదు.

పిల్లలైన మీరు ఎంత ఖుషీలో ఉండాలి. అనంతమైన తండ్రి స్వర్గ రచయిత కనుక స్వర్గములో చక్రవర్తి పదవి పిల్లలకు కూడా ఉండాలని మీరు ఎవ్వరికైనా చెప్పవచ్చు. అందుకే భారతవాసులు స్పష్టంగా స్మృతి చేస్తారు. భగవంతుని కలుసుకోవాలనుకుంటారు. భక్తి చేస్తారు. కృష్ణపురికి పోవాలనుకుంటారు. దానినే స్వర్గమని అంటారు. కాని కృష్ణుని రాజ్యము సత్యయుగములో ఉండేదని, ఇప్పుడు కలియుగము సమాప్తమై సత్యయుగము మళ్లీ వస్తుందని, అప్పుడు మళ్లీ శ్రీ కృష్ణుని రాజ్యముంటుందని వారికి తెలియదు. 'అందరూ పరమాత్ముని సంతానమే' అని అందరికీ తెలుసు. కావున మళ్లీ పరమాత్మ నూతన సృష్టిని రచించి ఉంటారు. కనుక తప్పకుండా బ్రహ్మ ముఖము(నోటి) ద్వారానే రచించి ఉంటారు. బ్రహ్మ ముఖవంశావళిగా అయితే తప్పకుండా బ్రాహ్మణ కుల భూషణులే అవుతారు. ఆ సమయము కూడా సంగమ యుగమే అయ్యి ఉంటుంది. ఈ సంగమ యుగము కళ్యాణకారి యుగము. ఈ యుగములో పరమాత్మ కూర్చుని రాజయోగము నేర్పించి ఉంటారు. ఇప్పుడు మనము బ్రహ్మ ముఖవంశావళీ బ్రాహ్మణులము. పోతే బ్రహ్మ శరీరములో పరమాత్మ ప్రవేశించి రాజయోగము నేర్పిస్తారని మేమెలా ఒప్పుకోవాలని అంటారు. మీరు కూడా ''బ్రహ్మ ముఖవంశావళిగా అయ్యి రాజయోగము నేర్చుకుంటే దానంతకదే అనుభవమౌతుంది'' అని చెప్పండి. ఇందులో మూఢ నమ్మకాలు గానీ, కట్టుకథలు గానీ ఏమీ లేవు. మూఢ నమ్మకాలైతే ప్రపంచమంతా ఉన్నాయి. అందులో కూడా ముఖ్యంగా భారతదేశములో బొమ్మల పూజ చాలా జరుగుతుంది. 'విగ్రహ ప్రస్థము(విగ్రహాల సంపుటి)' అని భారతదేశాన్నే అంటారు. బ్రహ్మకైతే ఎన్ని భుజాలనిచ్చారు! ఇప్పుడిది ఎలా సాధ్యము? బ్రహ్మకు అనేకమంది పిల్లలున్నారు. విష్ణువుకు ఎలాగైతే 4 భుజాలు చూపుతారో, 2 భుజాలు లక్ష్మివి, 2 భుజాలు నారాయణునివి. అదే విధంగా బ్రహ్మకు కూడా అంతమంది పిల్లలుంటారు. ఉదాహరణానికి 4 కోట్ల మంది పిల్లలుంటే బ్రహ్మకు 8 కోట్ల భుజాలు అవుతాయి. కాని అలా లేదు. పోతే ప్రజలైతే తప్పకుండా ఉంటారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. తండ్రి వచ్చి ఈ విషయాలన్నీ అర్థము చేయిస్తారు. చివరికి ఏమి అవ్వనున్నదో వారు అర్థము చేసుకోలేరు. ఎన్ని ప్లాన్లు (ప్రణాళికలను) తయారు చేస్తున్నారు! రకరకాల ప్లాన్లు తయారు చేస్తారు. ఇచ్చట పిల్లలైన మీ కొరకు బాబా ప్లాను(ప్రణాళిక) ఒక్కటే. దాని ప్రకారము రాజధాని స్థాపన జరుగుతూ ఉంది. ఎవరెంత శ్రమ చేసి, తమ సమానంగా తయారు చేస్తారో, అంత ఉన్నత పదవిని పొందుతారు. తండ్రిని జ్ఞాన సాగరులు, ఆనంద సాగరులు, దయాహృదయులని అంటారు. తండ్రి అంటున్నారు - నాకు కూడా డ్రామాలో పాత్ర ఉంది. మాయ అందరి పై నిర్దయ చూపుతోంది. నేను వచ్చి అందరి పై