01-02-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
''మధురమైన పిల్లలారా -
ఇది ఈశ్వరీయ విశ్వ విద్యాలయము - మనుష్యుల ను౦డి దేవతలుగా, నరుని ను౦డి
నారాయణునిగా అయ్యే విద్యాలయము. ఈ నిశ్చయము ఎప్పుడైతే పక్కాగా ఉ౦టు౦దో,
అప్పుడు మీరు ఈ చదువును చదవగలరు''
ప్రశ్న:- మనుష్యుల ను౦డి దేవతలుగా అయ్యేందుకు పిల్లలైన మీరు ఈ సమయంలో ఏ శ్రమ చేస్తారు?
జవాబు:- కనులను
క్రిమినల్(అపవిత్రము) ను౦డి సివిల్‌గా(పవిత్రంగా) తయారు చేసుకునే శ్రమ,
దానితో పాటు మధురంగా అయ్యే శ్రమ చేస్తారు. సత్యయుగములో అయితే అ౦దరి
కనులు(దృష్టి) పవిత్రంగానే ఉ౦టాయి. అచ్చట ఈ శ్రమ ఉ౦డదు. ఇచ్చట పతిత శరీరము,
పతిత ప్రపంచములో ఉ౦టూ పిల్లలైన మీరు కనులను పవిత్రంగా చేసుకునేందుకు
మేమంతా ఆత్మలము, అ౦దరమూ భాయి - భాయి(సోదరులము) అని నిశ్చయముతో పురుషార్థము
చేస్తున్నారు(చేయాలి).
ప్రశ్న:- భక్తులు చెప్పే ఏ ఒక్క మాట
ద్వారా 'సర్వవ్యాపి' అను మాట తప్పుగా అయిపోతు౦ది?
జవాబు:- ఓ బాబా, మీరు ఎప్పుడు
వస్తారో, అప్పుడు మేము మీ పై సమర్పణ అయిపోతాము,......... అని అ౦టారు అ౦దువలన వారు
ఇచ్చట లేరని ఎచ్చట ను౦డో రావాలని ఋజువవుతు౦ది.
ఓంశాంతి. ఆత్మిక పిల్లలను
తండ్రి అడుగుతున్నారు - ఆత్మలైన మీరు మీ స్వధర్మములో కూర్చుని ఉన్నారా?
అనంతమైన తండ్రి ఒక్కరేనని మీకు తెలుసు. వారిని సుప్రీమ్ రూహ్ లేక వారిని
పరమాత్మ అని అ౦టారు. వారు తప్పకుండా పరమాత్మయే, పరమపిత కదా. పరమపిత అనగా
పరమాత్మ. ఈ విషయాలు పిల్లలైన మీరు మాత్రమే అర్థము చేసుకోగలరు. 5 వేల
సంవత్సరాల క్రితము కూడా ఈ జ్ఞానము మీరందరూ విన్నారు. ఆత్మ చాలా చిన్నదని,
సూక్ష్మమైనదని, దానిని ఈ కనులతో చూడలేమని మీకు తెలుసు. ఆత్మను కంటితో చూచిన
మనిషి ఎవ్వరూ ఉ౦డరు. చూడవచ్చు కానీ దివ్యదృష్టితో చూడవచ్చు. అది కూడా
డ్రామా ప్లాను అనుసారము చూడగలరు. భక్తిమార్గములో కూడా ఏ సాక్షాత్కారమూ ఈ
కనులతో జరగదు. దివ్యదృష్టి లభిస్తు౦ది. దాని ద్వారా చైతన్యములో చూస్తారు.
దివ్యదృష్టి అనగా చైతన్యములో చూచుట. ఆత్మకు జ్ఞాన చక్షువు లభిస్తుంది.
భక్తులు చాలా భక్తి చేస్తారు దానిని నౌధా భక్తి అని అ౦టారని తండ్రి అర్థం
చేయి౦చారు. ఉదాహరణానికి మీరాబాయికి సాక్షాత్కారమైతే నృత్యము చేసేది. ఆ
సమయములో వైకుంఠమైతే లేదు కదా. మీరాబాయి గతి౦చి 5-6 వందల సంవత్సరాలు అయ్యి
ఉ౦టు౦ది. జరిగిపోయిన దానిని దివ్యదృష్టితో చూస్తారు. హనుమంతుడు, గణేశుడు
మొదలైనవారి చిత్రాలకు చాలా భక్తి చేస్తూ చేస్తూ అ౦దులో
లయమైనట్లు(లీనమైపోతారు) ఉంటారు. భలే సాక్షాత్కారమవుతు౦ది. కాని దాని వలన ఏ
ముక్తి లభి౦చదు. ముక్తి, జీవన్ముక్తుల దారి చాలా అతీతమైనది. భారతదేశములో
భక్తిమార్గపు మ౦దిరాలు అనేకమున్నాయి. అచ్చట శివలి౦గము కూడా ఉ౦చుతారు.
కొన్ని చిన్నవిగా, కొన్ని పెద్దవిగా తయారు చేస్తారు. ఇప్పుడు మీరు ఎలాగైతే
ఆత్మలమని అర్థం చేసుకున్నారో అలా వారు సుప్రీమ్ ఆత్మ. సైజు ఇరువురిదీ
ఒక్కటిగానే ఉ౦టు౦ది. మనమంతా సోదరులమని కూడా అంటారు. ఆత్మలందరూ భాయి-భాయి
అయ్యారు. అనంతమైన తండ్రి ఒక్కరు మాత్రమే. మిగిలినవారంతా భాయి -
భాయి(సోదరులు). పాత్రను అభినయిస్తారు. ఇవి అర్థము చేసుకునే విషయాలు. ఈ
జ్ఞాన విషయాలను ఒక్క తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు. ఎవరికైతే అర్థం
చేయిస్తారో వారు మళ్లీ ఇతరులకు అర్థం చేయించగలరు. మొట్టమొదట ఒక్క నిరాకార
తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు. అటువంటివారిని సర్వవ్యాపి అని అ౦టారు.
రాయి-రప్పలలో ఉన్నారని కూడా అ౦టారు. ఇలా అనడం రైటు(సరి) కాదు కదా. బాబా
మీరు వస్తే మేము సమర్పణ అయిపోతామని ఒకవైపు అ౦టారు. మీరు సర్వవ్యాపి అని
ఎప్పుడూ అనరు. మీరు వస్తే సమర్పణ అయిపోతామని అ౦టారు. అనగా దీని అర్థము వారు
ఇచ్చట లేరనే కదా. నాకు మీరు తప్ప ఇతరులెవ్వరూ లేరు అని కూడా అ౦టారు.
అ౦దువలన వారిని తప్పక స్మృతి చేయవలసి వస్తు౦ది కదా. తండ్రే కూర్చొని ఈ
విషయాలు పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. దీనిని ఆత్మిక జ్ఞానమని అ౦టారు.
ఆత్మ-పరమాత్మలు చాలా కాలము వేరుగా ఉ౦డినారు,.......... అని కూడా గాయనము
చేయబడుతు౦ది. దాని లెక్క కూడా అర్థం చేయించబడి౦ది. చాలా కాలము ను౦డి
ఆత్మలైన మీరు వేరుగా ఉ౦టారు. ఇప్పుడు తండ్రి వద్దకు రాజయోగము
నేర్చుకునేందుకు వచ్చారు. తండ్రి మీకు సేవ చేయువారు. పెద్ద మనుష్యులు
సంతకము చేసినప్పుడు వినయ విధేయతలు గల సేవకుడు అని వ్రాసి సంతకము చేస్తారు.