దయ చూపించవలసి వస్తుంది. పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. సృష్టిచక్ర రహస్యాన్ని కూడా అర్థము చేయిస్తాను. తండ్రిని నాలెడ్జ్‌ఫుల్‌, జ్ఞానసాగరులని అంటారు. ఇది పిల్లలైన మీకు తెలుసు. ఎవరికైనా అర్థము చేయించవచ్చు కూడా. ఇచ్చట మూఢనమ్మకాల ప్రసక్తే లేదు. మేము నిరాకార పరమపిత పరమాత్మను ఒప్పుకుంటాము. మొట్టమొదట వారిని మహిమ చేయాలి. వారు వచ్చి రాజయోగము ద్వారా స్వర్గాన్ని రచిస్తారు. తర్వాత స్వర్గవాసులను మహిమ చేయాలి. భారతదేశము స్వర్గముగా ఉన్నప్పుడు అందరూ సర్వ గుణ సంపన్నంగా, 16 కళా సంపూర్ణంగా ఉండేవారు. ఇది 5 వేల సంవత్సరాల విషయము. అందువలన పరమాత్ముని మహిమ అందరికంటే భిన్నమైనది. ఆ తర్వాత దేవతల మహిమ. ఇందులో మూఢ నమ్మకాల మాటే లేదు. ఇచ్చట ఉండేది అందరూ పిల్లలే. ఫాలోయర్స్‌(శిష్యులు) ఎవ్వరూ లేరు. ఇది ఒక కుటుంబము. మనము ఈశ్వరుని కుటుంబము. అసలుకు ఆత్మలైన మనందరము పరమాత్ముని పిల్లలము. అందువలన ఇదంతా ఒక కుటుంబముంది కదా. ఆ నిరాకారుడు సాకారములో వస్తారు. ఈ సమయములో ఇది అద్భుతమైన కుటుంబము. ఇందులో సంశయపడే మాటే లేదు. అందరూ శివుని సంతానమే. ప్రజాపిత బ్రహ్మ సంతానమని కూడా మహిమ చేయబడింది. మనం బ్రహ్మకుమార-కుమారీలము. నూతన సృష్టి స్థాపించబడ్తూ ఉంది. పాత సృష్టి ఎదుటనే ఉంది. మొదట తండ్రి పరిచయమునివ్వాలి. బ్రహ్మవంశీయులుగా అవ్వకుండా తండ్రి ఆస్తి లభించదు. బ్రహ్మ వద్ద ఈ జ్ఞానము లేదు. శివబాబా జ్ఞానసాగరులు. వారి నుండే మనము వారసత్వాన్ని పొందుతాము. మనము ముఖవంశావళి వారము. అందరూ రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. మనలనందరినీ చదివించేవారు శివబాబాయే. వారు ఈ బ్రహ్మ శరీరములో వచ్చి చదివిస్తారు. ఈ ప్రజాపిత బ్రహ్మ వ్యక్తములో ఉన్నాడు. అతడు సంపూర్ణమైనప్పుడు ఫరిస్తా (సూక్ష్మ దేవత)గా అయిపోతాడు. సూక్ష్మవతన వాసులను ఫరిస్తాలని అంటారు. అచ్చట రక్త మాంసాలు, ఎముకలు ఉండవు. పిల్లలు సాక్షాత్కారములో కూడా చూస్తారు. తండ్రి అంటున్నారు - భక్తిమార్గములో అల్పకాలిక సుఖము కూడా నా ద్వారానే మీకు లభిస్తుంది. ఇచ్చే దాతను నేనొక్కడినే. అందుకే ఈశ్వరార్పణ చేస్తారు. ఈశ్వరుడే ఫలమునిస్తారని భావిస్తారు. సాధు సత్పురుషులు మొదలైన వారి పేరును ఎప్పుడూ తీసుకోరు. ఇచ్చేవారు ఒక్క తండ్రియే. అయితే ఎవరినో నిమిత్తముంచి వారి మహిమను వృద్ధి చేసేందుకు వారి ద్వారా ఇప్పిస్తాను. అదంతా అల్పకాలిక సుఖము. ఇది అనంతమైన సుఖము. కొత్త కొత్త పిల్లలు వస్తారు. వారు ఇంతవరకు ఏ మతమనుసారము నడుచుకునేవారో అర్థము చేసుకున్న తర్వాత ఈ జ్ఞానము వారికి అర్థం చేయించాలని భావిస్తారు. ఈ సమయములో