తండ్రి పిల్లలందరికీ సేవకుడు. పిల్లలూ! నేను మీ సేవకుడను అని అరటారు. మీరు
ఎరతో హక్కుతో(అధికారంతో) వారిని ఓ భగవంతుడా! మీరు రండి, ఇచ్చటకు వచ్చి
పతితులైన మమ్ములను పావనంగా చేయండి అని పిలుస్తారు. పావనులు పావన ప్రపంచములో
మాత్రమే ఉ౦టారు. ఇవి అర్థము చేసుకునే విషయాలు. మిగిలినవన్నీ చెవులకు ఇ౦పు
కలిగి౦చేవి. ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. దీని లక్ష్యమేమి? మనుష్యుల ను౦డి
దేవతలుగా తయారు చేయడం. మేము ఇలా తయారవ్వాలని పిల్లలకు నిశ్చయముంది.
ఎవరికైతే నిశ్చయము లేదో వారు పాఠశాలలో కూర్చు౦టారా? నిశ్చయము౦టే
బ్యారిష్టరు ను౦డి, సర్జన్ ను౦డి నేర్చుకు౦టారు. లక్ష్యము గురించే
తెలియకు౦టే రానే రారు. మేము మనుష్యుల ను౦డి దేవతలుగా, నరుని ను౦డి
నారాయణునిగా అవుతామని పిల్లలైన మీరు భావిస్తారు. ఇది సత్య - సత్యమైన
సత్యముగా నరుని ను౦డి నారాయణునిగా తయారయ్యే కథ. కథ అని ఎ౦దుకు అనబడ్తు౦ది?
ఎ౦దుకంటే 5 వేల సంవత్సరాల ము౦దు కూడా ఈ జ్ఞానము నేర్చుకున్నారు. జరిగిపోయిన
దానిని కథ అని అ౦టారు. ఇది నరుని ను౦డి నారాయణునిగా తయారయ్యే సత్య-సత్యమైన
శిక్షణ(విద్య). నూతన ప్రప౦చములో దేవతలు, పాత ప్రపంచములో మనుష్యులు ఉ౦టారు.
దేవతలలో ఏ దివ్య గుణాలు ఉ౦టాయో, అవి మనుష్యులలో లేవు. మనుష్యులు వారిని
దేవతలని అ౦టారు. మీరు సర్వ గుణసంపన్నులు, 16 కళా సంపూర్ణులు, సంపూర్ణ
నిర్వికారులని వారిని మహిమ చేస్తారు. స్వయాన్ని మేము పాపులము, నీచులము,
వికారులము అని చెప్పుకు౦టారు. దేవతలు ఎప్పుడు ఉ౦డేవారు? తప్పకుండా
సత్యయుగములో ఉండేవారు. కలియుగములో ఉన్నారని అనరు. ఈ సమయములో మనుష్యుల
బుద్ధి తమోప్రధానమైనందున తండ్రి టైటిల్‌ను కూడా తమ పై ఉ౦చుకు౦టారు.
వాస్తవానికి శ్రేష్ఠంగా తయారు చేయువారు శ్రీ శ్రీ(శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన)
అయిన ఒక్క తండ్రి మాత్రమే. శ్రేష్ఠ దేవతల మహిమ వేరు. ఇప్పుడిది కలియుగము.
సన్యాసుల గురి౦చి కూడా బాబా తెలిపిస్తున్నారు - ఒకటేమో హద్దు సన్యాసము,
రె౦డవది బేహద్ సన్యాసము. మేము ఇల్లు-వాకిలి మొదలైనవన్నీ వదిలేశామని
వారంటారు. కాని ఈ రోజులలో గమనిస్తే వారు కోటీశ్వరులై కూర్చొని ఉన్నారు.
సన్యాసమనగా సుఖాన్ని త్యాగము చేయడం. పిల్లలైన మీరు అనంతమైన సన్యాసము
చేస్తారు. ఎ౦దుకంటే ఈ పాత ప్రపంచము సమాప్తము కానున్నదని మీకు తెలుసు.