అందరూ మాయ మతమును అనుసరిస్తున్నారు. ఇచ్చటైతే మీకు ఈశ్వరీయ మతము లభిస్తుంది. ఈ మతము అర్ధకల్పము నడుస్తుంది. ఎందుకంటే సత్య, త్రేతా యుగాలలో మనము దీని ప్రాలబ్ధాన్ని అనుభవిస్తాము. అచ్చట వ్యతిరేక మతముండదు. ఎందుకంటే అచ్చట మాయయే ఉండదు. ఉల్టా(వ్యతిరేక) మతమైతే తర్వాతనే ప్రారంభమౌతుంది. ఇప్పుడు తండ్రి మనలను తమ సమానంగా త్రికాలదర్శి, త్రిలోకనాథులుగా చేస్తారు. బ్రహ్మాండానికి అధిపతులుగా కూడా అవుతాము. మళ్లీ ఈ సృష్టికి కూడా మనము అధిపతులుగా అవుతాము. తండ్రి పిల్లల మహిమను తన మహిమ కంటే ఉన్నతంగా చేశారు. మొత్తము సృష్టిలో ఇటువంటి తండ్రిని, పిల్లల కొరకు ఇంత శ్రమ చేసి తనకంటే ఉన్నతంగా చేయు తండ్రిని ఎప్పుడైనా చూశారా! పిల్లలైన మీకు విశ్వ చక్రవర్తి పదవిని ఇస్తాను. నేను చక్రవర్తి పదవిని అనుభవించను. పోతే ఒక్క దివ్యదృష్టి తాళం చెవిని మాత్రము నా చేతిలో ఉంచుకుంటాను. ఈ తాళము చెవి భక్తిమార్గములో కూడా నాకు పనికొస్తుంది. ఇప్పుడు కూడా బ్రహ్మను సాక్షాత్కారము చేయించి, ఈ బ్రహ్మ వద్దకెళ్లి రాజయోగాన్ని నేర్చుకొని భవిష్య రాకుమారునిగా తయారవ్వండి అని ప్రేరణ ఇస్తాను. ఈ సాక్షాత్కారమైతే చాలా మందికి జరుగుతుంది. రాకుమారులందరూ కిరీటధారులుగా ఉంటారు. కాని వారికి సూర్యవంశీ రాకుమారుల సాక్షాత్కారమయ్యిందా లేక చంద్రవంశ రాజుకుమారులదా అనునది పిల్లలకు తెలియదు. ఎవరైతే తండ్రికి పిల్లలుగా అవుతారో వారు తప్పకుండా రాకుమార-రాకుమార్తెలుగా అవుతారు. కొందరు మొదట, కొందరు వెనుక వస్తారు. మంచి పురుషార్థులైతే సూర్య వంశీయులుగా లేకుంటే చంద్ర వంశీయులుగా అవుతారు. అదంతా పురుషార్థము పైన ఆధారపడి ఉంటుంది. బాబా ఏమో ప్రతి విషయాన్ని స్పష్టము చేసి అర్థం చేయిస్తారు. ఇందులో మూఢ నమ్మకాలు లేనే లేవు. ఇది ఈశ్వరీయ కుటుంబము. ఈ లెక్కతో వారు కూడా ఈశ్వరీయ సంతానమే. కానీ వారు కలియుగములో ఉన్నారు. మీరు సంగమ యుగములో ఉన్నారు. ఎవరి వద్దకైనా వెళ్లి మేము శివవంశీ, బ్రహ్మ ముఖవంశావళీ బ్రాహ్మణులు మాత్రమే స్వర్గ వారసత్వాన్ని పొందగలమని చెప్పండి. ఎవరికైనా బాగా అర్థం చేయించేందుకు శ్రమ చేయవలసి ఉంటుంది. 100 - 50 మందికి అర్థం చేయిస్తే అందులో ఎవరో ఒక్కరు వెలువడ్తారు. ఎవరి అదృష్టములో ఉంటుందో, వారు కోట్లలో ఏ ఒక్కరో వెలువడ్తారు. మీ సమానంగా తయారు చేయడంలో సమయము పడ్తుంది. పోతే షాహుకార్లు చేయు శబ్ధము (ప్రచారము) పెద్దగా ఉంటుంది. అనగా ఎక్కువగా వ్యాపిస్తుంది. మినిష్టరు(మంత్రి) వద్దకు వెళ్తే, మొదట వారు '' మీ వద్దకు ఎవరైనా మంత్రి వస్తారా? '' అని అడుగుతారు. వస్తారని చెప్తే, నేను కూడా వస్తానని ఆ మినిష్టరు ఒప్పుకుంటాడు.