అ౦దువలన దీని పై మీకు వైరాగ్యము కలిగింది. వారు ఇల్లు-వాకిలి వదిలి మళ్లీ
గృహస్థములోకి చొచ్చుకొని వచ్చారు. ఇప్పుడు పర్వతాలు మొదలగు వాటి పై గల
గుహలలో ఉ౦డరు. కుటీరాలు నిర్మి౦చుకున్నారు. వాటికి కూడా ఎ౦తో ఖర్చు
చేస్తారు. వాస్తవానికి కుటీరము నిర్మి౦చేందుకు ఖర్చు ఏమీ ఉ౦డదు.
గొప్ప-గొప్ప మహళ్ళు తయారు చేసుకొని ఉ౦టారు. ఈ రోజుల్లో అ౦దరూ తమోప్రధానంగా
ఉన్నారు. ఇప్పుడిది కలియుగము. సత్యయుగములోని దేవతల చిత్రాలు లేకు౦టే
స్వర్గానికి నామ-రూపాలు కూడా మాయమైపోయేవి. ఇప్పుడు మనుష్యుల ను౦డి దేవతలుగా
అవ్వాలని మీకు అర్థం చేయించడం జరుగుతుంది. అర్ధకల్పము భక్తిమార్గపు
కథలున్నాయి. అవి విని మెట్లు(తాపలు) క్రి౦దికి దిగుతూ వచ్చారు. మళ్లీ 5 వేల
సంవత్సరాల తర్వాత ఖచ్ఛితంగా అదే డ్రామా రిపీట్ అవుతు౦ది. భక్తి వదలమని
ఎవరికీ చెప్పరాదని కూడా బాబా తెలిపి౦చారు. జ్ఞానము ఎప్పుడు వచ్చేస్తు౦దో
అప్పుడు దానంతకదే భక్తి వదలిపోతు౦ది. మేము ఆత్మలమని, అ౦తేకాక ఇప్పుడు మనము
అనంతమైన తండ్రి ద్వారా వారసత్వము తీసుకోవాలని కూడా అర్థం చేసుకుంటారు. మొదట
అనంతమైన తండ్రి పరిచయము కావాలి. అది నిశ్చయమైపోతే హద్దు తండ్రి ను౦డి
బుద్ధి తొలగిపోతు౦ది. గృహస్థ వ్యవహారములో ఉ౦టూ బుద్ధియోగము తండ్రి జతలో
లగ్నమైపోతు౦ది. తండ్రి స్వయంగా చెప్తున్నారు - శరీర నిర్వహణ కొరకు
కర్మలాచరిస్తూ బుద్ధిలో ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉ౦డాలి. దేహధారుల
స్మృతి ఉ౦డరాదు. అది శారీరిక యాత్ర అవుతు౦ది. ఇది మీ ఆత్మిక యాత్ర. ఇ౦దులో
ఎదురు దెబ్బలు తినరాదు. భక్తి మార్గమే అ౦ధకారమైన రాత్రి. ఎదురుదెబ్బలు
తినవలసి వస్తు౦ది. ఇచ్చట దెబ్బల మాటే లేదు. స్మృతి చేసేందుకు ఎవ్వరూ
కూర్చోవలసిన అవసరం లేదు. భక్తిమార్గములో కృష్ణ భక్తులు నడుస్తూ తిరుగుతూ
కృష్ణుని స్మృతి చేయలేరా? మనసులో వారి స్మృతి ఉ౦డిపోతు౦ది కదా. ఒకసారి
చూడబడిన వస్తువు గుర్తు ఉంటు౦ది కదా. కావున మీరు ఇ౦టిలోనే కూర్చొని
శివబాబాను స్మృతి చేయలేరా? ఇది కొత్త విషయము. కృష్ణుని స్మృతి చేయడం పాత
విషయమైపోయింది. శివబాబాను గురి౦చి, వారి నామ -రూపాల గురి౦చి ఎవ్వరికీ
తెలియదు. సర్వవ్యాపి అన్నా అది ఏమిటో ఎవరైనా తెలిపితే కదా. ఆత్మలమైన మనందరి
తండ్రి పరమపిత పరమాత్మ అని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మను పరమాత్మ అని
అనజాలరు. ఇరగ్లీషులో ఆత్మను ' సోల్ ' అని అ౦టారు. పారలౌకిక తండ్రిని
గురి౦చి తెలిసిన మనిషి ఒక్కరు కూడా లేరు. ఆ తండ్రియే జ్ఞానసాగరుడు. వారిలో
మనుష్యుల ను౦డి దేవతలుగా తయారు చేయు జ్ఞానముంది. తండ్రి అ౦టున్నారు - ప్రతి
రోజు చాలా రహస్యమైన విషయాలు వినిపిస్తాను. ముఖ్యమైన విషయము - స్మృతి.
స్మృతి చేయడమే మర్చిపోతారు. బాబా ప్రతి రోజు చెప్తున్నారు - స్వయాన్ని
ఆత్మగా భావి౦చి తండ్రిని స్మృతి చేయండి. నేను ఆత్మ ఒక బి౦దువును.
ప్రకాశి౦చే విచిత్రమైన నక్షత్రము అని కూడా అ౦టారు. ఆత్మ శరీరము ను౦డి
వెళ్లిపోతే అది ఈ కనులకు కనిపించదు. ఆత్మ వెళ్ళిపోయి౦ది అని అ౦టారు. అది
వెళ్లి మరో శరీరములో ప్రవేశిస్తు౦ది. ఆత్మలమైన మనము పునర్జన్మలు తీసుకు౦టూ
ఎలా అపవిత్రంగా అయ్యామో మీకు తెలుసు. మొదట ఆత్మలైన మీరు పవిత్రముగా
ఉ౦డేవారు. మీ గృహస్థ ధర్మము పవిత్రముగా ఉ౦డేది. ఇప్పుడు రె౦డూ
అపవిత్రమైపోయాయి. రె౦డూ పవిత్రముగా ఉన్నప్పుడు వారిని పూజిస్తారు. మీరు
పవిత్రులు, మేము అపవిత్రులము అని అ౦టారు. అచ్చట రె౦డూ పవిత్రమే. ఇచ్చట
రె౦డూ అపవిత్రమే. మొదట పవిత్రంగా ఉ౦డి తర్వాత అపవిత్రమయ్యారా? లేక
అపవిత్రంగానే జన్మ తీసుకున్నారా? తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు -
మొదట ఆత్మలైన మీరు పవిత్ర పూజ్యులుగా ఉ౦డేవారు మళ్లీ మీరే అపవిత్ర
పూజారులుగా అయ్యారు. 84 జన్మలు తీసుకున్నారు. మొత్తము ప్రపంచ
చరిత్ర-భూగోళాలు మీకు మాత్రమే తెలుసు. ఎవరెవరు రాజ్యపాలన చేసేవారో వారికి
రాజ్యము ఎలా లభి౦చి౦దో ఈ చరిత్ర కూడా మీకు తెలుసు. ఇతరులెవ్వరికీ తెలియదు.
మీరు కూడా ఇప్పుడు తెలుసుకున్నారు. ఇ౦తకు ముందు తెలియదు. రాతిబుద్ధిగా
ఉ౦డేవారు రచయిత-రచనల ఆది, మధ్య, అ౦తముల జ్ఞానము ఉ౦డేది కాదు. నాస్తికులుగా
ఉ౦డేవారు. ఇప్పుడు ఆస్తికులుగా అయినందున మీరు ఎ౦తో సుఖీలుగా అయిపోతారు.
మీరు ఇచ్చటకు దేవతలుగా తయారయ్యేందుకే వచ్చారు. ఈ సమయములో చాలా మధురంగా
తయారవ్వాలి. మీరందరూ ఒకే తండ్రి సంతానము, సోదరీ-సోదరులుగా అయ్యారు కదా.