తండ్రి అంటున్నారు - నేను చాలా సాధారణంగా ఉన్నాను. కావున ధనవంతులు ఎవరో అరుదుగా విశేషమైనవారు మాత్రమే వస్తారు. అందరూ తప్పకుండా వస్తారు. అయితే చివర్లో వస్తారు. పిల్లలైన మీకు చాలా నషా ఉండాలి. మేము ఈ తనువు, మనస్సు, ధనములతో భారతదేశ సేవ చేస్తామని వారికి అర్థము చేయించాలి. మీరు భారతదేశ సేవ కొరకే బలిహారమయ్యారు కదా! మీలాంటి ధర్మదాతలు ఎవ్వరూ ఉండరు. వారైతే ధనము కూడబెట్టుకొని ఇండ్లు మొదలైనవి నిర్మిస్తూ ఉంటారు. చివరికి ఇవన్నీ మట్టిలో కలిసిపోనున్నాయి. మీరు మీ సర్వస్వాన్ని బాబా పై బలిహారం చేయాలి. భారతదేశాన్ని స్వర్గంగా చేసే సేవలోనే మీ సర్వస్వాన్ని ఉపయోగించాలి. అప్పుడు మళ్లీ వారసత్వము కూడా మీరే పొందుతారు. మీకు మేము ఆల్‌మైటీ అథారిటీ (సర్వశక్తివంతుల) సంతానమని, మేము వారి వద్ద నమోదైపోయామనే నషా ఉంది. బాబా వద్ద నమోదయ్యేందుకు చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. సంపూర్ణ నిర్వికారులుగా అవుతామనే ప్రమాణము చేసి, అలా ఉండి చూపినప్పుడు బాబా వారిని రిజిస్టరు చేసుకుంటారు. మేము భారతదేశాన్ని స్వర్గము లేక రాజస్థానముగా తయారు చేస్తున్నామనే నషా పిల్లలకు ఉండాలి. అప్పుడు దాని పై రాజ్యపాలన చేస్తారు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మేము ఈశ్వరీయ సంతానము, మేమంతా ఒకే ఈశ్వరీయ కుటుంబములోని వారము, మాకిప్పుడు ఈశ్వరీయ మతము లభిస్తోందనే ఆత్మిక నషాలో ఉండాలి. వ్యతిరేక మతాల పై నడవరాదు.
2. భారతదేశానికి సేవ చేసేందుకు బ్రహ్మాబాబా సమానంగా పూర్తిగా బలిహారమవ్వాలి. తనువు, మనసు, ధనములను భారతదేశాన్ని స్వర్గంగా చేయుటలో సఫలం చేయాలి. పూర్తి దానీలుగా అవ్వాలి. 

వరదానము :- ''సమీప సంబంధము మరియు సర్వ ప్రాప్తుల ద్వారా సహజయోగులుగా అయ్యే సర్వ సిద్ధిస్వరూప భవ ''
ఏ పిల్లలైతే సమీప సంబంధములో ఉంటారో, సర్వ ప్రాప్తులను అనుభవం చేస్తారో వారికి సహజ యోగము అనుభవమవుతుంది. వారు సదా నేను తండ్రివాడిననే అనుభవం చేస్తారు. నేను ఆత్మను, నేను తండ్రి సంతానాన్ని అని గుర్తు చేయించాల్సిన అవసరముండదు. వారు సదా ఇదే నశాలో ప్రాప్తి స్వరూపాన్ని అనుభవం చేస్తారు. సదా శ్రేష్ఠ ఉల్లాస-ఉత్సాహాలు మరియు ఖుషీలో (సంతోషంలో) ఏకరసంగా ఉంటారు, సదా శక్తిశాలీ స్థితిలో ఉంటారు. అందువలన సర్వ సిద్ధి స్వరూపులుగా అయిపోతారు

స్లోగన్‌ :- ''ఆత్మిక శాన్‌ ( గౌరవము )లో ఉండు వారెప్పుడూ హద్దు మాన్‌, శాన్‌(గౌరవము, కీర్తి)లోకి రాజాలరు. ''
 

No comments:

Post a Comment