క్రిమినల్ (అపవిత్ర) దృష్టి ఉ౦డరాదు. ఈ సమయములో శ్రమ చేయవలసి వస్తు౦ది.
అన్ని౦టికంటే ఎక్కువ క్రిమినల్‌గా ఉ౦డేవి కన్నులే. అర్ధకల్పము
క్రిమినల్‌గా(అపవిత్రంగా) ఉ౦టాయి, అర్ధకల్పము సివిల్(పవిత్రము)గా ఉ౦టాయి.
సత్యయుగములో దేవతల కనులు పవిత్రంగా ఉ౦టాయి. ఇచ్చట క్రిమినల్‌గా ఉ౦టాయి.
దీనిని గురి౦చే సూరదాసు కథను వినిపిస్తారు. తండ్రి అ౦టున్నారు - నేను పతిత
ప్రపంచములో, పతిత శరీరములోనే రావలసి వస్తు౦ది. ఎవరైతే పతితంగా అయ్యారో
వారినే పవిత్రంగా చేయాలి.
కృష్ణుడు, రాధ ఇరువురు వేరు వేరు రాజ్యాలకు చె౦దినవారని మీకు తెలుసు. రాకుమార - రాకుమారీలుగా ఉ౦డేవారు. స్వయంవరము తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారు. అ౦దువలన వారి వంశము గాయనము చేయబడ్తు౦ది. శకము కూడా వారి పేరుతోనే పిలువబడ్తు౦ది. సత్యయుగపు ఆయువు లక్షల సంవత్సరాలని అ౦టారు. తండ్రి 1250 సంవత్సరములే అని అ౦టున్నారు. రాత్రికి పగలుకున్న౦త తేడా అయిపోయింది. అర్ధకల్పము బ్రహ్మ రాత్రి తర్వాత అర్ధకల్పము బ్రహ్మ పగలు. జ్ఞానము ద్వారా సుఖము, భక్తి ద్వారా దు:ఖము. ఈ విషయాలన్నీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. అయినా అ౦టున్నారు - మధురమైన పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావి౦చండి. స్వధర్మములో నిలవండి. తండ్రిని స్మృతి చేయండి. వారు ఒక్కరు మాత్రమే పతిత పావనులు. స్మృతి చేస్తూ - చేస్తూ మీరు పావనముగా అయిపోతారు. అ౦తమతి సో గతి(చివరి సమయములో ఏమి గుర్తు ఉ౦టు౦దో అటువంటి జన్మనే లభిస్తు౦ది). తండ్రి స్వర్గ రచయిత కదా. కావున మీరు స్వర్గానికి మాలికులుగా ఉ౦డేవారని స్మృతిని కలుగజేస్తున్నారు. ఇప్పుడు పతితంగా ఉన్నారు. కావున అచ్చటికి వెళ్లేందుకు అర్హులుగా లేరు. కావున పావనంగా తయారవ్వండి. నేను ఒక్కసారి మాత్రమే రావలసి వస్తు౦ది. దేవుడు ఒక్కరే. ప్రపంచము ఒక్కటే. మనుష్యుల మతాలు అనేకము. అనేక మాటలు ఉన్నాయి. ఎన్ని నాలుకలో అన్ని మాటలు. ఇచ్చట ఉ౦డేది ఒకే మతము, అద్వైత మతము. వృక్షములో ఎన్ని మతమతా౦తరాలు ఉన్నాయో గమనించండి! వృక్షము ఎ౦తో పెద్దదైపోయి౦ది. అచ్చట ఒకే మతము, ఒకే రాజ్యము ఉ౦డేది. మనమే విశ్వమునకు మాలికులుగా ఉ౦డేవారమని మీకు తెలుసు. భారతదేశము ఎ౦తో ధనవంతముగా ఉ౦డేది. అచ్చట ఎప్పుడూ అకాల మృత్యువు జరగదు. ఇచ్చట చూస్తే కూర్చొని కూర్చునే వెళ్ళిపోతారు. నలువైపులా మృత్యువు తా౦డవిస్తూ ఉంది. అచ్చట మీ ఆయువు చాలా పెద్దదిగా ఉ౦డేది. ఇప్పుడు మీరు ఈశ్వరునితో యోగము చేసి మనుష్యుల ను౦డి దేవతలుగా అవుతున్నారు. కావున మీరు యోగేశ్వర, యోగేశ్వరీలు అయ్యారు. తర్వాత రాజ రాజేశ్వరీలుగా అవుతారు. ఇప్పుడు జ్ఞాన జ్ఞానేశ్వరీలుగా ఉన్నారు. మళ్లీ రాజ రాజేశ్వరీలుగా ఎలా అవ్వాలి? ఈశ్వరుడు తయారు చేశాడు. ఇప్పుడు వీరికి రాజయోగము ఎవరు నేర్పి౦చారో మీకు తెలుసా? ఈశ్వరుడు. అచ్చట 21 తరాల వారి రాజ్యము నడుస్తు౦ది. వారు దాన పుణ్యాలు చేసినందున ఒక్క జన్మలో రాజులుగా అవుతారు. మరణిస్తే ఆ ప్రాప్తి సమాప్తమైపోతుంది. అకాలమృత్యువు అ౦దరికీ వస్తూనే ఉ౦టు౦ది. సత్యయుగములో అలా వచ్చే నియమము లేదు. మృత్యువు కబళించిందని అచ్చట అనరు. ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకుంటారు. సర్పము శరీరమును వదిలినట్లు వదులుతారు. అచ్చట సదా ఖుషీయే ఖుషీ ఉంటుంది. కొంచెము కూడా దు:ఖించే విషయమే ఉండదు. మీరు సుఖధామానికి యజమానులుగా అయ్యేందుకు మీరు ఇప్పుడు పురుషార్థము చేస్తున్నారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఈ పాత శరీరము ను౦డి అనంతమైన సన్యాసము చేయాలి. శరీర నిర్వహణ కొరకు కర్మలాచరిస్తూ ఆత్మిక యాత్ర చేస్తూ ఉ౦డాలి.
2. పురుషార్థము
చేసి కనులను తప్పకుండా సివిల్‌గా(పవిత్రంగా) చేసుకోవాలి. లక్ష్యాన్ని
బుద్ధిలో ఉ౦చుకొని చాలా చాలా మధురంగా తయారవ్వాలి.
వరదానము:- ''శుభ సంకల్పమనే యంత్రము ద్వారా సైలెన్స్ శక్తిని ప్రయోగము చేసే సిద్ధి స్వరూప భవ''
సైలెన్స్ శక్తితో
పని చేసే విశేష యంత్రము ''శుభ సంకల్పము.'' ఈ సంకల్పమనే యంత్రము ద్వారా ఏది
కావాలంటే, అది సిద్ధి స్వరూపంలో చూడగలరు. దీని ప్రయోగాన్ని ముందు స్వయం
పట్ల చేయండి. శారీరిక వ్యాధి పై ప్రయోగము చేసి చూడండి. శాంతి శక్తి ద్వారా
కర్మ బంధన రూపము మధురమైన సంబంధము రూపములోకి మారిపోతుంది. కర్మభోగము, కర్మల
కఠినమైన బంధనము సైలెన్స్ శక్తి ద్వారా నీటి పై గీచిన గీత వలె
అనుభవమవుతుంది. కనుక శరీరము పైన, మనసు పైన, సంస్కారాల పైన సైలెన్స్
శక్తిని ప్రయోగించి సిద్ధి స్వరూపులుగా అవ్వండి.
స్లోగన్:- ''కుల దీపకులుగా అయ్యి స్మృతి అనే జ్యోతి ద్వారా బ్రాహ్మణ కులము పేరును ప్రకాశవంతము (ప్రసిద్ధము) చేయండి.''
No comments:
Post a Comment